Anakapalle
-
రెండు గ్రామాల్లో గంగాదేవి గావు పండగ
కె.కోటపాడు : గుల్లేపల్లి, జోగన్నపాలెం గ్రామాల్లో గంగాదేవి(గావు ) పండగ పర్వదినాన్ని మంగళవారం ఆయా గ్రామస్ధులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి మూడేళ్లకు ఒక మారు రెండు గ్రామాల ప్రజలు ఆమ్మవారి పండగను నిర్వహించడం ఆనవాయితీ. ఆలయ ప్రాంగణంలో నిర్మాణం చేపట్టిన పందిరికి భక్తుల మొక్కులలో భాగంగా కొబ్బరి, అరటి, ద్రాక్ష పండ్లతో పాటు, నగదు, చీరలను వేలాడదీశారు. ఆయా వస్తువులను భక్తులు పొందేందుకు సాయంత్రం దోపిడీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులకు లభించే వస్తువులను అమ్మవారి ప్రసాదంగా భావిస్తారు. రెండు గ్రామాల్లో మధ్యాహ్నం అన్న సమారాధన జరిపారు. మాజీ డిప్యూటీ సీఎం బూడి ప్రత్యేక పూజలు గుల్లేపల్లి గ్రామంలో గంగాదేవి గావు పండగ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు. గంగాదేవికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆయనను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. అలాగే ఎంపీపీ రెడ్డి జగన్మోహన్, సర్పంచ్ బండారు దేముళ్లు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ● పందిరికి అరటి, కొబ్బరి, నగదు తదితర వస్తువులను వేలాడదీసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు -
సరికొత్త హంగులతో వైఎస్సార్ స్టేడియం
విశాఖ స్పోర్ట్స్: ఐపీఎల్ ప్రస్తుత సీజన్‌కు విశాఖలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియం సిద్ధమవుతోంది. మరో సారి ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ హోం గ్రౌండ్‌గా విశాఖ స్టేడియాన్ని ఎంచుకోవడమే కాకుండా తొలి మ్యాచ్‌ను ఇక్కడే ఆడి సీజన్‌కు శ్రీకారం చుట్టనుంది. 27,251 మంది అభిమానులు ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించే అవకాశం ఉన్న వైఎస్సార్ స్టేడియంలో డీసీ తొలి మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్‌తో 24వ తేదీ రాత్రి ఏడున్నర గంటలకు ఆడనుంది. అలాగే ఈ నెల 30వ తేదీ ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం మూడున్నరకే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ల నిర్వహణకు వీలుగా స్టేడియంలో ఆధునిక హంగులు సమకూరుస్తున్నారు. ఆటగాళ్ల గ్రీన్రూమ్స్తో సహా డగౌట్స్ను ఆధునికీకరించారు. మ్యాచ్‌ల్లో డ్రెస్సింగ్ రూమ్‌కి చాలా ప్రాధాన్యం ఉన్నా.. టీ–20లో ఆటగాళ్లు కూర్చునేందుకు మైదానానికి ఇరువైపులా ఉండే డగౌట్స్ ప్రత్యేకతను సంతరించుకుంటాయి. డీసీ మేనేజ్మెంట్ సూచనల మేరకు ఏసీఏ ప్రత్యేక దృష్టి పెట్టి సాధారణ ప్రేక్షకులతో పాటు కార్పొరేట్‌కు పెద్దపీట వేసింది. అందుకు అనువుగా 34 వీఐపీ కార్పొరేట్ బాక్స్‌లతో పాటు రెండు టీమ్ బాక్స్‌లను ఆధునికీకరించింది. ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్తో సహా నాలుగు లిఫ్ట్‌ల్లో ఒకేసారి 64 మంది వెళ్లే విధంగా తీర్చిదిద్దింది. దాదాపు రూ.40 కోట్ల వరకు వెచ్చించి స్టేడియంలో సౌకర్యవంతమైన సీటింగ్ ఏర్పాట్లతో పాటు అభిమానులకు బాత్రూమ్లను సైతం మూడింతలు పెంచి సౌకర్యాలు కల్పించింది. స్టేడియంలో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేసి 14 ఏళ్లు దాటిపోవడంతో.. వాటి స్థానంలో రూ.9.5 కోట్లు వెచ్చించి ఆధునిక టెక్నాలజీతో పూర్తి నైట్ మ్యాచ్‌కు అనువుగా ఆధునికీకరించింది. పెవిలియన్ ఎండ్ సౌత్ బ్లాక్‌లో ఆటగాళ్ల రూమ్, డగౌట్‌కు పైన 1,640 మంది కూర్చునే కార్పొరేట్ బాక్స్‌లు అన్ని హంగులతో సిద్ధమయ్యాయి. ఆటగాళ్లకు దగ్గరగా ఉండే అప్పర్ వెస్ట్, జి, ఐ స్టాండ్స్‌లోనూ సిట్టింగ్ ఏర్పాట్లను మెరుగుపరిచారు. స్టేడియంలో మొత్తంగా కార్పొరేట్ బాక్స్‌లతో సహా 22 స్టాండ్స్ ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్‌లకు టికెట్లను త్వరలోనే ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
దివ్యాంగ బాలలకు ఎన్టీపీసీ వితరణ
పరవాడ: స్థానిక దివ్యాంగ బాలల శ్రేయస్సుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న సింహాద్రి ఎన్టీపీసీ యాజమాన్యాన్ని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అభినందించారు. దివ్యాంగ బాలల ఉపకరణాల వితరణకు ఎన్టీపీసీ రూ.12.99 లక్షలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా దీపాంజిలినగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, మాట్లాడారు. దివ్యాంగ బాలల విద్యాభివృద్ధి, అవసరమైన ఉపకరణాల పంపిణీకి ఎన్టీపీసీ సమకూర్చిన నిధులను సద్వినియోగపర్చుకోవాలని సూచించారు. సమగ్ర శిక్ష పథక సంచాలకులు డాక్టర్ జయప్రకాష్ మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లాలో 43 భవిత కేంద్రాలకు గతంలో ఎన్టీపీసీ యాజమాన్యం రూ.12 లక్షలతో ఉపకరణాలు అందజేశారని, తాజాగా అనకాపల్లి జిల్లాలోని 24 భవిత కేంద్రాలు, ఆరు సహిత విద్యా రిసోర్స్ రూములు, ఉపకరణాలకు రూ.12.99 లక్షలు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. సింహాద్రి ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీర్‌శర్మ మాట్లాడుతూ సంస్థ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్య, వైద్యం, బాలికా సాధికారిత, ఉపకార వేతనాలు వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. ఎన్టీపీసీ సమకూర్చిన ఉపకరణాలను మండలాల వారీగా ఆయా భవిత కేంద్రాల నిర్వాహకులకు కలెక్టర్ అందించారు. దివ్యాంగ బాలలు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా సహిత విద్య సమన్వయ అధికారి బి.శకుంతల, రిసోర్స్ పర్సన్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సంస్థ అధికారులు పాల్గొన్నారు. -
సింహాద్రి ఎన్టీపీసీలో కలెక్టర్
ఎన్టీపీసీ సోలార్ విద్యుత్ ప్లాంట్‌లో జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పరవాడ: అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మంగళవారం సింహాద్రి ఎన్టీపీసీని సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా కంట్రోల్ రూమ్‌లోని మహిళా ఉద్యోగులతో కాసేపు ముచ్చటించారు. ప్లాంట్‌లోని మోడల్ రూం పనితీరును తెలుసుకున్నారు. ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను సందర్శించారు. సందర్శనలో భాగంగా పవర్ ప్లాంటు కార్యకలాపాలు, ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. బొగ్గు రవాణా సేకరణ లింకేజీలు, షెడ్యూల్ ప్రక్రియపై చర్చలు జరిపారు. సమర్థవంతమైన ఇంధన ఉత్పత్తికి ఎన్టీపీసీ సింహాద్రి చేస్తున్న కృషిని కలెక్టర్ అభినందించారు. కలెక్టర్ వెంట సింహాద్రి ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీర్‌శర్మ, ప్లాంట్ హెచ్ఆర్ బి.బి.పాత్ర, సీనియర్ అధికారులు ఉన్నారు. -
పెయ్యిల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలి
కె.కోటపాడు : పెయ్యిల పెంపకంలో జాగ్రత్తలను పాటించడం వల్ల పెయ్యిల్లో ఎదుగుదల, ఆరోగ్యంగా ఉంటాయని అనకాపల్లి జిల్లా పశుసంవర్ధకశాఖ పశువైద్యాధికారి పి.రామ్మోహన్రావు, విశాఖపట్నం ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మండలంలో చిరికివానిపాలెం, చౌడువాడ గ్రామాల్లో పశుసంవర్ధకశాఖ, పశుగణాభివృద్ది సంస్ధల ఆధ్వర్యంలో మంగళవారం లేగ దూడల ప్రదర్శన నిర్వహించారు. చిరికివానిపాలెంలో 43, చౌడువాడలో 35 పెయ్యిలను ఈ ప్రదర్శనకు రైతులు తీసుకువచ్చారు. మొదటి మూడు స్ధానాలలో ఆరోగ్యకరమైన పెయ్యిలుగా ఎంపికై న వాటి యజమానులకు బహుమతులతో పాటు పోటీలకు పెయ్యిలను తీసుకువచ్చిన రైతులకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా జిల్లా పశువైద్యాదికారి రామ్మోహన్రావు, డిప్యూటీ డైరక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ పెయ్యిలకు పుట్టిన 10 రోజులకు ఒకసారి నట్టల నివారణ మందును వేయడంతో పాటు ప్రతి నెలకు ఒకసారి 6 నెలల పాటు నట్టల నివారణ మందును వేయాలని తెలిపారు. ఆవు, గేదెలు ఈనిన 60 రోజుల నుంచి 90 రోజులలోపు చూడికట్టే ఇంజక్షన్‌ను చేయించడం వల్ల చూడికట్టే శాతం మెరుగ్గా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు లవణ మిశ్రమం ప్యాకెట్లను ఉచితంగా అందించారు. కార్యక్రమంలో కె.కోటపాడు పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్ డైరక్టర్ దినేష్‌కుమార్, సౌజన్య, కొరువాడ, చౌడువాడ పశువైద్యాధికారులు సిహెచ్.వై.నాయుడు, సింహాచలంనాయుడు, పశువైద్య సహాయకులు పాల్గొన్నారు. చిరికివానిపాలెం, చౌడువాడ గ్రామాల్లో లేగ దూడల ప్రదర్శన ఆరోగ్యకరమైన పెయ్యిలకు బహుమతులు -
పనులు జరుగుతున్న రోడ్డుకు మళ్లీ శంకుస్థాపన!
దేవరాపల్లి : ఇప్పటికే పనులు జరుగుతున్నా రహదారిపై మరలా టీడీపీ నాయకులు శంకుస్థాపన చేయడం పలు విమర్శలకు దారి తీసింది. చింతలపూడి పంచాయితీ శివారు బోడిగరువు, నేరెళ్లపూడి గ్రామాలకు వెళ్లే రహదారిలో బీటీ రోడ్డుకు నిధులు మంజూరయ్యాయని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణ మూర్తి కుమారుడు బండారు అప్పలనాయుడు మంగళవారం శంకుస్థాపన చేయడం వివాదాస్పదమైంది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరూ లేకుండానే ఏ హోదాలో అతను రోడ్డుకు శంకుస్థాపన చేశారంటూ పలువురు విస్మయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులను ప్రజాప్రతినిధులు, అధికారులు లేకుండా శంకుస్థాపన చేయడం ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం స్థానిక సర్పంచ్, ఎంపీటీసలకు సైతం సమాచారం ఇవ్వకుండా చేయడంపై దుమారం రేగింది. దీనిపై అధికారులు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. నాడు బూడి చొరవతో రూ.2 కోట్లతో మట్టిరోడ్డు నిర్మాణం చింతలపూడి పంచాయతీ పరిధిలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న బోడిగరువు, నేరెళ్లపూడి గిరిజన గ్రామాలకు కనీసం కాలినడకన వెళ్లేందుకు కాలి బాట సైతం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. సుమారు 4కి.మీ మేర దూరంలో ఉన్న సమ్మెదకు చేరుకోవాలంటే కొండలు, గుట్టలు, గెడ్డలు, వాగులు దాటి ప్రాణాలకు తెగించి రాకపోకలు సాగిస్తూ నరకయాతన అనుభవించేవారు. 2023లో డిప్యూటీ సీఎం హోదాలో బూడి ముత్యాలనాయుడు 5 కి.మీ మేర కొండలు, గెడ్డలు, వాగులు దాటుకుంటూ ఆ రెండు గ్రామాలకు కాలినడకన చేరుకొని వారి కష్టాలను స్వయంగా చూశారు. సమ్మెద బ్రిడ్జి నుంచి బోడిగురువు మీదుగా నేరెళ్లపూడి వరకు రహదారి సౌకర్యం కల్పించేందుకు రూ.2 కోట్లు నిధులు మంజూరు చేయించి, నిర్మాణ పనులు పూర్తి చేయించారు. ఆత ర్వాత బీటీ రోడ్డు నిర్మాణ పనులకు సైతం సంకల్పించారు. అయితే ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పనులు కొనసాగించాల్సి ఉండగా మరలా శంకుస్థాపనల పేరిట ఇలా హడావుడి చేయడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. బోడిగరువు, నేరెళ్లపూడి రోడ్డుకు ఎమ్మెల్యే తనయుడు శంకుస్థాపన ఎమ్మెల్యే కుమారుడు అప్పలనాయుడు తీరుపై సర్వత్రా విమర్శలు అధికారులు, ప్రజాప్రతినిధులు లేకుండా ఏ హోదాలో చేశారని విస్మయం -
దైన్యం.. జూలో మూగ జీవాల వైద్యం
● ఇటీవల పుట్టిన రెండు సింహం పిల్లలు మృతి ● వారాల తరబడి పోటీ పడి మరీ సెలవుల్లో వైద్యులు ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో మూగ జీవాలకు వైద్యం ప్రశ్నార్థకంగా మారింది. వైద్యులు వారాల తరబడి పోటాపోటీగా సెలవులు పెట్టడం, విధులకు హాజరైన రోజుల్లో కూడా సరిగా వైద్య సేవలు అందించకపోవడంతో మూగ జీవాల ఆరోగ్యం అగమ్యగోచరంలో పడింది. ఇటీవల ఇక్కడ శివంగి(ఆడ సింహం)కి పుట్టిన రెండు పిల్లలు మృత్యువాత పడ్డాయి. జూ పార్కుల్లో సింహాలకు పిల్లలు పుట్టడం దేశంలో ఇదే మొదటిసారి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన జూ వైద్యులు నిర్లక్ష్యం కారణంగా.. పుట్టిన రెండు సింహం పిల్లల్లో ఒకటి రెండు రోజుల వయసులో, మరొకటి 12 రోజుల వయసులో ప్రాణాలు కోల్పోయాయి. ఏడాదిన్నర క్రితం ఇక్కడ జిరాఫీ పిల్ల తల్లి కడుపులోనే మరణించిన విషయం తెలిసిందే. ఇతర దేశాల నుంచి ఇక్కడకు తీసుకువచ్చిన పలు అరుదైన వన్యప్రాణులు సైతం సరైన వైద్యం అందకపోవంతో మృత్యువాత పడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లాంగ్ లీవ్‌లో డాక్టర్ శ్రీనివాస్ జూ పార్కు ఏర్పాటైనప్పటి నుంచి పశు సంవర్ధక శాఖకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ ఇక్కడి మూగజీవాలకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఆయన వ్యక్తిగత కారణాలతో రెండేళ్ల క్రితం లాంగ్(ఐదేళ్ల) లీవ్ పెట్టారు. అప్పటి నుంచి పరిస్థితులు దిగజారాయి. ప్రస్తుతం ఇక్కడ ముగ్గురు వైద్యులున్నారు. వారిలో నెల క్రితం నియమించిన పశు సంవర్ధక శాఖకు చెందిన ప్రభుత్వ వైద్యుడున్నారు. మిగిలిన ఇద్దరు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వారిలో ఒక యువ వైద్యుడు ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. ఆయనకు హైదరాబాద్‌లో సొంతంగా వెటర్నరీ మందుల సంస్థ ఉంది. ఆ సంస్థ నుంచే గతంలో అవసరానికి మించి మందులు కొనుగోలు చేయించేవారని సమాచారం. సదరు వైద్యుడు నెలలో సగం రోజులు సిక్ లీవ్‌ల పేరిట జూ డ్యూటీకి ఎగనామం పెడుతున్నారు. మరో మహిళా వైద్యురాలు నాలుగు నెలల క్రితం జూలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో చేరారు. ఆమె గతంలో కొన్నాళ్లు ఇక్కడ వైద్యురాలిగా పనిచేశారు. ఇక్కడ మానేసిన తర్వాత జీవీఎంసీ మొబైల్ వెటర్నరీ క్లినిక్‌లో చేరారు. ప్రస్తుతం ఆమె రెండు ఉద్యోగాలు చేస్తున్నట్లు జూ సిబ్బంది చెప్తున్నారు. అక్కడో వారం.. ఇక్కడో వారం అన్నట్లుగా ఆమె సేవలందిస్తున్నట్లు తెలిసింది. వీరిద్దరు డ్యూటీకి వెళ్లిన రోజుల్లో కూడా వన్యప్రాణులను సరిగా పరిశీలించట్లేదని యానిమల్ కీపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగానే గర్భం దాల్చిన సింహానికి సరైన వైద్యం, అవసరమైన మందులు అందక నీరసించిన పిల్లలు పుట్టాయన్న ఆరోపణలున్నాయి. వీరిద్దరు ఇటీవల నియమించిన ప్రభుత్వ వెటర్నరీ వైద్యుడికి కూడా సహకరించకుండా సెలవుల్లో గడుపుతున్నారని సమాచారం. ఇంత జరుగుతున్నా అటవీశాఖ సీఎఫ్, జూ ఉన్నతాధికారులు సర్దుబాటు చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. -
బైకులు, బంగారం దొంగ అరెస్టు
అనకాపల్లి : రామాపురం కాలనీ ఏలేరు కాలువ వద్ద సోమవారం పట్టణ ఎస్ఐ అల్లు వెంకటేశ్వరరావు వాహనాలు తనిఖీ చేస్తుండగా రావికమతం మండలం, కొత్తకోట గ్రామం, శివాలయం వీధికి చెందిన మొగలుతుర్తి మణికంఠ అలియాస్ రంగ పోలీసులను చూసి పారిపోబోయాడు. అనుమానంతో అతన్ని పట్టుకుని విచారించగా అతని వద్ద నుంచి చోరీ సొత్తు రెండు బైకులు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ ఎం.శ్రావణి చెప్పారు. పట్టణ పోలీస్‌స్టేషన్ ఆవరణలో మంగళవారం విలేకరులతో వివరాలు వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్ 15న అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయతీ శివారు సుబ్బారావు దాబా దగ్గర హైవే పక్కన పార్క్ చేసి ఉన్న కారుల్లో అద్దాలను పగులకొట్టి అందులో రెండు హ్యాండ్ బాగుల్లో ఉన్న రూ.40వేలు నగదు, ఒక జత బంగారు చెంప స్వరాలు, ఒక జత బంగారు చెవి దిద్దులు, ఒక బంగారు మండ గొలుసు, ఒక బంగారు చైన్, ఒక యాపిల్ ఐఫోన్ చోరీకి గురైనట్టు ఫిర్యాదు అందింది. పై వస్తువులను మొగలుతుర్తి మణికంఠ చోరీ చేసినట్టు అంగీకరించినట్టు డీఎస్పీ చెప్పారు. ఆ వ్యక్తి నుంచి రెండు బైక్‌లు, బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్టు డీఎస్పీ చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ టి.వి.విజయకుమార్, కానిస్టేబుల్స్ పి.కిషోర్‌కుమార్, టి.సంతోష్‌కుమార్, శివాజీ పాల్గొన్నారు. -
లిక్విడ్ గంజాయితో యువకుడి అరెస్ట్
కె.కోటపాడు : యాసస్ ఆయిల్(గంజాయి లిక్విడ్)ను తరలిస్తున్న యువకుడిని మంగళవారం ఎ.కోడూరు ఎస్ఐ లక్ష్మినారాయణ పట్టుకున్నారు. ఆయన తెలిపిన వివరాలివి. ఆనందపురం కూడలి వద్ద సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సందర్భంలో అనుమానస్పదంగా సంచరిస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన షేక్ మహ్మద్ జాకీర్ అనే వ్యక్తి బ్యాగ్‌ను తనిఖీ చేయగా 900 గ్రాముల యాసస్ ఆయిల్(గంజాయి లిక్విడ్)ను గుర్తించినట్టు ఎస్ఐ తెలిపారు. ఈ గంజాయి లిక్విడ్‌ను ఏజెన్సీ ప్రాంతం నుంచి తీసుకువస్తున్నట్టు నిందితుడు అంగీకరించాడన్నారు. ఆనందపురం మీదుగా అనకాపల్లికి వెళ్లే ప్రయత్నంలో అతను పట్టుబడినట్టు తెలిపారు. పట్టుబడ్డ యాసస్ ఆయిల్ విలువ రూ.20వేలు ఉంటుందన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హజరుపర్చగా రిమాండ్‌కు విధించినట్టు వివరించారు. -
విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి
కె.కోటపాడు : పిండ్రంగి గ్రామానికి చెందిన బి.స్వామినాయుడు(38) విద్యుత్ షాక్‌కు గురై మంగళవారం సాయింత్రం మృతిచెందాడు. తన ఇంటి నిర్మాణ పనులకు మేస్త్రి వద్ద స్వామినాయుడు సహాయంగా ఉన్నాడు. ఇంటికి సమీపం గుండా ఉన్న హెడ్డీ విద్యుత్ లైన్ వైరు ప్రమాదవశాత్తూ స్వామినాయుడు ఎడమ చేతికి తగులడంతో షాక్‌కు గురయ్యాడు. స్థానికులు వెంటనే అతన్ని ఆటోలో కె.కోటపాడు సీహెచ్‌సీకి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యంలోనే స్వామినాయుడు మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబ పోషణ చేసే భర్త మరణించడంతో తను, పిల్లలు అనాథలుగా మారామని భార్య లక్ష్మి రోధించడం చూపరులను కలచివేసింది. ఘటనపై లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు ఎ.కోడూరు ఎస్ఐ లక్ష్మినారాయణ తెలిపారు. మృతదేహానికి బుధవారం పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగిస్తామన్నారు. మృతిచెందిన స్వామినాయుడు -
తాండవ గేట్ల మరమ్మతులు ప్రారంభం
తాండవ ప్రాజెక్టు ప్రధాన గేట్ల మరమ్మతు పనులు ప్రారంభిస్తున్న ప్రాజెక్టు డీఈ అనురాధ, చైర్మన్ సత్యనారాయణ నాతవరం : తాండవ ప్రాజెక్టు ప్రధాన గేట్ల మరమ్మతులతోపాటు కాలువల అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు ప్రాజెక్టు డీఈ ఆనురాధ చెప్పారు. ఆమె మంగళవారం తాండవ ప్రాజెక్టు ప్రధాన గేట్ల లీకేజీలకు మరమ్మతు పనులను ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కె.సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. తాండవ ప్రాజెక్టు అభివృద్ధికి రూ.2 కోట్ల 10 లక్షలతో 18 పనులు చేపడుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం తాండవ కాలువలకు సంబంధించి మూడు పనులు జరుగుతున్నాయని, మిగతా పనులు త్వరలో చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. జేఈలు శ్యామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
యువత కోసం పోరు బాట
● నేడు విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన కలెక్టర్‌కు వినతిపత్రం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడుఅనకాపల్లి: ఎన్నికల ముందు అలవి కాని హామీలు ఇచ్చి కూటమి నేతలు ప్రజలు నిలువునా ముంచేశారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.. ఉద్యోగాలు రాక, నిరుద్యోగ భృతి ఇవ్వక యువత పడరాని పాట్లు పడుతున్నారని, వారి పక్షాన వైఎస్సార్సీపీ ‘యువత పోరు’ పేరిట నిరసన కార్యక్రమం చేపట్టిందన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆధ్వర్యంలో యువత పోరు పోస్టర్‌ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం 8 గంటలకు పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించాలని.. అనంతరం ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ శ్రేణులు అనకాపల్లి రింగ్‌రోడ్డు పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. అక్కడ నుంచి ర్యాలీగా కలెక్టరేట్ వరకు విద్యార్థుల తల్లిదండ్రులు, నిరుద్యోగులతో వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ప్రజలను నిలువునా ముంచేశారని, సూపర్ సిక్స్ పథకాలని ఆశ కల్పించి అధికారం చేజిక్కించుకున్నాక నరకం చూపిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ మాట్లాడారు. ఎంపీపీ గొర్లి సూరిబాబు, పార్టీ మండల అధ్యక్షుడు పెదిశెట్టి గోవింద్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు, కశింకోట మండల అధ్యక్షుడు మలసాల కిషోర్, జిల్లా కార్యదర్శి జాజుల రమేష్, జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడు పల్లెల వెంకట సీతమ్మదొర, 80వ వార్డు ఇన్చార్జ్ కె.ఎం.నాయుడు, జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరిపల్లి శోభ, తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పుడైనా కళ్లు తెరవాలి
ఎన్నికల ముందు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని వాగ్దానం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా ఇంతవరకు అతీగతీ లేదు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఏటా విద్యార్థులకు వసతి దీవెన, విద్యాదీవెన తదితర పథకాలు పక్కాగా అమలు జరిగేవి. దీంతో పిల్లలను చదివించడం సులువయ్యేది. ఇప్పుడు అప్పులు చేయాల్సివస్తోంది. యువత పోరు కార్యక్రమం ద్వారా అయినా విద్యార్థులకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం. –కాండ్రేగుల జగన్, విద్యార్థిని తండ్రి, తిమ్మరాజుపేట, మునగపాక మండలం -
అంధకారం
యువత భవితప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నెలకొల్పిన పరిశ్రమలు 35 భారీ.. 300 చిన్న, మధ్యతరహా కంపెనీలు పరిశ్రమల్లో కొత్తగా వచ్చిన ఉద్యోగాలు 14,114 రీయింబర్స్మెంట్ అందుకున్న విద్యార్థులు 39 వేలు అందుకున్న ఫీజుల మొత్తం రూ.26.12 కోట్లు జిల్లాలో నిరుద్యోగుల సంఖ్య2.30 లక్షలు కొత్తగా వచ్చిన పరిశ్రమలుసున్నా రీయింబర్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు 39 వేలు గతం -
గడ్డి తిని బతకాలా..!
● ఉపాధి కూలీల వినూత్న నిరసన గడ్డి చేత పట్టుకొని నిరసనకు దిగిన ఉపాధి కూలీలు దేవరాపల్లి: ఉపాధి హామీ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉపాధి కూలీలు వినూత్న నిరసన చేపట్టారు. గడ్డి చేత పట్టి, నోట్లో పెట్టుకొని తమ ఆవేదన వెలిబుచ్చారు. గర్సింగ్, డొర్రి చెరువు, మారేపల్లి గ్రామాలలో చేసిన కూలి పనుల బిల్లులు చెల్లించకపోతే గడ్డి తిని బతకాలా అని ప్రశ్నించారు. ఎండు గడ్డి చేత పట్టుకొని మంగళవారం వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. నాలుగు నుంచి ఎనిమిది వారాల వరకు ఉపాధి కూలీల సొమ్ము చెల్లించక పోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి ఆందోళనకు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డి.వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి.దొర మద్దతు పలికారు. -
కూటమి ఎమ్మెల్యేలకు ప్రజల్లోకి వెళ్లే ధైర్యంలేదు
● ఎన్నికల హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు ● భూములిచ్చిన రైతులను మోసం చేసిన ప్రభుత్వం ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ● నిర్వాసిత గ్రామాల్లో పర్యటన నక్కపల్లి: కూటమి ఎమ్మెల్యేలకు ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ప్రజలు నిలదీస్తారనే భయంతో ప్రజల్లోకి వెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్నారని మండిపడ్డారు. విశాఖ చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. మంగళవారం ఆయన మండలంలోని ఇండస్ట్రియల్ కారిడార్ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా భూములు ఇచ్చిన నిర్వాసితులు, రైతులతో రాజయ్యపేట, చందనాడ, బుచ్చిరాజుపేట, అమలాపురం, డీఎల్ పురం తదితర గ్రామాల్లో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లిస్తామని హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. డీఫారం భూముల్లో మామిడి, జీడి, కొబ్బరి తోటలకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. పరిహారం చెల్లింపుల్లో కూడా పక్షపాతం చూపిస్తున్నారన్నారు. జిరాయితీ రైతులతో సమానంగా నష్టపరిహారం చెల్లించాలని కోరితే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరితే ఇచ్చినంత తీసుకోండి, లేకపోతే మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండని హోం మంత్రి వ్యాఖ్యానించడం దారుణమన్నారు. రైతుల నుంచి రెండు పంటలు పండే భూములను కారు చౌకగా తీసుకుని కార్పొరేట్ శక్తులకు అధిక ధరలకు అమ్ముకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు. ప్రజలకు హాని కలిగించే బల్క్ డ్రగ్ పార్క్‌ను తీరప్రాంతాల్లో ఏర్పాటు చేయడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుందన్నారు. ఇచ్చిన హామీలపై ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి ఉందన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లోకనాథం, జిల్లా కార్యవర్గసభ్యులు అప్పలరాజు, మండల కన్వీనర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
● ఫ్యాక్టరీ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనకు సిద్ధం ● గోవాడ చెరకు రైతులకు బాసటగా నిలిచిన వైఎస్సార్సీపీ ● వారి కష్టాలు తెలుసుకున్న శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ● సమస్యలను శాననమండలిలో ప్రస్తావిస్తామని హామీ
చోడవరం: గోవాడ చెరకు రైతులకు వైఎస్సార్సీపీ బాసటగా నిలిచింది. సుగర్ ఫ్యాక్టరీలో తరుచూ క్రషింగ్‌కు అంతరాయం కలగడంతో చెరకు రైతులు కొద్ది రోజులుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి అండగా నిలిచి, వారి సమస్యలను ప్రభుత్వానికి ఎలుగెత్తి చాటేందుకు మేమున్నామంటూ వైఎస్సార్సీపీ ముందుకు వచ్చింది. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్, జెడ్పీ చైర్పర్సన్ సుభద్రతో కూడిన వైఎస్సార్సీపీ ప్రతినిధుల బృందం సోమవారం గోవాడ సుగర్ ఫ్యాక్టరీని సందర్శించింది. ఇక్కడి యార్డులో నిలిచిపోయిన చెరకు బళ్లను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలు, ప్రస్తుత ఫ్యాక్టరీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తమకు గతేడాది చెరకు బకాయిలు ఇంకా ఇవ్వలేదని, ఈ ఏడాది 40 రోజులు ఆలస్యంగా క్రషింగ్ ప్రారంభించారని, ఫ్యాక్టరీ మిషనరీలో మరమ్మతుల వల్ల ఈ సీజన్లో అనేక సార్లు క్రషింగ్ ఆగిపోయిందని, ఈ ఏడాది సరఫరా చేసిన చెరకుకు ఇంకా పేమెంట్స్ ఇవ్వలేదని రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే ఫ్యాక్టరీని బాగుచేస్తామని, రైతులకు రూ.4 వేలు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పిన ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే రాజు, బండారు ఇప్పుడు రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నా ఇటువైపు కన్నెత్తి చూడలేదని మరికొంతమంది రైతులు ఆగ్రహంతో చెప్పారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పడు పలుసార్లు ఫ్యాక్టరీకి సాయం చేశారని, ఆ డబ్బులతో ఎప్పటికప్పుడు చెరకు బకాయిలు చెల్లించడంతోపాటు ఫ్యాక్టరీ ఓవరాయిలింగ్ పనులు కూడా పూర్తిగా చేసేవారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి కూడా సాయం చేయకపోవడంతో రైతులకు, కార్మికులకు బకాయిలు చెల్లించలేదని, ఫ్యాక్టరీని ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ పూర్తిగా పట్టించుకోలేదని రైతులంతా ముక్తకంఠంతో చెప్పారు. వైఎస్సార్సీపీ రైతులకు అండగా ఉండేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉందని, తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లండంటూ రైతులు సమస్యలు విన్నవించారు. -
తప్పుల తడకగా సీనియారిటీ జాబితా
● అప్పీళ్లకు ముగిసిన గడువు ● సవరణల కోసం 250 మంది దరఖాస్తులు విశాఖ విద్య: ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా లు ప్రకటించేందుకు విద్యాశాఖాధికారులు ఆపసోపాలు పడుతున్నారు. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(టీఐఎస్)లో సమగ్ర వివరాలు నమోదు సమ యంలో ఉపాధ్యాయుల అలసత్వం, డీడీవోల నిర్లక్ష్యంతో జాబితాలు తప్పులతడకగా మారాయి. వీటి ఆధారంగానే త్వరలోనే ప్రమోషన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో ఉపాధ్యాయుల్లో కలవరం మొదలైంది. దీంతో సీనియారిటీ జాబితా లో లోపాలను సవరించి, తమకు న్యాయం చేయా లని కోరుతూ ఉమ్మడి విశాఖ జిల్లాకు సర్వీసు విషయాల్లో నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న విశాఖ జిల్లా డీఈవోకు తమ మొర విన్నవించుకునేందుకు ఉపాధ్యాయులు క్యూ కట్టారు. అప్పీళ్లకు సోమ వారం చివరి రోజు కావటంతో ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న 250 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. అప్పీళ్ల పరిశీలనకు ప్రత్యేక కమిటీ వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించే నిమి త్తం 12 మంది సీనియర్ ప్రధానోపాధ్యాయులు, ఇద్దరు ఎంఈవోలతో జిల్లా స్థాయిలో కమిటీ ఏ ర్పాటు చేశారు. వచ్చిన ప్రతీ దరఖాస్తును వారు పరిశీలించిన తరువాతనే టీఐఎస్ లాగిన్‌లో వాటిని సరిచేశారు. ఇలా 210 దరఖాస్తులను సోమవారం నాటికి ఒక కొలిక్కి తీసుకొచ్చి, ఉపాధ్యాయులు లే వనెత్తిన అంశాలను సరిచేశారు. మరో 40 వరకు దరఖాస్తులు అభ్యంతరాలతో కూడినవి కావటంతో.. మరోసారి క్షేత్రస్థాయి నుంచి నివేదికలను తెప్పించుకున్న తరువాతనే వాటిని సీనియారిటీ జాబితాలో చోటు కల్పించేలా చర్యలు చేపట్టారు. జాబితాలపై ఉన్నత స్థాయి సమీక్ష ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలు, సవరణల కోరుతూ వచ్చిన అప్పీళ్ల విషయమై సోమవారం విద్యాశాఖ కమిషనరేట్ కార్యాలయం నుంచి వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి డీఈవో ప్రేమ్‌కుమార్, సర్వీసు వ్యవహరాలు చూసే అసిస్టెంట్ డైరెక్టర్ అరుణ జ్యోతి, సంబంధిత సెక్షన్ అధికారులు, ఉద్యోగులు పాల్గొని, వివరాలను తెలియజేశారు. ఆందోళన వద్దు సీనియారిటీ జాబితాల్లో తప్పిదాలపై ఉపాధ్యాయులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉమ్మడి జిల్లాలో అన్ని క్యాడర్ల వారీగా పూర్తి స్థాయిలో సమగ్ర పరిశీలన చేసిన తరువాతనే తుది జాబితాలను వెల్లడిస్తాం. జాబితాల్లో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా.. ఉపాధ్యాయులు నేరుగా మా దృష్టికి తీసుకురావచ్చు. – ఎన్.ప్రేమ్‌కుమార్, నోడల్ అధికారి, ఉమ్మడి విశాఖ జిల్లా -
ఉచితం పేరుతో అనుచితం
తుమ్మపాల: విద్య హక్కు చట్టం ద్వారా చదువుతున్న పేద విద్యార్థులను ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద పీజీఆర్ఎస్ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు నిర్వహించిన నిరసన కార్యక్రమం అనంతరం కలెక్టర్ విజయ్ కృష్ణన్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎం.రమణ మాట్లాడుతూ విద్యార్థులను ఫీజుల ఒత్తిడికి గురిచేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని, గతంలో రెండుసార్లు కలెక్టర్‌కు విన్నవించినప్పటికీ ఎటువంటి చర్యలు లేవన్నారు. పట్టణంలో గుడ్షెపర్ఢ్, విద్యాధరి, శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం లాంటి స్కూళ్లు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని, ఉచితంగా ఇవ్వాల్సిన సీట్లకు కూడా ఫీజులు చెల్లించాలని వత్తిడి చేయడం తీవ్ర అన్యాయమన్నారు. అధికారులు స్పందించి ఈ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, ఉచిత విద్య పథకంలో చదువుతున్న విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులు తిరిగి వెనక్కు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన -
అంగన్వాడీల నిర్బంధంపై నిరసన హోరు
ఇఫ్తార్ సహర్ మంగళ బుధ అనకాపల్లి 6.10 4.53 నర్సీపట్నం 6.12 4.51నర్సీపట్నం: ఇచ్చిన హామీల సాధనకు శాంతియుత నిరసన తలపెట్టిన అంగన్వాడీ కార్యకర్తలను ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్న ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండిస్తూ సిటు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ఎన్టీఆర్ స్టేడియం నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. ధర్నాను ఉద్దేశించి రాజు మాట్లాడుతూ.. గత సమ్మె కాలంలో అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ విజయవాడ వెళ్తున్న కార్యకర్తలను నిర్బంధించడాన్ని ఖండిస్తున్నామన్నారు. వేతన సమస్యను పరిష్కరించకుండా, వయసు రెండేళ్లు పెంచి గతంలో అంగీకరించని, సరైన విధానం లేని గ్రాట్యుటీని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం అంగన్వాడీలను మోసగించడమేనన్నారు. గౌరవ వేతనం ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా చూపుతున్నారని, వారి కుటుంబాల్లోని వికలాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. రేషన్ కార్డులు తొలగించడంతో అంగన్వాడీలు ఆరోగ్యశ్రీకి నోచుకోలేదన్నారు. నర్సీపట్నం, గొలుగొండ ప్రాజెక్టుల నాయకులు వి.సామరాజ్యం, పి.వరలక్ష్మి, ఆర్.కృష్ణవేణి, రమణమ్మ, హైమా, శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. -
మహిళల రక్షణ కోసం శక్తి టీమ్
● అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ● హోం మంత్రి అనితనక్కపల్లి: మహిళల రక్షణ కోసం శక్తి టీమ్‌లను ఏర్పాటు చేయడంతోపాటు, ప్రత్యేక యాప్‌ను రూపొందించామని రాష్ట్ర హోం, విపత్తుల శాఖ మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. సోమవారం నక్కపల్లిలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ పాఠశాల విద్యార్థులు, మహిళా సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం నక్కపల్లి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శక్తి యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ ప్రతి మహిళ ఈ యాప్‌ను తమ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఆడపిల్లల రక్షణ కోసం శక్తి టీమ్‌లను రంగంలోకి దించుతున్నామన్నారు. 112 నంబరుకు ఫోన్ చేస్తే 15 నుంచి 20 నిమిషాల్లో శక్తి టీం వస్తుందన్నారు. ఎన్టీపీసీ సాయంతో మాదక ద్రవ్యాలు, మహిళా చట్టాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించే వాహనాలను మంత్రి ప్రారంభించారు. శక్తి టీమ్ సభ్యుల కోసం ప్రత్యేకంగా సమకూర్చిన 39 వాహనాలు, 11 డ్రోన్స్‌ను మంత్రి ప్రారంభించి పోలీస్ శాఖకు అందజేశారు. డీఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ గడచిన ఆరు నెలల కాలంలో గంజాయి కేసుల్లో 500 మందిని అరెస్టు చేశామని, 47 కేసుల్లో శిక్షలు పడ్డాయన్నారు. 11 వేల ఎకరాల్లో సాగయ్యే గంజాయి పంటను 90 ఎకరాలకు పరిమితం చేశామన్నారు. జిల్లాలో గంజాయి నిర్మూలన కోసం 39 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరచిన 13 మంది పోలీసు సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, అదనపు ఎస్పీ దేవప్రసాద్, డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ డీఎస్పీ అప్పారావు, పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్, ట్రెయినీ డీఎస్పీ కృష్ణచైతన్య, సీఐలు కుమారస్వామి, రామకృష్ణ, ఎస్ఐ సన్నిబాబు తదితరులు పాల్గొన్నారు. -
యువత పోరు హోరెత్తాలి
చోడవరం: ఈనెల 12వ తేదీన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, యువతకు ఉద్యోగ కల్పన, నిరుద్యోగ భృతి హామీలు నెరవేర్చని ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైఎస్సార్సీపీ చేపట్టిన యువత పోరు ఆందోళనను అంతా విజయవంతం చేయాల ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు, చోడవరం సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ కోరారు. చోడవరం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ప్రచార వాల్‌పోస్టర్లను సోమవారం వారు ఆవిష్కరించారు. యువత, విద్యార్థుల పక్షాల వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, ఈ ఉద్యమంలో వారంతా పాల్గొనాలని కోరారు. విద్యార్థులు, నిరుద్యోగుల తరపున పోరాటం అనకాపల్లి: చంద్రబాబు పాలనలో దగాపడ్డ విద్యార్థులు, నిరుద్యోగుల తరపున యువత పోరు కార్యక్రమాన్ని ఈనెల 12న నిర్వహిస్తున్నామని వైఎస్సా ర్సీపీ యూత్ విభాగం జిల్లా అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్ చెప్పారు. స్థానిక రింగ్‌రోడ్డులోని పార్టీ సమస్వయకర్త మలసాల భరత్‌కుమార్ కార్యాలయంలో సోమవారం యువత పోరు పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు బకాయిపడ్డ రూ.4,600 కోట్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలండర్ ఇచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన చంద్రబాబునాయుడు మరో సారి నిరుద్యోగులను మోసగించారన్నారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది మాసాలు అవుతున్నప్పటికీ ఒక్కరికీ రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వలేదని పేర్కొన్నారు. జిల్లా ఐటీ వింగ్ విభాగం అధ్యక్షుడు పల్లెల వెంకట సీతమ్మదొర మాట్లాడుతూ డీఎస్సీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి నేటికీ అమలు చేయకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బి.హేమంత్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు ఫీజుల రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థి విభాగం యలమంచిలి అధ్యక్షుడు చదరం అప్పలనాయుడు, వైద్యవిభాగం రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ లక్ష్మీనరసింహరావు, జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరిపల్లి శోభ, తదితరులు పాల్గొన్నారు. -
పి–4 సర్వే వేగవంతం చేయాలి
పి–4 సర్వేపై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్ విజయకృష్ణన్ తుమ్మపాల : పేదరికం నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వ, ప్రవేటు, ప్రజల భాగస్వామ్యంతో (పి4) సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఎంపీడీఓలను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పి –4 సర్వే, పంచాయతీరాజ్, జిఎస్డబ్ల్యూఎస్, డ్వామా, జిల్లా పరిషత్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా బీటీ, సీసీ రోడ్లను మార్చి చివరినాటికి పూర్తి చేయాలన్నారు. ఈ వారం స్వర్ణంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి చెత్త సేకరించి, తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువుగా మార్చాలని సూచించారు. పాఠశాలల ప్రహరీ పనులు, గోకులం షెడ్ల నిర్మాణాలు సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. తాగునీటి వాటర్ ట్యాంక్‌లను శుభ్రపరిచి, మరమ్మతులు, క్లోరినేషన్ చేపట్టాలన్నారు. ఉపాధి పనులను, కేటాయించిన పనిదినాల్లో లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జి.రామారావు, జిల్లా పంచాయతీరాజ్ ఈఈ వీరునాయుడు, డ్వామా పీడీ పూర్ణిమ దేవి, జిల్లా పంచాయతీ అధికారి శిరీషారాణి, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ రామస్వామి పాల్గొన్నారు. -
ఎస్పీ కార్యాలయానికి 31 అర్జీలు
అర్జీదారుల సమస్యలను తెలుసుకుంటున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి : స్థానిక ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 31 అర్జీలు వచ్చినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు. ఎస్పీ అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను త్వరితగతిన పూర్తి చేస్తామని, ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, చీటింగ్ వంటి వాటిపై అర్జీలు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్‌రావు, ఎస్ఐ డి.వెంకన్న పాల్గొన్నారు. -
రోడ్డున పడిన 400 మంది కార్మికులు
● వేతనాలు వేస్తామని నమ్మబలికి అందుబాటులో లేని లలిత ఫెర్రో యాజమాన్యం ● ఆందోళన చేపట్టిన కార్మికులుఅచ్యుతాపురం రూరల్ : వేతనాలు అకౌంట్లలో వేస్తామని కార్మికులను నమ్మబలికి వారిని రోడ్డున పడేసిన రాజ్ రాజేశ్వరి లలిత త్రిపుర సుందరి ఫెర్రో పరిశ్రమ యాజమాన్యంపై కార్మికులు మండిపడుతున్నారు. సోమవారం నాటికి తమ అకౌంట్లలో వేతనాలు వేస్తామని చెప్పి తరువాత ఫోన్లు ఎత్తకుండా మోసం చేయడంపై కార్మికులు ఆందోళనకు దిగారు. వారికి సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు రొంగలి రాము అండగా నిలిచారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా పరిశ్రమ లాక్ అవుట్ చేసి కార్మికులను రోడ్డున పడేయడం అన్యాయమన్నారు. ఉపాధి పేరున వేల కోట్ల రాయితీలు పొందుతూ రూ. కోట్ల విలువైన భూములను తీసుకుని పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని చెప్పి నిర్వాసితులకు మోసగించారన్నారు. కార్మికులకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన హామీలు నెరవేర్చకుండా దొంగచాటున పరిశ్రమలో ఉన్న ఉత్పత్తి మెటీరియల్‌ని తరలించడంపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇదివరకు కార్మికులకు హామీ ఇచ్చిన పరిశ్రమల ప్రతినిధులను సైతం యాజమాన్యం విధుల నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో కార్మికులు పరిశ్రమ గేటు బయట ఆందోళన చేపట్టారు. సుమారు 400 కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. క్యాంటీన్లో పనిచేస్తున్న ఆరుగురు కార్మికుకులు ఆరు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. వారికి వేతనాలతో పాటు గ్రాట్యూటీ ఇచ్చి ఆదుకోవాలన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కార్మికులను నిర్ధాక్ష్యణ్యంగా విధుల నుంచి తొలగించిన పరిశ్రమ యాజమాన్యంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. -
ఉద్యమం
చెరకు రైతుల పక్షాన త్వరలో రాజకీయాలు చేయడానికి రాలేదు రైతుల ఆవేదన విన్న బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం, ఫ్యాక్టరీ యాజమాన్యం వెంటనే రైతుల సమస్యలు పరిష్కరించకపోతే చెరకు రైతుల తరపున త్వరలో ఉద్యమానికి దిగుతామని చెప్పారు. రాజకీయాలు చేయడానికి తాము ఇక్కడికి రాలేదని, చెరకు రైతుల సమస్యలు తెలుసుకొని వారికి అండగా నిలవాలనే వచ్చామని బొత్స చెప్పారు. చెరకు రైతులు రాష్ట్ర ప్రజలు కారా...వారిని పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని ప్రశ్నించారు. చెరకు రైతుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావిస్తామని చెప్పారు. ఫ్యాక్టరీకి తక్షణ సాయంగా రూ.35 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని త్వరలో జరగనున్న శానసమండలి సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి వైఎస్సార్సీపీ తీసుకెళుతుందని ఆయన చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రూ.89 కోట్లు సాయంగా ఇచ్చి ఫ్యాక్టరీని అప్పుల ఊబిలోంచి బయటకు తెచ్చిందని, రైతుల పక్షపాతిగా జగన్మోహన్రెడ్డి అన్ని విధాలుగా సాయం అందించారన్నారు. ఇప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు, కూటమి ప్రభుత్వం పూర్తిగా చెరకు రైతులను, ఫ్యాక్టరీని విస్మరించిందని ధ్వజమెత్తారు. ఎంపీ ఎక్కడి నుంచో వచ్చారని, ఆయన ఈ ప్రాంతం వారు కాకపోవడంతో ఇక్కడ రైతులు, ఫ్యాక్టరీ సమస్యలు ఆయనకు పట్టవన్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యేలు ఇక్కడి వారే కాబట్టి వారైనా ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేయకపోవడం విచారకరమన్నారు. రైతులకు అన్యాయం జరిగితే వైఎస్సార్సీపీ చూస్తూ ఉండదని, వారికి అండగా ఉంటుందని బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, జిల్లా యూత్ అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగులాపల్లి రాంబాబు, ఉపాధ్యక్షురాలు బొగ్గు శ్యామల, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు బొడ్డేడ సూర్యనారాయణ, మండల అధ్యక్షుడు దొడ్డి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
కూటమి పాలనలో సహకార రంగం నిర్వీర్యం
సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పిస్తున్న సీపీఎం నాయకులు అనకాపల్లి టౌన్: సహకార రంగాన్ని నిర్వీర్యం చేయడమే రాష్ట్ర ప్రభుత్యం ధ్యేయంగా కనిపిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదన్నారు. మూడు నెలలుగా గోవాడ సుగర్ ఫ్యాక్టరీ రైతుల బకాయిలు, రైతులకు చెల్లించాల్సిన చెరకు బకాయిలు సుమారు రూ.35 కోట్లు ఉందన్నారు. ఎన్నికలకు ముందు పార్లమెంట్ సభ్యుడు సి.ఎం రమేష్ రూ.100 కోట్లు నిధులను తీసుకొచ్చి జిల్లాలో సుగర్ ఫ్యాక్టరీలను ఆధునీకరిస్తానని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో 14 సహకార చక్కెర కర్మాగారాలు ఉండేవని, వాటిలో చాలా వరకు సీఎంగా ఉన్న చంద్రబాబు అమ్మేసారని తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు లోకనాథం మాట్లాడుతూ బడ్జెట్లో సహకార రంగానికి నిధులు కేటాయించలేదని విమర్శించారు. రైతులకు సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో చెరకు విస్తీర్ణత శాతం తగ్గిపోయిందని, దీంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మెగ్గు చూపుతున్నారన్నారు. ముందుగా సామాజిక విప్లవ నాయకురాలు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి వివాళులు అర్పించారు. ఈ సమావేశంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరావు, మండల కార్యదర్శి గంటా శ్రీరామ్‌లు పాల్గొన్నారు. -
గిరిజన గ్రామాల్లో దాహం దాహం
మాడుగుల: మండలంలో శంకరం పంచాయతీ గొప్పూరు, తాడివలస గిరిజన గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఖాళీ బిందెలతో మహిళలు నిరసన ప్రదర్శన చేశారు. ఆదివాసీ గిరిజన సంఘం నాన్‌షెడ్యూల్ ఏరియా, ఐదవ షెడ్యూల్ సాధన కమిటీ ఆధ్వర్యంలో తమ దాహం తీర్చాలంటూ సోమవారం మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం నాన్‌షెడ్యూల్ ఏరియా జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరటా నరసింహమూర్తి మాట్లాడుతూ.. ఇది వరకు ఈ గ్రామాలకు పైపులైన్ ఏర్పాటు చేసి తాగునీరు అందించారన్నారు. అయితే ప్రస్తుతం సక్రమంగా కొళాయిలు నుంచి తాగునీరు అందకపోవడంతో గిరి మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు వచ్చి మరమ్మతులు చేపడుతున్నా సరే రెండు రోజులు నీరు వచ్చి మళ్లీ పాడవుతున్నాయని వాపోయారు. మళ్లీ షరా మామూలే అయిపోతుందన్నారు. సంబంధిత అధికారులు స్పందించి రెండు గ్రామాలకు తాగునీటి సమస్యలు పరిష్కరించాలని గిరిజన మహిళల తరుపున ఆదివాసీ గిరిజన సంఘం కోరింది. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మహిళా కార్యకర్తలు గిన్నెపల్లి సన్యాసమ్మ, సోలం మంగ, సోలం వరలక్ష్మి, రాములు తదితరులు పాల్గొన్నారు. ఖాళీ బిందెలతో మోకాళ్లపై నిరసన -
నీ వెంటే.. నేనూ !
● భర్తకు పెద్దకర్మ చేస్తూ భార్య మృతి ● రామానాయుడుపాలెంలో విషాదంయలమంచిలి రూరల్: నీలో నేను సగమంటూ భార్యాభర్తలు భావిస్తుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత ఎక్కువైనప్పుడు, ఇద్దరిలో ఏ ఒక్కరు దూరమైనా, మిగిలిన వారు తీవ్ర వేదనకు గురవుతారు. నీవులేని బతుకు నాకెందుకంటూ కుమిలిపోతుంటారు. చనిపోయిన భర్తకు పెద్దకర్మ నిర్వహిస్తుండగానే, అతని భార్య నీ వెంటే నేనంటూ తుది శ్వాస విడిచింది. మున్సిపాలిటీ పరిధి రామానాయుడుపాలెంలో తీవ్ర విషాదం నింపిన ఈ సంఘటన వివరాలు.. ఈ నెల 1న రామానాయుడుపాలెం గ్రామానికి చెందిన రావి తాతారావునాయుడు (60) అనారోగ్యంతో చనిపోయారు. సోమవారం కుటుంబసభ్యులు, బంధువులు పెద్దకర్మ నిర్వహిస్తుండగా ఊహించని షాక్ తగిలింది. తాతారావునాయుడు చిత్రపటానికి భార్య నాగమణి (50) పుష్పాలు వేసి పూజ చేసి నివాళులర్పిస్తూ, అందరూ చూస్తుండగానే గుండెపోటుతో కుర్చీలో కూలబడిపోయింది. బంధువులు, కుటుంబ సభ్యులు కంగారుగా వెళ్లి చూసేసరికి నాగమణి ప్రాణాలు విడిచింది. వివాహమైనప్పటి నుంచి ఈ దంపతులిద్దరూ ఎంతో అన్యోన్యంగా, ఆదర్శంగా ఉండేవారని బంధువులు స్థానికులు చెప్పారు. సోమవారం సాయంత్రమే ఆమెకు పెద్ద కుమార్తె లీలావతి అంత్యక్రియలు నిర్వహించారు. -
కనుల పండువగా వెంకన్న కల్యాణోత్సవాలు
ఉభయ దేవేరులతో కల్యాణ కాంతులీనుతున్న ఉపమాక వెంకన్నకనుల పండువగా ఎదురు సన్నాహ మహోత్సవంభక్తులే పెళ్లి పెద్దలయ్యారు. శ్రీవారికి, దేవేరులకు నేత్రపర్వంగా కల్యాణోత్సవాలు జరిపిస్తున్నారు. అర్చక స్వాముల ఇంట స్వామివారిని, ఉభయనాంచారులను ఎదురెదురుగా ఉంచి భక్తులు జరిపిన పెళ్లిమాటలు, కట్నకానుకల కార్యక్రమం (కన్యావరుణ సంవాదం) ఆద్యంతం ముగ్ధులను చేసింది. నక్కపల్లి: ఉపమాక క్షేత్రంలో కలియుగ వైకుంఠనాథుని తిరుకల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు గరుడాద్రి పర్వతంపై కల్కి అవతారంలో వెలసిన మూలవిరాట్‌కు పంచామృతాలతో అభిషేకం, తొలిపూజ నిర్వహించారు. స్వర్ణాభరణాలతో అలంకరించిన శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామిని పెద్దపల్లకిలో వేంచేయింపజేసి ఉపమాక మాడ వీధుల్లో తిరువీధి సేవ నిర్వహించారు. అనంతరం ఆలయంలో ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్, అర్చక స్వాములు సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, శేషాచార్యులు వేదమంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. ధ్వజపటాన్ని ఎగురవేస్తూ అష్టదిక్పాలకులు, దేవతలను స్వామివారి కల్యాణానికి ఆ హ్వానించడం జరిగిందని, ధ్వజారోహణతో కల్యాణోత్సవాలు లాంఛనంగా ప్రారంభమయినట్లేనని అర్చక స్వాములు తెలిపారు. విశాఖ నుంచి తెచ్చి న ఆభరణాలను స్వామివారి ఉత్సవమూర్తులకు అలంకరించి ధ్వజస్తంభం ఎదురుగా ఉన్న అద్దాల మండపంలో ఉంచి భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం 9 గంటలనుంచి భక్తుల రాక ఒక్కసారిగా పెరిగిపోవడంతో కిలోమీటరు దూరం క్యూలైన్లలో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. నేత్రపర్వంగా ఎదురు సన్నాహమహోత్సవం కల్యాణ తంతులో భాగంగా సోమవారం రాత్రి ఎదురు సన్నాహ మహోత్సవం జరిగింది. దీనినే కన్యావాద సంవాదం (పెళ్లిమాటల తంతు) అంటారు. వేంకటేశ్వరస్వామిని ఇత్తడి గరుడ వాహనంపైన, ఉభయదేవేరులను ఇత్తడి సప్పరం వాహనంపై ఉంచి చిన్నవీధి, పెద్ద వీధులలో ఊరేగించారు. ఉపమాక సింహాద్రాచార్యులు ఇంటి వద్ద పెళ్లిమాటల తంతు నిర్వహించారు. విశ్రాంత తెలుగు పండిట్ డాక్టర్ గొట్టుముక్కల గాయత్రీదేవి స్వామివారి, అమ్మవార్ల గుణగణాలను, కీర్తిప్రతిష్టలను వివరించిన సన్నివేశం భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీవేంకటేశ్వరస్వామిరిని రథంపై ఉంచి తిరువీధుల్లో రథోత్సవం నిర్వహించారు. హోం మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ విజయ కృష్ణన్, డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ తుహిన్ సిన్హా స్వామిని దర్శించుకున్నారు. వడ్డాదిలో పోటెత్తిన భక్తులు బుచ్చెయ్యపేట: వడ్డాది వేంకటేశ్వరస్వామి 152వ కల్యాణ మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల కల్యాణ వేడుకల్లో భాగంగా ఏకదశి తొలిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు, తిరువీధి ఉత్సవం నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ఆలయం ముందు భక్తులు బారులు తీరారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త దొండా కన్నబాబు కుటుంబ సభ్యులకు తొలి దర్శనం కల్పించి ప్రత్యేక పూజలు చేయించి స్వామివారి ప్రసాదాలు అందించారు. భక్తుల గోవింద నామస్మరణతో గిరిజాంబ కొండ మార్మోగింది. కోటాటాలు, చిడతల భజనల మధ్య సాయంత్రం స్వామివారికి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. స్వామి పల్లకిని మోయడానికి పలువురు భక్తులు పోటీపడ్డారు. రాత్రికి గిరిజాంబ కొండపైన ఆలయ కల్యాణ మండపంలో స్వామి వారి కల్యాణాన్ని వేలాదిమంది భక్తుల సమక్షంలో వేడుకగా నిర్వహించారు. దేవస్ధానం ఈవో శర్మ దగ్గరుండి పూజా కార్యక్రమాలు చేయించి ప్రసాదాలు అందించారు. రాత్రికి ఆలయం వద్ద వడ్డాది నాలుగు రోడ్ల జంక్షన్లో వర్తక సంఘం ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల్ని అలరించాయి. -
కారు ఢీకొని వ్యక్తి మృతి
మాడుగుల రూరల్ : తాటిపర్తి శివారు గరికబంద గ్రామ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాడేరు గ్రామానికి చెందిన వేమగిరి రమేష్(47) మృతి చెందారు. ఎస్ఐ జి. నారాయణరావు సోమవారం విలేకరులకు తెలిపిన వివరాలివి. పాడేరు గ్రామానికి చెందిన వేమగిరి రమేష్ తన ద్విచక్రవాహనంపై మాడుగుల నుంచి పాడేరు వెవెళ్తుండగా, తాటిపర్తి శివారు గరికబంద సమీపంలో పాడేరు నుంచి మాడుగుల వైపు వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. దీంతో రమేష్ తలకు బలమైన గాయాలు తగిలాయి. వెంటనే రమేష్‌ను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పుత్రికి తీసుకెళ్లగా, అప్పటికే రమేష్ చనిపోయాడు. ఘటనపై రమేష్ సోదరుడు వేమగిరి వెంకట సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
అర్జీదారులతో సందడిగా కలెక్టరేట్
తుమ్మపాల : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా కలెక్టరేట్లో నెల రోజుల పాటు నిలిపివేసిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం సోమవారం పునఃప్రారంభమైంది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులతో కలెక్టరేట్ పరిసరాలు నిండిపోయాయి. అర్జీల వివరాలు ఆన్లైన్ చేసేందుకు పది శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టెంట్ వద్ద సచివాలయ ఉద్యోగులు నిరక్ష్యరాసులు, వృద్ధులు, వికలాంగుల సమస్యలు తెలుసుకుని అర్జీలు తయారు చేశారు. సమస్యల ఆధారంగా అర్జీలపై నమోదు చేసిన రిఫరెన్స్‌తో ఆన్లైన్ చేసి మొదటి అంతస్తు పీజీఆర్ఎస్ వేదికపైకి పంపించడంతో కలెక్టర్, డీఆర్వో, ఇతర జిల్లా అధికారులు అర్జీదారుల సమస్యలు తెలుసుకుని అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పెండింగ్ అర్జీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అర్జీలకు పరిష్కారం చూపడమే కాకుండా, పరిష్కారం కాని దరఖాస్తులకు వివరంగా సమాధానం ఇవ్వాలని సూచించారు. సోమవారం మొత్తం 440 అర్జీలు నమోదవ్వగా అందులో అత్యధికం భూ సమస్యలపైనే కావడం గమనార్హం. దివ్యాంగులు, వృద్ధులు ఆరు బయటే... భౌతికంగా తమను చూసి జాలితోనైనా సమస్య పరిష్కారానికి కలెక్టర్ కృషి చేస్తారనే గంపెడు ఆశతో జిల్లా సరిహద్దుల నుంచి సైతం వృద్ధులు, వికలాంగులు కలెక్టరేట్‌కు చేరుకుంటే వారిని సిబ్బంది ఆరుబయటే నిలిపివేశారు. దీంతో నేరుగా కలెక్టర్‌ను కలిసి తమ గోడు చెప్పుకునే అవకాశం లేక వెనుతిరుగుతున్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వీల్ చైర్లు, లిఫ్ట్ ద్వారా తామే స్వయంగా కలెక్టర్‌ను కలవగలమని, కానీ అందుకు అవకాశం ఇవ్వలేదని ఆవేదన చెందారు. భూ సమస్యపై పాయకరావుపేట మండల నుంచి కుటుంబసభ్యుల సహాయంతో వచ్చిన 95 ఏళ్ల వృద్ధురాలికి కలెక్టర్‌ను కలిసే అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆమె అర్జీని ఇతరులతో పీజీఆర్ఎస్లో నమోదు చేయించి జిల్లా అఽధికారులకు పంపించారు. వివాదంలో ఉన్న భూమి ఆన్‌లైన్‌పై ఫిర్యాదు కోర్టు వివాదంలో ఉన్న భూమిని ఆన్లైన్న్ చేసి, భూ ఆక్రమణకు ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పాయకరావుపేట మండలం పడాలవాని లక్ష్మీపురం గ్రామానికి చెందిన పదిలం సీతయ్యమ్మ (95 ఏళ్ల వృద్ధురాలు)తో ఆమె కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో సర్వే నెం.155, 158, 153, 164, 162లో పలు సబ్ డివిజన్లలో తన భర్త వాటాకు గల వ్యవసాయ భూములు తన పేరున పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నప్పటికీ తప్పుడు పత్రాలతో కుటుంబ సభ్యులు కోర్టుకు వెళ్లడంతో ప్రసుత్తం సదరు అంశం కోర్టు పరిధిలో ఉంది. భూమిని ఇరువురికి కూడా ఆన్లైన్ చేయవద్దంటూ డిస్ప్యూట్ రిజిస్టర్లో కూడా నమోదు చేయడం జరిగిందని, కానీ రీ సర్వేలో వీఆర్వోతో పాటు సర్వేయర్, రెవెన్యూ అధికారులు సదరు భూములను తన కుటుంబ సభ్యుల పేరి ఆన్లైన్ చేయడంతో వారు భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని, వారి నుంచి తనకు ప్రాణహాని కూడా ఉందని వృద్ధురాలు తెలిపారు. కలెక్టర్, జిల్లా అధికారులు తక్షణమే విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలని కోరారు. అయితే కలెక్టర్‌ను స్వయంగా కలిసి తన బాధ చెప్పుకునే అవకాశం లేకపోవడంపై ఆమె నిరాశ వ్యక్తం చేసింది. ఇంటి పట్టా కోసం మూడేళ్లుగా ఎదురు చూపులు ప్రభుత్వ భూమిలో ఉన్న ఇంటికి క్రమబద్దీకరణ పత్రం అందిస్తామని చెప్పి జీవో నెం.225 ద్వారా రూ.2.17 లక్షలు కట్టించుకుని నేటికీ పట్టా ఇవ్వడం లేదని అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన కోరుకొండ పెదసాధు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. పైకప్పు రేకులుగా ఉన్న ఇంటికి శాశ్వత హక్కు పత్రం వస్తుందనే ఆశతో మూడేళ్లుగా ఎదురుచూస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, కూలి పనులు చేసుకునరి దాచుకున్న సొమ్మంతా సచివాలయంలో కడితే బిల్లు ఇచ్చి సరిపెట్టేసారని, కలెక్టరమ్మ చొరవ చూపి తనకు న్యాయం చేయాలని కోరారు. బ్యాటరీ ట్రైసైకిల్ మంజూరు చేయరూ... వికలాంగుడినైన తన జీవనోపాధి కోసం బ్యాటరీ ట్రై సైకిల్ మంజూరు చేయాలని చీడికాడ మండలం తిరువోలు గ్రామానికి చెందిన కంచి రాము అర్జీ చేసుకున్నాడు. నిరుపేద అయిన తాను 40 ఏళ్ల నుంచి గ్రామంలో చిన్న కిల్లీబడ్డి పెట్టుకుని జీవిస్తున్నానని, ఈ నెల 9న విద్యుత్ షార్ట్ సర్క్యుట్‌తో కిల్లీబడ్డితో పాటు తన బండి కూడా కాలిపోయిందని, సరుకులు తెచ్చుకుని అమ్ముకుని జీవనోపాధి పొందెందుకు బ్యాటరీ బండి మంజూరు చేయాలని కోరారు. పూర్వ తహసీల్దార్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు యలమంచిలి రూరల్ : యలమంచిలి పూర్వ తహసీల్దార్ ఎస్.రాణి అమ్మాజీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రేగుపాలెం మాజీ సర్పంచ్ కొల్లి సత్యనారాయణ జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, అనకాపల్లి ఆర్డీవో ఆయీషాలకు సోమవారం ఫిర్యాదు చేశారు. యలమంచిలి మండలం రేగుపాలెం గ్రామ పరిధి సర్వే నంబర్లు 167/1,167/3లో 2.91 ఎకరాల ప్రభుత్వ భూమిని యలమంచిలి పూర్వపు తహసీల్దార్ రాణి అమ్మాజీ ఉద్దేశపూర్వకంగా ఒక రియల్టర్ పేర జిరాయితీగా రికార్డులను మార్పు చేసి ఆ భూమి అమ్మకం జరిగేలా చేసి ప్రభుత్వానికి నష్టం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇటీవల ఆ భూమిని కొనుగోలు చేసిన ఒక సిమెంటు పరిశ్రమ యాజమాన్యం పక్కనే ఉన్న ఎర్రచెరువుతో పాటు పక్కనే ఉన్న శ్మశానవాటిక స్థలాన్ని కూడా ఆక్రమించి గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా భారీ ప్రహరీ గోడ నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోలేదని ఫిర్యాదులో తెలిపారు. తప్పు జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా ఈ అక్రమ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో అర్థంకావడం లేదని మాజీ సర్పంచ్ సందేహం వ్యక్తపరిచారు. దీనికి సంబంధించి ఇటీవల సాక్షి దినపత్రికలో ప్రచురితమైన వార్తల క్లిప్పింగులను కూడా ఫిర్యాదుదారు తన ఫిర్యాదుతో జతపరిచారు. నెల తరువాత మొదలైన పీజీఆర్ఎస్ అర్జీలు భూ సమస్యలపైనే అధికం ఆరు బయటే దివ్యాంగులు, వృద్ధులు -
‘ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటే సరిపోదు’
చోడవరం: రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటే సరిపోదని, రాష్ట్రంలోని రైతుల సమస్యలు కూడా పట్టించుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రైతులు మన రాష్ట్రానికి సంబంధించిన వారు కాదా? అని బొత్స నిలదీశారు. ఈ రోజు(సోమవారం) చోడవరంలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీని బొత్స సందర్శించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతుల కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేస్తాం. శాసనమండలలో రైతుల సమస్యలను లేవనెత్తుతాం. రైతుల బకాయిలను ఆణా పైసాతో సహా చెల్లించాలి. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ పరిధిలో లక్ష 70 వేల టన్నుల చెరకు పండింది. ఇప్పటి వరకు కనీసం 70 టన్నుల చెరకు కూడా క్రస్సింగ్ చేయలేదు. షుగర్ ఫ్యాక్టరీ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు రైతులకు బకాయిలు చెల్లించలేదు. ప్రతి ఏడాది నవంబర్ డిసెంబర్ నెలలో క్రసింగ్ జరిగేది. కానీ ఇప్పుడు సంక్రాంతి దాటిన క్రసింగ్ జరగ లేదు. జనవరిలో క్రాసింగ్ జరగడం వలన చెరుకు ఎండిపోతుంది. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులను వైఎస్ జగన్ రూ. 90 కోట్లతో ఆదుకున్నారు.షుగర్ ఫ్యాక్టరీ కష్టాల నుంచి తక్షణం గట్టెక్కాలంటే 35 కోట్లు అవసరం. ప్రభుత్వం వెంటనే రూ. 35 కోట్లు విడుదల చేయాలి. ఉద్యోగులకు జీతాలు వెంటనే చెల్లించాలి. టన్ను చెరుకుకు రూ. 2500 ఇస్తే ఏమి సరిపోతుంది?, రైతులు మన రాష్ట్ర ప్రజలు కాదా?, దివంగత నేత వైఎస్ హయాంలో షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నతమైన దశలో ఉన్నాయి. ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కాదు రైతులను ఆదుకోవాలి. రాజకీయాలు కోసం నేను రాలేదు.. రైతుల బాధలు చూసి మాట్లాడుతున్నాను.’ అని బొత్స స్పష్టం చేశారు. -
పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు
చెరకు రైతులకు అండగా వైఎస్సార్సీపీ దేవరాపల్లి: గోవాడ సుగర్ ఫ్యాక్టరీ చెరకు రైతులకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని మాజీ డిప్యూటీ సీఎం, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు అన్నారు. ఆదివారం తారువలో ఆయన మాట్లాడుతూ గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో చెరకు రైతులతో సోమవారం నిర్వహించే ముఖాముఖి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ హాజరై చెరకు రైతులు, కార్మికుల సమస్యలు, కష్టనష్టాలను అడిగి తెలుసుకుంటారన్నారు. వీటిపై శాసన మండలిలో ప్రస్తావించడంతోపాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. ముఖాముఖి కార్యక్రమానికి ఫ్యాక్టరీ చెరకు రైతులు, పార్టీ నాయకులు తరలిరావాలని కోరారు. -
దినదిన గండం ‘గోవాడ’ భవితవ్యం
● ఆర్థిక ఇబ్బందులతో సుగర్ ఫ్యాక్టరీ సతమతం ● నిధులు తెస్తామని కనిపించకుండా పోయిన ఎంపీ, ఎమ్మెల్యే ● ఫ్యాక్టరీ మనుగడపై ఆందోళన చెందుతున్న చెరకు రైతులు, కార్మికులు ● నేడు వైఎస్సార్సీపీ, సీపీఎం ఆధ్వర్యంలో రైతులతో ఆందోళన ● నేడు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గోవాడ రాకనేడు చెరకు రైతులతో ఆందోళన ఫ్యాక్టరీని, చెరకు రైతులను ఆదుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ, సీపీఎం ఆధ్వర్యంలో వేర్వేరుగా ఈనెల 10వ తేదీన చెరకు రైతులతో కలిసి ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యాయి. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ వద్ద సోమవారం ఉదయం 10గంటలకు సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించే ఆందోళనకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు వస్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 3గంటలకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో చెరకు రైతులతో ఆందోళన చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఆందోళనలో ఆ పార్టీ నుంచి శానసమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పాల్గొననున్నారు. ఆయనతోపాటు మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి, స్థానిక సమన్వయకర్త గుడివాడ అమర్నాఽథ్, మాజీ ప్రభుత్వ విప్, అనకాపల్లి పార్లమెంటు పరిశీలకుడు కరణం ధర్మశ్రీ పాల్గొని రైతుల తరపున మద్దతుగా ఉద్యమించేందుకు సిద్ధమయ్యారు. చోడవరం: రైతులకు చెరకు పేమెంట్స్ ఇవ్వలేక, కార్మికులకు జీతభత్యాలు చెల్లించలేక, పాత బకాయిలు చెల్లించలేక, క్రషింగ్‌కు కావలసిన సామగ్రికి అవసరమైన ఆర్థిక స్థోమత లేక గోవాడ సుగర్ ఫ్యాక్టరీ చాలా దయనీయ స్థితిలో ఉంది. 23,450 మంది సభ్య రైతులు ఉన్న ఈ ఫ్యాక్టరీ నేడో రేపో మూసివేసే దుస్థితికి రావడం రైతులను, కార్మికులను ఆందోళనకు గురిచేస్తోంది. 2019 సంవత్సరానికి ముందు గత టీడీపీ ప్రభుత్వం హాయాంలో ఫ్యాక్టరీ పాలకమండలిలో ఉన్న టీడీపీ పాలకవర్గం సుమారు రూ. 150 కోట్లు అప్పుల ఊబిలోకి నెట్టింది. అప్పట్లో అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ఫ్యాక్టరీకి ఆర్థికసాయం అందించలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఫ్యాక్టరీని ఆధుకుంది. ప్రభుత్వ విప్ హోదాలో అప్పటి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఉప ముఖ్యమంత్రిగా బూడి ముత్యాలనాయుడు, పరిశ్రమల శాఖామంత్రిగా గుడివాడ అమర్నాఽథ్ ఈ ఫ్యాక్టరీని కాపాడడానికి ఎంతో కృషి చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కూడా సానుకూలంగా స్పందించి ఐదేళ్లలో రూ.89 కోట్లు ఆర్థిక సాయం అందించారు. దీంతో ఫ్యాక్టరీ నెమ్మదిగా అప్పుల ఊబిలోంచి కొంతమేర బయటపడింది. అయితే 2024లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం గడిచిన పది నెలల్లో ఒక్క రూపాయి కూడా ఫ్యాక్టరీకి సాయం ఇవ్వలేదు. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యాక్టరీని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు ఉప ఉత్పత్తుల యూనిట్లు నెలకొల్పి ఫ్యాక్టరీని పూర్తిగా అభివృద్ధి చేసి చెరకు టన్నుకి రూ. 4వేలు గిట్టుబాటు ధర కల్పిస్తామని కూటమి నేతలు ఎంపీ రమేష్, ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు, బండారు సత్యనారాయణమూర్తి చెప్పారు. ఈ ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమైపోయాయి. ఎప్పుడో 1962లో 1000 టన్నుల కెపాసిటీతో స్థాపించిన ఈ ఫ్యాక్టరీ దశలవారీగా కెపాసిటీ స్థాయి పెంచుకుంటూ ప్రస్తుతం 5.2 లక్షల టన్నుల క్రషింగ్ కెపాసిటీకి వచ్చింది. కానీ మిషనరీ అంతా 30, 40 యేళ్ల నాటిదే కావడంతో పాత మిషనరీతో తరుచూ క్రషింగ్‌లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అత్యవసరంలో రూ. 9 కోట్లు ప్రభుత్వం సాయంగా అందిస్తే తప్పా తాత్కాలికంగా ఫ్యాక్టరీ ఆర్థిక ఇబ్బంది నుంచి గట్టెక్కలేని పరిస్థితి ఉంది. రాష్ట్ర సహకార రంగంలో 11 ఫ్యాక్టరీల్లో అన్నీ ఇప్పటికే మూతబడి పోగా ఒక్క గోవాడ ఫ్యాక్టరీలో నడుస్తోంది. గత వైఎస్సార్సీపీ పాలనలో 4 ఫ్యాక్టరీలకు సుమారు రూ. 200 కోట్లు వరకూ ఆర్థికసాయం అందించి, కార్మికులు, రైతుల పాతబకాయిలన్నీ చెల్లించారు. కూటమి ప్రభుత్వం ఈ ఒక్క ఫ్యాక్టరీని ఆదుకోవడానికి ఎందుకు స్పందించడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు ఇచ్చిన మాటలు ఏమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీగోవాడ సుగర్ ఫ్యాక్టరీ మనుగడ దినదినగండంలా ఉంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతున్న ఫ్యాక్టరీకి ఈ ఏడాది క్రషింగ్ సీజన్లో ఎదురవుతున్న సమస్యలు మరింతగా కుంగదీస్తున్నాయి. మరో పక్క ఫ్యాక్టరీని, చెరకు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, నాయకులు చేతులెత్తేయడంతో ఇప్పుడు ఫ్యాక్టరీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. -
వీహెచ్‌పీ జిల్లా ఉపాధ్యక్షుడిగా రామకొండలరావు
మాడుగుల రూరల్: విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడిగా, మాడుగుల ప్రఖండ్ బాధ్యులు రాపేట రామకొండలరావు మాస్టరును నియమించారు. ఈ నెల 8,9, తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో గల వీరంపాలెం గ్రామంలో గల బాల త్రిపుర సుందరీ సహిత, పరమేశ్వర ఆలయంలో జరిగిన విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర ప్రాంత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలో 19 జిల్లాలకు చెందిన విశ్వహిందూ పరిషత్ బాధ్యులు హాజరయ్యారు. దీనికి కేంద్ర కమిటీ బాధ్యులు కోటేశ్వరశర్మ, ఉత్తరాంధ్ర ప్రాంత అధ్యక్షుడు వెంకటేశ్వరావు, ప్రాంత కార్యదర్శి సుబ్బరాజు, ఉత్తరాంధ్ర జిల్లాల కమిటీ సభ్యులతో జరిగిన సమావేశంలో జిల్లా వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడిగా రామకొండలరావును నియమించారు. రామకొండలరావు గతంలో మాడుగుల మండల వీహెచ్‌పీ అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పట్లో అయోధ్య నుంచి తీసుకొచ్చిన శ్రీరాముని అక్షింతలను ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ, సమరతాసేవా ఫౌండేషన్ సభ్యుల సహకారంతో గ్రామాల్లో పంపిణీ చేశారు. మండలంలో 56 గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేశారు. -
కార్మికుల భద్రతతోనే స్వర్ణాంధ్ర సాకారం
● రాష్ట్ర కార్మిక, కర్మాగార బాయిలర్, వైద్య బీమా సర్వీసుల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ● జాతీయ భద్రతా వారోత్సవాల ప్రారంభం అనకాపల్లి: జాతీయ భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని కార్మికులతో పాటు సామాన్య ప్రజలకు భద్రత పట్ల అవగాహన కల్పించాలని రాష్ట్ర కార్మిక, కర్మాగార బాయిలర్, వైద్య బీమా సర్వీసుల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. 54వ జాతీయ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని స్థానిక ఎన్టీఆర్ క్రీడామైదానంలో కలెక్టర్ విజయకృష్ణన్, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌లతో కలసి ఆయన ఆదివారం జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కార్మికుల భద్రంగా ఉంటేనే రాష్ట్రం భద్రంగా ఉంటుందని, కార్మికుల భద్రతతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ కల సాకారం అవుతుందన్నారు. కార్మికుల భద్రతకు ప్రభుత్వమే కాకుండా యాజమాన్యం కూడా బాధ్యత వహించి వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని అన్నారు. జిల్లాలో 884 పరిశ్రమలు ఉన్నాయని, వాటిలో 205 ప్రమాదకరమైన కార్యకలాపాలు నిర్వహించే పరిశ్రమలు ఉన్నాయని, ఈ పరిశ్రమలన్నింటిలో సుమారుగా లక్షా 28వేల మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్మికులతో పాటు విద్యార్థులందరికీ భద్రత పట్ల అవగాహన కల్పించాలని కోరారు. సేఫ్టీ అండ్ వెల్బీయింగ్ కృషియల్ ఫర్ వికసిత్ భారత్–2047 అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యల గురించి సలహాలు ఇవ్వడానికి వసుధ మిశ్రా నేతృత్వంలో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఎస్పీ తుహిన్‌సిన్హా మాట్లాడుతూ పరిశ్రమలలో ప్రమాదాలపై కార్మికులకు మాక్ డ్రిల్ నిర్వహించి భద్రతపై శిక్షణ ఇవ్వాలన్నారు. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ మాట్లాడుతూ యాజమాన్యం, కార్మికుల సంయుక్త కృషితో జీరో యాక్సిడెంట్ లక్ష్యంగా కృషి చేయాలన్నారు. ప్రతి కార్మికునికి బీమా సహాయం అందాలంటే ఆయా పథకాలలో నమోదు కావాలని ఆయన కోరారు. అనంతరం ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్మికశాఖ డైరెక్టర్ చంద్రశేఖర్మూర్తి, కర్మాగార సంయుక్త ముఖ్య తనిఖీ అధికారి జె.శివశంకర్‌రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్ర జీఎం నాగరాజారావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ముకుందరావు, ఎన్డిఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, ఫైర్ సర్వీసస్, హెచ్‌పీసీఎల్, ఎన్టీపీసీ, హెటిరో ఫార్మా కంపెనీ యాజమాన్యం, పట్టణ సీఐ టి.వి.విజయ్‌కుమార్, ట్రాఫిక్ సీఐ ఎం.వెంకటనారాయణ పాల్గొన్నారు. -
నేడే ఉపమాక వెంకన్న కల్యాణం
● ఘనంగా అంకురార్పణ ● మాడవీధుల్లో పెళ్లి కావిడి ఊరేగింపు ● స్వర్ణాభరణాలతో దర్శనమిస్తున్న స్వామివారు ● విద్యుద్దీపకాంతులతో మెరుస్తున్న ఆలయం నక్కపల్లి: ఉత్తరాంధ్ర ప్రాచీన పుణ్యక్షేత్రం ఉపమాక గరుడాద్రి పర్వతంపై వెంకన్న వార్షిక తిరుకల్యాణోత్సవాలకు ఆదివారం సాయంత్రం అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పరిషత్, కంకణ ధారణ అంతరాలయ దేవతాపూజ, మత్స్యంగ్రహణ నిర్వహించారు. నిత్య సేవాకాలంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ గోష్టి ప్రసాద వినియోగం జరిపారు. అంకురార్పణ పూజా కార్యక్రమాల్లో భాగంగా హంసవాహనంపై తిరువీధి సేవ నిర్వహించారు. స్వామివారి కల్యాణ మండపంలో ఉభయదేవేరులను ఉంచి సుదర్శన పెరుమాళ్లను పల్లకిలో ఉంచి పుట్టమన్ను తెచ్చేందుకు తీసుకెళ్లారు. దీన్నే అంకురార్పణ అంటారు. అనంతరం వాస్తు మండప పూజ, యోగీశ్వరపూజ, అగ్నిప్రతిష్టాపన, జయాది హోమాలు జరిగాయి. గరుడ ప్రాణప్రతిష్ట విశేషహోమాలు, నీరాజన మంత్ర పుష్ప కార్యక్రమం నిర్వహించి గరుడప్పాలు నివేదన చేశారు. అష్టదిక్పాలకులకు ఆవాహన కార్యక్రమాలు నిర్వహించి, స్వామివారి పెళ్లికావిడిని ఉపమాక మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి పసుపు కుంకుమలు, కొబ్బరిబొండాలు కానుకలుగా సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమాలతో స్వామివారి కల్యాణోత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యా యని ఆలయప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్ తెలిపారు. పెళ్లికావిడి ఊరేగింపులో అర్చకులు కృష్ణమాచార్యులు, గోపాలాచార్యులు, శేషాచార్యులు, రాజగోపాలాచార్యులు, సాయి ఆచార్యులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. నేడే స్వామివారి కల్యాణం స్వామివారి కల్యాణం సోమవారం అర్ధరాత్రి అంగరంగ వైభవంగా జరగనుంది. అదేరోజు సాయంత్రం కన్యావాద సంవాదం (ఉపమాక సింహద్రాచార్యులు ఇంటి వద్ద స్వామివారి అమ్మవార్ల పెండ్లిమాటలు, గుణగణాలను వివరించే తంతును నిర్వహిస్తారు) తరిగొండ వేంగమాంబ సాహితీ పీఠం వ్యవస్థాపకురాలు, వేద పండితురాలు డాక్టర్ గొట్టుముక్కల గాయత్రీదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించి కన్నుల పండువగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం రథోత్సవం జరుగుతుంది. తదుపరి స్వామివారి కల్యాణం నిర్వహించేందుకు దేవస్థానం వారు ఏర్పాట్లు చేశారు. 12వ తేదీ పండిత సభ, 13వ తేదీన స్వామివారికి గజవాహనంపై తిరువీధి సేవ,14న పౌర్ణమినాడు రాజయ్యపేట సముద్రతీరంలో స్వామివారికి చక్రస్నానం నిర్వహిస్తారు. రాత్రికి డోలోత్సవం, అద్దపు సేవ జరుగుతుంది. 15 నుంచి 17 వరకు స్వామి వారి పుష్పయాగోత్సవాలు జరుగుతాయి. కల్యాణ తంతును నిర్వహించేందుకు తిరుచానూరు పద్మా వతి ఆలయానికి చెందిన ప్రముఖ వేదపండితులు, ఆగమశాస్త్రసలహాదారులను రప్పిస్తున్నారు. విస్తృత ఏర్పాట్లు కల్యాణోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంతోపాటు, గోపురాలు, బేడామండపం, ఆస్థాన మండపం, కల్యాణమండపాలకు రంగురంగుల విద్యుద్దీపాలను అలంకరించారు. టీటీడీ సిబ్బంది, పోలీసు సిబ్బంది సుమారు 300 మంది విధుల్లో పాల్గొంటున్నారు. భక్తుల కోసం ప్రత్యేక స్నానఘట్టాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. స్వర్ణాభరణాలతో దర్శనమివ్వనున్న స్వామివారు వజ్ర వైఢూర్యాలు, కెంపులు, పచ్చల హారం, కాసులపేర్లు, మరకత మాణిక్యాలు, బంగారంతో తయారు చేసిన శంఖు, చక్రం, హస్తాలు, వజ్రాలు పొదిగిన కిరీటాలు, హారాలు, చంద్రహారాలు, స్వర్ణ వజ్రకవచం ఇలా స్వామివారికి వెలకట్టలేనన్ని ఆభరణాలున్నాయి. వీటిని స్వామివారికి అలంకరించి ఐదురోజుల పాటు భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. -
ఘనంగా బౌద్ధ సమ్మేళనం
● బొజ్జన్నకొండ వద్ద శాంతి ర్యాలీ ● బుద్ధ భూమి మాసపత్రిక ఆవిష్కరణ అనకాపల్లి టౌన్: ప్రపంచానికి మొట్ట మొదటిసారిగా శాంతి, ధర్మం, అహింసా మార్గాలను బోధించిన మహానుభావుడు బుద్ధుడని రాష్ట్ర మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. మండలంలోని శంకరం ప్రముఖ బౌద్ద పర్యాటక క్షేత్రం బొజ్జన్నకొండ వద్ద బౌద్ధ సమ్మేళనం ఘనంగా ఆదివారం జరిగింది. జిల్లా బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు పల్లా బాబ్జీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా కొండ మెట్ల మార్గం గుండా బుద్ధుని విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బౌద్ధ సంఘాల సమాఖ్య ప్రతినిధులు, బౌద్ద ఉపాసకులు, బౌద్ద అభిమానులు, విదేశీ బౌద్ధ భిక్షువులు వెనరబుల్ పూజ్య బ్రరామో బాంతేజీ (కంబోడియా), రాజాభాంతేజీ(బర్మా)లు పాల్గొని ప్రార్థనలు నిర్వహించి ప్రపంచ శాంతి స్థాపనకు అందరూ దోహద పడాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా బుద్ధభూమి మాస పత్రికను ఆవిష్కరించారు. రాష్ట్ర బుద్దిస్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వై హరిబాబు, విశాఖ బౌద్ధ సంఘాల సమాఖ్య గౌరవఅధ్యక్షుడు డాక్టర్ మాటూరి శ్రీనివాస్, బౌద్ధ సంఘాల ప్రతినిధులు బొడ్డు కల్యాణరావు, పి.రాంబాబు, ఎన్.గంగాధర్, వి.వి.దుర్గారావు, బోర వేణు గోపాల్, బౌద్ధ సంఘాల సమాఖ్య ప్రచార కమిటీ సభ్యుడు బల్లా నాగభూషణం పాల్గొన్నారు. -
ఆయిల్ తాగేశారు!
అధికారులేనెలకు అదనంగా రూ.30 లక్షల ఆయిల్ వినియోగం అధికారులకు అధికారులే మామూళ్ల ఆఫర్ ● ఫాగింగ్ యంత్రాల ఆయిల్ బిల్లు రూ.68 లక్షలకు పెంచేశారు.. ● ప్రతి నెలా పబ్లిక్ హెల్త్, మెకానికల్ అధికారులకు లంచాలు ● డిప్యూటేషన్‌పై వచ్చిన ఓ అధికారికి పంపకాల బాధ్యత ● గత కమిషనర్ హయాంలో క్షేత్రస్థాయిలో పరిశీలన ● నెలకు అదనంగా రూ.30 లక్షలు కొట్టేస్తున్నారని స్పష్టం ● ఇప్పటికీ చర్యలు తీసుకోని వైనం తనిఖీలో తేలిందిలా.. ఫాగింగ్ యంత్రాలకు ప్రతి నెలా సుమారు రూ.30 లక్షల మేర అదనపు ఆయిల్ వినియోగం జరుగుతుండటంతో, మెకానికల్ విభాగానికి కొత్తగా వచ్చిన అధికారికి అనుమానం కలిగింది. దీంతో ఆయన ఈ విషయాన్ని గత కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన ఆదేశాల మేరకు ఫాగింగ్ యంత్రాలకు గంటకు ఎంత ఆయిల్ అవసరమవుతుందో ముగ్గురు అధికారులు విచారణ చేపట్టారు. వాస్తవానికి ఈ ఫాగింగ్ యంత్రాలకు గంటకు 40 నుంచి 45 లీటర్ల ఆయిల్ సరిపోతుందని విచారణలో తేలింది. అయితే గతంలో పనిచేసిన అధికారి మాత్రం ఏకంగా 120 లీటర్ల చొప్పున ఆయిల్ మంజూరు చేయడం గమనార్హం. ఫాగింగ్ పనులను పర్యవేక్షించే డిప్యూటేషన్ అధికారి, ప్రజారోగ్య విభాగంలోని ముఖ్య అధికారులు అడిగిన దాని ప్రకారమే గత అధికారి మంజూరు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఫాగింగ్ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యత కలిగిన ఆ డిప్యూటేషన్ అధికారి మామూళ్ల వ్యవహారాలను కూడా చూస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఆ అధికారి ప్రతి నెలా మెకానికల్, ప్రజారోగ్య శాఖ అధికారులకు క్రమం తప్పకుండా మామూళ్లు అందజేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత కమిషనర్ ఫాగింగ్ వ్యవహారాల పర్యవేక్షణాధికారికి షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఆదేశించినప్పటికీ, ఆయన బదిలీ, ఎన్నికల నియామవళి అమల్లోకి రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం ఇన్చార్జి కమిషనర్‌గా ఉన్న కలెక్టరు దృష్టికి ఈ విషయం వెళ్లకుండా కొందరు జాగ్రత్తగా కాపాడే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : సాధారణంగా ఏదైనా పనిచేసే కాంట్రాక్టర్.. అధికారులకు లంచాలు ఇవ్వడం పరిపాటి. అయితే ఘనత వహించిన జీవీఎంసీలో మాత్రం అధికారులే అధికారులకు లంచాలు ఇస్తున్నారు. తమకు ఇంత మొత్తం బిల్లు ఆయిల్ కోసం ఇస్తే.. మీకు ఇంత మొత్తం ప్రతి నెలా లంచం ముట్టచెబుతామంటూ ఆఫర్లు ఇస్తుండటం గమనార్హం. మెకానికల్ విభాగం, ప్రజారోగ్య విభాగానికి చెందిన అధికారుల మధ్య జరిగిన ఈ డీల్‌తో జీవీఎంసీకి భారీ నష్టం జరిగింది. గతంలో మెకానికల్ విభాగంలో పనిచేసిన ఓ అధికారితో పాటు జీవీఎంసీకి డిప్యూటేషన్‌పై వచ్చిన ఇద్దరు అధికారుల మధ్య లాలూచీతో వ్యవహారం సాఫీగా సాగింది. వాస్తవానికి ఫాగింగ్ యంత్రాల కోసం గతంలో రూ.38 లక్షల మేర నెలవారీగా బిల్లు ఉండగా.. దానిని ఏకంగా రూ.68 లక్షలకు పెంచేశారు. దీనిపై గత నెలలో అప్పటి కమిషనర్ ఆధ్వర్యంలో విచారణ చేయగా.. రూ.38 లక్షల మేర ఆయిల్ బిల్లు సరిపోతుందని తేలింది. తద్వారా నెలకు రూ.30 లక్షల మేర అధికంగా ఆయిల్ పేరుతో లాగేసినట్టు విచారణలో బయటపడింది. ఈ నేపథ్యంలో సదరు మెకానికల్ అధికారిపై ఈ వ్యవహారంతో పాటు ఇతర ఫిర్యాదులు రాగా బదిలీ వేటు పడింది. అయితే డిప్యూటేషన్‌పై ఉన్న మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈలోగా కమిషనర్ బదిలీతో ఈ వ్యవహారం మూలకు చేరింది. ఈ వ్యవహారంలో అడిగినంత మేర ఆయిల్ ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఇద్దరు అధికారులకు మరో అధికారి ప్రతి నెలా రూ.2 లక్షల చొప్పున మామూళ్లు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఇన్చార్జి కమిషనర్‌గా ఉన్న కలెక్టర్ ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. అడ్డగోలుగా ఆయిల్ సరఫరా జీవీఎంసీలో ఫాగింగ్ మిషన్లు పెద్దవి 8, మీడియం సైజువి 80 ఉండగా, స్ప్రింక్లర్లు 25 ఉన్నాయి. వీటికి ప్రతి నెలా గతంలో రూ.38 లక్షల మేర ఆయిల్ బిల్లు చెల్లించేవారు. అయితే డిప్యూటేషన్‌పై వచ్చిన ఇద్దరు అధికారులు, మెకానికల్ విభాగంతో కుదుర్చుకున్న మామూళ్ల ఒప్పందంలో భాగంగా ఈ బిల్లును ఏకంగా రూ.68 లక్షలకు పెంచేశారు. ఇందుకు ప్రతిఫలంగా ఆ ఇద్దరు అధికారులకు ప్రతి నెలా రూ.2 లక్షల చొప్పున ముట్టజెప్పే విధంగా ఒప్పందం కుదిరినట్టు సమాచారం. మలేరియా విభాగం వారు అడిగిన మేరకే తాము ఆయిల్ కార్డులను ఇచ్చామని మెకానికల్ విభాగంలో పనిచేసిన అధికారి చెబుతున్నట్టు సమాచారం. గతానికి భిన్నంగా ఒకేసారి రెట్టింపు స్థాయిలో ఆయిల్ వినియోగం పెరిగితే కనీసం విచారణ చేయాల్సిన మెకానికల్ విభాగం అధికారి, ఎటువంటి ప్రశ్నలు వేయకుండా ఆయిల్‌ను తీసుకునేందుకు అనుమతి ఇచ్చారు. సదరు అధికారులకు అధికార పార్టీ నేతల నుంచి మద్దతు కూడా ఉండటంతో ఎవరూ తమను ఏమీ చేయలేరనే ధీమాతో అడ్డగోలుగా ఆయిల్ పంపిణీకి తెరలేపారు. ఈ వ్యవహారంలో కొందరు అధికార పార్టీ కార్పొరేటర్లకు కూడా నెలవారీగా మామూళ్లు అందినట్టు తెలుస్తోంది. రాబోయే కాలానికి కాబోయే మేయర్‌నని చెప్పుకుంటున్న నేత వద్ద ఉండే ఇద్దరు కార్పొరేటర్లకు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. -
వడ్డాది వెంకన్న క్షేత్రానికి కల్యాణ శోభ
● నేటి నుంచి 15 వరకు కల్యాణోత్సవాలు ● ఏర్పాట్లు చేసిన దేవస్థానం అధికారులు ● లక్షలాది మంది భక్తుల రాకతో భారీ బందోబస్తు ● అంకురార్పణ దొంగపెండ్లితో ప్రారంభమైన వేడుకలు ● నేడు ఏకాదశి ప్రత్యేక పూజలు, రాత్రికి శ్రీనివాస కల్యాణం బుచ్చెయ్యపేట: ఉత్తరాంధ్రలోనే ప్రసిద్ధి చెందిన వడ్డాది వేంకటేశ్వరస్వామి క్షేత్రం కల్యాణ శోభతో కాంతులీనుతోంది. సోమవారం ఉదయం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు 152వ కల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదివారం అర్ధరాత్రి అంకురార్పణ చేసి స్వామివారి దొంగపెండ్లితో కల్యాణ వేడుకలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు సోమవారం ఏకాదశి వేంకటేశ్వరస్వామి కల్యాణం జరగ్గా, ఆఖరి రోజు శనివారం రాత్రి స్వామివారి పవళింపు సేవతో వేడుకలు ముగుస్తాయి. కోరిన కోర్కెలు తీర్చే కరుణామయుడిగా వడ్డాది వెంకన్నగా పేరొందడంతో ఏటా స్వామి వారి కల్యాణ వేడుకలను తిలకించడానికి తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. వీరి సౌకర్యార్థం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వంద మందితో ఎస్ఐ శ్రీనివాసరావు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. క్యూలైన్లు, మంచినీటి సదుపాయం, వైద్య సేవలు అందేలా ఆలయ వంశపారంపర్య ధర్మకర్త దొండా కన్నబాబు, ఈవో శర్మ, గ్రామ పెద్దలు తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాలకు, మెట్లు మార్గం, కల్యాణ వేదిక, కళావేదికలకు రంగులు వేసి, విద్యుద్దీపాలంకరణతో ముస్తాబు చేశారు. టికెట్ల కౌంటర్, ధ్వజ స్తంభం వద్ద, ఆలయంలోను, ఉత్సవ విగ్రహాలు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్వామివారు కొలువైన గిరిజాంబ కొండ నుంచి వడ్డాది నాల్గు రోడ్ల జంక్షన్ వరకు కిలోమీటర్ల పొడవున మిరుమిట్లు గొలిపే విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేశారు. కొండ కింద మెట్ల వద్ద భక్తులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయ చరిత్ర.. 150 ఏళ్ల క్రితం వడ్డాది గ్రామానికి నారాయణభజీ అనే సాధువు భిక్షాటనకు వచ్చాడు. ఇక్కడ ప్రదేశాల్ని చూసి త్వరలోనే వడ్డాది పుణ్యక్షేత్రంగా భాసిల్లుతుందని చెప్పి వెళ్లిపోయాడు. ఆయన చెప్పి వెళ్లిన కొన్ని రోజులకే వడ్డాది పక్క గ్రామమైన విజయరామరాజుపేట కాళ్లవారి పాకల వద్ద రైతులు మంచినీరు కోసం నేలబావి తవ్వుతుండగా శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి విగ్రహాలు బయట పడ్డాయి. అప్పటి గ్రామ పెద్ద దొండా భగవంతులయ్య గ్రామ పెద్దలతో కలిసి వడ్డాదికి తూర్పు దిక్కున ఉన్న ఎత్తయిన గిరిజాంబ కొండపై వీటిని ప్రతిష్టించి ఆలయం నిర్మించారు. దేవుడికి నిత్య ధూపదీప నైవేద్యాల కోసం 58 ఎకరాల భూమిని విరాళంగా అందించారు. అప్పటి నుంచి భగవంతులయ్య కుటుంబ సభ్యులు ఆలయ వంశపారంపర్య ధర్తకర్తలుగా కొనసాగుతున్నారు. ఐదు రోజులపాటు పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు కల్యాణ వేడుకల్లో భాగంగా ఈ నెల 10న వివిధ పూజలు, హామాలు, గజ, గరుడ వాహనాలపై తిరువీధి ఉత్సవం, రాత్రి 9 గంటలకు కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. 14న నాగవల్లి వసంతోత్సవం, చక్రస్నానం, 15న పుష్పాంజలి సేవ, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. వడ్డాది కొండ దిగువున, నాల్గు రోడ్ల జంక్షన్లో వర్తక సంఘం ఆధ్వర్యంలో రోజూ రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలను భక్తులు తిలకించేలా ఏర్పాటు చేశారు. ఆలయానికి ఇలా చేరుకోవాలి స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రతి అరగంటకు నర్సీపట్నం, చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ల నుంచి బస్సు సదుపాయం కలదు. విశాఖపట్నం, అనకాపల్లి, పాడేరు నుంచి వడ్డాదికి ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. -
చెరువులో పడి యువకుడి మృతి?
పరవాడ: మండలంలోని భర్నికం గ్రామానికి చెందిన బలిరెడ్డి సూర్య లక్ష్మీనారాయణ(32) చెరువులో చేపల వేటకు దిగి నీటిలో మునిగిపోయి మృతి చెందినట్లు పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు చెప్పారు. గ్రామ సమీపంలోని పెద్ద చెరువులో స్నేహితులతో కలిసి లక్ష్మీనారాయణ ఆదివారం మధ్యాహ్నం చేపల పట్టడానికి చెరువులో దిగాడు. చేపల వేట సాగిస్తూ నీటిలో మునిగిపోయి ఎంతకి రాకపోవడంతో తోటి స్నేహితులు పరవాడ పోలీసులకు, బంధువులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టినా రాత్రి వరకు మృతదేహం లభ్యం కాలేదు. సోమవారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు సీఐ మల్లికార్జునరావు చెప్పారు. గాలింపు చర్యల్లో పరవాడ ఎస్ఐ మహాలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. -
స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్‌గా సలీం బాధ్యతల స్వీకరణ
ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్ (ఆపరేషన్స్)గా డాక్టర్ జి.సలీం పురుషోత్తమన్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈ బాధ్యతలు నిర్వహించిన ఎ.కె.సక్సేనా మొయిల్‌కు ఎండీగా వెళ్లడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. మెకానికల్ ఇంజనీర్ అయిన సలీం 1988లో బొకారోలో మేనేజ్మెంట్ ట్రైనీగా తన కెరీర్‌ను ప్రారంభించారు. 1996లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో చేరారు. సర్టిఫైడ్ ఎనర్జీ మేనేజర్‌గా స్టీల్‌ప్లాంట్ ఐఎస్ఓ 50001 సర్టిఫికేషన్ పొందడంలో ఆయన గణనీయంగా దోహదపడ్డారు. 2018లో ఆయన బ్రైత్ వైట్ అండ్ కంపెనీ లిమిటెడ్‌లో డైరెక్టర్ (ప్రొడక్షన్)గా చేరారు. అక్కడ ఒక ఏడాది పాటు డైరెక్టర్ (ఫైనాన్స్)గా బాధ్యతలు నిర్వహించారు. మూడు నెలల పాటు అక్కడ సీఎండీగా వ్యవహరించారు. 2024లో మలేషియాలోని లింకన్ యూనివర్సిటీ నుంచి ఆయన డాక్టరేట్ పొందారు. -
ఇంకా చి‘క్కె’న్!
అనకాపల్లిటౌన్: బర్ట్ప్లూ సోకి కోళ్లు చనిపోతున్నాయని అపోహతో ఇంకా కొంత మంది చికెన్ తినడానికి జంకుతున్నారు. చికెన్ 80 డిగ్రీలు వేడి తో వండుకొని తింటే ఎటువంటి ప్రమాదం ఉండదని నిపుణులు అవగాహన కల్పిస్తున్నా ప్రజలు భయపడుతున్నారు. మటన్, చేపలు ధరలు అధికంగా ఉన్నా వాటి వైపే అధిక శాతం ప్రజలు మెగ్గుచూపుతున్నారు. చికెన్ ధరలు వాస్తవంగా శనివారం కంటే ఆదివారం ఎక్కువగా ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా భారీగా ధర తగ్గినా చికెన్ విక్రయాలు అంతతమాత్రంగానే ఉన్నాయి. జిల్లాలో శనివారం కేజి విత్ స్కిన్ 180 ఉండగా ఆదివారం 160, స్కిన్ లెస్ 190 నుంచి 170 రూపాయలకు తగ్గింది. మార్కెట్లో సేల్స్ పెంచుకోవడానికి కొందరు ఇంకో పదిరూపాయిలు తగ్గించి 160 రూపాయలకు అమ్మకాలు చేపట్టారు. అయినా అమ్మకాలు అంతంతమాత్రంగానే జరిగాయి. అవగాహన సదస్సులు, చికెన్ మేళాలు నిర్వహిస్తున్నా చికెన్ కొనడానికి వెనకడుగు వేస్తుండడం గమనార్హం. -
గురుకులం పిలుస్తోంది..
● ఐదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ● ఈ నెల 13 వరకు గడువు యలమంచిలి రూరల్: పేద విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో విద్యనందించే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలకు, కళాశాలల్లో 2025–26 సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 7 గురుకులాల్లో రానున్న విద్యాసంవత్సరానికి సంబంధించి ఆంగ్ల మాధ్యమంలో ఐదో తరగతి,ఇంటర్ మొదటి సంవత్సరాల్లో చేరడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.5 బాలికలు,2 బాలురు పాఠశాలలు, కళాశాలల్లో ఐదో తరగతిలో 560, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 560 సీట్లు భర్తీ చేయనున్నారు.జిల్లాలో నక్కపల్లి, కొక్కిరాపల్లి, తాళ్లపాలెం,నర్సీపట్నం, కోనాంలలో బాలుకలు,దేవరాపల్లి మండలం తెనుగుపూడి, గొలుగొండల్లో బాలురకు గురుకులాలు ఉన్నాయి. ప్రవేశాల కోసం ఈ నెల 13వ తేదీ వరకు గడువు ఉంది. ఆసక్తి గల విద్యార్థులు తమ దరఖాస్తులను గడువులోగా ఆన్లైన్లో పంపించాలి. ఈ గురుకులాల్లో 5వ తరగతిలో ఒకసారి ప్రవేశం పొందితే ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా చదువుకోవచ్చు. పరీక్ష ఇలా.. ఐదో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 6న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు,ఇంటర్లో చేరే వారికి అదేరోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఐచ్ఛిక విధానంలో ప్రవేశ పరీక్ష ఉటుంది.ప్రతి తప్పు జవాబునకు 1/4 మార్కు (నెగెటివ్) మార్కు తీసివేస్తారు.ఐదో తరగతికి సంబంధించి నాలుగో తరగతిలో తెలుగు 10,ఆంగ్లం 10,గణితం 15,సైన్స్ 15 కలిపి మొత్తం 50 ప్రశ్నలు(ఒక మార్కు) ఉంటాయి. ఇంటర్‌కు సంబంధించిన ప్రవేశ పరీక్షలో పదో తరగతిలో గణితం 15, భౌతికశాస్త్రం 15,సామాన్యశాస్త్రం(బయాలజీ) 15,ఆంగ్లం 15,సామాజిక అధ్యయనాలు 10,లాజికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ 30 కలిపి మొత్తం 100 ప్రశ్నలు(ఒక మార్కు) ఉంటాయి. సద్వినియోగం చేసుకోవాలి.. ఆంగ్ల మాధ్యమంలో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ఒత్తిడి లేని నాణ్యమైన విద్యా బోధన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ఉంటుంది. ప్రభుత్వం గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం గురుకులాల్లో ప్రతి ఏటా ఐదు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరాల్లో ప్రవేశాల కోసం పరీక్ష నిర్వహిస్తోంది. ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పించి అర్హత కలిగిన నిష్ణాతులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాఠాలు బోధిస్తారు. నిర్ణీత సమయంలోగా ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కో గురుకులంలో మొత్తం 80 సీట్లలో రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ కేటగిరీకి 60, బీసీ–సీ కి 10, ఎస్టీకి 05, బీసీ 04, ఓసీ 01 చొప్పున కేటాయిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలి. –మళ్ల మాణిక్యం, ప్రిన్సిపాల్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం(బాలికలు), కొక్కిరాపల్లి అర్హతలు ఐదో తరగతిలో ప్రవేశానికి ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు 2012 సెప్టెంబరు 1 నుంచి 2016 ఆగస్టు 31 మధ్య,ఓసీ,బీసీ,ఎస్సీ కన్వెర్టెడ్ క్రిస్టియన్లు 2014 సెప్టెంబరు 1 నుంచి 2016 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి.ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి 2025 ఆగస్టు 31 నాటికి 17 ఏళ్ల వయసు మించకూడదు.ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న వారు మాత్రమే అర్హులు.అభ్యర్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్ష మించకూడదు.అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో htt pr://apbragcet.apcfss.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. దరఖాస్తులు చేసేటపుడు తప్పులు లేకుండా చూసుకోవాలి. నమోదు సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, తెల్లరేషన్ కార్డు, ఇంతకు ముందు తరగతికి సంబంధించి ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.మొబైల్ నెంబరు తప్పులేకుండా నమోదయ్యేలా చూసుకోవాలి. ప్రతిభ పరీక్షలో మెరిట్ ఆధారంగా నేరుగా ప్రవేశం కేటాయిస్తారు. వసతులు: ఉచిత వసతి, భోజన సౌకర్యంతో గురుకుల విధానంలో చదువుకునే అవకాశం ఉంది. పౌష్టికాహారం, మూడు జతల ఏకరూప దుస్తులు, దుప్పటి లేక జంకాన, బూట్లు, సాక్సులు, టై, బెల్టు, రాత, పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందిస్తారు. కాస్మోటిక్ ఛార్జీలు, రోజూ వేరుశనగ చిక్కీ, వారానికి ఆరు రోజులు గుడ్లు,రెండు రోజులు చికెన్‌తో భోజనం ఉంటుంది. -
కూటమి పాలనలో 43 మంది కార్మికుల మృతి
అనకాపల్లి: జిల్లాలో పరిశ్రమలు ఎక్కువగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తొమ్మిది మాసాల్లోనే 43 మంది కార్మికులు మృత్యువాత పడినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. స్థానిక పెంటకోట కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల ఎస్సెన్షియా కంపెనీలో జరిగిన సంఘటనలో 15 మంది మృత్యువాత పడ్డారని, సీఎం చంద్రబాబునాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై వసుధ మిశ్రా కమిటీని ఏర్పాటు చేశారన్నారు. కమిటీ రిపోర్టు ఆధారంగా అన్ని భద్రతా చర్యలను తీసుకుంటామన్నారు. జిల్లాలో కెమికల్ కర్మాగారాలు ఉన్నాయని, ఇక్కడ త్వరలో బర్న్ వార్డులతోపాటు రెండు బర్న్ అంబులె న్స్ ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, పరి శ్రమల శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. నూకాంబిక సేవలో మంత్రి... ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబిక అమ్మవారిని మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్.సుజాత అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ -
ప్లాట్‌ఫాంపైకి రావడం అంత వీజీ కాదు
● రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నియంత్రణకు కొత్త వ్యూహాలు ● కన్ఫర్మ్ టికెట్స్ ఉంటేనే ప్లాట్‌ఫాంపైకి అనుమతి ● వెయిటింగ్ లిస్ట్ ఉంటే స్టేషన్ బయట ఉన్న హాల్లోనే.. ● త్వరలో విశాఖ రైల్వే స్టేషన్లో అమలుకు సన్నాహాలు సాక్షి, విశాఖపట్నం: నేను టికెట్ తీసుకున్నాను. వెయిటింగ్లో ఉంది. ట్రైన్ ఎక్కిన తర్వాత ఎలాగైనా కన్ఫర్మ్ చేయించుకుని బెర్త్‌లో హాయిగా పడుకుంటానని అనుకుంటే.. ఇకపై ఆ పప్పులింక ఉడకవ్. ఎందుకంటే టికెట్ కన్ఫర్మ్ అయితేనే ప్లాట్‌ఫాంపైకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. లేదంటే కన్ఫర్మ్ టికెట్ ఉన్నవాళ్లు వెళ్లిన తర్వాత.. మీ టర్న్ వచ్చినప్పుడు మాత్రమే ట్రైన్ ఎక్కగలరు. ఇటీవల ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించిన దురదృష్టకర ఘటన నేపథ్యంలో, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షతన ఒక అత్యున్నత సమావేశం జరిగింది. ప్లాట్‌ఫాంలపై ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలువురు నిపుణులు సూచనలు చేశారు. అనంతరం అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలను అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్లాట్‌ఫాంలపైకి ఒకేసారి ప్రయాణికులు గుంపులుగా రాకుండా నిరోధించడానికి అవసరమైన చర్యలను దేశవ్యాప్తంగా 60 ప్రధాన స్టేషన్లలో అమలు చేయాలని నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్టు కింద న్యూఢిల్లీ, ఆనంద్ విహార్, వారణాసి, అయోధ్య, పాట్నా స్టేషన్లలో ఈ నిబంధనలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. రైలు వచ్చిన తర్వాత, ప్రయాణికులను ఒకరి తర్వాత ఒకరిగా, వివిధ మార్గాల ద్వారా రైలు దగ్గరకు అనుమతిస్తున్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో కూడా ఈ తరహా నిబంధనలు అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏం చేస్తారంటే.? ● ప్లాట్‌ఫాంపై రద్దీని నియంత్రించేందుకు ఇకపై వెయిటింగ్ ప్రాంతాలను స్టేషన్ బయట ఏర్పాటు చేస్తారు. టికెట్ లేని ప్రయాణికులు కూడా స్టేషన్ వెలుపలే వేచి ఉండాలి. వెయిటింగ్ లిస్ట్‌లోని ప్రయాణికులను పంపిన తర్వాత, వారికి రైలు ఎక్కేందుకు అనుమతి లభిస్తుంది. ● ముందుగా కన్ఫార్మ్ రిజర్వేషన్ టికెట్ ఉన్న ప్రయాణికులను మాత్రమే ప్లాట్‌ఫాంపైకి అనుమతిస్తారు. ● మరోవైపు స్టేషన్లలో మరింత వెడల్పుగా ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను(వంతెనలు) నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. మహాకుంభమేళా సమయంలో ఇలాంటి వెడల్పాటి వంతెనలు సమర్థవంతంగా పనిచేశాయి. ఈ నేపథ్యంలోనే స్టేషన్లలో 6 మీటర్లు, 12 మీటర్ల వెడల్పు కలిగిన ఎఫ్‌వోబీలు రాబోతున్నాయి. ● రైల్వేస్టేషన్లలో రద్దీని ఎప్పటికప్పుడు గమనించేందుకు సీసీ టీవీ నిఘాను మరింత పటిష్టం చేయనున్నారు. రైల్వేస్టేషన్ల పరిసర ప్రాంతాల్లో కూడా నిఘా ఏర్పాటు చేస్తారు. ● సమన్వయాన్ని మెరుగుపరచడానికి సిబ్బందికి వాకీ టాకీలు, అత్యాధునిక అనౌన్స్మెంట్ సిస్టమ్, కాలింగ్ సిస్టమ్‌లతో సహా ఆధునిక డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొస్తారు. ● సంక్రాంతి, దసరా వంటి పండుగలు, సెలవుల సమయాల్లో రైల్వే స్టేషన్లలో వార్ రూమ్‌లను ఏర్పాటు చేస్తారు. స్టేషన్ పరిధిలోని అన్ని విభాగాల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ, రద్దీని నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించి అమలు చేస్తారు. ● ప్రధాన స్టేషన్లలో ఆర్థికపరమైన విషయాలపై తక్షణమే నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగిన స్టేషన్ డైరెక్టర్‌ను నియమించనున్నారు. ఈ అధికారి స్టేషన్ సామర్థ్యం, రైలు లభ్యతను బట్టి టికెట్లను ఎంత వరకు విక్రయించాలనే విషయాలను నిర్ణయిస్తారు. ● ఈ ప్రాజెక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత రైల్వేస్టేషన్ ప్రవేశంపై రైల్వే శాఖ పూర్తి నియంత్రణ కలిగి ఉంటుంది. స్టేషన్‌కు చేరుకోవడానికి ఉన్న అన్ని అనధికారిక ప్రవేశ మార్గాలను మూసివేస్తారు. ● విశాఖపట్నం ఇటీవలే ‘ఏ’గ్రేడ్ స్టేషన్‌గా గుర్తింపు పొందిన నేపథ్యంలో, ఈ తరహా నిబంధనలను ఇక్కడ కూడా అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. స్టేషన్‌కు అధికారికంగా, అనధికారికంగా ఎన్ని ప్రవేశ ద్వారాలు ఉన్నాయి? నిష్క్రమణ మార్గాలు ఎన్ని ఉన్నాయి? రోజువారీ రైళ్ల రాకపోకలు, ప్రయాణికుల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను అందజేయాలని రైల్వే బోర్డు ఆదేశించినట్లు సమాచారం. ప్లాట్‌ఫాంలు 8 స్టేషన్లో మొత్తం ట్రాక్‌లు 10 రైల్వే స్టేషన్ విస్తీర్ణం 1,110,600 చ.అడుగులు ఏటా ప్రయాణికుల రాకపోకల ద్వారా ఆదాయం సుమారు రూ.560 కోట్లు ఏటా రాకపోకలు సాగించే ప్రయాణికులు సుమారు 2 కోట్లు విశాఖ రైల్వేస్టేషన్ సమాచారం స్టేషన్ కేటగిరీ నాన్ సబర్బన్ గ్రూప్ (ఎన్ఎస్జీ)1 -
మహిళా నాయకత్వానికి ఎంతో ప్రోత్సాహం
అనకాపల్లి టౌన్: మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాల నాయుడు పేర్కొన్నారు. పట్టణంలోని రింగ్‌రోడ్ పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ ఒక్క వైఎస్సార్కాంగ్రెస్పార్టీనేనని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ మహిళా విభాగం ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. అనంతరం అతిఽథులను శాలువాతో సత్కరించి చిరు జ్ఞాపికలను అందజేశారు. మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ జిల్లా పరిశీలకుడు కరణం ధర్మశ్రీ, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే ఆదీప్‌రాజ్, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్, కశింకోట ఆర్ఈసీఎస్ మాజీ చైర్మన్ మలసాల రమణారావు, పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు ఎల్ సుజాత, పెందుర్తి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు నదియా, పట్టణ మహిళా కార్పొరేటర్లు జాజుల ప్రసన్న లక్ష్మి, పీలా సౌజన్య, జిల్లా మాజీ మహిళా అధ్యక్షురాలు ఈర్లె అనురాధ, అమృతవల్లి, కొత్తూరు సర్పంచ్ ఎస్ లక్ష్మి, నియోజకవర్గ పార్టీ నాయకులు నీటిపల్లి లక్ష్మి, పండాడి పద్మ, మరిపల్లి శోభ, కొటియాడి పద్మ, దొడ్డి లక్ష్మి, వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిదే పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాల నాయుడు పార్టీ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం -
12న వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు
అనకాపల్లి టౌన్ : జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈనెల 12న ఘనంగా నిర్వహించనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షడు, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. స్థానిక రింగ్‌రోడ్డు పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా గ్రామీణ స్థాయి నుంచి వేడుకలు నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అదే రోజు ఉదయం తొమ్మిది గంటలకు నియోజకవర్గ ప్రధాన కేంద్రాలు, మండల కేంద్రాలలో జెండా ఎగుర వేసి, అనంతరం నాయకులు, కార్యకర్తలు జిల్లా ప్రధాన కేంద్రంలో జరిగే వేడుకలకు విచ్చేస్తారని ఆయన తెలిపారు. అక్కడి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు ప్రజలను మోసం చేయడంపై కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొనాలని ఆయన కోరారు. తల్లికి వందనం, విద్యాదీవెన, రైతు భరోసా, మహిళలకు ఉచిన బస్, 50 ఏళ్లకే పింఛన్...ఇలా ఏ ఒక్క హామీ కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏ పథకానికీ నిధులు కేటాయించలేదని, దీనిని బట్టి హామీలన్నీ ఉత్తుత్తివే అని నిరూపణ అయిందన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా పార్లమెంట్ పరిశీలకుడు కరణం ధర్మశ్రీ, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, ఎంపీపీ గొర్లి సూరిబాబు, కశింకోట ఆర్ఈసీఎస్ మాజీ చైర్మన్ మలసాల రమణారావు, జిల్లా కార్యదర్శి జాజుల రామేష్ పాల్గొన్నారు. గ్రామీణ స్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకూ పార్టీ జెండావిష్కరణలు ఈ సందర్భంగా సూపర్ సిక్స్ హామీల అమలు కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు -
మహిళలు అన్నింటా సమానులు..
● మామూళ్లు.. గమ్మత్తుగా! 8లోఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025● ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి.. ● ఉత్పాదక యూనిట్ల స్థాపనకు ప్రోత్సాహం ● ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర ● ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇప్పటికే ప్రైవేటు పీఏ వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొంటున్న కూటమి నేత ఒకరు... ఇప్పుడు కలెక్షన్ల కోసం ఏకంగా బెంగళూరు నుంచి ఓ వ్యక్తిని తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ముందుగా నియోజకవర్గంలోని మొత్తం మద్యం షాపుల నుంచి మామూళ్లు వసూలు చేయాలని భావించారు. ఇందుకు అనుగుణంగా మద్యం షాపు సిండికేట్లతో గత నెలలో సమావేశం ఏర్పాటు చేసి మరీ టార్గెట్లు ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ప్రతి మద్యం షాపు యజమాని ప్రతి నెలా రూ.2.5 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. ఇందుకు ప్రతిఫలంగా సదరు ప్రైవేటు మద్యం దుకాణదారుడు బెల్టు షాపులకు ఎమ్మార్పీ మీద రూ.10 అధికంగా విక్రయించుకునేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఆయా దుకాణాల పరిధిలో బెల్టు షాపులకు మద్యం సరఫరా బాధ్యత కేవలం వారికే దక్కేలా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆయా మద్యం షాపులతో పాటు బెల్టు షాపుల జోలికి ఎకై ్స జ్‌శాఖ అధికారులు వెళ్లకుండా కూడా ఆదేశాలు జారీ కావడం విశేషం. వచ్చే ఏడాది నుంచి ప్రతి నెలా వసూళ్ల మొత్తం రూ.3 లక్షలకు పెంచనున్నట్టు కూడా ముందుగానే ప్రకటించినట్టు సమాచారం. మొత్తంగా ఒక ప్రైవేటు పీఏ వ్యవహారంలో విమర్శల నేపథ్యంలో దూరంగా పెట్టిన సదరు నేత.. ఇప్పుడు బెంగళూరు నుంచి వచ్చిన మరో వ్యక్తి ద్వారా వసూళ్లకు దిగడం చర్చనీయాంశమవుతోంది. విచ్చలవిడిగా బెల్టు షాపులు! ఇప్పటికే పేకాట, కోడి పందేల వ్యవహారంలో వార్తలకెక్కిన సదరు నేత.. ఇప్పుడు విచ్చలవిడిగా మద్యం బెల్టు దుకాణాలకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అంతేకాకుండా పేకాట డెన్ల నిర్వహణలో కొంత మొత్తం వసూలు చేసేందుకు మరీ అనుమతి ఇచ్చారు. వాటి జోలికి వెళ్లకుండా కూడా కొద్దిరోజుల పాటు నియంత్రించగలిగారు. అయితే అంతర్గత విభేదాల కారణంగా ఈ వ్యవహారం కాస్తా బయటకు వచ్చింది. దీంతో తాత్కాలికంగా పేకాట శిబిరాలు మూతపడ్డాయి. ఇక కోడి పందేల శిబిరాలు ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఏకంగా మూడు ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. అధికారికంగా సదరు నేత పాల్గొనకపోయినా వారి అండతోనే ఈ వ్యవహారం నడిచింది. దీంతో అటువైపు పోలీసులు కన్నెత్తి చూడలేదు. పైగా కోడి పందేల శిబిరాల ప్రాంతంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కూడా జరిగాయి. బహిరంగంగానే మద్యాన్ని విక్రయించారు. వీటి ఏర్పాట్లకు కూడా వేలం పాట నిర్వహించి మరీ వసూళ్లకు తెగబడ్డారు. మరోవైపు ఇప్పటికే సదరు నేత నియోజకవర్గంలో భారీగా బెల్టు షాపులు వెలిశాయి. బెల్టు షాపుల కోసం వేలం పాట నిర్వహించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయినా సదరు నేత అండదండలతో చర్యలు తీసుకోలేదని విమర్శలున్నాయి. కేవలం ఈ నియోజకవర్గంలోనే ఏకంగా వందకుపైగా బెల్టు షాపులు ఏర్పాటైనట్టు సమాచారం. మద్యం దుకాణదారులు ఆయా బెల్టు షాపులకు ఎమ్మార్పీకి రూ.10కి అధికంగా మద్యం విక్రయించుకుంటున్నారు. ఇందులో వచ్చే సగం ఆదాయాన్ని సదరు నేతకు ముట్టచెబుతున్నట్టు తెలుస్తోంది. సాక్షి, అనకాపల్లి : మహిళలు ఉత్పాదక యూనిట్లు స్థాపించి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని రాష్ట్ర అబ్కారీ, భూగర్భ గనుల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక పెంటకోట కన్వెన్షను హాలులో మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మహిళా దినోత్సవ కార్యక్రమం జరిగింది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్, జిల్లా కలెక్టరు విజయ కృష్ణన్, జేసీ ఎం. జాహ్నవి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, శాసనసభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మహిళలు వారి హక్కుల కోసం అనేక పోరాటాలు, త్యాగాలు చేసి1911 మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవంగా సాధించుకున్నారని తెలిపారు. 2025 సంవత్సరానికి ‘మహిళలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు, సమాన పదవులు’ థీమ్‌గా మహిళా దినోత్సవాన్ని జరుపుకొంటున్నట్టు తెలిపారు. ప్రోత్సాహక యూనిట్లు స్థాపనకు జిల్లాలో కోడూరు వద్ద 30 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందని, ఎవరైనా యూనిట్ల స్థాపనకు ముందుకు వస్తే వారికి రటన్ టాటా ఇన్నొవేషన్ వారిచే శిక్షణ అందించి, వారికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం దీపం పథకం అమలు, పెన్షన్లు మొత్తం పెంపు, అన్నా కేంటీన్లు తిరిగి ప్రారంభం, ఎన్ఆర్ఈజీఎస్ పనులు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. మే నెల నుంచి తల్లికి వందనం, రైతులకు, మత్స్యకారులకు భరోసా పథకాలు అందించడం జరుగుతుందన్నారు. అన్ని రంగాల్లో నాయకత్వం : స్పీకర్ అయ్యన్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడు తూ మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో నాయకత్వం వహిస్తున్నారని, ప్రస్తు తం జిల్లాను విజయపథంలో నడిపించేది మహిళా అధికారులేనని కొనియాడారు. మహిళల ఆర్థికాభివృద్ధ్దికి స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయడం జరిగిందని, సంఘాలు బలోపేతమై ప్రభుత్వానికే అప్పు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నమ్మకంతో ముందడుగు : కలెక్టర్ విజయకృష్ణన్ జిల్లా కలెక్టరు విజయ కృష్ణన్ మాట్లాడుతూ మహిళలకు సమాన హక్కులు, సమాన వేతనం కొరకు ఎన్నో పోరాటాలు చేసి హక్కులు సాధించుకున్నామని, అందుకు గుర్తుగా అదే స్ఫూర్తిని కొనసాగించుటకు ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకొంటున్నట్లు తెలిపారు. సీ్త్ర పుట్టుకతోనే బలమైనదని, సీ్త్ర అద్భుతాలు సృష్టించగలదని, ప్రతి సీ్త్ర తనపైన నమ్మకంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టరు పిలుపునిచ్చారు. మహిళల రక్షణకు శక్తి మహిళ యాప్ : ఎస్పీ సిన్హా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ పోలీసుశాఖలో మహిళా ఉద్యోగులు పురుషులతో సమానంగా పనిచేస్తున్నారని తెలిపారు. మహిళల రక్షణకు పోలీసుశాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని, మహిళలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే 112 నంబరుకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చునన్నారు. ప్రభుత్వం ప్రారంభిస్తున్న శక్తి మహిళా యాప్ ప్రతి మహిళ వారి మైబెల్లో నిక్షిప్తం చేసుకొని సహాయం కొరకు వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ రమేష్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, రమేష్ బాబు , జేసీ జాహ్నవి, డీఆర్వో వై.సత్యనారాయణరావు, ఆర్డీవో షేక్ ఆయిషా, జిల్లా గ్రామీణాభివృది సంస్థ పీడీ శచీదేవి, మహిళా, శిశు సంక్షేమశాఖ పీడీ అనంతలక్ష్మి, సివిల్ సప్లయి డీఎం జయంతి, మహిళా సంఘా ల సభ్యులు పాల్గొన్నారు.తుమ్మపాల : జిల్లాలో ఎన్నికల కోడ్ ముగిసినందున ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ఈ నెల 10 సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమంను యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ప్రజలకు మరింత సమర్థవంతంగా అమలు చేసే నిమిత్తం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంతో పాటు, డివిజన్, మండల, మున్సిపల్ కార్యాలయాలు, గ్రామసచివాలయాలలో ప్రజా ఫిర్యాదులు స్వీకరించడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్డీవో కార్యాలయం, మండల తహసీల్దార్, ఇతర కార్యాలయాల్లో ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. యథావిధిగా రేపు ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం బెంగళూరుకు చెందిన వ్యక్తి ద్వారా..! వాస్తవానికి సదరు నేతకు ఏళ్లుగా నమ్మినబంటుగా ఉన్న వ్యక్తి ద్వారా అన్ని వ్యవహారాలు నడిపేవారు. అయితే సదరు వ్యక్తిపై సొంత పార్టీ నేతలే ఫిర్యాదు చేయడంతో పక్కన పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఆ స్థానంలో తనకు నమ్మిన బంటుగా ఉన్న మరో వ్యక్తిని బెంగళూరు నుంచి ప్రత్యేకంగా పిలిపించినట్టు ఆ పార్టీ నేతలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. మద్యం సిండికేట్ల ద్వారా వసూలు చేసే మొత్తం కూడా సదరు బెంగళూరు వ్యక్తి చేతికి చేరుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కొద్దిరోజుల క్రితం సెజ్‌లోని ఒక కంపెనీలో సీసీ కెమెరాలను బిగించే పని ఇప్పించడం కోసం కూడా రూ.3 లక్షల మేర వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఈ తతంగమంతా కూడా బెంగళూరు వ్యక్తి ద్వారానే నడిచినట్టు సమాచారం. మొత్తంగా పీఏలు మారుతున్నారు తప్ప వసూళ్ల కార్యక్రమం మాత్రం తమకు తప్పడం లేదని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. బెంగళూరు వ్యక్తిపై కూడా ఫిర్యాదు చేసేందుకు ఆ పార్టీ నేతలే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. -
ఆందోళనకరంగా మెదడు, నాడీ వ్యవస్థ రుగ్మతలు
● అంతర్జాతీయ న్యూరో సర్జరీ వైద్య నిపుణుడు, ప్రొఫెసర్ మళ్ల భాస్కరరావు అనకాపల్లి టౌన్ : మెదడు, నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే రుగ్మతల నియంత్రణకు ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ న్యూరో సర్జరీ వైద్య నిపుణులు, నిమ్‌హేన్స్ బెంగళూరు ఆస్పత్రి పూర్వ అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ మళ్ల భాస్కరరావు సూచించారు. స్థానిక గౌరీ గ్రంథాలయం 83వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఇక్కడ న్యూరో వ్యాధి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు మెదడు, నాడీ సంబంంధ వ్యాధులతో అంతర్గతంగా బాధపడుతున్నారని అధ్యయనంలో తేలిందన్నారు. దేశ జనాభాలో 2019 నాటికి 37.9 శాతం మంది బ్రెయిన్ స్ట్రోక్ నియోనాటల్ ఎన్సెఫలోపతి (మెదడు గాయం), మైగ్రేన్, చిత్తవైకల్యం, డయాబెటిక్ న్యూరోపతి (నరాల నష్ట), మెనింజైటిస్, మూర్చ, ఆటిజం స్పెక్ట్రమ్ రుగ్మత, నాడీ వ్యవస్థ క్యాన్సర్లు, అకాల జననం నుంచి వచ్చే నాడీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని, ఈ శాతం 2024 నాటికి మరింత పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కువ శాతం 40 నుంచి 58 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పురుషులు ఈ వ్యాధి బారిన పడుతున్నారన్నారు. గౌరీ గ్రంథాలయ కార్యదర్శి కాండ్రేగుల వెంకటరమణ, కన్వీనర్ మళ్ల బాపునాయుడు, అధ్యక్షుడు కాండ్రేగుల జగ్గారావు, కాండ్రేగుల సత్యనారాయణ పాల్గొన్నారు. -
రాజీమార్గమే రాజమార్గం
మాట్లాడుతున్న 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీవిద్య అనకాపల్లి టౌన్: లోక్ అదాలత్‌లో రాజీమార్గమే రాజ మార్గమని, ఇక్కడి తీర్పే అంతిమమని 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్. శ్రీవిద్య అన్నారు. స్థానిక కోర్టు ఆవరణలో శనివారం జరిగిన లోక్ అదాలత్‌లో ఆమె మాట్లాడారు. ఈ అదాలత్‌లో 1101 కేసులు పరిష్కరించి, ఐదు కోట్ల ముప్పై రెండు లక్షల పదిహేడు వేల రెండు వందలు కక్షిదారులకు చెల్లించామన్నారు. నాలుగు బెంచ్‌లలో జరిగిన కార్యక్రమంలో సుమారు 650 మంది కక్షిదారులు పాల్గొని తమ కేసులను పరిష్కరించుకున్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి పి. నాగేశ్వరరావు, సీనియర్ డివిజన్ జడ్జి జి. రామకృష్ణ, సీనియర్ డివిజన్ అడిషనల్ సివిల్ జడ్జి బి.వి. విజయలక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంజేవీఎన్ కుమార్, కార్యదర్శి బీఎన్ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. -
గోవాడ సుగర్ ఫ్యాక్టరీని ఆదుకున్నది వైఎస్సార్సీపీనే
మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకుడు కరణం ధర్మశ్రీ అనకాపల్లి టౌన్: వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో 89.90 లక్షల నిధులు తీసుకొచ్చి గోవాడ సుగర్ ఫ్యాక్టరీని అన్ని విధాలా ఆదుకుందని అనకాపల్లి జిల్లా పార్లమెంట్ పరిశీలకుడు కరణం ధర్మశ్రీ తెలిపారు. స్ధానిక రింగ్‌రోడ్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం సుగర్ ఫ్యాక్టరీ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. క్రషింగ్కి అనుకూల పరిస్థితులు కల్పించడంలో ఇక్కడి ఎంపీ, ఎమ్మెల్యేలు విఫలమయ్యారన్నారు. ప్రతి ఏడాడి నవంబర్, డిసెంబర్ నెలల్లో ప్రారంభం కావల్సిన క్రషింగ్ నేటికీ పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదన్నారు. ఇప్పటికి లక్షా 50 వేల టన్నులు క్రషింగ్ జరగాల్సి ఉండగా కేవలం 60 టన్నుల క్రషింగ్ మాత్రమే జరిగిందన్నారు. ఈ క్రమంలో రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవడానికి ఈ నెల 10న రాష్ట్ర శాసన మండలి సభ్యులు బొత్స సత్యనారాయణ, పార్టీ జిల్లా ముఖ్య నాయకులు ఫ్యాక్టరీని సందర్శించి రైతులు, యాజమాన్యంతో చర్చిస్తారన్నారు. సమస్యల పరిష్కారానికి తగిన సూచనలు చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాల నాయుడు, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్, పట్ణణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, కశింకోట ఆర్ఈసీఎస్ మాజీ చైర్మన్ మలసాల రమణారావు, జిల్లా కార్యదర్శి జాజుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
నూకాంబిక అమ్మవారికి రూ.2 లక్షల విరాళం
నూకాంబిక అమ్మవారి ఆలయాభివృద్ధికి రూ.2 లక్షల విరాళం అందజేస్తున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ మునగపాక: మండలంలోని చూచుకొండలోని నూకాంబిక అమ్మవారి ఆలయాభివృద్ధికి తనవంతు సాయంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ శనివారం రూ.2 లక్షల విరాళం అందజేశారు. సర్పంచ్ దొడ్డి సూరప్పారావు, ఎంపీటీసీ కాండ్రేగుల కిరణ్‌కుమార్, మాజీ ఎంపీటీసీ పెంటకోట అప్పలనాయుడు, పీఏసీఎస్ మాజీ పర్సన్ ఇన్చార్జి పెంటకోట హరేరామ, వైఎస్సార్సీపీ నేతలు గుంట్ల అప్పారావు, పిన్నమరాజు రవీంద్రరాజు, వ్యాపారవేత్త ఆడారి కృష్ణ, శంకర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 22 కిలోల గంజాయితో ఇద్దరి అరెస్టు గొలుగొండ : కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అల్లూరి పార్కు వద్ద స్కూటీపై అక్రమంగా 22 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు కృష్ణదేవిపేట ఎస్ఐ తారకేశ్వర్రావు తెలిపారు. అనంతపూర్ జిల్లాకు చెందిన మనోహర్(22), గూడెం కొత్తవీదికి చెందిన వెంకటేష్ (32) స్కూటీపై 22 కేజీల గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. నిందితులిద్దపై కేసు నమోదు చేసి, కోర్టుకు తరలించి, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి నర్సీపట్నం : చెట్టుపల్లి–పాత లక్ష్మీపురం మధ్యలో శనివారం తెల్లవారి జరిగిన రోడ్డు ప్రమాదంలో అయ్యన్న కాలనీకి చెందిన పెదిరెడ్ల జగదీశ్వరరావు (36) మృతి చెందినట్టు రూరల్ ఎస్ఐ రాజారావు తెలిపారు. జగదీశ్వరరావుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వడ్డాది నుంచి తిరిగి వస్తుండగా తెల్లవారి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో జగదీశ్వరరావు మృతి చెందగా సతీష్, లోవరాజు గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
వెంకన్న పెళ్లికొడుకాయెనే
● ఉపమాక వేంకటేశ్వరస్వామి కల్యాణానికి అంకురార్పణ నేడు ● ఉదయం పెండ్లి కావిడి ఊరేగింపు ● 10వ తేదీ రాత్రి కల్యాణం ● ఘనంగా ఏర్పాట్లు చేసిన టీటీడీవేసవి తాపాన్ని తట్టుకునేలా ఏర్పాట్లు.. నక్కపల్లి: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, ప్రాచీన పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణానికి నేడు అంకురార్పణ జరగనుంది. మార్చి 10వ తేదీ సోమవారం రాత్రి ఉపమాకలో గరుడాద్రి పర్వతంపై కల్కి అవతారంలో షడ్భుజాలతో స్వయం వ్యక్తమై వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి వార్షిక కల్యాణం ఘనంగా జరగనుంది. ప్రతి ఏటా ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి వార్షిక కల్యాణం అంగరంగా వైభవంగా నిర్వహిస్తారు. ఈ కల్యాణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వార్షిక కల్యాణానికి సంబంధించి 9వ తేదీ ఆదివారం ఉదయం స్వామివారి పెండ్లి కావిడను ఉపమాక మాడ వీధుల్లో ఊరేగిస్తారు. భక్తులు స్వామివారికి పసుపు కుంకుమలు, కొబ్బరికాయలు కానుకగా సమర్పిస్తారు. సాయంత్రం ఆలయంలో విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రుత్విక్వరుణ, కంకణధారణ, అంతరాలయ పూజ, నీరాజన మంత్రపుష్పాలు సమర్పిస్తారు. తదుపరి సాయంత్రం అంకురార్పణకు శ్రీకారం చుడతారు. సుదర్సన పెరుమాళ్లను పల్లకిలో ఉంచి మత్సంగ్రహణం (పుట్టమన్ను) తీసుకు రావడానికి ఉత్తర ఈశాన్య దిక్కున గల ప్రాంతానికి తీసుకెళ్తారు. అనంతరం అశ్వవాహనంపై తిరువీధి సేవ జరుగుతుంది. స్వామి, అమ్మవార్లను అశ్వవాహనంలో ఉంచి మాడవీధుల్లో తిరువీధి సేవ నిర్వహిస్తారు. తర్వాత స్వామివారి కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను కొలువుదీరుస్తారు. అంకురార్పణ చతుస్టాన అర్చనలు గరుడప్పాల నివేదన నిర్వహిస్తారు. దీంతో స్వామివారి కల్యాణ ఉత్సవాలు ప్రారంభమైనట్లేనని ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్ తెలిపారు.10వ తేదీ ఉదయం ఉభయ దేవేరులను పెద్దపల్లకిలో కొలువుదీర్చి ఆలయం, గ్రామంలో అష్టదిక్పాలకులను ఆవాహన చేసిన తర్వాత ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు రాత్రి వేంకటేశ్వర స్వామిని ఇత్తడి గరుడ వాహనంపై, ఉభయ దేవేరులను శేషవాహనంపై ఉంచి ఉపమాక సింహాద్రాచార్యులు ఇంటి వద్ద కన్యావాద సంవాదం (ఎదురు సన్నాహ మహోత్సవం) నిర్వహిస్తారు. ప్రముఖ వేద పండితురాలు డాక్టర్ గొట్టుముక్కల గాయత్రీదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించి ఎదురు సన్నాహ మహోత్సవం నిర్వహిస్తారు. అనంతరం రథోత్సవం, కల్యాణం జరుగుతుంది. 300 మంది పోలీసులతో బందోబస్తు.. జిల్లా ఎస్పీ తుహిన్‌సిన్హా ఆదేశాల మేరకు కల్యాణోత్సవాలకు సుమారు 300 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సీఐ కుమారస్వామి తెలిపారు. ఆరుగురు సీఐలు, 20 మంది ఎస్ఐలతో పాటు, స్పెషల్ బ్రాంచి పోలీసులు, హెచ్‌సీలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, మఫ్టీలో సిబ్బంది భద్రత కోసం పని చేస్తారన్నారు. 16 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, డ్రోన్ కెమెరాల సాయంతో భద్రత పర్యవేక్షిస్తామన్నారు. మనబానవానిపాలెం, నక్కపల్లిలో పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలు కేటాయించామన్నారు. ఉపమాక వెళ్లే అన్ని మార్గాల్లోను చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. 10వ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే ద్విచక్ర వాహనాల రాకపోకలను అనుమతిస్తామన్నారు. -
తోడల్లుడే చంపించాడు...
● నగేష్‌కుమార్ హత్య కేసులో ముగ్గురి అరెస్టు ● నిందితులకు 14 రోజుల రిమాండ్ ● వివరాలు వెల్లడించిన ఇన్చార్జి డీఎస్పీ మోహనరావు అనకాపల్లి : మండలంలో కుంచంగి గ్రామంలో ఈనెల 5వ తేదీన బుచ్చియ్యపేట మండలం కరక గ్రామానికి చెందిన భీమవరపు నగేష్‌కుమార్ హత్య కేసులో మృతుడి తోడల్లుడితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించినట్టు ఇన్చార్జి డీఎస్పీ బి.మోహన్‌రావు చెప్పారు. డీఎస్పీ కార్యాలయంలో శనివారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మృతుడి తోడల్లుడు కశింకోట శివాలయం వీధికి చెందిన పెద్దపూడి కిషోర్, అదే గ్రామానికి చెందిన మారేడుపూడి రాజేష్, కాకినాడ జిల్లా భానుగుడి జంక్షన్, మిలిటరీ రోడ్డుకు చెందిన గోరస నాగేశ్వరరావు కలసి భీమవరపు నగేష్‌కుమార్‌ను హత్య చేసినట్టు ఆయన తెలిపారు. కిషోర్, రాజేష్‌లు అనకాపల్లిలోని ఓ బంగారం షాప్‌లో గతంలో పనిచేశారని, కిషోర్ కశింకోటలో కొత్తగా దుకాణం పెట్టుకుని వ్యాపారం సాగిస్తున్నాడని డీఎస్పీ చెప్పారు. కిషోర్ షాప్ వద్దకు రాజేష్ అప్పుడప్పుడు వస్తుండేవాడన్నారు. అదే సమయంలో కాకినాడలో ల్యాబ్ టెక్నీషియన్‌గా ఉన్న రాజేష్ మేనల్లుడి కొడుకు గోరస నాగేశ్వరరావు కూడా కిషోర్ దుకాణానికి వచ్చేవాడు. అదే షాప్‌కు పెద్దపూడి కిషోర్ తోడల్లుడైన నగేష్‌కుమార్ కూడా వస్తుండడంతో వారి మధ్య పరిచయం ఏర్పడింది. వారంతా కలిసి వ్యాపార లావాదేవీలు సాగించే వారని, ఈ క్రమంలో వారి మధ్య గొడవలు ఉన్నాయని తెలిపారు. కాకినాడకు చెందిన గోరస నాగేశ్వరరావుకి షార్ట్ ఫిల్మ్ షూటింగ్ నిమిత్తం పిస్టల్ కావాలని నాగేష్‌ను అడగడంతో రూ.10వేలు అవుతుందని చెప్పి తీసుకున్నాడు. తరువాత నగేష్ ఒక డమ్మీ పిస్టల్ తీసుకువచ్చి చూపించి మళ్లీ తీసుకువెళ్లిపోయాడు. దాని నగదును కూడా తిరిగి నాగేశ్వరరావుకు ఇవ్వకపోవడంతో అతను నగేష్‌పై కోపం పెంచుకున్నాడన్నారు. అదే సమయంలో మృతుడి తోడల్లుడు పెదపూడి కిషోర్ కూడా నగేష్‌పై వివిధ కారణాలతో పగ పెంచుకుని అతనిని హత్య చేయాలని పథకం వేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 5న మృతుడు (భీమవరపు నగేష్‌కుమార్), తోడల్లుడు పెద్దపూడి కిషోర్, మారేడుపూడి రాజేష్, గోరస నాగేశ్వరరావు బుచ్చియ్యపేట మండలం రాజాం వద్ద ధాబాలో మద్యం సేవించారు. ముందుగా పథకం వేసుకున్న ప్రకారం కాకినాడకు చెందిన గోరస నాగేశ్వరరావును అనకాపల్లి జాతీయ రహదారిలో బైక్‌పై దించాలని నగేష్‌ను కోరడంతో అతను పల్సర్ బైక్‌పై ఎక్కించుకుని వస్తుండగా అనకాపల్లి మండలం కుంచంగి గ్రామానికి వచ్చేసరికి నాగేశ్వరరావు తన వెంట తీసుకు వచ్చిన సర్జికల్ బ్లేడ్‌తో బైక్ నడుపుతున్న నగేష్ పీక కోసి అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటికే వెనుక వస్తున్న పెద్దపూడి కిషోర్, మారేడుపూడి రాజేష్ ఇద్దరూ నాగేశ్వరరావును అక్కడి నుంచి బైక్‌పై ఎక్కించుకుని కశింకోట జాతీయ రహదారిలో బస్ ఎక్కించి పంపేశారు. నిందితుల కాల్ డేటా ఆధారంగా కేసు ఛేదించినట్టు డీఎస్పీ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ జి.అశోక్‌కుమార్, ఎస్ఐ జి.రవికుమార్, పట్టణ ఎస్ఐ వి.సత్యనారాయణ, ఏఎస్ఐ ఎస్.భాస్కర్‌రావు, హెచ్‌సీలు వై.సోమ్బాబు, కె.నూకరాజు, కానిస్టేబుళ్లు ఎస్.నారాయణ, పి.నరేంద్ర, ఎం.నగేష్ తదితరులు పాల్గొన్నారు. -
సారా రహిత సమాజమే ధ్యేయం
● నవోదయం 2.0 రథాన్ని ప్రారంభించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర తుమ్మపాల : నాటుసారా రహిత సమాజాన్ని తీర్చిదిద్దేందుకు గ్రామ గ్రామాన ప్రజల్లో నాటు సారాకు వ్యతిరేకంగా చైతన్యం కలిగించడమే లక్ష్యంగా ప్రచార రథాన్ని ప్రారంభించినట్టు జిల్లా ఇన్చార్జి, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నాటు సారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా పట్టణంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో పాటు స్పీకర్ సీహెచ్.అయ్యన్నపాత్రుడు, ఎంపీ సీఎం రమేష్, కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా , జేసీ జాహ్నవిలు విచ్చేసి పోస్టర్, రథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటు సారాను పూర్తిగా నియంత్రించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత అందరిలో ఉందన్నారు. జిల్లా అసిస్టెంట్ కమిషనర్ సూర్జిత్ సింగ్ మాట్లాడుతూ నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 202 నాటుసారా కేసులు నమోదు చేసి, 107 మంది నిందితులను అరెస్టు చేయడమైందన్నారు. 1,022 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నామన్నారు. సారా తయారీలో ఉపయోగించే 69, 260 లీటర్ల పులిసిన బెల్లం ఊటను ధ్వంసం చేసి, 15,289 కేజీల బెల్లం స్వాధీన పరుచుకున్నామని, 10 వాహనాలను జప్తు చేశామని, అదేవిధంగా 550 మంది పాత నేరస్తులపై నిఘా ఉంచి వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్న్, ఎకై ్సజ్ శాఖ అధికారి వి.సుధీర్, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.రాజశేఖర్, ఎకై ్సజ్ సీఐ వై.లక్ష్మున్నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీగా కార్మికుల తొలగింపు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కార్మికులను భారీగా తొలగించారు. 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించింది. ఏ క్షణమైనా సమ్మెకు కాంట్రాక్ట్ కార్మికులు దిగనున్నారు. రేపు భారీ ఆందోళనకు అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఇప్పటికే సమ్మె నోటీసు గడువు ముగిసింది. స్థానిక ప్రజా ప్రతినిధులపై కార్మికులు మండిపడుతున్నారు.కాగా, స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు జె.అయోధ్యరామ్‌కు ఇచ్చిన షోకాజ్ నోటీసును తక్షణం ఉపసంహరించుకోవాలని జిల్లా అధ్యక్షుడు ఎన్.రామారావు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అయోధ్యరామ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉక్కు పరిపాలన భవనం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని ప్రభావితం చేసే విధంగా కార్మిక సంఘాల ప్రతినిధులపై ఉక్కు యాజమాన్యం కుట్రలు చేస్తోందన్నారు. కర్మాగారంలో నేటి వరకు ఉన్న ప్రతి ప్రయోజనం పోరాటాల ద్వారానే సాధించుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. పోరాటంలో అనైక్యతను సృష్టించడం కోసం ప్రభుత్వం, యాజమాన్యాలు ఎంత ప్రయత్నించినా.. స్టీల్ కార్మికులు మరింత ఐక్యంగా ముందుకు సాగుతారన్నారు. గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ ద్వారా స్టీల్ పరిశ్రమలో సమస్యలు పరిష్కారం కావని ఆయన వివరించారు. సస్పెన్షన్లు, షోకాజ్ నోటీసులతో కార్మి ఉద్యమాన్ని అణచలేరన్నారు. వెంటనే యాజమాన్యం నోటీసును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
తల్లి మృతి.. కన్నీటితో ఇంటర్ పరీక్ష రాసిన విద్యార్థి
అనకాపల్లి: తల్లిని కోల్పోయిన పుట్టెడు దుఃఖంలోనూ ఇంటర్మీడియట్ విద్యార్థి పరీక్షకు హాజరైన విషాదకర ఘటన తారువలో శుక్రవారం చోటు చేసుకుంది. దేవరాపల్లి మండలం తారువ గ్రామానికి చెందిన ముత్యాల పరమేశ్వరి గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఆమె కుమారుడు ఆకాష్ సహా కుటుంబ సభ్యులంతా రాత్రంతా తల్లి పార్థివదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. చోడవరంలో చదువుతున్న ఆకాష్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సవరం పరీక్షలకు శుక్రవారం హాజరు కావాల్సి ఉంది. అతని భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని కుటుంబ సభ్యులు ఆకాష్‌కు ధైర్యం చెప్పి పరీక్షకు సిద్ధం చేశారు. గుండెల్లో నుంచి ఉబికివస్తున్న బాధను పంటి బిగువున భరిస్తూ పరీక్షకు హాజరయ్యాడు. పరీక్షకు పయనమయ్యే ముందు ఆకాష్ తన తల్లి పార్థివదేహం వద్ద గుండెలవిలేలా రోదించడం పలువుర్ని కంటతడి పెట్టించింది. తల్లికి నమస్కరించి బాధను దిగమింగుతూ పరీక్ష రాసేందుకు చోడవరం పయనమయ్యాడు. ఆకాష్ పరీక్ష రాసి తిరిగి వచ్చాక ఆశ్రునయనాల మధ్య కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. -
మహిళలకు అధిక ప్రాధాన్యమివ్వాలి
మహారాణిపేట: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించడానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని జిల్లా పరిషత్ చైరపర్సన్ జె.సుభద్ర అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ లింగ సమానత్వం, మహిళా సాధికారత ప్రాముఖ్యతను గుర్తు చేస్తుందన్నారు. జెడ్పీ సీఈవో నారాయణమూర్తి మాట్లాడుతూ నిరంతరం సేవా కార్యక్రమాలు, సృజనాత్మకత, ప్రజా సంక్షేమం పట్ల చూపిస్తున్న మహిళా ఉద్యోగుల అంకితభావాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి జెడ్పీటీసీ సభ్యురాలు ఉప్పిలి దేవి, డిప్యూటీ సీఈవో కె.రాజ్‌కుమార్, ఆనందపురం ఎంపీడీవో జానకీ, పరిపాలనాధికారి ఎ.మంజువాణి, ఏపీ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. -
వడ్డాది వెంకన్న కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు
బుచ్చెయ్యపేట: ఉత్తరాంధ్రలో పేరెన్నికగన్న వడ్డాది వేంకటేశ్వరస్వామి 152వ కల్యాణోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు వీటిని ఘనంగా నిర్వహించనున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కరుణామయుడిగా వడ్డాది వెంకన్నగా పేరొందడంతో ఉత్తరాంధ్ర నుంచే కాక ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఇప్పటికే గిరిజాంబ కొండపై వెలసిన వేంకటేశ్వరస్వామి ఆలయం చుట్టూ గర్భగుడికి, మెట్లు మార్గం, కల్యాణ మండపం, టికెట్ కౌంటర్ ప్రదేశంలో రంగులు వేసి మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలంకరణ ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షలాది మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్ల కోసం విశాఖ నుంచి బారికేడ్లను తీసుకొచ్చి ఈవో టీఎన్ఎస్ శర్మ, ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఎండాకాలం కావడంతో మెట్ల మార్గంలో నీడ వసతితోపాటు కొండ దిగువున, పైన మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు. భక్తులు వేంకటేశ్వరస్వామికి తలనీలాలు సమర్పించిన తర్వాత స్నానాలు చేయడానికి ఇప్పటి వరకు బాత్రూములు లేకపోవడంతో కొండపై కొత్తగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. స్వామివారి ఆలయం నుంచి వడ్డాది నాల్గు రోడ్ల జంక్షన్ వరకు భారీ విద్యుత్ లైటింగ్‌తోపాటు ఆలయం వద్ద, నాల్గు రోడ్ల జంక్షన్ వద్ద భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను తిరువీధుల్లో ఊరేగించేందుకు గజ, గరుడ వాహనాలు శుభ్రం చేయించి కల్యాణ మండపాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. దాతలు సహాయంతో ఐదు రోజులు భక్తులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రికి భోజన వసతి కల్పించనున్నారు. ఈ ఏడాది ఉత్సవాలు విజయవంతం చేయడానికి పార్టీలకతీతంగా నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు, యువకులు, దాతలు సహకరిస్తున్నారని దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త దొండా కన్నబాబు, ఈవో శర్మ తెలిపారు. 10 నుంచి 14 వరకు మహోత్సవాలు -
‘ఉపాధి’ లక్ష్యాలను సాధించాలి
● ప్రజా వేదికలో డ్వామా పీడీ పూర్ణిమాదేవి ● నిధుల రికవరీకి ఆదేశాలు నర్సీపట్నం: ప్రతి జాబ్కార్డుదారుకు వంద రోజులు ఉపాధి పని దినాలు కల్పించాలని డ్వామా పీడీ పూర్ణిమాదేవి ఆదేశించారు. ఏడాది కాలంలో జరిగిన ఉపాధి హామీ పనులపై శుక్రవారం స్థానిక ఉపాధి హామీ కార్యాలయం వద్ద జరిగిన ప్రజావేదికలో ఆమె పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో సోషల్ ఆడిట్ బృందం గుర్తించిన లోపాలను ప్రజావేదికలో వెల్లడించారు. మొక్కలు వేసినట్లు రికార్డుల్లో చూపుతున్నా, క్షేత్రస్థాయిలో అవి లేవని, పనికి వెళ్లకుండా కొందరు పేరున మస్తర్లు వేసినట్లు పీడీ దృష్టికి తీసుకువెళ్లారు. గబ్బాడ ఫీల్డ్ అసిస్టెంట్ సన్యాసినాయుడు నిత్యం మద్యం మత్తులో ఉంటున్నాడని, పని కల్పించటం లేదని కూలీలు ఫిర్యాదు చేశారన్నారు. అతడిని తొలగించాలని ఎంపీడీవో ఉషాశ్రీని పీడీ ఆదేశించారు. ఏడాది కాలంలో రూ.12 కోట్లతో పనులు చేపట్టగా, రూ.లక్ష వరకు దుర్వినియోగం జరిగినట్లు సోషల్ ఆడిట్ బృందం గుర్తించింది. సంబంధిత వ్యక్తులను రూ.60 వేల వరకు రికవరీకి పీడీ ఎంపీడీవోను ఆదేశించారు. అనంతరం రోలుగుంట, నాతవరం, కోటవురట్ల, మాకవరపాలెం మండలాల్లోని ఎఫ్ఎఎస్, టీఎఎస్, ఈఎస్, ఏపీవోలతో సమీక్షించారు. 37,56,173 పని దినాలకు గాను 35,23,727 పని దినాలు పూర్తి చేశారని, మిగిలిన 2,32,446 పని దినాలను ఈ నెల 20వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి అమృత్ సర్వోవర్, రోడ్డుకు ఇరువైపులా రెండు కిలో మీటర్ల మేర మొక్కలు పెంపకం, 20 ఎకరాలు భూ అభివృద్ధి పనులు, ప్రతి రైతుకు మామిడి, కొబ్బరి, జీడి మొక్కలు పంపిణీ చేయాలన్నారు. చెరువు గట్లపై కొబ్బరి మొక్కలు నాటాలన్నారు. జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ నిర్మలాదేవి, స్టేట్ రిసోర్స్ పర్సన్ నాగరాజు, ఎంపీపీ సుర్ల రాజేశ్వరి, ఎంపీటీసీ బోళెం చినబాబు, టీడీపీ మండలాధ్యక్షుడు శ్రీరంగస్వామి పాల్గొన్నారు. -
రూ.11 లక్షలతో నిమ్మకట్టు కాలువకు సీసీ లైనింగ్
నాతవరం: వచ్చే ఖరీఫ్‌కు శివారు ఆయకట్టుకు సైతం నిమ్మకట్టు ఆనకట్ట నీరందేలా కాలువలు అభివృద్ధి చేస్తున్నామని తాండవ ప్రాజెక్టు డీఈ అనురాధ తెలిపారు. మండలంలో రాజుపేట అగ్రహారం సమీపంలో తాండవ నదిపై నిర్మించిన నిమ్మకట్టు ఆనకట్ట ప్రధాన కాలువకు చేస్తున్న సిమెంటు లైనింగ్ పనులను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.11 లక్షలతో ఆనకట్ట ప్రధాన గేటు దిగువ ప్రాంతంలో పంట కాలువకు సిమెంటు లైనింగ్ చేస్తున్నామన్నారు. ఆనకట్ట నిర్మాణ సమయంలో చేసిన పనులు పూర్తిగా శిథిలమై రాళ్లు తేలిపోయాయన్నారు. దాంతో పూడిక తీసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందని ఆయకట్టు రైతుల కోరిక మేరకు సిమెంటు లైనింగ్ చేస్తున్నామన్నారు. కాలువకు ఇరువైపులా కొంతమేర గోడ నిర్మిస్తామన్నారు. ఈ వేసవిలో రెండు జిల్లాల సరిహద్దులో కాలువలు అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో తాండవ ప్రాజెక్టు నాతవరం సెక్షన్ జేఈ శ్యామ్‌కుమార్, మన్యపురట్ల పరిధి తాండవ ప్రాజెక్టు నీటి సంఘం అధ్యక్షుడు అప్పన దివాణం, వర్కు ఇన్స్పెక్టరు అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు.తాండవ ప్రాజెక్టు డీఈ అనురాధ -
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
చోడవరం: స్థానిక ఆర్టీసీ కాంపెక్స్ సమీప కాలువలో గుర్తుతెలియని మృతదేహాన్ని చోడవరం పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ మృతదేహం దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారెళ్లి మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు తీశారు. సుమారు 45–50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మగవ్యక్తిగా గుర్తించారు. నల్లరంగు పుల్ప్యాంట్, నల్లరంగు పుల్‌హ్యాండ్స్ నిలువు గీతలు కలిగిన చొక్కా శరీరంపై ఉన్నట్టు ఎస్ఐ నాగకార్తీక్ చెప్పారు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేశామన్నారు. మృతుడి కుటుంబ సభ్యులుగానీ బంధువులుగానీ 9440796090, 9492952555 నంబర్లను సంప్రదించాలన్నారు. -
ఇసుక అక్రమ రవాణాపై ఆర్డీవోకు ఫిర్యాదు
నర్సీపట్నం: మాకవరపాలెం మండలం జంగాలపల్లిలో భారీ ఎత్తున ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఓబీసీ చైర్మన్ బొంతు రమణ తెలిపారు. ఈ మేరకు శుక్ర వారం నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణకు ఫిర్యాదు చేశారు. సుమారు 30 ఎకరాల్లో ఇసుక మేటలను అడ్డుగోలుగా తవ్వేస్తున్నారని, పర్యావరణానికి ఇబ్బందులు తలెత్తున్నప్పటికీ మైనింగ్, రెవెన్యూ, పోలీసు పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉచిత ఇసుక ముసుగులో రాత్రింబవళ్లు తేడా లేకుండా రవాణా చేస్తున్నారని, తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు లేవని వాపోయారు. స్థానిక నాయకులు కోట్లాది రూపాయల ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని, దీనికి అడ్డుకట్ట వేయాలని కోరారు. -
గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి
పరవాడ: గంజాయి అక్రమ రవాణా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పోలీసులను ఆదేశించారు. పరవాడ పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఆయన అకస్మికం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి వినియోగదారుల వివరాలను సేకరించి, వారిపై నిఘా ఉంచాలన్నారు. రౌడీ షీటర్లు, చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులను కౌన్సిలింగ్ చేయడంతో పాటు వారి కార్యకలాపాలపై నిఘా ఉంచాలన్నారు. నేరాల నియంత్రణకు గస్తీ చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమల్లో జరిగే ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళా చట్టాలు, పోక్సో యాక్ట్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, సైబర్ క్రైం, రోడ్డు భద్రతలపై స్థానిక పోలీసులు, మహిళా పోలీసులతో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. స్టేషన్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను పరిశీలించి, వాటి పురోగతిని ఆరా తీశారు. స్టేషన్ సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్, పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు, ఎస్ఐలు కృష్ణారావు, మహలక్ష్మిలు ఉన్నారు.పరవాడ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీలో ఎస్పీ తుహిన్ సిన్హా -
స్నేహితుని వివాహానికి వచ్చి మృత్యువాత
రాంబిల్లి(అచ్యుతాపురం): స్నేహితుడి వివాహానికి వచ్చిన ఐటీఐ విద్యార్థి శారదా నదిలో ఈతకు దిగి మృతి చెందాడు. రాంబిల్లి మండలం కొత్తూరులో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. రావికమతం మండలానికి చెందిన ఎస్.మణికంఠ విశాఖలోని ప్రైవేట్ ఐటీఐలో చదువుతున్నాడు. కొత్తూరులో తన స్నేహితుని వివాహానికి గురువారం విచ్చేశాడు. ఇక్కడ తన స్నేహితులతో కలిసి శారదా నదిలో సరదాగా ఈతకు దిగాడు. ఆ సమయంలో ఈత కొడుతూ పెద్ద గొయ్యిలో మునిగిపోయాడు. ఎంతకూ బయటకు రాకపోవడంతో మిగిలిన ఫ్రెండ్స్ గట్టిగా కేకలు వేశారు. దాంతో చుట్టు పక్కల వారు వచ్చి పోలీసుల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శారదా నదిలో ఈతకు దిగి రావికమతం విద్యార్థి మృతి -
కూటమి నాయకులకు సిగ్గుండాలి
చీడికాడ: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ప్రారంభమైన రోడ్డు నిర్మాణం ఇటీవల పూర్తయితే, కూటమి ప్రభుత్వం చేసిందని చెప్పుకోవడానికి సిగ్గుండాలని అధికార పార్టీ నాయకులపై వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు గొల్లవిల్లి రాజుబాబు, ఎంపీపీ కురచా జయమ్మ నారాయణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. చీడికాడ మండలం వి.బి.పేట నుంచి కొండేంపూడి, గొప్పూరు వరకు నిర్మించిన తారురోడ్డును శుక్రవారం వి.బి.పేట సర్పంచ్ వంటాకు సూర్యనారాయణ ఆధ్వర్యంలో కొండేంపూడి, గొప్పూరు, ముడిచర్ల, జైపురం గ్రామాల గిరిజనులతో కలిసి వారు పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ గతేడాది జనవరి 22న రూ.5.65 కోట్ల నాబార్డు నిధులతో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు శంకుస్థాపన చేసి రోడ్డు పనులు ప్రారంభించారన్నారు. అప్పటి నుంచి నిరంతరాయంగా పనులు జరిగి నేడు అందుబాటులోకి వచ్చిందన్నారు. దీన్ని కూటమి ప్రభుత్వమే చేసిందని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకోవడానికి సిగ్గుండాలన్నారు. సర్పంచ్ వంటాకు నర్సింహామూర్తి, గిరిజన గ్రామాల నేతలు కోట గంగరాజు, సింగారపు నాగరాజు, బోళెం రాము, సింగారపు ముసిలి, సొలం కొండబాబు తదితరులు మాట్లాడుతూ తమ గ్రామాలకు దారి లేక పోవడంతో మహానేత వైఎస్సార్ హయాంలో రూ.6 లక్షలతో మెటల్ రోడ్డు నిర్మించారని, తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఈ మెటల్ రోడ్డును తారురోడ్డుగా మార్చి తమ కష్టాలను తీర్చారన్నారు. వీరి రుణం తీర్చుకోలేనిదని కృతజ్ఞతలు తెలిపారు. సీడీసీ చైర్మన్ సుంకర శ్రీనివాసరావు, శిరిజాం, ఖండివరం ఎంపీటీసీలు ఈర్లి దేవినాయుడు, గెంజి స్వామిబాలాజీ, వైస్ ఎంపీపీ ధర్మిశెట్టి స్వాతి కొండబాబు, పార్టీ నేతలు పోతల రమణ, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ హయాంలోనేవి.బి.పేట–గొప్పూరు తారురోడ్డు నిర్మాణం 4 గ్రామాల గిరిజనులతో పార్టీ నేతల పరిశీలన -
హెల్త్‌సిటీలో రక్త రుగ్మతల కేంద్రం ప్రారంభం
ఆరిలోవ: హెల్త్‌సిటీ యునిక్ ఆస్పత్రిలో మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో రక్త రుగ్మతుల కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఈ కేంద్రాన్ని హెమటాలజీ పితామహుడు డాక్టర్ మామ్మెన్ చాందీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సికిల్ సెల్, తలసేమియాతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉన్నారన్నారు. అలాంటి వారికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. పేదలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా ఈ కేంద్రాన్ని నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కేంద్రం విశాఖలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఊన్న మురళీకృష్ణను అభినందించారు. నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సదాశివుడు మాట్లాడుతూ విశాఖలో రక్త రుగ్మతుల కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఆరోగ్య సంరక్షణలో కీలక ముందుడుగు పడిందన్నారు.దీర్ఘకాలిక వ్యాధులు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. అలాంటి సమస్యల నివారణకు ఈ కేంద్రం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఏపీతోపాటు ఒడిశా, చత్తీస్‌గఢ్‌లలో ఎక్కడా రక్త వ్యాధులను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా హెమటాలజీ కేంద్రం లేదన్నారు. ఈ లోటును భర్తీ చేయడానికి ఇక్కడ సమగ్ర రక్త రుగ్మతల కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పలువురు ఆంకాలజీ విభాగం వైద్యులు పాల్గొన్నారు. -
ప్రజల మనిషిగా.. వారిలో ఒకరిగా..
నియోజకవర్గ కేంద్రం మాడుగుల సర్పంచ్‌గా ఎడ్ల కళావతి సేవా కార్యక్రమాల్లో ముందున్నారు. పోస్టుమాన్ కుమార్తె అయిన ఆమె సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. ప్రజల కష్టసుఖాలు తెలుసు. ప్రతి రోజు ఉదయాన్నే గ్రామంలో తిరుగుతూ కొళాయిలు సక్రమంగా వస్తున్న దీ లేనిదీ పరిశీలిస్తుంటారు. లేకపోతే వెంటనే సరి చేయిస్తారు. పారిశుధ్య నిర్వహణను పర్యవేక్షిస్తారు. పంచాయతీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారు. గత ప్రభుత్వంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు సహకారంతో ఇంటింటికీ కొళాయిలు, సీసీ రోడ్లు, ప్రధాన డ్రైనేజీలు, కోట్లాది రూపాయలతో శాశ్వత తాగునీటి పథకం నిర్మించి గ్రామాన్ని స్వర్గసీమగా మార్చారు. – మాడుగులమాడుగుల మహిళా సర్పంచ్ సేవలు -
రాయితీపై పాడి పశువులకు బీమా
మాకవరపాలెం: రాయితీపై పశువులకు బీమా కల్పిస్తున్నట్టు పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారి రామ్మోహన్రావు తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో ఆయన శుక్రవారం మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పశువులకు 80 శాతం రాయితీతో బీమా అందిస్తున్నాయన్నారు. రెండేళ్ల కాలంలో 10,231 పశువులకు బీమా చేయగా, మృతి చెందిన 179 పశువులకు మంజూరైన రూ.52 లక్షల 98 వేల బీమా నగదును రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. ఈ నెల 1 నుంచి ప్రారంభమైన గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమంలో జిల్లాలో ఇప్పటి వరకు 90 వేల పశువులకు టీకాలు వేశామన్నారు. వర్షాకాలంలో పశువులకు అధికంగా సోకే గాలికుంటు వ్యాధిని నివారించేందుకు ఈ నెలాఖరు వరకు టీకాలు వేస్తున్నామన్నారు. జిల్లాలో 817 మినీ గోకులాలు మంజూరు చేయగా ఇప్పటివరకు 742 గోకులాల నిర్మాణం పూర్తయినట్టు చెప్పారు. -
విజయోస్తు సీ్త్రరస్తు...!
సాక్షి, అనకాపల్లి: అవకాశాలను అందిపుచ్చుకొని మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పురుషులకు ఎందులోనూ తీసిపోమని తమ తమ వృత్తుల్లో ప్రావీణ్యతను చాటుకుంటున్నారు. అమ్మలా లాలించడమే కాదు.. సమర్థవంతంగా పాలించడంలోనూ ముందుంటామని నిరూపించుకుంటున్నారు. వివిధ విభాగాల్లో అధికారులుగా తమదైన ముద్ర వేసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఇద్దరూ మహిళలు కావడం విశేషం. జిల్లా యంత్రాంగంలో వివిధ విభాగాల్లో హెచ్వోడీలు మహిళలే ఉన్నారు. కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, డ్వామా పీడీ పూర్ణిమాదేవి, డీఆర్డీఏ పీడీ శచీదేవి, జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి శిరీషరాణి, పౌరసరఫరాల శాఖ అధికారి జయంతి, డీఎల్డీఓ మంజులావాణి, అనకాపల్లి డీఎస్పీ శిరీష, ఆర్డీవో షేక్ ఆయిషా.. ఇంకా డివిజన్, మండల స్థాయిలో వివిధ విభాగాల్లో మహిళా ఉద్యోగులు సేవలందిస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా మహిళలదే అగ్రస్థానం. విధానపరమైన నిర్ణయాల అమలులోనూ అతివలు కీలకంగా నిలుస్తూ తమదైన పాత్ర పోషిస్తున్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర, విశాఖ మేయర్ గొలగాని హరి వెంకటకుమారి జిల్లా రాజకీయ రంగంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మహిళకు చదువు.. ఇంటికి వెలుగు ఒక ఇంటిలో మహిళ చదువుకుని ఉద్యోగం చేస్తే.. ఆ ఇల్లంతా వెలుగుతూ ఉంటుంది. వారి చదువును తల్లిదండ్రులు నిర్ల క్ష్యం చేయకూడదు. వారికి చిన్నతనంలోనే పెళ్లి చేయడం తగదు. వారు మానసికంగా ఎదగాలి. తల్లిదండ్రుల ఆలోచనా విధానంతోనే మహిళ భవిష్యత్తు ఉంటుంది. పదో తరగతి తరువాత చదువులోనే కాదు.. వారు క్రీడలతో సహా ఏ రంగంపై ఆసక్తి చూపినా ప్రోత్సహించాలి. కుటుంబంలో ఒక మహిళ అభ్యుదయం వెనక తల్లిదండ్రులు, అన్న, తమ్ముడు ప్రోత్సాహం ఉంటుంది. – జాహ్నవి, జాయింట్ కలెక్టర్ఏ పని చేపట్టినా విజయమే.. మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. మహిళలు ఏ పనైనా సమర్ధవంతంగా చేయగలరు. ఒక ఇంటి బాధ్యతను ఎంత సక్రమంగా నడపిస్తారో.. అదేవిధంగా విధుల్లోనూ రాణిస్తారు. గతంలో ఆడవారిని ఇంటికే పరిమితం చేసేవారు. కానీ ఇప్పుడు అన్ని రంగాలలో మహిళలే ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ప్రతి ఆడపిల్ల విద్యాపరంగా... ఆర్థికంగా ఎదిగితే వారికి స్వతంత్రంగా అత్యున్నత స్థాయికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. దేశాభివృద్ధిలో కూడా మహిళ పాత్ర ఉంది. – విజయ కృష్ణన్, కలెక్టర్ -
క్షయ రహిత పంచాయతీగా భీమవరం ఎంపిక
బుచ్చెయ్యపేట: ఆర్.భీమవరాన్ని క్షయ రహిత పంచాయతీగా కేంద్రం ఎంపిక చేసినట్లు జిల్లా క్షయ నివారణాధికారి ఎస్.వి.కె.బాలాజీ తెలిపారు. ముక్త భారత్‌లో భాగంగా శుక్రవారం ఆయన తురకలపూ డి పీహెచ్సీ సిబ్బందితో సమావేశం నిర్వహించా రు. ఈనెల 24వ తేదీన టీబీ డే సందర్భంగా కేంద్ర బృందం అనకాపల్లి వచ్చి కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందిస్తారన్నారు. క్షయ నిర్మూలనకు వైద్య సిబ్బంది కృషి చేయాలన్నారు. వైద్యాధికారి డి.సంధ్యారాణి, కో ఆర్డినేటర్ అయ్యపురెడ్డి పెంటయ్య, ఆరోగ్య విస్తరణాధికారి రాజశేఖర్, ఫార్మాసిస్టు చంద్రమౌళి, పీహెచ్ఎన్ సీతమ్మ పాల్గొన్నారు. -
ఉపమాక కల్యాణోత్సవాలకు పటిష్ట బందోబస్తు
నక్కపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 9 నుంచి 17 వరకు జరిగే వార్షిక కల్యాణోత్సవాలకు 300మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. శుక్రవారం ఆయన ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయ పరిసరాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. వారం రోజుల పాటు జరిగే కల్యాణోత్సవాలకు సుమారు లక్షమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గొలుసు దొంగతనాలు, జేబు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈవ్ టీజింగ్‌ను నియంత్రించాలన్నారు. కల్యాణోత్సవ పరిసరాలు, మెయిన్ రోడ్డు, మాడ వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. మానిటరింగ్ కోసం తాత్కాలిక కంట్రోలు రూం ఏర్పాటు చేయా లని ఆదేశించారు. భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ కోసం డ్రోన్ కెమెరాలు ఉపయోగించాలని సూచించారు. అపరిచిత వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు. రథోత్సవం నాడు రోప్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. ఎస్బీ డీఎస్పీ అప్పారావు, నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు, సీఐలు కుమారస్వామి, రామకృష్ణ, ఎస్ఐ సన్నిబాబు, ఐటీ కోర్ ఎస్ఐ సురేష్‌బాబు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. మహిళా దినోత్సవానికి ఏర్పాట్లు శనివారం జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఎస్పీ తుహిన్ సిన్హా పరిశీలించారు. నక్కపల్లి డిగ్రీ కళాశాల ఆవరణలో మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరవుతారన్నారు. ఆలయానికి చేరిన ఆభరణాలు నక్కపల్లి: ఉపమాకలో ఈనెల 10వ తేదీన జరిగే వెంకన్న కల్యాణోత్సవాల సందర్భంగా స్వామివారికి అలంకరించేందుకు శుక్రవారం సబ్ ట్రెజరీ నుంచి ఆభరణాలను తీసుకువచ్చారు. స్వామివారికి వజ్ర వైఢూర్యాలు, మరకత మాణిక్యాలు, కెంపులు, కోట్లాది రూపాయల విలువైన పచ్చలహారం, చింతాకు పతకం, కాసుల పేర్లు, వజ్ర వైఢూర్యాలు పొదిగిన కిరీటం, కటి, హస్తాలు మొదలయిన స్వర్ణాభరణాలు ఉన్నాయి. భద్రతా కారణాల రీత్యా వీటిని విశాఖలో పటిష్ట బందోబస్తు మధ్య సబ్ ట్రెజరీలో భద్రపరుస్తున్నారు. కల్యాణోత్సవాలకు వీటిని తీసుకువచ్చి స్వామివారి ఉత్సవమూర్తులకు అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తారు. కల్యాణం అనంతరం వీటిని తిరిగి విశాఖ సబ్ ట్రెజరీకి తరలిస్తారు. శుక్రవారం చేరుకున్న ఆభరణాలను ఆలయం వద్ద ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్ తదితరులు స్వాధీనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీటిని శనివారం నుంచి స్వామికి అలంకరిస్తారు. ఆభరణాలను ఆలయంలో ఉంచిన నేపథ్యంలో ప్రత్యేక పోలీసు సిబ్బంది, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు సిబ్బందితో ఆలయం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్ సాయంతో పర్యవేక్షణ : ఎస్పీ తుహిన్ సిన్హా -
ప్రతి రోజు పండగ కావాలి
తుమ్మపాల: మహిళల జీవితంలో ప్రతి రోజు పండగ కావాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆకాక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆమె మిగతా మహిళా అధికారులతో కలసి పాల్గొన్నారు. కేట్ కట్ చేసి, జిల్లా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో ప్రతి మహిళ వారి కోరికలు, లక్ష్యాలను నెరవేర్చుకొనేలా కుటుంబ సభ్యులు సహాయపడాలని, చదువు, ఉద్యోగాలలో వారిని ప్రోత్సహించాలని కోరారు. నేడు అన్ని రంగాలలో మహిళలు ముందుంటున్నారని, రాజకీయ, విద్య, న్యాయ, వైద్య, రక్షణ, పరిపాలన, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్నత పదవులను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని, కళలు, ఆటలు, పారిశ్రామిక, వ్యవసాయం వంటి అనేక రంగాలలో ఉన్నతంగా రాణిస్తున్నారని అన్నారు. ప్రతి బాలికకు విద్యను అందించాలని, మహిళకు ఉన్నత స్థానాన్ని ఇవ్వాలని, వారి మాటకు గౌరవాన్నివ్వాలన్నారు. మహిళను గౌరవించిన సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. జేసీ ఎం.జాహ్నవి మాట్లాడుతూ ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉన్నత స్థానానికి చేరిన మహిళా అధికారులు జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. మహిళల జీవితాల్లో ఎన్నో మార్పులు వచ్చాయని కుటుంబ బాధ్యతలతో పాటు, వృత్తిలో కూడా రాణిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. చిన్నారులు నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆర్డీవో షేక్ ఆయిషా, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు సుబ్బలక్ష్మి, రమామణి, మనోరమ, కలెక్టరు కార్యాలయ పరిపాలనాధికారి బి.వి.రాణి, ఇతర మహిళా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ విజయ కృష్ణన్ ఆకాంక్ష మహిళలకు శుభాకాంక్షలు -
చిన్నారులపై లైంగిక నేరాలకు కఠిన శిక్షలు
యలమంచిలి రూరల్: చిన్నారులు, బాలలపై లైంగిక దాడులకు పాల్పడితే పోక్సో చట్టం ప్రకారం కఠిన శిక్షలు విధిస్తారని యలమంచిలి సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ అధ్యక్షురాలు పి.విజయ అన్నారు. శుక్రవారం యలమంచిలి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో స్వయం సహాయక సంఘాల మహిళలు, ఆశ కార్యకర్తలు, పురపాలక సంఘం పరిధిలో మహిళా ఉద్యోగులకు పోక్సో చట్టంపై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉన్నత స్థానాల్లో ఉన్న ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు వంటి వారు తమ స్థానాన్ని ఆసరాగా చేసుకుని పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే జీవిత ఖైదు, ఇంకా తీవ్రమైన నేరాలకు పాల్పడితే మరింత కఠినమైన శిక్షలు ఉంటాయన్నారు. చైల్డ్ పోర్నోగ్రఫీ తీవ్రమైన నేరంగా చట్టం చెబుతోందన్నారు. లైంగిక నేరాల కేసులకు సంబంధించి బాధిత పిల్లల దగ్గర్నుంచి వాంగ్మూలాలు తీసుకుంటున్న సమయంలో వారు తమపై జరిగిన అఘాయిత్యాలను చెబుతుంటే చాలా బాధ కలుగుతోందన్నారు. తల్లిదండ్రులు ప్రతిరోజూ పిల్లలతో స్నేహపూర్వకంగా మెలుగుతో పాఠశాలలు, కళాశాలల్లో వాళ్లతో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది, సహచర విద్యార్థులు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకుంటూ ఉండాలన్నారు. చెడు, మంచి స్పర్శల మధ్య తేడాను వారికి వివరించాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ పిల్లా రమాకుమారి, మున్సిపల్ కమిషనర్ బీజేఎస్ ప్రసాదరాజు, యలమంచిలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ధూళి నూకరాజు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల వికాసం కోసం..
టీచర్‌గా పాఠాలు బోధించడాని కే పరిమితం కాలేదు ఆమె. సేవలతో ఆదర్శప్రాయంగా నిలిచారు. విద్యార్థులు మెచ్చే మార్గదర్శిగా గుర్తింపు పొందారు. కె.జె.పురం జెడ్పీ హై స్కూల్లో ఆంగ్ల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న పారుపల్లి వెంకటసత్య పద్మజ. పనిచేసిన ప్రతి పాఠశాలలో తనదైన ముద్ర వేశారు. ఆమె వెంకటాపురం ఎంపీపీ పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు 2019లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డును గురుపూజోత్సవం సందర్భంగా అందుకున్నారు. ఆ పాఠశాలకు ఆమె రూ.1.35 లక్షల విలువ చేసే 10 ఇనుప బెంచీలను విరాళంగా అందజేశారు. చినగదిలి మండలం లక్ష్మీనగర్, వెంకటాపురం పాఠశాల విద్యార్థుల కోసం కంచాలు, గ్లాసులు, షూలు అందించారు. పేద విద్యార్థులకు ఫీజులు కడుతుంటారు. కొత్తపాలెం హైస్కూలు విద్యార్థుల కు పుస్తకాలను పంపిణీ చేశారు. ఉపాధ్యాయిని పద్మజ ఎన్సీసీ స్టూడెంట్ కూడా. అదే స్ఫూర్తితో వెంకటాపురం పాఠశాలలో 92 మంది విద్యార్థులకు రూ.97 వేలు విలువ చేసే ఆర్మీ యూనిఫాం కుట్టించారు. వారితో చక్కని ఫొటో దిగి వారిని ప్రోత్సహించారు. – మాడుగుల రూరల్ -
చెరకు తోటలో చకచకా..
చెరకు తోటలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన ఆ మహిళా రైతు పేరు సుంకరి అప్పారావమ్మ. బుచ్చెయ్యపేట మండలం కేపీ అగ్రహారానికి చెందిన ఆమె భర్తకు దీటుగా 30 ఏళ్లుగా చెరకు సాగు పనుల్లో పాల్గొంటోంది. మగవారికి సమానంగా ఆడవారు కష్టపడితేనే కుటుంబం హాయిగా సాగుతుందని, ఎంతో ఆత్మవిశ్వాసం కలుగుతుందని ఆమె చెబుతోంది. 3 ఎకరాల్లో చెరకు తోట సాగు చేస్తున్నామని, చెరకు నాట్లు, గొప్పులు, పొలంలో అన్ని రకాల పనులు చేయగలనని చెప్పింది. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ ఈ ఏడాది సక్రమంగా నడవకపోవడంతో బెల్లం ఆడి లాభాలు వచ్చేలా చూసుకుంటున్నామని చెప్పింది. ఇద్దరు అబ్బాయిల్ని, అమ్మాయిని చదివించి వారికి వివాహాలు చేశామని, ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉన్నామని తెలిపింది. మగవారితోపాటు ఆడవారు కష్టపడితే ఆర్థిక ఇబ్బందులుండవని పేర్కొంది. – బుచ్చెయ్యపేట -
పెదఉప్పలంలో సర్వే టీం పర్యటన
ఎస్.రాయవరం: కేంద్ర ప్రభుత్వ పథకాలు సరిగా అమలవుతున్నాయో లేదో తెలుసుకునేందుకు సర్వే టీం శుక్రవారం పెదఉప్పలం గ్రామంలో పర్యటించింది. నీతి ఆయోగ్ పంపిన బృందం సభ్యులు ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. . ఈ టీమ్‌కు సచివాలయ సిబ్బంది, ఇన్చార్జ్ ఎంపీడీవో సత్యనారాయణ తదితరులు సహాయ సహకారాలు అందించారు. కేంద్రం నుంచి వచ్చిన టీమ్‌లో ఫీల్డ్ మేనేజర్ వికాస్ మల్కర్, టీమ్ సూపర్వైజర్ సంధ్యారాణి, ఇన్వెస్టిగేటర్ భానుచందర్, లోకేష్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
No Headline
ఏయూక్యాంపస్: అమ్మాయిల చదువుకు ఎక్కువగా ప్రాధాన్యత లేని రోజుల్లో 17 ఏళ్ల వయసులో పెళ్లిపీటలపై కూర్చున్నారు. పెళ్లిచూపుల సమయంలో పెళ్లికొడుకు చదువుకుంటావా అని అడిగిన ప్రశ్న ఆమెలో కొత్త ఆశలను చిగురించేలా చేసింది. అలా భర్త సహకారంతో తన చదువును కొనసాగించారు. నేడు దేశంలో ప్రతిష్టాత్మకమైన ఆంధ్రవిశ్వవిద్యాలయం న్యాయ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా బాధ్యతలను నిర్వహించే స్థాయికి ఎదిగారు ఆచార్య కె.సీతామాణిక్యం. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక సీ్త్ర ఉంటుందంటారు. కానీ ఆచార్య సీతామాణిక్యం విజయం వెనుక ఆమె భర్త తమ్మిరెడ్డి ఉన్నారు. చిన్న వయసులో పెళ్లి చేసుకున్నా విద్యపై ఉన్న ఆసక్తితో ఆమెను ప్రోత్సహించారు. ప్రైవేటుగా డిగ్రీ పూర్తిచేసి అనంతరం ఎం.ఏ హిస్టరీ, బ్యాచ్‌లర్ ఆఫ్ లా, ఎం.ఏ ఇగ్లీషు, ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్లా(ఎల్ఎల్ఎం) పూర్తిచేశారు. ఒకవైపు కుటుంబం, పిల్లలు బాధ్యతలను నిర్వహిస్తూ ఒడిశాలోని బ్రహ్మపుర విశ్వవిద్యాలయం నుంచి 2000 సంవత్సరంలో సైబర్ నేరాలపై పరిశోధన చేసి డాక్టరేట్ సాధించారు. 2014లో పోస్ట్ డాక్టరోల్ ఇన్ లా(ఎల్ఎల్డీ)ని అందుకున్నారు. రాష్ట్రం నుంచి ఈ డిగ్రీ సాధించిన తొలి వ్యక్తి ఆచార్య సీతామాణిక్యం కావడం విశేషం. వివాహం, కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే తన ఆకాంక్షలను సాకారం చేసుకోవచ్చు అనడానికి ఆచార్య సీతామాణిక్యం జీవితం ఒక ఉదాహరణ మాత్రమే. అనంతరం ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఏయూలో 2006లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. 2021లో ప్రొఫెసర్‌గా బాధ్యలు చేపట్టారు. 24 జూన్ 2024 నుంచి న్యాయ కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. 2023లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ టీచర్ అవార్డును అందుకున్నారు. -
స్కూటీ అదుపు తప్పి.. మహిళా పోలీస్ దుర్మరణం
అనకాపల్లి: స్కూటీ (Scooty)అదుపు తప్పిన ఘటనలో మహిళా పోలీసు(Female police officer) చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి మల్కాపురం ఎస్ఐ శ్యామలరావు తెలిపిన వివరాలివి. అంగనపూడి ప్రాంతానికి చెందిన మీను భూషణ్(46) కూర్మన్నపాలెం సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త స్టీల్‌ప్లాంట్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో మీను భూషణ్ తన కుమార్తెతో కలిసి స్కూటీపై షీలానగర్ నుంచి పోర్టు ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా నగరం వైపు వెళ్తున్నారు. బ్రిడ్జి ఎక్కుతుండగా, ఆమె వెళ్తున్న మార్గంలో ఇద్దరు వ్యక్తులు గడ్డి పట్టుకుని రోడ్డు దాటుతున్నారు. వారిని గుర్తించిన మీను భూషణ్ వెంటనే తన స్కూటీకి అకస్మాత్తుగా బ్రేక్ వేశారు. దీంతో వాహనం అదుపు తప్పి పక్కనున్న డివైడర్‌ను ఆమె ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మీను భూషణ్‌కు తలకు, ఆమె కుమార్తెకు శరీరంపై గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మీను భూషణ్ గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కాళ్లు పట్టుకుని బతిమిలాడాను.. -
‘అమ్మానాన్నా.. ఐ యామ్ సారీ’
ఎస్.రాయవరం: పరీక్షల ఒత్తిడో...అనారోగ్య కారణమో.... లేత మనసుకు తగిలిన గాయమో...ఓ బాలిక ఉసురు తీసింది. పరీక్షల సమయంలోనే ఓ విద్యా కుసుమం రాలిపోయింది.. కోనవానిపాలెం గ్రామంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం(Intermediate second year) చదువుతున్న బాలిక ఉరి పోసుకుని గురువారం మృతి చెందింది. ఎస్ఐ విభీషణరావు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు తుని చైతన్య కళాశాలలో చదువుతున్న విద్యార్థిని జోగా సృజన జయప్రియ(Srijana Jayapriya) (17) బుధవారం ఇంగ్లిష్ పరీక్ష రాసి ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి నీరసంగా ఉండడంతో ఆమెను ఇంటి దగ్గర ఉంచి, తల్లిదండ్రులు గురువారం మధ్యాహ్నం ఓ ఫంక్షన్‌కి వెళ్లారు. ఇంటిదగ్గర ఎవరూ లేని సమయం చూసి సృజన జయప్రియ సూసైడ్ నోట్ రాసి ఉరిపోసుకుని చనిపోయింది. ఈ సూసైడ్ నోట్లో(Suicide note) ‘అమ్మ, నాన్న నన్ను క్షమించండి...నా చావుకి నా ఆరోగ్యమే(Health) కారణం ఈ బాధలు తట్టుకోలేక పోతున్నాను...దేనిమీద దృష్టి పెట్టలేక చాలా బాధపడ్డా.. నా కోరిక తీర్చుకోలేనేమోనని నాలో నేనే చాలా బాధ అనుభవించాను...సారీ అమ్మ ఎందుకు చనిపోయానో కారణం ఎవరికీ చెప్పకండి.. నేను బ్రతికుండి ప్రయోజనం లేదు.. తమ్ముడు చరణ్, చిన్నా మీరు బాగా ఉండండి. మీరంటే నాకు చాలా ఇష్టం. అమ్మని బాగా చూసుకోండి... నాన్నను బాధపెట్టకండి. నాన్న చెప్పిన మాట ఆలకించండి.. నేనే చనిపోతున్నందుకు చాలా బాధగా ఉంది.. లవ్యు అమ్మ, నాన్న అండ్ మై బ్రదర్స్ గుడ్‌బై..’ అని రాసింది. ఈ లెటర్ చూసి చదివిన వారందరూ కన్నీటి పర్యంతమయ్యారు. చదువులో మంచి మార్కులు తెచ్చుకుని అందమైన జీవితం ఉంటుందనుకున్న తరుణంలో కుటుంబ సభ్యులను తీరని దుఃఖ సాగరంలో ముంచి బాలిక మృతి చెందిందని ఆవేదన చెందారు. గ్రామంలో ఈ బాలిక మృతి వార్త విని ప్రతి ఒక్కరూ విషాదంలో మునిగిపోయారు. చదువు ఒత్తిడి, చిన్న ఆనారోగ్యం బాలిక ప్రాణాలు తీశాయని పోలీసులకు తెలిపారు. వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భారతీయ మహిళలు ధైర్యవంతులు
విశాఖ విద్య: భారతీయ మహిళలు ఎంతో ధైర్యవంతులని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు ఎస్.విజయభారతి అన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో దుర్గాబాయి దేశముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్, ఏబీఆర్ఎస్ఎం–లేడీ టీచర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం–2025 వర్క్‌షాప్ ఆక్సెలరేట్ యాక్షన్‌ను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీ్త్ర విద్యతో సమాజాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. సంస్కారవంతమైన యువతకు తల్లిదండ్రులే కీలకమని చెప్పారు. సమాజం కోసం, దేశం కోసం అనే భావనతో యువత ముందుకెళ్లాలని సూచించారు. వివేకానందుడు కలలుగన్న విధంగా యువతరం ఉజ్వల తారలుగా మారి, తమ ఆశయాలను సాకారం చేసుకోవాలన్నారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో మహిళల విజయగాథలను వివరించారు. కార్యక్రమంలో ఆచార్య ఎ.పల్లవి ఆంధ్రప్రదేశ్ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ పి.శ్రీదేవి, ఐఏఎస్ఈ ప్రిన్సిపాల్ ఆచార్య డి.నగరాజకుమారి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలు విజయభారతిని వైస్‌ఛాన్సలర్ ఆచార్య రాజశేఖర్, రిజిస్ట్రార్ ధనుంజయరావు జ్ఞాపిక అందించి, సత్కరించారు. జాతీయ హక్కుల కమిషన్ సభ్యురాలు ఎస్.విజయభారతి -
కుట్టు శిక్షణ ఉంది.. అంగన్వాడీ భవనం ఖాళీ చేయండి.!
● వమ్మవరంలో కూటమి నాయకుడి దౌర్జన్యం ● ఎటువంటి సమాచారం లేకుండా సామగ్రి తరలింపు ● అడ్డగించిన అంగన్వాడీ సిబ్బంది, లబ్ధిదారులు ఎస్.రాయవరం: కూటమి నాయకుల బెదిరింపులకు అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. చిన్నారుల ప్రాథమిక విద్యకు ఎంతో ఉపయోగపడుతున్న అంగన్వాడీ కేంద్రాన్ని సైతం వదలడం లేదు. తమ అవసరాల కోసం మూడు నెలల పాటు ఈ కేంద్రాన్ని అప్పగించి వేరే చోటకు మారాలని ఒత్తిడి చేస్తున్నారు. అంతటితో ఆగకుండా కేంద్రంలోని సామగ్రిని పంచాయతీ స్వీపర్లతో తరలించడం చర్చనీయాంశంగా మారింది. వివరాలిలా ఉన్నాయి. వమ్మవరం పంచాయతీ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భవనంలో నాలుగేళ్లుగా రెండో నంబర్ గల అంగన్వాడీ కేంద్రం నిర్వహిస్తున్నారు. అంతకు ముందు 18 ఏళ్ల పాటు ఈ కేంద్రం అద్దె భవనంలో నడిచేది. అప్పట్లో ఖాళీగా ఉన్న ఈ భవనాన్ని సర్పంచ్ పాలపర్తి పాపారావు అంగన్వాడీ కేంద్రానికి కేటాయించారు. అప్పటి నుంచి దళిత కాలనీ పరిధిలో ఉన్న ఈ భవనంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు, కిషోర్ బాలికలకు సేవలందిస్తూ అంగన్వాడీ కేంద్రం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీటీసీ కూటమి ప్రభుత్వం అండదండలతో మహిళలకు కుట్టు శిక్షణ ఉంది ఈ భవనం తనకు 3 నెలలు పాటు కావాలని ఒత్తిడి చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా పంచాయతీ స్వీపర్లు వెంటబెట్టుకొని వచ్చి గురువారం ఈ భవనంలో ఉన్న అంగన్వాడీ సామగ్రిని తరలించే ప్రయత్నం చేశారు. ఉన్న పళంగా వేరే భవనానికి ఎలా వెళ్లాలని అంగన్వాడీ సిబ్బందితో పాటు లబ్ధిదారులు మాజీ ఎంపీటీసీని ప్రశ్నించారు. దళిత కాలనీకి అందుబాటులో ఉన్న ఈ భవనం నుంచి అంగన్వాడీ కేంద్రాన్ని తొలగించవద్దని, గ్రామానికి దూరంగా మారిస్తే చిన్నారులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడతారని చెప్పారు. అయినా వినిపించుకోకపోవడంతో విషయం తెలుసుకున్న సర్పంచ్ పాపారావు, ఎంపీటీసీ బాలం సూరిబాబు కలగజేసుకున్నారు. భవనంలో తీసిన సామగ్రిని యథావిధిగా పెట్టి అక్కడి నుంచి వెనక్కి రావాలని సూచించారు. దీంతో సామగ్రి తొలగింపు ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేశారు. కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు విషయమై ఇన్చార్జి ఎంపీడీవోను సంప్రదించగా.. కుట్టు శిక్షణ కార్యక్రమం ప్రతిపాదన ఉందని, గ్రామంలో అనువైన భవనం చూసి ఏర్పాటు చేస్తామన్నారు. నిర్వహణలో ఉన్న అంగన్వాడీ భవనాన్ని ఖాళీ చేయాలని తాము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు. -
100 అడుగుల వెడల్పున లంకెలపాలెం–అసకపల్లి రోడ్డు
● భూ సేకరణ గ్రామ సభలో ఆర్డీవో షేక్ ఆయిషాసబ్బవరం: మండలంలోని పైడివాడ అగ్రహారం నుంచి లంకెలపాలెం–అసకపల్లి రోడ్డును అనకాపల్లి జిల్లా కోడూరు గ్రామంలోని ఏపీఐఐసీ ఎంఎస్ఎంఈ పార్కు వరకూ రెండు వరసల రహదారిగా విస్తరించనున్నట్లు ఆర్డీవో షేక్ ఆయిషా తెలిపారు. మండలంలోని పైడివాడ అగ్రహారంలో రోడ్డు విస్తరణకు అవసరమయ్యే భూ సేకరణపై రైతులకు అవగాహన కల్పించేందుకు గురువారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో 100 అడుగుల వెడల్పున రెండు లేన్లలో 2.68 కి.మీ. మేర ఈ రోడ్డును విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. రోడ్డు విస్తరణ డీపీఆర్ ముసాయిదా ఇప్పటికే సిద్ధమైందన్నారు. గ్రామంలో 12.26 ఎకరాల మేర భూమిని సేకరించే అవకాశం ఉందని వెల్లడించారు. విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు వీఎంఆర్డీఏ ద్వారా టీడీఆర్ బాండ్లు జారీ చేస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ చిన్నికృష్ణ, మండల సర్వేయర్ అప్పారావు, ఆర్ఐ వీరయ్య, వీఆర్వో దేముడుబాబు, ఎంపీటీసీ సీరం అప్పలరాజు, గ్రామ పెద్దలు అక్కిరెడ్డి దుర్గినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
దారి కాచి దారుణం...
అనకాపల్లి : బుచ్చెయ్యపేట మండలం కరక గ్రామానికి చెందిన భీమవరపు నూకేష్ (28) ను బుధవారం రాత్రి అనకాపల్లి మండలం కుంచంగి గ్రామం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు పీక కోసి పరారయ్యారు. నూకేష్ అక్కడికక్కడే రక్తపు మడుగులో పడిపోయాడు. అటుగా వెళుతున్న వాహనదారులు, స్థానికులు రోడ్డుపై పడి ఉన్న నూకేష్కుమార్ను హుటాహుటిన 108 వాహనంలో ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ అశోక్‌కుమార్ సంఘటన స్థలం వద్దకు చేరుకుని పరిశీలించారు. బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం రూమ్‌లో భద్రపరిచి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గురువారం తెల్లవారుజామున మృతుడి సెల్‌ఫోన్ ఆధారంగా నలుగురు అనుమానితులను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద మిన్నంటిన రోదనలు ఈ ఘటనపై సమాచారం అందుకున్న మృతుడి భార్య ఇందు, రెండేళ్ల కుమారుడు సాత్విక్, ఇతర కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ వైద్యాలయం వద్దకు చేరుకుని భోరున విలపించారు. భీమవరపు నూకేష్ విశాఖ డాక్‌యార్డులో కాంట్రాక్టర్ వద్ద కార్పెంటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నిత్యం బుచ్చియ్యపేట నుంచి విశాఖకు బైక్‌పై రాకపోకలు సాగిస్తున్నాడు. గతంలో నూకేష్ బెట్టింగ్‌లో కొంత నగదు పోగొట్టుకోగా, ఆ సమయంలో బెట్టింగ్ గ్యాంగ్‌కు కుటుంబ సభ్యులు అప్పులు తీర్చారు. ప్రస్తుతం ఎటువంటి అప్పలు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం సెలవు తీసుకుని ఇంటి వద్దనే ఉన్న నూకేష్ రాత్రి 8 గంటల సమయంలో ఫోన్ కాల్ రావడంతో బుచ్చెయ్యపేట మండలం సీతయ్యపేట గ్రామానికి స్నేహితుల వద్దకు వెళ్లి వస్తానని వెళ్లాడు. అక్కడ నుంచి అనకాపల్లి వస్తుండగా కుంచంగి వద్ద నూకేష్ దుండగుల దాడికి గురయ్యాడు. నిందితులను పట్టుకుంటాం : రూరల్ సీఐ అశోక్‌కుమార్ మండలంలో కుంచంగి గ్రామం వద్ద హత్యకు గురైన నూకేష్ ఘటనలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకోవడం జరుగుతుందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగిందని, మృతుడి భార్య ఇందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
బుచ్చెయ్యపేట: మండలంలోని ఆర్.శివరాంపురం గ్రామం వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. రాజాం నుంచి మల్లాం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని కూడ్రం నుంచి రాజాం వైపు వస్తున్న స్కూల్ వ్యాను ఢీకొంది. ఈ ప్రమాదంలో గొరపల్లి మణి, అప్పారావు, ఆది బుల్లికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ప్రైవేటు వాహనంలో అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన స్కూల్ బస్సు యాజమాన్యం కనీసం బాధితులను పట్టించుకోకుండా వెళ్లిపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఉపాధి కూలీల ఆందోళన
బుచ్చెయ్యపేట: ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించి తమకు ఉపాధి పనులు కల్పించాలని కోరుతూ ఎల్.సింగవరం గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. గ్రామంలోని కొండల వద్ద ఉన్న ప్రభుత్వ బంజరు భూమిలో గురువారం జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేపట్టడానికి వెళ్లిన కూలీలను అదే గ్రామానికి చెందిన కొంత మంది అడ్డుకున్నారు. ఈ భూమిని నమ్ముకుని తుప్పలు తొలగించి మొక్కలు పెంచుకుని ఉపాధి పొందుతున్నామని, ఇక్కడ ఉపాధి పనులు చేపట్టొద్దని కూలీలను అడ్డగించారు. దీంతో గ్రామ నాయకులు కలగజేసుకుని ఉపాధి పనులను అడ్డుకోవద్దని సాగు రైతులకు సూచించారు. ఈ క్రమంలో ఉపాధి కూలీలు, సాగు రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ఉపాధి పనులు కల్పించాలని కూలీలు రేణం శ్రీను, రామోజీరావు, రాము, గజ్జాలమ్మ, పి.నాగేశ్వరరావు, వి.పుష్పా, కె.బుల్లమ్మ, తదితర్లు బుచ్చెయ్యపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ లక్ష్మి విచారణ చేపట్టి న్యాయం చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. -
పది, ఇంటర్లో శత శాతం ఉత్తీర్ణత లక్ష్యం
● బీసీ, ఎస్సీ వెల్ఫేర్ డీడీ రాజేశ్వరి ● నర్సీపట్నంలో వసతి గృహాల సందర్శననర్సీపట్నం: ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్థులను సమాయత్తం చేశామని బీసీ, ఎస్సీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ కె.రాజేశ్వరి తెలిపారు. నర్సీపట్నంలోని బీసీ, ఎస్సీ బాలికల వసతి గృహాలను గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్సీ బాలికల వసతి గృహంలో హైస్కూల్, కాలేజీ విద్యార్థులకు వసతి సరిపోవడం లేదని వార్డెన్ రాజ్యలక్ష్మి డీడీ దృష్టికి తీసుకెళ్లారు. అదనపు భవనం మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తానని డీడీ బదులిచ్చారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వసతిగృహాల్లో జరుగుతున్న మరమ్మతుల పనులను పరిశీలించి, సంక్షేమాధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీడీ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో బీసీ వసతి గృహాల నుంచి 645 మంది, ఎస్సీ వసతి గృహాల నుంచి 344 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షలకు బీసీ కాలేజీ వసతిగృహాల నుంచి 700 మంది, ఎస్సీ కాలేజీ వసతి గృహాల నుంచి 130 మంది హాజరవుతున్నట్టు చెప్పారు. విద్యార్థులకు అన్ని విధాలా తర్ఫీదు ఇచ్చామన్నారు. బీసీ వసతి గృహాల మరమ్మతులకు రూ.72 లక్షలు, ఎస్సీ వసతిగృహాల మరమ్మతులకు రూ.4.20 కోట్లు మంజూరయ్యాయని, ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ వసతిగృహం వార్డెన్ అర్జున్‌రావు, తదితరులు పాల్గొన్నారు. -
భారతీయ మహిళలు ధైర్యవంతులు
విశాఖ విద్య: భారతీయ మహిళలు ఎంతో ధైర్యవంతులని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు ఎస్.విజయభారతి అన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో దుర్గాబాయి దేశముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్, ఏబీఆర్ఎస్ఎం–లేడీ టీచర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం–2025 వర్క్‌షాప్ ఆక్సెలరేట్ యాక్షన్‌ను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీ్త్ర విద్యతో సమాజాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. సంస్కారవంతమైన యువతకు తల్లిదండ్రులే కీలకమని చెప్పారు. సమాజం కోసం, దేశం కోసం అనే భావనతో యువత ముందుకెళ్లాలని సూచించారు. వివేకానందుడు కలలుగన్న విధంగా యువతరం ఉజ్వల తారలుగా మారి, తమ ఆశయాలను సాకారం చేసుకోవాలన్నారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో మహిళల విజయగాథలను వివరించారు. కార్యక్రమంలో ఆచార్య ఎ.పల్లవి ఆంధ్రప్రదేశ్ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ పి.శ్రీదేవి, ఐఏఎస్ఈ ప్రిన్సిపాల్ ఆచార్య డి.నగరాజకుమారి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలు విజయభారతిని వైస్‌ఛాన్సలర్ ఆచార్య రాజశేఖర్, రిజిస్ట్రార్ ధనుంజయరావు జ్ఞాపిక అందించి, సత్కరించారు. జాతీయ హక్కుల కమిషన్ సభ్యురాలు ఎస్.విజయభారతి -
ఉపాధి పనులను పరిశీలించిన డ్వామా పీడీ
కూలీలతో మాట్లాడుతున్న దృశ్యం చీడికాడ : ఎండలు తీవ్రత పెరగడంతో ఉపాధి పనులను ఉదయం 11 గంటలకు ముంగించాలని డ్వామా పీడీ ఆర్.పూర్ణిమదేవి సూచించారు. ఆమె గురువారం మండలంలోని కోనాం శివారు గుంటి గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధి పనులను పరిశీలించారు. ఈ మేరకు ఆమె కూలీలతో మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం 6 గంటలకు పనులు ప్రారంభించి 11 గంటలకు ముగించాలన్నారు. ప్రతి కుటుంబానికి 150 రోజులు పూర్తి చేయాలన్నారు. రోజువారి రూ.300 వేతనం వచ్చే విధంగా పనులు జరిగేలా చూడాలని ఆదేశించారు. ఆమె వెంట ఎన్ఆర్ఈజీఎస్ ఏపీడీ శ్రీనివాస్, ఏపీవో గంగనాయుడు తదితరులున్నారు. -
ఏపీఐఐసీ చైర్మన్‌కు నిర్వాసితుల వినతి
నక్కపల్లి : మండలంలో ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఏపీఐఐసీ వారు సేకరించిన భూములను ఏపీఐఐసీ చైర్మన్, ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు గురువారం పరిశీలించారు. రాజయ్యపేట, డీఎల్‌పురం, అమలాపురం తదితర గ్రామాల్లో పర్యటించి ఎన్ని ఎకరాలు సేకరించారు.. వాటిలో జిరాయితీ ఎంత? ప్రభుత్వ, ఢీఫారం భూములు ఎంత? అనే వివరాలు తెలుసుకున్నారు. బల్క్ డ్రగ్‌పార్క్, ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ ఇండియా స్టీల్‌ప్లాంట్ వారికి ఎంత భూములు కేటాయించారు.. అనే వివరాలపై ఆరా తీశారు. అనంతరం రాజయ్యపేట సమీపంలో జరుగుతున్న బల్క్ డ్రగ్ పార్క్ పనులు పరిశీలించారు. ఏపీఐఐసీ వారు నిర్మిస్తున్న అంతర్గత రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు ఆధ్వర్యంలో పలువురు నిర్వాసితులు చైర్మన్‌ను కలిసారు. భూసేకరణ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లించాలన్నారు. నిర్వాసిత కుటుంబాల్లో మేజర్లకు ప్రత్యేక ప్యాకేజీ చెల్లించాలన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసే కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలన్నారు. డీఫారం భూముల్లో మామిడి,జీ డితోటలకు నష్టపరిహారం చెల్లించలేదని, జిరాయతీ రైతులతో సమానంగా వీరికి కూడా పరిహారం చెల్లించాలని కోరారు. -
గీత కార్మికులకు మద్యం షాపుల కేటాయింపు
అనకాపల్లి: జిల్లాలో మద్య నిషేధ అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో గీత కార్మికులకు 15 మద్యం దుకాణాలను లాటరీ పద్ధతి ద్వారా కేటాయించినట్టు డీఆర్వో వై.సత్యనారాయణ తెలిపారు. స్థానిక గుండాల జంక్షన్ ఎస్ఆర్ శంకరన్ ఫంక్షన్ హాల్లో గురువారం లాటరీ పద్ధతి ద్వారా గీత కులాల వారికి షాపులు కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 మద్యం దుకాణాలకు 205 దరఖాస్తులు వచ్చాయన్నారు. మద్యం షాపు దక్కించుకున్న దరఖాస్తుదారుడు తక్షణమే రిటైల్ ఎకై ్సజ్ టాక్స్ రూ.5,41,667 లేదా రూ.4,58,333 మొదటి విడతగా చెల్లించి లైసెన్స్ పొందాలన్నారు. కల్లుగీత కార్మికులకు కేటాయించిన 15 మద్యం దుకాణాల నాన్ రిఫండబుల్ కింద రూ.4.10 కోట్ల ఆదాయం సమకూరిందని చెప్పారు. లైసెన్స్ ఫీజు కింద రూ.78.75 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మద్య నిషేధ అబ్కారీ శాఖ అధికారి వి.సుధీర్, అబ్కారీ అధికారి రాజశేఖర్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. షాపు లబ్ధిదారుడు అనకాపల్లి రూరల్ సీహెచ్.మారుతీరాజు మునగపాక పిల్లి శ్రీను రోలుగుంట దార శ్రీనివాస్ కోటవురట్ల దమ్ము రోహిణి మాకవరపాలెం రేలంగి కిరణ్‌కుమార్ నాతవరం చిన్ని నానాజీ యలమంచిలి రేలంగి ఎల్.ఎన్.అశ్విని రాంబిల్లి కడాలి రాజ్యలక్ష్మి దేవరాపల్లి సిమ్మా దేమళ్లు బుచ్చియ్యపేట అనసూరి అనంద్ పాయకరావుపేట లవిటి నూకరాజు నక్కపల్లి దొడ్డి అప్పలరాజు వి.మాడుగుల యల్లంకి లావణ్య చీడికాడ సమ్మంగి లక్ష్మణ్ రావికమతం కడవల ఉపేంద్ర దుకాణాలు దక్కించుకున్న గీత కార్మికుల వివరాలు -
బాలలతో పని చేయించడం నేరం
చీడికాడలో ఒక దుకాణం వద్ద పరిశీలిస్తున్న బాలల హక్కుల ప్రతినిధులు చీడికాడ: బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్ములించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని జిల్లా బాలల హక్కుల పరిరక్షణ ప్రతినిధి డి.లోవరాజు అన్నారు. గురువారం మండల కేంద్రం చీడికాడలో పలు దుకాణాలను పరిశీలించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ బాలలను కార్మికులుగా పని చేయిస్తే చట్టప్రకారం శిక్షార్హులన్నారు. అనంతరం చీడికాడ పోలీసుస్టేషన్లో బాలికలతో సమావేశం నిర్వహించారు. బాలల హక్కులపై అవగాహన కల్పించారు. ఆయన వెంట ఏఎస్ఐ నాగేశ్వరరావు, హెచ్.సి రమణ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఉక్కుపాదం
ఉద్యమంపై షోకాజ్ ● నినదించే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ● స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు అయోధ్యరామ్‌కు షోకాజ్ నోటీసు ● యాజమాన్య వైఖరికి నిరసనగా నేడు స్టీల్ సీఐటీయూ ధర్నా సాక్షి, విశాఖపట్నం : విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ఎలా గాడిలో పెట్టాలన్నదానిపై ఆలోచనలు చేయకుండా.. ఉక్కు భవిష్యత్తు కోసం పోరాడుతున్న వారిపై జులుం ప్రదర్శించడంలో స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం అత్యుత్సాహం చూపిస్తోంది. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ని ఎలాగైనా కాపాడుకోవాలన్న ఉక్కు సంకల్పంతో పోరాటం చేస్తున్న ఉద్యమ నాయకుల్ని భయపెట్టేందుకు యాజమాన్యం షోకాజ్‌లు జారీ చేస్తోంది. ఆది నుంచి పోరుబాటలో ముందున్న స్టీల్‌ప్లాంట్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు అయోధ్యరామ్ గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తూ షోకాజ్ నోటీసు జారీ చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిరంతర పోరాటాల వల్లే.. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నోట నుంచి వచ్చినప్పటి నుంచి ఉద్యమ జ్వాల ఎగసిపడింది. అప్పటి నుంచి విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు అన్ని సంఘాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం, నిరంతరం రోడ్లపై ఉద్యోగ కార్మిక సంఘాలు పోరాటం చేయడం వల్ల.. నాలుగేళ్లుగా విశాఖ స్టీల్‌ప్లాంట్ జోలికి కేంద్రం రాలేకపోయింది. తాజాగా దిద్దుబాటు చర్యలు చేపడుతున్నట్లుగా రూ.11 వేల కోట్లు ప్యాకేజీని ప్రకటించింది. తాత్కాలిక ఉపశమనం కల్పించినా.. ఆర్ఐఎన్ఎల్కు ప్రైవేటీకరణ ముప్పు మాత్రం ఇంకా పొంచి ఉండటంతో ఉద్యమ నాయకులు పోరాటం ఆపలేదు. అయితే స్టీల్‌ప్లాంట్ గురించి ఎక్కడా మాట్లాడకూడదు.. వీఆర్ఎస్, హెచ్ఆర్ఏ, ఉద్యోగులు, కార్మికుల జీతాల కోసం ఎక్కడా నోరు మెదపకూడదంటూ యాజమాన్యం ఆంక్షలు విధించింది. అయినా.. కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు ఎక్కడా వెనకడుగు వేయకుండా హెచ్ఆర్ఏ, విద్యుత్ చార్జీలు, వీఆర్ఎస్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై నిరంతరం రోడ్డెక్కి పోరాడుతున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టీల్‌ప్లాంట్ సీఐటీయూ గౌరవ అధ్యక్షుడు జె.అయోధ్యరామ్‌కు యాజమాన్యం గురువారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా సీఐటీయూ గౌరవాధ్యక్షునిగా ప్రచారం చేశారంటూ మండిపడుతూ.. ఈ చర్యలపై ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఎంఎంఎస్ఎం డిపార్ట్మెంట్ డిసిప్లినరీ అథారిటీ డీజీఎం(ఎలక్ట్రికల్) ఉమాకాంత్ గుప్తా నోటీసులో పేర్కొన్నారు. యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ.. స్టీల్ యాజమాన్యం అయోధ్యరామ్‌కు షోకాజ్ నోటీస్ ఇవ్వడంపై సీఐటీయూ శ్రేణులు మండిపడుతున్నాయి. అధికారుల చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 8 నుంచి స్టీల్‌ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం వద్ద ధర్నా చేస్తామని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి రామస్వామి తెలిపారు. నోటీసులు వెనక్కు తీసుకునేంత వరకూ ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. -
పాడుతా తీయగా విజేత ధీరజ్‌కు సన్మానం
ధీరజ్‌ను సత్కరిస్తున్న ప్రముఖ వ్యాపారి నారాయణరావు కుటుంబ సభ్యులు నర్సీపట్నం : పాడుతా తీయగా మహాసంగ్రామంలో తృతీయ బహుమతి సాధించిన నర్సీపట్నం వాసి దొంతంశెట్టి ధీరజ్‌ను ప్రముఖ వ్యాపారి వెలగా నారాయణరావు దంపతులు స్వగృహంలో గురువారం ఘనంగా సత్కరించారు. ధీరజ్ తల్లిదండ్రులను సన్మానించారు. ధీరజ్ పాటల మాధుర్యాన్ని పంచడంతో పాటు చిత్రకళ, ఫోటో గ్రఫీ, రచనల్లో కాకుండా అనేక భాషల్లో గాన గంధర్వుడని కొనియాడారు. రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలని అకాంక్షించారు. సన్మానించిన వారిలో కంకటాల శిల్ప, వాసవీక్లబ్ జోన్చైర్మన్ పద్మనాభూని రాజేశ్వరి ఉన్నారు. -
గురుకుల సీవోఈలో దరఖాస్తుకు గడుపు పెంపు
మధురవాడ: ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొమ్మాది రిక్షా కాలనీలోని విశాఖపట్నం డాక్టర్. బీఆర్ అంబేడ్కర్ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ( సీవోఈ)లో 2025–26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి, ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం(ఇంగ్లీషు మీడియం)లో ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి గడువు పెంచినట్టు ప్రిన్సిపాల్ శాంతికుమారి తెలిపారు. తొలుత మార్చి 6వరకు మాత్రమే అవకాశం ఉందని ప్రకటించగా తాజాగా 13వ తేదీ వరకు పొడిగించారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి విశాఖ జిల్లాకి చెందిన బాలికలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. https:// apbragcet.apcfss. in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. -
ఉక్కును కాపాడుకోవడమే నా విధానం: అయోధ్యరామ్
స్టీల్‌ప్లాంట్ నోటీసులపై అయోధ్యరామ్ గట్టిగానే స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు అయోధ్యరామ్ స్పందించారు. నోటీసులతో గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే.. వేల గొంతులు ఒక్కటై పిక్కటిల్లేలా ఉద్యమిస్తామని హెచ్చరించారు. నోటీసుకు ప్రతిస్పందనగా యాజమాన్యానికి లేఖ రాశారు. కార్మికులు, ఉద్యోగుల హక్కుల గురించి పోరాడటమే తన విధానమనీ.. స్టీల్‌ప్లాంట్‌ని కాపాడుకునేంత వరకూ రోడ్డెక్కి ఉద్యమిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. సీఐటీయూ నాయకునిగా కార్మికుల సమస్యలపై పోరాడటం తమ బాధ్యత అన్నారు. నోటీసులో పేర్కొన్న సమస్యలపై తమ పోరాటం కొనసాగిస్తామే తప్ప భయపడేది లేదని తెగేసి చెప్పారు. -
పాకలపాడులో కేంద్రబృందం
లబ్ధిదారుల నుంచి వివరాలు సేకరిస్తున్న కేంద్ర బృందం సభ్యులు గొలుగొండ : పాకలపాడు గ్రామంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పథకాలపై గురువారం కేంద్రం బృందం సభ్యులు గ్రామంలో పర్యటించారు. గ్రామంలో ప్రజలతో సమావేశం అనంతరం కేంద్రం మంజూరు చేసిన రోడ్లు, గృహాలు పింఛన్లు, డ్వాక్రా సభ్యులు పనితీరు, గ్రామ సడన్యోజన పథకం తీరుపై పరిశీలన చేశారు. కేంద్ర ప్రభుత్వం మంజూరులో అర్హత పొందిన లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి వాటి పనితీరు, అందే విధానం గురించి క్షణ్ణంగా పరిశీలన చేశారు. గ్రామాల్లో పేదలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక పథకాలు అందుతున్నాయని వాటి పనితీరుపై పూర్తిస్థాయిలో పరిశీలన చేస్తున్నట్టు కమిటీ సభ్యులు వికాస్ మలేకర్, భానుచందర్, లోకేష్ తదితరులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో మేరీ రోజ్‌తో పాటు పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. -
చెరకు సాగు ప్రశ్నార్థకం
దారి కాచి దారుణం... ఈ ఏడాది ఆదిలోనే కష్టాలు ఇప్పటికీ 10 శాతం కూడా ప్రారంభం కాని చెరకు నాట్లు ఆందోళన చెందుతున్న గోవాడ సుగర్ ఫ్యాక్టరీ రైతులను పట్టించుకోని ప్రభుత్వం ● నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య ● బైక్ అడ్డగించి పీక కోసిన గుర్తు తెలియని వ్యక్తులు ● మూడు ప్రత్యేక బృందాలతో దుండగుల కోసం పోలీసుల గాలింపు 8లోచోడవరం : రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో జిల్లాలో చెరకు సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఒకప్పుడు బెల్లం, పంచదార ఫ్యాక్టరీలతో ఎక్కడ చూసినా వేలాది ఎకరాల్లో చెరకు సాగుతో పొలాలన్నీ కళకళలాడేవి. ఫిబ్రవరి నెల నుంచే చెరకు నాట్లు వేస్తూ అంతా సందడిగా ఉండేది. ఈ ఏడాది ఆ సందడే కానరాలేదు. ఐదునెలలుగా కనీస వర్షాలు కురవకపోవడం, సుగర్ ఫ్యాక్టరీ రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వకపోవడంతో రైతులు ఈ ఏడాది చెరకు పంటపై అనాసక్తి కనబరుస్తున్నారు. గత నెలలోనే ప్రారంభం కావలసిన చెరకు నాట్లు మార్చినెల ప్రారంభమైనా 10శాతం కూడా వేయలేదు. జిల్లాలో 4సుగర్ ఫ్యాక్టరీలు, ఒక అంతర్జాతీయ బెల్లం మార్కెట్ ఉండడంతో ఏటా 2 లక్షల ఎకరాల్లో చెరకు సాధారణ సాగు జరిగేది. అయితే మూడు ఫ్యాక్టరీలు మూతపడడంతో చెరకు సాగు విస్తీర్ణం తగ్గుకుంటూ రాగా ఈ ఏడాది ఘోరంగా 60 శాతానికి మించి సాగు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. గతేడాది కంటే 20 శాతం విస్తీర్ణం తగ్గిపోనుందని సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం అందోళన చెందుతుంది. గతేడాదే తగ్గిన చెరకు సాగుతో ఈ ఏడాది క్రషింగ్ లక్ష్యాన్ని చేరుకోలేక ఫ్యాక్టరీ చతికిలబడుతోంది. గానుగ లక్ష్యం..నానాటికీ తీసికట్టు... గోవాడ ఫ్యాక్టరీ 5.2 లక్షల టన్నుల సామర్ధ్యం ఉన్నప్పటికీ కేవలం 1.5 లక్షల టన్నులే లక్ష్యం పెట్టుకోగా ఇప్పటి వరకు కేవలం 60 వేలు టన్నులు మాత్రమే క్రషింగ్ చేసింది. మరో 40 వేల టన్నులకు మించి క్రషింగ్ జరిగే అవకాశాలు లేవు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలోనే చెరకు నాట్లు ప్రారంభమై మార్చి నాటికి 30 శాతానికి మించే నాట్లు జరిగేవి. జిల్లాలో అత్యధికంగా చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో పరిధిలోనే సుమారు 80వే ఎకరాలకు పైబడి చెరకు పండిస్తారు. అలాంటిది ఈ ఏడాది అక్కడక్కడ వ్యవసాయ బోర్ల సాయంతో కొందరు నాట్లు వేస్తున్నప్పటికీ వారు కూడా చెరకు పంటపై మక్కువతోనే వేస్తున్నామంటూ నిట్టూర్చడం చెరకు సాగు భవితవ్యంపై ప్రశ్నార్థకం వ్యక్తమౌతుంది. ఉడుపులు ముమ్మరమయ్యే సమయంలో వర్షాలు కురవకపోవడం, జలాశయాలు, నదులు, చెరువులు, కొండగెడ్డల్లో నీటి నిల్వలు లేకపోవడంతో సాగుపై రైతులు నిరాశకు గురయ్యారు. మోటార్ల సాయంతోనైనా నాట్లు వేద్దామంటే భూగర్భ జలాల్లో నీటి నిల్వలు అడుగంటడం.. ఇవన్నీ రైతుకు గుదిబండగా మారాయి. పట్టించుకోని ప్రభుత్వం చెరకు రైతులను, సుగర్ ఫ్యాక్టరీలను ఆదుకొని గిట్టుబాటు ధర ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఫ్యాక్టరీని పట్టించుకోలేదు. మద్దతు ధర టన్నుకు రూ.3100లకు మించి ఇవ్వలేదు. దీనితో రైతులు చెరకుకు బదులు ప్రత్యామ్నాయంగా సరుగుడు, ఇతర పంటలు వేయడానికే సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితిలో ఫ్యాక్టరీలు, ప్రభుత్వం రైతులను ఆదుకుంటే తప్ప ఈ ఏడాది చెరకు కనీస విస్తీర్ణంలో కూడా సాగు జరిగేలా లేదని రైతులు అంటున్నారు. -
గొలుగొండ డిపోలో వెదురు అమ్మకాలు
● డిపో సందర్శించిన డీఎఫ్‌వో శ్యామ్యూల్ వేలం పాట నిర్వహిస్తున్న డీఎఫ్‌వో గొలుగొండ : ప్రభుత్వానికి టేకు, వెదురు అమ్మకాల వల్ల ఆదాయం తీసుకురావడం జరుగుతుందని నర్సీపట్నం డీఎఫ్‌వో శ్యామ్యూల్ తెలిపారు. ఆయన గురువారం గొలుగొండ కలప డిపోను సందర్శించారు. ప్రతి నెల 6వ తేదీన గొలుగొండ కలప డిపోలో వెదురు, టేకు అమ్మకాలు జరుగుతున్న కారణంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం టేకు నిల్వలు తక్కువగా ఉన్నాయని, వెదురు అమ్మకాలు జరుగుతున్నట్లు చెప్పారు. గొలుగొండ కలప డిపో ద్వారా ప్రతి ఏటా రూ.కోట్లలో టేకు అమ్మకాలు జరుగుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం వెదురు నిల్వలు అమ్మకాలు జరుగుతున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో కృష్ణదేవిపేట, గొలుగొండ రేంజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పేదల ఆర్థిక సాధికారతకు పీ–4 సర్వే
తుమ్మపాల : పేదరికం లేని సమాజం లక్ష్యంగా ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో (పి4) సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ గ్రామ, వార్డు సచివాయాల సిబ్బందిని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పి4 సర్వేపై ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామ, వార్డు సచివాలయల సిబ్బందికి వర్చువల్‌గా పీ4 సర్వేపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలకు ఆర్థిక సాధికారత చేకూర్చడం, వారి జీవన ప్రమాణాల్లో అట్టడుగు స్థాయిలో గల 20 శాతం మంది నిరుపేదలను గుర్తించడం ద్వారా పేదరికాన్ని దూరం చేయడం పీ4 సర్వే విధాన లక్ష్యమన్నారు. పి4 లక్ష్య సాధనకు ఈ నెల 8 నుంచి 18 తేదీ వరకు సర్వే చేయాలన్నారు. పేదల అవసరాలను గుర్తించి, వారి సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టుల రూపకల్పనకు ఈ సర్వే దోహదం చేస్తుందని కుటుంబాలు ప్రస్తుతం అందుకుంటున్న పథకాలపై ఈ సర్వే ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు. సర్వే ద్వారా సేకరించిన డేటా ఆధారంగా ఇంటి అవసరాలకు అనుగుణంగా సమర్ధమైన ప్రణాళికల రూపకల్పనకు వీలవుతుందన్నారు. ఈ సమాచారాన్ని కుటుంబాలకు వివరించి కుటుంబ వివరాలతో పాటు వివిధ సామాజిక, ఆర్థిక పరిమితులతో కచ్చితమైన సమాచారాన్ని యాప్‌లో పొందుపరచిన 27 ప్రశ్నల ద్వారా సేకరించాలని ఆదేశించారు. కుటుంబాలకు ఏవైనా అపోహలు ఉంటే తొలగించి, సర్వేను పది రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. అన్ని శాఖల సమన్వయంతో సమష్టి భాగస్వామ్యంతో సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయి అధికారులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ‘స్వర్ణాంధ్ర –2047‘ లక్ష్యంగా వచ్చే ఐదేళ్లలో పేదరిక నిర్మూలనకు, రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశంగా నిలిచిన ‘10 సూత్రాలు‘ ఫ్రేమ్‌వర్క్‌లో ‘జీరో పావర్టీ పీ4 పాలసీ‘ అత్యంత ప్రాముఖ్యత అంశం కనుక ఈ విధానం పై ప్రజల అభిప్రాయం క్యూఆర్ కోడ్, https://swarnandhra. ap.gov.in/p4 వెబ్ పోర్టల్ ద్వారా అత్యధిక సంఖ్యలో సేకరించాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జి.రామరావు, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి నాగలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 8 నుంచి 18 వరకు కార్యక్రమం 27 ప్రశ్నలతో పీ4 సర్వే యాప్ కలెక్టర్ విజయకృష్ణన్ -
మహిళా సాధికారతకు తోడ్పాటు
ఎస్పీ తుహిన్ సిన్హా సాక్షి, అనకాపల్లి : విద్య, ఉద్యోగ సాధనలో మహిళల అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సాధికార వారోత్సవాల్లో భాగంగా వివిధ కాలేజీల విద్యార్థినులకు ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిమశేఖర్ డిగ్రీ కాలేజ్ , ఆదినారాయణ మహిళా డిగ్రీ కాలేజ్, ఏఎంఏఎల్ కళాశాల, డైట్ కళాశాలల నుంచి విద్యార్థినులు పాల్గొన్నారు. పోలీసులు విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలు, ఇతర భద్రతా పరికరాలను గూర్చి అవగాహన కల్పించారు. విద్యార్థులకు ఆటలు, చిత్రలేఖన పోటీలు, వ్యాసరచన పోటీలు, డిబెట్లు, సంస్కృతిక కార్యక్రమాల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మార్చి 1 నుంచి మహిళా సాధికార వారోత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలందరూ తమ తమ హక్కుల గురించి, చట్టాల గురించి తెలుసుకోవాలని సూచించారు. పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లో పురుషులతో పోటీగా మహిళలు రాణిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సాధించిన ప్రగతిని గురించి అవగాహన కల్పించి, మహిళల హక్కులు, సమానత్వం, భద్రత, రక్షణ కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలను తెలియజేశారు. ఒత్తిడిని, సమస్యలు ఎదురైన సమయంలో .. వాటిని ఎదుర్కొని మహిళలు ధైర్యంగా నిలవాలని తెలియజేశారు. మహిళలు ఉన్నత చదువులు అభ్యసించి తనకు తాను ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని కోరారు. అత్యవసర సమయాల్లో .. హెల్ప్లైన్లకు సమాచారం ఇవ్వండి మహిళలు, చిన్నారులు ఎలాంటి ప్రమాదంలో చిక్కుకున్నా వెంటనే సహాయం అందించేలా హెల్ప్‌లైన్ నంబర్లు వారికి తెలియజేసి, అత్యవసర సమయాల్లో కాల్ చేసి పోలీసులు సహాయం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహనరావు, ఎస్బీఎస్పీ బి.అప్పారావు, మహిళా డీఎస్పీ ఈ.శ్రీనివాసులు, ఏఆర్ పి.నాగేశ్వరరావు, ఇన్స్పెక్టర్లు లక్ష్మణమూర్తి, చంద్రశేఖర్, బాల సూర్యారావు, రామకృష్ణారావు, మన్మథరావు, వెంకటచిట్టి ఎస్ఐలు వెంకన్న, సురేష్ బాబు, ఆదినారాయణ ఇతర అధికారులు సిబ్బంది, వివిధ కాలేజీ విద్యార్థులకు పాల్గొన్నారు. విద్య, ఉద్యోగ సాధనలో ముందడుగు వేయాలి కళాశాల విద్యార్థినులతో ఓపెన్ హౌస్ ఘనంగా మహిళా సాధికార వారోత్సవాలు మహిళల భద్రత కోసం హెల్ప్‌లైన్ నంబర్లు చైల్డ్ హెల్ప్ లైన్ 1098ఉమెన్ హెల్ప్ లైన్ 181 పోలీస్ హెల్ప్ లైన్ 100 / 112 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 ఈగల్ హెల్ప్ లైన్ 1972 నంబర్లకు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. అనకాపల్లి జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 94409 04229 -
ఢిల్లీ దర్బారులో ఏటికొప్పాక బొమ్మ
●రాష్ట్రపతి భవన్లో లక్క బొమ్మల ప్రదర్శన ●హస్త కళాకారుడు పెదపాటి శరత్‌కు అరుదైన అవకాశం యలమంచిలి రూరల్ : ఖండాంతర ఖ్యాతినార్జించిన ఏటికొప్పాక హస్తకళకు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా రాష్ట్రపతి భవన్లో ఏటికొప్పాక లక్కబొమ్మల ప్రదర్శన గురువారం ప్రారంభమైంది. ఈ నెల 9 వరకు ఈ ప్రదర్శన ఉంటుందని హస్తకళాకారుడు పెదపాటి సత్యనారాయణ శరత్ ‘సాక్షి’కి తెలిపారు. ఇంతటి అరుదైన అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రదర్శన ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఏటికొప్పాక లక్కబొమ్మల ప్రత్యేకతను ప్రస్తావించారని పేర్కొన్నారు. ప్రముఖ గాయని మంగ్లీ గురువారం లక్కబొమ్మలను చూసి అబ్బురపడ్డారని తెలిపారు. గతంలో మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ మెప్పును పొందిన లక్కబొమ్మలు మరోసారి రాష్ట్రపతి ప్రశంసలు అందుకోవడం పట్ల ఏటికొప్పాక హస్తకళాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సహజసిద్ధమైన రంగులతో కళాకారుల చేతిలో రూపుదిద్దుకుంటున్న లక్కబొమ్మలు చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే. -
రాలిన విద్యాకుసుమం
‘పరీక్ష’లు చాలించి... ● కోనవానిపాలెంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య ● అనారోగ్యమే కారణమంటూ.. సూసైడ్ లేఖఎస్.రాయవరం : పరీక్షల ఒత్తిడో...అనారోగ్య కారణమో....లేత మనసుకు తగిలిన గాయమో...ఓ బాలిక ఉసురు తీసింది. పరీక్షల సమయంలోనే ఓ విద్యా కుసుమం రాలిపోయింది.. కోనవానిపాలెం గ్రామంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బాలిక ఉరి పోసుకుని గురువారం మృతి చెందింది. ఎస్ఐ విభీషణరావు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు తుని చైతన్య కళాశాలలో చదువుతున్న విద్యార్థిని జోగా సృజన జయప్రియ (17) బుధవారం ఇంగ్లిష్ పరీక్ష రాసి ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి నీరసంగా ఉండడంతో ఆమెను ఇంటి దగ్గర ఉంచి, తల్లిదండ్రులు గురువారం మధ్యాహ్నం ఓ ఫంక్షన్‌కి వెళ్లారు. ఇంటిదగ్గర ఎవరూ లేని సమయం చూసి సృజన జయప్రియ సూసైడ్ నోట్ రాసి ఉరిపోసుకుని చనిపోయింది. ఈ సూసైడ్ నోట్లో ‘అమ్మ, నాన్న నన్ను క్షమించండి...నా చావుకి నా ఆరోగ్యమే కారణం ఈ బాధలు తట్టుకోలేక పోతున్నాను...దేనిమీద దృష్టి పెట్టలేక చాలా బాధపడ్డా.. నా కోరిక తీర్చుకోలేనేమోనని నాలో నేనే చాలా బాధ అనుభవించాను...సారీ అమ్మ ఎందుకు చనిపోయానో కారణం ఎవరికీ చెప్పకండి.. నేను బ్రతికుండి ప్రయోజనం లేదు..తమ్ముడు చరణ్, చిన్నాని మీరు బాగా ఉండండి మీరంటే నాకు చాలా ఇష్టం. అమ్మని బాగా చూసుకోండి...నాన్నను బాధపెట్టకండి నాన్న చెప్పిన మాట ఆలకించండి.. నేనే చనిపోతున్నందుకు చాలా బాధగా ఉంది.. లవ్యు అమ్మ, నాన్న అండ్ మై బ్రదర్స్ గుడ్‌బై..’ అని రాసింది. ఈ లెటర్ చదివిన వారందరూ కన్నీటి పర్యంతమయ్యారు. చదువులో మంచి మార్కులు తెచ్చుకుని ఆమెకు అందమైన జీవితం ఉంటుందనుకున్న తరుణంలో కుటుంబ సభ్యులను తీరని దుఃఖ సాగరంలో ముంచి బాలిక మృతి చెందిందని ఆవేదన చెందారు. గ్రామంలో ఈ బాలిక మృతి వార్త విని ప్రతి ఒక్కరూ విషాదంలో మునిగిపోయారు. చదువు ఒత్తిడి, చిన్న ఆనారోగ్యం బాలిక ప్రాణాలు తీశాయని పోలీసులకు తెలిపారు. వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వీఎంఆర్డీఏ తహసీల్దార్‌పై ఫిర్యాదులు
విశాఖ సిటీ: వీఎంఆర్డీఏలో తహసీల్దార్(భూసేకరణ)గా విధులు నిర్వర్తిస్తున్న కోరాడ వేణుగోపాల్‌పై వరుస ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఎస్.రాయవరం మండలం తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలో చేసిన అవినీతి, అక్రమాలపై విచారణ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆయనపై చట్టపరంగానే కాకుండా సర్వీస్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎం, డిప్యూటీ సీఎం, హెచ్ఆర్డీ మంత్రి, డీజీపీ, సీసీఎల్ఏ, ఇతర అధికారులతో పాటు వీఎంఆర్డీఏ చైర్‌పర్సన్‌కు కూడా రాతపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. గతంలో తప్పుడు ధృవపత్రాలు సమర్పించి ఎంపీటీసీ, ఎంపీపీలుగా గెలిచినట్లు నిర్ధారణ అయినప్పటికీ.. ఎన్నికల్లో వారిని అనర్హులుగా ప్రకటించకపోవడంపై వేణుగోపాల్‌పై విచారణ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. అలాగే ఆయన ఎస్.రాయవరంలో తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలో అనేక అవకతవకలకు పాల్పడి భూ అక్రమాలకు అండగా నిలిచారని.. దీనిపై కూడా విచారించాలని విజ్ఞప్తి చేశారు. ఇటువంటి అవినీతి ఆరోపణలు ఉన్న వేణుగోపాల్‌ను హోం మంత్రి వంగలపూడి అనిత పీఎస్‌గా నియమించాలని ప్రయత్నిస్తుండడం సరైన నిర్ణయం కాదని వారు లేఖలో పేర్కొన్నారు. -
టెన్త్ పరీక్షల్లో విద్యార్థుల హక్కులకు ప్రాధాన్యమివ్వాలి
అనకాపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 17 నుంచి జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థుల హక్కులతో ముడిపడి ఉన్న సంక్షేమానికి జిల్లా అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారాం అన్నారు. స్థానిక జీవీఎంసీ వేల్పులవీధి బాలికోన్నత పాఠశాల ఆవరణలో బుధవారం విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్, కేజీబీవీ పాఠశాలల ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. బాలల హక్కుల పరిరక్షణలో భాగంగా తాగునీటి సదుపాయం, చక్కని గాలి, వెలుతురు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, ఫ్యాన్లు, సరిపడినన్ని బెంచీలు, కుర్చీలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలు జరిగే కేంద్రాల పరిధిలో విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని, మారుమూల గ్రామాల విద్యార్థులకు పరీక్షలకు హాజరవడానికి రవాణా ఇబ్బందులు లేకుండా సరిపడా బస్‌లు ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రంలో వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. జిల్లా ఉప విద్యాశాఖ అధికారి పి.అప్పారావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రై వేటు పాఠశాలల నుంచి 20,774 మంది విద్యార్థినీ విద్యార్థులు 107 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నట్టు తెలిపారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణకమిషన్ సభ్యుడు గొండు సీతారాం -
పోలీస్ స్టేషన్లకు నూతన భవనాలు
గొలుగొండ/నాతవరం: నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాలను త్వరలో ప్రారంభిస్తామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఆయన బుధవారం గొలుగొండ, కృష్ణదేవిపేట, నాతవరం పోలీస్ స్టేషన్లను సందర్శించారు. కొత్త భవనాలను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ గంజాయి రవాణా జరగకుండా నిత్యం గస్తీ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలతో పోలీసులు స్నేహభావంతో మెలగాలని తెలిపారు. రహదారి భద్రత, సైబర్ నేరాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్‌కు కొత్త వాహనం మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. నాతవరం స్టేషన్లో ఉన్న వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను పరిశీలించి వీటి కేసులను ట్యాగ్ చేయాలని ఎస్ఐను ఆదేశించారు. స్టేషన్ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి పలు సూచనలు చేశారు. జిల్లాలో నక్కపల్లితోపాటు పలు మండలాల్లో నూతన భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశామన్నారు. జిల్లాలో కొత్తకోట పోలీసు స్టేషన్ పరిఽధిలో తరుచు గంజాయి రవాణా చేస్తూ పట్టుబడుతున్నారని, పీడీ యాక్టు ప్రకారం వారి ఆస్తులు జప్తు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం హోం మంత్రి దృష్టికి తీసుకువెళ్లి అమలు చేస్తామన్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు, కృష్ణదేవిపేట, గొలుగొండ, నాతవరం ఎస్ఐలు తారకేశ్వర్రావు, రామారావు, సీహెచ్ భీమరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. త్వరలో ప్రారంభం ఎస్పీ తుహిన్ సిన్హా -
పేదల ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ వేగవంతం
తుమ్మపాల: ప్రభుత్వం పేదలకు కల్పిస్తున్న ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ పథకాన్ని అర్హులందరికీ అమలు చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. పీజీఆర్ఎస్, రీసర్వే, గ్రామసభలు, వెబ్‌ల్యాండ్, ఇళ్ల స్థలాల రీ–వెరిఫికేషన్, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, రికార్డు రూమ్‌ల నిర్వహణ వంటి అంశాలపై బుధవారం కలెక్టరేట్లో అన్ని మండలాల రెవెన్యూ అధికారులతో జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవితో కలిసి ఆమె సమీక్షించారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూమిలో 2019 మార్చి 15 నాటికి ఇల్లు కట్టుకుని, ప్రస్తుతం నివాసముంటూ, ఇంటికి సంబంధించిన ఆధార పత్రాలు కలిగి, ఎక్కడా ఇల్లు లేనివారు మాత్రమే ఈ పథకానికి అర్హులని తెలిపారు. 150 గజాలలోపు స్థలంలో ఇల్లు కట్టుకున్న పేదవారికి ఉచితంగా, అంతకంటే ఎక్కువ స్థలం కలిగిన వారికి ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం రుసుము వసూలు చేసి క్రమబద్ధీకరిస్తామన్నారు. జేసీ ఎం.జాహ్నవి మాట్లాడుతూ రీ–సర్వేపై గ్రామసభల్లో వచ్చిన అర్జీలన్నింటినీ రెండు రోజుల్లో పరిష్కరించాలన్నారు. వెబ్‌ల్యాండులో మార్పుల కోసం ప్రతిపాదనలను సర్వే నంబరు, సబ్ డివిజన్ వివరాలతో పంపించాలన్నారు. చౌకధరల దుకాణాలు, గోడౌన్లు, బియ్యం మిల్లులను తనిఖీ చేసి నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని తెలిపారు. డీఆర్వో వై.సత్యనారాయణరావు, కె.ఎంె.ఆర్.సి. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.వి.ఎస్.సుబ్బలక్ష్మి, బి.జె.ఆర్.యు.ఎస్.ఎస్. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.రమామణి, ఆర్డీవోలు వి.వి.రమణ, షేక్ ఆయిషా,క లెక్టరేట్ పరిపాలనాధికారి బి.వి.రాణి, సెక్షను సూపరింటెండ్ంట్లు, సర్వే శాఖ సహాయ సంచాలకులు గోపాలరాజ, తహసీల్దార్లు పాల్గొన్నారు. మహిళా దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు తుమ్మపాల: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణ కోసం, జిల్లా, మండల స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణకు సంబంధించి బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు సమన్వయం చేసుకుని విజయవంతం చేయాలన్నారు. అదేరోజున మహిళల భద్రత కోసం మహిళా శక్తి యాప్‌ను జిల్లా స్థాయిలో సీ్త్రలు, పిల్లల విభాగాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నారు. జిల్లా, మండల స్థాయిలో కార్యక్రమం జరిగే ప్రదేశాలలో శక్తి యాప్ లోగో ఏర్పాటు చేసి, యాప్‌పై మహిళలకు అవగాహన కల్పించాలని జిల్లా అదనపు ఎస్పీ ఎం.దేవ ప్రసాద్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహిళలకు ఆరోగ్య పరీక్షలు చేయాలని, పోషకాహార ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి మండలానికి ఒక స్వయం సహాయక బృందం సభ్యులకు సన్మానం చేయాలని, జిల్లా స్థాయిలో వివిధ రంగాల్లో విజయవంతమైన మహిళలను సన్మానించాలని సూచించారు. అదేరోజు బ్యాంకర్లు స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు అందివ్వాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జి.రామారావు, ఐసీడీఎస్ పీడీ అనంతలక్ష్మి, డీఆర్డీఏ పీడీ శచిదేవి, డీఎంహెచ్‌వో రవికుమార్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నాగరాజారావు, మెప్మా పీడీ సరోజిని, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ ఈడీలు పెంటోజీరావు, కె.పద్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ అధికారుల సమీక్ష సమావేశంలోకలెక్టర్ విజయ కృష్ణన్ -
అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
సీడీపీవో, సూపర్వైజర్ వేధింపులే కారణమని ఆరోపణకె.కోటపాడు: పోతనవలస అంగన్వాడీ కార్యకర్త రొంగలి నూకరత్నం బుధవారం చీమలమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. పొలానికి వెళ్లిన భర్త నాయుడు ఇంటికి తిరిగి వచ్చే సరికి ఆమె అపస్మారక స్ధితిలో ఉన్నారు. పక్కనే నీటిలో చీమల మందు కలి పి ఉన్న గ్లాస్ ఉండడంతో ఆయన చూసి ఆందోళన చెందాడు. దీంతో భార్యను ఆటోలో కె.కోటపాడు సీహెచ్‌సీకి తరలించారు. అవసరమైన వైద్యం అందించామని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని సీహెచ్‌సీ వైద్యాధికారి ప్రశాంత్ తెలిపారు. శ్రుతి మించిన వేధింపులు కె.కోటపాడు సీడీపీవో మంగతాయారు, సూపర్వైజర్లు రాములమ్మ, కల్యాణి తిట్టడం వల్లనే మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించినట్టు అంగన్వాడీ కార్యకర్త నూకరత్నం తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సాక్షితో మాట్లాడుతూ.. ఈ నెల 1న అంగన్వాడీ కేంద్రం విజిట్‌కు వచ్చిన సీడీపీవో మంగతాయారు, సూపర్వైజర్ రాములమ్మలు తనను తిట్టి, సెంటర్ రికార్డులు కె.కోటపాడు ఆఫీస్‌కు తీసుకువెళ్లిపోయారని తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం సీడీపీవో కార్యాలయానికి రావాలని తెలిపితే వెళ్లానని, అక్కడ కూడా వారు తీవ్ర దుర్భాషలాడారని ఆమె పేర్కొన్నారు. 3న పోతనవలస గ్రామంలో సూపర్వైజర్ తనిఖీ చేశారని, అంగన్వాడీ కేంద్రం ద్వారా పాలు, గుడ్లు, సరకులు సక్రమంగా ఇస్తున్నట్లు లబ్ధిదారులు తెలిపినా.. సీడీపీవో మంగతాయారు గ్రామ సమావేశంలో అందరి ముందు తనని చెప్పలేని పదజాలంతో తీవ్రంగా దుర్భాషలాడారని నూకరత్నం తెలిపారు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని నూకరత్నం తెలిపారు. బాధితురాలికి సీపీఎం నాయకుల పరామర్శ కె.కోటపాడు సీహెచ్‌సీలో నూకరత్నంను సీపీఎం నాయకులు పరామర్శించారు. పార్టీ మండల కార్యదర్శి రొంగలి ముత్యాలనాయుడు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్త నూకరత్నంకు ఎటువంటి ప్రమాదం జరిగినా సీడీపీవో, సూపర్వైజర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఉద్యోగపరంగా తప్పులుంటే సంజాయిషీ అడగాలి లేదా శాఖాపరంగా పనిష్మెంట్ ఇవ్వాలి తప్ప వ్యక్తిగతంగా దూషించే హక్కు ఎంత పెద్ద అధికారికీ లేదని ముత్యాలనాయుడు అన్నారు. -
బడ్జెట్లో యూజ్లెస్ హామీలు
బడ్జెట్లో మూడు వరాలు ఇచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. అందులో ఏదీ మాకు ఉపయోగపడేది లేదు. రిటైర్ అయిన వారికి రూ.1.5 లక్షల గ్రాట్యుటీ ఇస్తామని చెప్పారు. దేశంలో ఆశా వ్యవస్థ ఏర్పాటు చేసి 20 ఏళ్లయింది. మన రాష్ట్రంలో ఏ కార్యకర్తకు 15 ఏళ్లు మించి అనుభవం లేదు. మరి 30 ఏళ్ల సర్వీసు ఉంటే గ్రాట్యుటీ ఇస్తామన్న హామీతో ఎవరికి ఉపయోగం? 180 రోజుల ప్రసూతి సెలవులు ప్రకటించారు. జిల్లాలో ఉన్న ఆశా కార్యకర్తల్లో 99 శాతం మంది 40 ఏళ్లు దాటినవారే. ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు కూడా మాకు పనికి వచ్చేది కాదు. పని ఒత్తిడితో 60 ఏళ్లకే అనారోగ్యం బారిన పడుతున్నాం. ఎన్నికల హామీలు నెరవేర్చలేదని నిరసన తెలుపుతున్నామని కూట మి ప్రభుత్వం యూజ్ లెస్ హామీలు ఇచ్చింది. అందుకే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్నాం. –ఈశరపు పార్వతి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి -
ఉపమాక కల్యాణోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత
● నాలుగువైపులా చెక్‌పోస్టులు ● ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు ● అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ● ఆలయ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారుల సమీక్ష నక్కపల్లి: ఉపమాక వేంకటేశ్వరస్వామివారి వార్షిక కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ నెల 10న స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. 9వ తేదీన ఇందుకు అంకురార్పణ చేస్తారు. ఐదు రోజులపాటు స్వామివారి కల్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ వారు ఏర్పాట్లు ప్రారంభించారు. కల్యాణోత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. నక్కపల్లి సీఐ కుమారస్వామి, ఎస్ఐ సన్నిబాబు, దేవస్థానం మాజీ చైర్మన్లు కొండబాబు, బుజ్జి, మండల టీడీపీ అధ్యక్షుడు కె.వెంకటేష్, ప్రధానార్చకులు జి.వరప్రసాదాచార్యులు బుధవారం దేవస్థానంలో సమావేశమయ్యారు. కల్యాణోత్సవాల సందర్బంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై చర్చించారు. నాలుగు చక్రాల వాహనాలను నిర్దేశించిన చోటనే పార్క్ చేయాలి. ద్విచక్రవాహనాలను 10వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే ఆలయం వద్దకు అనుమతిస్తారు. పదో తేదీ సాయంత్రం నుంచి పదకొండో తేదీ ఉదయం వరకు కేవలం నడచి వెళ్లే భక్తులను మాత్రమే అనుమతిస్తారు. రూ.కోట్లాది విలువైన స్వామివారి ఆభరణాలను విశాఖ ట్రెజరీ నుంచి తీసుకురానుండడంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఐ కుమారస్వామి తెలిపారు. ఆలయం వద్ద పోలీస్ ఔట్‌పోస్టు, ఆలయానికి చేరుకునే నాలుగు మార్గాల్లో పోలీస్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుమారు 200 మందికి పైగా పోలీసు సిబ్బంది గస్తీ కాస్తారన్నారు. -
విశాఖలో హైకోర్టు బెంచ్ కోసం త్వరలో అఖిలపక్ష సమావేశం
విశాఖ లీగల్ : విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ త్వరలో ఆరు జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఇతర నాయకులతో కలిసి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బెవర సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఏడు జిల్లాల(శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ) న్యాయవాదులతో ఒక సదస్సును ఏర్పాటు చేసి.. మద్దతు కూడగట్టామని పేర్కొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై అఖిలపక్ష సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజా ప్రతినిధులు, ఇతర నేతల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి ఈ ఆరు జిల్లాల ప్రజాభీష్టాన్ని వివరించనున్నట్లు తెలిపారు. -
ఆదుకున్నది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే..
వాస్తవానికి వేతనాలు పెంచి ఆశా కార్యకర్తలను ఆదుకున్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. 2019కి ముందు వరకు చాలీచాలని వేతనాలతో ఆశాలు అగచాట్లు పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం వారి కష్టాలను విన్నది కూడా లేదు. ఈ నేపథ్యంలో తమ వేతనాలు పెంచి ఆదుకోవాలని పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆశా సిబ్బంది కోరా రు. ఆయన సీఎం అయ్యాక 2019 ఆగస్టులో వారి వేతనాలను రూ.5 వేల నుంచి ఒకేసారి రూ. 10 వేలకు పెంచారు. వేతనం పెంచి ఐదేళ్లయిందని, పెరిగిన జీవన వ్యయాలు, కుటుంబ అవసరాలకు అనుగుణంగా మళ్లీ పెంచాలని గత ఏడాది డిసెంబరులో రాష్ట్రవ్యాప్తంగా ఆశా సిబ్బంది ధర్నాకు దిగారు. మరోపక్క కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక నాయకులు వీరిపై దాడులు మొదలుపెట్టారు. గ్రామాల్లో పనిచేస్తున్న ఆశాలను రాజకీయ కారణాలతో తొలగించి, వారి పొట్టగొట్టే పన్నాగానికి తెర తీశారు. -
హామీలేతప్ప జీవోలు లేవు
మాకు ఇచ్చే జీతం కన్నా ఎక్కువగా పనిచేస్తున్నాం. యాప్‌ల పేరిట ఉదయం నుంచి రాత్రి వరకూ పని ఒత్తిడి పెంచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైంది. మా ఒప్పంద మినిట్స్ బుక్‌లో హామీలను అమలు చేస్తూ జీవోలు లేవు. మా కష్టానికి తగిన ప్రతిఫలం లేదు. పెరుగుతున్న నిత్యావసర ధరల కారణంగా వచ్చే జీతంతో కుటుంబాలు గడవడం లేదు. ఈ బడ్జెట్లో మా హామీలు నెరవేరుస్తారనుకుంటే తెలివిగా అక్కరకు రాని ప్రకటనలు చేశారు. ఏదో అరకొరగా పనికి రాని హామీలు మూడు ఇచ్చారు. ఇది మమ్మల్ని వెక్కిరించినట్టుగా ఉంది. అందుకే విజయవాడకు పయనమయ్యాం. ఇప్పటికై నా ప్రభుత్వం కనీస వేతనాలు పెంచాలి. లేదంటే మరింత ఉద్యమిస్తాం. – కాకర శాంతి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి -
ఆశ.. నిరాశ
కూటమి పాలనలో ● బడ్జెట్లో ప్రకటించిన మూడు అంశాలూ కంటితుడుపునకే.. ● మండిపడుతున్నఆశా కార్యకర్తలు ● డిమాండ్ల సాధనకు నేడు ‘చలో విజయవాడ’ వేతనాల పెంపుపై మాట తప్పిన ప్రభుత్వం ● అనేక సమస్యలకు దొరకని పరిష్కారం సాక్షి, అనకాపల్లి: తీవ్రమైన పని ఒత్తిడి.. చాలీచాలని జీతాలు.. పెరిగిన నిత్యావసర ధరలు.. దీంతో బతుకు భారమై భవిష్యత్తు అగమ్యగోచరమై ఆశా కార్యకర్తలు ఉద్యమిస్తున్నారు. కరోనా లాంటి విపత్కర సమయాల్లో కూడా ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశామని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్న కనీస డిమాండ్‌కూ ఈ కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపించిందని వారు మండిపడుతున్నారు. అందుకే ఈ నెల 6వ తేదీన తలపెట్టిన ‘చలో విజయవాడ’కు బయల్దేరారు. జిల్లాలోని వైద్యాధికారులందరికీ వినతిపత్రాలు సమర్పించి, ఫలితం లేకపోవడంతో చివరకు ఉద్యమించడానికి సిద్ధపడ్డారు. ఆశ వర్కర్లకు ఉద్యోగ విరమణ ప్రయోజనాలేవీ అందడం లేదని, తక్షణమే వాటిని అమలుచేయాలని, వేతనాలు పెంచాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఆశా వర్కర్స్ యూనియన్‌కు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రసూతి సెలవులు, 30 ఏళ్ల సర్వీసు ఉన్నవారికి ఉద్యోగ విరమణ ప్రోత్సాహంతో సరిపెట్టింది. తమకు ఉద్యోగ భద్రత కల్పించి.. కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్‌ని ఆశావర్కర్లుగా మార్పు చేయాలని, ప్రభుత్వ సెలవులు, క్యాజువల్ లీవ్స్, బీమా సౌకర్యం, మట్టి ఖర్చులు ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఏఎన్ఎం కోర్సు పూర్తి చేసిన వారికి పదోన్నతి కల్పించాలన్న కనీసమైన డిమాండ్‌నూ ప్రభుత్వం పట్టించుకోలేదు. వీటిపై ఆశా వర్కర్స్ యూనియన్‌తో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వాటిని అమలు చేయాలని ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి విజ్ఞప్తి చేసింది. 2024 ఫిబ్రవరి 9వ తేదీన ఇచ్చిన ఒప్పంద మినిట్స్ కాపీలకు జీవోలు ఇచ్చి అమలు చేయాలని కోరుతూ గురువారం చలో విజయవాడకు పిలుపునిచ్చారు. జిల్లాలో 1445 మంది ఆశాలు తమ నిరసన తెలియజేయడానికి విజయవాడకు పయనమయ్యారు. -
విశాఖ చేరుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి
గోపాలపట్నం: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీ నుంచి బుధవారం రాత్రి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆమెకు రాష్ట్ర మంత్రులు అనిత, పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ మహిళా నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో నోవాటెల్ హోటల్‌కి చేరుకున్నారు. గురువారం గీతంలో జరిగే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం బడ్జెట్ అంశంపై నోవాటెల్ హోటల్లో నిర్వహించే సదస్సులో అధికారులు, పారిశ్రామికవేత్తలు, నిపుణులతో భేటీ అవుతారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడతారు. -
హోలీకి ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం: హోలీ పండగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. ● చర్లపల్లి–షాలిమర్(07703) హోలీ స్పెషల్ చర్లపల్లిలో ఈ నెల 9, 16వ తేదీల్లో (ఆదివారం) రాత్రి 7.45 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9 గంటలకు దువ్వాడకు చేరుకుంటుంది. అక్కడ నుంచి 9.02 గంటలకు బయల్దేరి మరుసటిరోజు (మంగళవారం) తెల్లవారు 2 గంటలకు షాలిమర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో షాలిమర్–చర్లపల్లి(07704) హోలీ స్పెషల్ ఈ నెల 11, 18వ తేదీల్లో (మంగళవారంలో) ఉదయం 5 గంటలకు షాలిమర్‌లో బయల్దేరి అదేరోజు రాత్రి 7.50 గంటలకు దువ్వాడకు చేరుకుంటుంది. అక్కడ నుంచి 7.52 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 8.10 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ● చర్లపల్లి –సంత్రగచ్చి(07705) హోలీ స్పెషల్ ఈ నెల 7, 21వ తేదీల్లో(శుక్రవారం) ఉదయం 7.15 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి అదేరోజు రాత్రి 7.45గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 7.47 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 10.30 గంటలకు సంత్రగచ్చి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సంత్రగచ్చి–చర్లపల్లి(07706) హోలీ స్పెషల్ సంత్రగచ్చిలో ఈ నెల 8, 22వ తేదీల్లో (శనివారం) మధ్యాహ్నం 12.35 గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్లవారు 3.50 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 3.52 గంటలకు బయల్దేరి అదేరోజు సాయంత్రం 4.40 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. -
ఆర్‌ఏఆర్‌ఎస్‌లో చెరకు విత్తనం సిద్ధం
అనకాపల్లి: స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో 2009ఎ 107, 2009ఎ 252, 2012 ఎ 319, 93 ఎ 145 రకాల చెరకు విత్తనం అందుబాటులో ఉందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఇన్చార్జి ఏడీఆర్ పీవీకే జగన్నాథరావు తెలిపారు. కావలసిన రైలులు అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ వారిని సంప్రదించాలన్నారు. స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్ కార్యాలయంలో మంగళవారం శాస్త్రవేత్తలతో జరిగిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. పిలక దశలో రబీ వరిపైరులో ఎకరాకు 35 కిలోల యూరియా వేసుకోవాలన్నారు. వరి నాటిన 30 రోజుల్లో ఫినోక్సప్రాప్ ఈథైల్ అనే కలుపు మందును ఎకరానికి 250 మి.లీ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. వాతావరణ పరిస్థితుల్లో వరిలో జింకు లోపం కనిపించే అవకాశం ఉందన్నారు. లోప సవరణకు 2 గ్రాముల జింకు సల్ఫేట్ 5 గ్రాముల యూరియాను ఒక లీటరు నీటితో కలిపి ఐదు రోజుల వ్యవధిలో రెండు, మూడు సార్లు పిచికారీ చేయాలన్నారు. పొడి వాతావరణం ఉండడం వల్ల అపరాలు బెట్ట పరిస్థితులకు గురయినట్లతే తేలికపాటి తడి ఇవ్వాలని సూచించారు. నువ్వు పంట వేసిన 30 రోజులకు తేలికపాటి తడి ఇవ్వాలన్నారు. ఎకరాకు 20 కిలోల యూరియాను పైపాటుగా వేసుకోవాలన్నారు. చెరకు కార్శి తోటకు మోళ్లు చెక్కిన పిదప ఎకరాకు వంద కిలోల యూరియా, 250 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ 80 కిలోమ్యారేట్ ఆఫ్ పొటాష్ దుబ్బులకు దగ్గరగా గోతులు తీసి ఎరువు వేసి మట్టితో కప్పిన తర్వాత తేలికపాటి తడిని ఇవ్వాలన్నారు. చెరకు కార్శి చేసిన వెంటనే ప్రోపికొనజోల్ 1 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలన్నారు. చెరకు మొక్కతోటలు నాటే ముందు ఎకరాకు కార్బొఫూరాన్ 3జి 13 కిలోలు లేదా ఫిప్రొని 0.3జి 10 కిలోలు క్లొరాంట్రినిలిఫ్రొల్ 0.4జి 9 కిలోలు చొప్పున చాళ్లలో 1.2 నిష్పత్తిలో ఇసుకతో కలిపి వేసినట్లయితే పీక పురుగు ఉధృతిని తగ్గించవచ్చని సూచించారు. మామిడి తేనే మంచు పురుగు ఆశిస్తే ఇమిడక్లోప్రిడ్ 0.4 మి.లీ బుప్రోఫెజిన్ 1.6 మి.లీ కర్బెండిజం 1 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. పూత మొదలయ్యే సమయం పిందెలు తయారయ్యే సమయంలో పూత ఆకులపైనే కాకుండా మొదళ్లపైన కొమ్మల పైనా పిచికారీ చేయాలన్నారు. సమావేశంలో డాక్టర్ కె.వి. రమణమూర్తి, డాక్టర్ వి. గౌరీ, డాక్టర్ బి. భవాని, డాక్టర్ చంద్రశేఖర్, పి.వి. పద్మావతి పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షకు 96.2 శాతం హాజరు
యలమంచిలి రూరల్: జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాల్లో ఇంటర్ పబ్లిక్ పరీక్ష మంగళవారం సజావుగా జరిగింది. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని డీఐఈవో బి సుజాత తెలిపారు. మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్–1 పరీక్షకు మొత్తం 14,249 మందికి గాను 13,709 (96.2 శాతం) మంది హాజరయ్యారని ఆమె తెలిపారు. వీరిలో జనరల్ విద్యార్థులు 11,620 మందిలో 11,297 మంది, వొకేషనల్ విద్యార్థులు 2629 మందిలో 2412 మంది హాజరయ్యారు. మొత్తంగా 540 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు హాల్ టికెట్లను తెల్ల కాగితంపై మాత్రమే ప్రింటు తీసుకొని పరీక్షలకు హాజరు కావాలని, కలర్ పేపర్లపై తీసిన ప్రింట్లను అనుమతించరని డీఐఈవో తెలిపారు. -
పక్కాగా పదో తరగతి పరీక్షలు
● విద్యాశాఖ ప్రాంతీయ సంచాలకుడు విజయభాస్కర్ అనకాపల్లి: ఈ నెల 17 నుంచి జరుగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ఎటువంటి అక్రమాలు, ఆరోపణలకు తావు లేకుండా నిబంధనల ప్రకారం పక్కాగా నిర్వహించాలని విద్యాశాఖ విశాఖ ప్రాంతీయ సంచాలకుడు (ఆర్జేడీ) బి.విజయభాస్కర్ పేర్కొన్నారు. అనకాపల్లి గుండాల కూడలిలో ఉన్న జీవీఎంసీ ఎస్సార్ శంకరన్ సమావేశ మందిరంలో మంగళవారం టెన్త్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. సెల్ఫోన్లు, వాచ్‌లు, తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరాదని, అధికారులు, సిబ్బంది వద్ద కూడా ఫోన్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా ఉప విద్యాశాఖాధికారి పి.అప్పారావు, పరీక్షల విభాగం సహాయ కమిషనర్ శ్రీధర్‌రెడ్డి, డీసీసీబీ కార్యదర్శి సిహెచ్ సత్యనారాయణ (కిట్టు), కార్యాలయ పర్యవేక్షకుడె రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఐపీఎల్‌కు సరికొత్తగా..
● ముస్తాబవుతున్న వైఎస్సార్ క్రికెట్ స్టేడియం ● మ్యాచ్‌ల నిర్వహణపై ఏసీఏ, జిల్లా యంత్రాంగం సమీక్ష విశాఖ స్పోర్ట్స్: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు విశాఖలోని వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం సరికొత్త రూపు సంతరించుకుంటోంది. ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించి మంగళవారం జిల్లా యంత్రాంగం సమావేశమైంది. ముందుగా ఆంధ్ర క్రికెట్ సంఘం అపెక్స్ కౌన్సిల్‌తో పాటు కలెక్టర్ హరేందిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, మ్యాచ్ నిర్వాహక కమిటీ స్టేడియంను పరిశీలించింది. మ్యాచ్‌లు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించింది. స్టేడియంలో ఆధునికీకరణ పనులు పర్యవేక్షించిన అనంతరం.. ఫ్లడ్‌లైట్ల పనితీరును పరిశీలించింది. ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా స్టేడియం, స్టేడియం బయట ఎలాంటి ఏర్పాట్లు చేయాలి? ప్రవేశా మార్గాలు ఏర్పాటు తదితర అంశాలపై కమిటీ చర్చించింది. ఈ సందర్భంగా కలెక్టర్, సీపీ కాసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. కాగా.. ఈ నెల 24న రాత్రి ఏడు గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో సూపర్‌జెయింట్, 30న ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు డీసీతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లకు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయించనున్నారు. రూ.40 కోట్లతో స్టేడియం ఆధునికీకరణ సాంకేతికతను అనుసంధానిస్తూ విశాఖలోని వైఎస్సార్ స్టేడియంను ఆధునికీకరిస్తున్నట్లు ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తెలిపారు. సీపీ, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్‌బాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ క్యాపిటల్స్ సూచనల మేరకు స్టేడియంలో బాత్రూమ్లను పెంచి అభిమానులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. సంక్రాంతి అనంతరం ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టి.. స్టేడియం స్వరూపమే మార్చినట్లు చెప్పారు. దాదాపు 40 కోట్ల వరకు వెచ్చించి, తొలి దశ పనులు పూర్తి చేశామన్నారు. ఫ్లడ్‌లైట్ల కోసం రూ.9.5 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు. 34 వీఐపీ కార్పొరేట్ బాక్స్‌లతో పాటు రెండు టీమ్ బాక్స్‌లను సరికొత్తగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. దీంతో బీసీసీఐ సైతం ఈ ఏడాది మరిన్ని మ్యాచ్‌లను విశాఖ వేదికగా నిర్వహించేందుకు మాటిచ్చిందన్నారు. విశాఖలో మరో ఇంటిగ్రేటెడ్ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఎటువంటి ఆలోచన లేదని ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి సానా సతీష్‌బాబు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రతి జిల్లాలో క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటుతో పాటు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు వివరించారు. సీపీ మాట్లాడుతూ మరోసారి విశాఖ వేదికగా ఐపీఎల్ జరగడం శుభపరిణామన్నారు. ఆటగాళ్ల నుంచి అభిమానుల భద్రత వరకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ఏర్పాట్లు చేస్తామన్నారు. -
ఎస్ఐ కొలువులు సాధించిన పూర్వ విద్యార్థులకు సత్కారం
డీఎస్సీ శ్రీనివాసరావు సమక్షంలో ఎస్ఐ కొలువులు సాధించిన నాని, దుర్గాప్రసాద్‌లను సత్కరిస్తున్న కరస్పాండెంట్ కోనా సతీష్ నర్సీపట్నం : సబ్ ఇన్స్పెక్టర్లుగా కొలువులు సాధించిన పూర్వ విద్యార్థులను రిషీ కళాశాల యాజమాన్యం, డీఎస్పీ పి.శ్రీనివాసరావు సమక్షంలో ఘనంగా సత్కరించారు. రావికమతం మండలం, పి.పొన్నవోలు గ్రామానికి చెందిన పి.నాని, కె.దుర్గాప్రసాద్ రిషీ డిగ్రీ కళాశాలలో చదివారు. ఇటీవల నిర్వహించిన సబ్ ఇన్స్పెక్టర్ల పోటీ పరీక్షల్లో ఎస్ఐ కొలువులు సాధించి, ప్రస్తుతం ట్రైనీ ఎస్ఐలుగా బాధ్యతలు స్వీకరించారు. వీరిని కళాశాలకు ఆహ్వానించి డీఎస్పీ సమక్షంలో కరస్పాండెంట్ కోనా సతీష్, అధ్యాపకులు సత్కరించారు. అనంతరం ట్రైనీ ఎస్ఐలు పోటీ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. -
కందిపప్పు అడగొద్దు
● ఈ నెలలో కూడా ఎగనామం పెట్టిన కూటమి ప్రభుత్వం ● అసహనం వ్యక్తం చేస్తున్న కార్డుదారులుమహారాణిపేట: కూటమి ప్రభుత్వంలో ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) అస్తవ్యస్థంగా మారింది. ఎండీయూ వాహనాల ద్వారా బియ్యం కార్డుదారులకు అందించే కందిపప్పునకు ఈ నెల కూడా ఎగనామం పెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీడీఎస్ ద్వారా పంపిణీ చేసే నిత్యావసర సరకుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. కేవలం బియ్యం, పంచదార మినహా మిగిలిన సరుకుల సరఫరా నోచుకోవడం లేదు. కందిపప్పు సరఫరా కూడా రెండు నెలల ముచ్చటగానే ముగిసింది. ఆ తర్వాత నుంచి కందిపప్పు జాడలేదు. ఈ నెల కూడా కంది పప్పును మాత్రం అడగొద్దని అంటున్నారు. కొన్ని నెలలుగా కందిపప్పు పంపిణీ నిలిచిపోగా మార్చి నెలలోనైనా ఇస్తారని కార్డుదారులు ఆశగా ఎదురు చూశారు. కానీ ఈ నెలలో కూడా పంపిణీ చేయలేమని కూటమి ప్రభుత్వం చేతులెత్తేయడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఎన్నికలకు ముందు కూటమి పార్టీల నాయకులు బియ్యం కార్డుదారులకు వరాల జల్లు కురిపించారు. రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు, నూనె, గోధుమ పిండి, రాగి పిండి తదితర సరుకులు అందజేస్తామని హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై కనీసం దృష్టి సారించలేదు. చుక్కలు చూపిస్తున్న కందిపప్పు ధర జిల్లాలో 5,12,619 తెలుపు కార్డుదారులు ఉన్నాయి. వీరి కోసం 625 చౌకధరల డిపోలు ఉన్నాయి. దీని ప్రకారం జిల్లాలోని కార్డుదారుల అవసరాలకు అనుగుణంగా 700 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం. అయితే గతేడాదిలో రెండు నెలలు మాత్రమే కందిపప్పులు సరఫరా చేశారు. గతంలో ఎండీయూ వాహనాల ద్వారా కార్డుదారులకు కందిపప్పును రూ.67కు అందించేవారు. కొంత కాలంగా ప్రభుత్వం పంపిణీ చేయకపోవడం, బహిరంగ మార్కెట్లో కేజీ ధర రూ.160 వరకు పలుకుతుండటంతో పేద, మధ్యతరగతి ప్రజలు కందిపప్పు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో పప్పన్నానికి దూరం అవుతున్నారు. వచ్చే నెలలో అయినా కందిపప్పు అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కార్డుదారులు కోరుతున్నారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం
ఉపాధ్యాయులను సన్మానిస్తున్న పూర్వ విద్యార్థులు చీడికాడ : మండలంలో అప్పలరాజుపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో 1990–91 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు మంగళవారం తమ చదువుకున్న పాఠశాలలో కలుసుకున్నారు. 35 సంవత్సరాలు తర్వాత తొలిసారిగా కలుసుకుని, పాత జ్ఞాపకాలు నెమరవేసుకున్నారు. ఈ సందర్బంగా నాడు పాఠశాలల్లో చదివిన రోజులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పూర్వ విద్యార్థులు ఆర్థిక సహకారంతో పాఠశాలకు కంప్యూటర్ను అందజేశారు. పాఠశాల ఆవరణలో 30 మెక్కలు నాటారు. పాఠశాలల్లో చదువుతున్న 250 మంది విద్యార్దినీ, విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేశారు. అప్పట్లో చదువు నేర్పిన ఉపాధ్యాయులు వెంకట్రావు, పాల్ మాస్టర్, నర్సిరెడ్డి, రికార్డు అసిస్టెంటు గిరిజ, అప్పటి అటెండర్ లక్ష్మి తదితరులను సత్కరించారు. ప్రస్తుత పాఠశాల హెచ్ఎం, ఇతర ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థిని, ఎంపీపీ కురచా జయమ్మ, పెంటకోట రమణబాబు, పుట్టా రవి తదితరులు పాల్గొన్నారు. -
ఈ పంచాయతీ ఈవో మాకొద్దు...
రావికమతం : కొత్తకోట మేజర్ పంచాయతీ ఈవో జ్యోతిరెడ్డి పంచాయతీ పాలనను గాలికి వదిలి అధికారి పార్టీ నాయకులు చెప్పినట్లు చేస్తున్నారని సర్పంచ్ లోవరాజు, ఉప సర్పంచ్ పందల దేవ, ఎంపీటీసీ సభ్యులు పూడి దేవ, పైల చిన్నమ్మలు, వార్డు మెంబర్లు ఆరోపించారు. మంగళవారం పంచాయతీ వద్ద విలేకరులతో మాట్లాడుతూ పంచాయతీ పాలనా పరమైన సమస్యలపై ఈవో జ్యోతి నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారన్నారు. గ్రామానికి ఆదాయం సమకుర్చేందుకు సుమారు రూ.18 లక్షల నాబార్డు, పంచాయతీ నిధులతో మార్కెట్‌యార్డ్‌ను నిర్మించినా మార్కెట్ ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇవ్వలేదన్నారు. దేవాలయం వద్ద మాంసం, చేపలు విక్రయాలు చేస్తున్నారని పలువురు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. తక్షణమే ఆమైపె చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమైపె జిల్లా కలెక్టర్, మండల అభివృద్ధికి ఫిర్యాదు చేస్తామన్నారు. -
కుళ్లిన కోడిగుడ్ల సరఫరాపై గర్భిణుల ఆందోళన
యాదగిరిపాలెంలో కుళ్లిన కోడిగుడ్లు మునగపాక : యాదగిరిపాలెం అంగన్వాడీ కేంద్రం నుంచి గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేస్తున్న కోడిగుడ్లు నిల్వ ఉండిపోవడంతో కుళ్లిన వాసన వస్తుందని పలువురు ఆందోళనకు గురయ్యారు. పలువురు గర్భిణులు స్థానికంగా ఉండే అంగన్వాడీ కేంద్రం ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న కోడిగుడ్లు, పాలు తీసుకువెళతారు. సుమారు 10 రోజుల క్రితం సరఫరా చేసిన గుడ్లను ఉడికించేందుకు గర్భిణి యత్నించగా కుళ్లిన వాసన రావడంతో ఆందోళనకు గురయ్యారు. కోడిగుడ్లు నిల్వ ఉన్నవిగా గుర్తించి సంబంధిత అంగన్వాడీ టీచర్ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో పెద్దలు కొంతమంది కలుగజేసుకొని నిల్వ ఉన్న గుడ్లను పంపిణీ చేయకుండా చూసుకోవాలని ఇకపై ఇలాంటి తప్పులు జరిగితే సహించేది లేదని పలువురు హెచ్చరించారు. -
వాహనమిత్ర ఎగ్గొట్టి భారీ జరిమానాలా?
● వడ్డాదిలో ఆటో కార్మికుల ఆందోళనబుచ్చెయ్యపేట : కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి వాహనమిత్ర నగదు అందించకుండా భారీ జరిమానాలు విధించడం వాహనదారులను మోసగించడమేనని ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.లక్షణ ఆగ్రహం చెందారు. మంగళవారం మేజర్ పంచాయతీ వడ్డాదిలో ఆటో యూనియన్ నాయకులతో కలిసి ప్రభుత్వం కొత్తగా తీసికొచ్చిన నూతన మోటార్యాక్ట్ చట్టం106(1)(2)ను వెంటనే రద్దు చేయాలని నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆటో వాహన డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కూటమి ప్రభుత్వం సంపద సృష్టి అని చెప్పి వాహనదారులపై అదనపు భారం వేయడం తగదని అన్నారు. కొత్త మోటార్ యాక్ట్‌ను రద్దు చేసి ప్రతి వాహనమిత్రకు రూ.15 వేలు అందించాలన్నారు. కార్యక్రమంలో శేఖర్, నూకరాజు, రమణ తదితరులు పాల్గొన్నారు. -
సాల్వియాన్ కార్మికుల సమస్యలపై వినతి
అచ్యుతాపురం రూరల్ : సాల్వియాన్ పరిశ్రమ కార్మికుల వేతనాల సమస్యలపై లేబర్ కమిషనర్‌కి సీఐటీయూ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంగళవారం సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రొంగలి రాము మాట్లాడుతూ సాల్వియాన్ పరిశ్రమ కార్మికులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అర్ధంతరంగా మూసివేయడం అన్యాయమన్నారు. మూడు నెలల బకాయి వేతనాలు చెల్లించి, పరిశ్రమ తెరిపించి కార్మికులకు న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వం, లేబర్ అధికారులు వెంటనే స్పందించి కార్మికులకు ఇవ్వవలసిన బకాయి వేతనాలు ఇస్తూ పరిశ్రమ తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్ధంతరంగా పరిశ్రమ బంద్ చేసిన సాల్వియాన్ పరిశ్రమ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐటీయు నాయకులు డిమాండ్ చేశారు. -
14 నుంచి ఉత్తరాంధ్ర స్థాయిలో మెగా పాల పోటీలు
నర్సీపట్నం : ఉత్తరాంధ్ర పాడి పశువుల మెగా పాల పోటీలను విజయవంతం చేయాలని పశుసంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్.నరసింహులు వైద్యులకు సూచించారు. నర్సీపట్నం ప్రాంతీయ పశువైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు, పశువైద్యాధికారులు, సిబ్బందితో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక పాల దిగుబడినిచ్చే మేలు జాతి పశువుల పెంపకంపై ఆసక్తి పెంచడానికి శాసీ్త్రయ పోషణ, యాజమాన్య పద్ధతుల ద్వారా రైతుల్లో పోటీతత్వం పెంపొందించడానికి ప్రభుత్వం ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఉత్తరాంధ్ర స్థాయి మెగా పాల పోటీలను విజయనగరం జిల్లా తోటపాలెంలో నిర్వహిస్తుందన్నారు. ముర్రాజాతి గేదెలు, స్వదేశీ ఆవులు, విదేశీ సంకరజాతి ఆవులకు వేర్వేరుగా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మొదటి బహుమతి రూ.50 వేలు, రెండో బహుమతి రూ.40 వేలు, మూడో బహుమతి రూ.25 వేలుగా నిర్ణయించారన్నారు. అక్కడ వాతావరణ పరిస్థితులకు అలవాటు పడడానికి రెండు రోజుల ముందు 12వ తేదీ నుంచి పశువులను అక్కడికి అనుమతిస్తారన్నారు. రెండు రోజుల పాటు నిపుణులతో పశుపోషణలో మెలకువలు, ముఖాముఖీ సదస్సులు నిర్వహిస్తామన్నారు. స్టీల్ క్యాన్, ప్లాస్టిక్ తొట్టి, పశువులకు అవసరమైన ఇతర సామాగ్రి, ఆరు రోజులకు సరిపడా మేత, నీరు, దాణా, సర్టిఫికేట్, మెమెంటోతో పాటు ఒక్కో పశువుతో వచ్చే ఇద్దరు మనుషులకు ఉచితంగా రవాణా, వసతి, భోజనం సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఆసక్తి గల రైతులు సమీపంలోని రైతు సేవ కేంద్రం వద్ద వివరాలు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. -
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఉచిత శిక్షణ
తుమ్మపాల : ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్‌ఏఎంపీ పథకం ద్వారా ఉచిత శిక్షణ నిర్వహిస్తామని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజరు జి. నాగరాజారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతీ యువకులకు పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందుటకు ఆర్‌ఏఎంపీ పథకం ద్వారా వ్యవస్థాపకత, నైపుణ్య అభివృద్ధిపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఎంఎస్ఎంఈ (సూక్ష్మ,చిన్న మధ్యతరహా పరిశ్రమలు) ఎపి.ఎంఎస్ఎంఇ. అభివృద్ధి సంస్థ ద్వారా గుర్తింపు పొందిన శిక్షణ సంస్థ ట్రెండ్జ్ ఐటీ వారితో శిక్షణ అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎంటర్ప్రెన్యూర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా నెల రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకుకోవాలన్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ పొంది, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు స్థాపించుటకు అవసరమైన అవగాహన, ప్రాజెక్ట్ ప్రిపరేషన్, పథకాల వివరాలు, మార్కెట్ పై అవగాహన కలిగి, తద్వారా ఉపాధి పొందవచ్చునని తెలిపారు. ఈ శిక్షణ తరగతులు అనకాపల్లి పట్టణంలో ట్రెండ్జ్ ఐటీ, 12–46 మాక్స్ షాపింగ్ మాల్ పైన, 3 వ ఫ్లోర్, ఉషాప్రైమ్ పక్కన, కాంప్లెక్స్ దగ్గర, 2. చోడవరం ట్రెండ్జ్ ఐటి, 5–20, లక్ష్మిపురం రోడ్, వేంకటేశ్వరస్వామి గుడి ఎదురుగా గల కేంద్రాలలో ఈ నెల 8 నుంచి నిర్వహించబడునని తెలిపారు. అనకాపలి 9502166626, 9948519782, చోడవరం 7386084548, 7799883952 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. ఉచిత శిక్షణకు హాజరు కాదలచిన అభ్యర్థులు 18 నుండి 58 సంవత్సరాలు వయస్సు కలిగి, ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, కులధ్రువీకరణ పత్రం, తెల్లరేషన్ కార్డుతో ఈ నెల 5 నుండి సంప్రదించాలన్నారు. -
కొలంబో చేరుకున్న ఐఎన్ఎస్ కుతార్
సింథియా : హిందూ మహా సముద్రంపై శ్రీలంక, భారత్‌ల సముద్ర సంబంధాలను బలోపేతం చేసే దిశగా.. తూర్పు నావికాదళానికి చెందిన ఈస్ట్రర్న్ ఫ్లీట్ షిప్ ఐఎన్ఎస్ కుతార్ కొలంబో చేరుకున్నట్లు నేవీ వర్గాలు తెలిపాయి. దీంతో ఓడ కమాండింగ్ ఆఫీసర్ కమాండర్ నితిన్ శర్మ.. శ్రీలంక నేవీ వెస్ట్రన్ నేవల్ ఏరియా కమాండర్ రియర్ అడ్మిరల్ ఎంహెచ్సీజె శిల్వా నుంచి స్వాగతం అందుకున్నారు. అనంతరం ఇరుదేశాల నావికాదళాల మధ్య వృత్తిపరమైన, ఉమ్మడి కార్యాకలాపాలపై కార్యచరణను రూపొందించడంతోపాటు రెండు దేశాల మధ్య దీర్ఘకాల భాగస్వామ్యపంపై చర్చించినట్లు నేవీ అధికారులు తెలిపారు. -
పూడిమడక రోడ్డు విస్తరణ సర్వే పనులు వేగవంతం
● కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశంపూడిమడక రోడ్డు విస్తరణ సర్వే పనులను పరిశీలిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్ మునగపాక: పూడిమడక రోడ్డు విస్తరణ సర్వే పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. అనకాపల్లి జాతీయ రహదారి నుంచి అచ్యుతాపురం వరకు ఉన్న ప్రస్తుత రోడ్డును 100 అడుగుల మేర విస్తరించనున్న నేపథ్యంలో జరుగుతున్న ఫైనల్ సర్వే పనులను ఆమె మంగళవారం పలు శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. సర్వే పనులు వేగవంతం చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని విస్తరణకు సంబంధించి ఎటువంటి సమస్య రాకుండా చూడాలన్నారు. పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి బాధితులకు తగు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఆర్డీవో ఆయిషా, ల్యాండ్ అండ్ రికార్డ్స్ విభాగం ఏడీ గోపాలకృష్ణ, ఆర్అండ్బీ, వీఎంఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. -
మహిళల భాగస్వామ్యంతో గ్రామీణాభివృద్ధి
కె.కోటపాడు: ఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో కె.కోటపాడు జెడ్పీటీసీ ఈర్లె అనురాధ మంగళవారం పాల్గొన్నారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ వర్క్‌షాప్‌లో ఆంధ్రప్రదేశ్ తరపున ఎంపిక చేసిన ముగ్గురు జెడ్పీటీసీలతో కలిసి ఆమె పాల్గొన్నారు. మహిళల భాగస్వామ్యంతో గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వర్క్‌షాప్‌లో వివరించినట్లు అనురాధ తెలిపారు. వర్క్‌షాప్‌లో కేంద్ర పంచాయతీరాజ్, ఫిషరీస్, పశుసంవర్ధకశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, సహాయ మంత్రి ఎస్.పి.సింగ్, కేంద్ర మహిళా, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణదేవి పాల్గొన్నట్లు అనురాధ తెలిపారు. జాతీయ వర్క్‌షాప్‌లో వివరించిన జెడ్పీటీసీ అనురాధ -
వైఎస్సార్సీపీ నాయకుడికి హైకోర్టులో ఊరట
నర్సీపట్నం: బీసీ కార్పొరేషన్ స్టేట్ మాజీ డైరెక్టర్, వైఎస్సార్సీపీ నాయకుడు కర్రి శ్రీనివాసరావుకు హైకోర్టులో ఊరట లభించింది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా శ్రీనివాసరావు సోదరుడు సత్యనారాయణ భవనాన్ని కూలగొట్టారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడిని దూషించారంటూ టీడీపీ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు పలు సెక్షన్లతో శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. శ్రీనివాసరావు మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ చేయవద్దని, 41 నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. -
ఎమ్మెల్యే ఫలితం కూటమికి చెంపపెట్టు
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం చెంపపెట్టులాంటిదని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉత్తరాంధ్రపై చూపుతున్న వివక్షకు నిరసనగా టీచర్లు గట్టి షాకిచ్చారని పేర్కొన్నారు. కూటమి బలపరచిన రఘువర్మ ఘోర పరాజయం తర్వాత ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నాయకులు మాట మార్చారని మండిపడ్డారు. గెలిచిన గాదె శ్రీనివాసులునాయుడు తమ అభ్యర్థే అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. రఘువర్మను గెలిపించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సమావేశాలు నిర్వహించారని, తన ఎక్స్ ఖాతాలో రఘువర్మకు టీడీపీ శ్రేణులు ఓటెయ్యాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఆయనతోపాటు కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, అశోక్ గజపతిరాజు లాంటి సీనియర్ నాయకులు బహిరంగంగానే పిలుపునిచ్చారని పేర్కొన్నారు. వీ టితో పాటు రఘువర్మను గెలిపించాలని టీడీపీ నా యకుల పేరుతో పత్రికా ప్రకటనలు కూడా వచ్చా యన్నారు. జనసేన పార్టీ సైతం తన అధికారిక ఖా తాలో టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రఘువ ర్మను ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. గాదె శ్రీనివాసులునాయుడుకి మద్దతు ఇచ్చినట్టు కూట మి నాయకులు ఒక్క ఆధారమైనా చూపించగలరా ? అని ప్రశ్నించారు. ఎవరికో పుట్టిన బిడ్డకు మీ పేరు పెట్టుకోవద్దంటూ ఎద్దేవా చేశారు. 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వచ్చిన వ్యతిరేకతకు ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. ఉద్యోగుల్లో దాదాపు 35 శాతంగా ఉన్న టీచర్లు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వ వైఫల్యం బయటపడిందన్నారు. కుటమి దుష్టపాలనకు టీచర్లు గట్టిగా బుద్ధి చెప్పారు శ్రీనివాసులునాయుడు గెలవడంతో ప్లేటు ఫిరాయించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ -
పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి
● లైంగిక వేధింపులకు దూరంగా పెంచాలి ● ఇది మనందరి బాధ్యత: డీఎంహెచ్‌వో రవికుమార్ తుమ్మపాల: లైంగిక వేధింపులకు దూరంగా పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి.రవికుమార్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో ‘పిల్లలకు లైంగిక వేధింపులు–నివారణ’ అనే అంశంపై మంగళవారం ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పిల్లలపై లైంగిక దాడులు జరగకుండా చూసుకోవడం మనందరి బాధ్యత అన్నారు. లైంగిక వేధింపులపై పిల్లలకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని, అపరిచితులతో జాగ్రత్తగా మసలుకునేటట్లు జాగ్రత్తలు తెలియజేయాలన్నారు. ఎన్సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జె.ప్రశాంతి మాట్లాడుతూ తల్లిదండ్రులే కాకుండా సమాజంలోని అందరూ పిల్లలపై లైంగిక దాడులు జరగకుండా చూసుకోవాలన్నారు. పిల్లలకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర స్థాయి ట్రైనర్ ఉదయ్‌కుమార్, సైకాలజిస్ట్ బి.నాగరాజు మాట్లాడుతూ పిల్లలు లైంగిక వేధింపులు జరగకుండా ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలో వివరించారు. వైద్యాధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సీడీపీవోలు, గవర్నమెంట్ మెంటల్ హెల్త్ హాస్పిటల్ సిబ్బంది, సైకియాట్రిస్ట్ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో పడాల రవికుమార్ హెచ్చరించారు. జిల్లాలో 58 ప్రైవేటు స్కానింగ్ కేంద్రాలు, ఆస్పత్రులు, ల్యాబ్స్ ఎటువంటి లింగ నిర్థారణ పరీక్షలు చేపట్టినా కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ పట్టుబడినవారిపై గర్భస్థ పిండ లింగ నిర్ధారణ వ్యతిరేక చట్టం–1994 ప్రకారం మొదటిసారి మూడేళ్ల జైలు శిక్ష, రూ.50 వేలు జరిమానా, ఐదేళ్ల వరకు ధ్రువీకరణ రద్దు చేస్తామన్నారు. రెండోసారి తప్పు జరిగితే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించి, వైద్య ధ్రువీకరణ శాశ్వతంగా రద్దు చేస్తామన్నారు. -
వేతన వెతలు
ఎన్ఆర్ఈజీఎస్ కూలీల ఆకలి కేకలునిధులు విడుదల కాలేదంటున్న అధికారులువ్యవసాయ సీజన్ ముగిసింది. ఎన్ఆర్ఈజీఎస్ పనులు జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల ప్రారంభమయ్యాయి. ప్రతి గ్రామంలో ఉపాధి పనుల బాట పడుతున్నారు. రోజంతా మట్టిలో స్వేదం చిందిస్తే కూలీలకు రూ.250–300లకు మించి రావడంలేదు. అయినా ఏదో ఇంటి ఖర్చులు తీరతాయి అని వెళితే గత ఏడు వారాలుగా వేతనాలు చెల్లించలేదు. దీంతో ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారో అని ఉపాధి కూలీలు ఎదురు చూస్తున్నారు. బకాయిలైనా చెల్లించండి... తిండైనా పెట్టండి రాష్ట్రవ్యాప్తంగా నిధులకు కటకట ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 95 శాతం పనిదినాలు కల్పించాం. మార్చి నెలలో దాదాపుగా లక్ష్యానికి మరింత చేరువవుతాం. ఉపాధి వేతనదారులకు జనవరి 5 నుంచి బకాయిలు పెండింగ్ ఉన్న మాట వాస్తవమే. త్వరలో నిధులు విడుదలవుతాయి. అయితే ఈ సమస్య అనకాపల్లి జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. జనవరి 5 తరువాత చేసిన ఉపాధి పనులకు కేంద్రం నుంచి నిధులు ఇంకా విడుదల అవ్వలేదు. అందుకే బకాయిలు పేరుకుపోయాయి. నిధులు మంజూరైన వెంటనే చెల్లింపులు ప్రారంభిస్తాం. – పూర్ణిమాదేవి, డ్వామా పీడీ అనకాపల్లి జిల్లాసాక్షి, అనకాపల్లి : రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు వారివి.. ఏదో ఉపాధి పనులు ఆదుకుంటాయి కదా అని వస్తే ఏడు వారాలుగా పస్తులుండాల్సి వచ్చింది. వేతన బకాయిలు చెల్లించడానికి ఇంకెంత కాలం పడుతుందోనన్న బెంగ కూలీల గుండెల్లో గూడు కట్టుకుంది. జిల్లాలో 24 మండలాల పరిధిలో 2.89 లక్షల మంది ఉపాధి కూలీలకు ఉపాధి వేతనాలు సుమారుగా రూ.24 కోట్లు బకాయి చెల్లించాల్సి ఉంది. జనవరి 5వ తేదీ తరువాత నుంచి ఏడు వారాలుగా వేతన బకాయిలు పెండింగ్‌లో ఉండడంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. ఈ డబ్బులు ఎప్పుడిస్తారో.. చెప్పలేని స్థితిలో అధికారులు ఉన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) కోసం జిల్లాను నాలుగు క్లస్టర్లుగా విభజించారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో 6 మండలాలున్నాయి. నాలుగు క్లస్టర్ల పరిధిలో ఉన్న 24 మండలాల పరిధిలో దాదాపుగా ఉపాధి పనులు ప్రారంభమయ్యాయి. రోజంతా కష్టపడితే సగటున రూ.250–288లకు మించి కూలి డబ్బు పడడం లేదు. ఆ డబ్బు కూడా ఏడు వారాలుగా బకాయి ఉంది. ఒక్కో కూలీకి సగటున రూ.8,500 నుంచి రూ.10 వేల వరకు చెల్లించాల్సి ఉందని సమాచారం. జిల్లాలో సుమారు రూ.24 కోట్లకు పైగా బకాయి ఉంది. జనవరి 5వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన కూలీలకు కూలి సొమ్ము వచ్చింది. డిసెంబరు ఆఖరు వారం వరకు డబ్బులు వచ్చాయి. జనవరి మొదటి వారం నుంచి ఈ రోజు వరకు అంటే ఏడు వారాలుగా ఉపాధి వేతనాలు అందక కూలీలు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో కోటవురట్లలో అత్యధికంగా రూ.1.65 కోట్ల వేతన బకాయి ఉంది. ఒక్కో రోజు లక్షకు పైగా కూలీలు.. ఎన్ఆర్ఈజీఎస్ అమలులో భాగంగా 2,81,075 జాబ్ కార్డులు జారీ చేశారు. అందులో పనులకు హాజరయ్యే యాక్టివ్ జాబ్ కార్డులు 2,02,924 వరకు ఉన్నాయి. పనులకు హాజరయ్యేవారు 2,07,896 మంది వేతనదారులున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో సగటున రోజుకు లక్ష నుంచి లక్షా 20 వేలమంది వరకు హాజరయ్యారు. మార్చి నెల నుంచి కూలీలు పూర్తి స్థాయిలో పనులకు హాజరయ్యే అవకాశమున్నందున వేతన బకాయిలు చెల్లిస్తే 2 లక్షలకు పై చిలుకు వేతనదారులు పనులకు వస్తారు. లేదంటే తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 1.20 కోట్ల పనిదినాలు కల్పించాలని లక్ష్యం కాగా... 1.14 కోట్ల పనిదినాలు (ఫిబ్రవరి నెలాఖరు వరకు) పూర్తిచేశారు. ● ఆకులు పట్టుకొని ఉపాధి కూలీల వినూత్న నిరసన దేవరాపల్లి: ఉపాధి హామీ వేతన బకాయిలను తక్షణమే చెల్లించాలని ఉపాధి కూలీలు వినూత్న నిరసనకు దిగారు. తామరబ్బ గ్రామంలో మంగళవారం ఆకులు చేతపట్టుకొని నిరసన చేపట్టారు. బకాయిలైన చెల్లించండి... తిండైనా పెట్టండి అంటూ నినాదాలు చేసి వారి నిరసనను వెళ్లగెక్కారు. వీరికి ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న మద్దతు పలికారు. అనంతరం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ గత ఏడు వారాల నుంచి కూలీలకు సొమ్ము అందించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం చేసిన పనికి సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో కూలీలు గ్రామాలు విడిచి వలసలు పోతున్నారన్నారు. గత మూడేళ్లుగా బడ్జెట్లో నిధులకు కోత విధించి, మెటీరియల్ చార్జీలు పెంచేశారని, దీంతో కాంట్రాక్టర్లకు ముందు బిల్లులు చెల్లించి, కూలీలకు పెండింగ్ పెడుతున్నారన్నారు. గతంలో 20 శాతం సమ్మర్ అలవెన్స్ ఇచ్చేవారని, ఇప్పుడు పూర్తిగా కోత విధించారన్నారు. వెంటనే ఈ ఏడాది 30 శాతం సమ్మర్ అలవెన్స్‌తో పాటు మెడికల్ కిట్లు, టెంట్లు, తట్టా, గునపం, మంచినీటికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి 200 రోజుల పనిదినాలు, రోజూ 600 కూలీ సొమ్ముతో పాటు ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వాలని కోరారు. ఉపాధి హామీ కూలీల సమస్యలపై ఈనెల 12న ఛలో విజయవాడ కార్యక్రమం పేరిట ఆందోళన చేపట్టనున్నామని, విజయవంతం చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి. వెంకన్న కోరారు. తామరబ్బలో పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఆకులు పట్టుకొని వినూత్న నిరసనకు దిగిన ఉపాధి హామీ కూలీలు అప్లోడ్ చేసిన పక్షం రోజుల్లో డబ్బులు జమ చేయాలని నిబంధన ఏడు వారాలుగా అందని వేతనాలు జిల్లాలో వేతన బకాయి సుమారు రూ.24 కోట్లు ఎదురుచూస్తున్న ఉపాధి కూలీలు 2.89 లక్షలు -
బ్రేక్
అడవిలో అడ్డదారికి యలమంచిలి రూరల్: ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌కు రాకపోకల కోసం ప్రభుత్వ, అటవీ భూముల మీదుగా అనుమతులు లేకుండా వేసిన రహదారిపై రాకపోకలు జరగకుండా అటవీ, జలవనరుల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పెదపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం పొడవున అక్రమంగా రహదారి ఏర్పాటు చేసుకున్న విషయంపై ‘అడవిలో అడ్డదారి’ శీర్షికన సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనం సంచలనం కలిగించింది. ఇంత అక్రమం జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోకపోవడంపై సాక్షిలో సమగ్రంగా వచ్చిన వార్త గత రెండ్రోజులుగా అధికార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లా అటవీ అధికారి రాజారావు ఆదేశాల మేరకు యలమంచిలి సబ్ డీఎఫ్‌వో సునీల్ ఆధ్వర్యంలో యలమంచిలి అటవీ పరిధి అధికారి జి.అనిల్‌కుమార్, అటవీ సెక్షన్ అధికారి వెంకటరమణ, సిబ్బంది సోమ, మంగళవారాల్లో అటవీ భూమి మీదుగా ఏర్పాటు చేసిన రహదారిని పరిశీలించి, రహదారిపై రాకపోకలు జరగకుండా పలుచోట్ల కందకాలు తవ్వించారు. ఇకపై అటవీ భూముల్లోకి ఎవరైనా అక్రమంగా ప్రవేశించినా, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినా 1967 ఏపీ అటవీ చట్టం, 1972 వన్యప్రాణుల రక్షణ చట్టం, 2002 జీవ వైవిధ్య చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని, అతిక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు రియల్ ఎస్టేట్ వెంచర్ ప్రధాన గేటుకు ఎదురుగా హెచ్చరిక బోర్డు సైతం పెట్టారు. జలవనరుల శాఖ అధికారులు కూడా శేషుగెడ్డ రిజర్వాయర్ గట్టుపై ఎలాంటి రహదారి నిర్మించకూడదని, దీనిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక జారీ చేశారు. ఇదిలా ఉండగా అటవీ భూమిలో రహదారి వేసినందుకు ప్రాథమికంగా గుర్తించిన సమాచారం ప్రకారం ముగ్గురిపై అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసినట్టు ఎఫ్ఎస్వో వెంకట రమణ సాక్షికి తెలిపారు. యలమంచిలి పట్టణానికి ఆనుకుని 16వ నెంబరు జాతీయ రహదారికి సమీపంలోనే రియల్ వెంచర్ ఉందని చెప్పడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారిలో.. అటవీ భూముల్లో వేసిన రహదారిని తొలగించడంతో ఆందోళన మొదలైంది. రియల్ ఎస్టేట్ వెంచర్‌కు వేసిన రహదారిపై రాకపోకలు బంద్ రహదారి తొలగించి, కందకాలు తవ్వించిన అటవీ అధికారులు ముగ్గురిపై కేసు నమోదు.. ఇకపై అటవీ భూముల్లోకి ప్రవేశించే వారిపై కఠిన చర్యలు -
జిల్లాలో 33 క్షయ రహిత పంచాయతీలు
సమావేశంలో మాట్లాడుతున్న క్షయ నివారణ జిల్లా అధికారి రామకృష్ణ మాకవరపాలెం: జిల్లాలో 33 క్షయ రహిత పంచాయతీలను గుర్తించామని క్షయ నివారణ జిల్లా అధికారులు రామకృష్ణ, అయ్యప్ప తెలిపారు. స్థానిక పీహెచ్సీలో మంగళవారం వైద్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షయ రహిత గ్రామాలే లక్ష్యంగా వైద్యశాఖ చర్యలు చేపట్టిందన్నారు. దీనిలో భాగంగా ప్రతి గ్రామంలో క్షయ వ్యాధి గుర్తింపు, నివారణపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. వైద్య సిబ్బంది కూడా వ్యాధి నివారణపై ప్రజలకు వివరించాలన్నారు. జిల్లాలో 33 క్షయ రహిత పంచాయతీలను ఎంపిక చేశామన్నారు. మాకవరపాలెం మండలం బూరుగుపాలెం పీహెచ్సీ పరిధిలో జి.గంగవరం, మాకవరపాలెం పీహెచ్సీ పరిధిలో జడ్.గంగవరం, బయ్యవరం, బి.ఎస్.పేట పంచాయతీలు వీటిలో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు సీతారామలక్ష్మి, చరిష్మ, ఎంపీహెచ్‌ఈవో రమేష్, టీబీ సూపర్వైజర్లు మూలయ్య, చక్రవర్తి, ల్యాబ్ టెక్నీషియన్ సుధీర్ పాల్గొన్నారు. -
ఎన్నికల కోడ్ ఎత్తివేత
మహారాణిపేట (విశాఖ): ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికల కోడ్ ఎత్తి వేశారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఇక మీదట అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయన్నారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గత నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ జారీ నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. 27న పోలింగ్, ఈ నెల 3న ఓట్ల లెక్కింపు పూర్తయింది. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడు గెలుపొందిన విషయం తెలిసిందే. -
మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు
అభ్యర్థి వచ్చిన ఓట్లు కె.విజయ గౌరి 5,804 డాక్టర్ కె.రాధాకృష్ణ 30 గాదె శ్రీనివాసులు నాయుడు 7,210 దుర్గారావు 67 ఎన్.సూర్య ప్రకాష్ 85 ఎస్.ఎస్.పద్మావతి 15 పి.రఘువర్మ 6,845 పి.శివప్రసాద్ రావు 15 ఆర్.సత్యనారాయణ 31 డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు 33 మొత్తం 20,135 -
నైపుణ్య శిక్షణ ఇస్తే కొత్త డిజైన్ల తయారీ
● కలెక్టర్‌కు విన్నవించిన ఏటికొప్పాక హస్త కళాకారులు ● బొమ్మల తయారీ పరిశీలించిన కలెక్టర్ విజయకృషన్ ● ఉత్పత్తి వ్యయం, ఆదాయంపై ఆరా ● అంకుడుకర్ర డిపో ఏర్పాటు, బొమ్మలకు మార్కెటింగ్ సదుపాయం కోసం హస్తకళాకారుల వినతియలమంచిలి రూరల్ : అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఏటికొప్పాక లక్కబొమ్మల తయారీని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ సోమవారం పరిశీలించారు. అంకుడు కర్ర, సహజసిద్ధమైన రంగులతో తయారుచేసే బొమ్మలను కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. రాష్ట్రపతి అవార్డు అందుకున్న హస్త కళాకారుడు శ్రీశైలపు చిన్నయాచారి ఏర్పాటు చేసిన బొమ్మల తయారీ పరిశ్రమ, హస్తకళాకారుల కాలనీలకు వెళ్లి ఆమె బొమ్మల తయారీని పరిశీలించారు. ఆ పరిశ్రమలో సుమారు 200 మంది మహిళలు బొమ్మలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. హస్తకళాకారుడు చిన్నయాచారి ఆమెకు బొమ్మల తయారీ విధానం, వాడే ముడి పదార్థాలు, ఉపయోగించే రంగుల గురించి విపులంగా వివరించారు. లక్కబొమ్మల తయారీ ద్వారా ఎంత లాభం వస్తుంది? అని కలెక్టర్ అడిగారు. ఉత్పత్తి వ్యయం పోనూ సుమారు 30 నుంచి 35 శాతం లాభం వస్తుందని చిన్నయాచారి తెలిపారు. ఒకే తరహా డిజైన్లు కాకుండా కొత్త డిజైన్లు తయారు చేయగలరా? అని ఆమె అడగ్గా డిజైనర్లతో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తే ప్రస్తుత మార్కెట్ అవసరాలకు తగినట్లుగా బొమ్మలు తయారు చేయగలుగుతామన్నారు. ముఖ్యంగా బొమ్మల తయారీకి అవసరమైన అంకుడు కర్ర కొరత కారణంగా బొమ్మల తయారీ వ్యయం బాగా పెరిగిపోతోందని హస్తకళాకారులు కలెక్టర్‌కు తెలిపారు. అంకుడుకర్ర సాగు పెంచి, అటవీ శాఖ అనుమతితో కళాకారులకు అందుబాటులో డిపో ఏర్పాటు చేస్తే అందరికీ ప్రయోజనం కలుగుతుందన్నారు. బ్యాంకుల నుంచి రుణ సదుపాయం, తాము తయారు చేసిన బొమ్మలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని కోరారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పరేడ్‌లో లక్కబొమ్మల శకటం మూడో స్థానంలో నిలవడానికి కారణమైన హస్తకళాకారుడు సంతోష్‌ను ఆమె అభినందించారు. కార్యక్రమంలో కలెక్టరు వెంట డీఆర్డీఏ పీడీ కె.శచీదేవి, ఎంపీడీవో కొండలరావు, డిప్యూటీ తహసీల్దార్ వినయ్‌కుమార్, ఎంఈవో అరుణ్ కుమార్, మండల ఇంజినీర్ చంద్రశేఖర్, ఏవో ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీ మహిళా సదస్సుకు జెడ్పీటీసీ అనురాధ
కె.కోటపాడు: కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 4, 5 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించే మహిళా సాధికారితపై నిర్వహించే వర్క్‌షాపులో పాల్గొనేందుకు కె.కోటపాడు జెడ్పీటీసీ ఈర్లె అనురాధకు ఆహ్వానం అందింది. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెండు రోజుల పాటు జరిగే వర్క్‌షాపులో పాల్గొనేందుకు రాష్ట్రంలో ముగ్గురు జెడ్పీటీసీలకు ఆహ్వానం అందగా అందులో తనకు ఆహ్వానం అందడం ఆనందంగా ఉందని ఈర్లె అనురాధ అన్నారు. ఢిల్లీలో 4,5 తేదీల్లో జరిగే వర్క్‌షాపులో పాల్గోనేందుకు సోమవారం ఆమె బయలుదేరి వెళ్లారు. మహిళల నేతృత్వంలో స్థానిక సంస్థల బలోపేతం, పాలనా సామర్థ్యాల పెంపుపై ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమెకు పలువురు ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు. -
పవర్ లిఫ్టింగ్‌లో హెడ్ కానిస్టేబుల్ ప్రతిభ
నర్సీపట్నం : రత్నమ్మ మెమోరియల్ ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిప్టింగ్ పోటీల్లో నర్సీపట్నం రూరల్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కె. శ్రీనివాసరావు గోల్డ్ మోడల్ సాధించారు. మాస్టర్స్ కేటగిరిలో 95 కిలోల విభాగంలో కాంస్య పతకం, రెడ్ లిప్టు 110 కేజీల విభాగంలో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించారు. శ్రీనివాసరావును, కోచ్ లోవరాజును ట్రైనీ డీఎస్పీ చైతన్య , రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ, టౌన్ సీఐ గోవిందరావు అభినందించారు. ట్రైనీ డీఎస్పీ మాట్లాడుతూ జాతీయస్థాయి పవర్ లిప్టింగ్ పోటీలకు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు అర్హత సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు. -
టెన్త్ హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోండి
అనకాపల్లి టౌన్ : పదవతరగతి విద్యార్ధులు తమ హాల్ టికెట్లను వాట్సప్ గవర్నెన్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి జి.అప్పారావు నాయుడు తెలిపారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో అభ్యర్థులు తమ వాట్సప్ ద్వారా 95523 00009 నెంబర్‌కి హాయ్ అని మెసేజ్ పంపి, సేవను ఎంచుకోని విద్యా సేవలు ఆప్షన్ పై క్లిక్ చేసి ఎస్ఎస్సి హాల్ టికెట్‌ని ఎంచుకొని, విద్యార్థి అప్లికేషన్ నంబర్ని నమోదు చేసి, పుట్టిన తేదీ నమోదు చేయాలని, ఆపై స్ట్రీమ్‌లో రిసీవ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలని ఆయన వివరించారు. ఈ హాల్ టికెట్‌ను సంబంధిత పాఠశాలల యాజమాన్యాలతో సరిచూసుకోవాని సూచించారు. -
నాటకీయ పరిణామాలతో ఉద్రిక్తత
సోమవారం రాత్రి ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ రహదారిపై ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులుగాదె విజయం 9 గంటలకు ఖరారైంది. ఆర్వో కూడా సంతకం చేసి వెళ్లిపోయినా అధికారికంగా ప్రకటించకపోవడం, ధృవీకరణ పత్రం జారీ చేయకపోవడంతో కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నట్లు పీఆర్టీయూ ప్రతినిధులు గ్రహించారు. టీడీపీ నాయకులు గండి బాబ్జీ, సీతంరాజు సుధాకర్ రాత్రి 9.30 గంటల సమయంలో కౌంటింగ్ కేంద్రానికి చేరుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉపాధ్యాయుల్లో మరింత అనుమానాలు రేకెత్తాయి. గెలువు విషయంలో ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతుందేమోనని గ్రహించారు. వెంటనే అధికారికంగా ప్రకటించి.. ధృవీకరణ పత్రం జారీ చెయ్యాలంటూ పట్టుబట్టారు. కానీ.. కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో గాదె మద్దతుదారులు ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మెయిన్ ఎంట్రన్స్ రహదారిపై ధర్నాకు దిగారు. వెంటనే ధృవీకరణ పత్రాన్ని మంజూరు చేయాలంటూ నినదించారు. ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన చేపడుతున్నారని గ్రహించిన టీడీపీ నేతలు అక్కడి నుంచి జారుకున్నారు. చివరికి పోలీసులు కౌంటింగ్ కేంద్రంలో ఉన్న గాదె శ్రీనివాసులు నాయుడు మద్దతుదారులతో ఫోన్లో మాట్లాడి.. ఇక్కడ అంతా సవ్యంగానే ఉందని చెప్పడంతో నిరసన ఉపసంహరించుకున్నారు. -
బెత్తం దెబ్బ
కూటమికిఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి టీచర్లు ఝలక్ పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడికే అయ్యవార్లు పట్టం వర్మ ఓట్ల లెక్కింపుతో గాదెకు 12,035 ఓట్లు వచ్చినట్లుగా ప్రకటన ● కూటమి ప్రభుత్వం మద్దతిచ్చిన పాకలపాటి రఘువర్మకు షాక్ ● టీడీపీ, జనసేన నేతలు కాళ్లకు బలపాలు కట్టుకొని తిరిగినా పట్టించుకోని ఉపాధ్యాయులు ● ఫలించని ప్రజాప్రతినిధుల ప్రలోభాల ఎర ● తొమ్మిది నెలల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం ఈ ఫలితం సాక్షి, విశాఖపట్నం/విశాఖ సిటీ : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వానికి షాకిచ్చాయి. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే కూటమి పార్టీలకు ఉపాధ్యాయులు బెత్తం దెబ్బ రుచి చూపించారు. పాకలపాటి రఘువర్మను గెలిపించేందుకు టీడీపీ, జనసేన ప్రజాప్రతినిధులు కాళ్లకు బలపాలు కట్టుకొని ఉత్తరాంధ్ర జిల్లాల్లో కలియతిరిగినా టీచర్లు కనికరించలేదు. ఓటుకు రూ.2 వేలు నుంచి రూ.10 వేలు వరకు ఇచ్చి ప్రలోభాల ఎర వేసినా లొంగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడుకే పట్టం కట్టారు. ఈ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టులా పరిణమించాయి. ప్రలోభాల ఎర వేసినా.. ఏజెంట్ల అవతారమెత్తినా.. పాకలపాటి రఘువర్మ విజయానికి కూటమి నేతలు ఎన్ని ప్రలోభాల ఎర వేసినా.. ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు ఎలక్షన్ ఏజెంట్ల అవతారమెత్తినా ఉపాధ్యాయులు కనికరించలేదు. వాస్తవానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా జరుగుతాయి. ఇటువంటి గౌరవప్రదమైన ఎన్నికలకు కూటమి ప్రభుత్వం రాజకీయ రంగు పులిమింది. ఏపీటీఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పాకలపాటి రఘువర్మకు ముందు టీడీపీ, జనసేనలు మద్దతుగా నిలిచాయి. నామినేషన్ వేసిన దగ్గర నుంచి పోలింగ్ వరకు ఆ పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రఘువర్మ విజయం నల్లెరుపై నడకే అన్న తరహాలో ప్రచారం చేసుకుంటూ పోయారు. మరోవైపు కూటమి ప్రభుత్వం మద్దతు ఉన్న రఘువర్మను గెలిపిస్తేనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమవుతాయని వాట్సాప్ గ్రూపుల్లో విస్తృత ప్రచారం కల్పించారు. ఉత్తరాంధ్రలో ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేర్వేరుగా ప్రత్యేక పార్టీలు, విందులు, వినోదాలు ఏర్పాటు చేశారు. ఓటుకు రూ.2 వేలు నుంచి రూ.10 వేలు వరకు ముట్టజెప్పారు. పోలింగ్ రోజున ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కేంద్రాల వద్ద టెంట్లలో ఎన్నికల ఏజెంట్ల తరహాల్లో ఓటర్ స్లిప్పులను సైతం అందించారు. ఇలా ఎన్ని చేసినా ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వాన్ని విశ్వాసంలోకి తీసుకోలేదు. తొమ్మిది నెలలకే ప్రభుత్వంపై వ్యతిరేకత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడం, రాష్ట్ర ఖజానాను నింపుకోవడం కోసం విద్యుత్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వంపై అనతికాలంలోనే అన్ని వర్గాలకు ఆశలు సన్నగిల్లాయి. ప్రధానంగా ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై ఇప్పటివరకు దృష్టి పెట్టకపోవడంతో పాటు పీఆర్సీ కమిటీ ఏర్పాటు, ఐఆర్ వంటి వాటి ప్రస్తావనే చేయకపోవడంపై కూడా ఉద్యోగ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. ఈ క్రమంలో జరిగిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు ప్రభుత్వానికి తమ దెబ్బ రుచి చూపించారు. టీడీపీ, జనసేన మద్దతిచ్చిన పాకలపాటి రఘువర్మను ఓడించి గాదె శ్రీనివాసులునాయుడును గెలిపించారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇంతటి వ్యతిరేకతను మూట్టగట్టుకోవడంతో కూటమి శ్రేణులు డీలా పడ్డాయి. ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు రంగంలోకి దిగినప్పటికీ ఓటమి చడిచూడడంతో జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈవీఎం కాదు.. బ్యాలెట్ విజయమిది.! గాదె విజయానంతరం పీఆర్టీయూ మద్దతుదారులతో కౌంటింగ్ కేంద్రం వద్ద కోలాహలం ఏర్పడింది. ఇది ఈవీఎం విజయం కాదనీ... బ్యాలెట్ బాక్సుల విజయమని కొందరు ఉపాధ్యాయులు వ్యాఖ్యానించడం గమనార్హం. -
తొలి నుంచి గాదెకు ఆధిక్యం
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఉదయం 11.30 గంటలకు బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లను 20 టేబుల్స్‌కు సరిపడేలా కట్టలు కట్టారు. మొత్తం 20,971 ఓట్లు పోలవ్వగా 656 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. దీంతో 10,068 ఓట్లను మ్యాజిక్ ఫిగర్‌గా ప్రకటించారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆది నుంచీ గాదె శ్రీనివాసులనాయుడు ఆధిక్యంలో కొనసాగారు. మొదటి ప్రాధ్యానత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి గాదె 365 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. గాదెకు మొదటి ప్రాధ్యాన్యత ఓట్లు 7,210 రాగా, రఘువర్మకి 6,845 ఓట్లు, విజయ గౌరికి 5,804 ఓట్లు వచ్చాయి. మధ్యాహ్నం విరామం అనంతరం ఎలిమినేషన్ రౌండ్ల కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగింది. ప్రతి దశలోనూ గాదె ఆధిక్యం కొనసాగింది. మూడో స్థానంలో ఉన్న విజయ గౌరికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత లెక్కింపు చేపట్టారు. 9వ రౌండ్లో గాదె 9,237 ఓట్లతో మొదటి స్థానంలో నిలవగా.. వర్మకు 8,527 ఓట్లు వచ్చాయి. దీంతో తన ఓటమి ఖరారైందని భావించిన వర్మ కౌంటింగ్ కేంద్రం నుంచి నిరాశగా వెనుదిరిగారు. అయితే.. మ్యాజిక్ ఫిగర్ ఓట్లు సాధించేందుకు గాదె ఇంకా 831 ఓట్ల దూరంలో నిలిచారు. 1967 ఓట్ల మెజారిటీతో విజయం అప్పటికే వర్మ బయటికి వెళ్లిపోవడంతో వర్మకి చెందిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లని లెక్కించాలా.. గాదె విజయాన్ని ధృవీకరించాలా అనే అంశంపై రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్, ఎన్నికల అబ్జర్వర్ ఎం.ఎం.నాయక్ ఎలక్షన్ కమిషన్‌కి అభ్యర్థించారు. మ్యాజిక్ ఫిగర్ వచ్చేంతవరకూ లెక్కించాలని చెప్పడంతో వర్మకి వచ్చిన ఓట్ల లెక్కింపును సాయంత్రం 6.45 గంటలకు ప్రారంభించారు. గాదె మ్యాజిక్ ఫిగర్ 10,068 ఓట్లకు చేరుకోగానే అధికారికంగా గాదె విజయం సాధించారు. మిగిలిన ఓట్ల లెక్కింపును కూడా పూర్తి చేశారు. చివరకు గాదెకు 12,035 ఓట్లు వచ్చాయి. రిటర్నింగ్ అధికారి గాదె విజయం సాధించినట్లు సంతకం చేసి ఎన్నికల కమిషన్ సంతకం కోసం విజయవాడ పంపించారు. -
టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నిక తీర్పు.. కూటమికి చెంప పెట్టు
● 9 నెలలకే కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం ● మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే ప్రచారం చేసినా తప్పని పరాజయం ● మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు విమర్శదేవరాపల్లి : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించడం కూటమి ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటిదని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. ఈ మేరకు తారువలో సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, నాయకులంతా శత విధాలుగా ప్రలోభాలకు తెరతీసినా ఘోర పరాజయం తప్పలేదని ఎద్దేవా చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 9 నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకుందని, గతంలో ఏ ప్రభుత్వానికి ఇంతటి చేదు అనుభవం ఎదురుకాలేదన్నారు. కూటమిపై ఉపాధ్యాయులు తిరుగుబావుటా ఎగురు వేసి, ఓటమి రుచి చూపించారన్నారు. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు చేతిలో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఘోర పరాజయం మోసపూరిత వాగ్దానాలతో దగా చేసిన ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. ఎన్నికల్లో గెలిచాక కనీసం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఒక్క డీఏ, ఐఆర్, పీఆర్సీ ఊసెత్తకుండా మోసగించడంతో కూటమికి ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పారని మాజీ డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిష్పక్షపాతంగా అమలు చేయాలని, లేకుంటే రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజా తీర్పు మాత్రం ఇదే మాదిరిగా ఉంటుందని స్పష్టం చేశారు.