పన్నులే.. పనుల్లేవ్ !
ఖర్చులు పెరిగాయి
డ్రెయినేజీలు లేకపోవడంతో మురుగు నీరు ఇళ్ల మధ్య నిలుస్తుంది. డ్రెయినేజీలు నిర్మించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం. అయినా పట్టించుకున్న నాథుడే లేడు. గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేసినా మాకు ఏం ప్రయోజనం లేదు. పైగా ఖర్చులు పెరిగాయి.
–స్వామి, బొమ్మాయిపల్లి
పంచాయతీగా ఉన్నప్పుడే బాగు
కొత్తగా నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో వీధి దీపాలు లేవు. రాత్రి సమయంలో చిన్నారులు, మహిళలు బయటకు వెళ్లాలంటే బయపడుతున్నారు. వీధి దీపాలు ఏర్పాటు చేయాలని చాలాసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించాం. ఇవే కాకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. పంచాయతీగా ఉన్నప్పుడే బాగుండేది.
–గోపాల్, పగిడిపల్లి
పన్నులు చెల్లిస్తున్నా ఏంలాభం
మున్సిపాలిటీలో కలిపి నాలుగేళ్లు గడిచినా ఇప్పటి వరకు సీసీ రోడ్లు వేయలేదు. గ్రామంలో కొన్ని చోట్ల మట్టి రోడ్లపై ఏడాది క్రితం కంకర పోశారు. ఇప్పటి వరకు సీసీ వేయకపోవడంతో నడవలేకపోతున్నాం. డ్రెయినేజీలు కూడా లేవు. వర్షాలు వస్తే ఇంటి పక్కన నీరు నిలిచి కుంటలా మారుతుంది. పన్నులు చెల్లిస్తున్నా పనులు మాత్రం జరగడం లేదు.
–లక్ష్మమ్మ, రాయగిరి
భువనగిరి : మున్సిపాలిటీలో విలీనమైతే తమ గ్రామాలు అభివృద్ధి చెందుతాయనుకున్న ప్రజలకు నిరాశే ఎదురైంది. సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, వీధి దీపాలు లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పన్నులు పెరిగాయే తప్ప సౌకర్యాలు సమకూరడం లేదని.. సమస్యలను అధికారులు, పాలకవర్గ సభ్యులకు విన్నవించినా స్పందించడం లేదని ప్రజలు వాపోతున్నారు.
మూడు గ్రామాలు విలీనం
భువనగిరి మండలంలోని బొమ్మాయిపల్లి, రాయగిరి, పగిడిపల్లి గ్రామాలను 2019లో భువనగిరి మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఈ గ్రామాల విలీనంతో భువనగిరి మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య 35కు చేరింది. ఇందులో రాయగిరి 2,3,4 వార్డులు, బొమ్మాయిపల్లి 11వ వార్డు, పగిడిపల్లి 12 వార్డు పరిధిలో ఉంది.
ఆస్తిపన్ను చెల్లిస్తున్నా
సమకూరని సౌకర్యాలు
విలీన గ్రామాల ప్రజలు మున్సిపాలిటీలోని అందరి మాదిరిగానే ఏటా ఆస్తిపన్ను చెల్లిస్తున్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్ను డిమాండ్ రూ.6.62 కోట్లు ఉండగా 90 శాతానికి పైగా వసూలైంది. 2024–25 సంవత్సరానికి గాను రూ.8.85 కోట్లు డిమాండ్ ఉంది.ఆస్తిపన్ను చెల్లిస్తున్నా సౌకర్యాలు సమకూరడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పటి వసతులే తప్ప.. కొత్తగా అభివృద్ధి జరగలేదని వాపోతున్నారు. మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్ల ఆయా గ్రామాల ప్రజలకు ఉపాధిహామీ పథకం వర్తించడం లేదు. దీంతో నిరుపేదలకు ఉపాధి లేకుండాపోయింది.
అభివృద్ధికి నోచని విలీన గ్రామాలు
ఫ సీసీ రోడ్లు, డ్రెయినేజీలు,
వీధి దీపాలు లేక అవస్థలు
ఫ వసతుల కల్పనపై అధికారులు, పాలకవర్గం శీతకన్ను
ఫ పన్నులు పెరిగాయే తప్ప అభివృద్ధి జరగడం లేదని ప్రజల ఆవేదన
విలీన గ్రామాలు
గ్రామం జనాభా ఓటర్లు
రాయగిరి 5,245 3,300
పగిడిపల్లి 1,134 550
బొమ్మాయిపల్లి 1,089 650
నిధులు రాగానే కేటాయిస్తాం
ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే విలీన గ్రామాలకు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధులతో చిన్నచిన్న సమస్యలను పరిష్కరిస్తున్నాం. ప్రజలనుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. పరిష్కరించేందుకు నిధుల కోసం ఎదురుచూస్తున్నాం.
–రామాంజులరెడ్డి, మున్సిపల్ కమిషనర్, భువనగిరి
Comments
Please login to add a commentAdd a comment