అర్జీలు వేగంగా పరిష్కరించాలి
భువనగిరి టౌన్: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వేగంగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. సోమవారం భువనగిరి కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గంగాధర్‌తో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 34 అర్జీలను స్వీకరించి మాట్లాడారు. అర్జీలు పెండింగ్‌లో పెట్టకుండా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అధికారులపై ఆగ్రహం
ప్రజావాణిలో డీఎస్‌ఓకు వచ్చిన వినతి పత్రం స్వీకరించిన అదనపు కలెక్టర్ వీరారెడ్డి మైక్‌లో రెండుసార్లు పిలిచిన సదరు అధికారి రాకపోవడంతో ఆ శాఖకు సంబంధించి మరో అధికారి వచ్చి తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రజావాణికి జిల్లా అధికారులు ఎదుకురావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరైన సీనియర్, జూనియర్ అధికారులపై మండిపడ్డారు. జిల్లా వ్యవసాయ అధికారి సైతం ప్రజావాణికి రాకపోవడంతో ఆ శాఖకు వచ్చిన వినతి పత్రం అదనపు కలెక్టర్ వద్దే ఉంచుకున్నారు. జిల్లా అధికారులు ప్రజావాణికి రాకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
● అదనపు కలెక్టర్ వీరారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment