East Godavari
-
నిమ్మకు తెగుళ్ల బెడద
పెరవలి: జిల్లాలో నిమ్మపంట 720 హెక్టార్లలో సాగు జరుగుతుండగా వివిధ రకాల తెగుళ్లు ఆశించి ఉండటంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడి, తోటలు పాడైపోతున్నాయి. ముఖ్యంగా ఈ పంటపై ఆకు ముడత, పండ్ల రసాన్ని పీల్చే రెక్కల పురుగులు, బంక, వేరుకుళ్లు, గజ్జి, మొజాయిక్ తెగుళ్లు ఆశించి ఉన్నాయి. ఈ తెగుళ్ల నివారణకు రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలు గురించి కొవ్వూరు ఉద్యాన అధికారి (ఏడీఏ) సీహెచ్ శ్రీనివాస్ వివరించారు. ఆకుముడత : ఈ తెగులు ఎక్కువగా లేత చిగుర్లపై ఆశించి ఆకులపై తెల్లటి పొరలు వంకర టింకరగా ఏర్పడి ఆకులు ముడుచుకునేలా చేస్తుంది. తద్వారా ఆకులపై గజ్జి తెగులు ఎక్కువగా వ్యాప్తి చెంది ఆకులు రాలిపోతాయి. నివారణ చర్యలు : ఆకులు ముడతలు పడినట్లు గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. డైమిథోయేట్ 2 మిల్లీ లీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.5మిల్లీ లీటర్లు మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. దీని ఉధృతి ఎక్కువగా ఉంటే 10 రోజుల వ్యవధిలో రెండవసారి పిచికారీ చేయాలి. తెల్లపొలుసు పురుగులు : ఈ పొలుసు పురుగులు ఎక్కువగా కాండంపై ఆశించి సున్నం పూసినట్లుగా కనపడతాయి. ఇవి కాండం, కొమ్మలలో రసాన్ని పీల్చివేయటం వల్ల అవి ఎండిపోతాయి. నివారణ చర్యలు : ఈ పురుగులు ఆశించిన చోట గోనె సంచితో బాగా రుద్ది మిధైల్డెమటాన్ లేదా డైమిథోయేట్ 2 మిల్లీ లీటర్లు మందును లీటరు నీటిలో కలిపి కాండం, కొమ్మలపై పిచికారీ చేయాలి. నల్లి పురుగులు : నల్లి పురుగుల్లో ఆకుపచ్చ నల్లి, మంగు నల్లి ముఖ్యమైనవి. ఆకునల్లి ఆకులపైన, మంగునల్లి కాయలపైన ఆశించి రసాన్ని పీల్చివేస్తాయి. దీనివల్ల కాయలపై చిన్న చిన్న తెల్లని మచ్చలు లేదా ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కాయ అంతటా మంగు ఏర్పడుతుంది. నివారణ చర్యలు : నీటిలో కరిగే గంధకం 3గ్రాములు లేదా డైకోఫాల్ 5.0 మిల్లీ లీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే నివారణ అవుతుంది. రసం పీల్చే రెక్కల పురుగులు : ఈ రెక్కల పురుగులు పండ్లపై రంథ్రాలు చేసి కాయలో ఉండే రసాన్ని పీల్చుతాయి. దీంతో కాయలకు చేసిన రంథ్రాల ద్వారా శిలీంద్రాలు, బ్యాక్టీరియా చేరి పండ్లు కుళ్లి, రాలిపోతాయి. పండ్లపై డాగు ఏర్పడుతుంది. నివారణ చర్యలు : ఈ పురుగులు ఆశించి కుళ్లి, రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. పురుగులను నాశనం చేయటానికి మలాథియాన్ ఒక మిల్లీలీటరు మందుకు ఒక శాతం పంచదార, పండ్ల రసం కలిపి చెట్ల కింద అమర్చాలి. పురుగులను ఆకర్షించటానికి బల్బులను ఏర్పాటు చేయాలి. దీని ద్వారా పురుగులను అరికట్టవచ్చు. పురుగుల నుంచి కాయలను రక్షించటానికి కాయలకు బుట్టలను ఏర్పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. బంక తెగులు : బంక తెగులు రెండు రకాలు ఒకటి ఫెటోఫ్తోరా, రెండు డిఫ్లోడియా. మొదటి తెగులు ఆశించిన చెట్టు నుంచి ధారాళంగా బంక కారుతుంది. ఇది చెట్టు వేళ్లకు, మొదలు కింది భాగానికి పరిమితమై ఉంటుంది. డిఫ్లోడియా బంక తెగులు చెట్టు మొదలు పైభాగాన కొమ్మల పంగల్లో ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు ఎక్కువగా ఉంటే బంక కారటం, బెరడు కుళ్లటం జరుగుతుంది. నీరు త్వరగా ఇంకని భూముల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుంది. నివారణ చర్యలు : బంక కారి కుళ్లిన బెరడును పూర్తిగా తొలగించి బోర్డోపేస్టు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ పేస్టు పూయాలి. ఈ పేస్టును మొదలు చుట్టూ పూయాలి. కొమ్మలపై వచ్చే బంక తెగులు నివారణకు లీటరు నీటికి 1గ్రాము కార్బండజిమ్ కలిపి చెట్టు మొత్తం తడిసేలా పిచికారీ చేయాలి. మెటలాక్సిల్ 2 గ్రాములు లీటరు నీటిలో కలిపి చెట్టు మొదలులో పోయాలి. వేరుకుళ్లు తెగులు : వేరుకుళ్లు తెగులు ఆశించిన చెట్టుకు పోషక పదార్థాలు అందక చెట్లు ఎండిపోతాయి. ఈ తెగులు ఆశించిన చెట్లు ఎక్కువ పూతపూసి కాయలు ముదిరే లోగా చెట్లు వాడి ఎండిపోతాయి. ఎండిన చెట్ల వేర్లను పరీక్షిస్తే కుళ్లిన వాసన వస్తుంది. నివారణ చర్యలు : వ్యాధి సోకిన తొలి దశలోనే గమనించి చెట్టుకు ఎక్కువగా నీరు కట్టి మరుసటి రోజు కార్బండజిమ్ 2 గ్రాములు లేదా మాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా చెషంట్ 3 గ్రాములు లేదా ఒక శాతం బోర్డో మిశ్రమాన్ని లీటరు నీటిలో కలిపి చెట్టు చుట్టూ నేల తడిసేలా పిచికారీ చేయాలి. చెట్టుకి కావలిసిన పోషక పదార్థాలు సేంద్రియ ఎరువులు, పచ్చి రొట్ట ద్వారా అందించాలి. ఒక కిలో ట్రైకోడెర్మా మందును 90 కిలోల పశువుల ఎరువు 10 కిలోల వేపపిండితో కలిపి 15 రోజులు మాగపెట్టి చెట్టు మొదలు చుట్టూ వేయాలి. ఇలా చేస్తే చెట్టును ఈ తెగులు నుంచి కాపాడవచ్చు. గజ్జి తెగులు (కాంకర్ మచ్చ) : నిమ్మ పంటపై ఎక్కుగా ఆశించే తెగులు ఈ గజ్జి తెగులు. ఇది కాయలు, ఆకులు, చిన్న, పెద్ద కొమ్మలను ఆశిస్తుంది. తెగులు ప్రభావం అధికంగా ఉంటే చెట్లు ఎండిపోయి చనిపోతాయి. నివారణ చర్యలు : ఈ తెగులు సోకి ఎండిన కొమ్మలను కత్తిరించి స్ట్రెప్టోసైక్లిన్ ఒక గ్రాము, 30 గ్రాములు బ్లైటాక్స్ మందును 10 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. గజ్జి ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని గోకి బెరడును తీసి వేసి బోర్డోపేస్టును పూయాలి. -
బ్లడ్ బ్యాంక్‌లో తనిఖీలు
కాకినాడ క్రైం: కాకినాడలోని శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. డీఎంహెచ్‌వో డాక్టర్ నరసింహనాయక్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాధారణ తనిఖీలలో భాగంగా బ్లడ్ బ్యాంక్‌ను పరిశీలించినట్లు తెలిపారు. రిజిస్టర్లు పరిశీలించామని, రిక్విజేషన్ ఫాంలోని వివరాల ఆధారంగా దాతలు, గ్రహీతలతో మాట్లాడి నిర్ధారించుకున్నట్లు తెలిపారు. బ్లడ్ స్టాక్ రికార్డు, డోనార్ రికార్డు, క్యాంప్ రిజిస్టర్స్, క్రాస్ మ్యాచింగ్, డిస్కార్ట్ రిజిస్టర్, బ్లడ్ ఇష్యూ రిజిస్టర్, పేమెంట్ రిక్విజేషన్ ఫాం, పేమెంట్ రిసీప్ట్స్, ఫిజికల్ స్టాక్, బ్లడ్ కలెక్షన్, మ్యాచింగ్, కాంపోనెంట్ ప్రిపరేషన్, వైరల్ స్క్రీనింగ్ రూంలను తనిఖీ చేసినట్లు తెలిపారు. శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్‌లో నిబంధనలకు అనుగుణంగానే రక్తదాన సేవలు కొనసాగుతున్నాయని నిర్ధారించినట్లు తెలిపారు. ఈ తనిఖీలలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ వ్యాధుల నియంత్రణాధికారి(డీఎల్వో) డాక్టర్ రోణంకి రమేష్ పాల్గొన్నారు. -
మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో మండపేట యువకుడి మృతి
మండపేట: పొట్టకూటికి మహారాష్ట్ర పనికి వెళ్లిన మండపేట యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నాలుగు రోజలు క్రితం జరిగిన ఈ విషాద ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు, స్నేహితులు తెలిపిని వివరాలిలా వున్నాయి. పట్టణంలోని కొండపల్లివారి వీధికి చెందిన పరమటి జితేంద్ర (33) మహారాష్ట్రలోని ఉద్గార్లోని ఓ ఫైనాన్స్ సంస్థలో కొంత కాలంగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మార్చి 7వ తేదీ ఉదయం ద్విచక్ర వాహనంపై లైన్‌కు బయలుదేరాడు. హల్నీ రహదారిపై వెళ్తున్న జితేంద్ర గండోపత్ దప్కా ప్రాంతానికి వచ్చేసరికి ప్రమాదానికి గురయ్యాడు. ఎదురుగా వేగంగా వస్తున్న నాలుగు చక్రాల గూడ్స్‌వ్యాన్ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రుణ్ణి స్థానికులు ఆసుపత్రికి చేర్చించారు. అక్కడ వైద్యం పొందుతుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడని చెప్పారు. ఘటనపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. పంచనామా పూర్తయ్యాక అక్కడి పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా మహారాష్ట్ర నుంచి అంబులెనన్స్ వాహనంలో సోమవారం రాత్రి మండపేట తీసుకువచ్చారు. కాగా మృతునికి భార్య, మూడు నెలల పసిపాప వున్నారు. తమ కోసం కష్టపడటానికి వెళ్లి ఎప్పుడూ క్షేమంగా ఇంటికి చేరుకునే తన భర్త ఈసారి ఎవరికీ అందనంత దూరం వెళ్లిపోయారని గుండెలవిసేలా రోదించిన భార్యను చూటి చుట్టుపక్కల వారు కంటతడి పెట్లారు. ఉపాధి హామీ పని చేస్తూ మహిళా కూలి మృతి దేవరపల్లి: ఉపాధి పని చేస్తూ అస్వస్థతకు గురై పని ప్రదేశంలోనే మహిళా కూలీ మృతి చెందిన ఘటన దేవరపల్లి మండలం పల్లంట్లలో మంగళవారం జరిగింది. ఏపీఓ జీవీ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పల్లంట్లకు చెందిన బొందల చంద్రమ్మ(53) 15 ఏళ్లుగా ఉపాధి పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. మంగళవారం ఉదయం గ్రామంలోని రైతు పొలంలో ఫార్మ్ చెరువు తవ్వకం పనులకు వెళ్లిన చంద్రమ్మ కొద్దిసేపటికి అస్వస్థతకు గురైంది. వెంటనే వైద్యం కోసం గ్రామానికి తీసుకువస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. -
‘చెత్త’ విద్యుత్ కేంద్రాన్ని అంగీకరించం
పెదపూడి: బిక్కవోలు మండలం కాపవరం, బలభద్రపురం గ్రామాల వద్ద చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రం ఏర్పాటుకు తాము అంగీకరించబోమని అనపర్తి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. ఈ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనపర్తిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామాల్లో టన్నులకొద్దీ వచ్చే చెత్తను కాపవరం, బలభద్రపురం గ్రామాలకు తీసుకుని వచ్చి, ఆ చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రం ఏర్పాటుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండు నెలలుగా ప్రయత్నిస్తోందని చెప్పారు. సంబంధిత స్థలాన్ని పరిశీలించేందుకు పురపాలక శాఖ మంత్రి నారాయణ స్వయంగా ఈ రెండు గ్రామాల్లో పర్యటించారన్నారు. ఆ విషయం తనకు తెలీదని స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్పడం పచ్చి అబద్ధమని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే భాగస్వామి అని, అయినప్పటికీ ఈ విషయం తనకేమీ తెలియదంటూ మొత్తం తప్పును జిల్లా కలెక్టర్‌పై నెట్టివేయడం హాస్యాస్పదమని విమర్శించారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు స్థానిక తహసీల్దార్, ఆర్డీఓలు గ్రామ పంచాయతీ పాలకవర్గాలను తీర్మానాలు కోరడం ఎమ్మెల్యేకి తెలియకుండానే జరిగిందంటున్నారంటే ఆ గ్రామాలతో పాటు నియోజకవర్గ ప్రజలను మోసం చేయడం కాక మరేమిటని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి ప్రశ్నించారు. స్థానిక ప్రజల అభిప్రాయం అవసరం లేదా? తనకు సమాచారం ఇవ్వరా అంటూ ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే, అధికారులపై ఒత్తిడి చేసి ప్రజాభిప్రాయ సేకరణ నిలుపు చేయించడం ప్రజలను మోసం చేయడం కాదా అని నిలదీశారు. గ్రాసిమ్ పరిశ్రమ వలన ప్రజలు కేన్సర్ బారిన పడుతున్నారని ఎమ్మెల్యే అంటున్నారని, అయితే ఆ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతులిచ్చింది అప్పట్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. దీనికి నాటి టీడీపీ ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 5న విడుదల చేసిన జీఓ 27 సాక్ష్యమని అన్నారు. ఆ విషయం తెలియనట్లు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అనుమతులు వచ్చాయంటూ ఎమ్మెల్యే నల్లమిల్లి పూర్తిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి మండిపడ్డారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ బిక్కవోలు మండల కన్వీనర్ పోతుల ప్రసాదరెడ్డి, కాపవరం సర్పంచ్ సత్యంశెట్టి వెంకట రమణ, ఎంపీటీసీ సభ్యుడు మేడపాటి ఆనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ దీని ఏర్పాటుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం ఫ ప్రజల పక్షాన పోరాడతాం ఫ అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి -
గరుడ వాహనంపై ఘనంగా గ్రామోత్సవం
మధురపూడి: కోరుకొండ శ్రీలక్ష్మీనృసింహుని వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామివారు మంగళవారం రాత్రి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాంగసుందరంగా అలంకరించిన గరుడ వాహనంపై కోరుకొండ వీధుల్లో స్వామివారి గ్రామోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. స్వామివారికి ఉదయం, సాయంత్రం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణోత్సవాల సందర్భంగా స్వామివారి దర్శనాలు, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా దేవస్థానానికి రూ.4,89,174 ఆదాయం వచ్చిందని అన్నవరం దేవస్థానం సూపరింటెండెంట్ వాసు తెలిపారు. అన్నప్రసాద విరాళాలుగా రూ.30,025 వచ్చాయన్నారు. -
బెట్టింగ్‌ల మోజులో యువత
జీవితాలు బలైపోతాయని హెచ్చరిస్తున్న పోలీసులు రాజానగరం: అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పొందుతున్న విజ్ఞానాన్ని సమాజ హితం కోసం కాకుండా తప్పుడు మార్గాలలో సంపాదనలకు కొంతమంది స్వార్థపరులు ఉపయోగిస్తుంటే, వాటికి ఆకర్షితులై కొంతమంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా తమ బిడ్డలు ఉన్నతంగా ఉండాలి, ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేయాలనే ఆశతో చాలామంది తల్లిదండ్రులు తమ కడుపులు మాడ్చుకుని, అప్పులు చేసి మరీ పిల్లలను చదివిస్తున్నారు. ఈ క్రమంలో దూర ప్రాంతాలలోని కళాశాలలలో చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు హాస్టల్స్‌లో ఉంటూ చదువులు సాగిస్తుంటారు. అయితే ఇటువంటి వారిలో కొంతమంది చెడు స్నేహాలతో కన్నవారి ఆశలను వమ్ము చేయడమే కాకుండా, తమ బంగారు జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. బ్రిడ్జి కౌంటీ కేంద్రంగా ... విద్యా, వ్యాపార రంగాలకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న రాజమహేంద్రవరం సమీపంలో ఇంజినీరింగ్, వైద్య కళాశాలలు అనేక ఉండటంతో యాప్‌ల ద్వారా బెట్టింగ్‌లు నిర్వహించే వ్యక్తులు ఈ ప్రాంతాన్నే తమ కేంద్రంగా చేసుకుని, బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న బ్రిడ్జి కౌంటీలో 12 మంది నిందితులు పట్టుబడ్డారు. చేపల చెరువుల ద్వారా ఆర్థికంగా నష్టపోయిన భీమవరానికి చెందిన దండు వెంకటవర్మ అనే సంతోష్ (31), కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్‌కు చెందిన ఇమ్మంది భరత్‌కుమార్ (34)తో కలిసి బ్రిడ్జి కౌంటీలోని బి–12 విల్లాను అద్దెకు తీసుకుని, కొన్ని నెలలుగా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాడు. వీరిద్దరినీ అడ్మిన్లుగా చేసుకుని, భీమవరం నుంచి దుబాయ్ వెళ్లిన వినీత్ అనే మరో వ్యక్తి కీ రోల్ పోషిస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బ్రిడ్జి కౌంటీలో ఇటువంటి కార్యకలాపాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి వాటి గురించి సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేసి, సహకరించాలని నార్త్ జోన్ డీఎస్పీ వై. శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. తప్పుడు మార్గాలలో పయనించి, జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు ఆయన హితవు పలికారు. హాస్టల్స్‌లో ఉంచి చదివిస్తున్న తమ పిల్లల ప్రవర్తనలపై తల్లిదండ్రులు కూడా నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. క్రికెట్ బెట్టింగ్‌లే అధికం సమాచారం కోసం కనుగొన్న సెల్‌ఫోన్ నేడు అందరికీ జీవితంలో ఒక భాగమైపోయింది. చిన్నపిల్లల నుంచి పండు ముదుసలి వరకు సెల్‌ఫోన్ ముట్టుకోకుండా రోజుగడవడం లేదనడం అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో ఇక విద్యార్థుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో పేకాట, గుండాటల తరహాలోనే ఆన్లైన్లో అనేక రకాల యాప్‌లు హల్చల్ చేస్తున్నాయి. అనేక మంది వాటికి ఆకర్షితులవుతున్నారు. తెలిసీ తెలియని పరిజ్ఞానంతో వారి బ్యాంకు అకౌంట్ల వివరాలు అపరిచితులకు తెలియజేయడమే కాకుండా తల్లిదండ్రుల అకౌంట్లను కూడా కొల్లగొట్టేందుకు తోడ్పడుతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది అమాయకులు భయంతో బయటకు చెప్పుకోలేక, తల్లిదండ్రులకు తెలిస్తే ఏమవుతుందోననే భయంతో జీవితాలను అర్ధంతరంగా ముగించుకునే పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి. ఇటువంటి వాటిలో క్రికెట్ బెట్టింగ్‌లే ఎక్కువగా ఉన్నాయి. బార్బర్ షాపులలో కూడా టీవీలను పెట్టుకుని, యాప్‌ల ద్వారా బెట్టింగులు నిర్వహిస్తున్నారు. వీటిని నిరోధించేందుకు పోలీసులు ఎంతగా ప్రయత్నించినా, సరైన ఫలితాలు కనిపించడం లేదు. -
ద్రాక్షారామలో పేలుడు కలకలం
రామచంద్రపురం రూరల్: రామచంద్రపురం మండలంలోని ద్రాక్షారామలో పేలుడు కలకలం చోటు చేసుకుంది. ద్రాక్షారామ ఎస్సై ఎం. లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం బాధిత కుటుంబం ఎండీ జాఫర్ హుస్సేన్ అతని భార్య ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడుతో కలసి ద్రాక్షారామ నున్నవారి వీధిలో నివాసం ఉంటున్నారు. జాఫర్ మార్కెట్లో మటన్ దుకాణం నడుపుకుంటున్నాడు. సోమవారం రాత్రి భోజనం చేసి భార్య, కుమార్తెలు పెంకుటింటిలో నిద్రపోగా, జాఫర్, అతడి కుమారుడు ఇంటి పెరటిలో ఉన్న రేకుల షెడ్డులో నిద్రపోయారు. అర్ధరాత్రి 1.15 గంటలకు పేలుడు శబ్దం, మంటలు రావడంతో భయపడి లేచి బయటకు వచ్చి చూసేసరికి అదే గ్రామానికి చెందిన మహమ్మద్ రోషన్ అబ్బాస్, మరో ఇద్దరు గుర్తు తెలియని యువకులు వీరిని చూసి మోటారు సైకిళ్లపై పారిపోయారు. గాజు సీసాలకు చుట్టిన ఔట్లు, పేలుడు పదార్థాలతో ఇంటిపై దాడి చేశారని, గతంలో రోషన్ అబ్బాస్ భావ మహ్మద్ అలీహుస్సేన్కి తనకి మసీదు విషయంలో ఉన్న గొడవలను దృష్టిలో పెట్టుకుని తమ కుటుంబాన్ని చంపాలని, ఇంటిని నాశనం చేసి ఆస్థి నష్టం కలిగించాలనే ఉద్దేశంతో తమపై దాడికి పాల్పడ్డారని జాఫర్ హుస్సేన్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. ఘటనా స్థలాన్ని సీఐ వెంకట నారాయణ సిబ్బందితో కలసి పరిశీలించారు. -
రూ.1,375.95 కోట్ల భృతి బకాయి
గత ప్రభుత్వ హయాంలో.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పేరిట ఏటా క్రమం తప్పకుండా ఆర్థిక సాయం అందించేవారు. విద్యా దీవెన కింద కళాశాలలను గ్రేడ్లుగా విభజించి, ఎ–ఏగ్రేడ్ కళాశాలలో చదివే వారికి ఏటా రూ.18,400, బి–గ్రేడ్ కళాశాలకు రూ.15,300 చొప్పున నాటి ప్రభుత్వం చెల్లించేది. నాలుగు విడతల్లో ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము విద్యార్థులు, తల్లుల ఉమ్మడి ఖాతాలో జమ చేసేది. దీంతో విద్యార్థులు ఫీజులు చెల్లించేవారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లలో జిల్లాలోని 70,241 మంది విద్యార్థులకు రూ.142.99 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ అందించింది. వసతి దీవెన పథకం కింద 34,261 మంది విద్యార్థులకు చెందిన 30,559 మంది తల్లుల ఖాతాలో ఏటా రూ.32.61 కోట్లు జమ చేసేది. ఇలా నాలుగేళ్లలో 69,098 మంది విద్యార్థులకు రూ.65.56 కోట్ల మేర నాటి జగన్ ప్రభుత్వం అందించింది. ఫ ఉద్యోగాల భర్తీ లేదు.. నిరుద్యోగ భృతీ లేదు ఫ పైగా లక్షల ఉద్యోగాలిచ్చినట్లు బిల్డప్‌లు ఫ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మంగళం! ఫ కూటమి ప్రభుత్వ కుయుక్తులపై వైఎస్సార్ సీపీ ఉద్యమ బాట ఫ నేడు ‘యువత పోరు’ ఆందోళన ఉద్యోగాల భర్తీ నిరుద్యోగ భృతి సాక్షి, రాజమహేంద్రవరం: ‘కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలిస్తాం. ఉద్యోగం వచ్చే వరకూ ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం తమ్ముళ్లూ..’ అంటూ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ. ప్రతి సభ, సమావేశంలో ఇదే విషయాన్ని ఊదరగొట్టారు. ఇలా నిరుద్యోగులను, యువతను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఆ ఊసే ఎత్తడం లేదు. గద్దెనెక్కి తొమ్మిది నెలలైనా ఆ హామీలకు అతీగతి లేదు. ఉద్యోగాల కల్పన కలగానే మిగిలింది. నిరుద్యోగ భృతికి మంగళం పాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడిస్తారనే స్పష్టత కరువైంది. ఇలా విద్యార్థులను, నిరుద్యోగులను వంచిస్తున్న కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు వైఎస్సార్ సీపీ ఉద్యమ బాట పట్టింది. నిరుద్యోగ యువత, విద్యార్థుల పక్షాన సమరభేరి మోగించింది. ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ ‘యువత పోరు’ పేరిట బుధవారం ఆందోళన నిర్వహించేందుకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, నిరుద్యోగులు భారీ ర్యాలీ, కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి, కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నారు. నిరుద్యోగ ‘భ్రాంతి’ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల్లో యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి మొదటి స్థానంలో ఉన్నాయి. కానీ, ఈ హామీల అమలుకు ఇప్పటికీ అతీగతి లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగాలు వచ్చేస్తాయని నమ్మి నిరుద్యోగులు, విద్యార్థులు ఉద్యోగాల సాధనపై దృష్టి సారించారు. పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపేందుకు కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు. రూ.వేలల్లో ఫీజులు చెల్లించి మరీ శిక్షణ పొందుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేశారు. దానికే ఇంతవరకూ దిక్కు లేకుండా పోయింది. మిగిలిన ఉద్యోగాల భర్తీ ఊసే లేదు. దీంతో గత్యంతరం లేక పలువురు చిన్నచిన్న జీతాలకు ఉద్యోగాలు, చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉద్యోగాల భర్తీకి నిరీక్షణ జిల్లావ్యాప్తంగా 1,008 ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో 650కు పైగా ఉపాధ్యాయ ఖాళీలున్నట్లు గతంలో అధికారులు లెక్కలు తీశారు. అయితే 2025 డిసెంబర్ వరకూ ఏర్పడే ఖాళీలను అనుసరించి డీఎస్సీ పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. కానీ, ఇప్పటి వరకూ పోస్టుల భర్తీపై అతీగతి లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మంగళం!విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలపై కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వడం లేదు. గత ఏడాది ఆగస్టు నెలలో విడుదల చేస్తామన్నారే తప్ప నేటికీ విడుదల చేయలేదు. జిల్లావ్యాప్తంగా రూ.32.74 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ కోసం 34,764 మంది పేద విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తూండటంతో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం మంగళం పాడినట్లేనని తల్లిదండ్రులు భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల్లో యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి మొదటి స్థానంలో ఉన్నాయి. కానీ, ఈ హామీల అమలుకు ఇప్పటికీ అతీగతి లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగాలు వచ్చేస్తాయని నమ్మి నిరుద్యోగులు, విద్యార్థులు ఉద్యోగాల సాధనపై దృష్టి సారించారు. పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపేందుకు కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు. రూ.వేలల్లో ఫీజులు చెల్లించి మరీ శిక్షణ పొందుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేశారు. దానికే ఇంతవరకూ దిక్కు లేకుండా పోయింది. మిగిలిన ఉద్యోగాల భర్తీ ఊసే లేదు. దీంతో గత్యంతరం లేక పలువురు చిన్నచిన్న జీతాలకు ఉద్యోగాలు, చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఏటా సుమారు 12 వేల మంది ఇంటర్మీడియెట్ పూర్తి చేస్తున్నారు. దాదాపు 8 వేల డిగ్రీ పట్టా పుచ్చుకుని బయటకు వస్తున్నారు. బీటెక్, ఎంటెక్, డిప్లొమా కోర్సులు పూర్తి చేస్తున్న వారు మరో 2 వేల మంది వరకూ ఉంటున్నారు. వీరిలో కొందరు ఉద్యోగాలు చేస్తున్నా.. మరి కొందరు ఖాళీగా ఉంటున్న దుస్థితి. ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా నిరుద్యోగి ఉంటున్నారు. జిల్లాలో 5,09,611 కుటుంబాలు ఉన్నాయి. ఎన్నికల హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఉద్యోగం లేదా రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇలా ప్రతి నెలా రూ.152,88,33,000 చెల్లించాల్సి ఉంది. మొత్తం తొమ్మిది నెలలకు లెక్క వేస్తే రూ.1375,94,97,000 మేర ప్రభుత్వం భృతి రూపంలో చెల్లించాల్సి ఉంది. నిరుద్యోగ ‘భ్రాంతి’యువత పోరు విజయవంతం చేద్దాం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేదా నిరుద్యోగ భృతి చెల్లించాలనే డిమాండుతో చేపడుతున్న ‘యువత పోరు’ ఆందోళనలో యువతీ యువకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకూ పార్టీ పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలు, యువతతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తాం. కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తాం. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. – చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జిల్లా జనాభా 18,32,332 మొత్తం కుటుంబాలు 5,09,611 ఏటా వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణులవుతున్న వారు 22,000 ఉద్యోగాలు లేదా నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన వారు 5,09,611 9 నెలల్లో భృతి బకాయి రూ.1375,94,97,000 ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.4,600 కోట్ల బకాయిలు తక్షణం చెల్లించాలి. ఫీజుల కోసం కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాలు లేదా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ బడ్జెట్లో ఎక్కడా దీని ప్రస్తావన లేదు. – షేక్ బాబా సలామ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా నిరుద్యోగ భృతి ఇవ్వాలి కూటమి ప్రభుత్వం వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలి. లేదా ప్రతి నెలా నిరుద్యోగ భృతి ఇవ్వాలి. దీనిపై కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ప్రభుత్వ చేయూత లేక నిరుద్యోగులు చిన్నపాటి పనులకే పరిమితమవుతున్నారు. – కోజారి లక్ష్మణరావు, బ్రాహ్మణగూడెం -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,000 గటగట (వెయ్యి) 15,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
నన్నయ వీసీకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య సత్తుపాటి ప్రసన్నశ్రీకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన హెచ్ఎంటీవీ మాతృశక్తి అవార్డు–2025 కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డు అందుకున్నారు. అంతరించిపోతున్న 19 గిరిజన భాషలకు లిపి రూపొందించి, 2022లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి ‘నారీ శక్తి’ అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో వీసీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న తొలి గిరిజన మహిళగా గుర్తింపు పొందిన ఆమె విద్యారంగానికి అందిస్తున్న విశిష్ట సేవలకుగాను ఈ అవార్డు అందజేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి అవార్డు అందుకుంటున్న ఆచార్య ప్రసన్నశ్రీ -
ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా
13 మంది విద్యార్థులకు గాయాలు జగ్గంపేట: జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామంలో మంగళవారం ఉదయం విద్యార్థులతో జగ్గంపేట వస్తున్న ఒక ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 13 మంది విద్యార్థులు ఉండగా వీరిలో 9 మందికి స్వల్పంగాను, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జగ్గంపేట ఎస్సై రఘునాథరావు తెలిపిన వివరాల మేర కు ఉదయం జగ్గంపేట వస్తున్న బస్సు కాండ్రేగుల గ్రామ శివారులో బోల్తాపడింది. స్థానికుల సహకారంతో విద్యార్థులను బయటకు తీసి జగ్గంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. వీరిలో 9 మందిని ప్రాథమిక చికిత్స అనంతరం ఇళ్లకు పంపించేశారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురు తోటకూర కార్తీక్ నాగేంద్ర, అనితా రామచక్ర, ద్వారపూడి ధనలక్ష్మి, బొదిరెడ్డి శ్రావణిలను మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. స్కూల్ కరస్పాండెట్, వైఎస్సార్ సీపీ జిల్లా బూత్ కమిటీల అధ్యక్షుడు ఒమ్మి రఘురాంఆస్పత్రికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విద్యార్థులందరూ 6 నుంచి 9 తరగతి చెందిన వారని, డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎస్సై తెలిపా రు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రణీత్ విద్యార్థులకు వైద్య సేవలందించారు. -
ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక పాత సోమాలమ్మ గుడి వద్ద ప్లాస్టిక్ గోడౌన్లో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వివరాలివీ.. ఆలయం ఎదురుగా హర్షిత ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన గోడౌన్ ఉంది. అందులో మార్కెట్లో విక్రయించేందుకు ప్లాస్టిక్ సామాన్లు పెద్ద మొత్తంలో ఉంచారు. ప్రస్తుతం సోమాలమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో వెలిగించిన బాణసంచా వెళ్లి పడటంతో ప్లాస్టిక్ గోడౌన్‌కు నిప్పంటుకుంది. ప్లాస్టిక్ సామగ్రి కావడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రాజమహేంద్రవరం అగ్నిమాపకశాఖాధికారి శ్రీనివాస్ నేతృత్వంలో రాజమహేంద్రవరం నుంచి రెండు, కొవ్వూరు నుంచి ఒకటి చొప్పున అగ్నిమాపక వాహనాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సుమారు రెండు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. కాలి బూడిదైన ప్లాస్టిక్ సామగ్రి విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని గోడౌన్ యజమానులు చెబుతున్నారు. రూ.30 లక్షల ఆస్తినష్టం -
నేడు వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం
రాజమహేంద్రవరం రూరల్: వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. పార్టీకి చెందిన ముఖ్య నేతలు పాల్గొనే ఈ కార్యక్రమం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుంది. వైఎస్సార్ సీపీ బుధవారంతో 15వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వేణుగోపాలకృష్ణ తెలిపారు. ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయపార్టీ ఎదుర్కోనన్ని సవాళ్లు, దాడులను వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ సీపీ ఎదుర్కొందన్నారు. వాటన్నింటినీ ఎదుర్కొంటూనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం జగన్ అలుపెరగని పోరాటం చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల పాటు సంక్షేమాభివృద్ధి పథకాలు, విప్లవాత్మక సంస్కరణలతో సుపరిపాలన అందించారన్నారు. పీ–4 సర్వేకి సహకరించండి రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో నిర్వహిస్తున్న పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టిసిపేషన్ (పి–4) సర్వేకి ప్రజలందరూ సహకరించాలని కలెక్టర్ పి.ప్రశాంతి మంగళవారం ఒక వీడియో సందేశంలో విజ్ఞప్తి చేశారు. ఈ సర్వే ద్వారా పేదల్లో పేదలను గుర్తించడం, తలసరి ఆదాయం, ఆరోగ్య, విద్యా ప్రమాణాలు పెంచే ప్రయత్నంలో వారి ఆర్థిక పరిస్థితి, ఏ పని చేస్తే వారికి ఆదాయం వస్తుందనే అంశాలను తెలుసుకునేందుకు ఈ సర్వే చేపడుతున్నారని వివరించారు. సర్వేలో భాగంగా పీజీఆర్ఎస్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారంలో సంతృప్తి స్థాయి కూడా తెలుసుకుంటారని తెలిపారు. జిల్లాలోని 1,33,548 ఇళ్లను 502 గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న 3,408 మంది సిబ్బంది ఈ సర్వేలో పాల్గొంటారని పేర్కొన్నారు. వారికి ప్రజలు సహకరించి, తగిన సమాచారం అందించాలని కోరారు. ఈ నెల 18వ తేదీ వరకూ ఈ సర్వే జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రుల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం కొవ్వూరు: జిల్లాలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి ఎం.పద్మశ్రీ రాణి తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్–1, ఆడియో మెట్రీషియన్–2 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిపై భర్తీ చేస్తామన్నారు. బయో స్టాటిస్టిషన్–1, థియేటర్ అసిస్టెంట్–1, జనరల్ డ్యూటీ అటెండెంట్స్–22, ఆఫీస్ సబార్డినేట్స్–3 పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో ఏడాది కాలానికి భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 13వ తేదీ ఉదయం 10.30 నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు స్థానిక ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న తన కార్యాలయంలో సమర్పించాలని పద్మశ్రీ రాణి సూచించారు. నిడదవోలు ఆర్ఓబీ పనులపై క్షేత్రస్థాయి తనిఖీలు రాజమహేంద్రవరం రూరల్: నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణ పనులపై అధికారులతో కూడిన నిపుణుల కమిటీ ద్వారా క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి, నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. రెవెన్యూ, రైల్వే అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నిడదవోలు ఆర్ఓబీ పనులను వేగవంతం చేయాలన్నారు. దీనికి సంబంధించి క్షేత్ర స్థాయిలో సింగవరం, శెట్టిపేట, తాళ్లపాలెం గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించామన్నారు. ఈ పనులపై ఆర్డీఓ, రైల్వే ఈఈ, ఇరిగేషన్ ఎస్ఈ, జిల్లా వ్యవసాయ అధికారితో కలిసి రెండు మూడు రోజుల్లో క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తి చేసి, నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఎర్ర కాలువకు వరద వచ్చినప్పుడు ముంపు సమస్య పరిష్కారానికి అధికారులు ఇచ్చే సూచనలను అనుసరించి జిల్లా మంత్రితో చర్చించి, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, రైల్వే ఈఈ అశోక్ కుమార్, నిడదవోలు తహసీల్దార్ బి.నాగరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మిత్రుల అంకురం.. రైతులకు సంబరం
పిఠాపురం: పంటకు మేలు చేసి, రైతులకు పురుగు మందుల ఖర్చు తగ్గించే మిత్రులుగా భావించే మిత్ర పురుగులు సేంద్రియ వ్యవసాయం పుణ్యమా అని మళ్లీ వాటికి జవజీవాలు సంతరించుకున్నాయి. విచ్చలవిడిగా రసాయనాల వినియోగంతో కనుమరుగైన మిత్ర పురుగులు.. సేంద్రియ వ్యవసాయంతో ఉనికిలోకి వస్తున్నాయి. వీటివల్ల పంటలకు ఎంతో మేలు కలిగి, రైతుకు పైసా ఖర్చు లేకుండానే క్రిమికీటకాలు నివారించబడతాయి. అలాంటి మిత్ర పురుగులు పొలాల్లో కనిపించకుండా పోవడంతో, కీటకాలు పెరిగి, పంటలకు తెగుళ్లు సోకి రైతుకు నష్టాలను మిగులుస్తున్నాయి. ఈ తరుణంలో ప్రకృతి వ్యవసాయం వల్ల పంటలకు మిత్రులు మళ్లీ వస్తుండడంతో రైతులను ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు మేలు సాలీడు, అక్షింతల పురుగు, తూనీగలు, అల్లిక రెక్కల పురుగు, గొల్లభామలను పంటలకు మిత్రులుగా చెబుతారు. ఇవి పంటలకు రక్షణ కవచాలుగా రైతులు పరిగణిస్తుంటారు. కొన్నేళ్లుగా సాగులో రసాయనాలను గణనీయంగా వినియోగించడంతో కనుమరుగైన ఈ పురుగులు.. ప్రకృతి వ్యవసాయం వల్ల, రసాయనాల వినియోగం తగ్గి, మళ్లీ భూమిపై సంచరిస్తూ పంటలకు మేలు చేస్తున్నాయి. ఈ మిత్ర పురుగులు పొలంలో లేకుంటే పంటకు కీడు చేసే పురుగుల తీవ్రత పెరిగి, పంటలకు తీవ్ర నష్టాలను కలిగిస్తాయి. అక్షింతల పురుగు పంటలకు అక్షింతల పురుగు (లేడీ బర్డ్ బీటిల్) చాలా ప్రయోజనకరంగా చెబుతారు. అనేక రకాల కీటకాలను, పేను బంక లాంటి రసం పీల్చే పురుగులకు ఇవి సహజ శత్రువులు. ఒక అక్షింతల పురుగు తన జీవిత కాలంలో సుమారు ఐదు వేల పేనుబంక పురుగులను తింటుంది. గుండ్రంగా కుంభాకారం కలిగి ఉంటుంది. పసుపు, గులాబీ, నారింజ, ఎరుపు, నలుపు రంగుల్లో మచ్చలు కలిగి ఉంటుంది. వీటి లార్వాలు సైతం కీటకాలను వేటాడుతాయి. ఆడ పురుగులు ప్రతి మూడు నెలలకోసారి సుమారు వెయ్యి గుడ్లు పెడతాయి. ఇవి ప్రకాశవంతమైన మచ్చలతో, నలుపు రంగులో ఉండి, ప్రమాదకరమైన దానిగా కనిపించినప్పటికీ పంటకు మాత్రం ఎంతో మేలు చేస్తుంది. ఇవి వదిలే లార్వా ఎటువంటి ప్రమాదకరం కాకపోవడంతో పంటకు మేలు మినహా, కీడు అనేది ఉండదు. అనేక వారాల పాటు పంటలపై ఉండి కీటకాలను తినడం ద్వారా రైతులు కీటకాల నివారణకు పురుగు మందులు పిచికారీ చేసే అవసరం లేకుండా, పెట్టుబడి, శ్రమ చాలా తగ్గుతుంది. అల్లిక రెక్కల పురుగు ప్రకృతిలో అల్లిక రెక్కల పురుగు (గ్రీన్ లేస్ వింగ్ బగ్) విరివిగా కనిపించే ఓ సాధారణ రెక్కల పురుగు. కానీ ఇది పంటలకు చేసే మేలు అంతా ఇంతా కాదు. గొంగళి పురుగులు, లీవ్ ఆఫర్స్, బిలివర్స్, వైట్ ఫ్లైస్ వంటి ఇతర మృదువైన శరీరం కలిగిన కీటకాలను నియంత్రించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. లేత ఆకుపచ్చ రంగులో, సున్నితమైన రెక్కలతో ఉండే ఈ పురుగు వదిలే లార్వా ఇతర కీటకాలను నాశనం చేస్తాయి. పంటలు నాశనం చేసే కీటకాలకు దీనిని బద్ధ శత్రువుగా చెబుతారు. తూనీగ పొడవైన శరీరం కలిగి, కళ్లు, రెండు జతల బలమైన రెక్కలు కలిగి, వివిధ రంగుల మచ్చలతో ఉండే తూనీగ (డ్రాగన్ ఫ్లై) 95 శాతం కీటకాలను వేటాడతాయి. అందుకే దీనిని డెడ్లీ హంటర్ అని కూడా అంటారు. కచ్చితమైన లక్ష్యాన్ని ఛేదించేవిగా చెబుతారు. ఇవి ఒకే వేసవిలో వేలాది కీటకాలను పట్టుకుని తింటాయి. దోమలు, ఈగలు, తెల్లదోమలను తిని పంటలకు మేలు చేకూరుస్తాయి. సాలీడు సాధారణ పంటలకు సోకే తెగుళ్ల నియంత్రణకు సాలీడు (స్పైడర్) జీవ ఏజెంట్లుగా పని చేస్తాయి. ఇవి అనేక సజీవ కీటకాలను తింటాయి. చీడపీడలను నియంత్రించడంలో వీటిని మించిన పురుగు మరొకటి లేదంటారు. కేవలం శత్రు కీటకాలను తినడం మినహా, పంటకు కానీ, మొక్కలకు కానీ ఎటువంటి హానీ చేయకపోవడం వల్ల మిత్ర పురుగుల్లో ఇది తొలి స్థానంలో ఉంది. దోమలు, ఈగలు, తెల్లదోమలు, ఎగిరే కీటకాలను పట్టుకుని తినడం ద్వారా ఇవి పంటలకు మేలు చేస్తాయి. గొల్లభామ పంటలకు గొల్లభామ (ప్రేయింగ్ మ్యాంటీస్)లను ఆస్తులుగా చెబుతారు. తెగుళ్ల నియంత్రణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. పునుబంక, ఆస్త్రరాగస్ బీటిల్స్, గొంగళి పురుగు, బీటిల్స్, తేనెమంచు పురుగు తదితర వాటిని తిని పంటలకు హాని కలగకుండా నివారిస్తాయి. ఇవి పుప్పొడి మకరందాన్ని తీసుకోవు. కానీ వీటిని ఉత్పత్తి చేసే మొక్కలు గొల్లభామలు తినే ఆహారాలైన కీటకాలను ఆకర్షిస్తాయి. వీటివల్ల పంటలకు చాలా మేలు కలుగుతుంది. పంటకు రక్షకులు.. కీటకాలకు శత్రువులు రసాయనాల వినియోగంతో కనుమరుగు ప్రకృతి వ్యవసాయంతో మిత్ర పురుగులకు జీవం సేంద్రియ పంటల్లో వాటి ప్రాముఖ్యమెంతో.. మిత్ర పురుగులు మళ్లీ వచ్చాయి గతంలో ఎక్కడ చూసినా మిత్ర పురుగులు కనిపించేవి. కానీ రసాయనాల వినియోగం వల్ల అవి కనుమరుగయ్యాయి. ముఖ్యంగా పొలాల్లో అస్సలు కనిపించడం లేదు. కానీ సేంద్రియ వ్యవసాయం మొదలయ్యాక వాటి మనుగడ మళ్లీ ప్రారంభమైంది. రైతు ఎటువంటి పురుగు మందులు వాడకుండా, 70 శాతం వరకు ఇవి పంటలకు హాని చేసే కీటకాలను నాశనం చేసి, పంటకు మేలు చేస్తాయి. ఇప్పుడు ఇవి భారీగా కనిపిస్తున్నాయి. తెగుళ్లు తగ్గుముఖం పట్టాయి. రైతుకు పెట్టుబడి తగ్గింది. ఇది చాలా శుభపరిణామంగా చెప్పవచ్చు. – గుండ్ర శివచక్రం, ప్రకృతి వ్యవసాయ రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం ప్రకృతి వ్యవసాయ ఫలితమే.. కొన్నేళ్లుగా చేపట్టిన ప్రకృతి వ్యవసాయ సాగు ఫలితమే మిత్ర పురుగుల మనుగడకు అంకురం. ప్రస్తుతం సేంద్రియ పంటలన్నింటి పైనా ఈ పురుగులు సంచరిస్తున్నాయి. తద్వారా కీటకాల బెడద గణనీయంగా తగ్గింది. పురుగు మందుల అవసరం లేకుండా పోయింది. పంటలకు మంచి రోజులు వచ్చాయనడానికి నిదర్శనమే మిత్ర పురుగుల సంచారం. ఇది మారుతున్న వ్యవసాయ విధానాల్లో శుభపరిణామంగా చెప్పవచ్చు. – ఎలియాజరు, డీపీఎం, ప్రకృతి వ్యవసాయ శాఖ, కాకినాడ -
పోలీస్ పీజీఆర్ఎస్కు 29 ఫిర్యాదులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రతీ సోమవారం నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం’(ిపీజీఆర్‌ఎస్)కు 29 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి పోలీసు కార్యాలయానికి వచ్చిన ప్రజల నుంచి వివిధ రకాల అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను స్వయంగా జిల్లా అడినల్ ఎస్పీ(అడ్మిన్) ఎన్‌బీఎం మురళీకృష్ణ అడిగి తెలుసుకున్నారు. సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా మాట్లాడి ఫిర్యాదిదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయవలసిందిగా సూచించారు. కుటుంబ సమస్యల గురించి, ఛీటింగ్, కొట్లాట, దొంగతనం కేసులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించారు. -
రెండో ర్యాంకుకు అన్నవరం దేవస్థానం !
ఇతర పుణ్యక్షేత్రాల స్థానం దిగజారడంతో ఎగబాకిన వైనం అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం భక్తులకు అందిస్తున్న సేవల్లో రెండో ర్యాంకును సాధించింది. గత నెలలో రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో చివరగా ఏడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 25 మధ్య సేకరించిన అభిప్రాయ సేకరణలో రెండో స్థానంలో ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన దేవస్థానాల భక్తుల అసంతృప్తి శాతం తక్కువగా ఉండడంతో రెండో స్థానంలో నిలిచినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గతంలో ఈ దేవస్థానం ఏడో ర్యాంకులో ఉండడంతో కలెక్టర్ షణ్మోహన్ గత నెల 24న అన్నవరం విచ్చేసి, విస్తృత తనిఖీలు నిర్వహించి, దేవస్థానం మొదటి ర్యాంకులో రావాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. భక్తులకు సేవలందించడం, ప్రసాదం నాణ్యత, ఇతర ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలు సేకరించి తాజా ర్యాంకులు ప్రకటించింది. భక్తులకు దర్శనంలో రెండో ర్యాంకు, మౌలిక వసతుల్లో మూడో ర్యాంకు, ప్రసాదం రుచిలో రెండో ర్యాంకు సాధించింది. -
క్రికెట్ బెట్టింగ్‌లో 12 మంది అరెస్టు
రాజానగరం: జాతీయ రహదారిని ఆనుకుని చక్రద్వారబంధం సమీపంలో ఉన్న బ్రిడ్జి కౌంటీలోని బి–12 విల్లాలో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్‌లో 12 మందిని అరెస్టు చేశామని నార్త్ జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ తెలిపారు. దుబాయ్ కేంద్రంగా నడుస్తున్న ఈ క్రికెట్ బెట్టింగ్‌లో పట్టుబడిన వారంతా కర్నాటక, భీమవరం వారేనన్నారు. ఈ వివరాలను సోమవారం సాయంత్రం ఇక్కడ మీడియాకు వెల్లడించారు. భీమవరం మండలం బలుసుముడికి చెందిన దండు వెంకటవర్మ అలియాస్ సంతోష్ (31), కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్‌కు చెందిన ఇమ్మంది భరత్‌కుమార్(34)తో కలిసి బ్రిడ్జి కౌంటీలోని బి–12 విల్లాను అద్దెకు తీసుకున్నాడు. కొంతమందిని ఆఫీసు బుక్కీలుగా, కాంట్రాక్ట్ స్టాఫ్‌గా తీసుకుని కొన్ని నెలలు ఆన్లైన్ ద్వారా పంటర్స్(కస్టమర్స్)తో గెలుపు, ఓటములపై గేమింగ్ నడుపుతున్నాడు. ఈ బెట్టింగ్ ప్రక్రియ దుబాయ్ కేంద్రంగా జరుగుతోంది. భీమవరానికి చెందిన వినీత్ అనే వ్యక్తి దుబాయ్‌కి వెళ్లి, అక్కడి నుంచి కన్నడ, ఏపీబుక్.బర్లారి.కామ్లనే వెబ్సైట్లను నిర్వహిస్తుంటే, ఇద్దరు నిందితులు ఇక్కడి నుంచి అతనికి ఆడ్మిన్లుగా ఉన్నారు. గతేడాది జూలైలో అడ్మిన్లు ఇద్దరికీ కన్నడ 24.కామ్ అనే వెబ్సైట్ ద్వారా వైజాగ్‌లో 20 రోజుల శిక్షణ కూడా ఇచ్చాడు. ఆ తరువాత బి.కామ్ వెబ్ సైట్‌ని కొత్తగా ప్రారంభించి, ఈ బ్రిడ్జి కౌంటీలో అద్దెకు తీసుకున్న విల్లా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆదివారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌పై మధ్యాహ్నం 2 గంటల నుంచి మ్యాచ్ పూర్తయ్యే వరకు బెట్టింగ్‌లు నిర్వహించారు. ఈ మేరకు అందిన సమాచారంతో ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు ఎస్సై నాగార్జున ఆకస్మిక దాడి చేసి, నిందితులను అరెస్టు చేశారు. మొత్తం 12 మంది నిందితుల్లో ఇద్దరు ప్రధాన నిందితులు కాగా, మిగిలిన 10 మంది బుక్కీలు(ఆఫీస్ స్టాఫ్). వీరి నుంచి ఏడు ల్యాప్‌టాప్‌లు, 42 సెల్ఫోన్లు స్వాధీనపర్చుకున్నామని డీఎస్పీ తెలిపారు. బెట్టింగ్‌లకు వినియోగిస్తున్న వెబ్సైట్లను క్లోజ్ చేయించడంతో పాటు, వారి బ్యాంక్ ఖాతాలను కూడా సీజ్ చేయించేందుకు చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో సీఐ వీరయ్యగౌడ్, ఎస్సైలు మనోహర్, నాగార్జున, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. నిందితులు కర్నాటక, భీమవరం వారే.. దుబాయ్ నుంచి కీ రోల్ పోషిస్తున్న వినీత్ నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ వెల్లడి -
అర్జీల పరిష్కారంలో హేతుబద్ధత
రాజమహేంద్రవరం రూరల్: ప్రజల నుంచి స్వీకరించిన అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో ఆమె, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడుతో కలిసి అర్జీలను స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ ఎన్నికల నియమావళి పూర్తయినందున వివిధ స్థాయిల్లో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను హేతుబద్ధతతో పరిష్కారం చూపాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాటిని పరిష్కరించాలన్నారు. స్వయంగా కలిసిన వివరాలు ఎప్పటికప్పుడు పోర్టల్ లో అప్లోడ్ చేయాలన్నారు. ఆన్లైన్ లో ఉన్నతాధికారుల ద్వారా వచ్చిన 285 అర్జీలు పరిష్కారం చెయ్యాల్సి ఉందన్నారు. పోలీస్ 61, విద్యుత్ 31, రెవెన్యూ 65, పంచాయతీరాజ్ 28, వ్యవసాయ శాఖకు సంబంధించి 6 ఉన్నాయన్నారు. క్షేత్ర స్థాయిలో పరిష్కారం అయ్యే అర్జీలు జిల్లా కేంద్రానికి రావడం, ఒకే ఫిర్యాదు పలుసార్లు రావడం గుర్తించామన్నారు. భూములు, సర్వే, విభజన, మ్యుటేషన్, వితంతు, వృద్దాప్య, దివ్యాంగుల పెన్షన్ల కోసం, రేషన్ కార్డులు తదితర అంశాలపై అర్జీలు వస్తున్నాయని, సచివాలయం స్థాయిలో వివరాలు నమోదు చేసి అర్జీదారునికి వివరించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి వారికి తెలియజేయ్యాల్సి ఉంటుందన్నారు. దివ్యాంగులకు 3 వీల్ చైర్స్, 10 హియరింగ్ ఎయిడ్స్ పంపిణీ పీజీఆర్ఎస్లో జిల్లా ప్రత్యేక అవసరాల, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మూడు వీల్ చైర్స్, 10 వినికిడి యంత్ర పరికరాలను కలెక్టర్ ప్రశాంతి, జేసీ చిన్న రాముడు అందజేశారు. జిల్లా రెవిన్యూ అధికారి టి.సీతారామమూర్తి, బీఎస్పీ భవ్యకిషోర్, సీపీవో అప్పలకొండ, డీఎల్డీవో పి.వీణాదేవి పాల్గొన్నారు. కలెక్టర్ ప్రశాంతి -
హిందువులపై అక్రమ కేసులు దారుణం
రాజమహేంద్రవరం రూరల్: అన్నమయ్య జిల్లా రాయచోటి సంఘటనలో స్థానిక ఎస్సైని సస్పెన్షన్ చేయాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఆయన సక్రమంగా విధులు నిర్వర్తించకపోవడం దారుణమని పేర్కొంది. బాధిత హిందువులు, హిందూ సంస్థలపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని, ఉత్సవంపై దాడి చేసిన వారిని గుర్తించి, తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి తెలియజేస్తూ రాసిన వినతి పత్రాన్ని సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పి.ప్రశాంతికి అందజేసింది. ముందుగా విశ్వహిందూ పరిషత్ సభ్యులు కోటిపల్లి బస్టాండ్ సెంటర్ నుంచి బైక్ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. రాధామనోహర్‌దాస్, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు సత్తి గోవిందరెడ్డి, కార్యవర్గ సభ్యులు గనిరాజు, అనంత్, గీత, వెంకట్ , ప్రదీప్, వర్మ, కొవ్వూరు జిల్లా కార్యదర్శి గంగాధరం, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ విభాగ్ సహకార్యవాహ కామవరపు మోహన్‌కృష్ణ, విభాగ్ కార్యకారిణి సభ్యులు వాడ్రేవు మాణిక్యాలరావు, సమరతసేవ ఫౌండేషన్ జిల్లా ధర్మప్రచారక్ కర్రి శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర తదితర సుమారు 300 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరభద్రస్వామి ఉత్సవంలో దాడి వీహెచ్‌పీ నాయకులు మాట్లాడుతూ రాయచోటిలో ఈ నెల 4వ తేదీన వీరభద్రస్వామి ఆలయ పార్వేటి ఉత్సవం సందర్భంగా భక్తులు ఊరేగింపు చేస్తుండగా హిందువులపై మరోవర్గం వారు దాడి చేశారని, ఈ దాడిని అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. అలాగే పక్షపాత ధోరణితో హిందువులపైనే అమానుషంగా లారీచార్జి చేసి వారిని తీవ్రంగా గాయపరిచి, అక్రమ కేసులు బనాయించారన్నారు. అన్ని అనుమతులు తీసుకొని ఉత్సవాన్ని నిర్వహించుకుంటుంటే, దానికి ఆటంకాలు కలగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఉత్సవంపై దాడి చేసిన వారిని వదిలేసి, తిరిగి హిందువులపై, హిందూసంస్థలపై కేసు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. వాటిని వెంటనే ఉపసంహరించాలి రాయచోటిలో ఉత్సవంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి వీహెచ్‌పీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ కలెక్టరేట్లో వినతిపత్రం అందజేత -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,000 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ముస్లిం మైనార్టీలపై చిన్న చూపెందుకు బాబూ?
ఏపీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ నిజాం ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్సీ పదవి మైనారిటీలకు లేకుండా చేయడం ద్వారా ఆ వర్గానికి అన్యాయం చేశారని ఏపీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ నిజాం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలను సీఎం చంద్రబాబు చిన్నచూపు చూస్తున్నారని, నామినేటెడ్ పోస్టుల్లోనూ ముస్లింలకు ప్రాధాన్యం దక్క లేదని తెలిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో ముస్లిం, దూదేకులకు 13 కార్పొరేషన్ చైర్మన్ పదవులిచ్చి వాటిలో 6 కేబినెట్ హోదా కల్పించారని గుర్తుచేశారు. శాసనమండలిలో వైస్ చైర్మన్ పదవితోపాటు రాష్ట్రంలో టాప్ 10 కార్పొరేషన్లలో ఇద్దరు ముస్లింలకు చోటు కల్పించారన్నారు. జనసేన దక్కించుకున్న కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో ఒక్కటి కూడా ముస్లిం మైనారిటీలకు కేటాయించకపోవడం గమనిస్తే మైనార్టీలపై పవన్ కల్యాణ్ వైఖరి అర్థమవుతోందన్నారు. ఆయనకు మైనారిటీల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. జనసేన, టీడీపీలో ఉన్న మైనారిటీ నాయకులు సీఎం చంద్రబాబునాయుడితో మాట్లాడి.. బీజేపీ ప్రభుత్వం తీసుకోరాబోతున్న కుట్రపూరిత వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసే విధంగా ఒత్తిడి తీసుకోని రావాలని ఆయన కోరారు. సత్యదేవుని ఆలయానికి భక్తుల తాకిడిఅన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని ఆలయం ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం వేలాదిగా వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, విశ్రాంతి మండపాలు అన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించగా స్వామివారి వ్రతాలు 1,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ. 30 లక్షలు ఆదాయం సమకూరింది. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో నాలుగు వేల మందికి భోజన సౌకర్యం కల్పించారు. సత్యదేవునికి ఘనంగా ఏకాదశి పూజలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పార్చన, ఉదయం తొమిది గంటల నుంచి 11 గంటల వరకు పుష్పార్చన నిర్వహించారు. ముత్యాల కవచాల అలంకరణలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతీ రోజు స్వర్ణాభరణాలు, వజ్ర కిరీటాలతో భక్తులకు దర్శనమిచ్చే స్వామి, అమ్మవారు ప్రతీ సోమవారం ముత్యాల కవచాలతోను, ప్రతీ గురువారం ఏ విధమైన ఆలంకరణలు లేకుండా నిజరూపంలో దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. -
కమనీయం నరసన్న కల్యాణం
మధురపూడి: శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల సందర్భంగా కోరుకొండ గోవింద, హరి నామస్మరణతో మార్మోగింది. స్వయంభు శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం రథోత్సవం, రాత్రి 9 గంటలకు కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగాయి. దేవస్థానంలోని కల్యాణ మండపంలో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. కోరుకొండ నవనరసింహ క్షేత్రం కావడంతో సుదూర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కోరుకొండ పరిసరాలన్నీ భక్తజనంతో కిక్కిరిసింది. రథోత్సవంతో కోరుకొండ మీదుగా గోకవరం, భద్రాచలం, విశాఖపట్నం, విజయనగరం వెళ్లాల్సిన వాహనాలు నిలిచిపోయాయి. ప్రధాన వీధుల మీదుగా కొనసాగిన రథోత్సవం సాయంత్రం 5.30కు తిరిగి దేవస్థానానికి చేరింది. అక్కడ స్వామి, అమ్మవార్లను మేళతాళాలు, మంగళవాయిద్యాలతో ఆలయానికి తోడ్కొనివచ్చారు. వధూవరులకు మంగళస్నానాలు నిర్వహించారు. పట్టువస్త్రాలను అలంకరించిన స్వామి, అమ్మవారు దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. వధూవరులకు వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం వేద పండితులు పాణింగపల్లి పవన్‌కుమార్ ఆచార్యులు కల్యాణం నిర్వహించారు. దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త ఎస్పీ రంగరాజబట్టర్, అర్చకస్వాములు పెద్దింటి, పెదపాటి వారి పర్యవేక్షణలో కల్యాణ వేడుక కమనీయంగా జరిగింది. మాలధారణ భక్తుల ప్రదర్శనలు రథోత్సవంలో మాలధారణ చేసిన భక్తుల ప్రదర్శనలు ఆధ్యాత్మకతను సంతరించుకున్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన 220 మంది భక్తులు స్వామివారి మాలధారణ వేశారు. ఉత్సవాల సందర్భంగా స్వాములు 9 రోజుల పాటు నిష్ఠతో పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. వీరికి స్వామివారి మాలధారణ ట్రస్టు ద్వారా వడి, భిక్షలను ఏర్పాటు చేశారు. బుధవారం దీక్షను విరమిస్తారు. భక్తజన సందోహం నడుమ.. సోమవారం స్వామివారి రథోత్సవం భక్తజన సందోహం నడుమ వైభవంగా జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 1.56 గంటలకు వేద మంత్రోచ్ఛరణతో స్వామి, అమ్మవార్లు ఆశీనులైన రథం బయలుదేరింది. కొండ నుంచి ప్రారంభమైన రథం దేవస్థానం రోడ్డు, వాటర్ ప్లాంట్, రెడ్డి పంతులు సత్రం, పాత సంత మార్కెట్, వడ్టీలపేట, మత్స్యకారుల వాడ, ఎయిర్టెల్ టవర్, సాయిబాబా గుడి, అంకాలమ్మ గుడి, శివాలయం మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా గరగ నృత్యాలు, బ్యాండ్‌మేళాలు, కోలాటం, తీన్మార్, శక్తి వేషధారణలు, కేరళ డ్రమ్స్ వాయిద్యాలతో రథానికి స్వాగతం పలికారు. సాయంత్రం 5.40కు రథం తిరిగి దేవస్థానానికి చేరింది. భక్తులు అరటి పండ్లను స్వామి రథంపైకి వేస్తూ, దర్శించుకున్నారు. దేవస్థానానికి చేరుకున్న రథానికి ఎదుర్కోలు కార్యక్రమంలో భాగంగా మేళతాళాలతో నరసింహస్వామి, లక్ష్మీదేవిని ఆలయంలోకి తీసుకెళ్లారు. ఆయా కార్యక్రమాల్లో అన్నవరం దేవస్థాన ఈఓ వీర్ల సుబ్బారావు, దేవస్థానం అధికారులు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణచౌదరి, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, నార్త్‌జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్, కోరుకొండ తహసీల్దార్ సుస్వాగతం, ఎంపీడీఓ బత్తిన అశోక్‌కుమార్ పాల్గొన్నారు. కోరుకొండ సీఐ సత్యకిషోర్, ఎస్సై శ్యామ్‌సుందర్ బందోబస్తు నిర్వహించారు. శ్రీలక్ష్మీ నరసింహుని రథోత్సవం భక్తజన సందోహం కన్నుల పండువగా కల్యాణోత్సవాలు -
‘వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్.. కానీ’: నాదెండ్ల మనోహర్
కాకినాడ: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకిచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మకి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన బాబు..ఇప్పుడు ఆ హామీని గాలికొదిలేశారు. దాంతో చంద్రబాబు మాట నమ్మి ఇప్పటికే రెండు సార్లు మోసపోయిన వర్మ.. మరోసారి దానికి గురి కాకతప్పలేదు. తాజాగా టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ టికెట్ల జాబితాలో వర్మ పేరు ఎక్కడా కనిపించలేదు.పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ఎమ్మెల్యే సీటును వర్మ వదులుకున్న క్రమంలో ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు తీరా చూస్తే వర్మ కి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదుజఈ అంశంపై పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఆసక్తికర కామెంట్లు చేశారు. ఎస్పీఎస్ఎన్ వర్మ ఒక సీనియర్ పొలిటిషియన్ అంటూనే, ఆయన ఎమ్మెల్సీ టికెట్ అంశమనేది వారి పార్టీనే నిర్ణయిస్తుందన్నారు మనోహర్. ఇక్కడ తాము వర్మకి చెక్ పెట్టాల్సిన అవసరం ఏముంటందన్నారు మనోహర్.‘పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా. వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్. వాళ్ళ పార్టీ ఆయన విషయం లో నిర్ణయం తీసుకుంటుంది, అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. వర్మ ని గౌరవించడం లో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వర్మకి చెక్ పెట్టాల్సిన అవసరం ఏమి ఉంటుంది’ అని అన్నారు.ఇక ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు మనోహర్ పేర్కొన్నారు. పవన్ సెక్యూరిటీ విషయంలో డిపార్ట్మెంట్ తో పాటు పార్టీ పరంగా మేము కూడా చూసుకుంటాం. సభా ప్రాంగణం లో 75 సి సి కెమెరా లు ఏర్పాటు చేస్తాం. పిఠాపురం ప్రజలకి కృతజ్ఞతలు చెప్పడానికి ఈ సభ ఏర్పాటు చేశాం. ఈ నెల 14 న సాయంత్రం 4 గంటలకు జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ప్రారంభమవుతుంది’ అని పేర్కొన్నారు మంత్రి మనోహర్. -
నేడు యథావిధిగా పీజీఆర్ఎస్
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో సోమవారం పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామని కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. వ్యయ ప్రయాసలు కోర్చి జిల్లా కేంద్రానికి రావద్దని, క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండే డివిజన్, మండల స్థాయి అధికారులకు అర్జీలు అందజేయాలని జనానికి సూచించారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి అందరూ జిల్లా స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరు కావాలని ఆదేశించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఫిర్యాదులను కలెక్టరేట్లో స్వీకరిస్తామని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. వేంకటేశ్వరుని ఆలయానికి రూ.లక్ష విరాళం రాజానగరం: మండలంలోని చక్రద్వారబంధంలో ఇటీవల ప్రతిష్ఠ జరిగిన శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వేంకటేశ్వరస్వామిని విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షుడు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధికి ఆయన రూ.లక్ష విరాళంగా అందజేశారు. సుంకరపాలెం ఘటనపై కేసు నమోదు ఎకై ్సజ్ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు తాళ్లరేవు: మద్యం తరలిస్తున్నారన్న అనుమానంతో ఇద్దరు యువకులను వెంబడించిన ఎకై ్సజ్ కానిస్టేబుల్ బి.ఆనందరాజుపై ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ ఏనుగుల చైతన్య మురళి సస్పెన్షన్ వేటు వేశారు. సుంకరపాలెం చెక్‌పోస్టు వద్ద శనివారం జరిగిన ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో కోట శ్రీరామ్ అనే విద్యార్థి మృతిచెందడంతో బాధ్యులపై చర్యలు చేపట్టాలని, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ సుంకరపాలెం, పరిసర గ్రామాలకు చెందిన అనేక మంది సుంకరపాలెం చెక్‌పోస్టును ముట్టడించి, ఆందోళన చేశారు. అర్థరాత్రి రెండు గంటల వరకు ఆందోళన కొనసాగింది. ఈ నేపథ్యంలో ఎకై ్సజ్ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. యువకులను ఎకై ్సజ్ కానిస్టేబుల్ ఆనందరాజు వెంబడించినట్లు నిర్థారణ కావడంతో, అతడిపై చర్య తీసుకుంటున్నట్టు డీసీ చైతన్యమురళి తెలిపారు. ఆయన వివరాల మేరకు, ఐడియల్ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న నలుగురు విద్యార్థులు రెండు బైకులపై యానాం వచ్చి, తిరిగి వెళుతుండగా ఎకై ్సజ్ సిబ్బంది చెక్ పోస్టు వద్ద తనిఖీ కోసం ఆపారు. ముందుగా బైక్‌పై వెళుతున్న యువ కులు ఒత్తిడికి గురై, బైక్‌పై వేగంగా వెళుతూ లారీని దాటే క్రమంలో వెనుకనున్న విద్యార్థి కిందకు దూకగా, శ్రీరామ్ అదుపుతప్పి లారీ కిందపడి మృతిచెందాడు. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ కానిస్టేబుల్ ఆనందరాజును సస్పెన్షన్‌కు ఆదేశించామని, ఇన్ఫార్మర్పై చర్యలకు నిర్దేశించినట్టు డీసీ తెలిపారు. కాగా, మృతదేహానికి ఆదివారం శవ పంచనామా నిర్వహించినట్టు కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపారు. -
పదోన్నతులు కల్పించాక రేషనలైజేషన్
జిల్లా వీఆర్వోల సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్ రాజమహేంద్రవరం రూరల్: వీఆర్వోలకు పదోన్నతులు కల్పించిన తరువాతే రేషనలైజేషన్ చేపట్టాలని జిల్లా గ్రామరెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు సాన శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం పిడింగొయ్యి గ్రామ సచివాలయం–4లో జిల్లా గ్రామరెవెన్యూ అధికారుల సంఘం జిల్లా సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న రేషనలైజేషన్ ప్రక్రియతో రాష్ట్రవ్యాప్తంగా 7,500 సిబ్బంది తగ్గిపోతారన్నారు. మిగిలిపోయిన 7,500 వీఆర్వోలను ఏమి చేస్తారో ప్రభుత్వం ముందుగా స్పష్టత ఇవ్వాలన్నారు. ఇప్పటికే వీఆర్వోలు ఆనేక ఇబ్బందులకు గురవడంతో పాటు ఇతర శాఖల సర్వేలతో రెవెన్యూసేవలు ఆలస్యమవుతున్నాయన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న వీఆర్వోలందరికి డీడీవోగా తహసీల్దార్లు ఉండేలా నిర్ణయం తీసుకుని అందరినీ రెవెన్యూ లైన్ డిపార్ట్మెంట్లో కొనసాగించాలన్నారు. కొవ్వూరు, రాజమండ్రి డివిజన్ల అధ్యక్షులు, మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
వినిపించని ఆకలి కేకలు
మూడు నెలలు దాటినా.. అలాగే ఐసీపీఎస్, శిశు గృహ పరిఽధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు చేతికంది మూడు నెలలు దాటింది. ఇదే పరిధిలో ఉన్న దిశ వన్‌స్టాప్ సెంటర్ ఉద్యోగులకు గతేడాది ఆగస్టు తర్వాత జీతాలే లేవు. వీరంతా ఆకలి పస్తులుంటూ, అప్పులు చేసుకుంటూ, వారి జీవితాలను నెట్టుకొస్తున్నారు. కష్టాన్నంతా పంటికింద బిగువపట్టి ఉద్యోగాలు చేస్తున్నారు. కనీసం తమ ద్విచక్ర వాహనాల్లో పెట్రోల్కై నా చేతిలో చిల్లిగవ్వ ఉండడం లేదంటూ తమ ఆవేదనను వెళ్లబోసుకుంటున్నారు. జీతాలు ఇవ్వకున్నా ఫీల్డ్ వర్క్ తప్పడం లేదని చెబుతున్నారు. కాకినాడ క్రైం: మహిళా దినోత్సవం ముగిసింది, జిల్లాలో ఈ సంబరాలు అంబరాన్ని తాకాయి. వారోత్సవాలతో వారం రోజులూ పండగ వాతావరణం నెలకొంది. ర్యాలీలు, మారథాన్లు, ఆటలు, పాటలు, ఉపన్యాసాలు, మానవహారాలు ఒకటా, రెండా.. విమెన్స్ డే వేడుకలతో జిల్లా దద్దరిల్లింది. ఇది నాణానికి ఓ వైపు మాత్రమే. మరోవైపు సదరు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగులు ఎవరికీ జీతాలు లేవు. ఊకదంపుడు ఉపన్యాసాల్లో మాటలన్నీ ముఖస్తుతికేనన్న విషయం తేలిపోయింది. గతేడాది ఆగస్టు నుంచి గొడ్డు చాకిరీ చేస్తున్నా జీతాలకు మాత్రం వారు నోచుకోలేదు. కష్టపడి పని చేసినా వారికి జీతం ఇవ్వడం లేదు. ఈ దుస్థితి ఇంకేదో డిపార్టుమెంట్లో కాదు. మహిళా భద్రత, భవిత, భరోసా కోసం నిర్దేశించిన సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులదే. పేరుకు తగ్గట్టుగానే జిల్లాలో ఈ శాఖలో మహిళా ఉద్యోగులే ఎక్కువ. ఈ డిపార్టుమెంట్లో ఉన్న మూడు కీలక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న సుమారు 800 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు నెలల తరబడి జీతాల్లేకపోవడంతో, అప్పులపాలై వారి కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి నెలకొంది. శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. కానీ సిబ్బంది ఆకలి కేకలు వారిలో ఏ ఒక్కరికీ వినిపించ లేదు. విమెన్ అండ్ చైల్డ్ డెవలెప్మెంట్ డిపార్టుమెంట్లో ఉన్న రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు అందుతుండగా, వారంతా అధికార హోదాలో కొనసాగుతున్నారు. క్షేత్ర స్థాయిలో వారు నిర్దేశించే ప్రతి పని పూర్తి చేయాల్సిన కష్టం.. చిరుద్యోగులైన కాంట్రాక్టు సిబ్బందిదే. ఈ డిపార్టుమెంట్ పరిధిలో సేవలందిస్తున్న ఐసీడీఎస్‌కు చెందిన అంగన్వాడీలకు ఈ నెలలో నేటికీ జీతాలే పడలేదు. వీరంతా మహిళలే, కనీసం 600 మంది ఉంటారు. అంగన్వాడీ కేంద్రాల అద్దెలను కూడా వీరు తమ జీతాల నుంచే చెల్లిస్తారు. ఈ అద్దెలు విడుదల చేసి ఆరు నెలలకు పైగా అయింది. సీమంతాల కోసం ప్రతి అంగన్వాడీ కార్యకర్త చేతిలో సొంత డబ్బు వెచ్చిస్తారు. నెలవారీ రూ.500 చొప్పున ఖర్చు చేస్తారు. ఇవి తిరిగి చెల్లించి ఏడాది కావస్తోంది. తప్పని నరకయాతన మహిళా దినోత్సవాల పేరుతో అంగన్వాడీలు ప్రత్యక్ష నరకం చూశారు. అధికారులు వీరితో ఓ ఆటాడుకున్నారు. జీతాలు నేటికీ రాకపోయినా చాకిరీ చేయించారు. ఠంచనుగా జీతాలు తీసుకుంటున్న రెగ్యులర్ హోదాలో కొనసాగుతున్న ఉద్యోగులకు విధి నిర్వహణలో ఇంతటి కష్టం లేదు. అఽధికార హోదాలో వారు తీవ్రమైన పని ఒత్తిడిని అంగన్వాడీలపై పెడుతున్నారు. వారోత్సవాలంటూ రేయింబవళ్లు తేడా లేకుండా పోయింది. ర్యాలీలు, మారథాన్లకు ఉదయాన్నే వచ్చి వాలిపోవాలన్నారు. రానివారికి మెమోలు ఇస్తామని బెదిరించారు. వచ్చి పడిగాపులు కాస్తే అఽధికారులు ఎప్పటికో తీరికగా కార్లు దిగేవారు. పోషకాహార గొప్పతనాన్ని చెబుతూ, ప్రతి అంగన్వాడీ సిబ్బంది రెండు, మూడు రకాల చిరుధాన్యాల వంటలు వండి తేవాలన్నారు. ఆకలి పస్తులున్నా, ఆటల్లో పాల్గొనక తప్పదని ఒత్తిడి తెచ్చారు. వీటన్నింటినీ మించి ఇల్లూ వాకిలి వదిలి, పిల్లలు, భర్తను విడిచి ఉదయాన్నే వాలిపోవాలంటూ హుకుం జారీ చేశారు. ఉన్నతాధికార్లకు నివేదించాం సిబ్బందికి జీతాలు చెల్లించలేదనేది వాస్తవమే. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం. ఫైల్ కూడా పంపించాం. త్వరలో పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం. – కె.విజయకుమారి, పీడీ, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ, కాకినాడ మహిళా దినోత్సవం నాటికీ అందని వేతనాలు ఉసూరుమంటున్న మహిళా సిబ్బంది సీ్త్ర, శిశు సంక్షేమ శాఖలో దయనీయ స్థితి వారోత్సవాల పేరుతో అంగన్వాడీలకు ప్రత్యక్ష నరకం -
12న యువత పోరుకు వైఎస్సార్ సీపీ
● అటకెక్కిన నిరుద్యోగ భృతి ● ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలలో జాప్యం ● అబద్దపు ప్రచారంతో కూటమికి అధికారం: మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు ● సూపర్ సిక్స్ అమలు చేయకపోతే ఊరుకునేది లేదు : జక్కంపూడి రాజా సీటీఆర్ఐ(రాజమహేంద్రవరంట): ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి అమలు పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఈ నెల 12వ తేదీన శ్రీయువత పోరుశ్రీ పేరిట కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళన చేయనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ అన్నారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావ వేడుక సందర్భంగా ఆరోజు అన్ని మండలాల్లో సంబరాలు నిర్వహించిన ఆనంతరం కలెక్టర్ కార్యాలయం దగ్గర యువత పోరు ఆందోళన చేసి, వినతి పత్రం అందజేస్తామన్నారు. విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు పాల్గొనాలని కోరారు. యువత పోరు పోస్టర్‌ను రాజమహేంద్రవరంలోని ప్రకాశంనగర్ కార్తికేయ ఎనక్లేవ్‌లోని జక్కంపూడి రాజా నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆవిష్కరించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, అడపా అనిల్ తదితరులు పాల్గొన్నారు. వేణు గోపాలకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ చేయకపోవడం దారుణమని విమర్శించారు. నిరుద్యోగులకు 3 వేల రూపాయల భృతి ఇస్తామని హామీ ఇచ్చి ఇంకా అమలు చేయలేదన్నారు. ఎన్నికల ముందు ఇష్టం వచ్చినట్లు హామీలు గుప్పించి, అబద్ధపు ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రజలను పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు రాష్ట్రం మరో శ్రీలంక అయి పోతుందని, 14 లక్షల కోట్లు అప్పు అయిపోయిందని ఇలా రకరకాలుగా అబద్ధపు ప్రచారం చేసి, తాము వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పిన కూటమి నాయకులు తీరా అధికారంలోకి వచ్చాక తమ ధోరణి మార్చేశారని వేణుగోపాల కృష్ణ విమర్శించారు. బడ్జెట్ ప్రవేశ పెట్టి అప్పుల సంగతి తేల్చాలని అడిగితే, వాస్తవాలు ఎక్కడ బయట పడతాయో నన్న భయంతో ఓట్ ఆన్ ఎక్కౌంట్ బడ్జెట్ పెట్టి ఇన్నాళ్లూ కాలక్షేపం చేశారన్నారు. తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వ అప్పులు 4లక్షల 91వేల కోట్లు, కార్పొరేషన్ల అప్పులు ఒక లక్షా 53వేలకోట్లు వెరసి 6లక్షల 46వేల 500కోట్ల రూపాయల అప్పులున్నటు ప్రభుత్వమే చెప్పిందని గుర్తుచేశారు. మరి ఎన్నికల్లో 14లక్షల కోట్లు అప్పు అని అబద్ధ ప్రచారం ఎందుకు చేశారని ఆయన నిలదీశారు. పేద వర్గాలకు చెందిన, అణగారిన వర్గాలకు చెందిన పిల్లలు చదువుకుని అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్ మెంట్ ప్రవేశపెట్టారని ఆయన గుర్తుచేశారు. ఈ పథకాన్ని నీరుగార్చాలని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నించిందని, మళ్ళీ ఇప్పుడు అదే రీతిలో వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. అసలు పేదలు చదువు కోవడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. తల్లికి వందనం పేరిట ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రూ.15 వేలు చొప్పున ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఇంతవరకు ఎందుకు అమలుచేయలేదని ప్రశ్నించారు. జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడి కొనసాగించడం ఇష్టంలేక పేరు మార్చారని అయినా సరే, అమలు చేయడం లేదన్నారు. వలంటీర్లను జగన్ మోహన్‌రెడ్డి నియమించి రూ.5వేలు చొప్పున ఇస్తుంటే, రూ.పదివేలు చొప్పున ఇస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వలంటీర్ల వ్యవస్థను గాలికి వదిలేశారని ఆయన ధ్వజమెత్తారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత : జక్కంపూడి రాజా ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఎన్నో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చక పోవడం దారుణమన్నారు. అందుకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. వలంటీర్లకు 10వేలు వేతనం ఇస్తామని చెప్పి, వాళ్ళను పట్టించుకోకుండా పక్కన పెట్టేయడం శోచనీయమన్నారు. మెగా డీఎస్సీకి తొలిసంతకం అని చెప్పి, ఇప్పటి వరకు డీఎస్సీ తీయలేదన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ అమలుచేయకపోవడం వలన విద్యార్థులు నానా బాధలు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగ భృతికి సంబంధించి బడ్జెట్లో ప్రస్తావన లేదన్నారు. వైస్సార్సీపీ హయాంలో ప్రభుత్వం తరఫున మెడికల్ కాలేజీలను కట్టడం ప్రారంభిస్తే, కూటమి ప్రభుత్వం వాటిని ప్రయివేటు పరం చేయాలని చూస్తోందన్నారు. విద్య,వైద్య రంగాలను కూటమి ప్రభుత్వం నీరుగారుస్తోందన్నారు. విద్యార్థులు, యువత సమస్యలను పరిష్కరించాలని, హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ 12వ తేదీన యువత పోరు పేరిట ఆందోళన చేపట్టినట్లు చెప్పారు. కూటమి నాయకులు ఎంతో గొప్పగా చెప్పిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి తీరాలని జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. -
హలీమ్.. రుచికి సలామ్
రంజాన్ స్పెషల్ డ్రింక్ తాగాల్సిందే.. హలీమ్ తిన్న తర్వాత స్పెషల్ రంజాన్ డ్రింకులను తాగకుండా వెళ్లలేరు. ఫ్రూట్ సలాడ్, ఫాలుడా, డ్రైఫ్రూట్ ఐస్‌క్రీమ్, షర్బత్, జీరా సోడా వంటి పానీయాలకు గిరాకీ ఎక్కువ. ● అరబ్బులు పరిచయం చేసిన వంటకం ● హైదరాబాద్ రుచులు అద్దిన ఏడో నవాబ్ మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ ● నేడు ప్రపంచవ్యాప్తంగా ఇష్టమైన వంటకం ● తయారీకి సుమారు 10 గంటల సమయం ● హైదరాబాద్ తర్వాత రాజమహేంద్రవరం ప్రసిద్ధి ● స్పెషల్ అట్రాక్షన్‌గా రోటీకా రూమాల్సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఏటా రంజాన్ మాసంలో రాజమహేంద్రవరంలో సాయంత్రం 4 గంటలు దాటాక కులమతాలకతీతంగా, కుటుంబ సమేతంగా హలీమ్ షాపులకు రావడం పరిపాటిగా మారింది. ఒక్క రాజమహేంద్రరం వాసులే కాకుండా కోనసీమ, కాకినాడ, కొవ్వూరు నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ హలీమ్ రుచి చూస్తున్నారంటే ఇదెంత ప్రసిద్ధి చెందిందో అవగతమవుతుంది. నవాబుల కాలంలోనే.. హైదరాబాద్ ఆరో నవాబు మహబూబ్ ఆలీఖాన్‌కి అరబ్ దియాస్సార తెగకు సంబంధించిన వారు ఈ హలీమ్‌ని పరిచయం చేశారు. అప్పుడు హలీమ్‌లో నాలుగు రకాల దినుసులను మాత్రమే వాడేవారు. తర్వాత ఏడో నవాబు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ తన వంట వారితో బిర్యానీలా, మరింత రుచికరంగా ఉండేలా దీనిని తయారు చేయాలని సూచించారు. దీంతో బిర్యానీకి వాడే దినుసులతో హలీమ్ రూపొందించబడింది. అంతకుముందు హలీమ్ కంటే ఇది రుచిలో మేటిగా, శక్తినివ్వడంలో మరింత మెరుగ్గా తయారైంది. అప్పటి నుంచి హైదరాబాద్ నుంచి విదేశాలకూ ఎగుమతి కావడం మొదలైంది. అరబ్బు దేశం నుంచి వచ్చిన ఈ వంటకం.. కొత్త రుచులు సంతరించుకుని, తిరిగి అక్కడికే సరఫరా అవుతూండటం దీని విశేషం. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్ వంటి 30 దేశాల ప్రజలు ఈ రుచిని ఆస్వాదిస్తున్నారు. 30 రకాల దినుసలతో.. అత్యధిక పోషకాలున్న ఆహారం ఇది. ఇందులో హై ప్రొటీన్స్, కేలరీలు పుష్కలంగా ఉన్నాయి. మూడు రకాల హలీమ్లున్నాయి. చికెన్ హలీమ్, మటన్ హలీమ్, వెజిటబుల్ హలీమ్ ప్రధానమైనవి. హలీమ్ తయారీలో స్వచ్ఛమైన నెయ్యి, వెన్న , గోధుములు, జీడిపప్పు, బాదం, పిస్తా, షాజీరా, యాలకులతో పాటు, సన్నగా తరిగి నేతిలో వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర వంటి సుమారు 25 రకాల వివిధ రుచికరమైన వంట పదార్థాలను వాడుతారు. హై హెల్దీ ఫుడ్ రుచిలోనే కాదు పోషక విలువల్లో సైతం హలీమ్‌కు సాటి ఏదీ లేదు. న్యూట్రిషియన్లు చెప్పిన మేరకు, ఇందులో హై ప్రొటీన్, క్యాలరీస్, కాల్షియం అత్యధికంగా ఉంటాయి. శరీరంలో లోపించే విటమిన్లను సమృద్ధిగా అందించే ప్రత్యేకమైన వంటకం హలీమ్. శారీరక శక్తి లోపించిన వారికి ఇది దివ్యౌషధం లాంటిది. అందుకే అంత కఠినమైన ఉపవాస దీక్ష చేసే ముస్లింలకు తక్షణ శక్తి కోసం హలీమ్‌ని సాయంత్రం ఉపవాస దీక్ష అనంతరం ఇఫ్లార్ విందులో స్వీకరిస్తారు. తయారీ ఇలా.. హలీమ్ తయారీ చాలా శ్రమతో కూడుకున్నది. ఇద్దరు మాస్టర్లు ఇటుకలతో తయారు చేసిన బట్టీలో మంట వద్ద 10 నుంచి 12 గంటల పాటు శ్రమించాల్సి ఉంటుంది. మంటపై అంటు పట్టకుండా నిత్యం పొడవాటి చేతికర్రలతో గట్టిగా తిప్పుతూండాలి. ఏ మాత్రం అడుగంటినా దీని రుచి పాడవుతుంది. అందుకే ఇది సిద్ధం కావడానికి అన్ని గంటలు పడుతుంది. రాజమహేంద్రవరం రావాల్సిందే.. ఒకప్పుడూ హలీమ్ పేరు చేపితే హైదరాబాద్ మాత్రమే గుర్తుకొచ్చేది. నేడు రాజమహేంద్రవరం కూడా దాని సరసన చేరింది. దానికి కారణం అక్కడి నుంచి వంట మాస్టర్లను తెచ్చి, అదే రుచి వచ్చేలా ఇక్కడి వ్యాపారులు ఎంతో కృషి చేశారు. రాజమహేంద్రవరంలోని జాంపేటలో సుమారు 20 షాపుల వరకు ఏర్పాటయ్యాయి. వీటిలో సుమారు 60 మంది మాస్టర్లు పనిచేస్తున్నారు. చికెన్ హలీమ్, మటన్ హలీమ్, వెజిటబుల్ హలీమ్‌ను తయారు చేస్తున్నారు. వీటిలో చికెన్, మటన్ హలీమ్లే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. చికెన్ హలీమ్ రూ.120 కాగా, మటన్ హలీమ్ రూ.160, వెజిటబుల్ హలీమ్ రూ.50కి విక్రయిస్తున్నారు. సంథింగ్ స్పెషల్.. రూమాలీ రోటీ ప్రత్యేకించి ఈ ఏడాది రంజాన్‌లో హలీమ్‌తో పాటుగా, రూమాలీ రోటీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ధాబాల్లో చిన్న రోటీలు లభిస్తాయి. ఇక్కడ పెద్ద సైజులో రోటీలను ఎక్కువగా నూనె వాడకుండా, బోర్లించిన పెద్ద బానపై కాల్చి ఇస్తారు. జాంపేటకు చెందిన మహ్మద్ అబ్దుల్లా షరీఫ్(పండు) దీనిని ఈ ఏడాది నగరవాసులకు పరిచయం చేశారు. మాస్టర్ షేక్ ఫయాజ్ తన విన్యాసాలతో ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. రోటీ పిండిని ముద్దగా చేసి, దానిని చేతితో పెద్దగా చేసి, గాల్లోకి ఎగరవేసిన తర్వాత, తిరిగి చేతపట్టుకుని బానపై వేసి కాలుస్తున్నారు. కొత్తగా ఉన్న దీని రుచి చూసిన భోజనప్రియుల ఆహా.. అంటూ లొట్టలేసుకుని తింటున్నారు. చికెన్ గ్రేవీ, మటన్ బోన్ గ్రేవీతో రూ.50 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు. శ్రమతో కూడుకున్నది తయారీకి 10 నుంచి 12 గంటల వరకు పడుతుంది. తెల్లవారుజామున ప్రారంభిస్తే, సాయంత్రం 4 గంటలకు అందించగలం. పెద్ద పొయ్యి పెట్టి వాటిపై పెద్ద బానలు పెట్టి వంట చేస్తాం. ఒక్కో బానలో 10 కేజీల హలీమ్ తయారవుతుంది. 10 కేజీల చికెన్, 10 కేజీల మటన్, 10 కేజీల వెజిటబుల్ హలీమ్ తయారు చేస్తాం. మూడు తరాల నుంచి హలీమ్ తయారీలో ప్రావీణ్యం ఉంది. – చాంద్, హలీమ్ తయారీదారు తింటూంటే జివ్వుమంటుంది ప్రతి సంవత్సరం ఇక్కడ అమ్ముతున్న హలీమ్‌ను క్రమం తప్పడకుండా తింటున్నాను. దీని టేస్ట్‌కి మరేది సాటి రాదు. చికెన్ హలీమ్, మటన్ హలీమ్ చాలా టేస్టీగా ఉంటాయి. నోటిలో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయి. పేస్టు చేసినట్టుగా ఉండటంతో, నమిలి మింగాల్సిన అవసరం లేకుండా, గొంతులోకి ఇట్టే జారిపోతుంది. అందుకే రంజాన్ మాసంలో క్రమంతప్పకుండా తింటాను. – ఎం.చిన్నా, రాజమండ్రి వాసి దీని టేస్ట్‌కి ఎవ్వరైనా సలామ్ కొట్టి, గులామ్ కావాల్సిందే. ఒక్కసారి తింటే మళ్లీమళ్లీ తినాలపించే రుచి దీనిది. ఏడాదిలో ఒక్క రంజాన్ మాసంలోనే ఎక్కువగా లభిస్తుంది. ముస్లింలతో పాటు, వివిధ వర్గాల ప్రజలు ఎంతో ఇష్టంగా తీసుకునే హై హెల్దీ ఫుడ్ ఇది. దీని పేరే హలీమ్. హైదరాబాద్‌లో ప్రసిద్ధిగాంచి, నేడు రాజమహేంద్రవరంలో అంతగా పేరు తెచ్చుకున్న వంటకం బహుశా ఇదే కావచ్చు. హైదరాబాద్ బిర్యానీ తర్వాత అంత ఎక్కువగా జిల్లావాసులు ఇష్టపడే వంటకం హలీమ్ అనడం అతిశయోక్తి కాదు. -
రేషన్ బియ్యం పట్టివేత
నిడదవోలు: జాతీయ రహదారిపై పెరవలి మండలం కండవల్లి వద్ద ఆదివారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల అధికారులు పట్టుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు విప్పర్రు గ్రామం నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలేనికి వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 10 టన్నుల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ పెరవలి డిప్యూటీ తహసీల్దార్ ఎస్ఎస్ సుధీర్‌రెడ్డి తన సిబ్బందితో సీజ్ చేశారు. పౌర సరఫరాల చట్టం 6ఏ కేసు నమోదు చేశారు. వ్యాన్‌ను పెరవలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వాహనం డ్రైవర్ తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వైచర్ల శివకిరణ్పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు సుధీర్‌రెడ్డి తెలిపారు. షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం ● మూడిళ్లు దగ్ధం ● రూ.2 లక్షల ఆస్తినష్టం అమలాపురం రూరల్: మండలంలోని సమనస పరిధిలో ఉన్న రంగాపురం బాబునగర్‌లో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించి, మూడు ఇళ్లు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా సత్తాల చింతాలు, ఆకుమర్తి పురుషోత్తమరాజు, సత్తాల దుర్గారావుకు చెందిన ఇళ్లు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. సమాచారం అందుకున్న అమలాపురం అగ్నిమాపకాధికారి మురళీ కొండబాబు ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. వేగంగా మంటలు చుట్టుముట్టడంతో ఇళ్లల్లోని వస్తువులు తీసుకునే అవకాశం లేకుండా పోయిందని బాధితులు విలపించారు. ఫర్నిచర్, ధ్రువీకరణ పత్రాలు, నగదు తదితర వస్తువులు బూడిదయ్యాయి. ఈ సంఘటనలో సుమారు రూ.రెండు లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు బాధితులను పరామర్శించారు. బాధితులకు 25 కేజీల బియ్యం, రూ.10 వేల వంతున సాయం అందించారు. -
బీసీ, ఓబీసీ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షునిగా వీరబ్రహ్మం
● మహిళా అధ్యక్షురాలిగా హేమలత అన్నవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షునిగా విద్యా శాఖలో పనిచేస్తున్న గుత్తుల వీరబ్రహ్మం, మహిళా విభాగం అధ్యక్షురాలిగా దేవదాయ శాఖలో పనిచేస్తున్న హేమలత ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక రాఘవేంద్ర ఫంక్షన్ హాలులో రాష్ట్ర స్థాయి బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట కౌన్సిల్ జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు ఎస్పీఆర్ విఠల్కుకుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సంఘ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షునిగా చొల్లంగి శ్రీధర్‌ను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రం నలుమూలల నుంచి బీసీ, ఓబీసీ ఉద్యోగ సంఘాల నాయకులు, అన్నవరం దేవస్థాన బీసీ ఉద్యోగులు హాజరయ్యారు. సత్యదేవుని దర్శించిన ఇండియన్ నేవీ బృందంఅన్నవరం: ఇండియన్ నేవీలో ఉద్యోగ అవకాశాలు వివరిస్తూ కోల్‌కతా నుంచి కన్యాకుమారికి సుమారు 3,800 కిలోమీటర్లు 30 కార్లలో ర్యాలీ చేస్తున్న 30 మంది ఇండియన్ నేవీ ఉద్యోగుల బృందం ఆదివారం రత్నగిరిపై సత్యదేవుని దర్శించింది. ఈ సందర్భంగా స్వామివారికి పూజలు చేశారు. యువకులు నేవీలో చేరి, దేశానికి సేవ చేయాలని, నేవీలో ఉద్యోగాలపై యువతకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేస్తున్నట్లు బృందం సభ్యులు తెలిపారు. తొలుత ఈ బృందానికి దేవస్థాన పండితులు స్వాగతం పలికారు. సత్యదేవుని దర్శనం అనంతరం వేద పండితులు ఆశీస్సులు, ప్రసాదాలు అందజేశారు. వీరి వెంట ఏఈఓ కృష్ణారావు, ఆర్ఐ ప్రసాద్ ఉన్నారు. -
వేర్వేరు చోట్ల ఇద్దరు యువకుల మృతి
నిడదవోలు: పొట్టకూటి కోసం ఉన్న ఊరిని వదిలి.. పొరుగు ప్రాంతానికి వెళ్లిన వారు.. విగత జీవులయ్యారు. ఒకరు రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లి.. కన్నవారికి కడుపుకోత మిగిలిస్తే.. మరొకరు పొరుగూరుకు వెళ్లి.. పని ముగించుకుని వస్తూ తిరిగిరాని లోకానికి పయనమయ్యారు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనలు వారి గ్రామాల్లో విషాదాన్ని నింపాయి.నిడదవోలు పట్టణంలో ఆర్అండ్బీ ప్రధాన రహదారిపై ఏపీఈపీడీసీఎల్ డీఈఈ కార్యాలయం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే, మండలంలోని పందలపర్రు గ్రామానికి చెందిన సంకు నానిబాబు(18) తాపీ పని చేస్తుంటాడు. చాగల్లు మండలం బ్రాహ్మణగూడెంలో పని ముగించుకుని ఇంటికి బైక్‌పై బయలుదేరాడు.పట్టణంలో ఏపీఈపీడీసీఎల్ కార్యాలయం వద్దకు వచ్చేసరికి నిడదవోలు నుంచి చాగల్లు వెళుతున్న మినీ వ్యాన్.. మరో వాహనాన్ని తప్పించపోయి అతడి బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో నానిబాబు అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి తండ్రి చిన్నతనంలోనే మృతిచెందాడు. తల్లి సంకు దుర్గకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. తండ్రి చనిపోవడంతో, నానిబాబు చిన్నతనం నుంచే తల్లికి చేదోడువాదోడుగా ఉంటూ కుంటుంబ పోషణకు భుజాన వేసుకున్నాడు. గ్రామంలో అందరితో కలివిడిగా ఉంటే నానిబాబు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబానికి ఆసరాగా ఉన్న నానిబాబు మరణవార్తను అతడి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రాంగ్ రూట్లో వచ్చిన మినీవ్యాన్ రూపంలో మృత్యువు అతడిని బలితీసుకుంది. వ్యాన్ డ్రైవర్ స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పట్టణ ఎస్సై పరమహంస సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.హైదరాబాద్‌లో జొన్నలంక యువకుడి మృతిపి.గన్నవరం: జీవనోపాధి కోసం హైదరాబాద్‌లో ఉంటున్న యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందడంతో అతడి స్వగ్రామమైన జొన్నలంకలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల వివరాల మేరకు, హైదరాబాద్‌లో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో పి.గన్నవరం మండలం ఎల్.గన్నవరం శివారు జొన్నల్లంకకు చెందిన చందాడి సాయివెంకటకృష్ణ(20)మృతి చెందగా, అదే గ్రామానికి చెందిన లంకే బాల మణికంఠ లక్ష్మీసాయి తీవ్రంగా గాయపడ్డాడు. వీరు హైదరాబాద్‌లో వెల్డింగ్ పనులు చేస్తూ, వారి కుటుంబాలకు ఆసరాగా ఉన్నారు. శనివారం రాత్రి వారు పనులు ముగించుకుని బైక్ ఇంటికి వెళ్తుండగా, వనస్థలిపురం వద్ద డివైడర్‌ను ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన వీరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, వెంకటకృష్ణ మృతి చెందగా, లక్ష్మీసాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో వెంకటకృష్ణ కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. అతడి తండ్రి బాలరాజు, తల్లి, సోదరి కన్నీటి పర్యంతమయ్యారు. -
కుటుంబ కథా చిత్రం ‘పౌరుషం’
● చిత్ర హీరో, దర్శకుడు షెరాజ్ మెహ్ద ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): అన్ని వర్గాల వారు మెచ్చేలా కుటుంబ కథా చిత్రంగా ‘పౌరుషం’ చిత్రాన్ని రూపొందించామని చిత్ర దర్శకుడు, హీరో షెరాజ్ మెహ్ద వెల్లడించారు. చిత్ర ప్రమోషన్లో భాగంగా యూనిట్ ఆదివారం స్థానిక రంభ, ఊర్వశి, మేనక కాంప్లెక్స్‌కు వచ్చింది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకుడు, హీరో షెరాజ్ మెహ్ద మాట్లాడుతూ, యువిటీ హాలివుడ్ స్టూడియోస్(యూఎస్ఏ), శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అశోక్ ఖుల్లార్, దేవేంద్ర నేగి నిర్మించిన ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను సుమ తల్వార్, మేకా రామకృష్ణ, అశోక్ ఖుల్లార్, జ్యోతిరెడ్డి, ఆమని, శైలజ తివారి, అనంత్, కనిక, జబర్దస్త్ కార్తిక్, కట్టప్ప, గంగాధర్ పోషించారని తెలిపారు. కుటుంబ విలువలు, అన్నాచెల్లెళ్ల అనురాగం, ప్రేమ పేరుతో యువతులు మోసంపోవడం వంటి అంశాలను ఈ చిత్రంలో చూపించామన్నారు. రాజమండ్రికి చెందిన సినీ హీరో గంగాధర్ ఈ చిత్ర నిర్మాణానికి సహకారం అందించారని కృతజ్ఞతలు తెలిపారు. చిత్రానికి తానే సంగీతాన్ని సమకూర్చినట్టు తెలిపారు. నిర్మాత అశోక్ ఖుల్లార్ మాట్లాడుతూ, ఈ చిత్రం అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చిందన్నారు. నటుడు గంగాధర్ మాట్లాడుతూ, చిత్రంలో తాను సుమ కుమారుడిగా, హీరోయిన్‌కు సోదరుడిగా నటించానన్నారు. తనకు మంచి పాత్ర ఇచ్చిన షెరాజ్ మెహ్దకు ధన్యవాదాలు తెలిపారు. ముందుగా చిత్ర యూనిట్‌కు థియేటర్ వద్ద ఘన స్వాగతం లభించింది. -
జోరుగా.. హుషారుగా ఎడ్ల పందాలు
● సీనియర్స్ విభాగంలో ధర్మవరం ఎడ్ల జత ప్రథమం ● ద్వితీయ, తృతీయ స్థానాల్లో కొవ్వాడ, జి.మేడపాడు ఎడ్లుప్రత్తిపాడు రూరల్: పెద్దిపాలెంలోని వైఆర్సీ కాలువ గట్టుపై నిర్వహించిన ఎడ్ల పరుగు పందాలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ్ల పరుగు పందెం పోటీలకు జిల్లా నలుమూలల నుంచి రైతులు, ఎడ్ల పందాల అభిమానులు తరలివచ్చి ఆసక్తిగా తిలకించారు. ఈ పోటీల్లో 31 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. సీనియర్స్ విభాగంలో ఏడు, జూనియర్స్ విభాగంలో 24 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. విజేతగా ధర్మవరం ఎడ్ల జట్టు సీనియర్ విభాగంలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరానికి చెందిన జువ్వల సత్తిబాబు ఎడ్ల జట్టు ప్రథమ స్థానం సాధించింది. కొవ్వాడకు చెందిన మట్టా నవనీత్ శ్రీమణికంఠ ఎడ్లు ద్వితీయ బహుమతిని, జి.మేడపాడుకు చెందిన మలిరెడ్డి అన్నపూర్ణ ఎడ్లు తృతీయ బహుమతులను కై వసం చేసుకున్నాయి. సీనియర్స్ విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కై వసం చేసుకున్న విజేతలకు వరుసగా రూ.12 వేలు, రూ.10 వేలు, రూ.8 వేల నగదు, షీల్డ్‌ను అందజేశారు. అదేవిధంగా జూనియర్ విభాగంలో కాపవరానికి చెందిన కుంచం మనోజ్ ఎడ్ల జట్టు ప్రథమ స్థానాన్ని, హుకుంపేటకు చెందిన కురుమళ్ల వీరవెంకట సత్య జైవర్థన్ ఎడ్ల జట్టు ద్వితీయ, కొవ్వాడకు చెందిన మట్టా నవీనీత్ శ్రీమణికంఠ ఎడ్లు తృతీయ స్థానాన్ని సాధించాయి. ఇందులో విజేతలకు వరుసగా రూ.10 వేలు, రూ.8 వేలు, రూ.6 వేల నగదు, షీల్డ్‌ను ప్రదానం చేశారు. న్యాయనిర్ణేతలుగా యనమల కృష్ణ, సిద్ధా నానాజీ, చెకూరి రామకృష్ణ వ్యవహరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సై లక్ష్మి బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేత ముదునూరి మురళీకృష్ణంరాజు పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక
● 14 నుంచి పులివెందులలో రాష్ట్ర స్థాయి పోటీలు సామర్లకోట: కడప జిల్లా పులివెందులలో ఈ నెల 14 నుంచి మూడు రోజుల పాటు జరిగే 34వ సబ్ జూనియర్స్ రాష్ట్ర స్థాయి బాల, బాలికల కబడ్డీ పోటీలకు ఉమ్మడి జిల్లా జట్లను ఆదివారం స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్లో ఎంపిక చేశారు. కాకినాడ, రాజమహేంద్రవరం, కిర్లంపూడి, సామర్లకోట, ప్రతిపాడు, పెద్దాపురం, జగ్గంపేట, పిఠాపురం, రామచంద్రపురం మండలాల నుంచి బాలుర విభాగం నుంచి 40 మంది, బాలికల విభాగం నుంచి 25 మంది ఎంపికకు హాజరయ్యారు. ప్రతిభ ఆధారంగా బాలుర జట్టును నిమ్మకాయల కిరణ్, పవన్ కుమార్, బాలికల జట్టును ఎన్.శ్వేత, డి.దేవికుమారి ఎంపిక చేశారు బాలబాలికల జట్లు ఇవే.. ఉమ్మడి జిల్లా బాలికల జట్టులో ఎంవీ దుర్గామహాలక్ష్మి, ఎస్.భవాని, టి.మహేశ్వరి, బీఎం వరలక్ష్మి, సీహెచ్వీఆర్పీ దుర్గాభవాని, డి.దివ్యశ్రీ, ఎ.లోకిభవాని, సీహెచ్ఎల్ ప్రత్యూష, ఎంఎల్వీ దుర్గ, జి.శిరీష, వర్షిణి ఉన్నారు. అదేవిధంగా బాలుర జట్టులో జి.త్రిమూర్తులు, జి.నరేష్, సీహెచ్ఎన్కే రెడ్డి, కె.అభిరామ్, కె.ప్రవీణ్‌కుమార్, సీహెచ్పీవీవీఎస్ శ్రీహర్ష, వి.సత్యచరణ్, వై.సామ్రాట్, జి.వీరబాబు, ఎం.దుర్గాప్రసాదరావు ఎంపికయ్యారు. ప్రొ కబడ్డీ అంపైర్ బోగిళ్ల మురళీకుమార్, కబడ్డీ సంఘ ప్రతినిధులు పర్యవేక్షించారు. -
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి చంద్రబాబు షాక్
అమరావతి: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మకి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన బాబు..ఇప్పుడు ఆ హామీని గాలికొదిలేశారు. దాంతో చంద్రబాబు మాట నమ్మి ఇప్పటికే రెండు సార్లు మోసపోయిన వర్మ.. మరోసారి దానికి గురి కాకతప్పలేదు. తాజాగా టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ టికెట్ల జాబితాలో వర్మ పేరు ఎక్కడా కనిపించలేదు.పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ఎమ్మెల్యే సీటును వర్మ వదులుకున్న క్రమంలో ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు తీరా చూస్తే వర్మ కి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు చంద్రబాబు. దాంతో చంద్రబాబు తీరుపై వర్మ వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరొకవైపు వర్మ రాజకీయ భవిష్యత్ ముగిసిందనే ప్రచారం కూడా సాగుతోంది. చంద్రబాబు ఇచ్చిన షాక్ తో వర్మ వర్గం అయోమయంలో పడింది. తమనేత రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిన సమయంలో ఏం చేయాలనే దానిపై వారు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. -
జనసేన నేత వీరంగం.. వైద్యురాలిపై దౌర్జన్యం
సాక్షి, కాకినాడ జిల్లా: అధికారం చేతిలో ఉంది కదా అని కూటమి నేతలు బరితెగిస్తున్నారు. జనసేన నాయకుడు రెచ్చిపోయాడు. ప్రత్తిపాడు సిహెచ్సీ వైద్య సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేయాలంటూ వేలు చూపిస్తూ వైద్యులకు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు వార్నింగ్ ఇచ్చాడు.రోగులకు వైద్యం చేస్తున్న సమయంలో డాక్టర్ శ్వేతకు తమ్మయ్యబాబు ఫోన్ చేశారు. ఆయనెవరో తెలియదని.. వేరొకరికి వైద్యం చేస్తున్నానని వైద్యురాలు చెప్పారు. ఫోన్లో మాట్లాడడానికి వైద్యురాలు నిరాకరించడంతో తమ్మయ్య బాబు.. నేరుగా ఆసుపత్రికి వచ్చి డాక్టర్ శ్వేతతో పాటుగా అక్కడున్న వైద్య సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. జ్ఞానం ఉందా?.. నోర్మూయ్ అంటూ వైదురాలిపై అరుపులతో వీరంగం సృష్టించారు. -
చిరకాలం గుర్తుండేలా..
పెళ్లి విషయంలో తల్లిదండ్రులు, పిల్లల అభిరుచులు మారుతున్నాయి. జీవితంలో పెళ్లి అరుదైన ఘట్టం. చిరకాలం గుర్తుండిపోయేలా ఘనంగా చేసుకుంటున్నారు. అధునాతన సెట్టింగులు, కొత్త పోకడలకు అనుగుణంగా పెళ్లి మంటపాలను సిద్ధం చేయాలని కోరుతున్నారు. – రాకుర్తి ప్రసాద్, సత్యనారాయణ గార్డెన్స్ యజమాని, అమలాపురం అభిరుచికి తగినట్టుగా.. పెళ్లిళ్లు చేసే తీరు మారిపోతోంది. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేదు. పెళ్లి తంతులో ప్రతి సందర్భం అద్భుతంగా గుర్తుండిపోవాలని కోరుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో పెళ్లిళ్ల సెట్టింగులను చూసి, తమకు కూడా అలాగే చేయాలని కోరుతున్నారు. పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడిని చేయడం, ఊరేగింపు, సంగీత్, బరాత్.. ఇలా అన్ని కొత్తదనం, ఆర్భాటం కనిపించాలని కోరుకుంటున్నారు. – కొవ్వూరి ధర్మారెడ్డి, ఎస్వీ ఈవెంట్స్, రావులపాలెం -
మహిళలకు సమానత్వం కల్పించాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): మహిళలకు సమానత్వం కల్పించాలనే నినాదంతో ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో శనివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, శక్తి యాప్ ద్వారా మహిళల రక్షణకు చర్యలు తీసుకుంటున్నారని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. మెప్మా ఆధ్వర్యాన కోటి ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం ద్వారా రూ.కోటి ఆదాయం సమకూర్చామని చెప్పారు. జిల్లాలో మహిళా రక్షక్ ఏర్పాటు చేసిన ఎస్పీ నరసింహ కిషోర్ అభినందనీయులని, రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు మన జిల్లా నాంది పలికిందని అన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ మాట్లాడుతూ, కుటుంబం నుంచే మహిళల పట్ల వివక్షను పారదోలినప్పుడే నిజమైన మహిళా సాధికారిత సాధ్యమవుతుందని అన్నారు. రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్ కేతన గార్గ్ మాట్లాడుతూ, పారిశుధ్య కార్మికులు, సచివాలయ సిబ్బంది కార్పొరేషన్‌కు వెన్నెముకగా ఉన్నారని, వారిలో పెద్ద సంఖ్యలో మహిళలుండటం గమనార్హమని అన్నారు. డీఎస్పీ భవ్య కిశోర్ మాట్లాడుతూ, సైబర్ నేరాల బారిన పడకుండా ఎన్నో కార్యక్రమాలను చేపట్టామన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. తొలుత అతిథులు మెప్మా, డీఆర్డీఏ, నగరపాలక సంస్థ, వైద్య, ఆరోగ్య శాఖ, డీఎల్ఎస్ఏ, పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను తిలకించారు. నగరపాలక సంస్థ పారిశుధ్య సిబ్బందిని సత్కరించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ, డీఆర్డీఏ, వైద్య, ఆరోగ్యం, ఆర్ట్స్ కళాశాల, స్పోర్ట్స్, వ్యవసాయ శాఖకు చెందిన 77 మందికి అవార్డులు అందజేశారు. పోలీసు శాఖ నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. మహిళా అధికారులను సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అదనపు ఎస్పీలు సుబ్బరాజు, మురళీకృష్ణ, మహిళ, శిశు సంక్షేమ అధికారి కె.విజయ కుమారి, డీఆర్డీఏ పీడీ ఎన్వీవీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
రత్నగిరి.. భక్తజనసిరి
అన్నవరం: సత్యదేవుడిని శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించి, పూజలు చేశారు. రత్నగిరితో పాటు వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు తమ బంధుమిత్రులతో కలసి సత్యదేవుని ఆలయానికి తరలివచ్చారు. వీరందరూ స్వామివారి వ్రతాలాచరించి, దర్శనాలు చేసుకున్నారు. దీంతో ఆలయం వద్ద రద్దీ ఏర్పడింది. ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. స్వామివారిని 40 వేల మంది దర్శించుకున్నారు. వ్రతాలు 1,800 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని అన్న ప్రసాదాన్ని సుమారు 4 వేల మంది స్వీకరించారు. ఆలయంలో సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. సెలవు కావడంతో ఆదివారం కూడా రత్నగిరిపై భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆదివారం ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవారిని టేకు రథంపై ఊరేగించనున్నారు. సువర్ణ ఇండియా బాధితులకు న్యాయం చేయాలి అమలాపురం రూరల్: అమరావతి హైకోర్టు గతేడాది నవంబర్‌లో ఇచ్చిన తీర్పు ప్రకారం సువర్ణ ఇండియా డిపాజిట్ బాధితులకు న్యాయం చేయాలని బాధితుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కాశీ వెంకట్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం త్రిరత్న బుద్ధ విహార్ హాలులో సువర్ణ ఇండియా బాధితుల సమావేశం జరిగింది. వెంకట్రావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల పరిధిలో 24 బ్రాంచీల ద్వారా రూ.12 కోట్ల డిపాజిట్ల సేకరించి 2014లో ముంచేశారన్నారు. అమలాపురం ప్రధాన కేంద్రంగా 2011లో సువర్ణ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని ప్రారంభించి డిపాజిట్లు సేకరించారన్నారు. 2016లో కంపెనీకి చెందిన ఆస్తులు, డైరెక్టర్ల పేరు మీద ఉన్న ఆస్తులను అప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధికారులు సీజ్ చేశారని తెలిపారు. సీజ్ చేసిన ఆస్తులకు సంబంధించి రాజమహేంద్రవరంలోని న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే కంపెనీ ఎండీ బూసి వెంకట నాగవేణు, ఇతర డైరెక్టర్లు కలిసి ఏపీలో పలుచోట్ల సీజ్ చేసిన ఆస్తులను విక్రయించారన్నారు. 2024లో హైకోర్టు తీర్పు ప్రకారం కంపెనీకి చెందిన భూములను నగదు రూపంలో డిపాజిట్ దారులకు చెల్లించాలన్నారు. సమావేశంలో డిపాజిట్‌దారులు పాల్గొన్నారు. బాలబాలాజీకి రూ.3.36 లక్షల ఆదాయం మామిడికుదురు: అప్పనపల్లి బాలబాలాజీ స్వామి ఆలయానికి శనివారం భారీగా భక్తులు తరలి వచ్చారు. తెల్లవారు జామున సుప్రభాత సేవ, తొలి హారతితో దర్శనాలు ప్రారంభమయ్యాయి. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, స్వామి వారికి తలనీలాలు, ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. వివిధ సేవల ద్వారా రూ.3,36,594 ఆదాయం వచ్చింది. స్వామి వారిని 5 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. 3 వేల మంది అన్న ప్రసాదం స్వీకరించారు. లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.65,670 ఆదాయం వచ్చిందని ఈఓ ఎం.సత్యనారాయణరాజు తెలిపారు. -
మహిళలకు కూటమి ప్రభుత్వం దగా
దేవరపల్లి: ఎన్నికల్లో సూపర్ సిక్స్ పేరిట ప్రజలను మభ్యపెట్టి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలు అమలు చేయకుండా మహిళలను కూటమి ప్రభుత్వం దగా చేసిందని వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్, రాష్ట్ర మాజీ హోం మంత్రి తానేటి వనిత విమర్శించారు. యర్నగూడెంలోని తన క్యాంపు కార్యాలయం వద్ద శనివారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలవుతున్నా ఇప్పటి వరకూ ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకుండా ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. ఉచిత బస్సు ఆచూకీ ఎక్కడా లేకపోగా, జిల్లా వరకే ఉచిత బస్సు ప్రయాణమని ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.12 లక్షల కోట్ల అప్పు చేసిందంటూ ఎన్నికల్లో అసత్య ప్రచారం చేసిన కూటమి.. అధికారంలోకి వచ్చాక మాట మార్చిందని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా గత ప్రభుత్వం చేసిన అప్పు రూ.6 లక్షల కోట్లని ప్రకటించారని తెలిపారు. తొమ్మిది నెలల పాలనలో కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.లక్ష కోట్ల అప్పు చేసిందని చెప్పారు. తల్లికి వందనం కోసం పేద పిల్లల తల్లులు ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని, భవిష్యత్తులో మరోసారి మోసపోవద్దని వనిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యేగా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సంబోధిస్తున్నారని, ఎవరైనా ముందు ఎమ్మెల్యే అయ్యాకనే మంత్రి, ముఖ్యమంత్రి అవుతారనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో దళిత మహిళకు హోం మంత్రిగా అవకాశమిచ్చి గౌరవించారని, ప్రస్తుత సీఎం చంద్రబాబు కూడా ఇదే ఒరవడిని పాటించి అనితకు హోం మంత్రి పదవి ఇచ్చారని చెప్పారు. జగన్ ఈ విధానం ప్రారంభించకపోతే అనితకు హోం మంత్రి పదవి దక్కేదే కాదని స్పష్టం చేశారు. ఎదుటి వారిని గౌరవించి, తిరిగి గౌరవం పొందాలని టీడీపీ, జనసేన మహిళలకు సూచించారు. వైఎస్సార్ సీపీ మహిళలు హుందాగా నడుచుకోవాలని, అసభ్య పదజాలాలు వాడవద్దని వనిత విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచంట అనసూయ, నియోజకవర్గ, మండల మహిళా అధ్యక్షులు దాకారపు బంగారమ్మ, కడలి హైమావతి, నాగమణి, జెడ్పీటీసీ సభ్యురాలు కాకులపాటి లలిత తదితరులు పాల్గొన్నారు. -
పొలాలను వదిలి.. రోడ్డుపై బైఠాయించి..
● సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు ● జాతీయ రహదారి 216పై రాస్తారోకో ● అధికారుల హామీతో ఆందోళన విరమణ తాళ్లరేవు: సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు. జాతీయ రహదారి 216పై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పి.మల్లవరం పంచాయతీ పరిధిలోని శివారు భూములకు కొన్ని రోజులుగా సాగునీరు అందక వరి చేలు ఎండిపోతుండడంతో శనివారం రైతులు పోలేకుర్రు ఇరిగేషన్ కార్యాలయం వద్దకు వచ్చారు. అయితే కార్యాలయంలో ఒక్క అధికారి కూడా అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. చెంతనే ఉన్న జాతీయ రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఆందోళకారులతో చర్చలు విషయం తెలుసుకున్న కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. రైతులు తమ సమస్యలను ఎస్సైతో పాటు రెవెన్యూ అధికారులకూ మొరపెట్టుకున్నారు. పి.మల్లవరం పంచాయతీ శివారు మూలపొలం, గ్రాంటు, రాంజీనగర్ గ్రామాలకు 20 రోజులుగా సాగునీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వరిచేలు పొట్టదశలో ఉన్నాయని, ఈ సమయంలో సరిపడా నీరు లేకపోతే తీవ్రంగా నష్టపోతామన్నారు. వంతుల వారీ విధానం పెట్టినప్పటి నుంచి సాగునీరు సరఫరా కావడం లేదన్నారు. ఎగువ రైతులకు మేలు జరుగుతుందని, తమ వంతు వచ్చేసరికి కాలువ చివరికే నీరు రావడం లేదన్నారు. తూతూమంత్రంగా.. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు ఈ సమస్యను విన్నవించినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని రైతులు వాపోయారు. అధికారులు తూతూ మంత్రంగా వచ్చి వెళుతున్నారని, అయితే సాగునీరు మాత్రం వరిచేలోకి రావడం లేదన్నారు. సాగు ప్రారంభంలో అధికారులను సంప్రదిస్తే ప్రతి ఎకరాకు నీరిస్తామని చెప్పారని అయితే ప్రస్తుతం నీరు అందక సుమారు 600 ఎకరాలు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. కాగా.. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి పూర్తిస్థాయిలో నీటిని సరఫరా చేస్తామని అధికారులు చెప్పడంతో ఆందోళన విరమించారు. తక్షణమే సరఫరా చేయాలి సాగునీరు లేక ఎండిపోతున్న శివారు ప్రాంత భూములకు తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా మండలంలో పర్యటిస్తున్న ఆయన రైతుల ఆందోళన విషయం తెలుసుకుని అక్కడకు వచ్చారు. రైతుల సమస్యలు తెలుసుకుని ధవళేశ్వరం సర్కిల్ ఇరిగేషన్ ఈఈ రామకృష్ణతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ పంటలు కళ్లెదుటే ఎండిపోతుంటే చూడలేక రైతులు రోడ్డు మీదకు వచ్చారననారు. ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సాగునీటి సమస్య వచ్చిందన్నారు. దీన్ని అత్యవసర పరిస్థితిగా భావించి అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన కదిలి, ప్రత్యేక అధికారిని వేయడంతో పాటు, ఎత్తిపోతల ద్వారానైనా ప్రతి ఎకరాకు సాగునీరందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం ప్రతినిధులు మోర్త రాజశేఖర్, వల్లు రాజబాబు, టి.ఈశ్వరరావు, రైతులు మేడిశెట్టి శ్రీనివాసరావు, పితాని సత్తిబాబు, కె.వెంకన్నబాబు రాజు, కాదా సాయిబాబు, కావూరి వెంకన్న, పేరాబత్తుల సాయి తదితరులు పాల్గొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,000 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
వాడపల్లి వెంకన్నకు భక్తుల తాకిడి
కొత్తపేట: కోనసీమ తిరుపతిగా ఖ్యాతి కెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. గోవింద నామ స్మరణతో ఆలయం మార్మోగింది. ఉదయం స్వామివారిని ప్రత్యేకంగా పువ్వులతో అలంకరించారు. గౌతమీ గోదావరిలో భక్తులు స్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఆవరణలోని వేంకటేశ్వరస్వామి క్షేత్ర పాలకుడు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించారు. దేవదాయ ధర్మదాయశాఖ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
లారీని ఢీకొన్న మోటారు సైకిల్
● యువకుడి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు ● ఇంజరం వద్ద ఘటన ● ఎకై ్సజ్ పోలీసులు వెంబడించడంతో ప్రమాదం తాళ్లరేవు: యానాం – ద్రాక్షారామ రహదారిలోని ఇంజరం వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరప మండలం గురజనాపల్లి శివారు అడివిపూడి గ్రామానికి చెందిన కోట శ్రీరామ్ (21), పిఠాపురానికి చెందిన మరో యువకుడు పెద్దాపురంలోని ఒక కళాశాలలో చదువుతున్నారు. వీరు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం వచ్చి తిరిగి వెళుతుండగా మద్యం తరలిస్తున్నారనే అనుమానంతో సుంకరపాలెం ఎకై ్సజ్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆపారు. అయితే వీరు బైక్ ఆపకుండా వెళ్లిపోవడంతో ఎకై ్సజ్ పోలీసులు వెంబడించారు. దీంతో వేగంగా బైక్ నడుపుతూ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కోట శ్రీరామ్‌కు తీవ్రగాయాలై రక్తస్రావమైంది. స్థానికులు హుటాహుటీన యానాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మరో యువకుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఎకై ్సజ్ చెక్ పోస్టు ముట్టడి యువకుడు మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న స్థానికులు ఎకై ్సజ్ చెక్‌పోస్టు వద్దకు చేరుకుని ముట్టడించారు. ఎకై ్సజ్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే నిండుప్రాణం బలై పోయిందని సిబ్బందిని నిలదీశారు. డిపార్ట్మెంట్కు సంబంధం లేని ఒక ప్రైవేటు వ్యక్తిని మద్యం దుకాణాల వద్ద నిఘా పెట్టి.. అతడు ఇచ్చిన సమాచారంతో ప్రతి రోజూ ఇదే మాదిరిగా వేధిస్తున్నారన్నారని ఆరోపించారు. సమాచారం తెలుసుకున్న కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ సుంకరపాలెం చెక్‌పోస్టు వద్ద పరిస్థితిని సమీక్షించారు. 08ఎఎమ్పి149 : మృతి చెందిన కోట శ్రీరామ్ (ఫైల్) -
ప్లేట్లెట్స్ తగ్గిపోయిన గర్భిణికి ప్రసవం
అమలాపురం టౌన్: మనిషి శరీరంలో రక్త కణాలు (ప్లేట్లెట్స్) లక్ష ల్లోంచి వేలల్లోకి పడిపోతే మనం కంగారు పడతాం. అలాంటిది ఓ గర్భిణికి ప్లేట్లెట్స్ 15 వేలకు పడపోవడమే కాకుండా మధుమేహం కూడా తోడవడంతో ఆమె ప్రసవం కష్టమైంది. ఈ తరుణంలో వైద్యులు రిస్క్‌తో శస్త్ర చికిత్స చేశారు. ఇప్పుడు తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. అల్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి నెలల నిండడంతో ప్రసవం కోసం అమలాపురంలోని సాయి రవీంద్ర హాస్పిటల్లో చేరింది. చేరే సమయానికే ఆమె ఇమ్యూన్ థ్రోంబోసైటోపెనియా (ఐటీపీ) ప్లేట్లెట్లు 15 వేలకు పడిపోయి మధుమేహంతో బాధపడుతోంది. హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ గఽంధం భవానీ ఆమె ప్రసవం ప్రమాదకరంగా ఉన్నప్పటికీ ఫిజిషియన్ డాక్టర్ శ్రీహరి, మత్తు వైద్యుడు సందీప్, పిల్లల డాక్టర్ యోగానంద్, ఆర్ధోపెడిక్ రవీంద్రలతో కూడిన వైద్య బృందం శస్త్ర చికత్స చేసి ప్రసవం చేశారు. ఇప్పుడు తల్లీ బిడ్డ ఆరోగ్యంగా కోలుకుంటున్నారని డాక్టర్ భవాని తెలిపారు. -
యాన్యువల్ డేకి వెళ్లాలి డాడి లే..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోకవరం మండలం కొత్తపల్లి శివారున పెట్రోల్‌బంక్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో(road accident) ఉపాధ్యాయుడు(Govt School Teacher) మృతి చెందగా అటవీశాఖ ఉద్యోగిని తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం అల్లూరి సీతారామరాజు జిల్లా వై.రామవరం మండలం దొలిపాడుకు చెందిన వలాల చిన్నబ్బాయి (52) జగ్గంపేట మండలం గోవిందపురం జిల్లా పరిషత్ హైసూ్కల్లో 2023 నుంచి సాంఘిక శాస్తం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. కొంత కాలంగా గోకవరంలో నివాసం ఉంటూ బైక్‌పై వెళ్లి వస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆయన వెళ్తుండగా అటవీశాఖలో గార్డుగా పని చేస్తున్న రెడ్డి విజయదుర్గ లిఫ్ట్ అడగడంతో ఆమెను ఎక్కించుకుని మళ్లీ ముందుకు సాగిపోయారు. కొత్తపల్లి శివారున పెట్రోల్ బంకు సమీపంలో వారు ప్రయాణిస్తున్న బైక్‌ను జగ్గంపేట వైపు నుంచి ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నబ్బాయి అక్కడికక్కడే మృతి చెందగా విజయదుర్గ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న గోకవరం ఎస్సై పవన్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. పిల్లలను పాఠశాల వద్ద దించి.. చిన్నబ్బాయికి భార్య పార్వతి, తొమ్మిదో తరగతి చదువుతున్న మేఘవర్షిణి, ఎనిమిదో తరగతి చదువుతున్న స్నేహిత ఉన్నారు. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న వారిని పాఠశాల వద్ద దించి, అనంతరం ఇంటి నుంచి బయలుదేరి కొద్దిసేపటికే ఆయన మృత్యువాతపడ్డారు. యాన్యువల్ డేకి వెళ్లాలి డాడి లే.. ఆ చిన్నారులు చదువుతున్న పాఠశాల వార్షికోత్సవం శనివారం జరగనుంది. తన పిల్లలు ఆ కార్యక్రమానికి రావాలి డాడీ అని పిలవగా నేను రాను అన్న ఆయన మాటే నిజమైందని చిన్నబ్బాయి భార్య రోదించారు. యాన్యువల్డేకి వెళ్లాలి లే డాడీ అంటూ చిన్నారులు పోలీసులు వద్ద రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పోలీస్‌స్టేషన్ వద్ద నుంచి ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించడానికి వాహనాన్ని నిలపగా భార్య, కుమార్తెలు మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. ఈ క్రమంలో వారిని ఎవరూ వారించలేకపోయారు. హెల్మెట్ ఉన్నా.. బైక్ నడిపే సమయంలో చిన్నబ్బాయి హెల్మెట్ కచ్చితంగా వాడతారు. ప్రమాదం జరిగినపుడు కూడా హెల్మెట్ ధరించినప్పటికీ కారు ఢీకొట్టిన వేగానికి హెల్మెట్ ముక్కలైపోయి తలకు గట్టి దెబ్బ తగలడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఉపాధ్యాయుడి మృతి విషయం తెలుసుకున్న సహచర ఉపాధ్యాయులు భారీగా అక్కడకు చేరుకుని విచారం వ్యక్తం చేశారు. -
ఇంతింతై... సేవకు అంకితమై..
● అన్ని రంగాల్లోనూ రాణిస్తున్న మహిళలు ● అధికారులుగా తమదైన ముద్ర ● నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిడదవోలు: భగవంతుడు అన్నిచోట్లా ఉండలేడని తనకు బదులుగా అమ్మను సృష్టించాడని అంటారు. ఇది మహిళా ప్రాధాన్యతను తెలియజేస్తుంది. ముద్దులోలికే కూతురిగా, ఇంటి పనుల్లో సహయకురాలిగా, సమాజ స్థితిగతులను అవగాహన చేసుకునే విద్యార్థిగా, జీవిత భాగస్వామిగా, పిల్లలను సాకే సృష్టికర్తగా, కుటుంబాన్ని చక్కదిద్దే ప్రణాళిక రచయితగా, శ్రామిక మహిళగా, ఉద్యోగినిగా, అన్నింటికీ మించి అమ్మగా సాగే జీవితమే ఆమె. కడుపులోనే చిదిమేద్దమనో, మదమెక్కి హత్యాచారం చేద్దామనో, ఆస్తుపాస్తుల కోసం అంతం చేద్దామనో అనుకున్న వాళ్లకు ఆ అమ్మ గొప్పదనం తెలియకపోవచ్చును. మొత్తం మానవ సమాజానికి ఆ ఆడదే ఆధారం. మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తూ సామాజిక సేవలో రాణిస్తున్నారు. సామాజిక సమస్యలను సవాల్‌గా తీసుకుని ఉన్నత ఉద్యోగాల్లో కూడా రాణిస్తున్న నారిమణులు ఉన్నారు. మరో వైపు ఓ అమ్మగా పిల్లలను లాలిస్తూ..గృహిణిగా ఎన్నో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ మహిళా అధికారులు తమదైన ముద్ర వేస్తున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం... మానసిక దివ్యాంగులకు సేవ చేస్తూ... నిడదవోలు మండలంలోని శంఖారాపురం గ్రామ శివారున ఉన్న సహాయ స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మానసిక దివ్యాంగుల కేంద్రంలో విశాలాక్షి తన సేవాభావాన్ని చాటుకుంటున్నారు. అన్నెం పున్నెం ఎరగని అభాగ్యులకు దగ్గర ఉండి వారి పరిచర్యలు చేస్తూ సేవ అనే పదానికి సరైన నిర్వచనం చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి గ్రామానికి చెందిన విశాలాక్షి పీజీ పూర్తి చేసి, మధ్యప్రదేశ్‌లోని బోజ్ యూనివర్శిటీలో బీఈడీ(ఎంఆర్) పూర్తి చేశారు. ప్రస్తుతం మానసిక వికలాంగుల కేంద్రంలో ఆర్గనైజర్, ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న విశాలాక్షి సేవలకు గుర్తిస్తూ 2019లో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ మహిళా సేవా పురస్కారానికి తీసుకున్నారు. సేవలోనే ఆత్మ సంతృప్తి నిడదవోలు పట్టణానికి చెందిన డాక్టర్ కుంచాల విజయకి చిన్నతనం నుంచి బాగా చదువుకోవాలి..నలుగురికి సేవా చేయ్యాలనే ఆలోచన వచ్చింది. సమాజానికి ఏదో చేయాలనే తపన ఉంది. కోట రామకృష్ణారెడ్డి, జాలమ్మ దంపతుల కుమార్తె విజయ. తండ్రికి ఆర్థిక స్థోమత లేకపోయినా ఎంతో పట్టుదలతో బీఎస్సీ చదివారు. ప్రస్తుతం జగన్నాథపురం పంచాయతీ ఈవోగా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. సేవాభావం గల భర్త ప్రొత్సహించడంతో ఆమె సేవా గుణాన్ని భర్త గ్రహించాడు. భర్త ప్రోత్సాహంతో మనోజ్ఞ చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి, సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. భర్త ఆదాయంలో నెలకు 20 శాతం పేద విద్యార్థులకు కేటాయిస్తూ పలు సేవ కార్యాక్రమాలను చేపడుతున్నారు. నిడదవోలులో నివాసముంటున్న శ్రీనివాసరెడ్డి దంపతులు నిడదవోలు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలలో సేవా కార్యాక్రమాలు నిర్వహిస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ట్రస్టు కార్యక్రమాలు ఇద్దరూ నిర్వహిస్తూ పలు అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. ట్రస్టు చేపడుతున్న సేవలకు గుర్తింపుగా రెండు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏపీ స్టేట్ కల్చరల్ ఆవేర్నెస్ సోసైటీ, ఏపీ బెస్ట్ సిటిజన్ అవార్డు, పొట్టి శ్రీరాములు విశిష్ట సేవా శిరోమణి పురస్కారంతో పాటు అమెరికాలో బర్కెలీ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. కరోనా సమయంలో చేసిన సేవలకు గుర్తిపుగా విశ్వగురు వరల్డ్ రికార్డు నుంచి రోనా వారియర్స్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.గొల్లపల్లి భరణి ఎల్లార్ఆమె చేయి పడితే కంటి చూపు ఖాయం నిడదవోలు పట్టణంలో లయన్స్ కంటి ఆసుపత్రిలో గత ఎనిమిదేళ్లుగా కంటి వైద్యురాలిగా పనిచేస్తున్న గొల్లపల్లి భరణి ఎల్లార్ తన కంటూ ప్రత్యేక స్ధానం ఏర్పరచుకున్నారు. ఆమె చేయి వేస్తే కంటి చూపు వస్తుందనే నమ్మకం వృద్ధుల్లో కలిగింది. ఇప్పటి వరకు ఆమె 45,000 కంటి శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు. సుమారు 2 లక్షల మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. స్వచ్ఛంధ సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాల్లో సైతం పాలు పంచుకుంటారు. రోగుల పట్ల ఎంతో ప్రేమగా మాట్లాడుతుంటారు. 1974లో కొవ్వూరులో జన్మించారు. 1999లో విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, పీజీ పూర్తి చేశారు. వృత్తిపట్ల అంకిత భావం, పేదలకు ఉచిత వైద్య సేవలందించడంలో తనదైన ముద్ర వేశారు. అపజయం ఎరుగని కౌన్సిలర్ నిడదవోలు మున్సిపల్ పాలకవర్గంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ పువ్వల రతీదేవి ఉన్నత విద్యావంతురాలిగా మహిళల సమస్యలపై గళమెత్తుతారు. ఎంఏ బీఈడి పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం నాలుగోసారి కౌన్సిలర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2005లో కాంగ్రెస్ హయాంలో కౌన్సిలర్‌గా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా నాలుగో సారి కౌన్సిలర్‌గా విజయం సాధించి పదవిలో కొనసాగుతున్నారు. మధ్య తరగతి కుంటుంబం నుంచి వచ్చిన ఆమె ప్రత్యర్థులను చిత్తు చేయడంలో దిట్ట. ఎన్నికల బరిలో ఎవరు ఉన్నా ఓడించి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచున్నారు. కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలపై గళమెత్తుతూ మరోపక్క ప్రైవేట్ స్కూల్ నడుపుతూ పేద, తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ఉచితంగా చదువు చెబుతున్నారు.మహిళలపై వివక్ష పోవాలి మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఎందరో మహిళలు కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. ప్రధానంగా కుటుంబం అక్షరాస్యతతో ఉండాలి. మహిళలు సమాజ సేవ, రాజకీయ రంగంలో తమకంటూ ప్రత్యేక గుర్తుంపును తెచ్చుకుంటున్నారు. అయినప్పటికి సమాజంలో మహిళలపై వివక్ష కొనసాగుతోంది. అది పూర్తిగా పోవాలి. – డాక్టర్ ఈ తేజశ్రీ, వైద్యాధికారి, నెహ్రూనగర్ అర్బన్ హెల్త్ సెంటర్, నిడదవోలు) -
గేట్లు.. పాట్లు
అన్నవరం: పంపా రిజర్వాయర్ వద్ద కొత్త గేట్ల ఏర్పాటుకు రూ.3.36 కోట్లు మంజూరై దాదాపు మూడు నెలలైనా ఇంకా పనులు ప్రారంభం కాలేదు. నెలాఖరులోగా ఖర్చు చేయకపోతే ఈ నిధులు మురిగిపోయే అవకాశం ఉండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇదీ పరిస్థితి పంపా జలాశయం కింద తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో 12,500 ఎకరాల ఆయకట్టు ఉంది. ఒకసారి ఆయకట్టు మొత్తం సాగు జరగాలంటే 1.5 టీఎంసీల నీరు అవసరం. పంపా గర్భంలో నుంచి పుష్కర కాలువ నిర్మాణం జరగక ముందు ఈ రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 105 అడుగులుండేది. 105 ఆ స్థాయికి నీటిమట్టం చేరితే రిజర్వాయర్‌లో 0.5 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. అయితే పుష్కర కాలువను రిజర్వాయర్‌కు 103 అడుగుల ఎత్తులో నిర్మించారు. దీంతో పంపా రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టాన్ని 103 అడుగులకు పరిమితం చేశారు. దీంతో దీని నీటినిల్వ సామర్థ్యం 0.44 టీఎంసీలకు పరిమితమైపోయింది. ఇప్పుడు పంపా బ్యారేజీ గేట్లు బలహీనంగా ఉండటంతో నీటిమట్టాన్ని 99 అడుగులకే పరిమితం చేశారు. దీంతో రిజర్వాయర్‌లో 0.26 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయడం సాధ్యమవుతోంది. ఫలితంగా ఖరీఫ్ పంట కాలంలో రిజర్వాయర్ నాలుగుసార్లు నిండితే తప్ప ఆయకట్టు రైతులు గట్టెక్కలేని దుస్థితి ఏర్పడింది. తాత్కాలిక మరమ్మతులతో సరి అన్నవరం వద్ద పంపా రిజర్వాయర్ నిర్మించి దాదాపు 56 ఏళ్లు పూర్తయింది. అప్పట్లో ఏర్పాటు చేసిన ఐదు గేట్లకు సమస్యలు ఎదురైనపుడు ఎప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతులు మాత్రమే చేస్తున్నారు. రిజర్వాయర్ గేట్లను అప్పటి సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం అర్ధచంద్రాకారంగా అంటే సినిమా స్కోప్ తెర మాదిరిగా నిర్మించారు. ఈ గేట్లు కాస్త వంపుగా ఉండటంతో భారీ వర్షాలు, తుపాన్ల సమయంలో రిజర్వాయర్ నుంచి మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేయడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గేట్లు ఎత్తడం, దించడం సమస్యగా మారింది. ఈ పరిస్థితుల్లో పాత గేట్లు మార్చాలనే ప్రతిపాదన సుమారు పదేళ్లుగా ఉంది. వైఎస్సార్ సీపీ హయాంలోనే మంజూరు రైతుల ఇబ్బందిని గుర్తించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పంపా బ్యాకేజీకి పాత గేట్ల స్థానంలో కొత్తవి అమర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు 2023 జూలై నెలలో ఇరిగేషన్ అధికారులు బ్యారేజీ గేట్లు పరిశీలించారు. వీటిని మార్చి కొత్త గేట్లు అమర్చాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీనికి నాటి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2023 డిసెంబర్లోనే కొత్త గేట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తరువాత ఎన్నికల కోడ్ కారణంగా నిధులు విడుదల కాలేదు. ఆ తరువాత ఏర్పడిన కూటమి ప్రభుత్వం మళ్లీ ఈ ప్రతిపాదనలను పరిశీలించి కేంద్రానికి పంపించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత ఏడాది డిసెంబర్లో విపత్తు రక్షణ నిధుల నుంచి రూ.3.36 కోట్లు విడుదల చేశాయి. మరోవైపు గేట్ల పనులకు ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో రిజర్వాయర్‌లోని నీటిని దిగువకు వదిలేశారు. దీంతో జలాశయం అడుగంటి కనిపిస్తోంది. మళ్లీ వర్షాలు కురిస్తే తప్ప నిండే పరిస్థితి కనిపించడం లేదు. ఫ పంపా రిజర్వాయర్ కొత్త గేట్లకు ఖరారవని టెండర్లు ఫ నీరుగారుతున్న రూ.3.36 కోట్లు ఫ నెలాఖరులోగా ఖర్చు చేయకపోతే మురిగిపోయే అవకాశం త్వరలోనే కొత్త గేట్లు నీటి సంఘాల ఎన్నికలు తదితర కారణాలతో పంపా రిజర్వాయర్ కొత్త గేట్ల ఏర్పాటుకు టెండర్లు పిలవడం ఆలస్యమైంది. గత నెలలోనే టెండర్లు పిలిచాం. వాటిని ఖరారు చేసి పనులు ప్రారంభించాల్సి ఉంది. మార్చి నెలాఖరులోగా ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. అందువలన త్వరలోనే పనులు ప్రారంభించి కొత్త గేట్లు ఏర్పాటు చేస్తాం. – జి.శేషగిరిరావు, ఇరిగేషన్ ఈఈ -
ఇంతింతై... సేవకు అంకితమై..
● అన్ని రంగాల్లోనూ రాణిస్తున్న మహిళలు ● అధికారులుగా తమదైన ముద్ర ● నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిడదవోలు: భగవంతుడు అన్నిచోట్లా ఉండలేడని తనకు బదులుగా అమ్మను సృష్టించాడని అంటారు. ఇది మహిళా ప్రాధాన్యతను తెలియజేస్తుంది. ముద్దులోలికే కూతురిగా, ఇంటి పనుల్లో సహయకురాలిగా, సమాజ స్థితిగతులను అవగాహన చేసుకునే విద్యార్థిగా, జీవిత భాగస్వామిగా, పిల్లలను సాకే సృష్టికర్తగా, కుటుంబాన్ని చక్కదిద్దే ప్రణాళిక రచయితగా, శ్రామిక మహిళగా, ఉద్యోగినిగా, అన్నింటికీ మించి అమ్మగా సాగే జీవితమే ఆమె. కడుపులోనే చిదిమేద్దమనో, మదమెక్కి హత్యాచారం చేద్దామనో, ఆస్తుపాస్తుల కోసం అంతం చేద్దామనో అనుకున్న వాళ్లకు ఆ అమ్మ గొప్పదనం తెలియకపోవచ్చును. మొత్తం మానవ సమాజానికి ఆ ఆడదే ఆధారం. మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తూ సామాజిక సేవలో రాణిస్తున్నారు. సామాజిక సమస్యలను సవాల్‌గా తీసుకుని ఉన్నత ఉద్యోగాల్లో కూడా రాణిస్తున్న నారిమణులు ఉన్నారు. మరో వైపు ఓ అమ్మగా పిల్లలను లాలిస్తూ..గృహిణిగా ఎన్నో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ మహిళా అధికారులు తమదైన ముద్ర వేస్తున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం... మానసిక దివ్యాంగులకు సేవ చేస్తూ... నిడదవోలు మండలంలోని శంఖారాపురం గ్రామ శివారున ఉన్న సహాయ స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మానసిక దివ్యాంగుల కేంద్రంలో విశాలాక్షి తన సేవాభావాన్ని చాటుకుంటున్నారు. అన్నెం పున్నెం ఎరగని అభాగ్యులకు దగ్గర ఉండి వారి పరిచర్యలు చేస్తూ సేవ అనే పదానికి సరైన నిర్వచనం చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి గ్రామానికి చెందిన విశాలాక్షి పీజీ పూర్తి చేసి, మధ్యప్రదేశ్‌లోని బోజ్ యూనివర్శిటీలో బీఈడీ(ఎంఆర్) పూర్తి చేశారు. ప్రస్తుతం మానసిక వికలాంగుల కేంద్రంలో ఆర్గనైజర్, ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న విశాలాక్షి సేవలకు గుర్తిస్తూ 2019లో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ మహిళా సేవా పురస్కారానికి తీసుకున్నారు. సేవలోనే ఆత్మ సంతృప్తి నిడదవోలు పట్టణానికి చెందిన డాక్టర్ కుంచాల విజయకి చిన్నతనం నుంచి బాగా చదువుకోవాలి..నలుగురికి సేవా చేయ్యాలనే ఆలోచన వచ్చింది. సమాజానికి ఏదో చేయాలనే తపన ఉంది. కోట రామకృష్ణారెడ్డి, జాలమ్మ దంపతుల కుమార్తె విజయ. తండ్రికి ఆర్థిక స్థోమత లేకపోయినా ఎంతో పట్టుదలతో బీఎస్సీ చదివారు. ప్రస్తుతం జగన్నాథపురం పంచాయతీ ఈవోగా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. సేవాభావం గల భర్త ప్రొత్సహించడంతో ఆమె సేవా గుణాన్ని భర్త గ్రహించాడు. భర్త ప్రోత్సాహంతో మనోజ్ఞ చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి, సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. భర్త ఆదాయంలో నెలకు 20 శాతం పేద విద్యార్థులకు కేటాయిస్తూ పలు సేవ కార్యాక్రమాలను చేపడుతున్నారు. నిడదవోలులో నివాసముంటున్న శ్రీనివాసరెడ్డి దంపతులు నిడదవోలు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలలో సేవా కార్యాక్రమాలు నిర్వహిస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ట్రస్టు కార్యక్రమాలు ఇద్దరూ నిర్వహిస్తూ పలు అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. ట్రస్టు చేపడుతున్న సేవలకు గుర్తింపుగా రెండు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏపీ స్టేట్ కల్చరల్ ఆవేర్నెస్ సోసైటీ, ఏపీ బెస్ట్ సిటిజన్ అవార్డు, పొట్టి శ్రీరాములు విశిష్ట సేవా శిరోమణి పురస్కారంతో పాటు అమెరికాలో బర్కెలీ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. కరోనా సమయంలో చేసిన సేవలకు గుర్తిపుగా విశ్వగురు వరల్డ్ రికార్డు నుంచి రోనా వారియర్స్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.గొల్లపల్లి భరణి ఎల్లార్ఆమె చేయి పడితే కంటి చూపు ఖాయం నిడదవోలు పట్టణంలో లయన్స్ కంటి ఆసుపత్రిలో గత ఎనిమిదేళ్లుగా కంటి వైద్యురాలిగా పనిచేస్తున్న గొల్లపల్లి భరణి ఎల్లార్ తన కంటూ ప్రత్యేక స్ధానం ఏర్పరచుకున్నారు. ఆమె చేయి వేస్తే కంటి చూపు వస్తుందనే నమ్మకం వృద్ధుల్లో కలిగింది. ఇప్పటి వరకు ఆమె 45,000 కంటి శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు. సుమారు 2 లక్షల మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. స్వచ్ఛంధ సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాల్లో సైతం పాలు పంచుకుంటారు. రోగుల పట్ల ఎంతో ప్రేమగా మాట్లాడుతుంటారు. 1974లో కొవ్వూరులో జన్మించారు. 1999లో విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, పీజీ పూర్తి చేశారు. వృత్తిపట్ల అంకిత భావం, పేదలకు ఉచిత వైద్య సేవలందించడంలో తనదైన ముద్ర వేశారు. అపజయం ఎరుగని కౌన్సిలర్ నిడదవోలు మున్సిపల్ పాలకవర్గంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ పువ్వల రతీదేవి ఉన్నత విద్యావంతురాలిగా మహిళల సమస్యలపై గళమెత్తుతారు. ఎంఏ బీఈడి పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం నాలుగోసారి కౌన్సిలర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2005లో కాంగ్రెస్ హయాంలో కౌన్సిలర్‌గా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా నాలుగో సారి కౌన్సిలర్‌గా విజయం సాధించి పదవిలో కొనసాగుతున్నారు. మధ్య తరగతి కుంటుంబం నుంచి వచ్చిన ఆమె ప్రత్యర్థులను చిత్తు చేయడంలో దిట్ట. ఎన్నికల బరిలో ఎవరు ఉన్నా ఓడించి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచున్నారు. కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలపై గళమెత్తుతూ మరోపక్క ప్రైవేట్ స్కూల్ నడుపుతూ పేద, తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ఉచితంగా చదువు చెబుతున్నారు.మహిళలపై వివక్ష పోవాలి మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఎందరో మహిళలు కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. ప్రధానంగా కుటుంబం అక్షరాస్యతతో ఉండాలి. మహిళలు సమాజ సేవ, రాజకీయ రంగంలో తమకంటూ ప్రత్యేక గుర్తుంపును తెచ్చుకుంటున్నారు. అయినప్పటికి సమాజంలో మహిళలపై వివక్ష కొనసాగుతోంది. అది పూర్తిగా పోవాలి. – డాక్టర్ ఈ తేజశ్రీ, వైద్యాధికారి, నెహ్రూనగర్ అర్బన్ హెల్త్ సెంటర్, నిడదవోలు) -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,000 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
పాల దుకాణంపై ఫుడ్‌సేఫ్టీ అధికారుల దాడులు
బోట్‌క్లబ్: స్థానిక అచ్యుతాపురం రైల్వే గేటు సమీపంలోని శ్రీసాయి శ్రీనివాస్ మిల్క్ షాప్‌పై శుక్రవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. పాలు, పెరుగు నిల్వ ఉండడానికి స్పైడ్రైయ్ మిల్క్‌పౌడర్, బెంజోయాక్ యాసిడ్ వినిగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పాలు ఎక్కువ రోజు నిల్వ ఉంచేందకు ఈ యాసిడ్ వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పాలు తోడుపెట్టే క్రమంలో ఈ పౌడర్‌ను వినియోగిస్తున్నట్టు ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కంట్రోలర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు నిర్వాహకునిపై కేసు నమోదు చేస్తున్నామన్నారు. ఇతని వద్ద స్వాధీనం చేసుకొన్న పాలు, పెరుగు ల్యాబ్‌కు పంపుతామన్నారు. ఇవి హానికరమని తేలితే మరో కేసు నమోదు చేస్తామన్నారు. పాలు, పెరుగు, రసాయనాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు తెలిపారు. యాసిడ్ వినియోగించి నిల్వ ఉంచి పాలు మనం తాగితే జీర్ణకోశ సమస్యలు వస్తాయని ఆయన తెలిపారు. గొర్రిపూడి హెచ్ఎంపై పోక్సో కేసు కరప: విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడిన గొర్రిపూడి జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం అడబాల కాశీవిశ్వేశ్వరరావుపై పోక్సో కేసు నమోదైంది. అధికారుల విచారణలో ఫిర్యాదులు నిర్థారణ కావడంతో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ సునీత శుక్రవారం తెలిపారు. కేసు విచారణలో ఉన్నందున నిందితుడిని అరెస్టు చేయలేదని, విచారణ నివేదికతో కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
ప్రకృతి సాగు విస్తీర్ణం పెంచాలి
● హార్టికల్చర్ గణనీయమైన సాగు విస్తీర్ణం సాధ్యం ● కలక్టర్ ప్రశాంతి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం ప్రతి ఏడాది పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని అప్పుడే పర్యావరణ పరిరక్షణ లక్ష్యం సాధ్యం అవుతుందని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, హార్టికల్చర్ క్షేత్ర స్థాయి అధికారులతో 2024–25 లక్ష్య సాధన, 2025–26 లక్ష్యాలపై యూనిట్ ఇన్చార్జిల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం 30,641 మంది రైతుల ద్వారా సుమారు 46 వేల ఎకరాలు లక్ష్యంగా నిర్దేశించగా.. 37,844 మంది రైతుల ద్వారా 44,200 ఎకరాల సాగు విస్తీర్ణం చేశామన్నారు. గత ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఆర్థిక సంవత్సరం వరకూ ఎంత విస్తీర్ణం పెంచ గలిగారో అన్న విషయం ద్వారా మాత్రమే ప్రకృతి వ్యవసాయం దిశగా అడుగులు వేశారో తెలుసుకునే అవకాశం ఉందన్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే యూనిట్ ఇన్చార్జిలు, ఐసీఆర్పీలు, ఇతర సిబ్బంది పనితీరును ఏ విధంగా విశ్లేషణ చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఆర్బీకే స్థాయిలో అనుకున్న స్థాయిలో ప్రకృతి వ్యవసాయ దిశగా అడుగులు వేయడం లేదన్నది వాస్తవం అన్నారు. రాబోయే సమావేశం నాటికి ఖరీఫ్ , రబీ 2025–26 ఈ క్రాప్ డేటా వివరాలు ఎంత మేరకు కన్వర్షన్ చేయడంపై నివేదికలో పేర్కొనాలని ఆదేశించారు. నవధాన్యాల సాగు విస్తీర్ణం పెంచడం పై దృష్టి పెట్టడం ద్వారా ప్రకృతి వ్యవసాయ సాగు పెంచడం సాధ్యం అవుతుందని కలెక్టర్ తెలియజేశారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు, జిల్లా హార్టికల్చర్ అధికారి బి.సుజాతకుమారి పాల్గొన్నారు. టీచర్లకు రెండు రోజుల అవకాశం కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సీనియార్టీ జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలపాలని జిల్లా విద్యాశాఖదికారి వారి వెబ్సైట్లో ఉంచినట్టు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాల్లో ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్స్ తత్సమానమైన ఉపాధ్యాయులు, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు. పీఈటీ ఉపాధ్యాయులు, లాంగ్వేజ్ పండిట్ ఉపాధ్యాయులు తదితర ఉపాధ్యాయులు సీనియార్టీ వివరాలు జిల్లా విద్యాశాఖధికారి వెబ్సైట్లో ఉంచినట్టు డీఈవో తెఇపారు. వెబ్సైట్లో ఉన్న సీనియార్టీ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత నమూనా ప్రొఫార్మాతో శని, ఆదివారాలలో కార్యాలయ పని వేళలలో సమర్పించేందుకు అవకాశం ఉందన్నారు. 10న అప్రెంటిస్ మేళా బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వివిధ కంపెనీల్లో ఉన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఈ నెల 10వ తేదీన కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాలవర్మ శుక్రవారం తెలిపారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఐటీఐలో ఉత్తీర్ణులై ఎన్టీసీ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు ఉదయం 9గంటలకు కళాశాలకు హాజరుకావాలని, ఇతర వివరాలకు 86392 30775 నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు. అధికారుల 2కె రన్ కాకినాడ క్రైం: మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు. శుక్రవారం నాగమల్లితోట నుంచి ప్రారంభమైన ఈ రన్ భానుగుడి కూడలి వరకు సాగింది. అక్కడ మానవహారాన్ని ఏ ర్పాటు చేసి మహిళల భద్రత, రక్షణపై నినాదాలు చేశా రు. కార్యక్రమంలో పోలీస్‌శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. న్యాయ సేవాధికార కమిటీకి మధ్యవర్తుల నియామకం అమలాపురం టౌన్: అమలాపురం న్యాయ సేవాధికార కమిటీకి మధ్యవర్తులుగా ముగ్గురిని నియమిస్తూ ఆ కమిటీ చైర్మన్, రెండో అదనపు కోర్టు జిల్లా న్యాయమూర్తి వి.నరేష్ ఉత్తర్వులు జారీ చేశారు. విశ్రాంత స్పెషల్ మెజిస్ట్రేట్ ఎం.రామభద్రరావు, సీనియర్ న్యాయవాది, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ వీకేఎస్ భాస్కరశాస్త్రి, మరో సీనియర్ న్యాయవాది కేవీవీ శ్రీనివాసరావులు మధ్యవర్తులుగా నియమితులయ్యారు. జిల్లా ప్రధాన మండల న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు గతంలో ఈ ముగ్గురూ రాజమహేంద్రవరం జిల్లా ప్రధాన కోర్టులో 40 గంటల పాటు మధ్యవర్తిత్వంపై శిక్షణ పొందారు. ఇప్పడు ఈ ముగ్గురిని మధ్యవర్తులుగా నియమించారు. -
గౌరవిస్తేనే సంపూర్ణ మహిళా సాధికారిత
– జేఎన్టీయూకే వీసీ డాక్టర్ ప్రసాద్ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సీ్త్రలను గౌరవించినప్పుడే సంపూర్ణ మహిళా సాధికారిత సాధ్యమవుతుందని జేఎన్టీయూకే వీసీ డాక్టర్ సీఎస్ఆర్కే ప్రసాద్ పేర్కొన్నారు. జేఎన్టీయూకేలో వుమెన్ ఎంపవర్మెంట్ గ్రీవెన్స్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద్ మాట్లాడుతూ కాలం ఎంతో విలువైందని, మహిళలు తమ కంటూ లక్ష్యం ఏర్పరచుకుని ఆ లక్ష్యాన్ని చేరేవరకూ నిరంతరం శ్రమించాలన్నారు. ఫిలిప్పీన్ దేశ జనభాలో అత్యధికంగా మహిళలే ఉద్యోగం చేస్తున్నారన్నారు. మహనీయులను ఆదర్శంగా తీసుకుని నలుగురికి ఉపయోగపడేలా సేవలందిస్తూ ఉన్నత శిఖారాలు అధిరోహించాలన్నారు. వర్సిటీలో మహిళ సాఽధికారిత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని, మహిళలు విద్యార్థి దశలో విద్యకు అధిక ప్రాధాన్యమివ్వడంతో పాటు ఇతరులకు విద్యపట్ల అవగాహన కల్పించాలన్నారు. మరో ముఖ్య అతిథి నన్నయ వర్సిటీ వీసీ ప్రసన్నశ్రీ మాట్లాడుతూ సమాజంలో మహిళను బలపరిస్తే ఆమె ఒక కుటుంబాన్ని బలపరుస్తుందని, ఒక కుటుంబం బలంగా ఉంటే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. సమాజంలో ప్రతి మనిషికి ఆత్మ గౌరవం ఉంటుందని,మహిళలు ఆ ఆత్మగౌరవంతో అవకాశాలు చేజిక్కించుకోవాలన్నారు. అనంతరం లక్ష్మీ ఫౌండేషన్ ద్వారా ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు రూ.20వేలు ఉపకార వేతనం ఇస్తుండగా వచ్చే విద్యాసంవత్సరం ప్రతి విద్యార్థికి స్కాలర్ షిప్ ఇవ్వడానికి ముందుకు రావడంపై అభినందించారు. అనంతరం నన్నయ వీసీ ప్రసన్నశ్రీని సత్కరించారు. రెక్టార్ కేవీ రమణ, ఇన్చార్జి రిజిస్ట్రార్ రవీంద్రనాథ్, డైరెక్టర్ రత్నకుమారి పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి
● అటవీశాఖ ఉద్యోగినికి తీవ్ర గాయాలు ● బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఘటన గోకవరం: గోకవరం మండలం కొత్తపల్లి శివారున పెట్రోల్‌బంక్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి చెందగా అటవీశాఖ ఉద్యోగిని తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం అల్లూరి సీతారామరాజు జిల్లా వై.రామవరం మండలం దొలిపాడుకు చెందిన వలాల చిన్నబ్బాయి (52) జగ్గంపేట మండలం గోవిందపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో 2023 నుంచి సాంఘిక శాస్తం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. కొంత కాలంగా గోకవరంలో నివాసం ఉంటూ బైక్‌పై వెళ్లి వస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆయన వెళ్తుండగా అటవీశాఖలో గార్డుగా పని చేస్తున్న రెడ్డి విజయదుర్గ లిఫ్ట్ అడగడంతో ఆమెను ఎక్కించుకుని మళ్లీ ముందుకు సాగిపోయారు. కొత్తపల్లి శివారున పెట్రోల్ బంకు సమీపంలో వారు ప్రయాణిస్తున్న బైక్‌ను జగ్గంపేట వైపు నుంచి ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నబ్బాయి అక్కడికక్కడే మృతి చెందగా విజయదుర్గ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న గోకవరం ఎస్సై పవన్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. పిల్లలను పాఠశాల వద్ద దించి.. చిన్నబ్బాయికి భార్య పార్వతి, తొమ్మిదో తరగతి చదువుతున్న మేఘవర్షిణి, ఎనిమిదో తరగతి చదువుతున్న స్నేహిత ఉన్నారు. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న వారిని పాఠశాల వద్ద దించి, అనంతరం ఇంటి నుంచి బయలుదేరి కొద్దిసేపటికే ఆయన మృత్యువాతపడ్డారు. యాన్యువల్ డేకి వెళ్లాలి డాడి.. ఆ చిన్నారులు చదువుతున్న పాఠశాల వార్షికోత్సవం శనివారం జరగనుంది. తన పిల్లలు ఆ కార్యక్రమానికి రావాలి డాడీ అని పిలవగా నేను రాను అన్న ఆయన మాటే నిజమైందని చిన్నబ్బాయి భార్య రోదించారు. యాన్యువల్డేకి వెళ్లాలి లే డాడీ అంటూ చిన్నారులు పోలీసులు వద్ద రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పోలీస్‌స్టేషన్ వద్ద నుంచి ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించడానికి వాహనాన్ని నిలపగా భార్య, కుమార్తెలు మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. ఈ క్రమంలో వారిని ఎవరూ వారించలేకపోయారు. హెల్మెట్ ఉన్నా.. బైక్ నడిపే సమయంలో చిన్నబ్బాయి హెల్మెట్ కచ్చితంగా వాడతారు. ప్రమాదం జరిగినపుడు కూడా హెల్మెట్ ధరించినప్పటికీ కారు ఢీకొట్టిన వేగానికి హెల్మెట్ ముక్కలైపోయి తలకు గట్టి దెబ్బ తగలడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఉపాధ్యాయుడి మృతి విషయం తెలుసుకున్న సహచర ఉపాధ్యాయులు భారీగా అక్కడకు చేరుకుని విచారం వ్యక్తం చేశారు. -
వ్యక్తి అదృశ్యం
కొవ్వూరు: వాడపల్లి గ్రామానికి చెందిన డొంకిన నాగర్జున (28) శుక్రవారం ఇంటి నుంచి అదృశ్యమైనట్టు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పి.విశ్వం తెలిపారు. పలుచోట్ల వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదన్నారు. భార్య దుర్గ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేశామన్నారు. నాగార్జున లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. తన గురించి వెతకవద్దని మెసేజ్ పెట్టినట్టు ఆ ఫిర్యాదులో దుర్గ పేర్కొన్నారు. నాగార్జునకు వేరోకరితో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా చెబుతున్నారు. వివరాల తెలిసిన వారు 94407 96622 నంబర్‌కు కాల్ చేయాలని ఆయన సూచించారు. -
గురుకుల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
రంగంపేట: గురుకుల విద్యాలయాలలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు లక్ష్మీ నరసాపురం బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వై.లక్ష్మణకుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ సాంఘిక, సంక్షేమ గురుకుల విద్యాలయాల ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న 21 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులాలలో 2025–26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్మీడియెట్ (ఇంగ్లిషు మీడియం)లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అన్నారు. ఈ నెల 13వ తేదీ నాటికి దరఖాస్తులు అందించాలన్నారు. ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేయవచ్చునని తెలిపారు. ఈ గురుకుల విద్యాలయాలు ప్రత్యేకంగా పేద, నిరుపేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఒక గొప్ప అవకాశం ఉందని, వీటిలో విద్యార్థులు సెల్‌ఫోన్ సంస్కృతి నుంచి దూరంగా క్రమ శిక్షణ, ఆత్మస్థైర్యం, మంచి ఆరోగ్యం, మంచి జీవన శైలి నేర్చుకోవచ్చునని తెలిపారు. ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్య, పౌష్టికాహారం, ఉచిత పుస్తకాలు, యూనిఫాం, బూట్లు, స్టూడెంట్ స్టేషనరీ, స్పోర్ట్స్ తదితర సౌకర్యాలు ఉన్నాయన్నారు. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. -
సంక్షేమం నుంచి సంక్షోభం
కూటమి పాలనలో మహిళా ఉద్యమాలిలా.. కూటమి ప్రభుత్వం రాగానే మహిళా శ్రామికులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రంగా దగాపడ్డారు. 8 నెలల వేతన బకాయిలు ఇవ్వాలని వీఓఏలు జనవరి 27, 28, 29లలో నిరసన కార్యక్రమాలు చేశారు. కోనసీమ జిల్లాలో 1,726, తూర్పుగోదావరి జిల్లాలో 1,556 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో విస్తారంగా అంగన్వాడీలున్నారు. కాకినాడ జిల్లాలో సుమారు 3500 మంది అంగన్వాడీలు సేవలందిస్తున్నారు. వారంతా కూటమి సర్కార్ ఇచ్చిన హామీలుకు గత నెల 18న ఐసీడీఎస్ కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. అదే నెల 24న కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు ధర్నాకు దిగారు. వలంటీర్లకు రూ.10వేలు గౌరవ వేతనమిస్తూ విధుల్లో చేర్చుకుంటామన్న కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ మూడు జిల్లాల్లో వివిధ స్థాయిల్లో ఆందోళన చేపట్టారు. పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడతామంటూ ఒక మంత్రి, విధుల్లోకి తీసుకుంటే న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయంటూ మరో మంత్రి అనడంపై నిరసన వ్యక్తం చేశారు. ● మహిళను మరచిన కూటమి సర్కార్ ● అడుగడుగునా అవమానాలు ● హామీలన్నీ నీటి మూటలు ● ప్రతి విషయంలో తప్పని ప్రతిఘటన ● నిత్యం ఎదురవుతున్న ఉద్యమ నినాదాలు ● ఆమెను అందలం వేసిన జగన్ ప్రభుత్వం కపిలేశ్వరపురం: అమ్మ గర్భంలో ఊపిరి తీసుకున్న బిడ్డ ఆ ఊపిరి ఉన్నతంతకాలం ఆమెకు రుణపడి బతకాల్సిందే. అమ్మగా, జీవిత భాగస్వామిగా, కుమార్తెగా బంధమేదైనా బతుకు ఆమెతోనే. సంపద సృష్టి నుంచి సమాజ ప్రగతి వరకు ఎంతో ప్రాధాన్యమున్న మహిళ గౌరవం, రక్షణ ఇవ్వడంలో ప్రభుత్వం శాసీ్త్రయ పద్ధతిని అనుసరించాలి. ఇది వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో కచ్చితంగా అమలైంది. అనంతరం వచ్చిన కూటమి సర్కార్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహిళలను దగా చేస్తూనే ఉన్నారు. అందుకు ప్రతిగా వారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు నిరసనలు చేస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెకు జరుగుతున్న అన్యాయంపై ప్రత్యేక కథనం. ఉపాధి కరవు ఉమ్మడి జిల్లాలో మహిళా విద్యా వంతులు ఎందరో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు ఉపాధి కల్పనపై ఎన్నో హామీలిచ్చి 9 నెలలు గడుస్తున్నా సమీక్షలు, సర్వేలు పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప ఒక్క నోటిఫికేషనూ విడుదల చేయలేదు. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న హామీని తుంగలో తొక్కారు. అలాగే డీఎస్సీ ప్రకటించేస్తామని, 25 వేల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటనలు గుప్పించేశారు. తీరా చూస్తే 16,347 ఖాళీ పోస్టులను చూపిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విద్యా శాఖ వెబ్సైట్లో కేవలం 1,146 మాత్రమే చూపిస్తున్నట్టు సమాచారం. జూలైలో నోటిఫికేషన్ ఇచ్చి, ఆగస్టులో పరీక్ష నిర్వహిస్తామన్న ప్రకటన అమలుకు నోచుకోలేదు. సుమారు 60 వేల మంది పోస్టుల భర్తీకై ఎదురు చూస్తున్నారు. సంక్షేమం గాలికి.... మహిళాభ్యుదయం కూటమితోనే సాధ్యమంటూ ఆ నేతలు ఉపన్యాసాలు ఊదరగొట్టారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ మహిళలకు 50 ఏళ్లకే పింఛను అన్నారు. దాని ఊసే లేదు. కొత్త పింఛన్లు ఇస్తామని తొలగింపులకు దిగారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వితంతు పింఛను లబ్ధిదారులు 49,906 మంది, ఒంటరి మహిళ పింఛను దారులు 4,557 ఉండగా తూర్పు గోదావరి జిల్లాలో వితంతు 64,376 మంది, ఒంటరి మహిళ పింఛను లబ్దిదారులు 9,107 మంది వైఎస్ జగన్ సర్కార్ నుంచి పింఛను పొదుతున్నారు. వాటిలో చాలా వరకు రద్దు చేస్తున్నారు. దివ్యాంగ పింఛన్ల సర్వే ఆ వర్గాల్లో ఆందోళన నింపుతోంది. ఏరులైపారుతున్న మద్యం... మద్యం ధరలు తగ్గిస్తామంటూ పురుషులను, నాణ్యతలేని మద్యం విక్రయిస్తూ మీ మగవారి ఆరోగ్యాలను వైఎస్సార్ సీపీ పాడుచేస్తోంది, మేలుకోండంటూ మహిళలను ఆకట్టుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చి దండిగా ఆర్జిస్తున్నారు. మహిళాభ్యుదయానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ వైఎస్ జగన్ సర్కార్ రాగానే ప్రైవేటు మద్యం దుకాణాలను రద్దు చేసింది. నిబంధనలను కఠినతరం చేస్తూ ప్రభుత్వం ద్వారా పరిమిత సంఖ్యలో మద్యం దుకాణాలకు అనుమతినిస్తూ మద్యం విక్రయాలను పరిమితం చేసింది. మహిహిళలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంచింది. ఊరికి ఒకటి నుంచి రెండు చొప్పున సచివాలయం, ఆర్బీకే, హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసి స్థానికంగానే మహిళకు ఉద్యోగాలిచ్చింది. కాకినాడ జిల్లాలో 620, కోనసీమలో 384, తూర్పుగోదావరిలో 512 సచివాలయాల్లో అత్యధిక సంఖ్యలో మహిళలకు ఉద్యోగాలు ఇచ్చింది. అక్క చెల్లెమ్మలకు రూ.5 లక్షలు విలువైన ఇంటి స్థలాన్ని అందజేసింది. తాజా ప్రభుత్వం వాటిని రద్దుచేసే యోచనలో ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో 431, కాకినాడ జిల్లాలో 241 లేఅవుట్లలో సుమారు 90 వేల ఇళ్ల పట్టాలను జగన్ సర్కార్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజకీయ, సామాజిక రంగాల్లో.. గత ప్రభుత్వంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేసింది. వైఎస్సార్ సీపీలో అంతకంటే ఎక్కువ శాతం పదవులను మహిళలకు కట్టపెట్టింది. దేశంలో తొలిసారిగా దళిత మహిళను హోమ్ మినిస్టర్‌ను చేసింది. శాసన మండలి చరిత్రలో తొలిసారిగా మైనారిటీ మహిళను డిప్యూటీ చైర్ పర్సన్‌ను చేసింది. దాదాపు స్థానిక ప్రజాప్రతినిధులు వైఎస్సార్ సీపీ మద్దతుదారులు కావడంతో క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవకుండా అవమానిస్తున్న ఘటనలు అనేకం ఉన్నాయి. -
మహాధర్నాను విజయవంతం చేయండి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వివాదాస్పదమైన వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించాలనే దుర్మార్గపు ఉద్దేశాన్ని కేంద్ర ప్రభుత్వం వదలడం లేదని జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ ఆరిఫ్ అన్నారు. శుక్రవారం స్థానిక కార్యాలయం నుంచి ఆయన మాట్లాడుతూ మార్చి 12 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు ఆమోదం పొందుతుందనే భయం నెలకొని ఉందని, కేంద్ర ప్రభుత్వ మిత్రపక్షమైన తెలుగుదేశం కూడా ఈ ప్రమాదకరమైన పథకంలో భాగంగా ఉండడం అత్యంత బాధాకరమన్నారు. అందుకే ఆఖరి అస్త్రంగా ఢిల్లీతో పాటు విజయవాడ, పాట్నాలలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఫిబ్రవరి 12న జరిగిన అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నిర్ణయించిందన్నారు. ఈ నిర్ణయం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని ముస్లింలు శనివారం విజయవాడలోని గాంధీనగర్‌లోని అల్ నకర్ హోటల్ ఎదురుగా ఉన్న ధర్నా చౌక్ వద్ద ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భారీ ధర్నా నిర్వహిస్తున్నారన్నారు. ఈ ధర్నా ఆంధ్రప్రదేశ్ ముస్లింల భావోద్వేగాలకు, భావాలకు, ఆగ్రహానికి, నిరసనకు పూర్తి నిదర్శనం కావాలని అన్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ ఐక్యంగా పాల్గొనాలన్నారు. 24, 25న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రాజమహేంద్రవరం సిటీ: బ్యాంక్ ఉద్యోగులు, అధికారుల సంఘం ఆధ్వర్యంలో నగరంలో శుక్రవారం యూకో బ్యాంక్ వద్ద సన్నాహక ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఉద్యోగులు, అధికారుల సంఘం నాయకులు లక్ష్మీపతిరావు, శేషుకూమార్, పాపారావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలు చేయక పోవడం అన్యాయమన్నారు. ఇన్సూరెన్‌న్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలన్నారు. బ్యాంకింగ్ రంగంలో యాజమాన్యాలు గత సంవత్సరం ఒప్పుకొని ప్రభుత్వానికి పంపిన హామీలు ఇంతవరకు అమలు చేయలేదన్నారు. తాత్కాలిక ఉద్యోగుల నియామకాలు ఆపాలని, మిగతా సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని లేనిపక్షంలో ఈ నెల 24, 25 తేదీలలో రెండు రోజుల సమ్మె తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వానికి, వ్యాపారులకు వారధిగా సీఏలు బోట్‌క్లబ్ (కాకినాడ) : ప్రభుత్వానికి, వ్యాపారులకు మధ్య వారధులుగా సీఏలు పనిచేస్తున్నారని ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు డి.ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ చార్టర్డ్ అకౌంట్స్ కాకినాడ చాప్టర్ కార్యాలయంలో చార్టర్డ్ అకౌంటెంట్స్ కాకినాడ బ్రాంచ్ చైర్మన్ తాలూరి శ్రీనివాసరాజు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ దేశ ఆర్థిక అభివృద్ధిలో సీఏలు కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. 1956లో ఇన్‌కమ్‌టాక్స్ వ్యవస్థ ఏర్పడిందని అప్పటి నుంచి ఇప్పటి వరకూ సీఏలు ఎంతగానో సేవలందిస్తున్నారన్నారు. జీఎస్టీ బిల్లును ప్రవేశ పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్న ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉత్తమ అవార్డు సైతం అందించిందన్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా 11 సెంట్రల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కార్యాలయాలను తీసుకువస్తుందన్నారు. త్వరలోనే విజయవాడ కేంద్రంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కాకినాడ బ్రాంచ్ ఉపాధ్యక్షులు టి.పవన్‌కుమార్, సెక్రటరీ పాండురంగమూర్తి, ట్రెజరర్ సూర్యనారాయణమూర్తి పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదంలో రెండు కార్లు దగ్ధం
ఆలమూరు: మండలంలోని జొన్నాడ కారు గ్యారేజీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో కె.సురేష్ కార్ల గ్యారేజీ నడుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఆ గ్యారేజీ నుంచి హఠాత్తుగా మంటలు వెలువడి రెండు కార్లు ఒకేసారి దగ్థమయ్యాయి. ఆ సమయంలో గ్యారేజీలో ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణాప్రాయం తప్పింది. స్థానికుల ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన హైవే, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపకదళ సిబ్బంది సహకారంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. కార్లను ఉద్దేశ పూర్వకంగా దగ్ధం చేశారా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటనలో సుమారు రూ.ఐదు లక్షల వరకూ నష్టం వాటిల్లి ఉండవచ్చునని అగ్నిమాపకదళ సిబ్బంది అంచనావేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు కాలేదని ఎస్సై ఎం.అశోక్ తెలిపారు. మహిళ ఆత్మహత్య అమలాపురం టౌన్: భాగస్వామ్యంతో అద్దెకు తిప్పేందుకు కొనుగోలు చేసిన కారు ఇక తనకు దక్కదేమోనన్న మనస్తాపంతో ఓ మహిళ తన ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. పట్టణ ఎస్సై తిరుమలరావు తెలిపిన వివరాల మేరకు అమలాపురం పట్టణం ముస్లిం వీధికి చెందిన అంకాల వల్లీ శ్రీదుర్గ (32) గురువారం సాయంత్రం ఈ అఘాయిత్యానికి పాల్పడింది. గతంలో ఓ బ్యాంక్‌లో పనిచేసిన శ్రీదుర్గ, అదే బ్యాంక్‌లో పనిచేసే సాధనాల శివాజీ ఇద్దరూ కలిసి ఓ కారును కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ కారును అద్దెకు తిప్పుతున్నారు. అయితే తనకు కారు పని ఉందని శ్రీదుర్గ నుంచి కారు తాళాలు తీసుకున్న శివాజీ కారు ఇక ఇచ్చేది లేదని తెగేసి చెప్పాడని ఎస్సై తిరుమలరావు తెలిపారు. కారు ఇక తనకు దక్కదేమోన్న మనస్తాపంతో శ్రీదుర్గ తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త రెడ్డి సతీష్ భార్య మృతి పట్ల విలపించారు. శ్రీదుర్గ తల్లి రామలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుమలరావు తెలిపారు. -
వ్రత పురోహితులకు పారితోషికం పెంపు
దేవస్థానం ధర్మకర్తల మండలి తరఫున చైర్మన్ ఐవీ రోహిత్ తీర్మానాలు అన్నవరం: రత్నగిరి వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని 260 మంది వ్రత పురోహితుల పారితోషికాన్ని నెలకు రూ. రెండు వేలు చొప్పున, విశ్రాంత వ్రతపురోహితుల పెన్షన్‌ను రూ.వేయి చొప్పున పెంచేందుకు దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త, ఆలయ చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన గల ఏకసభ్య ధర్మకర్తల మండలి శుక్రవారం తీర్మానించింది. ధర్మకర్తల మండలి పదవీ కాలం గత ఫిబ్రవరితో ముగిసింది. దీంతో ఆలయ చైర్మన్ హోదాలో రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావుతో కలిసి శుక్రవారం ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. గతంలో దేవస్థానం వ్రతపురోహిత సంఘం అధ్యక్షుడు, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు ఆధ్వర్యంలో వ్రత పురోహితులు దేవస్థానం చైర్మన్, ఈఓలకు సమర్పించిన వినతి మేరకు తీర్మానం చేసి కమిషనర్ ఆమోదానికి పంపించినట్టు చైర్మన్ రోహిత్ తెలిపారు. మిగిలిన తీర్మానాలివీ.. ● సత్యదేవుని ప్రసాదం తయారీకి ఆవునెయ్యి కిలో రూ.590 చొప్పున విజయ డైరీ, సంగం డైరీల నుంచి కొనుగోలు చేయడం. ● రూ.1.2 కోట్లతో ప్రకాష్‌సదన్, న్యూ సెంటినరీ, ఓల్డ్ సెంటినరీ కాటేజీల మరమ్మత్తులు. ● దేవస్థానంలో 123 సీసీ కెమేరాల ఏర్పాటుకు కొటేషన్ల ఆమోదం. ● దేవస్థానం ఆసుపత్రి కి రూ.3.75 లక్షలతో రంగులు, కేశఖండన శాలలో రూ.తొమ్మిది లక్షల అంచనా వ్యయంతో మరమ్మత్తులు. ● మే నెలలో జరుగనున్న సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలకు రూ.22 లక్షలతో ఆలయం, ఇతర భవనాలు, మండపాలకు రంగులు వేయించడం. ● ఆదివారం నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్న అన్నవరం దేవస్థానం దత్తత ఆలయం కోరుకొండ లక్ష్మీ నర్శింహస్వామి వారి కల్యాణ మహోత్సవాలకు రూ.11.40 లక్షలతో ఏర్పాట్లు. ● సమావేశంలో దేవస్థానం డీసీ చంద్రశేఖర్, ఏసీ రామ్మోహన్రావు, ఏఈఓలు జగ్గారావు, కొండలరావు, కృష్ణారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే ఖరీఫ్‌లో నూతన వంగడాలు సాగు చేయండి
ఏరువాక ప్రధాన శాస్త్రవేత్త శ్రీనివాస్ కొవ్వూరు: రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదల చేసిన నూతన వరి వంగడాలు ఎన్ఎస్ఆర్ 3238, ఎంటీయు 1426 రకాలను ఆర్ఎన్ఆర్ 15058 వంగడంలో పోల్చి కొత్త వంగడాల పంటకాలం గురించి ఏరువాక ప్రధాన శాస్త్రవేత్త మానుకొండ శ్రీనివాస్ సూచించారు. దొమ్మేరు, ధర్మవరం గ్రామాల్లో పొలంబడి కార్యక్రమంలో భాగంగా క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులు గ్రామ నమునాలను రంగవల్లుల రూపంలో తయారు చేసి రైతులకు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి వివరించారు. గ్రామాభివృద్ధి, గారమ ప్రభుత్వ కార్యాలయాల పనితీరు, విధి, విధానాలు గురించి రైతులకు అవగాహన కల్పించారు. కొత్త వరి వంగడాలు దిగుబడి బాగున్నాయని, రాబోయే ఖరీఫ్ నుంచి వీటిని సాగు చేయాలని రైతులకు సూచించారు. ఈ మేరకు రైతులకు వంగడాల విత్తనాలను చిరు సంచులను అందజేశారు. మండల వ్యవసాయ శాఖ అధికారి ఎ.గంగాధర రావు, ఏఈవో ఎన్.శ్రీనివాస్, నాయకులు గారపాటి వెంకటకృష్ణ, కాకర్ల సురేష్, కుందుల రమేష్, గోపాలకృష్ణ పాల్గొన్నారు. -
‘తమ్ముళ్ల’కే కిక్కు
● చక్రం తిప్పిన టీడీపీ నాయకులు ● గీత కార్మికుల మద్యం షాపుల్లో వారికే అత్యధికం రాజమహేంద్రవరం రూరల్: కల్లు గీత ఉప కులాలకు కేటాయించిన మద్యం షాపుల టెండర్లలో తెలుగు తమ్ముళ్లు చక్రం తిప్పారు. అత్యధిక మద్యం దుకాణాలు దక్కించుకున్నారు. జిల్లాలో కల్లుగీత ఉపకులాలకు కేటాయించిన 13 మద్యం దుకాణాల లైసెన్సుదారుల ఎంపికకు రాజమహేంద్రవరం ఆర్డీఓ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఆర్డీఓ కృష్ణనాయక్, ఎక్సైజ్, ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ ఎం.శివప్రసాద్, జిల్లా అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ వినీష ఆధ్వర్యాన లాటరీ ప్రక్రియ జరిగింది. మొత్తం 387 దరఖాస్తులు రాగా, దరఖాస్తుదారుల సమక్షంలోనే లక్కీడిప్ నిర్వహించి లైసెన్సుదారులను ఎంపిక చేశారు. మొదట మున్సిపల్ పట్టణ ప్రాంతం, ఆ తర్వాత సర్కిళ్ల వారీగా మండలం కేంద్రాల్లోని దుకాణాలకు లాటరీ నిర్వహించారు. ఎంపికై న మొదటి వ్యక్తి వెంటనే లైసెన్సు ఫీజు చెల్లించి దుకాణాన్ని దక్కించుకున్నారు. రెండు షాపులను మహిళలకు కేటాయించారు. రంగంపేట మండలంలో గుత్తుల వెంకటలక్ష్మి, తాళ్లపూడి మండలంలో కొప్పిశెట్టి రోజా వసంతలక్ష్మి వీటిని దక్కించుకున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో నిర్వహించిన టెండర్లలో కూడా జిల్లాలోని 14 మంది మహిళలకు మద్యం షాపులు దక్కాయి. జిల్లాలో మొదటి విడత 125, రెండో విడత కల్లు గీత ఉపకులాలకు 13 కలిపి మొత్తం 138 మద్యం దుకాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. మొదటి విడతలో రూ.87.68 కోట్లు, రెండో విడతలో రూ.7.74 కోట్ల చొప్పున ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఇన్స్పైర్ మనక్‌కు 100 ప్రాజెక్టుల ఎంపిక కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇన్స్పైర్ మనక్ అవార్డులకు 2024–25 విద్యా సంవత్సరంలో జిల్లా నుంచి 100 ప్రాజెక్టులు ఎంపికయ్యాయని జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి వాసుదేవరావు తెలిపారు. ఆ జాబితాను ఆయా ప్రధానోపాధ్యాయులకు పంపించామని, ఉన్నతాధికారుల సూచనల ప్రకారం ప్రాజెక్టుల ప్రదర్శన తేదీని త్వరలో ప్రకటిస్తామని వివరించారు. ఎంపికై న ప్రాజెక్టుల పాఠశాలల విద్యార్థులు, గైడ్ టీచర్లు ప్రదర్శనకు సిద్ధం కావాలని జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస నెహ్రూ తెలిపారు. కూటమి సిండికేట్‌కే గీత కార్మికుల మద్యం షాపులు అమలాపురం రూరల్: జిల్లాలో కల్లు గీత కార్మికులకు కేటాయించిన మద్యం షాపులను కూటమి సిండికేట్లే దక్కించుకున్నారు. జిల్లాలో మొత్తం 13 మద్యం షాపులను గీత కార్మికులకు కేటాయించారు. అమలాపురం మున్సిపాలిటీ, అమలాపురం మండలం, ఆలమూరు, అయినవిల్లి, ఐ.పోలవరం, కె.గంగవరం, కపిలేశ్వరపురం, కొత్తపేట, మండపేట మున్సిపాలిటీ, ముమ్మిడివరం రూరల్, పి.గన్నవరం, రామచంద్రపురం మున్సిపాలిటీ, రామచంద్రపురం రూరల్ ప్రాంతాల్లోని ఈ షాపుల్లో ఒకటి గౌడ కులస్తులకు, 12 శెట్టిబలిజలకు కేటాయించి, టెండర్లు పిలిచారు. గీత కార్మికుల ముసుగులో కూటమి సిండికేట్లు ఒక్కో దుకాణానికి 5 నుంచి 15 వరకూ టెండర్లు వేశారు. మొత్తం 261 టెండర్లు దాఖలయ్యాయి. వీటికి కలెక్టరేట్లో జేసీ నిషాంతి, డీఆర్ఓ రాజకుమారి, అమలాపురం ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎస్కేడీవీ ప్రసాద్ పర్యవేక్షణలో గురువారం లక్కీ డ్రా తీసి, షాపులు కేటాయించారు. గ్రహణం మొర్రికి నేడు ఉచిత వైద్య శిబిరం ముమ్మిడివరం: ఏపీ సమగ్ర శిక్ష, హైదరాబాద్ బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యాన గ్రహణం మొర్రి, గ్రహణ శూలతో బాధ పడుతున్న చిన్నారులకు శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్ష అదనపు పథక సంచాలకుడు షేక్ సలీం బాషా గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిర్వహించే ఈ శిబిరంలో చిన్నారులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయనున్నారు. శిబిరానికి వచ్చే చిన్నారులకు ఉచిత రవాణా ఖర్చులు ఇస్తారు. జిల్లాలోని చిన్నారుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అదనపు సమాచారానికి జిల్లా సహిత విద్య కో ఆర్డినేటర్ మర్రెడ్డి వెంకట సత్యనారాయణను 99636 54283 మొబైల్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. నేడు 2కే రన్ కాకినాడ సిటీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంటలకు కాకినాడ భానుగుడి జంక్షన్ నుంచి సర్పవరం జంక్షన్ వరకూ 2కే రన్ నిర్వహిస్తున్నారు. కలెక్టర్ షణ్మోహన్ గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, మహిళలు తదితరులు పాల్గొంటారన్నారు. -
మృత్యు శకటం
పల్లిపాలెంలో విషాద ఛాయలుకాజులూరు: ఏలూరు బస్సు ప్రమాదంలో జుత్తుగ భవాని దుర్మరణం పాలవడంతో ఆమె స్వగ్రామం కాజులూరు మండలం పల్లిపాలెం శివారు కళావారిపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన జుత్తుగ అప్పారావు, భవాని దంపతులకు ఇద్దరు కుమారులు. భార్యాభర్తలిద్దరూ జీవనోపాధి నిమిత్తం కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. అప్పారావు ఒక అపార్టుమెంట్లో వాచ్‌మన్‌గా చేస్తూండగా భవాని పలువురి ఇళ్లలో పని చేస్తోంది. పెద్ద కుమారుడు ఇంజినీరింగ్, చిన్న కుమారుడు ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. బంధువుల ఇంట్లో వివాహ వేడుకకు భవాని కాకినాడ బయలుదేరింది. ఈ క్రమంలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె మరణ వార్త తెలియగానే గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. హైదరాబాద్‌లో ఉంటున్నప్పటికీ భవాని తరచూ గ్రామానికి వచ్చి వెళ్లేదని, వచ్చిన ప్రతిసారీ అందరితో కలివిడిగా మసులుతూండటంతో అసలు ఆమె ఎప్పుడూ గ్రామంలోనే ఉన్నట్టుండేదని స్థానికులు చెబుతున్నారు. బస్సును పక్కకు తీస్తున్న క్రేన్ ● ఏలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ● లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు ● వేకువజామున ఘటన ● ఘటనా స్థలంలో ముగ్గురు, చికిత్స పొందుతూ మరొకరు మృతి ● 21 మందికి గాయాలు ● మృతులు, క్షతగాత్రుల్లో అత్యధికులు ఉమ్మడి జిల్లా వాసులు ఏలూరు రూరల్: తెల్లవారకముందే వారి జీవితాలు తెల్లారిపోయాయి. కొద్ది గంటల్లోనే గమ్య స్థానాలకు చేరుకోవాల్సిన వారిని మృత్యువు కబళించింది. జిల్లా కేంద్రం ఏలూరులోని చొదిమెళ్ల వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై రత్నాస్ హోటల్ సమీపాన ఆగి ఉన్న ఓ లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సంఘటన స్థలంలోనే ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రుల్లో అత్యధికులు కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన వారు. ప్రమాదం అనంతరం బస్సు నుంచి కారిన రక్తధారలు చూసిన వారు భయభ్రాంతులకు గురయ్యారు. సంఘటన స్థలంలో క్షతగాత్రుల హాహాకారాలు మిన్నంటాయి. ప్రమాదం జరిగిందిలా.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న సిమెంట్ లారీ మరమ్మతులతో నిలిచిపోయింది. గురువారం వేకువజామున 5 గంటల సమయంలో రమణ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తోంది. బస్సును అతి వేగంగా నడుపుతున్న డ్రైవర్ మధు.. పొగమంచు కమ్ముకోవడంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న సిమెంట్ లారీని గుర్తించలేకపోయాడు. చివరి నిమిషంలో గమనించి, తప్పించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో లారీ వెనుక భాగాన్ని బస్సు ఢీకొంది. ఆ వేగానికి కండక్టర్ వైపు భాగాన్ని బస్సు చీల్చుకుంటూ వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో బస్సులో నిద్రిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. ఘోర ప్రమాదంతో ఉలిక్కిపడిన స్థానికులు, ఇతర వాహనాల డ్రైవర్లు హుటాహుటిన వచ్చి ప్రయాణికులను రక్షించేందుకు ప్రయత్నించారు. హైవే పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. గాయపడిన వారిని 108 అంబులెన్సులో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాదంతో ఘటనా స్థలం రక్తసిక్తం కాగా.. పరిసరాల్లో బస్సులోని విడి భాగాలు చెల్లాచెదురుగా పడి, ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. శకలాల మధ్య ఇరుక్కుపోయి.. నుజ్జునుజ్జయిన బస్సులో కండక్టర్ సీటు వైపు కూర్చున్న మహిళలు మట్టపర్తి భవాని, జుత్తుగ భవాని (38), బొందు భీమేశ్వరరావు చిక్కుకుపోయి విలవిలలాడారు. బస్సు డ్రైవర్ మధు సైతం స్టీరింగ్ వద్ద ఇరుక్కుపోయాడు. పోలీసులు క్రేన్‌తో బస్సును లేపి పక్కకు చేర్చారు. బస్సులో చిక్కుకుపోయిన ఈ నలుగురినీ ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మట్టపర్తి భవాని, జుత్తుగ భవాని, భీమేశ్వరరావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డ్రైవర్ మధుకు అత్యవసర చికిత్స అందించారు. నాలుగు గంటల పాటు మృత్యువుతో పోరాడిన అనంతరం అతడు మృతి చెందాడు. మధు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. క్షత్రగాత్రులు వీరే.. ఈ ప్రమాదంలో కాకినాడకు చెందిన కోలా సురేఖ, కోలా రాజబాబు, కోలా లిఖిత, వనమనీడి ఆదిలక్ష్మి, పి.అక్కమ్మ, కోట వేణి, రాజమహేంద్రవరానికి చెందిన పి.హేమలత, మాచర్ల సుజాత, పాలకొల్లుకు చెందిన మండపాక శ్రీదేవి, మండపాక శశిరేఖతో పాటు మద్దాల కీర్తి, మాచర్ల సుజాత, మండపాక బాలాజీ, మండపాక హరిణి, ఆర్నాలకంటి శ్రీలక్ష్మి, పువ్వుల శ్యామ్‌కుమార్, శీలం ప్రకాష్, ఎం.ప్రతాప్, గోణజ విజయకుమార్, రామిశెట్టి సోమ సత్యనారాయణ, టి.రవికుమార్, జి.మణికంఠ (క్లీనర్) ఉన్నారు. క్షతగాత్రులకు అధికారులు చికిత్స చేయించి గమ్యస్థానాలకు పంపించారు. శోకసంద్రంలో భవానీ కుటుంబం జగ్గంపేట: ఈ ప్రమాదంలో మృతురాలు మట్టపర్తి భవానీ స్వస్థలం కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఆమె తండ్రి రాజు కౌలు రైతు. ఆమెకు ఓ తమ్ముడు ఉన్నాడు. కష్టపడి చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన భవాని.. వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా స్వగ్రామానికి వస్తోంది. ఈ క్రమంలో ఏలూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృత్యువాత పడింది. తమ గారాలపట్టి అయిన భవాని.. తమ కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉంటుందనుకుంటే.. దేవుడు తమపై దయ చూపలేదంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భవానీ మృతితో ఆమె కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. -
బతుకు పూలబాట కాదు..
● నా దారిలో ఎన్నో ముళ్లు గుచ్చుకున్నాయి ● ఎవరిని ఉద్ధరించాలని అంటూ హేళన చేశారు ● అయినా వెనుకడుగు వేయలేదు ● అలా 19 గిరిజన భాషలకు లిపి రూపొందించా.. ● ‘నన్నయ’ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ పోలీసు ఇన్ఫార్మర్ అనుకునే వారు మొదట్లో గిరిజనులు నాతో మాట్లాడేవారు కాదు. బయటి నుంచి వచ్చానని, నన్నో పోలీసు ఇన్ఫార్మర్గా భావించి భయపడేవారు. రకరకాలుగా ఇబ్బంది పెట్టేవారు. వారు చెప్పేది అర్థమయ్యేది కాదు. ఆ సమయంలోనే ముందుగా వారి భాష నేర్చుకోవాలని అనుకున్నాను. అలా వారి భాష నేర్చుకుని వారిలో ఒకరిగా కలిసిపోయాను. ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలనే తపనతో పని చేశాను. ‘ఈ పని నేనే చేయగలనని అనుకుంటే ఏదైనా సాధించగలరు. నేను చేయగలనా? అనుకుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు’. నా ద్వారా ఆ గిరిజనులకు భాషాపరంగా మేలు జరగాలనే తలంపుతోనే ముందుకు వెళ్లాను. ఆ సమయంలో ప్రొఫెసర్ సింథియా వెస్లీతో పాటు చాలా మంది విదేశీయుల నుంచి ప్రోత్సాహం నన్ను మరింత కార్యోన్ముఖురాలిని చేసింది. ఆల్ఫా, బీటా ఏవిధంగా రాయాలో వారి నుంచి నేర్చుకున్నాను. అంతరించి పోతున్న బగత, గదబ, కొలామి, కొండదొర వంటి 19 గిరిజన భాషలకు లిపిని రూపొందించడంలో విజయం సాధించాను. తద్వారా 2022లో అప్పటి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారం అందుకున్నాను.వ్యక్తిగతం.. గుంటూరు జిల్లా సీతానగరంలో 1964 సెప్టెంబరు 2న జన్మించాను. నాన్న సత్తుపాటి ప్రసాదరావుది రైల్వేలో ఉద్యోగం కావడంతో విజయవాడ, కోల్‌కతా, మిరాజ్(మహారాష్ట్ర)లో చదువుకున్నాను. విజయవాడలో పదో తరగతి, కేబీఎన్ కళాశాలలో ఇంటర్, మాంటిస్సోరి మహిళా కళాశాలలో డిగ్రీ (1982–84) చదివాను. తరువాత విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ(ఏయూ)లో ఎంఏ, తిరుపతి పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేశాను. అమ్మ వసుంధరాదేవి గృహిణి. అయినా పేపర్, పుస్తకాలు ఎక్కువగా చదివేది. నాకు ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. పెద్ద చెల్లెలు విజయవాడ, చిన్న చెల్లెలు కాకినాడ, తమ్ముడు రామచంద్రపురంలో ఉద్యోగాలు చేస్తున్నారు. వృత్తిగతం.. 1987లో పద్మావతి మహిళా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బోధనా వృత్తి చేపట్టి, 14 ఏళ్లు పని చేశాను. అక్కడి నుంచి విశాఖపట్నం ఏయూకు వచ్చాను. పాత సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవడంతో 2002లో అక్కడ ప్రొఫెసర్ చేరాను. ఆవిధంగా ప్రొఫెసర్‌గా ఆంధ్రప్రదేశ్‌లో 23 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించిన ఏకై క మహిళగా గుర్తింపు పొందాను. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 10 సెమినార్లు నిర్వహించి, 60 సెమినార్లలో పాల్గొన్నాను. నేను రాసిన 125 పరిశోధన వ్యాసాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రచురితమయ్యాయి. అలా.. గోదారి బిడ్డనయ్యా.. నా భర్త హరి వెంకట లక్ష్మణ్, మాది ప్రేమ వివాహం. మమ్మల్ని ఏయూనే కలిపింది. నేను ఇంగ్లిష్, ఆయన సోషియాలజీలో పీజీ చేస్తూండగా మా మనసులు కలిశాయి. మొదట పెద్దలు అంగీకరించకపోయినా, తరువాత ఓకే అన్నారు. ఆవిధంగా ఈ ప్రాంతానికి చెందిన అల్లు ఎరకయ్య కోడలిగా గోదావరి ప్రాంత బిడ్డనయ్యాను. మా అమ్మాయిని కూడా ఈ ప్రాంతంలోనే ఇచ్చాం. గోదావరి వాసే. నా ఎదుగుదలకు ఆయన దివిటీ ప్రస్తుతం నేనీ ఉన్నత స్థితిలో ఉండటానికి ప్రధాన కారణం నా భర్త హరి వెంకట లక్ష్మణ్ అని గర్వంగా చెబుతా. ఆయన ఓ కొవ్వొత్తిలా కరిగిపోతూ నా ఎదుగుదలకు దివిటీలా నిలిచారు. గిరిజన భాషలకు లిపిని రూపొందించే క్రమంలో ఎంతో బిజీగా ఉండేదాన్ని, ఆ సమయంలో మాకున్న ఒకే ఒక్క పాప హర్షిత ఆలనా పాలనా ఆయనే చూసుకుంటూ, కార్యోన్ముఖురాలిని కావాలని ప్రోత్సహించారు. హర్షిత ప్రస్తుతం మెకానికల్ ఇంజినీర్‌గా వర్క్ ఫ్రమ్ హోం చేస్తోంది. ఒక బాబు ఉన్నాడు. పుట్టింటి వారు ఉన్నత స్థాయిలో ఉన్నవారే.. అమ్మ, నాన్న వైపు వారంతా ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్–1 ఉద్యోగాలు చేసిన వారే. నలుగురు మావయ్యలలో ఇద్దరు ఐపీఎస్, ఒకరు ఐఏఎస్. చిన్నమ్మలిద్దరూ వైద్యులు. మా తాతయ్య వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు, ధనవంతుడు కూడా. ఆ సమయంలో ధనాన్ని బానల్లో దాచుకునేవారంటారు. ఒక విద్యార్థి నమ్మకంగా ఉంటూనే కొంత ధనాన్ని దోచుకున్నాడట. నాకు 6 నెలల వయసులోనే తాతయ్య చనిపోయారు. నా ఎదుగుదల ఎక్కువగా కోల్‌కతాలోనే. ఆ తరువాత మహారాష్ట్ర, విజయవాడల్లో పెరిగాను. అందుకనే 23 భాషలు మాట్లాడతాను. అన్నయ్య ఆశయం నెరవేరింది మా అన్నయ్య (కజిన్) ఐజీగా పని చేస్తూ చనిపోయా రు. కొన్నేళ్ల క్రితం ఆయన నాకు ఒక చీర బహుమతిగా ఇస్తూ, ‘నువ్వు కచ్చితంగా వైస్ చాన్సలర్ అవుతావు. అప్పుడు కట్టుకో’ అన్నాడు. ఆయన నమ్మకం నిజమైంది. అందుకే ఆ చీరను నన్నయ వీసీగా బాధ్యతలు తీసుకునే సమయంలో కట్టుకున్నాను. స్టూవర్టుపురం అంటూ ఇంకా వదిలిపెట్టరా? తాతగారి ఊరి పేరు స్టూవర్టుపురం అని చెప్పడమే గానీ, నేను ఏనాడూ అక్కడ లేను. ఊహ తెలిసిన తరువాత స్టూవర్టుపురం అంటే దొంగల ఊరు అంటారని కాస్త భయపడ్డాను. కానీ అక్కడి వారు చాలా మంచివారు. నిజానికి ఏ ఊళ్లో దొంగలు లేరు చెప్పండి? ‘పూర్వం చదువుకోనందు వల్లనే చాలా మంది దొంగలుగా తయారయ్యారు. కానీ నేటి కాలంలో చదువుకున్న వాళ్లు కూడా దొంగలుగా మారుతున్నారు, దీన్ని ఏమనాలి?’ అని మా నాన్నమ్మ అంటూండేది. ఆచార్య ప్రసన్నశ్రీ ఎలా ఎదిగిందనేది వదిలేసి, స్టూవరుపురానికి చెందిన.. అంటూ ఆ గ్రామం మూలాలున్న వారిని ఇంకా వదిలిపెట్టరా? భగత గిరిజన భాషకు ఆచార్య ప్రసన్నశ్రీ రూపొందించిన లిపి ‘జీవితం పూలబాట కాదు. దారిలో ఎన్నో ముళ్లు గుచ్చుకున్నాయి. ఏనాడూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ఎంచుకున్న లక్ష్యం వైపు అడుగులు వేశాను. ఆడ పిల్లలకు పెద్ద చదువులు ఎందుకనే సమాజం నుంచి.. ఆడపిల్లలు తలచుకుంటే దేనిలోనూ తీసిపోరనే నమ్మకంతో పయనించాను. ఉనికి కోల్పోతున్న 19 గిరిజన భాషలకు లిపి రూపొందించి.. ఆయా వర్గాలకు ఎంతో కొంత మేలు చేసేందుకు ప్రయత్నించాను. ఈ క్రమంలో కన్నవారితో పాటు కట్టుకున్న భర్త ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. గిరిజన భాషలకు లిపిని కూర్చే క్రమంలో ఒకసారి నాటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్‌ను కలిసే అవకాశం వచ్చింది. నా ప్రయత్నం గురించి తెలుసుకున్న ఆయన.. ‘నీ కాళ్లలో ఎన్ని ముళ్లు గుచ్చుకున్నాయ్ ప్రసన్నా’ అని అన్న మాటలు మరువలేను’ అన్నారు ‘నారీ శక్తి’ పురస్కార గ్రహీత.. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సత్తుపాటి ప్రసన్నశ్రీ. ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది, సమాజానికి అందించే నన్నయ వర్సిటీకి ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన ఈ తొలి గిరిజన మహిళ.. మార్చి 8– అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన జీవనపథంలోని వెలుగుచీకట్లను తనను కలసిన ‘సాక్షి’తో పంచుకున్నారు. – రాజానగరం -
పిచ్చిగీతలంటూ హేళన
1982లో ఇంటర్మీడియెట్ అయిన తరువాత అటవీ ప్రాంతానికి వెళ్లాను. అక్కడి వారిని చూసి, వారి కోసం ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను. ఉద్యోగం వచ్చిన తరువాత వాచకంగా ఉన్న భాషకు లిపిని అందించాలనే సంకల్పించాను. శూన్యం నుంచి ఒక ప్రపంచాన్ని సృష్టించుకుని ఎదగడానికి ప్రయత్నించాను. నా ప్రయత్నాన్ని కొందరు ఉన్నతాధికారులు, నాయకులు ప్రోత్సహించకపోగా ఏమిటీ పిచ్చి గీతలు, ఎవరిని ఉద్ధరించాలని అంటూ అవమానించారు. ఆ సమయంలో నిజంగా నరకం చూశాను. చాలా బాధ వేసేది. వాటన్నిటినీ భరిస్తూనే నా ప్రయత్నాన్ని వదలలేదు. మనిషి మనుగడ అభివృద్ధి వైపు అడుగులు వేయాలంటే అక్షరం అవసరం. దానిని గుర్తించి, నా ప్రయత్నాన్ని కొనసాగించాను. అటవీ ప్రాంతంలో తిరుగుతూ.. -
గురువుకే పంగనామాలు పెట్టే పనిలో వర్మ..!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నిన్న మొన్నటి వరకు ఆ ఇద్దరూ గురుశిష్యులని గొప్పగా చెప్పుకునే వారు. రాజకీయాల్లో విడదీయలేని దశాబ్దాల బంధం వారిది. గురువు చెప్పినట్టు శిష్యుడు నడుచుకోవడమే తప్ప ఎదురు ప్రశ్నించిన రోజే లేదు. అటువంటి గురుశిష్యులు పెద్దల సభలో చోటు కోసం తలోదారి వెతుక్కుంటున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికై న ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసిపోతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ స్థానాల ఎన్నికకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫలితంగా కూటమిలో ఎమ్మెల్సీ ఆశావహులు పైరవీలకు తెరతీశారు. ఐదు ఎమ్మెల్సీ స్థానాలలో(MLC Elections) ఉమ్మడి తూర్పుగోదావరికి ఒక్క స్థానం దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల నుంచి ఆశావహులు క్యూలో ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్ నాయకుడైన యనమల రామకృష్ణుడు(Yanamala Rama Krishnudu)తన స్థానాన్ని తిరిగి పునరుద్ధరించుకోవాలనే ప్రయత్నాలు షురూ చేశారు. ఖాళీ అవుతోన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో యనమల ఖాళీ చేసే స్థానం కూడా ఒకటి కావడం గమనార్హం. తెలుగుదేశం పార్టీలో పార్టీ సీనియర్ అయిన యనమల రామకృష్ణుడు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ(SVSN Varma), పిల్లి అనంతలక్ష్మి, బీజేపీ నుంచి రాజమహేంద్రవరానికి చెందిన సోము వీర్రాజు తదితరులు ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు. జనసేన నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్(Pawan Kalyan) సోదరుడైన నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తారంటున్నారు. ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటామని నెలన్నర క్రితం స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే(Chandrababu Naidu) ప్రకటించారు. ఫలితంగా నాగబాబుకు ఎమ్మెల్సీ, మంత్రి కావడం ఖాయమనుకుని సామాజిక మాధ్యమాల్లో జనసేన శ్రేణులు హల్చల్ చేశాయి. కానీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీలో నాగబాబుకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు తాజాగా తెరమీదకు వచ్చిన సమాచారం. ఇదే విషయం టీడీపీ అనుకూల మీడియాలో విస్తృతంగా జరుగుతోన్న ప్రచారంతో నాగబాబుకు ఇక ఎమ్మెల్సీ లేదనే నిర్ధారణకు పార్టీ వర్గాలు వచ్చేశాయి.ఈ పరిస్థితుల్లో ఉమ్మడి తూర్పున తెలుగుదేశంపార్టీ(TDP) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కోసం గట్టి పట్టుబడుతోంది. ఈ స్థానం కోసం నిన్నమొన్నటి వరకు చెట్టపట్టాలేసుకు తిరిగిన గురు, శిష్యులు యనమల, వర్మ ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. చంద్రబాబు తరువాత అంతటి ప్రాధాన్యం కలిగిన నేతగా టీడీపీలో రామకృష్ణుడుకు పేరుంది. జనసేన, కమలనాధులతో కలిసి కూటమిగా టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలవుతోంది. అయినా వీసమెత్తు గుర్తింపు, హోదా దక్కలేదని టీడీపీ సీనియర్ నేత యనమల అంతర్మథనం చెందుతున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో పార్టీలో ఇంతలా ప్రాధాన్యం లేని రోజులు ఎప్పుడూ చూడలేదనే ఆవేదన అనుచరవర్గం బాహాటంగానే వ్యక్తం చేస్తోంది. తునిలో వరుస పరాజయాలతో ప్రజాక్షేత్రానికి దూరమైన యనమలను పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీని చేసింది. కూటమి గద్దె నెక్కడంతో సీనియర్‌గా తన సేవలు కేబినెట్లో వినియోగించుకుంటారను కున్నా ఆ ఆశలు కూడా ఆవిరైపోయిన సంగతి విదితమే. వాస్తవానికి ఇవేమీ కాకున్నా రాజ్యసభకు వెళ్లాలనేది యనమల చిరకాల వాంఛ. సీనియర్‌నైన తనను పక్కనబెట్టి ఎవరెవరినో రాజ్యసభకు పంపిన దగ్గర నుంచి యనమల తీవ్ర అంతర్మథనం చెందుతున్నారని పార్టీ వర్గాల మధ్య చర్చ నడుస్తోంది. ఇటువంటి తరుణంలో పదవీకాలం ముగిసిపోతున్న ఎమ్మెల్సీ స్థానాన్ని పునరుద్ధరిస్తారని యనమల అనుచరవర్గం లెక్కలేసుకుంటోంది. కుమార్తె దివ్యకు తుని అసెంబ్లీ, వియ్యంకుడైన పుట్టా సుధాకర్‌యాదవ్‌కు మైదుకూరు అసెంబ్లీ, ఒక అల్లుడు పుట్టా మహేష్‌కుమార్‌కు ఏలూరు ఎంపీ..ఇలా యనమల కుటుంబంలో మూడు కీలక పదవులు అనుభవిస్తున్న పరిస్థితుల్లో రామకృష్ణుడును ఎమ్మెల్సీ కొనసాగించడం కష్టమేనంటున్నారు. నాలుగు దశాబ్దాల పాటు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన యనమల ఎమ్మెల్సీ చాన్స్ కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నారంటున్నారు. కానీ చాన్స్ మాత్రం తక్కువనే ప్రచారం పార్టీలో జరుగుతోంది.టీడీపీలో యనమల శిష్యుడిగా చెప్పుకునే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ ఈసారి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. యనమల మాట జవదాటరని పార్టీ నేతలు చెప్పుకునే దానికి భిన్నంగా గురువుకే పంగనామాలు పెట్టే పనిలో వర్మ ఉన్నారంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కల్యాణ్ కోసం సీటు త్యాగం చేయడమే కాకుండా గెలుపు కోసం అనుచరులంతా పడ్డ కష్టానికి తగిన ఫలం దక్కలేదనేది వర్మ ఆవేదన. పిఠాపురం సీటు త్యాగం చేసినందుకు కూటమి అధికారంలోకి వచ్చాక తొలి ఎమ్మెల్సీ వర్మకేనని చంద్రబాబు సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రకటించారు. కూటమి గద్దె నెక్కాక వచ్చిన తొలి ఎమ్మెల్సీ అవకాశాన్ని రాకుండా పవన్ అండ్ కో మోకాలడ్డిందని వర్మ అనుచరులు బాహాటంగానే ప్రచారం చేశారు. రెండు పర్యాయాలు వచ్చిన అవకాశాన్ని ఎగరేసుకుపోయిన పరిస్థితుల్లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకూడదనే ప్రయత్నాల్లో వర్మ ఉన్నారు. ఈసారి ఎమ్మెల్సీ దక్కించుకోకపోతే జిల్లాలోనే కాకుండా చివరకు పిఠాపురంలో అనుచరుల వద్ద తలెత్తుకు తిరిగే పరిస్థితి ఉండదనే ఆందోళన చెందుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే చినబాబు ద్వారా వర్మ గట్టి లాబీయింగ్ చేస్తున్నారని అనుచరులు చెబుతున్నారు. పదవుల పందేరంలో చాణక్య నీతిని ప్రదర్శించే టీడీపీలో ఉద్దండుడైన గురువు యనమలకు కాకుండా వర్మకు అవకాశం దక్కుతుందా అని కొందర సందేహం వ్యక్తం చేస్తున్నారు. గురుశిష్యుల్లో చివరకు చాన్స్ ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే! -
డాక్టర్ చిర్రావూరి అస్తమయం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): మహామహోపాధ్యాయ, శ్రీ రామాయణ తత్త్వజ్ఞ డాక్టర్ చిర్రావూరి శ్రీ రామశర్మ కర్నాటక రాష్ట్రం శృంగేరిలో మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కన్ను మూశారు. 1948లో రాజమహేంద్రవరంలో జన్మించిన చిర్రావూరి సీతంపేటలోని గౌతమీ విద్యాపీఠంలో విద్యార్థులకు సంస్కృత, ఆంధ్రాలు బోధించేవారు. తెలుగు సంస్కృత భాషలలో అష్టావధానాలు, షోడశ అవధానాలు నిర్వహించారు. కంచి, శృంగేరి, దత్త పీఠం ఆధ్వర్యంలో సత్కారాలు అందుకున్నారు. అవిభక్త రాష్ట్రంలో ఆగమ శాస్త్ర సలహా మండలి సలహాదారునిగా సేవలు అందించారు. 2023లో అనారోగ్య కారణంగా శృంగేరిలో ఉన్న కుమారుని వద్దకు వెళ్లి, అక్కడే స్థిరపడ్డారు. మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ, శలాక రఘునాథశర్మ, కొంపెల్ల సత్యనారాయణ శాస్త్రి, భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు, కలాగౌతమి వ్యవస్థాపకుడు డాక్టర్ బీవీఎస్ మూర్తి తదితరులు చిర్రావూరి మృతికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికపై న్యాయ పోరాటం పట్టభద్రుల ఎమ్మెల్సీ పోటీదారు జీవీ సుందర్ రాజమహేంద్రవరం సిటీ: ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా ఓటమి పాలైనప్పటికీ యువత, ఉపాధ్యాయ, ప్రజా సమస్యలపై తన గొంతు వినిపిస్తూనే ఉంటానని జీవీ సుందర్ వెల్లడించారు. బుధవారం స్థానిక రాజీవ్‌గాంధీ కళాశాలలోని సమావేశపు హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమి ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందన్నారు. బల్క్‌గా ఓట్లు చేర్పించడం దగ్గర నుంచి ఓటర్లను ప్రలోభపెట్టడం, చివరికి కౌంటింగ్‌లో కూడా అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల అవకతవకలపై న్యాయపోరాటం చేస్తానన్నారు. కౌంటింగ్‌లో ఎవరో సెట్ చేసినట్లుగా కూటమి అభ్యర్థికి ప్రతీ రౌండ్‌కు 16వేల పైచిలుకు ఓట్లు వచ్చాయన్నారు. కనీసం ఓటు వేయడం రాని వారిని కూడా ఓటర్లుగా చేర్చారని, ఓట్ల లెక్కింపులో అనేక బ్యాలెట్లపై జై టీడీపీ అంటూ రాయడం కన్పించిందన్నారు. ఇప్పటికే గ్రూప్ 2 విద్యార్థుల తరఫున న్యాయస్థానంలో కేసు వేసి పోరాటానికి సిద్ధమయ్యామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి విజయం ప్రజలు ఇచ్చిన విజయం కాదని, చంద్రబాబు ఇచ్చిన విజయమని ఆరోపించారు. 11న పీడిఎస్ బియ్యం వేలం గోపాలపురం: తూర్పుగోదావరి జిల్లాలో వివిధ కేసుల్లో సీజ్ చేసిన 47 274 మెట్రిక్ టన్నుల పీడీఎస్ రైస్(ప్రజాపంపిణీ బియ్యం)తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో గల ఎం ఎల్ ఎస్ పాయింట్లో ఈ నెల 11వ తేదీ 10గంటలకు బహిరంగ వేలం నిర్వహిస్తామని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6ఎ కేసులు ముగియడంతో సీజ్ చేసిన 47 274 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కిలో ఒక్కంటికీ రూ.30 చొప్పున ధర నిర్ణయించినట్లు తెలిపారు. ఆసక్తి గల వ్యాపారస్తులు జీఎస్టీ లైసెన్స్ కలిగి ముందుగా రూ.2 లక్షల ధరావత్తు సొమ్మును జాయింట్ కలెక్టర్ తూర్పుగోదావరి జిల్లా వారి పేరున డీడీ రూపంలో చెల్లించి వేలంలో పాల్గొనాలని సూచించారు. తాళం వేసిన దుకాణంలో చోరీ అమలాపురం టౌన్: స్థానిక నారాయణపేటలో శ్రీహరి ఆటో మొబైల్స్ పేరిట నిర్వహిస్తున్న మోటారు సైకిల్ మెకానిక్ షాపులో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీ జరిగింది. మూడు పోర్షన్లు ఉన్న పెంటిల్లు అది. ఆ ఇంట్లో షాపుగా ఉన్న పోర్షన్‌కు తాళం వేసి ఉండగానే చోరీ జరిగి నగదు మాయం కావడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షాపు యాజమాని దనలకోట కృష్ణ షాపులో ఓ సంచిలో రూ.10 లక్షల వరకూ దాచుకున్నానని, అవి చోరీకి గురయ్యాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పట్టణ సీఐ పి.వీరబాబు, ఎస్సై తిరుమలరావు, క్రైమ్ పార్టీ పోలీసులు బుధవారం ఉదయం చోరీ జరిగిన తీరును పరిశీలించారు. తాను రెండేళ్ల కిందట స్థలం విక్రయించిన సొమ్ము, తాను రోజు సంపాందించే సొమ్మును షాపులో ఓ సంచిలో దాచుకుంటున్నానని యజమాని తెలిపాడు. ఈ డబ్బు కుమారుడి వివాహానికి కూడబెట్టానని పోలీసులకు వివరించాడు. నారాయణపేటలోనే ఉన్న తన సొంత ఇంట్లో నగదు దాచుకోకుండా షాపులో ఉండచంపై, షాపు తాళం తీయకుండానే సొమ్ము పోవడంపై కృష్ణను పలు కోణాల్లో విచారిస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లతో దర్యాప్తు చేస్తున్నారు. చోరీ జరిగిన ఇంటి మూడు పోర్షన్లలో ఒకటి అద్దెకు ఇవ్వగా, మరొకదానిలో కృష్ణ సోదరుడు ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం షాపునకు తాళం వేసి వెళ్లిన కృష్ణ బుధవారం ఉదయం వచ్చి షాపు తాళం తీసి లోనికి వెళ్లినప్పుడు చోరీ జరిగినట్లు గమనించాడు. -
లక్కు కిక్కు ఎవరికో!
రాజమహేంద్రవరం రూరల్: ప్రభుత్వం గీత కులాలకు జిల్లాలో కేటాయించిన 13 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. ఈ ఏడాది జనవరి 27వ తేదీన ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై గత నెల 8వ తేదీన ముగిసింది. గీత కులాలకు రిజర్వేషన్ ప్రాతిపదికన 2024–26 సంవత్సరాలకు మద్యం దుకాణాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గెజిట్ విడుదల ప్రకారం గతనెల 6వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తి కావాల్సినప్పటికీ అశావహుల నుంచి స్పందన లభించలేదు. ఆదాయమే లక్ష్యంగా ప్రభుత్వం మళ్లీ గడువు పెంచడంతో ఊహించనిదాని కంటే దరఖాస్తులు రికార్డు స్థాయిలో అధికంగానే 387 వచ్చాయి. నిడదవోలు రూరల్, సీతానగరం, గోపాలపురం, చాగల్లు మండలాల్లోని మద్యం షాపులకు పెద్దమొత్తంలో దరఖాస్తులు దాఖలయ్యాయి. దరఖాస్తుల రూపంలో రూ.7.74 కోట్ల ఆదాయం జిల్లాలో 387 దరఖాస్తులు రూపంలో రూ.7.74 కోట్లు ఆదాయం సమకూరింది. నిడదవోలు రూరల్ మండలానికి అత్యధికంగా 48 దరఖాస్తులు రాగా, గోపాలపురం, సీతానగరం, చాగల్లు మండలాలకు 43 దరఖాస్తులు వచ్చాయి. నేడు లక్కీడిప్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి సీహెచ్ లావణ్య నేతృత్వంలో అధికారులు గత నెల 9వ తేదీన దరఖాస్తులను పరిశీలించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మద్యం షాపుల లాటరీ వాయిదా పడింది. ఎన్నికల కోడ్ ముగియడంతో గురువారం లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లు వారీగా దుకాణాలను కేటాయించనున్నారు. ఇందుకు సంబంధించి రాజమహేంద్రవరం ఆర్డీవో కార్యాలయం సమావేశ మందిరంలో ఉదయం 10.00 గంటలకు కలెక్టర్ సమక్షంలో లక్కీడిప్ నిర్వహించనున్నారు. ఉదయం 8.00 నుంచి 9.00 గంటలలోపు దరఖాస్తుదారులు ఎంట్రీపాస్తో పాటు గుర్తింపుకార్డుతో లక్కీడిప్ నిర్వహణ ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది అక్టోబరులో ఓపెన్ కేటగిరీ కింద జిల్లాలో 124 మద్యం దుకాణాలు కేటాయించారు. అందులో 10శాతం దుకాణాలు గీత కులాలకు వారి జనాభా, షాపుల నిష్పత్తి ప్రకారం జిల్లాలో మరో 13 దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. జిల్లాలో మద్యం దుకాణాలు రిజర్వేషన్ల వివరాలు మద్యం దుకాణం సామాజిక వచ్చిన ప్రతిపాదించిన ప్రాంతం వర్గం దరఖాస్తులు రాజమహేంద్రవరంసిటీ శెట్టిబలిజ 22 కడియం శెట్టిబలిజ 22 కోరుకొండ శెట్టిబలిజ 26 సీతానగరం శెట్టిబలిజ 43 రంగంపేట శెట్టిబలిజ 13 అనపర్తి గౌడ 09 బిక్కవోలు శెట్టిబలిజ 14 చాగల్లు శెట్టిబలిజ 43 తాళ్లపూడి శెట్టిబలిజ 26 దేవరపల్లి శెట్టిబలిజ 39 గోపాలపురం శెట్టిబలిజ 43 నిడదవోలురూరల్ గౌడ 48 పెరవలి శెట్టిబలిజ 39 ముగిసిన గీత కులాల మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ జిల్లాలో 13 షాపులకు 387 దరఖాస్తులు నేడు లక్కీడిప్ ద్వారా కేటాయింపు -
తమ్ముళ్ల కళ్లలో వత్తులు!
తూర్పులో ఇలా..జిల్లాలో ఇలా... తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, ఏఎంసీ చైర్మన్లు 6, జిల్లా వక్ఫ్‌బోర్డు చైర్మన్లతో పాటు ఇతర స్టేట్ డైరెక్టర్ల పోస్టులు ఖాళీ ఏర్పడి నెలలు గడుస్తున్నాయి. అన్ని సామాజిక వర్గాల నుంచి నేతలు పదవులు ఆశిస్తున్నారు. పదవుల కోసం వందల సంఖ్యలో దరఖాస్తులు అధిష్టానానికి పంపారు. వాటిని ఫిల్టర్ చేసి ప్రకటించేందుకు అధిష్టానం నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటంతో కార్యకర్తలు, నాయకులు సహనం కోల్పోతున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం: నామినేటెడ్ పదవుల భర్తీలో టీడీపీ అధినేత చంద్రబాబు పూటకో ప్రకటన, రోజుకో మాట చెబుతున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదిగో ఇదిగో అంటూ ఊరించడం.. కొన్ని పేర్లు ప్రకటించడం పరిపాటిగా మారుతోంది. రెండు దశల పోస్టుల భర్తీలో ఇదే విధానం అవలంబించారు. తాజాగా నెలాఖరుకు నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో ఆశావహుల్లో మళ్లీ సందడి మొదలైంది. మార్కెట్ యార్డులు, దేవస్థానాల బోర్డుల్లోని నియామకాల కోసం పేర్లు ప్రతిపాదించాలని స్పష్టం చేయడంతో నేతల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. పార్టీలో కష్టపడిన, నిజమైన కార్యకర్తలకు పదవులు వరిస్తాయంటూ వెల్లడించిన విషయం తెలిసిందే. రెండు విడతల భర్తీల్లోనూ పార్టీ కోసం శ్రమించిన పార్టీ శ్రేణులకు అన్యాయం జరిగింది. ఈ సారైనా తమకు న్యాయం జరుగుతుందా..? లేదంటే ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన వారికే అందలం ఎక్కిస్తారా? అన్న చర్చ పార్టీ శ్రేణుల్లో నడుస్తోంది. ఆశావహుల చక్కర్లు ప్రధానంగా దేవస్థాన కమిటీలు, మార్కెట్ యార్డుల కమిటీలు, జిల్లా గ్రంథాలయాలు, నియోజకవర్గాల్లో పలు శాఖల్లో నామినేటెడ్ పదవులు ఉన్నాయి. రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల పందేరం సైతం పూర్తి స్థాయిలో జరగాల్సి ఉంది. జిల్లా స్థాయి నేతలకు రాష్ట్ర స్థాయి కార్పొరేట్ పదవులు, మండల, గ్రామ స్థాయి నేతలకు దేవస్థాన, మార్కెట్ యార్డు కమిటీలతో పాటు ఇతర కమిటీల్లో స్థానం కల్పించాలని సీఎం వద్దకు ప్రతిపాదనలు వెళ్లినట్లు తెలిసింది. పదవుల ప్రస్తావన మళ్లీ తెరపైకి రావడంతో ఆశావహులు ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఎమ్మెల్యేలు, మంత్రులు తమ అభ్యర్థుల కోసం సీఎం వద్ద పైరవీలు చేసినట్లు తెలిసింది. అమరావతిలోనే తిష్ట వేసి మరీ తమ ప్రతిపాదనలు వినిపించేందుకు ఉత్సాహం చూపారు. అయితే చంద్రబాబు మాత్రం అవేమీ పట్టించుకోలేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. చినబాబు కనుసన్నల్లో ఎంపిక? మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు చేసినా.. చినబాబు ఆమోద ముద్ర వేయందే పదవులు దక్కడం లేదు. మంత్రి లోకేశ్ కనుసన్నల్లోనే జాబితా రూపొందిస్తున్నారు. గత రెండు విడతల్లో సైతం లోకేశ్ అనుయాయులకే పదవులు దక్కాయన్న వాదన వినిపిస్తోంది. పైకి మాత్రం పార్టీ కోసం శ్రమించిన వారికి పదవులు ఇస్తామని గొప్పలు చెబుతున్న చంద్రబాబు.. ఆచరణలోకి వచ్చేసారికి చినబాబు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడమే ప్రామాణికంగా పెట్టుకున్నట్లు సమాచారం. రెండు విడతల్లో సైతం సీనియర్లను పక్కనబెట్టి లోకేశ్ చెప్పిన వారికే పదవులు దక్కడంతో సీనియర్లలో అసంతృప్తి నెలకొంది. పార్టీ కోసం శ్రమిస్తున్నా.. తమకు సరైన గౌరవం దక్కడం లేదని లోలోన మదనపడుతున్నారు. పైకి చెప్పుకున్నా.. పట్టించుకునే నాథుడే లేకపోవడంతో చేసేది లేక మిన్నకుండిపోతున్నారు. జనసేన, బీజేపీ నేతలకు నిరాశే? మూడో దశ నామినేటెడ్ పదవుల భర్తీలో జనసేన, బీజేపీ నేతలకు మొండిచెయ్యి చూపనున్నట్లు తెలిసింది. టీడీపీలోనే నామినేటెడ్ ఆశావహుల సంఖ్య పెరిగిపోతుండటంతో బీజేపీ, జనసేనకు ఇస్తే కొత్త తలనొప్పి ఎదురవుతుందని భావించిన చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే తమ కృషితో అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు తమనే విస్మరిస్తున్నారని జనసేన, బీజేపీ నేతలు ఆవేదన చెందుతున్నారు. మందు, ఇసుక వ్యాపారాలు అన్నీ టీడీపీ నేతలకే కట్టబెట్టారని, కనీసం నామినేటెడ్ పదవుల్లో తమకు న్యాయం చేయకపోతే ఎలాగన్న ప్రశ్న ఎదురవుతోంది. ఎమ్మెల్సీపై ఆశలు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ భర్తీ కోసం నగారా మోగింది. రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ ఏర్పడనున్నాయి. 29వ తేదీతో పదవీ కాలం యుగియనుంది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు, 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు గడువుగా నిర్ధారించారు. మార్చి 20న పోలింగ్ ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలపై జిల్లాలోని ప్రధాన నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లు ఆశించి భంగపడిన నేతలకు చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈసారైనా తమకు దక్కుతాయా? లేదా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.తూర్పుగోదావరి జిల్లాలో నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న పలువురు ఆశావహులకు రెండో విడతలోనూ చుక్కెదురైంది. మూడో దశలోనైనా వరిస్తుందన్న ఆశతో ఉన్నారు. నిడదవోలు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత బూరుగుపల్లి శేషారావుకు రెండో విడత నామినేటెడ్ పోస్టుల్లో నిరాశ తప్పలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా శేషారావు నిడదవోలు ఎమ్మెల్యే సీటు త్యాగం చేశారు. ఆయన స్థానంలో జనసేన నేత కందుల దుర్గేష్‌కు కేటాయించారు. శేషారావుకు సముచిత స్థానం కల్పిస్తామని, ఎమ్మెల్సీ, ఇతర ప్రాధాన్యత పదవుల్లో నియమిస్తామని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. తొలి, రెండో దశలోనూ నిరాశే ఎదురైంది. ఎమ్మెల్సీ ఎప్పుడిస్తారన్న విషయమై స్పష్టత కరవైంది. బాబు వ్యవహార శైలిని పరిశీలిస్తే శేషారావు కేవలం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి స్థానానికే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా మూడో దశ నామినేటెడ్ పోస్టుల పందేరం మొదలవ్వడం, 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండంతో ఈసారైనా ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని ఆశగా వేచిచూస్తున్నారు. టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడికే పార్టీలో ప్రాధాన్యం కరవైంది. కొవ్వూరు నియోజకవర్గంలో తమ సామాజిక వర్గం నేతలకు అధికారం కట్టబెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతకు అన్యాయం చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కేఎస్.జవహర్‌కు రెండు విడతల నామినేటెడ్ జాబితాల్లోనూ స్థానం దక్కలేదు. ఎస్సీ కమిషన్ చైర్మన్ వరిస్తుందన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఆ పదవి ఇతరులకు కేటాయించడంలో ఇక నామినేటెడ్ కలగానే మిగిలింది. సార్వత్రిక ఎన్నికల్లో కొవ్వూరు ఎమ్మెల్యే సీటు ఇవ్వకుండా ఘోరంగా అవమానించిన టీడీపీ తాజాగా నామినేటెడ్‌లో పక్కన పెట్టేసింది. పార్టీ జిల్లా అధ్యక్షుడికే దిక్కులేకపోతే సామాన్య కార్యకర్తలకు ఏం న్యాయం జరుగుతుందన్న ప్రశ్న కార్యకర్తల్లో ఉత్పన్నమవుతోంది. ద్విసభ్య కమిటీ సభ్యుల అభ్యంతరం మేరకు జవహర్‌కు పార్టీలో ప్రాధాన్యత తగ్గిస్తున్నారన్న వాదన నియోజకవర్గ టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. తాజాగా నామినేటెడ్ పదవుల పందేరం నడుస్తుండటం, ఎమ్మెల్సీలు ఖాళీలు ఏర్పడటంతో ఈ దశలోనైనా సీనియర్ నేతకు స్థానం దక్కుతుందా..? లేదా..? అన్న మీమాంస పార్టీ శ్రేణుల్లో నెలకొంది. నెలాఖరుకు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్న సీఎం చంద్రబాబు అనుభవానికి పెద్దపీట వేస్తామని ప్రకటన ఇప్పటికే రెండు జాబితాల్లో సీనియర్లకు దక్కని చోటు తాజా ప్రకటనతో ఆశావహుల్లో సందడి ఎమ్మెల్యే, మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వని బాబు ప్రకటిస్తాం వెళ్లండంటూ జవాబు లోకేష్ డైరెక్షన్లో రూపొందుతున్న జాబితా -
పంట దిగుబడులకు సమగ్ర సస్యరక్షణే కీలకం
నల్లజర్ల: పంటల సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా పంట దిగుబడులతో పాటు నాణ్యమైన ఉత్పత్తులు కోసం చీడపీడల యాజమాన్యంలో రైతులకు అందుబాటులో ఉన్న అన్నిరకాల సమగ్ర యాజమాన్య పద్ధతులను వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి మాధవరావు రైతులకు సూచించారు. విజయవాడలోని సెంట్రల్ ఐపీఎం కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం తెలికిచెర్లలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఏరువాక కేంద్రం డైరెక్టర్ డాక్టరు చల్లావెంకట నరసింహారావు మాట్లాడుతూ అధికంగా పురుగుల మందుల వినియోగం వల్ల పర్యావరణం దెబ్బతినడంతో పాటు పంటలకు మేలు చేసే కీటకాలు చనిపోవడంతో పాటు పురుగులలో నిరోధకశక్తి పెరగడం వంటి అనర్థాలు చోటు చేసుకుంటాయన్నారు. వివిధ జీవ నియంత్రణ పద్ధతులు, మేలైన పురుగుమందుల గురించి వివరించారు. గ్రామసర్పంచ్ బండి చిట్టీ, జిల్లా వనరుల కేంద్రం డైరెక్టర్ ఎస్.జయరామలక్ష్మి, కేంద్రీయ సస్యరక్షణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ డాక్టరు మనోజ్పూరీగోస్వామి, పీపీఓ డాక్టరు కే.వి.చౌదరి, ఏపీఓ ప్రేమరంజితం, ఏఓ కమల్‌రాజ్, హెచ్ఓ బబిత, ఏఈఓ పుష్పలత, వీఏఏలు హేమంత్, సురేష్, వీహెచ్ఏ సాయి, రైతులు పాల్గొన్నారు.జిల్లా వ్యవసాయాధికారి మాధవరావు -
గోదావరిలో డ్రెడ్జింగ్ పడవలను నిషేధించాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గోదావరిలోకి డ్రెడ్జింగ్ పడవలు రాకుండా ఆపాలని, ఇసుక పడవల కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళ్ళ రాజు, ప్రగతి శీల కార్మిక సమాఖ్య (పీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ కే మస్తాన్ ఆధ్వర్యంలో బొమ్మూరులో కలెక్టరేట్ వద్ద ఇసుక కార్మికులతో బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ప్రశాంతికి వినతి పత్రం అందజేశారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో గతంలో పడవలలో కార్మికులు ఇసుక తీసి గట్టుకు తరలించేవారని, ఈ మధ్యకాలంలో కొంతమంది దళారులు ఎటువంటి అనుమతులు లేకుండా డ్రెడ్జింగ్ పడవలతో గోదావరిలో యంత్రాలతో ఇసుక తీస్తున్నారని, దీని వలన పదివేల మంది ఇసుక తీసే కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. యంత్రాలతో ఇసుక తీయడం వల్ల గోదావరిలో 340 అడుగు లోతు గోతులు ఏర్పడుతున్నాయని, భవిష్యత్తులో గోదావరిలో నిర్మించిన కట్టడాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన చెందారు. చట్ట వ్యతిరేకంగా యంత్రాలతో ఇసుక తరలిస్తున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గోదావరిలో డ్రెడ్జింగ్ పడవలు నిషేధించాలని, కార్మికులకు ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నాగేశ్వరరావు, కృష్ణ, సత్తిబాబు, దుర్గ పాల్గొన్నారు. -
రూ.కోట్లలో దోచేస్తున్న ఎమ్మెల్యే వాసు
రాజమహేంద్రవరం సిటీ: పేకాట క్లబ్బులు, ఇసుక దందాలతో రోజుకి రూ.లక్షలు వెనకేసుకుంటూ వస్తున్న రాజమహేంద్రవరం సిటీ ఈవీఎం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తాజాగా కోట్లాది రూపాయల భూ వ్యవహారాల్లో కూడా తలదూరుస్తూ తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ధ్వజమెత్తారు. బుధవారం రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మొదటి నుంచి ఈవీఎం ఎమ్మెల్యే దందాల గురించి చెబుతూనే ఉన్నామన్నారు. తాను బురదలో ఉంటూ, ఎదుటివారిపై బురద జల్లడం ఆయనకు అలవాటేనని ఎన్నో సంఘటనలు రుజువు చేస్తున్నాయన్నారు. రాజమహేంద్రవరం నగరంలో ఇంతవరకూ ఏ ఎమ్మెల్యేకు లేని అప్రతిష్ట మూటగట్టుకున్న ఘనత ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకే దక్కుతుందన్నారు. గౌతమీ సూపర్ బజార్‌కి చెందిన దేవీచౌక్‌లోని 300 గజాల స్థలం లీజు విషయంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో తనకు 5కోట్ల రూపాయల లంచం ఇచ్చారంటూ తీవ్రమైన ఆరోపణలు చేసి, కరపత్రాలు సైతం ముద్రించి తనపై బురద చల్లారన్నారు. తాము అధికారంలోకి వస్తే, అక్రమ లీజు రద్దుచేసి, అవినీతికి పాల్పడిన వారిని జైలుకి పంపుతానని శపథం కూడా చేశారని అన్నారు. తీరా ఎమ్మెల్యే అయ్యాక అదే స్థలంలో అదే లీజుదారుడు నిర్మాణాలు చేస్తుంటే, ఏం చేస్తున్నారని భరత్‌రామ్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు చెప్పినట్లు ఈ లీజు వ్యవహారంపై వాస్తవం ఏమిటో తేల్చాలని భరత్‌రామ్ సవాల్ చేశారు. లేని పక్షంలో తాము కూడా ధర్నాకు దిగుతామని, వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. నగరంలో పందిరి మహాదేవుడు సత్రానికి సంబంధించి దేవదాయశాఖ అధీనంలో ఉన్న జేఎన్ రోడ్డులోని కోట్లాది రూపాయల విలువైన సుమారు నాలుగెకరాల భూమిని వైఎస్సార్ సీపీ హయాంలో కొందరు అన్యాయంగా తక్కువ రేటుకి కొట్టేయాలనుకుంటే, తాను అడ్డుకున్నానని తెలిపారు. ఇప్పుడు అదే స్థలాన్ని తక్కువ ధరకు కొట్టేయాలన్న ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇందుకు ఈవీఎం ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయన్నారు. మద్యం షాపుల్లో పెట్టుబడులు ఎమ్మెల్యేలు గెలిచి మంచి పేరు తెచ్చుకున్నారని, ఇంతవరకు ఏ ఎమ్మెల్యే మీద లేని భూ దందా ఆరోపణలు ఈ ఎమ్మెల్యేపై ఉన్నాయన్నారు. మద్యం షాపుల్లో సైతం ఎమ్మెల్యే పెట్టుబడులు పెట్టి, వాటిని అనుచరులతో నడిపిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం నగరంలో ఎవరిని అడిగినా తెలుస్తుందన్నారు. ఆయన తండ్రి అదిరెడ్డి అప్పారావు గతంలో వైఎస్సార్ సీపీలో ఉండడం వలన తమ పార్టీలో కొందరితో సంబంధాలు కొనసాగిస్తూ, వాళ్లను కూడా కలుపుకుని మద్యం సిండకేట్ ఎమ్మెల్యే నడుపుతున్నారని జనం నుంచి వినిపిస్తోందన్నారు. మద్యం షాపులను బార్లుగా మార్చేస్తున్నారని, ఇక బెల్టు షాపులైతే విచ్చలవిడిగా తెరిచేస్తున్నారని భరత్‌రామ్ ఆరోపించారు. ఎన్నికల ముందు ఒక విధంగా ఎన్నికలయ్యాక మరోవిధంగా ఉన్న ఎమ్మెల్యే వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారని, తీరు మారకపోతే తగిన గుణపాఠం చెబుతారన్నారు. మద్యం, ఇసుక, భూ దందాల్లో ఆరితేరిపోయారు మాజీ ఎంపీ భరత్‌రామ్ -
మహిళా దినోత్సవానికి విస్తృతంగా ఏర్పాట్లు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఆర్ట్స్ కళాశాలలో మార్చి 8వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. ఈ మేరకు తన క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆమె మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు. పోలీసులు, పరిశ్రమలు, వైద్య, ఆరోగ్యం, మెప్మా పీడీ, డీఆర్డీఏ పీడీ, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖలు స్టాళ్లు ఏర్పాటు చేయాలని, మహిళల్లో చైతన్యం కలిగించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక అందజేయాలన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నాలుగు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. 5న సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు కెరీర్ అవకాశాలు, సెల్ఫ్ డిఫెన్స్ తరగతులు, ఒత్తిడిని అధిగమించడం వంటి అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. బొమ్మూరులో ఇంటింటా పోస్టర్లు అతికించాలని సూచించారు. 6న నర్సరీలు, ఆర్టీసీ కాంప్లెక్స్‌లో పని చేస్తున్న మహిళలకు వివిధ చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. 7న బొమ్మూరు మహిళా ప్రాంగణంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు మహిళా చట్టాలు, సమస్యలపై సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. 8న ఆర్ట్స్ కాలేజీలో మహిళా దినోత్సవం జిల్లా స్థాయి వేడుకలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. -
24, 25 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
రాజమహేంద్రవరం సిటీ: బ్యాంక్ ఉద్యోగులు, అధికారుల సంఘం ఆధ్వర్యాన ఈ నెల 24, 25 తేదీల్లో సమ్మె నిర్వహించనున్నట్లు బ్యాంక్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు లక్ష్మీపతిరావు, పాపారావు, శేషుకుమార్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో పార్లమెంట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించి, ఆర్థిక శాఖ అధికారి నాగరాజుకు వినతిపత్రం అందజేశారని మంగళవారం తెలిపారు. వెంటనే అన్ని క్యాడర్ నియామకాలు చేపట్టాలని, అన్ని ప్రభుత్వ శాఖల్లో 5 రోజుల పనిదినాలు అమలు చేయాలని, తాత్కాలిక ఉద్యోగుల నియామకాలు ఆపాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 24, 25 తేదీల్లో సమ్మె తప్పదని తెలిపారు. వేసవిలో విద్యుత్ సమస్యలపై దృష్టి అమలాపురం రూరల్: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వేసవిలో విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, కోనసీమకు 6 పవర్ ట్రాన్స్ఫార్మర్లు కేటాయిస్తామని ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ తెలిపారు. అమలాపురం మండలం భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లాలోని విద్యుత్ శాఖ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వేసవిలో ఎక్కడా లోఓల్టేజీ సమస్య లేకుండా చూడాలని, ట్రాన్స్ఫార్మర్ల ఓవర్ లోడ్‌ను గుర్తించి అందుకు తగిన యాక్షన్ ప్లాన్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. వేసవిలో విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ బిల్లుల బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ప్యానల్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని, వినియోగదారులకు చౌకగా సోలార్ విద్యుత్ అందించే విధానంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. సర్కిల్ కార్యాలయం ఏర్పాటుకు నల్లవంతెన వద్ద అనువైన భవనాలను పరిశీలించారు. తొలుత ఈదరపల్లిలోని విద్యుత్ కార్యాలయం వద్ద లైన్మెన్ దివస్ కార్యక్రమంలో లైన్మన్లను సత్కరించారు. సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్.రాజబాబు, టెక్నికల్ డీఈ ఎస్.నాగేశ్వరరావు, ఈఈలు కె.రాంబాబు, కె.రత్నాలరాజు, అక్కౌంట్ ఆఫీసర్ సత్యకిషోర్, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. హాకీ జట్టు ఎంపిక నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): అంతర్ జిల్లాల హాకీ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు ఎంపిక స్థానిక జిల్లా క్రీడా మైదానంలో మంగళవారం జరిగింది. జిల్లా హాకీ సంఘం ఆధ్వర్యాన జరిగిన ఈ ఎంపికలకు 25 మంది హాజరయ్యారు. డీఎస్ఏ హాకీ కోచ్ నాగేంద్ర పర్యవేక్షణలో 18 మందిని జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకూ గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరిగే అంతర్ జిల్లాల హాకీ పోటీలో పాల్గొంటారు. ఈ జట్టుకు కోచ్‌గా దుర్గాప్రసాద్, మేనేజర్‌గా బాబ్జీ వ్యవహరిస్తారని హాకీ సంఘం ప్రతినిధి రవిరాజు తెలిపారు. పాదగయకు రూ.11.75 లక్షల ఆదాయం పిఠాపురం: పాదగయ క్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి ఆలయం హుండీని మంగళవారం తెరచి ఆదాయం లెక్కించారు. సీఎస్ఓ సీహెచ్ రామ్మోహనరావు, ఇన్స్పెక్టర్లు వడ్డి ఫణీంద్రకుమార్, జోగా సత్యనారాయణ పర్యవేక్షణలో ఆలయ ఈఓ కె.జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం జరిగింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని 17 రోజులకు గాను హుండీల ద్వారా రూ.11,74,660 ఆదాయం లభించిందని ఈఓ తెలిపారు. -
ఎమ్మెల్సీగా పేరాబత్తుల విజయం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజేశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులు మధ్య ప్రధానంగా పోటీ జరిగింది. మరో 33 మంది స్వతంత్రులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ ఎన్నికల్లో పేరాబత్తుల తన సమీప ప్రత్యర్థి, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులుపై 77,461 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొదట ప్రాధాన్య ఓట్లు 50 శాతం పైచిలుకు సాధించడంతో ఆయనను విజేతగా ప్రకటించారు. ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకూ బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను కట్టలు కట్టడానికే సమయం సరిపోయింది. 28 టేబుల్స్ ఏర్పాటు చేసి 17 రౌండ్లు నిర్వహించేలా కట్టలు కట్టారు. ఎట్టకేలకు రాత్రి 10 గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. ప్రతి టేబుల్‌కు వెయ్యి చొప్పున సగటున ప్రతి రౌండ్లో 28 వేల ఓట్లు లెక్కించి, 8 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియను ముగించారు. మొత్తం 2,18,997 ఓట్లు పోలవగా వాటిలో 19,789 ఓట్లు చెల్లనివిగా నిర్ధారించారు. మిగిలిన 1,99,208 ఓట్లను లెక్కించారు. ప్రతి రౌండ్లోనూ కూటమి అభ్యర్థి ఆధిక్యం కొనసాగింది. మొదటి రౌండ్లో 28 వేల ఓట్లు లెక్కించగా కూటమి అభ్యర్థికి 16,520, పీడీఎఫ్ అభ్యర్థి 5,815 చొప్పున ఓట్లు దక్కాయి. ఎనిమిది రౌండ్లు కలిపి టీడీపీ అభ్యర్థికి 1,24,702 మొదటి ప్రాధాన్య ఓట్లు రాగా.. పీడీఎఫ్ అభ్యర్థి 47,241 ఓట్లు దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తనయుడు జీవీ సుందర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, మెరుగైన ఓట్లు సాధించారు. ఎనిమిది రౌండ్లలో ఆయనకు 16,183 ఓట్లు దక్కాయి. మిగిలిన అభ్యర్థులు తక్కువ ఓట్లతో సరిపెట్టుకున్నారు. విజేత పేరాబత్తులకు రిటర్నింగ్ అధికారి వెట్రిసెల్వి ధ్రువీకరణ పత్రం అందించారు.·˘ 77,461 KrÏ Ððl$gêÈt™ø VðSË$ç³# ·˘ ï³yîlG‹œ A¿ýæÅÇ®MìS 47,241 Kr$Ï ·˘ 8 Æú…yýlÏÌZ Ð]l¬Wíܯ]l KrÏ ÌñæMìSP…ç³# -
సమన్వయంతో మున్సిపాలిటీల అభివృద్ధి
నిడదవోలు: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మున్సిపాలిటీలను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు పురపాలక సంఘాల్లోని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ (ఆర్డీ), అప్పిలేట్ కమిషనర్ సీహెచ్ నాగ నరసింహారావు అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించి, అన్ని విభాగాలనూ పరిశీలించారు. అనంతరం కౌన్సిల్ సమావేశ మందిరంలో నిడదవోలు, రామచంద్రపురం, అమలాపురం, కొవ్వూరు, ముమ్మిడివరం, మండపేట మున్సిపల్ కమిషనర్లు, అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పురపాలక సంఘాల వారీగా పరిపాలన, అభివృద్ధి పనులపై అధికారులను ఆరా తీశారు. రెవిన్యూ, శానిటేషన్, ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్ విభాగాల అధికారుల పని తీరు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రీజియన్ పరిధిలోని ఆరు పురపాలక సంఘాల్లో ఆస్తిపన్ను వసూళ్లలో కొవ్వూరు ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, ఖాళీ స్థలాల పన్నుల వసూళ్లకు సంబంధించి రెండు జిల్లాల్లో కొవ్వూరు ప్రథమ స్థానంలో ఉండగా, ఫిబ్రవరి నెలకు గాను ప్రైవేట్ ఆస్తి పన్ను వసూళ్లలో నిడదవోలు 75 శాతంతో ప్రథమ స్థానంలో ఉందని వివరించారు. తడి, పొడి చెత్త సేకరణపై దృష్టి పెట్టాలన్నారు. వేసవిలో మంచినీటి సరఫరాకు అంతరాయం లేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లే అవుట్ నిర్మాణాలపై ఆరా తీశారు. ప్రజారోగ్యం విషయంలో అలసత్వం తగదని శానిటేషన్ అధికారులకు సూచించారు. అనంతరం పట్టణంలోని కంపోస్ట్ యార్డ్, పంపుహౌస్‌ను నాగ నరసింహారావు సందర్శించి, అధికారులకు తగు సూచనలు చేశారు. సమావేశంలో నిడదవోలు, కొవ్వూరు, మండపేట, అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం కమిషనర్లు టి.కృష్ణవేణి, టి.నాగేంద్ర కుమార్, టీవీ రంగారావు, కేవీఆర్ఆర్ రాజు, పి.రవివర్మ వీఐ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఫ పన్ను వసూళ్లలో కొవ్వూరు ఫస్ట్ ఫ మున్సిపల్ ఆర్డీ నాగనరసింహారావు -
చట్టాలపై మహిళలకు అవగాహన కల్పించాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.శ్రీలక్ష్మి, ఎస్పీ డి.నరసింహ కిశోర్ అన్నారు. తద్వారా పని చేసే కార్యాలయాలు, ప్రాంతాల్లో మహిళలపై లైంగిక వేధింపులు జరగకుండా చూడవచ్చన్నారు. అంతర్జాతీయ మహిళా వారోత్సవాల సందర్భంగా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన ఎస్పీ కార్యాలయంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీలక్ష్మి మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు, వృద్ధులకు ఉచిత న్యాయ సేవలందించే ఆశయంతో ఏర్పాటు చేసిన డీఎల్ఎస్ఏపై ఆయా వర్గాలకు అవగాహన కల్పించి, న్యాయం చేకూరే విధంగా కృషి చేయాలని మహిళా రక్షక్ కానిస్టేబుళ్లకు సూచించారు. ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ, అనుకోని సంఘటన జరగక ముందే, ముందు జాగ్రత్తగా అనుమానితులను మహిళా రక్షక్ కానిస్టేబుళ్లు హెచ్చరించాలని అన్నారు. మహిళల రక్షణ కోసం జిల్లాలో ప్రత్యేక మహిళా రక్షక దళం ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ అధికారి కె.విజయ్‌కుమారి మాట్లాడుతూ, అనాథ పిల్లల, మహిళలకు ప్రతి మండలంలో తమ సిబ్బంది రక్షణ కల్పిస్తున్నారని అన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
భయం గుప్పెట్లో వేట్లపాలెం ప్రజలు
సామర్లకోట: వేట్లపాలెంలో గత ఏడాది డిసెంబరు 15న రెండు (కల్దారి, బత్సల) కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు వ్యక్తు లు హత్యకు గురి కావడంతో 23 మంది నిందితులను గుర్తించి కేసు నమోదు చేసిన విషయం విదితమే. 23 మందిని కోర్టుకు హాజరు పర్చగా జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. వీరిలో 20 మంది బెయిల్‌పై సోమవారం సాయంత్రం విడుదల కావడంతో మంగాయమ్మ కాలనీ వాసులు భయం గుప్పెట్లో జీవిస్తున్నారు. కత్తులతో దాడి చేయడంతో కాల్దారి చంద్రరావు(60, కాల్దారి ప్రకాశరావు(55) కల్దారి ఏసు (45) చనిపోయిన విషయం తెలిసిందే. హత్య జరిగినప్పటి నుంచి మంగాయ్మమ్మ కాలనీలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు తక్కువగా ఉండటంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు. పోలీసులను పెంచి పికెట్ కొనసాగించి గ్రామంలో ప్రశాంత వాతావరణం ఏర్పడే విధంగా కృషి చేయాలని వేట్లపాలెం గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఆ ప్రాంతంలో ఎప్పటికప్పుడు నిఘా ఉండే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరావు ఆధ్వర్యంలో సీఐ ఎ.కృష్ణభగవాన్ ప్రత్యేక నిఽఘా ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలు శాంతంగా ఉండాలని సీఐ రెండు వర్గాలకు సూచించారు. హత్య కేసులో 20 మంది నిందితులు విడుదల పోలీసు పికెట్ కొనసాగించాలని డిమాండ్ -
బోటు రైడర్, హెల్పర్‌పై హత్యాయత్నం కేసు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): బోటులో అనధికారికంగా తీసుకువెళ్లి మళ్లీ సోమవారం రాత్రి తిరిగి వస్తుండగా బోటు తిరగబడి ఇద్దరు మృతిచెందిన ఘటనపై త్రీటౌన్ పోలీసులు సుబ్బారావుపేటకు చెందిన బెజవాడ సత్తిబాబు ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం సుబ్బారావుపేటకు చెందిన బెజవాడసత్తిబాబు, సింహాచలనగర్‌కు చెందిన చవల అన్నవరం(54), కాతేరు మిలటరీకాలనీకి చెందిన గాడారాజు(24), కోట రాంబాబు, భవానీపురానికి చెందిన మరికొందరుతో కలిసి కోటిలింగాలరేవు నుంచి సోమవారం మధ్యాహ్నం బోటులో బ్రిడ్జిలంక బయలుదేరారు. బోటులో వెళ్తుండగా లోపలికి నీరు వస్తుండడంతో సత్తిబాబు, మరికొందరు కేకలు వేశారు. బోటు రైడర్ మల్లయ్యపేటకు చెందిన మల్లాది సుబ్రహ్మణ్యం, బోటుషికారు కోసం రూ.100 వసూలు చేసిన ఇసుకపల్లి ధనరాజు ఏమీ జరగదని, బోటులో నీటిని తోడేస్తే ఏమీ కాదని భరోసా ఇచ్చారు. చివరకు బ్రిడ్జిలంకకు చేరుకున్నారు. తిరిగి రాత్రి 7.30 గంటల సమయంలో బోటురైడర్, హెల్పర్, మరో పదిమంది బోటులో పుష్కరఘాట్‌కు బయలుదేరారు. బోటు రైల్వే బ్రిడ్జి 7 – 8 పిల్లర్ల మధ్యలోకి రాగానే ఒక్కసారిగా బోటులోకి నీరు చేరింది. దీంతో బోటు గోదావరి నదిలో కూరుకుపోయింది. ఇంతలో చవల అన్నవరం, గాడా రాజులకు ఈత రాకపోవడంతో గోదావరి నదిలో గల్లంతయ్యారు. కానీ, బెజవాడ సత్తిబాబు ఆ స్థలం నుంచి ఈత కొట్టి సమీపంలోని పాత హావ్ లాక్ బ్రిడ్జి పిల్లర్లను పట్టుకున్నారు. వారి కేకలు విన్న సమీపంలోని మత్స్యకారులు వారిని సురక్షితంగా పుష్కరఘాట్‌కు తరలించారు. బెజవాడ సత్తిబాబు, ఇతరులు వారికి తెలిసినవారికి సమాచారం ఇవ్వడంతో పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ అధికారులు పుష్కరాలరేవుకు చేరుకుని గోదావరిలో పడవలతో గాలించగా చవల అన్నవరం, గాడా రాజు మృతదేహాలు లభ్యమయ్యాయి. గోదావరి నదిలో బోటు నడిపిన బోటు రైడర్‌తో కలిసి ప్రయాణం కోసం డబ్బులు వసూలు చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని, ఎలాంటి అనుమతులు లేకుండా పడవలో గోదావరిలో అమాయకులను తరలించిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని బెజవాడ సత్తిబాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భయం గుప్పెట్లో వేట్లపాలెం ప్రజలు
సామర్లకోట: వేట్లపాలెంలో గత ఏడాది డిసెంబరు 15న రెండు (కల్దారి, బత్సల) కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు వ్యక్తు లు హత్యకు గురి కావడంతో 23 మంది నిందితులను గుర్తించి కేసు నమోదు చేసిన విషయం విదితమే. 23 మందిని కోర్టుకు హాజరు పర్చగా జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. వీరిలో 20 మంది బెయిల్‌పై సోమవారం సాయంత్రం విడుదల కావడంతో మంగాయమ్మ కాలనీ వాసులు భయం గుప్పెట్లో జీవిస్తున్నారు. కత్తులతో దాడి చేయడంతో కాల్దారి చంద్రరావు(60, కాల్దారి ప్రకాశరావు(55) కల్దారి ఏసు (45) చనిపోయిన విషయం తెలిసిందే. హత్య జరిగినప్పటి నుంచి మంగాయ్మమ్మ కాలనీలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు తక్కువగా ఉండటంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు. పోలీసులను పెంచి పికెట్ కొనసాగించి గ్రామంలో ప్రశాంత వాతావరణం ఏర్పడే విధంగా కృషి చేయాలని వేట్లపాలెం గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఆ ప్రాంతంలో ఎప్పటికప్పుడు నిఘా ఉండే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరావు ఆధ్వర్యంలో సీఐ ఎ.కృష్ణభగవాన్ ప్రత్యేక నిఽఘా ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలు శాంతంగా ఉండాలని సీఐ రెండు వర్గాలకు సూచించారు. హత్య కేసులో 20 మంది నిందితులు విడుదల పోలీసు పికెట్ కొనసాగించాలని డిమాండ్ -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
లంకలో.. జంకు లేకుండా..
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ఇటు రాజమహేంద్రవరం నగరానికి.. అటు కొవ్వూరు పట్టణానికి మధ్యన.. గోదావరి నడుమ అనేక లంకలున్నాయి. కేతావారిలంక, బ్రిడ్జి లంక, వెంకట నగరం లంక వంటివి వీటిలో ముఖ్యమైనవి. ఈ లంకల్లో చిన్నచిన్న పూరిళ్లు కట్టుకుని మత్స్యకారులు నివసిస్తూంటారు. గోదావరిలో చేపల వేట చేసుకుంటూ జీవనం సాగిస్తారు. వరద గోదారి పోటెత్తితే ముందు జాగ్రత్తగా రాజమహేంద్రవరం తీరానికి వచ్చేస్తారు. వరద తగ్గిన తర్వాత తిరిగి ఆయా లంకలకు పయనమవుతారు. ఈ లంకల్లో ఇటు రాజమహేంద్రవరం, అటు కొవ్వూరుకు చేరువగా బ్రిడ్జి లంక ఉంది. సువిశాలంగా ఉన్న ఈ లంక విస్తీర్ణం సుమారు 100 ఎకరాలు ఉంటుంది. చారిత్రక హేవలాక్ వంతెన (పాత రైల్వే బ్రిడ్జి), కొత్త ఆర్చిల వంతెనల వద్ద ఉండటంతో దీనికి బ్రిడ్జి లంక అనే పేరు వచ్చింది. నిన్నమొన్నటి వరకూ సాధారణంగా అక్కడకు విహారానికి ఎవ్వరూ వెళ్లిన దాఖలాలు లేవు. అటువంటిది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఆ లంకకు తరచుగా పదుల సంఖ్యలో జనాలు బోట్లపై రాకపోకలు సాగిస్తున్నారు. ఇటు రాజమహేంద్రవరం, అటు కొవ్వూరు ప్రాంతాల నుంచి భారీగానే జనం బ్రిడ్జి లంకకు వెళ్తున్నారు. ఇలా ఎందుకు వెళ్తున్నారనే దానిపై ఇప్పటి వరకూ అధికారుల పర్యవేక్షణే లేదు. కోడిపందాలు, పేకాటకు అడ్డాగా.. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత కోడిపందాలు, పేకాట స్థావరాలకు బ్రిడ్జి లంక అడ్డాగా మారిపోయింది. సంక్రాంతి పండగతో సంబంధం లేకుండా.. రాజమహేంద్రవరం నగరం, పరిసర ప్రాంతాల్లో పేకాటలు, కోడిపందాలు నిత్యం జోరుగానే జరుగుతున్నాయి. బయటి ప్రాంతాల్లో బరులు వేసి, పందాలు సాగిస్తే పోలీసు అధికారులతో అప్పుడప్పుడు ఇబ్బందులు తప్పవు. ఈ తలనొప్పి లేకుండా ఉండటానికి, పోలీసుల కళ్లుగప్పి తప్పించుకోవడానికి బ్రిడ్జి లంక అనువుగా ఉంటుందని పందాల నిర్వాహకులు భావించారు. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా ఈ లంకలో కోడి పందాలు, పేకాట యథేచ్ఛగా సాగుతున్నాయి. రాజమహేంద్రవరంతో పాటు, కొవ్వూరు ప్రాంతం నుంచి పలువురు జూద ప్రియులు బోట్లలో బ్రిడ్జి లంకకు చేరుకుని, కోడి పందాలు, పేకాట ఆడి, తిరిగి రాత్రి సమయాల్లో చేరుకుంటున్నారు. ఇలా వెళ్తున్నారు బ్రిడ్జి లంకలో కోడిపందాల నిర్వాహకుడు రాజమహేంద్రవరం, కొవ్వూరు ప్రాంతాల్లోని పందాల ప్రియులకు, జూదరులకు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తున్నాడు. పందాలు, జూదాల కోసం వెళ్లే వారి నుంచి ఆయా ప్రాంతాల్లోని బోట్ రైడర్లు రూ.100 చొప్పున వసూలు చేసి, బ్రిడ్జి లంకకు తీసుకుని వెళ్తున్నారు. తిరిగి పందాలు అయిపోయిన తరువాత లంక నుంచి తిరిగి తీరానికి చేరుస్తున్నారు. దీనిలో భాగంగానే సోమవారం మధ్యాహ్నం కోటిలింగాల రేవు నుంచి బోటు రైడర్, హెల్పర్ రూ.100 చొప్పున తీసుకుని 10 మందిని బ్రిడ్జి లంకకు తీసుకుని వెళ్లారు. కొవ్వూరు, రాజమహేంద్రవరం నుంచి అక్కడకు వెళ్లిన సుమారు 40 మంది కోడి పందాలు ఆడారు. పలువురు అక్కడే మద్యం తాగారు. రాత్రి 7.30 గంటల సమయంలో బోట్ రైడర్, హెల్పర్‌తో కలిపి 12 మంది బోటులో తిరుగు పయనమయ్యారు. హేవలాక్ బ్రిడ్జి 7 – 8 పిల్లర్ల మధ్యకు చేరుకునే సరికి లోపలకు నీరు చేరి బోటు మునిగిపోయింది. ఈత వచ్చిన వారు దూకి పిల్లర్లను పట్టుకోగా, స్థానిక మత్స్యకారులు వారిని రక్షించి, గోదావరి ఒడ్డుకు చేర్చారు. స్థానిక సింహాచల నగర్‌కు చెందిన చవల అన్నవరం (54), కాతేరు మిలటరీ కాలనీకి చెందిన గాడా రాజు (24) ఈత రాక మృత్యువాత పడ్డారు. గోదారిలో కలుస్తున్న నిబంధనలురాజమహేంద్రవరం, కొవ్వూరు ప్రాంతాల్లోని గోదావరి ఘాట్లలో ఉన్న బోట్ల నిర్వాహకులు నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. ఎటువంటి లైఫ్ జాకెట్లు లేకుండా బోట్లలో ఎక్కించేసుకుంటున్నారు. గోదావరి నదిలో ఫ్లోట్ బోటింగ్ హోటల్ ఏర్పాటు చేశాక రాత్రి వేళల్లో మహిళలు సైతం అధిక సంఖ్యలో అక్కడకు వెళ్లి పార్టీలు చేసుకుంటున్నారు. ఫ్లోట్ బోటింగ్‌కు తీసుకుని వెళ్లే బోట్లలో సైతం ప్రయాణికులకు లైప్ జాకెట్లు ఇవ్వడం లేదు. దీనిపై పోలీసులు, పర్యాటక అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి, ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. కూటమి సర్కార్ నిర్లక్ష్యంఫ ప్రజల ప్రాణాలంటే లెక్కే లేదు ఫ గోదావరిలో రాకపోకలపై నియంత్రణ కరవు ఫ బాధ్యులపై చర్యలు చేపట్టాలి ఫ తక్షణం కంట్రోలు రూము ఏర్పాటు చేయాలి ఫ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి ఫ వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ డిమాండ్ ఫ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా బ్రిడ్జి లంక ఫ యథేచ్ఛగా కోడిపందాలు, పేకాట ఫ రాజమహేంద్రవరం – కొవ్వూరు ప్రాంతాల నుంచి వెళ్తున్న ప్రజలు ఫ కానరాని అధికారుల పర్యవేక్షణ ఫ ఈ నేపథ్యంలోనే పడవ ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం రాజమహేంద్రవరం సిటీ: కూటమి ప్రభుత్వానికి నిర్లక్ష్యానికి ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం పుష్కరాల రేవు సమీపాన సోమవారం రాత్రి గోదావరిలో పడవ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో పుష్కర్ ఘాట్‌ను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కోటిలింగాల ఘాట్ నుంచి బ్రిడ్జి లంకకు తరచూ బోట్ల మీద జనాలు వెళ్తున్నట్లు తెలుస్తోందన్నారు. ఇలా ఎందుకు వెళ్తున్నారో కూటమి ప్రభుత్వం పర్యవేక్షించకపోవడం దారుణమన్నారు. రాత్రి వేళ బ్రిడ్జి లంకకు వెళ్లాల్సిన అవసరమేమిటో అర్థం కావడం లేదన్నారు. గతంలో గోదావరి పుష్కరాల సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పుష్కరాల రేవులో 29 మంది ప్రాణాలు కోల్పోయారని మార్గాని భరత్‌రామ్ గుర్తు చేశారు. మళ్లీ పుష్కరాలు రాబోతున్నాయని, ఈ పరిస్థితిల్లో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోందో అర్థం కావడం లేదని విమర్శించారు. ఒకవైపు లంకలోని రెస్టారెంట్ వద్దకు టూరిజం బోటులో జనం వెళ్తున్నారని, అటువంటప్పుడు జాగ్రత్తలేమైనా తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని అన్నారు. బోటు ప్రమాదం రాత్రి 7 గంటలకు జరిగితే రెస్క్యూ ఆపరేషన్ టీమ్ రాత్రి 11 గంటల ప్రాంతానికి అక్కడకు చేరుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఎటువంటి ప్రభుత్వ నియంత్రణా లేనందు వల్లనే ప్రమాదం జరిగిందని, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో శంకరమఠం ఎదురుగా కంట్రోలు రూము ఏర్పాటు చేయించి, పాపికొండలు టూర్‌ను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టామన్నారు. కనీసం దీనినైనా 24 గంటలూ పని చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికై నా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని కంట్రోల్ రూము ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తక్షణం స్పందించి బోటు మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, వారికి న్యాయం చేయాలని, ప్రమాద బాధ్యులపై తక్షణ చర్యలు చేపట్టాలని భరత్‌రామ్ డిమాండ్ చేశారు ఇసుక పైనే దృష్టి కోటిలింగాల రేవులో స్థానిక ఎమ్మెల్యే అనుయాయుల ఆధ్వర్యాన ఇసుక ర్యాంపులు నడుస్తున్నాయని, 12, 13 సొసైటీలు రోజూ బోట్ల మీద ఇసుక తవ్వుతూ, వందల లారీల్లో తరలిస్తున్నారని భరత్‌రామ్ ఆరోపించారు. బోట్ల మీద ఇసుక కోసం వెళ్లిన వారు పడవ ప్రమాదంపై కనీసంగా కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారు స్పందించి ఉంటే, ఆ ఇద్దరి ప్రాణాలు దక్కేవని చెప్పారు. డబ్బులు దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ ప్రజలను కాపాడటంలో లేదని మండిపడ్డారు. మహాశివరాత్రి రోజున తాళ్లపూడి మండలం తాడిపూడిలో ఐదుగురు యువకులు చనిపోవడంతో పాటు తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున.. తగిన కార్యాచరణతో చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గౌతమీ సూపర్ బజార్ స్థలం లీజు విషయంలో తనకు రూ.5 కోట్ల లంచం ఇచ్చినట్లు ఆరోపించిన ఈవీఎం ఎమ్మెల్యే.. ఇప్పుడు అక్కడ నిర్మాణాలు జరుగుతూంటే ఏం చేస్తున్నారో తెలియడం లేదని విమర్శించారు. ఆయనకు డబ్బులు ముట్టాయేమోననే అనుమానం కలుగుతోందన్నారు. అక్రమంగా లీజుకు ఇచ్చారని చెప్పి, ఇప్పుడు నిర్మాణం జరుగుతూంటే ఆపకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. గౌతమీ సూపర్ బజార్ స్థలాన్ని పరిరక్షించే చర్యలు చేపట్టి, నిర్మాణం ఆపాలని, లేకుంటే అక్కడ ధర్నా చేస్తామని భరత్‌రామ్ ప్రకటించారు. -
నైతిక విలువలు లేకుంటే ఎన్ని డిగ్రీలు ఉన్నా వృథాయే
● ‘నన్నయ’ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ ● నారీ ఫెస్ట్ 2025 ఉత్సవాలు ప్రారంభం రాజానగరం: సమాజంలో నైతిక విలువలు పాటించని వారికి ఎన్ని డిగ్రీలు ఉన్నా వృథాయేనని, వాటికి విలువ కూడా ఉండదని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య సత్తుపాటి ప్రసన్నశ్రీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యూనివర్సిటీ మూడు రోజులపాటు నిర్వహించే ‘నారీ ఫెస్ట్ 2025’ ఉత్సవాలను మంగళవారం ఒక చిన్నారితో జ్యోతిని వెలిగింపజేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన సభలో వీసీ మాట్లాడుతూ ఆడవారిని ఆకాశంలో సగం, అవకాశాలలో సగం అంటే సరిపోదని, ఆదరించడంలో కూడా సగం కావాలన్నారు. ఆడవారికి ఆదరణే ఆధారమని, ఆ ఆదరణ తల్లిదండ్రుల నుంచి, జీవిత భాగాస్వామి నుంచి, పిల్లల నుంచి లభిస్తుందన్నారు. గతంలో ఆడవారి పట్ల వివక్ష చూపేవారని, ఆధునిక సమాజంలో కొంత మార్పు వచ్చిందన్నారు. ఇదే క్రమంలో రాబోయే కాలంలో వివక్ష లేని సమాజం వైపు అడుగులు వేయాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు. తరాలు మారుతున్నా అంతరాలు మారకూడదనే ఉద్దేశంతో బామ్మ – మనుమరాలి షో నిర్వహిస్తున్నామన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచే బామ్మలను స్ఫూర్తినగా మార్గదర్శకంగా తీసుకుని ఆమె చేయి పట్టుకుని మనుమరాళ్లు నడుస్తుంటే ముచ్చటగొలుపుతుందన్నారు. పెద్దలను ఎల్లప్పుడూ గౌరవించాలని, వృద్ధాశ్రమాల అవసరం లేని సమాజం వైపు పయనించాలన్నారు. అలరించిన వెల్ బేబీ షో బామ్మ – మనుమరాలు షోతోపాటు నిర్వహించిన వెల్ బేబీ షోకు కూడా అపూర్వ స్పందన లభించింది. రాజమహేంద్రవరం పరిసరాల నుంచి తరలివచ్చిన అనేక మంది తల్లిదండ్రులు తమ చిన్నారులను వేదిక పైకి తీసుకువచ్చి, బుడగలతో పోటీలు నిర్వహించడంలో ఎంజాయ్ చేశారు. అలాగే గ్రూప్ సింగింగ్, గ్రూప్ డాన్స్, ఫ్యాషన్ షో, స్కిట్స్‌లలో పోటీలు జరిగాయి. పరిసరాలలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉమెన్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ పి. ఉమామహేశ్వరిదేవి, ప్రిసైడింగ్ అధికారి డాక్టర్ వి.పెర్సిస్, డాక్టర్ ఎన్.సజనారాజ్, డాక్టర్ కె.దీప్తి, డాక్టర్ డి. లతా, డాక్టర్ బి.విజయకుమారి, ఆచార్య డి.జ్యోతిర్మయి, డాక్టర్ పి.విజయనిర్మల, డాక్టర్ కె.సుబ్బారావు, డాక్టర్ కె.నూకరత్నం, డాక్టర్ పద్మావతి, డాక్టర్ కె.రమణేశ్వరి పాల్గొన్నారు. -
ఆశాభంగం
ప్రభుత్వం ప్రకటించిన వరాలు పనికిరావు జిల్లాలో ఎన్నికల కోడ్ ఉన్నా హడావుడిగా ఆశా కార్యకర్తలను సంతృప్తి పరచేందుకు పలు రాయితీలను అందిస్తుందంటూ ప్రభుత్వం ఇచ్చిన లీకేజీల వల్ల ఆశా కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. 2006లో పూర్తి స్థాయిలో ఆశా కార్యకర్తలను పోస్టులు భర్తీ చేయగా మధ్యలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసుకుంటూ వచ్చారు. గత పదేళ్ల నుంచి ఆశా కార్యకర్తల పోస్తుల భర్తీకి అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వం ప్రకటించిన ప్రసూతి సెలవులు ఉపయోగించుకొనే అవకాశం లేదని ఆశా కార్యకర్తలు చెబుతున్నారు. గ్రాడ్యుటీని ప్రవేశపెట్టి రూ.1.50 లక్షలు పదవీ విరమణ అనంతరం ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటన కూడా బూటకమని వారు చెబుతున్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ సర్వీసు ఉంటేనే గ్రాడ్యుటీ అమలు చేస్తామని మెలిక పెట్టడం ఆశా కార్యకర్తలను వంచించడమేనని మండిపడుతున్నారు. వేతనాల పెంపు లేకుండా కేవలం పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడంలో ఆశా కార్యకర్తలకు ఒరిగేదేమీ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాటి వైఎస్సార్ సీపీ సర్కారులో స్వర్ణయుగం 2019–24 మధ్య కాలంలో పాలించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంది. చాలీచాలని వేతనాలతో దుర్భర జీవితం అనుభవించిన ఆశా కార్యకర్తలకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు చేసిన పాదయాత్రలో ఆశా కార్యకర్తల దుస్థితిని గుర్తించారు. అందుకనుగుణంగా వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టిన వెంటనే అప్పటి వరకూ రూ.మూడు వేలు ఉన్న వేతనాన్ని ఒక్కసారిగా 2019 ఆగస్టు 12న రూ.పది వేలకు పెంచారు. ఆశా కార్యకర్తల కులం, మతం, ప్రాంతం, వర్గం చూడకుండా సజావుగా విధులు నిర్వహించేందుకు భరోసా కల్పించారు. నేటి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పోల్చుకుంటున్న ఆశా కార్యకర్తలు నాటి స్వర్ణయుగాన్ని తలుచుకుంటున్నారు. ఆలమూరు: రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రతకు అహర్నిశలు శ్రమిస్తున్న ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పిచడంతో పాటు దీర్ఘకాలిక డిమాండ్లు పరిష్కరిస్తామన్న కూటమి ప్రభుత్వం హామీ నీటిమూటగా మారింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అలవి కాని హామీలిచ్చి అమలు చేయలేక అన్ని వర్గాల ప్రజలు మాదిరిగానే ఆశా కార్యకర్తలను కూడా నయవంచనకు గురిచేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అఽధికారం చేపట్టి 9నెలలు అయినా ఇంకా హామీలు అమలు చేయకపోవడంతో రాష్ట్ర ఆశా కార్యకర్తల సమాఖ్య పిలుపు మేరకు గత ఏడాది నవంబర్ 18న ఆశా కార్యకర్తలు జిల్లా కేంద్రమైన అమలాపురంలోని డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద తమ నిరసనలను తెలియజేశారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం ఆశా కార్యకర్తల డిమాండ్లను సానుకూల దృక్పథంతో పరిష్కారిస్తామని ఆ సమయంలో హామీ ఇచ్చింది. ప్రభుత్వం మాట తప్పిన వైనాన్ని జీర్ణించుకోలేని ఆశా కార్యకర్తలు తాడోపేడో తేల్చుకునేందుకు ఈ నెల ఆరవ తేదీన చలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పోలీసులు ధర్నాకు వెళ్లే వారిని గుర్తించే పనిలో నిమగ్నమై బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనుకాడవద్దని ఆశా కార్యకర్తలు తీర్మానించుకున్నారు. ఆశా కార్యకర్తలపై పెరిగిన పని ఒత్తిడి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనున్న 56 ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రస్తుతం 1395 మంది ఆశా కార్యకర్తలు విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యి జనాభాకు ఒక ఆశా కార్యకర్తను ప్రభుత్వం నియమించవలసి ఉంది. జిల్లాలో 2011 జనాభా గణాంకాల ప్రకారం 17.19 లక్షల మంది జనాభా ఉండగా ఆశా కార్యకర్తలను దాదాపు 1,700 మందిని నియమించవలసి ఉంది. ప్రస్తుతం వివిధ కారణాల రీత్యా ఖాళీ అయిన ఆశా కార్యకర్తల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. దీంతో ప్రస్తుతం ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలపైనే అదనపు భారం పడుతోంది. రోజు రోజుకు ప్రవేశపెడుతున్న యాప్‌లతో పాటు పని ఒత్తిడితో ఆశా కార్యకర్తలు సతమతమవుతున్నారు. దైనందిన జీవితంలో నిత్యవసరాల ధరలతో పాటు ఖర్చులు పెరిగినట్లుగా వేతనం పెరగక ఆశా కార్యకర్తలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఆశా కార్యకర్తల డిమాండ్లు ఇవీ కనీస వేతనం రూ.20 వేలు చెల్లించాలి. ఒప్పంద జీవోలన్నింటిని విడుదల చేయాలి. ఏఎన్ఎం శిక్షణ పొందిన వారందరికి పర్మి నెంట్ పోస్టుల భర్తీ సమయంలో తగిన ప్రాధాన్యం కల్పించాలి. అర్హతను బట్టి దశల వారీగా ఏఎన్ఎం శిక్షణను ఇచ్చి ధ్రువపత్రాలను మంజూరు చేయాలి. ఆరోగ్య రంగానికి బడ్జెట్లో ప్రకటించిన వాటి కంటే అధికంగా నిధులు పెంచాలి. ఆరోగ్య భద్రతా చట్టం చేయాలి. ప్రతి యేటా రెండు జతలకు యూనిఫామ్ అలావెన్స్ ఇవ్వాలి. లెప్రసీ సర్వేకు సంబంధించిన పారితోషికాలు వెంటనే చెల్లించాలి.న్యాయబద్ధమైన డిమాండ్లు అంగీకరించాలి రాష్ట్ర ప్రభుత్వం గత సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఆశా కార్యకర్తల న్యాయబద్ధమైన డిమాండ్లను అంగీకరించాలి. ఏఎన్ఎంలుగా పదోన్నతికి అవకాశం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఆశా కార్యకర్తల డిమాండ్లను ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలి. – కె.కృష్ణవేణి, కోనసీమ జిల్లా ఆశా కార్యకర్తల సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు ఆశా కార్యకర్తలను నయవంచన చేస్తున్న ప్రభుత్వం గత వైఎస్సార్ సీపీలో వేతనం రూ.పది వేలకు పెంపు రేపు చలో విజయవాడకు పిలుపునిచ్చిన సీఐటీయూ పోలీసు కేసులకు, వేధింపులకు భయపడేది లేదు -
అగ్ని ప్రమాదానికి పశువుల శాల ఆహుతి
● కాలిపోయిన 4 గేదెలు, రెండు ఆవులు, నాలుగు దూడలు ● రూ.ఐదు లక్షల నష్టం సామర్లకోట: మండల పరిధిలో వీకే రాయపురంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు గేదెలు, రెండు ఆవులు, నాలుగు దూడలు పూర్తిగా కాలిపోయాయి. వీటిలో రూ.1.50 లక్షల విలువ కలిగిన గేదె అక్కడికక్కడే మృతి చెందింది. రైతులు, బాధితుల కథనం ప్రకారం వీకే రాయపురం సమీపంలోని మామిళ్లదొడ్డిలోని పశువుల పాకపై విద్యుత్తు వైరు తెగి పడిపోవడంతో మంటలు చెలరేగి పశువుల పాక పూర్తిగా కాలి బూడిద అయింది. ఆ పాకలో ఉన్న పశువులు పూర్తిగా కాలిపోయాయి. మూగజీవాల ఆర్తనాదాలకు సమీపంలో ఉన్న రైతులు పశువుల పాక వద్దకు చేరుకొని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేసి పశువుల యజమాని రంగనాథం వీరభద్రరావుకు సమాచారం ఇచ్చారు. మంగళవారం ఉదయం పశువైద్యాధికారి మాకినీడి సౌమ్య ఘటనా ప్రదేశానికి చేరుకొని కాలిపోయిన పశువులను పరిశీలించారు. కాలిపోయిన పశువులు జీవించే అవకాశం లేదన్నారు. సుమారు రూ.5 లక్షల వరకు నష్టం ఉంటుందని చెప్పారు. కాలిపొయిన పశువుల ఆర్తనాదాలు రైతుల హృదయాలను కదిలించి వేశాయి. పశువుల పరిస్థితిని చూచి వైఎస్సార్ సీపీ మండల పార్టీ అధ్యక్షుడు తలారి దొరబాబు, రైతు సంఘ నాయకుడు ఇంటి వెంకట్రావులు కంటతడి పెట్టుకున్నారు. వైద్యం అందించినా పశువులు జీవించే అవకాశం లేదని వైద్యాధికారి సౌమ్య తెలిపారు. రెండు పశువులకు మాత్రమే బీమా ఉన్నదని ఆమె చెప్పారు. పశువులకు జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన రిపోర్టును ఉన్నతాధికారులకు పంపుతానని చెప్పారు. వీఆర్వో రైతుల నుంచి సమాచారం సేకరించి తహసీల్దార్‌ను నివేదిక సమర్పించారు. స్విమ్మింగ్ పూల్‌లో తప్పిన ప్రమాదం నీట మునిగి సీపీఆర్‌తో బతికిన స్విమ్మర్ నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడామైదానంలోని స్విమ్మింగ్ పూల్‌లో ప్రమాదవశాత్తూ మునిగిపోయి ఓ వ్యక్తి స్పృహ కోల్పోగా స్విమ్మింగ్ పూల్ సిబ్బంది సకాలంలో స్పందించడంలో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే జిల్లా క్రీడామైదానంలోని స్విమ్మింగ్ పూల్‌లో ఉదయం 8 నుంచి 9 గంటల బ్యాచ్‌లో శంఖవరం గ్రామానికి చెందిన ప్రదీప్‌కుమార్ నెల రోజుల నుంచి కాకినాడ స్విమ్మింగ్ చేస్తున్నాడు. రోజులాగే మంగళవారం కూడా స్విమ్మింగ్ పూల్‌కు వచ్చిన ఆయన ఈత కొడుతున్న సమయంలో ముక్కులోకి నీరు వెళ్లి ఊపిరి ఆడక అస్మారక ిస్థితిలోకి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న స్విమ్మింగ్ కోచ్ అప్పలనాయుడు, సీనియర్ స్విమ్మర్లు దానిని గమనించి ప్రదీప్‌కుమార్‌ను కొలనులోనుంచి బయటకు తీసి సీపీఆర్ చేసి అంబులెన్సులో దగ్గర ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి ప్రదీప్‌కు ఆస్తమా ఉన్న కారణంగా ఊపిరి సమ్యస్య వచ్చిందని తెలిపి చికిత్సను ప్రారంభించారు. స్విమ్మింగ్ పూల్ వద్ద లైఫ్‌గార్డుల స్థానంలో సీనియర్ స్విమ్మర్లను డీఎస్ఏ అధికారులు కొనసాగిస్తున్నారు. లైఫ్‌గార్డుల నియామకానికి శాప్‌కు లేఖ రాసినా ఇంతవరకు అనుమతి రాకపోవడంతో సీనియర్లను కొనసాగించాల్సి వస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. డీఎస్డీఓ శ్రీనివాస్‌కుమార్‌ను వివరణ కోరగా త్వరలోనే లైఫ్‌గార్డులను నియమిస్తామని తెలిపారు. క్షతగాత్రులకు కొనసాగుతున్న చికిత్స కాకినాడ క్రైం: కాకినాడలోని జై బాలాజీ ట్రాన్స్‌పోర్ట్‌లో సోమవారం చోటు చేసుకున్న బాణసంచా పేలుడు ఘటనలో క్షతగాత్రులకు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స కొనసాగుతోంది. కాకినాడ వన్‌టౌన్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేయగా విచారణ కొనసాగుతోంది. మంగళగిరి నుంచి వచ్చిన ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ బృందం పేలుడు జరిగిన ప్రదేశంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టింది. పలు నమూనాలు సేకరించింది. -
బస్సులో సూట్ కేసు చోరీ
తస్కరించిన మహిళ నుంచి 117 గ్రాముల బంగారు నగల రికవరీ అమలాపురం టౌన్: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న దంపతులకు చెందిన బంగారు నగలతో ఉన్న సూట్ కేసును వారితో ప్రయాణించిన ఓ మహిళ కాజేసిన కేసును అమలాపురం పట్టణ పోలీసులు ఛేదించారు. దాదాపు రూ.6 లక్షల విలువైన 117 గ్రాముల బంగారు నగలను ఆ మహిళ నుంచి రికవరీ చేయడంతోపాటు ఆమెను మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. ఈ కేసు వివరాలను ఆయన వివరించారు. గత నెల 17వ తేదీన విశాఖపట్నం జిల్లా కూర్మన్నపాలేనికి చెందిన దుర్గమ రామకృష్ణ దంపతులు కాకినాడ ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో అమలాపురం నాన్ స్టాప్ బస్సు ఎక్కారు. బస్సులో రామకృష్ణ భార్య పక్కనే ఓ మహిళ కూర్చుంది. బస్సులో కాళ్ల దగ్గర బంగారు నగలతో ఉన్న సూట్ కేసును ఆ దంపతులు పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఆ మహిళ ముమ్మిడివరంలో దిగిపోయింది. రామకృష్ణ దంపతులు అమలాపురంలోని తమ బంధువులు ఇంటికి వెళ్లిన తర్వాత బస్సులో సూట్ కేసు పోయినట్లు గుర్తించారు. ఆ సూట్ కేసులో ఒక బంగారు తెల్ల రాళ్ల నక్లెస్, ఎరుపు ఆకుపచ్చ రాళ్ల బంగారు నక్లస్, బంగారపు ఆకు పచ్చ రాళ్ల నక్లెస్, రెండు బంగారపు లాకెట్లు మొత్తం 117 గ్రాముల బంగారు నగలు ఉన్నట్లు అదే రోజు పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రామకృష్ణ పేర్కొన్నారు. బస్సులో తన భార్య చెంతన కూర్చున్న మహిళపైనే తమకు అనుమానం ఉందని ఆ ఫిర్యాదులో రాశారు. ఈ కేసును డీఎస్సీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో సీఐ వీరబాబు, క్రైమ్ ఎం.గజేంద్రకుమార్ పర్యవేక్షణలో పట్టణ ఎస్సై ఎస్ఆర్ కిషోర్‌బాబు, క్రైమ్ సిబ్బంది లోతుగా దర్యాప్తు చేశారు. ఆ రోజు బస్సులో బంగారు నగలతో ఉన్న సూట్ కేసును గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం ఎర్ర చెరువు గ్రామానికి చెందిన ఆవుల యశోద దొంగిలించినట్లు తమ దర్యాప్తులో పోలీసులు గర్తించారు. అమలాపురం ఆర్టీసీ బస్సు స్టేషన్లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న యశోదను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి 117 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. దొంగను రెండు వారాల్లో అరెస్ట్ చేయడమే కాకుండా నూరు శాతం సొత్తును రికవరీ చేసిన సీఐలు వీరబాబు, గజేంద్రకుమార్, ఎస్సై కిషోర్‌బాబు, క్రైమ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ చోరీలో మహిళా దొంగ యశోదకు సహకరించిన మరో నిందితురాలిని అరెస్ట్ చేయాల్సి ఉందని సీఐ వీరబాబు తెలిపారు. -
తండ్రి మందలించాడని ఆత్మహత్యాయత్నం
అమలాపురం టౌన్: ఉప్పలగుప్తానికి చెందిన బి.ఫార్మసీ చదువుతున్న విద్యార్థిని అమలాపురంలో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్యహత్యాయత్నం చేసిన ఘటన పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది, స్థానికులకు ముచ్చెమటలు పట్టించింది. అమలాపురం గాంధీనగర్ శివారులో నిర్మాణం పూర్తయి ఇంకా ప్రారంభం కాని దాదాపు 60 అడుగుల ఎత్తు ఉన్న వాటర్ ట్యాంక్‌పై ఆ యువతి ప్రమాదకర పరిస్థితుల్లో నిలబడి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ యువతి భీమవరం విష్ణు కళాశాలలో బి.ఫార్మసి చివరి సంవత్సరం చదువుతోంది. 15 రోజులకోసారి ఇంటికి రావడం, చదువుపై అంతగా దృష్టి పెట్టకపోవడంపై తల్లిదండ్రులు ఆమెను తరుచూ మందలిస్తున్నారు. భీమవరం నుంచి ఇంటికి వచ్చిన విద్యార్థిని వైఖరిపై తండ్రి సోమవారం అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం విద్యార్థిని తన ల్యాప్ ట్యాప్‌లో సినిమా చూస్తోంది. ఇది గమనించిన ఆమె తండ్రి మందలించి పొలం వెళ్లిపోయాడు. తండ్రి మందలింపులతో మనస్తాపం చెందిన ఆ విద్యార్థిని తన బ్యాగ్ తీసుకుని ఉప్పలగుప్తం నుంచి అమలాపురం వెంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో గల తమ బంధువుల ఇంటికి చేరుకుంది. ఆ బ్యాగ్‌ను బంధువుల ఇంట్లో పడేసి విద్యార్థిని నేరుగా వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లి ట్యాంక్ ఎక్కేసింది. యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంటోందని గమనించిన స్థానికులు తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో ఆ ట్యాంక్ వద్దకు స్థానికులు చేరకున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి వచ్చారు. పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది తాళ్లు, వలలు కూడా సిద్ధం చేశారు. ఆమెను ట్యాంక్ నుంచి దూకితే రక్షించేందుకు సన్నాహాలు కూడా చేశారు. విద్యార్థినిని ట్యాంక్ దిగాలని అటు స్థానికులు, ఇటు పోలీసులు పదే పదే చెప్పారు. ఇలా గంటకు పైగా సమయం గడిచిపోయింది. ఎట్టకేలకు ట్యాంక్ నుంచి విద్యార్థిని ఏడుస్తూ కిందకు దిగడంతో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పట్టణ సీఐ పి.వీరబాబు, పట్టణ ఎస్సైలు, అగ్నిమాపక సిబ్బంది విద్యార్థిని ట్యాంక్ నుంచి దింపడంతో సఫలీకృతులయ్యారు. విద్యార్థినికి కౌన్సెలింగ్ నిర్వహించి ఆమె తల్లికి అప్పగించడంతో కథ సుఖాంతమైంది. వాటర్ ట్యాంక్ ఎక్కిన బి.ఫార్మసీ విద్యార్థిని గంటన్నర సేపు పోలీసులు, స్థానికుల్లో ఉత్కంఠ ఎట్టకేలకు విద్యార్థిని ట్యాంక్ దిగడంతో కథ సుఖాంతం -
జ్యోతిర్లింగాల దర్శనార్థం పాదయాత్ర
ఫ గుజరాత్ నుంచి 6 నెలల కిందట ప్రారంభం ఫ చిన్న వయసులోనే ఆధ్యాత్మికత వైపు అడుగులు గండేపల్లి: చిన్న వయసులోనే ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తూ నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నాడా యువకుడు. జ్యోతిర్లింగాల దర్శనార్థం ఆరు నెలల కిందట ఆ యువకుడు పాదయాత్ర ప్రారంభించాడు. గుజరాత్ రాష్ట్రంలో సోమనాథ్ జిల్లాలో ఉన్న గ్రామానికి చెందిన 22 ఏళ్ల రాజ్మజిత దేశంలోని 12 జ్యోతిర్లింగాల దర్శనం కోసం 2024 ఆగస్ట్ 30న గుజరాత్లో సోమనాథ్ ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించాడు. జాతీయ రహదారి మీదుగా వస్తున్న అతని పాదయాత్ర సోమవారం మండలంలోని నీలాద్రిరావుపేట చేరుకుంది. అతన్ని పాదయాత్రకు భారతీయ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజ్మజిత మాట్లాడుతూ 10వ తరగతి వరకు విద్యనభ్యసించానని, దేవునిపై ప్రేరణ కలగడంతో ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నట్టు తెలిపాడు. తాను ఉన్న గ్రామానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ గుజరాత్లో సోమనాథ్ ఆలయం వద్ద స్వామి సేవలో గడిపేవాడినని, ఆధ్యాత్మిక చింతనతోనే ఈ పాదయాత్రను ప్రారంభించానన్నాడు. గుజరాత్, మహరాష్ట్రలో పుణ్యక్షేత్రాలు, తమిళనాడులో రామేశ్వరంలో దైవ దర్శనం అనంతరం ఆంధ్రకు చేరుకుని తిరుపతిలో స్వామిని దర్శించుకుని, శ్రీశైలంలో మల్లికార్జునస్వామి వారిని దర్శించుకున్నట్టు పేర్కొన్నాడు. 16వ నంబర్ జాతీయ రహదారి మీదుగా ఒడిశాలో పూరీ జగన్నాథస్వామి దర్శనం అనంతరం నేపాల్‌లో పుణ్యక్షేత్రాల సందర్శన, కాశీవిశ్వనాథుని దర్శనంతోపాటు భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నట్టు తెలిపాడు. రోజుకు 40 కిలోమీటర్లు నడుస్తున్నానని, 16 వేల కిలోమీటర్లు ప్రయాణించి, ఈ ఏడాది ఆగస్ట్‌కు తన సొంత రాష్ట్రానికి చేరుకోనున్నట్టు పేర్కొన్నాడు. అతన్ని భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పాలచర్ల నాగేంద్ర చౌదరి దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వీర్రాజు, సాయి కుమార్, మంగన్న తదితరులు ఉన్నారు. -
పట్టుబడిన మద్యం ధ్వంసం
అంబాజీపేట: ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ చైతన్యమురళీ, జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎస్కేబీవీ ప్రసాద్ ఆదేశాల మేరకు కొత్తపేట డివిజన్ పరిధిలో ఏడు పోలీస్ స్టేషన్లకు సంబంధించి రూ.90 లక్షలు విలువైన అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసినట్లు కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ చెప్పారు. సోమవారం అంబాజీపేట మార్కెట్ యార్డులో అక్రమ మద్యం ధ్వంసం చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ పి.గన్నవరం సర్కిల్ పరిధిలోని అంబాజీపేట, పి.గన్నవరం, అయినవిల్లి, నగరం పోలీస్ స్టేషన్లతో పాటు రాజోలు సర్కిల్ పరిధిలోని రాజోలు, సఖినేటిపల్లి, మలికిపురం పోలీస్ స్టేషన్లకు సంబంధించి ఆరేళ్ల నుంచి నమోదు చేసిన 258 కేసుల్లో మద్యాన్ని ధ్వంసం చేశామన్నారు. 9,124 బాటిళ్లలో ఉన్న వివిధ రకాల 2,700 లీటర్ల మద్యాన్ని రోడ్డు రోలర్ ద్వారా ధ్వంసం చేయించారు. 300 లీటర్ల నాటు సారాను గోతిలో కప్పెట్టారు. కాగా నూతన మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తామని, డ్రోన్లు ఉపయోగించి పేకాట, కోడి పందేల నిర్వహణ తదితర అసాంఘిక కార్యక్రమాలపై చర్యలు చర్యలు చేపడతామన్నారు. పి.గన్నవరం, రాజోలు సీఐలు ఆర్.భీమరాజు, టీవీ నరేష్కుమార్, ఎస్సైలు కె.చిరంజీవి, బి.శివకృష్ణ, ఎ.చైతన్యకుమార్, కె.మనోహర్జోషి, బి.రాజేష్‌కుమార్, పి.సురేష్, కె.డి.శ్రీనివాస్, ఎకై ్సజ్ సీఐ వీటీవీవీ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. రావులపాలెం: వివిధ కేసుల్లో పట్టుపడిన అక్రమ మద్యాన్ని సోమవారం పోలీసులు, ఎకై ్సజ్ శాఖ అధికారులు ధ్వంసం చేశారు. స్థానిక గౌతమీ గోదావరి పాత ఇసుక ర్యాంపు బాటలో మద్యం బాటిళ్ల సారాను జేసీబీ సాయంతో ధ్వంసం చేశారు. రావులపాలెం టౌన్ సీఐ శేఖర్‌బాబు మాట్లాడుతూ ఆలమూరు, అత్రేయపురం, కొత్తపేట, రావులపాలెం స్టేషన్ల పరిధిలో 296 కేసుల్లో సీజ్ చేసిన డీపీఎల్, ఎన్డీపీఎల్ మద్యం బాటిళ్లు మొత్తం 11,687, నాటు సారా 1944.50 లీటర్లను అసిస్టెంట్ సూపరింటెండెంట్ ప్రొఫెషన్ ఎకై ్సజ్ అధికారి అమర్‌బాబు ఆధ్వర్యంలో ధ్వంసం చేశామన్నారు. వీటి విలువ రూ. 15 లక్షలు ఉంటుందన్నారు. రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్, ఎస్సైలు సురేంద్ర, అశోక్, రాము, వీఆర్వోలు సత్యప్రసాద్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి
●● ఇప్పటి వరకూ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం ● రాష్ట్ర కాపు జేఏసీ నేతల డిమాండ్ ● తాడిపూడి మృతుల కుటుంబాలకు పరామర్శ తాళ్లపూడి: మహాశివరాత్రి సందర్భంగా గత నెల 26న తాడిపూడిలో గోదావరి పుణ్యస్నానాలకు వెళ్లి, ఐదుగురు యువకులు మృతి చెందితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ కనీసంగా కూడా స్పందించకపోవడం బాధాకరమని రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు జెట్టి గురునాథం, తోట రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పంధించి మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన మృతుల కుటుంబాలను రాష్ట్ర కాపు జేఏసీ, నియోజకవర్గ కాపు నాయకులు సోమవారం పరామర్శించారు. పడాల దుర్గా ప్రసాద్, పడాల దేవదత్త సాయి, అనిశెట్టి పవన్ గణేష్, గర్రే ఆకాష్, తిరుమలశెట్టి పవన్ కుమార్ల కుటుంబ సభ్యులను కలిసి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాపు సంఘం తరఫున ఒక్కొక్క మృతుని కుటుంబానికి రూ.30 వేల చొప్పున మొత్తం రూ.1.50 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా గురునాథం మాట్లాడుతూ, ఈ ఘటనపై ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కాపు జేఏసీ సభ్యుడు, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు తోట రామకృష్ణ మాట్లాడుతూ, కాపుల ఓట్లతో గెలిచిన కూటమి ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ ఘటనపై స్పందించాలని అన్నారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా కూడా పవన్ కల్యాణ్‌కు చేరాలని, బాధితులకు న్యాయం చేయాలంటూ పోస్టులు పెట్టి వైరల్ చేస్తున్నారని అన్నారు. తాడిపూడి సర్పంచ్ నామా శ్రీనివాస్ మాట్లాడుతూ, మృతుల కుటుంబాలకు ర్యాంపు నిర్వాహకులు కూడా నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కాపు సంఘం అధ్యక్షుడు నామా ప్రకాశం, పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, కరిబండి విద్యాసంస్థల డైరెక్టర్ కరిబండి త్రినాథస్వామి, కాపు నాయకులు పాల్గొన్నారు. -
వినికిడి సమస్యకు సత్వర చికిత్స చేయించాలి
రాజమహేంద్రవరం రూరల్: వినికిడి సమస్య ఉంటే సత్వర చికిత్స అందించాలని, తద్వారా ఈ సమస్య తీవ్రం కాకుండా చూసుకోవచ్చని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు అన్నారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా బొమ్మూరులోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వినికిడి సమస్యతో చాలా మంది నిత్య జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వయసు రీత్యా వినికిడి లోపం వచ్చిన వారికి స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ పథకాల్లో భాగంగా వినికిడి యంత్రాలు అందించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎపిడమాలజిస్ట్ సుధీర్‌బాబు, డిప్యూటీ డెమో సత్యకుమార్, డాక్టర్ మౌనిక తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్లకు అదనపు వసూళ్లు వద్దు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వంట గ్యాస్ బుక్ చేసుకున్న వారికి 48 గంటల్లోగా సిలిండర్ డోర్ డెలివరీ చేయాలని, ఆ సందర్భంగా అదనపు సొమ్ము డిమాండ్ చేయరాదని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. గ్యాస్ డీలర్లు, ఏజెన్సీల ప్రతినిధులతో కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. సిలిండర్ డోర్ డెలివరీ అనంతరం 48 గంటల్లోగా సబ్సిడీ సొమ్ము వినియోగదారుల బ్యాంకు అకౌంట్లో పడిందో లేదో డీలర్లు తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని సూచించారు. సిలిండర్ డోర్ డెలివరీకి బాయ్స్ ఎక్కువ సొమ్ము డిమాండ్ చేయకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ఈ మేరకు డెలివరీ బాయ్స్‌కు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. సిలిండర్ డెలివరీ అనంతరం రశీదులు ఇస్తున్నారో లేదో కూడా తనిఖీ చేసుకోవాలన్నారు. జిల్లాలో దీపం–2 పథకంలో 408 మంది సబ్సిడీ పొందలేదని, వారికి త్వరితగతిన సబ్సిడీ మొత్తం వచ్చేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో డీఎస్ఓ ఎం.నాగాంజనేయులు, హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీల రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీకే రామారావు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు తెలుగు, సంస్కృతం, హిందీ పేపర్–2 పరీక్షలు జరిగాయి. జనరల్ విభాగంలో 18,005 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 17,777 మంది హాజరయ్యారు. 222 మంది గైర్హాజరయ్యారు. వృత్తి విద్యా కోర్సుల పరీక్ష 1,689 మంది రాయాల్సి ఉండగా 1,634 మంది రాశారు. ఈ పరీక్షకు 55 మంది హాజరు కాలేదు. మొత్తం 55 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 37 కేంద్రాలను ఆర్జేడీ, డీవీఈఓ, ఆర్ఐఓ, డీఈసీ, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోలేదు. ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావాలి తుని: జీవాత్మకు పరమాత్మను అనుసంధానం చేసేదే ధర్మమని, ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య, ఆధ్మాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని కహెన్ షా వలీ దర్గాలో సోమవారం జరిగిన 28వ వార్షిక సర్వధర్మ సమ్మేళన సభకు ఆయన అధ్యక్షత వహించారు. సికింద్రాబాద్ యోగాలయ నిర్వహకుడు డాక్టర్ వాసిలి వసంత్ కుమార్, హిందూ ధర్మ ప్రతినిధి స్వామి విజయానంద, ఇస్లాం ప్రతినిధి సూఫీ షేక్ అహ్మద్ జానీ, క్రైస్తవ ప్రతినిధి ఎస్.బాలశౌరి, బౌద్ధం ప్రతినిధి పూజ్య భంతే, సిక్కు మత ప్రతినిధి గురుచరణ్ సింగ్‌తో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి, సమ్మేళనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సమాజంలో శాంతి, మానవత్వం విలువలను తెలియజేయడానికి సర్వధర్మ సమ్మేళన సభలు నిర్వహిస్తున్నామని అన్నారు. మానవ జన్మను సార్థకం చేసుకునేందుకు ఆధ్యాత్మికతను అలవరచుకోవాలని సూచించారు. మానవత్వమే మతమని గ్రహించాలని, ఈశ్వర తత్వాన్ని పాటించాలని అన్నారు. -
అద్వితీయం
కాకినాడ జిల్లా ఏలేశ్వరం 162 కాకినాడ 3,987 తుని 3,073 కోనసీమ జిల్లా అమలాపురం 1,588 రామచంద్రపురం 1,795 రావులపాలెం 2,295 రాజోలు 1,089 2024 నుంచి 2025 ఫిబ్రవరి నెలాఖరు వరకూ డిపోల వారీగా కార్గో ఆదాయం (రూ.) రాజమహేంద్రవరం 8,07,00,000 గోకవరం 23,72,000 నిడదవోలు 28,75,000 కొవ్వూరు 1,99,00,000 ఏలేశ్వరం 32,00,000 కాకినాడ 3,53,00,000 తుని 1,78,00,000 అమలాపురం 1,91,00,000 రామచంద్రపురం 98,00,000 రావులపాలెం 2,19,00,000 రాజోలు 97,48,000 ఉమ్మడి జిల్లాలో డిపోల వారీగా డీజీటీ వాహనాలు రాజమహేంద్రవరం 1 కొవ్వూరు 2 అమలాపురం 3 రాజోలు 2 జిల్లాల వారీగా ఏటీబీలు తూర్పుగోదావరి 34 కాకినాడ 16 కోనసీమ 15 2024 నుంచి 2025 ఫిబ్రవరి నెలాఖరు వరకూ డిపోల వారీగా డోర్ డెలీవరీ సేవలు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం 8,298 గోకవరం 695 నిడదవోలు 514 కొవ్వూరు 734 ● ఆర్టీసీ డోర్ డెలివరీలో ఉమ్మడి జిల్లాకు రెండో స్థానం ● దండిగా రాబడిరాజమహేంద్రవరం సిటీ: ప్రయాణికులతో పాటు సరకుల రవాణా ద్వారా కూడా ఏపీఎస్ ఆర్టీసీ ఆదాయం పెంచుకుంటోంది. సామాన్యులకు అతి తక్కువ చార్జీలతో సరకుల రవాణాను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. అధిక బరువు సరకులుంటే ఆర్టీసీకి చెందిన డిపో గూడ్స్ ట్రాన్స్పోర్ట్ (డీజీటీ) వాహనాన్ని వినియోగదారు వద్దకే పంపించి, వాటిని రవాణాకు చర్యలు చేపట్టింది. అతి తక్కువ ధరకే సరకులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నిర్ణీత సమయంలో భద్రంగా చేరవేస్తూ వినియోగదారుల మన్ననలు పొందుతోంది. మొదట్లో కార్గో సేవలు ముఖ్యమైన ఆర్టీసీ బస్టాండ్లకే పరిమితమయ్యాయి. అక్కడే ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేసి, సరకులు రవాణా చేసేవారు. ప్రజల నుంచి మంచి ఆదరణ రావడంతో మరో అడుగు ముందుకేసి, పట్టణాల్లో సరకుల డోర్ డెలివరీ సేవలకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి జిల్లాలోని 11 డిపోల్లో 10 కిలోమీటర్ల పరిధిలో 50 కేజీల వరకూ సరకులను డోర్ డెలివరీ ద్వారా అందిస్తున్నారు. ఈవిధంగా డోర్ డెలీవరీ సేవల్లో రాష్ట్రంలోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ప్రయాణికుల సేవలతో పాటు కార్గో సేవలను మరింత సులభంగా అందించే లక్ష్యంతో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆథరైజ్డ్ టికెట్ బుకింగ్ కౌంటర్లు (ఏటీబీ) కూడా ఏర్పాటు చేసింది. తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఏటీబీ కౌంటర్లకు అవకాశం ఆర్టీసీ రవాణాలో భాగస్వాములయ్యేలా యువతకు ఏటీబీ కౌంటర్లు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో రూ.వెయ్యి, నగర, పట్టణ ప్రాంతాల్లో రూ.5 వేల చొప్పున ధరావత్తు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించే మార్గంలో కౌంటర్ ఏర్పాటుకు అవసరమైన గదితో పాటు కంప్యూటర్, వేయింగ్ మెషీన్ ఏర్పాటు చేసుకోవాలి. ఆసశక్తి ఉన్న యువత రాజమహేంద్రవరంలోని జిల్లా ప్రజా రవాణా శాఖ కార్యాలయంలో సంప్రదించాలి. – మాధవ్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, ఏపీఎస్ ఆర్టీసీ, రాజమహేంద్రవరం -
కూటమిలో కుంపటి
ఫ జనసేన, టీడీపీ వాగ్వాదం ఫ అభివృద్ధి పనుల శంకుస్థాపనలో రగడ కొత్తపల్లి: కూటమిలో నాయకుల్లో కుంపటి రాజుకుంది.. అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం చర్చనీయాంశమైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా, ఇలా పనులకు శంకుస్థాపన చేయడం విమర్శలకు దారితీసింది.. అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూడడం గమనార్హం. కొత్తపల్లి మండలం మూలపేట జిల్లా పరిషత్ పాఠశాల క్రీడా మైదానానికి ప్రహరీ నిర్మాణానికి ఉపాధి హామీ పథకం నిధులు రూ.34 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిర్మాణానికి సోమవారం జనసేన పార్టీ నాయ కులు శంకుస్థాపన చేశారు. పాఠశాల అభివృద్ధి కమిటీ ఉండగా ప్రహరీ నిర్మాణానికి మీరెందుకు శంకుస్థాపన చేస్తారంటూ టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరుపార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా, ఏ విధంగా శంకుస్థాపన చేస్తారని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. దీనిపై మండల ఇంజినీరింగ్ అధికారి శ్రీనివాస్‌ను సాక్షి వివరణ కోరగా ప్రహరీ నిర్మాణానికి విడతల వారీగా ఉపాధి హామీ పథకం నుంచి రూ.34 లక్షలు మంజూరయ్యాయని అన్నారు. ఈ పనులకు సంబంధించి గ్రామ పంచాయతీ తరఫున తీర్మానం అందించాల్సి ఉందన్నారు. అయితే ఇంకా ఎటువంటి తీర్మానం ఇవ్వలేదని అన్నారు. -
చేబ్రోలు బైపాస్‌లో వ్యక్తి మృతదేహం
పిఠాపురం: కత్తిపూడి– పిఠాపురం రోడ్డులో చేబ్రోలు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు సోమవారం ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. చేబ్రోలు బైపాస్ రోడ్డు సమీపంలో సుమారు 40–50 ఏళ్ల వయస్సుగల వ్యక్తి మృతదేహం గుర్తించారు. దీనిని పిఠాపురం సీఐ శ్రీనివాస్ పరిశీలించి పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు. బస్ బ్రేకులు ఫెయిల్ ఫ డ్రైవర్ సమయ స్ఫూర్తితో పెళ్లి బృందానికి తప్పిన ప్రమాదం ఫ రత్నగిరి ఘాట్ రోడ్లో ఘటన అన్నవరం: సత్యదేవుని సన్నిఽధిలో జరిగిన వివాహానికి హాజరైన రాజమహేంద్రవరానికి చెందిన ఒక పెళ్లి బృందం బస్సుకు సోమవారం తెల్లవారు జామున రత్నగిరి ఘాట్ రోడ్లో త్రుటిలో ప్రమాదం తప్పింది. తెల్లవారు జామున సత్యగిరిపై జరిగిన వివాహానికి రాజమహేంద్రవరానికి చెందిన 40 మంది హాజరయ్యారు. అనంతరం వీరు తిరిగి పయనమయ్యారు. వారు ప్రయాణిస్తున్న బస్సు కొండ దిగువకు వస్తుండగా సత్యగిరి శివారు మలుపులో బస్సు బ్రేక్‌లు పట్టేయడంతో డ్రైవర్ విజయ్ అప్రమత్తమయ్యారు. బస్సును రోడ్డుకు ఎడమ వైపునకు మళ్లించి అక్కడి చెట్టుకు ఢీకొట్టారు. దీంతో బస్సు ఆ చెట్టును, దాని పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఆగిపోయింది. ఆ బస్సులో వారంతా ఆందోళన చెంది బస్సు డోర్ తీసుకుని కిందకు దిగిపోయారు. ఎవరికీ ఏవిధమైన గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు డ్రైవర్ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా బస్సు రోడ్డుకు కుడివైపున ఉన్న లోయలో పడిపోయేది. బస్సులో ఉన్నవారికి తీవ్ర గాయాలయ్యేవి. డ్రైవర్ విజయ్ సమయ స్ఫూర్తితో చెట్టును ఢీకొనడంతో తామంతా సురక్షితంగా బయట పడ్డామని పెళ్లి బృందం తెలిపింది. -
సత్యదేవునికే శఠగోపం!
● షార్ట్ టెండర్ లేకుండానే కాంట్రాక్ట్ ● ఇప్పటి వరకూ రూ.49 లక్షలకే పనులు ● ఇప్పుడు ఆరింటిగా విభజించి రూ.70 లక్షలకు పెంపు ● చక్రం తిప్పిన ఓ ఇన్స్పెక్టర్ ● అన్నవరం దేవస్థానంపై ప్రతి నెలా రూ.21 లక్షల భారంసాక్షి ప్రతినిధి, కాకినాడ: అధికారం అండతో అక్రమార్కులు ఏకంగా అన్నవరం సత్యదేవుడికే శఠగోపం పెట్టేశారు. నిబంధనలకు పాతరేసి తస్మదీయులకు రూ.లక్షల విలువైన కాంట్రాక్ట్ కట్టబెట్టేశారు. నిబంధనల ప్రకారం రూ.5 లక్షలు దాటే పనులకు టెండర్లు పిలవాలి. ఒకవేళ టెండర్లకు సమయం తక్కువగా ఉంటే కనీసం షార్ట్ టెండర్ అయినా ఆహ్వానించాలి. కానీ, అన్నవరం దేవస్థానంలో కొందరు అధికారులు, టీడీపీ నేతలు కుమ్మకై ్క అటువంటి నిబంధనలకు మంగళం పాడేశారు. ఏం జరిగిందంటే.. సత్యదేవుని సన్నిధికి వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఇబ్బంది కలగకూడదని పారిశుధ్యం, హౌస్ కీపింగ్, ధోబీ, ఎలక్ట్రికల్ వంటి పనులను కాంట్రాక్ట్‌కు ఇచ్చేందుకు రెండేళ్లకోసారి టెండర్లు పిలుస్తూంటారు. దేవస్థానంలో ఈ పనులను రెండేళ్లుగా ఒక సంస్థ నిర్వహించేది. దీనికి గాను ఆ సంస్థకు ప్రతి నెలా రూ.49 లక్షల చొప్పున చెల్లించేవారు. దీని కాంట్రాక్టు గడువు గత నవంబర్‌తో ముగిసింది. అయినప్పటికీ ప్రభుత్వం టెండర్ ద్వారా కొత్త ఏజెన్సీని ఎంపిక చేయలేదు. దీంతో దేవస్థానం అధికారుల అభ్యర్థన మేరకు ఆ ఏజెన్సీ గత నెల 28వ తేదీ వరకూ సేవలు కొనసాగించింది. గడువు ముగిసినా కాంట్రాక్ట్ కొనసాగిస్తూ పోతే ప్రతి నెలా తాము రూ.10 లక్షల మేర నష్టపోతామని నెలన్నర క్రితమే ఆ సంస్థ దేవస్థానం అధికారులకు తెలియజేసింది. చక్రం తిప్పిన ‘నంబర్–2’! గడువు ముగిసినా సేవలు కొనసాగిస్తున్న ఆ సంస్థను తప్పించి, తమ అనుయాయుడికి కట్టబెట్టేందుకు టీడీపీలో నంబర్–2గా చెప్పుకొనే ఓ నేత గట్టి ప్రయత్నమే చేశారు. అయితే, ఆ అనుయాయుడికి ఈ పనుల్లో కనీస అనుభవం కూడా లేకపోవడంతో చివరకు వెనుకడుగు వేశారు. అయినప్పటికీ పాత సంస్థ కాంట్రాక్ట్ గడువు ముగిసిపోవడంతో.. తాత్కాలిక సర్దుబాటు అనే సాకుతో ఇన్నాళ్లూ ఒకే ఏజెన్సీ నిర్వహించిన పనులను ఆరింటిగా విభజించి, తన అనుయాయులకు కట్టబెట్టారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. పారిశుధ్య కార్మికుల సరఫరా, పారిశుధ్య పనుల నిర్వహణ, శానిటేషన్ మెటీరియల్ సరఫరా, పెస్ట్ కంట్రోల్, గార్బేజ్ తరలింపు, ధోబీ, ఎలక్ట్రిసిటీ.. ఇలా పనులను విభజించేసి, షార్ట్ టెండర్లు పిలవకుండానే గుంటూరుకు చెందిన ఓ కాంట్రాక్టర్‌తో పాటు పలువురికి కట్టబెట్టేయడం విస్మయానికి గురి చేస్తోంది. దీనికోసం సంబంధిత ఏజెన్సీలతో ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారని అంటున్నారు. అంతేకాదు.. నిన్న మొన్నటి వరకూ నెలకు రూ.49 లక్షలకే జరిగిన ఈ పనులను ఇప్పుడు రూ.70 లక్షలకు పెంచేశారు. దీనంతటి వెనుక టీడీపీలో నంబర్–2గా చెప్పుకొనే ఓ సీనియర్ నేత చక్రం తిప్పారని, అందువల్లనే టెండర్లతో ప్రమేయం లేకుండానే పనులు కట్టబెట్టేశారని అంటున్నారు. దీనంతటి ఫలితంగా దేవస్థానంపై ప్రతి నెలా రూ.21 లక్షల మేర అదనపు భారం పడుతోంది. ఈ అంశం అన్నవరం కొండపై ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ముఖ్య నేత ఆదేశాలతో.. ‘దేశం’ ముఖ్య నేత ఆదేశాలతో దేవస్థానం అధికారులు దేవదాయ శాఖ కమిషనర్‌కు నోట్ ఫైల్ పంపించి, ఆగమేఘాలపై అనుమతులు రప్పించారనే ఆరోపణలు వస్తున్నాయి. విజయవాడ నుంచి డెప్యుటేషన్‌పై వచ్చి, గడువు కూడా ముగిసినా దేవస్థానాన్ని వదిలిపెట్టని ఓ ఇన్స్పెక్టర్ ఈ వ్యవహారంలో చక్రం తిప్పారని కొండపై ప్రచారం జరుగుతోంది. పైగా ఆయన కూడా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన తన సన్నిహితుడికి ఒక విభాగాన్ని ఇప్పించుకున్నారని తెలిసింది. స్వామి సన్నిధిలో సేవలన్నింటినీ ఒకే ఏజెన్సీ నిర్వహిస్తే బాధ్యతగా ఉంటుందనే ఉద్దేశంతో గతంలో తీసుకున్న నిర్ణయాన్ని గాలికొదిలేసి.. అనుయాయులకు అయాచిత లబ్ధి చేకూర్చే పన్నాగం పన్నారని అంటున్నారు. రెండేళ్లుగా ప్రతి నెలా రూ.49 లక్షలకే జరిగిన పనులను.. ఇప్పుడు ఆరింటిగా విభజించి రూ.70 లక్షలు చెల్లించేందుకు దేవదాయ శాఖ ఏవిధంగా ఆమోదం తెలిపిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేవలం తమ వారికి లబ్ధి చేకూర్చాలనే దుర్బుద్ధితోనే ఇలా చేశారని పలువురు విమర్శిస్తున్నారు. వాస్తవానికి ఇన్ని లక్షల రూపాయల విలువైన కాంట్రాక్ట్‌ను కనీసం షార్ట్ టెండరయినా పిలవకుండా.. అధికారం చేతిలో ఉందనే ధైర్యంతో ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయి వరకూ గట్టి లాబీయింగ్ చేసి పని చక్కబెట్టేశారని అంటున్నారు. పాత సంస్థ కాంట్రాక్ట్ కాలపరిమితి గత నవంబర్లోనే ముగిసింది. ఇన్ని నెలలైనా దేవస్థానం అధికారులు షార్ట్ టెండర్ పిలవాలనే ఆలోచన చేయకపోవడం వెనుక.. తమ వారికి కాంట్రాక్ట్ కట్టబెట్టాలనే టీడీపీ నేత వ్యూహం ఉందని కొండపై చర్చ జరుగుతోంది. అన్నవరం దేవస్థానంలో వస్తున్న ఆదాయానికి, ఖర్చులకు పొంతన లేకుండా పోతోందని కొంత కాలంగా భక్తుల నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో దేవస్థానం అధికారులు ఖర్చులు తగ్గించుకుని, ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించాలి. అలా కాకుండా అధికార పార్టీ నేతలకు అయాచిత లబ్ధి చేకూర్చేలా చర్యలు చేపట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. -
రత్నగిరిపై కనకవర్షం
● సత్యదేవునికి రికార్డు స్థాయి ఆదాయం ● 30 రోజులకు హుండీల ద్వారా రూ.1.89 కోట్ల రాబడి అన్నవరం: మాఘ మాసం పుణ్యమా అని రత్నగిరిపై కనకవర్షం కురిసింది. గడచిన 30 రోజులకు గాను అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి హుండీల ద్వారా రికార్డు స్థాయిలో రూ. 1,88,91,940 ఆదాయం సమకూరింది. దేవస్థానంలోని హుండీలను సోమవారం తెరచి, భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. నగదు రూ. 1,80,63,749, చిల్లర నాణేలు రూ.8,28,191 వచ్చా యని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. వీటితో పాటు బంగారం 66.010 గ్రాములు, వెండి 693 గ్రాములు వచ్చాయని చెప్పారు. విదేశీ కరెన్సీ హుండీల ద్వారా సత్యదేవునికి పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ కూడా లభించింది. అమెరికన్ డాలర్లు 129, సింగపూర్ డాలర్లు 50, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ దీనార్ 21, ఇంగ్లండ్ పౌండ్లు 10, ఖతార్ రియల్స్ 28, ఆస్ట్రేలియా డాలర్లు 25, యూఏఈ దీర్హామ్స్ 530, యూరోలు 5, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ బైసా 100, మలేషియా రింగిట్స్ 6 లభించాయి. కలిసొచ్చిన మాఘం గడచిన మాఘ మాసంలో రత్నగిరిపై పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. అలాగే ఫాల్గుణ మాసంలో కూడా గత మూడు రోజులుగా రత్నగిరిపై జోరుగా వివాహాలు జరుగుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న వారు కూడా అధిక సంఖ్యలో సత్యదేవుని ఆలయానికి తరలి వస్తున్నారు. అలాగే, గత నెలలో భీష్మ ఏకాదశి సందర్భంగా సుమారు లక్ష మంది భక్తులు సత్యదేవుని దర్శనానికి వచ్చారు. ఇలా వచ్చిన భక్తులందరూ పెద్ద మొత్తంలో హుండీల్లో కానుకలు సమర్పించారు. దీంతో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందని, హుండీల ద్వారా రోజుకు సగటున రూ.6,09,412 రాబడి వచ్చిందని చైర్మన్, ఈఓ తెలిపారు. హుండీల ఆదాయం లెక్కింపులో పలు స్వచ్ఛంద సంస్థల సిబ్బంది పాల్గొన్నారు. వచ్చిన నగదును స్థానిక స్టేట్ బ్యాంకుకు తరలించారు. -
పొగిలిన పేగు బంధం
ఫ రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి ఫ తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులు ఫ రామవరం వద్ద సంఘటన జగ్గంపేట/ కిర్లంపూడి: అనుకోని ప్రమాదం ఆ కుటుంబాల్లో విషాదం నింపింది.. కుమారుల మృతి ఆ మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.. లే కొడుకా, రా కొడుకా అంటూ విగతజీవులుగా మారిన తమ బిడ్డలను చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.. ఈ హృదయ విదారక ఘటన జగ్గంపేట మండలం రామవరం వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో కిర్లంపూడి మండలం బూరుగుపూడి గాంధీనగర్‌కు చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలవడం అందరినీ కలచివేసింది. చేతికందొచ్చిన కొడుకులు అనంత లోకాలకు వెళ్లారనే కబురుతో ఆ తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతమైంది. జగ్గంపేట పోలీసుల కథనం ప్రకారం.. కిర్లంపూడి మండలం బూరుగుపూడి గాంధీనగర్‌కు చెందిన రౌతుల హర్షవర్థన్ (19), షేక్ అబ్దుల్లా (19), వేణు మణికంఠ (19)లు ఒకే మోటారు సైకిల్‌పై సోమవారం సాయంత్రం పుస్తకాలు కొనుక్కునేందుకు జగ్గంపేట బయలు దేరారు. వీరు రామవరం వద్దకు వచ్చేసరికి ముందు వెళుతున్న ట్రాలీని తప్పించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మోటార్ సైకిల్ అదుపు తప్పి ట్రాలీ వెనుక చక్రాల కింద పడిపోయారు. ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. రౌతుల హర్షవర్ధన్, షేక్ అబ్దుల్లా అక్కడికక్కడే మృతి చెందగా, వేణు మణికంఠను జగ్గంపేట సీహెచ్‌సీకి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. మాజీ మంత్రి, జగ్గంపేట వైఎస్సార్ సీపీ ఇన్చార్జి తోట నరసింహం బూరుగుపూడి మీదుగా జగ్గంపేట వస్తుండగా ప్రమాదం జరగడాన్ని గమనించారు. తక్షణం అక్కడి నుంచి జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. అయితే అప్పటికే ఇద్దరు యువకులు మృతి చెందడం గుర్తించి, గాయపడిన మరో యువకుడిని తక్షణం ఆసుపత్రికి తరలించాలని చెప్పారు. ఆసుప్రతి వద్ద బాధిత కుటుంబాలను తోట నరసింహం, తోట రాంజీ, పాటంశెట్టి సూర్యచంద్ర పరామర్శించారు. సమాచారం అందుకున్న జగ్గంపేట సీఐ శ్రీనివాస్, ఎస్సై రఘునాథరావులు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతదేహాలను పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పుస్తకాల కోసం వెళ్తానని చెప్పి.. బూరుగుపూడికి చెందిన రౌతుల సురేష్, సుమనాగలక్ష్మి అదే గ్రామంలో రోడ్డుపై టీ అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె. కుమారుడు రౌతుల హర్షవర్థన్. తాము పడుతున్న కష్టాలు తమ పిల్లలు పడకూడదని రాత్రీపగలు తేడా లేకుండా కష్టపడి పిల్లలను ఆ దంపతులు చదివించుకుంటున్నారు. హర్షవర్థన్ పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 17 నుంచి జరగబోయే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, పెన్నులను కొనుక్కోవాలని చెప్పడంతో డబ్బులు ఇచ్చి జాగ్రత్తగా వెళ్లి రా నాయనా.. అని చెప్పి పంపిన ఆ తల్లిదండ్రులకు కొద్ది నిమిషాల్లో తమ కొడుకు మరణించాడనే వార్త తెలియడంతో బోరున విలపిస్తున్నారు. చేదోడుగా ఉంటాడనుకుంటే.. షేక్ సుల్తాన్, మీరాబీ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో మధ్యలోనే పిల్లల చదువులు ఆపేసి వారితో పాటు స్థానికంగా ఉన్న సాగో ఫ్యాక్టరీలో కూలి పని చేసుకుంటున్నారు. తన చిన్న కుమారుడు మృతుడు షేక్ అబ్దుల్లా అప్పటి వరకూ తమ కళ్ల ముందు చలాకీగా తిరిగి అంతలోనే మరణించాడనే వార్త తెలియడంతో జీర్ణించుకులేకపోతున్నామని తల్లిదండ్రులు అంటున్నారు. ఇద్దరు కుమారులు చేదోడుగా ఉంటారనుకున్నామనే సమయంలో చిన్న కొడుకు ఇక లేడనే వార్త కలచివేస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఎవరి కోసం బతకాలి వేణు వీరబాబు, వరలక్ష్మి దంపతులకు వేణు మణిికంఠ ఒక్కగానొక్క కుమారుడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో మణికంఠ చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. దీంతో అదే గ్రామంలో ఉన్న సైకిల్ రిపేర్ షాపులో పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉంటున్నాడు. తలదాచుకోవడానికి ఇల్లు లేకపోయినా, ఆర్థిక పరిస్థితులు వెంటాడుతున్నా.. కొండంత అండగా తన కొడుకు ఉన్నాడనే బతుకుతున్నామని ఆ తల్లిదండ్రులు అంటున్నారు. చేదికందొచ్చిన కొడుకు మరణించడంతో తమకు దిక్కెవరని బోరున విలపిస్తున్నారు. బూరుగుపూడిలో విషాదం కిర్లంపూడి మండలం బూరుగుపూడి గాంధీనగర్‌కు చెందిన ముగ్గురు యువకుల మరణవార్తతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. చేతికందొచ్చిన కుమారులు అనంత లోకాలకు వెళ్లారనే సమాచారంతో అంతా తల్లడిల్లిపోయారు. -
హత్య కేసులో వ్యక్తికి జీవిత ఖైదు
కంబాలచెరువు, (రాజమహేంద్రవరం): హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి ఆర్.శ్రీలత తీర్పు చెప్పారు. 2021 సెప్టెంబర్ 25న జరిగిన ఈ కేసు వివరాలను స్థానిక మూడో పట్టణ పోలీసులు తెలిపారు. స్థానిక సీటీఆర్ఐ దుర్గానగర్ ప్రాంతానికి చెందిన జీరీ వెంకట తోటయ్యరెడ్డిని పాత గొడవల నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ యర్రా సాయి కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశాడు. అప్పటి మూడో పట్టణ ఇన్స్పెక్టర్ జి.మధుబాబు కేసు నమోదు చేశారు. వాదోపవాదాల అనంతరం యర్రా సాయి నేరం రుజువు కావడంతో అతడికి జీవిత ఖైదు, రూ.20 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ క్రికెట్ బెట్టింగ్‌ను ఆర్గనైజ్డ్ క్రైమ్‌గా డీఎస్పీ రఘువీర్ తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్‌లో ఎక్కువగా యువత చిక్కుకుంటున్నారన్నారు. సోమేశ్వరంలో నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ మూలాలను పట్టుకుంటామన్నారు. విచారణ కొనసాగుతుందని చెప్పారు. అనుమానిత ప్రాంతాల్లో నిఘా పెంచుతామన్నారు. క్రికెట్ బెట్టింగ్‌లో పాల్గొని, డబ్బులు కోల్పోయిన వారు చెడు వ్యసనాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై దృష్టి సారించాలన్నారు. అలాగే ప్రజలు కూడా పోలీసులకు సహకారం అందించాలన్నారు. క్రికెట్ బెట్టింగ్, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఫ పోలీసుల అదుపులో ఆరుగురు ఫ పరారీలో మరో నిందితుడు రాయవరం: ఒకపక్క ఇండియా– న్యూజిలాండ్ వన్ డే క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా.. మరోపక్క ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు క్రికెట్ బెట్టింగ్ బ్యాచ్‌పై దాడి చేశారు. అయితే సోమేశ్వరంలో అదుపులోకి తీసుకున్న నిందితులు ఇచ్చిన సమాచారంతో రాజానగరం మండలం చక్రద్వారబంధం వెళ్లి అక్కడ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలను సోమవారం రాయవరం పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. సోమేశ్వరం గ్రామ వినాయక కాలనీలో లింగాపు సతీష్ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారంపై జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాలతో రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ ఆధ్వర్యంలో మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు, రాయవరం, మండపేట రూరల్ ఎస్సైలు డి.సురేష్‌బాబు, పి.బుజ్జిబాబులు దాడి చేశారు. ఆ సమయంలో ముగ్గురు ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా, ఒక వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఇద్దరు నిందితులు ఇచ్చిన సమాచారంతో రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామంలో గుట్టుగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ బెట్టింగ్ అంతా ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు గమనించిన పోలీసులు వారి ఖాతాల్లో సోమవారం రూ.7.35 లక్షల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. భీమవరం, గొల్లప్రోలు, కొత్తపేట, సోమేశ్వరం గ్రామాలకు చెందిన పులి వెంకటేష్, గాడి గణేష్, అక్కిరెడ్డి వినయ్, నిమ్మకాయల రవి, కేతా నరేంద్ర, కేఏ రెడ్డిలను అదుపులోకి తీసుకుని వారు ఉపయోగించిన రెండు క్రికెట్ లైన్ బాక్సులు, నాలుగు ల్యాప్‌టాప్‌లు, 49 సెల్ఫోన్లు, ఒక సోనీ వాయిస్ రికార్డర్, ఒక ట్యాబ్, ఒక 32 అంగుళాల ఎల్ఈడీ టీవీ తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
హెచ్ఎంను సాగనంపండి..
గొర్రిపూడి విద్యార్థినులు, గ్రామస్తుల డిమాండ్ కరప: అభం, శుభం తెలియని చిన్నారుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న గొర్రిపూడి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు అడబాల కాశీవిశ్వేశ్వరరావును ఇంటికి సాగనంపాలని విచారణాధికారిగా వచ్చిన డీవైఈఓ ఎన్.వెంకటేశ్వరరావు వద్ద గ్రామస్తులు ఏకరవు పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే.. కరప మండలం గొర్రిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎంగా అడబాల కాశీవిశ్వేశ్వరరావు పనిచేస్తున్నారు. కొంతకాలంగా 10, 9వ తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, వేధింపులకు గురిచేస్తున్నారని రెండు నెలల కిందట విద్యార్థినుల తల్లిదండ్రులు కరప పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు హైస్కూల్‌కు వెళ్లి విచారణ జరిపి, హెచ్ఎం కాశీవిశ్వేశ్వరరావు వేధింపులకు పాల్పడుతున్నట్టు నిర్ధారించగా, పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తల్లిదండ్రులు, గ్రామస్తులు హెచ్చరించి వదిలేశారు. అయినా హెచ్ఎం వైఖరిలో మార్పు రాకపోవడంతో వారం రోజుల క్రితం విద్యార్థినులు, తల్లిదండ్రులు పోలీసు కంట్రోల్ రూమ్‌కు, విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హెచ్ఎంపై కేసు నమోదు చేసి, ఈ నెల 1న కరప ఎస్ఐ టి.సునీత గొర్రిపూడి హైస్కూల్‌కి వెళ్లి విద్యార్థినులను విచారణ జరిపి, నివేదిక పైఅధికారులకు అందజేశారు. జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు సోమవారం కాకినాడ డీవైఈఓ ఎన్.వెంకటేశ్వరరావు, ఎంఈఓలు కె.బుల్లికృష్ణవేణి, పి.సత్యనారాయణలతో కలసి గొర్రిపూడి హైస్కూల్‌కు వెళ్లి గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయులతో విడివిడిగా సమావేశమై హెచ్ఎం కాశీవిశ్వేశ్వరరావుపై విచారణ జరిపారు. హెచ్ఎం గతంలో పనిచేసిన పాఠశాలల్లో కూడా ఇలా అసభ్యకరంగా ప్రవర్తించారని, అయినా ఎక్కడా తనపై చర్యలు తీసుకోకుండా అందరినీ మేనేజ్ చేసి బయటపడ్డాడని తెలిసిందని, ఇప్పుడు తమ గ్రామంలోనూ హెచ్ఎం వేధింపులకు పాల్పడుతున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని గొర్రిపూడి గ్రామస్తులు రాత పూర్వకంగా డీవైడీఈఓకు అందజేశారు. తర్వాత ఉపాధ్యాయులకు వివిధ ప్రశ్నలతో కూడిన వినతి పత్రాన్ని ఇచ్చి సదరు హెచ్ఎం కాశీవిశ్వేశ్వరరావుపై అభిప్రాయాలు సేకరించారు. అనంతరం 9వ, 10వ తరగతి విద్యార్థినులతో డీవైఈఓతో పాటు ఎంఈఓలు బుల్లికృష్ణవేణి, సత్యనారాయణలు సమావేశమై విచారణ జరిపారు. తమ పట్ల హెచ్ఎం ఎలా ప్రవర్తించారో వారు వివరించారు. ఈ నివేదికను డీఈఓకు అందజేస్తామని డీవైఈఓ వెంకటేశ్వరరావు తెలిపారు. -
శరవేగంగా గ్రీన్‌ఫీల్డ్ హైవే
దేవరపల్లి: రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నిర్మీస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో నాలుగు నెలల్లో ఈ జాతీయ రహదారి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఎక్కడా గ్రామాలను తాకకుండా పచ్చని పంట పొలాల మధ్య నుంచి దీనిని నిర్మీస్తున్నారు. ఈ హైవే నిర్మాణం పూర్తయితే ఉత్తరాంధ్ర నుంచి తెలంగాణకు రవాణా సదుపాయం మెరుగుపడడంతో పాటు సమయం, దూరం ఆదా అవుతాయి. 162 కిలోమీటర్ల పొడవు... రూ.2,200 కోట్ల వ్యయం తెలంగాణలోని ఖమ్మం నుంచి తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి వరకూ రూ.2,200 కోట్లతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) సుమారు 162 కిలోమీటర్ల పొడవున ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేను నిర్మీస్తోంది. ఇది పూర్తయితే దేవరపల్లి – ఖమ్మం మధ్య సుమారు 70 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. దీని నిర్మాణానికి 2022 ఏప్రిల్‌లో అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. గత ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ హైవే నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా అధిక వర్షాలు, తుపానుల కారణంగా పనుల్లో జాప్యం జరిగింది. ఆంధ్రాలో హైవే సాగుతుందిలా.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి సమీపంలోని రేచర్ల నుంచి ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి టి.నర్సాపురం, వేపుగుంట, గుర్వాయగూడెం, బొర్రంపాలెం, జంగారెడ్డిగూడెం వద్ద మద్ది ఆంజనేయస్వామి ఆలయం సమీపాన ఎర్రకాలువ మీదుగా కొయ్యలగూడెం మండలం రాజవరం, యర్రంపేట, దేవరపల్లి మండలం యాదవోలు, చిన్నాయగూడెం,గోపాలపురం మండలం వాదాలకుంట, వెదుళ్లకుంట గ్రామాల మీదుగా దేవరపల్లి వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిని కలుస్తుంది. జంగారెడ్డిగూడెం వద్ద పుట్లగట్లగూడెం–గుర్వాయగూడెం వద్ద జంక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి 83 ఎకరాలు సేకరించారు. ఖమ్మం–దేవరపల్లి మధ్య 8 టోల్‌ప్లాజాలు, 51 మైనర్, 9 మేజర్ బ్రిడ్జిలు నిర్మీస్తున్నారు. ఉమ్మడి ‘పశ్చిమ’లో 72 కిలోమీటర్లు గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులను హైదరాబాద్‌కు చెందిన డెకెం సంస్థ చేపట్టింది. తెలంగాణలో ఖమ్మం నుంచి రేచర్ల వరకూ ఒకే ప్యాకేజీగా పనులు జరుగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 72 కిలోమీటర్ల పొడవును మూడు ప్యాకేజీల్లో ఈ పనులు జరుగుతున్నాయి. సేకరించిన భూములకు రైతులందరికీ పరిహారం అందించారు. భూసేకరణకు అడ్డంకులు గ్రీన్‌ఫీల్డ్ హైవేకి అవసరమైన భూసేకరణకు కొయ్యలగూడెం మండలం పొంగుటూరు వద్ద బ్రేక్ పడింది. ఆ గ్రామానికి చెందిన రైతు కోర్టుకు వెళ్లడంతో మూడెకరాల భూసేకరణ నిలిచిపోయింది. న్యాయస్థానం తీర్పు రిజర్వులో పెట్టి దాదాపు ఏడాది కావస్తోంది. తీర్పు కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు.రూ.2 కోట్లకు ఎకరం ధరఇప్పటికే రెండు హైవేలు ఉండటం, మరో హైవే వస్తుండటంతో దేవరపల్లి ప్రాంతంలో ఇప్పటికే భూముల ధరలు ఊహించని విధంగా పెరిగాయి. ఎకరం రూ.2 కోట్లు పైగా పలుకుతోంది. మూడు జాతీయ రహదారులు అందుబాటులోకి రావడంతో మెట్ట ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. పంట ఉత్పత్తులను దూర ప్రాంతాల్లోని మార్కెట్లకు రవాణా చేయడం ద్వారా రైతులు గిట్టుబాటు ధర పొందే అవకాశం కలుగుతుంది.ఇప్పటికే ఈ ప్రాంతం నుంచి రైతులు హైదరాబాద్, విశాఖపట్నం, విజయనగరం, కోల్‌కతా వంటి ప్రాంతాలకు వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా నిమ్మ, అరటి, కోకో, జీడిగింజల వంటి పంట ఉత్పత్తులు వస్తుంటాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ సహకారంతో కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ దీని నిర్మాణ పనులు చేపట్టింది. ఈ నేపథ్యంలో మొన్నటి వరకూ సాధారణ జంక్షన్‌గా ఉన్న దేవరపల్లి ఇప్పుడు మూడు జాతీయ రహదారుల జంక్షన్‌గా కొత్త రూపు సంతరించుకుంటోంది. కోల్‌కతా– చెన్నై 16వ నంబర్ జాతీయ రహదారి దేవరపల్లి మీదుగానే సాగుతోంది. అలాగే, దేవరపల్లి – ఖమ్మం జిల్లా తల్లాడ మధ్య ఇప్పటికే 316డి హైవే ఉంది.ఇప్పుడు కొత్తగా దేవరపల్లి – ఖమ్మం మధ్య కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మీస్తున్నారు. ఇది 16వ నంబర్ జాతీయ రహదారిని దేవరపల్లి వద్ద గోపాలపురం రోడ్డులోని డైమండ్ జంక్షన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో కలుస్తుంది. ఈ ప్రాంతంలో మూడు హైవేలు కలుస్తూండటంతో వాటిని విభజిస్తూ నూతన టెక్నాలజీతో అవుటర్ రింగ్ రోడ్డు (డ్రమ్‌ఫుట్) నిర్మీస్తున్నారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేకి ప్రభుత్వం సుమారు 1,100 ఎకరాలు సేకరించింది. 85 శాతం పూర్తి ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకూ రేచర్ల నుంచి గుర్వాయగూడెం వరకూ 85 శాతం, అక్కడి నుంచి దేవరపల్లి వరకూ 65 శాతం పనులు పూర్తయ్యాయి. వంతెనలు, కల్వర్టుల నిర్మాణాలు పూర్తయ్యాయి. దేవరపల్లి వద్ద డ్రమ్‌ఫుట్ నిర్మాణం జరుగుతోంది. మొత్తంగా 85 శాతం పనులు పూర్తయ్యాయి. వచ్చే జూన్ నాటికి ఈ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. – సురేంద్రనాథ్, పీడీ, నేషనల్ హైవేస్, రాజమహేంద్రవరం -
ఐదు నుంచి వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలు
● ఐదు రోజులు విశేష వాహన సేవలు ● 6న వైభవంగా శ్రీవారి కళ్యాణోత్సవం కొత్తపేట: ఆత్రేయపురంలోని లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకూ వైభవంగా నిర్వహించనున్నారు. ఆ మేరకు ఆలయ శాశ్వత ధర్మకర్త, ఆలయ కమిటీ చైర్మన్ పాతపాటి వెంకట సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో వెంకట సత్యరాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో ఐదు రోజుల పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల వివరాలను ఉత్సవ కమిటీ సభ్యులు ఆదివారం విలేకరులకు తెలిపారు. ఐదో తేదీ తెల్లవారు జాము నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాలలో ఆ రోజు నుంచి వివిధ వాహనాలపై శ్రీవారి ఊరేగింపులు కనువిందు చేయనున్నాయి. రాత్రి 7.30 గంటలకు శేష వాహనోత్సవం నిర్వహిస్తారు. ఆరో తేదీ ఉదయం 10.30 గంటలకు శ్రీవారి కళ్యాణోత్సవం, సాయంత్రం 6 గంటలకు హనుమద్ వాహనోత్సవం, 7న ఉదయం 108 బిందెలతో కలశాభిషేకం, మహిళలచే సామూహిక కుంకుమార్చన, సాయంత్రం 108 తామర పుష్పాలతో మహాలక్ష్మీహోమం, అనంతరం సింహ వాహనోత్సవం నిర్వహిస్తారు. 8న గరుడ వాహనోత్సవం, అనంతరం శంకు, చక్ర నామార్చన, సహస్ర దీపాలంకరణ సేవ, ఊంజల్ సేవ నిర్వహిస్తారు. 9 న మహా శాంతి హోమం, పూర్ణాహుతి, అనంతరం శ్రీచక్ర స్నానం, అన్న సమారాధన, పల్లకిసేవ, రాత్రి శ్రీపుష్పయాగోత్సవం నిర్వహించనున్నారు. -
కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
● 28 టేబుళ్లు.. 17 రౌండ్లు ● 2,18,902 ఓట్ల లెక్కింపుఏలూరు (మెట్రో): ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు సోమవారం ప్రారంభం కానుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆధ్వర్యంలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని ఆరు జిల్లాల్లోని 456 పోలింగ్ కేంద్రాల్లో గత నెల 27న పోలింగ్ జరిగింది. 69.50 శాతం పోలింగ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3,637, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 47,125, ఏలూరు జిల్లాలో 29,651, కాకినాడ జిల్లాలో 47,150, తూర్పు గోదావరి జిల్లాలో 42,446, పశ్చిమ గోదావరి జిల్లాలో 48,893 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 69.50 శాతం ఓటింగ్ నమోదు కాగా, బ్యాలెట్ బాక్సులను ఏలూరులోని స్ట్రాంగ్ రూములో భద్రపరిచారు. ఈ ఎన్నికల బరిలో 35 మంది నిలిచారు. టీడీపీ బలపర్చిన పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులు మధ్య ప్రధాన పోటీ నెలకొందని భావిస్తున్నారు. ఉదయం 7 గంటలకు.. కౌంటింగ్ కేంద్రానికి సిబ్బంది 6.30 గంటలలోపు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. మూడు షిప్టుల్లో 700 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొంటారు. మొత్తం 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 17 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. ప్రతి టేబుల్‌కు కౌంటింగ్ సిబ్బంది, సూపర్వైజర్, రోల్ ఇన్చార్జి, షిఫ్ట్ ఇన్చార్జి, మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వహిస్తారు. సమగ్ర శిక్షణ ఏలూరు (ఆర్ఆర్ పేట): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కౌంటింగ్ ఏర్పాట్లను ఆదివారం ఆమె పరిశీలించారు. కౌంటింగ్‌పై సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇచ్చామన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి రెండు మూడు రోజుల సమయం పట్టవచ్చన్నారు. పూర్తి భద్రతా ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు. కౌంటింగ్ సిబ్బందికి డ్యూటీ పాసులు, ఏజెంట్లకు ఐడీ కార్డులు జారీ చేశామన్నారు. పాస్ లేనిదే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రంలోనికి సెల్ఫోన్లను నిషేధించామన్నారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద నిర్వహిస్తామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఈపీడీసీఎల్ ఎస్ఈ పి.సాల్మన్‌రాజును కలెక్టర్ ఆదేశించారు. -
లోవలో భక్తుల సందడి
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో ఆదివారం రద్దీ నెలకొంది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 15 వేల మంది క్యూలైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకున్నట్లు ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1.12.800. పూజా టికెట్లకు రూ.68 వేలు, కేశఖండనకు రూ.11,400, వాహన పూజలకు రూ.4,500, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.34,610, విరాళాలు రూ.72,972 కలిపి మొత్తం రూ.3,04,285 ఆదాయం సమకూరిందని వివరించారు. -
కోటసత్తెమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ తల్లిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానార్చకుడు అప్పారావుశర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. దర్శనాలు, ప్రసాదం, పూజా టికెట్లు, ఫొటోల అమ్మకం ద్వారా దేవస్థానానికి రూ.1,04,088 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్య ప్రకాష్ తెలిపారు. ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నర్సరీలో హైకోర్టు న్యాయమూర్తి కడియం: కడియపులంకలోని పుల్లా ఆంజనేయులుకు చెందిన శ్రీ సత్యదేవ నర్సరీని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు ఆదివారం సందర్శించారు. నర్సరీ అధినేత ఆంజనేయులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. వివిధ రకాల మొక్కల గురించి వివరించారు. కడియం ప్రాంత నర్సరీలు అద్భుతంగా ఉన్నాయని న్యాయమూర్తి అన్నారు. పుల్లా వీరబాబు, పుల్లా రాజశేఖర్, డీఎస్పీ భవ్యకిశోర్, తహసీల్దార్ సునీల్ తదితరులు పాల్గొన్నారు. నేడు హుండీల ఆదాయం లెక్కింపు అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించనున్నారు. అన్నవరం దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని గత జనవరి 30వ తేదీన లెక్కించారు. తిరిగి 30 రోజుల అనంతరం లెక్కింపు చేపట్టనున్నారు. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకూ మాఘ మాసం కావడంతో సత్యదేవుని ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. వారు హుండీల్లో పెద్ద మొత్తంలో కానుకలు సమర్పించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఈసారి హుండీల ద్వారా సుమారు రూ.1.5 కోట్లు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హుండీల ఆదాయం లెక్కింపును దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.సుబ్బారావు పర్యవేక్షించనున్నారు. లెక్కింపులో దేవస్థానం సిబ్బంది అందరూ పాల్గొనాలని ఈఓ ఆదేశించారు. అయినవిల్లికి పోటెత్తిన భక్తులు అయినవిల్లి: సంకటహర చతుర్థి సందర్భంగా ఆదివారం అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని పూజలు చేయించుకున్నారు. 2,730 మంది భక్తులు స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు వివిధ పూజల టికెట్లు, అన్నదాన విరాళాల ద్వారా దేవస్థానానికి రూ.2,70,660 ఆదాయం లభించినట్లు ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. కొత్త అల్లుడికి కోనసీమ మర్యాదలు 29 వంటకాలతో విందు భోజనం అమలాపురం టౌన్: ఇంటికి వచ్చిన అల్లుడికి ఆ కుటుంబ సభ్యులు కోనసీమ మర్యాదలు రుచి చూపించారు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి యర్రమల్లు వంశీకి అమలాపురం శ్రీరామపురానికి చెందిన ప్రత్యూషతో ఇటీవల వివాహమైంది. అత్తవారింటికి ఆదివారం వచ్చిన వంశీ 29 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. కొత్త దంపతులిద్దరికీ సంప్రదాయబద్ధంగా ఒకే అరిటాకులో పదార్థాలన్నీ వడ్డించగా వంశీ, ప్రత్యూష ఆ విందు ఆరగించారు. కొత్త జంటకు భోజనంలో బిర్యానీ, పులిహోర, ఉల్లి చట్నీ, పన్నీర్ కర్రీ, ములక్కాడ, టమాటా కర్రీ, ఆనపకాయ కూర, చేమదుంపల పులుసు, సాంబారు, దోసకాయ పప్పు, ఆవకాయ, కొబ్బరి కాయ పచ్చడి తదితర వంటకాలు వడ్డించారు. మామ తుమ్మూరి వీర వెంకట సత్యనారాయణ, అత్త ఉమా శ్రీదేవి తమ అల్లుడికి దగ్గరుండి మరీ వడ్డించారు. -
నిజాయితీతో సేవలందించాలి
● ఏలూరు పోలీస్ రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ ● 100 మంది ఎస్సైలకు నియామక పత్రాలు ఏలూరు టౌన్: సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కు నిర్భయంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీతో సేవలందించాలని ఏలూరు పోలీస్ రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబేషనరీ సబ్ ఇన్ స్పెక్టర్లు ఐజీని ఏలూరు రేంజ్ కార్యాలయంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రొబేషనరీ ఎస్సైలకు ఆయన నియామక ఉత్తర్వు లు అందజేశారు. రేంజ్ పరిధిలో 100 మంది (68 మంది పురుషులు, 32 మంది మహిళలు) ఎస్సై శిక్షణ పూర్తి చేసుకోగా జిల్లాల వారీగా ఏలూరు 1, అల్లూరి సీతారామరాజు 4, కాకినాడ జిల్లా 2, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా 1, తూర్పు గోదావరి జిల్లాకు 15, పశ్చిమ గోదావరి జిల్లా 1, కృష్ణా జిల్లాకు 20, ఎన్టీఆర్ జిల్లాకు 56 మందిని నియమించారు. ఈ సందర్భంగా ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా ప్రజలకు అత్యుత్తమ స్థాయిలో సేవలు అందించాలని సూచించారు. బాధితుల పక్షాన న్యాయం చేయాలని, నిందితులకు చట్ట ప్రకారం శిక్షలు పడేలా పారదర్శకత, జవాబుదారీతనంతో పని చేయాలని అన్నారు. పోలీస్ శాఖలో అడుగు పెడుతున్న మీరంతా సమాజంలో నేరస్తులకు భయం, బాధితులకు అభయం అందించేలా పని చేయాలన్నారు. పోలీస్ విధుల్లో పని చేయటం అదృష్టంగా భావిస్తూ చట్టాలకు లోబడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని ఐజీ పిలుపునిచ్చారు. -
గ్రీన్‌ఫీల్డ్ రయ్‌వే
ఎకరం రూ.2 కోట్లు ఇప్పటికే రెండు హైవేలు ఉండటం, మరో హైవే వస్తూండటంతో దేవరపల్లి ప్రాంతంలో ఇప్పటికే భూముల ధరలు ఊహించని విధంగా పెరిగాయి. ఎకరం రూ.2 కోట్లు పైగా పలుకుతోంది. మూడు జాతీయ రహదారులు అందుబాటులోకి రావడంతో మెట్ట ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడనుంది. పంట ఉత్పత్తులను దూర ప్రాంతాల్లోని మార్కెట్లకు రవాణా చేయడం ద్వారా ఇక్కడి రైతులు గిట్టుబాటు ధర పొందే అవకాశం కలుగుతుంది. ఇప్పటికే ఈ ప్రాంతం నుంచి రైతులు హైదరాబాద్, విశాఖపట్నం, విజయనగరం, కోల్‌కతా వంటి ప్రాంతాలకు వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా నిమ్మ, అరటి, కోకో, జీడిగింజల వంటి పంట ఉత్పత్తులు వస్తుంటాయి.● ఖమ్మం – దేవరపల్లి మధ్య నిర్మాణం ● జూన్ నాటికి పూర్తి ● రూ.2,200 కోట్ల వ్యయందేవరపల్లి: రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో నాలుగు నెలల్లో ఈ జాతీయ రహదారి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఎక్కడా గ్రామాలను తాకకుండా పచ్చని పంట పొలాల మధ్య నుంచి దీనిని నిర్మిస్తున్నారు. ఈ హైవే నిర్మాణం పూర్తయితే ఉత్తరాంధ్ర నుంచి తెలంగాణకు రవాణా సదుపాయం మెరుగుపడటంతో పాటు సమయం, దూరం ఆదా కానున్నాయి. 162 కిలోమీటర్లు తెలంగాణలోని ఖమ్మం నుంచి తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి వరకూ రూ.2,200 కోట్లతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) సుమారు 162 కిలోమీటర్ల పొడవున ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేను నిర్మిస్తోంది. ఇది పూర్తయితే దేవరపల్లి – ఖమ్మం మధ్య సుమారు 70 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. దీని నిర్మాణానికి 2022 ఏప్రిల్‌లో అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. గత ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ హైవే నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా అధిక వర్షాలు, తుపానుల కారణంగా పనుల్లో జాప్యం జరిగింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ సహకారంతో కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ దీని నిర్మాణ పనులు చేపట్టింది. ఈ నేపథ్యంలో మొన్నటి వరకూ సాధారణ జంక్షన్‌గా ఉన్న దేవరపల్లి ఇప్పుడు మూడు జాతీయ రహదారుల జంక్షన్‌గా కొత్త రూపు సంతరించుకుంటోంది. కోల్‌కతా – చైన్నె 16వ నంబర్ జాతీయ రహదారి దేవరపల్లి మీదుగానే సాగుతోంది. అలాగే, దేవరపల్లి – ఖమ్మం జిల్లా తల్లాడ మధ్య ఇప్పటికే 316డి హైవే ఉంది. ఇప్పుడు కొత్తగా దేవరపల్లి – ఖమ్మం మధ్య కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మిస్తున్నారు. ఇది 16వ నంబర్ జాతీయ రహదారిని దేవరపల్లి వద్ద గోపాలపురం రోడ్డులోని డైమండ్ జంక్షన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో కలుస్తుంది. ఈ ప్రాంతంలో మూడు హైవేలు కలుస్తూండటంతో వాటిని విభజిస్తూ నూతన టెక్నాలజీతో అవుటర్ రింగ్ రోడ్డు (డ్రమ్‌ఫుట్) నిర్మిస్తున్నారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేకి ప్రభుత్వం సుమారు 1,100 ఎకరాలు సేకరించింది. ఆంధ్రాలో హైవే సాగుతుందిలా.. ఏలూరు జిల్లా చింతలపూడి సమీపంలోని రేచర్ల నుంచి ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే మన రాష్ట్రంలో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి టి.నర్సాపురం, వేపుగుంట, గుర్వాయగూడెం, బొర్రంపాలెం, జంగారెడ్డిగూడెం వద్ద మద్ది ఆంజనేయస్వామి ఆలయం సమీపాన ఎర్రకాలువ మీదుగా కొయ్యలగూడెం మండలం రాజవరం, యర్రంపేట, తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు, చిన్నాయగూడెం, గోపాలపురం మండలం వాదాలకుంట, వెదుళ్లకుంట గ్రామాల మీదుగా దేవరపల్లి వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిని కలుస్తుంది. జంగారెడ్డిగూడెం వద్ద పుట్లగట్లగూడెం – గుర్వాయగూడెం వద్ద జంక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి 83 ఎకరాలు సేకరించారు. ఖమ్మం – దేవరపల్లి మధ్య 8 టోల్‌ప్లాజాలు, 51 మైనర్, 9 మేజర్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. ఉమ్మడి ‘పశ్చిమ’లో 72 కిలోమీటర్లు గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులను హైదరాబాద్‌కు చెందిన డెకెం సంస్థ చేపట్టింది. తెలంగాణలో ఖమ్మం నుంచి రేచర్ల వరకూ ఒకే ప్యాకేజీగా పనులు జరుగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 72 కిలోమీటర్ల పొడవున మూడు ప్యాకేజీల్లో ఈ పనులు జరుగుతున్నాయి. సేకరించిన భూములకు సంబంధించిన రైతులందరికీ పరిహారం అందించారు. భూసేకరణకు అడ్డంకులు గ్రీన్‌ఫీల్డ్ హైవేకి అవసరమైన భూసేకరణకు కొయ్యలగూడెం మండలం పొంగుటూరు వద్ద బ్రేక్ పడింది. ఆ గ్రామానికి చెందిన రైతు కోర్టుకు వెళ్లడంతో మూడెకరాల భూసేకరణ నిలిచిపోయింది. న్యాయస్థానం తీర్పు రిజర్వులో పెట్టి దాదాపు ఏడాది కావస్తోంది. తీర్పు కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. 85 శాతం పూర్తి ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకూ రేచర్ల నుంచి గుర్వాయగూడెం వరకూ 85 శాతం, అక్కడి నుంచి దేవరపల్లి వరకూ 65 శాతం పనులు పూర్తయ్యాయి. వంతెనలు, కల్వర్టుల నిర్మాణాలు పూర్తయ్యాయి. దేవరపల్లి వద్ద డ్రమ్‌ఫుట్ నిర్మాణం జరుగుతోంది. మొత్తంగా 85 శాతం పనులు పూర్తయ్యాయి. వచ్చే జూన్ నాటికి ఈ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. – సురేంద్రనాథ్, ప్రాజెక్ట్ డైరెక్టర్, నేషనల్ హైవేస్, రాజమహేంద్రవరం -
ఓపెన్‌కు సర్వం సిద్ధం
పకడ్బందీగా చేపట్టాలి ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాం. ఇప్పటికే సీఎస్, డీవోలకు ఓరియంటేషన్ నిర్వహించాం. ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా పరీక్షలు నిర్వహించాలని డీఈవోలకు ఆదేశాలిచ్చాం. – జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ ● నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 63 కేంద్రాలు ● హాజరు కానున్న 16,072 మంది విద్యార్థులు ● 17 నుంచి పదో తరగతి పరీక్షలు రాయవరం: ఈ నెల ఒకటో తేదీ నుంచి రెగ్యులర్ ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభంగా కాగా, ఏపీ సార్వత్రిక విద్యా పీఠం ద్వారా ఏటా నిర్వహించే ఇంటర్ పరీక్షలను సైతం సోమవారం నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉన్నత చదువు కోసం ఆశ పడినప్పటికీ అనుకోని అవాంతరాలు, ఆర్థిక ఇబ్బందులతో చదువు నిలిపివేసిన వారి కోసం ఏపీ సార్వత్రిక విద్యా పీఠం ద్వారా ఓపెన్ స్కూల్ విధానం ద్వారా అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఓపెన్ స్కూల్ ద్వారా పది, ఇంటర్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు ఇప్పటికే హాల్ టిక్కెట్లను విడుదల చేశారు. ఉత్తీర్ణులు కానివారు సైతం ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ ప్రవేశాలకు గతేడాది ఆగస్టులో విడుదల చేసిన నోటిఫికేషన్ మేరకు ఇంటర్ పరీక్షలకు 16,072 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో పరీక్షలు రాసి, ఉత్తీర్ణులు కానివారు కూడా ఇప్పుడు పరీక్షలు రాయనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 63 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే విద్యార్థులకు హాల్‌టికెట్లు విద్యార్థులకు చేరాయి. ఈ పరీక్షలు ఈ నెల 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలు ఇలా.. ఏపీ సార్వత్రిక విద్యా పీఠం ద్వారా నిర్వహించే పదో తరగతి పరీక్షలు ఈ నెల 17 నుంచి 28వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. రెగ్యులర్ విద్యార్థులతో పాటే ఓపెన్ విద్యార్థులకూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 74 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 5,947 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారుజిల్లాల వారీగా పరీక్షా కేంద్రాలు, విద్యార్థుల వివరాలు జిల్లా పది ఇంటర్ విద్యార్థులు విద్యార్థులు కోనసీమ 1,195 4,645 కాకినాడ 2,248 6,625 తూర్పు 2,504 4,802 మొత్తం 5,947 16,072 -
కారు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
● లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఘటన ● క్షతగాత్రులు రాజమహేంద్రవరం వాసులు దెందులూరు: వివాహానికి కారులో వెళ్లి తిరిగివస్తుండగా జరిగిన ప్రమాదంలో ఐదుగురు గాయాలపాలయ్యారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం గుండేరు వాగు వద్ద శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో నివాసం ఉంటున్న ఊట్ల రామకృష్ణ కుటుంబ సభ్యులు ఐదుగురు కలసి తమ సొంత కారులో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వివాహానికి వెళ్లారు. వివాహానంతరం శనివారం రాత్రి తిరిగి రాజమహేంద్రవరానికి బయలుదేరారు. రాత్రి రెండు గంటల సమయంలో వీరు ఏలూరు జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం గుండేరు వాగు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వెళుతున్న లారీని దాటేందుకు ప్రయత్నించగా, కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ఊట్ల రామకృష్ణకు తలపై, ఆయన భార్య అరుణకు కాలిపై గాయాలయ్యాయి. ఈ ఘటనలో రామకృష్ణ నాన్నమ్మ అనంతలక్ష్మి, అరుణ అమ్మమ్మ సామ్రాజ్యం, వారి కుటుంబ సభ్యుడు ఇరుసుమల్లి మణికంఠ కూడా గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న దెందులూరు ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, హైవే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 అంబులెన్‌న్సులో ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులకు అక్కడే చికిత్స అందిస్తున్నారు. నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శివాజీ తెలిపారు. -
విద్యారంగానికి నిధులు కేటాయించాలి
పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ కంబాలచెరువు: విద్యారంగానికి కేంద్ర బడ్జెట్లో 20 శాతం, రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం, జీడీపీలో 6 శాతం నిధులు కేటాయించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. స్థానిక పీడీఎస్‌యూ భవన్లో జరిగిన రాష్ట్ర ఆఫీస్ బెరర్ల కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలలో విద్యారంగానికి 34,311 కోట్లు తక్కువ బడ్జెట్ కేటాయించి ప్రచార ఆర్భాటాలు చేసుకునే పద్ధతి మంచిది కాదన్నారు. విద్యను వ్యాపారంగా, కార్పొరేటీకరణ చేయడమే ఈ బడ్జెట్ ముఖ్య ఉద్దేశమన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 2009 నియమ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు కొఠారి కమిషన్ సిఫార్సులను లెక్కచేయని దుస్థితి పట్టిస్తూ కూటమి ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసిందన్నారు. బడ్జెట్లో విద్యార్థులు, నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం తీవ్రంగా దగా చేసిందన్నారు. ‘తల్లికి వందనం’ పథకానికి కేవలం రూ.9,407 కోట్లతో ప్రతిపాదనలు చేసి ‘బాబు’ తల్లులను మోసం చేశారని, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంత మందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు బడ్జెట్లో కోత విధించి 84 లక్షల మంది తల్లులను మోసం చేశారన్నారు. గత విద్యా సంవత్సరంలో ఇవ్వాల్సిన తల్లికి వందనంపై కనీస ప్రస్తావన లేదన్నారు. ప్రతి నెలా రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీపైనా మొండిచేయి చూపారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రఫీ, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ఉమ్మడి జిల్లా ట్రెజరీ ఉద్యోగుల కార్యవర్గం
కాకినాడ లీగల్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ట్రెజరీ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఈ ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. ఎన్నికల అధికారిగా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎ.రామ్మోహన్రావు వ్యవహరించగా, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్‌గా పి.కిరణ్ కుమార్(నెల్లూరు), రాష్ట్ర పరిశీలకుడిగా డి.రమణ రెడ్డి(నెల్లూరు) వ్యవహరించారు. ఎన్నికల అనంతరం పి. శ్రీనివాసరావు ప్యానెల్ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ఎ.రామ్మోహన్రావు ప్రకటించారు. నూతన అధ్యక్షుడిగా పి.శ్రీనివాసరావు, సహాధ్యక్షుడిగా వి.చంద్రశేఖర్, ఉపాధ్యక్షులుగా ఎస్.ఈశ్వరి, వి.శ్రీనివాస్, వి.శశికుమార్, ఎం.విశ్వనాథం, కార్యదర్శిగా వై.భాస్కరావు ఎన్నికయ్యారు. అలాగే సంయుక్త కార్యదర్శులుగా నజీరా బేగం, బీవీవీ సత్యనారాయణ, ఆర్.జయకృష్ణ, కోశాధికారిగా వైఎన్ మూర్తి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎస్.శ్రీనివాస్, ఎ.పాపారావు, హైదర్ ఆలీపాషా, ఉదయ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా శ్రీనివాసరావు కార్యదర్శిగా భాస్కరరావు -
తెగుళ్లతో ఖాళీఫ్లవర్
పెరవలి: కూరగాయల పంటలో కాలీఫ్లవర్ ఆదాయాన్ని ఇచ్చే పంట.. ఇప్పుడు ఈ పంట రైతుల గుండెల్లో మంట పెడుతోంది. తెగుళ్లు ముప్పేట దాడి చేయడంతో ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో సస్యరక్షణ చర్యలు అవశ్యమని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 2,795 హెక్టార్లలో కూరగాయల సాగు జరుగుతుండగా, ఇందులో కాలీఫ్లవర్ 425 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ పంట సాధారణంగా శీతల ప్రాంతంలో వేయాల్సి ఉండగా, ప్రస్తుతం వేసవి ప్రారంభం కావడంతో తెగుళ్ల ఉధృతి అధికంగా ఉంది. దీనికి వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కొవ్వూరు ఉద్యాన అధికారి సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ఈ పంటపై ప్రస్తుతం ఆకుమచ్చ, పచ్చపురుగు, బట్టవింగ్, రైసీనెస్, కొరడా తెగుళ్లు ఎక్కువగా ఆశించాయి. ఈ తెగుళ్ల నివారణకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన వివరించారు. బట్టవింగ్ ఈ తెగులు ఆశించిన తోటల్లో పూలు చిన్నవిగా వస్తాయి. నత్రజని తక్కువగా అందించటం వల్ల లేక ఆలస్యంగా నారు నాటటం వలన ఈ ప్రభావం కనిపిస్తుంది. దీనిని అరికట్టాలంటే 21 నుంచి 25 రోజుల వయసు కలిగిన నారును మాత్రమే నాటుకోవాలి. సరియైన సమయానికి తగు మోతాదులో నత్రజని ఎరువును అందించాలి. సరియైన సమయంలో నాటుకోవాలి. రైసీనెస్ ఈ తెగులు వాతావరణంలో వేడి ప్రారంభమైనప్పుడు వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు ఆశిస్తే పువ్వు వదులై, విచ్చుకున్నట్లుగా అయ్యి పువ్వు గుడ్డుపై మాగు వస్తుంది. దీనివల్ల పువ్వు అంద విహీనంగా కనిపించి మార్కెట్టులో ధరపడిపోతుంది. దీని నివారణకు పువ్వులకు ఎండ ఎక్కువగా తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పువ్వు విచ్చుకున్న వెంటనే సరైన సమయంలో పువ్వులను కోయాలి. బ్రౌవింగ్ ఈ తెగులు బోరాన్ లోపం వల్ల వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా క్షార నేలల్లో ఈ పంటలను వేసినప్పుడు తెగులు వ్యాప్తి అధికంగా ఉంటుంది. ఈ తెగులు ఆశించిన పువ్వులపై గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి. కాండం గుల్లగా మారి నీరుకారుతుంది. దీని నివారణకు ఆఖరి దుక్కులో ఎకరాకు 8నుంచి 10 కిలోలు బోరాక్స్ వేయాలి. లీటరు నీటిలో 3 గ్రాములు బోరాక్స్ కలిపి పువ్వు గడ్డ ఏర్పడే దశలో పిచికారీ చేయాలి. కొరడా ఈ తెగులు మాలిబ్దినం ధాతు లోపం వల్ల సోకుతుంది. ఆకులు పసుపుగా మారి, అంచులు తెల్లబడతాయి. తెగులు తీవ్రత ఎక్కుగా ఉంటే ఆకు మధ్య మాత్రమే పొడవుగా పెరుగుతుంది. ఇలా పెరిగితే కొరడా తెగులు ఆశించినట్లు గుర్తించాలి. దీని నివారణకు నత్రజనిని సరైన మోతాదులో అందించాలి. ఎకరాకు 400 గ్రాములు సోడియం లేదా అమ్మోనియం మాలిబ్డేట్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ● కాలీప్లవర్ పువ్వు తెల్లగా ఉండాలంటే పువ్వు ఏర్పడిన దశలో పువ్వు చుట్టూ ఉన్న ఆకులను పువ్వుపై కప్పుతూ సూర్యరశ్మి సోకకుండా దారంతోకానీ రబ్బరు బ్యాండ్ కానీ వేయాలి. 4 నుంచి 5 రోజుల తరువాత పువ్వును కోయాలి. సస్యరక్షణ చర్యలు అవశ్యం లేకుంటే దిగుబడులపై ప్రభావం కుళ్లు తెగులు ఈ తెగులు సాధారణంగా నారుమడి నుంచి ప్రారంభమై నాటిన తోటలోనూ వ్యాప్తి చెందుతుంది. ఆకుల అంచుల నుంచి పసుపు రంగుకు మారి ఈనెలు నల్లబడి కాండం కుళ్లిపోతుంది. ఈ తెగులు అధికంగా ఉంటే పువ్వును కూడా ఆశిస్తుంది. అది కూడా కుళ్లిపోతుంది. నివారణ చర్యలు ఈ తెగులు ఆశించిన తోట పూర్తయిన తరువాత మళ్లీ ఇదే పంటను వేయకూడదు. పంట మార్పిడి తప్పని సరిగా చేయాలి. ఈ తెగులు ఆశించినట్లు గుర్తించిన వెంటనే కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి 3 గ్రాములు చొప్పన కలిపి మొక్క అంతా తడిసేలా పిచికారీ చేయాలి. ఇలా చేయటం వలన తెగులును కొంతవరకు నివారించవచ్చు. ఆకుమచ్చ తెగులు ఈ తెగులు ఆశించిన తోటల ఆకులపై గుండ్రని బూడిద రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా పెద్దవిగా మారతాయి. ఈ తెగులు సాధారణంగా వాతవరణంలో తేమశాతం అధికంగా ఉన్నప్పుడు వ్యాప్తి చెందుతుంది. నివారణ చర్యలు ఈ తెగులు నివారణకు మాంకోజెబ్ మందును లీటరు నీటికి 2.5 గ్రాములు లేదా కాఫర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటికి 3 గ్రాములు చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేస్తే నివారణ అవుతుంది. తెగులు అధికంగా ఉంటే 10 రోజుల వ్యవధిలో రెండు నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి. -
ఉచితంగా వినికిడి పరీక్షలు
కాకినాడ క్రైం: ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా సోమవారం ఉచితంగా వినికిడి పరీక్షలు నిర్వహించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆడియోలజిస్ట్స్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పేథోలజిస్ట్స్ అసోసియేషన్ (ఏపీఏఎస్ఎల్పిఏ), ఇండియన్ స్పీచ్, లాంగ్వేజ్ అండ్ హియరింగ్ అసోసియేషన్ (ఐఎస్హెచ్ఏ) ఆంధ్రప్రదేశ్ శాఖ జనరల్ సెక్రటరీ డాక్టర్ పెబ్బిలి గోపి వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ పి.రేణుకాదేవి తెలిపారు. ఈ మేరకు ఆదివారం స్థానిక లచ్చిరాజు వారి వీధిలో వాగ్దేవి స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్‌లో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, వినికిడి సమస్యను నిర్లక్ష్యం చేస్తే జీవితాలు దుర్భరం అవుతాయన్నారు. వినికిడి లోపం ఉన్న చిన్నపిల్లల్లో మాట్లాడే లోపం లేకపోయినా మాటలు రావని అన్నారు. వివిధ కారణాలు ఇందుకు దారితీస్తాయని తెలిపారు. సోమవారం ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా ఐఎస్హెచ్ఏ, ఏపీఏఎస్ఎల్పీఏల సంయుక్త ఆధ్వర్యంలో వినికిడి లోపంతో బాధపడుతున్న ఐదేళ్లలోపు పిల్లలకు ఓఏఈ, పెద్దలకు ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ అనే పరీక్షలను ఉచితంగా నిర్వహించాలని నిర్ణయించనున్నట్లు తెలిపారు. సదస్సులు ఏర్పాటు చేసి వినికిడి ప్రాధాన్యం, అది లోపించడం వల్ల తలెత్తే సమస్యలు, వినికిడిని కాపాడుకోవడం, లోపం ఉన్నవారిలో గుర్తించడంపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కాకినాడలో వాగ్దేవి స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ (లచ్చిరాజు వారి వీధి), శ్రావ్య స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ (సాలిపేట, శ్రావణి ఈఎన్టీ హాస్పిటల్లో), హియర్ జాప్ (మెయిన్ రోడ్ అపోలో ఆసుపత్రి ఎదురుగా), మహి స్పీచ్(రమణయ్యపేట, అపోలో ఫార్మసీ పై అంతస్తు)లో ఉచిత వినికిడి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సహాయం కోసం 99899 85385, 99121 11107 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏపీఏఎస్ఎల్పీ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి డాక్టర్ డి.సూర్యనారాయణ, అసోసియేషన్ సభ్యులు డాక్టర్ వి.హరీష్, డాక్టర్ ఫీబి, డాక్టర్ వి.తేజ, డాక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. నేడు కాకినాడలో నాలుగు కేంద్రాల్లో ఏర్పాటు -
‘జయలక్ష్మి’ బాధితులకు న్యాయం చేయండి
కాకినాడ రూరల్: జయలక్ష్మి సొసైటీ బాధితులకు న్యాయం చేయాలని బాధితుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. స్థానిక చల్లా కళ్యాణ మండపంలో ఆదివారం మధ్యాహ్నం జయలక్ష్మి ఎంఏఎం సొసైటీ లిమిటెడ్ డిపాజిటర్ల బాధితుల సంఘం సమావేశం నిర్వహించింది. సమావేశానికి అధ్యక్షుడు జి.బదరీనారాయణ అధ్యక్షత వహించారు. 2022లో సుమారు 560 కోట్ల రూపాయలు డిపాజిటర్ల సొమ్ముతో జయలక్ష్మి సొసైటీ గత పాలకవర్గం బోర్డు తిప్పేసిందని, ఇప్పటికీ న్యాయం జరగలేదని పలువురు బాధితులు పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన పలువురు బాధితులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బదిరీనారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం గంగిరెడ్డి త్రినాథరావు అధ్వర్యంలో ఉన్న పాలకవర్గానికి జవాబుదారీతనం లోపించిందన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, బాధితులకు సత్వర న్యాయం జరగడం లేదన్నారు. పలువురు వృద్ధాప్యంలో ఉండి ఇబ్బందులు పడుతున్నందున వారికోసం పోరాడాల్సింది పోయి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, దీనిపై తాము గత నెలలో అవిశ్వాస తీర్మానం చేశామన్నారు. ప్రస్తుతం ఉన్న బోర్డులను తొలగించి రహస్య ఓటింగ్ ద్వారా కొత్తగా బోర్డును ఏర్పాటు చేయాలని, అందులో ప్రభుత్వ ఉద్యోగి విధిగా ఉండాలని సభ్యులు సూచిస్తున్నారన్నారు. తాము బాధితుల పక్షాన పోరాడతామని, త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమావేశంలో పిల్లి గణేష్, రామారావు, వీఎస్వీ సుబ్బారావు, రఘు, భూషణ్, నాగేశ్వరరావు, ప్రభాకరరావు, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి మంత్రి దుర్గేష్ జర్మనీ పర్యటన
సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్రంలోని పర్యాటక వనరులపై అవగాహన కల్పించి, ఈ రంగంలో పెట్టుబడులు రాబట్టేందుకు ఆదివారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకూ జర్మనీలో పర్యటించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేటలోని తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్మనీలోని టెర్లిన్ ఎక్స్పో సెంటర్ సిటీ వేదికగా ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకూ జరిగే ఐటీబీ బెర్లిన్–2025 పర్యాటక వాణిజ్య ప్రదర్శన(ఈ–ఇంటర్నేషనల్ టూరిజం బోర్స్)లో పాల్గొని, రాష్ట్ర పర్యాటక రంగంలో పెట్టుబడులు సాధిస్తామని చెప్పారు. ట్రావెల్ టూరిజం అభివృద్ధికి నిరంతర ప్రేరణనిచ్చే ఈ ట్రేడ్ ఫెయిర్‌లో 400 మందికి పైగా అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో 200 సెషన్లు, 17 థీమ్డ్ ట్రాక్స్ ప్రదర్శిస్తారని చెప్పారు. ప్రఖ్యాత హోటళ్లు, పర్యాటక బోర్డులు, టూర్ ఆపరేటర్లు, సిస్టమ్ ప్రొవైడర్లు, పరిశ్రమల ప్రతినిధులు, ట్రావెల్ ఎక్స్పర్ట్స్ పాల్గొంటారనని వివరించారు. ప్రధానంగా సాంకేతిక పరివర్తన (డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్), సుస్థిరాభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మార్కెట్ ట్రెండ్స్‌పై ఈ సదస్సు జరుగుతోందన్నారు. వేగవంతమైన పర్యాటకాభివృద్ధికి సరికొత్త వ్యూహాలపై చర్చించి, అమలు చేసేందుకు ఈ సదస్సు ఎంతో దోహదపడుతుందని మంత్రి దుర్గేష్ తెలిపారు. విలేకర్ల సమావేశంలో జనసేన రాజమండ్రి సిటీ ఇన్చార్జి అత్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం
తాళ్లపూడి: మహాశివరాత్రి పర్వదినాన తాడిపూడి గ్రామంలో పుణ్యస్నానానికి వెళ్లి గోదావరిలో మృతి చెందిన ఐదుగురు యువకుల కుటుంబాలను వైఎస్సార్ సీపీ శనివారం నాయకులు పరామర్శించారు. గ్రామానికి చెందిన పడాల దుర్గా ప్రసాద్, పడాల దేవదత్త సాయి, అనిశెట్టి పవన్ గణేష్, గర్రే ఆకాష్, తిరుమలశెట్టి పవన్ కుమార్ల కుటుంబ సభ్యులను వారి ఇళ్లకు వెళ్లి మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి, గోపాలపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ తానేటి వనిత, కొవ్వూరు నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తదితరులు పరామర్శించి, ఓదార్చారు. ప్రమాదం జరిగిన తీరు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ కాకర్ల వెంకటేశ్వరరావు, తాడిపూడి సర్పంచ్ నామా శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పిట్టా శ్రీనివాస్, జిల్లా గ్రీవెన్స్ సెల్ నాయకుడు గూడా విజయరాజు తదితరులు పాల్గొన్నారు. -
వరాల వసంతం
30 రోజులు ప్రత్యేకం ● రంజాన్ మాసంలో తొలి 10 రోజులు కారుణ్య దినాలు. ● 10 నుంచి 20 క్షమాపణ రోజులు, ● 20 నుంచి 30 వరకూ నరకాగ్ని నుంచి విముక్తి దినాలు. ఇబాదత్తో పుణ్యఫలం పవిత్ర రంజాన్ మాసం మొత్తం ఇబాదత్తో (దైవ ప్రార్థన) గడపాలి. దానధర్మాలు చేయాలి. ఉపవాస దీక్షలు తప్పక పాటించాలి. తద్వారా పుణ్యఫలం, అల్లాహ్ కృప పొందవచ్చు. రంజాన్ చివరి పది రోజుల్లో ఐదు తాఖ్‌రాత్‌లు వస్తాయి. అన్ని రాత్రులూ ఇబాదత్ (అల్లాహ్ ఆరాధన) బాగా చేయాలి. దువా చేయాలి. లైలతుల్ ఖదర్ రాత్రి చేసే ఇబాదత్ వెయ్యి రాత్రుల కంటే అధికంగా ఉంటుంది. ఈ రాత్రి దైవారాధనలో గడిపితే వారికి అత్యధిక పుణ్యఫలం సిద్ధిస్తుంది. – హాఫిజ్ అలీ అన్సారీ రజ్వీ, ఇమామ్, మజ్జిదే ఆయేషా, రాజమహేంద్రవరం క్షమాపణల మాసం రంజాన్ నెలలో అల్లాహ్ తన దాసుల పాపాలను క్షమిస్తాడు. విశ్వాసం, ఉపవాసం పాటించడం వల్ల అల్లాహ్ ప్రతిఫలం ప్రసాదిస్తాడనే ఆశతో రోజాలు ఉన్న వారి మునుపటి పాపాలను ఆయన క్షమిస్తాడని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు. ఈ నెలలో నిరుపేదలు, అవసరమున్న వారికి సహాయం చేయడం పుణ్యకరం. జకాత్, ఫిత్రా చెల్లించడం ద్వారా రమజాన్ బర్కత్ను పొందుతారు. రోజా ఉన్న వ్యక్తికి ఇఫ్తార్ (రోజా తెరిచే ఆహారం) ఇస్తారో, అతనికి కూడా రోజా ఉన్నంత పుణ్యం లభిస్తుంది. పవిత్ర నెలలో ఇబాదత్పై ఎక్కువ సమయం గడపాలి. – షేక్ అబ్దురహ్మ్రాన్ అస్లమ్ ఉమరీ హఫీజవుల్లా, ఇమామ్, మజ్జిద్–ఎ–జమ్ జమ్, హుకుంపేట, రాజమహేంద్రవరం సాక్షి, రాజమహేంద్రవరం: ముస్లింలకు సమస్త శుభాలూ కలిగించే పవిత్ర మాసం రంజాన్. శనివారం సాయంత్రం నెలవంక దర్శనంతో ఈ మాసం ప్రారంభమైంది. ‘ఓ నెలవంకా! నీ దేవుడు, మా దేవుడు, అందరి దైవం అల్లాహ్ మాత్రమే’ అంటూ ప్రార్థించి నెలవంకను ముస్లింలు వీక్షించారు. మసీదుల్లో ఇమామ్‌లు రంజాన్ మాసాన్ని ప్రకటించారు. దీంతో శనివారం రాత్రి నుంచే తరావీహ్ నమాజ్ ప్రారంభమైంది. ఆదివారం వేకువజాము నుంచి ఉపవాస దీక్షలను ముస్లింలు ప్రారంభిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎలాంటి ఆహారం, కనీసం నీళ్లు కూడా తాగకుండా కఠోర నిష్టతో దీక్ష పాటిస్తారు. ఉమ్మడి ‘తూర్పు’న ఆధ్యాత్మిక శోభ.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా దాదాపు 400 మసీదులున్నాయి. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మసీదులన్నీ ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. రంగురంగుల విద్యుద్దీపాలతో శోభిల్లుతున్నాయి. ముస్లింలు రోజా, నమాజ్, జికర్, దువాలతో గడపనున్నారు. మసీదుల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంటోంది. సహెరి, ఇఫ్తార్ విందులతో హడావుడి కనిపించనుంది. ఉపవాస దీక్షలు ఆచరించేందుకు అవసరమైన నిత్యావసరాలను ముస్లింలు విరివిగా కొనుగోలు చేశారు. ఉపవాసం ప్రత్యేకత ఇస్లాంలో నాలుగో మూలస్తంభం ఉపవాసం. ముస్లిం సమాజం త్రికరణ శుద్ధితో ఆచరించే ఆరాధనా వ్రతమిది. ఎదుటి వారి ఆకలి విలువ గుర్తించాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. ఉపవాసాన్ని అరబీ భాషలో ‘సౌమ్’గా, ఉర్దూలో ‘రోజా’గా పిలుస్తారు. ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం తొమ్మిదో నెల అయిన రంజాన్ మాసంలో ఈ ఆరాధన వ్రతాన్ని పాటిస్తారు. ఇస్లాం ధర్మశాస్త్ర పరిభాషలో సౌమ్ అంటే ఆగి ఉండటం. అంటే ఉషోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ తినడానికి, తాగడానికి, మనోవాంఛలకు దూరంగా ఉండటమని అర్థం. ఉపవాసం మినహాయింపు మనిషి బలహీనతలను, వారి కష్టసుఖాలను బాగా ఎరిగిన దైవం ఉపవాసాన్ని విధిగా నిర్ణయించినప్పటికీ, కొందరికి మినహాయింపులు కూడా ఇచ్చారు. చిన్న పిల్లలు, బాటసారులు, వ్యాధిగ్రస్తులు, వృద్ధాప్యం మరీ ఎక్కువైనవారు, మతిస్థిమితం లేనివారు, అశుద్ధావస్థలో ఉన్న మహిళలకు ఉపావాసం నుంచి మినహాయింపు ఉంది. దివ్య ఖురాన్ అవతరణ మాసం ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించి, సదా ఆచరించే దివ్య గ్రంథం ఖురాన్ ఈ మాసంలోనే అవతరించింది. ఇతర ప్రవక్తలపై ఫర్మానులు సైతం ఇదే నెలలో అవతరించాయి. అందుకే ఈ నెలకు అంత ప్రాధాన్యం. ఈ సమయంలో సైతాను బందీ అవుతాడని, నరక ద్వారాలు మూతపడి స్వర్గ ద్వారాలు తెరచుకుంటాయని ముస్లింల ప్రగాఢ విశ్వాసం. ప్రత్యేక ప్రార్థనలు ముస్లింలు ఈ మాసమంతా ఆధ్యాత్మికంగా గడుపుతారు. ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనల్లో నిమగ్నమవుతారు. రోజూ సూర్యాస్తమయం వరకూ కఠోర ఉపవాస దీక్షలు పాటిస్తారు. దానధర్మాలు చేస్తారు. ఐదు పూటలా నమాజ్‌తో పాటు తరావీ ప్రార్థనల్లో పాల్గొంటారు. 30 అధ్యాయాలున్న ఖురాన్‌ను నెలలోగా పఠించాలన్న ప్రవక్త ఆదేశాన్ని తప్పక పాటిస్తారు. పేదలకు సంపన్నులు జకాత్ చెల్లిస్తారు. చివరి పది రోజులూ ఇంటిని వదిలి మసీదుల్లో ఉంటూ దైవస్మరణ చేస్తారు. పండగకు ముందు ఫిత్రా ఇస్తారు. ఉపవాస సమయంలో జరిగిన తప్పులు, లోటుపాట్లకు ఈ ఫిత్రా పరిహారం. ఉపవాసాలు పాటించిన వారు, పాటించని వారు, చిన్నాపెద్దా అనే తారతమ్యం లేకుండా దానం చేస్తారు. తరావిహ్ నమాజ్ ప్రారంభం రంజాన్ మాసంలో నెలవంక దర్శనమిచ్చినప్పటి నుంచే తరావిహ్ నమాజ్ ప్రారంభమవుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మసీదుల్లో రంజాన్ మాసం ముగిసే (మళ్లీ నెలవంక దర్శనమిచ్చేంత) వరకూ ప్రతి రోజూ రాత్రివేళ నమాజ్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా రోజుకు ఖురాన్‌లోని కొన్ని అధ్యాయాలు చదివి వినిపిస్తారు. మాసం పూర్తయ్యేలోగా ఖురాన్ పఠనం పూర్తి చేస్తారు. నాలుగు వాక్యాలే ప్రధానం పవిత్ర రంజాన్ మాసంలో మహ్మద్ ప్రవక్త నాలుగు విషయాల్ని అధికంగా స్మరించాలని ఉపదేశించారు. వాటి ప్రాముఖ్యతను ధార్మిక పండితులు వివరిస్తారు. లాయిలాహ ఇల్లల్లాహ్, అస్తగ్ఫిరుల్లా.., అస్ అలుకజన్నత్, అవుజుబికమిన్నార్.. ఎక్కువగా పఠించాలి. నెలవంక దర్శనంతో ప్రారంభమైన పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలకు సిద్ధమైన ముస్లింలు తరావిహ్ నమాజ్ ప్రారంభం ఉమ్మడి జిల్లా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు విద్యుద్దీపాలతో శోభిల్లుతున్న ప్రార్థనా స్థలాలుసంకల్పం ప్రవక్త బోధించిన ‘నవయతు అన్ అసుముగజన్ లిల్లాహి తాలా మిన్ సౌమిరమజాన్’ అనే వచనాలు పఠించి ముస్లింలు ఉపవాస వ్రతానికి శ్రీకారం చుడతారు. ఉపవాస విరమణ సమయంలో ‘అల్లాహుమ్మ లకసుంతు వబిక ఆమంతు, వ అలైక తవక్కత్తు, వ ఆలారిస్కిక అఫ్తర్తు ఫతఖబ్బల్ మిన్ని’ అని వచిస్తారు. ఇఫ్తార్ సూర్యాస్తమయం తరువాత ఏదైనా ఆహారం తీసుకుని ఆ రోజు దీక్షను విరమించడమే ఇఫ్తార్. ఖర్జూరాలతో ఇఫ్తార్ చేయడం ప్రవక్త సంప్రదాయం. అందకే ముస్లింలందరూ ఖర్జూరాలతోనే ఇఫ్తార్ చేస్తారు. దీక్ష విరమించే సమయంలో ఉపవాసి దేనిని అర్థించినా అల్లాహ్ స్వీకరిస్తాడని ప్రగాఢ విశ్వాసం. ఉపవాసికి ఇఫ్తార్ ఇవ్వడం దైవసేవగా భావించి, విందు ఇచ్చేవారి పాపాలను దేవుడు క్షమిస్తాడని ముస్లింలు నమ్ముతారు. సహర్ ఉపవాసం (రోజా) ఉండదలచిన వారు తెల్లవారుజామున 4 గంటల సమయంలో భోజనం చేస్తారు. దీనినే సహర్ అంటారు. సాయంత్రం వరకూ ఏ పదార్థాన్నీ తినరు. ఏదైనా కారణం వల్ల సహర్ తీసుకోకపోయినా వ్రతాన్ని మాత్రం ఆపరు. -
సద్వినియోగం చేసుకోండి
విద్యార్థులు కలలను సాకారం చేసుకోవడానికి ఇది చక్కని అవకాశం. దీనిని అందిపుచ్చుకునేందుకు విద్యార్థులు ప్రయత్నించాలి. ఇస్రో పేర్కొన్న అర్హతలు కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకునేలా సైన్స్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ఇది మంచి మార్గం. –జీవీఎస్ సుబ్రహ్మణ్యం, జిల్లా సైన్స్ అధికారి, అమలాపురం ఎంతో ఉపయుక్తం యువికాకు అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. శాస్త్రవేత్తలు కావాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయుక్తం. ప్రశ్నించేతత్వమే ప్రయోగాలకు, శాస్త్రవేత్తలు కావడానికి కారణమవుతుంది. డీఈఓలు, డీవైఈఓలు, జిల్లా సైన్స్ అధికారులు, సైన్స్ టీచర్లు శ్రద్ధ తీసుకుని అధిక సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా చూడాలి. –జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ -
చంద్రబాబు ప్రభుత్వంపై 420 కేసు పెట్టాలి
● ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి ● ఇది మోసపూరిత బడ్జెట్ ● ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అక్రమాలకు పాల్పడింది ● మాజీ ఎంపీ హర్షకుమార్ రాజమహేంద్రవరం సిటీ: గత ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి, మోసం చేసినందుకు చంద్రబాబు ప్రభుత్వంపై 420 కేసులు పెట్టాలని, కూటమి సర్కార్‌ను బర్తరఫ్ చేయాలని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ మోసపూరితంగా ఉందని, గత ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చేదిగా లేదని అన్నారు. రైతన్నకు రూ.20 వేలు ఇస్తామన్నారని, అయితే, కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి దీనిని అమలు చేస్తున్నారని చెప్పారు. తల్లికి వందనం పథకం అమలుకు ఎంత ఖర్చవుతుంది, బడ్జెట్లో ఎంత పెట్టారనేది స్పష్టత లేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు, ప్రతి మహిళకు నెలకు రూ.1,500, యాభయ్యేళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్లు, ఆటో డ్రైవర్లకు, చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పారు. నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాల భర్తీ హామీల ఊసే లేదన్నారు. ఎస్సీలకు రావాల్సిన పథకాలు అమలు చేయడం లేదన్నారు. ఉచిత ఇసుక కేవలం రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకే అమలవుతోందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలవడానికి అనేక హామీలు ఇచ్చి ఎగ్గొట్టిన వారిని శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. గత జగన్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలను బాగానే అమలు చేసిందన్నారు. రాజ్యాంగం భావప్రకటనా స్వేచ్ఛ కల్పించిందని, మాట్లాడినంత మాత్రాన కేసులు పెట్టి అరెస్టులు చేయడం ఎంత మాత్రం భావ్యం కాదని హర్షకుమార్ అన్నారు. అధికారంలోకి రాక ముందు కక్ష సాధింపులుండవని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమి నిలబెట్టిన అభ్యర్థి తరపున రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకూ నగదు పంపిణీ చేశారని ఆరోపించారు. స్వయంగా ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే ఈ డబ్బుల పంపిణీ జరగడం సిగ్గుచేటన్నారు. పవన్ కల్యాణ్ కాషాయ దుస్తులు వేసుకుని, ఇటువంటి పనులు చేయడం సరికాదని, అవి తీసివేయాలని అన్నారు. చంద్రబాబుకు తన పాలనపై నమ్మకం లేకో, తమను ప్రజలు నమ్మడం లేదనే అనుమానంతోనో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడో తరగతి చదివిన వారికి కూడా పట్టభద్రుల ఓటు కల్పించారని, తాము దరఖాస్తు చేయించిన వేలాది మందికి ఓట్లు రాకుండా చేశారని ఆరోపించారు. ఈ విషయాలన్నీ బయటకు తీస్తామన్నారు. చంద్రబాబు సర్వశక్తులూ ఒడినప్పటికీ తన తనయుడు జీవీ సుందర్ విజయం సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. కూటమి వద్ద డబ్బు ఉండొచ్చని, తమకు ప్రజాబలం, యువత బలం ఉందని అన్నారు. -
బడ్జెట్ అంకెల గారడీ
రాజమహేంద్రవరం రూరల్: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్డెట్ అంకెల గారడీ అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు నైజమనే విషయం బడ్జెట్ ద్వారా మరోసారి నిరూపితమైందన్నారు.సూపర్ సిక్స్ సహా హామీలన్నీ విస్మరించి, పిల్లలు, యువత, మహిళలు, నిరుద్యోగులు, రైతులు ఇలా అన్ని వర్గాలనూ కూటమి ప్రభుత్వం దగా చేసిందన్నారు. తల్లికి వందనం అంటూనే బడ్జెట్లో రూ.3 వేల కోట్లకు పైగా కోత పెట్టారన్నారు. పేద, బీసీ వర్గాలంటే చంద్రబాబుకు కడుపు మంటని, అందుకే గత ఏడాది ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలు నిలుపు చేశారని విమర్శించారు. బడ్జెట్ కేటాయింపులు కూడా అరకొరగానే ఉన్నాయన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. అవ్వాతాతలకు, దివ్యాంగులకు ఇచ్చే ఫించన్లు, మహిళలకు ఇచ్చే ఉచిత గ్యాస్ సిలిండర్లలో సైతం కోత విధించారన్నారు. రాష్ట్రంలో 1.48 కోట్ల మంది రేషన్‌కార్డుదారులుండగా బడ్జెట్లో కేవలం 90.1 లక్షల మందికే నిధులు కేటాయించారని చెప్పారు. 2019–24 మధ్య నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోలోని ప్రతి హామీనీ క్యాలెండర్ ప్రకారం అమలు చేశారని వేణు గుర్తు చేశారు. ఇంటర్ పరీక్షలు ప్రారంభం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా వ్యాప్తంగా 51 కేంద్రాల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు తెలుగు, హిందీ, సంస్కృతం పరీక్షలు నిర్వహించారు. జనరల్ విభాగంలో 21,024 మందికి గాను 20,448 మంది విద్యార్థులు హాజరయ్యారు. 576 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 2,281 మందికి గాను 2,084 మంది పరీక్ష రాశారు. 197 మంది గైర్హాజరయ్యారు. స్క్వాడ్ సభ్యులు, కస్టోడియన్లు 33 పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు. తొలి రోజు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగలేదని ఇంటర్మీడియెట్ విద్య జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎన్‌ఎస్‌వీఎల్ నరసింహం తెలిపారు. 144 సెక్షన్ అమలు చేస్తూండటంతో అన్ని కేంద్రాల గేట్లు ఉదయం 9 గంటలకే మూసివేశారు. కొన్నిచోట్ల కొంత మంది విద్యార్థులు తొలి రోజు ఆలస్యంగా వచ్చినప్పటికీ పరీక్షకు అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. తాగునీటి ఇబ్బంది లేకుండా చర్యలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రానున్న 15 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు వీయవచ్చనే హెచ్చరికల నేపథ్యంలో తాగునీరు సరఫరాకు ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికారులు, సిబ్బందితో శనివారం ఆమె జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పారిశుధ్య నిర్వహణ, సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన పారిశుధ్య సేవలపై దృష్టి సారించాలని అన్నారు. ప్రజలు కలరా, టైఫాయిడ్ తదితర వ్యాధుల బారిన పడకుండా శుద్ధమైన తాగునీరు సరఫరా చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలోని 180 చేతి పంపులకు మరమ్మతులు చేపడతామని సంబంధిత అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్ కేతన గార్గ్, ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు. లింగ నిర్ధారణపై ప్రకటనలిస్తే శిక్ష రాజమహేంద్రవరం రూరల్: లింగ నిర్ధారణపై ఎటువంటి వాణిజ్య ప్రకటనలూ ఇవ్వరాదని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిని ఉల్లంఘిస్తే ప్రైవేటు ఆసుపత్రులు, లేబొరేటరీలు, స్కానింగ్ సెంటర్లపై పీసీ – పీఎన్డీటీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ జరిమానా, మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారని తెలిపారు. జిల్లాలో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే ట్రోల్ ఫ్రీ నంబర్ 1800–425–3365కు తెలియజేయాలని డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. -
దినకర తేజ... ధరణీనాయక
ఫ దారులన్నీ వాడపల్లి క్షేత్రానికే.. ఫ ఒకేరోజు రూ.44.31 లక్షల ఆదాయం కొత్తపేట: దినకర తేజా గోవింద.. ధరణీనాయక గోవింద అంటూ ఆ స్వామిని కీర్తిస్తూ భక్తజనం మురిసింది.. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం ఆధ్యాత్మిక చింతనతో బాసిల్లింది. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే వాడపల్లి బాట పట్టారు. పావన గౌతమీ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, క్యూ లైన్లలో బారులు తీరి మరీ స్వామివారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. తలనీలాలు సమర్పించారు. ఏడు శనివారాల వెంకన్న దర్శనం నోము ఆచరించే భక్తులు మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేశారు. అర్చకులు సుప్రభాత సేవతో ప్రారంభించి వివిధ సేవలు నిర్వహించారు. రంగురంగుల సుగంధ భరిత పుష్పాలతో స్వామివారిని అలంకరించారు. స్వామి దర్శనం, తీర్థప్రసాదాల స్వీకరణ అనంతరం అన్నసమారాధనలో వేలాది మంది అన్న ప్రసాదం స్వీకరించారు. దేవదాయ– ధర్మదాయ శాఖ డిప్యూ టీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఇతర అధికారులు, సిబ్బంది భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లను పర్యవేక్షించారు. వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఈ ఒక్కరోజు దేవస్థానానికి సాయంత్రం 4 గంటల వరకూ రూ 44.31 లక్షల ఆదాయం వచ్చినట్టు ఈఓ తెలిపారు. రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్ఐ ఎస్.రాము, వాడపల్లిలో ట్రాఫిక్ నియంత్రించి, బందోబస్తు పర్యవేక్షించారు. ఏపీఎస్ ఆర్టీసీ వివిధ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుంచి వాడపల్లికి ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపింది. -
మరోసారి మోసానికి తెరతీసిన కూటమి
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అమలాపురం టౌన్: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తుంటే మరోసారి మోసానికి తెరతీసినట్లు ఉందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాలంటూ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఆ పథకాల అమలుకు కేటాయింపులు ఏమీ చేయలేదన్నారు. తల్లికి వందనం పథకానికి అరకొర నిధులు బడ్జెట్లో కేటాయించి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని వర్గాలకు మేలు జరిగిందని గుర్తుచేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 143 హామీలను గాలిలో కలిపేసేలా బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఎమ్మెల్సీ విమర్శించారు. ఇందులో పేదల ప్రయోజనాలు కనిపించలేదని అన్నారు. అమరావతిని ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన అప్పుతో అభివృద్ధి చేయనున్నారని, బడ్జెట్లో అదేదో కూటమి ప్రభుత్వం గొప్పలుగా చెబుతోందన్నారు. ఈ బడ్జెట్ డబ్బున్న వ్యక్తులకు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైందని చెప్పారు. రైతులు, చేనేత కార్మికులు ఇలా ప్రతి రంగానికి అన్యాయం జరిగిందన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, పార్టీ నాయకుడు ముంగర ప్రసాద్ పాల్గొన్నారు. ఆర్థిక భారం మోపేలా బడ్జెట్ ప్రత్తిపాడు: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలపై పన్నుల భారం మోపేలా ఉందని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బుగత బంగార్రాజు విమర్శించారు. గత ప్రభుత్వం కంటే పథకాలకు, సంక్షేమానికి చాలా తక్కువగా నిధులు కేటాయించి, ఎన్నికల హామీలు అమలు చేస్తామనడం ప్రజలను మోసం చేయడమేనని వ్యాఖ్యానించారు. ప్రత్తిపాడు లిబరేషన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తలకు మించి హామీలిచ్చిన చంద్రబాబు తల్లికి వందనంలో నిర్ధిష్టమైన విధానాన్ని ప్రకటించకుండానే కేటాయింపులు చేశారన్నారు. గత ప్రభుత్వం రూ.17 వేల కోట్లు అమ్మ ఒడికి కేటాయించి, ఇంటికి ఒకరికి అమలు చేస్తే... ప్రస్తుతం బడ్జెట్లో రూ. 1,500 కోట్లు కేటాయించి అందరికీ వర్తింపచేస్తాననడం బూటకం కాదా అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వం రైతు భరోసాకు రూ. 1800 కోట్లు, ఇరిగేషన్ శాఖకు రూ. 24.73 వేల కోట్లు, విద్యకు రూ. 11.03 కోట్లు, ప్రజారోగ్యానికి రూ. 6.02 కోట్లు కేటాయిస్తే... ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసాకు రూ. 900 కోట్లు, ఇరిగేషన్‌కు రూ. 23.98 కోట్లు, విద్యకు రూ. 10.9 కోట్లు, ప్రజారోగ్యానికి రూ. 0.98 కోట్లు కేటాయించడం చూస్తుంటే మౌళిక వసతులను నిర్లక్ష్యం చేసేలా ఉందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 20 లక్షల ఉద్యోగాల కల్పన, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేంతవరకు ఇస్తానన్న నిరుద్యోగ భృతికి కేటాయింపులే లేవన్నారు. రాష్ట్రంలో 16,340 టీచర్ పోస్టులు డీఎస్సీ ద్వారా ప్రకటించారని, ఇది ముందుకు సాగే విధాన ప్రకటన లేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు, 19 ఏళ్లు దాటిన మహిళలకు ఆసరా పథకానికి బడ్జెట్లో ప్రస్తావనే లేకపోవడం.. ప్రజలను దగా చేయడమేనన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెబుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు ఇప్పటివరకూ కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా రాష్ట్రానికి తీసుకురాలేదన్నారు. సమావేశంలో అఖిల భారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర కమిటీ సభ్యుడు మానుకొండ లచ్చబాబు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కిర్లంపూడి: ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడని ఎస్సై జి.సతీష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. సోమవరం గ్రామానికి చెందిన సుంకు నూకరాజు (47) అదే గ్రామంలో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నాడు. స్థానిక పరిసర గ్రామాల్లో తన ట్రక్ ఆటోలో వాటర్ బాటిల్స్ డెలివరీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి యర్రవరంలో వాటర్ బాటిల్ వేసి తిరిగి వస్తుండగా సోమవరం జాతీయ రహదారిపై మలుపు తిరుగుతున్న సమయంలో రాజమహేంద్రవరం వైపు నుంచి వైజాగ్ వెళుతున్న కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది. ఆటోలో ఉన్న నూకరాజు తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. దీంతో కార్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని ఎస్సై తెలిపారు. మృతుడీకి భార్య, పెళ్లైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడు కుమార్తె టిక్కా సంగీత ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. డ్రైవర్ దుర్మరణం పి.గన్నవరం: స్థానిక కొత్త అక్విడెక్టుపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. మామిడికుదురు మండలం ఈ దరాడకు చెందిన డ్రైవర్ ఇంజరపు దుర్గావెంకట నాగరామకృష్ణ (39) రాజమహేంద్రవరం నుంచి ఇంటికి ఆటోపై వస్తుండగా, మలికిపురం నుంచి ఆలమూరుకు వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొంది. దీంతో రామకృష్ణ అక్కడిక్కడే మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహానికి రాజోలు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఎస్సై బి.శివకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. తేనెటీగల దాడి సామర్లకోట: స్థానిక సీబీఎం సెంటర్లో తేనెటీగల దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం సీబీఎం సెంటర్లో కేబుల్ వైరు పనులు, చిరు వ్యాపారులు పనులు చేసుకొంటున్న సమయంలో ఆకతాయిలు చెట్టుపై ఉన్న తేనె పుట్టను కొట్టడంతో ఒకసారిగా తేనెటీగలు చెలరేగిపోయాయి. ఆ రోడ్డుపై ఉన్న వారిపై దాడి చేశాయి. దాంతో ప్రయాణికులతో పాటు చిరు వ్యాపారస్తులు, కేబుల్ టెక్నీషియన్లు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే సమీపంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స చేశారు. -
నైపుణ్యాలు పెంచుకుంటే భవిష్యత్తు
రాజానగరం: విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. నన్నయ యూనివర్సిటీలోని ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ (డీసీఎంఎస్) ఆధ్వర్యంలో ‘సవిస్క్రా 2కే25’ పేరుతో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఫెస్ట్‌ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసన్నశ్రీ మాట్లాడుతూ యువత తమలోని ప్రతిభకు పదును పెట్టడానికి, నిర్వహణా నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు చక్కటి వేదికలవుతాయన్నారు. ఆరోగ్యకరమైన ఇటువంటి పోటీల్లో పాల్గొనడంతో విజ్ఞానాన్ని విస్తరించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ప్రాక్టికల్ లెర్నింగ్, నైపుణ్యాభివృద్ధి, నెట్ వర్కింగ్ అవకాశాలు, వ్యవస్థాపక మనస్తత్వం, కాన్ఫిడెన్స్ బిల్డింగ్, వ్యాపార పోకడలు, సాంకేతికతకు బహిర్గతం, రెజ్యూమ్, కెరీర్ అవకాశాలను మెరుగుపర్చడం వంటి వాటిపై విద్యార్థులు దృష్టిని సారించాలని సూచించారు. జీతిత బీమా సంస్థ సీనియర్ డివిజనల్ మేనేజర్ (రాజమహేంద్రవరం) కె.సంధ్యారాణి మాట్లాడుతూ ఆధునిక సమాజంలో అన్ని రంగాలలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు. అయితే వాటిని ఆకళింపు చేసుకుంటూ సృజనాత్మక ఆలోచనలతో ముందుకు వెళ్తేనే ఉత్తమ ఫలితాలను అందుకోగలుగుతారన్నారు. ఈ సందర్భంగా అకడమిక్ ఈవెంట్స్‌గా బుల్ వర్సెస్ బియర్ స్టాక్ మార్కెట్, బిజినెస్ క్విజ్, మార్కెట్ మేకర్స్, ట్రెజర్ హంట్, యంగ్ మేనేజర్, కేర్ స్టడీ, మ్యాచింగ్ ది అకౌంటింగ్, లిప్ టిప్, క్లు క్వెస్ట్, టవర్ బిల్డింగ్, గ్రూప్ గేమ్స్ నిర్వహించారు. కార్యక్రమంలో గెయిల్ ఇండియా సంస్థ (రాజమహేంద్రవరం) హెచ్ఆర్ మేనేజర్ వైవీఎస్ మూర్తి, హెచ్ఓడీ డాక్టర్ ఎన్.ఉదయ్‌భాస్కర్, విద్యార్థులు పాల్గొన్నారు. -
పొగాకు బ్యారన్లు, పాకలు దగ్ధం
సీతానగరం: మండలంలోని కాటవరంలో నాలుగు పొగాకు బ్యారన్లు, మూడు రెల్లుగడ్డి పాకలకు అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం కాటవరం పెట్రోల్ బంకు దగ్గరలో సాయంత్రం 5 గంటలకు చిట్టూరి వరప్రసాద్, పోలిన ప్రకాశం, చిట్టూరి వీర్రాజులకు చెందిన పొగాకు బ్యారన్లలో వర్జీనియా పొగాకు క్యూరింగ్ జరుగుతుండగా, ప్రమాదవశాత్తు బ్యారన్లో గొట్టాలపై ఆకులు పడి అగ్ని ప్రమాదం జరిగింది. దానితో నాలుగు బ్యారన్లు, మూడు పాకలు పూర్తిగా దగ్ధమయ్యాయి. బ్యారన్లలో ఉన్న పొగాకు, ములకలకర్రలు, బాజులు, అలాగే రెల్లుగడ్డి పాకల్లో ఉంచిన పొగాకు బేళ్లు కాలిపోయాయి. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో స్థానికులు ఇళ్ల వద్ద ఉన్న మోటార్లు వేసి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. రాజమహేంద్రవరం నుంచి రెండు అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 లక్షల నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. -
యువికా.. ప్రతిభకు వేదిక
ఫ ఇస్రో ఆధ్వర్యంలో యువ విజ్ఞాన కార్యక్రమం ఫ 9వ తరగతి విద్యార్థులకు చక్కని అవకాశం ఫ మార్చి 23 వరకూ దరఖాస్తులకు గడువు రాయవరం: అంతరిక్ష విజ్ఞానం, స్పేస్ అప్లికేషన్స్‌పై అవగాహన కల్పించేందుకు యువికా–2025 (యంగ్ సైంటిస్ట్) కార్యక్రమాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రూపొందించింది. అంతరిక్షంలో ఎలా ఉంటుంది.. ఉపగ్రహాల ప్రయోగం ఎలా చేస్తారు.. ఇలాంటి అంశాలపై శాస్త్రవేత్తలతో నేరుగా మాట్లాడే అవకాశాన్ని విద్యార్థులకు కల్పిస్తుంది. వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి యువ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 9వ తరగతి విద్యార్థులకు చక్కని తోడ్పాటు అందిస్తుంది. యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా) పేరుతో అర్హులకు ఈ శిక్షణ ఇవ్వనుంది. ప్రతిభావంతులకు.. విద్యార్థి దశ నుంచే సైన్స్‌పై ఆసక్తి చూపి ఎందరో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. అటువంటి విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మెరుస్తున్నారు. వారి కోసం ఇస్రో ప్రత్యేకంగా యువ విజ్ఞాన కార్యక్రమాన్ని ‘యువికా’ పేరుతో నిర్వహిస్తోంది. 2024–25 విద్యా సంవత్సరంలో ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇస్రో.జీవోవీ.ఇన్‌లో ఈ నెల 24 నుంచి మార్చి 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. వచ్చిన దరఖాస్తుల నుంచి ఏప్రిల్ 7న మొదటి విడత ఎంపిక జాబితా విడుదల చేస్తారు. అర్హతలివీ.. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు యువికా–2025 దరఖాస్తుకు అర్హులు. 8వ తరగతి పూర్తి చేసి, ప్రస్తుతం 2024–25 విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే దరఖాస్తుకు అవకాశముంది. విద్యార్థి విద్యాభ్యాస కాలంలో చూపించిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాష్ట్ర సిలబస్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. ఎంపిక పద్ధతి 8వ తరగతిలో పొందిన మార్కులు (50 శాతం), మూడేళ్లలో పాఠశాల, జిల్లా, రాష్ట్ర/జాతీయ స్థాయిలో నిర్వహించిన ఏదైనా వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొంటే (2/5/10 శాతం), ఆన్లైన్ క్విజ్‌లో ప్రతిభకు (10 శాతం), ఒలింపియాడ్‌లో పాల్గొని పాఠశాల/ జిల్లా/ రాష్ట్ర స్థాయిల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి (2/ 4/ 5శాతం), రిజిస్టర్డ్ క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలు, అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటిన వారికి (2/ 4/ 5శాతం), మూడేళ్లలో స్కౌట్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ప్రతిభ చూపిన వారికి (5 శాతం), గ్రామీణ ప్రాంతంలో చదువుతున్న వారికి (15 శాతం) మార్కులు ఇస్తారు. జాతీయ స్థాయిలో ఎంపికై న వారికి మే 18వ తేదీ నుంచి 30 వరకు ఆయా కేంద్రాల్లో పూర్తిగా రెసిడెన్షియల్ పద్ధతిలో శిక్షణ ఇస్తారు. ఎంపికై న విద్యార్థితో పాటు తల్లిదండ్రుల్లో ఒకరు లేదా గైడ్ టీచర్‌కు కూడా ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. శిక్షణ అనంతరం శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లి అక్కడి విశేషాలను వివరిస్తారు. ఏడు శిక్షణ కేంద్రాల్లో.. విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఏడు కేంద్రాలను ఎంపిక చేశారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్, బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్, అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్, హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఐఐఆర్ఎస్, డెహ్రాడూన్, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, శ్రీహరికోటలో ఎంపికై న విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. దరఖాస్తు విధానం నాలుగు దశల్లో విద్యార్థులు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటగా ఈ–మెయిల్ ఐడీతో వివరాలు నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న 48 గంటల వ్యవధిలో ఇస్రో ఏర్పాటు చేసిన ఆన్లైన్ క్విజ్‌లో పాల్గొనాలి. క్విజ్ పూర్తి చేసిన 60 నిమిషాల తర్వాత యువికా పోర్టల్‌లో ఆన్లైన్ దరఖాస్తుతో పూర్తి వివరాలు నమోదు చేసి సమ ర్పించాలి. మూడేళ్లలో వివిధ అంశాల్లో విద్యార్థి సా ధించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ ప త్రాలు ఏవైనా ఉంటే, వాటి జెరాక్స్ కాపీలపై విద్యార్థి సంతకం చేసి అప్లోడ్ చేయాలి. దరఖాస్తులు సమర్పించేందుకు మార్చి 23వ తేదీ వరకూ అవకాశముంది. ఎంపిక జాబితాను రెండు విడతల్లో ప్రకటించి అర్హత సాధించిన వారికి సమాచారం అందిస్తారు. యువికా శిక్షణకు ఎంపికై న వారికి శిక్షణకు హాజరయ్యేందుకు రవాణా చార్జీలు, బస, భోజన వ సతితో పాటు అన్ని సౌకర్యాలను ఇస్రో కల్పిస్తుంది. -
అందని ప్రసాద్‌ం
ఎన్నికల కోడ్ వల్లనే.. అన్నవరం దేవస్థానంలో ప్రసాద్ స్కీమ్ పనులకు రీ టెండర్లను ఖరారు చేసే ప్రక్రియ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమైంది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వీటిని ఖరారు చేస్తారు. – ఈశ్వరయ్య, చీఫ్ ఇంజినీర్, పర్యాటక శాఖ అన్నవరం: కేంద్ర ప్రభుత్వ ‘పిలిగ్రిమేజ్ రీజువినేషన్ అండ్ స్పిరిట్యువల్ అగ్మెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీముకు అన్నవరం దేవస్థానం ఏ ముహూర్తాన ఎంపికై ందో కానీ ఆది నుంచీ అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతున్నాయి. ఫలితంగా వస్తాయనుకున్న నిధులు రాక, రత్నగిరికి ‘ప్రసాద్’ం అందడంలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఈ పథకం కింద రూ.20 కోట్లతో చేపట్టే నిర్మాణాలకు రీ టెండర్లు పిలిచిన 35 రోజులు గడిచినా ఇంకా ఖరారు కాలేదు. ఇవి మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధాని శ్రీకారం చుట్టినా.. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను పర్యాటక కేంద్రా లుగా అభివృద్ధి చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పదేళ్ల క్రితం ప్రసాద్ పథకానికి శ్రీకారం చుట్టింది. దీనికి అన్నవరం దేవస్థానం కూడా ఎంపికై ంది. అప్పటి ప్రజాప్రతినిధులు దఫదఫాలుగా చేసిన విజ్ఞప్తులు, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, నాటి కాకినాడ ఎంపీ వంగా గీత తదితరుల కృషితో కేంద్ర ప్రభుత్వ అధికారులు అన్నవరం దేవస్థానాన్ని సందర్శించారు. ఇక్కడ చేపట్టాల్సిన పనులపై ఒక అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో ఇక్కడి అధికారులు సుమారు రూ.100 కోట్లతో వివిధ పనులకు ప్రతిపాదించగా.. తర్వాత దీనిని సుమారు రూ.55 కోట్లకు, ఆ తర్వాత సుమారు రూ.20 కోట్లకు ఈ పనులను కుదించారు. ఆ మేరకు సుమారు రూ.20 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో చేపట్టే వివిధ పనులకు గత ఏడాది మార్చి 7న ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుంచి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. కొద్ది రోజులు గడిస్తే ఈ పనులను ప్రధాని ప్రారంభించి ఏడాది కానుంది. అయినప్పటికీ ఇప్పటికీ ఈ పనుల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. ‘ప్రసాద్’ పనులివీ.. ● దేవస్థానంలోని పాత టీటీడీ భవనం స్థలంలో రూ.10 కోట్లతో రెండంతస్తుల అన్నదాన భవనం నిర్మాణం. ● ప్రస్తుతం అన్నదాన భవనం పక్కనే రూ.6 కోట్లతో క్యూ కాంప్లెక్స్. ● ప్రకాష్ సదన్ భవనం వెనుక ప్రస్తుతం పార్కింగ్ స్థలంగా ఉన్న ప్రదేశంలో అటు సత్యగిరి, ఇటు రత్నగిరికి దగ్గరగా ఉండేలా రూ.3 కోట్లతో టాయిలెట్ బ్లాక్‌ల నిర్మాణం. ● సత్రాల నుంచి ఆలయానికి, వ్రత మండపాలకు భక్తులను తరలించేందుకు రూ.కోటితో రెండు బ్యాటరీ కార్ల కొనుగోలు. తొలుత రెండు ప్యాకేజీలుగా.. అన్నవరం దేవస్థానంలో ప్రసాద్ పనులపై గత ఏడాది అక్టోబర్ 9న రెండు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. మొత్తం 12 మంది కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. వీటిని అదే నెల 25న ఖరారు చేయాల్సి ఉండగా కూటమి సర్కార్ ఆ పని పూర్తి చేయలేదు. చివరకు గత డిసెంబర్లో ఆ టెండర్లను రద్దు చేశారు. ఒకే ప్యాకేజీగా రీటెండర్ ప్రసాద్ పనులకు ఈ ఏడాది జనవరి 9న రీటెండర్ పి లిచారు. ఈసారి రూ.18.97 కోట్లకు ఒకే ప్యాకేజీగా టెండర్లు ఆహ్వానించారు. ఈసారి ఆరుగురు మాత్రమే టెండర్లు వేశారు. వీటిని జనవరి 24న తెరచి ఖరారు చేయాల్సి ఉండగా ఆ పని ఇప్పటి వరకూ జరగలేదు. ఫిబ్రవరి నెల కూడా గడిచిపోయినా దీనిపై ఇంతవర కూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీనికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణమని అధికారులు చెబుతున్నారు. ‘టెండర్’ పెట్టేందుకేనని ఆరోపణలు రాష్ట్రంలోని అన్ని పథకాల టెండర్లలో చక్రం తిప్పుతున్న కూటమి ప్రభుత్వ పెద్దల కన్ను రత్నగికి ‘ప్రసాద్’ టెండర్లపై కూడా పడిందనే ఆరోపణలు రెండు నెలలుగా వినిపిస్తున్నాయి. తమకు అనుకూలమైన కాంట్రాక్టర్‌కు ఈ టెండర్లు దక్కాలనే ఆలోచనతో కూటమికి చెందిన ఒక మంత్రి చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఆవిధంగా తమ అనుకూల కాంట్రాక్టర్‌కు పనులు దక్కే అవకాశం లేదని తేలినందువల్లనే తొలుత పిలిచంని టెండర్లను డిసెంబర్లో రద్దు చేశారనే ఆరోపణలు వచ్చాయి. రెండోసారి టెండర్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లలో అర్హత పత్రాలు జత చేయలేదనే కారణంతో టెక్నికల్ బిడ్ సమయంలో ఇద్దరిని అనర్హులను చేసినట్లు సమాచారం. ఈవిధంగా తమకు అనుకూలమైన కాంట్రాక్టర్‌కే ఈ టెండర్లు దక్కేలా కూటమి నేత ఒకరు తెర వెనుక చక్రం తిప్పుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. రత్నగిరిపై మరింత జాప్యం అక్టోబర్‌లో పిలిచిన మొదటి టెండర్ రద్దు జనవరిలో మళ్లీ టెండర్లు రూ.18.98 కోట్లతో ఒకే ప్యాకేజీగా ఆహ్వానం 35 రోజులైనా ఖరారని వైనం మరింత ఆలస్యం జరిగే అవకాశం -
అబద్ధాల కుప్పగా ఏపీ బడ్జెట్: మార్గాని భరత్
సాక్షి, తూర్పుగోదావరి: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అబద్ధాల కుప్పగా, చంద్రబాబు మోసాలకు ప్రతిరూపంగా ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆక్షేపించారు. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు, ఇప్పుడు కేటాయింపులకు పొంతన లేకుండా బడ్జెట్ రూపొందించారని, ఇదంతా సూపర్ సిక్స్ పథకాల అమల్లో ప్రజలను మోసం చేయడంలో భాగమే అని ఆయన ఆరోపించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర నిధులు కేటాయించడం చూశాక వాటిని కూడా సక్రమంగా అమలు చేయరన్నది స్పష్టమవుతోందని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన మార్గాని భరత్ చెప్పారు.మార్గాని భరత్ ఇంకా ఏమన్నారంటే..:ఎవరు కౌటిల్యుడు? ఎవరు చంద్రగుప్తుడు?:అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా పయ్యావుల కేశవ్ తనను తాను కౌటిల్యుడిగా, చంద్రబాబును చంద్రగుప్త మౌర్యుడిగా పోల్చాడు. సామాన్యుడి సంక్షేమమే తన సంక్షేమంగా భావించి ప్రజలకు మేలు చేసిన చంద్రగుప్త మౌర్యుడితో చంద్రబాబును పోల్చడం విడ్డూరంగా ఉంది. సూపర్ సిక్స్ హామీలకు సంబంధించిన బడ్జెట్లో నిధులు కేటాయించకుండా గొప్పలు చెప్పుకోవడం కన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా?. ఇప్పటికే కూటమి ప్రభుత్వం దాదాపు రూ.1.40 లక్షల కోట్ల అప్పు చేసింది. మరోవైపు బడ్జెట్ ప్రసంగంలో భారతదేశంలో అప్పు తీసుకునే శక్తి లేని రాష్ట్రంగా ఏపీ తయారైందని ఆర్థిక మంత్రి పచ్చి అబద్ధాలు చెప్పారు. ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్లో ఆదాయం కింద రూ.2.17 లక్షల కోట్లు వస్తుందని అంచనా వేశారు. ఇందులో రూ. 1.04 లక్షల కోట్లు అప్పు కింద సమీకరిస్తున్నామని వారే చెప్పారు.మాటలకు చేతలకు పొంతన లేదు:అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా తీసుకెళ్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం రెవెన్యూ వ్యయం కింద రూ.2.51 లక్షల కోట్లు కేటాయించి, మూలధన వ్యయం కింద కేవలం రూ.40 వేల కోట్లు కేటాయించింది. అంటే వారు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదని అర్థమవుతుంది. 1995లో ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారి సీఎం అయిన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ప్రభుత్వం జీతాలివ్వలేని స్థితిలో ఉందని చెప్పి, అంతకు ముందు పాలించిన ఎన్టీఆర్‌ను ఘోరంగా అవమానించారు. వాస్తవానికి ఆ రోజుల్లో మిగులు బడ్జెట్ ఉంటే ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు సీఎం అయ్యాకే రాష్ట్రం అప్పులపాలైంది. సీనియర్ నాయకుడు అయి ఉండి కూడా బడ్జెట్ ప్రసంగంలో పయ్యావుల కేశవ్ తన మంత్రి పదవి కాపాడుకోవడానికి నారా లోకేష్‌ను, సీఎం చంద్రబాబును పొగిడే దుస్థితికి దిగజారిపోయారు.పారిశ్రామికవేత్తలను తరిమేస్తున్నారు:పెయిడ్ ఆర్టిస్టును అడ్డం పెట్టి చంద్రబాబు ప్రభుత్వం సజ్జన్ జిందాల్‌ను వేధించి ఏపీ నుంచి తరిమేస్తే ఆయన కంపెనీ జేఎస్‌డబ్ల్యూ మహారాష్ట్రలో రూ.3 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతోంది. ఇలాంటోళ్లు జగన్ పారిశ్రామికవేత్తలను తరిమేశాడని తప్పుడు ప్రచారం చేశారు. పొరుగునే ఉన్న తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు దావోస్‌లో లక్షల కోట్లు ఒప్పందాలు చేసుకుంటే.. రాష్ట్ర యువతకు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలిస్తామన్న తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ ఉత్త చేతులతో తిరిగొచ్చారు. ఉద్యోగాలివ్వలేని పక్షంలో నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు, ఆ పథకానికి బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించకుండా 20 లక్షల మంది నిరుద్యోగ యువతను నిలువునా మోసగించాడు.పథకాలన్నీ నిర్వీర్యం:ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మార్చి ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ట్రస్టు మోడల్ నుంచి ఇన్సూరెన్స్ మోడల్‌కి మార్చేసి పేదలకు ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మార్చేశారు. గతేడాది బడ్జెట్లో సూపర్ సిక్స్‌లో ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా, ఈ ఏడాది బడ్జెట్లో కూడా ఫ్రీ బస్, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి పథకాలకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోగా, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర నిధులు కేటయించి అమలు చేయడంపైనా ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నారు. 50 ఏళ్లు దాటిన బీసీలకు పింఛన్ ఇస్తామని మాట తప్పారు. అందుకే చంద్రబాబును నమ్మితే పులి నోట్లో తల పెట్టడమేనని, ఎన్నికల ముందు జగన్ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని మార్గాని భరత్ గుర్తు చేశారు. -
ఘనంగా కవిశేఖర ఉమర్ ఆలీషా జయంతి
కాకినాడ రూరల్: పిఠాపురంలోని విశ్వ విజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠం 6వ పీఠాధిపతి బహుముఖ ప్రజ్ఞాశాలి కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా 140వ జయంత్యుత్సవం కాకినాడ సర్పవరం జంక్షన్ బోట్‌క్లబ్ వద్ద శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పీఠం కాకినాడ ఆశ్రమ శాఖ ఆధ్వర్యంలో పీఠం కన్వీనరు పేరూరి సూరిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా విగ్రహానికి నవమ పీఠాథిపతి ఉమర్ ఆలీషా సద్గురువు సోదరులు అహ్మద్ ఆలీషా, హుస్సేన్ షా ఘన నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ మహాకవిగా, శతావధానిగా, తత్త్వవేత్త, సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడిగా, రాజకీయ నాయకుడిగా, పీఠాధిపతిగా డాక్టర్ ఉమర్ ఆలీషా సేవలందించారన్నారు. మాతృ భాష తెలుగు కాకపోయినప్పటికీ తెలుగులో అద్భుతంగా సాహిత్య సంపద సృష్టించారన్నారు. కవిశేఖర ఉమర్ ఆలీషా 1885 ఫిబ్రవరి 28న జన్మించారని, ఆయన జయంతి తమకు పండగ లాంటిదన్నారు. ప్రముఖ పేరడీ గాయకుడు బలరామకృష్ణ తన పాటలతో అలరించారు. ఉమర్ ఆలీషా పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ హుస్సేన్ షా, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, రిటైర్డ్ ఆర్టీఓ రామచంద్రరావు, స్థానిక పీఠం కన్వీనర్ యల్లమాంబ, కాకినాడ లక్ష్మి, రెడ్డి సూర్య ప్రభావతి, వనుము మణి, బాదం లక్ష్మికుమారి, వీరభద్రరావు, రెహ్మన్ కవి శేఖర డాక్టరు ఉమర్ ఆలీషా గురించి వివరించారు. -
ఎమ్మెల్సీ స్థానానికి రీ పోలింగ్ నిర్వహించండి
సాక్షి, న్యూఢిల్లీ: ఉభయ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రీ పోలింగ్ నిర్వహించాలని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండపల్లి శ్రీనివాస్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఎన్డీఏ (టీడీపీ) కూటమి అభ్యర్థికి గట్టి పోటీ ఇస్తాననే ఉద్దేశంతో అధికార పార్టీకి చెందిన నాయకులతో ఎన్నికల అధికారులు కుమ్మకై ్క తన నామినేషన్‌ను కుట్ర పూరితంగా రిజెక్ట్ చేసి పోటీలో లేకుండా తప్పించారని ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలో శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడారు. ఉభయ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశానని చెప్పారు. తనకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈనెల 12 ఫిర్యాదు చేశానని.. అయితే అక్కడ న్యాయం జరగకపోవడంతో 25న కేంద్ర ఎన్నికల సంఘానికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారితోపాటు మిగిలిన అధికారులపై విచారణ జరిపించి తన నామినేషన్‌ను పునరుద్ధరించి ఆమోదించాలని, రీ పోలింగ్ నిర్వహించాలని కోరారు. ఈ విషయంలో తనకు న్యాయం జరిగే వరకూ పోరాడతానన్నారు. నకిలీ వరి విత్తనాలతో నష్టం తాళ్లపూడి: కల్తీ వరి విత్తనాల కారణంగా రబీ వరిలో పంట నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. మండలంలోని మలకపల్లిలో శుక్రవారం గ్రామానికి చెందిన రైతులు స్థానిక రైతు భరోసా కేంద్రం వద్ద కంపెనీ ప్రతినిధులను నిర్బంధించారు. ఈనిక దశలో ఉన్న పంట చేలను వారికి చూపించి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. గ్రామానికి చెందిన మూతిన రాధాకృష్ణ, చెరుకూరి చిన్ని, ఎం అనిల్, మద్దిపాటి రామారావు, ఇమ్మణి సత్యనారాయణ, కొప్పినీడి రాజు, పి సత్యనారాయణ తదితరుల మాట్లాడుతూ ప్రీతి హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ విత్తనాలను తాళ్లపూడిలోని దేవీ ఏజన్సీస్ షాపు వద్ద నుంచి కొనుగోలు చేశామన్నారు. గ్రామంలో 300 ఎకరాల్లో రబీలో వరి సాగు చేశామని తెలిపారు. ప్రస్తుతం ఇందులో నాలుగు రకాల విత్తనాలు కేళీలు వచ్చాయని ప్రస్తుతం ఈనిక దశలో ఉందని తెలిపారు. ముందు వెనుక చేను రెల్లు వేస్తోందని అవి కూడా చిన్నగా ఉన్నాయని తెలిపారు. దీంతో దిగుబడి తగ్గిపోతుందని వాపోయారు. తమకు నష్టపరిహరం చెల్లించాలని, అధికారులు, కంపెనీ ప్రతినిధులు సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. కంపెనీ ప్రతినిధి హరిష్ మాట్లాడుతూ కేళీ వచ్చినంత మాత్రన నకిలీ విత్తనం కాదని అన్నారు. శాస్త్రవేత్తలు, అధికారులు నిర్ణయించాల్సి ఉంటుందని తెలిపారు. దీనిపై మండల వ్యవసాయాధికారిణి జి రుచిత మాట్లాడుతూ వాటి శాంపిళ్లను సేకరించి పరిశీలిస్తామన్నారు. -
పంచింది కొంత... పంచుకున్నది ఎంత?
పిఠాపురం: పంచింది రూ.లక్షల్లో అయితే నొక్కేసింది రూ.కోట్లలో ఉండొచ్చని కూటమి నేతల్లో వినిపిస్తున్న గుసగుసలు పిఠాపురంలో హాట్ టాపిక్‌గా మారాయి. గురువారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పిఠాపురంలో టీడీపీ నేతలు డబ్బు పంపిణీ చేసిన వైనం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. డబ్బు పంపిణీ పేరుతో పోలింగ్ రోజు వరకు కొందరు నేతలు తమ జేబులు నింపుకున్నారన్న చర్చ జరుగుతోంది. 30 మంది ఓటర్లకు ఒకరు చొప్పున కొందరు చోటా నాయకులను ఎంపిక చేసి ఆయా ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేలా చేసినందుకు ఒక్కో చోటా నాయకుడికి రోజుకు రూ.1,000 చొప్పున ముట్టజెప్పిన నేతలు ఆ పేరుతో భారీగా వెనకేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గురువారం ఓటర్లకు డబ్బు పంచుతూ టీడీపీ నేత సోషల్ మీడియాకు చిక్కడంతో అసలు పంపిణీ చేసింది ఎంత? ఎంతమందికి ఇవ్వాలని డబ్బు తెచ్చారు? అనే విషయాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. మీకు ఖర్చులు ఇస్తాం రండి అంటూ దూర ప్రాంతాల నుంచి ఓటర్లను రప్పించిన కూటమి నేతలు తీరా వారు వచ్చి ఓటు వేశాకా మీరు ఎక్కడి నుంచి వచ్చారో మాకేం తెలుసు అంటూ ఖర్చులు ఇవ్వకుండా తప్పించుకున్నట్టు హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక ఓటరు పోలింగ్ కేంద్రం వద్ద వాపోయినట్లు తెలిసింది. వారం రోజుల క్రితమే దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను గుర్తించమని వార్డు స్థాయి నేతలను అధినేతలు ఆదేశించారు. ఇదే అదనుగా కొందరు వార్డు స్థాయి నేతలు తమ జేబులు నింపుకున్నారని అంటున్నారు. కావాలనే వీడియో బయట పెట్టారా? కేవలం కొందరు నేతలు మాత్రమే డబ్బు పంపిణీ బాధ్యతలు తీసుకుని అరకొరగా పంపిణీ చేసి పెద్ద మొత్తంలో పక్కదోవ పట్టించారని కూటమి వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. పార్టీ అధిష్టానం, పార్టీ అభ్యర్థికి అనుమానం రాకుండా ఉండాలనే కావాలనే డబ్బులు పంచుతున్న వీడియోను బయట పడేలా చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. తక్కువ మందికి పంపిణీ చేసి ఎక్కువ మందికి ఇచ్చినట్టు చూపించడం ద్వారా ఎక్కువ మొత్తం కొట్టేయాలనే ఆలోచనలో భాగంగా కొందరికి పంపిణీ చేసి తాము నిజంగా పంపిణీ చేసినట్లు బయటకు తెలిసేలా చేసిన ఒక ప్రయోగంగా బయటపడిన వీడియో గురించి చెప్పుకుంటున్నారు. ఒక విధంగా టీడీపీ నేత డబ్బు పంపిణీ చేస్తూ దొరికి పోవడం సమాజంలో ఒక గుర్తింపు ఉన్న పట్టభద్రులను అవినీతి పరులుగా సమాజానికి తెలియజేసే విధంగా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహించాల్సిన ఎన్నికల అధికారులు ఇంత బహిరంగంగా డబ్బు పంపిణీ బయటపడినా ఏమి పట్టనట్టుగా వ్యవహరించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అంటున్నారు రాజకీయ వేత్తలు. -
బాబురే..! కోతల బడ్జెట్
● ఎన్నికల హామీలు గాలికి ● డ్వాక్రా మహిళలకు టోకరా ● అన్నదాత సుఖీభవకు అరకొర విదిలింపు ● ఊసేలేని మహిళలకు ఉచిత బస్సు ప్రస్తావన ● నిరుద్యోగ భృతికి మంగళం ● నిరాశ మిగిల్చిన కూటమి ప్రభుత్వ వార్షిక బడ్జెట్ సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వ వార్షిక బడ్జెట్ ప్రజలను దగా చేసేలా ఉంది. అమరావతిలోని శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెల్లో అన్ని వర్గాలకు అన్యాయం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం ఇలా అన్ని రంగాలకు తీరని అన్యాయం జరిగింది. కేటాయింపుల్లో కోత విధించి ప్రజలకు మోసం చేశారు. ఇటు వార్షిక, అటు వ్యవసాయ బడ్జెట్లో అన్నీ కోతలే విధించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘సూపర్ సిక్స్’కు అవసరమైన మేరకు కేటాయింపులు జరగలేదు. ఇచ్చిన తొలి హామీకే దిక్కులేకుండా పోయింది. అంతేగాక పలు రంగాలకు సగం కంటే తక్కువ నిధులు కేటాయించారు. రైతులు, మహిళలను దారుణంగా మోసం చేశారు. కూటమి ప్రభుత్వం కొలువు దీరింది. ఇచ్చిన హామీలు అమలు చేస్తుందని భావించిన ప్రజలకు నిరాశే ఎదురైంది. కూటమి బడ్జెట్‌పై మేధావులు, రైతు సంఘాల నేతలు పెదవి విరుస్తున్నారు. ఇంత దారుణమైన బడ్జెట్ తాము ఎన్నడూ చూడలేదని నిట్టూరుస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల్లో సైతం వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిరుద్యోగులకు దగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిరుద్యోగుల ప్రస్తావనే లేకుండా వారిని నిట్టనిలువునా మరోసారి మోసం చేశారు. నయా పైసా కూడా కేటాయించకుండా మోసం చేశారు. జిల్లా వ్యాప్తంగా లక్షల మంది నిరుద్యోగులకు అన్యాయం చేశారు. తల్లికి ద్రోహం తల్లికి వందనం పేరుతో పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15,000 ఇస్తామన్నారు. ఇందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా రూ.12 వేల కోట్లకు పైగా అవసరమైతే... కేవలం రూ.8,276 కోట్లు మాత్రమే కేటాయించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్న ప్రభుత్వం ఒక ఏడాది ఎగనామం పెట్టింది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు 1.62 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు వెళుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా రూ.243 కోట్లు అందించేవారు. ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులను బట్టి చూస్తే పథకంలో భారీగా కోత పడే అవకాశం ఉంది. మహిళలకు మోసం మహిళా అభ్యున్నతికి పాటుపడతామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రబాబు బడ్జెట్ కేటాయింపుల్లో దారుణంగా మోసం చేశారు. 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18,000 ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఉచిత బస్సు ఊసే లేదు మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రస్తావనే లేదు. బడ్జెట్లో నయాపైసా నిధులు కేటాయించలేదు. దీంతో పథకం అమలయ్యే అవకాశం కనిపించడం లేదు. పూర్తిగా వెలగని దీపం ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఈ ఏడాది రెండు సిలిండర్లకు ఎగనామం పెట్టి మోసం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్లో రూ.4 వేల కోట్లకు గాను రూ.2,601 కోట్లు మాత్రమే కేటాయించారు. దీన్ని బట్టి చూస్తే భారీగా కోత విధించేందుకు పావులు కదుపుతోంది. తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 3 ప్రధాన కంపెనీలు, 36 ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతోంది. మొత్తం 6,24,265 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో డబుల్ కనెక్షన్లు మినహాయిస్తే 4,09,734 ఉన్నాయి. తెల్లరేషన్ కార్డులు 5,42,964, అంత్యోదయ 21,591 కలిపి మొత్తం 5,64,555 ఉన్నాయి. బడ్జెట్ కేటాయింపులు చూస్తుంటే వీటిలో భారీగా కోత పెట్టే అవకాశం ఉంది. వేలాది మంది మహిళలు కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. డ్వాక్రా మహిళలకు టోకరా ఎన్నికల సమయంలో రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు అందజేస్తామని ప్రకటించింది. ప్రస్తుత బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఒక్కో ఏడాదిలో 33,498 గ్రామీణ ప్రాంత స్వయం సహాయక సంఘాలకు రూ.37.27 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని 6,680 సంఘాలకు రూ.8.42 కోట్ల వడ్డీ రాయితీ అందించింది. ప్రస్తుత బడ్జెట్‌ను బట్టి చూస్తే మహిళలకు మోసం తప్పడం లేదు. రైతులకు పంగనామాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా ఏడాదికి రూ.20 వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని హామీలు గుప్పించారు. తాజా బడ్జెట్లో మాత్రం అరకొర కేటాయింపులు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలతో కలిపి ఇస్తామంటూ మెలిక పెట్టారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 1.22 లక్షల రైతు కుటుంబాలున్నాయి. తక్కువ కేటాయింపులతో లబ్ధిదారులకు భారీగా కోత పెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతి ఏటా రైతు భరోసా పథకం కింద రూ.90.55 కోట్లు చెల్లించేది. ప్రస్తుతం వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. కౌలు రైతులకు బడ్జెట్లో కేటాయింపులు లేవు. పర్యాటక రంగానికి నిధులేవీ? రాజమహేంద్రవరాన్ని టూరిజం హబ్‌గా ప్రకటించలేదు. జిల్లాలో టెంపుల్, ఏకో, కెనాల్ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఇటీవల మంత్రి దుర్గేష్ ప్రకటించారు. గోదావరి కాలువ, రాజమహేంద్రవరంలోని చారిత్రాత్మక హేవలాక్ బ్రిడ్జి, కడియం నర్సరీలను కలుపుతూ సర్క్యూట్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. కానీ బడ్జెట్లో మాత్రం ఆ మేరకు పూర్తి స్థాయిలో కేటాయింపులు జరగలేదు. విద్య, వైద్య రంగాలపై దృష్టేదీ? కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో విద్య, వైద్య రంగాలపై దృష్టి కేంద్రీకరించలేదు. ప్రస్తుతం పెరిగే ధరలతో పోలిస్తే ఈ బడ్జెట్లో సామాజిక రంగాలకు అన్యాయం జరిగింది. పోలవరం జాతీయ ప్రాజెక్టును మినహాయిస్తే.. వ్యవసాయ రంగానికి కేటాయింపులు సరిగా లేవు. కేంద్ర నుంచి రావాల్సిన నిధుల విషయంలో నోరు మెదపడం లేదు. ఇది రైతు, వ్యవసాయ వ్యతిరేక బడ్జెట్. – తాటిపాక మధు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వాస్తవాల్లేని బడ్జెట్ వెలువరించిన బడ్జెట్లో వాస్తవాలు లేవు. ప్రతిపాదనలు, కేటాయింపులకు విరుద్ధంగా ఉన్నాయి. బీసీలకు 50 ఏళ్లకు పింఛను ఇస్తానని దగా చేశారు. అన్నదాత సుఖీభవకు గతేడాది రూ.4,500 కోట్లు కేటాయించారు. ఎవరికై నా అందిందా? రెండేళ్లు అన్నదాత సుఖీభవకు రూ.21 వేల కోట్లు అవసరమైతే కేటాయించింది మాత్రం రూ.6,300 కోట్లే. మహిళలకు రూ.1,500, విద్యార్థులకు రూ.15,000, రైతులకు రూ.20 వేలు ఇస్తామన్నారు. కేటాయింపులు మాత్రం అరకొరగా ఉన్నాయి. అరాచకం, విధ్వంసం అన్నారు. సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికలకు ముందు తెగ హడావుడి చేశారు. అధికారంలో వచ్చాక సక్రమంగా పథకాలు అమలు చేసిన దాఖలాలు లేవు. మాజీ సీఎం వైఎస్ జగన్ క్యాలెండర్ ప్రకటించి మరీ సంక్షేమ పథకాలు ఇచ్చారు. – చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు -
ఆటల్లో గెలుపు ఓటములు సహజం
● భారత మాజీ హాకీ కెప్టెన్ ధనారాజ్ పిళ్ళై ● ముగిసిన ఆలిండియా సివిల్ సర్వీసెస్ హాకీ పోటీలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఆటల్లో గెలుపు ఓటములు సహజం అని భారత హాకీ మాజీ కెప్టెన్ ధనరాజ్ పిళ్ళై పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా క్రీడామైదానంలో ఆలిండియా సివిల్ సర్వీసెస్ పురుషులు, మహిళల హాకీ పోటీలు ముగిశాయి. ముగింపోత్సవానికి టోర్నమెంట్ చీఫ్ కో–ఆర్టినేటర్, డిఎస్‌డీఓ బి.శ్రీనివాస్ కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ఒలింపియన్, భారత హాకీ జట్టు కెప్టెన్ఽ ఒలింపియన్, ధనరాజ్ పిళ్ళై, గౌరవ అతిథిగా ఏపీ, తెలంగాణ ఇన్కమ్ టాక్స్ డైరెక్టర్ ఆనంద్ రాజేశ్వర్ భాయ్వార్ హాజరయ్యారు. ధనరాజ్ మాట్లాడుతూ పోటీలలో విజేతలుగా నిలిచిన సెంట్రల్ సెక్టార్ జట్టు, ఒడిశా జట్టును ఆయన అభినందించారు. ఈ పోటీలలో దేశవ్యాప్తంగా 44 జట్లు పాల్గొన్నాయి. పురుషుల విభాగంలో సెంట్రల్ సెక్టార్ ప్రథమ, హైదరాబాద్ సెక్టార్ ద్వితీయ, హర్యానా తృతీయస్థానాలు, మహిళల విభాగంలో ఒడిశా మొదటి, సెంట్రల్సెక్టార్ రెండవ, హర్యానా మూడవ స్థానాలు గెలుచుకున్నాయి. విజేతలకు అతిధులు బహుమతులు అందజేశారు. టోర్నమెంట్ స్పాన్సర్స్‌కు అతిధులు చేతుల మీదుగా మెమెంటోలు ఇచ్చారు. టోర్నమెంట్ కన్వీనర్, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కల్చరల్, స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి రాహుల్ కుమార్, కలెక్టర్ షణ్మోహన్, జేసీ రాహుల్ కుమార్ మీనా, ట్రైనీ కలెక్టర్ భావన, హాకీ సంఘ ప్రతినిధి రవిరాజు, జేఎన్టీయూకే వీసీ ప్రసాద్, జేఎన్టీయూకే స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి శ్యాంకుమార్, కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ వ్యవస్థాపకులు రవిచంద్ర, అంతర్జాతీయ హాకీ క్రీడాకారుడు డి.మురళీకృష్ణ, డీఎస్ఏ కోచ్‌లు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు శనివారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫస్టియర్ జనరల్ విద్యార్థులు 20,591 మంది , ఒకేషనల్ 2,226 మంది, ద్వితీయ సంవత్సరం జనరల్ 19,226 మంది, ఒకేషనల్ 1875 మంది, మొత్తం 43,754 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. జిల్లాలో 51 కేంద్రాల్లో 20వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని కేంద్రాల్లోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్షకు అరగంట ముందుగా చేరుకోవాలి. పరీక్షల నిర్వహణకు 51 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 51 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 17 మంది అడిషనల్ డీవోలు, 10 మంది కస్టోడియన్లతోపాటు మూడు సిట్టింగ్ స్క్వాడ్లు, మూడు ప్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు పోలీసు అధికారులు, సిబ్బందితో పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ డి. నరసింహ కిషోర్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. విద్యార్థులు సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రాలలోకి తీసుకువెళ్లకూడదని, పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ఉండే జిరాక్స్ సెంటర్లు మూసి వేయాలన్నారు. ఫీల్డ్ ఆపరేటర్ల శ్రమను దోచుకుంటున్న ఓఎన్జీసీ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అరుణ్ రాజమహేంద్రవరం రూరల్: ఓఎన్జీసీ యాజమాన్యం ఫీల్డ్ ఆపరేటర్ల శ్రమను దోచుకుంటోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్ విమర్శించారు. ఫీల్డ్ ఆపరేటర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఓఎన్‌సీజీ గేటు వద్ద ఉద్యోగులు శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టి.అరుణ్ మాట్లాడుతూ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులు తమను పర్మినెంట్ చేయాలని ఆందోళనలు చేశారని అన్నారు. ఈ నేపథ్యంలో నాలుగు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ విధానాన్ని తీసుకొచ్చి ఉద్యోగ భద్రతను దూరం చేశారని మండిపడ్డారు. కార్మికుల చేత స్కిల్డ్ వర్క్ చేయించుకుని అన్ స్కిల్ వేతనాలు చెల్లిస్తున్నారని తెలిపారు. 2023 నుండి పెండింగ్‌లో ఉన్న పే రివిజన్ తక్షణమే చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ ఓపీడీ అలవెన్స్ రూ.1,000 నుంచి రూ.8,000కు పెంచాలని కోరారు. ఈ ధర్నాకు వి.శ్రీనివాసరావు, చంద్రమౌళి అధ్యక్షత వహించారు. నాయకులు డీఎస్ఆర్వీ సుబ్రహ్మణ్యం, అహ్మద్ అలీషా, నాయుడు, జి.చంద్రశేఖర్, గంగాచలం, బి.జయరాజు, రామకృష్ణయ్య పాల్గొన్నారు. రేషన్ సరకులకు అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలోని పలు ఎండియూ ఆపరేటర్లు రేషన్ సరకుల డెలివరీ సమయంలో ఎక్కువ ధర వసూలు చేస్తున్నారని, అటువంటివారిపై చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి జిల్లా పౌర సరఫరాల అధికారి ఎం.నాగాంజనేయులు అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలోని ఎండీయూ ఆపరేటర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. నాగాంజనేయులు మాట్లాడుతూ ఎండియూ ఆపరేటర్లు వారి పరిధిలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి రేషన్ సరకులు ఇవ్వాలని అదేశించారు. విధిగా తూకం వేసి ఇవ్వాలని, తూకం విషయంలో ఎటువంటి అవకతవకలు లేకుండా రేషన్ సరుకులు సరఫరా చేయాలన్నారు. సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్దార్లు, ఇతర సిబ్బంది, ఎండీయూ ఆపరేటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు. రైళ్ల రద్దు రాజమహేంద్రవరం సిటీ: విజయవాడ డివిజన్లోని కడియం, ద్వారపూడి, అనపర్తి రైల్వే స్టేషన్ మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు నిమిత్తం మార్చి 1,2,3 తేదీలలో జిల్లా మీదుగా రాకపోకలు సాగించే గుంటూరు– విశాఖపట్నం –గుంటూరు (17239/17240), విశాఖపట్నం– లింగంపల్లి– విశాఖపట్నం మధ్య నడిచే (12805/12806) రైళ్లను రద్దు చేసినట్టు విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటించారు. రద్దయిన రైళ్లలో రిజర్వేషన్ పొందిన ప్రయాణికులకు టిక్కెట్ సొమ్ము పూర్తిగా అందజేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. -
సరదాగా వెళ్లి... విగతజీవులై
ఫ రోడ్డు ప్రమాదంలో యువకుల మృతి ఫ పాత ఇంజరం వద్ద ఘటన ముమ్మిడివరం/ఐ.పోలవరం: బైక్‌పై సరాదాగా వెళ్లిన ఇద్దరు యువకులను గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే మృతి చెందారు. ఐ.పోలవరం మండలం పాత ఇంజరం వద్ద గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ముమ్మిడివరం మండలం బూరుగుపేటకు చెందిన మట్టా ఆకాష్‌రెడ్డి (21), ముమ్మిడివరం టెలిఫోన్ ఎక్ఛ్సేంజ్ వీధికి చెందిన దొమ్మేటి అభినవ్ (17) స్పోర్ట్స్ బైక్‌పై యానాంకు సరాదాగా వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నారు. వీరిని పాత ఇంజరం 216 జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరూ సంఘటనా స్థలంలో మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు మృతదేహాలను ఐ.పోలవరం పోలీసులు ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, ఘటనా స్థలంలో సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఐ.పోలవరం ఎస్సై మల్లిఖార్జున రెడ్డి తెలిపారు. ఒక్కగానొక్క కొడుకు.. ఒక్కగానొక్క కొడుకు అభినవ్ మృతితో ఆ తల్లిదండ్రుల రోధన కంటతడి పెట్టించింది. అల్లారు ముద్దుగా పెంచుకున్నామని, ఇక మాకెవరు దిక్కంటూ దొమ్మేటి అచ్యుత వీరవెంకట సత్యనారాయణ, సరోజనీ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో దేవుళ్లకు మొక్కితే 14 ఏళ్లకు కొడుకు పుట్టాడని, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నామని వారన్నారు. పదో తరగతి వరకూ చదువుకున్న తమ కుమారుడు స్నేహితులతో కలసి వెళ్లి ఇలా విగతజీవుడవుతాడని అనుకోలేదని ఆ కుటుంబ సభ్యులు అంటున్నారు. చేతికి అందివచ్చి.. మట్టా రాహుల్, సుభాషిణి దంపతులకు పెద్ద కుమారుడు ఆకాష్‌రెడ్డి. ప్రసుత్తం ముమ్మిడివరంలో డిగ్రీ చదువుతున్నాడు. చేతికంది వచ్చిన కొడుకు మృతితో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్నేహితులతో సరదాగా తిరిగి వస్తున్నాడనుకున్నామని, ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతాడని అనుకోలేదని ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోధించారు. -
అరెస్టులు కక్ష సాధింపే
● ప్రభుత్వ వైఫల్యాల నుంచి డైవర్షన్‌కే వైఎస్సార్ సీపీ నేతల అక్రమ అరెస్టులు ● మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫైర్సాక్షి, రాజమహేంద్రవరం: నెల రోజుల వ్యవధిలో వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని, సినీ నటుడు పోసాని కృష్ణమురళీని అక్రమంగా అరెస్టు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆరోపించారు. తొమ్మిది నెలలుగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు, నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లి మహిళలను సైతం బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఆరోగ్యం బాగా లేదని చెప్పినా లెక్క చేయకుండా అధికారం ఉంది కదా ఏం చేసినా చెల్లుతుందన్న ధోరణిలో వైఎస్సార్ సీపీ తరఫున గొంతు కలిపిన ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడుతున్నారని ఆక్షేపించారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా ఘోర వైఫల్యం చెందారని, దాని నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు నిత్యం ఏదో ఒక అంశాన్ని వెతుక్కుని దానిపై ఓ రెండు వారాల పాటు నడిపించడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. కొత్త బడ్జెట్ ప్రజారంజకంగా లేదని, దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం తెర లేపిన కొత్త సంస్కృతి, సంప్రదాయంతో రేపు మళ్లీ అదే బోనులో వారు కూడా నిలబడాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వం చేసే ప్రతి అరాచకాన్నీ ప్రజలు గమనిస్తున్నారని, ప్రభుత్వం మీద ప్రజల్లో ఇంత తీవ్రమైన స్థ్ధాయిలో వ్యతిరేకత ఎప్పుడూ చూడలేదని అన్నారు. గద్దెనెక్కించిన ప్రజలే ప్రభుత్వాన్ని గద్దె దించే కార్యక్రమం చేస్తారని.. ప్రజలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని రాజా స్పష్టం చేశారు. -
పీఏటీ పాస్ సర్టిఫికెట్లు రెడీ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా గత ఏడాది మార్చిలో జరిగిన ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్ టెస్ట్ (పీఏటీ) పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారి పాస్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తీర్ణులైన వారు తమ హాల్ టికెట్లతో శుక్రవారం నుంచి తమ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. వసతి గదుల కార్యాలయం వద్ద ఫ్రీ వైఫైఅన్నవరం: జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఇటీవల అన్నవరం దేవస్థానంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సందర్భంగా డిజిటల్ పేమెంట్లకు ఫ్రీ వైఫై సదుపాయం కల్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రత్నగిరిపై వసతి గదుల కార్యాలయంలో అధికారులు ఫ్రీ వైఫై ఏర్పాటు చేసి, డిజిటల్ పేమెంట్లకు అవకాశం కల్పించారు. ఆ కార్యాలయం వద్దకు వచ్చిన వెంటనే సెల్ఫోన్లో వైఫై ఆన్ చేయగానే సీఆర్ఓ రూముల బుకింగ్ అని వస్తుంది. దానిపై క్లిక్ చేయగానే వైఫై ఆన్ అవుతుంది. తద్వారా సత్యదేవుని సన్నిధిలో ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపుల ద్వారా వసతి గదులు పొందే అవకాశం భక్తులకు కలిగింది. వాట్సాప్ గవర్నెన్స్‌లో రిఫండ్ ఆప్షన్అన్నవరం: సత్యదేవుని సన్నిధి సహా ఇతర దేవస్థానాల్లో వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా మన మిత్ర పేరుతో అమలు చేస్తున్న వాట్సాప్ గవర్నెన్స్‌లో రిఫండ్ ఆప్షన్‌ను కూడా చేర్చారు. ఈ మేరకు రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ ఇన్చార్జి కమిషనర్ కె.రామచంద్ర మోహన్ గురువారం అన్ని దేవస్థానాలకూ సర్క్యులర్ జారీ చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దేవస్థానాల్లో వివిధ సేవలు, దర్శనాల టికెట్లు కొనుగోలు చేసిన కొనుగోలు చేసిన భక్తులకు ఏ కారణంతోనైనా వారి అకౌంట్ నుంచి నగదు కట్ అయి, టికెట్ రాకుంటే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నారు. ఇప్పటి వరకూ వాట్సాప్ గవర్నెన్స్‌లో ఈ ఆప్షన్ లేదు. నగదు కట్ అయి టికెట్లు రాని వారు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఆయా సేవల టికెట్లు లేదా విరాళాల రశీదులు రాకపోతే భక్తులు ఆయా దేవస్థానాల్లోని హెల్ప్ డెస్క్ లేదా కాంటాక్ట్ పాయింట్లో ఫిర్యాదు చేయాలి. నగదు చెల్లించినట్లు ఆధారాలు చూపాలి. ఆ వివరాలను వాట్సాప్ గవర్నెన్స్ నిర్వహిస్తున్న హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు పంపిస్తారు. బ్యాంకు పరిశీలన, నిర్ధారణ అనంతరం ఆ నగదును ఆ భక్తుని అకౌంట్‌కు జమ చేస్తారు. ఎటువంటి అవకతవకలకు ఈ మొత్తం వ్యవహారాన్ని రికార్డు చేయాలని, ఆడిట్ సమయంలో ఆడిట్ అధికారులకు సమర్పించాలని కమిషనర్ సూచించారు. పీఠంలో లింగోద్భవ పూజలు రాయవరం: మండలంలోని వెదరుపాక విజయదుర్గా పీఠంలో బుధవారం అర్ధరాత్రి లింగోద్భవ పూజలు ఘనంగా నిర్వహించారు. పీఠంలోని విజయదుర్గా అమ్మవారి సన్నిధిలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ పూజలు నిర్వహించారు. పీఠంలో ఉన్న ఎనిమిది ఈశ్వర బాణాలకు రాత్రి 11గంటల నుంచి శివుడు లింగరూపంలో ఉద్భవించిన సమయం వరకు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, అభిషేకం, అర్చనలు తదితర పూజలు నిర్వహించారు. వేద పండితులు చీమలకొండ వీరావధాని, శ్రీనివాసావధానులు, తోలేటి నాగేంద్రశర్మ, చక్రవర్తుల మాధవాచార్యులు తదితర 18 మంది వేద పండితులు ఈ పూజలను నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి లింగోద్భవ పూజలను వీక్షించారు. పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. రాయవరం పార్వతీ సమేత రాజేశ్వరస్వామి, అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి, సోమేశ్వరంలోని శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత సోమేశ్వరస్వామి, చెల్లూరులోని అగస్తేశ్వరస్వామి, వెంటూరులోని ఉమా సమేత సోమేశ్వరస్వామి, వెదురుపాక పార్వతీ సమేత సోమేశ్వరస్వామి, మాచవరంలో భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి, పసలపూడిలో రాజరాజేశ్వరస్వామి ఆలయాల్లో లింగోద్భవ పూజలు భక్తుల శివనామస్మరణ నడుమ పురోహితులు నిర్వహించారు. కొబ్బరి శాస్త్రవేత్తలకు టీమ్ అవార్డు అంబాజీపేట: వివిధ పంటలపై ఆశించే పురుగులు, తెగుళ్ల సమర్ధ నివారణకు జీవ నియంత్రణ పద్ధతుల వినియోగంపై స్థానిక డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా కేంద్ర శాస్త్రవేత్తలకు టీమ్ అవార్డు లభించినట్టు కేంద్ర అధిపతి డాక్టర్ ఎన్.బి.వి.చలపతిరావు తెలిపారు. ఈ మేరకు గురువారం బెంగళూరులో జరిగిన రెండవ అంతర్జాతీయ జీవ నియంత్రణ సమావేశంలో ఈ అవార్డును ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్, నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చర్ ఇన్సెక్ట్స్ రీ సోర్సెస్ అధ్యక్షుడు డాక్టర్ ఎన్. ఎస్.సుశీల్, పరిశోధనా కేంద్ర అధిపతి డాక్టర్ చలపతిరావుకు ప్రదానం చేశారు. కొబ్బరి, కోకో, పంటలపై పురుగులు, తెగుళ్లను జీవ నియంత్రణ పద్ధతులలో నివారిస్తూ, బదనికలను అధిక సంఖ్యలో ఉత్పత్తి చేసి రైతులకు పంపిణీ చేసినందుకు ఈ అవార్డు లభించినట్లు చలపతిరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమెరికాకు చెందిన ఇతర పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
సూపర్ సిక్స్ ఓ బూటకం
● ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలు 143 ● ఒక్కటి కూడా అమలు చేయలేదు ● పథకాలు ఎగ్గొట్టడానికి ఆర్థిక వ్యవస్థ ధ్వంసమంటూ తప్పుడు ప్రచారం ● వైఎస్సార్ సీపీ నేత తలారి వెంకట్రావు చాగల్లు: కూటమి ప్రభుత్వం సూపర్‌సిక్స్ పథఽకాల అమలు ఒట్టి బూటకమని వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. చాగల్లులో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరుపై ఘాటుగా విమర్శించారు. ఎన్నికల్లో కూటమి నేతలు సూపర్ సిక్స్ మాత్ర కాదని, మొత్తం 143 హామీలు ఇచ్చారని చెప్పారు. అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది గడుస్తున్నా ఒక్క పథకం కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను రద్దు చేయానికి, ఎన్నికల హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టడానికి, ఒకటీ అరా ఇచ్చినా పూర్తిగా కోతలు విధించడానికే ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా తలారి వెంకట్రావు ఏమన్నారంటే.. ● దీపం పథకంలో భాగంగా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లని చెప్పారు. మొత్తం 1.55 కోట్ల లబ్ధిదారులుంటే 86 లక్షల మందికే ఒక్కో సిలిండర్ చొప్పున కేవలం రూ.686 కోట్లు మాత్రమే రీయింబర్స్ చేసినట్లు సాక్షాత్తూ గవర్నర్‌తోనే చెప్పించారు. తద్వారా ఈ పథకం ఎంత మోసమో తేలిపోయింది. ● డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకు ండా రిజర్వేషన్ల పేరిట కాలయాపన చేస్తున్నారు. ● అధికారంలోకి వచ్చి ఏడాదే రైతు భరోసా, అమ్మ ఒడి రెండూ ఇవ్వలేదు. మే నెలలో అమ్మ ఒడి ఇస్తామంటున్నారు. దీనిని రెండేళ్లకూ కలిపి ఇస్తారా? ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ అనే మాట ఇప్పటికీ చెప్పడం లేదు. ● పీఎం కిసాన్ కాకుండా అన్నదాతా సుఖీభవకు రూ.20 వేలు ఇస్తామన్నారు. ఇప్పుడు పీఎం కిసాన్తో కలిపి ఇస్తామంటున్నారు. ఏమిటీ మోసం? ఇది కూడా ఎంత మందికి ఇస్తారో, రెండేళ్లకు కలిపి ఇస్తారా అనేది వెల్లడించడం లేదు. ● అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో సాధించామని చెప్పుకొంటున్న రైల్వే జోన్‌కు కూడా భూమి ఇచ్చింది గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే. కూటమి వచ్చాక, ఆదాయం వచ్చే రైలు మార్గాలను, రైల్వే స్టేషన్లను ఒడిశాకు అప్పజెప్పారు. చిక్కి శల్యమైన జోన్‌ను సాధించి, ప్రజలకు ద్రోహం చేసి, దానిని కూడా గొప్పగా చెప్పుకుంటూ, అనుకూలంగా వక్రీకరించుకుంటున్నారు. ● కుటుంబాన్ని చూసుకోలేని వారు దేశాన్ని ఎలా చూసుకుంటారని గతంలో ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు దూషించారు. ఆయన కుటుంబాన్ని నీచంగా మాట్లాడారు. అమిత్‌షాపై తిరుపతిలో ఏకంగా రాళ్ల దాడి చేయించారు. ఇప్పుడు కాళ్లావేళ్లా పడి పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ మోదీని పొగడటం హాస్యాస్పదం. ● మధ్యాహ్న భోజనానికి మహాతల్లి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఘోరమైన భోజన కార్యక్రమమైంది. రోజుకో మెనూ పోయింది. కలుషితాహార ఘటనలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. పిల్లలు ఆస్పత్రుల్లో చేరుతున్న పరిస్థితులు రాష్త్రంలో ప్రతి రోజూ నెలకొంటున్నాయి. ● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయంలో నిరుపేదలందరికీ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకూ వైద్యాన్ని ఉచితంగా అందించారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మధ్యతరగతి ప్రజలకు సైతం ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మధ్యతరగతి వారికి చికిత్స వ్యయాన్ని రూ.2.5 లక్షలకే పరిమితం చేసింది. ఆరోగ్యశ్రీని పూర్తిగా మూసేసి, ఆరోగ్య బీమా పేరుతో వేల కోట్ల రూపాయల ప్రీమియం కొట్టేయడానికి ప్లాన్ చేశారు. దీనిని ప్రైవేటు కంపెనీలకు అప్పగించడానికి పెద్ద స్కాం చేస్తున్నారు. ● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు పూర్తయిన ఇళ్లనే కూటమి ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుని, పేదలకు ఇళ్ల నిర్మాణంలో ఏదో చేసేసినట్లు చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. వాస్తవానికి గత ఎన్నికల నాటికే 9.02 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. అప్పటికి నిర్మాణంలో ఉన్న ఇళ్లను ఈ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవడం ఆశ్చర్యకరం. వాట్సాప్‌లో సిటిజన్ సర్వీసుల సంగతేమో కానీ, హాయ్ అని కొట్టగానే వెంటనే మందు వస్తోంది. -
నేడు సివిల్ సర్వీసెస్ హాకీ ఫైనల్స్
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఆలిండియా సివిల్ సర్వీసెస్ కల్చరల్, స్పోర్ట్స్ బోర్డు పర్యవేక్షణలో జిల్లా క్రీడా మండలి ఆధ్వర్యాన కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో జరుగుతున్న ఆలిండియా సివిల్ సర్వీసెస్ పురుషులు, మహిళల హాకీ పోటీల ఫైనల్స్ శుక్రవారం జరగనుంది. గురువారం మహిళల సెమీ ఫైనల్స్‌లో ఒడిశా – ఆంధ్రప్రదేశ్ సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒడిశా 6–0 స్కోర్‌తో, సెంట్రల్ సెక్టార్ – హర్యానా మధ్య జరిగిన మ్యాచ్‌లో సెంట్రల్ సెక్టార్ 6–0 స్కోర్‌తో విజయం సాధించి, ఫైనల్స్‌కు చేరుకున్నాయి. పురుషుల విభాగంలో సెంట్రల్ సెక్టార్ – ఒడిశా మధ్య జరిగిన మ్యాచ్‌లో సెంట్రల్ సెక్టార్ 8–2 స్కోర్‌తో, ఆర్ఎస్బీ హైదరాబాద్ – హర్యానా సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్ఎస్బీ హైదరాబాద్ 5–0 స్కోర్‌తో విజయం సాధించి ఫైనల్స్‌లో చోటు దక్కించుకున్నాయి. జిల్లా క్రీడా మైదానంలో జరిగే ముగింపు ఉత్సవానికి భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్, ఒలింపియన్ ధనరాజ్ పిళ్లై, కలెక్టర్ షణ్మోహన్, ఇన్‌కమ్‌ట్యాక్స్ డైరెక్టర్ జనరల్ అతిథులుగా హాజరు కానున్నారు. -
పదవీ విరమణకు ఒక్క రోజు ముందు ఆగిన గుండె
రాజోలు: ఫైర్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న భైరిశెట్టి బాలకృష్ణ (62) ఈ నె 28న పదవీ విరమణ చేయనుండగా.. ఒక రోజు ముందు గుండెపోటుతో రావడంతో గురువారం మృతి చెందారు. రాజోలు గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న ఆయన ముమ్మిడివరం అగ్నిమాపక కేంద్రానికి విధులు నిర్వర్తించేందుకు మోటార్ సైకిల్‌పై బయలుదేరారు. ఇంటికి కూతవేటు దూరం వెళ్లేసరికి పంచాయతీ రోడ్డులో ఛాతి బరువెక్కి తీవ్రమైన గుండె నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో స్థానికులు ఆయనను రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. రాజోలులో లీడింగ్ ఫైర్‌మన్‌గా విధులు నిర్వహిస్తూ మూడు నెలల క్రితం పదోన్నతిపై ముమ్మిడివరం ఫైర్ ఆఫీసర్‌గా బదిలీపై వెళ్లారు. పోస్టుమార్టమ్ అనంతరం బాలకృష్ణ మృతదేహాన్ని స్వగ్రామం మామిడికుదురు మండలం కంచివారిపాలానికి తరలించారు. -
మందకొడిగా మొదలై..
శుక్రవారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025జిల్లాలో పోలింగ్ వివరాలు మొత్తం ఓటర్లు 62,970 పోలైన ఓట్లు 42,446 పోలింగ్ శాతం 60.03 నియోజకవర్గాల వారీగా అనపర్తిలో 73.36 శాతం, రాజానగరం 60.27, రాజమండ్రి రూరల్ 76.32, రాజమండ్రి సిటీ 63.22, జగ్గంపేట 79.99, కొవ్వూరు 66.37, నిడదవోలు 75.72, గోపాలపురం 63.72 శాతం చొప్పున ఓటింగ్ జరిగింది.లో8 -
పారిశుధ్య నిర్వహణపై సందిగ్ధత
● రత్నగిరిపై కొలిక్కిరాని వ్యవహారం ● నేటితో ముగియనున్న కేఎల్‌టీఎస్ కాంట్రాక్ట్ ● తాత్కాలికంగా కొత్త ఏజెన్సీ ఎంపిక ● అయినా తొలగని గందరగోళం అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో పారిశుధ్య విధులు నిర్వహిస్తున్న హైదరాబాద్‌కు చెందిన కేఎల్‌టీఎస్ సంస్థ కాంట్రాక్ట్ శుక్రవారంతో ముగియనుంది. తాత్కాలికంగా కొత్త ఏజెన్సీకి ఈ పనులు అప్పగించగా.. దీనికి అవసరమైన మెషీన్లు, ఇతర సామగ్రి వంటివి సమస్యగా మారుతోంది. దీంతో వ్యవహారం కొలిక్కిరాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలివీ.. అన్నవరం దేవస్థానంలో కేఎల్‌టీఎస్ సంస్థ రెండేళ్లుగా శానిటరీ విధులు నిర్వహిస్తోంది. గత ఏడాది నవంబర్ నెలతోనే ఈ సంస్థ కాంట్రాక్ట్ గడువు ముగిసింది. ఈ పరిస్థితుల్లో టెండర్ ద్వారా కొత్త సంస్థను ఎంపిక చేసేంత వరకూ ఈ విధులు నిర్వహించాలని కేఎల్‌టీఎస్ సంస్థను దేవస్థానం కోరింది. దీంతో ఆ సంస్థ సిబ్బంది ఈ నెలాఖరు వరకూ ఆ పనులు నిర్వహించారు. మార్చి 1 నుంచి తాము ఆ విధులు నిర్వహించలేమని ఆ సంస్థ దేవస్థానానికి లేఖ సమర్పించింది. దీంతో దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్‌ను అన్నవరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు ఈ నెల 14న విజయవాడలో కలిసి, పరిస్థితి వివరించారు. ఈ నేపథ్యంలో మార్చి 1 నుంచి నెల రోజుల పాటు దేవస్థానంలో శానిటరీ పనులకు అవసరమైన సిబ్బంది సరఫరాకు గుంటూరుకు చెందిన కనకదుర్గా శానిటరీ సర్వీసెస్ సంస్థను తాత్కాలికంగా ఎంపిక చేశారు. మెటీరియల్, మెషీనరీ సమస్య పారిశుధ్య సిబ్బంది సరఫరాకు ఏజెన్సీని ఎంపిక చేసినప్పటికీ, ఫినాయిల్, యాసిడ్, ఇతర లిక్విడ్స్ వంటి శానిటరీ మెటీరియల్ కొనుగోలు సమస్యగా మారింది. ఇప్పటి వరకూ కేఎల్‌టీఎస్ సంస్థే వీటన్నింటినీ సరఫరా చేసి, పనులు నిర్వహించేది. ఆ పనులు సరిగ్గా లేకపోతే దేవస్థానం మరోసారి చేయించేది. ఇప్పుడు నాణ్యమైన శానిటరీ సామగ్రిని దేవస్థానమే కొనుగోలు చేయాల్సి ఉంది. అలాగే, ఆలయ ఆవరణను కడగడానికి అవసరమైన మెషీన్లు కేఎల్‌టీఎస్ సంస్థ వద్దనే ఉన్నాయి. ఆ సంస్థ వాటిని తీసుకుని వెళ్లిపోతే పరిస్థితేమిటనే మీమాంస అధికారుల్లో నెలకొంది. నిత్యం వేలాదిగా భక్తులు వచ్చే అన్నవరం దేవస్థానంలో 24 గంటలూ పారిశుధ్యం, సత్రాల్లో హౌస్ కీపింగ్, ఆలయ ప్రాంగణంలో శుభ్రత తదితర పనులు నిరంతరాయంగా జరగాల్సి ఉంది. ఒక్క రోజు ఈ పనులు ఆగిపోయినా భక్తులకు ఇబ్బంది తప్పదు. ఈ పరిస్థితిని కమిషనర్‌కు వివరించామని, ఆయన నుంచి ఆదేశాలు వచ్చేంత వరకూ శానిటరీ మెటీరియల్, మెషీనరీని తీసుకుని వెళ్లవద్దని కేఎల్‌టీఎస్ సంస్థ కాంట్రాక్టర్‌ను కోరామని దేవస్థానం అధికారులు చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలోని ఏడు దేవస్థానాలను ఒకే యూనిట్‌గా రెండేళ్లకు శానిటరీ టెండర్ పిలుస్తారని, అప్పటి వరకూ తాత్కాలిక ఏర్పాట్లు తప్పవని తెలిపారు. ఈ విషయంలో కలెక్టర్ షణ్మోహన్ జోక్యం చేసుకుంటే తప్ప సమస్య పరిష్కారం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.అన్నవరం దేవస్థానం -
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
● జిల్లావ్యాప్తంగా 51 కేంద్రాల్లో నిర్వహణ ● పరీక్షలు రాయనున్న 43,754 మంది విద్యార్థులుకంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటర్మీడియెట్ పరీక్షలు శనివారం ప్రారంభం కానున్నాయి. మార్చి 20వ తేదీ వరకూ జరిగే ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామని ప్రాంతీయ ఇంటర్మీడియెట్ బోర్డు అధికారి (ఆర్ఐఓ) ఎన్‌ఎస్‌వీఎల్ నరసింహం గురువారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 51 కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి. అన్ని కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు అరగంట ముందుగా చేరుకోవాలి. తమ పరీక్ష కేంద్రాలను ఒక రోజు ముందుగానే తెలుసుకోవాలి. పరీక్షల నిర్వహణకు 51 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 51 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 17 మంది అడిషనల్ డీఓలు, 10 మంది కస్టోడియన్లతో పాటు మూడు సిట్టింగ్ స్క్వాడ్లు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. సీతానగరం, మురమండ, రంగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, అనపర్తి జీబీఆర్, ఎన్ఎంఆర్ కళాశాలలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి, అక్కడ మరింత బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పరీక్ష ప్రారంభం నుంచి ముగిసేంత వరకూ ఆయా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను తెరవరాదని ఆదేశించారు. ఆయా విద్యార్థుల వాట్సాప్‌కు హాల్ టికెట్లు పంపించారు. వాటిని విద్యార్థులు డౌన్లోడ్ చేసుకుని, పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లవచ్చు. పరీక్షలు రాయనున్న విద్యార్థులు ఫస్టియర్ జనరల్ 20,591 ఒకేషనల్ 2,226 ద్వితీయ సంవత్సరం జనరల్ 19,062 ఒకేషనల్ 1,875 మొత్తం 43,754 -
4 నుంచి ‘నన్నయ’లో నారీ ఫెస్ట్
రాజానగరం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో వచ్చే నెల 4 నుంచి నారీ ఫెస్ట్ 2025 నిర్వహించనున్నామని వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో మహిళలకు వివిధ విభాగాలలో పోటీలు ఉంటాయన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం విలేకరులకు తెలిపారు. మొదటి రోజు సెమినార్ హాల్లో హెల్త్ బేబీ పోటీలు, కన్వెన్షన్ సెంటర్లో బామ్మ–మనుమరాలి ఫ్యాషన్ షో జరుగుతుందన్నారు. హెల్త్ బేబీ పోటీలకు రాజమహేంద్రవరం పరిసరాలలోని ఐదేళ్లలోపు చిన్నారులు (ఆడ – మగ) పాల్గొనవచ్చన్నారు. వీటికి సంబంధించిన వివరాలకు 63057 89433 ఫోన్ నంబరులో సంప్రదించవచ్చు. బామ్మ–మనుమరాలు ఫ్యాషన్ షోలో పాల్గొనే బామ్మల వయస్సు 60 సంవత్సరాలు పైబడి ఉండాలని, మనుమరాలి వయసు ఐదు నుంచి పదేళ్ల వరకు ఉండవచ్చన్నారు. ఆసక్తి ఉన్నవారు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.150 చెల్లించి, మార్చి 3లోగా పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. వీటికి సంబంధించిన వివరాలకు 99126 62500 ఫోన్ నంబరులో సంప్రదించవచ్చు. క్యాంపస్‌లోని మహిళల కోసం అదే రోజు మహిళల కోసం ప్రత్యేక పోటీలు ఉంటాయని వీసీ తెలిపారు. యూనివర్సిటీతోపాటు తాడేపల్లిగూడెం, కాకినాడ క్యాంపస్‌లలోని మహిళ విద్యార్థులు, సిబ్బంది వీటిలో పాల్గొనవచ్చన్నారు. గ్రూప్ సింగింగ్, ఫ్యాషన్ షో, స్కిట్, డాన్స్ వంటి పోటీలు ఉంటాయి. వీటిలో పాల్గొనే వారికి రిజిస్ట్రేషన్ ఫ్రీ అన్నారు. స్థానిక పాఠశాలలో కూడా పోటీలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. రెండో రోజు అనుబంధ కళాశాలల సిబ్బందికి పోటీలు రెండోరోజు (మార్చి 5)న యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న గోదావరి జిల్లాలోని కళాశాలల సిబ్బందికి వివిధ పోటీలు ఉంటాయి. సృజనాత్మకతతో కూడిన వస్తువుల తయారీ (చేతి పనులు, చిరుధాన్యాలతో ఆహార పదార్థాల తయారీ, పూల అలంకరణ వంటివి) పై పోటీలు జరుగుతాయి. పాల్గొనేవారు మార్చి 4లోగా రూ. 100 రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించి, పేర్లు నమోదు చేయించుకోవాలి. మూడో రోజు నారీ ఫెస్ట్ 2025 మూడో రోజు నారీ ఫెస్ట్ 2025లో భాగంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవం నిర్వహిస్తామని వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ తెలిపారు. పై రెండు రోజులలో నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేస్తారు. ఈ సందర్బంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు యూనివర్సిటీ వుమెన్ సెల్ ఆధ్వర్యంలో జరుగుతాయన్నారు. -
నేత్రపర్వంగా భీమేశ్వరస్వామి రథోత్సవం
సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరి సమేత కుమార రామభీమేశ్వరస్వామి రథోత్సవం గురువారం నేత్ర పర్వంగా జరిగింది. ఈ నెల 24వ తేదీన జరిగిన స్వామివారి కల్యాణాన్ని పురస్కరించుకొని సాయంత్రం రథోత్సవం జరిగింది. ఉత్సవ కమిటీ చైర్మన్ కంటే బాబు ఈఓ బళ్ల నీలకంఠం, ఉత్సవాల ప్రత్యేకాధికారి కెవీ సూర్యనారాయణల ఆధ్వర్యంలో స్వామి వారిని అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయం నుంచి గాంధీచౌక్‌కు తీసుకొని వచ్చారు. ఆలయ పండితుల వేద మంత్రాల మధ్య స్వామి వారిని అమ్మవార్లను పూలతోను, విద్యుత్తు దీపాలతో అలంకరణ చేసిన రథంపై ఉంచారు. రథోత్సవ కమిటీ ఆధ్వర్యంలో గాంధీచౌక్‌లో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కొడా చైర్మన్ తుమ్మలబాబు, ఉత్సవ కమిటీ చైర్మన్ కంటే బాబులు రథోత్సవాన్ని ప్రారంభించారు. పురవీధుల గుండా వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, బాణసంచా కాల్పులు, సాంస్కృతిక ప్రదర్శనల మధ్య రథోత్సవం అత్యంత వైభవంగా సాగింది. దారి పొడవునా భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. సోమవారం రాత్రి స్వామి వారి శ్రీపుష్పయోగోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. -
బడివడిగా ప్రయోగాలు
పాఠశాలే ప్రయోగశాల ప్రతి వ్యక్తి జీవనానికి అవసరమైన పునాది పాఠశాలలో ప్రారంభమవుతుంది. ఈ దశ నుంచే ప్రతి విద్యార్థికి అవసరమైన ప్రయోగశాల పరిజ్ఞానం అందించే కృషి జరగాల్సి ఉంది. భవిష్యత్ ఆవిష్కరణ దిశగా వారిని నడిపించడానికి ఉపాధ్యాయులు, అధ్యాపకులు కృషి చేయాలి. – జీవీవీఎస్ సుబ్రహ్మణ్యం, జిల్లా సైన్స్ అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సైన్స్ ప్రాధాన్యం తెలియజేసేందుకు.. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మూడు రోజుల పాటు సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నాం. సైన్స్ ప్రాధాన్యతను విద్యార్థి దశ నుంచే తెలియజేయడం దీని ముఖ్య ఉద్దేశం. పాఠశాల, మండల స్థాయిలో ఆన్లైన్ క్విజ్, జిల్లా స్థాయిలో ఆఫ్‌లైన్ క్విజ్‌ను నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేస్తాం. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను త్వరలో నిర్వహించబోయే సైన్స్ స్టడీ టూర్‌కు ప్రాధాన్యతనిచ్చే ఆలోచన చేస్తున్నాం. – డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈవో, అమలాపురం రాయవరం: మస్తిష్కాన్ని కదిలించాలి. . మెదడులో విన్నూత్న ఆలోచనలు ఉరకలెత్తించాలి.. కళ్లు నిశితంగా పరిశీలించాలి.. మనసులో జిజ్ఞాస మొదలవ్వాలి.. నవతరాన్ని ఆసక్తి నుంచి ఒక ఆశయం దిశగా నడిపించాలి.. ఇంతటి శక్తి కేవలం ఒక్క సైన్స్‌కు మాత్రమే ఉంది. శాసీ్త్రయ ఆలోచనలతో అన్ని వయసుల వారికి, వారి స్థాయికి అన్వయించి జ్ఞానాన్ని అందించే శక్తి సైన్స్‌కు ఉంది. భారత శాస్త్రవేత్త సీవీ రామన్ ఎఫెక్ట్‌ను ప్రకటించిన రోజు ఫిబ్రవరి 28న ఏటా జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్ఫథాన్ని అలవర్చుకునేలా పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా, ఎస్సీఈఆర్టీలు ప్రణాళికలు రూపొందించి పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. ‘డిజైన్ థింకింగ్’ పేరుతో నేటి యువతరం నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు వేస్తోంది. పుస్తకాలతో కుస్తీ పడుతూ..మార్కుల వేటలో బిజీగా ఉంటూనే..మరోపక్క విద్యార్థులు పరిశోధనలకు ప్రాణం పోస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా, ఎస్సీఈఆర్టీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలతో ప్రతి పాఠశాల ప్రయోగశాలగా మారుతోంది. పాఠశాల దశ నుంచే.. పాఠశాల స్థాయి నుంచి సైన్స్ బోధన సాగుతోంది. కొన్నేళ్లుగా ఏపీ సమగ్ర శిక్ష ద్వారా పాఠశాలల్లో సైన్స్ పరికరాల కొనుగోలుకు నిధులు మంజూరు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 2019 నుంచి అటల్ ఇన్నోవేషన్ మిషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 10వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయగా, అందులో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 129 ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశారు. సమాజానికి సైన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది..సమాజంలో ఉన్న ప్రశ్నలకు సైన్స్ సమాధానాలు ఎలా చూపిస్తుందో తెలియజేసేదే అటల్ టింకరింగ్ ల్యాబ్. ప్రయోగాలతో మెరుస్తున్న కోనసీమ జిల్లా సైన్స్ విభాగం ఫ దక్షిణ భారత విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలో కోనసీమ జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి పాల్గొన్న ఆరు ప్రాజెక్టుల్లో నాలుగు ప్రాజెక్టులు ఎంపిక కావడం గమనార్హం. ఫ జాతీయ స్థాయికి ఎంపికై న నాలుగు ప్రాజెక్టుల్లో మూడు ప్రాజెక్టులు మొదటి 30 స్థానాల్లో నిలిచాయి. ఫ నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ భోపాల్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో టాప్ 20లో ఏపీ నుంచి రెండు పాఠశాలలుంటే అందులో ఒకటి కోనసీమ జిల్లా నుంచి ఎంపిక కావడం విశేషం. 15 సంవత్సరాల అనంతరం నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ జాతీయ స్థాయి పోటీల్లో గెలవడం, అందునా కోనసీమ ఎంపిక కావడం విశేషం. ఫ ’స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్‌లో భాగంగా ఏపీ నుంచి 76 ప్రాజెక్టులు ఎంపిక కాగా, అందులో రెండు ప్రాజెక్టులు కోనసీమ జిల్లా నుంచి ఎంపికయ్యాయి. జెడ్పీహెచ్ఎస్ మోరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల, రాజోలు పాల్గొన్నాయి. ఫ నేషనల్ సైన్స్ డే ప్రాథమిక స్థాయి విద్యార్థులకు నిర్వహిస్తున్నారు. సైన్స్‌కు పెద్దపీట వేసిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్ఫథాన్ని పెంపొందించేందుకు విద్యాశాఖ పెద్దపీట వేస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలను పాఠశాల స్థాయి నుంచే ఏర్పాటు చేశారు. పాఠశాల, మండల, జిల్లా స్థాయిల్లో విద్యా,వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలకు శాసీ్త్రయ దక్ఫథాన్ని జోడించి సరికొత్త పరిశోధనల వైపు విద్యార్థులు అడుగులు వేసేలా గత ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. గత ప్రభుత్వం పాఠశాలలకు సైన్స్ కిట్స్‌ను అందజేసింది. గత ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అగస్థ్య ఫౌండేషన్ వంటి పలు సంస్థలు సైన్స్‌కు ప్రాధాన్యతనిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అగస్త్య ఫౌండేషన్ ద్వారా సైన్స్ ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ తరగతులు కూడా నిర్వహించారు. నిష్ట ద్వారా ప్రయోగశాలలను ఏ విధంగా వాడవచ్చన్న అంశంపై సైన్స్ ఉపాధ్యాయులకు శిక్షణ అందించారు. గత ప్రభుత్వ హయాంలో సిమ్యులేషన్ విధానంలో ప్రయోగాలు ఎలా నిర్వహించవచ్చునో తెలియజేసేందుకు సైన్స్ ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహించారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, సైన్స్ సెమినార్లు, సైన్స్ డ్రామాల నిర్వహణకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కృషి చేసింది. జిల్లా సైన్స్ అధికారుల ఆధ్వర్యంలో ప్రతి ఏటా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు, ఇన్స్ఫైర్, చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నారు. జిల్లా సైన్స్ అధికారి పాత్రను గత ప్రభుత్వ హయాంలోనే విస్తృత పరిచారు. నేడు ప్రత్యేక కార్యక్రమాలు జిల్లా స్థాయిలో సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కోనసీమ జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. అయినవిల్లి మండలం చింతల్లంక జెడ్పీ ఉన్నత పాఠశాల, కాట్రేనికోన మండలం పల్లాం జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో శుక్రవారం ప్రత్యేకంగా జిల్లా స్థాయి సైన్స్ పోస్టర్ ప్రజంటేషన్, సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. కపిలేశ్వరపురం మండలం మాచర జెడ్పీ ఉన్నత పాఠశాలలో ‘వికసిత్ భారత్ కోసం సైన్స్, ఆవిష్కరణలలో ప్రపంచ నాయకత్వం కోసం భారతీయ యువతకు సాధికారిత’ అనే అంశంపై జిల్లా స్థాయి సైన్స్ సెమినార్‌ను నిర్వహిస్తున్నారు. వివిధ మండలాల నుంచి ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొననున్నారు. శాసీ్త్రయ దృక్ఫథం.. పరిశీలన.. పరిశోధనలకు మూలం సైన్స్‌కు పెద్దపీట వేసిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నేడు జాతీయ సైన్స్ దినోత్సవం -
పులకించిన పీఠికాపుర వీధులు
పిఠాపురం: గరళ కంఠుడి రథ చక్రాల ఘట్టనలతో పీఠికాపురం పులకించి పోయింది. ఆది దేవుడు కై లాసం నుంచి భువికి దిగి వచ్చాడా అన్నట్టుగా భక్త జనం బారులు తీరి పుర వీధుల్లో నిర్వహించిన ఉమా కుక్కుటేశ్వరస్వామి వారి దివ్య రథోత్సవం గురువారం రాత్రి కనుల పండువగా జరిగింది. తెల్లవారుజామున పిఠాపురం మహారాజా రాజా రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు బహుద్దూర్ పేరున ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో లింగోద్భవ పూజలు, అభిషేకాలు, తొలి అర్చన చేశారు. భక్త జన సందోహం నడుమ కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీ అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాల అనంతరం ఆలయం నుంచి పల్లకీలో ఊరేగింపుగా కుంతీ మాధవస్వామి వారి ఆలయం వద్ద ఉన్న స్వామివారి రథం వద్దకు తీసుకెళ్లారు. బ్యాండుమేళాల నడుమ విద్యుద్దీపాలు, పూలమాలలతో విశేషంగా అలంకరించిన రథంపై పట్టు వస్త్రాలు, నగలతో అలంకరించిన ఉత్సవ విగ్రహాలను రథంపై అధిష్టింప చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. మెయిన్‌రోడ్డు మీదుగా ఉప్పాడ సెంటర్ వరకు కొనసాగిన రఽథోత్సవానికి అశేష భక్త జనవాహిని కదిలి వచ్చింది. భక్తులు రథాన్ని లాగి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.