గంజాయి తరలిస్తున్న వ్యక్తుల అరెస్ట్
మోతె: గంజాయి తరలిస్తున్న వ్యక్తులను మోతె మండలం మామిళ్లగూడెం టోల్‌ప్లాజా వద్ద పోలీసులు పట్టుకున్నారు. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన బత్తుల హరీష్, బత్తుల విరాట్ ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సుభాష్‌కు గంజాయి కావాలని ఫోన్ చేశారు. ఈ మేరకు ఆదివారం సుభాష్ గంజాయి తీసుకుని ఖమ్మం వచ్చాడు. బత్తుల విరాట్, బత్తుల హరీష్‌తో పాటు ఎస్‌కే హుస్సేన్‌బాషా ఖమ్మంలో సుభాష్‌ను కలిసి అతడి వద్ద గంజాయి తీసుకుని స్కూటీ డిక్కీలో పెట్టుకొని నలుగురు కలిసి రెండు ద్విచక్ర వాహనాలపై ఖమ్మం నుంచి సూర్యాపేట వైపు వస్తున్నారు. మార్గమధ్యలో మోతె మండలం మామిళ్లగూడెం టోల్‌ప్లాజా వద్దకు వచ్చి మోతె మండల కేంద్రానికి చెందిన వెలుగు జయసింహ, దోసపాటి కళ్యాణ్‌రామ్, పగడాల ఉదయ్‌కుమార్‌రెడ్డి, వెలుగు ఆనంద్, కొండా ఉదయ్‌ను కలిశారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు టోల్ ప్లాజా వద్ద ఉన్న మైదానంలో వీరిని పట్టుకొని 1.640 గ్రాముల గంజాయి, రెండు స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని కోర్టుకు రిమాండ్ చేశారు. నిందితులను పట్టుకున్న వారిలో ఆర్‌ఐ మన్సూర్ అలీ, మోతె ఎస్‌ఐ యాదవేందర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు వీరస్వామి, రామనర్సయ్య, సుమన్, షరీఫ్ ఉన్నాయి. వారిని మునగాల సీఐ రామకృష్ణారెడ్డి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment