పిచ్చి కుక్క స్వైరవిహారం
● 4 గ్రామాల్లో 20 మందికి పైగా గాయాలు ● కుక్కను హతమార్చిన గ్రామస్తులు
యలమంచిలి: మండలంలోని కొంతేరు, కాజ పడమర, కాజ తూర్పు, ఊటాడ గ్రామాల్లో గురువారం పిచ్చి కుక్క స్వైరవిహారం చేసింది. సుమారు 20 మందికి పైగా జనాన్ని కరిచింది. బాధితులంతా పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడినవారిలో కొంతేరు గ్రామానికి చెందిన వలవల నాగేశ్వరరావు, కొమ్మిరెడ్డి ప్రసాద్, అంబటి నవీన్ చందు, అంబటి త్రినాథ్ సాత్విక్, కాజ తూర్పు గ్రామానికి చెందిన మునగల అభిరామ్, పినిశెట్టి నరసింహారావు, ఊటాడ గ్రామానికి చెందిన తమ్మినీడి రఘురాం, తాళ్లూరి లింగయ్య, రేవులగడ్డ బాబ్జి తదితరులు ఉన్నారు. వీరే కాకుండా మరికొందరు కూడా కుక్క కాటుకు గురయ్యారు. చివరకు కొంతేరు పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు కలిసి కుక్కను తరిమి పట్టుకుని అంతమొందించారు.
పిచ్చి కుక్క స్వైరవిహారం
Comments
Please login to add a commentAdd a comment