ఎఫెక్ట్
చెట్ల నరికివేతపై అధికారుల నోటీసులు
పెంటపాడు: రావిపాడు గ్రామంలో వెంకయ్య కాలువ వెంట చెట్ల నరికివేతపై పంచాయతీ అధికారులు స్పందించాలని ఇరిగేషన్ ఏఈ కె.అనిల్ తేజ పేర్కొన్నారు. సాక్షిలో ప్రచురితమైన వార్తకు ఆయన స్పందించారు. అనుమతి లేకుండా చెట్లు నరకడం నేరమన్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేలా పూర్తి వివరణ పంచాయతీ కార్యదర్శికి ఇవ్వాలన్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శికి ఇరిగేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు తక్షణం ఇవ్వాలి
ఏలూరు (మెట్రో): విద్యార్థులకు హాల్ టికెట్ల జారీలో, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో అధిక ఫీజులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తే చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి కళాశాలలను హెచ్చరించారు. అలాంటి కళాశాలల గుర్తింపును రద్దు చేస్తామని తెలిపారు. జ్ఞానభూమి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్ధికి ఫీజు రియింబర్స్‌మెంట్, మెస్ చార్జీలు మంజూరు చేస్తారన్నారు. హాల్ టెకెట్లు ఇవ్వకపోయినా, ఒరిజినల్ ధ్రువ పత్రాలు ఇవ్వకపోయినా, విద్యార్ధులు జిల్లా కలెక్టరు గ్రీవెన్స్ నెంబరు 9491041188 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment