గొడవకు దారి తీసిన ఫోన్‌కాల్
సాక్షి టాస్క్‌ఫోర్స్ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఒక ఫోన్ కాల్ వ్యవహారం గొడవకు దారి తీసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వైద్య ఆరోగ్య శాఖలో ఒక విభాగంలో పనిచేసే ఒక అధికారి ఫోన్ నుంచి ఒక నంబర్‌కు కాల్ వెళ్లింది. అందుకు సమాధానంగా అవతలి వ్యక్తి ‘ఎవరికి ఫోన్ చేశావ్’’ అని మాట్లాడారు. దీంతో పరస్పరం ఇద్దరి మధ్య ఫోన్‌లోనే మాటల యుద్ధం ప్రారంభమైంది. గొడవ తీవ్ర స్థాయికి చేరింది. తరువాత ఫోన్ చేసిన అధికారి ఫోన్ పెట్టేశాడు. ఫోన్‌లో మాట్లాడిన అవతలి వ్యక్తి ఆ తర్వాత తనకు ఫోన్ చేసింది తమ శాఖలోని ఓ సెక్షన్ అధికారి అని తెలుసుకుని ఆయనను బయట కలిసి మాట్లాడారు. ఆ సమయంలో వారి మధ్య మళ్లీ గొడవ జరిగినట్లుగా తెలిసింది. ఈ అంశం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
సిద్దవటం (ఒంటిమిట్ట) : మండలంలోని మాచుపల్లి గ్రామ పంచాయతీ, తురకపల్లి గ్రామానికి చెందిన బషీరున్ (24) అనే వివాహిత సోమవా రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు మృతురాలి అన్న మస్తాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కడప నగరానికి చెందిన బషీరున్‌కు తురకపల్లికి చెందిన మహమ్మద్‌తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. భర్త మహమ్మద్ జీవనోపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లాడు. తురకపల్లి గ్రామంలో బషీరున్ ఉన్న నివాస గృహానికి ఒక వైపు అత్త, మామలు, మరోవైపు మరిది నివాసం ఉంటున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు బషీరున్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని మృతి చెందినట్లు అత్తా మామలు మస్తాన్‌కు సమాచారం ఇచ్చారు. బషీరున్ మృతదేహాన్ని పరిశీలించి ఆమె మెడ, ఛాతీపై గాయాలు ఉండటంతో మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. సిద్దవటం ఇన్‌చార్జి ఎస్‌ఐ శివప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment