Eluru
-
నాణ్యమైన పొగాకును పండించాలి
బుట్టాయగూడెం: రైతులు నాణ్యమైన పొగాకును పండించి అధిక దిగుబడులు సాధించాలని జంగారెడ్డిగూడెం–1 వేలం కేంద్రం ఆక్షన్ సూపరింటెండెంట్ బి. శ్రీహరి సూచించారు. బుట్టాయగూడెంలో పొగాకు బోర్డు అధికారుల బృందం మంగళవారం పర్యటించింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గద్దే శ్రీధర్ పొలంలో ప్రకృతి వ్యవసాయం, పొటాషియం, రిలీజింగ్ బ్యాక్టీరియా వాడకంపై క్షేత్ర దినోత్సవ సదస్సును నిర్వహించారు. పొగాకు సాగులో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి భూసారాన్ని పెంపొందించుకోవాలన్నారు. పురుగు మందుల అవశేషాలు లేని నాణ్యమైన పొగాకును పండించాలని కోరారు. కార్యక్రమంలో ఐటీసీ మార్కెటింగ్ మేనేజర్ ప్రశాంత్ జోషి, ఐటీసీ కంపెనీ మేనేజర్ ఆదర్శ, కంపెనీ పీఎస్ఎస్ నాగేంద్ర, పొగాకు రైతు సంఘం నాయకులు కరాటం రెడ్డినాయుడు, గొట్టుముక్కల మల్లికార్జున రావు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. ముగ్గురికి గాయాలు ఉంగుటూరు: ఎదురెదురుగా రెండు మోటార్‌సైకిళ్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాలాయగూడెంకు చెందిన కోట శ్రీనివాసరావు చేబ్రోలు –గొల్లగూడెం వద్ద మలుపులో వెళుతుండగా తాడేపల్లిగూడెంకు చెందిన కె.అంజిబాబు, సంతోష్ మోటార్‌సైకిల్‌పై ఎదురుగా వచ్చి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురూ గాయపడ్డారు. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భూ సమస్యల్లో పోలీసుల జోక్యం నివారించాలి
ఏలూరు (టూటౌన్): ఏజన్సీ భూ సమస్యల్లో పోలీసుల అనుచిత జోక్యం నివారించాలని కోరుతూ సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డీఎన్‌వీడీ ప్రసాద్, కె. శ్రీనివాస్ లతో కూడిన బృందం మంగళవారం జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూస్వాములకు అనుకూలంగా ఇచ్చిన ప్రొటెక్షన్ ఆర్డర్లను రద్దు చేయాలని, 1/70 చట్టం భూములపై పోలీసుల జోక్యం ఆపాలని, గిరిజనులపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని ఆయన కోరారు. గిరిజనుల పంటను నాశనం చేసిన భూస్వాములపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్టీ కమిషన్ సభ్యులు నాయక్ ఆదేశాల ప్రకారం బుట్టాయిగూడెంలో ఆర్ఎస్. నెంబర్ 550/3,4లో గిరిజన పేదలు గుడిసెల విషయంలో పోలీసుల జోక్యం నివారించాలని కోరారు. ఎస్పీ స్పందిస్తూ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చానట్లు సీపీఎం నేతలు తెలిపారు. కార్మికుని కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి ఏలూరు (టూటౌన్): ప్రసాద్ సీడ్స్ మొక్కజొన్న ఫ్యాక్టరీలో పనిచేస్తూ ప్రమాదానికి గురై మృతి చెందిన కార్మికుని కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీపీఐ, సీపీఎం సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. పెదవేగి మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన ఎస్. రవీంద్ర (35) సోమవారం ప్రసాద్ సీడ్స్ మొక్కజొన్న ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు మిషన్‌లో పడి మృతి చెందాడన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.50 లక్షలు చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, బీకేఎంయూ జిల్లా అధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు, ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్ కోరారు. మహిళ అదృశ్యంపై ఫిర్యాదు ఆగిరిపల్లి: మహిళ అదృశ్యంపై ఆగిరిపల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. రెడ్డి విజయ అనే మహిళ తన భర్తతో మనస్పర్థలు రావడంతో వడ్లమానులో ఉన్న తన అన్నయ్య జలసూత్రం వెంకటేశ్వరావు వద్ద నెల రోజుల నుంచి ఉంటుంది. ఈనెల 8వ తేదీన గుండెల్లో నొప్పిగా ఉందని ఆగిరిపల్లి ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి వెళ్తున్నానని అన్నయ్యకు చెప్పి తన కుమారుడితో పాటు వెళ్లింది. కొంతసేపు ఆగిన తర్వాత విజయవాడ సెంటినీ హాస్పిటల్‌కు వెళుతున్నానని అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పింది. రాత్రి అయినా ఆమె తిరిగి రాకపోవడంతో ఆమె కోసం బంధువుల ఇళ్ల వద్ద గాలించిన ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శుభ శేఖర్ చెప్పారు. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె జయప్రదం చేయాలి
ఏలూరు (టూటౌన్) : ఈ నెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు సమ్మె చేస్తున్నట్లు ఏలూరు జిల్లా బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ సంఘం అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మోహన్ తెలిపారు. మార్చి 24 25 తేదీలలో జరిగే సమ్మెలో భాగంగా మంగళవారం సాయంత్రం స్థానిక ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద బ్యాంకు ఉద్యోగులు యుఎఫ్‌బీయు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే నియమించాలని, వారానికి ఐదు రోజులు పని దినాలు కల్పించాలని, తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఐబీఈఏ నేత ఎన్,లక్ష్మణరావు, ఏఐ బీఓసి నేత శ్రీనివాస్, ఎన్సీబీఇ నేత రత్న విమల్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌ను కలసిన కౌన్సిలర్లు
నూజివీడు: నూజివీడు మున్సిపాలిటీకి చెందిన చైర్పర్సన్ రామిశెట్టి త్రివేణీదుర్గతో పాటు 12 మంది కౌన్సిలర్లు మంగళవారం ఉండవల్లిలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. వీరిని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వెంట పెట్టుకొని తీసుకెళ్లి వైఎస్ జగన్‌తో మాట్లాడించారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు షేక్ మెహరున్నీసా బేగం, తుమ్మూరు మౌనిక, తలారి ధనలక్ష్మి, షేక్ రజియాబేగం, కళ్లేపల్లి ప్రియాంక, గాదెరెడ్డి శ్రీలత, మీర్ అంజాద్‌ఆలీ, చేబత్తిన మణికుమారి, నవుడు నాగమల్లేశ్వరరావు, శీలం రాము, కోఆప్షన్ సభ్యులు రామిశెట్టి మురళీకృష్ణ, మైనారిటీ విభాగం నాయకులు షేక్ యూనస్పాషా(గబ్బర్), పిళ్లా చరణ్ తదితరులు కలిశారు. -
మృత శిశువు జననం కేసులో వీడిన చిక్కుముడి
కై కలూరు: కై కలూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ) బాత్రూం కమోడ్‌లో ఈ నెల 7న మృత శిశువు జననంపై చిక్కుముడి వీడింది. ప్రసవం తర్వాత మైనర్ బాలిక పరారైన ఘటన సంచలనం కలిగించింది. ఈ కేసులో సీఐ పి.కృష్ణ ఆధ్వర్యంలో టౌన్ ఎస్సై ఆర్.శ్రీనివాస్ పూర్తి స్థాయి దర్యాప్తు చేశారు. కేసు వివరాల్లోకి వెళితే రాచపట్నం గ్రామానికి చెందిన మైనర్ బాలికకు చిన్నతనంలో తండ్రి మరణించాడు. తల్లి సంరక్షణలో పెరుగుతున్న ఆమె పదో తరగతి పరీక్షలు తప్పగా ఇటీవల కై కలూరు కార్నర్‌స్టోన్ ఓకేషనల్ కాలేజీలో 6 నెలలు నర్సింగ్ చదివింది. ఏలూరులో నానమ్మ వద్ద బాలిక నివాసముంటుంది. పెదవేగి మండలం కొప్పాకకు చెందిన కార్ డ్రైవర్ ప్రత్తిపాటి వినీత్ (25)తో బాలికకు పరిచ యం ఏర్పడింది. అతని బంధువులు కై కలూరు మండలం రామవరంలో ఉండటం, ఒకే సామాజికవర్గం కావడంతో బాలికకు మరింత దగ్గరయ్యాడు. వినీత్‌కు వివాహం కాగా భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. అదే విధంగా రాచపట్నంకు చెందిన కొనాల గణేష్ (35) బాలికకు స్వయాన మేనమామ . ఇతను కూడా మైనర్ బాలికకు దగ్గరయ్యాడు. గణేష్‌కు వివాహం కాలేదు. వీరిద్దరూ అనేక పర్యాయాలు లైంగికదాడికి పాల్పడడంతో గర్భం దాల్చినట్లు మైనర్ బాలిక ఫిర్యాదులో పేర్కొంది. ప్రసవ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోపోవడంతో శిశువు మరణించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. మైనర్ బాలిక గర్భం దాల్చడానికి కారకులైన ఇద్దరు నిందితులపై పోక్సో కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన సీఐ, ఎస్సైలను ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ అభినందించారు. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరి అరెస్ట్ -
నిట్‌లో క్రీడా సంబరాలు ప్రారంభం
తాడేపల్లిగూడెం: చదువుతో పాటు, క్రీడల్లోనూ విద్యార్థులు రాణిస్తే మంచి భవిష్యత్‌తో పాటు శారీరకంగా, మానసికంగా ఉత్తమ ఫలితాలు ఉంటాయని ఏపీ నిట్ రిజిస్ట్రార్ పి.దినేష్ శంకరరెడ్డి అన్నారు. మంగళవారం నిట్‌లో 2024–25 క్రీడా సంబరాలను ఆయన ప్రారంభించారు. నిట్ విద్యార్థులు విద్యతో పాటు జాతీయస్థాయిలో కబడ్డీ, పవర్ లిఫ్టింగ్, క్రికెట్, చదరంగం, వాలీబాల్ వంటి పోటీల్లో ప్రతిభ కనరబరుస్తుండడం అభినందనీయమన్నారు. డీన్లు డాక్టర్ కె.హిమబిందు, వీరేష్‌కుమార్, అసోసియేట్ డీన్ శ్రీనివాసన్, ఆచార్యులు డాక్టర్ తపస్, సుదర్శన్దీప పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు విద్యార్థి ఎంపిక తణుకు అర్బన్: ఈనెల 14 నుంచి 16 తేదీ వరకు కడప జిల్లా పులివెందులలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తణుకు మండలం మండపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి సంగాడి సత్యనాగ గణేష్ ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్.మోహన్‌బాబు తెలిపారు. ఈనెల 9వ తేదీన తణుకులో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్–16 కబడ్డీ పోటీల్లో గణేష్ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడన్నారు. క్రీడాకారుడు గణేష్‌తోపాటు, ఫిజికల్ డైరెక్టర్ సంకు సూర్యనారాయణను హెచ్ఎం మోహన్‌బాబుతోపాటు ఉపాధ్యాయులు అభినందించారు. మామపై అల్లుడు కత్తితో దాడి కాళ్ల: భార్యను తనతో కాపురానికి పంపడం లేదని పిల్లనిచ్చిన మామయ్యపై చిన్న అల్లుడు కత్తితో దాడి చేసిన ఘటనపై కాళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై ఎన్.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం వేంపాడు గ్రామానికి చెందిన యు.సత్యనారాయణ ఇంటికి అతని రెండో అల్లుడు అత్తిలి మండలం కె.ఎస్.గట్టు గ్రామానికి చెందిన కోనా కిషోర్ సోమవారం వచ్చాడు. తన భార్యని కాపురానికి పంపమని కిషోర్ తన మావయ్య సత్యనారాయణపై ఘర్షణకు దిగి కత్తితో దాడికి పాల్పడ్డాడు. గాయపడిన సత్యనారాయణను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారంతో కిషోర్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. లైంగిక దాడి కేసులో అరెస్ట్ పెనుగొండ: లైంగిక దాడి కేసులో నిందితుడిని మంగళవారం పెనుగొండ సీఐ రాయుడు విజయ్‌కుమార్ అరెస్ట్ చేశారు. గుడిపాడుకు చెందిన ఎం.రాంబాబు సోమవారం తన ఇంటి ఎదురుగా ఉన్న ఇంటిలో ఎవరూ లేని సమయంలో దివ్యాంగురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయడంతో రాంబాబును అరెస్ట్ చేసినట్లు ఎస్సై కే గంగాధర్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. యానాం మద్యం విక్రేత అరెస్ట్ తణుకు అర్బన్: ఇరగవరంలో యానాంకు చెందిన మద్యం విక్రయిస్తున్న పత్తివాడ కరుణాకర్‌ను మంగళవారం అరెస్ట్ చేసి అతని నుంచి 6 టిన్ల బీర్లు, ఒక మద్యం సీసాను స్వాధీనం చేసుకున్నట్లు తణుకు ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ సీఐ సత్తి మణికంఠరెడ్డి తెలిపారు. -
రైతు సంక్షేమంపై దృష్టి సారించాలి
ఉండి: రైతు సంక్షేమంపై శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకుడు డాక్టర్ జీ శివన్నారాయణ అన్నారు. మంగళవారం మండలంలోని ఎన్నార్పీ అగ్రహారం కృషీ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన శాసీ్త్రయ సలహా సంఘ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దత్తత గ్రామాల్లో విస్తరణ కార్యక్రమాలు ఎక్కువగా కేంద్రీకృతం చేసి రైతుల అభివృద్ధికి శాస్త్రవేత్తలు దోహదపడాలని అన్నారు. రైతులకు పంట దిగుబడి, ఆదాయం పెంచడం, ఖర్చు తగ్గించడం, భూసారం పెంచడం వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. మార్టేరు వరి పరిశోధనా స్థానం ఉప సంచాలకుడు డాక్టర్ టీ శ్రీనివాస్ మాట్లాడుతూ దాళ్వాలో వరిని నేరుగా విత్తడం, వేస్ట్ డీకంపోజ్, జింకులోప యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతులకు డిజిటల్ మార్కెటింగ్‌పై శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి జెడ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గుర్రపుడెక్కను కంపోస్టుగా మార్చడం, దానిని విలువ ఆధారిత ఉత్పత్తి అయిన ట్రేసంచులుగా తయారు చేయడం వల్ల కాలువల్లో కలుపు నివారించడమే కాకుండా ఆదాయ వనరుగా మార్చవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి దేవానంద్‌కుమార్, డిప్యూటీ వెటర్నరీ డైరెక్టర్ డాక్టర్ జావల్హుస్సేన్, జీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఊరిస్తున్న పొగాకు ధరలు
బుట్టాయగూడెం: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం 1 –2 , కొయ్యలగూడెం, దేవరపల్లి, గోపాలపురం మండలాల్లో ఈ నెల 24వ తేదీ నుంచి పొగాకు వేలం ప్రారంభం కానుంది. వేలం కేంద్రాల్లో కొనుగోళ్లకు సంబంధించి బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పొగాకు కేజీ ధర గతేడాది రికార్డు స్థాయిలో రూ.411 పలకడంతో ఈసారి రైతులు పోటీపడి మరీ పొగాకు సాగు చేశారు. 2025 –2026 సీజన్‌కు సంబంధించి బోర్డు 58.94 మిలియన్ల కేజీల పొగాకు విక్రయానికి అనుమతి ఇవ్వగా 70 మిలియన్ల కేజీల వరకూ ఉత్పత్తి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా పొగాకు రైతులు పోటీపడి మరీ సాగు చేయడంతో సాగుఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. భూమి, బ్యారన్ కౌలుతో పాటు కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గతేడాది కంటే సరాసరి ధర ఎక్కువ వస్తేనే తాము గట్టెక్కుతామని రైతులు చెబుతున్నారు. కర్ణాటక మార్కెట్ సరాసరి రూ. 268 ఇటీవల కర్ణాటకలో జరుగుతున్న పొగాకు వేలంలో ధరలు ఆశాజనకంగానే ప్రారంభమైనట్లు అక్కడి రైతులు చెబుతున్నారు. హై గ్రేడ్ కేజీ పొగాకు ధర రూ. 337 వరకూ పలికింది. మొత్తం సరాసరి ధర చూస్తే రూ.268.25 వరకు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే మంళవారం నాడు రూ.216, లో గ్రేడ్ రూ 130 ధర పలికినట్లు అధికారులు తెలిపారు. కాగా ఏపీలోని ఉమ్మడి ప్రకాశం జిలాల్లో ప్రారంభమైన పొగాకు కొనుగోళ్లలో మొదటి రోజు రూ.280కు వ్యాపారులు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ గతేడాది హై గ్రేడ్ కేజీ రూ.330 వరకూ పలికింది. ఈ ఏడాది ప్రారంభంలోనే పొగాకు కేజీ ధర రూ.280కు వ్యాపారులు కొనుగోలు చేయడంతో ఈ ధరలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని ఇటు రైతులు, అటు అధికారులు భావిస్తున్నారు. గ్రేడింగ్‌లో జాగ్రత్తలు అవసరం ఈ ఏడాది పొగాకు పంట ఆశాజనకంగా ఉండడం రైతులకు ఊరటనిచ్చే అంశం. మొత్తం ఉత్పత్తుల్లో 50 శాతానికి మొదటి రకం అంటే హై గ్రేడ్ వచ్చాయని అధికారులు చెప్తున్నారు. మిగిలిన గ్రేడులు కూడా ఆశించిన స్థాయిలో నాణ్యతగా ఉన్నాయని చెప్తున్నారు. ఇది రైతులకు సానుకూలాశంగా మారనుంది. అయితే గ్రేడింగ్ విధానంలో రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రేడ్లు వేరు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించి బేళ్లు కట్టాలని బోర్డు అధికారులు కోరుతున్నారు. 24 నుంచి ప్రారంభం కానున్న పొగాకు వేలం గతేడాది కంటే ఎక్కువ ధరపై ఆశపెట్టుకున్న రైతులు సరాసరి రూ.300 ఇవ్వాలని డిమాండ్ మొత్తం వేలం కేంద్రాలు – 5 పొగాకు రైతుల సంఖ్య – 12,487 సాగు విస్తీర్ణం – 28,719 హెక్టార్లు బోర్డు అనుమతించిన ఉత్పత్తి 58.94 మిలియన్ల కేజీల పంట ఉత్పత్తి అంచనా 70 మిలియన్ల కేజీలు అధికారుల సూచనలు పాటించాలి ఈ ఏడాది పొగాకు పంట ఆశాజనకంగా ఉంది. గత ఐదేళ్లలో ఈ విధంగా పండలేదు. రైతులు అవశేషాలు లేని హీట్, సాఫ్ లేకుండా గ్రేడుల ఆధారంగా పొగాకును సిద్ధం చేసుకోవాలి. ఈ ఏడాది హై గ్రేడ్ పొగాకు పండింది. అధికారులు సూచనలు పాటిస్తే మంచి ధర వచ్చే అవకాశం ఉంది. – బి.శ్రీహరి, ఆక్షన్ సూపరింటెండెంట్, జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం –1 ధరపైనే ఆశలు పొగాకు పంటలకు సాగు ఖర్చులు భాగా పెరిగాయి. పొలం, బ్యారన్ కౌలు, కూలి రేట్లు రెట్టింపయ్యాయి. ఈ ఏడాది సీజన్ ప్రారంభంలో మంచి ధర వస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్నాము. సరాసరి రూ.300 ధర వచ్చేలా బోర్డు అధికారులు కృషి చేస్తేనే రైతులు గట్టెక్కుతారు. – కలగర నాని, పొగాకు రైతు, కొమ్ముగూడెం, బుట్టాయగూడెం మండలం -
ట్రిపుల్ ఐటీలో మెగా ఎక్స్పో నిర్వహణ
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిర్వహిస్తున్న సాంకేతిక సంబరం టెక్‌జైట్–25లో భాగంగా మంగళవారం మెగా ఎక్స్పో నిర్వహించారు. ఈ ఎక్స్‌పోలో 100 జట్లు పాల్గొని తమ ప్రాజెక్టులకు సంబంధించి ప్రజంటేషన్లను సమర్పించారు. 86 జట్లు తాము రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించగా వాటిలో 56 జట్లు అర్హత సాధించాయి. ఈ ఎక్స్‌పోలో ఏఐ, డ్రోన్, రోబోటిక్స్ అంశాలపై రూపొందించిన నమూనాలను విద్యార్థులు ప్రదర్శించి న్యాయనిర్ణేతలకు వివరించారు. ఈ ఎక్స్పోను డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ఆర్జీయూకేటీ డీన్ అకడమిక్స్ దువ్వూరు శ్రావణి ప్రారంభించారు. టెక్ జైట్ 2025 లో భాగంగా ఎన్విజన్ అకాడమి, బిస్ సంస్థ ట్రిపుల్ ఐటీతో ప్రతి ఇంజనీరింగ్ విభాగం నుంచి విద్యార్థులకు పరీక్ష పోటీలను నిర్వహించారు. యూపీఎస్సీ ఆశావాహులకు మాక్ టెస్ట్ పోటీని ఎన్విజన్ అకాడమి నిర్వహించగా, ఉత్పత్తుల వినియోగంపై అవగాహన పెంచుకోవాలి అనే ఉద్దేశంతో బిస్ సంస్థ పోటీలను నిర్వహించింది. ఈ పోటీల్లో పీయూసీ, ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఏఓ బీ లక్ష్మణరావు, డీన్ అకడమిక్స్ చిరంజీవి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సర్కారుమోసంపై యువతపోరు
8లోబుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైద్య విద్యకు గ్రహణం పట్టించారు.. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, వేల సంఖ్యలో ఉన్న ఉద్యోగాలు పీకేశారు.. నిరుద్యోగ భృతి హామీని గాలికొదిలేశారు. గత పది నెలల్లో ఉపాధి కల్పన జరగకపోగా ఉన్న ఉపాధికి చంద్రబాబు సర్కారు గండి కొట్టింది. అడుగడుగునా నిరుద్యోగులను, యువతను దగా చేస్తూ ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్నారు. పాలకొల్లు మెడికల్ కళాశాల పనులను అర్ధాంతరంగా నిలిపివేశారు. ఉమ్మడి పశ్చిమలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న ఫీజు రీయిబర్స్మెంట్ను అటకెక్కించి తల్లిదండ్రులను అప్పులపాలు చేశారు. వీటన్నింటిపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ పోరుబాట పట్టింది. బుధవారం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించి కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టనుంది. యువత పోరుకు ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, నిరుద్యోగ యువత, వారి తల్లిదండ్రులు హాజరుకానున్నారు. రెండు జిల్లాల్లో పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రులు, పార్లమెంట్ ఇన్చార్జులు, నియోజకవర్గ ఇన్చార్జులు హాజరు కానున్నారు. దగ్గులూరులో వైద్య కళాశాలకు గ్రహణం గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఏలూరు నగరంలో, పాలకొల్లులోని దగ్గులూరులో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కేంద్రం ద్వారా అనుమతులు మంజూరు చేయించారు. ఏలూరులో రూ.535 కోట్లు, పాలకొల్లులో రూ.475 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో సుమారు 3 లక్షల చదరపు అడగుల విస్తీర్ణంలో కళాశాల భవనం, బాయ్స్, గర్ల్స్‌కు వేర్వురుగా 90 వేల చదరపు అడుగుల్లో హాస్టళ్లతో పాటు అన్ని రకాల సదుపాయాలు కల్పించేలా ప్రాజెక్టును రెండు జిల్లాలో ప్రారంభించారు. ఏలూరులోని ప్రభుత్వ వైద్యకళాశాలను గతేడాది నుంచి ప్రారంభించారు. 150 సీట్లతో ప్రారంభమైన కళాశాలలో ఈ ఏడాది రెండో బ్యాచ్ ప్రారంభమైంది. ఇక పాలకొల్లులోని దగ్గులూరులో 60 ఎకరాల విస్తీర్ణంలో పనులు మొదలుపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ. 80 కోట్ల వ్యయంతో బేస్మెంట్, పిల్లర్లు, ఇతర నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తి చేసుకుని వచ్చే విద్యా సంవత్సరానికి పాలకొల్లు వైద్యకళాశాలను ప్రారంభించాలనేది గత ప్రభుత్వ ఆలోచన. కూటమి సర్కారు కొలువుదీరడంతో పనులు నిలిచిపోయాయి. కళాశాల పూర్తయితే ఏటా 150 సీట్ల చొప్పున ఐదేళ్ళల్లో 750 సీట్లు పశ్చిమగోదావరిలో పేద విద్యార్థులకు దక్కే అవకాశం ఉంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వం గ్రహణం పట్టించింది. ఊరిస్తున్న పొగాకు ధరలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 24 నుంచి పొగాకు వేలం ప్రారంభం కానుంది. గతేడాది కంటే ఎక్కువ ధర వస్తుందని ఆశిస్తున్నారు. 8లోన్యూస్రీల్ నేడు ఏలూరు, భీమవరంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నాలు నిరుద్యోగ భృతి హామీ గాలికే 21 వేల మంది వలంటీర్లను మోసగించిన ప్రభుత్వం 1,378 మంది మద్యం షాపుల సిబ్బందికి ఉద్వాసన పాలకొల్లులో వైద్య కళాశాల పనులు నిలిపివేత ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా, వసతి దీవెన నిధులపై మౌనం హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నేడు పోరుబాట -
22 వేలకుపైగా ఉద్యోగాల తొలగింపు
నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు వస్తుందని లక్షలాది మంది యువత ఆశపడి భంగపాటుకు గురయ్యారు. ఏలూరు జిల్లాలో 10,589, పశ్చిమగోదావరిజిల్లాలో 9,547 మంది వలంటీర్లను అధికారంలోకి రాగానే తొలగించేశారు. ఎన్నికల ప్రచారంలో లోకేష్ మొదలుకొని బీజేపీ నేతల వరకు అందరూ వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, రూ. 10 వేలు జీతం ఇస్తామని పదే పదే చెప్పి అధికారంలోకి రాగానే వలంటీర్ల కడుపుకొట్టారు. ప్రభుత్వ వైన్‌షాపుల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు, ఇతర సిబ్బందిని కూడా ఒక్క సంతకంతో రోడ్డున పడేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో 893 మంది, ఏలూరు జిల్లాలో 485 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వం సమర్ధవంతంగా అమలు చేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా 2,04,681 మందికి రూ. 485.23 కోట్లు, జగనన్న వసతి దీవెన ద్వారా 1,76,142 మందికి రూ.163.41 కోట్లు అందించారు. ఏలూరు జిల్లాలో 1,46,007 మంది విద్యార్థులకు రూ.383.42 కోట్లు జగనన్న విద్యాదీవెనలో.. 1,42,996 మంది విద్యార్థులకు రూ.142.96 కోట్లు వసతి దీవెన ద్వారా అందచేశారు. ఈ ప్రభుత్వం 10 నెలలు గడిచినా మొదటి సంవత్సర రీయింబర్స్మెంట్ ఫీజులు ఇంత వరకు చెల్లించలేదు. -
చేపల చెరువులు తవ్వేస్తున్నారు
కై కలూరు: వ్యవసాయ భూములను చేపల చెరువులుగా మార్పు చేయాలంటే కఠినతర నిబంధనలు ఉన్నాయి. పైగా ఆ గ్రామాలు ఆక్వా జోన్ పరిధిలో ఉండాలి. మండల స్థాయి సిఫార్సులతో జిల్లా అధికారులు చెరువుల తవ్వకాలకు అనుమతులు మంజూరు చేయాలి. ఇవేమి పట్టించుకోకుండా కలిదిండి మండలం ఎస్ఆర్పీ అగ్రహారంలో 101, 129 సర్వే నంబర్లలో 18 ఎకరాల్లో చేపల చెరువులను తవ్వుతున్నారు. ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ(అప్సడా) నిబంధనలు పాటించడం లేదు. విషయం తెలుసుకున్న మత్స్యశాఖ అభివృద్ధి అధికారి రవికుమార్ మంగళవారం స్వయంగా వెళ్లి అనుమతుల పత్రాలు చూపించాలని అప్పటి వరకు పనులు నిలుపుదల చేయాలని ఆదేశించారు. ఆభయారణ్యంలో అలజడి.. కొల్లేరు అభయారణ్యంలో జీవో 120 అమలులో ఉంది. దీని ప్రకారం తట్ట మట్టి తీసినా నేరంగా పరిగణిస్తారు. కూటమి నేతల అండతో కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర పేరుతో పందిరిపల్లిగూడెం వంతెన వద్ద వాహనాలు నిలుపుదల చేయాలంటూ మట్టిని పూడ్చారు. అదే విధంగా గుమ్మళ్ళపాడు, సింగరాలతోట ప్రాంతాల్లో చెరువుల మరమ్మతులు జరుగుతున్నాయి. అవి కొల్లేరు అభయారణ్యంతో సంబంధం లేదని అటవీ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సుప్రీం కోర్టు ఆదేశాలతో అటవీ అధికారులు చేపల అక్రమ చెరువుల గట్లుకు గండ్లు పెడుతోన్నా.. కొద్ది సమయానికి వాటికి గ్రామస్తులు తడికలు అడ్డుపెడుతున్నారు. కొల్లేరు గ్రామాల్లో అటవీ అధికారులు, గ్రామస్తులకు చేపల అక్రమ చెరువుల విషయంలో వివాదాలు జరుగుతున్నాయి. ఎన్ఆర్పీ అగ్రహారంలో చేపల చెరువు అక్రమ తవ్వకం కొల్లేరు అభయారణ్యంలోనూ నిబంధనలకు తూట్లు పట్టించుకోని అధికారులు నోటీసులు అందిస్తాం చేపల చెరువుకు ముందుగా మండల స్థాయి అధికారుల నుంచి అనుమతులు పొందాలి. తర్వాత జిల్లా అధికారులు ఆన్లైన్లో పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారు. కలిదిండి మండలం ఎస్ఆర్పీ అగ్రహారంలో తవ్వుతున్న చేపల చెరువుకు ఎటువంటి అనుమతులు లేవు. సదరు రైతుకు నోటీసు అందించాలని ఎఫ్డీవోకు అదేశించాం. – బి.రాజ్‌కుమార్, మత్స్యశాఖఽ అధికారి, కై కలూరు -
విజువల్లీ చాలెంజ్డ్ ఎంప్లాయీస్ కార్యవర్గం ఎన్నిక
ఏలూరు (టూటౌన్): విజువల్లీ చాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గానికి ఏలూరులోని గిరిజన భవన్లో ఎన్నికల అధికారి బురహన్ అలీ మంగళవారం ఎన్నికలు నిర్వహించారు. 24 పోస్టులకు 24 నామినేషన్లు రావడంతో అందరూ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించి వారితో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా జి. రవీంద్రబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎ.జలంధర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారిగా సీహెచ్.జ్యోతి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా జి.రాధారాణి, రాష్ట్ర సహా అధ్యక్షుడిగా ఎన్.వెంకటేశ్వరరావు, రాష్ట్ర సంఘ సలహాదారుగా కె.గురుప్రసాద్, రాష్ట్ర మహిళా కార్యదర్శిగా పి.శైలజ, ఉపాధ్యక్షులుగా దేవేంద్రనాథ్, మధుబాబు, రామ్మోహన్ రావు, గోపి, శ్రీనివాస్, ఎరుకునాయుడు, భాస్కరరావు, సంయుక్త కార్యదర్శులుగా నాగార్జున, నరేష్, రాము, గోవిందరావు, దుర్గా ప్రసాద్, రాముడు, భార్గవ్, అర్చన, కృష్ణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
ఉల్లాస్ పరీక్షలకు ఏర్పాట్లు
కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఏలూరు(మెట్రో) : జిల్లాలో ఉల్లాస్ కార్యక్రమం కింద నమోదైన నిరక్షరాస్యులైన వయోజనులకు ఈనెల 23న నిర్వహించే పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఉల్లాస్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై వయోజన విద్య, విద్యా శాఖ తదితర అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఉల్లాస్ కార్యక్రమం కింద అక్షరాస్యత శిక్షణ పూర్తిచేసిన 7,321 మంది ఈ పరీక్షలు రాయనున్నారని అందుకోసం 732 పాఠశాలలు గుర్తించి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. ఇళ్ల నిర్మాణాలకు అదనపు సాయం ఏలూరు(మెట్రో) : స్వర్ణాంధ్ర–2047 విజన్ సాకారంలో భాగంగా 2029 నాటికి అందరికీ ఇళ్లు లక్ష్యంతో అసంపూర్తి ఇళ్ల నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. ఇందులో భాగంగా పీఎంఏవై 1లో ఇళ్లు మంజూరై, ఇంకా వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు యూనిట్ విలువకు అదనంగా ఆర్ధిక సహాయం అందించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. జిల్లాలో దాదాపు 49,436 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీల గృహాలు వివిధ దశలలో నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. గృహనిర్మాణం పూర్తికి యూనిట్ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా ఎస్సీలు, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, ఆదివాసి గిరిజనులకు రూ.లక్ష చొప్పున ఆర్ధిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా అందిస్తుందని తెలిపారు. నిర్మాణాలు ఏప్రిల్ 2025లోగా పూర్తి చేసుకోవాలన్నారు. లబ్ధిదారులు ఇల్లు పూర్తి చేసుకోవడానికి తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని హౌసింగ్ పీడీ జి.సత్యనారాయణను కలెక్టర్ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవడంలో నిధుల మంజూరు కోసం మధ్యవర్తులు, ఇతరుల మోసపూరిత మాటలు నమ్మరాదని, ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత మండల గృహ నిర్మాణ కార్యాలయం, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లను సంప్రదించాలన్నారు. పాఠశాల మరుగుదొడ్లకు తాళాలు ఫిర్యాదు చేసిన బాలికలు దెందులూరు : గోపన్నపాలెం ఉన్నత పాఠశాలను విజిలెన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజనంపై విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నారని ఈ పరిస్థితి ఉత్పన్నమైతే చర్యలు తప్పవని ఇన్చార్జి హెచ్ఎంకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలికల బాత్రూంలకు తాళాలు వేయడం కమిటీ తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. బాత్రూంలకు తాళాలు ఎందుకు వేయాల్సి వచ్చిందనే అంశం విచారణలో తేలాల్సి ఉంది. ఇంటర్ పరీక్షలకు 18,050 మంది హాజరు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మంగళవారం నిర్వహించిన ఫిజిక్స్ –1, ఎకనామిక్స్–1 పరీక్షలకు మొత్తం 19,237 మంది విద్యార్థులకు 18050 మంది విద్యార్థులు హాజరయ్యారు. 16,660 మంది జనరల్ విద్యార్థులకు 15,882 మంది, 2577 మంది ఒకేషనల్ విద్యార్థులకు 2168 మంది హాజరయ్యారు. విద్యార్థుల హాజరు 94 శాతంగా నమోదైంది. ఎలాంంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. -
మెడికల్ కళాశాల కల సాకారం
● సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థతో గడప వద్దకే సంక్షేమ లబ్ధి ● పేదల వైద్యానికి పెద్దపీట ● నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ ● నవరత్నాలతో పేదల ఉన్నతికి బాటలు ● జగనన్న సురక్షతో ఉచితంగా సర్టిఫికెట్ల జారీ ● ఆక్వా వర్శిటీ, మెడికల్ కళాశాల మంజూరు ● నేడు వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అక్కచెల్లెమ్మల అభ్యున్నతికి ‘చేయూత’నందించారు. వారి డ్వాక్రా రుణమాఫీకి ‘ఆసరా’ అయ్యారు.. అగ్రవర్ణాల పేద మహిళలకు ‘నేస్తం’గా నిలిచారు. పేదల చదువులకు ‘అమ్మఒడి’లా వారి ఉన్నతికి విద్య, వసతి దీవెనలు అందించారు. సాగులో రైతుకు, వేట విరామంలో మత్య్సకారులకు ‘భరోసా’గా ఉన్నారు. నేతన్నలకు ‘నేస్తం’ అయ్యారు. వలంటీర్, సచివాలయ వ్యవస్థలు తెచ్చి కులమత వర్గాలు, రాజకీయాలు చూడకుండా సంక్షేమ లబ్ధిని పేదల చెంతకు చేర్చారు. నేడు వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకల నిర్వహణకు పార్టీ శ్రేణులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. 2019 మే 30న సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే నవరత్నాల అమలుకు అడుగులు వేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ, వలంటీర్ వ్యవస్థలు తెచ్చారు. పింఛన్ కోసం అవ్వాతాతలు పడిగాపులకు చెక్ పెట్టారు. 1వ తేదీ ఉదయాన్నే ఇంటికి వెళ్లి పింఛన్ సాయాన్ని చేతికందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదల అభ్యున్నతికి వైఎస్సార్ పెన్షన్ కానుక, అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత. కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, టైలర్లు, రజకులు, నాయి బ్రాహ్మణుల కోసం జగనన్న చేదోడు, డ్రైవర్ల కోసం వాహనమిత్ర, మత్య్సకారులకు మత్య్సకార భరోసా, చేనేత కార్మికుల కోసం నేతన్న నేస్తం తదితర ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా పేదలను ఆదుకున్నారు. డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో ఉమ్మడి జిల్లాలోని పేదలకు సుమారు రూ.2,500 కోట్ల లబ్ధి చేకూరింది. ఉచిత పంటల బీమా, ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా చేశారు. జగనన్న సురక్ష శిబిరాల ద్వారా ఉమ్మడి జిల్లాలోని దాదాపు 11.82 లక్షల మంది లబ్ధిదారులకు ఏ విధమైన సర్వీస్ చార్జీ లేకుండానే కుల ధ్రువీకరణ, ఆదాయ, జనన, మరణ, మ్యారేజ్ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ తదితర 12.04 లక్షల సర్టిఫికెట్లు అందజేశారు. జగనన్న ఆరోగ్య సురక్షలో 2.26 లక్షల మందికి సేవలు జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్–1లో ఏలూరు జిల్లాలో 498 మెడికల్ క్యాంపులు నిర్వహించారు. రూరల్‌లో 463, అర్బన్ పరిధిలో 35 క్యాంపులు ఏర్పాటు చేశారు. ఈ క్యాంపుల్లో 2,26,779 మంది వైద్యసేవలు పొందారు. ఫేజ్–2లో 551 మెడికల్ క్యాంపులు నిర్వహించగా రూరల్ ప్రాంతాల్లో 441, అర్బన్ పరిధిలో 110 క్యాంపులు ఏర్పాటు చేశారు. 61,140 మంది వైద్య సేవలు పొందారు. నాడు– నేడు తొలి దశలో 648 పాఠశాలలకు మహర్దశ నాడు – నేడు కార్యక్రమంలో తొలి విడతగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 648 పాఠశాలలను ఎంపిక చేసి రూ.134. 84 కోట్లతో అభివృద్ధి చేశారు. రెండో విడతగా 889 పాఠశాలల అభివృద్ధికి రూ.295.54 కోట్లు కేటాయించారు. బలివే వద్ద వంతెన నిర్మాణం పెదవేగి మండలం విజయరాయి వద్ద బలివే వంతెన, ఏలూరు రూరల్ మండలంలోని శ్రీపర్రు వంతెన నిర్మాణ పనులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలోనే జరిగాయి. ప్రగతి పరవళ్లుఏలూరు ప్రజల దశాబ్దాల కలగా ఉన్న ప్రభుత్వ వైద్యకళాశాల సాకారమవడంతో తరగతులు ప్రారంభమయ్యాయి. రూ.60 కోట్ల వ్యయంతో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించారు. 2022–23 విద్యా సంవత్సరంలో 150 ఎంబీబీఎస్ సీట్లతో ప్రారంభించారు. రూ.525 కోట్ల ఈ ప్రాజెక్టులో భాగంగా మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తి చేసి మిగిలిన వ్యయంతో ప్రభుత్వ ఆసుపత్రిని టీచింగ్ ఆసుపత్రిగా అభివృద్ధి ప్రారంభించారు. తమ్మిలేరు రిటైనింగ్‌వాల్‌కు 2019లో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు పూర్తి చేశారు. రెండో దశలో 2.5 కిలోమీటర్ల మేర రూ.55.50 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించి 90 శాతానికిపైగా పనులు పూర్తి చేశారు. నేడు ఆవిర్భావ దినోత్సవం వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు పార్టీ కార్యాలయాల వద్ద పార్టీ జెండా ఆవిష్కరణలు, కేక్ కటింగ్‌లు చేయనున్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం దగాతో మోసపోయిన నిరుద్యోగులు, విద్యార్థుల పక్షాన జిల్లా కేంద్రాల్లో ‘యువత పోరు’ కార్యక్రమం నిర్వహించనున్నారు. -
యువత పోరు జయప్రదం చేద్దాం
కై కలూరు: ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెనలో రూ.4,600 కోట్ల బకాయిలు తక్షణం విడుదల చేయాలని, రూ.3 వేల నిరుద్యోగ భృతి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వంటి ప్రధాన డిమాండ్లతో బుధవారం జరిగే యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) కోరారు. కై కలూరు పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ స్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద బుధవారం 10 గంటల వినతిపత్రం అందిస్తామన్నారు. నాలుగు మండలాల విద్యార్థులు, తల్లిదండ్రులు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ముదిరాజుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్థన్, పార్టీ ఎంపీపీలు చందన ఉమామహేశ్వరరావు, రామిశెట్టి సత్యనారాయణ, రాష్ట్ర బీసీ సెల్ సెక్రటరీ బలే నాగరాజు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చేబోయిన వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. -
అబ్బురం.. దివ్యాంగురాలి నైపుణ్యం
ఏలూరు(మెట్రో): ప్రభుత్వ నైపుణ్య, వృత్తి శిక్షణ సంస్థ ద్వారా జాబ్‌మేళాలో ఉద్యోగావకాశాన్ని పొందిన బత్తుల అంజు అనే అంధ దివ్యాంగురాలు కృతజ్ఞతగా కలెక్టర్ కె.వెట్రిసెల్వి చిత్రపటాన్ని పెన్సిల్‌తో గీసి సోమవారం బహూకరించారు. జిల్లాలో దివ్యాంగులపై కలెక్టర్ చూపించే అభిమానాన్ని పురస్కరించుకుని ఆమె జీవిత చరిత్రను పుస్తకీకరించి కలెక్టర్ వెట్రిసెల్వి చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంజు తాను గీసిన చిత్రాన్ని కలెక్టర్‌కు అందించారు. అంజు నైపుణ్య, పట్టుదల చూసి కలెక్టర్ అభినందించారు. కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది అంజును ప్రత్యేకంగా అభినందించారు. -
సునీల్‌కుమార్ అక్రమ సస్పెన్షన్‌పై నిరసన
ఏలూరు (టూటౌన్) : డీజీ పీవీ సునీల్‌కుమార్‌ను అక్రమంగా సస్పెండ్ చేయడంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ న్యాయవాదులు స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ సునీల్‌కుమార్‌ను సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. దళితులపై, దళిత అధికారులపై కక్ష పూరిత చర్యలు తీసుకోవడం మంచిది కాదన్నారు. తక్షణమే ప్రభు త్వం సునీల్‌కుమార్ సస్పెన్షన్‌ను రద్దు చేసి ఆయన్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దళిత అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఇకనైనా మానుకోవాలని ముక్తకంఠంతో నినదించారు. న్యాయవాదులు టి.అజిత్ రాజు, జీటీ స్వామి, చదలవాడ రమణ, జి.విజయభాస్కర్, నున్న నాగేశ్వరరావు, ఎం. రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. స్విమ్మింగ్‌లో పతకం ఏలూరు(మెట్రో) : 35వ సౌత్‌జోన్ స్విమ్మింగ్ పోటీల్లో ఏలూరు క్రీడా ప్రాధికార సంస్థ విశ్వనాథ్ భర్తియా స్విమ్మింగ్ పూల్‌కి చెందిన బలగ స్వామినాయుడు కాంస్య పతకం సాధించాడు. 50 మీటర్ల బటర్ ఫ్లై విభాగంలో మూడో స్థానంలో నిలిచాడు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలవగా ఆమె అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో మరింత రాణించాలని ఆమె ఆకాంక్షించారు. స్విమ్మింగ్ దుస్తులు, సామగ్రిని స్వామినాయుడుకు అందించారు. శిక్షకుడు గణేష్ ఉన్నారు. ఇంటర్ పరీక్షలకు 12,485 మంది హాజరు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జిల్లాలోని 55 కేంద్రాల్లో సోమవారం జరిగిన ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 12,826 మందికి 12,485 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 11,022 మంది జనరల్ విద్యార్థులకు 10,809 మంది, 1,804 మంది ఒకేషనల్ విద్యార్థులకు 1,676 మంది హాజరయ్యారని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ తెలిపారు. ఓపెన్ పరీక్షలకు.. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ఇంటర్ పరీక్షలకు సోమవారం 165 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. భౌతిక శాస్త్రం పరీక్షకు 317 మందికి 268 మంది , రాజనీతి శాస్త్రం పరీక్షకు 470 మందికి 354 మంది హాజరయ్యారు. టెన్త్ విద్యార్థులకు ఉచిత ప్రయాణం ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయా ణ సౌకర్యం కల్పిస్తున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్వీఆర్ వరప్రసాద్ ప్రకటనలో తెలిపారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల పరిధిలో ఈనెల 17 నుంచి వచ్చేనెల 1 వరకు విద్యార్థులు హాల్‌టికెట్ చూపించి ప్రయాణించవచ్చని, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో అనుమతిస్తారన్నారు. గోదావరి జిల్లాల్లో ఉప్పునీటి సమస్య సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్రాన్ని పలు ప్రశ్నలు అడగ్గా.. కేంద్ర మంత్రులు సమాధానాలు ఇచ్చారు సముద్ర తీర ప్రాంతంలోని తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా లు ఉప్పు సమస్యను ఎదుర్కొంటున్నట్టు కేంద్ర జల్‌శక్తి సహాయ మంత్రి రాజ్ భూషణ్చౌదరి తెలిపారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర తీరప్రాంతాల్లో ఉప్పు చేరడం వలన అక్కడ పర్యావరణం దెబ్బతింతోందని, ఏయే ప్రాంతాలు ఉప్పు సమస్యను ఎదుర్కొంటున్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ పరిమళ్ నత్వాని ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమా ధానమిచ్చారు. 2012–23 వరకు జాతీయ జ లాశయ మ్యాపింగ్ అధ్యయనాల్లో ఏపీలో భూ గర్భ జలాలపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. -
ఉపాధి లేదు.. ఫీజు రాదు
●రంగుల పనికి వెళ్లి ఫీజు చెల్లించా.. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయలేదు. దీంతో కాలేజీ వాళ్లు డబ్బులు అడుగుతుంటే సెలవుల్లో రంగుల పనికి వెళ్లి వచ్చిన డబ్బులను ఫీజులు చెల్లించా. డిగ్రీ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరానికి చెందిన ఫీజులను ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయలేదు. – కటికల వరుణ్‌కుమార్, బీకాం కంప్యూటర్స్, పోలసానపల్లి, నూజివీడు మండలం ఫీజుల కోసం అప్పులు నూజివీడులో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఫీజు రీయింబర్స్మెంట్ డ బ్బులు రావాల్సి ఉంది. కాలేజీలో రోజూ ఫీజులు చెల్లించమని ఒత్తిడి చేస్తుంటే మా తల్లిదండ్రులు అప్పు చేసి ఫీజు కట్టారు. కూలి పనులు చేసుకుని జీవించే మాలాంటి వాళ్లం చదువుకోవాలంటే కష్టంగా ఉంది. – పులపా గౌరి, బీఎస్సీ, సీతారాంపురం, నూజివీడు మండలం. కూలి పనులకు వెళ్లి.. బీకాం సెకండియర్ చదువుతున్నా. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో తల్లిదండ్రులతో కూలి పనులకు వెళ్లి కొంత, అప్పు చేసి మరికొంత తెచ్చి ఫీజు చెల్లించాను. నాలుగో సెమిస్టర్ వస్తుండటంతో కాలేజీలో మళ్లీ ఫీజులు అడుగుతున్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలి. – ఓలిపల్లి హరీష్, మర్రిబంధం, నూజివీడు మండలంసాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం, వేల సంఖ్యలో విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో తొలి పథకం నిరుద్యోగ భృతికి ప్రభుత్వం మంగళం పాడింది. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.3 వేలు ఇస్తామని యువతను నిండా ముంచింది. ఉమ్మడి జిల్లాలో మొత్తంగా 5,47,790 నివాస గృహాలు ఉన్నాయి. వీటిలో గ్రామాల్లో 4,50,118, పట్టణాల్లో 97,672 ఇళ్లు ఉన్నాయి. ఈ లెక్కన నెలకు రూ.164 కోట్లు నిరుద్యోగ భృతి కింద యువతకు చెల్లించాల్సి ఉంది. మరోవైపు పరిశ్రమలు, క్లస్టర్లు ఏర్పాటుచేసి ఉద్యోగాలిప్పిస్తామని హామీలు గుప్పించారు. ఇప్పటివరకూ జిల్లాలో ఒక్క క్లస్టర్ ఏర్పాటుచేసి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న అధికారిక ప్రకటన కూడా లేదు. వందల కోట్లల్లో ఫీజు బకాయిలు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు అదిగో ఇదిగో అంటూ ప్రభుత్వం కాలం గడుపుతోంది. గతేడాది మే నెలలో విడుదల చేస్తాం, ఆగస్టులో విడుదల చేస్తాం అన్నారు తప్ప ఆచరణలో అమలు కాలేదు. దీంతో ఏడాది కాలంగా అప్పులు చేసి తల్లిదండ్రులు తమ పిల్లల చదువులకు ఫీజులు చెల్లిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 70 వేల మంది విద్యార్థులకు ఈ ఏడాది రూ.200 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ కింద రావాల్సి ఉంది. 2024–25 విద్యా సంవత్సరానికి ‘ఫీజు’ బకాయిలకు మంగళం పాడినట్టే అని పలువురు అంటున్నారు. జగన్ సర్కారులో.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో క్రమం తప్పకుండా అందించారు. ఏలూరు జిల్లాలో నాలుగేళ్లు కలిపి సుమారు రూ. 400 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో రూ.370 కోట్ల మేర తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఏటా మూడు విడతలుగా నగదును జమ చేసేవారు. 2024లో మొదటి విడత కూడా జగన్మోహన్రెడ్డి సర్కారు జమ చేసింది. తర్వాత బకాయిలను కొత్త సర్కారు వదిలేసింది. చంద్రబాబు మాయమాటలకు యువత దగా పడింది.. ఆక్వా, ఫుడ్, అగ్రికల్చర్ క్లస్టర్లు ఏర్పాటు చేసి స్థానికంగా వేలాది ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు.. ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని ఊదరగొట్టారు.. ఏటా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేస్తామన్నారు.. ఇలా ఎడాపెడా హామీలిచ్చారు.. తీరా కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి 9 నెలలు గడుస్తున్నా వీటి ఊసే ఎత్తడం లేదు. ప్రభుత్వ వంచనను ఎండగడుతూ నిరుద్యోగ యువత, విద్యార్థుల పక్షాన వైఎస్సార్సీపీ పోరుబాట పట్టింది. ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి కోసం, వైద్య కళాశాలలను ప్రైవేటుపరం కాకుండా అడ్డుకునేందుకు ఈనెల 12న ‘యువత పోరు’ పేరుతో ఆందోళన చేపట్టనుంది. జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీ చేపట్టి కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేసి కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనున్నారు. నిరుద్యోగ భృతి ఎప్పుడుకూటమి దగా అటకెక్కిన నిరుద్యోగ భృతి స్థానికంగా ఉపాధి అవకాశాలు లేవు లక్షల్లో ఉద్యోగాలంటూ ఎన్నికల్లో ప్రచారం ఉన్న ఉద్యోగాలనూ పీకేసిన కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థుల ఎదురుచూపులు రేపు వైఎస్సార్సీపీ యువత పోరు ఉద్యోగాల మాటేంటి?గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు చేకూర్చిన లబ్ధి సంవత్సరం జగనన్న విద్యాదీవెన జగనన్న వసతి దీవెన విద్యార్థులు లబ్ధి (రూ.కోట్లలో) విద్యార్థులు లబ్ధి (రూ.కోట్లలో) 2019–20 36,527 95.78 36,580 36.86 2020–21 37,148 77.97 37,750 35.76 2021–22 38,677 105.67 36,350 34.76 2022–23 33,655 81.53 32,316 30.96 2023–24 29,111 22.45 – – -
‘యువత పోరు’కు తరలిరండి
ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి విడుదల చేయకుండా పేదలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న తీరుపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘యువత పోరు’ పేరుతో పోరాటానికి సిద్ధమవుతున్నట్టు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు తెలిపారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో యువత పోరు పోస్టర్లను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని యువత, విద్యార్థులతో కలిసి శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఉదయం 10 గంటలకు ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం విద్యార్థి సంఘాలు, యువత, విద్యార్థులు, పార్టీ శ్రేణులతో కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పిస్తామని చెప్పారు. పార్టీ శ్రేణులు, విద్యార్థులు, యువత తరలిరావాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం పేద పిల్లలు ఉన్నత విద్య అభ్యసించకుండా కుటిల రాజకీయాలు చేస్తోందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలలో జాప్యంతో పిల్లల భవిష్యత్‌ను నాశనం చేసేలా వ్యవహరిస్తోందన్నారు. ఐదు త్రైమాసికాలకు సంబంధించి సుమారు రూ.4,600 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్సీపీ పాలనలో ఏడాదిలో మూడు విడతల్లో ఫీజులు, విద్యాదీవెన, వసతిదీవెన నిధులు విడుదల చేసేవారని గుర్తు చేశారు. కూటమివి కక్ష సాధింపులు చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో పేద పిల్లల ఉన్నత భవితకు బాటలు వేస్తూ సకాలంలో ఫీజులు చెల్లించారనీ, అయితే కూటమి సర్కారు కక్ష సాధింపులతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా నిరుద్యోగ భృతిని ఎప్పుడు ఇస్తారో చెప్పాలని నిలదీశారు. లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు దారుణంగా మోసం చేశారని విమర్శించారు. పార్టీ ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పాతినవలస రాజేష్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నాని, జిల్లా అధికార ప్రతినిధి మున్నల జాన్‌గురునాథ్, మాజీ డిప్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్‌బాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జీఎంఆర్, జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు షేక్ షమీం, జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శులు బుద్దాల రాము, కంచుమర్తి తులసి, కె.జనార్దన్, బత్తిన మస్తాన్‌రావు, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ల బాచి, మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ బాజీ, రాష్ట్ర యువజన కార్యదర్శి దాలి వెంకటేష్, మున్సిపల్ విభాగం రాష్ట్ర కార్యదర్శి తంగెళ్ల రాము, ఏలూరు నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల తదితరులు ఉన్నారు. విద్యార్థుల జీవితాలతో కూటమి చెలగాటం రేపు కలెక్టరేట్ వద్ద నిరసన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ -
అంగన్వాడీలపై నిర్బంధ కాండ
ఏలూరు (టూటౌన్): సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలిపేందుకు విజయవాడ బయలుదేరిన అంగన్వాడీలపై కూటమి ప్ర భుత్వం నిర్బంధం విధించింది. ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, గృహ నిర్బంధాలు, వాహనాల అడ్డగింత, నాయకులను కదలకుండా అడ్డగించడం వంటి చర్యలకు పూనుకుంది. ఇది తమ హక్కులను కాలరాయడమేనని అంగన్వాడీలు మండిపడుతున్నారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు సోమవారం చలో విజయవాడ వెళుతున్న నేపథ్యంలో జిల్లాలో పోలీసుల నిర్బంధకాండను ప్ర జాసంఘాల నాయకులు, పార్టీలు ఖండించాయి. చలో విజయవాడ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు సోమవారం సెక్టార్ మీటింగ్‌లు నిర్వహించడం ప్రభుత్వ ద్వంద్వ నీతికి అద్దం పడుతుందని ధ్వజమెత్తారు. జిల్లావ్యాప్తంగా.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్బంధకాండ కొనసాగింది. కై కలూరు రైల్వే స్టేషన్, ఏలూరురైల్వే స్టేషన్, చేబ్రోలు పోలీస్స్టేషన్ల వద్ద అంగన్వాడీలను నిర్బంధించారు. అలాగే జీలుగుమిల్లి, కుక్కు నూరు, వేలేరుపాడు తదితర మండలాలకు చెందిన అంగన్వాడీలను అశ్వారావుపేట సరిహద్దులో పోలీసులు అడ్డగించారు. కలపర్రు టోల్గేట్ వద్ద పలు ప్రైవేట్ వాహనాల్లో తరలివెళుతున్న అంగన్వాడీలను పెద్ద సంఖ్యలో అడ్డగించి వాహనాల నుంచి కిందకు దించారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో అంగన్వాడీలు ఆందోళనలు చేపట్టారు. నిర్బంధాలను అధిగమించి.. ప్రభుత్వం ఎంత కట్టడి చేసినా జిల్లా నుంచి సుమారు 2 వేల మంది అంగన్వాడీ కార్యకర్తలు విజయవాడ తరలివెళ్లినట్టు సీఐటీయూ నాయకులు తెలిపారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా, నిరంకుశంగా వ్యవహరించడంపై అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఐటీయూ ఖండన నిర్బంధ కాండను సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.లింగరాజు, డీఎన్‌వీడీ ప్రసాద్ తీవ్రంగా ఖండించారు శనివారం ఉదయం నుంచి పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు అంగన్వాడీ వర్కర్లకు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగారని విమర్శించారు. జిల్లాలో మిన్నంటిన నిరసనలు -
ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన నిధులు తక్షణమే విడుదల చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు డిమాండ్ చేశారు. స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీలో సోమవారం జరిగిన సమావేశంలో మంగరాజు మట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారని ఇంతవరకూ ఇవ్వలేదన్నారు. 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి తగు చర్యలు చేపట్టాలన్నారు. మోగా డీఎస్సీ తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12న నిరుద్యోగుల కోసం, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం వైఎస్ఆర్సీపీ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నాకు మాల మహానాడు పూర్తి మద్దతు ప్రకటిస్తుందని చెప్పారు. -
కోకోకు మద్దతు ధర ఇవ్వాలి
ఏలూరు (టూటౌన్): కోకో గింజల కొనుగోలు సమస్యను పరిష్కరించాలని, కిలో కోకో గింజలకు రూ.900 ధర కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో గుంటూరులోని రాష్ట్ర ఉద్యాన శాఖ కార్యాలయం ముందు కోకో రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఉద్యాన శాఖ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ సీవీ హరినాథ్ రెడ్డికి రైతులు వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం నాయకులు బొల్లు రామకృష్ణ, జె.కాశీ బాబు, కోనేరు సతీష్ బాబు, బోళ్ళ వెంకట సుబ్బారావు మాట్లాడుతూ.. కోకో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించకపోతే కోకో రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీలు విదేశాల నుంచి కోకో గింజలు దిగుమతి చేసుకున్నామని రైతులను బెదిరిస్తూ సిండికేట్‌గా మారి కోకో గింజల ధరను తగ్గించి వేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరారు. కోకో గింజల కొనుగోలు కంపెనీలతో రైతుల సమక్షంలో చర్చలు జరిపి కిలో కోకో గింజలకు రూ. 900 ధర కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యపై ఉద్యాన శాఖ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ కోకో గింజల కొనుగోలు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కోకో ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ పథకాలు అమలు చేస్తుందని వివరించారు. -
అర్జీలు నాణ్యతతో పరిష్కరించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజలు అందజేసిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను పెండింగ్ లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ప్రతి అర్జీని పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. సంబంధిత ఆర్డీఓలు వారి పరిధిలోని మండలాలలో పర్యటించి ఎండార్స్మెంట్లను పరిశీలించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారుల నుంచి 367 అర్జీలు స్వీకరించామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, వార్డు సచివాలయం అధికారి వై.దోసి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సైబర్ మోసంపై కేసు నమోదు ఉంగుటూరు: నారాయణపురంలోని ఒక షాపులో యువకుడు ఫోన్ పే పేరుతో రూ. 98 వేలు తన ఖాతాలోకి మళ్లించుకున్న ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2,800 బిల్లు చేసిన ఆ యువకుడు ఫోన్ పే చేస్తానని చెప్పి షాపు యజమాని ఫోను రూ.1 ఫోన్ పే చేయమన్నాడు. యజమాని రూపాయి ఫోన్ పే చేశాడు. ఆ యువకుడు ఇప్పుడే వస్తానని బయటకు వెళ్ళాడు. వెంటనే షాపు ఓనరు బ్యాంకు ఖాతా నుంచి రూ.98 వేలు డెబిట్ అయినట్లు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. మోసపోయినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిన వెంకన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల కృష్ణారావు సోమవారం సందర్శించారు. సతీసమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ముందుగా దేవస్థానం అధికారులు, అర్చకులు తూర్పురాజగోపురం వద్ద పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో న్యాయమూర్తికి అర్చకులు, పండితులు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలుకగా, ఆలయ డీఈఓ బాబురావు స్వామివారి మెమెంటో, ప్రసాదాలు అందజేశారు. బంగారం, వెండి చోరీ ఆగిరిపల్లి: ఇంటి తాళం పగులగొట్టి దొంగలు బంగారం, వెండి, నగదు చోరీ చేశారు. ఆగిరిపల్లి గౌడ బజార్‌కు చెందిన పల్లగాని రాంబాబు కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం బంధువుల ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి తిరిగి రాగా తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 40 తులాల వెండి, నాలుగు బంగారం ఉంగరాలు, రూ.3,500 నగదు చోరీ చేశారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి పాలకొల్లు సెంట్రల్: రొయ్యల చెరువుల వద్ద విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై బి.సురేంద్రకుమార్ తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని తిల్లపూడి గ్రామానికి చెందిన నడపన శ్రీనివాస్ (44) సోమవారం ఉదయం చెరువుల వద్దకు పనికి వెళ్లాడు. మోటర్‌కు ఉన్న విద్యుత్ వైర్లను గమనించకపోవడంతో ఆ వైర్లు తగిలి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పోషణకు అతనే ఆధారం. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేంద్ర తెలిపారు. -
పెద్దింట్లమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గా, గోకర్ణేశ్వరస్వామి కల్యాణోత్సవానికి సోమవారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ నెల 1 నుంచి 13 వరకు జాతర నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి జరిగిన కల్యాణానికి దేవస్థానం తరఫున ఈవో కూచిపూడి శ్రీనివాసు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందించారు. ఆలయ ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వర శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, పంచహారతులు అందించారు. పెద్దింట్లమ్మకు వస్త్ర, పుష్పాలంకరణ, ఉచిత ప్రసాద దాతలుగా భుజబలపట్నం గ్రామానికి చెందిన గొట్టుముక్కల ప్రసాదరాజు, ముదునూరి జానకీ సుబ్బరాజు, తాడిపూడికి చెందిన కూసంపూడి రామకృష్ణంరాజు, కై కలూరుకు చెందిన కలిదిండి సూర్యనారాయణవర్మ వ్యహరించారు. అమ్మవారికి భక్తులు వేడి నైవేద్యాలు, పాల పొంగళ్లు సమర్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. శక్తి వేషాలు, గరగ డప్పుల నృత్యాలు, కేరళ చండా మేళం, తీన్మార్ డప్పులు ఆకట్టుకున్నాయి. జాతరలో ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐ వి.రవికుమార్, రూరల్ ఎస్ఐ వి.రాంబాబుల ఆధ్వర్యంలో 120 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహించారు. పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాల సమర్పణ -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి
ఏలూరు(మెట్రో): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ కె.వెట్రిసెల్వితో పాటు జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఆర్డీవో అచ్యుత అంబరీష్, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.భాస్కర్ పాల్గొన్నారు. జిల్లాలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. -
సమగ్ర శిక్ష ఉద్యోగుల పోరుబాట
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యా రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. రెగ్యులర్ ఉద్యోగుల కంటే అధిక సమయం విధులు నిర్వహిస్తున్న వారి సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వ హయాంలో సమ్మె చేశారు. దీంతో అప్పటి ప్రభుత్వం వారి కోర్కెలను తీర్చడానికి ముందుకువచ్చింది. సమ్మె కాలంలో ఉద్యోగ సంఘాలతో ఒప్పందం చేసింది. సమ్మె ఒప్పందాలు విస్మరించిన ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులు నిర్వహించిన సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఆ ఉద్యోగ సంఘంతో కొన్ని ఒప్పందాలు చేసింది. సమగ్ర శిక్షలోని 7 విభాగాల ఉద్యోగుల వేతనాన్ని 23 శాతానికి పెంచుతూ ఒప్పందం చేయడంతో పాటు అమలు కూడా ప్రారంభించింది. ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) అమలు చేయడానికి కార్యనిర్వాహక కమిటీ ఎదుట ప్రతిపాదనలు ఉంచింది. ఉద్యోగుల జాబ్ చార్ట్‌ల కోసం కమిటీ ఏర్పాటుకు ఒప్పందం, కారుణ్య నియామకాలు చేపట్టడానికి ఒప్పందం, ప్రతీ నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి అంగీకారం వంటి ఒప్పందాలను చేశారు. గత ప్రభుత్వం చేసిన ఒప్పందాల్లో కొన్ని ఆ ప్రభుత్వ హయాంలోనే అమలు చేయగా మరికొన్ని ఒప్పందాలను అమలు చేయడానికి ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సమగ్రశిక్ష ఉద్యోగులను పూర్తిగా విస్మరించింది. ఉమ్మడి పశ్చిమలో 1500 మంది ఉద్యోగులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో సమగ్రశిక్షలో 7 విభాగాల ఉద్యోగులు దశాబ్దాలుగా పని చేస్తున్నారు. మొత్తం మీద సుమారు 1500 మంది ఉద్యోగులు ఆయా విభాగాల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో పాఠశాలల అభివృద్ధికి కావా ల్సిన నిధులు అంచనా వేసి ప్రతిపాదనలు సిద్ధం చేయడం, విద్యార్థుల యూనిఫారం, షూ కొలతలు సేకరించి అంచనాలు సిద్ధం చేయడం, స్కూల్ బ్యాగ్‌లు పంపిణీ, పార్ట్ టైమ్ శిక్షకులుగా పూర్తిస్థాయిలో విధులు నిర్వహించడం ఇలా జిల్లాలో విద్యారంగం అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇచ్చిన హామీ ఏమైంది? తమతో చేసుకున్న అన్ని ఒప్పందాలను అమలు చేయాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అడిగి అడిగి వేసారి పోయారు. తాము పోరాడి సాధించుకున్న హక్కులను అమలు చేసుకోవడానికి మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి రావడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో తాము చేసిన పోరాటాల సమయంలో తమ శిబిరాలకు వచ్చి మరీ మద్దతుగా నిలిచి, అప్పటి ప్రభుత్వంపై విమర్శలు చేసిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల డిమాండ్లు సముచితమైనవేనని, తాము అధికారంలోకి వస్తే వారి డిమాండ్లు అన్నీ నెరవేర్చుతామని కూటమి నేతలు హామీలు ఇచ్చారు. ఇదంతా కేవలం అప్పటి ప్రభుత్వంపై బురద చల్లడానికి తమ శిబిరాలను వినియోగించుకోవడానికి మాత్రమేనని, తమపై ప్రేమతో కాదని ఇప్పుడు అర్థం అవుతోందని చెబుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకుని ఉండి ఉంటే తమకు ఈ తిప్పలు తప్పేవని ఆయా ఉద్యోగులు అభిప్రాయ పడుతున్నారు. సమ్మె ఒప్పందాలను అమలు చేయకపోవడంపై ఆగ్రహం నిరసన దీక్షకు తరలిరావాలి సమ్మె ఒప్పందాలను అమలు చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 11న విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్న నిరసన దీక్షకు ఉద్యోగులంతా తరలిరావాలి. ప్రతీ నెలా 1వ తేదీనే జీతాలు విడుదల చేయాలి. మినిమం టైమ్‌స్కేల్ అమలు చేయాలి. పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచాలి. సమగ్రశిక్ష ప్రాజెక్టు ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలి. వాసా శ్రీనివాసరావు, పార్ట్‌టైమ్ ఇన్స్ట్రక్టర్స్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించే హెచ్ఆర్ పాలసీని ఒప్పందం మేరకు కచ్చితంగా అమలు చేయాలి. ప్రస్తుతం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించేందుకు మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ నెంబర్ –2ను తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీలు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలి. కే వినోద్ కుమార్, సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు -
పోలవరం నిర్వాసితుల ధర్నా
పోలవరం రూరల్: 18 ఏళ్లు నిండిన యువతకు, మహిళ వివాహితులకు కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింప చేయాలని ఆదివాసి మహాసభ అధ్యక్షుడు మిడియం వెంకటస్వామి, అడ్వకేట్ బాబ్జీ డిమాండ్ చేశారు. సోమవారం పోలవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద మండలంలోని కోండ్రుకోట, కోరుటూరు, తూటిగుంట పంచాయతీలకు చెందిన మహిళలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మిడియం వెంకటస్వామి, అడ్వకేట్ బాబ్జీ మాట్లాడుతూ మండలంలో మొత్తం 29 గ్రామాలు పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్నాయన్నారు. ఎగువ ఏజెన్సీలో 19 గిరిజన గ్రామాల నిర్వాసితులు ప్యాకేజీలు ఇవ్వకపోయినప్పటికీ గోదావరి వరదలకు భయపడి 2022లో గ్రామాన్ని ఖాళీ చేసి పునరావాస గ్రామాలకు తరలి వెళ్లారన్నారు. కటాఫ్ డేట్ పేరుతో నిర్వాసితుల పేర్లు తొలగించి, అసలు నిర్వాసితులు కాని వారికి, నిర్వాసిత గ్రామాలతో సంబంధం లేని వారి పేర్లు నమోదు చేసి ఇష్టారాజ్యంగా ప్యాకేజీలను ధారాదత్తం చేశారని ఆరోపించారు. ఇప్పటికై నా అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వివాహం అయిన పురుషులకు ప్యాకేజీ ఇచ్చినట్లు సీ్త్రలకు ఇవ్వాలన్నారు. అనంతరం పోలవరం తహసిల్దార్ సాయిరాజుకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో తెలిపేటి మహేశ్వరి, పుట్టి సృజన, కొనుతుల మహేశ్వరి, అరగంటి అఖిల, తొర్లపాటి లక్ష్మి, మాడే అలేఖ్య, తెలిపేటి సందీప్ రెడ్డి, ఆకుల మౌనిక, నిర్వాసిత మహిళలు పాల్గొన్నారు. -
వీహెచ్‌పీ ఆధ్వర్యంలో నిరసన
ఏలూరు (టూటౌన్): రాయచోటిలో ఈ నెల 4వ తేదీన వీరభద్ర స్వామి ఉత్సవాల సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్న హిందువులపై దాడి చేసిన వారికి పోలీసులు వత్తాసు పలుకుతూ అక్రమ కేసులు పెట్టారని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద సోమవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. హిందూ సంఘాల ప్రతినిధులు, వీహెచ్‌పీ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపారు. హిందువులపై దాడి చేసిన వారిని వెంటనే పోలీసులు అరెస్టు చేయాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వీహెచ్‌పీ ఆంధ్రా, తెలంగాణ ప్రాంత కార్యదర్శి తనికెళ్ళ సత్య రవికుమార్ మాట్లాడుతూ పోలీసులు ఒక వర్గం వారికి అనుకూలంగా పక్షపాత ధోరణితో వ్యవహరించడం తగదన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీలపై ఉక్కుపాదం దారుణం
ఏలూరు (టూటౌన్): అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని సోమవారం విజయవాడలో మహా ధర్నా నిర్వహించ తలపెట్టగా ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం తగదని సీఐటీయూ ఏలూరు జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది. జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు, ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. మహాధర్నాకు వెళ్లకుండా నాయకులను నిర్బంధించడం, నోటీసులు ఇవ్వ డం, బెదిరించడం మానుకోవాలని హితవు పలికారు. ఎన్నికల ముందు అంగన్వాడీల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వారి సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేయడం అన్యాయన్నారు. అక్రమ అరెస్ట్‌లు ఆపాలి : అంగన్వాడీల ముందస్తు అరెస్టులు నిలిపివేయాలని, ప్రజాస్వామ్యతంగా ధర్నా చేసేందుకు అవకాశం ఇవ్వాలని దళిత, ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. స్థానిక అన్నే భవనంలో ఆదివారం భారతీయ బౌద్ధ మహాసభ చైర్మన్ ఆర్.మనీ సింగ్, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎ.శ్యామల రాణి, కెవిపిఎస్, ఏపీ రైతు సంఘం, సీఐటీయూ నాయకులు సమావేశం నిర్వహించి అంగన్వాడీల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ఇఫ్టూ ఖండన ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): అంగన్వాడీలపై నిర్బంధాన్ని ప్రయోగించడం సరైనది కాదని భారత కార్మి క సంఘాల సమైక్య ఇఫ్టూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవీ రమణ, బద్దా వెంకట్రావు ఒక ప్రకటనలో ఖండించారు. నిర్బంధం తగదు కుక్కునూరు: విజయవాడలో ధర్నాకు వెళ్లనున్న అంగన్వాడీ కార్యకర్తలు, సీఐటీయూ నాయకులను నిర్బంధించడం దారుణమని సీఐటీయూ మండల కార్యదర్శి యర్నం సాయికిరణ్ అన్నారు. ఆదివా రం సాయికిరణ్‌ను తన ఇంటి వద్ద పోలీసులు ని ర్బంధించడాన్ని నిరసిస్తూ ప్రకటన విడుదల చేశారు. -
గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి దూప దీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చేతల్లిగా వరాలిచ్చే అమ్మగా పేరుపొందడంతో మంగమ్మగుడికి వచ్చే భక్తుల సంఖ్య ప్రతీ వారం పెరుగుతూనే ఉంది. క్షేత్రంలో కోతులను ఎత్తుకెళ్లిన వ్యక్తులు ద్వారకాతిరుమల : శ్రీవారి క్షేత్రంలో గుర్తు తెలియని ఒక వ్యక్తి, మహిళ కలిసి ఆదివారం రెండు కోతుల్ని బంధించారు. స్థానికులు ప్రశ్నించడంతో వాటిని తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానం పాత కేశఖండనశాల వెనుక రోడ్డులో ఆటోలో బోనును ఏర్పాటు చేసి, అరటి పండ్లను ఎరగా వేసి రెండు కోతుల్ని బంధించారు. మిగిలిన వాటిని పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. స్థానికులు వారిని ఎవరని నిలదీయడంతో హడావుడిగా అక్కడి నుంచి పరారయ్యారు. అసలు కొండముచ్చులను వారు ఎందుకు పట్టుకెళుతున్నారన్నది తెలియలేదు. కోతుల్ని తామేమి పట్టించలేదని దేవస్థానం, అటవీశాఖ అధికారులు తెలిపారు. 16 టన్నుల ఐరన్ మాయం దెందులూరు: దెందులూరు హౌసింగ్ గోడౌన్లో 16 టన్నుల ఐరన్ మాయమైందని గృహ నిర్మాణ శాఖ డివిజనల్ ఇంజనీర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొవ్వలి వంతెనకు వెళ్లే దారిలో గృహ నిర్మాణ శాఖ గోడౌన్ ఉంది. అయితే అక్కడ ఉన్న 16 టన్నుల ఐరన్ మాయమైందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో ప్రతిభ
జంగారెడ్డిగూడెం: జెట్టి సత్యారావు రాష్ట్ర స్థాయి ఫస్ట్ మెమోరియల్ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ 2025 జంగారెడ్డిగూడెంలో ఆదివారం జరిగింది. ఈ టోర్నమెంట్లో మొత్తం 220 మంది చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్–7, 9, 11, 13, 15 కేటగిరీల్లో నిర్వహించిన ఈ టోర్నమెంట్లో ఫస్ట్ప్రైజ్ రూ.5 వేలు, సెకండ్ప్రైజ్ రూ.4 వేలు, థర్డ్ రూ.3 వేలు అందజేశారు. 20 స్థానాలకు క్యాష్ ప్రైజ్, ట్రోఫీలు అందజేశారు. టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులకు ఉచిత భోజన వసతి కల్పించారు. స్థానిక ప్రతిభ ఇంగ్లీష్ మీడియంలో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు చేతుల మీదుగా విజేతలు ప్రదానం చేశారు. ప్రథమ బహుమతి దేవరపల్లి లక్ష్మణరావు(ఏలూరు), ద్వితీయ బహుమతి జడల మల్లేశ్వరరావు(విజయవాడ), తృతీయ బహుమతి కొరపర్తి సీతసాగర్ (రాజమండ్రి)కు అందజేశారు. కార్యక్రమంలో జెట్టి సత్యాదిత్య, కాసర సరోజారెడ్డి, కాల్నీడి రమేష్, ముప్పిడి శ్రీనివాసరావు, సుభాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అట్టహాసంగా భీమడోలు జాతర
భీమడోలు: భీమడోలు గ్రామదేవతలు శ్రీమద్దిరామమ్మ, శ్రీమహాలక్ష్మమ్మ, శ్రీగంగానమ్మ జాతర ఉత్సవాలు ఆదివారం రాత్రితో ముగిశాయి. గ్రామంలోని పురవీధులు భక్తులతో కిటకిటలాడాయి. 33 రోజులుగా జాతర ఉత్సవాలు సాగాయి. కొర్లబండిని పొలిమేరకు పంపడంతో ఉత్సవాలు ముగిశాయి. శనివారం అర్ధరాత్రి కీలక ఘట్టమైన అమ్మవార్లకు కుంభాభిషేకం పూజలు ప్రారంభించి ఆ తర్వాత పొలిచేట గ్రామ పొలిమేరల్లో తిరిగింది. తెల్లవారుజాము నుంచి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. ఆదివారం ఉదయం అమ్మవార్లకు కుంభం కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయాలు పోటెత్తాయి. అమ్మవార్లకు బూరెలు, గారెలు, అన్నం తదితర నైవేద్యాన్ని సమర్పించి భక్తిని చాటుకున్నారు. జాతర కమిటీ అధ్యక్షుడు దత్తాడ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో జాతర సమితి, యువకులు, పెద్దలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. భీమడోలు సీఐ యూజే విల్సన్ పర్యవేక్షణలో ఎస్సై వై.సుధాకర్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. వరసగా సెలువులు కావడంతో జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి భక్తులు తరలి వచ్చారు. ఆలయాల వద్ద స్వచ్ఛంద సేవా సంస్థలు, బ్యాంకు యాజమాన్యాలు భక్తులకు మజ్జిగ, నీళ్ల ప్యాకెట్లను అందించాయి. శ్రీకల్కి సేవా సమితి ద్వారా మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయించారు. భీమడోలు గ్రామంలోని ప్రతి ఇంటా పండుగ వాతావరణం నెలకొంది. మేళతాళాలు, బాణసంచాతో పాటు చిత్ర విచిత్ర వేషాలతో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. కొర్ల బండిని గణాచారులు, పెద్దలు, భక్తులు లాగి పొలిమేర వద్దకు పంపారు. -
జాతర వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి వనిత
ద్వారకాతిరుమల: భీమడోలులో ఆదివారం జరిగిన జాతర ముగింపు వేడుకల్లో మాజీ హోం మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ద్వారకాతిరుమల మండల కన్వీనర్ ప్రతాపనేని వాసు, గోపాలపురం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాకారపు బంగారమ్మతో కలసి పసుపులేటి సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా వనితకు పెద్దిరెడ్డివారి మహిళలు పసుపు, కుంకుమ పెట్టారు. అనంతరం విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో పెద్దిరెడ్డి జ్యోతి శ్రీనివాస్, పాకలపాటి త్యాగ భీమేశ్వరరావు, దాసరి రాంబాబు, భోగరాజు సాయికృష్ణ, పెద్దిరెడ్డి నాగేశ్వరరావు, కొల్లి సుబ్బారావు, ఘంటా శ్రీను, దాకారపు అగ్గియ్య తదితరులున్నారు. -
సబ్ జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక
తణుకు అర్బన్: పశ్చిమగోదావరి జిల్లా సబ్ జూనియర్ అండర్–16 బాలురు, బాలికల కబడ్డీ సెలక్షన్స్ తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఆదివారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 200 మంది క్రీడాకారులు హాజరుకాగా వారిలో 12 మంది బాలురు, 12 మంది బాలికలను ఎంపిక చేసినట్లు కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ యలమరెడ్డి శ్రీకాంత్ తెలిపారు. ఎంపికై న జట్లు ఈ నెల 14 నుంచి 16 వరకు కడప జిల్లాలోని పులివెందులలో నిర్వహించే 39వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా తరపున ఆడనున్నట్లు ఆర్గనైజర్ సంకు సూర్యనారాయణ తెలిపారు. ముందుగా బాలుర జట్టు ఎంపికను ఏఎంసీ మాజీ చైర్మన్ బసవ రామకృష్ణ, బాలికల జట్టు ఎంపికను తణుకు పట్టణ బీజేపీ అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు ప్రారంభించారు. వ్యాయామ ఉపాధ్యాయులు కె.షణ్ముఖం, కేవీఆర్ సుబ్బారావు, బి.ప్రదీప్, జి.రవి, కే.మంగ, వి.సత్యవేణి, సి.రాణి తదితరులు పాల్గొన్నారు. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రపంచ రికార్డు తణుకు అర్బన్: తణుకు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఆదివారం చిన్నారులు మార్షల్ ఆర్ట్స్ నాన్ చాక్ తిప్పుతూ వేసిన యోగాసనాలు యునైటెడ్ వరల్డ్ రికార్డును సాధించాయి. కేఎస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చైర్మన్ డాక్టర్ కె.శ్రీనివాస్ ఆధ్వర్యంలో 250 మంది కరాటే విద్యార్థులు 22 రకాల యోగాసనాలు వేస్తూ మార్షల్ ఆర్ట్స్ నాన్ చాక్ తిప్పుతూ వినూత్నంగా చేసిన ప్రదర్శన అలరించింది. ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వి.ఆర్యన్ వ్యవహరించారు. ముఖ్య అతిథిగా హాజరైన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్‌లో చిన్నారులు రాణిస్తున్న తీరు అభినందనీయమని, విద్యతోపాటు క్రీడల్లో కూడా పట్టు సాధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. క్రీడాకారులను తీర్చిదిద్దుతున్న అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌ను అభినందించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచంలోనే మొదటిసారిగా 250 మంది మార్షల్ ఆర్ట్స్ విన్యాసాల మధ్య యోగాసనాలు వేయడం జరిగిందన్నారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి జంగారెడ్డిగూడెం : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందిన ఘటన ఆదివారం జంగారెడ్డిగూడెం పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై షేక్ జబీర్ తెలిపిన వివరాల ప్రకారం లక్కవరం గ్రామానికి చెందిన చుక్కా మహాలక్ష్మి కాకర్ల వై.జంక్షన్ వద్ద కిళ్లీ కొట్టు నడుపుతోంది. ఆదివారం ఉదయం మహాలక్ష్మి తన స్కూటీపై కిళ్లీ కొట్టుకు వెళ్తుండగా.. అశ్వారావుపేట వైపు నుంచి కొయ్యలగూడెం వైపు వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో మహాలక్ష్మి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి కుమారుడు చుక్కా సూర్యప్రకాష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక
భీమవరం: భీమవరం లూథరన్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు 1976–1981 మధ్య చదివిన ఆలనాటి మిత్రుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించారు. అప్పటి ఉపాధ్యాయులను, ప్రస్తుత ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. తరగతి గదుల్లో కూర్చుని చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా చిన్ననాటి స్నేహితులు ముగ్గురికి ఆర్థిక సాయం అందించి తమ అనుబంధాన్ని చాటుకున్నారు. ఆనాటి స్నేహితుల్లో ఒకరైన శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు పాల్గొని చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసి అందర్నీ ఆత్మీయంగా పలకరించి సందడి చేశారు. ఆత్మీయ మిత్రుల సమ్మేళనానికి కృషి చేసిన కొప్పర్తి అప్పారావు, బుడెం శ్రీనివాసరావు, కాటం రమేష్, తటవర్తి విశ్వేశ్వరరావు, అడబాల శివను తోటి మిత్రులు అభినందించారు. -
అపరాల రైతుల నిరసన
ఏలూరు (టూటౌన్): అపరాలకు కనీస మద్ద తు ధర రాక నష్టపోతున్నామంటూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు రూరల్ మండలం జాలిపూడిలో రైతులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. అపరాల కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలంటూ నినాదాలు చేశారు. రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మా ట్లాడుతూ పెసర, మినుములు వంటి అపరాల పంటలకు పెట్టిన పెట్టుబడులు కూడా రా వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించి వేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు పెసర క్వింటాల్‌కు రూ.8,682, మినుముకు రూ.7,400 రావడం లేదన్నారు. ఈ ఏడాది తెగుళ్లతో దిగుబడులు తగ్గాయని, వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్బారాయుడి ఆలయానికి తాకిడి ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. పుట్టలో పాలు పోసి స్వామిని దర్శించుకున్నారు. పాల పొంగళ్లశాల వద్ద మహిళలు నైవేద్యాలు సమర్పించారు. నాగబంధాల వద్ద, గోకులంలో మహిళలు పూజలు చేశారు. ఆలయ సహాయ కమిషనర్ ఆర్.గంగాశ్రీదేవి ఏర్పాట్లను పర్యవేక్షించారు. నేటి నుంచి వేణుగోపాలస్వామి కల్యాణోత్సవాలు ముదినేపల్లి రూరల్: మండలంలోని గురజలో రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయ వార్షిక కల్యాణోత్సవాలు సోమవారం నుంచి నిర్వహించనున్నట్టు ఈఓ శింగనపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 14 వరకు ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. తొలిరోజు అంకురారోపణ, ధ్వజారోహణం, మంగళవారం ఊరేగింపు, 12న కల్యాణోత్సవం, 13న గరుడోత్సవం, రథోత్సవం, 14న పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. మెకానిక్‌లు వృత్తి నైపుణ్యం పెంచుకోవాలి నూజివీడు: నవ్యాంధ్ర టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏలూరు జిల్లా ఇన్చార్జి అధ్యక్షుడిగా యర్రంశెట్టి చిన్ని నియమితులయ్యారు. నూజివీడులో ఆదివారం నిర్వహించిన సమావేశంలో సంఘ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సుభానీ చిన్ని నియమకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ సంఘం బలపడితే హక్కులు సాధించవచ్చన్నారు. మెకానిక్‌లు వృత్తిలో నైపుణ్యం పెంచుకోవాలని, ఈ దిశగా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. గుండె ఆపరేషన్ చేయించుకున్న మెకానిక్ బసవయ్య, ప్రమాదానికి గురైన సుబ్బారాయుడుకు సంఘం తరఫున రూ.10 వేలు ఆర్థిక సాయం చేశారు. జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్ సైదులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొప్పుల శౌరి, 20 మండలాల అధ్యక్షులు, సంఘ నాయకులు పాల్గొన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలి చింతలపూడి: ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న కౌ లు రైతులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇ వ్వా లని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఎర్రగుంటపల్లిలో కుప్పా ల సురేష్ అధ్యక్షతన జరిగిన కౌలు రైతుల స మావేశంలో ఆయన మాట్లాడారు. ఆయిల్ పామ్ సాగులో 90 శాతం మంది కౌలు రైతులు ఉన్నారని, వీరికి అన్నదాత సుఖీభవ పథకం, రూ.2 లక్షల వరకు పంట రుణాలు ఇప్పించాలన్నారు. సంఘం జిల్లా కార్యదర్శి దొంతా కృష్ణ, జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సోమశేఖర్ పాల్గొన్నారు. అనంతరం గ్రామ కమిటీ కన్వీనర్‌గా కుప్పాల సురేష్, కో–కన్వీనర్‌గా పాకనాటి సూరిబాబును ఎన్నుకున్నారు. -
లోక్‌అదాలత్‌లో 5,236 కేసుల పరిష్కారం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీల్‌కుమార్ ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ, ఏలూరు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 5,236 కేసులను పరిష్కరించినట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి (ఎఫ్ఏసీ) ఎం.సునీల్‌కుమార్ ఆదివారం తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 26 బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. వీటిలో ఏలూ రులో 6, భీమవరంలో 3, కొవ్వూరులో 3, నరసాపురంలో 3, తణుకులో 3, తాడేపల్లిగూడెంలో 3, పాలకొల్లులో 1, నిడదవోలులో 1, జంగారెడ్డిగూడెంలో 1, చింతలపూడిలో 1, భీమడోలులో 1 చొప్పున బెంచీలు ఏర్పాట్లు చేశామన్నారు. మొత్తంగా 4,919 క్రిమినల్ కేసులు, 162 మోటార్ వాహన ప్రమాద బీమా కేసుల్లో సుమారు రూ.11 కోట్లను పరిహారంగా కక్షిదారులకు అందించామన్నారు. 155 సివిల్ కేసులను రాజీ చేయడంతో పాటు 132 ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించామన్నారు. ఏలూరులో 1,268, భీమవరంలో 896, చింతలపూడిలో 184, జంగారెడ్డిగూడెంలో 371, కొవ్వూరులో 300, నరసాపురంలో 292, పాలకొల్లులో 176, తాడేపల్లిగూడెంలో 495, తణుకులో 743, నిడదవోలు 465, భీమడోలులో 46 కేసులు పరిష్కరించామని వివరించారు. కేసుల పరిష్కారంలో సహకరించిన న్యాయవాదులు, ప్రభుత్వ అధికారులు, బీమా, బ్యాంకు అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
కాంరకీట్ లిఫ్ట్ తెగిపడి కానరాని లోకాలకు..
తాడేపల్లిగూడెం అర్బన్: నిర్మాణ భవనానికి శ్లాబ్ వేస్తున్న సమయంలో కాంక్రీట్ లిఫ్ట్ బకెట్ తెగిపడటంతో ఓ మహిళా కూలీ దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలైన సంఘటన తాడేపల్లిగూడెంలోని 5వ వార్డులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని 5వ వార్డులోని రామాలయం వీధిలో ఆదివారం ఓ భవనానికి మూడో అంతస్తు నిర్మాణం కోసం శ్లాబ్ వేస్తున్నారు. జట్లపాలెంలోని గంగిరెడ్డ కాలనీకి చెందిన చింతా రమణమ్మ (30), ఆవుల వెంకన్న, బీరా వెంకటేశ్వరరావు, మరికొందరు కూలీలు పనిచేస్తున్నారు. వీరంతా కింద పనులు చేస్తుండగా కాంక్రీట్‌ను పైకి తరలించే లిఫ్ట్‌కు ఉన్న ఇనుప తీగ తెగిపడటంతో రమణమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. కాంక్రీట్ మోస్తున్న ఆవుల వెంకన్న, బీరా వెంకటేశ్వరరావు తలలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వెంకన్న తలకు బలమైన గాయం కావడంతో కోమాలోకి వెళ్లిపోగా మెరుగైన వైద్యం కోసం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్వరరావు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రమణమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం, పట్టణ సీఐ ఎ.సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూలి పనులే ఆధారం మృతురాలు రమణమ్మ, భర్త కోటయ్యలు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. రమణమ్మ మృతితో భర్త, పిల్లలు గుండెలవిసేలా రోదిస్తున్నారు. భవన యజమానికి కూటమి అండ! మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని బంధువులు భవన యజమానిని వేడుకోగా తనకు ప్ర జాప్రతినిధుల అండదండలున్నాయని, ఏం చేసుకుంటారో చేసుకోండని దురుసుగా మాట్లా డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యజమానికి కూటమి వర్గానికి చెందిన కొందరు నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. మృతురాలు రమణమ్మ కుటుంబంతో పాటు కోమాలోకి వెళ్లిన వెంకన్న కుటుంబాన్నీ ఆదుకోవాలని కోరుతున్నారు. నిర్లక్ష్యంతోనే ప్రమాదం భవన నిర్మాణ ప్రాంతంలో కాంక్రీట్ లిఫ్టును ఇనుప రాడ్లతో పకడ్బందీగా ఏర్పాటుచేయాల్సి ఉంది. అయితే నామమాత్రంగా కర్రలతో కట్టడంతో కర్రలు విరిగి, ఇనుప తీగలు తెగి ప్రమాదం జరిగిందని బంధువులు అంటున్నారు. మహిళా కూలీ దుర్మరణం మరో ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం -
రంజాన్స్పెషల్..హరీరా
●ఐదు దశాబ్దాలుగా.. చింతలపూడి హరీరా ఐదు దశాబ్దాలుగా ఈ ప్రాంత ముస్లింలను అలరిస్తోంది. రంజాన్ వచ్చిందంటే నెలరోజుల పాటు హరీరాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆరోగ్య పరంగా కూడ హరీరా మంచి ఆహారం. ఉపవాస దీక్షలో తప్పనిసరిగా ముస్లింలు హరీరా సేవించి దీక్షను విరమిస్తారు. రుచికరంగా ఉండటమే కాక పగలంతా ఉపవాసాలు ఉన్న వారికి శక్తిని ఇచ్చే ఔషధంగా పని చేస్తుంది. – సయ్యద్ రహీం(బాబు), జామియా మసీదు కమిటీ అధ్యక్షుడు రంజాన్ నెలలో స్పెషల్ ప్రతీ సంవత్సరం రంజాన్ నెలలో 30 రోజులపాటు ఉపవాసాలు ఉండి హరీరా సేవించడం ఆరోగ్యానికి మంచిది. రోజంతా ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరులు భగవంతుని కృప కోసం ఇఫ్తార్ సమయంలో హరీరా సేవిస్తారు. – ఎండీ జిలాని, జామియా మసీదు కమిటీ కార్యదర్శి చింతలపూడి: ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఆచరించే ఇస్లాం మార్గదర్శకాల్లో రంజాన్ ఉపవాసాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. రంజాన్ నెలలో 30 రోజుల పాటు కఠోర ఉపవాసాలు ఆచరించడంతో పాటు ఐదు పూటలా ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. నెలవంక దర్శనంతో మరుసటి రోజు నుంచి ప్రారంభమయ్యే రోజా (ఉపవాసాలు) షవ్వాల్ నెలవంక దర్శనంతో ముగుస్తాయి. ప్రతి ముస్లిం నమాజుతో పాటు తప్పని సరిగా ఉపవాసాలు పాటించాలని ఇస్లాం సూచిస్తోంది. తెల్లవారుజాముకు ముందు నుంచే ఉపవాస దీక్ష (సహర్) ప్రారంభమవుతుంది. సూర్యాస్తమయం సమయం (ఇఫ్తార్) వరకు పాటిస్తారు. పగటి సమయమంతా అన్నపానీయాలు, ఆహార పదార్థాలు తీసుకోరు. సాయంత్రం ఇఫ్తార్‌తో దీక్ష విరమిస్తారు. పగలంతా ఉపవాసం పాటించిన దీక్షాపరులు సాయంత్రం నిర్ణీత వేళలో పండ్లు, ఫలహారాలతో దీక్ష విరమిస్తారు. ఈ సందర్భంగా ఇఫ్తార్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. చింతలపూడి ప్రాంతంలో 67 ఏళ్ల క్రితం అప్పటి జమాతే ఇస్లామీ హింద్ నాయకులు బషార్తుల్లా హరీరా తయారు చేయడం ప్రారంభించారు. దూరప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ హరీరా సేవిస్తారు. ఇప్పటికీ రంజాన్ నెలలో హరీరా తయారు చేసి ముస్లిం సోదరులకు అందిస్తారు. పోషకాలకు నెలవు ఉపవాస దీక్ష విరమణలో వినియోగించే హరీరా(గంజి)కి ఈ ప్రాంతంలో ఎంతో విశిష్టత ఉంది. గత 67 ఏళ్ళుగా చింతలపూడి హరీరాకు ప్రత్యేక స్థానం ఉంది. రోజంతా ఉపవాసం ఉన్న వాళ్ళు ఈ హరీరా తాగితే తిరిగి శక్తిని పొందవచ్చు. ఇందులో ఉపయోగించే పదార్థాలన్నిటిలో పోషకాలు ఎక్కువగా ఉండటం విశేషం. తక్షణమే శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇందులో ఉండే పీచు పదార్థం కారణంగా పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఇందులో ఉపయోగించే మసాలా దినుసులు, డ్రై ఫ్రూట్స్ అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడే వారికి ఉపశమనం కలిగిస్తాయి. హరీరా తయారు చేయడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. కట్టెల పొయ్యి మీద తయారు చేయడంతో దీని రుచి అద్భుతంగా ఉంటుంది. తయారీ విధానం తయారీలో బియ్యం రవ్వ, మటన్ కీమా, నూనె, డాల్డా, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, టమాటా, లవంగాలు, దాల్చిన చెక్క, పెసరపప్పు, కారం వంటి వస్తువులతో చేస్తారు. హలీంకు ఏమాత్రం తీసిపోకుండా రుచికరంగా ఉంటుంది. హరీరా (గంజి) బలవర్ధకమైన పానీయం. దీన్ని తాగితే ఉపవాస దీక్షా పరులకు బలం చేకూరడమే కాక, ఆరోగ్యవంతంగా కూడ ఉంటారని ఇక్కడి ముస్లింలు చెబుతారు. అందుకే ముస్లింలే కాకుండ హిందూ సోదరులు కూడ ఈ హరీరాను సేవించడానికి వస్తుంటారు. 67 ఏళ్ల నుంచి చింతలపూడి ప్రాంతంలో ప్రసిద్ధి హరీరా సేవించి ఉపవాస దీక్ష విరమణ -
శ్రీవారి క్షేత్రంలో పూల సోయగం
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రానికి వెళ్లే మార్గం పూల సోయగం. రంగులు అద్దినట్టు పూస్తున్న కాగితం పూలతో రహదారి మద్యలోని డివైడర్ భక్తులకు, ప్రయాణికులకు కనువిందు చేస్తోంది. ద్వారకాతిరుమల నుంచి లక్ష్మీపురం వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర, రహదారి మధ్య డివైడర్‌లో శ్రీవారి దేవస్థానం ఈ పూల మొక్కలు వేసి, సంరక్షిస్తోంది. సిబ్బంది నిత్యం మొక్కలను సమాంతరంగా కట్ చేసి, నీరు పెడుతున్నారు. వాటి పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. డివైడర్ కొంత దూరం తెలుపు పూలు, మరి కొంత దూరం ఎరుపు, గులాబీ రంగు పూలతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. భీమడోలు వైపు నుంచి వచ్చే భక్తులకు ఈ పూల మొక్కలు కనిపించగానే క్షేత్రానికి వచ్చామన్న అనుభూతి కలుగుతోంది. -
కొల్లేరు సరిహద్దుల పరిశీలన
కై కలూరు/ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొల్లేరు అభయారణ్యం సరిహద్దులను అటవీ శాఖ రాష్ట్ర దళాధిపతి, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఏకే నాయక్, రాజమండ్రి సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బీఎన్ఎన్ మూర్తి ఆదివారం పరిశీలించారు. జిల్లా అటవీశాఖ అధికారి బి.విజయ ఆధ్వర్యంలో ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రు, కలకుర్రు, మాధవాపురం, ప్రత్తికోళ్లలంక పరిసర గ్రామాలు, మండవల్లి మండలం పులపర్రు కొల్లేరు గ్రామాల్లో ప్లస్ 5 కాంటూరు సరిహద్దులను పరిశీలించారు. కొల్లేరు అభ్యయారణ్యం సరిహద్దులపై పూర్తిస్థాయి నివేదికను త్వరలో సుప్రీంకోర్టుకు అందిస్తామన్నారు. అభయారణ్యం ఆక్రమణలకు గురికాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సరిహద్దుల గుర్తింపు దిమ్మల ఏర్పాటుకు కొంత సమయం కావాలని కోర్టును అభ్యర్థిస్తామని చెప్పారు. టెరిటోరియల్ డీఎఫ్ఓ శుభమ్, ఏలూరు రేంజర్ కేపీ రామలింగాచార్యులు, అటవీ శాఖ సిబ్బంది వారి వెంట ఉన్నారు. -
ట్రిపుల్ఐటీ.. టెక్‌జైట్‌కు రెడీ
నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు ట్రిపుల్‌ఐటీలో సోమవారం నుంచి 12 వరకు మూడు రోజుల పాటు జాతీయస్థాయి టెక్నికల్ ఫెస్ట్ ‘టెక్‌జైట్–25’ను నిర్వహించనున్నారు. ముఖ్య అతిథులుగా ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.మధుమూర్తి, ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ ఆచార్య ఎం. విజయ్‌కుమార్, నూజివీడు ట్రిపుల్ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ హాజరుకానున్నారు. ఫెస్ట్‌ను క్యాంపస్‌లోని స్టూడెంట్ డెవలప్మెంట్ క్యాంపస్ యాక్టివిటీ సెల్ (ఎస్డీసీఏసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. టెక్‌జైట్‌లో ట్రిపుల్ఐటీకి చెందిన 8 వేల మందితో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే 2 వేల మంది మొత్తంగా 10 వేల మంది వరకు విద్యార్థులు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. గతంలో నిర్వహించిన టెక్ఫెస్ట్లకు భిన్నంగా నూతన పంథాలో నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సాంకేతిక ఉత్సవంగా ఇది నిలవనుంది. సాంకేతిక, పరిశోధన సామర్థ్యాల మెరుగుదల విద్యార్థుల్లో సాంకేతిక, సృజనాత్మకత పెరగడమే కాకుండా పరిశోధన సామర్థ్యాలు మెరుగుపడేలా టెక్‌ఫెస్ట్‌ను నిర్వహిస్తున్నారు. కోడింగ్ సవాళ్లు, రోబోటిక్స్ పోటీలు, సర్క్యూట్ డిజైనింగ్, హ్యాకథాన్ల వరకు వివిధ సాంకేతిక పోటీల్లో విద్యార్థులు పాల్గొంటారు. అలాగే పలు రంగాల్లో విశేష అనుభవం కలిగిన వారితో, విజయాలను సాధించిన నిష్ణాతులతో ఇప్పటికే వర్క్‌షాపులను నిర్వహించారు. ట్రిపుల్‌ఐటీలోనే చదువుకుని వివిధ రంగాలలో ఉన్నత స్థాయిలో ఉన్న పూర్వ విద్యార్థులతో కూడా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు పోటీలు ఇంజినీరింగ్ విద్యార్థులకు పలు రకాల పోటీలను ఏర్పాటుచేశారు. మెగా ఎక్స్పో, హ్యాక్‌థాన్, వర్క్‌షాప్స్, ఈవెంట్స్, రోబోవార్స్ వంటి పోటీలు నిర్వహించనున్నారు. విద్యార్థుల విజ్ఞానాన్ని, వ్యక్తిత్వం, సమగ్రత, నాయకత్వ లక్షణాలను పెంచడానికి క్విజ్ పోటీలు, ఐపీఎల్ ఆక్షన్, ఫ్రీఫైర్, ఐఏఎస్ పోటీలు టెక్‌జైట్‌లో మరింత ఆకర్షణగా నిలవనున్నాయి. సాంకేతిక రంగంలో వస్తున్న తాజా పురోగతులు, కెరీర్ మార్గదర్శకత్వం, వివిధ రంగాల్లో వస్తున్న నూతన ధోరణులతో సహా పలు రకాల అంశాలు టెక్‌జైట్‌లో ఉన్నాయి. మెటావర్స్ థీమ్‌తో.. మెటావర్స్ థీమ్‌తో టెక్జైట్ను నిర్వహిస్తున్నారు. ‘నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి పాతదైపోతున్న నేటి ఆధునిక యుగంలో రాబోయే రోజులన్నీ ఈ మెటావర్స్‌దే’ అన్న ఉద్దేశంతో దీనిని థీమ్‌గా తీసుకున్నారు. విద్యార్థుల్లో ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలటీ (వీఆర్) గురించి మరింత విజ్ఞానాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ థీమ్‌ను ఎంపిక చేశారు. నేటి నుంచి సాంకేతిక సంబరం మూడు రోజులపాటు నిర్వహణ సుమారు 10 వేల మంది సందర్శన హ్యాకథాన్ పోటీలు టెక్‌జైట్–25లో భాగంగా నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఆదివారం హ్యాకథాన్ పోటీలను డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ ప్రారంభించారు. ఏఐ హ్యాకథాన్ పోటీల్లో 71 జట్లు, రోబోటిక్ హ్యాకథాన్ పోటీల్లో 10 జట్లు పాల్గొంటున్నాయి. ఏఐ హ్యాకథాన్‌లో ఉత్తమ పరిష్కారం కనుగొన్న రెండు జట్లకు రూ.10 వేల చొప్పున, రోబోటిక్ హ్యాకథాన్‌లో ఉత్తమ పరిష్కారం కనుగొన్న జట్టుకు రూ.10 వేల నగదు బహుమతి అందిస్తామని డైరెక్టర్ తెలిపారు. హ్యాకథాన్ పోటీలు సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతాయన్నారు. అనంతరం ఫలితాలను ప్రకటిస్తామని ఏఓ బి.లక్ష్మణరావు తెలిపారు. డీన్ అకడమిక్స్, టెక్‌జైట్–25 కన్వీనర్ చిరంజీవి పాల్గొన్నారు. -
కొల్లేరులో కొలువైన కొంగు బంగారం పెద్దింట్లమ్మ
కొల్లేటికి మహాపట్టమహిషి పెద్దింట్లమ్మ జాతర ద్వీపకల్పమైన కొల్లేరు సరస్సు మధ్యన అంగరంగ వైభవంగా జరుగుతోంది. రాష్ట్రంలో అత్యంత పురాతన చరిత్ర కలిగిన దేవాలయాల్లో ఏలూరు జిల్లా, కైకలూరు మండలం కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఒకటి. ప్రతి ఏటా ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకూ జాతర జరుగుతుంది. ఈ ఏడాది మార్చి 1 నుంచి 13 వరకు అమ్మవారి జాతర (తీర్థం) నిర్వహిస్తున్నారు. జాతరలో అత్యంత కీలకఘట్టమైన జలదుర్గా గోకర్ణేశ్వరుల కల్యాణం మార్చి 10, ఆదివారం రాత్రి జరిగింది.కొల్లేరు సరస్సు మధ్యలో కోట దిబ్బపై పెద్దింట్లమ్మతల్లి 9అడుగుల ఎత్తులో, విశాల నేత్రాలతో వీరాసన భంగిమలో భక్తులకు దర్శనమిస్తారు. కాలాలతో పాటు కోటలు మాయమైనప్పటికీ పెద్దింట్లమ్మ తల్లి విగ్రహం చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. సామాన్యంగా ఒక గ్రామానికి ఒక దేవత ఉంటుంది. కానీ పెద్దింట్లమ్మ ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో 44 కొల్లేరు దిబ్బలపై నివసించే వారందరికీ కులదైవంగా ఆరాధింపబడటం విశేషం.గ్రంథాల్లో కొల్లేరు అందాలు..రామాయణం అరణ్యకాండలో అగస్త్య మహాముని శ్రీరాముడికి ఈ సరస్సు గురించి చెప్పినట్లు ఉంది. అదేవిధంగా దండి అనే మహాకవి తన దశకుమార చరిత్రలో కొల్లేరు సరస్సును అభివర్ణించాడు. చరిత్రలో కొల్లేటికోట, కొల్లేరు సరస్సుప్రాంతాన్ని కొల్లేటికోట, కొల్లివీటికోట, కర్ణపురి, కొల్హాపురి, కృష్ణా, గోదావరి సంగమదేవ పుష్కరిణీ, సృష్ట్యారంభ పద్మ సరస్సు, దేవపుష్కరిణి, బ్రహ్మ సరస్సు, అరజా సరోవరం, బ్రహ్మండ సరస్సు, కోలాహలపురం, కొల్లేరు, కొలనువీడు అని వ్యవహరించేవారు. కొల్లేరుకు తెలంగాణ బోనాల సాంప్రదాయం..తెలంగాణలో ఉజ్జయిని మహంకాళి, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, మారెమ్మలకు జూలై నెలలో బోనాలు సమర్పిస్తారు. అదేవిధంగా 2020 నుంచి కొల్లేటికోట పెద్దింట్లమ్మకు బోనాలు సమర్పిస్తోన్నారు. అమ్మవారి దేవస్థానానికి 2 కిలోమీటర్ల దూరంలోని పందిరిపల్లిగూడెం నుంచి ప్రభల ఊరేగింపుతో పాటు బోనాలు ప్రతీ ఏటా తీసుకొస్తున్నారు. రాత్రి సమయంలో దీపాల మధ్య బోనాలు, 7 కావిళ్ళలో అమ్మవారి పుట్టింటి నైవేద్యం పసుపు, కుంకుమ, నెయ్యి, వేప రొట్టలు, నిమ్మకాయలు, పానకం, కల్లుతో పెద్దింట్లమ్మ దేవస్థానం తీసుకు రానున్నారు. 3 మైళ్ళ దూరంలోని గోకర్ణేశ్వరపురంలో గోకర్ణేశ్వరస్వామిని ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారితో అంగరంగ వైభవంగా ఆదివారం కల్యాణం జరిపించారు. ఆ సమయంలో కొల్లేరు పెద్ద జనారణ్యంగా మారిపోయింది. జాతర పదమూడు రోజులని పేరే కానీ ఫాల్గుణ మాసం నెలరోజులూ ప్రతి ఆదివారం కొల్లేరు భక్తజన సంద్రంగా మారిపోతుంటుంది. చుట్టుపక్కల గ్రామాలనుంచి, జిల్లాల నుంచి భక్తులు విరివిగా విచ్చేసి అమ్మవారిని, స్వామివారినీ దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. – బి.శ్యామ్, సాక్షి, కైకలూరు, కృష్ణా జిల్లా -
విదేశీ కోకో దిగుమతులు ఆపాలి
పెదవేగి : విదేశీ కోకో గింజల దిగుమతులు వెంటనే నిలుపుదల చేయాలని, రైతులు వద్ద ఉన్న కోకో గింజలు వెంటనే కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం పెదవేగి మండలం విజయరాయి, గాంధీనగర్ షిరిడి సాయి కల్యాణ మండపంలో కోకో రైతుల ప్రాంతీయ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో కె.శ్రీనివాస్ మాట్లాడుతూ విదేశాల నుంచి కోకో గింజలు దిగుమతి చేసుకున్నామని, రైతులు వద్ద నుంచి తగినంతగా కోకో గింజలు కొనుగోలు చేయలేమని కొన్ని కంపెనీలు రైతులను బెదిరించడం తగదన్నారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇవ్వకుండా కంపెనీలు రైతులను మోసగిస్తూ ఇబ్బందులు గురి చేయడం అన్యాయమని విమర్శించారు. కిలో కోకోకు రూ.900 ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 6న జరిగిన కోకో రైతుల చలో ఏలూరు కార్యక్రమం సందర్భంగా కోకో రైతుల సమస్యలను కలెక్టర్‌కు వివరించామని చెప్పారు. ఈ నెల 10న ఉద్యాన శాఖ కమిషనర్ దృష్టికి సమస్య తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఉద్యాన శాఖ కమిషనర్ కార్యాలయం వద్దకు కోకో రైతులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కోకో రైతుల సంఘం నాయకులు బొల్లు రామకృష్ణ, ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘం ఉపాధ్యక్షుడు మున్నంగి సుబ్బారెడ్డి, కోనేరు సతీష్, గుడిబండి రమేష్ రెడ్డి, ఎ.అనిల్ కుమార్, కె.రామిరెడ్డి, కె.గోపాలరెడ్డి పాల్గొన్నారు. -
పాపికొండల్లో వన్యప్రాణుల సందడి
స్వేచ్ఛగా తిరుగుతున్న వన్య ప్రాణులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో 2020 నాటికి పోలవరం మండలం పరిధిలోని 19 నిర్వాసిత గ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు. ప్రస్తుతం ఆయా గ్రామాలు ఖాళీగా ఉండటంతో పాటు వ్యవసాయ భూముల్లో పశుగ్రాసం విపరీతంగా పెరిగింది. ఆ గ్రామాల పక్కన గోదావరి నది ఉండడంతో వన్యప్రాణుల సంచారం పెరిగింది. కొండ గొర్రెలు, నెమళ్లు, చిరుత పులులు, దుప్పులు, తదితర జంతువులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇటీవల వైల్డ్‌లైఫ్ అధికారులు కొరుటూరు సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో పలు జంతువులు చిక్కాయి. వాటి సంరక్షణకు కూడా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అటువైపు వచ్చే పర్యాటకులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ట్రాప్ కెమెరాకు చిక్కిన చిరుత బుట్టాయగూడెం: జీవ వైవిద్యానికి నిలయం పాపికొండల అభయారణ్యం. ఈ అభయారణ్యం పులులు, చిరుతలు, జింకలు, అడవి దున్నలతో కళకళలాడుతోంది. ఇటీవల కాలంలో అడవి జంతువుల సంఖ్య పెరగడం శుభపరిణామమని అటవీ అధికారులు చెబుతున్నారు. ఇటీవల వైల్డ్‌లైఫ్ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో అనేక జంతువులు స్వేచ్ఛగా తిరుగుతూ కెమెరాకు చిక్కాయి. వాటి సంరక్షణకు వైల్డ్‌లైఫ్, ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 1.12 లక్షల హెక్టార్లలో అభయారణ్యం 1,12,500 హెక్టార్లలో పాపికొండల అభయారణ్యం విస్తరించి ఉంది. పశ్చిమ ఏజెన్సీప్రాంతంలో పాపికొండల అభయారణ్యం పరిధిలో ఉన్న బుట్టాయగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని అటవీప్రాంతంలో వన్య ప్రాణుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. వైల్డ్‌లైఫ్ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జంతువుల కదలికలు గుర్తిస్తున్నారు. జంతువుల సంరక్షణ కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పాపికొండల అభయారణ్యంలో ఎలుగుబంట్లు, కొండ గొర్రెలు, జింకలు, కొండచిలువలు, అడవి పందులు, అడవి దున్నలు, ఆగలి, గెద్దలు, నెమళ్లు, చిరుతలు, కురుడు పందులు, చుక్కల దుప్పులు, సాంబాలు, ముళ్ల పందులు, నక్కలు, ముంగిసలు, అడవి దున్నలు వంటివి ఉన్నాయి. మూడేళ్ల క్రితం జంతు గణన 2018లో పాపికొండల అభయారణ్యంలో వైల్డ్ లైఫ్ అధికారులు జంతుగణన నిర్వహించి జంతువుల కదలికలను గుర్తించారు. 2022 జనవరిలో జంతుగణన కార్యక్రమాన్ని చేపట్టారు. పాపికొండల అభయారణ్యంలోని సుమారు 116 ప్రాంతాల్లో 232 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి సర్వే నిర్వహించారు. ఈ సర్వేల్లో ఏనుగులు, సింహాలు తప్ప అన్ని రకాల జంతువులు, పక్షులు, ఉభయచర జీవులను గుర్తించారు. జంతువుల సంరక్షణపై బేస్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి వైల్డ్ లైఫ్ అధికారులు ప్రత్యేక గస్తీ నిర్వహించడంతోపాటు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాట్లు చేశారు. పులి, చిరుతలు, జింకలు, దుప్పుల సంచారం పెరిగిన నెమళ్లు, అడవి పందుల సంఖ్య వేసవిలో దాహార్తి తీర్చేలా ఏర్పాట్లు -
వారసులకు పరిహారం పరిహాసమేనా?
కుక్కునూరు: పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చి న్యాయం చేయాల్సిన ప్రభుత్వం చట్ట ప్రకారం వచ్చే వాటిని కూడా రాకుండా చేయడం ఎంతవరకు న్యాయమని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ఆర్ అండ్ ఆర్ పరిహారం కోసం 2017లో నిర్వాసిత గ్రామాల్లో సర్వే నిర్వహించిన ప్రభుత్వం కుటుంబ వివరాలతో పాటు అన్ని ఆధారాలను తీసుకోని ఆర్ అండ్ ఆర్ పరిహారం చెల్లించేందుకు అర్హుల జాబితాను తయారు చేసింది. అర్హుల జాబితాను తయారు చేసిన వెంటనే పరిహారం చెల్లించకుండా 7 సంవత్సరాల తరువాత గత జనవరిలో ఆర్ అండ్ ఆర్ పరిహారాన్ని నిర్వాసితుల ఖాతాల్లో జమచేసింది. ఈ మధ్య కాలంలో కరోనా వైరస్ వంటి పెను విపత్తులతో దేశవ్యాప్తంగా చాలా మంది మృతి చెందారు. విలీన మండలాల్లో కూడా పలువురు అనేక కారణాలతో మృతి చెందారు. మృతి చెందిన వారికి మంజూరైన పరిహారాన్ని వారి కుటుంబసభ్యులకు ఇవ్వాల్సింది పోయి ఆ పరిహారాన్ని రీస్టోర్ టు గవర్నమెంట్ అంటూ ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు చూడడంపై నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క 2013 భూసేకరణ చట్టం ప్రకారం కుటుంబంలో అర్హులైన నిర్వాసితుడికి మంజూరైన పరిహారాన్ని అతడు మృతి చెందితే వారి వారసులకు ఇవ్వొచ్చని పలు రాజకీయ పార్టీల నాయకులు చెబుతుండగా.. ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా రీస్టోర్ టు గవర్నమెంట్ అని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అదే ప్రభుత్వం పరిహారాన్ని వెంటనే ఇచ్చుంటే నిర్వాసితులకు న్యాయం జరిగుండేదని ప్రభుత్వం చేసిన తప్పుకు నిర్వాసితులు బలి కావాలా అని పలువురు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మృతి చెందిన వారి పరిహారాన్ని వారసులకిచ్చి నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కోర్టు ఆర్డర్‌ను పట్టించుకోవడం లేదు మా నాన్న సర్వే అనంతరం అర్హుల జాబితా ప్రకటించిన తరువాత మృతి చెందాడు. మృతి చెందిన వారికి పరిహారం ఇవ్వమని చెప్పడంతో మా నాన్న పరిహారాన్ని వారసురాలైన మా చెల్లికి ఇవ్వాలని కోరుతూ కోర్టుకు వెళ్లి కోర్టు ఆర్డర్ తీసుకొచ్చాను. అయినా అధికారులు కనీసం కోర్టు ఆర్డర్ కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. ఘంటసాల చంద్రం, నిర్వాసితుడు, కుక్కునూరు పరిహారాన్ని ఎగ్గొట్టే ప్రయత్నం ఓ వ్యక్తి మృతి చెందితే అతనికి రావాల్సినవి వారసులకు ఇవ్వాలని చట్టం చెబుతోంది. అసైన్మెంట్ ల్యాండ్‌కు సంబంధించిన యజమాని మృతి చెందితే తదనంతరం అతని వారసులకు చెందుతుంది. నిర్వాసితుడు మృతి చెందాడని అతని పరిహారం గవర్నమెంట్‌కు రీస్టోర్ చేయడం పరిహారాన్ని ఎగ్గొట్టేందుకు చేసే యత్నంలో భాగమే. ఎ.రవి, సీపీఎం జిల్లా కార్యదర్శి, ఏలూరు -
చినవెంకన్న క్షేత్రంలో పోటెత్తిన భక్తులు
ద్వారకాతిరుమల : చినవెంకన్న దివ్య క్షేత్రం శనివారం భక్తులతో పోటెత్తింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు సందడిగా మారాయి. ఎటుచూసినా భక్తులతో కళకళలాడాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాల తదితర విభాగాలు భక్తులతో రద్దీగా మారాయి. ఉచిత అన్నప్రసాదం కోసం వకుళమాత నిత్యాన్నదాన భవనం వద్ద భక్తులు బారులు తీరారు. పార్కింగ్ ప్రదేశాలు భక్తుల వాహనాలతో నిండిపోయాయి. శ్రీహరి కళాతోరణం ప్రాంతంలో పలువురు బాలలు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. సాయంకాలార్చన సమయంలో మార్పు శ్రీవారి ఆలయంలో ఈ నెల 14 నుంచి స్వామివారి సాయంకాలార్చన సమయాన్ని మార్పు చేస్తున్నట్టు ఆలయ ఈఓ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు నిర్వహిస్తున్నారని.. ఈ నెల 14 నుంచి సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహిస్తారని ఈఓ తెలిపారు. అర్చన జరిగే సమయంలో స్వామి దర్శనం ఉండదని, అర్చన ముగిసన తరువాత రాత్రి 7 గంటల నుంచి తిరిగి శ్రీవారి దర్శన భాగ్యం భక్తులకు కలుగుతుందన్నారు. -
కౌలు రైతులకు చట్టం తేవాలి
చింతలపూడి : సమగ్ర కౌలు రైతుల చట్టం తేవాలని కోరుతూ మార్చి 17న కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య పిలుపునిచ్చారు. మండలంలోని సమ్మటివారిగూడెంలో శనివారం కౌలు రైతుల సంఘం సమావేశం సంకు సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జమలయ్య మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం కౌలు రైతుల రక్షణ కోసం నూతన కౌలు రైతు చట్టం తెస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తవుతున్నా ఇంతవరకు చట్టం ఆచరణలోకి తీసుకు రాలేకపోయారని విమర్శించారు. రైతు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునే పరిస్థితి లేదని, కౌలు రైతులకు నూతన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల సంక్షేమానికి బడ్జెట్ సమావేశాలు ముగిసే లోపు నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంత కృష్ణ మాట్లాడుతూ వేసవిలో చెరువులలో కాలువలలో ఉన్న గురప్రు డెక్కను తొలగించి సమగ్ర పూడిక పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కౌలు రైతులు సంకు వెంకటనారాయణ, వినుకొండ శ్రీను, వనమాల శాంతారావు, రైతు సంఘం నాయకులు తాడిగడప మాణిక్యాలరావు, తక్కలపాటి ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. -
13 గంటల్లోనే తల్లిదండ్రుల చెంతకు బాలిక
భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం పట్టణంలో మైనర్ బాలిక అదృశ్యం కేసును టూటౌన్ పోలీసులు 13 గంటల్లో ఛేదించారు. టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ జయసూర్య శనివారం వివరాలు వెల్లడించారు. భీమవరం 36 వార్డు సత్యవతి నగర్‌కు చెందిన మజ్జి శ్రీను దంపతుల కుమార్తె ఈ నెల 6న మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి ఇంటికి రాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని కేసును ఛేదించారు. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ నుంచి బాలిక అదృశ్యం అయినట్లు గుర్తించారు. రైల్వే పోలీసుల సహకారంతో బాలిక విజయవాడ వెళ్లినట్లుగా గుర్తించి అక్కడ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. బాలిక ఫొటోలు పంపించగా నిర్ధారణ చేసుకుని విజయవాడ హోంలో బాలికను ఉంచారు. ఆ తర్వాత బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. తల్లిదండ్రులు కోప్పడడంతో వెళ్లిపోయినట్లు విచారణలో తెలిందన్నారు. రూ.5 లక్షల యానాం మద్యం స్వాధీనం తణుకు అర్బన్: ఇతర రాష్ట్రాల మద్యం స్థానికంగా సరఫరా చేస్తున్న పాత నేరస్తుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 43.1 లీటర్ల మద్యం సీసాలు, కారును తణుకు ఎకై ్సజ్ శాఖ అధికారులు స్వాఽధీనం చేసుకున్నారు. ఇరగవరం మండలం కంతేరు గ్రామానికి చెందిన కొవ్వూరి వెంకట శ్రీనివాసరెడ్డి కదలికలపై నిఘా పెట్టిన అధికారులు శనివారం కంతేరులో కారులో ఉన్న యానాం మద్యం 209 సీసాలు, 10 టిన్ బీరులు స్వాధీనం చేసుకుని అతనిని అరెస్టుచేశారు. తణుకు ఎకై ్సజ్ స్టేషన్లో శనివారం జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి ఆర్ఎస్ కుమరేశ్వరన్ వివరాలు వెల్లడిస్తూ... ముద్దాయి యానాం, గోవా ప్రాంతాల నుంచి మద్యం సీసాలను తీసుకొచ్చి స్థానికంగా డోర్ డెలివరీ చేసేవాడని చెప్పారు. గతంలో తాడేపల్లిగూడెం, భీమడోలు, దేవరపల్లి కేసుల్లో పరారీలో ఉన్నాడని తెలిపారు. సహ నిందితుడిగా కోనాల వెంకట సత్యనారాయణరెడ్డి అలియాస్ భరత్‌రెడ్డి, చిన్ని అనే వ్యక్తితోపాటు యానాంలో మద్యం సరఫరా చేస్తున్న బాదర్ల ప్రేమ్‌కుమార్‌ను గుర్తించామని త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామని చెప్పారు. స్వాధీనం చేసుకున్న మద్యం ధర సుమారుగా రూ. 5 లక్షలు ఉంటుందని చెప్పారు. -
గురువుల్లో గుబులు
బదిలీలపై స్పష్టత ఇవ్వాలి ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఉపాధ్యాయుల నుంచి అందిన సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుని వాటికి అనుగుణంగా నిబంధనలు మార్చాలి. విద్యాశాఖ అధికారులు వెబ్సైట్లో ఉంచిన సీనియార్టీ జాబితా తప్పుల తడకగా ఉంది. వెంటనే దానిని సరి చేసి పారదర్శకమైన జాబితాను ప్రకటించాలి. బదిలీల చట్టం ఎప్పటికప్పుడు సవరించేలా ఉండాలి. జీఓ 117ను రద్దు చేసి తీసుకురానున్న కొత్త జీఓలో పబ్లిక్, టీచర్ నిష్పత్తిని సవరించాలి. – గెడ్డం సుధీర్, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హక్కులను కాలరాసేలా.. బదిలీల చట్టంలో ఉపాధ్యాయుల హక్కులను కాలరాసేలా ఉన్న 12,14 సెక్షన్లను వెంటనే రద్దు చేయాలి. బదిలీల నుంచి 70 శాతం డిజేబిలిటీ ఉన్న ఆర్థోపెడికల్లీ చాలెంజ్డ్ ఉపాధ్యాయులకు కూడా మినహాయింపు ఇవ్వాలి. ఉపాధ్యాయులు మొదటగా 3, 4 కేటగిరీల పాఠశాలలను మాత్రమే కోరుకోవాలి అనే సెక్షన్‌ను తొలగించాలి. సీనియార్టీ జాబితాలో ముందు వరుసలో ఉన్నవారికి ముందుగా 1, 2 కేటగిరీలు కోరుకునే అవకాశం కల్పించాలి. – మద్దుకూరి ఆదినారాయణ, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు చేపడతామని కూటమి ప్రభుత్వం తెలపడంతో ఆయా వర్గాల్లో హడావుడి మొదలైంది. ఈ మేరకు ప్రభుత్వం ముసాయిదా బిల్లు విడుదల చేసి ఈనెల 7వరకు సలహాలు, సూచనలను కోరింది. ఉపాధ్యాయుల అభ్యర్థనల మేరకు అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి గాని ప్రభుత్వం బదిలీలపై ఓ కొలిక్కి వచ్చే అవకాశం లేదు. ఇదిలా ఉండగా అప్పుడే బదిలీల ప్రక్రియ పూర్తిచేసినట్టు కూటమి ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. దీంతో త్వరలో చేపట్టనున్న బదిలీల్లో తమకు ఏ మేరకు న్యాయం జరుగుతుందో అనే చర్చ ఉపాధ్యాయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉపాధ్యాయులకు ఈసారి బదిలీల్లో స్థాన చలనం తప్పదు. విడుదల కాని జీఓ : మే నెలాఖరులోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటికీ జీఓ విడుదల కాలేదు. మే నెలాఖరులోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయడం కష్టసాధ్యమని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చేపట్టే బదిలీల కౌన్సెలింగ్ విద్యాశాఖాధికారులకు కత్తిమీద సాములాంటిది. ఇదిలా ఉండగా జిల్లా విద్యాశాఖాధికారులు ఇటీవల సీనియార్టీ జాబితాను విడుదల చేసి ఈనెల 9లోపు అభ్యంతరాలు తెలియజేయాలని కోరారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యాలయానికి వందల సంఖ్యలో అభ్యంతరాలు వచ్చినట్టు తెలుస్తోంది. 11,391 మంది ఉపాధ్యాయులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 11,391 మంది స్కూల్ అసిస్టెంట్లు, సెకండ్ గ్రేడ్ టీచర్లు, హెచ్ఎంలు పనిచేస్తున్నారు. గతంలో జరిగిన పని సర్దుబాటులో కొందరు మిగులు ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే అసలు జిల్లాలో ఖాళీ పోస్టులు ఎన్ని, మిగులు ఉపాధ్యాయ పోస్టులు ఎన్ని వంటి వివరాలు తెలియకుండా బదిలీల ప్రక్రియ ఎలా చేపడతారని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పష్టత రావడానికి కాస్త సమయం పడుతుందని, ఇవన్నీ తేలే వరకూ బదిలీలకు అవకాశం ఉండదంటున్నారు. హైస్కూల్ ప్లస్‌లు రద్దు : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన హైస్కూల్ ప్లస్‌లను రద్దు చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హైస్కూల్ ప్లస్‌లలో సుమారు 1,450 మంది ఉపాధ్యాయులు పీజీటీలుగా పనిచేస్తున్నారు. ప్రస్తుత సర్కారు వీటిని రద్దు చేయడంతో పీజీటీలను ఏం చేస్తారనే దానిపై స్పష్టత లేదు. వారికి బదిలీల్లో స్థానం కల్పిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ‘ప్రాథమికోన్నత’ పరిస్థితి ఏంటో ? కూటమి ప్రభుత్వ విధానంలో భాగంగా ప్రాథమికోన్నత పాఠశాలలు మూతపడనున్నాయి. దీంతో ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ల పరిస్థితిపై గందరగోళం నెలకొంది. వారిని బేసిక్ ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులుగా నియమించే అవకాశం ఉందని జిల్లా విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే ఉమ్మడి జిల్లాలో సుమారు 400 మంది స్కూల్ అసిస్టెంట్లు మిగులు ఉపాధ్యాయులుగా మారతారు. వారిలో కొత్త విధానంలో ఏర్పడే సుమారు 300 మంది మోడల్ ప్రైమరీ పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులుగా నియామకాలు పొ ందినా మరో 100 మంది దాకా మిగిలిపోతారు. వారి పోస్టింగ్‌లపైనా స్పష్టత రావాల్సి ఉంది. బదిలీలపై గందరగోళం ప్రహసనంలా బదిలీల ప్రకటన ఇప్పటికీ విడుదల కాని జీఓ ఖాళీలు, మిగులు లెక్క తేలలేదు యూపీలో పనిచేసే ఎస్ఏల సంగతేంటో? 1,450 మంది పీజీటీల భవిష్యత్ ప్రశ్నార్థకం -
ఆస్పత్రిలో శిశువు మరణంపై వీడిన మిస్టరీ
కై కలూరు: కై కలూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) బాత్రూంలో ఆడ శిశువు మరణంపై మిస్టరీ శనివారం వీడింది. మృత శిశువును వదలి శుక్రవారం రాత్రి పరారైన బాలిక (17)ను పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. కై కలూరు మండలం రాచపట్నం గ్రామానికి చెందిన బాలికను లారీ డ్రైవర్ (33)గా పనిచేస్తున్న స్వయానా మేనమామ గర్భవతిని చేసినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఈ విషయం ఎవరికై నా చెబితే చంపేస్తానని బెదిరించడం వల్ల బాత్రూంలో బిడ్డను ప్రసవించిన తర్వాత భయంతో బయటకు వచ్చానని పోలీసుల ఎదుట సదరు బాలిక చెప్పినట్టు తెలిసింది. ప్రస్తుతం బాలికకు కై కలూరు సీహెచ్‌సీలో చికిత్స అందిస్తున్నారు. బాలిక నర్సింగ్ కోర్సు చేసింది. ఆమె తండ్రి 15 ఏళ్ల క్రితం మరణించాడు. తల్లి పనులకు వెళుతూ ఒక్కగానొక్క బిడ్డను పెంచుతోంది. ఈ క్రమంలోనే మేనమామ ఆమైపె లైంగిక దాడి చేసినట్టు తెలుస్తోంది. అతను పోలీసులు అదుపులో ఉన్నట్టు సమాచారం. ఏలూరు డీఎస్పీ ఆదేశాలతో కై కలూరు పట్టణ సీఐ పి.కృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. వైద్యాధికారుల విచారణ ఆడ మృత శిశువు మరణంపై కలెక్టర్ ఆదేశాలతో డీసీహెచ్ఎస్ పాల్ సతీష్‌కుమార్ కై కలూరు సీహెచ్‌సీలో శనివారం విచారణ చేపట్టారు. రాత్రి విధుల్లో ఉన్న సిబ్బందిని ఒక్కొక్కరిని విచారించారు. ఇంత ఘటన జరిగినా ఆస్పత్రి సూపరింటెండెంట్ అల్లాడి శ్రీనివాసరావు రాకపోవడంపై మీడియా సభ్యులు ప్రశ్నిస్తే అక్కడ సిబ్బంది సెలవులో ఉన్నారని సమాధానం చెప్పారు. ప్రత్యేక అధికారితో పూర్తిస్థాయి విచారణ చేయించి ఉన్నతాధికారులకు శిశువు మరణంపై నివేదిక అందిస్తామని డీసీహెచ్ఎస్ చెప్పారు. రాచపట్నానికి చెందిన బాలికగా గుర్తింపు జిల్లా వైద్యాధికారుల విచారణ -
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో మహిళల ఆర్థికాభివృద్ధి, భద్రతకు ప్రాధాన్యమిస్తున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. స్థానిక సీఆర్‌రెడ్డి డిగ్రీ కాలేజీ ఆడిటోరియంలో శనివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల భద్రతకు 181 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటుచేశామన్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ మాట్లాడుతూ మహిళల అక్రమ రవాణా నిరోధానికి పార్లమెంట్లో ప్రత్యేక బిల్లు ప్రవేశపెడుతున్నారన్నారు. కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో మహిళా సాధికారతకు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ షేక్ నూర్జహాన్ తదితరులు మాట్లాడారు. జేసీ పి.ధాత్రిరెడ్డి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పలు పథకాలు, కార్యక్రమాల కింద మహిళలకు రూ.131.82 కోట్ల రుణాల చెక్కులను మంత్రి మనోహర్ చేతులమీదుగా అందజేశారు. పోలీస్ డార్మిటరీ నిర్మాణానికి శంకుస్థాపన ఏలూరు టౌన్: ఏలూరు ఫైర్‌స్టేషన్ సమీపంలో మహిళా పోలీసుల డార్మిటరీ నిర్మాణానికి ఎంపీ నిధులు రూ.64.80 లక్షలతో నిర్మించనున్న భవనానికి మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని డార్మిటరీ నిర్మించడం అభినందనీయమని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ అన్నారు. జిల్లా ఎస్పీ శివకిషోర్ పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి మనోహర్ -
మద్యం దుకాణంపై మండిపాటు
ఆగిరిపల్లి: జనావాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే సహించేది లేదని మహిళలు హెచ్చరించారు. ఆగిరిపల్లిలోని జంక్షన్ రోడ్డులో మడుపల్లి కాంప్లెక్స్ ఎదురుగా జనావాసాల మధ్య షాపు ఏర్పాటుకు రంగం సిద్ధం చేయగా ఉదయం స్థానికులు, మహిళలు ఆందోళన చేపట్టారు. ఓ పక్క ప్రభుత్వ పాఠశాల, మరోపక్క శోభనాచలస్వామి కల్యాణ మండపం, చుట్టూ నివాసాలు ఉన్నా పట్టించుకోరా అంటూ మండిపడ్డారు. స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో నిర్వాహకులు షాపును రాత్రికి శోభనాచల స్వామి ఆలయం ఎదురుగా ఉన్న రోడ్డులోని మార్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మద్యం సీసాల కేసులను షాపులో సిబ్బంది సర్దుతుండగా అక్కడి మహిళలూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో భారీగా వాహనాలు స్తంభించాయి. ఏఎస్సై నాయక్ ఆందోళనకారులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. ఇదే విషయమై ఎకై ్సజ్ సీఐ మస్తానయ్యతో ఫోన్లో మాట్లాడగా దుకాణంలోని మద్యం సీసాలను వ్యాపారి ఒక్కరాత్రికి ఇక్కడ ఉంచి ఆదివారం ఉదయం వేరేచోటుకు తీసుకువెళతారని చెప్పారు. -
లోక్ అదాలత్‌తో సత్వర పరిష్కారం
ఏలూరు (టూటౌన్): కేసుల సత్వర పరిష్కారానికి కక్షిదారులు లోక్ అదాలత్ సేవలు వినియోగించుకోవాలని హైకోర్టు జడ్జి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథ రావు అన్నారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయసేవా సదన్‌లో శనివారం జాతీయ లోక్ అదాలత్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్‌పై కక్షిదారుల ఆలోచనా విధానంలో మార్పులు రావాలని, ఒకసారి పరిష్కారమైన కేసులను మరలా హైకోర్టులో ఫైల్ చేస్తున్నారన్నారు. లోక్ అదాలత్‌లపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా కోర్టుల్లో శాశ్వత లోక్‌అదాలత్‌లు నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం లోక్ అదాలత్‌లో పరిష్కారమైన కేసులో బీమా సంస్థ నుంచి రూ.26 లక్షల పరిహారం చె క్కును జస్టిస్ మన్మధరావు కక్షిదారులకు అందించా రు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి (ఎఫ్ఏసీ) ఎం.సునీల్‌కుమార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్, రెండో అదనపు జిల్లా జడ్జి పి.మంగాకుమారి, పోక్సో స్పెషల్ జడ్జి ఎస్.ఉమా సునంద, ఐదో అదనపు జిల్లా జడ్జి జి.రాజేశ్వరి, 7వ అదనపు జిల్లా జడ్జి ఎం.రామకృష్ణంరాజు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కేకేవీ బులికృష్ణ తదితరులు పాల్గొన్నారు. 5,368 కేసుల రాజీ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జరిగిన లోక్ అదాలత్‌లో 5,368 కేసులు రాజీ చేసినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ తెలిపారు. 155 సివిల్, 132 వాహన ప్రమాద బీమా, 4,919 క్రిమినల్, 132 ఫ్రీ లిటిగేషన్ కేసులు ఉన్నాయన్నారు. -
మహిళా జడ్జిలకు సత్కారం
ఏలూరు (టూటౌన్): మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని హైకోర్టు జడ్జి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మఽథరావు అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవాసదన్ లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు తల్లిగా, భార్యగా కుటుంబ అభివృద్ధికి సమర్థవంతంగా కృషి చేస్తున్నారన్నారు. రెండో అదనపు జిల్లా జడ్జి పి.మంగకుమారి, ఐదో అదనపు జిల్లా జడ్జి జి.రాజేశ్వరి, పోక్సో స్పెషల్ కోర్టు జడ్జి ఉమా సునంద, ఏలూరు రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి.రచన, పాలకొల్లు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి లక్ష్మీ లావణ్యకు పూలమొక్కలు అందించి, శాలువాలతో సత్కరించారు. ఇంటర్ పరీక్షలకు 16,025 మంది హాజరు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు శనివారం నిర్వహించిన గణితం–1బీ, జువాలజీ–1, హిస్టరీ–1 పరీక్షలకు జిల్లా లో 16,025 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తంగా 55 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. 14,407 మంది జనరల్ విద్యార్థులకు 13,847 మంది, 2,590 మంది ఒకేషనల్ విద్యార్థులకు 2,178 మంది హాజరయ్యారు. 94 శాతం హాజరు నమోదైంది. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ తెలిపారు. -
సమాజాభివృద్ధిలో మహిళలు కీలకం
ఏలూరు టౌన్: సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమనీ పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో రాణిస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి అన్నారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అధ్యక్షతన శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా సావిత్రీబాయి పూలే, మదర్ థెరిస్సా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నర్సింగ్ సూపరింటెండెంట్ శాంతకుమారి, నగర కో–ఆప్షన్ సభ్యురాలు తాయారును సత్కరించారు. కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అ నంతరం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్నిరంగాల్లో మహిళలకు 50 శాతం కోటా కేటాయించినట్టు గుర్తుచేశారు. మహిళా అ ధ్యక్షురాలు సరితారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దిశ యాప్, దిశ పోలీస్స్టేషన్లు, పోక్సో కేసులతో మహిళల భద్రత పెద్దపీట వేశారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం మహిళల భద్రత, రక్షణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నగర మ హిళా అధ్యక్షురాలు, కార్పొరేటర్ జిజ్జువరపు విజయనిర్మల మాట్లాడుతూ మహిళల సాధికారతకు మాజీ సీఎం జగన్ చేసిన కృషి మరువలేమన్నారు. ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్, చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు, రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, జంగారెడ్డిగూ డెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, ఏలూ రు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు నెరుసు చిరంజీవులు, జిల్లా విద్యా ర్థి విభాగం అధ్యక్షుడు పాతినవలస రాజేష్, జిల్లా అధికార ప్రతినిధి ఇంజేటి నీలిమ, జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి, జెడ్పీటీసీలు నిట్టా లీ లా నవకాంతం, ఈడే వెంకటేశ్వరమ్మ, రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ కోమటి విష్ణువర్ధన్, రాష్ట్ర మ హి ళా కార్యదర్శి గంటా సంధ్యారాణి, ఎంపీపీ తాతా రమ్మ, చింతలపూడి అసెంబ్లీ మహిళా అధ్యక్షురాలు చండీ ప్రియ, కై కలూరు అసెంబ్లీ మహిళా అ ధ్యక్షురాలు బేబీ స్వరూపరాణి, బాలత్రిపుర సుందరి, న గర బీసీ సెల్ అధ్యక్షులు కిలాడి దుర్గారావు, మాజీ డిప్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్‌బాబు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్ పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నేతలకు రాష్ట్ర పదవులు
ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు జిల్లాకు చెందిన పలువురు నాయకులకు రాష్ట్ర ప దవులు కేటాయించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఏలూరుకు చెందిన భాస్కర్ల ఆర్ఎన్ శంకర్ (బాచీ) ను రాష్ట్ర వాణిజ్య విభాగం సెక్రటరీగా నియమించారు. అలాగే రామిశెట్టి సత్యనారాయణను వాణిజ్య విభాగ కార్యదర్శిగా, లంకలపల్లి వెంకట గణేష్‌ను రాష్ట్ర మేధావుల ఫోరంజాయింట్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరు నియోజకవర్గంలో పార్టీ కోసం క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న నాయకులకు పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పదవుల కేటాయింపులో ప్రాధాన్యమిచ్చారు. నీటి కష్టాలకు చెక్ తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెంలో తాగునీటి సమస్యపై ‘ప్రజల నీటి కష్టాలు!’ శీర్షికన శని వారం ‘సాక్షి’లో ప్ర చురించిన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. కుళాయిలు వస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా ఉండటంతో మోటార్ల ద్వారా కొందరు అక్రమంగా నీటిని తోడుతున్నారని, దీంతో పలు ప్రాంతాలకు కుళాయి నీరు రావడం లేదని మహిళలు ఆందోళన చెందుతున్నారు. ‘సాక్షి’ కథనంపై స్పందించిన మున్సిపల్ కమిషనర్, విద్యుత్ శాఖ అధికారులు కుళాయిలు వచ్చే సమయంలో ఉదయం, సాయంత్రం అరగంట సేపు విద్యుత్ సరఫరా నిలిపివేసేలా చర్యలు తీసుకున్నారు. దీంతో మూడు రోజులుగా తాగునీటి సమస్య ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో కుళాయిల ద్వారా నీరందింది. ‘వైద్యసేవ’ ఉద్యోగుల విధుల బహిష్కరణ భీమవరం(ప్రకాశం చౌక్): డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10, 17, 24 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా విధులు బహిష్కరిస్తున్నామని ఏపీ వైద్య సేవ ఎంప్లాయీస్ జేఏసీ సంఘ నాయకులు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని బీమా పరిధిలోకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తోందని, ఆప్కాస్ రద్దు దిశగా ఇప్పటికే అడుగులేసిందన్నారు. ఈ పరిణామాలతో రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు. విధుల బహిష్క రణతో పాటు జిల్లా సమన్వయకర్త అధికారి కా ర్యాలయం వద్ద నిరసన తెలుపుతామన్నారు. సమస్యలపై సైకిల్ యాత్ర భీమవరం(ప్రకాశం చౌక్): పేదల ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాల సమస్యల పరిష్కరించాలని, టిడ్కో కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని జిల్లాలోని 20 మండలాలు, ఆరు పట్టణాల్లో సైకిల్ యాత్ర చేపట్టినట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ తెలిపారు. భీమవరం టిడ్కో ఇళ్ల వద్ద గోపాలన్ ఆధ్వర్యంలో 15 మంది నాయకులతో చేపట్టిన యాత్రను రాష్ట్ర కమి టీ సభ్యుడు బి.బలరాం ప్రారంభించారు. బల రామ్ మాట్లాడుతూ యాత్ర 17 వరకు సాగుతుందని, పేదల ఇళ్ల సమస్యలు, కాలనీల్లో సౌకర్యాలను తెలుసుకుంటామన్నారు. కూట మి ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళల విద్యతోనే దేశాభివృద్ధి భీమవరం(ప్రకాశం చౌక్): మహిళలు చదువుకుంటేనే దేశాభివృద్ధి సాధ్యమని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. భీమవరం అంకాల ఆర్ట్ అకాడమీలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు కోడే విజయమ్మ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ మహిళా దినోత్సవానికి శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుందని, కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్నారు. ఎక్కడ సీ్త్రలను పూజిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని అన్నారు. జిల్లా అధ్యక్షురాలు విజయమ్మ మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పిస్తే అన్ని రంగాల్లో మరింత రాణిస్తారన్నారు. మనదేశంలో మహిళలకు ఉన్న గౌరవం ప్రపంచంలో ఏ దేశంలో లేదన్నారు. అనంతరం ఐదుగురు మహిళలను సత్కరించారు. పార్టీ నేతలు కోడే యుగంధర్, కామన నాగేశ్వరరావు, గాదిరాజు రామరాజు, ఏఎస్ రాజు, చిగురుపాటి సందీప్, విప్పర్తి సత్యవేణి, చవ్వాకుల సత్యనారాయణ, బొమ్మిడి శాంతి తదితరులు పాల్గొన్నారు. -
సూపర్ సిక్స్‌ను తుంగలో తొక్కిన కూటమి
వీరవాసరం: సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభు త్వం తుంగలో తొక్కిందని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ తీవ్రంగా ఆక్షేపించారు. నవుడూరు జంక్షన్లో శని వారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తప్పుడు అ ప్పుల ప్రచారంతో చంద్రబాబు గద్దెనెక్కారని విమర్శించారు. ఇప్పుడు శాసనసభలో ఆర్థిక మంత్రి గత ప్రభుత్వం చేసిన అప్పుల చిట్టాను విప్పడంతో ప్రజలందరికీ చంద్రబాబు చేసిన గోబెల్స్ ప్రచారం అర్థమైందన్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ అధికారం అందుకున్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, వీటిని ఎలా ఎగ్గొట్టాలనే ఆలోచన చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన పార్టీ ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే అని గుర్తు చేశారు. మాజీ సీఎం జగన్ అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించారన్నారు. గవర్నర్ ప్రసంగంలో సైతం ప్రజలను మభ్యపెట్టి ఆలోచన చేయడం దారుణమని దుయ్య బట్టారు. సంపద పెంచే మంత్రదండం ఏమీ లేదని చంద్రబాబు ప్రజలను మరోసారి తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. -
పరుగుల జ్యోతి
తణుకు అర్బన్: తణుకుకు చెందిన దండి జ్యోతికశ్రీ ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించి కీర్తి చాటింది. ఒలింపిక్స్ పోటీల్లో పరుగు విభాగంలో ఆమె పరుగెత్తిన రోజు దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో ప్రముఖంగా నిలిచింది. తణుకుకు చెందిన అతి సామాన్యుడైన శ్రీనివాసరావు కుమార్తె జ్యోతిక శ్రీ చిన్ననాటి నుంచి తండ్రి సహకారంతో స్థానిక చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో వేసిన అడుగులు ఆమె ను ప్యారిస్ ఒలింపిక్స్‌కు చేర్చాయి. పరుగులో ఆటంకాలు, కష్టనష్టాలు, ఒడిదుడుకులు ఎదురైనా అలుపెరుగని దీక్షతో ముందుకు సాగుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది జ్యోతికశ్రీ. శ్రమ, పట్టుదలతో ఏస్థాయికి అయినా చేరవచ్చనడానికి నిదర్శనంగా నిలుస్తోంది ఈ తణుకు అమ్మాయి. -
యశ్వంత్ మృతిపై సమగ్ర విచారణ జరపాలి
ఏలూరు (టూటౌన్): ఏలూరులోని తంగెళ్లమూడిలో రెల్లి బాలుడు బంగారు యశ్వంత్‌కుమార్‌ను మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు కాళ్లకు, చేతులకు సంకెళ్లు వేసి చిత్రహింసలకు గురి చేయడంతోనే మృతిచెందాడని, ఇది ముమ్మాటికీ పోలీసులు చేసిన హత్య అని దీనిపై సమగ్ర విచారణ జరపాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. శుక్రవారం యశ్వంత్ తల్లి, కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. పోలీసుల లాఠీ దెబ్బలకు చనిపోయిన తర్వాత బాలుడిని కాలువలో పడేసి కట్టుకథలు అల్లుతున్నారన్నారు. హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితులపై దాడులు, హత్యలు జరుగుతుంటే హాం మంత్రికి పట్టదా అని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్లో చిత్రహింసల ఆరోపణలపై నిజాలు నిగ్గుతేల్చాలన్నారు. ఏలూరు జిల్లా కార్యదర్శి అందెగుల ఫ్రాన్సిస్, నాయకులు మంచెల్ల ఇస్సాక్ తదితరులు ఉన్నారు. -
విద్యతో రాణించాలి
ప్రతి ఒక్క మహిళకూ వారి అమ్మే రోల్‌మోడల్. అలాగే నాకు మా అమ్మ లత ఇచ్చిన ప్రోత్సాహం మరువలేను. అమ్మ 8వ తరగతి వరకూ చదువుకున్నా నన్ను చదివించడంలో కీలక పాత్ర పోషించారు. కలెక్టర్ కావాలనే నా కోరికను నెరవేర్చుకోవడంలో ప్రధాన భూమిక పోషించారు. ప్రస్తుత సమాజంలో ప్రతి మహిళా విద్య, ఆర్థిక వనరులను ఆయుధాలుగా మార్చుకోవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో మహిళలందరికీ శుభాకాంక్షలు. – కె.వెట్రిసెల్వి, కలెక్టర్, ఏలూరు సీ్త్ర వ్యక్తి కాదు శక్తి మహిళ కేవలం వ్యక్తి మాత్రమే కాదు. శక్తిగా అవతరిస్తూ నేడు అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంటున్నారు. నన్ను కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి విధి నిర్వహణలో ప్రోత్సహిస్తుంటే.. మా అమ్మ కనకదుర్గ బాధ్యత మరువలేనిది. ఆమె ఇప్పటికీ నాకు అన్నివిధాలా తోడుగా ఉంటూ మనోధైర్యాన్ని నింపుతున్నారు. మా అమ్మే నా రోల్‌మోడల్. డాక్టర్‌గా సేవలందించాలనుకున్నా, అయితే రైతులకు సేవలు అందించడం ఆనందంగా ఉంది. – వి.శ్రీలక్ష్మి, జిల్లా పౌరసరఫరాల మేనేజర్, ఏలూరు చాలెంజ్‌గా తీసుకోవాలి మహిళలు సవాళ్లను చాలెంజ్‌గా తీసుకోవాలి. జిల్లాస్థాయి ఉద్యోగంలో చేరేంత వరకూ ఎంతో నేర్చుకున్నాను. ఇప్పటికీ నేర్చుకుంటున్నాను. తల్లిదండ్రుల సహకారం, భర్త ప్రో త్సాహంతో బాధ్యతలు నిర్వహిస్తున్నాను. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల సహకారంతో జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖను ముందుకు తీసుకు వెళుతున్నాను. మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు – పి.శారద, మహిళా శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్, ఏలూరు ● -
గిరిజన మహిళ.. ఉపాధి భళా
బుట్టాయగూడెం: చిరుధాన్యాలను ఆదాయ వనరుగా మార్చుకుని స్వయం ఉపాధి పొందుతూ భళా అనిపిస్తున్నారు గిరిజన మహిళలు. కేఆర్ పురం ఐటీడీఏ సహకారంతో పౌష్టికాహార బిస్కెట్లు, పౌడర్లు తయారు చేస్తూ ఆదాయం పొందుతున్నారు. ఓ కుగ్రామంలో ప్రారంభించిన వీరి వ్యాపారం ఇప్పుడు ఢిల్లీ వరకూ చేరింది. బుట్టాయగూడెం మండలం రాజానగరం, బండార్లగూడెంకు చెందిన గిరిజన మహిళలు 30 మంది 2016లో ఆహార ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేక శిక్షణ పొంది ఐటీడీఏ కార్యాలయం వద్దే 12 రకాల చిరుధాన్యాలతో మల్టీగ్రెయిన్ బిస్కెట్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేసుకుని ఉత్పత్తులు తయారీ చేసి విక్రయిస్తున్నారు. అమెజాన్ వంటి సంస్థల ద్వారా ఉత్పత్తులను అమ్ముతున్నారు. ఇటీవల టాటా కంపెనీ ఏర్పాటు చేసిన సమావేశం కోసం వీరికి ఆర్డర్ వచ్చింది. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ వీరి ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. వీరి ఉత్ప త్తులకు ఆదరణ బాగుండటంతో ఆదాయం కూడా పెరిగింది. -
బుర్రకథ.. శ్రీదేవి ఘనత
తాడేపల్లిగూడెం: ఏడేళ్ల వయసులోనే తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన కళారూపంలో ఆమె ఖ్యాతి గడించారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాది ప్రదర్శనలతో ప్రశంసలు అందుకుంటున్నారు తాడేపల్లిగూడేనికి చెందిన బుర్రకథ కళాకారిణి యడవల్లి శ్రీదేవి. బుర్రకథ కళాకారుడు పద్మశ్రీ మిరియాల అప్పారావు కళావారసురాలిగా చిరుప్రాయంలోనే బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చారు. ఆరోహణ, అవరోహణ రాగాలను అవలీలగా ఆకళింపు చేసుకుని బుర్రకథను రక్తికట్టించడంలో ప్రేక్షకుల మన్ననలు పొందారు. 1992లో ఆకాశవాణిలో తొలిసారిగా బాలవిహార్ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు కథను చెప్పారు. అప్పటినుంచి ఆమె ప్రస్తానం అప్రతిహతంగా సాగుతోంది. రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతగా నిలిచారు. ఉగాది పురస్కారం, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వారి మహిళా సాధికారత అవార్డు, రాష్ట్రస్థాయిలో ఉత్తమ కళాకారిణి అవార్డులు అందుకున్నారు. 2023లో హుబ్లీలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన యూత్ ఫెస్టివల్లో తన ప్రదర్శనతో మెప్పించి పురస్కారం అందుకున్నారు. రాష్ట్రంతో పాటు మలేషియా, కువైట్, సింగపూర్, దుబాయ్ దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి భళా అనిపించుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భగా శ్రీశ్రీ కళావేదిక తరపున నారీరత్న అవార్డును అందుకోనున్నారు. -
ఉత్సాహంగా 2కే మారథాన్
ఏలూరు (టూటౌన్): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఏలూరులో 2కే మారథాన్ ఉత్సాహంగా జరిగింది. ముందుగా కలెక్టర్ కె.వెట్రిసెల్వి జెండా ఊపి ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు స్టేడియం నుంచి పాత బస్టాండ్ వరకు మారథాన్ నిర్వహించగా జిల్లా అధికారులు, ఉద్యోగులు, మహిళలు, బాలికలు, క్రీడా కారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా దినోత్సవంలో భాగంగా వారం రోజులుగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. శనివారం సీఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించనున్నామన్నారు. హక్కులు, సమానత్వం, మహిళా సాధికారతపై చైతన్యమే లక్ష్యమన్నారు. సమాజంలోని ప్రతిఒక్కరూ మహిళా అభివృద్ధికి సహకరించాలని, ఆడపిల్లలకు చదువు ఎంతో ముఖ్యమన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల విజయాలు గుర్తించి వారిని సత్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. జేసీ పి.ధాత్రిరెడ్డి, డీఎస్పీ శ్రావణకుమార్, విద్యుత్ ఎస్ఈ పి. సాల్మన్‌రాజు, సెట్వెల్ సీఈఓ ప్రభాకరరావు, ఐసీడీఎస్ పీడీ పి.శారద, డీసీపీఓ సూర్యచక్రవేణి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజరు వి.శ్రీలక్ష్మి, డీఈఓ వెంకటలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్సీకి ఉచిత శిక్షణ
ఏలూరు (టూటౌన్): డీఎస్సీ–2025 పరీక్షలకు టెట్‌లో అర్హత సాధించిన బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఆన్లైన్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని, ఈనెల 10 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు జిల్లా బీసీ సంక్షేమం, సాధికారత అధికారి ఆర్వీ నాగరాణి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు విద్యార్హత, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, రెండు పాస్‌పోర్టు ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను పోస్టు ద్వారా లేదా నేరుగా ఏలూరులోని బీసీ సంక్షేమ అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్ 86861 80018లో సంప్రదించాలని కోరారు. -
ముమ్మరంగా వేట
నరసాపురం: నరసాపురం తీరం పొడవునా సముద్రంలో వేట ముమ్మరంగా సాగుతోంది. పలు జిల్లాలకు చెందిన మెకనైజ్డ్ బోట్లు వేట సాగిస్తున్నాయి. మచిలీపట్నం, కాకినాడ, నెల్లూరు, విశాఖ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 70 వరకు బోట్లు ఇక్కడ నడుస్తున్నాయి. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం, వేటకు అనుకూలంగా ఉండటం, చేపలు దొరికే సీజన్ కూడా కావడంతో మత్స్యకారులు బిజీగా ఉన్నారు. గతేడాది వేట కష్టనష్టాలతో సాగింది. వరుస విపత్తులు గంగపుత్రులను ఇబ్బంది పెట్టాయి. రాష్ట్రంలో గద్దెనెక్కిన కూటమి సర్కారు మత్స్యకారులను ఆదుకునేలా చర్యలు తీసుకోకపోవడం మరింత కుంగదీసింది. భరోసా లేక.. వేసవిలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకునేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మత్స్యకార భరోసా పథకాన్ని అమలు చేసింది. 2019–23 మధ్య ఐదేళ్లలో ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున రూ.7.87 కోట్ల సాయం అందించింది. అయితే గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు మత్స్యకార భరోసా కింద రూ.20 వేలు అందిస్తామని ప్రకటించినా అమలు చేయలేదు. గతేడాది సాయానికి ఎగనామం పెట్టడం, జూన్ నుంచి నవంబర్ వరకు విపత్తులతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వచ్చే నెల నుంచి నిషేధం : చేపల పునరుత్పత్తి సీజన్ కావడంతో ఏటా ఏప్రిల్ 14 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధం అమలులోకి వస్తుంది. వేట నిషేధ గడువు దగ్గర పడటం, ప్రస్తుతం అనుకూల వాతావరణం ఉండటంతో సముద్రంలో వేట జోరుగా సాగుతోంది. రూ.200 కోట్ల మత్స్య సంపద ఎగుమతి నరసాపురం తీరంలో గత జూన్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకూ దాదాపు రూ.200 కోట్ల మత్స్యసంపద ఎగుమతులు జరిగినట్టు అంచనా. 2023–24లో రూ.300 కోట్ల వరకు ఎగుమతులు జరగ్గా.. ఈ ఏడాది రూ.100 కోట్ల మేర తగ్గాయి. వేట నిషేధం గడువు ఎత్తేసిన తర్వాత జూన్ నుంచి మత్స్యకారులు మరలా సముద్రంలో వేట ముమ్మరంగా సాగిస్తారు. గత జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో తుపానులు ఇబ్బంది పెట్టాయి. మరలా జనవరి నుంచి చేపలు పెద్ద సంఖ్యలో పడటంతో ఆశించిన ఆదాయం వస్తోందని మత్స్యకారులు అంటున్నారు. మత్స్యకారులు బిజీబిజీ ఈ ఏడాది వరుస విపత్తులతో సతమతం కూటమి సహకారం కరువు వచ్చేనెల 14 నుంచి వేట నిషేధం వారంలోనే ఒడ్డుకు.. సముద్రంలో ముమ్మరంగా వేట సాగుతోంది. సముద్రంలోకి వెళ్లిన బోటు వారం లోపునే సరుకుతో ఒడ్డుకు చేరుతోంది. బోటు యజమానులు పడిన సరుకును బట్టి మాకు డబ్బులు ఇస్తారు. దీంతో ఆనందంగా ఉంది. ఇప్పుడే నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి. వచ్చేనెల నుంచి వేట నిషేధం అమలవుతోంది. – తిరుమాని గంగరాజు, బోటు కార్మికుడు తుపాన్లతో ఇబ్బంది కూటమి సర్కార్ తాము అధికారంలోకి వస్తే మత్స్యకార భరోసా రూ.20 వేలు పెంచి ఇస్తామన్నారు. ఈ ఏడాది ఒక్కపైసా కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారు. రెండేళ్లకు కలిపి మత్స్యకారులకు రూ.40 వేలు ఇవ్వాలి. ఈ ఏడాది తుపాన్లు, అల్పపీడనాలతో వేట సవ్యంగా సాగలేదు. ఏడాదంతా అప్పులు చేసి ఈడ్చుకొచ్చాం. – బర్రి శంకరం, మత్స్యకార నేత -
హౌస్ కీపింగ్ పోస్టులకు సీల్డు టెండర్ల ఆహ్వానం
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి యూనిట్‌లోని కోర్టు కాంప్లెక్స్‌ల హౌస్ కీపింగ్ సర్వీస్ (క్లీనింగ్) కోసం వార్షిక నిర్వహణ కాంట్రాక్టును రెండేళ్ల కాలానికి ఇవ్వడానికి సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా ప్రధాన న్యా యమూర్తి (ఎఫ్ఏసీ) ఎం. సునీల్‌కుమార్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఏలూరులోని కోర్టు కాంప్లెక్స్‌లకు ఇద్దరు సూపర్వైజర్లు, 54 మంది హౌస్‌మెన్ /హౌస్‌మెయిడ్‌లు అవసరమని, వీరిలో నలుగురికి ప్లంబింగ్, వడ్రంగి, విద్యుత్ పనుల్లో పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. టెండర్ దరఖాస్తులను ఈనెల 17న సాయంత్రం 5 గంటలలోపు పంపాలని పేర్కొన్నారు. -
క్రికెట్లో మెలకువలు నేర్పుతూ..
ఏలూరు రూరల్: ఒకప్పుడు గల్లీ క్రికెట్ ఆడిన యువతి.. నేడు ఆంధ్ర క్రికెట్ మహిళా జట్టుకు కోచ్ అయ్యారు. గ్రామీణ బాలికలను క్రికెటర్లుగా తీర్చిదిద్దుతూ క్రికెట్‌కు సేవలందిస్తున్నారు భీమవరం మండలం రాయలం గ్రామానికి చెందిన సంపాద రమాదేవి. జిల్లా బాలికల క్రికెట్ జట్టు విజయాల్లో ప్రధాన భూమికి పోషిస్తున్నారు. ఆమె వద్ద శిక్షణ పొందిన బాలికలు జిల్లా, జోన్, రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపడంతో పాటు రాష్ట్ర జట్టులో సైతం చోటు సంపాదించారు. 2017లో అండర్–19 ఆల్ ఇండియా చాంపియన్‌షిప్ పోటీల్లో ఆంధ్ర జట్టును విజయపథంలో నడపటంలో కీలకంగా వ్యవహరించారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్ర మహిళల టీ–20 జట్టు కోచ్‌గా నియమితులమైన ఆమె ఏసీఏ లెవెల్–1 ఏగ్రేడ్, ఎన్సీఏ లెవెన్–1లో పాల్గొన్నారు. -
అపరాల కొనుగోలుకు చర్యలు
ఏలూరు(మెట్రో): జిల్లాలో ప్రభుత్వ మ ద్దతు ధరలతో మిను ము, పెసల అపరాల కొనుగోలును ప్రారంభిస్తున్నట్టు జేసీ పి.ధాత్రిరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక జేసీ చాంబర్లో ఆమె సమీక్షించారు. క్వింటాకు పెసలు రూ.8,682, మిను ము రూ.7,400లకు కొనుగోలు చేయాలన్నా రు. పెదపాడు, ఏలూరు, దెందులూరు, ముదినేపల్లి, మండవల్లి, కై కలూరు, కలిదిండి మండలాల్లో ఈ–పంట నమోదు చేసుకున్న రైతుల నుంచి వీటిని కొనుగోలు చేయాలన్నారు. ఇంటర్ పరీక్షలకు 400 మంది గైర్హాజరు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు శుక్రవారం నిర్వహించిన గణితం–2ఏ, బోటనీ–2, సివిక్స్–2 పరీక్షలకు జిల్లాలో 400 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలోని 55 కేంద్రాల్లో 14,616 మందికి 14,216 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 12,797 మంది జనరల్ విద్యార్థులకు 12,522 మంది, 1,819 మంది ఒకేషనల్ విద్యార్థులకు 1,694 మంది హాజరయ్యారని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ తెలిపారు. ఓపెన్ పరీక్షలకు.. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ఆధ్వర్యంలో దూర విద్యా విధానంలో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షలకు 689 మంది హాజరయ్యారు. రసాయన శాస్త్రం పరీక్షకు 309 మందికి 257 మంది, ఆర్థిక శాస్త్రం పరీక్షకు 480 మందికి 432 మంది హాజరయ్యారని డీఈఓ ఎం. వెంకట లక్ష్మమ్మ తెలిపారు. నేటి నుంచి పీ–4 సర్వే ఏలూరు(మెట్రో): జిల్లాలో శనివారం నుంచి చేపట్టనున్న పీ–4 సర్వేను విజయవంతం చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో పీ–4 సర్వే, ఎంఎస్ఎంఈ సర్వే, వర్క్ ఫ్రమ్ హోం సర్వేపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, మండల సచివాలయ ప్రతినిధులతో ఆమెసమావేశం నిర్వహించారు. పీ–4 సర్వే నిర్వహణపై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మా ట్లాడుతూ గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది ద్వారా ఈనెల 16 నాటికి సర్వే పూర్తిచేయాలని, ఈనెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలు నిర్వహించాలని అన్నారు. మహిళా దినోత్సవానికి ఆహ్వానం దెందులూరు: అమరావతిలో జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాలకు అంతర్జాతీయ స్కేటర్, ప్రధానమంత్రి బాల పురస్కార్ అవార్డు గ్రహీత ఎం.జెస్సీరాజ్‌కు ఆహ్వా నం అందింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల్లో 9 మందిని ఎంపిక చేయగా వారిలో జెస్సీరాజ్ ఒకరు. శనివారం జరిగే వేడుకలకు తాను హాజరవుతున్నట్టు జెస్సీరాజ్ తెలిపారు. టైలరింగ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం ఏలూరు (టూటౌన్): జిల్లాలో బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల్లోని 18 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ ఇచ్చి అనంతరం సర్టిఫికెట్తో కుట్టుమెషీన్ కూడా అందిస్తామని జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం కార్య నిర్వాహక సంచాలకులు ఎన్.పుష్పలత శుక్రవారం ప్రకటనలో తెలిపారు. అర్హులు సచివాలయాల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. శనివారం నుంచి దరఖాస్తుల నమోదుకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో 4,589 మందికి శిక్షణ ఇచ్చేలా నిర్దేశించారన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 08812–230837 నంబర్లో సంప్రదించాలని కోరారు. నేడు జాతీయ లోక్ అదాలత్ ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల్లో శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్నట్టు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి (ఎఫ్ఏసీ) ఎం.సునీల్‌కుమార్ ప్రకటనలో తెలిపారు. ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవాసదన్‌లో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, ముందుగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
ఆమే స్ఫూర్తి.. దీప్తి
రక్తదానాన్ని ప్రోత్సహిస్తూ.. సాక్షి, భీమవరం: రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా స్వచ్ఛంద రక్తదానంలో ప్రభుత్వ ఉద్యోగులను భాగస్వాముల్ని చేశారు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో శిబిరాల నిర్వహణకు ఆదేశాలిచ్చారు. ఏ నెలలో ఏఏ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు రక్తదానం చేయాలో తెలుపుతూ షెడ్యూల్‌ను విడుదల చేశారు. గత డిసెంబరులో మొదలైన శిబిరాల నిర్వహణ విజయవంతంగా సాగుతోంది. ఇప్పటివరకూ దాదాపు 500 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఓ నెగెటివ్, బీ నెగెటివ్, ఏబీ నెగెటివ్ తదితర అరుదైన గ్రూప్స్ రక్తం అందుబాటులో ఉందని జిల్లా రెడ్‌క్రాస్ సంస్థ చైర్మన్ డా.ఎం.శివరామభద్రిరాజు తెలిపారు. ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అందిస్తున్నామన్నారు. వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటుతూ.. ఏలూరు రూరల్: ఆమెకు పేదరికం సవాల్ విసిరింది. ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే సంకల్పాన్ని ఇచ్చింది. పట్టుదలతో సాధన ఖ్యాతి గడించాలని ఉసిగొల్పింది. ఫలితంగా రాష్ట్ర, జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పతకాలు సాధించిపెట్టింది. ఏలూరుకు చెందని మొగలి దీపానయోమీ పాఠశాల స్థాయి నుంచి వె యిట్ లిఫ్టింగ్‌లో సాధన చేస్తోంది. పేదరికపు అడ్డంకులను దాటి వెయిట్ లిఫ్టింగ్‌లో పట్టు సాధించింది. ఐదేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటింది. 2026లో జరిగే ఒలింపిక్స్ కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఉత్తమ క్రీడాకారుల క్యాంపునకు ఎంపికైంది. ఔరంగాబాద్‌లో నెలరోజుల పాటు శిక్షణ తీసుకుని గెలుపే లక్ష్యంగా సాధన చేస్తోంది. -
పోలీసుల కాళ్లు పట్టుకుని బతిమిలాడాను..
ఏలూరు : ‘బండి చోరీ కేసు అంటూ.. మూడు రోజుల క్రితం మా అబ్బాయిని పోలీసులు(Police) తీసుకువెళ్లారు.. నిన్న స్టేషన్‌కు వెళ్లాను.. ఒక్కసారైనా మా అబ్బాయి ముఖం చూపించండయ్యా అని పోలీసుల కాళ్లు పట్టుకుని బతిమిలాడాను.. ఏమీ లేదమ్మా.. రేపు ఇంటికి వచ్చేస్తాడు అన్నారు.. వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్, హనుమాన్ జంక్షన్ పోలీస్స్టేషన్లల్లో ఉన్నాడని తలో మాట చెప్పారు.. ఈరోజు చూస్తే జీజీహెచ్‌లో శవమై కనిపించాడు’ అంటూ బాలుడి తల్లి వనిత బోరున విలపించింది. పదో తరగతి విద్యార్థి(Tenth grade student) (16) ఒంటిపై, అరికాళ్లపై దెబ్బలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఏలూరులో తీవ్ర సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే.. ఏలూరులోని చేపలతూము ప్రాంతానికి చెందిన బంగారు శివ చింతలపూడిలోని విద్యాశాఖలో అ టెండర్‌గా పనిచేస్తున్నారు. శివ చిన్న కుమారుడు యశ్వంత్‌కుమార్ (16) ఏలూరులోని ప్రభుత్వ హై సూ్కల్లో పదో తరగతి చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం ఏలూరు సీసీఎస్ పోలీసులు బండి చోరీ కేసులో రికవరీల కోసమని యశ్వంత్‌తో పాటు మరో ఆరుగురు పిల్లలను తీసుకువెళ్లారు. అయితే వారిని సీసీఎస్ స్టేషన్లో కాకుండా వేరే ప్రాంతంలో ఉంచి విచారించారు. ఈ నేపథ్యంలో తన కుమారు డి కోసం యశ్వంత్ తల్లి వనిత రెండు రోజులుగా పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదు. ఈ క్రమంలో గురువారం వేకువజామున 5 గంటల సమయంలో పెదవేగి మండలం మొండూ రు ప్రాంతంలో గోదావరి కుడికాల్వ గట్టుపై య శ్వంత్ అపస్మారక స్థితిలో పడి ఉండగా.. గుర్తించి ఏలూరు జీజీహెచ్‌కు తరలించారు. అయితే బా లుడు అప్పటికే మృతి చెందడంతో మార్చురీలో పెట్టి కనీసం కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు సమాచారం ఇవ్వలేదు. మార్చురీ వద్ద ఆందోళన మార్చురీ సిబ్బంది ద్వారా యశ్వంత్ మృతి వార్త తెలిసిన తల్లిదండ్రులు శివ, వనిత, సోదరుడు కృష్ణవర్ధన్ బంధువులతో కలిసి జీజీహెచ్‌కు వచ్చారు. యశ్వంత్ మృతదేహాన్ని చూసి బోరున విలపించా రు. అరికాళ్ల నుంచి చాతీ వరకూ తీవ్ర గాయాలయ్యేలా నిర్దాక్షిణ్యంగా పోలీసులే కొట్టి చంపేసి, శవాన్ని ఎక్కడో పడేశారంటూ విలపించారు. తమ కుమారుడి మృతికి న్యాయం చేయాలంటూ మార్చురీ వద్ద బైఠాయించి దీనిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని ఆందోళనకు దిగారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చొదిమెళ్లలో జరిగిన బస్సు ప్రమాద బాధితులను పరామర్శించడానికి కలెక్టర్ వెట్రిసెల్వి జీజీహెచ్‌కు రాగా ఆమెను కలిసి యశ్వంత్ మృతిపై ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి విచారణకు ఆదేశించి న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. భిన్నంగా పెదవేగిలో ఫిర్యాదు ఇదిలా ఉండగా పెదవేగి పోలీస్‌స్టేషన్‌లో భిన్నంగా ఫిర్యాదు నమోదైంది. పోలీసులు, చోటా నేతల ఒత్తి ళ్లతో యశ్వంత్ సోదరుడు కృష్ణవర్ధన్‌తో పెదవేగి పో లీసులు ఫిర్యాదు తీసుకున్నారు. ఈనెల 5న తన సో దరుడు ఇంటి నుంచి బయటకు వెళ్లాడని, 6న మొండూరు కాల్వ గట్టుపై అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పెదవేగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడిని జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతిచెందాడని, మార్చురీకి తరలించి తమకు సమాచారం ఇచ్చారని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
జాతీయ లోక్‌అదాలత్‌కు విస్తృత ఏర్పాట్లు
ఏలూరు (టూటౌన్): ఈనెల 8వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌కు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి (ఎఫ్ఏసీ), ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.సునీల్ కుమార్ చెప్పారు. స్థానిక జిల్లా కోర్టు నందు గురువారం విలేకరులతో వారు మాట్లాడుతూ జాతీయ లోక్‌అదాలత్ నిర్వహణ కోసం జిల్లా కోర్ట్‌లో 6 బెంచ్‌లు ఏర్పాటు చేయగా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని కోర్ట్లలో కలిసి 26 బెంచ్‌లు ఏర్పాటుచేసి కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామన్నారు. జాతీయ లోక్‌అదాలత్‌లో పరిశీలన కోసం 4,453 కేసులను గుర్తించగా వీటిలో 1,815 క్రిమినల్, 2,341 సివిల్ కేసులు, 297 ఎంవీఓపీ కేసులు ఉన్నాయన్నారు. వీటిలో 3,875 కేసులకు సంబంధించి నోటీస్‌లు కూడా జారీ చేశామన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో 2,500 కేసుల పరిష్కారాన్ని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. వివిధ కారణాల వాళ్ల కోర్టుకు రాలేనివారి కోసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కక్షిదారుల నుంచి వివరాలు తీసుకుని, రాజీకి వారు సిద్ధపడితే కేసుల పరిష్కారం చేస్తామన్నారు. లోక్ అదాలత్‌లలో కేసుల పరిష్కార విధానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వివిధ శాఖల సిబ్బందితో 69 సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ మాట్లాడుతూ రాజీ కాదగిన కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకుని సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలన్నారు. జిల్లా కోర్ట్ ఆవరణలోని జిల్లా న్యాయ సేవాసదన్‌లో శాశ్వత లోక్ అదాలత్ ఏర్పాటు చేశామని, కోర్టుల పనిదినాల్లో కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం పాల్గొన్నారు. -
చంద్రబాబువి చవకబారు రాజకీయాలు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు జంగారెడ్డిగూడెం: వైఎస్సార్ సీపీ నేతలు, మద్దతుదారులకు ఎటువంటి పనులు చేయవద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చవకబారు రాజకీయాలకు నిదర్శనమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు అన్నారు. జంగారెడ్డిగూడెంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వైఎస్సార్ సీపీకి సుమారు 1.33 కోట్ల మంది మద్దతిచ్చారని, వారందరికీ సంక్షేమాన్ని ఆపేస్తారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్ వ్యవస్థ ద్వారా కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా సమానంగా సంక్షేమాన్ని అందించి ప్రజలందరి మెప్ప పొందారన్నారు. ప్రస్తుతం చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే రాష్ట్రం 30 నుంచి 40 ఏళ్లు వెనక్కి పోయేలా ఉందన్నారు. ఫ్యాక్షన్ రాజకీయం తీసుకువచ్చి కులాలు, పార్టీల మధ్య చిచ్చుపెట్టవద్దని హితవు పలికారు. సూపర్ సిక్స్‌ను అమలు చేసి ఎన్నికల సమయంలో కూటమి నాయకులు చెప్పిన మాటలను నిజం చేసి, వారి మనోభావాలు కాపాడాలని సూచించారు. తాము సూపర్‌సిక్స్ గురించి మాత్రమే మాట్లాడతామని, అంతకు మించి తమకేమీ అక్కర్లేదని జెట్టి అన్నారు. -
ముందుకు లాక్కొచ్చిన మృత్యువు
భీమడోలు: అప్పటి వరకు ప్రైవేటు బస్సులో వెనుక సీటులో కూర్చొన్న వ్యక్తి స్వగ్రామం దగ్గర పడుతుండడంతో ముందు సీటు ఖాళీ అవ్వగా అక్కడకు వచ్చి కూర్చున్నాడు. అంతలోనే హైటెక్ బస్సుకు జరిగిన ప్రమాదంలో అతడిని మృత్యువు కబళించింది. చోదిమెళ్ల వద్ద గురువారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని హైటెక్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో భీమడోలు గ్రామానికి చెందిన బొంతు భీమేశ్వరరావు(43) మృతి చెందాడు. జీవనోపాధి నిమిత్తం రెండు నెలల క్రితం భీమేశ్వరరావు హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ పెయింటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆతని భార్య, ఇద్దరు పిల్లలు భీమడోలులో నివాసముంటుంన్నారు. ఈ క్రమంలో ఈనెల 8, 9వ తేదీల్లో 12 ఏళ్ల కొకసారి వచ్చే భీమడోలు జాతర వేడుకల్లో పాల్గొనేందుకు భీమేశ్వరరావు బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి రావులపాలెం వెళ్లే ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎక్కాడు. తెల్లవారితే తన కుటుంబ సభ్యులను కలుసుకుని సంతోషంతో గడపాలని భావించాడు. ట్రావెల్ బస్సులో అప్పటి వరకు వెనుక సీటులో కూర్చున్న భీమేశ్వరరావు హనుమాన్ జంక్షన్ వద్ద ముందు సీటు ఖాళీ అవ్వడంతో వెనుక ఉన్న ఆతను ముందు సీటులో కూర్చున్నాడు. చోదిమెళ్ల వద్దకు వచ్చేసరికి బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో భీమేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు మృతి చెందగా బస్సులోని 21 మంది గాయాలపాలయ్యారు. భీమేశ్వరరావు మృతితో భీమడోలులో విషాదఛాయలు అలుముకున్నాయి. చోదిమెళ్ల వద్ద హైటెక్ బస్సుకు జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతి భీమడోలులో విషాదఛాయలు -
పంచాయతీ స్థలం ఆరకమణ.. ముగ్గురి అరెస్ట్
టీడీపీ నేతతో పాటు మరో ఇద్దరికి రిమాండ్ ఉంగుటూరు: నారాయణపురం పంచాయతీకి చెందిన ఆరు సెంట్ల స్థలాన్ని తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన కేసులో తెలుగుదేశం పార్టీ దళిత నాయకుడు గంటా యువరాజు, అతడికి సహకరించిన సీపాని శివబాలాజీ, చిగురుపల్లి దాలేశ్వరరావును గురువారం అరెస్ట్ చేసి తాడేపల్లిగూడెం కోర్టులో హాజరుపర్చగా 15 రోజుల రిమాండ్ విధించినట్టు ఎస్సై సూర్యభగవాన్ తెలిపారు. మోసపూరితంగా పంచాయతీ స్థలాన్ని కాజేయాలనే రిజిస్ట్రేషన్ చేసిన నేరంపై వీరిని అరెస్ట్ చేశామన్నారు. ఎస్సై సూర్యభగవాన్, కానిస్టేబుళ్లు ఆక్రమిత స్థలాన్ని పరిశీలించారు. పంచాయతీ స్థలం రక్షణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పంచాయతీ కార్యదర్శి విజయ్ తెలిపారు. -
కోలుకుంటున్న కోడి
తణుకు అర్బన్ : బర్డ్‌ఫ్లూ వైరస్ కారణంగా సంక్షోభాన్ని చవిచూసిన పౌల్ట్రీ రంగం ఇప్పుడిప్పుడే మెల్లగా కోలుకుంటోంది. గతనెలలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి బాదంపూడి, తణుకు మండలం వేల్పూరు, పెరవలి మండలం కానూరు గ్రామాల్లో కోళ్ల ఫారాల్లో బర్డ్‌ఫ్లూ పాజిటివ్‌గా రావడంతో ఆయా ప్రాంతాలకు 10 కిలోమీటర్ల మేర చికెన్, కోడిగుడ్లు అమ్మకాలపై నిషేధాజ్ఞలు విధించారు. అయితే బర్డ్‌ఫ్లూ సోకిన దానికంటే కూడా భయంకరంగా జరిగిన ప్రచారం కారణంగా కోళ్లు కొనుగోలు చేసే వారు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కోళ్లకు మేత వేయలేక కొన్ని ప్రాంతాల్లో ఉచితంగా కూడా పంపిణీ చేసినట్లుగా పౌల్ట్రీ ఫెడరేషన్ ఆవేదన వ్యక్తం చేశారు. బర్డ్‌ఫ్లూ మహమ్మారి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.100 కోట్లు నష్టపోయామని కేంద్ర పశుసంవర్థక శాఖ బృందానికి పౌల్ట్రీ ఫెడరేషన్ వినతిపత్రం అందజేసింది. తాజాగా బర్డ్‌ఫ్లూ వ్యవహారం తగ్గడంతో చికెన్ మేళాల నిర్వహణ తదితర కారణాలతో చికెన్ అమ్మకాలు కొద్దికొద్దిగా ఆశాజనకంగా మారుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. చికెన్ మేళాలకు ఆదరణ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పౌల్ట్రీ ఫెడరేషన్, జిల్లా కోళ్ల రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల కొన్ని ప్రాంతాల్లో చికెన్, ఎగ్ మేళాలు నిర్వహించి ఉచితంగా చికెన్ వంటకాలను ప్రజలకు అందించారు. వీటిని భారీ ఎత్తున ప్రజలు ఆదరించారు. ముఖ్యంగా ఈనెల 5వ తేదీన పౌల్ట్రీ ఫెడరేషన్, పశ్చిమ గోదావరి జిల్లా కోళ్ల రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తణుకు నెక్ కల్యాణ మండపంలో నిర్వహించిన చికెన్, ఎగ్ మేళాకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇక్కడ 10 వేల మందికి చికెన్, బిర్యానీ వంటకాలను సిద్ధం చేయగా సుమారుగా 13 వేల మందికిపైగా హాజరయ్యారు. మేళాకు హాజరైన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సైతం చికెన్ వంటకాలను వడ్డించి ఆమె స్వయంగా చికెన్ తిన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు పౌల్ట్రీ ఫెడరేషన్, కోళ్ల రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తణుకు, వేల్పూరు, ఏలూరు, భీమవరం ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన చికెన్ మేళాలకు ప్రజలు భారీగానే తరలివచ్చారు. జిల్లాలో 300 కోళ్ల ఫారాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బాయిలర్ కోళ్లకు సంబంధించి 300 ఫారాలు ఉండగా నిత్యం 22 టన్నులు (22వేలు కిలోలు) బాయిలర్, 15 టన్నులు (15వేల కిలోలు) లేయర్ మాంసం విక్రయాలు జరగ్గా బర్డ్‌ఫ్లూ అనంతరం కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం విధించిన ఆంక్షలు, అపోహల కారణంగా 20 శాతానికి అమ్మకాలు పడిపోయాయి. ఈనెల 1 నుంచి అమ్మకాలపై ఆంక్షలు తొలగించడంతో చికెన్ తినేందుకు ప్రజానీకం భయపడే పరిస్థితుల్లో తాజాగా చికెన్ మేళాల అనంతరం 50 శాతానికి అమ్మకాలు పెరిగాయని ఉగాది పండుగ వచ్చేసరికి నూరు శాతం అమ్మకాలకు చేరుకోగలమని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోడిగుడ్లకు సంబంధించి సుమారు 200కు పైగా ఉన్న ఫారాల ద్వారా నిత్యం కోటి ఇరవై లక్షలు కోడిగుడ్లు రోజుకు ఉత్పత్తి చేసే సామర్థ్యం జిల్లాలో ఉన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా పౌల్ట్రీ రంగానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెట్టింది పేరని రైతులు చెబుతున్నారు. పెరుగుతున్న చికెన్, కోడిగుడ్ల అమ్మకాలు జిల్లాలో సక్సెస్ అవుతున్న చికెన్ మేళాలు 20 నుంచి 50 శాతానికి పెరిగిన చికెన్ విక్రయాలు పుంజుకున్న చికెన్ అమ్మకాలు వైరస్ ప్రభావం తొలగడంతో ఈనెల 1వ తేదీ నుంచి చికెన్, కోడిగుడ్లు అమ్మకాలపై ఆంక్షలు తొలగించారు. వైరస్ భయంతో 20 శాతానికి పడిపోయిన చికెన్ అమ్మకాలు నేడు తిరిగి పుంజుకుని 50 శాతానికి పెరిగాయి. రానున్న రోజుల్లో వంద శాతానికి పెరుగుతాయి. – డాక్టర్ కరణం శంకర్ భావనారాయణ, తణుకు మండల పశువైద్యాధికారిచికెన్ మేళా సక్సెస్ తణుకు నెక్ కల్యాణ మండపంలో నిర్వహించిన చికెన్, ఎగ్ మేళా కార్యక్రమాన్ని ప్రజలు విశేషంగా ఆదరించారు. తక్కువ ధరకు అధిక ప్రొటీన్ పోషకాలు అందించే చికెన్, ఎగ్‌లను ప్రజలు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అపోహలు తొలగించేందుకే చికెన్ మేళాలు నిర్వహించాం. – కోమట్లపల్లి వెంకట సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ చైర్మన్ -
రగులుతున్న కొల్లేరువాసులు
కై కలూరు: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొల్లేరు ప్రజలు రగిలిపోతున్నారు. తమ జీవనోపాధికి అడ్డువస్తే అటవీ అధికారులను అడ్డుకుంటాం అంటూ హెచ్చరిస్తున్నారు. మరోవైపు కొల్లేరు అభయారణ్యంలో అక్రమ చెరువుల ధ్వంసంపై సుప్రీంకోర్టు విధించిన గడువు దగ్గరపడటంతో అటవీశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గురువా రం మండలంలోని గోకర్ణపురం గ్రామం వద్ద కొల్లేరు అభయారణ్యంలో సాగువుతున్న సుమారు 100 ఎకరాల (మూడు చెరువులు)కు గండ్లు కొట్టేందుకు అటవీశాఖ రేంజర్ కేపీ రామలింగాచార్యులు, డెప్యూటీ రేంజ్ ఆఫీసర్ రంజిత్‌కుమార్, ఫారెస్టు బీట్ ఆఫీసర్ రాజ్‌కుమార్, 20 మంది సిబ్బందితో కలిసి వచ్చారు. విషయం తెలిసిన కొల్లేరు వడ్డీ సాధికారత చైర్మన్ బలే ఏసురాజు, జనసేన నేత కొల్లి బా బీ, గ్రామస్తులు అధికారులు వద్దకు రాగా వాదోపవాదాలు జరిగాయి. జిల్లా అటవీ అధికారికి వినతిపత్రాలు ఇస్తామని, చెరువుల జోలికి రావద్దని గ్రామస్తులు చెప్పడంతో అటవీ సిబ్బంది వెనుదిరిగారు. గండ్లు కొట్టిన చెరువుల్లోనే సాగు కొల్లేరు ఆపరేషన్ సమయంలో గట్లు కొట్టేసిన చెరువుల్లో నిల్వ ఉన్న నీటిలోనే చేప పిల్లలు పెంచుతున్నామని, కొత్తగా చెరువులు తవ్వలేదని బలే ఏ సురాజు చెప్పారు. శుక్రవారం జిల్లా అటవీ అధికారిని కలిసి వినతిపత్రం ఇస్తామన్నారు. -
ప్రాణం తీసిన బెదిరింపు
ముదినేపల్లి రూరల్: తల్లిని భయపెట్టేందుకు చేసిన పని వికటించి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన మండలంలోని వడాలిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన బాలుడు (17) రొయ్యల చెరువులపై పనులకు వెళుతుంటాడు. ఈ క్రమంలో చెరువుగట్లపై తిరుగాడే పందికొక్కులను నిర్మూలించేందుకు స్థానికంగా ఉన్న చెరువుగట్లపై బిళ్లలు కొట్టడానికి వెళ్లి మిగిలిన బిళ్లలు వెంట తిరిగి తెచ్చుకున్నాడు. ఈ బాలుడు 10వ తరగతి చదువుతూ మధ్యలో మానివేశాడు. తండ్రి గతంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలుడికి ఒక చెల్లెలు ఉంది. తండ్రి చనిపోవడంతో కుటుంబపోషణ తల్లితో పాటు బాలుడిపై పడింది. బాలుడు చెరువుపై పనులకు వెళుతున్నప్పటికీ కూలి తీసుకోకుండా మద్యానికి అలవాటు పడ్డాడు. దీంతో చెరువు పనులకు వెళ్లవద్దని, రంగులు వేసే పనికి వెళ్లి కుటుంబాన్ని పోషించేందుకు సహాయపడాలంటూ తల్లి బాలుడిని గట్టిగా మందలించింది. ఈ మందలింపును జీర్ణించుకోలేని బాలుడు తల్లిని బెదిరించేందుకు వెంట తెచ్చుకున్న మిగిలిన పందికొక్కు బిళ్లల్లో కొన్ని మింగి వెంటనే ఊసేశాడు. తల్లి వెంటనే ముదినేపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే బాలుడు మరణించినట్లు స్థానికులు తెలిపారు. చేతికి అంది వచ్చిన కొడుకు ఇలా అకాల మరణం చెందడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరై విలపించింది. కాగా స్థానిక కూటమి నాయకుల చెరువులపై అప్పుడప్పుడు చిన్నపాటి పనులు చేస్తుంటే కూలి ఇవ్వకుండా మద్యం ఇచ్చి సరిపెడుతుండడంతో ఈ పరిస్థితి తలెత్తిందని పలువురు చెబుతున్నారు. చెక్‌బౌన్స్ కేసులో న్యాయవాదికి జైలుశిక్ష,జరిమానా నూజివీడు: చెల్లని చెక్కు ఇచ్చిన నేరానికి ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన న్యాయవాది పెరుమాళ్ల వెంకట సతీష్‌కు ఆరు నెలల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మేజిస్ట్రేట్ వేల్పుల కృష్ణమూర్తి గురువారం తీర్పు వెలువరించారు. వివరాల ప్రకారం చాట్రాయి మండలం సీ గుడిపాడుకు చెందిన నక్కా శ్రీను 2021 ఏప్రిల్‌లో సతీష్‌కు రూ.5 లక్షలు అప్పుగా ఇచ్చారు. కొంతకాలం తరువాత తన అప్పు తీర్చమని శ్రీను కోరగా 2022 మే నెలలో సతీష్ రూ.2 లక్షలకు చెక్కు ఇచ్చాడు. సతీష్ ఖాతాలో నగదు లేకపోవడంతో బ్యాంకు నుంచి ఆచెక్కు వెనక్కు వచ్చింది. దీనిపై శ్రీను కోర్టులో కేసు వేయగా విచారణ అనంతరం సతీష్‌కు రూ.3 లక్షల జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధిస్తూ మేజిస్ట్రేట్ తీర్పు చెప్పారు. సొమ్ముల మాయంపై ఖాతాదారుల ఆందోళన ముదినేపల్లి రూరల్: బ్యాంకు ఖాతాల్లో నిల్వ ఉన్న తమ సొమ్ములు తగ్గడంపై ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై బుధ, గురువారాల్లో స్థానిక స్టేట్ బ్యాంక్‌కు దాదాపు 100 మంది వరకు తరలివచ్చిన ఖాతాదారులు మేనేజర్‌ను ప్రశ్నించారు. ఒకరికి రూ.36 వేలు, మరొకరికి రూ.96 వేలు, పలువురికి రూ.వెయ్యి నుంచి రూ.30 వేల వరకు ఖాతాల్లో నిల్వలు తగ్గిపోయాయంటూ మేనేజర్‌కు తెలిపి కారణం చెప్పాలంటూ నిలదీశారు. దీనిపై బ్రాంచ్ మేనేజర్ బీఎస్ సూర్యనారాయణ వివరణ ఇస్తూ స్థానికంగా ఉన్న తమ శాఖ నుంచి ఖాతాల్లో నిల్వలు ఏమి తగ్గించలేదన్నారు. ఖాతాదారులు ఇతర బ్యాంకుల నుంచి రుణాలు పొంది తిరిగి చెల్లించకుంటే ఈ విధంగా జరిగే అవకాశం ఉండవచ్చని తెలిపారు. అయినప్పటికీ దీనిపై ఉన్నతాధికారులకు సమాచారమందించి తగిన కారణాలు తెలియజేస్తామన్నారు. -
పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి
భీమవరం (ప్రకాశం చౌక్): నిర్థిష్ఠ ప్రణాళికతో పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పోలీసు అధికారులతో గురువారం ఆయన నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగతనాల కట్టడితో పాటు చోరీ సొత్తు రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దర్యాప్తులో వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ నేర నియంత్రణలో సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు. ఎన్ఫోర్స్మెంట్ ముమ్మరం చేసి చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ల వారీగా పాత పెండింగ్ కేసుల వివరాలు, ప్రస్తుత కేసుల స్థితిగతులు, నమోదైన కేసుల్లో నేరస్తుల అరెస్టు, కేసు దర్యాప్తు తీరుతెన్నులపై సంబంధిత పోలీస్ అధికారులను ఆరా తీశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, రాత్రి సమయంలో రెగ్యులర్ బీట్లతో వాహనాల తనిఖీలు చేసి కట్టడి చేయాలని, నేర నియంత్రణకు విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపట్టి ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు పాటించేలా చేయాలన్నారు. అలాగే జిల్లాలో గుర్తుతెలియని మృతదేహాలు, అనుమానాస్పద మృతి కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆయా కేసుల్లో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి పూర్తిస్థాయిలో సాక్ష్యాధారాలు సేకరించాలన్నారు. గ్రామాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని పాటించాలన్నారు. ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని, జవాబుదారీగా ఉండాలని, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఏఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, భీమవరం సబ్ డివిజన్ డీఎస్పీ రావూరి గణేష్ జయసూర్య, నరసాపురం డీఎస్పీ జి.శ్రీ వేద, తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ డీఎస్పీ డి.విశ్వనాథ్, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వి.పుల్లారావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ డి.వెంకటేశ్వరరావు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి -
కదం తొక్కిన కోకో రైతులు
ఏలూరు (టూటౌన్) : కంపెనీలు సిండికేట్‌గా మారి కోకో గింజల ధర తగ్గిస్తున్నాయంటూ ఏలూరులో రైతులు కదం తొక్కారు. చలో ఏలూరు కార్యక్రమంలో భాగంగా రైతులు ర్యాలీ, మహాధర్నా చేపట్టారు. ముందుగా ఫైర్‌స్టేషన్ మీదుగా ఉద్యాన శాఖ డీడీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ధర్నాను ఉద్దేశించి ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కిలోకు రూ.900 ధర ఇప్పించాలని, సిండికేట్‌గా మారిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కంపెనీలతో రైతుల సమక్షంలో చర్చలు జరపాలని లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నినాదాలు చేస్తుండగా ఏలూరు త్రీటౌన్ సీఐకి రైతు సంఘ నాయకులతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం తగదని నాయకులు విమర్శించారు. వినతిపత్రం అందుకున్న కలెక్టర్ వెట్రిసెల్వి రైతులతో చర్చలు జరిపి వారి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. ఏపీ కోకో రైతు సంఘం నాయకులు బొల్లు రామకృష్ణ, ఎస్.గోపాలకృష్ణ, సంఘ నాయకులు ఏలూరుతో పాటు పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ఎన్టీ ఆర్, కృష్ణా జిల్లాల రైతులు భారీగా తరలివచ్చారు. కలెక్టరేట్ వద్ద రైతుల మహాధర్నా కోకో గింజలకు కిలోకు రూ.900 ధర ఇప్పించాలని వినతి సిండికేట్‌గా మారిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
ఆకివీడు: లారీ ఢీకొని మోటార్‌సైక్లిస్టు మృతి చెందిన ఘటన ఆకివీడులో చోటుచేసుకుంది. కై కలూరు నియోజకవర్గంలోని పెదకొట్టాడ గ్రామానికి చెందిన మద్దా మరియదాసు (38) ఆకివీడులో ఫిష్ప్యాకింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి ఫిష్ప్యాంకింగ్ పనులు ముగించుకుని మోటారు సైకిల్‌పై తిరిగి ఇంటికి వెళుతుండగా స్థానిక ఎఫ్‌సీఐ గోడౌన్ సమీపంలో కై కలూరు నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మరియదాసు తలకు తీవ్ర గాయమవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై హనుమంతు నాగరాజు చెప్పారు. దాసుకు భార్య, ముగ్గురు మగపిల్లలు ఉన్నారని, అతడి భార్య విదేశాల్లో ఉంటున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దాసు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించామన్నారు. ఏటీఎంలో చోరీకి యత్నం తాడేపల్లిగూడెం అర్బన్: తాడేపల్లిగూడెంలోని కరూర్ వైశ్యాబ్యాంక్ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేసిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కరూర్ వైశ్యాబ్యాంక్కు చెందిన ఏటీఎంలో చోరీకి పాల్పడేందుకు యత్నించారు. ముందుగా ఏటీఎం గదిలోకి ప్రవేశించేందుకు అక్కడ ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా సాధ్యం కాకపోవడంతో అక్కడి నుంచి పరారయ్యారు. గురువారం ఉదయం బ్యాంకు సిబ్బంది వచ్చి పరిశీలించి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ సీఐ ఎ.సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య కేసులో నిందితుడి అరెస్టు అత్తిలి: దంతుపల్లిలో జరిగిన హత్యకేసులో నిందితుడు కడలి వెంకట నారాయణను తణుకు రూరల్ సీఐ బి కృష్ణకుమార్ అరెస్టు చేసి కోర్టుకు హాజరుపర్చారని ఎస్సై పి ప్రేమరాజు గురువారం తెలిపారు. దంతుపల్లి గ్రామంలో జుత్తిగ వీరాంజనేయులను రాయితో కొట్టి హత్యచేసిన వెంకట నారాయణను ఇంటివద్ద అరెస్ట్ చేసి తణుకు కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారని ఎస్సై చెప్పారు. ఇంట్లోకి ప్రవేశించి.. కంట్లో కారం కొట్టి జంగారెడ్డిగూడెం: ఇంట్లోకి ప్రవేశించి, కంట్లో కారం కొట్టి, మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెంకు చెందిన భూమా భాస్కరరావు, రత్నావతి స్థానిక బెనర్జీగారి వీధిలోని దుర్గాభవానీ అపార్టుమెంటులో నివాసముంటున్నారు. గురువారం ఉదయం భాస్కరరావు పనిమీద బయటకు వెళ్లగా రత్నావతి ఇంటి వద్ద ఒంటరిగా ఉంది. ఇంట్లో ఆమె టీవీ చూస్తున్న సమయంలో వెనుక నుంచి ఓ అపరిచిత వ్యక్తి ఆమె మెడలో ని బంగారు గొలుసు, సూత్రాలను లాక్కుని పరారయ్యాడు. ముఖానికి మాస్కు పెట్టుకుని వచ్చిన దుండగుడు తన జుట్టు పట్టుకుని, తన కళ్లల్లో కారం కొట్టి కట్టర్ సహాయంతో సూత్రాలతో పాటు గొలుసును కత్తిరించుకుపోయాడని బాధితురాలు రత్నావతి కన్నీటిపర్యంతమైంది. విషయం తెలుసుకున్న ఎస్సై జబీర్ ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. -
ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు
ద్వారకాతిరుమల: మండలంలోని జి.కొత్తపల్లి గ్రామంలో పచ్చ ముఠా అక్రమ గ్రావెల్ మట్టి తవ్వకాలు దర్జాగా సాగిస్తోంది. గత కొద్దిరోజులుగా టీడీపీ పెద్దల అండదండలతో ప్రభుత్వ భూముల్లో ఈ అక్రమ మట్టి తవ్వకాల దందా జోరుగా సాగుతోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. అదే అదనుగా సదరు టీడీపీ నేతలు రెచ్చిపోయి మరీ రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. జేసీబీ సహాయంతో తవ్వకాలు జరిపి, టిప్పర్ల ద్వారా మట్టిని కామవరపుకోట, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. రియాల్టర్ల నుంచి కాంట్రాక్టులు పొంది మరీ ఈ దందాను దర్జాగా సాగిస్తున్నారు. ఒక్కో టిప్పర్ మట్టిని రూ.5 వేలకు పైగా విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఎవరైనా ఈ అక్రమ తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేస్తే, వెంటనే మట్టి తవ్వకాలు ఆగిపోతున్నాయి. కొద్దిసేపటి తరువాత మళ్లీ దందా షరామామూలుగా సాగుతోంది. ప్రభుత్వ భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతుంటే కనీసం ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని స్థానికులు ధ్వజమెత్తుతున్నారు. కూటమి నేతల కనుసన్నల్లో అధికారులు పనిచేయడమే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. జి.కొత్తపల్లిలో దర్జాగా పచ్చ ముఠా దందా రియల్ ఎస్టేట్ వెంచర్లకు టిప్పర్ల ద్వారా తరలిపోతున్న మట్టి -
పోలీసులే కొట్టి చంపారు..!
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ‘బండి చోరీ కేసు అంటూ.. మూడు రోజుల క్రితం మా అబ్బాయిని పోలీసులు తీసుకువెళ్లారు.. నిన్న స్టేషన్‌కు వెళ్లాను.. ఒక్కసారైనా మా అబ్బాయి ముఖం చూపించండయ్యా అని పోలీసుల కాళ్లు పట్టుకుని బతిమిలాడాను.. ఏమీ లేదమ్మా.. రేపు ఇంటికి వచ్చేస్తాడు అన్నారు.. వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్, హనుమాన్ జంక్షన్ పోలీస్స్టేషన్లల్లో ఉన్నాడని తలో మాట చెప్పారు.. ఈరోజు చూస్తే జీజీహెచ్‌లో శవమై కనిపించాడు’ అంటూ బాలుడి తల్లి వనిత బోరున విలపించింది. పదో తరగతి విద్యార్థి (16) ఒంటిపై, అరికాళ్లపై దెబ్బలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఏలూరులో తీవ్ర సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే.. ఏలూరులోని చేపలతూము ప్రాంతానికి చెందిన బంగారు శివ చింతలపూడిలోని విద్యాశాఖలో అ టెండర్‌గా పనిచేస్తున్నారు. శివ చిన్న కుమారుడు యశ్వంత్‌కుమార్ (16) ఏలూరులోని ప్రభుత్వ హై స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం ఏలూరు సీసీఎస్ పోలీసులు బండి చోరీ కేసులో రికవరీల కోసమని యశ్వంత్‌తో పాటు మరో ఆరుగురు పిల్లలను తీసుకువెళ్లారు. అయితే వారిని సీసీఎస్ స్టేషన్లో కాకుండా వేరే ప్రాంతంలో ఉంచి విచారించారు. ఈ నేపథ్యంలో తన కుమారు డి కోసం యశ్వంత్ తల్లి వనిత రెండు రోజులుగా పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదు. ఈ క్రమంలో గురువారం వేకువజామున 5 గంటల సమయంలో పెదవేగి మండలం మొండూ రు ప్రాంతంలో గోదావరి కుడికాల్వ గట్టుపై య శ్వంత్ అపస్మారక స్థితిలో పడి ఉండగా.. గుర్తించి ఏలూరు జీజీహెచ్‌కు తరలించారు. అయితే బా లుడు అప్పటికే మృతి చెందడంతో మార్చురీలో పెట్టి కనీసం కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు సమాచారం ఇవ్వలేదు. మార్చురీ వద్ద ఆందోళన మార్చురీ సిబ్బంది ద్వారా యశ్వంత్ మృతి వార్త తెలిసిన తల్లిదండ్రులు శివ, వనిత, సోదరుడు కృష్ణవర్ధన్ బంధువులతో కలిసి జీజీహెచ్‌కు వచ్చారు. యశ్వంత్ మృతదేహాన్ని చూసి బోరున విలపించా రు. అరికాళ్ల నుంచి చాతీ వరకూ తీవ్ర గాయాలయ్యేలా నిర్దాక్షిణ్యంగా పోలీసులే కొట్టి చంపేసి, శవాన్ని ఎక్కడో పడేశారంటూ విలపించారు. తమ కుమారుడి మృతికి న్యాయం చేయాలంటూ మార్చురీ వద్ద బైఠాయించి దీనిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని ఆందోళనకు దిగారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చొదిమెళ్లలో జరిగిన బస్సు ప్రమాద బాధితులను పరామర్శించడానికి కలెక్టర్ వెట్రిసెల్వి జీజీహెచ్‌కు రాగా ఆమెను కలిసి యశ్వంత్ మృతిపై ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి విచారణకు ఆదేశించి న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. భిన్నంగా పెదవేగిలో ఫిర్యాదు ఇదిలా ఉండగా పెదవేగి పోలీస్‌స్టేషన్‌లో భిన్నంగా ఫిర్యాదు నమోదైంది. పోలీసులు, చోటా నేతల ఒత్తి ళ్లతో యశ్వంత్ సోదరుడు కృష్ణవర్ధన్‌తో పెదవేగి పో లీసులు ఫిర్యాదు తీసుకున్నారు. ఈనెల 5న తన సో దరుడు ఇంటి నుంచి బయటకు వెళ్లాడని, 6న మొండూరు కాల్వ గట్టుపై అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పెదవేగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడిని జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతిచెందాడని, మార్చురీకి తరలించి తమకు సమాచారం ఇచ్చారని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీ కేసులో 16 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మూడు రోజుల తర్వాత విగతజీవిగా గుర్తింపు -
తెల్లారిన బతుకులు
తెల్లవారకముందే.. వారి జీవితాలు తెల్లారిపోయాయి. కొద్ది గంటల్లోనే గమ్యస్థానాలకు చేరుకోవాల్సి ఉండగా మృత్యువు వారిని కబళించింది. అతివేగం, పొగమంచు కారణంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. బస్సు నుంచి కారిన రక్తధారలు భయభ్రాంతులకు గురిచేయగా.. క్షతగాత్రుల హాహాకారాలు మిన్నంటాయి. ఏలూరు జిల్లా ఏలూరులోని చొదిమెళ్ల వద్ద జాతీయరహదారి (ఎన్‌హెచ్–16)పై ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. డ్రైవర్ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. బస్సులోని 21 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఘటనా స్థలిలో బస్సు దెబ్బతిన్న తీరు చూస్తే ప్రమాద తీవ్రత అర్థమవుతుంది. శురకవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025జాతరకు వస్తూ.. మృతుడు బొంతు భీమేశ్వరరావు భీమడోలుకు చెందినవారు. పెయింటర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వృత్తిరీత్యా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆయన సొంతూరులో జరిగే జాతరకు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. మరో 20 నిమిషాల్లో సొంతూరుకు చేరుకుంటారనుకున్న సమయంలో మృత్యువు కబళించింది. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారి కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ భవాని మృతురాలు మొటపర్తి భవానిది కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రవారిపాలెం. ఆమె హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కుటుంబసభ్యులను చూసేందుకు వచ్చి రోడ్డు ప్రమాదంలో మృత్యవాత పడ్డారు. భవానీ అకాల మరణం ఆ కుటుంబంలో తీరని శోకం నింపింది. బంధువుల ఇంటికి వెళ్లి వస్తూ.. మృతురాలు జుత్తిగ భవాని గృహిణి. ఆమెది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కోలంక గ్రామం. బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్న సమయంలో ఆమె ప్రమాదంలో కన్నుమూసింది. ఆమె కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. మృతుడు డ్రైవర్ మధు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నీటి ఎద్దడి తలెత్తకూడదు దెందులూరు/ఏలూరు (టూటౌన్): జిల్లాతో తాగు, సాగునీటి సమస్య లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం దెందులూరు మార్కెట్ కమిటీ చెక్ పోస్టు సమీపంలో ఏలూరు నగరానికి సాగునీటి సరఫరా చేసే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. దెందులూరు కాలిబాట వంతెన వద్ద ఏలూరు కాల్వలో తూడు తొలగింపు పనులనూ పరిశీలించారు. ఏలూరు కాలువ ద్వారా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను నీటితో నింపేందుకు పర్యవేక్షణ చేయాలన్నారు. చేపల చెరువులకు అక్ర మంగా నీటి మళ్లింపును అరికట్టేలా కాలువ గట్ల వెంబడి పటిష్ట నిఘా ఉంచాలన్నారు. అనంతరం వాటర్ పంప్ హౌప్ వద్ద కలెక్టర్ మొక్క నాటారు. ఏలూరు కాలువలో మూడున్నర అడుగుల మేర నీరు ఉందని ఇరిగేషన్ శాఖ ఎస్ఈ పి.నాగార్జునరావు తెలిపారు. ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, కమిషనర్ భానుప్రతాప్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి హబీబ్ బాషా ఉన్నారు. కొనసాగిన ఇంటర్ పరీక్షలు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు గురువారం గణితం–1ఏ, బోటనీ, సివిక్స్–1 పరీక్షలు జరిగాయి. జిల్లాలో 55 కేంద్రాల్లో 19,400 మంది విద్యార్థులకు 18,195 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ తెలిపారు. అలాగే ఇంటర్ సంస్కృతం జవాబుపత్రాల మూల్యాంకనం శుక్రవారం నుంచి ఏ లూరు కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమవుతుందని చెప్పారు. గీత కార్మికులకు మద్యం షాపులు ఏలూరు(మెట్రో): జిల్లాలో కల్లుగీత కార్మికులకు కేటాయించిన మద్యం దుకాణాలను కలెక్టర్ కె.వెట్రిసెల్వి లాటరీ ద్వారా ఎంపిక చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో లాటరీ ప్రక్రియను నిర్వహించారు. 14 షాపులకు 294 దరఖాస్తులు వచ్చాయి. షాపు దక్కించుకున్న వారు లైసెన్స్ కోసం రూ.5,41,667 లేదా మొదటి విడతగా రూ.4,58,333 మొదటి విడతగా చెల్లించాల్సి ఉంటుంది. 14 షాపులకు సంబంధించి నాన్ రిఫండబుల్ కింద రూ. 5.80 కోట్లు సమకూరగా రాష్ట్రంలో ఏలూరు జిల్లా 6 స్థానంలో నిలిచింది. అలాగే లైసెన్స్ ఫీజు కింద రూ.72.50 లక్షల ఆదాయం లభించింది. ఎకై ్స జ్ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీలత, జిల్లా మద్య నిషేధ అబార్కీ అధికారి ఎ.ఆవులయ్య, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ పాండురంగారావు, సీఐలు రమేష్ ధనరాజు పాల్గొన్నారు. ‘గురుకుల’ ప్రవేశాలకు ఆహ్వానం ఏలూరు (టూటౌన్): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి, ఇంటర్మీడియెట్ ఫస్టియర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా సమన్వయ అధికారి బి.ఉమాకుమారి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపికచేస్తామని, దరఖాస్తుల స్వీకరణకు గడువును ఈనెల 13 వరకు పొడిగింంచామని పే ర్కొన్నారు. వచ్చేనెల 6న ప్రవేశ పరీక్షలు నిర్వ హిస్తామని తెలిపారు. ఏలూరు జిల్లాలో బాలురుకు పెదవేగి, చింతలపూడి, బాలికలకు పో లసానిపల్లి, వట్లూరు, ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం, నూజివీడులో పాఠశాలలు ఉన్నాయన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో బా లురుకు ఆరుగొలను, న్యూ ఆరుగొలను, ఎల్ బీ చర్ల నరసాపురంలో, బాలికలకు పెనుగొండలో పాఠశాలలు ఉన్నాయన్నారు. బాలుడి మృతిపై విచారణకు డిమాండ్ ఏలూరు (టూటౌన్): చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులకు ప్రజల ప్రాణాలకు ముప్పుతెచ్చే హక్కులేదని, తప్పు చేసిన వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టి శిక్షించాలని సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి అన్నారు. తమ బిడ్డను పోలీసులే చంపేశారంటూ ఏలూరులోని తంగేళ్లమూడిలో నివాసముంటున్న యశ్వంత్ అనే బాలుడు కుటుంబసభ్యులు ఏలూరులో ఆస్పత్రి వద్ద గురువారం ఆరోపణ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. యశ్వంత్ మృతికి పోలీసులే కారణమైతే బాధాకరమని, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే అరెస్టు చేసిన బాలుడు మృతి చెందిన ఘటనపై కలెక్టర్ విచారణకు ఆదేశించాలని సీపీఎం నగర కమిటీ డిమాండ్ చేసింది. డెడ్లీ జర్నీ ● ఏలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ● వేకువజామున ఘటన ● లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు ● ఘటనా స్థలంలో ముగ్గురు, చికిత్స పొందుతూ మరొకరు మృతి ● 21 మందికి గాయాలు ఏలూరు రూరల్: ఏలూరులోని చొదిమెళ్ల వద్ద రత్నాస్ హోట ల్ సమీపంలో విజయవాడ నుంచి రాజమండ్రి వెళుతు న్న సిమెంట్ లారీ (ఏపీటీ 91ఏ 1769) మరమ్మతుల కారణంగా నిలిచిపోయింది. గురువారం వేకువజామున 5 గంటల సమయంలో రమ ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (ఎన్ఎల్ 01బీ 3092) హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతుండగా వేగంగా నడుపుతున్న బస్సు డ్రైవర్ రోడ్డు పక్కన ఆగి ఉన్న సిమెంట్ లారీని గుర్తించలేకపోయాడు. చివరి నిమిషంలో బస్సును తప్పించేందుకు ప్రయత్నించగా లారీ వెనుక భాగాన్ని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. బస్సులో కండక్టర్ వైపు భాగం చీల్చుకుంటూ వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో బస్సులో నిద్రిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేశారు. ప్రమాదంతో ఉలిక్కిపడిన స్థానికులు, ఇతర వాహనాల డ్రైవర్లు హుటాహుటిన వచ్చి ప్రయాణికులను రక్షించేందుకు ప్రయత్నించారు. హైవే పెట్రోలింగ్ పోలీసులు సైతం ఘటనా స్థలానికి చేరుకుని బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకువచ్చారు. క్షతగా త్రులను 108లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం రక్తసిక్తం కాగా.. పరిసరాల్లో బస్సులోని విడి భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. శకలాల మధ్య ఇరుక్కుపోయి.. బస్సులో కండక్టర్ సీటు వైపు కూర్చున్న మహిళలు మొటపర్తి భవాని, జుత్తిగ భవాని, పురుషుడు బొంతు భీమేశ్వరరావు శకలాల్లో చిక్కుకుపోయారు. లారీ డ్రైవర్ మధు సైతం స్టీరింగ్ వద్ద ఇరుక్కుపోయాడు. పోలీసులు క్రేన్ సాయంతో బస్సును లేపి పక్కకు చేర్చారు. శకలాలను తప్పించి ముగ్గురు ప్రయాణికులతో పాటు డ్రైవర్‌ను అంబులెన్స్ ద్వారా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రయాణికులు ముగ్గురు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. డ్రైవర్ మధుకు అత్యవసర చికిత్స అందించగా నాలుగు గంటల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు. ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేయించారు. క్షత్రగాత్రులు వీరే.. ప్రమాదంలో గాయాలపాలైన వారిలో కోలా సురేఖ, కోలా రాజాబాబు, కోలా లిఖిత, వనమనీడి ఆదిలక్ష్మి, మద్దాల కీర్తి, మాచర్ల సుజాత, మండపాక బాలాజీ, మండపాక శ్రీదేవి, మండపాక హరిణి, మండపాక శశిరేఖ, ఆర్నాలకంటి శ్రీలక్ష్మి, కోట వేణి, పువ్వుల శ్యామ్‌కుమార్, శీలం ప్రకాష్, ఎం.ప్రతాప్, పి.అక్కమ్మ, పి.హేమలత, గోణజ విజయకుమార్, రామిశెట్టి సోమసత్యనారాయణ, టి.రవికుమార్, జి.మణికంఠ (క్లీనర్) ఉన్నారు. అధికారులు క్షతగాత్రులకు చికిత్స చేయించి వారి గమ్యస్థానాలకు పంపించారు. క్షతగాత్రులు పాలకొల్లు, రాజమండ్రి, కాకినాడప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. న్యూస్రీల్నైట్ పెట్రోలింగ్ నామమాత్రం దెందులూరు: భీమడోలు నుంచి హనుమాన్ జంక్షన్ వరకు జాతీయ రహదారి (ఎన్‌హెచ్–16) మృత్యు మార్గంగా మారింది. ఈ ప్రాంతంలో తరచూ ప్ర మాదాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా నైట్ పెట్రోలింగ్ తూతూమంత్రంగా జరుగుతుండటం విమర్శలకు తావిస్తోంది. రాత్రి వేళ పెట్రోలింగ్‌కు సిబ్బంది, వాహనాలు ఉన్నా పూర్తిస్థాయిలో జరగడం లేదు. ఈ వాహనమైనా రాత్రి వేళ హైవేపై నిలిచిపోతే హైవే పోలీసులకు సమాచారం ఇచ్చే అవకాశం ఉండటం లేదు. అలాగే పెట్రోలింగ్ పోలీసులు నిత్యం పెట్రోలింగ్ చేయడం ద్వారా కొంతవరకు ప్రమాదాలను నివారించవచ్చని డ్రైవ ర్లు అంటున్నారు. వారంలో ఒక్కరోజైనా సీఐ స్థా యి నుంచి పై స్థాయి అధికారి రాత్రిళ్లు పెట్రోలింగ్‌పై తనిఖీలు చేయాలని అంటున్నారు. ప్రమాదాలు ఎక్కువగా రాత్రి 12.30 నుంచి వేకువజామున 5 గంటలలోపు జరుగుతున్నాయి. ప్రతిపాదనలకే షెల్టర్ పరిమితం లారీలు, భారీ వాహనాల నిలుపుదల, డ్రైవర్ల విశ్రాంతికి జాతీయరహదారిపై కలపర్రు నుంచి భీమడోలు వరకు ఎలాంటి సౌకర్యాలు, స్థలం లేవు. గతంలో స్థలం కోసం గుండుగొలను వద్ద కలెక్టర్ పరిశీలన చేశారు. అక్కడ షెల్టర్ నిర్మించాలని ప్రతిపాదనలు చేసినా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. దెందులూరు నియోజకవర్గంలో డ్రైవర్ల విశ్రాంతి, వాహనాల నిలుపుదలకు కనీసం పది ఎకరాల్లో షెల్టర్ ఏర్పాటు చేయాలని చాలాకాలంగా డ్రైవర్లు కోరుతున్నారు. ఇక్కడ ప్రమాదాల నివారణకు షెల్టర్ దోహదపడుతుందని వాహనాల డ్రైవర్లు అంటున్నారు. అతి వేగం.. పొగ మంచు అతివేగం, పొగమంచు ప్రమాదానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు. వేకువజామున పొగమంచు కురవడంతో బస్సు డ్రైవర్ ఆగి ఉన్న లారీని గుర్తించలేకపోయాడు. మరోపక్క లారీ డ్రైవర్ లారీని జాతీయరహదారి ప క్కన నిలపడం ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. ఘటనా స్థలానికి 30 మీటర్ల దూరంలో పార్కింగ్ రోడ్డు ఉందని, జాతీయరహదారిపై ఎక్కడిపడితే అక్కడ వాహనాలను నిలుపుదల చేయడం ప్రమాదాలకు కారణమవుతున్నాయని చెబుతున్నారు. డ్రైవర్లు వాహనాలను పార్కింగ్ స్థలాల్లోనే నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఏలూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొన్న లారీ.. ముగ్గురి మృతి
సాక్షి, ఏలూరు జిల్లా: ఏలూరు సమీపంలోని చొదిమెళ్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్‌ను లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఏలూరు ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.లారీ లోయలో పడి ముగ్గురి మృతిమరో ఘటనలో వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని మద్దిమడుగు ఘాట్ పైన బుధవారం మధ్యాహ్నం లారీ లోయలోకి పడిన ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. చేపల మేత లోడుతో బెంగళూరు నుంచి ఏలూరుకు వెళ్తున్న లారీ మద్దిమడుగు ఘాట్ పైన నాలుగో మలుపు వద్దకు రాగానే బ్రేక్ ఫెయిల్ అయి అదుపుతప్పి 50 అడుగులున్న లోయలోకి పడిపోయింది.లారీలోని డ్రైవర్ సాంబయ్య, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా.. చక్రాయపేట మండలం కప్పకుంటపల్లెకు చెందిన కె.వివేకానందరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాద తీవ్రత కారణంగా లారీ మూడు ముక్కలుగా విడిపోయి కేబిన్ నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న రక్షక్ సిబ్బంది అగ్ని మాపక సిబ్బందిని, 108 అంబులెన్స్‌ను పిలిపించి క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే లారీ డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. -
ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
నూజివీడు: ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 7 వందల గ్రాముల బంగారు ఆభరణాలను, ఒక మోటార్ సైకిల్‌ను, కారును స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ పీ సత్యశ్రీనివాస్ బుధవారం తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దొంగతనాలను నివారించాలనే లక్ష్యంతో ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేసి అనుమానితుల కదలికలను పరిశీలిస్తుండగా విశాఖపట్టణంకు చెందిన శీలా అనిల్‌కుమార్, పెల్లి శ్రీనివాసరెడ్డి, మచిలీపట్నంకు చెందిన వేల్చూరి అనిల్కుమార్లను అదుపులోకి తీసుకొని విచారించగా వారు చేసిన పలు దొంగతనాల వివరాలు వెల్లడయ్యాయన్నారు. వీరు రాత్రి సమయంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లకు వెళ్లి తాళాలను పగులగొట్టి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలిస్తారన్నారు. వీటిని విక్రయించడం, తాకట్టు పెట్టడం, కరిగించి అమ్మడం చేస్తూ ఉంటారు. వీరిపై నూజివీడు, రాజమండ్రి టూ టౌన్, తెనాలి 3 టౌన్, నెల్లూరు జిల్లా దర్గమిట్ట, అనపర్తి, సర్పవరం, ఏలూరు 2 టౌన్, శ్రీకాకుళం జిల్లా సంతకవిటి, చల్లపల్లి, భీమవరం 2 టౌన్, ఏలూరు 3 టౌన్, కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లలో చోరీ కేసులున్నాయన్నారు. వీరి వద్ద నుంచి పలు కేసులకు సంబంధించిన 7 వందల గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశామన్నారు. చోరీ కేసుల్లో నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన నూజివీడు టౌన్, ఏలూరు 3 టౌన్, ఏలూరు సీసీఎస్ సీఐలు పీ సత్యశ్రీనివాస్, వీ కోటేశ్వరరావు, రాజశేఖర్, నూజివీడు టౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్సై జీ జ్యోతీబసు, ఏఎస్సై పీ సురేష్, హెచ్‌సీ బాలరమేష్, కానిస్టేబుళ్లు సీహెచ్ రామకృష్ణ, ఎస్ రాధాకృష్ణ, ఏలూరు 3 టౌన్ హెచ్‌సీ ఓం ప్రకాష్‌లను ఎస్పీ అభినందించడంతో పాటు రివార్డులు ప్రకటించారు. -
కట్టుకున్నవాడే కాలయముడై..
బుట్టాయగూడెం: కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు. ప్రేమించి పెళ్లిచేసుకున్న 8 నెలలకే ఓ వివాహిత జీవితం అర్ధాంతరంగా ముగిసింది. భర్త చేతిలో భార్య హత్యకాబడిన ఘటన మండలంలోని బూరుగువాడలో బుధవారం చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి గొడ్డా శ్రీను తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జీలుగుమిల్లి మండలం చంద్రమ్మ కాలనీకి చెందిన గొడ్డా సాయి కిరణ్, బుట్టాయగూడెం మండలం బూరుగువాడకు చెందిన రేఖామాధురి(22) నాలుగేళ్ల నుంచి ప్రేమించుకుని 8 నెలల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో మాధురి తండ్రి గొడ్డా శ్రీను ఇద్దరినీ మందలించి సర్థిచెప్పడం జరిగేది. అయితే మంగళవారం చంద్రమ్మకాలనీ నుంచి భార్యాభర్తలిద్దరూ బుట్టాయగూడెం మండలం బూరుగువాడకు వచ్చారు. సాయంత్రం తిరిగి వెళ్లే సమయంలో పూచికపాడులో భార్యాభర్తలు మళ్లీ గొడవ పడ్డారు. దీనితో రేఖామాధురి విషయాన్ని తండ్రి శ్రీనుకు ఫోన్లో చెప్పింది. వెంటనే తండ్రి ఆమెను బూరుగువాడుకు తీసుకువెళ్లారు. అర్ధరాత్రి దాటిన తర్వాత సాయికిరణ్ భార్య దగ్గరకు రావడంతో అల్లుడే కదా అని రానిచ్చారు. బుధవారం ఉదయం 6 గంటలకు రేఖామాధురి తండ్రి శ్రీను, తల్లి చిలకమ్మ, చెల్లెలు మాధురి అందరూ పొలం పనులకు వెళ్లిపోయారు. ఏడున్నర గంటల సమయంలో సాయికిరణ్ మామ శ్రీనుకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఉరివేసుకుని చనిపోయిందని సమాచారం ఇచ్చాడు. దీంతో కుమార్తె మృతదేహాన్ని పరిశీలించగా గాలిపంపు తాడును పీకకు బిగించి చంపినట్లు అనుమానం రావడంతో తండ్రి శ్రీను బుట్టాయగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలవరం డీఎస్పీ ఎం. వెంకటేశ్వరరావు, జీలుగుమిల్లి సీఐ బి.వెంకటేశ్వరరావు, బుట్టాయగూడెం ఎస్సై డి.దుర్గామహేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రేఖామాధురి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
పన్ను వసూళ్లలో జాప్యం
జంగారెడ్డిగూడెం: జిల్లాలోని మున్సిపాల్టీల్లో ఆస్తి పన్ను వసూళ్లు మందకొడిగా సాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం నెలాఖరునాటికి 100 శాతం పన్నులు వసూలు చేయాల్సి ఉండగా, ఏ మున్సిపాలిటీలోనూ 50 శాతం వసూళ్లు మించలేదు. జిల్లాలో ఏలూరు కార్పొరేషన్, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ, నూజివీడు మున్సిపాలిటీ, చింతలపూడి నగర పంచాయతీ ఉన్నాయి. ఈ నాలుగు మున్సిపాలిటీల్లోనూ మొత్తంగా రూ.83.64 కోట్ల ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉండగా, కేవలం రూ.47.36 కోట్లు మాత్రమే వసూలైంది. మొత్తంగా 43.38 శాతం మాత్రమే ఆస్తిపన్ను వసూలైంది. ఆయా మున్సిపాలిటీల్లో గత ఏడాది వరకు ఉన్న బకాయిలు, ఈ ఏడాది ఆస్తి పన్ను మొత్తం కలిపి వరుసగా, ఏలూరు కార్పొరేషన్లో రూ.60.44 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, రూ.25.79 కోట్లు మాత్రమే వసూలైంది. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో పాత బకాయిలు, ఈ ఏడాది పన్ను కలిపి రూ.11.34 ట్లు వసూలు కావాల్సి ఉండగా, రూ.5.38 కోట్లు వసూలైంది. నూజివీడు మున్సిపాలిటీలో పాత బకాయిలు, ఈ ఏడాది కలిపి రూ.9.53 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, రూ.4.16 కోట్లు వసూలైంది. చింతలపూడి నగర పంచాయతీలో పాత బకాయిలు, ఈ ఏడాది కలిపి రూ.2.32 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, రూ.0.95 కోట్లు మాత్రమే వసూలైంది. ఇదిలా ఉంటే జిల్లాలో మున్సిపాలిటీల్లో వరుసగా చూస్తే ఆస్తి పన్ను వసూళ్లలో జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ 47.43 శాతంతో ప్రథమ స్థానంలో ఉండగా, రెండో స్థానంలో నూజివీడు, మూడో స్థానంలో ఏలూరు కార్పొరేషన్, నాలుగో స్థానంలో చింతలపూడి నగర పంచాయతీ ఉన్నాయి. మున్సిపాలిటీల్లో 50 శాతం కూడా వసూలు కాని వైనం జంగారెడ్డిగూడెం పట్టణం -
అభివృద్ధి పనుల కొనసాగింపులో జాప్యం
తణుకు అర్బన్: శాసన మండలిలో బుధవారం ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు సద్వినియోగం చేసుకోవడంలో ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) తీవ్ర జాప్యం చేస్తోందని, ఎంఎస్ఎంఈ నిధులతో మొదలుపెట్టిన అభివృద్ధి పనులు మధ్యలోనే ఆగిపోయాయని అన్నారు. తణుకు, నెల్లిమర్ల, గాజులమండ్యం పారిశ్రామిక వాడలో రూ. 36 కోట్ల అభివృద్ధి పనులు ఆగిపోయాయని వాటిని త్వరితగతిన పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. తాను లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి భరత్ సమాధానం ఇస్తూ కొంత జాప్యం జరిగిందని, అవాంతరాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆర్డర్స్‌ను ఈ క్లస్టర్స్‌కు కేటాయించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు రవీంద్రనాథ్ తెలిపారు. -
పన్ను వసూళ్లు వేగవంతం చేస్తున్నాం
జంగారెడ్డిగూడెం పట్టణంలో పన్ను వసూళ్లు వేగవంతం చేస్తున్నాం. ఇప్పటికే మైక్‌ల ద్వారా, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా పన్ను చెల్లించేలా చైతన్య పరుస్తున్నాం. రూ.11.34 కోట్లకు గాను ఇంతవరకు రూ.5.38 కోట్లు వసూలైంది. మార్చి నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో పన్నులు వసూలు చేసేలా చర్యలు చేపట్టాం. మొండి బకాయిలపై ప్రత్యేక చర్యలు చేపట్టి వసూలు చేసేందుకు కృషిచేస్తున్నాం. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి పన్ను వసూళ్లల్లో జంగారెడ్డిగూడెం మున్సిపాల్టీని ప్రథమ స్థానంలో నిలిచేలా అధికారులను సమన్వయం చేసుకుని చర్యలు తీసుకుంటున్నాం. – కేవీ రమణ, కమిషనర్, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ -
సారా రహిత రాష్ట్రంగా మార్చుదాం
నూజివీడు: కాపు సారాను పూర్తిగా నిర్మూలించడానికి రాష్ట్ర ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, దీని ద్వారా రాష్ట్రాన్ని కాపు సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కమిషనర్ నిశాంత్‌కుమార్ అన్నారు. పట్టణంలోని ఎకై ్సజ్ స్టేషన్‌ను బుధవారం ఆయన సందర్శించారు. అనంతరం మట్లాడుతూ కాపుసారా అనర్ధాల గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ఎకై ్సజ్ కేసుల్లో పాత నేరస్తులను బైండోవర్ చేయాలని, బైండోవర్‌ను ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించాలన్నారు. సారా తయారీ, క్రయవిక్రయాలు గురించి సమాచారాన్ని 14405 టోల్ ఫ్రీ నెంబర్‌కు తెలిపేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డైరెక్టర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ రాహుల్ దేవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
రైతు వ్యతిరేక విధానాలపై ఆగ్రహం
ఏలూరు (టూటౌన్): మోడీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్త పిలుపు మేరకు రైతులకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల జిల్లా సమన్వయ సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలని, పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలంటూ నినాదాలు చేశారు. రైతు సంఘం సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, రైతు కూలీ సంఘం సహాయ కార్యదర్శి షేక్ బాషా, బీకేఎంయు రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. జిల్లాలో మిర్చి, పత్తి, కోకో, మినుములు, పెసలు వంటి పంటలకు ధరలు పతనమై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ఇంకా ప్రారంభించలేదని, సాగునీటి ప్రాజెక్టులు, పంట కాలువలు, డ్రైన్ల నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేశారు. -
స్పందన
మోదేలులో వాటర్ ట్యాంక్ ఏర్పాటు బుట్టాయగూడెం: గతనెల 25న సాక్షి దినపత్రికలో ప్రచురించిన ‘దశాబ్దాలుగా చీకట్లోనే’ కథనంపై అధికారులు స్పందించారు. మోదేలు గ్రామానికి మంచినీటి సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తున్నారు. గ్రామంలో 5 వేల లీటర్ల కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంక్ నిర్మించడంతోపాటు గ్రామంలోని 15 ఇళ్లకు పైప్లైన్లు ఏర్పాటు చేసి ఇంటింటికీ ట్యాప్ నీరు వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. జలజీవన్ మిషన్ పథకంలో సుమారు రూ.6.50 లక్షలు మంజూరయ్యాయని ఆ నిధులతో గ్రామంలో మంచినీటి సమస్య తలెత్తకుండా సోలార్ సిస్టమ్ ద్వారా నీరు వాటర్ ట్యాంక్‌లకు వెళ్ళే ఏర్పాట్లు చేస్తున్నామని వేలేరుపాడు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గుజ్జెల జగదీష్ తెలిపారు. దూరవిద్య ఇంటర్ పరీక్షకు 454 మంది హాజరు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): దూర విద్యా విధానంలో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షల్లో బుధవారం తెలుగు పేపర్ బుధవారం నిర్వహించారు. పరీక్షకు 511 మందికి గాను 454 మంది విద్యార్థులు హాజరు కాగా, హిందీ పరీక్షకు 17 మందికి 15 మంది హాజరయ్యారు. ఉర్దూ పరీక్షకు నలుగురు హాజరయ్యారు. ఉపాధి హామీలో పనులు కల్పించాలి ఏలూరు (టూటౌన్): ఉపాధి లేని గ్రామీణ పేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించి వలసలను నివారించాలని కోరుతూ జిల్లా రెవెన్యూ అధికారికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బికేఎంయు) నాయకులు బుధవారం వినతిపత్రం సమర్పించారు. బీకేఎంయు రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఏలూరులో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. గ్రామీణ పేదల వలసల నివారణ కోసం ఉపాధి హామీ పనులు కుటుంబానికి సంవత్సరానికి 200 రోజులు కల్పించి, రోజు కూలీ రూ.700 ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీకేఎంయు జిల్లా అధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు బకాయి పడ్డ డబ్బులు తక్షణమే చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గొలిమే బాల యేసు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలి ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): బుధవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పేపర్–2లో చోటు చేసుకున్న రెండు ప్రశ్నలకు విద్యార్థులు గందరగోళానికి గురయ్యారని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రంలో రోమన్ నెంబర్ 8లో 5 మార్కుల ప్రశ్నకు సంబంధించి, రోమన్ నెంబర్ 13లో మరో 5 మార్కుల ప్రశ్న అర్థంకాకుండా ఉండడంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారన్నారు. ఈ మేరకు విద్యార్థులు విలువైన 10 మార్కులు కోల్పోయే ప్రమాదంలో పడ్డారని ఇందుకుగాను ప్రభుత్వం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం చింతలపూడి: 5వ తరగతి నుండి ఎనిమిదో తరగతి వరకు ఇంటర్ మొదటి, డిగ్రీ ప్రథమ సంవత్సర ప్రవేశ పరీక్షకు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నాగిరెడ్డిగూడెం ఏపీఆర్ బాలికల గురుకుల స్కూల్ ప్రిన్సిపాల్ మండలి బ్రాహ్మణేశ్వరమ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31 లోగా దరఖాస్తులను సమర్పించాలని తెలిపారు. 5, 6, 7, 8వ తరగతి వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఇంటర్, డిగ్రీ ప్రథమ సంవత్సరాలకు మధ్యాహ్నం రెండు 2:30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. -
కేసుల పరిష్కారానికి సహకరించాలి
ఏలూరు(టూటౌన్): కేసుల పరిష్కారానికి పోలీసు అధికారులు సహకరించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ ఏలూరు, జంగారెడ్డిగూడెం, భీమడోలు, చింతలపూడి కోర్టుల పరిధిలోని పోలీసు అధికారులతో 8న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ యోగ్యమైన క్రిమినల్ కేసుల పరిష్కారం నిమిత్తం సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ మాట్లాడుతూ కేసుల పరిష్కారానికి పోలీసులు కక్షిదారులతో సంప్రదింపులు జరపాలని, రాజీకి అనుకూలమైన కేసులను ఇప్పటికే గుర్తించామని, ఆ కేసులలో కక్షిదారులకు అవగాహన కలిగించి రాజీకి ప్రయత్నించాలన్నారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్న పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ చేస్తారని చెప్పారు. న్యాయ సలహాలు లేదా సాయం కావాల్సిన వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను 15100 లేదా 08812 224555 నెంబర్లలో సంప్రదించాలన్నారు. -
నారాయణపురంలో పంచాయతీ స్థలం స్వాహా
ఉంగుటూరు : ఆక్రమణకు కాదేది అనర్హం అన్న చందంగా తయారైంది కూటమి ప్రభుత్వంలో పరిస్థితి. కన్ను వేశారా అంతే హాంఫట్.. ఉంగుటూరు మండలం నారాయణపురంలో జాతీయరహదారిని ఆనుకుని గ్రామ పంచాయతీకి చెందిన ఆరు సెంట్ల స్థలాన్ని టీడీపీ తన పేరున ఏకంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. సర్వే నెంబరు–156/2లో ఉన్న ఈ స్థలాన్ని టీడీపీ నేత గంటా యువరాజు తన భార్య పేరున పంచాయతీ స్థలం సరిహద్దులతో 156/1 సర్వే నెంబరుతో ఇటీవల గిఫ్ట్ డీడ్ కింద రిజిస్ట్రేషన్ చేయించారు. పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి అని, తండ్రి తనకు రాశారని రిజిస్ట్రేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పంచాయతీ అధికారులు ఉలిక్కిపడ్డారు. పంచాయతీ కార్యదర్శి విజయ్ తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్న కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ నకళ్లు తీసుకున్నారు. చేబ్రోలు పోలీసు స్టేషన్లో మంగళవారం పంచాయితీ కార్యదర్శి ఫిర్యాదు చేశారు. ఆ పంచాయితీ స్థలానికి సర్వే చేయించి హద్దులు నిర్ణయించి రాటలు పాతారు. ఫెన్సింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.పంచాయతీకి చెందిన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్న విషయంపై పోలీస్టేషన్లో కేసు పెట్టామని కార్యదర్శి తెలిపారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి రద్దు చేయిస్తామని విజయ్ తెలిపారు. ఈ స్థలం మార్కెట్ విలువ రూ.కోటి ఉంటుందని అంచనా. గూడెం రిజిస్ట్రార్ కార్యాలయంలో గోల్మాల్ ఈ స్థలాన్ని తప్పడు సర్వే నెంబరుతో ఎలా రిజిస్ట్రేషన్ చేశారనేది ప్రశ్న. ఈ వ్యవహరంలో తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొందరి హస్తం ఉండొచ్చంటున్నారు. రిజిస్ట్రేషన్ చేసిన 90 రోజుల వ్యవధిలో సర్వే నెంబరు తప్పుగా నమోదైందనే వంకతో ప్రభుత్వ భూమిని కాజేయలనేది ఆ నాయకుడు ఎత్తుగడ. ఈ భూమిని మరో వ్యక్తికి గత నెల 12న తనఖా రిజిస్ట్రేషన్ కూడా చేశారు. తన భార్య పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్న టీడీపీ నేత -
ఒప్పందాలు అమలు చేయాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): హెచ్ఆర్ పాలసీ అమలు కోసం కమిటీని ఏర్పాటు చేయాలని, మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, ఇతర సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం స్థానిక సమగ్ర శిక్ష జిల్లా కార్యలయం వద్ద సమగ్రశిక్ష కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ గతంలో తమ సమస్యలపై సమ్మె చేయగా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని.. అమలు ఇప్పటికీ పెండింగ్‌లో ఉందన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ మార్చి 5, 6 తేదీల్లో మండల కేంద్రంలో, కేజీబీవీ స్కూల్స్ వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో సామూహిక నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 8న జిల్లా కేంద్రంలో మహిళా ఉద్యోగుల సమస్యలపై సదస్సు నిర్వహించి, తీర్మానం చేయనున్నామన్నారు. మార్చి 11న విజయవాడలో నిరసన దీక్ష చేయాలని కమిటీ నిర్ణయించిందన్నారు. -
మహిళా దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు
కలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు(మెట్రో): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని గౌతమీ సమావేశ మందిరంలో మహిళా దినోత్సవ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ నెల 8వ తేదీన సీఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. సుమారు 25 స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 2కె మారథాన్, సైకిల్ ర్యాలీ వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. మహిళలకు హెల్త్ చెకప్ శిబిరాన్ని ఏర్పాటు చేయాలని, క్యాన్సర్ స్క్రీనింగ్‌కు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు, జెడ్పీ సీఈఓ కె.సుబ్బారావు, ఐసీడీఎస్ పీడీ పి.శారద, డీఎస్పీ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బడ్జెట్లో రూ.2,500 కోట్లు కేటాయించాలి
ఏలూరు (టూటౌన్): గొర్రెలు, మేకల అభివృద్ధి, పెంపకందారుల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.2,500 కోట్లు కేటాయించాలని కోరుతూ మార్చి 11న గుంటూరు కొత్తపేటలోని గొర్రెల, మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొట్టేలు పెంటయ్య తెలిపారు. స్థానిక స్ఫూర్తి భవన్లో ఏపీ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో మార్చి 11న గుంటూరులో జరిగే ధర్నా కార్యక్రమం కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెంటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గొర్రెలు, మేకలకు ఏడాదికి నాలుగు సార్లు నట్టల నివారణకు మందులు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పించాలని కోరారు. గొర్రెలు, మేకలకు ఉచిత బీమా సౌకర్యం అమలు చేయాలన్నారు. రాష్ట్ర సమితి సభ్యుడు మాగంటి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మా ఇంటిపై దాడి.. చింతమనేని కుట్ర
బంగారు నగల దోపిడీ జంగారెడ్డిగూడెంలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై ముగ్గురు దాడి చేసి బంగారు నగలు దోపిడీ చేశారు. దాదాపు 8 కాసులు దోచుకుపోయారు. 8లో u● చెరువుల లీజు విషయంలో నాకు సంబంధం లేదు ● మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి పెదవేగి: తన ఇంటిపై టీడీపీ శ్రేణుల దాడిని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి తీవ్రంగా ఖండించారు. తోటలో పామాయిల్ గెలలు కోస్తుండగా, టీడీపీ శ్రేణులు అడ్డుకొని, అక్కడ పనిచేస్తున్నవారిని కొట్టారని, గొడవ జరగకుండా సముదాయించడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని, ఇందులో పలువురికి గాయాలయ్యాయని ఆయన తెలిపారు. చేపల చెరువుల లీజు విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ విషయం తాను ఎప్పుడో ప్రకటించినా.. అక్కడి గ్రామస్తులను బెదిరించి చింతమనేని కనుసన్నల్లో టీడీపీ నేతలు కొంతకాలంగా తన ఇంటి ముందు అక్రమ ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశాంత వాతావరణాన్ని భంగపరిచేందుకు కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చింతమనేని దుర్మార్గ రాజకీయాలకు ఇది నిదర్శనమని తెలిపారు. రెడ్‌బుక్ రాజ్యాంగంపై ఉన్న శ్రద్ధను నియోజకవర్గ అభివృద్ధిపై పెట్టాలని హితవు పలికారు. వైఎసా్‌స్‌ర్‌సీపీ శ్రేణులు దాడులకు భయపడవని, వారికి అండగా ఉంటానని, అధికారం శాశ్వతం కాదని గుర్తించాలని అబ్బయ్య చౌదరి స్పష్టం చేశారు. -
కబ్జా కోరల్లో ప్రభుత్వ స్థలం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వ హయాంలో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. కన్ను పడిందంటే చాలు ప్రభుత్వ భూములు ఆక్రమిస్తున్నారు. ఏలూరు నగర కార్పొరేషన్ పరిధి శనివారపుపేట శ్రీరామ్‌నగర్ 1వ రోడ్డులో విశాలమైన ప్రభుత్వ పోరంబోకు భూమిపై కబ్జారాయుళ్ల కన్ను పడింది. కొన్నేళ్ల క్రితం ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వర్షపునీటితో ఈ భూమి చెరువుగా మారింది. క్రమేపీ చెట్లు, పిచ్చిమొక్కలతో డంప్‌యార్డ్‌గా మారింది. ఇక్కడి నుంచి డ్రయినేజీ మురుగునీరు తమ్మిలేరుకు చేరుతోంది. దీని గట్టుపై పేదలు ఇళ్ళు కట్టుకోగా, దిగువ భూమి ఖాళీగా ఉంది. సుమారు 100 మీటర్లు పొడవు, 50 మీటర్ల వెడల్పు కల్గిన స్థలం విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది. మార్కెట్ విలువ ప్రకారం ఇక్కడ గజం రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకూ పలుకుతోంది. కొద్దినెలల క్రితం మొదట సుమారు 300 అడుగుల స్థలంలో వ్యర్థాలు పోశారు. కొద్దివారాల తర్వాత టిప్పర్లతో కంకర తెచ్చి మెరక చేశారు. ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా చదును చేస్తున్నారు. ప్రజలు అడిగితే ప్రభుత్వం పార్కు కడుతుంది లేదా రైతు బజారు పెడతారంట అంటూ తమ అనుయాయులతో ప్రచారం చేయిస్తున్నారు. ఇదేదో ప్రభుత్వం చేపట్టిన పనే స్థానికులు భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో రైతుబజారుకు ప్లాన్ విశాలమైన ఈ స్థలంలో రైతుబజారు ఏర్పాటుచేయాలని గత ప్రభుత్వ హయాంలో మార్కెట్‌యార్డ్ అధికారులు భావించారు. ఇక్కడ స్థానిక ప్రజల తాగునీటి సరఫరా కోసం ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మించి, దాని చుట్టూ వాకింగ్ ట్రాక్‌తో పాటు జిమ్ ఏర్పాటుచేస్తే బాగుంటుందని కార్పొరేషన్ అధికారులు తలచారు. కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో అధికారుల ఆలోచనలు అమలు కాలేదు. ఇప్పుడు కోట్ల రూపాయల విలువైన భూమి కబ్జారాయుళ్ల చేతిలోకి వెళ్లిపోయింది.ప్రణాళిక ప్రకారం స్వాహాకు యత్నం -
అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు దారుణం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము బలపరిచిన అభ్యర్థి దారుణంగా ఓడిపోవడంతో కూటమి నాయకులు జీర్ణించుకోలేక విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షేక్ ముస్తఫా అలీ, రవికుమార్ రుద్రాక్షి ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు యూటీఎఫ్‌కు వైఎస్సార్సీపీ ముసుగువేస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. వాస్తవానికి ఏపీటీఎఫ్, పీఆర్టీయూ అభ్యర్థులకు కూటమి ముసుగు వేయడం ద్వారా అధికార పక్షమే ఉపాధ్యాయ ఉద్యమంలో చీలికలు తెచ్చిందని విమర్శించారు. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ స్వతంత్రంగా పోటీ చేసిందని దానికి యూటీఎఫ్, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయని గుర్తు చేశారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఏ రాజకీయ పక్షం వహించకుండా మండలిలో స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలతో పాటు ప్రజా సమస్యలపై గళం ఎత్తుతున్నారన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల విజయం
సాక్షి ప్రతినిధి,ఏలూరు: ఉభయగోదావరి జిల్లాల్లో పట్టభద్రుల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగి సింది. ఎన్నికల బరిలో కూటమి అభ్యర్థి, పీడీఎఫ్ అభ్యర్థి మధ్య ప్రధాన పోటీ జరగ్గా.. మరో 33 మంది స్వతంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కూటమి పార్టీ బలపరిచిన టీడీపీ నేత పేరాబత్తుల రాజశేఖరం ఎమ్మెల్సీగా గెలుపొందారు. 1,24,702 ఓట్లు సాధించి సమీప ప్రత్యర్థి, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులపై 77,461 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. మొదట ప్రాధాన్యత ఓటులోనే 50 శాతం పైచిలుకు సాధించడంతో విజేతగా ప్రకటించారు. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లను కట్టలు కట్టడానికే సమయం సరిపోయింది. రాత్రి 10 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ముగించారు. ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాలులో 28 టేబుల్స్ ఏర్పాటు చేసి 17 రౌండ్లు నిర్వహించేలా కట్టలు కట్టారు. అనంతరం ప్రతి టేబుల్‌కు వెయ్యి చొప్పున సగటున ప్రతి రౌండ్లో 28 వేల ఓట్లను లెక్కించి 8 రౌండ్లల్లో ఎన్నికల ప్రక్రియను ముగించేశారు. మొత్తం 2,18,997 ఓట్లు పోల్ కాగా వాటిలో 19,789 ఓట్లు చెల్లనవిగా నిర్ధారించారు. మిగిలిన 1,99,208 ఓట్లను మిగిలిన 8 రౌండ్లల్లో లెక్కించారు. ఎన్నికల బరిలో టీడీపీ అభ్యర్థి, పీడీఎఫ్ అభ్యర్థితో పాటు 35 మంది పోటీ చేశారు. వీరిలో స్వతంత్ర అభ్యర్ధి, మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవీ సుందర్ మాత్రమే సత్తా చాటగా, మిగిలిన వారందరూ నామామత్రంగా కూడా ఓట్లు దక్కించుకోలేదు. 30 గంటల పాటు కౌంటింగ్ ప్రక్రియ గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 30 గంటల పాటు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. ప్రతి రౌండ్లోనూ కూటమి అభ్యర్థి ఆధిక్యం కొన సాగింది. పీడీఎఫ్ అభ్యర్ధి మొదటి రౌండ్ నుంచి వెనుకంజలో ఉన్నారు. మొదటి రౌండ్లో 28 వేల ఓట్లు లెక్కించగా టీడీపీ అభ్యర్ధికి 16,520, పీడీఎఫ్ అభ్యర్ధి 5,815 ఓట్లు దక్కాయి. 8 రౌండ్లు కలిపి టీడీపీ అభ్యర్థికి 1,24,702 మొదటి ప్రాధాన్యత ఓట్లు రాగా.. పీడీఎఫ్ అభ్యర్థి 47,241 ఓట్లు దక్కించుకున్నారు. సత్తా చాటిన జీవీ సుందర్ మాజీ ఎంపీ జీ.హర్షకుమార్ తనయుడు జీవీ సుందర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మెరుగ్గా ఓట్లు సాధించారు. 8 రౌండ్లు కలుపుకుని 16,183 ఓట్లు దక్కించుకున్నారు. స్వతంత్రులుగా పోటీ చేసిన వారిలో కాట్రు నాగబాబు 565, షేక్ హుస్సేన్ 394, కట్టా వేణుగోపాలకృష్ణ 1017, కాండ్రేగుల నర్సింహం 364, కుక్కల గోవిందరాజు 269, కునుకు హేమకుమారి 956, కై లా లావణ్య 365, కొల్లు గౌతమ్ బాబు 317, చిక్కాల దుర్గారావు 665, నోరి దత్తాత్రేయ 565, యళ్ళ దొరబాబు 303, పిప్పళ్ళ సుప్రజ 479, బొమ్మడి సన్నిరాజ్ 398, బండారు రామ్మోహనరావు 709, చిక్కా భీమేశ్వరరావు 254, వానపల్లి శివ గణేష్ 772, హాసేన్ షరీఫ్ 709 ఓట్లు దక్కించుకున్నారు. గెలుపొందిన టీడీపీ అభ్యర్థికి రిటర్నింగ్ అధికారి వెట్రిసెల్వి డిక్లరేషన్ అందించారు. 77,461 ఓట్ల మెజార్టీతో గెలుపు పీడీఎఫ్ అభ్యర్థికి 47,241 ఓట్లు 8 రౌండ్లలో ముగిసిన ఓట్ల లెక్కింపు -
తడబడిన పట్టభద్రులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉభయగోదావరి జిల్లాల్లో పట్టభద్రులు తడబడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 19,789 మంది చెల్లని ఓట్లు వేశారు. వీటిలో 42 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా ఉండటం గమనార్హం. ప్రతి రౌండ్లో సగటున 2,400పైగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఓటుపై అధికారులు అనేక అవగాహన సదస్సులు నిర్వహించారు. అభ్యర్థులు ప్రచారంలో కూడా ఓటు ఎలా వేయాలనేది గ్రాడ్యుయేట్లకు వివరించారు. అయినప్పటికీ వేల సంఖ్యలో చెల్లని ఓట్లు నమోదయ్యాయి. మొదటి రౌండ్లో 2,416, 2వ రౌండ్లో 2607, 3వ రౌండ్లో 2632, 4వ రౌండ్లో 2109, 5వ రౌండ్లో 2329, 6వ రౌండ్లో 2725, 7వ రౌండ్లో 2760, 8వ రౌండ్లో 2211 మొత్తం కలుపుకుని 19,789 చెల్లని ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల విధుల్లో సుమారు 2,700 మంది సిబ్బంది పాల్గొనగా కేవలం 243 మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. వీటిలో కూడా 42 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. బ్యాలెట్ పేపర్లో ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాలి. మొదటి ప్రాధాన్యత ఓటు అభ్యర్ధి పేరు ఎదురు ఉన్న గడిలో 1వ నెంబర్, ప్రాధాన్యతను బట్టి 2, 3, 4 నెంబర్లు ఇతర అభ్యర్థులకు వేయవచ్చు. ఒకే అంకెను ఇద్దరికి వేసినా, 1 వేయకుండా 2, 3, 4 వేసినా నెంబర్లు కాకుండా రోమన్ నెంబర్లు వేసినా, అక్షరాలు రాసినా ఓటు చెల్లదు. ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు ఓటు వేయాలనుకున్న అభ్యర్థు పేరు వద్ద టిక్ పెట్టడం, రౌండ్ చుట్టడం, వారి సొంత పెన్నులు వినియోగించడం వంటి కారణాలతో వేల సంఖ్యలో ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. మొదటి మూడు స్థానాల్లో ఉన్న వారిని మినహాయిస్తే.. మిగిలిన 32 మందికి కలిపి 11,082 ఓట్లు పోలయ్యాయి. వారందరి ఓట్ల కంటే చెల్లని ఓట్లే అధికంగా ఉండటం విశేషం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 19,789 చెల్లని ఓట్లు పోలైన ఓట్లలో 9 శాతం చెల్లనివే -
సత్య సాయి తాగునీరు పునరుద్ధరణ
కొయ్యలగూడెం: సత్యసాయి తాగునీటి సరఫరా పునరుద్ధరణకు నోచుకోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి పత్రికలో ఫిబ్రవరి 28న ‘నిలిచిన సత్యసాయి తాగునీరు’ శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పాటు, సత్యసాయి తాగునీటి సరఫరా సిబ్బంది నాలుగు రోజులపాటు శ్రమించి పైపులైను మరమ్మతులు పూర్తిచేసి సరఫరా పునరుద్ధరించారు. దీంతో పోలవరం, చింతలపూడి నియోజకవర్గాలలోని పలు మండలాలకు తాగునీరు పూర్తిస్థాయిలో అందనుంది. ఎన్నికల సిబ్బందికి అభినందనలు ఏలూరు(మెట్రో): తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా పట్టభధ్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా పూర్తిచేశామని దీనికి సహకరించిన అందరికి అభినందనలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేయడంలో అధికారులు, సిబ్బంది అందరూ టీం స్పిరిట్‌తో అద్భుతంగా పనిచేశారన్నారు. ఈ ఎన్నికల నిర్వహణలో ఓటర్ల జాబితా మొదలుకొని కౌంటింగ్ ముగిసే వరకు సంబంధిత అధికారులందరి సమష్టి కృషితోనే ఎన్నికల ప్రక్రియ విజయవంతమైందన్నారు. ఈ సందర్భంగా పోలీసు యంత్రాంగానికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. త్రీడి బయో ప్రింటింగ్ అద్భుతం తాడేపల్లిగూడెం: శరీరంలో ఏ అవయవం దెబ్బతింటే ఆ అవయవాన్ని ప్రయోగశాలలో కృత్రిమంగా తయారుచేయడానికి త్రీడి బయో ప్రింటింగ్ ఉపయోగపడుతుందని, ఇది ఓ అద్భుతం మంగళవారం నిట్‌లో జరిగిన కార్యక్రమంలో ఐఐటీ బయో ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ అశోక్‌కుమార్ అన్నారు. వైద్య రంగంలో త్రీడి బయో ప్రింటింగ్ ఓ సంచలనంగా మారనుందన్నారు. ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిట్ రిజిస్ట్రార్ దినేష్ శంకర్‌రెడ్డి మాట్లాడుతూ త్రీడి ప్రింటింగ్ టెక్నాలజీ భవిష్యత్‌లో నూతన అధ్యాయానికి నాంది పలకనుందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలి ఏలూరు (టూటౌన్): భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టీయు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా భవన నిర్మాణ కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఐఎఫ్టీయు రాష్ట్ర సహాయ కార్యదర్శి కెవీ రమణ, ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యుడు కాకర్ల శ్రీనివాసు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు అనేక రకాల హామీలు ఇచ్చి గద్దెనెక్కిందన్నారు. తక్షణం కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ బోర్డును పునఃనిర్మించాలని, కార్మికులకు ఆ సంక్షేమ బోర్డు నుంచి పథకాలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్‌కు వినతిపత్రం ఇచ్చారు. -
ఉద్యోగులకు మొండిచేయి
బుధవారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2025ఏలూరు(మెట్రో): ఎన్నికల సమయంలో ఉద్యోగులపై వరాలు కురిపించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా కనికరం చూపడం లేదు. ఉద్యోగులకు అంత చేస్తాం, ఇంత చేస్తాం అని ప్రగల్భాలు పలికిన సర్కారు ఉద్యోగులను పట్టించుకోవడమే మానేసింది. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగుల ప్రస్తావనే రాకుండా బడ్జెట్ సమావేశాన్ని ముగించింది. ప్రతి పథకం అమలు చేయడంలో, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడంలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకం. ఆ ఉద్యోగులను పట్టించుకోకపోవడంపై పెదవి విరుస్తున్నారు. రూ.200 కోట్ల మేర బకాయిలు ఉద్యోగులకు ఇప్పటికే వారి వేతనాలకు అనుగుణంగా 2.5 నుంచి 5.5 శాతం వరకు డీఏలు ఇవ్వాలి. ఉద్యోగులకు 2 డీఏలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ వీటిపై కూటమి సర్కారు నోరు మెదపడం లేదు. కేంద్ర ప్రభుత్వం మరో డీఏ ప్రకటిస్తే మూడు డీఏ బకాయిలు పేరుకుపోయే అవకాశం ఉంది. సరెండర్ లీవ్‌లు రెండు ఇవ్వాల్సి ఉండగా.. వాటి ఊసే బడ్జెట్లో ప్రస్తావించలేదు. సరెండర్ లీవ్‌ల నిమిత్తం రూ.180 నుంచి రూ.200 కోట్ల మేర బకాయిలు ఉద్యోగులకు చెల్లించాలి. ప్రతీ ఉద్యోగి సరెండర్ లీవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఏపీ జీఎల్ఐ ఆధ్వర్యంలో లోన్ల ఫైనల్ క్లైమ్స్ పేరుకుపోయాయి. వీటిపై బడ్జెట్లో ప్రస్తావించలేదు. రిటైర్ అయిన ఉద్యోగులకు 300 రోజుల సంపాదిత సెలవు ప్రస్తావన రాకపోవడం శోచనీయం. గ్రాట్యుటీ విషయంలోనూ అదే నిర్లక్ష్యపు ధోరణిని కూటమి సర్కారు ప్రదర్శిస్తోంది. జిల్లా వ్యాప్తంగా గత 8 నుంచి 9 నెలల కాలంలో సుమారు 800 మంది ఉద్యోగులు రిటైర్ అయినా వీరికి గ్రాట్యుటీ, ఆర్జిత సెలవులకు సంబంధించిన వేతనం నేటికీ లభించలేదు. మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు రూ.50 కోట్ల బకాయి ఉద్యోగులకు వైద్య ఖర్చులు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు జిల్లాలో రూ.50 కోట్లు చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఎక్కడికక్కడ దస్త్రాలు నిలిచిపోయాయి. ఉద్యోగులకు రూ. కోట్లాది రూపాయల బకాయిలు చెల్లించడంలో కూటమి సర్కారు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 35 వేల మంది ఉద్యోగులు, టీచర్లు విధులు నిర్వహిస్తుండగా, మరో 35 వేల మంది పెన్షనర్లు ఉన్నారు. వివిధ స్కీంలలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మరో 15వేల మంది ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ కూటమి సర్కారు మొండి చేయి చూపింది. న్యూస్‌రీల్ రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగులను పట్టించుకోని సర్కారు డీఏలు, సరెండర్ లీవులపై మౌనం ఉమ్మడి జిల్లాలో 80 వేల మంది పెన్షనర్లు, ఉద్యోగులపై ప్రభావం సప్లిమెంటరీ బడ్జెట్ ప్రవేశపెట్టాలి ఉద్యోగులకు మెడికల్ రీయిబర్స్‌మెంట్, డీఏలు చెల్లించాల్సి ఉంది. పెన్షనర్లకు గ్రాట్యుటీ, ఆర్జిత సెలవులు ఇవాల్సి ఉంది. ఇటీవల బడ్జెట్లో ఉద్యోగులకు నిధుల కేటాయింపు లేదు. ఉద్యోగులకు సప్లిమెంటరీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి బకాయిలు చెల్లిస్తే ఉద్యోగులు ఆనందిస్తారు. – చోడగిరి శ్రీనివాసరావు, ఉమ్మడి జిల్లా ఎన్జీవో అధ్యక్షుడు బకాయిల చెల్లింపులో నిర్లక్ష్యం అధికారం చేపట్టి 9 నెలలు కావస్తున్నా ఉద్యోగులపై సర్కారు కనికరం చూపడం లేదు. పేరుకుపోయిన బకాయిలు చెల్లించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. జిల్లాలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.కోట్లలో ఉన్నాయి. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలలి. – కె.రమేష్‌కుమార్, చైర్మన్, ఏపీ జేఏసీ, అమరావతి -
మహారాష్ట్ర డైట్ బృందం పర్యటన
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లా డైట్ కాలేజీ లెక్చరర్లు ఏలూరు జిల్లాలో అధికారిక పర్యటనకు విచ్చేశారు. మంగళవారం ఉదయం స్థానిక సుబ్బమ్మ దేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో టీచర్లతో పలు అంశాలను చర్చించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో కొత్త విధానాలు, బోధనా పద్ధతులు, ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు, ఆధునిక డిజిటల్ పరికరాలు పరిశీలించారు. కొన్ని కార్యక్రమాలను మహారాష్ట్రలో కొన్ని జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించే దిశగా ఏలూరు జిల్లాలో పర్యటించినట్లు ఆ బృందం ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మను, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ కే. పంకజ్ కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. -
ఇంటర్ పరీక్షలకు 17,844 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మంగళవారం నిర్వహించిన ఇంగ్లీష్ పేపర్ –1 పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 55 కేంద్రాల్లో మొత్తం 18,991 మంది విద్యార్థులకు 17844 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 16,374 మంది జనరల్ విద్యార్థులకు గాను 15641 మంది హాజరయ్యారు. 2,617 మంది ఒకేషనల్ విద్యార్థులకు 2,203 మంది హాజరయ్యారు. విద్యార్థుల హాజరు 94 శాతంగా నమోదయింది. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కే యోహాన్ తెలిపారు. -
జీసీసీలో టార్గెట్ పూర్తి చేయకపోతే చర్యలు
బుట్టాయగూడెం: గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ద్వారా నిర్వహిస్తున్న డిపోల్లో అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లు, విక్రయాల టార్గెట్ పూర్తి చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీఓ కె. రాములు నాయక్ హెచ్చరించారు. మండలంలోని కేఆర్‌పురం ఐటీడీఏలో సేల్స్మెన్లు, సిబ్బందితో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మొత్తం 26 జీసీసీ డిపోల ద్వారా గిరిజన ఉత్పత్తులు అమ్మకాలు జరుగుతున్నాయని అన్నారు. ఎవరైనా అలసత్వం వహిస్తే బదిలీలు తప్పవని అన్నారు. అటవీ ఉత్పత్తులు తప్పనిసరిగా గిరిజనుల నుంచి కొనుగోలు చేయాలన్నారు. గిరిజన ఉత్పత్తులను సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉత్పత్తులు సేకరించే సమయంలో గిరిజనులు నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలని అన్నారు. కార్యక్రమంలో జీసీసీ అకౌంటెంట్ రాజయోగి, సిబ్బంది పాల్గొన్నారు. -
12న వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా
ఏలూరు (టూటౌన్): ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ.12వేల నగదు, మూడు సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.6లక్షలు ఇఆ్వలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ.రవి అన్నారు. పేదల సమస్యలపై ఈ నెల 12న విజయవాడలో మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేసారు. స్థానిక పవరుపేటలోని అన్నే భవన్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మహాధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎం.జీవరత్నం, తానా ముత్యాలమ్మ, వై.నాగేంద్రరావు, ఎస్.మహాంకాళిరావు పాల్గొన్నారు. గాలాయగూడెంలో కోళ్ల మృత్యువాత దెందులూరు: మండలంలోని గాలయగూడెంలో కోళ్లు మృత్యువాతకు గురవుతున్నాయి. ఒక వైపు అన్ని ప్రాంతాల్లో వేల సంఖ్యలో కోళ్లు చనిపోవడం పశు వైద్యశాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడం విధితమే. చనిపోయిన కోళ్లను గాలాయగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్ పక్కన చెరువుగట్టు మీద ఉండటంతో కుక్కలు వచ్చి చనిపోయిన కోళ్లను పీక్కుతింటున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా దుర్వాసన వస్తోంది. పశు వైద్య శాఖ సిబ్బంది గ్రామాల్లో పర్యవేక్షణ చేయాలని చనిపోయిన కోళ్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. కట్నం కోసం వేధిస్తున్నారని భర్తపై భార్య ఫిర్యాదు ఉండి: వివాహమైన ఆరేళ్ల తరువాత కట్నం కావాలంటూ వేధింపులకు గురి చేస్తున్నారని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. వివరాల ప్రకారం ఉండి మండలం చెరుకువాడ గ్రామానికి చెందిన కంకిపాటి లక్ష్మీదుర్గకు, ఏలూరుకు చెందిన శ్రావణ్‌కుమార్‌తో 2019లో వివాహమైంది. ఈ నేపథ్యంలో భార్యను రూ.10 లక్షలు కట్నం తేవాలని వేధించేవాడు. అతనికి అత్తమామలు, ఆడపడుచులు సహకరిస్తూ శారీరక, మానసిక వేధింపులు చేసేవారు. గతేడాది డిసెంబర్ 12న లక్ష్మీదుర్గను ఇంటి నుంచి పంపేయడంతో చెరుకువాడలో తల్లిదండ్రులతో ఉంటుంది. ఈ మేరకు బాధితురాలు మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎండీ నసీరుల్లా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అర్ధరాత్రి రోడ్డుపై ఆగిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
దెందులూరు: మండలంలోని ముప్పవరం సోమవారం అర్ధరాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డుపై నిలిచిపోయింది. వివరాలను ప్రకారం వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే నవదిశా ట్రావెల్స్‌కు సంబంధించిన బస్సు సోమవారం సాయంత్రం వైజాగ్‌లో 35 మంది ప్రయాణికులతో బయలుదేరింది. అయితే అర్ధరాత్రి వంటి గంట సమయానికి ముప్పవరం వద్ద రిపేర్ వచ్చి ఆగిపోయింది. దీంతో ఆ సంస్థకు ఫోన్ చేయగా యజమాని దుర్భాషడాలరని ప్రయాణికులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న ఏఎస్సై వెంటేశ్వరరావు బస్సు డ్రైవర్‌తో మాట్లాడి, యజమానికి విషయం తెలపడంతో మంగళవారం మీ సొమ్ములు చెల్లిస్తానని యజమాని చెప్పాడు. దీంతో ప్రయాణికులు రాత్రి సమయంలో వేరే బస్సుల్లో గమ్యస్థానాలకు చేరుకున్నారు. వైభవంగా పెద్దింట్లమ్మ జాతర కై కలూరు: పంచహారతుల మధ్య కొల్లేటికోట పెద్దింట్లమ్మతల్లి దేదీప్యమానంగా భక్తులకు దర్శినమిచ్చారు. పెద్దింట్లమ్మ జాతర మంగళవారానికి నాలుగో రోజుకు చేరింది. అమ్మవారికి పుష్పాలంకరణ, ధూపసేవ, బాలభోగం వంటి వైదిక కార్యక్రమాలు చేశారు. వస్త్ర, పుష్పాలంకరణ, ఉచిత ప్రసాదదాతులుగా ఆటపాకకు చెందిన వేగేశ్న ప్రసాదరాజు, గణపవరానికి చెందిన రుద్రరాజు పుల్లంరాజు అందించారు. ఆలయ ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పెరికేగూడెంకు చెందిన శ్యామలాంబ కళానికేతన్ ఆధ్వర్యంలో త్రిరత్నాలు సాంఘిక ప్రదర్శన అహుతులను అలరించింది. ఆలయ ఈఓ కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఈ నెల 13 వరకు జాతర జరుగుతుందని, జలదుర్గాగేకర్ణేశ్వరస్వామి దివ్వ కల్యాణం ఈ నెల 10న నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రేషన్ బియ్యం పట్టివేత జంగారెడ్డిగూడెం: అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. రెండు వాహనాల్లోనూ 52 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పోలీసులు, రెవెన్యూ శాఖ సంయుక్తంగా జరిపిన దాడిలో మండలంలోని దేవులపల్లి నుంచి కాకినాడ జిల్లా పిఠాపురానికి ఒక వాహనంలో అక్రమంగా రవాణా చేస్తున్న 22 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో పిఠాపురం మండలం బి.పత్తిపాడుకు చెందిన కామిరెడ్డి వీరవెంకట్రావును అరెస్టు చేసినట్లు చెప్పారు. అలాగే జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట నుంచి మరొక వాహనంలో యర్రంపేట కు రవాణా అవుతున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో యర్రంపేటకు చెందిన నల్లమోతు సూర్యప్రకాష్‌ను అరెస్టు చేశామన్నారు. ఈ దాడుల్లో ఎస్సై జబీర్తోపాటు సివిల్ సప్లయిస్ డీటీ జి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సాంకేతికతను రైతులకు అందించాలి తాడేపల్లిగూడెం: కృషి విజ్ఞాన కేంద్రాల్లోని వ్యర్థాలను పునర్వియోగ సాంకేతికతను రైతుల దరికి చేర్చాలని ఉద్యానవర్సిటీ ఉపకులపతి డాక్టర్ కె.గోపాల్ కోరారు. వెంకట్రామన్నగూడెంలో మంగళవారం ఉద్యానవర్సిటీలో నిర్వహించిన శాసీ్త్రయ సాంకేతిక సలహామండలి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ రైతుల పొలాల్లో జీవనియంత్రణ కారకాలు లేకుండా ప్రోత్సహించాలన్నారు. సేంద్రియ వ్యవసాయంపై రైతులకు ఆసక్తి పెంచే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 2024–25లో సాధించిన ప్రగతి, 2025–26 సంవత్సరంలో చేపట్టాల్సిన కార్యాచరణ గురించి చర్చించారు. -
శ్రీవారి సేవలో కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి మంగళవారం రాత్రి సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ముందుగా దేవస్థానం అధికారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె స్వామి, అమ్మవార్లను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు ఆమెకు వేద ఆశీర్వచనాన్ని పలుకగా, సూపరింటెండెంట్ రమణరాజు శ్రీవారి జ్ఞాపికను, ప్రసాదాలను అందజేశారు. కోళ్ల వ్యర్థాల వాహనాలు సీజ్ పెదపాడు: అక్రమ రవాణా చేస్తున్న కోళ్ల వ్యర్థాల వాహనాలను పెదపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారు వివరాలు ప్రకారం పెదపాడు మండలంలోని వడ్డిగూడెం, తోటగూడేనికి కోళ్ల వ్యర్థాల వాహనాలు తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు వాహనాలను అడ్డుకుని వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సదరు వాహన డ్రైవర్ వాహన యజమాని చేపల చెరువు యజమానులపై కేసు నమోదు చేసి, కోళ్ల వ్యర్థాలను ధ్వంసం చేస్తామని ఎస్సై తెలిపారు. -
వృద్ధురాలిపై దాడి, బంగారు నగల దోపిడీ
జంగారెడ్డిగూడెం: ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి బంగారు నగలు దోపిడీ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక సాయి స్ఫూర్తి ఆసుపత్రి సమీపంలో ఒంటరిగా నివసిస్తున్న 70ఏళ్ల రిటైర్డ్ ఉర్దూ టీచర్ షేక్ ఫాతిమున్నీసా ఇంటికి గుర్తు తెలియని 40 నుంచి 45 వయసు కలిగిన ముగ్గురు వ్యక్తులు మధ్యాహ్నం సమయంలో వచ్చినట్లు ఫాతిమున్నీసా తెలిపారు. ఇల్లు అద్దెకు కావాలంటూ ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి ఫాతిమున్నీసాపై దాడి చేశారు. ఆమె అరవకుండా నోరు నోక్కేసి ఆమె చేతికి ఉన్న 5 కాసుల బంగారు గాజులు, మెడలో ఉన్న 3 కాసుల చంద్రహారం దోపిడీ చేసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఫాతిమున్నీసా చేతికి తీవ్ర గాయం కాగా, స్థానిక ఏరియా ఆసుపత్రిలో వైద్యులు సుమారు 8 కుట్లు వైద్యులు వేశారు. ఘటనపై ఆమె స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. -
ఆర్థిక ఇబ్బందులతో ఆక్వా రైతు ఆత్మహత్య
నిడమర్రు: ఆర్థిక ఇబ్బందులతో ఆక్వారైతు నిమ్మల శ్రీను (42) సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెదనిండ్రకొలను గ్రామంలో సంచలనం కలిగించింది. వివరాల ప్రకారం పెదనిండ్రకొలను గ్రామానికి చెందిన నిమ్మల శ్రీను గుణపర్రు గ్రామంలో ఆక్వా చెరువులు లీజుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఆక్వా చెరువుల్లో గ్యాస్ ట్యాబ్లెట్స్ను శ్రీను మింగేసాడు. అనంతరం సోదరుడు రామకృష్ణకు నేను ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నట్లు మృతుడు ఫోన్ చే శాడు. దీంతో కుటుంబ సభ్యులు మృతుని కోసం ఆరా తీసి గుణ పర్రు చెరువుల వద్ద ఉన్నట్లు తెలియడంతో అక్కడకు వెళ్లి గణపవరం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి మెరుగైన వైద్యం కోసం తాడేపల్లిగుడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీను చనిపోయాడు. ఇటీవల ఆశించిన స్థాయిలో ఆక్వా సాగు లేకపోవడం, ఇల్లు కట్టడంతో ఉన్న ఎకరం పొలం అమ్మేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు పెరగడం వల్ల ఆత్మహత్యకు చేసు కున్నాడని స్థానికులు చెబుతున్నారు. మృతుడు సోదరుడు నిమ్మల రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరప్రసాద్ తెలిపారు. మృతుడు శ్రీనుకి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ట్రిపుల్ ఐటీలో క్లే, పెన్సిల్ ఆర్ట్ పోటీలు
నూజివీడు: స్థానిక ట్రిపుల్‌ఐటీలో మంగళవారం విద్యార్థులకు మట్టితో ప్రతిమలు తయారు చేయడం (క్లే ఆర్ట్), పెన్సిల్ ఆర్ట్ పోటీలను నిర్వహించారు. త్వరలో నిర్వహించనున్న వార్షికోత్సవం శ్రీసిగ్నస్శ్రీలో భాగంగా ఈ పోటీలను నిర్వహించారు. విద్యార్థుల సృజనాత్మకతను మెరుగుపరిచే ఉద్దేశంతో నిర్వహిస్తున్నట్లు ఈ పోటీలను ప్రారంభించిన ఆర్జీయూకెటి రిజిస్ట్రార్, నూజివీడు ట్రిపుల్ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కేవీడీజీ బాలాజీ అన్నారు. విద్యార్థుల్లోని కళాపోషణని బయటకి తీస్తూ, మన సంస్కృతిని తెలియజేయడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. క్లే ఆర్ట్ పోటీలో విద్యార్థులు రూపొందించిన ప్రతి ప్రతిమ వెనుక ఒక కథను చెప్పేలా వారి కళాత్మకతను ప్రదర్శించారు. అలాగే పెన్సిల్ ఆర్ట్ పోటీల ద్వారా విద్యార్థులు సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా అద్భుతమైన చిత్రాలను చిత్రీకరించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ట్రిపుల్ఐటీ ఏఓలు బి.లక్ష్మణరావు, సతీష్, సిగ్నస్ కన్వీనర్ జె.సీతాపతి తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఐటీలో పలు వర్క్‌షాపులు నూజివీడు: ట్రిపుల్‌ఐటీలో మంగళవారం పలు వర్క్‌షాపులు నిర్వహించారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్ తయారీపైన, పియూసీ విద్యార్థులకు క్రియేటివ్ డిజైన్ మాస్టరీ వర్క్‌షాపులను నిర్వహించారు. టెక్‌జైట్–2025లో భాగంగా ఈ వర్క్‌షాపులను నిర్వహించామని నూజివీడు ట్రిపుల్ఐటీ ఏఓ బీ లక్ష్మణరావు పేర్కొన్నారు. పీయూసీ విద్యార్థులకు క్రియేటివ్ డిజైన్‌లో నిర్వహించిన వర్క్‌షాపులో సీనియర్ ప్రొడక్ట్ అండ్ గ్రాఫిక్ డిజైనర్ చోడిశెట్టి సూర్యత్రినాధ్ పాల్గొని డిజైన్ రంగంలో ఉన్న అవకాశాలు, మెరుగైన డిజైనింగ్ స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకోవడం, మార్కెట్లో ఉన్న డిమాండ్ తదితర అంశాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. -
బంగారు హారాన్ని పోగొట్టుకున్న భక్తురాలు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో ఒక భక్తురాలు మంగళవారం తన మెడలోని 5 కాసుల బంగారు హారాన్ని పోగొట్టుకుంది. బాధితురాలి కథనం ప్రకారం పెదవేగి మండలం అంకన్నగూడెంకు చెందిన కోసూరి దుర్గా ప్రభావతి కుటుంబ సభ్యులతో కలసి ద్వారకాతిరుమలకు వచ్చారు. అనంతరం శ్రీహరి కళాతోరణం వేదిక పక్కనున్న ప్రాంతంలో కొబ్బరికాయలు కొట్టి, తిరుగు ప్రయాణం అయ్యే క్రమంలో వాహనాల పార్కింగ్ ప్రాంతంలోకి వచ్చేసరికి మెడలో బంగారు హారం లేకపోవడాన్ని ఆమె గమనించి, దేవస్థానం అధికారులకు సమాచారం అందించింది. సిబ్బంది సీసీ ఫుటేజీలను పరిశీలించి మంచినీటి కుళాయి వద్ద, కింద పడి ఉన్న హారాన్ని ఒక మహిళ తీసుకుని వెళ్లిపోయినట్టు గుర్తించారు. వెంటనే బాధితురాలు స్థానిక పోలీసులను ఆశ్రయించింది. లోక్‌అదాలత్‌లో బీఎస్ఎన్ఎల్ బిల్లుల కేసులను పరిష్కరించుకోవాలి ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని బీఎస్ఎన్ఎల్ బిల్లుల బకాయిల కేసులను పరిష్కరించుకోవాలని ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ఎల్ శ్రీను తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వినియోగదారులు జిల్లా, మండల న్యాయ సేవాధికార కమిటీలతో ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, తణుకు, భీమవరం, నరసాపురం పరిధిలోని లోక్ అదాలత్ కోర్టుల్లో ఈ నెల 8వ ఉదయం 10 గంటల నుంచి నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ నందు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. వినియోగదారులు తమ బకాయిలను ముందుగానే చెల్లించాలనుకుంటే వారు తమ దగ్గరలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 94947 08898, 9490312777, 94404 33533 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. తప్పిపోయిన పిల్లల అప్పగింత గణపవరం: తప్పిపోయిన ఇద్దరు బాలుర విషయమై గణపవరం పోలీసులు అత్యవసరంగా స్పందించడంతో వారిని గంటల వ్యవధిలోనే పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన 13 సంవత్సరాల వయస్సు ఉన్న ఇద్దరు బాలురు ఈ నెల 3వ తేదీ రాత్రినుంచి కనిపించకుండా పోయారు. వారికోసం కుటుంబసభ్యులు స్నేహితులు, బంధువుల ఇళ్లు గాలించినా ఫలితం లేకపోవడంతో ఆ పిల్లల అమ్మమ్మ పూడి కాంతమ్మ అర్ధరాత్రి 3 గంటలకు 112 నెంబరు ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే గణపవరం సీఐ ఎంవి సుభాష్, ఎస్సై మణికుమార్‌లు స్పందించి హెడ్‌కానిస్టేబుల్ రత్నప్రసాద్, పీసీ పి.కాంతయ్య, హెచ్‌సీ ఎం.సతీష్‌తో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి గాలించడంతో పిప్పర పరిసర ప్రాంతాలలో పిల్లలను గుర్తించి మంగళవారం ఉదయం పట్టుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
పేదింట నిత్యావసరాల మంట
సాక్షి, భీమవరం: పేదల్లో ఇళ్లల్లో నిత్యావసరాల మంట రాజుకుంటుంది. నిత్యావసరాల ధరలకు రెక్కలు రావడంతో పేదల ఇంట పప్పులు ఉడకనంటుంటే.. నూనెలు సలసలమంటున్నాయి. రేషన్ ద్వారా కందిపప్పు సరఫరాకు సర్కారు ఎగనామం పెట్టగా, ధరల నియంత్రణ కోసమంటూ గతంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి. మార్కెట్లో పప్పుల ధరలు మండిపోతున్నాయి. కిలో కందిపప్పు రూ. 150 ఉంటే పెసరపప్పు రూ. 130, మినపప్పు రూ. 110 ఉంది. మరోవైపు పామాయిల్ ప్యాకెట్ రూ.140లు ఉండగా, సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.150 ఉంది. జనవరిలో రూ.120 ఉన్న పామాయిల్ ఫిబ్రవరిలో రూ. 20 పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. అదేమాదిరి ఇతర నూనెల ధరలు పెరిగాయి. నిత్యావసరాలు లేనిదే రోజు గడవని పరిస్థితుల్లో పెరుగుతున్న ధరలు పేదలకు భారమవుతున్నాయి. ధరల నియంత్రణ దిశగా ప్రభుత్వం చొరవ చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది. పత్తాలేని ప్రత్యేక కౌంటర్లు నిత్యావసరాల ధరల నియంత్రణ కోసం సివిల్ సప్లయిస్ శాఖ ఆధ్వర్యంలో నవంబరులో జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు తదితర నియోజకవర్గ, మండల కేంద్రాల్లోని సూపర్ మార్కెట్లు, రైతు బజార్లు, ప్రైవేట్ దుకాణాల్లో 22 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. హోల్‌సేల్ ధరలపై ఉల్లిపాయలు, పామాయిల్, టమాట, బియ్యం తదితర సరుకుల అమ్మకాలు చేపట్టారు. పామాయిల్ రూ. 110కు, ఇతర సరుకులను బయటి మార్కెట్లో కంటే కొంతమేర తగ్గింపు ధరలకు విక్రయాలు చేశారు. అయితే నిర్వహణ సరిగా లేక కొద్దిరోజులకే చాలా చోట్ల ఇవి మూతపడిపోయాయి. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా ఇవి వినియోగంలో ఉన్న దాఖలాలు లేవు. కందిపప్పు రాలేదు జిల్లాలో 5.68 లక్షల రేషన్‌కార్డులు ఉండగా 356 ఎండీయూ వాహనాల ద్వారా బియ్యం, పంచదార సరఫరా చేసేవారు. అక్టోబరు నుంచి కందిపప్పు పంపిణీ ప్రారంభించిన కూటమి ప్రభుత్వం ఐదు నెలలు తిరగకుండానే చేతులెత్తేసింది. జిల్లాలో 1,052 మంది రేషన్ డీలర్లు ఉండగా ప్రతినెలా 20వ తేదీలోపు సరుకుల కోసం అవసరమైన మొత్తానికి డీడీలు తీయాల్సి ఉంది. ఈ మేరకు నాలుగు నెలలు పాటు కార్డుదారులకు కిలో రూ. 67కు కందిపప్పు సరఫరా చేసింది. ఫిబ్రవరి నెలకు కందిపప్పు కోసం డీలర్లు డీడీలు తీయగా 568 టన్నులకు గాను కేవలం 110 టన్నులు మాత్రమే సరఫరా చేసింది. డీడీల్లోని మిగిలిన సొమ్ములను ఇతర సరుకులకు సర్దుబాటు చేశారు. అయితే మార్చి నుంచి ప్రభుత్వం పూర్తిగా కందిపప్పు సరఫరాను నిలిపివేసింది. ఈ నెలలో కందికప్పు కోసం డీడీలు తీయవద్దని సివిల్ సప్లయిస్ అధికారులు ముందుగానే డీలర్లకు సమాచారం ఇచ్చారు. గత నెలలో పూర్తిస్థాయిలో కందిపప్పు రాకపోవడంతో వచ్చిన సరుకును సరిగా పంపిణీ చేయకుండా కొందరు పక్కదారి పట్టించారన్న ఆరోపణలున్నాయి. కందిపప్పు కోసం ఎండీయూ వాహనాల ఆపరేటర్లను అడుగుతుంటే స్టాకు రాలేదని చెబుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. దీంతో కందిపప్పును బయటిమార్కెట్‌లో అధిక ధర వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. కాగా ఈ నెలకు సంబంధించి కందిపప్పు రాలేదని సివిల్ సప్లయిస్ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలు మేరకు సరఫరాపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఆకాశాన్ని అంటుతున్న పప్పుల ధరలు సలసలమంటున్న నూనెలు కందిపప్పు పంపిణీకి సర్కారు ఎగనామం కందిపప్పు కొనలేకున్నాం రేషన్ షాపుల ద్వారా కందిపప్పు సరఫరా చేయకపోవడంతో బహిరంగ మార్కెట్లో అధిక ధరలు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది. మార్కెట్లో కొన్న కందిపప్పు నాణ్యంగా ఉండడం లేదు. రేషన్ షాపు ద్వారా కందిపప్పు సరఫరాను పునరుద్ధరించాలి. – ఎ.సత్యవతీదేవి, ఆకివీడు నిత్యావసరాల ధరలు పెరిగాయి గత కొద్ది రోజులుగా నిత్యవసరాల ధరలు పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు సరుకులు కొనుక్కోవాలంటే భారంగా ఉంటుంది. కందిపప్పు, మినప్పప్పు అలాగే ఆయిల్ రేట్లు పెరిగాయి. నిత్యావసరాల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – బి చంద్రకుమారి, జున్నూరు పెద్దపేట -
కృత్రిమ మేధ వినియోగం పెరిగింది
తాడేపల్లిగూడెం: కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, డ్రోన్ టెక్నాలజీ వినియోగం రోజురోజుకూ పెరుగుతోందని ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ డాక్టర్ జీవీవీ శర్మ అన్నారు. సోమవారం ఏపీ నిట్‌లో అన్‌మేన్డ్ ఏరియల్ వెహికల్స్ ఫర్ వైర్లెస్ కమ్యూనికేషన్ అండ్ రిమోట్ సెన్సింగ్ అంశంపై జరిగిన ిస్కిల్ డెవలప్మెంట్ వర్క్‌షాపులో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. రిమోట్ కంట్రోల్ సహాయంతో పనిచేసే సమర్థవంతమైన డ్రోన్లు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ఆన్లైన్లో పాల్గొన్న మరో అతిథి ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ పి.రాజ్యలక్ష్మి మాట్లాడుతూ మానవరహిత వాహనాల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఈ దిశగా పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. నిఘా నేత్రాలుగా డ్రోన్లు అద్భుత పాత్ర పోషిస్తున్నాయని నిట్ రిజిస్ట్రార్ దినేష్ రెడ్డి, డీన్ రవికిరణ్ శాస్త్రి అన్నారు. నై పుణ్యాల మెరుగుకు ఇలాంటి కార్యక్రమాలు దో హదపడతాయని ఈసీఈ విభాగాధిపతి భానావతు నర్సింహారావు అన్నారు. వి.సందీప్, గుర్రాల కిరణ్‌కుమార్, కార్తికేయశర్మ పాల్గొన్నారు. -
సెక్యూరిటీ సిబ్బంది నిజాయతీ
ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది నిజాయతీ చూపి భక్తురాలికి హ్యాండ్‌బ్యాగ్‌ను అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. సోమ వారం కాకినాడకు చెందిన ఓ భక్తురాలు శ్రీవారి దర్శనానికి విచ్చేసి స్వామివారి పాదుకా మండపం వద్ద ఉన్న కల్యాణ మండపంలో కాసేపు కూర్చున్నారు. ఆ సమయంలో ఆమె తన హ్యాండ్‌బ్యాగ్‌ను మండపంలో విడిచి వెళ్లిపోయారు. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది హ్యాండ్ బ్యాగ్‌ను తెరిచి చూడగా బంగారు నగలు ఉన్నాయి. వెంటనే దానిని ఆలయ అధికారులకు అప్పగించారు. అధికారులు మైక్ ద్వారా అనౌన్స్ చేసి బాధిత భక్తురాలికి బ్యాగ్‌ను అందజేశారు. సెక్యూరిటీ సిబ్బంది నిజాయతీని భక్తులు మెచ్చుకున్నారు. -
6న కోకో రైతుల ధర్నా
పెదవేగి: కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా కొనుగోలు చేయాలని, కిలో గింజలకు రూ.900 ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 6న ఉదయం 10 గంటలకు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు ఏపీ కోకో రైతు ల సంఘం, ఏపీ రైతు సంఘం నాయకులు ప్రకటించారు. సోమవారం పెదవేగి మండలం విజయరాయిలోని కోకోనట్ గ్రోయర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద చలో కలెక్టరేట్ ధర్నా కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజలకు రూ.900 వరకు ధర ఉన్నా కొనుగోలు కంపెనీలు ఆ ధరను చెల్లించడం లేదన్నారు. ప్రాంతీయ కొబ్బరి రైతుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు బొల్లు రా మకృష్ణ, కోకో రైతుల సంఘం నాయకులు కోనేరు సతీష్, రాపర్ల తేజ కృష్ణ, వట్టికూటి రామవతారం తదితరులు పాల్గొన్నారు. -
చురుగ్గా పోలవరం ప్రాజెక్టుజంట సొరంగాల పనులు
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్‌వాల్ నిర్మాణం పనులతో పాటు కుడి కాలువను అనుసంధానం చేసే ప్రాజెక్టు అనుబంధ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఏలూరు జిల్లా పోలవరం మండలం తోటగొంది, మామిడిగొంది, దేవరగొంది గ్రామాల మధ్య గల జంట సొరంగాల పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. రెండు సొరంగాలను వెడల్పు చేస్తున్నారు. ఎంట్రీ, ఎగ్జిట్ ఛానల్ పనులు కూడా జరుగుతున్నాయి. 63వ ప్యాకేజీలో టన్నెల్ 715 మీటర్లు, 64వ ప్యాకేజీలో టన్నెల్ 826 మీటర్ల పొడవునా తవ్వకం పనులు జరిగాయి. సొరంగాల్లో షాట్ గ్రేటింగ్ పనులు జరుగుతున్నాయి. టన్నెల్స్‌లో లైనింగ్ పనులు చేపట్టేందుకు సంబంధించి ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో లైనింగ్ పనులు ప్రారంభించడం జరుగుతుందని ఈఈ బాలకృష్ణమూర్తి తెలిపారు. -
కూటమికి ఓటమి రుచి చూపిన ఉపాధ్యాయులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కూటమి ప్రభుత్వానికి ఉపాధ్యాయులు తొమ్మిది నెలల కాలంలోనే ఓటమి రుచి చూపించారని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సుధీర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపర్చిన అభ్యర్థిని ఘోరంగా ఓడించి వ్యతిరేకతను చూపించారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఐఆర్, పీఆర్సీ, డీఏల విషయంలో ఏమీ ప్రకటించలేదని తెలిపారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పై సానుకూల వైఖరి లేకపోవటమే కూటమి ఓ టమికి కారణమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులను సమస్యలు పరిష్కరించాలని కోరారు. జాతీయ పురస్కారానికి ‘బీ ఏ హ్యూమన్’ ఎంపిక జంగారెడ్డిగూడెం: జాతీయ ప్రత్యేక ప్రశంసా పురస్కారానికి బీ ఏ హ్యూమన్ లఘు చి త్రం ఎంపికైంది. 2024 లఘుచిత్ర పోటీల్లో జంగారెడ్డిగూడెంకు చెందిన ఔత్సాహిక దర్శకుడు నవీన్ లొట్ల నిర్మించిన బీ ఏ హ్యూమన్ విజేతగా నిలిచింది. సోమవారం నవీన్ మాట్లాడుతూ జాతీయ స్థాయికి 303 లఘుచిత్రాలు ఎంట్రీ సాధించగా, వాటిలో 7 చిత్రాలు విజేతలుగా నిలిచాయన్నారు. వాటిలో బీ ఏ హ్యూమన్ ఒకటని, గృహ హింస, మహిళలపై దాడులు, ఆడబిడ్డలను అనాథలుగా వదిలేయడం, సమాజ జో క్యం ఇతివృత్తంగా దీనిని నిర్మించామన్నారు. ఈ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషంతో పాటు స్ఫూర్తిని ఇచ్చిందన్నారు. స్థానికులు శైలజ, బాబీ, ఎల్ఆర్ కృష్ణబాబు, సింధు రాజ్‌కుమార్, త్రిపుర, పోతురాజు, వల్లి, అశోక్ లఘుచిత్రంలో నటించారని, రాజ్‌కిరణ్ (కెమెరా), ఆలీ (డబ్బింగ్ బీజీఏం), డబ్బింగ్ ఆర్టిస్ట్ పర్వీన్ సహకరించారన్నారు. పురస్కారంతో పాటు రూ.50 వేల నగదు బహుమతిగా జాతీయ మానవ హక్కుల సంఘం అందించనుందని, త్వరలో ఢిల్లీలో పురస్కారాన్ని అందుకోనున్నానని నవీన్ తెలిపారు. ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా తయారీ ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పూర్వపు పశ్చిమగోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల యాజమాన్యాల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సాధారణ సీనియార్టీ జాబితాను రూపొందించినట్టు ఏలూరు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. జాబితాలను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో, పాఠశాలల నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 10లోపు సమర్పించాలని సూచించారు. ఉపాధ్యాయుడి పూర్తి పేరు, పదవి, సంబంధిత వివరాలు, జాబితాలో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పేర్కొనాలని, ఆధారాలు లేదా సాక్ష్యాలు ఉంటే జత చేయాలని తెలిపారు. గడువు తర్వాత అందిన అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలక ఏలూరు డీఈఓ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. పాలకొల్లులో మరో పసికందు గుర్తింపు విజయవాడ స్పోర్ట్స్: నెలలు నిండని పసి కందులను విక్రయిస్తున్న విజయవాడ మహిళల ముఠా నుంచి మరో చంటి బిడ్డను ఎన్టీఆర్ జిల్లా పోలీసు యంత్రాంగం కాపాడింది. ఢిల్లీ, అహ్మదాబాద్ నుంచి చిన్నారులను తీసుకొచ్చి విజయవాడ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్న విజయవాడ ముఠాను ఈనెల 1వ తేదీ శనివారం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ముఠా ఇచ్చిన సమాచారంతో 2వ తేదీ ఆదివారం రాజమండ్రిలో ఓ చంటి బిడ్డను పోలీసులు స్వాధీనం చేసుకుని సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. కేసు దర్యా ప్తులో భాగంగా మరో పసికందును పశ్చిమగోదా వరి జిల్లా పాలకొల్లులో పోలీసులు గుర్తించారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ కె.లతాకుమారి, మహిళా పోలీసులు ఈ పాపను వారి చేతుల్లోకి తీసుకొని సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. -
చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలకు పరాకాష్ట
భీమడోలు: ప్రజా సంక్షేమం, అభివృద్ధిని మరిచి సీఎం చంద్రబాబు వైఎస్సార్ సీపీ శ్రేణులే లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలకు, కుట్రపూరిత రాజకీయాలకు పెద్ద పీఠ వేయడం దురదృష్టకరమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ వర్కింగ్ అధ్యక్షుడు నౌడు వెంకట రమణ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ శ్రేణులను పాములతో పోల్చడం బాబు నీతిమాలిన రాజకీయాలకు పరాకాష్ట అని, ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నిర్వహించిన టీడీపీ ప్రజావేదికలో వైఎస్సార్ సీపీ శ్రేణులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను పనులు చేయవద్దని, వారికి పనులు చేస్తే పాములకు పాలు పోసినట్లేనని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 40 శాతం ఓటర్లను పాములుగా పోల్చడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లేనన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో కుల, మత, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఆయన్ను చూసైనా బుద్ది మార్చుకోవాలని నౌడు హితవు పలికారు. -
ఎస్సీలను అణగదొక్కడానికి కుట్ర
తాడేపల్లిగూడెం (టీఓసీ): తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీలను అన్ని రంగాల్లో అణగదొక్కడానికి మనువాదులు కుట్ర చేస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యుడు చీకటిమిల్లి మంగరాజు ఆందోళన వ్యక్తం చేశారు. మాల మహానాడు ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంరద్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎస్సీల మధ్య చిచ్చుపెట్టి, మొత్తానికి ఎస్సీ రిజర్వేషన్ తీసివేసేందుకే ఈ కుట్ర అని అన్నారు. ఈ కుట్రలో మందకృష్ణ మాదిగను పావులా మనువాదులు వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కొన్నేళ్లుగా మాలలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేయకుండా చూడాలన్నారు. మాలలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాలకు వెనుకాడరని హెచ్చరించారు. ఉన్నమట్ల విజయకుమారి, గుంపుల సత్యకృష్ణ, డెక్కపాటి రమణ, మరపట్ల రాజు, ఏలూరి రవి, భాస్కరరావు పాల్గొన్నారు. -
కట్టలు కట్టేందుకే 12 గంటలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రహసనంలా మారింది. రెండు జిల్లాల్లోని ఓట్లను కట్టలు కట్టడానికే 12 గంటలకు పైగా సమయం పట్టింది. ఏలూరు జిల్లా అధికార యంత్రాంగానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ తొలిసారి కావడం, ఇతరత్రా కారణాలుగా కనిపిస్తున్నాయి. మూడు షిప్టుల్లో 700 మంది సిబ్బందిని నియమించినా కౌంటింగ్ ప్రక్రి య వేగంగా సాగడం లేదు. 456 పోలింగ్ కేంద్రాల్లో.. : గత నెల 27న ఆరు జిల్లాల పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ జరిగింది. ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఎన్నికల రిట ర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. కౌంటింగ్‌కు ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్‌ను ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేశారు. మొ త్తంగా 456 పోలింగ్ కేంద్రాల్లో 3,14,984 మందికిగాను 2,18,997 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉద యం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. 6.30 గంటలకే దాదాపు 250 మంది సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. మొత్తంగా 1,368 బ్యాలెట్ బాక్సులను 17 రౌండ్లుగా విభజించి కట్ట లు కట్టే ప్రక్రియ ప్రారంభించారు. ఈ ప్రక్రియ రాత్రి 8.30 గంటల వరకు సాగింది. 28 టేబుళ్లను ఏర్పాటు చేసి 17 రౌండ్లుగా విభజించి కట్టలు కట్టిన ఓట్ల లెక్కింపునకు సన్నద్ధం చేశారు. అనంతరం రాత్రి 9 గంటల నుంచి చెల్లిన, చెల్లని ఓట్లను వేరు చేసి లెక్కింపు మొదలుపెట్టారు. ఈ ప్రక్రియకు సు మారు 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో రాత్రి 11 గంటలకు మొదటి రౌండ్ లెక్కింపు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆరు జిల్లాల అధికారులున్నా ఆలస్యమే.. కౌంటింగ్ కేంద్రం వద్ద ఆరు జిల్లాల్లో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించిన డీఆర్వో లు, ఇతర జిల్లా స్థాయి అధికారులతో పాటు తహ సీల్దార్లు, వివిధ విభాగాల అధికారులు విధుల్లో ఉన్నా లెక్కింపు ప్రారంభానికి తీవ్ర జాప్యం జరుగుతుంది. ఉదయం 6 గంటలకు విధుల్లోకి వచ్చిన వారు మధ్యాహ్నం 2 గంటలకు వెళ్లిపోతారు. మ ధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంట ల వరకు మూడు ఫిఫ్టుల్లో లెక్కింపు జరుగుతోంది. గుంటూరులో వేగంగా.. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూ రు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ గుంటూరులో కొనసాగుతోంది. అక్కడ కూడా 700 మంది సిబ్బంది, మూడు షిప్టులు ఇదే పద్ధతి ఉన్నా సాయంత్రం 4 గంటలకే కట్టలు కట్టడం పూర్తి చేసి 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. రాత్రి 8.30 గంటల సమయానికే మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. గతంలో నాలుగు సార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ గుంటూరులో నిర్వహించడం, ఇతర కారణాలతో అక్కడ కౌంటింగ్ వేగంగా సాగుతోంది. ఏలూరు జి ల్లాకు మొట్టమొదటిసారి కావడం, అధికారులకు అ నుభవం తక్కువగా ఉండటం, ఇతర కారణాలతో ఇక్కడ మాత్రం ఆలస్యమవుతోంది. ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది మొత్తానికి భోజనాలతో సహా అన్ని ఏర్పాట్లు కౌంటింగ్ కేంద్రం వద్దే ఏర్పాటుచేశారు. ఉదయం 8 గంటల నుంచి ప్రధాన పార్టీలతో పా టు స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లు మొదటి రౌండ్ కౌంటింగ్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం రాత్రి 8.30 గంటల వరకూ కట్టలు కట్టడంతోనే సరి ఉభయగోదావరిలో 456 పోలింగ్ కేంద్రాల్లో 1,368 బ్యాలెట్ బాక్సులు రాత్రి 9 గంటలకు ప్రారంభమైన చెల్లిన, చెల్లని ఓట్ల లెక్కింపు తొలిసారి ఏలూరు జిల్లాలో కౌంటింగ్ తంతు -
పట్టభద్రుల కౌంటింగ్ ప్రారంభం
సాక్షి ప్రతినిధి, ఏలూరు/ ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఓట్ల లెక్కింపు కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఏలూరులోని సర్ సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కలెక్టర్, రిటర్నింగ్ అధికారి కె. వెట్రిసెల్వి నేతృత్వంలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. స్ట్రాంగ్‌రూమ్ కూడా ఇంజనీరింగ్ కళాశాలలోనే ఏర్పాటు చేయడంతో కౌంటింగ్ హాలుకు బ్యాలెట్ బాక్సులు తరలించారు. ఉభయగోదావరి జిల్లాల్లో 2,18,997 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా గతనెల 27న జరిగిన పోలింగ్‌లో 69.50 శాతం పోలింగ్ నమోదైంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కూటమి బలపరిచిన టీడీపీ నేత పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులతో పాటు మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవీ సుందర్కుమార్తో పాటు 32 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. ఉదయం 6.30 గంటల నుంచి.. ఉదయం 6.30 గంటలకు పోలింగ్ కేంద్రంలో సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. కలెక్టర్ పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాలుకు తరలించారు. ఇంజనీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ హాలులో 28 టేబుళ్లను ఏర్పాటు చేసి 17 రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు బ్యాలెట్లు కట్టలు కట్టేందుకు సమయం ప ట్టింది. ఉభయగోదావరిలోని ఆరు జిల్లాల్లో 456 పోలింగ్ కేంద్రాల్లో 1,368 బ్యాలెట్ బాక్సులు విని యోగించారు. వీటన్నింటినీ అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో తెరిచి ఓట్లను కట్టలు కట్టి అనంతరం చెల్లిన, చెల్లని ఓట్లను గుర్తించి అలాగే మొదటి ప్రా ధాన్యత ఓట్లను కూడా గుర్తించేలా లెక్కించనున్నా రు. మొదటి 8 రౌండల్లో మొదటి ప్రాధాన్యతా ఓట్లను లెక్కిస్తారు. 700 మంది సిబ్బంది.. 24 గంటలూ విధులు ఆరు జిల్లాల నుంచి వచ్చిన అధికారులు, ఉద్యోగులు మూడు షిఫ్టుల్లో కౌంటింగ్ విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి షిఫ్టునకు సుమారు 240 మంది సిబ్బంది 8 గంటలపాటు పనిచేసేలా విధులు కేటాయించి ముందస్తుగానే కౌంటింగ్‌కు సంబంధించి శిక్షణా తరగతులు కూడా నిర్వహించారు. ఆరుగురు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 22 మంది ఎస్సైలు, 38 మంది ఏఎస్సైలు, 92 మంది కానిస్టేబుళ్లు, 166 మంది హోంగార్డులు బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నారు. లెక్కింపు ఇలా.. సాధారణ కౌంటింగ్ ప్రక్రియ కంటే కొంత భిన్నంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. పోలైన ఓట్లల్లో చెల్లే ఓట్లను పరిగణనలోనికి తీసుకుంటారు. 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఉదాహరణకు 2,20,000 ఓట్లల్లో సుమారు 1,10,001 ఓట్లు 17 రౌండ్లకుగాను మొదటి 8 రౌండ్లల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించిన అభ్యర్థి విజేతగా నిలుస్తారు. రాత్రి 10 గంటలకు తొలి రౌండ్ ఓట్లు కట్టలు కట్టడం, చెల్లిన, చెల్లని ఓట్లు గుర్తింపు, మొదటి ప్రాధాన్యత ఓట్లు గుర్తింపు ప్రక్రియంతా పూర్తి చేసుకుని సుమారు రాత్రి 10 గంటల సమయంలో మొదటి రౌండ్ లెక్కింపు 28 టేబుళ్లల్లో ప్రారంభమైంది. మొదటి రౌండ్లో 10,783 ఓట్లను లెక్కిస్తున్నారు. ప్రహసనంలా ప్రక్రియ రాత్రి 10 గంటలకు మొదటి రౌండ్ లెక్కింపు 12 గంటలకు పైగా సాగిన బ్యాలెట్ కట్టల విభజన 28 టేబుళ్లలో 17 రౌండ్లలో లెక్కింపు తొలి 8 రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ ఆరు జిల్లాల పరిధిలో పోలైన ఓట్లు 2,18,997 నిరంతరాయంగా సాగుతున్న ప్రక్రియ జిల్లాల వారీగా పోలైన ఓట్లు జిల్లా ఓట్లు పోలింగ్ శాతం ఏలూరు జిల్లా 29,651 70.13 పశ్చిమగోదావరి 48,893 69.80 అల్లూరి సీతారామరాజు 3,637 77.90 డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ 47,125 73.90 తూర్పుగోదావరి 42,446 67.41 కాకినాడ 47,150 68.84 -
టెన్త్ హాల్‌టికెట్లు సిద్ధం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో ఈనెల 17 నుంచి జరిగే ఎస్ఎస్సీ/ఓఎస్ఎస్సీ/ ఒకేషనల్ పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు అన్ని యాజమాన్య పాఠశాలలు లాగిన్లలో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. అలాగే శ్రీమన మిత్ఙ్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా హాల్‌టికెట్లు పొందవచ్చని పేర్కొన్నారు. హాల్‌టికెట్లు ప్రింట్ తీసుకుని విద్యార్థుల వివరాలను హెచ్ఎంలు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. వివరాలు సరిపోలకపోతే ఈ మెయిల్ ద్వారా సంచాలకులు ప్రభుత్వ పరీక్షలు, ఆంధ్రప్రదేశ్, విజయవాడ వారి దృష్టికి తీసుకువెళ్లాలని డీఈఓ పేర్కొన్నారు. -
2,18,997 ఓట్లు.. 17 రౌండ్లు
ఆటో బోల్తా నూజివీడులోని రామాయమ్మరావుపేట వద్ద ఆటో బోల్తా పడిన సంఘటనలో నలుగురికి తీవ్రంగా, 14 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. 8లో uసాక్షి ప్రతినిధి, ఏలూరు: తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,18,997 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఓట్లను లెక్కించేందుకు 17 రౌండ్లల్లో 28 టేబుళ్లు ఏర్పాటుచేశారు. మొదటి 8 రౌండ్లల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించడం, అంతకు ముందే చెల్లిన, చెల్లని ఓట్లను వేరు చేసే పనిలో కౌంటింగ్ సిబ్బంది నిమగ్నమయ్యారు. ఏలూరులోని సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను సోమ వారం ఉదయం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, ఏలూరు ఎస్పీ కె.ప్రతాప శివ కిషోర్‌లు కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించారు. కూటమి పార్టీల మద్దతుతో టీడీపీ నేత పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థిగా రిటైర్డ్ టీచర్ దిడ్ల వీరరాఘవులతో పాటు 33 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. టీడీపీ, పీడీఎఫ్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంది. భారీ పోలీస్ బందోబస్తు కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేశారు. ప్రాధాన్యతా క్రమంలో.. 28 టేబుళ్లకు సగటున 10 నుంచి 15 వేల ఓట్లను కేటాయించి వాటిలో చెల్లిన, చెల్లని ఓట్లను వేరు చేసి అలాగే మొదటి ప్రాధాన్యతా క్రమంలో ఓట్లను వేరు చేసి లెక్కింపు ప్రారంభించారు. మొదటి రౌండ్లో 10,783, రెండో రౌండ్లో 13,929, 3వ రౌండ్లో 11,870, 4వ రౌండ్లో 13,777, 5వ రౌండ్లో 13,168, 6వ రౌండ్లో 14,783, 7వ రౌండ్లో 12,841, 8వ రౌండ్లో 14,296, 9వ రౌండ్లో 14,162, 10వ రౌండ్లో 11,654, 11వ రౌండ్లో 13,674, 12వ రౌండ్లో 12,296, 13వ రౌండ్లో 12,523, 14వ రౌండ్లో 13,876, 15వ రౌండ్లో 14,668, 16వ రౌండ్లో 15,823, 17వ రౌండ్లో 4879 మొత్తం కలిపి 2,18,997 ఓట్లను లెక్కించనున్నారు. -
ఇంటర్ పరీక్షలకు 13,964 మంది..
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సోమవారం పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ లాంగ్వేజ్ పరీక్షలు జరిగాయి. జిల్లాలోని 55 కేంద్రాల్లో 14,319 మంది విద్యార్థులకు 13,964 మంది హాజరయ్యారు. వీరిలో 12,511 మంది జనరల్ విద్యార్థులకు 12,274 మంది, 1,808 మంది ఒకేషనల్ విద్యార్థులకు 1,690 మంది హాజరయ్యారు. మొత్తంగా 98 శాతం హాజరు నమోదైంది. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ తెలిపారు. ‘ఓపెన్’ పరీక్షలకు 559 మంది.. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియెట్ ఇంగ్లిష్ పరీక్షకు సోమవారం 629 మందికి 559 మంది హాజరయ్యారు. డీఈఓ 2 కేంద్రాల్లో, డీఈసీ కమిటీ 2 కేంద్రాల్లో, ఫ్లయింగ్ స్క్వాడ్ మరో 2 కేంద్రాల్లో తనిఖీలు చేశారు. ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ కేసులూ నమోదు కాలేదని, పరీక్షలు ప్రశాంతంగా జరిగా యని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. -
పాము కాటుతో యువకుడు మృతి
కై కలూరు: పొట్టకూటి కోసం చేపల పట్టుబడికి అమరావతి వెళ్లిన యువకుడు పాము కాటుతో మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కై కలూరు మండలం శృంగవరప్పాడు గ్రామానికి చెందిన జయమంగళ నాగరాజు, మరియమ్మలకు ఇద్దరు మగ పిల్లలు. పెద్ద కుమారుడు బతుకుదెరువు కోసం కర్ణాటక రాష్ట్రం వెళ్లాడు. చిన్న కుమారుడు జయమంగళ జాన్(18) పదో తరగతి వరకు చదివి తల్లదండ్రులకు ఆసరాగా మారాడు. ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన 11 మందితో కలసి అమరావతిలో చేపల చెరువు పట్టుబడి నిమిత్తం వాహనంలో వెళ్లారు. తెల్లవారుజామున 3 గంటలు కావడంతో ఉదయం చేపల పట్టుబడి చేద్దామని చెరువు గట్టు షెడ్డులో అందరూ నిద్రించారు. ఆ సమయంలో జాన్ పాము కాటుకు గురయ్యాడు. అయితే నిద్రమత్తులో ఉన్న జాన్ ఈ విషయం గమనించలేదు. ఉదయం రక్తపువాంతులు చేసుకోవడంతో అతడిని సమీపంలో ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందాడు. అతను పాము కాటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని ఇంటికి పంపారు. -
అదుపు తప్పి ఆటో బోల్తా
నూజివీడు: పట్టణంలోని రామాయమ్మరావుపేట వద్ద ఉన్న అన్న క్యాంటీన్ సమీపంలో సోమవారం ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, 14 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిలో ఆటో డ్రైవర్ కాకుండా మిగిలిన 17 మంది మహిళలే. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నూజివీడు పట్టణంలోని కొప్పెలమపేటకు చెందిన మహిళలు పట్టణ పరిధిలోని సరస్వతీ ఆలయం సమీపంలో ఉన్న ప్రియా పచ్చళ్ల కంపెనీలో పనిచేసేందుకు ప్రతిరోజూ వెళ్తారు. వీరు ఉదయం 6 గంటలకు డ్యూటీకి వెళ్లి మధ్యాహ్నం 2 గంటలకు వస్తారు. దీనిలో భాగంగానే సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు డ్యూటీ దిగి 17 మంది మహిళలు ఆటోలో ఇంటికి వెళ్తుండగా రామాయమ్మరావుపేటలోని అన్న క్యాంటీన్ సమీపంలోకి వచ్చే సరికి ఎదురుగా కారు సందులో నుంచి రోడ్డుమీదకు వస్తుండటంతో దానిని తప్పించేందుకు ఆటోను డ్రైవర్ ఒక్కసారిగా పక్కకు తిప్పడంతో ఆటో అదుపు తప్పి పక్కకు పడిపోయి పల్టీలు కొట్టి కరెంటు స్తంభాన్ని ఢీకొంది. స్థానికులు హుటాహుటిన క్షతగ్రాతులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆటోడ్రైవర్ వైకుంఠపు అప్పలనాయుడు(40), సబ్బవరపు వరలక్ష్మి(40), నారగాని ఆదిలక్ష్మి(40), గేదెల వెంకటలక్ష్మి(50)లకు ఏరియా ఆసుపత్రి వైద్యులు ప్రథమ చికిత్సనందించి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. మిగిలిన 14 మందికి ఏరియా ఆసుపత్రిలోనే చికిత్స నందిస్తున్నారు. సామర్థ్యానికి మించి ఎక్కడమే కారణమా? డ్రైవర్‌తో కలిపి ఐదుగురు ఎక్కాల్సిన ఆటోలో సామర్థ్యానికి మించి 18 మంది ఎక్కడమే ప్రమాదానికి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నూజివీడు పట్టణంతో పాటు రెడ్డిగూడెం, ఇతర గ్రామాల నుంచి కూడా ఇదే విధంగా ఓవర్‌లోడుతో ఆటోల్లో ప్రియా పచ్చళ్ల కంపెనీకి డ్యూటీ నిమిత్తం వచ్చి వెళ్తూంటారు. ఇంతకు ముందు వర్కర్ల కోసం బస్సును నడిపిన కంపెనీ కరోనా నుంచి ఆ సదుపాయాన్ని తొలగించింది. దీంతో అప్పటి నుంచి మహిళా వర్కర్లు ఆటోల్లోనే కంపెనీకి వచ్చి వెళ్తున్నారు. పట్టణ సీఐ పీ సత్యశ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నలుగురికి తీవ్ర, 14 మందికి స్వల్ప గాయాలు ప్రియా పచ్చళ్ల కంపెనీలో పని కోసం వెళ్తూ గాయపడిన మహిళలు -
ఎరువుల దుకాణం తనిఖీ
భీమడోలు: స్థానిక సంతమార్కెట్ వద్ద గల సత్యదుర్గా ట్రేడర్స్ ఎరువుల దుకాణాన్ని సోమవారం మండల వ్యవసాయాధికారిణి ఎస్పీవీ ఉషారాణి, వివిధ శాఖల అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్‌లోని ఎరువుల నిల్వలను పరిశీలించారు. దుకాణంలో 367 బస్తాల ఎరువులను రైతులకు విక్రయించగా రైతులకు బిల్లులు ఇవ్వకపోవడం, స్టాక్ నిల్వల్లో తేడాలు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ పోస్ మిషన్‌లో అమ్మకాలు నమోదులోను అవకతవకలకు పాల్పడినట్లు అధికారుల బృందం గుర్తించారు. దుకాణంలో నిల్వ ఉన్న రూ.32760 విలువ గల 126 బస్తాలను సీజ్ చేశారు. నిత్యావసర చట్టం ప్రకారం దుకాణం యజమానిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఏడీఏ ఆర్.గంగాధర్ సిఫారసు చేశారు. ఈ తనిఖీల్లో వీఏఏ ఎం.రూపాదేవి, వీఆర్వోలు కె.వీరప్రతాస్, వి.వినయ్ పాల్గొన్నారు. -
జరిమానాల మోత.. తస్మాత్ జాగ్రత్త
తణుకు అర్బన్: పిల్లాడు బండి నడిపేస్తున్నాడంటూ సంబర పడి మైనర్లకు బండి ఇస్తున్నారా.. కేరింతలు కొడుతూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారా.. హెల్మెట్ లేకుండానే బండి నడుపుతున్నారా.. రహదారుల్లో ఇష్టానుసారంగా వాహనాలను పార్కింగ్ చేసేస్తున్నారా.. ఇన్సూరెన్స్ అవసరం లేదనుకుంటున్నారా అయితే ఇక మీకు జరిమానాల మోతమోగిపోతాది తస్మాత్ జాగ్రత్త. మార్చినెల 1 తేదీ నుంచి వచ్చిన నూతన వాహనాల చట్టం ప్రకారం నిబంధనలు మీరే వారికి జరిమానాలతో షాకిచ్చేందుకు పోలీసు, రవాణా శాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారు. మోటారు వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే వారికి వేసే జరిమానాలు హడలెత్తిస్తున్నాయి. ఈనెల 1వ తేదీ నుంచి వాహనదారులు నిబంధనలు పాటించకపోతే వేసే జరిమానాల తాలూకా ఫ్లెక్సీలను పట్టణ ప్రధాన రహదారులు, కూడళ్లలో పోలీసులు ఏర్పాటుచేశారు. దీంతో నిబంధనలు పాటించని వారితోపాటు డ్రైవింగ్ లైసెన్స్‌లు లేనివారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అంతేకాకుండా గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో సైతం కొత్త జరిమానాలు వైరల్‌గా మారాయి. లైసెన్స్‌లు లేకుండా బండెక్కితే జరిమానాల మోత మోగనుందనే విధంగా నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. న్యాయస్థానం ఉత్తర్వుల ప్రకారం మార్చి 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం నూతన మోటారు వాహన చట్ట నిబంధనలను అనుసరించి వాహన చట్ట ఉల్లంఘనపై పెంచిన జరిమానాలు ఎం.పరివాహన యాప్‌లో పొందుపరిచారు. అలాగే నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాలివిగో అనే ఫ్లెక్సీలు తణుకులో గత రెండు రోజులుగా ప్రధాన కూడళ్లలో ప్రత్యక్షం కావడంతో వాహనదారులు ఆగి పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, రవాణా శాఖ అధికారులతో వాగ్వివాదానికి దిగినా, సమాచారం ఇచ్చేందుకు నిరాకరించినా చట్టపరమైన చర్యలు కూడా తీసుకొనబడతాయంటూ ఫ్లెక్సీల్లో పొందుపరిచారు. వేగానికి కళ్లెం పడనుందా..? ప్రస్తుతం తణుకు పట్టణంలో వాహనాల వేగానికి అద్దూ అదుపు లేకుండా పోయిందని, ముఖ్యంగా వాహనాల వేగాన్ని నియంత్రించాలని పలువురు కోరుతున్నారు. సైలెన్సర్లు తీసేసి నడుపుతున్న యువత, బైక్‌లపై స్టంట్లు చేస్తూ భయాన్ని ఉసిగొల్పుతున్న ఆకతాయిలపై తప్పనిసరిగా ఈ తరహా జరిమానాలు వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈనెల 1 నుంచి అమల్లోకి వచ్చిన నూతన నిబంధనలు వాహనదారులు జాగ్రత్త పడాలని హెచ్చరిక ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పోలీసులు పోలీసు అధికారులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లోని అంశాలు.. ఉల్లంఘనలు జరిమానాలు హెల్మెట్ లేకపోతే రూ.వెయ్యి వెనుక కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ లేకుంటే రూ.వెయ్యి డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే రూ.10వేలు. వాహనానికి బీమా లేకపోతే (మొదటిసారి) రూ.వెయ్యి రెండోసారి పట్టుబడితే రూ. 2వేలు శబ్దం – పొగ కాలుష్యానికి పాల్పడితే రూ. 2వేలు డేంజరస్ పార్కింగ్ రూ. 1500 నుంచి రూ.3వేలు రేసింగ్ (ఓవర్‌స్పీడ్) రూ.5 వేలు డేంజరస్ డ్రైవింగ్ రూ.10 వేలు మైనర్ డ్రైవింగ్ రూ.వెయ్యి ప్రయాణికులను రవాణా వాహనాల్లో ఎక్కిస్తే ఒక్కరికి రూ.200 ప్రమాదాల నివారణకే నూతన చట్టం రోడ్డు ప్రమాదాల నివారణ, శబ్ధ కాలుష్యం తదితర ఇబ్బందులను పరిష్కరించే ఉద్దేశ్యంతో ఏపీ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మోటారు వాహనాల చట్టం నూతన జరిమానాలు ఈనెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఇకపై తప్పనిసరిగా వాహనదారులు హెల్మెట్ పెట్టుకుని, డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు వాహనానికి తప్పనిసరిగా బీమా చేయించుకోవాలి. జాతీయ రహదారులతోపాటు పట్టణం, గ్రామాల్లో వాహనదారులు నిబంధనలు పాటిస్తూ సురక్షితమైన ప్రయాణాలు చేయాలి. – ఎన్.కొండయ్య, తణుకు పట్టణ సీఐ -
చింతకాయల సత్యనారాయణకు గౌరవ పురస్కారం
తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెంకు చెందిన ప్రముఖ వ్యాయమ ఉపాధ్యాయుడు చింతకాయల సత్యనారాయణ (పీడీ) గౌరవ పురస్కారం అందుకున్నారు. డెహ్రాడూన్ రాణా ప్రతాప్ సింగ్ స్టేడియంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత పరుగుల రాణి, ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పెదపుల్లకాండి తక్కె పెరంబుల్ ఉష, పీటీ ఉషచే గౌరవ పురస్కారం అందుకున్నారు, అథ్లెటిక్స్‌లో క్రీడాకారులను రాణించేలా తీర్చిదిద్దినందుకుగాను ఆయనకు ఈ పురస్కారం లభించింది. క్రీడాకారులు, పీఈటీలు, పట్టణ ప్రముఖులు ఆయన్ను అభినందించారు. ఆచంటేశ్వరుని హుండీ లెక్కింపు పెనుగొండ: ఆచంటేశ్వరునికి రూ.4,88,159 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాఽధికారి ఆదిమూలం వెంకట సత్యనారాయణ తెలిపారు. సోమవారం దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వర్దినీడి వెంకటేశ్వరరావు సమక్షంలో హుండీ లెక్కించినట్లు వివరించారు. అదేవిధంగా శివరాత్రి సందర్భంగా టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.3,11,351 ఆదాయం వచ్చినట్లు చెప్పారు. లెక్కింపులో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ నెక్కంటి గణేశ్వరరావు, ఆలయ అధికారులు గుబ్బల రామ పెద్దింట్లురావు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని తెలిపారు. లైన్గోపాలపురంలో బైక్ చోరీ ద్వారకాతిరుమల: మండలంలోని లైన్గోపాలపురం జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ కింద సోమవారం పార్క్ చేసిన బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. బాధితుడి కథనం ప్రకారం. మండలంలోని పి.కన్నాపురం గ్రామానికి చెందిన కొండేటి ఆనందరావు కొబ్బరి బొండాలు కోసే పని చేస్తుంటాడు. ఈ క్రమంలో రోజువలె ముఠా సభ్యులతో కలసి బైక్‌పై లైన్గోపాలపురంనకు వచ్చిన ఆనందరావు అందరితో పాటు తన బండిని ఫ్లై ఓవర్ కింద పార్క్ చేశాడు. అనంతరం కొంబరి బొండాలు కోసేందుకు వ్యాన్‌లో వెళ్లాడు. తిరిగి సాయంత్రం వచ్చేసరికి బైక్ కనిపించలేదు. చుట్టుపక్కల వెదికినా ఫలితం దక్కలేదు. దాంతో బైక్ చోరీకి గురైనట్టు గుర్తించిన బాధితుడు ఆనందరావు ద్వారకాతిరుమల పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
గుర్తు తెలియని మృతదేహాలతో ఉండిలో కలకలం
ఉండి: రెండు రోజుల్లో రెండు గుర్తు తెలియని మృతదేహాలు లభ్యం కావడంతో ఉండిలో కలకలం చోటుచేసుకుంది. ఆదివారం ఉండి శివారు గోరింతోట వద్ద పంట కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం కాగా సోమవారం ఉండి ఇరిగేషన్ కార్యాలయం పక్కనే బొండాడ మేజర్ డ్రెయిన్‌లో మరో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఇద్దరి వయసు సుమారు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, చనిపోయి సుమారు వారం రోజుల లోపు ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే మండలంలో ఇంతవరకు గత వారంగా ఎటువంటి అద్యశ్య కేసులు నమోదు కాలేదు. దీంతో చనిపోయినవారు ఇతర ప్రాంతాలకు చెందిన వారుగా భావిస్తున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోను ఆక్వా చెరువులపై పనిచేసేందుకు ఇతర రాష్ట్రాలకు చెందినవారు వస్తుండడంతో ఎవరు మిస్సింగ్ అయినా పోలీసులకు ఫిర్యాదులు అందడం లేదు. దీంతో శవాలు గుర్తు తెలియని మృతదేహాలుగానే మిగిలిపోతున్నాయి. వీటిపై సరైన విచారణ చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయాలి
భీమవరం (ప్రకాశంచౌక్): ఈనెల 8న నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని న్యాయమూర్తులు పోలీసులకు సూచించారు. 3వ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ డాక్టర్ బి.లక్ష్మీనారాయణ అధ్యక్షతన పోక్సో కోర్టు హాల్లో సోమవారం పోలీసు అధికారులతో న్యాయమూర్తులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. క్రిమినల్ కేసుల రాజీకి కక్షిదారులకు అవగాహన కల్పించాల్సిందిగా కోరారు. రాజీ చేసేందుకు ఏవిధమైన చట్టపరమైన సమస్యలు వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కేసుల రాజీకి వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చన్నారు. ప్రిన్సిపల్ జ్యుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ జి.సురేష్ బాబు, 2వ అదనపు జ్యుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ డి.ధనరాజు, డీఎస్పీ ఆర్జీ జయ సూర్య సర్కిల్, సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి దెందులూరు: చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది. ఎస్సై ఆర్ శివాజీ తెలిపిన వివరాల ప్రకారం గాలాయగూడెంకు చెందిన ఉప్పాటి గాయత్రి పదో తరగతి చదువుతోంది. గత నెల 27న కుటుంబ సభ్యులు మందలించడంతో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఏలూరు జీజీహెచ్‌కు తరలించగా అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఈనెల 2న రాత్రి 10 గంటలకు విజయవాడ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. ‘జైన్’ ఒప్పందం విద్యార్థులకు ఉపయోగకరం తాడేపల్లిగూడెం (టీఓసీ): మహారాష్ట్రకు చెందిన జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ అనే గ్లోబల్ కంపెనీతో సోమవారం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో జైన్ ఇరిగేషన్ సిస్టం నిర్వహిస్తున్న అత్యాధునిక టిష్యూ కల్చర్ ల్యాబ్ సదుపాయాలను, వారి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ సెంటర్స్‌ను తమ విద్యార్థులు పరిశోధనల కోసం వినియోగించుకోవడానికి వీలు కలుగుతుందని ఉప కులపతి డాక్టర్ కె.గోపాల్ అన్నారు. రాష్ట్రంలో కోకో పంట అభివృద్ధికి, మార్కెటింగ్ సహకారానికి ఈ అవగాహన ఒప్పందం ఉపకరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, జైన్ ఇరిగేషన్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఐపీఎస్ సునీల్‌కుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలని ధర్నా
భీమవరం (ప్రకాశంచౌక్): దళిత ఐపీఎస్ అధికారి సునీల్‌కుమార్‌పై సస్పెన్షన్ విధించడాన్ని దళిత జేఏసీ సంఘాల సభ్యులు ఖండించారు. సోమవారం భీమవరం అంబేద్కర్ సెంటర్లో దళిత జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సునీల్‌కుమార్‌ను సస్పెండ్ చేయడం దారుణమని దళిత జేఏసీ నాయకులు బండి మధు, గంటా సుందర్ కుమార్, కోనా జోసెఫ్, కేసీ రాజు అన్నారు. దళిత నాయకులు విమానాలు ఎక్కకూడదా .. ఎక్కితే సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. విల్లింగ్ ఇచ్చిన రెండోరోజున సస్పెండ్ చేయడం దళిత జాతిని అవమానించినట్లేనని, రాబోయే రోజుల్లో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సునీల్ కుమార్ సస్పెన్షన్ ఎత్తివేసి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అలురి చిన్నారావు, ఈది రవికుమార్, బేతల కమలాకర్, దర్మద, జి సందీప్, బి నాగరాజు, కేవీ రత్నం, వై జోసెఫ్, బొంగ ఆదాము, పిల్మి శేఖర్, జి బాలఏసు, ఎం.పీటర్ పాల్, ఎం.బెంజిమెన్, ఎండి శామ్యూల్, ఎం.ఏసురత్నం, వి ప్రశాంత్, రవి తదితరులు పాల్గొన్నారు. -
● బాల్య వివాహాలు నేరం
బాల్య వివాహాలను అరికట్టాలని కోరుతూ సోమవారం సాయంత్రం బుట్టాయగూడెం మండలం రాజానగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎన్వీ సత్యవతి మాట్లాడుతూ బాల్య వివాహాలను అరికట్టడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. బాల్య వివాహాలను ప్రోత్సహించేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. వసతిగృహం వార్డెన్ బి. సోమాలమ్మ, ఏఎన్ఎం ఎం.సూర్యకాంతం, అంగన్వాడీ కార్యకర్తలు కె. పుష్ప, పి.సుజాత, కె.అనంతకుమారి, వి.దుర్గాలక్ష్మి, కె. జ్యోతి తదితరులు పాల్గొన్నారు. – బుట్టాయగూడెం -
రెడ్‌బుక్ దౌర్జన్యకాండ.. అబ్బయ్య చౌదరి ఇంటిపై దాడి!
సాక్షి, ఏలూరు: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం దర్జాగా అమలు చేస్తున్నారు కూటమి నేతలు. దెందులూరులో టీడీపీ నాయకుడు చింతమనేని కనుసన్నల్లో రెడ్‌బుక్ అమలు జరుగుతోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి టీడీపీ శ్రేణులు మూకుమ్మడి దాడికి చేశాయి. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.దెందులూరులో చింతమనేని కనుసన్నల్లో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసి కూటమి నేతలు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి నివాసంపై టీడీపీ మూకలు దూసుకెళ్లారు. అంతేకాకుండా అబ్బయ్య చౌదరికి చెందిన చేనులో పామాయిల్ గెలలు కోస్తుండగా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణులు వారిని ప్రశ్నించగా దాడికి దిగారు. దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. -
50కి పైగా దేశాల డేటాతో..
నా వద్ద ఉన్న తక్కువ స్థాయి సామర్థ్యం గల పరికరాలతో అంచనాలను రూపొందిస్తున్నా. భవిష్యత్‌లో మరింత పరిధి పెంచుకోవటానికి ప్రయత్నించి, మెరుగ్గా అంచనా విధానాన్ని సిద్ధం చేస్తున్నా. దీంతో 50కి పైగా దేశాల భూకంపాల రీసెర్చ్ డేటాను పరిశీలించి ఆయా దేశాలకు సమాచారం పంపే అవకాశం ఉంటుంది. దీనిని కొన్నేళ్లలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఆవిష్కరిస్తాను. భారత వాతావరణ శాఖ 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ భూకంపాలను ముందుగా అంచనాలు వేసే వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. దానికనుగుణంగా నా ప్రాజెక్టు సాగుతుంది. – మరడాని శివ సీతారామ్, ఇంజనీర్, ఏలూరు -
నిజాయతీతో సేవలందించాలి
ఏలూరు టౌన్: సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు నిర్భయంగా, నిష్పక్షపాతంగా, నిజాయతీతో సేవలందించాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశో క్కుమార్ అన్నారు. అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పూర్తిచేసుకున్న ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్లు ఆదివారం ఏలూరు రేంజ్ కార్యాలయంలో ఐజీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రొబేషనరీ ఎస్సైలకు ఆయన నియామక ఉత్తర్వులు అందజేశారు. రేంజ్ పరిధిలో 100 మంది (68 మంది పురుషులు, 32 మంది మహిళలు) ఎస్సై శిక్షణ పూర్తిచేసుకోగా జిల్లాల వారీగా ఏలూరు 1, అల్లూరి సీతారామరాజు 4, కాకినాడ జిల్లా 2, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా 1, తూర్పుగోదావరి జిల్లా 15, పశ్చిమగోదావరి జిల్లా 1, కృష్ణా జిల్లా 20, ఎన్టీఆర్ జిల్లా 56 మంది ఉన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా అత్యుత్తమ సేవలు అందించాలన్నారు. బాధి తుల పక్షాన న్యాయం చేయటం, నిందితులకు చట్టా ల మేరకు శిక్షలు విధించేలా పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. నేరస్తులకు భ యం, బాధితులకు అభయం అందించేలా పనిచేయాలన్నారు. పోలీస్ విధుల్లో పనిచేయటం అదృష్టంగా భావిస్తూ చట్టాలకు లోబడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని ఐజీ పిలుపునిచ్చారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ 100 మంది ఎస్సైలకు నియామక పత్రాలు అందజేత -
కూటమి మట్టి మాఫియా
మైనింగ్ నిబంధనలు ● మైనింగ్ కోసం ఆన్లైన్లో రూ.6 వేలు చలానా కట్టి దరఖాస్తు చేసుకోవాలి. ● మైనింగ్ శాఖ నుంచి స్థానిక రెవెన్యూ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తు ప్రకా రం సర్వే నంబర్లలో పరిశీలించి తహసీల్దార్ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ● తిరిగి మైనింగ్ జియాలజిస్ట్, తహసీల్దార్, సర్వేయర్ పరిశీలించి చెక్ రిపోర్టును మైనింగ్ శాఖ ఏడీకి పంపాలి. ● లైసెన్సుదారుడు సీనరేజ్, డీఎఫ్ఎం కింద క్యూబిక్ మీటరకు రూ.114 చెల్లించాలి. ● గవర్నమెంట్ ప్రెస్‌కు పంపించి స్టేషనరీ కింద బిల్ బుక్స్ అందిస్తారు. మట్టి తరలించే వాహన డ్రైవర్ల వద్ద ఇవి ఉండాలి. ● నేషనల్ హైవే పనులకు మట్టిని తరలించే కాంట్రాక్టర్ సీనరేజీ కట్టాలి. ప్రభుత్వం రీయింబర్స్మెంట్ కింద వీటిని తిరిగి చెల్లిస్తుంది. ఇవేమీ కై కలూరు నియోజకవర్గంలో అమలు కావడం లేదు. సాక్షి టాస్క్‌ఫోర్స్ : ‘నా నియోజకవర్గం నుంచి ఒక్క టిప్పరు ఇసుక బయటకు వెళ్లినా ఊరుకోను.. రోడ్లు పాడవుతున్నాయి.. నిబంధనలకు లోబడి మాత్రమే ఇక్కడ జరుగుతున్న హైవే రోడ్డు పనులకు మట్టిని తరలించాలి.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక దందాకు పూర్తిగా స్వస్తి పలకాలి’ ఇది కై కలూ రు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఇటీవల మీడియా సాక్షిగా పోలీసు, రెవెన్యూ అధికారులకు తీసుకున్న క్లాస్. ఇదంతా ఒకవైపే.. అయితే పరిస్థితి భిన్నంగా ఉంది. నియోజకవర్గంలో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కొందరు కూటమి నేత లే అక్రమ మైనింగ్ పనులపై కన్నెర్ర చేస్తున్నారు. పోలీసుల ఎదుటే ఆందోళన టీడీపీ నాయకుడు వీరాబత్తిన సుధా కై కలూరు సీఐ కార్యాలయం ఎదుట రోడ్డుపై వెళుతున్న అక్రమ మట్టి టిప్పరును నిలుపుదల చేసి సీజ్ చేయాలని శనివారం పోలీసుల ఎదుటే ఆందోళన చేశారు. కూటమి పార్టీ సానుభూతిపరుడు స్థానిక పంచాయతీలో కీలక వార్డు సభ్యుడు కేవీఎన్‌ఎం నాయుడు భారీ ఇసుక టిప్పర్ల కారణంగా రోడ్లు పాడవుతు న్నాయని ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌కు తెలిసీ ఈ తంతు జరిగితే తాము కూడా మట్టి వ్యాపారం చేస్తామని ఘాటుగా విమర్శించారు. ఈ రెండు ఘటనలు చాలు నియోజకవర్గంలో మట్టి మాఫియా ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోడానికి అని కొందరు కూటమి నేతలే వాపోతున్నారు. హైవే పనుల పేరుతో మోసం కై కలూరు నియోజకవర్గంలో జాతీయ రహదారి బైపాస్ పనులు కొన్నేళ్లుగా జరుగుతున్నాయి. హైవే పనుల పేరు చెప్పి మట్టి టిప్పర్లను గుడివాడ, భీమవరం, ఏలూరు వంటి పట్టణాలకు తరలించేస్తున్నా రు. ప్రతిపక్ష పార్టీ నాయకుడిని తిట్టడానికి మా త్రమే ఉపయోగించే దుందుడుకు గడ్డం నాయకుడిగా పేరుపొందిన వ్యక్తి సహజ వనరులను కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్నాడు. ● మండవల్లి మండలం భైరవపట్నంకు చెందిన ఓ నాయకుడు చేసే అక్రమ మైనింగ్‌పై కన్నెత్తి చూసే సాహసం అధికారులు చేయలేరు. సమీప ఎమ్మెల్యే తమ వాడే అంటూ బాబాయి, అబ్బాయిలు తమకు మైనింగ్‌లో తిరుగేలేదంటూ చెలరేగిపోతున్నారు. ● ఎన్నికల్లో ఖర్చుపెట్టి నష్టపోయానూ అంటూ కలిదిండి మండలంలో ‘లంక’ గ్రామాలను ఓ నేత దోచేస్తున్నాడు. ● ముదినేపల్లి మండలం వణుదుర్రులో ప్రభు త్వం తమదే మట్టి అమ్ముకుంటా ఎవరడుగుతా రూ అంటూ ఓ వ్యక్తి సవాల్ విసురుతున్నాడు. ● కొల్లేరు నాయకుడిగా చలామణి అవుతున్న నేత ఓ పక్క సుప్రీంకోర్టు కొల్లేరు అభయారణ్యంపై హెచ్చరికలు చేస్తున్నా.. కొల్లేరు గ్రామాల్లో దగ్గరుండి తన సామాజికవర్గంతో మట్టిని విక్రయిస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలానే ఉంది. తవ్వేయ్.. తరలించేయ్ కై కలూరులో అక్రమ తవ్వకాలు హైవే పనుల పేరుతో దోపిడీ రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి నాలుగు మండలాలనూ పంచేసుకున్న నేతలు భారీ టిప్పర్లతో రోడ్లు ధ్వంసం చర్యలు తీసుకుంటాం అనుమతులు లేని టిప్పర్లపై చర్యలు తీసు కుంటాం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మైనింగ్ చేయాలి. కై కలూరు మండలంలో అక్రమ మైనింగ్ నిర్వహించే వ్యక్తుల వివరాలను తెలపాలని ఆయా గ్రామాల వీఆర్వోలకు అదేశాలు ఇచ్చాం. పోలీసులతో కలిసి దాడులు, తనిఖీలు చేస్తాం. –ఎండీ ఇబ్రహీం, తహసీల్దార్, కై కలూరు ప్రభుత్వానికి రూ.కోట్లలో నష్టం కూటమి నేతలు ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో గండి కొడుతున్నారు. నియోజకవర్గంలో శీతనపల్లి, వదర్లపాడు, వేమవరప్పాడు, శృంగవరప్పాడు, గుమ్మళ్లపాడు, అగ్రహారం, సున్నంపూడి, తాడినాడ, గోపాలపురం, సానారుద్రవరం, కోరుకొల్లు, గన్నవరం, వణుదుర్రు, పెదగొన్నూరు, కొత్తపల్లి, ఆచవరం గ్రామాల్లో అక్రమ మైనింగ్ జరుగుతోంది. టిప్పరు మట్టిని రూ.3,500కి విక్రయిస్తున్నా రు. భీమవరానికి రూ.8,500 వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్ మట్టిని రూ.1,010కి విక్రయిస్తున్నారు. నిబంధనల ప్రకారం క్యూబిక్ మీటరుకు రూ.114 సినరేజీ కట్టాలి. అంటే ఎకరానికి 4,200 క్యూబిక్ మీటర్లుకు గాను రూ.4,78,800 చెల్లించాలి. అలాగే హెక్టారుకు ప్రీమియం కింద రూ.6 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాలి. ఇలా నియోజకవర్గంలో రూ.కోట్లాది ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతోంది. -
ఆటో బోల్తా పడి యువకుడి మృతి
ఆగిరిపల్లి: మండలంలోని అమ్మవారిగూడెం వద్ద ఆటో బోల్తా పడి యువకుడు మృతి చెందాడు. ఆగిరిపల్లి చెందిన కూరపాటి నాని (31)ఆటో డ్రైవర్‌గా జీవిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఆగిరిపల్లి నుంచి బండారు గూడెంకు ఆటోలో గోనె సంచుల లోడుతో వెళ్తుండగా అమ్మవారిగూడెం వద్దకు రాగానే ప్రమాదవశాత్తు ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కనే గోతిలో బోల్తా పడింది. ప్రమాదంలో నాని తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. యువకుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బధిర టీ 20 క్రికెట్ పోటీలకు ఎంపిక భీమవరం(ప్రకాశంచౌక్): 7వ జాతీయస్థాయి బధిర టీ–20 క్రికెట్ పోటీలకు 16 మంది ఎంపికయ్యారని జిల్లా బధిర క్రికెట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు రంగసాయి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సీహెచ్ తాతారావు తెలిపారు. జాతీయస్థాయికి ఎంపికై న 16 మంది క్రీడాకారులు ఏప్రిల్ 19 నుంచి 25 వరకు హరియాణాలో జరిగే టీ–20 పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఆదివారం భీమవరం వెంకట్రామ థియేటర్లో జరిగిన సమావేశంలో వివరాలను తెలిపి ఎంపికై న వారికి అభినందనలు తెలిపారు. ఇటీవల భీమవరం డీఎన్నార్ క్రీడా మైదానంలో జరిగిన రాష్ట్రస్థాయి టీ–20 క్రికెట్ పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారుల్లో 16 మంది జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు అర్హత సాధించారని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలని కోరుకుంటున్నామన్నారు. -
ట్రెజరీ సంఘ జిల్లా అధ్యక్షుడిగా దాసరి
ఏలూరు(మెట్రో): ట్రెజరీస్,అకౌంట్స్ సర్వీసెస్ అసోసియేషన్ ఏలూరు జిల్లా కార్యవర్గ ఎన్నికలు ఆదివారం ఏలూరు జిల్లా ట్రెజరీ కార్యా లయంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా ఏలూరు డీసీహెచ్ఎస్ అసిస్టెంట్ ఫైనాన్స్ ఆఫీసర్ దాసరి కృష్ణంరాజు, జిల్లా కార్యదర్శిగా జిల్లా ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ ఈ.మ హేష్‌బాబు, సహాధ్యక్షురాలిగా డ్వామా అకౌంట్స్ ఆఫీసర్ పి.మాధవి ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా ట్రెజరీ జిల్లా సహాయ ఖజానా అధికారి పి.ప్రేమావతి, భీమడోలు ఉప ఖజానాధికారి ఎన్.శ్రీనివాసరావు, జిల్లా ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ ఎస్.జయలక్ష్మి, కార్యనిర్వాహక కార్యదర్శిగా ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ వై.శిరీష్‌కుమార్, జాయింట్ సెక్రటరీలుగా జంగారెడ్డిగూడెం ఉప ఖజానాధికారి ఎస్.చినబాబు, కై కలూరు ట్రెజరీ జూనియర్ అకౌంటెంట్ ఎన్.సాయికృష్ణ, ఏలూరు సబ్ ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ కె.రత్నకుమారి, ట్రెజరర్‌గా జిల్లా ఖజానా కార్యాలయ సీనియర్ అకౌంటెంట్ కె.నరేంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి, ఏపీ టాసా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ హసీనా బేగం ఎన్నికల వివరాలు వెల్లడించారు. సంఘ సభ్యుల పురోభివృద్ధికి పాటుపడుతూ త్వర లోనే అన్ని జిల్లాల ఎన్నికలు పూర్తిచేసుకుని రాష్ట్ర సంఘ ఎన్నికలకు వెళతామని హసీనా బేగం తెలిపారు. ఏపీ టాసా రాష్ట్ర అధ్యక్షుడు.రవికుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాజ్ కుమార్, ఉద్యోగులు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘హోమియో’పై అవగాహన ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): హోమియో వైద్య విధానంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు దేశవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించేందుకు నిర్ణయించామని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ ఫిజీషియన్స్ (ఐఐహెచ్‌పీ) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కేఎస్ఎస్ శివమూర్తి తెలిపారు. గత నెల 22,23 తేదీల్లో పూణేలో జరిగిన జాతీయ హోమియో వైద్యుల సదస్సులో ఏలూరుకు చెందిన డాక్టర్ శివమూర్తిని ఐఐహెచ్‌పీ జాతీ య అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం నగరంలో ఏర్పా టుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన పదవీ కాలం 2027 వరకు ఉంటుందని, హోమియో పట్టభద్రుల విజ్ఞాన సముపార్జన కోసం వైద్య సదస్సులు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ హోమియో వైద్యుల నియామకాలు, హోమియో వైద్య కళాశాలల్లో బోధనా సిబ్బందిని పెంచడం కోసం కృషి చేస్తామన్నారు. హోమియో వైద్యంలో ఎండీ కోర్సు లు, నూతన సబ్జెక్టుల ప్రారంభం, సూపర్ స్పెషాలిటీ కోర్సుల కోసం కృషి చేస్తామన్నారు. హోమియో మందుల ప్రామాణికతను పెంచడానికి, సమాజంలో వివిధ వైరస్ల నివారణకు ఉచిత వ్యాధి నిరోధక శిబిరాలు ఏర్పా టు చేయాలని నిర్ణయించామన్నారు. అనంతరం హోమియో వైద్య నిపుణులు ఆయన్ను సత్కరించారు. ఐఐహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు వీకే పంకజాక్షన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.గోపీనాథ్, జిల్లా అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారుల సమస్యలపై మంత్రికి వినతి భీమవరం(ప్రకాశంచౌక్) : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా మత్స్యకారుల సంక్షేమంతోపాటు మత్స్యరంగ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ అధికారులను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆదేశించారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రిని నూతనంగా ఎన్నికై న ఉమ్మడి జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షుడు మైల వసంతరావు, పాలకవర్గ సభ్యులు కలిశారు. జిల్లాలో మత్స్యకారుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మైరెన్ ప్రాంతంలోని ఫిష్ మార్కెట్లలో వసతుల కల్పన, పంచాయతీరాజ్ చెరువుల వేలంలో 10 శాతం పరిమితి దాటకుండా చర్యలు తీసుకోవాలని, వలలు, నావలకు ప్ర భుత్వం ఇచ్చే సబ్సిడీని 75 శాతం పెంచాలని, మత్స్యకార కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, మత్స్యకారుల వాహనాలకు ఇచ్చే రాయితీలు పెంచాలని పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. సంఘ వైస్ ప్రెసిడెంట్ రాజా బాలాజీ, డైరెక్టర్లు వూడిమూడి శ్రీనివా స్, బేరం శ్రీరామచంద్రమూర్తి, బెజవాడ నాగరాజు తదితరులు ఉన్నారు. -
వైభవంగా మరియ మాత ఉత్సవాలు
కై కలూరు: మరియ మాత మహోత్సవాలు కలిదిండి విచారణ చర్చి వద్ద ఆదివారం రెండో రోజు ఘనంగా కొనసాగాయి. సమీప జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు విచ్చేశారు. కలిదిండి విచారణ కర్త బంటుమిల్లి యోహాను సమష్టి దివ్య పూజా బలి నిర్వహించారు. సాయంత్రం మేత్రాసన ఇంగ్లీషు మీడియం స్కూల్స్ కో–ఆర్డినేటర్ పల్లె విజయ జోజిబాబు ఏసు సందేశాన్ని అందించారు. కోరుకొల్లు విచారణకర్త గూడపాటి ప్రతాప్ ఆధ్వర్యంలో భక్తి పాటలు ఆలపించారు. అనంతరం కొవ్వూరుకు చెందిన హార్ట్ బీట్స్, క్రిస్టియన్ అర్కెస్ట్రా ఆలపించిన మధుర గీతాలు ఆకట్టుకున్నాయి. భక్తులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. -
కనుల పండువగా కోదండరాముడి విగ్రహ ప్రతిష్ఠ
ఉండి: మండలంలోని చిలుకూరులో వేంచేసియున్న కోదండ రామాలయంలో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన కనులపండువగా నిర్వహించారు. దాతల సహకారంతో ఆలయాన్ని పునః నిర్మించారు. సర్పంచ్ ముదునూరి వెంకట సోమరాజు, ఆలయ ధర్మకర్త వేగేశ్న వెంకట రమణరాజు, ఆలయ నిర్మాణక మిటీ చైర్మన్ వేగేశ్న సత్యనారాయణ రాజు, దాతలు భీమరాజు, మాజీ సర్పంచ్ బంగార్రాజు, సీతారామరాజు తదితరులు ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని పూజ నిర్వహించారు. గ్రామంలోని భక్తులతో పాటుగా మహదేవపట్నం, వెలివర్రు, ఉండి, ఎన్నార్పీ అగ్రహారం, గరగపర్రు, భీమవరం తదితర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు. ముఖ్య అతిథులుగా కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, మాజీ ఎమ్మెల్యే వెంకట శివరామరాజు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యుల ఆధ్వర్యంలో పునఃప్రతిష్ఠాపన, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.ఽ -
50కి పైగా దేశాల డేటాతో..
నా వద్ద ఉన్న తక్కువ స్థాయి సామర్థ్యం గల పరికరాలతో అంచనాలను రూపొందిస్తున్నా. భవిష్యత్‌లో మరింత పరిధి పెంచుకోవటానికి ప్రయత్నించి, మెరుగ్గా అంచనా విధానాన్ని సిద్ధం చేస్తున్నా. దీంతో 50కి పైగా దేశాల భూకంపాల రీసెర్చ్ డేటాను పరిశీలించి ఆయా దేశాలకు సమాచారం పంపే అవకాశం ఉంటుంది. దీనిని కొన్నేళ్లలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఆవిష్కరిస్తాను. భారత వాతావరణ శాఖ 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ భూకంపాలను ముందుగా అంచనాలు వేసే వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. దానికనుగుణంగా నా ప్రాజెక్టు సాగుతుంది. – మరడాని శివ సీతారామ్, ఇంజనీర్, ఏలూరు -
యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు
పట్టించుకోని అధికారులు బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం చీమలవారిగూడెం సమీపంలో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పట్టపగలు ఎలాంటి అనుమతి లేకుండా చింతలపూడి గట్టును ఆనుకుని ఉన్న ఆర్ అండ్ ఆర్ భూమిలో మట్టిని జేసీబీతో తవ్వి టిప్పర్లలో తోలుకుపోతున్నారు. కనీసం అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వెంచర్లు, లేఅవుట్, రియల్ ఎస్టేట్లకు అక్రమంగా మట్టిని తోలుకుపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత 5 రోజులుగా మట్టి అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల సహకారంతోనే యథేచ్ఛగా మట్టి రవాణా జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమంగా తరలుతున్న మట్టి రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. -
రిటైర్డ్ జడ్జికి సత్కారం
ఉండి: రిటైర్డ్ జడ్జి పెరికల గంగయ్యను ఆదివారం వినియోగదారుల సంఘ నాయకుడు బొబ్బిలి బంగారయ్య, పలువురు భక్తులు సత్కరించారు. గ్రామంలో వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించడమే కాకుండా గుడి పోషణార్థం తనకున్న ఏడెకరాల భూమిని గుడికి దానం చేశారు. స్వామి కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకొని నాయకులు, పలువురు భక్తులు సన్మానం చేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ వేణుగోపాల్ దంపతులు, త్రిమూర్తులు, తదితరులు పాల్గొన్నారు. ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కుక్కునూరు: కారు అదుపు తప్పి రోడ్డు పక్కన పొదళ్లోకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు పడ్డారు. శనివారం రాత్రి మండలంలోని కివ్వాక చెరువు కట్టపై ఈ ఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కుక్కునూరు నుంచి కివ్వాక వైపు వెళ్తున్న కారు కివ్వాక చెరువు కట్ట మీదకు రాగానే రోడ్డు బాగోలేని కారణంగా అదుపు తప్పి పక్కనే ఉన్న పొదళ్లోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయాలపాలయ్యారు. వారిలో ఒకరికి తీవ్రగాయాలు కావడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. -
శ్రీవారి సేవలో ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యాక్టింగ్ చైర్పర్సన్ విజయ భారతి సయాని ఆదివారం మధ్యాహ్నం సందర్శించారు. ఆమెకు ముందుగా దేవస్థానం అధికారులు, అర్చకులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు ఆమెకు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలుకగా, ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి స్వామి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. రాట్నాలమ్మ గుడికి పోటెత్తిన భక్తులు పెదవేగి: రాట్నాలమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు దేవస్థానానికి విచ్చేసి, మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ వారం పూజా టిక్కెట్లపై రూ.38,240, విరాళాలుగా రూ.20,100, లడ్డూ ప్రసాదంపై రూ.19,725, ఫొటోల అమ్మకంపై రూ.2,000, ఆలయ నిర్మాణానికి రూ1,00,000 వచ్చిందని ఈవో ఎన్.సతీష్‌కుమార్ తెలిపారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం ఉండి: ఉండి గోరింతోట వద్ద పంట కాలువలో గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై ఎండీ నసీరుల్లా తెలిపిన వివరాల ప్రకారం మృతుడి ఒంటిపై లేత పసుపు రంగు టీషర్టు, బ్లూ జీన్స్ ఉన్నాయి. చేతిపై గౌరీ కే ఆదిలక్ష్మీ అని పచ్చబొట్టు ఉంది. మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించినట్లు ఎస్సై తెలిపారు. వివరాలు తెలిసిన వారు 9440796648 నెంబర్లో సంప్రదించాలని ఎస్సై తెలిపారు. క్షీరారామలింగేశ్వరస్వామిని దర్శించుకున్న ఓంకార్ పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం క్షీరారామలింగేశ్వరస్వామిని టీవీ యాంకర్ ఓంకార్ ఆదివారం దర్శించుకున్నారు. ముందుగా గణపతి పూజ చేసి అనంతరం క్షీరారామలింగేశ్వరస్వామి, జనార్ధనస్వామి, లక్ష్మీపార్వతి అమ్మవార్లను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. స్వామి వారి చిత్రపటాన్ని అందజేసి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు.