12లోపు అభ్యంతరాలు తెలపాలి
సాక్షి,యాదాద్రి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12వ తేదీ లోపు తెలియజేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ గంగాధర్‌తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 426 గ్రామ పంచాయతీలు, 3698 వార్డులు ఉండగా 3698 పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ ముసాయిదా జాబితా రూపొందించామన్నారు. అభ్యంతరాలను 13వ తేదీన పరిష్కరిస్తామని చెప్పారు. తుది ఓటరు జాబితా 17న ప్రచురించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సునంద, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
వ్యవసాయ గణన పకడ్బందీగా నిర్వహించాలి
వ్యవసాయ గణన పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హనుమంత రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో 11వ వ్యవసాయ గణనపై శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డీఏఓ, ఎంఏఓ, ఏఈఓలకు అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు సంబంధించిన అన్ని అంశాలను తెలియపరుస్తూ సమాచారాన్ని ట్యాబ్ ఎంట్రీలో పొందుపరచాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రణాళికా అధికారి శామ్యూల్, ఎస్‌ఓ రాజమ్మ, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ అధికారి నీలిమ, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ హనుమంతరావు
Comments
Please login to add a commentAdd a comment