Treatment
-
పసుపు ప్రాణాలను హరిస్తుందా? వెలుగులోకి షాకింగ్ విషయాలు
పసుపు శుభాకార్యలకే గాక ఆయుర్వేద పరంగా కూడా మంచి ఔషధ లక్షణాలు కలిగింది. ఇందులో అధికంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అందువల్ల వంటల్లో తప్పనిసరిగా పసుపుని వాడతారు అందరూ. అలాంటి పసుపు కాస్తా సీసంలా మారి ప్రాణాలను హరిస్తుందంటూ షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అందుకోసం బంగ్లాదేశం ప్రభుత్వం నడుబిగించి మరి పసుపు వాడకాన్ని నియంత్రించిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. నిజంగా పసుపు మంచిది కాదా? అది ప్రాణాంతకమైన సీసంలా మారుతుందా? తదితరాల గురించే ఈ కథనం! దక్షిణాసియా వాసులు విరివిగా వాడే వాటిలో ఈ పసుపు ఒకటి. ఇప్పుడది మంచిది కాదని, దీని వల్ల ప్రజలు చనిపోతున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతోంది. దీని కారణంగా చాలామంది ప్రజలు, చిన్నారుల, గుండె, మెదడు సంబంధిత జబ్బుల బారినపడుతున్నట్లు పేర్కొంది. 2019లో ఈ పసుపు కారణంగా దాదాపు 1.4 మిలియన్ల మరణాలు సంభవించినట్లు వెల్లడించింది. ఈ మేరకు బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ డయేరియా డిసీజ్ రీసెర్చ్ బృందాలు, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంతో కలిపి చేసిన పరిశోధనాల్లో పసుపుకి సంబంధించిన పలు షాకింగ్ విషయాలు బయటపెట్టింది. ఈ పసుపు వినియోగం కారణంగా వ్యక్తుల శరీరంలోని రక్తంలో సీసం చేరి ఎలా ప్రాణాలు తీస్తుందో వివరించింది. ఇదేలా జరుగుతందని పలు అధ్యయనాలు జరపగా.. పసుపు కల్తీకి గురవ్వడం వల్ల అని తేలింది. ముఖ్యంగా హోల్‌సేల్ మార్కెట్లోని వ్యాపారులు పసుపుని పెద్ద ఎత్తున్న కల్తీ చేస్తున్నారని గుర్తించారు బంగ్లాదేశ్ అధికారులు. ఈ కల్తీకి అడ్డుకట్టవేసేలా బంగ్లాదేశ్ బజార్లలో పెద్ద ఎత్తున్న హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఈ కల్తీ పసుపు వినియోగానికి అడ్డుకట్ట వేసేలా ప్రచారం చేసింది. దీని ఫలితంగా రెండేళ్లో సుగంధ ద్రవ్యాల మార్కెట్లో పసుపు కల్తీ వ్యాప్తి కట్టడి చేస్తూ.. సున్నాకి తీసుకొచ్చింది. పసుపు మిల్లీ కార్మికుల రక్తంలోని సీసం స్థాయిలను చూసి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక్కసారిగా షాక్‌కి గురయ్యే దీనిపై దృష్టిసారించే పరిశోధనలకు నాంది పలికింది. అప్పుడే పసుపు పెద్ద ఎత్తున కల్తీ అవుతున్నట్లు గుర్తించింది. దీనికి సత్వరమే అడ్డుకట్టవేసి లక్షలాది ప్రాణాలను కాపాడింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఈ కల్తీ కారణంగా ప్రపంచంలోని సుమారు 815 మంది మిలియన్ల మంది పిల్లల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ ప్రాణాంతక లోహం బారిన పడుతున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఈ పరిస్థితి పేద దేశాల్లో పిల్లల్లో ఎక్కువుగా కనిపిస్తోందని వాషింగ్టన్‌లోని థింక్-ట్యాంక్ సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ పేర్కొంది. ఎన్నో ఔషధ లక్షణాలు కలిగిన పసుపు ప్రకృతి ప్రసాదించిన ప్రసాదంగా సక్రమంగా వాడితే ఎంత మంచిదో దాన్ని కూడా కల్తీ చేసేందుకు యత్నిస్తే మన ప్రాణాలనే హరిస్తుందనడానికి ఈ ఉదంతమే ఉదాహరణ. (చదవండి: 'ప్టోసిస్' గురించి విన్నారా? కంటికి సంబంధించిన వింత వ్యాధి!) -
ఆస్పత్రులపై సైబర్ నీడ..వెలుగులోకి షాకింగ్ విషయాలు!
సైబర్ నేరగాళ్లు ఆగడాలు శృతి మించుతున్నాయి. ఇంతవరకు ఆన్లైన్ మోసాలకు లేదా కొత్త తరహాలో వ్యక్తుల డేటాను తస్కరించి బ్లాక్‌మెయిల్‌తో డబ్బులు గుంజడం వంటి సైబర్ నేరాలు చూశాం. అక్కడితో ఆగకుండా దేవాలయాల్లాంటి ఆస్పత్రులపై కూడా సైబర్ నీడ పడింది. వాటిని కూడా టార్గెట్ చేసి రోగుల వ్యక్తిగత డేటాను ఆసరా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అమెరికాలో లాస్‌వేగస్‌లోని ఓ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..లాస్‌వేగస్‌లోని ప్లాస్టిక్‌సర్జరీ క్లినిక్ హాంకిన్స్ అండ్ సోహ్న్ హెల్త్‌కేర్ హ్యాకర్ల బారిన పడింది. ఆ క్లినిక్‌కి వచ్చిన రోగులు వ్యక్తిగత డేటా, ఆపరేషన్‌కి ముందు తర్వాత తీసిన వ్యక్తిగత న్యూడ్ ఫోటోలతో సహా హ్యాక్ చేసి ఆన్లైన్లో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఘటన వెలుగులోకి వచ్చాంది. దీంతో ఒక్కసారిగా ఆ ప్లాస్టిక్ సర్జరీ ఆస్పత్రి వివాదంలో చిక్కుకుపోయింది. హెల్త్‌కేర్ సెక్టార్‌కి సంబంధించి రోగులు డేటా భద్రత విషయమై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటన సైబర్ సెక్యూరిటీ అవసరాన్ని తెలియజేస్తోంది. ఈ ఘటనలో ముఖ్యంగా బాధిత మహిళ రోగుల డేటానే ఎక్కువగా లీక్ అయినట్లు తెలుస్తోంది. ఆయా రోగులు శస్త్ర చికిత్స, వ్యక్తిగత సమాచారం తోపాటు బ్యాంకు అకౌంట్ల నంబర్లను హ్యాకింగ్ గురయ్యాయి. సదరు ఆస్పత్రి తమ ఆరోగ్య భద్రతను కాపాడటంలో విఫలమైందంటూ బాధితుల నుంచి ఆరోపణలు వెల్లవెత్తాయి. అంతేగాదు సదరు ఆస్పత్ర ప్రజల హెల్త్ కేర్ పేషెంట్ల డేటా ప్రొటెక్షన్‌కి చట్టాలకు కట్టుబడి లేదంటూ విమర్శలు వచ్చాయి. భాదితమహిళలు తమకు జరిగిన నష్టానికి సదరు ఆస్పత్రి తగిన సమాధానం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రులు రోగుల నమ్మకాలు, భావోద్వేగాలతో ఆడుకుందంటూ మండిపడుతున్నారు. ఆస్పత్రుల డేటాను పర్యవేక్షించడంలో సైబర్ సెక్యూరిటీ విఫలమైందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీని కారణంగా రోగుల హెల్త్ డేటా భద్రత విషయమై క్లినిక్‌లపై చెరగని మచ్చ ఏర్పడుతోందని ఫైర్ అయ్యారు. ఈ ఇంటర్నెట్ యుగంలో భద్రత అన్నదే కరువైందంటూ సదరు బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పుడు కేవలం కంపెనీలు, మనుషుల వ్యక్తి గత డేటానే గాదు ఆస్పత్రుల డేటాపై కూడా సైబర్ దాడి చేయడం బాధకరం. సాధ్యమైనంత వరకు అన్ని విభాగాలకి సంబంధించిన డేటాకి సైబర్ సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోంది. ఈ మేరకు లాస్‌వేగాస్ పోలీసులు ఈ ఘటనపై సత్వరమే దర్యాప్తు చేపట్టారు. ఏదిఏమైనా తస్మాత్ జాగ్రత్త! డేటా అపహరణకు గురికాకుండా ఎవరికివారుగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోక తప్పదని ఈ ఉదంతాలు చెప్పకనే చెబుతున్నాయి. (చదవండి: 'ప్టోసిస్' గురించి విన్నారా? కంటికి సంబంధించిన వింత వ్యాధి!) -
'ప్టోసిస్' గురించి విన్నారా? కంటికి సంబంధించిన వింత వ్యాధి!
ఎన్నో వింత వ్యాధులు. ఎందుకొస్తాయో తెలియదు. వాటి వల్ల అనుభవించే బాధ అంత ఇంత కాదు. బయటపడటం కూడా అంత ఈజీ కూడా కాదు. వైద్య శాస్త్రనికే సవాళ్లు విసిరే విచిత్రమైన వ్యాధులు రోజుకోకటి చొప్పున పుట్టుకొస్తూనే ఉన్నాయి. స్వయంకృతాపరాధమో మనిషి స్వార్థానికి పరాకాష్ట అనాలో తెలియదు. అలాంటి వింత వ్యాధినే ఇక్కడొక మహిళ ఎదుర్కొంటోంది. రోజురోజుకి పరిస్థితి దారుణంగా మారిందే తప్ప తగ్గలేదని బోరుమని విలపిస్తోంది. ఆ మహిళకు వచ్చిన వింత వ్యాధి ఏంటీ? ఎందువల్ల అంటే.. అమెరికాలో ప్రముఖ నటి జీనత్ అమన్ నాలుగు దశాబ్దాలుగా ప్టోసిస్ అనే పరిస్థితితో బాధపడుతోంది. కొన్నేళ్ల క్రితం కంటికి తగిలిన గాయమే ఇందుకు కారణం. ఆమె కుడి కన్నుకు ఏర్పడిన గాయం కారణంగా ఆమె కంటి నరాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత క్రమేణ కంటి రెప్ప కుంగిపోవడం లేదా కిందకు వాలిపోవడం జరిగింది. అలా పూర్తిగా కిందకు వచ్చేస్తోంది. అది ఆమె కంట్రోల్ లేదు. అంటే కనురెప్పను కదల్చలేదు. దీని వల్ల కనుచూపు తగ్గిపోతూ వచ్చింది. ఆఖరికి ఆపరేషన్ చేయించకున్న తన పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదని ఇన్‌స్ట్రాగాం వేదికగా వాపోయింది. ఇంతకీ ప్టోసిస్ అంటే ఏంటీ.. ప్లోసిస్ అంటే 'డ్రూపింగ్ కనురెప్ప' అని అంటారు. దీని కారణంగా ఎగువ కనురెప్ప కుంగిపోవడం లేదా వైద్య పరిభాషలో స్థానభ్రంశం చెందడం అంటారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మోలజీ ప్రకారం ఈ పరిస్థితి ఒకటి లేదా రెండు కనురెప్పలను ప్రభావితం చేస్తుంది. ఇది దృష్టిని ప్రభావితం చేయొచ్చు లేదా పూర్తిగా దృష్టిని కోల్పోవచ్చు. ఈ పరిస్థితి వయస్సు సంబంధిత మార్పలు కారణంగా గానీ కండరాల బలహీనత లేదా నరాల బలహీనత/ పుట్టుకతో వచ్చే వివిధ సమస్యలు కారణం కావచ్చు. ప్టోసిస్ లక్షణాలు.. కనురెప్పలు వంగిపోవడం స్పష్టంగా చూడలేకపోవడం కనురెప్పలు పైకి లేపాలంటే భారంగా అనిపించడం కన్ను తెరవడమే కష్టంగా ఉండటం దైనందిన పనులు చేసుకోవడం కూడా కష్టమవ్వడం తదితర సమస్యలు ఉత్ఫన్నమైతే తక్షణమే కంటి నిపుణుడిని సంప్రదించడం అత్యంత ముఖ్యం. (చదవండి: మద్యపాన వ్యసనం ఇంత ఘోరంగా ఉంటుందా? ఏకంగా యాసిడ్‌లా మూత్రం..) -
మద్యపాన వ్యసనం ఇంత ఘోరంగా ఉంటుందా? ఏకంగా యాసిడ్‌లా మూత్రం..
మద్యపానం వ్యసనం అనేది ఓ రుగ్మత అని పలువురు ఆరోగ్య నిపుణులు గట్టిగా నొక్కి చెబుతున్న సంగతి తెలిసిందే. మనకు తెలిసినవాళ్లు లేదా సన్నిహితులు ఇలా ఉంటే గమనించి కౌన్సిలింగ్ ఇప్పించి మార్చాలని లేదంటే మానవ సంబంధాల తోపాటు ప్రాణాలు కూడా హరించిపోతాయని హెచ్చరిస్తుంటారు. కానీ ఇప్పుడూ ఈ ఘటన చూస్తే.. అదంతా నిజమే అని అనకుండా ఉండలేరు. ఈ వ్యసనం కారణంగా ఓ ప్రముఖ మోడల్ ఆరోగ్యం ఎంతలా క్షీణించిందో వింటే..వామ్మో! అని నోరెళ్లబెట్టడతారు!. వివరాల్లోకెళ్తే..కాలిఫోర్నియాకు చెందిన 37 ఏళ్ల మోడల్, నటి జెస్సికా లాండన్ వోడ్కాకు బానిసైపోయింది. ఎంతలా అంటే 24 గంటలు అది తాగకపోతే లేను అనేంతగా మద్యం అంటే పడి చచ్చిపోయింది. ఆ అలవాటు చాలా చిన్న వయసులోనే ఆరోగ్యం మొత్తం కోల్పోయేలా క్షీణించేసింది. చివరికి ఆ వ్యసనం తనకు తెలియకుండానే తాగుతూ నేలపై పడిపోయి తెలియకుండానే అక్కడే మల మూత్ర విసర్జనలు చేసేంతలా ఆరోగ్యాన్ని దిగజార్చేసింది. వృధాప్యంలో వచ్చే వణుకు, భయం అన్ని ఈ వయసులోనే ఫేస్ చేసింది. మాటిమాటికి స్ప్రుహ కోల్పోవడం అన్ని మరిచిపోతున్నట్ల మెదడు మొద్దుబారిపోవడం వంటి లక్షణాలన్ని ఒక్కసారిగా ఆవరించాయి ఆ మోడల్‌కి. దీని కారణంగా బయటకు వచ్చేందుకు కాదు కదా కనీసం తోడు లేకుండా బాత్రూంకి కూడా వెళ్లలేని స్థితికి చేరుకుంది. ఆఖరికి ఆమె మూత్రమే యాసిడ్‌లా మారి ఆమె చర్మాన్ని తినేసేంత స్థితికి వచ్చేసింది. సరిగ్గా అదే సమయంలో ఆమె మెట్లపై స్ప్రుహ కోల్పోయి పడిపోయింది. పుండు మీద కారం చల్లినట్లుగా ఈ టైంలోనే తలకు కూడా బలమైన గాయం అయ్యింది. దీని కారణంగా మెదడులో బ్లడ్ క్లాట్ అయ్యి కణితిలా వచ్చింది. దీంతో ముఖంలో ఒకవైపు అంతా పక్షవాతానికి గురై మాట కూడా రాని స్థితికి చేరుకుంది. ఇది సీరియస్ కాకమునుపే ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించడంతో జెస్సికా ఆల్కహాల్‌కి పూర్తి స్థాయిలో దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా ఆల్కహాల్ మానడం అంత ఈజీ కాదు. దీని కారణంగా మూర్చ, పక్షవాతం, వణుకు లాంటి దారుణమైన సమస్యలను ఎదుర్కొంది. ఒకరకంగా మెదడు శస్త్ర చికిత్స కోసం తాగకుండా ఉండటమే ఆమెను ఆల్కహాల్ అడిక్షన్ నుంచి బయటపడేందుకు ఉపకరించిందనాలి. ఆ తర్వాత ఆపరేషన్ అనంతరం ఆమె నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించింది. అసలు మద్య పానం వ్యసనం అంటే.. ఆల్కహాల్‌పై నియంత్రణ లేకుండా అదేపనిగా తాగడం. అందుకోసం ఎలాంటి పని చేసేందుకైనా దిగజారడం. ప్రియమైన వారితో సంబంధాలను తెంచుకునేలా ప్రవర్తించడం తగని సమయాల్లో కూడా తాగడం మద్యాన్ని దాచడం లేదా తాగేటప్పుడూ దాచడం తదితర విపరీతమైన లక్షణాలు ఉండే వారిని వైద్యుల వద్దకు తీసుకొచ్చి చికిత్స ఇప్పించాలి లేదంటే ప్రాణాంతక వ్యాధుల బారినపడి చనిపోతారు. (చదవండి: మద్యపాన వ్యసనం మానసిక జబ్బా? దీన్నుంచి బయటపడలేమా?) -
శిశువు రక్షణ అందరి బాధ్యత! కానీ ఇప్పటికీ..
పుట్టిన బిడ్డ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలని తల్లితో పాటు ఆ కుటుంబం కూడా తపిస్తుంటుంది. అయితే, ఈ విషయంలో సరైన అవగాహన ఉండటం లేదనేది వైద్యుల మాట. ఎందుకంటే, ఇప్పటికీ భారతదేశంలో నవజాత శిశు మరణాల రేటు ఆందోళనకరంగానే ఉంది. యూరప్‌లో 1990ల మొదట్లో శిశు మరణాల రేటును తగ్గించడానికి చర్యలు తీసుకోవడంలో, అవగాహన కల్పించేందుకు నవంబర్ 7ను శిశు రక్షణ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించాయి. ఆ తర్వాత అమెరికా, మిగతా దేశాలు కూడా ఈరోజు శిశు రక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. నవజాత శిశువులలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, శిశు మరణాల రేటును తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ విషయంలో నిపుణుల అభిప్రాయాలు తీసుకోవడం తప్పనిసరి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి ప్రెగ్నెన్సీ అని తెలియగానే కాబోయే తల్లితోపాటు, ఆ కటుంబం కూడా జాగ్రత్త పడాలి. మన దగ్గర రక్తహీనత సమస్య, పోషకాహార లేమి ఎక్కువ. దీనివల్ల బేబీ గ్రోత్ మందగిస్తుంది. గర్భిణుల్లో హైపో థైరాయిడ్ సమస్య ఎక్కువ చూస్తున్నాం. ఐరన్ లోపం, రసాయనాల ఆహారం తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంటుంది. తల్లి ఆరోగ్యం సరిగాలేకపోతే లోపల బేబీ శరీర, మానసిక ఎదుగుదలపైన ప్రభావం చూపుతుంది. బీపీ, షుగర్.. వంటి సమస్యలు ఉన్నప్పుడు వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేవారు ముందునుంచే వైద్యులు చెప్పిన టైమ్‌కి వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. తల్లి మానసిక ఆరోగ్యం కూడా బాగుండాలి. అందుకు, సైకలాజికల్ కౌన్సెలింగ్ కూడా తీసుకోవడం ముఖ్యం. వైద్యులు చెప్పిన సూచనలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే కుటుంబం అంతా భవిష్యత్తులో రాబోయే సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. – డాక్టర్ శిరీషా రెడ్డి, గైనకాలజిస్ట్, తార్నాక, హైదరాబాద్ ప్రమాదాలను ముందే పసిగట్టాలి నెలలు నిండకుండా పుట్టడం, బరువు తక్కువుండి పుట్టడం, ఇన్ఫెక్షన్స్, పోషకాహార లోపం వల్ల శిశు మరణాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. ఏడాదిలోపు పిల్లలను నవజాత శిశువులు అంటారు. ఈ సమయంలో సులువుగా ఇన్ఫెక్షన్స్ సోకుతుంటాయి. అందుకే, వీరిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. ఏడాదిలోపు వచ్చే ఆరోగ్య సమస్యలను నివారించగలిగితే ఆ తర్వాత వచ్చే సమస్యలను సులువుగా అధిగమించవచ్చు. మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే పట్టడం అవసరం, ఆరోగ్యం కూడా. ఆ తర్వాత వారికి ఇచ్చే పోషకాహారం చాలా ముఖ్యం. దీంతోపాటు వ్యాక్సినేషన్ చేయించడం ముఖ్యం. ఎందుకంటే, నిమోనియా, డయేరియా వల్ల మరణాలు ఎక్కువ. అందుకే, ప్రభుత్వం కూడా డయేరియా, న్యూమోనియా.. వ్యాక్సినేషన్ జాబితాలో చేర్చింది. పిల్లల వైద్యనిపుణుల పర్యవేక్షణ చాలా అవసరం. కొన్ని గ్రామీణ ప్రాంతాల వారికి ఈ సౌకర్యం అందుబాటులో లేకపోవచ్చు. కానీ, రెగ్యులర్ హెల్త్ చెకప్ అనేది ముఖ్యం అని తెలుసుకోవాలి. ఇక నవజాత శిశువులకు దెబ్బలు తగిలే అవకాశం కూడా ఉంది. మంచంపై నుంచి కింద పడటం వంటివి. చిన్న దెబ్బలు కూడా పెద్దవి కావచ్చు. మదర్ పోస్ట్ ప్యాటర్న్ డిప్రెషన్లో ఉన్నప్పుడు బిడ్డను చూసుకునేవారుండరు. ఇలాంటప్పుడు కూడా శిశువు సంరక్షణ ప్రమాదంలో పడుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కుటుంబం జాగ్రత్త వహించాలి. – ప్రియాంకరెడ్డి, పిడియాట్రిషియన్, మాదాపూర్, హైదరాబాద్ ఒకరి ద్వారా మరొకరికి సూచనలు మేం గర్భిణులపై ఎక్కువ ఫోకస్ పెడుతుంటాం. ఎందుకంటే, వారి ఆరోగ్యం బాగుంటేనే పుట్టబోయే బిడ్డ బాగుంటుంది. ఆరోగ్యం, పౌష్టికాహారంతో పాటు ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్లేవరకు ఎలా చూసుకోవాలో ఆమెకే కాదు, ఇంటిల్లిపాదికీ కౌన్సెలింగ్ ఇస్తాం. ఎంత చెప్పినా వినిపించుకోని వారు కొందరుంటారు. అయినా వారిని వదలకుండా తల్లి అయిన వారితో కౌన్సెలింగ్ ఇప్పిస్తాం. చార్ట్ ప్రకారం వాళ్లు తీసుకోవాల్సిన పోషకాహారం, మందులు కూడా అంగన్వాడీ నుంచి ఇస్తుంటాం. చంటిపిల్లల విషయంలో మేం తగు జాగ్రత్తలు చెప్పడంతో పాటు, ఏ సమయానికి వ్యాక్సిన్లు వేయించాలి, ఎలా చూసుకోవాలి అనే విషయాలపైన తల్లులకు ఒకరి ద్వారా మరొకరు సూచనలు చేసుకునేలా కౌన్సెలింగ్ చేస్తుంటాం. దీనివల్ల నవజాత శిశు మరణాల రేటు తగ్గడమే కాకుండా శిశువులు ఆరోగ్యంగా పెరిగేందుకు దోహదం చేస్తుంది. – వెంకటరమణ, అంగన్వాడీ టీచర్, ఖాసింపేట, సూర్యపేట జిల్లా (చదవండి: మత్తు కోసం పాము విషమా?..అందుకోసం పార్టీల్లో..) -
మార్క్ జుకర్‌బర్గ్ మోకాలికి శస్త్ర చికిత్స..అసలేంటి చికిత్స? ఎందుకు?
మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ సమయంలో మోకాలికి గాయం అవ్వడంతో శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. అసలు మోకాలి గాయం అంటే ఏంటీ? ఎందువల్ల అవుతుంది తదితరాల గురించే కథనం. మోకాలి గాయం అంటే.. క్రీడాకారులు ఎక్కువగా ఈ మోకాలి గాయం బారిన పడతారు. మోకాలి గాయాన్ని పూర్వ క్రూసియేట్ లిగ్మెంట్ (Anterior Cruciate Ligament(ACL)) గాయం అని కూడా అంటారు. అంటే మోకాలి ఏసీఎల్ నిర్మాణంపై ఏర్పడిన గాయంగా కూడా చెబుతారు. ఈ ఏసీఎల్ అనేది మోకాలిలో ఉండే మృదువైన కణజాల నిర్మాణం. ఈ క్రూసియేట్ లిగ్మెంట్ తొడను ముందు ఎముక(టిబియా)తో కలిపే జాయింట్. దీనివల్లే మనం నిలబడటానికి నుంచొవడానికి వదులుగా మోకాలు కదులుతుంది. మనం ముందుకు వంగడానికి, నిలుచున్నప్పుడు కదిలే ఈభాగంలో గాయం అయితే పాపింగ్ లాంటి ఒక విధమైన సౌండ్ వస్తున్న అనుభూతి కలుగుతుంది. ఆ ప్రాంతంలో అంతర్లీనంగా లిగ్మెంట్ చీరుకుపోవడం లేదా ఎముకలు తప్పి ఒక విధమైన శబ్దం వస్తుంది. దీంతో మోకాలు ఉబ్బి, అస్థిరంగా ఉంటుంది. భరించలేని నొప్పిని అనుభవిస్తాడు పేషెంట్. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) ఏసీఎల్ లిగ్మెంట్కి చికిత్స ఎలా అందిస్తారంటే.. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ప్రకారం..దెబ్బతిన్న ఏసీఎల్ లిగ్మెంట్ స్థానంలో కొత్త ACL గ్రాఫ్ట్ కణజాలంతో భర్తీ చేసి శస్త్ర చికిత్స చేస్తారు. అయితే ఈ కొత్త ఏసీఎల్ కణజాలం రోగి నుంచే తీసుకోవచ్చు లేదా మరొకరి నుంచైనా స్వీకరించొచ్చు. ఈ చికిత్స రోగికి తగిలిన గాయం తాలుకా తీవ్రత ఆధారంగా వివిధ రకాలుగా చికిత్స అందిస్తారు వైద్యులు. సాధ్యమైనంత వరకు ఇలాంటి గాయాల్లో తీవ్రత తక్కువగా ఉంటే ఫిజియోథెరపీ చేయించడం, రోగిని రెస్ట్ తీసుకోమనడం వంటివి సూచిస్తారు వైద్యులు. అదే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటే ఏసీఎల్ పునర్నిర్మాణ శస్త్ర చికిత్స చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ సాధారణ ఆర్థోస్కోపిక్ పద్ధతులను ఉపయోగించే నిర్వహించడం జరుగుతుంది. మోకాలిపై కోతలు పెట్టి పాటెల్లార్ స్నాయువుని(మోకాలి చిప్ప), తొడ ఎముకను కొత్త లిగ్మెంట్తో జాయింట్ చేసేలా మోకాలి అంతటా ఆపరేషన్ నిర్వహిస్తారు. ఫలితంగా పటేల్లార్ స్నాయువు ముందుకు వెనక్కు కదిలేందుకు ఉపకరిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో ఆ మోచిప్పలనే తొలగించడం లేదా ఇతర స్నాయువులతో పునర్నిర్మించవడం వంటివి చేస్తారు వైద్యులు. (చదవండి: దంతాలకు ఏ పేస్టు బెటర్?.. దంత సమస్యలకు కారణం!) -
దంతాలకు ఏ పేస్టు బెటర్?.. దంత సమస్యలకు కారణం!
దంతాలకు ఈ పేస్టు/టూత్ పౌడర్ మంచిదంటూ వివిధ కంపెనీలు పలు ఆకర్షణీయమైన అడ్వర్టైస్మెంట్లతో మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇంతకీ వాటిలో ఏది బెటర్ అనేది తెలియక జనాలు అవస్థలు మాములుగా ఉండవు. కొందరూ తమ బడ్జెట్‌కి అనుగుణంగా ఉన్నది ఎంపిక చేసుకుంటే ఇంకొందరూ మార్కెట్లోకి వచ్చే ప్రతీ కొత్తరకం పేస్ట్‌ని ట్రై చేసేస్తుంటారు. నిజానికి వాటిలో ఏ పేస్ట్ మంచిది. ఇంతలా ఇన్ని రకాల పేస్టుల మార్కెట్లో ఉన్నా.. ప్రజలు దంత సమస్యలను ఇంకా ఫేస్ చేస్తూనే ఉంటున్నారు ఎందుకు? తదితరాల గురించి ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి ఏం చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం!. దంత సమస్యలకు కారణం.. ప్రధానంగా కాల్షియం లోపం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి. అలాగే నోటిలోని లాలజలంలో పీహెచ్ విలువ ఆహారం తీసుకోక మునుపు 7.4 తర్వాత 5.9 ఉండకపోయినా దంత సమస్య వస్తుంది. డీ, బీ, సీ విటమిన్ లోపం వల్ల చిగుళ్ల వాపు వంటి సమస్యలు వచ్చి దంతాలు వదులుగా మారి సలుపు రావడం వంటి సమస్యలు వస్తాయి. దంతాలు పైన ఉండే ఎనామెల్ దెబ్బతినడం వల్ల దంతాల్లో బ్యాక్టీరియా చేరడం తదితరాల వల్ల ఈ దంత సమస్యలు తరుచుగా వస్తుంటాయి. అంతేగాక ఇవి కాస్త గుండె జబ్బులకు దారితీసే ప్రమాదం ఉందని ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏ పేస్ట్ బెటర్! మార్కెట్లోకి వస్తున్నా రకరకాల పేస్ట్‌లు, పౌడర్లు కన్నా వేప పుల్లలు లేదా జామ ఆకులు చాల మంచివి. ముఖ్యంగా జామా ఆకులతో పళ్లు తోముకుంటే చిగుళ్ల నొప్పులు, పంటి నొప్పులు దంతాల వాపు తదితర పళ్ల సమస్యలు ఉండవు. ఫలితంగా ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు నవీన్ నడిమింటి. ఆయా టూత్ పేస్ట్‌లోని రసాయనం కడుపులో వికారం వంటివి కలగజేసి ఆకలి లేకుండా చేస్తున్నాయని చెప్పారు. కొన్ని అయితే వాటిలో ఉండే గాఢత పళ్లకు మంచి చేసే బ్యాక్టీరియాను కూడా నాశనం చేసి పళ్లపై ఉండే ఎనామిల్ దెబ్బతినేలా చేస్తున్నాయని అన్నారు. మరొకొన్ని పేస్టులు దంతాలను తెల్లగా మార్చేస్తున్నాయి, కానీ ఇలా దంతాలు ఆకస్మికంగా తెల్లగా కనబడటం కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు సంకేతం కావోచ్చు లేదా ఇతరత్ర దంత సమస్యలకు సంకేతం కూడా అయి ఉండోచ్చని చెబుతున్నారు. దంత సమస్యలకు నివారణ.. ఇక నోటిలో పుండ్లు వంటి వాటికి ప్రధాన కారణం చవుకబారు నూనెలతో తయారు చేసిన చిరుతిండ్లు తినడం రావొచ్చు లేదా విటమిన్ బీ, సీ లోపం వల్ల కూడా రావచ్చని అన్నారు. అందుకోసం సి -విటమిన్, బి-కాంప్లెక్స్ మాత్రలు వాడుతూ తేనె కలిపిన నీటితో నోరు పుక్కిలిస్తే ఈ సమస్య త్వరితగతిన తగ్గిపోతుందన్నారు. దంతాల నొప్పి భరించలేని విధంగా ఉంటే Vantage అనే పేస్ట్ వాడమని సూచిస్తున్నారు. ఇది పేస్ట్‌గా పళ్లు తోముకోవడానికి వాడకూడదు. కేవలం నొప్పిగా ఉన్న ప్రాంతాల్లో పూస్తే చాలు. ఇది కడుపులోపలికి వెళ్లినా.. ఎలాంటి ప్రమాదం ఉండదు. నొప్పి మరీ తీవ్ర స్థాయిలో ఉంటే..Vantage పేస్ట్ తోపాటు కాట్రోల్ katorol dt అనే మాత్రను కూడా వాడితే చక్కటి ఫలితం ఉంటుదని చెబుతున్నారు. ---ఆయర్వేద వైద్యులు నవీన్ నడిమింటి (చదవండి: మద్యపాన వ్యసనం మానసిక జబ్బా? దీన్నుంచి బయటపడలేమా?) -
‘లేజర్’తో యాంజియోప్లాస్టీ..!
కొన్నిసార్లు గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే కీలకమైన రక్తనాళాల్లో అడ్డంకులు (బ్లాక్స్) ఏర్పడ్డప్పుడు బైపాస్ సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ వంటి అనేక ప్రక్రియలు చేస్తారన్న విషయం తెలిసిందే. ఈ యాంజియోప్లాస్టీ ద్వారా ఇటీవల అనేకమంది గుండెజబ్బుల బాధితులను రక్షిస్తున్న సంగతులూ తెలిసినవే. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ యాంజియోప్లాస్టీ ప్రక్రియను లేజర్ సహాయంతో మరింత సురక్షితంగా చేయడం ద్వారా, మంచి ఫలితాలను సాధించవచ్చని తేలింది. గుండెజబ్బుల చికిత్సలో నూతన సాంకేతికతకూ, పురోగతికీ ప్రతీక అయిన ఈ సరికొత్త ‘లేజర్ యాంజియోప్లాస్టీ’ గురించి అవగాహన కల్పించేందుకే ఈ కథనం. ‘లేజర్ యాంజియోప్లాస్టీ’ గురించి తెలుసుకునే ముందు కరోనరీ యాంజియోప్లాస్టి అంటే ఏమిటో చూద్దాం. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాల్లో అడ్డంకులున్నప్పుడు, శస్త్రచికిత్స చేయకుండానే... చేతి లేదా కాలి దగ్గరున్న రక్తనాళం నుంచి చిన్న పైపుల్ని పంపి గుండె రక్తనాళాల వరకు చేరతారు. ఇక్కడ అడ్డంకులను తొలగించడం, నాళం సన్నబడ్డ లేదా అడ్డంకి ఉన్న చోట బెలూన్ను ఉబ్బించి, నాళాన్ని వెడల్పు చేసి, స్టెంట్ వేసి, రక్తం సాఫీగా ప్రవహింపజేసే ప్రక్రియనే ‘కరోనరీ యాంజియోప్లాస్టీ’ అంటారు. ఈ ప్రక్రియను ఎలా నిర్వహిస్తారంటే... రక్తనాళాల్లో అడ్డంకులు/బ్లాకులనేవి అక్కడ కొవ్వు పేరుకుపోవడంవల్ల ఏర్పడతాయి. యాంజియోప్లాస్టీలో... ముందుగా బ్లాక్ ఉన్న రక్తనాళంలోకి ఓ పైప్‌ను ప్రవేశపెడతారు. దీన్ని ‘గైడింగ్ క్యాథేటర్’ అంటారు. ఆ పైపులోంచి వెంట్రుక అంత సన్నటి తీగను... అడ్డంకిని సైతం దాటేలా... రక్తనాళం చివరివరకు పంపిస్తారు. ఈ సన్నటి తీగనే ‘గైడ్ వైర్’ అంటారు. ఒకసారి గైడ్ వైర్ అడ్డంకిని దాటి చివరి వరకు వెళ్లాక, గైడ్ వైర్ మీది నుంచి ఒక బెలూన్ని బ్లాక్ వరకు పంపిస్తారు. బ్లాక్‌ను దాటి వెళ్ళగానే, ఆ బెలూన్ని పెద్దగా ఉబ్బేలా చేస్తారు. ఒకసారి బెలూన్ సహాయంతో, రక్తనాళాన్ని తగినంతగా వెడల్పు చేశాక... ఆ బెలూన్ని వెనక్కి తీసుకువచ్చి, దాని స్థానంలో ఒక స్టెంట్ని ప్రవేశపెడతారు. స్టెంట్ అనేది లోహంతో తయారైన స్థూపాకారపు వల (జాలీ) వంటి పరికరం. ఇలా ఈ స్టెంట్‌ను... వేరొక బెలూన్ సహాయంతో బ్లాక్ ఉన్నచోట అమరుస్తారు. అలా అమర్చిన స్టెంట్ ని వేరొక బెలూన్‌తో బాగా ఎక్కువ ఒత్తిడితో రక్తనాళం గోడకు పూర్తిగా అనుకునేలా చూస్తారు. దీంతో యాంజియోప్లాస్టీ పూర్తవుతుంది. యాంజియోప్లాస్టీలో వచ్చే ఇబ్బందులు కొన్నిసార్లు యాంజియోప్లాస్టీని నిర్వహించే సమయంలో గైడ్ వైర్ బ్లాక్‌ను దాటి ముందుకు వెళ్లలేకపోవచ్చు. ఒక్కో సారి... దాటి వెళ్ళినప్పటికీ, దానిమీది నుంచి బెలూన్ వెళ్లలేకపోవచ్చు. కొన్నిసార్లు రక్తనాళం అడ్డంకులలో క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల... బెలూన్‌తో ఉబ్బించే ప్రక్రియ చేసినప్పటికీ... ఆ బ్లాక్ తొలగకపోవచ్చు. ఇంకొన్నిసార్లు రక్తనాళం అడ్డంకులలో రక్తం గడ్డకట్టడం వల్ల బెలూనింగ్ చేసినప్పుడు... ఆ రక్తం గడ్డలు నాళంలోనే మరోచోటికి వెళ్లి, రక్త ప్రవాహానికి అవరోధంగా మారవచ్చు. ఈ ఇబ్బందుల్ని అధిగమించటానికి ఇప్పుడు లేజర్ ప్రక్రియని వాడుతున్నారు. అసలు లేజర్ అంటే ఏమిటి? ‘లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్’ అన్న పదాల సంక్షిప్త రూపమే ‘లేజర్’. దీని సాంకేతిక అంశాలు ఎలా ఉన్నా, అందరికీ తేలిగ్గా అర్థమయ్యే రీతిలో ఇలా చెప్పవచ్చు. మామూలుగా కాంతి కిరణాలు నిర్దిష్టమైన వేవ్‌లెంగ్త్‌తో ప్రసరిస్తూ ఉంటాయి. వాటన్నింటినీ ఒక క్రమబద్ధమైన ఏకరీతితో మరింత శక్తిమంతంగా ప్రసరింపజేసినప్పుడు వెలువడే కిరణాన్ని ‘లేజర్’ అనవచ్చు. శక్తిమంతమైన ఈ కాంతికిరణాల్ని (లేజర్లను) అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. వైద్య చికిత్సల్లోనూ అనేక రకాలైన లేజర్లు వినియోగిస్తుంటారు. ఇలాంటి అనేక లేజర్లలో గుండె కోసం వాడే వాటిని ‘ఎగ్జిమర్ లేజర్’ అంటారు. లేజర్‌తో అడ్డంకుల తొలగింపు ఎలాగంటే...? లేజర్ కిరణాలు మన కణజాలాలని తాకినప్పుడు మూడు రకాల ఫలితాలు కనిపిస్తుంటాయి. అవి... ఫొటో కెమికల్, ఫొటో థర్మల్, ఫొటో కైనెటిక్ ఎఫెక్ట్స్. ఈ ప్రభావాల సహాయంతో అక్కడ పేరుకున్న వ్యర్థ కణజాలాన్ని (దాదాపుగా) ఆవిరైపోయేలా చేయవచ్చు. రక్త నాళంలోని అడ్డంకులనూ అదేవిధంగా ఆవిరైపోయేలా చేయడానికి లేజర్ సహాయం తీసుకుం టారు. ఏయే దశల్లో లేజర్‌ను ఎలా ఉపయోగిస్తారంటే... గైడ్ వైర్ మీదనుంచి బెలూన్ వెళ్లలేకపోయిన సందర్భాల్లో లేదా బెలూన్ ద్వారా బ్లాక్‌ను మార్చలేకపోయినప్పుడు. ∙రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఏర్పడిన బ్లాక్స్ ఉన్నప్పుడు, అవి మరోచోటికి చేరి మళ్లీ రక్తప్రవాహానికి అవరోధంగా మారకుండా చూడటానికి. గుండె రక్తనాళాల్లో సంపూర్ణంగా, చాలాకాలం నుంచి ఉండిపోయిన మొండి బ్లాక్‌లను తొలగించడానికి. ∙కాల్షియం అధికంగా ఉన్న గుండె రక్తనాళాల్లో బ్లాక్‌ని తొలగించడానికి. ఒకసారి వేసిన స్టెంట్లో మరోసారి అడ్డంకి బ్లాక్ ఏర్పడినప్పుడు రక్తనాళం మొదట్లో ఉన్న అడ్డంకులు, లేదా మరీ పొడవుగా ఉన్న అడ్డంకుల్ని అధిగమించేందుకు. ఇది యాంజియోప్లాస్టీకి ప్రత్యామ్నాయమా? సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలతో లేజర్ యాంజియోప్లాస్టీ అన్నది... సంప్రదాయ యాంజియోప్లాస్టీ కన్నా తక్కువ ఖర్చుతో రక్తనాళంలోని అడ్డంకుల్ని తొలగించడానికి ఉపయోగపడుతుందన్న అర్థం స్ఫురిస్తోంది. అయితే ఇది పూర్తిగా నిజం కాదు. లేజర్ని యాంజియోప్లాస్టిలో ఒక అనుబంధ విధానంగా వాడుకోవచ్చుగానీ లేజర్ అనేదే ఆంజియోప్లాస్టీకి ప్రత్యామ్నాయం కాదు. బాధితులందరికీ ఈ లేజర్ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. లేజర్‌కు అయ్యే ఖర్చు ఎక్కువే కాబట్టి... కేసు తీవ్రతను బట్టి ఎవరికి అవసరం అన్నది కేవలం డాక్టర్లు మాత్రమే నిర్ణయించే అంశమిది. కేవలం చాలా తక్కువ మందిలో మాత్రమే ఇది అవసరం పడవచ్చు. --డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్ (చదవండి: రాళ్ల ఉప్పుకి మాములు ఉప్పుకి ఇంత తేడానా? ఆ వ్యాధులకు కారణం ఇదేనా?) -
ప్రెగ్నెన్సీ సమయంలో పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదా? ప్రమాదమా?
ప్రెగ్నెన్సీ సమయంలో పెయిన్ కిల్లర్స్ వేసుకోవద్దంటారు. నిజమేనా? ఒకవేళ జ్వరం లాంటి వాటికి డోలో వంటి మందులు వేసుకుంటే ఏమన్నా ప్రమాదమా? – సి. వెంకటలక్ష్మి, బిచ్కుంద ప్రెగ్నెన్సీలో ఏ నెలలో అయినా కొంత పెయిన్ ఉండటం చాలామందిలో చూస్తుంటాం. పెయిన్ టైప్, తీవ్రతను బట్టి పెయిన్ స్కేల్ అసెస్మెంట్తో నొప్పిని తగ్గించే మందులు, వ్యాయామాలు లేదా ఫిజియోథెరపీ లేదా కౌన్సెలింగ్ సూచిస్తారు. అయితే వీటన్నిటికీ నిపుణుల పర్యవేక్షణ తప్పనిసరి. NSAIDS డ్రగ్ ఫ్యామిలీకి సంబంధించిన Brufen, Naproxen, Diclofenac లాంటివి ప్రెగ్నెన్సీ సమయంలో అస్సలు వాడకూడదు. ముఖ్యంగా ఏడు నుంచి తొమ్మిది నెలల్లో. పారాసిటమాల్(డోలో, కాల్పాల్, క్రోసిన్) లాంటివి వాడవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో మామూలు నుంచి ఓ మోస్తరు పెయిన్ ఉన్నప్పుడు డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్, వేడి, ఐస్ కాపడాలు వంటివి సూచిస్తారు. పారాసిటమాల్‌ని వాడవచ్చు. 30 వారాలు దాటిన తర్వాత ఎలాంటి పెయిన్ కిల్లర్స్‌ని వాడకపోవడమే మంచిది. ఒకవేళ నొప్పి తీవ్రంగా ఉంటే Opiates పెయిన్ కిల్లర్స్ అంటే Morphine, Tramadol లాంటివి సూచిస్తారు. లేబర్ పెయిన్‌ని కూడా కొంతవరకు ఓర్చుకోగల ఉపశమనాన్నిస్తాయి. అయితే ఇవి కేవలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పైనే వాడాలి. కొంతమంది గర్భిణీలకు నర్వ్ పెయిన్ అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. దీనికి పారాసిటమాల్‌ని ఇస్తారు. గర్భిణీ.. నిపుణల పర్యవేక్షణ, పరిశీలనలో ఉండాలి. కొందరికి Amitriptyline లాంటి మందులను కొన్ని రోజులపాటు ఇస్తారు. పారాసిటమాల్ ఒళ్లు నొప్పులను, జ్వరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. గర్భిణీలకు పారాసిటమాల్ సురక్షితమైందని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. డాక్టర్ భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: నాలుగు నెలల పాపకు అలా అవ్వడం ప్రమాదం కాదా?) -
మద్యపాన వ్యసనం మానసిక జబ్బా? దీన్నుంచి బయటపడలేమా?
జానకి ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్. కొంతకాలం హైదరాబాద్‌లో పనిచేశాక అమెరికా వెళ్లింది. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో కలసి పబ్‌కు వెళ్లేది. అమెరికా వెళ్లాక అది అలవాటుగా మారింది. రోజూ పబ్, క్లబ్, ఆల్కహాల్ ఆమె జీవితంలో భాగంగా మారిపోయాయి. ఏదైనా ఒకరోజు ఆల్కహాల్ తాగకపోతే పిచ్చెక్కినట్లు ఉండేది. దాంతో ఇంట్లోనే బార్ ఏర్పాటు చేసుకుంది. ఆఫీస్ నుంచి రాగానే నాలుగైదు పెగ్గులు వేయందే నిద్రపట్టేది కాదు. అలా అలా ఆల్కహాల్ వ్యసనంగా మారింది. అయితే వివాహం తర్వాత ఆమెకు సమస్య మొదలైంది. నెలరోజులు ఎలాగోలా ఓపిక పట్టినా ఆ తర్వాత ఆగలేక తాగడం మొదలు పెట్టింది. దాంతో భర్తతో పెద్ద గొడవైంది. సోషల్ డ్రింకింగ్ విషయంలో తనకూ అభ్యంతరం లేదని, కానీ రోజూ స్పృహ తప్పేంతగా తాగుతానంటే భరించలేనని భర్త తేల్చి చెప్పేశాడు. ఈ విషయం ఇరువైపులా పేరెంట్స్‌కు తెలిసి పంచాయతీ పెట్టారు. చివరకు విడాకుల వరకూ దారితీసింది. అలవాటు కాదు.. జబ్బు జానకిలా మద్యం వ్యసనంతో ఇల్లూ, ఒళ్లూ గుల్ల చేసుకున్నవారు, చేసుకుంటున్నవారూ మన చుట్టూ చాలామంది కనిపిస్తారు. మద్యం తాగడం పాపమని కొందరు వారికి హితబోధలు చేస్తే, బలహీన మనస్తత్వమున్నవారే తాగుతారని మరి కొందరు వాదిస్తుంటారు. నిజానికి మద్యానికి బానిసవ్వడం, విపరీతంగా మద్యం సేవించడం, మద్యం వల్ల జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ తాగకుండా ఉండలేకపోవడం ఒక మానసిక రుగ్మత. దానివల్ల అనేకానేక శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. హఠాత్తుగా మద్యం తాగడం తగ్గించినా, ఆపేసినా కూడా సమస్యలు వస్తాయి. మద్యం వ్యసనం నుంచి శాశ్వతంగా విముక్తి లభించాలంటే చికిత్స అవసరం. తిడితే సరిపోదు.. చికిత్స అవసరం.. మద్యానికి బానిసైన వారిని చులకనగా చూడటం, తిట్టడం సమస్యను పరిష్కరించవు. అలాంటివారిని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ లేదా క్లినికల్ సైకాలజిస్ట్ లేదా అడిక్షన్ ఎక్స్పర్ట్ దగ్గరకు తీసుకువెళ్లాలి. అవసరమైతే కొంతకాలం రీహాబిలిటేషన్ సెంటర్లోనే ఉంచి మద్యపాన వ్యసనం నుంచి బయట పడేయవచ్చు. మద్యపాన వ్యసనం ఉన్నవారు తమకు సమస్య ఉందని గుర్తించక చికిత్స పొందడానికి వెనుకాడతారు. అందువల్ల కుటుంబసభ్యులే వారిని చికిత్సకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. వివిధ దశల్లో చికిత్స మద్యపాన వ్యసనానికి వివిధ దశల్లో వివిధ రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ దశల్లో వ్యక్తిగత, గ్రూప్ కౌన్సెలింగ్.. సమస్యను బాగా అర్థంచేసుకోవడంలో సహాయపడతాయి. మద్యపాన వ్యసనం వల్ల వచ్చిన మానసిక సమస్యల నుంచి కోలుకోవడానికి మద్దతునిస్తాయి. ఆల్కహాల్ చికిత్స నిపుణుల పర్యవేక్షణలో గోల్ సెట్టింగ్, ప్రవర్తనలో మార్పు తెచ్చే పద్ధతులు, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం వంటివన్నీ వ్యసనం నుంచి బయటపడేందుకు సహాయపడతాయి కొన్ని టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్ తాగితే వికారం, వాంతులు, తలనొప్పి వంటివి కలుగుతాయి. మరికొన్ని మందులు ఆల్కహాల్ తాగాలనే కోరికను తగ్గిస్తాయి · మద్యపాన వ్యసనం నుంచి కోలుకుంటున్న వ్యక్తులు మళ్లీ మద్యం వైపు మళ్లకుండా కొన్నిరకాల మందులు, ఇంజెక్షన్లు సహాయపడతాయి ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమవ్వడం వ్యసనాల నుంచి కోలుకునేందుకు సహాయపడుతుంది రీహాబిలిటేషన్ సెంటర్ లేదా సైకియాట్రిక్ ఆస్పత్రిలో వారం రోజులపాటు డిటాక్స్ అండ్ విత్ డ్రాయల్ చికిత్స అందిస్తారు. విత్ డ్రాయల్ లక్షణాలను నివారించడానికి మందులు తీసుకోవాల్సి రావచ్చు మద్యపాన వ్యసనం తీవ్రంగా ఉన్నవారు కొన్ని నెలలపాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉండాల్సి రావచ్చు. అక్కడ ఆల్కహాల్, డ్రగ్ కౌన్సెలర్లు, సోషల్ వర్కర్లు, నర్సులు, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తారు. మద్యపాన వ్యసనం లక్షణాలు మద్యం తాగడం, వ్యసనంగా మారడం, దానికి బానిసవ్వడం మూడూ వేర్వేరు. రెండు గంటల్లో నాలుగైదు పెగ్గులు అంతకంటే ఎక్కువ తాగడాన్ని అనారోగ్యకరమైన డ్రింకింగ్‌గా పరిగణిస్తారు. మద్యపాన వ్యసనానికి ఈ కింది లక్షణాలు ఉంటాయి. ఆల్కహాల్ తాగాలనే బలమైన కోరిక, తాగకుండా ఉండలేకపోవడం · తాగే పరిమాణాన్ని పరిమితం చేయలేకపోవడం తాగడం తగ్గించుకోవడానికి విఫల యత్నాలు చేయడం తాగడంలోనే ఎక్కువ సమయం గడపడం, ఇతర పనులను పక్కన పెట్టడం మద్యం వల్ల బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమవడం జీవితంలో సమస్యలకు కారణమవుతుందని తెలిసినప్పటికీ కొనసాగించడం డ్రైవింగ్, ఈత లాంటి సందర్భాల్లో కూడా మద్యం తాగడం కారణాలు.. మద్యపాన వ్యసనానికి సామాజిక, మానసిక, జన్యు కారణాలున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. మద్యం వినియోగం సాధారణమైన సమాజంలో, కుటుంబంలో పుట్టి పెరిగిన వారికి అది తప్పుగా అనిపించదు. సరదాగా మొదలుపెట్టినా చివరకు వ్యసనంగా మారుతుంది. కాలక్రమేణా ఆల్కహాల్ తాగడం మెదడులోని ఆనందం, పనితీరు, ప్రవర్తనపై నియంత్రణ సాధించే భాగాలతో అనుసంధానమవుతుంది. ఇది మంచి భావాలను పునరుద్ధరించడానికి లేదా ప్రతికూల భావాలను తగ్గించడానికి ఆల్కహాల్ కోరికను కలిగిస్తుంది. అలా మద్యానికి బానిసను చేస్తుంది. కొందరు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనలేక మద్యం మత్తులో సేద తీరుతూ వాస్తవికత నుంచి తప్పించుకుంటారు. --సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com (చదవండి: ఆ టైంలోనే అతిపెద్ద అండర్‌గ్రౌండ్ ఎయిర్‌పోర్టు..కానీ ఇప్పుడది..) -
ఆ టైంలో కూడా గుండె సమస్యలు వస్తాయా?
మలయాళ బుల్లి తెర నటి డాక్టర్ ప్రియా గుండెపోటుతో కుప్పకూలి చనిపోయిన సంగతి తెలిసింది. నిండు గర్భిణి అయిన ఆమె సాధారణ చెకప్ కోసం ఆస్పత్రికి వచ్చినప్పుడే ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. దీంతో వైద్యులు ఆపరేషన్ చేసి ఆమె కడుపులో ఉన్న శిశువుని బయటకు తీసి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నెలల నిండక మునుపే పుట్టడంతో వైద్యులు ఆ చిన్నారిని అబ్జర్వేషన్లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. గర్భంతో ఉన్నప్పుడు మహిళలకు గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయా? ఎందువల్ల ఇలా జరుగుతుంది తదితరాల గురించే ఈ కథనం!. అధిక రక్తపోటు, ధూమపానం తదితరాలే గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకాలు. కానీ నిపుణల అభిప్రాయం ప్రకారం గుండె సంబంధ సమస్యలకు మరో ప్రధాన కారకం ఉంది. అదే గర్భధారణ సమయంలో వచ్చే ప్రీక్లాంప్సియా. ఈ ప్రీక్లాంప్సియా అనేది ప్రమాదకరమైన తీవ్ర రక్తపోటు పరిస్థితి. ఇది మహిళలకు గర్భం దాల్చిన 20 వారం నుంచి మొదలవుతుంది. ఈ ప్రీక్లాంప్సియా చరిత్ర ఉన్న స్త్రీలు గుండెపోటు లేదా స్ట్రోక్‌తో చనిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. గర్భస్రావమైన లేదా నెలలు నిండకుండానే ప్రసవించిన మహిళలకు ఈ ప్రమాదం మరింత ఎక్కువుగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే డెలివరీలలో 8% వరకు క్లిష్టతరం కావడానికి ప్రధానం కారణం ఈ ప్రీక్లాంప్సియానే అని వైద్యలు చెబుతున్నారు. యూఎస్‌లో 15% అకాల ప్రసవాలకు ఈ పరిస్థితి వల్లేనని తెలిపారు వైద్యులు. ప్రీక్లాంప్సియా లక్షణాలు ఎలా ఉంటాయంటే.. తలనొప్పి మబ్బు మబ్బుగా కనిపించడం కంటిలో నల్లటి మచ్చలు కడుపులో కుడివైపు నొప్పి చేతులు, ముఖం వాచి ఉండటం ఊపిరి ఆడకపోవడం గర్భధారణ సమయంలో గుండె పదిలంగా ఉండాలంటే.. రక్తపోటును క్రమం తప్పకుండా చెక్ చేయించుకోవాలి ఆరోగ్యకరమైన, కాలానుగుణ ఆహారాన్ని తినడం వ్యాయామం చేయడం. ఇందులో మోస్తరు నుండి అధిక-తీవ్రత వర్కౌట్లు లేదా యోగా ఉంటాయి అధిక బరువు పెరగకుండా ఉండండి ఒత్తిడికి దూరంగా ఉండండి శరీరంలో సరైన రక్త ప్రసరణ ఉండేలా చూసుకోవడం తదితరాలను పాటిస్తే గర్భధారణ సమస్యలో ఈ గుండె సంబంధిత సమస్యల ఎదురవ్వవు. (చదవండి: తక్కువ వ్యాయామమే మంచి ఫలితాలిస్తుంది!పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
రాళ్ల ఉప్పుకి మాములు ఉప్పుకి ఇంత తేడానా? ఆ వ్యాధులకు కారణం ఇదేనా?
మాములుగా ప్యాకెట్లలో దొరికే సాల్ట్‌కి రాక్ సాల్ట్‌కి తేడా ఏంటో చాలామందికి తెలియదు. దీనికి తోడు టీవీల్లో ప్యాకెట్ సాల్ట్ చాలా మంచిది అని ఇచ్చే అడ్వర్టైస్మెంట్ల కారణంగా వాటినే వాడేస్తుంటారు. అయితే అది క్రిస్టల్‌గా ఉండదు కాబట్టి ఈజీగా కరిగిపోతుంది అనుకుంటారు. ఆయుర్వేద పరంగా రాళ్ల ఉప్పే మంచిదని చెబుతుంటారు. ఇంతకీ ఏది మంచిది? మార్కెట్లో దొరికే ప్యాకెట్ ఉప్పు వాడకూడదా? ప్యాకెట సాల్ట్ యంత్రంలో శుద్ధి అవుతుంది. దీనికి సోడియం, క్లోరైడ్, అయెడిన్ అనే మూడింటి తోపాటు అందంగా కనిపించేలా కృత్రిమ రసాయనాలను కలిపి తయారు చేస్తున్నారు. అందువల్ల దీన్ని వాడటం వల్ల గాయిటర్, గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటుకి కారణంగా కూడా ఈ ప్యాకెట్ ఉప్పు వల్లనే అని తేల్చారు. మాములు ఉప్పులో 97% సోడియం క్లోరైడ్, 3% ఇతర మూలకాలు ఉంటాయి. ఇక రాతి ఉప్పు లేదా రాక్‌సాల్ట్/ రాళ్ల ఉప్పు సముద్రం లేదా ఉప్పు నీటి సరస్సుల నుంచి తయారు చేస్తారు. ఈ రాతి ఉప్పు ముతకగా ఉంటుంది. ఇందులో దాదాపు 85% సోడియం క్లోరైడ్ ఉంటుంది. ఇక మిగిలిన 15%.. ఇనుము, రాగి, జింక్, అయోడిన్, మాంగనీస్, మెగ్నీషియం, సెలీనియం మొదలైన ఖనిజాలతో సహా సుమారు 84 రకాల మూలకాలు ఉంటాయి. ఈ ఖనిజాలు శరీరానికి మేలు చేస్తాయి. ఈ రాళ్ల ఉప్పులో అయోడిన్ని కలపాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ సాధారణ ఉప్పులో మాత్రం అయోడిన్ కలపాల్సి ఉంటుంది. అలాగే బ్లాక్ సాల్ట్‌లో కూడా రాక్‌సాల్ట్ మాదిరిగానే దీనిలో ఎన్నో ఖనిజాలు ఉన్నాయి. ఈ రాళ్ల ఉప్పు వల్ల కలిగే ప్రయోజనాలు.. వివిధ రకాల ఖనిజాలను కలిగి ఉండటం వల్ల, రాతి ఉప్పు అనేక వ్యాధులను నివారించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఇది చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణ ఉప్పును అధికంగా ఉపయోగించడం వలన అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువుగా ఉంటుంది. ఇది సైనస్ చికిత్సలో సహాయపడుతుంది. ఈ రాతి ఉప్పు లేదా రాళ్ల ఉప్పు సరైన క్యాంటిటీలో ఉపయోగిస్తే అధిక బరువు సమస్య ఉండదు. నిద్రలేమి లేదా ఇతర నిద్ర సంబంధిత సమస్యలు ఉన్నవారు రాళ్ల ఉప్పును ఆహారంలో చేర్చుకోవడం మంచిది. కొంతమంది రాతి ఉప్పును బాడీ స్క్రబ్‌గా కూడా ఉపయోగిస్తారు. ఇది చర్మ హైడ్రేషన్‌ను సమర్ధవంతంగా మెరుగుపరుస్తుంది. రాక్ సాల్ట్ చిగుళ్ళను శుభ్రం చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మైగ్రేన్ నొప్పికి కారణమయ్యే మెగ్నీషియం లోపాన్ని కూడా రాక్ సాల్ట్ భర్తీ చేస్తుంది. మలబద్ధకాన్ని నివారించి జీర్ణ సంబంధిత సమస్యలను మెరుగుపరుస్తుంది. (చదవండి: తక్కువ వ్యాయమమే మంచి ఫలితాలిస్తుంది!పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
'ఒంటరితనం' రోజుకు 15 సిగరెట్లు తాగినంత ప్రాణాంతకమా?
ఒంటరితనం అదొక రకమైన వ్యాధి అని ఎందరో వైద్యులు చెబుతున్నారు. మానసిక వ్యాధిలా మొదలై దీర్థకాలికి వ్యాధులు చుట్టుముట్టేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు. పరిశోధకులు జరిపిన అధ్యయనంలో సిగరెట్లు తాగితే ఎంత ప్రమాదమో! అంత ప్రాణాంతకం అని హెచ్చరిస్తున్నారు. నిజానికి ఒంటరితనం అంత ప్రాణాంతకమా? ఏకంగా ధూమపానం తాగడంతో పోల్చడానికి కారణం ఏంటీ?.. తదితరాల గురించే ఈ కథనం!. ఒంటరితనం ఒంటరిగా ఉండటం అంటే.. ఒంటరితనం, ఒంటిరిగా అనే పదాలు ఒకేలా ఉన్నా రెండింటికి చాలా తేడా ఉంది. మనకు మనంగా కోరుకుని ఒంటరిగా ఉండటాన్ని ఏకాంతంగా గడపటంగా భావించొచ్చు. ఇష్టపూర్వకంగా నీతో నీవు గడపటం లాంటిది. ఇది ఆరోగ్యానికి ఒకరకంగా మంచిదే. మిమ్మల్ని మీరు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఒకరకంగా మీ భావోద్వేగాలను నియంత్రించుకునే ఓ గొప్ప అవకాశం. అదే ఒంటరితనం అంటే.. మన చుట్టూ ఎంతమంది ఉన్నా ఏదో లేదనే భావన ఉండటం. తనకంటూ ఎవ్వరూ లేరని ఫీలవుతుండటం ఒంటిరితనం కిందకు వస్తుంది. ఇది మనిషిని కుంగదీస్తుంది. చూడటానికి సాధారణంగా అనిపించినా.. ఓ భయానక వ్యాధి. చివరికి మనిషిని చనిపోయేలా కూడా ప్రేరేపిస్తుంది. అందుకనే వైద్యలు, ఆరోగ్య నిపుణులు ఒంటరితనం ప్రాణాంతకమైనదని పదేపదే ప్రజలను హెచ్చరిస్తున్నారు. పరిశోధనలే ఏం చెబుతున్నాయంటే శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన అధ్యయనంలో మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసిన వాళ్ల కంటే ఒంటరితనంతో బాధపడే వ్యక్తులు అకాల మరణానికి 50% ఎక్కువ ఉందని వెల్లడైంది. ఈ ఒంటరితనం ధూమపానం తాగినంత ప్రమాదకరమైనదని పేర్కొంది. రోజుకి 15 సిగరెట్లు తాగితే ఎంత ప్రాణాంతకం అంత ప్రమాదకరమైనది ఒంటిరితనం అని వెల్లడించింది. దీనివల్ల రోజువారి జీవనంపై ప్రభావం ఏర్పడి దీర్ఘకాలిక గుండె జబ్లులు వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ డిప్రెషన్ కారణంగా చాలామంది ఒబెసిటీ సమస్యను ఎదర్కొంటున్నట్లు అధ్యయనంలో తేలింది. అందుకోసం అని ఓ మెడిల్ ఆస్పత్రిలోని దీర్ఘకాలిక సమస్యలతో ఒంటరితనంతో బాధపడుతున్న కొంతమంది రోగులపై అధ్యయనం చేయగా..వారు కొంత సేపు తమతో ఆరోగ్యం గురించి మాట్లాడారు. ఆ తర్వాత వారి వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఎప్పటికప్పుడూ వారిని పర్యవేక్షిస్తూ వారితో స్నేహంగా మెలిగారు. వారు కూడా తెలియకుండానే వారితో కనెక్ట్ అయ్యి తమ భావోద్వేగాలన్నింటిని షేర్ చేసుకున్నారు. వాళ్లికి ఎవ్వరితోనైనా కాసేపు మాట్లాడితే తెలియని ఆనందం ఉంటుందనేలా ఆ రోగులకు అవగాహన కల్పించారు. ఆ తర్వాత ఆ రోగులు డిశ్చార్జ్ అయ్యాక కూడా వారి పరిస్థితి గురించి ఎప్పటికప్పుడూ ట్రాక్ చేస్తూనే ఉన్నారు పరిశోధకులు. ఐతే వారిలో మార్పు వచ్చి మనుషులతో కనెక్ట్ అవ్వడం ప్రారంభించారు. అలాగే ఆ రోగులు ఆస్పత్రిని సందర్శించడం కూడా తగ్గింది. ఎందుకు హానికరం అంటే.. తనకంటూ ఎవ్వరూ లేరనే వ్యథ ఆవరించి మనిషిని ఒక విధమైన సోమరి లేదా చేతకాని వాడిగా మార్చేస్తుంది. తెలియని నిరుత్సాహం వచ్చేస్తుంది. చిన్న పనులు కూడా భారంగా ఉంటాయి. అది క్రమేణ ఆ వ్యక్తిని మంచానికే పరిమితమై ఓ భయానక వ్యాధిలా మారిపోతుంది. ఏం లేకుండానే ఏదో మహమ్మారి బారినపడ్డవాడిలా త్వరతగతిన మృత్యు ఒడిలోకి వెళ్లిపోతాడు. ఇలాంటి వాళ్లు తాను నిర్లక్ష్యానికి గురవ్వుతున్నా అనే భావం నుంచి మొదలై ఎవ్వరితోనూ సంబంధాలు నెరుపుకోలేక ఇబ్బంది పడతారు. మొదట ఆ భావన తొలగించి తనకు నచ్చినా లేదా తనంటే ఇష్టపడే వ్యక్తులతో గడుపూతూ మంచి సంబంధాలను నెరుపుకుంటూ పోతే మనల్ని వద్దనుకున్నవాళ్లు సైతం మనతో చేయి కలిపేందుకు ముందుకు వస్తారు. చిత్త వైకల్యం అన్నింటికంటే ప్రమాదకరమైంది. అది బాగుంటే అన్ని బాగున్నట్లే. అలాగే రిలేషన్స్‌లో క్యాలిటీ ముఖ్యం వందల సంఖ్యలో రిలేషన్స్ ఏర్పర్చుకోనవసరం లేదు. మనం అంటే ఇష్టపడే వ్యక్తి ఒక్కరైనా చాలు. మనకు వారి వద్ద స్వాంతన దొరికితే చాలు. నచ్చిన స్నేహితుడు లేదా మీ శ్రేయోభిలాషి/మన అనుకునులే మనం మంచి కోరే వ్యక్తి ఉంటే చాలు. అందుకే ఇక్కడ మీరు ఎవరితో సన్నిహితంగా ఉంటారో వారితో మంచి నాణ్యతతో కూడిన బాండింగ్ ఏర్పర్చుకుంటే చాలు. తెలియకుండానే అన్ని రుగ్మతల నుంచి బయటపడతారు. ఆ తర్వాత మీకు మీరుగా ఏదోక వ్యాపకం ఏర్పరుచుకుని ధైర్యంగా జీవితాన్ని గడపగలిగే మనోధైర్యం వచ్చేస్తుంది. చింతకు చోటు ఇవ్వదు అది మీ చిత్తాన్ని చెదిరిపోయేలా చేసి కుంగదీస్తుంది. మీకు కాస్త ఒంటరితనంగా ఫీలయితే వెంటనే సోషల్ మీడియాలో లేదా దేవాలయానికో లేదా నచ్చిన ప్రదేశానికి వెళ్లండి కొత్త మనుషులు పరిచయలు ఏర్పడి మీకో కొత్త ఉత్తేజాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. ఇటీవల ఈ కరోనా మహమ్మారి తర్వాత నుంచే ఈ ఒంటరితనం సమస్య ఎక్కువైంది. ముఖ్యంగా అమెరికా వంటి దేశాల ఈ సమస్య మరింత ఎక్కువ ఉంది. (చదవండి: కోవిడ్‌కి గురైతే గుండె సమస్య తప్పదా? ఆరోగ్య మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు) -
కోవిడ్‌కి గురైతే గుండె సమస్య తప్పదా? ఆరోగ్య మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు
కోవిడ్‌కి గురైనవారు చాలామంది గుండె సంబంధిత సమస్యల బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ కరోనా గుండెపై ప్రభావం చూపిస్తుందా?. కరోనా వచ్చినవారంతా జాగ్రత్తగా ఉండాల్సిదేనా?. ఆరోగ్య మంత్రి సైతం కరోనా ఇన్ఫెక్షన్కి గురైన అలాంటివి చేయొద్దంటూ హెచ్చరించడంతో ఒక్కసారిగా మళ్లీ కరోనా గుబులు పోలేదా అని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమయ్యాయి ఈనేపథ్యంలోనే ఈ కథనం!. వివరాల్లోకెళ్తే..ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కరోనా బారిన పడినవారు గుండెపోటు రాకుండా ఉండాలంటే అతిగా శ్రమించటం, భారీగా వ్యాయమాలు వంటివి చేయటం మానుకోవాలని సూచించారు. ఇటీవల గుజరాత్ నవరాత్రి వేడుకల సందర్భంగా గర్బా నృత్యం చేస్తూ సుమారు 10 మంది మరణించిన సంగతి తెలిసిందే. పైగా మృతుల్లో 13 ఏళ్ల బాలుడు అతి పిన్న వయస్కుడు. ఈ నేపథ్యంలో ఆరోగ్యమంత్రి ఈ విధంగా ప్రజలకు సూచనలిచ్చారు. దీంతో ఒక్కసారి కరోనా భయాలు ప్రజల్లో వెల్లువెత్తాయి. అంతేగాదు మాండవియా ఐసీఎంఆర్ అధ్యయనం ప్రకారం తీవ్ర కరోనాతో బాధపడినవారు గుండెపోటుకి గురికాకుడదంటే కనీసం ఒక ఏడాది లేదా రెండేళ్ల పాటు అతిగా వ్యాయామాలు, వంటి జోలికి పోకూడదని చెబుతోందంటూ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. #WATCH | Bhavnagar, Gujarat: On heart attack cases during the Garba festival, Union Health Minister Mansukh Mandaviya says, "ICMR has done a detailed study recently. The study says that those who have had severe covid and enough amount of time has not passed, should avoid… pic.twitter.com/qswGbAHevV — ANI (@ANI) October 30, 2023 కరోనా వల్ల గుండె సమస్యలు వస్తాయా..? కరోనా అనేది శ్వాసకోస లేదా ఊపిరితిత్తుల వ్యాధికి సంబంధించినదే అయినప్పటికీ గుండెపై ప్రభావం చూపుతుంది. గుండె కణాజాలనికి సక్రమంగా ఆక్సిజన్ అందకపోవడంతో మొదలవుతుంది సమస్య. ఈ వైరస్ ఊపిరితిత్తులలోని గాలి సంచులను ద్రవంతో నింపుతుంది. ఫలితంగా కొద్ది ఆక్సిజన్ మాత్రమే రక్తప్రవాహంలో ఉంటుంది. దీంతో శరీరంలోకి రక్తాన్ని పంప్ చేయడానికి గుండె అధికంగా కష్టపడాల్సి ఉంటుంది. అందువల్ల గుండె కణాజాలానికి శాశ్వత నష్టం లేదా తాత్కాలిక నష్టం ఏర్పడుతుంది. కొన్ని కేసుల్లో కరోనా వైరస్ నేరుగా గుండె కండరాల కణజాలానికి సోకి దెబ్బతీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్లు సిరలు, ధమనులు అంతర్గత ఉపరితలాలను కూడా ప్రభావితం చేస్తాయి. దీంతో రక్తానాళాల్లో వాపు లేదా నష్టం ఏర్పడి రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది. ఫలితం శరీరంలో ఇతర భాగాలకు రక్తప్రవాహం సక్రమంగా జరగదు. శరీరం ఒత్తిడికి గురవ్వడం వల్ల కూడా.. వైరల్ ఇన్షెక్షన్లు కారణంగా శరీరం ఒత్తిడికి లోనై కాలోకోలమైన్లు అనే రసాయాలను విడుదల చేస్తుంది. ఇది గుండె పనితీరుకు ఆటంక కలిగించి గుండె సమస్యలు ఉత్ఫన్నమయ్యేలా చేస్తుంది. గుండె ఆరోగ్యం ఉండాలంటే.. వ్యాయామాలను అతిగా కాకుండా శరీరానికి తగినంతగా చేయాలి పండ్లు, కూరగాయాలు, తృణధాన్యాలు, ప్రోటీన్లతో కూడిన ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోవాలి తగినంత కంటి నిండా నిద్రపోవాలి ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవాలి ధుమపానం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి ఈ విధమైన ఆరోగ్యకరమైన అలవాట్లు కరోనా వైరస్‌ను జయించేలా శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవ్వడమే కాకుండా దీర్ఘకాలంలో గుండె సమస్యలను రాకుండా నిరోధించడంలో సహాయ పడుతాయి. (చదవండి: ఆకుకూరలు మంచిదని తినేస్తున్నారా? శాస్త్రవేత్తలు స్త్రాంగ్ వార్నింగ్!) -
'70 గంటలు పని'.. వ్యాఖ్యలపై వైద్యులు ఏమంటున్నారంటే..!
ప్రముఖ టెక్ కంపెనీ ఫౌండర్ ఓ కార్యక్రమంలో 'యువత 70 గంటలు పనిచేస్తే'.. ఎన్నో విజయాలు సాధించొచ్చు అన్న వ్యాఖ్యలు పెద్ద ప్రకంపనం సృష్టించాయి. ఆయనతో కొన్ని కంపెనీ సీఈవోలు ఏకీభవించగా, ఐటీ ఉద్యోగులు మాత్రం ఘాటుగా స్పందించారు. ఏదీఏమైనా ఇది అందరికీ సాధ్యమా? ఏ మనిషి అయినా అన్ని గంటలు పనికే కేటాయిస్తే ఆరోగ్య పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కుటుంబ సంబంధాలు దెబ్బతినవా? అది అసలు బ్యాలెన్స్ అవుతుందా? దీని గురించి వైద్యలు ఏం చెబుతున్నారు తదితరాల గురించే ఈ కథనం!. దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి యువత పని విషయమై ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. భారత యువత వారంలో 70 గంటలు పనిచేస్తే భారత ఆర్థిక రంగంలో ఊహించని విజయాలు సాధించవచ్చు అని నారాయణ మూర్తి ఓ కార్యక్రమంలో వ్యాఖ్యలు చేశారు. దీంతో నెట్టింట ప్రముఖ ఐటి ఉద్యోగులంతా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పనికి తగ్గట్టుగా వేతనం ఇస్తే కచ్చితంగా అన్ని గంటలు చేస్తామంటూ మూర్తి వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఐతే ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా సీఈవో భవిష్ అగర్వాల్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్పర్సన్ సజ్జన్ జిందాల్ వంటి ప్రముఖులు మాత్రం నారాయణ మూర్తి వ్యాఖ్యలపై ఏకభవించడం విశేషం. ఇదిలా ఉండగా, నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై వైద్యులు సైతం విభేదించారు. ఈ మేరకు బెంగళూరుకు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి మాట్లాడుతు..అసమంజసమైన పని గంటలు వల్ల దీర్ఘకాలికా ఆరోగ్యంపై తీవ్ర దుష్పరిణామాలు చూపిస్తాయన్నారు. ఇన్ని గంటలు పనిచేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆయన చెప్పినట్లు వారానికి 70 గంటలు అంటే..రోజుకు 24 గంటల షెడ్యుల్ ప్రకారం..వారానికి ఆరో రోజులు పనిచేస్తే..రోజుకు 12 గంటలు చొప్పున పనిచేయగా మిగిలిని 12 గంటల్లో ఓ ఎనిమిది గంటలు నిద్రకుపోగా మిగిలిని 4 గంటలు మీ వ్యక్తిగత విషయాలు, ఆఫీస్‌కు చేరుకునే జర్నీకి పోతాయి. అదే బెంగళూరు వంటి మహానగరాల్లో అయితే రెండు గంటలు రోడ్డుపైనే గడిచిపోతాయి. అంటే ప్రశాంతంగా తినడానికి, కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి, వ్యాయామానికి, కనీసం వినోదానికి సమయం ఉండదు. ఇలా ఓ యంత్రంలా మనిషి చేసుకుంటూ పోతే కెరియర్ పరంగా ఎదుగుదల ఉంటుందేమో గానీ తనకు తెలియకుండాననే వివిధ మానసిక రుగ్మతల బారిన పడి లేని అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అదీగాక ఇటీవల యువత చిన్న వయసులోనే గుండెపోటుకి గురై చనిపోతున్న ఉదంతాలను ఎన్నో చూస్తున్నాం. యువకులకే ఈ గుండెపోటులు ఎందుకొస్తున్నాయో? ప్రముఖులు కాస్త ఆలోచించాలని చెబుతున్నారు. తెలియని పని స్ట్రెస్ ఉద్యోగంలో అనుకున్న గోల్ రీచ్ కాలేకపోతున్నామన్న భయం మరోవైపు ఉద్యోగంలో ఎదుగుదల కోసం నానాపాట్లు ఇవన్నీ వెరసి గుండెపై ప్రభావం చూపి కార్డియాక్ అరెస్టులు లేదా గుండెకు సంబంధించిన వ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు. వైద్యులు మాత్రం ముందు ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేసి నిరుద్యోగ సమస్యకు కళ్లెం వేయండి. యువత పని జీవితం బ్యాలెన్స్డ్గా ఉంటేనే మంచి లక్ష్యాలను వృద్ధిని సాధించగలరని వైద్యుడు దీపక్ నొక్కి చెబుతున్నారు. సదరు వైద్యుడి వ్యాఖ్యలపై నెటిజన్లు ఏకీభవించడమే గాక ఇన్ని గంటలు పని కారణంగా వ్యక్తిగత సంబంధాలు సైతం దెబ్బతింటాయని ఒకరు, లేనిపోని అనారోగ్య సమస్యలు బారినపడి భారంగా జీవనం గడపాల్సి వస్తుందంటూ రకరకాలు కామెంట్లు చేస్తూ ట్వీట్లు చేశారు. 24 hours per day (as far as I know) If you work 6 days a week - 12h per day Remaining 12h 8 hours sleep 4 hours remain In a city like Bengaluru 2 hours on road 2 hours remain - Brush, poop, bathe, eat No time to socialise No time to talk to family No time to exercise… https://t.co/dDTKAPfJf8 — Dr Deepak Krishnamurthy (@DrDeepakKrishn1) October 27, 2023 (చదవండి: పిల్లలను మంచిగా పెంచడం ఎలా? సైకాలజిస్ట్‌లు ఏం చెబుతున్నారంటే..) -
నాలుగు నెలల పాపకు అలా అవ్వడం ప్రమాదం కాదా?
నాకు నాలుగు నెలల పాప. అంత చంటిపిల్లకు అప్పుడప్పుడు వైట్ డిశ్చార్జ్ అవుతోంది. నేను భయపడుతుంటే మా ఇంట్లో పెద్దవాళ్లేమో ‘మరేం పర్లేదు .. అలా అవడం సహజమే’ అని తేలిగ్గా తీసుకుంటున్నారు. నిజంగా పర్లేదా? అది సహజమేనా? – పేరు, ఊరు వివరాలు రాయలేదు. వైట్ కలర్ లేదా బ్లడ్ టైప్ వెజైనల్ డిశ్చార్జ్ పది రోజుల వయసు నుంచి ఆరు నెలల వయసు గల ఆడపిల్లల్లో చాలా నార్మల్. గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఈస్ట్రోజెన్ హార్మోన్ ప్రభావంలో ఉండి.. పుట్టిన తరువాత ఒక్కసారిగా ఆ హార్మోన్ ప్రభావం నుంచి బయటపడ్డంతో ఇలా విత్‌డ్రాయల్ బ్లీడ్ లేదా డిశ్చార్జ్ కనపడవచ్చు. ఇది పుట్టినప్పటి నుంచి ఆరునెలల దాకా ఉండొచ్చు. మూడు నాలుగు రోజుల్లోనే తగ్గిపోతుంది. క్లియర్‌గా.. స్మెల్ లేని వైట్ డిశ్చార్జ్ ఆడపిల్లల్లో ఎప్పుడైనా కనపడొచ్చు. అయితే ఇన్ఫెక్షన్ గనుక ఉంటే రెడ్నెస్, బ్యాడ్ స్మెల్, యెల్లో లేదా గ్రీన్‌కలర్ వెజైనల్ డిశ్చార్జ్ కనిపిస్తుంది. దగ్గు, జలుబుకు ఎక్కువసార్లు యాంటీబయాటిక్స్ వాడితే వాటితో వెజైనాలో ఫంగల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. సబ్బుతో స్నానం, టాల్కంపౌడర్స్, డియోడరెంట్ పెర్ఫ్యూమ్స్ వంటివాటి వల్లా.. పిల్లల ఇన్నర్‌వేర్ నుంచీ ఇరిటేషన్ రావచ్చు. అందుకే మైల్డ్ క్లెన్సర్స్తో.. గోరువెచ్చని నీటిలో క్లీన్ చెయ్యాలి. పాపకు స్నానం చేయించాక వెట్ క్లాత్‌తో వెజైనల్ ఏరియాను ముందు నుంచి వెనుకగా తుడవాలి. ఔ్చbజ్చీ కింద డైపర్కి సంబంధించిందేమైనా ఉండిపోయి.. అది వైట్ డిశ్చార్జ్‌గా కనిపించవచ్చు. అందుకే అక్కడ శుభ్రంగా తుడవాలి. స్క్రబ్ చేయకూడదు. మెత్తటి తడి గుడ్డతోనే అదీ ముందు నుంచి వెనుకగా శుభ్రం చేయాలి. ఒక్కోసారి ఫారిన్ బాడీ ఏదైనా పొరపాటున వెజైనాలో ఉంటే కూడా తెల్లబట్ట అవుతూ ఉంటుంది. ఒకసారి గైనకాలజిస్ట్/ పీడియాట్రీషన్ని సంప్రదించడం మంచిది. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ఆకుకూరలు మంచిదని తినేస్తున్నారా? శాస్త్రవేత్తలు స్త్రాంగ్ వార్నింగ్!) -
రైస్ వల్ల షుగర్ లెవల్స్ పెరగవు!.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
రైస్ అధికంగా తినడం వల్లే బరువు పెరుగుతామని, అలాగే రక్తంలో షుగర్ లెవల్స్ పెరిపోతాయని చాలామంది అనుకుంటారు. అందుకే రైస్‌ని దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తారు కూడా. కొందరు రాత్రి సమయంలో చపాతీలు, పుల్కాలు, సూప్‌లతో సరిపెట్టేస్తారు. అదేం అవసరం లేదంటున్నారు న్యూటిషియన్లు. దీనిపై అధ్యయనం చేసిన యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూటిషియన్లు కూడా రైస్‌ను హాయిగా తినొచ్చని అంటున్నారు. అదంతా కేవలం అపోహే అని తేల్చి చెబుతున్నారు. ఆ రైస్‌కి తాము చెప్పిన వాటిని జోడించి తింటే ఆ భయాలు కూడా ఉండవని నొక్కి చెబుతున్నారు. ఐతే మధుమేహం వ్యాధి గ్రస్తులు కూడా రైస్‌ని రెండుపూట్ల హయిగా తినేయొచ్చ? తదితరాల గురించే ఈ కథనం.! రైస్‌లో అత్యంత సాధారణ కార్బోహైడ్రేట్ ఉంటుందని అంటున్నారు ప్రముఖ న్యూటిషియన్ పూర్ణిమ. ఆహారంలో రైస్ ఎక్కువుగా తీసుకుంటే బరువు పెరుగుతామన్న భయంతో కొద్దికొద్దిగానే తింటూ బాధపడుతుంటారు. కానీ అది నిజం కాదని చెబుతున్నారు న్యూటిషియన్ పూర్ణిమ. ఇది బరువు తగ్గడంలోనూ, చక్కెర స్థాయిలను నిర్వహించడంలోనూ సమర్థవంతంగా పనిచేస్తుందంటూ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. ఈ మేరకు పూర్ణిమ యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ అధ్యయనంలో కనుగొన్న ఆసక్తికర విషయాలు ఏంటంటే... ఎలా తీసుకుంటే గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయంటే.. తెల్లటి అన్నంలో వంద శాతం గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అదే రైస్‌కి వెనిగర్ కలిపి వండుకుంటే గ్లూకోజ్ స్థాయిలు పెరుతాయన్న భయమే ఉండదు. బియ్యానికి వెనిగర్‌ని జోడించడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ ప్రభావం గణనీయంగా తగ్గిపోతుంది. అలాగే రైస్‌కి పాలు చేర్చడం వల్ల మంచి ప్రోటీన్ లభిస్తుంది. ఆటోమెటిక్‌గా గ్లైసెమిడ్ ఇండెక్స్ తగ్గుతుందని సోయాబీన్ లేదా సోయాబీన్ ఉత్పత్తులతో కూడిన బియ్యంలో కూడా గ్లైసెమిక సూచిక తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది. నిమ్మరసాన్ని జోడించడం వల్ల కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ ప్రభావం గణనీయంగా 40 శాతం తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. నిమ్మరసంతో అన్నం తినడం వల్ల ఎక్కువుగా తిన్న అనుభూతి కలుగుతుంది. అందువల్ల తెలియకుండానే ఈజీగా బరువు కూడా తగ్గుతాం పులియబెట్టిన పదార్థాలను రైస్‌కి జోడించడం వల్ల కూడా గ్లూకోజ్ స్థాయిలు తక్కువుగానే ఉంటాయి. ఉదాహరణకు కొబుచా, సౌర్‌క్రాట్, కిమ్చి, మిసో, పెరుగు తదితరాలు ప్రేగులకు మంచిది. ఎసిటిక్ యాసిడ్‌తో కలిగిన పదార్థాలు లేదా వెనిగర్ ఆధారిత పదార్థాలు, పచ్చళ్లు, సాస్‌లు, ఆవాలు, సలాడ్లు(మిక్సిడ్ కూరగాయాలు) తదితరాలు అన్నానికి జోడించి తీసుకుంటే మంచిది. ఇది కుదరనట్లయితే రైస్‌లో ఏదో రకంగా నిమ్మరసం జోడించి తీసుకోవడం మంచి ఆప్షన్ని అని న్యూట్రిషియన్ పూర్ణిమ చెబతున్నారు. ఇలా తీసుకుంటుంటే బరువు తగ్గడమే గాక రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రించగలం అంటున్నారు న్యూట్రిషియన్ పూర్ణిమ. అందుకు సంబంధించిన వీడియోని కూడా నెట్టింట షేర్ చేశారు. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Poornima Peri (@poornimahormonecoach) (చదవండి: రాత్రిళ్లు అకస్మాత్తుగా చెమటలు పడుతున్నాయా? బీ కేర్‌ఫుల్ అంటున్న వైద్యులు!) -
సబ్బుతో స్కిన్ క్యాన్సర్‌కి చెక్..14 ఏళ్ల బాలుడి సరికొత్త ఆవిష్కరణ
క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైన వ్యాధో అందరికి తెలిసిందే. బాగా డబ్బుంటే విదేశాల్లో పేరుగాంచిన ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుని బయటపడుతుంటారు ప్రముఖులు, సెలబ్రెటీలు. అలాంటి భయానక క్యాన్సర్ వ్యాధుల్లో ఒకటి ఈ స్కిన్ క్యాన్సర్. అలాంటి స్కిన్ క్యాన్సర్‌ని తక్కువ ఖర్చుతోనే ఈజీగా నయం చేసేలా ఓ సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికాడు ఓ టీనేజర్. ఈ ఆవిష్కరణతో ఆ యువ శాస్త్రవేత్త అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ ఎవరా టీనేజర్? ఏమిటా ఆవిష్కరణ..?. వివరాల్లోకెళ్తే..అమెరికాలోని వర్జీనియాకు చెందిన 14 ఏళ్ల హేమన్ బెకెలే స్కిన్ క్యాన్సర్‌ని జయించేలా సబ్బుని కనిపెట్టాడు. అది కూడా తక్కువ ఖర్చతోనే నయం అయ్యేలా రూపొందించాడు. ఈ సబ్బు ధర కేవలం రూ. 800/-. ఈ సరికొత్త ఆవిష్కరణగానూ ఆ బాలుడు టాప్ యంగ్ సైంటిస్ట్‌గా అవార్డును గెలుచుకున్నాడు. ఈ సబ్బు అందరికీ అందుబాటులో ఉండేలా ఆ బాలుడు లాభప్రేక్షలేని ఓ సంస్థను కూడా స్థాపించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఆ బాలుడికి ఈ ఆవిష్కరణను కనుగొనడానికి త్రీఎం డిస్కవరరీ ఎడ్యుకేషన్ శాస్త్రవేత్తల సలహాదారు డాక్టర్ మహ్ఫుజా అలీ సాయం చేశారు. బెకెలేకి జీవశాస్త్రం, సాంకేతికపై మంచి ఆసక్తి. ఇదే ఈ ఆలోచనకు పురిగొల్పింది. అదే అతడిని యూఎస్‌లో ఏటా నిర్వహించే 2023 3M యంగ్ సైంటిస్ట్స్ ఛాలెంజ్‌లో పాల్గొనేలా చేసింది. దాదాపు తొమ్మిది మంది పోటీ పడిన ఈ చాలెంజ్‌లో అమెరికా టాప్ యంగ్ సైంటిస్ట్‌గా విజయం కైవసం చేసుకుని దాదాపు రూ. 31 లక్షల ఫ్రైజ్ మనీని గెలుచుకున్నాడు. ఇథియోపియాకు చెందిన బెకెలే తాను అక్కడ ఉన్నప్పుడు చాలామంది స్కిన్ క్యాన్సర్‌తో బాధపడుతుండటం చూశానని చెప్పుకొచ్చాడు. అప్పుడే దీన్ని నయం చేసేలా ఏదైనా కనిపెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నానని చెప్పాడు. దీనికి ఈ ఛాలెంజ్ పోటీనే సరైన వేదికగా భావించానని చెప్పుకొచ్చాడు. ఇక బెకెలే రూపొందించిన ఈ సబ్బు పేరు స్కిన్ క్యాన్సర్ ట్రీటింగ్ సోప్. ఈ సోప్ చర్మాన్ని రక్షించే డెన్డ్రిటక్ కణాలను పునరుద్ధరింంచి, స్కిన్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడతుందని బెకెలే పేర్కొన్నాడు. అదీగాక ఇంతవరకు మార్కెట్లో స్కిన్ క్యాన్సర్‌కి సంబంధించి క్రీమ్‌లు మాత్రమే మార్కెట్లో ఉన్నాయని, సబ్బుని ఉపయోగించడం ఇదే తొలిసారి అని యంగ్ ఛాలెంజ్ ప్రెజెంటేషన్ ప్యానల్ వివరించాడు బెకెలే. సమాజానికి తన వంతుగా సాయం అందించేలా ఈ స్కిన్ క్యాన్సర్‌ని అతి తక్కువ ఖర్చుతోనే జయించేలా తాను కనుగొన్న ఈ సరికొత్త ఆవిష్కరణ ప్రపంచానికి ఓ కొత్త ప్రేరణ ఇస్తుందని ఆశిస్తున్నానని ప్యానెల్ సభ్యులకు వివరించాడు బెకెలే. (చదవండి: అంతరించిపోయే స్టేజ్‌లో అరటిపళ్లు!..శాస్త్రవేత్తలు స్ట్రాంగ్ వార్నింగ్) -
ఎలాంటి వారికి సీజెరియన్ సజెస్ట్ చేస్తారు?
ఇప్పుడు నాకు 9వ నెల. నార్మల్ డెలివరీ అంటే భయం. అసలు సిజేరియన్ బర్త్ అంటే ఏంటీ? ఎలాంటి వారికి దీన్ని సజెస్ట్ చేస్తారు? – వి. హీరా, ధర్మాబాద్ చాలామందికి 9వ నెల చివర్లో సహజంగా నొప్పులు వచ్చి నార్మల్‌గా వెజైనల్ బర్త్ అవుతుంది. కానీ కొంతమంది గర్భిణీలు ఇలా నొప్పులు తీయడానికి భయపడుతుంటారు. ఇంకొంతమందిలో బిడ్డ పొజిషన్ నార్మల్ డెలివరీకి అనుకూలంగా ఉండదు. అలాంటివాళ్లందరికీ సిజేరియన్ బర్త్ను సజెస్ట్ చేస్తారు. సిజేరియన్ బర్త్‌లో బిడ్డకు, తల్లికి కొన్ని రిస్క్స్ ఉంటాయి. ఇది చిన్న ప్రొసీజర్ కాదు. పెద్ద ఆపరేషన్. ఆపరేషన్ సంబంధిత రిస్క్స్ కూడా ఉంటాయి. వీటన్నిటినీ మీ డాక్టర్ మీతో డీటెయిల్డ్‌గా డిస్కస్ చేస్తారు. వ్యక్తిగత కారణాలు, కన్సర్న్స్, ఫీలింగ్స్‌తో మీకు ఆపరేషనే కావాలి అనుకుంటే మీ అభిప్రాయాన్ని గౌరవించి ఆపరేషన్ వల్ల కలిగే ప్రయోజనాలు.. తలెత్తే సమస్యలను మీకు వివరిస్తారు. వెజైనల్ డెలివరీకి భయపడి.. ఆపరేషన్‌కి వెళ్లేవారికి కౌన్సెలింగ్ సెషన్‌ని ఏర్పాటు చేస్తారు. ఈ సెషన్లో గైనకాలజిస్ట్, మత్తు డాక్టర్, మానసిక వైద్య నిపుణులు, ఫిజియోథెరపిస్ట్ ఉంటారు. భయాన్ని ఎలా ఎదుర్కోవాలో.. పెయిన్ రిలీఫ్‌కి బెస్ట్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో సూచిస్తారు. ఆందోళన, టెన్షన్‌కి కారణాలు చెప్పి.. వాటిని అధిగమించి వెజైనల్ బర్త్‌కి ప్రయత్నించమనీ చెప్తారు. ఎపిడ్యూరల్ ఎనాలిసిస్, బర్తింగ్ ఎక్సర్సైజెస్ చెప్తారు. ఈ కౌన్సెలింగ్ తర్వాత కూడా మీరు సిజేరియన్ బర్త్నే కావాలనుకుంటే.. ఎప్పుడు ఆ డెలివరీని ప్లాన్ చేస్తే మంచిదో చెప్తారు. కొన్ని కేసెస్‌లో సిజేరియన్ డెలివరీ తర్వాత బిడ్డకు ఏర్పడే రెస్పిరేటరీ డిస్ట్రెస్ వల్ల బిడ్డను ఎన్ఐఐయులో అడ్మిట్ చేసే చాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. అలాంటివి ఎదురవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారు. సిజేరియన్ సెక్షన్ తర్వాత కుట్లు నొప్పి లేకుండా.. ఇన్ఫెక్షన్ సోకకుండా త్వరగా మానడానికి స్పెషల్ మెడికేషన్ ఇస్తారు. ఆపరేషన్ వల్ల టిష్యూలో Adhensions ఏర్పడే చాన్సెస్ పెరుగుతాయి. దీనివల్ల తర్వాత డెలివరీ అప్పుడు ఆపరేషన్ టైమ్‌లో ఇబ్బందులు తలెత్తవచ్చు. బ్లాడర్, పేగు వంటివీ గాయపడే చాన్సెస్ ఉంటాయి. సాధారణంగా 39 వారాలు పూర్తయిన తర్వాత సిజేరియన్ చెయ్యడం మంచిది. కానీ మీకు బీపీ, సుగర్, బిడ్డ పెరుగుదలలో సమస్యలు ఉంటే కనుక కొంచెం ముందుగా ప్లాన్ చేస్తారు. స్ట్రెచ్ మార్క్స్ మాయం ప్రసవం తర్వాత మహిళలను స్ట్రెచ్ మార్క్స్ చాలానే ఇబ్బంది పెడుతుంటాయి. కొంత మందిలో పెరిగిన బరువు తగ్గిన తర్వాత కూడా ఇవి ఏర్పడుతుంటాయి. వీటినిపోగొట్టేందుకు చాలామంది అనేక రకాల క్రీములు వాడుతుంటారు. అయితే సహజమైన పద్ధతుల్లో వీటిని తగ్గించుకోవచ్చు. చర్మానికి తేమను అందించే గుణం కొబ్బరినూనెకు ఉంటుంది. అందుకే రోజూ రాత్రి పడుకునే ముందు స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట గోరువెచ్చని కొబ్బరినూనెతో మసాజ్ చేయాలి. దీని వల్ల చారలు పోవడమే కాకుండా సాగిన పొట్ట కూడా తగ్గుతుంది. అలాగే బంగాళదుంప రసం, కలబంద గుజ్జునూ స్ట్రెచ్ మార్క్స్‌ను పోగొట్టేందుకు వాడొచ్చు. వీటిని స్ట్రెచ్ మార్క్స్ పైరాసి పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేస్తే క్రమంగా మార్క్స్ తగ్గటంతో పాటు ఇవి మంచి మాయిశ్చరైజర్స్గానూ పనిచేస్తాయి. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ఫ్లూ జ్వరం ఎందుకొస్తుంది? రాకుండా ముందుగానే నివారించొచ్చా?) -
స్విమ్మింగ్‌తో ఓ మహిళ కంటి చూపు మాయం!
చాలామందికి ఈత కొట్టడం సరదా. నదుల్లోనూ, చిన్ని చిన్న కాలువాల్లో పిల్లలు, పెద్దలు ఈత కొడుతుంటారు. నిజానికి అలాంటి నీటిలో అమీబా వంటి పరాన్న జీవులు ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ అవే ఓ మహిళ కంటి చూపు పోవడానికి కారణమైంది. సాధారణ నొప్పిగా మొదలై ఏకంగా కంటిలోని కార్నియాను తినేసింది. దీంతో ఆమె శాశ్వత అంధురాలిగా మారిపోయింది. వివరాల్లోకెళ్తే..ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. యూకేలో కెంట్కు చెందిన 38 ఏళ్ల షెరీన్ ఫే గ్రిఫిత్ ఎప్పటిలానే పబ్లిక్ స్మిమ్మింగ్పూల్లో ఈత కొట్టింది. ఐతే రెండు రోజుల తర్వా నుంచి కంటి ఇన్ఫెక్షతో విలవిలలాడింది. తొలుత సాధారణమైందిగా భావించి ఐ డ్రాంప్స్ వంటివి వేసుకుంది. వైద్యులు కూడా నార్మల్ ఇన్ఫెక్షన్గానే పరిగణించారు. కానీ రోజురోజుకి ఇన్ఫెక్షన్ తీవ్రమైందే గానీ తగ్గలేదు. పైగా కన్ను చుట్టూ ఉన్న ప్రాంతమంతా వాచి కనురెప్ప తెరవలేని స్థితికి వచ్చేసింది. దీంతో వైద్యులు కంటికి సంబంధించిన అని వైద్య పరీక్షలు నిర్వహించగా అకాంతమీబా కారణంగా ఈ ఇన్ఫెక్షన్ వచ్చినట్లు గుర్తించారు. దీంతో ఈ నొప్పి, దురద, పుండ్లు కూడిని ఇన్ఫెక్షన్న వస్తుందని బాధితురాలు షెరీన్కి తెలిపారు. ఈ ఇన్ఫెక్షన్ని తగ్గించేందుకు స్టెరాయిడ్స్, యాంటీ బ్యాక్టీరియల్ ఐ డ్రాప్స్ వంటివి ఇచ్చి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. దురద నొప్పి ఎక్కువై విలవిలలాడింది. ఎందువల్ల ఇలా అయిందని పరీక్షించగా ఆ పరాన్న జీవి అకాంతమీబా షెరీన్ కంటిలోని కార్నియాను తినేసినట్లు గుర్తించారు. దీంతో ఆమె కంటి చూపుని కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆమె ఆమె నొప్పి, దురద పుండ్లు వంటి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు తెలిపింది. అంతేగాదు తాను కంటి చూపుని కోల్పోడం వల్ల తన దైనందిన కార్యక్రమాలను వేటిని చేసుకోలేకపోతున్నట్లు ఆవేదనగా వివరించింది. కాగా, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం అకాంతమీబా సాధారణంగా సరస్సులు, మహాసముద్రాలు, మట్టి వంటి నీటి వనరుల్లో కనిపిస్తుంది. ఇది పంపు నీరు, వెంటిలేటింట్ , ఎయిర్ కండిషనింగ్ యూనిట్లు, కొలనుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కంటికి కాంటాక్ట్ లెన్స్ ధరించడం వల్ల గానీ చిన్న చిన్న కంటి గాయాల ద్వారా గానీ కన్నులోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలుగజేస్తుందని పేర్కొంది. ఇవి నేరుగా కళ్లపై దాడి చేసి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. అయితే నీరు తాగడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ రాదని, అలాగే ఇది అంటువ్యాధి కూడా కాదని వైద్యులు చెబుతున్నారు. ఐతే ఈ ఇన్ఫెక్షన్కి చికిత్స అందించడం చాల కష్టమని అన్నారు. ఈ ఇన్షెక్షన్ సోకే ముందు కనిపించే లక్షణాలు.. అస్పష్టంగా కనిపించడం లేదా దృష్టి కోల్పోవడం మేఘావృతమైన కార్నియా తీవ్రమైన కంటినొప్పి కళ్లలో ఎరుపు నీళ్లు నిండిన కళ్లు కంటి ఉపరితలంపై తెల్లటి వలయాలు అయితే అకాంతమీబా కంటిలోకి ప్రవేశించిన చాలా రోజుల వరకు దాని లక్షణాలు బయటపడవని వైద్యుల చెబుతున్నారు. (చదవండి: భోజనం చేసిన వెంటనే పండ్లు తింటున్నారా? ఆరోగ్య నిపుణుల ఏం చెబుతున్నారంటే..) -
ఫ్లూ జ్వరం ఎందుకొస్తుంది? రాకుండా ముందుగానే నివారించొచ్చా?
గత కొద్దికాలంగా జ్వరాలు, దగ్గు, జలుబుతో పాటు శ్వాస సరిగా అందకపోవడం వంటి ఫ్లూ లక్షణాలతో చాలామంది హాస్పిటళ్లకు పరుగులెత్తుతున్నారు. జ్వరం తగ్గాక కూడా పొడి దగ్గు, కొందరిలో కఫంతో కూడిన దగ్గు ఒక పట్టాన తగ్గకపోవడంతో ఆందోళన పడుతున్నారు. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. బాధితుల నుంచీ ఇవే కంప్లెయింట్స్తో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని చాలా ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఈ ఫ్లూ జ్వరాలు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ఇవి ఎందుకిలా వస్తున్నాయి, లక్షణాలేమిటి, ముందస్తు నివారణకూ లేదా ఇప్పటికే వచ్చి ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. ఫ్లూలాంటి జ్వరాలు... లక్షణాలూ, జాగ్రత్తలుఇటీవల వస్తున్న ఫ్లూలాంటి జ్వరాలన్నింటికీ ఇన్ఫ్లుయెంజా, పారా ఇన్ఫ్లుయెంజా వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు ప్రధాన కారణమని వైద్య నిపుణుల భావన. రెండుమూడేళ్ల కిందట వచ్చిన కరోనా వైరస్ తాలూకు తీవ్రత బాగా తగ్గిపోయి, పెద్దగా ప్రమాదకరం కాని కోవిడ్ కూడా ఈ జ్వరాల కారణాల్లో ఒకటి కావచ్చునని కూడా వైద్యవర్గాలు భావిస్తున్నాయి. రాబోయేది చలికాలం కావడంతో ఇవే జ్వరాలు... దాదాపు వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి వరకు కొనసాగవచ్చని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. లక్షణాలు : దాదాపు ఫ్లూ జ్వరాల్లో కనిపించే అన్ని లక్షణాలూ ఈ సీజనల్ ఫీవర్స్‌లో కనిపిస్తున్నాయి. ఉదాహరణకు... ∙జ్వరం ∙తలనొప్పి ∙ఒళ్లునొప్పులు ∙గొంతునొప్పి ∙గొంతు కాస్త బొంగురుగా మారడం ∙కొన్నిసార్లు (తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు) శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు. ఈ లక్షణాలు ఐదు నుంచి దాదాపు గరిష్ఠంగా పదిరోజులు ఉంటాయి. నిర్ధారణ పరీక్షలు / చికిత్స ముక్కు, గొంతు స్వాబ్‌తో కరోనా లేదా ఇతర ఇన్ఫ్లుయెంజా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అని నిర్ధారణ చేయవచ్చు. తీవ్రత తక్కువగా ఉన్నవాళ్లకి (జ్వరం, గొంతునొప్పి, ఒళ్లునొప్పులు లక్షణాలు గలవారికి) ఇంటివద్దనే లక్షణాలకు తగినట్లుగా పారాసిటమాల్, ఓఆర్ఎస్, దగ్గు సిరప్‌లతో చికిత్స అందించవచ్చు. తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి అంటే... విపరీతమైన దగ్గు, ఆయాసం, ఆక్సిజన్ తగ్గిపోవడం వంటి లక్షణాలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులున్నవారిని హాస్పిటల్లో చేర్చి చికిత్స అందించాలి. నివారణ / జాగ్రత్తలు: దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఎదుటివారిపై తుంపర్లు పడకుండా చేతి రుమాలు అడ్డుపెట్టుకోవాలి. చేతి రుమాలు లేనప్పుడు తమ ఫుల్ స్లీవ్స్లోకి తుమ్మడం మంచిది. దీని వల్ల వైరస్ లేదా వ్యాధిని సంక్రమింపజేసే సూక్ష్మజీవులు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించవు. కరోనా సమయంలోలా వీలైతే జ్వరం, దగ్గు తగ్గేవరకు మాస్క్ ధరించడం మేలు. ∙దగ్గు లేదా తుమ్మినపుడు చేతులను అడ్డుపెట్టుకున్నవారు, తర్వాత చేతుల్ని 20 సెకన్ల పాటు సబ్బుతో కడుక్కోవాలి లేదా శానిటైజర్ వాడాలి. దగ్గు/తుమ్ము సమయంలో ఒకరు వాడిన రుమాలును వేరొకరు ఉపయోగించకూడదు. దాన్ని తప్పనిసరిగా డిస్పోజ్ చేయాలి. జలుబు లేదా ఫ్లూ లక్షణాలున్న వ్యక్తులనుంచి దూరంగా ఉండాలి ∙బాధితుల పక్కబట్టలను, పాత్రలను విడిగా ఉంచాల్సినంత అవసరం లేదుగానీ... వ్యక్తిగత పరిశుభ్రత కోసం ఒకరి బట్టలు, పాత్రలను మరొకరు వాడకపోవడమే మంచిది. బాధితుల్ని మిగతావారి నుంచి కాస్త విడిగా (ఐసోలేషన్) ఉంచటం మేలు. ∙ఇన్ఫ్లుయెంజాకు, కోవిడ్‌కు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. వ్యాధి తీవ్రత తగ్గించడానికీ, హాస్పిటల్లో చేరికల నివారణకు వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. ఈ జ్వరాలు చాలావరకు పెద్దగా ప్రమాదకరం కావు. అరుదుగా ఎవరిలోనైనా పరిస్థితి మరీ తీవ్రంగా మారితే... తక్షణం బాధితుల్ని ఆసుపత్రికి తరలించాలి. వీళ్లలో తీవ్రత ఎక్కువ... ఇప్పటికే ఆస్తమా, దీర్ఘకాలిక లంగ్స్ సమస్యలు, బ్రాంకైటిస్, దీర్ఘకాలిక గుండెజబ్బులతో బాధపడేవారు, హార్ట్ ఫెయిల్యూర్, కరోనరీ ఆర్టరీ డిసీజ్ బాధితులు, దీర్ఘకాలిక కిడ్నీ/లివర్ వ్యాధులున్నవారు, కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజ్‌లతో బాధపడుతూ స్టెరాయిడ్ చికిత్స తీసుకుంటున్నవారూ, లుకేమియా, సికిల్ సెల్ ఎనీమియా ఉన్నవారు, వయోవృద్ధులూ వారితోపాటు ఐదేళ్లలోపు పిల్లలు, గర్భిణులు... వీళ్లందరి లోనూ లక్షణాల్లో తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, నిద్రలేమి, పల్స్ ఆక్సిమీటర్‌తో పరీక్షించినప్పుడు ఆక్సిజన్ శాచ్యురేషన్స్ తగ్గడం, ఆక్సిజన్ మోతాదుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. ఒక్కోసారి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడి బాధితుల్ని ఆసుపత్రులకు తీసుకురావాల్సిన అవసరమూ ఏర్పడుతుంది. డాక్టర్ వి రాజమనోహర్ ఆచార్యులు, సీనియర్ కన్సల్టెంట్, పల్మనాలజిస్ట్ (చదవండి: నివారించలేని వింత వ్యాధి! తనను తాను గాయపరుచుకునేలా ప్రేరేపించే వ్యాధి!) -
విమర్శ లేదా తిరస్కరణను హ్యాండిల్ చేయలేకపోతున్నారా?
విమర్శలు ఎవరికీ నచ్చవు. వివేక్కి అసలే నచ్చవు. నేను సరిగా లేనేమో, నన్ను ఎవ్వరూ పట్టించుకోరేమో, తిరస్కరిస్తారేమో, విమర్శిస్తారేమో అనే భయం నిరంతరం అతన్ని వెంటాడుతూ ఉంటుంది. తప్పు చేయడం, మాట పడటం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఆందోళన చెందుతుంటాడు. ఎవరైనా ఏదైనా మాటంటే చాలు.. నెలల తరబడి దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతుంటాడు. అందుకే ఆఫీస్ మీటింగ్‌లకు ఏదో ఒక సాకు చెప్పి ఎగవేస్తుంటాడు. టీమ్ లీడర్ అయితే అందరితో మాట్లాడాల్సి వస్తుందని ప్రమోషన్ కూడా వద్దన్నాడు. ఏ విషయంలోనూ నిర్ణయం తీసుకోలేడు, ఎవరినీ నమ్మలేడు. ఏ అమ్మాయితో మాట్లాడితే ఏమవుతుందోనని దూరదూరంగా ఉంటాడు. అలా మొత్తం మీద అందరికీ దూరంగా ఒంటరిగా గడిపేస్తుంటాడు. వివేక్ సమస్య ఏమిటో పేరెంట్స్‌కు, ఫ్రెండ్స్‌కు అర్థంకాలేదు. అడిగినా ఏమీ చెప్పడు. నాకేం నేను బాగానే ఉన్నానంటాడు. పెళ్లి చేసుకోమంటే ముందుకురాడు. అప్పుడే పెళ్లేంటంటూ వాయిదా వేస్తుంటాడు. ‘ఇప్పటికే 30 ఏళ్లొచ్చాయి, ఇంకెప్పుడ్రా చేసుకునేది?’ అని పేరెంట్స్ గొడవపడుతున్నా పట్టించుకోడు. వివేక్ సమస్యేమిటో అర్థంకాక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. వివేక్ లాంటి వాళ్లు జనాభాలో 2.5 శాతం మంది ఉంటారు. దీన్ని అవాయిడెంట్ పర్సనాలిటీ డిజార్డర్ (AVPD) అంటారు. అంటే అది వ్యక్తిత్వంలో ఏర్పడిన సమస్య, రుగ్మత. ఇలాంటి వ్యక్తిత్వ రుగ్మతలను గుర్తించడం కష్టం. ఎందుకంటే అవి ఆ వ్యక్తి ప్రవర్తనలో, వ్యక్తిత్వంలో విడదీయలేని భాగంగా ఉంటాయి. బాల్యానుభవాల నుంచే.. ఏవీపీడీకి జన్యు, పర్యావరణ, సామాజిక, మానసిక కారకాలను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. పరిస్థితి మెరుగుపడడంలో పాత్ర పోషించే కొన్ని అంశాలు.. బాల్యంలో తల్లిదండ్రుల ఆప్యాయత, ప్రోత్సాహం లేకపోవడం, తిరస్కరణకు గురయిన పిల్లలు ఈ రుగ్మతకు లోనవుతారని పరిశోధనలు సూచిస్తున్నాయి. తోటివారి తిరస్కరణ, ఎమోషనల్ అబ్యూజ్, అపహాస్యానికి గురైన వ్యక్తులు చిన్నతనంలో చాలా సిగ్గుపడతారు. పెద్దయినా ఆ సిగ్గును అధిగమించరు. బాల్యంలో ఎదురైన బాధాకరమైన అనుభవాలు వారి ఆలోచనా విధానాలు మారడంలో పాత్ర పోషిస్తాయి. అలాంటి అనుభవాలు మళ్లీ ఎదురుకాకుండా, వాటిని తప్పించుకునేందుకు మనుషులనే తప్పించుకు తిరుగుతుంటారని అర్థం చేసుకోవచ్చు. రెండేళ్ల వయసులోనే ఈ లక్షణాలు కనిపించినా పెరిగి పెద్దవాళ్లయిన తర్వాత మాత్రమే నిర్ధారణ అవుతుంది. అసమర్థత భావాలే ప్రధాన లక్షణం.. అసమర్థత భావాలు, విమర్శ లేదా తిరస్కరణను తీసుకోలేకపోవడం, సోషల్ ఇన్హిబిషన్ ఏవీపీడీ ప్రధాన లక్షణాలు. యుక్త వయసుకు వచ్చేనాటికి వీటిని అనుభవించి ఉంటారు. వాటితోపాటు ఈ కింది లక్షణాలు కూడా ఉంటాయి. తనను తాను అసమర్థంగా, ఆనాకర్షణీయంగా, తక్కువగా భావించడం విమర్శ లేదా తిరస్కరణ భయం కారణంగా వర్క్ ప్లేస్‌లో వ్యక్తులతో కలసి పనిచేసే అవకాశాలను తప్పించుకోవడం పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని కచ్చితంగా తెలిస్తే తప్ప ఇతరులతో సంభాషించడానికి ఇష్టపడకపోవడం అవమాన భయం కారణంగా సన్నిహిత సంబంధాలలో తడబాటు సామాజిక పరిస్థితుల్లో విమర్శల గురించే ఆలోచిస్తూ ఉండటం కొత్త సామాజిక పరిస్థితులను తప్పించుకోవడం రిస్క్ తీసుకోవడానికి లేదా ఇబ్బందికి దారితీసే కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఇష్టపడకపోవడం. అయితే ఈ లక్షణాలు కనిపించగానే ఏవీపీడీ ఉందని కంగారుపడిపోకండి. ఈ రుగ్మత నిర్ధారణకు సైకాలజిస్ట్‌తో సైకలాజికల్ ఎవాల్యుయేషన్ అవసరం. ఎవాల్యుయేషన్ తర్వాతనే ఈ సమస్య ఉందని నిర్ధారిస్తారు. గుర్తించడమే చికిత్సలో తొలిమెట్టు ఏవీపీడీతో బాధపడేవారిలో చాలామంది దాన్ని గుర్తించరు. గుర్తించినా చికిత్స తీసుకోరు. అందుకే మీకు తెలిసిన లేదా ప్రేమించే వ్యక్తి ఏవీపీడీతో జీవిస్తున్నారని భావిస్తే, సైకాలజిస్ట్‌ను కలిసేందుకు ప్రోత్సహించండి. థెరపీ లేకుండా దీని నుంచి మెరుగుపడే అవకాశం లేదు. ఏవీపీడీ నుంచి బయటపడాలంటే చేయాల్సిన మొదటి పని దాని సంకేతాలను గుర్తించడం. నిర్దిష్ట లక్షణాలను అర్థంచేసుకోవడం ద్వారా, వాటిని పరిష్కరించుకునే మార్గాలను అన్వేషించగలుగుతారు సమస్య నుంచి బయటపడేందుకు స్మోకింగ్, ఆల్కహాల్, అతిగా తినడం లాంటి అనారోగ్యకరమైన కోపింగ్ టెక్నిక్స్ కాకుండా ఆరోగ్యకరమైన సంరక్షణ మార్గాలు పాటించాలి మీ చికిత్సలో స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా చేర్చుకోండి. మీ సమస్యేమిటో, ఎలా సహాయం చేయాలో వాళ్లకు బాగా అర్థమవుతుంది · కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, సైకోడైనమిక్ థెరపీ, స్కీమా థెరపీ, గ్రూప్ థెరపీ, సోషల్ స్కిల్స్ ట్రైనింగ్ లాంటివి ఈ రుగ్మత నుంచి బయటపడేందుకు సహాయపడతాయి బాల్యంలోని బాధాకరమైన అనుభవాలను అర్థంచేసుకుని, వాటి తాలూకు నొప్పిని, సంఘర్షణను అధిగమించేందుకు చికిత్స ఉపయోగపడుతుంది · ఏవీపీడీ చికిత్సకోసం మందులు ఏవీ లేనప్పటికీ.. దానివల్ల వచ్చే డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి సంబంధిత రుగ్మతల నుంచి బయటపడేందుకు మందులు ఉపయోగపడతాయి. --సైకాలజిస్ట్ విశేష్ (చదవండి: మానసిక సమస్య ఉందని గుర్తించడమెలా?) -
చిన్నారుల్లో వచ్చే ‘అబ్సెన్స్ సీజర్స్’ అంటే..?
చిన్నారుల్లో ఫిట్స్ (సీజర్స్) రావడం సాధారణంగా చూస్తుండేదే. ఇలా ఫిట్స్ రావడాన్ని వైద్యపరిభాషలో ‘ఎపిలెప్సీ’గా చెబుతారు. పెద్దవాళ్లతో పోల్చినప్పుడు పిల్లల్లో వచ్చే సీజర్స్‌కు కారణాలూ, చికిత్సకు వారు స్పందించే తీరుతెన్నులూ... ఇవన్నీ కాస్త వేరుగా ఉంటాయి. ఈ సీజర్స్లోనూ ‘ఆబ్సెన్స్ సీజర్స్’ అనేవి ఇంకాస్త వేరు. నాలుగేళ్ల నుంచి 14 ఏళ్ల వయసు పిల్లల్లో వచ్చే వీటి కారణంగా చిన్నారులు ఏ భంగిమలో ఉన్నా... ఉన్నఉన్నవారు ట్లుగానే వారు స్పృహ కోల్పోతారు. ఇవి పిల్లల్లో అకస్మాత్తుగా మొదలవుతాయి. హఠాత్తుగా వాళ్లను స్పృహలో లేకుండా చేస్తాయి. కనీసం 10 – 20 సెకండ్లు అలా ఉండిపోయి, మెల్లగా ఈలోకంలోకి వస్తారు. ఇలా హఠాత్తుగా కనిపించి, తల్లిదండ్రుల్ని ఆందోళనకు గురిచేసే ‘ఆబ్సెన్స్ సీజర్స్’పై అవగాహన కోసం ఈ కథనం. చిన్నారుల్లో వచ్చే ‘అబ్సెన్స్ సీజర్స్’ అంటే..?పిల్లల్లో వచ్చే ఫిట్స్‌లో... ఆబ్సెన్స్ సీజర్స్ అనేవి కనీసం 20 నుంచి 25% వరకు ఉంటాయి. సాధారణంగా ఇవి జన్యుపరమైన (జెనెటిక్), జీవక్రియ పరమైన (మెటబాలిక్) సమస్యల వల్ల వస్తుంటాయి. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లో ‘ఆబ్సెన్స్ సీజర్స్’ కేసులు ఎక్కువగా వస్తుంటాయి. అసాధారణంగా కొందరు చిన్నారుల్లో ఏడాదిలోపు వయసున్నప్పుడు కూడా ఇవి మొదలు కావచ్చు. చాలా మంది ఆరోగ్యకరమైన పిల్లల్లో హఠాత్తుగా మొదలైనప్పటికీ... కొందరు చిన్నారుల్లో మాత్రం... వారికి జ్వరం వచ్చినప్పుడు కనిపించే ఫిట్స్‌తో ఇవి మొదలవుతాయి. అలాగే ఎదుగుదలలో లోపాలు (డెవలప్మెంటల్ డిలే) వంటి నాడీ సంబంధమైన సమస్యలున్నవారిలోనూ కనిపిస్తుంటాయి. ఇంక కొందరిలోనైతే... వాస్తవంగా కనుగొన్న నాటికి చాలా పూర్వం నుంచే... అంటే నెలలూ, ఏళ్ల కిందటి నుంచే ఇవి వస్తుంటాయి. కానీ తల్లిదండ్రులు (లేదా టీచర్లు) చాలా ఆలస్యంగా గుర్తిస్తారు. కానీ... వీటినంత తేలిగ్గా గుర్తించడం సాధ్యం కాకపోవడంతో పిల్లలేదో పగటి కలలు కంటున్నారనీ, ఏదో వాళ్ల లోకంలో వాళ్లు ఉన్నారంటూ తల్లిదండ్రులు, టీచర్లు, లేదా పిల్లల్ని చూసుకునే సంరక్షకులు పొరబడుతూ ఉండవచ్చు. సాధారణ సీజర్స్‌లో అవి వచ్చినట్లు తెలుస్తుంది. కానీ ఆబ్సెన్స్ సీజర్స్‌లో అవి వచ్చిన దాఖలా కూడా స్పష్టంగా తెలియదు. కొన్ని సందర్భాల్లో చాలాకాలం వరకూ తెలిసిరాదు. ప్రేరేపించే అంశాలు... ఈ ‘ఆబ్సెన్స్ సీజర్స్’ను కొన్ని అంశాలు ప్రేరేపిస్తూ ఉంటాయి. అవి... తీవ్రమైన అలసట వేగంగా శ్వాస తీసుకోవడం పిల్లలు టీవీ, మొబైల్ చూస్తున్నప్పుడు తరచూ హఠాత్తుగా మారిపోతూ ఉండే కాంతిపుంజాలూ, ఫ్లాష్లైట్ల కారణంగా... ఆబ్సెన్స్ సీజర్స్ రావచ్చు. ఆబ్సెన్స్ సీజర్స్ లక్షణాలు... ఈ సందర్భాల్లో పిల్లలు... అకస్మాత్తుగా చేష్టలుడిగి (బిహేవియర్ అరెస్ట్‌తో) నిశ్చేష్టులై ఉండిపోవడం ∙ముఖంలో ఎలాంటి కవళికలూ కనిపించకపోవడం ∙కళ్లు ఆర్పుతూ ఉండటం, ఒంటి మీద బట్టలను లేదా ముఖాన్ని తడబాటుగా చేతి వేళ్లతో నలపడం, నోరు చప్పరించడం, మాటల్ని తప్పుగా, ముద్దగా ఉచ్చరిస్తూ ఉండటం (ఫంబ్లింగ్), చేస్తున్నపనిని అకస్మాత్తుగా నిలిపివేయడం / ఆపివేయడం ∙బయటివారు పిలుస్తున్నా జవాబివ్వకపోవడం / ఎలాంటి స్పందనలూ లేకపోవడం పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వాళ్లు బయటకు పూర్తిగా నార్మల్‌గానూ కనిపించవచ్చు. మాట్లాడటం మాత్రం చాలావరకు నార్మల్‌గా ఉండిపోవచ్చు. కొందరిలో మాత్రం కొంచెం అస్పష్టత కనిపించవచ్చు. ఈ లక్షణాలన్నీ వారు ఆటలాడుకుంటున్నప్పుడూ, టీవీ చూస్తున్నప్పుడూ లేదా కొన్నిసార్లు నిద్రలో కూడా కొనసాగుతుంటాయి. చిన్నారులు అన్యమనస్కంగా ఉండటమో లేదా ఏదో లోకంలో ఉన్నట్టు కనిపించడాన్ని తల్లిదండ్రులు గమనిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. నిర్ధారణ ఇలా... ఆబ్సెన్స్ సీజర్స్‌లో ఎన్నో రకాలున్నప్పటికీ... సాధారణంగా టిపికల్ (అంతగా సంక్లిష్టం కానివి), అటిపికల్ (సంక్లిష్టమైనవి) అనే రకాలు ఉంటాయి. ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ (ఈఈజీ) ఎమ్మారై (బ్రెయిన్) వంటి మరికొన్ని పరీక్షలతో వీటిని నిర్ధారణ చేయవచ్చు. ఇక అటిపికల్ రకాల విషయంలో ఇతర నాడీ సంబంధమైన సమస్యలనూ, జీవక్రియలకు(మెటబాలిక్) సంబంధించిన, జన్యుసంబంధమైన మరికొన్ని పరీక్షలతో పాటు మెదడు / వెన్నుపూస చుట్టూ ఉండే ద్రవం (సెరిబ్రో స్పైనల్ ఫ్లుయిడ్ – సీఎస్ఎఫ్)ను పరీక్షించడం ద్వారా ఈ (అటిపికల్) రకాన్ని తెలుసుకుంటారు. చికిత్స సమస్య నిర్దారణ అయిన వెంటనే చికిత్స మొదలుపెట్టాలి. ఇందుకోసం ఫిట్స్ మందులు (యాంటీ సీజర్ మెడిసిన్స్) వాడాలి. వీటిని కనీసం రెండేళ్ల పాటు వాడాల్సి ఉంటుంది. అలా వాడుతూ, బాధితుల మెరుగుదలను గమనిస్తూ, దాని ప్రకారం మోతాదును క్రమంగా తగ్గిస్తూ పోవాలి. ఈ మందులు చిన్నారుల్లో... కేవలం ఫిట్స్ తగ్గించడం మాత్రమే కాదు, వాళ్ల జీవన నాణ్యతనూ మెరుగుపరుస్తాయి. స్కూల్లో వాళ్ల సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. సామాజికంగా ఒంటరి కాకుండా... నలుగురితో కలిసిపోయేలా చేస్తాయి. మందుల గుణం కనిపిస్తోందా లేదా అన్న విషయాన్ని నిర్ణీత వ్యవధుల్లో ఈఈజీ తీయడం ద్వారా పరిశీలిస్తూ ఉండాలి. ఇక సహాయ చికిత్సలు (సెకండ్ లైన్ ట్రీట్మెంట్)గా వాళ్లకు కీటోజెనిక్ డైట్ (కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం) ఇవ్వడం, వేగస్ నర్వ్ అనే నరాన్ని ప్రేరేపించడం (వేగస్ స్టిమ్యులేషన్) జరుగుతుంది. దాదాపు 70 శాతం కేసుల్లో చిన్నారులు యుక్తవయసునకు వచ్చేనాటికి మంచి స్పందన కనిపిస్తుంది. (చదవండి: నివారించలేని వింత వ్యాధి! తనను తాను గాయపరుచుకునేలా ప్రేరేపించే వ్యాధి!) -
రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి హెచ్ఐవీ ఫిజీషియన్ ఆయన!
వైద్యులు రోగులకు వైద్యం చేస్తారు. పేషెంట్ వ్యాధిని అంచనా వేసి, పరీక్షలతో నిర్ధారణకు వచ్చి, సిలబస్‌లో చదివిన సమాధానాలతో వైద్యం చేస్తారు. మరి... అప్పటివరకు లేని కొత్త రోగం వస్తే? చికిత్స కోసం అప్పటికే చదివిన సిలబస్‌లో సమాధానం ఎలా వెతకాలి? వైద్యవిద్యలో చెప్పని పాఠాల కోసం అన్వేషణ ఎలా మొదలు పెట్టాలి? అందుకే... ‘పేషెంట్లు, పరిశోధనలే నా గురువులు’ అన్నారు డాక్టర్ మురళీకృష్ణ. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... నిర్ధారిత ప్రయోగాలు, నిరూపిత సమీకరణలతో వైద్యం చేయడానికే పరిమితం కాకూడదు. రోగికి అవసరమైన కొత్త సమీకరణాలను వైద్యులు సృష్టించగలగాలన్నారు. బ్రాండ్స్ ఇంపాక్ట్ సంస్థ విశేషంగా వైద్యసేవలందించిన వైద్యులను ఇటీవల న్యూఢిల్లీలో గౌరవించింది. పేదవారికి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తూ ‘హెల్త్ కేర్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2023’ పురస్కారం అందుకున్నారు తెలుగు డాక్టర్ మురళీకృష్ణ. మైక్రో బయాలజీ నడిపించింది! ‘‘మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రాపురం. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్, అదే కాలేజ్‌లో ఎం.డీ (మైక్రో బయాలజీ) కూడా చేసి, సాంక్రమిక వ్యాధుల నిపుణుడిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. మైక్రో బయాలజీలో చేరడం ఇష్టంతో కాదని చెప్పడానికి ఏ మాత్రం మొహమాట పడను. సీటు వచ్చిన కోర్సుతో రాజీపడిపోయాను. కానీ కోర్సు మొదలైన తర్వాత ఏర్పడిన ఆసక్తిని మాటల్లో వర్ణించలేను. నేరుగా వైద్యం చేయడం కంటే వైద్యరంగానికి అవసరమైన తెర వెనుక కృషి చాలా సంతృప్తినిచ్చింది. గర్భిణులు, ఇతర వ్యాధిగ్రస్థులకు పరీక్షల కోసం సేకరించిన రక్త నమూనాలను తీసుకుని ఎయిడ్స్ వైరస్ గురించి ప్రభుత్వం చాలా గోప్యంగా పరీక్షలు నిర్వహించేది. మనదేశంలో వెయ్యిలో 15 మందిలో ఎయిడ్స్ వైరస్ ఉన్నట్లు, అది దక్షిణాది ఆఫ్రికా దేశాల నుంచి మనదేశంలోకి వస్తున్నట్లు తెలుసుకున్నాం. దేశంలో ప్రభుత్వ సంస్థల దగ్గర ఉన్న సమాచారమంతటినీ సేకరించాను. అన్ని సంస్థల దగ్గరున్న సమాచారం కంటే ఎక్కువ డాటా నా దగ్గరుంది. అప్పట్లో మనదగ్గర ఎయిడ్స్‌కి వైద్యం చేసే డాక్టర్లు లేరు. అనుబంధ సమస్యలకు వైద్యం చేసే నిపుణులే హెచ్ఐవీకి కూడా మందులిచ్చేవారు. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి హెచ్ఐవీ ఫిజీషియన్ని నేనే. వారానికి ఇద్దరు పేషెంట్లు! సొంతక్ట్రీస్ మొదలుపెట్టింది 2000లో. మొదట్లో వారానికి ఇద్దరు లేదా ముగ్గురు పేషెంట్లు వచ్చేవారు. దాంతో నా సమయాన్ని ఎయిడ్స్ అధ్యయనానికి ఉపయోగించాను. ప్రముఖ పరిశోధకులందరూ శాస్త్రం ఆధారంగా ఎయిడ్స్‌కు వైద్య శోధన మొదలు పెట్టారు. నా అధ్యయనం, పరిశోధనలను పేషెంట్ వైపు నుంచి మొదలు పెట్టాను. ఎయిడ్స్‌కి మాంటూక్స్ టెస్ట్ అలాంటిదే. ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులు వ్యాధినిరోధక శక్తిని కోల్పోయి టీబీ సోకడం సర్వసాధారణంగా జరిగేది. ఎయిడ్స్ మరణాల్లో ఎక్కువ టీబీ మరణాలే ఉండేవి. ‘13వ ఇంటర్నేషనల్ ఎయిడ్స్ కాన్ఫరెన్స్’ సౌత్ ఆఫ్రికాలోని దర్బన్‌లో జరిగింది. ఆ సదస్సులో నేను ‘మాంటూక్స్ టెస్ట్’ ఎయిడ్స్ తీవ్రత పట్ల ఒక అంచనాకు రావచ్చని చెప్తూ నా పరిశోధన పత్రాన్ని సమర్పించాను. అది ఎయిడ్స్ చికిత్సలో కొత్త దృక్పథానికి దారి తీసింది. ఎయిడ్స్ చికిత్సలో వైద్యం మొదలు పెట్టిన వారం రోజుల నుంచి రికవరీ స్పష్టంగా తెలుస్తుంది. అయితే జీవితకాలం మందులు వాడాల్సిందే. పేషెంట్ తిరిగి తన పనులకు వెళ్లగలిగేటట్లు చేయడం నా వైద్యం ఉద్దేశం. ఈ వ్యాధి పేదవాళ్లలోనే ఎక్కువ. వారికి వైద్యం చేయడంలో టెస్ట్‌ల మీద ఆధారపడకుండా వ్యాధి లక్షణాలు, చిహ్నాలను బట్టి తీవ్రతను అంచనా వేసి చికిత్స చేస్తాను. అలాగే రెండంచెల ఔషధాలతో వైద్యం చేయడం కూడా నేను చేసిన మరో ప్రయోగం. ఫ్రాన్స్‌లో జరిగిన ‘ఇంటర్నేషనల్ సింపోజియమ్ హెచ్ఐవీ ఎమర్జింగ్ మెడిసిన్ ’ సదస్సులో పేపర్ సమర్పించాను. నేను ప్రతిపాదించిన పదేళ్ల తర్వాత 2019 నుంచి ఇప్పుడు అంతర్జాతీయంగా టూ డ్రగ్స్ చికిత్సనే అనుసరిస్తున్నారు. ఎయిడ్స్ అవగాహన వ్యాసాలు హెచ్ఐవీ గురించి మన సమాజంలో విపరీతమైన భయం రాజ్యమేలుతున్న రోజులవి. ఆ వ్యాధి పట్ల అవగాహన కల్పించడం కోసం నగరాలు, పట్టణాలు, చిన్న కాలనీలు, గ్రామాల్లో ఐదు వందలకు పైగా సమావేశాల్లో ప్రసంగించాను. వయోజనుల్లో అవగాహన కోసం ‘అక్షర గోదావరి’ పేరుతో క్లుప్తంగా, సరళంగా సామాన్యులకు అర్థమయ్యే రీతిలో రాశాను. మొదట మా జిల్లాలో ప్రయోగాత్మకంగా మొదలు పెట్టిన ఆప్రాజెక్టును తర్వాత అన్ని జిల్లాలకూ విస్తరించారు. ఆశ వర్కర్స్, రీసోర్స్ పర్సన్‌కి ప్రామాణిక గ్రంథంగా నా రచననే తీసుకున్నారు. హెచ్ఐవీ గురించిన అవగాహన వ్యాసాలతో ‘ఎయిడ్స్’ పేరుతో పుస్తకాన్ని ప్రచురించాను. ఆ పుస్తకం పునర్ముద్రణలతో పదేళ్లలో ఎనిమిది వేల కాపీలు అమ్ముడవుతుందని నేను కూడా ఊహించలేదు. ఎంబీబీఎస్‌లో కాలేజ్ మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా పని చేసిన అనుభవమే ఇప్పటికీ నా అధ్యయనాలన్నింటినీ అక్షరబద్ధం చేయిస్తోంది. కోవిడ్‌కి ఇంట్లోనే వైద్యం కోవిడ్ వైద్యరంగానికి పెద్ద సవాల్ అనే చెప్పాలి. ఒక వ్యాధికి మందులు రావాలంటే దశాబ్దాల పరిశోధన తర్వాత మాత్రమే సాధ్యం. కొత్త వ్యాధి, పైగా ఒక్కసారిగా విజృంభించినప్పుడు రోగులందరికీ ఒకేసారి నాణ్యమైన వైద్యం అందించడం ఎవరికీ సాధ్యం కాదు. వ్యాధి విస్తరించినంత వేగంగా ప్రత్యామ్నాయాల అన్వేషణ కూడా జరగాలన్న ఆలోచనతో సులభంగా, చవగ్గా దొరికే మందులతో హోమ్‌కేర్ కిట్ రూపొందించాను. కోవిడ్ మీద అవగాహన కోసం వీడియోలు చేసి సోషల్ మీడియాలో ΄పోస్ట్ చేశాను. ఒక్కో పోస్ట్ వేలసార్లు షేర్ అయింది. వైద్యం కోసం పేషెంట్లు అప్పుల పాలు కాకూడదనేది నా పాలసీ. అందుకోసమే నా తాపత్రయమంతా. కోవిడ్ మీద కూడా అవగాహన పుస్తకం తెచ్చాను. కోవిడ్ తర్వాత వస్తున్న సమస్యల మీద అధ్యయనం ఇంకా కొనసాగుతోంది. నాలుగు ఇంటర్నేషనల్ సెమినార్లలో పేపర్లు ప్రెజెంట్ చేశాను. ఇంకా చేస్తాను కూడా. ఒక డాక్టర్‌గా వైద్యరంగం నేర్పించిన జ్ఞానంతో పేషెంట్లను ఆరోగ్యవంతులను చేయడానికి కృషి చేయడం అనేది నూటికి తొంబై తొమ్మిది మంది చేసే పని. నా కృషితో వైద్యరంగానికి తోడ్పాటు అందించడం నా విజయం. మొదట ఆరోగ్యపరంగా నన్ను నేను జయించాను. ఆ తర్వాత జీవితాన్ని జయించాను. మా ఇంట్లో తొలి వైద్యుడిని నేనే. నా పిల్లలిద్దరిలో ఎవరూ వైద్యరంగం పట్ల ఆసక్తి చూపకపోవడమే మనసుకు బాధ కలిగించే విషయం’’ అన్నారు ప్రజారోగ్య పరిరక్షణలో జీవన సాఫల్య పురస్కారం అందుకున్న డాక్టర్ మురళీకృష్ణ. – డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎం.డి, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
చక్కెర కంటే బెల్లమే ఎందుకు ఆరోగ్యానికి మంచిదంటే..!
సంప్రదాయక తియ్యటి పదార్థం బెల్లం. ఆరోగ్యపరంగా బెల్లమే మంచిదని మన పెద్దవాళ్లు పదే పదే చెబుతుంటారు. అదీగాక ఇటీవల కాలంలో షుగర్ వ్యాధిగ్రస్తులు విపరీతంగా పెరిగిపోయారు. దీంతో పలు ఛానెళ్లలోనూ, ఆరోగ్య నిపుణులు పంచదారకు బదులు బెల్లాన్ని ఉపయోగించండి, పంచదారను అస్సలు దగ్గరకు రానియ్యకండి అంటూ ఊదరగొట్టేస్తున్నారు. ఇందులో వాస్తవం ఎంతుంది. ఇది ఎంతవరకు నిజం? తదితరాలు గురించే ఈ కథనం. పంచదార లేదా చక్కెర అనేది రిఫైన్డ్ చేసినది. కానీ బెల్లం చెరుకు రసంతో తయారు చేసిన అన్ రిఫైన్డ్ పదార్థం. అందుకే దీన్ని నాన్ సెంట్రీఫూగల్ కేన్ షుగర్ అంటారు. ఐతే ఆరోగ్య నిపుణులు పంచదార కంటే బెల్లమే మంచిదైనపట్టికీ కాలాల వారికి వాటిని వినియోగించాలని చెబుతున్నారు. పూర్తిగా పంచదారను దూరం పెట్టేయకూడదని, మన శరీరానికి తగు మోతాదులో అందాల్సిన ఘగర్ని తీసుకోవచ్చని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే పంచదార తెల్లగా కనిపించేందుకు ఎక్కువ కెమికల్స్ వినియోగిస్తారు. దీని బదులు ఆర్గానిక్ పద్ధతిలో అంటే పటికి బెల్లం రూపంలో ఉండే షుగర్‌ని వినియోగించుకోవచ్చు. ఈ రెండింటిని కాలాల వారిగా వినియోగించుకుంటే సులభంగా మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందగలరని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. శీతకాలం జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. అందువల్ల ఆ కాలంలో బెల్లంతో చేసిన వంటకాలు లేదా భోజనం అయిన వెంటనే కొద్ది మొత్తంలో బెల్లాన్ని సేవిస్తే మంచిది. ఇక వేసవి కాలం చెమట రూపంలో నీరంతా బయటకు వెళ్లిపోయి గ్లూకోజ్ స్థాయిలు పడిపోతాయి. ఆ సమయంలో మనకు తక్షణ శక్తిని ఇచ్చే గ్లూకోజ్ రూపంలో పంచదారను తీసుకోవచ్చు. అదికూడా ఎక్కువగా ప్రాసెస్ చేయనిది పటికి బెల్లం రూపంలోని పంచదారని తీసుకుంటే ఎలాంటి హాని ఉండదని చెబుతున్నారు. బెల్లంలో రకాలు ప్రయోజనాలు.. ఇక బెల్లం దగ్గరకు వస్తే..చెరుకుని ఉడకబెట్టి తయారు చేసే సాధారణ బెల్లం గాక పలురకాలు బెల్లాలు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. అవేంటంటే.. చెరుకు బెల్లం: ఇది అందరికీ తెలిసిన సాధారణ బెల్లం. చెరకు రసాన్ని ఉడకబెట్టి తయారు చేస్తారు. ఈ బెల్లం ఎంత ముదురు రంగులో ఉంటే అంత మంచిదని అంటారు. ఇది ఎన్నోరకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడంలో ఎంతగానో సహయపడుతుంది. దీనిలో సమృద్ధిగా పోషకాలు ఉంటాయి. తాటిబెల్లం: తాటి చెట్ల రసంతో తయారు చేస్థారు. ఈ తాటి బెల్లంలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఐరన్ లోపంతో బాధపడుతున్న వ్యక్తులకు చాలా మంచిది ఈ తాటి బెల్లం. ఖర్జూర బెల్లం: ఖర్జూర రసం నుంచి తయారు చేస్తారు. దీనిలో ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ బెల్లాన్ని ఆసియా వంటకాల్లో ప్రసిద్దిగా ఉపయోగిస్తారు. కొబ్బరి బెల్లం: కొబ్బరి, తాటి చెట్ల రసం నుంచి తయారు చేస్తారు. ఈ కొబ్బరి బెల్లంలో పొటాషియం పుష్కలంగా ఉంటుఒంది. పంచదార పాకం వంటి రుచిని ఇస్తుంది. భారత్‌లో కొన్ని చోట్ల ఈ కొబ్బరిబెల్లం బాగా ప్రాచుర్యం పొందింది. నల్లబెల్లం: సాంప్రదాయ ఆయుర్వేద ఔషధాలను రూపొందించడానికి ఈ రకమైన బెల్లాన్ని వివిధ మూలికలు, సుగంధ ద్రవ్యాలను చేర్చి తయారు చేస్తారు. అందువల్ల ఇందులో ఇతరత్ర బెల్లముల కంటే అదనంగా ఔషధ గుణాలు ఉంటాయి. నువ్వుల బెల్లం: వేయించిన నువ్వులకు బెల్లాన్ని జతచేసి తయారు చేస్తారు. ఇందులో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఆరోగ్య ప్రయోజనాలు.. బెల్లంలో ఇనుము, మెగ్నీషియం, పొటాషియం ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవిగాక కొద్ది మొత్తంలో బి విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇందులో ఉండే అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ కారణంగా శరీరానికి కావల్సిన తక్షణ శక్తిని అందిస్తుంది. కాలేయం తీరుని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి రక్తాన్ని శుద్ది చేయడానికి ఉపయోగపడుతుంది. దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలకు చక్కని నివారిణిగా ఈ బెల్లం ఉపయోగపడుతుంది. ఎర్రరక్తకణాల ఉత్తత్తికి ఉపయోగడుతుంది. ముఖ్యంగా అనీమియాతో బాధపుడుతున్న రోగులకు ఇది మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఈ బెల్లం చక్కటి ప్రత్యామ్నాయం. ఇందులో కేలరీలు తక్కువుగా ఉంటాయి. అందువల్ల బరువుతగ్గాలనుకునే వారికి ఆరోగ్యకరమైన తీపి పదార్థంగా మంచి ఎంపిక. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే గాక వృద్ధాప్య ఛాయలను ఎదుర్కొవడంలో మంచి ఔషధంగా ఉపకరిస్తుంది. (చదవండి: కంటి రెప్పపై కురుపులు లేదా గడ్డలు ఇబ్బంది పెడుతున్నాయా?)