Guntur
-
ఎల్లప్పుడూ ప్రజల వెంటే.. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని, ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటుందని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ 15వ ఆవిర్భావ వేడుకలు(YSRCP Formation Day) బుధవారం ఏపీ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకలకు హాజరైన వైఎస్ జగన్.. మహానేత వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి, పార్టీ జెండా ఆవిష్కరించి ప్రసంగించారు. వైఎస్సార్సీపీ ఇవాళ 15వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. ప్రజల కష్టాల నుంచి వైఎస్సార్సీపీ పుట్టింది. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి పోరాడుతోంది. ప్రతిపక్షంలో కూర్చోవడం మనకు కొత్త కాదు. అధికారంలో ఉన్నవాళ్లకు ఎప్పటికప్పుడు ధీటైన సమాధానమే ఇస్తున్నాం. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాం.జగన్ చెప్పాడంటే.. చేస్తాడంతే అనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. ఇవాళ ప్రజల్లోకి ధైర్యంగా కాలర్ ఎగరేసుకుని వెళ్లగలిగే స్థితిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుంది. 3-4 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే అని అన్నారాయన. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన ఆయన.. ఇవాళ వైఎస్సార్సీపీ చేపట్టిన ఫీజు పోరు గురించి ప్రస్తావించారు. ఈ వేడుకల్లో పార్టీ ముఖ్యనేతలంతా పాల్గొన్నారు.ప్రజాభ్యుదయమే పరమావధిగా ఎదుగుతున్న వైఎస్సార్సీపీ(YSRCP).. సవాళ్లనే సోపానాలుగా మార్చుకుంది. ప్రజాసమస్యల పరిష్కారంపై మడమ తిప్పకుండా పోరాటాలు చేస్తోంది. మహానేత వైఎస్సార్ ఆశయ సాధన లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే రాజకీయాల్లో నైతిక విలువలను చాటిచెప్పిన వైఎస్ జగన్(YS Jagan) ‘నేను విన్నాను.. నేను ఉన్నానంటూ’ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. -
‘రైల్వే సేవా పురస్కార్’ అందజేత
లక్ష్మీపురం: సౌత్ సెంట్రల్ రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని 69వ రైల్వే సేవా పురస్కార్ వేడుకలను ప్రతి ఏటా పండుగ వాతావరణంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని డివిజన్ డీఆర్ఎం ఎం.రామకృష్ణ అన్నారు. స్థానిక పట్టాభిపురంలోని రైల్వే డివిజన్ కార్యాలయంలో మంగళవారం 69వ రైల్వే వీక్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవార్డులను 2024లో ప్రతిభ కనబరిచినందుకు అధికారి, ఉద్యోగులకు ఈ పురస్కారాలను అందజేయడం జరుగుతుందన్నారు. డివిజన్ పరిధిలోని 14 మంది అవార్డు గ్రహీతలుగా గుర్తించడం జరిగిందన్నారు. డివిజన్ అధికారి జి.రత్నం, గుంటూరు ఏడీఈఈ, ఎలక్ట్రిక్, మెయిన్ అధికారితో పాటు మరో 13 మంది వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది ఉన్నారని తెలిపారు. అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం స్థాయిలో మూడు అవార్డులు, రైల్వే బోర్డు స్థాయిలో ఒక అవార్డును సాధించడంలో ప్రతి శాఖ అధికారి సిబ్బంది కృషి ఉందని వారందరిని అభినందించారు. అనంతరం రైల్వే సేవా పురస్కారాలను అందజేశారు. ఏడీఆర్ఎం సైమన్, సీనియర్ డీపీఓ షహబాజ్ హనూర్, సీనియర్ డీఈఎన్ కో–ఆర్డినేషన్ అనుషా, సీనియర్ డీఎంఈ మద్దాళి రవికిరణ్, సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్, డీసీఎం కమలాకర్‌బాబు పాల్గొన్నారు. -
11 మందికి ఎస్ఐలుగా, నలుగురికి ఏఎస్ఐలుగా ఉద్యోగోన్నతి
నగరంపాలెం: ప్రతిఒక్కరూ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపా ఠి అన్నారు. రేంజ్ పరిధిలోని పలు జిల్లాలకు చెందిన 11 మంది ఏఎస్ఐ (సివిల్)లకు ఎస్ఐ (సివిల్)లుగా, నలుగురు హెడ్ కానిస్టేబుళ్ల (ఏఆర్)కు ఏఎస్ఐ (ఏఆర్)లుగా ఉద్యోగోన్నతి కల్పించి, జిల్లాలు కేటాయించారు. ఈ మేరకు ఉద్యోగోన్నతి పొందిన ఎస్ఐలు, ఏఎస్ఐలు మంగళవారం గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్డులోని ఐజీ కార్యాలయంలో ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిశారు. ● ఎస్ఐలు ఎన్.శ్రీనివాసరెడ్డి తిరుపతి జిల్లాకు, వీఎన్ మల్లేశ్వరరావు, పి.ప్రమీల, ఆర్.కొండయ్య, డి.రాజ్యం, డి.శ్రీనివాసరావు, పి.సుబ్బారావు, బీ.శ్రీనివాసరావు, వై.రాజులు, ఎండి.అబ్దుల్‌హఫీజ్, షేక్.ఎన్.రసూల్‌ను గుంటూరు జిల్లాకు, ఏఆర్ ఏఎస్ఐలు పి.మోహన్‌రావు శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లా, షేక్.మస్తాన్, కె.శీను తిరుపతి జిల్లాకు, కె.శివకుమార్‌ను పల్నాడు జిల్లాకు కేటాయించారు. -
క్యారమ్స్కు కేరాఫ్ జలీల్
గుంటూరు వెస్ట్ (క్రీడలు): కొందరికి క్రీడలు సాధనం కాగా మరికొందరు దానినే జీవితంగా భావిస్తారు. అటువంటి వారికి సమాజంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానముంటుంది. ఈ కోవలోకే వస్తారు గుంటూరుకు చెందిన ప్రఖ్యాత క్యారమ్స్ ప్లేయర్, శిక్షకుడు షేక్ అబ్దుల్ జలీల్. తొలినాళ్లలో జీవనోపాధి కోసం క్యారమ్స్ క్రీడను సాధనంగా ఎంచుకున్నారు. ప్లేయర్ గా రాణించినా అవగాహనా లోపంతో ప్రభుత్వ ఉద్యోగాన్ని త్రుటిలో కోల్పోయారు. అయితే క్యారమ్స్ను మాత్రం ఆయన జీవితంలో ఒక భాగంగా చేసుకుని దానికి ఐపీఎల్ స్థాయి హోదా తీసుకొచ్చేందుకు రాజీలేని పోరాటం చేశారు. తొలిసారి రాష్ట్రంలో పేరొందిన క్రీడాకారులను రూ.లక్షలు వెచ్చించి కొన్ని జట్లు కొనుగోలు చేశాయి. క్యారమ్స్‌లో అంతర్జాతీయ క్రీడాకారుడిగా, శిక్షకుడిగా, మెంటార్‌గా, ప్రమోటర్‌గా విభిన్న పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఆంధ్ర క్యారమ్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న జలీల్ ఈ నెల 17 నుంచి 21 వరకు ఢిల్లీలో జరగనున్న 52వ జాతీయ నేషనల్ క్యారమ్స్ చాంపియన్‌షిప్‌కు చీఫ్ రిఫరీగా ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆయనకు నియామక ఉత్తర్వులు అందాయి. రాష్ట్రంలోనే ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి జలీలే కావడం గమనార్హం. క్రీడాకారునిగా ... 1991లో క్యారమ్స్ క్రీడలో సాధన ప్రారంభించిన జలీల్ 1995లో జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఎదిగారు. అదే ఏడాది స్థానిక ఎల్వీఆర్ క్లబ్లో జరిగిన ఇండో–శ్రీలంక చాంపియన్‌షిప్‌లో చక్కని ప్రతిభ కనబరిచారు. తన కెరీర్లో సుమారు 15 జాతీయ స్థాయి టోర్నమెంట్స్తోపాటు పలు అంతర్జాతీయ మ్యాచ్‌ల ను ఆడి ప్రపంచ ప్రఖాత క్రీడాకారులతో తలపడ్డారు. ప్రస్తుతం జాతీయ క్రీడాకారిణిగా కొనసాగుతున్న షేక్ హుస్నా సమీరాకు కోచ్ జలీలే. హుస్నా సమీరా ఇటీవల గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. రిఫరీగా... 1995 నుంచి జలీల్ క్యారమ్స్ ప్లేయర్‌గా కొనసాగుతూనే రిఫరీగా చేస్తున్నాడు. ఈ క్రమంలో 2012లో ఎల్వీఆర్ క్లబ్లో జరిగిన ఇండో–శ్రీలంక చాంపియన్‌షిప్‌తోపాటు 2013లో ఏడు దేశాలు పాల్గొన్న 17వ సార్క్ చాంపియన్‌షిప్, 5వ ఏషియన్ చాంపియన్‌షిప్‌కు నిర్వహణా కార్యదర్శిగా పనిచేశారు. భారత క్యారమ్స్ జట్టుకు కోచ్‌గానూ వ్యవహరించారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన డెక్కన్ ప్రీమియర్ క్యారమ్స్ లీగ్ (డీఏపీసీఎల్)లో ఆంధ్ర క్యారమ్స్ అసోసియేషన్‌తో కలసి పోటీలను అద్భుతంగా విజయవంతం చేశారు. ప్రస్తుతం జలీల్ ఇంటర్నేషనల్ రిఫరీ హోదా కలిగి ఉన్నారు. అతని శిష్యులు నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు.క్యారమ్స్ ప్రతి ఇంట్లోకి వెళ్లాలి క్యారమ్స్ అందరికీ చక్కని ఆటవిడుపు. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే సాధన చేయొచ్చు. ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తుంది. కార్పొరేట్ స్థాయిలో ఆదరణ లభిస్తుంది. అనేక పేరొందిన టోర్నమెంట్స్‌ను మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించాం. ఆంధ్ర క్యారమ్స్ అసోసియేషన్‌తోపాటు, స్థానిక క్లబ్‌లు ఎంతో ప్రోత్సాహాన్నిస్తున్నాయి. 52వ జాతీయ నేషనల్ క్యారమ్స్ చాంపియన్‌షిప్‌కు చీఫ్ రిఫరీగా ఎంపికకావడం సంతోషంగా ఉంది. – షేక్ అబ్దుల్ జలీల్, ఆంధ్ర క్యారమ్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 52వ జాతీయ నేషనల్ క్యారమ్స్ చాంపియన్‌షిప్‌కు చీఫ్ రిఫరీగా ఎంపిక రిఫరీగా, శిక్షకుడిగా, పర్యవేక్షకునిగా రాణింపు -
కారం మిల్లులపై విజిలెన్స్ దాడులు
నగరంపాలెం: గుంటూరు నగరంలోని పలు కారం మిల్లుల్లో విజిలెన్స్, ఇతర ప్రభుత్వశాఖ అధికారులు మంగళవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. సుమారు రూ.21లక్షలకు పైగా విలువ చేసే కారం పొడి, మిరప కాయలు, పసుపు, ధనియాలు సీజ్ చేశారు. గుంటూరు రీజినల్ విజిలెన్స్ ఎస్పీ డి.సూర్యశ్రావణ్‌కుమార్ ఆదేశాల మేరకు చిలకలూరిపేటరోడ్డు శ్రీలక్ష్మీ గణపతి ఇండస్ట్రీస్ (కారం మిల్లు)లో విజిలెన్స్, తూనికలు–కొలతల శాఖ, వ్యవసాయ శాఖ, ఆహార నియంత్రణ, కార్మిక శాఖ అధికారులు సంయుక్తంగా సోదాలు చేశారు. ఎటువంటి రశీదులు, రికార్డుల్లేకుండా మిల్లు యాజమాని బండారు రవీంద్రకుమార్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. మిర్చియార్డు దగ్గర్లోని మోహన్‌లాల్ మహేంద్ర కుమార్ – కంపెనీ నుంచి ఎక్కువ మొత్తంలో మిర్చికి బిల్లుల్లేకుండా తీసుకొచ్చి కారం పొడి తయారీ చేస్తున్నట్లు బహిర్గతమైంది. కొన్ని ట్రేడర్స్‌కు చెందిన స్టాక్స్ బిల్లులు లేకపోవడంతో, రూ.17.43 లక్షల విలువ చేసే 13,915 కిలోల కారం పొడి, రూ.3.14 లక్షల ఖరీదైన 1,815 కిలోల మిరపకాయలు, రూ.12 వేల విలువైన 75 కిలోల పసుపు, రూ.1.06 లక్షల ఖరీదు చేసే 1,320 కిలోల దనియాలకు స్టాక్ రిజిస్టర్, బిల్లులు లేకపోవడాన్ని తనిఖీల్లో గుర్తించారు. తదుపరి చర్యలకై కారం, మిరపకాయలు, పసుపు, ధనియాలు సీజ్ చేశారు. ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలకు స్టాంపింగ్ లేకపోవడంతోపాటు ప్యాకింగ్ లైసెన్స్ లేకుండా ప్యాకింగ్ చేయడంపై యాజమానిపై కేసు నమోదు చేశారు. కార్మికశాఖ కూడా కార్మికుల హాజరు పట్టిక, ఇతరత్రా వివరాలు సేకరించి చర్యలకు ఉపక్రమించారు. విజిలెన్స్ సీఐ కె.చంద్రశేఖర్,ఏఓ ఆదినారాయణ, తూనికలు, కొలతల శాఖ ఏసీ కొండారెడ్డి, ఫుడ్ ఇన్స్పెక్టర్ రవీంద్రారెడ్డి, కార్మిక అధికారి సాయి పాల్గొన్నారు. సుమారు రూ.21 లక్షలకు పైగా విలువచేసే కారం పొడి, పసుపు, ధనియాలు సీజ్ -
యూత్ పార్లమెంట్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు
గుంటూరు ఎడ్యుకేషన్: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి యూత్ పార్లమెంటు పోటీలను టీజేపీఎస్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు టీజేపీఎస్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లాస్థాయి యూత్ పార్లమెంటు చైర్పర్సన్ డాక్టర్ ఎస్.అనితాదేవి తెలిపారు. మంగళవారం పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాలలో ఆమె మీడియాతో మాట్లాడారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్‌లో భాగంగా నిర్వహిస్తున్న యూత్ పార్లమెంట్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. యూత్ పార్లమెంటు నమోదుకు ఈనెల 16వ తేదీవరకు గడువు పొడిగించినట్లు చెప్పారు. జిల్లాస్థాయి యూత్ పార్లమెంట్ నోడల్ అధికారి డాక్టర్ జేవీ సుధీర్‌కుమార్ గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలోని విద్యార్థులకు గుంటూరు కేంద్రంగా పోటీలు జరగనున్నాయని తెలిపారు. 18 నుంచి 25 ఏళ్ల లోపు వయసు గల యువత పోటీల్లో పాల్గొనవచ్చునని వివరించారు. ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ‘మై భారత్ పోర్టల్’ లో రిజిస్టర్ చేసుకుని, ఒక నిముషం నిడివి కలిగిన ‘వాట్ డస్ వికసిత్ భారత్ మీన్ టు యూ‘ అనే అంశంపై వీడియో చేసి, మై భారత్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. స్క్రీనింగ్‌లో ఎంపికై న వారికి జిల్లా, రాష్ట్రస్థాయిలో పోటీలు ఉంటాయని అన్నారు. ఈనెల 16వరకు దరఖాస్తు చేసుకోవచ్చు జిల్లాస్థాయి యూత్ పార్లమెంటు చైర్పర్సన్ అనితాదేవి -
విద్యార్థుల భవిత కోసం నేడు పోరుబాట
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం విద్యార్థుల భవిష్యత్ కోసం, వారి పక్షాన వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. బుధవారం జరగనున్న యువత పోరులో విద్యార్థులు, తల్లిదండ్రులు, యువజనులు భాగస్వాములవ్వాలని, కూటమి సర్కారుకు గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గుంటూరు నగరంలో యువత పోరు ఏర్పాట్లను మంగళవారం ఆయన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల పార్లమెంటరీ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి, నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు, పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా, డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు(డైమండ్ బాబు)తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామి థియేటర్ వద్ద వారు మాట్లాడుతూ బుధవారం ఉదయం 9.30 గంటలకు పట్టాభిపురంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం నుంచి ర్యాలీ మొదలవుతుందని, కలెక్టరేట్ వరకు జరుగుతుందని వివరించారు. ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు పానుగంటి చైతన్య, మాజీ మిర్చి యార్డ్ ఛైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కొరిటెపాటి ప్రేమ్‌కుమార్, పార్టీ విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షులు వినోద్‌కుమార్ ఇతర నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు యువత పోరుకు ఏర్పాట్లు పూర్తి పరిశీలించిన వైఎస్సార్ సీపీ ముఖ్యనేతలు -
శ్రీధరం.. సంతృప్తికరం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పొగాకుకు ఎన్నడూ రానంత ధరలు రావడం, రైతులందరూ సంతోషంగా ఉండటం తనకెంతో తృప్తినిచ్చిందని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్‌బాబు తెలిపారు. ఏడున్నరేళ్ల సుదీర్ఘకాలం పొగాకు బోర్డులో సేవలు అందించిన శ్రీధర్‌బాబు తన సొంత క్యాడర్ ఉత్తరాఖండ్‌కు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పొగాకు బోర్డులో తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. తాను వచ్చేసరికి పొగాకు బోర్డు ఏటా రూ.27 కోట్ల నష్టాల్లో ఉండగా ప్రస్తుతం ఫిబ్రవరి నాటికే రూ.95 కోట్ల ఆదాయంతో అన్ని వ్యవసాయ బోర్డులలో అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు. చిరస్మరణీయంగా 2023–24 సీజన్ 2023–24 పొగాకు అమ్మకాల సీజన్ రైతులకు చిరస్మరణీయంగా నిలిచిందని శ్రీధర్ పేర్కొన్నారు. గతంలో రైతులకు 15 రోజులకు చెల్లింపులు జరిగేవని, ఇప్పుడు వాటిని తొమ్మిది రోజులకు తగ్గించి త్వరగా రైతులకు నగదు అందేలా చూస్తున్నామని వెల్లడించారు. రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా డబ్బులు జమయ్యేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు వరుసగా రెండేళ్లపాటు రైతులకు సహాయ నిధి నుంచి పది వేల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇప్పించామని పేర్కొన్నారు. గతంలో అధిక ఉత్పత్తి పై జరిమానాలు ఉండేవని, దీని వల్ల రైతులు అనధికారిక పంటలు వేయకుండా చూడటంతోపాటు పొగాకు బోర్డుకు ఆదాయం వచ్చేదన్నారు. అయితే కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా పొగాకు పంట తగ్గిన నేపథ్యంలో అక్కడ ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా ఇక్కడ ఎక్కువ పంటకు అనుమతి వచ్చేలా చూడంతోపాటు అధిక ఉత్పత్తి చేసిన రైతులపై విధించిన జరిమానాలను ఎత్తివేసి, 76.84 మిలియన్ కిలోల అదనపు పొగాకును విక్రయించే అవకాశం కల్పించామని వివరించారు. దీని ద్వారా రైతులకు రూ.184 కోట్ల మేర ప్రయోజనం దక్కిందన్నారు. ఎన్నడూ లేనంత ధర 2023–24లో 215.35 మిలియన్ కిలోల పొగాకు విక్రయం జరగగా, రెండు దశాబ్దాలలో ఎప్పుడూ రానంత అత్యధిక ధర పలికిందని శ్రీధర్ పేర్కొన్నారు. గత ఏడాది సగటు ధర రూ. 288.65 పలికిందని, అంతకుముందు ఏడాది రూ. 225.73తో పోలిస్తే రూ.62.92 పెరుగుదల నమోదైందన్నారు. ఎన్నడూ లేనివిధంగా గరిష్ట ధర రూ. 411 పలకడం ఇదే మొదటిసారి అన్నారు. కర్ణాటకలో తాజాగా మొదలైన పొగాకు అమ్మకాలలో కూడా సగటున 288 రూపాయలకు కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. 2023–24 సీజన్లో పొగాకు ఎగుమతుల విలువ రూ. 12,005.89 కోట్లు చేరిందని, 2024–25లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని శ్రీధర్ పేర్కొన్నారు. ఈ సీజన్లో మరింత మెరుగైన ధర 2024–25 సీజన్లో మరింత మెరుగైన ధరలు వస్తాయని శ్రీధర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ రైతులు తన పట్ల చూపించిన ఆదరణ మరువలేనిదని పేర్కొన్నారు. ఉత్తర కాశీ కలెక్టర్‌గా పనిచేస్తూ బదిలీ అయినప్పుడు అక్కడ ప్రజలు రోడ్డుపైకి వచ్చి తనను బదిలీ చేయవద్దని ఆందోళనలు చేశారని, ఇక్కడ రైతులు కూడా అంతకంటే ఎక్కువ ఆదరణ చూపించారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పొగాకు బోర్డులో రికార్డు స్థాయి ధరలు ఉత్పత్తిలో అత్యున్నతం నష్టాల నుంచి లాభాల్లోకి నడిపిన ఈడీ శ్రీధర్‌బాబు సొంత క్యాడర్ ఉత్తరాఖండ్‌కు వెళ్తున్న సందర్భంగా ‘సాక్షి’తో మాటామంతీ మౌలిక సదుపాయాలకు పెద్దపీట తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత వేలం కేంద్రాలలో మౌలిక సదుపాయాల కోసం రూ. 38.92 కోట్లు ఖర్చుచేసినట్టు శ్రీధర్ చెప్పారు. ఎన్నడూ లేని విధంగా విడి పొగాకు, స్క్రాప్ అమ్మకాలకు కూడా అధిక ధరలు వచ్చాయని పేర్కొన్నారు. టుబాకో బోర్డును ఆధునికీకరించి పరిశ్రమగా అభివృద్ది చేసేందుకు శ్రీకారం చుట్టామని చెప్పారు. విదేశాలలో పొగాకు మార్కెట్‌ను పరిశీలించి వచ్చిన తర్వాత తాను చేసిన విజ్ఞప్తిని కేంద్రం అంగీకరించి రైతుల పక్షాన తీసుకున్న నిర్ణయాలు రైతుల ఆదాయాన్ని పెంచడానికి దోహదపడ్డాయన్నారు. పొగాకు డిమండ్ పెరిగి రైతులకు ఆదాయంతోపాటు ప్రభుత్వానికి విదేశీ మారక ద్రవ్యం కూడా పెరిగిందన్నారు. -
ధర్మవరం వెళ్లే రైళ్లు తాత్కాలికంగా రద్దు
లక్ష్మీపురం: సౌత్ సెంట్రల్ రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ మీదుగా ధర్మవరం రైల్వేస్టేషన్‌కు వెళ్లాల్సిన రైళ్లు ధర్మవరం స్టేషన్ ప్లాట్ ఫారం 5లో పలు అభివృధ్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో అనంతరపురం వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు డివిజన్ సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్ తెలిపారు. రైలు నంబర్ 17215 మచిలీపట్నం–ధర్మవరం రైలు ఈనెల 12 నుంచి 30వ తేదీ వరకు మచలిపట్నం స్టేషన్ నుంచి బయలుదేరి అనంతపురం స్టేషన్ వరకు మాత్రమే ప్రయాణిస్తుందని తెలిపారు. రైలు నంబర్ 17216 ధర్మవరం–మచిలీపట్నం రైలు ఈనెల 13వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అనంతపురం నుంచి మచిలీపట్నం వరకు మాత్రమే నడుస్తుందన్నారు. ప్రయాణికులు అసౌకర్యాన్ని గమనించి సహకరించాల్సిందిగా కోరారు. బ్యాంక్ ఉద్యోగుల నిరసన కొరిటెపాడు(గుంటూరు): బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించతలపెట్టిన రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్(యూఎఫ్‌బీయూ) పిలుపునిచ్చింది. ఈ మేరకు వివిధ బ్యాంకుల ఉద్యోగులు, అధికారులు మంగళవారం తమ తమ బ్యాంకుల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నగరంపాలెంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ వి.నరేంద్ర కుమార్ మాట్లాడుతూ బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల్లోని అన్ని విభాగాల్లో తగిన రిక్రూట్మెంట్ చేపట్టాలని, వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వర్క్‌మెన్, ఆఫీసర్ డైరెక్టర్ల పోస్టుల భర్తీకి కూడా యూఎఫ్‌బీయూ డిమాండ్ చేస్తోందన్నారు. కార్యక్రమంలో వివిధ బ్యాంకుల యూనియన్ల నాయకులు పీఎస్ రంగసాయి, షేక్ ఇబ్రహీం, పి.కిషోర్, సయ్యద్ బాషా, సునీత, కళ్యాణ్, రాంబాబు, సాంబశివరావు, శివాజీ తదితరులు పాల్గొన్నారు. కృష్ణానదిలో గుర్తుతెలియని మృతదేహం తాడేపల్లిరూరల్: ప్రకాశం బ్యారేజ్ కృష్ణానది దిగువ ప్రాంతంలో గేటు వద్ద మృతదేహం ఉన్నట్లు మంగళవారం తాడేపల్లి పోలీసులకు మత్స్యకారులు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కృష్ణానది దిగువ ప్రాంతంలోని 4వ నెంబరు గేటు వద్ద మృతదేహాన్ని బయటకు తీయించి పరిశీలించారు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 35–40 మధ్య ఉండవచ్చని, మృతుడి ఒంటిపై ఎర్రచొక్క నల్లగీతలు, బ్లాక్ జీన్స్‌ఫాంట్ ధరించి ఉన్నాడని, కుడిచేతికి కాశీదారం ఉందని, మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిందని, మృతదేహాన్ని గుర్తిస్తే తమను సంప్రదించాలని పోలీసులు కోరారు. -
ఏపీకి చేరుకున్న మయన్మార్‌లో చిక్కుకుపోయిన వ్యక్తులు
గన్నవరం: మయన్మార్ దేశంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడుగురు వ్యక్తులు భారత ప్రభుత్వ చొరవతో మంగళవారం సురక్షితంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు, శ్రీకాకుళం, రాజమండ్రి, విజయవాడ, ప్రొద్దుటూరుకు చెందిన మరో నలుగురు వివిధ ఏజెన్సీలు ద్వారా వర్క్ వీసాపై ఉద్యోగాలు నిమిత్తం మయన్మార్ వెళ్లారు. వర్కింగ్ వీసాల గడువు తీరినప్పటికీ వెనక్కి రాకుండా వీరంతా మయన్మార్‌లోనే స్థిరపడిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన మయన్మార్ అధికారులు సదరు ఏడుగురు పాస్‌పోర్ట్‌లు, వీసాలను స్వాధీనం చేసుకుని భారత ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం వెంటనే మయన్మార్ అధికారులతో సంప్రదింపులు జరిపి అక్కడ చిక్కుకుపోయిన ఏడుగురిని న్యూఢిల్లీకి తీసుకువచ్చారు. అక్కడ వీరిని సమగ్ర విచారణ అనంతరం కేంద్ర ప్రభుత్వ అధికారులు మంగళవారం రాత్రి ఎయిరిండియా విమానంలో గన్నవరం పంపించారు. ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌లో వీరిని గన్నవరం సీఐ బీవీ. శివప్రసాద్, ఎస్ఐ శ్రీధర్‌లు రిసీవ్ చేసుకున్నారు. అనంతరం ఏడుగురిలో ఐదుగురిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాజమండ్రి, ప్రొద్దుటూరుకు చెందిన ఇరువురిని బుధవారం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు సీఐ తెలిపారు. మయన్మాన్ నుంచి వచ్చిన వారి పేర్లు ఎస్కె. ఖాహప్, షేక్ గౌస్మస్తాన్, సిహెచ్. త్రిదేవ్, అఫ్రిది, రాజేష్‌కుమార్, షాంషేర్ బాషా, జోయల్ సన్నిగా పేర్కొన్నారు. -
హంస వాహనంపై నారసింహుడు
లక్ష్మీనృసింహస్వామి బ్రహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేతుడైన నారసింహుడు మంగళవారం ఉదయం హంస వాహంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి ప్రసాదాలు స్వీకరించారు. కై ంకర్యపరులుగా వేదాంత వెంకట రమణాచార్యులు భార్య గోపాల సత్యవతి, కుమారులు వేణుగోపాల వాసుదేవభట్టర్,అరుణప్రియ, సోదరులు వ్యవహరించారు. మంగళవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారు గజవాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. కై ంకర్యపరులుగా పాత మంగళగిరి శ్రీ పద్మశాలీయ సంఘం వారు వ్యవహరించారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ ఎ.రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. అత్యంత విశిష్టత కలిగిన పొన్నవాహన సేవ బుధవారం రాత్రి జరుగుతుందని ఈఓ రామకోటిరెడ్డి తెలిపారు. – మంగళగిరి/మంగళగిరి టౌన్ -
రేపు ఎయిమ్స్‌లో వాక్‌థాన్
మంగళగిరి: నగర పరిధిలోని ఆల్ ఇండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(ఎయిమ్స్) ఆవరణలో వాక్‌థాన్ నిర్వాహకులు వి.నేహ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా నెఫ్రాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 13న గురువారం ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు వాక్‌థాన్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఎయిమ్స్ ఆవరణలోని ఆడిటోరియంలో నిర్వహించే సమావేశంలో కిడ్నీ ప్రాముఖ్యంపై అవగాహన కల్పించనున్నట్టు వివరించారు. సాగర్ నీరు సాగు, తాగుకే వాడుకోవాలి నరసరావుపేట: నాగార్జునసాగర్ కుడికాలువకు కృష్ణా బోర్డు కేటాయించిన నీటిలో మిగిలిన నీరు మార్చి చివరి వరకు మాత్రమే సరిపోయే అవకాశం ఉన్నందున వృథా చేయకుండా పంట పొలాలు, తాగునీటి చెరువులకు మాత్రమే ఉపయోగించాలని ఎన్ఎస్పీ సూపరింటెండెంట్ ఇంజినీర్ కృష్ణమోహన్ సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మే నెలలో తాగునీటి చెరువుల కోసం నీరు విడుదల చేసేంత వరకు కాలువలు మూసివేయనున్నట్టు చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా విభాగం, ప్రజారోగ్యశాఖల అధికారులు తాగునీటి చెరువుల్లోని నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని కోరారు. రేపు సత్రశాలలో 16 రోజుల పండుగ సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద వేంచేసిన శ్రీగంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానంలో గురువారం 16 రోజుల పండగ నిర్వహించనున్నట్లు ఈఓ గాదె రామిరెడ్డి మంగళవారం తెలిపారు. మహాశివరాత్రి పండగ వెళ్లిన 16 రోజుల తరువాత దేవస్థానంలో స్వామివార్ల కల్యాణం నిర్వహించి అనంతరం కనులపండువగా వసంతోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తున్నట్లు వివరించారు. వలస పక్షుల రాక పెదకూరపాడు : కొల్లేరు ప్రాంతానికి విదేశీ పక్షులు రావడం అందరికీ తెలిసిన విషయమే. గుంటూరు జిల్లాలోనూ తక్కెళ్లపాడు చెరువుకు వలస పక్షులు రావడం సహజం. ఈ కోవలోనే పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరు గ్రామంలోని చెరువు కూడా వలస పక్షులకు ఆవాసంగా మారడంతో ప్రజలు పక్షులను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువు గట్లపైన పండ్ల మొక్కలు నాటి సంరక్షిస్తే పక్షులకు ఆవాసాలుగా మారతాయని, తద్వారా జీవవైవిధ్యాన్ని కాపాడవచ్చని పక్షి ప్రేమికులు కోరుతున్నారు. యార్డులో 1,44,323 బస్తాలు మిర్చి విక్రయం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 1,38,953 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,44,323 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. -
సంక్షేమం ఫ్రీజ్
వైఎస్ జగన్ ప్రభుత్వంలో కొలువుల జాతర అబద్ధాల విష వలయం చుట్టుముడితే.. ఆకాశానికి నిచ్చెన వేసి ఆశల పల్లకీలో ఊరేగిస్తే.. అరచేతిలో వైకుంఠం చూపి మంత్రదండంలా ఆడిస్తే నిజమని నమ్మిన సామాన్యుడు.. కాల‘కూటమి’ చక్రబంధనంలో చిక్కుకున్నాడు.. అది మాయాచట్రమని తెలుసుకునేలోపు నివురుగప్పిన మోసం నిలువునా ముంచేసింది. బంగారు భవితను అంధకారం చేసింది. ఇంటికో ఉద్యో గం.. నిరుద్యోగ భృతి అంటూ యువగళంలో పోసిన గరళం అంపశయ్యపైకి చేర్చింది. తల్లికి వందనం పేరిట ‘అమ్మఒడి’లో రేపిన మంట కార్చిచ్చులా చుట్టుముట్టింది. విద్యా దీవెనలు.. శాపాల శరాఘాతాలై నిలువెల్లా తాకాయి. ఫలితంగా దగా పడ్డ తెలుగుబిడ్డ ఆగ్రహజ్వాలతో గళమెత్తి గర్జిస్తున్నాడు. కూటమి సర్కారుపై కన్నెర్రజేసి ఖబడ్దార్ అంటూ హెచ్చరిస్తున్నాడు. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో దళమై కదంతొక్కేందుకు సిద్ధపడ్డాడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా జిల్లాలో సుమారు ఐదు వేల మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా మరో ఐదు వందల మందికి ఉపాధి దొరికింది. చాలా మంది తమ సొంత గ్రామాలు, సొంత మండలాల్లో ఉపాధి పొందారు. అప్పట్లో హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నవారు సొంత ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం గమనార్హం. ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాల కల్పన గతంలో ఎన్నడూ జరిగిన దాఖలాలు లేవు. వైద్య ఆరోగ్య శాఖలో రెండు వేలకు పైగా ఉద్యోగాలు కల్పించారు. అలాగే ఇతర శాఖల్లో శాశ్వత, కాంట్రాక్టు పోస్టులు భర్తీ చేశారు. అప్కాస్ పేరిట వేలాది మందికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే స్థానిక యువతకు వలంటీర్ వ్యవస్థ ద్వారా భారీగా ఉపాధి కల్పించడం విశేషం. జిల్లాలో సుమారు పది వేల మందికిపైగా మంది వలంటీర్లుగా సొంత గ్రామంలో ఉపాధి పొందారు. ప్రజల ముంగిళ్లలోకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లారు. గత ప్రభుత్వంలో క్యాలెండర్ ప్రకారం.. గత ప్రభుత్వంలో జగనన్న విద్య దీవెన, వసతి దీవెనకు సంబంధించిన నిధులను ప్రతి మూడు నెలలకొకసారి క్యాలెండర్ ప్రకారం విడుదల చేసేవారు. దీంతో ఫీజు బకాయిలు లేకుండా సకాలంలో కాలేజీలకు చెల్లించేవాళ్లం. కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేయకుండా ఉండేవి. కానీ ప్రస్తుతం ఆ విధంగా చెల్లింపులు జరగకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. – రామసాయి, విద్యార్థి, బీటెక్ థర్డ్ ఇయర్ ఫీజుల కోసం అప్పు గతంలో ఇంటర్ చదువుకునే విద్యార్థులకు అమ్మఒడి ద్వారా రూ.15వేలు చెల్లించేవారు. ఆ నగదుతో ఫీజులు కట్టుకునే వాళ్లం. గత ఏడాదికి సంబంధించి అమ్మఒడి నిధులను ప్రస్తుత ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఫీజులను సొంతంగా అప్పు చేసుకుని కట్టుకోవాల్సిన దుస్థితి దాపురించింది. – డి.సురేంద్ర ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ●సాక్షి ప్రతినిధి, గుంటూరు: అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటికొక ఉద్యోగం ఇస్తాం.. యువతకు ఉపాధి కల్పిస్తాం.. సంపద సృష్టించి అభివృద్ధి చేస్తాం.. నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు భృతి ఇస్తామంటూ ఎన్నికల సమయంలో కూటమి నేతలు, ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఊదరగొట్టారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా కొత్త ఉద్యోగం ఇవ్వలేదు. పైగా ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇంటర్, డిగ్రీ, డిప్లమా, ఐటీఐ, ఇంజినీరింగ్, పీజీ ఇలా ఏదో ఒకటి పూర్తి చేసిన నిరుద్యోగులు ఐదు లక్షల 58 వేల మంది ఉన్నారని అంచనా. వీరికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు కల్పించాల్సి ఉంది. అయితే ఆ దిశగా సర్కారు చర్యలు తీసుకోవడం లేదు. అలాగే నిరుద్యోగ భృతి ఊసే ఎత్తడం లేదు. బడ్జెట్లోనూ కేటాయింపులు చేయలేదు. అసలు భృతికి అర్హత ఏమిటన్న మార్గదర్శకాలూ విడుదల చేయలేదు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ, తొలి సంతకం అంటూ ఆర్భాటం చేసిన చంద్రబాబు దానికీ పాతరేశారు. ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఏపీపీఎస్సీ ఉద్యోగాల నోటిఫికేషన్లూ ఇవ్వడం లేదు. ఫలితంగా యువత నిరసన గళమెత్తుతోంది. బాబు వల్ల విద్యారంగం నిర్వీర్యం బాబు పాలనలో విద్యారంగం నిర్వీర్యమైపోతోంది. గత ప్రభుత్వంలో అమలైన ఫీజు రీయింబర్స్మెంట్(విద్యాదీవెన), వసతి దీవెన పథకాలు అటకెక్కాయి. ఫలితంగా విద్యార్థుల బంగారు భవిత అంధకారమైపోతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సర్కారు విడుదల చేయకపోవడంతో కళాశాలల నుంచి ఎప్పుడు బయటకు గెంటేస్తారో తెలీక విద్యార్థులు సతమతమవుతున్నారు. ఇప్పటికే చదువు పూర్తయిన విద్యార్థులకు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఫలితంగా ఉద్యోగాల కోసం యత్నిస్తున్న వారు అవస్థలు పడుతున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ కాలేజీలకు ఫీజులు చెల్లిస్తున్నారు. అప్పులకు వడ్డీ భారం పెరుగుతున్నా.. సర్కారులో మాత్రం చలనం ఉండట్లేదు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా రీయింబర్స్మెంట్ సొమ్ము విడుదల చేయడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. ఇదిలా ఉండగా, ఫీజులు చెల్లిస్తేనే ఈ ఏడాది పరీక్షలకు అనుమతిస్తామని కళాశాలల నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు. వైఎస్సార్ సీపీ ఉద్యమబాట కూటమి ప్రభుత్వ వంచనను ఎండగట్టేందుకు వైఎస్సార్ సీపీ ఉద్యమ బాట పట్టింది. నిరుద్యోగ యువత, విద్యార్థుల పక్షాన పోరుబాటకు నాంది పలికింది. ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ బుధవారం ‘యువత పోరు’ పేరుతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టనున్నారు. జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పథకాల లబ్ధి ఇలా.. పథకం లబ్ధిదారులు ఆర్థిక ప్రయోజనం (రూ.కోట్లలో) జగనన్న అమ్మఒడి 1,59,594 239.39 జగనన్న విద్యాదీవెన 38,252 80.35 జగనన్న వసతి దీవెన 37,894 33.31 భారీగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తల్లికి వందనం, విద్యాదీవెన, వసతి దీవెనకు మంగళం నిరుద్యోగ భృతి అడ్రస్ గల్లంతు ఉపాధి లేదు.. ఉద్యోగం రాదు.. యువత తరఫున నేడు వైఎస్సార్ సీపీ పోరుబావుటా ప్రతిపక్షానికి అన్నివర్గాల నుంచి విశేష మద్దతు తల్లికి వందనం ఎక్కడ? కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే గత ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. గతంలో నాలుగేళ్లపాటు నిరాటంకంగా అమలైన జగనన్న అమ్మ ఒడి ఆర్థిక ప్రోత్సాహం ఆగిపోయింది. ఏటా తల్లుల ఖాతాల్లో జమైన రూ.15 వేలు పిల్లల చదువులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. కరోనా సంక్షోభంలోనూ అమ్మఒడి ఆగలేదు. కూటమి సర్కారు వచ్చాక తల్లికి వందనం అని చెప్పి మొత్తంగా ఎగ్గొట్టారు. -
‘అమరావతి అప్పులపై చంద్రబాబు పచ్చి అబద్దాలు’
తాడేపల్లి: అమరావతి రాజధాని నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నవి పచ్చి అబద్దాలేననే విషయం బట్టబయలు అయ్యిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి కోసం కేంద్రం రూ.15వేల కోట్లు ప్రపంచబ్యాంక్ ద్వారా ఇప్పిస్తోందని, ఇది పూర్తి గ్రాంట్ అంటూ ఇప్పటి వరకు చేసిన వాదనలు పూర్తి అవాస్తవాలేనని తేలిపోయింది. పార్లమెంట్ సాక్షిగా అమరావతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించిన అంశాలతో ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు చేస్తున్న బుకాయింపులన్నీ అసత్యాలేనని బయటపడిందన్నారు కారుమూరి వెంకటరెడ్డి. ఇంకా ఆయన ఏమన్నారంటే...అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇప్పించేది గ్రాంట్ మాత్రమేనని, దీనిని అప్పుగా తిరిగే కట్టాల్సిన అవసరం లేదంటూ ఇప్పటి వరకు రాష్ట్రప్రభుత్వం బుకాయిస్తూ వచ్చింది. తాజాగా పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి దీనిపై ఇచ్చిన స్పష్టతతో ఇదంతా అబద్ధమేనని తేలిపోయింది. వైయస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి ఈనెల 10వ తేదీన పార్లమెంట్లో అడిగిన క్వశ్చన్ నెంబర్ 1703కు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్లో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రపంచబ్యాంకు, ఏడీబీ సహా ఇతర రుణాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పుల పరిధిలోకి రాని రుణాలే అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే వాటిని చెల్లించాలని కేంద్ర మంత్రి తన సమాధానంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కేంద్రం కేవలం పది శాతం మాత్రమే అంటే రూ. 1500 కోట్లు వరకే గ్రాంట్‌గా ఇస్తుందని వెల్లడించారు. అమరావతికి కేంద్ర సాయం ఒట్టిదేనని, చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఇన్నాళ్లు వైయస్సార్సీపీ చెబుతూ వస్తున్నదే ఇప్పుడు నిజమైంది. కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం ద్వారా చంద్రబాబు చేసిన ప్రచారం అబద్ధమేనని తేలిపోయింది.రూ.5 వేల కోట్లు అప్పుకి రూ.15 వేల కోట్లు చెల్లింపు2014-19 మధ్య కూడా అమరావతి నిర్మాణం కోసం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రూ.5,335 కోట్లు రుణాలు తీసుకుంది. ఇందులో హడ్కో నుంచి రూ. 1,098 కోట్లు, బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ. 1862 కోట్లు, అమరావతి బాండ్ల ద్వారా రూ. 2 వేల కోట్లు తీసుకుంది. ఈ అప్పులకు సంబంధించిన వడ్డీలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం, అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏటా రూ. 1,573 కోట్లు వడ్డీలుగానే కడుతోంది. అంటే రూ.5,335 కోట్ల రుణాలకు పదేళ్లలో రూ. 15,773 కోట్లు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితిని తీసుకువచ్చారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని చెప్పుకుంటూ ప్రజాధనంను వడ్డీల రూపంలో అమరావతి కోసం దోచిపెడుతున్నారు. మళ్లీ ఇదే అమరావతి కోసం బడ్జెట్లో రూ. 6 వేల కోట్లు కేటాయించారు.అమరావతి కోసం మొత్తం రూ.37 వేల కోట్ల రుణాలుప్రస్తుతం ప్రపంచ బ్యాంకు నుంచి రూ. 15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ. 11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ నుంచి రూ.5 వేల కోట్లు .. మొత్తం రూ. 31 వేల కోట్లు మళ్లీ అప్పులు చేస్తున్నారు. వీటితోపాటు సీఆర్డీఏ ద్వారా నిధులు సమీకరించాలని చూస్తోంది. గతంలో చేసిన అప్పులు కూడా కలిపి ఇప్పటికే రూ. 37 వేల కోట్లు అప్పులు చేశారు. ఇవన్నీ ఎప్పుడు చెల్లిస్తారు.. ఎలా చెల్లిస్తారు? అమరావతి అంటేనే ఒక దోపిడీ. రాజధాని నిర్మాణం ముసుగులో భారీ అవినీతి జరుగుతోంది. జాతీయ రహదారుల నిర్మాణానికే కిలోమీటర్‌కి రూ. 20 నుంచి రూ. 22 కోట్లు ఖర్చవుతుంటే, అమరావతి ప్రాంతంలో ఒక కిలోమీటర్ రోడ్డు వేయడానికి రూ. 53.88 కోట్లు అవుతుందట. గతంలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీల నిర్మాణం కోసం ఒక చదరపు అడుగు నిర్మాణానికి రూ.9400 లు ఖర్చు చేశారు. ఏ గేటెడ్ కమ్యూనిటీ నిర్మానానికి కూడా ఇంత భారీగా ఖర్చు కాదు. అమరావతి పేరుతో బినామీలకు దోచిపెట్టడమే లక్ష్యంగా చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్గతంలో 2014-19 మధ్య రూ. 40 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి రూ. 5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అందులోనూ దిగిపోయేనాటికి రూ. వెయ్యి కోట్లు బిల్లులు పెండింగ్ పెట్టి దిగిపోయారు. ఇదే వ్యవహారం ఇప్పుడూ జరుగుతోంది. ఇదంతా ప్రజలకు తెలియకుండా అసెంబ్లీ సాక్షిగా డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపారు. బడ్జెట్ లో ఉన్న లొసుగులపై ప్రభుత్వాన్ని వైయస్ఆర్సీపీ ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పే ధైర్యం లేక కేబినెట్ మీటింగులో రంగయ్య మరణంపై చర్చ పెట్టారు. కేబినెట్ సమావేశంలో ప్రజా సమస్యలను గాలికొదిలేసి సహజ మరణాన్ని అనుమానాస్పద మరణంగా చిత్రీకరించే కుట్రకు తెరలేపారు. సుప్రీంకోర్టు డైరెక్షన్లో సీబీఐ దర్యాప్తు చేస్తున్న వివేకా కేసుపై కేబినెట్లో ముఖ్యమంత్రికి చర్చించాల్సిన అవసరం ఏంటి? అసెంబ్లీలో ఎందుకు చర్చిస్తున్నారు? ఇంత చెబుతున్న చంద్రబాబు.. వివేకాను దారుణంగా నరికి చంపానని ఒప్పుకున్న దస్తగిరి గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఇదంతా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్.బాబు హయాంలోనే హత్యారాజకీయాలుతన జీవితంలో పాలనలో హత్యారాజకీయాలు చేయలేదని, చూడలేదని చంద్రబాబు చెప్పడం విడ్డూరం. ఆయన బావమరిది బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పులు, చనిపోయిన వాచ్మెన్ మరణంపై విచారణ కోరండి. దీంతోపాటు మల్లెల బాబ్జి, వంగవీటి మోహనరంగ హత్య, పింగళి దశరథరామ్ హత్యలపై కూడా సిట్ విచారణ జరిపించవచ్చు కదా! ఇవన్నీ ప్రజలకు తెలియాలి. ఎన్టీఆర్ మానసిక క్షోభకు ఎవరు కారణం? ఆయన ఎలా చనిపోయారో ఈనాటి తరానికి తెలియాలి. పార్టీ ఆఫీసు మీద జరిగిన దాడిపై కూడా చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని పట్టాభి అనే వ్యక్తి నాటి సీఎం వైయస్ జగన్ గురించి అసభ్య పదజాలంతో రెచ్చిపోయినందుకు కాదా? దాడి వెనుక కారకులు తండ్రీకొడుకులు చంద్రబాబు, నారా లోకేష్ కాదా? తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్కసారైనా చంద్రబాబు నీతివంతమైన రాజకీయం చేశాడా? అడుగడుగునా అవినీతి, బంధుప్రీతి, దోపిడీ, వెన్నుపోటు రాజకీయాలు చేసిన వ్యక్తి తన మీద మరకలు లేవని చెబుతున్నాడు’అని మండిపడ్డారు. -
పిఠాపురం పీఠాధిపతి ఎక్కడ?
సాక్షి,తాడేపల్లి : పిఠాపురం పీఠాధిపతి ఎక్కడ? అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల ప్రశ్నించారు. జ్యోతి కాశినాయున క్షేత్రంలో కూల్చివేతలను పరిశీలించారు. ఈ ప్రభుత్వం ఆధ్యాత్మిక స్థలాలను కూల్చివేయడం దారుణం. విధ్వంస పాలన అంటే ఇది. సనాతన ధర్మాన్ని కాపాడతానన్న పిఠాపురం పీఠాధిపతి ఎక్కడికి వెళ్ళాడు..? ఆయన సొంత శాఖ అధికారులు కూల్చివేతకు దిగితే ఎందుకు నోరుమెదపడం లేదు..? అటవీ అనుమతులు తీసుకురావాల్సిన ఆయన ఎందుకు మిన్నకున్నారు..? ఈ కూల్చివేతకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి’ అని డిమాండ్ చేశారు. -
వైఎస్సార్సీపీ ‘యువత పోరు’కు అంతా సిద్ధం
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పేద విద్యార్థులు, నిరుద్యోగులు తరఫున కూటమి ప్రభుత్వంపై పోరుకి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. రేపు(బుధవారం) ‘‘యువత పోరు’’ పేరుతో ధర్నా కార్యక్రమం నిర్వహించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులను ఆదేశించారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జెండావిష్కరణలు చేయనున్నారు. అనంతరం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు ప్రభుత్వ మోసాలపై విద్యార్థులు, నిరుద్యోగులు నినదించనున్నారు. ధర్నాలు నిర్వహించనున్నారు.16,347 పోస్టులతో డీఎస్సీ పేరుతో చంద్రబాబు చేసిన తొలి సంతకం అభాసుపాలైంది. 9 నెలలు కావొస్తున్నా డీఎస్సీ నోటిఫికేషన్ అతీగతీలేదు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను కూటమి సర్కార్ ప్రైవేటుపరం చేసింది. పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యను కూడా కూటమి ప్రభుత్వం దూరం చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మూడు త్రైమాసికాల నుండి ఫీజులు ఇవ్వకుండా విద్యార్థులను చంద్రబాబు వేధిస్తున్నారు. నిరుద్యోగ భృతి విషయంలో కూటమి ప్రభుత్వం మాట తప్పింది. నిరుద్యోగ భృతి పేరుతో నెలకు రూ.3 వేలు ఇస్తామంటూ యువతను మోసం చేశారు. ఉద్యోగాల్లేక యువత అల్లలాడిపోతోంది.విద్యార్థుల జీవితాలతో కూటమి సర్కార్ ఆటలు: కన్నబాబుకాకినాడ జిల్లా: పేద విద్యార్ధుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటోందని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన యువత పోరు పోస్టర్‌ను ఆవిష్కరించారు. రూ.4,800 కోట్లు ఫిజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూటమి ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని ధ్వజమెత్తారు.‘‘ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టిన ఘనత దివంగత మహానేత వైఎస్సార్‌దే. ఆయన తనయుడిగా నాలుగు అడుగులు ముందుకు వేసి ఈ పథకాన్ని వైఎస్ జగన్ విస్తృతంగా అమలు చేశారు. ప్రతి వర్గాన్ని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదే. మోసపోయిన ప్రజలకు అండగా వైఎస్సార్సీపీ ఉంటుంది. చంద్రబాబు సర్కార్‌ను నిలదీయడానికి వైఎస్సార్సీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది’’ అని కన్నబాబు పేర్కొన్నారు. -
బుడమేరు వరద సాయంలో చంద్రబాబు సర్కార్ విఫలం: బొత్స
సాక్షి, అమరావతి: వరద సహాయంలో కూటమి సర్కార్ విఫలమైందని విపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బుడమేరు వరద సాయంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ జగన్ ప్రకటించిన కోటి రూపాయలను మేమే బాధితులకు అందించామని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని.. అందుకే మేమే స్వయంగా మా పార్టీ తరపున బాధితులకు సాయం అందించామని బొత్స తెలిపారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ, వరద బాధితుల్లో అనేక మందికి ఇంకా పరిహారం అందలేదని మండిపడ్డారు. వరద సహాయం విషయంలో ప్రభుత్వం విఫలమైంది. ఆపరేషన్ బుడమేరు అన్నారు.. ఇప్పటివరకు ఏం చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రుహుల్లా మాట్లాడుతూ.. బుడమేరు గేట్లను ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని.. వరదల తర్వాత బుడమేరును ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఇప్పటికీ అనేకమంది బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. ఒక ఇంటికి పరిహారం ఇచ్చి 10 ఇళ్లకు ఇచ్చినట్లు రాసుకున్నారు. అందరికీ సాయం అందిందని చెప్పడం పచ్చి అబద్ధమని రుహుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మండలి: మేం అనుసరించిన విధానాలను నీతి ఆయోగ్ ప్రశంసించింది: బొత్స
మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు తీవ్ర నిరాశను కలిగించాయి : వరుదు కళ్యాణి👉పెట్టుబడి సాయం 20 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు👉ఇప్పుడు కేంద్రం సాయంతో కలిపి 20 వేలు ఇస్తామంటున్నారు👉మండలి సాక్షిగా రైతుకి వెన్నుపోటు పొడిచారు👉ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసింది👉అన్నమో రామచంద్రా అనే పరిస్థితికి రైతును తీసుకొచ్చారు👉జగన్ మోహన్ రెడ్డి పాలనలో వ్యవసాయం పండుగలా సాగింది👉కూటమి పాలనలో సాగు విస్తీర్ణం తగ్గిపోయిందిఅచ్చెన్నాయుడు మాటలు వింటుంటే నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు : బొత్స👉2016లో రుణమాఫీకి బాండ్ ఇచ్చారు👉రుణమాఫీ చేయకుండా 2019 వరకూ ఏం చేశారు👉మిర్చి ఒక్క టన్నైనా 11,700 రూపాయలకి కొన్నారా👉గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవాలని కోరుతున్నాం60% శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్నారు: బొత్స👉గత ప్రభుత్వంలో రైతులను సకాలంలో ఆదుకున్నాం👉విపత్తు వస్తే సీజన్ ముగిసేలోపు పరిహారం అందించాం👉విత్తనాలు...ఎరువులు రైతుల వద్దకే తీసుకెళ్లి అందించాం👉మా ప్రభుత్వంలో అనుసరించిన వ్యవసాయ విధానాలను నీతిఆయోగ్ కూడా ప్రశంసించింది👉మేం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మేలు చేశాం👉వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేనాటికి సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ చెల్లించాల్సిన బకాయిలు 5286 కోట్లు👉వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకుంటే రైతుల పేరుతో డబ్బులు తీసుకున్నారనడం కరెక్ట్ కాదు👉ఇలా మాట్లాడటం రైతులను అవమానపరచడమేమంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ అభ్యంతరం👉తప్పు జరిగితే విచారణ జరిపించుకోవడం ఆయా ప్రభుత్వాల విధానం👉తాడేపల్లి ప్యాలెస్‌లో రికార్డులు తగలబెట్టేశారనడం సరికాదు👉రికార్డుల నుంచి మంత్రి వ్యాఖ్యలు తొలగించాలి👉ఆధారాలుంటే రుజువుచేయండి👉బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉండి ఇలా మాట్లాడటం సరికాదు👉తగలబెట్టినట్లు ఆధారాలుంటే కేసు ఫైల్స్‌లో ఎంక్వైరీ బైండింగ్స్‌లో చేర్చుకోండిబుడమేరు వరద సాయంపై మండలిలో చర్చ👉వరద బాధితుల్లో అనేకమందికి ఇంకా పరిహారం అందలేదు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్👉వరద సహాయం విషయంలో ప్రభుత్వం విఫలమైంది👉ఆపరేషన్ బుడమేరు అన్నారు.. ఇప్పటివరకు ఏం చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి👉బుడమేరు గేట్లను ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రుహుల్లా👉వరదల తర్వాత బుడమేరును ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు👉ఇప్పటికీ అనేకమంది బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు👉ఒక ఇంటికి పరిహారం ఇచ్చి 10 ఇళ్లకు ఇచ్చినట్లు రాసుకున్నారు👉అందరికీ సాయం అందిందని చెప్పడం పచ్చి అబద్ధం👉కూటమి ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు: బొత్స సత్యనారాయణ👉వైఎస్ జగన్ ప్రకటించిన కోటి రూపాయలను మేమే బాధితులకు అందించాం👉నేనే అందుకు బాధ్యత తీసుకున్నా👉కూటమి సర్కార్ సాయం అందించడంలో విఫలమైంది👉ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు👉అందుకే మేమే స్వయంగా మా పార్టీ తరపున బాధితులకు సాయం అందించాంఏపీ శాసనమండలిలో ఉచిత ఇసుకపై వాడివేడిగా చర్చ 👉కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక ధర పెరిగింది: బొత్స సత్యనారాయణ👉విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇసుక ధర తగ్గలేదు👉ప్రభుత్వం చెప్పినట్లు ఇసుక ఇవ్వడం లేదు👉గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ఎంతకిస్తున్నారో వెరిఫై చేయాలి👉కూటమి నేతలు చెప్పే లెక్కలు తప్పుగా ఉన్నాయి.👉కూటమి నేతలు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు👉ఉచిత ఇసుక, ఇసుక అక్రమ అమ్మకాలపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 80 లక్షల టన్నుల స్టాక్‌ను కొత్త ప్రభుత్వానికి అప్పగించిందని.. దానిలో ఎంత స్టాక్ రికార్డెడ్‌గా జమ చేశారు?. ఎంత ఆదాయం వచ్చిందని ప్రశ్నించారు. రీచ్‌లలో ట్రాక్టర్ల నుంచి లారీల్లోకి ఇసుక వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మొత్తం మెషినరీల ద్వారానే ఇసుకను తీసి లారీలకు లోడు చేస్తున్నారు. రాత్రి, పగలూ తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది’’ అని తోట త్రిమూర్తులు మండిపడ్డారు.👉‘‘ఒక్కొక్క లారీకి సుమారు 11 నుంచి 12 వేల వరకు వసూలు చేస్తున్నారు. గత ప్రభుత్వం అప్పగించిన ఇసుకకు, చెబుతున్న లెక్కలకు తేడాలు ఉన్నాయి. మెషినరీల ద్వారా ఇసుకను మొత్తం తోడేస్తున్నారు. గత 2016లో తెచ్చిన పాలసీనే ఇప్పుడు కూడా ఉంది. పేద ప్రజలకు ఇసుక అందే పరిస్థితి లేదని తోట త్రిమూర్తులు ధ్వజమెత్తారు.👉శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో లారీ ఇసుక ఎంతకు దొరికేది?.. ఈ రోజు ఎంతకు దొరుకుతుందంటూ కూటమి సర్కార్‌ని నిలదీశారు. ఉచిత ఇసుక అంటే టన్నుకు కనీసం 400 రూపాయలు తగ్గాలి. సామాన్యులకు ఉచిత ఇసుక అందే పరిస్థితి లేదని మండిపడ్డారు. -
AP: జీబీఎస్ వైరస్‌తో మరో మహిళ మృతి
సాక్షి, గుంటూరు: గుంటూరు ఆసుపత్రిలో జీబీఎస్ వైరస్‌తో మరో మహిళ మృతి చెందింది. వారం క్రితం వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలోకి చేరిన మహిళ.. చికిత్స పొందుతూ మరణించింది. కాగా, గుంటూరు జీజీహెచ్‌లో గత నెల.. షేక్ గౌహర్ జాన్ అనే మహిళ మృతి చెందింది. గులియన్ బార్ సిండ్రోమ్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన గౌహర్.. వ్యాధి తీవ్రత మరణించింది.కాగా, ఇటీవల ఇదే ఆసుపత్రిలో కమలమ్మ అనే మహిళ జీబీఎస్‌తో చనిపోగా.. ఇపుడు మరో మహిళ కూడా మరణించడంతో జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న జీబీఎస్ బాధితులు ఆందోళన చెందుతున్నారు.భయపెడుతున్న జీబీ సిండ్రోమ్గులియన్ బ్యారి సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణాలేమిటి? దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలను ప్రజలు శోధిస్తున్నారు. కలుషిత నీరు, ఆహారం తీసుకునేవారిలోనే జీబీఎస్ అధికంగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. -
జగనన్న కాలనీ కబ్జా.. పల్నాడులో బరితెగించిన టీడీపీ గూండాలు
సాక్షి, పల్నాడు జిల్లా: గురజాల నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను సైతం వదలడం లేదు. టీడీపీ నాయకులు యథేచ్ఛగా సాగిస్తున్న భూ దందా సాగిస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో టీడీపీ నాయకులు మరింత రెచ్చిపోతున్నారు.గురజాల మండలంలోని పులిపాడు గ్రామంలో జగనన్న కాలనీని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరులు కబ్జా చేసేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో పులిపాడులో 70 సెంట్ల లో 40 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ భూములంటూ యరపతినేని అనుచరులు నకిలీ సర్టిఫికెట్ సృష్టించారు. పొజిషన్ సర్టిఫికెట్ జారీ చేయడంలో వీఆర్వో జ్యోతి కీలక పాత్ర పోషించారు.పొజిషన్ సర్టిఫికెట్ ఆధారంగా 70 సెంట్లు జగనన్న కాలనీని తొమ్మిది మంది టీడీపీ నేతలు తమ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎవరైనా గొడవ చేస్తే చంపేస్తామంటూ టీడీపీ గూండాలు బెదిరింపులకు దిగుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. -
బీఈడీ ప్రశ్నాపత్రం లీకేజీలో 10 మంది అరెస్టు
నగరంపాలెం: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) బీఈడీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో పది మందిని అరెస్టుచేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. లీకేజీకి వినియోగించిన 13 మొబైల్ఫోన్లను సీజ్ చేశామని చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఉత్తర డీఎస్పీ మురళీకృష్ణ, పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామితో కలిసి ఆయన కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. వినుకొండ కాలేజీలో లీక్.. ఏఎన్‌యూ పరిధిలో గత శుక్రవారం (ఈనెల 7న) మ.2 గంటలకు బీఈడీ పరీక్ష ప్రారంభం కావల్సి ఉండగా మ.1.22కు ప్రశ్నపత్రం లీకైంది. దీన్ని ఏఎన్‌యూ ఉప కులపతి (వీసీ), పరీక్ష కేంద్రం సమన్వయకర్త గుర్తించారు. లీకేజీ వ్యవహారంపై ఏఎన్‌యూ పీజీ, వృత్తి విద్య కోర్సుల పరీక్ష కేంద్రం సమన్వయకర్త మన్నవ సుబ్బారావు పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పల్నాడు జిల్లా వినుకొండ టౌన్‌లోని శ్రీ వివేకానంద కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థలోని కంప్యూటర్ గది నుంచి లీకైనట్లు తేల్చారు. దీంతో కళాశాల కరస్పాండెంట్ సయ్యద్ రఫిక్ అహ్మద్, ప్రిన్సిపాల్ దుపాటి సురేష్ కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ ధార స్వర్ణరాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ నిర్వాకం ఇక పరీక్ష ప్రారంభమయ్యే నలభై నిమిషాల ముందు ఆయా పరీక్ష కేంద్రాలకు పాస్వర్డ్ పంపిస్తారు. తద్వారా పాస్వర్డ్ కొట్టి, ప్రశ్నాపత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. కానీ, ఈ పాస్‌వర్డ్‌ను కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, కంప్యూటర్ ఆపరేటర్లు దుర్వినియోగం చేసి, వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశారు. తద్వారా ఒడిశాకు చెందిన సంతోష్‌కుమార్ సాహు, బిష్ణుప్రసాద్ పాత్రో, సుకాంత్, విద్యార్థులు పురుషోత్తం ప్రధాన్, ధీరేన్కుమార్ సాహులకు చేరింది. వీరు ప్రియబత్రో గోడయ్, మిలాన్ తృష్టిలకు పంపించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ పదిమందినీ అరెస్టుచేసి వీరి నుంచి 13 మొబైల్ఫోన్లను స్వా«దీనం చేసుకుని సీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. ఒడిశా నిందితులు తమ రాష్ట్రంలో విద్యార్థులతో బీఈడీ పరీక్షలు రాయించి వారు ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణతయ్యేందుకు ఈ లీకేజీకి శ్రీకారం చుట్టారు. అలాగే, శ్రీ వివేకానంద కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థ నిర్వాహకులు కూడా ఇదే పద్ధతి అవలంబించినట్లు దర్యాప్తులో తేలింది. ఇక కేసుని త్వరితగతిన ఛేదించిన ఉత్తర డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ, పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామిలను ఎస్పీ అభినందించారు. -
ఉద్యోగాల పేరిట మోసాలు
చిట్టీల పేరుతో.. సంగడిగుంట కిడాంబినగర్ ఐదో వీధిలో ఉంటున్న తల్లి, కుమారుడు వస్త్ర దుకాణం నిర్వహించేవారు. రెండేళ్ల నుంచి చిట్టీ పాటలు నడుపుతున్నారు. గతేడాది తల్లి హఠాన్మరణం చెందారు. కుమారుడు చిట్టీ పాటల నగదు చెల్లిస్తానని నమ్మబలికాడు. ప్రస్తుతం ఆర్టీసీకాలనీలో ఉంటున్న అద్దె గృహాన్ని ఖాళీ చేశాడు. ఎవరైనా మొబైల్‌కు కాల్ చేసి డబ్బులు అడిగితే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. దాదాపు రూ.25 లక్షలకుపైగా చెల్లించాల్సి ఉంది. న్యాయం చేయగలరు. – బాణాల లక్ష్మి, శివపార్వతి,బాధితులు , సంగడిగుంట నగరంపాలెం: ఉద్యోగాల పేరిట మోసగించారని పలువురు బాధితులు వాపోయారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా ఫిర్యాదులు, పరిష్కారాల వ్యవస్థ ద్వారా అర్జీలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి బాధితుల నుంచి అర్జీలు తీసుకున్నారు. సకాలంలో బాధితులకు న్యాయం చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఏఎస్పీలు (క్రైం) కె.సుప్రజ, హనుమంతు, ట్రాఫిక్ డీఎస్పీ రమేష్ కూడా అర్జీలు స్వీకరించారు. ● -
ప్రకృతి సాగుకు ఫ్రాన్స్ బృందం ప్రశంసలు
గుంటూరు రూరల్: ప్రకృతి వ్యవసాయం విధానంలో సాగు చేసిన పెరటి తోటలను పరిశీలించడానికి ఫ్రాన్స్ బృందం సోమవారం కొల్లిపర మండలంలోని అత్తోట, దావులూరు పాలెం గ్రామాలను సందర్శించింది. రైతు సాధికార సంస్థ ద్వారా నిర్వహిస్తున్న ఏపీసీఎన్ఎఫ్ (ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం) ఆధ్వర్వంలో ఈ తోటలు సాగు అవుతున్నాయి. ముందుగా గుంటూరులోని కృషి భవనంలో ఏపీసీఎన్ఎఫ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ (డీపీఎం) కే రాజకుమారితో ఫ్రాన్స్ బృందం సభ్యులు సమావేశమయ్యారు. డీపీఎం మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విధానాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. అనంతరం బృంద సభ్యులు అత్తోట, దావులూరిపాలెం గ్రామాలలో 365 రోజుల కిచెన్ గార్డెన్, న్యూట్రి గార్డెన్, ఏ గ్రేడ్, ఏటీఎం, సూర్య మండలంలోని పలు మోడల్స్‌ను పరిశీలించారు. బీజామృతం, ఘన జీవామృతం తయారీ తెలుసుకున్నారు. అభ్యుదయ గ్రామ సంఘం సభ్యులతో సమావేశమయ్యారు. ప్రకృతి వ్యవసాయం బాగా చేస్తున్నారని బృందం ప్రశంసించింది. కార్యక్రమంలో నాగలక్ష్మి, ఎంటీఎల్ మాధవి, ఎంటీ పాండురంగారావు, ఎన్ఎఫ్ఎఫ్ రజిని, అవినాష్, ఆర్‌వైఎస్‌ఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అర్జీలను వేగంగా పరిష్కరించండి
గుంటూరు వెస్ట్: ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ మాట్లాడుతూ.. మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయి అధికారులకు కూడా ప్రజలు ప్రతి వారం అర్జీలను ఇవ్వొచ్చన్నారు. ఇచ్చిన అర్జీలకు తప్పనిసరిగా ఎండార్స్మెంట్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. పరిష్కారంలో నిర్లిప్తత ఉండకూడదని తెలిపారు. అనంతరం వచ్చిన 290 అర్జీలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, అసిస్టెంట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి -
ఎలక్ట్రిక్ బస్సులు వితరణ
మంగళగిరి: మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నృసింహస్వామి కొండతోపాటు ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు రెండు ఎలక్ట్రిక్ బస్సులను మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్టక్చర్ కంపెనీ సోమవారం అందజేసింది. బస్సులను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్టక్చర్ సీఎస్ఆర్ నిధుల ద్వారా రూ.2.4 కోట్ల విలువైన రెండు అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను అందజేసింది. ఈ బస్సుల్లో ఒకటి మంగళగిరి బస్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్, డీజీపీ ఆఫీసు మీదుగా ఎయిమ్స్‌కు వెళ్తుంది. మరొకటి మంగళగిరి బస్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా శ్రీ పానకాలస్వామి కొండకు వెళ్తుంది. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ కేవీ ప్రదీప్, ఎయిమ్స్ డైరెక్టర్ శాంతా సింగ్, డిప్యూటీ డైరెక్టర్ శశికాంత్, ఆలయ ఈవో ఏ రామకోటిరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, పద్మశాలీ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య పాల్గొన్నారు. మాల్ ప్రాక్టీసు కేసు నమోదు గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో సోమవారం తొలి మాల్ ప్రాక్టీసు కేసు నమోదైంది. పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన ద్వితీయ సంవత్సరం గణితం–2బీ పరీక్షకు గుంటూరు జిల్లాలోని 87 పరీక్షా కేంద్రాల పరిధిలో 28,274 మంది విద్యార్థులు హాజరయ్యారు. 446 మంది గైర్హాజరయ్యారు. గుంటూరులోని ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో కాపీయింగ్‌కు ప్రయత్నించిన ఓ విద్యార్థిపై అధికారులు మాల్ ప్రాక్టీసు కేసు నమోదు చేశారు. ఆర్ఐవో జీకే జుబేర్ ఐదు పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన మంగళగిరి: సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం మంగళగిరి మండలంలోని నీరుకొండ గ్రామంలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి సోమవారం పరిశీలించారు. సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది, అధికారులతో కలిసి ఆమె వర్సిటీని సందర్శించారు. సీఎం ప్రారంభించనున్న సీవీ రామన్ బ్లాక్, ప్రసంగించనున్న అబ్దుల్ కలామ్ ఆడిటోరియం తదితర ప్రదేశాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. వర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ నారాయణరావు, ప్లానింగ్ ఈడీ వీఆర్ అలపర్తి, సెక్రటరీ అనంత్ సింగ్, రిజిస్ట్రార్ ఆర్. ప్రేమ్‌కుమార్, సీఎల్‌ఎం డైరెక్టర్ అనూప్‌సింగ్, జీఎం రమేష్‌బాబు పాల్గొన్నారు. బీఈడీ పరీక్ష రద్దు ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో ఈ నెల 7న జరిగిన బీఈడీ మొదటి సెమిస్టర్ పర్సెక్టీవ్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్షను వీసీ ఆచార్య కె.గంగాధర్‌రావు ఆదేశాల మేరకు రద్దు చేశామని సీఈ ఏ శివప్రసాద్‌రావు సోమవారం తెలిపారు. ఈ పరీక్షను ఈ నెల 12వ తేదీన తిరిగి నిర్వహిస్తామని వెల్లడించారు. యార్డుకు 1,61,169 బస్తాల మిర్చి కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు సోమవారం 1,61,169 బస్తాల మిర్చి రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,30,718 బస్తాలు విక్రయించారు. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. -
బాబోయ్.. ఇవేం స్పీడ్ బ్రేకర్లు?
గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ, ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన చర్యలు వాహనదారులకు నిత్యం నరకం చూపిస్తున్నాయి. బైక్ రేసర్ల ఆట కట్టించేందుకు ప్రధాన రహదారులైన లక్ష్మీపురం, బృందావన్ గార్డెన్స్, విద్యానగర్, పట్టాభిపురం, స్తంభాలగరువు వంటి ప్రధాన రోడ్లపై స్పీడ్ బ్రేకర్లను అడ్డగోలుగా నిర్మించారు. కనీస ప్రమాణాలు కూడా పాటించకపోవడంతో వాహనదారులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ● నగరంలోని స్పీడ్ బ్రేకర్లతో వాహన చోదకులకు నిత్యం నరకం ● నిర్దేశిత ప్రమాణాల ప్రకారం కాకుండా అడ్డగోలుగా నిర్మాణం ● బ్యాలెన్స్ తప్పుతుండటంతో ప్రమాదాల బారిన బైకు చోదకులు తీవ్ర ఇబ్బందులు లక్ష్మీపురం: పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని గుజ్జనగుండ్ల నుంచి విద్యానగర్, రింగ్‌రోడ్డు, కొరిటెపాడు వరకు ఒక్కో ప్రదేశంలో మూడు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. దీంతో వాహనదారుల అవస్థలు వర్ణనాతీతం. ఈ విషయం గ్రహించిన అధికారులు మూడు స్పీడ్ బ్రేకర్లకు బదులు కొన్నిచోట్ల నామమాత్రంగా రెండు స్పీడ్ బ్రేకర్లుగా సరి చేశారు. ఇంకా చాలాచోట్ల అలాగే ఉన్నాయి. ముఖ్యంగా అమరావతి రోడ్డులోని నగరాలు వెళ్లే మార్గంలో ఇరువైపులా మూడు స్పీడ్‌బ్రేకర్లు అడ్డగోలుగా వేయడంతో వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. యూటర్న్‌లలో ప్రమాదకరంగా.. ఈ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసిన ప్రదేశాలలో ప్రతి చోట దాదాపు మలుపు తిరిగే ప్రాంతం కావడంతో యూటర్న్ తీసుకునే సమయంలో వాహనదారుల సమస్యలు రెట్టింపు అవుతున్నాయి. భారీ వాహనాలు అటుగా ప్రయాణించే సమయంలో పలువురు ప్రమాదాలకు గురవుతున్నారు. స్పీడ్ బ్రేకర్లను సరిచేసి వాహనదారులు స్పీడ్ తగ్గించి ఎలాంటి ప్రమాదాలబారిన పడకుండా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా నగరవాసులు కోరుతున్నారు. ఇటీవల కొన్ని రోజుల క్రితం పట్టాభిపురం, స్తంభాలగరువు మీదుగా పలు ప్రదేశాలలో స్పీడ్ బ్రేకర్లను ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేశారు. పైగా వాటిపై కనీసం నిర్దేశిత రంగులు కానీ, రేడియం లైట్లు, కలర్లుగానీ వేయక పోవడంతో రాత్రి వేళ వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బైకు రేసర్ల కట్టడికి సిబ్బందితో నిఘా పెట్టడం, నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం వంటివి చేయాలేగానీ ఇలా అడ్డగోలుగా స్పీడ్ బ్రేకర్లు వేయడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పెద్ద ప్రమాదాలు జరిగితే ప్రాణాలు పోతే ఎవరు సమాధానం చెబుతారని జనం మండిపడుతున్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం యువత బైక్ రేసుల్లో పాల్గొనకుండా స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాల్సిందిగా నగరపాలక సంస్థ అధికారులకు సూచించాం. వారి నిబంధనల ప్రకారం స్పీడ్ బ్రేకర్లను నిర్మించారు. రేడియం పెయింట్ వేయించాల్సిందిగా వెస్ట్ ట్రాఫిక్ సీఐ ద్వారా లేఖ కూడా పంపాం. రింగ్ రోడ్డు వైపు ఉన్న రెండు స్పీడ్ బ్రేకర్లు యూటర్న్ వద్ద ఉన్నందున పరిశీలించి వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం. స్పీడ్ బ్రేకర్లు పెట్టినా బైక్ రేసర్ల స్పీడ్ తగ్గడం లేదు. బ్రేకర్లతో పాటు జిగ్‌జాగ్ స్టాప్ బోర్డులను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – ఎం.రమేష్, ట్రాఫిక్ డీఎస్పీ ప్రమాణాలు పాటించని స్పీడ్ బ్రేకర్ల దెబ్బకు నగరవాసుల నడుం విరిగినంత పనవుతోంది. చాలాసార్లు బైకు బ్యాలెన్స్ కుదరక అదుపు తప్పి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. బైకుపై వెనుక భాగంలో కూర్చున్నవారు జారి కింద పడుతున్నారు. ఇక వృద్ధులు బైకు నడపాలంటేనే గజగజ వణికిపోతున్నారు. పేషెంట్లు అటుగా వెళ్లాలన్నా, వారిని బైకుపై తీసుకెళ్లాలన్నా బైకు నడిపేవారికి నరకమే. గర్భిణుల పరిస్థితి చెప్పే పనే లేదు. విద్యాసంస్థలకు పిల్లలను తీసుకుని బ్యాగులతో వచ్చీపోయే తల్లులు స్కూటీలను ఈ స్పీడ్ బ్రేకర్ల దగ్గర అదుపు చేయలేక బెంబేలెత్తుతున్నారు. పురుషులు కూడా చాలా అసౌకర్యానికి గురవుతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు. పలువురి జేబుల్లోని సెల్ఫోన్లు కింద పడటం, వాటిని తీసుకోవడానికి వాహనాలు పక్కకు ఆపి మళ్లీ వెనక్కి రావాల్సిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇక కాస్త ఖరీదైన కార్లు కింది భాగం స్పీడ్ బ్రేకర్లకు తగులుతుండటంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు పెరుగుతున్నాయి. పైగా వాహనాలు కూడా దెబ్బతింటున్నాయని యజమానులు వాపోతున్నారు. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని నగర ప్రజలు కోరుతున్నారు. -
ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
కూటమి పాలనపై నెహ్రూనగర్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 9 నెలల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన జరగనున్న యువత పోరుకు సంబంధించి సోమవారం సన్నాహక సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కూటమి పాలనలో రాష్ట్రం తిరోగమనంలో ఉందన్నారు. గుంతలు పూడ్చి రోడ్లు వేశామని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. 9 నెలల కాలంలో ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పరిపూర్ణంగా అమలు చేసిన పాపాన పోలేదన్నారు. ఇస్తున్న వృద్ధాప్య పింఛన్లలో భారీగా కోతలు పెడుతున్నారని విమర్శించారు. 9 నెలల కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చిందని, సమయం వచ్చినప్పుడు ఓట్లతో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రోడ్లపైకి వచ్చి అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు. కూటమి ఎమ్మెల్యేల అక్రమాలు అనంతం కూటమి పాలనలో ఎమ్మెల్యేలు ఇసుక, మట్టి, బియ్యం అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా కప్పం కట్టాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారని తెలిపారు. రోజు రోజుకు కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిపోతోందని చెప్పారు. వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా ఏకమై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 12న జరిగే వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవాల్లో, యువత పోరు కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాలుపంచుకుని దిగ్విజయం చేయాలన్నారు. తద్వారా ఈ ప్రభుత్వం సక్రమంగా పనిచేయడం లేదనే సందేశాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. పార్టీ శ్రేణులే పేదవారి గొంతుగా మాట్లాడాలని సూచించారు. పార్టీ గుంటూరు, నరసరావుపేట పార్లమెంటరీ స్థానాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆనాడు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక ఎత్తు అయితే.. తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ సారథిగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించారన్నారు. మోసం చేయడంలో నంబర్ వన్ అంటే గుర్తుకు వచ్చేది చంద్రబాబు పేరే అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇస్తామని బూటకపు మాటలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. సమాజంలో విద్య, ఆరోగ్యం రెండు కళ్లు వంటివన్నారు. నేడు విద్యకు సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు రాకపోవడంతో విద్యార్థులు కాలేజీల్లో తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం వైఎస్సార్సీపీ యువత పోరు కార్యక్రమం చేపట్టిందన్నారు. ఏపీలో 28 మెడికల్ కాలేజీలు ప్రారంభమైతే.. ఇంటికే వచ్చి వైద్యం చేసే పరిస్థితి ఉందన్నారు. ఆ మెడికల్ కాలేజీలను నేడు ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. వీటన్నింటిపై పోరాటం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, గుంటూరు నగర అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, మిర్చి యార్డు మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణలు మాట్లాడారు. పార్టీ బలోపేతానికి సూచనలు చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక్క సంక్షేమ కార్యక్రమాన్నీ పరిపూర్ణంగా అమలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం సమయం వచ్చినప్పుడు ఓట్లతో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ప్రజలు యువత పోరు సన్నాహాక సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రేపటి వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం, యువత పోరు జయప్రదానికి విజ్ఞప్తి -
వసూలు.. ఉసూరు..!
మంగళవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2025ఆర్థిక సంవత్సరం చివరి దశకు చేరినా మార్కెటింగ్ శాఖ నిర్దేశించిన లక్ష్యాల సాధనలో జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లు ఉసూరుమనిపిస్తున్నాయి. జిల్లాలోని ఎనిమిది యార్డులకు 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.133.69 కోట్ల మార్కెట్ ఫీజు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు రూ.102.82 కోట్లు మాత్రమే వసూలైంది. ● జిల్లాలోని మార్కెట్ యార్డుల లక్ష్యం రూ.133.69 కోట్లు ● ఇప్పటి వరకు రూ.102.82 కోట్లు మాత్రమే వసూలు ● సీజన్ ముగుస్తున్నా లక్ష్య సాధనలో వెనుకబాటు ఇఫ్తార్ సహర్ (మంగళ) (బుధ) గుంటూరు 6.22 5.02 నరసరావుపేట 6.24 5.04 బాపట్ల 6.22 5.02 గుంటూరు మార్కెట్ యార్డ్ న్యూస్‌రీల్ -
బ్రహ్మాండ నాయకుడు
సింహ వాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చిన నారసింహుడు మంగళగిరి / మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామి వారు సింహవాహనంపై దర్శనమిచ్చారు. భక్తులు కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చారు. హింసించే స్వభావం గల వారిని హింసించేవాడు నారసింహుడు, నరుల్లో సింహం వంటి వాడు నరసింహ స్వరూపుడైన స్వామి వారి సింహ వాహనోత్సవం తిలకించిన వారికి దుర్మార్గుల వల్ల కలిగే భయం తొలగుతుందని భక్తుల నమ్మకం. ఉత్సవం సందర్భంగా రాజావాసిరెడ్డి వెంకట్రాది నాయుడు కళావేదికలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఆలయ ఈవో రామకోటిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మాల్యవంతం వెంకట కృష్ణమాచార్యులు మనుమలు వ్యవహరించారు. సోమవారం ఉదయం చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కైంకర్యపరులుగా దేవతి భగవన్నా రాయణ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నేడు హంస, గజ వాహన సేవలు మంగళవారం ఉదయం హంస వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి గజ వాహనంపై స్వామికి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. -
Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి బెయిల్
పల్నాడు జిల్లా: ప్రముఖ రచయిత,నటుడు పోసాని కృష్ణమురళిపై నరసరావుపేటలో నమోదైన కేసులో బెయిల్ మంజూరైంది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నరసారావుపేటలో కేసు నమోదు చేశారు పోలీసులు. మార్చి మొదటి వారంలో పోసానిపై కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు పిటి వారెంట్‌పై నరసరావుపేట కోర్టులో పోసాని హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్టు పోసానికి 10 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను నరసరావుపేట టూటౌన్ పోలీసులు గుంటూరు జైలుకు తరలించారు. తాజాగా, నరసరావుపేట కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు గత శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోసానికి బెయిలు ఇవ్వకూడదని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ.. కోర్టు పోసాని తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ... బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులోనే పోసాని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయ్యారు.పోసానిని హైదరాబాద్‌లోని నివాసంలో అరెస్ట్ చేసి.. ఆ మరుసటి రోజు ఓబులవారిపల్లెకు తీసుకెళ్లారు. అటుపై పల్నాడు జిల్లా నరసరావుపేటలో, కర్నూల్ జిల్లా ఆదోనీ పీఎస్‌లలో నమోదైన కేసుల్లో పీటీ వారెంట్ కింద ఆయన్ని తరలించారు. ఈ కేసుల్లో ఉపశమనం కోరుతూ ఆయన వేశారు. ఆదోని కేసులో భాగంగా పోలీసులు కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను కర్నూల్ జేఎఫ్‌సీఎం కోర్టు కొట్టివేయగా, నరసారావుపేట కేసులో బెయిల్ మంజూరైంది. మరోవైపు హైకోర్టులోనూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్ విచారణ దశలో ఉంది. -
కూటమి ప్రభుత్వంలో కూలీలుగా విద్యార్థులు.. పవన్ ఏం చేస్తున్నట్లు..
సాక్షి,తాడేపల్లి: ప్రజా సమస్యలను గాలికి వదిలేసి చంద్రబాబు కక్షసాధింపులకు దిగారు. ఫీజు రియింబర్స్‌మెంట్ లేక కూలి పనులకు వెళ్తున్నారు. ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? బకాయి పడిన మొత్తం ఫీజు రియింబర్స్మెంట్ని వెంటనే చెల్లించాలని వైఎస్సార్సీపీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి చంద్రబాబు కక్షసాధింపులకు దిగారు. ఫీజులు కట్టలేదని కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. ఫీజు కట్టలేక విద్యార్థులు కూలీలుగా మారుతున్నారు.అనంతపురంలో చరణ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.అయినాసరే కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. అందుకే 12న పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఇంతవరకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. గ్రూప్-2 విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే మంత్రి లోకేష్ దుబాయ్ వెళ్లి క్రికెట్ చూశాడు. వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తెస్తే వాటిని చంద్రబాబు ప్రయివేటీకరణ చేస్తున్నారు.మెడికల్ సీట్లు వద్దని చంద్రబాబు లేఖ రాయడం దుర్మార్గం.ప్రశ్నిస్తామన్న పవన్ ఏం చేస్తున్నట్లు : చంద్రబాబు యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారు. రూ.3900 కోట్లు ప్రతి ఏటా ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇవ్వాలి. నిధులు ఇవ్వకపోవడంతో కాలేజీ యాజమాన్యం విద్యార్థులను బయటకు నెడుతున్నాయి. బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో కూడా ప్రభుత్వం చెప్పటం లేదు. ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?.2050 మెడికల్ సీట్లు వద్దని లేఖ రాసిన నీచ చరిత్ర చంద్రబాబుది.బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అని నిరూపించారు. జాబ్ కేలండర్ జాడే లేదు.నిరుద్యోగులను చంద్రబాబు మోసం చేశారు.మెగా డిఎస్సీ పేరుతో దగా చేశారు. వైఎస్ జగన్ తెచ్చిన విద్యా సంస్కరణలకు చంద్రబాబు పాతర వేశారు.ఈ సమస్యల పరిష్కారం కోరుతూ 12న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేస్తాం’అని హెచ్చరించారు. రవిచంద్ర, విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ -
12న జరిగే 'యువత పోరు'తో ప్రభుత్వాన్ని నిలదీద్దాం: సజ్జల
తాడేపల్లి : ఈ నెల 12వ తేదీన వైఎస్సార్సీపీ తలపెట్టిన ‘యువత పోరు’ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీద్దామని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.. ఈ మేరకు ఆయన టెలికన్ఫరెన్స్ లో మాట్లాడారు. దీనికి వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు, విద్యార్థి, యువజన విభాగం నేతలు, 13 యూనివర్శిటీల విద్యార్థి నాయకులు, మేధావులు, విద్యారంగం ప్రముఖులు హాజరయ్యారు.‘12న జరిగే 'యువత పోరు'తో ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ఫీజు రీయంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వం దిగివచ్చేవరకూ పోరాడదాం. రేపు యూనివర్శిటీల లోపల లేదా బయట "యువత పోరు" పోస్టర్ ఆవిష్కరణ చేయాలి. యూనివర్శిటీల నుంచి విద్యార్థులు ర్యాలీలో పాల్గొనేలా చూడాలి. అప్పుడే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి వారి సమస్యలు పరిష్కారమవుతాయి వైఎస్సార్సీపీ విద్యార్ధి, యువజన విభాగాలు సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహించాలి’ సూచించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రతీ పల్లెలో ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు -
పోలీసుల కట్టుకథకు ఇవిగో ఆధారాలు : విడదల రజని
సాక్షి, నరసరావుపేట: కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నిత్యం దళితులు, వెనుకబడిన వర్గాలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుని పాలన సాగిస్తోందని మాజీ మంత్రి విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్లో నరసరావుపేట జైలులో రిమాండ్‌లో ఉన్న చిలకలూరిపేటకు చెందిన దళిత యువకుడు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ దొడ్డా రాకేష్ గాంధీని సోమవారం ఆమె పరామర్శించి, ధైర్యం చెప్పారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాలకు గొంతెత్తే స్వాతంత్రం కూడా లేకుండా చేశారంటూ మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివీస్ట్ లపై ఉక్కుపాదంతో అణిచివేస్తున్న దుర్మార్గమైన పాలనను చంద్రబాబు కొనసాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...పత్తిపాటి పుల్లారావు ఒత్తిడితోనే తప్పుడు కేసులుతెలుగుదేశం ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఒత్తిడితోనే పోలీసులు తప్పుడు బనాయిస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడుగా, సోషల్ మీడియా యాక్టివిస్ట్‌గా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న రాకేష్ గాంధీపై కావాలనే తప్పుడు కేసులు బనాయించి, జైలుకు పంపారు. భాషా అనే వ్యక్తితో టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఈనెల 6వ తేదీన ఒక కేసు నమోదు చేయించారు. రాకేష్ గాంధీ తన ఇద్దరు మిత్రులు ఫణీంద్ర నాగిశెట్టి, దామిశెట్టి కోటేశ్వర్ లతో కలిసి తనపై దాడి చేసి, హతమార్చేందుకు ప్రయత్నించారని, అసభ్య పదజాలంతో దూషించారంటూ భాష ఫిర్యాదు చేశాడు. చుట్టుపక్కల వారు గమనించడంతో తన ఫోన్ లాక్కుని వారు పరారయ్యారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు ఏకంగా సెక్షన్ 308 కింద కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద బీఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసులు పెడితే కోర్టులు చీవాట్లు పెడుతుండటంతో, రాకేష్ గాంధీపై ఈ సెక్షన్ నమోదు చేయకుండా తెలివిగా ఒక తప్పుడు ఫిర్యాదును రాయించి, దాని ప్రకారం హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కట్టుకథకు ఇవిగో ఆధారాలురాకేష్ గాంధీ అరెస్ట్ విషయంలో పోలీసులు అల్లిన కట్టుకథ ఇలా ఉంటే.. వాస్తవాలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. రాకేష్ బెదిరించినట్టుగా చెబుతున్న ఆరో తేదీ రాత్రి 9 గంటల సమయంలో అతడు గుంటూరులో ఇంట్లో ఉన్నాడు. దీనికి సీసీ ఫుటేజీ ఆధారాలున్నాయి. అదే వ్యక్తి అదే సమయంలో చిలుకలూరిపేట కళామందిర్ సెంటర్లో ఎలా ఉంటాడో పోలీసులే చెప్పాలి. చిలకలూరిపేటలో ఉంటే వేధిస్తున్నారనే కారణంతో గత 9 నెలలుగా రాకేష్ గుంటూరులోనే ఉంటున్నాడు. ఘటన జరిగినట్టుగా చెబుతున్న 6వ తేదీతో పాటు అంతకు ముందు రోజు కూడా అతడు గుంటూరులోనే ఉన్నాడు. గుంటూరులో నాతో పాటు పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇదే కేసులో ఉన్న మరో వ్యక్తి ఫణీంద్ర నాగిశెట్టి కూడా ఘటన జరిగిన రోజు, అదే సమయంలో సెలూన్లో హెయిర్ కటింగ్ కోసం వెళ్లాడు. ఇందుకు సీసీ ఫుటేజీ ఆధారాలు కూడా ఉన్నాయి. మరో వ్యక్తి దామిశెట్టి కోటేశ్వర్ కూడా ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ ఆధారాలన్నీ చూస్తే కట్టుకథలు అల్లి వైస్సార్సీపీ శ్రేణులను వేధింపులకు గురిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. కేవలం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రోద్భలంతో సీఐ ఇలా తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అబద్ధాలను నిజం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ ఆధారాలను కోర్టు ముందుంచడం జరిగింది. అధికార పార్టీ ఎమ్మెల్యేల మెప్పకోసం పోలీసులు నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇలాంటి పనులు ద్వారా పోలీసు వ్యవస్థ మీద ప్రజల్లో ఉన్న నమ్మకం రోజురోజుకీ తగ్గిపోతోంది. -
రౌడీషీటర్ల ఆగడాలు సహించేదే లేదు
నగరంపాలెం: జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలో ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు ఈ పక్రియ చేపట్టారు. నగరంపాలెం పీఎస్, పట్టాభిపురం పీఎస్, అరండల్‌పేట పీఎస్ పరిధిలోని రౌడీషీటర్లకు పశ్చిమ డీఎస్పీ అరవింద్ కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీషీటర్లు మంచి ప్రవర్తనతో మెలగాలని సూచించారు. చెడు అలవాట్లకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని సూచించారు. వివాదాలు, పంచాయితీలు, దందాలు, బెదిరింపులు, కిడ్నాపులు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. ఇక నుంచి కుటుంబ సభ్యులతో రౌడీషీటర్లు కౌన్సెలింగ్‌కు హాజరవాల్సి ఉంటుందని చెప్పారు. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఎదుట కౌన్సెలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. చిన్న నేరాల్లోనైనా పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. వారికి ప్రభుత్వ పథకాల నిలిపివేతకు సిఫారసు చేస్తామని చెప్పారు. ఫోన్, ఆధార్ కార్డుల నంబర్లు, ఇళ్ల చిరునామాలు పోలీస్ డేటాబేస్‌లో ఉన్నాయని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంటుందని అన్నారు. తీరు మారని రౌడీషీటర్లపై నమోదైన పాత కేసులను త్వరితగతిన విచారణ చేపట్టి, శిక్షలు పడేలా చేస్తున్నామని వెల్లడించారు. నిత్యం నేరాలు, అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ చట్టం ప్రయోగించి, జిల్లా బహిష్కరణ చేస్తామన్నారు. మంచి ప్రవర్తనతో మెలిగితే ఉన్నతాధికారులకు సిఫారసు చేసి, రౌడీషీట్లను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేరాలకు పాల్పడితే పీడీ చట్టం, బహిష్కరణ తప్పదని డీఎస్పీ హెచ్చరిక జిల్లావ్యాప్తంగా అన్ని పీఎస్‌లలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ -
గుంటూరుకు 100 ఎలక్ట్రిక్ బస్సులు
కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని నెహ్రూనగర్: కేంద్ర ప్రభుత్వం గుంటూరు పట్టణానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, ఛార్జింగ్ పాయింట్లు తదితర ఏర్పాట్ల కోసం ఆదివారం తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఆర్టీసీ అధికారులతో కలిసి ఆయన గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ బస్సులను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్లు వరకు ప్రయాణించగలవన్నారు. వీటిని నిర్వహించాలంటే ప్రత్యేక సదుపాయాలు కావాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండ్ 20 ఎకరాల విస్తీర్ణంలో ఉందని గుర్తుచేశారు. బస్టాండ్, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకుపోను మిగిలిన స్థలంలో పీపీపీ పద్ధతిలో లీజులకు ఆర్టీసీ స్థలాలను ఇస్తే సంస్థకు ఆదాయం పెరిగే అవకాశం ఉందన్నారు. దీనిపై ఆర్టీసీ అధికారులు కసరత్తు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ కొనకళ్ల నారాయణ, ఈడీ అడ్మిన్ జి. రవివర్మ, ఈడీ జోన్ 3 నెల్లూరు నాగేంద్రప్రసాద్, ఆర్ఎం ఎం.రవికాంత్, డిపో మేనేజర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీనివాస కల్యాణ వేడుక ఏర్పాట్లు పరిశీలన వెంకటపాలెం (తాడికొండ): తుళ్ళూరు మండలం వెంకటపాలెం గ్రామంలోని టీటీడీ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఈ నెల 15వ తేదీన జరగనున్న శ్రీనివాస కల్యాణ మహోత్సవ ఏర్పాట్లను గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో ఆదివారం ఆయన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలను పరిశీలించారు. ఆలయం వద్ద వాహనాల పార్కింగ్, రాకపోకలకు అనువుగా కేటాయించిన మార్గాలు, వీవీఐపీ, వీఐపీ భక్తులకు ప్రత్యేక మార్గాల కేటాయింపు తదితర అంశాలపై సిబ్బందితో ఎస్పీ చర్చించారు. ఆయన మాట్లాడుతూ.. ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన వెంట లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ రవికుమార్, తుళ్ళూరు డీఎస్పీ మురళీ కృష్ణ, తుళ్ళూరు సీఐలు వెంకటేశ్వర్లు, అంజయ్య తదితరులు ఉన్నారు. అవయదానంతో ముగ్గురికి కొత్త జీవితం గుంటూరు మెడికల్: ఓ మహిళ అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేయడానికి అంగీకరించడంతో ముగ్గురికి నూతన జీవితం లభించింది. వివరాలు.. బాపట్ల జిల్లా బాపట్ల పట్టణం వివేకానంద నగర్ కాలనీకి చెందిన కొపనాతి వరలక్ష్మి (45) మెదడు సంబంధిత వ్యాధితో ఈ నెల 6 న గుంటూరులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో చేరారు. ఆదివారం బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ జీవన్ దాన్ ప్రతినిధులు వరలక్ష్మి కుటుంబసభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. అవయవాలు దానం చేసేందుకు వారు అంగీకరించారు. దీంతో జీవన్మరణ స్థితిలో ఉన్న ముగ్గురికి కొత్త జీవితం ప్రసాదించారు. జీవన్ దాన్ ప్రతినిధులు ఊపిరితిత్తులను తెలంగాణ రాష్ట్రానికి చెందిన కిమ్స్ ఆసుపత్రికి, కిడ్నీ, లివర్లను ఆస్టర్ రమేష్ హాస్పిటల్‌కు అందించారు. ఊపిరితిత్తులను గ్రీన్ చానల్ ద్వారా గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు తరలించారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మమత రాయపాటి, క్లస్టర్ మార్కెటింగ్ హెడ్ డాక్టర్ కార్తిక్ చౌదరి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
ప్రార్థనతోనే దేవుడి అనుగ్రహం
అమరావతి: ప్రభువైన ఏసుక్రీస్తు కృప లోకమంతా నిండి ఉందని, మానవుడు దేవుడిని ఎంతగా ప్రార్థిస్తే అంతగా అనుగ్రహిస్తాడని హోసన్నా మినిస్ట్రీస్ చీఫ్ పాస్టర్ జాన్‌వెస్లీ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని లేమల్లె హోసన్నా దయా క్షేత్రంలో హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహిస్తున్న 48వ గుడారాల పండుగ చివరి రోజు పగటిపూట ముగింపు ప్రార్థనలకు లక్షలాది మంది ఆరాధికులు తరలివచ్చారు. పాస్టర్ జాన్‌వెస్లీ ప్రసంగిస్తూ.. జాతి, కుల, మత, వర్గ, పేద, ధనిక భేదం లేకుండా అందరికీ దేవుని కృప ఉంటుందని చెప్పారు. ఆయన్ను స్తుతిస్తూ బలి పీఠం దగ్గరకు ఎవరు వస్తారో వారిపై ప్రత్యేక కృప కనబరుస్తాడని పేర్కొన్నారు. లోకమంతా దేవుని కృపతో నిండి ఉందని, దాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆయన్ను నిరంతరం స్తుతించాలని తెలిపారు. ప్రపంచంలో అందరిపైనా ఆయన వర్షం కురిపించినా ఆత్మీయులపై మాత్రం కృపా వర్షం కురిపిస్తాడని పేర్కొన్నారు. హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు పాస్టర్ అబ్రహాం ప్రసంగిస్తూ.. గుడారాల పండుగలో దేవుడిని దర్శించిన ప్రతి ఒక్కరి వెంట ఆయన వస్తున్నాడని.. మంచిని కలుగచేస్తాడని తెలిపారు. మానవుడిని ఆశ్రయించే దురాత్మలను దేవుడు దూరం చేసి సంతోషం కలుగ చేస్తాడని వివరించారు. ఎంతో దూరం నుంచి వచ్చిన లక్షలాది మంది విశ్వాసులకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించకపోయినా, సర్దుకుపోయిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తొలి సంవత్సర అనుభవాలతో వచ్చే ఏడాది ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 5,6,7,8 వ తేదీల్లో గుడారాల పండుగ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ పండుగ ఘనంగా జరగడానికి సహకరించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు, సిబ్బందికి హోసన్నా మినిస్ట్రీస్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పాస్టర్ల బృందం స్తుతి గీతాలు ఆలపించింది. ఆదివారం కావడంతో లక్షలాది మంది హోసన్నా ఆరాధికులు పాల్గొన్నారు. ముగిసిన 48వ గుడారాల పండుగ ముగింపు ప్రార్థనలు చేసిన పాస్టర్స్ జాన్‌వెస్లీ, అబ్రహాం దయా క్షేత్రానికి చేరుకున్న లక్షలాది మంది విశ్వాసులు -
గుంటూరు
సోమవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2025పోలీసుల అదుపులో కీలక సూత్రధారులు అంగట్లో విద్య..విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు యూనివర్సిటీ వేదిక కావాలి. విలువలు పెంచేలా వ్యవహరించాలి. కానీ ఆచార్య నాగార్జున వర్సిటీ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఇక్కడ చోటు చేసుకుంటున్న అక్రమాల దందాను పరిశీలిస్తుంటే ఇది విద్యాలయమా, మాఫియా నిలయమా అనే సందేహం నెలకొంటోంది. సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నియోజకవర్గంలోని ఈ ఉన్నత విద్యాసంస్థలో రోజుకో అక్రమం చోటుచేసుకుంటున్న తీరు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఇఫ్తార్ సహర్ (సోమ) (మంగళ) గుంటూరు 6.22 5.03 నరసరావుపేట 6.24 5.05 బాపట్ల 6.22 5.03 పెదకాకాని: పరీక్ష పత్రం లీకేజీ వ్యవహారంలో పోలీసులు 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నా అసలు సూత్రధారులపై చర్యలు ఉంటాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పరీక్షలలో ఇది సర్వసాధారణమని, నగదు కోసం పలు సెంటర్ల నిర్వాహకులు సిఫార్సులు చేసి మరీ పరీక్షల నిర్వహణకు అనుమతులు తెచ్చుకుంటున్నారని విచారణలో పోలీసులు గుర్తించారు. ఆ తరువాత నిబంధనలకు నీళ్లు వదలడం సర్వసాధారణంగా మారుతోందని వెల్లడైంది. యథేచ్ఛగా మాస్ కాపీయింగ్‌తోపాటు పరీక్ష హాలులోకి పుస్తకాలను కూడా అనుమతిస్తారని పోలీసులు గుర్తించారు. రేయింబవళ్లు కష్టపడి చదువుకుని నిజాయతీగా పరీక్షలు రాసే విద్యార్థుల జీవితాలతో వీరు చెలగాటం ఆడుతున్నారు. బీఈడీ పరీక్ష పత్రం లీకేజీ వ్యవహారంలో శనివారం తెల్లవారుజామున తెనాలిలో ఒడిశాకు చెందిన ధీరేన్ కుమార్ సాహు, గణేష్ సీహెచ్ సాహు, మిలాన్ ప్రుస్తీలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి విదితమే. వారు ఇచ్చిన సమాచారం మేరకు శనివారం రాత్రి పెదకాకాని సీఐ టి.పి. నారాయణస్వామి తమ సిబ్బందితో వినుకొండ చేరుకున్నారు. వివేకానంద బీఈడీ కళాశాల కరస్పాండెంట్ ఎస్ రఫీ, ప్రిన్సిపల్ సురేష్‌కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ దారా స్వర్ణరాజులను అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో ఒడిశాకు చెందిన ఏజెంట్లు సంతోష్ సాహు, బిష్ణుపాత్రో, పురుషోత్తమ్ ప్రధాన్, సుదాన్ష్ శేఖర్ రాణా, బదాల్ ప్రధాన్ తదితరులను అదుపులోకి తీసుకుని ఆదివారం స్టేషన్‌కు తరలించారు. కేసులో మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.7 బీఈడీ పరీక్ష పత్రం లీకేజీలో తీగ లాగితే కదులుతున్న డొంక రెండు రోజుల్లో 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వినుకొండ కళాశాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్, కంప్యూటర్ ఆపరేటర్లది కీలక పాత్రగా గుర్తింపు న్యూస్‌రీల్ -
యాలివాహనంపై నరసింహుడు
మంగళగిరి/ మంగళగిరి టౌన్: మంగళాద్రిలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామి వారు యాలివాహనంపై దర్శనమిచ్చారు. ఇలా స్వామిని దర్శిస్తే దుర్మార్గుల వలన కలిగే భయం నశిస్తుందని భక్తుల నమ్మకం. ఆలయ ఈవో రామకోటి రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కైంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన మురికిపూడి పుష్పవేణి, కుమారులు వ్యవహరించారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదికపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ముత్యాల పందిరి వాహనంపై.... స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ముత్యాల పందిరి వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఉత్సవానికి కై ంకర్యపరులుగా విజయవాడకు చెందిన అంగా ఉపేంద్రవర్మ, తేజస్విని దంపతులు వ్యవహరించారు. నేడు సింహ వాహన సేవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నరసింహస్వామి సోమవారం ఉదయం చిన్న శేషవాహనం, రాత్రి 7 గంటలకు సింహ వాహనంపై గ్రామోత్సవంలో విహరించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు తెలిపారు. -
12న ‘యువత పోరు’కు తరలిరండి
నగరంపాలెం: వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ‘యువత పోరు’కు విద్యార్థులు, యువత, వారి తల్లిదండ్రులు పెద్దఎత్తున తరలిరావాలని వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. ఆదివారం బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ కార్యాలయంలో ‘యువత పోరు’ పోస్టర్లను మాజీ మంత్రి అంబటి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, నియోజకవర్గాల సమన్వయకర్తలు షేక్ నూరి ఫాతిమా (తూర్పు). బాలవజ్రబాబు (తాడికొండ), అంబటి మురళీకృష్ణ (పొన్నూరు), దొంతిరెడ్డి వేమారెడ్డి (మంగళగిరి), మిర్చి యార్డు మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజ నారాయణ, వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జిల్లా అధ్యక్షుడు వినోద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ రాష్ట్రంలోని యువత, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేసేందుకు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఫీజు రీఎంబర్స్మెంట్ కింద రూ.4,600 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికీ వాటిని విడుదల చేయకపోవడంతో విద్యార్థులను యాజమాన్యాలు కళాశాలల నుంచి బయటకు పంపుతున్నాయని ఆరోపించారు. చదువుకోవాల్సిన వారు కూలీలుగా, వ్యవసాయ పనులకు వెళ్లే విషమ పరిస్థితిని కూటమి ప్రభుత్వం కల్పిస్తోందని మండిపడ్డారు. వెంటనే పెండింగ్ బకాయిలను తీర్చి విద్యార్థులకు, యాజమాన్యాలకు ఊరటనివ్వాలని డిమాండ్ చేశారు. బకాయిలు రూ.4,600 కోట్లు ఉండగా, ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో అతి తక్కువగా చూపించారని ఆరోపించారు. ప్రస్తుతం బకాయిలను తీర్చే పరిస్థితులు కనిపించడంలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కుంగదీస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని పేద ప్రజానీకానికి విద్యను దూరం చేస్తున్నారని విమర్శించారు. దీనికిగాను రాష్ట్ర ప్రభుత్వం భారీగా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ‘సూపర్ సిక్స్’ ఊసే లేదు ఎన్నికల ముందు చంద్రబాబు ఊదరగొట్టిన సూపర్ సిక్స్ పథకాల అమలు ఊసే లేదని, సెవన్ కూడా లేదని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైనా దాన్ని విస్మరించారని విమర్శించారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారని, దాని ఊసు కూడా లేదని మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్లో గవర్నర్‌తో పచ్చి అబద్ధాలను మాట్లాడించారని విమర్శించారు. ఏపీలో వైద్య కళాశాలల తీరు మరింత దారుణంగా మారిందని ఆరోపించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ విద్య, వైద్యంపై ఏ రాష్ట్రంలో పెట్టని విధంగా ప్రత్యేక దృష్టి సారించారని గుర్తుచేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలు ఉండరాదనే ఉద్దేశంతో వైద్యులు మొదలుకుని ఇతరత్రా పోస్టులన్నింటినీ భర్తీ చేయించారని అన్నారు. జిల్లాకు ఒక వైద్య కళాశాలను ప్రారంభించారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వైద్య కళాశాలలను నిర్వీర్యం చేస్తోందని తెలిపారు. కూటమిలోని పెద్ద భూస్వాములకు ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తద్వారా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు ఎలా అందుతాయని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులు, యువత, వారి తల్లిదండ్రులు జయప్రదం చేయాలి రూ.4,600 కోట్ల ఫీజు బకాయిలను సర్కారు విడుదల చేయాలి పేద ప్రజలకు విద్య, వైద్యాన్ని దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి రూ.3 వేలు, 20 లక్షల ఉద్యోగాల కల్పన శూన్యం వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు పాలకుల కుటిల యత్నాలు వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి -
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పోరాటం
తెనాలి: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఎస్టీయూ నిరంతరం పోరాటం చేస్తుందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.సాయి శ్రీనివాస్ చెప్పారు. ఉపాధ్యాయ బదిలీలపై ప్రభుత్వం ప్రత్యేకచట్టం చేసిందని గుర్తుచేశారు. అలాగే పీఆర్సీ బకాయిలు, డీఏ ఇవ్వాలని, పెండింగు సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నట్టు తెలిపారు. ఎస్టీయూ, ఏపీ ఉపాధ్యాయ సంఘం, ఉమ్మడి తెనాలి ఏరియా (తెనాలి అర్బన్, తెనాలి, దుగ్గిరాల, కొల్లిపర, చుండూరు, అమర్తలూరు, వేమూరు, కొల్లూరు మండల శాఖలు) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్జీవో కళ్యాణమండపంలో జరిగిన ఈ వేడుకలకు ఎస్టీయూ తెనాలి ఏరియా కార్యదర్శి డీవీ సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఆత్మీయ అతిథిగా పాఠశాల విద్య ఆర్జేడీ బి.విజయభాస్కర్ మాట్లాడుతూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్.రామచంద్రయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేఏకే జిలాని, జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి అమరనాథ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు ఏవీ ప్రసాద్ బాబు, వేమూరు ఏరియా కార్యదర్శి ఎం.శ్రీధర్, డాక్టర్ శారద మాట్లాడారు. దుగ్గిరాల జిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రధానోపాధ్యాయిని శోభాదేవి, కవయిత్రిగా గుర్తింపును తెచ్చుకున్న కొలకలూరు ఉపాధ్యాయిని దేవికరాణి, వివిధ మండల శాఖల మహిళా కన్వీనర్లు సహా 23 మందిని ఘనంగా సత్కరించారు. ఉమ్మడి తెనాలి ఏరియా కార్యదర్శి ఎం.శ్రీధర్‌తోపాటు ఏరియాలోని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏవీ గోపాలరావు, ఎం.రవి, జి.మిథున్ చక్రవర్తి, ఎస్.నాగేశ్వరరావు, ఉన్నం ప్రసాద్, మునిపల్లి మోహన కృష్ణ, ఖాన్, ఆరోన్, వినోద్, ప్రసాద్, నాగరాజు, చంద్రశేఖర్, కిరణ్, నాగరాజు, శ్రీనివాస్, రామకృష్ణ, సీనియర్ నాయకులు ఈ.అంబరీషుడు, పట్టణ శాఖ నాయకులు పూషాడపు శ్రీనివాసరావు, ఉమ్మడి తెనాలి ఏరియాలోని రాష్ట్ర కౌన్సిలర్లు, జిల్లా కార్య నిర్వాహక సభ్యులు, మండల కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు. -
15 నుంచి ‘తిరుమల మహా పాదయాత్ర’
తెనాలి: పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీవాసవీ పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి (బాలస్వామి) ఈ నెల 15వ తేదీ నుంచి ‘తిరుమల మహా పాదయాత్ర’ చేపట్టనున్నారు. రైతు క్షేమార్థం, ధర్మసంస్థాపనార్థం చేపట్టనున్న తిరుమల మహాపాదయాత్రను భక్తజన సమూహంగా ఆరంభించనున్నారు. దీనికి ముందుగా తెనాలిలో ‘గురు పాదధూళి’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఆరు గంటలకు స్థానిక గంగానమ్మపేటలోని శ్రీవిద్యాపీఠం శ్రీసాలిగ్రామ పీఠం నుంచి బయలుదేరి బుర్రిపాలెం రోడ్డులోని గోశాల వరకు పాదయాత్ర చేశారు. తిరుమల మహా పాదయాత్ర రోజు వరకు రోజూ గురు పాదధూళి పాదయాత్ర ఉంటుందని, భక్తులు పాల్గొనాలని కోరారు. శ్రీసాలిగ్రామ పీఠం కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి -
నాలుగు పళ్ల విభాగంలో విజేత బాపట్ల జిల్లా
రాజుపాలెం: మండలంలోని ఆకుల గణపవరంలో గల శ్రీ ప్రసన్నాంజనేయస్వామి 96వ జయంత్యుత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల పందేలు ఆదివారం రసవత్తరంగా జరిగాయి. నాలుగు పళ్ల విభాగంలో బాపట్ల జిల్లా పంగులూరు చిలుకూరి నాగేశ్వరరావుకు చెందిన ఎడ్ల జత 5,278 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరికి చెందిన చీరబోయిన కోటేశ్వరరావు ఎడ్ల జత 4,250 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవ్వులూరు గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాసరావు ఎడ్ల జత 4,000 అడుగుల దూరం లాగి తృతీయ స్థానంలో నిలిచాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం భీమవరానికి చెందిన దివ్యశ్రీ ఎడ్ల జత 3,027 అడుగుల దూరం లాగి నాల్గవ స్థానం, పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం నిండుజర్లకు చెందిన ప్రసన్నాంజనేయ ఎడ్ల జత 2250 అడుగుల దూరం లాగి ఐదవ స్థానం సాధించాయి. సోమవారం వ్యవసాయ విభాగంలో పందేలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి రోజూ పందేలు చూడటానికి వచ్చే రైతులకు అన్నదానం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
అంగన్వాడీలపై సర్కారు ద్వంద్వ వైఖరి
లక్ష్మీపురం: అంగన్వాడీల విషయంలో కూటమి ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ ధ్వజమెత్తారు. స్థానిక బ్రాడీపేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ... ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూటమి నాయకులు అంగన్వాడీల సమ్మె శిబిరాలలో ప్రత్యక్షంగా పాల్గొని పోరాటానికి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా జీతాల పెంపు పట్టించుకోవడం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం మార్చి 10వ తేదీన విజయవాడలో ధర్నా నిర్వహించనున్నట్లు ముందుగానే అధికారులు, మంత్రులకు యూనియన్ వినతి పత్రాలు ఇచ్చిందన్నారు. అయినప్పటికీ ధర్నాను భగ్నం చేసేందుకు అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా సెక్టార్లవారీగా ట్రైనింగులు ఉంటాయని, దానికి హాజరు కాకపోతే తీవ్ర చర్యలు చేపడతామని హెచ్చరికలు జారీ చేయడం, యూనియన్ నాయకుల గృహనిర్బంధాలు, అరెస్టులు ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని చెప్పారు. ఇలాంటి నిర్బంధాలు కొత్త కాదని, వాటన్నింటినీ అధిగమించి పోరాటం చేయగల సత్తా అంగన్వాడీలకు ఉందని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను కట్టిపెట్టి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారిపై నిర్బంధం ప్రయోగిస్తే పోరాడే అంగన్వాడీలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. సమ్మె ముగింపు సందర్భంగా ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు విషయంలోనూ తూట్లు పొడుస్తున్నారని తెలిపారు. ఒప్పందంలో మట్టి ఖర్చులు రూ.20వేలు ఇవ్వాలని ఉంటే దాన్ని రూ.15 వేలకు కుదించి జీవో ఇవ్వడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. అలాగే రిటైర్మెంట్ సర్వీసు పరిహారం కింది అంగన్వాడీలకు రూ.1.20 లక్షలు, హెల్పర్లకు రూ.60 వేలు ఇవ్వాలని ఒప్పందంలో ఉంటే దాన్ని రూ. 20 వేల వంతున తగ్గించారన్నారు. మళ్లీ పేరు మార్చి గ్రాట్యూటీ అని చెబుతూ దానితోనే సంబరపడమని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెనూ చార్జీల పెంపుదల, ప్రమోషన్లు తదితర విషయాలపై ఏర్పాటు చేసిన కమిటీని పక్కన పెట్టేశారని విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ -
ఒకేసారి 220 ఎలక్ట్రానిక్ డివైజ్‌ల తయారీ
గుంటూరు ఎడ్యుకేషన్: 220 మంది విద్యార్థులు ఒకే వేదికపై ఎలక్ట్రానిక్ డివైజ్ రూపొందించారు. ఉపాధ్యాయుల సూచనలు ఆలకిస్తూ సర్క్యూట్ బోర్డులతో 220 డివైజ్‌లను వారు తయారు చేశారు. డాక్టర్ చివుకుల హనుమంతరావు చారిటబుల్ ట్రస్ట్ అనుబంధ సంస్థ సుగుణ సైన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం అమరావతి రోడ్డులోని హిందూ ఇంజినీరింగ్ కళాశాల సుధర్మ ఆడిటోరియంలో ‘ఎలైట్ అండ్ ఎనర్జిటిక్ మైండ్స్’ పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. నాలుగు చక్రాల వాహనాలను రివర్స్ చేసే సమయంలో ఉపయోగించే అలారంతో కూడిన ఎలక్ట్రానిక్ డివైజ్‌ను విద్యార్థులు తయారు చేశారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. గుంటూరులోని శ్రీపాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌తోపాటు వెంకటకృష్ణాపురంలోని సిద్దార్థ హైస్కూల్‌కు చెందిన 220 మంది విద్యార్థులు పాలుపంచుకున్నారు. సుగుణ సైన్స్ అకాడమీ సీఈవో డాక్టర్ చివుకుల సాంబశివరావు అధ్యక్షత వహించారు. ప్రత్యేక పరిశీలకుడు పత్రి వేణుగోపాల్ సారథ్యంలో డివైజ్‌లు తయారు చేయించారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ బోడేపూడి రామారావు అకాడమీ ప్రతినిధులకు ధ్రువీకరణపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో అప్కాస్ట్ మెంబర్ సెక్రటరీ డాక్టర్ కె. శరత్‌కుమార్, కేఎల్ వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జేవీ షణ్ముఖ కుమార్, సెర్చ్ ఎన్జీవో సంస్థ అధ్యక్షుడు మన్నవ హనుమప్రసాద్, అమ్మనాన్న చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు చెన్న పోతురాజు, పాఠశాలల కరస్పాండెంట్లు పాటిబండ్ల విష్ణువర్ధన్, కట్టా శ్రీనివాసరావు పాల్గొన్నారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కోసం ప్రయోగం వాహన రివర్స్ అలారంతయారు చేసిన విద్యార్థులు -
అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
చీరాల: అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఈపూరుపాలెం ఎస్సై ఎ.చంద్రశేఖర్ తెలిపారు. వేటపాలెం మండలం రామాపురంలోని బీచ్ రోడ్‌లోని వాయల రాంబాబు కూల్‌డ్రింక్ షాపులో రైడ్ చేయగా విస్కీ7 సీసాలు, ఇంపీరియల్ బ్లూ 4, ఎంసీ డోవేల్స్ 3 మొత్తం 14 బాటిల్స్‌ను సీజ్ చేసి అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమంగా మద్యం అమ్మడం నేరమన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక చీరాలటౌన్: ఉమ్మడి ప్రకాశం జిల్లా ఏపీ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షునిగా జమండ్లమూడి శ్రీనివాసరావును ఎన్నుకున్నారు. ఆదివారం పట్టణంలోని డోలా ఐజాక్ ఎన్జీవో భవనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం.వెంకటరెడ్డి, మాజీ సలహాదారు షేక్ యూసుఫ్ మొహరాలి అధ్యక్షతన నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం అధ్యక్షులుగా జమండ్లమూడి శ్రీనివాసరావు, సహాధ్యక్షులుగా ఎన్.కృపాచార్యులు, జనరల్ సెక్రటరీగా సాయి మహేష్, ఉపాద్యక్షులుగా ఎం.వెంకటేశ్వర్లు, కోశాధికారిగా సూర్యనారాయణ, సభ్యులను ఎన్నుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం బలోపేతం చేయడంతోపాటు హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అందరం ఐక్యమత్యంగా ఉండాలని పిలుపు నిచ్చారు. గూడ్స్ రైలు కిందపడి టైల్స్ మేస్త్రి ఆత్మహత్య నరసరావుపేట టౌన్: గూడ్స్ రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దొండపాడుకు చెందిన పుట్లూరి శివారెడ్డి(42) పట్టణంలోని బరంపేటలో నివాసం ఉంటున్నాడు. టైల్స్ మేస్త్రిగా జీవనం కొనసాగిస్తున్నాడు. శావల్యాపురం రైల్వే స్టేషన్ సమీపంలో వెల్లలచెరువు ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకటేశ్వరనాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. -
రుణాల ఊబిలో టిడ్కో గృహ లబ్ధిదారులు
లక్ష్మీపురం: టిడ్కో గృహాల లబ్ధిదారులను ప్రభుత్వం రుణాల ఊబిలోకి నెట్టిందని, గృహ సముదాయాలలో మౌలిక సదుపాయాలూ కల్పించలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబురావు విమర్శించారు. సీపీఎం ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఆదివారం గుంటూరు నగరంలోని అడవితక్కెళ్లపాడులో ఉన్న టిడ్కో గృహ సముదాయాలను బాబురావు, నగర కార్యదర్శి కె. నళిని కాంత్, ఇతర నగర నాయకులు సందర్శించారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ.. లబ్ధిదారులు బ్యాంకుల నుంచి రూ.3.50 లక్షల రుణం తీసుకుంటే 15 నుంచి 20 ఏళ్ల కాలంలో దాదాపు రూ.10.50 లక్షల వరకు చెల్లించాల్సి వస్తోందన్నారు. అసలు కంటే వడ్డీ అధికంగా ఉందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచితంగా ఇల్లు ఇస్తామని చేసిన వాగ్దానం అమలు కాలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం ఎన్నికల హామీ నిలబెట్టుకొని లబ్ధిదారుల రుణాలను వడ్డీ సహా భరించాలని కోరారు. కనీస వసతులు కల్పించాలి గృహ సముదాయాల వద్ద వసతులు లేవని బాబురావు పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఆరు కుటుంబాలకు సరిపోయే నీళ్ల ట్యాంక్ నిర్మించి, 16 కుటుంబాలకు సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. అది కూడా రోజు మార్చి రోజున గంటసేపు మాత్రమే నీళ్లు వస్తున్నాయని తెలిపారు. చాలాసార్లు కలుషిత నీరు సరఫరా అవుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. తాగటానికి ఉపయోగపడట్లేదని నాయకులకు తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, ముళ్ల చెట్లను తొలగింపజేయాలని కోరారు. డిపాజిట్ చెల్లించినా ఇల్లు కేటాయించలేదని, రిజిస్ట్రేషన్ చేయలేదని, కానీ వడ్డీ కోసం బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. యాత్రలను జయప్రదం చేయండిసీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాబురావు లక్ష్మీపురం: ఈ నెల 17వ తేదీ వరకు జరిగే ప్రజాచైతన్య యాత్రలను జయప్రదం చేయాలని, సమస్యలను యాత్ర బృందానికి తెలపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్.బాబురావు కోరారు. బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాయలంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాశం రామారావు అధ్యక్షతన జిల్లా విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రజాసమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి దశల వారీగా ఆందోళన చేయునున్నట్లు తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈమని అప్పారావు, ఎ్.భావన్నారాయణ, ఎం.రవి, కె.నళినీకాంత్, బూరగ వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు డి.శ్రీనివాసకుమారి, ఎల్.అరుణ తదితరులు పాల్గొన్నారు. -
సందడిగా సినిమా పాటల పోటీలు ప్రారంభం
సత్తెనపల్లి: చైతన్య కళా స్రవంతి 46వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫంక్షన్ హాలులో ఆదివారం జాతీయస్థాయి సినిమా పాటల పోటీలు ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు హాజరయ్యారు. పోటీల్లో సోలో పాటలకు మాత్రమే అవకాశం కల్పించారు. డ్యూయెట్స్ను అనుమతించలేదు. ముందుగా చైతన్య కళా స్రవంతి వ్యవస్థాపక అధ్యక్షుడు పిల్లుట్ల రామారావు చిత్రపటానికి చైతన్య కళా స్రవంతి అధ్యక్షులు కమతం శ్రీనివాసరావు, సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పాటల పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో వ్యాపారవేత్త పోతుగంటి రామకోటేశ్వరరావు, చైతన్య కళా స్రవంతి ఉపాధ్యక్షులు పిల్లుట్ల రాజా వీరాస్వామి, ప్రధాన కార్యదర్శి గుండవరపు అమర్నాథ్, ట్రెజరర్ ఎస్సీఎం సుభాని, గౌరవ సలహాదారుడు ముట్లూరి వెంకయ్య, కంబాల వెంకటేశ్వరరావు, అచ్చిరెడ్డి పాల్గొన్నారు. -
ఎంఎల్‌హెచ్‌పీ ఆత్మహత్యాయత్నం
యద్దనపూడి: యద్దనపూడి పీహెచ్సీ పరిధిలోని జాగర్లమూడి గ్రామంలో గతంలో మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ)గా విధులు నిర్వహించిన ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం ఘటన ఆదివారం కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి... యద్దనపూడి మండలం జాగర్లమూడి గ్రామంలో సరోజిని ఎంఎల్‌హెచ్‌పీగా విధులు నిర్వహిస్తుండేది. ఆమె విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తోటి సిబ్బందితో పాటు గ్రామస్తులు పలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో డీఎంహెచ్ఓ విజయమ్మ నాలుగు నెలల క్రితం కేంద్రాన్ని సందర్శించి రికార్డులు సక్రమంగా లేకపోవడంతో ఆమెను వివరణ కోరారు. అయినా ఆమె పద్ధతి మార్చుకోకపోవడంతో వైద్యాధికారి శ్రీహర్ష నాలుగు నెలల క్రితం డీఎంహెచ్ఓ కార్యాలయానికి సరెండర్ చేశారు. ఈ క్రమంలో డీఎంహెచ్ఓ కార్యాలయ అధికారులు ప్రాంతీయ సంచాలకుల కార్యాలయానికి ఆమెను సరెండర్ చేయడం గమనార్హం. ఈ క్రమంలో ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడంతో యద్దనపూడి పరిధిలోనే హాజరు వేసుకుంటూ తనకు వేతనం మంజూరు చేయడం లేదని కొన్ని రోజులుగా ఆస్పత్రి వైద్యాధికారి శ్రీహర్షపై ఒత్తిడి చేస్తూ అతనితో వివాద పడింది. కొన్ని రోజులుగా వివాదం నడుస్తుందని ఆస్పత్రి సిబ్బంది స్వయంగా సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో జీతాలు, విధులు నిర్వహించాల్సిన ప్రాంతం విషయంలో అధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో పర్చూరు పోలీస్ స్టేషన్లోను, యద్దనపూడి పోలీస్ స్టేషన్లోను వైద్యాధికారి శ్రీహర్షపై ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో తనను మానసికంగా వైద్యాధికారి, ఉన్నతాధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆమె ఎలుకల మందు తీసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గుంటూరు ఆస్పత్రిలో చేర్చారు. ఈ విషయం సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో స్థానికంగా కలకలం రేకెత్తింది. ● ఈ విషయమై డీఎంహెచ్ఓ విజయమ్మను వివరణ కోరగా గతంలో సరోజిని విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటుందనే ఆరోపణలు రావడంతో సాధారణ తనిఖీల్లో భాగంగా విచారించామన్నారు. ఈ విచారణలో రికార్డుల నిర్వాహణ సక్రమంగా లేక పోవడంతోపాటు అక్కడి స్థానిక వైద్యసిబ్బందితో పాటు ప్రస్తుతం వైద్యాధికారి శ్రీహర్షతోపాటు గతంలో ఉన్న వైద్యాధికారిపై కూడా పలు నిరాధారణ ఆరోపణలు చేసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక వైద్యసిబ్బంది ఆరోపణల నేపథ్యంలో వైద్యాధికారి శ్రీహర్ష జిల్లా కేంద్రానికి సరెండర్ చేయగా తాము ఆర్డీ కార్యాలయానికి సరెండర్ చేసినట్లు చెప్పారు. ● ఈ విషయమై రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిని వివరణ కోరగా యద్దనపూడి పీహెచ్సీ కేంద్రం నుంచి డీఎంహెచ్ఓ కార్యాలయానికి, అక్కడి నుంచి ఆర్డీ కార్యాలయానికి సరెండర్ చేసిన మాట వాస్తవమే అని వివరణ ఇచ్చారు. ఆమెకు మరోచోట బదిలీ చేసేందుకు ఎంఎల్సీ కోడ్ అడ్డుగా వచ్చిందన్నారు. నాలుగు రోజుల క్రితం ఆమె ఆర్డీ కార్యాలయానికి వచ్చి జాగర్లమూడి గ్రామంలో పని చేసుకుంటానని ప్రాధేయపడిందని, కానీ ఆమెకు యద్దనపూడీ పీహెచ్సీలో పనిచేసేందుకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని చెప్పారు. ఆమెకు వేతనాలు మంజూరు చేసే అధికారం యద్దనపూడి పీహెచ్సీ వైద్యాధికారికి లేదన్నారు. ఈ ఆత్మహత్యయత్నం ఘటన ఇప్పుడే తెలిసిందని, వాస్తవాలు విచారించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. -
భారత జట్టు అపూర్వ విజయంపై వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. జట్టు విజయం మన దేశానికి గర్వకారణమైన క్షణం అని చెప్పుకొచ్చారు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో అసాధారణ విజయం సాధించిన అనంతరం భారత జట్టుకు వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ‘ఇది ఎంతో అర్హమైన అజేయ విజయం. మన దేశానికి గర్వకారణమైన క్షణం! టీమిండియాకు అభినందనలు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.Congratulations to Team India on their exceptional victory! in ICC Champions Trophy 2025. This is a highly deserving unbeaten victory. A proud moment for our nation! Kudos to Team India.#ChampionsTrophy2025 #INDvsNZ— YS Jagan Mohan Reddy (@ysjagan) March 9, 2025 -
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతిపై వైఎస్ జగన్ సంతాపం
సాక్షి,తాడేపల్లి : ప్రముఖ సంగీత విద్వాంసులు, శాస్త్రీయ సంగీత గాయకుడు, స్వరకర్త గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. గరిమెళ్లకు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్ధానం ఆస్ధాన విద్వాంసుడిగా బాలకృష్ణ ప్రసాదు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు వైఎస్ జగన్. సంగీత విద్వాంసుడిగానే కాకుండా ప్రముఖ సంకీర్తనాచార్యులు తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తలనకు స్వరకల్పన చేసి.. అన్నమాచార్యుల వారి సంగీత, సాహిత్యాలను ప్రజలకు చేరవేయడంలో ఆయన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు వైఎస్ జగన్. -
‘యువత పోరుకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం’
గుంటూరు: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న యువత పోరు కార్యక్రమానికి అందరూ మద్దతు ఇవ్వాలని పార్టీ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు. ఈరోజు(ఆదివారం) గుంటూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో యువత పోరు పోస్టర్ ను ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో కలిసి అంబటి రాంబాబు ఆవిష్కరించారు. దీనిలో భాగంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 12వ తేదీన యువత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వసతి దీవెన బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. విద్యార్థులు చదువుకునేందుకు ఇబ్బందలు పడుతున్నారు. పేద విద్యార్థులు వ్యవసాయ బాట పట్టే విషమ పరిస్థితిని కల్పించారు. బకాయిలు తీర్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ వరకూ ర్యాలీ చేస్తాం. ఈ ప్రభుత్వంలో సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదు. నిరుద్యోగ భృతి అంశాన్ని పక్కన పెట్టేశారు. ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మెడికల్ కాలేజ్ లను ప్రభుత్వం రంగం నుండి ప్రవేటు రంగానికి మార్చేసి పప్పు బెల్లాల్లా అమ్ముకునేందుకు సిద్దం మయ్యారు. పెట్టుబడి దారులకు అమ్ముకుంటున్నారు. యువత పోరుకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం’ అని అంబటి స్పష్టం చేశారు. -
ప్రతీ పల్లెలో ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఈనెల 12న చేపట్టిన ‘యువత పోరు’ ద్వారా రాష్ట్రంలో యువతను, నిరుద్యోగులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అలాగే, 12వ తేదీన వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలన్నారు. ప్రతి పల్లెలోనూ పార్టీ జెండాలను ఎగురవేయాలని సూచించారు.యువత పోరు, పార్టీ ఆవిర్భావ దినోత్సవాలపై ఆదివారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో సజ్జల రామకృష్ణారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘రాష్ట్ర వ్యాప్తంగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం రూ.3900 కోట్ల మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉంటే ఈ బడ్జెట్లో కేవలం రూ.2600 కోట్లు కేటాయించడం దుర్మార్గం. అంటే విద్యార్ధుల సంఖ్యను కూడా కుదించేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోంది.బకాయిలు పెండింగ్..పేద, మధ్యతరగతి విద్యార్ధులను చదువులకు దూరం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అయిదు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టడం రాక్షసత్వం. ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీల నుంచి విద్యార్ధులను వెళ్లగొడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో చదువులు మధ్యలో ఆగిపోతున్నా సర్కారు చోద్యం చూస్తోంది. పేద పిల్లలకు పెద్ద చదువులు సాకారం చేస్తూ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఆనాడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువచ్చారు. నిరుపేద ఇళ్ల నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు తయారు కావాలన్న సమున్నత లక్ష్యంతో నాడు ఫీజు రీయింబర్స్మెంట్ కు శ్రీకారం చుట్టారు.చంద్రబాబు సర్కార్ 2014-19 మధ్యలో ఈ పథకానికి తిలోదకాలు ఇచ్చింది. ఉద్దేశపూర్వకంగా బకాయిలు పెట్టి, కాలేజీ యాజమాన్యాలను, విద్యార్ధులను ఇబ్బందుల పాలు చేసింది. వైఎస్సార్ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసిన వైఎస్ జగన్ 93 శాతం మంది విద్యార్ధులకు మేలు చేసేలా ఈ పథకాన్ని విస్తరింపచేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు కూటమి సర్కార్ ఈ పథకాన్ని నీరు గార్చేందుకు ప్రయత్నిస్తోంది.నిరుద్యోగులను వంచిస్తున్న కూటమి..కూటమి ప్రభుత్వంపై యువతలోనూ ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిరుద్యోగ యువతకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని విస్మరించారు. ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా ప్రతినెలా మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామంటూ ఇచ్చిన హామీ ఏమైంది?. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.7200 కోట్లు అవసరం. కానీ గత బడ్జెట్ లో దీనికి కేటాయింపులు లేవు. ఈ ఏడాది బడ్జెట్ లోనూ పైసా కూడా కేటాయించలేదు.మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం..ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు వైఎస్సార్సీపీ హయాంలో పదిహేడు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు. ఇందులో అయిదు కాలేజీల నిర్మాణం పూర్తై, తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలిన వాటిల్లో నిర్మాణపనులు పూర్తిచేసి, తరగతులను ప్రారంభించాల్సి ఉంది. కానీ వాటిని కూడా ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఇచ్చిన మెడికల్ సీట్లను కూడా వద్దంటూ రాష్ట్రప్రభుత్వమే లేఖ రాయడం దుర్మార్గం. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతో ఒకేసారి పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టింది.వీటిల్లో విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల కాలేజీలు 2023లో ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2019 వరకు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కేవలం 11 వైద్య కాలేజీలే ఉండేవి. వందేళ్ళ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టిన ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుంది. అయితే కొత్త మెడికల్ కాలేజీలను, వాటిద్వారా వచ్చే సీట్లను కూటమి ప్రభుత్వం అడ్డుకుంటోంది. వాటిని ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తోంది.విద్యార్థి సంఘాలు కలిసి రావాలి..ఈ తరుణంలో ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ.. యువతకు, విద్యార్ధులకు అండగా నిలిచి ప్రభుత్వం విధానాలపై పోరాడాలి. అందుకోసం తలపెట్టిన యువత పోరులో కలిసి వచ్చే అన్ని విద్యార్థిసంఘాలు, యువజన సంఘాలతో వైఎస్సార్సీపీ నేతృత్వంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించాలి. అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట విద్యార్థులు, నిరుద్యోగులు, యవతతో కలిసి వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రదర్శన, ధర్నా కార్యక్రమం చేపట్టాలి. అనంతరం కలెక్టర్లకు సమస్యలపై విజ్ఞాపన పత్రాలు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, మండల స్థాయి నేతలు సమన్వయంతో విజయవంతం చేయాలి.వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలు..ఈనెల 12వ తేదీ వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం. రాష్ట్రంలోని వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలి. ప్రతి పల్లెలోనూ పార్టీ జెండాలను ఎగురవేయాలి. ప్రజల్లో వైఎస్సార్సీపీకి ఉన్న బలాన్ని చాటుకోవాలి. పార్టీ పట్ల సానుభూతితో ఉన్న శ్రేణులను ఆవిర్భావ వేడుకల్లో భాగస్వాములను చేయాలి. ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణను నిలబెట్టుకుంటూ, రానున్న రోజుల్లో వారికి అండగా ఉంటామనే భరోసాను కల్పించాలి. మండలస్థాయి కమిటీల ఏర్పాటుకు కూడా నియోజకవర్గ ఇన్చార్జీలు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. -
ఆగని ‘కూటమి’ వేధింపులు.. సోషల్ మీడియా యాక్టివిస్ట్ రాకేష్ అరెస్ట్
చిలకలూరిపేట: రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. పల్నాడు జిల్లా చిలకలూ రిపేటలోని తూర్పు మాలపల్లెకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ దొడ్డా రాకేష్‌గాంధీని అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి గుంటూరులో అదుపులోకి తీసుకుని చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అరెస్టు చేస్తారన్న భయంతో రాకేష్‌గాంధీ చిలకలూరిపేటలో నివాసం ఉండటం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రాకేష్‌గాంధీ ఆచూకీ తెలియజేయాలని అతని తండ్రి దొడ్డా దాసును పోలీసులు 4 రోజులపాటు అక్రమంగా నిర్బంధించి వేధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.అయినప్పటికీ అతని ఆచూకీ తెలియకపోవడంతో అప్పటి నుంచి నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. టీడీపీకి చెందిన బాషా అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాకేష్గాంధీపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాకేష్గాంధీపై రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల కూడా కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఈ విషయమై చిలకలూరిపేట అర్బన్ సీఐ పి.రమేష్‌ను వివరణ కోరగా, దొడ్డా రాకేష్‌గాంధీని అరెస్టు చేశామన్నారు. రాకేష్‌గాంధీని న్యాయస్థానంలో హాజరుపరిచారు. చిలకలూరిపేట కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. -
కేసినో వేట.. జీవితాలతో ఆట..!
గోవా అనగానే బీచ్‌లతోపాటు కేసినోలు గుర్తుకొస్తాయి. ఆ కేసినోలపై తెలుగు రాష్ట్రాల్లోని కొందరికి ఉన్న ఆకర్షణను అవకాశంగా చేసుకుని కొన్ని ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఈవెంట్ల పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఏజెంట్లను నియమించుకుని మరీ అమాయకులకు ఎర వేస్తున్నారు. గోవాతోపాటు శ్రీలంక, నేపాల్‌లలో కూడా దందా సాగుతోంది. రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు చెల్లించి వెళ్లేవారు.. ఆటలు ముగిశాక ఒట్టి చేతులతోనో, అప్పుల భారంతోనో, ఆస్తులు రాసేసో.. వెనక్కి రాక తప్పడం లేదు.ఇలా వెళ్లిన వందల మంది సర్వం పోగొట్టుకుని వస్తున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు : మధ్య తరగతి, సంపన్నవర్గాలకు కేసినో ఈవెంట్లు నిర్వహించే ముఠాలు గాలం వేస్తున్నాయి. గోవాలోని కేసినోలతో చీకోటి ప్రవీణ్ తెరపైకి రాగా.. ఆయనను ఆదర్శంగా తీసుకుని మరికొందరు ఈ దందాలో అడుగుపెట్టారు. గోవాలో 13 ముక్కలాటపై నిషేధం ఉన్నా, అద్దెకు తీసుకున్న కేసినోలలో వీటిని నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఎనిమిది మంది సిండికేట్‌గా ఏర్పడ్డారు. శ్రీనివాసరెడ్డి, ధన, రఫీ, వీరన్నగౌడ్, ప్రశాంత్‌రెడ్డి, నాగరాజు, పరమేష్, తిరుపతిరెడ్డిలు తమ వాట్సప్ గ్రూపుల ద్వారా దందా నడుపుతున్నారు. ఏరియాలవారీగా సభ్యులను ఏర్పాటు చేసుకుని ఎరినైనా గోవా పంపితే కమీషన్ ఇస్తున్నారు. ప్రతి నెలలో ఇరవైకిపైగా ఇలాంటి ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. గోవాలోని బిగ్ బీ, క్యాడీలాక్ డైమండ్ తదితర కేసినోలను అద్దెకు తీసుకుంటున్నారు. నాలుగు రోజుల ఈవెంట్‌కు రూ.కోటి వరకు అద్దె చెల్లిస్తున్నారంటే వారి రాబడి స్థాయి ఎంతో తెలుసుకోవచ్చు. డిపాజిట్ మొత్తాన్ని బట్టి ఆఫర్లు వెళ్లేవారు రూ.రెండు లక్షల వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు వారికి కాయిన్లు అందిస్తారు. ఈ కాయిన్లతో కేసినోలో ఆడాల్సి ఉంటుంది. వీరికి రానుపోనూ ఉచితంగా విమాన టిక్కెట్లు, గోవాలో బస సదుపాయం, కట్టిన మొత్తాన్ని బట్టి ఫ్రీ మద్యం, వినోద కార్యక్రమాలు వంటి ఆఫర్లు ఉంటాయి. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖ, హైదరాబాద్‌ల నుంచి విమానాల్లో గోవా తీసుకెళ్తున్నారు. ఈవెంట్లు ఉన్న రోజుల్లో గోవా వెళ్లే విమానాలన్నీ రద్దీగా ఉంటున్నాయి. ఒక్కో ఈవెంట్‌కు ఒక్కో ఆర్గనైజర్, అతడికి ఫోన్ నెంబర్ కేటాయిస్తున్నారు. అందర్–బాహర్, బక్కారత్, రౌలెట్టే, బ్లాక్‌జాక్, జండూ, తీన్‌పత్తీ, రమ్మీ/సిండికేట్‌తో పాటు 13 ముక్కల ఆట ఆడిస్తున్నారు. అప్పులిచ్చి.. ఆస్తులు కొట్టేసి.. గెలిచినా ఏదో విధంగా డబ్బులు గుంజి పంపుతున్నారు. డబ్బులు పోతే అక్కడే వీరికి అప్పులు ఇచ్చి మరీ లాగేస్తున్నారు. తర్వాత పొలాలు, స్థలాలు వంటి స్థిరాస్తులు కూడా రాయించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇలా ఈవెంట్లకు వెళ్తున్న వారి సంఖ్య వందల్లో ఉంటోంది. గోవా కేసినోలో ఆడితే జీఎస్టీతో కలిపి అక్కడి నిర్వాహకులకు చెల్లించాలి. తెలుగు రాష్ట్రాల నుంచి ఈవెంట్లు చేస్తున్న వారు అక్కడ తమ సొంత స్వైపింగ్ మిషన్లు పెడుతున్నారు. జీఎస్టీ కూడా చెల్లించకుండానే ఈవెంట్లు చేస్తున్నా ప్రభుత్వాలు, నిఘా వర్గాలు పట్టించుకోవడం లేదు. దీంతో దందా యథేచ్ఛగా సాగిపోతోంది. ఈ ముఠాల చేతిలో చిక్కిన వారి కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. -
విజయం సాధించాలంటే కష్టపడి చదవాలి
అర్జున అవార్డు గ్రహీత ఇషా సింగ్ తాడికొండ: విద్యార్థులు జీవితంలో విజయం సాధించాలంటే కష్టపడి చదవాలని, తక్కువ మార్కులు వచ్చాయని బాధపడకుండా లక్ష్యాలను నిర్దేశించుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలని అర్జున అవార్డు గ్రహీత(షూటింగ్) ఇషా సింగ్ అన్నారు. విటోపియా– 2025 వార్షిక క్రీడల, సాంస్కృతిక ఉత్సవం రెండోరోజు శనివారం ఉత్సాహంగా కొనసాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అర్జున అవార్డు గ్రహీత ఇషాసింగ్ పాల్గొని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు దిశా నిర్దేశం చేసి, వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. వీఐటీ– ఏపీ విశ్వ విద్యాలయం వీసీ డాక్టర్ ఎస్వీ కోటారెడ్డి మాట్లాడుతూ మహిళలకు తమ వర్సిటీ అడ్మిషన్లలో అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. 2017లో వీఐటీ– ఏపీ క్యాంపస్‌లో కేవలం 8 శాతం మహిళా విద్యార్థులతో ప్రారంభమై ఇప్పుడు 33 శాతానికి పెరిగిందని త్వరలో అది 50 శాతానికి చేరుకుంటుందని ఆకాంక్ష వ్యక్తం చేశారు. రెండో రోజు వార్షిక క్రీడలు, సాంస్కృతిక ఉత్సవంలో భాగంగా ప్రో షోలో ప్రముఖ నేపథ్య గాయని షల్మాలి ఖోల్గాడే, ప్రముఖ నేపథ్య గాయకుడు కార్తీక్‌ల డీజేల సంగీత విభావరి అందరినీ ఆకట్టుకుంది. వీఐటీ– ఏపీ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి, విటోపియా కన్వీనర్ డాక్టర్ కృష్ణ స్వామి, స్టూడెంట్ వెల్ఫేర్ డీడీ డాక్టర్ ఖాదీర్ బాషా పాల్గొన్నారు. మారథాన్‌ను ప్రారంభించిన గుంటూరు ఎస్పీ విటోపియాలో భాగంగా డ్రగ్స్ రహిత ఇండియా కోసం గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో మారథాన్ నిర్వహించారు. వీఐటీ– ఏపీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జీవీ సెల్వంతో కలసి డ్రగ్స్ రహిత ఇండియా కోసం విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీ విజయవంతమైంది. అనంతరం గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ విద్యార్థులతో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం డ్రగ్ నిర్మూలనా ప్రతిజ్ఞ చేయించారు. డాక్టర్ షమ సుల్తానాకు ఉత్తమ మహిళ అవార్డు గుంటూరు మెడికల్: గుంటూరుకు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్, హోప్ విన్ హాస్పిటల్ చైర్పర్సన్ డాక్టర్ షమ సుల్తానాకు ముంబాయికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఆఫీస్ ఉత్తమ మహిళ అవార్డు అందజేశారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముంబాయిలోని యూనియన్ కార్యాలయంలో ఎం పవర్ అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో డాక్టర్ షమ సుల్తానా పాల్గొని తన జీవిత కథ వివరించారు. అత్యున్నత స్థాయికి ఎదగడంలో తాను అనుభవించిన సమస్యలను వివరించారు. ఈసందర్భంగా డాక్టర్ షమ సుల్తానాకు ఉత్తమ మహిళఅవార్డు అందజేసి ఘనంగా సత్కరించారు. హోప్ విన్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మహిళల కోసం చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఆమె వివరించారు. రైల్వే డివిజన్ ఆస్పత్రిలో.. లక్ష్మీపురం:అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు రైల్వే డివిజన్ రైల్వే ఆస్పత్రి ప్రాంగణంలో మహిళా ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అని సౌత్ సెంట్రల్ రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజనేషన్ అధ్యక్షురాలు, డీఆర్ఎం సతీమణి ఎం.ఆశాలత అన్నారు. స్థానిక గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద గల రైల్వే ఆస్పత్రిలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని మహిళా రైల్వే ఉద్యోగులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిందిగా కోరారు. ఇలాంటి శిబిరాల వల్ల ఎంతగానో ఉపయోగం ఉంటుందన్నారు. అనంతరం రైల్వే ఆస్పత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు. డాక్టర్ ఎ.ప్రియాంక, పి.షర్మిల, డాక్టర్ వి.సింధు, సౌమ్య పాల్గొన్నారు. మహిళా భాగస్వామ్యం పెరగాలి.. గుంటూరు ఎడ్యుకేషన్: న్యాయ వ్యవస్థలో మహిళా భాగస్వామ్యం మరింతగా పెరగాలని మహిళా, శిశు సంక్షేమశాఖ న్యాయవాది ఎ.విజయలక్ష్మి పేర్కొన్నారు. శ్యామలానగర్‌లోని మాంటిస్సోరి ఇంగ్లిష్ మీడియం స్కూల్లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ప్రముఖ వైద్యురాలు కె. శ్రీవిద్య మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన ఎంతో మంది మహిళలు మన దేశానికి చెందిన వారు కావడం గర్వకారణమన్నారు. పాఠశాల కరస్పాండెంట్ మంజు సెబాస్టియన్ మాట్లాడుతూ మన దేశంలోని మహిళలు అన్ని రంగాల్లో ఉన్నతస్థాయిలో రాణిస్తూ, తమ శక్తి, సామర్‌ాధ్యలను ప్రపంచానికి చాటి చెప్పడం గొప్ప విషయమన్నారు. మహిళల విజయగాథలు సాధారణ మహిళలకు స్ఫూర్తిదాయకం కావాలని చెప్పారు. ఈసందర్భంగా మంజు సెబాస్టియన్‌తో పాటు అతిథులుగా పాల్గొన్న మహిళా ప్రముఖులనుసత్కరించారు. -
కూటమి కూసాలు కదిలేలా ఫీజు పోరు
వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య నగరంపాలెం: కూటమి ప్రభుత్వ కూసాలు కదిలేలా ఫీజు పోరుకు తరలిరావాలని వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య పిలుపునిచ్చారు. ఈ నెల 12న వైఎస్సార్ సీపీ చేపట్టనున్న ఫీజు పోరుని జయప్రదం చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి క్యాంపు కార్యాలయంలో విద్యార్థి నాయకులతో శనివారం సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు చిన్నాబత్తిన వినోద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పానుగంటి చైతన్య మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకపోవడంతో విద్యార్థులను విద్యకు దూరమవుతున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం తక్షణమే కపట నాటకాలు నిలిపివేయాలని అన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యంకావడంతో చదువులు అర్ధాంతంగా నిలిపివేయాల్సి వస్తోందని వాపోయారు. తద్వారా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. పిల్లల ఫీజులకు డబ్బులు చెల్లించలేక తల్లిదండ్రులు అప్పులు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో పలు కళాశాలల కమిటీ అధ్యక్షులు మణిచౌదరి, సుభానీ, శ్రీకాంత్, ప్రవీణ్, మస్తాన్‌రెడ్డి, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బడే జగదీష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గురిశెట్టి రవి, గంటి, జిల్లా ప్రధాన కార్యదర్శులు మస్తాన్, కరీం, రాజేష్, అజయ్, జిల్లా కార్యదర్శులు సన్ని, రామకృష్ణ, కిరణ్ పాల్గొన్నారు. -
ఎస్టీపీ ప్లాంట్ పరిశీలన
తెనాలిఅర్బన్: తెనాలి పూలే కాలనీలో ట్రైయిల్ రన్ నిర్వహిస్తున్న ఎస్టీపీ ప్లాంట్‌ను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పబ్లిక్ హెల్త్ రాష్ట్ర చీఫ్ ఇంజినీర్ మరియన్న పేర్కొన్నారు. శనివారం ఎస్టీపీ ప్లాంట్‌ను పరిశీలించి నిర్మాణాలపై ఆరా తీశారు. మిగిలిన చిన్న చిన్న మరమ్మతులను పూర్తి చేయాలని, గ్రీనరీని ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే సచివాలయాల పరిధిలోని ఇమ్యూనిటీ సెక్రటరీలకు ఎస్టీపీ పనితీరుపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి పూలే కాలనీలో సుమారు రూ.30 కోట్లతో ఎస్టీపీ ప్లాంట్ నిర్మించడం జరిగిందన్నారు. దాదాపు పనులు పూర్తయ్యాయని, కొద్ది రోజులుగా ట్రైయిల్ రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. త్వరలో రాష్ట్ర మంత్రులతో దీనిని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనివాసరావు, డీఈ శివరామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఇన్చార్జి ఎంఈ ఆకుల శ్రీనివాసరావు, డీఈలు సుబ్బారావులు, శ్రీనివాసరావు, ఏఈలు ఫణీ, సూరిబాబు, సునీల్ ఉన్నారు. జిల్లా కోర్టులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా కోర్టులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం న్యాయ సేవా సదన్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఐదో అదనపు జిల్లా న్యాయమూర్తి కె.నీలిమ హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ సమాజంలో సీ్త్ర శక్తి ఎంతో విలువైనదని చెప్పారు. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని సూచించారు. జిల్లా న్యాయ సేవా సదన్ సెక్రెటరీ, న్యాయమూర్తి సయ్యద్ జియా ఉద్దీన్ మాట్లాడుతూ సమాజంలో మహిళా విద్యకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. స్వేచ్ఛ భద్రతను కల్పించి ముందుకు నడిపించాలన్నారు. చెట్టుకు వేలాడిన కళేబరం ●కొంత కాలం కిందట వ్యక్తి ఆత్మహత్య ●అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలింపుబల్లికురవ:గుర్తు తెలియని వ్యక్తి ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడగా శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. మండలంలోని పాతమల్లాయపాలెం గ్రామం నుంచి సోమవరప్పాడు వెళ్లే దారిలో ఉన్న కొండ సమీపంలో వేపచెట్టుకు 40 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ ఘటన జరిగి చాలా రోజులు కావటంతో శవం.. కళేబరంగా మారింది. శనివారం పాఠశాలలకు సెలవు కావటంతో ఆడుకునేందుకు అటువైపు వెళ్లిన విద్యార్థులు చెట్టుకు వేళ్లాడుతున్న కళేబరం గుర్తించగా.. తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై జీవీ చౌదరి, రైటర్ ఆంజనేయులు, సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
ధైర్యం, స్వేచ్ఛతో మహిళా సాధికారత సాధ్యం
నగరంపాలెం: మహిళలు ధైర్యంగా, స్వేచ్ఛగా ఉన్నప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని జిల్లా ఏఎస్పీ(ఏఆర్) హనుమంతు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం పోలీస్ పరేడ్ మైదానం వద్ద మహిళా సాధికారత ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి మూడు బొమ్మల సెంటర్ మీదగా తిరిగి పోలీస్ పరేడ్ మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఏఎస్పీ మాట్లాడుతూ మహిళలు సమాజంలో ధైర్యంగా, స్వతంత్రంగా ఉండాలని అన్నారు. లింగ సమానత్వాన్ని, హక్కులను స్వేచ్ఛగా అనుభవించినప్పుడే మహిళా సాధికారత సాధించినట్లు అని పేర్కొన్నారు. మహిళల రక్షణ, భద్రత కోసం ‘మహిళా...మీ కోసం‘ ఇటీవల ప్రారంభించినట్లు గుర్తుచేశారు. ఆపదలో ఉన్న మహిళలకు అండగా ఉంటుందని అన్నారు. మహిళల రక్షణకు సంబంధించి భద్రతా చర్యలను తీసుకున్నామని పేర్కొన్నారు. ర్యాలీ అనంతరం వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు అందించారు. మహి ళా పీఎస్ డీఎస్పీ సుబ్బారావు, సీఐ నారాయణ, ఆర్ఐలు శివరామకృష్ణ, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
లారీ ఢీకొని యువకుడు మృతి
రాజుపాలెం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని మాచర్ల–గుంటూరు రహదారిపై రెడ్డిగూడెం రైస్‌మిల్లు వద్ద శనివారం రాత్రి జరిగింది. పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామానికి చెందిన సంధ్యానాయక్ (26)అనే యువకుడు సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ల వెళుతుండగా అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ కె.వేణుగోపాల్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాన్ని సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సీఎం పర్యటనకు ఏర్పాట్లు పరిశీలన
మంగళగిరి: మండలంలోని నీరుకొండ గ్రామంలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పలు నిర్మాణాలకు శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 11వ తేదీన రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు శనివారం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, సంయుక్త కలెక్టర్ ఎ. భార్గవ్ తేజలు ఆయా ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్నారు. సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను, ఎస్ఆర్ఎం నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమంలో వర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ నారాయణరావు, మంగళగిరి తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర, డీఎస్పీ మురళి, రూరల్ సీఐ, ఎస్ఐలు వై.శ్రీనివాసరావు, సీహెచ్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
డ్రోన్ నిఘాతో మందు బాబులపై కేసులు
పెదకాకాని: సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ టీపీ నారాయణస్వామి శనివారం తెలిపారు. వివరాలు.. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు మద్యం తాగుతున్న వారిని గుర్తించేందుకు డ్రోన్ నిఘా ఉంచారు. గ్రామ శివారులోని పొలాల్లో, చెట్ల కింద మద్యం తాగుతున్న వారు సులువుగా దొరికిపోతున్నారు. డ్రోన్ కెమెరా ద్వారా ఏ ప్రాంతంలో ఓపెన్‌గా మద్యం తాగుతున్నారో ఆ ప్రాంతానికి పోలీసు సిబ్బంది చేరుకుని వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడంపై కేసులు నమోదు చేస్తున్నట్లు సీఐ వివరించారు. -
మహిళలు పోరాటాలకు సిద్ధం కావాలి
శ్రామిక మహిళ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ నరసరావుపేట: అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తితో అతివలు పోరాటాలకు సిద్ధం కావాలని శ్రామిక మహిళ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డి.శివకుమారి పిలుపునిచ్చారు. పట్టణంలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో శనివారం యూటీఎఫ్, సీఐటీయూ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షురాలు ఎ.భాగేశ్వరిదేవి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో శివకుమారి మాట్లాడుతూ.. మహిళా సాధికారత గురించి పాలకుల ఉపన్యాసాల్లో తప్ప ఆచరణలో ఏమీ లేదన్నారు. కనీస రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తీరుతో మహిళా సాధికారత వెనుకబడిందన్నారు. సమాన పనికి సమాన వేతనం అందడం లేదని, స్థిరమైన ఉపాధి లభించడం లేదన్నారు. సమాన అవకాశాలు మహిళలకు దూరంగా ఉన్నాయన్నారు. అంగన్వాడీ, ఆశా, మున్సిపల్, భవన నిర్మాణ, ఇతర రంగాలలో వేలాదిమంది మహిళలు మగ్గుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటుపల్లి రజిని, సంఘం సీనియర్ నాయకులు గద్దె ఉమశ్రీ, నాయకులు ఎస్.దుర్గా బాయి, నాగమ్మ బాయి, పలు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్‌లో 3,027 కేసులు పరిష్కారం
గుంటూరు లీగల్ : ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వై.వి.ఎస్.బి.జి.పార్థసారథి నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా జరిగిన లోక్ అదాలత్‌లో వివిధ న్యాయ స్థానాల్లో పెండింగ్ ఉన్న, రాజీ పడదగిన కేసులు పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు. సివిల్ 388, క్రిమినల్ 2531, ప్రీ లిటిగేషన్ 108 కేసులు కలిపి మొత్తం 3,027 కేసులు పరిష్కరించామని వెల్లడించారు. మొత్తం రూ. 11.49 కోట్ల విలువైన పరిహారం ఇప్పించామని చెప్పారు. జాతీయ లోక్ అదాలత్‌ను ఫిజికల్, వర్చువల్ పద్ధతిలో నిర్వహించినట్లు తెలిపారు. సహకరించిన న్యాయవాదులకు, పోలీస్ సిబ్బందికి, ప్రభుత్వ సంస్థలకు, కక్షిదారులకు, న్యాయస్థాన సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. -
రాజాధిరాజ వాహనంపై నారసింహుడు
మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నాలుగో రోజైన శనివారం స్వామి వారు రాజాధిరాజ వాహనంపై దర్శనంఇచ్చారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదికలో భక్తి గీతాలు, కూచిపూడి నృత్యం తదితర ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో రామకోటిరెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షించగా.. కై ంకర్యపరులుగా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన పెమ్మసాని శైలేంద్ర వ్యవహరించారు. స్వామి ఆదివారం రాత్రి యాలివాహనంపై దర్శనమివ్వనున్నారు. – మంగళగిరి/ మంగళగిరి టౌన్ -
మహిళ కిడ్నాప్ కలకలం
లక్ష్మీపురం: మహిళను కిడ్నాప్ చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరాలు ప్రాంతానికి చెందిన యక్కల బాలశేఖర్, వాసవి దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. నగరాలులో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 2019లో ముత్యాలరెడ్డినగర్ ప్రాంతానికి చెందిన నరసారెడ్డి అనే వ్యక్తి వద్ద బాలశేఖర్ రూ.2 లక్షల చీటీలు రెండు వేశాడు. రెండూ పాడుకున్నాడు. 2020లో కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయని విజయవాడ ప్రకాష్‌నగర్‌కు వెళ్లి జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం శారదాకాలనీకి చెందిన వాసవి సోదరుడు రాజేష్ మృతి చెందాడు. మృతదేహాన్ని చూసేందుకు వాసవి వచ్చింది. సమాచారం తెలుసుకున్న నరసారెడ్డి ఆటోలో ఆమెను బలవంతంగా ఎక్కించుకుని పోలీస్ స్టేషన్‌కు వెళదామంటూ ముత్యాలరెడ్డి నగర్‌లోని నరసారెడ్డి తల్లి ఇంట్లో నిర్బంధించాడు. భార్యను వదిలి పెట్టాలంటే బాకీ డబ్బు చెల్లించాలంటూ బాలశేఖర్ను నరసారెడ్డి బెదిరించాడు. దిక్కుతోచక విషయాన్ని బాధితుడు తన మరదలికి తెలియజేశాడు. అంత డబ్బు లేదని నరసారెడ్డిని ప్రాధేయపడ్డాడు. కనీసం రూ.లక్ష చెల్లించనదే వదిలి పెట్టనని నరసారెడ్డి చెప్పాడు. లక్ష్మి రూ.లక్ష నగదును నరసారెడ్డికి ఆన్లైన్ ద్వారా జమ చేసింది. వాసవిని వదిలి పెట్టాల్సిందిగా కోరితే.. మిగిలిన నగదు చెల్లించేవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి బెదిరించాడు. దీంతో బాధితుడు బాలశేఖర్ శనివారం సాయంత్రం అరండల్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అప్పటికే స్టేషన్ ఎస్హెచ్ఓ వీరాస్వామి, సిబ్బందితో వెళ్లి నరసారెడ్డిని, వాసవిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. సోదరుడి మృతదేహాన్ని చూసేందుకు రాక చీటీల డబ్బులు చెల్లించాలంటూ బలవంతంగా తరలింపు -
గుంటూరు
ఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025నేడే ఆంజనేయస్వామి తిరునాళ్ల రొంపిచర్ల: మండలంలోని గోగులపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సువర్చలా సమేత అభయాంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం ఆదివారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు పెదపులివర్రు(భట్టిప్రోలు): పెదపులివర్రు గ్రామంలో కొలువైన శ్రీ భూనీళా సమేత వరదరాజస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ప్రసన్నాంజనేయస్వామి జయంతి రాజుపాలెం: మండలంలోని ఆకుల గణపవరంలో ప్రసన్నాంజనేయస్వామి జయంతి మహోత్సవం సందర్భంగా శనివారం లక్ష తమలపాకుల పూజ చేశారు. ఇఫ్తార్ సహర్ (ఆది) (సోమ) గుంటూరు 6.22 5.04 నరసరావుపేట 6.24 5.06 బాపట్ల 6.22 5.04 సాక్షి ప్రతినిధి, గుంటూరు: కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీరు అందడం లేదు. ఫలితంగా రబీ సాగుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో 1,59,275 ఎకరాల్లో మొక్కజొన్న, జొన్న సాగు జరుగుతోంది. పలుచోట్ల కూరగాయలు, అరటి కూడా సాగు చేస్తున్నారు. పది రోజులుగా నీటి విడుదల పూర్తిగా తగ్గిపోవడంతో పంటలు ఎండుతున్నాయి. మరోవైపు ఎన్నడూ లేనివిధంగా ఫిబ్రవరి చివరి నుంచే ఎండలు మండిపోతుండటంతో నీటి అవసరం పెరిగింది. అయితే అదే సమయంలో ప్రకాశం బ్యారేజి నుంచి నీటి విడుదల తగ్గింది. పశ్చిమ డెల్టాకు వెయ్యి క్యూసెక్కులు, గుంటూరు చానల్‌కు 200 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నారు. నీటి విడుదల తగ్గిపోవడంతో రైతులు ఆయిల్ ఇంజిన్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఇంకో తడికి నీరు అందించాలని లేకపోతే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారుల ప్రణాళిక లోపం! ఖరీఫ్‌లో తుఫాన్లు, భారీ వర్షాలకు పంట దెబ్బతింది. మరోవైపు రంగుమారిన, తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం, గిట్టుబాట ధర లేకపోవడంతో ఇప్పటికే డెల్టా రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంది. ఈ సమయంలో రబీకి కూడా నీటి కష్టాలు ఎదురవుతుండటం వారిని కలవరపరుస్తోంది. అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురైంది. డెల్టా పరిధిలో తాగు, సాగునీటి అవసరాలకు ఇప్పటి వరకూ 67,92 క్యూసెక్కుల నీటిని వినియోగించారు. వచ్చే నెలాఖరు వరకూ డెల్టాకు 2.29 టీఎంసీ, గుంటూరు ఛానల్‌కు 0.21 టీఎంసీ మాత్రమే వాడుకునే అవకాశం ఉందని జలవనరుల శాఖ ఇంజనీర్లు చెబుతున్నారు. పులిచింతలలో ఉన్న నీటిని ఇప్పుడు వాడేస్తే భవిష్యత్‌లో తాగు, సాగునీటి సమస్యలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఎండిపోతున్న పంటల సంగతేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. 7న్యూస్రీల్పలు మండలాల్లో తీవ్రంగా.. పశ్చిమ డెల్టాకు నీటి కష్టాలు ఎండుతున్న పంటలు పట్టించుకోని అధికారులు కాల్వలకు చేరని సాగునీరు ఆయిల్ ఇంజిన్లతో తోడుకుంటున్న రైతులు ఎకరానికి రూ.నాలుగైదు వేల అదనపు ఖర్చు నీటి విడుదల పెంచాలని రైతుల డిమాండ్ దుగ్గిరాల, పొన్నూరు, వేమూరు, అమర్తలూరు, రేపల్లె మండలాల్లోని పలు గ్రామాల్లో సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. నీటివిడుదల తగ్గిపోవడంతో పంట కాల్వల్లో నీటి మట్టాలు బాగా పడిపోయాయి. దీంతో పొలాల్లోకి నీరు రావాలంటే ఆయిల్ ఇంజన్లు పెట్టి తోడుకోవాల్సి వస్తోంది. దీనివల్ల ఎకరానికి రూ.నాలుగు వేల నుంచి రూ.ఐదు వేల రూపాయలు అదనంగా ఖర్చు అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటో నంబర్ బ్రాంచ్ కెనాల్‌కు నాలుగు నెలల నుంచి నీరు ఇవ్వడం లేదని ఈమని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ కాలువ పరిధిలో ఈమని, చింతలపూడి, కుంచారం, అత్తొట గ్రామాల్లో వెయ్యి ఎకరాలకుపైగా సాగు ఉంది. -
అందుబాటులోకి మూడు వంతెనలు
నెహ్రూనగర్: ఎట్టకేలకు మూడు వంతెనల మీదుగా రాకపోకలు శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యాయి. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రెండు లైన్లుగా ఉన్న మూడు వంతెనలను నాలుగు లైన్లుగా ఆధునికీకరిస్తూ పనులు చేపట్టామన్నారు. రానున్న రోజుల్లో శంకర్ విలాస్ బ్రిడ్జి విస్తరణ పనులు మొదలు పెడతామని వెల్లడించారు. గతంలో వర్షం పడితే మూడు వంతెనలు మునిగే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ సమస్య రాకుండా డ్రైయిన్ నిర్మాణం చేపట్టామని తెలిపారు. ట్రాఫిక్ కష్టాల నుంచి నగర ప్రజలను తప్పించేందుకు ఆక్రమణలు తొలగిస్తున్నామని పేర్కొన్నారు. తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు అవమానం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజైన శనివారమే పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవికి అవమానం జరిగింది. ఆమె రాకుండానే కేంద్ర మంత్రి పెమ్మసాని మూడు వంతెనలను ప్రారంభించారు. పశ్చిమ నియోజకవర్గం వైపు ప్రారంభ వేడుక ఏర్పాటు చేసినప్పటికీ కనీసం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వచ్చేవరకు కూడా వేచి చూడలేదు. హడావిడిగా ఆయన ప్రారంభించేశారు. కొంత మంది టీడీపీ శ్రేణులు దీనిపై విమర్శలు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే లేకుండా ఇలా చేయడం ఏంటని మంత్రి తీరుపై మండిపడుతున్నారు. -
కల్యాణ వేంకటేశ్వరస్వామి ఉత్సవాలు
దుగ్గిరాల: దుగ్గిరాల పసుపుయార్డు సమీపంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో రెండో శనివారం వేడుకలు ఘనంగా జరిగాయి. దేవాలయంలో సుప్రభాతసేవ, నవనీత హరతి, నిత్య కై ంకర్యాలు, నవకుంభారాధన, నరసింహ హోమం, సాయంత్రం నిత్య హోమం, ఆలయ బలిహరణ జరిగాయి. భక్తులకు అన్నదానం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు సాకేత్ శర్మ, రామచంద్రలు పర్యవేక్షించారు. బార్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల గుంటూరు లీగల్ : బార్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్చి 27వ తేదీన జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్‌కు ఎన్నికలు జరుగుతాయని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాసు వెంకటరెడ్డి వెల్లడించారు. 2025–26 ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినట్లు శనివారం ఆయన తెలిపారు. 12న ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 13న నామినేషన్ల స్వీకరణ ఉదయం 11 – సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ఈ నెల 17వ తేదీన నామినేషన్ల పరిశీలన, 18న ఉపసంహరణ ఉంటుందన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా 27న ప్రకటిస్తారన్నారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. శతచండీ మహాయాగం సత్తెనపల్లి: పట్టణంలోని భవిష్య పాఠశాల సమీపంలో గల త్రిశక్తి దుర్గాపీఠంలో శతాధిక ప్రతిష్టా బ్రహ్మ, దేవి ఉపాసకులు, విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక కోశాధికారి, పరమ పూజ్య హనుమత్‌స్వామి ఆధ్వర్యంలో పంచాయతన పూర్వక నవదుర్గాత్మక శత చండీ మహాయాగం శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చండీ పారాయణం, శత చండీ హోమం, గురువందనం, ప్రధాన దేవతా అర్చన, శత చండీహోమం, లలిత సహస్ర నామార్చన, దీపార్చన, హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ చేపట్టారు. సుదర్శన హోమం, లక్ష్మీనారాయణ హోమం, వాస్తు హోమం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా గణేష్ యువసేన, త్రిశక్తి దుర్గాపీఠం బ్రహ్మోత్సవ కమిటీ, త్రిశక్తి దుర్గాపీఠం మహిళా శక్తి బాధ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వెంకన్న ఆలయంలో గోవింద నామస్మరణ రాజుపాలెం: పల్నాడు తిరుపతిగా పేరుగాంచిన దేవరంపాడు కొండపై స్వయంభూగా వెలసిన శ్రీనేతి వెంకన్నస్వామి రెండవ శనివారం తిరునాళ్లకు భక్తులు పోటెత్తారు. సమీప ప్రాంతాల నుంచే గాక సుదూర ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు దేవరంపాడు కొండకు విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. కొండపై స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు కన్నులారా తిలకించారు. అనంతరం స్వామివార్లను పల్లకీలో ఊరేగించారు. దాతలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ఈవో గణసతి సురేష్ తెలిపారు. -
కష్టాలన్నీ దాటే మహాశక్తి అతివ
నెహ్రూనగర్: కష్టాలను దాటి ముందుకు వెళ్లగల మహాశక్తి అతివ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శనివారం ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తున్న మహిళామణులకు అభినందనలు తెలిపారు. అన్ని రంగాల్లో మహిళా నాయకత్వం ఉందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వంటి ఎందరో ఆదర్శంగా ఉన్నారని తెలిపారు. అతివలు ఆర్థిక అక్షరాస్యత పెంచుకుంటే కుటుంబాలు ప్రగతి పథాన పయనిస్తాయని చెప్పారు. మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలను పెంచాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి మాట్లాడుతూ మహిళల సాధికారిత, ఆర్థిక స్వాతంత్య్రం కోసం ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ మాట్లాడుతూ.. మహిళలు, బాలికలు అప్రమత్తంగా ఉంటే 90 శాతం లైంగిక వేధింపులు ముందుగానే అరికట్టవచ్చన్నారు. సామాజిక మాధ్యమాల వినియోగం విషయంలోనూ పరిమితులు పెట్టుకోవాలని సూచించారు. వ్యక్తిగత ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయరాదన్నారు. మహిళల భద్రత కోసం మీ కోసం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనరు పులి శ్రీనివాసులు మాట్లాడుతూ మహిళా సాధికారిత వైపు అందరూ ప్రయాణించాలన్నారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవిలు మాట్లాడుతూ నేటి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఏపీఐటీఎస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే ఖాజా వలి, ఐసీడీఎస్ పీడీ విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాబాయి, సీపీఓ శేషశ్రీ, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, పరిశ్రమల శాఖ జీఎం జయలక్ష్మి, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఓబులేసు, బీసీ సంక్షేమ శాఖ అధికారి మయూరి, మెప్మా పీడీ విజయలక్ష్మి, డిప్యూటీ మేయరు సజీలా, డిప్యూటీ కమిషనర్లు శ్రీనివాసులు, వెంకట కృష్ణయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వంగవీటి నరేంద్ర, బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కర్నాటి వెంకట ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, రాష్ట్ర కార్యదర్శులుగా పూల శ్రీనివాసరెడ్డి (సత్యసాయి జిల్లా), కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి (తిరుపతి జిల్లా) నియమించిన సంగతి తెలిసిందే. -
సహజ మరణాలపై సిట్ కుట్ర: వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి
పులివెందుల: వైఎస్సార్సీపీ డాక్టర్స్ విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్‌రెడ్డి అనారోగ్యంతో మృతి చెందితే, దానిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని, దానికి ప్రభుత్వ పెద్దలు కూడా వంతపాడుతున్నారని అభిషేక్ రెడ్డి తండ్రి, వైఎస్సార్సీపీ నేత వైఎస్ మదన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులంతా ఒక్కొక్కరుగా చనిపోతున్నారంటూ ఎల్లో మీడియా విషపూరిత కథనాలు ప్రచురించడాన్ని ఖండించారు.తమ కుమారుడు అభిషేక్ రెడ్డి అనారోగ్యంతో చనిపోయారని చెప్పారు. తమ కుమారుడి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు శక్తివంచన లేకుండా ప్రయత్నించారని, కోమా నుంచి బయటపడతాడని ఆశించామని, దేవుడు చిన్న చూపు చూడటంతో మృతి చెందాడని తెలిపారు. ఎంతో భవిష్యత్ ఉన్న అభిషేక్‌రెడ్డి చిన్న వయస్సులో చనిపోవడం ఈ ప్రాంతంలో అందరినీ కలచివేసిందని చెప్పారు. అభిషేక్‌రెడ్డి పిల్లలను చూస్తే కడపు తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు.అభిషేక్ మృతి తమకు తీరని లోటని, ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నామని తెలిపారు. ఇలాంటి తీవ్ర విషాద పరిస్థితుల్లో తాముంటే.. చిన్నాన్న వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారని, అందులో కుట్ర ఉందంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పెడర్థాలు తీయడం, ప్రభుత్వ పెద్దలూ ఇదే విధంగా మాట్లాడటం దారుణమని అన్నారు. మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కరోనా వైరస్, అనారోగ్యంతో దీర్ఘ కాలం చికిత్స పొందుతూ చనిపోయారని తెలిపారు.మొన్న వాచ్‌మేన్ రంగన్న కూడా అనారోగ్యంతో చనిపోయాడని చెప్పారు. రంగన్నకు ఆయాసం ఉందని ఆయన కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారని, అతని అనారోగ్యం ఇక్కడి అందరికీ తెలుసునని చెప్పారు. వీరందరి సహజ మరణాలను అసహజ మరణాలుగా చిత్రీకరించేందుకు ఒక పథకం ప్రకారం ఎల్లో మీడియా పనిచేస్తోందని అన్నారు. బయటి ప్రపంచానికి పులివెందులలో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని తెలియజెప్పేందుకు ఎల్లో మీడియా విశ్వప్రయత్నం చేస్తోందని, ప్రభుత్వ పెద్దల చర్యలూ ఇదే విధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు.సిట్ కాదు.. జ్యుడీషియల్ విచారణ జరిపించండిచిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్న వారు మృతి చెందిన వ్యవహారంపై ప్రభుత్వ సిట్ దర్యాప్తు అంటేనే ఏదో కుట్ర దాగి ఉందన్న అనుమానం వస్తోందని వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిట్ కాకుండా జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అనేక మందిపై పెడుతున్న అడ్డగోలు కేసులు, చేపడుతున్న ఏకపక్ష విచారణ అందరమూ కళ్లారా చూస్తున్నామని, అందువల్లే సిట్‌పై నమ్మకం లేదని చెప్పారు. -
చంద్రబాబు తప్పుడు మాటలు.. ఈనాడు రోత రాతలు: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ఈనాడు రోత రాతలపై వైఎస్సార్సీపీ మండిపడింది. వైఎస్ జగన్ లక్ష్యంగా ఈనాడు విషపు రాతలు రాస్తోందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో నారాయణ సాక్షిగా ఉన్నారని ఈనాడు రోత రాతలు రాసింది. కేబినెట్లో చంద్రబాబు ఏదో మాట్లాడితే.. ఈనాడు తప్పుడు వార్తలు వండి వార్చింది. వివేకా వాచ్మెన్ రంగయ్య మృతిని కూడా వైఎస్ జగన్‌కు ఆపాదించే యత్నం చేసింది. హామీలు అమలు గురించి తప్పించుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్’’ అంటూ పేర్ని నాని నిప్పులు చెరిగారు.‘‘డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు.. ఎన్నికలయ్యాక చేతులెత్తేశారు. రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు వార్తలు రాయించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్టీఆర్ పరపతిని కూడా ఈనాడును అడ్డంపెట్టకుని బాబు దెబ్బతీశాడు. గతంలో లక్ష్మీపార్వతిపై కూడా ఈనాడులో ఇలాగే తప్పుడు రాతలు రాయించారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ఈనాడును చంద్రబాబు వాడుతున్నారు. వైఎస్ వివేకా హత్యతో వైఎస్ జగన్‌కు ఏం సంబంధం?. వ్యవస్థలను ప్రభావితం చేసి వైఎస్సార్సీపీ నేతలను బాబు ఇబ్బంది పెట్టాలని చూశారు’’ అని పేర్ని నాని ధ్వజమెత్తారు.‘‘వైఎస్ జగన్, వైఎస్ అవినాష్‌రెడ్డిలపై విషం చిమ్మడమే చంద్రబాబు లక్ష్యం. న్యాయ వ్యవస్థలను కూడా ప్రభావితం చేసేలా ఈనాడులో వార్తలురాస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా రంగన్న మృతిని కేబినెట్లో చర్చించారు. నారాయణ యాదవ్ అనారోగ్యంతో మృతి చెందారు. గంగాధర్‌రెడ్డిది సహజ మరణమని పోస్టుమార్టం రిపోర్ట్ చెప్తుంది. గంగాధర్‌రెడ్డి మరణం అనుమానం అంటూ బాబు డైరెక్షన్లో ఈనాడు తప్పుడు రాతలు రాసింది. గన్మెన్లు ఉండగా రంగన్న మృతిపై చంద్రబాబుకు సందేహం ఏంటో అర్థం కావడం లేదు. చంద్రబాబు ఇచ్చిన గన్మెన్లు ఉండగా.. రంగన్న మృతి ఎలా అనుమానాస్పదం?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.‘‘పరిటాల మృతి తర్వాత చంద్రబాబు సీఎం అయ్యారు. 2014- 2019 మధ్య పరిటాల సునీత కూడా మంత్రిగా ఉన్నారు. పరిటాల రవి హత్యపై ఎందుకు విచారణ చేయలేదు. వివేకా హత్య కేసులో నారాయణ సాక్షి కాదని రికార్డులు చెప్తూ ఉంటే.. నారాయణ సాక్షి అని ఈనాడు ఎలా రాస్తోంది?’’ పేర్ని నాని నిలదీశారు.‘‘వివేకా హత్య కేసులో ఈనాడు తప్పుడు వార్తలు రాసింది. సుగాలి ప్రీతి హత్య కేసు గురించి తీవ్రంగా పరిగణించరుగానీ రంగయ్య మృతిపై మాత్రం తీవ్రంగా స్పందిస్తారంట. జగన్ డ్రైవర్ నారాయణ యాదవ్ ఆ కేసులో సాక్షి అంటూ తప్పుడు కథనాలు రాశారు. జగన్ లక్ష్యంగా విషపు రాతలు రాసింది. చంద్రబాబువి.. తప్పుడు మాటలు, ఈనాడువి తప్పుడు రాతలు. కేబినెట్లో ప్రజలకు చేయాల్సిన మేలు గురించి చర్చించలేదు. ఎన్నికలలో ఓట్ల కోసం ప్రజలను మోసం చేస్తారు. అధికారంలోకి వచ్చాక తన తప్పుడు హామీల నుండి బయట పడటానికి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. హామీలకు పంగనామాలు పెట్టారు...రాజకీయ ప్రత్యర్థులపై ఈనాడులో విషం కక్కించటం చంద్రబాబుకు అలవాటే. ఎన్టీఆర్ కు వెన్నుపోటు నుండి అనేక అంశాలలో ఇదే జరిగింది. లక్ష్మీ పార్వతి విషయంలో కూడా అప్పట్లో ఇలాగే రాయించారు. అవినాష్ కు సంబంధం లేకపోయినా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేసేలాగ పెద్దపెద్ద అక్షరాలతో వార్తలు రాయిస్తున్నారు. నారాయణకు వివేకా కేసుకు ఎలాంటి సంబంధం లేదు. బ్రెయిన్ ట్యూమర్ తో నారాయణ చనిపోయారు. కల్లూరి గంగాధరరెడ్డిని 243వ సాక్షిగా ఉన్నాడు. దీర్ఘకాలంగా షుగర్ వ్యాధితో మృతి చెందారు. ఆయనది సహజ మరణం అని పోస్టుమార్టం రిపోర్టు కూడా ఉంది. శ్రీనివాసరెడ్డి 2018 సెప్టెంబరు లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపుల కారణంగానే సూసైడ్ చేసుకున్నట్టు సూసైడ్ నోట్ రాశారు..వైఎస్ అభిషేక్‌రెడ్డి తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. జగన్, సునీతమ్మ ఇద్దరికీ అభిషేక్ బంధువే. మల్టీ ఆర్గన్స్ డేమేజ్ వలన అభిషేక్ మృతి చెందిన సంగతి అందరికీ తెలిసినా ఈనాడు విషపు రాతలు రాసింది. వాచ్మెన్ రంగన్నకు పోస్టుమార్టం అయ్యాక ఖననం చేశారు. రంగన్న గురించి కేబినెట్లో చర్చించారు. డీజీపీతో పాటు కడప నుండి పోలీసు అధికారులు వచ్చి ప్రభుత్వ పెద్దల సందేశం తీసుకుని వెళ్లారు. రంగన్నకు 2+2 గన్ మెన్లతో జగన్ ప్రభుత్వం భద్రత కల్పించారు. చంద్రబాబు వచ్చాక 1+1 భద్రతకు తగ్గించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన గన్‌మెన్ ఉండగా ఎలా అనుమానాస్పదంగా రంగన్న మృతి చెందారు?. ఖననం చేసిన రంగన్న మృతదేహాన్ని మళ్ళీ బయటకు తీసి రీపోస్టుమార్టం చేస్తున్నారు. ఆ నివేదికలు రాకముందే ఈనాడులో తప్పుడు కథనాలు ఎలా రాశారు?..పరిటాల రవి హత్యలో సాక్షుల మృతిపై చంద్రబాబు ఎందుకు విచారణ జరపలేదు?. ఎప్పుడో చనిపోయిన నారాయణ యాదవ్ మృతితో సహా అందరిపై విచారణ చేస్తారట, ఎవరిని ఇరికించటానికి విచారణల పేరుతో వ్యవస్థలను నాశనం చేస్తారు?. ఎన్నికల హామీలను డైవర్షన్ చేయటానికి ఇలాంటి తప్పుడు వార్తలు, తప్పుడు విచారణలు చేయిస్తున్నారు. రంగన్న ఇచ్చిన 164 స్టేట్మెంటులో అవినాష్ రెడ్డి పేరు లేదు. అసలు ఏ సాక్షి కూడా అవినాష్ పేరు చెప్పలేదు. ఇలాంటి తప్పుడు కథనాలు రాసే విష సంస్కృతి మానుకోవాలి’’ అని పేర్ని నాని హితవు పలికారు. -
నవ మాసాల్లో కూటమి నవ మోసాలను తెచ్చింది
గుంటూరు, సాక్షి: మహిళ అంటే కూటమి ప్రభుత్వానికి గౌరవమే లేదని.. అందుకే ఈ పాలనలో రక్షణ కరువైందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం(మార్చి 8న) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న రోజా.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘వైఎస్సార్సీపీ హయాంలో మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చాం. కానీ, కూటమి ప్రభుత్వం ఈ నవ మాసాల్లో నవ మోసాలు తీసుకొచ్చింది’’ అని అన్నారామె.‘‘ఏపీలో మహిళలు.. చంద్రబాబు మోసాలపై ఆగ్రహంతో ఉన్నారు. సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేశారు. ఏపీలో చంద్రన్న దగ, చంద్రన్న పగ, చంద్రన్న పంగనామం, చంద్రన్న వెన్నుపోటు మాత్రమే అమలవుతున్నాయి. సూపర్ సిక్స్ పేరుతో మహిళలను మోసం చేసి నట్టేట ముంచారు. మహిళా దినోత్సవాన్ని జరుపుకునే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. రోజుకు 70 మంది మహిళలు, వృద్దుల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. జగన్ హయాంలో దిశా పీఎస్‌లు, యాప్ తెచ్చి రక్షణ కల్పించారు. చంద్రబాబు మళ్లీ యాభై వేలకు పైగా బెల్టుషాపులు పెట్టారు’’ అని ఆర్కే రోజా మండిపడ్డారు.‘‘తల్లికివందనం పేరుతో మహిళలకు పంగనామం పెట్టారు. ఇదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం?. నిరుద్యోగ మహిళలు, యువతులను చంద్రబాబు మోసం చేశారు. మహిళలు తిరగబడతారని చంద్రబాబుకు అర్థమయ్యింది. అందుకే శక్తియాప్ పేరుతో యాప్‌ని తెస్తున్నారు. జగన్ తెచ్చిన దిశా యాప్‌ని చంద్రబాబు కాపీ కొట్టారు. మహిళా భద్రత గురించి కేబినెట్లో ఏనాడూ చర్చించలేదు. కానీ గంజాయి, మద్యం వ్యాపారుల ప్రయోజనాల గురించి చర్చించారు. చంద్రబాబు, అనిత సొంత నియోజకవర్గాల్లో గంజాయి విపరీతంగా అమ్ముతున్నారు. 30 వేలమంది మహిళలు అక్రమ రవాణా అయ్యారని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు?. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం పవన్ కే చెల్లింది..సుగాలి ప్రీతి కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేక పోతున్నారు?. కేంద్రంలో కూడా మీ కూటమి ప్రభుత్వమే ఉన్నప్పుడు ఎందుకు సీబీఐ విచారణ చేయించలేకపోయారు?. కనీసం సుగాలి ప్రీతి తల్లికి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు?. జనసేన నేతల చేతిలో మోసపోయిన మహిళలకి ఏం న్యాయం చేశారు?. మహిళా దినోత్సవం జరుపుకునే హక్కు పవన్ కళ్యాణ్‌కి లేదు. మహిళల కన్నీటి శాపనార్థాలకు కూటమి ప్రభుత్వం పతనం అవుతుంది. ఉచిత బస్సు పేరుతో అన్యాయం చేశారు. తగిన సమయంలో మహిళలే చంద్రబాబుకు బుద్ధి చెప్తారు’’ అని రోజా చెప్పారు. -
‘మల్లెల బాబ్జీ నుంచి తారకరత్న దాకా చర్చిద్దామా.. బాబు?’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం అంటేనే హత్యా రాజకీయాలు అని మరోసారి నిరూపించుకున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. అసలు వివేకా హత్య జరిగింది కూడా చంద్రబాబు హయాంలోనే కదా. ఆ సమయంలో కేసును నీరుగార్చేలా చేసిందీ చంద్రబాబే. వివేక కేసులో దోషులందరికీ కఠినంగా శిక్షించాల్సిందే అంటూ వ్యాఖ్యలు చేశారు.మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కేబినెట్ సమావేశాలు కామెడీ సమావేశాలుగా మారిపోయాయి. కేబినెట్ సమావేశాలు అనగానే అన్ని వర్గాల ప్రజలు ఆశగా ఎదురు చూస్తారు. తమకు మేలు చేకూరే అంశాలపై ఏమైనా నిర్ణయం తీసుకుంటారేమోనని అనుకుంటారు. కానీ, చంద్రబాబు కేబినెట్‌కి వైఎస్ జగన్ అంటే భయం పట్టుకుంది. పదే పదే జగన్ చుట్టూ చర్చిస్తున్నారు. చివరికి సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న కేసు గురించి కూడా చర్చించే స్థాయికి దిగజారారు.చంద్రబాబు ప్రభుత్వం అంటేనే హత్యా రాజకీయాలు అని మరోసారి నిరూపించుకున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన హత్యల గురించి కూడా సమీక్షలు నిర్వహించాలి. అసలు వివేకా హత్య జరిగింది కూడా చంద్రబాబు హయాంలోనే. ఆ సమయంలో కేసును నీరుగార్చేలా చేసిందీ చంద్రబాబే. సాక్షులు అనారోగ్యంతో చనిపోతే జగన్ కుటుంబానికి ఏం సంబంధం?. వైఎస్ జగన్‌ని అవమానపరిచే కుట్ర కాదా ఇది?. ఆయన చెల్లెళ్లను కూడా తన రాజకీయాల కోసం చంద్రబాబు వాడుకున్నారు. వైఎస్ జగన్ కుటుంబాన్ని చీల్చటానికి చంద్రబాబు చేసిన కుట్ర ఇది.వివేకానంద రెడ్డిని నేనే చంపానని దస్తగిరి పదేపదే చెప్పాడు. మరి అతనికి బెయిల్ ఇచ్చి బయట తిప్పుతున్నదెవరో చంద్రబాబు సమీక్ష చేయాలి. మల్లెల బాబ్జీ హత్య నుండి వినుకొండ రషీద్ హత్య వరకు అన్నింటిపై చర్చిద్దాం. వీటిపై ఏ వేదిక మీద చర్చించటానికైనా మేము సిద్ధమే. బాలకృష్ణ కుటుంబంలో జరిగిన కాల్పుల గురించి కూడా చర్చిద్దాం. ఆయన వాచ్మెన్ ఎలా చనిపోయాడో కూడా చర్చిద్దామా?. హరికృష్ణ రోడ్డు ప్రమాదం, నారా రామ్మూర్తి నాయుడు పిచ్చివాడు కావటం, తారకరత్న హఠాన్మరణం గురించి కూడా చర్చించాలి. వీటన్నిటిపై చంద్రబాబు సమీక్ష చేయాలి. వివేకా కేసులో దోషులందరికీ కఠినంగా శిక్షించాల్సిందే. వివేకా అధికారికంగా పెళ్లి చేసుకున్న షమీమ్ ఫోన్ ఎక్కడ ఉంది?. అందులోని వాట్సప్ చాటింగ్‌ని ఎందుకు డిలిట్ చేశారో కూడా తేల్చాలి. ఈసీ గంగిరెడ్డి, డ్రైవర్ నారాయణ, అభిషేక్‌రెడ్డి అనారోగ్యంతో చనిపోతే దాన్ని కూడా రాజకీయం చేస్తారా?. అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదైనా చేయవచ్చు అనుకుంటున్నారా?. హత్యా రాజకీయాలు మాపై రుద్దాలనుకుంటే కుదరదు. ఆ పాపాలే మీకు శాపాలై ఉరితాళ్లుగా మారతాయి’ అంటూ హెచ్చరించారు. -
‘యువత పోరు’తో చంద్రబాబు వైఖరిని ఎండగడదాం: వైవీ సుబ్బారెడ్డి
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో పేద విద్యార్థులు, నిరుద్యోగులు తరఫున కూటమి ప్రభుత్వంపై పోరుకి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఈ నెల 12వ తేదీన ‘‘యువత పోరు’’(Yuvatha Poru) పేరుతో ధర్నా కార్యక్రమం నిర్వహించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ తాడేపల్లిలోని YSRCP కేంద్ర కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. యువత పోరు పోస్టర్‌ను లాంఛ్ చేసిన రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) మీడియాతో మాట్లాడారు. యువతపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. వారికి ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయటం లేదు. అందుకే 12న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించాం. ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తాం. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. 👉రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మూడు త్రైమాసికాల నుండి ఫీజులు ఇవ్వకుండా విద్యార్థులను చంద్రబాబు వేధిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నిధులు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తాం. ఫీజు బకాయిలు తక్షణమే చెల్లించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టబోతున్నాం. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించనున్నాం. ఎక్కడికక్కడే మెమోరాండం సమర్పించబోతున్నాం. ఫీజు బకాయిలతో పాటు నిరుద్యోగ సమస్య, మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశాలపైనా యువత పోరు ఉండనుంది.👉నిరుద్యోగ భృతి విషయంలో కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) మాట తప్పింది. నిరుద్యోగ భృతి పేరుతో నెలకు రూ.3 వేలు ఇస్తామంటూ యువతను మోసం చేశారు. ఉద్యోగాల్లేక యువత అల్లలాడిపోతోంది. కూటమి స్వార్థ ప్రయోజనాల కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల కోసం నాణ్యమైన వైద్యం అందించాలని జగన్ 17 మెడికల్ కాలేజీలను తెచ్చారు. ఐదు కాలేజీలను ఆల్రెడీ ప్రారంభించారు. కానీ, చంద్రబాబు ప్రయివేటు పరం చేయాలని చూస్తున్నారు. ఈ ప్రయత్నాలను అడ్డుకుందాం.విద్యార్థులు, నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతూ ర్యాలీలు నిర్వహిద్దాం. యువత పోరును పెద్ద ఎత్తున విజయవంతం చేద్దాం’’ అని వైఎస్సార్సీశ్రేణులను ఉద్దేశించి వైవీ సుబ్బారెడ్డి పిలుపు ఇచ్చారు. -
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుంటుందని తెలిపారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని అన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. “మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే దేశం కూడా బాగుంటుంది’’ అని గట్టిగా నమ్మే వ్యక్తిని. ఆ దిశలోనే మన ప్రభుత్వ కాలంలో మహిళల అభ్యున్నతి, సాధికారతకు పెద్దపీట వేస్తూ పాలన చేశాం. అన్నిరంగాల్లో మహిళలను ప్రోత్సహించి, దాదాపు 32కు పైగా పథకాల ద్వారా వారికి భరోసా కల్పించాం.నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం కేటాయిస్తూ తొలిసారిగా చట్టం చేశాం. గిరిజన, దళిత మహిళలను డిప్యూటీ సీఎం, హోంమంత్రి లాంటి పెద్ద పదవులతో గౌరవించాం. మహిళల భద్రత, రక్షణ కోసం “దిశ’’ వ్యవస్థను ప్రవేశపెట్టాం. “ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు’’ అన్న నానుడిని నమ్ముతూ ఆ దిశగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాం. నా భవిష్యత్ రాజకీయ ప్రస్థానం కూడా మహిళాభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా సాగుతుంది’ అని తెలిపారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. “మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే దేశం కూడా బాగుంటుంది’’ అని గట్టిగా నమ్మే వ్యక్తిని. ఆ దిశలోనే మన ప్రభుత్వ కాలంలో మహిళల అభ్యున్నతి, సాధికార…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 8, 2025 -
కిమ్స్ శిఖర హాస్పిటల్లో అరుదైన శస్త్ర చికిత్సలు
గుంటూరు మెడికల్: రాష్ట్రంలోనే తొలిసారిగా మినిమల్లి ఇన్విజివ్ (చిన్న గాటుతో) యూని పోర్టల్ వాట్స్ విధానంలో గుంటూరు కిమ్స్ శిఖర హాస్పిటల్లో రెండు అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్టు డాక్టర్ ఖాజా అబ్దుల్ మొయిన్బేగ్ తెలిపారు. కిమ్స్ శిఖర హాస్పటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. బీపీ, షుగర్ ఉన్న గుంటూరుకు చెందిన 60 ఏళ్ల వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ అత్యవసరస్థితిలో మూడు రోజుల క్రితం కిమ్స్ శిఖర ఆస్పత్రిలో చేరారు. చీఫ్ కన్సల్టెంట్ థొరాసిక్, మినిమల్ యాక్సిస్ సర్జన్ డాక్టర్ ఖాజా అబ్దుల్ మొయిన్ బేగ్ నేతృత్వంలో వెంటనే రోగిని పరీక్షించగా కుడివైపు ఊపిరితిత్తిలో గాలిబుడగ ఏర్పడి అది పగిలిపోయి లంగ్ పూర్తిగా కుంచించుకుపోయినట్లు గుర్తించారు. యూని పోర్టల్ వాట్స్ విధానంలో చిన్న గాటుతో శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అలాగే విజయవాడకు చెందిన 38 ఏళ్ల గృహిణి తరచూ లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ హాస్పిటల్లో చేరారు. ఆమె లంగ్ ఎడమవైపు కింది భాగంలో నీటి గడ్డ లాంటిది ఉండడాన్ని వైద్యులు గుర్తించారు. ఈమెకు కూడా యూని పోర్టల్ వాట్స్ విధానంలో శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. మూడు రోజుల్లోనే రోగులిద్దరూ డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా కిమ్స్ శిఖర హాస్పటల్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, చీఫ్ న్యూరో సర్జన్ డాక్టర్ చిట్టెం లక్ష్మణరావు మాట్లాడుతూ ఊపిరితిత్తుల సమస్యలకు తమ వైద్యశాలలో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని వివరించారు. అరుదైన శస్త్రచికిత్సలు చేసిన వైద్యులను కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అద్విక్ బొల్లినేని, కిమ్స్ శిఖర హాస్పిటల్ సీఈఓ సుధాకర్ జాదవులు అభినందించారు. -
విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఇన్విజిలేటర్‌కు దేహశుద్ధి
● ఎంబీఏ చదువుతున్న వ్యక్తికి ఇన్విజిలేటర్ బాధ్యతలు ● సంజాయిషీ కోరిన ఆర్ఐఓ గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పరీక్షలు రాస్తున్న ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఇన్విజిలేటర్‌కు తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ప్రకాశం జిల్లా దర్శి మండలానికి చెందిన విద్యార్థిని గుంటూరులోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాల హాస్టల్లో ఉండి చదువుతోంది. ఈనెల 3 నుంచి పొన్నూరు రోడ్డులోని ఓ ప్రైవేటు కళాశాల పరీక్షా కేంద్రంలో సీనియర్ ఇంటర్ పరీక్షలకు హాజరవుతోంది. విద్యార్థిని పరీక్ష రాస్తున్న గది ఇన్విజిలేటర్‌గా వ్యవహరిస్తున్న యువకుడు పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం, ఫోన్ నంబర్ ఇవ్వాలంటూ అడగడం చేశాడు. దీంతో మనస్ధాపం చెందిన విద్యార్థిని తాను చదువుతున్న కళాశాల యాజమాన్యం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లింది. కళాశాల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ యువకుడిని రెండు రోజుల క్రితం పోలీసులు తీవ్రంగా మందలించారు. అదే రోజు అతన్ని ఇన్విజిలేషన్ విధుల నుంచి అధికారులు తొలగించారు. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం పరీక్ష కేంద్రం వద్దకు చేరుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు చీఫ్ సూపరింటెండెంట్‌తోపాటు కళాశాల ప్రిన్సిపాల్‌తో మాట్లాడి యువకుడిని కళాశాలకు పిలిపించారు. అతడికి దేహశుద్ధి చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో ఓ ప్రైవేటు కళాశాలలో ఎంబీఏ చదువుతున్న వ్యక్తిని అధికారులు ఇన్విజిలేటర్‌గా నియమించడం గమనార్హం. ఈ విషయం ఆర్ఐవో జీకే జుబేర్ దృష్టికి వెళ్లడంతో ఎంబీఏ విద్యార్థిని ఇన్విజిలేటర్‌గా నియమించడంపై చీఫ్ సూపరిండెంట్‌ను సంజాయిషీ కోరారు. -
వీఐటీలో విటోపియా క్రీడా సాంస్కృతిక ఉత్సవం ప్రారంభం
తాడికొండ: విద్యతో పాటు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అవసరమని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ అన్నారు. వీఐటీ–ఏపీ విశ్వవిద్యాలయంలో విటోపియా–2025 వార్షిక క్రీడలు, సాంస్కృతిక ఉత్సవం శుక్రవారం ప్రారంభమైంది. ముఖ్య అతిధిగా తాడికొండ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ క్రీడలు మానసికాభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు.వీఐటీ వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్, వీఐటి–ఏపి విశ్వ విద్యాలయ వైస్ చాన్సలర్ డాక్టర్ కోటా రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ప్రగతిని వివరించారు. మూడేళ్లుగా అవుట్ లుక్ ర్యాకింగ్స్లో అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కేటగిరిలో దేశంలోనే ప్రథమస్థానంలో వీఐటీ ఉందని వెల్లడించారు. సాయంత్రం జరిగిన ప్రొ–షోలో సెహరి బ్యాండ్, స్వరాగ్ బ్యాండ్, డీజే పరోమాల సంగీత విభావరి అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి, డాక్టర్ కృష్ణసామి (విటోపియా కన్వీనర్), డాక్టర్ ఖాదీర్ పాషా (స్టూడెంట్ వెల్ఫేర్ డెప్యూటీ డైరెక్టర్) పాల్గొన్నారు. -
నేటి నుంచి మూడు వంతెనల మీదుగా రాకపోకలు
గుంటూరు విద్యానగర్‌లోని రెండిళ్లలో గురువారం భారీ చోరీలు జరిగాయి. ఈ ఘటనలు నగరంలో కలకలం రేపాయి. గుంటూరు విద్యానగర్‌లోని సాయినివాస్ అపార్ట్మెంట్లోని ఓ ప్లాట్‌లో సాయంత్రం.. అదే వీధిలోని అక్షయ లీలా హోమ్స్‌లోని మరో ఫ్లాట్‌లో అర్ధరాత్రి చోరీలు జరిగాయి. సుమారు రూ.2.50 కోట్ల విలువైన 2.5 కిలోల బంగారు ఆభరణాలు, రూ.2.50 లక్షలు చోరీకి గురయ్యాయి. ఘటనాస్థలాలను డీఎస్పీ అరవింద్, ఎస్ఐ నరహరి పరిశీలించారు. –లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) డీఎస్సీకి ఉచిత ఆన్లైన్ శిక్షణ నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): మెగా డీఎస్సీకి ఉచిత ఆన్లైన్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ అధికారి కె.మయూరి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లాకు చెందిన బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ బయోడేటాతోపాటు 10వ తరగతి, టీటీసీ/బీఎడ్ మార్కుల లిస్ట్, టెట్ మార్కుల లిస్ట్, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్, 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు జతపరిచి రాజాగారితోటలోని బీసీ స్టడీ సర్కిల్, గుంటూరు కార్యాలయంలో ఈనెల 10వ తేది నుంచి అందించాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 0863–2358071 నంబర్‌ను సంప్రదించాలని వివరించారు.నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ పనుల నిమిత్తం గంటూరు మూడు వంతెనల మీదుగా నవంబర్ 25 నుంచి రాకపోకలు నిలిపివేసిన విషయం తెలిసిందే. 60 రోజుల్లో పనులు పూర్తి చేసి రాకపోకలు పునరుద్ధరిస్తామని అధికారులు ప్రకటించారు. అయితే వంద రోజులు పూర్తయినా ఇప్పటికీ పనులు పూర్తిచేయలేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల అవస్థలను గుర్తించిన సాక్షి దినపత్రిక పలుమార్లు కథనాలు ప్రచురించింది. శుక్రవారం కూడా ‘రైల్వే ట్రాక్ విస్తరణతో నరకయాతన’ శీర్షికన కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన అధికారులు హడావుడిగా పెండింగ్ పనులు పూర్తిచేయకుండానే వంతెనలపై నుంచి రాకపోకల పునరుద్ధరణకు సిద్ధం చేశారు. శనివారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కలెక్టర్ నాగలక్ష్మి, కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు మూడు వంతెనలను ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు. -
15న వెంకటపాలెం టీటీడీలో శ్రీనివాస కల్యాణోత్సవం
వెంకటపాలెం(తాడికొండ): లోక కల్యాణార్థం శ్రీనివాస కల్యాణోత్సవం ఈ నెల 15న గుంటూరు జిల్లా వెంకటపాలెంలోని టీటీడీ ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో జె. శ్యామలరావు తెలిపారు. శుక్రవారం వెంకటపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ వినయ్ చంద్, ఎస్పీ సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ తేజతో కలిసి శ్యామలరావు ఏర్పాట్లు పరిశీలించారు. ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి వైభవాన్ని దేశం నలుమూలల అంతర్జాతీయ స్థాయిలో వ్యాప్తి చేసేలా లోక కల్యాణార్థం స్వామివారి కల్యాణత్సోవాలను అనేక ప్రాంతాల్లో టీటీడీ నిర్వహిస్తోందన్నారు. ఇక్కడ శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహించాలని విజ్ఞప్తులు రావటంతో ఈనెల 15న జరిపేందుకు ముహూర్తం నిర్ణయించామన్నారు. కల్యాణోత్సవంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారని, కల్యాణాన్ని తిలకించేందకు 20 వేల మది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని వివరించారు. 15న సాయంత్రం కల్యాణం జరుగుతందని వివరించారు. అనంతరం పోస్టర్ విడుదల చేశారు. వివరాలు వెల్లడించిన టీటీడీ ఈవో శ్యామలరావు -
పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి
కలెక్టర్ నాగలక్ష్మి గుంటూరు వెస్ట్: పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన భూములను గుర్తించాలన్నారు. మంగళగిరి మండలంలో గోల్డ్ స్మిత్, హ్యాండ్లూమ్ క్లస్టర్ల ఏర్పాటును వేగవంతం చేయాలని సూచించారు. పీఎం విశ్వకర్మ యోజన దరఖాస్తులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ సబ్సిడీ కోసం నిర్ణీత సమయంలో ధ్రువపత్రాలు అందజేయని ఎంఎస్ఎంఈ దరఖాస్తుదారులకు మరోసారి గుర్తు చేయాలన్నారు. జిల్లాలోని 49 ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ, రీఎంబర్స్మెంట్ ఆఫ్ ఇంట్రస్ట్ సబ్సిడీ, కాస్ట్ సబ్సిడీకి సంబంధించి రూ.2,12,79,045 మంజూరు చేస్తూ కమిటీ ఆమోదించిందని కలెక్టర్ వివరించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం జయలక్ష్మి, జిల్లా ఉప రవాణా కమిషనర్ సీతారామిరెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్ రెడ్డి, కమర్షియల్ టాక్స్ డీసీబీహెచ్ మనోరమ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఏఎన్‌యూ బీఈడీ ప్రశ్నపత్రం లీక్
పెదకాకాని : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో శుక్రవారం నిర్వహించిన బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్ష పత్రం లీకై న ఘటన కలకలం రేపింది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్ష ప్రారంభం కావాల్సి ఉండగా పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే ప్రశ్నపత్రం లీక్ అయినట్లు తెలుస్తోంది. సీడీ ద్వారా ఆన్లైన్లో అరగంట ముందుగా ప్రశ్నపత్రాన్ని రిలీజ్ చేశామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కానీ మొబైల్ ద్వారా అరగంట ముందే లీకై బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. పరీక్షల నిర్వహణకు సబంధించిన కొందరు అధికారులు పరీక్ష కేంద్రాల నిర్వాహకుల వ్యవహర శైలిపై ఉదాసీనంగా ఉండడమే లీకేజీకి కారణంగా తెలుస్తోంది. దీంతోపాటు కొత్తగా పరీక్షకు అరగంట ముందుగా సీడీ ద్వారా విడుదల చేసే విధానం కూడా ప్రశ్నపత్రం సులభంగా లీక్ కావడానికి కారణమని పలువురు పేర్కొంటున్నారు. శుక్రవారం పరీక్ష పేపర్ లీక్ అయిందని ఘటన వెలుగులోకి వచ్చినప్పటికీ గురువారం కూడా ప్రశ్నపత్రం అరగంట ముందుగానే లీక్ అయిందన్న విమర్శలు ఉన్నాయి. సంబంధిత అధికారులకు తెలిసినా బయటకు రానియకుండా చూడటం వల్లే పరిస్థితులు శ్రుతి మించుతున్నాయనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. బీఈడీ పరీక్షలకు సబంధించిన పరీక్ష కేంద్రాల ఖరారు, పరీక్షలను పర్యవేక్షించే అధికారుల నియామకం వంటి కీలక అంశాలు కొన్ని పరీక్షా కేంద్రాల నిర్వాహకుల కనుసన్నల్లో జరుగుతుండటం ఇలాంటి ఘటనలకు కారణమవుతోందనే విమర్శలూ వస్తున్నాయి. ప్రశ్నపత్రం లీకేజీపై ఉన్నత విద్యాశాఖామంత్రి లోకేష్ విచారణకు ఆదేశించారు. పరీక్షకు అరగంట ముందే లీకై న మొదటి సెమిస్టర్ ప్రశ్నపత్రం పరీక్షల నిర్వహణలో ఏఎన్‌యూ అధికారులు నిర్లక్ష్యం -
హనుమంత వాహనంపై నృసింహుడు
మంగళగిరి/మంగళగిరి టౌన్: మంగళగిరిలోని శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడవ రోజు శుక్రవారం రాత్రి స్వామిని హనుమంత వాహనంపై ఊరేగించారు. అభయ ప్రదాత అయిన హనుమంతుని భుజ స్కందాలపై లక్ష్మీ నరసింహస్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా అధిరోహించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ ఈవో రామకోటి రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన వాసిరెడ్డి మల్లేశ్వరరావు (రాజేష్) కై ంకర్యపరులుగా వ్యవహరించారు. శనివారం రాత్రి రాజాధిరాజ వాహనంపై స్వామి గ్రామోత్సవం జరగనుంది. హనుమంత వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత నృసింహుడు ఉత్సవానికి హాజరైన భక్తులు -
ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
గుంటూరు ఎడ్యుకేషన్: జీవితంలో ఎటువంటి విపత్కరస్థితి ఎదురైనామహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని గుంటూరు జిల్లా క్రైమ్ బ్రాంచ్ ఏఎస్పీ కె.సుప్రజ పేర్కొన్నారు. పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాలలో మహిళా విభాగ, రోటరీ క్లబ్ గుంటూరు ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏస్పీ సుప్రజను సత్కరించారు. కార్యక్రమంలో గుంటూరు రోటరీ క్లబ్ అధ్యక్షురాలు పి.రత్నప్రియ, విశ్రాంత తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ ఎం.స్వర్ణలతాదేవి, డాక్టర్ ఆర్.సిందూజ, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.అనితాదేవి, మహిళా విభాగ కన్వీనర్ కవిత, సభ్యులు ఆర్.జయ శైలజ, డాక్టర్ నాగ నిర్మలా రాణి, డాక్టర్ ఆర్.శిరీష, కె.సునీత, బి.జ్యోతి, జమృద్ బేగం, విద్యార్థినులు పాల్గొన్నారు. మహిళల పాత్ర కీలకం సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉండటం గర్వకారణమని ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జెడ్పీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం మహిళా ఉద్యోగినుల ఆటల పోటీలను ఆమె ప్రారంభించారు. హెనీ క్రిస్టినా మాట్లాడుతూ మహిళల ప్రాధాన్యాన్ని వివరించారు. మహిళా ఉద్యోగులకు టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్ పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వి.జ్యోతి బసు, అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్ పాల్గొన్నారు. డీఆర్ఎం కార్యాలయంలో.. లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): మహిళలు అన్ని రంగాల్లో సాధికారత సాధించాలని గుంటూరు రైల్వే డీఆర్ఎం ఎం.రామకృష్ణ ఆకాంక్షించారు. స్ధానిక పట్టాభిపురంలోని గుంటూరు రైల్వే డివిజన్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. డీఆర్ఎం మాట్లాడుతూ మహిళల ప్రాధాన్యాన్ని వివరించారు. అనంతరం డివిజన్ కార్యాలయంలోని మహిళా ఉద్యోగులకు పలు క్రీడా, సాంస్కృతిక పోటీలను నిర్వహించారు. విశేష కృషి చేసిన ఉద్యోగులను సత్కరించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి పతకాలను, సౌత్ సెంట్రల్ రైల్వే ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం కె.సైమన్, సౌత్ సెంట్రల్ రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు ఎం.ఆశాలత, సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ షేక్.షాహబాజ్ హనూర్, సీనియర్ డివిజనల్ ఇంజజనీర్ కో ఆర్డినేషన్ జె.అనూష, సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ అమూల్యరాజ్, డివిజనల్ కమర్షియల్ మేనేజర్ , కో ఆర్డినేషన్ ప్రదీప్, ఆయా విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతికతతో కొత్త అవకాశాలు
ల్లాయిడ్ హెల్త్ కేర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రెసిడెంట్ మహేష్ కవథేకర్ చేబ్రోలు: సాంకేతికతతో కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయని ల్లాయిడ్ హెల్త్ కేర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రెసిడెంట్ మహేష్ కవథేకర్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ నావిగేటింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ మేనేజ్మెంట్ విత్ టెక్నాలజీ అండ్ సస్టైనబిలిటీ ’’ అనే అంశంపై రెండు రోజుల పాటు బ్లెండెడ్ మోడ్‌లో నిర్వహించే అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ కవథేకర్ మాట్లాడుతూ ఆటోమేషన్, ఏఐ, డేటా ఎనలిటిక్స్ తదితర అంశాల గురించి వివరించారు. -
మహిళలు ధైర్యంగా మెలగాలి
నగరంపాలెం(గంటూరు వెస్ట్): అన్ని వేళల్లో మహిళలు ధైర్యంగా ఉండాలని జిల్లా ఏఎస్పీ కె.సుప్రజ (క్రైం) అన్నారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం పోలీస్ కవాతు మైదానంలో ఓపెన్‌హౌస్ నిర్వహించారు. జిల్లా ఏఎస్పీ సుప్రజ మాట్లాడుతూ మహిళలు తమ లక్ష్యాలను చేధించాలని అన్నారు. తద్వారా నలుగురికి ఆదర్శంగా నిలవాలని చెప్పారు. సీ్త్రలు లేనిదే జననం లేదని పేర్కొన్నారు. అనంతరం విద్యార్ధినీలకు ఆయుధాల పనితీరుపై మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ సుబ్బారావు, సిబ్బంది అవగాహన కల్పించారు. కొత్తపేట పీఎస్ పరిధిలోని శ్రీజలగం రామా రావు మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో మహిళా సాధికారత ర్యాలీ, పాతగుంటూరు పీఎస్ పరిధిలోని యాదవ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు, ఎస్ఐలు రమేష్ (కొత్తపేట పీఎస్), వెంకటేశ్వర్లు (పాతగుంటూరు పీఎస్) పాల్గొన్నారు. జిల్లా ఏఎస్పీ కె.సుప్రజ (క్రైం) -
1,22,426 బస్తాలు మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం 1,11,958 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,22,426 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 44,470 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. పసుపు ధరలు దుగ్గిరాల: దుగ్గిరాల పసుపు యార్డులో శుక్రవారం 229 బస్తాలు వచ్చాయి. పసుపు మొత్తం అమ్మకం చేసినట్లు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. కొమ్ములు 140 బస్తాలు వచ్చాయి. వాటి కనిష్ట ధర రూ.8,000 గరిష్ట ధర రూ.9,800 మోడల్ ధర రూ.9,400, కాయలు 89 బస్తాలు వచ్చాయి. వాటి కనిష్ఠి ధర రూ.8,000, గరిష్ఠ ధర రూ.9,800, మోడల్ ధర రూ.9,400, మొత్తం 171.750 క్వింటాళ్లు అమ్మకాలు జరిగినట్లు ఆయన వివరించారు. బ్యాంక్ ఉద్యోగుల నిరసన కొరిటెపాడు(గుంటూరు): బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 24, 25 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఈమేరుక ఉద్యోగులు, అధికారులు శుక్రవారం చంద్రమౌళి నగర్‌లోని కెనరా బ్యాంక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. బ్యాంక్ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక(యుఎఫ్‌బీయూ) జిల్లా కన్వీనర్ బాషా మాట్లాడుతూ బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎస్బీఐ ఉద్యోగ సంఘ నేత పరేంద్ర మాట్లాడుతూ ఐడీబీఐ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. యూబీఐ ఉద్యోగ నేత రాంబాబు, యూఎఫ్‌బీయూ సలహాదారుడు పి.కిషోర్ కుమార్ పాల్గొన్నారు. -
మహిళా ఫిర్యాదుల విండోకు విశేష స్పందన
57 ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం నగరంపాలెం: మహిళా దినోత్సవం సందర్భంగా చేపట్టిన మహిళా ఫిర్యాదుల విండోకు విశేష స్పందన లభించిందని ట్రైనీ ఐపీఎస్ అధికారిణి దీక్ష చెప్పారు.ఎస్పీ సతీష్‌కుమార్ నేతృత్వంలో గురువారం జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్స్టేషన్లలో మహిళా ఫిర్యాదుల విండో కార్యక్రమాన్ని నిర్వహించారు. చి మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది ఫిర్యాదులు స్వీకరించారు. కొన్ని ఫిర్యాదులను కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా 64 మంది మహిళలు ఫిర్యాదులివ్వగా, అందులో 57 సమస్యలను తక్షణం పరిష్కరించినట్టు అధికారులు చెప్పారు. ఈ సదర్భంగా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి దీక్ష మాట్లాడుతూ ప్రత్యేక ఫిర్యాదుల విండో మంచి కార్యక్రమమని పేర్కొన్నారు. దివ్యాంగుల బదిలీల్లో వెసులుబాటు కల్పించండి గుంటూరు వెస్ట్: ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో దివ్యాంగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్లయ్య కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో ఈ మేరకు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎల్లయ్య మాట్లాడుతూ 40 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులను ప్రాధాన్య క్రమంలో చేర్చి బదిలీలు నిర్వహించాలన్నారు. 70 శాతం పైబడి ఉన్న వారికి బదిలీల నుంచి మినహాయింపునివ్వాలని ఒకవేళ వారు కోరుకుంటే మొదటి ప్రాధాన్యత వారికే ఇవ్వాలని కోరారు. 2025లో రూపొందించిన ఉపాధ్యాయ బదిలీ చట్టంలోని దివ్యాంగులకు ఇబ్బందికరంగా ఉన్న అంశాలను తొలగించాలన్నారు. మనస్తాపంతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య పెదకూరపాడు: చదువుకోవటం నాకు ఇష్టం లేదు... నన్ను బలవంతం పెట్టకండి.. నేను హాస్టల్‌కి వెళ్లను. ఇంటివద్ద ఉంటాను... అంటూ విద్యార్థి చెప్పడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని పంట పొలంలోని పురుగులు మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలోని జలాలపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. జలాలపురం గ్రామానికి చెందిన మన్నవ శరీలు, చిట్టెమ్మల కుమార్తె మన్నవ జోష్ రాణి (17) నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సెలవులకు స్వగ్రామం జలాలపురం వచ్చింది. సెలవులు అనంతరం కళాశాలకు వెళ్లకపోవటంతో తల్లి మందలించింది. చదువు ఇష్టం లేదని జోష్ రాణి చెప్పటంతో కళాశాలకు వెళ్లక పోతే నాతో పాటు వ్యవసాయ పనులకు రావాలని ఒత్తిడి చేయటంతో రెండు రోజులపాటు తల్లితో కలిసి మిరప కోత పనులకు వెళ్లింది. ఈ క్రమంలో బుధవారం మిర్చి కోతలు కోస్తున్న పంట పొలంలో రైతు దాచుకున్న పురుగులు మందును తాగింది. వాంతులు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను సత్తెనపల్లి ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. జనరిక్ ఔషధాల వినియోగంపై అవగాహన కల్పించాలి నరసరావుపేట: జనరిక్ మందుల ఔషధాల వినియోగం పెరిగేలా డాక్టర్లు శ్రద్ధ చూపాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. శుక్రవారం జన ఔషది దివస్‌ను పురస్కరించుకొని పల్నాడురోడ్డులోని పాత ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ప్రధానమంత్రి జనరిక్ షాపు వద్ద డీఎంహెచ్ఓ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన జనరిక్ షాపుల ద్వారా చాలా తక్కువ ధరకే నాణ్యమైన మందులు అందించటం జరుగుతుందని చెప్పారు. -
మహిళల భాగస్వామ్యం తప్పనిసరి
తెనాలిరూరల్: అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని సబ్‌కలెక్టర్ సంజనా సింహా అన్నారు. తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు ఎంపీడీవో అత్తోట దీప్తి అధ్యక్షత వహించారు. సబ్ కలెక్టర్ సంజనా సింహా ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మహిళల ప్రాధాన్యాన్ని వివరించారు. మహిళా దినోత్సవ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. వెలుగు ఏపీఎం జయశ్రీ వందన సమర్పణ చేశారు. ఎంపీడీవో కార్యాలయ పరిపాలన అధికారి శ్రీనివాసరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో తెనాలి డీఎల్డీఓ శ్రీదేవి, పంచాయతీరాజ్ ఏఈ పార్వతి, ఆర్డబ్యెస్ ఏఈ అనూష, సీడీపీఓ సునీత పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శనను సబ్ కలెక్టర్ సందర్శించారు.కాంట్రాక్టు స్టాఫ్‌నర్సు ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయం పరిధిలో కాంట్రాక్టు స్టాఫ్‌నర్సు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారి ప్రొవిజనల్ మెరిట్ లిస్టును విడుదల చేసినట్లు ఆర్డీ డాక్టర్ కె.సుచిత్ర తెలిపారు. జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 13వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న ఆర్డీ కార్యాలయంలో తెలియజేయాలని పేర్కొన్నారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 44 కాంట్రాక్టు స్టాఫ్‌నర్సు ఉద్యోగాలకు గత ఏడాది డిసెంబరు 30న నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. నోటిఫికేషన్లో 44 కాంట్రాక్టు స్టాఫ్‌నర్సు ఉద్యోగాలు ఉన్నాయని, 5,888 మంది ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. స్వచ్ఛాంధ్ర పోస్టర్ల ఆవిష్కరణ గుంటూరు రూరల్: స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా ముద్రించిన పోస్టర్లను కలెక్టర్ నాగలక్ష్మి శుక్రవారం ఆవిష్కరించారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, నగర కమిషనర్ శ్రీనివాసులు, తెనాలి సబ్ కలెక్టర్ సంజనాసింహా, డీఆర్ఓ షేక్ ఖాజావలి, డీపీఓ సాయికుమార్, రూరల్ మండలం ఎంపీడీవో బండి శ్రీనివాసరావు, విస్తరణ అధికారి కె శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రపంచ శాంతి కోసమే గుడారాల పండుగఅమరావతి: ప్రభువైన ఏసుక్రీస్తుచే తేజరింపచేసి ప్రపంచంలోని మానవులందరి ఉజ్జీవం కోసం గుడారాల పండుగలో ప్రార్థనలు చేస్తున్నామని హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు, దైవజనులు ఫాస్టర్ అబ్రహం అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని హోసన్నా దయాక్షేత్రంలో హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహించే 48వ గుడారాల పండుగ రెండవ రోజు రాత్రిపూట ప్రార్థనలకు వచ్చిన లక్షలాది మంది ఆరాధికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ఈ పండుగలో విశ్వాసులు, సేవకులు ఉజ్జీవింపబడాలంటే దేవుని చేత ప్రకాశించి, వాక్యం మీద ఆసక్తి కలిగి దేవుని ప్రార్థనే ఊపిరిగా భావించాలన్నారు. అనంతరం రెండవ వర్తమానంలో హోసన్నా మినిస్ట్రీస్ చీఫ్ పాస్టర్ జాన్‌వెస్లీ ప్రసంగించారు. -
జీవితం ‘అమృత’మయం
తెనాలి: కష్టాల గరళాన్ని దిగమింగి జీవితాన్ని అమృతమయం చేసుకున్నారామె.. తెనాలిలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ)గా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈనాటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమెపేరు గోలి అమృతరాణి. గ్రూప్–1 సాధించి ఈ మధ్యనే తొలి పోస్టింగ్ తెనాలిలో పొందారు. ఆమె సొంతూరు ఫిరంగిపురం. ఆమె ఎంవీఐ స్థాయికి ఎదిగిన తీరు ఆమె మాటల్లోనే.. అమ్మమ్మ ప్రోత్సాహంతో.. మా అమ్మ సింగిల్ పేరెంట్. చిన్నతనంలో ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయిని అయిన మా అమ్మమ్మ ప్రోత్సాహం కొండంత బలాన్ని ఇచ్చింది. ఫిరంగిపురం సెయింట్ ఆన్స్ ఎయిడెడ్ బాలికోన్నత పాఠశాలలో చదివా. పదో తరగతిలో 537 మార్కులు సాధించా. నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో ఉచిత సీటు లభించింది. మెకానికల్ ఇంజినీరింగ్ చేశాను. 2015లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌గా బయటకొచ్చా. కొంతకాలం ప్రైవేటు కాలేజీలో జూనియర్ అధ్యాపకురాలిగా పనిచేశా. సివిల్ ఇంజినీరు సత్యనారాయణతో 2016లో ఏడడుగులు వేశా. అయినా ఉన్నతోద్యోగం సాధించాలనే నా లక్ష్యాన్ని వదలలేదు. భర్త ప్రోద్బలంతో సివిల్స్, గ్రూప్స్ రాశా. తొలిసారి నిరాశే మిగిలింది. 2023లో ఏపీపీఎస్సీకి ఎంపికయ్యా. 2024లో ఎంవీఐ ఉద్యోగం వచ్చింది. శిక్షణ తర్వాత తొలి పోస్టింగ్ తెనాలి వచ్చింది. ప్రస్తుతం మాకో బాబు ఉన్నాడు. ఎంవీఐగా పనిచేస్తున్నా. మరింత ఉన్నత స్థానం చేరుకోవడానికి గ్రూప్–1, సివిల్స్‌కు ప్రిపేరవుతున్నా. -
క్రీడా ‘చంద్రిక’
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినా కుమిలిపోలేదు ఆమె. తాతమ్మ దగ్గర ఉంటూనే పవర్ లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకుని సత్తాచాటుతున్నారు. ఆదర్శంగా నిలుస్తున్నారు. మంగళగిరికి చెందిన ఆమె పేరు బొల్లినేని చంద్రిక. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బంగారు, రజిత, కాంస్య పతకాలను ఆమె సాధించారు. కామన్వెల్త్లో నాలుగు బంగారు పతకాలు, ఏషియన్ చాంపియన్ షిప్లో మూడు బ్రాంజ్ మెడల్స్, ఏషియన్ పసిఫిక్‌లో నాలుగు గోల్డ్ మెడల్స్, సుబ్రత ఇంటర్నేషనల్ ఛాంపియన్ షిప్లో నాలుగు గోల్డ్ మెడల్స్, స్ట్రాంగెస్ట్ విమెన్ ఇన్ సౌత్ ఇండియా సీనియర్ కేటగిరిలో పతకం సాఽధించారు. ఫెడరేషన్ పవర్‌లిఫ్టింగ్ గేమ్స్ స్టేట్ చాంపియన్‌గా 15 ఏళ్లుగా నిలుస్తున్నారు. అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ చంద్రిక -
అవనితలాన అద్భుతం
అజేయం.. అమేయం ఆమె.. అకుంఠిత దీక్ష, పోరాటపటిమ ఆమె సొంతం.. ఓర్పు, నేర్పు వంటి పదాలు ఆమెను చూసే పుట్టాయేమో.. భగభగమండే బడబాగ్నిని సైతం చిరునవ్వుతో చల్లార్చగల నేర్పరి.. గుండెలను పిండేసే బాధనైనా సంకల్పబలంతో దిగమింగగల ఓర్పరి.. అనితరసాధ్యమైన లక్ష్యాలనూ అవలీలగా ఛేదించగల ధీశాలి. ఆమె సహచర్యం దివ్యౌషధం.. ఆమె మార్గదర్శకం అనన్యసామాన్యం.. ఒక్క మాటలో చెప్పాలంటే అవనితలాన అద్భుతం ఆమె. అందుకే ఆమె ఆదిశక్తి అయింది. అన్ని రంగాల్లో రాణిస్తూ నేడు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళామూర్తుల విజయగాధలతోపాటు అంతరంగాన్ని ఆవిష్కరించే యత్నమిదీ.. – సాక్షి, నెట్వర్క్మంగళగిరికి చెందిన జెస్సీరాజ్ స్కేటింగ్‌లో అంతర్జాతీయ ఖ్యాతి సాధించారు. ఆమె 13 ఏళ్ళ వయస్సులోనే దేశంలోనే నంబవర్ వన్ స్కేటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. జెస్సీని రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రపంచ స్థాయి పోటీలకు పంపింది. జెస్సీ 31.98 పాయింట్లు సాధించి ప్రపంచ స్థాయిలో ప్రథమ స్థానంలో రాణించి బంగారు పతకాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం విజయవాడలోని ఎన్ఎస్ఎం స్కూలులో తొమ్మిదో తరగతి చదువుతున్న జెస్సీ 2021 నుంచి స్కేటింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఆమె జాతీయ పోటీలలో ఒక గోల్డ్, ఒక సిల్వర్, మూడు బ్రాంజ్ మెడల్స్ సాధించారు. రాష్ట్ర పోటీలలో రెండు గోల్డ్, నాలుగు సిల్వర్, రెండు బ్రాంజ్, జిల్లా స్థాయి పోటీలలో నాలుగు గోల్డ్,ఎనిమిది సిల్వర్ మెడల్స్ సాధించారు. అథ్లెటిక్స్, నృత్యం, పెయింటింగ్‌లోనూ జెస్సీ రాణిస్తుండడం విశేషం. ఆకాశంలో సగం అన్ని రంగాల్లో ఆమెదేపైచేయి రాణిస్తున్న సీ్త్రమూర్తులు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంస్కేటింగ్ జెస్సీ -
వైద్యదేవత అనూష
మంగళగిరి: వైకల్యాన్ని అధిగమించి మెడికల్ ఆఫీసర్‌గా రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇందిరానగర్ ఆరోగ్యం కేంద్రం అధికారిణి అనూష. ఆమె సొంతూరు గుంటూరు. ఏలూరు ఆశ్రంలో మెడికల్ సైన్సెస్ చదివారు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై జరిపిన పరిశోధనల్లో 2,790 మందితో పోటీపడి జీనియస్ వరల్డ్ రికార్డు సాధించారు. 2022లో ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించారు. 2024లో బెస్ట్ మెడికల్ ఆఫీసర్‌గా కలెక్టర్ నుంచి అవార్డు అందుకున్నారు. రోగులకు మంచి వైద్య సేవలు అందిస్తున్నారు. ఆమె సేవల వల్ల పీహెచ్‌సీకి దేశంలోనే తొలి ఎన్కాస్ సర్టిఫికెట్, క్వాలిటీ ఎస్యూరెన్స్ అవార్డు లభించాయి. -
అకుంఠిత ‘దీక్ష’తో ఐపీఎస్‌గా
నగరంపాలెం: అకుంఠిత దీక్షతో ఐపీఎస్‌గా ఎంపికై యువతకు స్ఫూర్తిగా నిలిచారు ఆమె. ఆమె పేరు దీక్ష. సొంతూరు ఢిల్లీ. హైదరాబాద్‌లో సివిల్స్ శిక్షణ తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 208వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం ట్రైనీ ఐపీఎస్ అధికారిణిగా గుంటూరులో పనిచేస్తున్నారు. దీక్ష తల్లిదండ్రులు అసోసియేట్ ప్రొఫెసర్లు. ఆమెకు ఇద్దరు సోదరులున్నారు. భర్త ముఖేష్ ఆదాయపుపన్ను శాఖ అధికారి. దీక్ష 2016లో యూపీఎస్సీ రాసి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారిణిగా ఎంపికై ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో విధులు నిర్వర్తించారు. మళ్లీ పోటీ పరీక్షలు రాశారు. 2018లో డీఎస్పీ ర్యాంకు ఆఫీసర్‌గా ఎంపికై ఢిల్లీలో పనిచేశారు. ఐపీఎస్ లక్ష్యంగా ప్రయత్నించారు. 2021లో 208వ ర్యాంక్ సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఐపీఎస్ కోసం నాలుగేళ్లు కష్టపడ్డా ఐపీఎస్ సాధించాలనే లక్ష్యంతో నాలుగేళ్లు కష్టపడ్డా. నా లక్ష్యాన్ని చేరుకున్నా. సమాజంలో మహిళలు ముందుండాలి. పట్టుదలతో యత్నిస్తే ఏదైనా సాధించొచ్చు. సమర్థవంతంగా పనిచేసి మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకుంటా. – దీక్ష, ట్రైనీ ఐపీఎస్ -
అబద్ధాల్లో చంద్రబాబు డబుల్ పీహెచ్డీ: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: అబద్దాలు చెప్పటంలో చంద్రబాబు డబుల్ పీహెచ్డీ చేశారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ దుయ్యబట్టారు. అధికారంలోకి రావటానికీ, వచ్చాక కూడా అబద్ధాలు ఆడటం చంద్రబాబుకు అలవాటు అంటూ మండిపడ్డారు. రాష్ట్రం శ్రీలంకలాగ మారుతోందంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి పదేపదే విష ప్రచారం చేశారు. రూ.14 లక్షల కోట్ల అప్పు రాష్ట్రానికి ఉన్నట్టు ప్రచారం చేశారు.. వాస్తవానికి చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న అప్పులతో అల్లాడిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న అప్పుల కేకలు పవన్ కళ్యాణ్‌కి వినపడటం లేదా?’’ అంటూ శైలజానాథ్ ప్రశ్నించారు.‘‘గవర్నర్ స్పీచ్‌లో కూడా అబద్దాలు చెప్పారు. వైఎస్సార్సీపీ సభ్యులు అసెంబ్లీలో అప్పుల గురించి అడిగితే వాస్తవాలు బయట పడ్డాయి. ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏకంగా శ్రీలంకని మించి అప్పులు చేశారన్నారు. బీజేపీ నేత పురంధేశ్వరి కూడా రూ.12 లక్షల అప్పు ఉందన్నారు. ప్రజలను మోసం చేయటానికి వీరంతా కలిసి వ్యవస్థీకృత నేరం చేశారు. అప్పటి జగన్ ప్రభుత్వంపై ఒక ప్రణాళికాబద్ధంగా దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు ఈ 9 నెలలకే లక్షా 47 వేల కోట్ల అప్పు చేశారు. ఈ తెచ్చిన అప్పంతా ఎవరికి ఇచ్చారు?’’ అంటూ శైలజానాథ్ నిలదీశారు.‘‘ప్రజలకు ఇచ్చారా? పెద్దవాళ్లే పంచుకున్నారా?. సంపద సృష్టిస్తామని చెప్పి అప్పులు చేస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలన్నిటినీ వెంటనే అమలు చేయాలి. అప్పులు తెచ్చి రాజధానిని కడుతున్నారు. అన్ని ప్రాంతాల ప్రజల సొమ్మును రాజధానిలో పెడుతున్నారు. కేంద్రం ఇస్తానన్న రూ.20 వేల కోట్లు తెచ్చి రాజధాని నిర్మాణం చేయాలి’’ అని సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. -
కూటమి నేతల్లో క్రెడిబులిటీ లేదు : శ్యామల
సాక్షి,తాడేపల్లి : రాష్ట్రంలో మహిళలకు భయం తప్ప భరోసా లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు. శుక్రవారం (మార్చి7) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.‘వైఎస్సార్సీపీ తరుఫున మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కూటమి నేతలకు క్రెడిబులిటీ లేదు. వైఎస్సార్సీపీ హయాంలో మహిళలకు అగ్రతాంబూలం కల్పించారు. నవరత్నాల్లో కూడా 90 శాతం మహిళలకే నిధులు కేటాయించింది. దిశ యాప్‌తో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రక్షణ కల్పించారు. జాతీయ స్థాయిలో 19 అవార్డులు వచ్చిన దిశ యాప్‌ను కూటమి ప్రభుత్వం నిర్విర్యం చేసింది. దిశ ప్రతులను ఇప్పటి హోమంత్రి అనిత తగల బెట్టారు.కూటమి ప్రభుత్వంలో మహిళలపై 16,809 కేసులు నమోదయ్యాయని హోంమంత్రి ప్రకటించారు. వాటిల్లో ఎన్ని కేసుల్లో బాధితులకు న్యాయం చేశారు?. మచ్చుమర్రి, గుడ్లవల్లేరు ఘటనలు ప్రభుత్వ ఉదాసీనకు అద్దం పట్టాయి.పుంగనూరులో చిన్నారి హత్య జరిగితే హోంమంత్రి రాజకీయాలు మాట్లాడటం సిగ్గుచేటు.ఆడపిల్లలు, మహిళలకు రక్షణ కలిగింది కేవలం వైఎస్ జగన్ పాలనలోనే. ఒక సోదరుడిగా, బిడ్డగా ముందుండి వైఎస్ జగన్ నడిపించారు. నవరత్నాల పథకంతో మహిళలకు గౌరవం పెరిగింది. ఎవరూ అడగకుండానే జగన్ మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించారు.జడ్పీ ఛైర్మన్లు, డిప్యూటీ ఛైర్మన్లు, మేయర్లు ఇలా సగానికిపైగా మహిళలకే కేటాయించారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ చోద్యం చూస్తున్నారా?.సూపర్ సిక్స్ హామీలన్నీ మోసం మోసం. ఉచిత బస్సు పథకంపై నిలువునా మోసం చేశారు. రాష్ట్రం అంతా ఉచిత బస్సు ద్వారా తిరగవచ్చని చంద్రబాబు చెబితే జిల్లాలకే పరిమితం చేస్తున్నట్టు మంత్రి సంధ్యారాణి ప్రకటించారు’అని అన్నారు. -
మహిళలకు టోకరా.. ఉచిత బస్సుపై చంద్రబాబు సర్కార్ యూటర్న్
సాక్షి, విజయవాడ: మహిళ దినోత్సవం ముందే మహిళలకు కూటమి సర్కార్ టోకరా వేసేసింది. ఉచిత బస్సుపై చంద్రబాబు ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. శాసన మండలి సాక్షిగా కేవలం జిల్లా పరిధిలో మాత్రమే మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం అంటూ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించింది. ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడనుంచైనా ఉచిత బస్ ప్రయాణం అంటూ ప్రకటనలు హోరెత్తించారు. ప్రతి సభలో ఎక్కడ నుండి ఎక్కడవరకైనా ఉచితం అంటూ చంద్రబాబు ప్రచారం చేసింది. అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రభుత్వం మాట మార్చేసింది. దీంతో సోషల్ మీడియాలో మహిళలు తీవ్రంగా మండి పడుతున్నారు.ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజల్ని బురిడీ కొట్టించడంలో తన ట్రేడ్ మార్క్ మోసాన్ని ప్రదర్శించిన చంద్రబాబు తాను బురిడీ బాబునని మరోసారి నిరూపించుకున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు డబ్బా కొట్టారు.అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విషయాన్ని విస్మరించారు. కర్ణాటక, తెలంగాణలలో ఉచిత బస్ పథకం అమలు తీరుపై అధ్యయనం అంటూ ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారు. ఆ తర్వాత 2025 జనవరి 1 నుంచి అన్నారు... కాదు కాదు... ఈ ఏడాది ఉగాది నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఖాయమన్నారు. తీరా బడ్జెట్లో అసలు ఆ పథకం ప్రస్తావనే లేదు.. చివరికి జిల్లా పరిధిలో మాత్రమే మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం అంటూ శాసనమండలిలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి సెలవిచ్చారు. -
వెలిగొండ ప్రాజెక్ట్‌పై కూటమి సర్కార్ కుట్ర: ఎమ్మెల్యే తాటిపర్తి
సాక్షి, తాడేపల్లి: మూడు జిల్లాలకు వరప్రదాయినిగా నిలుస్తున్న వెలిగొండ ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయించకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేవలం రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే వెలిగొండ ప్రాజెక్ట్‌కు కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కేవలం రూ.359 కోట్లు మాత్రమే కేటాయించడం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు. ఏకంగా 53 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.ప్రెస్మీట్లో ఎమ్యెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఇంకా ఏమన్నారంటే..:నాడు చిత్తశుద్దితో పనులు:ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం ప్రాంతంలో నెలకొన్న నీటి ఎద్దడి, కరవు పరిస్థితులను ఐక్యరాజ్యసమతి వంటి అంతర్జాతీయ సంస్థలే గుర్తించాయి. ఈ కరవు పరిస్థితులను మార్చేందుకు నిర్దేశించిన వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంలో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించింది. ఈ ప్రాజక్ట్ పనులు శరవేగంతో చేయడం వల్ల శ్రీశైలం నుంచి నీటిని తీసుకురావడానికి నిర్మించిన రెండు టన్నెల్స్ పనులు పూర్తయ్యాయి. దానిలోని మట్టిని మాత్రం తొలగించాల్సి ఉంటుంది. అలాగే స్టోరేజీ చేసే కొండల మధ్య ఉన్న గ్యాప్‌లను పూడ్చడం జరిగింది. పునరావాసానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.గతంలో పునరాసానికి రూ.1.80 లక్షలు ప్రకటిస్తే, జగన్‌గారు వచ్చిన తరువాత రూ.12.5 లక్షలు ప్రకటించారు. ఈ ఏడాది జనవరి వరకు ఎవరికైతే 18 ఏళ్ళు నిండి ఉంటాయో వారికి పరిహారం ఇచ్చి, ముంపు ప్రాంతాల నుంచి తరలించాల్సి ఉంది. ఇదే జరిగితే 53 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు పూర్తిస్థాయిలో నీరందుతుంది. శ్రీశైలంలో 45 రోజుల పాటు వచ్చే నీటిని ఇక్కడికి తీసుకువచ్చి, కరవును దాదాపు రూపుమాపవచ్చు.పాదయాత్ర. ప్రభుత్వాన్ని నిలదీస్తాం:వెలిగొండ ప్రాజెక్ట్‌లో గత బడ్జెట్లో అరకొర నిధులను మాత్రమే కేటాయించారు. ఈ నిధుల కేటాయింపుతోనే అసలు వెలిగొండను పూర్తి చేసే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదని అర్థమవుతోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న కుటిల ప్రయత్నాలను తిప్పికొడతాం. వెలిగొండ ప్రాజెక్ట్‌కు నిధులు సాధించేందుకు మేం చేపట్టే పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు అవుతారు.ప్రకాశం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు కూడా రాజకీయాలను పక్కకుపెట్టి ఈ ప్రాజెక్ట్ సాధనకు ముందుకు రావాలి. తప్పుడు రాజకీయాలు చేస్తున్న నేతలను నిలదీయాలి. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వైఖరిపై ఇప్పటికే ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వెలిగొండ ప్రాజెక్ట్ ప్రాముఖ్యత ఈ ప్రాంత ప్రజలకు తెలుసు కాబట్టి, తనను నిలదీస్తారనే భయంతోనే చంద్రబాబు తన పర్యటనను ప్రాజెక్ట్ వద్ద కాకుండా దూరంగా పెట్టుకుంటున్నారు. తన కుమారుడు నారా లోకేష్ కోసం ఆయన నియోజకవర్గంలో వందల కోట్లు కేటాయించుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘ఆస్తులు అమరావతికి.. పస్తులు ప్రకాశానికి’ అన్నట్లుగా వీరి వ్యవహారం ఉంది. -
ప్రజలకు వాస్తవాలన్నీ తెలిశాయి: పుత్తా శివశంకర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి నోటికొచ్చినట్టు అబద్దాలు చెప్పారని.. రూ.14 లక్షల కోట్ల అప్పులంటూ.. రాష్ట్రం శ్రీలంక అయిందంటూ విష ప్రచారం చేశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎల్లోమీడియాలో అడ్డమైన కూతలు కూశారని.. దారుణమైన రాతలు రాశారని ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగంలో అప్పుల గురించి తప్పించి మాట్లాడించారు.’’ అని పేర్కొన్నారు.‘‘ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆమోదంతో రాతపూర్వకంగా సమాధానం చెప్పక తప్పలేదు. నవ రత్నాల అమలు, డీబీడీ ద్వారా వేసిన నిధులు అన్నీ కలిపిన అప్పులు అవి. మరి చంద్రబాబు బ్యాచ్, ఎల్లోమీడియా ఎందుకు తప్పుడు కూతలు కూశారు?. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పులు భారీగా ఉన్నాయి. ఆ లెక్కలు జనానికి తెలియకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. కారు కూతలు కూసిన చంద్రబాబు, లోకేష్, పురంధేశ్వరి, పవన్ కల్యాణ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని శివశంకర్ డిమాండ్ చేశారు.‘‘ఓట్ల కోసం తప్పుడు సమాచారం చెప్పామని జనం ఎదుట ఒప్పుకోవాలి. ఇక సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టడానికి వీల్లేదు. వైఎస్ జగన్ చాలా చక్కగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని కాపాడారని తేలింది. ప్రజలకు వాస్తవాలన్నీ తెలిశాయి’’ అని శివశంకర్ తెలిపారు. -
సమష్టిగా శంకర్ విలాస్ ఫ్లయ్ ఓవర్ పనులు
గుంటూరు వెస్ట్: స్థానిక శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ పునర్నిర్మాణ పనులు అధికారులందరూ సమష్టిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో స్టేక్ హోల్డర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ బ్రిడ్జికి సంబంధించి భూ సేకరణ పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయాలన్నారు. ఏప్రిల్ 15 నాటికి టెండర్‌ను ఫైనలైజ్ చేయాలని, మే మొదటి వారంలో నిర్మాణ పనులు ప్రారంభించాలని తెలిపారు. నిర్మాణ సమయంలో అండర్ గ్రౌండ్ వాటర్‌పైపులు, టెలిఫోన్ కనెక్షన్లు, ఎలక్ట్రికల్ కేబుల్స్, డ్రెయినేజీ వంటి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. బ్రిడ్జికి ఇరువైపులా అప్రోచ్ రోడ్డు పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. నిర్మాణ సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా శంకర్ విలాస్ ఫ్లైఓవర్‌కు అటు, ఇటువైపు ఉన్న బ్రాడీపేట, అరండల్‌పేట ప్రాంతాల్లో పైపులైన్ క్లియరెన్స్‌కు చర్యలు చేపట్టాలన్నారు. పునర్నిర్మానిర్మాణ పనులతో భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయని పేర్కొన్నారు . జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీనివాసమూర్తి, ట్రాఫిక్ డీఎస్పీ రమేష్, అధికారులు పాల్గొన్నారు. 15న జెడ్పీ సర్వసభ్య సమావేశం గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 15న నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు గురువారం ఓప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి జెడ్పీలో ఏడుస్థాయీ సంఘ సమావేశాలు జరగనుండగా, అదేరోజు మధ్యాహ్నం 2.30 నుంచి జెడ్పీ సమావేశ మందిరంలో చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. -
హోసన్నా.. జయము!
అమరావతి: లక్షలాదిమంది విశ్వాసుల స్తోత్రములతో దైవజనుల ప్రార్థనలతో, ప్రభు ఏసును కీర్తిస్తూ, స్తుతి గీతాలాపనల నడుమ గురువారం రాత్రి 48వ గుడారాల పండుగ ఎంతో ఘనంగా ప్రారంభమైంది. పల్నాడు జిల్లా అమరావతి మండలం లేమల్లె గ్రామంలో హోసన్నా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో హోసన్నా దయాక్షేత్రం ప్రాంగణంలోని సువిశాలమైన మైదానంలో గుడారాల పండుగ ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. తొలుత హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు అబ్రహాం మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు జరిగే గుడారాల పండుగకు ప్రపంచవ్యాప్తంగా విచ్చేసిన విశ్వాసులను ఏసుక్రీస్తు నిరంతరం కాపాడాలని ప్రార్థిస్తున్నామన్నారు. గుడారాల పండుగలో దేవుడు అద్భుత కార్యాలను జరిపిస్తాడన్నారు. రోగులకు స్వస్థత చేకూరాలని అలాగే సేవకులకు ఉజ్జీవం కలగాలని ప్రార్థించారు. స్తుతి గీతాల ఆల్బమ్ విడుదల.. దక్షిణాఫ్రికాకు చెందిన దైవజనులు పాస్టర్ జాషువా మోజెస్ ప్రత్యేక ప్రార్థనలు చేసి లక్షలాదిమంది విశ్వాసులు సోత్రాలు, కరతాళ ధ్వనుల మధ్య జాతీయపతాకంలోని మూడు రంగుల బెలూన్లను, శ్వేతవర్ణ పావురాలను ఎగురవేసి నాలుగు రోజులపాటు నిర్వహించే గుడారాల పండుగను ప్రారంభించారు. అనంతరం నూతన స్తుతిగీతాల పుస్తకమైన దయాక్షేత్రం పాటల పుస్తకాన్ని అమెరికాకు చెందిన దైవజనులు ఎర్నెట్‌పాల్ ప్రార్థనలు చేసి ఆవిష్కరించారు. అలాగే హోసన్నా స్తుతిగీతాల అల్బమ్‌ను మదనపల్లెకు చెందిన దైవజనులు పాస్టర్ రాజశేఖర్ ప్రార్థనలు చేసి ఆవిష్కరించారు. ప్రార్థనల్లో చైన్నెకి చెందిన దైవజనులు మోహన్. సి. లాజరస్తో పాటుగా పాస్టర్లు రమేష్, ఫ్రెడ్డీపాల్, అనీల్, రాజు పాల్గొని స్తుతి గీతాలను ఆలపించారు. తొలిరోజు ప్రార్థనల్లో రెండు తెలుగు రాష్టాల నుంచే కాక దేశ, విదేశాల నుంచి లక్షలాదిగా విశ్వాసులు తరలివచ్చారు. పల్నాడు జిల్లా లేమల్లెలో ఘనంగా ప్రారంభమైన 48వ గుడారాల పండుగ ప్రత్యేక ప్రార్థనలు చేసిన హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు అబ్రహాం, చీఫ్ పాస్టర్ జాన్‌వెస్లీ లక్షలాదిగా తరలివచ్చిన విశ్వాసులు 32 ఏళ్ల తర్వాత మళ్లీ లేమల్లెలో.. హోసన్నా మినిస్ట్రీస్ చీఫ్ ఫాస్టర్ జాన్‌వెస్లీ మాట్లాడుతూ గుడారాల పండుగ 1977 నుంచి 1992 వరకు హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బ్రదర్ ఏసన్న చేతుల మీదుగా లేమల్లె గ్రామంలో జరిగాయన్నారు. అయితే 1993 నుంచి 2024 వరకు 32సంవత్సరాలపాటు గుంటూరు సమీపంలో గోరంట్లలో నిర్వహించుకున్నామన్నారు. 32 సంవత్సరాల తర్వాత ఇదే లేమల్లె గ్రామంలో మార్చి 5వ తేదీన హోసన్నా దయాక్షేత్ర ఆవరణలో నూతన చర్చి ప్రారంభించు కున్నామన్నారు. -
ముగిసిన మద్యం షాపుల లాటరీ ప్రక్రియ
నెహ్రూనగర్: గుంటూరు జిల్లాలో గౌడ, గౌడ్ సామాజిక వర్గాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 13 మద్యం షాపులను కేటాయించిన విషయం తెలిసిందే. ఈ షాపుల కేటాయింపు సంబంధించి గురువారం లాటరీ ప్రక్రియ కలెక్టరేట్లోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె.శ్రీనివాసులు, ఎకై ్సజ్ శాఖ జిల్లా అధికారి ఎ.అరుణకుమారి తదితరుల సమక్షంలో లాటరీ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. 13 షాపులను జిల్లా జాయింట్ కలెక్టర్ స్వయంగా తన చేతుల మీదుగా లాటరీ నిర్వహించి షాపులకు సంబంధించి లైసెన్సు దారులను ఎంపిక చేశారు. ఉదయం 9 గంటల నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించి అరగంటలోనే ముగించారు. జిల్లాలో 13 షాపులకు సంబంధించి దరఖాస్తుదారుల సమక్షంలోనే ప్రక్రియను బహిరంగంగా నిర్వహించారు. ఏఈఎస్ ఇ.మారయ్య బాబు, ఎకై ్సజ్ శాఖ సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఏపీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం తాడికొండ: గుంటూరు జిల్లా తాడికొండ ఏపీ గురుకుల విద్యాలయంలో 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎ.జోజారావు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 5వ తరగతిలో 80 సీట్లు, 6, 7, 8 తరగతుల్లో మిగిలిపోయిన ఖాళీ సీట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 1 నుంచి 31వ తేదీ వరకు ఆన్లైన్ వెబ్సైట్ ఏపీఆర్ఎస్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.ఘనంగా చంద్రమౌళేశ్వరస్వామి దివ్య రథోత్సవం చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలోని గంగాపార్వతి సమేత చంద్రమౌళేశ్వరస్వామి వారి రథోత్సవం గురువారం కనుల పండువగా జరిగింది. స్వామి వారి కల్యాణోత్సవం అర్చకస్వాముల బృందం వేద మంత్రోచ్ఛారణలతో ఘనంగా నిర్వహించింది. కల్యాణోత్సవం అనంతరం కల్యాణమూర్తులు చంద్రమౌళేశ్వరస్వామి, గంగాదేవి, పార్వతి దేవి అమ్మవార్లు రథంపై పురవీధుల్లో విహరించారు. కల్యాణమూర్తులను దర్శించుకోవటం కోసం వడ్లమూడి పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు రథం తాడును లాగటానికి ఉత్సాహం చూపారు. దేవదాయశాఖాధికారి నరసింహారావు రథోత్సవ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆలయ ధర్మకర్తలు జి అమర్‌చంద్, గణపతిరావు భక్తులు పాల్గొన్నారు. 17న వేణుగోపాల ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ట ఫిరంగిపురం: మండలంలోని 113 తాళ్లూరులోని వేణుగోపాలస్వామి ఆలయం ధ్వజస్తంభ ప్రతిష్ట ఈనెల 17న నిర్వహించనున్నట్లు దేవదాయ ధర్మాదాయ శాఖాధికారి జె.శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 10.25 గంటలకు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని వేదపండితులు దీవి పవన్‌కుమార్, దీవి ప్రసన్నమూర్తిలు నిర్వహిస్తారన్నారు. పూజా కార్యక్రమంలో దాత డేగల ప్రభాకర్, భువనేశ్వరి దంపతులు పాల్గొంటారని చెప్పారు. మధ్యాహ్నం అన్నదానం నిర్వహిస్తామన్నారు. -
వైభవం.. ధ్వజారోహణం
మంగళగిరి/మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసినయున్న లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అతి ప్రధానమైన ఘట్టం ధ్వజారోహణ. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవరోజు గురువారం రాత్రి 8 గంటలకు ఋత్వికరణ, అంకురారోపణాధి కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి కల్యాణోత్సవానికి భక్తజనులు, దేవతల ఆహ్వానానికి భక్తాగ్రేసరుడైన గరుత్మంతుడిని ధ్వజంపై ప్రతిష్టించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని ధ్వజారోహణం తిలకించి, గరుడ ముద్దలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ వేడుకలను ఆలయ ఈఓ రామకోటిరెడ్డి పర్యవేక్షించగా కై ంకర్య పరులుగా మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ వ్యవహరించారు. నేడు హనుమంత వాహనంపై.. లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవరోజైన శుక్రవారం రాత్రి 7 గంటలకు శ్రీవారు హనుమంత వాహనంపై గ్రామోత్సవంలో దర్శనమివ్వనున్నారు. భక్తులు పాల్గొని ఉత్సవాన్ని తిలకించి స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ అధికారులు కోరారు.నృసింహుడి కల్యాణానికి దేవతలకు ఆహ్వానం -
విజయవంతం చేద్దాం
తిరుపతమ్మ చిన్న తిరునాళ్లను పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మవారి ఆలయంలో చిన్న తిరునాళ్లను అందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని నందిగామ డివిజన్ ఆర్డీఓ కె. బాలకృష్ణ ఆదేశించారు. మార్చి 14 నుంచి 18 వరకు ఐదు రోజుల పాటు జరిగే తిరునాళ్ల ఉత్సవాలకు సంబంధించి గురువారం ఆలయ బేడామండలంలో అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సమర్థంగా పనిచేయాలన్నారు. తిరునాళ్ల ఉత్సవాలు జరిగే ఐదు రోజులు పారిశుద్ధ్యం, తాగునీటికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మార్చి 17న పుట్టింటి పసుపు–కుంకుమ బండ్లకు విద్యుత్ దీప కాంతులు ఏర్పాటు చేసే సందర్భంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. భక్తులకు అసౌకర్యం లేకుండా ఆలయం వద్ద పలు శాఖల సమాచార కేంద్రాలతో పాటు, తాగునీటి సౌకర్యం, తాత్కాలికంగా బస్టాండ్ల ఏర్పాటు ఉంటుందన్నారు. పుట్టింటి పసుపు కుంకుమ బండ్లకు ప్రభలు 11 అడుగులకు మించి ఉండకూడదన్నారు. సీసీ కెమెరాలు అన్నీ ఒకే చోట పెట్టకుండా గ్రామంలోకి వచ్చే అన్ని దారుల్లో ఏర్పాటు చేయాలని దేవాలయ అధికారులకు సూచించారు. -
శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025
ఇఫ్తార్ సహర్ (శుక్ర ) (శని) గుంటూరు 6.22 5.05 నరసరావుపేట 6.24 5.07 బాపట్ల 6.22 5.04 సాక్షి ప్రతినిధి, గుంటూరు: మిర్చి రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గత నెలలో మిర్చి రైతులను ఆదుకోవాలంటూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మిర్చియార్డును సందర్శించి, రైతుల సమస్యలు తెలుసుకున్న తర్వాత ప్రభుత్వం కొన్ని రోజులపాటు హడావిడి చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం, తర్వాత మంత్రులతో చర్చించడం జరిగింది. రూ.11,781 కంటే క్వింటాలుకు తక్కువ వస్తే ఆ మొత్తాన్ని భరిస్తామని ప్రకటించారు. అయితే ఇప్పటివరకూ ఆ దిశగా అడుగులు పడలేదు. చేస్తానన్న సాయంపై మార్గదర్శకాలు రాలేదు. మరోవైపు రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. తాజాగా గురువారం వైఎస్సార్ జిల్లాలో అప్పుల బాధతో మిర్చి రైతు చీపాటి మోషే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం మిర్చి పంటను గుంటూరుకు తీసుకురాగా నాసిరకమని పంటను కొనుగోలు చేయకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. నష్టం ప్రభుత్వమే భరించాలి.. రూ. 11,781 కంటే తక్కువకు కొంటే ఆ నష్టం భరించడం కాకుండా తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ ఏడాది సాగు వ్యయం పెరిగినందున మిర్చి రైతులందరికీ ఎకరాకు రూ. 30 వేల నుంచి రూ.50 వేల వరకూ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది రూ. 27వేల వరకు పలికిన మిర్చికి ఇప్పుడు కనీసం రూ.10 వేల కూడా పలకడం లేదు. మరోవైపు వ్యాపారులు కుమ్మకై ్క ధర తగ్గిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ తేజా మిర్చి ధర క్వింటాల్‌కు రూ. 15 వేలు పలికితే ఇప్పుడు రూ.13 నుంచి 11 వేల మధ్య కొంటున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో క్వింటా మిర్చి రూ.22వేల నుంచి రూ.27 వేల వరకు అమ్మితే, ఇప్పుడు కనీసం రూ.10 వేలు కూడా పలకడం లేదు. మార్కెట్లో పంటల ధరలు పతనమైతే, రైతులను ఆదుకోవడం కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచింది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్లో ధరల స్థిరీకరణ నిధిగా కేవలం రూ.300 కోట్లు మాత్రమే కేటాయించింది. గత ప్రభుత్వం ప్రకటించిన దానిలో మూడో వంతు అయినా మిర్చి రైతులను ఆదుకోవడానికి ఖర్చు చేస్తే రైతులకు కొంతైనా ఊరట లభించేది. మూడు రోజులుగా పడిగాపులు.. నేను రెండు ఎకరాల్లో తేజ రకం మిర్చి పంట సాగు చేశాను. సొంత పొలం కావడంతో ఎకరానికి రూ.2 లక్షలు వరకు ఖర్చు వచ్చింది. గుంటూరు మిర్చి యార్డుకు 30 బస్తాలు ఎండు మిరప కాయలు తీసుకువచ్చి మూడు రోజులైంది. కొనే నాథుడు లేక పడిగాపులు కాయాల్సి వచ్చింది. తొలిరోజు(మంగళవారం) క్వింటా రూ.12 వేలు పడుతుందిని చెప్పారు. కనీసం రూ.13 వేలు ధర అయినా పలికితే అమ్ముకుందామని ఇవ్వలేదు. గురువారం అవే కాయలకు రూ.11 వేలు చెల్లిస్తామని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో అమ్ముకోవాల్సి వచ్చింది. గత ఏడాది ఇవే కాయలు క్వింటా రూ.25 వేలు చొప్పున విక్రయించాను. ఎకరాకు సుమారు రూ.లక్షకు పైగా నష్టం వస్తోంది. ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి. –సూరా రాజగోపాల్‌రెడ్డి, రైతు, అంకభూపాలెం, అర్ధవీడు మండలం, ప్రకాశం జిల్లా వ్యాపారుల మాయాజాలం.. మిర్చికి మంచి ధర చెల్లించడం.. తక్కువ ధర చెల్లించడం అనేది మిర్చి వ్యాపారుల చేతుల్లోనే ఉంది. నేను 4 ఎకరాల్లో మిర్చి సాగు చేశాను. గురువారం 15 బస్తాలు తేజ రకం కాయలు యార్డుకు తీసుకువచ్చాను. ఉదయం మచ్చుకాయలు తీసుకుని క్వింటా రూ.13 వేలు అన్నారు. 11 గంటలకు రూ.11 వేలు చెల్లిస్తాం ఇస్తే ఇవ్వండి లేదంటే మీ ఇష్టం అంటున్నారు. ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి. –జె.శంకర్, రైతు, ఇబ్రహీంపురం, నందవరం మండలం, కర్నూలు జిల్లా రైతులను ఆదుకునే దిశగా పడని అడుగులు ఇప్పటివరకు సాయంపై మార్గదర్శకాలు రాని వైనం మొక్కుబడి సమావేశాలతో సరిపెడుతున్న అధికారులు నోటిఫైడ్ మార్కెట్ యార్డుల్లోనే అమ్మాలనే నిబంధన తొలగించాలని మిర్చి రైతుల డిమాండ్ కుమ్మకై ్క ధర మరింత తగ్గిస్తున్న వ్యాపారులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులు న్యూస్రీల్ఏమార్చేందుకు.. కుమ్మకై ్క ధరలు తగ్గిస్తున్నారు.. కేంద్ర ప్రభుత్వం మిర్చి ధర క్వింటాకు రూ.11,781 ప్రకటించిన తర్వాత మిర్చి ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం మద్దతు ధర రూ.11,781 ప్రకటించక ముందు తేజ రకం మిర్చి క్వింటా రూ.13,500 నుంచి రూ.14,500 వరకు ధర పలికింది. ప్రస్తుతం రూ.12 వేలకు కూడా కొనే నాథుడు లేక అవస్థలు పడాల్సి వస్తోంది. వ్యాపారులు కుమ్మకై ్క ధరలు తగ్గిస్తున్నా.. అధికారులు ఏమీ పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తూ చోద్యం చూస్తున్నారు. క్వింటాకు రూ.20 వేలు చెల్లిస్తే పెట్టిన ఖర్చులు వస్తాయి. లేదంటే రైతులకు ఆత్మహత్యలే శరణ్యం. –రమావత్ అఖిల్, రైతు, యండ్రపల్లి, యరగ్రొండపాలెం మండలం, ప్రకాశం జిల్లా మరోవైపు అధికారులు గత డిసెంబర్ నుంచి రోజువారీగా ఎంత మిర్చి కొనుగోలు చేసింది. ఎవరి వద్ద కొన్నారు. వారి ఆధార్ వివరాలు కావాలంటూ వ్యాపారులను అడిగారు. ఇది కేవలం కాలయాపన చేసి.. సీజన్ అయ్యేవరకూ నడిపే కుట్ర అని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం దగ్గర ఈ లెక్కలన్నీ ఉంటాయని, తమ దగ్గర లేనట్టు మార్కెటింగ్ అధికారులు వ్యాపారులను వివరాలు అడగడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జనవరి నుంచి మిర్చి సీజన్ ప్రారంభమై రోజూ లక్షన్నరకు పైగా బస్తాలు గుంటూరు మిర్చి యార్డుకు చేరుకుంటుంటే రెండు నెలల తర్వాత లెక్కలు అడగడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. -
సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
బాపట్లటౌన్: సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమైనదని జిల్లా అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో గురువారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఎస్పీ టి.పి.విఠలేశ్వర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. తొలుత డ్రోన్ ఎగురవేసి అది పనిచేసే విధానం, పోలీస్ శాఖకు ఏవిధంగా ఉపయోగపడుతుందనే విషయాలపై విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. మహిళలకు రక్షణ, భద్రత కల్పించేందుకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు, అత్యవసర పరిస్థితులలో సంప్రదించాల్సిన చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, మహిళలకు సంబంధించిన సమస్యలకు ఉమెన్ హెల్ప్‌లైన్ 181, పోలీస్ శాఖను సంప్రదించేందుకు పోలీస్ హెల్ప్‌లైన్ 112, సైబర్ నేరాలకు గురైతే సంప్రదించాల్సిన సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 గురించి, విధి నిర్వహణలో పోలీసులు వినియోగిస్తున్న వివిధ రకాల ఆయుధాలు, తుపాకులు, బాంబ్ డిస్పోజల్స్ పరికరాలు, పోలీసు డాగ్స్, సాంకేతికత, బాడీ వోర్న్ కెమెరాలు, కమ్యూనికేషన్ విభాగాల్లో వినియోగిస్తున్న పరికరాలపై క్షుణ్ణంగా వివరించారు. నేర స్థల పరిశీలనలో క్లూస్ టీం ఆధారాలు, ఫింగర్ ప్రింట్స్ సేకరించే విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, ఏఆర్ డీఎస్పీ విజయసారథి, అడ్మిన్ ఆర్ఐ మౌలుద్దీన్, మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ శ్రీనివాస్, ఎస్బీ సీఐ నారాయణ, బాపట్ల పట్టణ, రూరల్, రూరల్ సర్కిల్ సీఐలు రాంబాబు, శ్రీనివాసరావు, హరికృష్ణ, పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థి దశనుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి జిల్లా అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్ -
నారీ వివక్ష లేని సమాజంతోనే అభ్యున్నతి
గుంటూరు రూరల్: నారీ వివక్షత లేని సమాజంతో అభ్యున్నతి సాధ్యమని, మహిళలకు విద్య, ఉపాధి, భద్రత, ఆరోగ్యం తదితర అంశాలలో సమాన అవకావాలు ఇవ్వాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ ఆర్. శారద జయలక్ష్మీదేవి పిలుపునిచ్చారు. నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలోని విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం అభివృద్ధిలో మహిళా శాస్త్రవేత్తల కృషి మరువలేనిదని కొనియాడారు. మహిళా రక్షణ సెల్ అధ్యక్షురాలు డాక్టర్ ఎ. మణి మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో అన్ని కమిటీలతో, పలు స్కీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళల్లో అక్షరాస్యత శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఏపీ అగ్రికల్చర్ కమిషనర్ బి. రాజశేఖర్ మాట్లాడుతూ మహిళలు బహుముఖ ప్రజ్ఞాశాలురని తెలిపారు. సమాజంలో మార్పుకోసం, లింగవివక్షత, అసమానతలను అధిగమించేందుకు ఒక ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా ఉత్తమ మహిళా రైతులు, ఉత్తమ అధికారులకు సత్కారాలు అందించారు. ఉత్తమ మహిళా రైతులుగా మన్యం జిల్లా పార్వతీపురం మండలం వంజరపుగూడాకు చెందిన మర్రి నవ్య, తూర్పుగోదావరి జిల్లా నిడిగల్లుకు చెందిన వేమగిరి అన్నపూర్ణ, పల్నాడు జిల్లా అచ్చంపేటకు చెందిన కిలారి జయమ్మ, ఒంగోలు జిల్లా సంతపేటకు చెందిన గుల్లపల్లి సుజాత, తిరుపతికి చెందిన కె. యువరాణి, శ్రీ సత్యసాయి జిల్లా ఉప్పునేసినపల్లికి చెందిన నారా నాగలక్ష్మిలకు ఉత్తమ మహిళా రైతు పురస్కారాలు అందించి, ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య
యద్దనపూడి: భార్య కాపురానికి రాకపోవటంతో జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని పూనూరులో జరిగింది. మండలంలోని పూనూరు గ్రామంలోని వడ్డెర కాలనీకి చెందిన తన్నీరు గంగరాజు (28) కు జె. పంగులూరు మండలం కొప్పెరపాడు గ్రామానికి మహిళతో ఏడేళ్ల కిందట వివాహమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య నాలుగేళ్ల కిందట అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. రోజులు గడుస్తున్నా భార్య కాపురానికి రాకపోవటంతో ఈ నెల 4వ తేదీ భార్య దగ్గరికి వెళ్లి కాపురానికి రమ్మని చెప్పగా ఆమె నిరాకరించటంతో మనస్తాపానికి గురైన గంగరాజు బుధవారం మధ్యాహ్నం పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి గురువారం మృతి చెందినట్లు ఎస్సై రత్నకుమారి తెలిపారు. మృతుని తండ్రి రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. బబ్బేపల్లి కొండపై మంటల కలకలం మార్టూరు: మండలంలోని బబ్బేపల్లి కొండపై గురువారం రాత్రి మంటలు స్థానికంగా కలకలం రేకెత్తించాయి. రాత్రి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో కొండపై నుంచి ఎగిసిపడుతున్న మంటలను చూసిన స్థానికులు మంటల సమీపం లోకి వెళ్లి పరిశీలించారు. గొర్రెలు లేదా పశువుల కాపర్లు పొరపాటున విసిరిన సిగరెట్ లేదా బీడీలు మంటలకు కారణమై ఉండవచ్చని మొదట భావించారు. కానీ ఒకేసారి నాలుగైదు వైపుల నుంచి ఎగిసిపడుతున్న మంటలను చూసి ఎవరైనా కావాలని చేశారా.. అనే అనుమానం గ్రామస్తులు వ్యక్త పరుస్తున్నారు. ఈ విషయమై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేష్‌ను వివరణ కోరగా.. మంటలకు కారణం పొరపాటా లేక ఎవరైనా కావాలని చేశారా.. అనే విషయం శుక్రవారం ఉదయం వెళ్లి పరిశీలించి చెబుతామన్నారు. మూడు పూరిళ్లు దగ్ధం రూ.11లక్షల ఆస్తి నష్టం నిజాంపట్నం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నికి మూడు పూరిళ్లు దగ్ధమైన సంఘటన మండలంలోని నక్షత్రనగర్‌లో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు గ్రామంలోని మోపిదేవి శివనాగరాజు గృహంలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు ఎగసిపడ్డాయి. పక్కనే ఉన్న మరో రెండు పూరిళ్లకు మంటలు వ్యాపించి మూడు పూరిళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. బాధితులు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. సంఘటనా స్థలానికి రేపల్లె అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. రూ.11లక్షల వరకు ఆస్తినష్టం సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఐదు హాస్పిటళ్లకు జరిమానాలు నరసరావుపేట: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో వచ్చిన 77 ఫిర్యాదులపై కమిటీ సభ్యులు విచారించారు. అందులో డబ్బులు వసూలు చేసిన ఐదు హాస్పిటళ్లకు జరిమానా విధించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధ్యక్షతన జిల్లా క్రమశిక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ వైద్యసేవ పేషెంట్లకు బిల్లులు లేకుండా నగదు రహిత వైద్యం అందించేలా ఆసుపత్రి యాజమాన్యాలు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఎంహెచ్‌వో డాక్టర్ బి.రవి, జిల్లా ప్రభుత్వ వైద్యశాలల పర్యవేక్షణ అధికారి డాక్టర్ బీవీ రంగారావు, డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ జి.చంద్రశేఖర్, డాక్టర్ విక్టర్, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యా బోధన.. సాగు ఒకటే !
ఏఎన్‌యూ: విద్యా బోధన, సాగు ఒకటేనని, అధ్యాపకులు నిత్య విద్యార్థులుగా ఉండాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య కె. గంగాధర రావు అన్నారు. బోధనలో అధునాతన పద్ధతులను అందిపుచ్చుకుని విద్యార్థులు మెరుగైన జ్ఞానాన్ని అందించాలని ఆయన సూచించారు. విశ్వవిద్యాలయంలోని విద్యా విభాగంలో రెండు రోజులపాటు జరుగుతున్న జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రెక్టార్ ఆచార్య కె. రత్న షీలామణి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. వీసీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలోని విద్యావేత్తలను ఆచార్య పి. బ్రహ్మాజీరావు ఉపన్యాసకులుగా ఆహ్వానించడంపై హర్షం వ్యక్తం చేశారు. సదస్సుకు ఆర్ట్స్, కామర్స్ లా కళాశాల ఆచార్యులు ఎం. సురేష్ కుమార్ అధ్యక్షత వహించారు. రెక్టార్ ఆచార్య కె. రత్నషీలామణి మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా బోధన విధానాలను రూపొందించుకోవాలని, వృత్తిపరమైన కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. విద్యా విభాగ పీఠాధిపతి ఆచార్య ఎం. వనజ విద్యా విధానంలో వివిధ దశలను గురించి వివరించారు. అమర్ కంటక్‌కు చెందిన ఆచార్య ఎం.టి.వి నాగరాజు, ఒరిస్సాలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు ఈ.అశోక్ కుమార్, జమ్మూ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఆచార్య వంగూరి రవి, కేరళ లోని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి చెందిన ఆచార్య ఇస్మాయిల్ తమ్మరేసరి, మధ్యప్రదేశ్ లోని డాక్టర్ హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య పుచ్చ చిట్టిబాబు, ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన ఆచార్య టి. షరోన్ రాజు, బిహార్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య పి. ఆడమ్ పాల్, ఇగ్నో డెప్యూటీ డైరెక్టర్ ఆచార్య కె. సుమలత,సెంట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ చైర్మన్ డాక్టర్ సూరజ్ మోహన్, ఆర్‌వీఆర్‌ఆర్ కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ సీనియర్ ఆచార్యులు గద్దె మంగయ్య ఉపన్యసించారు. విద్యా విభాగంపై డాక్టర్ టి. సందీప్ రచించిన పుస్తకావిష్కరణ చేశారు. ఈ సదస్సుకు డాక్టర్ ఎం. వసంతరావు, డాక్టర్ ఆర్. శివరామిరెడ్డి, కన్వీనర్లుగా వ్యవహరించారు. వీసీ ఆచార్య కె.గంగాధరరావు అధ్యాపకులు నిత్య విద్యార్థులుగా ఉండాలి -
విద్యుత్ చౌర్యం కేసులో రూ. 85వేలు జరిమానా
గుంటూరు లీగల్: విద్యుత్ చౌర్యం కేసులో జరిమానా విధిస్తూ జడ్జి వి.ఎ.ఎల్.సత్యవతి తీర్పు చెప్పారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాల గ్రామానికి చెందిన వేల్పుల పెదఏసు 2016 నవంబరు 15న అక్రమంగా విద్యుత్ వినియోగిస్తుండగా ఆ శాఖ అధికారి ఎం.కోటయ్య తనిఖీల్లో పట్టుకున్నారు. దీనిపై ఆయన యాంటీ పవర్ తెఫ్ట్ స్క్వాడ్‌కు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్ఐ కె. హనుమంతరావు విచారణ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఒకటో అదనపు జిల్లా కోర్టులో విచారణ జరిగింది. నేరం రుజువు కావడంతో జడ్జి వి.ఎ.ఎల్.సత్యవతి రూ. 85వేలు జరిమానా విధించారు. కట్టలేని పక్షంలో ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వజ్రాల రాజశేఖరరెడ్డి వాదనలను వినిపించారు. -
దాతపై పచ్చ నేతల దౌర్జన్యం
నాదెండ్ల: సచివాలయం, రైతు భరోసా కేంద్రం భవనాల నిర్మాణానికి స్థలమిచ్చిన దాతను కూటమి నేతలు తీవ్ర వేధింపులకు గురిచేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రు గ్రామానికి చెందిన 75 ఏళ్ల పచ్చవ కోటేశ్వరరావు రెండు పర్యాయాలు గ్రామ ఉపసర్పంచ్‌గా పనిచేశారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. 2020 ఆగస్టు 28న పచ్చవ వెంకటేశ్వర్లు కుమారుడు అనిల్‌కుమార్ వద్ద 20 సెంట్లు కొనుగోలు చేశారు. ఈ స్థలంలో 10 సెంట్లు సచివాలయ నిర్మాణానికి, 5 సెంట్లు రైతు భరోసా కేంద్రానికి దానపత్రం రాసి రిజిస్టర్ జరిపింపారు. అప్పటి పంచాయతీ కార్యదర్శి భార్గవ్‌కు దస్తావేజులను అందించారు. 20 సెంట్లలో 15 సెంట్లు దానమివ్వగా మిగిలిన 5 సెంట్లలో సెంటున్నరను రైతు భరోసా కేంద్రానికి దారి నిమిత్తం వదిలిపెట్టారు. రెండు రోజుల క్రితం ఆ మూడున్నర సెంట్లలో తన గేదెలకు షెడ్డు వేసేందుకు గుంతలు తీయించారు. ఇక్కడ ఆయనకు స్థలం లేదని గ్రామ టీడీపీ నాయకులు దౌర్జన్యం చేశారు. షెడ్డు కోసం తీసిన గుంతలను పూడ్చివేయటమే కాక ఇదేమని అడిగినందుకు కోటేశ్వరరావుపై చేయి చేసుకున్నారు. దీంతో కిందపడటంతో స్వల్పగాయాలయ్యాయి. ఇంతటితో వదలక కోటేశ్వరరావుపై నాదెండ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ నిమిత్తం గత రెండు రోజులుగా పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఉదయం నుండి రాత్రి వరకూ అక్కడే ఉంచుతున్నారు. గ్రామంలోకి వెళ్తే గొడవ అవుతుందని, టీడీపీ నాయకులు ఒప్పుకోవటం లేదంటూ పోలీసులు చెబుతున్నారు. దీనిపై బాధిత మాజీ ఉపసర్పంచ్ కోటేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గతంలో సచివాలయం, ఆర్బీకే భవనాలపై దాతలు పచ్చవ కోటేశ్వరరావు, పెద్దబ్రహ్మమ్మ దంపతుల పేరిట శిలాఫలకాలు ఏర్పాటు చేశారన్నారు. సచివాలయ నిర్మాణానికి రూ.40 లక్షలు, ఆర్బీకే నిర్మాణానికి రూ.21.80 లక్షల వ్యయంతో పనులు చేశామన్నారు. సంబంధిత బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, నేటి వరకూ రూ.47 లక్షలు మాత్రమే వచ్చాయన్నారు. మరో రూ.14 లక్షలు రావాల్సి ఉందన్నారు. గ్రామంలోని టీడీపీ నాయకులు తనపై దౌర్జన్యం చేస్తున్నారని, పోలీసులతో ఇబ్బందులకు గురిచేయించటం ఎంతవరకు సబబని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పంచాయతీ ఇన్చార్జి కార్యదర్శి రాఘవయ్య ప్రోద్బలంతోనే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఎం.ప్రసాద్, పి. శౌరిరాజులు తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సచివాలయం, ఆర్బీకే భవనాలకు 15 సెంట్లు దానమిచ్చిన కోటేశ్వరరావు మాజీ ఉప సర్పంచ్, 75 ఏళ్ల వృద్ధుడిపై టీడీపీ నేతల దాడి -
పర్యవేక్షణ అధికారి పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
నరసరావుపేట రూరల్: జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పోస్ట్‌కు ఫారిన్ సర్వీస్‌పై పనిచేయుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ వి.సుబ్బారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న అర్హులైన స్కూల్ అసిస్టెంట్ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. -
పసుపు రైతులకు త్వరితగతిన పరిహారం
తెనాలి: దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ గతేడాది జనవరిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు చెల్లించాల్సిన పరిహారంపై రైతు సంఘం నేతలు గురువారం తెనాలిలో సబ్ కలెక్టర్ సంజనా సింహాను కలిశారు. రైతులకు రావాల్సిన పరిహారంపై ప్రభుత్వం ఇచ్చిన హామీని త్వరితగతిన నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. బాపట్ల జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వేములపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కోల్ట్ స్టోరేజీ అగ్ని ప్రమాదం దుర్ఘటనకు సంబంధించి, మొత్తం 380 మంది పసుపు రైతులకు పరిహారం అందాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వం ఆమోదించిన పరిహారం మొత్తాన్ని ఒకే విడతలో చెల్లించాలని కోరామని, సబ్ కలెక్టర్ సంజనా సింహ ఈ విషయంపై సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివ సాంబిరెడ్డి మాట్లాడుతూ పసుపు రైతులకు పరిహారంపై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఎనిమిది నెలల క్రితం ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరకపోవడంపై విచారం వ్యక్తంచేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, వెంటనే పరిహారం ఇప్పించేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య, గద్దె శ్రీహరి, పోతురాజు కోటేశ్వరరావు, పేర్ని రవి, గుళ్లపల్లి సుబ్బారావు, యర్రు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సబ్ కలెక్టర్‌ను కోరిన రైతు సంఘం బృందం -
గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుపుతున్న గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి అర్హత గల విద్యార్థులు ఈనెల 31లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని గుంటూరు జిల్లా కన్వీనర్ టి. జయప్రకాష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాడికొండలోని ఏపీఆర్ స్కూల్ (జనరల్) బాలురు, గుంటూరులోని మైనార్టీ బాలికలు, బాలుర పాఠశాలల్లో 5వ తరగతితో పాటు 6,7,8 తరగతుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు ఏపీఆర్ఎస్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. పాత గుంటూరు నందివెలుగు రోడ్డులోని ఏపీఆర్జేసీ మైనార్టీ బాలుర జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు వెబ్‌సైట్‌తో పాటు 87126 25038 నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు. -
సీనియార్టీ జాబితాలో లోపాలు సవరించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యాశాఖ విడుదల చేసిన మున్సిపల్ ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలో లోపాలను సవరించాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుకకు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ (ఎన్టీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.హైమారావు విజ్ఞప్తి చేశారు. గురువారం డీఈవో కార్యాలయంలో రేణుకను కలసిన ఎన్టీఏ నాయకులు ఆమెకు వినతిపత్రం సమర్పించారు. ఉపాధ్యాయుల సీనియార్టీని పరిగణలోకి తీసుకోకపోవడంతో పాటు ఇతర మేనేజ్మెంట్ల నుంచి వచ్చిన ఉపాధ్యాయులను జూనియర్లుగా చూపలేదని డీఈవో దృష్టికి తెచ్చారు. జాబితాలోని తప్పులను సవరించాలని కోరారు. దీనిపై డీఈవో మాట్లాడుతూ సీనియార్టీ జాబితాలో తప్పులు దొర్లిన నేపథ్యంలో ఉపాధ్యాయులు తగు ఆధారాలతో ఈనెల 10లోపు ఫిర్యాదు చేయాలని సూచించారు. డీఈవోను కలసిన వారిలో ఎన్టీఏ గుంటూరు జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖలీల్, గుంటూరు నగర శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయి విశ్వనాఽథ్, పి. లలితబాబు, గౌరవాధ్యక్షుడు ఏవీ కృష్ణారావు ఉన్నారు. -
భవనాశి కాలువలో కొండచిలువ
అద్దంకి: భవనాశి కాలువలో కొండ చిలువ కలకలం రేపింది. అయితే కొందరికి మొసలి కూడా కనిపించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం పట్టణానికి చెందిన సుద్దపల్లి కోటయ్య వాగులో కొండచిలువ ఉందని ఫారెస్ట్ అధికారులకు అందిన సమాచారం మేరకు.. నరసింహపురం సమీపంలోని భవనాశి కాలువను పరిశీలించారు. అలాగే ముగ్గు వాగులో మొసలి సంచిరిస్తుందని నంగవరపు సుధీర్ ఇచ్చిన సమాచారం మేరకు అక్కడా పరిశీలించారు. ఈ క్రమంలో భవనాశి కాలువలో కొండచిలువను గుర్తించామని అధికారి తెలిపారు. ముగ్గు వాగులో మొసలి జాడలు కనిపించలేదని, అయినా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. మరలా మొసలి సంచారం కనిపిస్తే తమకు తెలియజేయాలని స్థానిక రైతులకు చెప్పారు. ముగ్గు వాగులో మొసలి? జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారుల హెచ్చరిక -
పరీక్ష కేంద్రాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి
నిజాంపట్నం: పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని డిప్యూటీ డీఈవో కేసనశెట్టి సురేష్ అన్నారు. ఈనెల 17వ తేదీ నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో మండలంలో ఏర్పాటు చేసిన పలు పరీక్ష కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన బెంచీలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాల ఆవరణంలో ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పాఠశాలకు 100 మీటర్ల వరకు ఎవరూ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈవోలు ఆర్.శోభాచంద్, జీ.శేషుగోపాలం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ డీఈవో సురేష్ -
ఎక్కడా రాజీ పడొద్దు.. గట్టిగా గళం వినిపించండి: వైఎస్ జగన్
తాడేపల్లి: ఈనెల 10వ తేదీ నుంచి పార్లమెంటు మలి విడత బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంప్ ఆఫీస్‌లో సమావేశమయ్యారు. ఉభయ సభల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, రాష్ట్ర సమస్యలపై పార్లమెంటు ఉభయ సభల్లో పార్టీ ఎంపీలు గట్టిగా గళం వినిపించాలని సమావేశంలో వైఎస్ జగన్ ఆదేశించారు.టీడీపీ ఎంపీలు ఉన్నా నిమ్మకు నీరెత్తినట్లు..రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం పార్లమెంటు ఉభయ సభల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఈ సందర్భంగా సమావేశంలో చర్చ జరిగింది. రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు కాగా, ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఎత్తు ఎంతో కీలకమని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అలాంటి ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు అన్నది రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం అని, కేంద్ర క్యాబినెట్లో ఇద్దరు టీడీపీ మంత్రులు ఉన్నా, వారు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించక పోవడం దారుణమని ఆయన అన్నారు.కాగా, రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా, రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ టీడీపీ ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని సమావేశంలో వైయస్సార్సీపీ ఎంపీలు ప్రస్తావించారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్లేందుకు తాము వెనకాడ్డం లేదని, టీడీపీ ఎంపీలతో కలిసి ప్రధాని సహా కేంద్రంలో సంబంధిత మంత్రులను కలవాలని కూడా ప్రతిపాదించామని, కానీ టీడీపీ ఎంపీలు ముందుకు రాలేదని వైఎస్సార్సీపీ ఎంపీలు వెల్లడించారు. పోలవరం ఎత్తు విషయంలో రాష్ట్రం తరఫున పార్లమెంటులో గట్టి పోరాటం చేయాలని, ఈ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని పార్టీ ఎంపీలను వైఎస్ జగన్ ఆదేశించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఎలాగైనా కాపాడుకోవాలి..అలాగే ఆంధ్రుల హక్కుగా, ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఎలాగైనా కాపాడుకోవాలని, ఆ సంస్థ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలకు వ్యతిరేకంగా పార్టీ ఎంపీలు పోరాడాలని వైఎస్ జగన్ నిర్దేశించారు. నియోజకవర్గాల పునర్విభజనపై రకరకాలుగా చర్చ జరుగుతోందని, దీని వల్ల ఉత్తరాదిలో పెరిగనట్లుగా దక్షిణాదిన సీట్లు పెరగవన్న ప్రచారం సాగుతోందని సమావేశంలో ఎంపీలు వెల్లడించారు. దీనిపై స్పందించిన వైఎస్జగన్, నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్రం నుంచి స్పష్టత వచ్చేలా పార్లమెంటలో ప్రస్తావించాలని సూచించారుబ్యాలెట్ విధానంలో ఎన్నికల కోసం డిమాండ్ చేయండివన్ నేషన్. వన్ ఎలక్షన్’పై ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉందని గుర్తు చేసిన ఎంపీలు.. ఒకేసారి కేంద్రం, రాష్ట్రంలో జరిగే ఎన్నికలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన వైఎస్ జగన్.. కేంద్రం, రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ విధానంలో ఎన్నికల కోసం డిమాండ్ చేయాలని నిర్దేశించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని, మొదట్లో ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించిన దేశాలు కూడా, ఆ తర్వాత బ్యాలెట్ విధానానికి మళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజారోగ్య రంగంపై పార్లమెంట్లో ప్రస్తావించండినిరుపేదలకు వైద్య విద్యను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలు పెట్టగా, వాటిలో పూర్తైన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దిశలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై సమావేశంలో ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారోగ్య రంగంపై సీఎం చంద్రబాబు కత్తికట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఎంపీలు ప్రస్తావించగా, ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని వైఎస్ జగన్ ఆదేశించారు.పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్నారు..పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడంతో పాటు, ప్రతి జిల్లాలో పేదలకు అత్యాధునిక వైద్యాన్ని ఉచితంగా అందించే ఉద్దేశంతో కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని వైఎస్ జగన్ వెల్లడించారు. ఎన్నో వ్యవప్రయాసలకోర్చి, అన్ని రకాలుగా నిధులు, భూములు సేకరించి కాలేజీలను నిర్మించామని, కానీ ఈరోజు వాటిని ప్రైవేటుపరం చేస్తూ మంచి ఉద్దేశాలను నీరు గారుస్తున్నారని, అందుకే ఈ అంశాన్ని పార్లమెంటులో గట్టిగా ప్రస్తావించాలని స్పష్టం చేశారు వైఎస్ జగన్. వైఎస్ జగన్ భద్రతపై ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన ఎంపీలువైఎస్ జగన్ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా తప్పు బట్టిన ఎంపీలు.. మాజీ ముఖ్యమంత్రిగా, జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న నేతకు తగిన భద్రత కల్పించడం లేదని ఆక్షేపించారు. జగన్‌గారి గుంటూరు మిర్చి యార్డు సందర్శన సమయంలో, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయకపోవడాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా విడిచి పెట్టబోమన్న వారు, ప్రజా నాయకుడిగా ఉన్న జగన్ ప్రజల్లోకి వెళ్లకుండా నిరోధించడానికి, ఆయనకు భద్రతా సమస్యలు సృష్టించడానికి ఇలాంటి చర్యలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. అందుకే ఈ విషయాన్ని కూడా పార్లమెంటులో గట్టిగా లేవనెత్తుతామని వైఎస్సార్సీపీ ఎంపీలు వెల్లడించారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (వైఎస్సార్సీపీ) నేత వై.వీ.సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రాజ్యసభలో వైఎస్సార్సీపీ నాయకుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌తో పాటు, ఎంపీలు గొల్ల బాబూరావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎం.గురుమూర్తి, తనూజారాణి, రఘునాథరెడ్డి ఇంకా పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
‘ఇది మోసపూరిత బడ్జెట్.. చంద్రబాబు చేతులెత్తేశారు’
తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబుది మోసపూరిత బడ్జెట్ అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారనే విషయాన్ని తమ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఆధారాలతో బయటపెట్టారన్నారు. ఈరోజు(గురువారం) చంద్రబాబు మోసపూరిత బడ్జెట్ పై వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి.. ‘ సూపర్ సిక్స్ సహా 143 హామీలు అమలు చేయలేక చంద్రబాబు చేతులెత్తేశారు. జగన్ రూ. 14 లక్షల కోట్లు అప్పు చేసినట్లు చంద్రబాబు విష ప్రచారం చేశారు. చివరకు గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అప్పు రూ. 6 లక్షల కోట్లే అని తేల్చారు. అంటే ఇచ్చిన హామీల అమలను ఎగ్గట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆడబిడ్డ నిధి కింద చంద్రబాబు రూ. 36 వేల కోట్లు ఎగ్గొట్టారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా చంద్రబాబు వ్యాఖ్యలునిరుద్యోగులకు రూ.52 వేల కోట్లు బకాయి పెట్టారు. తల్లికివందనం కింద రూ.13,050 కోట్లు అవసరమైతే రూ.8 వేల కోట్లి మాత్రమే కేటాయించారు. అంటే ఇది ఎగ్గొట్టే ఉద్దేశం కాదా? , అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేల కోట్లు ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ మహిళలకు రూ. 45 వేల కోట్లు ఎగ్గొట్టారు. దీపం పథకం కింద అరకొర నిధులే కేటాయించారు. పెన్షన్ కూడా ఇప్పటికే 4 లక్షల మందికి కట్ చేశారు . అమరావతి అద్బుతదీపం అన్నారు. వేల కోట్లు అప్పు తెచ్చి కడుతున్నారు. టీడీపీ వారికి తప్ప ఇంకెవరికీ పనులు చేయవద్దంటూ ప్రజాస్వామ్య విరుద్ధంగా మాట్లాడారు. ఆయన మాటలు చూస్తుంటే చంద్రబాబు బుర్ర పని చేయటం లేదనిపిస్తోంది.పవన్ అధికారాన్ని వదిలేసి ప్రతిపక్ష హోదా తీసుకో.. పవన్ కళ్యాణ్ అధికారాన్ని వదిలేసి ప్రతిపక్ష హోదా తీసుకోవాలి. జగన్ ఎవరి దయాదాక్షణ్యంతో రాజకీయాలలోకి రాలేదు. ఢిల్లీ కోటని ఢీకొట్టి మరీ వచ్చారు. లోకేష్ లాగా తన తండ్రిని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి రాలేదు. చంద్రబాబు అంత నీచుడు, 420 మరెవరూ లేరని ఎన్టీఆర్, హరికృష్ణ, నారా రామ్మూర్తి ఆత్మలు ఘోషిస్తున్నాయి. లోకేష్ చేస్తున్న దుర్మార్గాలకు ఈసారి ఘోర ఓటమి తప్పదు. నాదెండ్ల మనోహర్ బియ్యం దొంగ, లంచాల కోరు. పీడిఎస్ బియ్యం అమ్ముకుంటున్న దొంగ నాదెండ్ల మనోహర్. తనిఖీల పేరుతో బెదిరించి కోట్లకు కోట్లకు వసూలు చేస్తున్నారు. మాది పోరాటం చేసి, రాటు తేలిన రాజకీయ పార్టీసూపర్ సిక్స్ హామీల అమలుకు రూ.79,876 కోట్లు అవసరమా? కాదా?, మరి మీరు కేటాయించినది ఎంత? అనేదానికి సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ మీద కాపులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎంతోమంది బీసీలు, కాపులను వదిలేసి తన అన్నకు పదవులు ఇవ్వటం కరెక్టు కాదు. నమ్ముకున్న వారిని నట్టేట ముంచవద్దని పవన్ కళ్యాణ్ ని కోరుతున్నాను. చంద్రబాబు కుట్రల మీద దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలో పుస్తకం రాశారు. ఇప్పుడు ఇద్దరూ ఒకే వేదిక మీదకు వచ్చారు. మా పార్టీ నేతలపై పెట్టే అక్రమ కేసులు నిలపడవు. సోనియా గాంధీ ఎన్ని కేసులు పెట్టినా జగన్ నిలపడ్డారు. మాది పోరాటం చేసి, రాటు తేలిన రాజకీయ పార్టీ. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటానికి మేము సిద్దమే. బూతులు తిట్టే అయ్యన్నపాత్రుడు స్పీకర్ అంట’ అని ధ్వజమెత్తారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన నందీపుర పీఠాధిపతులు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కర్ణాటకలోని విజయనగర జిల్లా నందీపుర పీఠాధిపతులు గురువారం కలిశారు. భూమిపూజకు ఆయనను ఆహ్వానించారు. ఏప్రిల్ 30న నందీపురలో ప్రపంచంలోనే ఎత్తయిన 108 అడుగుల శ్రీఅర్ధనారీశ్వరస్వామి విగ్రహానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు.వైఎస్ జగన్‌కు పీఠాధిపతులు శ్రీ డా.మహేశ్వర స్వామీజీ (నందీపుర పుణ్యక్షేత్రం), శ్రీ ష.బ్ర. పంచాక్షరి శివాచార్య స్వామీజీ (హీరే మఠం, బెన్నిహళ్ళి), శ్రీ జడేశ్వర తాత (శక్తి పీఠం, వీరాపుర), శ్రీ కృష్ణపాద స్వామీజీ (భుజంగ నగర్, సండూర్) ఆహ్వానపత్రిక అందజేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ ఎంఎల్సీ డాక్టర్ ఎ.మధుసూదన్, రామచైతన్య (ఫౌండర్, అర్ధనారీశ్వర ఫౌండేషన్), వీరేష్ ఆచార్య (కో-ఫౌండర్, అర్ధనారీశ్వర ఫౌండేషన్) పాల్గొన్నారు. -
AP High Court: పోసాని కృష్ణమురళికి ఊరట
సాక్షి, అమరావతి: ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై చిత్తూరు, విశాఖ జిల్లాల్లో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం పోలీసులను గురువారం ఆదేశించింది.పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 30 ఫిర్యాదుల ఆధారంగా.. 16 కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్‌లను దూషించారంటూ ఇటు టీడీపీ, అటు జనసేన శ్రేణులు ఫిర్యాదులు చేయడంతో ఈ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో.. ఫిబ్రవరి 28వ తేదీన రాత్రి హైదరాబాద్‌లోని నివాసంలో పోసానిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ మీద ఆయన్ని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. ఆపై పీటీ వారెంట్ల మీద పల్నాడు జిల్లా నరసరావుపేట, అటు నుంచి కర్నూల్ సెంట్రల్ జైలుకు రిమాండ్ మీద తరలించారు. అయితే ఉద్దేశపూర్వకంగా ఒక్కో జిల్లా తిప్పుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగానే.. తన పైన నమోదైన కేసులను కొట్టివేయాలంటూ పోసాని కృష్ణ మురళి క్వాష్ పిటిషన్(Posani Quash Petition) వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. రెండు జిల్లాల్లో నమోదైన కేసుల నుంచి కాస్త ఊరట ఇచ్చింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
తమ్ముడికి శుభాకాంక్షలు.. పవన్‌పై అంబటి రాంబాబు సెటైర్లు
సాక్షి, తాడేపల్లి: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘‘అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.కాగా, శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ఖరారు చేశారు. ఈ మేరకు బుధవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘నాగబాబు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీకి సేవలందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు పార్టీ సమాచారం ఇచ్చింది. పార్టీ పరంగా కూడా నామినేషన్‌కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పవన్‌కళ్యాణ్ ఆదేశించారు.’ అని తెలిపింది. కాగా, ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.అయితే, నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై టీడీపీలో కొందరు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా సోషల్ మీడియా వేదికగా నాగబాబును విపరీతంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.. పదేళ్లుగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని వ్యక్తిని.. ఇలా ఎమ్మెల్సీ కోటాలో మంత్రిని చేయడం ఏంటంటూ పోస్టులు పెట్టారు. గతంలో నారా లోకేష్‌ను టార్గెట్ చేసుకుని నాగబాబు చేసిన పోస్టులను కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. ఆ పోస్టుల వెనుక.. మంత్రి నారా లోకేష్ ఉన్నాడనే చర్చ కూడా నడిచింది.2024 ఎన్నికల కోసం టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుగా వెళ్లాయి. ఆ టైంలో అనకాపల్లి ఎంపీ పోటీ కోసం నాగబాబు తెర వెనుక ప్రయత్నాలు చేసినప్పటికీ.. పొత్తు అడ్డం వచ్చింది. అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నించినా అదీ కుదరలేదు. ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఒక్కరోజు గడవకముందే.. టీటీడీ బోర్డు చైర్మన్ పదవి మెగా బ్రదర్‌కే అంటూ ఓ ప్రచారం నడిచింది. కానీ, చంద్రబాబు దాన్ని కూడా లాగేసుకున్నారు. ఆపై ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి నాగబాబుకే దక్కవచ్చనే చర్చా నడిచింది. అది జరగలేదు. మొత్తం మీద తమ్ముడి సాయంతో నాగబాబు త్వరలో ఏపీకి మంత్రి కాబోతున్నారమాట.. అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు!@NagaBabuOffl @PawanKalyan— Ambati Rambabu (@AmbatiRambabu) March 6, 2025 -
తాడో పేడో తేల్చుకుంటాం.. విజయవాడకు భారీగా చేరుకున్న ఆశావర్కర్లు
సాక్షి, విజయవాడ: ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకొనేందుకు ఆశావర్కర్లు సిద్ధమవుతున్నారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. గత సమ్మె కాలంలో ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాలపై జీవోలు విడుదల చేయాలని ఆశావర్కర్లు కోరుతున్నారు. ఇప్పటికే రెండు రోజుల పాటు ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.గురువారం.. అన్ని జిల్లాల నుంచి ధర్నా చౌక్‌కు భారీగా చేరుకున్న ఆశా వర్కర్లు.. రోడ్లపై సైతం కార్పెట్లు వేసుకుని ఎండలో ధర్నాకు దిగారు. ఆశా వర్కర్ల కదలికలపై డ్రోన్లు, ఇంటిలిజెన్స్ బృందాల ద్వారా పోలీసులు నిఘా పెట్టారు. ధర్నాచౌక్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.దాదాపు 10 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంటుందని యూనియన్ నాయకులు అంటున్నారు. ఆర్ముడ్ రిజర్వ్, సివిల్, ర్యాపిడ్ యాక్షన్ టీంలను పోలీసులు సిద్ధం చేశారు. ఏడీసీపీ, ఏఎస్పీ, ముగ్గురు డిఎస్పీలు, నలుగురు సీఐలు, ఇతర సిబ్బందితో భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్వష్టమైన ప్రకటన చేస్తే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని ఆశా వర్కర్లు చెబుతున్నారు. -
శాసనమండలిలో వైఎస్సార్సీపీ వర్సెస్ టీడీపీ
👉బడ్జెట్‌పై చర్చలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రసంగాన్ని అడ్డుకున్న మంత్రులు👉రెండున్నర కోట్ల మంది మహిళలు మోసపోయారు👉తల్లికివందనం లబ్ధిదారులను వంచన చేశారు👉అన్నదాతలకు వెన్నుపోటు పొడిచారు👉నిరుద్యోగ భ్రుతిని భ్రాంతికి కలిగించారు👉మహిళల మాన ప్రాణాల్ని పణంగా పెట్టి ఈ బడ్జెట్ ని రూపొందించారు👉ఇది బాహుబలి బడ్జెట్ కాదు.. కట్టప్ప బడ్జెట్👉హామీలను నమ్మి ఓట్లేసిన ప్రజలను కట్టప్పలా వెన్నుపోటు పొడిచారు👉మేడిపండులా ఈ బడ్జెట్ ఉంది👉టీడీపీ నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన బాండ్లను ఇప్పుడు ప్రజల్లోకి తీసుకుని వెళ్లగలరా..?👉ఎన్నికల్లో వచ్చేది బాబే...ఇచ్చేది బాబే అన్నారు...👉బాబు వచ్చారు.. ఏమిచ్చారు..👉మద్యం అమ్మకాలను పెంచుతామని బడ్జెట్ లో చెప్పడం దారుణం👉ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రసంగాన్ని అడ్డుకున్న మంత్రులు బాల వీరాంజనేయ స్వామి, అనిత👉మద్యం కోసం మాట్లాడే అర్హత లేదంటూ మంత్రి బాలవీరాంజనేయులు వ్యాఖ్యలు👉ఎన్టీఆర్ తెచ్చిన మద్య నిషేధం ఎత్తేసింది చంద్రబాబు కాదా..? అంటూ కౌంటర్ ఇచ్చిన వరుదు కళ్యాణి👉మద్యం అమ్మకాలను పెంచి ఆదాయం పెంచుతామని చెప్పడం దారుణం👉25 శాతం అమ్మకాలు పెంచి ఆదాయం పెంచుతామనడం దారుణం కాదా..?👉మద్యం ద్వారా 27 వేల కోట్ల ఆదాయం పెంచుతామనడం సమంజస మేనా..?👉ఆడబిడ్డ నిధి, , ఉచిత బస్సు , తల్లికివందనం, 50 ఏళ్లకే పెన్షన్ పథకానికి నిధులు ఎగనామం పెట్టారు👉తొమ్మిది నెలల్లోనే 1.35 లక్షల కోట్ల అప్పు చేసిన ఈ ప్రభుత్వానిదే ఆర్థిక విధ్వంసం👉మండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ వాయిదా తీర్మానం👉ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ మంజూరు హామీపై చర్చించాలని వాయిదా తీర్మానం👉చంద్రబాబు మోసాలను శాసన మండలిలో ఎండగడుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు 👉మండలి సాక్షిగా ఆడుదాం ఆంధ్రాపై టీడీపీ అబద్ధపు ప్రచారం గుట్టురట్టు👉ఆడుదాం ఆంధ్రాలో ఎలాంటి అక్రమాలు జరగలేదని శాసన మండలిలో కూటమి సర్కార్ ప్రకటన👉తల్లికి వందనంపై పచ్చి దగా.. మండలి సాక్షిగా అడ్డంగా దొరికిపోయిన లోకేష్👉వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నతో తల్లికి వందనంపై మంత్రి నారా లోకేష్ తప్పుడు లెక్కలు విడుదల చేసి అడ్డంగా దొరికిపోయారు👉అన్నదాతలను పట్టించుకోని కూటమి సర్కార్..👉పంటలు పండక, పండినవాటికి మద్దతు ధర లేక అన్నదాతలు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ ఆగ్రహం👉నిన్న (బుధవారం) అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడి చర్చ నడిచింది.👉2014–19 మధ్య రైతులను రుణమాఫీ పేరిట వంచించారు👉అన్నదాత సుఖీభవను అర్హులైన అందరికీ అందించాలి👉సర్కారు వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ వాకౌట్ -
గరుడ వాహనంపై శ్రీవారి నగరోత్సవం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): స్థానిక బృందావన్గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న అష్టబంధన మహా సంప్రోక్షణ సమేత మహాకుంభాభిషేక మహోత్సవాలు బుధవారం కొనసాగాయి. ప్రత్యేకంగా అలంకరించిన గరుడ వాహనంపై ఉభయదేవి సమేతుడైన స్వామి ఉత్సవమూర్తులకు వైభవంగా నగరోత్సవాన్ని నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, కోలాటాలు, వేషధారణలు, గుర్రాలు, డప్పు వాయిద్యాలతో ప్రధాన వీధుల్లో ఊరేగింపు కొనసాగింది. అనంతరం భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో తపోవనం, శ్రీమాతా శివచైతన్య మాతాజీ (నులకపేట) పర్యవేక్షణలో చండీ హోమం, పూర్ణాహుతి, డాక్టర్ కోగంటి వేంకటశ్రీరంగనాయకి నిర్వహణలో లలిత పారాయణ, సువాసిని సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. అనంతరం సాహితీవేత్తలు ముప్పవరపు సింహాచలశాస్త్రి, నారాయణం శేషుబాబు, మహా కుంభాభిషేక విశేషాలు, బ్రహ్మోత్సవాల విశిష్టతను భక్తులకు వివరించారు. విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య, బీజేపీ నేతలు చెరుకూరి తిరుపతిరావు, యడ్లపాటి స్వరూపారాణి, పీవీ శంకరరావు (వికాస్ విద్యా సంస్థలు), ప్రముఖ వ్యాపారవేత్త మందలపు బంగారుబాబు ప్రసంగించారు. టీటీడీ ఆగమశాస్త్ర పండితులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, అగ్నిహోత్ర శోభనాచల లక్ష్మీనరసింహాచార్యుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ నిర్వాహకులు బొల్లేపల్లి సత్యనారాయణ, సాహితీవేత్త నోరి నారాయణమూర్తి, ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్ మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, సూర్యదేవర వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, కన్నెగంటి బుచ్చయ్యచౌదరి, బండారు సాంబశివరావు పాల్గొన్నారు. -
టెన్త్ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు
గుంటూరు ఎడ్యుకేషన్: ఈనెల 17 నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక చెప్పారు. ఆమె ‘‘సాక్షి’’తో మాట్లాడుతూ జిల్లాలో టెన్త్ పబ్లిక్ పరీక్షలకు 30,410 మంది విద్యార్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో 150 కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఈనెల 17 నుంచే జరగనున్న దూరవిద్య టెన్త్ పబ్లిక్ పరీక్షలకు రెగ్యులర్ కేంద్రాల్లోనే ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల్లో ఫర్నిచర్‌తోపాటు వేసవి దృష్ట్యా ఫ్యాన్ల ఏర్పాటు, చల్లని తాగునీరు, టాయిలెట్లు మౌలిక వసతుల కల్పనపై పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు వివరించారు. జిల్లా జైలులో తొలిసారిగా పరీక్ష కేంద్రం ప్రస్తుత ఏడాది దూరవిద్య టెన్త్ పరీక్షల కోసం జిల్లా జైలులోని ఖైదీలకు తొలిసారిగా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు డీఈఓ చెప్పారు. అక్కడ పరీక్ష రాసే ఖైదీల కోసం చీఫ్ సూపరింటెండెంట్, డీవోను నియమిస్తున్నట్లు వివరించారు. హాల్ టికెట్‌తో నేరుగా పరీక్ష రాసేందుకు వెళ్లవచ్చు ● పరీక్ష ఫీజు చెల్లించిన ప్రతి విద్యార్థికీ ప్రభుత్వ పరీక్షల విభాగం హాల్ టికెట్ జారీ చేసిందని, హాల్ టికెట్లను పాఠశాలల హెచ్ఎం లాగిన్‌లో ఉంచినట్లు డీఈఓ చెప్పారు. ● ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన 95523 00009 నంబరుకు వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ పంపడం ద్వారా హాల్ టికెట్ పొందవచ్చునని వివరించారు. ● డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో విద్యార్థులు నేరుగా పరీక్షలు రాసేందుకు వెళ్లవచ్చునని, ఎవరి అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు. ● ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనుండగా, విద్యార్థులు గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఈనెల 17 నుంచి ప్రారంభం ఫీజు చెల్లించిన అందరికీ హాల్‌టికెట్లు జారీ డీఈఓ సీవీ రేణుక -
దివ్యోత్సవం.. నేత్రోత్సవం
మంగళగిరి/మంగళగిరి టౌన్: మంగళాద్రిలోని శ్రీలక్ష్మీ నరసింహుని బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే శ్రీవారిని, అమ్మవార్లను పంచామృత స్నపనతో మంగళస్నానం చేయించారు. అనంతరం స్వామిని పెళ్లి కుమారుడిగా, అమ్మవార్లను పెళ్లి కుమార్తెలుగా అలంకరించారు. తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారు భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెళ్లికుమారుడి ఉత్సవానికి మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం వారు కైంకర్యపరులుగా వ్యవహరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉత్సవాన్ని ఆలయ ఈఓ రామకోట్టిరెడ్డి పర్యవేక్షించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 13న స్వామి దివ్య కల్యాణం, 14న రథోత్సవం జరుగుతాయని వివరించారు. లక్ష్మీనరసింహుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం పెళ్లి కుమారుడిగా శ్రీవారు 13న కల్యాణ మహోత్సవం 14న స్వామి రథోత్సవం -
గుడారాల పండగ ఏర్పాట్ల పరిశీలన
అమరావతి : గుడారాల పండగ ఏర్పాట్లను బుధవారం ఎస్పీ పరిశీలించారు. ఆయన హోసన్నా దయాక్షేత్రం ప్రాంగణంలో పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నియంత్రణ, కంట్రోల్ రూం వంటి అంశాలపై నిర్వాహకులతో చర్చించారు. పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు, నిర్వాహకులు అబ్రహం, జాన్‌వెస్లీ, అనీల్, సీఐ అచ్చియ్య పాల్గొన్నారు. నేడు మద్యం దుకాణాలకు లాటరీ నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : గీత కులాలకు కేటాయించిన 13 మద్యం దుకాణాలకు గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఎస్ఆర్ శంకరన్ హాలులో లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అరుణకుమారి బుధవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఉదయం 9 గంటలకు జరిగే లాటరీ ప్రక్రియకు మద్యం దుకాణానికి సంబంధించిన దరఖాస్తు, కుల ధృవీకరణ పత్రం, ఆధార్‌కార్డు, పాన్ కార్డ్‌లను తీసుకురావాలని సూచించారు. ప్రపంచబ్యాంక్ బృందం పర్యటన తాడికొండ: రాజధాని అమరావతిలో నిపుణులతో కూడిన ప్రపంచ బ్యాంక్ బృందం బుధవారం పర్యటించింది. రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రపంచ బ్యాంక్ బృందం నిర్దేశించిన కార్యక్రమాల అమలు, వాటి నిర్వహణ రూపకల్పనపై చర్చ జరిపింది. నీటి నిర్వహణ ప్రాజెక్టులు, పర్యావరణ, సామాజిక రక్షణకు రూపొందించిన కార్యకలాపాలు, ప్రొక్యూర్మెంట్ విషయాలపై ఏపీ సీఆర్డీయే అధికారులతో బృంద సభ్యులు మాట్లాడారు. కార్యక్రమంలో ప్రపంచ బ్యాంక్ కో టాస్క్ టీం లీడర్ గెరాల్డ్ ఒలీవర్ తదితరులు ఉన్నారు. వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి రూ.10.10 లక్షల విరాళం నగరంపాలెం: స్థానిక బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవస్థానం అవసరాల నిమిత్తం ప్రముఖ బిల్డర్ పులివర్తి శేషగిరిరావు కుమారులు డాక్టర్ వెంకటేష్, కమలేష్ రూ.10,10,116 చెక్కును బుధవారం కమిటీ అధ్యక్షులు సి.హెచ్.మస్తానయ్యకు అందజేశారు. కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య పాల్గొన్నారు. పోలీసుల నుంచి తప్పించుకోబోయి వ్యక్తి మృతి నరసరావుపేట టౌన్: పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు లాడ్జి పైనుంచి దూకి వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి పట్టణంలో చోటు చేసుకుంది. టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తెలంగాణ రాష్ట్రం తుకారాంగేట్‌కు చెందిన రాములు నాయక్ గుంటూరు పరిసరాల్లో జరిగిన చోరీల్లో అనుమానితుడిగా భావిస్తున్నారు. నరసరావుపేట కోర్టుకు వాయిదాకి వచ్చినట్లు తెలుసుకున్నారు. అనంతరం బస్టాండ్ సమీపంలోని లాడ్జికి వెళ్లాడు. గుంటూరు నుంచి వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాత్రూంకు వెళ్లి వస్తానని చెప్పి కిటికీలో నుంచి కిందకు దిగే ప్రయత్నం చేశాడు. ప్రమాదవశాత్తు జారి మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళా సాధికారతకు కృషి చేయాలి
గుంటూరు వెస్ట్: అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా జిల్లాలో వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర మహిళ శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిర్వహించిన వర్చువల్ సమావేశానికి స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్‌తోపాటు, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ సుప్రజ పాల్గొన్నారు. అనంతరం జరిగిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మహిళ సాధికారత జీవనోపాధి, మెరుగు దలకు ప్రభుత్వం నిర్ధేశించిన కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొన్నారు. మహిళ దినోత్సవ వేడుకలు ఈనెల 8న స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తల అమ్మకాలకు రూపొందించి ఈ– కామర్స్ యాప్ ద్వారా కొనుగోలు జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు జీవనోపాధి మెరుగు పరిచేందుకు ఈ–బైక్, ఈ–ఆటో, ఇతర స్వయం ఉపాధి పథకాల ద్వారా మంజూరు చేసిన యూనిట్లు, మహిళ దినోత్సవం నాటికి గ్రౌండింగ్ జరిగేలా బ్యాంకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ శాఖల ద్వారా మహిళ సంక్షేమం, ఆర్ధికాభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ ప్రాంగణంలో స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. మహిళ రక్షణకు అమలు చేస్తున్న కార్యక్రమాలపై పోలీసు శాఖ ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేయాలన్నారు. దీంతోపాటు, ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల ద్వారా ఆర్ధికాభివృద్ధి సాధించిన మహిళలకు సన్మానం కార్యక్రమం చేపట్టాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, పరిశ్రమల శాఖ జీఎం జయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాబాయి, మహిళ అభివృద్ధి సంక్షేమ శాఖ పీడీ ఉమాదేవి, మెప్మా పీడీ విజయలక్ష్మి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి -
పందికొక్కుల దాడిలో పసికందు మృతి!
నూజెండ్ల: ఊయలలో నిద్రిస్తున్న మూడు నెలల పసికందును పంది కొక్కులు కొరికి చంపిన ఘటన నూజెండ్ల మండలం రవ్వారం గ్రామంలో బుధవారం జరిగింది. రవ్వారం గ్రామానికి చెందిన నాయిని కొండ గురవయ్య, దుర్గమ్మలు గ్రామాల్లో తిరిగి గాజులు అమ్ముకుని జీవనం సాగిస్తుటారు. వీరికి ఒక పాప ఉంది. సమీపంలోని ఓ తండా నుంచి మూడునెలల బాబు కౌషిక్‌ను తెచ్చుకుని పెంచుకుంటున్నారు. ఎప్పటిలానే కొండ గురవయ్య గాజుల విక్రయానికి వెళ్లాడు. అదే సమయంలో పాప ఏడుస్తూ ఉండడంతో ఏదైనా కొని తెద్దామని తల్లి సమీపంలోని దుకాణానికి వెళ్లింది. ఈ సమయంలో ఊయలలో ఒంటరిగా ఉన్న కౌషిక్‌పై పందికొక్కులు దాడి చేశాయి. తల వెనుక భాగాన, ముఖం, కాలివేళ్లను కొరికివేశాయి. దుకాణం నుంచి వచ్చిన తల్లి పరిస్థితిని గమనించి వైద్యశాలకు తరలించేలోపు చిన్నారి మృతి చెందింది. ముక్కుపచ్చలారని చిన్నారికి జరిగిన దారుణం చూపరులను కంటతడి పెట్టించింది. -
అవినీతి శుద్ధిపూసలు
తెనాలిఅర్బన్: తెనాలి పురపాలక సంఘంలోని ఆరోగ్య విభాగానికి అవినీతి జబ్బు చేసింది. కొందరు శానిటరీ ఇన్స్పెక్టర్లు గైర్హాజరైన పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులకు అటెండెన్స్ వేసి వారి నుంచి నెలకు కొంత నగదు లంచంగా తీసుకుంటున్నారు. ఫలితంగా తెనాలి పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. తెనాలి పట్టణ జనాభా సుమారు రెండు లక్షలు. 40 వార్డులు ఉన్నాయి. వీటిని తొమ్మిది పారిశుద్ధ్య డివిజన్లుగా అధికారులు విభజించారు. వీటిలో రెండు డివిజన్లలో ప్రభుత్వ పారిశుద్ధ్య కార్మికులు పనులు చేస్తుండగా, మిగిలిన ఏడు డివిజన్లలో అవుట్ సోర్సింగ్ సిబ్బందితో పనులు చేయిస్తున్నారు. రోజూ పట్టణంలో 80 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. అటెండెన్స్ వేయించుకుని ఇళ్లకు.. తెనాలిలో పారిశుద్ధ్య నిర్వహణను నలుగురు శానిటరీ ఇన్స్పెక్టర్లు, నలుగురు హెల్త్ అసిస్టెంట్లు పర్యవేక్షిస్తారు. 82 మంది పర్మినెంట్, 320 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు, 40 మంది నగర దీపికలు పారిశుద్ధ్య పనులు చేస్తారు. శానిటరీ డివిజన్ కార్యాలయానికి ఉదయం 5 గంటలకు కార్మికులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు వచ్చి అటెండెన్స్ వేయించుకున్న తర్వాత కేటాయించిన ప్రాంతాలకు వెళ్తారు. పట్టణంలో మొత్తం 402 మంది కార్మికులు ఉంటే రోజూ పనికి వచ్చేది మాత్రం 350 మందే. ఉదయం అటెండెన్స్ కాగానే చాలా మంది ఇళ్లకు వెళ్లిపోతారు. రోజుకు రూ.వెయ్యి వసూలు పర్మినెంట్ వర్కర్లలో సగం మంది రోజూ పనికి రారు. వీరికి శానిటరీ ఇన్స్పెక్టర్లు అటెండెన్స్ వేసి రోజుకు రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తారనే ఆరోపణ ఉంది. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు విధులకు గైర్హాజరైతే వారి నుంచి రోజుకు రూ.500 చొప్పున వసూలు చేస్తారని సమాచారం. మున్సిపల్ కమిషనర్ ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేసి అటెండెన్స్‌లో తేడాలు గమనించారు. ఇన్స్పెక్టర్లను మందలించారు. బదిలీ వర్కర్ల(కార్మికుడు తన స్థానంలో మరొకరితో పని చేయించడం) పద్ధతీ పట్టణంలో పరిపాటిగా మారింది. మామూళ్లు మామూలే శానిటరీ ఇన్స్పెక్టర్లు వీధి దుకాణదారుల వద్ద, కబేళా వద్ద మాంసం విక్రేతల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. గ్యాంగ్ వర్కులోనూ దోపిడేనే... తెనాలిలో ఏదోఒక ప్రాంతంలో రోజూ గ్యాంగ్ వర్కు జరుగుతుంటుంది. సగటున 30 నుంచి 40 మందితో మురుగు కాలువలు బాగు చేయిస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే ముప్పావు మందీ పని చేయరు. ఇటీవల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఈ విషయాన్ని ప్రస్తవించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికై న ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే హెల్త్ సెక్షన్‌ను ప్రక్షాళన చేయాలి. తెనాలి మున్సిపల్ హెల్త్ విభాగంలో అక్రమాలు అరకొర సిబ్బందితోనే పారిశుద్ధ్య పనులు 402 మందికి పనిచేసేది 350 మందిలోపే విధులకు రాకుండానే కార్మికులకు హాజరు శానిటరీ ఇన్స్పెక్టర్ల చేతివాటం ప్రక్షాళన చేస్తున్నాం హెల్త్ సెక్షన్లో లోపాలున్న మాట వాస్తవం. ఇప్పటికే అధికారులు, సిబ్బందితో సమీక్షలు జరిపి ఆరోపణలు రాకుండా చూసుకోవాలని హెచ్చరించాం. కొద్ది రోజుల్లో పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. పారిశుద్ధ్య మెరుగుకు చర్యలు చేపడతాం. –బండి శేషన్న, కమిషనర్, తెనాలి పురపాలక సంఘం -
కొంపగోడు
గుంటూరుసుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు పిడుగురాళ్ల: నాగులగుడిలోని సుబ్రహ్మణ్యేరస్వామికి బుధవారం పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని భక్తులు దర్శనం చేసుకున్నారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 526.50 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 8,023 క్యూసెక్కులు విడుదలవుతోంది. పోలీసుల స్వచ్ఛ భారత్ తాడేపల్లిరూరల్: తాడేపల్లి పోలీస్ స్టేషన్లో బుధవారం పోలీసులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. స్టేషన్ ఆవరణలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శుభ్రం చేశారు. గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2025తెనాలి: ఇంటి నిర్మాణ అనుమతుల కోసం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానాన్ని అటు యజమానులు, ఇటు లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్, సర్వేయర్లు వ్యతిరేకిస్తున్నారు. స్వీయ ధ్రువీకరణతో గంటల వ్యవధిలోనే అనుతులు పొందే అవకాశాన్ని ఇస్తున్నామన్న పేరుతో ప్రభుత్వం ఇంటి యజమానులు, ప్లానర్ల మెడపై కత్తి పెట్టిందనే భావన వ్యక్తమవుతోంది. దీంతో గత రెండురోజులుగా కొత్త ఇళ్ల నిర్మాణాలకు ప్లాన్లు గీసే ప్రక్రియ నిలిచిపోయింది. ఇదే అంశంపై ఈనెల ఆరో తేదీన గుంటూరులో మున్సిపల్ రీజినల్ డైరెక్టర్‌తో సమావేశం జరగనుంది. టెక్నికల్ పర్సన్ల ఆందోళన దరఖాస్తులు, అనుబంధ పత్రాలు అప్లోడ్ చేసిన నాటినుంచి నిర్మాణ పనులు పూర్తి చేసేవరకు అన్ని దశల్లోనూ టెక్నికల్ పర్సన్లదే బాధ్యతని ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టంచేసింది. ఎక్కడైనా ఇంటి యజమానులు నిర్మాణాల్లో సాంకేతిక తప్పులు చేసినట్టు నిర్ధారణైతే సంబంధిత లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ లైసెన్సును ఐదేళ్లపాటు రద్దు చేస్తామని, తప్పు తీవ్రత ఆధారంగా చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశమూ ఉందని హెచ్చరించింది. ఆమోదిత లే అవుట్లలోనే నిర్మాణాలకు అనుమతులు తీసుకోవాలని, సర్వే రిపోర్టు, స్థలం విలువ ఆధారిత సర్టిఫికెట్ వంటివి తప్పనిసరని వివరించింది. ఇందుకు విరుద్ధంగా ఎవరైనా వ్యహరించినట్టు ఆకస్మిక తనిఖీల్లో వెలుగుచూస్తే అనుమతులు రద్దుచేస్తామని స్పష్టం చేసింది. దీంతో సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్లాను ఇచ్చిన తర్వాత యజమాని ఎక్కడైనా నిబంధన ఉల్లంఘిస్తే తమకెలా తెలుస్తుందని టెక్నికల్ పర్సన్లు ప్రశ్నిస్తున్నారు. ‘ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే, మేమే సమాచారం ఇవ్వాలట! అధికారులు వచ్చి కూలగొడతారట.. ఇదేం న్యాయం..’ అంటూ ప్లానర్లు ఆందోళన చెందుతున్నారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో టౌన్, సిటీ ప్లానింగ్ విభాగం ఉంటుంది. బిల్డింగ్ ఇన్స్పెక్టర్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు ఉంటారు. వాస్తవానికి అనధికార నిర్మాణాలను అడ్డుకోవాల్సిన బాధ్యత వీరిదే. అయితే కొత్త విధానంలో కేవలం లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్పైనే బాధ్యత పెట్టడం సరికాదనే వాదన వ్యక్తమవుతోంది. ఈనెల నుంచే అమలు 9చిన్న ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బంది నూతన విధానం 60, 100 150 గజాల్లో ఇళ్లు నిర్మించుకునేవారికి చాలా ఇబ్బందిగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలకు వసూలు చేస్తున్న ఫీజులు అధికం. దీనికితోడు కఠిన నిబంధనలతో చిన్న స్థలాల్లో ఇంటి నిర్మాణం సాధ్యం కాదని చెబుతున్నారు. ఆర్డీతో సమావేశం కొత్త జీవోతో తెనాలి పట్టణంలో నూతన ప్లాన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ఇదే విషయమై రీజనల్ డైరెక్టర్ బుధవారం గుంటూరులో లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు. ఇంటి నిర్మాణాలపై కొత్త పిడుగు అఫిడవిట్‌తో అనుమతికి ప్రభుత్వ జీఓ అమల్లోకి వచ్చిన కొత్త సాఫ్ట్వేర్ వ్యతిరేకిస్తున్న ఇంజినీర్లు, భవన యజమానులు కొత్త విధానంపై రాష్ట్ర ప్రభుత్వం గత నెలలోనే జీవో జారీచేసినా సాంకేతిక కారణాలతో ఈనెల నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై అనుమతుల కోసం కార్పొరేషన్లు, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ యజమానులు తిరగాల్సిన పనిలేదని, అధికారులు కొర్రీలు పెట్టి వేధిస్తారన్న ఆందోళన అవసరం లేదని లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ (ఎల్టీపీ, లైసెన్స్డ్ సర్వేయర్) ద్వారా భనవ నిర్మాణానికి దరఖాస్తును పోర్టల్‌లో అప్లోడ్ చేసి, గంటల వ్యవధిలోనే అనుమతులు పొందవచ్చని పేర్కొంది. నిబంధనలకు లోబడి భవన నిర్మాణ పనులు పూర్తిచేసి, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌నూ పొందవచ్చని సూచించింది. ఈ విధానంలో 18 మీటర్ల ఎత్తులోపు ఐదు అంతస్తుల్లో నిర్మాణాలను సులభతరం చేస్తూ ప్రభు త్వం ‘స్వీయ ధ్రువీకరణ పథకం’ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యదర్శులుగా పూల శ్రీనివాసరెడ్డి (సత్యసాయి జిల్లా), కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి(తిరుపతి జిల్లా) నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. -
రెండు పక్కలా నేనే కొడతానంటే ఎలా?: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోమంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన రూలింగ్‌పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) స్పందించారు. అసెంబ్లీలో రెండే పక్షాలు ఉంటాయని.. అలాంటిది ప్రధాన ప్రతిపక్షాన్ని గుర్తించకపోతే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో రెండే పక్షాలు ఉన్నాయి. ఒకటి అధికార పక్షం, ప్రతిపక్షం రెండే ఉంటాయి. ఇంతమంది శాసన సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తాం అని ఎక్కడా రూల్ లేదు. ఢిల్లీలో మూడు స్థానాలు వచ్చిన బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది. గతంలో చంద్రబాబు(Chandrababu) అనే ఇదే వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఇచ్చాం. టీడీపీ నుంచి ఐదుగురు పక్కన కూర్చున్నా.. ఇంకా పది మందిని మన పార్టీలోకి లాగుదామని మా వాళ్లు చెబితే నేనే వద్దన్నా. అసెంబ్లీలో ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి.. నేను వింటానని చంద్రబాబుకి చెప్పా. ఇదే ఆయనకు, నాకు ఉన్న తేడా.ప్రతిపక్షంలో ఉన్న వారిని అధికారంలో ఉన్నవారు గుర్తించకపోతే.. ఏం సాధించడం కోసం అసెంబ్లీ నడపడం. ప్రధాన ప్రతిపక్షం మాకు కాకుండా ఇంకెవరికి ఇస్తారు?. ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడకూడదు.. ఐదే నిమిషాలు సమయం ఇచ్చి మైక్ కట్ చేస్తామంటే అంటే ఎలా?. లీడర్ ఆఫ్ ద హౌజ్‌కు ఎంతసేపు మైక్ ఇస్తారో.. ప్రతిపక్ష నేతకు కూడా అంతే టైం ఇవ్వాలి. అది ఇవ్వట్లేదు కాబట్టే మీ ద్వారా(మీడియా) ఇలా సుదీర్ఘ సమయం తీసుకుని మోసాలను ప్రజలకు వివరించాల్సిన పరిస్థితి వచ్చింది.మీరే అధికారంలో ఉండి..మీరే ప్రతిపక్షం పాత్ర పోషిస్తారా?. రెండు పక్కలా నేనే కొడతానంటే ఎలా?. ఇదేమైనా డబుల్ యాక్షనా.. ఇదేమన్నా సినిమానా? అని జగన్ అన్నారు. జనసేన ఉండగా.. వైఎస్సార్సీపీకి ఐదేళ్లలో ప్రతిపక్ష హోదా రాదన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ‘‘ఆయన జీవితకాలంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకి తక్కువ’’ అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. -
అప్పులపై చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచన: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: లెఫ్ట్&రైట్ అప్పులు చేసే చంద్రబాబు(Chandrababu) ఏపీ అప్పులపై తప్పుడు ప్రచారం చేసి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని(YSRCP Govt) బద్నాం చేసే ప్రయత్నం చేశారని.. కానీ కాగ్ లెక్కలు ఆ మోసాన్ని బయటపెట్టాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాడారు2014-19కి రూ.4 లక్షల కోట్ల అప్పులు ఉంటే.. 2024 నాటికిరూ.6 లక్షల కోట్ల అప్పు ఉంది. కాగ్ లెక్కలు కూడా ఇదే స్పష్టం చేశాయి. కానీ, రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉందని ప్రచారం చేశారు. గవర్నర్ ప్రసంగంలోనూ అబద్ధాలు చెప్పించారు. సాధారణంగా.. బడ్జెట్ గ్లాన్స్(budget Glance)లో పదేళ్ల కిందట అప్పుల లెక్కలు ఉంటాయి. కానీ, లెక్కలు చూపిస్తే ఎక్కడ దొరికిపోతామోనని మొన్నటి బడ్జెట్లో అది చూపించలేదు. అంత దుర్మార్గంగా వ్యవహరించారు చంద్రబాబు.ఎందుకింత అబద్ధాలు.. ఎందుకింత మోసాలు?. చంద్రబాబు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి పేరు మీద అప్పులు చేస్తున్నారు. రాష్ట్రానికి ఆదాయం రావట్లేదు. చంద్రబాబు, ఆయన మనుషుల జేబుళ్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ఆర్థికవేత్తల అంచనాకి కూడా అందకుండా చంద్రబాబు ప్రజలపై బాదుడు బాదబోతున్నారు. -
అదేమైనా మీ బాబుగారి సొమ్మా?: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ వాళ్లకు పథకాలు ఇవ్వకూడదని, వాళ్లకు ఇస్తే పాముకు పాలు పోసిట్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ అంశంపై ఆయన మాట్లాడారు.వైఎస్సార్సీపీ(YSRCP) వాళ్లకు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదని, ఎలాంటి సాయం చేయకూడదని చంద్రబాబు ప్రకటన చేశారు. ఇవ్వకపోవడానికి అదేమైనా మీ బాబుగారి సొమ్మా?. అది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నడుస్తోంది. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసిన చంద్రబాబు.. ఇలా బహిరంగంగా, నిసిగ్గుగా మాట్లాడతారా?. జడ్జిలుగానీ, గవర్నర్‌గానీ చంద్రబాబు(Chandrababu) లేదంటే నా ఈ వ్యాఖ్యలైనా ఒకసారి చూడాలి. ఇలాంటి వ్యక్తి సీఎంగా అర్హుడేనా?.. ఇలాంటి సీఎం ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా?. ఇలాంటి వ్యక్తిని సీఎం స్థానంలో కొనసాగించడం ధర్మమేనా? అని జగన్ ప్రశ్నించారు. -
ఉచిత బస్సు కోసం ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: హామీల పేరుతో ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు నైజమని చెప్పారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. సూపర్ సిక్స్ ఇస్తామని ఒక్క హామీని కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు. చిన్న పథకం మహిళలకు ఉచిత బస్సు కూడా అమలు చేయడం లేదని తెలిపారు.వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఉచిత బస్సు కోసం మహిళలంతా ఎదురు చూస్తున్నారు. ఉచిత ప్రయాణాలు ఎప్పుడెప్పుడు చేస్తామా? అని ఆశగా చూస్తున్నారు. రాయలసీమ ఆడబిడ్డలంతా విశాఖ పోదామని అనుకుంటున్నారు. ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం ఆడబిడ్డలంతా అమరావతి ఎలా కడుతున్నారు? ఎలా ఉందని చూడాలనుకుంటున్నారు. ఎప్పటి నుంచి ఉచిత బస్సు అమలు చేస్తారు. ఇది చిన్న పథకం. అది ఇవ్వడానికి కూడా సాకులు చెబుతున్నారు. ఉచిత బస్సు రూపేణ రూ.7వేల కోట్లు ఎగరగొట్టారు. ఇంతకంటే దారుణం ఉంటుందా? అని ప్రశ్నించారు.అలాగే, రాష్ట్రంలో 18 నుంచి 60 ఏళ్ల మహిళకు సంవత్సరానికి రూ.18 వేలు ఆడబిడ్డ నిధి అన్నారు. దానికి ఎగనామం పెట్టారు. మహిళల సంక్షేమం పేరిట ఈ హామీతో రూ.7 వేల కోట్లు ఎగ్గొట్టారు. స్కూల్‌కి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేల సాయం అన్నారు. ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని అన్నారు. తల్లికి వందనం కోసం మొదటి బడ్జెట్లో రూ. 5,386 కోట్లు కేటాయింపులు చేశారు. ఈసారి నెంబర్ మోసంతో ప్రజలను మభ్య పెడుతున్నారు. ఎలాగూ మోసం చేసేది కదా అని ఇలా చేస్తున్నారు. చివరికి చిన్న పిల్లాడికి కూడా బకాయిలు పెడుతూ.. ఎగనామం పెడుతున్నారు’ అని అన్నారు. -
బాబు పాలన.. ప్రతీ నిరుద్యోగికి 72,000 ఎగనామం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల ముందు చెప్పినట్టుగా బాబు ష్యూరిటీ,, మోసం గ్యారెంటీ అన్నట్టుగా కూటమి సర్కార్ పాలన సాగుతోందన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. బడ్జెట్లో సూపర్ సిక్స్ పథకాలకు అరకొర కేటాయింపులే చేశారు. ప్రతి నిరుద్యోగికి ఇప్పటికే రూ.72వేలు ఎగనామం పెట్టారని చెప్పుకొచ్చారు.వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ఎన్నికల సమయంలో చంద్రబాబు నిరుద్యోగులకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక దానికి ఎగనామం పెట్టారు. నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని గవర్నర్ స్పీచ్‌లో అబద్దాలు చెప్పించారు. బడ్జెట్లో ప్రతిపాదించకుండా లక్షల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు. ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు?. 2024-25 సోషియో ఎకనమిక్ సర్వేలో ఎంఎస్ఎంఈ సెక్టార్లో 27 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు అబద్దాలు చెప్పారు. ఇవ్వన్నీ ఎక్కడ ఇచ్చారు?. ప్రతి నిరుద్యోగికి ఇప్పటికే రూ.72వేలు ఎగనామం పెట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల్లో 40 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. లెక్కలు, ఆధార్ కార్డులతో సహా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మరి మీరు ఇచ్చిన ఉద్యోగులు, ఉద్యోగాలు ఎక్కడ?. చంద్రబాబు అనే వ్యక్తి చేసేదంతా మోసమే.. చెప్పేవన్నీ అబద్దాలే’ అని తెలిపారు. -
మోసాల బడ్జెట్.. బాహుబలి అంటూ బిల్డప్‌లు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం పేరుతో ప్రతీ వర్గాన్ని చంద్రబాబు మోసం చేశారని, బడ్జెట్ గారడీతో అది బయటపడిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన చంద్రబాబు చేస్తున్న దగాను వివరించారు.ప్రెస్మీట్లో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 👉అసెంబ్లీలో ప్రతిపక్షం చెబుతున్న మాటలు వినడం లేదు. అందుకే మీడియా ముందుకు వచ్చాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టింది. సూపర్ సిక్స్, 143 హామీల కోసం అరకోర కేటాయింపులు చేశారు. అన్నిరకాలుగా మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తోంది.👉బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ కాస్త బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ అయ్యింది. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సెవెన్ అంటూ ఊదరగొట్టారు. చంద్రబాబు దత్తపుత్రుడు కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ప్రతీ ఇంటికి బాండ్లు పంచారు. 20 లక్షల ఉద్యోగాలు,. రూ.3 వేల నిరుద్యోగ భృతి సాయం అన్నారు. 👉ఇప్పుడు హామీలపై అడిగితే సమాధానం లేదు. రెండు బడ్జెట్లలోనూ నిధులు కేటాయించలేదు. ప్రజలను మోసం చేసిన తీరు స్పష్టంగా కనిపిస్తోంది. తొమ్మిది నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని చెప్పారు . గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారు. 👉ఆత్మస్తుతి పరనింద అన్నట్లుగా చంద్రబాబు బడ్జెట్ ప్రసంగం ఉంది. తొలిబడ్జెట్‌లో కేటాయిచింది బోడి సున్నా. ఈ ఏడాది కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ప్రతి నిరుద్యోగి భృతి రూ.72 వేలు ఎగనామం పెట్టారు. 2024-25 సోషియో ఎకనమిక్ సర్వేలో ఎంఎస్ఎంఈ సెక్టార్లో 27 లక్షల ఉద్యోగాలిచ్చామని చెప్పారు. బడ్జెట్లో ప్రతిపాదించకుండా లక్షల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?👉జగన్ చెప్పినదానికంటే ఎక్కువ ఇస్తున్నామని ఫోజులు కొడుతున్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారు. పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తున్నారు. ఏపీ రావాలంటే కంపెనీలు భయపడుతున్నాయి👉చంద్రబాబు ఏది చెప్పినా అబద్ధం.. మోసం. చంద్రబాబు చేసేది.. దగా .. వంచన👉వైఎస్సార్సీపీ హయాంలో వివిధ సెక్టార్లో ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 6 లక్షలు. మొత్తం మా పాలనలో అన్నీ రంగాలకు కలిపి 40 లక్షల పైచిలుకు ఉద్యోగాలిచ్చాం. ఆధార్ కార్డులతో సహా ఆ వివరాలు చెప్పగలం. ఇది ఎవరూ కాదనలేని సత్యాలివి👉18 నుంచి 60 ఏళ్ల మహిళకు సంవత్సరానికి రూ.18 వేలు ఆడబిడ్డ నిధి అన్నారు. దానికి ఎగనామం పెట్టారు. ఉచిత బస్సు కోసం మహిళలంతా ఎదురు చూస్తున్నారు. ఉచిత ప్రయాణాలు ఎప్పుడెప్పుడు చేస్తామా? అని ఆశగా చూస్తున్నారు. మహిళల సంక్షేమం పేరిట ఈ హామీతో రూ.7 వేల కోట్లు ఎగ్గొట్టారు. 👉స్కూల్‌కి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేల సాయం అన్నారు. ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని అన్నారు. తల్లికి వందనం కోసం మొదటి బడ్జెట్లో రూ. 5, 386 కోట్లు కేటాయింపులు చేశారు. ఈసారి నెంబర్ మోసంతో ప్రజలను మభ్య పెడుతున్నారు. ఎలాగూ మోసం చేసేది కదా అని ఇలా చేస్తున్నారు. చివరికి చిన్న పిల్లాడికి కూడా బకాయిలు పెడుతూ.. ఎగనామం పెడుతున్నారు. 👉అఫ్కోర్స్.. చంద్రబాబుకి రైతులను మోసం చేయడం కొత్తేం కాదు రైతు భరోసా పేరిట రైతన్నలను గతంలోనే కాదు.. ఇప్పుడూ మోసం చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేల సాయం అందిస్తామన్నారు. కిందటి ఏడాది ఎగ్గొట్టారు. ఈసారి కూడా ఆ పని చేస్తే.. రెండు బడ్జెట్లకు కలిపి రూ.40 వేలు ఎగనామం పెట్టినట్లు అవుతుంది. 👉 దీపం పథకం కింద మరో మోసానికి దిగారు. ఎలాగూ ఎగనామం పెట్టేదే కదా.. మోసమే కదా అని కేటాయింపులు చేసుకుంటూ పోయారు.👉 చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం.. 50 ఏళ్లు నిండిన వాళ్లకు పెన్షన్ల విషయంలో మరో 20 లక్షల మంది జత కావాల్సి ఉంది. రెండేళ్లలో రూ.96 వేల చొప్పున మోసం చేశారు. 👉 సూపర్ సిక్స్.. సెవెన్ కింద అన్ని పథకాలకు కలిపి మొత్తం.. దాదాపు రూ.80 వేల కోట్లు(రూ.79,867 కోట్లు) కావాలి. కిందటి ఏడాది రూ.7 వేల కోట్లు పెడితే.. రూ.800 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఈసారి బడ్జెట్ కేటాయింపులే రూ.17, 179 కోట్లు మాత్రమే. బాబు షూరిటీ.. మోగ్యారెంటీకి ఇదే నిదర్శనం. 👉వైఎస్సార్సీపీ వాళ్లకు పథకాలు ఇవ్వకూడదని, ఎలాంటి సాయం చేయకూడదని చంద్రబాబు అన్నారు. ఇవ్వకపోవడానికి అదేమైనా మీ బాబుగారి సొమ్మా?. అది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నడుస్తోంది. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ఇలా.. బహిరంగంగా మాట్లాడతారా?. ఇలాంటి వ్యక్తి సీఎంగా అర్హుడేనా?.. ఇలాంటి సీఎం ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా?. ఇలాంటిక్తిని సీఎం స్థానంలో కొనసాగించడం ధర్మమేనా?. చంద్రబాబు చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అందరూ చూడాలిఎన్నికల టైంలో చంద్రబాబు: జగన్ ఇప్పించిన సంక్షేమం ఆగదు. 143 హామీలు కాకుండా.. మరింత సంక్షేమం ఇస్తాంఅసెంబ్లీలో సీఎంగా చంద్రబాబు: మనం హామీలు ఇచ్చాం. సూపర్ సిక్స్ ఇచ్చాం. చూస్తే భయం వేస్తోంది. ముందుకు కదల్లేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి.👉సంక్షేమానికి కేరాఫ్‌గా నిలిచాం. మా హయాంలో 4 పోర్టులకు శ్రీకారం చుట్టాం. రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. 10 పిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాం. విద్యారంగంలో కీలక సంస్కరణలు తెచ్చాం. CBSE నుంచి IB వరకు బాటలు వేశాం. నాడు-నేడు కింద స్కూళ్ల రూపురేఖలు మార్చేశాం. చంద్రబాబు హయాంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయ్యింది👉మా హయాంలో 66 లక్షల మందికి పెన్షన్లు అందించాం. బాబు పాలనలో 62 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నారు. కొత్తగా ఎవరిని చేర్చకపోగా.. ఉన్నవాళ్లలో 4 లక్షల మంది లబ్ధిదారులను తొలగించారు. బడ్జెట్ కేటాయింపుల్లోనూ పెన్షన్ నిధులు తగ్గించేశారు👉రూ.15 వేలు ఇస్తామని వాహనమిత్రకు ఎగనామం పెట్టారు. ముస్లింలకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షలు ఇస్తామని మోసం చేశారు. 👉దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ క్యాలెండర్ అమలు చేశాం. మా హయాంలో అక్కాచెల్లెళ్లకు భరోసా ఉండేది. తమ కాళ్లపై నిలబడేలా అడుగులు ముందుకు వేశాం. 👉ఇప్పుడు అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి పథకాలు లేవు. విద్యాదీవెన పథకానికి నిధులు ఇవ్వలేదు. ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు వదిలేసే పరిస్థితికి వచ్చారు. ఈ పరిస్థితిపై వైఎస్సార్సీపీ పోరాటం చేయనుంది. మార్చి 12న విద్యార్థులు, తల్లిదండ్రుల సమన్వయంతో వైఎస్సార్సీపీ ఫీజు పోరు ఉంటుంది👉కూటమి ప్రభుత్వంలో.. వ్యవసాయం, వైద్యం, ఆరోగ్యం, విద్య ఇలా అన్ని రంగాలను నాశనం చేశారు. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారు. మేం తెచ్చిన విప్లవాత్మక మార్పులను.. నిర్వీర్యం చేశారు. మిర్చి రైతులను దారుణంగా మోసం చేశారు. సమస్య పరిష్కరించామని అసెంబ్లీలో అబద్ధాలు చెబున్నారను. కేజీ మిర్చి కూడా కొనలేదు.👉ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారు. కోవిడ్‌లాంటి మహమ్మారి టైంలోనూ మెరుగైన జీతాలు.. అదీ సకాలంలో మేం చెల్లించాం. ఇవాళ జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఏటా ఇచ్చే ఇంక్రిమెంట్లను ఎగ్గొట్టారు. ఐఆర్, పీఆర్సీ, పెండింగ్బకాయిలు ఇవన్నీ ఇవ్వబోమని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది.👉అయ్యా.. పయ్యావులగారూ.. కరోనా టైంలోనూ సాకులు చెప్పకుండా మేం అన్నీ సక్రమంగా నడిపించాం. ఇప్పుడు మీరు ఎగ్గొటడానికి సాకులు వెతుకుతున్నారు.అప్పులపై.. తప్పులు👉2014-19కి రూ.4 లక్షల కోట్ల అప్పులు ఉంటే.. 2024 నాటికిరూ.6 లక్షల కోట్ల అప్పు ఉంది. కాగ్ లెక్కలు కూడా ఇదే స్పష్టం చేశాయి. కానీ, రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉందని ప్రచారం చేశారు. గవర్నర్ ప్రసంగంలోనూ అబద్ధాలు చెప్పించారు. 👉సాధారణంగా.. బడ్జెట్ గ్లాన్స్‌లో పదేళ్ల కిందట అప్పుల లెక్కలు ఉంటాయి. కానీ, లెక్కలు చూపిస్తే ఎక్కడ దొరికిపోతామోనని మొన్నటి బడ్జెట్లో అది చూపించలేదు. అంత దుర్మార్గంగా వ్యవహరించారు చంద్రబాబు.👉ఎందుకింత అబద్ధాలు.. ఎందుకింత మోసాలు?. చంద్రబాబు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి పేరు మీద అప్పులు చేస్తున్నారు. 👉రాష్ట్రానికి ఆదాయం రావట్లేదు. చంద్రబాబు, ఆయన మనుషుల జేబుళ్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ఆర్థికవేత్తల అంచనాకి కూడా అందకుండా చంద్రబాబు ప్రజలపై బాదుడు బాదబోతున్నారు. అయ్యా స్వామీ.. ఏంది ఈ మోసాలు?.. బడ్జెట్ అంతా అంకెల గారడీ.. దీనిని పట్టుకుని బాహుబలి బడ్జెట్ అనడం వాళ్లకు మాత్రమే చెల్లుతుంది👉ఇదీ వాస్తవం. ఇబ్బడిముబ్బిడిగా అప్పు. గత మా ప్రభుత్వంలో కన్నా, ఇప్పుడు ఇబ్బడిముబ్బిడిగా చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. మా హయాంలో 2023–24లో మేము రూ.62,207 కోట్లు చేస్తే, చంద్రబాబు 2024–25లో చేసిన అప్పు రూ,73,362 కోట్లు. నిజానికి అది ఇంకా ఎక్కువే ఉంది. ఇంకా అమరావతి కోసం చేసిన, చేస్తున్న అప్పులు వేరుగా ఉన్నాయి.ఇబ్బడిముబ్బిడిగా అప్పులు చేస్తున్నారు. మాట్లాడితే, అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అంటాడు. కానీ, బడ్జెట్లోని డిమాండ్, గ్రాంట్స్ చూస్తే.. రూ.6 వేల కోట్లు అమరావతి నిర్మాణం కోసమని చూపారు. మరి అలాంటప్పుడు అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని ఎందుకు చెప్పాలి?👉రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం (ఎస్ఓఆర్): 2023–24తో 2024–25ను పోలిస్తే రాష్ట్ర సొంత ఆదాయం ఏకంగా 9.5 శాతం పెరిగిందని చంద్రబాబు చెబుతున్నారు. ఎస్ఓఆర్ 2023–24లో రూ.93,084 కోట్ల నుంచి రూ.1,01,985 కోట్లకు పెరిగిందని చంద్రబాబు చెబుతున్నారు. కానీ, కాగ్ నివేదిక చూస్తే.. ఎస్ఓఆర్ తగ్గింది. 2025–26లో 37 శాతం పెరుగుదలతో రూ.1,27 లక్షల కోట్లకు ఎస్ఓఆర్ చేరుతాయంటున్నారు. ఇది మరో పచ్చి అబద్ధం. నిజానికి రాష్ట్ర ఆదాయం పెరగడం లేదు. కేవలం చంద్రబాబు, ఆయన మనుషులకే ఆదాయం వస్తోంది. ఖజానాకు సున్నా.👉నాన్ టాక్స్ రెవెన్యూ: 2024–25లో మిస్లీనియస్ జనరల్ సర్వీసెస్ కింద రూ.7,916 కోట్లు ఆదాయం చూపుతున్నారు. ల్యాండ్ రెవెన్యూ కింద రివైజ్డ్ అంచనా మేరకు రూ.1341 కోట్లు అని చూపుతున్నారు. కానీ, నిజానికి ఈ 10 నెలల్లో వచ్చింది కేవలం రూ.196 కోట్లు మాత్రమే. మరి ఏ రకంగా ఆ ఆదాయం పొందబోతున్నారు?👉మూల ధన వ్యయం: 2023–24లో 10 నెలల్లో మూలధన వ్యయం కింద మేము రూ.20,942 కోట్లు ఖర్చు చేస్తే, అదే చంద్రబాబు హయాంలో 2024–25లో తొలి 10 నెలల్లో చేసిన వ్యయం కేవలం రూ.10,854 కోట్లు అంటే మైనస్ 48 శాతం. ఇది వాస్తవం. కానీ రివైజ్డ్ అంచనాలో మరో రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చూపారు.👉ఈ బడ్జెట్ అంకెల గారడీ కాదా?: చంద్రబాబు వచ్చాక ఆదాయం తగ్గింది. రాష్ట్ర సొంత ఆదాయం ఎస్ఓఆర్ పెరగలేదు. అది పెరగకపోగా, చాలా తగ్గింది. మూల ధన వ్యయం కూడా దారుణంగా తగ్గింది. ఇలాంటి పరిస్థితులున్నా, చంద్రబాబు ఏమంటున్నాడు. జీఎస్డీపీ 12.94 శాతం నమోదు అవుతుందని చెబుతున్నాడు. ఎలా సాధ్యం?. వాస్తవాలు ఇలా ఉంటే, ఈ ఏడాది బడ్జెట్ రూ.3,22,359 కోట్లు ఎలా సాధ్యం? ఇది అంకెల గారడీ కాదా?. పైగా దీన్ని బాహుభళీ బడ్జెట్ అనడం మీకే చెల్లింది. 👉ప్రతిపక్షం ఈ మేర చెప్పలేకపోతే.. ఎలా?. ప్రతిపక్షంలో ఉన్న వారిని అధికారంలో ఉన్నవారు గుర్తించకపోతే.. ఏం సాధించడం కోసం అసెంబ్లీ నడపడం👉ఇంత ప్రసంగంలోనూ నేను ఎవరినీ తిట్టలేదు. లెక్కలతో సహా చూపించాం. మరి సమాధానాలు చెబుతారా? చూద్దాం👉ఎమ్మెల్సీ ఫలితాలపై..ఎమ్మెల్సీ విజయంతో ప్రజల్లో తమకు సానుకూలత ఉందన్న కూటమి ప్రభుత్వ వాదనపై జగన్ స్పందించారు. ప్రపంచ చరిత్రలో ఎమ్మెల్సీ ఫలితాల్లో రిగ్గింగ్ చేసేవాళ్లను ఎక్కడా చూడలేదు. ఫస్ట్ టైం ఇక్కడే చూశా. అయినా ఉత్తరాంధ్ర స్థానంలో టీచర్లు కూటమికి బాగా బుద్ధి చెప్పారు. అక్కడ రిగ్గింగ్ కుదరదు కాబట్టి ఓడిపోయారు👉అసెంబ్లీలో రెండే పక్షాలు ఉన్నాయి.. ఒకటి అధికారం.. మరొకటి ప్రతిపక్షం . ప్రధాన ప్రతిపక్ష హోదా మాకు కాకుంటే ఇంకెవరికి ఇస్తారు? . రెండు వైపులా మీరే కొడతామంటే.. ఇదేమైనా డబుల్ యాక్షన్ సినిమానా?👉గతంలో టీడీపీ నుంచి ఐదుగురు మా వైపు వచ్చారు. మరో పది మందిని లాగుదామంటే నేనే వద్దన్నా.. ఏం మాట్లాడతావో మాట్లాడు.. నేను వింటా అని చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా ఇచ్చా. ఇదే ఆయనకు నాకు తేడా👉మైక్ ఇస్తేనే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. అది ఇవట్లేదు కాబట్టే ఇలా మీడియా ముందుకు రావాల్సి వస్తోందిపవన్పై సెటైర్లు..👉టీడీపీ తర్వాత జనసేన అతిపెద్ద పార్టీ అని.. కాబట్టి తాము ఉండగా ఈ ఐదేళ్లు వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారని మీడియా ప్రతినిధులు జగన్ వద్ద ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ. జీవిత కాలంలో ఒక్కసారి ఆయన ఎమ్మెల్యే అయ్యారు అని జగన్ సెటైర్ వేశారు. -
రిగ్గింగ్.. బూత్ క్యాప్చరింగ్.. దొంగ ఓట్లతో గెలిచారు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్, దొంగ ఓట్లతో గెలిచిందని ఆ ఎన్నికలో ఓటమి పాలైన పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఆరోపించారు. ఒక సీటు కోసం ఈ స్థాయికి టీడీపీ దిగజారిపోతుందని ఊహించలేదన్నారు. మంగళవారం ‘సాక్షి ప్రతినిధి’తో లక్ష్మణరావు మాట్లాడుతూ.. దొంగ ఓట్లు గణనీయంగా పని చేశాయన్నారు. ఆలపాటి పేరుకు ముందు వేసిన ఒకటి అనే అంకె దాదాపు 50కిపైగా బ్యాలెట్ పత్రాలపై ఒకేలా కనబడిందని, ఈ ఓట్లన్నీ ఒక్కరే వేసినట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. పల్నాడు జిల్లా కారంపూడిలో 91 శాతం, దాచేపల్లిలో 88 శాతం, వినుకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో 80% కంటే ఎక్కువ ఓట్ల శాతం నమోదయ్యాయన్నారు. గుంటూరు జిల్లా తెనాలి, కృష్ణా జిల్లాలోని పలుచోట్ల, ఏలూరు జిల్లాలోని కైకలూరు, నూజివీడులలో దొంగ ఓట్లు, బ్యూత్ క్యాప్చరింగ్‌లు జరిగాయని ఆరోపించారు. నూజివీడులో ముందు రోజున ఓటర్లకు వాల్‌క్లాక్‌లు పంపిణీ చేసిన సంగతి గుర్తు చేశారు. రిగ్గింగ్‌కు పాల్పడ్డారుపలు పోలింగ్ బూత్‌లలో టీడీపీ అభ్యర్థి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని లక్ష్మణరావు ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తిలో పీడీఎఫ్ తరఫున ఏజెంట్‌ను కూడా కూర్చొనివ్వలేదని చెప్పారు. దుర్గిలో గంటలోపే ఏజెంట్‌ను బయటకు నెట్టేశారన్నారు. బెల్లంకొండలో ఏజెంట్‌ను బయటకు లాక్కొచ్చి అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారని, తాను అమరావతి పోలింగ్ కేంద్రానికి వెళ్లినప్పుడు ఆ కేంద్రం గేటు వద్ద 200 మంది టీడీపీ నేతలు టెంట్లో ఉన్నారని, వారంతా యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశారని పేర్కొన్నారు. అనేకచోట్ల ఎమ్మెల్యేలు బూత్‌లలోకి వెళ్లి అక్కడ చాలా సమయం గడిపి ఓటింగ్‌ను ప్రభావితం చేశారన్నారు. ఎన్నికలు సజావుగా జరగలేదని, అధికార పార్టీ తన పరపతిని ఉపయోగించి ఓటింగ్‌ను ప్రభావితం చేసిందన్నారు. జరిగిన అక్రమాలపై ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్టు చెప్పారు. ఎన్నికల సంఘం స్పందించలేదన్నారు. డిగ్రీ చదవని వారిని కూడా పెద్దఎత్తున ఓటర్లుగా నమోదు చేయించారన్నారు. భారీ ఎత్తున దొంగ ఓట్లు సైతం వేయించారన్నారు. ఓటువేసే సమయంలో గుర్తింపు కార్డు చూపించకుండానే ఓటర్లను లోపలికి అనుమతించారని ఆరోపించారు. పెనమలూరు వద్ద ఒకే పేరుతో 42 ఓట్లు, మరోచోట ఒకే పేరుతో 10 ఓట్లు నమోదయ్యాయని గుర్తు చేశారు. తెనాలిలోని కోగంటి శివయ్య స్కూల్ వద్ద కూడా ఇదేవిధంగా జరిగిందని, దీనిపై కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారనన్నారు. ఒక ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రానికి వెళితే ఓ సీఐ ‘సర్.. మీరు వెళ్లండి. ఇక్కడ అంతా మేం చూసుకుంటాం’ అని చెప్పిన విషయాన్ని రికార్డు చేసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. అనైతికంగా సోషల్ మీడియాలో చివరి నాలుగు రోజులు విపరీతమైన దుష్ప్రచారం చేశారని లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
కిక్కిరిసినఆడిటోరియం
వైద్య విద్యార్థులకు పట్టా ప్రదానం వేడుకను కనులారా వీక్షించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఫలితంగా వైద్య కళాశాల ఆవరణం, కళాశాల ఆడిటోరియం కిక్కిరిసిపోయాయి. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా కళాశాలను సుందరంగా తీర్చిదిద్దారు. ఎక్కువగా రైతు కుటుంబాలకు చెందిన పిల్లలు వైద్యులుగా పట్టాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ కమనీయ దృశ్యాలను బంధించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేకంగా వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లను పెట్టుకుని హాజరవడం అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులు పట్టాలు చేతపట్టుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కళాశాల ప్రాంగణంలోనే ఫొటోలు దిగి మురిసిపోయారు. -
‘హాల్‌టికెట్ల కలర్ ప్రింటవుట్‌ను అనుమతించం’
నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్‌టికెట్లను వైట్ పేపర్‌పై ప్రింటవుట్ తీసుకొని పరీక్ష కేంద్రాలకు రావాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి సోమవారం తెలిపారు. కొందరు విద్యార్థులు హాల్‌టికెట్లను కలర్ ప్రింట్లో తీసుకువస్తున్నారని, వాటిని అనుమతించటం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్ విద్యామండలి నుంచి ప్రత్యేక ఉత్తర్వులు అందినట్టు వివరించారు. విద్యార్థులు గమనించి తమ వెంట తెల్లకాగితంపై ప్రింట్ చేసిన హాల్‌టికెట్లతో హాజరు కావాలని సూచించారు. -
ఆలపాటి గెలుపు
సాక్షి ప్రతినిధి, గుంటూరు : కృష్ణా–గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు. మొత్తం తొమ్మిది రౌండ్ల కౌంటింగ్ జరగగా మొత్తం పోలైన ఓట్లు 2,41,774కి గాను 2,14,865 ఓట్లు చెల్లబాటయ్యాయి. 26,909 ఓట్లు చెల్లలేదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 1,45,057 ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుకు 62,737 ఓట్లు వచ్చాయి. దీంతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 82,320 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఈ విజయం దక్కించుకున్నారు. మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో ఉండగా మిగిలిన వారెవరూ కనీస పోటీ ఇవ్వలేదు. మూడోస్థానంలో ఉన్న అన్నవరపు ఆనందకిషోర్కు 860 ఓట్లు దక్కగా గౌతుకట్ల అంకమ్మరావుకు అత్యల్పంగా 26 ఓట్లు దక్కాయి. మంగళవారం గుంటూరు కలెక్టర్ చాంబర్లో కృష్ణా, గుంటూరు పట్టభధ్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, గుంటూరు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు ధ్రువీకరణ పత్రం అందించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ మల్లేశ్వరి పాల్గొన్నారు. దొంగ ఓట్లు, రిగ్గింగ్‌తో గెలిచారు ఈ ఎన్నికల్లో దొంగ ఓట్లు, బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్‌లతో అధికార పార్టీ గెలిచిందని పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఆరోపించారు. ఫలితాల వెల్లడి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలను రాజకీయం చేసిందని, తనపై ప్రత్యర్థులు దుష్ప్రచారం చేశారని, ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాల మధ్య చీలిక తెచ్చారని, రూ.కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. అనేక చోట్ల ఎన్నికల రోజు, దొంగ ఓట్లు, అక్రమాలు చోటుచేసుకున్నాయని, దీనికి అధికార యంత్రాంగం కూడా సహకరించిందని ధ్వజమెత్తారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు అనేక సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగ యువత, రైతులు పలు ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్ట్, అవుట్ – సోర్సింగ్, అనేక రంగాల్లో పనిచేస్తున్న చిరు ఉద్యోగులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ అంశాలపై పోరాటాలను కొనసాగిస్తానని కేఎస్ లక్ష్మణరావు ప్రకటించారు. 40 శాతం మంది తొలిసారి ఓటర్లు ఎన్నికల్లో గెలుపొందిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో 40 శాతం మంది తొలిసారి ఓటు హక్కును ఉపయోగించుకున్నారని చెప్పారు. తనపై వ్యతిరేక ప్రచారం చేసినా ఓటర్లు కూటమిని గెలిపించారని పేర్కొన్నారు. సమస్యలపై శాసన మండలిలో గళం విప్పుతానని వివరించారు. మొదటి ప్రాధాన్య ఓట్లతోనే మ్యాజిక్ ఫిగర్ 82,320 ఓట్ల మెజారిటీ అనైతికంగా గెలిచారంటున్న పీడీఎఫ్ ప్రజలు కూటమికే పట్టం కట్టారన్న ఆలపాటి -
ఐదు తీర్మానాలు ఆమోదం
● సర్కారు మోసపూరిత విధానాల వల్ల మిర్చి రైతులకు గిట్టుబాటు ధర అందడం లేదు. దీనిని ఖండించాలి. ● తక్షణమే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి మిర్చిని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ● గుంటూరు జిల్లాలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలి. ● శనగ, జొన్న, మొక్కజొన్న, పత్తి ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలి. ● ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఈనెల 12న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ● వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులను, అరెస్టులను తీవ్రంగా ఖండించాలి. పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు రూపొందించిన ఐదు అంశాలను సమావేశంలో దొంతిరెడ్డి వేమారెడ్డి ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఆ ఐదు అంశాలు ఇవే.. -
రేపటి నుంచి గుడారాల పండగ
అమరావతి: ఏటా నిర్వహించే గుడారాల పండగను ఈ ఏడాది గుంటూరు శివారులోని గోరంట్లలో కాకుండా మండల పరిధిలోని లేమల్లె గ్రామంలో నిర్వహించటానికి అన్ని ఏర్పాట్లనూ పూర్తిచేశామని హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు అబ్రహం చెప్పారు. మంగళవారం లేమల్లెలోని హోసన్నా దయాక్షేత్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఏసన్నా తొలుత లేమల్లె గ్రామంలో హోసన్నా మందిరం నిర్మాణం చేసిన ప్రదేశంలో సుమారు 25 ఏళ్ల తర్వాత 48వ గుడారాల పండగ నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఈనెల 6,7,8,9 తేదీలలో జరిగే ఈ పండగకు విశ్వాసులు తరలిరావాలని కోరారు. ఆర్టీసీ గుంటూరు నుంచి ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నట్టు వెల్లడించారు. -
మానవతా నాడి పట్టాలి
స్టెతస్కోప్ చెవిన పెట్టకుండానే లబ్‌డబ్ సవ్వడి వీనులను తాకిందా.. మది నిండా ఉప్పొంగిన భావోద్వేగం ఆనందబాష్పమై కురిసిందా.. ఆరేళ్ల శ్రమ కనుల వేడుకై మెరిసిందా.. ఎన్నాళ్లో వేచిన హృదయం ‘పట్టా’భిషిక్తమై మురిసిందా.. అన్నట్టు గుంటూరు వైద్యకళాశాల సంతోషాల వేదికై ంది. గ్రాడ్యుయేషన్ డే ఉత్సాహంతో ఉప్పొంగింది. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆత్మీయ ఆలింగనాలతో నవ్వులు చిలికింది. ఈ సంబరమంతా తళుకులీని కెమెరాల్లో అందంగా బంధీయైంది. రోగులపై దయ చూపాలి డీఎంఈ డాక్టర్ నరసింహం ఉత్సాహంగా వైద్య కళాశాల 74వ గ్రాడ్యూయేషన్ డే -
జలపాలేశ్వరుడిపై సూర్యకిరణాలు
ఫిరంగిపురం: మండలంలోని వేములూరిపాడు గ్రామంలోని జలపాలేశ్వర ఆలయంలో స్వామిపై మంగళవారం సూర్యకిరణాలు ప్రసరించాయి. ఈ సమయంలో అనేకమంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామికి అభిషేకాలు చేయించుకున్నారు. గ్రామంలో చోళుల కాలంనాటి జలపాలేశ్వర ఆలయం ఉంది. 16వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలోని జలపాలేశ్వరుడిపై ఏటా పాల్గుణ మాసంలో కొద్దిరోజులపాటు సూర్యోదయ కాలంలో సరాసరి స్వామివారి లింగాకృతి కింది భాగం నుంచి పూర్తిగా స్వామిపై వరకు సూర్యకిరణాలు ప్రసరిస్తాయని ఆలయ అర్చకులు ఉమాపతి శాస్త్రి తెలిపారు. మళ్లీ అవి తగ్గుముఖం పట్టి పూర్తిగా సూర్యకిరణాలు ప్రసరించడం ఆగుతుందని తెలిపారు. నృసింహుని ఏకాదశ మాలధారణ దీక్ష స్వీకరణ మంగళగిరిటౌన్: మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఎగువ సన్నిధిలోని పానకాలస్వామి వారి ముఖ మండపంలో మంగళవారం భక్తులు నృసింహుని ఏకాదశ మాలధారణ దీక్ష స్వీకరణ మహోత్సవం జరిగింది. దేవస్థానం ప్రధాన అర్చకులు, గురుస్వామి మాల్యవంతం శ్రీనివాసదీక్షితులు భక్తులకు మాలవేసి దీక్ష ఇచ్చారు. స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవా ట్రస్ట్ అధ్యక్షులు తోట శ్రీనివాసరావు మాలధారణ దీక్ష స్వీకరించే భక్తులకు దీక్షా వస్త్రాలను ఉచితంగా అందజేశారు. అనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు, న్యాయవాది రంగిశెట్టి లక్ష్మి మాట్లాడారు. కార్యక్రమంలో శివారెడ్డి గురుస్వామి, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు గోగినేని వెంకటేశ్వరరావు, రోటరీ క్లబ్ ప్రతినిధి సైదా నాయక్, శివాలయం మాజీ ధర్మకర్త అన్నపురెడ్డి రామకృష్ణారెడ్డి, భక్త బృందం ప్రతినిధులు బుర్రి సతీష్, హను మంత నాయక్, మాదల గోపీ తదితరులు పాల్గొన్నారు. జాతీయ సమావేశాలకు ఐదుగురికి ఆహ్వానం సత్తెనపల్లి: అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో ప్రత్యేకత చాటుకున్న ఎంపీడీవో, గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు ఈనెల 4, 5 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న జాతీయ సమావేశానికి ఆహ్వానం అందింది. గుంటూరు జిల్లా పెదనందిపాడు ఎంపీడీవో లక్ష్మీదేవి, గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం సర్పంచ్ ఎం.లలితకుమారి, వెంగళాయపాలెం కార్యదర్శి వి.రవి, కొల్లిపర మండలం వల్లభాపురం సర్పంచ్ భ్రమరాంబ, పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడు సర్పంచ్ షేక్ గౌసియా బేగం స్నేహపూర్వక పంచాయతీల (ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ) పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను పంచాయతీలో అమలు చేస్తున్నారు. ఇందుకు ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి సమావేశాలకు వీరికి ఆహ్వానం అందడంతో సోమవారం పయనమై వెళ్లారు. ఎండీయూ వాహనం తనిఖీ మంగళగిరిటౌన్: మంగళగిరి నగరపాలక సంస్థ పరిధిలోని ఎర్రబాలెంలో రేషన్ బియ్యాన్ని ఇంటింటికీ సరఫరా చేసే ఎండీయూ వాహనాన్ని మంగళవారం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీ చేశారు. స్థానికులతో మాట్లాడి రేషన్ పంపిణీ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రోజుకు ఎంత మందికి రేషన్ అందజేస్తున్నారన్న విషయాన్ని పరిశీలించారు. -
పోరు గళం
జగనన్న దళం.. తగ్గేదే.. లే సమావేశంలో మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి కార్యకర్తలకు అండగా ఉంటాం కార్యకర్తలకు అండగా ఉంటాం. వారిని ఇబ్బంది పెడితే సహించేది లేదు. కార్యకర్తల కోసం అంబటి రాంబాబు కష్టపడుతున్నారు. మనందరం కలిసికట్టుగా సర్కారుపై పోరాడాలి. భవిష్యత్తులో కష్టపడిన ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఉంటుంది. – మోదుగుల వేణుగోపాలరెడ్డి, వైఎస్సార్ సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల పరిశీలకులు తాడేపల్లిరూరల్: ప్రజల పక్షాన పోరుజెండా ఎత్తాల్సిన సమయం ఆసన్నమైందని, దీని కోసం ప్రతి కార్యకర్త, నాయకుడు సైనికులై ముందుకు కదులుదామని రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. మంగళవారం కుంచనపల్లిలోని శ్రీగ్రాండ్ ఫార్చ్యూన్లో వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా రెండో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యుడు, పార్టీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ వై.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ కేసులకు అదరని, బెదరని కార్యకర్తలు, నాయకులు వైఎస్సార్ సీపీ సొంతమని, గుంటూరు జిల్లా పార్టీ శ్రేణులు రాష్ట్రానికే ఆదర్శమని, క్రమం తప్పకుండా జిల్లా కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రధానంగా రైతులు మద్దతు ధర దక్కక నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులూ సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ రాక నష్టపోతున్నారని, ఈనెల 12న జరిగే ఫీజు పోరు ధర్నాను జయప్రదం చేసి ప్రభుత్వం మెడలు వంచుదామని పేర్కొన్నారు. మిర్చి రైతుల సమస్యలపై గుంటూరులో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గళమెత్తిన తర్వాతే ప్రభుత్వం కదిలిందని గుర్తుచేశారు. ఈ తొమ్మిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం సూపర్‌సిక్స్ హామీలను అమలు చేయకుండా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులే లక్ష్యంగా కేసులతో వేధించిందని, భవిష్యత్తులోనూ కేసులు తప్పవని, అయినా అదరక, బెదరక ముందుకు సాగే కార్యకర్తలే మన బలమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన పోరుబాటలో ముందుకు కదులుదామని వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ గుంటూరు, పల్నాడు జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు వనమా బాల వజ్రబాబు, అంబటి మురళీకృష్ణ, షేక్ నూరి ఫాతిమా, బలసాని కిరణ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు పానుగంటి చైతన్య, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలే అజెండా ప్రజలు సమస్యలతో బాధపడుతున్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు. ప్రజా సమస్యలే మన అజెండా. పోరాటానికి సిద్ధమవుదాం. కేసులకు భయపడేది లేదు. వైఎస్ జగన్‌ను మరోమారు ముఖ్యమంత్రిగా చేసుకుందాం. – దొంతిరెడ్డి వేమారెడ్డి, వైఎస్సార్ సీపీ మంగళగిరి సమన్వయకర్త ప్రజల పక్షాన ధ్వజమెత్తుదాం ప్రతిఒకరం సైనికుడై కదులుదాం భవిష్యత్తులో కార్యకర్తలకు ప్రాధాన్యం రాజ్యసభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి రెడ్‌బుక్‌కు పాతరేద్దాం కూటమి సర్కారు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. దానికి ఉప్పుపాతరేసే దిశగా పోరాడదాం. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. అయితే కేసులకు భయపడుతున్నారు. మనం ముందుండి పోరాడుదాం. వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంను చేద్దాం. – షేక్ ఫాతిమా, వైఎస్సార్ సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు రైతుకు వెన్నుదన్నుగా నిలుద్దాం రైతులకు వెన్నుదన్నుగా నిలిచి పోరాడదాం. గతంలో ధాన్యం బస్తా రూ.1,700 నుంచి రూ. 2 వేలు అమ్మితే ఈ ఏడాది రూ. వెయ్యి నుంచి రూ.1,300 మాత్రమే పలికింది. ఒక్కో రైతుకు రూ.లక్షల్లో నష్టం వచ్చింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు రైతులకు దూరమయ్యాయి. కూటమి ప్రభుత్వంపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు. – అంబటి మురళీకృష్ణ, వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త -
యూబీఐ ఎంఎస్ఎంఈ రుణమేళా
కొరిటెపాడు(గుంటూరు): యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుంటూరు రీజియన్ పరిధిలో జీటీ రోడ్‌లోని ప్రాంతీయ కార్యాలయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) రుణమేళా మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జీటీ రోడ్‌లోని యూబీఐ ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ రుణమేళాలో యూబీఐ చీఫ్ జనరల్ మేనేజర్ బిజు వాసుదేవన్ మాట్లాడుతూ ఖాతాదారుల ఉన్నతికి యూబీఐ కృషి చేస్తోందన్నారు. ఖాతాదారుల ప్రయోజనాలే లక్ష్యంగా సేవలందిస్తున్నామని చెప్పారు. తక్కువ వడ్డీకే రుణాలు సకాలంలో ఇవ్వడంతో పాటు, డిపాజిట్ దారులకు లాభదాయకమైన వడ్డీ అందిస్తున్నట్లు వివరించారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యూబీఐ సేవలు విస్తరిస్తున్నామని, వీటిని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలో గుంటూరు ఆటోనగర్, తెనాలి, మంగళగిరి పరిధిలో నిర్వహించిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల దారుల(ఎంఎస్ఎంఈ)కు రూ.150 కోట్ల విలువైన రుణ మంజూరు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో యూబీఐ గుంటూరు రీజియన్ రీజినల్ హెడ్ ఎస్.జవహర్ పాల్గొన్నారు.