ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 22,554
ముసాయిదా ఓటరు జాబితా ఖరారు.. నేడు ప్రకటన
ఫ గతంలో కంటే పెరిగిన 1,666 మంది ఓటర్లు
ఫ ఈసారి అదనంగా 19 పోలింగ్ కేంద్రాలు
ఫ అత్యధిక ఓటర్లు హన్మకొండలో, అత్యల్పం సిద్ధిపేటలో
ఫ వచ్చే నెల 25న వరంగల్– ఖమ్మం –
నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితా విడుదలకు కసరత్తు
పెరిగిన పోలింగ్ కేంద్రాలు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో గతంలో 181 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఈసారి వాటి సంఖ్య 200కు పెరిగింది. గతంలో కంటే 19 పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. మొత్తం ఓటర్లలో పురుషులే అధికంగా ఉన్నారు. పురుష ఓటర్ల సంఖ్య 13,498 ఉండగా, మహిళ ఓటర్లు 9056 మంది ఉన్నారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఓటర్ల లెక్క ఖరారైంది. ఓటు హక్కు కోసం 28,698 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో స్క్రూటినీ తరువాత 22,554 మంది అర్హులైన ఓటర్లుగా అధికారులు తేల్చారు. గత ఎన్నికల్లో 20,888 మంది ఓటర్లుండగా ప్రస్తుతం చేపట్టిన ఓటరు నమోదు కార్యక్రమంలో గతంలో కంటే 1,666 మంది ఓటర్లు పెరిగారు. మొత్తంగా ఈసారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజక వర్గంలో అర్హులైన ఓటర్ల సంఖ్య 22,554 మందిగా అధికారులు ఖరారు చేశారు. శనివారం ముసాయిదా జాబితాను జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించనున్నారు.
6,144 దరఖాస్తులు తిరస్కరణ
వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు నమోదు ఈ నెల 6వ తేదీతో ముగిసిపోయింది. నియోజకవర్గం మొత్తంలో 28,698 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అందులో నిబంధనలకు అనుగుణంగా లేని 6,144 మంది టీచర్ల దరఖాస్తులను తిరస్కరించారు.
నేడు ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన
ముసాయిదా ఓటరు జాబితా శనివారం ప్రకటించనున్నారు. మొత్తం 22,554 మంది ఓటర్లు ఉన్నారు. అయితే అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 4,424 మంది ఓట్లు నమోదు చేసుకోగా, అతి తక్కువగా సిద్ధిపేట జిల్లాలో 149 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. నల్లగొండ 4,178 మంది ఓటర్లతో రెండో స్థానంలో నిలిచింది.
నాలుగు జిల్లాల్లో తగ్గిన ఓటర్లు
గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్న ఓటర్ల సంఖ్యతో పోల్చితే ఈసారి నాలుగు జిల్లాల్లో ఓటర్ల సంఖ్య తగ్గింది. సిద్దిపేట, జనగామ, భద్రాద్రి, యాదాద్రి జిల్లాల్లో ఈసారి ఓటర్ల సంఖ్య తగ్గింది. వరంగల్ జిల్లాలో గతంలో కంటే ఈసారి అత్యధికంగా ఓటర్ల సంఖ్య నమోదైంది.
వచ్చే నెల 9వరకు అభ్యంతరాలు స్వీకరణ,
ఓటరు నమోదుకు అవకాశం
ఈ ముసాయిదా ఓటర్ల జాబితాపై ఈనెల 23వ తేదీ నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అలాగే కొత్త ఓటర్ల నమోదుకు కూడా అవకాశం కల్పిస్తారు. సవరణలను స్వీకరిస్తారు. వాటన్నింటిని వచ్చే నెల 25వ తేదీలోగా పరిష్కరించి తుది జాబితా ప్రకటిస్తారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా ఓటర్లు ఇలా..
జిల్లా పోలింగ్ పురుషులు సీ్త్రలు మొత్తం
స్టేషన్లు
యాదాద్రి 17 549 277 826
సూర్యాపేట 23 1,574 893 2,467
నల్లగొండ 37 2,479 1,699 4,178
Comments
Please login to add a commentAdd a comment