తండ్రి బడా నిర్మాత.. కానీ హీరోగా కొడుకు ఫెయిల్.. ఇతడి గురించి తెలుసా?
బాలీవుడ్ బడా నిర్మాతల్లో బోనీ కపూర్ ఒకరు. శ్రీదేవి భర్తగా ఈయన అందరికీ తెలుసు.
బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌరీ కపూర్. వీళ్లకు పుట్టిన కొడుకే అర్జున్ కపూర్.
ఇతడు పుట్టినరోజు నేడు (జూన్ 26). ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ విశేషాలు.
తండ్రి బడా నిర్మాత కావడంతో పెద్దగా కష్టపడకుండానే ఇండస్ట్రీలోకి వచ్చేశాడు.
కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేశాడు.
2012లో వచ్చిన 'ఇష్క్ జాదే' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పర్లేదనిపించుకున్నాడు.
టూ స్టేట్స్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్, కీ & కా తదితర చిత్రాలతో హిట్స్ కొట్టాడు.
అర్జున్ కపూర్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ గత కొన్నేళ్లుగా హిట్ కొట్టలేకపోయాడు.
గతేడాది వచ్చిన 'లేడీ కిల్లర్' అయితే మరీ దారుణం. కోట్లు పెట్టి మూవీ తీస్తే లక్షల్లో వసూళ్లు వచ్చాయి.
ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. కాకపోతే ఒకదానిలో విలన్, మరో దానిలో హీరో.
ఇలా నటుడిగా ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ విమర్శలు మాత్రం ఎక్కువే.
తనకంటే ఎక్కువ వయసున్న మలైకా అరోరాతో గత కొన్నేళ్లుగా రిలేషన్‌లో ఉన్నాడు.
ఎందుకో వీళ్ల ఈ మధ్య దూరం దూరంగా ఉంటున్నారు. దీంతో విడిపోయారనే టాక్ నడుస్తోంది.