నమ్మకం, నాణ్యతకు ప్రాధాన్యం
వైనాట్ షోరూం అధినేత వెల్లడి
తణుకు అర్బన్: నాణ్యత, నమ్మకానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి వినియోగదారుల ఆదరణ పొందిన కారణంగా నేడు 31వ వార్షికోత్సవం దిగ్విజయంగా నిర్వహించుకుంటున్నామని వైనాట్ షోరూం అధినేత జుజ్జువరపు వెంకటరాయుడు అన్నారు. తణుకు షోరూంలో వినియోగదారుల మధ్య ఈ వేడుకను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 31 సంవత్సరాలుగా వినియోగదారులకు నమ్మకమైన సర్వీసు అందిస్తున్నామని తెలిపారు. 31వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం రూ.10 వేలు కొనుగోలుపై ప్రతి ఒక్కరికీ లక్కీ పాట్ ద్వారా కచ్చితమైన బహుమతిని ఇచ్చే విధంగా వినియోగదారులకు అవకాశం కల్పించామని చెప్పారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత వెంకటరాయుడు చేతులమీదుగా నూతనంగా వైనాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment