●తెలుగు భాషా దినోత్సవాన్ని జయప్రదం చేయాలి | - | Sakshi
Sakshi News home page

●తెలుగు భాషా దినోత్సవాన్ని జయప్రదం చేయాలి

Published Wed, Aug 28 2024 2:02 AM | Last Updated on Wed, Aug 28 2024 2:02 AM

-

జిల్లాలో తొలి తెలుగు శాసనాలు లభ్యమైన కలమల్ల గ్రామంలో ఈ నెల 29న ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించున్న తెలుగు భాషా దినోత్సవాలను జయప్రదం చేయాలని కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి పిలుపునిచ్చారు. మంగళవారం కడప కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్‌ హాలులో వేడుకల నిర్వహి ణా ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు, సలహాలు అందించి వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలిపే విధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ అనూరాధ, జెడ్పీ సీఈఓ సుధాకర్‌ రెడ్డి, డీపీఓ ప్రభాకర్‌ రెడ్డి, ఆర్కియాలజీ ఏడీ శివకుమార్‌, టూరిజం జిల్లా అధికారి రామ్‌ కుమార్‌, ఇంటాక్‌ సభ్యులు చిన్నప్ప రెడ్డి, మహబూబ్‌ బాషా, తెలుగు ఉపాధ్యాయులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement