ప్రధాన వార్తలు

పరాకాష్టకు బాబు భేతాళ కుట్ర
చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ భేతాళ కుట్రలు పరాకాష్టకు చేరాయి. కక్షసాధింపు కుతంత్రాల్లో తాజా అంకానికి టీడీపీ కూటమి సర్కారు తెరతీసింది. వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్ష నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టుకు తెగబడింది. ఎన్నికల మ్యానిఫెస్టో అమలు చేయలేని తమ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాలకు మరింత పదునుపెట్టింది. అసలు మద్యం విధానం ముసుగులో దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ బాబు అన్నది బహిరంగ రహస్యం. 2014–19లో టీడీపీ హయాంలో సాగించిన మద్యం దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు ఆయనే. ఏకంగా రూ.25 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని సీఐడీ దర్యాప్తులో నిగ్గుతేలడం నిఖార్సైన నిజం. సీఐడీ ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేసిన ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్‌పై బయట ఉన్నారు. ఇక 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత రికార్డులను తిరగరాస్తూ మరింత భారీ దోపిడీకి తెగబడుతుండడం ప్రస్తుతం నడుస్తున్న కూటమి ప్రభుత్వ అవినీతి చరిత్రే.అలాంటి చంద్రబాబు.. వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా అమలుచేసిన మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేయడం కేవలం రెడ్‌బుక్ కుట్రేనన్నది సుస్పష్టం. వైఎస్సార్సీపీ హయాంలో జరగని కుంభకోణం జరిగినట్టుగా చూపించేందుకు టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో సిట్‌ను ఏర్పాటుచేయడం చంద్రబాబు మార్కు కుతంత్రం. ఇక దర్యాప్తు ముసుగులో సాక్షులు, ఇతరులను వెంటాడి వేధించి అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం టీడీపీ ప్రభుత్వ అధికారిక గూండాగిరీకీ తార్కాణం. ఆ భేతాళ కుట్రనే సిట్ ఈ కేసులో దాఖలు చేసిన ప్రాథమిక చార్జ్‌షీట్‌లో పేర్కొని న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. కేవలం ఏడాదిలోనే టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతుండడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు సాగిస్తున్న రాజకీయ భేతాళ కుట్ర ఇదిగో ఇలా ఉంది. సాక్షి, అమరావతి: బాబు స్క్రిప్టు... భేతాళ కుట్ర... అందుకుతగ్గట్టు అబద్ధపు వాంగ్మూలాలు...! చంద్రబాబు డైరెక్షన్లో సాగుతున్న భేతాళ కుట్ర కేసులో సిట్ దర్యాప్తు పేరిట బరితెగిస్తోంది. అక్రమ కేసులో లేని ఆధారాలను సృష్టించేందుకు వేధింపులనే అస్త్రంగా చేసుకుంది. సిట్ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో పేర్కొన్న వాంగ్మూలాలన్నీ కూడా బెదిరించి, వేధించి నమోదు చేసినవే కావడం గమనార్హం. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి అబద్ధపు వాంగ్మూలాన్నే సిట్ ఈ అక్రమ కేసుకు ప్రధాన ఆధారంగా చేసుకుంది. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు తొలుత అబద్ధపు వాంగ్మూలం నమోదుకు నిరాకరించిన ఆయన సిట్ బెదిరింపులకు వ్యతిరేకంగా మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. అయినా సరే ప్రభుత్వం వాసుదేవరెడ్డిని వెంటాడి వేధించింది. డెప్యుటేషన్ ముగిసినా రిలీవ్ చేయకుండా అడ్డుకుంది. కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేసింది. చివరికి సిట్ చెప్పినట్టుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వెంటనే వాసుదేవరెడ్డిని రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.⇒ ఇదే రీతిలో బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్యప్రసాద్, అనూషలను వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించింది. ⇒ చంద్రబాబు కుట్రలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా భాగస్వామి అయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా మరో మూడున్నరేళ్లు సమయం ఉన్నా సరే పదవికి రాజీనామా చేసి.. టీడీపీ కూటమికి రాజ్యసభలో ఎంపీ సీటు దక్కేలా చేశారు. అనంతరం చంద్రబాబు చెప్పమన్నట్టుగా.. సిట్ విచారణకు హాజరై అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం.⇒ ఈ అక్రమ కేసులో అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చేందుకు అంగీకరించని వారిపైన సిట్ తన ప్రతాపం చూపించింది. కొన్ని డిస్టిలరీల ప్రతినిధులు వృద్ధులు అని కూడా చూడకుండా విచారణ పేరుతో హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొచ్చి వేధించింది. దాంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో... హైదరాబాద్‌లోని వారి నివాసంలోనే విచారించాలని కోర్టు ఆదేశించింది. కేసుతో ఏమాత్రం సంబంధం లేని రాజ్ కేసిరెడ్డి తండ్రిని బలవంతంగా తీసుకొచ్చి విచారణ పేరుతో వేధించింది. మరో నిందితుడి తండ్రి, రిటైర్డ్ కానిస్టేబుల్‌ను అక్రమంగా నిర్బంధించి మరీ వేధించడంతో ఆ కుటుంబం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.⇒ ఈ కేసులో అరెస్టయిన రాజ్ కేసిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి విచారణలో చెప్పని విషయాలు చెప్పినట్టుగా రిమాండ్ నివేదికలో పేర్కొనడం సిట్ కుట్రను బట్టబయలు చేసింది. ⇒ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా పనిచేసిన గిరి, మదన్‌రెడ్డిలను అక్రమంగా నిర్బంధించి అబద్ధపు వాంగ్మూలం కోసం తీవ్రంగా వేధించారు. బెంబేలెత్తిన గిరి సిట్ అధికారులు చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. అందుకు సమ్మతించని మదన్‌రెడ్డిపై సిట్ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం విభ్రాంతికర విషయం. సిట్ అధికారులు తనపై భౌతికంగా దాడి చేశారని మదన్‌రెడ్డి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు కూడా. ఇక అబద్ధపు వాంగ్మూలం ఇస్తే నామినేటెడ్ పదవితో పాటు రూ.2కోట్లు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు సిట్ అధికారుల ద్వారా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్నేహితుడు వెంకటేశ్నాయుడు దంపతులను ప్రలోభపెట్టారు. వారు తిరస్కరించడంతో అక్రమ కేసులో వెంకటేశ్‌నాయుడును అరెస్టు చేశారు. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో ఏమాత్రం సంబంధం లేని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిలను కూడా సిట్ అక్రమంగా అరెస్టు చేసింది. ⇒ అసలు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతో కూడా సంబంధం లేని ప్రపంచ దిగ్గజ సిమెంట్ కంపెనీ వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను అక్రమంగా అరెస్టు చేయడం సిట్ కుట్రకు పరాకాష్ట.విజయవాడ సిట్ కార్యాలయానికి వెళుతున్న పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రమే..దర్యాప్తు పేరిట సిట్ ఎందుకు ఇంతగా నిబంధనలకు విరుద్ధంగా బరితెగిస్తోంది...!? అంటే వినిపించే ఏకైక సమాధానం.. అసలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అక్రమాలు జరగనే లేదు. ఎలాంటి అవినీతి లేదు కాబట్టే లేని ఆధారాలు సృష్టించేందుకు సిట్ ఇంతగా దిగజారుతోంది. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టింది. దుకాణాల వేళలను కుదించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను దశలవారీగా 2,934కు తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్లుగా లైసైన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన 43 వేల బెల్ట్ దుకాణాలను తొలగించింది. రాష్ట్రంలోని 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు జారీ చేసింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందు ప్రభుత్వాలు లైసెన్సులు మంజూరు చేశాయి. మొత్తం డిస్టిలరీలను బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లకు ఎంప్యానల్ చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సులు మంజూరు చేయలేదు. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి.⇒ మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలకు లాభాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ఇస్తాయి. కానీ, వైఎస్సార్సీపీ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. మరి కమీషన్లు ఎందుకు ఇస్తాయి...? ఇవ్వనే ఇవ్వవు. ఎలాంటి అవినీతి లేని వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో సిట్ ఆధారాలు సేకరించలేకపోతోంది. అందుకే అప్పటి అధికారులు, ఇతర సాక్షులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయడమే పనిగా పెట్టుకుంది. వాటి ఆధారంగా కేసును కొనసాగించడమే సిట్ ఏకైక విధానంగా మారింది. ఆ కుట్రనే చార్జ్‌షీట్ రూపంలో కూడా కొనసాగించింది.మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్శనివారం ఎంపీ మిథున్‌రెడ్డి స్వచ్ఛందంగా సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ అక్రమ కేసులో గతంలో ఓసారి ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి వచి్చన మిథున్‌రెడ్డి నేరుగా సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 వరకు సిట్ అధికారులు ఆయనను విచారించారు. అనంతరం మిథున్‌ను అరెస్ట్ చేసి విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు. మిథున్‌రెడ్డిని ఆదివారం ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తి నివాసంలో హాజరుపరుస్తారని తెలుస్తోంది. ⇒ సిట్ అధికారుల విచారణలో...వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగలేది ఎంపీ మిథున్‌రెడ్డి సాధికారికంగా తేల్చిచెప్పారు. ఎంపీ అయిన తనకు రాష్ట్ర ప్రభుత్వ విధానాలలో ఏమాత్రం ప్రమేయం ఉండదని కుండబద్ధలు కొట్టారు. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై సిట్ అధికారులు మిథున్‌ను పలు ప్రశ్నలు వేశారు. అయితే ఆయనపై అభియోగాలకు సంబంధించి సిట్ అధికారులు సరైన ఆధారాలను చూపించలేకపోయారు. ఈ కేసులో సిట్ బెదిరించి, వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే ఎంపీ మిథున్‌రెడ్డిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఆ అవాస్తవ ఆరోపణలను మిథున్ సమర్థంగా తిప్పికొట్టారు. ⇒ సిట్ అరెస్టు చేసిన రాజ్ కేసిరెడ్డితో తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. అయినా సరే, ప్రభుత్వ పెద్దల కుట్రనే సిట్ అధికారులు ఏకపక్షంగా అమలు చేశారు. అవాస్తవాల పుట్ట.. రెడ్‌బుక్ కుట్ర సిట్ చార్జ్షీట్చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రకు సిట్ చార్జ్‌షీట్ అద్దంపట్టింది. పూర్తిగా అవాస్తవాలు, అభూత కల్పనలతో దీన్ని రూపొందించింది. ప్రాథమిక చార్జ్‌షీట్‌ను సిట్ అధికారులు ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తికి శనివారం సమర్పించారు. గతంలో తాము బెదిరించి వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలు, సృష్టించిన తప్పుడు సాక్ష్యాల వివరాలను చార్జిషీట్లో పునరుద్ఘాటించారు. తద్వారా రాజకీయ కక్షసాధింపే తమ లక్ష్యమని పరోక్షంగా అంగీకరించారు. నెలల తరబడి దర్యాప్తు పేరుతో చేసిన హడావుడి అంతా కనికట్టేనని... టీడీపీ ప్రధాన కార్యాలయం ఇచ్చిన స్క్రిప్ట్‌నే దర్యాప్తు నివేదిక పేరుతో సమర్పించామని చేతల్లో చూపించింది. ఈ అక్రమ కేసులో అదనంగా 8 మంది.. సైమన్ ప్రసన్, కొమ్మారెడ్డి అవినాశ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, సుజన్ బెహ్రాన్, మోహన్, రాజీవ్‌ప్రతాప్, బొల్లారం శివకుమార్, ముప్పిడి అవినాశ్‌రెడ్డిలను నిందితులుగా పేర్కొంది. దాంతో నిందితుల సంఖ్య 41కు చేరింది. జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న 11 మంది రిమాండ్, ఫోరెన్సిక్ నివేదికలు, జప్తు చేసిన స్థిరాస్తులు, స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల జాబితా, ఇతర వివరాలను పొందుపరచినట్టు తెలుస్తోంది. ఈ అక్రమ కేసులో త్వరలో అనుబంధ చార్జ్షీట్లను దాఖలు చేయాలని సిట్ భావిస్తోంది. కోర్టు కంటే ముందే ఎల్లో మీడియాకు చార్జ్షీట్రెడ్బుక్ కుట్రల కోసం చంద్రబాబు ప్రభుత్వం, సిట్ అధికారులు ఏకంగా న్యాయ వ్యవస్థకే అగౌరవం కలిగిస్తుండడం విస్మయపరుస్తోంది. న్యాయస్థానం కంటే ముందుగా అక్రమ కేసులో చార్జ్‌షీట్ వివరాలను ఈనాడు–ఈటీవీ, ఆంధ్రజ్యోతి–ఏబీఎన్, టీవీ5, మహాన్యూస్ చానళ్లకు సిట్ అధికారులు తెలియజేయడమే దీనికి నిదర్శనం. అక్రమ కేసులో ప్రాథమిక చార్జ్‌షీట్‌ను సిట్ అధికారులు న్యాయస్థానంలో శనివారం రాత్రి సమర్పించారు. శనివారం ఉదయం మార్కెట్లోకి వచ్చిన ఈనాడు పత్రికలో ఆ చార్జ్‌షీట్ వివరాలు ప్రచురితం కావడం గమనార్హం. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కోర్టులో సమర్పించే వరకు చార్జ్‌షీట్‌లో ఉన్న వివరాలు ఎవరికీ తెలియకూడదు. ఆ చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు న్యాయస్థానం ప్రకటించాలి. అనంతరం కోర్టు ద్వారానే చార్జ్‌షీట్ కాపీని ఈ కేసుతో సంబంధం ఉన్నవారు తీసుకోవాలి. ఈ నిబంధనలను చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కోర్టు కంటే ముందుగానే ఈనాడు, ఇతర ఎల్లో మీడియాకు చార్జ్‌షీట్ వివరాలను వెల్లడించింది. ఎంత పక్కాగా అంటే చార్జ్‌షీట్ ఎన్నిపేజీలు ఉన్నాయి...? అందులోని వివరాలన్నీ యథాతథంగా ఎల్లో మీడియా ముందే ప్రచురించింది. టీడీపీ అనుకూల ఎల్లో మీడియా టీవీ చానళ్లు చార్జ్‌షీట్‌లోని వివరాలను శనివారం ఉదయం నుంచే ప్రసారం చేశాయి. అంటే.. చంద్రబాబు ప్రభుత్వం న్యాయవ్యవస్థ కంటే ఎల్లో మీడియాకే పెద్దపీట వేస్తోందనన్నది మరోసారి స్పష్టమైంది.మద్యం డాన్ చంద్రబాబేవైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు వెనుక పక్కా పన్నాగం దాగుంది. ఎందుకంటే గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో తెగించి పాల్పడిన మద్యం దోపిడీని కప్పిపుచ్చే కుతంత్రం ఉంది. అసలు రాష్ట్రంలో మద్యం దందాకు ఆద్యుడు చంద్రబాబే అన్నది బహిరంగ రహస్యం. మద్యం మాఫియాను పెంచి పోషించిన వ్యవస్థీకృత దందాను స్థిర పరచింది ఆయనే. 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండి కొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అస్మదీయుల కంపెనీలకు అడ్డగోలు లబ్ధి కలిగించారు. అందుకోసం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ రెండు చీకటి జీవోలతో కుంభకోణానికి పాల్పడ్డారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల చొప్పున 2015 నుంచి 2019 వరకు రూ.5,200 కోట్లు గండికొట్టారు. ఈ విషయాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’(కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాలను స్పష్టంగా నివేదించారు కూడా. ఇక టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలో 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు.. వాటికి అనుబంధంగా 4,380 పర్మిట్ రూమ్‌లు.. 43 వేల బెల్ట్ దుకాణాలతో మద్యం ఏరులై పారించారు. ఎంఆర్పీ కంటే 20 శాతం అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగించి, ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు కొల్లగొట్టారు. వెరసి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా రూ.25 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతో సహా బయట పడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ కమిషనర్‌గా వ్యవహరించిన ఐఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పుటి సీఎం చంద్రబాబు, తదితరులపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు అప్పటి నుంచి ముందస్తు బెయిల్‌పైనే ఉన్నారు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మద్యం విధానం ముసుగులో మహా దోపిడీకి మరోసారి తెగబడ్డారు. 3,396 ప్రైవేటు మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్‌కు ఏకపక్షంగా కట్టబెట్టడంతోపాటు ఏకంగా 75 వేల బెల్ట్ దుకాణాలతో భారీ దోపిడీకి బరితెగించారు. టీడీపీ ప్రభుత్వంలో గతంలో చేసిన దోపిడీ.. ప్రస్తుతం బరితెగించి సాగిస్తున్న దోపిడీ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే సిట్ ద్వారా మద్యం అక్రమ కేసు కుట్రకు తెగబడ్డారు. ‘ప్రివిలేజ్’గా ఖజానాకు గండి కొట్టారుమద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజు ప్రభుత్వానికి ఆదాయ వనరు. ఆ ఫీజును గుట్టుచప్పుడు కాకుండా రద్దు చేస్తే ఖజానాకు గండి పడుతుంది. సీఎం హోదాలో నోట్ ఫైళ్లపై సంతకాల సాక్షిగా ఆ నిర్వాకం చంద్రబాబుదే. మంత్రివర్గాన్ని బురిడీ కొట్టిస్తూ 2015లో రెండు చీకటి జీవోలతో ప్రివిలేజ్ పన్నును రద్దు చేశారు చంద్రబాబు. తద్వారా టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలోని మద్యం దుకాణాలు, బార్ల యజమానులకు అడ్డగోలుగా ప్రయోజనం కలిగించారు. ఇలా నాలుగేళ్లలోనే రూ.5 వేల కోట్లు కొల్లగొట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇలాంటి ఒక్క చీకటి జీవోను కూడా జారీ చేయనేలేదు.తమవారికి దోచిపెట్టారు2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం నాలుగు డిస్టిలరీల నుంచే ఏకంగా 53.21 శాతం మద్యం కొన్నారు. సి–టెల్ అనే సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టి మరీ దందా సాగించారు. ఆ విషయాన్ని ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం నియమించిన సిట్ నివేదికే వెల్లడించింది కూడా. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం కేవలం కొన్ని డిస్టిలరీలకే ప్రయోజనం కలిగించలేదు. లోపభూ యిష్టమైన సి–టెల్‌సాఫ్ట్‌వేర్‌ను తొలగించింది. సగటున ప్రతి డిస్టిలరీకీ 5 శాతం నుంచి 10% ఆర్డర్లు వచ్చేలా పారదర్శకంగా వ్యవహరించింది.పేజీల సంఖ్యతో సహా చార్జ్‌షీట్‌లో ఏముందో ముందే ప్రచురించిన ‘ఈనాడు’ ఊరూపేరు లేని 200 బ్రాండ్లను ప్రవేశపెట్టారు మద్యం కుంభకోణంలో వినిపిస్తున్న మరో మాట ఊరూపేరూ లేని బ్రాండ్లు. అసలు ఇలాంటి బ్రాండ్లను ప్రవేశపెట్టడమే దోపిడీకి కారణమైతే ఆ అవినీతి పాపం కచ్చితంగా చంద్రబాబుదే. ఎందుకంటే 2014–19 మధ్యన రాష్ట్రంలో ఎన్నడూ వినిపించని దాదాపు 200 బ్రాండ్లను తెచ్చారు చంద్రబాబు. అందులో కొన్నిటి పేర్లు... ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్, పవర్ స్టార్, లెజెండ్, లెఫైర్ నెపోలిన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ, హైవోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జీ 10000, బ్రిటీష్ అంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా, రాయల్ ప్యాలస్, న్యూ కింగ్, సైన్ అవుట్, బీరా 91, టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అసలు మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు జరగనే లేదు. కొత్త డిస్టిలరీలకు అనుమతి ఇవ్వలేదు. ప్రైవేటు మద్యం దుకాణాలను తొలగించారు. పర్మిట్ రూమ్‌లను రద్దు చేశారు. బెల్ట్ దుకాణాలు తొలగించారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి దుకాణాల సంఖ్యను తగ్గించారు. ఇలా అవినీతికి కారణమయ్యే అన్ని మూలాలను సమూలంగా రూపుమాపారు. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం అక్రమ కేసు నమోదు చేయడం కేవలం రెడ్‌బుక్ కుట్రే .అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే..⇒ మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? ⇒ విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్‌లు, బెల్టు షాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? ⇒ 2014-19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా?⇒ మద్యంపై తక్కువ ట్యాక్స్‌ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్‌లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? ⇒ ఎంపిక చేసుకున్న 4ృ5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? ⇒ ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? వైఎస్సార్సీపీ హయాంలో.. ⇒ 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది. ⇒ లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది. ⇒ 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది. ⇒ మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. ⇒ మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్‌కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది. ⇒ మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి.

రోజాపై భానుప్రకాష్ వ్యాఖ్యలు అత్యంత హేయం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే భాను ప్రకాష్ వ్యాఖ్యల పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే భానుప్రకాష్‌ని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రోజాకు సంఘీభావం తెలుపుతూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణిపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయం. టీడీపీలో దారుణంగా మారిన దుష్ట సంస్కృతికి ఆ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతూ గట్టిగా మాట్లాడుతున్నందుకు, వాటిని ప్రశ్నిస్తున్నందుకూ ఓర్చుకోలేక, నా సోదరి రెండుసార్లు ఎమ్మెల్యేగానూ, మంత్రిగానూ పని చేసిన ఆర్కే రోజాను అత్యంత అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. తమను విమర్శించే మహిళల గొంతు నొక్కడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీలో ఒక తంతుగా మారిన అత్యంత హేయమైన సంస్కృతికి ఇది ఒక నిదర్శనం. వ్యక్తిత్వ హననం ద్వారానే చంద్రబాబు తన రాజకీయ జీవితం కొనసాగిస్తున్నారు....నిజం చెప్పాలంటే ఒక మహిళపై అత్యంత హేయంగా ఆరోపణలు చేసి, దుష్ప్రచారం చేసే ఆయన ఉన్నత పదవి పొందారు. అప్పటి నుంచే వ్యక్తిగత దాడులు, స్త్రీలను ద్వేషించే తత్వం తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్‌గా మారింది. ధైర్యంగా మాట్లాడే మహిళలను భయపెట్టి వారి నోరు మూయించడానికి నిస్సిగ్గుగా అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు, విమర్శించడాన్ని ఆ పార్టీ నాయకులు ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఆ కోవలోనే గత ఏడాది కాలంగా అనేక మంది మహిళా నాయకురాళ్లను వారు దారుణంగా వేధించారు.. అవమానించారు’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు.తనపై ఒక ఎమ్మెల్యే చేసిన అత్యంత హేయమైన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయడానికి ఆర్కే రోజా వెళ్లగా, వాస్తవాలు స్పష్టంగా కళ్లెదుటే కనిపిస్తున్నా పోలీసులు తిరిగి ఆమెపైనే సందేహాలు వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా మారింది? టీడీపీ గుండాలను రక్షించేందుకు వారు ఏ స్థాయిలో తమ బాధ్యత, కర్తవ్యాన్ని మర్చి వ్యవహరిస్తున్నారన్నది చూపుతున్నాయి.నిజానికి ఒక్క రోజా విషయంలోనే కాదు.. మాజీ మంత్రి విడదల రజని, కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారికతో పాటు, మా పార్టీకి చెందిన పలువురు నాయకుల కుటుంబ సభ్యుల విషయంలో కూడా చాలా అవమానకర ఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయింది. వారికి కనీస గౌరవ, మర్యాదలు దక్కడం లేదు. వారికి ఏ విధంగానూ న్యాయం జరగడం లేదు. ఇకనైనా మాజీ మంత్రి ఆర్కే రోజాను దారుణంగా అవమానించిన ఎమ్మెల్యే భానుప్రకాష్‌ను తక్షణమే అరెస్టు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.The shocking verbal abuse hurled by TDP MLA Gali Bhanu Prakash against @RojaSelvamaniRK is yet another example of the deeply rotten culture within the TDP. Roja, my sister, a two-time MLA and former minister, was subjected to filthy, degrading, and offensive language simply for…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 19, 2025

ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం...ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ మీది ఫలితం వేరొకదిగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. గృహ నిర్మాణయత్నాలలో అవాంతరాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు, పనిభారం పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. శివపంచాక్షరి పఠించండి.వృషభం....కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. కోర్టు కేసులు పరిష్కారదశకు చేరతాయి. వాహనయోగం. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. కళారంగం వారికి సత్కారాలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. కనకధారాస్తోత్రాలు పఠించండి.మిథునం...ఆర్థికంగా ఇబ్బంది పడతారు. సోదరులు, సోదరీలతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. భూవివాదాలు నెలకొంటాయి. ప్రముఖులతో చర్చలు ఫలించవు. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఉద్యోగయత్నాలు నిదానంగా సాగుతాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. రాజకీయవర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. వారం మధ్యలో ధన, వస్తులాభాలు. నూతన పరిచయాలు. నేరేడు, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.కర్కాటకం...అనుకున్న వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం. బంధువుల నుంచి శుభవార్తలు. భూములు, వాహనాలు కొంటారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగుల యత్నాలు కొంతమేరకు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.సింహం...కొత్త వ్యక్తులు పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆప్తులు మీ అభివృద్ధిలో కీలకం కాగలరు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. సోదరులతో విభేదాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి నూతన అవకాశాలు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. పసుపు, గులాబీ రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.కన్య...నూతన ఉద్యోగప్రాప్తి. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. కొన్ని వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో వివాదాలు. అనుకోని ఖర్చులు. నీలం, నేరేడు రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.తుల...ఆర్థిక వ్యవహారాలు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగయత్నాలు నిదానంగా సాగుతాయి. సోదరులు, సోదరీలతో అకారణంగా విభేదాలు. కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆరోగ్యం చికాకు పరుస్తుంది. వ్యాపార లావాదేవీలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి ఒత్తిడులు తప్పవు. వారం చివరిలో అప్రయత్న కార్యసిద్ధి. ఆకస్మిక ధనలబ్ధి. గులాబీ, తెలుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.వృశ్చికం....అనుకోని ఖర్చులు ఎదురై అప్పులు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులతో తగాదాలు. ముఖ్యమైన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. కాంట్రాక్టర్లకు నిరాశాజనకంగా ఉంటుంది. అనారోగ్య సూచనలు. ఇంటి నిర్మాణాలలో అవరోధాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. రాజకీయవర్గాలకు గందరగోళ పరిస్థితులు. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. శివాష్టకం పఠించండి.ధనుస్సు...అనుకున్న విధంగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. ప్రముఖుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. కొత్త వ్యక్తులు పరిచయమై ఉత్సాహాన్నిస్తారు. సంఘంలో మరింత పేరు గడిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసమస్యలు. లేత ఆకుపచ్చ, నలుపు రంగులు. హనుమాన్ ఛాలీసా పఠించండి.మకరం...వీరికి అన్నింటా విజయాలే. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఒక కీలకమైన కేసు పరిష్కారమవుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని హోదాలు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు, సన్మానాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, లేత ఎరుపు ర ంగులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.కుంభం...అనుకున్న పనులు నత్తనడకన కొనసాగుతాయి. బంధువులతో విభేదాలు ఏర్పడవచ్చు. శ్రమ మరింతగా పెరుగుతుంది. ఆరోగ్య, కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పవు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో విందువినోదాలు. ఉద్యోగలాభం. నేరేడు, గులాబీ రంగులు. గణేశ్‌ను పూజించండి.మీనం...వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. మిత్రులతో కలహాలు. సేవాకార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. శ్రమకు తగిన ఫలితం రాక డీలా పడతారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు వద్దు. తీర్థయాత్రలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి యత్నాలలో అవాంతరాలు. వారం ప్రారంభంలో శుభవార్తలు. ప్రముఖులతో పరిచయాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

2026 నుంచి కాజీపేటలో చిక్‌బుక్ చిక్‌బుక్ రైలే
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్లో 2026 నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వచ్చే డిసెంబర్ కల్లా యూనిట్ సివిల్ నిర్మాణ పనులు పూర్తవుతాయని చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ యూనిట్ నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. కాజీపేట యూనిట్లో రైల్వే ఇంజిన్లతోపాటు కోచ్‌లు, మెట్రో రైళ్ల తయారీ, డిజైన్ పనులు కూడా చేపడతామని వెల్లడించారు. ఈ యూనిట్ ఒక మెగా ఫ్యాక్టరీగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. శనివారం హను మకొండ జిల్లా అయోధ్యపురంలోని కాజీపేట రైల్వే కోచ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లో జరుగుతున్న పనులను కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, బీజేపీఎల్పీ నేత ఎ.మహేశ్వర్‌రెడ్డితో కలిసి అశ్వినీ వైష్ణవ్ పరిశీలించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో కాజీ పేట రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆయన.. ఫ్యాక్టరీలో జరుగుతున్న పనుల గురించి రైల్వే అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనుల పురోగతిని వివరించారు. అనంతరం ఫ్యాక్టరీ ఆవరణలోనే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు. ఎన్నో ఏళ్లపాటు కలగానే మిగిలిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సాకారం చేశారని అన్నారు. రూ.500 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమలో బహుళ రకాల రైల్వే మాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ ప్రాజెక్టు పురోగతిపై చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. మోదీ మాట తప్పరు అనేందుకు ఇదే నిదర్శనం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన మాట తప్పరు అనేందుకు కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీనే ఉదాహరణ అని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఈ ఫ్యాక్టరీ కోసం సుమారు 40 ఏళ్లుగా వరంగల్ జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో కూడా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత కాజీపేటలో రైల్వే ఇంజన్లు, కోచ్‌లు, వ్యాగన్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారని.. ఆయనే స్వయంగా వచ్చి భూమి పూజ చేశారని గుర్తుచేశారు. తెలంగాణలో మొత్తం 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరుగుతోందని, వరంగల్ రైల్వేస్టేషన్ అభివృద్ధి కూడా అందులో భాగమేనని వెల్లడించారు. ఈ యూనిట్ ద్వారా సుమారు 3 వేల మందికి ప్రత్యక్షంగా, వేల మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి లభిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు, ఆర్ఆర్ పాలసీ ప్రకారం స్థానికులకు ఫ్యాక్టరీలో ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తే త్వరలోనే వరంగల్‌కు ఎయిర్‌పోర్టు వరంగల్‌లో ఎయిర్పోర్ట్ అవసరం ఎంతో ఉందని.. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని సేకరించి పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు అప్పగిస్తే వరంగల్ ప్రజలకు విమాన రాకపోకల సౌకర్యం కలుగుతుందని కిషన్‌రెడ్డి తెలిపారు. భూమి కోసం గత సీఎం కేసీఆర్‌కు అనేకసార్లు లిఖితపూర్వకంగా విన్నవించానని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే విషయంపై విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ‘ప్రధాని మోదీ తెలంగాణకు ఏం ఇచ్చారు? బీజేపీ ఏం తెచ్చింది? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అలాంటివారు తమ కళ్లు తెరిచి చూడాలి. చెవులుంటే వినాలి. మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా చూడాలి’అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, మార్తినేని ధర్మారావు, మాజీ ఎంపీ ఆజ్మీరా సీతారాం నాయక్, బీజేపీ వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ తదితరులు పాల్గొన్నారు.

పైలట్ ‘మాస్ మర్డర్-సూసైడ్’
టేకాఫ్ చేసిన కొద్ది సెకండ్లలో ఎయిరిండియా బోయింగ్ 787 విమానంలోని ఇంధన నియంత్రణ మీటల్ని కెప్టెన్ (సీనియర్ పైలట్) సుమీత్ సబర్వాల్ ఎందుకు ఆపేశాడు? ఒక్క సెకను తేడాతో రెండు స్విచ్చులు ఆఫ్ అయ్యాయి. ఫలితంగా విమానం ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. పైలట్స్ తేరుకుని మీటల్ని లాగి ఇంధన సరఫరాను పునరిద్ధరించేందుకు యత్నించినా అప్పటికే సమయం మించిపోయింది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంధనం అందక, చోదక శక్తి క్షీణించి విమానం కుప్పకూలింది. గత నెల 12న అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే సంభవించిన ఈ దుర్ఘటనలో ఒకే ఒక్క ప్రయాణికుడు మినహా మిగతా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. ఈ 241 చావుల్లో ఒకదాన్ని (కెప్టెన్/సీనియర్ పైలట్) ఆత్మహత్యగా, మిగతా 240 మరణాలను హత్యలుగా (మాస్ మర్డర్-సూసైడ్) భావించాలా? వీరే కాకుండా విమానం కూలిపోయాక భూమిపై ఉన్న మరో 19 మంది చనిపోయారు. మొత్తం మరణాలు దాదాపు 260. ఇంతకూ ఇది పైలట్ ఉద్దేశపూర్వకంగా చేసిన దుష్కృత్యమా? పరధ్యానమా? లేక ప్రమాదమా? విద్రోహ చర్యా? ఏమో... ఇంకా తెలియరాలేదు. కారణాల వెలికితీత కోసం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారం పైలట్ల మానసిక ఆరోగ్యంపైనా చర్చను లేవదీస్తోంది.పైలట్లే కూల్చేశారు!విమాన దుర్ఘటనల్లో పైలట్ ‘హత్యాత్మహత్యల’ ఉదంతాలు అరుదు అయినప్పటికీ చరిత్రలో అవి కూడా లేకపోలేదు. 2015లో ‘జర్మన్ వింగ్స్’ కో-పైలట్ ఆండ్రియాస్ లుబిడ్జ్ తన కెప్టెన్ (సీనియర్ పైలట్)ను కాక్‌పిట్ వెలుపల బంధించి ఎ320 ఎయిర్ బస్ విమానంతో నేరుగా ఫ్రెంచ్ ఆల్ప్స్ పర్వతాలను ఢీకొట్టాడు. దాంతో విమానంలోని మొత్తం 150 మందీ చనిపోయారు. ఇక 1997లో ‘సిల్క్ ఎయిర్’ ఫ్లైట్ 185, 1999లో ‘ఈజిప్ట్ ఎయిర్’ ఫ్లైట్ 990 విమాన ప్రమాదాలకు పైలట్ల ఉద్దేశపూర్వక చర్యలే కారణమని అమెరికా ఇన్వెస్టిగేటర్లు నిర్ధారించారు. ఈ రెండు ఘటనల్లో 321 మంది చనిపోయారు. అయితే ఆ రెండు దుర్ఘటనలకు దారితీసిన కారణాలపై అమెరికన్ ఇన్వెస్టిగేటర్లు కనుగొన్న అంశాలతో ఇండోనేషియా, ఈజిప్ట్ విభేదించండం వేరే సంగతి. ఇక ఇటీవల 2022లో చైనా ఈస్టర్న్ ఫ్లైట్ 5735 కూడా తాను ప్రయాణిస్తున్న ఎత్తు నుంచి వేగంగా కిందికి దిగిపోయి కూలిపోవడంతో 132 మంది మరణించారు. అది కూడా పైలట్ ఉద్దేశపూర్వక చర్యేనని లీకైన డేటా సూచిస్తోంది. హిందూమహాసముద్ర గగనతలంపై ప్రయాణిస్తూ 2014లో మలేషియా ఎయిర్‌లైన్స్ 370 విమానం అదృశ్యమైంది. అందుకు కారణాలు ఇప్పటివరకు తెలియలేదు. విమానం కెప్టెన్ జహారీ అహ్మద్ షా ‘హత్యాత్మహత్యల’ (ఉద్దేశపూర్వక) చర్య ఫలితంగానే ఈ దుర్ఘటన సంభవించిందన్న వాదనలు కొన్ని తెరపైకి వచ్చాయి. స్విస్ ‘బ్యూరో ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఆర్కైవ్’ సమాచారాన్ని విశ్లేషించి ‘న్యూస్ వీక్’ పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం... గత 30 ఏళ్లలో ఇలాంటి ఉద్దేశపూర్వక హత్యాత్మహత్యల వల్ల 1,034 మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యపరమైన విమానాల ప్రమాదాల్లో అదే గత 30 ఏళ్ల వ్యవధిలో చనిపోయిన వారి సంఖ్యతో పోలిస్తే... ఈ పైలట్ ‘మర్డర్-సూసైడ్’ మరణాల సంఖ్య 3.5 శాతంగా ఉన్నట్టు తేలింది. ఇలాంటి సంఘటనలు అరుదే అయినప్పటికీ విమానయాన భద్రతలో పైలట్ల మానసిక ఆరోగ్యానికి ఎంతటి ప్రముఖ పాత్ర ఉందో అవి తేటతెల్లం చేస్తున్నాయని ‘సెంటర్ ఫర్ ఏవియేషన్ సైకాలజీ’ క్లినికల్ సైకాలజిస్టు డాక్టర్ రాబర్ట్ బోర్ వ్యాఖ్యానించారు. మొత్తం విమాన ప్రమాదాల్లో ఈ ‘ఉద్దేశపూర్వక’ ఘటనల భాగం స్వల్పమే అయినప్పటికీ వాటిల్లే నష్టం మాత్రం అపారం. ఎందుకంటే వాటివల్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయి. విమానయానంపై ప్రజలు నమ్మకం కోల్పోతారు. పైలట్ల మానసిక ఆరోగ్యం పట్ల వైమానిక రంగ పర్యవేక్షణా లోపాల్ని అవి ఎండగడతాయి. పైలట్లు అత్యంత అప్రమత్తంగా మెలగాలని కోరుకుంటామని, అయితే వారు ఎదుర్కొంటున్న సమస్యలు సాంకేతికపరమైనవి మాత్రమే కాదని, అందులో వ్యక్తిగత, ఆర్థిక, సంబంధాలపరమైన అంశాలు కూడా ఉన్నాయని రాబర్ట్ బోర్ చెప్పారు. పైలట్లు ఎదుర్కొంటున్న ఇటువంటి ఒత్తిళ్లను పట్టించుకోకుండా, పరిష్కరించకుండా అలాగే ఉపేక్షిస్తే అవి ప్రమాదకరంగా మారతాయని అన్నారు. తాము మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు పైలట్స్ ఎవరైనా బయటికి చెబితే వారి కెరీర్ రిస్కులో పడుతుందని, పైలట్ లైసెన్స్ కోల్పోయే అవకాశముందని, ఆ భయంతో వారెవరూ ముందుకురారని వైమానిక నిపుణుడు, మాజీ పైలట్ డాన్ బబ్ చెప్పారు. పైలట్ ‘మర్డర్-సూసైడ్’ ఘటనల నివారణకు వీలుగా విమానం కాక్‌పిట్‌లో పైలట్లపై నిఘా కోసం వీడియో కెమెరాలు పెట్టాలని అమెరికాలోని జాతీయ రవాణా భద్రతా మండలి 2000 సంవత్సరంలో సూచించింది. తమ గోప్యతకు భంగం వాటిల్లుతుందని పైలట్లు అభ్యంతరం చెబుతుండటంతో కాక్‌పిట్‌లో వీడియో రికార్డింగుపై చర్చ నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇంజిన్లకు ఇంధనం సరఫరా ఎందుకు ఆపివేశావంటూ ఎయిరిండియా బోయింగ్ 787 విమానం సీనియర్ పైలట్ ను కో-పైలట్ అడిగినట్టు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) వెల్లడించడం చూస్తుంటే... పైలట్ల మానసిక ఆరోగ్యం విషయంలో వైమానిక పరిశ్రమ వ్యవహరిస్తున్న తీరుపై ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. - జమ్ముల శ్రీకాంత్

ఏదీ 'సునాయాసం' కాదు!
థాంక్యూ! హలో క్లాస్ ఆఫ్ 2024! నేనెంత ఉత్సాహంగా ఉన్నానో మీకెవరికీ తెలియదు. నేనొక కాలేజీ క్యాంపస్‌లో అడుగుపెట్టడం నా జీవితంలో ఇది రెండోసారి. కానీ, మీరు దేన్నో దృష్టిలో పెట్టుకుని నాకు డాక్టరేట్ డిగ్రీ ప్రదానం చేస్తున్నారు. నేనిక్కడ ప్రసంగించడానికి వచ్చాను. కానీ, ‘డాక్టర్ రోజర్’గా ఇంటికి తిరిగి వెళతాను. అది నాకు గొప్ప బోనస్ లాంటిది. ‘డాక్టర్ రోజర్’. ఇది నేను ఏమాత్రం ఊహించని విజయం! ఇది నాకు కొద్దిగా పరిచయం లేని వాతావరణం. ఇది నేను ఎప్పుడూ చూసే దృశ్యం కాదు... ఈ దుస్తులు కూడా నేను సాధారణంగా వేసుకునేవి కావు. ఈ పొడవాటి గౌను బరువుగా ఉంది. గత 35 ఏళ్ళుగా ఇంచుమించుగా ప్రతి రోజు నేను పొట్టి నిక్కర్లు, టీ షర్టులతోనే గడిపాను. నాలుగు పదాలే చెప్పగలిగాను!నేను ఇలాంటి ప్రసంగాలు చేసే వ్యక్తిని కూడా కాను. నేను స్విట్జర్లాండ్ జాతీయ జట్టులో చేరేనాటికి నాకు 17 ఏళ్ళు. అప్పట్లో నేను ఎంతగా కలవరపడ్డానంటే నాలుగు పదాలకు మించి మాట్లాడలేకపోయాను. ‘‘ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది’’ అన్నానంతే. ఇప్పుడు ఇక్కడ 25 ఏళ్ళ తర్వాత, నాకు ఇప్పటికీ కొద్ది కలవరంగానే ఉంది. కాకపోతే ఇపుడు మీకు చెప్ప డానికి నా దగ్గర నాలుగు మాటలకు మించి చాలా ఉన్నాయి. ఈ స్థాయికి వచ్చేందుకు మీరెంతో కష్టపడి ఉంటారు. మీరంతా సాధించిన దానిపట్ల నాకెంతో గౌరవం ఉంది. ఎందుకంటే, పూర్తి స్థాయి టెన్నిస్ ఆటగాడిగా మారేందుకు నేను 16వ ఏటనే స్కూలు చదువుకు స్వస్తి చెప్పేశాను. కనుక, నేను కాలేజీలో అడుగు పెట్టింది లేదు. కానీ, నేను ఇటీవలే టెన్నిస్‌లో గ్రాడ్యుయేట్‌నయ్యా. ‘రిటైర్’ అనే మాట ఉపయోగించాలని నాకు తెలుసు. ‘‘రోజర్ ఫెదరర్ టెన్నిస్ నుంచి రిటైర్ అయ్యాడు.’’ రిటైర్ అవడమా? ఆ మాట వినడానికే బాగా లేదు. కాలేజీ నుంచి రిటైర్ అవుతున్నామని మీరు చెప్పలేరు. ఔనా? మీలాగే నేను కూడా ఒక పెద్ద పని పూర్తి చేసి మరో దానికి మరలుతున్నా. మీలాగే నేను కూడా తదుపరి ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నా. మీ బాధ నాకు అర్థమవుతోంది. చదువు పూర్తయిందిగా, ఏం చేయబోతున్నావు? అని అందరూ అడ గడం మొదలెడతారు. ఆ మాటకొస్తే, ‘‘ఇంక ఇపుడు నువ్వు వృత్తిపరమైన టెన్నిస్ ఆటగాడివి కాదు కదా! ఏం చేయ బోతున్నావు?’’ అని నన్నూ అడుగుతారు. ఏం చేయాలో నాకూ తెలియదు. తెలియకపోవడమూ మంచిదే. మరి నేను కాలాన్ని ఎలా వెళ్ళబుచ్చుతా? తండ్రిగా పిల్లల్ని స్కూల్లో దింపి రావచ్చు. ఎవరో అపరిచితులతో ఆన్లైన్లో చదరంగం ఆడవచ్చు. వాక్యూమ్ క్లీనర్‌తో ఇంటిని శుభ్రం చేయ వచ్చు. వాస్తవానికి, టెన్నిస్ పట్టభద్రునిగా జీవితాన్ని నేను ఇష్టపడతున్నా. నేను 2022లో టెన్నిస్‌లో గ్రాడ్యుయేట్‌నయ్యా. మీరు 2024లో పట్టభద్రులవుతున్నారు. ఈ పరిణామ క్రమంలో నేను ఆకళింపు చేసుకున్న కొద్ది పాఠాలను మీతో పంచుకోవా లనుకుంటున్నా. వాటిని మనం టెన్నిస్ పాఠాలు అనుకోవచ్చు.స్నేహపూరిత ప్రత్యర్థులు: రఫేల్ నదాల్‌తో రోజర్ ఫెదరర్ టెన్నిస్ పాఠాలుమొదటిది. ‘సునాయాసంగా’ అనే మాట ఒక భ్రమ! నేను సునాయాసంగా ఆడతానని అంటూంటారు. చాలా సందర్భాల్లో దాన్ని ఒక పొగడ్తగానే చెబుతారు. కానీ, ‘‘అతని దేహంపై ఒక్క స్వేద బిందువు కూడా లేదు చూడండి’’ లాంటి మాటలు వారి నుంచి విన్నప్పుడు నాకు అసహనంగా ఉండేది. సత్యం ఏమంటే, తేలిగ్గా ఆడినట్లు కనిపించడం వెనుక నేను చేసిన కఠోర శ్రమ ఉంది. నన్ను నేను తమాయించుకోవడం నేర్చుకోవడానికి ముందు చాలా ఏళ్ళు కోర్ట్‌లో విసుగు ప్రదర్శించేవాడిని, అనుచితమైన మాటలనేవాడిని, చేతిలో రాకెట్‌ను విసిరేసేవాడిని. కానీ, క్రీడా జీవితం ఆరంభంలోనే, వాటిని సరిదిద్దుకునే అవకాశం లభించింది. ఒకసారి ఇటాలియన్ ఓపెన్‌లో నా ప్రత్యర్థి ఒకరు నా మానసిక క్రమశిక్షణను బాహాటంగానే ప్రశ్నించాడు. ‘‘మొదటి రెండు గంటలు రోజర్ గెలుస్తాడనుకుంటారు. ఆ తర్వాత, నేను ఫేవరెట్‌గా మారతాను’’ అని వ్యాఖ్యానించాడు. మొదట, నాకు ఆ మాటలు అర్థం కాలేదు. తర్వాత, అతని మాటలలోని ఆంతర్యాన్ని గ్రహించాను. మొదటి రెండు గంటలపాటు ప్రతి ఆటగాడు బాగానే ఆడతాడు. శారీరకంగా శక్తితో ఉంటారు. వేగంగా కదులుతారు. రెండు గంటల తర్వాత, కాళ్ళు పీకడం మొదలెడతాయి. మనసు ఏకాగ్రతను కోల్పోతుంది. నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆ మాటలతో అర్థం చేసుకున్నా. ఆ దిశగా ప్రయాణం ప్రారంభించి, కోరుకున్న స్థితికి చేరుకున్నా. ఆ క్రమంలో నా తల్లితండ్రులు, కోచ్‌లు, ఫిట్ నెస్ కోచ్ నా ప్రవర్తనను సరిదిద్దుతూ వచ్చారు. నా ప్రత్యర్థి ఆటగాళ్ళు కూడా ఆ పని చేస్తున్నారు. ఈ విషయంలో, నాతోటి ఆటగాళ్ళకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.డార్ట్‌మౌత్‌లో మీరు దీన్ని మరో విధంగా గమనించి ఉంటారు. తోటి విద్యార్థులు ర్యాంకుల మీద ర్యాంకులు సాధించడాన్ని చూసి శాన్‌బర్న్ లైబ్రరీలో మీరు ఓ మూలన మౌనంగా రోదించి ఉంటారు. నా లాగానే మీరు కూడా ‘అప్రయత్నంగా’ అనే మాట ఒక భ్రమేనని తెలుసుకుని ఉంటారని భావిస్తున్నా. కేవలం ప్రతిభతోనే నేను ఈ స్థితికి చేరుకోలేదు. ప్రత్యర్థులకన్నా ఎక్కువసేపు, ప్రభావశీలంగా, కఠిన శ్రమకోర్చి ప్రాక్టీసు చేయ బట్టే ఈ స్థితికి చేరా. నిజంగా గర్వపడే విజయాలు అవే!మనం నిరాశతో చతికిలపడే సందర్భాలూ ఎదురవుతా యని గుర్తుంచుకోవాలి. వెన్ను, మోకాళ్ళు నొప్పి పుట్టవచ్చు. స్వల్పంగా అనారోగ్యం పాలుకావచ్చు లేదా ముందున్న లక్ష్యం భయపెట్టనూవచ్చు. అయినా, గెలుపొందడానికి మీరొక మార్గాన్ని కనుగొని తీరాలి. అలా సాధించిన విజయాల గురించి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే, మీరు ఉత్తమమైన స్థితిలో ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా విజయాలు సాధించగలరని అవి నిరూపిస్తాయి. ఔను. ప్రతిభ కూడా ఉండి తీరాలి. దానితో పని లేదని చెప్పడానికి నేను ఇక్కడ నుంచో లేదు. కానీ, ప్రతిభ అనే మాటకు విస్తృతమైన నిర్వచనం ఉంది. చాలా సందర్భాలలో, దాన్ని వరంగా చూడకూడదని, వజ్ర సమాన సంకల్పంగా భావించాలని చెప్పదలచుకున్నాను. కానీ, జీవితంలో మాదిరి గానే... టెన్నిస్‌లో కూడా క్రమశిక్షణే ప్రతిభగా పరిణమిస్తుంది. ఓర్పు కూడా అంతే అవసరం. మీపై మీకు నమ్మకం ఉండటం కూడా ప్రతిభే. ఏ ప్రక్రియనైనా సరే స్వాగతించడం, ప్రేమించడం ప్రతిభ కిందకే వస్తుంది. మీ జీవితాన్ని, మిమ్మల్ని నడుపుకోవడం కూడా ప్రతిభ కోవలోకే వస్తుందేమో. కొందరికి పుట్టుకతోనే ఆ లక్షణాలు ఉంటాయి. మిగిలిన అందరూ వాటిని సంతరించుకునే కృషి చేయాలి.అదొక పాయింట్ అంతే!రెండవ పాఠం. అదొక పాయింట్ మాత్రమే! మీరు సాధ్యం అనుకున్నదానికన్నా ఎక్కువగానే శ్రమించి ఉంటారు... అయినా పరాజయం పాలయ్యారు. ఈ రోజు మీలో ఒక్కరే డిగ్రీ పొందా రని ఊహించుకుందాం. విజేతకు అభినందనలు తెలుపుదాం. మిగిలిన వెయ్యి మంది మాటేమిటి? తదుపరి విడతలో ఉత్తీర్ణులు కావచ్చు... నేనెప్పుడూ గెలుపొందడానికే ప్రయత్నించానని మీకు తెలుసు. కానీ, నేను ఓడిన సందర్భాలున్నాయి. కొన్నిసార్లు పెద్ద టోర్నమెంట్లలోనే ఓటమి చెందా. వింబుల్డన్ 2008 ఫైనల్స్ వాటిలో ఒకటి. నేను, రఫేల్ నదాల్ తలపడ్డాం. కొందరు దాన్ని చరిత్రలోనే మరపురాని మ్యాచ్‌గా అభివర్ణిస్తారు. రఫా మీద నాకు పూర్తి గౌరవం ఉంది. కానీ, ఆ మ్యాచ్‌లో నేను గెలుపొంది ఉంటే ఇంకా బాగుండేది. వింబుల్డన్‌లో ఓటమిని తేలిగ్గా తీసు కోలేం... ఏ టెన్నిస్ ఆటగాడికైనా వింబుల్డన్‌లో విజయమే సర్వస్వం. నేను 2008లో వరుసగా ఆరవసారి టైటిల్ సాధించేందుకు బరిలోకి దిగా. చరిత్రలో సుస్థిర స్థానం కోసం ఆడుతున్నా. ఆ మ్యాచ్‌లో ఒక్కో పాయింట్ మా ఇద్దరిలో ఎవరెవరికి ఎలా వచ్చిందీ నేను ఇపుడు వివరించబోవడం లేదు. అదంతా చెప్పా లంటే కొన్ని గంటలు పడుతుంది. సరిగ్గా చెప్పాలంటే, ఆ మ్యాచ్ దాదాపు ఐదు గంటలు సాగింది. రఫా రెండు సెట్లు గెలి చాడు. టై–బ్రేక్స్‌లో తదుపరి రెండు సెట్లు నేను గెలిచా. ఐదవ సెట్లో ఏడు పాయింట్లతో ఇద్దరం సమ స్థితిలో ఉన్నాం. ఆట చివరి భాగంపై అందరూ ఎందుకు అంత దృష్టి కేంద్రీ కరిస్తారో నాకు అపుడు అర్థమైంది... చివరి నిమిషాల్లో నాకు కళ్ళు బైర్లు కమ్మాయి. గ్రాస్ కోర్టుపై తెల్లని చారలు కూడా మసకగా కనిపించడం మొదలెట్టాయి. అన్నిసార్లూ గెలవలేము!ఇపుడు వెనుతిరిగి చూసుకుంటే... ఆ మ్యాచ్‌లో మొదటి పాయింట్ అప్పుడే నేను ఓటమి పాలయ్యాననిపిస్తుంది. ‘ఏయ్, నువ్వు ఐదు విడతలుగా గెలుస్తూ వస్తున్న డిఫెండింగ్ చాంపియన్‌వి! పైగా, ఆడుతున్నది గ్రాస్ కోర్ట్‌లో. ఇక్కడ ఎలా ఆడాలో నీకు బాగా తెలుసు’ అని నా అంతరంగంలో నేను గుర్తు తెచ్చుకోవడానికి మూడవ సెట్ దాకా సమయం పట్టింది. కానీ, ఆ ధైర్యం చాలా ఆలస్యంగా వచ్చింది. రఫా గెలుపొందాడు. దానికతను అన్ని విధాలా యోగ్యుడే!కొన్ని ఓటములు మిగిలినవాటికన్నా ఎక్కువ బాధిస్తాయి. వరుసగా ఆరవసారి టైటిల్ కోసం పోటీ పడే అవకాశం జీవితంలో మళ్ళీ లభించదని నాకు తెలుసు. వింబుల్డన్‌లో ఓడాను.నంబర్ వన్ ర్యాంకింగ్ కోల్పోయాను. టెన్నిస్‌లో పరిపూర్ణత అనేది అసాధ్యం. నా వృత్తి జీవితంలో నేను ఆడిన 1,526 సింగిల్స్ మ్యాచ్‌లలో దాదాపు 80% గెలుపొందా. కానీ, ఇక్కడ నేను మీకో ప్రశ్న వేయదలచుకున్నా. ఆ మ్యాచ్‌లలో, నేను గెలి చిన పాయింట్ల శాతం ఎంతనుకుంటున్నారు? కేవలం 54%. మరో విధంగా చెప్పాలంటే, అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాళ్ళు కూడా వారు అడిన మ్యాచ్‌ల పాయింట్లలో కేవలం సగంపైన మాత్రమే గెలిచి ఉంటారు. కొంపేం మునిగిపోయింది. అది ఒక పాయింట్ మాత్రమే అని మీకు మీరే నేర్చుకోవాలి. జీవితంలో మీరు ఏ ఆట ఆడినా... కొన్నిసార్లు ఓటమి తప్పదు. అది ఒక పాయింట్, ఒక మ్యాచ్, ఒక సీజన్, ఒక ఉద్యోగం కోల్పోవడం ఏదైనా కావచ్చు. జీవితం అనేక ఎత్తు పల్లాలున్న రోలర్ కోస్టర్. కుంగిపోయినపుడు మీ సామర్థ్యంపై మీకు సందేహాలు ఏర్పడటం సహజం. కానీ, మీ ప్రత్యర్థులకు కూడా వారి సామర్థ్యాలపై వారికి సందేహాలుంటాయని మరచి పోకండి. కానీ, నెగెటివ్ ఎనర్జీ వృథా ఎనర్జీ! ప్రపంచంలో ఉత్తములుగా పరిగణన పొందుతున్నవారు అన్నింటిలోనూ గెలవడం వల్ల అలాంటి హోదా ఏమీ పొందడం లేదు. ఓటమి పాలవుతామనీ, పరాజయాలు పదే పదే వెక్కిరి స్తాయనీ వారికి తెలుసు. వాటిని తట్టుకుని ఎలా నిలబడాలో వారు నేర్చుకుంటారు కాబట్టి గొప్పవారు అనిపించుకుంటారు. చేస్తున్న పనిని ఆనందించండి!మూడవ పాఠం. జీవితం కోర్ట్ కన్నా పెద్దది. టెన్నిస్ కోర్ట్ చిన్న ప్రదేశం. నిక్కచ్చిగా చెప్పాలంటే, 2,106 చదరపు టడుగులు. అది సింగిల్స్ మ్యాచ్‌లు ఆడే కోర్ట్ వైశాల్యం. ఒక సత్రం గదికన్నా మరీ పెద్దదిగా ఏమీ ఉండదు. ఆ చిన్న ప్రదేశంలోనే నేను ఎంతో శ్రమించాను. నేర్చుకున్నాను. ఎన్నో మైళ్ళు పరుగెత్తాను. కానీ, ప్రపంచం దానికన్నా చాలా చాలా పెద్దది. టెన్నిస్ లోకి అడుగు పెట్టినప్పుడే, టెన్నిస్ నాకు ప్రపంచాన్ని చూపిస్తుంది కానీ, టెన్నిస్సే ప్రపంచం కాదన్న సంగతి నాకు తెలుసు. టెన్నిస్ నుంచి నిష్క్రమించగానే నేను మాజీ టెన్నిస్ క్రీడాకారుడిని అయి పోయా. కానీ, మీరు దేనికీ మాజీలు కాదు. మీరు భవిష్యత్ రికార్డు బ్రేకర్లు. ప్రపంచ యాత్రికులు. భవిష్యత్ కార్యకర్తలు. దాతలు. విజేతలు, నాయకులు.ఈ గౌరవ డిగ్రీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ విజయో త్సవంలో నాకూ భాగం కల్పించినందుకు కృతజ్ఞతలు. మీలో ప్రతి ఒక్కరి తదుపరి భవిష్యత్ కార్యాచరణ ఏమిటో చూడాలని నాకు ఉత్సాహంగా ఉంది. మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా, మీ శక్తి మేరకు ప్రతిభను ప్రదర్శించండి. మీకు నచ్చిన రీతిలో ఆడండి. స్వేచ్ఛగా ఆడండి. అన్నింటిని ప్రయత్నించి చూడండి. అన్నింటికన్నా ముఖ్యంగా, పరస్పరం దయ కలిగి ఉండండి. చేస్తున్న పనిని ఆనందించండి. క్లాస్ ఆఫ్ 2024కి మరోసారి అభినందనలు.

BCCI: క్రికెట్ ఒక్కటేనా?.. అదో పెద్ద సామ్రాజ్యం! ఆర్థిక వనరులు ఇవే..
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రపంచ క్రికెట్లో పెద్దన్న పాత్ర పోషిస్తుంది. వరల్డ్‌లోనే సంపన్నమైన క్రికెట్ బోర్డుగా బీసీసీఐ ఖ్యాతి గడించింది. తాజాగా బీసీసీఐ మరోసారి సంపద సృష్టిలో చరిత్ర సృష్టించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI ) రికార్డు స్థాయిలో రూ.9,741.7 కోట్ల ఆదాయాన్ని సంపాదించినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో భారత క్రికెట్ బోర్డుకు ఆదాయం వచ్చే మార్గాలపై ఓ లుక్కేద్దాం.ఐపీఎల్ బంగారు బాతు..భారత క్రికెట్ బోర్డుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) బంగారు బాతులా మారింది. 2007లో పురుడుపోసుకున్న ఐపీఎల్.. బీసీసీఐకి ప్రదాయ ఆదాయ వనరుగా ఉంది. తాజా నివేదిక ప్రకారం 2023-2024 సంవత్సరానికి గాను ఈ క్యాష్ రిచ్ లీగ్ నుంచి రూ. 5,761 కోట్లు బోర్డు ఖాతాలో చేరాయి.మీడియా హక్కులు, ఫ్రాంచైజీ ఫీజులు, స్పాన్సర్‌షిప్‌ల రూపంలో వచ్చాయి. బీసీసీఐ ఆర్జించిన మొత్తంలో 59 శాతంతో ఐపీఎల్ ప్రధాన వాటాదారుగా నిలిచింది. అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ద్వారా బీసీసీఐకి రూ.1042 కోట్లు(10.7%) వచ్చాయి.అంతేకాకుండా ఐపీఎల్ యేతర మీడియా హక్కుల(భారత అంతర్జాతీయ మ్యాచ్‌లు బ్రాడ్‌కాస్టింగ్) ద్వారా బోర్డు అదనంగా రూ. 813 కోట్లు సంపాదించింది. మరోవైపు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అరంగేట్ర సీజన్ ద్వారా బోర్డుకు రూ. 378 కోట్లు వచ్చాయి.భారత్ అంతర్జాతీయ పర్యటనలో టికెట్ అమ్మకాలు, స్పాన్సర్లు, లైసెన్సింగ్ ద్వారా 361 కోట్లు అదనంగా బీసీసీఐకి లభించాయి. స్టేడియంలో ప్రకటనలు, జరిమానాలు, ఇతర రుసుముల రూపంలో భారత క్రికెట్ బోర్డుకు 400 కోట్ల ఆదాయం సమకూరింది.వెయ్యి కోట్ల పైగా వడ్డీ..భారత క్రికెట్ బోర్డు దగ్గర దాదాపు రూ. 30 వేల కోట్లు రిజర్వ్‌లో ఉన్నాయి. దీని వల్ల ఏడాదికి రూ. 1,000 కోట్ల వడ్డీ వస్తున్నట్లు తెలుస్తోంది.బీసీసీఐకి ఖర్చు కూడా ఎక్కువే..భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదాయాన్ని సంపాదించడంలోనే కాదు ఖర్చు చేయడంలో మిగిలిన బోర్డులకంటే ముందు ఉంది. క్రికెట్ అభివృద్ది కోసం బీసీసీఐ ఖర్చు చేసే ఆంశాలను ఓసారి పరిశీలిద్దాం. ఆటగాళ్ల జీతాలు, మ్యాచ్ ఫీజులు, బోనస్‌లు కింద బీసీసీఐ ప్రతీ ఏటా రూ.250 కోట్ల పైగా ఖర్చుచేస్తోంది. అదేవిధంగా కోచింగ్ స్టాప్ జీతాల కోసం రూ.100 కోట్ల పైగా బీసీసీఐ వెచ్చిస్తోంది.అంతేకాకుండా స్టేట్ క్రికెట్ ఆసోయేషిన్‌లకు నిధుల రూపంలో రూ.1000 కోట్ల పైగా భారత క్రికెట్ బోర్డు ఖర్చుచేస్తోంది. మ్యాచ్‌లను నిర్వహించేందుకు రూ. 500 కోట్లు, మహిళల క్రికెట్ అభివృద్ది కోసం 150 కోట్లు బీసీసీఐ ప్రతీ ఊటా కేటాయిస్తోంది.పరిపాలన, కార్యకలాపాలు(ట్రావిలింగ్, మార్కెటింగ్) కోసం బీసీసీఐ 300 పైగా కోట్లు ఖర్చు చేస్తోంది. మరోవైపు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ప్రారంభించడానికి బీసీసీఐ భారీ ఖర్చు చేసింది. అందులో మీడియా హక్కుల కోసం రూ. 951 కోట్లు వెచ్చించింది.చదవండి: ENG vs IND: క్రికెట్ ప్లేయర్లు లంచ్ బ్రేక్‌లో ఏమి తింటారో తెలుసా?

పదేళ్లు సీఎంననడం అభ్యంతరకరం
నల్లగొండ: మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిపై మరోమారు విరుచుకు పడ్డారు. మరో పదేళ్ల పాటు తానే సీఎంనని రేవంత్ రెడ్డి ప్రకటించడంపై రాజగోపాల్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ శనివారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్య బద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్‌ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు’.. అని రాజగోపాల్‌రెడ్డి ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టించాయి.

మోదీ జీ.. ఇంతకీ నిజం ఏమిటి?: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ల మధ్య ఈ మే నెలలో జరిగిన యుద్ధంలో ఐదు యుద్ధ విమానాలు కూలిపోయాయనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను కార్నర్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ. ట్రంప్ చెప్పినదాంట్లో నిజం ఏమిటి? అని ప్రశ్నించారు రాహుల్. ఆపరేషన్ సింధూర్ అంశానికి సంబంధించి దేశ ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారని రాహుల్ ట్వీట్ చేశారు.मोदी जी, 5 जहाज़ों का सच क्या है?देश को जानने का हक है! pic.twitter.com/mQeaGCz4wp— Rahul Gandhi (@RahulGandhi) July 19, 2025 కాగా, ఇరు దేశాల యుద్ధంలో ఐదు యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని ట్రంప్ చెప్పినప్పటికీ, అవి ఏ దేశానికి చెందినవో చెప్పలేదు. ఇరు దేశాల యుద్ధ విమానాలు కలిపి ఐదా.. లేక పాకిస్తాన్‌వా.. భారత్‌కు చెందినవా? అనేదే క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు దీన్ని ప్రశ్నిస్తోంది ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత జై రాం రమేశ్ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి రెండు రోజులే సమయం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్.. ఆపరేషన్ సింధూర్ వ్యవహారాన్ని ఉభయ సభల్లో ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్లే కనబడుతోంది. ట్రంప్ తాజా వ్యాఖ్యలను ఉదహరిస్తూ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జై రాం రమేశ్.. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ‘ట్రంప్ మిసైల్ దూసుకుపోతోంది. ఇప్పటికి 24 సార్లు ఒకే సందేశాన్ని ట్రంప్.. పదే పదే చెబుతూ వస్తున్నారు. "2019, సెప్టెంబర్‌లో 'హౌడీ మోడీ', 2020, ఫిబ్రవరిలో 'నమస్తే ట్రంప్' వంటి కార్యక్రమాలతో అధ్యక్షుడు ట్రంప్‌తో సంవత్సరాల తరబడి స్నేహం కలిగి ఉన్న ప్రధాని మోదీ.. గత 70 రోజులుగా ట్రంప్ ఏమి చెబుతున్నారనే దానిపై పార్లమెంట్లో స్పష్టత ఇవ్వాలి. ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించి ట్రంప్ మాట్లాడుతున్న ప్రతీ దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది’ అని జై రాం రమేశ్ ముందుగానే తాము ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తనున్నామని విషయాన్ని స్పష్టం చేశారు.

ఈపీఎఫ్‌వో రూల్స్‌లో మార్పు.. ఆ కండీషన్లు ఇక ఉండవు
ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) ఈడీఎల్ఐ అంటే ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ నిబంధనల్లో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ భారీ ఊరటనిచ్చింది. ఇప్పుడు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మునుపటిలా కఠినమైన షరతులు ఉండవు. దీని వల్ల లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలకు, ముఖ్యంగా విధుల్లో ఉండగా మరణించిన ఉద్యోగి కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుంది.కనీసం రూ .50,000 బీమాతాజా నోటిఫికేషన్ ప్రకారం.. ఇప్పుడు ఉద్యోగి పీఎఫ్ బ్యాలెన్స్ రూ .50,000 కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ఆ ఉద్యోగి మరణించినప్పుడు వారి కుటుంబానికి కనీసం రూ .50,000 బీమా ప్రయోజనం లభిస్తుంది. ఇంతకు ముందు ఈ ప్రయోజనాన్ని పొందడానికి, ఉద్యోగి ఖాతాలో నిర్ణీత పరిమితి వరకు బ్యాలెన్స్ ఉండాలి. కానీ ఇప్పుడా షరతు తొలగించారు.మరో ముఖ్యమైన మార్పుకనీస పీఎఫ్ బ్యాలెన్స్ షరతును తొలగించడంతోపాటు ఈ పథకంలో మరో ముఖ్యమైన మార్పు చేశారు. ఈ పథకం కోసం 12 నెలల నిరంతర సర్వీసును లెక్కించేటప్పుడు, ఉద్యోగి కంపెనీలు మారిన సందర్భంలో రెండు ఉద్యోగాల మధ్య 60 రోజుల వరకు గ్యాప్ ఉంటే, దాన్ని ఇకపై విరామంగా పరిగణించరు. అంటే ఉద్యోగి రెండుమూడు ఉద్యోగాలు చేసి, వాటి మధ్య 2 నెలల కంటే తక్కువ విరామం ఉంటే, అప్పుడు అన్ని ఉద్యోగాలు ఒకే (నిరంతర) సర్వీసుగా పరిగణిస్తారుఅంతే కాకుండా పీఎఫ్ పథకంలో సభ్యుడైన ఉద్యోగి చివరి పీఎఫ్ కంట్రిబ్యూషన్ నుండి 6 నెలల్లోపు మరణించిప్పుడు కూడా వారి కుటుంబానికి ఈ పథకం కింద బీమా మొత్తాన్ని ఇస్తారు. అయితే ఆ సమయంలో ఉద్యోగి కంపెనీ రోల్స్‌లో నమోదై ఉండాలి. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణించినప్పుడు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం ఈపీఎఫ్ఓ ఈడీఎల్ఐ పథకం ప్రధాన ఉద్దేశం.
పరాకాష్టకు బాబు భేతాళ కుట్ర
వారం రోజులు ఆలస్యంగా...
‘మిస్టర్ కార్తీక్’ మళ్లీ వస్తున్నాడు
పెళ్లి చేసుకునే ఆలోచన లేదు!
పాన్ ఇండియా కాదు... పాన్ వరల్డ్
సమగ్ర సర్వే మెగా హెల్త్ చెకప్‌లాంటిది..: సీఎం రేవంత్
పదేళ్లు సీఎంననడం అభ్యంతరకరం
2026 నుంచి కాజీపేటలో చిక్‌బుక్ చిక్‌బుక్ రైలే
బిహార్‌లో ఉచిత విద్యుత్ పథకం - సీఎం నితీశ్‌కుమార్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
రామ్‌చరణ్ సాయం..? ఒక్క రూపాయి రాకుండా చేశారు: ఫిష్ వెంకట్ కూతురు
కెప్టెన్‌గా నితీశ్ కుమార్ రెడ్డి
పుట్టెడు దుఃఖం, డిప్రెషన్.. అక్క కోసం ఇండియాకు వచ్చేశా: శిల్ప శిరోద్కర్
Junior Review: ‘జూనియర్’ మూవీ రివ్యూ
ఈ రాశి వారికి వ్యాపారాలు.. ఉద్యోగాలలో నూతనోత్సాహం
వెల్కం టూ అమెరికా! మీకు వీసా ఉన్నా మీ వెంటే ఉండి గమనించమని ట్రంప్ చెప్పారు..!
ఓటీటీలోకి మలయాళ క్రైమ్ డ్రామా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
స్వామీ! మీరే కాపాడాలి.. ఎక్కడ మద్యం కేసులయినా మమ్మల్నే అందులోకి లాగుతున్నారు!
ఈ రాశి వారికి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి
కుటుంబ సభ్యుల మోసం.. నాన్న కొత్త ప్రయాణం: అనసూయ
మీరే సేవ చేయించుకుంటున్నారు! ఇక మీరెక్కడ సేవ చేస్తారు!!
కాంగ్రెస్‌కు శశిథరూర్లాగా మనకూ ఈయన అలాగే ఉన్నాడనిపిస్తుంది సార్!
'జూనియర్' కలెక్షన్.. మొదటిరోజు అన్ని కోట్లా?
హైదరాబాద్‌లో బరితెగిస్తున్న బ్లడీ చీటర్స్
ప్రెగ్నెన్సీ ప్రకటించిన బిగ్‌బాస్ సోనియా.. ప్రాజెక్ట్ సక్సెస్ అంటూ రివీల్!
ముగిసిన టీసీఎస్ బెంచ్ పాలసీ గడువు
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ ‘జాడ’ కనిపెట్టేశారు..!
ఈగల్ టీమ్‌కు చిక్కిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, హెచ్ఆర్ మేనేజర్లు..!
‘నా సీతా సీమంతం’ శ్రీమతి సీమంతంపై బిగ్‌బాస్ ఫేం పోస్ట్ (ఫొటోలు)
ఇద్దరితో సహజీవనం.. అతడితో పెళ్లి.. భార్యకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి..
పరాకాష్టకు బాబు భేతాళ కుట్ర
వారం రోజులు ఆలస్యంగా...
‘మిస్టర్ కార్తీక్’ మళ్లీ వస్తున్నాడు
పెళ్లి చేసుకునే ఆలోచన లేదు!
పాన్ ఇండియా కాదు... పాన్ వరల్డ్
సమగ్ర సర్వే మెగా హెల్త్ చెకప్‌లాంటిది..: సీఎం రేవంత్
పదేళ్లు సీఎంననడం అభ్యంతరకరం
2026 నుంచి కాజీపేటలో చిక్‌బుక్ చిక్‌బుక్ రైలే
బిహార్‌లో ఉచిత విద్యుత్ పథకం - సీఎం నితీశ్‌కుమార్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
రామ్‌చరణ్ సాయం..? ఒక్క రూపాయి రాకుండా చేశారు: ఫిష్ వెంకట్ కూతురు
కెప్టెన్‌గా నితీశ్ కుమార్ రెడ్డి
పుట్టెడు దుఃఖం, డిప్రెషన్.. అక్క కోసం ఇండియాకు వచ్చేశా: శిల్ప శిరోద్కర్
Junior Review: ‘జూనియర్’ మూవీ రివ్యూ
ఈ రాశి వారికి వ్యాపారాలు.. ఉద్యోగాలలో నూతనోత్సాహం
వెల్కం టూ అమెరికా! మీకు వీసా ఉన్నా మీ వెంటే ఉండి గమనించమని ట్రంప్ చెప్పారు..!
ఓటీటీలోకి మలయాళ క్రైమ్ డ్రామా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
స్వామీ! మీరే కాపాడాలి.. ఎక్కడ మద్యం కేసులయినా మమ్మల్నే అందులోకి లాగుతున్నారు!
ఈ రాశి వారికి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి
కుటుంబ సభ్యుల మోసం.. నాన్న కొత్త ప్రయాణం: అనసూయ
మీరే సేవ చేయించుకుంటున్నారు! ఇక మీరెక్కడ సేవ చేస్తారు!!
కాంగ్రెస్‌కు శశిథరూర్లాగా మనకూ ఈయన అలాగే ఉన్నాడనిపిస్తుంది సార్!
'జూనియర్' కలెక్షన్.. మొదటిరోజు అన్ని కోట్లా?
హైదరాబాద్‌లో బరితెగిస్తున్న బ్లడీ చీటర్స్
ప్రెగ్నెన్సీ ప్రకటించిన బిగ్‌బాస్ సోనియా.. ప్రాజెక్ట్ సక్సెస్ అంటూ రివీల్!
ముగిసిన టీసీఎస్ బెంచ్ పాలసీ గడువు
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ ‘జాడ’ కనిపెట్టేశారు..!
ఈగల్ టీమ్‌కు చిక్కిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, హెచ్ఆర్ మేనేజర్లు..!
ఇద్దరితో సహజీవనం.. అతడితో పెళ్లి.. భార్యకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి..
సీతగా 'సాయిపల్లవి'నే ఎందుకు.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్
సినిమా

విలన్ ఎవరు?
మహేశ్‌బాబు హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్). రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ప్రియాంకా చోప్రా హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలు చేస్తున్నారు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా కథ ఏంటి? షూటింగ్ ఎంత వరకూ వచ్చింది? వంటి విషయాలపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.అయితే ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ‘ఇండియానా జోన్స్’ స్టైల్ కథతో ఈ సినిమా రూపొందుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే... ఈ కథలో విలన్ ఎవరు? అనే విషయం సినిమా ముగిసేవరకూ ఊహించలేమట. పతాక సన్నివేశాల వరకు నెగెటివ్ రోల్ తెలియనివ్వకుండా ప్రేక్షకులను సస్పెన్స్ చేయనున్నారట రాజమౌళి. ఈ చిత్రంలో మాధవన్ కీలకపాత్రలో కనిపించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. దాంతో ఆయన విలన్‌గా కనిపించనున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.

పెద్ద సినిమా ఉంటేనే చిన్న సినిమాకి చాన్స్!: నిర్మాత ఏయం రత్నం
‘‘ఓ పెద్ద సినిమా రిలీజ్ అప్పుడు వీకెండ్లో టికెట్ ధరలు ఎక్కువ ఉండొచ్చన్నది నా ఉద్దేశం. విదేశాల్లో ఇలానే ఉంటుంది. కానీ మనోళ్లు ఫిక్స్ చేస్తే... వారమంతా ఒకటే రేట్ ఉంటుంది. వీక్ డేస్‌లో మామూలు ధరలు ఉంచి, వీకెండ్లో ధరలు పెంచుకునే సౌకర్యం ఉండాలి. అప్పుడు సినిమా టికెట్లు అందరికీ అందుబాటులో ఉంటాయి. ‘భారతీయుడు’ సినిమా సమయంలో కలెక్టర్స్ను రిక్వెస్ట్ చేసి, హైదరాబాద్, వైజాగ్‌లో టికెట్ ధరలు పెంచాను.ఇది తెలిసి రామానాయుడుగారు షాక్ అయ్యారు. రత్నం భలే చేశాడన్నారు’’ అని నిర్మాత ఏయం రత్నం అన్నారు. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చారిత్రక చిత్రం ‘హరిహర వీరమల్లు’. జ్యోతికృష్ణ, క్రిష్ దర్శకత్వంలో ఏయం రత్నం సమర్పణలో అద్దంకి దయాకర్ రావు నిర్మించిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ‘హరిహర వీరమల్లు: స్పిరిట్ వర్సెస్ స్వార్డ్’ ఈ నెల 24న విడుదల కానుంది.ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాత ఏయం రత్నం చెప్పిన విశేషాలు.⇒ నా గత చిత్రాలు ‘కర్తవ్యం, భారతీయుడు’ వంటివాటి తరహాలోనే ‘హరిహర వీరమల్లు’లో కూడా వినోదంతోపాటు సందేశం ఉంది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కల్పిత కథే ఈ చిత్రం. పవన్ కల్యాణ్‌గారితో ‘ఖుషి, బంగారం’ చిత్రాల తర్వాత నేను చేసిన మూడో సినిమా ఇది.⇒ సినిమా అనేది అవసరం కాదు. ప్రేక్షకులు ఆ సినిమా పట్ల ఆసక్తిగా ఉంటే థియేటర్స్‌కు వస్తారు. లేక పోతే లేదు. కొందరు ఓటీటీలో చూద్దాంలే అని రావడం లేదు. నా సినిమా బాగుంది... కనీసం పెట్టిన డబ్బులైనా తిరిగి రావాలని, టికెట్ ధరలను పెంచమని ప్రభుత్వానికి విన్నవించుకున్నాను. తెలంగాణ ప్రభుత్వం చారిత్రక సినిమా అయితే ఇస్తామన్నారు. మాది చారిత్రక సినిమాయే అని చె΄్పాం. ఆడియన్స్ మామూలు సినిమా తీస్తే థియేటర్స్‌కు రావడం లేదు. క్వాలిటీ సినిమా అందించాలంటే నిర్మాణ వ్యయం పెరిగి పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా టికెట్నుపావలాకు, అర్ధణాకు అమ్మితే ఎలా వర్కౌట్ అవుతుంది. ఈ పరిస్థితుల్లో టికెట్ ధరలు తక్కు వగా ఉంటే సినిమా థియేటర్స్ మూసివేయాల్సి వస్తుంది. మన నేటివిటీ ఉన్న ఒకట్రెండు సినిమాలు ఆడొచ్చు. కానీ ఈ సినిమాలే ఉంటే థియేటర్స్ అనేవి ఉండవు. ఓపెనింగ్ తెప్పించే పెద్ద సినిమాల వల్లే థియేటర్స్ ఉంటాయి. అవి ఉంటేనే కదా... చిన్న సినిమాలకు చాన్స్ ఉంటుంది.

ఈమెని గుర్తుపట్టారా? సిద్దార్థ్‌తో హిట్ సినిమా.. ఇప్పుడేమో ఇలా
కొందరు బ్యూటీస్ ఒకటి రెండు సినిమాలు చేసినా సరే మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. ఈమె కూడా సేమ్ అలానే అనుకోవచ్చు. తమిళంలో చాలా మూవీస్ చేసినప్పటికీ తెలుగులో ఒకే ఒక్క మూవీతో ఫేమస్ అయింది. అందులో హీరో సిద్దార్థ్. మరి ఇన్ని హింట్స్ ఇచ్చాం కదా ఈ నటి ఎవరో కనిపెట్టారా? మమ్మల్ని చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న నటి పేరు నందిత జెన్నీఫర్. తండ్రి చిన్నా కొరియోగ్రాఫర్ కావడంతో ఈమె కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచింది. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ఎంచుకుంది. 2000కి ముందు ఓ పక్క కొరియోగ్రఫీ చేస్తూనే మరోవైపు ఐటమ్ సాంగ్స్‌లోనూ అడపాదడపా మెరిసేది. అలా దర్శకుల దృష్టిలో పడి 'రిథమ్' అనే సినిమాతో నటిగా మారింది. అలా 2022 వరకు పలు చిత్రాల్లో నటించింది. తమిళంలో పలు రియాలిటీ షోల్లోనూ పాల్గొంది.(ఇదీ చదవండి: హన్సిక వైవాహిక బంధానికి బీటలు? ఒక్కమాటలో తేల్చేసిన భర్త!)దాదాపు తమిళ సినిమాలే చేసినా ఈమె.. సిద్దార్థ్ 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాతో తెలుగులోకి పరిచయమైంది. డాలీ పాత్రలో తనదైన యాక్టింగ్ చేసి ఆకట్టుకుంది. మూవీ చూసినా ప్రతిసారి ఈమె పాత్ర కూడా నచ్చేస్తుంది. దీని తర్వాత పవిత్ర, వేర్ ఈజ్ విద్యాబాలన్, నా రూటే సెపరేట్ చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్‌లో కనిపించింది.జెన్నీఫర్ వ్యక్తిగత జీవితానికొస్తే.. 2007లో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ కాశీ విశ్వనాథన్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు కొడుకులు పుట్టారు. ప్రస్తుతం ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈమె.. ఇన్ స్టాలోనూ యాక్టివ్గానే ఉంది. ఎప్పటికప్పుడు ఫొటోలు, రీల్స్ పోస్ట్ చేస్తూ ఉంది. అయితే అప్పట్లో సిద్ధార్థ్ సినిమాలో చూసినప్పటికీ ఇప్పటికీ ఈమెలో ఎంత మార్పు వచ్చేసింది. చాలామంది గుర్తుపట్టలేకపోతున్నారు కూడా!(ఇదీ చదవండి: డైరెక్టర్ క్రిష్ లేకుండానే 'హరిహర వీరమల్లు' మేకింగ్ వీడియో) View this post on Instagram A post shared by Jeni_Chinna (@jenniferr252)

డైరెక్టర్ క్రిష్ లేకుండానే మేకింగ్ వీడియో
పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' మరో వారంలో రిలీజ్ కానుంది. అయినాసరే అనుకున్నంతగా హైప్ రావట్లేదు. దీంతో పెట్టిన బడ్జెట్ రికవరీ కోసమో ఏమో గానీ ఏపీ ప్రభుత్వం నుంచి భారీగా టికెట్ రేట్ల పెంపు తెచ్చుకున్నారు. ఈ మేరకు జీవో కూడా వచ్చింది. తాజాగా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. అంతా బాగానే ఉంది కానీ ఇక్కడే ఓ సందేహం కలుగుతోంది. అటు ప్రమోషన్లలో గానీ ఇటు మేకింగ్ వీడియోలోని గానీ ఒకటి మిస్ అవుతోంది. అదే క్రిష్.(ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి తెలుగు సినిమా)'హరిహర వీరమల్లు' నిర్మించింది ఏఎం రత్నం కావొచ్చు, హీరోగా చేసింది పవన్ కల్యాణ్ కావొచ్చు. కానీ ఈ సినిమా తీయడానినికి మూలకారణం క్రిష్. కొన్నాళ్ల పాటు మూవీ టీమ్‌తో పాటు ట్రావెల్ చేసిన ఈయన.. ప్రాజెక్ట్ మరీ ఆలస్యం అవుతుండేసరికి అనివార్య కారణాలతో తప్పుకొన్నారు. అనంతరం నిర్మాత కొడుకైన జ్యోతికృష్ణ.. మిగిలిన పార్ట్ అంతా దర్శకత్వం వహించారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రమోషన్లలో క్రిష్ ఏ మాత్రం కనిపించట్లేదు. సరే ఇది పక్కనబెడితే.. తాజాగా మేకింగ్ వీడియోలోనూ క్రిష్ ఒక్కటంటే ఒక్క షాట్‌లోనూ లేరు.మేకింగ్ వీడియోలో క్రిష్ లేకపోవడానికి కారణమేంటి అనేది మూవీ టీమ్‌కే తెలియాలి. పవన్‌తో పాటు ప్రధాన తారాగణం అంతా కనిపించాడు. చెప్పాలంటే పవన్‌తో పాటు జ్యోతికృష్ణ ఎక్కువగా కనిపించారు. త్రివిక్రమ్ కూడా కనిపించారు గానీ క్రిష్‌కి ఇందులో చోటు ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. డైరెక్షన్ క్రెడిట్ మాత్రం క్రిష్‌తో పాటు జ్యోతికృష్ణ పంచుకున్నారు. మూవీ రిలీజ్ తర్వాత అయినా సరే క్రిష్ మీడియా ముందుకొస్తారా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'హరిహర వీరమల్లు'.. ఏపీలో భారీగా టికెట్ రేట్ల పెంపు)
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

India-England Test XI: భారత్ నుంచి ఏడుగురు.. సచిన్‌కు నో ప్లేస్
టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar)లో భాగంగా లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు గెలిస్తే.. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ తొలిసారి విజయబావుటా ఎగురవేసింది. అయితే, లార్డ్స్‌లో ఆఖరి వరకు పోరాడిన గిల్ సేనకు చేదు అనుభవమే మిగిలింది. దీంతో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. మాంచెస్టర్‌లోనూ తొలిసారి గెలిచి సిరీస్‌ను సమం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది.అత్యుత్తమ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్ఇక ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు కామెంటేటర్ వ్యవహరిస్తున్న టీమిండియా వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా ఆసక్తికర ఎంపికతో ముందుకు వచ్చాడు. ఇరుజట్ల నుంచి 21వ శతాబ్దానికి గానూ తన అత్యుత్తమ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. దిగ్గజాలకు నో ప్లేస్అయితే, ఇందులో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar)తో పాటు గౌతం గంభీర్, మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మలకు మాత్రం పుజ్జీ చోటివ్వలేదు.అదే విధంగా.. ఇంగ్లండ్ లెజెండరీ ఆటగాళ్లు సర్ అలిస్టర్ కుక్, జేమ్స్ ఆండర్సన్ (James Anderson)లను కూడా పుజారా పట్టించుకోలేదు. ఇక తన కంబైన్డ్ జట్టుకు ఓపెనర్లుగా అలెక్ స్టెవార్ట్, రాహుల్ ద్రవిడ్‌లను ఎంచుకున్న పుజారా.. వన్‌డౌన్‌లో జో రూట్‌ను ఆడిస్తానని తెలిపాడు. భారత్ నుంచి ఏడుగురుమరోవైపు.. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లిని ఎంపిక చేసుకున్న ఈ వెటరన్ బ్యాటర్.. ఐదో స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను ఎంపిక చేసుకున్నాడు.అదే విధంగా.. బౌలింగ్ విభాగంలోనూ టీమిండియా ఆటగాళ్లకే పుజారా పెద్ద పీట వేశాడు. పేస్ దళంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలకు చోటిచ్చిన పుజారా.. స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లకు స్థానం కల్పించాడు. ఇంగ్లండ్ నుంచి ఇద్దరు సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఆండ్రూ ఫ్లింటాఫ్, బెన్ స్టోక్స్‌లను పుజారా ఎంపిక చేశాడు. మొత్తంగా టీమిండియా- ఇంగ్లండ్ 21వ శతాబ్దపు అత్యుత్తమ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో నలుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లకు మాత్రమే పుజారా చోటివ్వడం విశేషం. పన్నెండో ఆటగాడిగా మాథ్యూ హోగర్డ్ను పుజ్జీ ఎంచుకున్నాడు.ఎదురుచూపులే మిగిలాయికాగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 103 టెస్టులు ఆడిన పుజారా 7195 పరుగులు సాధించాడు. ఇందులో 19 శతకాలు, 3 డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఐదు వన్డేల్లో కలిపి 51 పరుగులు మాత్రమే చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఐపీఎల్లో 30 మ్యాచ్‌లలో కలిపి 390 రన్స్ చేశాడు. చివరగా ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్ ఆడిన పుజారా.. టీమిండియాలో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే, యువ ఆటగాళ్లతో పోటీలో అతడు పూర్తిగా వెనుకబడ్డాడు.పుజారా ఎంచుకున్న 21వ శతాబ్దపు భారత్- ఇంగ్లండ్ కంబైన్డ్ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్అలెస్ స్టెవార్ట్ (వికెట్ కీపర్), రాహుల్ ద్రవిడ్, జో రూట్, విరాట్ కోహ్లి, వీవీఎస్ లక్ష్మణ్, బెన్ స్టోక్స్, ఆండ్రూ ఫ్లింటాఫ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మాథ్యూ హొగర్డ్ (12th man).చదవండి: ODI WC 2011: యువీని సెలక్ట్ చేయడం అవసరమా?.. ధోని నిర్ణయం ఇదే..

టీమిండియాతో నాలుగో టెస్టు.. చరిత్రకు అడుగు దూరంలో జో రూట్
సొంత గడ్డపై టీమిండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ దుమ్ములేపుతున్నాడు. లార్డ్స్ టెస్టులో అద్బుతమైన సెంచరీతో చెలరేగిన రూట్.. ఇప్పుడు మాంచెస్టర్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టులో కూడా సత్తాచాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు జూలై 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో జోరూట్ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు.డేంజర్లో పాంటింగ్ రికార్డు.. మాంచెస్టర్‌లో రూట్ మరో 119 పరుగులు సాధిస్తే..టెస్టు క్రికెట్లో అత్యధిక రన్స్ చేసిన రెండో ఆటగాడిగా రూట్ నిలుస్తాడు. రూట్ ఇప్పటివరకు 156 టెస్టులు 50.8 సగటుతో 13259 పరుగులు చేశాడు.టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రూట్ ప్రస్తుతం నాలుగో స్ధానంలో ఉన్నాడు.రూట్ కంటే ముందు రాహుల్ ద్రవిడ్(13288), జాక్వస్ కల్లిస్(13289), రికీ పాంటింగ్(13378), సచిన్ టెండూల్కర్(15921) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో గాని ఆఖరి టెస్టులో గాని ద్రవిడ్, కల్లిస్, పాంటింగ్‌ను రూట్ అధగమించే అవకాశముంది. ఇక అగ్రస్దానంలో కొనసాగుతున్న సచిన్‌ను ఆధిగమించేందుకు రూట్ ఇంకా 2,662 పరుగుల దూరంలో ఉన్నాడు.అయితే 34 ఏళ్ల రూట్ మరి కొన్నాళ్ల పాటు టెస్టుల్లో కొనసాగితే సచిన్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. కాగా ఐదు టెస్టుల ఆండర్సన్- టెండూల్కర్ ట్రోఫీలో ఇంగ్లండ్ ప్రస్తుతం 1-2 ఆధిక్యంలో కొనసాగుతోంది.చదవండి: WCL 2025: అన్నా.. నీవు ఇప్పటికి మారలేదా? పాక్ ఆటగాడిపై సెటైర్లు

అన్నా.. నీవు ఇప్పటికి మారలేదా? పాక్ ఆటగాడిపై సెటైర్లు
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 (WCL 2025) టోర్నమెంట్‌ను పాకిస్తాన్ ఛాంపియన్స్ విజయంతో ఆరంభించింది. శుక్రవారం ఇంగ్లండ్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో పాక్ గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించినప్పటికి.. ఆ జట్టు వికెట్ కీపర్ కమ్రాన్ ఆక్మల్ మాత్రం తీవ్ర నిరాశపరిచాడు.తొలుత బ్యాటింగ్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసిన ఆక్మల్.. అనంతరం ఫీల్డింగ్‌లో గల్లీ స్ధాయి వికెట్ కీపర్‌ను తలపించాడు. షోయబ్ మాలిక్ బౌలింగ్‌లో ఆక్మల్ ఈజీ స్టంపింగ్‌ను మిస్ చేసి నవ్వులు పాలయ్యాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన షోయబ్ మాలిక్.. ఇంగ్లండ్ బ్యాటర్ ఫిల్ మస్టర్డ్‌కు ఫుల్ ఔట్‌సైడ్ ఆఫ్ డెలివరీగా సంధించాడు.ఆ బంతిని మస్టర్డ్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి పిచ్ అయిన వెంటనే షర్ఫ్గా టర్న్ అవుతూ వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. నేరుగా చేతి లోకి వెళ్లిన బంతిని అందుకోలేక స్టంప్ ఔట్ చేసే అవకాశాన్ని కమ్రాన్ కోల్పోయాడు.దీంతో 23 పరుగుల దగ్గర ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మస్టర్డ్ ఏకంగా హాఫ్ సెంచరీ బాదేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో నెటిజన్లు నీవు అన్నా.. నీవు ఇప్పటికి ఇంకా మారలేదా? అంటూ ట్రోలు చేస్తున్నారు. కాగా ఆక్మల్ అంతర్జాతీయ క్రికెట్ ఆడే సమయంలో కూడా ఇటువంటి వికెట్ కీపింగ్‌తో చాలా మ్యాచ్‌ల్లో పాక్ కొంపముంచాడు. 2011 వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ రాస్ టేలర్ ఇచ్చిన ఈజీక్యాచ్ను జారవిడిచిన ఆక్మల్.. పాక్ ఓటమికి కారణమయ్యాడు. ఆ మ్యాచ్‌లో ఆరంభంలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న టేలర్.. ఏకంగా సెంచరీతో చెలరేగాడు. ప్రస్తుత మ్యాచ్‌లో పాక్ గెలవకపోయింటే అందుకు ఆక్మల్ కారణమయ్యేవాడు.చదవండి: ODI WC 2011: యువీని సెలక్ట్ చేద్దామా?.. ధోని నిర్ణయం మాత్రం అదే!Kamran Akmal Wicket keeping -Then, Now & Forever.....His wicket keeping costs Shoaib Akhter career - Ross Taylor assault in 2011 WC.#WCL2025 pic.twitter.com/HNcMCLRXUE— alekhaNikun (@nikun28) July 19, 2025

ODI WC 2011: యువీని సెలక్ట్ చేయడం అవసరమా?
టీమిండియా వన్డే వరల్డ్‌కప్-2011 గెలవడంలో ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh)ది కీలక పాత్ర. ఈ ఐసీసీ టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న యువీ.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. ఈ ఈవెంట్ మొత్తంలో 362 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు పడగొట్టి కీలక మ్యాచ్‌లలో భారత్‌ను గెలిపించాడు. యువీ లేని ఈ టోర్నీని ఊహించడం కూడా సాధ్యం కాదు.అయితే, యువీని అసలు జట్టులోకి తీసుకోవాలా? వద్దా? అన్న అంశంపై తీవ్రమైన చర్చ నడిచిందట. 2010లో ఈ ఆల్‌రౌండర్ ఆట తీరు అంత గొప్పగా లేకపోవడమే ఇందుకు కారణం. అయితే, నాటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni)తో పాటు అప్పటి టీమిండియా కోచ్ గ్యారీ కిర్‌స్టన్ మాత్రం అతడి కోసం పట్టుబట్టారట. ఇందుకు సంబంధించి కిర్‌స్టన్ తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.ధోని కూడా నాలాగే ఆలోచించాడు‘‘నాడు ఆ జట్టు ఎంపిక అంత తేలికగా ఏమీ జరుగలేదు. పదిహేను మంది ప్లేయర్లు ఎవరా అన్న అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఆఖరి నిమిషంలో.. అతడిని జట్టులోకి తీసుకున్నాం. ఇందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పాల్సిందే.నిజానికి నేను అతడిని తప్పక జట్టులోకి తీసుకోవాలనే పట్టుదలతో ఉన్నాను. ధోని కూడా నాలాగే ఆలోచించాడు. యువీ అనుభవాన్ని, అతడి ప్రతిభను మిస్ చేసుకోకూడదని మేము ఫిక్సయ్యాం. మా నమ్మకాన్ని నిలబెట్టేలా అతడు టోర్నీ ఆసాంతం ఎలా ఆడాడో అందరూ చూశారు కదా!యువరాజ్ అంటే చాలా ఇష్టంనాకు యువరాజ్ అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్కరితోనూ ఎంతో ఆప్యాయంగా ఉంటాడు. అయితే, ఎదుటివాళ్లకు చిరాకు తప్పించడం అతడికి అలవాటు. ఒక్కోసారి ఆ అల్లరి శ్రుతిమించుతుంది కూడా!.. అయినప్పటికీ అతడంటే నాకు అభిమానం.చాలా మంచివాడు. అతడు ఎప్పుడు బ్యాటింగ్ చేసినా పెద్ద ఎత్తున పరుగులు రాబట్టాలని కోరుకుంటాను. అతడి బ్యాటింగ్‌ను పూర్తిగా ఆస్వాదిస్తాను’’ అని గ్యారీ కిర్‌స్టెన్ పాత సంగతులు గుర్తు చేసుకుంటూ యువీపై ప్రశంసలు కురిపించాడు.అతడి పాత్రా కీలకమేఇక యువీ వరల్డ్‌కప్ ప్రయాణం అంత తేలికగా ఏమీ సాగలేదన్న కిర్‌స్టన్.. ‘‘యువీని ప్రపంచకప్ టోర్నీకి పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయడంలో ప్యాడీ ఉప్టన్ (మెంటల్ కండిషనింగ్- స్ట్రాటజిక్ లీడర్షిప్ కోచ్)ది కీలక పాత్ర. తను ఎల్లవేళలా యువీకి మద్దతుగా నిలిచాడు. ఇక యువరాజ్ కూడా కీలక సమయాల్లో తనను మోటివేట్ చేసుకుంటూ అనుకున్న ఫలితాలను రాబట్టగలిగాడు’’ అని చెప్పుకొచ్చాడు.కాగా ధోని సారథ్యంలో టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011 గెలిచిన భారత జట్లలో యువీ సభ్యుడు అన్న విషయం తెలిసిందే. అయితే, యువీ తండ్రి యోగ్రాజ్ సింగ్ మాత్రం ధోనిని ఉద్దేశించి ఎల్లప్పుడూ ఘాటు విమర్శలు చేస్తూ ఉంటాడు. ధోని వల్లే తన కుమారుడి కెరీర్ నాశనమైందంటూ తీవ్రస్థాయిలో అతడిని విమర్శిస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే.. ముంబైలోని వాంఖడే వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో శ్రీలంకను ఓడించి టీమిండియా 2011లో ట్రోఫీని కైవసం చేసుకుంది.చదవండి: రుతురాజ్ గైక్వాడ్ కీలక నిర్ణయం
బిజినెస్

ఆ బ్యాంకు భళా.. ఈ బ్యాంకు డీలా
ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 76 శాతం జంప్‌చేసి రూ. 1,111 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 633 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 7,568 కోట్ల నుంచి రూ. 8,866 కోట్లకు బలపడింది.వడ్డీ ఆదాయం రూ. 6,535 కోట్ల నుంచి రూ. 7,386 కోట్లకు ఎగసింది. నిర్వహణ లాభం రూ. 1,676 కోట్ల నుంచి రూ. 2,358 కోట్లకు జంప్‌చేసింది. స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 2.89 శాతం నుంచి 1.97 శాతానికి, నికర ఎన్పీఏలు 0.51 శాతం నుంచి 0.32 శాతానికి దిగివచ్చాయి. కనీస మూలధన నిష్పత్తి 17.82 శాతం నుంచి 18.82 శాతానికి మెరుగుపడింది. ఫలితాల నేపథ్యంలో ఐవోబీ షేరు బీఎస్ఈలో యథాతథంగా రూ. 40 వద్ద ముగిసింది.బంధన్ బ్యాంక్ లాభం క్షీణత ప్రయివేట్ రంగ సంస్థ బంధన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 65 శాతం క్షీణించి రూ. 372 కోట్లను తాకింది. మొండి రుణాలు పెరగడం, వడ్డీ ఆదాయం తగ్గడం ప్రభావం చూపాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 1,063 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 6,082 కోట్ల నుంచి రూ. 6,201 కోట్లకు బలపడింది. అయితే వడ్డీ ఆదాయం రూ. 5,536 కోట్ల నుంచి రూ. 5,476 కోట్లకు నీరసించింది.నికర వడ్డీ ఆదాయం రూ. 2,987 కోట్ల నుంచి రూ. 2,757 కోట్లకు వెనకడుగు వేసింది. నిర్వహణ లాభం సైతం రూ. 1,941 కోట్ల నుంచి రూ. 1,668 కోట్లకు క్షీణించింది. స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 4.23 శాతం నుంచి 4.96 శాతానికి, నికర ఎన్పీఏలు 1.15 శాతం నుంచి 1.36 శాతానికి పెరిగాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 523 కోట్ల నుంచి రూ. 1,147 కోట్లకు భారీగా పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో బంధన్ బ్యాంక్ షేరు 1.1 శాతం పుంజుకుని రూ. 187 వద్ద ముగిసింది.

ఒకే మోడల్.. నాలుగేళ్లలో 6 లక్షల యూనిట్లు తయారీ
టాటా మోటార్స్ తన పాపులర్ మైక్రో ఎస్యూవీ టాటా పంచ్ కార్లును ఇప్పటివరకు 6,00,000 తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ కారు తయారీ ప్రారంభించిన నాలుగు ఏళ్లలో ఈమేరకు గణనీయమైన ఉత్పత్తి మైలురాయిని చేరుకున్నట్లు పేర్కొంది. ఇండియాలోని కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో ఈ మోడల్ గేమ్ ఛేంజర్‌గా నిలిచినట్లు చెప్పింది.‘అక్టోబర్ 2021లో లాంచ్ అయిన టాటా పంచ్ దాని డిజైన్, హై గ్రౌండ్ క్లియరెన్స్, ఇతర ఫీచర్లతో త్వరగా వినియోగదారుల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. టాటా ఆల్ఫా (ఎజిల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్డ్) ఆర్కిటెక్చర్‌తో నిర్మించిన పంచ్ ఓ మోస్తారు ఎస్యూవీ వాహనాలు చూస్తున్న వారిని ఎంతో ఆకర్షించింది’ అని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: భారత్‌లోకి యూఎస్ జన్యుమార్పిడి పంటలు ఎంట్రీ?2024 క్యాలెండర్ ఇయర్లో ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ కారుగా టాటా పంచ్ నిలిచిందని సంస్థ పేర్కొంది. అమ్మకాల పరంగా మారుతీ సుజుకీ దశాబ్దాల ఆధిపత్యాన్ని అధిగమించినట్లు తెలిపింది. గత 40 ఏళ్లలో వార్షిక అమ్మకాల్లో మారుతీని తొలిసారి టాటా వెనక్కి నెట్టినట్లు చెప్పింది. ఇది ఐసీఈ, ఈవీ వెర్షన్‌ల్లో లభ్యం అవుతుంది.

భారత రియల్టీ మార్కెట్‌పై కేకేఆర్ కన్ను
గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ అండ్ కో ఇంక్ భారతదేశ రియల్ ఎస్టేట్ రంగంపై దృష్టి సారించింది. అభివృద్ధి చెందుతున్న ఈ మార్కెట్లో భారత్‌ను వ్యూహాత్మక పెట్టుబడికి గమ్యస్థానంగా గుర్తించినట్లు కేకేఆర్ తెలిపింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న స్థిరాస్తి రంగంలో పెరుగుతున్న ఆసక్తిని ఇది హైలైట్ చేస్తుంది.ప్రపంచ అస్థిరతల మధ్య కూడా దేశ ఆర్థిక అభివృద్ధి, విధానాలు, వినియోగదారుల ఆసక్తి మెరుగ్గాఉందని ఎత్తిచూపుతూ, ఎమర్జింగ్ మార్కెట్లలో భారత్ వ్యూహాత్మకంగా నిలుస్తుందని సంస్థ పేర్కొంది. రూపాయిలో స్వల్ప క్షీణతను కేకేఆర్ అంచనా వేసినప్పటికీ, దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తెలిపింది. మార్చి 2025 నాటికి ప్రపంచ వ్యాప్తంగా కేకేఆర్ 664 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను నిర్వహిస్తోంది. రియల్టీ పరంగా చైనాలో కల్లోల పరిస్థితులున్నాయని, యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో స్తబ్దత నెలకొందని కంపెనీ చెప్పింది. భారత్‌లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని తెలిపింది.ఇదీ చదవండి: భారత్‌లోకి యూఎస్ జన్యుమార్పిడి పంటలు ఎంట్రీ?భారతదేశం, జపాన్, ఆగ్నేయాసియాతో సహా ఆసియా రియల్ ఎస్టేట్ మార్కెట్లలో అభివృద్ధికి అవకాశాలను చూస్తున్నామని కేకేఆర్ తాజా సమీక్షలో పేర్కొంది. నిర్మాణాత్మక వృద్ధి, మార్కెట్ ఒడిదుడుకులు కలిసే ఆసియా రియల్ ఎస్టేట్‌ను అధిక రాబడికి అవకాశంగా చూస్తున్నట్లు తెలిపింది. ఈ-కామర్స్ వృద్ధి, డేటా సెంటర్ల విస్తరణ, సప్లై చెయిన్ ఆధునీకరణ వంటి విస్తృత అంశాలకు అనుగుణంగా లాజిస్టిక్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను భారత్‌లో ఆకర్షణీయ విభాగాలుగా గుర్తించినట్లు కూడా పేర్కొంది.

మళ్లీ లకారం దాటిన బంగారం!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం ధరలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఫ్యామిలీ

ఆషాఢ జాతర రికార్డు ఆదాయం రూ. 10.84కోట్లు
సోలాపూర్, మహారాష్ట్ర: ఈ ఏడాది ఆషాఢ ఏకాదశి జాతర సందర్భంగా మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని విష్ణువు అవతారమైన విఠోబా లేదా శ్రీ విఠల రుక్మిణి ఆలయానికి (Shri Vitthal Rukmini Mandire) కానుకలు, విరాళాల రూపంలో భారీ ఆదాయం సమకూరింది. ఆలయ చరిత్రలోనే మొదటిసారిగా రికార్డుస్థాయిలో రూ. 10.84 కోట్ల ఆదాయం లభించిందని ఆలయ కమిటీ సహాయ అధ్యక్షుడు గహినీనాథ్ ఔసేకర్ మహారాజ్ తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రెండున్నర కోట్ల రూపాయలు అదనంగా లభించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ఆషాఢ ఏకాదశి జాతరకు అత్యధికంగా 15 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. ఇది కూడా ఒక రికార్డే. లడ్డూ ప్రసాదం, భక్త నివాసాలు, హుండీ ఆదాయం కానుకల రూపేణా వచ్చిన మొత్తం 10.84 కోట్ల ఆదాయాన్ని భక్తులకు వివిధ సౌకర్యాలు కల్పించేందుకు ఉపయోగిస్తామని మేనేజర్ మనోజ్ శృత్రి తెలిపారు. ఇదీ చదవండి: ఇన్నాళ్లకు..మా ఊరికి బస్సొచ్చింది!

లంబోర్ఘిని అయితే.. రియల్బాస్ డాగీ రాజా ఇక్కడ! వైరల్ వీడియో
కార్లు అన్నింటిలోనూ ఖరీదైన, లగ్జరీ కారు రారాజు లాంటిది లంబోర్ఘిని కారు. విశ్వాసంలో కింగ్..కుక్క. ఈ రెండు అనుకోకుండా ఎదురు పడితే.. అస్సలు ఊహకే అందడం లేదు కదా. అందుకే విచిత్రమైన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.విషయం ఏమిటంటే.. ముంబై వీధిలో లంబోర్గిని కారునుకొద్దిసేపు ఆటాడుకుంది ఓ స్ట్రీట్ డాగ్. కొట్టొచ్చినట్టు ఉన్న కారు కలర్ (డార్క్ ఆరెంజ్) చూసి అలా బిహేవ్ చేసిందో ఏమో తెలియదు కానీ ఈ వీడియో ఒకటి ప్రస్తుతం ఎక్స్ లో వైరల్ అవుతోంది.వీడియోలో విశేషాలుఆరెంజ్ కలర్లో లంబోర్గిని కారుకు అడ్డంగా నిలబడింది డాగ్. అటూ ఇటూ కొంచెం కూడా కదల్లేదు.. బెదర లేదు. దానితో మనకెందుకునే అనుకున్న డ్రైవర్ పక్కకు పోనిచ్చాడు. ఆహా.. అయినా వదల్లేదు.. వదల బొమ్మాళీ అంటూ కారును ఫాలో అయింది. మళ్లీ డ్రైవర్ తన కారును తిప్పినప్పుడు,ఇక మన శునక రాజు గట్టిగా అరవడం మొదలు పెట్టింది. చివరికి లంబోర్గిని కుక్కను దాటి దూసుకుపోయింది. దాంతో దాన్ని శునకం కొంత దూరం వరకు వెంబడించడం ఈ వీడియోలో చూడవచ్చు.ఈ వీడియోను "కాలేష్ బీ/వీ సర్ డోగేష్ అండ్ లంబోర్గిని" అనే క్యాప్షన్ తో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు కూడా వచ్చాయి. "రోడ్డుకి నిజమైన బాస్" ‘‘మన బ్రో దెబ్బకు.. లంబోర్గిని పారిపోయింది’’ ఇలా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.Kalesh b/w Sir Dogesh and Lamborghini pic.twitter.com/EbgnzoErvI— Ghar Ke Kalesh (@gharkekalesh) July 15, 2025

ఆ మూగజీవి ప్రతిస్పందనకు..ఎవ్వరైన ఇట్టే కరిగిపోవాల్సిందే..!
ఆ మూగజీవి స్కూల్‌కి ఎందుకొచ్చిందో గానీ..అక్కడున్న పిల్లల వద్ద అది కూడా ఓ పసిపాపాయిలా కూర్చొని ఉండటం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. అక్కడ అదిచేసే పని చూస్తే..కళ్లర్పడమే మరిచి ఆ శునకాన్నే చూస్తుండిపోతారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక అందమైన కుక్క పాఠశాల తరగతి గదిలో పిల్లల తోపాటుగా కూర్చొని ఉంటుంది. చాలా అమాయకంగా అందర్ని చూస్తూ ఉంటుంది. ఆ క్లాస్‌లో పిల్లలంతా డ్రాయింగ్ వేయడంలో మునిగిపోతే..ఈ కుక్క కూడా వేయాలనుకుందో ఏమో గానీ ఒక కాలుపైకిత్తి తనకు సమీపంలో ఉన్న పిల్లవాడి చేతిని తాకుతుంది. నేనే రంగులు వేస్తా అన్నట్లుగా అతడి చేతిలో తన కాలుని పైకెత్తి పెడుతుంది. ఆ దృశ్యం చాలా భావోద్వేగంగా ఉంటుంది. అయితే ఆ పిల్లవాడు చేతిని వదిలించుకని తన పనిలో తాను నిమగ్నమవుతుండగా మరోసారి అడుగుతున్నట్లుగా కాలుతో కదుపుతుంది. అయితే ఆ చిన్నారి కూడా నీ వల్ల కాదులే అన్నట్లుగా తన పని తాను చేసుకుంటున్న ఆ నిశిబ్ధ సంభాషణకు ఎలాంటి వారి మనసైనా ఇట్టే కరిగిపోతుంది. పాపం అది మాత్రం ఎవ్వరైనా నాకు కొంచెం డ్రాయింగ్ వేసే పేపర్ ఇవ్వరూ..అన్నట్లుగా చూస్తున్న దాని చూపు భలే నవ్వుతెప్పిస్తోంది .నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోకి మూడు మిలయన్లకు పైగా వ్యైస్ నాలుగు లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. అంతేగాదు నెటిజన్లు యూనిఫాం ఏది.. ? వేసుకుని వచ్చి ఉంటే నీకు డ్రాయింగ్ వేసే పేపర్ ఇచ్చేవారు అంటూ ఆ క్యూట్ కుక్కని ఉద్దేశిస్తూ.. కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Helpbezubaans (@helpbezubaans) (చదవండి: ఎంఆర్ఐ స్కానింగ్ భయానక అనుభవం..! ఇలా మాత్రం చెయ్యొద్దు..)

కరీనా మోడ్రన్ స్టైల్ ‘‘గళ్ల లుంగీ స్కర్ట్.. నల్ల కళ్లద్దాలు’’!
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor Khan) ప్రస్తుతం గ్రీస్‌లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలను షేర్ చేసి అభిమానులను మెస్మరైజ్ చేసింది.తన మోడ్రన్ లుక్స్‌కు దేశీ ట్విస్ట్ ఇవ్వడం కరీనా ఫ్యాషన్ స్టైల్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. పసుపు రంగు హాల్టర్-నెక్ బ్రాలెట్‌తో పాటు గళ్ల లుంగీ-స్టైల్ స్కర్ట్‌లో అల్ట్రా-హిప్గా కనిపిస్తున్న కొత్త చిత్రాలను పోస్ట్ చేసింది కరీనా. నల్ల సన్ గ్లాసెస్ , బ్రౌన్ టోపీతో తన లుక్‌ను మరింత ఎలివేట్ చేసింది.తన ఫోటోలకు “గ్రీస్‌లో లుంగీ డ్యాన్స్ ..భలే మజా వచ్చింది. తప్పకుండా తప్పక ప్రయత్నించండి’’ అనే క్యాప్షన్ ఇవ్వడం విశేషం. దీనికి వెరైటీ లుంగీ అంటూ ఫ్యాన్స్ కమెంట్స్ చేశారు. ఫ్యాన్స్‌తో పాటు, కరీనా స్నేహితులు మనీష్ మల్హోత్రా, సావ్లీన్ మంచాంద, పూనమ్ దమానియా ఫైర్ ఎమోజీలను పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) ఇటీవల వివాదం రేపిన ప్రాడా కొల్హాపురి చెప్పులపై కూడా ఎమోజీలతో సెటైర్ వేసింది కరీనా. కొల్హాపురి మెటాలిక్ సిల్వర్ స్లిప్పర్లలో ఒక చిత్రాన్ని షేర్ చేస్తూ.. "సారీ...ఇది ప్రాడా కాదు... నా OG కొల్హాపురి" అని క్యాప్షన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొల్హాపురి చెప్పులనుంచి భారతీయ లుంగీ వరకు కరీనా స్టైలింగ్, ఫ్యాన్స్ ప్రశంసలు లభిస్తున్నాయి.
ఫొటోలు
అంతర్జాతీయం

చమురు ఆదాయ వనరులే లక్ష్యంగా రష్యాపై ఈయూ, యూకే ఆంక్షలు
బ్రస్సెల్స్: ఉక్రెయిన్‌పై దురాక్రమణ సాగిస్తున్న రష్యాపై యూరోపియన్ యూనియన్, యూకేలు మరింత కఠిన ఆంక్షలను ప్రకటించాయి. రష్యా ఇంధన రంగం, పాతబడిన ట్యాంకర్ నౌకలతో దొంగచాటుగా ముడిచమురు రవాణా, సైనిక నిఘా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. యుద్ధాన్ని ఆపేసే వరకు రష్యాపై ఇలాంటి ఒత్తిడులు కొనసాగుతూనే ఉంటాయని ఈయూ విదేశాంగ విధానం చీఫ్ కాయ కలాస్ చెప్పారు. తాజా ఆంక్షలు అత్యంత కఠినమైనవన్నారు. ఇందులో భాగంగా ముడిచమురు ధరను మార్కెట్ ధర కంటే తక్కువగా 60 నుంచి 45 డాలర్ల వరకు తగ్గిస్తున్నట్లు ఈయూ తెలిపింది. 27 దేశాలతో కూడిన ఈయూ చమురు బారెల్ ధరను 48 డాలర్లుగా నిర్ణయించింది. అమెరికా సహా జీ7 గ్రూప్ దేశాలు సైతం ఈ విషయంలో తమతో కలిసి వస్తాయని ఈయూ ఆశిస్తోంది. అయితే, తాజా ఆంక్షలపై అమెరికా స్పందించకపోవడం గమనార్హం. ఆయిల్ విక్రయాల ద్వారా పెద్దమొత్తంలో ఆర్జిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చే మొత్తాన్ని ఉక్రెయిన్‌తో యుద్ధానికి వాడుతున్నట్లు ఈయూ ఆగ్రహంతో ఉంది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే ఈయూయేతర దేశాలపైనా నిషేధం విధించింది. రష్యా, జర్మనీల మధ్య ఉన్న నార్డ్ స్ట్రీమ్ పైపులైన్ల ద్వారా రష్యా చమురు సరఫరా చేయకుండా నిషేధం విధించింది. అంతేకాదు, రష్యాలోని బ్యాంకులు ఎలాంటి నిధులు సేకరించకుండా, ఆర్థిక కార్యక లాపాలను నిర్వహించకుండా ఆంక్షలు ప్రకటించింది ఈయూ. ఇందులో చైనాకు చెందిన రెండు బ్యాంకులున్నాయి. దీంతోపాటు, రష్యా మిలటరీ ఇంటెలిజెన్స్ విభాగం జీఆర్యూ లక్ష్యంగా యూకే మరిన్ని ఆంక్షలను విధించింది. ఉక్రెయిన్‌లోని మరియుపోల్‌లోని ఓ థియేటర్లో 2022లో తలదాచుకున్న వారిపై బాంబు దాడికి కుట్ర పన్నడంతోపాటు, రష్యా ఏజెంట్ కుటుంబాన్ని నెర్వ్ ఏజెంట్‌తో చంపేందుకు యత్నించినందుకు జీఆర్‌యూకు చెందిన 18 మంది అధికారులపై ఆంక్షలు అమలవుతాయని తెలిపింది.భారత్‌లోని రాస్‌నెఫ్ట్ రిఫైనరీపై ప్రభావంఈయూ విధించిన ఆంక్షల ప్రభావం భారత్ లోని రష్యా ఇంధన సంస్థ రాస్‌నెఫ్ట్ నడిపే రిఫైనరీపైనా పడనుంది. ఈ విషయాన్ని ఈయూ విదేశాంగ విధానం చీఫ్ కాయ కలాస్ తెలిపారు. బ్యారెల్ ధరను 60 డాలర్లకు తగ్గించడంతో రాస్‌నెఫ్ట్ సంస్థ భారత్‌లో క్రూడాయిల్‌ను ఈ ధరకే అమ్మాల్సి ఉంటుందన్నారు. రష్యా నుంచి చమురును కొనుగోలు చేసే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా నుంచి ఏకంగా 40 శాతం అందుతోంది. ఈయూ ఆంక్షలతో అంతిమంగా భారత్ లాభపడనుంది. గుజరాత్‌లోని వడినా ర్లో ఉన్న నయారా ఎనర్జీ లిమిటెడ్‌లో రాస్నెప్ట్కు 49.13% వాటా ఉంది. ఇక్కడి రిఫైనరీలో ఏడాదికి 20 మిలియన్ టన్నుల చమురు శుద్ధి అవుతుంది. తాజా ఆంక్షలతో నయారా కంపెనీ యూరప్ దేశాలకు పెట్రో ఉత్పత్తులను విక్రయించడం కుదరదు.

అమెరికా కల చెదురుతోంది..!
ముదురు పాకాన పడుతున్న అమెరికా వీసా సంక్షోభం భారతీయ విద్యార్థుల పాలిట పిడుగుపాటుగా మారుతోంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటినుంచీ విద్యార్థి వీసాలపై నానారకాల ఆంక్షలు విధిస్తుండటంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి అన్న చందంగా తయారవుతోంది. దాంతో పై చదువుల నిమిత్తం అగ్ర రాజ్యానికి వెళ్లే మనవాళ్ల సంఖ్యలో ఈ ఏడాది ఏకంగా 70 నుంచి 80 శాతం తగ్గుదల నమోదైందని హైదరాబాద్‌కు చెందిన పలు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు ఆందోళన వెలిబుచ్చారు. వీసా అపాయింట్మెంట్లను ఉన్నట్టుండి ఫ్రీజ్ చేయడం, వీసా దరఖాస్తుల తిరస్కరణల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటం వంటివి కూడా ఇందుకు కారణంగా నిలుస్తున్నట్టు వారు వివరించారు. ‘‘మామూలుగానైతే ఏటా ఈ సమయానికల్లా విద్యార్థులు వీసా ఇంటర్వ్యూలు పూర్తి చేసుకుని, అమెరికా వెళ్లే ఏర్పాట్లలో తలమునకలుగా ఉంటారు. ఈసారి మాత్రం మేమింకా వీసా స్లాట్లు అందుబాటులోకి వచ్చాయా అని రోజూ ఎంబసీ పోర్టల్‌ను చెక్ చేసుకునే దశలోనే ఉన్నాం! ఇంత దారుణ గత కొన్నేళ్లలో ఎన్నడూ లేదు’’ అంటూ వాపోయారు. ఇది చాలదన్నట్టు ఈసారి వీసా స్లాట్లను అమెరికా ఎంబసీలు దశలవారీగా విడుదల చేస్తున్నాయి. చెప్పా పెట్టకుండా ఉన్నట్టుండి కొత్త నిబంధనలు తెచ్చేస్తున్నాయి. ఇలాంటి ఆకస్మిక నిర్ణయాలు మొత్తం వీసా ప్రక్రియపై విద్యార్థుల్లో టెన్షన్ పెంచేస్తున్నాయి. అంతేకాదు. ఎలాగోలా వీసా స్లాట్లు బుక్కయినా, స్లాట్ దొరికిందంటూ విద్యార్థులకు కన్ఫర్మేషన్ రావడం లేదు. కొత్తగా అప్డేట్ చేసిన స్లాట్ సిస్టంను ఎంబసీలు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తుండటమే ఇందుకు కారణం కావచ్చని కన్సల్టెంట్లు అంటున్నారు. కానీ ఈ పరిణామం విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి లోను చేస్తోంది. ‘‘మరికొద్ది రోజుల్లో గనక వీసా స్లాట్లను విడుదల చేయకపోతే వేలాది మంది భారత విద్యార్థుల అమెరికా చదువుల కల కల్లగా మిగిలిపోనుంది. వాళ్లు తీవ్ర ఆందోళనతో రోజూ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు’’ అని ఓ కన్సల్టెంటు ఆవేదన వెలిబుచ్చారు. హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ మాత్రం వీసా స్లాట్ల ప్రక్రియ పునఃప్రారంభమైందని, అపాయింట్మెంట్ల కోసం విద్యార్థులు తరచూ వెబ్సైట్లో చూస్తుండాలని సూచించారు. గతేడాది రికార్డు స్థాయిలో ఏకంగా 3.3 లక్షల మందికి పైగా భారత విద్యార్థులు పై చదువుల నిమిత్తం అమెరికా వెళ్లారు. ఈ విషయంలో చైనాను అధిగమించి భారత్ తొలి స్థానంలో నిలిచింది కూడా! కానీ ట్రంప్ రాకతో పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. 2024 జనవరి నాటికి 11.6 లక్షలకు పైగా భారత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్నట్టు విదేశాంగ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. యూరప్ దేశాలకు వెళ్తున్న మన విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇతర దేశాలే ముద్దు అమెరికా వీసా కోసం అష్టకష్టాలు పడేకంటే ఇతర దేశాలను చూసుకోవడమే మేలని భారత విద్యార్థుల్లో అత్యధికులు భావిస్తున్నారు. ‘‘అమెరికా కలలను నిజం చేసుకునే ప్రయత్నంలో ఇప్పటికే ఏడాది వృథా చేసుకున్నా. ఇంకా దానిమీదే ఆశలు పెట్టుకుని మరో ఏడాది కూడా కోల్పోవడానికి సిద్ధంగా లేను. నాలాంటి ఎంతోమంది విద్యార్థుల అమెరికా కలలకు నా ఉద్దేశంలోనైతే ముగింపు కార్డు పడ్డట్టే’’ అని 23 ఏళ్ల ఓ ఆశావహ విద్యార్థి చెప్పుకొచ్చాడు. ఇప్పుడతను ఆటోమోటివ్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేసేందుకు జర్మనీ వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు.214(బి)తోనే సమస్య! గత మార్చిలోనే వీసా స్లాట్లు బుక్ చేసుకుని ఎట్టకేలకు ఇంటర్వ్యూ దాకా వెళ్తున్న భారత విద్యార్థుల్లో అత్యధికులకు ఎంబసీ నుంచి మొండిచెయ్యే ఎదురవుతోంది! ఈ పరిణామంపై కన్సల్టెంట్లే విస్తుపోతున్నారు. మంచి అకడమిక్, సోషల్ మీడియా రికార్డు తదితరాలుండి, గతేడాది దాకా అనాయాసంగా వీసాలు లభించిన ప్రొఫైళ్లను ఈసారి నిర్ద్వంద్వంగా తిరస్కరించేస్తున్నారు. అమెరికా ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్‌లోని 214(బి) సెక్షనే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. చదువు పూర్తయ్యాక మాతృదేశానికి కచ్చితంగా తిరిగి వెళ్తామన్న నమ్మకాన్ని ఎంబసీ అధికారులకు మనవాళ్లు కల్పించలేకపోతున్నారు. ‘‘ఈ నిబంధనలు కొత్తవేమీ కాదు. ఏళ్లుగా ఉన్నవే. కానీ వాటిని ఈ ఏడాదే తొలిసారి అమలు చేస్తున్నారు’’ అని డాలస్‌లో ఇమిగ్రేషన్ కన్సల్టింగ్ సంస్థ నడుపుతున్న రవి లోతుమల్ల వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్

Sex Scandal: 80 వేల న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్!
ఇటీవల థాయ్‌లాండ్‌లో వెలుగుచూసిన బౌద్ధ సన్యాసుల సెక్స్ స్కాండల్ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది దీనికి ప్రధాన సూత్రధారిగా ఉన్న 30 ఏళ్ల విలావన్ ఎమ్సావత్ అనే మహిళను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన థాయ్‌లాండ్ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనాలు సృష్టించడంతో ఆ స్కాండల్‌కు సంబంధించి ఒక్కో విషయం బయటకు వస్తోంది. 80 వేల న్యూడ్ ఫోటోలు.. రూ. 100 కోట్లు దోచేసింది!బౌద్ధ సన్యాసులతో లైంగిక సంబంధాలు కొనసాగించిన విలావన్ ఎమ్ సావత్ అనే మహిళ.. సుమారు 80 వేల న్యూడ్ ఫోటోలు తీసుకుంది. వీటి ద్వారా బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడి సుమారు వంద కోట్లకు పైగానే వెనుకేసింది. కాగా, చివరకు ఈ ఉదంతం బయటకు రావడంతో ఆమె అరెస్ట్ కావడమే కాదు.. విలావత్ జరిపిన ఆర్థిక లావాదేవీల వ్యవహారం బయటకొచ్చింది. మనీ ల్యాండరింగ్ ఆరోపణలతో ఆమె ఖాతాలను తనిఖీ చేయగా సుమారు రూ. 102 కోట్లు దోపిడీ చేసింది. ‘Mrs. గోల్ఫ్’గా పేరు మార్చుకుని లైంగిక సంబంధాలు జరిపిన ఆ మహిళపై దోపిడీ, మనీలాండరింగ్ తదితర కేసులు నమోదు అయ్యాయి.ఈ వ్యవహారం బయటపడిన తర్వాత పదవుల్లో ఉన్న సీనియర్ బౌద్ధ సన్యాసులను తొలగించారు దీనిపై విస్తృత స్థాయిలో విచారణకు రంగం సిద్ధం చేసింది థాయ్ ప్రభుత్వం. మరొకవైపు బౌద్ధ సన్యాసులు బ్రహ్మచర్యం పాటించాల్సిన నియమాన్ని ఉల్లంఘించిన కారణంగా దేశ వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎవరీ విలావన్ ఎమ్ సావత్?విలావన్ ఎమ్ సావత్.. సెక్స్ స్కాండల్ వ్యవహారానికి ప్రధాన పాత్రధారి. బౌద్ధ సన్యాసులే టార్గెట్‌గా ఆమె చేసిన దోపిడీ అంతా ఇంతా కాదు. ‘ శ్రీమతి గోల్ఫ్’ అనే పేరుతో థాయిలాండ్‌లోని బౌద్ధ సమాజాన్ని కుదిపేసిన భారీ కుంభకోణంలో కేంద్ర బిందువుగా మారింది. ఆమె వయసు 35 ఏళ్ల నుంచి 39 ఏళ్ల వరకూ ఉంటుంది. ఆమె గత మూడు సంవత్సరాలుగా కనీసం తొమ్మిది మంది సన్యాసులను బ్లాక్మెయిల్ చేసి, రూ. 100 కోట్లు వసూలు చేసిందనేది ప్రధాన ఆరోపణ. నార్త్ బ్యాంకాక్ నోంతబురిలోని ఆమెకు ఒక లగ్జరీ హౌస్ ఉంది. ఆమెను అదే ఇంట్లో పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై సీరియస్‌గా దృష్టి సారించారు థాయ్ పోలీసులు. ఓ బౌద్ధ సన్యాసి కారణంగా తల్లి అయినట్లు కూడా చెబుతున్న విలావన్ కేసు ఎంతవరకూ వెళుతుందో చూడాలి.

మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ ‘జాడ’ కనిపెట్టేశారు..!
కరాచీ: గ్లోబల్ టెర్రరిస్టు, భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు మసూద్ అజార్ తమ దేశంలో లేడని బుకాయిస్తు వస్తున్న పాకిస్తాన్ దొంగ బుద్ధి మరోసారి బయటపడింది. పాక్ చెబుతున్నది ఎంతమాత్రం నిజం కాదనే విషయాన్ని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తేటతెల్లం చేశాయి. మసూద్ అజార్ పాక్‌లో ఉన్న విషయాన్ని భారత్ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు పసిగట్టేశాయి. పీవోకే(పాక్ ఆక్రమిత కశ్మర్) పరిధిలో గిల్జిట్ బాలిస్తాన్ ప్రాంతంలో మసూద్ సంచరించిన విషయాన్ని తాజాగా వెల్లడించాయి. మసూద్ అజార్ కదలికల్ని అత్యంత దగ్గరగా నిశితంగా పరిశీలిస్తున్న భారత్ ఇంటెలిజెన్స్.. బహవల్పూర్కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో మసూద్ నివాస జాడలు ఉన్నట్లు తెలిపింది. ఇటీవల మసూజ్ అజాయర్ స్కర్దూ, సద్పారా ఏరియాల్లో కనిపించిన విషయాన్ని కూడా ఇంటెలిజెన్స్ స్పష్టం చేసింది. అక్కడ ప్రధానంగా పలు ప్రైవేటు, గవర్నమెంట్ గెస్ట్ హౌస్‌ల్లో మసూద్ కనిపించాడు. కాగా, ఇటీవల ఆల్ అజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిల్వాల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. మసూద్ అజార్ తమ దేశంలో లేడంటూ చెప్పుకొచ్చారు. ఒకవేళ పాకిస్తాన్లో ఉన్నాడని భారత్ సమాచారం ఇస్తే తాము సంతోషంగా అతన్ని అరెస్ట్ చేస్తామని కూడా బుకాయించే యత్నం చేశారు. ఇప్పుడు పాకిస్తాన్‌లోనే అజార్ ఉన్నాడని భారత ఇంటెలిజెన్స్ స్పష్టం చేసిన తరుణంలో బిల్వాల భుట్టో ఏమంటాడో చూడాలిభారత్లో ఉగ్రదాడులకు సూత్రధారిభారత్లో ఇప్పటివరకూ జరుగుతూ వచ్చిన ఉగ్రదాడుల వెనుక మసూద్ అజార్‌ది కీలక పాత్ర. 2016లో పఠాన్‌కోట్‌లో ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడితో పాటు 2019లో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత సైనికుల్ని పొట్టన పెట్టుకున్న ఘటనలో కూడా మసూద్ అజార్ ‘పాత్ర ఉంది. ఆ నేపథ్యంలో భారత్ మోస్గ్ వాంటెడ్ ఉగ్రవాదిగా మసూద్ అజార్ ఉన్నాడు.
జాతీయం

కూటమి భేటీలకు మేమిక దూరం
సాక్షి, న్యూఢిల్లీ: వర్షాకాల పార్లమెంట్ సమావేశాల ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి భారీ షాక్ తగిలింది. ఈ నెల 21 నుంచి మొదలయ్యే వర్షాకాల సమావేశాల్లో మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇండియా పక్షాలు ఏర్పాటు చేసిన ఆన్లైన్ భేటీకి, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే శనివారం ఏర్పాటు చేసిన భేటీకి దూరంగా ఉండనున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ‘‘ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చామని మా పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ కూటమి కేవలం గత లోక్‌సభ ఎన్నికల దాకానేనని కూడా ఆయన అప్పుడే చెప్పారు. కనుక ఇండియా కూటమిలో ఆప్ ఇంకెంత మాత్రమూ భాగం కాదు. టీఎంసీ, డీఎంకే వంటి పార్టీలు మాకు మద్దతిస్తున్నందున పార్లమెంటులో వారితో అంశాలవారీగా సమన్వయాన్ని కొనసాగిస్తాం’ అని ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ తెలిపారు. బిహార్, యూపీ, పూర్వాంచల్‌లో బుల్డోజర్ రాజ్యం, ఢిల్లీలో పేదల ఇళ్ల కూల్చివేతలపై కేంద్రాన్ని ఆప్ నిలదీస్తుందన్నారు.కూటమి బలహీనంగత లోక్‌సభ ఎన్నికల అనంతరం హరియాణా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుంటుందని భావించినా సీట్ల పంపకాల్లో విభేదాలతో అది జరగలేదు. ఆ తర్వాత పంజాబ్, గుజరాత్ ఉప ఎన్నికల్లో కూడా ఆప్ ఒంటరిగానే పోటీ చేసింది. గుజరాత్లో విశావదర్ ఉప ఎన్నికల్లో ఆప్ విజ యం తర్వాత కేజ్రీ వాల్ మాట్లాడుతూ, ఇండియా కూటమి కేవలం గతేడాది లోక్‌సభ ఎన్నికలకు ఉద్దేశించినది మాత్రమే నన్నారు. ‘‘ప్రస్తుతం కాంగ్రెస్‌తో పొత్తు లేదు. బిహార్ సహా అన్ని ఎన్నికల్లోనూ ఆప్ ఒంటరిగా పోటీ చేస్తుంది’’ అని ప్రకటించారు. దానిపై పార్టీ తాజాగా మరింత స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో విపక్షాల స్వరం నానాటికీ మరింత బలహీనపడుతోందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఆప్‌కు ప్రస్తుతం లోక్‌సభలో 3, రాజ్యసభలో 8 మంది ఎంపీలున్నారు. ఇండియా కూటమి నుంచి ఆ పార్టీ బయటకు రావడం విపక్ష ఐక్యతకు పెద్ద దెబ్బే కానుంది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, పాక్‌తో కాల్పుల విరమణలో అమెరికా జోక్యం, మనపై ఆ దేశ సుంకాలు, బిహార్‌లో ఈసీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి పలు అంశాలపై వర్షాకాల సమావేశాల్లో కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇలాంటి సమయంలో కీలక బిల్లులపై ఓటింగ్ జరిగే పక్షంలో ఆప్ లేకపోవడం ఇండియా కూటమికి సంఖ్యాపరంగా ఇబ్బందిగా మారనుంది.

మృగాళ్లకు అండగా తృణమూల్
దుర్గాపూర్: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని, వారు నిత్యం భయంభయంగా బతకాల్సి వస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన మృగాళ్లను ఆ పార్టీ కాపాడుతోందని ఆరోపించారు. మమతా బెనర్జీ ప్రభుత్వ నిర్వాకం వల్ల బెంగాల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న వసూళ్ల దందా చూసి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడం లేదని చెప్పారు. ప్రధాని మోదీ శుక్రవారం బెంగాల్లో పర్యటించారు. చమురు, గ్యాస్, విద్యుత్, రైలు, రహదారులకు సంబంధించిన రూ.5,400 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. జాతికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా దుర్గాపూర్‌లో బహిరంగ సభలో మాట్లాడారు. కోల్‌కతా ఆసుపత్రిలో యువ వైద్యురాలిపై ఘోరంగా అత్యాచారం జరిగిందని అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వారిని నిస్సిగ్గుగా వెనకేసుకొస్తోందని ధ్వజమెత్తారు. ఆ అత్యాచార ఘటన పట్ల దేశమంతా కలవరపాటుకు గురైందని, ఇప్పటికీ కోలుకోలేదని అన్నారు. ఆ ఘటన మర్చిపోకముందే మరో కాలేజీలో మహిళపై అత్యాచారం జరిగిందని ఆక్షేపించారు. ఈ కేసులో నిందితుడికి తృణమూల్ కాంగ్రెస్‌తో సంబంధాలు ఉన్నట్లు బయటపడిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గూండా ట్యాక్స్ ‘‘బెంగాల్లో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయి. ప్రజలకు రక్షణ కల్పించడంలో, న్యాయం చేకూర్చడంలో తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. ముర్షీదాబాద్‌లో అల్లర్లు జరిగితే పోలీసులు బాధితులనే వేధించారు. బాధ్యులను వదిలేశారు. రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరుగుతుందన్న ఆశలు అడుగంటాయి. వారి ప్రాణాలకే భద్రత లేకుండాపోయింది. ఇదంతా ప్రభుత్వ నిర్వాకం కాదా? తృణమూల్ కాంగ్రెస్ పార్టీ డబ్బుల కోసం పారిశ్రామికవేత్తలను పీడిస్తోంది. రాష్ట్రంలో ఆర్థిక ప్రగతికి అడ్డు తగులుతోంది. గూండా ట్యాక్స్‌కు భయపడి పారిశ్రామికవేత్తలు బెంగాల్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. పెట్టుబడులు రావడం, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడం తృణమూల్ కాంగ్రెస్‌కు ఎంతమాత్రం ఇష్టం లేదు. బెంగాల్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని మేము సంకల్పించాం. దేశ ప్రగతికి బెంగాల్‌ను చోదక శక్తిగా మారుస్తాం’’ అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈశాన్య భారత అభివృద్ధికి ‘వికసిత్ బిహార్’ మోతిహరీ: ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించాలన్న నిర్ణయం బిహార్ గడ్డపైనే తీసుకున్నానని, అది ఎలా విజయవంతమైందో ప్రపంచం చూసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈశాన్య భారతదేశ సమగ్రాభివృద్ధికి ‘వికసిత్ బిహార్’ అత్యంత కీలకమని స్పష్టంచేశారు. రాష్ట్ర బహుముఖ ప్రగతికి కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ శుక్రవారం బిహార్‌లో పర్యటించారు. తొలుతు తూర్పు చంపారన్ జిల్లాలో రూ.7,200 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మోతిహరీ జిల్లా కేంద్రంలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘బనాయేంగే నయా బిహార్, ఫిర్ ఏక్‌బార్ ఎన్డీయే సర్కార్’ అనే నూతన నినాదం ఇచ్చారు. దీవసూళ్ల దందానిపై జనం పెద్దఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. మళ్లీ ఎన్డీయే ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని, సరికొత్త బిహార్‌ను నిర్మించుకుందామని మోదీ ఇచ్చిన పిలుపును స్వాగతించారు. బిహార్‌లో విపక్ష కాంగ్రెస్–ఆర్జేడీ కూటమిపై ప్రధానమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ఆర్జేడీ ప్రభుత్వం పేదల భూములు బలవంతంగా లాక్కుందని, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు. పేదలు, అణగారినవర్గాల పేరిట కాంగ్రెస్–ఆర్జేడీ రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. బిహార్ వెనుకబాటుతనానికి ఆ రెండు పారీ్టలే కారణమని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా యువత సంక్షేమం, అభివృద్ధి కోసం ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని మోదీ వెల్లడించారు. ఇందుకోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు ప్రకటించారు. బిహార్ సర్వతోముఖాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, గత 45 రోజుల్లో 24,000 స్వయం సహాయక సంఘాలకు రూ.1,000 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. మోతిహరీని ముంబై తరహాలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మహాత్మా గాంధీ పోరాటానికి బిహార్‌లోని చంపారన్ నూతన దిశను నిర్దేశించిందని మోదీ గుర్తుచేశారు.

స్టాక్ మార్కెట్లో యూత్!
ఒకప్పుడు.. ‘స్టాక్ మార్కెట్‌తో మాకేంటి సంబంధం?’ అని సామాన్యుడు అనుకునేవాడు. కానీ, ఇప్పుడు అదే స్టాక్ మార్కెట్లో సామాన్యులు కూడా పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా, కోవిడ్, ఆ తరువాత జరిగిన అనేక పరిణామాలు.. ఇలా ఇందుకు కారణాలు అనేకం. ఫలితంగా ఇప్పుడు ఇన్టెస్టర్ల సంఖ్యలో ఏటా కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. దేశ జనాభాలో సుమారు 11.5 కోట్ల మంది జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్లో పెట్టుబడులు పెట్టారు. వీరిలో 30 ఏళ్లలోపు వారు 39 శాతం కాగా.. మహిళలు సుమారు 25 శాతం కావడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లోనూ మదుపరులు.. ముఖ్యంగా మహిళల సంఖ్య భారీగా పెరిగింది.బిహార్.. దేశంలోనే అత్యల్ప తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం. నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ) వేదికగా బిహార్ ఇన్వెస్టర్ల సంఖ్య అయిదేళ్లలో దేశంలోనే అత్యధికంగా 678 శాతం పెరిగింది. మదుపరుల సంఖ్య 7 లక్షల నుంచి 52 లక్షలకు దూసుకెళ్లింది. బిహార్‌లోనే ఇలా ఉంటే మరి ఇతర రాష్ట్రాల్లో? అవును.. ఇతర రాష్ట్రాల్లోనూ మదుపరులు గణనీయంగా పెరిగారు. ఎన్ఎస్ఈలో మదుపరుల సంఖ్య 2014–15లో 1,79,60,000. ఈ ఏడాది మే నాటికి అది ఏకంగా 11,49,42,000కు చేరింది. అంటే పదేళ్లలో 540 శాతం పెరుగుదల! 5–6 నెలలకే కొత్తగా కోటి మంది ఇన్వెస్టర్లు వచ్చి చేరుతున్నారంటే స్టాక్ మార్కెట్ పట్ల ఆసక్తి ఏ స్థాయిలో పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.సులభమైన షేర్ల లావాదేవీలు!స్మార్ట్ ఫోన్ సామాన్యుడికి చేరువైంది. ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలు సులువయ్యాయి. ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే భయపడే రోజుల నుంచి.. ప్రతిరోజూ వేలూ, లక్షల రూపాయలను రకరకాల మార్గాల్లో పంపే పరిస్థితులు వచ్చాయి. డిజిటల్ అక్షరాస్యత గణనీయంగా పెరిగింది. మరోపక్క.. దేశీయ స్టాక్ మార్కెట్ కూడా రోజురోజుకూ కొత్త శిఖరాలను అధిరోహిస్తూ మదుపరులను ఊరిస్తోంది. తక్కువ సమయంలో, సులభమైన ఆదాయ మార్గంగా స్టాక్ మార్కెట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే ఒకప్పుడు దరఖాస్తు ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉండేది.ఏ కంపెనీని ఎంచుకోవాలో సమాచారం తెలిసేది కాదు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు! షేర్ల కదలిక కళ్ల ముందు కనపడుతోంది. సామాన్యులు సైతం అతి తక్కువగా.. అంటే రూ.100 పెట్టుబడితో స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టొచ్చు. పెట్టుబడి పెట్టడమే కాదు.. ఉపసంహరణ సైతం చాలా సులభం అయిపోయింది. ముఖ్యంగా రిటైల్ ట్రేడింగ్‌ను సులభతరం చేసే ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్ ఎన్నో వచ్చాయి. కోవిడ్ సమయంలో చాలామందికి ఇంటి దగ్గర ఉంటూ ఆదాయార్జన మార్గంగా స్టాక్ మార్కెట్‌ను ఎంపిక చేసుకున్నారు. ఇలాంటి అనేక అంశాలు స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారుల సంఖ్య పెరగడానికి కారణమయ్యాయి.పెరిగిన మహిళా శక్తి!..: స్టాక్ మార్కెట్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుండడం విశేషం. మహిళా ఇన్వెస్టర్ల వాటా 2022–23లో 22.5 శాతం కాగా ఈ ఏడాది మే నాటికి 24.4 శాతానికి చేరింది. గోవాలో అత్యధికంగా మహిళా పెట్టుబడిదారులు 32.6 శాతం ఉన్నారు. దేశంలో మొత్తం ఇన్వెస్టర్ల పరంగా మహిళా ఇన్వెస్టర్ల అత్యధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ 28.4 శాతం ఉంటే , గుజరాత్లో 27.8 శాతం ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 23.4, తెలంగాణలో 24.9 శాతం మహిళలు ఉన్నారు.ఆ మూడు రాష్ట్రాలు..: ఒక కోటి మంది ఇన్వెస్టర్ల క్లబ్లో చేరిన మూడో రాష్ట్రంగా గుజరాత్ అవతరించింది. 1.86 కోట్లతో మహారాష్ట్ర, 1.31 కోట్లతో ఉత్తరప్రదేశ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే 4.2 కోట్లతో ఉత్తర భారత్ అగ్రస్థానంలో ఉంది. పశ్చిమ భారత్ 3.5 కోట్లు, దక్షిణాది 2.4 కోట్లు, తూర్పు భారత్‌లో 1.4 కోట్ల మంది ఇన్వెస్టర్లు ఉన్నారు. సంఖ్యా పరంగా ఏడాదిలో ఉత్తరాదిలో 24%, తూర్పు భారత్ 23%, దక్షిణాది 22%, పశ్చిమ భారత్‌లో 17% వృద్ధి నమోదైంది. మే నెలలో తోడైన కొత్త ఇన్వెస్టర్ల సంఖ్యలో దేశంలోని టాప్–10 జిల్లాల్లో రంగారెడ్డి (8), హైదరాబాద్ (10) చోటు దక్కించుకున్నాయి.దేశ వ్యాప్తంగా 11.5 కోట్ల మంది మదుపరులకు జూలై 14 నాటికి 22.87 కోట్లకుపైగా ట్రేడింగ్ అకౌంట్లు ఉన్నాయి. వీటిలో ఏపీ నుంచి 1.04 కోట్లకుపైగా ఉంటే, తెలంగాణలో 51.50 లక్షలకుపైగా ఉన్నాయి.

ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టుల మృతి
చత్తీస్గడ్: భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో భద్రతా బలగాలకు ఎదురుపడ్డ మావోయిస్టులు ఎదురు కాల్పులు జరపడానికి యత్నించారు. అబుజ్మాడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ రోజు(శుక్రవారం, జూలై 18) మధ్యాహ్న సమయం నుంచి భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య తీవ్ర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.. పలుమార్లు జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి పలు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు.మావోయిస్టుల వేరివేతే లక్ష్యంగా భదత్రా బలగాలు పలు ఆపరేషన్లు చేపట్టాయి. మావోయిస్టులు లొంగిపోవడం ఒకటైతే, ఇంకోటి ఏరివేతే అనే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. తమతో చర్చలు జరపాలని మావోయిస్టులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం చర్చలకు అంగీకరించలేదు. వచ్చే మార్చి నాటికి పూర్తిగా మావోయిస్టులనే ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా పలు ఆపరేషన్ల పేరుతో మావోయిస్టుల ఉన్న ఏరియాలను జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు.
ఎన్ఆర్ఐ

లండన్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు
కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుక సంబరాలు అంబరాన్నంటాయి. శుక్రవారం రోజున బండి సంజయ్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని లండన్ ఇల్ఫార్డ్‌లోని బీజేపీ శ్రేణులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్, స్వీట్లు, పంపిణి మొక్కలు నాటడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టారు.బీజేపీ లండన్ అధ్వర్యంలో ఇల్ఫార్డ్ లోని బండి సంజయ్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, స్వీట్లు, పూల మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాటిపల్లి సచిందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ క్షేత్రస్థాయిలో దిగ్విజయనేత అని కొనియాడారు. కార్పొరేటర్ నుండి ఎంపీ, కేంద్రమంత్రి స్థాయికి బండి సంజయ్ ఎదిగిన తీరు కార్యకర్తలకు ఆదర్శం, స్ఫూర్తిదాయకమన్నారు. సరస్వతీ శిశు మందిరం లో విద్యనభ్యసించిన బండి సంజయ్ కుమార్ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని అన్నారు.ఆర్ఎస్ఎస్లో ఘటన్ నాయక్ గా, ముఖ్య శిక్షక్ గా ప్రాథమిక విద్యా స్థాయిలోనే బండి సంజయ్ పని చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో, బిజెపి కరీంనగర్ పట్టణ ఉపాధ్యక్షుడిగా, అధ్యక్షులుగా, జిల్లా , రాష్ట్ర కార్యవర్గాల్లో వివిధ హోదాల్లో బిజెపిలో ఆయన బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ కేరళ, తమిళనాడు రాష్ట్రాల ఇన్చార్జిగా ను ఆయన పని చేశారని, ఎల్కే అద్వానీ చేపట్టిన రథయాత్రలోనూ బండి సంజయ్ కుమార్ భాగం పంచుకున్నారని , 35 రోజులపాటు దేశవ్యాప్తంగా జరిగిన ప్రచారంలో పాల్గొన్నారని తెలిపారు. 1994 _ 2003 మధ్యకాలంలో బండి సంజయ్ కుమార్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా పని చేశారన్నారు.2005లో కరీంనగర్ 48వ డివిజన్ నుండి కార్పొరేటర్‌గా బండి సంజయ్ విజయం సాధించారని, వరుసగా మూడుసార్లు ఆయన కార్పొరేటర్ గా గెలుపొందారన్నారు.2019 లో కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారని తెలిపారు. అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ కుమార్ పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన సారాధ్యంలో బిజెపి రాష్ట్రంలో పుంజుకుందన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణ వ్యాప్తంగా బండి సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్రతో బీజేపీ గ్రామ గ్రామానికి చేరిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై, వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ, అధికార పార్టీపై తీవ్రస్థాయిలో బండి సంజయ్ కుమార్ విరుచుకుపడ్డారని తెలిపారు.బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో రాష్ట్రంలో జరిగిన దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలు జిహెచ్ఎంసి ఎన్నికలు చరిత్ర సృష్టించాయన్నారు. బండి సంజయ్ దిశా నిర్దేశంలో రాష్ట్రంలో బిజెపి గ్రాఫ్ పెరిగిందన్నారు. అనంతరం బండి సంజయ్ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారని తెలిపారు. కరీంనగర్ చరిత్రలోనే భారీ మెజారిటీతో రెండోసారి బండి సంజయ్ పార్లమెంట్ సభ్యునిగా గెలుపొంది, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారని తెలిపారు. ప్రస్తుతం దేశ, రాష్ట్ర బిజెపి కీలక నేతల్లో బండి సంజయ్ ఒకరని చెప్పారు.ప్రధానంగా కరీంనగర్ పార్లమెంటు సర్వతో ముఖాభివృద్ధి కోసం బండి సంజయ్ కుమార్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, రెండు టర్ములలో పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక మెజారిటి తో గెలుపొంది రాష్ట్ర బిజెపి అధ్యక్షునిగా పనిచేసి కేంద్రమంత్రి గా కొనసాగుతూ స్థానికంగా ప్రజలకి అందుబాటులో ఉంటున్నారని కొనియాడారు ఈ కార్యక్రమం లోఓవర్సీస్ బీజేపీ నాయకులు వాస భరత్, బండ సంతోష్, కోమటిరెడ్డి శివ ప్రసాద్ రెడ్డి, జయంత్, సంజయ్, బద్దం చిన్న రెడ్డి, సురేష్, చార్లెస్, జేమ్స్, ఆంథోనీ తదితరులు పాల్గొన్నారు.

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవం
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బోనాల పండుగ వైభవంగా జరిగింది. శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో సుమారు 900 మంది భక్తులతో ఈ వేడుకు ఘనంగా జరిగింది. అంతర్జాలం ద్వారా మరో 7,000 మంది వీక్షించారు. తెలంగాణ జానపద గేయాలు, భక్తిగీతాలు, నృత్యప్రదర్శనలు ఉత్సవానికి విశేష ఆకర్షణగా నిలిచాయి.బోయిన స్వరూప, పెద్ది కవిత, సరితా తులా, దీపారెడ్డి, మోతే సుమతి, గంగా స్రవంతి, సంగీత తదితర మహిళలు కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. మొదటి నుంచి చివరి వరకు సాంప్రదాయభరితంగా, సాంస్కృతిక ఘనతతో కొనసాగిన ఈ కార్యక్రమంలో తెలుగు కుటుంబాలు, కార్మిక సోదరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.మహిళలు, చిన్నారులు ఉత్సాహంతో నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. కాళికా అమ్మవారికి వేపచెట్టు రెమ్మలు, పసుపు, కుంకుమతో అలంకరించి, దీపం వెలిగించిన బోనాలను అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పించారు. మట్టి కుండల్లో అన్నం, పాలు, పెరుగు, బెల్లంతో చేసిన బోనాలను తలపై మోస్తూ, డప్పులు, పోతురాజులు, ఆటగాళ్లతో ఆలయానికి తరలివచ్చారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను పంచిపెట్టారు. పెద్దపులి ఆట, పోతురాజు వేషధారణ, సాంస్కృతిక నృత్యాలు కార్యక్రమానికి మరింత ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా సింగపూర్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని నిర్వాహకుడు బోయిన సమ్మయ్య తెలిపారు.బోనాలు తెలంగాణకు ప్రత్యేకమైన సాంప్రదాయక పండుగ అని, తక్కువ సమయంలో పెద్ద ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిచారంటూ సమాజం అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అభినందించారు. ఈ ఏడాది సమాజం సువర్ణోత్సవాలను కూడా ప్రకటించారు. కార్మిక సోదరులు పెద్దఎత్తున హాజరయినందుకు ఉపాధ్యక్షులు పుల్లన్నగారి శ్రీనివాసరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షులు కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి స్పాన్సర్ వజ్ర రియల్‌ఎస్టేట్‌కు అభినందనలు తెలిపారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సింగపూర్ తెలుగు సమాజం, అరసకేసరి దేవస్థానం సభ్యులకు, ఆహుతులకు, హాజరైన భక్తులు అందరికీ గౌరవ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.కోశాధికారి ప్రసాద్, ఉపకోశాధికారి ప్రదీప్, ఉపాధ్యక్షులు నాగేష్, మల్లిక్, కార్యదర్శి స్వాతి, కమిటీ సభ్యులు గోపి కిషోర్, జనార్ధన్, జితేందర్, భైరి రవి, గౌరవ ఆడిటర్లు ప్రీతి, నవత తదితరులు ఈ వేడుకలో భాగం పంచుకున్నారని, తెలుగు వారంతా బోనాల స్ఫూర్తితో పాల్గొని మన ఐక్యతను చాటారని నిర్వాహకులు పేర్కొన్నారు.

ట్రంప్‌కు మరో షాక్.. రాజీనామా యోచనలో కాష్ పటేల్!
ట్రంప్ వీరవిధేయుడు, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బ్యూటీఫుల్ బిల్లు విషయంలో విభేదాలతో ఎలాన్ మస్క్ డోజ్‌ను వీడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాష్ పటేల్ కూడా ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో అదే బాటలో పయనించే అవకాశం కనిపిస్తోంది.వాషింగ్టన్: భారత సంతతికి చెందిన కాష్ పటేల్(కశ్యప్ ప్రమోద్ పటేల్) ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో రాజీనామా చేస్తారనే ఊహాగానాల నడుమ.. కాష్ ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. డాన్ రాజీనామా చేసిన వెంటనే తన పదవి నుంచి వైదొలగాలని కాష్ భావిస్తున్నారని స్థానిక మీడియా కథనాలు ఇస్తోంది. ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్‌లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి. ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినోఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారాన్ని అమెరికా న్యాయ విభాగం.. ఎఫ్‌బీఐ కలిపి విచారిస్తోంది. అయితే ఈ కేసును అటార్నీ జనరల్ పామ్ బాండీకు అప్పగించినప్పటి నుంచి ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన సెలవులపై వెళ్లారు. అయితే ఆమె ఉండగా తాను తిరిగి విధుల్లోకి రాలేనని బోంగినో ఎఫ్‌ఐబీకి స్పష్టం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ తరుణంలోనే కాష్ పటేల్ ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బోంగినో గనుక రాజీనామా చేస్తే.. కాష్ తాను పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నారని అక్కడి మీడియా కథనాలు ఇచ్చింది. పామ్ బాండీ‘‘ఈ దర్యాప్తులో పామ్ బాండీ ఉండాలని కాష్ పటేల్ కూడా కోరుకోవడం లేదు. బాండీ మరికొన్ని పత్రాలను విడుదల చేయకపోవడంపైనా ఎఫ్‌బీఐ వర్గాల్లో తీవ్ర అసహనం నెలకొంది. అందుకే బోంగినో గనుక వీడితే ఆయన కూడా ఎఫ్‌బీఐని వీడే అవకాశం ఉంది’’ అని ఓ ప్రముఖ జర్నలిస్టు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎఫ్‌బీఐకి, డీవోజే(డిపార్ట్మెంట ఆఫ్ జస్టిస్)కు నడుమ పొసగట్లేదన్న విషయాన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ట్రంప్ అనుచరురాలు లారా లూమర్ సైతం ధృవీకరించడం గమనార్హం. పారదర్శకత లోపించిందనేది ప్రధాన ఆరోపణతో ఎఫ్‌బీఐ వర్గాలు బాండీ తీరుపట్ల అసంతృప్తిగా ఉన్నాయంటూ లూమర్ తెలిపారు. ఈ క్రమంలో బాండీని.. బ్లోండీ అంటూ ఆమె ఎద్దేవా చేయడం గమనార్హం. ప్రముఖ ఇన్వెస్టర్ అయిన ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఫైల్స్ ఇప్పటిదాకా బయటకు రాకపోవడంతో అమెరికా రాజకీయాల్లో, మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. అయితే.. ఎప్స్టీన్ ఫైల్స్‌లో.. ప్రముఖుల పేర్లు ఉన్నాయని, వాటిని త్వరలోనే బయటపెడతామని ఫిబ్రవరిలో ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పామ్ బాండీ ప్రకటించారు. అయితే తాజాగా డీవోజే-ఎఫ్‌బీఐ సంయుక్తంగా విడుదల చేసిన మెమోలో.. ఎలాంటి ఆధారాల్లేవని, కేసును ముగించినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాండీ మాటమార్చి.. తన గత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఒకవైపు ఎలాన్ మస్క్ సైతం ఈ వ్యవహారంపై ట్రంప్ ప్రభుత్వానికి చురకలంటిస్తున్నారు. మరోవైపు ట్రంప్ ఈ వ్యవహారంపై తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటిదాకా ఎఫ్‌బీఐ వర్సెస్ జ్యూడీషియల్ డిపార్టెమెంట్ వ్యవహారంపై వైట్‌హౌజ్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇంకోవైపు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA) ఉద్యమకారులు సైతం ఈ పరిణామాలపై అసంతృప్తితో రగిలిపోతున్నారు.కశ్యప్ పూర్వీకులు భారత్‌లోని గుజరాత్ నుంచి వలస వెళ్లారు. అతడి తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. ఉగాండా నుంచి అమెరికాకు వలస వచ్చారు. 1980లో న్యూయార్క్‌లో కశ్యప్ జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశారు.అనంతరం మియామీ కోర్టుల్లో లాయర్‌గా వివిధ హోదాల్లో సేవలందించారు. ఆ సమయంలోనే ట్రంప్‌కు ఆయన దగ్గరయ్యారు. ఫిబ్రవరి 22వ తేదీన ఎఫ్‌బీఐ 9వ డైరెక్టర్‌గా కాష్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో పామ్ బాండీ కాష్‌తో ప్రమాణం చేయించగా.. భగవద్గీత మీద చేయి ఉంచి ఆయన బాధ్యతలు చేపట్టారు.

యూఎస్‌కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్!
కూటి కోసం కోటి తిప్పలు..ఇది సగటు మనిషి ఆలోచన. మెరుగైన జీవితం కోసం డాలర్ డ్రీమ్స్ ఎందరివో. విదేశాలకు వెళ్లాలి. డాలర్లలో సంపాదించాలి అనేది లెక్కలేనంతమంది భారతీయు యువతీ యువకుల ఆశ, ఆశయం. కానీ డాలర్ డ్రీమ్స్ ఇపుడు మసక బారుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువమంది భారతీయ టెకీలు నివసించే అమెరికాలోరోజు రోజుకీ మారుతున్న పరిణామాలు భారతదేశానికి తిరిగి పయనమయ్యేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్డిట్‌లో అమెరికాలో ఉంటున్న ఒక యువజంట పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ జంట గత 15 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తోంది. వీరి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) హోదాను కలిగి ఉన్నారు, ఇది వారికి ఏ దేశంలోనైనా నివసించడానికి, పని చేయడానికి వెసులుబాటునిస్తుంది. కుమారుడికి కూడా అమెరికా పౌరసత్వం ఉంది. ముగ్గురు సభ్యుల ఫ్యామిలీ ఇండియాకు తిరిగి రావాలని ప్లాన్ చేస్తోంది. ‘‘మేం ఇద్దం 30ల్లో ఉన్నాం. టెక్నాలజీ, ఇక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారతదేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తున్నాం. ఒక ముగ్గురు సభ్యులున్న కుటుంబం ఇండియాలో బతకాలంటే రూ. 25 కోట్లు సరిపోతాయా... రిటైర్ మెంట్ తరువాత పిల్లలను పెంచుకుంటూ, హ్యాపీగా జీవించాలి అసలు ఎంత కావాలి దయచేసి తెలపండి’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇండియాకు వెళ్లాక కొంతకాలం విరామం తీసుకోవచ్చు. ఆ తరువాత ఇంట్రస్ట్‌ను బట్టి ఉద్యోగాలు వెదుక్కుంటాం. కానీ అది మా జీవితాలను ప్రభావితం చేయకూడదని పేర్కొన్నారు. దాదాపు 5.5 మిలియన్ల డార్లు (సుమారు రూ. 47.21 కోట్లు) ఉన్నాయంటూ తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను కూడా అందించారు.రెడ్డిటర్లు ఈ పోస్ట్‌పై స్పందించారు. అది మీరుండే నగరం, ఇల్లు,అలవాట్లు, జీవన శైలిసహా అనేక అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని కొందరు సాధారణంగా భారతీయ నగరంలో జీవించడానికి రూ. 25 కోట్లు సరిపోతాయని మరి కొందరు చెప్పగా, టైర్ 2 స్మార్ట్/బాగా అభివృద్ధి చెందిన నగరంలో నివసిస్తుంటే ప్రామాణిక ఖర్చులు అద్దె, ఆహారం, కొన్ని అవసరమైన వస్తువులు సహా 75 వేల రూపాయలు సరిపోతాయి. సొంత ఇల్లు ఇంకా మంచిది. పిల్లవాడికి ఒక మాదిరి స్కూలు ఫీజు నెలకు 30-50 వేలు చాలు. నికరంగా ఒక స్టాండర్డ్ లైఫ్‌కి నెలకు 2 లక్షలు బేషుగ్గా సరిపోతాయి రెండు మూడేళ్ల తరువాత ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుంటే చాలు అని ఒకరు వివరించారు. (Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!)ముగ్గురే కాబట్టి ఇక్కడ సౌకర్యవంతంగా బతకాలంటే జీవనశైలి బట్టి నెలకు కనీసంగా రూ. 4 లక్షలు, గరిష్టంగా రూ. 8 కోట్లు సరిపోతాయని లెక్కలు చెప్పారు. మరో యూజర్ ఏమన్నారంటే.. "నేను ఇటీవల భారతదేశంలో (ముఖ్యంగా బెంగళూరులో) కొంత సమయం గడిపాను. US కి దగ్గరగా జీవించాలనుకుంటే ఇండియాచాలా ఖరీదైనది. US సబర్బన్ లాంటి, బెంగళూరులోని ఆదర్శ్, బ్రిగేడ్ లేదా ప్రెస్టీజ్ వంటి కొన్ని ప్రీమియర్ గేటెడ్ కమ్యూనిటీలు 2000 చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో రూ. 5 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అవుతాయి కానీ మీరు ఇంతకంటే చవగ్గా కూడా బతకొచ్చు. కాబట్టి మూడు మిలియన్ డాలర్లు సరిపోతాయా లేదా అనేది మీమీదే ఆధారపడి ఉంటుదని మరొకరు వ్యాఖ్యానించారు.అంతేకాదు “ఇండియాలో ట్రాఫిక్, దుమ్ము, కాలుష్యం, అవినీతి, శాంతిభద్రతల సమస్యలు, వేడి, నీటి కొరత లాంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.” అని మరో రెడ్డిటర్ వ్యాఖ్యానించాడు.ఇదీ చదవండి: Lishalliny Kanaran : భారతీయ పూజారిపై మిస్ గ్రాండ్ మలేషియా సంచలన ఆరోపణలు!
క్రైమ్

ఎమ్మెల్యే వేధింపులు తాళలేను.. ఆత్మహత్య చేసుకుంటున్నా
తిరువూరు: సీనియారిటీ, స్థానికత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం పచ్చనాయకుల సిఫార్సుల మేరకు కూటమి ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేపట్టిన బదిలీలకు ఉద్యోగులు బలైపోతున్నారు. పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికిన చందంగా.. ఉద్యోగుల ప్రాణాలతోనే చెలగాటమాడుతున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఉన్నతాధికారులు దళిత ఉద్యోగినైన తనను వేధింపులకు గురి చేశారని, భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు దళితుడైన ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని మైనర్ ఇరిగేషన్ సెక్షన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వి.కిషోర్ శుక్రవారం సీఎం, డిప్యూటీ సీఎంలకు లేఖ రాశారు. తనను తిరువూరు నుంచి గౌరవరం ఎన్ఎస్సీ సెక్షన్‌కు బదిలీ చేసిన అధికారులు రిలీవ్ చేయలేదని, దీనిపై ఎమ్మెల్యేను పలుమార్లు కోరినా ఫలితం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. విజయవాడ స్పెషల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గంగయ్య, కంచికచర్ల స్పెషల్ సబ్ డివిజన్ డీఈఈ ఉమాశంకర్ కలిసి తనకు రాజకీయ రంగు పులిమి ఇంజినీర్ ఇన్ చీఫ్ శ్యాంప్రసాద్‌కు తిరువూరు ఎమ్మెల్యేతో ఫోన్ చేయించి తన బదిలీని నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రిలీవ్ చేయవద్దన్నారని స్వయంగా ఇంజినీర్ ఇన్ చీఫ్ చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అధికారులు, తిరువూరు ఎమ్మెల్యే కలిసి ఆడిన రాజకీయ నాటకంలో తాను బలైపోయానని, తన చావుకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఏ ఉద్యోగీ తనలా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చూడాలని లేఖలో కోరారు. ఇరిగేషన్ అధికారుల వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసిన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లారు.

కట్నం వేధింపులతో యువతి ఆత్మహత్య... ఒంటిపై సూసైడ్ నోట్
లక్నో: మరింత కట్నం తేవాలంటూ అత్తింటి వారు పెట్టే వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు కారణమంటూ భర్తతోపాటు అత్తింట్లో వాళ్ల పేర్లను ఒంటిపై రాసుకుని మరీ ఈ అఘాయిత్యానికి పాల్పడింది. మనీషా అనే యువతికి 2023లో నోయిడాకు చెందిన కుందన్‌తో పెళ్లయింది. మొదట్లో అంతా సాఫీగానే వారి కాపురం సాగింది. ఆ తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. పెళ్లప్పుడు బుల్లెట్ బైక్‌ను కొనిచ్చారు మనీషా తల్లిదండ్రులు. అయితే, ఎస్యూవీ కావాలంటూ కుందన్ కుటుంబీకులు డిమాండ్ చేయనారంభించారు. తమకు అంత స్థోమత లేదని చెప్పడంతో మనీషా తల్లిదండ్రులు తెలపడంతో శారీరకంగా, మానసికంగా వేధింపులు తీవ్రతరం చేశారు. ‘అన్నం పెట్టకుండా పస్తులుంచుతున్నారు. గదిలో ఉంచి తాళం వేస్తున్నారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ కుందన్ బెదిరిస్తున్నాడు’అని మనీషా తన చేతిపై రాసుకుంది. వేధింపులు తట్టుకోలేక మనీషా 2024లో పుట్టింటికి చేరుకుంది. అక్కడున్నా వేధింపులకు మాత్రం అంతం లేకుండాపోయింది. ఇటీవల కుందన్, అతడి తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు గ్రామ పెద్దను తీసుకువచ్చి విడాకుల పత్రాలపై సంతకం చేయాలంటూ మనీషాను, ఆమె కుటుంబాన్ని ఒత్తిడి చేశారు. ఒప్పుకోకపోయేసరికి బెదిరింపులు మొదలుపెట్టారు. ‘నా మరణానికి భర్త కుందన్, మరుదులు దీపక్, విశాల్లే కారణం. పంచాయితీ సమయంలో వారు నా కుటుంబానికి హెచ్చరికలు చేశారు’అంటూ మనీషా తన కాలిపై రాసుకుంది. ‘మంగళవారం రాత్రి మేడపైన పడుకునేందుకు వెళ్లిన మనీషా పురుగుమందు తాగింది. ఉదయానికి విగతజీవిగా కనిపించింది’అని కుటుంబీకులు చెప్పారు. అత్తింటి నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లు, వేధింపులను తాళలేక డిప్రెషన్‌తో బలవన్మరణం చెందిందన్నారు. చనిపోయేముందే శరీరంపై ఆమె ఈ మేరకు రాసుకుందన్నారు. మనీషా మరణానికి విష ద్రావకమే కారణమని పోస్టుమార్టంలో తేలిందని ఏఎస్పీ ఎన్పీ సింగ్ చెప్పారు. ఆమె కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు.

HYD: ట్యాక్స్ ఎగ్గొట్టే యత్నం.. పట్టించిన ఏఐ
స్థిరాస్తి విక్రయాలకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖకు చెల్లించాల్సిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ (ఎల్టీసీజీ) ట్యాక్స్ ఎగవేయాలని పథకం వేసిన హైదరాబాద్ వ్యాపారి కొన్ని నకిలీ బిల్లులు సృష్టించారు. రూ.21.6 లక్షలు చెల్లించాల్సిన చోట రూ.7200 చెల్లిస్తే చాలన్నట్లు తయారు చేశారు. ఓ బిల్లులోని ఫాంట్‌పై అనుమానం వచ్చిన ఐటీ అధికారులు ఏఐ టూల్ వినియోగించారు. ఈ నేపథ్యంలో ఆ బిల్లుపై ఉన్న తేదీ నాటికి మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో ఆ ఫాంట్ లేదని నివేదిక వచ్చింది. దీని ఆధారంగా ఐటీ అధికారులు సదరు వ్యాపారికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించారు. గత్యంతరం పరిస్థితుల్లో సదరు వ్యాపారి రూ.21.6 లక్షలు చెల్లించి కేసు నుంచి బయటపడాల్సి వచ్చింది.హైదరాబాద్‌లోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం కేంద్రంగా జరిగిన ఈ వ్యవహారం పూర్వాపరాలు ఇలా... ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం ఎల్టీసీజీ ద్వారా వచ్చే లాభంలో 30 శాతం పన్నుగా చెల్లించాలి. అయితే ఈ మొత్తాన్ని మరో స్థిరాస్తి పైన లేదా దాని అభివృద్ధి కోసం వెచ్చిస్తే ఆ మొత్తానికి మినహాయింపు పొందవచ్చు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి 2000కు ముందు రూ.68 లక్షలు వెచ్చించి శివార్లలో ఉన్న ఓ పాత ఇంటిని ఖరీదు చేశారు. దీనికి మరమ్మతులు చేసి అదనపు హంగులు చేర్చారు. దీంతో పాటు రియల్ ఎస్టేట్ బూమ్ కారణంగా రూ.1.4 కోట్లకు విక్రయించారు. ఇలా సదరు స్థిరాస్తి విక్రయం ద్వారా 2002లో రూ.72 లక్షలు లాభం పొందారు. దీనిపై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌గా రూ.21.6 లక్షలు చెల్లించాల్సి ఉంది.అయితే 2002–08 మధ్య తనకు చెందిన మరో ఇంటి అభివృద్ధి కోసం రూ.71 లక్షలకు పైగా వెచ్చించినట్లు నకిలీ బిల్లులు సృష్టించారు. వీటిని ఆదాయపు పన్ను శాఖకు సమర్పిస్తూ చేస్తూ తనకు క్యాపిటల్ గెయిన్గా కేవలం రూ.24 వేలు మిగిలినట్లు చూపించారు. ఇందులో 30 శాతం యడం ద్వారా ఆ మేరకు మినహాయింపు పొంది మిగిలిన రూ.7200 చెల్లించారు. ఈ వ్యవహారాన్ని సందేహించిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు సదరు వ్యాపారికి నోటీసులు జారీ చేస్తుండగా దానికి ఆయన నుంచి సమాధానాలు వెళ్తున్నాయి. ఇలా దాదాపు 16 ఏళ్లుగా వీరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి.ఈ బిల్లుల్లోని లోటుపాట్లను గుర్తించడానికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏఐ టూల్ వినియోగించారు. వ్యాపారి సమర్పించిన బిల్లుల్లో 2002 జూలై 6 తేదీతో రూ.7.6 లక్షలది కూడా ఉంది. దీన్ని విశ్లేషించిన ఏఐ టూల్ అందులోని ఫాంట్లో ఉన్న లోపాన్ని ఎత్తి చూపింది. ఆ బిల్లు మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లోని కాలిబ్రి అనే ఫాంట్‌తో ముద్రించి ఉంది. డిజిటల్ సాన్స్–సెరిఫ్ టైప్ ఫేస్ ఫాంట్ అని గుర్తించిన ఏఐ టూల్ మరికొన్ని కీలకాంశాలను బయటపెట్టింది.దీన్ని 2002–2004 మధ్య డచ్ డిజైనర్ లూకాస్ డి గ్రూట్ రూపొందించారని, 2006లో విండోస్ విస్టాతో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని తేల్చింది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో ఆ ఫాంట్ 2007 నుంచి మాత్రమే అందుబాటులోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. వర్డ్‌లో టైమ్స్ న్యూ రోమన్‌ని, పవర్‌పాయింట్, ఎక్సెల్, ఔట్లుక్ల్లో ఏరియల్న ఫాంట్‌కి బదులు ఇది అందుబాటులోకి వచ్చినట్లు ఆ టూల్ నివేదించింది. కంప్యూటర్ ప్రపంచంలోకి 2006లో అందుబాటులోకి వచ్చిన ఫాంట్‌తో 2002లో బిల్లు ముద్రితం కావడం అసాధ్యమని స్పష్టం చేసింది. ఈ నివేదిక ఆధారంగా ఐటీ అధికారులు సదరు వ్యాపారికి మరోసారి నోటీసులు జారీ చేశారు. దీంతో గత్యంతరం లేక ఆ వ్యాపారి మొత్తం రూ.21.6 లక్షలు చెల్లించిన అధికారులకు క్షమాపణ చెప్పి వెళ్లారు.- శ్రీరంగం కామేష్

హైదరాబాద్‌లో బరితెగిస్తున్న బ్లడీ చీటర్స్
మానవత్వం మంటగలిసిపోతోంది.. అమూల్యమైన సేవలకు సైతం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.. కొందరి అమాయకత్వం, అవసరం.. ఇంకొందరికి వరంగా మారుతోంది.. సమాజం కోసం ఏదో చేయాలనే తపనతో ఓ వైపు యువత స్వచ్ఛందంగా రక్తం దానం చేసేందుకు ముందుకొస్తుంటే.. మరికొందరు బాధితుల అవసరాన్ని సైతం సొమ్ము చేసుకుంటున్నారు!!.ఇటీవలి కాలంలో రక్తదానంపై అవగాహన పెరగడంతో చాలా మట్టుకు ఆపద సమయాల్లో అవసరం తీరుతోంది. సరిగ్గా అదే అదునుగా కొందరు కేటుగాళ్లు బరితెగిస్తున్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి ఆస్పత్రులకు వచ్చేవారిని టార్గెట్ చేస్తూ బాధితులకు టోకరా వేస్తున్నారు.. మానవత్వం ముసుగులో సమాజం సిగ్గుతో తలదించుకునే చర్యలకు పాల్పడుతున్నారు.. బ్లడీ చీటర్స్.. అంతేకాదు.. డబ్బు స్వాహా చేసేదే కాకుండా అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వివిధ ఆరోగ్య సమస్యలతో నగరంలోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌తో పాటు జాతీయ స్థాయిలో పేరొందిన పలు కార్పొరేట్ ఆస్పత్రులకు అనేక మంది బాధితులు వస్తుంటారు. సరిగ్గా వీరినే ఆసరా చేసుకుని సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్ళు. సేవ పేరుతో సమాజం తలదించుకునే మోసానికి తెరతీస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమని సోషల్ మీడియాల్లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో పెట్టే విజ్ఞప్తులను క్యాష్ చేసుకుంటున్నారు. ఆపదలో ఉన్న వారి ప్రాణాలతో ఆటలాడుతున్నారు.. అమూల్యమైన వారి సమయాన్ని ధనార్జన కోసం ఫణంగా పెడుతున్నారు.సమాచారమే.. వారి డేటా..అత్యవసర పరిస్థితుల్లో రక్తం కోసం కుటుంబసభ్యులు, మిత్రుల ద్వారా సామాజిక మాధ్యమైలన వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్ వంటి వాటిల్లో సహాయం కోరేవారి వివరాలే వారికి డేటాగా మారుతోంది.. అలాంటి సమాచారాన్ని సేకరించిన మోసగాళ్లు దాతల పేరుతో తక్షణమే బాధితులకు ఫోన్ చేస్తారు. ‘నాకు ఫలానా గ్రూపులో మెసేజ్ కనిపించింది. నేను రక్తం ఇవ్వడానికి సిద్ధం. కానీ నేను నగరానికి దూరంలో ఉన్నాను.. అయితే నా దగ్గర ప్రస్తుతం ట్రావెల్ చేయడానికి డబ్బులు లేవు.. మీరు ఏమీ అనుకోకుండా ఫోన్పేగానీ, గూగుల్పేగానీ చేస్తే వెంటనే వస్తాను.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో రావాలంటే సమయం పడుతుంది.. మీరు అర్జెంట్ అంటున్నారు కావబట్టి క్యాబ్ చార్జీలు ఇస్తే చాలు’ అని చెబుతారు.. డబ్బులు వేశాక ఫోన్ స్విచ్ఆఫ్ చేసేస్తారు.. ఆపదలో ఉన్న బాధితులు ఎలాగో పోలీసు స్టేషన్‌కి వెళ్లే పరిస్థితి ఉండదు.. ఒక వేళ వెళ్లినా వెయ్యి, రెండు వేల కోసం ఫిర్యాదు ఏం చేస్తాంలే.. అనే ఆలోచనతో ఉంటారు.. మరీ ముఖ్యంగా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వేరే దాత కోసం వేటలో పడతారు.. రోజువారీ ఖర్చులకు.. బాధ్యతారాహిత్యంగా.. మానవీయ విలువలు లేని వారు.. పక్కవాడి బాధను అర్థం చేసుకోలేని వారే ఇలాంటి మోసాలకు పాల్పడరు.. మరీ ముఖ్యంగా రోజు వారీ ఖర్చుల కోసం కొందరు యువత ఇలా బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్నారని సైబర్ నిపుణులు చెబుతున్నారు.. ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాలు పెరిగాయని, గేమింగ్, బెట్టింగ్, డేటింగ్ యాప్స్ ఖర్చుల కోసం అవగాహనా రాహిత్యంతో.. మేం చేసేది చిన్న మోసమేగా అనే అపోహతో.. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. అంతేకానీ తాము చేసే ఈ చిన్న తప్పిదం వల్ల సమాజానికి ఓ పెద్ద ప్రమాదం జరుగుతోందని, ఓ నిండు ప్రాణం బలైపోయే పరిస్థితి ఉందని, ఓ కుటుంబం రోడ్డున పడుతుందనిగానీ ఆలోచించలేని మైండ్ సెట్ ఉన్నవారు మాత్రమే ఈ తరహా మోసానికి పాల్పడతారని చెబుతున్నారు. వీరి వల్ల నిజంగా రక్తం ఇచ్చే దాతలకు కూడా చెడ్డపేరు వస్తుందని, చివరికి మంచి వారిపై కూడా నమ్మకం కోల్పోయే పరిస్థితి తలెత్తుతుందని ఆలోచించకుండా మనుషుల మధ్య విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు.సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్..అవసరం, అమాకత్వం వంటివే మోసగాళ్లకు అనుకూలంగా మారే అంశాలు.. మరీ ముఖ్యంగా నగరంలో భాష సమస్య కూడా ఓ కారణమే. ఇలాంటి తరుణంలో మోసపోయామని గ్రహించిన బాధితులు సైబర్ క్రైమ్ సెల్‌కు వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి మోసాలపై సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చు. హైదరాబాద్ నగరం మరోసారి ‘గివింగ్ సిటీ’గా నిలవాలంటే.. ప్రజలతోపాటు, పోలీస్, హెల్త్ డిపార్ట్మెంట్, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఏర్పడింది.:::సాక్షి, సిటీబ్యూరో