ప్లే స్కూళ్లను తలపించేలా..
రామన్నపేట: అంగన్‌వాడీ కేంద్రాలను కార్పొరేట్ పాఠశాలలు, ప్లే స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్న ప్రభుత్వం చిన్నారులకు మెరుగైన వసతులను కల్పించేందుకు వివిధ రకాల ఫర్నీచర్‌ను సమకూరుస్తోంది. దీంతో అంగన్‌వాడీ కేంద్రాలు చిన్నారులకు ఆహ్లాదాన్ని పంచే సెంటర్లుగా మారుతున్నాయి.
ఒక్కో సెంటర్‌కు నాలుగు రకాల ఫర్నిచర్
జిల్లాలో భువనగిరి, ఆలేరు, మోత్కూరు, రామన్నపేటలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిల 901 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అయితే వీటిలో ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో నిర్వహిస్తున్న 405 కేంద్రాలతోపాటు, సొంత భవనాలు కలిగిన 200 సెంటర్లు, మిగతావి అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటన్నింటికీ కొత్తగా నాలుగు రకాల ఫర్నీచర్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో భాగంగా ఒక్కో సెంటర్‌కు ఒక దీర్ఘచతురస్రాకారం టేబుల్, రౌండ్ టేబుల్, నాలుగు మ్యాట్లు, ఒక ర్యాక్‌ను అందిస్తున్నారు. ఇప్పటికే సగానికిపైగా కేంద్రాలకు ఫర్నిచర్ చేరింది. మిగిలిన కేంద్రాలకు ఫర్నిచర్‌ను చేరవేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. విద్యార్థులు సౌకర్యవంతంగా కూర్చోవడానికి ఆడుకోవడానికి.. రాసుకోవడానికి ఫర్నిచర్ ఉపయోగపడుతుంది. దీంతో ఇప్పటికే ఫర్నిచర్ అందిన అంగన్‌వాడీ కేంద్రాలు కొత్త శోభను సంతరించుకున్నాయి.
నమోదైన చిన్నారుల సంఖ్య
19,405
అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త ఫర్నిచర్
ఒక్కో సెంటర్‌కు రెండు టేబుళ్లు, నాలుగు మ్యాట్లు, ఒక ర్యాక్
ఒప్పటికే సగానికిపైగా కేంద్రాలకు
అందజేత
రెండు, మూడు రోజుల్లో
పూర్తికానున్న ప్రక్రియ
పిల్లలకు చాలా ఉపయుక్తంగా ఉంది
ప్రభుత్వం సరఫరా చేసిన ఫర్ని చర్ పిల్లలకు చాలా ఉపయుక్తంగా ఉంది. పిల్ల లు మినీచైర్స్‌పై టేబుళ్ల చుట్టూ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. యూని ఫామ్ కూడా ఇవ్వడంతో ఎన్‌రోల్ మెంట్ పెరుగుతుంది. దీంతో చిన్నప్పటి నుంచే పిల్లల్లో సమానత్వ భావం అలవాటవుతుంది.
– పి.మంజుల, అంగన్‌వాడీ టీచర్,
ఉత్తటూరు, రామన్నపేట మండలం
రెండు రోజుల్లో మిగతా కేంద్రాలకు..
కొత్త ఫర్నిచర్‌తో అంగన్‌వాడీ కేంద్రాలు కార్పొరేట్ స్కూళ్ల ను తలపించేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా కేంద్రాలను ఫర్నిచర్‌ను చేరవేశాం. మిగిలిన కేంద్రాలకు ఒకటి రెండు రోజుల్లో పంపిణీ చేస్తాం. దీంతో ప్రీస్కూల్ చిన్నారులు కేంద్రాలకు రావడానికి ఆసక్తి కనబరుస్తారు.
– కె. నర్సింహారావు, జిల్లా సంక్షేమ అధికారి, యాదాద్రి భువనగిరి
జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు 901
Comments
Please login to add a commentAdd a comment