● నలుగురిపై కేసు నమోదు
వలిగొండ: ఎలాంటి అనుమతులు లేకుండా వ్యవసాయ భూమిలో బ్లాస్టింగ్‌కు పాల్పడుతుండగా ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి పేలుడు పదార్థాలను సీజ్ చేశారు. నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలం ఎం. తుర్కపల్లి గ్రామానికి చెందిన రైతు తన వ్యవసాయ భూమిలో ఉన్న రాళ్లను తొలగించడానికి కొందరు వ్యక్తులతో కలిసి బ్లాస్టింగ్‌కు పాల్పడుతుండగా.. విశ్వసనీయ సమాచారం మేరకు భువనగిరి ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. 25 జిలిటెన్ స్టిక్స్, డిటోనేటర్ పవర్ కేబుల్ బండిల్, బైండింగ్ వైర్లను సీజ్ చేసి నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ యుగంధర్ తెలిపారు.
రైతుపై పోస్టుమాస్టర్ ఆగ్రహం
కొండమల్లేపల్లి: రైతుపై సబ్ పోస్టుమాస్టర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొండమల్లేపల్లి మండలం జోగ్యతండాకు చెందిన రమావత్ గిరి పత్తి అమ్ముకోవడంతో కొండమల్లేపల్లి పోస్టాఫీస్‌లోని తన ఖాతాలో నగదు జమయ్యాయి. అతడి పోస్టాఫీస్ ఖాతా జీరో అకౌంట్ కావడంతో అదనంగా ఫిక్స్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు సోమవారం తపాలా కార్యాలయానికి వచ్చాడు. ఈ క్రమంలో సబ్ పోస్టుమాస్టర్ రూ.1000 ఉంటేనే ఖాతా తెరుస్తామని లేదంటే కుదరదని చెప్పాడు. ఖాతా తెరిచేందుకు రూ.500 కడితే సరిపోతుంది కదా అని గిరి అడగగా.. సబ్ పోస్టుమాస్టర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిని గిరి తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండడంతో అతడిని సబ్ పోస్టుమాస్టర్ కొట్టబోయాడు. సబ్ పోస్టుమాస్టర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గిరి కోరుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment