రైతుల కష్టాలు గుర్తించాలి
విద్యుత్ శాఖ అఽధికారులు రైతుల కష్టాలు గుర్తించాలి. అనేక వ్యయ ప్రయాసాలు ఎదుర్కొంటూ విద్యుత్ కనెక్షన్ కోసం నిర్ణీత ఫీజు చెల్లించడం జరుగుతుంది. ఇటువంటి తరుణంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. విద్యుత్ కనెక్షన్ కోసం నేను కూడా దరఖాస్తు చేసుకుంటున్నాను. ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తే సకాలంలో పంటలకు నీటి తడులు అందించుకునేందుకు అవకాశం కలుగుతుంది.
– వెన్నపూస కృష్ణారెడ్డి, రైతు, రాజుపాళెం
అధికారుల చుట్టూ
తిరుగుతున్నా..
నాకు 3 ఎకరాల సాగు భూమి ఉంది. కేసీ కెనాల్ సాగునీరు అందాలంటే కష్టం. ఈ క్రమంలో బోరు వేసుకుని వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఐదారు నెలల నుంచి మంజూరైన ట్రాన్స్‌ఫార్మర్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఇవ్వటం లేదు. రేపు మాపు మంటూ కాలయాపన చేస్తున్నారు. మా గోడును ఆలపించి ఇప్పటికై నా మాకు ఇవ్వాల్సిన ట్రాన్స్‌ఫార్మర్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.
– మునీంద్ర, రైతు, రేపల్లె, చాపాడు మండలం
Comments
Please login to add a commentAdd a comment