
సర్కారు నిర్లక్ష్యం.. పౌల్ట్రీకి శాపం
చేదెక్కుతున్న మామిడి
మామిడికి గడ్డు పరిస్థితులు దాపురించాయి. ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడం లేదు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. 8లో u
శనివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
సాక్షి, భీమవరం: జిల్లాలో బర్డ్‌ఫ్లూతో నిండామునిగిన రైతులకు ఇప్పటికీ ప్రభుత్వ సాయం, నష్టపరిహారం అందించలేదు. కనీసం బ్యాంకు రుణాలు కూడా రీషెడ్యూల్ చేయకపోవడంతో కొత్త బ్యాచ్‌లు వేయలేకపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు.
200 పౌల్ట్రీలు.. 1.30 కోట్ల కోళ్లు
ఉమ్మడి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, అత్తిలి, ఇరగవరం, ఉంగుటూరు, దేవరపల్లి, ఉండ్రాజవరం తదితర మండలాల్లో దాదాపు 200 పౌల్ట్రీల్లో 1.30 కోట్ల వరకు లేయర్ కోళ్లు ఉన్నాయి. రోజుకు 1.05 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. మరోపక్క ఏడు లక్షల వరకు బ్రాయిలర్ కోళ్లు పెంచే షెడ్లు ఉన్నాయి. సంక్రాంతికి ముందు నుంచే జిల్లాలోని నాటు కోళ్లు, పందెం పుంజులు వైరస్ లక్షణాలతో మృత్యువాత పడగా శీతల ప్రభావం వలన చనిపోతున్నాయని అధికారులు కొట్టిపారేస్తూ వ చ్చారు. తర్వాత బర్డ్‌ఫ్లూ వైరస్ లేయర్, బ్రాయిలర్ ఫారాలకు విస్తరించింది. జిల్లాలో అసాధారణ రీతిలో కోళ్లు మరణాలు సంభవిస్తుండటంపై ఫిబ్రవరి 4న ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉంగుటూరు మండలం బాదంపూడి, తణుకు మండలం వేల్పూరులో కోళ్ల మరణాలకు ఎవియాన్ ఇన్‌ఫ్లూయంజ్ (హెచ్5ఎన్1) వైరస్ కారణమని ల్యాబ్ నివేదికలు తేల్చాయి. వైరస్ గుర్తించిన పౌల్ట్రీకి కిలోమీటరు పరిధిలో ఇన్ఫెక్షన్ జోన్, పది కిలోమీటర్లు పరిధిని అలర్ట్ జోన్‌గా గుర్తించి కొద్దిరోజులపాటు చికెన్, గుడ్లు అమ్మకాలపై అధికారులు నిషేధం విధించారు.
కలకలం రేపిన చిన్నారి మృతి
పల్నాడు జిల్లా నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూతో మృతిచెందడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసింది. ఈ ప్రభావం పౌల్ట్రీ రంగంపై పడింది. దీంతో చికెన్, గుడ్డు ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. రెండు రోజుల క్రితం ఫాంగేట్ వద్ద రూ.4.60 ఉన్న గుడ్డు ధర శుక్రవారం రూ.4.25కి తగ్గిపోయింది.
మరింత సంక్షోభంలోకి..
ప్రభుత్వం సకాలంలో వైరస్‌ను గుర్తించి, కట్టడికి చర్యలు చేపట్టి ఉంటే ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదని పలువురు విమర్శిస్తున్నారు. మరోపక్క పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కోళ్ల రైతులకు గుబులు పుట్టిస్తున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువైతే వడదెబ్బకు గురై కోళ్ల మరణాలు పెరగడంతో పాటు 10 నుంచి 20 శాతం వరకు గుడ్ల ఉత్పత్తి పడిపోతుందంటున్నారు. రా నున్న రోజుల్లో పరిశ్రమ మరింత సంక్షోభంలో కూ రుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వేసవిలో పిల్లల ఆరోగ్యం జాగ్రత్త
వేసవిలో చిన్నారులకు వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. 8లో u
ఆదుకోని ప్రభుత్వం
వైరస్ గుర్తించక ముందు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 15 లక్షల వరకు లేయర్, 50 వేల వరకు బ్రాయిలర్ కోళ్లు మృతిచెందినట్టు అంచనా. వైరస్ గుర్తించాక వేల్పూరు ఇన్ఫెక్షన్ జోన్‌లోని 55వేలు, బాదంపూడి ఇన్ఫెక్షన్ జోన్‌లోని 1.34 లక్షల లేయర్ కోళ్లను కల్లింగ్ చేశారు. గుడ్లు, మేతలను పూడ్చిపెట్టేశారు. ఒక్కో కోడికి రూ.140 నష్టంగా అధికారులు ప్రాథమికంగా లెక్కకట్టారు. ఈ మేరకు పూడ్చిపెట్టిన కోళ్లకు రూ.2.65 కోట్లు, అలాగే గుడ్లు, మేతల రూపంలో మరింత మొత్తం బాధిత రైతులకు అందించాల్సి ఉంది. అయితే ఇప్పటికీ ప్రభుత్వం పరిహారం అందించలేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రుణాలు రీషెడ్యూల్ చేయకపోవడంతో కొత్త బ్యాచ్‌లు వేయలేని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.
న్యూస్‌రీల్
బర్డ్‌ఫ్లూ వైరస్ నియంత్రణలో కూటమి సర్కారు నిర్లక్ష్య ధోరణి పౌల్ట్రీ రంగానికి శాపంలా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బర్డ్‌ఫ్లూ పంజా విసరడంతో కోళ్ల పరిశ్రమ కుదేలైంది. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితుల్లో తాజాగా నరసారావుపేటలో బర్డ్‌ఫ్లూతో చిన్నారి మృతి చెందిన ఘటన కోళ్ల రైతులను కలవరపరుస్తోంది.
కోడికి కష్టకాలం
నరసరావుపేట ఘటనతో కలకలం
మరలా బర్డ్‌ఫ్లూ భయం
వైరస్ నియంత్రణలో కూటమి నిర్లక్ష్యం
జిల్లాలో బర్డ్‌ఫ్లూ బాధిత రైతులకు అందని సాయం
విడుదల కాని నష్టపరిహారం.. రీషెడ్యూల్ కాని రుణాలు
కోళ్ల పరిశ్రమకు తీవ్ర నష్టం
బర్డ్‌ఫ్లూ వెలుగుచూసే నాటికి ఫాంగేట్ వద్ద గుడ్డు ధర రూ.5.05 ఉంది. ఆంక్షల నేపథ్యంలో స్థానిక వినియోగంతో ఎగుమతులు తగ్గడంతో ఫిబ్రవరిలో రూ.4.10కి పడిపోయింది. చికెన్ ధరలు సైతం కిలో రూ.100కి తగ్గి కోళ్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు పట్టణ ప్రాంతాల్లో చికెన్, ఎగ్ మేళాలు నిర్వహించారు. ధర లేకపోవడం, ఎండలకు జడిసి బ్రాయిలర్ రైతులు కొత్త బ్యాచ్‌లు తగ్గించడంతో మార్కెట్‌లో కోళ్ల సంఖ్య తగ్గింది. రంజాన్ మాసం మొదలు కావడం, బర్డ్‌ఫ్లూ లేదని నిరభ్యంతరంగా చికెన్ తినవచ్చంటూ అధికారులు ప్రకటించడంతో కొద్దిరోజులుగా వినియోగం పెరిగింది.
నష్టపరిహారం రావాల్సి ఉంది
బర్డ్‌ఫ్లూ కారణంగా జిల్లాలో జరిగిన నష్టం వివరాలపై ప్రభుత్వానికి నివేదిక పంపించాం. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే సంబంధిత రైతులకు అందజేస్తాం. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా బర్డ్‌ఫ్లూ లేదు.
– కె.మురళీకృష్ణ, పశుసంవర్ధకశాఖ జేడీ, పశ్చిమగోదావరి జిల్లా

సర్కారు నిర్లక్ష్యం.. పౌల్ట్రీకి శాపం

సర్కారు నిర్లక్ష్యం.. పౌల్ట్రీకి శాపం

సర్కారు నిర్లక్ష్యం.. పౌల్ట్రీకి శాపం