భూదాన్‌పోచంపల్లి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేపట్టి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) రాష్ట్ర అధ్యక్షుడు సాగర్ అన్నారు. మంగళవారం భూదాన్‌పోచంపల్లి లో నిర్వహించిన పీవైఎల్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 30 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందని, ఇంకా రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ఈనెల 16న చేపట్టిన చలో అసెంబ్లీ ముట్టడిని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో పీవైఎల్ రాష్ట్ర సహాయకార్యదర్శి కుమార్, జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు శివ, బాలకృష్ణ, వెంకటేశ్, కృష్ణ, మోహన్‌రెడ్డి, నవీన్, కిషోర్, బుచ్చయ్య, బాలనర్సింహ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment