శివకేశవులకు సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: శివకేశవులకు నిలయమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం ఆధ్యాత్మిక పర్వాలు కొనసాగాయి. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో రుద్రాభిషేకం, బిల్వార్చన పూజలు విశేషంగా నిర్వహించారు. ఇక ప్రధానాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు సంప్రదాయ పూజలు కొనసాగించారు. ఆలయంలో వైభవంగా నిత్యకల్యాణ వేడుక, శ్రీసుదర్శన నారసింహ హోమం, జోడు సేవలు వంటి పూజలను ఆచార్యులు శాస్త్రోక్తంగా జరిపించారు.
ప్రథమ భూదాతకు
ఘన నివాళి
భూదాన్‌పోచంపల్లి: ప్రథమ భూదాత వెదిరె రాంచంద్రారెడ్డి 37వ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలో వినోబాభావే సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మోటె రజిత రాజు, సేవా సమితి ఉపాధ్యక్షుడు కొయ్యడ నర్సింహ, ప్రధానకార్యదర్శి వేశాల మురళి, భారత భాస్కర్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
హామీలు అమలు
చేయలేకే మాటల గారడీ
చౌటుప్పల్: ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటల గారడీ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన ఆ పార్టీ మునుగోడు నియోజకవర్గ సంస్థాతగ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉచిత బస్సు హామీని అమలు చేసి మిగతా హామీలన్నీ అమలు చేసినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీలు.. 66మోసాలతో ఏడాది పాలన ముగించారని విమర్శించారు. హామీలు అమలు చేసే వరకు వెంటాడుతామన్నారు. సమావేశంలో పార్టీ నల్లగొండ జిల్లా సంస్థాగత ఎన్నికల అధికారి కట్టా సుధాకర్‌రెడ్డి, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్శిత్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనూరి వీరారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్, దూడల భిక్షం, జక్కలి రాజు, రాసాల జనార్దన్‌రెడ్డి, గుజ్జుల సురేందర్‌రెడ్డి, ఆలె చిరంజీవి, బత్తుల జంగయ్య, కె.అశోక్, కంచర్ల గోవర్ధన్‌రెడ్డి, చినుకని మల్లేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment