Annamayya
-
ఇద్దరు సీఐల బదిలీ
● ముగ్గురి నియామకం రాయచోటి: పొలీస్ శాఖలో సీఐల బదిలీలు, నియామకాలు చేపట్టారు. మంగళవారం రాత్రి కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ అన్నమయ్య జిల్లా పరిధిలో ఇద్దరిని బదిలీ చేస్తూ, ముగ్గురిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాయచోటి అర్బన్ సీఐ పి.చంద్రశేఖర్‌ను కర్నూలు వీఆర్‌కు బదిలీ చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు సీఐగా పని చేస్తున్న బి.వి.చలపతిని రాయచోటి అర్బన్ సీఐగా నియామకం చేశారు. రాజంపేట మన్నూరు సీఐగా పని చేస్తున్న కె.మహమ్మద్ అలీని అన్నమయ్య సైబర్ సెల్ సీఐగా, కడప వీఆర్‌లో పని చేస్తున్న ఎస్.కులాయప్పను మన్నూరు సీఐగా, కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో పని చేస్తున్న సీఐ జి.శంకరమల్లయ్యను అన్నమయ్య జిల్లా ఉమెన్స్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. -
17న గ్రామ పంచాయతీ కార్మికుల చలో విజయవాడ
రాయచోటి అర్బన్ : గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 17న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకట్రామయ్య తెలిపారు. మంగళవారం రాయచోటి మండలం చెన్నముక్కపల్లె గ్రామం పీటీఎం పల్లెలో జరిగిన జిల్లా స్థాయి పంచాయతీ కార్మికుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చలో విజయవాడ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను కార్మికులతో కలిసి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కార్మికులకు 3 నుంచి 9 నెలల వరకు వేతన బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు. కార్మికుల పేరుమీద ఈఎస్ఐ, పీఎఫ్‌లకు నిధులు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు రామాంజులు, ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబు మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రీన్ అంబాసిడర్లకు జీతాలుగా కొన్ని పంచాయతీలు పూర్తిగా చెల్లించలేదన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు దేవరాయలు, ఏ.వి.రమణ, అంజి, మురళి, రెడ్డెయ్య, సుభద్ర, లక్ష్మిదేవి, గంగులు, శ్రీరాములుతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు. -
బాధ్యతాయుతంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి
– జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు రాయచోటి : రోడ్డు భద్రత, వ్యక్తిగత భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ బాధ్యతగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ప్రజలకు సూచించారు. మంగళవారం రాయచోటిలో పత్రికలకు అందజేసిన ప్రకటనలో డ్రైవింగ్ లైసెన్సులతో వాహనాలు నడిపి ప్రమాదాల నివారణకు సహకరించాలని ఎస్పీ కోరారు. చట్టపరమైన అవసరమే కాకుండా రోడ్డు భద్రతకు, వ్యక్తిగత భద్రతకు కూడా చాలా ముఖ్యమన్నారు. దేశంలో మోటారు వాహనాలను నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరి అన్నారు. డ్రైవింగ్ లైసెన్సు ఒక ముఖ్యమైన గుర్తింపు పత్రమన్నారు. చట్టప్రకారం 18 సంవత్సరాలు నిండని వారు వాహనం నడపరాదన్నారు. మైనర్లు వాహనం నడపటం వల్ల వారికి, ఇతరులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. మైనర్లకు వాహనం ఇచ్చిన వారి మీద చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. -
రైలుకింద పడి గుర్తుతెలియని యువకుడి మృతి
మదనపల్లె : గుర్తు తెలియని యువకుడు రైలు కింద పడి మృతి చెందిన ఘటన మంగళవారం మదనపల్లె మండలంలో జరిగింది. ధర్మవరం నుంచి నరసాపురం వెళుతున్న రైలు కిందపడి సీటీఎం వద్ద యువకుడు మృతి చెందడంతో గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వివరాలు తెలియలేదు. కాగా, మృతుడు గళ్లచొక్కా, నీలిరంగు ప్యాంటు ధరించి సుమారు 25 ఏళ్ల వయస్సు కలిగి ఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు కదిరి రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ రహీం తెలిపారు. దేవతానగర్‌లో చోరీ మదనపల్లె : పట్టణంలోని దేవతానగర్‌లో చోరీ జరిగింది. మంగళవారం చోరీపై బాధితులు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డ్రైవర్‌గా పనిచేస్తున్న చిన్నరెడ్డెప్ప దేవతానగర్‌లో భార్య అరుణతో కలిసి నివసిస్తున్నాడు. ఈనెల 9న గుర్రంకొండ మండలం శెట్టివారిపల్లె పంచాయతీ అరిగెలవారిపల్లెకు భార్యతో కలిసి వ్యక్తిగత పనులపై వెళ్లారు. పనులు ముగించుకుని పదోతేదీ ఉదయం ఇంటికి రాగా, ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటంతో ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా, వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువా తలుపులు తెరచి ఉండటంతో చోరీ జరిగిందని నిర్ధారించుకున్నారు. 74 గ్రాముల బంగారు ఆఽభరణాలు చోరీకి గురయ్యాయని తాలూకా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. క్లూస్‌టీమ్ సభ్యులు ఆధారాలు సేకరించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. టీడీపీ మండల అధ్యక్షుడి కారు దగ్ధం రామసముద్రం : మండల టీడీపీ అధ్యక్షుడు విజయగౌడ్ కారును సోమవారం అర్థరాత్రి గుర్తుతెలియని దుండగులు కాల్చివేశారు. సమాచారం అందుకున్న మదనపల్లె రూరల్ సీఐ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని ఎస్ఐ రవికుమార్‌తో కలిసి పరిశీలించి వివరాలు సేకరించారు. అర్థరాత్రి కారుకు నిప్పు పెట్టడంతో టైర్లు పగిలిన శబ్దానికి మెలకువ వచ్చి చూడగా కారు కాలుతోందని బాధితుడు తెలిపారు. వెంటనే పుంగనూరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో మంటలు అదుపు చేశారు. విషయం తెలుసుకున్న సీఐ సత్యనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అలాగే ఎమ్మెల్యే తనయుడు జునైద్ అహ్మద్, టీడీపీ రాజంపేట అధికార ప్రతినిధి ఆర్.జె. వెంకటేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనుమానితులపై కేసు నమోదు చేశామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని సీఐ తెలిపారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే అక్రమాలపై ఆగ్రహం
మదనపల్లె : పాతికేళ్ల క్రితం తాము కష్టార్జితంతో కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాలకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ అధికార బలంతో అక్రమంగా పొందిన 1బీ అడంగల్‌ను రద్దుచేసి తమకు న్యాయం చేయాలని చేనేత కార్మికులు వేడుకున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటిస్థలాలను ఆక్రమించి, దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడంపై మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధితులు ధర్నాకు దిగారు. కార్యాలయం ఎదుట బైఠాయించి, లోపలకి ఎవ్వరిని వెళ్లనీయకుండా అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీకే.పల్లె రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్ 423/2లో కొండుపల్లె యశోదమ్మ, కొండుపల్లె శ్రీనివాసులు, కె.రెడ్డెప్ప నుంచి 77 మంది చేనేత కార్మికులు ప్లాట్ల రూపంలో వేసిన లే అవుట్లో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేశామన్నారు. ఇందులో కొందరు ఇళ్లు నిర్మించుకోగా, మరికొందరు పునాదులు వేసుకుని, స్థలాన్ని కాపాడుకుంటూ వస్తున్నామన్నారు. ఈ స్థలాన్ని ఎలాగైనా కాజేయాలనే దురుద్దేశంతో రికార్డులు తనిఖీ చేసుకోకుండా, తమను సంప్రదించకుండా 2020 సంవత్సరం డిసెంబర్ 1న దేశిరెడ్డి హరినాథరెడ్డి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ(జీపీఏ) తీసుకుని, ప్లాట్ల రూపంలో అమ్మిన భూమిని, వ్యవసాయభూమిగా పేర్కొంటూ 2025 జనవరి 29న టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ డాక్యుమెంట్ నెంబర్.962/2025 కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. తర్వాత అక్రమంగా భూమిలోకి ప్రవేశించి, పాతికేళ్లుగా ఉన్న తమను ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా బెదిరిస్తూ దౌర్జన్యంతో చుట్టూ కంచె నిర్మించాడన్నారు. ఈ విషయమై తాము ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, తహసీల్దార్లను కలిసి తమగోడును వివరించి న్యాయం చేయాల్సిందిగా అభ్యర్థించామన్నారు. ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, సబ్ రిజిస్ట్రార్ గురుస్వామిని పిలిచి రిజిస్ట్రేషన్ రద్దుచేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని ఆదేశించారన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో 1బీ, అడంగల్ ఆన్లైన్లో ఉన్నందునే తాను రిజిస్ట్రేషన్ చేశానని సబ్ రిజిస్ట్రార్ చెప్పిన నేపథ్యంలో వాటిని రద్దుచేయాల్సిందిగా అధికారులకు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశామన్నారు. అయితే మూడు వారాలు అవుతున్నా ఇప్పటివరకు అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. తమకు న్యాయం జరగని పక్షంలో తమకు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయ తలుపులు మూయడంపై వివాదం.. న్యాయం చేయాలని బాధితులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట కూర్చుని నిరసన తెలుపుతుంటే, అధికారులు పట్టించుకోకపోగా.. లోపలకు ఎవ్వరినీ అనుమతించకుండా .కార్యాలయం తలుపులు వేసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఆడవాళ్లు, చేనేతకార్మి కులు నిరసన తెలుపుతున్నా, పట్టించుకోకపోవడంపై నిలదీశారు. దీంతో తహసీల్దార్, కార్యాలయం ఎదుట న్యూసెన్స్ చేస్తున్నారని, పోలీసులను పిలిపించారు. నిరసన తెలిపిన వారిని అదుపులోకి తీసుకోవాల్సిందిగా కోరారు. దీనిపై బాధితులు తాము న్యాయం కోసం మాత్రమే వచ్చామని, తమ భూమిపై అక్రమంగా మంజూరుచేసిన 1బీ అడంగల్‌ను రద్దుచేస్తే చాలని వేడుకున్నారు. తహసీల్దార్ ధనంజయులు మాట్లాడుతూ...పని ఒత్తిడి అధికంగా ఉండటంతో కార్యాలయం తలుపులు వేసుకుని లోపల పనిచేస్తున్నామని, ఆఫీసు వేళల్లో ఇబ్బంది పెట్టడం భావ్యం కాదన్నారు. ఈ విషయమై ఇప్పటికే జిల్లా కలెక్టర్, బాధితులతో మాట్లాడారని, ఆయన ఆదేశాల ప్రకారం నడుచుకోవాల్సిందిగా సూచించారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధితుల ధర్నా అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని ఆవేదన -
సచివాలయ దారికి అడ్డంగా కంచె
సాక్షి టాస్క్‌ఫోర్స్ : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కూటమి నాయకులు రెచ్చిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ రైల్వేకోడూరు నియోజకవర్గ ఇన్చార్జి ముక్కా రూపానందరెడ్డి అనుచరులు చిట్వేలి మండలం, మార్గోపల్లి సచివాలయానికి వెళ్లే దారికి అడ్డంగా సిమెంటు దిమ్మెలను నాటి ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై తహసీల్దార్, ఎంపీడీఓలను వివరణ కోరగా గుడి కోసం కంచె వేశారని చెబుతున్నారు. కాగా గుడి పేరుతో గ్రామకంఠం కబ్జాలకు పాల్పడుతున్నారని సచివాలయానికి వెళ్లేదారిలో కంచె ఏర్పాటు చేస్తుంటే అధికార పార్టీ నాయకులకు అధికారులు అండదండగా నిలుస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సచివాలయానికి ప్రత్యామ్నాయంగా సిమెంటు రోడ్డు ఉందని, అయితే సంవత్సరాలుగా సచివాలయానికి వెళ్లే రహదారిలో కంచె ఏర్పాటు చేయడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు కలెక్టర్, సబ్ కలెక్టర్ ఈ విషయంపై విచారించి చర్యలు తీసుకోవాలని, సచివాలయానికి గతంలో ఉన్న దారిని వదిలి గుడి నిర్మించుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. గ్రామకంఠం కబ్జా చేసేందుకు కూటమి నాయకుల యత్నం పట్టించుకోని అధికారులు -
ప్రశాంతంగా ఉరుసు నిర్వహించాలి
రామాపురం : మండల పరిధిలోని నీలకంట్రావుపేట పంచాయతీ సమీపంలో సద్గురు సాయి దర్బార్ నగర్లో వెలసిన సద్గురు హజరత్ దర్బార్ అలీషా వలీ, రహమతుల్లా అలై బాబా, జలీల్ మస్తాన్ వలీ బాబా ఉరుసు ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని తహసీల్దార్ రామాంజనేయులు, లక్కిరెడ్డిపల్లె సీఐ కొండారెడ్డి, ఎస్ఐ వెంకటసుధాకర్రెడ్డిలు తెలిపారు. ఉత్సవాల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ 13న గంధం, 14న ఉరుసు ఉత్సవాలు, రాత్రికి బెంగళూరుకు చెందిన అస్మా నిఖిత్ ఖవ్వాలి, అలాగే నాగపూర్‌కు చెందిన సలీం షైదా ఖవ్వాలి నిర్వహించనున్నారు. 15న తీర్థ ప్రసాదాలతో ఉరుసు ముగుస్తుందన్నారు. ఉరుసు ఉత్సవాలను హిందూ ముస్లిం ఐకమత్యంతో జరుపుకోవాలని సూచించారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలసపాడు : కలసపాడు మండలంలోని పెండ్లిమర్రి వద్ద ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న భార్గవి సోమవారం రాత్రి పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్రంగా గాయపడిన ఆ బాలికను చికిత్స నిమిత్తం సిబ్బంది పోరుమామిళ్లలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం అక్కడి నుంచి కడప రిమ్స్‌కు, ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపల్ రెడ్డిజ్యోతిని వివరణ కోరగా విద్యార్థిని ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి కింద పడిందని, వెంటనే అక్కడ ఉన్న సిబ్బందికి తెలియజేసి పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించామని తెలిపారు. దాడి ఘటనలో కేసు నమోదు కడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలో పులివెందుల రోడ్డు సాక్షి సర్కిల్ సమీపంలో ఈనెల 10వ తేదీన పాతసామాన్ల అంగడిని నిర్వహిస్తున్న విక్రమ్ వద్దకు మాట్లాడేందుకు మల్లికార్జున అనే వ్యక్తి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడున్న కిషోర్, ప్రకాష్, ఇంకా ముగ్గురు మల్లికార్జునను ఎగతాళి చేశారు. దీంతో ఈ విషయాన్ని మల్లికార్జున తన సోదరుడు, సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి మద్దిలేటికి తెలియజేశాడు. మద్దిలేటి వారిని అడిగేందుకు సంఘటన స్థలానికి వెళ్లగా వారు మద్దిలేటి, అతని సోదరుడు మల్లికార్జునపై దాడి చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం కడప తాలూకా ఎస్ఐ తాహీర్హుసేన్ కేసు నమోదు చేశారు. -
ఇష్టపడి చదివితేనే ఉత్తీర్ణత
సిద్దవటం : బీసీ వసతి గృహంలో ఉండి చదువుకునే విద్యార్థులు క్రమశిక్షణతో, ఇష్టపడి చదివితే అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించగలరని జిల్లా బీసీ సంక్షేమాధికారి భరత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సిద్దవటం మండలం పార్వతీపురంలో ఉన్న బీసీ బాలుర వసతి గృహంలో మంగళవారం రాత్రి 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి నైతిక విలువలను పెంచుకోవాలన్నారు. 10వ తరగతి విద్యార్థులు ఏకాగ్రతతో చదివి మంచి మార్కులను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీబీవీడి సభా హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఎం.డి. మధుసూదన్, తెలుగు పండిట్ పోలిరెడ్డి, ఉపాధ్యాయులు, జిల్లా బీసీ వెల్ఫేర్ కార్యాలయం సూరింటెండెంట్ ఆంజనేయులు, స్థానిక వసతి గృహం అధికారి రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆడ్డుకోవాల్సిన వారే.. ఆడించేస్తున్నారు..!
● అంతర్ జిల్లాల పేకాటకు అడ్డాగా రాయచోటి ● జోరుగా జూద స్థావరాలు ● నిర్వాహకులకు కొందరు ఖాకీల సహకారం ● పోలీసుల అదుపులో ప్రధాన గ్యాంబ్లర్ ● ఎస్పీ విచారణలో గుట్టు రట్టు టాస్క్ ఫోర్స్: అధికారమే అండగా.. శిక్షించాల్సిన రక్షక భటులే అసాంఘిక కార్యకలాపాలకు రక్షణగా ఉండటంతో.. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పేకాట స్థావరాలకు అడ్డాగా మారింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన జూదరులకు జిల్లా కేంద్రం, పరిసర ప్రాంతాలు వేదికలయ్యాయి. మొబైల్ పేకాట, స్థానికంగా ఉన్న తోటలు, గుట్టల్లో రోజూ కోట్ల రూపాయలు చేతులు మారే జూదం నడుస్తోంది. కొందరు పోలీసులు, ఉన్నతాధికారులు.. నిర్వాహకులు అందించే మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఒక్కో ఆట నిర్వహణకు ముడుపుల రూపంలో లక్ష రూపాయలు ముడుతున్నట్లు ప్రచారం ఉంది. ఇలా రోజుకు రెండు, మూడు క్యాంపులు నిర్వహించి.. అంతే మొత్తంలో గ్యాంబర్లు అశోక్‌రెడ్డి, నర్సరీ రమణ మరికొందరి నుంచి ఓ కానిస్టేబుల్, హోంగార్డు ద్వారా కొందరు పోలీసు అధికారులకు అందుతున్నట్లు తెలియవచ్చింది. ఈ పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నా రాయచోటి కేంద్రంగా అధికంగా కనిపిస్తోంది. దీంతో ఎస్పీ నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. స్పెషల్ పార్టీ పోలీసుల దాడులు జిల్లా వ్యాప్తంగా ఎస్పీకి అనుబంధ శాఖలు, వేగుల నుంచి అందుతున్న సమాచారం మేరకు నేరుగా స్పెషల్ పార్టీ పోలీసులతో పేకాట స్థావరాలపై దాడులు చేస్తూ తనదైన శైలిలో చర్యలు చేపట్టారు. దాడుల సమయంలో జూదరులు అందిస్తున్న సమాచారం మేరకు.. పోలీస్ శాఖ పరిధిలోని ఇంటి దొంగల పేర్లు బయటకు వస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఒక కానిస్టేబుల్, హోంగార్డు, ఒక డబుల్, త్రిబుల్ స్టార్ల అధికారుల పేర్లు కూడా ఆధారాలతో సహా రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. అందుపులో అంతర్ జిల్లా గ్యాంబ్లర్ అన్నమయ్య జిల్లా కేంద్రంగా పేకాట పక్క జిల్లాలు, ప్రాంతాల నుంచి జూదరులను సేకరించే గ్యాంబ్లర్ అశోక్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రాయచోటి సమీపంలో రెండు రోజుల క్రితం పేకాట స్థావరంపై దాడి చేసి 12 మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దాడి చేసిన సమయంలో మరో ఐదుగురు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నట్లు సమాచారం. వారిలో ప్రధానంగా గ్యాంబర్లు అశోక్ రెడ్డి, నర్సరీ రమణ, కానిస్టేబుల్ కోసం ఎస్పీ పార్టీ వలపన్నగా.. అశోక్‌రెడ్డి చిక్కినట్లు తెలుస్తోంది. అశోక్‌రెడ్డి ద్వారా జాదరులకు సహకరిస్తున్న పోలీసులు, పోలీసు అధికారుల వివరాలను రాబడుతున్నట్లు తెలియవచ్చింది. గ్యాంబర్ల నుంచి డబ్బుల చేరవేతలో మధ్యవర్తిగా ఉన్న హోంగార్డును కూడా స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి తొలగించి ఎస్పీ కార్యాలయానికి అటాచ్మెంట్ చేసినట్లు వినికిడి. -
●మనుషులు, పాడి ఆవులు మృత్యువాత
వేటగాళ్లు వినియోగించే నాటుబాంబులు, విద్యుత్ తీగెల వల్ల మనుషులతోపాటు పాడిఆవులు బలి అవుతున్న సంఘటనలు ఉన్నాయి. మండలంలోని మర్రిపాడు గ్రామ కస్పాకు చెందిన నందమహారెడ్డి గ్రామానికి సమీపంలోని తన పొలంలో వేరుశనగ పంట సాగు చేశాడు. ఆయన రెండేళ్ల క్రితం రాత్రి వేళ పొలానికి కాపలాగా వెళ్తుండగా.. పరిసరాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగెల్లో చిక్కుకొని మృతి చెందాడు. కలకడ మండలం ఎనుగొండ పాళెం తండాకు చెందిన సిద్దులు నాయక్, లీలాభాయ్లు గుర్రంకొండకు పక్కనున్న సుంకర వాండ్లపల్లెకు నడకదారిన వెళుతూ.. విద్యుత్ తీగెల మధ్యలో చిక్కుకొని మృతి చెందారు. వారం రోజుల క్రితం చెర్లోపల్లె పంచాయతీ కిలారివాండ్లపల్లె సమీప పొలాల్లో విద్యుత్ తీగెల వల్ల రమేష్నాయడు అనే వ్యవసాయ కూలీ మృత్యువాత పడ్డాడు. యల్లంపల్లెలో ఇరువురు వ్యక్తులు రక్తగాయాలతో బయట పడి ఆస్పత్రుల పాలయ్యారు. మామిళ్లవారిపల్లె నాగరాజుకు చెందిన పాడిఆవు పొలాల వద్ద ఉన్న నాటుబాంబును నమిలి నోరు మొత్తం పేలిపోయి మృతి చెందింది. యల్లంపల్లె, సరిమడుగు, నడిమిఖండ్రిగ గ్రామాల్లో విద్యుత్ తీగెల్లో చిక్కుకొని నాలుగు పాడిఆవులు మృతి చెందాయి. -
ప్రకృతి వ్యవసాయం.. లాభదాయకం
రాజంపేట రూరల్: ప్రకృతి వ్యవసాయం రైతులకు ఎంతో లాభదాయకమని జిల్లా డీఆర్సీ ఏడీఏ అశోక్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని ఊటుకూరు గ్రామ సచివాలయంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా మంగళవారం వీఏఏ, వీహెచ్ఏ, వీఏఓలతోపాటు ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి జి.రాజకుమారి, వెలుగు ఏపీఎం గంగాధర్, ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ వేల్పుల సిద్దయ్య, డీఆర్సీ ఏఓ సుచరిత, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి పాఠశాలలో స్కౌట్స్ ఏర్పాటురాయచోటి అర్బన్: అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో స్కౌట్ యూనిట్ ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం అన్నారు. పట్టణంలోని అర్చన కళాశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు నిర్వహిస్తున్న పెట్రోల్ లీడర్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన మంగళవారం ఉదయం పరిశీలించారు. పీఎంశ్రీ పాఠశాలల నుంచి వచ్చిన 250 మంది విద్యార్థులకు రెసిడెన్షియల్ విధానంలో 5 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అర్చన విద్యాసంస్థల కరస్పాండెంట్ మదనమోహన్‌రెడ్డి, హెచ్‌డబ్ల్యూ బి.నిర్మల, స్కౌట్స్ మాస్టర్ నాగరాజ, గైడ్ కెప్టెన్లు సుజాత, గోవిందమ్మ, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. మిట్స్ కళాశాలకు అరుదైన గౌరవం కురబలకోట: అంగళ్లులోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలకు అరుదైన గౌరవం దక్కింది. సివిల్ విభాగానికి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ కొలాబరేషన్ ల్యాబొరెటరీస్ (ఎన్‌ఎబీఎల్) గుర్తింపు నాలుగేళ్ల పాటు లభించింది. ఇందుకు సంబంధించిన పత్రాన్ని ప్రిన్సిపాల్ యువరాజ్‌తోపాటు ప్రొఫెసర్లు మంగళవారం మీడియాకు విడుదల చేశారు. ఉన్నత విద్యా ప్రమాణాలకు ఎన్‌ఎబీఎల్ మార్గదర్శకమవుతుందని ప్రిన్సిపాల్ తెలిపారు. దీని ద్వారా పరిశోధన సామర్థ్యాలు పెంచుకోవడంతోపాటు పరిశ్రమలలో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చన్నారు. విద్యార్థులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. -
పేద విద్యార్థులను విస్మరించిన ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యం చేయడం వల్ల వారు చదువులు ఆపాల్సి వస్తోంది. దీని ప్రభావం సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై పడుతోంది. పిల్లల ఫీజులకు డబ్బులు లేక తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారు. గతంలో 2018–19లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం బకాయి పెట్టిన 1800 కోట్ల రూపాయలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. అదే విధంగా 2023–24లో ఎన్నికల కోడ్ కారణంగా ఏర్పడిన బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత నుంచి ప్రస్తుత కూటమి ప్రభుత్వం పక్కకు తప్పుకోవడం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే. ఆ బకాయిలతో కలిపి, ఇప్పటి వరకు 3900 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. లక్షలాది మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశంలో ఇంకా జాప్యం చేయకుండా ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన డబ్బులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. – జంగంరెడ్డి కిశోర్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు, అన్నమయ్య జిల్లా నిరుద్యోగులపై నిర్లక్ష్య వైఖరి కూటమి సర్కారు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకపోగా, సీఎం చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకార సమయంలో మొదటి సంతకం పెట్టిన మెగా డీఎస్సీ ఇంత వరకు అతీ గతీ లేదు. ఏవేవో సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారు. మరోపక్క 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి.. కల్పించని సమయంలో నిరుద్యోగ భతి ఇస్తామని కబుర్లు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు పట్ల నిర్లక్ష్య వైఖరి కనబరుస్తున్నారు. నిరుద్యోగ భృతికి అవసరమైన డబ్బులను బడ్జెట్లో ఒక రూపాయి కూడా కేటాయించలేదు. – శివప్రసాద్‌రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు న్యూస్‌రీల్ -
●మదనపల్లె మెడికల్ కళాశాలపై నీలినీడలు
● నేడు రాయచోటిలో యువత పోరు వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యారు. కూటమి సర్కారు పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడం, నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోకపోవడం, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి చెల్లించకపోవడం, ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం, మెడికల్ కళాశాలలను ప్రైవేటుకు అప్పగించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 10 గంటలకు రాయచోటిలోని జాతీయ రహదారి నుంచి కలెక్టర్ చాంబర్ వరకు ర్యాలీగా వెళ్లి అనంతరం వినతిపత్రాన్ని సమర్పించనున్నారు. కార్యక్రమం విజయవంతానికి ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు పోస్టర్లను ఆవిష్కరించారు. యువత పోరుకు పెద్దఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యో గులు తరలిరావాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. సాక్షి రాయచోటి: సార్వత్రిక ఎన్నికల అనంతరం అఽధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు నిరుద్యోగులను గాలికి వదిలేసింది. అధికారంలోకి రాకమునుపు ఒకటేమిటి? అది చేస్తాం, ఇది చేస్తామంటూ బురిడీ కొట్టించారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు.. అదీ లేకపోతే నిరుద్యోగ భృతి, చదువుకునే వారికి ఫీజు రీయింబర్స్మెంట్.. ఇలా ఎన్నో చెప్పి చివరకు సూపర్ సిక్స్ లేకపోగా, మిగతావి కూడా అమలు చేయకుండా మాయమాటలతో ముందుకు సాగుతోంది. ఇప్పుడే కాదు.. 2014లో కూడా హామీలిచ్చి అధికారంలోకి రాగానే ఎగనామం పెట్టింది. అయితే 2019 వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు పరిశ్రమలు, మరోవైపు నిరుద్యోగులకు ఉపాధి, ఇంకోవైపు చదువులకు వైఎస్సార్ విద్యాదీవెన ఎప్పటికప్పుడు త్రైమాసికంలోనే అందిస్తూ అన్ని విధాలా ఆదుకోవడం జరిగింది. అంతేకాకుండా అందరి ఆరోగ్యానికి భరోసా నింపుతూ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించడం ఒక ఎత్తయితే, మెడికల్ కళాశాలలు నిర్మించి వైద్య విద్యకు పెద్దపీట వేశారు. అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా ముందడుగు పడని పరిస్థితుల్లో.. వైఎస్సార్ సీపీ పోరుబాటకు సంకల్పించింది. చదువుకేదీ భరోసా వైఎస్సార్సీపీ హయాంలో చదువులకు భరోసా ఉండేది. ఇంజినీరు కావాలన్నా.. డాక్టర్ కోర్సు చేయాలన్నా.. ఇతర పెద్ద చదువులకు చదవాలన్నా ప్రోత్సాహం అందించింది. గడిచిన ఐదేళ్లలో వైఎస్సార్ విద్యా దీవెన కింద 1,50,934 మందికి సుమారు రూ.378.75 కోట్లు అందించారు. వైఎస్సార్ వసతి దీవెన కింద రూ. 1,28,290 మందికి రూ.150.33 కోట్ల సొమ్మును అందించారు. పేద విద్యార్థులకు వైఎస్ జగన్ సర్కారు అండగా నిలుస్తూ వచ్చింది. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు అన్నమయ్య జిల్లాలో రోజురోజుకు నిరుద్యోగం పెరిగిపోతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు లేక, ప్రైవేటు కొలువులు దొరకక అవస్థలు తప్పడం లేదు. డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, బీఈడీ తదితర కోర్సులు చేసిన వారు నిరుద్యోగులుగా మారుతున్నారు. అధికారంలోకి రాకమునుపు కూటమి నేతలు ప్రతి ఒక్కరికీ ఉద్యోగం లేకపోతే.. నిరుద్యోగ భృతి రూ.3 వేలు అందిస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తీరా ఇప్పుడు చూస్తే తొమ్మిది నెలలు అవుతున్నా అతీగతీ లేని పరిస్థితి కనిపిస్తోంది. కొత్త పరిశ్రమల జాడ జిల్లాలో లేకపోగా, నిరుద్యోగులకు ఉద్యోగాలకల్పన మాటలకే పరిమితమైనట్లు కనిపిస్తోంది. జిల్లాలో సుమారు 2,45,000కు పైగా యువత, నిరుద్యోగులు ఉన్నారు. ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రభుత్వ పెద్దలు ఇంతకుముందు ప్రకటించినా ఇప్పటికీ ఆ ఊసే ఎత్తలేదు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇదిగో, అదిగో అంటున్నారే తప్ప అడుగులు ముందుకు పడని పరిస్థితిపై నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. యువతను నిట్టనిలువునాముంచిన కూటమి నిరుద్యోగులకు భృతి లేదు.. ఉపాధి కానరాదు ఫీజురీయింబర్స్‌మెంట్ చెల్లించని ప్రభుత్వం ఐదు త్రైమాసికాలకు రూ.212 కోట్లకు పైగా బకాయిలు మదనపల్లె మెడికల్ కళాశాలకు మంగళం నేడు కలెక్టరేట్ ఎదుటవైఎస్సార్సీపీ ‘యువత పోరు’ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైద్య విద్యకు ప్రాధాన్యతనిస్తూ.. వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెకు మెడికల్ కళాశాలలు మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టింది. గతేడాది జూన్ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభించాలని, అందుకు తగ్గట్టు భవనాలను కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కళాశాలకు 150 సీట్లు వస్తాయని అంచనా వేసిన తరుణంలో.. కూటమి అధికారంలోకి రాగానే వైద్య కళాశాలలపై నీలినీడలు కమ్ముకున్నాయి. పులివెందుల, మదనపల్లెలో సిబ్బందిని తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నా.. కూటమి ప్రభుత్వం కళాశాలలను ప్రైవేటుకు అప్పగించే ఆలోచన నేపథ్యంలో ఉన్న వారందరినీ ఇతర ప్రాంతాలకు పంపించేసింది. ఒకపక్క మెడికల్ కళాశాలకు సంంధించిన సీట్లను కోల్పోగా.. మరోపక్క మదనపల్లె మెడికల్ కళాశాల నిర్మాణంపై సందేహాలు నెలకొన్నాయి. -
అర్జీలకు సత్వరమే పరిస్కారం
– జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లోని పీజిఆర్ఎస్ హాల్లో పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న బియాండ్ ఎస్ఎల్ఏ దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకుని పరిష్కరించాలన్నారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రం రాయచోటికి వచ్చిన అర్జీదారులకు జిల్లా సంయుక్త కలెక్టర్ స్నాక్స్, వాటర్ బాటిల్స్, టీ సౌకర్యాలను కల్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మధుసూదన్ రావు, ఎస్డీసీ రమాదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. డీఎస్సీ పరీక్షలకు ఆన్లైన్ ద్వారా శిక్షణ కడప రూరల్ : మెగా డీఎస్సీ పరీక్షలకు ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ జిల్లా సంచాలకులు యం భరత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బీసీ, ఈడబ్ల్యూఎస్ (ఈబీసీ) కేటగిరీకి చెందిన అభ్యర్ధులు ఉచిత శిక్షణ కోసం ఈ నెల 10వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్ధులు టెట్ పరీక్షలో అర్హత సాధించిన మార్కుల జాబితా నేటివిటీ, కుల, ఆదాయం ధృవీకరణ పత్రాలతో రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు జతపరచి కడప పాత రిమ్స్‌లో గల ఏపీ బీసీ స్టడీ సర్కిల్, బీసీ భవన్ రెండో అంతస్తులోని కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. పూర్తి వివరాలకు కార్యాలయంలో లేదా 9849919221 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. -
ఒత్తిడికి లోనుకావొద్దు : డీఈఓ సుబ్రమణ్యం
పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఒత్తిడికి లోనుకావొద్దని జిల్లా విద్యాశాఖ అఽధికారి సుబ్రమణ్యం తెలిపారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 505 ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలల్లో 22,355 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఇందు కోసం 121 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 1200 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. ఆరు సమస్మాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులు తమ హాల్‌టిక్కెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునన్నారు. హాల్‌టిక్కెట్లను వాట్సప్ మనమిత్ర 9552300009 నంబర్ల నుంచి పొందవచ్చని తెలిపారు. -
అత్యాచారం కేసులో నిందితుల అరెస్టు
మదనపల్లె : నిమ్మనపల్లె మండలంలో ఓ వివాహితపై అత్యాచారం చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు మదనపల్లె రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ తెలిపారు. సోమవారం స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం నిమ్మనపల్లి మండలం తవళం గ్రామం నాయనవారిపల్లెకు చెందిన ఓ వివాహిత (21) పాలు పోసేందుకు తమ గ్రామం నుంచి పక్కనే ఉన్న నల్లంవారిపల్లెకు వెళ్లి డిపోలో పాలు పోసి తిరిగి వస్తుండగా, నల్లంవారిపల్లెకు చెందిన పి.రమణ కుమారుడు పల్లపు నాగేంద్ర (23), డి.వెంకటరమణ కుమారుడు దేవర ఇంటి సురేంద్ర (33), కాపు కాచి బాధితురాలిపై అత్యాచారం చేశారు. ఆ సమయంలో జరిగిన విషయం బయటకు చెబితే బాధితురాలిని, ఆమె భర్తను చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో బాధిత మహిళ వారం రోజుల తర్వాత నిమ్మనపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో, డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు సూచనలతో కేసు దర్యాప్తు చేశామన్నారు. నిందితులను సోమవారం అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. -
కారు కల్వర్టును ఢీకొని దంపతులకు గాయాలు
రామాపురం : కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిలోని బండపల్లె గ్రామం టోల్‌గేటు సమీపంలో సోమవారం కారు కల్వర్టును ఢీ కొనడంతో నాగిరెడ్డి, వనజ దంపతులకు గాయాలైనట్లు మండల ఎస్ఐ వెంకటసుధార్రెడ్డి తెలిపారు. తిరుపతికి చెందిన నాగిరెడ్డి, వనజలు కడప నుంచి కారులో రాయచోటికి వస్తుండగా మార్గమధ్యంలో బండపల్లి టోల్గేట్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొని కాలువలో పడింది. పోలీసు క్షత్రగాత్రులను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ములకలచెరువు : రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం ఉదయం మండల కేంద్రంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు... సత్యసాయి జిల్లా చీకుచెట్టుపల్లెకు చెందిన ఆదినారాయణ పనుల నిమిత్తం ములకలచెరువుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో రోడ్డు దాటుతుండగా మదనపల్లె వైపు నుంచి కదిరికి వెళ్తున్న ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆదినారాయణ(56) సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. భార్య ఉత్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెట్టుబడి సాయాన్ని అందించాలిరాయచోటి అర్బన్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్నా రైతులకు ఇస్తామన్న పెట్టుబడి సాయం రూ. 20 వేలు ఎప్పుడిస్తారని ఏపీ రైతు సంఘం నాయకులు ప్రశ్నించారు. ఏపీ రైతుసంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి, కౌలురైతుల సంఘం జిల్లా కార్య దర్శి రమేష్‌బాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ పంటలకు ఽగిట్టుబాటు ధరను కల్పించి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ముదివేడు రిజర్వాయరు నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ.రామాంజులు, రైతు సంఘం నాయకులు వేమనారాయణ రెడ్డి, శ్రీనివాసులు, రమణప్ప, రత్నమ్మ, లక్షుమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అసంపూర్తి గృహాలకు అదనపు ఆర్థిక సహాయం
– జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ రాయచోటి : 2019–24 మధ్య కాలంలో బీసీ,ఎస్సీ,ఎస్టీలకు మంజూరైన గృహాలు పూర్తి కాకుండా అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తి చేయడానికి అదనంగా ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిందని సోమవారం అధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ చెప్పారు. స్వర్ణాంధ్ర–2047 విజన్ సాకారంలో భాగంగా 2029 నాటికి అందరికీ ఇల్లు ఏర్పరచాలనే దృఢ నిశ్చయంతో అసంపూర్తి ఇళ్ల నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో దాదాపు 25 వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీల గృహాల వివిధ దశల్లో నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. నిర్మాణం పూర్తికి ఎస్సీలు, బీసీలు అందరికీ రూ. 50 వేలు, ఎస్టీలకు రూ.75వేలు చొప్పున అదనంగా ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. లబ్దిదారులు ఇల్లు పూర్తి చేసుకోవడానికి తక్షణణే అవసరమైన చర్యలు తీసుకోవాలని హౌసింగ్ పీడీ శివయ్యను కలెక్టర్ ఆదేశించారు. దరఖాస్తుల ఆహ్వానం ఓబులవారిపల్లె : ఉమ్మడి కడప జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఆంజనేయరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి గురుకులంలో 6,7,8వ తరగతులకు సంబంధించి ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు ఎపీఆర్ఎస్టీఏటీ– 2025 ద్వారా ప్రవేశ పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తామన్నారు.ఉమ్మడి జిల్లాలోని బాలురకు ముక్కవారిపల్లి గురుకుల పాఠశాలలో, బాలికలకు మైలవరం గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తికల వారు ఏపీఆర్ఎస్.సీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మార్చి 31 వరకు గడువు ఉందన్నారు. ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్షను ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాలకు 8712625056 నంబర్లో సంప్రదించాలని కోరారు. యువతకు శిక్షణ కడప కోటిరెడ్డిసర్కిల్ (వైఎస్సార్ జిల్లా): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో డీడీయూ–జీకేవై పథకం ద్వారా సి–డ్యాప్ సౌజన్యంతో 18–32 సంవత్సరాల మధ్య వయస్సుగల యువతీ యువకులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిహార్ స్కిల్ ఎడ్యుకేషన్ రీజినల్ కో ఆర్డినేటర్ ఎం.సుబ్బరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు నెలల కాల వ్యవధిలో ఎలక్ట్రానిక్ కంప్యూటర్ హార్డ్‌వేర్, హెల్త్‌కేర్, ఎమెర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్, ఐటీ సెక్టార్, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, బ్యూటీ వెల్నెస్ సెక్టార్, బ్యూటీ థెరఫీ కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఇతర వివరాలకు 90630 82227 నంబబర్లో సంప్రదించాలన్నారు. ఎస్ఎస్ఏలో నూతన నియామకం కడప కోటిరెడ్డి సర్కిల్ : అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులలో కెరీర్ మానసిక ఆరోగ్య కౌన్సెలర్‌గా కడప నగరానికి చెందిన డాక్టర్ సుష్మితారెడ్డిని నియమించారు. ఈ మేరకు సోమవారం ఆమెకు అధికారికంగా ఉత్తర్వులు అందాయి. ఈ సందర్భంగా డాక్టర్ సుష్మితారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సరైన కెరీర్ మార్గదర్శకత్వం, మానసిక ఆరోగ్య సలహాలు అందించడం ద్వారా వారి భవిష్యత్‌ను మెరుగుపరిచేందుకు తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు. వైభవం..పల్లకీ ఉత్సవం రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేతుడికి పల్లకీ సేవ నిర్వహించారు.సోమవారం ప్రధాన అర్చకులు శంకరయ్యస్వామి, కృష్ణయ్య స్వామి, రాచరాయయోగీ స్వామి, శేఖర్ స్వామిల ఆధ్వర్యంలో మూల విరాట్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు.అనంతరం ఉత్సవమూర్తులకు రంగురంగుల పూలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు. ఆలయమాఢవీధులోల ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో డీవీ రమణారెడ్డి, భక్తులు పాల్గొన్నారు. -
టీడీపీ ‘బెల్ట్’ మద్యంపై ఎస్ఐ వేటు!
కురబలకోట : ముదివేడు ఎస్ఐ దిలీప్‌కుమార్ బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించారు. బెల్ట్ మద్యం విక్రయిస్తూ ఇద్దరు పట్టుబడినట్లు ఎస్ఐ సోమవారం తెలిపారు. పి. సుబ్రమణ్యం (65), జి. వెంకట్రమణ (60) మండలంలోని కంటేవారిపల్లె వద్ద అధిక ధరలకు మద్యం అమ్ముతుండగా పట్టుకున్నట్లు తెలిపారు. మద్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ బెల్ట్ మద్యాన్ని అంగళ్లులోని సూరి వైన్స్, రుద్ర వైన్స్ నుంచి కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. దీంతో మద్యం షాపు ఓనర్లు, టీడీపీ నాయకులు సూరి, బాలకృష్ణను కూడా నిందితులుగా చేర్చి కేసు నమోదు చేశామన్నారు. బెల్ట్ షాపుల వ్యవహారంలో అధికార టీడీపీ మద్యం షాపు ఓనర్లపై కూడా కేసు నమోదు కావడంతో ఆ పార్టీ శ్రేణులు ఉలిక్కి పడుతున్నాయి. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఎక్కడైనా మద్యం బెల్ట్ షాపులు ఉన్నట్లయితే 9440900705 మొబైల్ నెంబరుకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. మద్యం షాపు ఓనర్లపైనా కేసు నమోదు మరో ఇద్దరి అరెస్టు -
యువతను వంచించిన చంద్రబాబు
రైల్వేకోడూరు అర్బన్ : ఎన్నికల ముందు యువత, నిరుద్యోగులు, విద్యార్థులకు మాయమాటలు చెప్పి హామీలు ఇచ్చి అధికారం చేపట్టాక చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేష్‌లు యువత, నిరుద్యోగులను నయవంచన చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం ఈనెల 12న జరిగే యువత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది అవుతున్నా ఒక్కహామీ ఊసు కూడా లేదన్నారు. యువత, విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు ఆడుకొంటున్నారని ధ్వజమెత్తారు. ఫీజు ఈ ఎంబర్స్మెంట్ లేక విద్యార్థుల చదువులు కుంటు పడుతున్నాయని తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యం ఇచ్చి, ఫీజు రీ ఎంబర్స్మెంట్, అమ్మ ఒడి, నాడునేడు, ఇంగ్లీష్ మీడియం ఇలా చదువుకు అండగా ఉండి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తమకు వద్దని కేంద్రానికి తెలియజేసిన ఏకై క ముఖ్యమంత్రి చంద్రబాబేనని విమర్శించారు. యువత, నిరుద్యోగుల కోసం ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించి, నిరుద్యోగులకు రూ.2000 నిరుద్యోగ భృతి ఇవ్వకుంటే చొక్కా పట్టుకోవాలని లోకేష్ నాడు సభల్లో చెప్పాడని, అలాగే కూటమి చెప్పే మాటలకు తాను హామీగా ఉండి ప్రశ్నిస్తానన్న ఉప ముఖ్యమంత్రి పవనన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లాడని ప్రశ్నించారు. చంద్రబాబు వంచనకు నిరసనగా ఈనె 12న రాయచోటిలో జరిగే నిరసన, కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు యలగచెర్ల శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీటీసీ రత్నమ్మ, రమేష్, మందల నాగేంద్ర, అన్వర్‌బాషా, తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి, కౌరెడ్డి సిద్దయ్య, ఉమామహేశ్వర్‌రెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల -
ఒత్తిడి వద్దు..పదిని జయించు
మదనపల్లె సిటీ : వార్షిక పరీక్షలు సమీపిస్తున్న సమయాన విద్యార్థుల్లో భయాన్ని తొలగించి, ఆత్మవిశ్వాసాన్ని కలిగించేలా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరీక్షలు సమీపిస్తున్న వేళ ఎక్కువ మార్కులు సాధించాలని, మంచి ర్యాంకు రావాలని తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ తరుణంలో మోదీ మాటలను ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందే. జిల్లాలో గత ఏడాది మార్కులు తక్కువ వచ్చాయని కొందరు విలువైన జీవితాన్ని కోల్పోయారు. పది మార్కులే జీవితం కాదన్న సత్యాన్ని అంతా గ్రహించాలి. ఇంకా వారం రోజులు సమయం ఉందని, ఒత్తిడికి లోను కావద్దని, పక్కా ప్రణాళికతో చదివితే మంచి మార్కులు, ర్యాంకు సాధించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. నిత్యం పాఠశాలలో రాసే పరీక్షల వంటివే అన్న భావనతో సిద్ధమవ్వాలని చెబుతున్నారు. ఏం చేయాలంటే.. సమయానికి ఆహారం తీసుకోవాలి. పండ్లు ఎక్కువగా తినాలి. పరీక్ష వేళ ఒత్తిడికి గురికాకుండా తగిన నిద్ర అవసరం. అన్ని సబ్జెక్టులకు సమయాన్ని కేటాయించుకుని చదువుకోవాలి. కష్టమైన సబ్జెక్టుని ఇష్టంగా చదువుకోవాలి. బృందపఠనం అవసరం. ఏకాగ్రత కోసం ఉదయాన్నే ధ్యానం వంటి సాధనలు చేయాలి. అనుమానాలను ఉపాధ్యాయులతో చర్చించి నివృత్తి చేసుకోవాలి. పక్కా ప్రణాళకతో చదవాలి నిపుణుల సూచన -
ఖాళీ బిందెలతో నిరసన
సాక్షి రాయచోటి : జిల్లాలో తాగునీటికి ప్రమాద ఘంటికలు కళ్లేదుటే కనిపిస్తున్నాయి. వేసవి తాపం భయపెడుతుండగా ప్రజలు తీరని దాహంతో అల్లాడిపోతున్నారు. జిల్లాకేంద్రమైన రాయచోటిలో ఇప్పటికే ప్రజలు మంచినీరో రామచంద్రా...అంటున్నారు. అనేక కాలనీల్లో నీరు రావడానికి నాలుగైదు రోజుల సమయం పడుతుందంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతున్నాయి. భూగర్బ జలాలు అడుగంటడం ప్రారంభమైన నేపథ్యంలో చెరువులు, కుంటల్లో ఉన్న నీరు ఇంకిపోతే బోర్లలో కూడా కనీస నీటిమట్టం గగనమవుతుంది. ఇప్పటికే తాగునీటి బోర్లలో రోజురోజుకు నీరు ఇంకిపోతుండడం ఆందోళన కలిగించే పరిణామం. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా రానున్న కాలంలో విపత్కర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి ఆశాజనకంగా వర్షాలు లేకపోవడంతో పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో చెరువులు, కుంటలు కనిపించడం లేదు. ఇప్పుడిప్పుడే తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చుతున్నా ఏప్రిల్, మే నెలల్లో మరింత తీవ్రం కానుందని తెలుస్తోంది. పరిస్థితి తీవ్రతను ముందే అంచనా వేసి ఈ పాటికే నివారణ చర్యలు చేపట్టి ఉంటే ప్రజలకు తాగునీటి కష్టాలు కొంతవరకై నా తప్పేవి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి డైవర్షన్ పాలిటిక్స్, ప్రచార పటాటోపాలపై ఉన్న ఆసక్తి ప్రజల పట్ల లేకపోవడమే ఈ దుస్థితికి కారణమన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రాయచోటి మున్సిపాలిటీలో దాహం...దాహం జిల్లా కేంద్రమైన రాయ చోటిలో ప్రజల నుంచి దాహం కేకలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా రా యచోటిలోని పలు కాల నీలకు సంబంధించి నీటి కోసం వారం రోజులు పడుతోంది. అంతేకాకుండా కొనుగోలు చేస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం. ప్రధానంగా వెలిగల్లు ప్రాజెక్టుకు సంబంధించి రెండో పైపులైన్ పనులు నిలిచిపోవడంతో రాయచోటికి తాగునీటికి ఇబ్బందులు ఎ దురవుతున్నాయి. అంతో, ఇంతో నీరు లభిస్తున్నా పూ ర్తి స్థాయిలో రెండో పైపులైన్ ఉంటేనే ప్రజలకు ఇబ్బంది లేకుండా అందించేందుకు అవకాశం ఉంటుంది. 8గ్రామాలను తాకుతున్న తాగునీటి సమస్య పట్టణాల్లోని శివారు ప్రాంతాలే కాకుండా గ్రామాలను తాగునీటి ఎద్దడి తాకింది. నందలూరు మండలంలోని ఎస్టీ కాలనీల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఎక్కడో పొలాల వద్దకు వెళ్లి మంచినీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. అలాగే మిగిలిన నియోజకవర్గాల్లోని అనేక గ్రామాల్లో రానున్నరోజుల్లో తాగునీటి సమస్య తీవ్రమయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే స్కీముల్లోని బోర్లు కూడా ఎండ సెగ తగిలి భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ఏది ఏమైనా ఈ వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడడం అధికారులకు తలకుమించిన భారంగా మారనుంది. ఇప్పటికే రాయచోటిలో దాహం కేకలు పల్లెల్లో సైతం మోగుతున్న తాగునీటి సైరన్ ఎండిపోతున్న సీజనల్ బోర్లు జిల్లాలో వేసవి కాలం వచ్చిందంటే సీజనల్ బోర్లు ఎండిపోతున్నాయి. కేవలం వర్షాకాలం, ఇతర సీజన్లలో నీరు ఉన్నప్పుడు మాత్రమే బోర్లు పనిచేస్తున్నాయి. వేసవి ప్రారంభమైందంటే భూగర్బ జలాలు అడుగంటి సీజనల్ బోర్లు పనికుండా ఉన్నాయి. 10 సీపీడబ్ల్యూ, 4896 పీడబ్ల్యూఎస్ స్కీములు ఉన్నాయి. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా 8946 బోర్లు ఉండగా, అందులో 2980 సీజనర్ బోర్లు ఎండిపోయాయి. సమస్య తలెత్తకుండా చర్యలు జిల్లాలో ఎక్కడా కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఎక్కడెక్కడా ప్రమాదం ఉంటుందన్న విషయం తెలుసుకుని పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాం. వేసవి నేపథ్యంలో ఏప్రిల్, మే నెలల్లో కొంత నీటికి ఎక్కువ డిమాండ్ ఏర్పడనుంది. అందుకు అనుగుణంగా పరిష్కారానికి అన్ని చర్యలు చేపడుతున్నాం. – ప్రసన్నకుమార్, సూపరింటెండెంట్ ఇంజినీరు, ఆర్డబ్ల్యూఎస్, రాయచోటి, అన్నమయ్య జిల్లా సిద్దవటం : మండలంలోని వెంకటేశ్వరపురం, మాధవరం–1 గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆయా ప్రాంతాల ప్రజలు సోమవారం ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ వెంకటేశ్వరపురంలోని ప్రజలకు 2 వారాలకు ఒక సారి తాగునీరు వస్తోందని, అవికూడా 3,4 బిందెలు మాత్రమే వస్తున్నాయన్నారు. తాము రోడ్డు అవతలికి వెళ్లి మంచినీళ్లు తెచ్చుకుంటున్నామన్నారు. మరికొందరు ఒకక్యాన్ రూ. 10 చెల్లించి తాగుతున్నామని వాపోయారు. తాగునీరు రావడం లేదని సర్పంచ్‌ను అడిగితే 2నెలల వరకు రావంటాడు, మా సమస్యను ఎవరికి చెప్పుకోవాలన్నారు. మాధవరం–1 గ్రామ ప్రజలు తాగునీరు రాక చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. తాగునీటి కోసం కొళాయిల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని, ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
వీఆర్వో అక్రమాలపై బాధితుల గగ్గోలు
గాలివీడు : అవినీతి వీఆర్వో బాగోతం తవ్వేకొద్దీ అక్రమాలు కోకొల్లలుగా బయటకు వస్తున్నాయి. ‘వీఆర్వో రూటే సప‘రేటు’శీర్షికతో ఆదివారం సాక్షిలో వెలువడిన కథనంతో సోమవారం బాధితులు మూకుమ్మడిగా రెవెన్యూ కార్యాలయం వద్దకు చేరుకుని తహసీల్దార్ ముందు వీఆర్వో రవీంద్రారెడ్డి చేసిన అవినీతి అక్రమాలపై గగ్గోలు పెట్టుకున్నారు. బాధితులు కొండ్రెడ్డి చిన్న రెడ్డన్న తన అనుభవంలో ఉన్న సర్వే నంబర్ 900బీ1లో 40 సెంట్ల భూమి ఇతరుల పేరుపై ఆన్లైన్ చేయించారని, అలాగే దాదినేని నారాయణ పట్టా భూమి సర్వే నంబర్ 2343/4, 2344/4, 2344/6 లలో మొత్తం 75 సెంట్ల భూమిని సదరు వీఆర్వో మామూళ్లకు ఆశపడి వేరొకరి పేరుపై ఆన్లైన్ చేయించాడని వాపోయారు. ఇలా చాలామంది బాధితులు తహసీల్దార్ భాగ్యలత ముందు తమ గోడును వినిపించగా వారి స్టేట్మెంట్ను రాతపూర్వకంగా రికార్డు చేశారు. వీఆర్వోపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపుతామని, ఉన్నతాధికారులకు నివేదిక పంపుతానని తహసీల్దార్ తెలిపారు. ఇదిలా ఉండగా వీఆర్వో అర్హులకు న్యాయం చేయకుండా ముడుపులు తీసుకుని అనర్హులకు మేలు చేస్తున్నాడని కొందరు వాపోతున్నారు. వీఆర్వో బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, మండల స్థాయి అధికారులను ప్రభావితం చేస్తుండటంతో చాలామంది స్వేచ్ఛగా ముందుకొచ్చి వారికి జరిగిన అన్యాయాన్ని చెప్పుకోలేకపోతున్నారు. జిల్లా స్థాయి అధికారులు స్పందించి.. క్షేత్రస్థాయిలో పర్యటించి వీఆర్వో అక్రమాలపై విచారణ చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. ‘సాక్షి’కథనంతో విచారణ చేపట్టిన తహసీల్దార్ -
అల్లాహ్ ప్రార్థనకు పిలుపు.. అజాన్
కడప కల్చరల్ : తెల్లవారుజాము సమయం. చిరు చీకట్లను తరిమివేస్తూ వెలుగు రేఖలు విచ్చుకుంటున్న వేళ. ఆ ప్రశాంత సమయంలో ‘అల్లాహు అక్బర్’ అంటూ గంభీరమైన స్వరం. అల్లాహ్‌ను ప్రార్థించేందుకు రమ్మంటూ ఇస్తున్న పిలుపు హృదయాన్ని తాకుతున్న ఆ ఆహ్వానాన్ని అందుకుని మనసారా దైవ ప్రార్థనలు చేసేందుకు సిద్ధమవుతున్న ముస్లింలు. మసీదులలో దైవ ప్రార్థనలకు రావాలంటూ తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఐదుమార్లు ఇలా అజాన్ పిలుపు వినిపించడం అందరికీ తెలిసిందే. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు ప్రతిరోజు ఐదుసార్లు నమాజ్‌ను అధిక సంఖ్యలో మసీదులకు తరలివచ్చి ఆచరిస్తారు. ఇందులో భాగంగా ఆజాన్ గురించి కడప నగరానికి చెందిన ధర్మ పరిచయ కమిటీ ప్రతినిధి హజరత్ సయ్యద్ అహ్మద్ (బాబుభాయ్) ఇలా వివరిస్తున్నారు. ప్రపచంలోని ముస్లింలందరికీ ఈ పవిత్ర రంజాన్ మాసం ప్రాణప్రదమైనదిగా భావిస్తారు. ఈ జన్మకు ముక్తిని ప్రసాదించే దివ్య వరంగా భావించి ఈ సందర్భంగా దైవం సూచించిన మార్గాలలో తప్పక అనుసరిస్తారు. సాధారణ రోజుల్లో ఆచరించే ప్రార్థనలతోపాటు ప్రతిరోజు తరావీ ప్రార్థనలు చేయడం ఈ మాసం ప్రత్యేకతగా చెప్పవచ్చు. కేవలం రంజాన్ మాసంలోనే గాక మిగతా రోజుల్లో కూడా ముస్లింలు రోజూ ఐదు మార్లు ప్రార్థనలు చేస్తారు. రోజువారి పనుల్లో నిమగ్నమైన వారికి ప్రార్థనా సమయం ఆసన్నమైందని తెలుపుతూ మసీదుల్లోని మౌజన్లు ‘అల్లాహు అక్బర్’ అంటూ పిలుపునిస్తారు. అజాన్ విన్న వెంటనే వీలైనంత త్వరగా మసీదులకు చేరుకుని ప్రార్థనలు చేస్తారు. ఆజాన్లో వచ్చే వాక్యాలు అరబ్బీ భాషలో ఉన్నాయి. ఐదు పూటల నమాజుకు ముందు సమీపంలోని ముస్లింలందరికీ ప్రార్థనలకు వేళ అయిందని సూచిస్తూ ఇచ్చే ఈ పిలుపు ముస్లింల రోజువారి జీవితంలో ఒక భాగమైంది. ఈ పిలుపు వినగానే అసంకల్పితంగా ముస్లింలు మసీదు వైపు వెళతారు. అజాన్ అర్థం తెలిసిన వారు మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అజాన్ వెనుక కథ ఏకేశ్వరుడైన అల్లాహ్‌ను సామూహికంగా ఆరాధించేందుకు ప్రజలందరికీ ఎలా సమీకరించాలన్న విషయంపై ప్రవక్త తన అనుచరులతో సంప్రదింపులు జరిపారు. ‘బూర’ ఊది గుర్తించాలని కొందరు, డోలు మోగిస్తే బాగుంటుందని మరికొందరు, జెండా ఊపితే మంచిదని మరికొందరు ఇలా రకరకాల సలహాలు ఇచ్చారు. ఈ విషయంగా అబ్దుల్లా బిన్ జైద్ ర.జి. దీర్ఘంగా ఆలోచించడం ప్రారంభించారు. ఒక రాత్రి కలలో ఇప్పుడు మనం వింటున్న అజాన్ పిలుపులోని మాటలను ఆయన అనుభూతించారు. ఈ విషయాన్ని మహా ప్రవక్తకు తెలిపారు. హజరత్ ఉమర్ ర.జి.లు కూడా ఇదే కలగన్నారు. విషయం తెలుసుకున్న ప్రవక్త మహనీయుడైన ఉమర్‌ను పిలిచి వచ్చిన కల గురించి అడిగారు. తనకంటే ముందు అబ్దుల్లా బిన్ జైద్ ఈ కలగన్నారని, కనుక ఆయన ద్వారానే వివరాలు వినడం మంచిదని భావిస్తున్నామని ఉమర్ తెలిపారు. ప్రవక్త తన ప్రియ సహచరుడు హజరత్ బిలాల్ ర.జి.ని పిలిచి అబ్దుల్ బిన్ జైద్ ఏ వాక్యాలు పలుకుతారో వాటిని మీరు గొంతెత్తి గట్టిగా పలకాలని ఆదేశించారు. ఆ వాక్యాలకు అజాన్ అనే పేరు ఖరారైంది. మసీదుల్లో అజాన్ పిలుపునిచ్చే వ్యక్తిని మౌజన్ అంటారు. ఈ పిలుపు ద్వారా ‘ఓ మానవులారా అల్లాహ్ సర్వోన్నతుడు.. గుణ విశేషణాలలో అద్వితీయుడు.. స్వయం ప్రభువు, ఆది మధ్యాంత రహితుడు, అనంతుడు, పోలిక లేనివాడు, నిర్వికారుడు, సమస్త సృష్టికి నిర్దేశకుడు, సర్వశక్తివంతుడు, అంతర్యామి, సృష్టికర్త’ అని వివరిస్తాడు.రంజాన్ ఉపవాసాల నేపథ్యంలో కథనంఅజాన్.. దాని అర్థం ఇలా ఉంది అల్లాహు అక్బర్...అల్లాహు అక్బర్... అల్లాహు అక్బర్....అల్లాహు అక్బర్... (అల్లాహ్ సర్వోన్నతుడు) అష్హదు అన్ లాయిలాహ ఇల్లల్లాహ్ అష్హదు అన్ లాయిలాహ ఇల్లల్లాహ్ (అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కాదని నేను సాక్ష్యం ఇస్తున్నాను) అష్హదు అన్న మహమ్మదర్రసూలుల్లాహ్ అష్హదు అన్న మహమ్మదర్రసూలుల్లాహ్ (మహమ్మద్(సొ.అ.వ) అల్లాహ్ సందేశ హరులు అని నేను సాక్ష్యం పలుకుతున్నాను) హయ్య అలస్సలాహ్....హయ్య అలస్సలాహ్ (రండి నమాజ్ వైపునకు రండి) హయ్య అలల్‌ఫలాహ్...హయ్య అలల్‌ఫలాహ్ (రండి సాఫల్యం వైపునకు) అస్సలాతు ఖైరుమ్ మిన్నన్నౌమ్ అస్సలాతు ఖైరుమ్ మిన్నన్నౌమ్ (నిద్రకన్నా నమాజ్ ఉత్తమమైనది) అల్లాహు అక్బర్....అల్లాహు అక్బర్ (అల్లాహ్ సర్వోన్నతుడు) లా ఇలాహ ఇల్లల్లాహ్ (అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధ్యులు లేరు) ‘అస్సలాతు ఖైరుమ్ మిన్నన్నౌమ్’– ఈ వాక్యాలను తెల్లవారుజామున ఇచ్చే అజాన్‌లో మాత్రమే పలుకుతారు. -
కుటుంబ సమస్యలతో కూలీ ఆత్మహత్య
మదనపల్లె : మద్యానికి బానిసై తరచూ కుటుంబ సభ్యులతో గొడవపడుతూ, మనస్థాపం చెంది కూలీ ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం రాత్రి మదనపల్లెలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు.. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం ఎరగ్రుంట్లపల్లెకు చెందిన సుంకప్ప, విజయలక్ష్మి దంపతుల కుమారుడు ఎస్.రాజు (38), 20 సంవత్సరాల క్రితమే ఉపాధి కోసం మదనపల్లెకు వచ్చాడు. పట్టణంలోని గజ్జలకుంట తిలక్‌వీధిలో నివసిస్తూ నీరుగట్టువారిపల్లె టమాటా మార్కెట్లో కూలీగా పని చేస్తున్నాడు. తల్లిదండ్రులు మృతి చెందడం, భార్య తనని వదిలేసి వెళ్లిపోవడంతో, 10 సంవత్సరాల క్రితం గజ్జలకుంటకు చెందిన దేవితో సహజీవనం చేస్తున్నాడు. ఆమెకు వాణిశ్రీ మౌనిక ఇద్దరు కుమార్తెలు ఉండగా ఆరు నెలల క్రితం వాణిశ్రీకి వివాహం చేశారు. ప్రస్తుతం దేవి మరో కుమార్తెతో కలిసి రాజు ఉంటున్నాడు. కొంతకాలంగా మద్యానికి తీవ్రంగా బానిసై ప్రతిరోజు ఇంట్లో భార్యతో గొడవ పడేవాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగేది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన రాజు భార్య దేవితో గొడవపడి కొట్టాడు. దెబ్బలు తాళలేక ఆమె కుమార్తె మౌనికను తీసుకుని గజ్జల గుంటలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఉదయం తిరిగి ఇంటికి వచ్చి చూడగా తలుపులు కిటికీలు మూసి ఉండడంతో, బయట నుంచి కిటికీ తలుపులు తోసి లోపలికి చూడగా, రాజు ఇంట్లో చీరతో ఉరి వేసుకుని వేలాడుతూ ఉండడాన్ని గమనించి కేకలు వేసింది. దీంతో స్థానికులు టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సమస్యల కారణంగా తీవ్ర మనస్తాపం చెంది ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు, దేవి పోలీసులకు తెలిపారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ సీఐ రామచంద్ర తెలిపారు. వేతనాలు పెంచాలంటూ అంగన్వాడీల ధర్నా రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేశారు. కార్యకర్తలకు చట్ట ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలన్నారు. కనీస వేతనాలు చెల్లించాలని కోరారు. శాంతియుతంగా ధర్నా చేసేందుకు విజయవాడ వెళుతున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి జాన్ ప్రసాద్, అధ్యక్షురాలు రమాదేవి, రాధాకుమారి, శిరీషా, లీలావతి పాల్గొన్నారు. అంగన్వాడీల అరెస్టులు దుర్మార్గంరాజంపేట రూరల్ : విజయవాడలో తలపెట్టిన మహాధర్నాకు బయలు దేరిన అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి ఈ. సికిందర్ పేర్కొన్నారు. స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజమండ్రి, కోనసీమ జిల్లాలలో రిజర్వేషన్ చేసుకొని బస్సు ఎక్కిన అంగన్వాడీలను దించివేయడం కూటమి ప్రభుత్వానికి తగదన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు, నరసింహ, జమాల్, రమణ, రవి, రాఘవ, తదితరులు పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
రాయచోటి : తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా పట్ట పగలు దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 200 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. సోమవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కచ్చిలేట్ వెంకటేశ్వర్లు తిరుపతి జిల్లా అంబేద్కర్ కాలనీ ఆటోనగర్‌లో ఉంటున్నాడని తెలిపారు. ఇతనిపై తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాలో దొంగతనాలకు పాల్పడినట్లు 19 కేసులు నమోదయ్యాయన్నారు. రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2024 అక్టోబర్ 8వ తేదీన దొంగతనానికి పాల్పడిన కేసులో వెంకటేశ్వర్లు నిందితుడిగా ఉన్నాడన్నారు. పోలీసులకు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాయచోటి సీసీఎస్, రైల్వేకోడూరు పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టి ఈనెల 9న అదుపులోకి తీసుకున్నారన్నారు. తాళం వేసిన ఇంటిలో పగటిపూట దొంగతనాలు చేయడం వృత్తిగా అలవర్చుకున్నట్లు తెలిపారు. వెంకటేశ్వర్లుపైన 19 కేసులు నమోదు కాగా అందులో ఒక మర్డర్ కేసు, హత్యాయత్నం కేసు, మిగిలిన 17 దొంగతనం కేసులు నమోదయ్యాయన్నారు. దొంగతనాలకు పాల్పడుతున్న సమయంలో నిందితుడికి ప్రమాదం జరిగి కుడి కాలుకు సర్జరీ చేసి రాడ్లు వేశారన్నారు. అతని వద్ద నుంచి సుమారు 200 గ్రాముల బంగారం నగదు, ఒకసోని ఏ7 కెమెరాను స్వాధీనం చేసుకున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న నగల విలువ రూ.17.50 లక్షలుగా ఉందన్నారు. నిందితుడు నడవ లేని స్థితిలో చికిత్స పొందుతుండటం వలన 35(3) బీఎన్ఎస్ యాక్టు కింద నోటీసు ఇచ్చామన్నారు. ఈ కేసును ఛేదించడంలో రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, సీసీఎస్ సీఐ ఎం.చంద్రశేఖర్, రైల్వేకోడూరు సీఐ హేమసుందర్, సీసీఎస్ ఎస్ఐ రామకృష్ణారెడ్డి, కోడూరు ఎస్ఐ నవీన్, సీసీఎస్ కోడూరు పోలీసు సిబ్బందిని అభినందించారు. సీసీ కెమెరాలతో ప్రయోజనం.. ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల గుర్తింపు, నేరాల పరిశీలనకు సీసీ కెమెరాలు ఏర్పాటుతో చెక్ పెట్టవచ్చని, వీటి ఏర్పాటు వలన అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. మార్కెట్లు, బస్టాండు, రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్, ఇళ్లు, అపార్ట్మెంట్లు, దేవాలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అవసరమన్నారు. ప్రతి సమస్యకు చట్ట పరిధిలో పరిష్కారం రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఫిర్యాదులకు చట్ట పరిధిలో పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చట్ట పరిధిలో బాధితులకు న్యాయం జరిగేలా భరోసా కల్పించాలని, పోలీసులు నిష్పక్షపాతంగా చట్టప్రకారం దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఫోన్ ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు. పట్టపగలే చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్టు 200 గ్రాముల బంగారు నగలు, కెమెరా స్వాధీనం ఎస్పీ విద్యాసాగర్ నాయుడు -
● వైభవం.. తిరుచ్చి ఉత్సవం
గుర్రంకొండ మండల పరిధి తరిగొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తిరుచ్చి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన ఆదివారం ఉదయాన్నే మూలవర్లకు శుద్ధితోమాల సేవ నిర్వహించారు. ఆలయంలో స్వామి వారికి ఊంజల్‌సేవ నిర్వహించారు. తిరుచ్చిలో స్వామివారికి అలంకరణ కావించారు. ఈ సందర్భంగా తిరుచ్చి ఉత్సవం గ్రామ వీధుల మీదుగా మేళతాళాలతో, జానపద కళాకారుల భజనలతో కనుల పండువగా నిర్వహించారు. అనంతరం స్నపన తిరమంజనం కావించారు. వాహన మండపంలో స్వామివారి వాహనాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. స్వామివారు పెద్దశేషవాహనంపై కొలువుదీరి గ్రామ వీధుల్లో విహరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. – గుర్రంకొండ● గంగమ్మ ఆలయం.. పోటెత్తిన భక్తజనంభక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ అనంతపురం గంగమ్మ తల్లికి బోనాలు ఎత్తికుని వేలాది మంది భక్తులు ఆదివారం మొక్కులు తీర్చుకున్నారు. జాతర ముగిసిన తరువాత మొదటి ఆదివారం కావడంతో ఇటు గ్రామంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. క్యూలైన్లు కిటకిటలాడాయి. అమ్మవారి దర్శనానికి గంటల కొద్దీ వేచి ఉండాల్సి వచ్చింది. ఆలయ పూజారులు చెల్లు గంగరాజు, దినేష్ యాదవ్, రామచంద్ర, వెంకటేష్, గురుస్వామి, రెడ్డిశేఖర్,బోస్ యాదవ్, సాయిలు తీర్థప్రసాదాలు అందజేశారు. లక్కిరెడ్డిపల్లి పోలీసులతోపాటు ఆలయ ప్రత్యేకాధికారి శ్రీనివాసులు భక్తులకు సౌకర్యాలు కల్పించారు. జాతర సందర్భంగా ఏర్పాట్లు చేసిన శీతల పానియాలు, దుకాణాలు, మిఠాయి కొట్టులు, చెరుకుల బండ్లు ఇంకా ఉండటంతో భక్తులు కొనుగోలు చేశారు. కొందరు తలనీలాలు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, వేలాది మంది భక్తులు తదితరులు పాల్గొన్నారు. – లక్కిరెడ్డిపల్లి● క్షేత్రం.. తిరునాల శోభితంసంబేపల్లె మండల పరిధి శెట్టిపల్లె గ్రామం అడవికమ్మపల్లె సమీపంలో కొలువైన శ్రీ అక్కదేవతల తిరునాల ఆదివారం వైభవంగా జరిగింది. ఆలయాన్ని వివిధ రకాల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అక్కదేవతలతోపాటు ఆలయంలో శివలింగేశ్వరులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. గ్రామంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాత్రి చాందినీ బండ్ల మెరవణితోపాటు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఉత్సవ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. – సంబేపల్లె -
పేద విద్యార్థులకు మద్దతుగా పోరుబాట
రాజంపేట టౌన్ : పేద విద్యార్థులకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పడుతున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి తెలిపారు. లక్షలాది మంది విద్యార్థులు, యువతను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వం తీరును ఎండగట్టేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 12వ తేదీ తలపెట్టిన ‘యువత పోరు’ పోస్టర్లు ఆదివారం రాజంపేట పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆకేపాటి విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా పేద విద్యార్థులపై సీఎం చంద్రబాబునాయుడు కక్షగట్టారని అన్నారు. ఐదు త్రైమాసికాలుగా చెల్లించక పోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలలకు ఫీజులు చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద విద్యార్థులు చదువులు మానేసి కూలీ పనులకు వెళ్లే దయనీ పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేద పిల్లలకు పెద్ద చదువుల కల సాకారం చేసిన వైఎస్సార్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి పేద పిల్లలు పెద్ద చదువులు చదివే కలను సాకారం చేశారని తెలిపారు. నిరుపేద ఇళ్ల నుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, సైంటిస్టులు తయారు కావాలన్న సమున్నత లక్ష్యంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. అయితే అనంతరం వచ్చిన ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చుతూ వచ్చాయన్నారు. 2014–2019 మధ్య కాలంలో సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తిలోదకాలు ఇచ్చారని దుయ్యబట్టారు. పకడ్బందీగా అమలు చేసిన జగన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కాగానే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో మేలు చేకూరిందని తెలిపారు. అంతేకాక జగనన్న వసతిదీవెన పథకం ద్వారా పేద విద్యార్థులు హాస్టల్లో ఉంటూ చదువుకునేందుకు నెలకు రెండు వేల రూపాయిల చొప్పున ఇచ్చినట్లు పేర్కొన్నారు. పిల్లల తలరాతలు మారాలంటే ఒక విద్యతోనే సాధ్యం అని గట్టిగా విశ్వసించి జగన్ ప్రభుత్వం పేద విద్యార్థులకు ఎనలేని మేలు చేసినట్లు తెలిపారు. ఆ దిశగా జగన్ తన హయాంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు జగన్ ప్రభుత్వం 18 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిందన్నారు. ఫీజురీయింబర్స్మెట్పై చంద్రబాబు కుట్ర పేదలు చదువుకోకూడదన్న ఉద్దేశంతో చంద్రబాబునాయుడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పేద విద్యార్థులు చదువుకుంటే పేదరికం నుంచి బయటపడితే తమ అడ్రస్ ఎక్కడ గల్లంతు అవుతుందో అన్న భయంతో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదని ఆరోపించారు. యువతకు ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 20 లక్షల ఉద్యోగాలు.. లేకుంటే ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారన్నారు. అయితే వాటిని అమలు చేయలేదని విమర్శించారు. యువత పోరును విజయవంతం చేయండి ఈనెల 12వ తేదీన జిల్లా కేంద్రమైన రాయచోటిలో చేపట్టే ‘యువతపోరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని నలుమూలల నుంచి విద్యార్థులు, నిరుద్యోగులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలి రావాలని తెలిపారు. అలాగే మార్చి 12న వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవమైనందున అన్ని మండలాలు, గ్రామాల్లో వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఓ పండుగ వాతావరణంలో నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మర్రి రవి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కిషోర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ వివిధ విభాగాల కన్వీనర్లు వడ్డే రమణ, డి.భాస్కర్‌రాజు, డీలర్ సుబ్బరామిరెడ్డి, శ్రీను, వివేకానందరెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, దండు గోపి, జీవీ సుబ్బరాజు, మిర్యాల సురేఖ, ఖాజా మోహిద్దీన్, జాహీద్ అలీ, మసూద్, అబ్దుల్‌మునాఫ్, నరేష్, చింతల హరీష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘యువత పోరు’ ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాఽథ్‌రెడ్డి -
పౌల్ట్రీ ఫారం మూసివేత
గాలివీడు : హైకోర్టు ఆదేశాలతో గ్రామసభ తీర్మానం మేరకు శ్రీ షిరిడీ సాయి పౌల్ట్రీ ఫారాన్ని ఆదివారం మూసివేసినట్లు గోరాన్‌చెరువు పంచాయతీ కార్యదర్శి సరోజమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామస్తుల విన్నపం మేరకు ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించిన గ్రామసభలో ఈ మేరకు తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. గోరాన్ చెరువు గ్రామం దాసరివాండ్లపల్లెలో ఏర్పాటు చేసిన పౌల్ట్రీ ఫారం ద్వారా వెలువడే వ్యర్థాలు, దుర్వాసనతో స్కూల్ విద్యార్థులు, గ్రామస్తులు అనారోగ్యం పాలవుతున్నారన్న కారణంగా కోళ్ల ఫారాన్ని మూసివేస్తున్నట్లు పంచాయతీ అధికారులు తెలిపారు. నూతన కార్యవర్గం ఎన్నికకడప వైఎస్ఆర్ సర్కిల్ : రవాణాశాఖలో రాయలసీమ స్థాయిలో నాన్ టెక్నికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీటీడీ ఎన్టీఈఏ)కు సంబంధించి సీమ అధ్యక్షుడిగా పెద్దిరెడ్డి లక్ష్మికర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన ప్రొద్దుటూరులో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఎన్నికకు సంబందించి ఫిబ్రవరి 22న నోటిఫికేషన్, 9న నామినేషన్ ప్రక్రియను ఎన్నికల అధికారి ఎం. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. జోన్ అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఈవై ప్రకాశ్ (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కడప), జోన్ వైస్ ప్రెసిడెంట్–1గా కె.సువర్ణకుమారి (అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, అనంతపురం), జోన్ వైస్ ప్రెసిడెంట్–2గా టీఎన్ పురుషోత్తంరెడ్డి (సీనియర్ అసిస్టెంట్, చిత్తూరు), జోన్ వైస్‌ప్రెసిడెంట్–3గా ఎస్.మనోహర్‌బాబు (జూనియర్ అసిస్టెంట్, ఆదోని), జోన్సెక్రటరీగా టి.విజయ్‌కుమార్ (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, మదనపల్లె), జోన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఓ.యువ కిశోర్ (సీనియర్ అసిస్టెంట్, తిరుపతి), జోన్ జాయింట్ సెక్రటరీ–1గా డి.నసీరుద్దీన్ (సీనియర్ అసిస్టెంట్, కర్నూలు), జోన్ జాయింట్ సెక్రటరీ–2 ఓ.నాగరాజ (సీనియర్ అసిస్టెంట్, మదనపల్లె), జోన్ జాయింట్ సెక్రటరీ–3 పి.చక్రపాణి (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, చిత్తూరు), జోన్ ట్రెజరర్‌గా ఎన్.రవిప్రకాశ్ (సీనియర్ అసిస్టెంట్, హిందూపురం)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కడపలోని రవాణా శాఖ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికై న 11 మందిని పలువురు రవాణాశాఖలో పనిచేసే ఉద్యోగులు, టెక్నికల్ సిబ్బంది సత్కరించారు. -
సంతోషం.. క్షణాల్లో బుగ్గి..
మదనపల్లె : చిక్కబళ్లాపురం జిల్లా చింతామణి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సొంతూరులో బంధువులను పలకరించి సంతోషంగా బెంగళూరుకు వస్తున్న కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. తల్లీ కుమారుడు సజీవ దహనమయ్యారు. చింతామణి సమీపంలోని కంచార్లపల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని మదనపల్లి రోడ్డులో జోగ్యానహళ్లి–గోపల్లి మధ్య ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో దుర్ఘటన జరిగింది. వారు ప్రయాణిస్తున్న బ్యాలెనో కారును ప్రైవేటు బస్సు ఢీకొనడంతో కారు మంటల్లో కాలిపోయింది. బంధువుకు కొడుకు పుట్టాడని.. ధనుంజయరెడ్డి (30), ఆయన తల్లి కళావతి (52), ధనుంజయరెడ్డి భార్య శోభారాణి, కొడుకు మాన్విత్రెడ్డి (3), శోభారాణి తల్లి మహాలక్ష్మీ కారులో బెంగళూరుకు బయల్దేరారు. ధనుంజయరెడ్డి కారు నడుపుతున్నారు. ఆయన తండ్రి గోపాల్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో కడప నగరంలోని రాఘవేంద్ర టౌన్షిప్లో నివాసముంటూ ఆకాశవాణిలో ఉద్యోగం చేస్తున్నారు. ధనుంజయరెడ్డి, భార్య ఐటీ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తూ మహదేవపురలో నివాసముంటున్నారు. కడపలో శోభారాణి అన్న సుబ్బారెడ్డికి కొడుకు పుట్టడంతో శనివారం అందరూ వెళ్లి చిన్నారిని చూసి సంతోషంగా గడిపారు. బెంగళూరుకు తిరిగి వస్తుండగా చింతామణి దగ్గర ఎదురుగా బెంగళూరు నుంచి తిరుపతికి వెళుతున్న శ్రీ భారతి ప్రైవేటు బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. కారు రోడ్డు పక్కన పడి మంటల్లో చిక్కకుంది. అప్పటికే కారులోని వారు బయటకు ఎగిరిపడ్డారు. ధనుంజయరెడ్డి, తల్లి కళావతికి మంటలు అంటుకుని సజీవ దహనమయ్యారు. మిగతా ముగ్గురికి గాయాలయ్యాయి. బస్సు కూడా బోల్తా పడింది. అందులోని కొందరికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. కారు పూర్తిగా దగ్ధం స్థానికులు చేరుకుని క్షతగాత్రులకు సాయం చేశారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేసేటప్పటికి కారు పూర్తిగా దహనమైంది. జిల్లా ఎస్పీ కుశాల్ చౌక్సి, డీఎస్పీ మురళీధర్, సీఐ వెంకటరమణప్ప తదితరులు పరిశీలించారు. మృతదేహాలకు చింతామణి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. శోభారాణి, కొడుకు మాన్విత్, మహాలక్ష్మీలకు ప్రథమ చికిత్స నిర్వహించి బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. ఆస్పతి దగ్గర బంధువుల రోదనలు మిన్నంటాయి. కర్ణాటకలో కడపవాసుల కారుకు ప్రమాదం తల్లీ కుమారుడు సజీవ దహనం భార్య, కొడుకు, అత్తకు గాయాలు -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
చిన్నమండెం : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. చిన్నమండెం మండలంలోని మల్లూరుకు చెందిన ఉస్మాన్‌బాషా కుమారుడు రఫీ(34) ట్రాక్టర్ కింద పడి మృత్యువాత పడ్డాడు. గత పది సంవత్సరాలుగా ట్రాక్టర్ పెట్టుకుని జీవనం సాగిస్తున్న రఫీ దేవగుడిపల్లె గ్రామ పంచాయతీలోని శ్రీ మండెం లక్ష్మీనరసింహస్వామి ఆలయం వెనుక ఉన్న మాండవ్య నదిలో.. ఆదివారం ట్రాక్టర్లో ఇసుక లోడు వేసుకుని తిరిగి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రఫీ ట్రాక్టర్ కిందపడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి వివాహమై ఇద్దరు కుమారులు ఉన్నారు. రఫీ మృతదేహం వద్ద తల్లిదండ్రులు, కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ ఢీకొని.. ఓబులవారిపల్లె : బొమ్మవరం అడ్డరోడ్డు జాతీయ రహదారిపై లారీ ఢీకొనడంతో ఆర్. వెంకటేష్ (21) అనే యువకుడు మృతి చెందాడు. పుల్లంపేట మండలం అప్పారాజుపేట దళితవాడ గ్రామానికి చెందిన ఆర్.వెంకటేష్ స్కూటర్‌పై తన బంధువుల అబ్బాయి విజయ్‌తో కలిసి కోడూరుకు బయలుదేరాడు. మంగంపేట ఏపీఎండీసీ దాటిన అనంతరం బొమ్మవరం అడ్డరోడ్డు వద్దకు రాగానే వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో వెంకటేష్ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విజయ్ తీవ్ర గాయాల పాలయ్యాడు. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. కళాశాల వార్షికోత్సవానికి వెళ్లి వస్తుండగా.. మదనపల్లె : రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి దుర్మరణం పాలైన సంఘటన శనివారం రాత్రి మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని ఎస్టేట్ శివాజీనగర్‌కు చెందిన శ్రీనివాసులు, శ్రీదేవి దంపతుల కుమారుడు సీవీ ఉదయ్‌కిరణ్(20) స్థానికంగా వివేకానంద కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. పుంగనూరు రోడ్డులోని ఆదిత్య కాలేజీలో జరిగిన వార్షికోత్సవానికి హాజరై రాత్రి తిరిగి ద్విచక్రవాహనంలో ఇంటికి వస్తుండగా, మార్గంమధ్యలోని కనుమలో గంగమ్మ గుడి సమీపంలో వాహనాన్ని అదుపుచేయలేక రోడ్డు పక్కన ఉన్న సైన్‌బోర్డును ఢీకొని, ఎగిరి అదే వేగంతో పక్కనున్న బంక్‌పై పడ్డాడు. ప్రమాదంలో తలకు, ముఖంపై తీవ్రగాయాలై అపస్మారక స్థితికి వెళ్లాడు. గమనించిన స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగ వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ గదికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపారు. -
అధికార బలంతో చెట్లు నరికివేస్తారా?
ఓబులవారిపల్లె : అధికారం ఉంది కదా తమను అడిగేవారే లేరని పచ్చటి మామిడి చెట్లను నరికి వేయడం దారుణమని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎం. జయరామయ్య అన్నారు. బొమ్మవరం రెవెన్యూ పరిధిలోని ఎన్.పృథ్వీరాజ్ అనే రైతుకు చెందిన పది ఎకరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు నరికేసిన మామిడి చెట్లను బీకేఎంయూ నాయకులు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా జయరామయ్య మాట్లాడుతూ పృథ్వీరాజ్ అనే రైతుకు సంబంధించిన పది ఎకరాల పట్టా భూమికి కోర్టు అనుమతించినా.. తెలుగుదేశం పార్టీ నాయకులు బరితెగించి మామిడి చెట్లను నరికివేశారని పేర్కొన్నారు. కూటమి నాయకులు చివరకు కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి భూఆక్రమణలకు పాల్పడుతున్నారని, అడ్డుకోవాల్సిన అధికారులు ఏమీ చేయలేకపోతున్నారని విమర్శించారు. భూ ఆక్రమణలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకొని, కేసులు నమోదు చేసి నష్టపోయిన రైతుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రమణ పాల్గొన్నారు.వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు -
సెహరి.. ఇఫ్తార్
ఐక్యతకు.. ధార్మికతకు ప్రతిరూపం శక్తికొద్దీ సేవలు ఆధ్యాత్మికతకే కాకుండా సేవా భావానికి కూడా ప్రతీక రంజాన్ మాసం. ఇటీవల ఈ మాసం సందర్భంగా యువత కలిసికట్టుగా ఉపవాస దీక్షల కోసం సెహరీకి ఏర్పాట్లు చేస్తున్నారు. కొందరు యువకులు కమిటీలుగా ఏర్పడి తమ సమీపంలోని మసీదుల్లో ఈ మాసమంతా సెహరీని ఏర్పాటు చేస్తున్నారు. నెలరోజులపాటు దాతల సహకారంతో తమ సేవా భావాన్ని ప్రదర్శిస్తూ రోజేదార్ల సేవలో తరిస్తున్నారు. పలు హోటళ్లలో ఇటీవల సెహరీ ప్యాకేజీలను అందిస్తున్నారు. రంజాన్ మాసంలో సెహరీ తయారీ కోసం ప్రత్యేక వంటకాల తయారీ కోసం ప్రత్యేకంగా నిపుణులను రప్పిస్తున్నారు. వాటి తయారీలో ఎంతో అనుభవం గల వారు హైదరాబాదు, ముంబయి తదితర ప్రాంతాల రంజాన్ వంటకాల రుచులను మన ప్రజలకు అందిస్తున్నారు. నగరంలోని కృష్ణా సర్కిల్ వద్దగల షాహీదర్బార్ హోటల్లో పదిహేనేళ్లుగా రోజేదార్ల కోసం సెహరీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ హోటల్లో ప్రత్యే కంగా లక్కీ డ్రాపెట్టి విజేతలకు ఉమ్రా యాత్ర అదృష్టాన్ని కల్పిస్తుండడం విశేషం. ఇలాంటి ప్రత్యేకమైన ఆఫర్లను ఇతర హోటళ్లలో కూడా నిర్వహిస్తున్నారు. -
ఒంటిమిట్టలో వైభవంగా మహా సంప్రోక్షణ
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం మహా సంప్రోక్షణ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దంపతులు పొల్గొని పంచసూక్త పవమాన హోమాలు నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు మహాపూర్ణాహుతి, 10.15 నుంచి 11.30 గంటల వరకు వృషభలగ్నంలో మహా సంప్రోక్షణ, మహా కుంభాభిషేకం, స్వర్ణపుష్పార్చన జరిగపారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతించారు. కార్యక్రమంలో అర్చకులు, డిప్యూటీ ఈఓలు నటేష్ బాబు, గోవిందరాజన్, సెల్వం, ప్రశాంతి, ఎస్ఈలు వెంకటేశ్వర్లు, మనోహర్, వీజీఓ సదాలక్ష్మీ, ప్రెస్ అండ్ సేల్స్ వింగ్ ప్రత్యేక అధికారి రామరాజు పాల్గొన్నారు. నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రాయచోటి: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంజిల్లా కేంద్రమైన రాయచోటితో పాటు గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేడు ఉచిత గ్రహణమొర్రి పరీక్షలు రాయచోటి జగదాంబసెంటర్: బసవతారకం స్మైల్ ట్రైన్ సెంటర్–బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్ , సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి ఒంటి గంట వరకు ఉచిత గ్రహణ మొర్రి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఐఈ కోఆర్డినేటర్ కె.జనార్ధన తెలిపారు. కడపలోని భవిత సెంటర్లో జరిగే శిబిరానికి 6 నెలల వయస్సు నుంచి 50 సంవత్సరాలు వారు హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు. పులుల గణనకు కెమెరాల ఏర్పాటుసిద్దవటం: పులుల గణన కోసం సిద్దవటం రేంజ్లో 128 కెమెరాలను ఏర్పాటు చేశామని సిద్దవటం రేంజర్ కళావతి తెలిపారు. ఆదివారం రేంజర్ ఇక్కడ మాట్లాడుతూ కడప డీఎఫ్ఓ వినీత్‌కుమార్ అదేశాల మేరకు పులుల గణన కోసం సిద్దవటం రేంజ్ లోని 64 స్థానాల్లో ఒక్కో స్థానంలో రెండు కెమెరాల చొప్పున ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మార్చి 5వ తేదీ నుంచి ఆదివారం వరకు వీటిని ఏర్పాటు చేశామన్నారు. 40 రోజుల పాటు కెమెరాల్లోని డేటాను సేకరించనున్నట్లు చెప్పారు. ఈనెల 24న, ఏప్రిల్ 13వ తేదీన డేటాను సేకరిస్తామని రేంజర్ తెలిపారు. రాయచోటిలో 144 సెక్షన్ అమల్లో ఉందిరాయచోటి టౌన్: ఈనెల 9వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాయచోటి టౌన్లో 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లు రాయచోటి అర్బన్ సీఐ చంధ్రశేఖర్ ఆదివారం తెలిపారు. ప్రొసీడింగ్స్ అమల్లో ఉంటాయని రాయచోటి తహసీల్దార్ జారీ చేసినట్లు చెప్పారు. దీనిని ఎవరు అతిక్రమించినా చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మదనపల్లెలో .. మదనపల్లె: మదనపల్లె డివిజన్లో సోమవారం 144 సెక్షన్ అమలులో ఉంటుందని డీఎస్పీ కొండయ్యనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. వీధుల్లో మతపరమైన ర్యాలీలు, సమావేశాలు, ధర్నాలు నిషేధించామన్నారు. ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. జపాన్ యూనివర్సిటీతో మిట్స్ ఒప్పందం కురబలకోట: జపాన్‌లోని ప్రముఖ ఐజు యూనివర్సిటీతో అంగళ్లులోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రిన్సిపాల్ యువరాజ్, ఇంటర్నేషనల్ సీనియర్ మేనేజర్ విజయలక్ష్మి తెలిపారు. ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలతో పాటు పరిశోధన, ఆవిష్కరణలకు అవకాశాలు మెరుగుపడతాయన్నారు. విద్యా భాగస్వామ్యం ఏర్పడుతుందన్నారు. ఈ ఒప్పందం అంతర్జాతీయ ప్రయత్నాలో ప్రధాన మైలు రాయి అని విద్యలో సరికొత్త మార్గాలను తెరుస్తుందని కరస్పాండెంట్ డాక్టర్ నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి పేర్కొన్నారు. -
తెల్లవారుజాము 3.00 గంటల సమయం. ఆ ప్రాంతమంతా నిద్ర మేల్కొంది. పెద్దపెద్ద బట్టీ పొయ్యిలు పొగలు కక్కుతున్నాయి. టీ హోటళ్లలో చాయ్ వాసన గుబాళిస్తోంది. పక్కనే ఉన్న మసీదు మినార్లు విద్యుద్దీపాల వెలుగులో ధగధగలాడుతున్నాయి. అస్సాలాము అలైకుమ్ భాయ్‌సాబ్.. అంటూ పలకరి
రంజాన్ మాసంలో రోజేదార్లకు సెహరీ అవకాశం కల్పించే భాగ్యం దక్కడం దైవం ఇచ్చిన వరంగా భావిస్తున్నా. నెలంతా రాత్రింబవళ్లు పని చేసే కార్మికుల వల్లే సాధ్యమవుతోంది. సెహరీ, హలీం తయారు చేసే వాళ్లను హైదరాబాద్ నుంచి పిలిపించాం. ఉడతాభక్తిగా ఈసారి మా తరఫున ఒకరికి ఉమ్రా యాత్ర చేసే అవకాశం కల్పించాం. –ఎస్.ఎండీ ఆజం, హోటల్ యజమాని, షాహీ దర్బార్ ఉదయం సెహరీ సందర్భంగా ఇంట్లో ఆహారం స్వీకరించినా ఇఫ్తార్ సమయంలో రోజేదార్లు అందరూ ఒకేచోట కలుసుకుంటాం. రంజాన్ శుభవేళలో ఇలా అందరం ఒకచోట కలిసి ప్రార్థనా సమయపు ఆహారమైన ఇఫ్తార్ స్వీకరించడం అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. – షేక్ మమ్మద్గౌస్, రవీంద్రనగర్, కడప జిల్లాలో హలీం వ్యాపారం ఉభయ వైఎస్సార్ జిల్లాలో రంజాన్ మాసం సందర్భంగా రంజాన్ ప్రత్యేక సంప్రదాయ వంటకమైన హలీం వ్యాపారం బాగా సాగుతోంది. పుష్టికరమైన ఈ వంటకంపై రోజేదార్లతో పాటు సాధారణ ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.అద్భుతమైన అనుభూతి దైవం ఇచ్చిన వరం.. -
జోరుగా క్రికెట్ బెట్టింగ్
రాయచోటి: జిల్లా వ్యాప్తంగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ బెట్టింగ్ జోరుగా సాగింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకు పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా బెట్టింగ్ వ్యాపారం చాపకింద నీరులా పాకింది. బెట్టింగులను నిలువరించాల్సిన పోలీసులు ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. యువత, ఉద్యోగులు పోటాపోటీగా బెట్టింగులు కట్టారు. భారీ నష్టాలను చవిచూసిన వారు బయటకు చెప్పలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్నా క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసు అధికారులు వాటిని నిలువరించడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొంతమంది పోలీసు అధికారులు నేరుగా బెట్టింగ్‌రాయుళ్లతో చేతులు కలుపుతున్నారని ఆరోపణలు కూడా లేకపోలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్–న్యూజిలాండ్ జట్లు సమ ఉజ్జీలుగా తలపడటంతో ఇరు జట్లపై క్రికెట్ అభిమానులు భారీగా బెట్టింగ్ కాశారు. జిల్లాలో ప్రధాన పట్టణాలైన రాయచోటి, మదనపల్లి, రాజంపేట, పీలేరు, కోడూరు పట్టణాల్లో బెట్టింగ్ జరిగింది. కొందరు ఆన్లైన్లో, మరికొందరు క్రికెట్ మ్యాచ్‌లను లైవ్‌లో చూస్తూ బెట్టింగ్‌కి పాల్పడుతున్నారు. ముందస్తు ఒప్పందంలో భాగంగా మొబైల్ నంబర్లు నమోదు చేసుకుని బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు సమాచారం. కొందరు వికెట్ల చొప్పున, బంతి, బంతికి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. మ్యాచ్‌లో తలపడిన ఇండియా, న్యూజిలాండ్ జట్టులో ఫలానా జట్టు టాస్ గెలుస్తుందని, ఫలానా జట్టు బ్యాటింగ్ తీసుకుంటుందని బెట్టింగ్ వేశారు. ఇందులో ఒకటికి రెండింతలు చెల్లించే పద్ధతిని పాటించారు. రూ.10 వేలు పెడితే గెలిస్తే రూ.30 వేలు వస్తాయని ఆశ చూపి యువతను బెట్టింగ్ ఊబిలోకి లాగారు. అత్యాశకు పోయి ధనవంతులు, పేద, మధ్య తరగతి అనే తేడా లేకుండా యువకులు లక్షల రూపాయల్లో పందేలు కాస్తూ అప్పుల పాలవుతున్నారు. పోలీసులను ఆసరాగా చేసుకుని కొంతమంది క్రికెట్‌తో వ్యాపారం చేస్తున్నారు. మరికొందరు కమీషన్లు తీసుకుంటూ బుకీలుగా మారారు. రెండు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం చేసి అందినకాడికి దండుకుంటున్నారన్న సమాచారం ఉంది. సులువుగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో కొందరు స్నేహితులు బృందాలుగా ఏర్పడి బెట్టింగులకు పాల్పడుతున్నారు. ప్రధానంగా గుగూల్‌పే, పేటీఎం ద్వారా సులభంగా మనీ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉన్నందున సెల్ఫోన్ల నుంచి ఆన్లైన్ ద్వారా లావాదేవీలు జరుపుకుంటున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు అనేకం వెలుగుచూశాయి. యువత రానురాను విష వలయంలో చిక్కుకుంటోంది. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు, పోలీసు అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ● ఓవర్.. బంతుల చొప్పున.. యాప్‌లు, ఆన్లైన్ ద్వారా రూ.లక్షల్లో చెల్లింపులు చోద్యం చూస్తున్న పోలీసులు -
● అంతర్జాతీయస్థాయిలో సాధించిన మెడల్స్
సాక్షి రాయచోటి: రైల్వేకోడూరుకు చెందిన జి. నరేంద్ర, జి. ఉమామహేశ్వరి (బంగారు అంగడి) దంపతుల కుమారుడైన గొబ్బూరు విశ్వతేజ కడపకు చెందిన బ్యాడ్మింటన్ అంతర్జాతీయ అంపైర్, ఫిజికల్ డైరెక్టర్ ఎస్.జిలానీబాషా శిక్షణలో బ్యాడ్మింటన్‌లో ఓనమాలు ప్రారంభించి అనతికాలంలోనే జాతీయస్థాయిలో రాణించాడు. 2021 నుంచి 2023 వరకు ఒడిశాలోని భువనేశ్వర్‌లో రీజినల్ బ్యాడ్మింటన్ అకాడ మీలో శిక్షణ పొందాడు. ప్రస్తుతం అస్సాంలోని గౌహతిలో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో శిక్షణ పొందుతున్నాడు. అంతర్జాతీయస్థాయిలో 3 మెడల్స్ సాధించిన ఈయన బ్యాడ్మింటన్ ఆఫ్ ఇండియా (బాయ్) ర్యాంకింగ్‌లో 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా ప్రకటించిన ర్యాకింగ్స్లో సీనియర్ మెన్స్ డబుల్స్ విభాగంలో 152వ ర్యాంకు, జూనియర్ వరల్డ్ బాలుర డబుల్స్ విభాగంలో గుంటూరుకు చెందిన భార్గవ్‌రామ్‌తో కలిసి 1వ స్థానంలో ఉన్నాడు. జాతీయస్థాయిలో 17 పతకాలు, అంతర్జాతీయస్థాయిలో 3 పతకాలు సాధించడంతో పాటు పలు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారతజట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. రానున్న రోజుల్లో సీనియర్ విభాగంలో సైతం సత్తాచాటేందుకు సన్నద్ధం అవుతున్నాడు. భారత్‌కు ప్రాతినిథ్యం.. విశ్వతేజ 2024లో చైనాలోని నాన్చాంగ్లో నిర్వహించిన యోనెక్స్ బీడబ్లుఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్, యోనెక్స్ బీడబ్లుఎఫ్ వరల్డ జూనియర్ మిక్స్డ్ టీం చాంపియన్‌షిప్‌లో భారతజట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ● 2024లో ఇండోనేషియాలోని యోగ్యకర్తాలో నిర్వహించిన బీఎన్ఐ బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించాడు. ● 2023లో చైనాలో నిర్వహించిన బ్యా డ్మింటన్ ఆసియా అండర్–17, అండర్–15 జూనియర్ చాంపియన్‌షిప్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించాడు. సన్మానం: గొబ్బూరి విశ్వతేజ బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో వరల్డ్‌నెంబర్ 1గా నిలిచి జిల్లాకు విచ్చేసిన సందర్భంగా జిల్లా బ్యాడ్మింటన్ సంఘం సభ్యులు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. జిల్లా బ్యాడ్మింటన్ సంఘం చైర్మన్ ఎస్. జిలానీబాషా, అధ్యక్షుడు డాక్టర్ సింగం భాస్కర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ వి.నాగరాజు, అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు విశ్వతేజను ఘనంగా సన్మానించారు. ప్రపంచ నెంబర్ 1 ర్యాంకింగ్ సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈయన్ను ఆదర్శంగా తీసుకుని యువ క్రీడాకారులు రాణించాలని ఆకాంక్షించారు. 2025లో ఇస్తోనియాలో నిర్వహించిన యోనెక్స్ ఇస్తోనియన్ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో డబుల్స్ మెన్ విభాగంలో రజత పతకం సాధించాడు. 2024లో పూణేలో నిర్వహించిన అండర్–19 యోనెక్స్ సన్‌రైజ్ ఆలిండియా జూనియర్ ఇంటర్నేషనల్ గ్రాండ్ ప్రిక్స్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో డబుల్స్ విభాగంలో గోల్డ్‌మెడల్ సాధించాడు. 2023లో పూణేలో నిర్వహించిన అండర్–19 యోనెక్స్ సన్‌రైజ్ ఆలిండియా జూనియర్ ఇంటర్నేషనల్ గ్రాండ్ ప్రిక్స్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో డబుల్స్ విభాగంలో గోల్డ్‌మెడల్ సాధించాడు. -
అసెంబ్లీ సాఽక్షిగా అప్పులపై అసత్యాలు
రాయచోటి టౌన్ : అసెంబీ సాక్షిగా రాష్ట్ర అప్పులపై కూటమి సర్కార్ నేతలు అసత్యాలతో దొరికిపోయారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శనివారం రాయచోటిలోని వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజంపేట ఎమ్మెల్యే అకేపాటి అమరనాథరెడ్డి, మున్సిపల్‌చైర్మన్ ఫయాజ్ బాషాలతో కలసి మాట్లాడారు. అధికారంలోకి రావడం కోసం ప్రజలకు ప్రజలకు ఎన్నైనా చెప్పవచ్చన్నారు. అయితే అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రజల్ని తప్పదోవ పట్టిస్తూ, ఎన్నో రకాలుగా గత ప్రభుత్వం పేద ప్రజలకు మేలు చేసినా దానిని కూడా చంద్రబాబు దుష్ప్రచారం చేశారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ. కోట్లు అప్పు చేసిందని చంద్రబాబు, రూ.14 లక్షల కోట్లు అప్పు చేసిందని బీజెపీ నాయకురాలు పురందేశ్వరీ ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల అనంతరం తొలి అసెంబ్లీ సమావేశంలో అప్పుల నోట్ వచ్చిందన్నారు. రూ.7.80 కోట్లు ఉంటే అందులో రూ.3.5 కోట్లు గత ప్రభత్వంలోనే జరిగాయన్న వాస్తవాలను అసెంబ్లీలో ప్రజెంట్ చేశారన్నారు. అయినా కూటమి పార్టీ నేతలు దుష్ప్రచారం ఆపలేదన్నారు. రూ.14 లక్షల కోట్లు అప్పులు చేశారని జగన్ ఆర్థిక విధ్వంసం చేశారని మాట్లాడారన్నారు. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రాతపూర్వకంగా జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పులు రూ.3.5 కోట్లు మాత్రమేనని ధ్రువీకరించిరన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి అప్పుల్లో 50 శాతం అప్పులు చంద్రబాబు ప్రభుత్వంలో జరిగాయని స్పష్టం చేశారన్నారు. ప్రస్తుతం గద్దెనెక్కి సంవత్సరం అయినా కాలేదు అప్పుడే రూ.1.5 కోట్లు అప్పులు చేసినట్లు రికార్డులు తెలుపుతున్నాయన్నారు. జగన్ రూ.14 లక్షల కోట్లు అప్పలు చేశారని దుష్ప్రచారం చేసినందుకు ప్రజలకు క్షమాణలు చెప్పాలన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో వైఎస్. జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి ఆదాయం తగ్గినా, పేద ప్రజలకు అన్యాయం జరగకుండా అప్పుల బ్యాలెన్స్ షీట్ మెయింటెనెన్స్ చేస్తూనే పాలన సాగించారని తెలిపారు. చద్రబాబు నాయుడు మాత్రం అప్పుల బండారం బయట పడుతుందనే ప్రజల దృష్టి మరల్చేందుకు రకరకాలుగా పేపర్లలో అసత్యాలు రాయిస్తున్నారన్నారు. పులివెందులలో ఎవరు చనిపాయినా.. పులివెందులలో ఎవరు చనిపోయినా దానిని వివేకానందరెడ్డి హత్యకు ముడిపెట్టడం ఏమిటని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడున్నది మీ ప్రభుత్వమే కదా.. మీ చేతుల్లోనే సీఐడీ, ఇతర విచారణ సంస్థలు ఉన్నాయి కదా ...వాస్తవాలను ఎందుకు వెలికి తీయలేకపోతున్నారు. జగన్‌కు స్వయాన మేనమామ ఈసీ గంగిరెడ్డి చనిపోతే కూడా వివేకానందరెడ్డి హత్యకు ముడిపెడుతున్నారు. డాక్టర్ అభిషేక్‌రెడ్డి అనారోగ్యంతో కొన్ని నెలలు పాటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోతే వివేకానందరెడ్డి హత్యకు ముడి పెట్టడం సరికాదన్నారు. వాచ్‌మన్ రంగన్న అనారోగ్యంతో చనిపోతే కూడా ఎందుకు లింక్‌లు పెడుతున్నారని నిలదీశారు. ప్రజలను పక్కదోవ పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ బాధ్యతారహితంగా మాట్లాడటం సిగ్గుగా అనిపించలేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి -
అనుమానాస్పద స్థితిలో బీఫార్మసీ విద్యార్థిని మృతి
మదనపల్లె : అనుమానాస్పద స్థితిలో బీఫార్మసీ చదువుతున్న విద్యార్థిని మృతి చెందిన సంఘటన శనివారం మదనపల్లి మండలంలో జరిగింది. సిటియం రోడ్డులోని తట్టివారిపల్లి చెరువులో మృతదేహం తేలియాడడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తాలూకా సీఐ కళా వెంకటరమణ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సీఐ తెలిపిన వివరాలిలా... పీలేరు పట్టణం సమీపంలోని బాలంవారిపల్లికి చెందిన ఎం.టి భాస్కర్ కుమార్తె పూజిత (24) మదనపల్లె మండలం, గంగన్నవారిపల్లె లోని కృష్ణచైతన్య నర్సింగ్ కళాశాల లో బీఫార్మసీ మూడవ సంవత్సరం చదువుతోంది. పట్టణంలోని ప్రశాంత్ నగర్ లోని బాలాజీ పీజీ హాస్టల్లో ఉంటూ రోజు కళాశాలకు వెళ్లి వచ్చేది. అనుమానాస్పద స్థితిలో చెరువులో మృతదేహమై కనబడింది. పోలీసుల సమాచారంతో మదనపల్లికు చేరుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు, కుమార్తె మృతికి కారణాలను తాలూకా పోలీసులకు వివరిస్తూ ఫిర్యాదు చేశారు. విద్యార్థిని చిన్నాన్న వెంకటేష్ శుక్రవారం రాత్రి పీలేరు కలకడ మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మతి చెందాడు. శనివారం ఉదయం బాబాయ్ అంత్యక్రియలకు వెళ్లడానికి పూజిత మదనపల్లి నుంచి బయలుదేరింది. విద్యార్థిని చదువుకయ్యే ఖర్చులు భరిస్తూ ఆలనా పాలన చూస్తున్న బాబాయ్ మృతి చెందిన విషయాన్ని జీర్ణించుకోలేక మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యార్థిని తండ్రి భాస్కర్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా సీఐ తెలిపారు. తట్టివారిపల్లె చెరువులో మృతదేహం -
వీఆర్వో రూటే సపరేటు
గాలివీడు : స్ధానిక తహసీల్దార్ కార్యాలయంలో ఓ ద్వితీయశ్రేణి అధికారి వీఆర్వో లంచావతారం ఎత్తాడు. ఆయన లీలలు అన్నీ ఇన్నీ కాదు. ప్రభుత్వ భూముల్లో ఒకో డీ పట్టాను రూ.50 వేలకు వేలం వేసి మరీ విక్రయించడం గమనార్హం. పైసలిస్తే చాలు ప్రభుత్వ భూములైనా,పట్టా భూములైనా ఇతరులకు ఆన్లైన్ చేయించేస్తాడు. రెవెన్యూ శాఖలో ఏళ్ల తరబడి కొనసాగుతున్నా తప్పనిసరి బదిలీల్లో సైతం చక్రం తిప్పి మండలంలో తిష్ట వేశాడు. అసైన్డ్ భూముల్లో అవినీతి,పొజిషన్ సర్టిఫికెట్ల పేరుతో విక్రయాలు,ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసి రైతుల దగ్గర నుండి డబ్బులు గుంజడం, ఇలా ఒకటేమిటి అన్నీ అక్రమాలే జరుగుతున్నాయంటూ ప్రజలు నుంచి పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో గాలివీడు వీఆర్వోగా విధులు నిర్వహించిన ఆయన పక్కనున్న గోరాన్ చెరువు గ్రామంలో ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉండటంతో అక్కడికి మకాం మార్చాడు. ప్రభుత్వ భూములు స్వాహాలో కొన్ని గమనిస్తే గాలివీడు పరిధిలో గుర్రాలమిట్ట వద్ద సర్వే నంబర్ 2286 లో 70 సెంట్ల భూముని మాయం చెయ్యగా, రాయచోటి ప్రధాన రహదారి పక్కనే ఉన్న వాటర్ ప్లాంట్ వద్ద సర్వే నంబర్ 900బీ1 లోని 85 సెంట్ల భూమిలో మామూళ్లకు కకత్తి పడి 40 సెంట్లు భూమిని వేరొకరి పేరుపై అన్లైన్ చేయించేశాడు. అలాగే రాయచోటి కదిరి ప్రధాన రహదారి పక్కనే ఉన్న విలువైన పట్టా భూమిని వేరొకరి పేరుపై ఆన్లైన్ చేయించాడు. గోరాన్ చెరువు గ్రామంలో మూడు యకరాల వ్యవసాయ భూమి వేరొకరి పెరోపై ఆన్లైన్ చేసయించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ పరంగా మండలంలో ఏపని చేయాలన్నా ఆయన్ను ప్రసన్నం చేసుకోవాల్సిందే. లేదంటే పని జరగదు. డబ్బు ముట్టనిదే ఆయన ఏ పనీ చేయరన్న ఆరోపణలు బహిరంగంగానే విన్పిస్తున్నాయి. డీ పట్టాలు కొన్నవారి పేర్లను సైతం రికార్డుల్లో ఎక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన అనుకుంటే రికార్డులను సైతం తారుమారు చేస్తాడన్న విమర్శిలున్నాయి. మండలానికి చెందిన కొందరు ప్రైవేటు వ్యక్తులను పెట్టుకుని వారి ద్వారా ప్రభుత్వ భూములను సైతం ఆన్లైన్ లోకి ఎక్కిస్తానంటూ వాటికి ఆనుకుని ఉన్న రైతులకు సమాచారం ఇచ్చి ముడుపులు దన్నుకుంటున్నాడని తెలుస్తోంది.ఇ ప్పటికై నా జిల్లా అధికారులు దృష్టి సారించి ఇలాంటి అవినీతి తిమింగళాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఒక్కో డీ పట్టా రూ.50 వేలు ప్రభుత్వ భూములను మాయం చేస్తున్న ఘనుడు తప్పనిసరి బదిలీల్లో కూడా మండలాన్ని వదలని విక్రమార్కుడు -
ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యం
రాజంపేట : ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగానే అన్నమాచార్య యూనివర్సిటీ వెళ్తోందని యూనివర్సిటీ ప్రొచాన్స్లర్ చొప్పా అభిషేక్ రెడ్డి అన్నారు. శనివారం అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు కోడ్క్రాప్ట్ హాకథాన్‌లో విజయం సాధించిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడెట్రూ సంస్థ నుంచి లక్ష రూపాయలు బహుమతి, ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్నారు. అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ రాజంపేటకు చెందిన ఐదుగురు విద్యార్థులు జాతీయస్థాయిలో నిర్వహించిన కోడ్క్రాప్ట్ హాకథాన్‌లో పాల్గొన్నారని, హ్యాండ్రైటింగ్ రికగ్నిషన్ సిస్టమ్ అనే ప్రాజెక్టును రూపొందించి ప్రతిభను చాటారన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సు, మెషిన్ లర్నింగ్ పద్ధతులను ఉపయోగించారన్నారు. ఈ ప్రాజెక్టును అభివృద్ది చేయడం ద్వారా ఆటోమేటెడ్ హ్యాండ్ రైటింగ్ గుర్తింపు వ్యవస్థను సమర్థవంతంగా రూపొందించారన్నారు. హాకథాన్‌లో కొత్త సమస్యలను పరిష్కరించే సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ది చేయడం, కోడింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడం అభినందనీయమన్నారు. సృజనాత్మక ఆలోచలను ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయన్నారు. కోడెట్రూ సంస్థ ఈ హాకథాన్‌ను సాప్ట్వేర్ అభివృద్ది, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాలలో నైపుణ్యం కలిగిన యువప్రతిభావంతులను గుర్తించేందుకు నిర్వహించిందన్నారు. ఈ సంస్థకు టాంపా, చికాగో, హైదరాబాద్ నగరాల్లో కార్యాలయాలు ఉన్నాయన్నారు. కోడ్ట్రూ ఉత్తమ టెక్నికల్ నైపుణ్యం కల్గిన విద్యార్థులను ఎంపిక చేసి వారికి పరిశ్రమ స్థాయిలో ఉద్యోగ అవకాశాలను అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. తమ కళాశాల విద్యార్థులు హాకథాన్‌లో ప్రథమ స్థానం సాధించడం గర్వకారణమని వారన్నారు. విజేతల బృందం సభ్యులు కున్ననన్ రెడ్డి, చిట్టేపు ఆనంద గోపాల్ రెడ్డి, మానే యనమల అఖిల్ కుమార్ రెడ్డి, గుబగుండ మహేంద్ర, మేక మనోజ్‌లు ఉన్నారని, వీరి ప్రతిభను గుర్తించి కోడ్ ట్రూ సంస్థ లక్ష రూపాయలు నగదు బహుమతిని అందజేసిందన్నారు. అంతే కాకుండా ఈ విద్యార్థులకు సంస్థ నుంచి ఉద్యోగ అవకాశాలు కూడా ప్రకటించిందన్నారు. తమ కళాశాల విద్యార్థులు హాకథాన్‌లో ప్రదర్శించిన సాంకేతిక నైపుణ్యాన్ని పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా గుర్తించి, అధిక వేతనంతో ఉద్యోగ అవకాశాలను కల్పించిందన్నారు. కార్యక్రమంలో అన్నమాచార్య విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ ఈ సాయిబాబా రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్ మల్లికార్జున రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ఎంవీ నారాయణ, సిఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ ఎం సుబ్బారావు. డాక్టర్ బి జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. యూనివర్సిటీ ప్రోచాన్స్లర్ చొప్పా అభిషేక్ రెడ్డి -
డిజిటల్ సాధనాలతో విద్యాబోధన
మదనపల్లె : డిజిటల్ సాధనాలతో విద్యాబోధన చేయడం ద్వారా విద్యార్థులకు విషయజ్ఞానం పెరుగుతుందని ఉన్నత విద్యామండలి అకడమిక్ ఆఫీసర్ శ్రీరంగం మాథ్యూ అన్నారు. పట్టణంలోని శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో రెండురోజులుగా జరుగుతున్న వర్క్‌షాప్ శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా శ్రీరంగం మాథ్యూ మాట్లాడుతూ బోధన సందర్భంగా వీలైనంతవరకు విద్యార్థుల నుంచి సమాధానాలను రప్పించే ప్రయత్నంచేసి వారి భాగస్వామ్యాన్ని అందులో పెంచడం ముఖ్యమన్నారు. బోధనలో వినూత్నపద్దతులు వాడాలని, చాక్‌పీస్, మాట్లాడటం కాదని తెలిపారు. స్వీయ, వేగవంతమైన అభ్యాసం విద్యార్థులకు అలవాటు చేయడం చాలా మంచిదన్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలు, సహ పాఠ్య కార్యకలాపాలు ముఖ్యమని, పరిశోధనలు, వృత్తి సంస్థలు, ఇంటర్నషిప్ మొదలైనవన్నారు. విద్యార్థులకు ముఖ్యంగా నైపుణ్య కోర్సులపై శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్లు అందించాలన్నారు. కార్యక్రమంలో భాగంగా శ్రీరంగం మాథ్యూను కరస్పాండెంట్ డాక్టర్.రాటకొండ గురుప్రసాద్, ప్రిన్సిపాల్ సురభి రమాదేవి, అధ్యాపకులు ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. -
టీడీపీ నాయకుల దౌర్జన్యం
● మామిడి చెట్లు నరికివేత ● అధికారం మాదే.. ● అడ్డువస్తే అంతం చేస్తామని బెదిరింపు ఓబులవారిపల్లె : తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యానికి అడ్డూ అదుపులేకుండా పోతోంది. అధికారం మాది..మమ్మల్ని అడిగేది ఎవరు.. అడ్డొస్తే అంతం చేస్తామంటూ బొమ్మవరం రెవెన్యూ పరిధిలో పది ఎకరాల మామిడితోటలో చెట్లను నరికి అక్రమంగా తరలించారు. బొమ్మవరం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబరు. 937, 938, 939 పట్టా భూమిని 15 సంవత్సరాల క్రితం సుబ్బరాఘవరాజు అనే రైతు నుండి రాజంపేట మండలం, మునక్కాయలపల్లి గ్రామానికి చెందిన పృథ్వీరాజ్ అనే రైతు కొనుగోలు చేశాడు. ఈ ఘటనపై పృథ్వీరాజ్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ పట్టా భూమిని చిట్వేలి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని, కొద్దిరోజుల అనంతరం ఎన్ సుబ్బరాఘవరాజు సతీమణి, పిల్లలు తమకు తెలియకుండా భూమి రిజిస్ట్రేషన్ చేయించారన్నారు. మరో వ్యక్తితో చేతులు కలిపి ఆ భూమిలో ఇంకొక భాగం ఉందని వేరొకరికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందన్నారు. అలాగే ముందుకొన్న తనపై రైల్వేకోడూరు కోర్టులో సివిల్ వ్యాజ్యం కూడా వేయించారని, ప్రస్తుతం అధికారం, పలుకుబడి ఉపయోగించి తహసీల్దార్ కార్యాలయంలో నాపేరుపై ఉన్న భూమిని ఆన్లైన్లో తొలగించారన్నారు. గత బుధవారం నుంచి పది ఎకరాలలో భూ కబ్జాదారుడు దుగ్గిన చంద్రబాబు నాయుడు, గోపాల్ నాయుడు అనే వ్యక్తులు తమ అనుచరులతో కలిసి పది ఎకరాల మామిడి తోటను నరికి వేశారన్నారు. హైదరాబాదులో ఉన్న తాను విషయం తెలుసుకొని పోలీసులకు, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశామని, కోర్టులో ఉన్న భూమిలో మామిడి చెట్లు నరికి కోర్టు దిక్కారానికి పాల్పడ్డారన్నారు. పొలంలోకి వస్తే అంతం చేస్తామని బెదిరించినట్లు పృథ్వీరాజ్ వాపోయాడు. కబ్జాదారులపై కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. -
స్త్రీల సాధికారతే ధ్యేయం
రాయచోటి: రాష్ట్రంలో మహిళా సాధికారతే లక్ష్యమని జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాయచోటిలోని నారాయణ ఫంక్షన్ హాల్లో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి, కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యతల వల్ల రాష్ట్రంలో మహిళా సాధికారత సాధ్యమైందన్నారు. డ్వాక్రా గ్రూపుల వల్ల ఎంతో మంది మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించగలిగారన్నారు. ఈ ఏడాది మే నెల నుంచి తల్లికి వందనం కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 25 వేల లావాదేవీలతో నాణ్యతతో కూడిన వస్తువులను విక్రయం చేసేందుకు సహకరించిన జిల్లా కలెక్టర్‌కు, జిల్లా యంత్రాంగానికి శుభాభినందనలు తెలిపారు. భవానీని స్పూర్తిగా తీసుకుందాం:కలెక్టర్ జిల్లాలోని మదనపల్లెకు చెందిన భవానీని స్పూర్తిగా తీసుకుని మహిళలందరూ ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అన్నారు. జీడీపీలో జిల్లా 23వ ర్యాంకులో ఉన్నప్పటికీ జిల్లాలోని మహిళలు డిజిటల్ కామర్స్‌లో ఎంతో ముందున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని మహిళలు చేసిన ఉత్పత్తులను విక్రయం చేసి 25 లక్షల రూపాయల విలువతో 25 వేల లావాదేవీలు జరగడం ఇందుకు ఉదాహరణగా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో లక్షాధికారులుగా మారిన మహిళలను సత్కరించుకోవడం ఆనందదాయకమన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నేడు డీఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న 635 ఎస్‌హెచ్‌జీ గ్రూపు మహిళలకు దాదాపు రూ.90 కోట్ల రుణాలను అందిస్తున్నామని తెలిపారు. ఎస్సీ ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు పీఎంఏజేఏవై పథకం కింద 46 మందికి 76 లక్షల రూపాయల రుణాలను అందిస్తుట్లుగా పేర్కొన్నారు. మెప్మా ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న 109 మందితో కూడిన ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు 17 కోట్ల రూపాయల రుణాలను అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. మెప్మా ఆధ్వర్యంలో 614 మంది మహిళలకు జాతీయ అప్రెంటిస్ శిక్షణ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నామని ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు నైపుణ్య అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పీఎం విశ్వకర్మ కార్యక్రమం ద్వారా 87 మంది మహిళలకు 86 లక్షల రూపాయల రుణాలను అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ,టైలరింగ్ మిషన్లను అందిస్తున్నామన్నారు. దేశ ఆర్థిక ప్రగతిలో మహిళల పాత్ర కీలకం: ఎస్పీ మహిళలు కేవలం కుటుంబపోషణలోనే కాకుండా దేశ ఆర్థికాభివృద్ధికి పాటు పడుతున్నారని వారి భద్రత చాలా ముఖ్యమని ఎస్పీ పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం శక్తి మొబైల్ యాప్‌ను ఈ రోజు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా మహిళలకు ఎటువంటి అభద్రత ఎదురైనా ఒక బటన్ నొక్కితే పోలీసులకు సమాచారం వెళుతుందన్నారు. డ్రోన్లను మహిళా భద్రత కోసం ఉపయోగించడం ప్రారంభించామన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లకు ఒక పోలీసును ఏర్పాటు చేస్తామన్నారు. ఎటువంటి సమాచారమైనా ఆ పోలీస్‌కు తెలుపవచ్చని పేర్కొన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ రోహిణి, ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ దీప్తి, జిల్లా ఐసీడీఎస్ అధికారి రమాదేవిలు మాట్లాడుతూ 21వ శతాబ్దంలో మహిళలు అన్ని రంగాలలో ఎంతో ప్రగతి సాధించారన్నారు. మెమెంటోలు అందజేత జిల్లాలో వివిధ శాఖలకు చెందిన ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు, లక్షాధికారులుగా మారిన మహిళలకు మంత్రి, జిల్లా అధికారులు మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లక్ష్మీప్రసాద్‌రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షులు జగన్మోహన్రాజు, తంబళ్లపల్లి టీడీపీ నాయకుడు జయచంద్రారెడ్డి, మదనపల్లెకు చెందిన భవానీ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి -
రామయ్య గోపురంపై శాస్త్రోక్తంగా స్వర్ణ కలశ ప్రతిష్ట
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయ మహా సంప్రోక్షణ మహోత్సవాల్లో భాగంగా శనివారం టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారు రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో విమాన గోపురంపై శాస్త్రోక్తంగా స్వర్ణ కలశాన్ని ప్రతిష్టించారు. ముందుగా సీతారామ లక్ష్మణ ఉత్సవ మూర్తులకు సహస్రనామ కలశాభిషేకానికి సిద్ధం చేసిన 1001 కలశాలలో పంచామృతాభిషకాలు నిర్వహించారు. అనంతరం స్వర్ణ కలశాన్ని విమాన గోపురంపై శాస్త్రోక్తంగా ప్రతిష్టించారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి చరుస్థానార్చనము, శ్రీమద్రామాయణ యజ్ఞం, మూర్తి హోమం నివేదన, శాత్తుమొర చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి కళాపకర్షణ, శయ్యాదివాసం, ప్రధాన మూర్తి హోమం, శాంతిహోమం, పూర్ణాహుతి, శాతుమొర నిర్వహించారు. అనంతరం సీతారామ లక్ష్మణ ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలు, తులసి గజమాలలు, ఆభరణాలతో అలంకరించి ఎదురుకోలు మండపంపై ఆసీనులు చేసి కన్నుల పండుగగా ఊంజల్ సేవను నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ నటేష్ బాబు, సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఆలయ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, అర్చకులు శ్రావణ్ కుమార్, సివిల్ విభాగం ఏఈ అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కల్పవృక్ష వాహనంపై నారసింహుడి విహారం
● రూ.20.01 కోట్ల నష్టంజిల్లాలో ఈ సీజన్లో వివిధ రకాల పూలతోటలు సాగు చేసిన రైతులు రూ. 20.01 కోట్లు మేరకు నష్టపోయారు. ఎకరం సాగుకు పంటరకాన్ని బట్టి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ఖర్చు వస్తుంది. జిల్లా మొత్తం మీద ప్రస్తుతం కోతకొచ్చిన పంటలు 1340 ఎకరాల వరకు ఉన్నాయి. ఒక్క కోత కూడా కోయకుండా పంటలను అలాగే వదిలేసిన రైతులు 80 శాతం మేరకు ఉన్నారు. మిగిలిన వారు ఒకటి రెండు కోతలు చేసి బెంగుళూరు, చైన్నె మార్కెట్లకు తీసుకెళ్లారు. ఆక్కడ కొనేవారు లేక పూల బస్తాలను వదిలేసి వస్తున్న సంఘటనలు చోటు చేసుకొన్నాయి. -
వేటగాళ్ల ఉచ్చుకు వ్యవసాయకూలీ బలి
గుర్రంకొండ : వేటగాళ్ల ఉచ్చుకు వ్యవసాయకూలీ బలైన సంఘటన మండలంలోని చెర్లోపల్లె పంచాయతీ దిగువ కమ్మపల్లెలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పి. రమేష్‌నాయుడు(48) వ్యవసాయ కూలి పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఇంటి నుంచి పనిమీద బయటకు వెళ్లాడు. అయితే రాత్రిళ్లు ఇంటికి రాకపోయేసరికి శనివారం కుటుంబ సభ్యులు గ్రామానికి పక్కనే ఉన్న కొండలు, గుట్టల్లో గాలించారు. చివరగా వ్యవసాయ పొలాల వద్ద గాలిస్తుండగా ఎగువకమ్మపల్లె–కిలారివాండ్లపల్లె గ్రామాలకు మధ్యలో ఉన్న వ్యవసాయ పొలాల్లో విగతజీవుడుగా పడి ఉండటం గమనించారు. చేతులు, కాళ్లు మొత్తం కోసుకుపోయి విద్యుదాఘాతానికి గురైనట్లు ఆనవాళ్లు కనిపించాయి. దీనిపై ఆరా తీయగా అక్కడి సమీప పొలాల్లోనే కొంతమంది వేటగాళ్లు అడవి జంతువులను వేటాడడం కోసం విద్యుత్ తీగెలతో ఉచ్చులు పన్నుతున్నారని అక్కడి రైతులు పేర్కొన్నారు. దీంతో అడవి జంతువులకు కోసం పన్నిన విద్యుత్ తీగల్లో చిక్కుకొని రమేష్‌నాయుడు మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వాల్మీకిపురం సీఐ ప్రసాద్, ఎస్ఐ మధురామచంద్రుడు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వాల్మీకిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
●అధికారిక కార్యక్రమంలో అనధికార నేతలు
రాయచోటి: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంగా నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో అనధికార నేతలు కూర్చోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్ధనరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దీప్తి, జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు జగన్మోహన్రాజు, మంత్రి సోదరులు మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డి, తంబళ్లపల్లి టీడీపీ నాయకులు జయచంద్రారెడ్డి పాలుపంచుకున్నారు. అధికారిక కార్యక్రమంలో ఎలాంటి అధికారిక హోదా లేని నాయకులు పాలుపంచుకోవడం పట్ల కార్యక్రమాన్ని వీక్షించిన ప్రజలు అధికారం మనదైతే అంతా మనమే అన్న రీతిన నడుస్తామన్నట్లు ఉందని గుసగుసలు వినిపించాయి. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
కేవీపల్లె : మండలంలోని మహల్ క్రాస్ వద్ద ఆర్టీసీ బస్సు, పాల వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో శుక్రవారం రాత్రి ఇద్దరు దుర్మరణం చెందిన విషయం విదితమే. ఎస్ఐ చిన్నరెడ్డెప్ప కథనం మేరకు వివరాలిలావున్నాయి. చిత్తూరు జిల్లా గుడిపాలకు చెందిన డిల్లీబాబు (33), అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నీలకంఠరావుపేటకు చెందిన టి. వెంకటేష్ (23) ఇద్దరూ పూతలపట్టు తేజస్ పాల డెయిరీ వ్యాన్‌కు డ్రైవర్లుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి పాల వ్యాన్‌తో పీలేరు నుంచి కలకడ వైపు బయలుదేరారు. అయితే మార్గం మధ్యలో మహల్ క్రాస్ వద్ద రాయచోటి నుంచి చైన్నె వెలుతున్న ఆర్టీసీ బస్సు, పాలవ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో డిల్లీబాబు, వెంకటేష్ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అదృశ్యమైన హాస్టల్ విద్యార్థి అప్పగింత కేవీపల్లె : మండలంలోని గ్యారంపల్లె ఎస్సీ హాస్టల్ నుంచి అదృశ్యమైన విద్యార్థి మదనపల్లెలో ఉండగా గుర్తించి హాస్టల్‌కు అప్పగించారు. వివరాలిలావున్నాయి. గ్యారంపల్లె ఎస్సీ హాస్టల్లో ఉంటున్న 8వ తరగతి విద్యార్థి వికాష్ శుక్రవారం హాస్టల్ నుంచి బయటకు వెళ్లి కనబడలేదు. దీంతో ఆందోళన చెందిన హాస్టల్ సిబ్బంది బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. చుట్టూ పక్కల గాలించినా కనబడలేదు. విషయం తెలుసుకున్న సోషియల్ వెల్ఫేర్ డీడీ జయప్రకాష్ శనివారం హాస్టల్‌ను సందర్శించారు. ఇదే సమయంలో మదనపల్లెలో విద్యార్థి ఉన్నట్లు వారి బంధువులు గుర్తించి గ్యారంపల్లెకు తీసుకొచ్చి అప్పగించారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్థం కాకుండా జాగ్రత్తలు పాటించాలని సిబ్బందిని డీడీ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానటరింగ్ కమిటీ సభ్యుడు పాలకుంట శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కారు బోల్తా..చిన్నారి మృతి రామాపురం : మండల పరిధిలోని 40వ నెంబరు జాతీయ రహదారిలోని పాలన్నగారిపల్లె సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుర్రంకొండకు చెందిన పాలకొండరాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ03 బిజెడ్ 7792 కారులో పాలకొండకు వెళ్లి తిరుగు ప్రయాణంలో మార్గంలోని పాలన్నగారిపల్లె సమీపంలో కారుకు కుక్క అడ్డు రావడంతో తప్పించబోయి కారు బోల్తా కొట్టింది. కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా అందులో చిన్నారి దర్శత్సాయి (1) మృతి చెందగా, నాగేష్, మౌనిక, పూజిత, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. క్షత్రగాత్రులను 108లో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటసుధాకర్‌రెడ్డి తెలిపారు. పెట్రోల్‌తో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్ కలకడ : పాతకక్షలతో పెట్రోల్ పోసి నిప్పు అంటించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ బి.రామాంజనేయులు తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు .. పిబ్రవరి–7వతేదీన కలకడ మండలం, ఎర్రకోటపల్లె పంచాయతీ గొళ్ళపల్లెకు చెందిన చిన్నరెడ్డెప్ప కుమారుడు సుధాకర్‌పై అదే గ్రామానికి చెందిన చిన్నరెడ్డెప్ప కుమారుడు వేంనారాయణ పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు వేంనారాయణను శనివారం మండలంలోని కోన క్రాస్ వద్ద ఉన్నట్లు గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని వాల్మీకిపురం కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. నిందితున్ని అరెస్ట్ చేసిన వారిలో ఎస్ఐ రామాంజనేయులు తోపాటు పోలీసులు హెడ్‌కానిస్టేబుల్ హరిబాబు, రమేష్, పోలీసులు కరుణాకర్, రమేష్, తదితరులు పాల్గొన్నారు. ఘనంగా కురబ దేవర ఉత్సవాలు రామసముద్రం : మండలంలోని మట్లవారిపల్లి గ్రామంలో వెలసిన కురబ దేవర ఉత్సవాలలో భాగంగా శ్రీ ఉజ్జనేశ్వర, శ్రీ సిగరేశ్వర, బీరేశ్వర, భత్తేశ్వరస్వామి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. 13 ఏళ్ల తర్వాత అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు శనివారం గ్రామంలో దేవరెద్దును బ్యాండువాయిద్యాలు, పిల్లనగ్రోవి నడుమ ఇంటింటా తీసుకెళ్లి తొలిపూజలు ప్రారంభించారు. దేవరెద్దుకు ఇంటింటా భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ ఉత్సవాలకు ఆంధ్రా, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి గుడారాలు వేసుకున్నారు. ఆదివారం జరిగే దేవర్ల వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. -
నేడు ఒంటిమిట్టకు టీటీడీ చైర్మన్ రాక
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయానికి ఆదివారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రానున్నారు. ఈ విషయాన్ని ఆలయ డిప్యూటీ ఈఓ నటేష్‌బాబు శనివారం తెలిపారు. మహా సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. మూలవిరాట్‌ను దర్శించుకున్న అనంతరం వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి సీతారాముల కల్యాణోత్సవ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని నటేష్‌బాబు తెలిపారు. ప్రభుత్వ వైద్యుడు సస్పెన్షన్ పెనగలూరు: పెనగలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ నిమృచిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈమేరకు పెనగలూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఉత్తర్వులు వచ్చాయి. మరోక డాక్టర్ తౌసిఫ్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు సమాచారం. వైద్యులు సమయానికి విధులకు హాజరుకాకపోవడంతో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సస్పెండ్ చేశారు. నేడు జూడో జట్టు ఎంపికలు పెనగలూరు: ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 9 గంటలకు పెనగలూరు మండలం, ఇన్ ఫ్యాంట్ జీసస్ స్కూల్ ఆవరణలో జిల్లాస్థాయి జూడో జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా జూడో కార్యదర్శి వెంకటేష్ తెలిపారు. జూని యర్ బాల బాలికల విభాగానికి 2005 నుంచి 2010 లోపు జన్మించిన వారు మాత్రమే అర్హులన్నారు. ఇందులో ఎంపికై న వారు విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియంలో ఈనెల 15, 16వ తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. వివరాలకు 98482 67126 నంబర్లో సంప్రదించాలని కోరారు. నేడు అవగాహన సదస్సు కడప కల్చరల్: భారత జాతీయ కళాసంస్కృతి వారసత్వ పరిరక్షణ సంస్థ (ఇన్ టాక్ )ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు కడప ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో సిరి ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఇన్ టాక్ కన్వీనర్ లయన్ కె.చిన్నపరెడ్డి వెల్లడించారు. ప్రముఖ ఆహార ఆరోగ్య శాస్త్రవేత్త పద్మశ్రీ డాక్టర్ ఖాదర్ వలీ ప్రధాన వక్తగా హాజరై ,చిరుధాన్యాలతో కలిగే ప్రయోజనాలపై సంపూర్ణ అవగాహన కల్పిస్తారని ఆయన వివరించారు. కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తదితరులు అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు .ఈ సమావేశంలో కడప ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. లోక్ అదాలత్‌లో 240 కేసుల పరిష్కారం రాయచోటి టౌన్: రాయచోటి కోర్టులో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు.మొత్తం 240 కేసులను పరిష్కరించారు. కక్షిదారులకు రూ.1,86,40.095లు అందజేసినట్లు రాయ చోటి జిల్లా 5వ అదనపు న్యాయమూర్తి కృష్ణన్‌కుట్టి తెలిపారు. రాయచోటి డివిజన్లోని అన్ని పోలీసు స్టేషన్ల నుంచి పోలీసు అధికారులు వారి పరిధిలోని కేసుల పరిష్కారం కోసం లోక్‌అదాలత్‌కు వచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఈ. ప్రసూన న్యాయవాదులు పాల్గొన్నారు. రాష్ట్ర అనుబంధ విభాగాల్లో నియామకాలు కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు దిగువ పేర్కొన్న అన్నమయ్య జిల్లాకు చెందిన నాయకులను రాష్ట్ర అనుబంధ విభాగాలలో వివిధ హోదాల్లో నియమిస్తున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా రేవతి బీరంజి, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శిగా జి. చంద్రమౌళి, రాష్ట్ర మేధావుల పోరం కార్యదర్శిగా వీఎస్ రెడ్డిలను నియమించారు. వైఎస్సార్ జిల్లాలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ జిల్లాకు చెందిన పలువురిని రాష్ట్ర అనుబంధ విభాగాలలో వివిధ హోదాలలో నియమిస్తున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర మహిళా విభాగం జాయింట్ సెక్రటరీలుగా జి. క్రిష్ణవేణిరెడ్డి, మూలే సరస్వతి దేవి, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శులుగా ఎం. రామమోహన్‌రెడ్డి, ఎస్. వీర గంగుల వీర ఆంజనేయులు, కార్యదర్శిగా రాయల్‌బాబు, రాష్ట్ర మేధావుల ఫోరం ప్రధాన కార్యదర్శిగా వీవీ సుబ్రమణ్యం రావు, కార్యదర్శులుగా పోచిమరెడ్డి సుబ్బారెడ్డి, ఓ. వేణుగోపాల్లను నియమించారు. -
ఆర్టీసీ బస్సును ఢీక్నొన్న పాల వ్యాన్
ఫ్లాష్..ఫ్లాష్ కలకడ : రాయచోటి నుంచి చెన్న్నెకి వెళ్తున్న ఏపీ 04జడ్ 0384 బస్సును పీలేరు నుంచి రాయచోటి వైపు వస్తున్న పాల వ్యాన్ శుక్రవారం అర్ధారాత్రి ఢీకొంది. పాల వ్యాన్‌లో ప్రమాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా.. చిత్తూరు– కర్నూలు జాతీయరహదారిపై కేవీపల్లి మండలం మహల్ క్రాస్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేవీపల్లి ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాలను పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియరాలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇద్దరు మృతి -
బ్రెడ్డు తిని ఐదుగురు విద్యార్థులకు అస్వస్థత
తంబళ్లపల్లె : మండలంలోని కోటకొండ యూపీ పాఠశాలలో ఆరవ తరగతికి చెందిన ఐదుగురు విద్యార్థులు శుక్రవారం ఓ దుకాణంలో బ్రెడ్డు కొని తినడంతో అస్వస్థతకు గురయ్యారు. వైద్యాధికారుల కథనం మేరకు వివరాలు.. కోటకొండ యూపీ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థులు అరవింద్ (11), జగదీష్ (11) బన్నీ (12), సంధ్య(12), అశ్విని(11) పాఠశాల బయట దుకాణంలో బ్రెడ్డు కొని తిన్నారు. కొద్దిసేపటికి అస్వస్థకు గురై వాంతులు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న హెచ్ఎం లలితమ్మ, ఉపాధ్యాయులు పిల్లలను ఆరోగ్య ఉప కేంద్రానికి తీసుకెళ్లారు. ఎఎన్ఎం గంగులమ్మ, ఆశా కార్యకర్త నారాయణలు విషయాన్ని కోసువారిపల్లె మెడికల్ ఆఫీసర్ అనుపమకు తెలియజేశారు. వైద్యాధికారి మునికుమార్, ఎంఈఓ త్యాగరాజు కోటకొండకు పరుగులు తీశారు. విషయాన్ని వైద్యాధికారి అనుపమ డీఎంహెచ్ఓ కొండయ్యకు తెలియజేశారు. డిఎంహెచ్ఓ పాఠశాలకు చేరుకుని అస్వస్థతకు గురైన పిల్లలతో మాట్లాడారు. బయట తినుబండారాలు తినకూడదని సూచించారు. చికిత్స తరువాత విద్యార్థులు కోలుకున్నారు. -
విద్యుత్ షాక్‌తో యువకుడికి తీవ్ర గాయాలు
బి.కొత్తకోట : చెట్టుపైకి ఎక్కిన యువకుడ్ని విద్యుత్ షాక్ కొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం బి.కొత్తకోట మండలం శంకరాపురం వద్ద జరిగింది. స్థానికులు, బాధితుల కథనం మేరకు వివరాలు. మండలంలోని బడికాయలపల్లి గ్రామం అప్పినాయునిపల్లికి చెందిన రవి స్థానిక ఇందిమ్మకాలనీలో నివాసం ఉంటున్నాడు. రైతుల పోలాల్లో కొత్తిమీర కొనుగోలు చేసి వ్యాపారం చేసుకొంటూ జీవిస్తున్నాడు. బీరంగి గ్రామం కురప్పల్లిలో కొత్తిమీర కోనుగోలు చేయడంతో పొలం నుంచి తీసుకొచ్చేందుకు రవి కుమారుడు పి.శ్రీకాంత్ (24) వెళ్లాడు. కొత్తమీర పొలం నుంచి తీశాక ఆకు కోసం శంకరాపురం వద్ద రోడ్డు పక్కన ఉన్న చెట్టుపైకి శ్రీకాంత్ ఎక్కాడు. చెట్టు మధ్యలోంచి వెళ్తున్న విద్యుత్ సరఫరా తీగలు కనిపించలేదు. కాలికి చెప్పులతోనే పైకి ఎక్కడం తర్వాత షాక్ తగలినా ప్రమాదం బారిన పడలేదు. చెప్పులు జారిపడిపోవడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. చెట్టుపై నుంచి కొమ్మల మధ్యలో పడుతూ కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతను ఫోన్లో జరిగిన ఘటనను తండ్రికి చెప్పగా.. కేకలు విన్న ఓ మహిళ శంకరాపురంలోకి వెళ్లి స్థానికులను తీసుకొచ్చింది. గమనించిన స్థానికులు సపర్యలు చేశాక 108 అంబులెన్స్‌లో స్థానిక సీహెచ్‌సీకి తరలించగా అక్కడి నుంచి మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. శ్రీకాంత్ కుడిచేతి మణికట్టు తొలగించాల్సి వస్తుందని, కాలి వేళ్లను తొలగించాలని వైద్యులు చెప్పినట్టు బాధితుడి తండ్రి రవి ఆవేదన వ్యక్తం చేశాడు. నిరుపేదలమైన తాము వైద్యం కూడా చేయించలేని పరిస్థితి ఉందని, ఆదుకోవాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పాగొండ ఖలీల్ ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై బాధితున్ని ఆదుకుంటామని వారు భరోసా ఇచ్చారని ఖలీల్ తెలిపారు. ఆదుకుంటామని ఎంపీ, ఎమ్మెల్యే భరోసా -
వివాహితపై అత్యాచారం
మదనపల్లె : సమాజంలో మహిళల ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ఓవైపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే సందర్భంలో.... మహిళల భద్రతపై కూటమి ప్రభుత్వం వైఫల్యాలకు నిదర్శనంగా, సభ్య సమాజం తలదించుకునేలా ఓ వివాహితను బెదిరించి ఇద్దరు నిందితులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన శుక్రవారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలంలో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వివరాలు బాధితురాలు తెలిపిన మేరకు.... నిమ్మనపల్లె మండలం, తవళం పంచాయతి నాయుని వారిపల్లికి చెందిన ఓ వివాహిత (26) గత నెల 28 వ తేదీన సాయంత్రం పాలు పోయడానికి సమీప గ్రామమైన నల్లంవారి పల్లికి కాలి నడకన వెళ్ళింది. తిరిగి ఇంటికి వస్తుండగా దారి కాచిన నల్లం వారిపల్లెకు చెందిన నాగేంద్ర, సురేంద్ర అనే ఇద్దరు యువకులు సదరు మహిళను చెట్ల పొదల్లోకి లాక్కునివెళ్లి ఒకరి తర్వాత ఒకరు బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం విషయం బయటపడకుండా ఆమెను చంపాలనే ఉద్దేశంతో ఒక బావిలోకి తోసే ప్రయత్నం చేయగా, నిందితులను బాధితురాలు ప్రాణాలు దక్కించుకుంది. అయితే అత్యాచార ఘటనకు సంబంధించి సమాచారం ఎవరికై నా చెబితే తనని, తన భర్తను చంపేస్తామని నిందితులు బెదిరించారు. దీంతో భయపడిన వివాహిత విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపకుండా మిన్నకుండిపోయింది. ఈ విషయమై తీవ్రంగా మధనపడుతూ పక్కింటి మహిళకు జరిగిన దారుణాన్ని వివరించింది. ఆమె కుటుంబ సభ్యులకు తెలపడంతో అత్యాచార ఘటన వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ తిప్పేస్వామి గ్రామానికి చేరుకొని బాధితురాలిని విచారించి వైద్యపరీక్షల నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నింధితులపై అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. భర్తను చంపేస్తామని బెదిరించిన నిందితులు ఆలస్యంగా వెలుగులోకి. కేసు నమోదు చేసిన నిమ్మనపల్లె పోలీసులు -
అగ్ని ప్రమాదంలో మామిడి, అల్లనేరేడు తోటలు దగ్ధం
నిమ్మనపల్లె : గుర్తు తెలియని వ్యక్తులు బీడు పొలాల్లో నిప్పు పెట్టడంతో చెలరేగిన మంటలు భారీ అగ్ని ప్ర మాదానికి కారణమయ్యాయి. పూత దశలోని మామి డి తోటలు, అల్ల నేరేడు చెట్లు, నీటి పైపులు, డ్రిప్పు పైపులు, కేబుల్ వైర్లు అగ్నికి ఆహుతై రైతులు తీవ్రంగా నష్టపోయారు. శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాద వివరాలు ఇలా..మండలంలోని బోడుమల్లయ్యగారి పల్లి సమీపంలో ఉన్న ఓబులేసుని కొండ వద్ద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బీడు భూముల్లో నిప్పు అంటించారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి చుట్టూ వ్యాపించాయి. రైతులు నరేంద్ర, ఖాసిం ఖాన్, భావాఖాన్, నిజాముద్దీన్ మంటలను గుర్తించారు. కొంతమంది రైతుల సాయంతో మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. ఓవైపు మంటల ఆర్పుతున్నా, మరోవైపు గాలి ప్రభావానికి వేగంగా మంటలు వ్యాప్తి చెంది,రైతుల శ్రమ వృథా అయింది. వాల్మీకిపురం ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. అగ్ని ప్రమాదంలో రైతు నరేంద్రకు చెందిన ఐదు ఎకరాల్లో మామిడి తోట, 45 అల నేరేడు చెట్లు నూరి మీటర్ల నీటి పైప్ లైన్, 100మీటర్ల కేబుల్ వైర్, మరో రైతు బావా ఖాన్ కు చెందిన పూత దశలో ఉన్న ఏడు ఎకరాల మామిడి తోట పూర్తిగా దెబ్బతింది. మొత్తంగా సుమారు 12 ఎకరాల్లోని మామిడి తోట, మామిడి తోటకు చుట్టూ వేసిన కంచె, మంటల్లో కాలిపోయింది. కంచె కోసం ఏర్పాటు చేసిన స్తంభాలు దెబ్బతిన్నాయి. పూత దశలోని మామిడి చెట్లు అగ్ని ప్రమాదానికి గురై కాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సమాచారం అందుకున్న తహసిల్దార్ అమర్నాథ్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రమాదంలో నష్టం వివరాలను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని రెవిన్యూ అధికారులు తెలిపారు. బీడు పొలాల్లో నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు 12 ఎకరాల్లోని మామిడి, 45 అల్లనేరేడు చెట్లు దగ్ధం -
డ్వాక్రా నిధులు మాయం
– రూ.12లక్షలు స్వాహా చేసిన సంఘం లీడర్ మదనపల్లె : డ్వాక్రా సంఘానికి లీడర్‌గా వ్యవహరిస్తూ గ్రూప్‌కు సంబంధించిన నిధులు రూ.12లక్షలు స్వాహా చేసిందని గ్రూప్ సభ్యులు తాలూకా పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. పట్టణంలోని ఈశ్వరమ్మకాలనీలో రాజరాజేశ్వరి డ్వాక్రా సంఘం ఉంది. అందులో 10మంది సభ్యులు ఉండగా, గ్రూప్‌లీడర్‌గా కే.రాధ వ్యవహరించేది. ఈ క్రమంలో సభ్యులు గ్రూప్‌కు సంబంధించిన డబ్బులు చెల్లించగా, వాటిని స్వప్రయోజనాలకు వాడుకుంది. మరో గ్రూపు సభ్యురాలు లక్ష్మీదేవి వద్ద ఉంచిన రూ.1లక్ష20వేలుతో కలిపి మొత్తంగా రూ.12లక్షలు స్వాహా చేసి ఉడాయించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంఘమిత్ర వాణి పూర్తి సహాయసహకారాలు అందించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అందుకున్న తాలూకా సీఐ కళావెంకటరమణ స్థానికంగా విచారించి కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఫిర్యాదుచేసిన వారిలో గ్రూపు సభ్యులు పద్మ, నిర్మల, లలిత, లక్ష్మీదేవి, చంద్రకళ, రెడ్డిరాణి ఉన్నారు. వేడినీళ్లు పడి చిన్నారికి గాయాలు మదనపల్లె : వేడినీళ్లు మీద పడి చిన్నారి గాయపడిన సంఘటన కురబలకోట మండలంలో శుక్రవారం జరిగింది. సర్కార్తోపునకు చెందిన అస్రా అంజుమ్(3) ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వేడినీళ్లు మీద పడవేసుకుంది. నీటివేడికి చిన్నారి తీవ్రంగా గాయపడగా, కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. విద్యాప్రమాణాల పెంపునకు కృషిచేయాలి – ఉన్నతవిద్యామండలి అకడమిక్ ఆఫీసర్ శ్రీరంగం మాథ్యూ మదనపల్లె : రాష్ట్రంలోని అటానమస్ డిగ్రీ కళాశాలల్లో విద్యాప్రమాణాల పెంపుకు కృషి చేయాలని విజయవాడ ఉన్నత విద్యామండలి అకడమిక్ ఆఫీసర్ శ్రీరంగం మాథ్యూ అన్నారు. పట్టణంలోని శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో జరుగుతున్న రెండురోజుల వర్క్‌షాప్‌కు శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశంలో లివరేజింగ్ అటానమీ, బోర్డ్ ఆఫ్ స్టడీస్, అకడమిక్ కౌన్సిల్, గవర్నింగ్ బాడీ, ఫైనాన్స్ కమిటీల గురించి తెలియజేశారు. అటానమస్ కళాశాలకు ఇండస్ట్రీకి అనుగుణంగా సిలబస్‌ను మార్చుకునే వెసలుబాటు ఉందన్నారు. స్టాండర్స్‌ను ఎంచుకోవాలన్నారు. ఇది విద్యార్థికి ఎంతవరకు ఉపయోగపడుతుందనే అంశంపై శ్రద్ధ పెట్టాలన్నారు. స్కిల్ ఓరియంటెడ్ కోర్సులను పెట్టాలన్నారు. టీచింగ్ మెథడాలజీ, ఎవాల్యుయేషన్‌పై తెలియజేశారు. విద్యార్థికి పరీక్షలు జరిగిన తర్వాత ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఫలితాలను ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ డాక్టర్.రాటకొండ గురుప్రసాద్, ప్రిన్సిపాల్ సురభి రమాదేవి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ముత్యపు పందిరి వాహనంపై శ్రీలక్ష్మీనరసింహుడు
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ముత్యపు పందిరి వాహనంపై ఘనంగా ఊరేగించారు. స్వామివారి బ్రహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయాన్నే స్వామివార్లకు తిరుచ్చి, శుద్ధి తోమాలసేవ, ఏకాంతసేవలు నిర్వహించారు. స్నపన తిరుమంజనం కావించి ఊంజల్‌సేవ నిర్వహించారు. వాహన మండపంలో స్వామివారి వాహనాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. అనంతరం స్వామివార్లను హనుమంత వాహనంపై కొలువు దీర్చి గ్రామపురవీధుల గుండా ఊరేగించారు. కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు స్వాములు పాల్గొన్నారు. -
సారా నిర్మూలించి భవిష్యత్తుకు బంగారుబాట వేద్దాం
కేవీపల్లె : నాటుసారాను సమూలంగా నిర్మూలించి భవిష్యత్తు తరాలకు బంగారు బాట వేద్దామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. శుక్రవారం మండలంలోని జిల్లేళ్లమందలో జిల్లా ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో నవోదయం 2.0 కార్యక్రమం నిర్వహించి నాటు సారా నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సారా తయారు చేసేవారు, తయారీకి సహకరించిన వారిపై పీడీ యాక్టు అమలు చేస్తామని హెచ్చరించారు. నాటు సారా వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని, భవిష్యత్తు తరాలు నష్టపోతున్నాయని తెలిపారు. నాటుసారాను అరికట్టి ప్రజలందరికీ ఉజ్వల భవిష్యత్తువైపు నడిపించేందుకు ప్రబుత్వం చర్యలు చేపట్టినట్లు చెప్పారు. నాటుసారా తయారు చేయడం ఆపేసిన వారికి ఆర్థికంగా రుణాలు అందించడం, వ్యాపారాలను ప్రారంభించేందుకు సహాయాన్ని అందించడం లాంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎక్కువ మొత్తంలో బెల్లం అమ్మి నాటుసారా తయారీకి సహకరిస్తే వారిమీద పీడీ చట్టాన్ని అమలు చేస్తామని హెచ్చరించారు. నాటు సారా తయారికి ఏ విధమైన సహాయ సహకరాలు అందించినా చర్యలు తప్పవన్నారు. నాటు సారా అమ్మకాలు, రవాణాపై టోల్ ఫ్రీనెంబర్ 14405కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. నాటుసారా నిర్మూలనకు కట్టుబడి ఉంటామని అందరితో కలసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం గ్రామస్తుల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషన్ జయరాజ్, అసిస్టెంట్ కమీషనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ 2018లో నవోదయం 1.0 కార్యక్రమాన్ని ఒంగోలు లో ప్రారంభించడం జరిగిందన్నారు. మళ్లీ ప్రస్తుతం ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఏఎస్ పీ జోగేందర్, సీఐ వెంకటసుబ్బారెడ్డి, ఎంపీపీ ఈశ్వరమ్మ, సర్పంచ్‌లు కృష్ణవేణి, అమ్ములు పాల్గొన్నారు. -
వృద్ధుడు అనుమానాస్పద మృతి
పీలేరురూరల్ : అనుమానాస్పద స్థితిలో వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండలంలోని రేగళ్లులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. మండలంలోని రేగళ్లు పంచాయతీ నగిరికి చెందిన డి. కృష్ణయ్య (64) గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో శుక్రవారం మృతదేహం లక్ష్యమైంది. పీలేరు పట్టణం జర్నలిస్టు కాలనీలో కాపురం ఉంటూ జీవనం సాగిస్తున్న ఆయన గురువారం స్వగ్రామానికి వెళ్లి చౌకదకాణంలో బియ్యం తీసుకెళ్లాడు. అనంతరం ఇంటి నుంచి వెళ్లి కనబడలేదు. శుక్రవారం పొలాల వద్ద కృష్ణయ్య మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. వివాహిత ఆత్మహత్యాయత్నం మదనపల్లె : కుటుంబ సమస్యలతో వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం కురబలకోట మండలంలో చోటుచేసుకుంది. గట్టు గ్రామానికి చెందిన అశోక్ భార్య భార్గవి కుటుంబసమస్యలతో ఇంటివద్దే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబసభ్యులు బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగ వైద్యులు చికిత్స అందించినా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. తండ్రి, కొడుకులపై దాడి మదనపల్లె : ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు తండ్రి, కొడుకులపై దాడిచేసిన ఘటన గురువారం రాత్రి మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని శేష్‌మహల్ సమీపంలో నివసిస్తున్న జాషువా(50) అదే ప్రాంతంలో ఉన్న వెంకటరమణకు స్థలం కొనుగోలు కోసం మూడు సంవత్సరాల క్రితం మూడులక్షల రూపాయలు ఇచ్చాడు. అయితే మూడేళ్లుగా స్థలం ఇప్పించకపోగా, డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో గురువారం రాత్రి జాషువా నగదు తిరిగి ఇవ్వాల్సిందిగా వెంకటరమణను నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి వెంకటరమణ, జాషువాను కొట్టాడు. దీంతో జాషువా తన కుమారుడు భరత్(28), జోసెఫ్(22), మహేష్(20) లకు సమాచారం ఇచ్చి సంఘటనాస్థలానికి పిలిపించాడు. దీంతో వెంకటరమణ సైతం తన మనుష్యులను అక్కడకు రప్పించి జాషువా, అతడి కుమారులపై దాడికి పాల్పడ్డాడు. వన్‌టౌన్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నట్లు సీఐ ఎరీషావలీ తెలిపారు. సౌమ్యనాథుడి హుండీ ఆదాయం లెక్కింపు నందలూరు : జిల్లాలో ప్రసిద్ధిగాంచిన నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. రూ. 1,94,302 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్ పేర్కొన్నారు. 24 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించినట్లు చెప్పారు. మొత్తం డబ్బును ఆలయ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సూపరిటెండెంట్ హనుమంతయ్య, టీటీడీ విజిలెన్సు అధికారి రమణారెడ్డి, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
ఒంటిమిట్టలో శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ
ఒంటిమిట్ట : ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో తిరుమల–తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో టీటీడీ పాంచరాత్ర ఆగమన సలహాదారు రాజేష్ కుమార్ వేదపండితుల బృందం మహా సంప్రోక్షణ మహోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రెండవరోజు శుక్రవారం ఉదయం 8 గంటల నుండి భగవత్పుణ్యాహము, చతుస్థానార్చనము, సహస్ర కలశవాహన, రామ తారక హోమం, శ్రీమద్రామాయణ హోమం, పవమాన, పంచసూక్త హోమములు, విమాన గోపుర ఛాయ స్నాపణము, పరివార హోమం, పూర్ణాహుతి నివేదన, బలి, నీరాజనము, సాత్తుమొర చేయగా సాయంత్రం 5.30 గంటల నుండి సామూహిక విష్ణు సహస్త్రనామ పారాయణం, చతుస్థానార్చనము, మూర్తి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. అలరించిన రామాయణ నాట్య ప్రదర్శన : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి పుణ్యక్షేత్రంలో మహా సంప్రోక్షణ మహోత్సవాలలో బాగంగా రెండవరోజు శుక్రవారం రామాయణ నాటి ప్రదర్శన అందరినీ అలరించింది. తిరుపతికి చెందిన శ్రీ వెంకటేశ్వర నాట్య కళాబృందం చేత వారికి స్వయంగా టీటీడీ పంచరాత్ర ఆగమన సలహాదారు రాజేష్ కుమార్ అభినందనలు తెలిపి, ఊంజల్ సేవలో ఉన్న ఉత్సవ మూర్తులకు హారతులు ఇచ్చారు. ఒక నాట్య ప్రదర్శనే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కోలాట బృందాలు కూడా భక్తులను అలరించాయి. కార్యక్రంమలో అర్చకులు శ్రావణ్ కుమార్, ఆలయ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు. -
● ’అభ్యాగుల పాలిట ‘స్వాతి’కిరణం
మదనపల్లె సిటీ: తనకు మాత్రమే ఎందుకు కష్టం వచ్చింది? అని ఆలోచించే బదులు నాలా మరెంత మందికి ఈ కష్టం వచ్చిందో.. వాళ్ల పరిస్థితి ఏమిటి అని ఆలోచించే మనస్తతత్వం అతి కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అలాంటి రెండో కోవకు చెందుతుంది డాక్టర్ శంఖారపు స్వాతి. ఉద్యోగ,ఉపాధి కోసం తిరగని చోటంటూ లేదు. దీంతో తీవ్ర నిరాశ నిస్పహులకు లోనైనా నేడు ఆమె వేలాది మందికి నైపుణ్యాలను అందించి వారికి దారి చూపిస్తోంది. మదనపల్లె పట్టణానికి చెందిన డాక్టర్ స్వాతి తెలుగుభాషలో పీహెచ్డీ పూర్తి చేసిన తర్వాత పెద్దలు నిశ్చయించిన వారితో పెళ్లి చేసుకుని బెంగళూరులో అడుగుపెట్టింది. అంతా బాగానే ఉందనుకునే సమయానికి భర్తకు వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు వచ్చాయి. దీంతో మరోదారి లేక డిగ్రీ పట్టా చేతపట్టి ఉద్యోగ వేటలో పడిన ఆమెకు ఎక్కడకెళ్లినా నిరాశే ఎదురయ్యేది. దీంతో మదనపల్లె పట్టణానికి చేరుకున్నారు. డబ్బు చెల్లించి కోర్సులు నేర్చుకునే స్థోమత లేక టైలరింగ్,కుట్లు, అల్లికలు, శారీరోలింగ్, ఫ్రాబిక్ పెయింటింగ్,ఎంబ్రాడయిరీ వంటి వాటిని ఆన్లైన్ ద్వారా సొంతంగా నేర్చుకుంటూ ప్రతిభను పెంచుకున్నారు.ఆకట్టుకునే డిజైన్లతో వస్త్రాలను కుట్టించేది. వచ్చిన డబ్బుతో బోటిక్, టైలరింగ్ షాపులను ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఒంటరి మహిళలు, వితంతువులు,సమాజంలో పడే కష్టాలను గమనించింది. అలాంటి వారికి చేయూత ఇవ్వాలన్న లక్ష్యంతో ధాత్రి ఫౌండేషన్ ప్రారంభించింది. తొమ్మిది మందితో ప్రారంభమై నేడు వెయ్యి మందికిపైగా మహిళలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. రోగులకు, రైతులకు, విద్యార్థులకు, మహిళలకు చేయూతనిచ్చి వారికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ కల్పించి సూక్ష్మ రుణాల ద్వారా ఉపాధి కల్పించి వారి వికాసానికి తోడ్పతున్నారు. -
No Headline
తల్లిదండ్రులు ప్రోత్సహిస్తుండటంతో రాజంపేట పట్టణం గంగిరెడ్డిపాలెంకు చెందిన చిత్తూరు రుతిక రేణుక వాలీబాల్ క్రీడలో సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు రుతిక రేణుక ఏడుసార్లు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ఆయా పోటీల్లో సత్తా చాటింది. ఆమె రాష్ట్ర జట్టుకు వైస్ కెప్టెన్ గా కూడా వ్యవహరిస్తోంది. ఒక సారి అల్ ఇండియా గేమ్స్, పీఎం కప్ పోటీలకు ఎంపికై ంది. అలాగే మూడు మార్లు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొని రాణించింది. కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తే మహిళలు ఏ రంగంలో అయినా రాణించగలరని రుతిక రేణుక చెబుతోంది. క్రీడల్లో రాణిస్తూ.. -
No Headline
కమలాపురం: ప్రస్తుత సమాజంలో రక్త సంబంధీకుల మృతదేహాలను చూసేందుకు జంకుతున్న తరుణంలో నేను సైతం అంటూ అనాథ మృత దేహాలకు అంత్య క్రియలు చేసేందుకు ముందుకు వస్తున్నారు కమలాపురం పట్టణం, కె. అప్పాయపల్లెకు చెందిన పాల మేరీ సునీత... కరోనా సమయంలో ఎవరైనా మృతి చెందితే సొంత కుటుంబ సభ్యులే చూసేందుకు ముందుకు రాని సందర్భాల్లో సునీత తన భర్త భూపాళం వెంకట లక్ష్మణ్ కుమార్ ప్రోత్సాహంతో అభి ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ విజయ్ బాబు సహకారంతో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ధైర్యంగా ముందుకు వచ్చారు. కరోనా కష్టకాలంలో 8 మంది మహిళల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. విజయ్ బాబు స్థాపించిన ట్రస్ట్‌లో 2021లో సభ్యురాలిగా చేరారు. ఎక్కడైనా అనాథమృత దేహాలు ఉన్నాయనే సమాచారం వస్తే సునీత తన భర్త లక్ష్మణ్, సోదరుడు కరుణాకర్, ట్రస్ట్ చైర్మన్ విజయ్‌బాబుతో కలసి అక్కడికి చేరుకుని మృతి చెందిన వారి మతాను సారం అంత్యక్రియలు నిర్వహిస్తూ, మానవత్వం చాటుతూ ముందుకు సాగుతున్నారు. ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇప్పటి వరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మృతి చెందిన 42 మంది పేద, అనాధ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఎక్కడైనా అనాథ మృతదేహాలు ఉంటే తమకు సమాచారం ఇస్తే వచ్చి ఉచితంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని చెబతోంది పాల మేరీ సునీత. మేరీ.. సేవా నారీ -
నేడు పాఠశాలలకు సెలవు
రాయచోటి టౌన్: మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు డీఈఓ డాక్టర్ సుబ్రహ్మణ్యం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండో శనివారం అయినా పాఠశాలల పనిదినాలు తక్కువగా ఉండటం వల్ల తరగతులు నిర్వహించాలని నిర్ణయించామని, అయితే మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఉన్నతాధికారులు ఈ నెల 8 వతేదీ సెలవుగా ప్రకటించారని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు ఈ విషయాన్ని గ్రహించాలని కోరారు. 12న వేలం పాట కురబలకోట: జిల్లాలో ప్రతిష్టాత్మకమైన మండలంలోని అంగళ్లు టమాటా మార్కెట్, గొర్రెల సంతతో పాటు కూరగాయల సంత గేటు వేలం పాటలు ఈనెల 12న ఉదయం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద జరుగుతాయి. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ పోరెడ్డి విశ్వారెడ్డి, గ్రామ కార్యదర్సి టి. ఉదయ్‌కుమార్ తెలిపారు. టమాటా మార్కెట్, గొర్రెల సంత గేటు వేలం పాటల్లో పాల్గొనదలచిన వారు ముందుగా రూ.5 లక్షల చొప్పున ఽడిపాజిట్టు చెల్లించాలన్నారు. నూతన నియామకం మదనపల్లె సిటీ: జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం సమన్వయకర్తగా మదనపల్లెకు చెందిన పేస్ స్వచ్చంద సంస్థ డైరెక్టర్ వి.ఎస్.రెడ్డిని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి నియమించారు. వీ.ఎస్.రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని వినియోగదారులను చైతన్యపరిచి సంఘటితం చేయడానికి కృషి చేస్తానన్నారు. ప్రణాళికబద్ధంగా కార్యక్రమాలు చేస్తామన్నారు. త్వరలోనే మండల వినియోగదారుల సమాచార కేంద్రాలను అధికారుల సహకారంతో నియమించడానికి కృషి చేస్తానన్నారు. నేడు, రేపు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సేవలు మదనపల్లె: ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా రెవెన్యూ సంపదలో భాగంగా శని, ఆది సెలవురోజుల్లో రిజిస్ట్రేషన్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సబ్ రిజిస్ట్రార్ గురుస్వామి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...రిజిస్ట్రేషన్స్ ఐజీ, డీఐజీ, డీఆర్ ఉత్తర్వుల మేరకు శని, ఆదివారాల్లో హాలిడే రిజిస్ట్రేషన్స్ చేయాలని ఉత్తర్వులు అందాయన్నారు. జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు శని, ఆది రెండురోజులు అందుబాటులో ఉంటాయని, ప్రజలు రిజిస్ట్రేషన్ సేవలను వినియోగించుకోవాలన్నారు. అయితే ఇందుకోసం అదనంగా రూ.5,000 హాలిడే రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. రాయచోటి పరిపాలన కేంద్రంగా జిల్లా కొనసాగుతుంది రాయచోటి టౌన్: రాయచోటి పరిపాలన కేంద్రంగా అన్నమయ్య జిల్లా కొనసాగుతుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం శాసన మండలిలో ఎమ్మెల్సీ రాంభూపాల్‌రెడ్డి జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదన ఏమైనా ఉందా.. ఉంటే ఎలాంటి ప్రతిపాదనలు ఉన్నాయి.. ప్రక్రియను ఎప్పటిలోగా పూర్తి చేస్తారనే ప్రశ్నలకు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానమిచ్చారని చెప్పారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదన లు ఏమీ లేవని పేర్కొన్నారని తెలిపారు. కాబట్టి రాయచోటి జిల్లా కేంద్రంగానే ఉంటుందని, అందులో ఎలాంటి మార్పులు ఉండవని, వీటిపై వస్తున్న వదంతులు నమ్మొద్దని స్పష్టం చేశారు. మెగా డీఎస్సీకి ఆన్లైన్లో ఉచిత శిక్షణ రాయచోటి జగదాంబసెంటర్: మెగా డీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆన్లైన్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ అధికారి సురేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ పొందేందుకు బీసీ, ఈబీసీ కేటగిరీలకు చెందిన అర్హులైన అభ్యర్థులు ఈ నెల 10 నుంచి దరఖాస్తు చేసుకోవాలన్నారు. టెట్ అర్హత సాధించిన అభ్యర్థులు సొంత జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హులైన వారు రాయచోటిలోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయం( గిరిజన బాలుర పాఠశాల వెనుక, రాజంపేట రోడ్డు)లో దరఖాస్తులు పొంది అక్కడే సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు రాయచోటిలోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. -
No Headline
పీలేరు: పీలేరు పట్టణానికి చెందిన మాజీ సైనికుడు టి. ప్రభాకర్‌రెడ్డి కుమార్తె టి. హోత్రిశ్రీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. చిన్నతనం నుంచే బ్మాడింటన్పై పట్టు సాధించి అనేక విజయాలు సొంతం చేసుకుంది. తండ్రి ప్రోత్సాహంతో గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి క్రీడాకారిణిగా గుర్తింపు పొందుతోంది. ఆమె తండ్రి ప్రభాకర్‌రెడ్డి జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. తన ఆరవ ఏటలోనే బ్యాడ్మింటన్‌లో అడుగుపెట్టిన హోత్రిశ్రీ 2017లో గోపిచంద్ అకాడమీలో జరిగిన జాతీయ స్థాయి సబ్ జూనియర్ పోటీల్లో పతకం గెలుపొందింది. రాజమండ్రిలో అండర్–15 విభాగంలో రాష్ట్ర చాంపియన్‌గా నిలిచింది. 2018లో నెల్లూరులో అండర్–14 విభాగంలో మినీ బ్యాడ్మింటన్ చాంపియన్‌గా నిలిచింది.2019లో ప్రొద్దుటూరు, బెంగళూరులో సౌత్‌జోన్ పోటీల్లో పాల్గొని ప్రశంసాపత్రాలను అందుకుంది. 2019లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అబ్దుల్ కలాం పురస్కారాన్ని స్వీకరించింది.2021లో బెంగళూరులో జరిగిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ చాంపియన్‌షిప్ పోటీల్లో విజేతగా నిలిచింది. ● 2024 సెప్టెంబరులో కడప జేఎన్టీయూ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబరచి చైన్నెలో జరిగే సౌత్‌జోన్ పోటీలకు ఎంపికై నంది. ప్రస్తుతం కేఎంఎం ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతోంది. అంతర్జాతీయ స్థాయి బ్మాడ్మింటన్ క్రీడాకారిణిగా రాణించాలన్నదే తన లక్ష్యమని హోత్రిశ్రీ చెబుతోంది. బ్యాడ్మింటన్ రాకెట్.. హోత్రిశ్రీ -
● తండ్రి స్ఫూర్తితో.. ఆయన అడుగుజాడల్లోనే...
కడప ఎడ్యుకేషన్: మేము చిన్నతనం నుంచే తండ్రి స్పూర్థితో తీసుకుని బాగా చదువుకుని నేడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఎంతో మంది పిల్లలకు సేవలందిస్తున్నామని యోగివేమన విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ పుత్తా పద్మ పేర్కొన్నారు. వివరాలు అమె మాటల్లోనే.. ‘నా పేరు పుత్తా పద్మ. చెన్నూరు మండలం చిన్నమాచుపల్లి. తండ్రి నాగమునిరెడ్డి, తల్లి నీరజ. మా నాన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్‌గా పనిచేస్తూ చివరిగా కడప ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ పొందారు. ఆయన లెక్చరర్‌గా పనిచేస్తూ ఎంతో మంది విద్యార్థులకు బోధనలందించి ప్రయోజకులను చేశారు. ఆయన స్ఫూర్తితో నేను కూడా బాగా చదువుకుని నేడు ఎంతో మంది విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నా. నేను ఎల్కేజీ నుంచి పదవ తరగతి వరకు కడపలోని విద్యామందిర్ స్కూల్లో చదువుకున్నాను. ఇంటర్‌ను అనంతపురంలోని నేషనల్ సాయిబాబా ఎయిడెడ్ కళాశాలలో, డిగ్రీ తిరుపతిలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో చదివాను. ఎంఏ, ఎంఫిల్ అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీలో, పీహెచ్డీ తిరుపతి మహిళా యూనివర్సిటీలో పూర్తి చేశాను. 1998లో నేను కడపలోని సుబ్బిరెడ్డి ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా చేరాను. 2006లో ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తూ 2007లో కడపలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలకు బదిలీపై వెళ్లాను.2007 చివరిలో కడప యోగివేమన యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా చేరా. 2013లో ప్రొఫెసర్‌గా అక్కడే పదోన్నతి పొందా. అక్కడ సీనియర్ ఫ్యాకల్టీగా, చీఫ్ ఎగ్జామినర్‌గా, ఉమెన్ కన్వీనర్‌గా, హెచ్ఓడిగా, డీన్‌గా పలు హోదాల్లో పనిచేశా. ప్రస్తుతం ఎస్కే యూనివర్సిటీకి కూడా బోర్డ్ ఆప్ స్టడీస్ చైర్మన్‌గా, పులివెందుల జేఎన్టీయూకు బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్‌గా పనిచేస్తున్నా.’ కోవిడ్ సమయంలో వైవీయూలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా పనిచే సిన ఈమె జిల్లాలోని అన్ని కళాశాలల్లో కట్టదిట్టంగా పరీక్షలను నిర్వహించి మంచిపేరు తెచ్చుకున్నారు. -
పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి
రాయచోటి : పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి సాధిస్తుందని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా ఆర్థిక ప్రగతికి పరిశ్రమలు దోహదం చేస్తాయని కలెక్టర్ అన్నారు. పరిశ్రమల వల్ల వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభించి జిల్లా ఆర్థిక ప్రగతి కూడా మెరుగుపడుతుందన్నారు. జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందివ్వాలని తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలలో ఔత్సాహిక నూతన పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా పరిశ్రమలశాఖ అధికారులు, బ్యాంకు అధికారులు దృష్టి సారించాలన్నారు. పీఎం విశ్వకర్మ పథకాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలన్నారు. 33 యూనిట్లకు రాయితీలు : జిల్లాలో 33 యూనిట్లకు రూ. 2.93 కోట్లు మేర రాయితీలను మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా పెట్టుబడి ప్రోత్సాహక రాయితీ కేంద్రం జిల్లాలో మొత్తం 22 యూనిట్లకు రూ. 2.72,96,776లు పావలా వడ్డీ రాయితీ క్రింద 4 యూనిట్లకు రూ. 4,96,592లు, విద్యుత్ రాయితీ క్రింద 7 యూనిట్లకు రూ. 15,83,583లు మంజూరుకు కమిటీ ద్వారా ఆమోదం తెలియజేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజరు జి కృష్ణారావు, జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జి ఆంజనేయులు, డిఆర్డీఏ పీడీ సత్యనారాయణ, విద్యుత్ శాఖ డిఈ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి అనీల్ కుమార్, డిక్కీ, టిక్కి జిల్లా ప్రతినిధులు శివశంకర్, రామ్మూర్తి నాయక్, సిక్కి అసోసియేషన్ అధ్యక్షులు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్, కమర్షియల్ ట్యాక్స్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 33 యూనిట్లకు రూ. 2.93 కోట్ల మేర రాయితీలు మంజూరు జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ -
● వాటర్ ఉమెన్ పారేశమ్మ
బి.కొత్తకోట: నీటి పొదుపు, భూగర్భజలాల వినియోగం, చిరుధ్యానాల సాగుపై గ్రామీణుల్లో చైతన్యం తీసుకొచ్చిన పారేశమ్మ వాటర్ ఉమెన్‌గా నిలిచి అవార్డు అందుకొంది. తంబళ్లపల్లె మండలం గొపిదిన్నెకు చెందిన పారేశమ్మ ఐటీఐ పూర్తి చే సి గుజరాత్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థలో రిసోర్స్‌పర్సన్‌గా పనిచేసింది. తంబళ్లపల్లెల్లో ఈమె పంటల సాగు, వనరుల సంరక్షణ, గ్రామస్తులతో సంఘాల ఏర్పాటు చేయడంపై కృషి చేస్తూ రైతుల్లో మార్పు తీసుకొచ్చింది. ఈమె కృషిని అంతర్జాతీయ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, కేంద్రప్రభుత్వ పరిధిలోని జాతీయ వాటర్ మిషన్ గుర్తించాయి. 2021లో ఉమెన్ వాటర్ అవార్డుకు 41 మంది ఎంపికవగా అందులో ఏపీ నుంచి పారేశమ్మ ఒకరు. అంతేకాదు..గ్రామీణప్రాంతాల్లో స్ఫూర్తిదాయక మహిళలు, మహిళా సంఘాలకు చెందిన మహిళల కథలను వెలుగులోకి తీసుకొస్తుంటుంది.రాష్ట్రపతి ద్రౌపదిముర్ము స్వచ్ఛ సుజల్ శక్తికి అభివ్యక్తి–2023 పేరుతో కేంద్రప్రభుత్వం వెలువరించిన నివేదికలో నీటిసంరక్షణ, చిరుధాన్యాల సాగులో విశేష కృషి చూపిన మహిళల గురించి ప్రస్తావనలో పారేశమ్మకు చోటు దక్కింది. అలాగే హైదరాబాద్‌కు చెందిన సంకల్పదివస్ సంస్థ రూ.12వేల నగదు, అవార్డుతో సత్కరించింది. తంబళ్లపల్లెలోని 33 పల్లెల్లో పారేశమ్మ రీసోర్స్‌పర్సన్‌గా పనిచేసింది. పంటల సాగు, భూగర్భజలాల మట్టాన్ని అంచనా వేసి పంటలకు ఎంత నీటి వ్యయం అవుతుంది, ఏ పంటలు సాగు చేయాలో రైతుల్లో అవగాహన కల్పించారు. -
మహిళలు ఔన్నత్యాన్ని చాటాలి
కురబలకోట : మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ తమ ఔన్నత్యాన్ని చాటాలని జిల్లా ఎస్పీ వి. విద్యా సాగర్ నాయుడు పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఆయన అంగళ్లు మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిఽథిగా పాల్గొన్నారు. ర్యాలీని ప్రారంభించారు. అంతకు ముందు అక్కడి ఆడిటోరియంలో జరిగిన సభలో మాట్లాడుతూ సమాజంలో సమస్యలు సహజమని స్వశక్తి (సెల్ప్ కనెక్షన్), వృత్తి నైపుణ్యం ఉంటే ఎలాంటి ఒడుదుడుకులైనా ఎదుర్కోవచ్చన్నారు. విద్య, అక్షరాస్యతకు తేడా ఉందన్నారు. వృత్తిలో జీవితంలో రాణించాలంటే తల్లిదండ్రులు, గురువులు, అనుభవజ్ణుల సూచనలు పాటించడం ద్వారా బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చన్నారు. మహిళలతో పాటు ఎవరికై నా సమస్య లేదా వేధింపులు ఉంటే పోలీస్ శాఖను సంప్రదించడానికి వెనుకాడవద్దన్నారు. ఇప్పటికే అన్నమయ్య జిల్లా వాట్సప్ గ్రూప్‌ను ఏర్పాటు చేయడంతో పాటు అవగాహన కార్యక్రమాలు పోస్టు చేయడం జరుగుతోందన్నారు. త్వరలో భరోసా అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. డీఎస్పీ కొండయ్య నాయుడు, త్రిపుల్ ఆర్ అకాడమీ ప్రెసిడెంట్ నాదేళ్ల ద్వారకనాధ్, ప్రిన్సిపాల్ యువరాజ్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. స్కిల్ సెట్‌తో సమస్యలను అధిగమించవచ్చు మహిళా దినోత్సవంలో జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు -
● మూగ జీవాలకు సేవ చేయాలనే లక్ష్యంతో..
కడప అగ్రికల్చర్: మాది వ్యవసాయ కుటుంబం. మా తల్లితండ్రులు కూడా వ్యవసాయంతోపాటు పాడి పశువులను పెంచేవారు. పాడి పశువులపై వారికి ఉన్న ప్రేమ చూసినేను కూడా బ్యాచురల్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ పూర్తి చేశా.పశుసంవర్ధకశాఖలో ఉద్యోగాన్ని సంపాదించి వేల మూగజీవాలకు సేవలందిస్తున్నానని జిల్లా పశుసంవర్థశాఖ అధికారి డాక్టర్ చెముడూరి శారదమ్మ చెబుతున్నారు. వివరాలు ఆమె మాటల్లో..మాది కలపాడు మండలం కలసపాడు గ్రామం. నేను 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఎగువ రామాపురంలో, 6,7,8 తరగతులను కలసపాడులో, 9, 10 తరగతులు పోరుమామిళ్లలో చదివాను. ఇంటర్‌ను కడపలోని బాలికల జూనియర్ కళాశాలలో, డిగ్రీ తిరుపతిలో పూర్తి చేశా.తర్వాత బ్యాచులర్ ఆఫ్ వెటర్నీరీ సైన్స్ తిరుపతిలో పూర్తి చేశాను. ● 1993లో చాపాడు మండలం వెదురూరులో తొలిసారిగా పశువైద్యాధికారిగా ఉద్యోగంలో చేరా. మూగ జీవాలకు వైద్యసేవలందిస్తూ..రైతు సంక్షేమం, అభివృద్ధి ద్యేయంగా పనిచేశాను. 2005 అసిస్టెంట్ డైరెక్టర్‌గా పదోన్నతి పొంది జమ్మలమడుగు ప్రాంతంలో పలు మండలాల్లో పనిచేశా. 2014లో డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొంది కడపకు వచ్చా. ఇక్కడే పనిచేస్తూ 2021లో జిల్లా పశువైద్యాధికారిగా పదోన్నతి పొంది సేవలందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వైద్యులకు సూచనలు, సలహాలను అందిస్తూ రైతు అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారు. తల్లితండ్రుల ఆశయాన్ని నేరవేరుస్తున్నందుకు ఆనందంగా ఉందని చెబుతున్నారు డాక్టర్ శారదమ్మ. -
No Headline
మదనపల్లెకు చెందిన ఆయిషా ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించింది. లక్షల్లో జీతం అయినా తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సా హంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించి గ్రూప్–1కు సన్నద్ధమయ్యారు. తొలి ప్రయత్నం విఫలమైనా నిరాశ చెందలేదు. మళ్లీ పట్టుదలతో ప్రయత్నించి గ్రూప్–1 విజేతగా నిలిచింది. సాధారణ కుటుంబంలో పుట్టిన ఆమె అనకాపల్లి ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్నారు. మదనపల్లెకు చెందిన అహ్మద్‌బాషా చిరువ్యాపారి. తల్లి సాధారణ గృహిణి. క్యాంపస్ ఇంటర్వ్యూలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చినా తాను సివిల్స్ రాయాలని ఉందని తల్లిదండ్రులకు చెప్పడంతో వారి ప్రోత్సాహంతో పోటీ పరీక్షలు రాసి విజేతగా నిలిచారు. ఓటమే విజయానికి నాంది -
No Headline
మహిళలు సున్నితమైన వారు.కష్టమైన పనులు చేయలేరు...అన్నది ఇంతవరకు ప్రజల్లో ఉన్న నమ్మకం. కానీ ఇటీవలి కాలంలో ఆ అభిప్రాయం చెల్లాచెదురై పోయింది. ఇంటి నుంచి మింటి వరకు అవకాశాలను అందిపుచ్చుకుంటూ అన్నింటా తానై దూసుకుపోతోంది మగువ. అబ్బురపరిచే విజయాలతో అందరి అభినందనలు అందుకుంటోంది వనిత. అనిర్వచనీయ పాత్రలో అంతులేని ఆత్మవిశ్వాసంతో తనకు తానే సాటిగా..పోటీగా మందుకు సాగుతోంది నేటి మహిళ. భూమిని చీల్చి పంటలు పండించడం నుంచి ఆకాశంలో రివ్వుమని విమానాలు నడపడంలో కూడా ప్రతిభ చూపుతున్నారు. కొలిమి పనులు, ఖాకీ దుస్తుల ఉద్యోగాల నుంచి రైలు పైలెట్లుగా, ఆర్టీసీ కండక్టర్లుగా రాణిస్తున్నారు. కొన్నిచోట్ల తమకు మాత్రమే గల సున్నితత్వాన్ని ప్రదర్శిస్తూ ప్రత్యేకతలు చాటుకుంటున్నారు. దేంట్లో అయినా తగ్గేదేలా అంటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. –కడప కల్చరల్ -
● ఆటాడించి...అగ్రస్థానంలో నిలిచి
విద్యార్థులకు ఆటపాటలు అక్కర్లేదని, అవి అన్నం పెట్టవని, పైగా చదువు పాడవుతుందని తల్లిదండ్రులు తేలిగ్గా చూస్తున్నారు. ఇలాంటి దశలో క్రీడారంగంలో తనదైన పట్టు సాధించి ఆణిముత్యాల్లాంటి విద్యార్థులను గుర్తించి వారి ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళుతోంది ఆమె. తాను పనిచేస్తున్న పాఠశాల గౌరవాన్ని రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపిన డ్యాషింగ్ లేడీ, కడప నగర పాలక సంస్థ (మెయిన్) స్కూలు ఫిజికల్ డైరెక్టర్ ఎల్.వెంకట లక్ష్మిదేవి. 2012లో ఆమె బదిలీపై మున్సిపల్ మెయిన్హైస్కూలుకు వచ్చారు. మైదానంలో దిగారు. అంతవరకు స్తబ్దుగా ఉన్న క్రీడాపరికరాలకు చలనం వచ్చింది. ఫలితంగా ఆ స్కూలు రాష్ట్ర స్థాయిలో రెండుసార్లు ద్వితీయ స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత ఏకంగా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి కడప పతాకాన్ని రెపరెపలాడించింది. దీంతో మన్సిపల్ హైస్కూలు మెయిన్ పాఠశాలను ప్రజలు క్రీడా పాఠశాలగా వ్యవహరిస్తున్నారు. మా వాడికి ఆటలు వద్దు అంటూ వెనక్కి తీసుకెళ్లిన బాలలను పదో తరగతిలో టాపర్లుగా నిలిపి వాళ్ల అభిప్రాయం తప్పని నిరూపించారు. తన శ్రమతో పలువురు విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో క్రీడా బహుమతులు సాధించేలా చేసింది. ఫిజికల్ డైరెక్టర్‌గా ఎల్.వెంకటలక్ష్మి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఇప్పుడామె వైఎస్సార్ జిల్లాలో క్రీడా శిక్షణకు ఐకాన్‌గా నిలిచారు. -
● సేవా పథంలో పయనం
కడప నగరానికి చెందిన నెమలిదిన్నె నాగవేణి పరిచయం అవసరం లేని సామాజిక సేవా కార్యకర్తగా గుర్తింపు సాధించుకున్నారు. నిజానికి ఆమె నిరుపేద కుటుంబానికి చెందిన యువతి. అయినా నగర పరిధిలోని అనాథ, వృద్ధులు, మహిళల ఆశ్రమాల్లో దుప్పట్లు, నూతన వస్త్రాలు, అన్నదానాలు చేస్తూ వారి అభిమానాన్ని సాధించుకున్నారు. రక్త సేకరణ శిబిరాలు, గుండె సంబంధిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుంటారు. దీపావళికి జువైనల్ హోంలోని బాలలందరికీ నూతన వస్త్రాలు, విందు భోజనం అందిస్తారు. వారితో కలిసి టపాసులు కాల్చి ఆనందిస్తారు. అధికారుల చుట్టూ తిరుగుతూ సేవా కార్యక్రమాల్లో వారు కూడా భాగస్వాములు అయ్యేలా చూస్తారు. ప్రైవేటుగా పీజీ చేస్తున్న ఆమె ప్రస్తుతం కడప నగరంలో పర్యాటక శాఖలో చిరుద్యోగిగా సేవలు అందిస్తున్నారు. ఇంతవరకు ఒక్క అన్నం పొట్లం కూడా ఇంటికి తీసుకెళ్లని ఆమెను విశ్వసించిన పలువురు మానవతా వాదులైన దాతలు ఆమె ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తనపై ఉన్న నమ్మకాన్ని చిరకాలం నిలబెట్టుకునేందుకే ప్రయత్నిస్తానని, తనను చూసిన వెంటనే ఆర్తుల ముఖాల్లో కనిపించే వెలుగును చూస్తే తన హృదయం ఆనందంతో నిండిపోతుందనంటారు నాగవేణి. అందుకు ఆమెను జిల్లా స్థాయి అధికారులు సైతం అభిమానిస్తారు. -
● బాలలు, మహిళల హక్కులే లక్ష్యం
మదనపల్లె సిటీ: సాయం చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు లలితమ్మ. మదనపల్లె పట్టణానికి చెందిన ఈమె లింగవిక్షకు గురైన బాధితురాలే. పెద్ద చదువులకు వెళ్లాలనుకున్నా పదో తరగతిలోనే చదువును ఆపాల్సి వచ్చింది. గాంధీ గ్రామీణాభివృద్ధ్ది సంస్థలో బాల్వాడీ టీచర్‌గా పని చేసేందుకు 1990లో ములకలచెరువు వెళ్లారు 1992 తంబళ్లపల్లె చేరుకుని అక్కడే పీపుల్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్(ఫోర్డు) స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. బాల్యవివాహాలను రూపుమాపడమే కాకుండా బడిమానేసిన వారికి తిరిగి పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ, వాటర్ ఎయిడ్ ఇండియా, అమెరికాకు చెందిన చైల్డ్ రైట్స్ యు (క్రై) సంస్థలు ఆర్థిక చేయూత ఇవ్వడంతో బాలలు, మహిళల హక్కుల కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. -
No Headline
వైఎస్సార్ జిల్లా చింతపూతాయపల్లె గ్రామానికి చెందిన చల్లగాలి మంజులారాణి కష్టతరమైన భావాలను గీతల్లో పలకించే విలక్షణ చిత్రకారిణి. భర్త గొల్లపల్లి జయన్న రాష్ట్ర ప్రభుత్వ హంస అవార్డు పొందిన చిత్ర, శిల్పకారుడు కావడంతో ఆమె తన ప్రతిభకు మెరుగులు దిద్దుకుంది. ప్రత్యేక శైలిగల చిత్రకారాణిగా ఆమె ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉనికిని చాటుకున్నారు. మహిళా సమస్యలను ప్రతిబింబించేలా ప్రతీకాత్మక చిత్రాలను గీయడం మంజులారాణికి రంగులతో పెట్టిన విద్య, మరీ ముఖ్యంగా మాతృత్వం తొణికిసలాడే అమ్మ చిత్రాలు, మురిపాలు ఆస్వాదిస్తూ తన్మయత్వంలో మునిగిన చిన్నారుల చిత్రాలు ఆమె చిత్రాలకు సంతకాలుగా నిలుస్తున్నాయి. ఆమె పలు జాతీయ, అంతర్జాతీయ చిత్ర కళా ప్రదర్శనల్లో పాల్గొని బహుమతులను సాధించారు.యువ చిత్రకారులను ప్రోత్సహిస్తున్నారు. ఆమె చిత్రం అపురూపం -
వ్యాపారిని కారు ఢీకొన్న ఘటనపై కేసు నమోదు
నిమ్మనపల్లె : నిర్లక్ష్యంగా వేగంగా కారు నడిపి ఎదురుగా ద్విచక్ర వాహనంలో వస్తున్న పానీపూరి వ్యాపారి శ్రీనివాసులు అతని భార్య లలితను ఢీకొన్న ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు. బుధవారం రాత్రి నిమ్మనపల్లి– మదనపల్లె మార్గంలో, రెడ్డివారిపల్లి పంచాయతీ పిట్టావాండ్లపల్లె వద్ద, సోమల మండలం తమ్మినాయన పల్లి పంచాయతీ కురువపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు, మదనపల్లి పట్టణంలోని ఈశ్వరమ్మ కాలనీ పెట్రోల్ బంక్ వద్ద పానీపూరి వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. వ్యవసాయ పనుల నిమిత్తం భార్య లలితతో కలిసి స్వగ్రామానికి వెళ్లి తిరిగి సాయంత్రం ద్విచక్ర వాహనంలో మదనపల్లెకు వస్తున్నారు. అదే సమయంలో మదనపల్లె వైపు నుంచి వచ్చిన గుర్తు తెలియని కారును డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ శ్రీనివాసులు ద్విచక్ర వాహనాన్ని ఢీకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని భార్య లలిత, బంధువు రమేష్ సాయంతో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
వేటగాళ్ల నాటు బాంబులకు పాడి ఆవు బలి
గుర్రంకొండ : అడవి జంతువులను వేటాడేందుకు పొలాల గట్లపై వేటగాళ్లు ఏర్పాటు చేసిన నాటు బాంబులను పొరబాటున పాడిఆవు నమలడంతో నోరుమొత్తం పేలిపోయి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన గుర్రంకొండ మండలం సంగసముద్రం పంచాయతీ మామిళ్లవారిపల్లెలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన నాగరాజ, రేవతి దంపతులు పాడి ఆవులను మేపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. గురువారం గ్రామానికి సమీపంలోని బండకింద గుట్టవైపు ఉన్న పొలాల వైపు నాగరాజు తమ పా డిఆవులను మేతకు తీసుకెళ్లాడు. గుట్టకిందనే పొలాలు ఉండడంతో గ్రామానికి చెందిన కొంతమంది వేటగాళ్లు అడవి జంతువులను వేటాడడం కోసం అక్కడక్కడా నాటుబాంబులు అమర్చారు. ఈ నేపథ్యంలో పొలాల గట్లపై గడ్డి మేస్తున్న పాడిఆవుల వద్ద పెద్ద శబ్దం రావడంతో నాగరాజు దంపతులు పరుగున అటువైపు వెళ్లారు. అప్పటికే వేటగాళ్లు అమర్చిన నాటుబాంబు నమిలి పాడిఆవు నోరు మొత్తం పేలిపోయి రక్తపుమడుగులో పడిపోయింది. సమాచారం అందుకున్న స్థానిక పశువైద్యాధికారి సునీల్ నాయక్ పాడి ఆవుకు వైద్యసేవలు అందించారు. పాడి ఆవు జీవించడం కష్టమని చెప్పారు. దీంతో జీవనోపాధి కోల్పోయిన పాడిరైతు దంపతులు బోరున విలపించడం అందరిని కలచివేసింది. ఈ సంఘటనకు గ్రామానికి చెందిన వేటగాళ్లు రెడ్డెప్ప, బాబు కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పాడి రైతు దంపతులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వైభవం..ధ్వజారోహణం
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. స్వామివారి బ్రహోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన గురువారం ఉదయం మూలవర్లకు స్నపన తిరుమంజనం జరిపారు. బ్రహోత్సవాలు జరిగే పదిరోజుల పాటు ఆలయానికి, ఉత్సవాలకు, యజ్ఞయాగాలకు సంరక్షణగా ముక్కోటి దేవతలు ఉండాలని కోరుకొంటూ వారిని ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. ఈసందర్భంగా గరుత్మంతునికి భక్తిశ్రద్ధలతో నైవేద్యం సమర్పించారు. అనంతరం నైవేద్యంగా ఉంచిన ప్రసాదాలను సంతానం లేని మహిళలు స్వీకరిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. తర్వాత ఊంజల్ సేవ జరిపారు. వాహన మండపంలో స్వామివారిని అందంగా అలంకరించి హంసవాహనంపై కొలువు దీర్చారు. గ్రామ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అఽధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఆలయంలో నేడు: శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజైన శుక్రవారం ఉదయం ముత్యపుపందిరివాహనం, సాయంకాలం సింహవాహన సేవలు ఉంటాయని ఆలయ అర్చకులు గోపాలబట్టార్ తెలిపారు. ఇదే రోజు ఉదయం స్నపన తిరుమంజనం, ఊంజల్‌సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
భార్యపై భర్త మచ్చుకత్తితో దాడి
చాపాడు : అనుమానం పెనుభూతమై కట్టుకున్న భర్త భార్యను కడతేర్చేందుకు మచ్చుకత్తితో విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన మండలంలోని నక్కలదిన్నె పంచాయతీ కొట్టాల గ్రామంలో గురువారం మధ్యాహ్నం జరిగింది. మండల పరిధిలోని కొట్టాల(బీసీ కాలనీ) గ్రామంలో గురువారం మధ్యాహ్నం ఎర్రిబోయిన భాస్కర్(48) అనే వ్యక్తి తన భార్య కళావతి(40)పై మచ్చుకత్తితో దాడి చేసి విచక్షణారహితంగా నరికాడు. ఈ ఘటనలో కళావతి తల, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితురాలిని 108లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
వసతి గృహం వార్డెన్‌పై ఫుడ్ కమిషన్ చైర్మన్‌కు ఫిర్యాదు
కలికిరి : కలికిరిలోని సాంఘిక సంక్షేమ శాఖ ఇంటిగ్రేటెడ్ వసతిగృహ వార్డెన్ రవీంద్రపై విద్యార్థులు, కొందరు తల్లిదండ్రులు కలికిరికి విచ్చేసిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డిని స్థానిక ఆర్అండ్బి అతిథి గృహంలో కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం ఉదయం హాస్టల్‌కు చేరుకున్న ఆయన హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న మెనూపై విచారించారు. విద్యార్థులు పొంతన లేకుండా సమాధానాలు చెప్పడంతో విద్యార్థులను అబద్ధాలకు తర్ఫీదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమచేత రూములు క్లీన్ చేయించడం, పాత్రలు కడిగించడం, ఇతర పనులు చేయిస్తున్నారని, పలువురు విద్యార్థులు విన్నవించారు. దీంతో వెంటనే సాంఘిక సంక్షేమశాఖ డీడీతో మాట్లాడిన ఆయన వార్డెన్‌కు వెంటనే మెమో ఇవ్వాలని, వారం రోజులలోపు మరో వార్డెన్‌ను నియమించి, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం స్థానిక ఏపీఎంజేపీ బాలికల గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను తనఖీ చేసిన ఆయన విద్యార్థినులకు అందుతున్న సదుపాయాలు, మెనూపై విచారించి సంతృప్తి వ్యక్తం చేశారు. డీఎస్ఓ రఘురాం, ఎంఈఓలు కరీముల్లా, నాగార్జున, సీఎస్ డీటీ విజయ్‌కుమార్‌రెడ్డి, తూనికలు, కొలతల అధికారి నాగరాజ తదితరులు ఆయన వెంట పాల్గొన్నారు. విద్యతోపాటు నాణ్యమైన భోజనం అందించాలి పీలేరు : ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు విద్యతోపాటు నాణ్యమైన భోజనం అందించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కామాటంపల్లె, ప్రకాశంరోడ్డు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం జెడ్పీ బాలికోన్నత పాఠశాలను తనిఖీ చేసి ఇస్కాన్ ద్వారా సరఫరా అయిన భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం చిత్తూరు మార్గంలోని జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, తిరుపతి రోడ్డులోని ఏపీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు చదువుతోపాటు ఆరోగ్యం చాలా ముఖ్యమని, అందుకు తగ్గట్లు ప్రభుత్వ మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ రఘురాం, తహసీల్దార్ భీమేశ్వర్రావు, సీఎస్ డీటీ విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తండ్రిపై కొడుకు బండరాయితో దాడి
సిద్దవటం : కన్న తండ్రిపైనే కొడుకు బండరాయితో దాడి చేయడంతో తండ్రి ఖాదర్‌హుస్సేన్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. సిద్దవటం మండలం ఉప్పరపల్లె గ్రామానికి చెందిన ఖాదర్‌హుస్సేన్ తన సొంత గృహాన్ని అద్దెకు ఇచ్చేందుకు బోర్డును ఏర్పాటు చేశాడు. అతని కుమారుడు బాబా ఫకృద్దీన్ ఆ బోర్డును తొలగించి తండ్రిపై బుధవారం సాయంత్రం ఇంటి వద్ద ఉన్న బండరాయితో తలపై కొటడ్డంతో తీవ్ర గాయాలతో కుప్ప కూలిపోయాడు. స్థానికులు, బంధువులు ఖాదర్హుసేన్స్ను ఒంటిమిట్ట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు సిఫార్సు చేశారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ ఆస్తి కోసం కన్న తండ్రిపైనే కొడుకు దాడి చేయడం అన్యాయమన్నారు. సిద్దవటం ఇన్చార్జి ఎస్ఐ శివప్రసాద్ జరిగిన ఘటనపై విచారిస్తున్నట్లు తెలిపారు. -
హలీమ్‌కు సలాం
రాజంపేట టౌన్ : రంజాన్ మాసంలో చేపట్టే వంటకాల్లో హలీం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఒకప్పుడు హైదరాబాద్‌లోనే దొరికే హలీం ఇప్పుడు ప్రధాన పట్టణాల్లోని ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రంజాన్ మాసం సందర్భంగా ఉపవాసం ఉండే ముస్లీంలే కాక ఇతర మతాల వారు హలీం రుచిని ఎంతో ప్రీతిగా ఆస్వాదిస్తారు. అందువల్ల ఇప్పుడు సాయంత్రం ఆరు గంటలు అయితే చాలు అనేక మంది ప్రజలు హలీం విక్రయించే చోట వాలిపోతున్నారు. హలీం అరబ్ దేశానికి చెందిన వంటకం హలీం అరబ్ దేశానికి చెందిన వంటకమని ముస్లీంలు చెబుతున్నారు. ఆరో నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ హయాంలో అరబ్ దేశమైన పర్షియా నుంచి హలీం తెలుగు రాష్ట్రమైన హైదరాబాద్‌కు చేరుకొని ఎంతో ప్రసిద్ధిగాంచింది. మహబూబ్ అలీఖాన్ తన సంస్థానంలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పర్షియా నుంచి ప్రత్యేక ఆహ్వానితులు వచ్చారు. ఆ సమయంలో రంజాన్ ఉపవాస దీక్షల్లో ఇఫ్తార్‌కు తయారు చేసే ప్రత్యేక వంటకమైన హలీం గురించి ప్రస్తావించారు. వెంటనే నవాబు తన సిబ్బందిని పిలిపించి హలీంను తయారు చేయించారు. ఆ విధంగా హలీం తొలుత హైదరాబాద్‌కు పరిచయమై ఇప్పుడు అన్ని పట్టణాలకు చేరుకుని ప్రజలతో లొట్టలేయిస్తోంది. తయారీ కూడా ప్రత్యేకమే సాంప్రదాయ వంటలతో పోలిస్తే హలీం తయారీ చాలా ప్రత్యేకమైనది. హలీం తయారీకి కనీసం తొమ్మిది గంటల సమయం పడుతుంది. ఇందులో మటన్ లేదా చికెన్, గోధుములు, అన్ని పప్పుదినుసులు, బాస్మతిబియ్యం, నెయ్యి, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, యాలకలు, దాల్చిన చెక్క, మిరియాలు, కొత్తిమీర, నూనె, డ్రైఫ్రూట్స్ తదితర వస్తువులను వినియోగించి తయారు చేసి ఇఫ్తార్ సమయానికి సిద్ధం చేస్తారు. ఉపవాసం ముగించుకున్న ముస్లీంలతో పాటు ఇతర మతాలకు చెందిన వారు సైతం హలీంను ఆరగించేందుకు ఇష్టపడతారు. అక్కడే తినేవారికి పింగాణి కప్పులలో వేయిస్తుండగా పార్శిల్ తీసుకెళ్లే వారికి బాక్సులలో వేయిస్తున్నారు. ఒక్కో బాక్సు రూ.150, రూ.250, రూ.500కు విక్రయిస్తున్నారు. రంజాన్ ప్రత్యేక వంటకంగా గుర్తింపు రుచికి ఫిదా అవుతున్న జనం -
సర్టిఫికెట్ల అందజేత
గుర్రంకొండ : గుర్రంకొండ తెలుగు జెడ్పీహైస్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులకు డీఈవో సుబ్రమణ్యం ఎస్జీఎఫ్ జాతీయస్థాయి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. 2024–2025 సంవత్సరానికి స్థానిక తెలుగు హైస్కూల్లో తొమ్మిదో తరగతికి చెందిన ప్రసన్నకుమార్, మేకల సంతోష్ జమ్మూకాశ్మీర్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి ఫెన్సింగ్ క్రీడా పోటీల్లో పాల్గొని రాష్ట్రానికి పతకాలు తీసుకొచ్చారు. ఈనేపథ్యంలో డీఈవో సుబ్రమణ్యం గురువారం విద్యార్థులను తన కార్యాలయానికి రప్పించుకొని సర్టిఫికెట్లను అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మన జిల్లాకు చెందిన విద్యార్థులు రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించడం శుభపరిణామన్నారు. క్రీడల్లో విద్యార్థుల ఉన్నతికి కారణమైన పీడీ రమేష్‌బాబు, కోచ్ రవీంద్రలను డీఈవో అభినందించారు. -
మహిళాభివృద్ధికి కృషి చేద్దాం
ఓపెన్ హౌస్ ప్రారంభోత్సవంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడురాయచోటి : మహిళల భద్రత, రక్షణ,అభివృద్ధి, సాధికారతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈనెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా 1 నుంచి 8వ తేది వరకు మహిళా సాధికారత వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరుపుతున్నట్లు ఎస్పీ తెలిపారు. అలాగే ఎస్పీ కార్యాలయాన్ని విద్యార్థునులు సందర్శించేలా, మహిళా గౌరవాన్ని పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున జిల్లా కేంద్రంలో ర్యాలీని నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను ర్యాలీ అనంతరం ప్రదానం చేస్తామన్నారు. విద్యార్థునులతో మమేకమై..... ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని తిలకించేందుకు వివి ధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థినులతో జి ల్లా ఎస్పీ, పోలీసు అధికారులు మమేకమయ్యా రు. విధి నిర్వహణలో పోలీసులు వినియోగిస్తున్న వివిధ రకాల అత్యాధునిక ఆయుధాల గురించి, బాంబ్ డిస్పోజల్స్ పరికరాలు, సాంకేతికత గురించి వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఐ రవిశంకర్ రెడ్డి, ఆర్ఐలు విజె రామకృష్ణ, ఎం పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు. -
క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి
రాయచోటి : విధి నిర్వహణలో నిర్భయంగా, నిష్పక్షపాతంగా, క్రమశిక్షణ, నిజాయితీ, పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తూ బాధితులకు న్యాయం చేసి ముద్దాయిలకు శిక్షలు పడేలా పనిచేయాలని ప్రొబేషనరీ మహిళా ఎస్ఐలకు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. అనంతపురం పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం అన్నమయ్య జిల్లాకు కేటాయించిన నలుగురు మహిళా ప్రొబేషనరీ ఎస్ఐలు గురువారం జిల్లా కార్యాలయంలో జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా పోలీస్ శాఖలోకి అడుగుపెడుతున్న ప్రొబేషనరీ ఎస్ఐలకు ఎస్పీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రజలకు మంచి సేవలు అందిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా విధులను నిర్వర్తించాలని సూచించారు. విధి నిర్వహణలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని ఉత్తమ ఫలితాలను రాబట్టాలన్నారు. అలాగే ప్రజలకు మరింత సేవ చేసేలాగా చూడాలన్నారు. ఫిర్యాదుదారులతో సత్ ప్రవర్తనతో ప్రవర్తించాలని తెలిపారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులను అప్లోడ్ చేసే విధానం, ఎఫ్ఐఆర్, దర్యాప్తుకు సంబంధించిన రికార్డులను రాయడం నేర్చుకోవాలన్నారు. విధి నిర్వహణలో ఎక్కడా ఏ విధమైన అనుమానం వచ్చినా వెంటనే సీనియర్ అధికారులను అడిగి తెలుసుకొని నివృత్తి చేసుకోవాలని ఎస్పీ తెలిపారు. మహిళా ఎస్ఐలు వీరే.. ప్రొబేషనరీ మహిళా ఎస్ఐలు దొంతుల తేజశ్విని, బానోతు శ్రీప్రియ, చిత్తూరు సుస్మిత, పోకల హారిక ఉన్నారు.ప్రొబేషనరీ మహిళా ఎస్ఐలకు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచన -
రికార్డులు సంతృప్తికరంగా లేవు
పెద్దతిప్పసముద్రం : మండలంలోని పోతుపేట గ్రామ పంచాయతీలో చేయని అభివృద్ది పనులతో పాటు ఇష్టారాజ్యంగా రూ.లక్షల ప్రజాధనం దుర్వినియోగంపై జనవరి 24న సాక్షి పత్రికలో ‘నిధులు నీళ్లపాలు’ అని కథనం వెలువడింది. ఈ నేపథ్యంలో మండలంలో కొత్తగా ఏర్పడిన పోతుపేట గ్రామ పంచాయతీకి మంజూరైన నిధులు, ఏ పనికి ఎంత ఖర్చు పెట్టారో ప్రజా క్షేత్రంలో బహిర్గతం చేయాలని పోతుపేటకు చెందిన ఎస్సీ నాయకుడు కేవీ రమణ ప్రజా ఫిర్యాదుల దినంలో భాగంగా గత నెల 24న జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సమగ్రమైన విచారణ జరపాలని డీపీఓ మస్తాన్‌వలీని కలెక్టర్ ఆదేశించారు. ఈ తరుణంలో గత కొద్ది రోజులుగా డీపీఓ ఆదేశాల మేరకు మదనపల్లె డీఎల్పీఓ నాగరాజు, ఇన్చార్జి మండల ఈఓఆర్డీ మోహన్ ప్రతాప్‌లు గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులు, ఖర్చుల వివరాలతో కూడుకున్న రికార్డులను తనిఖీ చేస్తున్నారు. ఖర్చు చేసిన రూ.22 లక్షల నిధులకు సంబంధించి పలు అనుమానిత రికార్డులను పరిశీలించి విస్తుపోయినట్లు సమాచారం. రెజ్యులేషన్, క్యాష్, ఎంబుక్‌లు, వార్డు సభ్యుల తీర్మానాలు, వాటి ఆమోద పత్రాలు లేకపోవడాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. అనంతరం రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎల్పీఓ విలేకరులతో మాట్లాడుతూ రికార్డులు సంతృప్తికరంగా లేవు. రికార్డుల తనిఖీ ఇంకా కొనసాగుతోంది, క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్ర స్థాయిలో ప్రజల సమక్షంలో విచారిస్తాం. జరిగిన కొన్ని పనులకు సంబంధించి విజిలెన్స్ కమిటీకి అప్పగించి సమగ్రమైన తుది నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. ఈ సందర్బంగా పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసిన కేవీ రమణ మాట్లాడుతూ ఎలాంటి మీటింగ్‌కు వెళ్లని తమ బంధువులైన వార్డు సభ్యుల సంతకాలు కూడా ఫోర్జరీ చేశారని, పనులకు తగ్గ ఎంబుక్‌లు కూడా లేవని, నిధుల దుర్వినియోగానికి బాధ్యులైన అధికారులకు వత్తాసు పలికినా, అధికార పార్టీ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి రికార్డులు తారుమారు చేసినా తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. డీఎల్పీఓ నాగరాజు నిధుల దుర్వినియోగంపై కొనసాగుతున్న విచారణ -
రూటే.. సప‘రేటు’..!
ఏ పనైనా సరే చేయాలంటే అందుకు నిబంధనలు ఉంటాయి. అయితే ఇక్కడ ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలిచ్చారు. ‘పరిపాలనకు’ పాతర వేశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు ‘అవినీతి జాడ్యం’ పట్టుకుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి టాస్స్‌ఫోర్స్ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శాఖలో తవ్వే కొద్దీ అవినీతి, అక్రమాలు బయటపడుతున్నాయి. ఇటీవల కాలంలో అవకతవకలపై విచారణలు జరుగుతున్నాయి. తాజాగా మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ శాఖలో పరిపాలన అదుపు తప్పిందనే వాదన ఉద్యోగుల నుంచి వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు.. ‘బ్యాన్’ ఉన్న వేళ బదిలీ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ‘బ్యాన్’ విధించింది. అంటే బ్యాన్‌ను తొలగించే వరకు ఎలాంటి బదిలీలు చేపట్టకూడదు. అయితే ఈ శాఖలో నిబంధనలు ధిక్కరించి బదిలీ చేయడం గమనార్హం. ఉమ్మడి జిల్లాకు సంబంధించి పుల్లంపేట పీహెచ్సీలో పని చేస్తున్న ఒక ఉద్యోగి ఆరు నెలలు మెడికల్ లీవ్ పెట్టారు. మెడికల్ లీవ్ అనంతరం ఆ ఉద్యోగికి రీపోస్టింగ్ ఇవ్వాలి. ప్రస్తుత జీఓ ప్రకారం తిరిగి పుల్లంపేటకే పోస్టింగ్ ఇవ్వాలి. అయితే అందుకు విరుద్ధంగా మాధవరం పీహెచ్‌సీకి పోస్టింగ్ ఇచ్చారు. అంటే ఆ ఉద్యోగిని పుల్లంపేట నుంచి మాధవరానికి బదిలీ చేశారు. ‘బ్యాన్’ ఉన్న సమయంలో ఈ బదిలీని ఏ ప్రాతిపదికన చేపట్టారో.. ఆ శాఖ వారికే ఎరుక. ఇందుకు గాను ఆ ఉద్యోగి నుంచి రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు లంచం తీసుకున్నట్లు సమాచారం. అలాగే ఆ ఉద్యోగి ఆరు నెలల మెడికల్ బిల్లు రూ.1,75,000 మంజూరు చేయడానికి మరో రూ.20 వేలు వసూలు చేసినట్లు తెలిసింది. ఉద్యోగులు సతమతం అలాగే సొంత శాఖలో జిల్లా వ్యాప్తంగా పని చేసే సిబ్బందిని కూడా వదలడం లేదు. డ్రాయింగ్ అండ్ డిస్పర్సమెంట్ పరిధి కారణంగా 90 పీహెచ్‌సీలు వస్తాయి. మెడికల్ ఆఫీసర్ మొదలుకొని క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు సర్వీసుకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఇక్కడ కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మెడికల్ లీవ్‌కు రూ 5.వేలు, ఎర్న్ లీవుకు రూ.3 వేలు, ఇంక్రిమెంట్ మంజూరుకు డాక్టర్‌కు అయితే రూ.3 వేలు, ఫీల్డ్ స్థాయి సిబ్బందికి రూ.2 వేలు, ఏదైనా దరఖాస్తును డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు ఫార్వర్డ్ చేయాలంటే రూ.5 వేలు, గర్భిణుల మెడికల్ బిల్లుకు రూ.5 వేలకు పైగా ఇలా ప్రతి పనికి ఒక రేటును ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారు. ఇందుకు కొంత మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ శాఖలో వేలాది మంది ఉద్యోగులు ఉన్నారు. ఏవైనా కార్యాలయ పనులు పడినప్పుడు అడిగినంత ఇచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. లేదంటే ఫైళ్లు ముందుకు కదలవు.. పనులు జరగవు. దీంతో ఈ శాఖలో పూర్తి స్థాయిలో ‘పరిపాలన’కు పాతర పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులు ఉద్యోగ భద్రతా కారణాల వల్ల తమ సమస్యలను బహిర్గతంగా చెప్పుకోలేరు. కారణాలు ఏవైనప్పటికీ సమగ్ర విచారణ చేపట్టి ప్రభుత్వ నిబంధనలు అమలయ్యేలా చూడాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. వైద్య ఆరోగ్య శాఖలో ‘కాసుల వేట’ ప్రతి పనికీ ఓ లెక్క నిబంధనలకు విరుద్ధంగా బదిలీ -
సర్టిఫికెట్ల అందజేత
గుర్రంకొండ : గుర్రంకొండ తెలుగు జెడ్పీహైస్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులకు డీఈవో సుబ్రమణ్యం ఎస్జీఎఫ్ జాతీయస్థాయి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. 2024–2025 సంవత్సరానికి స్థానిక తెలుగు హైస్కూల్లో తొమ్మిదో తరగతికి చెందిన ప్రసన్నకుమార్, మేకల సంతోష్ జమ్మూకాశ్మీర్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి ఫెన్సింగ్ క్రీడా పోటీల్లో పాల్గొని రాష్ట్రానికి పతకాలు తీసుకొచ్చారు. ఈనేపథ్యంలో డీఈవో సుబ్రమణ్యం గురువారం విద్యార్థులను తన కార్యాలయానికి రప్పించుకొని సర్టిఫికెట్లను అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మన జిల్లాకు చెందిన విద్యార్థులు రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించడం శుభపరిణామన్నారు. క్రీడల్లో విద్యార్థుల ఉన్నతికి కారణమైన పీడీ రమేష్‌బాబు, కోచ్ రవీంద్రలను డీఈవో అభినందించారు. -
భార్యపై భర్త మచ్చుకత్తితో దాడి
చాపాడు : అనుమానం పెనుభూతమై కట్టుకున్న భర్త భార్యను కడతేర్చేందుకు మచ్చుకత్తితో విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన మండలంలోని నక్కలదిన్నె పంచాయతీ కొట్టాల గ్రామంలో గురువారం మధ్యాహ్నం జరిగింది. మండల పరిధిలోని కొట్టాల(బీసీ కాలనీ) గ్రామంలో గురువారం మధ్యాహ్నం ఎర్రిబోయిన భాస్కర్(48) అనే వ్యక్తి తన భార్య కళావతి(40)పై మచ్చుకత్తితో దాడి చేసి విచక్షణారహితంగా నరికాడు. ఈ ఘటనలో కళావతి తల, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితురాలిని 108లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
రంజాన్ వేళ.. రూపుదిద్దుకుంది ఇలా..!
రాజంపేట టౌన్ : ముస్లింలు రంజాన్ మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో ముస్లింలు నియమ, నిష్టలతో ఉపవాసాలు ఉంటారు. ఉపవాసం చేపట్టే, విరమించే సమయాన్ని విధిగా పాటిస్తారు. ఎందుకంటే సహర్, ఇఫ్తార్ల సమయం కంటే ముందుగాని, ఆలస్యంగా గాని ఉపవాసం చేపట్టడం, విరమించడం చేస్తే ఆ రోజు చేపట్టే ఉపవాస దీక్షకు సార్థకత ఉండదని ముస్లిం మతపెద్దలు చెబుతున్నారు. అందువల్ల సహర్, ఇఫ్తార్లు సరైన సమయంలోనే పూర్తి చేయాలి. పూర్వం ఎలా చేసేవారంటే... ప్రస్తుతం సహర్, ఇఫ్తార్లు ఏ సమయంలో చేపట్టాలో తెలియజేసేందుకు కాలపట్టిక అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ కాలపట్టిక అందుబాటులోకి రాని సమయంలో సహర్, ఇఫ్తార్ వేళలను తెలియజేసేందుకు తూటాలు పేల్చేవారు. టపాసులు అందుబాటులోకి వచ్చాక టపాసులను పేల్చి తెలియజేసేవారు. కాలక్రమంలో మైకులు అందుబాటులోకి వచ్చాక మసీదుల్లో మౌజన్లు ఉపవాసం ప్రారంభానికి ఓ అరగంట ముందు రోజేదారో ఉఠో..ఉఠో (ఉపవాసం ఉండేవారు లేవండి) అంటూ నిద్రలేపేవారు. ఇక ఇఫ్తార్ సమయాన్ని అదే సమయంలో తెలియజేసేవారు. ప్రస్తుతం కాలం పూర్తిగా మారిపోయినందున సహర్, ఇఫ్తార్ వేళలను కార్డుల్లో ముద్రిస్తున్నారు. ఈ కార్డులను వ్యాపార సంస్థలు, ఆర్థిక పరిపుష్టి కలిగిన ముస్లింలు ముద్రించి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. సమయ నిర్ధారణ పట్టిక ఎలా తయారైందంటే.. పూర్వం ముస్లింలు ఉపవాసం ప్రారంభం, విరమణ సమయాల విషయంలో ఇబ్బందులు పడేవారు. ఈ ఇబ్బందులను గమనించిన ముఫ్తీ మహమ్మద్ రహీముద్దీన్ అబ్దుల్‌వాసే ఉపవాస ప్రారంభ, విరమణ సమయ నిర్ధారణ పట్టిక తయారు చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా కొన్ని రోజులు శ్రమించి ముస్లింలు దీక్ష చేపట్టే సమయ పట్టికను 290 పేజీల పస్తకం ‘మియారుల్ ఔకాత్’లో పొందుపరిచారు. ఇప్పటికీ ఈ పుస్తకం ఆధారంగానే ఉపవాస సమయ పట్టికను నిర్ధారిస్తున్నారు. ఈ పుస్తకం ఆధారంగా 1968వ సంవత్సరంలో తొలిసారిగా ఉపవాస సమయ పట్టికను తయారు చేశారు. ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి వచ్చే సరికి సహర్, ఇఫ్తార్ వేళల్లో కొన్ని నిమిషాల తేడాతో సమయ పట్టిక రూపొందించారు. అందువల్ల ఒక పట్టణానికి, మరొక పట్టణానికి రెండు లేక మూడు నిమిషాల తేడాతో సహర్, ఇఫ్తార్లు ప్రారంభమవుతాయి. ఈ సమయ పట్టికకు ఉపవాస సమయ పట్టిక అని నామకరణం చేశారు. ఉపవాస సమయ పట్టిక తయారై దాదాపు 56 సంవత్సరాలకు పైగా అయింది. చిన్నపాటి కార్డులో సహర్, ఇఫ్తార్ వేళలు తెలియజేసే పట్టిక ఇతరులను అడగాల్సిన అవసరం ఉండదు.. ఖచ్చితమైన సమయంలోనే సహర్, ఇఫ్తార్లు పూర్తి చేయాలి. అందువల్ల నా చిన్నవయస్సులో ఒకరోజు ముందు సహర్, ఇఫ్తార్ వేళలు చెప్పేవారు. మసీదుకు వెళ్లని వారు ఇతరులను అడిగి తెలుసుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గత కొన్నేళ్లుగా సహర్, ఇఫ్తార్ వేళలు తెలియజేసే పట్టికను కార్డుల్లో ముద్రించి ఇస్తున్నారు. అందువల్ల చాలా సౌకర్యవంతంగా ఉంది. – అబ్దుల్ మునాఫ్, ఉస్మాన్ నగర్, రాజంపేట -
ఒంటిమిట్టలో శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో మహా సంప్రోక్షణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గురువారం ఉదయం 7.30 గంటల నుంచి టీటీడీ పాంచరాత్ర ఆగమన సలహాదారు రాజేష్ కుమార్, వేదపండితులు భగవత్పుణ్యాహం, అగ్ని మదనం, ప్రధాన మూర్తి హోమాలు జరిపారు. సాయంత్రం 5.30 గంటల నుంచి చతుస్థానార్చనము, సహస్ర కలశాధివాసం, శాత్తుమొర నిర్వహించారు. రామయ్య క్షేత్రానికి భక్తుల తాకిడి పెంచుతాం... ఒంటిమిట్ట రామాలయ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిపుణుల బృందంలోని రాముడు సతీ సమేతంగా బాలాలయంలోని మూలమూర్తులను దర్శించుకున్నారు. ఈయనతోపాటు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, విజయవాడ నుంచి డైరెక్టర్ డాక్టర్ కొండా రమేష్, ఫ్రొఫెసర్లు డాక్టర్ దీపక్ కుమార్ సింగ్, అనీల్ కుమార్‌లు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒంటిమిట్ట ఆలయానికి భక్తుల తాకిడి పెంచేలా, భక్తులు రామక్షేత్రంలో అడుగు పెట్టగానే భక్తి భావం కలిగేలా ప్రణాళికలు రూపొందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ నటేష్‌బాబు, ఆలయ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, సివిల్ విభాగం డీఈ నాగరాజు, ఏఈ అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. -
వైభవం..ధ్వజారోహణం
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. స్వామివారి బ్రహోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన గురువారం ఉదయం మూలవర్లకు స్నపన తిరుమంజనం జరిపారు. బ్రహోత్సవాలు జరిగే పదిరోజుల పాటు ఆలయానికి, ఉత్సవాలకు, యజ్ఞయాగాలకు సంరక్షణగా ముక్కోటి దేవతలు ఉండాలని కోరుకొంటూ వారిని ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. ఈసందర్భంగా గరుత్మంతునికి భక్తిశ్రద్ధలతో నైవేద్యం సమర్పించారు. అనంతరం నైవేద్యంగా ఉంచిన ప్రసాదాలను సంతానం లేని మహిళలు స్వీకరిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. తర్వాత ఊంజల్ సేవ జరిపారు. వాహన మండపంలో స్వామివారిని అందంగా అలంకరించి హంసవాహనంపై కొలువు దీర్చారు. గ్రామ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అఽధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఆలయంలో నేడు: శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజైన శుక్రవారం ఉదయం ముత్యపుపందిరివాహనం, సాయంకాలం సింహవాహన సేవలు ఉంటాయని ఆలయ అర్చకులు గోపాలబట్టార్ తెలిపారు. ఇదే రోజు ఉదయం స్నపన తిరుమంజనం, ఊంజల్‌సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
తండ్రిపై కొడుకు బండరాయితో దాడి
సిద్దవటం : కన్న తండ్రిపైనే కొడుకు బండరాయితో దాడి చేయడంతో తండ్రి ఖాదర్‌హుస్సేన్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. సిద్దవటం మండలం ఉప్పరపల్లె గ్రామానికి చెందిన ఖాదర్‌హుస్సేన్ తన సొంత గృహాన్ని అద్దెకు ఇచ్చేందుకు బోర్డును ఏర్పాటు చేశాడు. అతని కుమారుడు బాబా ఫకృద్దీన్ ఆ బోర్డును తొలగించి తండ్రిపై బుధవారం సాయంత్రం ఇంటి వద్ద ఉన్న బండరాయితో తలపై కొటడ్డంతో తీవ్ర గాయాలతో కుప్ప కూలిపోయాడు. స్థానికులు, బంధువులు ఖాదర్హుసేన్స్ను ఒంటిమిట్ట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు సిఫార్సు చేశారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ ఆస్తి కోసం కన్న తండ్రిపైనే కొడుకు దాడి చేయడం అన్యాయమన్నారు. సిద్దవటం ఇన్చార్జి ఎస్ఐ శివప్రసాద్ జరిగిన ఘటనపై విచారిస్తున్నట్లు తెలిపారు. -
బాలల సంరక్షణ కేంద్రాల రిజిస్ట్రేషన్‌కు మరో అవకాశం
రాయచోటి జగదాంబసెంటర్ : జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాల రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం మరో అవకాశం కల్పించినట్లు జిల్లా స్థాయి నోడల్ అధికారి, అదనపు జిల్లా పర్యవేక్షణాధికారి కె.రవిప్రకాష్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.జిల్లాలో బాలల న్యాయ చట్టం ప్రకారం పిల్లల రక్షణ, సంరక్షణ కోసం నడుపుతూఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ చేసుకోని సంస్థలు ఈ నెల 10లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.మార్చి 10వ తేదీ తర్వాత కూడా రిజిస్ట్రేషన్ పొందకుండా బాలల సంరక్షణ కేంద్రాలు నడిపితే అటువంటి వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇంటర్ పరీక్షలకు 989 మంది గైర్హాజరు రాయచోటి : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష గురువారం జిల్లా వ్యాప్తంగా 49 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. 16278 మంది విద్యార్థులకు 15289 మంది హాజరయ్యారు. 989 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ కృష్ణయ్య తెలిపారు. రెగ్యులర్ పరీక్షల్లో 15018 మందికి 14203 మంది పరీక్షలకు హాజరు కాగా, ఒకేషనల్ పరీక్షలకు 1260 మంది విద్యార్థులకు 1086 మంది హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో లోటుపా ట్లు లేకుండా విద్యార్థులకు తగిన మౌలిక వసతులను కూడా కల్పించామని ఆయన తెలిపారు. ప్రభుత్వ భూములను కాపాడటమే లక్ష్యం పీలేరు : ప్రభుత్వ భూములు కాపాడటమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. గురువారం పీలేరు తహసీల్దార్ కార్యాలయాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీలపై గ్రామాల వారీగా రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన వాటికి నాణ్యమైన పరిష్కార మార్గాలు చూపాలని అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్లో ఇంకా 80, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీల్లో 56 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వారం లోగా వీటిని పరిష్కరించాలని ఆదేశించారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. పీలేరు మండలంలో పలు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనట్లు గుర్తించామని, వాటిని స్వాధీనం చేసుకుంటామని, ఆక్రమించుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆక్రమణలపై ఎవరి ఒత్తిడికి లోను కాకుండా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి, తహసీల్దార్ భీమేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. జాతీయ లోక్‌అదాలత్ విజయవంతం చేద్దాం మదనపల్లె : ఉమ్మడి చిత్తూరుజిల్లాలో ఈనెల 8వతేదీ శనివారం జరగనున్న జాతీయ లోక్‌అదాలత్‌లో కక్షిదారులు పాల్గొని కేసులను రాజీ చేసుకోవాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం.ఎస్.భారతి పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యాలయంలో జాతీయ లోక్‌అదాలత్ నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి ఎం.ఎస్.భారతి మాట్లాడుతూ... కేంద్ర న్యాయసేవ అధికార సంస్థ, రాష్ట్ర న్యాయ అధికార సేవాసంస్థ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చిత్తూరుజిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.భీమారావ్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉమ్మడి చిత్తూరుజిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జాతీయ లోక్‌అదాలత్ జరుగుతుందన్నారు. ఉమ్మడి చిత్తూరుజిల్లాలో 32 బెంచ్‌లు ఏర్పాటుచేశామన్నారు. 1997 నుంచి జాతీయ లోక్‌అదాలత్ ద్వారా కేసులను రాజీచేయనున్నట్లు చెప్పారు. కోర్టుల్లో లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రతి మూడునెలలకు ఒకసారి లోక్ అదాలత్ నిర్వహించడం ద్వారా సుమారు 10 నుంచి 20శాతం కేసులు పరిష్కారమవుతున్నాయని తెలిపారు. రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకోవడం వల్ల కక్షదారులకు సమయంతో పాటుగా ధనం ఆదా అవుతుందన్నారు. లోక్‌అదాలత్‌లో ఇచ్చిన తీర్పు అంతిమమని, దానిపై అప్పీల్ ఉండదన్నారు. శనివారం నిర్వహించే లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులు, న్యాయవాదులు, రెవెన్యూ, పోలీస్, బ్యాంక్ అధికారులు, చిట్‌ఫండ్ కంపెనీలు, బీమా సంస్థల ప్రతినిధులు, కక్షిదారులు పాల్గొనాలని, ఎక్కువ కేసులు పరిష్కరించి చిత్తూరు జిల్లాను రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉంచేందుకు సహకరించాలని కోరారు. -
మహిళాభివృద్ధికి కృషి చేద్దాం
ఓపెన్ హౌస్ ప్రారంభోత్సవంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడురాయచోటి : మహిళల భద్రత, రక్షణ,అభివృద్ధి, సాధికారతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈనెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా 1 నుంచి 8వ తేది వరకు మహిళా సాధికారత వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరుపుతున్నట్లు ఎస్పీ తెలిపారు. అలాగే ఎస్పీ కార్యాలయాన్ని విద్యార్థునులు సందర్శించేలా, మహిళా గౌరవాన్ని పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున జిల్లా కేంద్రంలో ర్యాలీని నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను ర్యాలీ అనంతరం ప్రదానం చేస్తామన్నారు. విద్యార్థునులతో మమేకమై..... ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని తిలకించేందుకు వివి ధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థినులతో జి ల్లా ఎస్పీ, పోలీసు అధికారులు మమేకమయ్యా రు. విధి నిర్వహణలో పోలీసులు వినియోగిస్తున్న వివిధ రకాల అత్యాధునిక ఆయుధాల గురించి, బాంబ్ డిస్పోజల్స్ పరికరాలు, సాంకేతికత గురించి వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఐ రవిశంకర్ రెడ్డి, ఆర్ఐలు విజె రామకృష్ణ, ఎం పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు. -
హలీమ్‌కు సలాం
రాజంపేట టౌన్ : రంజాన్ మాసంలో చేపట్టే వంటకాల్లో హలీం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఒకప్పుడు హైదరాబాద్‌లోనే దొరికే హలీం ఇప్పుడు ప్రధాన పట్టణాల్లోని ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రంజాన్ మాసం సందర్భంగా ఉపవాసం ఉండే ముస్లీంలే కాక ఇతర మతాల వారు హలీం రుచిని ఎంతో ప్రీతిగా ఆస్వాదిస్తారు. అందువల్ల ఇప్పుడు సాయంత్రం ఆరు గంటలు అయితే చాలు అనేక మంది ప్రజలు హలీం విక్రయించే చోట వాలిపోతున్నారు. హలీం అరబ్ దేశానికి చెందిన వంటకం హలీం అరబ్ దేశానికి చెందిన వంటకమని ముస్లీంలు చెబుతున్నారు. ఆరో నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ హయాంలో అరబ్ దేశమైన పర్షియా నుంచి హలీం తెలుగు రాష్ట్రమైన హైదరాబాద్‌కు చేరుకొని ఎంతో ప్రసిద్ధిగాంచింది. మహబూబ్ అలీఖాన్ తన సంస్థానంలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పర్షియా నుంచి ప్రత్యేక ఆహ్వానితులు వచ్చారు. ఆ సమయంలో రంజాన్ ఉపవాస దీక్షల్లో ఇఫ్తార్‌కు తయారు చేసే ప్రత్యేక వంటకమైన హలీం గురించి ప్రస్తావించారు. వెంటనే నవాబు తన సిబ్బందిని పిలిపించి హలీంను తయారు చేయించారు. ఆ విధంగా హలీం తొలుత హైదరాబాద్‌కు పరిచయమై ఇప్పుడు అన్ని పట్టణాలకు చేరుకుని ప్రజలతో లొట్టలేయిస్తోంది. తయారీ కూడా ప్రత్యేకమే సాంప్రదాయ వంటలతో పోలిస్తే హలీం తయారీ చాలా ప్రత్యేకమైనది. హలీం తయారీకి కనీసం తొమ్మిది గంటల సమయం పడుతుంది. ఇందులో మటన్ లేదా చికెన్, గోధుములు, అన్ని పప్పుదినుసులు, బాస్మతిబియ్యం, నెయ్యి, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, యాలకలు, దాల్చిన చెక్క, మిరియాలు, కొత్తిమీర, నూనె, డ్రైఫ్రూట్స్ తదితర వస్తువులను వినియోగించి తయారు చేసి ఇఫ్తార్ సమయానికి సిద్ధం చేస్తారు. ఉపవాసం ముగించుకున్న ముస్లీంలతో పాటు ఇతర మతాలకు చెందిన వారు సైతం హలీంను ఆరగించేందుకు ఇష్టపడతారు. అక్కడే తినేవారికి పింగాణి కప్పులలో వేయిస్తుండగా పార్శిల్ తీసుకెళ్లే వారికి బాక్సులలో వేయిస్తున్నారు. ఒక్కో బాక్సు రూ.150, రూ.250, రూ.500కు విక్రయిస్తున్నారు. రంజాన్ ప్రత్యేక వంటకంగా గుర్తింపు రుచికి ఫిదా అవుతున్న జనం -
పది పరీక్షలకు భానుడి సెగ
మదనపల్లె సిటీ : జిల్లాలో మార్చి రాగానే ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకూ ఉష్ణోగ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఓ వైపు ఎండల తీవ్రత.. మరో వైపు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రతకు భయపడి బయటకు రావాలంటే ప్రజలు హడలిపోతున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ సమయంలో విద్యార్థులు ఎక్కువ ఒత్తిడికి లోనవుతుంటారు. సక్రమంగా ఆహారం తీసుకోకుండా పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. ఒక వైపు పరీక్షలు.. మరో వైపు ఎండ వేడిమితో అల్లాడిపోయే విద్యార్థుల ఆరోగ్యం విషయంలోనూ తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిందే మరి. ఇలా చేయాలి.. ఎండ వేడిమి పెరుగుతుండడంతో విద్యార్థులు కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే నిద్రలేమి, డీ హైడ్రేషన్‌తో బాధపడాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలంటున్నారు. 24 గంటల వ్యవధిలో 8–10 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి. ఎండలో వెళ్తే టోపీ, గొడుగు లాంటివి వాడాలి. కళ్ల జోడు పెట్టుకోవాలి. విద్యార్థులు తేలికపాటి, లేత రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం. కూల్ డ్రింక్స్, జ్యూస్‌లు, ఐస్ కలిపిన రకరకాల పానీయాలు తాగొద్దు. ఐస్ శుభ్రంగా లేకపోతే డయేరియా, కలరా, టైఫాయిడ్, పచ్చ కామెర్లు వస్తాయి. బయటి ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. నూనె పదార్థాలు, వేపుళ్లు, ఉప్పు ఎక్కువ ఉండే జంక్‌పుడ్స్ తీసుకోకూడదు. ద్రవ పదార్థాలు ఎక్కువగా... కేవలం నీళ్లు కాకుండా కొబ్బరి నీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ, నిమ్మరసం లాంటివి తీసుకుంటే శరీరానికి నీటితో పాటు ఖనిజ లవణాలు అందుతాయి. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. దోసకాయ, కర్బూజ సలాడ్లు ఎక్కువగా తీసుకోవాలి. సొరకాయ, బీరకాయలాంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న కూరలు తీసుకోవడం ద్వారా శరీరంలో డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవచ్చు. కనీసం 7–8 గంటలు నిద్రపోవడం చాలా అవసరం. పోషకాహారం తీసుకోవడం వల్ల పరీక్షలు మరింత బాగా రాయగలుగుతారు. పరీక్షా సమయంలో జాగ్రత్తలు అవసరం! పోషకాహారం... తగినంత నిద్ర అవసరంవైద్యులను సంప్రదించాలి అధిక జ్వరం, పల్స్ పడిపోవడం, కండరాలు నొప్పులు, తీవ్రమైన నిస్సత్తువ, వాంతులు, విరేచనాలు లాంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే పరీక్ష బాగా రాయగలుగుతారు. – డాక్టర్ వెంకటరామయ్య, వైద్యులు, సీహెచ్సి,బి.కొత్తకోట -
ఇంటర్ పరీక్షలు ప్రశాంతం
రాయచోటి : జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 49 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో 13152 మందికి గానూ 12598 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో లోటుపాట్లు లేకుండా విద్యార్థులకు తగిన మౌలిక వసతులు కల్పించామని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఎం.కృష్ణయ్య తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 11639 మంది హాజరు కాగా 504 మంది గైర్హాజరయ్యారని, అలాగే ఒకేషనల్ పరీక్షలకు 969 మంది హాజరు కాగా 50 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని వారు తెలిపారు. మార్చి 30 నాటికి పక్కా గృహాలు పూర్తి చేయాలి – జిల్లా హౌసింగ్ పీడీ శివయ్య రామాపురం : మార్చి 30 నాటికి జిల్లాలో పక్కాగృహాలను పూర్తి చేయించాలని జిల్లా హౌసింగ్ పీడీ శివయ్య ఆదేశించారు. రామాపురం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 79,721 పక్కాగృహాలు మంజూరు కాగా, 2024 జూన్ నాటికి 33,179 పక్కాగృహాలు పూర్తి అయినట్లు తెలిపారు. రామాపురం మండలం హౌసిగ్ ఏఈగా పనిచేస్తున్న కేఎన్ఎం ప్రసాద్‌కు బదిలీ ఉత్తర్వులు ఇచ్చినా ఆఫీసుకు రావడం లేదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులు శ్రద్ధ చూపి గృహాలు త్వరగా నిర్మించుకోవాలన్నారు. సొంత స్ధలంలో ఇల్లు కట్టుకునే వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జాషువా పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం – డీఈవో సుబ్రహ్మణ్యం గుర్రంకొండ : డొక్కా సీతమ్మ పథకం కింద విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని డీఈవో సుబ్రహ్మణ్యం అన్నారు. గుర్రంకొండ, ఖండ్రిగ గ్రామాల్లో పాఠశాలల్లో బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక ఉర్దూ జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు వడ్డించడానికి సిద్ధంగా ఉంచిన భోజనాన్ని పరిశీలించారు. మధ్యాహ్న భోజనం తినే విద్యార్థుల హాజరు రిజిష్టర్ తనిఖీ చేసి ప్రతి విద్యార్థి భోజనం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయుడికి సూచించారు. అనంతరం ఖండ్రిగ ఉర్దూ ప్రాథమకోన్నత పాఠశాలను తనిఖీ చేసిన ఆయన ఎఫ్ఎ పరీక్షలు రాస్తున్న విద్యార్థులను కలిసి సిలబస్ గురించి ఆరా తీశారు. కొందరు ఉపాధ్యాయుల పనితీరుపై విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో ప్రతి ఉపాధ్యాయుడిపై హెడ్మాస్టర్లు నిఘా పెట్టాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి ఎఫ్ఎమ్ శిక్షణపై అడిగి తెలుసుకొన్నారు. సకాలంలో ఆంగన్వాడీ కేంద్రాలకు చేరుకొని మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సురేంద్రబాబు, హెడ్మాస్టర్ కమ్మర్తాజ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన లక్ష్మీ నరసింహస్వామి బ్రహోత్సవాలకు అంకురార్పణ వైభవంగా జరిగింది. స్వామి బ్రహోత్సవాలు బుధవారం నుంచి లాంఛనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే మూలవర్లకు అభిషేకం, తోమాల సేవ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా కలశస్థాపన చేసి వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ స్వస్తివాచనం, పుణ్యాహవాచనం గావించారు. అనంతరం రక్షాబంధనం, మృత్యంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. -
ఎండలు మండుతున్నాయి.. రాబోయే రెండు నెలల్లో 44 డిగ్రీలకు పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. భూగర్భ జలాలు అడుగంటిన పక్షంలో జలాశయాల నీటితోనే దాహార్తి తీర్చుకునే పరిస్థితి. కానీ ఆ దిశగా కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. రూ.100 కోట్
● నాడు వైఎస్సార్ చొరవతో.. ఈ పరిస్థితులు తెలుసుకున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గాలివీడు సమీపంలో వెలిగల్లు ప్రాజెక్టు పూర్తి చేయించారు. అక్కడి నుంచి 40 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయించి పట్టణ ప్రజల దాహార్తి తీర్చారు. నేటికీ రాయచోటి ప్రజలు తాగుతున్న నీరు, వినియోగిస్తున్న ప్రతి బొట్టులోనూ వైఎస్సార్ కృషి కనిపిస్తుంది. అనంతరం రాయచోటి పట్టణం జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందడంతో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అప్పటి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఆనాటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ప్రజల దాహార్తి తీర్చేందుకు వెలిగల్లు జలాశయం నుంచి రెండో పైపులైన్ నిర్మాణం కోసం రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయించారు. 60 శాతం మేర పనులు పూర్తి చేశారు. అనంతరం కూటమి ప్రభుత్వం ఆ పనులు నిలిపివేసింది. రాయచోటి వాసుల దాహార్తి తీర్చే అవకాశం లేకుండాపోయింది. జనాభాకు అవసరమైన నీరందడం లేదు. దీనికి తోడు వెలిగల్లు నుంచి పట్టణానికి రెండో పైపులైన్ నిర్మాణంలో భాగంగా గాలివీడు–మదనపల్లి రింగ్‌రోడ్డు సమీపంలో ఏర్పాటుచేస్తున్న ట్యాంకు పనులు, దిగువ అబ్బవరం సమీపంలో నిర్మిస్తున్న భూ ఉపరితల ట్యాంక్ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. కొత్తపల్లి ప్రాంతానికి తాగునీరందించే పాత పురపాలక సంఘం ప్రాంతంలోని ట్యాంకు కూల్చారే తప్ప కొత్తది నిర్మించలేదు. రాయచోటి : రాయచోటి పట్టణ పరిధి విస్తరించడంతో జనాభా 1.10 లక్షలకు చేరింది. 206 వీధులు ఉండగా.. సుమారు 32,355 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వీరికి ప్రస్తుతం 114 నీటి బోర్లు, 53 చేతిపంపుల ద్వారా అరకొరగా నీరు అందుతోంది. ఇవి చాలకపోవడంతో ప్రస్తుతం పట్టణానికి ప్రధాన ఆయువు వెలిగల్లు జలాశయం ద్వారా 40 కిలోమీటర్ల దూరంలోని రాయచోటి ప్రజలకు రోజూ పైపులైన్ల ద్వారా పట్టణ పురపాలక సంఘం నీటిని సరఫరా చేస్తోంది. సాధారణంగా రోజుకు 15 మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉండగా, కేవలం 9 మిలియన్ లీటర్ల నీరు వెలిగల్లు నుంచి అందుతోంది. మిలియన్ లీటర్ల నీటిని బోర్లు, చేతి పంపుల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇంకా ఐదు మిలియన్ల లీటర్ల నీటి అవసరం ఉంది. గత పరిస్థితి తలెత్తితే.. రాయచోటి పట్టణం దినదినాభివృద్ధి చెంది అన్నమయ్య జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందింది. అందుకు అనుగుణంగా పట్టణంలో ప్రతి ఒక్కరికీ కనీసం 40 లీటర్ల నీటిని అందించే దిశగా పురపాలక అధికారులు ప్రణాళికలు రూపొందించడం లేదనే విమర్శలున్నాయి. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా నెలకొన్న వర్షాభావం రాయచోటి పట్టణ వాసులకు అందించే నీటి సరఫరాపై పడిందే మాట వినిపిస్తోంది. రెండు దశాబ్దాల కిందట వరకూ గుక్కెడు నీటికోసం రాయచోటి వాసులు తపించిన విషయం నేటికీ కళ్లెదుట కనిపిస్తోంది. నాడు ఖాళీ బిందెలు సైకిళ్లు, ఎద్దులబండ్లు, అనుకూలమైన వాహనాలతో పట్టణ పరిసర ప్రాంతాలకు వెళ్లి పైసలు చెల్లించి చెమటోడ్చి నీటిని తెచ్చుకునే పరిస్థితి ఉండేది. ఒక్కమాటలో చెప్పాలంటే పట్టణ వాసులు నీటికోసం పోరాడిన రోజులే ఎక్కువ. నీటికోసం అవస్థలు తప్పవా? వెలిగల్లు జలాశయం నుంచి నీటిని అందించడంలో పురపాలక శాఖ అధికారుల నిర్లక్ష్యంతో పట్టణ వాసులకు ఈ ఏడాది దాహం కేకలు తప్పడం లేదు. పట్టణ పరిధిలో అక్కడక్కడ కొద్దో గొప్పో బోర్ల నుంచి పైపులైన్ల ద్వారా వివిధ ప్రాంతాలకు దిస్తున్న వందల లీటర్ల నీటి లీకేజీలు, నిర్వహణ లోపాలతో వృథా వుతోంది. ప్రధాన పైపులైన్ల నుంచి పట్టణంలోని 12457 ఇళ్లకు వారానికి ఒక రోజు వంతున నీటి కనెక్షన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇంకా 6 నుంచి 8 వేల కుటుంబాలకు నీటి సరఫరా సక్రమంగా లేదు. వారందరికీ నీరందించేందుకు వెలిగల్లు నుంచి రాయచోటికి, అనంతరం పట్టణంలో 125 కిలోమీటర్ల మేర పైపులైన్ ఏర్పాటు చేశారు. పైపులైన్లు, వాల్వ్‌ల నుంచి లీకేజీలు ఎక్కువగా ఉండడం, పైపులైన్లు తుప్పుపట్టి పగిలిపోవడం, కొత్తగా ఏర్పాటు చేసినవి బిగించకపోవడం తదితర కారణాలతో లీకేజీలు అధికంగా ఉన్నాయి. దీంతో పగలు, రాత్రి తేడా లేకుండా గంటల తరబడి ప్రధాన రహదారులు, వీధులలో నీరు వృథాగాపోతోంది. 206 వీధులు ఉండగా అందులో నూరు వీధుల్లో పైపులైన్లు దెబ్బతిని నీరు వృథాపోతోంది. దీనికి తోడు ప్రధాన పైపులైన్ నుంచి ఇళ్లకు సరఫరా చేయడానికి అంగుళం పరిమాణం కలిగిన గొట్టాలను అక్కడక్కడా మురుగు కాలువల నుంచి ఏర్పాటు చేశారు. పైపులు దెబ్బతింటే నీరు మురుగుతో కలిసి కలుషితమయ్యే ప్రమాదం ఉంది. ఈ సంఘటనలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నా.. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు ఇప్పటి వరకు చేపట్టడలేదు. ప్రధాన పైపులైన్ నిర్మాణ పనులు చేపట్టాలి రాయచోటి పట్టణ ప్రజల దాహార్తి తీర్చడానికి చేపట్టిన రెండో నీటి పథకం పనులు పూర్తిచేయాలి. అప్పటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి రూ.100 కోట్ల నిధులు రెండో పైపులైన్ నిర్మాణానికి మంజూరు చేయించారు. 60 శాతానికి పైగా పూర్తి చేయించారు. మిగిలిన పనులను పూర్తి చేయించి పట్టణ ప్రజల దాహార్తి తీర్చాల్సి ఉంది. పాత పురపాలక కేంద్రంలో తకొత్త ట్యాంకు నిర్మించాల్సి ఉంది. లీకేజీలకు మరమ్మతులు చేయించాల్సి ఉంది. – ఫయాజ్‌బాషా, మున్సిపల్ ఛైర్మన్, రాయచోటి జిల్లా కేంద్రానికి తప్పని తాగునీటి ఎద్దడి పైపుల లీకేజీలతో ప్రతి నిత్యం నీరు వృఽథా నాడు దివంగత వైఎస్సార్ చొరవతో తీరిన దాహార్తి నేడు రూ.100 కోట్లతో చేపట్టిన పనుల నిలిపివేత పెరిగిన జనాభాకు 15 మిలియన్ లీటర్లు అవసరం సమస్యను అధిగమిస్తాం జిల్లా కేంద్రంలో తాగునీటి సమస్యను ప్రణాళికాబద్ధంగా అధిగమిస్తాం. పట్టణంలో పైపులైన్ల నుంచి నీటి లీకేజీలు అరికట్టడానికి చర్యలు చేపట్టాం. దెబ్బతిన్న పైపులైన్లు గుర్తించి వాటికి మరమ్మతులు చేస్తాం. తద్వారా నీరు వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. వెలిగల్లు నుంచి రెండో పైపు నిర్మాణ పనులు పాత కాంట్రాక్టర్ ద్వారానే కొనసాగించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆదేశించారు. – వాసుబాబు, మునిసిపల్ కమిషనర్, రాయచోటి -
పశువైద్య కళాశాలలో ఉద్రిక్తత
ప్రొద్దుటూరు రూరల్ : మండలంలోని గోపవరం సమీపంలోని పశువైద్య కళాశాలలో బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుపతి పశువైద్య విశ్వవిద్యాలయం వీసీ ఉత్తర్వుల మేరకు ఉదయం 7 గంటలకు కళాశాలలోని విద్యార్థుల హాస్టల్‌ను మూసివేశారు. ఉదయం అల్పాహారం హాస్టల్లో తయారు చేయకపోవడంతో పశువైద్య విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల ప్రధాన గేట్ వద్ద బైఠాయించి టీచింగ్, నాన్ టీచింగ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఎవరిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ మహ్మద్ రఫి తన సిబ్బందితో అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారని, క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి వస్తుందని విద్యార్థులను ఎస్ఐ హెచ్చరించారు. దీంతో విద్యార్థులు మెయిన్ గేట్‌ను ఓపెన్ చేశారు. అనంతరం కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాసప్రసాద్‌ను పశువైద్య విద్యార్థులు కలిసి వినతి పత్రం సమర్పించారు. కళాశాల హాస్టల్‌ను తెరవాలని కోరారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రొద్దుటూరు నుంచి క్యాటరింగ్ ద్వారా విద్యార్థులంతా భోజనాలు తెప్పించుకుని అక్కడే తిన్నారు. అనంతరం శిబిరంలో కూర్చొని యథావిధిగా సమ్మె చేశారు. తమ ఉద్యమాన్ని అణచివేసేందుకే పశువైద్య కళాశాలల్లో హాస్టల్‌ను మూసివేసి అధికారులు బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. కళాశాలలో హాస్టల్ మూసివేత బైఠాయించి నిరసన తెలిపిన విద్యార్థులు -
ధర లభిస్తుందనే ఆశతోనే..
టమాట సాగు జూదంగా మారింది. ధరలు నిలకడగా లేకపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. క్యారెట్, బీట్రూట్, వేరుశెనగ సాగు చేసి ఇప్పుడు టమాట పంట సాగు చేపట్టాను. ఒకటిన్నర ఎకరంలో దుక్కులు దున్ని, టమాట నారు నాటేందుకు ఇప్పటికే రూ.80 వేలు ఖర్చయ్యింది. దిగుబడి వచ్చే ముందు వరకు రూ.3 లక్షలు ఖర్చవుతుంది. ఆ సమయానికి ధరలు ఉంటాయనే ఆశతో పంట సాగు చేస్తున్నా. ధర లభించకపోతే నష్టాలు తప్పవు. – శివారెడ్డి, టమాట రైతు, పోతుపేట వారం తర్వాత డిమాండ్ టమాట సాగు చేసేందుకు మొక్కలకు ఈ నెల రెండో వారం నుంచి డిమాండ్ ఉంటుంది. మే నెలలో దిగబడులు వచ్చేలా రైతులు పంట సాగు చేస్తారు. దీంతో ఏప్రిల్ 10వ తేదీ వరకు మొక్కల కోసం రైతులు నర్సరీల వద్ద క్యూ కడతారు. ఒక్కో మొక్కను 50 నుంచి 70 పైసలకు విక్రయిస్తాం. ఎకరాకు 7 నుంచి 10 వేల మొక్కలు అవసరమవుతాయి. రైతులు పంటను సాగుచేసే సమయానికి డిమాండ్‌కు తగ్గ నారును సిద్ధం చేసి ఉంచుతాం. – పి.నాగరాజు, నర్సరీ నిర్వహకుడు, అంగళ్లు -
అందరి నోట.. టమాట
● ఈ వేసవిలో అత్యధిక ధర లభిస్తుందనే నమ్మకం ● పెట్టుబడి భారం లెక్క చేయకుండా టమాట సాగు ● జిల్లా వ్యాప్తంగా 4,303 ఎకరాల్లో సాగు ● ప్రస్తుతం 2,791 ఎకరాల్లో పంట దిగుబడులు బి.కొత్తకోట : టమాట పంటతో ఈ మారు తాడో పేడో తేల్చుకోవాలని రైతాంగం సిద్ధమైంది. రాష్ట్రంలో అత్యధికంగా సాగయ్యే తంబళ్లపల్లి నియోజకవర్గంలోనూ గత ఏడాది పంట సాగులో కష్టాలు, నష్టాలు, సమంగా చూస్తూ ఈ ఏడాది రైతాంగం సర్దుకుపోతోంది. ఎవరి నోట విన్నా టమాటా సాగు మాటే వినిపిస్తోంది. వేసవిలో టమాటా ధరలను దృష్టిలో పెట్టుకున్న రైతులు.. మళ్లీ తమ కష్టాలు తీరిపోతాయనే ఆశతో పంట సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 4,303 ఎకరాల్లో టమాట పంట సాగైంది. ఈ పంట కాలం పూర్తి కావస్తోంది. ఇందులో 60 శాతం మేర తంబళ్లపల్లి నియోజకవర్గంలోనే సాగైంది. ప్రస్తుతం 2,791 ఎకరాల్లో దిగుబడులు తీయడమేగాక, గడచిన 15 రోజుల్లో కొత్తగా 812.5 ఎకరాల్లో మళ్లీ పంట సాగుచేసినట్లు అధికారిక లెక్క. అయితే ఇప్పటికే వేయి ఎకరాలకు పైగా దాటిపోయినట్టు అంచనా. పెద్దతిప్పసముద్రం, తంబళ్లపల్లి, కురబలకోట, సంబేపల్లి, పెద్దమండ్యం కలకడ, గుర్రకొండ మండలాల్లో 250 ఎకరాలకు పైగా, కలికిరి, రామసముద్రం, చిన్నమండెం, గాలివీడులో, మదనపల్లి, వీరబల్లి, రాయచోటి, కేవిపల్లి, రామాపురంలో, వాయల్పాడు, పీలేరు, టి.సుండుపల్లి, నిమ్మనపల్లి, లక్కిరెడ్డిపల్లి గ్రామాల్లో 740 ఎకరాల్లోనూ ఈ టమాటా పంట సాగు చేశారు. ధరలపై అశతోనే టమాట పంటకు గత ఏడాది పలికిన అత్యధిక ధరలను దృష్టిలో పెట్టుకుని రైతులు ఈ మారు అత్యధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. కొద్దిపాటి పొలం ఉన్న రైతు తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని సాగుచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. 2024 మే నెలలో మార్కెట్లో కిలో టమాట రూ.48 నుంచి రూ.52 పలికింది. జూన్‌లో రూ.88 నుంచి రూ.100, జూలైలో రూ.88 నుంచి రూ.95 వరకు పెరిగింది. మార్కెట్లో రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేసిన ధర. బహిరంగ మార్కెట్లో మూడో రకం టమాట ధర కిలో సెంచురీ దాటింది. ఒక్క తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచే రోజుకు 800 నుంచి వెయ్యి టన్నుల టమాట దిగుబడి వచ్చింది. ములకలచెరువు, మదనపల్లి, కర్నాటకలోని కోలారు మార్కెట్లలో విక్రయించారు. ఈ ధరలను దృష్టిలో పెట్టుకుని రైతులు మళ్లీ ఇవే ధరలు పలుకుతాయని భావిస్తున్నారు. తమ కష్టాలు తీరిపోతాయనే ఆశతో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. 3 వేల ఎకరాల్లో సాగుప్రస్తుతం తంబళ్లపల్లి నియోజకవర్గంలో టమాటా సాగుపై నెలకొన్న పరిస్థితుల మేరకు ఈ నెలాఖరు, ఏప్రిల్ రెండో వారం వరకూ కనీసం మూడు వేల ఎకరాల్లో టమాట సాగయ్యే సూచనలు ఉన్నాయి. ఈ సాగంతా వ్యవసాయ బోర్ల కింద మాత్రమే. రైతులు పంట సాగుచేశాక భూగర్భ జలాలు నిలకడంగా ఉంటాయనే నమ్మకం లేదు. గత రెండేళ్లుగా సరైన వర్షాలు కురవలేదు. గత ఖరీఫ్‌లో కరవు నెలకొని పంటకు నష్టం వాటిల్లింది. తీవ్రమైన ఎండలు, భూగర్భజలాలు టమాట సాగు, దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. దీంతో ధరలు పలకడం మాట అటుంచితే.. పంటను కాపాడుకుని లాభాలు పొందడం కత్తిమీద సామే అవుతుంది. ఈ పరిస్థితుల్లో టమాట పంట రైతాంగాన్ని ముంచుతుందో.. తేల్చుతుందో దిగుబడులు మొదలయ్యాక తేలిపోతుంది. తంబళ్లపల్లిలో టమాట సాగు (ఎకరాల్లో) మండలం సాగులో కొత్త పంట ములకలచెరువు 650 160 పెద్దతిప్పసముద్రం 578 125 తంబళ్లపల్లి 458 145 బి.కొత్తకోట 458 117.5 కురబలకోట 389 135 పెద్దమండ్యం 281 130 సంబేపల్లిలో ––– 286 కలకడలో ––– 254 గుర్రంకొండ ––– 245 -
చంపుతామని బెదిరించడంతో... గుండెపోటుతో వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి
సాక్షి టాస్క్‌ఫోర్స్ : పెనగలూరు మండలం, కొండూరు పంచాయతీ, తిరణంపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త బయనబోయిన పెంచలయ్య (65) ప్రాణ భయంతో గుండె ఆగి మంగళవారం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా.. తిరుణంపల్లి గ్రామ సర్వే నెంబరు 5లో 2.76 ఎకరాలు పెంచలయ్య పేరుతో రెండేళ్ల క్రితం ఆన్లైన్ అయింది. అనంతరం ఆ సర్వే నెంబర్‌ను తన భార్య పేరుతో రిజిస్టర్ చేయించాడు. తిరుణంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బయనబోయిన బుజ్జి అలియాస్ మణి, వెంకటేష్‌లు ఈ భూమి తమదంటూ రెండేళ్ల నుంచి పెంచలయ్య కుటుంబ సభ్యులను వేధిస్తున్నారు. మంగళవారం మృతుడు తన భూమిలో ఎండిపోయిన వేపచెట్టును కొట్టేందుకు ఉదయం 7 గంటలకు కూలీలను తీసుకెళ్లాడు. చెట్టును కొడుతున్న సమయంలో మణి, మరికొంత మంది అక్కడికి వచ్చి ఈ చెట్టును ఎందుకు కొడుతున్నావంటూ తీవ్రంగా దుర్భాషలాడారు. భూమిని రిజిస్టర్ చేయించుకున్నావు. నిన్ను కచ్చితంగా చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన పెంచలయ్య అదే భయంతో ఇంటికి వెళ్లాడు. ఉదయం 9 గంటల సమయంలో గుండెనొప్పి రావడంతో వాహనంలో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతి చెందాడు. చంపుతామని బెదిరించడంతోనే భయపడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని పెనగలూరు పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువచ్చారు. రాజంపేట రూరల్ సీఐ వెంకటరమణ, ఎస్ఐ రవిప్రకాష్ రెడ్డిలు మృతుని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు. కాగా చివరి క్షణంలో మృతుని కుటుంబ సభ్యులు గుండెపోటుతో మృతి చెందాడని స్టేట్మెంట్ రాసి కేసు వద్దని వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. -
దేవుడా.. ఏమిటయ్యా ఈ ఘోరం.!
కురబలకోట : భార్యా భర్తలు ఒకరి తర్వాత ఒకరు కన్నుమూశారు. అంతేకాదు భార్య చనిపోయిన విషయం భర్తకు తెలీదు. భర్త విషయం భార్యకు తెలీదు. తల్లిదండ్రులు దూరమవడంతో వీరి ఇద్దరి కుమార్తెలను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. మాటలకందని విషాదం అలుముకుంది. కన్నీరుకే కన్నీరు తెప్పించే విషాద సంఘటన ఇది. గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని అడవిపల్లెకు చెందిన ఎ. మాధవరెడ్డి (50) బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. భార్య శారద (39). వీరికి ఇద్దరు కుమార్తెలు. ఇటీవల శారద తండ్రి చంద్రశేఖర్‌రెడ్డి అస్వస్థతకు గురి కావడంతో అతన్ని చూసేందుకు బెంగళూరు నుంచి వచ్చారు. తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రిని పలకరించి శనివారం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. కారులో వస్తుండగా వాల్మీకిపురం సమీపంలోని విఠలం వద్ద ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరిద్దరూ గాయపడ్డారు. భార్య ఎ. శారద తీవ్రంగా గాయపడి శనివారం సాయంత్రం అక్కడికక్కడే మృతి చెందారు. భర్త ఎ. మాధవరెడ్డి గాయపడి బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు మృతి చెందడంతో వీరి స్వగ్రామమైన మండలంలోని అడవిపల్లె శోక సంద్రమైంది. రెండు రోజుల క్రితం భార్య శారదమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. ఆ విషాదం నుండి తేరుకోకమునుపే మంగళవారం అదే ఊరిలో భర్త అంత్యక్రియలు జరిపారు. అమ్మా..నాన్న ఇక మాకెవరు దిక్కు అంటూ వీరి కుమార్తెలు రోదించడం చూపరులను కలచి వేసింది. వీరిని చూసిన బంధుమిత్రులు వేదన చెందారు. ఇంటికి దీపంగా కంటికి రూపంగా ఉండాల్సిన తల్లిదండ్రులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో అడవిపల్లె తల్లడిల్లి పోయింది. వీరి కుమార్తెలను, రక్త సంబంధీకులను ఓదార్చడం ఎవరిరతం కాలేదు. భార్య సమాధి పక్కనే భర్త అంత్యక్రియలు నిర్వహించారు. భార్యా భర్తలు ఒకరి తర్వాత ఒకరు మృతి అడవిపల్లెలో అంతులేని విషాదం -
మాసూమ్ రోజేదార్.!
మదనపల్లె సిటీ : రంజాన్ మాసం ముస్లింలకు పరమ పవిత్ర మాసం. ఇస్లాం కాలమానంలోని 9వ నెల రంజాన్. ఈ మాసంలో ముస్లింలు 30 రోజుల పాటు ఎంతో నిష్టతో ఉపవాసదీక్షలు చేపడతారు. ఇందులో భాగంగా వేకువ జామున 4 గంటల సమయంలో అల్పాహారాన్ని స్వీకరిస్తారు. దీనిని ‘సహరీ’ అంటారు. అప్పటి నుంచి సాయంత్రం 6.30 వరకు ఎలాంటి ఆహార పానీయాలు సేవించకుండా ఉపవాసదీక్షను చేపడతారు. సాయంత్రం 6.30 గంటలకు ఖర్జూరంతో ఉపవాసదీక్షలు విరమిస్తారు. దీనిని ఇఫ్తార్ అంటారు. పెద్దలపై మాత్రమే ఉపవాసదీక్షలు విధిగా ఉండాలన్న నిబంధన ఉంది. మదనపల్లె పట్టణంలో 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలలోపు చిన్నారులు కూడా ఉపవాసదీక్షను చేపడుతున్నారు. వారిని చూసిన ప్రతి ఒక్కరూ వారి దైవభక్తిని మెచ్చుకొని ‘మాసూమ్ రోజేదార్’(ఉపవాసం ఉన్న అమాయక బాలలు) అని అంటున్నారు. ఇలాంటి పలువురు చిన్నారులు ‘సాక్షి’కి కనిపించారు. వారిని పలకరిస్తే ఉపవాసదీక్షలను పాటించడం తమకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఉపవాసదీక్ష చేపడుతున్న చిన్నారులు -
పైపులైన్ కోసం టీడీపీ వర్గీయుల ఘర్షణ
వీరబల్లి : మండలంలోని గుర్రప్పగారిపల్లి పంచాయతీలోని కొత్త వడ్డిపల్లిలో తెలుగుదేశం పార్టీ వర్గీయుల మధ్య పైపులైన్ కోసం మంగళవారం ఉదయం ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో జగన్మోహన్ రాజు వర్గీయులు సుగవాసి బాల సుబ్రమణ్యం వర్గీయులైన చంద్రశేఖర్‌పై దాడి చేశారు. ఈ దాడిలో చంద్రశేఖర్ తలకు బలమైన గాయం తగిలింది. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం సాయంత్రం ఇరువర్గీయులైన చంద్రశేఖర్, చంద్రమోహన్లు పైపులైన్ గేట్ వాల్ గురించి వాదోపవాదాలు చేరుకున్నారు. అంతటితో ఆగకుండా మంగళవారం తెల్లవారుజామున జగన్ మోహన్ రాజు వర్గీయులైన వీరనాగయ్య, చంద్రమోహన్లు కలిసి బాలసుబ్రమణ్యం వర్గీయులైన చంద్రశేఖర్‌పై దాడి చేసి గాయపరిచారు. ఈ ఘర్షణలో చంద్రశేఖర్ తలకు బలమైన గాయం తగిలింది. బాధితుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడిని పోలీసులు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్టార్టర్ చోరీపై ఫిర్యాదు నిమ్మనపల్లె : మండలంలోని అగ్రహారం గ్రామానికి చెందిన మునిరత్నం అలియాస్ రామారావుకు చెందిన బోరుబావి వద్ద సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రూ. 12 వేలు విలువచేసే స్టార్టర్ పెట్టెను చోరీ చేశారు. మంగళవారం ఉదయం బోరు వద్దకు వెళ్లిన రైతు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించాడు. వెంటనే నిమ్మనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరిపై 6ఏ కేసు నమోదు సిద్దవటం : రేషన్ బియ్యం 750 కిలోలు ఉన్నట్లు గుర్తించి డీలర్ బి. సుబ్బరాయుడు, ఎండీయూ ఆపరేటర్ శంకర్‌లపై మంగళవారం 6ఏ కేసు నమోదు చేశామని విజిలెన్స్ ఎఫోర్స్మెంట్ సీఐ శివన్న తెలిపారు. మాధవరం–1 గ్రామంలో రేషన్ అక్రమంగా రవాణా జరుగుతున్నట్లు సమాచారం రావడంతో సోమవారం రాత్రి ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించామన్నారు. దాడుల్లో వీరి నివాసాల్లో 750 కిలోల రేషన్ బ్యియం పట్టుబడ్డాయన్నారు. ఈ దాడిలో సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ సౌజన్య, వీఆర్ఓ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
భూ వివాదంలో రైతుపై దాడి
గాలివీడు : మండల పరిధిలోని గోరాన్ చెరువు గ్రామం బండివాండ్లపల్లె భూ వివాదంలో మంగళవారం రైతుపై దాడి ఘటన చోటు చేసుకుంది. బాధితుని కథనం మేరకు మిట్టపల్లి కాటం రెడ్డి, బొజ్జమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. కాగా, వీరికి 21 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దాదాపు ముప్ఫై సంవత్సరాల క్రితం మొత్తం భూమిని అన్నదమ్ములు సమ భాగాలు చేసుకున్నారు. ఈ క్రమంలో మిట్టపల్లి విశ్వనాథ రెడ్డి సర్వే నంబర్ 2024లో తనకు కేటాయించిన భూమిలో దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం మామిడి మొక్కలు పెంచుకున్నాడు. భూ భాగాల విషయమై తరచూ అన్నదమ్ములు ఘర్షణ పడేవారు. ఇదే విషయమై రెవెన్యూ, పోలీసు అధికారులకు పలుమార్లు విశ్వనాథరెడ్డి తెలియజేస్తూ, భూ భాగాల ఒప్పంద పత్రాలు ఉన్నప్పటికీ అన్నదమ్ములు దానిని తిరస్కరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తనకు కేటాయించిన భాగంలో మామిడి మొక్కలు పెంచుకున్నానని, తిరిగి అందులో మరోమారు భాగాలు పంచాలంటున్నారని తెలిపాడు. ఈ విషయమై జిల్లా ఎస్పీని కలసి వినతిపత్రం ఇచ్చానన్నారు. అయితే మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు మామిడి తోటకు వెళ్లే దారిలో మాటువేసి తనపై ముసుగు వేసి దాడి చేశారని కన్నీటి పర్యంతమయ్యాడు. కుటుంబ సభ్యుల సహాయంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరానని తెలిపాడు. అధికారులు విచారణ జరిపి తనపై దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తన భూమిని తనకు ఇప్పించాలని కోరాడు. -
బోరు విషయమై వ్యక్తిపై దాడి
మదనపల్లె : బోరు విషయమై చెలరేగిన వివాదం కారణంగా ఓ వ్యక్తిపై దాడి చేసిన సంఘటన మంగళవారం మదనపల్లె మండలంలో జరిగింది. కొత్తవారిపల్లి పంచాయతీ గాజులవారిపల్లెకు చెందిన చంద్రయ్య(56), అతని తమ్ముడు చిన్న రెడ్డప్పలకు ఉమ్మడిగా బోరుబావి ఉంది. ఇటీవల బోరు చెడిపోవడంతో చిన్న రెడ్డప్ప కొంత నగదు వెచ్చించి మరమ్మతు చేయించాడు. చంద్రయ్య వాటాకు సంబంధించిన నగదు చెల్లించకపోవడంతో, ఈ విషయమై చిన్న రెడ్డప్ప చంద్రయ్యను నిలదీశాడు. ఇరువురి మధ్య వాగ్వాదం జరుగుతుండగా, చిన్న రెడ్డప్ప కుమారుడు గంగాధర్ అక్కడికి చేరుకుని ఇద్దరు కలిసి చంద్రయ్యపై కరల్రతో దాడి చేశారు. దాడిలో చంద్రయ్య తీవ్రంగా గాయపడగా, గమనించిన స్థానికులు మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి గాలివీడు : పట్టణంలో భిక్షాటన చేసుకునే గుర్తు తెలియని వ్యక్తి కడప రిమ్స్‌లో మృతి చెందాడని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. గత ముప్ఫై సంవత్సరాలుగా గాలివీడు పట్టణం గేటు పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేసుకుంటూ మతిస్థిమితం లేక వీధుల్లో తిరుగుతుండేవాడన్నారు. అనారోగ్యంతో రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి సంబంధీకులు ఎవరైనా ఉంటే గాలివీడు ఎస్ఐ 9121100556 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. పంట పొలాలపై అడవి పందుల దాడి పుల్లంపేట : మండలంలోని అనంతంపల్లి పంచాయతీకి చెందిన తిప్పన ప్రభాకర్ రెడ్డి అనే రైతు అరటి పంటను సోమవారం రాత్రి అడవి పందులు ధ్వంసం చేశాయి. పంట చేతికందే సమయంలో సుమారు 50 అరటి చెట్లను అడవి పందులు ధ్వంసం చేశాయని బాధిత రైతు వాపోయాడు. ఫారెస్టు అధికారులు స్పందించి అడవి పందులు పంట పొలాల్లోకి రాకుండా చూడాలని, అలాగే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం మంజూరు చేయాలని రైతు ప్రభాకర్ రెడ్డి కోరుతున్నాడు. మహిళ ఆత్మహత్యాయత్నం రామసముద్రం : కుటుంబ కలహాల కారణంగా భర్తతో గొడవపడి వివాహిత విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం రామసముద్రంలో జరిగింది. ఎస్ఐ రవికుమార్ కథనం మేరకు.. రామసముద్రం గాజులనగర్కు చెందిన కళాకారుడు తిరుమలేష్ తన భార్య లక్ష్మీదేవి(32)తో ఆర్థిక లావాదేవీల విషయమై గొడవ పడి చేయి చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ఇంట్లో ఉన్న విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబీకులు వెంటనే బాధితురాలిని చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వైద్యుల సిఫార్సు మేరకు తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురికి తీవ్ర గాయాలు
మదనపల్లె : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మండలంలోని చిప్పిలి గ్రామానికి చెందిన నారాయణస్వామి(55) ట్రాక్టర్ కూలీగా పనిచేస్తూ జీవిస్తున్నాడు. మంగళవారం స్థానికంగా కూలి పనులకు వెళ్లి మధ్యాహ్నం తిరిగి ఇంటికి వస్తూ రోడ్డు దాటుతుండగా, కడప నుంచి బెంగళూరుకు వెళ్తున్న కారు వేగంగా ఢీకొంది. ప్రమాదంలో నారాయణస్వామి తలకు గాయమై తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి వెళ్లాడు. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. మండలంలోని ఆరోగ్యవరానికి చెందిన ధనమ్మ(72), స్థానికంగా రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం వచ్చి ఢీకొంది. ప్రమాదంలో బాధితురాలు తీవ్రంగా గాయపడగా స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా బాలాజీ నగర్‌కు చెందిన రఘునాథరెడ్డి (45), కుమారపురానికి చెందిన వెంకటస్వామి (46), ద్విచక్ర వాహనంలో వచ్చి సీటీఎం రోడ్డులోని పద్మావతి కళ్యాణ మండపం వద్ద రోడ్డు పక్కన నిలిచి ఉండగా, ద్విచక్ర వాహనం ఢీకొంది. వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనదారుడు ఆటోను ఢీకొని ఆ పైన రఘునాథ్ రెడ్డి, కుమారస్వామి ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నాడు. ప్రమాదంలో ఇద్దరు గాయపడగా గమనించిన స్థానికులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు. -
రాయచోటిలో ఉద్రిక్తత
రాయచోటి: రాయచోటిలోని శ్రీ వీరభద్రస్వామి పారువేట ఊరేగింపులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల నుంచి సామరస్య పరిస్థితులు నెలకొనక పోవడంతో ఒక దశలో పోలీసులు లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం ఆలయం నుంచి స్వామి వారి ఊరేగింపు ఠాణా మీదుగా రవి థియేటర్ సమీపంలోని పారువేట ప్రాంతానికి చేరుకుంది. ఊరేగింపులో భాగంగా కంసల వీధి నుంచి ఠాణా సర్కిల్లోని పెద్ద మసీదు వద్దకు చేరుకోగానే.. మరో వర్గం రోడ్డుపైకి రావడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు వర్గాలలోని చిల్లర మూకల కారణంగా పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో.. రెండో మారు ఎస్పీ సమక్షంలోనే పోలీసులు లాఠీచార్జీ చేసి ఇరువర్గాలను చెదరగొట్టాల్సి వచ్చింది. పరిస్థితులను అదుపు చేసేందుకు పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. అనంతరం పారువేట కార్యక్రమాన్ని ప్రశాంతంగా ముగించారు. ఇరువర్గాలకు హెచ్చరిక: ఎస్పీ శాంతి భద్రతలకు ఏ మాత్రం విఘాతం కలిగించినా, అసాంఘిక శక్తులు బయటికి వచ్చినా తాట తీసి, కేసులు పెట్టి అంతు చూస్తామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. వర్గాలను ఎవరు రెచ్చగొట్టినా చర్యలు కఠినంగా ఉంటాయని ఆయన తీవ్రంగా స్పందించారు. అదే స్థాయిలో స్థానిక పోలీస్ అధికారులు కూడా అప్రమత్తం కాకపోతే శాఖ పరమైన చర్యలు తప్పవని పట్టణ పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు -
మార్చి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. జనం చల్లని పానియాలు తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయినా ఎండ తీవ్రతకు దాహార్తి తీరడం లేదు. దీంతో వేసవి తాపం నుంచి ఉప శమనం కలిగించే పండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో వీటి ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ పరిణామం
● గతేడాది కంటే తక్కువ సాగు ● దిగుబడి కొనుగోలుపై వ్యాపారుల ఆసక్తి ● తొలి కోతలోనే అధిక ధరలు ● లాభాల బాటలో రైతులు రైల్వేకోడూరు అర్బన్: గత కొన్నేళ్లుగా దోస పంట రైతులకు నష్టాలు మిగిల్చింది. తెగుళ్ల బెడదతో దిగుబడి సరిగా రాకపోవడం.. నాణ్యత కూడా లేకపోవడంతో ధరలు పలకలేదు. దీంతో ఈ ఏడాది దోస పంట సాగు చేసేందుకు అధిక మంది రైతులు ఆసక్తి చూపలేదు. జిల్లా వ్యాప్తంగా తక్కువ విస్తీర్ణంలో సాగైంది. దీంతో దిగుబడి కూడా తక్కువగా వస్తోంది. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేదు. ఈ నేపథ్యంలో దోస కాయల రేటు విపరీతంగా పెరిగింది. ఈ ఏడాదంతా ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తెగుళ్లను అధిగమిస్తే.. లాభాలు దోస పంటకు ఆశించే అన్ని రకాల తెగుళ్ల నుంచి కాపాడుకుంటే.. ఈ రెండు నెలల్లో వచ్చే దిగుబడికి అధిక ధరలు ఉండి సిరులు కురిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం మొదటి కోతలో టన్ను రూ.22 వేల నుంచి 24 వేల వరకు ధర పలుకుతోంది. రైతులకు లాభాలు తెచ్చి పెడుతున్నాయి. జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో గత 5 ఏళ్లు 3900 ఎకరాలకు పైగా సాగు చేశారు. ఈ ఏడాది 3500 ఎకరాలు సాగు చేసినట్లు తెలుస్తోంది. ఏటా సెప్టెంబర్ నుంచి మార్చి వరకు సాగు చేస్తుంటారు. మల్చింగ్ షీట్‌పై పండించే దోస పంటకు విత్తనాలకే అధిక పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దుక్కుల నుంచి దిగుబడి చేతికి వచ్చే వరకు అన్నీ కలిపి ఎకరాకు రూ. 60 వేల వరకు పెట్టుబడి అవుతుంది. తెగుళ్లను అధిగమించి దిగుబడి వస్తే లక్ష రూపాయల వరకు ఆదాయం ఉంటుంది. అందువల్ల రైతులు దోస పంటపై ఆసక్తి చూపుతున్నారు. అయితే పెట్టుబడి అధికం అవుతుండటంతో కొంత మంది వెనకడుగు వేస్తున్నారు. పెట్టుబడికి అవసరమయ్యే అంత డబ్బున్న వారు ఈ పంటపై మక్కువ చూపుతున్నారు. రెండవ కోతలో టన్ను రూ.14 వేల నుంచి 23 వేల వరకు పలికే అవకాశం ఉంటుందని అంటున్నారు. పంటను కాపాడుకుంటే ఈ నెలతోపాటు ఏప్రిల్‌లో అధిక ధర పలికే అవకాశం ఉంటుంది. పంటకు రైతులు సస్యరక్షణ చర్యలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. రైల్వేకోడూరు మండలం బొజ్జావారిపల్లెలో సాగు చేసిన దోస పంట నియోజకవర్గం దోస (ఎకరాల్లో..) తక్కువ కాలంలోనే దిగుబడి ఈ ఏడాది దిగుబడి చేతికి వచ్చిన ప్రారంభ దశలోనే దోస పంట అధిక ధర పలుకుతూ లాభాలు తెచ్చి పెడుతోంది. జిల్లా వ్యాప్తంగా అధికంగా రైల్వేకోడూరు నియోజకవర్గంలో పండిస్తున్నారు. రాయచోటి, పీలేరు, రాజంపేట, మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో కూడా కొంత మేర సాగు చేశారు. సాధారణంగా రైతులు దోస పంటను తక్కువ సమయంలో దిగుబడి చేతికొచ్చి.. లాభాలు చూడవచ్చన్న కొండంత ఆశతో పండిస్తుంటారు. దుక్కులు, బోదెలుకట్టడం, మల్చింగ్‌షీట్, డ్రిప్ ఎరువులు అన్నీ కలిపి ఎకరాకు రూ.60 వేలకు పైగా పెట్టుబడి అవుతుంది. అయినా కేవలం రెండు నెలల్లో దిగుబడి, లాభాలు వస్తాయనే ఉద్దేశంతో రైతులు దోస పంట పండిస్తారు. రైల్వేకోడూరు 2210 రాయచోటి 480 రాజంపేట 179 మదనపల్లి 125 పీలేరు 230 తంబళ్లపల్లి 708 -
విజయం సులువు
ప్రణాళికతో చదువు.. సంబేపల్లె: విద్యార్థి జీవితానికి పదో తరగతి కీలక మలుపు. ఉన్నత విద్యకు, ఆ తర్వాత బంగారు భవిష్యత్తుకు పునాది. ఇది దృఢంగా ఉండాలంటే పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలి. ప్రణాళిక ప్రకారం చదువుతూ.. ఉపాధ్యాయులు చెప్పిన మెలకువలు పాటిస్తే.. ఇదేమంత కష్టం కాదంటున్నారు నిపుణులు. మార్చి 17 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ముందస్తు ప్రిపరేషన్ కోసం సబ్జెక్టు నిపుణుల అభిప్రాయాలతో ప్రత్యేక కథనం. సమయం లేదు మిత్రమా .. పది పరీక్షలకు దాదాపు రెండు వారాల సమయం మాత్రమే వుంది. పరీక్షలు ఎలా రాయాలి. ఉత్తమ మార్కులు సాధించేందుకు ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి, ఏ పాఠ్యాంశాలను రివిజన్ చేసుకోవాలి? వంటి అంశాలపై ఆయా సబ్జెక్టు టీచర్ల సలహాలు, సూచనలు తీసుకోవాలంటున్నారు నిపుణు లు. ముఖ్యమైన అంశాలపై పట్టు బిగిస్తే ఉత్తమ మా ర్కులతో ఉత్తీర్ణత సాధించవచ్చునని చెబుతున్నారు. అలాగే ‘తెలుగులో దోషాలుండొద్దు.. హిందీలో నిబంధ్‌పై పట్టుండాలి.. ఆంగ్లంలో ఎడిటింగ్ ము ఖ్యం, జీవన చిత్రాలపై తర్ఫీదు అవసరం, తికమక పడొద్దు.. సూత్రాల లెక్క తప్పొద్దు.. చరిత్ర తెలుసుకోవాలి’ అంటున్నారు.. ఆయా సబ్జెక్టు టీచర్లు. జిల్లాలో పదో తరగతి విద్యార్థుల వివరాలు మొత్తం విద్యార్థులు: 24,310 ప్రభుత్వ, జెడ్పీ హైస్కూల్ వారు: 12,559 మున్సిపల్ హైస్కూళ్లు, రెసిడెన్సీ హైస్కూళ్లు: 2,126 ఆదర్శ పాఠశాలలు: 1484 కేజీబీవీ: 799 ప్రైవేటు ఎయిడెడ్, అన్ఎయిడెడ్ : 7413మదరసా: 20 ఇతరులు, ఓరియంటల్, మినీగురుకులాలు: 909 ఇలా రాస్తే మంచిది ప్రశ్నలను ఒకటికి రెండు సార్లు చదివి అర్థం చేసుకున్నాకే రాయాలి. సమాధాన పత్రంలో పేజీకి 15 నుంచి 16 లైన్లు వుండాలి. మొదటి వరుసలో ఎంత బాగా రాశారో, చివరి వరకు అదే గుండ్రని అక్షరాలతో కొనగాగించాలి. –శశికళా, ఉపాధ్యాయిని సూత్రాలపై పట్టు సాధించాలి ప్రతి పాఠంలోనూ సూత్రాలపై పట్టు సాధిస్తే పరీక్షల్లో వచ్చే ప్రశ్నలకు సులువుగా సమాధానాలు రాయవచ్చు. బహుపదులు, వృత్తాలు, ఉపరితల వైశాల్యాల్లో పటాలు గీయడంపై సాధన చేయాలి. త్రికోణమితీయ, సర్వసమీకరణల ఉపరితల వైశాల్యాల పట్టికలపై సాధన అవసరం. – ఇ.రెడ్డప్పరెడ్డి, గణిత ఉపాధ్యాయుడు హిందీలో సులభంగా మార్కులు హిందీలో సులభంగా ఎక్కువ మార్కులు సాధించవచ్చు. సెక్షన్–1లో 12 ఐచ్చిక వ్యాకరణ సంబంధిత ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్–3లో ఓ కవి పరిచయంపై ఐదు మార్కులు ఉంటాయి. పరిచయం పేరాను చదివి ఖాళీలు పూరించాలి. –మోహినీసా నదామి, హిందీ టీచర్ నిరంతర సాధన రెయిమ్స్, స్కిమ్, ఫానెటిక్స్ను చదివితే సులువుగా ప్రశ్నలకు జవాబులు రాయవచ్చు. ఎడిటింగ్, ప్యాసేజ్ అంశాలపై పట్టు సాధించాలి. యాక్టీవ్ వాయిస్, ప్యాసీవ్ వాయిస్, రిపోర్టెట్ స్వీచ్ అంశాలపై చదవాలి. ప్యాసేజ్ అంశాలపై పట్టు సాధించాలి. ఒకాబులరీ గ్రామర్‌కు టెక్స్టూల్ను నిరంతర సాధన చేయాలి. – దేవప్రసాద్రెడ్డి, ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు హెడ్డింగ్‌లు, సబ్‌హెడ్డింగ్‌లు పెట్టాలి సాంఘిక శాస్త్రంలో అత్యధిక మార్కులు సాధించడానికి పట నైపుణ్యాలపై పట్టు సాధించాలి. ప్రపంచ పటాన్ని ఖండాల వారీగా సాధన చేయాలి. 8 మార్కుల ప్రశ్నలకు జవాబులను విస్తృతంగా రాయాల్సి ఉంటుంది. వీటికి హెడ్డింగ్‌లు, సబ్‌హెడ్డింగ్‌లు పెట్టడం ద్వారా ఉత్తమ మార్కులు సాధించవచ్చు. – ఎం.నరసింహారెడ్డి, ప్రభుత్వ పాఠ్యపుస్తక రచయిత, ప్రధానోపాధ్యాయుడు, సంబేపల్లె జెడ్పీ పాఠశాల అర్థవంతంగా చదవాలి జీవశాస్త్రంలో ప్రయోగాలు, పట్టికలు, పటాలపై పట్టు సాధిస్తే గరిష్ట మార్కులు సాధించవచ్చు. పాఠ్యపుస్తకాన్ని అర్థవంతంగా చదువుతూ.. ఏమవుతుంది, ఊహించి రాయండి, సూచనలు ఇవ్వండి, నినాదాలు రాయండి, ప్రశ్నించండి వంటి ప్రశ్నలకు సన్నద్ధం కావాలి. కిరణజన్య సంయోగక్రియలోని ప్రయోగాలు, ప్రత్యుత్పత్తి పాఠశాలలోని బొమ్మలపై పూర్తి శ్రద్ధ పెట్టాలి. – ఓబుల్‌రెడ్డి, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు త్వరలో పదో తరగతి పరీక్షలు సబ్జెక్టుల వారీగా అవగాహన అవసరం మెలకువలు పాటిస్తే.. అధిక మార్కులు అక్షర దోషాలు లేకుంటే మేలు తెలుగులో దోషాలు లేకుండా సమాధానాలు రాస్తే 20 శాతం మార్కులు సులువుగా సాధించవచ్చు. పద్యభాగంలో కవి పరిచయం, గద్యంలో ప్రక్రియలు, లేఖ, కరపత్రం అంశాలు, చందస్సులో వృత్త పద్యాలపై పశ్నలు వస్తాయి. విశ్వామిత్రుడు, మారీచుడు, సుగ్రీవుడు, దశరథుడు వంటి అంశాలతోపాటు రామాయణం, ప్రాశస్త్యం, సీతారామకల్యాణం వంటి అంశాలపై పట్టు సాధిస్తే అధిక మార్కులు సొంతం చేసుకోవచ్చు. –ఎ.సుశీల, తెలుగు ఉపాధ్యాయురాలు, ఆదర్శ పాఠశాల, సంబేపల్లె మండలం -
నేను ఎప్పటికీ ఆకేపాటి వెంటే
రాజంపేట టౌన్ : తాను, తన కుటుంబం ఎప్పటికి వైఎస్సార్సీపీలో కొనసాగుతూ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి వెంటే ఉంటామని హెచ్.కొత్తపల్లె మాజీ సర్పంచ్ చొప్పా గోపాల్‌రెడ్డి తెలిపారు. స్థానిక ఆకేపాటి భవన్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకేపాటికి వ్యతిరేకంగా మాట్లాడుతూ నిర్వహించిన సమావేశంలో తాను ఉన్న ఫొటో పత్రికల్లో వచ్చిందన్నారు. వాస్తవానికి తాను తనకు తెలిసిన ఓ వ్యక్తి మాట్లాడేంందుకు ఫోన్ చేయగా అక్కడికి వెళ్లానని, అక్కడ జరిగిన సమావేశంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆకేపాటి అమరనాథ్‌రెడ్డితో తమకు నలభై ఏళ్ల అనుబంధం ఉందన్నారు. తాను ఎప్పటికీ వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని అలాగే అమరనాథ్‌రెడ్డికి మద్దతుగా ఉంటానని తెలిపారు. -
ఒంటిమిట్ట ఆలయంలో పనులకు పురావస్తు శాఖ కొర్రీ
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండరామాలయంలో ధ్వజస్తంభం, బలిపీఠం, ఇత్తడి రేకు తొడుగు మార్పు పనులపై కేంద్ర పురావస్తుశాఖ అధికారులు నేటికీ అనుమతులు ఇవ్వలేదు. బుధవారం నుంచి మహా సంప్రోక్షణ ఉత్సవాలు జరగనుండగా పురావస్తు శాఖ జీర్ణోద్ధరణ పనులు పూర్తి చేసింది. అయితే ఒంటిమిట్ట రామాలయంలో ధ్వజస్తంభం, బలిపీఠం, స్వర్ణ రంగు పొయ్యి అంద వికారంగా దర్శనమిస్తున్నాయి. వాటిని స్వర్ణ రంగుతో తీర్చిదిద్దేందుకు పురావస్తు శాఖ అనుమతులు వస్తాయనుకున్న టీటీడీ అధికారులు ధ్వజ స్తంభం చుట్టూ ఇనుప పైపులతో సారవ కట్టించారు. కాగా కేంద్ర పురావస్తుశాఖ అధికారుల ఆదేశాల మేరకు మరమ్మతులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సంబంధిత టీటీడీ అధికారులు తెలిపారు. -
వలస వెళ్లకుండా పనులు కల్పించండి
రామాపురం: గ్రామాల్లో వలసలు వెళ్లకుండా ఉపాధి పనులు కల్పించాలని అన్నమయ్య జిల్లా డ్వామా పీడీ వెంకటరత్నం పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని రాచపల్లె, నల్లగుట్టపల్లె పంచాయతీల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం కూలీలకు 150 రోజుల పని దినాలు కల్పిస్తోందన్నారు. కూలి గిట్టుబాటు అయ్యే విధంగా చూడాలని మండల అధికారులకు సూచించారు. అనంతరం రాచపల్లె గ్రామంలో పశువుల షెడ్లు, ఫారంపాండ్లు, నల్లగుట్టపల్లెలో పశువుల నీటి కుంటలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీఓ పెంచయ్య, ఈసీ శివయ్య, టీఏ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు. సారా రహిత గ్రామాలుగా మార్చాలి తంబళ్లపల్లె: మండలంలోని గ్రామాలను సారా రహితంగా తీర్చిదిద్దాలని ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని కోటకొండతండాలో ములకలచెరువు ఎకై ్సజ్ సీఐ మాధవి ఆఽధ్వర్యంలో మంగళవారం నవోదయం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారా అమ్మకాలు చట్టరీత్యా నేరమన్నారు. సారా వల్ల కలిగే అనర్థాలు, యువత పెడదోవ పట్టే విధానాన్ని వివరించారు. నవశకానికి నాంది పలుకుదామని గ్రామస్తులతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జోగేంద్ర, తహసీల్దార్ హరికుమార్, ఎంఈఓ త్యాగరాజు, సర్పంచు తులశమ్మ తదితరులు పాల్గొన్నారు. కౌమార దశలో సాధికారతే లక్ష్యం నిమ్మనపల్లె: కౌమార దశలోని బాల, బాలికల్లో సాధికారతను సాధించడమే కిశోరి వికాసం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జిల్లా శిశుగృహ మేనేజర్ సుప్రియ అన్నారు. మంగళవారం ఎంపీడీవో పరమేశ్వర్‌రెడ్డితో కలిసి మహిళా సంరక్షణ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15–18 ఏళ్ల వయసులోని బాల బాలికలను రెండు గ్రూపులుగా విభజించి, బాలికల కోసం సఖి, బాలుర కోసం యువ గ్రూపులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గ్రూప్‌లోను కనీసం ఐదుగురు నుంచి 14 మంది సభ్యులను చేర్చాలని సూచించారు. కార్యక్రమంలో సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శులు పాల్గొన్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి రాయచోటి అర్బన్: అన్ని రంగాల్లో మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక సాయి ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళా పోలీసులు, కళాశాల విద్యార్థినులతో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఏదైనా సమస్య వస్తే పోలీసులను ఆశ్రయించాలన్నారు. పోలీసుల సహాయం కోసం డయల్ 100 లేదా 112కు ఫోన్ చేయాలన్నారు. మహిళా హెల్ప్‌లైన్ నంబర్ 181కి కాల్ చేయాలన్నారు. కార్యక్రమంలో రాయచోటి మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ రవిశంకర్‌రెడ్డి, ఎస్ఐ బి.శ్రీనివాస్ నాయక్, కళాశాల ఏడీ సుధాకరరెడ్డి, కళాశాల ఉమెన్స్ సెల్ కోఆర్డినేటర్ విశాలాక్షి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సునీత, అరుణతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు. -
స్వర్ణ అన్నమయ్య జిల్లాగా తీర్చిదిద్దుదాం
రాయచోటి: స్వర్ణ అన్నమయ్య జిల్లాగా తీర్చిదిద్దేందుకు బలమైన రంగాలైన వ్యవసాయం, పర్యాటకం, ఉద్యానవనం, మైనింగ్‌లపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లోని తన చాంబర్లో అన్ని శాఖల జిల్లా అధికారులతో స్వర్ణాంధ్ర 2047లో భాగంగా అన్నమ్య జిల్లా జీడీపీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే అంశంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జీడీపీలో అన్నమయ్య జిల్లా ర్యాంకు 23గా ఉందని, దీనిని అభివృద్ధి పరచాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆర్డబ్ల్యూఎస్ వన్యాప్తో తాగునీటి సరఫరా ఆర్డబ్ల్యూఎస్ వన్ యాప్‌ను ఉపయోగించుకొని అవసరమైన ప్రదేశాలలో తాగునీటి సరఫరా, నీటి నాణ్యత, సకాలంలో నీటి లభ్యత వంటి అంశాలపై దృష్టి సారించాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్సు హాల్లో జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, గ్రామీణ నీటి సరఫరా శాఖ సిబ్బంది, పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది తదితరులతో వేసవి కాలంలో నీటి సరఫరాపై కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో దాదాపు 536 గ్రామాలలో నీటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని, ఈ ప్రాంతాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారి ప్రసన్న కుమార్, జీఎస్‌డబ్ల్యూఎస్ అధికారి లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలి రాయచోటి జగదాంబ సెంటర్: మదనపల్లెలో ఈ నెల 8న నిర్వహించనున్న మెగా జాబ్‌మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. కలెక్టరేట్లో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సీడాప్, జిల్లా ఉపాధి కార్యలాయం సంయుక్త ఆధ్వర్యంలో మదనపల్లెలోని శ్రీనివాస డిగ్రీ కళాశాలలో జరిగే మెగా ఉద్యోగమేళా కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్‌మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఏజిల్ఎయిర్పోర్ట్ సర్వీసెస్, అడక్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆధ్య హెచ్ఆర్ సొల్యూషన్స్, నియో లింక్, ముత్తూట్ ఫైనాన్స్, టాటా క్యాపిటల్, బిగ్ సీ, ఫోన్ పే, ఫ్లిప్‌కార్ట్, అపోలో ఫార్మసీ తదితర కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. మరిన్ని వివరాలకు 6301612761, 9553202509, 9741432931, 8897 776368 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ -
గుర్రంకొండలో భారీగా గంజాయి స్వాధీనం
గుర్రంకొండ : మండల కేంద్రమైన గుర్రంకొండలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్న సంఘటన సోమవారం రాత్రి జరిగింది. ఇప్పటికే గంజాయి ముఠా సభ్యుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వివరాలు ఇలా ఉన్నాయి. గత కొంత కాలంగా గుర్రంకొండలో గంజాయి ముఠా సభ్యుల కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. యథేచ్ఛగా గంజాయి అమ్మకాలతో పాటు వినియోగించేవారు రోజురోజుకు ఎక్కువైపోతు న్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు గంజాయికి ఎక్కువగా బానిసలు అవుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో స్థానిక తెలుగు జెడ్పీ హైస్కూల్, తెలుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల పక్కన, పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా దుకాణాల సముదాయం గంజాయి కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. పలువురు గంజాయి ముఠా సభ్యులు ఈ దుకాణాల్లో గంజాయిని స్టాకు ఉంచుకొని నిత్యం సేవిస్తూ మత్తుగా తూలి అక్కడే ఉన్న సమాధులపై పడిపోతున్నారు. దీంతో గంజాయి కార్యకలాపాల జోరుపై సమాచారం అందుకున్న స్పెషల్ బ్రాంచి పోలీసులు, వాల్మీకిపురం, గుర్రంకొండ పోలీసులు బృందంగా ఏర్పడి గత రాత్రి ముందుగా అందుకున్న సమాచారం ప్రకారం పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా ఉన్న ఓ వెల్డింగ్ దుకాణంలో ముకుమ్మడి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రెండు కిలోల గంజాయి పార్సిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సదరు వెల్డింగ్ దుకాణం యజమానిని అప్పటికప్పుడు అదుపులోకి తీసుకొని పోలీసులు రహస్య ప్రదేశంలో విచారణ నిర్వహించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. గతంలో రెండు మార్లు గంజాయి కేసుల్లో నింతులుగా ఉన్న ముఠా సభ్యులే ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. సదరు ముఠా సభ్యుడు ఒకడు వెల్డింగ్ దుకాణంలో స్టాకు ఉంచి ప్రతి రోజు కొద్దికొద్దిగా వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని వెల్డింగ్ దుకాణం యజమాని పోలీసుల వద్ద అంగీకరించినట్లు తెలిసింది. ఇప్పటికే పట్టుబడిన ముఠాసభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు ఇందులో ఎవరెవరు ఉన్నారనే విషయం పసిగట్టి పలువురు ముఠా సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడిన విషయం పట్టణంలో సంచలనం రేకెత్తించింది. సాక్షాత్తు వందలాది మంది చదువుకునే విద్యాలయాలకు పక్కన, పోలీస్ స్టేషన్‌కు ఎ దురుగా ఉన్న ఓ దుకాణంలోనే గంజాయి పట్టుబడిన విషయం మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై ఎస్ఐ మధురామచంద్రుడును వివరణ కోరగా గత సోమవారం రాత్రి పోలీసుల దాడుల్లో కొద్దిగా గంజాయి పట్టుబడిందన్నారు. ఇందులో ఉన్న ముఠాసభ్యుల్ని విచారిస్తున్నామని త్వరలోనే వీరందరిపై కేసులు నమోదు చేస్తామన్నారు. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు -
నేటి నుంచి లెంట్‌డేస్ ప్రారంభం
రాజంపేట టౌన్ : క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలతో నలభై రోజుల పాటు చేపట్టనున్న లెంట్‌డేస్ (శ్రమకాలపు దినాలు) బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గుడ్‌ఫ్రైడేకి నలబై రోజుల ముందు వచ్చే భస్మ బుధవారంతో లెంట్‌డేస్ ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఏప్రిల్ 18వ తేదీ గుడ్‌ఫ్రైడే కావడంతో లెంట్‌డేస్ నిర్వహణకు ఆయా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల కోసం ఏర్పాట్లు చేశారు. అనేక మంది ఈ నలభై రోజులు ఎక్కువగా చర్చిలో గడుపుతారు. చర్చిలకు వెళ్లలేని వారు ఇంటి వద్దనే ఉంటూ ప్రార్థనలు చేసుకుంటారు. 40 రోజులు ఉపవాసాలతో ప్రార్థనలు చేయనున్న క్రైస్తవులు -
ధరలు స్థిరంగా ఉంటే లాభాలు
దోస పంటను పండించడానికి పెట్టుబడి అధికంగా ఉంటుంది. నేను 4 ఎకరాల్లో దోస పంట సాగు చేశాను. టన్ను రూ.22 వేలతో వ్యాపారస్తులు కొని ఎగుమతి చేసుకొన్నారు. ఇదే విధంగా ఈ నెల అంతా ధరలు ఉంటే రైతులకు అధిక లాభాలు వస్తాయి. – కందుల మల్లికార్జునరెడ్డి, రైతు, రాఘవరాజపురం, రైల్వేకోడూరు గతేడాది అంతా నష్టాలే గతేడాది దోస పంట తెగుళ్ల బారిన పడి భారీగా నష్టం వచ్చింది. ఈ ఏడాది కూడా సాగు చేశాను. ఈ ఏడాది విత్తనాలు, కవర్లు ఇలా అన్నీ ధరలు పెంచారు. కాబట్టి పెట్టుబడి కూడా అధికం అయ్యింది. దోస కాయల ధరలు ఇలాగే కొనసాగితే లాభాలు వస్తాయి. –సుంకర మురళి, రైతు, సత్రం, రైల్వేకోడూరు ధరలు అధికంగా ఉండే అవకాశం గతేడాది నష్టాలు రావడంతో ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు దోస పంట సాగుపై ఆసక్తి చూపలేదు. తెగుళ్లను అధిగమిస్తే నాణ్య తను బట్టి ఈ ఏడాది ధరలు బాగా పలికే అవకాశం ఉంది. రైతులు, వ్యాపా రుల లాభాలు గడించనున్నారు. –కంభం మల్లికార్జునరెడ్డి, వ్యాపారి, కేసీ అగ్రహారం సస్యరక్షణ చర్యలు పాటించాలి దోస పంటకు తెగుళ్లు అధికంగా వస్తాయి. రైతులు సస్యరక్షణ చర్యలు పాటించాలి. ఇష్టం వచ్చినట్లు మందులు పిచికారీ చేస్తే నష్టపోయే ప్రమాదం ఉంది. అధికారుల సూచనలు, సలహాలు పాటించాలి. –వెంకటభాస్కర్, ఉద్యానశాఖ అధికారి, రైల్వేకోడూరు -
అశ్వవాహనంపై భద్రకాళీ సమేత వీరభద్రుడు
రాయచోటి టౌన్ : రాయచోటి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా భద్రకాళీ సమేత వీరభద్రస్వామి అశ్వవాహనంపై పుర వీధులలో ఊరేగారు. భక్తుల కోర్కెలు తీర్చుతూ పార్వేటకు వెళ్లారు. మంగళవారం ఆలయ ఈఓ డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు శంకరయ్య స్వామి, కృష్ణయ్య స్వామి, శేఖర్ స్వామి, మల్లికార్జున స్వామి, ఆలయ వేదపండితులు రాచరాయ యోగీ స్వామి ఆధ్వర్యంలో పార్వేటకు వెళ్లారు. ఈ వేడుకలో భాగంగా స్వామి వారిని, అమ్మవారిని రంగురంగుల పూలు, బంగారు ఆభరణాలు, పట్టువస్త్రాలతో అందంగా అలంకరించారు. ఈ ఊరేగింపులో భాగంగా స్వామివారికి అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. తుమ్మల హరినాథ ఆధ్వర్యంలో శిబ్యాల బలిజపల్లె కళాకారులతో కోలాటం, చెక్క భజనలు భక్తులను అలరించాయి. అలాగే ఉదయం సరస్వతీ దేవి పూజ నిర్వహించి చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. మహా సంప్రోక్షణకు ఒంటిమిట్ట రామాలయం సిద్ధం ఒంటిమిట్ట : ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జీర్ణోద్ధరణ పనులు పూర్తయిన సందర్భంగా ఈనెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరగనున్న మహా సంప్రోక్షణకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. ఈ సందర్భంగా గర్భాలయ విమాన గోపురంపై స్వర్ణకలశం ఏర్పాటు చేసేందుకు చెక్కతో ప్రత్యేక మెటికలను ఏర్పాటు చేశారు. అలాగే భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు, వేసవి ఎండ నుంచి ఉపశమనం కోసం జర్మన్ షెడ్లు, ఆలయ మాడవీధుల చుట్టూ చలువ పందిళ్లు, రామాలయం మొత్తం రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరమైన అలంకరణ ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే మహా సంప్రోక్షణకు ఆలయ అర్చకుల సూచనల మేరకు టీటీడీ సివిల్ విభాగం అధికారులు యాగశాలను తీర్చిదిద్దారు. -
ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రశాంతం
రాయచోటి/మదనపల్లె సిటీ : ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. సోమవారం జిల్లా వ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 13201 మంది విద్యార్థులకు 12638 మంది హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో లోటుపాట్లు లేకుండా విద్యార్థులకు తగిన మౌలిక వసతులు కూడా కల్పించామని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఎం కృష్ణయ్య తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద సౌకర్యాలు లేవు మదనపల్లె పట్ణణంలోని ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థులు పరీక్ష రాసేందుకు కనీస సౌకర్యాలు లేవని ఎస్ఎఫ్ఐ నాయకులు సోమవారం సబ్ కలెక్టర్ మేఘస్వరూప్‌కు వినతిపత్రం అందజేశారు. నారాయణ కాలేజీలో ఒక బిల్డింగ్‌లో రెండు పరీక్షా కేంద్రాలు ఇచ్చారన్నారు. బెంగుళూరురోడ్డులోని ప్రైవేటు కాలేజీలో కనీసం మౌలిక వసతులు లేవన్నారు. కదిరిరోడ్డులోని ప్రైవేటు కాలేజీ వద్ద వ్యాపార సముదాయాలు ఉన్నాయన్నారు. ప్రశాంత్‌నగర్‌లోని ప్రైవేటు కాలేజీలో గదుల్లో సరైన వెలుతురు లేదన్నారు. పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బంది అందుబాటులో లేరన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నరసింహ, నాయకులు ఆఫ్రిద్, జయబాబు, సమీర్, ప్రేమ్, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ రాయచోటి : ప్రజల సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో సోమవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 228 అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ప్రతి సమస్యపై ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌ను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తుందని కలెక్టర్ అన్నారు. కాబట్టి అధికారులందరూ ప్రాధాన్యతగా ఫిర్యాదులను నూరుశాతం పరిష్కరించాలన్నారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా వచ్చిన అర్జీదారులకు జిల్లా కలెక్టర్ స్నాక్స్, వాటర్ బాటిల్స్, టీ సౌకర్యాలను కల్పించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డిఆర్ఓ మధుసూదన్ రావు, ఎస్డీసీ రమాదేవి పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రాధాన్యత విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో డిగ్రీ ఆపై తరగతులు చదువుతున్న ఆరుగురు విభిన్న ప్రతిభావంతులకు కలెక్టర్ చేతులు మీదుగా ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేశారు. జాతీయ దివ్యాంగుల ఆర్థిక అభివృద్ధి పథకం ద్వారా టెంట్ హౌస్ వ్యాపారంతో స్వయం ఉపాధి పొందేందుకు షేక్ జిలానీకి రూ. 5 లక్షలు రుణం చెక్కును అందజేశారు. గోడపత్రాల ఆవిష్కరణ రాయచోటి జగదాంబసెంటర్ : ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా ‘పిల్లల చెవి ఇన్ఫెక్షన్ను ఎలా నయం చేసుకోవచ్చు’ అనే విషయంపై గోడపత్రికను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 3న ప్రపంచ వినికిడి దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. పిల్లలలో వచ్చే చెవి ఇన్ఫెక్షన్ను తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలని, ఈఎన్టీ వైద్యుడిని మాత్రమే సంప్రదించాలని సూచించారు. సొంత వైద్యం చేయరాదని, ఆకుపసరు లేదా నాటువైద్యుల సలహాలు పాటించరాదని పేర్కొన్నారు. -
రాజకీయ కుట్ర
సాక్షి, రాయచోటి : ప్రజాక్షేత్రంలో పట్టున్న నేతగా నిరూపించుకున్న ఆకేపాటిపై ఆడని అబద్ధాలు లేవు. పచ్చ పత్రికలకు లీకులు ఇస్తూ ఏదో ఒక రకంగా అభాసుపాలు చేయడమే లక్ష్యంగా పావులు కదిపారు. 100 ఎకరాలు..కాదు కాదు...200 ఎకరాలు..కాదు 300 ఎకరాలు ఆక్రమించారంటూ ఇష్టానుసారంగా ఫిర్యాదులు చేస్తూ మానసికంగా కుంగిపోయేలా వ్యూహం అమలు చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ఆకేపాటిని సర్కార్ టార్గెట్ చేసింది. భూములే కాదు..ఇతర సమస్యలు కూడా దరిచేరకుండా ఉండాలంటే పార్టీ మారడమే మీ ముందన్న లక్ష్యం అన్నట్లు ఆకేపాటి కుటుంబంపై ఒత్తిడి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆది నుంచి వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఆకేపాటి అన్నింటినీ సున్నితంగా తిరస్కరిస్తూ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆకేపాటి కుటుంబంపై కుట్రలు వైఎస్సార్ సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డితోపాటు ఆయన కుటుంబంపై కుట్రలు కొనసాగుతున్నాయి. వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ మంచి మనిషిగా గుర్తింపు పొందిన ఆకేపాటి అమర్నాథరెడ్డిని పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. అప్పటి నుంచి వైఎస్సార్ సీపీని అన్ని విధాలుగా బలోపేతం దిశగా తీసుకెళుతూ కార్యకర్తలు, నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆకేపాటి విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. కూటమి సర్కార్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం సాగిస్తున్నారు. అధికారుల తీరుపై కూడా ఉదాసీన వైఖరి కాకుండా బహిరంగంగా విమర్శిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆకేపాటిని అభాసుపాలు చేయాలన్న దురుద్దేశంతో అధికారుల ద్వారా దెబ్బతీసే ప్రయత్నాలు చేశారు. రాజకీయ కుట్రలో భాగంగా ఆయన ఇంటిని అక్రమంగా నిర్మించుకున్నారని,భూములను ఆక్రమించుకుని సాగు చేస్తున్నారని ఫిర్యాదులతో నాటకాన్ని రక్తికట్టించారు. ఆకేపాటిపై భూముల విషయంలో ఒకవైపు సోషల్‌మీడియాలోనూ, మరోవైపు ఫిర్యాదుల ద్వారా...ఇంకోవైపు పచ్చ పత్రికల ద్వారా విషం చిమ్మారు. వందల ఎకరాలు ఆక్రమించారంటూ ఇష్టానుసారంగా కథలు అల్లారు. అయితే జిల్లా అధికారులు ఆన్లైన్లో ఉన్న 36 ఎకరాలు తొలగించడం, రిజిస్ట్రేషన్లు రద్దు చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తూ ఆకేపాటి కుటుంబం న్యాయ పోరాటం కొనసాగిస్తోంది. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన ఆకేపాటి సైలెంట్‌గానే ఆరోపణలకు దీటుగా తగిన సాక్ష్యాలతో ధీటుగా సమాధానమిస్తున్నారు. ఆకేపాడు భూములపై హైకోర్టు స్టేటస్ కో అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని ఆకేపాడు భూములపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. సుమారు 36 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం ఆకేపాటి కుటుంబ సభ్యుల పేర్లు రికార్డుల నుంచి తొలగించడం, రిజిస్ట్రేషన్లు రద్దు చేయడంపై ఆకేపాటి హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా సుమారు 30 ఏళ్లకు పైగా తమ ఆధీనంలో ఉన్నట్లు కోర్టుకు వివరించారు. ఎన్నో ఏళ్ల నుంచి తమ అనుభవంలో భూమి ఉందన్నారు. ఇప్పుడు ఫిర్యాదులంటూ రికార్డుల్లో చెరిపి వేయడం ఏమిటని ఆకేపాటి న్యాయవాది ద్వారా వాదనలు వినిపించారు. ఇష్టానుసారంగా వందల ఎకరాలు ఆక్రమించారంటూ విష ప్రచారం చేశారని కోర్టుకు విన్నవించారు. అంతేకాకుండా ఆకేపాటి భూములకు సంబంధించిన పూర్తి ఆధారాలను కోర్టుకు సమర్పించడంతో....ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు భూమిపై స్టేటస్కో విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనుభవంలో ఉన్న భూమికి సంబంధించి కోర్టుకు ఆధారాలు 100, 200 ఎకరాలు ఆక్రమించారంటూ విష ప్రచారం మానసికంగా ఆకేపాటిని దెబ్బతీయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం -
బాగోలేదని బతిమాలినా... బండెక్కాల్సిందే !
సాక్షి, రాయచోటి : ప్రముఖ సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఆరోగ్యం బాగో లేదని..బ్రతిమాలినా వదల్లేదు..ఆయనను అదుపులోకి తీసుకున్న రోజునుంచి ఇప్పటివరకు ప్రతిరోజు ఎక్కడో ఓ చోటికి తీసుకు వెళుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సోమవారం పోసానిని పీటీ వారెంట్‌పై నరసరావుపేటకు తీసుకెళ్లేందుకు పోలీసులు రాజంపేట సబ్ జైలు వద్దకు వచ్చారు. జైలు అధికారులు పోసానికి విషయం చేరవేయగా..ఆరోగ్యం బాగాలేదని, వెళ్లలేనని చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పటికే పోలీసులు ఆరోగ్యం విషయంలో సమస్య లేకున్నా నటిస్తున్నాడంటూ బహిరంగంగా వ్యాఖ్యానించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పీటీ వారెంటుపై సోమవారం ఉదయాన్నే పోసానిని నరసరావుపేటకు తీసుకెళ్లారు. వేధించడమే లక్ష్యం పవన్ కల్యాణ్‌తోపాటు పలువురు ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలు, కార్యకర్తల ద్వారా ఫిర్యాదులు చేయించి కేసులు నమోదు అయ్యేలా చేశారు. రాయలసీమతోపాటు పలు జిల్లాల్లో సుమారు 14–16 కేసుల వరకు పోసానిపై నమోదు చేశారు. గతనెల 26వ తేదీన హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పోసానిని అదుపులోకి తీసుకున్న తర్వాత 27వ తేదీ కోర్టులో హాజరు పరిచారు. అక్కడ బెయిలు వస్తుందేమోనన్న అనుమానంతో ఇతర జిల్లాకు చెందిన పోలీసులు కూడా మకాం వేసి ఆయనను అదుపులోకి తీసుకోవాలని బయట వేచి ఉన్నారు. కోర్టు రిమాండ్ విధించడంతో రాజంపేట సబ్‌జైలుకు తరలించాల్సి వచ్చింది. ఈ తరుణంలో పీటీ వారెంట్ పేరుతో పలు జిల్లాలకు సంబంధించిన పోలీసులు వరుసగా రానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కేసులు నమోదైన తరుణంలో పీటీ వారెంట్‌పై తీసుకెళ్లి హాజరు పెట్టనున్నారు. దీంతో వరుసగా తిప్పడంతోపాటు కేసుల పేరుతో పోసానిని వేధించడమే లక్ష్యంగా సర్కార్ ఎత్తుగడలుగా కనిపిస్తున్నట్లు స్పష్టమవుతోంది. హార్ట్ సమస్య ఉన్నా.... పోసాని కృష్ణమురళికి గతంలోనే గుండెకు సంబంధించి స్టంట్ వేశారు. ఇలాంటి తరుణంలో పోలీసులు దూర ప్రయాణం చేసే సమయంలో కనీసం వైద్యుడినైనా అందుబాటులో ఉంచుకోవాలి. అంబులెన్స్ లేకపోగా...వైద్యుడు లేకపోతే పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా పోసాని కృష్ణమురళిని వేధింపులకు గురి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు స్టేషన్లలో పోసానిపై కేసులు -
ప్రారంభమైన ఓపెన్ ఇంటర్ పరీక్షలు
రాజంపేట టౌన్ : జిల్లాలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని రాయచోటిలో నాలుగు, రాజంపేటలో మూడు, మదనపల్లెలో మూడు కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. తొలిరోజు జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు 1,878 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 1,676 మంది హాజరయ్యారని ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ జిల్లా కో–ఆర్డినేటర్ కె.శ్రీనివాసరాజు తెలిపారు. ప్రతి కేంద్రంలోనూ ఇద్దరు చొప్పున సిట్టింగ్ స్క్వాడ్‌ను, అలాగే మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. గృహ విద్యుత్ అదనపు లోడు క్రమబద్ధీకరణకు రాయితీ రాయచోటి జగదాంబసెంటర్ : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఆర్ఈసీ) తక్కువ లోడ్‌తో విద్యుత్ కనెక్షన్ తీసుకొని ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్న గృహ వినియోగదారులకు అదనపు లోడును 50 శాతం రాయితీతో క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది.ఈ అవకాశాన్ని రాయచోటి డివిజన్ పరిధిలోని గృహ విద్యుత్ వినియోగదారులు ఉపయోగించుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పేరూరి యుగంధర్ తెలిపారు. సోమవారం రాయచోటిలో ఆయన మాట్లాడారు. వినియోగదారులు తమ ఇళ్లకు అడిషనల్ లోడ్ 50 శాతం రాయితీకి ఈ నెల 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీలోపు మీ సర్వీస్ నంబర్, మీ ఆధార్‌కార్డు తీసుకొచ్చి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. బాలికలకు చట్టాలపై అవగాహన తప్పనిసరిరాయచోటి అర్బన్ : బాలికలకు చట్టాలపై తప్పనిసరిగా అవగాహన ఉండాలని జిల్లా సీ్త్ర,శిశు సంక్షేమ సాధితకారత అధికారిణి పి.రమాదేవి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పట్టణంలోని నేతాజీ సర్కిల్ వద్ద ఉన్న ప్రభుత్వ ఉన్నతపాఠశాల మైదానం నుంచి కలెక్టరేట్ వరకు మహిళా ఉద్యోగులు బైక్‌ర్యాలీని నిర్వహించారు. ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఆమె మాట్లాడుతూ బేటీ బచావో– బేటీ పఢావో కార్యక్రమం ద్వారా జిల్లావ్యాప్తంగా బాలికలకు అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చెప్పారు. బాల్య వివాహాల నిర్మూలన, బాలికావిద్యను ప్రోత్సహించడం తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కిషోరబాలికల వికాసం కార్యక్రమాల్లో భాగంగా అంగన్వాడీ సెంటర్ పరిధిలో డ్రాపౌ ట్స్ని గుర్తించి 10 నుంచి 15 మందికి మించకుండా సఖి సమూహాలను మహిళా సంరక్షణ కార్యదర్శి ద్వారా ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో కూడా సఖి సమూహాలను ఏర్పాటు చేసి చట్టాలపై అవగాహనను కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ సంస్థల హెచ్ఓడీలు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, మహిళా సంరక్షణ కార్యదర్శులు పాల్గొన్నారు. -
ప్రదక్షిణలు.. పడిగాపులు
● జిల్లాలో రైతులకు అందని గుర్తింపు కార్డులు ● ఆన్లైన్లో కనిపించని 41 గ్రామాల భూముల వివరాలు ● అన్నదాతకు తప్పని ఎదురుచూపులు గుర్రంకొండ : రైతులకు రైతు గుర్తింపు కార్డులు అందని ద్రాక్షపండులా మిగిలాయి. ఆయా గ్రామాలకు చెందిన రైతులు రోజుల తరబడి రైతుసేవాకేంద్రం వద్ద పడిగాపులు కాస్తూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇందు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్సైట్లో 41 రెవెన్యూ గ్రామాల్లో వేలాది మందికి చెందిన వేల ఎకరాల భూముల జాడే లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ గడువుతేదీ పొడిగించినా కార్డులు అందని వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో రైతు గుర్తింపు కార్డులు నమోదు ప్రక్రియ వేగంగా నిర్వహించారు. రైతుసేవాకేంద్రంలో వ్యవసాయశాఖ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక వెబ్సైట్లో ఆయా గ్రామాలకు చెందిన రైతుల వివరాలు నమోదు చేస్తున్నారు. భూమి పాసుపుస్తకం, రైతు ఆధార్‌కార్డు నంబరు ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత రైతు సెల్‌ఫోన్‌కు రెండు సార్లు ఓటీపీలు వస్తున్నాయి. చివరగా వెబ్సైట్లో ల్యాండ్ మార్కింగ్ దగ్గరకి వెళితే మాత్రం ఆయా గ్రామాలకు సంబంధించిన భూముల వివరాలు, సర్వేనంబర్లు చూపించడంలేదు. ప్రతిరోజు ఎన్ని మార్లు ప్రయత్నించినా చివరకు ఇదే ఫలితం వస్తోందని సిబ్బంది, రైతులు ఆరోపిస్తున్నారు. అలాగే ప్రభుత్వ భూములు సాగు చేసుకొంటున్న వారికి, డీకేటీ పట్టాలు పొందిన పలువురికి కుడా గుర్తింపు కార్డులు అందడం లేదని అన్నదాతలు అంటున్నారు. భూముల వివరాలు ఆన్లైన్లో లేని గ్రామాలు: నందలూరులో ఒకటి, రామాపురంలో రెండు, రాజంపేటలో ఒకటి, పెనగలూరులో ఆరు, చిట్వేల్‌లో ఆరు, ములకలచెరువులో నాలుగు, బి.కొత్తకోటలో రెండు, లక్కిరెడ్డిపల్లెలో ఆరు, కేవీ పల్లెలో రెండు, నిమ్మనపల్లె, గుర్రంకొండ, కలకడ మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున, సంబేపల్లెలో ఒకటి, తంబళ్లపళ్లె మూడు, వీరబల్లె ఒకటి, పీటీఎం మూడు గ్రామాలు మొత్తం జిల్లా వ్యాప్తంగా 41 గ్రామాల్లో రైతుల భూముల వివరాలు ఆన్లైన్లో కనిపించడం లేదు. దీంతో గుర్తింపు కార్డుల జారీప్రక్రియ ముందుకు సాగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గడువు పొడిగించినా.. రైతు గుర్తింపు కార్డు నమోదు జారీ ప్రక్రియ గడువు ఈ నెల 25 వరకు పొడిగించినా రైతుల్లో ఆందోళన తగ్గడం లేదు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం గత నెల 28 గడు వు తేదీగా నిర్ణయించింది. అయినా గడువు తేదీలోగా 41 గ్రామాల రైతుల సమస్య పరిష్కారం కాలేదు. నిర్ణీ త గడువు పొడిగించినా ఆన్లైన్లో భూముల వివరాలు కనపించడంలేదని, తమ పరిస్థితి ఏమిటని రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. అలాగే జిల్లాలో ప్రభుత్వభూములు సాగు చేసుకొంటున్న వారు, డీకేటీ పట్టాలు పొందిన వారికి కూడా రైతు గుర్తింపుకార్డులు జారీ కాలేదు. ఉన్నతాధికారులు స్పందించి కార్డులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో మొత్తం రైతులు : 3,44,873 పీఎం కిసాన్ అర్హులైన వారు : 1,78,197 గుర్తింపు కార్డులు పొందని గ్రామాలు : 41 ఇప్పటివరకు గుర్తింపు కార్డులు అందని రైతులు : 62,598 ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం జిల్లాలోని పలు రెవెన్యూ గ్రామాల్లో రైతులకు రైతు గుర్తింపు కార్డులు జారీ ప్రక్రియ జరగడం లేదనే విషయం రాష్ట్రవ్యవసాయ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. గత కొన్నిరోజులుగా ఈసమస్య ఉంది. రైతు గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ గడువు ఈనెల 25 వరకు పొడించారు. అందువల్ల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నాలుగైదు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు. – చంద్రానాయక్, జిల్లా వ్యవసాయాధికారి, అన్నమయ్య జిల్లా -
● పిల్ల కాలువలతోనే సస్యశ్యామలం
ప్రాజెక్టు పరిధిలో ఆయకట్టు సాగు వివరాలు ఉపకాలువ కి.మీ ఆయకట్టు (ఎకరాల్లో) తంబళ్లపల్లె ఉపకాలువ 30.750 15,000 పుంగనూరు ఉపకాలువ 224.5 85,900 వాయల్పాడు ఉపకాలువ 23.50 17,200 నీవా ఉపకాలువ 122.5 57,500 చింతపర్తి డిస్ట్రిబ్యూటరీ 42.30 22,400 ఎల్లుట్ల డిస్ట్రిబ్యూటరీ 25.17 15,400 సదుం డిస్ట్రిబ్యూటరీ 19.1 5,400 బి.కొత్తకోట : హంద్రీ–నీవా రెండో దశ సాగు, తాగునీటి ప్రాజెక్టు పనుల్లో కూటమి ప్రభుత్వం ఉపకాలువల లైనింగ్ పనులకు ప్రాధాన్యత ఇచ్చి పిల్ల కాల్వల తవ్వకం పనులు వదిలేసుకోవడంతో కరువు రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. 1994, 2005లో ప్రాజెక్టు పనులు చేపట్టేలా రూపొందించిన డీటైల్ ప్రాజెక్టు నివేదికల్లో ప్రాజెక్టు ఉపకాలువల నుంచి పిల్ల కాల్వలను తవ్వించి వాటి ద్వారా చివరి ఆయకట్టు భూమికి సాగునీరు అందించాలన్నది లక్ష్యం. ఒక ప్రాజెక్టు నుంచి చివరి ఆయకట్టు భూమి వరకు సాగునీరు వెళ్లాలంటే దాని ప్రధాన లేదా ఉపకాలువ నుంచి పిల్ల కాలువలను తవ్వించాలి. అయితే ఈ పనులను చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం సుముఖంగా లేదు. కాంట్రాకర్లకు ప్రయోజనం చేకూర్చే పనులపైనే దృష్టి పెట్టింది. కరువుతో కష్టాలు పడుతున్న రైతాంగాన్ని ఇంకా కష్టాల్లోకి నెట్టేస్తోంది. కిరణ్ పెంచగా..వద్దన్న బాబు ప్రాజెక్టు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల ఒప్పందం మేరకు ఎకరాకు రూ.4,700తో పిల్లకాలువ పనులు చేయాలి. మధ్యలో కల్వర్టులు, రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం చేయాల్సివస్తే కాంట్రాక్టర్లే చేపట్టాలి. ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్ సర్కారులో ఎకరాకు అదనంగా రూ.5,800 పెంచి రూ.10,500గా నిర్ణయించారు. 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు పిల్ల కాలువల పనులు చేపట్టకుండా కాంట్రాక్టర్లకు మేలు చేకూర్చేలా 2015లో జీవో 22 జారీతో ఈ పనులను కాంట్రాక్టర్లు వదిలేసుకున్నారు. ఫలితంగా రైతాంగానికి తీవ్ర నష్టం కలుగుతున్నా చంద్రబాబు సర్కార్‌కు ఏమాత్రం పట్టలేదు. ఇదే కథ మళ్లీ పునరావృతమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనుల స్వరూపాన్నే మార్చేసి వారికి ఇష్టమైన పనులే చేపడుతున్నారు. కాగా చిత్తూరుజిల్లాకు సంబంధించి 60, 61 ప్యాకేజిల్లో పిల్ల కాలువల పనులు జరిగాయి. లైనింగ్ పనులతో ముందుకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.1,217 కోట్లతో పుంగనూరు ఉపకాలువను వెడల్పు చేసి రైతులకు ప్రయోజనం కల్పించాలని నిర్ణయిస్తే కూటమి ప్రభుత్వం ఈ పనిపై కక్ష కట్టింది. గత సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని వెడల్పు పని రద్దు చేసి కాంక్రీట్ లైనింగ్ పని చేయిస్తున్నారు. దీనివల్ల కాంట్రాక్టర్‌కు తప్ప రైతులకు ప్రయోజనం లేదు. కాలువకు స్లూయిజ్‌ల నిర్మాణం చేపట్టకుండా కేవలం సమీపంలోని చెరువులకు మాత్రమే నీటిని అందించి చేతులు దులుపుకునే పరిస్థితులు నెలకొన్నాయి. పిల్ల కాలువలు తవ్వించి 2,18,800 ఎకరాల సాగుకు నీరివ్వకుండా కొన్ని చెరువులు నింపేందుకే ఆసక్తిగా ఉంది. పిల్ల కాలువలు వదిలేయడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. ఫలితంగా కాలువసాగే మార్గంలో ఒక్క ఎకరాకు సాగునీరు అందదు. ఫలితంగా ప్రాజెక్టు లక్ష్యం నీరుగారిపోతోంది. 28 మండలాలకు తీవ్ర నష్టంపిల్ల కాలువ పనులు జరక్కపోవడంతో అన్నమయ్య, చిత్తూరుజిల్లాల్లోని 28 మండలాలు కరువు పరిస్థితుల నుంచి గట్టెక్కలేని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. బి.కొత్తకోట, ములకలచెరువు, పెద్దతిప్పసముద్రం, తంబళ్లపల్లి, కురబలకోట, మదనపల్లి, పెద్దమండ్యం, పుంగనూరు, చౌడపల్లి, పులిచర్ల, సదుం, పలమనేరు, పెద్దపంజాణి, గంగవరం, చిత్తూరు, గుడిపాల, పాకాల, చంద్రగిరి, కేవి.పల్లి, వాయల్పాడు, కలకడ, కలికిరి, గుర్రంకొండ, పీలేరు, పెనుమూరు, పూతలపట్టు, ఐరాల, తవణంపల్లి మండలాలకు సాగునీరు అందక తీవ్రంగా నష్టపోతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఈ మండలాలకు నిర్ణయించిన ఆయకట్టు భూమికి కృష్ణాజలాలతో పంట సాగు కలలో మాటగా మిగిలిపోవడం ఖాయం. కుప్పానికి ఇదే పరిస్థితిసీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కుప్పం ఉపకాలువ నుంచి 6వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ఇక్కడి 110 చెరువులకు కృష్ణా జలాలను తరలించి నీటిని అందిస్తారు. అయితే రెండుచోట్ల పిల్ల కాలువలను తవ్వించాల్సి ఉన్నప్పటికీ దీనిపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. కుప్పం నియోజకవర్గంలో 77, పలమనేరు నియోజకవర్గంలో 33 చెరువులకు కృష్ణా జలాలు అందించే ప్రణాళికపై చర్యలు తీసుకుంటారో లేదో స్పష్టత లేదు. కుప్పం కాలువకు లైనింగ్ పనులు చేస్తున్నందున ఆ ప్రభావం రెండు నియోజకవర్గాలపై పడనుంది. పిల్ల కాలువలకు మంగళం అన్నమయ్య, చిత్తూరుజిల్లాల్లో 2,18,800 ఎకరాలకు చుక్కనీరు అందదు కుప్పం రైతాంగానికి ఇదే పరిస్థితి కృష్ణా జలాల తరలింపు లక్ష్యం నెరవేరదు కొత్తగా లైనింగ్ పనులతో రైతులకు తీవ్ర నష్టం ప్రస్తుత అన్నమయ్య, చిత్తూరుజిల్లాలో సాగే హంద్రీ–నీవా ప్రాజెక్టు ఉపకాలువల నుంచి రైతుల పొలాలకు నీళ్లు అందించేలా ప్రతి 40 నుంచి 100 ఎకరాలకు ఒక పిల్ల కాలువను తవ్వాలి. దీనికి నీటిని తరలించేలా ఉపకాలువ వద్ద స్లూయిజ్‌లను నిర్మించాలి. ఇలా చేయడం ద్వారా రెండు జిల్లాలకు చెందిన తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు, పలమనేరు, చిత్తూరు, పూతలపట్టు, చంద్రగిరి నియోజకవర్గాల్లోని 2,18,800 ఎకరాలకు శ్రీశైలం నుంచి ఇక్కడికి తరలించే కృష్ణా జలాలను సాగుకు అందించాలి. అయితే ప్రభుత్వం వీటిని తవ్వించేందుకు సుముఖంగా లేదు. రైతు ప్రయోజనాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా లైనింగ్ పనులపైనే శ్రద్ధ చూపుతోంది. -
ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్
మదనపల్లె : సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్ స్కూల్ సొసైటీ) ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జోరుగా సాగింది. సోమవారం ఓపెన్ ఇంటర్ పరీక్షలు పట్టణంలోని జెడ్పీ ఉన్నతపాఠశాల, కోటబడి హోప్ మున్సిపల్ హైస్కూల్, రామారావుకాలనీ బాపూజీ మున్సిపల్ హైస్కూల్ కేంద్రాల్లో ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. సుమారు 550 మందికి పైగా విద్యార్థులు మూడు కేంద్రాల్లోనూ పరీక్షలకు హాజరయ్యారు. రెగ్యులర్ ఇంటర్ పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో లైవ్ స్ట్రీమింగ్‌లో పర్యవేక్షణ జరుగుతోంది. అయితే ఓపెన్ ఇంటర్ పరీక్షలు మాత్రం ఇందుకు భిన్నంగా, ఎలాంటి బందోబస్తు లేకుండా ఇన్విజిలేటర్లు స్వయంగా విద్యార్థుల చేతికి స్లిప్పులు అందించి కాపీయింగ్‌కు సహకరించారు. సాధారణంగా పలు కారణాలతో కళాశాలలు, పాఠశాలకు వెళ్లని అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతుంటారు. ఇంకా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఉద్యోగోన్నతి కోసం ఓపెన్ ఇంటర్ స్కూల్ పరీక్షలు రాస్తున్నారు. ఇదే అదనుగా భావించిన స్టడీ కేంద్రాల నిర్వాహకులు అభ్యర్థులు ఒకొక్కరి నుంచి రూ.10 నుంచి 12 వేలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ మొత్తంలో విద్యాశాఖాధికారులకు, ఇన్విజిలేటర్లకు వాటాలు ముట్టజెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష ముగిశాక, పరీక్షా కేంద్రాల వద్ద ఎక్కడ చూసినా విద్యార్థులు పడేసిన స్లిప్పులు కనిపించాయి. ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌పై ఎంఈఓ–2 రాజగోపాల్‌ను వివరణ కోరితే... పరీక్షలు పకడ్బందీగా నిర్వహించామన్నారు. మాస్ కాపీయింగ్‌కు అవకాశమే లేదని, పరీక్ష నిర్వహణ పారదర్శకంగా నిర్వహించామన్నారు. స్టడీ సెంటర్ల నిర్వాహకుల డబ్బు వసూళ్లు తమ దృష్టికి రాలేదన్నారు. -
నాణ్యత లేని ఆహారం అమ్మితే కఠిన చర్యలు
రాయచోటి టౌన్ : నాణ్యత లేని ఆహారాన్ని ప్రజలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ హోటళ్లు, బేకరీ యజమానులను హెచ్చరించారు. సోమవారం జిల్లా ఆహార భద్రత అధికారి డాక్టర్ కె. షమీమ్బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా కేంద్రమైన రాయచోటిలోని పలు హోటళ్లు, బేకరీలను తనిఖీ చేశారు. వాటిలోని ఆహార పదార్థాలను పరిశీలించారు. వంటకాల కోసం వాడిన నూనెలను మూడు సార్లకు మించి వాడకూడదని అలా ఎక్కువ సార్లు వాడితే ఆ నూనెలు కలుషితం అవుతాయని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లను పరిశీలించి వారికి రూ.32 వేలు జరిమానా విధించారు. పేదింటి బిడ్డకు ఎస్ఐ కొలువు పీలేరు : స్థానిక ఇందిరమ్మ కాలనీకి చెందిన గిరిజన కుటుంబానికి చెందిన మూర్తి, కమలమ్మ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి కుమారుడు విశ్వనాథం లోకేష్ ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వలసపల్లె నవోదయ పాఠశాలలో చదివాడు. అనంతరం కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీలో బీఎస్సీ జాగ్రఫీ చదివివాడు. 2020లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలనే పట్టుదలతో చదివి 2024–25 ఎస్ఐ రిక్రూట్మెంట్లో ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించాడు. తిరుపతి జిల్లాలో ఎస్ఐ పోస్టింగ్ పొందాడు. ఆస్పత్రి సెక్యూరిటీ గార్డుపై అంబులెన్స్ డ్రైవర్ దాడిమదనపల్లె : ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి సెక్యూరిటీ గార్డుపై అంబులెన్స్ డ్రైవర్ దాడి చేయడంతో పాటు ఆస్పత్రి డ్యూటీ డాక్టర్‌పై దౌర్జన్యం చేసిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఘటనపై బాధితుడు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. జిల్లా ఆస్పత్రి సెక్యూరిటీ గార్డు నాగేశ్వర ఆదివారం రాత్రి ఐసీయూ విభాగం వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. రాత్రి 12.30 గంటల సమయంలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ అల్తాఫ్ మద్యం సేవించి ఐసీయూ వార్డు ద్వారా మెటర్నటీ వార్డులోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో అక్కడ ఉన్న నాగేశ్వర అర్ధరాత్రి వేళ అనుమతి లేకుండా మెటర్నటీ వార్డులోకి వెళ్లరాదంటూ అడ్డుకున్నాడు. దీంతో అంబులెన్స్ డ్రైవర్ ఆగ్రహంతో నాగేశ్వరపై దాడిచేసి గాయపరిచాడు. ఈ విషయాన్ని డ్యూటీ డాక్టర్, హెడ్నర్స్కు తెలిపితే...డాక్టర్ సయ్యద్ అజీజ్ ప్రశ్నించడంతో అంబులెన్స్ డ్రైవర్ ఆయనపై దౌర్జన్యం చేశాడు. ఈ విషయమై బాధితుడు నాగేశ్వర సోమవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ కోటేశ్వరికి, టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
పీజీ కామన్ సెట్ విధానాన్ని రద్దు చేయాలి
రాయచోటి అర్బన్ : పీజీ కామన్ సెట్ విధానంతో పాటు జీఓ నంబర్ 77ను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల వలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థుల ఉన్నత విద్యావకాశాలకు గండికొడుతున్న జీఓ నంబర్ 77ను వెంటనే రద్దు చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్ శ్రీధర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవ్, నియోజకవర్గ నాయకులు కిరణ్‌కుమార్, గణేష్, లక్ష్మిప్రసాద్, ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు. -
కిటకిటలాడిన గంగమ్మ ఆలయం
లక్కిరెడ్డిపల్లె.. మండలంలోని అనంతపురం గ్రామంలో వెలసిన అనంతపురం గంగమ్మ దేవాలయం జాతర ముగిసిన మరుసటి రోజు సోమవారం కూడా వేలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయింది. వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కు లు తీర్చుకున్నారు. ఆలయ ప్రత్యేకాధికారి శ్రీనివాసులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లక్కిరెడ్డిపల్లె సీఐ, ఎస్ఐలు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయ పూజారులైన చెల్లు గంగరాజు, దినేష్ యాదవ్‌లు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మార్కండేయ, శ్రీరాములు ,పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గంగమ్మ దేవత హుండీ ఆదాయం రూ.15 లక్షలు ఈ నెల 1, 2, 3 తేదీల్లో జరిగిన మూడు రోజుల గంగమ్మ దేవత జాతర సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలను లెక్కించారు. రూ.15లక్షల 43 వేలు 302 నగదు, బంగారం రూపంలో 11 గ్రాములు, వెండి రూపంలో 1 కేజీ 928 గ్రాములు వచ్చినట్లు ఆలయ ప్రత్యేకాధికారి శ్రీనివాసులు తెలిపారు. ఈ మొత్తాన్ని ఆలయ ఖాతాకు జమ చేసి అభివృద్ధికి ఖర్చు చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారులు చెల్ల గంగరాజు, దినేష్ యాదవ్, చంద్ర, వెంకటేశ్వర్లు, రెడ్డిశేఖర, కమిటీ సభ్యులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
నిర్ణీత సమయంలోగా సమస్యలు పరిష్కరించాలి
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి ఎస్పీ నేరుగా ఫిర్యాదులను స్వీకరించి ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదులను సంబంధిత పోలీసు అధికారులకు అప్పగించి సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. నడవలేని స్థితిలో వచ్చిన ఫిర్యాదు దారులతో.. మదనపల్లె మండలం, కోళ్లబైలు గ్రామం నుంచి వచ్చిన ఎ.సలావుద్దీన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నడవలేని స్థితిలో స్ట్రక్చర్ పై ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. తాను టీవీఎస్ వాహనంలో వెళ్తుండగా ఎదురుగా బైక్‌పై వస్తున్న వ్యక్తి ఢీ కొట్టగా తీవ్రగాయాలయ్యాయని, తనకు నష్టపరిహారం, ఆసుపత్రి ఖర్చులు ఇప్పించేలా సహాయం చేయాలని ఎస్పీని వేడుకున్నారు. దీంతో అతని సమస్యను పరిష్కరించాలని మదనపల్లె ఒకటో పట్టణ సీఐకి ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు. అలాగే నందలూరు మండలం, నాగిరెడ్డిపల్లి నుంచి వచ్చిన ఎస్.హుస్సేన్ బాషా నడవలేని స్థితిలో కుటుంబ సభ్యుల సాయంతో వచ్చారు. కాలు విరిగి వైద్యం కోసం దాచుకున్న నగదును పరిచయస్తుడైన వ్యక్తి తీసుకొని ఇవ్వలేదని, డబ్బులు ఇప్పించేలా న్యాయం చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. సమస్యను పరిష్కరించాలని నందలూరు ఎస్ఐను ఎస్పీ ఆదేశించారు. మజ్జిగ పంపిణీ.. ఎండలు ప్రారంభం కావడంతో కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుదారులకు ఇబ్బందులు కలగకుండా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు మజ్జిగ పంపిణీ చేశారు.జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు -
భక్తిశ్రద్ధలతో ధ్వజావరోహణం
రాయచోటి టౌన్ : రాయచోటిలోని వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు స్వామి వారి ధ్వజావరోహణ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం మఠాధిపతి వేదపండితులు శ్రీ మఠం ఓంకార స్వామి శిష్యగణం ఆధ్వర్యంలో వేదమంత్రాల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. అంతకు ముందు హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామి వారి బ్రహ్మోత్సవాల కంకణధారణలు విసర్జింప జేశారు. తర్వాత వసంతోత్సవ కార్యక్రమం అత్యంత కోలాహలంగా చేపట్టారు. ఈ పూజలు ఆలయ ఈఓ డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు శంకరయ్య స్వామి, కృష్ణయ్య స్వామి, శేఖర్ స్వామి, వేదపండితులు రాచరాయ యోగీ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించండి
మదనపల్లె : టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ నుంచి తమకు ప్రాణహాని ఉందని, అక్రమ రిజిస్ట్రేషన్‌తో ఆయన స్వాధీనం చేసుకున్న తమ ఇళ్ల స్థలాలను తమకు అప్పగించాలని కోరుతూ చేనేత కార్మికులు సబ్ కలెక్టర్ మేఘస్వరూప్‌ను వేడుకున్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. సబ్ కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను తీసుకుని, వారి సమస్యలను తెలుసుకున్నారు. పరిష్కార నిమిత్తం ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బండమీదకమ్మపల్లె రెవెన్యూ గ్రామం నీరుగట్టువారిపల్లెకు చెందిన చేనేత కార్మికులు తమ కష్టార్జితాన్ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ కబ్జా చేశారంటూ ఫిర్యాదు చేశారు. సిరికల్చర్ కాలనీ ఏరియా సర్వేనెంబర్.423–2లో వేసిన లేఅవుట్లో 77మంది చేనేత కార్మికులు... 21 ఏళ్ల క్రితం కొండుపల్లె యశోదమ్మ, శ్రీనివాసులు, రెడ్డెప్పల నుంచి ఇళ్లస్థలాలను కొనుగోలు చేశామన్నారు. అందులో కొందరు ఇల్లు నిర్మించుకోగా, మరికొందరు పునాదులు వేసుకుని భద్రపరుచుకున్నామన్నారు. ఈ స్థలాలపై కన్నేసిన మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్..2020లో దేశిరెడ్డి హరినాథరెడ్డి పేరుపై జీపీఏ చేయించి, సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్‌తో చేతులు కలిపి, తమ పేర్లపై రిజిస్ట్రేషన్ జరిగిన ఇళ్లస్థలాలను వ్యవసాయ భూములుగా పేర్కొంటూ తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. తర్వాత అక్రమంగా తమ స్థలాల్లోకి ప్రవేశించి, ఇళ్ల స్థలాల హద్దులను చెరిపివేసి, అడ్డువచ్చిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ భూమిని కబ్జా చేశారన్నారు. దీనిపై తహసీల్దార్, సబ్రిజిస్ట్రార్లను కలిసి వేడుకుంటే వారు పట్టించుకోలేదన్నారు. ఎమ్మెల్యే షాజహాన్‌బాషాను కలిసి వినతిచేస్తే..ఆయన మాజీ ఎమ్మెల్యే రిజిస్ట్రేషన్‌ను రద్దుచేయమని ఆదేశించినా, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్లు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ నుంచి తమకు బెదిరింపులు ఎక్కువయ్యాయని, తమకు ఏదైనా జరిగితే దానికి ఆయనదే పూర్తిబాధ్యత అన్నారు.సబ్ కలెక్టర్‌ను వేడుకున్న బాధితులు -
కష్టపడిన వారికే పదవులు ఇవ్వాలి
బి.కొత్తకోట : పార్టీ కోసం కష్టపడిన తమకే పదవులన్నీ కట్ట పెట్టాలని మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గీయులు డిమాండ్ చేశారు. సోమవారం బి.కొత్తకోటలో సమావేశమైన వీరంతా అధికారిక పదవులపై చర్చించారు. ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి వర్గానికి పదవులు ఇవ్వరాదని డిమాండ్ చేశారు. పార్టీ కోసం కష్టపడింది తామేనని, పదవులు శంకర్ వర్గానికి ఇవ్వడమే న్యాయమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని టీడీపీ జోన్ ఫోర్ ఇన్చార్జ్ దీపక్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి నివేదిక ఇవ్వాలని కోరినట్టు శంకర్ వర్గీయులు తెలిపారు. శంకర్ ఆదేశాలతోనే ఈ సమావేశం నిర్వహించామని నాయకులు చెప్పడం గమనార్హం. కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న వర్గ పోరు మళ్లీ బహిరంగమై పోటాపోటీగా సమావేశాలు పెడుతున్నారు.ఈ పోటీ సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు నారాయణస్వామి రెడ్డి, పోల్ కోఆర్డినేటర్ కుడుము శ్రీనివాసులు, టౌన్ అధ్యక్షుడు బంగారు వెంకటరమణ, క్లస్టర్ ఇన్చార్జి కనకంటి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుకుమార్, ప్రధాన కార్యదర్శి దేవరింటి కుమార్ పాల్గొన్నారు.జయచంద్రారెడ్డికి పోటీగా శంకర్ వర్గం సమావేశం -
అగ్నికి ఆహుతైన మామిడి చెట్లు
గాలివీడు : ఆకతాయిలు పెట్టిన అగ్నికి మామిడి చెట్లు ఆహుతి అయ్యాయి. బాధితుని కథనం మేరకు.. నూలివీడు పంచాయతీ శ్రీనివాసపురానికి చెందిన పోలా శ్రీనివాసులు గ్రామ సమీపంలో మామిడి చెట్లను పెంచుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు సమీపంలోని గుట్టకు నిప్పు పెట్టడంతో నిప్పు అక్కడి నుంచి వ్యాపించి మామిడి తోటకు అంటుకుంది. దీంతో అందులోని దాదాపుగా 40 వరకు చెట్లు కాలిపోయినట్లు బాధితుడు తెలిపాడు. మామిడి చెట్లకు 10 సంవత్సరాలకు పైబడి వయస్సు ఉంటుందని, మామిడి చెట్లను బతికించుకోవడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశానని తెలిపాడు. బాగా పూతకు వచ్చిన దశలో నిప్పు పెట్టడంతో చెట్లు మొత్తం కాలిపోయాయని వాపోయాడు. అధికారులు స్పందించి ప్రభుత్వం నుంచి సహాయం అందజేయాలని ఆయన కోరాడు. -
పీజీ కామన్ సెట్ విధానాన్ని రద్దు చేయాలి
రాయచోటి అర్బన్ : పీజీ కామన్ సెట్ విధానంతో పాటు జీఓ నంబర్ 77ను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల వలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థుల ఉన్నత విద్యావకాశాలకు గండికొడుతున్న జీఓ నంబర్ 77ను వెంటనే రద్దు చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్ శ్రీధర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవ్, నియోజకవర్గ నాయకులు కిరణ్‌కుమార్, గణేష్, లక్ష్మిప్రసాద్, ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు. -
పని భారం అంతా మా పైనేనా ?
పెద్దతిప్పసముద్రం: మండలంలోని పలు సచివాలయాల్లో పని చేస్తూ డీడీఓ అధికారాలు ఉన్న పంచాయతీ కార్యదర్శులు సోమవారం ఎంపీడీఓ అబ్దుల్ కలాం ఆజాద్ ఎదుట అసంతృప్తి గళం విప్పారు. ఈ సర్వే , ఆ సర్వే అంటూ మొత్తం 41 సర్వేల భారం అంతా తమపైనే రుద్దుతారా, మిగిలిన శాఖల అధికారుల గురించి మీరెందుకు పట్టించుకోవడం లేదు సార్ అంటూ ఎంపీడీఓను ప్రశ్నించారు. వీఆర్ఓ, సర్వేయర్ చూస్తే రీసర్వే అంటారు, ఆర్ఎస్కే అసిస్టెంట్‌ను అడిగితే ఫార్మర్ రిజిస్ట్రీ అంటారు. వెటర్నరీ, ఏఎన్ఎంలను సర్వే చేయమంటే సీజనల్ వ్యాధులని ఈ వ్యాక్సిన్, ఆ వ్యాక్సిన్ అంటారు. కొంత మంది గ్రేడ్–5 కార్యదర్శులు చూస్తే నెలల తరబడి సెలవులో వెళ్లిపోతారు. కొన్ని చోట్ల డీఏ, వెల్ఫేర్ పోస్టులు ఖాళీగా ఉన్నా ఆ పని భారం కూడా తమపైనే రుద్దుతారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని సర్వేలు తామే చేయడమే గాక మిగిలిన వారికంతా 1వ తేదీలోగా జీతాలు వచ్చేలా చూడాలి. ఇంత గొడ్డు చాకిరి చేసే తమకు మాత్రం 1వ తేదీ కాకుండా 20వ తేదీ జీతాలు ఎలా వస్తాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. డీడీఓల ఆవేదనపై స్పందించిన ఎంపీడీఓ పక్కనే ఉన్న తహసీల్దార్ శ్రీరాములు నాయక్‌తో చర్చించారు. సర్వేకు వీఆర్ఓలు, సర్వేయర్లు సహకరించేలా చూడాలని ఎంపీడీఓ సూచించారు. తహసీల్దార్ కూడా సానుకూలంగా స్పందించడంతో డీడీఓలు శాంతించారు.ఎంపీడీఓ ఎదుట డీడీఓల అసంతృప్తి -
విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రమాదం
గాలివీడు : చెట్టు కొమ్మ విరిగి పడిన ఘటనలో స్కూల్ విద్యార్థులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కవిత కథనం మేరకు.. మండల పరిధిలోని వెలిగల్లు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉదయం 8.40 గంటల ప్రాంతంలో విద్యార్థులు ప్రార్థన చేసేందుకు పాఠశాల మైదానంలో ఉన్న చెట్ల కింద నిల్చున్నారు. అయితే అక్కడే ఎత్తుగా ఉన్న సుంకేసుల చెట్టుకు ఉన్న పెలుసుబారిన బలమైన కొమ్మ ఒకటి ప్రమాదవశాత్తు విరిగి పడటంతో ఒక్కసారిగా విద్యార్థులు ఉలిక్కి పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థినులకు స్వల్పంగా రెమ్మలు తాకడంతో చర్మంపై గీచులు పడ్డాయి. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించామన్నారు. అదృష్టవశాత్తు విద్యార్థులకు పెద్ద పెను ప్రమాదం తప్పిందంటూ ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఎంపీలతో ఎమ్మెల్యే భేటీ
రాజంపేట రూరల్ : తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డిలతో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి భేటీ అయ్యారు. స్థానిక మేడా భవన్‌కు వచ్చిన ఎంపీలతో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి, నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆకేపాటి సోమవారం వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. పలు విషయాలపై చర్చించారు. ఎంపీలను కలిసిన వారిలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు విజయ్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్లు ఎస్. నవీన్‌కుమార్, డొంక సూరి, డొంక సురేష్, కూండ్ల రమణారెడ్డి, ఎస్.న్యామతుల్లా, విష్ణు నాయక్, సుబ్రమణ్యం పాల్గొన్నారు. కక్షగట్టి నిప్పు పెట్టారుసంబేపల్లె : వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఆవుల కుటుంబ సంబంధీకుల భూములపై గత కొంత కాలంగా కక్ష సాగింపు సాగుతోంది. ఈ క్రమంలో మండల పరిధిలోని మొటుకువాండ్లపల్లె క్రాస్ సమీపంలో ఉన్న తోటకు సోమవారం గుర్తు తెలియని దుండుగలు నిప్పు పెట్టారు. మంటలు అధికం కావడడంతో పైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. స్పందించిన ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే పొలంలో ఉన్న పైపులు, డ్రిప్ వైర్లు, కాలి బూడిదగా మారాయి. ఆవుల కుటుంబంపై ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష అని పలువురు చర్చించుకుంటున్నారు. అక్రమంగా మట్టి తరలింపుసిద్దవటం : ఉపాధి హామీ పనుల్లో భాగంగా కూలీలు పనులు చేపట్టిన ప్రాంతాల నుంచి ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. సిద్దవటం మండలంలోని టక్కోలు ఎర్ర చెరువులో గత రెండు వారాల నుంచి 60 మంది ఉపాధి హామీ కూలీలు ఫిష్ పాండ్ పనులు చేస్తున్నారు. పనులు ముగిసిన తరువాత ఇంటికి వెళ్లే సమయంలో ఉపాధి పనులు చేపట్టిన ప్రాంతాల నుంచి అక్రమంగా కొంతమంది మట్టిని ఇటుకల బట్టీలకు తరలించుకుంటున్నారు. ఒక ట్రాక్టర్ మట్టి విలువ దాదాపు రూ. 5వేలకు విక్రయించుకుంటున్నారు. ఉపాధి కూలీలు పనులు చేసిన ప్రదేశాల్లో అధికారులు కొలతలు తీసుకోక ముందే మట్టిని తరలిస్తుండటంతో కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఉపాఽధి హామీ ఏపీఓ నరసింహులు వివరణ కోరగా మట్టి తరలి పోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కూలిన విద్యుత్ స్తంభం లక్కిరెడ్డిపల్లి: గంగమ్మ జాతరకు వెళ్తూ చాందినీ బండి ముందున్న డీజే వాహనం విద్యుత్ స్తంభానికి తగలడంతో ఒక్కసారిగా విరిగి పడిపోయింది. వందలాది మంది రద్దీగా ఉన్న చౌటపల్లి కొత్తపల్లిరోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. కుర్నూతల వడ్డిపల్లికి చెందిన వ్యక్తి తలకు బలమైన గాయం తగలడంతో ఆసుపత్రికి తరలించారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా ట్రాన్స్‌కో అధికారులు కన్నెత్తి కూడా చూడలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
బీజేపీ నాయకుడిపై దాడి దారుణం
రామసముద్రం : కూటమి ప్రభుత్వంలో టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులపై దాడులు చేయడం దారుణమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ బోర్డ్ మెంబర్ భానుప్రకాష్‌రెడ్డి అన్నారు. రామసముద్రంలో కొద్దిరోజుల క్రితం టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తిని ఆదివారం స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా దాడికి దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడు మిట్ట వంశీకృష్ణ, జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయిలోకేష్తో కలిసి మీడియాతో మాట్లాడారు. కృష్ణమూర్తిపై దాడిచేసిన టీడీపీ నాయకులను వదిలే ప్రసక్తి లేదన్నారు. వాలీశ్వరస్వామి ఆలయ అర్చకుడి విషయంలో హైకోర్టు నిర్ణయానికి విరుద్ధంగా చేస్తుంటే, వారికి మద్దతుగా నిలిచినందుకు బీజేపీ నాయకులపై దాడిచేయడం సిగ్గుచేటన్నారు. దాడి విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ద్వారా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడి వెనుక ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరున్నా విడిచిపెట్టమన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బండి ఆనంద్, నారదరెడ్డి, ఆనందనాయుడు, చలపతి, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యంనాయుడు, వెంకటేష్, జయరాం, భగవాన్, లోకనాథస్వామి, బాలస్వామి, శంకరస్వామి, సుందరం, అశోక్, శంకర, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ బోర్డ్ మెంబర్ భానుప్రకాష్‌రెడ్డి -
దొంగ.. దొంగ!
కురబలకోట : ముదివేడు పోలీసులకు సవాల్‌గా మారిన అంగళ్లు వరుస చోరీల కేసులో దొంగల కోసం వేట మొదలైంది. కురబలకోట మండలం అంగళ్లు కూడలి ప్రాంతంలో హైవే పక్కన శుక్రవారం రాత్రి దొంగలు రెచ్చి పోయిన విషయం తెలిసిందే. రాత్రి 12 గంటల నుండి రెండున్నర గంటల వరకు యథేచ్ఛగా ఒకే రోజు వరుసగా ఏడు షాపుల్లో చోరీకి పాల్పడ్డారు. షాపుల యజమానులు హడలిపోయారు. రూ.2.5 లక్ష విలువ చేసే సామగ్రి, రూ.పది వేలు నగదు చోరీ జరిగినట్లు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. చోరీ చేసిన ఓ షాపులో సీసీ కెమెరాల్లో ఓ దొంగ ముఖ కవళికలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఇద్దరు యువకులు సీసీ ఫుటేజీలో కన్పిస్తుండగా ఒకరు గుర్తు పట్టే విధంగా కన్పిస్తున్నారు. దీంతో ఇతని కోసం వివిధ పోలీస్ స్టేషన్లకు సమాచారం పంపి విచారిస్తున్నారు. మరో వైపు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలిస్తున్నారు. దొంగలు ఎక్కడున్నా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ చోరీ కేసును ఛేదిస్తామని ఆదివారం తెలిపారు. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి బ్రహ్మంగారిమఠం : మండలంలోని కొత్తబస్వాపురంలో తొర్రివేముల నాగరాజు (34) ఆదివారం వ్యవసాయ పొలం దగ్గర విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పొలం వద్ద పందుల నివారణ కోసం ఏర్పాటు చేసిన వైరు తగలడంతో ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో..రాయచోటి: రాయచోటి–చిత్తూరు మార్గంలోని రింగ్ రోడ్డు సమీప ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చల్లా సుధాకర్ (50) మృతి చెందాడు. ఆదివారం ఉదయం బైకుపై వస్తున్న సుధాకర్‌ను ఎదురుగా వస్తున్న కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు కలకడ మండలం, ఎగువ కురవపల్లి గ్రామానికి చెందిన వాడన్నారు. కేసు నమోదు చేసినట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. అంగళ్లు దొంగల కోసం వేట -
గంగ జాతరలో ఏరులై పారిన మద్యం
లక్కిరెడ్డిపల్లి : గంగమ్మ జాతరలో మద్యం దుకాణాలు వెలిశాయి. బాటిల్‌పై రూ. 50 నుంచి రూ. 100 అదనంగా వసూలు చేసి మద్యం దుకాణదారులు లక్షల రూపాయలు సొమ్ము చేసుకున్నారు. ఇదంతా జరుగుతున్నా ఎకై ్సజ్ పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. మద్యం దుకాణాలకు ఎలాంటి అనుమతులు లేకపోయినా ఇష్టానుసారంగా జాతరలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి భక్తులను దండుకున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే పేకాట క్లబ్బులు, స్లో బాల్ ఆటలను ఏర్పాటు చేసుకొని భక్తుల జేబులకు చిల్లులు వేశారు. ఇదంతా జాతర బయట జరగలేదు. జాతర మధ్యలో సందడిగా ఉన్న ప్రాంతంలో పేకాట క్లబ్బులు జరిగాయి. లక్షలాది రూపాయలు భక్తుల నుంచి దోచుకున్నారు. అడిగే నాథుడే లేకపోవడంతో రంగులరాట్నం, మిఠాయి దుకాణాలు మొదలుకొని చెరుకుల గడల వరకు దోచుకున్న వారికి దోచుకున్నంత అన్న చందంగా అధికంగా వసూలు చేసుకొని వ్యాపాలు కొనసాగించారు. పట్టించుకోవాల్సిన అధికారులు తమకు ఏమీ తెలియనట్లు వ్యవహరించారు. విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు భక్తుల జేబులకు చిల్లులు పట్టించుకోని అధికారులు -
వ్యక్తి దారుణ హత్య
సంబేపల్లె : సంబేపల్లె మండల పరిధిలోని నారాయణరెడ్డిపల్లె గ్రామం ముదినేని వడ్డిపల్లెకు చెందిన తిరుపతి వారాధి (65) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల మేరకు ముదినేని వడ్డిపల్లెకు చెందిన టి. వారాధి గ్రామంలో రోడ్డుకు సంబంధించి బ్రిడ్జి నిర్మాణపు పనులు చేసేవాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి బ్రిడ్జి నిర్మాణపు పనుల వద్దకు వెళ్లాడు. ఆదివారం తెల్లవారే సరికి అతను శవమై కనిపించాడు. సమాచారం తెలుసుకున్న రూరల్ సీఐ వరప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మృతుని భార్య రెడ్డమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసును పోలీసులు సవాల్‌గా తీసుకుని విచారణ ముమ్మరం చేశారు. హత్యకు గురైన తండ్రిని చూసి కొడుకు నాగేశ్వర ‘నేను కువైట్ నుంచి వచ్చింది నీ చావు చూసేందుకా నాన్నా’ అంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి వారాధిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర క్రీడా శాఖా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పోలీస్ అధికారులకు సూచించారు. ఆదివారం మండల పరిధిలోని ముదినేనివాండ్లపల్లె సమీపంలో హత్యకు గురైన వారాధి మృతదేహాన్ని పరిశీలించారు. -
అత్తమామలపై అల్లుడి దాడి
మదనపల్లె : మద్యం మత్తులో అత్తమామలపై అల్లుడు దాడిచేసిన ఘటన ఆదివారం పీటీఎం మండలంలో జరిగింది. బూచుపల్లెకు చెందిన గంగాధర(50), లక్ష్మీనరసమ్మ(45) దంపతులు. వీరి కుమార్తె గాయత్రిని అదే గ్రామానికి చెందిన అమరప్ప కుమారుడు విజయ్ ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఉపాధి నిమిత్తం భార్యతో కలిసి బెంగళూరుకు వెళ్లి అక్కడే డ్రైవర్‌గా పనిచేసేవాడు. అయితే గత కొంతకాలంగా మద్యానికి బానిసై తరచూ భార్యను వేధింపులకు గురిచేస్తూ అదనపు కట్నం కోసం ఒత్తిడి చేసేవాడు. ఈ క్రమంలో శివరాత్రి పండుగ సందర్భంగా స్వగ్రామానికి భార్యతో కలిసి వచ్చి, ఆమెను పుట్టినింట్లో వదిలిపెట్టాడు. ఆదివారం మధ్యాహ్నం పూటుగా మద్యంసేవించి భార్య వద్దకు వచ్చి గొడవకు దిగాడు. ఆమైపె దాడిచేస్తుండగా, అత్త లక్ష్మీనరసమ్మ, మామ గంగాధర అడ్డుకునే ప్రయత్నం చేశారు. తీవ్ర ఆవేశానికి లోనైన విజయ్ వారిపై దాడిచేసి విచక్షణారహితంగా కొట్టాడు. దాడిలో గాయపడిన గంగాధర, లక్ష్మీనరసమ్మలను 108 వాహనంలో బి.కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఔట్‌పోస్ట్ పోలీస్ సిబ్బంది పీటీఎం స్టేషన్‌కు సమాచారం అందించారు. -
ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న ఓబిలి గ్రామస్తులు
పెనగలూరు : మండలంలోని ఓబిలి గ్రామ సమీపంలోని చెయ్యేరు నదిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను ఓబిలి గ్రామస్తులు ఆదివారం అడ్డుకున్నారు. ఓబిలి, అత్తిగారిపల్లి గ్రామాలకు తాగునీటి సరఫరా చేసే బోర్ల వద్దకు ఇసుకను తీసుకెళ్తుండటంతో తాగునీటి సమస్య తలెత్తుతుందని గ్రామస్తులు ట్రాక్టర్లను అడ్డుకున్నారు. గ్రామస్తులు లేనప్పుడు తిరిగి యథావిధిగా ఇసుకను తరలిస్తుండటంతో జేసీబీతో నాలుగు అడుగుల గుంత తీసి ట్రాక్టర్లు వెళ్లకుండా అదుపు చేశారు. వేసవి కాలం రానుండటంతో నీటి సమస్య తలెత్తకుండా ముందుజాగ్రత్తగా ట్రాక్టర్లను అడ్డుకుంటున్నామని గ్రామస్తులు తెలిపారు. -
హార్సిలీహిల్స్ విద్యార్థుల గోల్డెన్ జూబ్లీ వేడుక
బి.కొత్తకోట: బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌పై ఒకప్పుడు ఉన్న స్కూలులో చదువుకున్న విద్యార్థులు 50 ఏళ్ల తర్వాత ఇదే హార్సిలీహిల్స్‌పై ఆదివారం కలుసుకుని గోల్డెన్ జూబ్లీ వేడుకను ఉత్సాహాంగా జరుపుకున్నారు. కొండపై గతంలో హార్సిలీహిల్స్ హైస్కూల్ ఉండేది. 1975లో పదో తర గతి కలిసి చదువుకున్న అప్పటి విద్యార్థులు..ప్రస్తుతం వివిధ రంగాల్లో, రాజకీయాల్లో ఉన్న వీరంతా సమావేశం నిర్వహించుకున్నారు. అప్పటి గురువులను స్మరించుకుని మృతిచెందిన ఉపాధ్యాయుల చిత్రపటా లకు నివాళులర్పించారు. ఆట పాటలతో ఆనందంగా గడిపారు. తాము చట్టసభల్లో పని చేశామని, ఉన్నతాధికారులమన్న భావన లేకుండా ఒక్కటిగా కలిసి కొండపై సందడి చేశారు. కాలినడక ప్రకృతి అందాలను తిలకిస్తూ అప్పట్లో ఇక్కడ ఇలా ఉండేది..ఇప్పుడు ఇలా ఉంది అంటూ స్మృతులను నెమరేసుకున్నారు. సరదాగా క్రికెట్, ఇతరా క్రీడలు ఆడారు. చివర్లో పాత మిత్రులు కలిసి గ్రూప్‌ఫొటో దిగారు. ఈ పూర్వ విద్యార్థుల్లో శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి, విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి, వాణిజ్య పన్నులశాఖ జాయింట్ కమిషనర్ ఓంకార్, అనీషారెడ్డి, శ్రీనాథరెడ్డి, రాటకొండ తిలక్ తదితరులు పాల్గొన్నారు. 50 ఏళ్ల తర్వాత కలయిక వీరిలో మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు -
గన్నే నీకు ఇది తగునా..!
రాజంపేట టౌన్ : తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గన్నే సుబ్బనరసయ్యనాయుడు తమకు చెందిన భూముల్లో సాగుచేసుకుంటున్న పంట పొలాల్లోకి రానివ్వకుండా ఇతరుల ద్వారా బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని కొల్లావారిపల్లె మిట్టదళితవాడకు చెందిన దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత దళితులు, ఎమ్మార్పీఎస్ నాయకులు ఆదివారం వారి పంట పొలాల వద్ద గన్నే సుబ్బనరసయ్యనాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసైన్మెంట్ కమిటీ ద్వారా భూ లబ్ధిపొందిన వారి కుటుంబాలకు చెందిన జయరామయ్య, సుబ్బరాయుడు, ఈశ్వరయ్య విలేకరులతో మాట్లాడారు. రాజంపేట మండలం గోపమాంబపురం రెవెన్యూ పొలంలోని సర్వే నంబర్ 20/24లో 1.50 ఎకరాల భూమిని 2023వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం మన్నెం లక్షుమ్మకు అసైన్మెంట్ కమిటీ ద్వారా ఇచ్చిందన్నారు. ఈభూమి గతంలో లక్షుమ్మ అవ్వ గంగమ్మ పేరిట ఉండేదన్నారు. అలాగే 20/25 సర్వే నంబర్లోని 1.50 ఎకరాల భూమి కొట్టం దుర్గాకు, 20/26 సర్వే నంబర్లోని 50 సెంట్ల భూమిని మన్నెం పద్మకు ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ద్వారా ఇచ్చిందని తెలిపారు. దీంతో తమ భార్యల పేరిట ఉన్న ఈ భూముల్లో తాము పంటలు పెట్టి సాగుచేసుకుంటుండగా గన్నే సుబ్బనరసయ్యనాయుడు అండతో చవన పీరయ్యనాయుడు తమ భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకొని తమను భూముల్లోకి రానివ్వడం లేదని వారు ఆరోపించారు. 2023వ సంవత్సరంలో అసైన్మెంట్ కమిటీ ద్వారా తమకు కేటాయించిన భూములకు విద్యుత్‌శాఖ అధికారులు పీరయ్యనాయుడు పేరుతో విద్యుత్ కనెక్షన్‌ను ఇచ్చారని, ఈవిషయాన్ని తాము గతంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా అఽధికారులు పీరయ్యనాయుడు పేరిట ఉన్న కనెక్షన్‌ను తొలగించారని తెలిపారు. అయితే మళ్లీ అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకుల వత్తిళ్లకు తలొగ్గి పీరయ్యనాయుడుకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారన్నారు. దీంతో గన్నే సుబ్బనరసయ్యనాయుడు, పీరయ్యనాయుడులు తాము సాగుచేసుకుంటున్న పంట పొలాల్లోకి అడుగు కూడా పెట్టనివ్వకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము తమ భూముల్లోకి వెళితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, అలాగే తనపై ఆరోపణలు చేస్తే భారీ మూల్యం కూడా చెల్లించుకోవాల్సి ఉంటుందని గన్నే సుబ్బనరసయ్యనాయుడు ఇతరుల ద్వారా తమకు హెచ్చరికలు పంపుతున్నట్లు వారు తెలిపారు. సుబ్బనరసయ్యనాయుడు మేకవారిపల్లెలోని వంకపోరంబోకును ఆక్రమించుకొని షెడ్డు నిర్మించుకున్నాడని, అలాగే మిట్టమీదపల్లె మిట్టహరిజనవాడకు చెందిన గుడిసె సుబ్బరాయుడు, శెట్టిపల్లె నరసింహులు, కొండయ్య, మిట్టమీదపల్లెలోని సోమిగారి కుటుంబానికి చెందిన ఐదు ఎకరాల ఉరవడి చేనుకు గన్నే సుబ్బనరసయ్యనాయుడు దొంగపట్టాలు సృష్టించి ఆక్రమించుకున్నట్లు వారు ఆరోపించారు. గన్నే సుబ్బనరసయ్యనాయుడు రాజంపేట మండలంలో అనేకచోట్ల భూ ఆక్రమణలకు పాల్పడ్డాడని, వాటన్నింటిని కూడా తాము సర్వే నెంబర్లతో సహా వె వెలుగులోకి తీసుకురానున్నట్లు వారు తెలిపారు. దళితులను భయబ్రాంతులకు గురిచేస్తున్న టీడీపీ మండల అధ్యక్షుడు సాగుచేసుకుంటున్న భూముల్లోకి రానివ్వకుండా బెదిరింపులు గన్నే సుబ్బనరసయ్యనాయుడు దౌర్జన్యాలపై దళితుల నిరసన మద్దతు తెలిపిన ఎమ్మార్పీఎస్ నాయకులు -
యువకుడిపై దాడి
పులివెందుల రూరల్ : పులివెందుల మండల పరిధిలోని నల్లగొండువారిపల్లె గ్రామ సమీపంలోని తోటల వద్ద మట్టిని తోల కూడదని చెప్పినందుకు మణికంఠ అనే యువకునిపై దాడి చేసి గాయ పరిచారు. బాధితుని ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మట్టిని అక్రమంగా తరలిస్తుంటే తరలించ వద్దని చెప్పినందుకు సాదావలీ, అక్బరమ్మలు అరటి కాయలు కోసే కొడవలితో దాడి చేశారు. దీంతో వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం పులివెందుల ఆసుపత్రికి తరలించారు. నలుగురు మట్కా నిర్వాహకుల అరెస్టుప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని దస్తగిరి పేటలో మట్కా నిర్వహిస్తున్న నలుగురిని టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. మట్కా నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో టూటౌన్ సీఐ యుగంధర్ సిబ్బందితో కలిసి ఆదివారం సాయంత్రం దాడులు నిర్వహించారు. దాడిలో దస్తగిరిపేటకు చెందిన షేక్ నూరుద్దీన్తోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.70,250 నగదు, మట్కా పట్టీలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఆటోలో పోగొట్టుకున్న ల్యాప్‌టాప్ అప్పగింత కడప అర్బన్ : ఆటోలో ల్యాప్‌టాప్ ఇతర విలువైన వస్తువులను మరిచిపోయి దిగిన బాధితునికి పోలీసులు తిరిగి వాటిని అందజేశారు. వివరాలిలా.. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మురళి తన సొంత పనిమీద కడపకు వచ్చాడు. అప్సర సర్కిల్ వద్ద ఆటో దిగే సమయంలో తన ల్యాప్‌టాప్ ఇతర విలువైన వస్తువులు ఉన్న బ్యాగ్‌ను ఆటోలో మరిచిపోయి దిగి వెళ్లిపోయాడు. తర్వాత ఆ విషయాన్ని గుర్తించి చిన్న చౌక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆటో వచ్చిన మార్గంలోని వివిధ చోట్ల ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌లను కానిస్టేబుళ్లు శ్రీనివాస్, ఖాదర్ లు పరిశీలించి ఆటోను గుర్తించాడు. బాధితుడు కోల్పోయిన బ్యాగు, ల్యాప్‌టాప్, వాచ్ ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుని బాధితుడికి అందించారు. పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపాడు. అధికారుల ఆదేశాలతో తక్షణం స్పందించిన కానిస్టేబుళ్లను చిన్నచౌకు పోలీస్ స్టేషన్ సీఐ ఓబులేసు, ఎస్ఐలు రాజరాజేశ్వర రెడ్డి, రవి కుమార్, సిబ్బంది ప్రశంసించారు.