యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లిలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) ఆధ్వర్యంలో పోలీసుల ఆయుధ ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులకు ఆయుధాలపై అవగాహన కల్పించారు. ఏ సమయంలో ఎలాంటి తుపాకులను వాడుతారనే అంశాలను విద్యార్థులకు వివరించారు. ఆయుధాల రకాలు, వాటి పని తీరు, ప్రాముఖ్యతను తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్‌ఏఎఫ్ డిప్యూటీ కమాండెంట్ వినోద్ గోపి, శాఖాధిపతులు రామానాయుడు, రాజగోపాల్‌రెడ్డి, డాక్టర్ వినయ్, జగన్నాథరావు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ సాయిరాం, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ యాదగిరిరెడ్డి, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment