Bapatla
-
కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు
బాపట్ల: ఆహార పదార్థాలలో కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ ట్రెయినర్ కలకండ ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీపై మంగళవారం స్థానిక ఆహార భద్రత శిక్షణా కార్యాలయంలో హోటల్ వ్యాపారులకు ఆహార భద్రతపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రవీణ్‌కుమార్ మా ట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు. లేనిపక్షంలో అపరాధ రుసుం విధిస్తామని హెచ్చరించారు. జిల్లా గెజిటెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ దేవరాజు మాట్లాడుతూ కల్తీ ఆహారం ద్వారా ఏ వ్యక్తికై నా ప్రాణహానీ జరిగితే రూ.10 లక్షల జరిమానా విధిస్తామని చెప్పారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రణీత్ మాట్లాడుతూ ఆ హార పదార్థాల అమ్మకాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో జాతీయ కన్స్యూమర్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ చదలవాడ హరిబాబు, బాపట్ల జిల్లా ఫాస్టాక్ మేనేజర్ నవీన్, స్థానిక ఫాస్టాక్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీ సర్స్ గోపి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే సేవా పురస్కార్ అందజేత
లక్ష్మీపురం: సౌత్ సెంట్రల్ రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని 69వ రైల్వే సేవా పురస్కార్ వేడుకలను ప్రతి ఏటా పండుగ వాతావరణంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని డివిజన్ డీఆర్ఎం ఎం.రామకృష్ణ అన్నారు. స్థానిక పట్టాభిపురంలోని రైల్వే డివిజన్ కార్యాలయంలో మంగళవారం 69వ రైల్వే వీక్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవార్డులను 2024లో ప్రతిభ కనబరిచినందుకు అధికారి, ఉద్యోగులకు ఈ పురస్కారాలను అందజేయడం జరుగుతుందన్నారు. డివిజన్ పరిధిలోని 14 మంది అవార్డు గ్రహీతలుగా గుర్తించడం జరిగిందన్నారు. డివిజన్ అధికారి జి.రత్నం, గుంటూరు ఏడీఈఈ, ఎలక్ట్రిక్, మెయిన్ అధికారితో పాటు మరో 13 మంది వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది ఉన్నారని తెలిపారు. అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం స్థాయిలో మూడు అవార్డులు, రైల్వే బోర్డు స్థాయిలో ఒక అవార్డును సాధించడంలో ప్రతి శాఖ అధికారి సిబ్బంది కృషి ఉందని వారందరిని అభినందించారు. అనంతరం రైల్వే సేవా పురస్కారాలను అందజేశారు. ఏడీఆర్ఎం సైమన్, సీనియర్ డీపీఓ షహబాజ్ హనూర్, సీనియర్ డీఈఎన్ కో–ఆర్డినేషన్ అనుషా, సీనియర్ డీఎంఈ మద్దాళి రవికిరణ్, సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్, డీసీఎం కమలాకర్‌బాబు పాల్గొన్నారు. -
బకాయిలు వెంటనే విడుదల చేయాలి
ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కూటమి పభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు రూ.4,600 కోట్లు తక్షణం చెల్లించాలి. దీంతోపాటు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ప్రతిపాదలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకొని పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకరావాలి. అలా చేయని పక్షంలో వైఎస్సార్ సీపీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంది. – మాచవరపు రవికుమార్, రాష్ట్రకార్యదర్శి, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం డీఎస్సీ ప్రకటించాలి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. సంతకం చేసి పది నెలలైనా అతీగతీలేదు. తక్షణం డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యాగాలు ఇస్తామని, ఉద్యోగం రాని వారికి నెలకు రూ.3 వేలు భృతి ఇస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు. ఉద్యోగం రాని వారికి భృతి ఇవ్వాలి. –బొంత విజయకుమార్, బీకాం, బీపీఈడీ, బల్లికురవ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి బీటెక్ పూర్తిచేసి మూడేళ్లు దాటింది. ఉద్యోగవకాశాలు రాలేదు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, కూటమి నేతలు అధికారంలోకి రాగానే ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉద్యోగాలు కల్పించడం ఆలస్యమైతే నిరుద్యోగ భృతికింద నెలకు రూ.3 వేలు ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా రెండూ ఇవ్వలేదు. ఇప్పటికై నా ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి. –దేవరకొండ అవినాష్, బీటెక్, బాపట్ల -
ఏసీబీ వలలో పరిశ్రమల ప్రోత్సాహకాధికారి
రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు అద్దంకి: పీఎంఈజీపీ రుణం ఇప్పించేందుకు దరఖాస్తుదారుల నుంచి డిమాండ్ చేసిన నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు బాపట్ల జిల్లా పరిశ్రమల ప్రోత్సాహకాధికారి(ఏపీవో)ను పట్టుకున్నారు. వివరాలు.. బాపట్ల జిల్లా సంతమాగులూరుకు చెందిన వీర్ల రమేశ్‌బాబు తన గ్రామంలో డైరీ ఫాం పెట్టి వ్యాపారం చేసుకునేందుకు ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం(పీఎంఈజీపీ)కోసం వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్నాడు. అద్దంకికి చెందిన మరో వ్యక్తి కూడా దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో వీరిరువురినీ జిల్లా కేంద్రం బాపట్ల డీఐసీలో ఐపీవోగా పనిచేసే తన్నీరు ఉమాశంకర్ ఒక్కో దరఖాస్తుకు రూ.20 వేలు డిమాండ్ చేశాడు. దరఖాస్తుదారులకు ఆ లంచం అధికారికి ఇవ్వడం ఇష్టం లేక వారు గుంటూరులోని ఏసీబీ అధికారులను కలిసి రిపోర్టు చేశారు. ఆ అధికారి దరఖాస్తుదారులను మంగళవారం అద్దంకిలోని కేఅండ్కే కన్సల్టెన్సీ వద్ద రూ.40 వేలు మధ్యవర్తి అయిన కమ్మ కిశోర్‌బాబు అనే ప్రైవేటు వ్యక్తి ద్వారా తీసుకుంటుండగా, పక్కా ప్లాన్‌తో వచ్చిన ఏసీబీ అధికారులు ఇరువురినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారి మహేందర్ మాతే మాట్లాడుతూ అరెస్ట్ చేసిన ఇరువురిని బుధవారం విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరుస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే సంబంధిత జిల్లా ఏసీబీ అఽధికారులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఎవరైనా లంచం అడిగితే టోల్‌ఫ్రీ నెంబర్ 1064కు కాల్చేయాలని చెప్పారు. రేపు ఎయిమ్స్‌లో వాక్థాన్మంగళగిరి: నగర పరిధిలోని ఆల్ ఇండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(ఎయిమ్స్) ఆవరణలో వాక్‌థాన్ నిర్వాహకులు వి.నేహ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా నెఫ్రాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 13న గురువారం ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు వాక్‌థాన్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఎయిమ్స్ ఆవరణలోని ఆడిటోరియంలో నిర్వహించే సమావేశంలో కిడ్నీ ప్రాముఖ్యంపై అవగాహన కల్పించనున్నట్టు వివరించారు. యార్డులో 1,44,323 బస్తాలు మిర్చి విక్రయం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 1,38,953 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,44,323 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 69,551 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. -
ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన కారు
మార్టూరు: స్థానిక జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడగా కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మండలంలోని ద్వారకపాడు గ్రామానికి చెందిన దాసరి వెంకటేష్ భూమి నుంచి పెకలించిన చెట్ల మొదళ్లను ట్రాక్టర్‌పై మార్టూరు నుంచి ఒంగోలు వైపు వెళ్లే జాతీయ రహదారిపై తరలిస్తున్నాడు. కాగా ఒంగోలుకు చెందిన హరికృష్ణ, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు వ్యక్తులు కారులో అదే మార్గంలో ఒంగోలు వెళుతున్నారు. స్థానిక ఏలూరు క్యాంపు కార్యాలయానికి సమీపంలోకి వెళ్లగానే ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ప్రమాద ధాటికి ట్రక్కులోని చెట్ల మొదళ్లు రహదారి మొత్తం చెల్లా చెదురుగా పడి రోడ్డు మొత్తం వ్యాపించాయి. దీంతో ఒంగోలు వైపు వెళ్లే వాహనాల రాకపోకలు కొంతసేపు నిలిచి పోయాయి. ట్రాక్టర్ డ్రైవర్ వెంకటేష్ రహదారి పక్కనగల డివైడర్‌పై ఎగిరిపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కారు డ్రైవర్ హరికృష్ణకు కుడి చేయి విరగ్గా మరో వ్యక్తి వెంకటేశ్వర్లుకు ముక్కు పెదవులు పగిలి రక్తస్రావం జరిగింది. సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది ట్రాక్టర్ డ్రైవర్ వెంకటేషను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైవే పెట్రోలింగ్ సిబ్బంది డేవిడ్, అజయ్‌కుమార్, క్రేన్ సహాయంతో రహదారికి అడ్డంగా పడి ఉన్న కారును పక్కకు తరలించారు. చెల్లాచెదురుగా పడి ఉన్న చెట్ల మొదళ్లను స్థానికుల సాయంతో పక్కకు నెట్టి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ముగ్గురికి గాయాలు హైవేపై చెల్లాచెదురుగా పడిన కలప -
తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తి
అద్దంకి: శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి 70వ వార్షిక తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తయి నట్లు చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్‌నాయుడు అన్నారు. శింగరకొండలోని ఈఓ కార్యాలయంలో మంగళవారం రెండో సమన్వయ కమిటీ సమావేశాన్ని ఆర్డీఓ నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని శాఖల అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఆయా శాఖల ద్వారా చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు. అత్యవసర సర్వీసులకు, అధికారులకు ప్రత్యేక పాస్‌లు జారీ చేశామని చెప్పారు. సత్రాలకు సంబంధించి అవసరమైన సరుకులు ముందుగానే తెచ్చి పెట్టుకోవాలన్నారు. తిరునాళ్ల రోజు ఆయా సత్రాల వద్దకు మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే వాహనాల ను అనుమతిస్తామని చెప్పారు. భక్తులు, సత్రా ల యజమానులు, దుకాణాల వారు, అధికారులు సమన్వయంతో పనిచేసి తిరునాళ్ల విజయవంతమయ్యేలా సహకరించాలని కోరారు. పటిష్ట బందోబస్తు తిరునాళ్లలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్లు డీఎస్పీ మొయిన్ చెప్పారు. ప్రభలపై ఒంటి గంట వరకు మాత్రమే సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతి ఉందన్నారు. ఎక్కడైనా అశ్లీల కార్యక్రమాలు నిర్వహిస్తే కేసులు నమోదుతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశం ఈఓ తిమ్మనాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ఎంపీడీవో సింగయ్య, తహసీల్దార్ శ్రీచరణ్, సీఐ సుబ్బరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు డ్రోన్ పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిఘా -
ఆటో డ్రైవర్‌కు రెండేళ్ల జైలు శిక్ష
చీరాల రూరల్: ఆటోను అతివేగంగా.. అజాగ్రత్తగా నడిపి వ్యక్తి మరణానికి కారణమైన ఆటో డ్రైవర్‌కు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2,500 జరిమానా విధించారు. రెండో నిందితునిగా ఉన్న మరో వ్యక్తికి రూ.1,000 జరిమానా విధిస్తూ చీరాల అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టు మంగళవారం తీర్పును వెలువరించినట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. వివరాలు.. ఈపురుపాలెం శివారు ఆటోనగర్ సమీపంలో 2018లో యండ్రపాటి సునీల్‌కుమార్ అనే వ్యక్తి తన ఆటోను అతివేగంగా అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా నడిపి మరో ఆటోను ఢీకొట్టాడు. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న వెల్లినేని వెంకట వినోద్ఽకుమార్ మృతి చెందగా, పంచికట్ల జోగేశ్వరరావుకు గాయాలయ్యారు. అప్పటి రూరల్ సీఐ పి.భక్తవత్సలరెడ్డి కేసు నమోదుచేసి నిందితులను అరెస్టుచేశారు. అడిషనల్ పీపీ పద్మజ ప్రాసిక్యూషన్ తరఫున కోర్టులో వాదనలు వినిపించారు. కేసు పూర్వాపరాలను పూర్తిగా విచారించిన అసిస్టెంట్ సెషన్స్ జడ్జి న్యాయమూర్తి ఎం.సుధ.. వ్యక్తి మరణానికి కారణమైన మొదట ముద్దాయి యండ్రపాటి సునీల్‌కుమార్‌కు రెండేళ్ల జైలుశిక్షతోపాటు రూ.2,500 జరిమానా విధించారు. రెండో ముద్దాయి కంపా శరత్‌కు రూ.1,000 జరిమానా విధించారు. అప్పటి రూరల్ సీఐ పి.భక్తవత్సలరెడ్డి, కోర్టు లైజన్ యద్దనపూడి శ్రీను, కోర్టు హెడ్‌కానిస్టేబుల్ సీహెచ్ శ్రీనివాసరావు, హోంగార్డు డి.శ్రీనివాసరెడ్డిలను ఎస్పీ అభినందించారు. రేంజ్లో 11 మందికి ఎస్ఐలుగా, నలుగురికి ఏఎస్ఐలుగా ఉద్యోగోన్నతినగరంపాలెం: ప్రతిఒక్కరూ బాధ్యతతో సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. గుంటూరు రేంజ్ పరిధిలోని పలు జిల్లాలకు చెందిన 11 మంది ఏఎస్ఐ (సివిల్)లకు ఎస్ఐ (సివిల్)లుగా, నలుగురు హెడ్ కానిస్టేబుళ్ల (ఏఆర్)కు ఏఎస్ఐ (ఏఆర్)లుగా ఉద్యోగోన్నతి కల్పించి, జిల్లాలు కేటాయించారు. ఈ మేరకు ఉద్యోగోన్నతి పొందిన ఎస్ఐలు, ఏఎస్ఐలు మంగళవారం గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్డులోని ఐజీ కార్యాలయంలో ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్ఐలు ఎన్.శ్రీనివాసరెడ్డి తిరుపతి జిల్లాకు, వీఎన్ మల్లేశ్వరరావు, పి.ప్రమీల, ఆర్.కొండయ్య, డి.రాజ్యం, డి.శ్రీనివాసరావు, పి.సుబ్బారావు, బీ.శ్రీనివాసరావు, వై.రాజులు, ఎండి.అబ్దుల్‌హఫీజ్, షేక్.ఎన్.రసూల్‌ను గుంటూరు జిల్లాకు, ఏఆర్ ఏఎస్ఐలు పి.మోహన్‌రావు శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లా, షేక్.మస్తాన్, కె.శీను తిరుపతి జిల్లాకు, కె.శివకుమార్‌ను పల్నాడు జిల్లాకు కేటాయించారు. రూ. 2,500 జరిమానా వ్యక్తి మరణానికి కారణమైన కేసులో కోర్టు తీర్పు -
స్టాకు రికార్డుల్లో తేడానా?
పర్చూరు(చినగంజాం): రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి మంగళవారం పర్చూరులోని పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ముందుగా ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి విస్తుపోయారు. పాఠశాలలోని స్టాకుకు రికార్డుల్లో నమోదు చేసిన లెక్కలకు తేడాలు కనిపించడంతో ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యనభ్యసించే తరగతి గదుల్లోనే పిల్లలు నిద్రించడంపై పాఠశాల సిబ్బందిని వివరణ కోరారు. పాఠశాల ప్రిన్సిపాల్‌కు మెమో జారీ చేయాలని ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పాఠశాల సమీపంలోని రెండు వైన్‌షాపులను తొలగించాలని ఎస్పీకి ఫోన్ చేసి సమాచారం అందించారు. పాఠశాల హిందీ ఉపాధ్యాయుడు పిల్లలను విపరీతంగా కొడుతున్నారన్న విషయం విద్యార్థులు కమిషన్ సభ్యురాలి దృష్టికి తీసుకొని వెళ్లారు. దీంతో ఆమె వెంటనే విచారణ జరిపి సదరు ఉపాధ్యాయుడికి చార్జి మెమో జారీ చేయాలని డీఈఓని ఆదేశించారు. అనంతరం ఎంపీయూపీ పాఠశాలను తనిఖీ చేసి పాఠశాల స్టాక్ గదిలో చిక్కీలు పడి ఉండటాన్ని గమనించి అసహనం వ్యక్తం చేశారు. పాఠశాల హెచ్ఎంను సంజాయిషీ కోరారు. రికార్డులను తనిఖీ చేసిన స్టాకుకి.. ఉన్న స్టాకుకి తేడాలను గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల హెచ్ఎం తీరుబాగోలేదని ఆయనకు మెమో జారీ చేయాలని డీఈఓకి ఫోన్ చేసి చెప్పారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 114 మంది ఉంటే మధ్యాహ్న భోజనం సమయానికి సగం మంది మాత్రమే తినడంపై ఆరా తీశారు. అనంతరం పర్చూరులోని పలు ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేసి అక్కడ నెలకొన్న అసౌకర్యాలపై ఆమె తీవ్రంగా స్పందించారు. మండల విద్యాశాఖాధికారి వెంకటరామయ్య, సీడీపీఓ సుభద్ర, ఏఎస్ఐ సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి బియ్యం, గుడ్లు, చిక్కీల్లో వ్యత్యాసంపై ఆగ్రహం తప్పు చేసిన వారికి మెమోలు జారీ చేయాలని డీఈఓకి సిఫారసు -
సముద్ర తాబేళ్లను రక్షించాలి
చినగంజాం: సముద్రపు తాబేళ్లు అంతరించి పోకుండా కాపాడాలని జిల్లా అటవీశాఖాధికారి ఎల్.భీమయ్య అన్నారు. కుంకుడుచెట్లపాలెం తీరప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ, ట్రీ ఫౌండేషన్, ఐటీసీ బంగారు భవిష్యత్ వారు నిర్వహిస్తున్న సముద్ర తాబేళ్ల సంరక్షణ కేంద్రం నుంచి మంగళవారం తాబేలు పిల్లలను సముద్రంలోనికి వదలిపెట్టారు. ఈ ఏడాది జిల్లాలో మొట్టమొదటిసారిగా 107 తాబేలు పిల్లలను జిల్లా అటవీ శాఖ అధికారి ఎల్.భీమయ్య చేతుల మీదుగా సముద్రంలోనికి వదిలారు. కుంకుడుచెట్లపాలెం సముద్ర తాబేళ్ల సంరక్షణ కేంద్రంలో మంగళవారం వరకు 14 తల్లి తాబేళ్ల నుంచి 1480 గుడ్లు సేకరించినట్లు తెలిపారు. జనవరి 18వ తేదీ ఒక తల్లి తాబేలు నుంచి సేకరించిన 115 గుడ్లు నుంచి మంగళవారం వచ్చిన 107 పిల్లలను సురక్షితంగా వదలిపెట్టారు. డీఎఫ్ఓ మాట్లాడుతూ సముద్రపు తాబేలు అంతరించి పోయే జాతుల్లో ఉందని అటవీ శాఖ కాపాడే ప్రయత్నం చేస్తోందన్నారు. మత్స్యకారులతోపాటు పర్యావరణానికి తాబేలు సహాయకారిగా ఉంటుందని వాటి మనుగడకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సముద్రపు తాబేళ్ల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే తమ సముద్ర తాబేళ్ల రక్షణ దళ సభ్యులకు తెలియపరచాలని కోరారు. జిల్లా సమన్వయకర్త శవనం చంద్రారెడ్డి, సముద్ర తాబేళ్ల రక్షణ దళ సభ్యులు కారాని శ్రీను, వాయల జాలయ్య, కె.వెంకటేష్, నాగయ్య, పోలయ్య, గోపిరాజు పాల్గొన్నారు.జిల్లా అటవీశాఖాధికారి భీమయ్య -
మహిమాన్విత క్షేత్రం శింగరకొండ
అద్దంకి రూరల్: కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా భక్తులు నమ్మకంతో మహిమాన్విత క్షేతంగా విరాజిల్లుతోంది బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని శింగరకొండ క్షేత్రం. కొండపైన లక్ష్మీ నరసింహస్వామి, కొండకింద ప్రసన్నాంజనేయస్వామి నెలకొన్నారు. శింగరకొండ క్షేత్రం 14వ శతాబ్దం నాటికే కొండపై లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భక్తుల పూజలందుకుంటోంది. సుమారు 150 సంవత్సరాల కిందట లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం ప్రతిష్ట జగుతుండగా తేశి తటాకం ఒడ్డున ప్రసన్నాంజనేయస్వామి విగ్రజోవంతమైన యోగీశ్వరుడు కొండ దిగువున ప్రసన్నాంజనేయస్వామి విగ్రహం పూజించి అదృశ్యమయ్యారు. ఆ అద్భుతాన్ని కొండ మీద నుంచి చూసిన భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించి తరించారు. అప్పటి నుంచి శింగరకొండలో వెలసిన ప్రసన్నాంజనేయస్వామివారి దేవస్థానం దివ్యక్షేత్రమై విరాజిల్లుతోంది. దక్షిణాభిముఖం ఆలయం విశిష్టత శ్రీరామచంద్రుడు ఆజ్ఞ మేరకు సీతమ్మ తల్లిని వెతుకుతూ దక్షిణ పథంగా బయలుదేరిన ఆంజనేయుడు ఇక్కడ కొంత సేపు విశ్రాంతి తీసుకున్నాడని ఒక నమ్మకం. అందువల్లనే ఈ క్షేత్రంలో ప్రసన్నాంజనేయుడు నెలవై ఉన్న దేవాలయం దక్షిణాముఖంగా ఉంది. అన్ని దేవాలయాలు తూర్పు ఉత్తర ముఖ ద్వారాలు కలిగి ఉండగా ఒక్క శింగరకొండ క్షేత్రం దక్షిణాభిముఖం కలిగి ఉండటం విశేషం. క్షేత్ర దర్శనం సర్వపాపాల నివారిణి కొండపైనున్న లక్ష్మీనరసింహస్వామి, కొండ కింద ప్రసన్నాంజనేయుడి దేవాలయాలతో ఉభయ దేవతా క్షేత్రంగా పేరుపొందిన శింగరకొండ క్షేత్రం దర్శనం సర్వపాపల నివారిణిగా భక్తుల నమ్మకం. ప్రతి మంగళ, శనివారాల్లో విశేషపూజలు, ఉగాది, శ్రీరామనవమి, హనుమజ్జయంతి, ముక్కోటి, సంక్రాంతి, తిరునాళ్లకు భక్తులు లక్షల సంఖ్య వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతారు. కొండపైన లక్ష్మీనరసింహస్వామి, కొండ కింద ప్రసన్నాంజనేయస్వామి దక్షిణాభిముఖంగా వెలసిన ప్రసన్నాంజనేయస్వామి విశిష్టత క్షేత్రదర్శనం సర్వపాపల నివారిణి భక్తుల నమ్మకం నేటి నుంచి 70వ వార్షిక తిరునాళ్ల ప్రారంభం తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి ప్రత్యేక ఆకర్షణగా విద్యుత్ ప్రభలు -
మాటిచ్చారు...మరిచారు
కూటమి పాలకుల తీరుకు నిరసనగా నేడు యువత పోరు అబద్ధాల విష వలయం చుట్టుముడితే.. ఆకాశానికి నిచ్చెన వేసి ఆశల పల్లకీలో ఊరేగిస్తే.. అరచేతిలో వైకుంఠం చూపి మంత్రదండంలా ఆడిస్తే నిజమని నమ్మిన సామాన్యుడు.. కాల‘కూటమి’ చక్రబంధనంలో చిక్కుకున్నాడు.. అది మాయాచట్రమని తెలుసుకునేలోపు నివురుగప్పిన మోసం నిలువునా ముంచేసింది. బంగారు భవితను అంధకారం చేసింది. ఇంటికో ఉద్యోగం.. నిరుద్యోగ భృతి అంటూ యువగళంలో పోసిన గరళం అంపశయ్యపైకి చేర్చింది. తల్లికి వందనం పేరిట ‘అమ్మఒడి’లో రేపిన మంట కార్చిచ్చులా చుట్టుముట్టింది. విద్యా దీవెనలు.. శాపాల శరాఘాతాలై నిలువెల్లా తాకాయి. ఫలితంగా దగా పడ్డ తెలుగుబిడ్డ ఆగ్రహజ్వాలతో గళమెత్తి గర్జిస్తున్నాడు. కూటమి సర్కారుపై కన్నెర్రజేసి ఖబడ్దార్ అంటూ హెచ్చరిస్తున్నాడు. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో దళమై కదంతొక్కేందుకు సిద్ధపడ్డాడు. వైఎస్. జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రభుత్వం చదువుకున్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది. జిల్లాలో 477 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటుచేసి 5,247 ఉద్యోగాలు కల్పించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల పరిధిలో వేలాది మందికి వలంటీర్ ఉద్యోగాలు ఇచ్చింది. 348 హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేసి 348 ఎంఎల్‌హెచ్‌పీ ఉద్యోగాలు కల్పించింది. ఇవికాకుండా హౌస్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చింది. ఇక ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చింది. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచి వారి శ్రమను గుర్తించింది. ఇవి కాకుండా ఎంఎస్ఎంఈల ద్వారా జిల్లాలో 705 యూనిట్లు ఏర్పాటుచేసి వారికి రూ.110.69 కోట్ల మేర రాయితీలు కల్పించింది. సాక్షి ప్రతినిధి, బాపట్ల: ‘‘అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం.. ఉద్యాగాలు ఇవ్వడం ఆలస్యమైతే అప్పటివరకూ నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం.. కళలకు రెక్కల పథకం ద్వారా రుణాలు ఇస్తాం.. ఎయిడెడ్ కళాశాలల్లో ప్రైవేట్ పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పునరుద్దరణ... కాలేజీలకే రుసుం చెల్లించి విద్యార్థులకు సర్టిఫికెట్ చిక్కులు లేకుండా చేస్తాం.. జీవో 117 రద్దు... డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విదేశీ విద్య పథకం పునరుద్ధరణ.. ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం.. మెగా డీఎస్సీ’’... అంటూ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కురిపించిన వరాల జల్లు. ఆయన మాటలు నమ్మిన యువత ఓట్ల వర్షం కురిపించింది. చంద్రబాబు అధికారం చేపట్టారు. తీరా పది నెలలు గడిచింది. మెగా డీఎస్సీ ప్రకటన లేదు.. ఉద్యోగాల ప్రకటనలు లేవు... భృతి లేదు.. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు... దీంతో విద్యార్థుల చదువులు అటకెక్కుతున్నాయి. నిరుద్యోగుల్లో నిరాశ, నిస్పృహలు పెరుగుతున్నాయి. అయినా కూటమి ప్రభుత్వంలో చలనం లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, యువతకు అండగా నిలవాలని భావించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరు బాటకు పిలుపునిచ్చారు. బుధవారం బాపట్లలో యువత పోరు సాగనున్నది. విద్యార్థులకు ట్యాబ్‌లు... జిల్లా వ్యాప్తంగా 14,582 మందికి రూ.53.95 కోట్లు ఖర్చుచేసి ట్యాబ్‌లు పంపిణీచేశారు. విద్యాభివృద్ధిలో భాగంగా జిల్లాలో 1433 పాఠశాలల పరిధిలో రూ.304 కోట్లు ఖర్చుచేసి 2046 పనులను పూర్తిచేశారు. పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యం, ఫర్నీచర్, గ్రీన్ చాక్ బోర్డులు, కిచెన్ షెడ్లు, ఇంగ్లీషు ల్యాబ్, పెయింట్స్, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పించారు. ఇంటికొక నిరుద్యోగి....జిల్లాలో 459 గ్రామపంచాయతీల పరిధిలో 944 గ్రామాలు ఉండగా వాటి పరిధిలో 4,97,000 గృహాలు ఉన్నాయి. ఈ లెక్కన ఇంటికొకరు అనుకున్నా జిల్లా వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారంతా ఉద్యోగాలతోపాటు తక్షణ సాయంగా నిరుద్యోగ భృతిని ఆశిస్తున్నారు. ఇంటికొకరికి నిరుద్యోగ భృతి అనుకుంటే నెలకు రూ.149.10 కోట్ల చొప్పున చెల్లించాల్సి వుంది. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడంతోపాటు ఉద్యోగాలు దక్కనివారికి నిరుద్యోగ భృతి ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో ఇలా.. ఎన్నికల సమయంలో 20 లక్షలఉద్యోగాలు ఇస్తామన్న చంద్రబాబు పది నెలలైనా ఒక్క ప్రకటనా లేదు పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్– వసతి దీవెన బకాయిలు అటకెక్కుతున్న ఉన్నత చదువులు నెలకు రూ.3 వేలు భృతి మాట నీటిమూటే.. ఆందోళనలో విద్యార్థులు, యువత వైఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు -
న్యాయం జరిగేవరకు పోరాడుతాం
● సమస్య సీఎం దృష్టికి వెళ్లినా పరిష్కారం కాకపోవటంపై అసంతృప్తి ● భవిష్యత్ కార్యాచరణపై పుల్లారావు బాధితుల సమావేశం నరసరావుపేట టౌన్: కలిసి కట్టుగా ఉద్యమం చేసి న్యాయం జరిగే వరకు పోరాడదామని సాయి సాధన చిట్‌ఫండ్ స్కాం బాధితులు తీర్మానించుకున్నారు. సాయి సాధన చిట్‌ఫండ్ బాధితులు సోమవారం పట్టణంలోని ఓ హోటల్లో సమావేశం అయ్యారు. పాలడుగు పుల్లారావు చిట్‌ఫండ్, విజయలక్ష్మి టౌన్షిప్ పేర్లతో కోట్లాది రూపాయలు వసూలు చేసి పరారీ అయిన విషయం విధితమే. రియల్ ఎస్టేట్ మోసంపై పుల్లారావుతో పాటు అతని భాగస్వాములపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు అవ్వగా, కోర్టులో లొంగిపోయి సబ్జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఆ కేసులో సోమవారం పుల్లారావు అతని భాగస్వాములు గుండా సాంబశివరావు, గుండా అనిల్‌లకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నరసరావుపేట వన్‌టౌన్ పోలీసులు నమోదు చేసిన చీటింగ్ కేసులో పుల్లారావుకు బెయిల్ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై బాధితులంతా సమావేశమై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సమస్య తీసుకువెళ్లినా న్యాయం జరగలేదని కొందరు అభిప్రాయబడ్డారు. కేసు సీఐడీకి బదిలీ అయినప్పటి నుంచి పుల్లారావు కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేసే వరకు అవసరమైతే రిలే నిరాహార దీక్షలు చేద్దామని చర్చించుకున్నారు. చీటీపాట స్కాంలో ఉన్న బాధితులు సుమారు 600 మందితో త్వరలోనే సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని కమిటీ సభ్యులు చేకూరి సాంబశివరావు, ఇ.ఎం.స్వామి, యామిని రామారావు తెలిపారు. -
అర్జీలను సత్వరం పరిష్కరించాలి
జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ బాపట్ల, చీరాల టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో జేసీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను గడువు లోగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. జిల్లాలో నీటిపన్ను వసూలుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. జిల్లాలో పీ–4 సర్వేను వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పీ–4 సర్వే వాల్ పోస్టర్లను జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ స్వయం సహాయక సంఘాల ద్వారా సైనిక వెల్ఫేర్ ఫండ్ కోసం సేకరించిన రూ.10.30 లక్షల చెక్కును డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఏపీఎం, ఏసీలు జాయింట్ కలెక్టర్‌కు అందజేశారు. డీఆర్ఓ జి.గంగాధర్ గౌడ్, బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, సర్వ శిక్ష అభియాన్ పీఓ నాగిరెడ్డి, డీపీఓ ప్రభాకర్, డీఆర్డీఏ పీడీ పద్మజ, డ్వామా పీడీ విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ డాక్టర్ విజయమ్మ, జిల్లా రవాణాశాఖ అధికారి పరంధామరెడ్డి, డీఏఓ రామకృష్ణ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్ దిబోరా, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శివలీల, తదితరులు పాల్గొన్నారు. -
ఎలక్ట్రిక్ బస్సులు వితరణ
మంగళగిరి: మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నృసింహస్వామి కొండతోపాటు ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు రెండు ఎలక్ట్రిక్ బస్సులను మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్టక్చర్ కంపెనీ సోమవారం అందజేసింది. బస్సులను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్టక్చర్ సీఎస్ఆర్ నిధుల ద్వారా రూ.2.4 కోట్ల విలువైన రెండు అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను అందజేసింది. ఈ బస్సుల్లో ఒకటి మంగళగిరి బస్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్, డీజీపీ ఆఫీసు మీదుగా ఎయిమ్స్‌కు వెళ్తుంది. మరొకటి మంగళగిరి బస్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా శ్రీ పానకాలస్వామి కొండకు వెళ్తుంది. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ కేవీ ప్రదీప్, ఎయిమ్స్ డైరెక్టర్ శాంతా సింగ్, డిప్యూటీ డైరెక్టర్ శశికాంత్, ఆలయ ఈవో ఏ రామకోటిరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, పద్మశాలీ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య పాల్గొన్నారు. మాల్ ప్రాక్టీసు కేసు నమోదు గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో సోమవారం తొలి మాల్ ప్రాక్టీసు కేసు నమోదైంది. పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన ద్వితీయ సంవత్సరం గణితం–2బీ పరీక్షకు గుంటూరు జిల్లాలోని 87 పరీక్షా కేంద్రాల పరిధిలో 28,274 మంది విద్యార్థులు హాజరయ్యారు. 446 మంది గైర్హాజరయ్యారు. గుంటూరులోని ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో కాపీయింగ్‌కు ప్రయత్నించిన ఓ విద్యార్థిపై అధికారులు మాల్ ప్రాక్టీసు కేసు నమోదు చేశారు. ఆర్ఐవో జీకే జుబేర్ ఐదు పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన మంగళగిరి: సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం మంగళగిరి మండలంలోని నీరుకొండ గ్రామంలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి సోమవారం పరిశీలించారు. సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది, అధికారులతో కలిసి ఆమె వర్సిటీని సందర్శించారు. సీఎం ప్రారంభించనున్న సీవీ రామన్ బ్లాక్, ప్రసంగించనున్న అబ్దుల్ కలామ్ ఆడిటోరియం తదితర ప్రదేశాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. వర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ నారాయణరావు, ప్లానింగ్ ఈడీ వీఆర్ అలపర్తి, సెక్రటరీ అనంత్ సింగ్, రిజిస్ట్రార్ ఆర్. ప్రేమ్‌కుమార్, సీఎల్‌ఎం డైరెక్టర్ అనూప్‌సింగ్, జీఎం రమేష్‌బాబు పాల్గొన్నారు. బీఈడీ పరీక్ష రద్దు ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో ఈ నెల 7న జరిగిన బీఈడీ మొదటి సెమిస్టర్ పర్సెక్టీవ్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్షను వీసీ ఆచార్య కె.గంగాధర్‌రావు ఆదేశాల మేరకు రద్దు చేశామని సీఈ ఏ శివప్రసాద్‌రావు సోమవారం తెలిపారు. ఈ పరీక్షను ఈ నెల 12వ తేదీన తిరిగి నిర్వహిస్తామని వెల్లడించారు. యార్డుకు 1,61,169 బస్తాల మిర్చి కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు సోమవారం 1,61,169 బస్తాల మిర్చి రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,30,718 బస్తాలు విక్రయించారు. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. -
బ్రహ్మాండ నాయకుడు
సింహ వాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చిన నారసింహుడు మంగళగిరి / మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి గ్రామోత్సవంలో స్వామి వారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మాండ నాయకుడు నృసింహస్వామిని భక్తులు దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చారు. హింసించే స్వభావం గల వారిని హింసించేవాడు నారసింహుడు, నరుల్లో సింహం వంటి వాడు నరసింహ స్వరూపుడైన స్వామి వారి సింహ వాహనోత్సవం తిలకించిన వారికి దుర్మార్గుల వల్ల కలిగే భయం తొలగుతుందని భక్తుల నమ్మకం. ఉత్సవం సందర్భంగా రాజావాసిరెడ్డి వెంకట్రాది నాయుడు కళావేదికలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఆలయ ఈవో రామకోటిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మాల్యవంతం వెంకట కృష్ణమాచార్యులు మనుమలు వ్యవహరించారు. ఉదయం చిన్న శేషవాహనంపై... బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం చిన్నశేష వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కై ంకర్యపరులుగా దేవతి భగవన్నారాయణ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నేడు హంస, గజ వాహన సేవలు మంగళవారం ఉదయం హంస వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి గజ వాహనంపై స్వామికి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. -
కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
● ఒక్క సంక్షేమ కార్యక్రమాన్నీ పరిపూర్ణంగా అమలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ● సమయం వచ్చినప్పుడు ఓట్లతో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ప్రజలు ● యువత పోరు సన్నాహాక సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి ● రేపటి వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం, యువత పోరు జయప్రదానికి విజ్ఞప్తి నెహ్రూనగర్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 9 నెలల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన జరగనున్న యువత పోరుకు సంబంధించి సోమవారం సన్నాహక సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కూటమి పాలనలో రాష్ట్రం తిరోగమనంలో ఉందన్నారు. గుంతలు పూడ్చి రోడ్లు వేశామని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. 9 నెలల కాలంలో ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పరిపూర్ణంగా అమలు చేసిన పాపాన పోలేదన్నారు. ఇస్తున్న వృద్ధాప్య పింఛన్లలో భారీగా కోతలు పెడుతున్నారని విమర్శించారు. 9 నెలల కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చిందని, సమయం వచ్చినప్పుడు ఓట్లతో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రోడ్లపైకి వచ్చి అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు. కూటమి ఎమ్మెల్యేల అక్రమాలు అనంతం కూటమి పాలనలో ఎమ్మెల్యేలు ఇసుక, మట్టి, బియ్యం అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా కప్పం కట్టాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారని తెలిపారు. రోజు రోజుకు కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిపోతోందని చెప్పారు. వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా ఏకమై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 12న జరిగే వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవాల్లో, యువత పోరు కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాలుపంచుకుని దిగ్విజయం చేయాలన్నారు. తద్వారా ఈ ప్రభుత్వం సక్రమంగా పనిచేయడం లేదనే సందేశాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. పార్టీ శ్రేణులే పేదవారి గొంతుగా మాట్లాడాలని సూచించారు. పార్టీ గుంటూరు, నరసరావుపేట పార్లమెంటరీ స్థానాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆనాడు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక ఎత్తు అయితే.. తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ సారథిగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించారన్నారు. మోసం చేయడంలో నంబర్ వన్ అంటే గుర్తుకు వచ్చేది చంద్రబాబు పేరే అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇస్తామని బూటకపు మాటలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. సమాజంలో విద్య, ఆరోగ్యం రెండు కళ్లు వంటివన్నారు. నేడు విద్యకు సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు రాకపోవడంతో విద్యార్థులు కాలేజీల్లో తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం వైఎస్సార్సీపీ యువత పోరు కార్యక్రమం చేపట్టిందన్నారు. ఏపీలో 28 మెడికల్ కాలేజీలు ప్రారంభమైతే.. ఇంటికే వచ్చి వైద్యం చేసే పరిస్థితి ఉందన్నారు. ఆ మెడికల్ కాలేజీలను నేడు ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. వీటన్నింటిపై పోరాటం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, గుంటూరు నగర అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, మిర్చి యార్డు మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణలు మాట్లాడారు. పార్టీ బలోపేతానికి సూచనలు చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
వెల్దుర్తిలో తీవ్ర విషాదం
● రోడ్డు ప్రమాదంలో తండ్రీ కూతురు మృతి ● ఆగివున్న ట్రాక్టర్‌ను బైక్ ఢీకొట్టగా ఘటన ● ఘటనాస్థలంలోనే మృతి చెందిన వైనం వెల్దుర్తి: ఆగివున్న ట్రాక్టర్‌ను ఢీకొని తండ్రి కూతురు మృతిచెందిన విషాదకర సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని మిట్టమీదపల్లె గ్రామానికి చెందిన పల్లా శ్రీనివాసరావు (30), తన కుమార్తె రూప (3)తో కలిసి ద్విచక్రవాహనంపై మాచర్ల నుంచి స్వగ్రామం మిట్టమీదపల్లెకు వెళ్తున్నారు. ఈక్రమంలో వేగంగా వెళ్తూ 565 జాతీయ రహదారిలో వెల్దుర్తి సమీపంలోని పెట్రోలు బంకువద్ద రోడ్డు మార్జిన్లో నిలుపుదల చేసిన ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పల్లా శ్రీనివాసరావు, రూపలు తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జాతీయ వాలీబాల్ పోటీల్లో విజేత సెయింట్ ఆన్స్
వేటపాలెం: జాతీయ వాలీబాల్ పోటీల్లో సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ జట్టు ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచింది. ఈ మేరకు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్. లక్ష్మణరావు సోమవారం తెలిపారు. గుంటూరు ఎన్ఆర్ఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇటీవల జాతీయస్థాయి యూత్ ఫెస్టివల్–2025 నిర్వహించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన వాలీబాల్ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి 26 జట్లు పోటీ పడ్డాయని తెలిపారు. ఫైనల్స్‌లో సెయింట్ ఆన్స్ కాలేజీ జట్టు, బాపట్ల కాలేజీ జట్టును ఓడించి విజేతగా నిలిచిందని పేర్కొన్నారు. విజేతకు రూ.10 వేలు నగదు బహుమతి అందించారని ప్రిన్సిపాల్ కె. జగదీష్‌బాబు తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విజేతలను అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్.వి. రమణమూర్తి, అక్రిడిటేషన్స్ డైరెక్టర్ సుబ్బారావు, వివిధ విభాగధిపతులు అభినందించారు. -
సబ్ జూనియర్స్ కబడ్డీ పోటీలకు గాయత్రి ఎంపిక
వేటపాలెం: స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలకు విద్యార్థిని గాయత్రి జిల్లా కబడ్డీ సబ్ జూనియర్స్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం ఫణి సత్యనారాయణ సోమవారం తెలిపారు. ఆదివారం ఒంగోలు మినీ స్టేడియంలో ప్రకాశం ఉమ్మడి జిల్లా కబడ్డీ సబ్ జూనియర్స్ బాలబాలికల ఎంపిక నిర్వహించినట్లు తెలిపారు. ఈ పోటీల్లో హైస్కూలు ఎనిమిదో తరగతి విద్యార్థిని గాయత్రి ఎంపికై నట్లు చెప్పారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు జరిగే సబ్ జూనియర్స్ టోర్నమెంట్లో ఆమె పాల్గొంటుందని తెలిపారు. విద్యార్థినిని పీడీ ఎం. కోటేశ్వరమ్మ, ఉపాధ్యాయురాలు జె. శ్రీవాణి అభినందించారు. చేతివృత్తులకు నైపుణ్య శిక్షణ నరసరావుపేట ఈస్ట్: చేతి వృత్తులకు సంబంధించి అత్యాధునిక నైపుణ్య శిక్షణను పొందటం ద్వారా ఉద్యోగ, ఉపాధి పనులలో గొప్ప స్థాయికి వెళ్లగలరని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఇ.తమ్మాజీరావు తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వివిధ చేతివృత్తుల వారికి అత్యుత్తమ శిక్షణను అందిస్తున్నట్టు వివరించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ చేతివృత్తి కోర్సు పధకం ద్వారా సింక్రో సర్వ్ గ్లోబల్ సెల్యూషన్స్ ద్వారా శిక్షణ పొందిన వారికి సోమవారం సర్టిఫికెట్లు అందచేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న తమ్మాజీరావు మాట్లాడుతూ, పదవ తరగతి, ఇంటర్మీడియేట్, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు ఐఓటీ, పైథాన్, డ్రోన్ సర్వీస్ టెక్నీషియన్, బేసిక్ కంప్యూటర్ కోర్సులలో ఉచితంగా శిక్షణ ఇస్తామని, ఉద్యోగ, ఉపాధి కల్పనలో సహరిస్తామని స్పష్టం చేశారు. ఆసక్తి గలవారు 6301851503, 6301851504 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. -
తిరునాళ్లకు వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు..
●రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి ●మరొకరికి తీవ్ర గాయాలు రెంటచింతల: పాలువాయి గేటు గ్రామంలో సోమవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గోలి గ్రామానికి చెందిన మాచవరపు నాగేశ్వరరావు(45) బాలగాని ఆంజనేయులు ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై దుర్గి మండలంలోని ముటుకూరు తిరునాళ్లకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 167 ఏడీ నిర్మాణంలో భాగంగా పాలువాయి గేటు గ్రామంలోని రైల్వే ట్రాక్ వద్ద చేపట్టిన హైలేవల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవంతో రాత్రి సమయం కావడం వల్ల ముందు ఏమి కనిపించకపోవడంతో ఒక్కసారిగా ద్విచక్రవాహనంతో బ్రిడ్జిపై నుంచి ఇద్దరు కింద పడిపోయారు. దీంతో తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ తొలుత నర్సరావుపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో మాచవరపు నాగేశ్వరరావును ఆస్పత్రికి తరలించినా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలగాని ఆంజనేయులును మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణంలో ఉన్నట్లు ఆ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నాగేశ్వరరావుకు భార్య ఏసమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఏసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సీహెచ్ నాగార్జున తెలిపారు. -
ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకర జీవనం
జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వాణిశ్రీ వెల్లడి బల్లికురవ: ప్రకృతి వ్యవసాయంతో పండించే పంటలతో ప్రజలు ఆరోగ్యంగా జీవించడంతో పాటు భూమి సారవంతంగా ఉంటుందని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వి. వాణిశ్రీ తెలిపారు. సోమవారం ఆమె బల్లికురవ, నక్కబొక్కలపాడు, చెన్నుపల్లి గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయా గ్రామాల్లో స్వయం సహాయక సంఘ సభ్యులతో సమావేశాలు నిర్వహించారు. గ్రామ సంఘ సమావేశాల్లో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంపొందించాని తెలిపారు. గ్రామాల వారీగా ప్రకృతి వ్యవసాయ సాగును పెంచాలని చెప్పారు. పురుగుమందులు అవశేషాలు లేని ఆహార పదార్థాలు పండిస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విచక్షణా రహితంగా ఎరువులు, పురుగు మందులు వాడటంతో భూములు నిస్సారం కావడంతో పాటు పెట్టుబడులూ పెరుగుతాయని చెప్పారు. గ్రామాల వారీగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, పర్యవేక్షించేందుకు యూనిట్ ఇన్చార్జులు, క్లస్టర్ ఇన్చార్జులు, ఐసీఆర్పీలను ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు. కార్యక్రమంలో జైన్ క్రాప్ ప్రతినిధి ప్రతిమ, రాష్ట్ర రైతు సాధికార సంస్థ ప్రతినిధి సౌమ్య, అడిషన్ డీపీఎం మోహన్, ఎన్ఎంఏలు చందన, దుర్గ, మాస్టర్ ట్రైనర్ అప్పారావు, యూనిట్ ఇన్చార్జులు కల్పన, నాగాంజలి, నాగరాజు పాల్గొన్నారు. -
కళా సాధనకు నిరంతరం కృషి చేయాలి
సత్తెనపల్లి: ప్రతి మనిషిలో ఓ కళ ఉంటుందని, దాన్ని సాధించడానికి నిరంతర కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ డైరెక్టర్ రాసంశెట్టి నరసింహారావు అన్నారు. చైతన్య కళా స్రవంతి సత్తెనపల్లి 46వ వార్షికోత్సవం సందర్భంగా జాతీయ తెలుగు సినిమా పాటల పోటీలు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో ఆదివారం నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జాతీయస్థాయి తెలుగు సినిమా పాటల పోటీలలో ప్రథమ బహుమతి మాధవి (విజయవాడ), ద్వితీయ బహుమతి కె.రామారావు (కారంపూడి), తృతీయ బహుమతి కె.దుర్గాప్రసాద్ (హైదరాబాద్) వారు కై వసం చేసుకున్నారు. వీరితోపాటు 10 మంది కన్సోలేషన్ బహుమతులు, 15 మంది ప్రత్యేక బహుమతులను అందుకున్నారు. బహుమతి ప్రదానోత్సవానికి చైతన్య కళా స్రవంతి గౌరవ సలహాదారు లయన్ ముట్లూరి వెంకయ్య అధ్యక్షత వహించారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఏ.విశ్వేశ్వరరావు(పిడుగురాళ్ల), ఎస్.కళాంజలి(రాజంపేట), ఎం.రవివర్మ (నరసరావుపేట) వ్యవహరించారు. కార్యక్రమంలో వ్యాపారవేత్త పోతుగంటి రామ కోటేశ్వరరావు, శ్రీమారుతీ ట్రేడర్స్ అధినేత వెంకట హరేరామ చెంచయ్య పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ డైరెక్టర్ రాసంశెట్టి నరసింహారావు జాతీయ స్థాయి సినిమా పాటల పోటీల విజేత విజయవాడ మాధవి -
కూటమి ప్రభుత్వంలో విద్య, వైద్యం నిర్వీర్యం
చీరాల రూరల్: సూపర్స్ సిక్స్ పథకాలను అమలుచేస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యార్థులకు చదువును, పేదలకు వైద్యాన్ని అందించకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతోందని ఇన్చార్జ్ మున్సిపల్ చైర్మన్ బొనిగల జైసన్‌బాబు, పార్టీ పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ల వాసులు ధ్వజమెత్తారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ చాంబర్లో సోమవారం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కరణం వెంకటేష్‌బాబు ఆదేశాలతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ప్రజలకు అనేక హామీలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, నేడు ఒక్కటీ కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. గత ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్లను దృష్టిలో పెట్టుకుని ఇంగ్లిష్ మీడియంతో పాటు సీబీఎస్ఈ సిలబస్, ట్యాబ్‌లు, బైజూస్ కంటెంట్ అందిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వాటన్నింటిని దూరం చేసిందని మండిపడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా గత ప్రభుత్వం అడుగులు వేసి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించిందని వివరించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి వారికి చదువుకు దగ్గర చేసిందని తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు తీరని దోహం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జగనన్న మెడికల్ కాలేజీలు తీసుకువస్తే వాటని కట్టకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం ఏపీకి మెడికల్ సీట్లు కేటాయిస్తే ప్రధానమంత్రి మోదీకి చంద్రబాబు సీట్లు వద్దని లేఖలు రాయడమేమిటని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చిందని, ప్రతినెలా వారికి మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామనే హామీలు తుంగలో తొక్కిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనెల 12న బాపట్ల జిల్లాలో జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నాలో అధిక సంఖ్యలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ వివిధ విభాగాలకు చెందిన నాయకులు గవిని శ్రీనివాసరావు, కావూరి రమణారెడ్డి, ఉమ్మిట్టి శివ, సంగుల జాన్ చిరంజీవి, దుడ్డు రాంబాబు, కోడూరి ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. -
ప్రాణ భయంతో ఊరు వదిలి వెళ్లిపోయాం
బాపట్ల మండలం, దరివాదకొత్తపాలెం పంచాయతీ పరిధిలోని వైఎస్సార్ నగర్‌కు చెందిన నేను గిరిజన కులానికి చెందిన మహిళను. నన్ను 2009లో అదే ప్రాంతానికి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన శవనం గోవర్ధన్‌రెడ్డి ప్రేమించి వివాహం చేసుకున్నారు. మా దాంపత్యంలో ఇద్దరు అమ్మాయిలు జన్మించారు. గడిచిన ఐదు నెలలుగా అత్త నాగరత్తమ్మ, మామ వెంకటేశ్వరరెడ్డి, ఆడపడుచు తిరుపతమ్మ, ఆమె భర్త రవితో పాటు నా భర్త గోవర్ధన్‌రెడ్డి కూడా నన్ను చిత్రహింసలకు గురి చేస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. రెండు సార్లు హత్యాప్రయత్నం కూడా చేశారు. ప్రాణ భయంతో నేను రెండు నెలలుగా ఇద్దరు కుమార్తెలతో నరసరావుపేటలోని బంధువుల ఇంటివద్ద తలదాచుకుంటున్నాను. వారి చెరనుంచి నన్ను, నా బిడ్డల్ని కాపాడండి. – శవనం ఝాన్సీ, వైఎస్సార్ నగర్ -
రోడ్డు ప్రమాదంలో పాస్టర్ మృతి
అద్దంకి: బైకును లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ చర్చి పాస్టర్ మృతి చెందారు. ఈ ఘటన అద్దంకి పట్టణంలోని బస్టాండు సమీపంలో సోమవారం జరిగింది. అందిన వివరాల మేరకు.. మండలంలోని కలవకూరు గ్రామానికి చెందిన అత్తోటి బాలసుందరం (66) బైకుపై పనిమీద అద్దంకి వచ్చారు. ఈ క్రమంలో అద్దంకి నుంచి మేదరమెట్ల వైపునకు గూడ్స్‌తో లారీ వెళ్తోంది. బైకు పట్టణంలోని బస్టాండు సమీపంలోకి రాగానే లారీ ఢీకొట్టడంతో బాలసుందరం అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ రవితేజ వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్యా, పిల్లలు ఉన్నారు. వరలక్ష్మి చిరంజీవి బాపట్ల: అవయవ దానం ద్వారా కొపనాతి వరలక్ష్మి(60) చిరంజీవిగా నిలిచారని ఆర్డీఓ పి.గ్లోరియా కొనియాడారు. ఆమె మరణించినా, చిరకాలం మన మధ్యనే జీవిస్తూ ఉంటారని తెలిపారు. ఆమె ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు దానం చేయడం ద్వారా మరో ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు. వరలక్ష్మి భౌతికకాయాన్ని సోమ వారం ఉదయం వివేకానంద కాలనీలో సందర్శించి నివాళులర్పించారు. అవయవ దానానికి అంగీకరించిన వరలక్ష్మి భర్త వీరకుమార్‌కు శాలువా కప్పి అభినందించారు. మామయ్య నరసింహారావు ఉదాత్తమమైన నిర్ణయం తీసుకుని ప్రశంసించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. విజయమ్మ, తహసీల్దార్ షేక్ సలీమా, బాపట్ల జిల్లా శరీర, అవయవ దాతల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.సి.సాయిబాబు, సభ్యులు యాజలి భాస్కరరావు, యూటీఎఫ్ నాయకులు జడ వినయ్‌కుమార్. ఎం.ఎన్.ఎస్. భారతి, ఉదయకుమారి, నూతలపాటి కోటేశ్వరరావు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో లైన్‌మేన్ మృతి క్రోసూరు: పీసపాడు సబ్‌స్టేషన్ పరిధిలో లైన్‌మేన్‌గా పనిచేస్తున్న గుజ్జర్లపూడి రామారావు(45) సోమవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. క్రోసూరు మండల విద్యుత్ శాఖ ఏఈ బసవరాజు కథనం ప్రకారం. పారుపల్లిలోని ఓ రైతు పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో పీసపాడు సబ్‌స్టేషన్ నుంచి వచ్చే లైన్ సప్లయిని ఆఫ్ చేసుకుని రామారావు పనిచేస్తున్నాడు. అయితే దురదృష్టవశాత్తు క్రోసూరు నుంచి వచ్చే లైన్ ద్వారా విద్యుత్ ప్రసరించటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడి నుంచి కింద పడిపోయాడు. అతనిని హుటాహుటిన సత్తెనపల్లి ప్రైవేటు ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై పోలీసుస్టేషన్లో ఏఈ ఫిర్యాదు చేశారు. రామారావు సత్తెనపల్లిలో నివాసముంటూ పీసపాడులో విధులు నిర్వహిస్తున్నాడు. నాలుగేళ్ల నుంచి లైన్‌మేన్‌గా పనిచేస్తున్న రామారావు మరణం ప్రజలను కలచివేసింది. -
కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకోం !
ఇంకొల్లు (చినగంజాం): తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని పర్చూరు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త గాదె మధుసూదనరెడ్డి స్పష్టం చేశారు. ఇంకొల్లు మండలం పావులూరులోని ఆయన స్వగృహంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్. జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు తాను నియోజకవర్గ సమన్వయకర్తగా వచ్చానని తెలిపారు. ముందుగా పార్టీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. తర్వాత నియోజకవర్గంలో పర్యటించి, ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. తాము అభివృద్ధికి అవరోధం కాదని, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసే వారికి పార్టీలకతీతంగా పూర్తి సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కూటమి వైఎస్సార్ సీపీ హయాంలో ఆర్థిక సమస్య ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహనరెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని మధుసూదనరెడ్డి తెలిపారు. అయితే, అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. మేని ఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని, ప్రజలను ఎంతకాలం మభ్య పెడతారని ప్రశ్నించా రు. నియోజక అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యేతో తా ము సహకారం అందిస్తామని, సీనియర్ నాయకుడుగా ఆయన నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి పనులుపై దృష్టి పెడితే బాగుంటుందని సూచించారు. గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలను పెంచుకుంటూ పోతూ సామాన్య వ్యక్తులను అందుకు బలి చేయడం సమంజసం కాదని హితవు పలికారు. ఎమ్మెల్యే తీరు బాగోలేదు ! గత 40 ఏళ్లుగా పావులూరులో రేషన్ షాపు నడుపుతున్న డీలర్లను తొలగించడం సమంజసం కాదని తెలిపారు. గ్రామాల్లో సన్న, చిన్న కారు రైతులు, రోజూవారీ కూలీల మధ్య గొడవలు పెట్టి కక్షలు, కార్పణ్యాలు పెంచడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. తమ నాయకుడు వైఎస్. జగన్మోహనరెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీ వైపు అధికారులు మొగ్గు చూపవచ్చు గానీ, పక్షపాత ధోరణిగా వ్యవహరించడం సరైనది కాదని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్లు కఠారి అప్పారావు, మున్నం నాగేశ్వరరెడ్డి, జంపని వీరయ్య చౌదరి, చిన్ని పూర్ణారావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్లు పులఖండం రామకృష్ణారెడ్డి, గాదె సుబ్బారెడ్డి, గేరా స్వరాజ్ కుమార్, కరుణాకర్, రాందాస్ రెడ్డి, బిల్లాలి డేవిడ్ పాల్గొన్నారు. గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలుపెంచుతున్న కూటమి పర్చూరు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త గాదె ధ్వజం -
పిందె రాలడానికి పోషకాల లోపమే కారణం
వేటపాలెం: మామిడి చెట్లలో పోషకాల లోపాలతో పిందెలు రాలుతాయని గుంటూరు జిల్లా లాం ఫారం కీటక నివారణ శాస్త్రవేత్త నాగేంద్రరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని రామన్నపేట, పందిళ్లపల్లిలో మామిడి తోటలను సోమవారం పరిశీలించి, రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ పిందె రాలకుండా పోషక లోపాలను నివారించుకోవాలని సూచించారు. రైతులు దిగుబడులు పెంచుకోవడానికి ప్రూట్ కవర్లు వాడాలని తెలిపారు. కాయ నిమ్మకాయ సైజులో ఉండగానే కవర్లు కట్టుకోవాలని చెప్పారు. మామిడి తోటల్లో తేనె మంచు పురుగులు నివారణకు సూచనలు ఇచ్చారు. పూతని ఆశించే గొంగళి పురుగులు, ఆకు తినే పురుగులు, గూడు కట్టుకొనే పురుగులు ఎక్కువైనప్పుడు వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు. -
పోలీసుల చెరలు భరించలేకపోతున్నా..
పర్చూరు మండలం, గొల్లపూడి గ్రామానికి చెందిన నాకు మా గ్రామంలో 4 ఎకరాల పొలం ఉంది. దానిపక్కనే చెరుకూరు గ్రామానికి చెందిన యర్రాకుల నాగేశ్వరరావు పొలం ఉంది. నన్ను నా పొలంలోకి వెళ్లనీయకుండా ఇబ్బందులకు గురిచేస్తుంటే ఏడాదిన్నర క్రితం పర్చూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టాను. ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. నాగేశ్వరరావు కొడుకు కానిస్టేబుల్ కావడంతో పర్చూరు ఎస్ఐ, కానిస్టేబుల్స్ నిత్యం నన్ను రాజీపడమని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. రాజీపడలేదని నన్ను పొలంలోకి కూడా వెళ్ళనీయకుండా ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులు పెట్టే చెరలు భరించలేకపోతున్నా. – బొడ్డు నాగేశ్వరరావు, పర్చూరు -
ఉద్యోగం పేరుతో రూ. 2.75 లక్షలు స్వాహా
బాపట్ల పట్టణానికి చెందిన నేను బిటెక్ పూర్తిచేసి ఉద్యోగం వెతుకుంటున్న సమయంలో చీరాల ప్రాంతానికి చెందిన కట్టా జయరాజుతో పరిచయం ఏర్పడింది. అతను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్ ఉద్యోగం చేస్తున్నాడు. నాకు ఎయిర్‌ఫోర్స్‌లోని ఎంటీఎస్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని విడతల వారీగా రూ. 23.75 లక్షలు తీసుకున్నాడు, ప్రస్తుతం ఆయన రాజస్థాన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. నగదు తీసుకొని ఏళ్లు గడుస్తున్నా నేటి వరకు ఉద్యోగం ఇప్పించలేదు. ఇదేమని అడిగితే నీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరిస్తున్నారు. – దేవరకొండ అవినాష్, బాపట్ల -
బాధితులకు అండగా ఉంటాం
బాపట్ల టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 89 మంది బాధితులు హాజరై తమ సమస్యలను నేరుగా ఎస్పీకు విన్నవించుకున్నారు. సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ తుషార్‌డూడీ, అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్ వెంటనే సంబందిత సీఐ, ఎస్ఐలతో మాట్లాడారు. తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఎస్పీ తుషార్ డూడీ స్పందనలో సమస్యలు ఏకరువు పెట్టిన బాధితులు -
అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
చీరాల: అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఈపూరుపాలెం ఎస్సై ఎ.చంద్రశేఖర్ తెలిపారు. వేటపాలెం మండలం రామాపురంలోని బీచ్ రోడ్‌లోని వాయల రాంబాబు కూల్‌డ్రింక్ షాపులో రైడ్ చేయగా విస్కీ7 సీసాలు, ఇంపీరియల్ బ్లూ 4, ఎంసీ డోవేల్స్ 3 మొత్తం 14 బాటిల్స్‌ను సీజ్ చేసి అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమంగా మద్యం అమ్మడం నేరమన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక చీరాలటౌన్: ఉమ్మడి ప్రకాశం జిల్లా ఏపీ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షునిగా జమండ్లమూడి శ్రీనివాసరావును ఎన్నుకున్నారు. ఆదివారం పట్టణంలోని డోలా ఐజాక్ ఎన్జీవో భవనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం.వెంకటరెడ్డి, మాజీ సలహాదారు షేక్ యూసుఫ్ మొహరాలి అధ్యక్షతన నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం అధ్యక్షులుగా జమండ్లమూడి శ్రీనివాసరావు, సహాధ్యక్షులుగా ఎన్.కృపాచార్యులు, జనరల్ సెక్రటరీగా సాయి మహేష్, ఉపాద్యక్షులుగా ఎం.వెంకటేశ్వర్లు, కోశాధికారిగా సూర్యనారాయణ, సభ్యులను ఎన్నుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం బలోపేతం చేయడంతోపాటు హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అందరం ఐక్యమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. గూడ్స్ రైలు కిందపడి టైల్స్ మేస్త్రి ఆత్మహత్య నరసరావుపేట టౌన్: గూడ్స్ రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దొండపాడుకు చెందిన పుట్లూరి శివారెడ్డి(42) పట్టణంలోని బరంపేటలో నివాసం ఉంటున్నాడు. టైల్స్ మేస్త్రిగా జీవనం కొనసాగిస్తున్నాడు. శావల్యాపురం రైల్వే స్టేషన్ సమీపంలో వెల్లలచెరువు ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకటేశ్వరనాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. -
బాపట్ల
సోమవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2025ప్రభువుకు కృతజ్ఞతా స్తుతులతో రక్షణవిజయపురిసౌత్: ‘‘ఏసు ప్రభువునకు ఎల్లప్పుడూ కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట రక్షణదాయకమ’’ని గుంటూరు పీఠాధిపతులు చిన్నాబత్తిని భాగ్యయ్య అన్నారు. సాగర్మాత మహోత్సవం ముగింపు రోజైన ఆదివారం నిర్వహించిన సమష్టి దివ్య బలి పూజలో ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. పవిత్రాత్మ ప్రభావం వల్ల కన్నె మరియమాత గర్భాన దివ్యజ్యోతి అయిన ఏసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించినట్లు పేర్కొన్నారు. పవిత్రమైన ఏసుక్రీస్తును దీనభావంతో స్తుతించాలని తెలిపారు. ఆధ్యాత్మిక ఆయుధాలైన ప్రార్థన, ప్రేమ, నీతి, కరుణ, దయ, క్షమాగుణం కలిగిన వ్యక్తులు దేవుని మార్గంలో నడిపింపబడుతున్నారని అర్థం అని పేర్కొన్నారు. సాగర్మాత మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు దేవుడు ఐశ్వర్య, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రార్థించారు. రథోత్సవంతో ఉత్సవాలు ముగింపు ఆదివారం రాత్రి సాగర్ మాత రథోత్సవం ప్రధానమైంది. ఈ ఊరేగింపుతో ఉత్సవం ముగుస్తుంది. ఉదయం 5గంటలకు అత్తలూరు విచారణ గురువులు చాట్ల కస్సార్, 6గంటలకు కారంపూడి విచారణ గురువులు పెట్ల మర్రి అనిల్, 7గంటలకు ముట్లూరు విచారణ గురువులు మార్నేని దిలీప్, 8గంటలకు దాచేపల్లి విచారణ గురువులు గురుశ్రీ ఏరువ బాలశౌర్రెడ్డి, ఉదయం 10.30 గంటలకు గుంటూరు పీఠాధిపతులు చిన్నాబత్తిని భాగయ్య సమష్టి దివ్య పూజలు నిర్వహించారు. పామిశెట్టి తోమస్ బృందం గానం ఆకట్టుకుంది. ఫాదరన్లు జోసఫ్ బాలసాగర్, తంబి, మనోజ్‌కుమార్, ఆలయ పెద్దలు ఎం. జోషి, జెక్కిరెడ్డి చిన్నపరెడి, డి. ఇన్నారెడ్డి, కె. శౌర్రాజు, మరియదాసు, శౌరిబాబు, బాలస్వామి పాల్గొన్నారు. ఇఫ్తార్ సహర్ (సోమ) (మంగళ) బాపట్ల 6.22 5.03 గుంటూరు 6.22 5.03 నరసరావుపేట 6.24 5.05 సాక్షి ప్రతినిధి,బాపట్ల: దశాబ్దాలపాటు కలిసి కాపురంచేస్తామని ఇటు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అటు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌లు పదేపదే చెప్పినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. చాలాచోట్ల పచ్చనేతలు, జనసేన కార్యకర్తలకు మధ్య సమన్వయంలేదు. కొన్ని చోట్ల ఒకరంటే మరొకరికి గిట్టడంలేదు. ఇంకొన్నిచోట్ల ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ప్రధానంగా బాపట్ల జిల్లాలోని పర్చూరు, అద్దంకి, బాపట్ల, వేమూరులాంటి నియోజకవర్గాల్లో చంద్రబాబు సామాజికవర్గంతో పోలిస్తే జనసేన అధినేత సామాజికవర్గం తక్కువ జనాభా, ఓటర్లను కలిగి ఉండడంతో పచ్చపార్టీ నేతలు వారిని ఖాతరు చేయడంలేదు. తాజాగా పర్చూరు ఇందిరా నగర్–7 చౌకదుకాణం పంచాయతీ పచ్చపార్టీ, జనసేనల మధ్య చిచ్చురేపి హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ వ్యవహారం పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు తలకు చుట్టుకోగా జనసేన ఫిర్యాదుతో అటు పచ్చపార్టీ అధిష్టానానికి సైతం చేరినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. నియోజకవర్గ కేంద్రమైన పర్చూరులోని ఇందిరానగర్–7 చౌక దుకాణానికి 2000 సంవత్సరం నుంచి నవత డీలర్‌గా ఉన్నారు. భర్త మృతి చెందగా డీలర్షిప్పును నడుపుకొంటూ పిల్లలను పోషించుకుంటున్నారు. పవన్‌కళ్యాణ్ మీద అభిమానంతో నవత కుటుంబం జనసేన ఆవిర్భావం నుంచి ఆ పార్టీతోనే ఉన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనూ ఆమె డీలర్‌గా కొనసాగారు. కూటమి అధికారంలోకి రాగానే స్థానిక పచ్చనేత సదరు డీలర్‌షిప్పు కొట్టేసేందుకు పెద్ద ప్లాన్ వేశారు. మండిపడుతున్న జనసేన శ్రేణులు.. ఎన్నికల్లో టీడీపీకి ఓట్లేసి గెలిపిస్తే 25 ఏళ్లుగా డీలర్‌గా నవతను వితంతు అని కూడా చూడకుండా టీడీపీ నాయకుడు స్వయంగా అధికారులకు పట్టించి తొలగించడంపై జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. డీలర్ తనయుడు జనసేన కీలక నాయకుడుగా ఉన్నారు. పర్చూరు నియోజకవర్గంలో పవన్‌కల్యాణ్ సామాజికవర్గం ఓటర్లు 20 వేలకు పైగా ఉన్నాయి. ఇప్పుడు వారంతా పచ్చపార్టీపై ఆగ్రహంతో ఉన్నారు. అటు జనసేన అధిష్టానానికి విషయం చేరవేసినట్లు సమాచారం. దీంతో సమస్య పచ్చపార్టీ అధిష్టానానికి సైతం చేరినట్లు తెలుస్తోంది. మొత్తంగా చౌకదుకాణం వ్యవహారం ఇప్పుడు పర్చూరు కూటమిలో చిచ్చురేపింది. 7 పర్చూరులో టీడీపీ, జనసేన మధ్య విబేధాలు ప్లాన్ చేసి జనసేనకు చెందిన డీలర్‌కు చెక్ పెట్టిన పచ్చనేత లారీకి తక్కువ వచ్చాయని చౌకబియ్యం సేకరణ నమ్మి బియ్యం అమ్మిన ఇందిరానగర్–7 రేషన్ డీలర్ తర్వాత ఎన్ఫోర్స్మెంట్తో దాడిచేయించిన పచ్చనేత కేసుకు భయపడి రాజీనామా చేసిన డీలర్ నవత కూటమి అధికారంలోకి రాగానే డీలర్ షిప్ కొట్టేసేందుకు పావులు కదిపిన దందా నిర్వహకుడు టీడీపీ నేత పన్నాగాన్ని జనసేన డీలర్ చెవిన వేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారి పచ్చనేత దురాగతంపై జనసేన నేతల ఆగ్రహం న్యూస్రీల్వ్యూహం పన్నారు.. పట్టించారు..పర్చూరులో చౌకబియ్యం దందా నిర్వహించే సుమన్ బియ్యం లోడుకు తక్కువగా ఉన్నాయని, మీవద్దవున్న మొత్తం బియ్యం ఇవ్వాలంటూ డీలర్ నవతపై ఒత్తిడి పెట్టారు. 15వ తేదీ తర్వాత బియ్యం ఇస్తామని, ముందుగా ఇస్తే అధికారులతో సమస్య అవుతుందని నవత కుటుంబం చెప్పింది. అంతా తాను చూసుకుంటానని, అధికారుల భయంలేదని సుమన్ భరోసా మాటలు చెప్పారు. అసలే పచ్చనేతల దందా.. బియ్యం ఇవ్వకపోతే అదోతంటా ఎందుకని నవత కుటుంబం ఈ నెల 6వ తేదీన దందా నిర్వాహకుడు సుమన్‌కు తమవద్దవున్న రేషన్‌బియ్యం అప్పగించారు. 7వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నవత చౌకదుకాణంపై దాడిచేశారు. బియ్యంలేవని నిర్దారించుకొని కేసు కట్టాలా? రాజీనామా చేస్తారా? అంటూ బెదిరించారు. ఇదే సమయంలో బియ్యం దందా నిర్వాహకుడు సుమన్‌కు డీలర్ ఫోన్‌చేశారు. అక్కడికి వచ్చిన సుమన్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను పక్కకు తీసుకెళ్లి మాట్లాడి అధికారులు తన మాట వినడంలేదని, మీరే మాట్లాడుకోవాలని డీలర్‌కు చెప్పి అక్కడినుంచి జారుకున్నాడు. వాస్తవానికి బియ్యం లెక్కల్లో తేడాలొస్తే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేయాలి. కానీ పచ్చనేత ఒత్తిడితో అలా అలా చేయకుండా కేసులు కడితే కోర్టుచుట్టూ తిరగాల్సి వస్తుందని, మహిళగా ఉండి కోర్టుకు వెళ్లడం సరికాదని, రాజీనామా చేయడమే మంచిదని నవతను బెదిరించారు. అధికారుల ఒత్తిడి భరించలేక నవత అదేరోజు డీలర్ పదవికి రాజీనామా చేశారు. తాము చెప్పగానే రాజీనామా చేసిన నవతపై సానుభూతి చూపిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెళుతూ వెళుతూ పచ్చనేత ఒత్తిడితోనే తాము వచ్చామని, మీరు బియ్యం అమ్మిన విషయం చెప్పి పట్టించింది అతనేనంటూ అసలు విషయం ఆమెకు చెప్పి జారుకున్నారు. -
ఏఎన్ఎంలపై పనిఒత్తిడి తగ్గించాలి
బాపట్ల: ఏఎన్ఎంలపై పని ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె.రోశయ్య పేర్కొన్నారు. బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో అసోసియేషన్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో కె.రోశయ్య మాట్లాడుతూ తాలుకా, జిల్లా బాడీలను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. 143 జీఓని రద్దు చేయాలని కోరారు. ఏఎన్ఎంలపై ఒత్తిడి తగ్గించాలని, గ్రేడ్ 3 ఏఎన్ఎంలను వైద్యశాఖలోకి తీసుకోవాలని కోరారు. పీ4 సర్వేలో ఏఎన్ఎంలను మినహాయించాలన్నారు. సమావేశంలో నాయకులు సీహెచ్ బెనర్జీ, జె.సుధాకర్, ఎన్.సుబ్బారావు, కె.మారుతి ప్రసాద్, రత్నకుమారి, రమణమ్మ, సైదయ్య, వేణు, మహబూబ్, రాజేష్, బాపట్ల టౌన్ అధ్యక్షుడు జి.శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.రోశయ్య -
15 నుంచి ‘తిరుమల మహా పాదయాత్ర’
తెనాలి: పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీవాసవీ పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి (బాలస్వామి) ఈ నెల 15వ తేదీ నుంచి ‘తిరుమల మహా పాదయాత్ర’ చేపట్టనున్నారు. రైతు క్షేమార్థం, ధర్మసంస్థాపనార్థం చేపట్టనున్న తిరుమల మహాపాదయాత్రను భక్తజన సమూహంగా ఆరంభించనున్నారు. దీనికి ముందుగా తెనాలిలో ‘గురు పాదధూళి’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఆరు గంటలకు స్థానిక గంగానమ్మపేటలోని శ్రీవిద్యాపీఠం శ్రీసాలిగ్రామ పీఠం నుంచి బయలుదేరి బుర్రిపాలెం రోడ్డులోని గోశాల వరకు పాదయాత్ర చేశారు. తిరుమల మహా పాదయాత్ర రోజు వరకు రోజూ గురు పాదధూళి పాదయాత్ర ఉంటుందని, భక్తులు పాల్గొనాలని కోరారు. శ్రీసాలిగ్రామ పీఠం కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి -
లక్ష్యానికి తూట్లు.. పశుపోషకుల పాట్లు
బల్లికురవ: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పరచిన ఉన్నత లక్ష్యాలకు నేటి కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. మూగ జీవాలకు అత్యవసర వైద్యసేవలను ఆయా గ్రామాల్లోనే అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి రెండు చొప్పున 350 సంచార పశువైద్య వాహనాలను కేటాయించారు. బాపట్ల జిల్లాలోని అద్దంకి, పర్చూరు, చీరాల, బాపట్ల, వేమూరు, రేపల్లె నియోజకవర్గ కేంద్రాలకు తొలి విడతలో 2022 మే నెలలో ఆరు వాహనాలను కేటాయించారు. 2023 ఫిబ్రవరిలో నియోజకవర్గానికి రెండో వాహనాన్ని కేటాయించారు. ఇలా మొత్తం జిల్లాకు 12 వాహనాలు కేటాయించారు. రెండు నుంచి మూడు మండలాలకు కలిపి ఈ సంచార వాహనాన్ని కేటాయిస్తూ ఆయా పశువైద్యశాలలో పశుపోషకులకు అందుబాటులో ఉంచారు. ఈ వాహనానికి వైద్యుడు, ప్యారావిట్, పైలట్ పోస్టులు కేటాయించారు. గ్రామాలవారీగా పశుపోషకులకు అత్యవసర వైద్య సేవలందించేందుకు 1962 టోల్‌ఫ్రీ నంబర్‌ను కేటాయించారు. ఈ నెంబర్‌కు ఫోన్‌చేసి రైతు పేరు, గ్రామం, లోకేషన్, మండలం, జిల్లా తెలియచేయగానే వెంటనే గ్రామానికి వాహనం వచ్చి వైద్య సేవలందిస్తారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పశువైద్యసేవలను నిర్వీర్యం చేసింది. కాంట్రాక్టును పునరుద్ధరించకపోవడంతో మొదటివిడత జిల్లాకు వచ్చిన ఆరు వాహనాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. రెండో విడతలో వచ్చిన వాహనాలు మెయింట్నెన్స్లేక పశువైద్యశాలలకే పరిమితమయ్యాయి. గడువు పునరుద్ధరించక.. అంబులెన్స్‌ల నిర్వాహణ బాధ్యతను రాష్ట్రవ్యాప్తంగా జీవీకే ఫౌండేషన్‌కు అప్పగించటంతో మూడు సంవత్సరాలుగా వైద్యులు, సిబ్బంది జీతాలు, మెయింటనెన్స్ సక్రమంగానే అందించారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 28తో నిర్వహణ కాలవ్యవధి పూర్తవటంతో మొదటి విడతలో అందించిన వాహనాలను జిల్లా కేంద్రాలకు తెప్పించుకున్నారు. రెండో విడత వాహనాలకు మెయింట్‌నెన్స్ నిలిచి పోవటంతో పశువైద్యాశాలలకే పరిమితం అయ్యాయి. బల్లికురవ, సంతమాగులూరు మండలాలకు కేటాయించిన వాహనం బల్లికురవ పశువైద్యశాలలో మార్టూరు, యద్దనపూడి మండలాలకు కేటాయించిన వాహనం మార్టూరు వైద్యశాలకే పరిమితం అయింది. నిలిచిన సంచార పశు వైద్యసేవలు జిల్లాకు రెండు విడతల్లో 12 వాహనాలను కేటాయించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జీవీకే ఫౌండేషన్‌కు నిర్వహణ బాధ్యతలు 1962 టోల్‌ఫ్రీ ద్వారా గ్రామాల్లో అంబులెన్స్ సేవలు మొదటి విడత ఆరు వాహనాలకు గడువు పొడిగించని కూటమి ప్రభుత్వం మెయింటెనెన్స్ లేక మూలన పడిన రెండోవిడత ఆరు వాహనాలు అయోమయంలో పశుపోషకులు -
ఉత్తమ లక్ష్యాలతో ఉన్నత శిఖరాలకు..
రేపల్లె రూరల్: విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను కలిగి తమ లక్ష్య సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో రూ.8కోట్లతో నిర్మించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రస్తుతం సాంకేతిక విద్యకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉపాధి అవకాశాలు పొందటమే కాకుండా, స్వయంగా సైతం ఆయా రంగాలలో ఉపాధిని పొందవచ్చన్నారు. అన్నిరకాల హంగులతో నిర్మించిన సాంతికేక కళాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణంలోని శిలాఫలకాన్ని ఆవిష్కరించి కళాశాల భవంతిని ప్రారంభించారు. ఆయనతో పాటు సాంకేతిక విద్యాశాఖ జేడీ పద్మారావు, ఆర్జేడీ నిర్మల్‌కుమార్, ఈఈ భాస్కర్ బాబు, డీఈ రామమోహనరావు, ఆర్డీఓ నేలపు రామలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ కట్టా మంగ, కమిషనర్ సాంబశివరావు, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.చంద్రశేఖర్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రేపల్లెలో పాలిటెక్నిక్ కళాశాల నూతన భవనం ప్రారంభం వైఎస్సార్ సీపీ హయాంలో పూర్తి రేపల్లెలో సాంకేతిక విద్యను అందించాలన్న ఉద్దేశ్యంతో 2010 సంవత్సరం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో తాత్కాలిక భవంతిలో పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేసింది. శాశ్వత భవనం లేకపోవటం, సరైన సౌకర్యాలు లేకపోవటంతో విద్యార్థులు అంతంత మాత్రపు సౌకర్యాలతోనే విద్యాభ్యాసం చేసేవారు. అయితే తదుపరి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాల శాశ్వత భవనం ఏర్పాటును నీరుగార్చారు. దీంతో విద్యార్థులు, విద్యాసంఘాలు ఆగ్రహించి 2015 సంవత్సరంలో ఉద్యమాలు చేపట్టినప్పటికీ ఫలితం దక్కకపోవటంతో నిరాశ పడ్డారు. అనంతరం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల కోసం రూ.8కోట్లు నిధులు కేటాయించి ప్రత్యేక చొరవ చూపి భవంతిని పూర్తిచేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల తరువాత కళాశాలను ప్రారంభించింది. కళాశాల పనులు చురుగ్గా సాగటంతో పాటు అవసరమైన పూర్తి మౌలిక వసతులతో కళాశాలను ఏర్పాటుకు కారణమైన వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
గుంటూరుకు 100 ఎలక్ట్రిక్ బస్సులు
కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని నెహ్రూనగర్: కేంద్ర ప్రభుత్వం గుంటూరు పట్టణానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, ఛార్జింగ్ పాయింట్లు తదితర ఏర్పాట్ల కోసం ఆదివారం తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఆర్టీసీ అధికారులతో కలిసి ఆయన గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ బస్సులను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్లు వరకు ప్రయాణించగలవన్నారు. వీటిని నిర్వహించాలంటే ప్రత్యేక సదుపాయాలు కావాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండ్ 20 ఎకరాల విస్తీర్ణంలో ఉందని గుర్తుచేశారు. బస్టాండ్, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకుపోను మిగిలిన స్థలంలో పీపీపీ పద్ధతిలో లీజులకు ఆర్టీసీ స్థలాలను ఇస్తే సంస్థకు ఆదాయం పెరిగే అవకాశం ఉందన్నారు. దీనిపై ఆర్టీసీ అధికారులు కసరత్తు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ కొనకళ్ల నారాయణ, ఈడీ అడ్మిన్ జి. రవివర్మ, ఈడీ జోన్ 3 నెల్లూరు నాగేంద్రప్రసాద్, ఆర్ఎం ఎం.రవికాంత్, డిపో మేనేజర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మైనార్టీల అభ్యున్నతికి కృషి అద్దంకి రూరల్: మైనార్టీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషిచేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఆదివారం స్థానిక షాదీఖానాలో జరిగిన కార్యక్రమంలో రంజాన్ మాసం జేబు క్యాలెండర్ ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ మైనార్టీ సంక్షేమానికి బడ్జెట్లో రూ. 5434 కోట్లు ప్రకటించారన్నారు. సబ్ ప్లాన్ అమలుతో మైనార్టీలు అభివృద్ధి చెందుతారని తెలిపారు. అవయదానంతో ముగ్గురికి కొత్త జీవితం గుంటూరు మెడికల్: ఓ మహిళ అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేయడానికి అంగీకరించడంతో ముగ్గురికి నూతన జీవితం లభించింది. వివరాలు.. బాపట్ల జిల్లా బాపట్ల పట్టణం వివేకానంద నగర్ కాలనీకి చెందిన కొపనాతి వరలక్ష్మి (45) మెదడు సంబంధిత వ్యాధితో ఈ నెల 6 న గుంటూరులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో చేరారు. ఆమె పరిస్థితి విషమంగా మారి ఆదివారం బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ జీవన్ దాన్ ప్రతినిధులు వరలక్ష్మి కుటుంబసభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. దీంతో వారు విశాల హృదయంతో అవయవాలు దానం చేసేందుకు అంగీకరించారు. దీంతో జీవన్మరణ స్థితిలో ఉన్న ముగ్గురికి కొత్త జీవితం ప్రసాదించారు. జీవన్ దాన్ ప్రతినిధులు ఊపిరితిత్తులను తెలంగాణ రాష్ట్రానికి చెందిన కిమ్స్ ఆసుపత్రికి, కిడ్నీ, లివర్లను ఆస్టర్ రమేష్ హాస్పిటల్‌కు అందించారు. ఊపిరితిత్తులను గ్రీన్ చానల్ ద్వారా గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు తరలించారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మమత రాయపాటి, క్లస్టర్ మార్కెటింగ్ హెడ్ డాక్టర్ కార్తిక్ చౌదరి అవయవదాన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శ్రీనివాస కల్యాణ వేడుక ఏర్పాట్లు పరిశీలన వెంకటపాలెం (తాడికొండ): తుళ్ళూరు మండలం వెంకటపాలెంలోని టీటీడీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఈ నెల 15వ తేదీన జరగనున్న శ్రీనివాస కల్యాణ మహోత్సవ ఏర్పాట్లను గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదివారం పరిశీలించారు. కార్యక్రమంలో సీఎం పాల్గొననున్న దృష్ట్యా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. -
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పోరాటం
తెనాలి: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఎస్టీయూ నిరంతరం పోరాటం చేస్తుందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.సాయి శ్రీనివాస్ చెప్పారు. ఉపాధ్యాయ బదిలీలపై ప్రభుత్వం ప్రత్యేకచట్టం చేసిందని గుర్తుచేశారు. అలాగే పీఆర్సీ బకాయిలు, డీఏ ఇవ్వాలని, పెండింగు సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నట్టు తెలిపారు. ఎస్టీయూ, ఏపీ ఉపాధ్యాయ సంఘం, ఉమ్మడి తెనాలి ఏరియా (తెనాలి అర్బన్, తెనాలి, దుగ్గిరాల, కొల్లిపర, చుండూరు, అమర్తలూరు, వేమూరు, కొల్లూరు మండల శాఖలు) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్జీవో కళ్యాణమండపంలో జరిగిన ఈ వేడుకలకు ఎస్టీయూ తెనాలి ఏరియా కార్యదర్శి డీవీ సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఆత్మీయ అతిథిగా పాఠశాల విద్య ఆర్జేడీ బి.విజయభాస్కర్ మాట్లాడుతూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్.రామచంద్రయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేఏకే జిలాని, జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి అమరనాథ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు ఏవీ ప్రసాద్ బాబు, వేమూరు ఏరియా కార్యదర్శి ఎం.శ్రీధర్, డాక్టర్ శారద మాట్లాడారు. దుగ్గిరాల జిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రధానోపాధ్యాయిని శోభాదేవి, కవయిత్రిగా గుర్తింపును తెచ్చుకున్న కొలకలూరు ఉపాధ్యాయిని దేవికరాణి, వివిధ మండల శాఖల మహిళా కన్వీనర్లు సహా 23 మందిని ఘనంగా సత్కరించారు. ఉమ్మడి తెనాలి ఏరియా కార్యదర్శి ఎం.శ్రీధర్‌తోపాటు ఏరియాలోని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏవీ గోపాలరావు, ఎం.రవి, జి.మిథున్ చక్రవర్తి, ఎస్.నాగేశ్వరరావు, ఉన్నం ప్రసాద్, మునిపల్లి మోహన కృష్ణ, ఖాన్, ఆరోన్, వినోద్, ప్రసాద్, నాగరాజు, చంద్రశేఖర్, కిరణ్, నాగరాజు, శ్రీనివాస్, రామకృష్ణ, సీనియర్ నాయకులు ఈ.అంబరీషుడు, పట్టణ శాఖ నాయకులు పూషాడపు శ్రీనివాసరావు, ఉమ్మడి తెనాలి ఏరియాలోని రాష్ట్ర కౌన్సిలర్లు, జిల్లా కార్య నిర్వాహక సభ్యులు, మండల కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు. -
ప్రార్థనతోనే దేవుడి అనుగ్రహం
అమరావతి: ‘‘ప్రభువైన ఏసుక్రీస్తు కృప లోకమంతా నిండియున్నదని, మానవుడు దేవుని ఎంతగా ప్రార్థిస్తే అంతగా దేవుడికి దగ్గరవుతాడని హోసన్నా మినిస్ట్రీస్ చీఫ్ పాస్టర్ జాన్‌వెస్లీ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని లేమల్లె హోసన్నా దయా క్షేత్రంలో హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహిస్తున్న 48వ గుడారాల పండుగ చివరి రోజు పగటిపూట ముగింపు ప్రార్థనలకు లక్షలాది మంది ఆరాధికులు తరలివచ్చారు. పాస్టర్ జాన్‌వెస్లీ ప్రసంగిస్తూ.. జాతి, కుల, మత, వర్గ, పేద, ధనిక భేదం లేకుండా అందరికీ దేవుని కృప ఉంటుందని, ఆయన్ను స్తుతిస్తూ బలి పీఠం దగ్గరకు ఎవరు వస్తారో వారిపై ప్రత్యేక కృప కనబరుస్తాడని పేర్కొన్నారు. ప్రపంచంలో అందరి పైనా ఆయన వర్షం కురిపించినా అత్మీయులపై మాత్రం కృపా వర్షం కురిపిస్తాడని పేర్కొన్నారు. హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు పాస్టర్ అబ్రహాం ప్రసంగిస్తూ.. గుడారాల పండుగలో దేవుని దర్శించిన ప్రతి ఒక్కరి వెంట ఆయన వస్తున్నాడని.. మంచిని కలుగచేస్తాడని తెలిపారు. దురాత్మలను దూరం చేసి సంతోషం కలుగ చేస్తాడని వివరించారు. ఎంతో దూరం నుంచి వచ్చిన లక్షలాది మంది విశ్వాసులకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించకపోయినా, సర్దుకు పోయిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 5,6,7,8 తేదీల్లో గుడారాల పండుగ నిర్వహిస్తామని ప్రకటించారు. గుడారాల పండుగకు సహకరించిన అన్ని ప్రభుత్వశాఖల అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. లక్షలాదిమంది విశ్వాసులు పాల్గొన్నారు. ముగిసిన 48వ గుడారాల పండుగ ముగింపు ప్రార్థనలు చేసిన పాస్టర్లు జాన్‌వెస్లీ, అబ్రహాం దయా క్షేత్రానికి చేరుకున్న లక్షలాది మంది విశ్వాసులు -
అంగన్వాడీలపై సర్కారు ద్వంద్వ వైఖరి
లక్ష్మీపురం: అంగన్వాడీల విషయంలో కూటమి ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ ధ్వజమెత్తారు. స్థానిక బ్రాడీపేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ... ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూటమి నాయకులు అంగన్వాడీల సమ్మె శిబిరాలలో ప్రత్యక్షంగా పాల్గొని పోరాటానికి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా జీతాల పెంపు పట్టించుకోవడం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం మార్చి 10వ తేదీన విజయవాడలో ధర్నా నిర్వహించనున్నట్లు ముందుగానే అధికారులు, మంత్రులకు యూనియన్ వినతి పత్రాలు ఇచ్చిందన్నారు. అయినప్పటికీ ధర్నాను భగ్నం చేసేందుకు అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా సెక్టార్లవారీగా ట్రైనింగులు ఉంటాయని, దానికి హాజరు కాకపోతే తీవ్ర చర్యలు చేపడతామని హెచ్చరికలు జారీ చేయడం, యూనియన్ నాయకుల గృహనిర్బంధాలు, అరెస్టులు ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని చెప్పారు. ఇలాంటి నిర్బంధాలు కొత్త కాదని, వాటన్నింటినీ అధిగమించి పోరాటం చేయగల సత్తా అంగన్వాడీలకు ఉందని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను కట్టిపెట్టి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారిపై నిర్బంధం ప్రయోగిస్తే పోరాడే అంగన్వాడీలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. సమ్మె ముగింపు సందర్భంగా ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు విషయంలోనూ తూట్లు పొడుస్తున్నారని తెలిపారు. ఒప్పందంలో మట్టి ఖర్చులు రూ.20వేలు ఇవ్వాలని ఉంటే దాన్ని రూ.15 వేలకు కుదించి జీవో ఇవ్వడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. అలాగే రిటైర్మెంట్ సర్వీసు పరిహారం కింది అంగన్వాడీలకు రూ.1.20 లక్షలు, హెల్పర్లకు రూ.60 వేలు ఇవ్వాలని ఒప్పందంలో ఉంటే దాన్ని రూ. 20 వేల వంతున తగ్గించారన్నారు. మళ్లీ పేరు మార్చి గ్రాట్యూటీ అని చెబుతూ దానితోనే సంబరపడమని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెనూ చార్జీల పెంపుదల, ప్రమోషన్లు తదితర విషయాలపై ఏర్పాటు చేసిన కమిటీని పక్కన పెట్టేశారని విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ -
పర్చూరు ఏజీపీగా కొల్లా నరేంద్ర కుమార్
పర్చూరు(చినగంజాం): పర్చూరు కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా కొల్లా నరేంద్ర కుమార్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు అద్దంకి ఏజీపీగా విధులు నిర్వహిస్తున్న ఆయన బదిలీపై పర్చూరు కోర్టు ఏజీపీగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు పర్చూరు కోర్టులో వై. రమేష్ బాబు ఇన్చార్జ్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పర్చూరు కోర్టు ఏజీపీగా కొల్లా నరేంద్ర కుమార్‌ను నియమిస్తూ కలెక్టర్ జె. వెంకట మురళి ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు పళ్ల విభాగంలో బాపట్ల జిల్లా ఎడ్లకు ప్రథమస్థానం రాజుపాలెం: ఆకుల గణపవరంలో గల శ్రీ ప్రసన్నాంజనేయస్వామి 96వ జయంత్యుత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల పందేలు ఆదివారం రసవత్తరంగా జరిగాయి. నాలుగు పళ్ల విభాగంలో బాపట్ల జిల్లా పంగులూరు చిలుకూరి నాగేశ్వరరావుకు చెందిన ఎడ్ల జత 5,278 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరికి చెందిన చీరబోయిన కోటేశ్వరరావు ఎడ్ల జత 4,250 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవ్వులూరు గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాసరావు ఎడ్ల జత 4,000 అడుగుల దూరం లాగి తృతీయ స్థానంలో నిలిచాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం భీమవరానికి చెందిన దివ్యశ్రీ ఎడ్ల జత 3,027 అడుగుల దూరం లాగి నాల్గవ స్థానం, పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం నిండుజర్లకు చెందిన ప్రసన్నాంజనేయ ఎడ్ల జత 2250 అడుగుల దూరం లాగి ఐదవ స్థానం సాధించాయి. సోమ వారం వ్యవసాయ విభాగంలో పందేలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి రోజూ అన్నదానం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఒకేసారి 220 ఎలక్ట్రానిక్ డివైజ్‌ల తయారీ గుంటూరు ఎడ్యుకేషన్: 220 మంది విద్యార్థులు ఒకే వేదికపై ఎలక్ట్రానిక్ డివైజ్ రూపొందించారు. ఉపాధ్యాయుల సూచనలు ఆలకిస్తూ సర్క్యూట్ బోర్డులతో 220 డివైజ్‌లను వారు తయారు చేశారు. డాక్టర్ చివుకుల హనుమంతరావు చారిటబుల్ ట్రస్ట్ అనుబంధ సంస్థ సుగుణ సైన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం అమరావతి రోడ్డులోని హిందూ ఇంజినీరింగ్ కళాశాల సుధర్మ ఆడిటోరియంలో ‘ఎలైట్ అండ్ ఎనర్జిటిక్ మైండ్స్’ పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. నాలుగు చక్రాల వాహనాలను రివర్స్ చేసే సమయంలో ఉపయోగించే అలారంతో కూడిన ఎలక్ట్రానిక్ డివైజ్‌ను విద్యార్థులు తయారు చేశారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. గుంటూరులోని శ్రీపాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌తోపాటు వెంకటకృష్ణాపురంలోని సిద్దార్థ హైస్కూల్‌కు చెందిన 220 మంది విద్యార్థులు పాలుపంచుకున్నారు. సుగుణ సైన్స్ అకాడమీ సీఈవో డాక్టర్ చివుకుల సాంబశివరావు అధ్యక్షత వహించారు. ప్రత్యేక పరిశీలకుడు పత్రి వేణుగోపాల్ సారథ్యంలో డివైజ్‌లు తయారు చేయించారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ బోడేపూడి రామారావు అకాడమీ ప్రతినిధులకు ధ్రువీకరణపత్రాన్ని అందజేశారు. -
ఎంఎల్‌హెచ్‌పీ ఆత్మహత్యాయత్నం
యద్దనపూడి: యద్దనపూడి పీహెచ్సీ పరిధిలోని జాగర్లమూడి గ్రామంలో గతంలో మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ)గా విధులు నిర్వహించిన ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం ఘటన ఆదివారం కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి... యద్దనపూడి మండలం జాగర్లమూడి గ్రామంలో సరోజిని ఎంఎల్‌హెచ్‌పీగా విధులు నిర్వహిస్తుండేది. ఆమె విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తోటి సిబ్బందితో పాటు గ్రామస్తులు పలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో డీఎంహెచ్ఓ విజయమ్మ నాలుగు నెలల క్రితం కేంద్రాన్ని సందర్శించి రికార్డులు సక్రమంగా లేకపోవడంతో ఆమెను వివరణ కోరారు. అయినా ఆమె పద్ధతి మార్చుకోకపోవడంతో వైద్యాధికారి శ్రీహర్ష నాలుగు నెలల క్రితం డీఎంహెచ్ఓ కార్యాలయానికి సరెండర్ చేశారు. ఈ క్రమంలో డీఎంహెచ్ఓ కార్యాలయ అధికారులు ప్రాంతీయ సంచాలకుల కార్యాలయానికి ఆమెను సరెండర్ చేయడం గమనార్హం. ఈ క్రమంలో ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడంతో యద్దనపూడి పరిధిలోనే హాజరు వేసుకుంటూ తనకు వేతనం మంజూరు చేయడం లేదని కొన్ని రోజులుగా ఆస్పత్రి వైద్యాధికారి శ్రీహర్షపై ఒత్తిడి చేస్తూ అతనితో వివాద పడింది. కొన్ని రోజులుగా వివాదం నడుస్తుందని ఆస్పత్రి సిబ్బంది స్వయంగా సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో జీతాలు, విధులు నిర్వహించాల్సిన ప్రాంతం విషయంలో అధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో పర్చూరు పోలీస్ స్టేషన్లోను, యద్దనపూడి పోలీస్ స్టేషన్లోను వైద్యాధికారి శ్రీహర్షపై ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో తనను మానసికంగా వైద్యాధికారి, ఉన్నతాధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆమె ఎలుకల మందు తీసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గుంటూరు ఆస్పత్రిలో చేర్చారు. ఈ విషయం సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో స్థానికంగా కలకలం రేకెత్తింది. ● ఈ విషయమై డీఎంహెచ్ఓ విజయమ్మను వివరణ కోరగా గతంలో సరోజిని విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటుందనే ఆరోపణలు రావడంతో సాధారణ తనిఖీల్లో భాగంగా విచారించామన్నారు. ఈ విచారణలో రికార్డుల నిర్వాహణ సక్రమంగా లేక పోవడంతోపాటు అక్కడి స్థానిక వైద్యసిబ్బందితో పాటు ప్రస్తుతం వైద్యాధికారి శ్రీహర్షతోపాటు గతంలో ఉన్న వైద్యాధికారిపై కూడా పలు నిరాధారణ ఆరోపణలు చేసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక వైద్యసిబ్బంది ఆరోపణల నేపథ్యంలో వైద్యాధికారి శ్రీహర్ష జిల్లా కేంద్రానికి సరెండర్ చేయగా తాము ఆర్డీ కార్యాలయానికి సరెండర్ చేసినట్లు చెప్పారు. ● ఈ విషయమై రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిని వివరణ కోరగా యద్దనపూడి పీహెచ్సీ కేంద్రం నుంచి డీఎంహెచ్ఓ కార్యాలయానికి, అక్కడి నుంచి ఆర్డీ కార్యాలయానికి సరెండర్ చేసిన మాట వాస్తవమే అని వివరణ ఇచ్చారు. ఆమెకు మరోచోట బదిలీ చేసేందుకు ఎంఎల్సీ కోడ్ అడ్డుగా వచ్చిందన్నారు. నాలుగు రోజుల క్రితం ఆమె ఆర్డీ కార్యాలయానికి వచ్చి జాగర్లమూడి గ్రామంలో పని చేసుకుంటానని ప్రాధేయపడిందని, కానీ ఆమెకు యద్దనపూడీ పీహెచ్సీలో పనిచేసేందుకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని చెప్పారు. ఆమెకు వేతనాలు మంజూరు చేసే అధికారం యద్దనపూడి పీహెచ్సీ వైద్యాధికారికి లేదన్నారు. ఈ ఆత్మహత్యయత్నం ఘటన ఇప్పుడే తెలిసిందని, వాస్తవాలు విచారించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. వైద్య సిబ్బంది వేధింపులే కారణమంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వేధించారని ఆరోపణలు -
పీ–4 పేరిట పథకాలకు కోత?
వేటపాలెం: సూపర్ 6 .. ఈ నినాదాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల సభల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. పేద ప్రజల జీవితాలు మార్చి వేస్తానని ప్రజలకు ఆశలు కల్పించారు. దీంతో గంపెడు ఆశతో ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం కట్ట బెట్టారు. తీరా అధికారంలోకి వచ్చి ఎనిమిదిన్నర నెలలు గడుస్తున్నా వాటి అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పీ– 4 సర్వే పేరిట ఉన్న వాటిని కొల్లగొట్టేందుకు సమాయత్తం అవుతున్నట్లు ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సర్వే సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఇంట్లో ఫోన్, టీవీ, ఏసీ, ఇతర గృహోపకరణాలు, శ్లాబా, బ్యాంక్ అకౌంట్ ఉందా.. ఇలా 27 రకాల ప్రశ్నలకు సమాధానాలను సిబ్బంది నింపాల్సి ఉంది. ఆపై ప్రజల ఫోన్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి ప్రక్రియను ముగించనున్నారు. ఏసీ ఉన్నా సంక్షేమం కట్? జిల్లాలో 4,70,200 వేల కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయి. వీటి కోసం మరో లక్ష పైచిలుకు ఫ్యామిలీలు ఎదురుచూస్తున్నాయి. చీరాల నియోజకవర్గం పరిధిలో 57,010 కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయి. వీరంతా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలుగానే పరిగణించాలి. అప్పో సొప్పో తెచ్చుకొని నెలవారీ వాయిదాలతోనో, లేక ఎవరైనా కానుకగా ఇస్తే వారి ఇళ్లలో ఏసీలను ఎక్కువ మంది ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇది ఉందని తెలిస్తే చాలు వెంటనే ఆ వివరాలను ప్రభుత్వ రికార్డుల్లోకి సిబ్బంది నమోదు చేస్తున్నారు. ఈ వ్యవహారంతో తమకు సంక్షేమ పథకాలు ఆగిపోతాయనే ఆందోళన పేదల్లో నెలకొంది. నమ్మండయ్యా.. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్, పార్ట్నర్షిప్తో నిర్వహించేదే పి– 4 సర్వే. దీన్ని విశ్వసించాలని పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు, మండలాల్లో ఎంపీడీఓలు ప్రజలను అభ్యర్థిస్తున్నారు. జిల్లాలోని అన్ని సచివాలయాల పరిధిలోని కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది. ఇళ్ల వద్దకు సిబ్బంది వెళ్లి వివిధ సమాచారాన్ని సేకరించి యాప్‌లో నమోదు చేస్తారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, దీన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను గుర్తించేందుకు ఇది దోహదపడుతుందనే అంశాన్ని ప్రజలకు తెలియజేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి అధికారులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు యథావిధిగా కొనసాగుతాయని, ఇందులో ఎలాంటి అపోహలొద్దని చెప్తున్నా, క్షేత్రస్థాయిలో అంతా అయోమయం నెలకొంది. సర్వే పూర్తయ్యాక, విధివిధానాలు.. సర్వే నివేదిక ప్రాతిపదికన ఆర్థికాభివృద్ధి, పేదరిక నిర్మూలన కోసం పీ– 4ను ఉగాది పర్వదినాన ప్రారంభించనున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అట్టడుగున ఉన్న 20 శాతం మంది కోసం, అగ్రశ్రేణిలో ఉన్న పదిశాతం మంది సంపన్న వ్యక్తులు సహకరించేలా చూసేందుకే ఈ విధానమని తెలిపారు. ఉన్నతస్థాయి పారిశ్రామికవేత్తలు, ఆయా ప్రాంతాలకు చెందిన ఎన్నారైల సహకారంతో పీ– 4 విధానం ద్వారా పేద కుటుంబాలను అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. వద్దన్నా నమోదు.. సర్వేలో సిబ్బంది పొందుపర్చే అంశాలు ప్రస్తుత జీవనశైలిలో భాగమైనవే, స్మార్ట్‌ఫోన్, బైక్‌లు, ఇలాంటి ప్రశ్నలే ఉండటంతో సంక్షేమ పథకాల్లో కోత పడుతుందనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. సర్వేకు ఎవరైనా నిరాకరిస్తే, వారి పేర్లను సైతంనమోదు చేయాలనే ఆదేశాలు సిబ్బందికి జారీ అవ్వడం కలవరానికి గురిచేస్తోంది. సంక్షేమ పథకాలు కోత వేసేందుకే సర్వే ? గ్రామాల్లో శనివారం నుంచి సర్వే ప్రారంభం 27 రకాల ప్రశ్నలతో నిర్వహణ ఇళ్లలోని విలువైన వస్తువుల వివరాలు నమోదు అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రజలు -
సందడిగా సినిమా పాటల పోటీలు ప్రారంభం
సత్తెనపల్లి: చైతన్య కళా స్రవంతి 46వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫంక్షన్ హాలులో ఆదివారం జాతీయస్థాయి సినిమా పాటల పోటీలు ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు హాజరయ్యారు. పోటీల్లో సోలో పాటలకు మాత్రమే అవకాశం కల్పించారు. డ్యూయెట్స్ను అనుమతించలేదు. ముందుగా చైతన్య కళా స్రవంతి వ్యవస్థాపక అధ్యక్షుడు పిల్లుట్ల రామారావు చిత్రపటానికి చైతన్య కళా స్రవంతి అధ్యక్షులు కమతం శ్రీనివాసరావు, సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పాటల పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో వ్యాపారవేత్త పోతుగంటి రామకోటేశ్వరరావు, చైతన్య కళా స్రవంతి ఉపాధ్యక్షులు పిల్లుట్ల రాజా వీరాస్వామి, ప్రధాన కార్యదర్శి గుండవరపు అమర్నాథ్, ట్రెజరర్ ఎస్సీఎం సుభాని, గౌరవ సలహాదారుడు ముట్లూరి వెంకయ్య, కంబాల వెంకటేశ్వరరావు, అచ్చిరెడ్డి పాల్గొన్నారు. -
తెగుళ్ల ఘాటు.. రైతుకు చేటు
కారంచేడు: గతేడాది మిరపకు కొంత వరకు మంచి గిట్టుబాటు ఉంది. దీంతో ఈ ఏడాది మిరపను సాగు చేసేందుకు మరికొంత మంది రైతులు ముందుకొచ్చారు. అప్పుల బాధ నుండి గట్టెక్కవచ్చని ఆశించిన రైతన్నలకు ఈ ఏడాది మిరప నష్టాలే మిగిల్చేలా ఉంది. జిల్లాలో సుమారు 54 వేల హెక్టార్ల (1లక్షా 35 వేల ఎకరాలు)లో మిరప సాగు చేశారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో మిరప పంటకు ప్రధానంగా నల్లి తెగుళ్లు, బూడిద తెగులు, పండాకు, కొమ్మ ఎండు తెగుళ్లు వంటివి ఆశించాయి. వీటి వలన దిగుబడులు ఘోరంగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలను కాపాడుకోవడానికి వ్యవసాయాధికారులు, హార్టికల్చర్ అధికారుల సూచనల మేరకు మార్కెట్లో ఎన్ని రకాల నివారణ మందులున్నాయో వాటినన్నింటినీ పిచికారీ చేశామని వాపోతున్నారు. పెరిగిన సాగు ఖర్చులు గతేడాదితో పోల్చుకుంటే భూమి కౌలు నుంచి పంట చేతికందే వరకు అయిన సాగులో ఖర్చులు విపరీతంగా పెరిగాయని రైతులు చెబుతున్నారు. నీటి ఖర్చులు, కోతలకు మొత్తం ఎకరానికి రూ.3 లక్షలకు పైగా ఖర్చు చేశామని రైతులు చెబుతున్నారు. గణనీయంగా తగ్గిన దిగుబడులు గతేడాదితో పోల్చుకుంటే మిరపలో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ఎకరానికి 15–20 క్వింటాళ్ల దిగుబడి వస్తే అందుకు తగ్గట్లుగానే క్వింటా బస్తా ధర రూ.17–18 వేల వరకు వచ్చింది. ఈ ఏడాది ఎకరానికి 5–15 బస్తాలకు మించి దిగుబడులు వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం మార్కెట్ ధర కూడా రూ.12వేలు మాత్రమే ఉంది. అంటే సగటున ఎకరానికి రైతులు 15 బస్తాల దిగుబడి వస్తే కనీసం రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షలు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధరలపైనే ఆశలు.. గతేడాది ప్రభుత్వం మిరప పంటకు మంచి గిట్టుబాటు ధరలు కల్పించింది. గ్రామాల్లో వారు సాగు చేసిన చేల వద్దకు వచ్చిన వ్యాపారులు క్వింటాకు రూ.18000 వరకు ఇచ్చి కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఇప్పటికి రూ.12000కు మించి రావడం లేదు. ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు రూ.11,800 ప్రకటిస్తే, ఇక దళారులు, వ్యాపారులు ఎవరు వచ్చి కొంటారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం కనీస గిట్టుబాటు ధర రూ.18000కు పెంచితేనే వ్యాపారుల నుంచి పోటీ వస్తుందని, అప్పుడే రైతుకు గిట్టుబాటు అవుతుందని అంటున్నారు. వాతావరణ మార్పులతోనే మిరపకు తెగుళ్లు దిగుబడులపై నీలినీడలు.. తల్లడిల్లుతున్న రైతన్న జిల్లాలో 1.35 లక్షల ఎకరాల్లో మిరప సాగు ఎకరానికి రూ.1.2 లక్షలు నష్టం వచ్చే అవకాశం -
యువతను మోసం చేసిన చంద్రబాబు
బాపట్లటౌన్: ఎన్నికలకు ముందు నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. తొలుత ఈనెల 12న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించే యువత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. నాగార్జున మాట్లాడుతూ పేద విద్యార్థులపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఐదు త్రైమాసిక ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను పెండింగ్‌లో పెట్టి రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారన్నారు. సర్కార్ నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థుల చదువులు మధ్యలో ఆగిపోతున్నా సర్కార్ చోద్యం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్ పథకాన్ని నాడు వైఎస్సార్ ప్రవేశపెడితే ఆ పథకాన్ని మరో మూడు అడుగులు ముందుకు వేసి అమలుచేసిన ఘనుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో విద్యాదీవెనకు రూ.12,609 కోట్లు ఖర్చుచేశారన్నారు. వీటితోపాటు వసతి దీవెనకు మరో రూ.6 వేల కోట్లు ఖర్చుచేశారన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, లేకుంటే ప్రతి నెలా నిరుద్యోగులకు రూ.3 వేలు అందజేస్తామని నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయాలంటే బడ్జెట్లో రూ.7200 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని కనీసం బడ్జెట్లో ప్రవేశపెట్టకపోవడం దారుణమన్నారు. పేదల ఆరోగ్యాన్ని మెరుగుపర్చాలనే సదుద్దేశంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కళాశాలను తీసుకువస్తే వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. కూటమి పాలనలో పేద విద్యార్థులకు ఇంగ్లీషు మీడియం విద్య, ట్యాబ్‌ల పంపిణీ, అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్ద లాంటి పథకాలు దూరమయ్యాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆశ్వినిరెడ్డి, జిల్లా యువత విభాగం అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు ఈదా శ్రీనివాసరెడ్డి, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు వాసు, మైనర్జీవిభాగం జిల్లా అధ్యక్షులు జపరున్నీసా, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు గవిని శ్రీనివాసరావు, జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్లా రామయ్య, జిల్లా ప్రచారకమిటీ అధ్యక్షులు వడ్డిముక్కల డేవిడ్, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్ గవినికృష్ణమూర్తి పాల్గొన్నారు. 12న వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో యువతపోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున -
రాజాధిరాజ వాహనంపై నారసింహుడు
మంగళగిరి/ మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నాలుగో రోజైన శనివారం స్వామి వారు రాజాధిరాజ వాహనంపై దర్శనమిచ్చా రు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయు డు కళావేదికలో భక్తి గీతాలు, కూచిపూడి నృత్యం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈవో రామకోటిరెడ్డి పర్యవేక్షించగా కైంకర్యపరు లుగా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన పెమ్మసాని శైలేంద్ర వ్యవహరించారు. స్వామివారు ఆదివా రం రాత్రి యాలివాహనంపై దర్శనమివ్వనున్నారు. -
ఎస్టీపీ ప్లాంట్ పరిశీలన
తెనాలిఅర్బన్: తెనాలి పూలే కాలనీలో ట్రైయిల్ రన్ నిర్వహిస్తున్న ఎస్టీపీ ప్లాంట్‌ను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పబ్లిక్ హెల్త్ రాష్ట్ర చీఫ్ ఇంజినీర్ మరియన్న పేర్కొన్నారు. శనివారం ఎస్టీపీ ప్లాంట్‌ను పరిశీలించి నిర్మాణాలపై ఆరా తీశారు. మిగిలిన చిన్న చిన్న మరమ్మతులను పూర్తి చేయాలని, గ్రీనరీని ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే సచివాలయాల పరిధిలోని ఇమ్యూనిటీ సెక్రటరీలకు ఎస్టీపీ పనితీరుపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి పూలే కాలనీలో సుమారు రూ.30 కోట్లతో ఎస్టీపీ ప్లాంట్ నిర్మించడం జరిగిందన్నారు. దాదాపు పనులు పూర్తయ్యాయని, కొద్ది రోజులుగా ట్రైయిల్ రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. త్వరలో రాష్ట్ర మంత్రులతో దీనిని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనివాసరావు, డీఈ శివరామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఇన్చార్జి ఎంఈ ఆకుల శ్రీనివాసరావు, డీఈలు సుబ్బారావులు, శ్రీనివాసరావు, ఏఈలు ఫణీ, సూరిబాబు, సునీల్ ఉన్నారు. భారీ చోరీలపై కీలక ఆధారాలు లభ్యం ప్రత్యేక బృందాలతో గాలింపు లక్ష్మీపురం: గుంటూరు నగరంలో భారీ చోరీ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్, సీసీఎస్, పట్టాభిపురం పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే చోరీలకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. వివరాలు.. విద్యానగర్ 3/6 ప్రాంతంలో ఒకే రోజు రెండు ఇళ్లల్లో రూ.2.50 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీ ఘటన సంచలనం సృష్టించింది. చోరీ చేసిన వైనాన్ని సీసీ ఫుటేజ్ ద్వారా పరిశీలించిన పోలీసులు దొంగతనానికి పాల్పడిన వారు ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన వారుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనుమానితులుగా ఉన్న వారిని అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు. చిరంజిలాల్ ఇంట్లో జరిగిన చోరీకి సంబంధించి అయితే నూతన భవన నిర్మాణ పనులకు వచ్చిన వారిని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో మూడు నెలలు క్రితం ఎస్వీఎన్ కాలనీ, బృందావన్ గార్డెన్స్‌లో రిటైర్డ్ డీఎస్పీ నివాసంలో కూడా ఇదే తరహాలో కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలను చోరీ ఘటన చోటుచేసుకుంది. గతంలో జరిగిన దొంగతనాలకు సంబంధించి దొంగలు దొరికారు కాని చోరీకి గురైన బంగారం మాత్రం ఇంత వరకు రికవరీ చేయలేకపోయారు. దొంగతనం చేసిన వారిని సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించిన పట్టాభిపురం పోలీసులు చోరీ చేసిన వ్యక్తులు మహారాష్ట్రకు సంబంధించిన వారుగా గుర్తించారు. నేరస్తులను పట్టుకునేందుకు పట్టాభిపురం సీఐ, సిబ్బందితో ముంబాయి నగరానికి వెళ్లారు. అయితే ఇంత వరకు ఆ కేసు కొలిక్కి రాలేదు. ప్రస్తుత ఎస్పీ సతీష్‌కుమార్ కేసు ఛేదనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. -
ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుతోనే పేదలకు మేలు
మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి బాపట్ల: బాపట్లలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుతోనే పేద ప్రజలకు మేలు జరుగుతుందని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని చూడటం ఈప్రాంత ప్రజలకు తీరని అన్యాయమని తెలిపారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని 17 మెడికల్ కళాశాలలు నిర్మించేందుకు ముందుకురావటం జరిగిందన్నారు. మెడికల్ కళాశాల వలన వైద్యంతోపాటు వైద్య విద్యార్థులు కూడా వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ కళాశాలను తీసుకురావటం జరిగిందన్నారు. బాపట్ల కాకుండా మరోప్రాంతానికి మెడికల్ కళాశాల వెళ్లే అవకాశం ఉనప్పటికి ఖచ్చితంగా బాపట్లలోనే మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాంతానికే అవకాశం ఇచ్చారని తెలిపారు. బాపట్లలోనే కళాశాల ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ నుంచి స్థల సేకరణ చేపట్టి కళాశాల ఏర్పాటు చేయించామని తెలిపారు. 80 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణానికి కూడా ఏర్పాట్లు చేశామని తెలిపారు. తాజాగా చంద్రబాబునాయుడు ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించాలని ముందుకు రావటం వలన పెత్తనం మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతుందని తెలిపారు. పేదలకు మెరుగైన వైద్యం అందని ద్రాక్ష పండులా ఉంటుందని తెలిపారు. ఈమేరకు ఈ ప్రాంత ప్రజలందరూ ఆలోచించి కళాశాల కోసం ఒకతాటిపైకి రావాలని కోరారు. -
భావన్నారాయణుడిని తాకిన సూర్యకిరణాలు
చినగంజాం: మండలంలోని పెదగంజాం గ్రామంలోని భావన్నారాయణస్వామి ఆలయంలో స్వామి మూలవిరాట్ పాదాలను శనివారం సూర్యకిరణాలు తాకాయి. ప్రతి ఏడాది మార్చి మొదటి వారం, సెప్టెంబరు నెల చివరి వారంలో సూర్యుని లేత కిరణాలు స్వామి వారి పాదాలను అభిషేకిస్తాయి. ఈ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు వేకువ జామునుంచే ఆలయానికి చేరుకొని కనులారా తిలకించి భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. ఇటువంటి సుందర దృశ్యం ఏడాదిలో రెండు పర్యాయాలు సంభవించటంతోపాటు సుమారు వారం రోజులపాటు ఇదే విధంగా దర్శనమిస్తాయి. శనివారం తొలి రోజు పాక్షికంగా పడిన సూర్యకిరణాలు ఆదివారం నుంచి మరింత ఎక్కువగా పడేందుకు అవకాశం ఉందని ఆలయ పూజారి తెలియజేశారు. ఈ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు శనివారం ఉదయం స్థానికంగా ఉండే భక్తులు మాత్రమే ఆలయానికి విచ్చేసి తిలకించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. -
అన్ని రంగాల్లోనూ రాణిస్తున్న మహిళలు
రేపల్లె రూరల్: కట్టుబాట్ల పేరుతో వంటింటికే పరిమితమైన మహిళలు నేడు అంతరిక్షాన్ని చుట్టివచ్చేస్థాయికి ఎదిగారని, మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగల సత్తా ఉందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, గృహ నిర్మాణశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రేపల్లె పట్టణంలోని శ్రీ గుత్తికొండ లక్ష్మీనారాయణ కల్యాణ మండపంలో వేడుకలు నిర్వహించారు. మంత్రి కొలుసు మాట్లాడుతూ మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం మహిళలు కృషి చేయాలని కోరారు. తల్లిదండ్రులు ఆడపిల్లలను చదివించి వారి జీవితాలను చక్కగా తీర్చిదిద్దాలని అన్నారు. నవంబర్ నుంచి 80 లక్షల మంది మహిళలకు రూ.35 వేల కోట్ల సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దీపం–2 పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. రూ. 9వేల కోట్లతో తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మహిళల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. సమాజానికి మహిళలు అపారమైన సేవలు అందించారని వారిని ప్రతిరోజు గౌరవించాలని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా 592 స్వయం సహాయక సంఘాలకు రూ.13.6 కోట్ల చెక్కును, పీఎంఈజీపీ కార్యక్రమం క్రింద 75 స్వయం సహాయక సంఘాలకు రూ.1.95 కోట్ల చెక్కును, రేపల్లె మెప్మా ద్వారా 169 స్వయం సహాయక సంఘాలకు రూ.13.5 కోట్ల చెక్కులను మంత్రులు పంపిణీ చేశారు. వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 33 మంది మహిళలను రాష్ట్ర మంత్రులు సన్మానించారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్, బాపట్ల శాసనసభ్యుడు వేగేశన నరేంద్ర వర్మ, నెడ్ క్యాప్ చైర్మన్ మాణిక్యాలరావు, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రాజశేఖర్‌బాబు, జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి, జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, రేపల్లె ఆర్డీఓ ఎన్.రామలక్ష్మి, రేపల్లె మున్సిపల్ కమిషనర్ కాకర్ల సాంబశివరావు, తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, ఎంపీడీవో ఎం.శోభారాణి తదితరులు పాల్గొన్నారు. స్టాల్స్‌ను ప్రారంభించిన మంత్రులు మహిళలు, అంగన్వాడీలు, స్వయం సహాయక సంఘాల గ్రూపు సభ్యులు, స్వయం ఉపాధి పొందుతున్న మహిళలు ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లను జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో కలసి ప్రారంభించారు. స్వయం సహాయక సభ్యులు ఏర్పాటు చేసిన తినుబండారాలు స్టాళ్లను, చేనేత మహిళలు నేసిన నేత చీరల స్టాల్‌ను, స్వయం ఉపాధి పొందుతున్న మహిళలు తయారు చేసిన జూట్ బ్యాగ్‌లను ఆసక్తిగా తిలకించారు. విద్యార్థినుల కోలాట ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.28.5కోట్ల చెక్కులు పంపిణీ రేపల్లెలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు -
అత్యల్ప ఆదాయం ఉన్న వారిని గుర్తించేందుకే పి–4 సర్వే
జిల్లా కలెక్టర్ వెంకట మురళి రేపల్లె రూరల్: సమాజంలో అత్యల్ప ఆదాయం కలిగిన వారిని గుర్తించి ఆదుకునేందుకు ప్రభుత్వం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోందని జిల్లా కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. పీ–4 సర్వే కార్యక్రమాన్ని పట్టణంలో శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పబ్లిక్ ప్రైవేటు అండ్ పీపుల్స్ పార్టనర్ షిప్ (పీ–4) పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిని గుర్తించి ఆదుకోవటమే సర్వే ముఖ్యోద్దేశమన్నారు. ఈ పథకాన్ని ఉగాది పండుగ నుంచి ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించనున్నదన్నారు. ఉపాధి నాటికి సర్వేను పూర్తి చేసి ప్రభుత్వానికి వివరాలను అప్పగిస్తామన్నారు. బాపట్ల జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సర్వే ప్రారంభించటం ఆలస్యమైందన్నారు. ఫేజ్–2లో 8వ నుంచి 18వ తేదీ వరకు సర్వే జరుగుతుందన్నారు. నిరుపేదలను గుర్తించి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసి జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి పర్యటించి సర్వే నిర్వహిస్తారన్నారు. సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాకర్ల సాంబశివరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆయనకు ఆటే శ్వాస..ప్రాణం
చెరుకుపల్లి: ఆయన ఆటలంటే ప్రాణం. చిన్నతనం నుంచి ఆటల్లో చురుగ్గా పాల్గొనేవాడు. ఆ ఆసక్తితోనే చివరకు వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆరు పదుల వయసులోనూ తరగని ఉత్సాహం ఆయన సొంతం. జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించి పలువురికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు. నిత్య విద్యార్థిగా ప్రతిరోజూ సాధన చేస్తూ ఎందరో విద్యార్థులకు ఆయా క్రీడలలో అత్యుత్తమ శిక్షణ ఇస్తూ ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. చెరుకుపల్లి మండలం పొన్నపల్లి గ్రామానికి చెందిన తుమ్మ శ్రీనివాసరెడ్డి వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. సాధించిన విజయాలు గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 2012లో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో 50 మీటర్ల లాగ్ జంప్‌లో బంగారు పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత పొందాడు. 2013, 2014 సంవత్సరాలలో విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో త్రిపుల్ జంప్ పోటీలలో బంగారు పతకం పొందాడు. 2015లో గుంటూరులో జరిగిన రాష్ట్ర పోటీలలో 400 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, త్రిపుల్ జంప్ విభాగాలలో బంగారు పతకాలు కై వసం చేసుకున్నాడు. గతేడాది మధ్యప్రదేశ్‌లో జరిగిన 37వ జాతీయస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలలో 50 మీటర్ల విభాగం, 100 మీటర్ల విభాగంలో బంగారు పతకం, లాంగ్ జంప్‌లో కాంస్య పతకం సాధించాడు. విద్యార్థులను తీర్చిదిద్దుతూ.. భట్టిప్రోలు మండలం ఐలవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి విద్యార్థులు పతకాలు సాధించేలా తర్ఫీదు నిస్తున్నారు. తాను పనిచేసిన ప్రతి పాఠశాలలో విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. ఆయన పర్యవేక్షణలో శిక్షణ పొందిన ఎందరో విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలలో అనేక పతకాలు సాధించారు. జిల్లా యోగ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీగా శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తూ విద్యార్థులకు ఆటలతోపాటు యోగాసనాలపై శిక్షణ ఇస్తున్నారు. 2013వ సంవత్సరంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దక్కించుకున్నారు. ఆరు పదుల వయస్సులో అలవోకగా విజయాలు విద్యార్థులను ఆణిముత్యాలుగా తీర్చిదిద్దిన వైనం జాతీయ స్థాయిలో పతకాల పంట వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి సాధిస్తున్న విజయాలు తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. తల్లిదండ్రులు, స్నేహితుల ప్రోత్సాహంతో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా. 1998 సంవత్సరంలో పీఈటీగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక మంది విద్యార్థులను క్రీడాకారులుగా తయారు చేయటం ఆనందంగా ఉంది. వీరిలో 357 మంది రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొని పతకాలు సాధించారు. 28 మంది క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ఆంధ్ర జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. – శ్రీనివాసరెడ్డి, పీఈటీ -
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
భయమే కాటేసింది మార్టూరు: మనోవేదనతో పాటు భయం వల్ల ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని వలపర్ల గ్రామంలో శనివారం వెలుగు చూసింది. వలపర్ల ఎస్సీ కాలనీకి చెందిన తాళ్లూరి చిన్న పౌలు (36) తన భార్యతో కలిసి రెండు నెలలుగా నెల్లూరు జిల్లాలో పొగాకు పనుల నిమిత్తం వెళ్లారు. అతను చాలా కాలంగా మానసిక వ్యాధితో బాధ పడుతూ చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో చిన్న పౌలు అనారోగ్యం బారిన పడటంతో భార్య నాలుగు రోజుల కిందట వలపర్ల తీసుకొని వచ్చి వైద్యులకు చూపించగా పసికర్ల వ్యాధిగా గుర్తించి చికిత్స చేస్తున్నారు. రెండు రోజుల కిందట చిన్న పౌలు భార్యతో కలిసి బల్లికురవ మండలం లోని కొణిదెనలో గల ఆమె పుట్టింటికి వెళ్లారు. శుక్రవారం ఒక్కడే బైకుపై వలపర్ల వచ్చి ఇంట్లో ఉన్న బంగారు ఉంగరాన్ని స్థానికంగా తాకట్టు పెట్టి పదివేలు అప్పు తీసుకున్నాడు. అందులో ఐదు వేల రూపాయలు తన తల్లికి ఇచ్చి మిగిలిన రూ. 5 వేలు తనవద్ద ఉంచుకొని గ్రామంలో మద్యంతో పాటు నువాక్రాన్ పురుగుల మందు కొనుగోలు చేశాడు. శుక్రవారం రాత్రి సమీప గ్రామమైన నాగరాజు పల్లి పొలాల్లోకి వెళ్లి రెండూ కలుపుకుని తాగాడు. కొంతకాలంగా భార్యతో.. తనకు భయంగా ఉంటోందని ఆత్మహత్య చేసుకుని చనిపోదామని అనిపిస్తుందనేవాడు. భర్త ప్రవర్తన పట్ల అనుమానంగా ఉన్న అతని భార్య శుక్రవారం వలపర్ల వచ్చి బంధువులతో కలిసి చిన్న పౌలు ఆచూకీ కోసం వెతికినా ఫలితం కనిపించలేదు. శనివారం ఉదయం చిన్న పౌలు మృతదేహాన్ని గుర్తించిన పొలం యజమాని సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగు చూసింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చిన్న పౌలు మృతదేహాన్ని మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించి సాయంత్రం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతునికి ఇద్దరు మగ పిల్లలున్నారు. -
తెగుళ్ల ఘాటు.. రైతుకు చేటు
కారంచేడు: గతేడాది మిరపకు కొంత వరకు మంచి గిట్టుబాటు ఉంది. దీంతో ఈ ఏడాది మిరపను సాగు చేసేందుకు మరికొంత మంది రైతులు ముందుకొచ్చారు. అప్పుల బాధ నుండి గట్టెక్కవచ్చని ఆశించిన రైతన్నలకు ఈ ఏడాది మిరప నష్టాలే మిగిల్చేలా ఉంది. జిల్లాలో సుమారు 54 వేల హెక్టార్ల (1లక్షా 35 వేల ఎకరాలు)లో మిరప సాగు చేశారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో మిరప పంటకు ప్రధానంగా నల్లి తెగుళ్లు, బూడిద తెగులు, పండాకు, కొమ్మ ఎండు తెగుళ్లు వంటివి ఆశించాయి. వీటి వలన దిగుబడులు ఘోరంగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలను కాపాడుకోవడానికి వ్యవసాయాధికారులు, హార్టికల్చర్ అధికారుల సూచనల మేరకు మార్కెట్లో ఎన్ని రకాల నివారణ మందులున్నాయో వాటినన్నింటినీ పిచికారీ చేశామని వాపోతున్నారు. పెరిగిన సాగు ఖర్చులు గతేడాదితో పోల్చుకుంటే భూమి కౌలు నుంచి పంట చేతికందే వరకు అయిన సాగులో ఖర్చులు విపరీతంగా పెరిగాయని రైతులు చెబుతున్నారు. నీటి ఖర్చులు, కోతలకు మొత్తం ఎకరానికి రూ.3 లక్షలకు పైగా ఖర్చు చేశామని రైతులు చెబుతున్నారు. గణనీయంగా తగ్గిన దిగుబడులు గతేడాదితో పోల్చుకుంటే మిరపలో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ఎకరానికి 15–20 క్వింటాళ్ల దిగుబడి వస్తే అందుకు తగ్గట్లుగానే క్వింటా బస్తా ధర రూ.17–18 వేల వరకు వచ్చింది. ఈ ఏడాది ఎకరానికి 5–15 బస్తాలకు మించి దిగుబడులు వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం మార్కెట్ ధర కూడా రూ.12వేలు మాత్రమే ఉంది. అంటే సగటున ఎకరానికి రైతులు 15 బస్తాల దిగుబడి వస్తే కనీసం రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షలు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధరలపైనే ఆశలు.. గతేడాది ప్రభుత్వం మిరప పంటకు మంచి గిట్టుబాటు ధరలు కల్పించింది. గ్రామాల్లో వారు సాగు చేసిన చేల వద్దకు వచ్చిన వ్యాపారులు క్వింటాకు రూ.18000 వరకు ఇచ్చి కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఇప్పటికి రూ.12000కు మించి రావడం లేదు. ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు రూ.11,800 ప్రకటిస్తే, ఇక దళారులు, వ్యాపారులు ఎవరు వచ్చి కొంటారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం కనీస గిట్టుబాటు ధర రూ.18000కు పెంచితేనే వ్యాపారుల నుంచి పోటీ వస్తుందని, అప్పుడే రైతుకు గిట్టుబాటు అవుతుందని అంటున్నారు. వాతావరణ మార్పులతోనే మిరపకు తెగుళ్లు దిగుబడులపై నీలినీడలు.. తల్లడిల్లుతున్న రైతన్న జిల్లాలో 1.35 లక్షల ఎకరాల్లో మిరప సాగు ఎకరానికి రూ.1.2 లక్షలు నష్టం వచ్చే అవకాశం -
మాజీ సీఎం దిష్టిబొమ్మ దహనం అమానుషం
పర్చూరు(చినగంజాం): రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిష్టిబొమ్మను తగులబెట్టడం అమానుష చర్య అని వైఎస్సార్ సీపీ దళిత నాయకుడు గేరా స్వరాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం సాయంత్రం పర్చూరు బొమ్మల సెంటర్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిష్టిబొమ్మను జనసేన పార్టీ నాయకులు తగులబెట్టడంపై ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. శనివారం విలేకరులతో మాట్లాడారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జగన్మోహనరెడ్డిని విమర్శించిన తరువాత మాత్రమే ఆయన ప్రతి విమర్శ చేశారని, కానీ ఆయన చేసిన విమర్శ వాస్తవమేనన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఒకే ఒక్కడు పోరాటం చేసి ముఖ్యమంత్రి కాగలిగాడని, కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు ప్రజారాజ్యం పార్టీతో మొదలు పెట్టి వెనుదిరిగారని, జనసేన పార్టీని స్థాపించిన దగ్గర నుంచి ముందుగా బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారని తెలిపారు. తరువాత సీపీఎం, సీపీఐలతో పొత్తు, అటు తరువాత బీజేపీ, తదుపరి టీడీపీలతో పొత్తులు పెట్టుకొని, ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేని పరిస్థితుల్లో ఆయన కూటమి కట్టి ఎంఎల్ఏ ఆయ్యారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శను సద్విమర్శగా తీసుకొని ఒంటరిగా పోటీ చేసి గెలుపును సాధించాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ఓడిపోయినప్పటికీ 40 శాతం ఓట్లు సాధించగలిగిన పార్టీ అన్నారు. కూరాకుల కిరణ్, నలిగల ప్రభుకుమార్, పి. జయకృష్ణ, కాకులూరి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
ఫార్మసీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
బాపట్ల: మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే నిజమైన స్వేచ్ఛా, స్వాతంత్య్రం వచ్చినట్లుగా భావించాలని బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. అపోలో స్పెక్టర్ చీరాల వారి సౌజన్యంతో బాపట్ల కాలేజీ ఆఫ్ ఫార్మసీలో ఉచిత మెడికల్ క్యాంపు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం శనివారం నిర్వహించారు. డాక్టర్ ముప్పలనేని మాట్లాడుతూ మహిళలు తమ హక్కులను సాధించేందుకు ఐక్యంగా నిలబడాలని సూచించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ నిరుపమ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. భావితరాలకు మంచి పౌరులను అందించే అవకాశం సీ్త్రలకే ఉందని, ఇంట్లో తమ పిల్లలను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చదివించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ టి.ఈ.జి కే.మూర్తి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
మహిళాభివృద్ధితోనే దేశ అభ్యున్నతి
● సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు ● చట్టాలపై మహిళలకు అవగాహన తప్పనిసరి ● బాల్య వివాహాలు నేరం రేపల్లె రూరల్: మహిళాభివృద్ధితోనే దేశ అభ్యున్నతి సాధ్యమని సీనియర్ సివిల్ జడ్జి ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలకు శుక్రవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. మహిళలు ప్రస్తుతం అంతరిక్షాన్ని చుట్టి వచ్చేంత ఎత్తు ఎదిగారని తెలిపారు. అన్ని రంగాలలో పురుషులతో పోటీ పడుతూ తమదైన శైలిలో రాణిస్తున్నారని పేర్కొన్నారు. ఎంతో ఉన్నతస్థితిలో ఉన్నా మహిళలు సమాజంలో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, వీటిని జయించాలంటే తప్పనిసరిగా చట్టాలపై అవగాహన ఉండాలని ఆయన సూచించారు. మైనార్టీ తీరే వరకు వివాహాలు చేయరాదని తల్లిదండ్రులకు సూచించారు. మహిళలను ఇంట్లో గానీ, ఉద్యోగం చేసేచోట గానీ మానసికంగా, లైంగికంగా ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధిత మహిళలు న్యాయస్థానాల్లో నిర్భయంగా సహాయం పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు అవసరమైన పోస్కో, గృహ హింస, బాల్య వివాహాల నిరోధం, వరకట్న నిషేధ చట్టాలతో పాటు పలు మహిళా సంరక్ష చట్టాలపై ఆయన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీడీపీవో ఎం.సుచిత్ర, న్యాయవాదులు కొండపల్లి శ్రీనివాసరావు, డీఎస్ హరికుమార్, మోషే, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీలు పాల్గొన్నారు. -
విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఇన్విజిలేటర్‌కు దేహశుద్ది
● ఎంబీఏ చదువుతున్న వ్యక్తికి ఇన్విజిలేటర్ బాధ్యతలు ● సంజాయిషీ కోరిన ఆర్ఐఓ గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పరీక్షలు రాస్తున్న ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఇన్విజిలేటర్‌కు తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ప్రకాశం జిల్లా దర్శి మండలానికి చెందిన విద్యార్థిని గుంటూరులోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాల హాస్టల్లో ఉండి చదువుతోంది. ఈనెల 3 నుంచి పొన్నూరు రోడ్డులోని ఓ ప్రైవేటు కళాశాల పరీక్షా కేంద్రంలో సీనియర్ ఇంటర్ పరీక్షలకు హాజరవుతోంది. విద్యార్థిని పరీక్ష రాస్తున్న గది ఇన్విజిలేటర్‌గా వ్యవహరిస్తున్న యువకుడు పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం, ఫోన్ నంబర్ ఇవ్వాలంటూ అడగడం చేశాడు. దీంతో మనస్ధాపం చెందిన విద్యార్థిని తాను చదువుతున్న కళాశాల యాజమాన్యం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లింది. కళాశాల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ యువకుడిని రెండు రోజుల క్రితం పోలీసులు తీవ్రంగా మందలించారు. అదే రోజు అతన్ని ఇన్విజిలేషన్ విధుల నుంచి అధికారులు తొలగించారు. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం పరీక్ష కేంద్రం వద్దకు చేరుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు చీఫ్ సూపరింటెండెంట్‌తోపాటు కళాశాల ప్రిన్సిపాల్‌తో మాట్లాడి యువకుడిని కళాశాలకు పిలిపించారు. అతడికి దేహశుద్ధి చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో ఓ ప్రైవేటు కళాశాలలో ఎంబీఏ చదువుతున్న వ్యక్తిని అధికారులు ఇన్విజిలేటర్‌గా నియమించడం గమనార్హం. ఈ విషయం ఆర్ఐవో జీకే జుబేర్ దృష్టికి వెళ్లడంతో ఎంబీఏ విద్యార్థిని ఇన్విజిలేటర్‌గా నియమించడంపై చీఫ్ సూపరిండెంట్‌ను సంజాయిషీ కోరారు. -
అపరాల రైతులు పేర్లు నమోదు తప్పనిసరి
జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ కరుణశ్రీ చెరుకుపల్లి: అపరాలు అమ్ముకునే రైతులు ముందుగా గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని బాపట్ల జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ కె. కరుణశ్రీ సూచించారు. ఆమె శుక్రవారం మండల వ్యవసాయాధికారులతో కలసి ఆరుంబాక, గూడవల్లి, నడింపల్లి గ్రామాల్లో పర్యటించారు. పెసర పంట దిగుబడులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రబీ సీజన్లో బాపట్ల జిల్లాలో 58,790 హెక్టార్లలో రైతులు అపరాల సాగు చేశారని వెల్లడించారు. ఇందులో శనగలు 15,657 హెక్టార్లు, మినుములు 21,109 హెక్టార్లు, పెసలు 7,405 హెక్టార్లలో సాగు చేసినట్లు వివరించారు. శనగలను క్వింటా రూ. 5,650, మినుములు రూ. 7,400, పెసలు రూ. 8,682 చొప్పున రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేస్తారని ఆమె తెలిపారు. రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె రైతులకు సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అవ్వారు మహేష్ బాబు, వీఏఏలు, రైతులు పాల్గొన్నారు. -
మహిళలు ధైర్యంగా మెలగాలి
నగరంపాలెం(గంటూరు వెస్ట్): అన్ని వేళల్లో మహిళలు ధైర్యంగా ఉండాలని జిల్లా ఏఎస్పీ కె.సుప్రజ (క్రైం) అన్నారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం పోలీస్ కవాతు మైదానంలో ఓపెన్‌హౌస్ నిర్వహించారు. జిల్లా ఏఎస్పీ సుప్రజ మాట్లాడుతూ మహిళలు తమ లక్ష్యాలను ఛేదించాలని అన్నారు. తద్వారా నలుగురికి ఆదర్శంగా నిలవాలని చెప్పారు. సీ్త్రలు లేనిదే జననం లేదని పేర్కొన్నారు. అనంతరం విద్యార్ధినీలకు ఆయుధాల పనితీరుపై మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ సుబ్బారావు, సిబ్బంది అవగాహన కల్పించారు. కొత్తపేట పీఎస్ పరిధిలోని శ్రీజలగం రామా రావు మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో మహిళా సాధికారత ర్యాలీ, పాతగుంటూరు పీఎస్ పరిధిలోని యాదవ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు, ఎస్ఐలు రమేష్ (కొత్తపేట పీఎస్), వెంకటేశ్వర్లు (పాతగుంటూరు పీఎస్) పాల్గొన్నారు. జిల్లా ఏఎస్పీ కె.సుప్రజ (క్రైం) -
వైభవంగా రామలింగేశ్వరస్వామి కల్యాణోత్సవాలు ప్రారంభం
చుండూరు(వేమూరు): చుండూరు మండలంలోని చినపరిమిలో శుక్రవారం శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణోత్సవాలు వైభవంగా ప్రారంభించినట్లు ఈవో ఈమని అశోక్‌రెడ్డి తెలిపారు. ఉత్సవాలను 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున ధ్వజారోహణ, రాత్రి 9.30 గంటలకు విఘ్నేశ్వర పూజతో ఉత్సవాలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 12న స్వామి కల్యాణం, 13న అన్నసమారాధన ఉంటుందని ఆయన తెలిపారు. భక్తులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కుక్కల దాడిలో 12 గొర్రెలు మృతి మార్టూరు: కుక్కలు దాడి చేసి గొర్రెలను చంపిన సంఘటన మండలంలోని ద్రోణాదులలో గురువారం అర్ధరాత్రి జరిగింది. బాధితుడు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక బీసీ కాలనీకి చెందిన రాగినీడి గంగయ్య గొర్రెలను కోలలపూడి రోడ్డులోని తడికెల షెడ్డులో ఉంచి నిద్ర పోయాడు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో కొన్ని కుక్కలు షెడ్డులో దూరి విచక్షణారహితంగా గొర్రెలపై దాడి చేశాయి. గంగయ్య మేల్కొని కుక్కలను తరిమివేసే లోపే 12 గొర్రెలను చంపేశాయి. వాటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని బాధితుడు వాపోయాడు. ఏడు నెలల కిందట ఇదే షెడ్డులో ఐదు గొర్రెలను కుక్కలు దాడి చేసి చంపినట్లు గంగయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. కారు ఢీ.. వ్యవసాయ కూలీ మృతి బల్లికురవ: పొలం పనులు ముగించుకుని రోడ్డు దాటుతున్న వ్యవసాయ కూలీని వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం కొప్పరపాడు, వినుకొండ ఆర్ అండ్ బీ రోడ్డులోని ఆర్కే వైన్స్ సమీపంలో జరిగింది. మండలంలోని గొర్రెపాడు గ్రామానికి చెందిన జండ్రాజుపల్లి పున్నబాబు (44) పొలం పనులు ముగించుకుని రోడ్డు పైకి వచ్చాడు. ఈ సమయంలో వినుకొండ నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టంతో బలమైన గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. కుటుం సభ్యుల ఫిర్యాదు మేరకు బల్లికురవ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పొస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
అపరాల రైతులు పేర్లు నమోదు తప్పనిసరి
జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ కరుణశ్రీ చెరుకుపల్లి: అపరాలు అమ్ముకునే రైతులు ముందుగా గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని బాపట్ల జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ కె. కరుణశ్రీ సూచించారు. ఆమె శుక్రవారం మండల వ్యవసాయాధికారులతో కలసి ఆరుంబాక, గూడవల్లి, నడింపల్లి గ్రామాల్లో పర్యటించారు. పెసర పంట దిగుబడులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రబీ సీజన్లో బాపట్ల జిల్లాలో 58,790 హెక్టార్లలో రైతులు అపరాల సాగు చేశారని వెల్లడించారు. ఇందులో శనగలు 15,657 హెక్టార్లు, మినుములు 21,109 హెక్టార్లు, పెసలు 7,405 హెక్టార్లలో సాగు చేసినట్లు వివరించారు. శనగలను క్వింటా రూ. 5,650, మినుములు రూ. 7,400, పెసలు రూ. 8,682 చొప్పున రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేస్తారని ఆమె తెలిపారు. రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె రైతులకు సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అవ్వారు మహేష్ బాబు, వీఏఏలు, రైతులు పాల్గొన్నారు. -
వీఐటీలో విటోపియా క్రీడా సాంస్కృతిక ఉత్సవం ప్రారంభం
తాడికొండ: విద్యతో పాటు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అవసరమని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ అన్నారు. వీఐటీ–ఏపీ విశ్వవిద్యాలయంలో విటోపియా–2025 వార్షిక క్రీడలు, సాంస్కృతిక ఉత్సవం శుక్రవారం ప్రారంభమైంది. ముఖ్య అతిధిగా తాడికొండ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ క్రీడలు మానసికాభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు.వీఐటీ వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్, వీఐటి–ఏపి విశ్వ విద్యాలయ వైస్ చాన్సలర్ డాక్టర్ కోటా రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ప్రగతిని వివరించారు. మూడేళ్లుగా అవుట్ లుక్ ర్యాకింగ్స్లో అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కేటగిరిలో దేశంలోనే ప్రథమస్థానంలో వీఐటీ ఉందని వెల్లడించారు. సాయంత్రం జరిగిన ప్రొ–షోలో సెహరి బ్యాండ్, స్వరాగ్ బ్యాండ్, డీజే పరోమాల సంగీత విభావరి అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి, డాక్టర్ కృష్ణసామి (విటోపియా కన్వీనర్), డాక్టర్ ఖాదీర్ పాషా (స్టూడెంట్ వెల్ఫేర్ డెప్యూటీ డైరెక్టర్) పాల్గొన్నారు. -
చట్టసభల్లో సగం వాటాతోనే మహిళల అభ్యున్నతి
కలెక్టర్ జె.వెంకట మురళి బాపట్ల: చట్టసభలలో 50 శాతం మహిళలు వచ్చినప్పుడే అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ జేఎసీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో వేడుకలు నిర్వహించారు. మహిళా ఉద్యోగులకు వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహించారు. లెమన్ అండ్ స్పూన్, గోనె సంచులతో పరుగు పందెం, టగ్ ఆఫ్ వార్, స్పీడ్ వాక్, మ్యూజికల్ చైర్స్ వంటి పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలను కలెక్టర్ సందర్శించారు. ఉత్సాహంగా పాల్గొన్న ఉద్యోగినులను ఆయన అభినందించారు. అనంతరం మహిళా అధికారులు ఆర్డీఓ పి. గ్లోరియా, జిల్లా ఖజానా శాఖ అధికారి కామేశ్వరి, జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి కె. సుభాషిణి, సీడీపీఓ లక్ష్మీపార్వతిలను ఆయన ఏపీ జేఏసీ నాయకులతో కలసి ఘనంగా సన్మానించారు. పోటీలలో పాల్గొన్న ఉద్యోగులందరికీ ప్రోత్సాహక బహుమతులను అందించారు. అనంతరం మాట్లాడుతూ మహిళలపై లింగ వివక్ష లేకుండా ప్రతి కుటుంబంలో చిన్నారులను నైతిక విలువలతో పెంచాలని చెప్పారు. అప్పుడే సమాజంలో అత్యాచారాలు జరగకుండా నివారించగలమని తెలిపారు. ఇంటి నుంచే లింగ వివక్షతను ఆరికట్టాలని సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉన్నాయని జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్ గౌడ్ చెప్పారు. మహిళలను చిన్నచూపు చూడరాదని చెప్పారు. పోటీలలో ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలిచిన విజేతలకు ప్రభుత్వం నిర్వహించే మహిళా దినోత్సవం వేడుకలలో బహుమతులను అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఓ శ్రీనివాస్, డీఎస్డీఓ కె. పాల్ కుమార్, ఏపీ జేఏసీ చైర్మన్ సురేష్, మహిళ విభాగం చైర్ పర్సన్ రజిని పాల్గొన్నారు. -
మహిళాభివృద్ధితోనే దేశ అభ్యున్నతి
● సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు ● చట్టాలపై మహిళలకు అవగాహన తప్పనిసరి ● బాల్య వివాహాలు నేరం రేపల్లె రూరల్: మహిళాభివృద్ధితోనే దేశ అభ్యున్నతి సాధ్యమని సీనియర్ సివిల్ జడ్జి ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలకు శుక్రవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. మహిళలు ప్రస్తుతం అంతరిక్షాన్ని చుట్టి వచ్చేంత ఎత్తు ఎదిగారని తెలిపారు. అన్ని రంగాలలో పురుషులతో పోటీ పడుతూ తమదైన శైలిలో రాణిస్తున్నారని పేర్కొన్నారు. ఎంతో ఉన్నతస్థితిలో ఉన్నా మహిళలు సమాజంలో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, వీటిని జయించాలంటే తప్పనిసరిగా చట్టాలపై అవగాహన ఉండాలని ఆయన సూచించారు. మైనార్టీ తీరే వరకు వివాహాలు చేయరాదని తల్లిదండ్రులకు సూచించారు. మహిళలను ఇంట్లో గానీ, ఉద్యోగం చేసేచోట గానీ మానసికంగా, లైంగికంగా ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధిత మహిళలు న్యాయస్థానాల్లో నిర్భయంగా సహాయం పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు అవసరమైన పోస్కో, గృహ హింస, బాల్య వివాహాల నిరోధం, వరకట్న నిషేధ చట్టాలతో పాటు పలు మహిళా సంరక్ష చట్టాలపై ఆయన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీడీపీవో ఎం.సుచిత్ర, న్యాయవాదులు కొండపల్లి శ్రీనివాసరావు, డీఎస్ హరికుమార్, మోషే, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీలు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మికతకు నెలవు జుమ్మా మసీదు
● 160 ఏళ్ల చరిత్ర కలిగిన భట్టిప్రోలు జుమ్మా మసీదు ● ఉమ్మడి జిల్లాలో గుంటూరు తర్వాత ఒక్క భట్టిప్రోలులోనే మసీదు భట్టిప్రోలు: స్థానిక గర్డర్ బ్రిడ్జి రహదారిలోని జుమ్మా మసీదుకు ఎంతో ఘన చరిత్ర ఉంది. 160 సంవత్సరాల కిందట జమాలుద్దీన్ నిర్మించారు. ఆ కాలంలో ఉమ్మడి జిల్లాలో గుంటూరు తర్వాత ఒక్క భట్టిప్రోలులోనే మసీదు ఉండేది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ముస్లింలు నమాజు చేసుకునేందుకు ఇక్కడకు గుర్రాలపై తరలి వచ్చేవారని పెద్దలు చెబుతున్నారు. నమాజుకు వచ్చిన వారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేసేవారని తెలిపారు. మసీదుకు ఎదురుగా ఉన్న గదుల్లో ప్రార్థన చేసేందుకు వచ్చేవారు ఒకప్పుడు విశ్రాంతి తీసుకునేవారు. గుర్రాలు నిలిపేందుకు ఈ భవనం కింద దారి ఉండేది. ఇప్పుడు అక్కడ దుకాణాలు వెలిశాయి. ఈ మసీదు ఏర్పడ్డాకే ఆయా జిల్లాలోని అన్ని ప్రాంతాలలో నెలకొల్పారు. నాటి నుంచి క్రమం తప్పకుండా ఐదు పూటలా నమాజులు, ప్రత్యేక ప్రార్థనలు జరుగుతూ వస్తున్నాయి. రంజాన్ మాసంలో ఉపవాసాలతో పాటు తరాబే నమాజులు జరుగుతాయి. ప్రత్యేకతను సంతరించుకుంటున్న ఈద్గాలు ముస్లింలు ప్రత్యేక నమాజులు చేసుకునేందుకు ఈద్గాల ప్రదేశం ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. కఠోర ఉపవాస దీక్షలను నిర్వహిస్తున్న ముస్లింలు ప్రతి నిత్యం మసీదులకు చేరుకుని, పూర్తి సమయాన్ని ప్రార్థనలతో గడుపుతూ ఆధ్యాత్మిక లోకంలో గడుపుతారు. ప్రతి ఏడాది పండుగ రోజున ప్రత్యేక నమాజు చేసే సందర్భంగా ముస్లింలు ఎంతో వ్యయాన్ని వెచ్చించి ఈద్గా ప్రాంతాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుతారు. రంజాన్ మాసాన్ని ముస్లింలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. మండలంలోని అద్దేపల్లి, భట్టిప్రోలు, పల్లెకోన, వేమవరం, వెల్లటూరులోనూ మసీదులు ఉన్నాయి. -
1,22,426 బస్తాలు మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం 1,11,958 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,22,426 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 44,470 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. -
విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఇన్విజిలేటర్‌కు దేహశుద్ది
● ఎంబీఏ చదువుతున్న వ్యక్తికి ఇన్విజిలేటర్ బాధ్యతలు ● సంజాయిషీ కోరిన ఆర్ఐఓ గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పరీక్షలు రాస్తున్న ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఇన్విజిలేటర్‌కు తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ప్రకాశం జిల్లా దర్శి మండలానికి చెందిన విద్యార్థిని గుంటూరులోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాల హాస్టల్లో ఉండి చదువుతోంది. ఈనెల 3 నుంచి పొన్నూరు రోడ్డులోని ఓ ప్రైవేటు కళాశాల పరీక్షా కేంద్రంలో సీనియర్ ఇంటర్ పరీక్షలకు హాజరవుతోంది. విద్యార్థిని పరీక్ష రాస్తున్న గది ఇన్విజిలేటర్‌గా వ్యవహరిస్తున్న యువకుడు పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం, ఫోన్ నంబర్ ఇవ్వాలంటూ అడగడం చేశాడు. దీంతో మనస్ధాపం చెందిన విద్యార్థిని తాను చదువుతున్న కళాశాల యాజమాన్యం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లింది. కళాశాల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ యువకుడిని రెండు రోజుల క్రితం పోలీసులు తీవ్రంగా మందలించారు. అదే రోజు అతన్ని ఇన్విజిలేషన్ విధుల నుంచి అధికారులు తొలగించారు. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం పరీక్ష కేంద్రం వద్దకు చేరుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు చీఫ్ సూపరింటెండెంట్‌తోపాటు కళాశాల ప్రిన్సిపాల్‌తో మాట్లాడి యువకుడిని కళాశాలకు పిలిపించారు. అతడికి దేహశుద్ధి చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో ఓ ప్రైవేటు కళాశాలలో ఎంబీఏ చదువుతున్న వ్యక్తిని అధికారులు ఇన్విజిలేటర్‌గా నియమించడం గమనార్హం. ఈ విషయం ఆర్ఐవో జీకే జుబేర్ దృష్టికి వెళ్లడంతో ఎంబీఏ విద్యార్థిని ఇన్విజిలేటర్‌గా నియమించడంపై చీఫ్ సూపరిండెంట్‌ను సంజాయిషీ కోరారు. -
అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు
కర్లపాలెం: నేడు మహిళలు బహుముఖ ప్రజ్ఞాశాలులై అన్ని రంగాలలో రాణిస్తున్నారని రెడ్‌క్రాస్ సొసైటీ కర్లపాలెం మండల అధ్యక్షుడు ఇనకొల్లు పోలీస్రావు చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ కార్యాలయంలో ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తహసీల్దార్ సుందరమ్మ, ఎంఈవో విజయశ్రీ , మండల పరిషత్ సూపరిండెంట్ రజని, జూనియర్ అసిస్టెంట్ కల్యాణిలను రెడ్‌క్రాస్ సంస్థ సభ్యులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మహిళలు మహరాణులని, ఊయలలు ఊపిన చేతులతో ప్రపంచాన్ని పాలించగలరని చెప్పారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ మండల ఉపాధ్యక్షుడు మందపాటి పరమానందకుమార్ పాల్గొన్నారు. -
మహిళలు ధైర్యంగా మెలగాలి
నగరంపాలెం(గంటూరు వెస్ట్): అన్ని వేళల్లో మహిళలు ధైర్యంగా ఉండాలని జిల్లా ఏఎస్పీ కె.సుప్రజ (క్రైం) అన్నారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం పోలీస్ కవాతు మైదానంలో ఓపెన్‌హౌస్ నిర్వహించారు. జిల్లా ఏఎస్పీ సుప్రజ మాట్లాడుతూ మహిళలు తమ లక్ష్యాలను ఛేదించాలని అన్నారు. తద్వారా నలుగురికి ఆదర్శంగా నిలవాలని చెప్పారు. సీ్త్రలు లేనిదే జననం లేదని పేర్కొన్నారు. అనంతరం విద్యార్ధినీలకు ఆయుధాల పనితీరుపై మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ సుబ్బారావు, సిబ్బంది అవగాహన కల్పించారు. కొత్తపేట పీఎస్ పరిధిలోని శ్రీజలగం రామా రావు మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో మహిళా సాధికారత ర్యాలీ, పాతగుంటూరు పీఎస్ పరిధిలోని యాదవ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు, ఎస్ఐలు రమేష్ (కొత్తపేట పీఎస్), వెంకటేశ్వర్లు (పాతగుంటూరు పీఎస్) పాల్గొన్నారు. జిల్లా ఏఎస్పీ కె.సుప్రజ (క్రైం) -
బబ్బేపల్లి కొండపై మంటలు ఆర్పివేత
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేష్ మార్టూరు: మండలంలోని బబ్బేపల్లి గ్రామ కొండపై గురువారం రాత్రి ఎగిసిన మంటలు సహజంగా ఏర్పడినవేనని కూకట్లపల్లి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేష్ తెలిపారు. ఆయన శుక్రవారం మధ్యాహ్నం సిబ్బందితో కొండపైకి వెళ్లి పరిశీలించారు. గతంలో గ్రావెల్ తవ్వకాలు జరిపిన గుంతల్లో ఎండిన చెట్ల కొమ్మలతోపాటు కొండ పరిసరాల్లో భూమి సాగు చేస్తున్న కొంతమంది రైతుల పొలాల్లో వ్యర్థాలు గాలికి కొట్టుకు వచ్చి పేరుకుపోయాయని తెలిపారు. ఎవరో విసిరిన బీడీ లేదా సిగరెట్ వల్ల మంటలు ఏర్పడి కొండపై కొంతమేర వ్యాపించాయని వివరించారు. కొండపై చెట్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెప్పారు. అక్కడక్కడా కొద్దిపాటి పొగలతో వ్యాపిస్తున్న మంటలను సిబ్బందితో కలసి ఆర్పి వేసినట్లు తెలిపారు. ఫారెస్ట్ భూమిలో సాగు చేస్తున్న రైతులు పంటకాలం పూర్తయ్యాక వ్యర్థాలను వారే తొలగించాలని, భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి ఏర్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
మహిళా ఫిర్యాదుల విండోకు విశేష స్పందన
57 ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం నగరంపాలెం: మహిళా దినోత్సవం సందర్భంగా చేపట్టిన మహిళా ఫిర్యాదుల విండోకు విశేష స్పందన లభించిందని ట్రైనీ ఐపీఎస్ అధికారిణి దీక్ష చెప్పారు.ఎస్పీ సతీష్‌కుమార్ నేతృత్వంలో గురువారం జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్స్టేషన్లలో మహిళా ఫిర్యాదుల విండో కార్యక్రమాన్ని నిర్వహించారు. చి మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది ఫిర్యాదులు స్వీకరించారు. కొన్ని ఫిర్యాదులను కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా 64 మంది మహిళలు ఫిర్యాదులివ్వగా, అందులో 57 సమస్యలను తక్షణం పరిష్కరించినట్టు అధికారులు చెప్పారు. ఈ సదర్భంగా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి దీక్ష మాట్లాడుతూ ప్రత్యేక ఫిర్యాదుల విండో మంచి కార్యక్రమమని పేర్కొన్నారు. దివ్యాంగుల బదిలీల్లో వెసులుబాటు కల్పించండి గుంటూరు వెస్ట్: ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో దివ్యాంగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్లయ్య కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో ఈ మేరకు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎల్లయ్య మాట్లాడుతూ 40 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులను ప్రాధాన్య క్రమంలో చేర్చి బదిలీలు నిర్వహించాలన్నారు. 70 శాతం పైబడి ఉన్న వారికి బదిలీల నుంచి మినహాయింపునివ్వాలని ఒకవేళ వారు కోరుకుంటే మొదటి ప్రాధాన్యత వారికే ఇవ్వాలని కోరారు. 2025లో రూపొందించిన ఉపాధ్యాయ బదిలీ చట్టంలోని దివ్యాంగులకు ఇబ్బందికరంగా ఉన్న అంశాలను తొలగించాలన్నారు. మనస్తాపంతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య పెదకూరపాడు: చదువుకోవటం నాకు ఇష్టం లేదు... నన్ను బలవంతం పెట్టకండి.. నేను హాస్టల్‌కి వెళ్లను. ఇంటివద్ద ఉంటాను... అంటూ విద్యార్థి చెప్పడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని పంట పొలంలోని పురుగులు మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలోని జలాలపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. జలాలపురం గ్రామానికి చెందిన మన్నవ శరీలు, చిట్టెమ్మల కుమార్తె మన్నవ జోష్ రాణి (17) నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సెలవులకు స్వగ్రామం జలాలపురం వచ్చింది. సెలవులు అనంతరం కళాశాలకు వెళ్లకపోవటంతో తల్లి మందలించింది. చదువు ఇష్టం లేదని జోష్ రాణి చెప్పటంతో కళాశాలకు వెళ్లక పోతే నాతో పాటు వ్యవసాయ పనులకు రావాలని ఒత్తిడి చేయటంతో రెండు రోజులపాటు తల్లితో కలిసి మిరప కోత పనులకు వెళ్లింది. ఈ క్రమంలో బుధవారం మిర్చి కోతలు కోస్తున్న పంట పొలంలో రైతు దాచుకున్న పురుగులు మందును తాగింది. వాంతులు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను సత్తెనపల్లి ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. -
1,22,426 బస్తాలు మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం 1,11,958 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,22,426 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 44,470 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. -
రుణం ప్రాణం తీసింది
అద్దంకి రూరల్: అప్పుల బాధతో మనోధైర్యాన్ని కోల్పోయి ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరి వేసుకుని ఓ కూలీ చనిపోయాడు. ఈ సంఘటన శుక్రవారం అద్దంకి మండలంలో చోటుచేసుకుంది. ఈమేరకు మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఎస్సై ఖాదర్‌బాషా కేసు నమోదు చేశారు. తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన ధనరాజుపల్లి కోటేశ్వరరావు (37) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాది కిందట ప్రైవేటు ఫైనాన్స్‌లో ఇంటిపై రుణం తీసుకున్నాడు. ఆ ఆప్పు కట్టలేక పోతున్నానని భార్యతో చెప్పుకొని తీవ్ర మనోవేదన పడుతుండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా వేలాడుతున్నాడు. కొన ఊపిరితో ఉన్న కోటేశ్వరరావును అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, ఒక అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలలో ఉంచారు. అప్పుల బాధతో కూలీ ఆత్మ హత్య -
మోటుపల్లి ప్రాశస్త్యాన్ని వెలుగులోకి తీసుకురావాలి
బాపట్ల: మోటుపల్లి ప్రాచీన ప్రాశస్త్యాన్ని వెలుగులోకి తెస్తూ పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. మోటుపల్లి గ్రామం, మ్యూజియం నిర్మాణం, వీరభద్రస్వామి దేవస్థానం అభివృద్ధి కమిటీ సమావేశం స్థానిక కలెక్టర్ చాంబర్లో శుక్రవారం నిర్వహించారు. కాకతీయులనాటి అభయ శాసనాలను తెలుగులోకి అనువదిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ఇప్పటికే పురావస్తు శాఖ పరిశోధకులు, శాసనాల పరిశోధకుల ద్వారా ఆ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ప్రాచీన వైభవం తెచ్చేలా కోదందరామ ఆలయం అభివృద్ధి చేస్తామన్నారు. కోదండరామ దేవాలయానికి సమీపంలోని 5.8 ఎకరాల భూమిని ఆలయానికి కేటాయించాలన్నారు. ఆ భూమికి సంబంధించిన దస్త్రాలు, వివరాలను సీసీఎల్ఏకు నివేదించాలన్నారు. చినగంజాం మండలంలోని ఆ గ్రామంలో తుపాను షెల్టర్ ఎదురుగా ఉన్న 4.5 ఎకరాల ఖాళీ భూమిని విచారించాలన్నారు. సమీపంలోని 10.9 ఎకరాల భూమిని కోదండరామ స్వామి దేవాలయానికి కేటాయించే అంశంపై దృష్టి సారించాలన్నారు. 100 ఎకరాల పరిధిలోని బయోడైవర్సిటీ భూమిని పరిశీలించాలన్నారు. కాకతీయులు, చోళరాజుల నాటి శాసనాలు, పంచలోహాలను చిన్నగంజాంలోనే భద్రపరచడానికి మ్యూజియం నిర్మించాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. మ్యూజియం నిర్మాణంపై పురావస్తు శాఖకు సమగ్ర నివేదికతోపాటు లేఖ పంపాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతానికి చెందిన ప్రాచీన సంపద ప్రస్తుతం హైదరాబాద్, చైన్నె, విజయవాడ మ్యూజియంలలో ఉందన్నారు. వాటిని తెప్పించడానికి దస్త్రాలను సిద్ధం చేయాలన్నారు. ప్రాచీన కాలం నాటి బుద్ధుడి విగ్రహాన్ని భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. డీఆర్వో జి గంగాధర్‌గౌడ్, చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ సూర్యప్రకాశరావు, శాసనాల పరిశోధకులు డాక్టర్ బి రమేష్‌చంద్రబాబు, ఫోరం ఫర్ బెటర్ బాపట్ల సంస్థ అధ్యక్షులు డాక్టర్ సాయిబాబు పాల్గొన్నారు. గురుకుల పాఠశాలలో మౌలిక వసతి కల్పించాలి డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. నర్సాయపాలెంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల అభివృద్ధిపై అనుబంధ శాఖల అధికారులతో శుక్రవారం ఆయన స్థానిక కలెక్టర్ చాంబర్లో సమావేశం నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన రూ.3.5 లక్షలతో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నారు. 24 మరుగుదొడ్లు నిర్మించేలా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌కు దస్త్రం పంపాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పాఠశాలకు వంటగది, విద్యార్థుల కొరకు భోజనశాల ఏర్పాటు చేయాలన్నారు. క్రీడా మైదానాన్ని చదును చేయడానికి స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారం తీసుకోవాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అనంతరాజు, సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీ నాగిరెడ్డి, పంచాయతీరాజ్ ఇన్చార్జి ఎస్ఈ గౌడిపేరి రతన్ బాబు, పాఠశాల ప్రధానాచార్యులు పాల్గొన్నారు. జనరిక్ మెడికల్ షాపుపై ప్రజల్లో అపోహలు వద్దు జనరిక్ మెడికల్ షాపులపై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక టీచర్స్ కాలనీలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ పరియోజన మందుల షాపును కలెక్టర్ ప్రారంభించారు. బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సలగల రాజశేఖర్‌బాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ ఉన్నారు.జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి పక్కా గృహాల నిర్మాణంలో లక్ష్యాలు చేరుకోవాలి పక్కా గృహాల నిర్మాణంలో ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోడానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. గృహ నిర్మాణాలపై సంబంధిత శాఖ అధికారులతో శుక్రవారం ఆయన స్థానిక కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. మొదటి త్రైమాసికంలో బాపట్ల జిల్లాకు 4,898 గృహాలు పూర్తి చేయాలని లక్ష్యం అన్నారు. ప్రస్తుతం 454 మాత్రమే పూర్తి చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. లక్ష్యాలను పూర్తిచేయని ఇంజినీర్లకు చార్జి మెమోలు తయారుచేయాలని ఆదేశించారు. మిగిలిన వన్ని ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఈఈలు, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. -
పల్లె నుంచి పరిశోధన వైపు...
బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ బి.కృష్ణవేణి. ఆమె పరిశోధన స్థానం హెడ్ కూడా. నేటి మహిళకు స్ఫూర్తి. ఆమె తన కెరీర్ గురించి మాట్లాడుతూ మా తండ్రి శంకరరావు, తల్లి మంగమ్మ. మాది రేపల్లె. నాన్న నేవీలో ఉద్యోగి. మేము ముగ్గురం ఆడపిల్లలం, ఒక తమ్ముడు. అప్పట్లోనే ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివించాలన్నది నాన్న కోరిక. అలా నేను రేపల్లెలో హైస్కూల్ చదువు, నల్లపాడు సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాలలో ఇంటర్, బాపట్ల అగ్రికల్చర్ కళాశాలలో డిగ్రీతోపాటు పీజీ పూర్తిచేశాను. 1994నుంచి 2001 వరకు ఇండియన్ ఇన్స్ట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్(హైదరాబాద్)లో రీసెర్చ్ అసోసియేట్‌గా ఉద్యోగం, అక్కడే పీహెచ్డీ కూడా చేశాను. 2002 నుంచి 2007 వరకు అమృతలూరు వ్యవసాయ అధికారి, 2007లో ఎన్జీ రంగా అగ్రికల్చ ర్ యూనివర్సిటీలో జాయినింగ్. ఇప్పటివరకూ బాపట్ల పరిశోధన స్థానంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్, అండ్ హెడ్. ఇక పెద్ద చెల్లి దుర్గారాణి ఉపాధ్యాయురాలు, ఇంకొక చెల్లి నాగమణి బాపట్ల డిగ్రీకళాశాల ప్రిన్సిపల్, తమ్ముడు శివప్రసాద్ ఉపాధ్యాయుడు. అప్పట్లోనే తమ తల్లిదండ్రులు చదివించడం వల్లే అందరం ఈ స్థాయిలో ఉన్నాం. ప్రతి తల్లి, తండ్రి ఆడపిల్లలను చదివించాలి. పిల్లలు పట్టుబట్టి చదవాలి, లక్ష్యాలు నిర్దేశించుకోవాలి, వాటిని సాధించాలి. మహిళలు ఉన్నతస్థాయిలో ఉంటే సమాజం సరైన దారిలో నడుస్తుంది. -
వీఐటీలో విటోపియా క్రీడా సాంస్కృతిక ఉత్సవం ప్రారంభం
తాడికొండ: విద్యతో పాటు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అవసరమని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ అన్నారు. వీఐటీ–ఏపీ విశ్వవిద్యాలయంలో విటోపియా–2025 వార్షిక క్రీడలు, సాంస్కృతిక ఉత్సవం శుక్రవారం ప్రారంభమైంది. ముఖ్య అతిధిగా తాడికొండ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ క్రీడలు మానసికాభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు.వీఐటీ వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్, వీఐటి–ఏపి విశ్వ విద్యాలయ వైస్ చాన్సలర్ డాక్టర్ కోటా రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ప్రగతిని వివరించారు. మూడేళ్లుగా అవుట్ లుక్ ర్యాకింగ్స్లో అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కేటగిరిలో దేశంలోనే ప్రథమస్థానంలో వీఐటీ ఉందని వెల్లడించారు. సాయంత్రం జరిగిన ప్రొ–షోలో సెహరి బ్యాండ్, స్వరాగ్ బ్యాండ్, డీజే పరోమాల సంగీత విభావరి అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి, డాక్టర్ కృష్ణసామి (విటోపియా కన్వీనర్), డాక్టర్ ఖాదీర్ పాషా (స్టూడెంట్ వెల్ఫేర్ డెప్యూటీ డైరెక్టర్) పాల్గొన్నారు. -
బబ్బేపల్లి కొండపై మంటలు ఆర్పివేత
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేష్ మార్టూరు: మండలంలోని బబ్బేపల్లి గ్రామ కొండపై గురువారం రాత్రి ఎగిసిన మంటలు సహజంగా ఏర్పడినవేనని కూకట్లపల్లి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేష్ తెలిపారు. ఆయన శుక్రవారం మధ్యాహ్నం సిబ్బందితో కొండపైకి వెళ్లి పరిశీలించారు. గతంలో గ్రావెల్ తవ్వకాలు జరిపిన గుంతల్లో ఎండిన చెట్ల కొమ్మలతోపాటు కొండ పరిసరాల్లో భూమి సాగు చేస్తున్న కొంతమంది రైతుల పొలాల్లో వ్యర్థాలు గాలికి కొట్టుకు వచ్చి పేరుకుపోయాయని తెలిపారు. ఎవరో విసిరిన బీడీ లేదా సిగరెట్ వల్ల మంటలు ఏర్పడి కొండపై కొంతమేర వ్యాపించాయని వివరించారు. కొండపై చెట్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెప్పారు. అక్కడక్కడా కొద్దిపాటి పొగలతో వ్యాపిస్తున్న మంటలను సిబ్బందితో కలసి ఆర్పి వేసినట్లు తెలిపారు. ఫారెస్ట్ భూమిలో సాగు చేస్తున్న రైతులు పంటకాలం పూర్తయ్యాక వ్యర్థాలను వారే తొలగించాలని, భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి ఏర్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
ఏఎన్‌యూ బీఈడీ ప్రశ్నపత్రం లీక్
పెదకాకాని : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో శుక్రవారం నిర్వహించిన బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్ష పత్రం లీకై న ఘటన కలకలం రేపింది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్ష ప్రారంభం కావాల్సి ఉండగా పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే ప్రశ్నపత్రం లీక్ అయినట్లు తెలుస్తోంది. సీడీ ద్వారా ఆన్లైన్లో అరగంట ముందుగా ప్రశ్నపత్రాన్ని రిలీజ్ చేశామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కానీ మొబైల్ ద్వారా అరగంట ముందే లీకై బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. పరీక్షల నిర్వహణకు సబంధించిన కొందరు అధికారులు పరీక్ష కేంద్రాల నిర్వాహకుల వ్యవహర శైలిపై ఉదాసీనంగా ఉండడమే లీకేజీకి కారణంగా తెలుస్తోంది. దీంతోపాటు కొత్తగా పరీక్షకు అరగంట ముందుగా సీడీ ద్వారా విడుదల చేసే విధానం కూడా ప్రశ్నపత్రం సులభంగా లీక్ కావడానికి కారణమని పలువురు పేర్కొంటున్నారు. శుక్రవారం పరీక్ష పేపర్ లీక్ అయిందని ఘటన వెలుగులోకి వచ్చినప్పటికీ గురువారం కూడా ప్రశ్నపత్రం అరగంట ముందుగానే లీక్ అయిందన్న విమర్శలు ఉన్నాయి. సంబంధిత అధికారులకు తెలిసినా బయటకు రానియకుండా చూడటం వల్లే పరిస్థితులు శ్రుతి మించుతున్నాయనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. బీఈడీ పరీక్షలకు సబంధించిన పరీక్ష కేంద్రాల ఖరారు, పరీక్షలను పర్యవేక్షించే అధికారుల నియామకం వంటి కీలక అంశాలు కొన్ని పరీక్షా కేంద్రాల నిర్వాహకుల కనుసన్నల్లో జరుగుతుండటం ఇలాంటి ఘటనలకు కారణమవుతోందనే విమర్శలూ వస్తున్నాయి. ఏఎన్‌యూ బీఈడీ ప్రశ్నపత్రం లీకేజీపై ఉన్నత విద్యాశాఖామంత్రి లోకేష్ విచారణకు ఆదేశించారు. పరీక్షకు అరగంటకు ముందే లీకై న మొదటి సెమిస్టర్ ప్రశ్నపత్రం పరీక్షల నిర్వహణలో ఏఎన్‌యూ అధికారులు నిర్లక్ష్యం -
తండ్రి కలలు నిజం చేస్తూ...
బాపట్ల రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గ్లోరియ తన కెరీర్ గురించి మాట్లాడుతూ మాది ప్రకాశంజిల్లా సంతనూతలపాటు మండలం మైనంపాడు. నాన్న పలతోటి జాన్, అమ్మ కమల. ఇద్దరూ ప్రధానోపాధ్యాయులే. ముగ్గురం ఆడపిల్లలం. నాన్నకు మమ్మల్ని ఉన్నత స్థాయిలో చూడాలన్న కోరిక. అందుకే చదివించారు. స్థానికంగా 1984 నాటికి ఒంగోలు హెచ్‌సీఎమ్ కళాశాలలో పదో తరగతి, నల్లపాడు సెయింట్ జోసఫ్ మహిళా కళాశాలలో ఇంటర్, జెఎంజె తెనాలి, ఒంగోలు మంగమ్మ కళాశాలల్లో డిగ్రీ, ఎంఏ ఎకనమిక్స్ ఆంధ్ర యూనివర్సిటీలో పూర్తిచేశాను. 1995లో గ్రూప్–2లో సెలెక్ట్. డిప్యూటీ తహసీల్దారుగా ఉమ్మడి రాష్ట్రంలోని కరీంనగర్, తర్వాత వెలుగొండ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఒంగోలు, స్టెప్ సీఈవో, అండ్ డీపీవో(ఎఫ్ఏసీ)గుంటూరు, డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లయ్, సీఆర్డీఏ, అమరావతి–అనంతపురం హైవే భూసేకరణ అధికారి, చిత్తూరు జెడ్పీ సీఈవో, ప్రస్తుతం బాపట్ల ఆర్డీవోగా చేస్తున్నాను. తల్లిదండ్రులు ఆడపిల్లలు అనుకోకుండా చదివించడం వల్లే ఈ స్థాయిలో ఉన్నాం. కళలన్నా, పుస్తక పఠనమన్నా, తెలుగుభాష అన్నా తనకు ఎనలేని ఇష్టమన్నారు. ప్రతి మహిళ చదుకోవాలి. ఇప్పటి యూత్ సోషల్ మీడి యా, ఇతర వ్యాపకాలతో సమయం వృథా చేస్తున్నారు. చదువు, ఉద్యోగం, లేదా వ్యాపారం ఏ రంగమైనా ఫర్వాలేదు అభివృద్ధి సాధించడమే లక్ష్యం కావాలి. -
అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు
కర్లపాలెం: నేడు మహిళలు బహుముఖ ప్రజ్ఞాశాలులై అన్ని రంగాలలో రాణిస్తున్నారని రెడ్‌క్రాస్ సొసైటీ కర్లపాలెం మండల అధ్యక్షుడు ఇనకొల్లు పోలీస్రావు చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ కార్యాలయంలో ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తహసీల్దార్ సుందరమ్మ, ఎంఈవో విజయశ్రీ , మండల పరిషత్ సూపరిండెంట్ రజని, జూనియర్ అసిస్టెంట్ కల్యాణిలను రెడ్‌క్రాస్ సంస్థ సభ్యులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మహిళలు మహరాణులని, ఊయలలు ఊపిన చేతులతో ప్రపంచాన్ని పాలించగలరని చెప్పారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ మండల ఉపాధ్యక్షుడు మందపాటి పరమానందకుమార్ పాల్గొన్నారు. -
బ్యాంక్ ఉద్యోగుల నిరసన
కొరిటెపాడు(గుంటూరు): బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 24, 25 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఈమేరుక ఉద్యోగులు, అధికారులు శుక్రవారం చంద్రమౌళి నగర్‌లోని కెనరా బ్యాంక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. బ్యాంక్ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక(యుఎఫ్‌బీయూ) జిల్లా కన్వీనర్ బాషా మాట్లాడుతూ బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎస్బీఐ ఉద్యోగ సంఘ నేత పరేంద్ర మాట్లాడుతూ ఐడీబీఐ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. -
ప్రపంచ శాంతి కోసమే గుడారాల పండుగ
అమరావతి: ప్రభువైన ఏసుక్రీస్తుచే తేజరింపచేసి ప్రపంచంలోని మానవులందరి ఉజ్జీవం కోసం గుడారాల పండుగలో ప్రార్థనలు చేస్తున్నామని హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు, దైవజనులు ఫాస్టర్ అబ్రహం అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని హోసన్నా దయాక్షేత్రంలో హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహించే 48వ గుడారాల పండుగ రెండవ రోజు రాత్రిపూట ప్రార్థనలకు వచ్చిన లక్షలాది మంది ఆరాధికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ఈ పండుగలో విశ్వాసులు, సేవకులు ఉజ్జీవింపబడాలంటే దేవుని చేత ప్రకాశించి, వాక్యం మీద ఆసక్తి కలిగి దేవుని ప్రార్థనే ఊపిరిగా భావించాలన్నారు. దేవున్ని స్తుతించకుండా, ఆరాధించకుండా ఉండలేననే స్థితికి మనం చేరుకోవాలన్నారు. తాను కూడా అనేకులను ప్రభువు చెంతకు చేర్చటానికి సారధిగా మారాలనే సంకల్పం ఉండాలన్నారు. దేవుని యందు విశ్వాసంతో మనం పనిచేయగలిగితే జనులు కూడా నిన్ను అనుసరిస్తారు, అందుకు దైవజనులు ఏసన్న జీవితమే సాక్ష్యమన్నారు. 48 సంవత్సరాల కిందట కేవలం 80 మందితో నిర్వహించిన గుడారాల పండుగకు అదే గ్రామంలో నేడు లక్షలాదిమంది తరలిరావడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు. వసతులు ఉన్నా, లేకపోయినా, అవకాశం ఉన్నా లేకపోయినా లక్షలాది మంది ఈ దయాక్షేత్రానికి రావడానికి కారణమైన ఏసుప్రభు చూపిన మార్గంలో మనందరి నడిపిన దైవజనులు ఏసన్న కారణజన్ముడన్నారు. దేవుని కృప నీపై ప్రసరించబడిన ఈరోజు నుంచి ప్రతి ఒక్కని జీవితంలో సర్వసమృద్ధి కలుగుతుందన్నారు. దేవుడు తనని నమ్మినవారందరిని ఒకరి వద్ద చేతుల చాచే స్థితిలో లేకుండా అదృష్టాన్ని ప్రసాందించబోతున్నారన్నారు. దేవుని అనుగ్రహం పొందినవారిని తృణీకరించిన వారందరూ సాగిలపడతారన్నారు. అనంతరం రెండవ వర్తమానంలో హోసన్నా మినిస్ట్రీస్ చీఫ్ పాస్టర్ జాన్‌వెస్లీ ప్రసంగించారు. తొలుత దేవుని స్తుతి గీతాలకు సండేస్కూల్ చిన్నారుల నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. సుపీరియర్ సిస్టర్ ప్రేమ ఆధ్వర్యంలో దేవని గీతాలాపనలు విశ్వాసులను భక్తిభావంలో ఓలలాడించాయి. ఈ ప్రార్థనలలో దేశం నలుమూలల నుంచి వచ్చిన లక్షలాదిమంది హోసన్నా ఆరాధికులు పాల్గొన్నారు. ఫాస్టర్ అబ్రహం తరలివచ్చిన విశ్వాసులు -
ప్రజా సంక్షేమానికి ప్రభుత్వాలు తూట్లు
నరసరావుపేట: ప్రజా సంక్షేమానికి, ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడుస్తున్న కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై ప్రజలలో చైతన్యం నింపి పోరాటాలకు సిద్ధం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. గురువారం పల్నాడు జిల్లా కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో పార్టీ జిల్లా కమిటీ సమావేశం కమిటీ సభ్యులు జి.రవిబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ మోదీ వరుసగా మూడవసారి అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. బీజేపీతో కూడిన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు సూపర్ సిక్స్ అంటూ విస్తృతంగా ప్రచారం చేశారని తెలిపారు. ఇప్పుడు అమలు చేయలేక పోతున్నామని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన 23 వేల అర్జీల విషయంలో కాలయాపన వీడి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ప్రజా చైతన్య యాత్రల ద్వారా ప్రజా సమస్యలను అధ్యయనం చేసి ఈ నెల 20 నుంచి జిల్లా కలెక్టరేట్లు వద్ద, రెవెన్యూ, మండల పరిషత్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేయాలన్నారు. పార్టీ సీనియర్ నాయకులు గద్దె చలమయ్య, పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ మాట్లాడారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు వై.రాధాకృష్ణ, అనుముల లక్ష్మీశ్వరరెడ్డి, ఏపూరి గోపాలరావు, తిమ్మిశెట్టి హనుమంతరావు, తెలకపల్లి శ్రీను, ఎస్.ఆంజనేయ నాయక్, మహిళా నాయకులు ఉమశ్రీ, మల్లీశ్వరి, విమల, రజిని, దుర్గాబాయి పాల్గొన్నారు. -
సీనియార్టీ జాబితాలో లోపాలు సవరించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యాశాఖ విడుదల చేసిన మున్సిపల్ ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలో లోపాలను సవరించాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుకకు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ (ఎన్టీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.హైమారావు విజ్ఞప్తి చేశారు. గురువారం డీఈవో కార్యాలయంలో రేణుకను కలసిన ఎన్టీఏ నాయకులు ఆమెకు వినతిపత్రం సమర్పించారు. ఉపాధ్యాయుల సీనియార్టీని పరిగణలోకి తీసుకోకపోవడంతో పాటు ఇతర మేనేజ్మెంట్ల నుంచి వచ్చిన ఉపాధ్యాయులను జూనియర్లుగా చూపలేదని డీఈవో దృష్టికి తెచ్చారు. జాబితాలోని తప్పులను సవరించాలని కోరారు. దీనిపై డీఈవో మాట్లాడుతూ సీనియార్టీ జాబితాలో తప్పులు దొర్లిన నేపథ్యంలో ఉపాధ్యాయులు తగు ఆధారాలతో ఈనెల 10లోపు ఫిర్యాదు చేయాలని సూచించారు. డీఈవోను కలసిన వారిలో ఎన్టీఏ గుంటూరు జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖలీల్, గుంటూరు నగర శాఖ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు సాయి విశ్వనాఽథ్, పి. లలితబాబు, గౌరవాధ్యక్షుడు ఏవీ కృష్ణారావు ఉన్నారు. -
సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
బాపట్లటౌన్: సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమైనదని జిల్లా అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో గురువారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఎస్పీ టి.పి.విఠలేశ్వర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. తొలుత డ్రోన్ ఎగురవేసి అది పనిచేసే విధానం, పోలీస్ శాఖకు ఏవిధంగా ఉపయోగపడుతుందనే విషయాలపై విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. మహిళలకు రక్షణ, భద్రత కల్పించేందుకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు, అత్యవసర పరిస్థితులలో సంప్రదించాల్సి న నంబర్ల గురించి వివరించారు. విధి నిర్వహణ లో పోలీసులు వినియోగిస్తున్న వివిధ రకాల ఆయుధాల పనితీరును వివరించారు. నేర స్థల పరిశీల నలో క్లూస్ టీం ఆధారాలు, ఫింగర్ ప్రింట్స్ సేకరించే విధానంపై అవగాహన కల్పించారు. బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, ఏఆర్ డీఎస్పీ విజయసారథి, అడ్మిన్ ఆర్ఐ మౌలుద్దీన్, మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ శ్రీనివాస్, ఎస్బీ సీఐ నారాయణ, బాపట్ల పట్టణ, రూరల్, రూరల్ సర్కిల్ సీఐలు రాంబాబు, శ్రీనివాసరావు, హరికృష్ణ పాల్గొన్నారు. విద్యార్థి దశనుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి జిల్లా అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్ -
పవిత్ర మాసంలో శుభాల శుక్రవారం
యడ్లపాడు: ముస్లిం సమాజానికి జుమ్మా(శుక్రవారం) పవిత్రమైన ప్రత్యేక రోజు. సూర్యుడు ఉదయించే రోజుల్లో అన్నింటికంటే ఉత్తమమైన రోజుగా జుమ్మాను పరిగణిస్తారు. ఇస్లాంలో ప్రధానంగా రంజాన్, బక్రీద్ అనే రెండు పండుగలు ఉన్నప్పటికీ, వారంలో ఒకరోజైన జుమ్మాను ప్రత్యేక పండుగ రోజులా పరిగణిస్తారు. రంజాన్ మాసంలో ఇది మరింత విశిష్టతను సంతరించుకుంటుంది. ముఖ్యంగా చివరి జుమ్మా విశేష ఫలప్రదమైనదిగా భావిస్తారు. ఖురాన్‌లోని సూరా ‘అల్–జుమ్మా‘లో శుక్రవారం విశిష్టత వివరించబడింది. జుమ్మా రోజున ముస్లింలు తమ పనులను విడిచి మసీదులకు వెళ్లి ప్రాపంచిక విషయాలను పక్కన పెట్టి దైవచింతనతో ప్రార్థనలు చేయాలని స్పష్టంగా పేర్కొనబడింది. ఇస్లామిక్ గ్రంథాల ప్రకారం, తీర్పుదినం రోజు యూదులు, క్రైస్తవుల కంటే ముందుగా ముస్లింలు దైవ విచారణను ఎదుర్కొంటారని ప్రవక్త మొహమ్మద్ (సఅసం) తెలియజేశారు. మానవజాతి మొదటి వ్యక్తి అయిన ఆదాము(అ)ను దైవం సృష్టించబడిన రోజు శుక్రవారం. అతను స్వర్గానికి పంపించబడినదీ శుక్రవారమే. అనంతరం నిషేధిత ఫలం తిన్నరోజు.. ఆదాం అవ్వాలను తిరిగి భూమికి తరిమివేయబడినదీ ఆ రోజే. తమ తప్పును గ్రహించి అల్లాహ్‌ను క్షమాభిక్ష కోరిన రోజు కూడా శుక్రవారం కావడం విశేషం. తొలి మానవుడు ఆదాం మరణించినది ఇదే రోజు. తీర్పు దినం (ఖయామత్) కూడా శుక్రవారం జరిగే రోజు అని ప్రవక్త ముహమ్మద్ (సఅసం) తెలియజేశారు. శుక్రవారం 15 సున్నతులు పాటించాల్సి ఉంటుంది. ఇస్లాంలో జుమ్మా రోజుకు, జుమ్మా జోహర్ నమాజుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అల్లాహ్ ఆదేశానుసారం ప్రవక్త ఆచరించి చూపిన వాటిలో జుమ్మా నమాజు ఒకటి. పవిత్రమైన ఆ రోజున అల్లాహ్ ఆరాధనలో గడపాలని అల్లాహ్ యొక్క హుజూర్, ఉమ్మత్తులు అందరికీ నిశ్చయించారు. ఖురాన్, హుజూర్ నుంచి ఎన్నో హదీసుల ద్వారా సందేశాలను తెలియజేశారు. నేడు రంజాన్ మాసం తొలి శుక్రవారం ఇస్లాంలో జుమ్మా ఎంతో ప్రత్యేకం ఎంతో పుణ్యఫలం జుమ్మా నాడు మసీదుకు నడిచి వెళ్లిన వారి ఒక్కొక్క అడుగుకి ఒక్కో పాపం తొలగి, వారి దర్జా స్వర్గంలో హెచ్చించబడుతుంది. ఎవరైతే మసీదు లోపలికి మొదటిగా ప్రవేశిస్తారో వారికి దేవదూతలు ఒక ఒంటెను త్యాగం చేసినంత పుణ్యాన్ని లిఖిస్తారు. ప్రవేశించిన రెండో వ్యక్తికి ఆవు, మూడో వ్యక్తికి మేకను, నాలుగో అతనికి కోడి, ఐదో వ్యక్తికి గుడ్డుకు సమానంగా పుణ్యమును వారి ఖాతాల్లో దేవదూతలు రాయడం జరుగుతుంది. జుమ్మా నమాజ్‌తోపాటు అల్ కహాఫ్ సూరా చదివి, శ్రద్ధగా బయాన్ విన్నవారికి జుమ్మా నుంచి జుమ్మా వరకు చేసిన పాపములు అల్లాహ్ క్షమిస్తాడు. జుమ్మారోజు సూరా అల్ దుఖాన్ ఎవరైతే చదువుతారో వారికోసం 70 వేల దేవదూతలు దువా చేస్తారు. ఇలా జుమ్మాను పవిత్రంగా భావించి ఆరాధన చేసిన వారికి అల్లాహ్ ఒక సంవత్సరం అంతా ఒక్కపొద్దు, ప్రార్థనలు చేసినంత పుణ్యమును బహుమతిగా ఇస్తారు. అలాగే జుమ్మా రోజు చనిపోయిన వారికి అల్లాహ్ సమాధి శిక్షల నుంచి తొలగిస్తాడు. – షేక్ అబ్దుల్ కలీం, మత గురువు -
భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య
యద్దనపూడి: భార్య కాపురానికి రాకపోవటంతో జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని పూనూరులో జరిగింది. మండలంలోని పూనూరు గ్రామంలోని వడ్డెర కాలనీకి చెందిన తన్నీరు గంగరాజు (28) కు జె. పంగులూరు మండలం కొప్పెరపాడు గ్రామానికి మహిళతో ఏడేళ్ల కిందట వివాహమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య నాలుగేళ్ల కిందట అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. రోజులు గడుస్తున్నా భార్య కాపురానికి రాకపోవటంతో ఈ నెల 4వ తేదీ భార్య దగ్గరికి వెళ్లి కాపురానికి రమ్మని చెప్పగా ఆమె నిరాకరించటంతో మనస్తాపానికి గురైన గంగరాజు బుధవారం మధ్యాహ్నం పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి గురువారం మృతి చెందినట్లు ఎస్సై రత్నకుమారి తెలిపారు. మృతుని తండ్రి రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. బబ్బేపల్లి కొండపై మంటల కలకలం మార్టూరు: మండలంలోని బబ్బేపల్లి కొండపై గురువారం రాత్రి మంటలు స్థానికంగా కలకలం రేకెత్తించాయి. రాత్రి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో కొండపై నుంచి ఎగిసిపడుతున్న మంటలను చూసిన స్థానికులు మంటల సమీపం లోకి వెళ్లి పరిశీలించారు. గొర్రెలు లేదా పశువుల కాపర్లు పొరపాటున విసిరిన సిగరెట్ లేదా బీడీలు మంటలకు కారణమై ఉండవచ్చని మొదట భావించారు. కానీ ఒకేసారి నాలుగైదు వైపుల నుంచి ఎగిసిపడుతున్న మంటలను చూసి ఎవరైనా కావా లని చేశారా.. అనే అనుమానం గ్రామస్తులు వ్యక్త పరుస్తున్నారు. ఈ విషయమై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేష్‌ను వివరణ కోరగా.. మంటలకు కారణం పొరపాటా లేక ఎవరైనా కావాలని చేశారా.. అనే విషయం శుక్రవారం ఉదయం వెళ్లి పరిశీలించి చెబుతామన్నారు. పసుపు రైతులకు త్వరితగతిన పరిహారం సబ్ కలెక్టర్‌ను కోరిన రైతు సంఘం బృందం తెనాలి: దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ గతేడాది జనవరిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు చెల్లించాల్సిన పరిహారంపై రైతు సంఘం నేతలు గురువారం తెనాలిలో సబ్ కలెక్టర్ సంజనా సింహాను కలిశారు. రైతులకు రావాల్సిన పరిహారంపై ప్రభుత్వం ఇచ్చిన హామీని త్వరితగతిన నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. బాపట్ల జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వేములపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కోల్ట్ స్టోరేజీ అగ్ని ప్రమాదంలో మొత్తం 380 మంది పసుపు రైతులకు పరిహారం అందాల్సి ఉందని తెలిపా రు. ప్రభుత్వం ఆమోదించిన పరిహారం మొత్తాన్ని ఒకే విడతలో చెల్లించాలని కోరామని, సబ్ కలెక్టర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివ సాంబిరెడ్డి మాట్లాడుతూ పసుపు రైతులకు పరిహారంపై మంత్రి అచ్చెన్నాయుడు ఎనిమి ది నెలల కిందట ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరకపోవడంపై విచారం వ్యక్తంచేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, వెంటనే పరిహారం ఇప్పించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య, గద్దె శ్రీహరి, పోతురాజు కోటేశ్వరరావు, పేర్ని రవి, గుళ్లపల్లి సుబ్బారావు, యర్రు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
నారీ వివక్ష లేని సమాజంతోనే అభ్యున్నతి
గుంటూరు రూరల్: నారీ వివక్షత లేని సమాజంతో అభ్యున్నతి సాధ్యమని, మహిళలకు విద్య, ఉపాధి, భద్రత, ఆరోగ్యం తదితర అంశాలలో సమాన అవకావాలు ఇవ్వాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ ఆర్. శారద జయలక్ష్మీదేవి పిలుపునిచ్చారు. నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలోని విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం అభివృద్ధిలో మహిళా శాస్త్రవేత్తల కృషి మరువలేనిదని కొనియాడారు. మహిళా రక్షణ సెల్ అధ్యక్షురాలు డాక్టర్ ఎ. మణి మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో అన్ని కమిటీలతో, పలు స్కీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళల్లో అక్షరాస్యత శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఏపీ అగ్రికల్చర్ కమిషనర్ బి. రాజశేఖర్ మాట్లాడుతూ మహిళలు బహుముఖ ప్రజ్ఞాశాలురని తెలిపారు. సమాజంలో మార్పుకోసం, లింగవివక్షత, అసమానతలను అధిగమించేందుకు ఒక ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా ఉత్తమ మహిళా రైతులు, ఉత్తమ అధికారులకు సత్కారాలు అందించారు. ఉత్తమ మహిళా రైతులుగా మన్యం జిల్లా పార్వతీపురం మండలం వంజరపుగూడాకు చెందిన మర్రి నవ్య, తూర్పుగోదావరి జిల్లా నిడిగల్లుకు చెందిన వేమగిరి అన్నపూర్ణ, పల్నాడు జిల్లా అచ్చంపేటకు చెందిన కిలారి జయమ్మ, ఒంగోలు జిల్లా సంతపేటకు చెందిన గుల్లపల్లి సుజాత, తిరుపతికి చెందిన కె. యువరాణి, శ్రీ సత్యసాయి జిల్లా ఉప్పునేసినపల్లికి చెందిన నారా నాగలక్ష్మిలకు ఉత్తమ మహిళా రైతు పురస్కారాలు అందించి, ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
విద్యా బోధన.. సాగు ఒకటే !
ఏఎన్‌యూ: విద్యా బోధన, సాగు ఒకటేనని, అధ్యాపకులు నిత్య విద్యార్థులుగా ఉండాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య కె. గంగాధరరావు అన్నారు. బోధనలో అధునాతన పద్ధతులను అందిపుచ్చుకుని విద్యార్థులు మెరుగైన జ్ఞానాన్ని అందించాలని ఆయన సూచించారు. విశ్వవిద్యాలయంలోని విద్యా విభాగంలో రెండు రోజులపాటు జరుగుతున్న జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రెక్టార్ ఆచార్య కె. రత్న షీలామణి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. వీసీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలోని విద్యావేత్తలను ఆచార్య పి. బ్రహ్మాజీరావు ఉపన్యాసకులుగా ఆహ్వానించడంపై హర్షం వ్యక్తం చేశారు. సదస్సుకు ఆర్ట్స్, కామర్స్ లా కళాశాల ఆచార్యులు ఎం. సురేష్ కుమార్ అధ్యక్షత వహించారు. రెక్టార్ ఆచార్య కె. రత్నషీలామణి మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా బోధన విధానాలను రూపొందించుకోవాలని, వృత్తిపరమైన కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. విద్యా విభాగ పీఠాధిపతి ఆచార్య ఎం. వనజ విద్యా విధానంలో వివిధ దశలను గురించి వివరించారు. అమర్ కంటక్‌కు చెందిన ఆచార్య ఎం.టి.వి నాగరాజు, ఒరిస్సాలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు ఈ.అశోక్ కుమార్, జమ్మూ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఆచార్య వంగూరి రవి, కేరళ లోని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి చెందిన ఆచార్య ఇస్మాయిల్ తమ్మరేసరి, మధ్యప్రదేశ్ లోని డాక్టర్ హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య పుచ్చ చిట్టిబాబు, ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన ఆచార్య టి. షరోన్ రాజు, బిహార్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య పి. ఆడమ్ పాల్, ఇగ్నో డెప్యూటీ డైరెక్టర్ ఆచార్య కె. సుమలత,సెంట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ చైర్మన్ డాక్టర్ సూరజ్ మోహన్, ఆర్‌వీఆర్‌ఆర్ కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ సీనియర్ ఆచార్యులు గద్దె మంగయ్య ఉపన్యసించారు. విద్యా విభాగంపై డాక్టర్ టి. సందీప్ రచించిన పుస్తకావిష్కరణ చేశారు. ఈ సదస్సుకు డాక్టర్ ఎం. వసంతరావు, డాక్టర్ ఆర్. శివరామిరెడ్డి, కన్వీనర్లుగా వ్యవహరించారు. 8న మహిళా దినోత్సవం రేపల్లె రూరల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో ఎంసీఏ హాలులో ఈ నెల 8వ తేదీన జిల్లాస్థాయిలో నిర్వహించనున్న వేడుకల ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ గురువారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వేడుకలకు జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్ధసారథి, రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్లతోపాటు జిల్లా కలెక్టర్ వెంకట మురళి హాజరవుతారన్నారు. వేడుకల్లో వివిధ రంగాలలో రాణించి మహిళలను సత్కరించనున్నట్లు తెలిపారు. ఏర్పాట్లను సక్రమంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ విఠలేశ్వరరావు, ఆర్డీవో రామలక్ష్మి, తహసీల్దార్ శ్రీనివాసరావు, కమిషనర్ సాంబశివరావు తదితరులు ఉన్నారు. వీసీ ఆచార్య కె.గంగాధరరావు అధ్యాపకులు నిత్య విద్యార్థులుగా ఉండాలి -
మూడు పూరిళ్లు దగ్ధం
రూ.11లక్షల ఆస్తి నష్టం నిజాంపట్నం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నికి మూడు పూరిళ్లు దగ్ధమైన సంఘటన మండలంలోని నక్షత్రనగర్‌లో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు గ్రామంలోని మోపిదేవి శివనాగరాజు గృహంలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు ఎగసిపడ్డాయి. పక్కనే ఉన్న మరో రెండు పూరిళ్లకు మంటలు వ్యాపించి మూడు పూరిళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. బాధితులు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. సంఘటనా స్థలానికి రేపల్లె అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. రూ.11లక్షల వరకు ఆస్తినష్టం సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరారు. వేర్వేరు అగ్ని ప్రమాదాల్లో రూ.1.75 లక్షల నష్టం చీరాలఅర్బన్: ఈపురుపాలెంలో జరిగిన వేర్వేరు అగ్ని ప్రమాదాల్లో రూ.1.75 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల మేరకు.. బుధవారం రాత్రి చీరాల మండలం ఈపురుపాలెంలోని పాత ఇనుపసామాన్ల షాపులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక లక్షా 50 వేల రూపాయల విలువ గల సామగ్రి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షాపు యజమాని సయ్యద్ అఫ్రీది నుంచి వివరాలు నమోదు చేశారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. గురువారం సాయంత్రం ఈపురుపాలెంలోని ఎస్బీఐ సమీపంలో ఓ ఇంటిలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఇంటిలోని సామాగ్రి దగ్ధమైంది. మంటలు చెలరేగడానికి కారణం తెలియరాలేదు. ఇంటి యజమాని చెరుకూరి నారాయణ నుంచి వివరాలను నమోదు చేశారు. ఐదు హాస్పిటళ్లకు జరిమానాలు నరసరావుపేట: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో వచ్చిన 77 ఫిర్యాదులపై కమిటీ సభ్యులు విచారించారు. అందులో డబ్బులు వసూలు చేసిన ఐదు హాస్పిటళ్లకు జరిమానా విధించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధ్యక్షతన జిల్లా క్రమశిక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ వైద్యసేవ పేషెంట్లకు బిల్లులు లేకుండా నగదు రహిత వైద్యం అందించేలా ఆసుపత్రి యాజమాన్యాలు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఎంహెచ్‌వో డాక్టర్ బి.రవి, జిల్లా ప్రభుత్వ వైద్యశాలల పర్యవేక్షణ అధికారి డాక్టర్ బీవీ రంగారావు, డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ జి.చంద్రశేఖర్, డాక్టర్ విక్టర్, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుత్ చౌర్యం కేసులో రూ. 85వేలు జరిమానా
గుంటూరు లీగల్: విద్యుత్ చౌర్యం కేసులో జరిమానా విధిస్తూ జడ్జి వి.ఎ.ఎల్.సత్యవతి తీర్పు చెప్పారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాల గ్రామానికి చెందిన వేల్పుల పెదఏసు 2016 నవంబరు 15న అక్రమంగా విద్యుత్ వినియోగిస్తుండగా ఆ శాఖ అధికారి ఎం.కోటయ్య తనిఖీల్లో పట్టుకున్నారు. దీనిపై ఆయన యాంటీ పవర్ తెఫ్ట్ స్క్వాడ్‌కు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్ఐ కె. హనుమంతరావు విచారణ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఒకటో అదనపు జిల్లా కోర్టులో విచారణ జరిగింది. నేరం రుజువు కావడంతో జడ్జి వి.ఎ.ఎల్.సత్యవతి రూ. 85వేలు జరిమానా విధించారు. కట్టలేని పక్షంలో ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వజ్రాల రాజశేఖరరెడ్డి వాదనలను వినిపించారు. -
పటిష్ట బందోబస్తు
అద్దంకి: అధికారులంతా సమస్వయంతో పనిచేసి రాష్ట్రంలోనే పేరుగాంచిన శింగరకొండ తిరునాళ్లను విజయవంతం చేయాలని చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు కోరారు. ఈవో కార్యాలయంలో గురువారం ఆర్డీఓ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈఓ తిమ్మనాయుడు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆర్డీఓ మాట్లాడారు. ఈనెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ 70వ వార్షిక తిరునాళ్ల నిర్వహిస్తున్నామన్నారు. ప్రధాన తిరునాళ్ల ఈనెల 14న జరుగుతుందన్నారు. ఆ రోజు వచ్చే భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా పంచాయతీరాజ్, మునిసిపల్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలు చూడాలని చెప్పారు. దారిలో అక్కడక్కడా తాగునీటిని ట్యాంకుల ద్వారా అందుబాటులో ఉంచా లని చెప్పారు. ఎక్కడ ఏముందో తెలిపే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయనునన్నట్లు చెప్పారు. అధికారులకు మూడు రోజులపాటు అన్నప్రసాదం దేవస్థానం తరఫున ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహిళలు, పురుషులకు విడివిడిగా బయో టాయిలెట్స్ ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించారు. వృద్ధులకు, వికలాంగులకు వీల్‌చైర్‌తో దర్శనం, డ్యూటీ లో ఉండే అఽధికారులకు పాస్లజారీ, విద్యుత్ శాఖవారి సహకారంతో నిరంతరాయ విద్యుత్ సరఫరా, లైటింగ్ ఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు. ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ, తాత్కాలిక బస్‌స్టేషన్, అక్కడ డిస్ప్లేతో ఏర్పాటుచేస్తామని చెప్పా రు. అన్ని శాఖలు నిర్వహించాల్సిన కార్యక్రమాలను తెలియజేశారు. ఈనెల 11వ తేదీ సాయంత్రం విజిట్ ఉంటుందన్నారు. ప్రత్యేక వసతులు ఈఓ తిమ్మనాయుడు మాట్లాడుతూ తిరునాళ్ల రోజున భక్తులకు ఉచిత దర్శనంతోపాటు, రూ.50, రూ.100 ప్రత్యేక దర్శనాలను ఏర్పాటు చేయనున్నుట్లు వెల్లడించారు. ఉచిత ప్రసాద పంపిణీ, చంటి పిల్లలకు పాలిచ్చే ప్రత్యేక వసతులు ఉంటాయని చెప్పారు. అన్ని శాఖల అధికారులకు ప్రత్యేక స్టాల్స్ దేవస్థానం ముందు భాగంలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పై దేవస్థానం తరఫున కొండమీదకు ఉచిత బస్సులు, దారి పొడవునా లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తిరునాళ్లను విజయవంతం చేయండి ఆర్డీఓ చంద్రశేఖర్‌నాయుడు ఆధునాతన టెక్నాలజీ వినియోగం సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ అధికారులకు వాట్సప్ గ్రూప్ ఏర్పాటు వృద్ధులు, వికలాంగులకు వీల్‌చైర్‌తో దర్శనం ప్రభలపై అశ్లీల నృత్యాలు, ట్రాక్టర్లు, అత్యధిక మైక్‌లు, డీజేలు నిషేధం రాత్రి ఒంటి గంట వరకే సాంస్కృతిక కార్యక్రమాలు 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా డీఎస్పీ మొయిన్ మాట్లాడుతూ తిరునాళ్ల రోజున ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సంతమాగులూరు అడ్డరోడ్డు, పైలాన్, రేణింగవరం వద్ద అద్దంకి వైపు వాహనాలు రాకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నట్లు చెప్పారు. తప్పిపోయిన వారి అనౌన్స్మెంట్ కోసం దేవస్థానం తరఫున ఒకటి, పోలీసు తరఫున ఒకటి అనౌన్స్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ట్రాఫిక్ సమస్య దృష్ట్యా భక్తులు ఆ ఒక్క రోజు సొంత వాహనాల్లో రాకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తిరునాళ్లకు భక్తులతో వచ్చే వాహనాలను నిలిపేందుకు పరిసరాల్లో పది పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వాహనాలు అక్కడ ఉంచి కాలి నడకన తిరునాళ్ల జరిగే ప్రదేశానికి రావాలని చెప్పారు. తిరునాళ్లలో ఐదుగురు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 50 మంది ఎస్సైలు, 700 మంది పోలీసు మందోబస్తు నిర్వహిస్తామని చెప్పారు. ప్రభలపై అశ్లీల నృత్యాలు, పరిసరాల్లో క్రాకర్స్ పేల్చడం, అధిక సంఖ్యలో మైకులు, డీజేలు ఏర్పాటు నిషేధించామని చెప్పారు. ప్రభలపై ఆ రోజు రాత్రి ఒంటి గంట వరకు మాత్రమే కార్యక్రమాల నిర్వహణకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. ప్రభల నిర్వాహకులు, దానిపై కార్యక్రమం చేసే ఆర్కెస్ట్రా బృందం, వాయిద్యకారులు తదితరులు ముందుగానే వారి పేర్లతో స్టేషన్లో తెలియజేసి అనుమతి పొందాలని చెప్పారు. సమావేశంలో ఎంపీడీవో సింగయ్య, తహసీల్దార్ శ్రీ చరణ్, విద్యుత్‌శాఖ ఈఈ మస్తాన్‌రావు, ఆర్టీసీ డీఎం రామ్మోహన్రావు, సీఐ సుబ్బరాజు, మెడికల్, ఫైర్‌తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
బాపట్ల: సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఉత్పత్తులను మరింతగా పెంచాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. సేంద్రియ వ్యవసాయం వార్షిక ప్రణాళికపై అనుబంధ శాఖల అధికారులతో గురువారం స్థానిక కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రసాయనిక ఎరువులు, పురుగుమందులు వినియోగం లేకుండా పంటలు సాగు చేయాలని అన్నారు. సంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం సాగు చేస్తేనే ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించగలమన్నారు. హరిత విప్లవం ద్వారా ఆహార ధాన్యాల కొరతను పూర్తిగా అధిగమించడం సంతోషదాయకమన్నారు. 2025వ సంవత్సరంలో లక్షా 7 వేల 165 ఎకరాలలో సేంద్రియ పద్ధతిలోనే పంటలు సాగు చేయాలని వార్షిక ప్రణాళిక రూపొందించినట్లు ప్రకటించారు. 62 వేల 97 మంది రైతులను సేంద్రియ వ్యవసాయ పద్ధతిలోకి తెచ్చేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఇప్పటికే కొన్ని పంటలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నట్లు వివరించారు. ఈ సంవత్సరంలో వరి, శనగ, మినుము, పెసర, జొన్న, మొక్కజొన్న, కూరగాయలు, పండ్ల తోటల సాగు విస్తృతంగా వ్యాప్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని 362 గ్రామ సంఘాలలో సమావేశాలు నిర్వహించి, మహిళ రైతులతో చర్చించాలన్నారు. ఈనెల 30వ తేదీలోగా ఖరీఫ్ పంటల సాగుపై గ్రామస్థాయిలో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. జిల్లా స్థాయిలో నిర్దేశించిన లక్ష్యాలు చేరుకునేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. సేంద్రియ ఉత్పత్తులను పెంచడమే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగాలన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి రామకృష్ణ, సేంద్రియ వ్యవసాయం ఏపీ సీఎన్ఎఫ్ డీపీఎం వాణిశ్రీ, మోహన్‌కుమార్, ఉద్యాన శాఖ ఏడీ జెన్నమ్మ, డ్వామా పీడీ విజయలక్ష్మి, డీఆర్డీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు. లేబర్ సెస్ వసూలుకు చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ, ప్రైవేటు భవన నిర్మాణదారుల నుండి ఒక శాతం లేబర్ సెస్ వసూలు చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ జిల్లా కార్మికుల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం 1996 ప్రకారం ఒక శాతం లేబర్ సెస్ వసూలు చేయాలని అన్నారు. వసూలు చేసిన సెస్‌ను కార్మిక శాఖకు చలానా రూపంలో అందజేయాలన్నారు. సెస్ వసూలు చేసినా కార్మిక శాఖకు అందటం లేదని అన్నారు. 2 జూన్ 2014 నుండి మంజూరు చేసిన పనులకు సంబంధించి నివేదిక తయారు చేసి కార్మిక శాఖకు అందజేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కార్మిక శాఖ సహాయ కమిషనర్ వెంకటశివప్రసాద్, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈ అనంతరాజు, మైన్నింగ్ శాఖ ఏడీ రాజేష్, వ్యవసాయ మార్కెటింగ్ మేనేజర్ రమేష్, ఇరిగేషన్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి -
ఆయిల్ దొంగల అరెస్టు
మద్దిపాడు: ఆయిల్ దొంగల ఆట కట్టించారు పోలీసులు. మద్దిపాడు సమీపంలో ఉన్న లారీ యూనియన్ ఆఫీస్ వద్ద ఇటీవల ఆయిల్ దొంగతనం చేసిన కేసులో దొంగలు పట్టుబడ్డారు. ఎస్సై శివరామయ్య వివరాల మేరకు.. పల్నాడు జిల్లా వినుకొండ నెహ్రునగర్ తండాకు చెందిన మీరాజాత్ కళ్యాణ్ నాయక్, మీరాజాత్ ప్రేమ్‌కుమార్, వినుకొండ పట్టణానికి చెందిన తాడి అమరలింగేశ్వరరావు గత నెల 25వ తేదీ అర్ధరాత్రి సమయంలో లారీ యూనియన్ ఆఫీస్ వద్ద ఆయిల్ దొంగతనం చేశారు. దీనిపై లారీ యూనియన్ నాయకులు పోలీసులు ఫిర్యాదు చేశారు. జాతీయ రహదారిపై పలుచోట్ల లారీల నుంచి ఆయిల్ దొంగతనం చేస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతో ఎస్పీ దామోదర్ నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. మద్దిపాడు ఎస్సై, కానిస్టేబుల్ సురేష్, హోంగార్డు శేఖర్లు గురువారం ఉదయం 8 గంటల సమయంలో బీట్ నిర్వహిస్తుండగా కొష్టాలు సెంటర్ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఆపిన లారీ వెనుక భాగంలో అనుమానాస్పదంగా ఒక బొలెరో వాహనం కనిపించింది. పోలీసులు వారిని పట్టుకొని ప్రశ్నించగా ఆయిల్ దొంగతనం చేస్తున్నట్లు అంగీకరించారని ఎస్ఐ తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనాన్ని సీజ్ చేసి, ముగ్గురిని అదుపులోకి తీసుకొని స్పెషల్ మొబైల్ కోర్టుకు హాజరు పరిచినట్లు తెలిపారు. -
రేపు జాతీయ లోక్‌అదాలత్
రేపల్లె రూరల్: పట్టణంలోని సబ్‌కోర్టు హాలులో శనివారం నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్ కార్యక్రమాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ టీ.వెంకటేశ్వర్లు చెప్పారు. కోర్టు హాలులో గురువారం న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిష్కరించుకోదగిన కేసులను లోక్‌అదాలత్‌లో పరిష్కారం అయ్యేలా పనిచేయాలన్నారు. లోక్‌అదాలత్‌ల ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కారం అవ్వటంతోపాటు కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందన్నారు. లోక్‌అదాలత్‌లో అన్ని కేసులైన క్రిమినల్, సివిల్ ప్రీలిటికేషన్ కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. సమావేశంలో న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు. 15న జెడ్పీ సర్వసభ్య సమావేశం గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 15న నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు గురువారం ఓప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి జెడ్పీలో ఏడుస్థాయీ సంఘ సమావేశాలు జరగనుండగా, అదేరోజు మధ్యాహ్నం 2.30 నుంచి జెడ్పీ సమావేశ మందిరంలో చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీలు, ప్రభుత్వ శాఖల అధికారులు సమావేశాలకు హాజరవుతారని తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన అడిషనల్ ఎస్పీ వేటపాలెం: స్థానిక బండ్ల బాపయ్య హిందూ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్ష కేంద్రాలను అడిషనల్ ఎస్పీ టీపీ విఠలేశ్వర్ గురువారం తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాల పరిసరాలు పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా అధికారులు పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరినీ పరిశీలించిన అనంతరం పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తున్నామన్నారు. ఏ విధమైన మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. పరీక్షలు ముగిసేంత వరకు పరీక్ష కేంద్రాల దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్లను, జిరాక్స్ దుకాణాలను తెరవరాదని ఆదేశించారు. ఎస్సై ఎం.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నేటి నుంచి ఇంటర్ సంస్కృత జవాబు పత్రాల మూల్యాంకనం బాపట్ల: ఇంటర్మీడియెట్ సంస్కృత జవాబు పత్రాల మూల్యాంకనం శుక్రవారం నుంచి చీరాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రారంభమౌతాయని విద్యాశాఖాధికారి యర్రయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూల్యాంకనం కోసం 29 మంది ఎగ్జామినర్స్, ఇద్దరు చీఫ్ ఎగ్జామినర్స్, ఇద్దరు పరిశీలకులను బోర్డు వారు కేటాయించినట్లు తెలిపారు. వారందరూ తప్పనిసరిగా 7వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు మూల్యాంకనం జరుగుతున్న చీరాలలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని విద్యాశాఖాధికారి కోరారు. -
పరీక్ష కేంద్రాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి
నిజాంపట్నం: పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని డిప్యూటీ డీఈవో కేసనశెట్టి సురేష్ అన్నారు. ఈనెల 17వ తేదీ నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో మండలంలో ఏర్పాటు చేసిన పలు పరీక్ష కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన బెంచీలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాల ఆవరణంలో ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పాఠశాలకు 100 మీటర్ల వరకు ఎవరూ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈవోలు ఆర్.శోభాచంద్, జీ.శేషుగోపాలం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ డీఈవో సురేష్ -
హోసన్నా.. జయము!
హోసన్నా మినిస్ట్రీస్ చీఫ్ ఫాస్టర్ జాన్‌వెస్లీ మాట్లాడుతూ గుడారాల పండుగ 1977 నుంచి 1992 వరకు హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బ్రదర్ ఏసన్న చేతుల మీదుగా లేమల్లె గ్రామంలో జరిగాయన్నారు. అయితే 1993 నుంచి 2024 వరకు 32సంవత్సరాలపాటు గుంటూరు సమీపంలో గోరంట్లలో నిర్వహించుకున్నామన్నారు. 32 సంవత్సరాల తర్వాత ఇదే లేమల్లె గ్రామంలో మార్చి 5వ తేదీన హోసన్నా దయాక్షేత్ర ఆవరణలో నూతన చర్చి ప్రారంభించు కున్నామన్నారు. అమరావతి: లక్షలాదిమంది విశ్వాసుల స్తోత్రములతో దైవజనుల ప్రార్థనలతో, ప్రభు ఏసును కీర్తిస్తూ, స్తుతి గీతాలాపనల నడుమ గురువారం రాత్రి 48వ గుడారాల పండుగ ఎంతో ఘనంగా ప్రారంభమైంది. పల్నాడు జిల్లా అమరావతి మండలం లేమల్లె గ్రామంలో హోసన్నా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో హోసన్నా దయాక్షేత్రం ప్రాంగణంలోని సువిశాలమైన మైదానంలో గుడారాల పండుగ ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. తొలుత హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు అబ్రహాం మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు జరిగే గుడారాల పండుగకు ప్రపంచవ్యాప్తంగా విచ్చేసిన విశ్వాసులను ఏసుక్రీస్తు నిరంతరం కాపాడాలని ప్రార్థిస్తున్నామన్నారు. గుడారాల పండుగలో దేవుడు అద్భుత కార్యాలను జరిపిస్తాడన్నారు. రోగులకు స్వస్థత చేకూరాలని అలాగే సేవకులకు ఉజ్జీవం కలగాలని ప్రార్థించారు. స్తుతి గీతాల ఆల్బమ్ విడుదల.. దక్షిణాఫ్రికాకు చెందిన దైవజనులు పాస్టర్ జాషువా మోజెస్ ప్రత్యేక ప్రార్థనలు చేసి లక్షలాదిమంది విశ్వాసులు సోత్రాలు, కరతాళ ధ్వనుల మధ్య జాతీయపతాకంలోని మూడు రంగుల బెలూన్లను, శ్వేతవర్ణ పావురాలను ఎగురవేసి నాలుగు రోజులపాటు నిర్వహించే గుడారాల పండుగను ప్రారంభించారు. అనంతరం నూతన స్తుతిగీతాల పుస్తకమైన దయాక్షేత్రం పాటల పుస్తకాన్ని అమెరికాకు చెందిన దైవజనులు ఎర్నెట్‌పాల్ ప్రార్థనలు చేసి ఆవిష్కరించారు. అలాగే హోసన్నా స్తుతిగీతాల అల్బమ్‌ను మదనపల్లెకు చెందిన దైవజనులు పాస్టర్ రాజశేఖర్ ప్రార్థనలు చేసి ఆవిష్కరించారు. ప్రార్థనల్లో చైన్నెకి చెందిన దైవజనులు మోహన్. సి. లాజరస్తో పాటుగా పాస్టర్లు రమేష్, ఫ్రెడ్డీపాల్, అనీల్, రాజు పాల్గొని స్తుతి గీతాలను ఆలపించారు. తొలిరోజు ప్రార్థనల్లో రెండు తెలుగు రాష్టాల నుంచే కాక దేశ, విదేశాల నుంచి లక్షలాదిగా విశ్వాసులు తరలివచ్చారు. విశ్వాసులతో గుంటూరు బస్టాండ్ కిటకిటలాడింది.32 ఏళ్ల తర్వాత మళ్లీ లేమల్లెలో.. పల్నాడు జిల్లా లేమల్లెలో ఘనంగా ప్రారంభమైన 48వ గుడారాల పండుగ ప్రత్యేక ప్రార్థనలు చేసిన హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు అబ్రహాం, చీఫ్ పాస్టర్ జాన్‌వెస్లీ లక్షలాదిగా తరలివచ్చిన విశ్వాసులు -
వైభవం.. ధ్వజారోహణం
మంగళగిరి/మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసినయున్న లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అతి ప్రధానమైన ఘట్టం ధ్వజారోహణ. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవరోజు గురువారం రాత్రి 8 గంటలకు ఋత్వికరణ, అంకురారోపణాధి కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి కల్యాణోత్సవానికి భక్తజనులు, దేవతల ఆహ్వానానికి భక్తాగ్రేసరుడైన గరుత్మంతుడిని ధ్వజంపై ప్రతిష్టించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని ధ్వజారోహణం తిలకించి, గరుడ ముద్దలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ వేడుకలను ఆలయ ఈఓ రామకోటిరెడ్డి పర్యవేక్షించగా కై ంకర్య పరులుగా మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ వ్యవహరించారు. నేడు హనుమంత వాహనంపై.. లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవరోజైన శుక్రవారం రాత్రి 7 గంటలకు శ్రీవారు హనుమంత వాహనంపై గ్రామోత్సవంలో దర్శనమివ్వనున్నారు. భక్తులు పాల్గొని ఉత్సవాన్ని తిలకించి స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ అధికారులు కోరారు.నృసింహుడి కల్యాణానికి దేవతలకు ఆహ్వానం -
భవనాశి కాలువలో కొండచిలువ
అద్దంకి: భవనాశి కాలువలో కొండ చిలువ కలకలం రేపింది. అయితే కొందరికి మొసలి కూడా కనిపించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం పట్టణానికి చెందిన సుద్దపల్లి కోటయ్య వాగులో కొండచిలువ ఉందని ఫారెస్ట్ అధికారులకు అందిన సమాచారం మేరకు.. నరసింహపురం సమీపంలోని భవనాశి కాలువను పరిశీలించారు. అలాగే ముగ్గు వాగులో మొసలి సంచిరిస్తుందని నంగవరపు సుధీర్ ఇచ్చిన సమాచారం మేరకు అక్కడా పరిశీలించారు. ఈ క్రమంలో భవనాశి కాలువలో కొండచిలువను గుర్తించామని అధికారి తెలిపారు. ముగ్గు వాగులో మొసలి జాడలు కనిపించలేదని, అయినా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. మరలా మొసలి సంచారం కనిపిస్తే తమకు తెలియజేయాలని స్థానిక రైతులకు చెప్పారు. ముగ్గు వాగులో మొసలి? జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారుల హెచ్చరిక -
సొన చిదిమేశారు
బాపట్లపోలీసుల స్వచ్ఛ భారత్ తాడేపల్లిరూరల్: తాడేపల్లి పోలీస్ స్టేషన్లో బుధవారం పోలీసులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. స్టేషన్ ఆవరణలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శుభ్రం చేశారు. గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2025 ఇఫ్తార్ సహర్ (గురు) (శుక్ర) నరసరావుపేట 6.23 5.07 గుంటూరు 6.21 5.05 బాపట్ల 6.21 5.05 చీరాల: వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం గ్రామం వద్ద బైపాస్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న 111 ఎకరాల ప్రభుత్వ సొన పోరంబోకు భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఈ భూములను కొందరు కబ్జా చేసి దొంగ సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేసేసుకున్నారు. ప్లాట్లుగా వేసి అమ్మేస్తున్నారు. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ పాపంలో వారికీ భాగస్వామ్యం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ భూముల విలువ రూ.వంద కోట్లపైమాటేనని స్థానికులు చెబుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. చల్లారెడ్డిపాలెం వద్ద బైపాస్ రోడ్డును ఆనుకకుని సర్వే నంబర్ 59లో ఉన్న సొన పోరంబోకు భూమిని కొందరు తహసీల్దార్లు 1.2, 3, 4, 5, 6.7, 8, 9, 10, 11 సబ్ డివిజన్లగా విభజించి రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. ఇందులో 18 ఎకరాల భూమిని 1956లో అప్పటి రెవెన్యూ అధికారులు ఏ–డబ్ల్యూ కిందకి కన్వర్షన్ చేసి కొంత మందికి పట్టాలు ఇచ్చారు. మిగిలిన 93 ఎకరాలను 1993లో 83 భిన్నాలుగా విభజించారు. అధికారులు వారి స్వలాభం కోసమే వీటిని విభజించినట్టు విమర్శలు ఉన్నాయి. సబ్‌డివిజన్ చేసిన సర్వే నంబర్లతోపాటు విస్తీర్ణానికి సబంధించిన రికార్డులను ఆ పరిధిలోని చీరాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపాల్సి ఉన్నా.. అప్పటి అధికారులు పట్టించుకోలేదు. రికార్డులు రిజిస్ట్రార్ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో కొందరు అవి తమ పూర్వీకుల భూములని చెప్పి విలేజ్ సర్వేయర్లు, వీఆర్ఓల వద్ద ఎన్ఓసీ తీసుకుని దొంగ సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. తవ్వేకొద్దీ రెవెన్యూ అక్రమాలు వేటపాలెం మండల పరిధిలోని భూ అక్రమాలు ప్రస్తుత సర్వేలో తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. ఈ మండలంలో ప్రభుత్వ అసైన్డ్, సొన పోరంబోకు, డ్రెయినేజీ పోరంబోకు, కుందేరు పొరంబోకు వంటి ప్రభుత్వ భూములు వేల ఎకరాల్లో అన్యాక్రాంతమయ్యాయి. కుందేరు పోరంబోకు భూములను ఆక్రమించిన అక్రమార్కులు రొయ్యల చెరువులు సాగు చేశారు. డ్రెయినేజీ, సొన పోరంబోకు భూముల్లో సేద్యం చేసుకుంటున్నారు. సొన బోరంబోకు భూమిలో లేఅవుట్లు బైపాస్ రోడ్డు పక్కనే ఉన్న సొన పోరంబోకు భూముల్లో అక్రమార్కులు లేఅవుట్లు వేసి సెంటు రూ.3 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. ఈ భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపడితే అక్రమాలన్నీ బయటపడతాయి. సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే.. సొన పోరంబోకు, శ్మశానం పోరంబోకు, డ్రెయినేజీ పోరంబోకు భూములపై ప్రైవేటు వ్యక్తులకు ఎటువంటి హక్కులూ ఉండవని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆ భూములకు రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చినా చెల్లుబాటు కావని అనేకమార్లు స్పష్టం చేసింది. న్యూస్రీల్పూర్తిస్థాయిలో విచారణ చేపడతాంనేను ఇటీవలే బదిలీపై వేటపాలెం తహసీల్దార్‌గా వచ్చాను. ఆ భూమిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఏ మేరకు అక్రమాలు జరిగాయో పరిశీలించి నివేదికను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాను. – పార్వతి, తహసీల్దార్, వేటపాలెం సొన పోరంబోకు భూమి హాంఫట్ విలువ రూ.వంద కోట్లపైమాటే..! ఒక్కో ఎకరం రూ.కోటిన్నరపైనే దొంగ సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు ప్లాట్లుగా వేసి విక్రయం రెవెన్యూ అదికారులు, సిబ్బందికి భారీగా ముడుపులు -
దివ్యోత్సవం.. నేత్రోత్సవం
మంగళగిరి/మంగళగిరి టౌన్: మంగళాద్రిలోని శ్రీలక్ష్మీ నరసింహుని బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే శ్రీవారిని, అమ్మవార్లను పంచామృత స్నపనతో మంగళస్నానం చేయించారు. అనంతరం స్వామిని పెళ్లి కుమారుడిగా, అమ్మవార్లను పెళ్లి కుమార్తెలుగా అలంకరించారు. తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారు భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెళ్లికుమారుడి ఉత్సవానికి మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం వారు కైంకర్యపరులుగా వ్యవహరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమాలను ఈఓ రామకోట్టిరెడ్డి పర్యవేక్షించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 13న స్వామి దివ్య కల్యాణం, 14న రథోత్సవం జరుగుతాయని వివరించారు. లక్ష్మీనరసింహుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం పెళ్లి కుమారుడిగా శ్రీవారు 13న కల్యాణ మహోత్సవం 14న స్వామి రథోత్సవం -
గేట్లెత్తేశారు
సాక్షి ప్రతినిధి, బాపట్ల : చీరాల పచ్చనేత ఇసుక అక్రమ వ్యాపారం జోరందుకుంది. కూటమి సర్కారు వచ్చాక అడ్డు అదుపూ లేకుండా పోయింది. మరో వైపు బాపట్ల ఎంపీ అనుచరులు సైతం పోటీ పడడంతో ఇరువర్గాల మధ్య గొడవలు చెలరేగాయి. ఎంపీ అనుచరుల క్వారీలో ఉన్న యంత్రాన్ని చీరాల పచ్చనేత అనుచరులు తగలబెట్టారు. ఉన్నతాధికారుల జోక్యంతో ఓ ఇరవై రోజులపాటు తాత్కాలిక విరామమిచ్చిన పచ్చనేత తిరిగి అక్రమ తరలింపు మొదలు పెట్టారు. వేటపాలెం మండలం పందిళ్లపల్లె శివారు ఎస్టీ కాలనీ వద్ద ఉన్న అసైన్డ్ భూముల్లోని ఇసుక దిబ్బల నుంచి పచ్చనేత ఇసుకను తరలించి అమ్ముకుంటున్నారు. వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారి నిర్మాణానికి అమ్ముతున్నారు. చీరాల, బాపట్ల, పర్చూరు నియోజకవర్గాల పరిధిలో భవన నిర్మాణాలు, రియల్ వెంచర్లలో రోడ్లు, ప్లాట్ల చదును కోసం విక్రస్తున్నారు. పచ్చనేత వాహనాలకు రైట్ రైట్.. చీరాల ప్రాంతంలో తాను మినహా వేరెవరూ ఇసుకను విక్రయించేందుకు వీలులేదని హుకుం జారీ చేయడంతో వేటపాలెం మండల అధికారులు పచ్చనేత ఇసుక వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. మిగిలిన వారికి ఇసుక దిబ్బలు ఉన్నా, అమ్ముకోవడానికి వీలులేదు. కాదు కూడదని తరలించే ప్రయత్నం చేసినా వేటపాలెం తహసీల్దారు, పోలీసులు ట్రాక్టర్లను సీజ్ చేస్తున్నారు. చీరాల ప్రాంతంలో పచ్చనేత ఒక్కరే అక్రమ రవాణా చేస్తుండడంతో ఇసుకకు మరింత డిమాండ్ పెరిగింది. టిప్పర్ ఇసుక రూ.20 వేల నుంచి రూ. 25 వేలకు అమ్ముతున్నారు. ట్రాక్టర్ రూ. 5 వేలకు తగ్గకుండా విక్రయిస్తున్నారు. పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడుతున్నారు. జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం : పందిళ్లపల్లె శివారు ఎస్టీ కాలనీ వద్ద ఉన్న అసైన్డ్ భూముల్లోని ఇసుక దిబ్బల నుంచే ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. దీనికి సమీపంలోనే పుల్లరిపాలెం తాగునీటి పథకం ఉంది. పుల్లరిపాలెం గ్రామపంచాయతీ పరిధిలో కొత్తరెడ్డిపాలెం, బచ్చులవారిపాలెం, ఊటుకూరిసుబ్బయ్యపాలెం, రామచంద్రాపురంతో పాటు ఎస్టీ కాలనీలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నింటికీ ఇక్కడున్న తాగునీటి పథకం నుంచే మంచి నీరు అందుతుంది. ఇసుక అక్రమ తవ్వకాలతో తాగునీరు కూడా అందక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని, చర్యలు తీసుకోవాలని ఎస్టీ కాలనీ వాసులు గత ఏడాది అక్టోబర్‌లో జాతీయ ఎస్టీ కమిషన్‌కు రెండు మార్లు ఫిర్యాదులు చేశారు. అంతకుముందు జిల్లా ఉన్నతాధికారులకు సైతం పలుమార్లు విన్నవించారు. దీనిపై విచారించి తక్షణం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు బాపట్ల జిల్లా కలెక్టర్‌కు సైతం ఎస్టీ కమిషన్ సూచిందింది. మితిమీరిన ఒత్తిళ్లతోనే చీరాల పచ్చనేత అక్రమ ఇసుక వ్యాపారాన్ని అడ్డుకోవడం లేదన్న విమర్శలున్నాయి. యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా పందిళ్లపల్లె శివారు నుంచి తరలింపు అసైన్డ్ భూముల నుంచి తవ్వకాలు వాడరేవు రోడ్డు నిర్మాణంతోపాటు ఇతర అవసరాలకు .. ఆగని పచ్చనేత ఇసుక దందా పట్టించుకోని ఉన్నతాధికారులు -
బండరాయి పడి కార్మికుడు మృతి
మార్టూరు: ఓ గ్రానైట్ కార్మికుడు పనిచేసే ఫ్యాక్టరీలోనే బండరాయి పడటంతో మృతి చెందిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి మార్టూరు సమీపంలో జరిగింది. వివరాలు.. మధ్యప్రదేశ్‌కు చెందిన సంపత్ కుమార్ యాదవ్ (25 ) రాజుపాలెం డొంకలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస గ్రానైట్ ఫ్యాక్టరీలో క్రేన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి బండరాయిని కటింగ్ చేసే మిషన్ దగ్గర నిలబడి ఉన్న సంపత్ కుమార్ యాదవ్ పై ప్రమాదవశాత్తు బండరాయి దొర్లి పడింది. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. మిషన్ ఆపరేటర్ సత్యేంద్ర సింగ్ ఫిర్యాదు మేరకు ఎస్సై సైదా కేసు నమోదు చేశారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం తర్వాత బుధవారం సాయంత్రం బంధువులకు సంపత్ కుమార్ యాదవ్ మృతదేహాన్ని అప్పగించారు. -
తపాలా బీమా.. కుటుంబానికి ధీమా
వేటపాలెం: పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పీఎల్ఐ) పథకం గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తించేది. ప్రస్తుతం పట్టభద్రులకు వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అనేక మంది ఉద్యోగులు పథకంలో చేరి లబ్ధి పొందుతున్నారు. బీటెక్, ఎంటెక్, బీఈడీ, ఎంఈడీ, బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంబీబీఎస్, బీఎస్సీ, ఎమ్మెస్సీ నర్సింగ్, బీఫార్మసీ, డిప్లమా వంటి కోర్సులతో పాటు అన్ని విభాగాల్లో యూజీ, పీజీ కోర్సులు చేసిన విద్యార్థులు ఈ పాలసీకి అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. 19 – 55 ఏళ్ల మధ్య వయస్సు గల వారు అర్హులు. ప్రయోజనాలు ఇవీ.. ● పాలసీ అంగీకరించిన తేదీ నుంచి పూర్తి జీవిత బీమా సౌకర్యం ● ప్రీమియాన్ని దేశవ్యాప్తంగా ఏ పోస్టాఫీసులోనైనా చెల్లించే వెసులుబాటు ● ఐపీపీబీ, పోస్ట్ ఇన్ఫో యాప్‌ల ద్వారా ఆన్లైన్లో చెల్లించే అవకాశం ● ల్యాప్స్ (చెల్లని) పాలసీలను నిబంధనల ప్రకారం అధికారులను సంప్రదించి పునరుద్ధరించుకోవచ్చు. ● ఒక ఏడాది ప్రీమియం ముందే చెల్లించిన వారికి 2 శాతం రిబేటు సౌకర్యం ● ఒక్కో వ్యక్తి రూ.50 లక్షల వరకు ఎన్ని పాలసీలైనా తీసుకోవచ్చు. ● ఆదాయపు పన్ను మినహాయింపు. ● ఇతర బీమా పాలసీల కంటే ప్రీమియం తక్కువ, బోనస్ అధికంగా పొందే అవకాశం. ● పాలసీదారులు మరణిస్తే పాలసీ విలువతో పాటు అప్పటివరకు జమైన బోనస్‌ను కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. సద్వినియోగం చేసుకోవాలి పట్టభద్రులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అన్ని పోస్టాఫీసుల్లో పాలసీ చేసుకోవచ్చు. వివరాలకు పోస్టల్ అధికారులను సంప్రదించాలి. స్కీం గురించి మరింత మందికి అవగాహన కల్పించి భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తున్నాం. – శ్రీనివాసరావు, పోస్టుమాస్టర్, రావూరిపేట ఉద్యోగులు, పట్టభద్రుల కుటుంబాలకు భరోసా -
జల్సాల కోసం గంజాయి విక్రయాలు
చీరాల అర్బన్: వ్యసనాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించేందుకు గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను బుధవారం టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎండీ మొయిన్ వివరాలను వెల్లడించారు. బాపట్ల దగ్గుమల్లివారిపాలెంకు చెందిన దొప్పలపూడి యెహోషువ, చీరాల రామ్‌నగర్ న్యూకాలనీకి చెందిన బల్లాని పవన్‌కుమార్, బాపట్ల అరవ కాలనీకి చెందిన నీరుకంటి సురేష్ గంజాయిని బాపట్ల నుంచి చీరాలకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. సమాచారం రావడంతో టూటౌన్ సీఐ, పోలీస్ సిబ్బంది చీరాల మండలం బుర్లవారిపాలెం పంచాయతీ సాయికాలనీ ఓల్డ్ బైపాస్ రోడ్డుకు, బండారు నాగేశ్వరరావు కాలనీకి మధ్య బ్రిడ్జి వద్దకు వెళ్లగా.. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు యువకులు పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీస్ సిబ్బంది వారిని వెంబడించి పట్టుకున్నారు. మధ్యవర్తుల సమక్షంలో అదుపులోకి తీసుకుని వారిని విచారణ చేశారు. నిందితులు గంజాయిని బాపట్ల నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నట్టు తేలింది. వారి వద్ద నుంచి 3.9 కిలోల గంజాయి, మూడు సెల్ఫోన్లు, ద్విచక్రవాహనం, రూ.2 వేలు స్వాధీనం చేసు కున్నట్లు డీఎస్పీ తెలిపారు. ప్రతిభ చూపిన టూటౌన్ సీఐ బి.నాగభూషణం, ఎస్సై నాగశ్రీను, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ముగ్గురు యువకుల అరెస్టు 3.9 కిలోల గంజాయి స్వాధీనం -
గుడారాల పండగ ఏర్పాట్ల పరిశీలన
అమరావతి : గుడారాల పండగ ఏర్పాట్లను బుధవారం ఎస్పీ పరిశీలించారు. ఆయన హోసన్నా దయాక్షేత్రం ప్రాంగణంలో పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నియంత్రణ, కంట్రోల్ రూం వంటి అంశాలపై నిర్వాహకులతో చర్చించారు. పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు, నిర్వాహకులు అబ్రహం, జాన్‌వెస్లీ, అనీల్, సీఐ అచ్చియ్య పాల్గొన్నారు. నేడు మద్యం దుకాణాలకు లాటరీ నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం గీత కులాలకు మద్యం దుకాణాలను కేటాయిస్తున్నట్లు ఎకై ్సజ్ ఈ.ఎస్ మణికంఠ బుధవారం తెలిపారు. జిల్లాలో గీత కులాలకు కేటాయించిన 13 మద్యం దుకాణాలకు 199 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. కలెక్టర్ అరుణ్‌బాబు ఆధ్వర్యంలో లాటరీ పద్ధతి ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు జరుగుతుందన్నారు. దరఖాస్తు దారులంతా హాజరై లాటరీలో మద్యం దుకాణం దక్కించుకొన్న వారు ప్రభుత్వం నిర్ధారించిన సొమ్ము చెల్లించాలన్నారు. ప్రపంచబ్యాంక్ బృందం పర్యటన తాడికొండ: రాజధాని అమరావతిలో నిపుణులతో కూడిన ప్రపంచ బ్యాంక్ బృందం బుధవారం పర్యటించింది. రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రపంచ బ్యాంక్ బృందం నిర్దేశించిన కార్యక్రమాల అమలు, వాటి నిర్వహణ రూపకల్పనపై చర్చ జరిపింది. నీటి నిర్వహణ ప్రాజెక్టులు, పర్యావరణ, సామాజిక రక్షణకు రూపొందించిన కార్యకలాపాలు, ప్రొక్యూర్మెంట్ విషయాలపై ఏపీ సీఆర్డీయే అధికారులతో బృంద సభ్యులు మాట్లాడారు. కార్యక్రమంలో ప్రపంచ బ్యాంక్ కో టాస్క్ టీం లీడర్ గెరాల్డ్ ఒలీవర్ తదితరులు ఉన్నారు. రెడ్‌క్రాస్ ప్యాట్రన్ సభ్యత్వం బాపట్ల : ఇండియన్ రెడ్‌క్రాస్ జిల్లా ప్యాట్రన్ సభ్యత్వం 24 మందికి ఇవ్వటం ఎంతో సంతోషకరమని బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి పేర్కొన్నారు. ఈ మేరకు రూ.6.02 లక్షల చెక్కును రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ నారాయణభట్టుకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గ్లోరియా, రెడ్‌క్రాస్ బృందం సభ్యులు పాల్గొన్నారు. జిల్లాలో రెడ్‌క్రాస్ సేవలు విస్తృతం చేయాలని సూచించారు. పోలీసుల నుంచి తప్పించుకోబోయి వ్యక్తి మృతి నరసరావుపేట టౌన్: పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు లాడ్జి పైనుంచి దూకి వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి పట్టణంలో చోటు చేసుకుంది. టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తెలంగాణ రాష్ట్రం తుకారాంగేట్‌కు చెందిన రాములు నాయక్ గుంటూరు పరిసరాల్లో జరిగిన చోరీల్లో అనుమానితుడిగా భావిస్తున్నారు. నరసరావుపేట కోర్టుకు వాయిదాకి వచ్చినట్లు తెలుసుకున్నారు. అనంతరం బస్టాండ్ సమీపంలోని లాడ్జికి వెళ్లాడు. గుంటూరు నుంచి వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాత్రూంకు వెళ్లి వస్తానని చెప్పి కిటికీలో నుంచి కిందకు దిగే ప్రయత్నం చేశాడు. ప్రమాదవశాత్తు జారి మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సహకార సంఘాల ద్వారా వ్యాపారాలు చేపట్టాలి
బాపట్ల: జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి కో–ఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సంఘాల ద్వారా గిడ్డంగుల నిర్వహణ చేపట్టాలన్నారు. అలాగే పెట్రోల్ బంకులు, ఫెర్టిలైజర్స్, జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేయాలని సూచించారు. సొసైటీల్లో రికార్డుల కంప్యూటరీకరణ పూర్తిచేయాలని చెప్పారు. అనంతరం సహకార సంఘాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా సహకార అధికారి సి.హెచ్.శ్యాంసన్, వ్యవసాయ శాఖ జేడీ రామకృష్ణ, పశుసంవర్ధకశాఖ జేడీ వేణుగోపాల్, గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ సీఈఓ ఫణి కుమార్, ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సీఈఓ బిందు తదితరులు పాల్గొన్నారు. సమర్థంగా ఆధార్‌కార్డుల నవీకరణ ఆధార్ కార్డుల నవీకరణ ప్రక్రియను జిల్లాలో సమర్థంగా చేపడుతున్నట్టు కలెక్టర్ జె.వెంకట మురళి ఆదేశించారు. ఆధార్ కార్డుల నమోదు, నవీకరణ ప్రక్రియపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్లో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మార్గదర్శకాలను వివరించారు. మహిళా దినోత్సవాన్ని నిర్వహిద్దాం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని బాపట్ల జిల్లాలో వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ జె.వెంకట మురళి చెప్పారు. మహిళా దినోత్సవం ఏర్పాట్లపై అనుబంధ శాఖల జిల్లా అధికారులతో బుధవారం కలెక్టరేట్లో ఆయన సమీక్షించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ విఠలేశ్వర్, డీఆర్డీఏ పీడీ పద్మ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, మోడల్ అధికారి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ జె.వెంకట మురళి -
పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేద్దాం
బాపట్ల : పర్యాటక ప్రాంతంగా బాపట్ల జిల్లాను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ దిశగా కృషి చేయాలని పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ జిల్లా కలెక్టర్‌కు సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పర్యాటకశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తక్కువ సమయంలో మెరుగుపరచడానికి, జీడీపీ వృద్ధి రేటును పెంచడానికి సులువైన మార్గంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అజయ్ జైన్ తెలిపారు. చీరాలలో చేనేత చీరల తయారీ విధానం గురించి, జీడిపప్పు ప్రాసెసింగ్ గురించి, రొయ్యల ప్రాసెసింగ్ గురించి కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో ఆరుబీచ్లు : కలెక్టర్ జె.వెంకట మురళి జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి మాట్లాడుతూ, బాపట్ల జిల్లాలో మొత్తం ఆరు బీచ్‌లు ఉన్నాయని తెలిపారు. చీరాల ఓడరేవు, పాడురంగాపురం, సూర్యలంక, విజయలక్ష్మీపురం, రామాపురం, పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్‌లు ఉన్నాయని వివరించారు. పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ -
మహిళల గోప్యతకు డిజిటల్ భద్రత అవసరం
జిల్లా అడిషనల్ ఎస్పీ టి.పి. విఠలేశ్వర్ బాపట్లటౌన్: సమాజ పరిస్థితులపై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్ తెలిపారు. మహిళ సాధికార వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో మంగళవారం వక్తృత్వ పోటీలు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో మహిళల గోప్యతకు డిజిటల్ భద్రత అవసరం, ఆత్మరక్షణ అనేది ఒక ఎంపిక కాదు అవసరం, మహిళలకు సురక్షితంగా పనిచేసే ప్రదేశం–వేధింపులపై మౌనాన్ని వీడడం, బహిరంగ ప్రదేశాల్లో మహిళలు సురక్షితం–సవాళ్లు వాటి పరిష్కారాలు, మహిళల భద్రతకు భరోసా ఇవ్వడంలో పురుషుల పాత్ర అనే అంశాలపై వక్తృత్వ పోటీలను నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వక్తృత్వ పోటీలలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. విజేతలుగా నిలిచిన వారికి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బహుమతులు అందజేయనున్నామన్నారు. మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సాధించిన ప్రగతి గురించి అవగాహన కల్పించడం, మహిళల హక్కులు, సమానత్వం, భద్రత, రక్షణ కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలను తెలియజేయడం, మహిళల శక్తిని, మానసిక స్థైర్యాన్ని, స్వీయ రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని ఆయా పోలీస్స్టేషన్ల సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక
బాపట్ల: బాపట్ల మున్సిపల్ హైస్కూలులో మంగళవారం ఉమ్మడి గుంటూరు జిల్లా కబడ్డీ సబ్ జూనియర్ బాలబాలికల జట్ల ఎంపిక నిర్వహించారు. ఎంపికై న జట్లు ఈనెల 14,15,16 తేదీలలో కడప జిల్లాలో జరిగే అంతర జిల్లాల కబడ్డీ పోటీల్లో పాల్గొంటాయని గుంటూరు జిల్లా (కబడ్డీ) సెక్రటరీ మంతెన సుబ్బరాజు తెలిపారు. బాలికల జట్టులో జె.ప్రవల్లిక, సారిక, కీర్తి, హాసిని, సలోమి, ఆసిఫా, అమూల్య, శ్రావ్య (నరసాయపాలెం), కీర్తన(పేరలి), అంజలి, భార్గవి (నిజాంపట్నం), మౌనిక, దుర్గ, యామిని (ఎంపీపాలెం), బాలుర జట్టు ఎస్.హేమంత్, జ.మహిమరాజు, ఎస్.కె జుబెల్, కె.మణికంఠరెడ్డి, శ్రీనివాసులు, ప్రభు, ప్రశాంత్ (మునిసిపల్ హైస్కూల్, బాపట్ల), సాయి హర్షవర్ధన్ రెడ్డి, నాగభూషణ్, తేజ, చిన్న అయ్యప్ప (కర్లపాలెం), సుబ్బారావు, పోల్‌రెడ్డి (పేరలి), ప్రేమ్‌చంద్, మణి (దాచేపల్లి)లను ఎంపిక చేశారు. కార్యక్రమంలో పీడీలు కత్తి శ్రీనివాసరావు, ఎన్.కుటుంబరావు, పి. శైలజ, కోచ్ తిరుపతమ్మ (పి.ఈ.టి) ఎం.సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి
ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు రేపల్లె రూరల్: సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దటంలో ప్రతి ఒక్కరూ సహకారం ఎంతో అవసరమని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ బాపట్ల జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లు చెప్పారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా మండలంలోని గుడ్డికాయలంక గ్రామంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నాటుసారా తయారీ, విక్రయాలను సమూలంగా రూపుమాపేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. నాటుసారా తయారు చేసినా, విక్రయాలు జరిపినా నేరమని తెలిపారు. నాటుసారా సేవనంతో అనేక దుష్పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత కాలంలో యువత డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటుపడి తమ జీవితాలను పాడుచేసుకుంటోందన్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులు ఎటువంటి దుర్వసనముల పాలు కాకుండా ఉండేలా ఉండాలంటే ముందు తాము సత్పప్రవర్తనతో కూడిన మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. గ్రామంలో నాటుసారా తీసుకోవటంతో కలిగే నష్టాలను వివరిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రేపల్లెలోని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయం తనిఖీలు నిర్వహించి రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో రేపల్లె ఎకై ్సజ్ సీఐ దివాకర్, ఎన్ఫోర్స్మెంట్ సీఐ రామారావు, ఎస్ఐ రాజశ్రీ, వీఆర్వో హరీష్, మహిళా పోలీసు శ్రావణి, పేరం విష్ణు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. -
బెదిరింపులు మంచి పద్ధతి కాదు
ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి మేకల ప్రసాద్ బాపట్లటౌన్: పేదల విముక్తి పోరాటానికి నాయకత్వం వహించే నాయకుల్ని హత్య చేస్తామని బెదిరించడం విప్లవోద్యమానికి ద్రోహం చేయడమేనని అఖిలభారత రైతుకూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర కార్యదర్శి మేకల ప్రసాద్ అన్నారు. బాపట్లలోని డ్రైవర్స్ కాలనీలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రసాద్ మాట్లాడుతూ చంద్రన్న పార్టీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారన్నారు. ఈ పద్ధతి మానుకొని ప్రజా ఉద్యమ నిర్మాణానికి పోటీ పడాలన్నారు. బాపట్లలోని మాజీ ఎంపీ మాదాల నారాయణస్వామి కాలనీలో ప్రజలు చంద్రన్న నాయకత్వాన్ని ధిక్కరిస్తే నాదెండ్ల బ్రహ్మయ్యకు పట్టిన గతే ప్రసాద్‌కు పడుతుందని కాలనీలో సమావేశాలు పెట్టి హెచ్చరించడం విప్లవ నిబంధనలను ఉల్లంఘించడమే అన్నారు. చంద్రన్న విప్లవ విధానాలను విడిచిపెట్టి ఆర్థిక నేరాలు, భూ పంచాయతీలు, భూమి కొనుగోలు, హత్యలు చేయడం సిగ్గుచేటన్నారు. చంద్రన్న నాయకత్వంలోని న్యూ డెమోక్రసీ పార్టీని రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు వీడి మాతృ సంస్థ అయిన సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీతో చర్చలు జరిపి ఐక్యమయ్యారన్నారు. ఈ అక్కసుతోనే బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. దానిలో భాగంగా మా ఇంటికి వచ్చి బెదిరింపు చర్యలకు పాల్పడ్డారన్నారు. ఈ విషయాన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విప్లవ శ్రేణులు ఖండించాలన్నారు. సమావేశంలో పీవోడబ్ల్యూ బాపట్ల మండల అధ్యక్షులు కొండా అన్నమ్మ, డివిజన్ కార్యదర్శి మువ్వల పల్లవి పాల్గొన్నారు. -
షూటింగ్ బాల్లో చింతాయపాలెం విద్యార్థికి బంగారు పతకం
చింతాయపాలెం(కర్లపాలెం): సౌత్ జోన్ నేషనల్ షూటింగ్ బాల్ పోటీలలో తమ పాఠశాల 9వ తరగతి విద్యార్థి పిట్లు చిన్నయ్యప్పరెడ్డి మెరుగైన ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించాడని చింతాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం తోట వెంకటరాజు తెలిపారు. మంగళవారం పాఠశాలలో క్రీడాకారులైన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. హెచ్ఎం వెంకటరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా ఎన్జి కాలేజీలో జరిగిన నాల్గవ సౌత్ జోన్ నేషనల్స్ షూటింగ్ బాల్ పోటీలలో ఏపీ జట్టు తరపున జూనియర్స్ విభాగంలో చిన్నయ్యప్పరెడ్డి ఆడి బంగారు పతకం సాధించాడని తెలిపారు. 8వ తరగతి విద్యార్థిని యల్లావుల సలోమి అండర్ –14 బాలికల విభాగంలో విజయవాడలో జరిగిన ఫెన్సింగ్ పోటీలలో పాల్గొని తృతీయస్థానం సాధించిందని తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం.గోపీని ఉపాధ్యాయులు అభినందించారు. మిర్చి యార్డులో 1,27,375 బస్తాల విక్రయం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకు మంగళవారం 1,25,574 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,27,375 బస్తాలు అమ్మకాలు జరిగాయి. ఈ సీజన్లో ఈ స్థాయిలో మిర్చి బస్తాలు రావడం ఇదే ప్రథమం. శని, ఆదివారాలు మార్కెట్ యార్డుకు సెలవు కావడంతో ఆదివారం రాత్రి నుంచే వాహనాల్లో మిర్చి బస్తాలను తీసుకురాగా యార్డు నిండిపోయింది. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,000 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 70,117 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. -
నోడల్ ఆఫీసర్ మాధురీ సిఫోరా
బాలికల అభ్యున్నతికి చదువే కీలకం స్వర్ణ (కారంచేడు): బాలికల అభ్యున్నతికి వారికి అవసరమైన మంచి చదువే కీలకమని.. ఆశా నోడల్ ఆఫీసర్ మాధురీ సిఫోరా అన్నారు. మండలంలోని స్వర్ణ పీహెచ్సీ ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన ఆశాడే కార్యక్రమంలో ఆమె ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలతో మాట్లాడారు. ఈ నెలలో నిర్వహించనున్న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ఈ అంశంపై ప్రస్తావించిందన్నారు. గ్రామాల్లో బాలికలకు చదువును దూరం చేయవద్దన్నారు. వారు చదువుకోవడం వలన వారి భవిష్యత్‌కు పునాదులు వేసుకోగలుగుతారన్నారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారన్నారు. వివాహం కూడా సరైన వయస్సు వచ్చిన తర్వాతనే చేయాలన్నారు. అప్పుడే వారిలో పరిపక్వత ఉంటుందన్నారు. తద్వారా వారి కుటుంబాన్ని వారు చక్కదిద్దుకోగలుతారన్నారు. అలాగే గర్భిణులుగా ఉండే సీ్త్రలలో రక్తహీనత లేకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ వీ నాగేశ్వరరావు, హెచ్ఈ మీనాకుమారి, ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా పీటీడీ ఎస్సీ,ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక బాపట్ల: ఏపీపీటీడీ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ బాపట్ల జిల్లా నూతన కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. జిల్లాలోని అన్ని డిపోల నుంచి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులుగా రాజేష్, సెక్రటరీగా ఎస్.విజయలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కృపాదనంలను ఎన్నుకున్నారు. ఆర్టీసీ డిపోల పరిధిలోని కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు అసోసియేషన్ కృషి చేస్తుందని అధ్యక్షులు రాజేష్ పేర్కొన్నారు. పసుపు ధరలు దుగ్గిరాల: స్థానిక పసుపు యార్డులో మంగళవారం 66 బస్తాలు వచ్చాయి. పసుపు మొత్తం అమ్మకం చేసినట్లు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి శ్రీనివాసరరావు ఒక ప్రకటనలో తెలిపారు. కొమ్ములు 43 బస్తాలు వచ్చాయి. వాటి గరిష్ట ధర రూ.8,500 కాగా కనిష్ట ధర రూ.8,300, మోడల్ ధర రూ.8,500 పలికింది. కాయలు 23 బస్తాలు వచ్చాయి. గరిష్ట ధర రూ.8,500, కనిష్ట ధర రూ.8,300, మోడల్ ధర రూ.8,500, మొత్తం 49 క్వింటాళ్లు అమ్మకాలు జరిగినట్లు ఆయన తెలిపారు. -
గురుకులంలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలి
చెరుకుపల్లి: కావూరులోని గురుకుల బాలికల విద్యాలయంలో ప్రవేశం కోసం విద్యార్థినిల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బాలికల గురుకుల విద్యానిలయం కావూరు ప్రిన్సిపాల్ పి.నాగమణి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025–26 విద్యాసంవత్సరానికి విద్యార్థినిలు 5వ తరగతిలో చేరేందుకు, 6, 7, 8 తరగతుల్లో మిగిలిన ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. ఆసక్తి కలిగిన బాలికలు మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థినిలకు ఏప్రిల్ 25వ తేదీన ప్రవేశపరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం విద్యానిలయంలో సంప్రదించాలని కోరారు. వదినపై మరిది కత్తితో దాడి ఆస్తి తగాదాలే హత్యాయత్నానికి కారణం దగ్గుబాడు (కారంచేడు): కొన్నేళ్లుగా రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న ఆస్తి తగాదాలు హత్యాయత్నానికి దారితీశాయి. ఈ ఘటన సోమవారం రాత్రి జరగగా బాధితురాలు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్సై వీ వెంకట్రావు వివరాల మేరకు.. మండలంలోని దగ్గుబాడు గ్రామానికి చెందిన నాయుడు హనుమంతరావు, నాయుడు శ్రీరామమూర్తి అలియాస్ రాంబాబులు అన్నదమ్ములు. వీరి మధ్యన పొలానికి సంబంధించిన ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. గతంలో ఒకసారి నిందితుడు రాంబాబుపై కేసు నమోదైంది. ఈ క్రమంలో సోమవారం పెద్దల సమక్షంలో రాజీ ప్రయత్నం చేశారు. కానీ రాజీ కాలేదు. దీంతో కోపంలో ఉన్న రాంబాబు తన అన్న హనుమంతరావు భార్య (వదిన) విజయలక్ష్మిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో విజయలక్ష్మి చేతికి, తలకు మరికొన్ని చోట్ల గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో సోమవారం అర్ధరాత్రి కేసు నమోదైంది. నిందితుడిగా ఉన్న రాంబాబును ఎస్సై మంగళవారం అరెస్ట్ చేసి పర్చూరు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. ఆర్మీ జవానుపై కేసు చీరాల: ప్రేమించి పెళ్లి చేసుకొని ఓ బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డ తనకు పుట్టలేదని భార్యను వేధిస్తూ పుట్టింటికి పంపించివేయడంతో భార్య ఫిర్యాదు మేరకు ఈపూరుపాలెం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెదుళ్లపల్లికి చెందిన లక్ష్మారెడ్డి కావూరివారిపాలేనికి చెందిన కొచ్చెర్ల సుధారాణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక చిన్న బాబు పుట్టాడు. అయితే మొదటి నుంచి భార్యను వదిలించుకోవాలని చూస్తున్న ఆర్మీ జవాను ఆ బిడ్డ తనకు పుట్టలేదని అనుమానించి ఆమె పుట్టింటి వద్ద వదిలేసి వెళ్లాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్మీ జవాను లక్ష్మారెడ్డిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మానవతా నాడి ‘పట్టా’లి
స్టెతస్కోప్ చెవిన పెట్టకుండానే లబ్‌డబ్ సవ్వడి వీనులను తాకిందా.. మది నిండా ఉప్పొంగిన భావోద్వేగం ఆనందబాష్పమై కురిసిందా.. ఆరేళ్ల శ్రమ కనుల వేడుకై మెరిసిందా.. ఎన్నాళ్లో వేచిన హృదయం ‘పట్టా’భిషిక్తమై మురిసిందా.. అన్నట్టు గుంటూరు వైద్యకళాశాల సంతోషాల వేదికై ంది. గ్రాడ్యుయేషన్ డే ఉత్సాహంతో ఉప్పొంగింది. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆత్మీయ ఆలింగనాలతో నవ్వులు చిలికింది. ఈ సంబరమంతా తళుకులీని కెమెరాల్లో అందంగా బందీయైంది. రోగులపై దయ చూపాలి డీఎంఈ డాక్టర్ నరసింహం ఉత్సాహంగా వైద్య కళాశాల 74వ గ్రాడ్యూయేషన్ డే -
ఆధునిక సేంద్రియ పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలి
డీన్ డాక్టర్ పి.ప్రసూనరాణి బాపట్ల: జొన్నలు, సజ్జలు, రాగులు వంటి చిరుధాన్యాలను ఆధునిక సేంద్రియ పద్ధతుల ద్వారా పండించడంలో రైతులకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ప్రసూనరాణి అన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ చిరుధాన్య దిగుబడిని సాధించేరీతిగా రైతులను చైతన్యవంతం చేయడానికి హైదరాబాదులోని జాతీయ చిరుధాన్యాల ఉత్పత్తి కేంద్రంలో అవగాహన సదస్సు ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఎక్కువ పోషక విలువలు కలిగి ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే చిరుధాన్యాల సాగు ఆధునిక సమాజానికి ఎంతో మేలు చేకూరుస్తుందన్నారు. సాగుపట్ల అవగాహన పెంపొందించేందుకు ఆసక్తి గల కొందరు రైతులను ఎంపిక చేసి ఆ సదస్సులో పాల్గొనేందుకు బాపట్ల వ్యవసాయ కళాశాల అవకాశం కల్పించిందన్నారు. రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సులో ఈ ప్రాంత రైతులు పాల్గొని చిరుధాన్యాల పంటల ఉత్పత్తి, నాణ్యతపై అవగాహన పెంచుకొన్నారన్నారు. నాణ్యమైన విత్తనాల ఎంపిక, ఉత్పత్తి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడంలోని ఆవశ్యకతను తెలియజేసేందుకు ఈ సదస్సు దోహదపడిందన్నారు. వ్యవసాయ కళాశాల తరపున ప్రొఫెసర్ డాక్టర్ లాల్ అహమ్మద్ మొహమ్మద్ ఆధ్వర్యంలో డాక్టర్ జి.వినయ్‌కుమార్, డాక్టర్ ఎన్.కిరణ్‌కుమార్‌లు సదస్సులో పాల్గొన్నట్లు ఆమె తెలిపారు. -
రెండున్నర సవర్ల బంగారం చోరీ
నూతలపాడులో దొంగతనం పర్చూరు(చినగంజాం): తాళం వేసిన ఇంట్లోకి చొరబడి దుండగులు బంగారాన్ని అపహరించారు. ఈఘటన మండలంలోని నూతలపాడు ఎస్సీ కాలనీలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎస్సీకాలనీకి చెందిన నూకతోటి బెంజిమన్ నూతలపాడు సెంటర్లో నూడిల్స్ బండితో వ్యాపారం చేసుకుంటూ జీవనం చేస్తుంటాడు. మధ్యాహ్నం సెంటర్‌కు వెళితే తిరిగి రాత్రి 11 గంటలకు మాత్రమే ఇంటికి తిరిగి వస్తుంటాడు. సోమవారం ఎప్పటి లాగానే ఇంటికి తాళాలు వేసి బండి దగ్గరికి వెళ్లాడు. రాత్రి ఇంటికి వెళ్లిన సమయానికి తలుపులు తెరచి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడేసి కన్పించాయి. బీరువాలోని బంగారం వస్తువులు కనిపించకపోవడంతో ఒక్కసారిగా బిత్తరపోయాడు. రెండున్నర సవర్ల బంగారం దొంగతనానికి గురైందని గ్రహించాడు. దాంతో అతడు పర్చూరు పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ మాల్యాద్రి ఇంటి పరిసరాలను పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఎదురెదురుగా బైకుల ఢీ నలుగురికి గాయాలు కారంచేడు: ఎదురెదురుగా వేగంగా రెండు ద్విచక్రవాహనాలు ఢీకొట్టుకోవడంతో నలుగురికి గాయాలయ్యాయి. ఈఘటన మంగళవారం వాడరేవు–పిడుగురాళ్ల ప్రధాన రహదారిలో కారంచేడు యార్లగడ్డ నాయుడమ్మ ఉన్నత పాఠశాల సమీపంలోని ఆదిపూడి రోడ్డు వద్ద జరిగింది. ఎస్సై వీ వెంకట్రావు వివరాల మేరకు.. చీరాల జాండ్రపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు అవిశాయిపాలెం వెళ్లి చేతికి అయిన గాయంకు కట్టుకట్టించుకొని తిరిగి చీరాలకు ద్విచక్రవాహనంపై వస్తున్నారు. ఈ క్రమంలో జాగర్లమూడికి చెందిన ఇద్దరు వ్యక్తులు వ్యక్తిగత పనులపై చీరాల వచ్చి తిరిగి జాగర్లమూడి వెళ్తున్నారు. రెండు వాహనాలు ఎదురెదురెదుగా వేగంగా వస్తూ అదుపుతప్పి ఢీకొన్నాయి. దీంతో వాహనంపై ఉన్న ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కారంచేడు ఏఎస్ఐలు బీ శేషసాయి, మధుబాబులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి సహకారంతో 108 వాహనంలో చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వివరాలు నమోదు చేశారు. పూర్తి వివరాలు వచ్చిన తరువాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య పర్చూరు (చినగంజాం): మండలంలోని రమణాయపాలెం గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎన్నిరెడ్డి శ్రీనివాసరెడ్డి (34) ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి బంధువుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆయన తన భార్య వాసవితో కలిసి నివాసముంటున్నాడు. వారికి ఒకటిన్నర ఏడాది వయసు కలిగిన పాప కూడా ఉంది. ప్రస్తుతం భార్య గర్భిణి కావడంతో నెల రోజుల కిందట నూతలపాడు గ్రామంలోని తన పుట్టింటికి వచ్చి ఉంటోంది. దాంతో అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటున్న శ్రీనివాసరెడ్డి తాను నివాసముంటున్న అపార్ట్మెంట్లో ఉరివేసుకొని మృతి చెందినట్లు మంగళవారం కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందింది. హైదరాబాద్‌లో పోస్టుమార్టుం అనంతరం మృతదేహాన్ని బుధవారం గ్రామానికి తీసుకురానున్నట్లు బంధువులు తెలిపారు. అతని మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. -
మద్యం మత్తులో వ్యక్తిపై కత్తితో దాడి
మార్టూరు: మద్యం మత్తులో ఓ వ్యక్తిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈఘటన మండలంలోని ద్రోణాదుల గ్రామంలో మంగళవారం జరిగింది. అందిన వివరాల మేరకు.. గ్రామంలోని ప్రభుత్వ వైన్స్ షాప్ ఎదురుగా గల బాషా రెస్టారెంట్ పేరుతో ఓ మహిళ బెల్ట్ షాపు నిర్వహిస్తోంది. అదే గ్రామానికి చెందిన ముప్పరాజు చిన్నా, షేక్ జాన్ అనే ఇద్దరు వ్యక్తులు రెస్టారెంట్లో కూర్చుని మద్యం తాగుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రారంభమైన స్వల్ప వివాదం పెరిగి ఘర్షణకు దారితీసింది. మద్యం మత్తులో క్షణికావేశానికి గురైన జాన్ రెస్టారెంట్లో ఉన్న కత్తి తీసుకొని మొదట చిన్నాను కాలితో బలంగా తన్నాడు. ఆ ధాటికి చిన్నా రెస్టారెంట్ బయట గల బురదలో పడగా జాన్ చిన్నా వెంటపడి కత్తితో తలపై బలంగా దాడి చేయడంతో గాయమైంది. జాన్ అంతటితో ఆగక చిన్నా మెడపై కత్తి పెట్టి కోసే ప్రయత్నం చేశాడు. అప్పటి వరకు ఈ తతంగాన్ని గమనిస్తున్న స్థానికులు ఒక్కసారిగా అప్రమత్తమై జాన్‌ను చుట్టిముట్టి అతని చేతిలోని కత్తిని బలవంతంగా లాక్కొని విడిపించారు. అనంతరం జాన్‌కు దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు జాన్‌ను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధితుడు చిన్నాను చికిత్స నిమిత్తం మార్టూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కోలలపూడి గ్రామానికి చెందిన 8 మంది యువకులు జొన్నతాళి సెంటర్లోని సూర్య దాబా నిర్వాహకులు ముగ్గురిపై మద్యం మత్తులో బీరు సీసాతో కొట్టి ధ్వంసం చేసి వారం రోజులు కూడా గడవక ముందే ద్రోణాదులలో ఈ ఘటన జరగటం మండలంలో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. గొంతుకోసే యత్నం చేసిన దుండగుడు అడ్డుకుని దేహశుద్ది చేసిన స్థానికులు ద్రోణాదుల బెల్ట్ షాపులో ఘటన -
డ్రిప్‌తో నీటి ఆదా..
ప్రతి సాలుకు ప్రత్యేకంగా అమర్చిన డ్రిప్ పద్ధతి ద్వారా నీటి సరఫరాతో పాటు వీరు స్వయంగా గోమూత్రం, ఆవు పేడ, ఆవుపాలు, ఆవు పెరుగు, నెయ్యి తదితర పదార్థాలతో తయారు చేసిన ద్రవ, ఘన జీవామృతాలు, పంచగవ్య తదితర కషాయాలను డ్రిప్ ద్వారా మొక్కలకు సరఫరా చేయడంతో ప్రతి పంట పెరిగి పచ్చదనం, పర్యావరణానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది. సిబ్బంది మండల టీం లీడర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో వీరు పండించిన కూరగాయలు ఆకుకూరలను ప్రస్తుతం బొల్లాపల్లి, కోలాలపూడి, దర్శి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలతో పాటు కోనంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మధ్యాహ్న భోజన నిర్వాహకులకు మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకే సరఫరా చేయటం గమనార్హం. ప్రతి సోమవారం మండల రెవెన్యూ కార్యాలయం వద్ద సిబ్బంది స్వయంగా స్టాల్ ఏర్పాటు చేసి స్థానికులకు, ఉద్యోగులకు తాము పండించిన కూరగాయలు విక్రయిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. బొల్లాపల్లికి చెందిన గృహిణి అడ్డగడ సుజాతను వీరు అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ తమ ఇంటి ముందు పెరట్లో 16 రకాల ఆకుకూరలు, కూరగాయలతో కూడిన న్యూట్రి గార్డెన్ గ్రామస్తులకు ఆదర్శంగా నిలుస్తోంది. కేవలం ప్రకృతిలో లభించే పదార్థాలతో వీరు తయారు చేసిన ఘన, ద్రవ జీవామృతాలు, పుల్లటి మజ్జిగ, కోడిగుడ్డు, నిమ్మరసం, తదితర పదార్థాలతో ప్రకృతి సేద్యాన్ని రైతులతో పాటు స్థానిక మహిళలకు అవగాహన కల్పిస్తున్న సిబ్బంది శివశంకర్, రెహమాన్ బి, వైష్ణవి, శ్రీనివాసరావు, రాజేశ్వరి,శశికళ లను రైతులు రైతు సంఘం నాయకులు అభినందిస్తున్నారు. -
విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత ఎస్వీఆర్ఎం కళాశాలదే
నగరం: తీరప్రాంతంలో ఎంతో మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత శ్రీవెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాలదేనని రాష్ట్ర రెవెన్యూ ఽశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. స్థానిక ఎస్వీఆర్ఎం కళాశాల వ్యవస్థాపక దినోత్సవంలో మంత్రి అనగాని పాల్గొని మాట్లాడారు. 1969లో వెలగపూడి రామకృష్ణ నగరంలో కళాశాలను స్థాపించారన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కళాశాలలో విలువలతో కూడిన విద్యను అందింస్తున్నట్లు తెలిపారు. కళాశాలలో విద్యను అభ్యసించిన ఎంతో మంది ఉన్నత స్థానాలలో ఉన్నారన్నారు. కళాశాల సేవలను ఈ ప్రాంతంలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలన్నారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వల్లభనేని బుచ్చియ్యచౌదరి, ప్రిన్సిపాల్ హరికృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ -
ఇంటింటా ప్రకృతి సేద్యపు పంట
మార్టూరు: అరెకరా భూమిలో ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా రుచికరమైన 26 రకాల కూరగాయల పంటలను ప్రయోగాత్మకంగా పండిస్తున్నారు మండల ప్రకృతి సేద్యపు సిబ్బంది. మండలంలోని బొల్లాపల్లి గ్రామానికి చెందిన పల్లపు శ్రీనివాసరావు భూమిలో చేస్తున్న ఈ ప్రయోగం స్థానిక రైతులను, మహిళలను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ భూమిలో సిబ్బంది 11 రకాల ఆకుకూరలు, ఆరు రకాల దుంప జాతి, ఏడు రకాల కూరగాయలు, బంతి, ఆముదం వంటి ఎర్ర పంటలను అంతర పంటలుగా సాగుచేస్తూ ఔరా అనిపిస్తున్నారు. ప్రధాన పంటగా కాకర పాదులు నేలపై పాకే విధంగా కాకుండా ఫెన్సింగ్ పైకి అల్లుకునే విధంగా సాగు చేస్తూ ఒక్కో సాలుకు మధ్య పది అడుగుల భూమిని వదిలారు. కొన్ని సాళ్ల మధ్య క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బీన్స్, అనప, పప్పు చిక్కుడు వంటి కూరగాయలు సాగు చేస్తున్నారు. మరికొన్ని సాళ్ల మధ్యలో పాలకూర, చుక్కకూర, మెంతికూర, కొత్తిమీర, గోంగూర, తోటకూర వంటి 11 రకాల ఆకుకూరలతోపాటు ఎర్ర పంటలైన బంతిపూలు, ఆముదం చెట్లు సాగు చేస్తున్నారు. దుంప జాతి రకాలైన ముల్లంగి, క్యారెట్, బీట్ రూట్, చిలగడ దుంపలు తదితర ఆరు రకాల మొక్కలతో నోరూ రిస్తున్న పంటలను స్థానిక రైతులు ఆదర్శంగా తీసుకొని తమ ఇంటి పెరట్లో సైతం ఇలాంటి పంటలను సాగు చేయడం గమనార్హం. అర ఎకరం భూమిలో 26 రకాల పంటలు 16 రకాల న్యూట్రి గార్డెన్ ఏర్పాటు చేసిన మహిళ సుజాత అవగాహన కల్పిస్తున్న సిబ్బంది మార్కెటింగ్ సదుపాయంకల్పించాలిరైతులు, ప్రకృతి సేద్యపు సిబ్బంది క్షేత్రస్థాయిలో కష్టపడి పండిస్తున్న పంటలకు ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయం కల్పించి గిట్టుబాటు ధరలు కల్పిస్తే ప్రజలకు రసాయనిక రహిత ఆరోగ్యకరమైన కూరగాయలు ఆకుకూరలు అందించవచ్చు. ఆసక్తి గల రైతులు విధానాన్ని పాటించాలి. – వీరవల్లి కృష్ణమూర్తి, మండల రైతు సంఘం అధ్యక్షుడు. -
కిక్కిరిసినఆడిటోరియం
వైద్య విద్యార్థుల డిగ్రీ పట్టాల వేడుకలను కనులారా వీక్షించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఫలితంగా వైద్య కళాశాల ఆవరణం, కళాశాల ఆడిటోరియం కిక్కిరిసిపోయింది. గ్రాడ్యుయేషన్‌డే సందర్భంగా కళాశాలను సుందరంగా తీర్చిదిద్దారు. ఎక్కువగా రైతు కుటుంబాలకు చెందిన పిల్లలు వైద్యులుగా డిగ్రీ తీసుకుంటున్న నేపథ్యంలో ఈ కమనీయ దృశ్యాలను వీక్షించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేకంగా వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లను పెట్టుకుని హాజరవడం అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులు డిగ్రీ పట్టాలు చేతపట్టుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కళాశాల ప్రాంగణంలోనే ఫొటోలు దిగి మురిసిపోయారు. -
రూ.2 కోట్ల నిధులు వృథా
వేటపాలెం: గ్రామీణ క్రీడాకారులకు నిరంతరం శిక్షణ ఇచ్చి వారిని ప్రోత్సహించడానికి ఏడేళ్ల కిందట రూ.2 కోట్ల నిధులతో నిర్మించిన కేంద్రం ప్రారంభానికి నోచుకోక నిరుపయోగంగా ఉండిపోయింది. దీనికి ఖర్చు చేసిన రూ.2 కోట్లు వృథాగా మిగిలిపోయాయని క్రీడాకారులు విమర్శిస్తున్నారు. 2017 మార్చిలో పందిళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో స్టేడియం ఏర్పాటుకు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. అప్పట్లో దీని నిర్మాణానికి రూ.2 కోట్ల నిధులు కేటాయించారు. ఆ నిధులతో ఇండోర్ స్టేడియం నిర్మించారు. అప్పట్లో పనులు వేగవంతంగా సాగాయి. తరువాత పనులు నిలిచిపోయాయి. షటిల్ బ్యాడ్మింటన్ కోర్టుతోపాటుగా క్రీడాకారుల కోసం ప్రత్యేక గదులు, ప్రేక్షకుల కోసం గ్యాలరీ ఏర్పాటు చేయాల్సి ఉంది. మరుగుదొడ్లు నిర్మించి వదిలేశారు. ఇంకా సగానికి పైగా పనులు మిగిలి ఉన్నాయి. క్రీడా వికాస కేంద్రం నిర్మాణం పనులు ప్రారంభించి ఎనిమిదేళ్లు గడిచినా దాన్ని ఇంతవరకు పూర్తి చేయకపోవడంపై క్రీడాకారులు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు దీనిపై దృష్టి సారించి అసంపూర్తిగా ఉన్న క్రీడా ప్రాంగణ పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకు రావాలని క్రీడాకారులు కోరుతున్నారు. అసంపూర్తిగా క్రీడా వికాస కేంద్రం దుస్థితి ఏడేళ్లుగా ప్రారంభానికి నోచుకోని దుస్థితి పట్టించుకోని పాలకులు, అధికారులు -
లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చర్యలు
అద్దంకి: ఏ వైద్యశాలలోనైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో డాక్డర్ విజయమ్మ పేర్కొన్నారు. ఆమె మంగళవారం పట్టణంలోని గాజులపాలెం యూపీహెచ్సీ, కాకానిపాలెం యూపీహెచ్లను సందర్శించారు. ఆమె మాట్లాడుతూ ప్రైవేటు వైద్యశాలల్లో స్కానింగ్ క్వాలీటీ పెంచాలన్నారు. స్కానింగ్ సర్టిఫికెట్ రెన్యువల్‌ను సమయానికి విధిగా చేయించుకోవాలన్నారు. ఆశా కార్యకర్తల సమావేశంలో పాల్గొని విధులు బాధ్యతల గురించి వారికి వివరించారు. నిర్దేశించిన సర్వేలను, పనులను సకాలంలో పూర్తి చేయాలని చెప్పారు. సీడీ అండ్ ఎన్సీడీ సర్వేను పరిశీలించారు. పట్టణంలోని మూడు ప్రైవేట్ వైద్యశాలల రికార్డులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో గాజులపాలెం యూపీహెచ్సీ వైద్యాధికారి డాక్డర్ జయసింహా, కాకానిపాలెం వైద్యాధికారి హేమామాధవి, ఎంపీహెచ్‌ఈవో ఏ నాగేశ్వరరావు, సూపర్వైజర్ వీ వెంకాయమ్మ, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. డీఎంహెచ్‌వో విజయమ్మ -
ఆలపాటి గెలుపు
సాక్షిప్రతినిధి,గుంటూరు: కృష్ణా–గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు. మొత్తం తొమ్మిది రౌండ్ల కౌంటింగ్ జరగగా మొత్తం పోలైన ఓట్లు 2,41,774కి గాను 2,14,865 ఓట్లు చెల్లబాటయ్యాయి. 26,909 ఓట్లు చెల్లలేదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ 1,45,057 ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుకు 62,737 ఓట్లు వచ్చాయి. దీంతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 82,320 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందా రు. మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఈ విజయం దక్కించుకున్నారు. మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో ఉండగా మిగిలిన వారెవరూ కనీస పోటీ ఇవ్వలేదు. మూడోస్థానంలో ఉన్న అన్నవరపు ఆనందకిషోర్కు 860 ఓట్లు దక్కగా గౌతుకట్ల అంకమ్మరావుకు అత్యల్పంగా 26 ఓట్లు దక్కాయి. మంగళవారం గుంటూరు కలెక్టర్ చాంబర్లో కృష్ణా, గుంటూరు పట్టభధ్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, గుంటూరు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు ధ్రువీకరణ పత్రం అందించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ మల్లేశ్వరి పాల్గొన్నారు. 40శాతం మంది తొలిసారి ఓటర్లు ఎన్నికల్లో గెలుపొందిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో 40 శాతం మంది తొలిసారి ఓటు హక్కును ఉపయోగించుకున్నారని చెప్పారు. తనపై అసత్య ప్రచారం చేసినా ఓటర్లు గెలిపించారని పేర్కొన్నారు. సమస్యలపై శాసనమండలిలో గళం విప్పుతానని ఆలపాటి వివరించారు. దొంగఓట్లు, రిగ్గింగ్‌తో గెలిచారు పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఈ ఎన్నికల్లో దొంగ ఓట్లు, బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్‌లతో అధికార పార్టీ గెలిచిందని పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఆరోపించారు. ఫలితాల వెల్లడి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలను రాజకీయం చేసిందని, తనపై ప్రత్యర్థులు దుష్ప్రచారం చేశారని, ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాల మధ్య చీలిక తెచ్చారని, రూ.కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. అనేక చోట్ల ఎన్నికల రోజు, దొంగ ఓట్లు, అక్రమాలు చోటుచేసుకున్నాయని, దీనికి అధికార యంత్రాంగం కూడా సహకరించిందని ధ్వజమెత్తారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు అనేక సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగ యువత, రైతులు పలు ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్ట్, అవుట్ – సోర్సింగ్, అనేక రంగాల్లో పనిచేస్తున్న చిరు ఉద్యోగులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటిపై పోరాటాలను కొనసాగిస్తానని కేఎస్ లక్ష్మణరావు ప్రకటించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే మ్యాజిక్ ఫిగర్ 82, 390 ఓట్ల మెజారిటీ -
రైతుల సంక్షేమం కోసం నాబార్డు కృషి
ఇంకొల్లు (చినగంజాం): కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నాబార్డు సంస్థ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు.. రైతుల అభివృద్ధికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని ఉమ్మడి ప్రకాశం జిల్లా నాబార్డు డీడీవో రవికుమార్ అన్నారు. మంగళవారం రోటరీ భవనంలో ఇంకొల్లు సంరక్షణ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ సంబంధించిన ఎఫ్ఎస్ సెంటర్ రైతులతో సమావేశం నిర్వహించారు. ఎఫ్ఈసీ సెంటర్ ఎండీ ఎం శ్రీనివాసబాబు, కార్యదర్శి జీ మంజూషా ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం వివిధ రకాల రాయితీలతో పాటు రైతులు వ్యాపారం చేసుకునేందుకు సరుకు నిల్వ చేసుకునే గోడౌను నిర్మించుకునేందుకు రుణాలు కూడా ఇప్పించటానికి నాబార్డు కృషి చేస్తున్నట్లు అన్నారు. రైతులు తమ పండించిన పంట ఉత్పత్తులు అమ్మకాల విషయంలో దళారీ వ్యవస్థతో నష్టపోతున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు నష్టపోకుండా తాము పండించిన పంట ఉత్పత్తులు సమష్టిగా కలిసి అమ్ముకునేందుకు నాబార్డు సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ సమావేశాలకు ఐదుగురికి ఆహ్వానం సత్తెనపల్లి: అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో ప్రత్యేకత చాటుకున్న ఎంపీడీవో, గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిలకు ఈనెల 4, 5 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న జాతీయ సమావేశానికి ఆహ్వానం అందింది. గుంటూరు జిల్లా పెదనందిపాడు ఎంపీడీవో జీ లక్ష్మీదేవి, గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామ సర్పంచ్ ఎం.లలితకుమారి, వెంగళాయపాలెం గ్రామ కార్యదర్శి వి.రవి, కొల్లిపర మండలం వల్లభాపురం సర్పంచ్ బి భ్రమరాంబ, పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామ సర్పంచ్ షేక్ గౌసియా బేగం స్నేహపూర్వక పంచాయతీల (ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ) పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను పంచాయతీలో అమలు చేస్తున్నారు. ఇందుకు ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి సమావేశాలకు వీరికి ఆహ్వానం అందడంతో సోమవారం పయనమై వెళ్లారు. నృసింహుని ఏకాదశ మాలధారణ దీక్ష స్వీకరణ మంగళగిరిటౌన్: మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఎగువ సన్నిధిలోని పానకాలస్వామి వారి ముఖ మండపంలో మంగళవారం భక్తులు నృసింహుని ఏకాదశ మాలధారణ దీక్ష స్వీకరణ మహోత్సవం ఘనంగా జరిగింది. దేవస్థానం ప్రధాన అర్చకులు, గురుస్వామి మాల్యవంతం శ్రీనివాసదీక్షితులు భక్తులకు మాలవేసి దీక్ష ఇచ్చారు. స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవా ట్రస్ట్ అధ్యక్షులు తోట శ్రీనివాసరావు మాలధారణ దీక్ష స్వీకరించే భక్తులకు దీక్షా వస్త్రాలను ఉచితంగా అందజేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు, న్యాయవాది రంగిశెట్టి లక్ష్మి మాట్లాడారు. శివారెడ్డి గురుస్వామి, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు గోగినేని వెంకటేశ్వరరావు, రోటరీ క్లబ్ ప్రతినిధి సైదా నాయక్, శివాలయం మాజీ ధర్మకర్త అన్నపురెడ్డి రామకృష్ణారెడ్డి, భక్తబృందం ప్రతినిధులు బుర్రి సతీష్, హనుమంత నాయక్, మాదల గోపీ తదితరులు పాల్గొన్నారు. హాల్‌టికెట్ల కలర్ ప్రింటవుట్‌ను అనుమతించం డీఐఈఓ నీలావతిదేవి నరసరావుపేటఈస్ట్: ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్‌టికెట్లను వైట్ పేపర్‌పై ప్రింటవుట్ తీసుకొని పరీక్ష కేంద్రాలకు రావాలని పల్నాడు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి సోమవారం తెలిపారు. కొందరు విద్యార్థులు హాల్‌టికెట్లను కలర్ ప్రింట్లో తీసుకువస్తున్నారని, వాటిని అనుమతించటం లేదని పేర్కొన్నారు. ఈమేరకు ఇంటర్మీడియెట్ విద్యామండలి నుంచి ప్రత్యేక ఉత్తర్వులు అందినట్టు వివరించారు. విద్యార్థులు గమనించి తమ వెంట తెల్లకాగితంపై ప్రింట్ చేసిన హాల్‌టికెట్లతో హాజరు కావాలని సూచించారు. -
యుద్ధ ప్రాతిపదికన తొలగించాలి
పంటకాలువల్లోని చెత్తను బాపట్ల: పంట కాలువల్లో వేసిన చెత్తను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ఆదేశించారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు వద్ద మేజర్ కాలువను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. దిగువ ప్రాంతంలో పదివేల ఎకరాలకు సాగునీరు వెళ్లాల్సి ఉండగా చెత్త వేయడంతో కాల్వ పూడిపోతుందన్నారు. తద్వారా పర్యావరణం దెబ్బతింటుందని, ప్రజలకు నష్టం వాటిల్లుతుంటే పట్టించుకోరా అంటూ అధికారులను ప్రశ్నించారు. డంపింగ్ యార్డు కోసం కేటాయించిన స్థలంలో చెత్త వేయనివ్వడం లేదని, కొందరు కోర్టులో కేసు వేశారని పంచాయతీ సెక్రటరీ, డిప్యూటీ తహసీల్దార్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. డంపింగ్ యార్డ్ స్థలం లేక రహదారి పక్కనే ఉన్న కాలువలో వేయాల్సి వచ్చిందని తెలిపారు. సమీపంలోని శ్మశానవాటిక స్థలం, మిగిలిన ఖాళీ స్థలాలపై కలెక్టర్ ఆరా తీశారు. యుద్ధ ప్రాతిపదికన చెత్త తొలగించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తక్షణమే భూమి సర్వే చేసి 50 సెంట్లు భూమిని ఎస్‌డబ్ల్యూపీసీకి కేటాయించాలన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించడం లేదని, పంచాయతీ అధికారుల పర్యవేక్షణ కొరవడిందన్నారు. నూతనంగా కేటాయించే స్థలంలో చెత్త సంపద కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. ఇకనుంచి చెత్త బయట కనిపించకూడదని అన్నారు. పంట కాలువలను ఆక్రమించి చెత్త వేస్తూ పర్యావరణం దెబ్బతింటుంటే చూస్తూ ఊరుకుంటారా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాలువల్లో చెత్త వేయరాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు, పనుల మంజూరుపై అధికారికంగా ఉత్తర్వుల రాగానే గుర్రపు డెక్క వెంటనే తొలగించాలన్నారు. ఆయన వెంట జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, జలవనరుల కాల్వల పర్యవేక్షణ ఈఈ మురళీకృష్ణ, ఆర్డీవో పి గ్లోరియా, ఆర్ అండ్ బీ డీఈ అరుణకుమారి తదితరులు ఉన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి -
శబ్ద కాలుష్యం నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి
డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ విజయమ్మ బాపట్ల: శబ్ద కాలుష్యం నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ విజయమ్మ పేర్కొన్నారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా సోమవారం ఏర్పాటుచేసిన ప్రదర్శనను డాక్టర్ విజయమ్మ ప్రారంభించారు. డాక్టర్ విజయమ్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ వినికిడి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. చెవి వినడం ఆరోగ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పెద్ద, పెద్ద శబ్దాల నుంచి చెవిని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా పరిధిలోని హెచ్ఎంలు, ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 10వతేదీ లోపు తెలియచేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్ఎంలు, ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టీఐఎస్) ద్వారా రూపొందించామన్నారు. జాబితాలు జిల్లా విద్యాశాఖ, ప్రాంతీయ సంయుక్త సంచాలకుల కార్యాలయాలతో పాటు విద్యాశాఖ వెబ్సైట్, నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అభ్యంతరాలు తెలిపే ఉపాధ్యాయులు తమ పూర్తిపేరుతో కూడిన వివరాలు, జాబితాలోని తప్పిదం స్పష్టంగా పేర్కొనటంతో పాటు ఆధారాలు సమర్పించాలని సూచించారు. గడువు ముగిసిన తరువాత అందిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోమన్నారు. వచ్చిన అభ్యంతరాలపై ఫిర్యాదుల పరిష్కార కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తెలియచేస్తారని తెలిపారు. వివరాలకు జిల్లా విద్యాశాఖ, జోనల్ విద్యాశాఖ కార్యాలయాలలో సంప్రదించాలన్నారు. -
కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ వర్కర్స్ నిరసన
లక్ష్మీపురం: ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు, మున్సిపల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల రవికుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మున్సిపల్ కార్మికులకు అనేక హామీలు ఇచ్చిందన్నారు. తీరా గద్దె నెక్కాక వాటిని మరిచిందని విమర్శించారు. అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్‌ను రద్దు చేసి దాని స్థానంలో ప్రైవేట్ కంపెనీలకు, ఏజెన్సీలకు ఇచ్చే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే ఉద్యోగుల జీవితాలతో వారు చెలగాటం ఆడతారని తెలిపారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులను పెంచాలని కోరారు. విధుల్లో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆప్కాస్ ఉద్యోగ, కార్మికుల రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నగర కార్యదర్శి కోట మాలాద్రి, మంగళగిరి పట్టణ కార్యదర్శి దుర్గారావు, కార్మికులు పాల్గొన్నారు. -
మిర్చి రైతులకు అండగా ఉంటాం !
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నేతలు లక్ష్మీపురం: మిర్చి రైతులకు అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నేతలు స్పష్టం చేశారు. సోమవారం గుంటూరు మిర్చి యార్డును నేతలు సందర్శించారు. రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి. ప్రసాద్, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన రూ.11,781 మద్దతు ధరతో రైతుల ఆశలు అడియాసలయ్యాయని తెలిపారు. కనీసం రూ.20వేలు అయినా ప్రకటిస్తారని ఎదురు చూశారని పేర్కొన్నారు. తీరా గుంటూరు మార్కెట్ యార్డుకు వస్తే వ్యాపారస్తుల దోపిడీకి రైతులు బలి అవుతున్నారని చెప్పారు. మచ్చు, కమిషన్, గోతం పేరులతో క్వింటాకు వెయ్యి రూపాయల వరకు దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆసియాలోనే అతి పెద్దదైన గుంటూరు మిర్చి యార్డులో ఎన్నో రైతుల కన్నీటి గాథలు ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొల్లి రంగారెడ్డి, పచ్చల శివాజీ, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి. జగన్నాథం, కంజుల విఠల్ రెడ్డి, పల్నాడు జిల్లా కార్యదర్శి ఉలవలపూడి రాము, ప్రకాశం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హనుమారెడ్డి, వీరారెడ్డి, రామయ్య పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక చింతనతో భక్తిభావం
ప్రత్తిపాడు: ఆధ్యాత్మిక చింతనతో భక్తిభావం కలుగుతుందని విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ అన్నారు. విశ్వంజీ జన్మదిన వేడుకల్లో భాగంగా మూడవ రోజైన సోమవారం మండల పరిధిలోని చినకోండ్రుపాడు విశ్వనగర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య విశ్వంజీ ఔదంబర వృక్ష పీఠ సుస్థాపిత దత్త గురువులకు విశేష అర్చన చేశారు. అనంతరం యాగశాలలో వేద పండితులు శాస్త్రోక్తంగా అగ్ని ప్రతిష్ట, మహాగణపతి హవనం, సుదర్శన నారసింహ, శ్రీ మహారుద్ర హవనములు, స్థాపిత దేవతా పంచోపచార పూజ, నీరాజన, మహామంత్రపుష్ప చతుర్వేద సేవలను చేశారు. తొలుత శాంతిపాఠం, గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యమేళన ప్రాశనం, రక్షాబంధనం, ఆచార్యాది ఋత్విక్ వరణం, వాస్తు, నవగ్రహ, యోగిని, క్షేత్రపాలక, సర్వతోభద్ర, సుదర్శన నారసింహ, మహామృత్యుంజయ సప్త చిరంజీవి ఆవాహనం, అఖండధీప స్థాపన కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి. విశ్వమానవ సమైక్యతా సంసత్ కన్వీనర్ ఆకుల కోటేశ్వరరావు, కామేశ్వరి దంపతులతో విశ్వంజీ ప్రత్యేక పూజలు చేయించారు. రాత్రి ఆడిటోరియంలో విశ్వణి కూచిపూడి నాట్య ప్రదర్శన, లోల మనస్వి, నిధిమల భరతనాట్య ప్రదర్శన, కౌటూరి గాయత్రి సంగీత విభావరి, ఫణికుమార్ వేణుగాన కచేరీలు అలరించాయి. విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ -
గొట్టిపాడు శివాలయంలో చోరీ
ప్రత్తిపాడు: గొట్టిపాడు శివాలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడి దేవతామూర్తుల బంగారు, వెండి నగలను అపహరించుకుపోయిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడులోని శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి దేవస్థానం అర్చకులు ఆదివారం రాత్రి ఎప్పటిలానే పూజలు నిర్వహించి తాళాలు వేసి వెళ్లిపోయారు. అర్ధరాత్రి సుమారు ఒంటిగంట సమయంలో గుర్తుతెలియని దుండగులు ముఖానికి మాస్కు, చేతికి గ్లౌజులు ధరించి ఆలయంలోకి ప్రవేశించారు. ప్రధాన ద్వారానికి ఉన్న పెద్ద పెద్ద తాళాలు పగలగొట్టేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో, ఇనుప కడ్డీలు వంచి గుడి లోపలకు చొరబడ్డారు. నాలుగు కేజీల కాశీవిశ్వేశ్వరుని వెండి నాగాభరణంతో పాటు సుమారు నలభై గ్రాముల అమ్మవారి బంగారు తాళి బొట్టుతాడు, తాళిబొట్లు రెండు, ముక్కెర, బంగారు బొట్టు బిళ్ల, ఉత్సవమూర్తుల వెండి వస్తువుల అపహరించుకుపోయారు. వీటి విలువ ఎనిమిది లక్షల రూపాయలపైన ఉంటుందని చెబుతున్నారు. సోమవారం ఉదయం గ్రామస్తుడు వెలివెల్లి శ్రీనివాసరావు ఆలయంలో ప్రదక్షిణలు చేసేందుకు వెళ్లాడు. అప్పటికే ఉత్తరం వైపు ద్వారాలతో పాటు తూర్పువైపు ద్వారాలు తీసి ఉండటంతో విషయాన్ని గ్రామస్తులకు, ఆలయ అర్చకులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న వ్యవస్థాపక ధర్మకర్త పచ్చల అప్పారావు ఆలయానికి వచ్చి చూశారు. అప్పటికే దేవతామూర్తుల ఆభరణాలు కనిపించకపోవడంతో ప్రత్తిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ జి. శ్రీనివాసరావు, ఎస్ఐ కె. నాగేంద్రలు దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. స్థానికంగా ఆలయం సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. క్లూస్ టీమ్‌కు సమాచారం అందించడంతో రంగంలోకి దిగి వేలిముద్రలను సేకరించింది. అర్చకుడు బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. స్వామి వారి వెండి కిరీటంతో పాటు అమ్మవారి బంగారు నగల అపహరణ -
వైఎస్సార్ సీపీతోనే పేద వర్గాలకు మేలు
కొల్లూరు: పేద వర్గాలకు చెందిన కుటుంబాలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే ఎనలేని మేలు చేకూరిందని వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట అధికార ప్రతినిధి వరికూటి అశోక్‌బాబు అన్నారు. సోమవారం మండలంలోని చిలుమూరులంక, సుగ్గునలంక, ఈపూరులంక, చింతర్లంక, పెదలంక, పెసర్లంక గ్రామాలలో వైఎస్సార్ సీపీ నూతన గ్రామ కమిటీల ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. అశోక్‌బాబు మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పేద వర్గాల కోసం పెత్తందార్లతో పోరాడుతూ, ప్రతి కుటంబానికి ఆర్థికంగా మేలు జరిగేలా సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో అబద్దపు హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిందని, నేడు హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి, ప్రజాపక్షాన పోరాడటానికి గ్రామ కమిటీలు దోహదపడతాయన్నారు. చిలుమూరు శివారు చిలుమూరులంక గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శిగా తోడేటి పాల్మార్క్, కార్యదర్శిగా మెరకనపల్లి రత్తాలును ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. కార్యక్రమంలో కొల్లూరు, భట్టిప్రోలు మండల కన్వీనర్లు సుగ్గున మల్లేశ్వరరావు, శ్రీనివాసరావు, ఈపూరులంక సర్పంచి మేకతోటి శ్రీకాంత్, ఎంపీటీసీ సభ్యురాలు బుల్లా నవరత్నం, మాజీ ఎంపీపీ పెరికల పద్మారావు, మాజీ సర్పంచి కట్టుపల్లి సోమయ్య, నాయకులు దివి వెంకటేశ్వరరావు గుంటూరు పవన్‌కుమార్, వెలివల రామకృష్ణ, శంకర్, కూరేటి కోటేశ్వరరావు, బాణాల తనీష్, స్థానిక నాయకులు తోడేటి సతీష్, గుమ్మడి యేబు, తోడేటి రమేష్, విద్యాసాగర్‌లు పాల్గొన్నారు. నేడు లంక గ్రామాలలో గ్రామ కమిటీల నియామకం వైఎస్సార్ సీపీ నూతన గ్రామ కమిటీల నియామక ప్రక్రియ మంగళవారం కొల్లూరు మండలంలో నిర్వహించనున్నట్లు మండల కన్వీనర్ సుగ్గున మల్లేశ్వరరావు సోమవారం తెలిపారు. వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు గ్రామ నూతన కమిటీల నియామకం -
ట్రావెల్ బస్సును ఢీకొన్న లారీ
రొంపిచర్ల: మండలంలోని సుబ్బయ్యపాలెం అడ్డరోడ్డు సమీపంలోని అద్దంకి నార్కెట్‌పల్లి రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో బస్సు వెనుక భాగం ధ్వంసం అయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును అదే మార్గంలో వెనుకగా వస్తున్న లారీ ఢీకొట్టింది. బస్సు వెనుక భాగంలో ఇంజిన్ ఉండటం వల్ల లారీ ఢీకొట్టినా ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగటానికి గల కారణాలపై ఆరా తీశారు. రాత్రిళ్లు రహదారిపై వాహనాలు ఎక్కడబడితే అక్కడ పార్కింగ్ చేయకుండా పెట్రోలింగ్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ కంచి శ్రీనివాసరావు వెంట పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు. బంగారం చోరీ కేసులో మరో నిందితుడి అరెస్టు మంగళగిరి: ఆత్మకూరు అండర్ బైపాస్ వద్ద ఫిబ్రవరి 5న జరిగిన ఐదు కేజీల బంగారం కేసులో మరో నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. చోరీలో ఐదవ నిందితుడు ఖాజావలి కోర్టులో లొంగిపోయేందుకు రాగా, నిఘా ఉంచిన అధికారులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. నిందితులందరిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ అనంతరం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ●ప్రయాణికులంతా క్షేమం ●సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ శ్రీనివాసరావు -
విద్యుత్ వైర్లు తగిలి గడ్డి ట్రాక్టర్‌కు మంటలు
పర్చూరు(చినగంజాం): డ్రైవర్ చాకచక్యంతో పెనుప్రమాదం తప్పింది. వరిగడ్డి లోడుతో వెళుతున్న ట్రాక్టర్‌కు విద్యుత్ వైర్లు తగిలి నిప్పులు చెలరేగడంతో తీవ్రంగా మంటలు చెలరేగి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన మండలంలోని వీరన్నపాలెం గ్రామంలో సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అందిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన యార్లగడ్డ శ్రీనివాసరావు అనే రైతుకు చెందిన వరిగడ్డిని పొలం నుంచి ఇంటికి చేరుస్తున్నాడు. ఈక్రమంలో వరిగడ్డి ట్రాక్టర్ పంచాయతీ కార్యాలయం ముందుగా వెళ్తున్న సమయంలో ఆ మార్గంలో వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి వరిగడ్డి పూర్తిగా తగలబడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో ట్రాక్టర్ డ్రైవర్ ఆనందరావు చాకచక్యంగా వ్యవహరించాడు. తానేమాత్రం భయాందోళనకు గురికాకుండా గడ్డిని పక్కన పడేసి అందులో ఉన్న కూలీలను, ట్రాక్టర్‌ను కాపాడాడు. వెంటనే స్థానికులు మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గడ్డి పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ.50 వేలు వరకు నష్టం వాటిల్లి ఉంటుందని సమాచారం. వీరన్నపాలెంలో అగ్నిప్రమాదం డ్రైవర్ చాకచక్యంతో కూలీలు, ట్రాక్టర్ సురక్షితం -
లైంగిక దాడి యత్నం కేసులో విచారణ
చెరుకుపల్లి: మండలంలోని ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి యత్నం కేసులో ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని రేపల్లె డీఎస్పీ ఆవల శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆదివారం ఆరేపల్లి పంచాయతీ పరిధిలో చిన్నారిపై లైంగిక దాడి యత్నం కేసులో భాగంగా డీఎస్పీ సోమవారం గ్రామంలో పర్యటించి స్థానిక వీఆర్వో శివ నాగేశ్వరరావు సమక్షంలో చిన్నారి కుటుంబ సభ్యులను విచారించారు. వివరాలు అడిగి తెలుసుకొని నమోదు చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ ఘటనపై ఇప్పటికే క్లూస్ టీమ్ ఆధారాలు, వైద్య పరీక్షల నివేదిక ఆధారంగా కేసుపై తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. డీఎస్పీ వెంట స్థానిక ఎస్సై టి.అనీల్‌కుమార్ పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు
నరసరావుపేట ఈస్ట్: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాలోని పలు పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలోని విద్యాసంస్థల్లో మహిళల భద్రత, హక్కులు, సాధికారిత, మహిళా చట్టాలు, ఫోక్సో చట్టం, ఈవ్ టీజింగ్ తదితర అంశాలపై ఈ పోటీలను నిర్వహించారు. పోటీల అనంతరం స్టేషన్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో విద్యార్థినులతో సమావేశాలను ఏర్పాటు చేసి మహిళల రక్షణకు పోలీస్‌శాఖ తీసుకుంటున్న చర్యలను వివరించారు. అత్యవసర సమయంలో సహాయం కోసం హెల్ప్‌లైన్ నెంబర్లు చైల్డ్ 1098, ఉమెన్ 181, పోలీస్ 112, సైబర్ క్రైమ్ 1930 నెంబర్లకు ఫోన్ చేసి తక్షణ సహాయం పొందవచ్చని తెలిపారు. -
గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్టు
మరో ఇద్దరు పరార్ తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతానగరం రైల్వే బ్రిడ్జి సమీపంలో గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారయ్యారు. ఈ సంఘటనపై సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కల్యాణ్ రాజు వివరాలు వెల్లడించారు. విజయవాడలోని విద్యాధరపురానికి చెందిన గుమ్మడి సాయికుమార్ మరో ఇద్దరు యువకులు గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో కలసి సీతానగరం రైల్వే బ్రిడ్జి వద్దకు వెళ్లామని తెలిపారు. ఈ దాడిలో సాయికుమార్ వద్ద 1050 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఉండవల్లికి చెందిన మహేష్, విజయవాడకు చెందిన కోటి పరారయ్యారని పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న సాయికుమార్‌ను కోర్టుకు హాజరు పరచనున్నామని తెలిపారు. గంజాయి అమ్మకాలతో పాటు తాగే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
వర్సిటీ మహిళల బాల్ బాడ్మింటన్ పోటీలు ప్రారంభం
పాల్గొన్న ఐదు కళాశాలల జట్లు నరసరావుపేట రూరల్: మహిళలు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ ప్రొఫెసర్ పీపీఎస్ పాల్‌కుమార్ తెలిపారు. వర్సిటీ అంతర కళాశాలల మహిళల బాల్ బాడ్మింటన్ పోటీలు కేసానుపల్లిలోని ఎంఏఎం ఫార్మసీ కళాశాలలో సోమవారం ప్రారంభమయ్యాయి. పోటీలో ఐదు జట్లు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పీపీఎస్ పాల్‌కుమార్, టైనీటాట్స్ స్కూల్ అధినేత పాతూరి కోటేశ్వరమ్మలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి విద్యార్థులు మొబైల్‌కు దూరంగా ఉంటూ ఆటలాడుతూ చదువులో కూడా ముందుండాలని సూచించారు. పోటీలలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులతో వర్సిటీ జట్టును ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. కరైకుడిలోని అల్లప్ప యూనివర్సిటీలో నిర్వహించే ఆల్ ఇండియా అంతర వర్సిటీ పోటీల్లో వర్సిటీ జట్టు పాల్గొంటుందని తెలిపారు. పోటీలకు సెలక్షన్ కమిటీ సభ్యులుగా డాక్టర్ సిహెచ్ వెంకట్రావు, జె.ప్రేమ్‌కుమార్, ఇ.ఆదిబాబు, డాక్టర్ అరుణ సుజాతలు వ్యవహరించారు. కళాశాల చైర్మన్ మేదరమెట్ల రామశేషగిరిరావు, డైరక్టర్ దరువూరి శ్రావ్య, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రామారావు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. పారిశుద్ధ్య సేవలు ప్రైవేటుకు అప్పజెప్పొద్దు కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ నేతలు, కార్మికుల ధర్నా నరసరావుపేట: జీఓవెంటనే 279ని సత్వరం రద్దు చేసి ప్రైవేట్ కంపెనీలకు పారిశుద్ధ్య సేవలు అప్పజెప్పే విధానాన్ని విడనాడాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరేకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ గతంలో అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం తక్షణమే సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. లేనిపక్షంలో ఈనెల 11న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి లక్షలాదిగా తరలివెళ్తామన్నారు. ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఉప్పలపాటి రంగయ్య, వైదన వెంకట్, దాసరి రాజు, జయరాజు, వరహాలు, వందనం, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
నేను చెప్పిందే ‘యాక్ట్’
ఇసుక, బుసక, గ్రావెల్, గ్రానైట్, బియ్యం... ఏది దొరికినా అమ్మకానికి పెట్టి అక్రమార్జన..! రాబడి ఉందనుకుంటే ఏ ఒక్కరినీ, సంస్థలను వదలకుండా వేధింపులు..! అధికారంలోకి వచ్చిందే తడవుగా ఇదీ పచ్చ నేతల బరితెగింపు..! ఇప్పుడు వారు బెదిరింపుల పర్వానికీ తెరలేపారు..! తాజాగా బాపట్ల పచ్చ నేత చూపు యాక్ట్ కేబుల్ టీవీపై పడింది. ఇక్కడ తాను చెప్పిందే ‘యాక్ట్’ అంటూ సంస్థను నియోజకవర్గం నుంచి తరిమేసి మొత్తం కనెక్షన్లు తన కేబుల్ టీవీకి మళ్లించుకునేందుకు ఆయన ఎత్తు వేశారు. ఇందుకోసం శక్తిమంతమైన యాక్ట్ యాజమాన్యాన్నే బెదిరించారు. ఆయన బరితెగింపు జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా కూటమి ప్రభుత్వంలోనూ చర్చకు దారితీసింది. –సాక్షి ప్రతినిధి, బాపట్లకార్యాలయానికి పిలిపించుకుని బెదిరింపుల పర్వంబాపట్ల పచ్చ నేత నియోజకవర్గంలో 30 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది యాక్ట్ కేబుల్ యాజమాన్యం. ఇప్పుడు దానినే బెదిరిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. సంస్థకు ఉన్న 32 వేల కనెక్షన్లు తనకు అప్పగించి నియోజకవర్గం వదిలిపెట్టాలని బాపట్ల పచ్చ నేత హుకుం జారీ చేశారు. ఇటీవల యాక్ట్ కేబుల్‌కు చెందిన అసిస్టెంట్ మేనేజర్ మొదలు ఉద్యోగులందరినీ తన కార్యాలయానికి పిలిపించుకుని మరీ అల్టిమేటం జారీ చేశారు. ‘మీ కనెక్షన్లన్నీ మా సోదరుడి కేబుల్ టీవీకి బదలాయించండి’అని ఆదేశించారు. కాదూ.. కూడదంటే నియోజకవర్గంలో ఉండలేరన్నారు. వెళ్లకపోతే పోలీసు కేసులు పెట్టిస్తానని బెదిరించారు. ‘మీరంతా చిన్న ఉద్యోగులు.. యాక్ట్‌ను నమ్ముకుని కేసుల్లో ఇరుక్కోవద్దు’ అంటూ తనదైన శైలిలో సూచనలు చేశారు. తక్షణం ఉద్యోగాలు వదలి వెళ్లిపోవాలని ఆల్టిమేటం ఇచ్చారు. ఈ విషయం యాక్ట్ యాజమాన్యానికి తక్షణమే చేరవేయాలని కూడా సూచించారు. తన మాట ఖాతరు చేయకుండా పార్టీ పెద్దలు, లేదా మీ సంస్థకు పరిచయమున్న మంత్రులతో ఫోన్లు చేయించినా వినేది లేదని పచ్చనేత ఖరాకండిగా చెప్పారు. నాతో పెట్టుకోవద్దంటూ ఇలా నేరుగానే బెదిరించారు. యాజమాన్యంతో మీరే మాట్లాడాలని యాక్ట్ ఉద్యోగులు సూచించగా ‘మీ యాజమాన్యంతో మాట్లాడేంత తక్కువ స్థాయి వ్యక్తిని కాదు నేను. అవసరమనుకుంటే వారే నా వద్దకు రావాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.వారంలో వెళ్లకపోతే కేసులే..వారం రోజుల్లో బాపట్ల వదలి వెళ్లాలని, లేదంటే ఎలా పనిచేస్తారో చూస్తామని.. వరుస కేసులు పెట్టి అంతుచూస్తామని యాక్ట్ ఉద్యోగులకు పచ్చ నేత ఫైనల్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో.. మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తామని, వారు ఒప్పుకోవాలి తప్ప తామేమీ చేయలేమని చెప్పి యాక్ట్ ఉద్యోగులు వెనుదిరిగినట్లు తెలిసింది. తర్వాత పచ్చనేత సమీప బంధువు వచ్చి నియోజకవర్గానికి సంబంధించి 50 శాతం వాటా ఇస్తే ఓకే చెప్పిస్తానని యాక్ట్ ఉద్యోగుల వద్ద బేరం పెట్టినట్లు సమాచారం. ఇక బెదిరింపుల క్రమంలో ఇటీవల తమ కేబుల్‌ను కట్ చేశారన్న సాకు చూపి కర్లపాలెం పరిధిలో యాక్ట్ ఉద్యోగిపై అక్రమ కేసు నమోదు చేయించినట్లు తెలిసింది. ఇదే కాకుండా ఇటీవల పలుసార్లు యాక్ట్ ఉద్యోగులను పోలీసు ఫిర్యాదుల పేరుతో వేధిస్తున్నట్లు చెబుతున్నారు.ఇన్నేళ్లలో ఎప్పుడూ చూడలే..పచ్చ నేత బెదిరింపులను యాక్ట్ యాజమాన్యం కొందరు ప్రభుత్వ పెద్దల దృష్టికి సైతం తెచ్చినట్లు సమాచారం. వాస్తవానికి యాక్ట్ డిజిటల్ టీవీ బలమైన మీడియా సంస్థ. దేశంలోనే మూడో అతిపెద్ద కేబుల్, ఇంటర్నెట్ కంపెనీ. నాన్ టెలికంలో దేశంలో నంబర్‌వన్ స్థానంలో ఉంది. దేశ వ్యాప్తంగా 20 వేల మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. బాపట్ల నియోజకవర్గంలో 30 ఏళ్ల నుంచి 32 వేల కనెక్షన్లతో ఉంది. ఏడాదిన్నర క్రితం బాపట్ల పచ్చనేత తన రాజకీయ అవసరాల కోసం లోకల్ కేబుల్ పెట్టారు. తర్వాత అధికారంలోకి రావడంతో ఏకంగా బలమైన యాక్ట్ కేబుల్‌ను కనెక్షన్లు తనకు అప్పగించి వెళ్లాలని బెదిరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నేళ్లలో ఏ నాయకుడూ తమను బెదిరించలేదని, మొదటిసారి బాపట్లలో ఇలాంటి పరిస్థితి చూస్తున్నామని యాక్ట్ యాజమాన్యం పేర్కొంటోంది. -
కార్మికులపై సర్దుపోటు!
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగంలో పారిశుద్ధ్య కార్మికుల రేషనలైజేషన్ ప్రక్రియ ముగిసింది. వార్డులో ఎక్కువ ఉన్న కార్మికులను మిగతా చోట్ల సర్దుబాటు చేశారు. అయితే ఈ మార్పులో యూనియన్ నాయకులు కీలకంగా వ్యవహరించారు. తమ అనుకూలురుకు, మామూళ్లు ఇచ్చుకున్న వారికి వార్డుల్లో వారే కొనసాగేలాగా.. మామూళ్లు ఇవ్వనివారిని దూరంగా ఉన్న వార్డులకు మార్చారని వినికిడి. ఈ రేషనలైజేషన్‌పై పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2011 జనాభాకు తగ్గట్టుగా కార్మికులు 2011 జనాభా లెక్కల ప్రకారం 7.50లక్షల జనాభాకు తగినట్లుగా ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. అయితే, 2012లో 10 గ్రామ పంచాయతీలను నగరపాలక సంస్థలో విలీనం చేశారు. దీంతో జనాభా మరింత పెరిగింది. ప్రస్తుతం నగరంలో సుమారు 11లక్షల పైబడి జనాభా ఉండగా, సుమారు 3 లక్షల దాకా హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. నగరంలో ప్రస్తుతం 2011 జనాభాకు తగ్గట్లుగా 2వేల మందిలోపు మాత్రమే పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. గతంలో నగరంలో రోజుకు 400 మెట్రిక్ టన్నుల చెత్త వచ్చేది. ప్రస్తుతం సుమారుగా 470 మెట్రిక్ టన్నులకు ఇది పెరిగింది. ఈ చెత్తను బయటకు తీసుకెళ్లేందుకు తక్కువ సంఖ్యలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. 500 మంది అవసరం స్వచ్ఛ భారత్‌లో భాగంగా జాతీయ నిబంధనల మేరకు 350 ఇళ్లకు ఒక పుష్‌కాట్, ముగ్గురు వర్కర్లు ఉండాలి. అయితే ప్రస్తుతం ఇద్దరినే కేటాయించారు. ట్రాక్టర్‌కు నలుగురు నుంచి ఐదుగురు వర్కర్లు ఉండాలి. ప్రస్తుతం ఇద్దరే ఉంటున్నారు. దీంతో కార్మికులపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ప్రస్తుతం ఉన్న జనాభాకు 500 మంది కార్మికులను అదనంగా తీసుకుంటేనే తప్పా నగరం బాగుపడదని జీఎంసీ వర్గాలు భావిస్తున్నాయి. ఒక్కోక్కరి నుంచి రూ.10–15 వేలు వసూలు ? రేషనలైజేషన్ ప్రక్రియ జరుగుతుందని తెలుసుకున్న కొందరు యూనియన్ నాయకులు నిరసన చేపట్టారు. దీంతో ఈ ప్రక్రియను అధికారులు వారికే అప్పగించారు. మామూళ్లు ఇచ్చుకుంటే మీకు నచ్చిన వార్డుల్లో వేస్తామని, లేకపోతే దూరంగా వెళ్లాల్సి వస్తుందని కార్మికులను బెదిరించారు. కొంతమంది కార్మికులు యూనియన్ నాయకులకు రూ.10 నుంచి 15 వేల దాకా ఇచ్చుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మామూళ్లు ఇచ్చుకోలేని వారు దూరం వార్డులకు వెళ్లారు. దీనిపై నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. జీఎంసీలో పారిశుద్ధ్య కార్మికుల సర్దుబాటు యూనియన్ నాయకుల సిఫార్సుల మేరకే రేషనలైజేషన్! డబ్బులు ఇచ్చినవారికి దగ్గర వార్డులు! ఒక్కొక్కరి నుంచి రూ.10–15వేలు వసూలు చేసినట్లు ఆరోపణలు రేషనలైజేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు -
ముం‘చెత్త’న కోటప్పకొండ
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ పుణ్యక్షేత్రం చెత్తతో నిండిపోయింది. తిరునాళ్లతో పోగైన వ్యర్థాలను తొలగించడంలో పంచాయతీ రాజ్ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ చూసినా గుట్టలుగా వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. ప్రధాన రహదారుల వెంట కుళ్లిన వాటితో దుర్వాసన వస్తోంది. దీంతో స్థానికులతోపాటు భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ తిరునాళ్ల గత నెల 26వ తేదీన నిర్వహించారు. లక్షలాది మంది పాల్గొన్నారు. ఇది గడిచి నాలుగు రోజులైనా పారిశుద్ధ్య కార్యక్రమాలు మాత్రం చేపట్టలేదు. కొండ దిగువున ప్రధాన రహదారులు వెంట చెత్త పేరుకుపోయింది. తాత్కాలిక దుకాణాలు, చెరకు రసం దుకాణాల వ్యర్థాలు పోగయ్యాయి. ప్రభల నిధి, అధికారుల తాత్కాలిక వసతి గృహాల ప్రాంతం వద్ద ప్లాస్టిక్ కవర్లు, పేపర్ టీకప్పులు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. ప్రధాన సెంటర్లోని దుకాణాదారులు వ్యర్థాలను గోతాలలో రోడ్ల వెంట పడేశారు. అధికారులు వాటిని తొలగించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు అన్నవితరణ చేసి ఆకులను వదిలివెళ్లడంతో అవీ పోగయ్యాయి. ముక్కు మూసుకొని భక్తులు రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. పంచాయతీ రాజ్ శాఖ 350 మంది వరకు కూలీలను తిరునాళ్లకు విధుల్లో నియమించింది. సగం మంది కాంట్రాక్ట్ కార్మికులు. మూడు రోజులపాటు వీరు కొండ దిగువున పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరునాళ్ల అనంతరం అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఏటా తిరునాళ్ల ముగిసిన మరుసటి రోజు నుంచే పారిశుద్ధ్య పనులు జరిగేవి. వారం రోజులపాటు చెత్తను తొలగించేవారు. ఈ ఏడాది కనీసం ఇటువైపు చూసిన వారే కరవయ్యారు. కోటప్పకొండలో పేరుకుపోయిన చెత్త తిరునాళ్లతో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలు నాలుగు రోజులైనా పారిశుద్ధ్య పనులు శూన్యం గుట్టలుగా పేరుకుపోయిన చెత్తతో దుర్వాసన అధికారుల తీరుపై మండిపడుతున్న భక్తులు కూలీల కొరతే కారణం తిరునాళ్ల ఏర్పాట్ల కోసం మండలంలోని కాంట్రాక్ట్ కూలీలతోపాటు రోజువారీగా కొంతమందిని నియమించాం. తిరునాళ్ల తరువాత కూలీలు అందుబాటులో లేకపోవడంతో పారిశుద్ధ్య పనులు ప్రారంభించలేదు. కాంట్రాక్ట్ కూలీలకు ఆరోగ్య సమస్యలు కూడా మరో కారణం. సోమవారం నుంచి వ్యర్థాలు తొలగించే పనులు ప్రారంభిస్తాం. – నాగానంద్, ఈవోపీఆర్డీ, నరసరావుపేట మండలం -
అంకెల గారడి.. కూటమి బురిడి
బాపట్ల: రాష్ట్ర ప్రజలను చంద్రబాబునాయుడు అంకెల గారడీతో మళ్లీ మోసం చేశారని మాజీ డెప్యూటీ స్పీకర్, వైఎస్సార్ సీపీ బాపట్ల నియోజకవర్గ ఇన్చార్జి కోన రఘుపతి ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్‌ను రూ.3.22లక్షల కోట్లతో ప్రవేశపెట్టడం చూస్తుంటే అంకెల గారడీగా ఉందని తెలిపారు. రూ.72వేల కోట్లు అప్పు ఉంటేనే గగ్గోలు పెట్టిన చంద్రబాబునాయుడు ఇప్పుడు లక్ష కోట్లు ఏవిధంగా అప్పులు చేశారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. అమరావతి నిర్మాణానికి రూ.40వేల కోట్లు అవసరమని చెప్పిన ఆయన ఇప్పుడు రూ. 6వేల కోట్లు మాత్రమే కేటాయించడం ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని విమర్శించారు. పింఛన్లకు రూ.26వేల కోట్లు మాత్రమే కేటాయించడం గమనిస్తే, ఎంత మందివి తొలగించేందుకు కుట్ర జరుగుతుందో అర్థం కావడం లేదని తెలిపారు. మరోవైపు బీసీలకు 50సంవత్సరాలకే ిపింఛన్లు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఉచిత బస్సు, తల్లికి వందనం, రైతుల గురించి పట్టించుకోలేదని చెప్పారు. మత్స్యకారులకు గత ఏడాది భరోసా కింద రూ.20వేలను ఇవ్వకుండా ఈ ఏడాది ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. జగనన్న కాలనీల అభివృద్ధి పట్టించుకోకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. కొత్త జిల్లాలకు వైఎస్. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.100కోట్లు చొప్పున కేటాయించగా, ఈ ప్రభుత్వం వాటి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. మెడికల్ కళాశాలల గురించి ఊసే లేదని తెలిపారు. బడ్జెట్ ద్వారా చంద్రబాబునాయుడు హడావుడి నిర్ణయాలు చూస్తుంటే 2027లో జమిలి ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోందన్నారు. ప్రజల్లో వైఎస్సార్ సీపీపై విశ్వాసం ఉందని, వారికి అండగా ఉండేందుకు పార్టీ సిద్ధంగా ఉందని కోన స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్య, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, పార్టీ మండల అధ్యక్షులు మురుప్రోలు కొండలరెడ్డి, నాయకులు జోగి రాజా, కృష్ణ గుప్తా, కటికల యోహోషువా, పిన్నిబోయిన ప్రసాద్, శాయిల మురళి, నర్రా వెంకట్రావు, ఉరబిండి గోపి, తన్నీరు అంకమ్మ, డి.కోటిరెడ్డి పాల్గొన్నారు. ప్రజలను మోసం చేసిన చంద్రబాబునాయుడు మాజీ డెప్యూటీ స్పీకర్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి కోన -
‘మండలి’ గెలుపు ఎవరిదో ?
సాక్షి ప్రతినిధి, బాపట్ల: కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ సోమవారం గుంటూరు ఏసీ కాలేజీలో జరగనుంది. ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గత నెల 27న పోలింగ్ జరిగింది. జిల్లాలోని బాపట్ల, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల పరిధిలో మాత్రమే ఎన్నికలు జరిగాయి. మొత్తం 24,493 మందికి గాను 18,200 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. కూటమి తరఫున ఆలపాటి రాజేంద్రప్రసాద్, పీడీఎఫ్ తరఫున బరిలో నిలిచిన కేఎస్.లక్ష్మణరావుల మధ్యే ప్రధాన పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 25 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. సోమవారం జరగనున్న ఓట్ల లెక్కింపుతో వీరి భవితవ్యం తేలనుంది. కౌంటింగ్ నేపథ్యంలో కూటమి , పీడీఎఫ్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఓటర్లు, ప్రజల్లో కూడా లెక్కింపుపై మరింత ఆసక్తి నెలకొంది. కూటమి, పీడీఎఫ్ వర్గాలు ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్నారు. కూటమి నేతల్లో టెన్షన్ పోలింగ్ రోజు కూటమి నేతలు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, ప్రధానంగా దొంగ ఓట్లు వేసుకోవడంతోపాటు పలు చోట్ల తమ నాయకులు, ఏజెంట్లపై దాడులు చేసి రిగ్గింగులకు పాల్పడ్డారని పీడీఎఫ్ వర్గాలు ఆరోపించాయి. పలు అక్రమాల నేపథ్యంలో తమ గెలుపు ఖాయమని కూటమి నేతలు పైకి గంభీరంగా చెబుతున్నారు. అయితే, ఉద్యోగులు, నిరుద్యోగుల్లో కూటమి సర్కార్‌పై తొమ్మిది నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది ఈ ఎన్నికల్లో మరింతగా ప్రభావం చూపించే అవకాశముందని కూటమి వర్గాలు లోలోపల టెన్షన్‌గానే ఉన్నాయి. పైగా భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీ వర్గాలు కూటమి అభ్యర్థి ఆలపాటిపై వ్యతిరేకతతో ఉన్నాయి. ఇది మరింతగా నష్టం చేసేఅవకాశముందని అంతర్గతంగా చర్చ జరుగుతోంది. మరోవైపు కూటమి ఎన్నిరకాల అక్రమాలకు తెగబడినా ఉద్యోగులు, పట్టభద్రుల ఓట్లతో తాము విజయం సాధిస్తామని పీడీఎఫ్ వర్గాలు ధీమాగా ఉన్నాయి. మొత్తంగా సోమవారం జరగనున్న ఓట్ల లెక్కింపుతో ఎవరు విజయం సాధిస్తారో తేలనుంది. నేడు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కూటమి , పీడీఎఫ్ వర్గాల్లో ఉత్కంఠ ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూపులు జిల్లాలో ఓటుహక్కు వినియోగించుకున్న 18,200 గాడ్యుయేట్స్ ఏర్పాట్లు పూర్తి -
గుంటూరు రేంజ్‌కు 53 మంది ప్రొబేషనరీ ఎస్ఐలు
నగరంపాలెం: సమర్థంగా విధులు నిర్వర్తించాలని, విధి నిర్వహణలో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ప్రొబేషనరీ ఎస్ఐలకు సూచించారు. శిక్షణ పూర్తయి, గుంటూరు రేంజ్ పరిధిలో విధుల నిర్వహించేందుకు ఎంపికై న 53 (36 మంది పురుషులు, 17 మంది మహిళలు) మంది ప్రొబేషనరీ ఎస్ఐలు ఆదివారం గుంటూరు నగరంలోని గుంటూరు రేంజ్ కార్యాలయంలో ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ క్రమశిక్షణ, నిజాయతీ, పారదర్శకత, జవాబుదారీతనంతో విధులు నిర్వహించి పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని తెలిపారు. అనంతరం జిల్లాలు కేటాయిస్తూ నియామక ఉత్తర్వులను ఐజీ అందించారు. గుంటూరు జిల్లాకు 22 మంది, పల్నాడు జిల్లాకు 13, బాపట్ల జిల్లాకు 10, ప్రకాశం జిల్లాకు ఒకరు, శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లాకు ముగ్గురు, తిరుపతి జిల్లాకు నలుగురిని కేటాయించారు. ఈనెల 2వ తేదీ నుంచి 6 వరకు పీఎస్ఐలకు సెలవులని ఐజీ తెలిపారు. అనంతరం ఈనెల 7వ తేదీ నుంచి గ్రేహౌండ్స్ శిక్షణకు పంపిస్తామని వెల్లడించారు. అనంతరం పీఎస్ఐలతో ఐజీ మాట్లాడారు. జిల్లాల వారీగా కేటాయింపులు నియామక ఉత్తర్వులు జారీచేసిన రేంజ్ ఐజీ -
బాపట్ల
సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025 ఇఫ్తార్ సహరి (సోమ) (మంగళ) నరసరావుపేట 6.13 5.10 గుంటూరు 6.22 5.10 బాపట్ల 6.21 5.08 చీరాల: చేనేతలపై కూటమి ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ ప్రదర్శించింది. బడ్జెట్ కేటాయింపులలో రిక్తహస్తం చూపింది. కేవలం 0.043 శాతం కేటాయింపులు చేసి కపట ప్రేమ చూపించింది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్యాయం చేసింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చేనేతలు వెన్నంటే ఉన్నారని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు వారి సంక్షేమానికి బడ్జెట్లో మాత్రం పైసా విదిల్చలేదు. రాష్ట్రంలో చేనేత మగ్గాలపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా చేనేత ఉప వృత్తుల వారితో కలిపి ఐదు లక్షల మంది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. నేడు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చేనేత వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది. కేటాయింపులు నిల్ ? ● చేనేతల ఆరోగ్య భద్రతను తన బాధ్యతగా స్వీకరిస్తున్నానని చెప్పి హెల్త్ ఇన్స్యూరెన్స్ పథకానికి రూ.10కోట్లను చేనేత దినోత్సవం రోజున విజయవాడలో చంద్రబాబు ప్రకటించారు. కానీ బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. ● చేనేతలపై పెనుభారంగా ఉన్న జీఎస్టీని రద్దు చేయించేందుకు కట్టుబడి ఉన్నామన్న ఆయన కేంద్రంతో చర్చిస్తామని చెప్పి మొండిచెయ్యి చూపించారు. ● ఎన్నికల ముందు చీరాల్లో హ్యాండ్ లూమ్ పార్కు ఏర్పాటు చేయించి చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు, వస్త్రాలకు మార్కెటింగ్ కల్పిస్తానని హామీ ఇచ్చారు. తీరా బడ్జెట్లో ఆ ఊసే లేదు. ● నేతన్న నేస్తం పథకానికి గత ప్రభుత్వం ఏడాది రూ.24వేలు కేటాయించింది. కానీ ప్రస్తుత ప్రభుత్వఆ పథకం మాటే లేదు. ● నూలు సబ్సిడీ, స్థానిక మార్కెట్ అవకాశాలు పెంపొందించుకునేందుకు వినియోగదారులకు వస్త్ర కొనుగోలుపై ఇచ్చే 20శాతం రిబేట్ ఊసేలేదు. కలగానే చేనేత సహకార సంఘాల ఎన్నికలు 2018 నుంచి చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. అఫీషియల్ పర్సనల్ ఇన్చార్జిలతో నడిపిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించేంత వరకు సంఘ సభ్యులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసి కార్మికులకు ఇబ్బంది లేకుండా పని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సంఘ నాయకులు కోరుతున్నారు. చేనేతలకు నేరుగా లబ్ధిపొందే త్రిఫ్ట్ ఫండ్ పథకం, పరికరాల కొనుగోలు, నూలు సరఫరా సబ్సిడీ, ఉత్పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, చేనేతల రుణమాఫీ, పావలా వడ్డీ చెల్లింపులకు ప్రభుత్వ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి సవరణల ద్వారా కేటాయింపులు చేయాలని కోరుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బడ్జెట్లో కేటాయింపులు శూన్యం చేనేతలకు పూర్వ వైభవం తెస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన చంద్రబాబు పైసా విదల్చక పోవడంతో కార్మికుల్లో నిరాశ న్యూస్‌రీల్ -
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా తిరుపతిరావు
గుంటూరు మెడికల్: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా చెరుకూరి తిరుపతిరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు లాల్పురం రోడ్డులోని బీజేపీ జిల్లా కార్యాలయం వాజ్పాయ్ భవన్లో జిల్లా పరిశీలకుడు శ్రీనివాసరాజు, ఎలక్షన్ ఆఫీసర్ చిగురుపాటి కుమారస్వామి, బీజేపీ సీనియర్ నాయకుడు జూపూడి రంగరాజుల ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడిగా చెరుకూరి తిరుపతిరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడిగా తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషిచేస్తానని వెల్లడించారు. పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరవేసే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు జమ్ముల శ్యామ్ కిషోర్, నేరెళ్ల మాధవరావు, కొత్తూరి వెంకట సుబ్బారావు, మకుటం శివ, మాజీ మంత్రి డాక్టర్ శనక్కాయల అరుణ, యడ్లపాటి స్వరూపరాణి, ఈదర శ్రీనివాసరెడ్డి, టుబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్, డాక్టర్ శనక్కాయల ఉమా శంకర్, జిల్లా పదాధికారులు తదితరులు పాల్గొని తిరుపతిరావుకు అభినందనలు తెలిపారు.