ఇంటింటికీ తాగునీరు ప్రభుత్వ లక్ష్యం
యాదగిరిగుట్ట : రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ తాగునీరు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క తెలిపారు. యాదగిరిగుట్టలో మిషన్ భగీరథ పైలాన్ పనులకు శుక్రవారం మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వెళ్లిపోయారు. ఆ తరువాత సభలో సీతక్క మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ రిజరాయర్వాయర్ ద్వారా ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లోని ప్రతి ఇంటికీ మూడు నెలల్లో గోదావరి జలాలు అందజేస్తామన్నారు. ఇందుకోసం మల్లన్నసాగర్ నుంచి రూ.210 వ్యయంతో 16 కిలో మీటర్ల మేర ప్రత్యేకంగా పైప్‌లైన్ ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. పనులు పూర్తయితే ఆలేరు, భువనగిరితో పాటు జనగామ నియోజకవర్గంలోని 526 గ్రామాలకు సురక్షితమైన తాగునీరు అందుతుందన్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ప్రజల కష్టాలు తీరుతున్నాయన్నారు. రూ.25వేల కోట్లతో ప్రతి గ్రామానికి డబుల్, సింగిల్, లింక్ రోడ్లు వేయాలని మంత్రవర్గ సమీక్షలో నిర్ణయించినట్లు తెలిపారు.
పదేళ్లలో ఆలేరు వెనుకబడింది : విప్ ఐలయ్య
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఆలేరు నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పేరుతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం భూములు తీసుకొని నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 11 నెలల్లో అద్భుతమైన పథకాలు తీసుకువచ్చిందన్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తాగునీటి కోసం రూ.45 వేల కోట్లు ఖర్చు చేసినా నీళ్లు రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.210 కోట్లతో పైప్‌లైన్ ఏర్పాటు చేస్తుందన్నారు. ఈకార్యక్రమంలో మిషన్ భగీరథ సీఈ కృపార్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ ఎరుకల సుధ, మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్యరెడ్డి, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఫ ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకుమూడు నెలల్లో గోదావరి జలాలు
ఫ మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ప్రజల కష్టాలు తీరుస్తాం : కోమటిరెడ్డి
ఒకప్పుడు ఆలేరు, భువనగిరి ప్రాంతాల్లో బోర్లు వేస్తే నీళ్లు పచ్చగా వచ్చేవని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. యాదగిరిగుట్ట దేవస్థానానికి 50లక్షల లీటర్ల నీటికి గాను 44లక్షల లీటర్లే వస్తున్నాయన్నారు. ఉమ్మడి నల్ల గొండ జిల్లాలో ఓ వైపు ప్లోరైడ్, హైదరాబాద్ నగరంలో కోటిమంది వినియోగించి వదిలేసిన డ్రెయినేజీ నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారి కష్టాలను తీర్చేందుకే మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలు తీసుకువస్తున్నామన్నారు. మూసీని శుద్ధీకరణ చేసి తీరుతామని, రెండు నెలల్లో గంధమల్ల పనులకు టెండర్లు పిలుస్తామని, బస్వాపూర్ రిజర్వాయర్ పనులను త్వరలో పూర్తిచేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment