రాయచోటి : తరగతి గదిలో ఉపాధ్యాయునిపై దాడి చేసి మృతికి కారకులైన ఇద్దరు విద్యార్థులను జువైనల్ హోమ్‌కు తరలించినట్లు రాయచోటి అర్బన్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ఈ నెల 5వ తేదీన రాయచోటి పట్టణం కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఏజాస్ అహమ్మద్‌పై దాడి చేసి చంపిన విషయం తెలిసిందే.
ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తమ విచారణలో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఈ దాడిలో పాల్గొన్నట్లు నిర్ధారణ అయిందని సీఐ తెలిపారు. వారిద్దరినీ ఈ నెల 7వ తేదీన జువైనల్ కోర్టుకు హాజరుపరచగా కోర్టు వారిని జువైనల్ హోమ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment