జీ హుజూర్ !
సాక్షి ప్రతినిధి, కడప : అధికార మార్పిడి తర్వాత అ క్రమ కేసులు క్రమం తప్పకుండా తెరపైకి వస్తున్నా యి. నిజాయతీ పరులైన అధికారులకు బదిలీ బ హుమానంగా ఇవ్వడంతో.. అధికార వర్గాల్లో ఆత్మ స్థైర్యం సన్నగిల్లింది. ఆపై ఖాకీపై ఖద్దరు స్వారీ చే యడం ఆరంభించింది. ఈక్రమంలో వరుసగా అ క్రమ కేసులు తెరపైకి వస్తున్నాయి. మైదుకూరు, పు లివెందుల సబ్ డివిజన్‌లలో ఆ పాళ్లు మరింత ఎ క్కువయ్యాయి. మైదుకూరు తహసీల్దార్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డారనే అభియోగాలపై బెయిల్ పొందిన నేట్లపల్లె బ్రదర్స్‌ను మరో కేసులో రిమాండ్‌కు ఆదేశించిన వ్యవహారం చోటుచేసుకుంది.
పోలీసు వ్యవస్థకు మచ్చ తెస్తున్న వైనం
విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధత, చట్టపరిధి మేరకే పని చేసే అధికారులు కరువయ్యారా.. అధికారం, అక్రమార్జనకు బానిసలయ్యే అధికారులే అధికమయ్యారా.. ఖద్దరు నేతలు ఆదేశిస్తే జీ..హుజుర్ అంటూ తలాడిస్తూ చెప్పిందే తడువుగా ఖాకీలు పని చేస్తున్నారా.. అని ప్రశ్నలకు అవుననే విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. చట్టానికి అనుగుణంగా అడుగులు వేసే నాలుగో సింహం బహు అరుదుగా కూడా కన్పించడం లేదని పలువురు వాపోతున్నారు. రాజకీయ నాయకుల ప్రాపకం కోసం, ఆ మాటున అక్రమార్జన కోసం పరితపిస్తూ పోలీసు వ్యవస్థకు మచ్చ తెస్తున్న త్రిబుల్‌స్టార్ అధికారులు విశృంకళ నాట్యం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అందుకు మైదుకూరు పరిఽధిలోని నేట్లపల్లె బ్రదర్స్ వ్యవహారం చక్కటి ఊదాహరణగా నిలుస్తోంది.
తహసీల్దార్‌పై హత్యాయత్నం కేసులో రిమాండ్
మైదుకూరు రెవెన్యూ యంత్రాంగం సమక్షంలో తహసీల్దార్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డారని నేట్లపల్లె శివరాం, నేట్లపల్లె రామాంజనేయులు అనే అన్నదమ్ముళ్లుపై నవంబర్ 2న కేసు నమోదు చేశారు. కేసు నమోదు వ్యవహారం పోలీసులు రహస్యంగా ఉంచారు. కాగా 7వ తేదీ ఆ ఇరువురు అన్నదమ్ముళ్లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. తహసీల్దార్ ఇతర రెవెన్యూ సిబ్బందిపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తులు ఇంట్లోనే ఉంటారా? అన్నదే ఇక్కడ డాలర్ల ప్రశ్న. కాగా, పోలీసులు ఇంట్లో ఉన్న నిందితులుగా చెప్పబడిన నేట్లపల్లె బ్రదర్స్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. సరిగ్గా 33 రోజుల తర్వాత డిసెంబర్ 10న ఆ కేసులో నిందితులకు బెయిల్ వచ్చింది. వెంటనే మరో కేసులో పీటీ వారెంటుపై అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.
ఈమారు అల్లిన కథ ఏమిటంటే..
నేట్లపల్లె రామాంజనేయులు తన భార్య మస్తానమ్మతో కోర్టు ద్వారా 2001లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె చాపాడు మండలం రాజుపాళెం గ్రామంలో తల్లిదండ్రుల గ్రామంలో నివాసం ఉంటోంది. కాగా నవంబర్ 6న సాయంత్రం 4.30 గంటలకు పెద్దశెట్టిపల్లె గ్రామంలో నేట్లపల్లె బ్రదర్స్ దాడి చేసినట్లు 7వ తేదీన కేసు నమోదైంది. అప్పటికే రెవెన్యూ అధికారులపై దాడి చేసినట్లు నమోదైయిన కేసులో నేట్లపల్లె బ్రదర్స్‌ను అరెస్టు చేశారు. అదే రోజు రిమాండ్‌కు ఆదేశించారు. కాగా మస్తానమ్మ ఫిర్యాదుతో నమోదైన కేసు గురించి పోలీసులు బాహాట పర్చలేదు. బెయిల్ వచ్చిందని తెలుసుకొని అప్పటికప్పుడు పీటీ వారెంటు జారీ చేసి మస్తానమ్మ కేసులో రిమాండ్‌కు పంపించారు. నెలరోజుల పైబడి జైల్లో ఉన్న నిందితుల్ని పీటీ వారెంటు ద్వారా ఎప్పుడైనా విచారణ చేసే అవకాశం ఉండగా పోలీసులు అలాంటి చర్యలు చేపట్టలేదు. బెయిల్ వచ్చిన తర్వాతే పీటీ వారెంటు ద్వారా అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు పంపడం వెనుక రాజకీయ దురుద్దేశం స్పష్టంగా కన్పిస్తోందని పలువురు వాపోతున్నారు. ఇదే విషయమై ఓ పోలీసు అధికారి సైతం రాజకీయ కక్ష సాధింపు మేరకే అలా కేసులు వచ్చి చేరుతున్నట్లు ఆఫ్‌ది రికార్డుగా వెల్లడించడం గమనార్హం
ఎస్పీ హర్షవర్దన్‌రాజు బదిలీ తర్వాతే..
ఎస్పీగా హర్షవర్దన్‌రాజు పని చేస్తే ఇలాంటి తప్పుడు కేసులు నమోదు కావడం కష్టమనే ఉద్దేశంతో అధికార పార్టీ నేతలు బదిలీ బహుమానంగా ఇచ్చారు. ఆయన నవంబర్ 6న బదిలీ అయ్యారు. ఆ తర్వాత జిల్లాలో ప్రధానంగా పులివెందుల, మైదుకూరు సబ్ డివిజన్‌లలో అక్రమ కేసులు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. నేట్లపల్లె బ్రదర్స్ యాదవ సామాజికవర్గానికి చెందిన వారు. ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరడమే అక్రమ కేసులకు ప్రధాన కారణంగా పలువురు చెప్పుకొస్తున్నారు. ఖాకీ అధికారులపై ఖద్దరు నేతలు యథేచ్ఛగా స్వారీ చేసేందుకు అధికారులే స్వయంగా ఇలాంటి చర్యలతో అవకాశం ఇస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఇప్పటికై పోలీసు అధికారులు ‘నాలుగో సింహం’లా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, చట్టాన్ని పరిరక్షించాలని పలువురు కోరుతున్నారు.
అధికార పార్టీ నేతలు చెప్పినట్లు
వింటున్న పోలీస్ అధికారులు
ప్రతిపక్షపార్టీ నాయకులపై
వరుస అక్రమ కేసులు
హత్యాయత్నంలో బెయిల్‌పై
విడుదలైన నేట్లపల్లె బ్రదర్స్
ఆపై పీటీ వారెంటు కింద
మరో కేసులో రిమాండ్
Comments
Please login to add a commentAdd a comment