‘ఇందిరమ్మ’ అర్జీల పరిశీలన
భువనగిరి టౌన్: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంట్లో భాగంగా సోమవారం దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు సర్వే ప్రారంభించింది. అర్హులైన వారినే నూటికి నూరుశాతం లబ్ధిదారుల ఎంపికకు రాజకీయ ప్రమేయం లేకుండా పారదర్శకంగా వ్యవహించేలా ఇప్పటికే గ్రామాల్లో వార్డుల వారీగా కమిటీలు వేశారు.
అర్హుల గుర్తింపునకు మొబైల్ యాప్
జిల్లా వ్యాప్తంగా గతేడాది డిసెంబర్ 28 నుంచి ఈ ఏడాది జనవరి 6వ తేదీ వరకు ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి జిల్లా నుంచి 1.20 లక్షల మంది వరకు దరఖాస్తులు అందించారు. వీరిలో అర్హులైనవారి గుర్తించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి వచ్చిన అర్జీల సర్వేపై గూగుల్ మీట్ ద్వారా అధికారులతో మాట్లాడి క్షేత్ర స్థాయిలో తిరిగి అర్హులను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులు ఆదేశించారు. దీంతో జిల్లాలో 17 గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో వార్డు ఇన్‌చార్జ్‌ల ఆధ్వర్యంలో అర్హుల గుర్తింపునకు సోమవారం సర్వే ప్రారంభించారు. ఇందుకోసం మొబైల్ యాప్‌ను వినియోగిస్తూ దరఖాస్తుదారుల నివాసాలకు వెళ్లి వారి పూర్తి వివరాల పరిశీలిస్తూ మొబైల్ యాప్‌లో పొందుపరుస్తున్నారు.
సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనకు జిల్లా వ్యాప్తంగా సోమవారం సర్వే ప్రారంభమైంది. దీంట్లో భాగంగా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో సర్వేను అదనపు కలెక్టర్ వీరారెడ్డి, భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డితో కలిసి పరిశీలించారు. స్వయంగా మొబైల్ యాప్‌లో దరఖాస్తుదారుల వివరాలను నమోదు చేశారు. వారివెంట భువనగిరి మున్సిపల్ కమిషనర్ పి.రామాలజురెడ్డి తదితరులు ఉన్నారు.
దరఖాస్తుదారుల
ఇంటింటి సర్వే ప్రారంభం
ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల
పథకానికి 1.20 లక్షల దరఖాస్తులు
ప్రత్యేక యాప్‌లో వివరాలు
నమోదు చేస్తున్న సిబ్బంది
సర్వేకు సహకరించాలి
ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం పెట్టుకున్న దరఖాస్తులు పరిశీలించి విరాలు మొబైల్ యాప్‌లో పొందుపరచడానికి సర్వే నిర్వహిస్తున్నాం. జియోట్యాంగింగ్ ద్వారా ఫొటో తీసుకుంటున్నాం. దరఖాస్తుదారులంతా కచ్చితమైన సమాచారమిస్తూ సర్వేకు సహకరించాలి.
– హనుమంతరావు, జిల్లా కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment