ట్రంప్ వేట.. వెనిజువెలా డ్రగ్ లార్డ్ హతం
వాషింగ్టన్: అంతర్జాతీయ నేర సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ లీడర్ హెక్టార్ ‘నినో’ గెరెరోను అమెరికా సైన్యం మట్టుబెట్టింది. వెనిజువెలాకు చెందిన ‘ట్రెన్ డి అరాగువా’ ట్రాన్స్‌నేషనల్ క్రిమినల్ గ్యాంగ్ హెడ్ గెరెరోను సైనిక దాడిలో హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో ఫుటేజీని ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ట్రూత్ సోషల్’లో పంచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది.ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ - సంచలన వీడియోఅమెరికా సదరన్ కమాండ్ మెరుపు వేగంతో నిర్వహించిన ఈ ‘కైనెటిక్ స్ట్రైక్’లో గెరెరో హతమయ్యాడని ట్రంప్ పేర్కొన్నారు. ‘మా నాయకత్వంలో, ఈ క్రూరమైన హంతకులను, డ్రగ్ లార్డ్‌లను ఎక్కడైనా, ఎప్పుడైనా సరే వేటాడి పట్టుకుంటాం’ అని ట్రంప్ హెచ్చరించారు. వెనిజువెలా అధికారులతో సంపూర్ణ సమన్వయంతోనే ఈ వ్యూహాత్మక ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశామని, ప్రస్తుతం వెనిజువెలా ప్రభుత్వంతో అమెరికా కలిసికట్టుగా పనిచేస్తోందని ట్రంప్ స్పష్టం చేశారు.𝗗𝗼𝗻𝗮𝗹𝗱 𝗝. 𝗧𝗿𝘂𝗺𝗽 𝗣𝗼𝘀𝘁𝘀 𝗩𝗶𝗱𝗲𝗼 𝗼𝗻 𝗧𝗿𝘂𝘁𝗵 𝗦𝗼𝗰𝗶𝗮𝗹 - 𝟬𝟮:𝟬𝟯 𝗣𝗠 𝗘𝗦𝗧 𝟬𝟲.𝟭𝟮.𝟮𝟲At my direction, the United States Southern Command delivered a swift and lethal kinetic strike to successfully execute Niño Guerrero, the infamous leader of… pic.twitter.com/IMj9iZzTYM— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) June 13, 2026బైడెన్ సరిహద్దు విధానాలపై తీవ్ర విమర్శలుఈ అద్భుతమైన విజయాన్ని ప్రకటిస్తూనే, ట్రంప్ తన పూర్వ అధ్యక్షుడు జో బైడెన్ అనుసరించిన సరిహద్దు విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బైడెన్ హయాంలో సరిహద్దులను అదుపులేకుండా వదిలేయడం వల్లే ‘ట్రెన్ డి అరాగువా’ వంటి విదేశీ క్రిమినల్ ముఠాలు అమెరికాలోకి చొరబడ్డాయని ఆరోపించారు. గతంలో అమెరికాలో కలకలం రేపిన 12 ఏళ్ల జోస్లిన్ నుంగారే, 22 ఏళ్ల లాకెన్ రైలీల హత్యలను ప్రస్తావిస్తూ, ఈ సైనిక చర్య ద్వారా బాధిత కుటుంబాలకు న్యాయం చేకూరిందని, అమెరికా సైన్యం వారి తరఫున ప్రతీకారం తీర్చుకుందని ట్రంప్ ఉద్ఘాటించారు. ‘ట్రెన్ డి అరాగువా’ నేరచరిత్రవెనిజువెలాలో పుట్టిన ఈ ‘ట్రెన్ డి అరాగువా’ గ్యాంగ్ ప్రస్తుతం లాటిన్ అమెరికా అంతటా విస్తరించి ఒక పెద్ద ముప్పుగా మారింది. ఈ ముఠా దోపిడీలు, మానవ అక్రమ రవాణా, వలసదారుల స్మగ్లింగ్, డ్రగ్స్ మాఫియా, అనేక క్రూరమైన హింసాత్మక నేరాలకు పాల్పడుతున్నట్లు పలు దేశాల అధికారులు గుర్తించారు. ట్రంప్ ప్రభుత్వం తమ వలస విధానాలు, జాతీయ భద్రతా ఎజెండాలో భాగంగా ఈ గ్యాంగ్‌ను ప్రధాన లక్ష్యంగా చేసుకుంది.ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వంతెన
భారత్‌కు అనూహ్య మద్దతు.. విమర్శలకు చెక్!
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై పాశ్చాత్య దేశాల నుంచి విమర్శలు వస్తున్న వేళ ఫిన్లాండ్ వేదికగా భారత్‌కు కీలక మద్దతు లభించింది. రష్యా చమురు విషయమై ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి ఎలినా మరియా వాల్టోనెన్ స్పందిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నట్లు నివేదికలు వెల్లడించాయి. దీంతో, భారత్‌కు అనూహ్య మద్దతు లభించినట్టు అయ్యింది.ఫిన్లాండ్లో జరిగిన కుల్తరాంతా టాక్స్ (Kultaranta Talks) సదస్సులో విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో రష్యా చమురు దిగుమతులపై భారత వైఖరిని బలంగా సమర్థించగా, ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి ఎలినా భారత్ తీసుకున్న నిర్ణయాలకు మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా ఎలినా మాట్లాడుతూ.. భారత్ నిర్ణయాలను వ్యతిరేకించే అవకాశం లేదు. ప్రపంచం ఇప్పుడు బహుళ ధ్రువ (Multipolar) వ్యవస్థ వైపు వెళ్తోంది. వివిధ దేశాలు తమ జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాయి. భారత్ వంటి ఎదుగుతున్న శక్తుల భద్రతా, ఇంధన అవసరాలను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అని అన్నారు. అలాగే, భారత్-ఫిన్లాండ్ సంబంధాలపై మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటలైజేషన్, సుస్థిర అభివృద్ధి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. భారత్‌తో ఫిన్లాండ్కు అద్భుతమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని, వాటిని మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు.ఈ సందర్భంగా సదస్సులో ఓ పాత్రికేయుడు భారత్.. రష్యా పట్ల "అతి సానుభూతి" చూపుతోందని, భారీగా రష్యా చమురు కొనుగోలు చేస్తోందని ప్రశ్నించగా జైశంకర్ ఘాటుగా స్పందించారు. 2022లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత యూరోపియన్ దేశాలే మధ్యప్రాచ్య చమురును పెద్దఎత్తున కొనుగోలు చేశాయని, దీంతో భారత్‌కు తక్కువ ధరలో లభ్యమైన రష్యా చమురే ఆచరణాత్మక ప్రత్యామ్నాయంగా మారిందని వివరించారు. అంతేకాకుండా, యూరప్‌లో తయారైన ఆయుధాలు ఎన్నో ఏళ్లుగా భారత్‌పై దాడులకు ఉపయోగించబడ్డాయి. కానీ భారత్ ఎప్పుడూ యూరప్ భద్రతకు ముప్పు కలిగించే పని చేయలేదు అంటూ పాశ్చాత్య దేశాల ద్వంద్వ వైఖరిని ఎత్తిచూపారు.మరో కీలక అంశాన్ని కూడా జైశంకర్ వెల్లడించారు. రష్యాపై ఆంక్షలు విధించిన తర్వాత అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను స్థిరీకరించేందుకు భారత్, రష్యా చమురు కొనుగోలు చేయాలని అమెరికానే కోరిందని చెప్పారు. ప్రస్తుతం అదే దేశాలు భారత్‌ను విమర్శించడం విరుద్ధ వైఖరికి ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. భారత్ తన ఇంధన భద్రత, ప్రజల అవసరాలు, ధరల నియంత్రణను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటుందని, విదేశీ ఒత్తిళ్ల కంటే జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుందని జైశంకర్ స్పష్టం చేశారు.
కుక్కే క్లూ అనుకున్నారు.. కానీ!
రెండేళ్ల చిన్నారి. పెంపుడు కుక్కతో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కానీ వారమైనా తిరిగి రాలేదు. తల్లిదండ్రుల కన్నీళ్లు, బంధవులు.. గ్రామస్తుల ఆందోళన, పోలీసుల విస్తృత గాలింపు.. ఏదీ ఇప్పటివరకు జ్ఞానేశ్వరి ఆచూకీని కనిపెట్టలేకపోయాయి. పెంపుడు కుక్క తిరిగి వచ్చినా.. దానికి హైటైక్ టెక్నాలజీ తగిలించి ఆచూకీ కనిపెట్టాలని ప్రయత్నించినా.. పాప జాడ మాత్రం దొరక్కపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని చిక్కుళ్ల అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ వారమైనా చిక్కలేదు. తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు..చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అలాగే 10 పోలీసు టీంలు, 40 మంది ఎస్డీఆర్ఎఫ్ బృందం.. మరికొందరు అధికారులు పాప కోసం చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌లో భాగమయ్యారు. అడవులు, కొండలు, గ్రామాలన్నీ నిర్విర్వామంగా జల్లెడ పడుతున్నారు. దీంతో ఈ కేసు దేశం దృష్టిని ఆకర్షించింది.ఈ నెల 6న ఇంటి బయట ఆడుకుంటూ అదృశ్యమైంది. పెంపుడు కుక్కతో కలిసి బయటకు వెళ్లిన పాప తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే.. ఈ కేసులో పెంపుడు కుక్క కీలక ఆధారంగా మారొచ్చని పోలీసులు భావించారు. అదృశ్యమైన మూడు రోజుల తర్వాత కుక్క గ్రామానికి తిరిగి వచ్చింది. అయితే ఇంటి వద్ద ఉన్న హడావుడి చూసి మళ్లీ పారిపోయింది. ఈ క్రమంలో అది పలువురిపై దాడి చేసింది. అనంతరం డాగ్ క్యాచర్ సాయంతో అతికష్టం మీద దానిని పట్టుకుని ఇంటికి తీసుకువచ్చారు. ఓ తాడుతో కట్టేసి.. దానికి పోలీసును కాపలా ఉంచారు. నీరసంగా ఉన్న దానికి.. వెటర్నరీ సిబ్బంది వైద్య సేవలు అందించి కోలుకున్న తర్వాత పోలీసులు ప్రత్యేక చర్యలకు దిగారు.పెద్దాపురం డీఎస్పీ తిలక్ పర్యవేక్షణలో పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ, ఏఎన్ఎస్, క్యూఆర్టీ బృందాలు విస్తృత గాలింపు కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన జీపీఎస్ ట్రాకర్‌ను కుక్కకు అమర్చి వదిలారు. ట్రాకర్ ద్వారా కుక్క సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర సంచరించినట్లు గుర్తించారు. ఆ ప్రాంతాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కానీ, ఎక్కడా ఏ క్లూ లభించలేదు!.ఇక చిన్నారి కాళ్లకు ఉన్న వెండి పట్టీలను గుర్తించేందుకు సిల్వర్ మెటల్ డిటెక్టర్లను వినియోగిస్తున్నారు. జ్ఞానేశ్వరి చివరిసారిగా కనిపించిన ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయితే చిన్నారి ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు ఆపబోమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.అదే సమయంలో కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్ టవర్ డంప్ డేటా, కాల్ డిటైల్ రికార్డులు, సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులకు సన్నిహితులైన వ్యక్తులతో పాటు చుట్టుపక్కలకు కొత్తగా వచ్చిన వ్యక్తులు, గంజాయి అలవాటు ఉన్న వారిపై కూడా నిఘా పెట్టారు. పగలు, రాత్రి తేడా లేకుండా గాలింపు కొనసాగుతోంది.ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిన్నారి క్షేమంగా తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరాలని ప్రజలు ప్రార్థిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూడా స్పందిస్తూ, జ్ఞానేశ్వరి ఆయురారోగ్యాలతో ఇంటికి చేరాలని ఆకాంక్షించారు.
విజయ్ ఎఫెక్ట్.. స్టాలిన్ కళ్లు తెరిపించిన నివేదిక
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని కోల్పోవడంపై నియోజకవర్గాల వారీగా తెప్పించుకున్న క్షేత్రస్థాయి విచారణ నివేదికలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు షాక్ తగిలే విధంగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నికల్లో ఘోర పరాజయానికి గల కారణాలను విశ్లేషిస్తూ పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలు రెండు రోజుల క్రితమే ఒక సమగ్ర నివేదికను స్టాలిన్‌కు సమర్పించాయి.తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయడం, మహిళల్లో వ్యక్తమైన తీవ్ర అసంతృప్తి పార్టీని పూర్తిగా ముంచేసిందని ఈ నివేదిక తేల్చిచెప్పింది. శుక్రవారం డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయంలో ఈ ప్రత్యేక కమిటీతో స్టాలిన్ సమావేశమయ్యారు. ఇందులోని అంశాలను పరిశీలించి, నియోజకవర్గాల వారీగా చర్చించారు. ఓటమికి ప్రధాన కారణాలు తాజా నివేదిక మేరకు వెలుగులోకి వచ్చాయి.విజయ్ను తక్కువగా అంచనా విజయ్ క్షేత్రస్థాయిలో సాధిస్తున్న ప్రజాదరణను, ఆయనకు లభిస్తున్న నిశ్శబ్ద మద్దతును డీఎంకే జిల్లా అధికారులు, స్థానిక నాయకత్వం గుర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని తేలింది. గెలుపు గుర్రాలైన స్థానిక పలుకుబడి కలిగిన పలువురు సీనియర్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి, కొత్త ముఖాలను పోటీలో పెట్టడం కూడా ఓటమికి ఓ కారణంగా గుర్తించారు. నియోజకవర్గాల్లో కూటమి పార్టీల మధ్య కనీస సమన్వయం లేదని నివేదిక స్పష్టం చేసింది.ఇక యాక్షన్ ప్లాన్ ఈ పరాజయం నేపథ్యంలో డీఎంకేలో భారీ సంస్థాగత మార్పునకు ఎం.కె. స్టాలిన్ శ్రీకారం చుట్టారు. పార్టీ పరిపాలనా యంత్రాంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం పెద్ద జిల్లాల పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల వరకు ఒక జిల్లా కార్యదర్శి ఉండగా, ఆ నియోజకవర్గాల సంఖ్యను తగ్గించి కేవలం రెండు లేదా మూడు నియోజకవర్గాలకు ఒక జిల్లా కార్యదర్శిని నియమించేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం పార్టీ పరంగా ఉన్న 78 మంది జిల్లా కార్యదర్శుల సంఖ్యను 115కు పెంచనున్నారు. ఈ విభజన ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మరో 30 మంది పార్టీ కోసం పనిచేసే కొత్త వారికి జిల్లా కార్యదర్శులుగా అవకాశం దక్కనుంది.దక్షిణ, కొంగు మండలాలపై దృష్టి డీఎంకే తీవ్రంగా దెబ్బతిన్న దక్షిణ జిల్లాలు, పశ్చిమ ప్రాంతమైన కొంగు మండలం పార్టీని పునరుద్ధరించడానికి ప్రత్యేక కమిటీని రంగంలోకి దించారు. అలాగే, పార్టీ అగ్రనాయకత్వంలో కూడా అధికార వికేంద్రీకరణ జరగబోతోందని అరివాలయం వర్గాలు తెలిపాయి. కలైంజ్ఞర్ కాలం నాటి పాత రాజకీయ వ్యూహాలు ఇప్పుడు పని చేయవని, కొత్త తరం ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా సరికొత్త నాయకత్వ ఫార్ములాను స్టాలిన్ సిద్ధం చేసినట్టు తెలిసింది.కనిమొళి, ఉదయనిధి: ఇప్పటికే యువజన విభాగంలో కీలకంగా ఉదయనిధి స్టాలిన్‌తో పాటు, ఢిల్లీ రాజకీయాల్లో అపార అనుభవం, మహిళల్లో మంచి పట్టు ఉన్న సీనియర్ నేత కనిమొళికి కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. వీరిద్దరిని కలిపి ద్వంద్వ బృందం పద్ధతిలో పార్టీని నడిపించేందుకు అధిష్ఠానం కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే జరగబోయే డీఎంకే జనరల్ సర్వసభ్య సమావేశంలో ఈ సంచలన మార్పులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి.మహిళా లబ్దిదారుల ఆగ్రహం.. డీఎంకే హయాంలో ప్రవేశపెట్టిన మహిళా హక్కుల పథకం డీఎంకే ఓటమికి ప్రధాన కారణంగా నిలవడం గమనార్హం. రాష్ట్రంలో 2 కోట్ల 20 లక్షల రేషన్ కార్డులు ఉంటే, కేవలం ఒక వర్గానికి మాత్రమే కోటి 34 లక్షల మందికి ఈ సాయం అందించడం, ఇందులోనూ ఇతర పార్టీల వారు ఉండడంతో, మిగిలిన కోటి మంది మహిళలు డీఎంకేకు వ్యతిరేకంగా ఓటు వేశారన్నది స్పష్టం కావడం ఆలోచించ దగ్గ విషయం. అలాగే, ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు ప్రభుత్వం అందించిన రూ.5వేలు వేసవి సాయాన్ని కూడా కేవలం కొద్దిమంది అర్హులకు మాత్రమే పరిమితం చేయడం వలన సాధారణ మహిళా ఓటర్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమై ఓట్లను దూరం చేసినట్టు తేటతెల్లమైంది.సోఫా మోడల్ ప్రభుత్వం.. మరోవైపు.. తమిళనాడులో డీఎంకే ఐదేళ్ల ద్రావిడ మోడల్ పాలనలో సాధించిన అద్భుత విజయాలను, అభివృద్ధిని తాజా సీఎం విజయ్ ఆయన ఖాతాలో వేసుకుంటున్నారని డీఎంకే యువజన నేత, ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఆయన సోఫా మోడల్ ప్రభుత్వంగా అభివర్ణించారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం విజయ్ చేసిన ప్రసంగంపై శుక్రవారం ఉదయనిధి తన ఎక్స్ పేజీలో స్పందించారు.అవన్నీ డీఎంకే సాధించినవే.. ఎన్నికల ప్రచారంలో తమిళనాడు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, పాతాళానికి పడిపోయిందని అబద్దపు కథనాలను ప్రచారం చేసిన విజయ్, ఇప్పుడు అధికారంలోకి రాగానే, ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో, తమిళనాడు సాధించిన ఘనతలను ఒక పెద్ద జాబితా రూపంలో చదివి వినిపించారని గుర్తు చేశారు. తమిళనాడు రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, దేశంలో ఉద్యోగాలు చేసే మొత్తం మహిళల్లో 42 శాతం మంది తమిళనాడుకు చెందినవారేనని సీఎం విజయ్ అక్కడ ప్రస్తావించారని గుర్తు చేశారు. అలాగే మహిళా విద్య, రక్షణ, ఆరోగ్యం, స్వయం సహాయక సంఘాల అభివృద్ధిపై కూడా సీఎం మాట్లాడారన్నారు. ఇవన్నీ ఆయన అధికారంలోకి వచ్చిన ఈ ఒక నెల రోజుల సోఫా మోడల్ పాలనలో జరిగినవా? లేక ఐదేళ్లపాటు తమ డీఎంకే ప్రభుత్వం రాత్రింబవళ్లు కష్టపడి సాధించిన ద్రావిడ మోడల్ విజయాలా అని ప్రశి్నస్తూ, దీనికి సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.మౌనం ఎందుకు? ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత విజయ్ తీసుకున్న యూ–టర్న్‌లపై ఉదయనిధి మండిపడ్డారు. నీట్ పరీక్షే ప్రపంచమా అని ఎన్నికల సమయంలో వ్యాఖ్యలు చేసిన విజయ్, ఇప్పుడు అదే నీట్ పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఢిల్లీ వరకు వెళ్లిన సీఎం కర్ణాటకలో అధికారంలో ఉన్న తన కొత్త మిత్రపక్ష పార్టీతో కానీ, నీతి ఆయోగ్ సమావేశంలో కానీ, మేఘధాతు వ్యవహారంపై నోరు విప్పలేదని ఆరోపించారు. మనకెందుకులే వచ్చిన గొడవ అన్నట్లుగా ఆయన మౌనంగా తిరిగి వచ్చేశారని ఎద్దేవా చేశారు. వాస్తవానికి నీతి ఆయోగ్ సమావేశంలో డీఎంకే ప్రభుత్వ విజయాలపై ఈ సోఫా మోడల్’ ప్రభుత్వం పూర్తిగా వారి స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుందని ధ్వజమెత్తారు.
నో గాసిప్స్ ప్లీజ్! ఎవరైనా గాసిప్ ప్రారంభించగానే.. ఇలా చేయండి!
జెన్‌జీ..చెప్పుడు మాటలు నమ్మట్లేదు
భారత్‌కు అనూహ్య మద్దతు.. విమర్శలకు చెక్!
Beauty Tips: మార్కెట్లో దొరికే.. కెమికల్ ప్రొడక్ట్స్ కంటే ఇవే మేలు!
పుట్టినరోజు నాడే.. విజయ్ నుంచి బిగ్ లాంచ్?
ఇదెక్కడి 'డెలివెర్రి'రా బాబు!
భారత్‌లో మళ్లీ ‘కుష్టు’ బీభత్సం.. 91 వేలు దాటిన కొత్త కేసులు!
వరల్డ్‌కప్ చరిత్రలోనే అత్యధిక స్కోరు.. ఇంగ్లండ్ దెబ్బకు లంక కుదేల్
ఈ ఐదు రాష్ట్రాలలోనే వీళ్లు ఎక్కువ..
పవన్ పార్టీలో కలకలం.. ఎమ్మెల్యేకు కార్యకర్త సవాల్!
‘పెద్ది’ వివాదం.. కంగనా ఇచ్చే సలహా ఇదే!
మాతో పెట్టుకుంటే ఖబడ్దార్!
స్పోర్ట్స్ సర్టిఫికెట్ల దుకాణం.. టీడీపీ ఆఫీసు
శివాలెత్తిన శివమ్ దూబే.. సిక్సర్ల వర్షం
IND vs AFG ODI: వైభవ్ ధనాధన్.. భారత్ భారీ స్కోరు
ఒక్కసారిగా తగ్గిన చమురు ధరలు!
సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ విధ్వంసం.. కేవలం 17 బంతుల్లోనే
IND vs AFG: భారత్‌కు భారీ షాక్.. అఫ్గన్ అనూహ్య విజయం
ప్రపంచ దేశాలకు షాకిచ్చిన ఇరాన్
ఈ రాశి వారికి మిత్రుల నుంచి ధనలబ్ధి
చరిత్రలో ఇలాంటి చిత్రం రాలేదు..!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
‘ఆ బంగారం, వెండి.. నకిలీ ఆస్తులు’
బంగ్లా ప్లేయర్‌పై కన్నెర్ర చేసిన ఐసీసీ
ఓటీటీకి రూ.300 కోట్ల సినిమా.. ఒక్క రోజే 21 సినిమాలు స్ట్రీమింగ్..!
మనోడు ఏం మారలే.. శ్రీలంక గడ్డపై విధ్వంసం
భారత జట్టులోకి ద్రవిడ్ కుమారుడు
తల్లికి వందనం పథకానికి పంగనామాలు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
AIతో కాదు… రూ.370 బిర్యానీతో ఉద్యోగం ఊడింది
నో గాసిప్స్ ప్లీజ్! ఎవరైనా గాసిప్ ప్రారంభించగానే.. ఇలా చేయండి!
జెన్‌జీ..చెప్పుడు మాటలు నమ్మట్లేదు
భారత్‌కు అనూహ్య మద్దతు.. విమర్శలకు చెక్!
Beauty Tips: మార్కెట్లో దొరికే.. కెమికల్ ప్రొడక్ట్స్ కంటే ఇవే మేలు!
పుట్టినరోజు నాడే.. విజయ్ నుంచి బిగ్ లాంచ్?
ఇదెక్కడి 'డెలివెర్రి'రా బాబు!
భారత్‌లో మళ్లీ ‘కుష్టు’ బీభత్సం.. 91 వేలు దాటిన కొత్త కేసులు!
వరల్డ్‌కప్ చరిత్రలోనే అత్యధిక స్కోరు.. ఇంగ్లండ్ దెబ్బకు లంక కుదేల్
ఈ ఐదు రాష్ట్రాలలోనే వీళ్లు ఎక్కువ..
పవన్ పార్టీలో కలకలం.. ఎమ్మెల్యేకు కార్యకర్త సవాల్!
‘పెద్ది’ వివాదం.. కంగనా ఇచ్చే సలహా ఇదే!
మాతో పెట్టుకుంటే ఖబడ్దార్!
స్పోర్ట్స్ సర్టిఫికెట్ల దుకాణం.. టీడీపీ ఆఫీసు
శివాలెత్తిన శివమ్ దూబే.. సిక్సర్ల వర్షం
IND vs AFG ODI: వైభవ్ ధనాధన్.. భారత్ భారీ స్కోరు
ఒక్కసారిగా తగ్గిన చమురు ధరలు!
సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ విధ్వంసం.. కేవలం 17 బంతుల్లోనే
IND vs AFG: భారత్‌కు భారీ షాక్.. అఫ్గన్ అనూహ్య విజయం
ప్రపంచ దేశాలకు షాకిచ్చిన ఇరాన్
ఈ రాశి వారికి మిత్రుల నుంచి ధనలబ్ధి
చరిత్రలో ఇలాంటి చిత్రం రాలేదు..!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
‘ఆ బంగారం, వెండి.. నకిలీ ఆస్తులు’
బంగ్లా ప్లేయర్‌పై కన్నెర్ర చేసిన ఐసీసీ
ఓటీటీకి రూ.300 కోట్ల సినిమా.. ఒక్క రోజే 21 సినిమాలు స్ట్రీమింగ్..!
మనోడు ఏం మారలే.. శ్రీలంక గడ్డపై విధ్వంసం
భారత జట్టులోకి ద్రవిడ్ కుమారుడు
తల్లికి వందనం పథకానికి పంగనామాలు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
AIతో కాదు… రూ.370 బిర్యానీతో ఉద్యోగం ఊడింది
ఫొటోలు
ఫిఫా ప్రపంచకప్ 2026 : అందరి కళ్లు వీరిపైనే..(ఫొటోలు)
వడ్డే నవీన్ 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు' మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
హైలైఫ్ ఎగ్జిబిషన్ లో...అందమైన భామలు లేత మెరుపు తీగలు (ఫొటోలు)
హైదరాబాద్ : నగరంలో పలుచోట్ల భారీ వర్షం (ఫొటోలు)
నా ప్రాణానికి అప్పుడే రెండేళ్లు.. కుమారుడితో అమలాపాల్ (ఫోటోలు)
మూడు ముళ్ల బంధానికి ఆరేళ్లు.. సతీమణికి నవీన్ చంద్ర విషెస్ (ఫోటోలు)
నువ్వు నా భర్తగా రావడం అదృష్టం.. తబిత సుకుమార్ ఎమోషనల్ (ఫోటోలు)
శారీలో హీరోయిన్ ప్రీతి ముకుందన్ అందాలు.. ఫోటోలు
చంద్రబాబు వెన్నుపోటుకి రెండేళ్లు.. వైఎస్సార్సీపీ సమర శంఖం (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ (ఫొటోలు)
సినిమా
గోపిచంద్ యాక్షన్ మూవీ.. టైటిల్ ఇదే
టాలీవుడ్ హీరో, మాచో స్టార్ గోపిచంద్ ప్రస్తుతం వెంకట్ డైరెక్షన్లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో యాక్షన్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇవాళ గోపీచంద్ బర్త్ డే కావడంతో మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి సింగ అనే పవర్ఫుల్ టైటిల్ ఖరారు చేశారు.ఈ విషయాన్ని తెలియజేస్తూ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ వీడియోలో సుత్తి చేతిలో పట్టుకుని గోపిచంద్ కనిపించారు. ఈ చిత్రంలో గోపిచంద్ సరసన అనార్కలి నాజర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీని 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతమందిస్తున్నారు.
పెద్ది టీమ్‌కు మెగా ప్రశంసలు
రామ్ చరణ్ పెద్ది టీమ్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంపై చిరు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుపై ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను పెద్ది టీమ్ ట్విటర్లో పంచుకుంది.రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. జూన్ 4న రిలీజైన ఈ మూవీ ఇప్పటి వరకు రూ.345 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించింది. ఈ మూవీలో జగపతిబాబు అప్పలసూరి పాత్రలో మెప్పించారు. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. A MEGA APPRECIATION 💥Megastar @KChiruTweets Garu congratulated and appreciated team #Peddi on the blockbuster success of the film ❤️#PEDDI Now In Cinemas 💥https://t.co/EMhY3eMGKq pic.twitter.com/0aN2EgDNtD— PEDDI (@PeddiMovieOffl) June 12, 2026
వెంకీమామ- అనిల్ రావిపూడి కాంబో.. బీచ్‌లో క్రేజీ అప్డేట్
ప్రతి సంక్రాంతికి హిట్ కొడుతున్న టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ ఏడాది కూడా మనశంకరవరప్రసాద్గారు మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. చిరంజీవి- వెంకీతో కలిసి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. వీరిద్దరి కాంబోలో బాగానే వర్కవుట్ అయింది. ఇద్దరు స్టార్స్‌ను తీసుకుని కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కించడం ఒక్క అనిల్ రావిపూడికే సాధ్యమని టాలీవుడ్ సినీ ప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. సంక్రాంతికి వస్తున్నాం అంటూ వెంకీమామతో బ్లాక్‌బస్టర్ కొట్టిన అనిల్.. మరోసారి ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్నారు. వెంకీతో పాటు కల్యాణ్ రామ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ దాదాపు రెడీ అయిపోయింది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంచుకున్నారు. ఈ విషయాన్ని రోటీన్‌గా కాకుండా చాలా క్రేజీగా అనౌన్స్ చేశారు. వివాహ భోజనంబు చిత్రంలోని సుత్తి వీరభద్రరావు, బ్రహ్మానందం మధ్య బీచ్‌లో జరిగే ఓ సన్నివేశాన్ని రీక్రియేట్ చేశారు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఆ సినిమాలో లాగే బీచ్‌లో జీవీ ప్రకాశ్‌ను ఇసుకలో పూడ్చి మరి మ్యూజిక్ కంపోజ్ చేయించారు. ఆ తర్వాత పాటల రచయితగా అనంత శ్రీరామ్ పని చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మూవీ ఇంకా సెట్స్‌పైకి వెళ్లకముందే అప్డేట్స్తో అనిల్ రావిపూడి సరికొత్తగా దూసుకెళ్తున్నారు. దీంతో వెంకీ మామ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. I've always admired @gvprakash's ability to make music that connects instantly with audiences.👌🏻Thrilled to welcome him on board for #VenkyAnil5 - #NKRAnil2 🤗And we had a blast pulling off this fun concept...A big thank you to GV for trusting the idea, joining in… pic.twitter.com/AeAMx5hJbd— Anil Ravipudi (@AnilRavipudi) June 12, 2026
సింగ్ గీతం.. 94 ఏళ్ల వయసులో అదే డెడికేషన్..!
సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కిచిన తాజా చిత్రం సింగ్ గీతం. ఆయన ఇంటి పేరుతోనే వచ్చిన ఈ మూవీకి 94 ఏళ్ల వయసులో దర్శకత్వం వహించారు. ఈ వయసులో సినిమాకు దర్శకత్వం వహించడం అంటే మాటలు. దాదాపు 90 ఏళ్లు పైబడిన వ్యక్తి సెట్‌కు వచ్చి తెరకెక్కించడం సవాల్‌తో కూడుకున్న పనే. అయినా కూడా ఆయన పట్టుదలతో ఈ మూవీని రూపొందించారు. ఈ వయసులో కూడా కథ చెప్పడం పట్ల ఆయనకున్న అభిరుచి, నిబద్ధతతో ఇప్పటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ చిత్రాన్ని కేవలం 77 రోజుల్లోనే పూర్తి చేయడం మరో విశేషం. ఈ విషయాన్ని మూవీ టీమ్ సన్నిహితులు వెల్లడించారు.ఈ మూవీ కోసం సింగీతం శ్రీనివాసరావు పనిచేసిన తీరును కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ పంచుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు ఎలా దర్శకత్వం వహించారో వివరించారు. ఈ మూవీ కోసం ఎన్నో సర్దుబాట్లు అవసరమయ్యాయని అన్నారు. చెన్నైలో షూటింగ్ బాగానే జరిగిందని.. కానీ హైదరాబాద్‌లో మాత్రం కష్టంగా అనిపించిందని చెప్పారు. ఆయన ప్రయాణించలేని సమయంలో ఇంట్లోనే ఒక వర్చువల్ మానిటర్‌ను ఏర్పాటు చేశారు. సింగీతం హెడ్సెట్ ద్వారా నటీనటులకు, సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తూ వచ్చారు. దూరం నుంచే షూటింగ్‌ను పర్యవేక్షించారు.అయినప్పటికీ ఆయన ఎక్కువ భాగం ఆయన భౌతికంగా సెట్లోనే ఉన్నారని తెలిపారు. ఈ మూవీ చివరి రెండు నెలల్లో దర్శకుడికి దగ్గు రావడం.. అది తీవ్రమై ఇన్ఫెక్షన్గా మారిందని నాగ్ అశ్విన్ గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో కొంచెం బరువు తగ్గారని.. కానీ అదేమీ ఆయన ఉత్సాహాన్ని తగ్గించలేదన్నారు. సింగీతం అభిరుచి ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తుందని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. కాగా.. ఈ చిత్రంలో అయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించారు.
క్రీడలు
కెనడా-బోస్నియా మ్యాచ్ డ్రా
ఫిఫా ప్రపంచకప్-2026లో భాగంగా టొరంటో వేదికగా కెనడా-బోస్నియా మధ్య జరిగిన గ్రూపు-బి మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ డ్రాతో కెనడా తన ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలోనే మొట్టమొదటి పాయింట్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్ 21వ నిమిషంలో బోస్నియా ఫార్వర్డ్ ఆటగాడు జోవో లుకిచ్ కార్నర్ కిక్ ద్వారా అద్భుతమైన గోల్ చేసి తన జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 78 నిమిషలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన కెనడా ఆటగాడు సైల్ లారిన్ సూపర్ గోల్ కొట్టి స్కోరును 1-1తో సమం చేశాడు. ఫస్ట్‌హాఫ్‌లో కెనడా స్ట్రైకర్ జోనాథన్ డేవిడ్ గోల్ చేసేందుకు మంచి అవకాశాన్ని కోల్పోయాడు. అదేవిధంగా రెండవ అర్ధభాగంలో బోస్నియా కెప్టెన్ సియాద్ కొలాసినాక్ కొట్టిన బంతి క్రాస్‌బార్‌కు తగిలి వెనక్కి రావడంతో వారికి లీడ్ సాధించే ఛాన్స్‌ను కోల్పోయారు. కాగా ఈ టోర్నీకి కెనడా సహా ఆతిథ్య దేశంగా ఉన్న సంగతి తెలిసిందే.
రోహిత్‌పైనే దృష్టి
ధర్మశాల: వన్డే వరల్డ్ కప్ వచ్చే ఏడాది అక్టోబర్–నవంబర్లలో జరగనుండగా... దానికి ముందు భారత జట్టు కనీసం 25 వన్డేలు ఆడనుంది. మెగా టోర్నీ కోసం జట్టును సిద్ధం చేసేందుకు, అందుబాటులో ఉన్న అన్ని రకాల ప్రత్యామ్నాయాలను పరీక్షించేందుకు మేనేజ్మెంట్కు ఇదే సరైన సమయం. ఈ నేపథ్యంలో ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపైనే అందరి దృష్టీ నిలిచింది. భారత్, అఫ్గానిస్తాన్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు ధర్మశాలలో తొలి వన్డే జరగనుంది. ఇటీవల ఐపీఎల్లో ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొని కోలుకున్న రోహిత్ ఎలా ఆడతాడనేది ఆసక్తికరం. గాయంతో ఇప్పటికే విరాట్ కోహ్లి సిరీస్ నుంచి తప్పుకోవడంతో రోహిత్ ఆట కీలకం కానుంది. 39 ఏళ్ల రోహిత్ అటు బ్యాటింగ్‌లో రాణించడంతో పాటు తన ఫిట్నెస్ను కాపాడుకోవాల్సి ఉంటుంది. భారత్ తమ ఆఖరి వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడగా, రోహిత్ అన్ని మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. సత్తా చాటేందుకు నితీశ్ సిద్ధం... కెపె్టన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు రోహిత్ ఓపెనింగ్ చేయనుండగా... కోహ్లికి బదులుగా ఇషాన్ కిషన్ మూడో స్థానంలో దిగవచ్చు. ఆ తర్వాత శ్రేయస్, రాహుల్ స్థానాలు పదిలం కాగా, ఇద్దరు స్పిన్నర్లు కుల్దీప్, సుందర్ ఉంటారు. ఇక్కడి పిచ్‌ను బట్టి చూస్తే భారత్ ముగ్గురు పేసర్లతో ఆడనుంది. ప్రసిధ్, అర్ష్ దీప్‌లతో పాటు మూడో స్థానం కోసం కొత్త ఆటగాడు గుర్నూర్ సింగ్, ప్రిన్స్ యాదవ్ మధ్య పోటీ ఉంది. ఇద్దరిలో ఒకరు అంతర్జాతీయ అరంగేట్రం చేయడం ఖాయం. ఆరో స్థానంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్, ఆంధ్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి తన చోటును సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఐపీఎల్లో నిలకడగా రాణించిన నితీశ్ తన గత వన్డేలో అర్ధ సెంచరీ కూడా సాధించాడు. బౌలింగ్‌లో కూడా పేస్ పదును పెంచుకున్న అతను టి20లను దాటి ఈ ఫార్మాట్లో 10 ఓవర్లు ఎలా వేస్తాడనేది ఆసక్తికరం. హార్దిక్ పాండ్యా పదే పదే గాయాలతో జట్టుకు దూరమవుతున్న నేపథ్యంలో నితీశ్‌కు ఇది చాలా చక్కటి అవకాశం. 3–0తో ఆధిక్యం... మరోవైపు అఫ్గానిస్తాన్ జట్టు అనుభజ్ఞులైన ఆటగాళ్లపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఇబ్రహీమ్, గుర్బాజ్, రహ్మత్ షా, హష్మతుల్లా ప్రధాన బ్యాటర్లు కాగా... ఆల్‌రౌండర్‌గా అజ్మతుల్లా ఒమర్జాయ్ గత రెండేళ్లలో చాలా బాగా ఆడుతున్నాడు. టెస్టు ఆడని రషీద్ ఖాన్ రాకతో స్పిన్ బలంగా మారగా, ఘజన్ఫర్ కూడా కీలకం కానున్నాడు. ఇరు జట్ల మధ్య ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్. గతంలో ప్రపంచకప్, ఆసియా కప్‌లలో కలిపి రెండు టీమ్‌లు 4 మ్యాచ్‌లలో తలపడగా... భారత్ 3 గెలిచింది. మరో మ్యాచ్ ‘టై’గా ముగిసింది.
అందరివాడు కేన్ మామా...
జెంటిల్మన్ క్రికెటర్ అంటే ఎలా ఉండాలి... పరాజయంలో, మైదానంలో కఠిన సమయంలో, తుది ఫలితంతో గుండె బద్దలైన క్షణంలో కూడా ప్రశాంతంగా కనిపించడమే కాదు... నిగ్రహం కోల్పోకుండా తన ‘క్లాస్’ను కోల్పోకుండా వ్యవహరించాలి. వన్డే వరల్డ్ కప్ ఫైనల్, టి20 వరల్డ్ కప్ ఫైనల్, ఐపీఎల్ ఫైనల్... ఇలా తన సారథ్యంలో మూడుసార్లూ చివరి మెట్టుపై ఓటమి ఎదురైనప్పుడు కూడా అతను ఎక్కడా గీత దాటలేదు... 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో దాదాపు తమ చేతుల్లోంచి లాక్కున్నట్లుగా ట్రోఫీని కోల్పోయిన సమయంలోనూ అతను ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అదే చిరునవ్వు, అదే సంయమనం. అందుకే అతను అందరివాడు అయ్యాడు.ప్రత్యర్థి జట్ల అభిమానులు కూడా పలుమార్లు అతను విజయంలో భాగం అయి ఉంటే బాగుండేదని కోరుకున్నారు. అలాంటి మంచి పేరును సంపాదించుకున్న ఆటగాడే కేన్ విలియమ్సన్. హైదరాబాద్ ఫ్యాన్స్ అంతా ‘కేన్ మామా’ అంటూ అభిమానంతో పిలుచుకునే ఈ న్యూజిలాండ్ దిగ్గజం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 2010 తర్వాత గత దశాబ్దన్నర కాలంలో తమదైన ముద్ర వేసిన ‘ఫ్యాబ్ 4’లలో ఒకడైన కేన్ ఇప్పుడు పూర్తిగా తప్పుకున్నాడు. -సాక్షి క్రీడా విభాగం న్యూజిలాండ్ క్రికెట్ స్థాయిని పెంచి, తమదైన ఆటతో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో మార్టిన్ క్రో, రిచర్ట్ హ్యాడ్లీ, స్టీఫెన్ ఫ్లెమింగ్, బ్రెండన్ మెకల్లమ్‌ల తర్వాత కేన్ విలియమ్సన్ పేరు కచ్చితంగా ఉంటుంది. 20 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసి తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన కేన్ ఆ తర్వాత దూసుకుపోయి పదిహేనేళ్ల పాటు నిలకడైన ప్రదర్శనతో తానేంటో నిరూపించుకున్నాడు. అటు పేస్, ఇటు స్పిన్ బౌలింగ్‌ను సమర్థంగా ఆడగల నైపుణ్యం కేన్‌ను సాంప్రదాయ టెస్టు క్రికెట్లో ఈతరం అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా నిలిపింది. ‘ఫ్యాబ్యులస్ 4’లలో ఒకడిగా స్టీవ్ స్మిత్, జో రూట్, విరాట్ కోహ్లిలతో పోటీ పడుతూ పరుగులు సాధించిన విలియమ్సన్ పలు ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు. తనదైన ‘క్లాసిక్’ శైలితో వన్డే క్రికెట్లో చక్కటి గణాంకాలు నమోదు చేసిన ఈ కివీ స్టార్... టి20లకు అనుగుణంగా తన ఆటను మార్చుకొని మంచి ఫలితాలను సాధించడం చెప్పుకోదగ్గ విశేషం.హైదరాబాదీల అభిమానం...విలియమ్సన్ బ్యాటింగ్ శైలి చూస్తే అతను టి20లకు పనికి రాడని అంతా అనుకుంటారు. కానీ 2014 చాంపియన్స్ లీగ్‌లోనే అతను 48 బంతుల్లో సెంచరీతో తన వాడిని చూపించాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ జట్టు ద్వారా హైదరాబాద్ అభిమానులకు అతను చేరువయ్యాడు. 2015 నుంచి 2022 వరకు వరుసగా ఎనిమిది సీజన్ల పాటు ఇదే జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతను ‘కేన్ మామా’గానే సుపరిచితుడు. 2016 టైటిల్ విజయంలో భాగంగా ఉన్నా... అతను పెద్ద పాత్ర పోషించలేదు. కానీ 2018లో డేవిడ్ వార్నర్ గైర్హాజరులో కేన్ జట్టును ఫైనల్ వరకు చేర్చాడు. 8 అర్ధ సెంచరీలు సహా 735 పరుగులతో ‘ఆరెంజ్ క్యాప్’ గెలుచుకొని ముందుండి నడిపించాడు. తాజా సీజన్లో లక్నో జట్టు సలహాదారుడిగా ఇప్పటికే ఐపీఎల్లో కేన్ రెండో ఇన్నింగ్స్ మొదలైంది.‘వరల్డ్’ విజేతగా...టెస్టుల్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు విలియమ్సన్ సొంతం. అయితే అరుదైన 10 వేల మైలురాయికి కేవలం 485 పరుగుల దూరంలో ఉన్న అతను సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించడం అనూహ్యం. అయితే తాను ఎప్పుడైనా వ్యక్తిగత ప్రదర్శనకంటే జట్టు గురించి ఆలోచించానని, ఇప్పుడు ‘టీమ్ షీట్లో ఒక పేరు’గా మాత్రమే ఉండి మరో రెండు మ్యాచ్‌లు పెంచదల్చుకోలేదని తన ఉద్దేశాన్ని కేన్ స్పష్టంగా చెప్పాడు. చాలా కాలంగా అతను ఫామ్‌లేమితో పాటు ఫిట్నెస్ సమస్యలతో కూడా బాధపడుతున్నాడు. తనకు నచ్చిన టోర్నీలు లేదా సిరీస్‌లలో ఆడేందుకు 2024 జూన్‌లోనే అతను న్యూజిలాండ్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్నాడు. గాయం కారణంగానే భారత గడ్డపై న్యూజిలాండ్ 3–0తో గెలిచిన సిరీస్‌లో అతను ఆడలేదు. గత 9 ఇన్నింగ్స్‌లలో ఒకటే అర్ధసెంచరీ చేసిన కేన్... తాజాగా ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో 0, 18 పరుగులే నమోదు చేశాడు. దాంతో తప్పుకునేందుకు ఇదే సరైన సమయంగా భావించాడు. కెప్టెన్‌గా 2021 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ను గెలిపించడం విలియమ్సన్ కెరీర్లోనే అత్యుత్తమ ఘట్టం. భారత్‌పై లక్ష్య ఛేదనలో రెండో ఇన్నింగ్స్‌లో అతను అజేయ అర్ధసెంచరీ సాధించాడు. గుండె పగిలిన క్షణం...వన్డే క్రికెట్లో కూడా బ్యాటర్‌గా కేన్ తనదైన ముద్ర వేశాడు. మూడో స్థానంలో అతను ఏకంగా 51.16 సగటుతో పరుగులు సాధించడం అతని బ్యాటింగ్ గొప్పతనాన్ని చూపిస్తుంది. అతని 15 వన్డే సెంచరీల్లో 11 సార్లు జట్టు విజయం సాధించింది. అయితే కేన్‌ను మరచిపోకుండా చేసిన క్షణం 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో వచ్చింది. ఈ టోర్నీలో అద్భుత ఆటతో 9 ఇన్నింగ్స్‌లలో అతను 578 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లపై శతకాలతో పాటు సెమీస్‌లో భారత్‌పై విజయంలో 67 పరుగులతో కీలకపాత్ర పోషించాడు. అయితే ఫైనల్లో కేన్ బృందాన్ని దురదృష్టం వెంటాడింది. మ్యాచ్, సూపర్ ఓవర్లలో సమంగా నిలిచినా కూడా ట్రోఫీ దక్కలేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ‘బౌండరీ కౌంట్’ రూల్‌తో కివీస్ రన్నరప్‌గానే నిలవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇంగ్లండ్ మినహా ఇతర క్రికెట్ ప్రపంచం మొత్తం కూడా ఎంతో బాధపడిందంటే అతిశయోక్తి కాదు. టీమ్‌ను ఫైనల్ వరకు చేర్చిన విలియమ్సన్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా కూడా నిలిచాడు. కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ రికార్డుటెస్టులు 110 పరుగులు 9515 పరుగులు సగటు 54.06 సెంచరీలు 33 అర్ధ సెంచరీలు 38 అత్యధిక స్కోరు 251వన్డేలు 175 పరుగులు 7256 సగటు 48.69 సెంచరీలు 15 అర్ధ సెంచరీలు 47 అత్యధిక స్కోరు 148టి20లు 93 పరుగులు 2575 సగటు 33.44 అర్ధ సెంచరీలు 18 అత్యధిక స్కోరు 95
చాంపియన్లను తీర్చిదిద్దిన చాంపియన్
తుపాకీ ఎక్కుపెట్టగానే లక్ష్యానికి చేరుకున్నట్లు కాదని... స్టార్ షూటర్‌గా ఎదగాలంటే క్రమశిక్షణతో కూడిన కఠోర సాధన అవసరమని నిరూపించిన దిగ్గజ షూటర్ జస్పాల్ రాణా కన్నుమూశారు. గన్ పట్టుకోగానే ఫలితాలు వచ్చేయవని... అకుంఠిత దీక్షతో ప్రయత్నిస్తే తప్ప అంతర్జాతీయ స్థాయిలో మెరవలేమని యువ షూటర్లకు దిశానిర్దేశం చేసిన జస్పాల్ రాణా 49 ఏళ్ల వయసులోనే గుండెపోటుకు గురై ఈ లోకాన్ని వీడారు. గురి పెడితే లక్ష్యం తప్ప మరేదీ కళ్ల ముందు కనిపించకూడదనే ప్రాథమిక సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించిన జస్పాల్... తన కెరీర్లో ఎన్నో మరపురాని విజయాలు సాధించడంతో పాటు... తన శిష్యులను కూడా ప్రపంచ స్థాయి షూటర్లులుగా తీర్చిదిద్దారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన స్టార్ షూటర్ మనూ భాకర్‌ను మలిచిన ఆ శిల్పి ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే... – సాక్షి క్రీడా విభాగం‘ఈ లోకంలో జస్పాల్ రాణా లాంటి వారు మరొకరు ఉండరు’... రాణా మృతి సందర్భంగా భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) సంతాపం తెలుపుతూ ఈ వ్యాఖ్య చేసింది. ముమ్మాటికి ఇది వాస్తవం. షూటర్‌గా ఆసియా క్రీడల్లో 8 పతకాలు (4 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు), కామన్వెల్త్ గేమ్స్‌లో 15 పతకాలు (9 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్యాలు) ఖాతాలో వేసుకున్న రాణా... ఆ తర్వాత కోచ్‌గా అంతకుమించి ఘనతలు సాధించారు.క్రమశిక్షణకు మారుపేరైన జస్పాల్ రాణా... ప్లేయర్‌గా ‘అర్జున’ అవార్డు, శిక్షకుడిగా ‘ద్రోణాచార్య’ పురస్కారం సొంతం చేసుకున్నారు. దేశంలో షూటింగ్‌కు పెద్దగా ఆదరణ లేని సమయంలోనే గన్ ఎక్కుపెట్టిన జస్పాల్... ఎందరో యువ షూటర్లకు మార్గనిర్దేశకుడిగా నిలిచారు. ఉత్తరాఖండ్‌కు చెందిన రాణా... 1994 హిరోషియా ఆసియా క్రీడల్లో తొలిసారి పసిడి పతకం సాధించారు. అంతకుముందు 1978 ఆసియా క్రీడల్లో రాజా రణ్‌దీర్ సింగ్ పతకం సాధించగా... 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీనేజ్ వయసులోనే జస్పాల్ పసిడితో మెరిశారు. పురుషుల 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్‌లో అగ్రస్థానం దక్కించుకున్న జస్పాల్... అదే ఏడాది మిలాన్‌లో జరిగిన జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో మెరిశారు. ఆ తర్వాత ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో జస్పాల్ బరిలోకి దిగితే పతకం ఖాయం అనేలా ఎదిగారు. ముఖ్యంగా 2006లో దోహా ఆసియా క్రీడల్లో అయితే జస్పాల్ పట్టిందల్లా బంగారంలా మారింది. ఆ క్రీడల్లో 3 స్వర్ణాలు, ఒక రజతం నెగ్గిన రాణా... ప్రపంచ రికార్డు సైతం నెలకొల్పారు. కోచ్‌గా ఎనలేని కీర్తి... ‘అత్యుత్తమ ఆటగాడు... అంతే మంచి కోచ్ కాలేడు’ అన్న నానుడిని అసత్యమని నిరూపిస్తూ... కోచ్‌గా మారిన తర్వాత భారత షూటింగ్‌కు జస్పాల్ మరింత వన్నె తెచ్చారు. ప్రతిభను వెతికి పట్టడం ఎంత ముఖ్యమో దాన్ని సానబెట్టాల్సిన అవసరం కూడా అంతే ప్రధానమని బలంగా విశ్వసించి... దానిపైనే అహర్నిశలు కష్టపడిన జస్పాల్ ఎందరో యువ షూటర్లను తీర్చిదిద్దారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన మనూ భాకర్ వెనుక ఆయన కృషి ఎంతో ఉంది. మనూ భాకర్ భావోద్వేగం చిన్నతనం నుంచి మనూను గమనిస్తూ వస్తున్న జస్పాల్... ఆమె ఏ విభాగంలో అయితే రాణించగలదో కూడా ముందే నిర్ణయించారు. అయితే ఇద్దరి మధ్య పొరపొచ్చలు రావడంతో కొన్నాళ్లు వేరుపడినా... ఆ తర్వాత జస్పాల్ శిక్షణతోనే ఒలింపిక్ పతకం సాధ్యమని బలంగా నమ్మిన భాకర్... పారిస్ ఒలింపిక్స్‌కు ముందు తిరిగి తన గురువు చెంతకు చేరింది. దీంతో శిష్యురాలిని మెరుపులాగా తీర్చిదిద్దిన జస్పాల్... ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నిలిపారు. సౌరభ్ చౌధరీ, అనీశ్ భన్వాల్, చింకీ యాదవ్ వంటి పులువురు షూటర్లు వెలుగులోకి రావడం వెనక జస్పాల్ కృషి ఎంతో ఉంది. ‘ విజయం సాధిస్తే లోకం మొత్తం నిన్ను భుజాల మీద మోసేందుకు సిద్ధంగా ఉంటుంది... కానీ నువ్వు ఓడిపోయినా నీ వెంట నిలబడేందుకు నేను ఉన్నాను’ అని తన శిష్యులలో మనో ధైర్యం నింపిన జస్పాల్ చిన్న వయసులోనే మృతిచెందడం భారత షూటింగ్‌కు పెద్ద వెలితి! తుదిశ్వాస వరకు... మ్యూనిక్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో పాల్గొన్న అనంతరం తిరిగి వస్తున్న సమయంలో జస్పాల్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో విమానం ఢిల్లీలో దిగగానే నేరుగా ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందినా ఫలితం లేకపోయింది. ఈ ఏడాది ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ వంటి మెగా టోర్నీలు ఉన్న నేపథ్యంలో... షూటర్లను మెరుగ్గా తయారు చేయాలనే సంకల్పం మధ్య జస్పాల్ పెద్దగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేదు. షూటర్‌గా రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం జాతీయ జూనియర్ కోచ్‌గా పనిచేసిన రాణా... భవిష్యత్తులో సత్తా చాటగల షూటర్లను ముందే పసిగట్టి వారిని సానబెట్టడంతోనే... ప్రస్తుతం ఎక్కడ ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్ జరిగినా భారత షూటర్లు పతకాలు సాధించగలుగుతున్నారు. గతేడాది ఫిబ్రవరి నుంచి 25 మీటర్ల పిస్టల్ విభాగానికి హై పెర్ఫార్మెన్స్ కోచ్‌గా వ్యవహరిస్తున్న జస్పాల్ శిక్షణ ధోరణి భిన్నంగా ఉంటుంది. అంతర్జాతీయ పోటీల్లో రాణించే విధంగా సాధన చేయించే జస్పాల్... ఒలింపిక్స్‌ను తలపించే ఒత్తిడిలో షూటర్లతో ప్రాక్టీస్ చేయించడం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టారు. తీరని లోటు...జస్పాల్ రాణా మరణం భారత క్రీడా లోకానికి తీరని లోటు. షూటింగ్లో ఆయన సాధించిన ఘనతలు దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశాయి. షూటర్‌గా ఎంత పేరు సంపాదించారో... కోచ్‌గా యువ షూటర్లను తీర్చిదిద్దడంతో అంతకుమించి కీర్తి పొందారు. ప్రతిక్షణం మరింత మెరుగవ్వాలనే ఆయన నిబద్ధత ఎనలేనిది. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. – నరేంద్ర మోదీ, ప్రధానమంత్రిజస్పాల్ రాణా మరణవార్త విని గుండె ముక్కలైంది. భారత షూటింగ్ రూపురేఖలు మార్చిన అతడు నాకు ఆప్తమిత్రుడు. రేంజ్లో అడుగుపెడితే చాలు అతడితో పోటీ పడటం ఎవరికైనా కష్టం. మన క్రీడాలోకానికి ఈ లోటు తీర్చలేనిది. – అభినవ్ బింద్రా, బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేతకొంతమంది లోటు ఎప్పటికీ పూడ్చలేం. అలాంటి జాబితాలో అగ్రగణ్యుడు జస్పాల్ రాణా. నేను షూటింగ్ కెరీర్ ప్రారంభించిన కొత్తలో అప్పటికే జస్పాల్ స్టార్ షూటర్. 1994 ఆసియా క్రీడల్లో టీనేజ్ వయసులోనే స్వర్ణం సాధించి... భారతీయులు షూటింగ్‌ను ఏలగలరని నిరూపించారు. ఆయనను రోల్‌మోడల్‌గా భావించే షూటింగ్‌లోకి వచ్చా. అలాంటి నా చిన్ననాటి హీరోతో ఆ తర్వాత కలిసి బరిలోకి దిగే అవకాశం లభించింది.ఆసియా క్రీడల్లో 8 పతకాలు, కామల్వెల్త్ గేమ్స్‌లో 15 మెడల్స్... ప్రపంచ రికార్డులు ఇలా లెక్కకు మిక్కిలి సాధించినా జస్పాల్ నిత్య విద్యార్థిలాగే కష్టపడేవారు. మనూ భాకర్ రెండు ఒలింపిక్ పతకాలు సాధించడం వెనక ఆ కష్టం ఉంది. భారత్ షూటింగ్ భారాన్ని భుజస్కందాలపై మోసిన జస్పాల్ ఇక లేరంటే నమ్మశక్యంగా లేదు. – గగన్ నారంగ్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత
న్యూస్ పాడ్‌కాస్ట్
ఏపీలో చంద్రబాబు దగా పాలనపై ప్రజా ఉద్యమం... ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ ర్యాలీల్లో ఉప్పొంగిన జనహోరు
దగా ‘డీఎస్సీ’.. ‘మెగా’ స్కామ్!. చంద్రబాబు సర్కారుపై మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందే... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్...
నేడు విశాఖకు వైఎస్ జగన్మోహన్రెడ్డి... స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు పరామర్శ
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. తొమ్మిది మంది మృతి... ఆరుగురికి తీవ్ర గాయాలు
విష ప్రచారం చేయడం దుర్మార్గం.. మేం రైతులం కాదా?... సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఉండవల్లి రైతుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థను కుదిపేస్తున్న అక్రమాల రాకెట్
మనోడే.. ఇచ్చేద్దాం. ‘ఈనాడు’ కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్్సకు పోలవరం పనులు
ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల రాక్షస పాలనపై రణభేరి.. రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.
బిజినెస్
క్యాష్ ఈజ్ ట్రాష్.. కియోసాకి హెచ్చరిక!
ఎప్పటికప్పుడు ఆర్ధిక పరమైన అంశాలను వెల్లడించే.. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి, తాజాగా మరో అంశాన్ని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ట్రిలియన్ డాలర్లు అంటే ఎంత? అని ప్రశ్నిస్తూనే.. దీనికి 1 తర్వాత 12 సున్నాలు ఉంటాయని కియోసాకి పేర్కొన్నారు. మీరు నిమిషానికి ఒక డాలర్ చొప్పున ఖర్చు చేస్తే, ఆ మొత్తం ఖర్చు చేయడానికి మీకు 34,000 సంవత్సరాలు పడుతుంది. దీన్నిబట్టి చూస్తే ఇది ఎంత పెద్ద సంఖ్య అనేది స్పష్టమవుతోంది.ఒక సాధారణ మనిషికి ట్రిలియన్ డాలర్లు ఊహించడం కూడా చాలా కష్టం. కానీ ఫెడ్, యూఎస్ ట్రెజరీకి ఒక ట్రిలియన్ డాలర్లను ముద్రించడానికి ఒక నిమిషం కన్నా తక్కువ సమయం పడుతుందని కియోసాకి పేర్కొన్నారు.కియోసాకి ప్రకారం.. డబ్బు భద్రమైన పెట్టుబడి కాదు. ఎందుకంటే ద్రవ్యోల్బణం సమయంలో దీని విలువ క్రమంగా తగ్గుతుంది. కాబట్టి డాలర్లను పొదుపు చేసేవారు నష్టపోతారు. క్యాష్ ఈజ్ ట్రాష్ అంటూనే.. మీ డబ్బును బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథీరియం వంటి వాటిలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని రిచ్ డాడ్ వివరించారు.అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ప్రతి పెట్టుబడికి లాభాలు మాత్రమే కాదు, నష్టాలు కూడా ఉంటాయి. బంగారం వంటి సంప్రదాయ ఆస్తులు స్థిరత్వాన్ని ఇస్తే, క్రిప్టోకరెన్సీలు ఎక్కువ మార్పులు కలిగి ఉంటాయి. కాబట్టి ఏ పెట్టుబడి అయినా వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులు, లక్ష్యాలు, ప్రమాద సహనాన్ని బట్టి నిర్ణయించుకోవాలి.HOW MUCH is a $ TRILLION?A trillion is a 1 with 12 zeros after it.$1,000,000,000,000If you were to spend $1 a minute it would take you 34,000 years to spend.It takes the Fed and US Treasury less than a minute to print $1 trillion.Get the picture?Savers of dollars are…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 12, 2026
భారీ రీకాల్.. 2.5 లక్షల వాహనాలు వెనక్కి!
అమెరికా ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ మోటార్స్.. తాజాగా భారీ స్థాయిలో తన వాహనాలను రీకాల్ ప్రకటించింది. మొత్తం 2.5 లక్షలకు పైగా వాహనాలు ఈ రీకాల్ ప్రభావానికి గురయ్యాయి. గతంలో చేసిన రీకాల్‌లో సరిగా మరమ్మతులు చేయకపోవడం వల్ల, మళ్లీ సమస్య తలెత్తినట్లు గుర్తించిన సంస్థ ఇప్పుడు మరోమారు రీకాల్ జారీ చేసింది.ఈ రీకాల్ ప్రధానంగా 2012 నుంచి 2018 మధ్య తయారైన ఫోర్డ్ ఫోకస్ మోడల్ కార్లకు వర్తిస్తుంది. ఈ వాహనాల్లో ఉన్న కానిస్టర్ పర్జ్ వాల్వ్ లోపం కారణంగా ఇంజిన్ ఆకస్మికంగా ఆగిపోయే అవకాశం ఉంది. డ్రైవింగ్ సమయంలో ఇలాంటి సమస్య అనుకోని సమస్యను తీసుకొస్తుంది. దీనిని పరిష్కరించేందుకు డీలర్లు వాహనాలకు ఉచితంగా పవర్ట్రైన్ సాఫ్ట్వేర్ అప్డేట్ అందించనున్నారు. దీని ద్వారా ఇంజిన్ పనితీరును మెరుగుపరచి, అకస్మాత్తుగా ఆగిపోవడాన్ని నివారించవచ్చని కంపెనీ తెలిపింది.వాహన యజమానులకు సంబంధించిన నోటిఫికేషన్ లేఖలు జూలై 6 నుంచి పంపించడం మొదలైంది. అంతే కాకుండా.. ఫోర్డ్ వినియోగదారులు ఫోర్డ్ కస్టమర్ సర్వీస్ నంబర్ ద్వారా మరింత సమాచారం పొందవచ్చు. రీకాల్‌కు సంబంధించిన వాహనాల వివరాలు మరియు VIN నంబర్లు జూలై 6 నుంచి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని సంస్థ తెలిపింది.
EVలకు ఫుల్ డిమాండ్: కారణం ఇదే!
భారత ప్రభుత్వం ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను సాధించేందుకు పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తోంది. ఇప్పటికే E20 (20 శాతం ఇథనాల్ మిశ్రమం) వైపు అడుగులు వేసిన ప్రభుత్వం, భవిష్యత్తులో E22, E25, E27, E30 వంటి అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనాలకు కూడా మార్గం సుగమం చేస్తోంది. ఈ పరిణామాలు దేశంలోని వాహన కొనుగోలుదారుల నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి.ఇటీవల ప్రభుత్వం 22 నుంచి 30 శాతం వరకు ఇథనాల్ కలిగిన పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం మినహాయింపు ఇవ్వడం ద్వారా అధిక ఇథనాల్ వినియోగానికి మద్దతు ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఇంధనాలు మార్కెట్లో అందుబాటులో లేకపోయినా, వాటి ప్రమాణాలను ప్రభుత్వం ఇప్పటికే నోటిఫై చేయడం గమనార్హం.ఈ నేపథ్యంలో.. వాహన కొనుగోలుదారుల్లో అనిశ్చితి నెలకొంది. భవిష్యత్తులో అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనాలు అందుబాటులోకి వస్తే ప్రస్తుతం కొనుగోలు చేసే పెట్రోల్ వాహనాలు వాటికి అనుకూలంగా ఉంటాయా?, లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై నిర్వహించిన సర్వేలో 28 వేలకుపైగా మంది పాల్గొన్నారు. వారిలో 43 శాతం మంది E20, E30 వంటి ఇంధనాల భవిష్యత్ ప్రభావాల కారణంగా వచ్చే ఏడాది కొత్త వాహనాల కొనుగోలును వాయిదా వేయాలని లేదా ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవచ్చని తెలిపారు.సర్వేలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కేవలం 6 శాతం మంది మాత్రమే కొత్త పెట్రోల్ వాహనం కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు 7 శాతం మంది ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), 7 శాతం మంది హైబ్రిడ్ వాహనాలను కొనుగోలు చేయాలని ఆసక్తి చూపించారు. అంటే పెట్రోల్ వాహనాలతో పోలిస్తే EVలు, హైబ్రిడ్ వాహనాలపై ఆసక్తి రెట్టింపుకన్నా ఎక్కువగా ఉందని స్పష్టమవుతోంది.ఇంధన భవిష్యత్తుపై అనిశ్చితి, పెరుగుతున్న పెట్రోల్ ధరలు, తక్కువ నిర్వహణ ఖర్చులు వంటి కారణాల వల్ల ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఫలితంగా ప్రముఖ ఈవీ మోడళ్లకు వెయిటింగ్ పీరియడ్ కూడా గణనీయంగా పెరిగింది.దేశవ్యాప్తంగా EVల వినియోగం కూడా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోషియేషన్ (FADA) గణాంకాల ప్రకారం, 2026 మే నెలలో మొత్తం వాహన అమ్మకాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 11 శాతాన్ని దాటింది. అదే నెలలో EVల రిటైల్ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 45 శాతం పెరిగి 2.71 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. ముఖ్యంగా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ 81 శాతం పెరగడం ఈ రంగంలో పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం.
ఈ ఐటీ కంపెనీలో జీతాల పెంపునకు కొత్త ఫార్ములా..
ప్రపంచ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ (Accenture) తన ఉద్యోగుల వేతన పెంపు విధానంలో కీలక మార్పులు చేసింది. ఇకపై వేతన పెంపు మొత్తం బేసిక్ పేలో కలపకుండా, దానిని రెండు భాగాలుగా విభజించి అందించనుంది. ఒక భాగం శాశ్వత బేస్ పే పెంపుగా ఉండగా, మిగిలిన భాగాన్ని జూన్‌లో ఒకేసారి చెల్లించే లంప్సమ్ బోనస్‌గా ఇవ్వనుంది. ఈ విధానం ద్వారా ఉద్యోగులకు తక్షణ నగదు ప్రయోజనం కల్పించడంతో పాటు కంపెనీ తన స్థిర వేతన వ్యయాలను నియంత్రించగలదని సంస్థ భావిస్తోంది.కంపెనీ అంతర్గత సమాచారం ప్రకారం.. ఒక ఉద్యోగికి 3 శాతం వేతన పెంపు మంజూరైతే అందులో 1.5 శాతం మాత్రమే బేస్ పేలో చేరుతుంది. మిగిలిన 1.5 శాతం జూన్‌లో ఒకసారి చెల్లించే బోనస్‌గా అందుతుంది. అయితే ప్రమోషన్ పొందిన ఉద్యోగులకు వర్తించే పెంపు మాత్రం పూర్తిగా బేస్ పేలోనే జమ అవుతుంది. అలాగే జూన్ లంప్సమ్ చెల్లింపు డిసెంబరులో ఇచ్చే వార్షిక పనితీరు బోనస్‌కు పూర్తిగా వేరుగా ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.యాక్సెంచర్‌లో జూన్ నెలే ప్రమోషన్లు, వేతన సవరణలకు ప్రధాన చక్రంగా కొనసాగుతోంది. గత ఏడాది పరిమిత సంఖ్యలో మాత్రమే ‘స్టే-అట్-లెవల్’ ఉద్యోగులకు పెంపు లభించగా, ఈసారి మరింత పెద్ద సంఖ్యలో ఉద్యోగులను పెంపు పరిధిలోకి తీసుకురావాలని సంస్థ నిర్ణయించింది. దీంతో ఎక్కువ మంది ఉద్యోగులు కనీసం కొంత మేర వేతన ప్రయోజనం పొందే అవకాశం ఏర్పడింది.ఈ నిర్ణయం వెనుక ప్రపంచ ఆర్థిక మందగమనం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఐటీ సేవల రంగంలో కొనసాగుతున్న ఒత్తిళ్లు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. స్థిర ఖర్చులను అదుపులో ఉంచుతూ ప్రతిభావంతులైన ఉద్యోగులను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా యాక్సెంచర్ ఈ హైబ్రిడ్ వేతన విధానాన్ని అమలు చేస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వేతన నిర్ణయాలు ఉద్యోగుల నైపుణ్యాలు, పనితీరు, వ్యాపారంపై చూపిన ప్రభావం, ప్రవర్తనా ప్రమాణాల ఆధారంగానే కొనసాగుతాయని సంస్థ తెలిపింది.భారత్‌లో యాక్సెంచర్‌కు సుమారు 3.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ కొత్త విధానం వారి వేతన నిర్మాణంపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. కొంతమంది ఉద్యోగులు తక్షణ నగదు లాభాన్ని స్వాగతిస్తున్నప్పటికీ, బేస్ పే పెరుగుదల పరిమితంగా ఉండటం వల్ల భవిష్యత్ వేతన వృద్ధిపై ప్రభావం పడొచ్చనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఫ్యామిలీ
చిరునవ్వుల చదువిద్దాం...
రెండు నెలల తర్వాత బడి. బ్లాక్‌బోర్డు ఎదుట టీచర్ నిలిచే సమయం. కొత్త క్లాసులో పిల్లలు. కొత్త లెసన్ ప్లాన్లు. అయితే ముందు చేయాల్సిన పని ఒకటి ఉంది. పిల్లలకు చిర్నవ్వుతో స్వాగతం పలకడం. వారిని వాత్సల్యంగా పలకరించడం. పిల్లలు పేరెంట్స్ కన్నా టీచర్స్‌తో ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్లే ‘స్కూల్ అమ్మ’, ‘స్కూల్ నాన్న’. పిల్లలు చదువులో ‘పాస్’ అవ్వాలంటే, టీచర్లు మొదట వాళ్ల దృష్టిలో పాస్ కావాల్సిందే. ఎలా?పిల్లలకు టీచర్లు బాగా తెలుసు. టీచర్లకు పిల్లలందరూ తెలియకపోయినా. ఒక్కోసబ్జెక్ట్కు ఇద్దరు ముగ్గురు టీచర్లు (సార్లు) ఉంటే వారిలో పాఠం ఎవరు బాగా చెప్తారో, ఎవరు చిరాకు పడతారో, ఎవరు ఎక్కువ కోపంగా ఉంటారో, ఎవరు పనిష్మెంట్లు ఎక్కువ ఇస్తారో పిల్లలకు తెలిసిపోతుంది. పిల్లలే ఆ సమాచారాన్ని ఒకరికి మరొకరు ఇచ్చుకుంటారు.స్కూళ్లు రీ ఓపెన్ అయినప్పుడు ‘మేథ్స్‌కు ఫలానా సార్ వస్తే బాగుండు’ అని కొందరు పిల్లలు ‘ఫలానా సార్/టీచర్ వద్దు బాబోయ్’ మరికొందరు పిల్లలు అనుకుంటారు. కాని ఎవరు రావాలనేది వారి చేతుల్లో ఉండదు. కాని వచ్చిన వారు తమ వ్యవహార శైలితో పిల్లలకు నచ్చడం వారి చేతుల్లోనే.‘ఈ ఏడాదంతా ఈ టీచర్లే’ అని పిల్లలకు స్కూల్ మొదటిరోజు తెలిసినప్పుడు ప్రతి టీచర్‌ను వాళ్లు ఇష్టపడేలా ఉంటే ఎంత బాగుంటుంది? టీచర్లు పిల్లల కోసం ఉన్నారు. పిల్లలు ఉన్నారు కనుక ఉన్నారు. కాబట్టి పిల్లలతో పాఠం సమయంలో కఠినంగా, మిగిలిన సమయాల్లో ప్రేమగా ఉంటూ కూడా మంచి ఫలితాలు సాధించవచ్చు.కేస్ స్టడీ 1: సుజాత టీచర్ స్కూల్ తెరిచిన ఫస్ట్‌రోజు సుజాత మేడమ్ క్లాస్‌లోకి చాక్‌పీస్‌తో వెళ్లరు. ఒక పెద్ద చార్ట్, కొన్ని కలర్ స్కెచ్‌లు తీసుకెళ్తారు. బోర్డు మీద ముందో స్మైలీ గీసి ‘నా సమ్మర్ స్టోరీ’ అని రాసి, తాను సెలవుల్లో ఏం చేశారో మూడు నిమిషాలు చెప్తారు. ‘నేను మా ఊరెళ్లా, ఢిల్లీ చూశా, చాలా పుస్తకాలు చదివా’. తర్వాత పిల్లల్ని అడుగుతారు– ‘మరి మీ స్టోరీ ఏంటి?’ 40 మంది, 40 కథలు. ఒకడు అమ్మమ్మ వాళ్ల ఊర్లో బావిలో ఈత నేర్చాడు, ఒక పాప పిల్లి పిల్లకు పేరు పెట్టింది. నవ్వులు, కేకలు. పీరియడ్ అయిపోయింది. ఇలా క్లాసులు మొదలైతే పిల్లలు ఉత్సాహంగా ముందుకు దూకరూ?కేస్ స్టడీ 2: రవి సార్ రవి సార్ మ్యాథ్స్ అంటే పిల్లలకు దడ. సెలవుల తర్వాత మొదటి క్లాస్‌లో ఆయన బోర్డు మీద లెక్కల సూత్రం రాయరు. బదులుగా ‘మీలో ఎంతమందికి క్రికెట్ అంటే ఇష్టం?’అని అడుగుతారు. అందరూ చేతులు ఎత్తాక ‘సరే, ఐపీఎల్లో కోహ్లీ 5 మ్యాచ్‌లలో 45, 67, 2, 89,12 పరుగులు చేశాడు. యావరేజ్ ఎంత?’ అంటారు. పిల్లలు ఆన్సర్ చెప్పడానికి టకటకా పెన్నులు బయటకు తీస్తారు. లెక్కల క్లాసు ఇలా మొదలుపెట్టి రవిసార్ అనవసర భయాన్ని తగ్గిస్తారు. టీచర్లు దారి చూపేవారు. అయితే వారికి సూచనలు చేయవచ్చు.→ ‘అటెండెన్స్’ కంటే ముందు ‘అటెన్షన్’పేరుతో పిలవండి, నంబర్‌తో కాదు. రిజిస్టర్ లో ‘రోల్ నంబర్ 12’ అని ఉంటుంది. కానీ ఆ స్టూడెంట్‌కి పేరు ఉంది. ‘ఉత్కర్ష్... ఓ అక్కడ కూచున్నావా’ అని అనండి. ‘మేడంకి నా పేరు తెలుసా’ అనే ఫీలింగ్ ఉత్కర్ష్కి ధైర్యాన్నిస్తుంది. పరిశోధనలు చెప్తున్నాయి... పిల్లవాడిని పేరుతో పిలిచే టీచర్ క్లాస్‌లో హాజరు 23 శాతం ఎక్కువ ఉంటుందని. క్లాస్‌లో పేరు వినిపించే విద్యార్థి తన ఉనికికి సంతోషపడతాడు. ‘క్లాస్ లీడర్ ఎవరు?’... ‘బోర్డు తుడిచే మినిస్టర్ ఎవరు?’...‘పూలమొక్కలకు నీళ్లు పోసే గార్డెనర్ ఎవరు?’అని కొన్ని బాధ్యతలు ఇవ్వండి. పిల్లలకు ‘ఓనర్షిప్’ వస్తే బడి నచ్చుతుంది.→ ఆరా తీయండిమొదటిరోజు రోల్ కాల్ తీసేటప్పుడు మూడు నాలుగు పేర్లకు జవాబు రాదు. ‘ఆబ్సెంట్’ అని టిక్ పెట్టి వదిలేయకండి. ఆ పిల్లాడు ఎందుకు రాలేదు? టీసీ తీసుకున్నాడా? పనిమీద వేరే ఊరు వెళ్లాడా? లేక ‘బడి వద్దు’ అని మారాం చేస్తున్నాడా? 6వ క్లాస్, 9వ క్లాస్‌లో డ్రా΄ûట్స్ ఎక్కువ. ఫోన్ చేసి కనుక్కోండి. ‘ఏమైంది నాన్నా, రేపు వస్తావా?’ అని ఆ పిల్లాడితో మీరే మాట్లాడితే వాడి అమ్మానాన్నలకు ‘ఈ స్కూల్లో నా కొడుకుని పట్టించుకుంటారు’ అనే నమ్మకం వస్తుంది.→ మీ నవ్వే వాళ్లకు టానిక్ఫిన్లాండ్లో టీచర్లు మొదటి రెండు వారాలు అసలు పుస్తకం ముట్టుకోరు. కేవలం పిల్లలతో ‘బాండింగ్’ చేస్తారు. ఫలితం? ప్రపంచంలోనే బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌గా నిలిచింది. అందుకే మొదటిరోజు పిల్లలతో బాండింగ్ ఏర్పరుచుకోవడం మీదే దృష్టి పెట్టాలి. ‘ఇంట్లో ఎవరెవరు ఉంటారు?’..‘నీకు ఏ ఆట ఇష్టం?’... ‘అన్నం తిన్నావా?’ ఈ రెండు నిమిషాలు వాడికి ‘సేఫ్ జోన్’ క్రియేట్ చేస్తాయి. పిల్లవాడు మీతో కనెక్ట్ అయితే, సబ్జెక్ట్‌తో ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతాడు. డియర్ టీచర్స్... విద్యార్థికి ‘బడి’ అంటే ‘బిల్డింగ్’ కాదు, మీరే. చాక్‌పీస్ పట్టుకునే ముందు, పిల్లాడి చేయి పట్టుకోండి. వాడు మిమ్మల్ని గురువుగా, గైడ్‌గా చూస్తాడు. అది చాలు, ఈ ఏడాది మీ క్లాస్ నూరుశాతం పాస్.
డైనమిక్ డయాన్ @ 79
విజయానికి ఎన్ని మెట్లో ఎవరు చెప్పగలరు? కొందరు మాత్రం కొన్ని మెట్ల తర్వాత ఆగిపోతారు. కొందరు మాత్రం ప్రతి మెట్టులో ప్రతికూలతలు ఎదురైనా వెనక్కి తగ్గరు. ‘ఫోర్బ్స్ సెల్ఫ్–మేడ్ ఉమెన్’ సంపన్నుల జాబితాలో వరుసగా తొమ్మిదవసారి చోటు సాధించిన డెబ్బై తొమ్మిది సంవత్సరాల డయాన్ హెండ్రిక్స్ రెండో కోవకు చెందిన మహిళ. ‘పెద్ద ఎంటర్ప్రెన్యూర్ కావాలి’ అని చిన్నప్పటి నుంచే కలలు కన్న డయాన్ ఆ కలను సాకారం చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఖర్చుల కోసం టాయిలెట్లు శుభ్రం చేసిన రోజులూ ఆమె జీవితంలో ఉన్నాయి. ‘విజయం అంటే కొత్తగా ఆలోచించడం. మార్కెట్లోని లోటుని భర్తీ చేయడం’ అంటున్న డయాన్ హెండ్రిక్స్ గురించి...పదేళ్ల వయసు నుంచే ఎంటర్ప్రెన్యూర్ కావాలని కలలు కనేవారు డయాన్ హెండ్రిక్స్. ‘చిన్నప్పుడు ఎన్నో కలలు కంటాం... అవి నిజమవుతాయా!’ అని ఆ తరువాత అనుకోలేదు డయాన్. తన ‘లక్ష్యం’ అనే మొక్కను పదిలంగా కాపాడుకుంటూ వచ్చారు. కలను సాకారం చేసుకొని ‘సెల్ఫ్–మేడ్ ఉమెన్ బిలియనీర్’గా జేజేలు అందుకుంటున్నారు డయాన్.అప్పులు చేసి.. ఆస్తులు తాకట్టు పెట్టి...తాజాగా... తొమ్మిదవసారి అమెరికా రిచెస్ట్ సెల్ఫ్–మేడ్ ఉమెన్(2026) జాబితాలో చోటు సాధించి తన ప్రత్యేకత నిలుపుకున్నారు డయాన్. ఆమె సంపదలో అధిక భాగం ఆమె రూఫింగ్ మెటీరియల్ కంపెనీ ‘ఏబీసీ సప్లై’కి చెందినదే. తన భర్త కెన్ హెండ్రిక్స్‌తో కలిసి 1989 లో ఈ కంపెనీని స్థాపించారు. ఆరోజుల్లో వివిధ తయారీదారులు తయారు చేసిన రూఫింగ్ మెటీరియల్స్ ఒకేచోట దొరికే దుకాణాలు చాలా తక్కువగా ఉండేవి. ఇది గ్రహించిన డయాన్ ‘ఏబీసీ సప్లై’ కంపెనీకి శ్రీకారం చుట్టారు. ఈ కంపెనీప్రారంభించడానికి బ్యాంక్ నుంచి అప్పు చేయాల్సి వచ్చింది. ఆస్తులను తాకట్టు పెట్టాల్సి వచ్చింది. విస్కాన్సిన్లోని బెలోయిట్ కేంద్రంగా మొదలైన కంపెనీ కొన్ని సంవత్సరాలలో లాభాల బాట పట్టింది.విజయ రహస్యం‘నా విజయ రహస్యం... మార్కెట్లోని ఒక లోటును భర్తీ చేయడం’ అంటారు డయాన్. ఒస్సియో(యూఎస్)లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో పెరిగిన డయాన్ పెద్ద నగరంలో ఉండాలని, నీలం రంగు సూట్లు ధరించి, ఖరీదైన కార్లు నడపాలని కలలు కనేవారు. చిన్న వయసులోనే పెళ్లి అయి గర్భవతి కావడంతో ఇంటి నుంచే చదువు పూర్తి చేశారు. కాలేజీ చదువు కంటే రియల్ ఎస్టేట్ రంగంలో కెరీర్ వెదుక్కోవడానికి చిన్నాచితకా పనులు చేశారు. చిన్న వయసులో తల్లి అయిన డయాన్ తన ఖర్చుల కోసం ప్లేబాయ్ బన్నీ(ప్లేబాయ్ క్లబ్లో పనిచేసే కాక్టెయిల్ వెయిట్రెస్)గా కూడా పనిచేశారు.క్యాన్సర్‌ను జయించి...రెండు సార్లు క్యాన్సర్ బారిన పడ్డారు డయాన్. తన సంకల్పబలమే క్యాన్సర్‌ను జయించే శక్తిని ఇచ్చింది. భర్త మరణం ఆమెను దుఃఖంలో ముంచెత్తింది. కష్టకాలం లో, నిరాశానిస్పృహల చీకటిలో కూడా...‘సాధించాలి. తప్పకుండా సాధించాలి’ అని గట్టిగా ఒకటికి పదిసార్లు అనుకునేవారు డయాన్. ప్రారంభ రోజుల్లో...ఖర్చుల కోసం టాయిలెట్లు శుభ్రం చేసేవారు. పాత ఇంటిని కొని స్వయంగా మరమ్మతు చేసి కాలేజీ స్టూడెంట్స్‌కు అద్దెకు ఇచ్చేవారు.చాలా కష్టం...అయినా సరే...డయాన్ నాయకత్వంలో, మార్గదర్శకత్వంలో ‘ఏబీసీ సప్లై కో’ కంపెనీ ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు చేస్తూ మార్కెట్ లో దూసుకుపోతోంది. మార్కెట్ పోకడలకు అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకుంటోంది. వ్యర్థాల తగ్గింపు, పర్యావరణ అనుకూల ఉత్పత్తులపై దృష్టి పెడుతోంది. రైతుబిడ్డ నుండి బిలియనీర్ వ్యాపారవేత్తగా డయాన్ ప్రయాణం అనేది పట్టుదల, అపారమైన ధైర్యసాహసాల కలబోత. ఎంతోమంది ఔత్సాహికులకు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే అపూర్వ విజయం.‘ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకునే యువతకు మీరు ఇచ్చే సలహా ఏమిటి?’ అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన జవాబు... ‘వ్యాపారవేత్తగా రాణించడం అనేది చాలా కష్టం. మూస ఆలోచనలు కాకుండా ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలి. మీరు చేయాలనుకుంటున్నది మార్కెట్‌కు ఎంత అవసరం... అనేది మీకు మీరు వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న. వ్యాపారంలో విలువైన సమయంతోపాటు, డబ్బు కూడా కోల్పోవలసి రావచ్చు. అలా అని భయపడకూదు. రిస్క్ తీసుకోవాలి. ఎంత రిస్కైనా సరే!’ ఎంతోమంది ఔత్సాహికులు తమ కలలను నిజం చేసుకోవడంలో సహాయపడిన డయాన్ దాతృత్వ కార్యక్రమాలలోనూ ముందుంటారు. టెన్ కమాండ్మెంట్స్కష్టపడి పనిచేసి నా కలలను నిజం చేసుకున్న ఒక సాధారణ అమెరికన్ అమ్మాయిని, రైతు బిడ్డను. వ్యక్తిగత, వృత్తి జీవితంలో నన్ను ఎక్కువగా ప్రభావితం చేసింది నా తల్లిదండ్రులు. మా నాన్నగారు ఏది సరైనదో, ఏది కాదో చెప్పేవారు. ‘నేను చేస్తున్న పని సరైనదేనా అని నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటే నిర్ణయాలు తీసుకోవడం సులభం అవుతుంది’ అని చెప్పేవారు. టెన్ కమాండ్మెంట్స్ నా వ్యక్తిగత జీవితంలోనే కాకుండా వృత్తిజీవితంలోనూ ప్రభావాన్ని చూపుతున్నాయి. నేను వాటిని మళ్లీ మళ్లీ చదువుతాను. ఒక్కముక్కలో చె΄్పాలంటే ఏది సరిౖయెనదో, ఏది త΄్పో అవి వివరిస్తాయి.– డయాన్ హెండ్రిక్స్
40ల తరువాత అల్ట్రామారథాన్ : తృటిలో తప్పిన ముప్పు
ఆరోగ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు. ఉద్యోగ ఒత్తిళ్లు, గంటల తరబడి కూర్చునే జాబ్ నుంచి ఫిట్‌గా మారాలని నిర్ణయించుకుని, తీవ్ర కసరత్తు చేస్తారు. కానీ దీనికి సంబంధించి వైద్యుల సలహాలు, మందస్తు ప్రిపరేషన్ లేకపోతే ముప్పు తప్పదు. బెంగళూరుకు చెందిన ఒక ఉద్యోగికి ఎదురైన చేదు అనుభవం ఈ విషయాన్నే మరోసారి రుజువు చేసింది. పరుగు మంచిదే, కానీ ముందస్తు ప్రిపరేషన్ అవసరం,సురక్షితమైన ఆరోగ్యమే అంతిమ లక్ష్యం కావాలి అనే అంశంపై ఓ కథనం.బెంగళూరుకు చెందిన, 40 ఏళ్ల మధ్య వయసు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని భావించాడు. ఏళ్ల తరబడి ఒత్తిడితో కూడినడెస్క్ జాబ్‌నుంచి ఫిట్‌గా మారాలను కున్నాడు. అంతేకాదు లాంగ్-డిస్టెన్స్ రన్నింగ్‌ను చేపట్టాలని నిర్ణయించుకున్నాడు అమెరికాలో 100 కిలోమీటర్ల అల్ట్రామారథాన్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ అంతలోనూ ఊహించని ప్రమాదం అతణ్ని మృత్యువు అంచుల దాకా తీసుకెళ్లింది. ఇంతకీ ఏమైందంటే.అల్ట్రామారథాన్కోసం శ్రద్ధగా శిక్షణ పొందాడు. గుండె జబ్బులు, ఇతర అనారోగ్య సంకేతాలవీ లేకుండా ఆరోగ్యంగా కనిపించాడు. ఆ తర్వాత జరిగిన సంఘటన అతనికి షాక్ ఇచ్చింది. అతను తన ప్రాక్టీస్ రన్ల సమయంలో ట్రాక్‌పై కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న స్నేహితులు ఎమర్జెన్సీ రూమ్‌కు తీసుకువెళ్లారు. వైద్య పరీక్షలో అతని గుండెకు రక్తాన్ని సరఫరా చేసే మూడు ప్రధాన కరోనరీ ధమనులలో క్లాట్స్ ఉన్నట్లు తేలింది. అంతేకాదు ఆ తరువాత పరీక్షల్లో హై కొలెస్ట్రాల్ స్థాయిలు, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్రతో సహా, ఏళ్లుగా గుర్తించడని పలు అంతర్లీన ప్రమాద కారకాలు బయటపడ్డాయి.ఒక విధంగా చెప్పాలంటే అతను చాలా అదృష్టవంతుడు. ఒక పెను ప్రమాదం జరగక ముందే అతని పరిస్థితిని గుర్తించారు. గుండె ఆరోగ్యానికి పరుగు ఉత్తమమైన వ్యాయామమే అయినప్పటికీ, మధ్య వయస్సులో ఎలాంటి ముందస్తు సన్నాహం లేకుండా అకస్మాత్తుగా తీవ్రమైన ఓర్పు శిక్షణను ప్రారంభించడం, సంవత్సరాలుగా నిశ్శబ్దంగా ఉన్న అంతర్లీన వ్యాధిని కొన్నిసార్లు బయట పెట్టగలదని ఈ కేసు గుర్తు చేస్తుంది.పరుగు తీయడం వల్ల గుండె జబ్బులు రావు. నిజానికి ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, సుదీర్ఘకాలం పాటు ఎటువంటి శారీరక శ్రమ లేకుండా చాలా కాలం గడిపి, ఒక్కసారిగా 40 ఏళ్ల వయసులో తీవ్రమైన పరుగు పందాలు (మార్గాథాన్లు) ప్రారంభించడం వల్ల, లోపల దాగి ఉన్న గుండె సమస్యలు అకస్మాత్తుగా బయటపడే ప్రమాదం ఉంది. 40 ఏళ్లు పైబడిన వారు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?అధిక కొలెస్ట్రాల్, బీపీ, మధుమేహం, ధూమపానం వంశపారంపర్య గుండె జబ్బుల వంటి రిస్క్ ఫ్యాక్టర్లు చాలా సంవత్సరాలుగా లోపల నెమ్మదిగా ధమనులలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి.బయటకు ఎంతో ఫిట్‌గా కనిపించే వ్యక్తికి కూడా లోపల గుండె ధమనులలో తీవ్రమైన బ్లాక్స్ ఉండే అవకాశం ఉంది.ఒక్కసారిగాతీవ్రంగా శ్రమించడం వల్ల గుండెపై ఒత్తిడి పెరిగి, రక్తపోటు ఎక్కువ అవుతుంది. దీనివల్ల లోపల ఉన్న కొవ్వు పలకలు (plaques) ఊడిపోయి హార్ట్ ఎటాక్‌కు దారితీయవచ్చు.40 ఏళలు దాటిన తరువాత ముందే కార్డియాక్ స్క్రీనింగ్ అంటే గుండె పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ల సలహా మేరకు ECG, ఎకోకార్డియోగ్రామ్ , ట్రెడ్మిల్ టెస్ట్ వంటివి చేయించుకోవడం ఉత్తమం. పరుగు, లేదా కఠిన వ్యాయామాలను ఆరంభించే ముందు ఒకసారి వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.ప్రధానంగా రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ పరీక్షలతో ఫ్యామిలీ హిస్టరీని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.రిస్క్ ఎక్కువగా ఉన్నవారికి 'కరోనరీ CT యాంజియోగ్రఫీ' ద్వారా లోపల ఉన్న బ్లాక్స్‌ను ముందే గుర్తించవచ్చు.వ్యాయామాన్ని ఒకేసారి తీవ్రం చేయకూడదుకొన్ని సంవత్సరాలుగా రన్నింగ్ చేయని వారు ఒక్కసారిగా కొన్ని నెలల్లోనే పెద్ద రేసులకు సిద్ధం కాకూడదు.తొలుతసాధారణ నడకతో ప్రారంభించి, ఆపై వేగంగా నడవడం (Brisk Walking), ఆ తర్వాతే రన్నింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి.వేగం లేదా దూరం కంటే క్రమం తప్పకుండా చేయడం (Consistency) ముఖ్యం. దీనివల్ల గుండె, కండరాలు, కీళ్లకు తగిన సమయం దొరుకుతుంది.మరి ఏం చేయాలి?40 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో కండరాల సాంద్రత సహజంగానే తగ్గుతుంది. కాబట్టి కేవలం పరుగు మాత్రమే సరిపోదు. స్ట్రెంత్ ట్రైనింగ్ (కండరాల వ్యాయామం) తప్పనిసరివారానికి కనీసం రెండు సార్లు కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు (Strength Training) చేయాలి.ఇది మోకాళ్లు, నడుము, తుంటి భాగాలపై ఒత్తిడిని తగ్గించి గాయాలు కాకుండా కాపాడుతుంది.అంతేకాదు భారీ భోజనం వెంటనే రన్నింగ్ చేయకూడదు. ఆహారం తిన్న తర్వాత కనీసం రెండు గంటల సమయం ఇచ్చి, ఆపై రన్నింగ్ చేయడం వల్ల జీర్ణక్రియ సమస్యలు రావు. శరీరం కూడా బాగా సహకరిస్తుంది. ఇదీ చదవండి: 10 రోజులు లీవ్ తర్వాత ఉద్యోగికి బాస్ బంపరాఫర్
సెలవిక సమ్మర్‌కు సరదాగా స్కూల్‌కు
సెలవులు అయిపోయాయి.రేపో మాపో బడిగంట. ఇక అమ్మ ‘లేవరా’ అంటుంది. బయట స్కూల్ బస్ హారన్ మోగుతుంది. టీచర్ గుర్తొచ్చి భయమేస్తుంది. స్కూలుకు పోబుద్ధి కాదు. రెండు నెలల సెలవుల తర్వాత పిల్లలకు ఇలా అనిపించడం మామూలే. దీనిని స్కూల్ ఫీవర్ అనొచ్చు. అయితే ‘ఇలా నీకొక్కడికే కాదు... క్లాసంతా’ అని చెప్పాలి. పిల్లల్ని బడికి హుషారుగా సిద్ధం చేయాలి.తెలుగు రాష్ట్రాల్లో బడిగంట మోగే వేళన పిల్లలకు ఎన్నో సందేహాలు, లోలోపలి భయాలు, చిన్నపాటి ఆందోళనలు ఉంటాయి. కొత్త స్కూల్‌కి, కొత్త క్లాస్‌కి, కొత్త సెక్షన్‌కి మారడం... మళ్లీ ఆ భారీ స్కూల్ బిల్డింగ్‌లోకి అడుగు పెట్టడం... కొత్త టీచర్లను ఫేస్ చేయడం... అదీగాక ఇన్నాళ్లూ ఫోన్ చూసిన కళ్లతో రేపు బ్లాక్‌బోర్డ్ చూడాలంటే కష్టమే. అందుకే స్కూల్ ఫీవర్ తెచ్చుకుంటారు. అయితే దానికి విరుగుడు మాత్ర ఉంది.‘స్కూల్ ఫీవర్’ ఎందుకు?రెండు నెలలు ఇష్టానుసారం గడిచి ఉంటాయి. లేట్‌గా లేవడం, ఆడుకోవడం, టీవీ, నో హోంవర్క్.... ఇప్పుడు మళ్లీ టైమ్‌కి లేవాలి, ఇంట్లో స్కూల్లో రూల్స్ వస్తాయి... బ్రెయిన్ కి ఇది సడన్ బ్రేక్‌లా ఉంటుంది. అందుకే కడుపులో తిప్పేసినట్టు, ఏడుపు వచ్చేట్టు, చిరాకు కోపం, ఏదైనా ఎత్తుగడ వేయాలనిపించడం... పిల్లల్ని గమనించి మొదట వారిని ‘చిన్న పనుల్లో’ పెట్టాలి. ‘పుస్తకాలకు అట్టలు వేద్దాం రా’, ‘కొత్త పెన్ను పెన్సిలు బాక్స్‌లో పెట్టుకున్నావా?’, ‘యూనిఫామ్ సైజ్ చెక్ చేద్దాంరా’... ఈ పనులు చేయిస్తుంటే పిల్లల మైండ్‌కి ‘ఓకే, స్కూల్‌కి రెడీ అవ్వాలన్నమాట’ అనే ఫీలింగ్ వస్తుంది. ఫీవర్ దానంతట అదే తగ్గిపోతుంది.కొత్త బ్యాగ్ బెంగను పోగొడుతుందా?పోగొడుతుంది. కానీ బ్యాగ్ ఒక్కటే చాలదు. స్కూల్ ఫస్ట్ డే ఉదయం పిల్లలు లేచి చేసే మూడు పనులు వారి స్కూల్ ఫీవర్‌ని తరిమి కొడతాయి. ∙లేవగానే వారు చక్కగా తయారయ్యేలా చూసి అద్దంలో వారిని వారికి చూపించాలి. కొత్త యూనిఫామ్‌లో భలే బాగున్నావ్ అనాలి. ఏదో ఒక సరదా మాట చెప్పి నవ్వించాలి. నవ్వితే బ్రెయిన్ ‘నేను హ్యాపీ’ అని ఫిక్స్ అవుతుంది. ముందురోజు రాత్రే ఇష్టమైన టిఫిన్ కనుక్కుని ‘నీ ఫేవరెట్ టిఫిన్ రెడీ’ అని చెప్పాలి. కడుపు ఫుల్ అయితే మూడ్ ఆటోమేటిక్ సెట్. ∙స్కూల్‌కి వెళ్లేటప్పుడు ‘నీ బెస్ట్ ఫ్రెండ్ నీ సెక్షన్లోనే పడొచ్చు’ అనో, ‘ఈసారి ఎవరు కొత్త ఫ్రెండ్స్ అవుతారో’ అనో ఉత్సాహ పరచాలి. ‘క్లాస్‌రూమ్‌లకు కొత్తగా పెయింట్ చేయించారట’ అని చెప్పాలి. అలాంటివి వింటే పిల్లలు ఎగ్జయిట్ అవుతారు.హుషారుగా ఎలా ఉండాలి?‘మొదటిరోజు కాబట్టి నువ్వు ఈరోజు హుషారుగా ఉంటే సంవత్సరం అంతా హుషారుగా ఉంటావ్’ అని చెప్పాలి. ‘టీచర్ క్లాస్‌లోకి రాగానే గుడ్ మార్నింగ్ మేడం అని కాస్త గట్టిగా చెప్పు. లంచ్‌టైమ్‌లో ఒంటరిగా కూర్చోకు. ఇంకో విషయం... ఫస్ట్‌డే ఎవరూ నీ ర్యాంక్ అడగరు. నీ కొత్త షూస్, నీ నవ్వు చూస్తారు. నేను అందరితో కలిసిపోతా అనే ధైర్యంతో ఉండు’ అని చెప్పాలి.బస్సెక్కించేటప్పుడు ‘నీకు ఎలాంటి ఫీలింగ్ ఉందో నీ సెక్షన్లో ఉండే అందరు పిల్లలూ అలాంటి ఫీలింగ్‌తోనే ఇవాళ స్కూల్‌కి వస్తారు. ఏం పర్వాలేదు. వెళ్లు. అక్కడ బెంచీలు, బ్లాక్‌బోర్డు, బెల్ అన్నీ నీ కోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఏడాది నీదే. స్కూల్లో చదువు, ఆడు, కథలు విను, ఫ్రెండ్షిప్ చెయ్...’ అని చెప్పాలి. మొదటిరోజు దాటితే ఈ సంవత్సరం దాటేసినట్టే. కేస్ స్టడీ 1: కార్తికేయ, 7వ తరగతికార్తికేయ గుంటూరులో చదువుతున్నాడు. రేపు స్కూల్ తెరిస్తే సెవెన్త్‌లో కూచోవాలి. పోయిన సంవత్సరం ఆరుకు వచ్చినప్పుడు ఫస్ట్ డే ΄÷ద్దున్నే ‘కడుపునొప్పి’ అన్నాడు. అమ్మ టెంపరేచర్ చూసింది, జ్వరం లేదు. బస్సెక్కించబోతే మొహం అదోలా పెట్టి ‘కొత్త సెక్షన్లో నా ఫ్రెండ్స్ ఉండరు’ అన్నాడు. అమ్మ వాడితో ‘మా బుజ్జి కదూ. బ్యాగ్‌లో నీకిష్టమైన ఫుడ్ పెట్టాను. అది లంచ్‌లో నీ పక్కవాడితో షేర్ చేసుకో’ అని చెప్పింది. కార్తికేయ నసుగుతూనే బస్సెక్కాడు. డల్‌గా కూచున్నాడు. కాని సాయంత్రం ఇంటికి హుషారుగా వచ్చి ‘కొత్త ఫ్రెండ్ దొరికాడు మా’ అన్నాడు. స్కూల్ ఫీవర్ పోయింది. మళ్లీ ఈ సంవత్సరం కూడా ఈ ఫస్ట్‌డేకి ప్రిపేర్ చేయాలి.కేస్ స్టడీ 2: శ్రావ్య, 10వ తరగతిశ్రావ్య హైదరాబాద్‌లో ప్రయివేట్ స్కూల్. ఇప్పుడు 10కి వచ్చింది. 9వ క్లాస్‌లో మ్యాథ్స్‌లో 55 మార్కులు వచ్చాయి. సెలవులు అయిపోతున్నాయంటే శ్రావ్యకు మూడ్ పాడవుతోంది. ‘రేపు మ్యాథ్స్ మేడం సెలవుల్లో ఏం చేశావ్ అంటే ఏం చెప్పాలి? నన్నే లెక్క చేయమంటుందేమో’ అని ఏడుపు. అప్పుడు నాన్న పక్కన కూర్చుని ఒక పేపర్ ఇచ్చాడు. ‘దీనిమీద రాయి. టీచర్... నాకు లెక్కలు కష్టం. కానీ నేను నేర్చుకోవడానికి రెడీ. దయచేసి హెల్ప్ చేయండి. ఫస్ట్ డే ఇది మేడం డెస్క్ మీద పెట్టు. చదివిన ఏ టీచరూ హెల్ప్ చేయకుండా ఉండదు’ అన్నాడు. శ్రావ్యకు స్కూల్ ఫీవర్ పోయింది. బుర్రలో ‘భయం’ పోయి ‘భరోసా’ రావడంతో స్కూల్‌కు వెళ్లడానికి రెడీగా ఉంది.
అంతర్జాతీయం
ఉత్తర కొరియాపైకి డ్రోన్లు.. సియోల్ కోర్టు సంచలన తీర్పు
సియోల్: ఉత్తర కొరియాపైకి డ్రోన్లు పంపినందుకు గాను దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు సియోల్ కోర్టు ఇవాళ(శుక్రవారం) ఆయనకు మరో 30 ఏళ్ల భారీ జైలు శిక్షను ఖరారు చేసింది. అయితే, ఆయన ఇప్పటికే జీవిత ఖైదు అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. 2024 డిసెంబర్లో విఫలమైన మార్షల్ లా విధింపునకు దారితీసిన పరిణామాలపై విచారణ జరిపిన కోర్టు.. దేశద్రోహం, అధికార దుర్వినియోగం ఆరోపణల కింద ఆయనను దోషిగా తేల్చింది.సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టు తన తీర్పులో.. 2024 అక్టోబర్‌లో ఉత్తర కొరియాలోకి డ్రోన్లను పంపడం వెనుక యూన్ సుక్ యోల్ స్పష్టమైన వ్యూహం ఉందని పేర్కొంది. ఉత్తర కొరియాను రెచ్చగొట్టడం ద్వారా దేశంలో తీవ్ర భద్రతా సంక్షోభాన్ని సృష్టించి.. ఆ నెపంతో డిసెంబర్ 3, 2024న మార్షల్ లా విధించాలనేది ఆయన ప్రణాళిక అని కోర్టు నిర్ధారించింది.ఈ సైనిక ఆపరేషన్‌లో భాగస్వాములైన మరికొందరు కీలక అధికారులపై కూడా కోర్టు కఠిన చర్యలు తీసుకుంది. మాజీ రక్షణ మంత్రి కిమ్ యాంగ్-హ్యూన్.. ప్రత్యేక కౌన్సిల్ 25 ఏళ్ల శిక్షను కోరగా.. కోర్టు అంతకంటే ఎక్కువగా 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మాజీ కౌంటర్ ఇంటెలిజెన్స్ కమాండ్ చీఫ్ యో ఇన్-హ్యుంగ్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. డ్రోన్ ఆపరేషన్స్ మాజీ చీఫ్ కిమ్ యాంగ్ డేకు కూడా శిక్ష విధించింది.సైనిక పాలన విధించేందుకు అనుకూలమైన పరిస్థితులను సృష్టించడం కోసమే నిందితులు ఈ కుట్రకు పాల్పడ్డారు. ఉత్తర కొరియాను రెచ్చగొట్టి, సరిహద్దుల్లో ఘర్షణలు లేదా జాతీయ భద్రతా సంక్షోభాన్ని సృష్టించేందుకు మానసిక యుద్ధతంత్రాన్ని సైనిక వ్యూహంగా ఉపయోగించుకున్నారంటూ సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ రక్షణ కోసం.. చట్టబద్ధమైన అవసరాల కోసం మాత్రమే సైనిక శక్తిని ఉపయోగించాలనే ప్రజల నమ్మకాన్ని అధ్యక్షుడు, రక్షణ మంత్రి పూర్తిగా వమ్ము చేశారని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇదంతా వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జరిగిందని వ్యాఖ్యానించింది.అయితే, 2024లో ఉత్తర కొరియా.. దక్షిణ కొరియాపైకి పంపిన చెత్త బుడగలకు ప్రతిస్పందనగానే డ్రోన్లను పంపామని ఇది చట్టబద్ధమైన సైనిక చర్యేనని యూన్ తరఫు న్యాయవాదులు వాదించారు. కానీ కోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది. ఈ ఆపరేషన్ వల్ల దక్షిణ కొరియా సైనిక రహస్యాలు ఉత్తర కొరియాకు తెలిసిపోయాయని.. తద్వారా దేశ భద్రత ప్రమాదంలో పడిందని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే యూన్ సుక్ యోల్ న్యాయ బృందం ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ దాఖలు చేసింది.
ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్‌ను లైట్ తీసుకున్న నెతన్యాహు?
జెరూసేలం: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ వ్యూహాల మధ్య తీవ్రమైన వ్యత్యాసాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాల గురించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ముందే సమాచారం లేకపోవడం, ఆయనను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో అమెరికాకు ఉన్న తిరుగులేని శక్తి పరిమితులను బహిర్గతం చేస్తున్నాయని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇటీవల ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా నెతన్యాహుతో మాట్లాడారు. ఇరాన్‌తో తాము జరుపుతున్న అణు చర్చలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ప్రతీకార దాడులకు వెళ్లవద్దని ఆయన ఇజ్రాయెల్‌ను కోరారు. అయితే, ఈ విజ్ఞప్తిని లైట్ తీసుకుంది. కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్‌లోని వ్యూహాత్మక సైనిక స్థావరాలపై దాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలనే ట్రంప్ ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఈ పరిణామాలపై అమెరికా సెనేటర్ క్రిస్ మర్ఫీ తీవ్రంగా స్పందించారు. ఇది అమెరికా అగ్రరాజ్య హోదాకు, దాని శక్తికి అవమానకరం. దాడి చేయవద్దని అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా నెతన్యాహును కోరినప్పటికీ, ఇజ్రాయెల్ వెనుకాడకుండా దాడికి తెగబడింది. ఇది పశ్చిమాసియాలో అమెరికా ప్రభావం ఎంతలా తగ్గిపోయిందో స్పష్టం చేస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.ఈ క్రమంలో ఇరాన్‌తో త్వరలోనే ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదురుతుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం లేదా మంగళవారంలోగా సంతకాలు జరుగుతాయి అని కూడా ఆయన ప్రకటించారు. ఇరాన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ..‘మీరు క్షిపణులు ప్రయోగించారు. ఇక చాలు. ఇప్పుడు చర్చలకి రండి’ అని పిలుపునిచ్చారు. కానీ, ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడులు ఈ చర్చల ప్రక్రియను మరింత సంక్లిష్టం చేశాయి.మరోవైపు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దృక్పథం పూర్తిగా భిన్నంగా ఉంది.ఇరాన్ అణు ప్రణాళికలు,క్షిపణి సామర్థ్యాల విస్తరణ, ప్రాంతీయ ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ ఇస్తున్న మద్దతు..వీటన్నింటినీ ఇజ్రాయెల్ తన దేశ అస్తిత్వానికే ముప్పుగా భావిస్తోంది. అమెరికా కుదుర్చుకునే తాత్కాలిక దౌత్య ఒప్పందాలు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపలేవని నెతన్యాహు నమ్ముతున్నారు.ఈ పరిణామాలు సాంప్రదాయ మిత్రదేశాలైన అమెరికా–ఇజ్రాయెల్ సంబంధాలలో కొత్త ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తనను తాను ఒక ‘ప్రపంచ శాంతి దూత’గా నిరూపించుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం ఆయన ఇమేజ్‌కు భంగం కలిగిస్తోంది. ఒకవేళ ఇరాన్‌తో అమెరికా ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, ఇజ్రాయెల్ దానిని అంగీకరించేలా లేదనే అభిప్రాయం అంతర్జాతీయ సమాజంలో బలంగా వ్యక్తమవుతోంది.
రాజకుమారి మరణం.. థాయ్ సింహాసనంపై బిగ్ సస్పెన్స్
థాయ్‌లాండ్ రాజకుమారి యువరాణి బజ్రకితియాభా(47) మరణం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఆమె మరణం కేవలం రాజకుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత నష్టం మాత్రమే కాకుండా దేశ రాజ్యాంగ రాజరిక వ్యవస్థ భవిష్యత్తు, సింహాసన వారసత్వం మరియు దేశ రాజకీయాలపై ప్రభావం చూపే కీలక పరిణామంగా మారింది. దాదాపు మూడున్నరేళ్లకు పైగా కోమాలో చికిత్స పొందిన అనంతరం ఆమె కన్నుమూయడంతో థాయ్ రాజవంశ భవిష్యత్తుపై కొత్త చర్చలు మొదలయ్యాయి.డిసెంబర్ 2022లో సైనిక శునకాల శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో ఆమె అకస్మాత్తుగా కుప్పకూలారు. గుండె సంబంధిత సమస్యల కారణంగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అనంతరం మెదడు, గుండె మరియు ఇతర అవయవాలకు సంబంధించిన సమస్యలు తలెత్తడంతో ఆమె కోమాలోకి వెళ్లారు. అప్పటి నుంచి అత్యాధునిక వైద్య పరికరాల సహాయంతో చికిత్స కొనసాగించినప్పటికీ ఆరోగ్యం పూర్తిగా కోలుకోలేదు. గత కొన్ని నెలలుగా పరిస్థితి మరింత విషమించడంతో చివరకు ఆమె మరణించినట్లు రాజభవనం అధికారికంగా ప్రకటించింది.1978 డిసెంబర్ 7న జన్మించిన బజ్రకితియాభా.. ‘ప్రిన్సెస్ భా’గా పేరొందారు. థాయిలాండ్ రాజు మహా వజిరలాంగ్‌కార్న్ (Maha Vajiralongkorn)మొదటి భార్య సోమ్‌సావాలి పెద్ద కుమార్తె బజ్రకితియాభా. ఆమె కేవలం రాజకుమారిగా మాత్రమే కాకుండా, ఉన్నత విద్యావంతురాలు, న్యాయవాది, దౌత్యవేత్తగా కూడా గుర్తింపు పొందారు. థాయ్‌లాండ్‌లోని ప్రముఖ విద్యాసంస్థల్లో చదువుకున్న ఆమె.. బ్రిటన్, అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి న్యాయశాస్త్రంలో డాక్టరేట్ పొందారు. అనంతరం ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించడమే కాకుండా, ఆస్ట్రియా, స్లోవేకియా, స్లోవేనియాలకు థాయ్ రాయబారిగా కూడా పనిచేశారు. మహిళా ఖైదీల హక్కులు, న్యాయ సంస్కరణలు, సామాజిక సేవా కార్యక్రమాలపై ఆమె ప్రత్యేక దృష్టి పెట్టారు. ఐక్యరాజ్యసమితి కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అందుకే థాయ్ ప్రజల్లో ఆమెకు ప్రత్యేక ఆదరణ ఉండేది.రాజవంశానికి పెద్ద దెబ్బ..యువరాణి బజ్రకితియాభా మరణం థాయ్ రాజవంశానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. దేశాన్ని పాలిస్తున్న House of Chakri రాజవంశంలో అత్యంత సమర్థురాలిగా, ప్రజాదరణ కలిగిన సభ్యురాలిగా ఆమె గుర్తింపు పొందారు. భవిష్యత్తులో రాజ ప్రతినిధిగా లేదా రాజకుటుంబ పరిపాలనలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావించేవారు. ప్రస్తుతం థాయ్ సింహాసన వారసత్వ వ్యవస్థలో ప్రధానంగా రాజు దీపాంగ్కోరన్ రాష్మిజోటి(Prince Dipangkorn Rasmijoti) పేరు వినిపిస్తున్నప్పటికీ, ఆయన ప్రజా జీవితంలో పెద్దగా చురుకుగా లేకపోవడం వల్ల భవిష్యత్తు నాయకత్వంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బజ్రకితియాభా జీవించి ఉంటే రాజవంశ స్థిరత్వానికి కీలక ఆధారంగా నిలిచేవారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో బజ్రకితియాభా మరణం తర్వాత రాజకుటుంబంలో భవిష్యత్తులో ఎవరు కీలక పాత్ర పోషిస్తారనే అంశం మళ్లీ చర్చకు వచ్చింది.244 ఏళ్ల చరిత్ర..కాగా, థాయ్‌లాండ్‌లో రాజరిక వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది. రాజును కేవలం దేశాధినేతగా కాకుండా జాతీయ ఐక్యతకు ప్రతీకగా భావిస్తారు. దాదాపు 244 ఏళ్ల చరిత్ర కలిగిన రాజ కుటుంబానికి సంబంధించిన అంశాలు దేశ రాజకీయాలు, సామాజిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంటాయి. రాజకుటుంబాన్ని అవమానించే చర్యలపై కఠినమైన "లెజ్ మజెస్టే" చట్టాలు అమలులో ఉన్నాయి. అందువల్ల రాజవంశ వారసత్వానికి సంబంధించిన ప్రతి పరిణామం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది.ఈ నేపథ్యంలో బజ్రకితియాభా మరణం థాయ్‌లాండ్‌కు ఒక చారిత్రక మలుపుగా భావిస్తున్నారు. ఒకవైపు ప్రజాదరణ పొందిన రాజకుమారిని దేశం కోల్పోగా, మరోవైపు రాజవంశ భవిష్యత్తు నాయకత్వం, వారసత్వ రాజకీయాలపై కొత్త చర్చలకు తెరలేచింది. థాయ్ రాజకీయాలు, రాజరిక వ్యవస్థ భవిష్యత్తుపై ఈ పరిణామం దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
90 నిమిషాల్లో రూ. 30 కోట్లు : ఈ లెక్కలతో మతిపోవాల్సిందే!
ఫిఫా ప్రపంచకప్ 2026 (fifa world cup 2026) ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రపంచ అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. దశాబ్దాలుగా ఫుట్ బాల్ క్రీడకు వన్నె తెచ్చి, ప్రపంచాన్ని ఏలిన దిగ్గజాలకు ఇదే చివరి ప్రపంచకప్ కాబోతోంది. లియోనెల్ మెస్సీ, రొనాల్డో, లూకా మోద్రిచ్, థామస్ ముల్లర్, నెయ్మార్ వీరిలో ఉన్నారు. ముఖ్యంగా ప్రముఖ పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నాడు. ఆతని సంపాదన తీరుతెన్నులపై చర్చ నడుస్తోంది.పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇప్పుడు నిజానికి జీతం ఏమీ సంపాదించడం లేదు. కానీ ఆయన సంపాదన ఒక యుగ కాలంతో సమానం. ఆయన ఫుట్‌బాల్ మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ లెక్కలు పూర్తిగా మారిపోతాయి. 41 ఏళ్ల పోర్చుగీస్ ఫుట్‌బాలర్, కేవలం తన సౌదీ క్లబ్ డీల్ ద్వారానే ఏడాదికి సుమారు 20 కోట్ల డాలర్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఒకే ఏడాదిలో దాదాపు రూ. 1,600 నుండి 1,700 కోట్ల వరకు ఉంటుంది. క్లబ్, దేశం తరఫున ఆయన ఒక సీజన్లో సాధారణంగా 55 మ్యాచ్‌లు ఆడుతారని అనుకుందాం. ఆ వార్షిక సంపాదనను 55తో భాగిస్తే వచ్చే అంకె అద్భుతంగా ఉంటుంది. ఆయన ఆడే ప్రతి మ్యాచ్‌కు దాదాపు రూ. 30 కోట్లు. మరోలా చెప్పాలంటే, 90 నిమిషాల ఫుట్‌బాల్ ఆట (అదనపు సమయంతో కలిపి), అనేక భారతీయ కంపెనీలు తమ ఉద్యోగులందరికీ కలిపి ఏడాది మొత్తానికి కేటాయించే జీతాల బడ్జెట్‌తో సమానమైన డబ్బును ఆయనకు అందిస్తుంది.కళ్లు చెదిరే నెట్‌వర్త్ రొనాల్డో నికర ఆస్తి విలువ ప్రస్తుతం 120 కోట్ల డాలర్లు (సుమారు రూ. 10,000 కోట్లు). ఈ అపారమైన సంపద అనేది కేవలం రాత్రికి రాత్రే వచ్చింది కాదు. రెండు దశాబ్దాలకు పైగా టాప్-క్లాస్ జీతాలు, ఛాంపియన్స్ లీగ్ బోనస్‌లు, ఇమేజ్ రైట్స్, స్పాన్సర్షిప్ డీల్స్, వ్యాపార పెట్టుబడులు, అనేక దేశాల జనాభా కంటే ఎక్కువ ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను డబ్బుగా మార్చుకోవడం ద్వారా ఈ సామ్రాజ్యం సాధ్యమైంది.ఒక మ్యాచ్‌కు రొనాల్డో సంపాదన దాదాపు రూ.30 కోట్లు. వార్షిక జీతం రూ. 12 లక్షలు సంపాదించే భారతీయ ఉద్యోగి 40 ఏళ్ల పాటు కెరీర్‌ను కొనసాగించినా ఈ ఆస్తిలో ఒక చిన్న భాగానికి కూడా సరిపోలదు.. రొనాల్డో నికర ఆస్తికి సమానంగా సంపాదించాలంటే రూ. 12 లక్షల వార్షిక జీతం ఆర్జించే సుమారు 2 వేలమందికి సమానం. ఏడాదికి సుమారు 2,000 ఆఫీసు పని గంటల చొప్పున లెక్కిస్తే, ఇది దాదాపు 16 నుండి 17 కోట్ల గంటల శ్రమతో సమానం. దీనికి బదులు రొనాల్డో మైదానంలో గడిపే ప్రతి మ్యాచ్ గంటకు రూ. 20 కోట్లు సంపాదిస్తున్నాడు. మరో మాటలో చెప్పాలంటే, ఆధునిక ఫుట్‌బాల్ ప్రపంచంలో అత్యున్నత శిఖరం 90 నిమిషాల ఫుట్‌బాల్.
జాతీయం
అసలైన టీఎంసీ మాదే
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అంతర్గత సంక్షోభం కీలక మలుపులు తిరుగుతోంది. రెబల్ వర్గం తమదే అసలైన టీఎంసీ అంటోంది. లోక్‌సభలో టీఎంసీకి ఉన్న 28 మంది సభ్యులకుగాను 19 మంది తమ పక్షానే ఉన్నారని ప్రకటించింది. సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తమ వర్గాన్నే అసలైన టీఎంసీగా గుర్తించాలని కోరుతామంది. మమతా బెనర్జీ వర్గం చెబుతున్నట్లుగా తమకు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని తెలిపింది. తిరుగుబాటు వర్గం ఎంపీ జగదీశ్ చంద్ర బర్మ బసూనియా శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తమ వర్గాన్ని అసలైన టీఎంసీ పార్లమెంటరీ గ్రూపుగా గుర్తించాలంటూ స్పీకర్ ఓం బిర్లాకు ఇప్పటికే వినతి పత్రం అందజేశాం. మా పక్షం ఎంపీల సంతకాల సేకరణ ఈ నెల 8వ తేదీన మొదలుపెట్టాం. ఇప్పటి వరకు 19 మంది ఎంపీల సంతకాలను సేకరించాం. స్పీకర్‌ను సోమవారం మళ్లీ కలిసి, ఇందుకు సంబంధించిన వివరాలను అందజేస్తాం’అని వివరించారు. కాగా, తిరుగుబాటు వర్గం ఎంపీల పేర్లు, వారు సంతకాలు చేసినట్లుగా చెబుతున్న లేఖ ఒకటి ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. కాకోలీ ఘోష్ దస్తీదార్ సారథ్యంలో తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకు తాము మద్దతు తెలుపుతున్నట్లు అందులో ఉంది. ఎంపీలు కాకోలీ ఘోష్ దస్తీదార్, శతాబ్ది రాయ్, బాపి హల్దార్, శర్మిలా సర్కార్, ప్రసూన్ బందోపాధ్యాయ్, జగదీశ్ బర్మ బసూనియా, అసిత్ కుమార్ మల్, అరూప్ చక్రవర్తి, రచనా బెనర్జీ, సాయోని ఘోష్, ఖలీలుర్ రహమాన్, అబు తహెర్ఖాన్, యూసఫ్ పఠాన్, మితాలీ బాగ్, మాలా రాయ్, కాలిపాద సోరెన్, దీపక్ అధికారి, జూన్ మాలియా, పార్థ భౌమిక్‌ల సంతకాలు అందులో ఉన్నాయి. వీరితోపాటు మరికొందరు తమ గ్రూపులో చేరే అవకాశముందని ఈ వర్గానికి చెందిన ఓ ఎంపీ తెలిపారు. వీరంతా త్వరలో ఢిల్లీలో కలుసుకుని, తమ కార్యాచరణను ఖరారు చేసుకుంటారని చెబుతున్నారు. ఆపరేషన్ లోటస్‌లో భాగం: కీర్తి ఆజాద్ పార్టీలో అసమ్మతి జ్వాలల నేపథ్యంలో టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆపరేషన్ లోటస్ చేపట్టిన బీజేపీ తమ పార్టీలో ఫిరాయింపులకు చేస్తున్న కుట్రలు ఫలించవన్నారు. ఈ కుట్రల వెనుక హోం మంత్రి అమిత్ షా ఉన్నారంటూ ఎక్స్‌లో విమర్శలు చేశారు. పథకం ప్రకారమే బీజేపీ ఇదంతా చేస్తోందన్నారు. అయితే, గురువారం సీనియర్ నేత కల్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఉండాలో, తానుండాలో తేల్చుకోవాలంటూ మమతా బెనర్జీకి ఆయన అల్టీమేటం ఇవ్వడం తెల్సిందే. దీనిపై కీర్తి ఆజాద్.. ‘కల్యాణ్ బెనర్జీ ఎదో ఉద్రేకంతో అలా మాట్లాడారే తప్ప, ఆయన మమతా బెనర్జీ వీడి ఎక్కడికీ వెళ్లరు’అంటూ చెప్పుకొచ్చారు. మూడో అతిపెద్ద ప్రతిపక్షం లోక్‌సభలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల తర్వాత టీఎంసీకి అత్యధికంగా 28 మంది ఎంపీల బలముంది. వీరిలో 19 మంది వేరుకుంపటి ప్రకటించుకున్నారు. మూడింట రెండొంతుల మంది ఉన్నందున తమకు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదన్నది వీరి వాదన. ఈ సంఖ్యను అధికారికంగా ఆమోదించిన పక్షంలో వీరికి చట్టపరమైన రక్షణ కల్పించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇలా ఉండగా, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల గెలిచిన 80 మంది ఎమ్మెల్యేలకుగాను 58 మంది తిరుగుబాటు ప్రకటించిన రితబ్రత బెనర్జీకి మద్దతు ప్రకటించారు. పార్టీలో అన్ని స్థాయిల్లోనూ ఇదే రకమైన అసమ్మతి కన్పిస్తుండటంతో మమతా బెనర్జీ పార్టీ కమిటీలన్నిటినీ రద్దు చేయడం తెల్సిందే. వాళ్లంతా ద్రోహులు: మహువా మొయిత్రా జగదీశ్ చంద్ర బర్మ బసునీ ప్రకటనపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మండిపడ్డారు. తిరుగుబాటు వర్గం వాదనల్లో ఎలాంటి పస లేదన్నారు. ‘ఆ ద్రోహులకు చట్టం గురించి తెలియదు. 2003 నాటి రాజ్యాంగ 91వ సవరణ ద్వారా పార్టీలో చీలిక లేదా ప్రత్యేక వర్గంగా ఏర్పడే నిబంధనను పూర్తిగా తొలగించారు. ఇక్కడ ఎంతమంది ఎంపీలు ఉన్నారనే సంఖ్యతో సంబంధం లేదు. అసలైన రాజకీయ పార్టీలోని మూడింట రెండు వంతుల మంది ప్రజాప్రతినిధులు వేరే పార్టీలో విలీనం కావాల్సిందే. ఆ 19 మంది ద్రోహులూ వెంటనే రాజీనామా చేసి, బీజేపీ టికెట్‌పై మళ్లీ పోటీ చేయాలి’అంటూ ఆమె ఎక్స్‌లో నిప్పులు చెరిగారు.
కిమ్ బాటలో కాషాయ పార్టీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ బాటలోనే బీజేపీ పయనిస్తోందని, ఆయన్ను రోల్‌మోడల్‌గా తీసుకునే ఓటు చోరీ–సీటు చోరీలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేసిన మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేకున్నా, ఊహాజనిత కేసును చూపెట్టి ఆమె నామినేషన్ పత్రాన్ని తిరస్కరించడం ముమ్మాటికీ బీజేపీ కుట్రేనని అన్నారు.బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్, స్థానిక రిటర్నింగ్ ఆఫీసర్లే కుట్రదారులని ఆరోపించారు. ప్రైవేటు ఫిర్యాదులపై ఇచ్చే నోటీసులన్నింటినీ ప్రధాని నరేంద్ర మోదీ తన ఎన్నికల అఫిడవిట్లో చూపెడుతున్నారా? అని ప్రశ్నించారు. నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన రేవంత్‌రెడ్డి శుక్రవారం మీడియాతో పలు అంశాలపై చిట్‌చాట్ చేశారు. ఉత్తర కొరియాలో ఓట్లన్నీ కిమ్కే.. ‘ఇన్నాళ్లూ బీజేపీకి గాడ్సే ఆదర్శం అనుకున్నాం. గాంధేయవాదులకీ, గాడ్సే వారసులకీ యుద్ధం జరుగుతోందని భావించాం. కానీ బీజేపీ ఇప్పుడు కిమ్ జాంగ్‌ను ఆదర్శంగా తీసుకుంటోంది. ఉత్తర కొరియాలో ఎన్నికల్లో ఒకే పార్టీ పోటీ చేస్తుంది. ఓట్లన్నీ ఆ పార్టీ నేత కిమ్ జాంగ్కే పడతాయి. ఆయనే అధ్యక్షునిగా ఎన్నిక అవుతారు. అదే మాదిరి బీజేపీ ఓట్లు, సీట్లు అన్నీ తమకే దక్కేలా కుట్రలు చేస్తోంది. మీనాక్షి విషయంలోనూ అదే చేసి చూపించింది. బలం లేకుండా మూడో అభ్యర్థిని పెట్టారు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో తగినంత సంఖ్యాబలం లేకుండా మూడో అభ్యర్థిని పోటీలో పెట్టడం వెనుకే పెద్ద కుట్ర ఉంది. అక్కడ బీజేపీకి గెలిచేంత బలమే లేదు. అయినా అభ్యర్థిని పోటీలో పెట్టారు. మీనాక్షి నామినేషన్ వేశాక కుట్రలకు తెరలేపారు. వాస్తవానికి ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు కాలేదు. తెలంగాణలో ఆమెపై ఎలాంటి కేసులు లేవు. ఓ ప్రైవేటు ఫిర్యాదుకు సంబంధించిన విషయంలో ఆమెకు సమన్లు మాత్రమే జారీ అయ్యాయి.2023లో ఇద్దరి మధ్యలో జరిగిన వివాదంతో మీనాక్షికి సంబంధం లేదు. అయినప్పటికీ రిటర్నింగ్ ఆఫీసర్ ఒక పార్టీకి కార్యకర్తలా వ్యవహరించి నామినేషన్ తిరస్కరించారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, రిటర్నింగ్ ఆఫీసర్ ఇద్దరూ కుట్రదారులే. బీజేపీ టాప్ నేతలే దీనికి వ్యూహరచన చేశారు. కేసే లేనప్పుడు తెలంగాణ నుంచి ఈ వివరాలు ఎవరు బీజేపీ నేతలకు అందించారన్న దానిపై ప్రత్యేకంగా విచారణ అక్కర్లేదు..’అని సీఎం అన్నారు. కేటీఆర్ చెప్పినట్లుగా కిషన్‌రెడ్డి ఆడుతున్నారు.. ‘తెలంగాణకు ప్రాజెక్టులు ఇవ్వొద్దని కిషన్‌రెడ్డి ప్రతి కేంద్రమంత్రినీ కలిసి చెబుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు తానే నిలిపివేయించానని బీఆర్ఎస్ మాజీమంత్రి కేటీఆర్ అంటున్నారు. కేటీఆర్ చెప్పినట్లుగా కిషన్‌రెడ్డి ఆడుతున్నారు. ఐఆర్ఎఫ్సీకి లోన్ ఎందుకు ఇవ్వడంలేదు? 30వ తేదీన రావాల్సిన ఆ డబ్బులు ఎందుకు ఇవ్వడంలేదు? ఆర్ఆర్ఆర్ లో 320 కిలోమీటర్ల టెండర్ల ప్రక్రియ ఎందుకు ఆలస్యం అవుతోంది? మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా సీఎం ఫడ్నవీస్‌తో మాట్లాడి 1,500 ఎకరాలు తెలంగాణకు ఇప్పించలేరా? రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులపై ప్రధానికి కిషన్‌రెడ్డి ఎన్ని లేఖలు రాశారో చెప్పాలి. కేబినెట్ భేటీకి రానని చెప్పాలి.. మేము అడుగుతున్న మెట్రో, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులు కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. వీటిపై ఆయన ప్రధాని మోదీని కేబినెట్లో ఎందుకు అడగడం లేదు? ఈ సమస్యలన్నీ పరిష్కరించే వరకు మంత్రివర్గ సమావేశానికి హాజరుకానని కిషన్‌రెడ్డి చెప్పాలి. లేదంటే కిషన్‌రెడ్డి సహా..రాష్ట్రానికి చెందిన మొత్తం 8మంది ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేస్తే తెలంగాణ ప్రాజెక్టులు పరిగెత్తుకుంటూ వస్తాయి. మెట్రో వస్తే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు పేరు వస్తుందని కిషన్‌రెడ్డి ఆపుతున్నారు..’అని రేవంత్ ఆరోపించారు. నిధుల కేటాయింపుల్లో వివక్ష ‘బీజేపీయేతర పాలిత రాష్ట్రాలకు నిధుల కేటాయింపు విషయంలో వివక్ష ఉంది. ఈ వివక్ష పోవాలంటే వచ్చే ఎన్నికల్లో ప్రధానిని మారిస్తే సరిపోతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే దేశం ముందుకెళుతుంది. రాష్ట్రం కోరుతున్న ట్రిపుల్ ఆర్, రీజనల్ రింగ్‌రోడ్డు, ఐఐఎం, మెట్రోలకు ఇప్పటికైనా కేంద్రం నిధులచ్చి సహకరించాలి. జూలైలో మహారాష్ట్రతో చర్చలు.. గోదావరి జలాల వినియోగం, తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణంపై వచ్చే నెలలో మహారాష్ట్రతో చర్చలుంటాయి. నీతిఆయోగ్ సమావేశం సందర్భంగా దీనిపై ఫడ్నవీస్‌తో మాట్లాడా. వచ్చే నెలలో దీనిపై చర్చిద్దామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించిన కేంద్ర ప్రభుత్వం, తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణానికి 1,500 ఎకరాలు ఇప్పించలేదా? హిట్లర్ వ్యాఖ్యలకు వక్రభాష్యం.. రాష్ట్ర కేబినెట్ పునరవ్వ్యవస్థీకరణపై ఎలాంటి చర్చలు జరగలేదు. మంత్రి పదవులపై ఎవరైనా పార్టీ పెద్దలను కలవొచ్చు.. ఏదైనా అడగొచ్చు. బుద్ధి ఉన్నోడు ఎవడూ హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకోడు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేసే నేతలు ఎవరైనా ఆయన రోల్‌మోడల్ అని చెప్పరు. నా వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది..’అని సీఎం విమర్శించారు. వైఎస్ జగన్ సభలకు అనుమతిస్తున్నారా? ‘తెలంగాణకు ఎవరైనా రావొచ్చు..మాట్లాడొచ్చు..పోటీ చేయొచ్చు. కానీ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మాత్రమే సమస్యలు వస్తాయి. ఏవైనా శాంతి భద్రతల సమస్యలు వస్తాయని భావిస్తే పోలీసులు అనుమతులు ఇవ్వరు. పవన్ కల్యాణ్ సభ విషయంలో అక్కడి పరిస్థితులను బట్టి సమస్యలు వస్తాయనే అనుమతులు ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సభలకు అనుమతులు ఇస్తున్నారా? శాంతిభద్రతల సమస్యలున్నాయని సభలను తిరస్కరించట్లేదా?. ఇప్పటికి ఎన్ని సభలను అడ్డుకున్నారో వైఎస్ జగన్‌ను అడిగితే ఆయనే జాబితా ఇస్తారు..’అని రేవంత్ అన్నారు. రాహుల్‌గాంధీతో భేటీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శక్రవారం ఉదయం లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాం«దీతో భేటీ అయ్యారు. మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీ వ్యవహరించిన తీరుపై వీరిద్దరూ చర్చించుకున్నారు. బీజేపీ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని ఈ సందర్భంగా రాహుల్ సూచించినట్లు తెలిసింది.
అహ్మాదాబాద్ ప్రమాద ఘటన దర్యాప్తులో పురోగతి
సాక్షి,అహ్మదాబాద్: గతేడాది సరిగ్గా ఇదే రోజు భారత దేశ విమాన చరిత్రలోనే అత్యంత తీవ్రమైన విషాదం చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన 32 సెకన్లకే అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులలో 241 మందితో పాటు, మరో 19 మంది దుర్మరణం పాలయ్యారు. సరిగ్గా ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తులో కీలక విషయాలను దర్యాప్తు సంస్థ ప్రకటించింది.అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం AI-171 ప్రమాదం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ప్రమాద దర్యాప్తులో తాము గణనీయమైన పురోగతి సాధించామని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) (శుక్రవారం) ప్రకటించింది. దర్యాప్తుకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించింది.ఆ సంస్ధ విడుదల చేసిన వివరాలు. "గత ఏడాది కాలంగా, దర్యాప్తు బృందం ఈ ప్రమాదానికి సంబంధించిన అన్ని సాంకేతిక, కార్యాచరణ సంస్థాగత మానవ తప్పిదాలకు సంబంధించిన కోణాలను అత్యంత నిశితంగా, కఠినంగా పరిశీలించింది. ఈ ప్రక్రియలో గుర్తింపు పొందిన ప్రతినిధులు, సాంకేతిక సలహాదారులు, సంబంధిత సంస్థలకు చెందిన నిపుణుల సహాయం తీసుకున్నాం. విమాన వ్యవస్థలు, ఫ్లైట్ రికార్డర్ డేటా (బ్లాక్ బాక్స్), ఇంజిన్‌కు సంబంధించిన విడిభాగాలు, నిర్వహణ, కార్యాచరణ రికార్డులతో పాటు ఈ విచారణకు అవసరమైన ఇతర కీలక ఆధారాలను విశ్లేషించడంలో సమాచార సేకరణ పరంగా గణనీయమైన పురోగతి లభించింది." అని ప్రకటన విడుదల చేసింది.ఆ రోజు ఏం జరిగింది?2025 జూన్ 12న అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 (బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్), టేకాఫ్ అయిన కేవలం 32 సెకన్లకే కుప్పకూలింది. అయితే, విమానంలో ఉన్న ప్రయాణికులలో ఒకరు మాత్రం ఈ ప్రమాదం నుండి అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డారు.AAIB, గతేడాది జూలైలో తన ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రెండు ఇంజిన్ల ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు "RUN" పొజిషన్ నుండి "CUTOFF" పొజిషన్‌కు మారిపోయాయని, దీనివల్ల ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయిందని ఆ నివేదిక పేర్కొంది. అయితే, ఆ స్విచ్‌లు అలా మారడానికి గల అసలు కారణం ఏమిటనేది మాత్రం ఆ నివేదికలో స్పష్టం చేయలేదు. అలాగే ఈ ప్రమాదానికి సంబంధించి ఇది వరకూ ఎవరినీ బాధ్యులుగా ప్రకటించలేదు.
వాణిజ్య నౌకలపై అమెరికా వరుస దాడులు
సాక్షి, ఢిల్లీ: హర్ముజ్ జలసంధిలో 20 మంది భారతీయ నావికులతో వెళ్తున్న 'గినియా-బిస్సావు' పతాకం గల నౌకపై అమెరికా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై భారత్ సీరియస్ అయ్యింది. ఆ దేశ రాయబారికి సమన్లు జారీ చేసింది. ఇటీవల భారత్‌కు చెందిన చమురు నౌకలపై అమెరికా తరచుగా దాడులు చేస్తోంది. ఒమన్ సమీపంలోని హర్మూజ్ సముద్ర జలాల్లో చమురు రవాణా నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పూర్తై రెండురోజులైన గడవక ముందే మరోసారి భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకపై దాడులు చేసింది. దీంతో ఈ ఘటనపై భారత్ సీరియస్ అయ్యింది..ఈ ఘటనను నిరసిస్తూ (శుక్రవారం) భారత్‌లోని అమెరికా తాత్కాలిక రాయబారి జేసన్ మీక్స్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. భారత విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి , అమెరికా రాయబారితో ఈ విషయమై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు బుధవారం నాడు 'పలావు' పతాకంగల MT సెట్టెబెల్లో నౌకపై జరిగిన దాడికి సంబంధించి కూడా జేసన్ మీక్స్‌ను MEA పిలిపించి మాట్లాడింది. మూడు రోజుల్లో అమెరికా దౌత్య కార్యాలయానికి సమన్లు జారీ చేయడం ఇది రెండోసారి.భారతీయ నావికులే టార్గెట్‌గా జరుగుతున్న ఈ దాడులను భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో హర్ముజ్ జలసంధి సమీపంలో భారత నౌకాదళం అత్యున్నత నిఘాను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. "వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులు తక్షణమే ముగియాలి. అంతర్జాతీయ చట్టాలకు లోబడి అంతర్జాతీయ జలమార్గాలలో స్వేచ్ఛా వాణిజ్యం, నౌకల రాకపోకలను పునరుద్ధరించాలి. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణల వల్ల భారతీయ నావికులకు ముప్పు వాటిల్లడం తీవ్ర ఆందోళనకరం." అని తెలిపింది.కాగా ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో 18,000 మందికి పైగా భారతీయ నావికులు పనిచేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ నావికుల భద్రత, క్షేమం, దేశ సముద్ర ప్రయోజనాలను కాపాడటమే తమ మొదటి ప్రాధాన్యత అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఎన్ఆర్ఐ
23 ఏళ్ల పోరాటం.. రూ.85 కోట్లు.. అసలేంటి ఈ కథ?
యూకేలో భారతీయ సంతతి మహిళ 23 ఏళ్ల విడాకుల పోరాటానికి ఎట్టకేలకు తెరపడింది. యూకేలోనే అత్యంత అరుదైన.. సుదీర్ఘమైన విడాకుల పోరాటంలో భారత సంతతికి చెందిన వర్షా గోహిల్ ఏకంగా 6.6 మిలియన్ పౌండ్ల(సుమారు రూ. 85 కోట్లు) పరిహారాన్ని సాధించారు. ఈ కేసు 2002లో ప్రారంభమైంది. తన భర్త భద్రేష్ గోహిల్ వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాడని.. అతని ప్రవర్తన సరిగ్గా లేదని వర్షా గోహిల్ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. ఆనాటికి ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అప్పట్లో వీరిద్దరి మధ్య ఆర్థిక సెటిల్మెంట్ చాలా సాదాసీదాగా ముగిసినట్లు కనిపించింది. వర్షా దాదాపు 2,70,000 పౌండ్లు (సుమారు రూ. 3.5 కోట్లు) నగదుతో పాటు కుటుంబానికి చెందిన ప్యుజో (Peugeot) కారును తీసుకోవడానికి అంగీకరించారు. కానీ, తన భర్త తన ఆస్తులన్నింటినీ నిజాయితీగా వెల్లడించలేదని ఆమె పేర్కొంది.నైజీరియా మాజీ గవర్నర్ జేమ్స్ ఇబోరి అనుచరులతో ముడిపడి ఉన్న భారీ మనీలాండరింగ్ (అక్రమ ద్రవ్య చలామణి) కేసులో భద్రేష్ గోహిల్ ప్రధాన నిందితుడిగా అధికారులు విచారణ చేపట్టారు. దీంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. ఆఫ్‌షోర్ కంపెనీలు, క్లయింట్ ఖాతాల ద్వారా భద్రేష్ మిలియన్ల కొద్దీ పౌండ్లను అక్రమంగా బదిలీ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. సుదీర్ఘ విచారణ అనంతరం మనీలాండరింగ్, ఫోర్జరీ, మోసపూరిత కుట్రకు పాల్పడినట్లు రుజువు కావడంతో 2011లో భద్రేష్ గోహిల్ 10 ఏళ్ల జైలు శిక్ష పడింది.విచారణలో మొదటి విడాకుల కేసు సమయంలో బయటపడని కోట్ల రూపాయల విలువైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. వివిధ దేశాల్లో విస్తరించి ఉన్న నెట్వర్క్ కంపెనీల ద్వారా భద్రేష్ దాదాపు 28 మిలియన్ పౌండ్లను దాచాడనే కారణంగా అధికారులు ఆ ఆస్తులను ఫ్రీజ్ చేశారు. ఈ కొత్త ఆధారాలు వర్షా గోహిల్‌కు తన పాత విడాకుల సెటిల్మెంట్ను తిరిగి సవాలు చేయడానికి కొండంత బలాన్ని ఇచ్చాయి.ఈ కేసు చివరకు యూకే కోర్టుకు చేరింది. భర్తకు చెందిన జప్తు చేసిన ఆస్తుల నుంచి తనకు మరింత భరణాన్ని ఇవ్వలంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. జప్తు చేసిన మొత్తం యావత్తూ అక్రమార్జన కాదని.. అందులో కష్టపడి సంపాదించిన మొత్తం కూడా ఉందని ఆమె కోర్టుకు తెలిపారు. దీంతో వర్షా గోహిల్ వాదనతో అంగీకరించిన కోర్టు.. జప్తు చేసిన మొత్తంలో 66 లక్షల పౌండ్లు చెల్లించాలని తీర్పు వెలువరించింది. ఇకపై ఎలాంటి అప్పీళ్లకు అవకాశం లేదని కోర్టు స్పష్టం చేయడంతో ఈ 23 ఏళ్ల సుదీర్ఘ సమరానికి ఎట్టకేలకు తెరపడింది.
న్యూజిల్యాండ్‌లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరంలో న్యూజిల్యాండ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జై తెలంగాణ నినాదాలతో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సాధనలో ఆత్మార్పణం చేసిన అమరవీరులకు నివాళి అర్పించి, అమరవీరుల తల్లులకి మరియు తెలంగాణ ప్రజానీకానికి ఉద్యమ వందనాలు తెలియచేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, ప్రముఖ గాయని దాసరి మేఘన నాయుడు, యువ గాయకుడు సుస్వర తరంగ్ పాల్గొని తెలంగాణ ఉద్యమ పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రవాస తెలుగు ప్రజలను ఉర్రూతలూగించారు. అసోసియేషన్ అధ్యక్షులు కోడూరి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ మోహన్ కుమార్ సేథి ముఖ్య అతిథిగా హాజరై ప్రవాస తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను భావి తరాలకు అందించడంలో, రాష్ట్ర సాధనలో అమరులైన ఉద్యమ వీరులను త్యాగాలను స్మరించుకుని తెలుగు ప్రజల ఐక్యత గొప్పతనాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కి ఇంతకాలం నుంచి మద్దతు అందిస్తున్న ట్రాన్స్ పసిఫిక్ డైరెక్టర్ తమ్మినేని రోహిత్ రెడ్డిని సన్మానించారు. గాయని గాయకులు వందేమాతరం శ్రీనివాస్, దాసరి మేఘన నాయుడు, సుస్వర తరంగ్‌ని ఘనంగా సత్కరించారు.ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ బాల గారు సభకు విచ్చేసిన అతిధులకు ధన్యవాదాలు తెలిపిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు పట్లోళ్ల నరేందర్ రెడ్డితో పాటు ప్రవాస భారతీయ ప్రముఖులైన రోహిత్ తమ్మినేని, దయానంద్ కటకం, జగదీశ్వర్ రెడ్డి పట్లోళ్ల, విజేత యాచమనేని, మధు ఎర్ర, వర్ష పట్లోళ్ల, స్వాతి మేకల,కావ్యా మాశెట్టి, కిరణ్మయి పద్మ, విశ్వనాథ్ అవిటి, మహమ్మద్ బిలాలుద్దీన్, హరీష్ గోపాల్, మనోహర్ కన్నం, శ్రీనివాస్ పందిళ్ళ, రమేష్ రెడ్డి రామిండ్ల, శ్రీరామ్ విజయ్, శ్రీనివాస్ గాజుల, ప్రమోద్ ఇరుగు, అనిల్ మెరుగు, రమేష్ ఆడెపు, రవి కుమార్ వట్టం, మారుతి జెల్ల, మహేందర్ రెడ్డి ద్యావ, శ్రీనివాస్ కలకోట తదితరులు హాజరయ్యారు.
భారత సంతతి విద్యార్థికి ప్రతిష్టాత్మక హెన్రీ ఫోర్డ్ II స్కాలర్ అవార్డు..!
భారత సంతతి విద్యార్థి అవని అహుజాకి ప్రతిష్టాత్మక హెన్నీ ఫోర్డ్II స్కాలర్ అవార్డుని గెలుచుకుంది. ఎంఐటీలో అత్యున్నత పురస్కారాలలో ఒకటైన ఈ అవార్డుని సాధించిన ఎన్నారైగా ఘనత సృష్టించింది. అసాధారణమైన విద్యా ప్రతిభ, ఇంజనీరింగ్‌లలో బలమైన నాయకత్వ సామర్థ్యాన్ని ప్రదర్శించే సీనియర్ అండర్ గ్రాడ్యుయేట్లకు ఈ పురస్కారన్ని ప్రదానం చేస్తారు. ఈ అవార్డుతో ప్రతిష్టాత్మక ఎంఐటీ విద్యార్థుల ప్రత్యేక బృందంలో చేరారు. ఈ పురస్కారం ఇటీవల కోడే రీసెర్చ్ గ్రూప్‌లో ఆమె చేసి వర్క్ కెపాసిటివ్ వైర్లెస్ పవర్ ట్రాన్స్ఫర్ పరిశోధనకు గానూ లభించింది. ఈ సాంకేతికతను భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వైర్‌లెస్‌గా ఛార్జ్ చేయడానికి, శరీరంలో అమర్చే వైద్య పరికరాలకు శక్తిని అందించడానికి ఉపయోగించవచ్చు. ఈ మేరకు అవని మాట్లాడుతూ.."ఈ అవార్డును అందుకోవడం నాకు చాలా గౌరవంగా, ఆనందంగా ఉంది. ముఖ్యంగా డీన్ హామండ్‌ను కలవడం ఒక గొప్ప గౌరవం." అని అన్నారామె. నిజానికి హెల్త్‌కేర్ టెక్నాలజీలు, రోబోటిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లలో పనిచేయగల సామర్థ్యమే, ఆమెను ఎంఐటీ అత్యంత ప్రతిభావంతులైన అండర్ గ్రాడ్యుయేట్ పరిశోధకులలో ఒకరిగా నిలబెట్టింది. అలాగే అవనికి అత్యంత ఆసక్తి ఉన్న రంగాలలో మహిళల ఆరోగ్య పరిశోధన ఒకటి. అంతేగాదు ఆమె రొమ్ము కేన్సర్ స్క్రీనింగ్‌ను మరింత సులభతరం చేయడానికి రూపొందించిన, ధరించగలిగే బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ ప్యాచ్‌కు సంబంధించిన పరిశోధనలలో కూడా కీలకపాత్ర పోషించారామె. తాను పీహెచ్డీ పూర్తి అయిన వెంటనే మహిళల ఆరోగ్య పరిశోధన రంగంలో పవర్ ఎలక్ట్రానిక్స్‌ను అన్వయించాలని చూస్తున్నట్లు తెలిపారు.(చదవండి: నాడు నీట్ ఫెయిల్యూర్..ఇవాళ బయోటెక్నాలజీ నిపుణురాలు!)
NRI : అమెరికాలో రోడ్డు ప్రమాదం..
సాక్షి, హైదరాబాద్/మన్సూరాబాద్: మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ సతీమణి డాక్టర్ సుచియాష్కీ అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తమ చిన్న కుమార్తె డాక్టర్ గగనయాష్కీని బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ ఆసుపత్రిలో ఎండీ కోర్సులో జాయిన్ చేసి న్యూయార్క్‌కు వస్తుండగా భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.ప్రమాద సమయంలో వర్షం కురుస్తుండటంతో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టిందని, ఈ ప్రమాదంలో డాక్టర్ సుచియాష్కీకి పక్కటెముకలు విరిగిపోయాయని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. కాగా, మధుయాష్కీ కూడా అమెరికాలోనే ఉన్నారు. చిన్న కుమార్తె డాక్టర్ గగన న్యూయార్క్ మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, కాన్వొకేషన్‌కు హాజరయ్యేందుకు యాష్కీ దంపతులు అమెరికా వెళ్లారు.కుమార్తెను ఎండీ కోర్సులో జాయిన్ చేసి వచ్చే సమయంలో సుచి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో వేరే కారులో మధుయాష్కీ కూడా ఉన్నారని, భార్యకు ప్రమాదం జరిగిన నేపథ్యంలో గురువారం ఇండియాకు రావాల్సిన యాష్కీ, అక్కడే ఉండిపోయారని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ ఫోన్లో మధుయాష్కీని పరామర్శించారు.
క్రైమ్
కాటేదాన్‌లో.. అస్థి పంజరం కలకలం!
మైలార్‌దేవ్‌పల్లి: మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలోని కాటేదాన్ ఓల్డ్ కర్నూలు రోడ్డులో శుక్రవారం అస్థిపంజరం కలకలం సృష్టించింది. జీహెచ్ఎంసీ సిబ్బంది మ్యాన్‌హోల్స్ శుభ్రపరుస్తుండగా కుళ్లిపోయిన స్థితిలో అస్థి పంజరం కనిపించింది.దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు సమాచారం అందించడంతో మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అస్థిపంజరాన్ని పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహం పురుషుడిదా, మహిళదా? అనే విషయం ఫోరెన్సిక్ పరీక్షలు, దర్యాప్తు తర్వాత తేలుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
మేం జీహెచ్ఎంసీ అధికారులం.. మమ్మల్నే ఆపుతావా?
బంజారాహిల్స్: రహదారిపై అపసవ్య దిశలో రావడాన్ని నిలువరించిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి చేసి అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలో జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్–36 ఉద్యోగులిద్దరినీ శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–14లోని లూసిడ్ ఆస్పత్రి రోడ్డులో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు కార్లు, ట్యాంకర్లు, లారీలు వెళ్లకుండా నిషేధం విధించి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటుచేశారు. గురువారం మధ్యాహ్నం జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్–36 శానిటేషన్ ఇన్స్పెక్టర్ అమిత్‌కుమార్, ఏఈ పుప్పాల ఆనంద్ కారులో ఇటువైపు వెళ్లేందుకు యత్నించారు. విధుల్లో ఉన్న బంజారాహిల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీశైలం ఇలా వెళ్లడానికి వీల్లేదని మర్యాదగా చెప్పాడు. జీహెచ్ఎంసీ ఆఫీసర్లం.. మమ్మల్నే అడ్డుకుంటావా? అంటూ ఆనంద్ దుర్భాషలాడుతూ కానిస్టేబుల్ శ్రీశైలంపై దాడికి దిగాడు. మేం జీహెచ్ఎంసీ అధికారులం.. మమ్మల్ని ఆపే దమ్ము ఎవరికీ లేదంటూ హెచ్చరించాడు. నీ అంతుచూస్తాం.. నిన్ను ఇక్కడి నుంచి బదిలీ చేస్తామంటూ అమిత్‌కుమార్ సదరు కానిస్టేబుల్‌ను ఫొటోలు తీస్తూ బారికేడ్లను తొలగించి కారులో ఉడాయించారు. శ్రీశైలం ఫిర్యాదు మేరకు అమిత్‌కుమార్, ఆనంద్‌లపై బంజారాహిల్స్ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 121 (1), 132, 352, 351 (2) కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఠాణాలోనూ వీరు ప్రతాపం చూపేందుకు యత్నించడం కొసమెరుపు.
కత్తితో పొడిచి.. డంబెల్‌తో మోది
గోల్కొండ: సోదరిని ప్రేమ వివాహం చేసుకున్నాడనే కక్షతో.. సొంత బావమరుదులే బంధువులతో కలిసి బావను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోల్కొండ కుమ్మర్వాడీకి చెందిన షేక్ మసూద్ అలియాస్ చాందిని మసూద్ (25) వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. మూడేళ్లుగా షేక్ మసూద్ యూట్యూబ్ చానల్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఏడాదిన్నర క్రితం షేక్ మసూద్ తన బస్తీ కుమ్మర్వాడీకి చెందిన బేగం అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఆరు నెలల బాబు కూడా ఉన్నాడు. అయితే పెళ్లైన నాటి నుంచి మృతుడి బావమరుదులు, అత్త, ఇతర బంధువులు షేక్ మసూద్‌ను సూటిపోటి మాటలతో వేధించేవారు.దీంతో మసూద్ వారి ఇంటికి రాకపోకలు మానేశాడు. దారిలో ఎక్కడైనా ఎదురైనప్పుడు మసూద్ బావమరుదులు మసూద్‌ను బెదిరించే వారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఫతేదర్వాజా నూరాని మసీదులో మసూద్ మధ్యాహ్నం ప్రార్ధనలు ముగించుకొని తన ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే అప్పటికే అతడి బావమరుదులు అప్పు, జావేద్, వీరి బంధువు షేక్ సోహెల్‌తోపాటు మరో ఇద్దరు మహిళలతో మసూద్ ఇంటి ముందు కాపుకాసి ఉన్నారు. మసూద్ అక్కడికి రాగానే అతడిపై కత్తి, రాడ్‌తో దాడి చేశారు. ప్రాణభయంతో మసూద్ తన ఇంట్లోకి వెళ్లిపోయాడు.అక్కడితో ఆగకుండా ఇంట్లోకి చొరబడి కత్తితో పాటు వ్యాయామం చేసే డంబుల్స్తో కొట్టడం ప్రారంభించారు. నిందితుల్లో ఒకరు కత్తితో షేక్ మసూద్ తలపై కొట్టాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న మసూద్ తండ్రి నిందితులను అడ్డుకోగా నిందితుల్లో ఒకరైన అప్పు అతడిపై కూడా కత్తితో దాడి చేసి గాయపరిచాడు. రక్తం మడుగులో కిందపడిపోయిన మసూద్ చనిపోయాడని నిర్ధారించుకున్న నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కాగా నిందితుల్లో ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.
ఆర్నెల్ల కూతురితో కలిసి.. ఆరో అంతస్తు నుంచి దూకి
మియాపూర్: ఆరు నెలల చిన్నారితో కలిసి ఓ సాఫ్ట్వేర్ మహిళ తాను నివాసముంటున్న అపార్ట్మెంట్ ఆరవ అంతస్తుపై నుంచి కిందికి దూకింది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా ప్రహరీ గోడపై ఉన్న ఇనుప కంచెకు డ్రెస్ చిక్కుకొని గాయాలతో చిన్నారి బయటపడింది. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. సీఐ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన భూపేంద్ర సాహు, మధ్యప్రదేశ్‌లోని భూత్గావ్కు చెందిన ఈషా సాహు (37)లకు 2015లో వివాహం జరిగింది.గత ఎనిమిదేళ్లుగా వీరు మియాపూర్ మయూరీనగర్‌లోని ఓ అపార్ట్మెంట్ రెండవ అంతస్తులో ఉంటున్నారు. వీరిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురుకు ఎనిమిదేళ్లు, మరో చిన్నారికి ఆరు నెలలు. ప్రస్తుతం ఈషా సాహు ప్రసూతి సెలవులో ఉంది. కొన్ని నెలలుగా ఈషా సాహు తల్లిదండ్రుల ఊళ్లోనే ఉంది. నెల రోజుల క్రితం నాగపూర్‌లోని అత్తారింటికి వెళ్లింది. పెద్ద కూతురుకు స్కూళ్లు ప్రారంభం కావడంతో గత నెల 30న ఆమె తన భర్త, పిల్లలతో కలిసి నగరానికి వచ్చింది.సరుకులు తీసుకురమ్మని.. కాగా, శుక్రవారం మధ్యాహ్నం ఈషా సాహు తన భర్త భూపేంద్ర సాహు, పెద్ద కూతురు విధిని సరుకులు తీసుకురావాలని చెప్పి డీమార్ట్‌కు పంపించింది. సాయంత్రం సమయంలో ఆరు నెలల కూతురు వాణితో కలిసి ఆమె ఓ బకెట్ తీసుకొని ఆరవ ఫ్లోర్‌కు వెళ్లింది. బకెట్ పైకి ఎక్కి గోడ మీద నుంచి చిన్నారితో కలిసి ఆమె కిందికి దూకింది. తీవ్ర గాయాలతో ఈషా సాహు అక్కడికక్కడే మృతి చెందగా అపార్ట్మెంట్ ప్రహరీగోడపై ఉన్న ఇనుప కంచెకు చిన్నారి డ్రెస్ చిక్కుకొని స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు గమనించి భర్త భూపేంద్ర సాహు, మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా ఈషా సాహు మృతి చెందగా, పక్కనే ఉన్న ప్రహరీగోడ ఇనుప కంచెకు గౌను చిక్కుకొని చిన్నారి వేలాడుతూ కనిపించింది. పోలీసులు చిన్నారిని కంచె నుంచి తొలగించి ఆస్పత్రికి తరలించారు. ‘ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నా...మీరందరూ సంతోషంగా ఉండండి.. నన్ను క్షమించండి’అంటూ ఈషా సాహు ఓ నోట్లో రాసిందని పోలీసులు తెలిపారు. కాగా ఆరు నెలలుగా ఆమె డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు
నేను నా కొడుకు దద్దమ్మలం.. మీ సంపద మీరే సృష్టించుకోండి చేతులెత్తేసిన చంద్రబాబు..
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను చంపిన భార్య
యుద్ధం ముగించలేదు.. ట్రంప్ కు ఇరాన్ హెచ్చరిక
పాప తల్లి షాకింగ్ నిజాలు! జ్ఞానేశ్వరి తండ్రిపై పెరుగుతున్న అనుమానాలు..?
కడప MLA కాదు కూల్చివేతల MLA.. మాదవి రెడ్డిపై కడప మాజీ మేయర్ ఫైర్
పాప ఎక్కడుందో కుక్కకే తెలుసు! జాను జాడ కోసం వేట..
వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమం సక్సెస్ పై జగన్ హర్షం
YSRCP నంగి రెడ్డి శరత్ కుమార్ కుటుంబాన్ని ఫోన్ లో పరామర్శించిన జగన్
హైదరాబాద్ లో దంచికొట్టిన వాన
నువ్వు వేసిన మేకప్ తో గోడకు పెయింట్ వేయొచ్చు.. గుడివాడ సెటైర్లు

