ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. కొన్ని కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో సఖ్యత నెలకొంటుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగులకు అదనపు విధులు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. ఆకుపచ్చ, లేత పసుపు రంగులు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.