11, 12 తేదీల్లో కలెక్టర్ల సమావేశం
కడప సెవెన్‌రోడ్స్ : రాష్ట్ర సచివాలయంలో ఈనెల 11, 12 తేదీలలో కలెక్టర్ల సమావేశం నిర్వహించనున్నారు. అజెండాలోని అంశాలకు సంబంధించిన సమాచారాన్ని జిల్లాలోని ఆయా శాఖల అధికారులు సేకరించి కలెక్టర్‌కు నివేదించారు. తొలిరోజు ఉదయం సెషన్‌లో గ్రీవెన్స్, ఆర్‌టీజీఎస్, వాట్సాప్ గవర్నెన్స్, జీఎస్‌డబ్ల్యుఎస్‌లు ఉంటాయి. మధ్యాహ్నం సెషన్‌లో వ్యవసాయం, పశుసంవర్దక, ఉద్యాన, పౌరసరఫరాలు, అటవీ, నీటిపారుదల, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్, ఉపాధి హామీ, గ్రామీణ తాగునీరు, సెర్ఫ్, మున్సిపల్, శాంతిభద్రతలు అనే అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించనున్నారు. మరుసటిరోజు ఉదయం సెషన్‌లో పరిశ్రమలు, ఐటీ, ఐటీఈ అండ్ సీ, ఐఅండ్‌ఐ, విద్యుత్, మానవ వనరుల అభివృద్ధి, రహదారులు, గృహ నిర్మాణం, సోషల్ వెల్ఫేర్, బీసీ మైనార్టీ సంక్షేమం, సీ్త్ర శిశు సంక్షేమం, రెవెన్యూ (భూములు, రిజిస్ట్రేషన్, స్టాంపులు), ఎకై ్సజ్, గనులపై చర్చ కొనసాగుతుంది. జిల్లా అభివృద్ధి ప్రణాళికల ప్రెజెంటేషన్ నిర్వహిస్తారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సమావేశానికి హాజరు కానున్నారు.
14 నుంచి క్రీడా పోటీలు
వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల వాలీబాల్, కబడ్డీ, టగ్ ఆఫ్ వార్ పురుషులు మహిళల క్రీడా పోటీలు పొద్దుటూరు వైఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈనెల 14, 15 వ తేదీన నిర్వహించనున్నట్లు క్రీడా బోర్డు కార్యదర్శి డాక్టర్ కె. రామసుబ్బారెడ్డి తెలిపారు. ఈ క్రీడలలో పాల్గొనేవారు 2024 జులై 1వ తేదీ నాటికి 17 సంవత్సరాలు పైన 25 సంవత్సరాల లోపు వయసు కలిగి విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలో చదువుతూ ఉండాలన్నారు. ఈ క్రీడల్లో పాల్గొను వారు స్టడీ, టెన్త్‌మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఒరిజినల్ , జిరాక్స్ పత్రాలు తీసుకొని 14వ తేదీ ఉదయం 8 గంటలలో లోపల డాక్టర్ వైఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ వైవీయూ ప్రొద్దుటూరులో హాజరు కావాలని కోరారు. వివరాలకు 9052540530, 9000294626 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
14న జానమద్దిపై
స్మారకోపన్యాస సభ
కడప కల్చరల్ : సీపీ బ్రౌన్ గ్రంథాలయ నిర్మాత, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ జానమద్ది హనుమచ్చాస్త్రి శతజయంతి సంవత్సర స్మారక ఉపన్యాసంలో భాగంగా ఈనెల 14న తెలుగుభాష వైభవంపై ఉపన్యాసం ఉంటుందని జానమద్ది సాహితీపీఠం మేనేజింగ్ ట్రస్టీ జానమద్ది విజయభాస్కర్ తెలిపారు. సాయంత్రం 5.30 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ హాజరవుతారని తెలిపారు. కవిత విద్య సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షులు అలపర్తి పిచ్చయ్యచౌదరి సభకు అధ్యక్షత వహిస్తారని, కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి గౌరవ అతిథిగా హాజరవుతారని తెలిపారు. వైవీయూ బాధ్య కుల సచివులు ఆచార్య పుత్తా పద్మ ప్రత్యేక అతిథిగా పాల్గొంటారన్నారు.
బాధితులకు న్యాయం చేస్తాం
కడప అర్బన్ : ప్రజల సమస్యలను స్పష్టంగా తెలుసుకొని వాటిని చట్టపరిధిలో విచారించి బాధితులకు న్యాయం అందించడానికి జిల్లా పోలీస్ శాఖ సిద్ధంగా ఉంటుందని జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొని ప్రజల అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి, వారి సమస్యను విని, సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. సబ్ డివిజన్, సర్కిల్ పరిధిలో, పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను పూర్తిగా విని సత్వర న్యాయం చేయాలన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం
సిద్దవటం (ఒంటిమిట్ట) : మానసిక ఉల్లానికి, దేహధారుడ్యానికి పోలీసులకు క్రీడా పోటీలు ఎంతో అవసరమని జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. మండలంలోని భాకరాపేట సమీపంలో ఉన్న 11వ ఏపీఎస్పీ బెటాలియన్‌లో ఇన్‌చార్జి కమాండెంట్ నాగేశ్వరప్ప ఆధ్వర్యంలో సోమవారం జరిగిన 17వ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. 100 మీటర్లు, 800 మీటర్లు పరుగుపందెం పోటీలు, క్రికెట్, లాంగ్ జంప్, షాట్‌పుట్, షటిల్, వాలీబాల్ పోటీలను ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment