ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం అన్నారు. మంగళవారం కోదండరాముడి బ్రహ్మోత్సవాలపై స్థానిక పీఎస్‌పీలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కోదండరామున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు రామాలయం చుట్టూ గ్రీనరీని పెంచాలని, లైటింగ్ ఏర్పాట్లు, రామాలయం వద్ద చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై దిశానిర్దేశం చేశారు. రామాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రామాలయ చరిత్రను జోడించి టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ప్రచారం కల్పించాలని సూచించారు. సోషల్ మీడియాలో రామాలయ విశిష్టతను విధిగా ప్రచారం కల్పించాలన్నారు. అనంతరం భక్తులకు అందజేస్తున్న ఉచిత అన్న ప్రసాదాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
బ్రహ్మోత్సవాలకు నిధులకు
ప్రాథమిక నివేదిక తయారు చేయండి
బ్రహ్మోత్సవాలకు అవసరమయ్యే నిధులకు ప్రాథమిక నివేదికను తయారు చేయాలని టీటీడీ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాల నాటికి చేపట్టాల్సిన పనులు, అలంకార మండపం, పూజకు అవసరమయ్యే వస్తువులు సేకరణ, భక్తులకు అవసరమయ్యే షెల్టర్లను, తాగునీటి సరఫరా, రామాలయంలో పెద్దఎత్తున లైటింగ్, ఇతర పనులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
కోదండరాముని భూములకు హద్దులను కేటాయించండి
కోదండరామునికి సంబంధించిన భూముల హద్దులను స్థానిక రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టి హద్దులు ఏర్పాటు చేయాలని స్థానిక సర్వేయర్‌లను వీరబ్రహ్మం ఆదేశించారు. కార్యక్రమంలో టీటీడీ స్పె షల్ ఆఫీసర్ ప్రశాంతి, డిప్యూటీ ఈఓ నటేష్ బాబు, గుణ భూషణ్ రెడ్డి, ఈఈ సుమతి, డీఈ వెంకటేశ్వర్లు, ఏ.అమర్‌నాథ్ టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment