కొత్త పింఛన్లు ఇంకెప్పుడు?
భువనగిరిటౌన్: ఆసరా పింఛన్ల కోసం జిల్లా ప్రజలకు రెండేళ్లుగా ఎదురుచూపులు తప్పడంలేదు. గత ప్రభుత్వం 2022 ఆగస్టులో చివరిసారిగా కొత్త పింఛన్లు మంజూరు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా కొత్త పింఛన్లను మంజూరు చేయలేదు. కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని అందరూ భావించారు. కానీ, ఏడాది పూరైనా.. ఇప్పటికీ దానిపై ఊసెత్తడం లేదు. జిల్లా వ్యాప్తంగా 1,01,340 మంది లబ్ధిదారులకు నెలకు రూ.25.21 కోట్లు పింఛన్ పంపిణీ చేస్తున్నారు. ఇంకా 15 వేల మందికి పైగా వివిధ రకాల పింఛన్ల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు.
పెంచుతామన్న ఆసరా పింఛన్లూ పెంచలే..
తాము అధికారంలోకి వస్తే ఆసరా పింఛన్లు పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినా ఇప్పటికీ పాత పింఛన్లే అమలవుతున్నాయి. ప్రస్తుతం ఒక ఇంట్లో భార్యభర్తల్లో ఎవరైనా చనిపోతే వారికి వస్తున్న పింఛన్ వారి బతుకున్న భర్తకో, భార్యకో బదిలీ చేసే అవకాశం మాత్రమే ఇప్పుడు కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. కాగా.. ప్రభుత్వం నూతన పింఛన్లు ఇవ్వాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల దివ్యాంగుల సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు.
15 వేల మందికి పైగా ఎదురుచూపు
కలెక్టర్ కార్యాలయం చుట్టూ
తిరుగుతున్న లబ్ధిదారులు
Comments
Please login to add a commentAdd a comment