రాజంపేట : ఎంపీ మిధున్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథ్‌రెడ్డి కృషితో జయంతి ఎక్‌ప్రెస్‌రైలుకు హాల్టింగ్ ఉత్తర్వులు వెలువడ్డాయని గుంతకల్ రైల్వే యూజర్స్ కమిటీ సభ్యుడు తల్లెం భరత్‌రెడ్డి అన్నారు. రాజంపేటలో ఆయన మంగళవారం మాట్లాడుతూ రాజంపేటలో జయంతి ఎక్స్‌ప్రెస్ రైలు నిలుపుదల చేయాలని వినతులు పంపారన్నారు. కరోనా ముందు నుంచి హాల్టింగ్ ఉన్న రైళ్లకు హాల్టింగ్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జయంతి ఎక్స్‌ప్రెస్‌కు ముందుగానే రిజర్వేషన్ చేసుకున్న అయ్యప్పస్వాములకు ఉపయోగకరంగా నిలుపుదల ఉత్తర్వులు దోహదపడతాయన్నారు.
సౌమ్యనాథ స్వామి హుండీ ఆదాయం లెక్కింపు
నందలూరు : జిల్లాలో ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మక నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. రూ. 3,31,968 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం డబ్బును ఆలయ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, టీటీడీ విజిలెన్సు అధికారి జానకీ రామ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment