వ్యాధిరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి
మోటకొండూర్ : గ్రామాలను వ్యాధిరహితంగా తీర్చిదిద్దేందుకు వైద్యారోగ్య సిబ్బంది కృషి చేయాలని నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ ప్రోగ్రాం అధికారి సాయిశోభ సూచించారు. శుక్రవారం మోటకొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.ఫార్మసీ, ఓపీ, ల్యాబ్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, ఆరోగ్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. హెచ్‌ఐవీ, క్షయ, లెప్రసీ వంటి వ్యాధులు సంక్రమించకుండా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు విజయ్, హారిక, పార్వతమ్మ పాల్గొన్నారు.
పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
నల్లగొండ రూరల్ : కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్‌ఎం రాజశేఖర్ తెలిపారు. 7 డిపోల నుంచి అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి, బీమవరంలో సోమేశ్వర స్వామి, పాలకొల్లులో క్షీరలింగేశ్వర స్వామి, సామర్లకోటలో బీమలింగేశ్వర స్వామి క్షేత్రాలకు బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. ఈ నెల 24న ఆదివారం రాత్రి 8 గంటలకు బస్సులు బయలుదేరుతాయన్నారు. వివరాలకు మిర్యాలగూడ : 08689–241111, నల్లగొండ 7382834610, సూర్యాపేట హైటెక్ 949492665, సూర్యాపేట న్యూ 7382943819, కోదాడ 7780433533, దేవరకొండ 8639049226, యాదగిరిగుట్ట 9885103165 నంబర్లను సంప్రదించాలన్నారు.
రాష్ట్రస్థాయి ఖోఖో
పోటీలకు మర్యాల విద్యార్థి
బొమ్మలరామారం : మండలంలోని మర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎన్.నరేష్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల 7న జరిగిన ఉమ్మడి నల్లగొండ జిల్లాస్థాయి అండర్– 14 బాలుర ఖోఖో పోటీల్లో నరేష్ ఉత్తమ ప్రతిభ కనబరచడంతో రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. ఈ నెల 23,24,25 తేదీల్లో హైదరాబాద్‌లోని దోమలగూడలో జరిగే 68వ రాష్ట్రస్థాయి పోటీల్లో నరేష్ పాల్గొంటాడని హెచ్‌ఎం నిర్మలజ్యోతి తెలిపారు. నరేష్‌ను హెచ్‌ఎం నిర్మలజ్యోతి, ఎంఈఓ రోజారాణి, ఉపాధ్యాయులు అభినందించారు.
భక్తిశ్రద్ధలతో హజరత్ లాల్ షావలి దర్గా ఉర్సు
భువనగిరిటౌన్ : పట్టణంలోని హజరత్ లాల్ షావలి బాబా రహెమతుల్లా అలై దర్గా ఉర్సులో భాగంగా శుక్రవారం పంఖ ఊరేగింపు నిర్వహించారు. భక్తులు దర్గాపై పూలచాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ఎండీ తాహేర్, సలావుద్దీన్, ఫయాజ్, రెయ్యాన్, ఆదిల్, రషీద్ మౌలానా, నసీమ్, షకీల్ హాజీ, బాబా, జావీద్, షోయబ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment