రూ.10 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం!
● విజిలెన్స్ అధికారుల తనిఖీలో
వెలుగులోకి..
● పోచంపల్లి మండలం
ముక్తాపూర్‌లో ఘటన
● రైస్‌మిల్లు సీజ్.. యజమానిపై
కేసు నమోదు
భూదాన్‌పోచంపల్లి: మండలంలోని ముక్తాపూర్‌లోని లక్ష్మీనర్సింహస్వామి ఆగ్రో ఇండస్ట్రీస్‌లో రూ.10 కోట్ల విలువైన సీఎంఆర్ యాక్షన్ ధాన్యం మాయమైంది. పౌర సరఫరాల శాఖ అధికారుల తనిఖీలో రూ.10 కోట్ల విలువైన ధాన్యాన్ని సదరు రైస్‌మిల్లు యజమాని గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకొని మిల్లును మూసేసి వెళ్లిపోయినట్టు తేలింది. వివరాల్లోకి వెళితే.. 2022–23 సంవత్సరం రబీ సీజన్‌కు గాను యాదాద్రి జిల్లాలోని రైస్‌మిల్లర్లకు పౌర సరఫరాల శాఖ అధికారులు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కొరకు ధాన్యం ఇచ్చారు. అయితే ఎఫ్‌సీఐ ధాన్యం తీసుకోవడం లేదని అప్పటి ప్రభుత్వం సీఎంఆర్ రైస్ బదులు డబ్బులు చెల్లించేందుకు యాక్షన్ పిలిచింది. ఈ నేపథ్యంలో 2022–23 రబీ సీజన్‌కు గాను సివిల్ సప్లయ్ శాఖ ముక్తాపూర్‌లోని లక్ష్మీనర్సింహస్వామి ఆగ్రో ఇండస్ట్రీస్‌కు 11 వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ధాన్యాన్ని ఇవ్వగా మిల్లు యజమాని గతేడాది జనవరిలో 4,400 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ సంబంధించి డబ్బులు చెల్లించాడు. మిగతా 6,600 మెట్రిక్‌టన్నుల సీఎంఆర్ డబ్బులు ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు చెల్లించాల్సి ఉంది. అధికారులు ఎన్సిసార్లు అడిగినా స్పందనలేక పోవడంతో ఈ నెల 3న విజిలెన్స్ అధికారులు రైస్‌మిల్లు సందర్శనకు వచ్చారు. ఆ సమయంలో మిల్లు మూసేసి ఉంది. మిల్లులోని షట్టర్లు విరిగి ఉండడంతో అఽధికారులు లోనికి వెళ్లి చూడగా ధా న్యం పురుగుపట్టి పాడైపోయింది. బస్తాల స్టాక్‌ను లెక్కించి 1,600 మెట్రిక్ టన్నుల ధాన్యంఉందని తేల్చారు. ఇందులో రూ.10 కోట్ల విలువైన 5వేల టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు.
కేసు నమోదు చేశాం
ముక్తాపూర్‌లోని లక్ష్మీనర్సింహాస్వామి ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని 6,600 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ డబ్బులు ఇవ్వాల్సి ఉంది. మిల్లును సందర్శించగా కేవలం 1,600 మెట్రిక్‌టన్నుల ధాన్యం మాత్రమే స్టాక్ ఉంది. మిగతా ధాన్యం అమ్ముకొన్నట్లు తేలింది. దాంతో మిల్లును సీజ్ చేసి యజమానిపై కేసు నమోదు చేశాం. – జగదీశ్‌కుమార్, పౌర సరఫరాల డీఎం, యాదాద్రి భువనగిరి
రెవెన్యూ యాక్ట్ ప్రకారం కేసు
రైస్‌మిల్లు యజమానికి ఎన్నిసార్లు ఫోన్ చేసిన స్పందనలేక పోవడంతో పౌర సరఫరాల శాఖ అధికారులు ఈ నెల 5న స్థానిక తహసీల్దార్ మహేందర్‌రెడ్డి సమక్షంలో రైస్‌మిల్లును సీజ్ చేశారు. అలాగే మిల్లర్‌పై రెవెన్యూ రికార్డు యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. గతేడాది జిల్లాలో భువనగిరి మండలం అనంతారంలో ఓ రైస్‌మిల్లు యజమాని సీఎంఆర్ వడ్లు అమ్ముకొని రూ.5 కోట్లు చెల్లించక పోవడంతో అధికారులు మిల్లును సీజ్ చేశారు. తాజాగా ఇది రెండో కేసు కావడం విశేషం. అయితే మిల్లు యజమాని శీల శ్రీనివాస్‌ది కరీంనగర్ జిల్లా జగిత్యాల కాగా ముక్తాపూర్‌కు వచ్చి ఇక్కడ 5 ఎకరాల లీజు భూమిలో 2017లో లక్ష్మీనర్సింహస్వామి ఆగ్రో ఇండస్ట్రీస్ పేరిట రైస్‌మిల్లును ఏర్పాటు చేసినట్టు అధికారుల విచారణలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment