దాతలు చేయూతనివ్వాలి
భువనగిరి: ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న పేద విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు దాతలు ముందుకు రావాలని డీఈఓ సత్యనారాయణ అన్నారు. చలికాలం నేపథ్యంలో హాస్టళ్లలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ హనుమంతరావు ఆదేశాలతో సోమవారం భువనగిరిలో పలు సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ దుప్పట్ల పంపిణీకి దాత గోపాల్‌అగర్వాల్ సహకారం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్షా అభియాన్ కోఆర్డినేటర్లు శ్రీనివాస్, నరహరి, పాఠశాలల సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment