Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today

ప్రధాన వార్తలు

YSRCP MP Mithun Reddy Arrest News July 20th Updates Details1
మిథున్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌.. వాట్‌ నెక్స్ట్‌

మిథున్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌.. లేటెస్ట్‌ అప్‌డేట్స్‌విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద పోలీసుల ఓవరాక్షన్‌కాసేపట్లో వైద్య పరీక్షలు నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కి మిథున్ రెడ్డిప్రభుత్వ హాస్పటల్ వద్ద భారీగా పోలీసు బందోబస్తుప్రభుత్వ హాస్పటల్ కు భారీగా చేరుకుంటున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులువైఎస్సార్‌సీపీ నేతల వాహనాలకు మాత్రమే అనుమతి నిరాకరణఏపీలో కొనసాగుతున్న రాజకీయ కక్షసాధింపులులేని లిక్కర్ స్కాం పేరుతో వైఎస్సార్‌సీపీ కీలక నాయకుల అరెస్టులుఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సహా 11 మంది అరెస్టుతాజాగా ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అరెస్టు చేసిన సిట్ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేసి 48 మంది పేర్లను ఛార్జిషీటులో పేర్కొన్న సిట్మాజీ సీఎం వైఎస్ జగన్ చుట్టూ ఉన్న కీలక నేతల అరెస్టే లక్ష్యంగా పని చేస్తున్న సిట్ అధికారులునిజానికి చంద్రబాబు హయాంలో కంటే జగన్ హయాంలోనే ప్రభుత్వానికి ఎక్కువగా వచ్చిన ఎక్సైజ్ ఆదాయంఅయినప్పటికీ రూ.3 వేల కోట్లు పక్కదారి పట్టాయంటూ తప్పుడు కేసు నమోదురూ.50 వేల కోట్లు కొట్టేశారంటూ అసెంబ్లీలో పచ్చి అబద్దాలు చెప్పిన చంద్రబాబురూ.35 వేల కోట్లు అంటూ బొంకిన పవన్ కళ్యాణ్నోటికొచ్చినట్లు మాట్లాడుతూ లేని స్కాంని ఉన్నట్టు భేతాళ కథలు అల్లుతున్న ప్రభుత్వ పెద్దలుటీడీపీ కేంద్ర కార్యాలయంలో తయారయ్యే స్క్రిప్టునే ఛార్జిషీటు, రిమాండ్ రిపోర్టుల్లో పేర్కొంటున్న సిట్ఎల్లోమీడియా తప్పుడు రాతలు, సిట్ తప్పుడు విచారణలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్కోర్టుల్లోనే న్యాయపోరాటం చేస్తామంటున్న వైఎస్సార్‌సీపీఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డికి సంఘీభావం తెలిపిన పార్టీ నేతలుమిథున్ రెడ్డికి అండగా వైఎస్సార్‌సీపీవాట్‌ నెక్స్ట్‌మద్యం పాలసీ అక్రమ కేసులో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌విచారణ పేరిట విజయవాడకు పిలిచి మరీ అరెస్ట్‌ చేసిన సిట్‌సుదీర్ఘ విచారణ తర్వాత.. అరెస్ట్‌ చేసినట్లు శనివారం రాత్రి మిథున్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారంఇవాళ ఏసీబీ కోర్టు/జడ్జి ఎదుట మిథున్‌రెడ్డిని ప్రవేశపెట్టే అవకాశంమిథున్‌రెడ్డిని కస్టడీకి కోరనున్న సిట్‌!రిమాండ్‌ విధించే అవకాశం?అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు మద్యం అక్రమ కేసులో చంద్రబాబు సర్కార్‌ బరి తెగింపుఆధారాల్లేని లిక్కర్‌ స్కాంలో.. వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌విచారణ పేరిట పిలిచి మరీ అరెస్ట్‌ చేసిన సిట్‌రాజకీయ కక్షతో పెద్దిరెడ్డి కుటుంబాన్ని వేధిస్తోన్న చంద్రబాబునేడు జడ్జి ఎదుట హాజరుపరిచే అవకాశంమిథున్‌రెడ్డిని రిమాండ్‌ కోరనున్న సిట్‌మద్యం మాఫియా మూలవిరాట్టు చంద్రబాబే 👉పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండిమద్యం స్కామ్‌.. ఓ కట్టుకథరెడ్ బుక్ రాజ్యాంగానికి రెడ్ కార్పెట్ వేసే పాలన సాగిస్తున్నారు.ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానుమద్యం స్కామ్ అనేది ఒక కట్టు కథవైయస్సార్సీపి నేతలను అరెస్టు చేయడం కోసమే మద్యం స్కామ్ ను తెరపైకి తెచ్చారు.వైయస్ జగన్ సన్నిహితులపై అక్రమ కేసులు పెడుతున్నారువైయస్‌ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి శునక ఆనందం పొందుతున్నారు..కూటమి నేతల తప్పుడు కేసులకు ఎవరూ భయపడరు.:::అరకు ఎంపీ తనుజారాణిఅబద్ధాలపుట్టగా ఛార్జ్‌షీట్‌లేని మద్యం కేసును సృష్టించి చంద్రబాబు కుట్రలుఅవాస్తవ వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో కుతంత్రంలేని కుంభకోణం ఉన్నట్లుగా చూపే పన్నాగంఅబద్ధాల పుట్టగా చార్జ్‌షీట్‌ దాఖలుపెరిగిన నిందితులుమొత్తం 48కి పెరిగిన నిందితుల సంఖ్య 👉పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి మాఫియా డాన్ చంద్రబాబే‌2014-19 మధ్య యథేచ్ఛగా చంద్రబాబు దోపిడీఖజానాకు గండికొట్టి అస్మదీయులకు దోచిపెట్టిన బాబురూ.25 వేల కోట్లకు మించి అక్రమాలుసీఐడీ కేసులో ఇప్పటికీ బెయిల్‌పైనే చంద్రబాబుఅప్పటి దందానే నేడూ కొనసాగిస్తున్న వైనం!తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే అక్రమ కేసులు..అరెస్టులు👉పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండిమిథున్‌రెడ్డి అరెస్ట్‌ అక్రమం: వైఎస్సార్‌సీపీఇది స్కామ్‌ కాదు.. చంద్రబాబు ప్రతీకార డ్రామా: వైఎస్సార్‌సీపీలేని మద్యం కేసును సృష్టించి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్ మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో ఏమాత్రం సంబంధం లేని వారందరినీ కక్షపూరితంగా కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేసిన తీరుని వైయస్ఆర్… pic.twitter.com/CiIR4DyA1U— YSR Congress Party (@YSRCParty) July 19, 2025ఏడాది పాలనలో @ncbn చేసిన ఒక్కటంటే ఒక్క మంచి పని లేదు. ఆయన పాలన గురించి ఎవరూ ప్రశ్నించకూడదనే లేని లిక్కర్ కేసును సృష్టించి ఇలా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారు. ఆయన పాపం పండే రోజు కూడా వస్తుంది. @MithunReddyYSRC గారి అక్రమ అరెస్టును…— Roja Selvamani (@RojaSelvamaniRK) July 19, 2025రాష్ట్రంలో జరుగుతున్నది సుపరిపాలన కాదు, అరాచకపాలన. అధికారం ఉంది కదా అని లేని లిక్కర్ కేసును సృష్టించి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించడం మంచి పద్ధతి కాదు. మా ఎంపీ @MithunReddyYSRC గారి అక్రమ అరెస్టును ఖండిస్తున్నా. @ncbn గారూ అధికారం శాశ్వతం…— Rajini Vidadala (@VidadalaRajini) July 19, 2025మిథున్‌రెడ్డి అన్న అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది #westandwithMidhunReddy pic.twitter.com/Pwr0hKRVnQ— Nandigam Suresh Babu - YSRCP (@NandigamSuresh7) July 19, 2025#SadistChandraBabu@ncbn లో రాజకీయ కక్ష తారా స్థాయికి చేరింది. అందులో భాగంగానే అసలు లేని అవినీతిని ఉందన్నట్లుగా ప్రజలకు భ్రమ కల్పించడమే బాబు లక్ష్యం. అందులో భాగంగానే మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు.-మల్లాది విష్ణు గారు, మాజీ ఎమ్మెల్యే pic.twitter.com/2ENNFeGgqj— YSR Congress Party (@YSRCParty) July 19, 2025#SadistChandraBabuప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తూ కూటమి ప్రభుత్వం ఒక రాక్షస క్రీడను ప్రారంభించింది. అందులో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను.-పర్వతరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ pic.twitter.com/Lp44S1Jp67— YSR Congress Party (@YSRCParty) July 19, 2025లిక్కర్ స్కామ్ అంటారు… కానీ:ఆధారం లేదుడబ్బు సీజ్ కాలేదుమద్యం లభించలేదుచార్ట్ షీట్ లో పేరు లేదు ..కానీ అరెస్ట్ ఉంది ఎందుకంటే టార్గెట్ జగన్ అన్న @ysjagan ఈ కుట్రలో మిథున్ అన్నను @MithunReddyYSRC కూడా లాగారు.ఇది స్కామ్ కాదు… ఇది @ncbn చంద్రబాబు గారి ప్రతీకార డ్రామా.… pic.twitter.com/LJu64TEgqe— Dr.Anil Kumar Yadav (@AKYOnline) July 19, 2025#SadistChandraBabuవైఎస్సార్‌సీపీని ఎదుర్కొనే ధైర్యం లేక @ncbn… అక్రమ కేసుల రూపంలో కక్ష తీర్చుకుంటున్నాడు. ఇది రాజకీయ అరాచకమే.ఎంపీ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను.-అరకు ఎంపీ గుమ్మా తనూజ రాణి గారు pic.twitter.com/cG0dQB2SuY— YSR Congress Party (@YSRCParty) July 19, 2025మిథున్‌ రెడ్డి అరెస్ట్‌ రాజకీయ కక్ష సాధింపుపెద్దిరెడ్డి కుటుంబాన్ని, వైఎస్సార్‌సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యంరాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్‌లులేని లిక్కర్‌ స్కామ్‌ను సృష్టించి అరెస్ట్‌లు చేస్తున్నారు ఆ ప్రక్రియలో అంతులేని దారుణ వేధింపులుఇది… pic.twitter.com/3YO54cIp9I— Rachamallu Siva Prasad Reddy (@rachamallu_siva) July 19, 2025

Saudi Prince Alwaleed bin Khaled Passed Away: Why Sleeping Prince In Coma 20 Years2
20 ఏళ్లుగా కోమాలో.. సౌదీ ‘స్లీపింగ్ ప్రిన్స్’ కన్నుమూత

సౌదీ అరేబియా ప్రిన్స్ అల్‌వలీద్ బిన్ ఖలెద్(36) ఇక లేరు. గత 20 ఏళ్లుగా కోమాలో ఉన్న ఆయన.. శనివారం కన్నుమూశారు. ఈ కారణంగానే సౌదీ అరేబియా స్లీపింగ్‌ ప్రి‍న్స్‌గా ఈయనకంటూ ఓ పేరు ముద్రపడిపోయింది. ప్రిన్స్ అల్‌వలీద్ బిన్ ఖలెద్ సౌదీ అరేబియా రాజ కుటుంబానికి చెందినవారు. ఆయన ప్రిన్స్ ఖలెద్ బిన్ తలాల్ అల్ సౌద్ పెద్ద కుమారుడు. 2005లో లండన్‌లోని మిలిటరీ అకాడమీలో చదువుకుంటున్న టైంలో ఖలెద్‌ కారు ప్రమాదంలో గాయపడ్డాడు. మెదడులో రక్తస్రావం జరిగి.. వెంటిలేటర్‌పై కోమాలో ఉంటూ ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఖలెద్‌ కోసం అమెరికా, స్పెయిన్ నుండి నిపుణులు కూడా చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. జూలై 20న రియాద్‌లో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. Statement On the Passing of Prince Alwaleed bin Khaled bin Talal Al Saud pic.twitter.com/st19kxb7lC— Global Imams Council (GIC) (@ImamsOrg) July 19, 2025 View this post on Instagram A post shared by @arabianroyalagency

Chandrababu is Real Liquor Scam Key Man3
మద్యం మాఫియా మూలవిరాట్టు చంద్రబాబే!

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు వెనుక పక్కా పన్నాగం దాగుంది. ఎందుకంటే గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో తెగించి పాల్పడిన మద్యం దోపిడీని కప్పిపుచ్చే కుతంత్రం ఉంది. అసలు రాష్ట్రంలో మద్యం దందాకు ఆద్యుడు చంద్రబాబే అన్నది బహిరంగ రహస్యం. మద్యం మాఫియాను పెంచి పోషించిన వ్యవస్థీకృత దందాను స్థిర పరచింది ఆయనే. 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండి కొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అస్మదీయుల కంపెనీలకు అడ్డగోలు లబ్ధి కలిగించారు. అందుకోసం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ రెండు చీకటి జీవోలతో కుంభకోణానికి పాల్పడ్డారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల చొప్పున 2015 నుంచి 2019 వరకు రూ.5,200 కోట్లు గండికొట్టారు. ఈ విషయాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ ‘కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌’(కాగ్‌) ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ తన అభ్యంతరాలను స్పష్టంగా నివేదించారు కూడా. ఇక టీడీపీ సిండికేట్‌ ఆధ్వర్యంలో 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు.. వాటికి అనుబంధంగా 4,380 పర్మిట్‌ రూమ్‌లు.. 43 వేల బెల్ట్‌ దుకాణాలతో మద్యం ఏరులై పారించారు. ఎంఆర్‌పీ కంటే 20 శాతం అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగించి, ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు కొల్లగొట్టారు. వెరసి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా రూ.25 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతో సహా బయట పడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్‌ కమిషనర్‌గా వ్యవహరించిన ఐఎస్‌ నరేష్, అప్పటి ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పుటి సీఎం చంద్రబాబు, తదితరులపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 409, 120(బి) రెడ్‌ విత్‌ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్‌ విత్‌ 13(2) కింద సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు అప్పటి నుంచి ముందస్తు బెయిల్‌పైనే ఉన్నారు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మద్యం విధానం ముసుగులో మహా దోపిడీకి మరోసారి తెగబడ్డారు. 3,396 ప్రైవేటు మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్‌కు ఏకపక్షంగా కట్టబెట్టడంతోపాటు ఏకంగా 75 వేల బెల్ట్‌ దుకాణాలతో భారీ దోపిడీకి బరితెగించారు. టీడీపీ ప్రభుత్వంలో గతంలో చేసిన దోపిడీ.. ప్రస్తుతం బరితెగించి సాగిస్తున్న దోపిడీ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే సిట్‌ ద్వారా మద్యం అక్రమ కేసు కుట్రకు తెగబడ్డారు. ‘ప్రివిలేజ్‌’గా ఖజానాకు గండి కొట్టారుమద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్‌ ఫీజు ప్రభుత్వానికి ఆదాయ వనరు. ఆ ఫీజును గుట్టుచప్పుడు కాకుండా రద్దు చేస్తే ఖజానాకు గండి పడుతుంది. సీఎం హోదాలో నోట్‌ ఫైళ్లపై సంతకాల సాక్షిగా ఆ నిర్వాకం చంద్రబాబుదే. మంత్రివర్గాన్ని బురిడీ కొట్టిస్తూ 2015లో రెండు చీకటి జీవోలతో ప్రివిలేజ్‌ పన్నును రద్దు చేశారు చంద్రబాబు. తద్వారా టీడీపీ సిండికేట్‌ ఆధ్వర్యంలోని మద్యం దుకాణాలు, బార్ల యజమానులకు అడ్డగోలుగా ప్రయోజనం కలిగించారు. ఇలా నాలుగేళ్లలోనే రూ.5 వేల కోట్లు కొల్లగొట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇలాంటి ఒక్క చీకటి జీవోను కూడా జారీ చేయనేలేదు.తమవారికి దోచిపెట్టారు2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం నాలుగు డిస్టిలరీల నుంచే ఏకంగా 53.21 శాతం మద్యం కొన్నారు. సి–టెల్‌ అనే సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టి మరీ దందా సాగించారు. ఆ విషయా­న్ని ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం నియమించిన సిట్‌ నివేదికే వెల్లడించింది కూడా. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రం కేవలం కొన్ని డిస్టిలరీలకే ప్రయోజనం కలిగించలేదు. లోపభూ యిష్టమైన సి–టెల్‌సాఫ్ట్‌వేర్‌ను తొలగించింది. సగటున ప్రతి డిస్టిలరీకీ 5 శాతం నుంచి 10% ఆర్డర్లు వచ్చేలా పారదర్శకంగా వ్యవహరించింది.

JC Prabhakar Reddy SHOCKING Comments Towards Govt Officials4
ఏందిరా నీ ఓవరాక్షన్‌.. నువ్వేం పీకలేవురా.. రేయ్‌

తాడిపత్రి టౌన్‌: ‘ఏందిరా నీ ఓవరాక్షన్‌ .. నువ్వేం పీకలేవు రా.. రేయ్‌’ అంటూ మూడు రోజుల క్రితం అనంతపురం నగరంలోని జెడ్పీ కార్యాలయం వద్ద జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) నాగరాజు నాయుడుపై తాడిపత్రి మునిసిపల్‌ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి బూతులతో రెచ్చిపోయిన విషయం విదితమే. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి వీడియో శనివారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘జేసీ రౌడీయిజం.. రెడ్‌బుక్‌ పాలన’ శీర్షికతో ఆ వీడియోను ప్రజాస్వామ్యవాదులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఖండిస్తున్నారు. డీపీవో నాగరాజు నాయుడును ఉద్దేశించి...‘రేయ్‌ వాణ్ని పట్టుకో’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులను పురమాయించడం వీడియోలో ఉంది. ‘రేయ్‌ మర్యాద ఇచి్చన.. నువ్వు నోరు మూసుకో.. మూసుకో నా కొడకా.. లంచం దెం.. ఎప్పుడురా జాయింట్‌ కలెక్టర్‌ నీకిచి్చంది’ అనగానే డీపీవో నాగరాజు నాయుడు జేసీ వైపు చూశారు. దీంతో జేసీ ప్రభాకర్‌.. ‘ఏం అట్ల చూస్తావ్‌?! పీకలేవు రా రేయ్‌’ అంటూ దుర్భాషలాడుతూ కొట్టేవిధంగా డీపీవో మీదకు వెళ్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డిని అనుచరుడు పొట్టి రవి అడ్డుకోవడం కనిపించింది.

Anshul Kamboj added to India squad before 4th Test5
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు.. బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం! ధోని శిష్యుడికి పిలుపు

మాంచెస్ట‌ర్ వేదిక‌గా జూలై 23 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభంకానున్న‌ నాలుగో టెస్టుకు ముందు బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. భార‌త టెస్టు జ‌ట్టులోకి యువ పేస‌ర్ అన్షుల్ కాంబోజ్‌ను బీసీసీఐ చేర్చింది. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగే ఈ మ్యాచ్‌కు పేస‌ర్లు అర్ష్‌దీప్ సింగ్, ఆకాష్ దీప్ అందుబాటులో ఉంటారా లేదా అన్న‌ది ప్ర‌శ్నార్ధకంగా మారింది.లార్డ్స్‌లో జ‌రిగిన మూడో టెస్టులో ఆకాష్ దీప్ గాయ‌ప‌డ‌గా.. నాలుగో టెస్టు కోసం ప్రాక్టీస్ సంద‌ర్భంగా అర్ష్‌దీప్ చేతి వేలికి గాయ‌మైంది. అర్ష్‌దీప్ కోలుకోవ‌డానికి దాదాపు 10 రోజుల స‌మ‌యం ప‌ట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే అన్షుల్ కాంబోజ్‌కు తొలిసారి సెల‌క్ట‌ర్లు పిలుపునిచ్చారు.దీంతో అత‌డు ఉన్న‌ప‌ళంగా భార‌త్ నుంచి లండ‌న్‌కు బ‌య‌లుదేరిన‌ట్లు బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ ల‌య‌న్స్‌తో జ‌రిగిన అనాధికారిక టెస్టుల్లో భార‌త-ఎ త‌ర‌పున కాంబోజ్ ఆడాడు. ఈ సిరీస్‌లో కాంబోజ్ మంచి ప్రదర్శన కనబరిచాడు. ఈ పేసర్ 3 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు పడగొట్టాడు.అన్షుల్ కాంబోజ్ ఐపీఎల్‌-2025 సీజ‌న్‌లో ఎంఎస్ ధోని సారథ్యంలో సీఎస్‌కే తరపున ఆడాడు. ఐపీఎల్‌లో కూడా తన బౌలింగ్ ప్రదర్శనతో కాంబోజ్ ఆకట్టుకున్నాడు. అతడికి అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. గంట‌కు 138-139 కి.మీ వేగంతో బౌలింగ్ చేసి బ్యాట‌ర్ల‌ను బోల్తా కొట్టించ‌గ‌ల‌డు.ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు ఆడి 79 వికెట్లు పడగొట్టాడు. అతడి పేరిట ఓ పది వికెట్ల హాల్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అతడి సీనియర్ జట్టులోకి తీసుకున్నారు. ఇక అండర్సన్‌-టెండూల్కర్ ట్రోఫీలో భారత జట్టు 2-1 తేడాతో వెనకబడి ఉంది. దీంతో నాలుగో టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 2-1తో సమం చేయాలని గిల్ బృందం భావిస్తోంది.చదవండి: WCL: భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రద్దు.. అఫ్రిదిపై వేటు!

Telangana Bonalu Festival Celebration during Ashada Masam6
మీ బిడ్డలం... బోనమందుకో తల్లీ...

తెలంగాణ ప్రాంతంలో పెద్దమ్మ, పోచమ్మ, కట్ట మైసమ్మ, ఆరె మైసమ్మ, గండి మైసమ్మ, మాంకాళమ్మ, నల్ల పోచమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మ, జగదాంబిక పేర్లతో ప్రతి ఆషాఢమాసంలో అమ్మవార్లు బోనాలందుకుంటారు. అందుకే ఆషాఢం వచ్చిందంటే చాలు.... ప్రతి ఇంటా బోనాల హడావిడి కనిపిస్తుంది. ఆషాఢమాసం సందర్భంగా గత నెలలో ఆరంభమైన తెలంగాణ సాంస్కృతిక సంబురం బోనాల వేడుకలు ఆషాఢ బహుళ అమావాస్యతో ముగియనున్నాయి. నేడు పాతబస్తీలోని లాల్‌ దర్వాజాలో కొలువై ఉన్న సింహవాహిని అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారు.భక్తి, ఉత్సాహభరితమైన ఊరేగింపులు, సంబురాలు, ఆచారాలకు ప్రసిద్ధి చెందిన బోనాల పండుగ భాగ్యనగర వాసుల జీవితాలలో కొన్ని శతాబ్దాలుగా భాగమై ఉంది. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు, తెలంగాణలో అత్యధికులు ఎక్కువగా జరుపుకునే పండుగల్లో బోనాలు ముఖ్యమైనది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో గ్రామదేవతలకు ప్రతియేటా ఆషాఢమాసంలో పూజలు జరిపి, బోనాలు సమర్పించే ఈ సంప్రదాయం ఈనాటిది కాదు, వందల ఏళ్లుగా వస్తున్నదే. నగర వాతావరణంలో ఎన్ని హంగులు, ఆర్భాటాలు మార్పులు చేర్పులు చోటు చేసుకున్నా, కాలగమనంలో సంప్రదాయక పండుగలెన్నో పేరు తెలీకుండా అదృశ్యమై పోతున్నా, ఈ బోనాల వేడుకలు మాత్రం తమ వైభవాన్ని ఏమాత్రం కోల్పోకుండా అలనాటి ఆచార సంప్రదాయాలతో వైభవోపేతంగా నేటికీ కొనసాగుతుండడం విశేషం.నవాబుల కాలం నుంచి...మూసీ నది వరదల కారణంగా అంటువ్యాధులకు ఆలవాలమైన నగరంలో నాటి హైదరాబాద్‌ రాష్ట్ర ప్రధాని మహారాజా కిషన్‌ప్రసాద్‌ సలహా మేరకు నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ లాల్‌దర్వాజ సమీపంలోని అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి చార్మినార్‌ వద్దకు చేరిన వరదనీటిలో పసుపు, కుంకుమ, గాజులు, పట్టువస్త్రాలు సమర్పించాడట. అప్పటికి అమ్మ తల్లి శాంతించి నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో నవాబులే బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.ఎందుకీ బోనాలు?ఆషాఢమాసమంటే వర్షాకాలం.. అంటే అంటువ్యాధులకు ఆలవాలమైన మాసం. కలరా, ప్లేగు, మశూచి, క్షయ, తట్టు, పొంగు, అమ్మవారు వంటి అంటువ్యాధుల బారిన పడకుండా గ్రామదేవతలు గ్రామాలను చల్లంగా చూసేందుకే బోనాలు సమర్పిస్తారు. నియమనిష్ఠలతో అమ్మవారికి పసుపునీళ్లు, వే పాకులతో సాక పెడతారు. తర్వాత ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఆ తర్వాత అమ్మవారికి సమర్పించగా మిగిలిన పదార్థాలను ప్రసాదాలుగా స్వీకరిస్తారు. అచ్చ తెలంగాణ జానపదాలు బోనాల పాటలు ఆడామగా, చిన్న పెద్ద, ధనిక బీద తారతమ్యం లేకుండా ఆనందంతో చిందులేస్తూ చెవులకింపైన అచ్చ తెలంగాణ జానపదాలు ‘‘గండిపేట గండెమ్మా దండం బెడత ఉండమ్మా.., బోనాలంటే బోనాలాయే బోనాల మీద బోనాలాయే.., అమ్మా బైలెల్లినాదే... అమ్మా సల్లంగ సూడమ్మ... మైసమ్మా మైసమ్మా... వంటి పాటలు, పోతురాజుల నృత్యవిన్యాసాలు, శివసత్తుల చిందులు చూపరులను అలరిస్తాయి. పోతురాజుల చేతి కొరడా దెబ్బ... పోతురాజు అంటే అమ్మవారికి సోదరుడు. తమ ఇంటి ఆడపడుచును ఆదరించేందుకు, ఆమెకు సమర్పించే ఫలహారపు బండ్లకు కాపలా కాసేందుకు విచ్చేసే పోతురాజులు నృత్యవిన్యాసాలు తప్పక చూడతగ్గవి. చిన్న అంగవస్త్రాన్ని ధరించి ఒళ్ళంతా పసుపు రాసుకుని కాళ్ళకు మువ్వల గజ్జెలు, బుగ్గన నిమ్మపండ్లు, కంటికి కాటుక, నుదుట కుంకుమ దిద్దుకుని మందంగా పేనిన పసుపుతాడును కొరడాగా ఝళిపిస్తూ, తప్పెట్ల వాద్యాలకు అనుగుణంగా గజ్జెల సవ్వడి చేస్తూ లయబద్ధంగా పాదాలు కదుపుతూ కన్నుల పండుగ చేస్తారు. పోతురాజుల చేతి కొరడా దెబ్బతినడానికి చాలామంది పోటీ పడుతుంటారు. ఎందుకంటే ఆ కొరడా దెబ్బ దుష్టశక్తులను, శారీరక రుగ్మతలను దూరంగా తరిమి కొడుతుందని వారి విశ్వాసం.గోల్కొండ జగదాంబికదే తొలిబోనంమొదట వేడుకలు గోల్కొండ జగదాంబిక ఆలయంలో ఆరంభమవడం ఆచారం. తర్వాత ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో, ఇక ఆ తర్వాత అన్నిచోట్లా బోనాల సంరంభం మొదలవుతుంది. సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఒక్కోరోజు ఆషాఢ ఘటోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఘటాల ఊరేగింపు తర్వాతే బోనాల వేడుకలు ్ర పారంభమవుతాయి. గోల్కొండ జగదాంబిక ఆలయంలో మొదలైన ఉత్సవాలు తిరిగి ఆ అమ్మకు సమర్పించే తుదిబోనంతో ముగియడం ఆచారం.అమ్మ... ప్రతి ఇంటి ఆడపిల్లఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలిచేవారు. అదే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది.పండుగ రోజున స్త్రీలు పట్టుచీరలు, నగలు ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని (బోనం) మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు. బోనాలను మోసుకెళ్తున్న మహిళలను అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసం. మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయాన్ని సమీపించే సమయంలో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళు కుమ్మరిస్తారు.తొట్టెల సమర్పణతమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్తబృందమూ ఒక తొట్టెను సమర్పించడం ఆచారంగా ఉంది.బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్‌ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేట్‌ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా పాతబస్తీ ప్రాంతానికి చేరుకుంటుంది. ఆషాడంలోనే కాకుండా కొన్ని ప్రాంతాల్లో శ్రావణంలో కూడా జరుపుకుంటారు. – డి.వి.ఆర్‌.

Sonu Sood Catches Snake With Bare Hands, Video Goes Viral7
చేతులతో పాముని పట్టుకున్న సోనూ సూద్‌.. వీడియో వైరల్‌

పాము ఉందని తెలిస్తేనే ఆమడ దూరం పరుగెడతాం. కళ్లకు కనిపిస్తే.. భయంతో వణికిపోతాం. ఇక సినిమా వాళ్లకు పాము అంటే భయం ఇంకాస్త ఎక్కువనే చెప్పాలి. వాళ్లు రియల్‌ లైఫ్‌లో పాములను రేర్‌గా చూస్తుంటారు. చిన్న బల్లికే భయపడే స్టార్స్‌ చాలా మందే ఉన్నారు. కానీ ‘రియల్‌ హీరో’, నటుడు సోనూ సూద్‌(Sonu Sood ) మాత్రం పెద్ద పాముని తన చేతులతో పట్టుకున్నాడు. ఆ పాముని చూసి తన సిబ్బంది అంతా భయంతో దూరం జరిగితే.. ఆయన మాత్రం చాకచక్యంగా దాన్ని పట్టుకొని..అడవిలో విడిపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.ముంబైలో సోనూ సూద్‌ నివాసం ఉండే సొసైటీలోకి ఈ పాము దారితప్పి వచ్చింది. పాముని చూసి అంతా భయంతో దూరంగా వెళ్లిపోయారు. సోనూ సూద్‌ మాత్రం ఉత్త చేతులతో దాన్ని పట్టుకొని సంచిలో బంధించాడు. అనంతరం దాన్ని సురక్షిత ప్రాంతంలో వదిలి పెట్టాలని తన సిబ్బందికి సూచించారు. అయితే తనలాగా ఇలాంటి స్టంట్లు చేయకుండా.. ఇళ్లలోకి పాములు ప్రవేశిస్తే నిపుణులను పిలించి మాత్రమే పట్టుకోవాలన్నారు. తన ఇంట్లోకి వచ్చిన పాము ర్యాట్ స్నేక్ (జెర్రిపోతు) అని, అది విషపూరితమైనది కాదని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో పాముల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.हर हर महादेव 🔱❤️#harharmahadev🙏🌿🕉️ pic.twitter.com/u500AcrlxS— sonu sood (@SonuSood) July 19, 2025

Weekly Horoscope In Telugu From 20-07-2025 To 26-07-20258
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం...ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ మీది ఫలితం వేరొకదిగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. గృహ నిర్మాణయత్నాలలో అవాంతరాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు, పనిభారం పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. శివపంచాక్షరి పఠించండి.వృషభం....కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. కోర్టు కేసులు పరిష్కారదశకు చేరతాయి. వాహనయోగం. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. కళారంగం వారికి సత్కారాలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. కనకధారాస్తోత్రాలు పఠించండి.మిథునం...ఆర్థికంగా ఇబ్బంది పడతారు. సోదరులు, సోదరీలతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. భూవివాదాలు నెలకొంటాయి. ప్రముఖులతో చర్చలు ఫలించవు. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఉద్యోగయత్నాలు నిదానంగా సాగుతాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. రాజకీయవర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. వారం మధ్యలో ధన, వస్తులాభాలు. నూతన పరిచయాలు. నేరేడు, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.కర్కాటకం...అనుకున్న వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం. బంధువుల నుంచి శుభవార్తలు. భూములు, వాహనాలు కొంటారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగుల యత్నాలు కొంతమేరకు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.సింహం...కొత్త వ్యక్తులు పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆప్తులు మీ అభివృద్ధిలో కీలకం కాగలరు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. సోదరులతో విభేదాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి నూతన అవకాశాలు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. పసుపు, గులాబీ రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.కన్య...నూతన ఉద్యోగప్రాప్తి. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. కొన్ని వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో వివాదాలు. అనుకోని ఖర్చులు. నీలం, నేరేడు రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.తుల...ఆర్థిక వ్యవహారాలు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగయత్నాలు నిదానంగా సాగుతాయి. సోదరులు, సోదరీలతో అకారణంగా విభేదాలు. కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆరోగ్యం చికాకు పరుస్తుంది. వ్యాపార లావాదేవీలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి ఒత్తిడులు తప్పవు. వారం చివరిలో అప్రయత్న కార్యసిద్ధి. ఆకస్మిక ధనలబ్ధి. గులాబీ, తెలుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.వృశ్చికం....అనుకోని ఖర్చులు ఎదురై అప్పులు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులతో తగాదాలు. ముఖ్యమైన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. కాంట్రాక్టర్లకు నిరాశాజనకంగా ఉంటుంది. అనారోగ్య సూచనలు. ఇంటి నిర్మాణాలలో అవరోధాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. రాజకీయవర్గాలకు గందరగోళ పరిస్థితులు. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. శివాష్టకం పఠించండి.ధనుస్సు...అనుకున్న విధంగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. ప్రముఖుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. కొత్త వ్యక్తులు పరిచయమై ఉత్సాహాన్నిస్తారు. సంఘంలో మరింత పేరు గడిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసమస్యలు. లేత ఆకుపచ్చ, నలుపు రంగులు. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.మకరం...వీరికి అన్నింటా విజయాలే. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఒక కీలకమైన కేసు పరిష్కారమవుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని హోదాలు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు, సన్మానాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, లేత ఎరుపు ర ంగులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.కుంభం...అనుకున్న పనులు నత్తనడకన కొనసాగుతాయి. బంధువులతో విభేదాలు ఏర్పడవచ్చు. శ్రమ మరింతగా పెరుగుతుంది. ఆరోగ్య, కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పవు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో విందువినోదాలు. ఉద్యోగలాభం. నేరేడు, గులాబీ రంగులు. గణేశ్‌ను పూజించండి.మీనం...వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. మిత్రులతో కలహాలు. సేవాకార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. శ్రమకు తగిన ఫలితం రాక డీలా పడతారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు వద్దు. తీర్థయాత్రలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి యత్నాలలో అవాంతరాలు. వారం ప్రారంభంలో శుభవార్తలు. ప్రముఖులతో పరిచయాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

WCL 2025 India Pakistan Match Called Off Reason Is9
WCL: భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రద్దు.. అఫ్రిదిపై వేటు!

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టోర్నీలో నేడు జరగాల్సిన పాకిస్తాన్‌ భారత్‌ మ్యాచ్‌ రద్దైంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంగ్లాండ్‌ బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్‌‌ మైదానం వేదికగా షెడ్యూల్‌ ప్రకారం ఆదివారం రాత్రి 9గం. భారత ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య జరగాల్సి ఉంది. అయితే పాక్‌తో మ్యాచ్‌ను భారత ప్లేయర్లు బాయ్‌కాట్‌ చేసిన నేపథ్యం, ప్రజల మనోభావాలు దెబ్బ తిన్న నేపథయంలో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే పాయింట్ల విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.పాకిస్థాన్‌తో ఎలాంటి క్రికెట్‌ ఆడకూడదని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పహల్గాం దాడి తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పుడు డబ్ల్యూసీఎల్‌లో ఇరు జట్లూ తలపడనున్న నేపథ్యంలో చాలా విమర్శలు వచ్చాయి. ఇంకోవైపు.. పాక్‌తో మ్యాచ్‌ ఆడేందుకు మాజీ క్రికెటర్లకు ఎవరు అనుమతి ఇచ్చారంటూ? ప్రశ్నలు తలెత్తాయి. Dear all , pic.twitter.com/ViIlA3ZrLl— World Championship Of Legends (@WclLeague) July 19, 2025ఈ నేఫథ్యంలో.. భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్, మాజీ ఆల్‌రౌండర్‌ సురేష్ రైనా, మాజీ ఆల్‌రౌండర్లు ఇర్ఫాన్‌, యూసుఫ్ పఠాన్‌లు డబ్ల్యూసీఎల్ 2025లో పాకిస్తాన్ మ్యాచ్ నుంచి తప్పుకున్నారు. పహల్గామ్ దాడి, ఆ తరువాత జరిగిన పరిణామాలు వారి నిర్ణయంకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు.. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌పై సోషల్ మీడియాలోనూ తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ నుంచి తప్పుకున్నారని స్పష్టమైంది.ఈ మ్యాచ్‌లో తాను ఆడేది లేదని.. సదరు విషయాన్ని డబ్ల్యూసీఎల్ ఆర్గనైజర్లకు ఇప్పటికే చెప్పినట్లు శిఖర్ ధావన్‌ వెల్లడించాడు. మే 11నే లీగ్‌ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లినట్లు మెయిల్‌ స్క్రీన్‌షాట్‌లను ధావన్‌ పంచుకున్నాడు. ‘‘ఈ లీగ్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడకూడదని మే 11నే నిర్ణయం తీసుకున్నా. ఇప్పటికీ అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. నాకు నా దేశమే ముఖ్యం. దేశం కంటే ఏదీ ఎక్కువ కాదు. జై హింద్‌’’ అని మెయిల్‌ స్క్రీన్‌షాట్‌ను ధావన్‌ పోస్టు చేశాడు.ఇంకోవైపు.. పాక్‌ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిదీ భారత్‌పై, భారత ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయగా దుమారం రేగింది. ఈ పరిణామాల నేపథ్యంలో అఫ్రిదీపై డబ్ల్యూసీఎల్‌ నిర్వాహకులు వేటు వేసినట్లు తెలుస్తోంది. డబ్ల్యూసీఎల్‌ పోస్టర్‌ నుంచి అఫ్రిదీ ఫొటోను నిర్వాహకులు తొలగించారు. మిగతా మ్యాచ్‌లకూ అతన్ని దూరం పెట్టే యోచనలో నిర్వాహకులు ఉన్నట్లు సమాచారం.

YS Jagan Mohan Reddy reacted on Gali Bhanu Prakash comments10
మహిళల్ని అసభ్యంగా దూషించటం టీడీపీకి ఆనవాయితీ: వైఎస్‌ జగన్‌

సాక్షి,అమరావతి: మహిళలను అసభ్యకర పదజాలంతో దూషించటం టీడీపీకి ఆనవాయితీ అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. ‘మాజీమంత్రి ఆర్‌కే రోజా సెల్వమణిపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయం. తెలుగుదేశం పార్టీ లో దారుణంగా మారిన దుష్ట సంస్కృతికి ఆ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ గట్టిగా మాట్లాడుతున్నందుకు, వాటిని ప్రశ్నిస్తున్నందుకు ఓర్చుకోలేక, నా సోదరి, రెండుసార్లు ఎమ్మెల్యేగాను, మంత్రిగాను పనిచేసిన ఆర్‌కే రోజాను అత్యంత అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. తమను విమర్శించే మహిళల గొంతు నొక్కడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ లో ఒక తంతుగా మారిన అత్యంత హేయమైన సంస్కృతికి ఇది ఒక నిదర్శనం’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆ పోస్టులో ఆయన ఏమన్నారంటే..మహిళలకు ఏ మాత్రం రక్షణ లేదు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకుండాపోయింది. వారికి కనీస గౌరవ, మర్యాదలు దక్కడం లేదు. వారికి ఏ విధంగానూ న్యాయం జరగడం లేదు. ఇకనైనా మాజీ మంత్రి ఆర్‌కే రోజాను దారుణంగా అవమానించిన ఎమ్మెల్యే భానుప్రకాష్‌ను తక్షణమే అరెస్టు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.. అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. నోరు మూయించడానికే నిస్సిగ్గుగా వ్యాఖ్యలు ‘వ్యక్తిత్వ హననం ద్వారానే చంద్రబాబు తన రాజకీయ జీవితం కొనసాగిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఒక మహిళపై అత్యంత హేయంగా ఆరోపణలు చేసి, దు్రష్పచారం చేసే ఆయన ఉన్నత పదవి పొందారు. అప్పటినుంచే వ్యక్తిగత దాడులు, స్త్రీలను ద్వేషించే తత్వం తెలుగుదేశం పార్టీ కి ఒక బ్రాండ్‌గా మారింది. ధైర్యంగా మాట్లాడే మహిళలను భయపెట్టి వారి నోరు మూయించడానికే నిస్సిగ్గుగా అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు విమర్శించడాన్ని ఆ పార్టీ నాయకులు ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు’ అని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా మారింది ఆ కోవలోనే ఏడాది కాలంగా అనేకమంది మహిళా నాయ­కులను వారు దారుణంగా వేధించారు, అవమానించారు. తనపై ఒక ఎమ్మెల్యే చేసిన అత్యంత హేయమైన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయడానికి ఆర్‌కే రోజా వెళ్లగా, వాస్తవాలు స్పష్టంగా కళ్లెదుటే కనిపిస్తున్నా పోలీసులు తిరిగి ఆమెపైనే సందేహాలు వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా మారింది?, టీడీపీ గూండాలను రక్షించేందుకు వారు ఏ స్థాయిలో తమ బాధ్యత, కర్తవ్యాన్ని మరిచి వ్యవహరిస్తున్నారన్నది చూపుతున్నాయి. నిజానికి ఒక్క రోజా విషయంలోనే కాదు. మాజీ మంత్రి విడదల రజిని, కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారికతోపాటు మా పార్టీ కి చెందిన పలువురు నాయకుల కుటుంబ సభ్యుల విషయంలో కూడా చాలా అవమానకర ఘటనలు చోటుచేసుకున్నాయి.. అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement