ప్రతి పౌరుడు దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి అన్నారు.
పశువుల దాణాగా..
పలువురు రైతులు అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలామృతం కొనుగోలు చేసి పశువుల దాణాగా వినియోగిస్తున్నారు.
- 10లో
సాక్షి, యాదాద్రి: రేవంత్‌రెడ్డి ఏడాది పాలనలో సీఎం కుర్చీకి విలువ లేకుండా చేశారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి వారు పాలాభిషేకం చేశారు. అనంతరం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి పాలనపై రోజు రోజుకూ ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో మహిళా ఉద్యోగులకు లాభం జరుగుతుంది తప్ప.. పేద మహిళలకు మేలు జరగడం లేదన్నారు. ఫైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు తమ కష్టాలు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారన్నారు. పరిపాలనపై పట్టు లేదని, జేబులు నింపుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ మాయ మాటలతో మోసపోయామని ప్రజలు గుర్తించారన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారం బీఆర్‌ఎస్‌దేనన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా మాజీ కోఆర్డినేటర్ కొలుపుల అమరేందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఏనబోయిన ఆంజనేయులు, మాజీ జెడ్పీటీసీ సుబ్బురు బీరుమల్లయ్య, ఏవీ కిరణ్‌కుమార్, జనగాం పాండు, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, నీల ఓం ప్రకాశ్‌గౌడ్, బల్గూరి మధుసూదన్‌రెడ్డి, సందెల సుధాకర్, రేకల శ్రీనివాస్, సిద్దుల పద్మ, రత్నపురం పద్మ, బబ్లు, మున్సిపల్ కౌన్సిలర్‌లు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
సీఎం కుర్చీకి విలువ లేకుండా చేశారు
మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి
భువనగిరిలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం
Comments
Please login to add a commentAdd a comment