అజ్ఞాత యుగం నుంచే ఈ బోనాల సంప్రదాయం ఉంది.
పూర్వ కాలం నుంచే ఉన్న ఈ బోనాలకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో చరిత్ర ఉంది.
ఆషాడ మాసం వర్షాకాలం మొదలవగానే వస్తుంది
ఆ టైంలో వచ్చే సీజనల్ వ్యాధులు నివారణార్థమే ఈ పండుగ చేసేవారు.
మహంకాళి ఆకారాన్ని తెలంగాణ గ్రామాల్లో ‘మైసమ్మ’ అని పిలుస్తారు.
కోటనే మహంకాళిగా భావిస్తే ఆమెను ‘కోట మైసమ్మ
దొరల గడిని మహంకాళిగా తలిస్తే ఆమె ‘గడి మైసమ్మ’
కట్టకు పడిన గండిని మహంకాళిగా భావిస్తే ఆమె ‘గండి మైసమ్మ’.
చెరువు (రూపంలో)ను మహంకాళిగా భావిస్తే ఆమె ‘కట్ట మైసమ్మ’.
ప్రకృతిని శాంతింపజేసే ఊరుమ్మడి కార్యక్రమం 'బోనాల పండుగ'.
ఆషాడంలో మొదటగా వచ్చే గురువారం లేదా ఆదివారంతో మొదలవుతుంది.
ముందుగా గోల్కొండ మహంకాళి అమ్మవారి బోనాలు
ఆ తర్వాత లష్కర్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాలు
ఆ తర్వాత లాల్‌దర్వాజ బోనాలు జరుగుతాయి