12, 13న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన
భువనగిరి: పట్టణంలోని రాయగిరి గ్రామ పరిధిలో గల విద్యాజ్యోతి హైస్కూల్‌లో ఈ నెల 12,13వ తేదీల్లో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నట్లు డీఈఓ సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్‌స్పైర్ అవార్డులకు సంబంధించి 131 ప్రదర్శనలు ఉండగా విజ్ఞానిక ప్రదర్శనకు సంబంధించి 150 ఎగ్జిబిట్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహణకు 15 కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెల 12న ఉడయం 8 గంటలకు తమ ఎగ్జిబిట్‌తో పాటు విద్యార్థి, గైడ్ టీచర్ మాత్రమే హాజరుకావాలని సూచించారు.
క్రీడా నైపుణ్యాలను
పెంపొందించుకోవాలి
భూదాన్‌పోచంపల్లి : విద్యార్థులు చదువుతో పాటు క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిణి సునంద అన్నారు. మంగళవారం భూదాన్‌పోచంపల్లి పట్టణకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకర్, ఎంపీఓ మాజిద్, ప్రధానోపాధ్యాయులు రాజారెడ్డి, రమాదేవి, పీఈటీ ఉపేందర్, కరుణాకర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
గురుకుల పాఠశాల పరిశీలన
రాజాపేట: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మంగళవారం డీఐఈఓ రమణి సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రవేశాలు, విద్యార్థుల హాజరు శాతం నమోదు రికార్డులను పరిశీలించారు. అనంతరం పాఠశాలలో జరుగుతున్న సీఎం కప్ క్రీడాపోటీలను వీక్షించారు. ఆమె వెంట కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ రాజు, అధ్యాపకులు ఉన్నారు.
జనగామ జిల్లాకు
పాపన్నగౌడ్ పేరు పెట్టాలి
యాదగిరిగుట్ట: జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరు పెట్టాలని గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎలికట్టి విజయ్‌కుమార్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలోని గౌడ సంఘం భవనంలో నిర్వహించిన గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహాన్ని పెడతామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, వచ్చే ఏప్రిల్ వరకు పాపన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రం దుర్గాగౌడ్, మూల వెంకటశ్వర్లుగౌడ్, నారాయణగౌడ్, భిక్షయ్యగౌడ్, కార్యదర్శులు శ్రీనివాస్‌గౌడ్, దేవేందర్‌గౌడ్, పరమేష్‌గౌడ్, ఆయా జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇటీవల మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించిన వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం(సెట్విన్)లో తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అర్హులైన వారినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని శిక్షణ కేంద్రం ఇన్‌చార్జ్ సరిత మంగళవారం తెలిపారు. అభ్యర్థులు 18లోగా నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో గల సెట్విన్ కేంద్రంలో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, మొబైల్ సర్వీసింగ్, సీసీటీవీ ఇన్సాలేషన్ సర్వీసింగ్, ఎలక్ట్రిషియన్, ప్లంబింగ్, ఆటోమొబైల్ కోర్సుల్లో డిప్లొమా, ఏదేని యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉండడంతో పాటు అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment