Dr B R Ambedkar Konaseema
-
కలెక్టరేట్లో విదేశీ వ్యవహారాల హెల్ప్‌డెస్క్
కలెక్టర్ మహేష్‌కుమార్ అమలాపురం రూరల్: విదేశాలకు వలస వెళ్లినవారికి మార్గ నిర్దేశం చేసేందుకు కలెక్టరేట్లో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ పేరుతో విదేశీ వ్యవహారాల హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. మంగళవారం హెల్ప్ డెస్క్‌ను ఆయన, ఎస్పీ బీ.కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, డీఆర్ఓ బీఎల్ఎన్ రాజకుమారి, ఆర్డీవోలు కె.మాధవి, పి.శ్రీకర్, డి.అఖిల ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా నుంచి విదేశాలకు వలస వెళ్లి జీవనోపాధి పొందాలనుకునేవారికి పాస్‌పోర్టు, వీసాలు పొందేందుకు గల మార్గాలను సూచించడంతోపాటు అన్ని విధాలా గైడెన్స్ ఇస్తామన్నారు. ఈ ఈ కేంద్రాన్ని ఆరుగురు సిబ్బందితో నెలకొల్పామన్నారు. హెల్ప్ డెస్క్ నోడల్ అధికారి డీఎల్ఎన్ రాజకుమారి, సమన్వయకర్త గోళ్ళ రమేష్, పాల్గొన్నారు. వాడపల్లి వెంకన్న కళ్యాణ ఉత్సవాలకు ఏర్పాట్లు ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వరస్వామి తీర్థ కళ్యాణ మహోత్సవాలు ఏప్రిల్ 7 నుంచి 13వ తేదీ వరకు ఘనంగా నిర్వహిచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వేంకటేశ్వర స్వామి తీర్థ కళ్యాణ మహోత్సవాలపై దేవదాయ, పోలీసు రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 7వ తేదీన ధ్వజారోహణ, 8న స్వామి వారి తీర్థం, రథోత్సవం కళ్యాణం కార్యక్రమాలు, 9వ తేదీ పొన్న వాహన సేవ, 11వ తేదీ గోదావరిలో తెప్పోత్సవం, 12వ తేదీ మహా పూర్ణాహుతి, చక్రస్నానం కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈవో చక్రధరరావు, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఇంటికో ఉద్యోగం కల్పించాలి
టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించినట్టు ఇంటికో ఉద్యోగం కల్పించాలి. దీనికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. నిరుద్యోగులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి మంజూరు చేయాలి. అలా చేస్తే ఉద్యోగాల కోసం కోచింగ్ సెంటర్లకు వెళ్లే పేద విద్యార్థులకు వెసులుబాటుగా ఉంటుంది. – నేరేడుమిల్లి నరేష్, విద్యార్థి నాయకుడు, గంటి, కొత్తపేట మండలం. ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలి కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలన్నీ భర్తీ చేయాలి. అలాగే ప్రభుత్వ పోస్టులను సైతం నింపాల్సి ఉంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా పరిశ్రమల ఏర్పాటు చేయడం, చిన్న పరిశ్రమలతో చాలా వరకు నిరుద్యోగాన్ని తగ్గించవచ్చు. నిరుద్యోగ భృతి అందజేస్తే పోటీ పరీక్షలకు వెళ్లేవారికి మంచిది. – చెల్లంగి రామకృష్ణారావు, మాకనపాలెం, మామిడికుదురు మండలం. జాబ్ క్యాలెండ్ విడుదల చేయాలి ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. ఉపాధ్యాయ పోస్టులే కాదు.. ప్రభుత్వ శాఖల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటితోపాటు పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలి. – చప్పిడి రాజేష్, ఈదరపల్లి, అమలాపురం మండలం -
జిల్లా మలేరియా అధికారిగా వెంకటేశ్వరరావు
అమలాపురం రూరల్: అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలేరియా అధికారిగా నక్కా వెంకటేశ్వరరావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి డాక్టర్ ఎం.దుర్గారావు దొరకు జాయినింగ్ రిపోర్ట్ సమర్పించి పదవీ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్‌ను ఆయన చాంబర్లో మంగళవారం రాత్రి మర్యాద పూర్వకంగా కలిశారు. ఇంటర్ పరీక్షకు 907 మంది గైర్హాజరు అమలాపురం టౌన్: జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం జనరల్, ఒకేషనల్ పరీక్షలకు 907 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ పరీక్షలకు మొత్తం 11,984 మంది హాజరు కావాల్సి ఉండగా 11,462 మంది హాజరయ్యారు. 522 మంది రాలేదు. ఒకేషనల్ పరీక్షలకు మొత్తం 2,676 మందికి 2,291 మంది హాజరయ్యారు. 385 మంది రాలేదు. జిల్లాలోని 40 కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఐఈవో వనుము సోమశేఖరరావు తెలిపారు. విద్యార్థులలో సృజనను వెలికితీయాలి ముమ్మిడివరం: విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా పిలుపునిచ్చారు. ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పార్ట్ టైమ్ ఇనస్ట్రక్టర్లకు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ప్రతి విద్యార్థికి ఏదో ఒక అంశంలో ప్రావీణ్యం ఉంటుందని అది వెలికి తీసే విధంగా బోధన ఉండాలన్నారు. బోధనా సిబ్బందితో పాటుగా బోధనేతర సిబ్బంది విధుల పట్ల అంకిత భావంతో పనిచేయడం ద్వారా జిల్లాను విద్యాపరంగా మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలన్నారు. ఫైనాన్స్ అకౌంట్స్ అధికారి జి.ప్రవీణ్‌కుమార్, జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రమణ్యం, ఐఈ కోఆర్డినేటర్ ఎంవీవీ సత్యనారాయణ, ఏఎంవో రాంబాబు పాల్గొన్నారు. 27 మందికి ఉద్యోగావకాశాలు ముమ్మిడివరం: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్ధ, జిల్లా ఉపాఽధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జాబ్‌మేళాలో 27 మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డి.హరిశేషు తెలిపారు. రెండు ప్రధాన కంపెనీలు పాల్గొన్న ఈ జాబ్ మేళాకు 52 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరుకాగా 27 మందిని ఎంపిక చేశారు. స్కిల్ హబ్ కోఆర్డినేటర్ శ్రీదేవి, ఎస్ఈడీఏపీ సిబ్బంది పాల్గొన్నారు. హై వే పనులు వేగవంతం చేయాలి అమలాపురం టౌన్: అమలాపురం– రావులపాలెం జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్ధనరెడ్డికి మంగళవారం లేఖ రాశారు. అమలాపురం ఎర్ర వంతెన, నల్ల వంతెన, ఈదరపల్లి వంతెనలను జిల్లా కేంద్రం అయ్యాక పెరిగిన ట్రాఫిక్‌కు అనుగుణంగా ఆధునీకరించాలని సూచించారు. అమలాపురం– రావులపాలెం జాతీయ రహదారి జిల్లా ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తున్న దృష్ట్యా ఆ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్యయ్యేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారి అనుసంధానిస్తే కోనసీమ ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని పేర్కొన్నారు. అమలాపురం పట్టణంలో ఆ మూడు వంతెనలు దాదాపు శిథిలావస్థకు చేరుకుని ట్రాఫిక్ అవసరాలను ఏ మాత్రం తీర్చలేకపోతున్నాయని పేర్కొన్నారు. ఈ మూడు వంతెనలపై నిత్యం ప్రజలు ట్రాఫిక్ సమస్యలతో సతమమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. -
భర్తీ లేదు.. భృతి రాదు
● యువతకు సర్కారు దగా ● కూటమి ప్రభుత్వంలో కొత్త కొలువులు లేవు ● సంతకం పెట్టినా డీఎస్సీ ద్వారా భర్తీ కాని 890 పోస్టులు ● 7,500 మంది ఆశలపై నీళ్లు ● ఇస్తానన్న నిరుద్యోగ భృతి అందలేదు ● సుమారు లక్ష మంది ఎదురుతెన్నులు ● రీయింబర్స్మెంట్ లేదు ● సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులకు అందని సొమ్ము ● నేడు వైఎస్సార్ సీపీ యువత పోరు సాక్షి, అమలాపురం: ‘అధికారంలోకి రాగానే వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పిస్తాము. ఆ పరిస్థితి లేకుంటే నెలనెలా నిరుద్యోగ భృతి అందిస్తాము’ ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఇవి. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము. మెగా డీఎస్సీ ఏర్పాటు చేస్తాము. వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాము. ప్రతి ఏటా జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము. జిల్లాల వారీగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తాము. స్థానికంగా వేలాది ఉద్యోగాలు కల్పిస్తాము. ఎంఎస్ఎంఈ, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పోరేషన్లతో చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని నిరుద్యోగ యువతకు అయితే ఉద్యోగాలు, లేదా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీల వర్షం కురిపించారు. ఇవేమీ లేకుంటే నెలకు రూ.మూడు వేల నిరుద్యోగ భృతి అందజేస్తామన్నారు. ఇవే కాదు.. క్రమం తప్పకుండా ఫీజులు రీయింబర్స్మెంట్ అందించడం, వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడం, విద్యార్థులకు ఇవ్వాల్సిన సొమ్ము ఇస్తామని ఊదరగొట్టారు. సార్వత్రిక ఎన్నికల ముందు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలోనే కాదు. బాబు నిర్వహించిన బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారంటీ... పవన్ కళ్యాణ్ నిర్వహించిన వారాహీ యాత్రలలో యువత లక్ష్యంగా హామీల వర్షం కురిపించారు. తొమ్మిది నెలల కాలంలో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. వలంటీర్ల వ్యవస్థ ఎత్తివేత గత ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను కూటమి ప్రభుత్వం ఎత్తి వేసింది. గత ప్రభుత్వం వీరికి రూ.ఐదు వేలు గౌరవ వేతనం చొప్పున ఇచ్చేది. కూటమి ప్రభుత్వం రూ.పది వేలు ఇస్తామని మొత్తం వ్యవస్థను తీసివేసింది. బాబు వస్తే కొత్త జాబు రాలేదు సరికదా జిల్లాలో 9,581 మంది వలంటీర్లకు ఉన్న ఉద్యోగం కూడా పోయింది. సర్వేలకు మాత్రమే సచివాలయ సిబ్బంది గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయం, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే)ల ద్వారా సొంత జిల్లాలోనే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది. జిల్లావ్యాప్తంగా 512 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. 4,096 మందికి ఈ జిల్లాలోనే ప్రభుత్వ ఉద్యోగాలు అందించారు. కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థలను నిర్వీర్యం చేయాలని చూస్తోంది. భూముల రిజిస్ట్రేషన్లు సైతం చేసే స్థాయికి ఎదిగిన సచివాలయ వ్యవస్థను కూటమి ప్రభుత్వం సర్వేలకు మాత్రమే పరిమితం చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు గత ప్రభుత్వ హయాంలో విద్యాదీవెన 8,824 మంది విద్యార్థులకు రూ.6.14 కోట్లు విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దీని పేరు రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజుగా మార్చి (ఆర్టీఎఫ్) 2024,25 సంవత్సరానికి 7,210 మందికి రూ.8.33 కోట్లు విడుదల చేశారు. వసతి దీవెన పథకం పేరును మెయింటినెన్స్ ఆఫ్ ట్యూషన్ ఫీజు (ఎంటీఎఫ్)గా మార్చి రూ.1.39 కోట్లు విడుదల చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా 1.62 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.243 కోట్లు జమ అయ్యేవి. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకంగా పేరు మార్పు చేశారు. ఈ ప్రభుత్వ హయాంలో ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. నేడు యువత పోరు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా యువతను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ సీపీ సమర శంఖం పూరించింది. బుధవారం జిల్లా కేంద్రం అమలాపురంలో కలెక్టరేట్ వద్ద యువత పోరులో భాగంగా ధర్నా చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమానికి పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తరలి రానున్నారు. డీఎస్సీ ప్రకటనేనా!సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేసిన వెంటనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. కాని ఇంత వరకు ప్రకటన వెలువడలేదు. పరీక్షలు నిర్వహించకుండా వాయిదాపై వాయిదాలు వేస్తున్నారు. జిల్లాలో కనీసం 840 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. ఇందుకు 8 వేల మందికి పైగా అర్హులు ఎదురు తెన్నులు చూస్తున్నారు. -
పచ్చని పొలాల్లో ఆక్వా చిచ్చు
● యథేచ్ఛగా సాగుతున్న అక్రమ తవ్వకాలు ● చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం ● కుదేలవుతున్న కోనసీమ కల్పవృక్షం ముమ్మిడివరం: పచ్చని పొలాలు ఆక్వా చెరువులుగా మారుతున్నాయి. నిబంధనలను తుంగలోకి తొక్కి అక్రమ చెరువుల తవ్వకాలతో పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారు. ఇటీవల ప్రకృతి వైపరీత్యాలు, అధిక పెట్టుబడి తదితర కారణాలతో వరుస నష్టాలకు గురవుతున్న బడా రైతులు.. వ్యవసాయాన్ని పక్కనబెట్టి చెరువుల సాగుపై దృష్టి సారిస్తున్నారు. పచ్చని పొలాలు, కొబ్బరి తోటలను సైతం తెగనరికి ఆక్వా చెరువులుగా మార్చేస్తున్నారు. గతంలో సముద్ర తీర ప్రాంతాల్లోను, చౌడు, బీడు భూముల్లో, ఎటువంటి పంటలు పండని భూముల్లో చెరువులు తవ్వి ఆక్వా సాగు చేసేవారు. ఇప్పుడు సారవంతమైన భూములు, పొలాలు, కొబ్బరి తోటలు ఆక్వా చెరువులుగా మారుతుండడంతో జల కాలుష్యం విచ్చలవిడిగా పెరిగిపోతోంది. ఎటువంటి అనుమతులు లేకుండా.. ఆక్వా సాగుకు చెరువులు తవ్వాలంటే రెవెన్యూ, ఫిషరీస్, వ్యవసాయ శాఖ, ఇరిగేషన్, డ్రైనేజీ, పొల్యూషన్ వంటి శాఖల అనుమతి తీసుకుని చెరువులు తవ్వాల్సి ఉంది. ముమ్మిడివరం నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో పంట కాలువలు, ఏటిగట్ల చెంతనే ఎటువంటి అనుమతులు లేకుండా, యథేచ్ఛగా చెరువులను తవ్వుతున్నప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల అక్రమ చెరువుల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పచ్చని చేలు, కొబ్బరి తోటలు చెరువులుగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ముమ్మిడివరం మండలంలోని అయినాపురం పంట కాలువ చెంతనే సర్వే నంబర్ 82/1, 79/1లో సుమారు ఏడు ఎకరాల్లో కొబ్బరి తోటల్లో చెట్లను నరికి, బొబ్బర్లంక–పల్లంకుర్రు ప్రధాన పంట కాలువను ఆనుకుని ఆక్వా చెరువులు తవ్వేస్తున్నారు. ఇదే మండలంలో సోమిదేవరపాలెం పంచాయతీ పరిధిలో కొబ్బరి తోటలను నరికి ఆక్వా చెరువుల తవ్వకాలు చేపట్టారు. చెరువుల్లో తవ్వుతున్న మట్టిని పక్కనున్న మురుగు డ్రెయిన్‌కు అడ్డంగా అడ్డుకట్ట వేసి, ట్రాక్టర్లపై మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నేలకొరుగుతున్న కల్పవృక్షం కోనసీమ కల్పవృక్షాలు నేలకొరుగుతున్నాయి. కన్నబిడ్డ కంటే అమితంగా ఆదరించే రైతులను కంటతడి పెట్టిస్తున్నాయి. నెలసరి ఆదాయం సమకూరుస్తూ జీవితాంతం ఫలసాయం అందించే కొబ్బరి చెటు్ట్ కోనసీమవాసుల జీవితాలతో ముడిపడి ఉంది. ఇంటి పెరట్లో, కాలువ గట్లు, మురుగు డ్రెయిన్లు, ప్రభుత్వ ఆక్రమిత భూముల్లో కొబ్బరి చెట్లను పెంచుతూ జీవనోపాధి పొందడం కోనసీమ ప్రజలకు పరిపాటి. ఏదో నెపంతో చెట్లను నరికి, వారి జీవనోపాధికి గండి కొడుతూనే ఉన్నారు. ఇప్పటికే రోడ్ల విస్తరణ, కాలువల ఆధునికీకరణ పేరుతో వేలాది కొబ్బరి చెట్లను నరికేశారు. గతంలో ఏటిగట్ల ఆధునికీకరణ పేరుతో వేలాది కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. కోనసీమలో 216 జాతీయ రహదారి విస్తరణ, బైపాస్ రోడ్డు నిర్మాణాల పేరుతో వేలాది చెట్లను నరికివేశారు. ఇప్పుడు కొంత మంది రైతులు లాభార్జనే ధ్యేయంగా కొబ్బరి తోటలను నరికి ఆక్వా చెరువులు తవ్వుతున్నారు. దీంతో భవిష్యత్తులో కోనసీమలో కొబ్బరి తోటల మనుగడే ప్రశ్నార్థకమవుతుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయంపై దుష్ప్రభావం పలు ప్రాంతాలలో వరిచేలను చెరువులుగా మార్చేస్తుండడంతో సమీపంలోని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మంచినీటి చెరువులకు బదులుగా ఉప్పునీటి చెరువులుగా మార్చడంతో తమ పంటచేలలోకి ఊటనీరు ప్రవేశించి పంట నాశనం అవుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటేటా ఇలా చెరువులు తవ్వుకుంటూ పోతే వ్యవసాయం కనుమరుగయ్యే పరిస్థితి తలెత్తుతుందని, కనీసం తిండిగింజలు కూడా దక్కని దుస్థితి నెలకొంటుందని పలువురు రైతులు వాపోతున్నారు. అక్రమ తవ్వకాలను నిలువరించాలని కోరుతున్నారు. పర్యావరణానికి విఘాతం గ్రామంలో రోడ్లపై మట్టి ట్రాక్టర్లు విచ్చలవిడిగా సంచరించడంతో దుమ్ముధూళి చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పచ్చని పొలాల మధ్య ఆక్వా సాగు చేయడం వల్ల పచ్చదనం కరువై, పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులు తవ్వేందుకు ఎటువంటి అనుమతులు లేకపోయినా రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల అండదండలతో అక్రమ చెరువుల తవ్వకాలు సాగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
కలెక్టరేట్లో విదేశీ వ్యవహారాల హెల్ప్‌డెస్క్
కలెక్టర్ మహేష్‌కుమార్ అమలాపురం రూరల్: విదేశాలకు వలస వెళ్లినవారికి మార్గ నిర్దేశం చేసేందుకు కలెక్టరేట్లో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ పేరుతో విదేశీ వ్యవహారాల హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. మంగళవారం హెల్ప్ డెస్క్‌ను ఆయన, ఎస్పీ బీ.కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, డీఆర్ఓ బీఎల్ఎన్ రాజకుమారి, ఆర్డీవోలు కె.మాధవి, పి.శ్రీకర్, డి.అఖిల ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా నుంచి విదేశాలకు వలస వెళ్లి జీవనోపాధి పొందాలనుకునేవారికి పాస్‌పోర్టు, వీసాలు పొందేందుకు గల మార్గాలను సూచించడంతోపాటు అన్ని విధాలా గైడెన్స్ ఇస్తామన్నారు. ఈ ఈ కేంద్రాన్ని ఆరుగురు సిబ్బందితో నెలకొల్పామన్నారు. హెల్ప్ డెస్క్ నోడల్ అధికారి డీఎల్ఎన్ రాజకుమారి, సమన్వయకర్త గోళ్ళ రమేష్, పాల్గొన్నారు. వాడపల్లి వెంకన్న కళ్యాణ ఉత్సవాలకు ఏర్పాట్లు ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వరస్వామి తీర్థ కళ్యాణ మహోత్సవాలు ఏప్రిల్ 7 నుంచి 13వ తేదీ వరకు ఘనంగా నిర్వహిచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వేంకటేశ్వర స్వామి తీర్థ కళ్యాణ మహోత్సవాలపై దేవదాయ, పోలీసు రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 7వ తేదీన ధ్వజారోహణ, 8న స్వామి వారి తీర్థం, రథోత్సవం కళ్యాణం కార్యక్రమాలు, 9వ తేదీ పొన్న వాహన సేవ, 11వ తేదీ గోదావరిలో తెప్పోత్సవం, 12వ తేదీ మహా పూర్ణాహుతి, చక్రస్నానం కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈవో చక్రధరరావు, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మృతిరాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన
హైవేపై ఆందోళన చేసిన కట్టుంగగ్రామస్తులు, మృతురాలి బంధువులు రావులపాలెం: రోడ్డు ప్రమాదంలో లారీ ఢీ కొట్టడంతో మహిళ మృతి చెందింది. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు, గ్రామస్తులు రావులపాలెం వద్ద జాతీయ రహదారిపై కళావెంకట్రావు సెంటర్లో మంగళవారం ఆందోళన చేపట్టారు. సోమవారం సాయంత్రం స్థానిక ఊబలంక రోడ్డులో టిప్పర్ లారీ ఢీ కొట్టిన ఘటనలో మృతిచెందిన వందే విజయకుమారి బంధువులు, గ్రామస్తులు ఆత్రేయపురం మండలం కట్టుంగ గ్రామం నుంచి రావులపాలెం చేరుకుని స్థానిక కళావెంకట్రావు సెంటరులో జాతీయ రహదారిపై ఆందోళళన చేశారు. మృతురాలి పిల్లలకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. టౌన్ సీఐ శేఖరబాబు అక్కడి చేరుకుని వారితో మాట్లాడారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసి మృతదేహాన్ని అప్పగిస్తామని చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. దీంతో కాసేపటికి ఆందోళన విరమించారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. -
ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా
13 మంది విద్యార్థులకు గాయాలు జగ్గంపేట: జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామంలో మంగళవారం ఉదయం విద్యార్థులతో జగ్గంపేట వస్తున్న ఒక ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 13 మంది విద్యార్థులు ఉండగా వీరిలో 9 మందికి స్వల్పంగాను, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జగ్గంపేట ఎస్సై రఘునాథరావు తెలిపిన వివరాల మేర కు ఉదయం జగ్గంపేట వస్తున్న బస్సు కాండ్రేగుల గ్రామ శివారులో బోల్తాపడింది. స్థానికుల సహకారంతో విద్యార్థులను బయటకు తీసి జగ్గంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. వీరిలో 9 మందిని ప్రాథమిక చికిత్స అనంతరం ఇళ్లకు పంపించేశారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురు తోటకూర కార్తీక్ నాగేంద్ర, అనితా రామచక్ర, ద్వారపూడి ధనలక్ష్మి, బొదిరెడ్డి శ్రావణిలను మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. స్కూల్ కరస్పాండెట్, వైఎస్సార్ సీపీ జిల్లా బూత్ కమిటీల అధ్యక్షుడు ఒమ్మి రఘురాంఆస్పత్రికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విద్యార్థులందరూ 6 నుంచి 9 తరగతి చెందిన వారని, డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎస్సై తెలిపా రు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రణీత్ విద్యార్థులకు వైద్య సేవలందించారు. -
150 కేజీల గంజాయి పట్టివేత
● రూ.7లక్షల 50 వేలు విలువైన సరకు స్వాధీనం ● ఐదుగురి అరెస్టు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): లక్షల రూపాయల గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. వారి నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనిని రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి జైలుకు పంపారు. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ డి.నరసింహకిశోర్ మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ వివరాలను వెల్లడించారు. పట్టుబడిందిలా... ఉదయం 11 గంటల సమయం. ఏజెన్సీ నుంచి రాజమహేంద్రవరం మీదుగా గంజాయి రవాణా అవుతుందని పక్కా సమాచారం ఉండడంతో రూరల్ ప్రాంతంలోని కొంతమూరు గామన్ ఇండియా బ్రిడ్జి వద్ద పోలీసులు ముమ్మరంగా వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. అయితే నిందితులు ముందస్తుగా గంజాయి తరలించే వాహనానికి ఒక ఆటోను పైలట్‌గా ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఆటోలో వారు గంజాయి తీసుకెళ్తున్న మార్గంలో పోలీసులు తనిఖీలు చేస్తుంటే ఆ సమాచారాన్ని వారికి సమాచారం ఇస్తారు. అలా రంపచోడవరం నుంచి ఎయిర్‌పోర్టు రోడ్డులో వస్తూ వంతెన కింద నుంచి నేషనల్ హైవే 16 పైకి ఎక్కుతుండగా పైలట్ ఆటోలో వారు పోలీసులను గమనించి ఆ సమాచారం గంజాయి రవాణా అవుతున్న వాహనంలో ఉన్న వారికి సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన గంజాయి రవాణాదారులు పారిపోతుండగా రాజానగరం పోలీస్‌స్టేషన్ ఎస్సై మనోహర్, పోలీసు సిబ్బంది ఆ కారును, ఆటోను వెంబడించి పట్టుకున్నారు. మొత్తం రెండు కేజీల చొప్పున 75 ప్యాకెట్లలో కారు ఢిక్కీలో గంజాయి దొరికింది. పట్టుకున్న గంజాయి విలువ రూ.7 లక్షల 50 వేలు ఉంటుందని పోలీసుల తెలిపారు. దీనిని రవాణా చేస్తున్న ప్రకాశం జిల్లా కంభం గ్రామానికి చెందిన షేక్ ఇంతియాజ్, సింగరాయికొండకు చెందిన షేక్ అబ్దుల్, ఏఎస్ఆర్ జిల్లా రంపచోడవరం మండలం సీతంశెట్టినగర్కు చెందిన సంకురు బుచ్చిరెడ్డి, రెడ్డీపేట సంతమార్కెట్కు చెందిన ముర్ల చిన్నారెడ్డి, బూసిగ్రామానికి చెందిన ఉలుగుల రవికిరణ్రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5 సెల్ఫోన్లను స్వాఽఽధీనం చేసుకున్నారు. గంజాయి ఎవరు సరఫరా చేస్తున్నారు, ఎవరికి అమ్ముతున్నారు అనే విషయాలను దర్యాప్తు చేస్తామని ఎస్పీ డి.నరసింహాకిశోర్ తెలిపారు. నార్త్‌జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ పర్యవేక్షణలో గంజాయి పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన రాజానగరం సీఐ వీరయ్యగౌడ్, ఎస్సై పి.మనోహర్, కానిస్టేబుల్స్ రమణ, నాగేశ్వరరావు, కరీముల్లాఖాదర్లను ఎస్పీ అభినందించారు. -
బెట్టింగ్‌ల మోజులో యువత
జీవితాలు బలైపోతాయని హెచ్చరిస్తున్న పోలీసులు రాజానగరం: అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పొందుతున్న విజ్ఞానాన్ని సమాజ హితం కోసం కాకుండా తప్పుడు మార్గాలలో సంపాదనలకు కొంతమంది స్వార్థపరులు ఉపయోగిస్తుంటే, వాటికి ఆకర్షితులై కొంతమంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా తమ బిడ్డలు ఉన్నతంగా ఉండాలి, ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేయాలనే ఆశతో చాలామంది తల్లిదండ్రులు తమ కడుపులు మాడ్చుకుని, అప్పులు చేసి మరీ పిల్లలను చదివిస్తున్నారు. ఈ క్రమంలో దూర ప్రాంతాలలోని కళాశాలలలో చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు హాస్టల్స్‌లో ఉంటూ చదువులు సాగిస్తుంటారు. అయితే ఇటువంటి వారిలో కొంతమంది చెడు స్నేహాలతో కన్నవారి ఆశలను వమ్ము చేయడమే కాకుండా, తమ బంగారు జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. బ్రిడ్జి కౌంటీ కేంద్రంగా ... విద్యా, వ్యాపార రంగాలకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న రాజమహేంద్రవరం సమీపంలో ఇంజినీరింగ్, వైద్య కళాశాలలు అనేక ఉండటంతో యాప్‌ల ద్వారా బెట్టింగ్‌లు నిర్వహించే వ్యక్తులు ఈ ప్రాంతాన్నే తమ కేంద్రంగా చేసుకుని, బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న బ్రిడ్జి కౌంటీలో 12 మంది నిందితులు పట్టుబడ్డారు. చేపల చెరువుల ద్వారా ఆర్థికంగా నష్టపోయిన భీమవరానికి చెందిన దండు వెంకటవర్మ అనే సంతోష్ (31), కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్‌కు చెందిన ఇమ్మంది భరత్‌కుమార్ (34)తో కలిసి బ్రిడ్జి కౌంటీలోని బి–12 విల్లాను అద్దెకు తీసుకుని, కొన్ని నెలలుగా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాడు. వీరిద్దరినీ అడ్మిన్లుగా చేసుకుని, భీమవరం నుంచి దుబాయ్ వెళ్లిన వినీత్ అనే మరో వ్యక్తి కీ రోల్ పోషిస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బ్రిడ్జి కౌంటీలో ఇటువంటి కార్యకలాపాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి వాటి గురించి సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేసి, సహకరించాలని నార్త్ జోన్ డీఎస్పీ వై. శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. తప్పుడు మార్గాలలో పయనించి, జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు ఆయన హితవు పలికారు. హాస్టల్స్‌లో ఉంచి చదివిస్తున్న తమ పిల్లల ప్రవర్తనలపై తల్లిదండ్రులు కూడా నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. క్రికెట్ బెట్టింగ్‌లే అధికం సమాచారం కోసం కనుగొన్న సెల్‌ఫోన్ నేడు అందరికీ జీవితంలో ఒక భాగమైపోయింది. చిన్నపిల్లల నుంచి పండు ముదుసలి వరకు సెల్‌ఫోన్ ముట్టుకోకుండా రోజుగడవడం లేదనడం అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో ఇక విద్యార్థుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో పేకాట, గుండాటల తరహాలోనే ఆన్లైన్లో అనేక రకాల యాప్‌లు హల్చల్ చేస్తున్నాయి. అనేక మంది వాటికి ఆకర్షితులవుతున్నారు. తెలిసీ తెలియని పరిజ్ఞానంతో వారి బ్యాంకు అకౌంట్ల వివరాలు అపరిచితులకు తెలియజేయడమే కాకుండా తల్లిదండ్రుల అకౌంట్లను కూడా కొల్లగొట్టేందుకు తోడ్పడుతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది అమాయకులు భయంతో బయటకు చెప్పుకోలేక, తల్లిదండ్రులకు తెలిస్తే ఏమవుతుందోననే భయంతో జీవితాలను అర్ధంతరంగా ముగించుకునే పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి. ఇటువంటి వాటిలో క్రికెట్ బెట్టింగ్‌లే ఎక్కువగా ఉన్నాయి. బార్బర్ షాపులలో కూడా టీవీలను పెట్టుకుని, యాప్‌ల ద్వారా బెట్టింగులు నిర్వహిస్తున్నారు. వీటిని నిరోధించేందుకు పోలీసులు ఎంతగా ప్రయత్నించినా, సరైన ఫలితాలు కనిపించడం లేదు. -
బ్లడ్ బ్యాంక్‌లో తనిఖీలు
కాకినాడ క్రైం: కాకినాడలోని శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. డీఎంహెచ్‌వో డాక్టర్ నరసింహనాయక్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాధారణ తనిఖీలలో భాగంగా బ్లడ్ బ్యాంక్‌ను పరిశీలించినట్లు తెలిపారు. రిజిస్టర్లు పరిశీలించామని, రిక్విజేషన్ ఫాంలోని వివరాల ఆధారంగా దాతలు, గ్రహీతలతో మాట్లాడి నిర్ధారించుకున్నట్లు తెలిపారు. బ్లడ్ స్టాక్ రికార్డు, డోనార్ రికార్డు, క్యాంప్ రిజిస్టర్స్, క్రాస్ మ్యాచింగ్, డిస్కార్ట్ రిజిస్టర్, బ్లడ్ ఇష్యూ రిజిస్టర్, పేమెంట్ రిక్విజేషన్ ఫాం, పేమెంట్ రిసీప్ట్స్, ఫిజికల్ స్టాక్, బ్లడ్ కలెక్షన్, మ్యాచింగ్, కాంపోనెంట్ ప్రిపరేషన్, వైరల్ స్క్రీనింగ్ రూంలను తనిఖీ చేసినట్లు తెలిపారు. శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్‌లో నిబంధనలకు అనుగుణంగానే రక్తదాన సేవలు కొనసాగుతున్నాయని నిర్ధారించినట్లు తెలిపారు. ఈ తనిఖీలలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ వ్యాధుల నియంత్రణాధికారి(డీఎల్వో) డాక్టర్ రోణంకి రమేష్ పాల్గొన్నారు. -
ద్రాక్షారామలో పేలుడు కలకలం
రామచంద్రపురం రూరల్: రామచంద్రపురం మండలంలోని ద్రాక్షారామలో పేలుడు కలకలం చోటు చేసుకుంది. ద్రాక్షారామ ఎస్సై ఎం. లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం బాధిత కుటుంబం ఎండీ జాఫర్ హుస్సేన్ అతని భార్య ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడుతో కలసి ద్రాక్షారామ నున్నవారి వీధిలో నివాసం ఉంటున్నారు. జాఫర్ మార్కెట్లో మటన్ దుకాణం నడుపుకుంటున్నాడు. సోమవారం రాత్రి భోజనం చేసి భార్య, కుమార్తెలు పెంకుటింటిలో నిద్రపోగా, జాఫర్, అతడి కుమారుడు ఇంటి పెరటిలో ఉన్న రేకుల షెడ్డులో నిద్రపోయారు. అర్ధరాత్రి 1.15 గంటలకు పేలుడు శబ్దం, మంటలు రావడంతో భయపడి లేచి బయటకు వచ్చి చూసేసరికి అదే గ్రామానికి చెందిన మహమ్మద్ రోషన్ అబ్బాస్, మరో ఇద్దరు గుర్తు తెలియని యువకులు వీరిని చూసి మోటారు సైకిళ్లపై పారిపోయారు. గాజు సీసాలకు చుట్టిన ఔట్లు, పేలుడు పదార్థాలతో ఇంటిపై దాడి చేశారని, గతంలో రోషన్ అబ్బాస్ బావ మహ్మద్ అలీహుస్సేన్కి తనకి మసీదు విషయంలో ఉన్న గొడవలను దృష్టిలో పెట్టుకుని తమ కుటుంబాన్ని చంపాలని, ఇంటిని నాశనం చేసి ఆస్తి నష్టం కలిగించాలనే ఉద్దేశంతో తమపై దాడికి పాల్పడ్డారని జాఫర్ హుస్సేన్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. ఘటనా స్థలాన్ని సీఐ వెంకట నారాయణ సిబ్బందితో కలసి పరిశీలించారు. -
మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో మండపేట యువకుడి మృతి
మండపేట: పొట్టకూటికి మహారాష్ట్ర పనికి వెళ్లిన మండపేట యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నాలుగు రోజలు క్రితం జరిగిన ఈ విషాద ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు, స్నేహితులు తెలిపిని వివరాలిలా వున్నాయి. పట్టణంలోని కొండపల్లివారి వీధికి చెందిన పరమటి జితేంద్ర (33) మహారాష్ట్రలోని ఉద్గార్లోని ఓ ఫైనాన్స్ సంస్థలో కొంత కాలంగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మార్చి 7వ తేదీ ఉదయం ద్విచక్ర వాహనంపై లైన్‌కు బయలుదేరాడు. హల్నీ రహదారిపై వెళ్తున్న జితేంద్ర గండోపత్ దప్కా ప్రాంతానికి వచ్చేసరికి ప్రమాదానికి గురయ్యాడు. ఎదురుగా వేగంగా వస్తున్న నాలుగు చక్రాల గూడ్స్‌వ్యాన్ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రుణ్ణి స్థానికులు ఆసుపత్రికి చేర్చించారు. అక్కడ వైద్యం పొందుతుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడని చెప్పారు. ఘటనపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. పంచనామా పూర్తయ్యాక అక్కడి పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా మహారాష్ట్ర నుంచి అంబులెన్స్‌లో సోమవారం రాత్రి మండపేట తీసుకువచ్చారు. కాగా మృతునికి భార్య, మూడు నెలల పసిపాప వున్నారు. కుటుంబం కోసం కష్టపడటానికి వెళ్లి ఎప్పుడూ క్షేమంగా ఇంటికి చేరుకునే తన భర్త ఈసారి ఎవరికీ అందనంత దూరం వెళ్లిపోయారని గుండెలవిసేలా రోదించిన భార్యను చూటి చుట్టుపక్కల వారు కంటతడి పెట్టారు. ఉపాధి హామీ పని చేస్తూ మహిళా కూలి మృతి దేవరపల్లి: ఉపాధి పని చేస్తూ అస్వస్థతకు గురై పని ప్రదేశంలోనే మహిళా కూలీ మృతి చెందిన ఘటన దేవరపల్లి మండలం పల్లంట్లలో మంగళవారం జరిగింది. ఏపీఓ జీవీ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పల్లంట్లకు చెందిన బొందల చంద్రమ్మ(53) 15 ఏళ్లుగా ఉపాధి పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. మంగళవారం ఉదయం గ్రామంలోని రైతు పొలంలో ఫార్మ్ చెరువు తవ్వకం పనులకు వెళ్లిన చంద్రమ్మ కొద్దిసేపటికి అస్వస్థతకు గురైంది. వెంటనే వైద్యం కోసం గ్రామానికి తీసుకువస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. -
నిమ్మకు తెగుళ్ల బెడద
పెరవలి: జిల్లాలో నిమ్మపంట 720 హెక్టార్లలో సాగు జరుగుతుండగా వివిధ రకాల తెగుళ్లు ఆశించి ఉండటంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడి, తోటలు పాడైపోతున్నాయి. ముఖ్యంగా ఈ పంటపై ఆకు ముడత, పండ్ల రసాన్ని పీల్చే రెక్కల పురుగులు, బంక, వేరుకుళ్లు, గజ్జి, మొజాయిక్ తెగుళ్లు ఆశించి ఉన్నాయి. ఈ తెగుళ్ల నివారణకు రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలు గురించి కొవ్వూరు ఉద్యాన అధికారి (ఏడీఏ) సీహెచ్ శ్రీనివాస్ వివరించారు. ఆకుముడత : ఈ తెగులు ఎక్కువగా లేత చిగుర్లపై ఆశించి ఆకులపై తెల్లటి పొరలు వంకర టింకరగా ఏర్పడి ఆకులు ముడుచుకునేలా చేస్తుంది. తద్వారా ఆకులపై గజ్జి తెగులు ఎక్కువగా వ్యాప్తి చెంది ఆకులు రాలిపోతాయి. నివారణ చర్యలు : ఆకులు ముడతలు పడినట్లు గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. డైమిథోయేట్ 2 మిల్లీ లీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.5మిల్లీ లీటర్లు మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. దీని ఉధృతి ఎక్కువగా ఉంటే 10 రోజుల వ్యవధిలో రెండవసారి పిచికారీ చేయాలి. తెల్లపొలుసు పురుగులు : ఈ పొలుసు పురుగులు ఎక్కువగా కాండంపై ఆశించి సున్నం పూసినట్లుగా కనపడతాయి. ఇవి కాండం, కొమ్మలలో రసాన్ని పీల్చివేయటం వల్ల అవి ఎండిపోతాయి. నివారణ చర్యలు : ఈ పురుగులు ఆశించిన చోట గోనె సంచితో బాగా రుద్ది మిధైల్డెమటాన్ లేదా డైమిథోయేట్ 2 మిల్లీ లీటర్లు మందును లీటరు నీటిలో కలిపి కాండం, కొమ్మలపై పిచికారీ చేయాలి. నల్లి పురుగులు : నల్లి పురుగుల్లో ఆకుపచ్చ నల్లి, మంగు నల్లి ముఖ్యమైనవి. ఆకునల్లి ఆకులపైన, మంగునల్లి కాయలపైన ఆశించి రసాన్ని పీల్చివేస్తాయి. దీనివల్ల కాయలపై చిన్న చిన్న తెల్లని మచ్చలు లేదా ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కాయ అంతటా మంగు ఏర్పడుతుంది. నివారణ చర్యలు : నీటిలో కరిగే గంధకం 3గ్రాములు లేదా డైకోఫాల్ 5.0 మిల్లీ లీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే నివారణ అవుతుంది. రసం పీల్చే రెక్కల పురుగులు : ఈ రెక్కల పురుగులు పండ్లపై రంథ్రాలు చేసి కాయలో ఉండే రసాన్ని పీల్చుతాయి. దీంతో కాయలకు చేసిన రంథ్రాల ద్వారా శిలీంద్రాలు, బ్యాక్టీరియా చేరి పండ్లు కుళ్లి, రాలిపోతాయి. పండ్లపై డాగు ఏర్పడుతుంది. నివారణ చర్యలు : ఈ పురుగులు ఆశించి కుళ్లి, రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. పురుగులను నాశనం చేయటానికి మలాథియాన్ ఒక మిల్లీలీటరు మందుకు ఒక శాతం పంచదార, పండ్ల రసం కలిపి చెట్ల కింద అమర్చాలి. పురుగులను ఆకర్షించటానికి బల్బులను ఏర్పాటు చేయాలి. దీని ద్వారా పురుగులను అరికట్టవచ్చు. పురుగుల నుంచి కాయలను రక్షించటానికి కాయలకు బుట్టలను ఏర్పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. బంక తెగులు : బంక తెగులు రెండు రకాలు ఒకటి ఫెటోఫ్తోరా, రెండు డిఫ్లోడియా. మొదటి తెగులు ఆశించిన చెట్టు నుంచి ధారాళంగా బంక కారుతుంది. ఇది చెట్టు వేళ్లకు, మొదలు కింది భాగానికి పరిమితమై ఉంటుంది. డిఫ్లోడియా బంక తెగులు చెట్టు మొదలు పైభాగాన కొమ్మల పంగల్లో ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు ఎక్కువగా ఉంటే బంక కారటం, బెరడు కుళ్లటం జరుగుతుంది. నీరు త్వరగా ఇంకని భూముల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుంది. నివారణ చర్యలు : బంక కారి కుళ్లిన బెరడును పూర్తిగా తొలగించి బోర్డోపేస్టు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ పేస్టు పూయాలి. ఈ పేస్టును మొదలు చుట్టూ పూయాలి. కొమ్మలపై వచ్చే బంక తెగులు నివారణకు లీటరు నీటికి 1గ్రాము కార్బండజిమ్ కలిపి చెట్టు మొత్తం తడిసేలా పిచికారీ చేయాలి. మెటలాక్సిల్ 2 గ్రాములు లీటరు నీటిలో కలిపి చెట్టు మొదలులో పోయాలి. వేరుకుళ్లు తెగులు : వేరుకుళ్లు తెగులు ఆశించిన చెట్టుకు పోషక పదార్థాలు అందక చెట్లు ఎండిపోతాయి. ఈ తెగులు ఆశించిన చెట్లు ఎక్కువ పూతపూసి కాయలు ముదిరే లోగా చెట్లు వాడి ఎండిపోతాయి. ఎండిన చెట్ల వేర్లను పరీక్షిస్తే కుళ్లిన వాసన వస్తుంది. నివారణ చర్యలు : వ్యాధి సోకిన తొలి దశలోనే గమనించి చెట్టుకు ఎక్కువగా నీరు కట్టి మరుసటి రోజు కార్బండజిమ్ 2 గ్రాములు లేదా మాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా చెషంట్ 3 గ్రాములు లేదా ఒక శాతం బోర్డో మిశ్రమాన్ని లీటరు నీటిలో కలిపి చెట్టు చుట్టూ నేల తడిసేలా పిచికారీ చేయాలి. చెట్టుకి కావలిసిన పోషక పదార్థాలు సేంద్రియ ఎరువులు, పచ్చి రొట్ట ద్వారా అందించాలి. ఒక కిలో ట్రైకోడెర్మా మందును 90 కిలోల పశువుల ఎరువు 10 కిలోల వేపపిండితో కలిపి 15 రోజులు మాగపెట్టి చెట్టు మొదలు చుట్టూ వేయాలి. ఇలా చేస్తే చెట్టును ఈ తెగులు నుంచి కాపాడవచ్చు. గజ్జి తెగులు (కాంకర్ మచ్చ) : నిమ్మ పంటపై ఎక్కుగా ఆశించే తెగులు ఈ గజ్జి తెగులు. ఇది కాయలు, ఆకులు, చిన్న, పెద్ద కొమ్మలను ఆశిస్తుంది. తెగులు ప్రభావం అధికంగా ఉంటే చెట్లు ఎండిపోయి చనిపోతాయి. నివారణ చర్యలు : ఈ తెగులు సోకి ఎండిన కొమ్మలను కత్తిరించి స్ట్రెప్టోసైక్లిన్ ఒక గ్రాము, 30 గ్రాములు బ్లైటాక్స్ మందును 10 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. గజ్జి ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని గోకి బెరడును తీసి వేసి బోర్డోపేస్టును పూయాలి. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,000 గటగట (వెయ్యి) 15,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
అప్పులతో అమరావతి అభివృద్ధి సరే..
అమలాపురం టౌన్: శాసన సభ సమావేశాల సాక్షిగా మంత్రి నారాయణ వరల్డ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఏసియా, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు రూ.48 వేల కోట్ల (అప్పు)తో రానున్న ఐదారు నెలల్లో అభివృద్ధి చేయనున్నామని చెప్పారు సరే.. మరి పర్యావరణం, ఉపాధి అవకాశాలను ఎందుకు ప్రస్తావించలేదని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు సూటిగా ప్రశ్నించారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు, వైఎస్సార్ సీపీ నాయకులు మాట్లాడారు. ఎక్కడైనా అభివృద్ధి పేరిట పనులు మొదలెడితే, ఆ ప్రాంతంలో పర్యావరణం దెబ్బతింటుంది, కూలీలకు ఉపాధి అవకాశాలు మృగ్యమవుతాయి, ఇలాంటి అభివృద్ధి పేరిట ఉత్పన్నమయ్యే సమస్యలపై యునైటెడ్ నేషనల్ ఆర్గనైజన్స్(యూఎన్వో) ద్వారా ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ్ లాలో ఎన్నో దేశాల్లో కేసులున్నాయని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. అమరావతి అభివృద్ధి పేరుతో భవిష్యత్తులో జరగనున్న పర్యావరణ, ఉపాధి అవకాశాలపై ఎదురయ్యే సమస్యలను ఛాలెంజ్ చేస్తూ వైఎస్సార్ సీపీ అనుమతితో పార్టీ తరఫున ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ్ లాలో కేసు వేస్తామని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. యూఎన్వో చార్టర్ ప్రకారం రిహాబిలిటేషన్, రీ షెటిల్‌మెంట్ పరంగా అమరావతి అభివృద్ధి పేరిట అక్కడి కూలీలు, రైతులు, కార్మికులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతి అభివృద్ధి మాటున జరగనున్న విధ్వంసాలపై పార్టీ తరఫునే కాకుండా, బీసీ సంఘాల తరఫున కూడా ఈ వైఫల్యాలను ఖండిస్తున్నామన్నారు. సమావేశంలో పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, లీగల్‌సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు కుడుపూడి త్రినాథ్, నాయకులు వాసర్ల సుబ్బారావు, అనంత్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణం, ఉపాధి అవకాశాల మాటేమిటి? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు సూటి ప్రశ్న -
విజ్ఞానాసక్తి ఉంటే భవిష్యత్తు శాస్త్రవేత్తలు మీరే..
ముమ్మిడివరం: విజ్ఞాన శాస్త్ర ఆలోచన విధానాలను పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశాలు మెండుగా ఉంటాయని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా అన్నారు. స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లా విజ్ఞాన శాస్త్ర సంబరాల ముగింపు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి డీఈఓ ముఖ్యఅతిథిగా హాజరై, విజ్ఞాన శాస్త్ర ప్రాముఖ్యాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా క్విజ్ పోటీలు నిర్వహించిన క్విజ్ మాస్టర్ పీవీ బ్రహ్మానందం, మేక రామలక్ష్మి, టీఆర్ఎస్ పద్మావతిని అభినందించారు. క్విజ్ పోటీలు, డ్రాయింగ్ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనాతవరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సర్ ఐజాక్ న్యూటన్, ఆర్యభట్ట వేషధారణ ఆకట్టుకుంది. జిల్లా విజ్ఞాన శాస్త్ర అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, విద్యార్థులు విజ్ఞాన శాస్త్ర ఆలోచన విధానాలను పెంపొందించుకోవాలని సూచించారు. సమగ్ర శిక్షా ఏఎంఓ రాంబాబు మాట్లాడుతూ, విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించడం ద్వారా ఉత్తమ పరిశోధకులుగా తీర్చిదిద్దవచ్చన్నారు. సమగ్ర శిక్షా ఎఫ్ఏఓ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ, సమగ్ర శిక్షా ద్వారా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి, విద్యార్థులను నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ గౌరీశంకర్, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. డీఈఓ షేక్ సలీం బాషా విజ్ఞాన శాస్త్ర సంబరాల ముగింపు -
నేనేమి చేశాను నేరం..!
సాక్షి, అమలాపురం: మనలో ఉంటారు. కాని ప్రపంచం తెలియదు. మనతో కలిసి జీవిస్తారు. కాని జీవనం అంటే ఏమిటో తెలియదు. మన మాటలు వింటారు కానీ, తిరిగి పూర్తిగా సమాధానం చెప్పలేరు. కనీసం తమకు ఏదైనా శారీర ఇబ్బంది తలెత్తినా.. బాధతో విలవిల్లాడుతున్నా భరించడమే కానీ నోరు తెరిచి చెప్పలేని దుస్థితి వారిది. శారీరక దివ్యాంగానికి, మానసిక దివ్యాంగత్వం కూడా తోడు కావడంతో చిన్నారులు, యువతీ యువకులు మంచాలకే పరిమితమవుతున్నారు. ఇటువంటి వారికి మంచాలపై ఉంటున్న దీర్ఘకాలిక రోగులకు ఇస్తున్నట్టుగా రూ.15 వేల పింఛను ఇవ్వాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇందుకు పలు అవాంతరాలూ ఏర్పడుతున్నాయి. మంచాలపై ఉన్న దీర్ఘకాలిక రోగులకు మాత్రమే రూ.15 వేల పింఛనుకు జీవో ఉంది. ఇలా శారీరక, మానసిక దివ్యాంగులు మంచాలకే పరిమితవుతున్నా, వీరికి మాత్రం కేవలం రూ.6 వేల పింఛను మాత్రమే లభిస్తోంది. పైగా సదరన్ సర్టిఫికెట్లో ఇలా రెండు రకాల దివ్యాంగత్వంతో ఇబ్బంది పడుతూ మంచానికే పరిమితమవుతున్నారనే ఆప్షన్ లేకపోవడం వీరికి ప్రధాన అవరోధంగా పరిణమించింది. మొత్తం 21 రకాల దివ్యాంగులున్నారు. కానీ సదరం వైబ్సైట్లో కేవలం ఐదు రకాల దివ్యాంగులనే చూపుతోంది. కోనసీమ జిల్లాలో ఇటువంటి వారు సుమారు 500 మంది వరకు ఉంటారని అంచనా. వీరిలో కొందరికి దివ్యాంగ పింఛను రూ.6 వేలు వస్తుండగా, మరికొంత మందికి అదీ లేదు. ఉన్నంత లోనే సరిపుచ్చుతూ.. ప్రతి నెలా రూ.వేలల్లో అవుతున్న వైద్యం.. తల్లిదండ్రులు సామాన్య కూలీలు. కౌలుదారులు కావడం వల్ల లక్షలాది రూపాయలు పోసి తమ పిల్లలకు మెరుగైన వైద్యం చేయించలేకపోతున్నారు. ఉన్నదానిలో కొంత సొమ్ము వెచ్చించి వైద్యం చేయించడం, నెల వారీ మందులు కొనడంతో సరిపుచ్చుతున్నారు. ప్రభుత్వం మంచానికి పరిమితమై, వైద్యం పొందుతున్న వారికి ఇస్తున్నట్టుగా తమ వారికి కూడా నెలకు రూ.15 వేల పింఛను ఇవ్వాలని సుదీర్ఘ కాలంగా మొరపెట్టుకుంటున్నారు. వీరంలో కొంతమంది కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక.. మీ కోసం కార్యక్రమానికి హాజరయ్యారు. తమ గోడును జాయింట్ కలెక్టర్ టి.నిషాంతికి మొరపెట్టుకున్నారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించారు. అక్షరం తప్పు ఉందని.. ఈ అబ్బాయి పేరు గంధం బాబి. వయస్సు 15 ఏళ్లు. రావులపాలెం మండలం దేవరపల్లి. తండ్రి లేడు. తల్లి గంధం కాసులమ్మ కూలీ పనిచేసి పెంచాల్సిందే. ఈ అబ్బాయిని కాసులమ్మ తల్లి అయిన వృద్ధురాలు సాకుతోంది. ప్రస్తుతం రూ.ఆరు వేల పింఛను ఇస్తున్నారు. ఇప్పుడు దానికీ ఇబ్బంది వచ్చి పడింది. సదరన్ సర్టిఫికెట్లో బీవోబీబీవై అని, ఆధార్‌లో మాత్రం బీవోబీవై అని ఉందని పింఛను ఆపేలా ఉన్నారని తల్లి కాసులమ్మ తల్లడిల్లుతోంది. తల్లి గర్భం నుంచి భూమిపై అవతరించిన శిశువుకు ఈ ప్రపంచమంటే ఏమిటో తెలియదు. తల్లి ఒడే ఆ పాపాయికి సర్వస్వం. ఆనందంగా ఉంటే కేరింతలు కొట్టడం.. ఆకలేస్తే ఏడుపు అందుకోవడం.. ఇదే తెలుసు. కాలక్రమంలో వయస్సును బట్టి తెలివితేటలు.. అవసరాన్ని బట్టి ప్రాపంచిక జ్ఞానం అలవడుతాయి. పెరిగి పెద్దవారై.. కుటుంబానికి చేదోడువాదోడై.. జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటారు. కానీ.. ఏ నేరానికి వీరు ఈ శిక్ష అనుభవిస్తున్నారో చెప్పడానికి కూడా వీల్లేకుండా.. పుట్టుకతో మంచానికే పరిమితమై జీవచ్ఛవంలా కాలం వెళ్లదీస్తున్నారు ఈ అభాగ్యులు. వయసు పెరుగుతున్నా.. సమాజంలో అందరిలా బతకలేక బతుకీడుస్తూ.. జీవితాన్ని చిదిమేస్తున్న కష్టాన్నీ గ్రహించలేక.. చెరగని చిద్విలాసాన్ని మోముపై చిందిస్తూ.. కనికరం లేని పాలకుల కరకు హృదయాలు వారి ఉనికిని అణచివేస్తున్నా.. కనీసం వేలెత్తి చూపలేని ఈ శారీరక, మానసిక దివ్యాంగుల అమాయకత్వంపై ఈ ప్రభుత్వం కరుణించడం లేదు. ఈమె పేరు మద్దింశెట్టి హారిక. వయస్సు 22 ఏళ్లు. ఆమెది రావులపాలెం మండలం గోపాలపురం. శారీరక, మానసిక వైకల్యం వల్ల ఇంటిలో మంచానికే పరిమితమైంది. ఇప్పుడు దివ్యాంగులకు ఇచ్చే రూ.6 వేల పింఛను మాత్రమే అందుతోంది. తండ్రి వ్యవసాయ కూలీ. వైద్యం పేరుతో ఆపరేషన్లు చేసినా, ఇప్పుడు మందులు వాడుతున్నా పింఛను సొమ్ము లేదా తండ్రి కూలీగా వచ్చే సొమ్ముతోనే. ఈ అబ్బాయి పేరు పితాని సిద్ధివిలాస్. రావులపాలెం మల్లయ్యదొడ్డి గ్రామం. వయస్సు 15 ఏళ్లు. తల్లి వెంటక లక్ష్మీ ఆలనాపాలనా చూస్తుంటే, తండ్రి శ్రీనివాస్ కూలీ పని చేస్తూ పోషిస్తున్నాడు. సిద్ధి విలాస్‌కు మాటలు రావు. అడుగు తీసి అడుగు వేయలేడు. కాలకృత్యాలు, ఇతర అవసరాలకు తల్లిదండ్రులు చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి చేయించాల్సిందే. పుట్టినప్పటి నుంచి మంచానికే.. గాడ సాత్విక్ కుమార్ వయస్సు ఏడు సంవత్సరాలు. కొత్తపేట పంచాయతీ పరిధిలోని గణేష్ నగర్ ప్రాంతానికి చెందిన గాడ రాజు, ఎస్తేరురాణి దంపతుల కుమారుడు. పుట్టినప్పటి నుంచీ మంచానికే పరిమితమైన దివ్యాంగుడు. రూ.6 వేల పింఛను మాత్రమే వస్తోంది. మంచానికే జీవితం పరిమితం పింఛను పెంచమన్నా.. ప్రభుత్వం చూపని కనికరం శారీరక దివ్యాంగత్వంతో పాటు మానసికంగానూ ఇక్కట్లు సదరన్‌లో లేని బహుళ దివ్యాంగత్వ ఆప్షన్ అందని రూ.15 వేల పెన్షన్ కుదేలవుతున్న కుటుంబాలెన్నో.. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ.. ఆదిమూలం నాగ సత్యవతికి 15 ఏళ్లు. ఆదిమూలం సత్యనారాయణమ్మకు 14 ఏళ్లు. వీరిద్దరూ అక్కా చెల్లెళ్లు. పి.గన్నవరం మండలం కుందాలపల్లి గ్రామానికి చెందిన వెంకటరత్నం, భాగ్యలక్ష్మి దంపతుల కుమార్తెలు. వీరిద్దరూ పుట్టుక నుంచే మంచానికి పరిమితమైన మానసిక దివ్యాంగులు. తండ్రి సత్యనారాయణ కౌలుదారుడు. అలాగే జీవనం కూలీ పని కూడా చేసి సాగిస్తున్నారు. వెబ్సైట్ ఓపెన్ కాలేదట..! కొత్తపేట పాత రామాలయం వీధికి చెందిన చోడపనీడి లక్ష్మణుడు వయస్సు ఆరేళ్లు. శివ నాగప్రసాద్, రాజేశ్వరి దంపతుల కుమారుడు. వీరికి ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు(కవలలు). వీరిద్దరిలో రెండో కుమారుడు లక్ష్మణుడు. ఈ బాలుడు మంచానికే పరిమితమైన దివ్యాంగుడు. కుమార్తె కూడా దివ్యాంగురాలే. వీరిద్దరికీ ఇంత వరకు ఎటువంటి పింఛనూ పొందలేకపోతున్నారు. దరఖాస్తు చేద్దామని వెళుతుంటూ సిబ్బంది వెబ్సైట్ ఓపెన్ కావడం లేదని చెబుతున్నారని ప్రసాద్ దంపతులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. -
సెక్టార్ సమావేశాలకు డుమ్మా !
ఆలమూరు: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సీఐటీయూ పిలుపు మేరకు అంగన్వాడీలు తలపెట్టిన ధర్నాను నిలువరించేందుకు ఐసీడీఎస్ అధికారులు సోమవారం మండల కేంద్రాల్లో సెక్టార్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలకు ఒక్క అంగన్వాడీ కార్యకర్త కూడా హాజరు కాలేదు. అంగన్వాడీ సహాయకులు కేంద్రాలను తెరవకుండా మూకుమ్మడి సెలవును ప్రకటించారు. దీంతో జిల్లాలోని ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన సెక్టార్ సమావేశాలకు అంగన్వాడీలు హాజరుకాకపోవడంతో ఐసీడీఎస్ అధికారులు మధ్యాహ్నం వరకూ ఎదురుచూసి వెనుదిరిగారు. నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అనేక మంది అంగన్వాడీ కార్యకర్తలు ఇప్పటికే విజయవాడ చేరుకోగా, కొంతమందిని మహిళా పోలీసుల సాయంతో ఇంటి వద్దే నిలువరించారు. మరికొంత మందిని మర్గం మధ్యలో అడ్డుకుని, వెనక్కు పంపేశారని అంగన్వాడీలు చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆశించినట్టుగా అంగన్వాడీల ఉద్యమాన్ని అణచివేయలేకపోయామనే ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది.ఆందోళనకే మొగ్గుచూపిన అంగన్వాడీలు -
మిత్రుల అంకురం.. రైతులకు సంబరం
పిఠాపురం: పంటకు మేలు చేసి, రైతులకు పురుగు మందుల ఖర్చు తగ్గించే మిత్రులుగా భావించే మిత్ర పురుగులు సేంద్రియ వ్యవసాయం పుణ్యమా అని మళ్లీ వాటికి జవజీవాలు సంతరించుకున్నాయి. విచ్చలవిడిగా రసాయనాల వినియోగంతో కనుమరుగైన మిత్ర పురుగులు.. సేంద్రియ వ్యవసాయంతో ఉనికిలోకి వస్తున్నాయి. వీటివల్ల పంటలకు ఎంతో మేలు కలిగి, రైతుకు పైసా ఖర్చు లేకుండానే క్రిమికీటకాలు నివారించబడతాయి. అలాంటి మిత్ర పురుగులు పొలాల్లో కనిపించకుండా పోవడంతో, కీటకాలు పెరిగి, పంటలకు తెగుళ్లు సోకి రైతుకు నష్టాలను మిగులుస్తున్నాయి. ఈ తరుణంలో ప్రకృతి వ్యవసాయం వల్ల పంటలకు మిత్రులు మళ్లీ వస్తుండడంతో రైతులను ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు మేలు సాలీడు, అక్షింతల పురుగు, తూనీగలు, అల్లిక రెక్కల పురుగు, గొల్లభామలను పంటలకు మిత్రులుగా చెబుతారు. ఇవి పంటలకు రక్షణ కవచాలుగా రైతులు పరిగణిస్తుంటారు. కొన్నేళ్లుగా సాగులో రసాయనాలను గణనీయంగా వినియోగించడంతో కనుమరుగైన ఈ పురుగులు.. ప్రకృతి వ్యవసాయం వల్ల, రసాయనాల వినియోగం తగ్గి, మళ్లీ భూమిపై సంచరిస్తూ పంటలకు మేలు చేస్తున్నాయి. ఈ మిత్ర పురుగులు పొలంలో లేకుంటే పంటకు కీడు చేసే పురుగుల తీవ్రత పెరిగి, పంటలకు తీవ్ర నష్టాలను కలిగిస్తాయి. పంటకు రక్షకులు.. ఇతర కీటకాలకు శత్రువులు రసాయనాల వినియోగంతో కనుమరుగు ప్రకృతి వ్యవసాయంతో మిత్ర పురుగులకు జీవం సేంద్రియ పంటల్లో వాటి ప్రాముఖ్యమెంతో.. అక్షింతల పురుగు పంటలకు అక్షింతల పురుగు (లేడీ బర్డ్ బీటిల్) చాలా ప్రయోజనకరంగా చెబుతారు. అనేక రకాల కీటకాలను, పేను బంక లాంటి రసం పీల్చే పురుగులకు ఇవి సహజ శత్రువులు. ఒక అక్షింతల పురుగు తన జీవిత కాలంలో సుమారు ఐదు వేల పేనుబంక పురుగులను తింటుంది. గుండ్రంగా కుంభాకారం కలిగి ఉంటుంది. పసుపు, గులాబీ, నారింజ, ఎరుపు, నలుపు రంగుల్లో మచ్చలు కలిగి ఉంటుంది. వీటి లార్వాలు సైతం కీటకాలను వేటాడుతాయి. ఆడ పురుగులు ప్రతి మూడు నెలలకోసారి సుమారు వెయ్యి గుడ్లు పెడతాయి. ఇవి ప్రకాశవంతమైన మచ్చలతో, నలుపు రంగులో ఉండి, ప్రమాదకరమైన దానిగా కనిపించినప్పటికీ పంటకు మాత్రం ఎంతో మేలు చేస్తుంది. ఇవి వదిలే లార్వా ఎటువంటి ప్రమాదకరం కాకపోవడంతో పంటకు మేలు మినహా, కీడు అనేది ఉండదు. అనేక వారాల పాటు పంటలపై ఉండి కీటకాలను తినడం ద్వారా రైతులు కీటకాల నివారణకు పురుగు మందులు పిచికారీ చేసే అవసరం లేకుండా, పెట్టుబడి, శ్రమ చాలా తగ్గుతుంది. అల్లిక రెక్కల పురుగు ప్రకృతిలో అల్లిక రెక్కల పురుగు (గ్రీన్ లేస్ వింగ్ బగ్) విరివిగా కనిపించే ఓ సాధారణ రెక్కల పురుగు. కానీ ఇది పంటలకు చేసే మేలు అంతా ఇంతా కాదు. గొంగళి పురుగులు, లీవ్ ఆఫర్స్, బిలివర్స్, వైట్ ఫ్లైస్ వంటి ఇతర మృదువైన శరీరం కలిగిన కీటకాలను నియంత్రించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. లేత ఆకుపచ్చ రంగులో, సున్నితమైన రెక్కలతో ఉండే ఈ పురుగు వదిలే లార్వా ఇతర కీటకాలను నాశనం చేస్తాయి. పంటలు నాశనం చేసే కీటకాలకు దీనిని బద్ధ శత్రువుగా చెబుతారు. తూనీగ పొడవైన శరీరం కలిగి, కళ్లు, రెండు జతల బలమైన రెక్కలు కలిగి, వివిధ రంగుల మచ్చలతో ఉండే తూనీగ (డ్రాగన్ ఫ్లై) 95 శాతం కీటకాలను వేటాడతాయి. అందుకే దీనిని డెడ్లీ హంటర్ అని కూడా అంటారు. కచ్చితమైన లక్ష్యాన్ని ఛేదించేవిగా చెబుతారు. ఇవి ఒకే వేసవిలో వేలాది కీటకాలను పట్టుకుని తింటాయి. దోమలు, ఈగలు, తెల్లదోమలను తిని పంటలకు మేలు చేకూరుస్తాయి. సాలీడు సాధారణ పంటలకు సోకే తెగుళ్ల నియంత్రణకు సాలీడు (స్పైడర్) జీవ ఏజెంట్లుగా పని చేస్తాయి. ఇవి అనేక సజీవ కీటకాలను తింటాయి. చీడపీడలను నియంత్రించడంలో వీటిని మించిన పురుగు మరొకటి లేదంటారు. కేవలం శత్రు కీటకాలను తినడం మినహా, పంటకు కానీ, మొక్కలకు కానీ ఎటువంటి హానీ చేయకపోవడం వల్ల మిత్ర పురుగుల్లో ఇది తొలి స్థానంలో ఉంది. దోమలు, ఈగలు, తెల్లదోమలు, ఎగిరే కీటకాలను పట్టుకుని తినడం ద్వారా ఇవి పంటలకు మేలు చేస్తాయి. గొల్లభామ పంటలకు గొల్లభామ (ప్రేయింగ్ మ్యాంటీస్)లను ఆస్తులుగా చెబుతారు. తెగుళ్ల నియంత్రణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. పునుబంక, ఆస్త్రరాగస్ బీటిల్స్, గొంగళి పురుగు, బీటిల్స్, తేనెమంచు పురుగు తదితర వాటిని తిని పంటలకు హాని కలగకుండా నివారిస్తాయి. ఇవి పుప్పొడి మకరందాన్ని తీసుకోవు. కానీ వీటిని ఉత్పత్తి చేసే మొక్కలు గొల్లభామలు తినే ఆహారాలైన కీటకాలను ఆకర్షిస్తాయి. వీటివల్ల పంటలకు చాలా మేలు కలుగుతుంది.మిత్ర పురుగులు మళ్లీ వచ్చాయి గతంలో ఎక్కడ చూసినా మిత్ర పురుగులు కనిపించేవి. కానీ రసాయనాల వినియోగం వల్ల అవి కనుమరుగయ్యాయి. ముఖ్యంగా పొలాల్లో అస్సలు కనిపించడం లేదు. కానీ సేంద్రియ వ్యవసాయం మొదలయ్యాక వాటి మనుగడ మళ్లీ ప్రారంభమైంది. రైతు ఎటువంటి పురుగు మందులు వాడకుండా, 70 శాతం వరకు ఇవి పంటలకు హాని చేసే కీటకాలను నాశనం చేసి, పంటకు మేలు చేస్తాయి. ఇప్పుడు ఇవి భారీగా కనిపిస్తున్నాయి. తెగుళ్లు తగ్గుముఖం పట్టాయి. రైతుకు పెట్టుబడి తగ్గింది. ఇది చాలా శుభపరిణామంగా చెప్పవచ్చు. – గుండ్ర శివచక్రం, ప్రకృతి వ్యవసాయ రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం ప్రకృతి వ్యవసాయ ఫలితమే.. కొన్నేళ్లుగా చేపట్టిన ప్రకృతి వ్యవసాయ సాగు ఫలితమే మిత్ర పురుగుల మనుగడకు అంకురం. ప్రస్తుతం సేంద్రియ పంటలన్నింటి పైనా ఈ పురుగులు సంచరిస్తున్నాయి. తద్వారా కీటకాల బెడద గణనీయంగా తగ్గింది. పురుగు మందుల అవసరం లేకుండా పోయింది. పంటలకు మంచి రోజులు వచ్చాయనడానికి నిదర్శనమే మిత్ర పురుగుల సంచారం. ఇది మారుతున్న వ్యవసాయ విధానాల్లో శుభపరిణామంగా చెప్పవచ్చు. – ఎలియాజరు, డీపీఎం, ప్రకృతి వ్యవసాయ శాఖ, కాకినాడ -
కమనీయం నరసన్న కల్యాణం
మధురపూడి: శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల సందర్భంగా కోరుకొండ గోవింద, హరి నామస్మరణతో మార్మోగింది. స్వయంభు శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం రథోత్సవం, రాత్రి 9 గంటలకు కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగాయి. దేవస్థానంలోని కల్యాణ మండపంలో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. కోరుకొండ నవనరసింహ క్షేత్రం కావడంతో సుదూర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కోరుకొండ పరిసరాలన్నీ భక్తజనంతో కిక్కిరిసింది. రథోత్సవంతో కోరుకొండ మీదుగా గోకవరం, భద్రాచలం, విశాఖపట్నం, విజయనగరం వెళ్లాల్సిన వాహనాలు నిలిచిపోయాయి. ప్రధాన వీధుల మీదుగా కొనసాగిన రథోత్సవం సాయంత్రం 5.30కు తిరిగి దేవస్థానానికి చేరింది. అక్కడ స్వామి, అమ్మవార్లను మేళతాళాలు, మంగళవాయిద్యాలతో ఆలయానికి తోడ్కొనివచ్చారు. వధూవరులకు మంగళస్నానాలు నిర్వహించారు. పట్టువస్త్రాలను అలంకరించిన స్వామి, అమ్మవారు దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. వధూవరులకు వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం వేద పండితులు పాణింగపల్లి పవన్‌కుమార్ ఆచార్యులు కల్యాణం నిర్వహించారు. దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త ఎస్పీ రంగరాజబట్టర్, అర్చకస్వాములు పెద్దింటి, పెదపాటి వారి పర్యవేక్షణలో కల్యాణ వేడుక కమనీయంగా జరిగింది. మాలధారణ భక్తుల ప్రదర్శనలు రథోత్సవంలో మాలధారణ చేసిన భక్తుల ప్రదర్శనలు ఆధ్యాత్మకతను సంతరించుకున్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన 220 మంది భక్తులు స్వామివారి మాలధారణ వేశారు. ఉత్సవాల సందర్భంగా స్వాములు 9 రోజుల పాటు నిష్ఠతో పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. వీరికి స్వామివారి మాలధారణ ట్రస్టు ద్వారా వడి, భిక్షలను ఏర్పాటు చేశారు. బుధవారం దీక్షను విరమిస్తారు. భక్తజన సందోహం నడుమ.. సోమవారం స్వామివారి రథోత్సవం భక్తజన సందోహం నడుమ వైభవంగా జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 1.56 గంటలకు వేద మంత్రోచ్ఛరణతో స్వామి, అమ్మవార్లు ఆశీనులైన రథం బయలుదేరింది. కొండ నుంచి ప్రారంభమైన రథం దేవస్థానం రోడ్డు, వాటర్ ప్లాంట్, రెడ్డి పంతులు సత్రం, పాత సంత మార్కెట్, వడ్టీలపేట, మత్స్యకారుల వాడ, ఎయిర్టెల్ టవర్, సాయిబాబా గుడి, అంకాలమ్మ గుడి, శివాలయం మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా గరగ నృత్యాలు, బ్యాండ్‌మేళాలు, కోలాటం, తీన్మార్, శక్తి వేషధారణలు, కేరళ డ్రమ్స్ వాయిద్యాలతో రథానికి స్వాగతం పలికారు. సాయంత్రం 5.40కు రథం తిరిగి దేవస్థానానికి చేరింది. భక్తులు అరటి పండ్లను స్వామి రథంపైకి వేస్తూ, దర్శించుకున్నారు. దేవస్థానానికి చేరుకున్న రథానికి ఎదుర్కోలు కార్యక్రమంలో భాగంగా మేళతాళాలతో నరసింహస్వామి, లక్ష్మీదేవిని ఆలయంలోకి తీసుకెళ్లారు. ఆయా కార్యక్రమాల్లో అన్నవరం దేవస్థాన ఈఓ వీర్ల సుబ్బారావు, దేవస్థానం అధికారులు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణచౌదరి, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, నార్త్‌జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్, కోరుకొండ తహసీల్దార్ సుస్వాగతం, ఎంపీడీఓ బత్తిన అశోక్‌కుమార్ పాల్గొన్నారు. కోరుకొండ సీఐ సత్యకిషోర్, ఎస్సై శ్యామ్‌సుందర్ బందోబస్తు నిర్వహించారు. శ్రీలక్ష్మీ నరసింహుని రథోత్సవం భక్తజన సందోహం కన్నుల పండువగా కల్యాణోత్సవాలు -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
రాజానగరం: జాతీయ రహదారిని ఆనుకుని చక్రద్వారబంధం సమీపంలో ఉన్న బ్రిడ్జి కౌంటీలోని బి–12 విల్లాలో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్‌లో 12 మందిని అరెస్టు చేశామని నార్త్ జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ తెలిపారు. దుబాయ్ కేంద్రంగా నడుస్తున్న ఈ క్రికెట్ బెట్టింగ్‌లో పట్టుబడిన వారంతా కర్నాటక, భీమవరం వారేనన్నారు. ఈ వివరాలను సోమవారం సాయంత్రం ఇక్కడ మీడియాకు వెల్లడించారు. భీమవరం మండలం బలుసుముడికి చెందిన దండు వెంకటవర్మ అలియాస్ సంతోష్ (31), కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్‌కు చెందిన ఇమ్మంది భరత్‌కుమార్(34)తో కలిసి బ్రిడ్జి కౌంటీలోని బి–12 విల్లాను అద్దెకు తీసుకున్నాడు. కొంతమందిని ఆఫీసు బుక్కీలుగా, కాంట్రాక్ట్ స్టాఫ్‌గా తీసుకుని కొన్ని నెలలు ఆన్లైన్ ద్వారా పంటర్స్(కస్టమర్స్)తో గెలుపు, ఓటములపై గేమింగ్ నడుపుతున్నాడు. ఈ బెట్టింగ్ ప్రక్రియ దుబాయ్ కేంద్రంగా జరుగుతోంది. భీమవరానికి చెందిన వినీత్ అనే వ్యక్తి దుబాయ్‌కి వెళ్లి, అక్కడి నుంచి కన్నడ, ఏపీబుక్.బర్లారి.కామ్లనే వెబ్సైట్లను నిర్వహిస్తుంటే, ఇద్దరు నిందితులు ఇక్కడి నుంచి అతనికి ఆడ్మిన్లుగా ఉన్నారు. గతేడాది జూలైలో అడ్మిన్లు ఇద్దరికీ కన్నడ 24.కామ్ అనే వెబ్సైట్ ద్వారా వైజాగ్‌లో 20 రోజుల శిక్షణ కూడా ఇచ్చాడు. ఆ తరువాత బి.కామ్ వెబ్ సైట్‌ని కొత్తగా ప్రారంభించి, ఈ బ్రిడ్జి కౌంటీలో అద్దెకు తీసుకున్న విల్లా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆదివారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌పై మధ్యాహ్నం 2 గంటల నుంచి మ్యాచ్ పూర్తయ్యే వరకు బెట్టింగ్‌లు నిర్వహించారు. ఈ మేరకు అందిన సమాచారంతో ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు ఎస్సై నాగార్జున ఆకస్మిక దాడి చేసి, నిందితులను అరెస్టు చేశారు. మొత్తం 12 మంది నిందితుల్లో ఇద్దరు ప్రధాన నిందితులు కాగా, మిగిలిన 10 మంది బుక్కీలు(ఆఫీస్ స్టాఫ్). వీరి నుంచి ఏడు ల్యాప్‌టాప్‌లు, 42 సెల్ఫోన్లు స్వాధీనపర్చుకున్నామని డీఎస్పీ తెలిపారు. బెట్టింగ్‌లకు వినియోగిస్తున్న వెబ్సైట్లను క్లోజ్ చేయించడంతో పాటు, వారి బ్యాంక్ ఖాతాలను కూడా సీజ్ చేయించేందుకు చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో సీఐ వీరయ్యగౌడ్, ఎస్సైలు మనోహర్, నాగార్జున, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. నిందితుల్లో మొత్తం 12 మంది దుబాయ్ నుంచి కీ రోల్ పోషిస్తున్న వినీత్ నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ వెల్లడి -
రహదార్లపై మృత్యు తాండవం
కిర్లంపూడి: ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఆగి ఉన్న టిప్పర్‌ను బైకిస్ట్ ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందినట్టు కేసు నమోదు చేశామని కిర్లంపూడి ఏఎస్సై కుమార్ తెలిపారు. ఆయన వివరాల మేరకు, చిల్లంగా గ్రామానికి చెందిన కొప్పన అప్పారావు(29) తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి వీరవరంలో అత్తారింటికి మోటార్ బైక్‌పై బయలుదేరాడు. రాజుపాలెం వంతెన అవతల వైపు మోటార్ బైక్ అదుపుతప్పి ఆగి ఉన్న టిప్పర్ వెనుక భాగంలో ఢీకొనడంతో, అతడి తలకు తీవ్ర గాయమైంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి భార్య, పాప, బాబు ఉన్నారు. భార్య విశాలాక్షి ఇచ్చిన ఫిర్యాదు మేకు కేసు నమోదు చేసినట్టు ఏఎస్సై తెలిపారు. రోడ్డుపై ఆందోళన కగా నిబంధనలకు విరుద్ధంగా టిప్పర్‌ను రోడ్డుపై ఆపడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని మృతుడి బంధువులు, గ్రామస్తులు ఆరోపించారు. మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ఆందోళనకు ఉపక్రమించారు. దీంతో కిర్లంపూడి–సామర్లకోట రోడ్డుపై సుమారు 4 గంటల సేపు ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పెద్దాపురం ఎస్డీపీఓ శ్రీహరిరాజు, జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్సై రాఘనాథరావు అక్కడకు చేరుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. బైక్ అదుపుతప్పి.. ముమ్మిడివరం: మోటార్ సైకిల్‌పై వెళుతున్న ఇద్దరు యువకులు రోడ్డుపై ఆబోతు అడ్డురావడంతో అదుపు తప్పి కిందపడ్డారు. దీంతో ఓ యువకుడికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని అనాతవరం 216 జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన మల్లిపూడి ప్రవీణ్‌కుమార్ (28), సత్యప్రకాష్ ద్విచక్ర వాహనంపై కాకినాడ నుంచి సొంతూరుకు పయనమయ్యారు. అనాతవరం వద్ద జాతీయ రహదారిపై అడ్డొచ్చిన ఆబోతును బైక్‌తో ఢీకొన్నారు. ఈ ఘటనలో ప్రవీణ్‌కుమార్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాల పాలైన సత్యప్రకాష్‌ను అమలాపురంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై డి.జ్వాలాసాగర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. లారీ ఢీకొని వివాహిత.. రావులపాలెం: ఊబలంకలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వందే విజయకుమారి(40) మృతి చెందారు. ఎస్సై నాయుడు రాము వివరాల మేరకు, ఆత్రేయపురం మండలంలోని కట్టుంగకు చెందిన విజయకుమారి భర్త రమేష్‌బాబుతో కలిసి అమలాపురంలో చదువుతున్న తన కుమార్తెను చూసేందుకు మోటార్ బైక్‌పై వెళ్లారు. సోమవారం సాయంత్రం తిరుగు పయనమయ్యారు, స్థానిక వినాయకుని ఆలయం వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి లారీ వారి బైక్‌ను ఢీకొంది. దీంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోగా, విజయకుమారి పైనుంచి లారీ దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. సీఐ సీహెచ్ విద్యాసాగర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో నలుగురి మృతి పరీక్ష రాయడానికి వెళ్తూ విద్యార్థి.. ఆబోతు అడ్డొచ్చి ఓ యువకుడు అత్తారింటికి వెళుతూ మరో వ్యక్తి పరీక్షకు వెళుతూ... సామర్లకోట: ఇంటర్మీడియెట్ పరీక్ష రాయడానికి సోమవారం ఇంటి నుంచి మోటార్ బైక్‌పై బయలుదేరిన విద్యార్థి మార్గం మధ్యలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన విషాద సంఘటన ఇది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు, మండలంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన ప్రగడ వంశీ(19) ఇంటర్ సెకండియర్ పరీక్ష రాయడానికి ఇంటి నుంచి కాకినాడకు బైక్‌పై బయలు దేరాడు. గొంచాల గ్రామంలోని మలుపులో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ అతడి బైక్‌ను ఢీకొనడంతో వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై రాంబాబు తన సిబ్బందితో సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. మృతుడి తండ్రి చనిపోవడంతో, ఒక్కగానొక్క కుమారుడిని తల్లి గారాబంగా పెంచుతూ, చదివిస్తోంది. పరీక్ష రాయడానికి వెళ్లిన కుమారుడు ఇక శాశ్వతంగా తిరిగిరాడని తెలుసుకుని ఆ తల్లి సంఘటన స్థలంలో గుండెలవిసేలా రోదించింది. తాను ఎవరి కోసం బతకాలంటూ ఆమె రోదించిన తీరు స్థానికుల హృదయాలను కలచివేసింది. అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఎస్సై రాంబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆకట్టుకున్న సూక్ష్మ బంగారు వరల్డ్ కప్
పెద్దాపురం: ఐసీసీ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా మూడోసారి విజేతగా నిలిచిన సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ అవార్డు గ్రహీత, పట్టణంలోని బంగారు శిల్పి తాళాబత్తుల సాయి సూక్ష్మ బంగారు వరల్డ్ కప్‌ను రూపొందించారు. కేవలం 40 నిమిషాల సమయంలో 0.100 మిల్లీ గ్రాముల బంగారంతో 10 మిల్లీమీటర్ల పొడవు కలిగిన వరల్డ్ కప్‌ను తయారు చేసి, పలువురి మనన్నలు అందుకున్నారు. మూల్యాంకన విధులపై సమావేశం బాలాజీచెరువు(కాకినాడ): పదో తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనంపై సోమవారం విద్యా శాఖ ఆర్జేడీ నాగమణి సమావేశం నిర్వహించారు. స్థానిక రామకృష్ణ పబ్లిక్ స్కూల్లో జోన్–2కు సంబంధించి కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల డీఈఓలు, పరీక్షల విభాగ ఏసీ, సీసీలతో సమావేశం జరిగింది. మూల్యాంకన విధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ సమావేశంలో డీఈవోలు పిల్లి రమేష్, నారాయణ పాల్గొన్నారు. పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్ నల్లజర్ల: తూర్పుచోడవరంలో నాలుగేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన ఇల్లెందుల నాగరాజు(34) అసభ్యంగా ప్రవర్తించాడు. శనివారం ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికను మభ్యపెట్టి, అసభ్యంగా వ్యవహరించాడు. ఈ మేరకు బాలిక తల్లి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని సోమవారం అరెస్టు చేసి, కోర్టుకు తరలించినట్టు ఏఎస్సై శోభనాద్రి తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,000 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
రెండో ర్యాంకుకు అన్నవరం దేవస్థానం !
ఇతర పుణ్యక్షేత్రాల స్థానం దిగజారడంతో ఎగబాకిన వైనం అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం భక్తులకు అందిస్తున్న సేవల్లో రెండో ర్యాంకును సాధించింది. గత నెలలో రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో చివరగా ఏడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 25 మధ్య సేకరించిన అభిప్రాయ సేకరణలో రెండో స్థానంలో ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన దేవస్థానాల భక్తుల అసంతృప్తి శాతం తక్కువగా ఉండడంతో రెండో స్థానంలో నిలిచినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గతంలో ఈ దేవస్థానం ఏడో ర్యాంకులో ఉండడంతో కలెక్టర్ షణ్మోహన్ గత నెల 24న అన్నవరం విచ్చేసి, విస్తృత తనిఖీలు నిర్వహించి, దేవస్థానం మొదటి ర్యాంకులో రావాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. భక్తులకు సేవలందించడం, ప్రసాదం నాణ్యత, ఇతర ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలు సేకరించి తాజా ర్యాంకులు ప్రకటించింది. భక్తులకు దర్శనంలో రెండో ర్యాంకు, మౌలిక వసతుల్లో మూడో ర్యాంకు, ప్రసాదం రుచిలో రెండో ర్యాంకు సాధించింది. అన్నవరం దేవస్థానం -
12న యువత పోరు బాటకు తరలిరండి
వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీలు అమలాపురం రూరల్: వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 12వ తేదీన యువత పోరు బాట పేరిట కలెక్టరేట్ వద్ద జరిగే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్ పిలుపునిచ్చారు. అమలాపురం మండలం భట్నవెల్లిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ స్వగృహం వద్ద ఆదివారం వైఎస్సార్ సీపీ యువత పోరు బాట పేరిట వాల్ పోస్టర్లను ఎమ్మెల్సీలు ఆవిష్కరించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు సంసాని వెంకట చంద్రశేఖర్(నాని) అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీలు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైనా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.వెయ్యి కోట్లు విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. దీనివల్ల పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని, అప్పు చేసి, ఫీజులు కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజు బకాయిలు కట్టకపోతే పరీక్షలకు అనుమతించడం లేదన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి మూడు నెలలకు ఫీజు రీయింబర్స్మెంట్ తల్లుల బ్యాంక్ ఖాతాల్లో వేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం లక్షలాది మంది విదార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజు బకాయిలు ఇచ్చే వరకూ వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందన్నారు. జిల్లాలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యువత పోరు బాటకు తరలిరావాలని పిలుపునిచ్చారు. పార్టీ రామచంద్రపురం, పి.గన్నవరం నియోజకవర్గాల ఇన్చార్జీలు పిల్లి సూర్యప్రకాశ్, గన్నవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోందని దుయ్యబట్టారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, ఎంపీపీ కుడిపూడి భాగ్యలక్ష్మి, పార్టీ నేతలు కోనుకు బాపూజీ, జున్నూరి వెంకటేశ్వరరావు, తోరం గౌతమ్, జాన్ గణేష్, వంటెద్దు వెంకన్నాయుడు, కుడుపూడి భరత్‌భూషణ్, వాసంశెట్టి తాతాజీ, కుంచె రమణారావు, చింతా రామకృష్ణ, దంగేటి రుద్ర, కౌన్సిలర్లు చిట్టూరి పెదబాబు, బండారుల గోవింద్ తదితరులు పాల్గొన్నారు. -
గొంతు దాటనినిరసన గళం
అంగన్వాడీల ధర్నాకు అనుమతి లేదు చలో విజయవాడ ధర్నాకు అంగన్వాడీ కార్యకర్తలు చేసుకున్న దరఖాస్తును ప్రభుత్వం ఆమోదించలేదు. సోమవారం నిర్వహించే ధర్నా, నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదు. అంగన్వాడీ కార్యకర్తలందరూ మండల కేంద్రాల్లో నిర్వహించే సెక్టార్ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలి. అంగన్వాడీ సహాయకులు అంగన్వాడీ కేంద్రాలను తెరచిఉంచాలి. అంగన్వాడీలు సరైన కారణం లేకుండా సెలవు తీసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – బి.శాంతకుమరి, పీడీ, ఐసీడీఎస్, అమలాపురం ● అంగన్వాడీల ఉద్యమంపై ఉక్కుపాదం ● చలో విజయవాడ భగ్నానికి ప్రభుత్వం కుట్ర ● సెక్టార్ సమావేశాలకు హాజరుకావాలని అధికారుల హుకుం ● విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరిక ● పోలీసుబెదిరింపులతో అణచివేసే యత్నం ఆలమూరు/రాయవరం: దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న తమ న్యాయబద్దమైన డిమాండ్ల సాధన కోసం రాజ్యాంగబద్ధంగా ధర్నా చేసేందుకు ఉపక్రమిస్తున్న అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన చలో విజయవాడను భగ్నం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కుయుక్తులు పన్నుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తొమ్మిది నెలల్లోనే ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుంది. దీంతో పాటు గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రకటించిన హామీలు అమలు చేయకపోవడంతో, ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే ఈ నెల ఆరున తమ న్యాయబద్ధమైన డిమాండ్లను ఆమోదించాలని కోరుతూ ఈ నెల ఆరున ఆశా కార్యకర్తలు ఇచ్చిన చలో విజయవాడకు పిలుపు విజయవంతం కావడంతో, అంగన్వాడీల ఆందోళనను ఉక్కుపాదంతో అణచివేయాలని కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా కుతంత్రాలు, కుట్రలను పన్నుతోంది. చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీలకు గతేడాది జూలై నెలలో వేతనాలు పెంచుతామంటూ గత ప్రభుత్వం జీవోను వెలువరించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అఽధికారం చేపట్టడంతో ఆ జీఓను అమలు చేయలేదు, కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో అంగన్వాడీలు ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చినా, పట్టించుకోకపోవడంతో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఈ నెల 10న చలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో ప్రభుత్వం అహం దెబ్బతినడంతో ఆ ఉద్యమాన్ని అణగదొక్కాలని నిర్ణయించుకుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,726 అంగన్వాడీ, మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. అందులో 86,296 మంది చిన్నారులు, ప్రీ స్కూల్ విద్యార్థులు, 15,743 మంది బాలింతలు, గర్భిణులున్నారు. వీరికి క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందజేయడంతో పాటు, చిన్నారులకు ఆటపాటలతో వినోద పరికరాలతో విద్యా బోధన చేస్తున్నారు. దీంతో పాటు నిమిషం ఖాళీ లేకుండా, యాప్‌లను పూరించడంతోనే సమయం సరిపోతోందని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాజరు కావాల్సిందే.. అంగన్వాడీలందరూ ఆయా మండల కేంద్రాల్లో సోమవారం నిర్వహించబోయే సెక్టార్ సమావేశాలకు హాజరు కావాల్సిందేనని ఐసీడీఎస్ శాఖ హుకుం జారీ చేసింది. సరైన కారణాలు లేకుండా గైర్హాజరైతే సంజాయిషీ ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు అంగన్వాడీ కార్యకర్తలు చెబుతున్నారు. విధిగా ప్రతి అంగన్వాడీ కేంద్రాన్ని ఆయాలు తెరచి ఉంచాలని స్పష్టం చేసినట్టు సమాచారం. చలో విజయవాడకు అనుమతి లేనందున ఎట్టి పరిస్థితుల్లోను సిబ్బంది ఆదేశాలు పాటించాల్సిందేనని సీడీపీఓలు, సూపర్వైజర్లు పరోక్ష హెచ్చరికలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో జిల్లా స్థాయి అధికారులు చేసేదేమీ లేక, సమావేశాలకు హాజరు కావాలని, తగిన కారణం లేనిదే సెలవు పెట్టకూడదంటూ అంగన్వాడీలకు, ఆయాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. చర్చలకు పిలిచారు కానీ.. అంగన్వాడీలు చలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి సీఐటీయూ నేతలను ఆదివారం చర్చలకు అహ్వానించినట్టు తెలిసింది. ప్రభుత్వం నుంచి సోమవారం సాయంకాలం వరకూ కబురు రాకపోవడంతో, సీఐటీయూ ఆదేశాల మేరకు చలో విజయవాడ నిరసన కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించాలని అంగన్వాడీలు నిర్ణయించుకున్నారు. జిల్లాలోని ఆయా గ్రామాల్లోని మహిళా పోలీసుల సహకారంతో అంగన్వాడీల కదలికలను తెలుసుకుని, విజయవాడకు వెళ్లకుండా పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పలుచోట్ల అంగన్వాడీలను గృహ నిర్బంధం కాగా, మరికొందరు అంగన్వాడీలు ఇప్పటికే విజయవాడ చేరుకున్నట్టు సమాచారం.హామీలను నెరవేర్చాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హామీలను పట్టించుకోవడం లేదు. అందుకే రాష్ట్ర నాయకత్వం మహా ధర్నాకు పిలుపునిచ్చింది. ఎన్నికల సమయంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. – డి.ఆదిలక్ష్మి, అధ్యక్షురాలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల సంఘం, మండపేట ప్రాజెక్టు, రాయవరం అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల డిమాండ్ల సాధనకు విజయవాడలో మహాధర్నాకు సిద్ధమయ్యాం. మహాధర్నాకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదెంత మాత్రం సమంజసం కాదు. బలప్రయోగంతో అడ్డుకునే ప్రయత్నాలు సరికావు. – కె.కృష్ణవేణి, జిల్లా ప్రధాన కార్యదర్శి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, మండపేట ప్రధాన డిమాండ్లివే.. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెర్పర్స్ వేతనాలను సత్వరం పెంచాలి. గ్రాడ్యుటీపై జీవోను వెంటనే విడుదల చేయాలి మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మార్చాలి. అంగన్వాడీలందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. పనిభారం తగ్గించి, యాప్‌లను కుదించాలి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కనీస వేతన చట్టం అమలు చేయాలి. -
మోరి చేనేత వస్త్రాలకు రాష్ట్రపతి ప్రశంస
సఖినేటిపల్లి: జిల్లాలోని మోరి చేనేత సొసైటీ వస్త్రాలను ఆదివారం న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. నేషనల్ డిజైన్ సెంటర్(సెట్ అప్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్) ఆధ్వర్యంలో సౌత్ ఇండియా అమృత్ మహోత్సవ్‌లో ఏపీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మోరి చేనేత స్టాల్‌ను న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోరి చేనేత సొసైటీ స్టాల్‌లోని చేనేత వస్త్రాలను రాష్ట్రపతి పరిశీలించారు. ఆమె వెంట ఏపీ గవర్నర్ ఉన్నారు. చేనేత చీరల తయారీలో కార్మికుల నైపుణ్యాన్ని రాష్ట్రపతి ప్రసంశించినట్టు స్టాల్ సేల్స్‌మన్, మోరికి చెందిన నల్లా ప్రసాద్ తెలిపారు. సుదర్శన హోమానికి రూ.లక్ష విరాళం సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివా రి ఆలయంలో నిత్యం నిర్వహిస్తున్న నారసింహ సుదర్శన హోమానికి హైదరాబాద్ షేక్‌పేటకు చెందిన అవసరాల సూర్య బాయన్నపంతులు రూ.లక్ష విరాళం ఆదివారం అందజేశారు. ఆలయంలో అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణకు ఈ మొత్తాన్ని అందజేశారు. ఆయనకు స్వామివా రి చిత్రపటం, లడ్డూ ప్రసాదాన్ని అందించారు. నిత్యాన్నదాన పథకానికి.. అంతర్వేది ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి ఏలూరుకు చెందిన మద్దిపట్ల ఆనంద్కుమార్శర్మ రూ.50 వేల విరాళం అందజేశారు. ఆలయంలో అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణకు విరాళాన్ని అందజేసి, స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం అందుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్ విజయసారథి పాల్గొన్నారు. నేడు యథావిధిగా గ్రీవెన్స్అమలాపురం రూరల్: కలెక్టరేట్లో సోమవారం జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని డీఆర్వో రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిషత్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం ఎప్పటిలాగే జరుగుతుందన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిందన్నారు. దీంతో జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక యథావిధిగా నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా స్థాయి విజ్ఞాన సంబరాలు నేడు ముగింపు ముమ్మిడివరం: జిల్లా స్థాయి విజ్ఞాన శాస్త్ర సంబరాల ముగింపు వేడుకలు స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహిస్తున్నట్టు జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం తెలిపారు. జిల్లా విద్యా శాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా ఆధ్వర్యంలో విజ్ఞాన శాస్త్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గత నెల 28 నుంచి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సోమవారం ముగింపు వేడుకలను నిర్వహించి, వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. అనంతరం జిల్లా స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించనున్నారు. అలాగే ప్రాథమిక స్థాయిలో విజేతలైన విద్యార్థులకు ప్రత్యేకంగా డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. పిల్లల్లో పరిశోధన దృక్పథంపై, ఆవిష్కరణలపై ఆసక్తిని పెంపొందించడమే కార్యక్రమ ముఖ్యోద్దేశమని సుబ్రహ్మణ్యం తెలిపారు. లోవ దేవస్థానానికి తరలివచ్చిన భక్తులు రూ.3.65 లక్షల ఆదాయం తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో సందడి నెలకొంది. ఆదివారం వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చిన 18వేల మంది భక్తులు క్యూలైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకున్నట్టు ఇన్చార్జ్ డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయా ల ద్వారా రూ.1,39,305, పూజా టికెట్లకు రూ. 86,900, కేశఖండన శాలకు రూ.13,960, వాహ న పూజలకు రూ.3,890, వసతి గదులు, పొంగ లి షెడ్లు, కాటేజీల అద్దెలు రూ.43,756, విరాళా లు రూ.77,609 వెరసి మొత్తం రూ.3,65,420 ఆదాయం సమకూరినట్టు ఈఓ వివరించారు. -
సుంకరపాలెం ఘటనపై కేసు నమోదు
ఎకై ్సజ్ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు తాళ్లరేవు: మద్యం తరలిస్తున్నారన్న అనుమానంతో ఇద్దరు యువకులను వెంబడించిన ఎకై ్సజ్ కానిస్టేబుల్ బి.ఆనందరాజుపై ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ ఏనుగుల చైతన్య మురళి సస్పెన్షన్ వేటు వేశారు. సుంకరపాలెం చెక్‌పోస్టు వద్ద శనివారం జరిగిన ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో కోట శ్రీరామ్ అనే విద్యార్థి మృతిచెందడంతో బాధ్యులపై చర్యలు చేపట్టాలని, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ సుంకరపాలెం, పరిసర గ్రామాలకు చెందిన అనేక మంది సుంకరపాలెం చెక్‌పోస్టును ముట్టడించి, ఆందోళన చేశారు. అర్థరాత్రి రెండు గంటల వరకు ఆందోళన కొనసాగింది. ఈ నేపథ్యంలో ఎకై ్సజ్ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. యువకులను ఎకై ్సజ్ కానిస్టేబుల్ ఆనందరాజు వెంబడించినట్లు నిర్థారణ కావడంతో, అతడిపై చర్య తీసుకుంటున్నట్టు డీసీ చైతన్యమురళి తెలిపారు. ఆయన వివరాల మేరకు, ఐడియల్ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న నలుగురు విద్యార్థులు రెండు బైకులపై యానాం వచ్చి, తిరిగి వెళుతుండగా ఎకై ్సజ్ సిబ్బంది చెక్ పోస్టు వద్ద తనిఖీ కోసం ఆపారు. ముందుగా బైక్‌పై వెళుతున్న యువకులు ఒత్తిడికి గురై, బైక్‌పై వేగంగా వెళుతూ లారీని దాటే క్రమంలో వెనుకనున్న విద్యార్థి కిందకు దూకగా, శ్రీరామ్ అదుపుతప్పి లారీ కిందపడి మృతిచెందాడు. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ కానిస్టేబుల్ ఆనందరాజును సస్పెన్షన్‌కు ఆదేశించామని, ఇన్ఫార్మర్పై చర్యలకు నిర్దేశించినట్టు డీసీ తెలిపారు. కాగా, మృతదేహానికి ఆదివారం శవ పంచనామా నిర్వహించినట్టు కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపారు. -
జనసేన నేత వీరంగం.. వైద్యురాలిపై దౌర్జన్యం
సాక్షి, కాకినాడ జిల్లా: అధికారం చేతిలో ఉంది కదా అని కూటమి నేతలు బరితెగిస్తున్నారు. జనసేన నాయకుడు రెచ్చిపోయాడు. ప్రత్తిపాడు సిహెచ్సీ వైద్య సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేయాలంటూ వేలు చూపిస్తూ వైద్యులకు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు వార్నింగ్ ఇచ్చాడు.రోగులకు వైద్యం చేస్తున్న సమయంలో డాక్టర్ శ్వేతకు తమ్మయ్యబాబు ఫోన్ చేశారు. ఆయనెవరో తెలియదని.. వేరొకరికి వైద్యం చేస్తున్నానని వైద్యురాలు చెప్పారు. ఫోన్లో మాట్లాడడానికి వైద్యురాలు నిరాకరించడంతో తమ్మయ్య బాబు.. నేరుగా ఆసుపత్రికి వచ్చి డాక్టర్ శ్వేతతో పాటుగా అక్కడున్న వైద్య సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. జ్ఞానం ఉందా?.. నోర్మూయ్ అంటూ వైదురాలిపై అరుపులతో వీరంగం సృష్టించారు. -
చిరకాలం గుర్తుండేలా..
పెళ్లి విషయంలో తల్లిదండ్రులు, పిల్లల అభిరుచులు మారుతున్నాయి. జీవితంలో పెళ్లి అరుదైన ఘట్టం. చిరకాలం గుర్తుండిపోయేలా ఘనంగా చేసుకుంటున్నారు. అధునాతన సెట్టింగులు, కొత్త పోకడలకు అనుగుణంగా పెళ్లి మంటపాలను సిద్ధం చేయాలని కోరుతున్నారు. – రాకుర్తి ప్రసాద్, సత్యనారాయణ గార్డెన్స్ యజమాని, అమలాపురం అభిరుచికి తగినట్టుగా.. పెళ్లిళ్లు చేసే తీరు మారిపోతోంది. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేదు. పెళ్లి తంతులో ప్రతి సందర్భం అద్భుతంగా గుర్తుండిపోవాలని కోరుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో పెళ్లిళ్ల సెట్టింగులను చూసి, తమకు కూడా అలాగే చేయాలని కోరుతున్నారు. పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడిని చేయడం, ఊరేగింపు, సంగీత్, బరాత్.. ఇలా అన్ని కొత్తదనం, ఆర్భాటం కనిపించాలని కోరుకుంటున్నారు. – కొవ్వూరి ధర్మారెడ్డి, ఎస్వీ ఈవెంట్స్, రావులపాలెం -
ఇంటర్ పరీక్షలకు 787 మంది గైర్హాజరు
అమలాపురం టౌన్: జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు శనివారం జనరల్, ఒకేషనల్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ రెండు పరీక్షలకు జిల్లాలో 787 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం గణితం, జంతు శాస్త్రం, చరిత్ర పరీక్షలకు 10,911 మంది హాజరు కావాల్సి ఉండగా 10,519 మంది రాశారు. ఒకేషనల్ పరీక్షలకు 2,734 మంది హాజరు కావాల్సి ఉండగా 2,339 మంది హాజరయ్యారు. డీఐఈవో వనుము సోమశేఖరరావు ముమ్మిడివరం ప్రభుత్వ, తార, రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లోని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లాలోని 40 పరీక్షా కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్లు, జిల్లా పరీక్షల కమిటీ ప్రతినిధులు పర్యవేక్షిస్తూ తనిఖీలు నిర్వహించారు. బాల బాలాజీకి రూ.3.36 లక్షల ఆదాయం మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి ఆలయానికి శనివారం భారీగా భక్తులు తరలి వచ్చారు. తెల్లవారు జామున సుప్రభాత సేవ, తొలి హారతితో దర్శనాలు ప్రారంభమయ్యాయి. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామి వారికి తల నీలాలు, ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. లక్ష్మీ నారాయణ హోమాన్ని దర్శించుకున్నారు. గోశాలను సందర్శించి, పూజలు చేశారు. వివిధ సేవల ద్వారా రూ.3,36,594 ఆదాయం వచ్చింది. స్వామి వారిని ఐదు వేల మంది భక్తులు దర్శించుకున్నారు. మూడు వేల మంది అన్న ప్రసాదం స్వీకరించారు. లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.65,670 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ఎం.సత్యనారాయణరాజు తెలిపారు. నిత్య అన్నదానం ట్రస్టుకు భక్తులు రూ.77,414 విరాళాలుగా అందించారు. సువర్ణ ఇండియా బాధితులకు న్యాయం చేయాలి అమలాపురం రూరల్: అమరావతి హైకోర్టు గతేడాది నవంబర్‌లో ఇచ్చిన తీర్పు ప్రకారం సువర్ణ ఇండియా డిపాజిట్ బాధితులకు న్యాయం చేయాలని బాధితుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కాశీ వెంకట్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం త్రిరత్న బుద్ధ విహార్ హాలులో సువర్ణ ఇండియా బాధితుల సమావేశం జరిగింది. వెంకట్రావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల పరిధిలో 24 బ్రాంచీల ద్వారా రూ.12 కోట్ల డిపాజిట్ల సేకరించి 2014లో ముంచేశారన్నారు. అమలాపురం ప్రధాన కేంద్రంగా 2011లో సువర్ణ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని ప్రారంభించి డిపాజిట్లు సేకరించారన్నారు. 2016లో కంపెనీకి చెందిన ఆస్తులు, డైరెక్టర్ల పేరు మీద ఉన్న ఆస్తులను అప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధికారులు సీజ్ చేశారని తెలిపారు. సీజ్ చేసిన ఆస్తులకు సంబంధించి రాజమహేంద్రవరంలోని న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే కంపెనీ ఎండీ బూసి వెంకట నాగవేణు, ఇతర డైరెక్టర్లు కలిసి ఏపీలో పలుచోట్ల సీజ్ చేసిన ఆస్తులను విక్రయించారన్నారు. 2024లో హైకోర్టు తీర్పు ప్రకారం కంపెనీకి చెందిన భూములను నగదు రూపంలో డిపాజిట్ దారులకు చెల్లించాలన్నారు. సమావేశంలో డిపాజిట్‌దారులు పాల్గొన్నారు. -
అన్ని రంగాల్లో మహిళల విజయబావుటా
అమలాపురం రూరల్: మహిళలు అన్ని రంగాల్లో విజయబావుటా ఎగురవేస్తున్నారని ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్ అన్నారు. అమలాపురం మండలం భట్నవిల్లిలోని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటి వద్ద శనివారం వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వంగా గిరిజా కుమారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్సీలు సూర్యనారాయణరావు, ఇజ్రాయిల్ మాట్లాడుతూ మహిళా సాధికారత అనేది నాణ్యమైన జీవితానికి దారితీసే అన్ని రంగాల నిర్ణయాత్మక ప్రక్రియలో మహిళల భాగస్వామ్య శక్తిని సూచిస్తుందన్నారు. జిల్లా అధ్యక్షురాలు గిరిజా కుమారి మాట్లాడుతూ ప్రతి రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, వారి హక్కులను తెలిపేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించామన్నారు. ఎమ్మెల్సీలు కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వైఎస్సార్ సీపీ మహిళా నాయకులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, ఎంపీపీలు కుడిపూడి భాగ్యలక్ష్మి, దంగేటి అచ్యుత జానకి, జెడ్పీటీసీలు పందిరి శ్రీహరి రామ్‌గోపాల్, గెడ్డం సంపద రావు, పట్టణ అధ్యక్షుడు సంసాని బుల్లినాని, ఉప్పలగుప్తం మండల అధ్యక్షుడు బద్రి బాబ్జీ, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరు వెంకటేశ్వరరావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, హ్యాండి క్రాఫ్ట్ మాజీ డైరెక్టర్ ఉండ్రు బేబీ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారతతోనే అభివృద్ధి అమలాపురం రూరల్: మహిళా సాధికారతతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర వ్యవసాయశాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. అమలాపురంలోని సత్యనారాయణ గార్డెన్స్‌లో శనివారం జిల్లా స్థాయి మహిళా దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నారన్నారు. ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణ రావు మాట్లాడుతూ ప్రతి పురుషుడి విజయం వెనుక మహిళలు కీలక పాత్ర పోషించారనడం అతిశయోక్తి లేదన్నారు. కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, జేసీ టి.నిషాంతి, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఆర్డీవో కె.మాధవి పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు సూర్యనారాయణరావు, ఇజ్రాయిల్ ఘనంగా మహిళా దినోత్సవం -
యాన్యువల్ డేకి వెళ్లాలి డాడి లే..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోకవరం మండలం కొత్తపల్లి శివారున పెట్రోల్‌బంక్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో(road accident) ఉపాధ్యాయుడు(Govt School Teacher) మృతి చెందగా అటవీశాఖ ఉద్యోగిని తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం అల్లూరి సీతారామరాజు జిల్లా వై.రామవరం మండలం దొలిపాడుకు చెందిన వలాల చిన్నబ్బాయి (52) జగ్గంపేట మండలం గోవిందపురం జిల్లా పరిషత్ హైసూ్కల్లో 2023 నుంచి సాంఘిక శాస్తం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. కొంత కాలంగా గోకవరంలో నివాసం ఉంటూ బైక్‌పై వెళ్లి వస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆయన వెళ్తుండగా అటవీశాఖలో గార్డుగా పని చేస్తున్న రెడ్డి విజయదుర్గ లిఫ్ట్ అడగడంతో ఆమెను ఎక్కించుకుని మళ్లీ ముందుకు సాగిపోయారు. కొత్తపల్లి శివారున పెట్రోల్ బంకు సమీపంలో వారు ప్రయాణిస్తున్న బైక్‌ను జగ్గంపేట వైపు నుంచి ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నబ్బాయి అక్కడికక్కడే మృతి చెందగా విజయదుర్గ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న గోకవరం ఎస్సై పవన్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. పిల్లలను పాఠశాల వద్ద దించి.. చిన్నబ్బాయికి భార్య పార్వతి, తొమ్మిదో తరగతి చదువుతున్న మేఘవర్షిణి, ఎనిమిదో తరగతి చదువుతున్న స్నేహిత ఉన్నారు. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న వారిని పాఠశాల వద్ద దించి, అనంతరం ఇంటి నుంచి బయలుదేరి కొద్దిసేపటికే ఆయన మృత్యువాతపడ్డారు. యాన్యువల్ డేకి వెళ్లాలి డాడి లే.. ఆ చిన్నారులు చదువుతున్న పాఠశాల వార్షికోత్సవం శనివారం జరగనుంది. తన పిల్లలు ఆ కార్యక్రమానికి రావాలి డాడీ అని పిలవగా నేను రాను అన్న ఆయన మాటే నిజమైందని చిన్నబ్బాయి భార్య రోదించారు. యాన్యువల్డేకి వెళ్లాలి లే డాడీ అంటూ చిన్నారులు పోలీసులు వద్ద రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పోలీస్‌స్టేషన్ వద్ద నుంచి ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించడానికి వాహనాన్ని నిలపగా భార్య, కుమార్తెలు మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. ఈ క్రమంలో వారిని ఎవరూ వారించలేకపోయారు. హెల్మెట్ ఉన్నా.. బైక్ నడిపే సమయంలో చిన్నబ్బాయి హెల్మెట్ కచ్చితంగా వాడతారు. ప్రమాదం జరిగినపుడు కూడా హెల్మెట్ ధరించినప్పటికీ కారు ఢీకొట్టిన వేగానికి హెల్మెట్ ముక్కలైపోయి తలకు గట్టి దెబ్బ తగలడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఉపాధ్యాయుడి మృతి విషయం తెలుసుకున్న సహచర ఉపాధ్యాయులు భారీగా అక్కడకు చేరుకుని విచారం వ్యక్తం చేశారు. -
గేట్లు.. పాట్లు
త్వరలోనే కొత్త గేట్లు నీటి సంఘాల ఎన్నికలు తదితర కారణాలతో పంపా రిజర్వాయర్ కొత్త గేట్ల ఏర్పాటుకు టెండర్లు పిలవడం ఆలస్యమైంది. గత నెలలోనే టెండర్లు పిలిచాం. వాటిని ఖరారు చేసి పనులు ప్రారంభించాల్సి ఉంది. మార్చి నెలాఖరులోగా ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. అందువలన త్వరలోనే పనులు ప్రారంభించి కొత్త గేట్లు ఏర్పాటు చేస్తాం. – జి.శేషగిరిరావు, ఇరిగేషన్ ఈఈఅన్నవరం: పంపా రిజర్వాయర్ వద్ద కొత్త గేట్ల ఏర్పాటుకు రూ.3.36 కోట్లు మంజూరై దాదాపు మూడు నెలలైనా ఇంకా పనులు ప్రారంభం కాలేదు. నెలాఖరులోగా ఖర్చు చేయకపోతే ఈ నిధులు మురిగిపోయే అవకాశం ఉండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇదీ పరిస్థితి పంపా జలాశయం కింద తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో 12,500 ఎకరాల ఆయకట్టు ఉంది. ఒకసారి ఆయకట్టు మొత్తం సాగు జరగాలంటే 1.5 టీఎంసీల నీరు అవసరం. పంపా గర్భంలో నుంచి పుష్కర కాలువ నిర్మాణం జరగక ముందు ఈ రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 105 అడుగులుండేది. 105 ఆ స్థాయికి నీటిమట్టం చేరితే రిజర్వాయర్‌లో 0.5 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. అయితే పుష్కర కాలువను రిజర్వాయర్‌కు 103 అడుగుల ఎత్తులో నిర్మించారు. దీంతో పంపా రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టాన్ని 103 అడుగులకు పరిమితం చేశారు. దీంతో దీని నీటినిల్వ సామర్థ్యం 0.44 టీఎంసీలకు పరిమితమైపోయింది. ఇప్పుడు పంపా బ్యారేజీ గేట్లు బలహీనంగా ఉండటంతో నీటిమట్టాన్ని 99 అడుగులకే పరిమితం చేశారు. దీంతో రిజర్వాయర్‌లో 0.26 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయడం సాధ్యమవుతోంది. ఫలితంగా ఖరీఫ్ పంట కాలంలో రిజర్వాయర్ నాలుగుసార్లు నిండితే తప్ప ఆయకట్టు రైతులు గట్టెక్కలేని దుస్థితి ఏర్పడింది. తాత్కాలిక మరమ్మతులతో సరి అన్నవరం వద్ద పంపా రిజర్వాయర్ నిర్మించి దాదాపు 56 ఏళ్లు పూర్తయింది. అప్పట్లో ఏర్పాటు చేసిన ఐదు గేట్లకు సమస్యలు ఎదురైనపుడు ఎప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతులు మాత్రమే చేస్తున్నారు. రిజర్వాయర్ గేట్లను అప్పటి సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం అర్ధచంద్రాకారంగా అంటే సినిమా స్కోప్ తెర మాదిరిగా నిర్మించారు. ఈ గేట్లు కాస్త వంపుగా ఉండటంతో భారీ వర్షాలు, తుపాన్ల సమయంలో రిజర్వాయర్ నుంచి మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేయడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గేట్లు ఎత్తడం, దించడం సమస్యగా మారింది. ఈ పరిస్థితుల్లో పాత గేట్లు మార్చాలనే ప్రతిపాదన సుమారు పదేళ్లుగా ఉంది. వైఎస్సార్ సీపీ హయాంలోనే మంజూరు రైతుల ఇబ్బందిని గుర్తించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పంపా బ్యాకేజీకి పాత గేట్ల స్థానంలో కొత్తవి అమర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు 2023 జూలై నెలలో ఇరిగేషన్ అధికారులు బ్యారేజీ గేట్లు పరిశీలించారు. వీటిని మార్చి కొత్త గేట్లు అమర్చాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీనికి నాటి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2023 డిసెంబర్లోనే కొత్త గేట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తరువాత ఎన్నికల కోడ్ కారణంగా నిధులు విడుదల కాలేదు. ఆ తరువాత ఏర్పడిన కూటమి ప్రభుత్వం మళ్లీ ఈ ప్రతిపాదనలను పరిశీలించి కేంద్రానికి పంపించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత ఏడాది డిసెంబర్లో విపత్తు రక్షణ నిధుల నుంచి రూ.3.36 కోట్లు విడుదల చేశాయి. మరోవైపు గేట్ల పనులకు ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో రిజర్వాయర్‌లోని నీటిని దిగువకు వదిలేశారు. దీంతో జలాశయం అడుగంటి కనిపిస్తోంది. మళ్లీ వర్షాలు కురిస్తే తప్ప నిండే పరిస్థితి కనిపించడం లేదు. ఫ పంపా రిజర్వాయర్ కొత్త గేట్లకు ఖరారవని టెండర్లు ఫ నీరుగారుతున్న రూ.3.36 కోట్లు ఫ నెలాఖరులోగా ఖర్చు చేయకపోతే మురిగిపోయే అవకాశం -
కృషితో నాస్తి దుర్భిక్షం
ఫ ఇంటికి ఆర్థిక తోడ్పాటు ఫ తక్కువ పెట్టుబడితో అధికాదాయం ఫ ప్రకృతి సేద్యంలో నారీ విప్లవం ఫ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మామిడికుదురు/కొత్తపేట: నారీమణులకు సాధ్యం కాని రంగం అంటూ ఏదీలేదు. ప్రతి రంగంలోను వారు రాణిస్తూ ఔత్సాహికులకు అన్నింటా ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలో ప్రత్యేకంగా ప్రకృతి వ్యవసాయ విధానంలో 28 మంది మహిళా రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో కొబ్బరి, అరటిలో అంతర పంటలు పండిస్తూ అధిక దిగుబడులు, అదనపు ఆదాయం ఆర్జిస్తున్నారు. ప్రకృతి సేద్యంలోనూ పురుషులతో సమానంగా రాణిస్తూ అధికారుల ప్రశంసలందుకుంటున్నారు. ఒకే సమయంలో పలు పంటలు పండిస్తూ ప్రతిభను చాటుకుంటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మామిడికుదురు, కొత్తపేట ప్రాంతాల మహిళల విజయగాధలను పరిశీలిద్దాం... స్వశక్తిపై ఆధారపడాలన్నదే లక్ష్యం రాజోలు మండలం కడలి గ్రామానికి చెందిన కుసుమ పద్మావతి బీఏ, బీఈడీ, అగ్రికల్చర్ జనరల్ పూర్తి చేశారు. ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా నలుగురికి ఆదర్శంగా నిలవాలన్న సంకల్పంతో ఆమె వ్యవసాయ రంగం వైపు అడుగులు వేశారు. రసాయనిక ఎరువులు, క్రిమి సంహారకాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించారు. 2019 నుంచి ఆమె ప్రకృతి సాగు చేస్తున్నారు. తమ పూర్వీకులు కూడా వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ దిశగా ముందడుగు వేశారు. ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని.. రసాయనిక, క్రిమి సంహారక ఎరువులతో వ్యవసా యం చేయడం వల్ల అనేక దుష్పరిణాలు ఏర్పడుతున్నాయి. దీని వల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. దీని నుంచి విముక్తి పొందాలన్న ఉద్దేశంతో ఈదరాడ గ్రామా నికి చెందిన చెల్లుబోయిన రాధ ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపించారు. ఆమె బీఏ చదివారు. అధికారుల సూచనలు, సలహాలతో 2021 నుంచి నిరంతరాయంగా కూరగాయల పంటలతో పాటు వరి, కొబ్బరిలో అంతర పంటలు సాగు చేస్తున్నారు. పశువుల పెంట, మూత్రంతో జీవామృతం తయారు చేస్తూ సాగులో వినియోగిస్తున్నారు. క్రిముల నివారణకు వేపాకుతో తయారు చేసిన నీమాస్త్రం వినియోగించి విజయవంతంగా పంటలను సాగు చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో.. ఈదరాడ గ్రామానికి చెందిన కుడుపూడి జానకి ఇంటర్ బైపీసీ చదువుకున్నారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, కూరగాయలు వినియోగంతో ఆమె కుటుంబ సభ్యులకు షుగర్ వ్యాధి అదుపులోకి వచ్చింది. దీంతో పాటు వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరిగింది. దీంతో ఆమె ప్రకృతి వ్యవసాయం పట్ల ఆసక్తి చూపించారు. 2018 నుంచి ఆమె ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. దీని ద్వారా కూరగాయలు, ఆకు కూరలు సాగు చేస్తున్నారు. తక్కవ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధిస్తూ ఆమె ముందుకు వెళ్తున్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని ఈ ప్రాంతంలో పలువురు మహిళా మణులు ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండిస్తున్నారు. అంతర పంటలతో అదనపు ఆదాయం కొత్తపేట మండలం బిళ్లకుర్రు శివారు కముజువారిపాలేనికి చెందిన కముజు అరుణకుమారి ప్రకృతి వ్యవసాయం చేస్తూనే, ఫార్మర్ సైంటిస్టుగా పనిచేస్తూ మహిళలను ఈ రంగంలో చైతన్యవంతులను చేస్తున్నారు. తమ 1.50 ఎకరాల విస్తీర్ణం (కౌలు భూమి) లో ప్రధాన పంటగా అరటి పంట సాగు చేస్తూ దానిలో పంట తీసి పంట వేసే పద్ధతిలో అంతర పంటలుగా చెట్టు చిక్కుడు, వంగ, బీర, ఆనబ, పచ్చిమిర్చి, బొబ్బర్లు, బంతి, నిమ్మ, జామ, సపోట, మునగ పంటలు సాగు చేస్తున్నారు. ఘన, ద్రవ పదార్థాలు, జీవామృతం, నీరు నిమిత్తం నెలకు రూ.2 వేలు ఖర్చు పోను అరటి కాకుండా అంతర పంటల ద్వారా రూ.10 నుంచి రూ.12 వేల అదనపు ఆదాయం లభిస్తోంది. ఇలా కొత్తపేట మండలం వానపల్లి ప్రకృతి వ్యవసాయం యూనిట్ పరిధిలో 10 మంది మహిళా రైతులు, సిబ్బంది లబ్ధి పొందుతున్నారు. ఈదరాడలో ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్న నారీమణులుఆర్థిక అభివృద్ధి సాధనే లక్ష్యం మహిళల ద్వారా ఆర్థిక అభివృద్ధి గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయాధారంగా కుటుంబాలు ఆర్థిక అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయ రంగంలో మహిళలను ప్రోత్సహిస్తున్నాయని జిల్లా పాయింట్ పర్సన్ (డీపీపీ) సీహెచ్ సంధ్య తెలిపారు. ఫార్మర్ సైంటిస్ట్లకు హెడ్‌గా పనిచేస్తున్న ఆమె జిల్లాలో ప్రకృతి వ్యవసాయం, ప్రభుత్వాల ప్రోత్సాహం, మహిళల ఆర్థిక ప్రగతి గురించి వివరించారు. జిల్లాలో 22 ప్రకృతి వ్యవసాయ యూనిట్లు (గ్రామాలు) ఏర్పాటుచేసి అతి తక్కువ పెట్టుబడితో ప్రకృతి వ్యవసాయం చేయిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ రంగంలో పొదుపు దగ్గర నుంచి మహిళలను చైతన్యవంతం చేయడంలో భాగంగా ముందుగా కిచెన్ గార్డెన్స్ అబివృద్ధి చేయడం ద్వారా ఒక్కో కుటుంబానికి కూరగాయలు, ఆకు కూరలు పండించి, నెలకు కనీసం రూ.2 వేలు ఆదా చేసుకునేలా ప్రోత్సహించాం. 20 సెంట్ల స్థలం ఉంటే నెలకు రూ.25 వేలు ఆదాయం ఆర్జిస్తున్నారు. కోర్సు నేర్చుకుంటూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మహిళలకు రూ.10 వేలు స్టైఫండ్ ఇస్తున్నాం. ఇలా జిల్లాలో 28 మంది మహిళా రైతులు ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్నారని విరించారు. -
న్యాయ సేవాధికార కమిటీకి మధ్యవర్తుల నియామకం
అమలాపురం టౌన్: అమలాపురం న్యాయ సేవాధికార కమిటీకి మధ్యవర్తులుగా ముగ్గురిని నియమిస్తూ ఆ కమిటీ చైర్మన్, రెండో అదనపు కోర్టు జిల్లా న్యాయమూర్తి వి.నరేష్ ఉత్తర్వులు జారీ చేశారు. విశ్రాంత స్పెషల్ మెజిస్ట్రేట్ ఎం.రామభద్రరావు, సీనియర్ న్యాయవాది, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ వీకేఎస్ భాస్కరశాస్త్రి, మరో సీనియర్ న్యాయవాది కేవీవీ శ్రీనివాసరావులు మధ్యవర్తులుగా నియమితులయ్యారు. జిల్లా ప్రధాన మండల న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు గతంలో ఈ ముగ్గురూ రాజమహేంద్రవరం జిల్లా ప్రధాన కోర్టులో 40 గంటల పాటు మధ్యవర్తిత్వంపై శిక్షణ పొందారు. ఇప్పడు ఈ ముగ్గురిని మధ్యవర్తులుగా నియమించారు. పీఎం ఇంటర్న్‌షిప్ కోసం రిజిస్ట్రేషన్లు అమలాపురం రూరల్: భవన, ఇతర నిర్మాణ, అసంఘటిత రంగ కార్మికులకు చెందిన 21–24 మధ్య వయస్సు గల పిల్లలకు పీఎం ఇంటర్న్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాలని కోనసీమ జిల్లా ఉప కార్మిక కమిషనర్ టి.నాగలక్ష్మి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భవన నిర్మాణ, ఆసంఘటిత రంగ కార్మికుల పిల్లలు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అభ్యర్థులు ఐటీఐ నుంచి సర్టిఫికెట్, పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ నుంచి డిప్లొమా, బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ, బీ ఫార్మ్ వంటి డిగ్రీ కలిగి ఉండాలన్నారు. ఆన్లైన్, దూర విద్య ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. మార్చి 12 వరకు గడువు ఉందని తెలిపారు. డీఎస్సీ ఆన్లైన్ శిక్షణకు దరఖాస్తులు అమలాపురం రూరల్: అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని బీసీ, ఈబీసీ కులాలకు చెందిన అభ్యర్థులకు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో డీఎస్సీ–2024 పరీక్షలకు ఉచిత ఆన్లైన్ శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం అమలాపురంలో కోనసీమ జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసు కోవాలని సంబంధిత అధికారి పి. సత్య రమేష్ కోరారు. అభ్యర్థులు ఏపీ టెట్‌లో అర్హత సాధించి ఉండాలన్నారు. ఏపీ టెట్‌లో అత్యధిక మార్కులు పొందిన అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ బయోడేటా 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీఈడీ, టీటీసీ, టెట్ మార్కుల జాబితా, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్, బ్యాంకు పాస్ పుస్తకం, రెండు పాస్ పోర్ట్ సైజు ఫొటోలతో ఈ నెల పదో తేదీ నుంచి అమలాపురంలో కోనసీమ జిల్లా బీసీ సంక్షేమ సాధికరత అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. వివరాలకు 9398973754, 9440403629 సెల్ నంబర్లను సంప్రదించాలన్నారు. ‘ఇంటర్’ మూల్యాంకనం ప్రారంభం● అప్రమత్తంగా నిర్వహించాలని సిబ్బందికి డీఐఈవో సూచన అమలాపురం టౌన్: అమలాపురంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరాల సంస్కృతం జవాబు పత్రాలను దిద్దే ఏర్పాట్లు జరిగాయి. ప్రధమ సంవత్సరం 5,540, ద్వితీయ సంవత్సరం 4,929 జవాబు పత్రాలను ఇక్కడ దిద్దాల్సి ఉందని డీఐఈవో వనుము సోమశేఖరరావు తెలిపారు. అంతకు ముందు నిర్వహించిన సమావేశంలో మూల్యాంకనాన్ని అత్యంత అప్రమత్తంగా నిర్వహించాలని ఆయన సూచించారు. ఈనెల 17వ తేదీ నుంచి ఇంగ్లిషు, తెలుగు, హిందీ, గణితం, పౌర శాస్త్రం, 22 నుంచి రసాయనశాస్త్రం, చరిత్ర, 26 నుంచి వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం, వాణిజ్య శాస్త్రం జవాబు పత్రాల మూల్యాంకనాలు మొదలవుతాయని చెప్పారు. 543 మంది విద్యార్ధులు పరీక్షలకు గైర్హాజరు జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం జనరల్, ఒకేషనల్ పరీక్షలకు 543 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ ఇంటర్ పరీక్షలకు మొత్తం 10,379 మంది విద్యార్థులకు 10 వేల మంది విద్యార్ధులు హాజరుకాగా 379 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ పరీక్షలలో 2456 మంది విద్యార్థులకు 2,292 మంది హాజరు కాగా, 164 మంది గైర్హాజరయ్యారని డీఐఈవో తెలిపారు. పామర్రులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, రామచంద్రపురం ప్రభుత్వ, మోడరన్, వికాస్ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటైన పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీలు చేశారు. -
24, 25 తేదీల్లో బ్యాంకుల సమ్మె
అమలాపురం టౌన్: ఈనెల 24, 25 తేదీల్లో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో జిల్లాలో వాణిజ్య బ్యాంక్‌లు సమ్మె చేపడుతున్నట్లు ఈ యూనియన్ కోనసీమ చైర్మన్ పీవీవీ సత్యనారాయణ తెలిపారు. ఈ సమ్మెకు సమాయత్తమవుతున్న కోనసీమలోని దాదాపు 300 మంది బ్యాంక్ అధికారులు, ఉద్యోగులు స్థానిక యూనియన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచి వద్దకు శుక్రవారం సాయంత్రం చేరుకుని తమ డిమాండ్ల సాధనకు నినాదాలు చేశారు. సమ్మె సన్నద్ధతపై యూనియన్ కోనసీమ చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ కొత్త సిబ్బందిని అన్ని కేడర్లలో నియమించాలని, తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, 5 రోజుల పని దినాలను అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ కన్వీనర్ గణేష్‌కుమార్, సెక్రటరీ బి.శ్రీనివాస్, ఎల్డీఎం వర్మ, వివిధ బ్యాంకుల అధికారులు బి.వెంకటేశ్వరరావు, రమేష్, సురేష్‌కుమార్, కె.ఈశ్వరరావు తదితరులు ప్రసంగించారు. -
మహిళా సమానత్వంతో సమాజ వికాసం
ఫ మహిళా దినోత్సవంలో జేసీ నిశాంతి ఫ అవగాహన ర్యాలీ, మానవహారం అమలాపురం టౌన్: సమాజ నిర్మాణంలో సగ భాగంగా ఉన్న మహిళలు అన్నింటిలోనూ సమానత్వంతో ముందుకు సాగుతూ సమాజ వికాసానికి మూలమవుతున్నారని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమలాపురంలో శుక్రవారం జరిగిన వేడుకల్లో ఆమె మాట్లాడారు. తొలుత కలెక్టరేట్ నుంచి నల్లవంతెన వరకూ మహిళా చైతన్యంపై నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. మనమంతా దేవతగా కొలిచే సీ్త్ర మూర్తిపై జరుగుతున్న అత్యాచార సంస్కృతికి చరమ గీతం పాడేలా ప్రతి ఒక్కరూ ప్రతిన పూనాలని పిలుపునిచ్చారు. విద్య, వైద్య, వ్యాపార, రాజకీయ, ఉద్యోగ, అంతరిక్షం, సాంకేతక విప్లవం తదితర రంగాల్లో మహిళలు దూసుకువెళ్లుతున్న పరిణామాలే మహిళా సాధికార ప్రగతికి మెట్లు అవుతున్నాయన్నారు. కలెక్టరేట్ నుంచి దాదాపు కిలోమీటరు మేర మెయిన్ రోడ్డుపై మహిళలు, పోలీసులతో ర్యాలీ నల్లవంతెన వరకూ సాగింది. నల్ల వంతెన వద్దకు ర్యాలీ చేరుకున్నాక అక్కడ మానవ హారం నిర్వహించి మహిళలకు అన్ని విధాల రక్షణగా ఉంటామని అందరూ ప్రతిజ్ఞ చేశారు. ర్యాలీలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శాంతకుమారి, రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్, అమలాపురం పట్టణ, రూరల్ సీఐలు పి.వీరబాబు, డి.ప్రశాంత్‌కుమార్, పట్టణ ఎస్సై కిషోర్‌బాబుతో పాటు మహిళా పోలీసులు, డీఆర్డీఏ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)ల మహిళా సిబ్బంది పాల్గొన్నారు. మహిళా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అమలాపురం రూరల్: స్థానిక సత్యనారాయణ గార్డెన్స్‌లో శనివారం జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఏర్పాట్లకు సర్వం సిద్ధం చేసినట్లు జేసీ టి.నిశాంతి తెలిపారు. శుక్రవారం అక్కడి ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సాస్కృతిక కార్యక్రమాలు, సత్కారాలు, అవగాహన కార్యక్రమాలు, వివిధ శాఖలకు సంబంధించి ఉత్తమంగా నిలిచిన సంక్షేమ పథకాల స్టాల్స్, పథకాల నిర్వహణపై లబ్ధిదారుల అభిప్రాయ సేకరణ ఉంటాయని ఆమె తెలిపారు. అదే విధంగా వేదిక సౌకర్యాలు, భద్రతా చర్యలు, ఇతర ప్రాధాన్య ఏర్పాట్లను సమీక్షించి, వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మార్పులను చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారత దిశగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని వాటిని సద్వినియోగం చేసుకొని జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ డాక్టర్ శివశంకర్ ప్రసాద్, ఐసీడీఎస్ పీడీ శాంత్ కుమారి, డీపీఎం విజయకుమార్, మెప్మా, పరిశ్రమల కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో విదేశీ వ్యవహారాల హెల్ప్ డెస్క్
కలెక్టర్ మహేష్ కుమార్ సాక్షి, అమలాపురం: ఉపాధి, ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇతర దేశాలకు వెళ్లాలనుకునే వారి కోసం కలెక్టర్‌లో విదేశీ వ్యవహారాల హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. వారం రోజులలో నలుగురు సిబ్బందితో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించేలే ఈ డెస్క్ పని ప్రారంభిస్తుందని తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం కో ఆర్డినేషన్ సెక్షన్ పోస్టల్ సూపరింటెండెంట్లతో ఆయన సమావేశం నిర్వహించి డెస్క్ విధివిధానాలను వివరించారు. ఏజెంట్ల, సంప్రదింపుదారుల ద్వారా విదేశాలకు వెళ్లి మోసపోకుండా ఈ విభాగం తోడ్పడుతుందన్నారు. హెల్ప్ డెస్క్‌ను ఆశ్రయిస్తే 18 దేశాలలో విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పనకు మార్గ నిర్దేశం చేస్తూ ప్రభుత్వపరంగా పాస్‌పోర్ట్ వీసా అనుమతులకు సహకరిస్తుందన్నారు. అక్కడి ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలు, భౌగోళిక స్థితిగతులు, అత్యవసర సందర్భంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ముందుగా కరపత్రాన్ని ముద్రించి ఇవ్వనున్నట్టు కలెక్టర్ తెలిపారు. సంబంధిత సమాచారంతో జాగృతం చేస్తూ హెల్ప్ డెస్క్ తపాలా శాఖకు సిఫారసు చేస్తుందన్నారు. జిల్లా ప్రజలు విదేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు సామాజిక ప్రసార సాధనాలలో వచ్చే వదంతులను నమ్మవద్దని స్పష్టం చేశారు. సందేహాలుంటే 08856–236 388 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జేసీ టి.నిశాంతి, డీఆర్వో బిఎల్ఎన్ రాజకుమారి, సమన్వయకర్త జి.రమేష్, పోస్టల్ సూపరింటెండెంట్ ఆర్.నవీన్ కుమార్, పోస్టల్ అధికారి అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికారుల 2కె రన్ కాకినాడ క్రైం: మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు. శుక్రవారం నాగమల్లితోట నుంచి ప్రారంభమైన ఈ రన్ భానుగుడి కూడలి వరకు సాగింది. అక్కడ మానవహారాన్ని ఏ ర్పాటు చేసి మహిళల భద్రత, రక్షణపై నినాదాలు చేశా రు. కార్యక్రమంలో పోలీస్‌శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పిచ్చిగీతలంటూ హేళన
1982లో ఇంటర్మీడియెట్ అయిన తరువాత అటవీ ప్రాంతానికి వెళ్లాను. అక్కడి వారిని చూసి, వారి కోసం ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను. ఉద్యోగం వచ్చిన తరువాత వాచకంగా ఉన్న భాషకు లిపిని అందించాలనే సంకల్పించాను. శూన్యం నుంచి ఒక ప్రపంచాన్ని సృష్టించుకుని ఎదగడానికి ప్రయత్నించాను. నా ప్రయత్నాన్ని కొందరు ఉన్నతాధికారులు, నాయకులు ప్రోత్సహించకపోగా ఏమిటీ పిచ్చి గీతలు, ఎవరిని ఉద్ధరించాలని అంటూ అవమానించారు. ఆ సమయంలో నిజంగా నరకం చూశాను. చాలా బాధ వేసేది. వాటన్నిటినీ భరిస్తూనే నా ప్రయత్నాన్ని వదలలేదు. మనిషి మనుగడ అభివృద్ధి వైపు అడుగులు వేయాలంటే అక్షరం అవసరం. దానిని గుర్తించి, నా ప్రయత్నాన్ని కొనసాగించాను. అటవీ ప్రాంతంలో తిరుగుతూ.. -
మృత్యు శకటం
పల్లిపాలెంలో విషాద ఛాయలుకాజులూరు: ఏలూరు బస్సు ప్రమాదంలో జుత్తుగ భవాని దుర్మరణం పాలవడంతో ఆమె స్వగ్రామం కాజులూరు మండలం పల్లిపాలెం శివారు కళావారిపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన జుత్తుగ అప్పారావు, భవాని దంపతులకు ఇద్దరు కుమారులు. భార్యాభర్తలిద్దరూ జీవనోపాధి నిమిత్తం కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. అప్పారావు ఒక అపార్టుమెంట్లో వాచ్‌మన్‌గా చేస్తూండగా భవాని పలువురి ఇళ్లలో పని చేస్తోంది. పెద్ద కుమారుడు ఇంజినీరింగ్, చిన్న కుమారుడు ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. బంధువుల ఇంట్లో వివాహ వేడుకకు భవాని కాకినాడ బయలుదేరింది. ఈ క్రమంలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె మరణ వార్త తెలియగానే గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. హైదరాబాద్‌లో ఉంటున్నప్పటికీ భవాని తరచూ గ్రామానికి వచ్చి వెళ్లేదని, వచ్చిన ప్రతిసారీ అందరితో కలివిడిగా మసులుతూండటంతో అసలు ఆమె ఎప్పుడూ గ్రామంలోనే ఉన్నట్టుండేదని స్థానికులు చెబుతున్నారు. బస్సును పక్కకు తీస్తున్న క్రేన్ ● ఏలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ● లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు ● వేకువజామున ఘటన ● ఘటనా స్థలంలో ముగ్గురు, చికిత్స పొందుతూ మరొకరు మృతి ● 21 మందికి గాయాలు ● మృతులు, క్షతగాత్రుల్లో అత్యధికులు ఉమ్మడి జిల్లా వాసులు ఏలూరు రూరల్: తెల్లవారకముందే వారి జీవితాలు తెల్లారిపోయాయి. కొద్ది గంటల్లోనే గమ్య స్థానాలకు చేరుకోవాల్సిన వారిని మృత్యువు కబళించింది. జిల్లా కేంద్రం ఏలూరులోని చొదిమెళ్ల వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై రత్నాస్ హోటల్ సమీపాన ఆగి ఉన్న ఓ లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సంఘటన స్థలంలోనే ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రుల్లో అత్యధికులు కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన వారు. ప్రమాదం అనంతరం బస్సు నుంచి కారిన రక్తధారలు చూసిన వారు భయభ్రాంతులకు గురయ్యారు. సంఘటన స్థలంలో క్షతగాత్రుల హాహాకారాలు మిన్నంటాయి. ప్రమాదం జరిగిందిలా.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న సిమెంట్ లారీ మరమ్మతులతో నిలిచిపోయింది. గురువారం వేకువజామున 5 గంటల సమయంలో రమణ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తోంది. బస్సును అతి వేగంగా నడుపుతున్న డ్రైవర్ మధు.. పొగమంచు కమ్ముకోవడంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న సిమెంట్ లారీని గుర్తించలేకపోయాడు. చివరి నిమిషంలో గమనించి, తప్పించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో లారీ వెనుక భాగాన్ని బస్సు ఢీకొంది. ఆ వేగానికి కండక్టర్ వైపు భాగాన్ని బస్సు చీల్చుకుంటూ వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో బస్సులో నిద్రిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. ఘోర ప్రమాదంతో ఉలిక్కిపడిన స్థానికులు, ఇతర వాహనాల డ్రైవర్లు హుటాహుటిన వచ్చి ప్రయాణికులను రక్షించేందుకు ప్రయత్నించారు. హైవే పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. గాయపడిన వారిని 108 అంబులెన్సులో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాదంతో ఘటనా స్థలం రక్తసిక్తం కాగా.. పరిసరాల్లో బస్సులోని విడి భాగాలు చెల్లాచెదురుగా పడి, ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. శకలాల మధ్య ఇరుక్కుపోయి.. నుజ్జునుజ్జయిన బస్సులో కండక్టర్ సీటు వైపు కూర్చున్న మహిళలు మట్టపర్తి భవాని, జుత్తుగ భవాని (38), బొందు భీమేశ్వరరావు చిక్కుకుపోయి విలవిలలాడారు. బస్సు డ్రైవర్ మధు సైతం స్టీరింగ్ వద్ద ఇరుక్కుపోయాడు. పోలీసులు క్రేన్‌తో బస్సును లేపి పక్కకు చేర్చారు. బస్సులో చిక్కుకుపోయిన ఈ నలుగురినీ ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మట్టపర్తి భవాని, జుత్తుగ భవాని, భీమేశ్వరరావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డ్రైవర్ మధుకు అత్యవసర చికిత్స అందించారు. నాలుగు గంటల పాటు మృత్యువుతో పోరాడిన అనంతరం అతడు మృతి చెందాడు. మధు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. క్షత్రగాత్రులు వీరే.. ఈ ప్రమాదంలో కాకినాడకు చెందిన కోలా సురేఖ, కోలా రాజబాబు, కోలా లిఖిత, వనమనీడి ఆదిలక్ష్మి, పి.అక్కమ్మ, కోట వేణి, రాజమహేంద్రవరానికి చెందిన పి.హేమలత, మాచర్ల సుజాత, పాలకొల్లుకు చెందిన మండపాక శ్రీదేవి, మండపాక శశిరేఖతో పాటు మద్దాల కీర్తి, మాచర్ల సుజాత, మండపాక బాలాజీ, మండపాక హరిణి, ఆర్నాలకంటి శ్రీలక్ష్మి, పువ్వుల శ్యామ్‌కుమార్, శీలం ప్రకాష్, ఎం.ప్రతాప్, గోణజ విజయకుమార్, రామిశెట్టి సోమ సత్యనారాయణ, టి.రవికుమార్, జి.మణికంఠ (క్లీనర్) ఉన్నారు. క్షతగాత్రులకు అధికారులు చికిత్స చేయించి గమ్యస్థానాలకు పంపించారు. శోకసంద్రంలో భవానీ కుటుంబం జగ్గంపేట: ఈ ప్రమాదంలో మృతురాలు మట్టపర్తి భవానీ స్వస్థలం కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఆమె తండ్రి రాజు కౌలు రైతు. ఆమెకు ఓ తమ్ముడు ఉన్నాడు. కష్టపడి చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన భవాని.. వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా స్వగ్రామానికి వస్తోంది. ఈ క్రమంలో ఏలూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృత్యువాత పడింది. తమ గారాలపట్టి అయిన భవాని.. తమ కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉంటుందనుకుంటే.. దేవుడు తమపై దయ చూపలేదంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భవానీ మృతితో ఆమె కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. -
విపత్కర పరిస్థితిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి
అమలాపురం టౌన్: ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలని విద్యార్థినులకు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు సూచించారు. పోలీసు విధులు, ఆయుధాలు, మహిళా పోలీసు స్టేషన్ పనితీరు, ఎఫ్ఐఆర్ నమోదు, దర్యాప్తు, విచారణలపై విద్యార్థినులు, మహిళలు అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినులకు తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. పోలీసు విధుల పట్ల అవగాహన కల్పించారు. సమస్యల్లో చిక్కుకున్న మహిళలు, యువతులు మహిళా పోలీస్ స్టేషన్ సేవలను సద్వినియోగం చేసుకునే విధానాన్ని వివరించారు. పోలీసు విధులపై జిల్లా ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్ కూడా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచి సీఐ బి.రాజశేఖర్, డీసీఆర్బీ సీఐ వి.శ్రీనివాస్, అమలాపురం పట్టణ సీఐ కిషోర్‌బాబు పాల్గొన్నారు. మహిళల సమగ్రాభివృద్ధికి కృషిఅమలాపురం రూరల్: ప్రభుత్వ పథకాల ద్వారా మహిళల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. డీఆర్డీఏ, మెప్మా, వైద్య, ఆరోగ్యం, సీ్త్ర, శిశు సంక్షేమం, పరిశ్రమల శాఖల అధికారులతో కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సత్యనారాయణ గార్డెన్స్‌లో నిర్వహించే జిల్లా స్థాయి మహిళా దినోత్సవాన్ని ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని సూచించారు. మహిళా సాధికారతను ప్రతిబింబించేలా వివిధ శాఖల ఆధ్వర్యాన సూర్యఘర్, డ్వాక్రా ఉత్పత్తులు, విశ్వకర్మ యోజన, పోషకాహారం వంటి ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. స్వీయ రక్షణపై మహిళలకు అవగాహన కల్పించడంపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ శివశంకర్ ప్రసాద్, జిల్లా పరిశ్రమల కేంద్రం ఏడీ శివరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కూటమి సిండికేట్‌కే గీత కార్మికుల మద్యం షాపులు అమలాపురం రూరల్: జిల్లాలో కల్లు గీత కార్మికులకు కేటాయించిన మద్యం షాపులను కూటమి సిండికేట్లే దక్కించుకున్నారు. జిల్లాలో మొత్తం 13 మద్యం షాపులను గీత కార్మికులకు కేటాయించారు. అమలాపురం మున్సిపాలిటీ, అమలాపురం మండలం, ఆలమూరు, అయినవిల్లి, ఐ.పోలవరం, కె.గంగవరం, కపిలేశ్వరపురం, కొత్తపేట, మండపేట మున్సిపాలిటీ, ముమ్మిడివరం రూరల్, పి.గన్నవరం, రామచంద్రపురం మున్సిపాలిటీ, రామచంద్రపురం రూరల్ ప్రాంతాల్లోని ఈ షాపుల్లో ఒకటి గౌడ కులస్తులకు, 12 శెట్టిబలిజలకు కేటాయించి, టెండర్లు పిలిచారు. గీత కార్మికుల ముసుగులో కూటమి సిండికేట్లు ఒక్కో దుకాణానికి 5 నుంచి 15 వరకూ టెండర్లు వేశారు. మొత్తం 261 టెండర్లు దాఖలయ్యాయి. వీటికి కలెక్టరేట్లో జేసీ నిషాంతి, డీఆర్ఓ రాజకుమారి, అమలాపురం ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎస్కేడీవీ ప్రసాద్ పర్యవేక్షణలో గురువారం లక్కీ డ్రా తీసి, షాపులు కేటాయించారు. గ్రహణం మొర్రికి నేడు ఉచిత వైద్య శిబిరం ముమ్మిడివరం: ఏపీ సమగ్ర శిక్ష, హైదరాబాద్ బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యాన గ్రహణం మొర్రి, గ్రహణ శూలతో బాధ పడుతున్న చిన్నారులకు శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్ష అదనపు పథక సంచాలకుడు షేక్ సలీం బాషా గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిర్వహించే ఈ శిబిరంలో చిన్నారులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయనున్నారు. శిబిరానికి వచ్చే చిన్నారులకు ఉచిత రవాణా ఖర్చులు ఇస్తారు. జిల్లాలోని చిన్నారుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అదనపు సమాచారానికి జిల్లా సహిత విద్య కో ఆర్డినేటర్ మర్రెడ్డి వెంకట సత్యనారాయణను 99636 54283 మొబైల్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
బతుకు పూలబాట కాదు..
● నా దారిలో ఎన్నో ముళ్లు గుచ్చుకున్నాయి ● ఎవరిని ఉద్ధరించాలని అంటూ హేళన చేశారు ● అయినా వెనుకడుగు వేయలేదు ● అలా 19 గిరిజన భాషలకు లిపి రూపొందించా.. ● ‘నన్నయ’ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ పోలీసు ఇన్ఫార్మర్ అనుకునే వారు మొదట్లో గిరిజనులు నాతో మాట్లాడేవారు కాదు. బయటి నుంచి వచ్చానని, నన్నో పోలీసు ఇన్ఫార్మర్గా భావించి భయపడేవారు. రకరకాలుగా ఇబ్బంది పెట్టేవారు. వారు చెప్పేది అర్థమయ్యేది కాదు. ఆ సమయంలోనే ముందుగా వారి భాష నేర్చుకోవాలని అనుకున్నాను. అలా వారి భాష నేర్చుకుని వారిలో ఒకరిగా కలిసిపోయాను. ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలనే తపనతో పని చేశాను. ‘ఈ పని నేనే చేయగలనని అనుకుంటే ఏదైనా సాధించగలరు. నేను చేయగలనా? అనుకుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు’. నా ద్వారా ఆ గిరిజనులకు భాషాపరంగా మేలు జరగాలనే తలంపుతోనే ముందుకు వెళ్లాను. ఆ సమయంలో ప్రొఫెసర్ సింథియా వెస్లీతో పాటు చాలా మంది విదేశీయుల నుంచి ప్రోత్సాహం నన్ను మరింత కార్యోన్ముఖురాలిని చేసింది. ఆల్ఫా, బీటా ఏవిధంగా రాయాలో వారి నుంచి నేర్చుకున్నాను. అంతరించి పోతున్న బగత, గదబ, కొలామి, కొండదొర వంటి 19 గిరిజన భాషలకు లిపిని రూపొందించడంలో విజయం సాధించాను. తద్వారా 2022లో అప్పటి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారం అందుకున్నాను.వ్యక్తిగతం.. గుంటూరు జిల్లా సీతానగరంలో 1964 సెప్టెంబరు 2న జన్మించాను. నాన్న సత్తుపాటి ప్రసాదరావుది రైల్వేలో ఉద్యోగం కావడంతో విజయవాడ, కోల్‌కతా, మిరాజ్(మహారాష్ట్ర)లో చదువుకున్నాను. విజయవాడలో పదో తరగతి, కేబీఎన్ కళాశాలలో ఇంటర్, మాంటిస్సోరి మహిళా కళాశాలలో డిగ్రీ (1982–84) చదివాను. తరువాత విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ(ఏయూ)లో ఎంఏ, తిరుపతి పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేశాను. అమ్మ వసుంధరాదేవి గృహిణి. అయినా పేపర్, పుస్తకాలు ఎక్కువగా చదివేది. నాకు ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. పెద్ద చెల్లెలు విజయవాడ, చిన్న చెల్లెలు కాకినాడ, తమ్ముడు రామచంద్రపురంలో ఉద్యోగాలు చేస్తున్నారు. వృత్తిగతం.. 1987లో పద్మావతి మహిళా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బోధనా వృత్తి చేపట్టి, 14 ఏళ్లు పని చేశాను. అక్కడి నుంచి విశాఖపట్నం ఏయూకు వచ్చాను. పాత సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవడంతో 2002లో అక్కడ ప్రొఫెసర్ చేరాను. ఆవిధంగా ప్రొఫెసర్‌గా ఆంధ్రప్రదేశ్‌లో 23 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించిన ఏకై క మహిళగా గుర్తింపు పొందాను. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 10 సెమినార్లు నిర్వహించి, 60 సెమినార్లలో పాల్గొన్నాను. నేను రాసిన 125 పరిశోధన వ్యాసాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రచురితమయ్యాయి. అలా.. గోదారి బిడ్డనయ్యా.. నా భర్త హరి వెంకట లక్ష్మణ్, మాది ప్రేమ వివాహం. మమ్మల్ని ఏయూనే కలిపింది. నేను ఇంగ్లిష్, ఆయన సోషియాలజీలో పీజీ చేస్తూండగా మా మనసులు కలిశాయి. మొదట పెద్దలు అంగీకరించకపోయినా, తరువాత ఓకే అన్నారు. ఆవిధంగా ఈ ప్రాంతానికి చెందిన అల్లు ఎరకయ్య కోడలిగా గోదావరి ప్రాంత బిడ్డనయ్యాను. మా అమ్మాయిని కూడా ఈ ప్రాంతంలోనే ఇచ్చాం. గోదావరి వాసే. నా ఎదుగుదలకు ఆయన దివిటీ ప్రస్తుతం నేనీ ఉన్నత స్థితిలో ఉండటానికి ప్రధాన కారణం నా భర్త హరి వెంకట లక్ష్మణ్ అని గర్వంగా చెబుతా. ఆయన ఓ కొవ్వొత్తిలా కరిగిపోతూ నా ఎదుగుదలకు దివిటీలా నిలిచారు. గిరిజన భాషలకు లిపిని రూపొందించే క్రమంలో ఎంతో బిజీగా ఉండేదాన్ని, ఆ సమయంలో మాకున్న ఒకే ఒక్క పాప హర్షిత ఆలనా పాలనా ఆయనే చూసుకుంటూ, కార్యోన్ముఖురాలిని కావాలని ప్రోత్సహించారు. హర్షిత ప్రస్తుతం మెకానికల్ ఇంజినీర్‌గా వర్క్ ఫ్రమ్ హోం చేస్తోంది. ఒక బాబు ఉన్నాడు. పుట్టింటి వారు ఉన్నత స్థాయిలో ఉన్నవారే.. అమ్మ, నాన్న వైపు వారంతా ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్–1 ఉద్యోగాలు చేసిన వారే. నలుగురు మావయ్యలలో ఇద్దరు ఐపీఎస్, ఒకరు ఐఏఎస్. చిన్నమ్మలిద్దరూ వైద్యులు. మా తాతయ్య వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు, ధనవంతుడు కూడా. ఆ సమయంలో ధనాన్ని బానల్లో దాచుకునేవారంటారు. ఒక విద్యార్థి నమ్మకంగా ఉంటూనే కొంత ధనాన్ని దోచుకున్నాడట. నాకు 6 నెలల వయసులోనే తాతయ్య చనిపోయారు. నా ఎదుగుదల ఎక్కువగా కోల్‌కతాలోనే. ఆ తరువాత మహారాష్ట్ర, విజయవాడల్లో పెరిగాను. అందుకనే 23 భాషలు మాట్లాడతాను. అన్నయ్య ఆశయం నెరవేరింది మా అన్నయ్య (కజిన్) ఐజీగా పని చేస్తూ చనిపోయా రు. కొన్నేళ్ల క్రితం ఆయన నాకు ఒక చీర బహుమతిగా ఇస్తూ, ‘నువ్వు కచ్చితంగా వైస్ చాన్సలర్ అవుతావు. అప్పుడు కట్టుకో’ అన్నాడు. ఆయన నమ్మకం నిజమైంది. అందుకే ఆ చీరను నన్నయ వీసీగా బాధ్యతలు తీసుకునే సమయంలో కట్టుకున్నాను. స్టూవర్టుపురం అంటూ ఇంకా వదిలిపెట్టరా? తాతగారి ఊరి పేరు స్టూవర్టుపురం అని చెప్పడమే గానీ, నేను ఏనాడూ అక్కడ లేను. ఊహ తెలిసిన తరువాత స్టూవర్టుపురం అంటే దొంగల ఊరు అంటారని కాస్త భయపడ్డాను. కానీ అక్కడి వారు చాలా మంచివారు. నిజానికి ఏ ఊళ్లో దొంగలు లేరు చెప్పండి? ‘పూర్వం చదువుకోనందు వల్లనే చాలా మంది దొంగలుగా తయారయ్యారు. కానీ నేటి కాలంలో చదువుకున్న వాళ్లు కూడా దొంగలుగా మారుతున్నారు, దీన్ని ఏమనాలి?’ అని మా నాన్నమ్మ అంటూండేది. ఆచార్య ప్రసన్నశ్రీ ఎలా ఎదిగిందనేది వదిలేసి, స్టూవర్టుపురానికి చెందిన.. అంటూ ఆ గ్రామం మూలాలున్న వారిని ఇంకా వదిలిపెట్టరా? భగత గిరిజన భాషకు ఆచార్య ప్రసన్నశ్రీ రూపొందించిన లిపి ‘జీవితం పూలబాట కాదు. దారిలో ఎన్నో ముళ్లు గుచ్చుకున్నాయి. ఏనాడూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ఎంచుకున్న లక్ష్యం వైపు అడుగులు వేశాను. ఆడ పిల్లలకు పెద్ద చదువులు ఎందుకనే సమాజం నుంచి.. ఆడపిల్లలు తలచుకుంటే దేనిలోనూ తీసిపోరనే నమ్మకంతో పయనించాను. ఉనికి కోల్పోతున్న 19 గిరిజన భాషలకు లిపి రూపొందించి.. ఆయా వర్గాలకు ఎంతో కొంత మేలు చేసేందుకు ప్రయత్నించాను. ఈ క్రమంలో కన్నవారితో పాటు కట్టుకున్న భర్త ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. గిరిజన భాషలకు లిపిని కూర్చే క్రమంలో ఒకసారి నాటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్‌ను కలిసే అవకాశం వచ్చింది. నా ప్రయత్నం గురించి తెలుసుకున్న ఆయన.. ‘నీ కాళ్లలో ఎన్ని ముళ్లు గుచ్చుకున్నాయ్ ప్రసన్నా’ అని అన్న మాటలు మరువలేను’ అన్నారు ‘నారీ శక్తి’ పురస్కార గ్రహీత.. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సత్తుపాటి ప్రసన్నశ్రీ. ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది, సమాజానికి అందించే నన్నయ వర్సిటీకి ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన ఈ తొలి గిరిజన మహిళ.. మార్చి 8– అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన జీవనపథంలోని వెలుగుచీకట్లను తనను కలసిన ‘సాక్షి’తో పంచుకున్నారు. – రాజానగరం -
కదం తొక్కిన కోకో రైతులు
ఏలూరు (టూటౌన్): కంపెనీలు సిండికేట్‌గా మారి కోకో గింజల ధర తగ్గిస్తున్నాయంటూ ఏలూరులో రైతులు కదం తొక్కారు. చలో ఏలూరు కార్యక్రమంలో భాగంగా రైతులు ర్యాలీ, మహాధర్నా చేపట్టారు. ముందుగా ఫైర్‌స్టేషన్ మీదుగా ఉద్యాన శాఖ డీడీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ధర్నాను ఉద్దేశించి ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కిలోకు రూ.900 ధర ఇప్పించాలని, సిండికేట్‌గా మారిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కంపెనీలతో రైతుల సమక్షంలో చర్చలు జరపాలని లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నినాదాలు చేస్తుండగా ఏలూరు త్రీటౌన్ సీఐకి రైతు సంఘ నాయకులతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం తగదని నాయకులు విమర్శించారు. వినతిపత్రం అందుకున్న కలెక్టర్ వెట్రిసెల్వి రైతులతో చర్చలు జరిపి వారి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. ఏపీ కోకో రైతు సంఘం నాయకులు బొల్లు రామకృష్ణ, ఎస్.గోపాలకృష్ణ, సంఘ నాయకులు ఏలూరుతో పాటు పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల రైతులు భారీగా తరలివచ్చారు. -
భక్తుల తాకిడికి అనుగుణంగా ఏర్పాట్లు
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి వార్షిక కల్యాణోత్సవాల సందర్భంగా తరలివచ్చే భక్తుల తాకిడికి అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేయాలని కొత్తపేట ఆర్డీఓ పీ శ్రీకర్ దేవదాయ – ధర్మాదాయ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు సూచించారు. ఏప్రిల్ 7 నుంచి 13 వరకు కల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు దేవస్థానం కార్యాలయంలో గురువారం దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఆర్డీఓ శ్రీకర్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డీసీ అండ్ ఈఓ సూర్యచక్రధరరావు కల్యాణోత్సవాలకు తరలివచ్చే భక్తుల సంఖ్య అంచనా, ఏర్పాట్లు, దేవదాయ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల పాత్ర, కల్యాణోత్సవ వేదిక, వాహనాల పార్కింగ్ తదితర అంశాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీకర్ మాట్లాడుతూ ఈ వాడపల్లి వేంకటేశ్వరస్వామి క్షేత్రం భక్తుల విశ్వాసంతో దినదినాభివృద్ధి చెందుతున్నందున ప్రతీ శనివారంతో పాటు ఇతర రోజుల్లో కూడా ఇక్కడికి వచ్చే భక్తులు, యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. ఇక కల్యాణోత్సవాలకు భక్తుల తాకిడి విపరీతంగా పెరుగుతుందనే అంచనాలతో ఏర్పాట్లు చేయాలన్నారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, ఇరిగేషన్ హెడ్ వర్క్స్, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్టీసీ, అగ్నిమాపక, రెవెన్యూ, దేవదాయ, పోలీస్ తదితర శాఖల అధికారులు చేయాల్సిన ఏర్పాట్లను వివరించారు. శానిటేషన్‌పై దష్టి పెట్టాల్సిందిగా సూచించారు. అనంతరం ఆలయ ఆవరణ, పరిసరాలు, పార్కింగ్, కల్యాణ వేదిక స్థలాలను ఆర్డీఓ శ్రీకర్, డీసీ అండ్ ఈఓ చక్రధరరావు ఇతర అధికారులు పరిశీలించారు. డీఎల్పీఓ రాజు, డీఎల్డీఓ రాజేశ్వరరావు, ఆత్రేయపురం తహసీల్దార్ టి.రాజరాజేశ్వరరావు, ఎంపీడీవో బీకేఎస్‌ఎస్ వీ రామన్, ఆత్రేయపురం ఎస్సై ఎస్. రాము, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఏప్రిల్ 7 నుంచి 13 వరకు కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న కల్యాణోత్సవాలు ఉత్సవాల నిర్వహణపై ఆర్డీవో శ్రీకర్ అధికారులతో సమీక్ష -
తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలంటూ హేళన
కాకినాడ క్రైం: తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలంటూ హేళన చేశారు. మేం చెప్పింది చేయాలంటూ జులుం ప్రదర్శించారు, నువ్వు మాకు చెప్పే అంత పెద్దదానివా అంటూ చిన్న చూపు చూశారు. మా మీదే ఫిర్యాదు చేస్తావా అంటూ బెదిరించారు... ఇలా వరుస అవమానాలను తాళలేక పెద్దాడ పీహెచ్సీ పరిధిలో పెదపూడి–1 సబ్ సెంటర్లో ఎంఎల్‌హెచ్‌పీగా పనిచేస్తున్న సునీత బుధవారం ఆత్మహత్యకు యత్నించింది. సామాజిక మాధ్యమాల్లో ఆమె పంపిన వాయిస్ నోట్ ఆధారంగా రైలు కింద పడేందుకు వెళుతున్న ఆమెను పోలీసులు రైలు పట్టాలపై గుర్తించి రక్షించారు. ఆమైపె జరిగిన వేధింపులను నిరసిస్తూ గురువారం ఏపీ సీహెచ్వోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాయకులు బాధితురాలితో సహా కాకినాడ డీఎంహెచ్‌వో కార్యాలయ ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మెడికల్ ఆఫీసర్లు ప్రత్యూష, సురేఖతో పాటు శారదమ్మ అనే ప్రమోటెడ్ సీహెచ్‌వో సునీతను తీవ్ర వేధింపులకు గురి చేశారన్నారు. అసభ్య పదజాలంతో అవమానించారన్నారు. తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలంటూ హేళన చేసి మనోధైర్యాన్ని దెబ్బ తీశారని వాపోయారు. ఏడాదిన్నరగా ఏఎన్ఎం లేకపోతే ఆ పని కూడా సునీతే చేస్తున్నారనీ, కనీస కనికరం లేకుండా జులుం ప్రదర్శించడం హేయమైన చర్య అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో తనకు ఎదురవుతున్న అవమానాలు, వేధింపులను వివరిస్తూ బాధితురాలు సునీత కన్నీటి పర్యంతమయ్యారు. డీఎంహెచ్‌వో డాక్టర్ నరసింహ నాయక్‌ను కలిసిన నాయకులు న్యాయం చేయాలంటూ వినతి పత్రం సమర్పించారు. ఎంఎల్‌హెచ్‌పీలకు జాబ్ ఛార్ట్ నిర్దేశించి సునీతపై వేధింపులకు పాల్పడి, ఆత్మహత్యకు ప్రేరేపించిన వైద్యాధికారులు, సీహెచ్వోపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిరసనలో అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ సిరిపురపు నిస్సీ ప్రియాంక, రాష్ట్ర సమన్వయ కర్త ప్రమోద్ , అనకాపల్లి జిల్లా అధ్యక్షురాలు అనురాధ, పల్నాడు జిల్లా అధ్యక్షుడు పులి ప్రేమ్ కుమార్‌తో పాటు జిల్లా నలుమూలల నుంచి ఎంఎల్‌హెచ్‌పీలు పాల్గొన్నారు. వైద్యాధికారుల వేధింపులపై ఎంఎల్‌హెచ్‌పీల నిరసన దీక్ష -
ఆత్మహత్య చేసుకుని వ్యక్తి మృతి
కె.గంగవరం: మండల పరిధిలోని సుందరపల్లి గ్రామానికి చెందిన అడపా శ్రీనివాస్(42) బుధవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాస్ స్థానికంగా కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య రమాదేవితో పాటు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. కొంత కాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతున్న శ్రీనివాస్ అమలాపురంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నాడు. ఇదే క్రమంలో బుధవారం సాయంత్రం పశువుల పాకలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై జానీబాషా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అకౌంట్లో సొమ్ము కాజేసిన ౖసైబర్ కేటుగాట్లు కొవ్వూరు: సీతంపేట గ్రామానికి చెందిన సంగీత స్వాతి అనే మహిళ వాటాప్స్ చూస్తుండగా వచ్చిన ఏపీకే మెసేజ్‌పై క్లిక్ చేయగా తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.49,700లు గల్లంతైనట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని రూరల్ ఎస్సై కె.శ్రీహరిరావు తెలిపారు. గత డిసెంబర్ నెల 29వ జరిగిన ఈ ఘటనపై 1930 నంబర్‌కి కాల్ చేసి సైబర్ క్రైమ్‌కి ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. తర్వత వాడపల్లి బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. నాలుగు రోజుల తర్వాత తన ఖాతాలో ఉన్న సొమ్మును బ్యాంకు అధికారులు అదే నెల 31వ తేదీన ఫ్రీజ్ చేసినట్లు మేసెజ్‌లు వచ్చాయని ఆమె పేర్కోంది. గురువారం స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
‘ఇంటర్ స్పాట్’కు వేళాయె..
రాయవరం: ఇంటర్మీడియెట్ సెకండియర్ పరీక్షలు ఈ నెల 20న కెమిస్ట్రీ, కామర్స్‌తో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో జవాబు పత్రాల మూల్యాంకనంపై అధికారులు దృష్టి సారించారు. 2022–23 విద్యా సంవత్సరం వరకూ ఉమ్మడి జిల్లాకు చెందిన ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం రాజమహేంద్రవరంలో నిర్వహించారు. 2023–24 విద్యా సంవత్సరంలో పునర్విభజన జరిగిన జిల్లాల్లో తొలిసారిగా స్పాట్ క్యాంపు నిర్వహించారు. ఈ మేరకు గత ఏడాది కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో స్పాట్ వేల్యుయేషన్ నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి శుక్రవారం ఉదయం సంస్కృతం సబ్జెక్టు పేపరుతో స్పాట్ వేల్యుయేషన్ అమలాపురంలో ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 1,50,547 జవాబు పత్రాల మూల్యాంకనం జిల్లాలో చేపట్టనున్నారు. దీనికి జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి వనుము సోమసోఖరరావు క్యాంప్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. ఏఈకి రోజుకు 30 పేపర్లు జవాబు పత్రాల మూల్యాంకనం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిర్వహిస్తారు. ఒక అసిస్టెంట్ ఎగ్జామినర్ (ఏఈ) రోజుకు 30 జవాబు పత్రాలు మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. ప్రతి ఐదుగురు ఏఈలకు ఒక చీఫ్ ఎగ్జామినర్ (సీఈ) ఉంటారు. ఏఈ మూల్యాంకనం చేసే జవాబు పత్రాలను సీఈ పరిశీలిస్తారు. ఏఈలు, సీఈ కలిపి ఉండే బోర్డుకు ఒక స్క్రూటినైజర్ ఉంటారు. ఏఈలు అన్ని ప్రశ్నల జవాబులు మూల్యాంకనం చేశారా, లేదా, మార్కుల టోటల్ తదితర విషయాలను వారు పరిశీలిస్తూంటారు. సబ్జెక్టు నిపుణులు కూడా ఏఈలు మూల్యాంకనం చేసే పేపర్లను పరిశీలించి, తేడాలుంటే సూచనలిస్తారు. జిల్లాకు వచ్చే సబ్జెక్టు పేపర్ల సంఖ్య ఆధారంగా ఏఈలు, సీఈ కలిపి ఉండే బోర్డుల సంఖ్య ఉంటుంది. జవాబు పత్రాల కేటాయింపు ఇలా.. ఆయా సబ్జెక్టులకు సంబంధించి ఫస్టియర్ 82,217, సెకండియర్ 68,330 కలిపి జిల్లాకు మొత్తం 1,50,547 జవాబు పత్రాలు కేటాయించారు. ఇప్పటికే సంస్కృతం, తెలుగు పేపర్లు స్పాట్ వేల్యుయేషన్ కేంద్రానికి చేరాయి. మిగిలిన పేపర్లు కూడా దశలవారీగా చేరనున్నాయి. ఫస్టియర్‌కు సంబంధించి ఇంగ్లిషు 14,024, తెలుగు 5,561, హిందీ 264, సంస్కృతం 5,540, గణితం–1ఎ 9,229, గణితం–1బి 9,467, బోటనీ 2,880, జువాలజీ 2,742, ఫిజిక్స్ 11,812, కెమిస్ట్రీ 11,432, ఎకనామిక్స్ 3,371, వాణిజ్య శాస్త్రం 2,492, హిస్టరీ 691, సివిక్స్ 2,712 జవాబు పత్రాల మూల్యాంకనం జిల్లాలో చేపట్టనున్నారు. అలాగే, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి ఇంగ్లిషు 11,729, తెలుగు 4,277, హిందీ 235, సంస్కృతం 4,929, గణితం–2ఎ 8,031, గణితం–2బి 8,021, బోటనీ 2,336, జువాలజీ 2,180, ఫిజిక్స్ 10,351, కెమిస్ట్రీ 9,856, ఎకనామిక్స్ 2,280, వాణిజ్య శాస్త్రం 1,754, హిస్టరీ 459, సివిక్స్ 1,892 జవాబు పత్రాలను జిల్లాకు కేటాయించారు. మూల్యాంకనం ప్రక్రియ వచ్చే నెల రెండో వారంలో పూర్తయ్యే అవకాశముంది. మూల్యాంకనానికి అవసరమైన సిబ్బంది నియామకం దాదాపు పూర్తి కావచ్చింది. నేటి నుంచి మూల్యాంకనం జిల్లాకు 1.50 లక్షల జవాబు పత్రాల కేటాయింపుఏర్పాట్లు పూర్తి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ అన్ని ఏర్పాట్లూ చేశాం. ఎటువంటి అవకతవకలకూ ఆస్కారం లేని విధంగా మూల్యాంకనం చేపట్టనున్నాం. ఇప్పటికే జరిగిన పరీక్షల జవాబు పత్రాలు చేరుకోగా, జరగాల్సిన పరీక్షలకు సంబంధించినవి త్వరలో చేరనున్నాయి. – వనుము సోమశేఖరరావు, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి, అమలాపురం -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
రూ.800, రూ.900 నాణేల సేకరణ
అమలాపురం టౌన్: దేశంలోనే మొట్ట మొదటి సారిగా విడుదలైన రూ.800, రూ.900 నాణేలను అమలాపురానికి చెందిన నాణేల సేకరణ కర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ ప్రత్యేక ఆర్డర్‌పై సేకరించారు. ఈ రెండు నాణేలు అత్యధిక ముఖ విలువలతో ఒకేసారి విడుదల కావడం విశేషం. జైన తీర్ధకరుల్లో ఒకరైన పార్శ్వ నాథ భగవాన్ 2900వ జయంతిని పురస్కరించుకుని ముంబై టంకశాల రూ.800, రూ.900 నాణేలను ముద్రించి విడుదల చేసింది. పార్శ్వ నాథ భగవాన్ 2900 సంవత్సరాల క్రితం వారణాసిలో పరిపాలించిన అశ్వసేన మహారాజు, రాణి వామదేవిల కుమారుడు. ఆయన రాజ్య భోగలన్నింటినీ విడిచిపెట్టి జ్ఞాన సముపార్జన కోసం సన్యాసం స్వీకరించిన మహానీయుడు, జైనుల ఆరాధ్య దైవమైన భగవాన్ మహా వీరుని కంటే 250 సంవత్సరాల ముందే పార్శ్వ నాథ భగవాన్ జన్మించారు. 40 గ్రాముల బరువైన ఈ నాణేలను పూర్తి వెండితో తయారు చేశారు. -
రత్నగిరి సీఆర్వో కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ
అన్నవరం: రత్నగిరి గదుల రిజర్వేషన్ కార్యాలయ (సీఆర్వో) సిబ్బంది నిర్లక్ష్యంపై ఈఓ వీర్ల సుబ్బారావు విచారణకు ఆదేశించారు. దీనికి భాద్యులుగా భావిస్తూ సీఆర్వో కార్యాలయం సీనియర్ అసిస్టెంట్‌కు షోకాజ్ నోటీసు, ఆ కార్యాలయంలో కౌంటర్ క్లర్క్‌లుగా పనిచేస్తున్న ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులను సస్పెండ్ చేయడానికి అధికారులు ఫైల్ సిద్ధం చేసినట్టు సమాచారం. హరిహరసదన్ పక్కన గల స్థలం ఈ నెల 22న వివాహానికి అద్దెకి తీసుకున్న పెళ్లిబృందం వివాహం అనంతరం ఆ స్థలం ఖాళీ చేసినప్పటికీ సిబ్బంది పది రోజుల వరకు కంప్యూటర్లో చెకౌట్ చేయకపోవడంతో పది రోజులు అద్దెకిచ్చినట్లు నమోదైంది. ఈ స్థలం ఒక రోజు అద్దె రూ. 29 వేలు కాగా, పది రోజులకు రూ.2.90 లక్షలు చెల్లించాలని కంప్యూటర్లో నమోదైంది. సాధారణంగా దేవస్థానంలో సత్రం గదులు అద్దెకిచ్చిన 24 గంటల తరువాత చెకౌట్ అవ్వకపోతే ఆటోమేటిక్‌గా మరుసటి రోజు అద్దె కూడా కంప్యూటర్ లో నమోదయిపోతుంది. అందువల్ల ఆ సిబ్బంది గదులు అద్దెకు తీసుకున్న భక్తులకు ఈ విషయం చెబుతారు. కాని వివాహాలు చేసుకునే స్థలాల విషయంలో మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ఈ విధమైన పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కలెక్టర్ తనిఖీ తరువాత పట్టించుకున్న వారు లేరు గత నెల 24వ తేదీన కలెక్టర్ షణ్మోహన్ రత్నగిరి తనిఖీలలో భాగంగా గదులు అద్దెకిచ్చే కార్యాలయాన్ని తనిఖీ చేసి గదులు ఖాళీ ఉన్నా భక్తులకు అద్దెకివ్వని పరిస్థితి గమనించి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే. ఇది జరిగి పది రోజులైనా ఈ విభాగంలో తనిఖీ చేసిన నాథుడు లేడు. సిబ్బంది పనితీరు మారిందా లేదా అని పట్టించుకున్నవారు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతీ రోజు ఎన్ని గదులు అద్దె కిచ్చారు. ఎన్ని ఖాళీ ఉన్నాయి...అద్దె కిచ్చిన గదులకు సమానంగా అద్దె దేవస్థానానికి జమ అయిందా లేదా అని ఆరా తీసి ఉంటే ఈ వివాహ స్థలం చెకౌట్ విషయం కూడా తెలిసేదనే అభిప్రాయం వినిపిస్తోంది. కేవలం ఆఫీసులో సిబ్బందితో గంటల తరబడి సమావేశాల వలన పెద్దగా ప్రయోజనం ఉండదని అంటున్నారు. సీనియర్ అసిస్టెంట్‌కి షోకాజ్ నోటీసు ఇద్దరు కాంట్రాక్ట్ సిబ్బంది సస్పెన్షన్‌కు రంగం సిద్ధం -
కాండం తొలిచే పురుగతో అప్రమత్తం
ఐ.పోలవరం: రబీ వరి చేలల్లో కాండం తొలిచే పురుగు పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం, జిల్లా వ్యవసాయ సాంకేతిక సలహా (ఏరువాక) కేంద్రం అమలాపురం ప్రధాన శాస్త్రవేత్త, కో ఆర్డినేటర్ డాక్టర్ నందకిశోర్ తెలిపారు. ఇటీవల మండల పరిధిలో వరిచేలను ఆయనతో పాటు సహాయ వ్యవసాయ సంచాలకుడు డాక్టర్ ఏవీఎస్ రాజశేఖర్, ఏరువాక వ్యవసాయ అధికారి జె.మనోహర్, మండల వ్యవసాయ అధికారి ఎం.వాణితో కలసి పర్యటించారు. ఈ పర్యటనలో వరి పొలాలను పరిశీలించి, అక్కడక్కడా కాండం తొలిచే పురుగు గమనించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు ఇచ్చారు. వరి చేలల్లో పురుగులు, తెగుళ్లపై ఆయన పలు సూచనలు చేశారు. ఆయన మాటల్లోనే.. కాండం తొలిచే పురుగు (మొవ్వు చనిపోవుట లేదా మండి పురుగు/తెల్ల కంకి) పిలక దశలో కాండం తొలిచే పురుగు ఆశించడం వల్ల వరి మొక్కలోని మొవ్వు ఆకు చనిపోయి ఎండి పోతుంది. ఈ చనిపోయిన మొవ్వును చేతితో లాగితే సులభంగా చేతికిలోకి వస్తుంది. పొలంలో ఐదు శాతం కంటే ఎక్కువ చనిపోయిన మొవ్వులు లేదా చదరపు మీటరుకు ఒక రెక్కల తల్లి పురుగును గమనించినట్లయితే నివారణ చేపట్టాలి. పంట చిరు పొట్ట దశ నుంచి కంకి బయటకు వచ్చిన తర్వాత కాండం తొలిచే పురుగు ఆశించటం వల్ల కంకి శ్రీతెల్ల కంకి శ్రీ లాగా బయటకు వస్తాయి. దీనివల్ల కంకిలోని గింజలు తోడుకోక తాలు గింజలుగా మారిపోతాయి. నివారణ కాండం తొలిచే పురుగు నివారణకు పిలక దశలో లీటరు నీటికి క్లోరి పైరిఫాస్ 20 ఈసీ 2.5 మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ 75 ఎస్పీ 1.5 గ్రాములు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్పీ 2.0 గ్రాములు లేదా క్లోరం ట్రానిలిప్రోల్ 20 ఎస్సీ 0.3 మిల్లీ లీటర్లు చొప్పున కలిపి పిచికారీ చేయాలి. తెల్లకంకి తెల్లకంకి రాకుండా అరికట్టటానికి పంట అంకురం (కుదురు కట్టే దశ) దశలో ఎకరానికి కార్బోఫ్యురాన్ 3జి గుళికలు 10 కేజీలు (లేదా) కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జి గుళికలు 8 కిలోలు (లేదా) క్లోరంట్రానిలిప్రోల్ 0.4 జి గుళికలు 4 కిలోల చొప్పున వేయాలి. గుళికలు వేసేటప్పడు చేలో నీరు పలచగా వుండాలి. ఉల్లికోడు (గాల్ మిడ్జి) ఉల్లికోడు ఆశించడం వల్ల వరి దుబ్బులోని మొవ్వు ఆకు గొట్టం వలె మారి ఉల్లికాడ వలె రూపాంతరం చెందుతోంది. ఇవి ఆశించిన మొవ్వు ఆకులు నిలువుగా గొట్టాల మాదిరిగా మారిపోతాయి. ఇలా మారిన ఆకుల నుంచి వెన్నులు రావు. నివారణ.. ఎకరాకు 10 కేజీల కార్బోఫ్యూరాన్ 3 ఎ గుళికలు పొలంలో నీరు తగ్గించి చల్లుకోవాలి. ఈ గుళికలు ఏ విధమైన ఎరువులు పురుగు మందులను కలిపి వేయరాదు. గుళికలు చల్లున్నప్పుడు ముక్కుకు మాస్క్, చేతులకు గ్లోవ్స్ కచ్చితంగా ధరించాలి. అలాగే ఉదయం, సాయంత్రం పూట మాత్రమే వేయాలి. మధ్యాహ్నం ఎండ సమయంలో చల్లకూడదు. కాండం కుళ్లు (దుబ్బు కుళ్ళు తెగులు) వరి పంట పిలకలు చేయటం పూర్తి అయిన చేలలో దుబ్బు కుళ్లు గమనించాం. ఈ తెగులు ఆశించటం వలన కాండం లోపల కణుపుల మధ్య భాగమంతా నల్లగా మారడం, పిలకలు కిందకి వాలిపోయి ఎండి పోవుడం, క్రమంగా దుబ్బు అంతా ఎండిపోవడం జరుగుతోంది. వెన్నులో తాలు గింజలు ఏర్పడతాయి. నివారణ ● పొలంలో మురుగు నీరు నిల్వ వుండకుండా చూసుకోవాలి, వీలయితే పొలంలో నీరు బయటకు తీసి చేను ఒకసారి అరగట్టాలి. ● తెగులు ప్రారంభ దశలో నివారణకు హెక్సాకోనజోల్ 5 ఎస్సీ లేదా వాలిడామైసిన్ 3 ఎల్.2.0 మిల్లీ లీటర్లు లీటరు నీటికి లేదా ప్రొపికోనజోల్ 25 ఈసీ 1.0 మిల్లీ లీటర్లు లేదా టెబుకోనజోల్ 25.9 ఈసీ 2.0 మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. సస్య రక్షణతో తెగుళ్ల నివారణ ఏరువాక శాస్త్రవేత్త డాక్టర్ నంద కిశోర్ -
భీమేశ్వరుని ఆదాయం రూ.28.87 లక్షలు
రామచంద్రపురం రూరల్: దక్షిణ కాశీ ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.28,87,291 వచ్చినట్లు ఈఓ, దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గా భవాని తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆలయ ప్రాంగణంలో ఉప కమిషనర్ డీఎల్వీ రమేష్‌బాబు, ఎంఎస్ఎన్ చారిటీస్ ఈఓ, దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ కె. విజయలక్ష్మి సమక్షంలో హుండీల ఆదాయాన్ని లెక్కించారు. ఆలయ హుండీల ద్వారా 2024 డిసెంబరు 13వ తేదీ నుంచి ఈ నెల ఐదో తేదీ వరకు 83 రోజులకు రూ.27,97,105, అన్నదానం హుండీల ద్వారా రూ.90,186 ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. అలాగే 10 గ్రాముల బంగారం వచ్చినట్లు పేర్కొన్నారు. మెహబూబ్ సిస్టర్స్‌కు డీఈవో అభినందన ముమ్మిడివరం: అమలాపురానికి చెందిన మాస్టర్ అథ్లెట్స్ మెహబూబ్ సిస్టర్స్ షహీరా, షకీలాను డీఈవో డాక్టర్ షేక్ సలీమ్ బాషా బుధవారం ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల మెహబూబ్ సిస్టర్స్ అనంతపురం, హైదరాబాద్‌లలో జరిగిన రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించి జాతీయ పోటీలకు ఎంపికై న సంగతి తెలిసిందే. 75 ప్లస్ (వయస్సు) విభాగంలో షహీరా, 65 ప్లస్ విభాగంలో షకీలా పతకాలు సాధించడం అభినందనీయమని డీఈవో బాషా అన్నారు. ముమ్మిడివరంలోని డీఈవో కార్యాలయంలో మెహబూబ్ సిస్టర్స్ డీఈవోను బుధవారం కలిశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ఈ సిస్టర్స్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో సత్తా చాటుతూ పతకాలు సాధించడం జిల్లాకే గర్వ కారణమని పేర్కొన్నారు. ఏడున ఫిమేల్ జాబ్ మేళా అమలాపురం రూరల్: కలెక్టరేట్లోని వికాస సంస్థ జిల్లా కార్యాలయంలో ఈ నెల ఏడో తేదీన శుక్రవారం ఫిమేల్ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తుక్కుగూడ హైదరాబాద్‌లో గల ఫాక్స్‌కాన్ కంపెనీలో ఎస్ఎస్సీ, ఇంటర్ పాస్ లేదా ఫెయిల్, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన వారు అర్హులు అని ఆయన స్పష్టం చేశారు. ఈ సంస్థలలో మొబైల్ అసెంబ్లింగ్ యూనిట్లో ఆపరేటర్‌గా పని చేయడానికి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని, జిల్లాలో అర్హులైన నిరుద్యోగ యువతులు సద్వినియోగం చేసుకోవాలని వికాస జిల్లా మేనేజర్ రమేష్ విజ్ఞప్తి చేశారు. -
విద్యార్థినులకు చిత్ర లేఖన పోటీలు
అమలాపురం టౌన్: ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నాలుగు రోజులుగా వివిధ మహిళా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయం బుధవారం రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆ కార్యక్రమాలను వివరించారు. మహిళల భద్రత, హక్కులు, సాధికారత, మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. బాలికలకు గుడ్ టచ్ బాడ్ టచ్ గురించి వివరణ ఇస్తున్నామని తెలిపింది. మహిళలకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఇదే సందర్భంగా ఆయా పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు, ఓపెన్ హౌస్ కార్యక్రమాలు చేపట్టారు. జిల్లాలోని పలు విద్యా సంస్థల్లో విద్యార్థినులకు మహిళా చైతన్యం, ఆత్మ రక్షణ తదితర అంశాలపై వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలల్లో విద్యార్థినులకు బుధవారం మహిళల ‘ధైర్య సాహసాలు’ అనే అంశంపై చిత్ర లేఖన పోటీలను నిర్వహించారు. జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
సిండికేటు గనికట్టు..!
జియో కోట్స్ బండారం బట్టబయలు ఇసుక తవ్వకాలు చేసిన ర్యాంపులలో మైనింగ్ అధికారులు జియో కో ఆర్డినేట్స్ ద్వారా పరిశీలిస్తే ర్యాంపులలో ఇసుక తవ్వకాలపై కచ్చితమైన లెక్కలు వస్తాయి. కాని అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. రాజకీయ వత్తిడులకు తలొగ్గుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడున్నవారికే ర్యాంపులు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కొత్తవారు వస్తే ఇప్పటి వరకు జరిగిన అక్రమ తవ్వకాలు బయటకు వస్తాయని వారు భయపడుతున్నారు. జూలై నెల వరకు ర్యాంపులను పాతవారి చేతులలో ఉంచితే గోదావరికి వరదలు వస్తాయి. ర్యాంపుల వద్ద కొత్త ఇసుక మేటు వేయడం వల్ల పాత తవ్వకాల ఆనవాళ్లు కూడా కనపడవు. వరదలతో లంక గ్రామాల్లో పంటలతోపాటు ఇసుక అక్రమాలు కూడా కొట్టుకుపోతాయి. సాక్షి, అమలాపురం/రావులపాలెం: అధికారిక ఇసుక ర్యాంపుల్లో జరుగుతున్న తవ్వకాలకు.. మైనింగ్ అధికారులు చెబుతున్న లెక్కలకు పొంతన లేకుండా పోతోంది. మూడు లోడులు అధికారికంగా చూపితే.. దొడ్డిదారిన ఆరు లోడులు తరలిపోతున్నాయి. కూటమి నేతల కనుసన్నలలో సిండికేట్ అవతారం ఎత్తిన కాంట్రాక్ట్ కంపెనీలు దొడ్డిదారిన తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాయి. ఇప్పుడు తవ్వకాలకు సమయం సరిపోలేదని, గడువు పెంచాలని కోరుతూ మరోసారి ఆదాయానికి గండి కొట్టేందుకు సిద్ధమవుతోంది. జిల్లాలో ఉన్న 15 ఇసుక ర్యాంపులలో రెండింటికి ఈ ఏడాది నవంబరు వరకు కాలపరిమితి ఉంది. మిగిలిన 13 ర్యాంపులలో ఏడింటికి మంగళవారంతో గడువు పూర్తికాగా, మిగిలిన ఆరింటికి ఈ నెల 14తో గడువు ముగియనుంది. ఆయా ర్యాంపులకు ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు ఇచ్చిన అనుమతిలో సగం కూడా తవ్వకాలు చేయనట్టు మైనింగ్ అధికారులు చెబుతున్నారు. ఈ ర్యాంపులలో గత నవంబరు 8వ తేదీ నుంచి తవ్వకాలు మొదలయ్యాయి. మొత్తం 7,99,800 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతి ఇస్తే ఇంత వరకు 4,35,835 టన్నుల ఇసుక తవ్వారు. ఇంకా 3,63,965 టన్నుల ఇసుక తవ్వాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించారు. అయితే వాస్తవంగా అధికారులు చెప్తున్న దాని కన్నా రెండు రెట్లు అదనంగా ఇసుక తవ్వినట్టు అంచనా. ఇప్పుడు తవ్వకాలు పెద్దగా చేయలేదని చెబుతున్న వద్దిపర్రు–1తో పాటు అంకంపాలెం, నార్కెడ్మిల్లి, పులిదిండి, ఆత్రేయపురం, రావులపాలెం మండలం ఊబలంక, పొడగట్లపల్లి, కపిలేశ్వరపురం, ఆలమూరు, తాతపూడి తదితర ర్యాంపులలో నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలతో ఇసుక తవ్వకాలు చేయడం గమనార్హం. పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక లోడుతో లారీలు తిరుగుతూనే ఉన్నాయి. సిండి‘కాటు’ కొన్ని ర్యాంపులలో తవ్వకాలు తక్కువగా జరగడానికి ర్యాంపులు పొందిన పాటదారులు సిండికేట్‌గా మారడం ప్రధాన కారణం. ఇసుక ర్యాంపులు కేవలం కొత్తపేట, మండపేట నియోజకవర్గాలలో మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కీలక నేతలకు ర్యాంపులలో వాటాలు ఉండడంతో సిండికేట్‌ను ఒక మాట మీదనే ఉంచారు. అడ్డం వచ్చిన కాంట్రాక్టు సంస్థలను ముందుగానే తరిమివేశారు. వద్దిపర్రు–2, పొడగట్లపల్లి, ఆలమూరు వంటి ర్యాంపులలో తక్కువగా ఇసుక తవ్వకాలు జరగడానికి కారణం ఇసుకకు కృత్రిమ కొరత సృష్టించి సొమ్ములు చేసుకోవడమే. ఈ విషయాన్ని గత ఏడాది నవంబరులో ఇసుక పాటల సమయంలోనే ఆ నెల 8వ తేదీన ‘సిండికేటు పాట రూ.16 కోట్లు’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. అందుకు తగినట్టుగానే కొన్ని ర్యాంపుల్లో తవ్వకాలు చేయడం, మరికొన్ని ర్యాంపుల్లో తవ్వకాలు మందకొడిగా సాగాయి. ఇప్పుడు తవ్వకాలు పెద్ద ఎత్తున జరిగిన చోట, జరగని చోట కూడా గడువు పెంచాలని కోరుతూ ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా సొమ్ములు చేసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ర్యాంపులు.. వాటిలో ఇసుక తవ్వకాలు... స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక నిల్వలు ఇలా.. (ఈ నెల నాలుగో తేదీ సాయంత్రం వరకు) (మెట్రిక్ టన్నులలో) లెక్కల్లో మూడు.. దొడ్డిదారిన ఆరు లారీలతో తరలింపు నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలతో తవ్వకాలు అక్కడ నుంచి నేరుగా తరలింపు తక్కువ తవ్వకంగా చూపే యత్నం సహకరిస్తున్న అధికార యంత్రాంగం సిండికేటుగా మారి ఇసుక దోపిడీ ఇంకా తవ్వాల్సి ఉందని నివేదిక అనుమతి రాగానే మరోసారి దోచుకునే యత్నంర్యాంపు అనుమతి తవ్వినిది ప్రస్తుత నిల్వ తవ్వాల్సింది పులిదిండి 33,750 31,755 12,296 1,995 ఆత్రేయపురం 71,100 52,484 12,290 18,616 ఊబలంక 64,480 48,482 11,140 16,318 వద్దిపర్రు–1 63,300 15,132 3,255 48,168 పొడగట్లపల్లి–1 54,900 51,816 17,265 3,084 అంకంపాలెం 72,750 36,200 15,412 36,550 నార్కెడిమిల్లి 31,500 29,240 19,983 2,260 కపిలేశ్వరపురం 65,850 52,364 14,965 13,486 ఆలమూరు 68,400 26,854 14,329 41,546 తాతపూడి 67,500 30,648 24,316 36,852 గోపాలపురం 74,700 51,140 23,470 23,560 పొడగట్లపల్లి–2 60,000 9,720 5,740 50,280 వద్దిపర్రు–2 71,250 0 0 71,250 మొత్తం 7,99,800 4,35,835 1,74,461 3,63,965 -
తాళం వేసిన దుకాణంలో చోరీ
అమలాపురం టౌన్: స్థానిక నారాయణపేటలో శ్రీహరి ఆటో మొబైల్స్ పేరిట నిర్వహిస్తున్న మోటారు సైకిల్ మెకానిక్ షాపులో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీ జరిగింది. మూడు పోర్షన్లు ఉన్న పెంటిల్లు అది. ఆ ఇంట్లో షాపుగా ఉన్న పోర్షన్‌కు తాళం వేసి ఉండగానే చోరీ జరిగి నగదు మాయం కావడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షాపు యాజమాని దనలకోట కృష్ణ షాపులో ఓ సంచిలో రూ.10 లక్షల వరకూ దాచుకున్నానని, అవి చోరీకి గురయ్యాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పట్టణ సీఐ పి.వీరబాబు, ఎస్సై తిరుమలరావు, క్రైమ్ పార్టీ పోలీసులు బుధవారం ఉదయం చోరీ జరిగిన తీరును పరిశీలించారు. తాను రెండేళ్ల కిందట స్థలం విక్రయించిన సొమ్ములు, తాను రోజు సంపాందించిన సొమ్మలను షాపులో ఓ సంచిలో దాచుకుంటున్నానని యాజమాని తెలిపాడు. ఈ డబ్బులను తన కుమారుడి వివాహానికి కూడబెట్టానని పోలీసులకు వివరించాడు. నారాయణపేటలోనే ఉన్న తన సొంత ఇంట్లో నగదు దాచుకోకుండా షాపులో ఉండచంపై, షాపు తాళం తీయకుండానే సొమ్ము పోవడంపై కృష్ణను పలు కోణాల్లో విచారిస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లతో దర్యాప్తు చేస్తున్నారు. తెలుసున్న వ్యక్తులే ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీ జరిగిన ఇంటి మూడు పోర్షన్లలో ఒకటి అద్దెకు ఇవ్వగా, మరొకదానిలో కృష్ణ సోదరుడు ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం షాపునకు తాళం వేసి వెళ్లిన కృష్ణ బుధవారం ఉదయం వచ్చి షాపు తాళం తీసి లోనికి వెళ్లినప్పుడు చోరీ జరిగినట్లు గమనించాడు. రూ.10 లక్షల అపహరణ నారాయణపేటలో ఘటన -
ఇంటర్ పరీక్షలకు 468 మంది గైర్హాజరు
అమలాపురం టౌన్: జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లిషు, ఒకేషనల్ పరీక్షలకు 468 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇంగ్లీషుకు 9,985 మంది హాజరు కావాల్సి ఉండగా 317 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ పరీక్షకు 2,347 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 151 మంది గైర్హాజరైనట్టు డీఐఈవో వనుము సోమశేఖరరావు తెలిపారు. జిల్లాలోని 40 పరీక్షా కేంద్రాల్లో బుధవారం ప్రశాంతంగా జరిగాయన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్స్, మూడు సిటింగ్ స్క్వాడ్స్ , జిల్లా పరీక్షల కమిటీ సభ్యులతో పాటు తాను పలు పరీక్షా కేంద్రాల్లో తనిఖీ చేసినట్టు డీఐఈవో ఆయన తెలిపారు. విద్యార్థినికి అస్వస్థత ముమ్మిడివరం: స్థానిక తారా కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియెట్ పరీక్షా కేంద్రంలో ఓ విద్యార్థిని అస్వస్థతకు గురైంది. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లికి చెందిన చందన బుధవారం ఇంగ్లిషు పరీక్ష రాస్తుండగా కడుపు నొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకుంది. దీంతో ఇన్విజిలేటర్ స్థానిక పోలమ్మ చెరువు పీహెచ్సీ వైద్యులు పర్ణిక, సత్యనారాయణతో ఆమెకు వైద్యం చేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెకు స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించి తిరిగి పరీక్షా కేంద్రానికి తీసుకు వెళ్లి పరీక్ష రాయించారు. నేడు గీత కార్మికుల మద్యం షాపుల లాటరీ అమలాపురం రూరల్: కలెక్టరేట్ గోదావరి భవనంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కల్లు గీత కార్మికుల మద్యం షాపుల ఎంపికకు గురువారం ఉదయం 11 గంటలకు లాటరీ నిర్వహిస్తునట్లు అమలాపురం ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎస్కేడీవీ ప్రసాద్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో షాపుల టెండర్లను కలెక్టర్ మహేష్‌కుమార్ అధ్వర్యంలో తెరుస్తామన్నారు. 13 మద్యం షాపులకు 261 టెండర్లు వచ్చాయని తెలిపారు. -
కోనసీమ కోకో సంఘం ఏర్పాటుకు యోచన
అమలాపురం రూరల్: జిల్లాను కోకో హబ్‌గా తీర్చిదిద్దేందుకు నాంది పలుకుతూ కోనసీమ కోకో సంఘం ఏర్పాటుకు యోచిస్తున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ఉద్యాన, సహకార రిజిస్ట్రార్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ఈ ఏర్పాటుకు విధివిధానాలపై చర్చించారు. ఈ సంఘానికి అధ్యక్షురాలిగా జేసీ, ఉపాధ్యక్షులుగా జిల్లా ఉద్యాన అధికారి, సభ్యులుగా జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, మరొక సభ్యుడిగా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్, జిల్లా సహకార అధికారి, జిల్లా రిజిస్ట్రార్, రైతు ఉత్పత్తిదారుల సంఘాల నుంచి అడ్డాల గోపాలకృష్ణ, సరేళ అప్పారావులను నియమించనున్నట్టు తెలిపారు. సంఘ రిజిస్ట్రేషన్ ఏర్పాట్లు ప్రారంభించాలని అధికారుల ఆదేశించారు. క్లస్టర్ వారీగా కోకో పంటల విస్తరణకు జిల్లాలో ప్రాథమిక దశలో వెయ్యి ఎకరాలను గుర్తిస్తూ లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు. జిల్లాలో లక్ష ఎకరాల విస్తీర్ణంలో కొబ్బరి తోటలు ఉన్నాయని, వీటిలో 50 శాతం పాక్షిక నీడలో కోకో సాగుకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేయాలని సూచించారు. రాజోలు మలికిపురం, సఖినేటిపల్లి మండలాలో ఉప్పునీటి ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్న ఈ సాగుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రిజిస్ట్రార్ నాగలింగేశ్వర రావు, జిల్లా సహకార అధికారి ఎస్.మురళీకృష్ణ, జిల్లా ఉద్యాన అధికారి బీవీ రమణ పాల్గొన్నారు. పాఠశాలల పునర్విభజన నిర్వహించాలి పాఠశాల విద్య బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాఠశాలల పునర్విభజన చర్యలను పాఠశాల నిర్వహణ కమిటీలు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో వివరించి కమిటీల ఆమోదంతో ఈ ప్రక్రియను నిర్వహించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి పాఠశాలల పునర్విభజనపై సమీక్షించారు. ప్రభుత్వం పాఠశాలల పునర్నిర్మాణం, బోధనా సిబ్బంది పునర్విభజనపై దృష్టి పెట్టిందన్నారు. జేసీ టి.నిశాంతి, జిల్లా విద్యాశాఖ అధికారి సలీమ్ బాషా తదితరులు పాల్గొన్నారు. మానవ వనరుల లభ్యతపై.. జిల్లాలో వివిధ శాఖల్లో కార్యకలాపాలకు సంబంధించి మానవ వనరుల లభ్యత శిక్షణ కార్యక్రమాలపై జిల్లాస్థాయి అధికారులు నివేదికలు సమర్పించాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నైపుణ్య అభివృద్ధి శాఖ జిల్లా కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వివిధ శాఖలలో మానవ వనరుల వినియోగం, వాటికి అవసరమైన శిక్షణలను నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా ఇప్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి నైపుణ్యాభివృద్ధి విభాగానికి సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. మార్చి 19 నాటికి ఆయా శాఖలు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి హరి శేషు, జిల్లా విద్యాశాఖ అధికారి వసంత లక్ష్మి, డీఆర్డీఏ పీడీ శివ శంకర్ ప్రసాద్ జిల్లా వ్యవసాయ అధికారి బోసుబాబు, ఉద్యాన అధికారి దిలీప్ పరిశ్రమల కేంద్రం సహాయ సంచాలకుడు శివరాం ప్రసాద్ పాల్గొన్నారు. మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి ఈనెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జిల్లాస్థాయిలో అధికారులు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. బుధవారం సంబంధిత మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సూర్యకుమారి అమరావతి నుంచి వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి ఆదేశించినట్టు తెలిపారు. జేసీ టి.నిశాంతి మాట్లాడుతూ మహిళా సాధికారతకు అమలు చేస్తున్న పథకాలపై నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. డీఆర్డీఏ పీడీ శివశంకర ప్రసాద్, ఎల్డీఎం కేశవ వర్మ, జిల్లా పరిశ్రమల కేంద్రం సహాయ సంచాలకుడు శివరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ మహేష్ కుమార్ -
ఇంటర్ పరీక్షా కేంద్రాల తనిఖీ
అమలాపురం టౌన్: జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఎలాంటి మాస్ కాపీయింగ్, ఫేక్ న్యూస్‌లకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారిణి (డీఆర్వో) బీఎల్ఎస్ రాజకుమారి చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విలిజేటర్లను ఆదేశించారు. అమలాపురంలో పరీక్షలు జరుగుతున్న రెండు కేంద్రాలను ఆమె మంగళవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులతో ఆయా పరీక్షా కేంద్రాల్లో ఆమె మాట్లాడారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను డీఆర్వో పరిశీలించారు. వేసవి ఎండల నేపథ్యంలో పరీక్షల హాళ్లలో విద్యార్ధులకు తాగునీటి వసతిపై ఆరా తీశారు. ఆయా పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను ఆమె పరిశీలించి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉన్నాయా...? లేదా... అనే అంశంపై తనిఖీలు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాతో నిఘా, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ల అధికారులతో ఆమె పరీక్షా కేంద్రాల వద్ద చర్చించి వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పరీక్షల నిర్వహణలో ఇంటర్ విద్య, పాఠశాల విద్య, రెవెన్యూ, పోలీస్, ప్రజా రవాణా, వైద్య ఆరోగ్య, విద్యుత్, పోస్టల్ తదితర శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసే విధానంపై కూడా డీఆర్వో చర్చించారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల విజయం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉభయగోదావరి జిల్లాల్లో పట్టభద్రుల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల బరిలో కూటమి అభ్యర్థి, పీడీఎఫ్ అభ్యర్థి మధ్య ప్రధాన పోటీ జరగ్గా.. మరో 33 మంది స్వతంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కూటమి పార్టీ బలపరిచిన టీడీపీ నేత పేరాబత్తుల రాజశేఖరం ఎమ్మెల్సీగా గెలుపొందారు. 1,24,702 ఓట్లు సాధించి సమీప ప్రత్యర్థి, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులపై 77,461 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. మొదట ప్రాధాన్యత ఓటులోనే 50 శాతం పైచిలుకు సాధించడంతో విజేతగా ప్రకటించారు. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లను కట్టలు కట్టడానికే సమయం సరిపోయింది. రాత్రి 10 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ముగించారు. ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాలులో 28 టేబుల్స్ ఏర్పాటు చేసి 17 రౌండ్లు నిర్వహించేలా కట్టలు కట్టారు. అనంతరం ప్రతి టేబుల్‌కు వెయ్యి చొప్పున సగటున ప్రతి రౌండ్లో 28 వేల ఓట్లను లెక్కించి 8 రౌండ్లల్లో ఎన్నికల ప్రక్రియను ముగించేశారు. మొత్తం 2,18,997 ఓట్లు పోల్ కాగా వాటిలో 19,789 ఓట్లు చెల్లనవిగా నిర్ధారించారు. మిగిలిన 1,99,208 ఓట్లను మిగిలిన 8 రౌండ్లల్లో లెక్కించారు. ఎన్నికల బరిలో టీడీపీ అభ్యర్థి, పీడీఎఫ్ అభ్యర్థితో పాటు 35 మంది పోటీ చేశారు. వీరిలో స్వతంత్ర అభ్యర్ధి, మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవీ సుందర్ మాత్రమే సత్తా చాటారు. 30 గంటల పాటు కౌంటింగ్ ప్రక్రియ గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 30 గంటల పాటు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. ప్రతి రౌండ్లోనూ కూటమి అభ్యర్థి ఆధిక్యం కొనసాగింది. పీడీఎఫ్ అభ్యర్ధి మొదటి రౌండ్ నుంచి వెనుకంజలో ఉన్నారు. మొదటి రౌండ్లో 28 వేల ఓట్లు లెక్కించగా టీడీపీ అభ్యర్ధికి 16,520, పీడీఎఫ్ అభ్యర్ధి 5,815 ఓట్లు దక్కాయి. 8 రౌండ్లు కలిపి టీడీపీ అభ్యర్థికి 1,24,702 మొదటి ప్రాధాన్యత ఓట్లు రాగా.. పీడీఎఫ్ అభ్యర్థి 47,241 ఓట్లు దక్కించుకున్నారు. సత్తా చాటిన జీవీ సుందర్ మాజీ ఎంపీ జీ.హర్షకుమార్ తనయుడు జీవీ సుందర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మెరుగ్గా ఓట్లు సాధించారు. 8 రౌండ్లు కలుపుకుని 16,183 ఓట్లు దక్కించుకున్నారు. స్వతంత్రులుగా పోటీ చేసిన వారిలో కాట్రు నాగబాబు 565, షేక్ హుస్సేన్ 394, కట్టా వేణుగోపాలకృష్ణ 1017, కాండ్రేగుల నర్సింహం 364, కుక్కల గోవిందరాజు 269, కునుకు హేమకుమారి 956, కై లా లావణ్య 365, కొల్లు గౌతమ్ బాబు 317, చిక్కాల దుర్గారావు 665, నోరి దత్తాత్రేయ 565, యళ్ళ దొరబాబు 303, పిప్పళ్ళ సుప్రజ 479, బొమ్మడి సన్నిరాజ్ 398, బండారు రామ్మోహనరావు 709, చిక్కా భీమేశ్వరరావు 254, వానపల్లి శివ గణేష్ 772, హాసేన్ షరీఫ్ 709 ఓట్లు దక్కించుకున్నారు. గెలుపొందిన టీడీపీ అభ్యర్థికి రిటర్నింగ్ అధికారి వెట్రిసెల్వి డిక్లరేషన్ అందించారు. 77,461 ఓట్ల మెజార్టీతో గెలుపు పీడీఎఫ్ అభ్యర్ధికి 47,241 ఓట్లు 8 రౌండ్లలో ముగిసిన ఓట్ల లెక్కింపు -
అమ్మాయిలే మిన్నగా..
జెడ్పీ విద్యార్థులే ఎక్కువ ప్రభుత్వ యాజమాన్యాల వారీగా చూస్తే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులే పది పరీక్షలకు అధికంగా హాజరవుతున్నారు. జెడ్పీ యాజమాన్యం నుంచి అత్యధికంగా 9,204 మంది విద్యార్థులు హాజరవుతుండగా, ఆ తర్వాత ప్రైవేట్ యాజమాన్యం నుంచి 5,867 మంది హాజరవుతున్నారు. మున్సిపల్ యాజమాన్యం నుంచి 708, ప్రభుత్వ పాఠశాలల నుంచి 388, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి 28, ఏపీ సోషల్ వేల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి 150, ఎయిడెడ్ పాఠశాలల నుంచి 74 మంది హాజరు కానున్నారు. ఈ ఏడాది రెగ్యులర్ పాఠశాలల్లో ఒకేషనల్ కోర్సులు చదువుతున్న జెడ్పీ విద్యార్థులు 2,097, ప్రభుత్వ పాఠశాలల నుంచి 76, బీసీ సోషల్ వెల్ఫేర్ పాఠశాలల నుంచి 68, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి 277 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాయవరం: ఇప్పటికే ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం కాగా, ఈ నెల 17 నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 110 పరీక్షా కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఈ పరీక్షా కేంద్రాల్లో 19,217 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షకు హాజరవుతున్న విద్యార్థుల్లో ఈసారి కూడా బాలికల సంఖ్య అధికంగా ఉండడం విశేషం. ప్రభుత్వ పాఠశాలల్లోనే పరీక్షా కేంద్రాలు మాస్ కాపీయింగ్‌ను నిరోధించే చర్యల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ భావించింది. ఈ ఏడాది ప్రైవేటు పరీక్ష కేంద్రాలు చాలా వరకు తగ్గించారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ పరీక్షల విభాగం ముఖ్య ఉద్దేశంగా కన్పిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు, మున్సిపల్ పాఠశాలల్లో నాలుగు, జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 84, సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో రెండు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మూడు, ఎయిడెడ్ కళాశాలలో ఒకటి, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రత్యామ్నాయం లేకపోవడంతో 10 ప్రైవేటు విద్యాసంస్థల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. బాలికలే అధికం పదవ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థుల్లో బాలికల సంఖ్యే ఎక్కువగా ఉంది. జిల్లావ్యాప్తంగా 19,217 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా, వీరిలో 18,937 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 206 మంది ప్రైవేటుగా పరీక్షలకు హాజరవుతున్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 9,452 మంది బాలురు, 9,485 మంది బాలికలు పరీక్షలు రాయనున్నారు. ప్రైవేట్ విద్యార్థులు 206 మంది, ఓఎస్ఎస్సీ రెగ్యులర్ విద్యార్థులు 73, ఓఎస్ఎస్సీ ప్రైవేట్ ఒకరు పరీక్ష రాస్తున్నారు. గతేడాది పరీక్షలకు 18,787 మంది విద్యార్థులు హాజరు కాగా, ఈ ఏడాది 430 మంది విద్యార్థులు అధికం. 11,12 తేదీల్లో పరీక్ష పేపర్ల సరఫరా పది పరీక్ష పేపర్ల బండిల్స్ ఈ నెల 11, 12 తేదీల్లో మొదటి విడత, 14,15 తేదీల్లో రెండవ విడత జిల్లా కేంద్రానికి చేరుకుంటాయి. వచ్చిన పేపర్లు పరీక్షా కేంద్రాల పరిధిలోని పోలీస్స్టేషన్లకు చేరుకోనున్నాయి. మొదటి విడతలో తెలుగు, హిందీ, ఇంగ్లిషు పేపర్లు వస్తాయి. రెండవ విడతలో నాన్ లాంగ్వేజ్ (గణితం, సైన్సు, సోషల్) పేపర్లు వస్తాయి. క్విక్ బాక్స్‌లో విజేతలను అభినందిస్తున్న కలెక్టర్ పది పరీక్షల్లో బాలికల సంఖ్య అధికం మేనేజ్మెంట్ల వారీగా జెడ్పీ విద్యార్థులదే సింహ భాగం ఈ నెల 11,12 తేదీల్లో మొదటి విడత పేపర్ల సరఫరా ఈ నెల 17 నుంచి పరీక్షలు ప్రారంభం జిల్లాలో పది పరీక్షలు రాసే విద్యార్థులు 19,217 అమలాపురం రూరల్: రామచంద్రపురానికి చెందిన కారుమూరి బాల బాలాజీ దేవి ప్రియ కుమార్తె లేఖ నిహారిక ఏడో తరగతి చదువుతూ ఢిల్లీలో నిర్వహించిన ఇంటర్నేషనల్ క్విక్ బాక్స్ పోటీలలో రెండు గోల్డ్ మెడల్స్ ,ఒక సిల్వర్ మెడల్ సాధించడం అభినందనీయమని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో వరల్డ్ కప్ కు ఎంపికై న లేఖ నిహారికను మెడల్స్ అందించి అభినందించారు. ద్రాక్షారామంకు చెందిన అల్లం రాజేష్ కుమారుడు ప్రియదర్శిని కార్తీక్ ఆరో తరగతి చదువుతూ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ఇంటర్నేషనల్ కిక్ బాక్స్ పోటీలలో ఒక సిల్వర్, గోల్డ్ మెడల్ పతకాలు సాధించడం సంతోషకరమని అన్నారు. ఇద్దరికి కలెక్టర్ చేతుల మీదుగా మెడల్స్‌ను బహూకరించారు. కోచ్ బీకే. రత్నం, తల్లిదండ్రులు రాజేష్, బాల బాలాజీ దేవి ప్రియ పాల్గొన్నారు. లోటుపాట్లకు తావు లేకుండా.. పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా చూడాలని ఆదేశాలు ఇస్తున్నాం. పరీక్షలను ప్రశాంతం వాతావరణంలో నిర్వహించాలని సూచిస్తున్నాం. ముఖ్యంగా మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు కింది స్థాయికి ఇస్తున్నాం. – డాక్టర్ షేక్ సలీం బాషా, జిల్లా విద్యాశాఖాధికారి, అమలాపురం -
టైప్ రైటింగ్‌లో రాష్ట్ర ప్రథమ ర్యాంకు
యానాం: ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ నిర్వహించిన టైప్‌రైటింగ్ (ఇంగ్లిషు లోయర్)లో యానాం కొత్తపేటకు చెందిన యువతి మహదేవ నవ్యలక్ష్మి రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. ఇటీవలి నిర్వహించిన పరీక్షకు ఆమె స్ధానిక రామలింగేశ్వర టైప్ ఇనిస్టిట్యూట్ నుంచి హాజరయిందని, ప్రథమ, ద్వితీయ పేపర్లకు 98 మార్కులు చొప్పున వచ్చాయని ప్రిన్సిపాల్ నాలం రుద్రరాజు తెలిపారు. ఏపీ టైప్‌రైటింగ్ అండ్ షార్ట్‌హ్యాండ్ ఇనిస్టిట్యూట్స్ అసోషియేషన్ అధ్యక్షుడు ఇ.శ్రీరాములు, ఏజీకే మూర్తి మెమెంటో, సర్టిఫికెట్‌ను మంగళవారం నవ్యలక్ష్మికి అందజేశారు. ఆమెను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అభినందించారు. ఆన్లైన్లో ‘పది’ పరీక్షల హాల్ టికెట్లు రాయవరం: పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు హాల్ టికెట్లు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందజేసే పనిలో ఉన్నారు. విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలంటే 95523 00009 నంబరుకు హాయ్ అని టైప్ చేసి వివరాలు నమోదు చేస్తే వాట్సాప్ ద్వారా హాల్ టికెట్ పొందే అవకాశాన్ని ప్రభుత్వ పరీక్షల విభాగం కల్పించింది. మన మిత్ర యాప్ ద్వారా నేరుగా హాల్ టికెట్ పొందే అవకాశముంది. హాల్ టికెట్లో తప్పులు ఉంటే సంబంధిత ప్రధానోపాధ్యాయుల సంతకంతో మెయిల్ చేసి పరిష్కరించుకునే వీలుంది. ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న పది పబ్లిక్ పరీక్షలకు జిల్లా నుంచి 19,217 మంది పరీక్షలు రాయనున్నారు. వేసవిలో విద్యుత్ సమస్యలపై దృష్టి ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ అమలాపురం రూరల్: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వేసవిలో విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, కోనసీమకు 6 పవర్ ట్రాన్స్ఫార్మర్లు కేటాయిస్తామని ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ తెలిపారు. అమలాపురం మండలం భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లాలోని విద్యుత్ శాఖ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వేసవిలో ఎక్కడా లోఓల్టేజీ సమస్య లేకుండా చూడాలని, ట్రాన్స్ఫార్మర్ల ఓవర్ లోడ్‌ను గుర్తించి అందుకు తగిన యాక్షన్ ప్లాన్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. వేసవిలో విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ బిల్లుల బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ప్యానల్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని, వినియోగదారులకు చౌకగా సోలార్ విద్యుత్ అందించే విధానంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. సర్కిల్ కార్యాలయం ఏర్పాటుకు నల్లవంతెన వద్ద అనువైన భవనాలను పరిశీలించారు. తొలుత ఈదరపల్లిలోని విద్యుత్ కార్యాలయం వద్ద లైన్మెన్ దివస్ కార్యక్రమంలో లైన్మన్లను సత్కరించారు. సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్.రాజబాబు, టెక్నికల్ డీఈ ఎస్.నాగేశ్వరరావు, ఈఈలు కె.రాంబాబు, కె.రత్నాలరాజు, అక్కౌంట్ ఆఫీసర్ సత్యకిషోర్, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. సీతారామపురంలో శిలాఫలకం ధ్వంసం తాళ్లరేవు: కోరంగి పంచాయతీ సీతారామపురంలో ఒక అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. స్థానిక చినబొడ్డువెంకటాయపాలెం గ్రామ రహదారి నుంచి కాలభైరవస్వామి ఆలయానికి వెళ్లేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సుమారు రూ.20 లక్షలు వెచ్చించి సీసీ రహదారిని నిర్మించారు. దీనికి సంబంధించిన శిలఫలాకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి ధ్వంసం చేశారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు కాదా గోవిందకుమార్, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లాడి శ్రీను కోరంగి ఎస్సై పి.సత్యనారాయణకు తెలియజేశారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాను పరిశీలిస్తే బాధ్యులను గుర్తించవచ్చని ఎస్సైకి సూచించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులను కఠినంగా శిక్షించాలని గోవిందకుమార్ కోరారు. గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో ధ్వంసమైన శిలాఫలకం -
ఇసుక.. మరింత కొరత
సాక్షి, అమలాపురం/రావులపాలెం: ఇసుక ర్యాంపులోనే కాకుండా గోదావరి నదీపాయల పొడవునా అక్రమ ఇసుక తవ్వకాలు సాగుతున్నా... జిల్లాలో కృత్రిమ ఇసుక కొరత పట్టి పీడిస్తూనే ఉంది. ఇసుక అందుబాటులో లేదని... అడ్డుగోలుగా దోచుకుంటున్న సమయంలో జిల్లా ప్రధాన ఇసుక ర్యాంపులు మంగళవారం నుంచి మూతపడుతున్నాయి. ఇదే అదనుగా కొతర పేరుతో ఇసుక అక్రమార్కులు మరింత దోపిడీకి సిద్ధమవుతున్నారు. కోనసీమ జిల్లాలో మొత్తం 15 ఇసుక ర్యాంపులున్నాయి. ఇదే సమయంలో అనధికార ర్యాంపులున్నాయి. కొత్తపేట, మండపేట నియోజకవర్గాలలో మాత్రమే ప్రభుత్వం ఇచ్చిన ర్యాంపులున్నాయి. వీటిలో తొలుత 13 ర్యాంపులకు వేలం నిర్వహించారు. వీటిలో ఏడు ర్యాంపులకు మంగళవారంతో గడువు ముగిసింది. మిగిలిన ఆరు ర్యాంపులకు ఈ నెల 14వ తేదీతో గడువు ముగియనుంది. మిగిలిన రెండు ర్యాంపులు అయిన ఒకటి అంకంపాలెం, పొడగట్లపల్లి–3కు నవంబర్ 20వ తేదీ వరకు అనుమతి ఉంది. మొత్తం ఏడు ర్యాంపులకు సంబంధించి మార్చి 4వ తేదీ సాయంత్రానికి 3,87,450 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతి మంజూరు చేసింది. మైన్స్ అధికారుల లెక్కల ప్రకారం 1,73,863 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు చేశారు. ఇంకా 2,13,587 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు చేయాల్సి ఉందని చెబుతున్నారు. అనుమతి మేరకు మిగిలిన పరిణామం ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు జిల్లా మైన్స్ ఏడీ వంశీధర్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అక్కడ నుంచి అనుమతి రావాల్సి ఉందన్నారు. ఈ ఏడు ర్యాంపుల వద్ద ఉన్న స్టాక్ పాయింట్లలో సుమారు 1,07,976 మెట్రిక్ టన్నుల ఇసుక అమ్మకాలకు సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. తొలుత టెండర్లు నిర్వహించిన సమయంలో అతి తక్కువకు బిడ్ వేసి వద్దిపర్రు–1, పొడగట్లపల్లి–2, వద్దిపర్రు–2 మూడు ర్యాంపులను దక్కించుకున్న సాన్వీ, మిట్టల్, కోస్టల్ కాంట్రాక్ట్ కంపెనీలను కలెక్టర్ నేతృత్వంలోని జిల్లాస్థాయి సాండ్ కమిటీ అనర్హులుగా ప్రకటించింది. రెండో స్థానంలో ఆర్ఎస్ఆర్ (కొత్తపేట నియోజకవర్గానికి చెందిన ఒక కీలక ప్రజాప్రతినిధి స్నేహితుని కంపెనీ)కి ఈ మూడు ర్యాంపులను కట్టబెట్టారు. ఇందుకు జిల్లా సాండ్ కమిటీ చెప్పిన కారణం... తక్కువకు టెండరు వేసిన వారు పూర్తిస్థాయిలో ఇసుక తవ్వకాలు చేయలేరని. కాని వాస్తవంగా ఇప్పుడు టెండరు దక్కించుకున్న ఏడు ర్యాంపులలో సహితం పూర్తి స్థాయిలో ఇసుక తవ్వకాలు జరగలేదు. వాస్తవంగా ఆయా ర్యాంపుల నుంచి అధికంగా ఇసుక తవ్వకాలు జరిగింది పులిదిండి, పొడగట్లపల్లి–1, నార్కెడ్మిల్లిలో మాత్రమే. మిగిలిచోట్ల పెద్దగా ఇసుక తవ్వకాలు చేయలేదు. మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఆర్ అడ్డదారిలో దక్కించుకున్న వద్దిపర్రు ర్యాంపు–2లో అసలు తవ్వకాలు చేయకపోవడం గమనార్హం. కాగా వద్దిపర్రు –1లో ఇంకా 48,168 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు చేయాల్సిందిగా చూపుతున్నారు. పొడగట్లపల్లి–2లో ఇంకా 50,280 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు చేయాల్సిందిగా చూపుతున్నారు. అయితే ఇచ్చిన గడువులో తవ్వకాలు చేయలేదు. ఈ కంపెనీలపై కలెక్టర్ అనర్హత వేటు వేయాల్సి ఉంది. కాని మైనింగ్, జిల్లా సాండ్ కమిటీ రాజకీయ ఒత్తిడిలకు తలోగ్గి మళ్లీ వారికే మిగిలిన పరిమాణం తవ్వడానికి అనుమతులు ఇవ్వాల్సిందిగా కోరడం గమనార్హం. ఆత్రేయపురం మండలం వద్దిపర్రులో ఇసుక తవ్వకాలు (ఫైల్)బ్లాక్ చేసి అమ్మకాలు జిల్లాలో 15 ఇసుక ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. మరోవైపు అనధికార ఇసుక ర్యాంపుల్లో పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అయిన ఇసుక దొరకడం లేదని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా టన్నుకు అదనంగా సాండ్ కమిటీ రూ.500 చొప్పున వసూలు చేస్తోంది. ఇప్పుడు సగం ర్యాంపులు నిలిచిపోతే ఈ వంకన ఇసుక ధర మరింత పెంచి అమ్మకాలు చేస్తారని వినియోగదారులు వాపోతున్నారు. నేటి నుంచి జిల్లాలో 7 ర్యాంపుల మూత 7.98 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతి స్టాక్ యార్డులలో 1.49 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ర్యాంపులు మూతపడితే కొరత వస్తుందని వినియోగదారుల ఆందోళన (మెట్రిక్ టన్నులలో) ర్యాంపు పేరు తవ్వకాలకు ఇప్పటి వరకు ఇంకా తవ్వకాలు అనుమతి తవ్వింది చేయాల్సిన ఇసుక పులిదిండి 33,750 31,755 1,995 వద్దిపర్రు 63,300 15,132 48,168 పొడగట్లపల్లి 54,900 51,186 3,084 అంకంపాలెం 72,750 36,200 36,550 నార్కెడుమిల్లి 31,500 29,240 2,260 పొడగట్లపల్లి–2 60,000 9,720 50,280 వద్దిపర్రు 71,250 0 71,250 మొత్తం 3,87,450 1,73,863 2,13,587 -
తండ్రి మందలించాడని ఆత్మహత్యాయత్నం
అమలాపురం టౌన్: ఉప్పలగుప్తానికి చెందిన బి.ఫార్మసీ చదువుతున్న విద్యార్థిని అమలాపురంలో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్యహత్యాయత్నం చేసిన ఘటన పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది, స్థానికులకు ముచ్చెమటలు పట్టించింది. అమలాపురం గాంధీనగర్ శివారులో నిర్మాణం పూర్తయి ఇంకా ప్రారంభం కాని దాదాపు 60 అడుగుల ఎత్తు ఉన్న వాటర్ ట్యాంక్‌పై ఆ యువతి ప్రమాదకర పరిస్థితుల్లో నిలబడి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ యువతి భీమవరం విష్ణు కళాశాలలో బి.ఫార్మసి చివరి సంవత్సరం చదువుతోంది. 15 రోజులకోసారి ఇంటికి రావడం, చదువుపై అంతగా దృష్టి పెట్టకపోవడంపై తల్లిదండ్రులు ఆమెను తరుచూ మందలిస్తున్నారు. భీమవరం నుంచి ఇంటికి వచ్చిన విద్యార్థిని వైఖరిపై తండ్రి సోమవారం అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం విద్యార్థిని తన ల్యాప్ ట్యాప్‌లో సినిమా చూస్తోంది. ఇది గమనించిన ఆమె తండ్రి మందలించి పొలం వెళ్లిపోయాడు. తండ్రి మందలింపులతో మనస్తాపం చెందిన ఆ విద్యార్థిని తన బ్యాగ్ తీసుకుని ఉప్పలగుప్తం నుంచి అమలాపురం వెంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో గల తమ బంధువుల ఇంటికి చేరుకుంది. ఆ బ్యాగ్‌ను బంధువుల ఇంట్లో పడేసి విద్యార్థిని నేరుగా వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లి ట్యాంక్ ఎక్కేసింది. యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంటోందని గమనించిన స్థానికులు తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో ఆ ట్యాంక్ వద్దకు స్థానికులు చేరకున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి వచ్చారు. పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది తాళ్లు, వలలు కూడా సిద్ధం చేశారు. ఆమెను ట్యాంక్ నుంచి దూకితే రక్షించేందుకు సన్నాహాలు కూడా చేశారు. విద్యార్థినిని ట్యాంక్ దిగాలని అటు స్థానికులు, ఇటు పోలీసులు పదే పదే చెప్పారు. ఇలా గంటకు పైగా సమయం గడిచిపోయింది. ఎట్టకేలకు ట్యాంక్ నుంచి విద్యార్థిని ఏడుస్తూ కిందకు దిగడంతో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పట్టణ సీఐ పి.వీరబాబు, పట్టణ ఎస్సైలు, అగ్నిమాపక సిబ్బంది విద్యార్థిని ట్యాంక్ నుంచి దింపడంతో సఫలీకృతులయ్యారు. విద్యార్థినికి కౌన్సెలింగ్ నిర్వహించి ఆమె తల్లికి అప్పగించడంతో కథ సుఖాంతమైంది. వాటర్ ట్యాంక్ ఎక్కిన బి.ఫార్మసీ విద్యార్థిని గంటన్నర సేపు పోలీసులు, స్థానికుల్లో ఉత్కంఠ ఎట్టకేలకు విద్యార్థిని ట్యాంక్ దిగడంతో కథ సుఖాంతం -
భయం గుప్పెట్లో వేట్లపాలెం ప్రజలు
సామర్లకోట: వేట్లపాలెంలో గత ఏడాది డిసెంబరు 15న రెండు (కల్దారి, బత్సల) కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు వ్యక్తు లు హత్యకు గురి కావడంతో 23 మంది నిందితులను గుర్తించి కేసు నమోదు చేసిన విషయం విదితమే. 23 మందిని కోర్టుకు హాజరు పర్చగా జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. వీరిలో 20 మంది బెయిల్‌పై సోమవారం సాయంత్రం విడుదల కావడంతో మంగాయమ్మ కాలనీ వాసులు భయం గుప్పెట్లో జీవిస్తున్నారు. కత్తులతో దాడి చేయడంతో కాల్దారి చంద్రరావు(60, కాల్దారి ప్రకాశరావు(55) కల్దారి ఏసు (45) చనిపోయిన విషయం తెలిసిందే. హత్య జరిగినప్పటి నుంచి మంగాయ్మమ్మ కాలనీలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు తక్కువగా ఉండటంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు. పోలీసులను పెంచి పికెట్ కొనసాగించి గ్రామంలో ప్రశాంత వాతావరణం ఏర్పడే విధంగా కృషి చేయాలని వేట్లపాలెం గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఆ ప్రాంతంలో ఎప్పటికప్పుడు నిఘా ఉండే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరావు ఆధ్వర్యంలో సీఐ ఎ.కృష్ణభగవాన్ ప్రత్యేక నిఽఘా ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలు శాంతంగా ఉండాలని సీఐ రెండు వర్గాలకు సూచించారు. హత్య కేసులో 20 మంది నిందితులు విడుదల పోలీసు పికెట్ కొనసాగించాలని డిమాండ్ -
బోటు రైడర్, హెల్పర్‌పై హత్యాయత్నం కేసు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): బోటులో అనధికారికంగా తీసుకువెళ్లి మళ్లీ సోమవారం రాత్రి తిరిగి వస్తుండగా బోటు తిరగబడి ఇద్దరు మృతిచెందిన ఘటనపై త్రీటౌన్ పోలీసులు సుబ్బారావుపేటకు చెందిన బెజవాడ సత్తిబాబు ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం సుబ్బారావుపేటకు చెందిన బెజవాడసత్తిబాబు, సింహాచలనగర్‌కు చెందిన చవల అన్నవరం(54), కాతేరు మిలటరీకాలనీకి చెందిన గాడారాజు(24), కోట రాంబాబు, భవానీపురానికి చెందిన మరికొందరుతో కలిసి కోటిలింగాలరేవు నుంచి సోమవారం మధ్యాహ్నం బోటులో బ్రిడ్జిలంక బయలుదేరారు. బోటులో వెళ్తుండగా లోపలికి నీరు వస్తుండడంతో సత్తిబాబు, మరికొందరు కేకలు వేశారు. బోటు రైడర్ మల్లయ్యపేటకు చెందిన మల్లాది సుబ్రహ్మణ్యం, బోటుషికారు కోసం రూ.100 వసూలు చేసిన ఇసుకపల్లి ధనరాజు ఏమీ జరగదని, బోటులో నీటిని తోడేస్తే ఏమీ కాదని భరోసా ఇచ్చారు. చివరకు బ్రిడ్జిలంకకు చేరుకున్నారు. తిరిగి రాత్రి 7.30 గంటల సమయంలో బోటురైడర్, హెల్పర్, మరో పదిమంది బోటులో పుష్కరఘాట్‌కు బయలుదేరారు. బోటు రైల్వే బ్రిడ్జి 7 – 8 పిల్లర్ల మధ్యలోకి రాగానే ఒక్కసారిగా బోటులోకి నీరు చేరింది. దీంతో బోటు గోదావరి నదిలో కూరుకుపోయింది. ఇంతలో చవల అన్నవరం, గాడా రాజులకు ఈత రాకపోవడంతో గోదావరి నదిలో గల్లంతయ్యారు. కానీ, బెజవాడ సత్తిబాబు ఆ స్థలం నుంచి ఈత కొట్టి సమీపంలోని పాత హావ్ లాక్ బ్రిడ్జి పిల్లర్లను పట్టుకున్నారు. వారి కేకలు విన్న సమీపంలోని మత్స్యకారులు వారిని సురక్షితంగా పుష్కరఘాట్‌కు తరలించారు. బెజవాడ సత్తిబాబు, ఇతరులు వారికి తెలిసినవారికి సమాచారం ఇవ్వడంతో పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ అధికారులు పుష్కరాలరేవుకు చేరుకుని గోదావరిలో పడవలతో గాలించగా చవల అన్నవరం, గాడా రాజు మృతదేహాలు లభ్యమయ్యాయి. గోదావరి నదిలో బోటు నడిపిన బోటు రైడర్‌తో కలిసి ప్రయాణం కోసం డబ్బులు వసూలు చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని, ఎలాంటి అనుమతులు లేకుండా పడవలో గోదావరిలో అమాయకులను తరలించిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని బెజవాడ సత్తిబాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బస్సులో సూట్ కేసు చోరీ
తస్కరించిన మహిళ నుంచి 117 గ్రాముల బంగారు నగల రికవరీ అమలాపురం టౌన్: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న దంపతులకు చెందిన బంగారు నగలతో ఉన్న సూట్ కేసును వారితో ప్రయాణించిన ఓ మహిళ కాజేసిన కేసును అమలాపురం పట్టణ పోలీసులు ఛేదించారు. దాదాపు రూ.6 లక్షల విలువైన 117 గ్రాముల బంగారు నగలను ఆ మహిళ నుంచి రికవరీ చేయడంతోపాటు ఆమెను మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. ఈ కేసు వివరాలను ఆయన వివరించారు. గత నెల 17వ తేదీన విశాఖపట్నం జిల్లా కూర్మన్నపాలేనికి చెందిన దుర్గమ రామకృష్ణ దంపతులు కాకినాడ ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో అమలాపురం నాన్ స్టాప్ బస్సు ఎక్కారు. బస్సులో రామకృష్ణ భార్య పక్కనే ఓ మహిళ కూర్చుంది. బస్సులో కాళ్ల దగ్గర బంగారు నగలతో ఉన్న సూట్ కేసును ఆ దంపతులు పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఆ మహిళ ముమ్మిడివరంలో దిగిపోయింది. రామకృష్ణ దంపతులు అమలాపురంలోని తమ బంధువులు ఇంటికి వెళ్లిన తర్వాత బస్సులో సూట్ కేసు పోయినట్లు గుర్తించారు. ఆ సూట్ కేసులో ఒక బంగారు తెల్ల రాళ్ల నక్లెస్, ఎరుపు ఆకుపచ్చ రాళ్ల బంగారు నక్లస్, బంగారపు ఆకు పచ్చ రాళ్ల నక్లెస్, రెండు బంగారపు లాకెట్లు మొత్తం 117 గ్రాముల బంగారు నగలు ఉన్నట్లు అదే రోజు పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రామకృష్ణ పేర్కొన్నారు. బస్సులో తన భార్య చెంతన కూర్చున్న మహిళపైనే తమకు అనుమానం ఉందని ఆ ఫిర్యాదులో రాశారు. ఈ కేసును డీఎస్సీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో సీఐ వీరబాబు, క్రైమ్ ఎం.గజేంద్రకుమార్ పర్యవేక్షణలో పట్టణ ఎస్సై ఎస్ఆర్ కిషోర్‌బాబు, క్రైమ్ సిబ్బంది లోతుగా దర్యాప్తు చేశారు. ఆ రోజు బస్సులో బంగారు నగలతో ఉన్న సూట్ కేసును గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం ఎర్ర చెరువు గ్రామానికి చెందిన ఆవుల యశోద దొంగిలించినట్లు తమ దర్యాప్తులో పోలీసులు గర్తించారు. అమలాపురం ఆర్టీసీ బస్సు స్టేషన్లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న యశోదను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి 117 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. దొంగను రెండు వారాల్లో అరెస్ట్ చేయడమే కాకుండా నూరు శాతం సొత్తును రికవరీ చేసిన సీఐలు వీరబాబు, గజేంద్రకుమార్, ఎస్సై కిషోర్‌బాబు, క్రైమ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ చోరీలో మహిళా దొంగ యశోదకు సహకరించిన మరో నిందితురాలిని అరెస్ట్ చేయాల్సి ఉందని సీఐ వీరబాబు తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
అగ్ని ప్రమాదానికి పశువుల శాల ఆహుతి
● కాలిపోయిన 4 గేదెలు, రెండు ఆవులు, నాలుగు దూడలు ● రూ.ఐదు లక్షల నష్టం సామర్లకోట: మండల పరిధిలో వీకే రాయపురంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు గేదెలు, రెండు ఆవులు, నాలుగు దూడలు పూర్తిగా కాలిపోయాయి. వీటిలో రూ.1.50 లక్షల విలువ కలిగిన గేదె అక్కడికక్కడే మృతి చెందింది. రైతులు, బాధితుల కథనం ప్రకారం వీకే రాయపురం సమీపంలోని మామిళ్లదొడ్డిలోని పశువుల పాకపై విద్యుత్తు వైరు తెగి పడిపోవడంతో మంటలు చెలరేగి పశువుల పాక పూర్తిగా కాలి బూడిద అయింది. ఆ పాకలో ఉన్న పశువులు పూర్తిగా కాలిపోయాయి. మూగజీవాల ఆర్తనాదాలకు సమీపంలో ఉన్న రైతులు పశువుల పాక వద్దకు చేరుకొని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేసి పశువుల యజమాని రంగనాథం వీరభద్రరావుకు సమాచారం ఇచ్చారు. మంగళవారం ఉదయం పశువైద్యాధికారి మాకినీడి సౌమ్య ఘటనా ప్రదేశానికి చేరుకొని కాలిపోయిన పశువులను పరిశీలించారు. కాలిపోయిన పశువులు జీవించే అవకాశం లేదన్నారు. సుమారు రూ.5 లక్షల వరకు నష్టం ఉంటుందని చెప్పారు. కాలిపొయిన పశువుల ఆర్తనాదాలు రైతుల హృదయాలను కదిలించి వేశాయి. పశువుల పరిస్థితిని చూచి వైఎస్సార్ సీపీ మండల పార్టీ అధ్యక్షుడు తలారి దొరబాబు, రైతు సంఘ నాయకుడు ఇంటి వెంకట్రావులు కంటతడి పెట్టుకున్నారు. వైద్యం అందించినా పశువులు జీవించే అవకాశం లేదని వైద్యాధికారి సౌమ్య తెలిపారు. రెండు పశువులకు మాత్రమే బీమా ఉన్నదని ఆమె చెప్పారు. పశువులకు జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన రిపోర్టును ఉన్నతాధికారులకు పంపుతానని చెప్పారు. వీఆర్వో రైతుల నుంచి సమాచారం సేకరించి తహసీల్దార్‌ను నివేదిక సమర్పించారు. స్విమ్మింగ్ పూల్‌లో తప్పిన ప్రమాదం నీట మునిగి సీపీఆర్‌తో బతికిన స్విమ్మర్ నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడామైదానంలోని స్విమ్మింగ్ పూల్‌లో ప్రమాదవశాత్తూ మునిగిపోయి ఓ వ్యక్తి స్పృహ కోల్పోగా స్విమ్మింగ్ పూల్ సిబ్బంది సకాలంలో స్పందించడంలో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే జిల్లా క్రీడామైదానంలోని స్విమ్మింగ్ పూల్‌లో ఉదయం 8 నుంచి 9 గంటల బ్యాచ్‌లో శంఖవరం గ్రామానికి చెందిన ప్రదీప్‌కుమార్ నెల రోజుల నుంచి కాకినాడ స్విమ్మింగ్ చేస్తున్నాడు. రోజులాగే మంగళవారం కూడా స్విమ్మింగ్ పూల్‌కు వచ్చిన ఆయన ఈత కొడుతున్న సమయంలో ముక్కులోకి నీరు వెళ్లి ఊపిరి ఆడక అస్మారక ిస్థితిలోకి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న స్విమ్మింగ్ కోచ్ అప్పలనాయుడు, సీనియర్ స్విమ్మర్లు దానిని గమనించి ప్రదీప్‌కుమార్‌ను కొలనులోనుంచి బయటకు తీసి సీపీఆర్ చేసి అంబులెన్సులో దగ్గర ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి ప్రదీప్‌కు ఆస్తమా ఉన్న కారణంగా ఊపిరి సమ్యస్య వచ్చిందని తెలిపి చికిత్సను ప్రారంభించారు. స్విమ్మింగ్ పూల్ వద్ద లైఫ్‌గార్డుల స్థానంలో సీనియర్ స్విమ్మర్లను డీఎస్ఏ అధికారులు కొనసాగిస్తున్నారు. లైఫ్‌గార్డుల నియామకానికి శాప్‌కు లేఖ రాసినా ఇంతవరకు అనుమతి రాకపోవడంతో సీనియర్లను కొనసాగించాల్సి వస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. డీఎస్డీఓ శ్రీనివాస్‌కుమార్‌ను వివరణ కోరగా త్వరలోనే లైఫ్‌గార్డులను నియమిస్తామని తెలిపారు. క్షతగాత్రులకు కొనసాగుతున్న చికిత్స కాకినాడ క్రైం: కాకినాడలోని జై బాలాజీ ట్రాన్స్‌పోర్ట్‌లో సోమవారం చోటు చేసుకున్న బాణసంచా పేలుడు ఘటనలో క్షతగాత్రులకు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స కొనసాగుతోంది. కాకినాడ వన్‌టౌన్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేయగా విచారణ కొనసాగుతోంది. మంగళగిరి నుంచి వచ్చిన ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ బృందం పేలుడు జరిగిన ప్రదేశంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టింది. పలు నమూనాలు సేకరించింది. -
ఆశాభంగం
నాటి వైఎస్సార్ సీపీ సర్కారులో స్వర్ణయుగం 2019–24 మధ్య కాలంలో పాలించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంది. చాలీచాలని వేతనాలతో దుర్భర జీవితం అనుభవించిన ఆశా కార్యకర్తలకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు చేసిన పాదయాత్రలో ఆశా కార్యకర్తల దుస్థితిని గుర్తించారు. అందుకనుగుణంగా వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టిన వెంటనే అప్పటి వరకూ రూ.మూడు వేలు ఉన్న వేతనాన్ని ఒక్కసారిగా 2019 ఆగస్టు 12న రూ.పది వేలకు పెంచారు. ఆశా కార్యకర్తల కులం, మతం, ప్రాంతం, వర్గం చూడకుండా సజావుగా విధులు నిర్వహించేందుకు భరోసా కల్పించారు. నేటి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పోల్చుకుంటున్న ఆశా కార్యకర్తలు నాటి స్వర్ణయుగాన్ని తలుచుకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన వరాలు పనికిరావు జిల్లాలో ఎన్నికల కోడ్ ఉన్నా హడావుడిగా ఆశా కార్యకర్తలను సంతృప్తి పరచేందుకు పలు రాయితీలను అందిస్తుందంటూ ప్రభుత్వం ఇచ్చిన లీకేజీల వల్ల ఆశా కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. 2006లో పూర్తి స్థాయిలో ఆశా కార్యకర్తలను పోస్టులు భర్తీ చేయగా మధ్యలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసుకుంటూ వచ్చారు. గత పదేళ్ల నుంచి ఆశా కార్యకర్తల పోస్తుల భర్తీకి అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వం ప్రకటించిన ప్రసూతి సెలవులు ఉపయోగించుకొనే అవకాశం లేదని ఆశా కార్యకర్తలు చెబుతున్నారు. గ్రాడ్యుటీని ప్రవేశపెట్టి రూ.1.50 లక్షలు పదవీ విరమణ అనంతరం ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటన కూడా బూటకమని వారు చెబుతున్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ సర్వీసు ఉంటేనే గ్రాడ్యుటీ అమలు చేస్తామని మెలిక పెట్టడం ఆశా కార్యకర్తలను వంచించడమేనని మండిపడుతున్నారు. వేతనాల పెంపు లేకుండా కేవలం పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడంలో ఆశా కార్యకర్తలకు ఒరిగేదేమీ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆలమూరు: రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రతకు అహర్నిశలు శ్రమిస్తున్న ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పిచడంతో పాటు దీర్ఘకాలిక డిమాండ్లు పరిష్కరిస్తామన్న కూటమి ప్రభుత్వం హామీ నీటిమూటగా మారింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అలవి కాని హామీలిచ్చి అమలు చేయలేక అన్ని వర్గాల ప్రజలు మాదిరిగానే ఆశా కార్యకర్తలను కూడా నయవంచనకు గురిచేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అఽధికారం చేపట్టి 9నెలలు అయినా ఇంకా హామీలు అమలు చేయకపోవడంతో రాష్ట్ర ఆశా కార్యకర్తల సమాఖ్య పిలుపు మేరకు గత ఏడాది నవంబర్ 18న ఆశా కార్యకర్తలు జిల్లా కేంద్రమైన అమలాపురంలోని డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద తమ నిరసనలను తెలియజేశారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం ఆశా కార్యకర్తల డిమాండ్లను సానుకూల దృక్పథంతో పరిష్కారిస్తామని ఆ సమయంలో హామీ ఇచ్చింది. ప్రభుత్వం మాట తప్పిన వైనాన్ని జీర్ణించుకోలేని ఆశా కార్యకర్తలు తాడోపేడో తేల్చుకునేందుకు ఈ నెల ఆరవ తేదీన చలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పోలీసులు ధర్నాకు వెళ్లే వారిని గుర్తించే పనిలో నిమగ్నమై బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనుకాడవద్దని ఆశా కార్యకర్తలు తీర్మానించుకున్నారు. ఆశా కార్యకర్తలపై పెరిగిన పని ఒత్తిడి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనున్న 56 ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రస్తుతం 1395 మంది ఆశా కార్యకర్తలు విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యి జనాభాకు ఒక ఆశా కార్యకర్తను ప్రభుత్వం నియమించవలసి ఉంది. జిల్లాలో 2011 జనాభా గణాంకాల ప్రకారం 17.19 లక్షల మంది జనాభా ఉండగా ఆశా కార్యకర్తలను దాదాపు 1,700 మందిని నియమించవలసి ఉంది. ప్రస్తుతం వివిధ కారణాల రీత్యా ఖాళీ అయిన ఆశా కార్యకర్తల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. దీంతో ప్రస్తుతం ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలపైనే అదనపు భారం పడుతోంది. రోజు రోజుకు ప్రవేశపెడుతున్న యాప్‌లతో పాటు పని ఒత్తిడితో ఆశా కార్యకర్తలు సతమతమవుతున్నారు. దైనందిన జీవితంలో నిత్యవసరాల ధరలతో పాటు ఖర్చులు పెరిగినట్లుగా వేతనం పెరగక ఆశా కార్యకర్తలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఆశా కార్యకర్తల డిమాండ్లు ఇవీ కనీస వేతనం రూ.20 వేలు చెల్లించాలి. ఒప్పంద జీవోలన్నింటిని విడుదల చేయాలి. ఏఎన్ఎం శిక్షణ పొందిన వారందరికి పర్మి నెంట్ పోస్టుల భర్తీ సమయంలో తగిన ప్రాధాన్యం కల్పించాలి. అర్హతను బట్టి దశల వారీగా ఏఎన్ఎం శిక్షణను ఇచ్చి ధ్రువపత్రాలను మంజూరు చేయాలి. ఆరోగ్య రంగానికి బడ్జెట్లో ప్రకటించిన వాటి కంటే అధికంగా నిధులు పెంచాలి. ఆరోగ్య భద్రతా చట్టం చేయాలి. ప్రతి యేటా రెండు జతలకు యూనిఫామ్ అలావెన్స్ ఇవ్వాలి. లెప్రసీ సర్వేకు సంబంధించిన పారితోషికాలు వెంటనే చెల్లించాలి.న్యాయబద్ధమైన డిమాండ్లు అంగీకరించాలి రాష్ట్ర ప్రభుత్వం గత సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఆశా కార్యకర్తల న్యాయబద్ధమైన డిమాండ్లను అంగీకరించాలి. ఏఎన్ఎంలుగా పదోన్నతికి అవకాశం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఆశా కార్యకర్తల డిమాండ్లను ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలి. – కె.కృష్ణవేణి, కోనసీమ జిల్లా ఆశా కార్యకర్తల సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు ఆశా కార్యకర్తలను నయవంచన చేస్తున్న ప్రభుత్వం గత వైఎస్సార్ సీపీలో వేతనం రూ.పది వేలకు పెంపు రేపు చలో విజయవాడకు పిలుపునిచ్చిన సీఐటీయూ పోలీసు కేసులకు, వేధింపులకు భయపడేది లేదు -
నైతిక విలువలు లేకుంటే ఎన్ని డిగ్రీలు ఉన్నా వృథాయే
● ‘నన్నయ’ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ ● నారీ ఫెస్ట్ 2025 ఉత్సవాలు ప్రారంభం రాజానగరం: సమాజంలో నైతిక విలువలు పాటించని వారికి ఎన్ని డిగ్రీలు ఉన్నా వృథాయేనని, వాటికి విలువ కూడా ఉండదని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య సత్తుపాటి ప్రసన్నశ్రీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యూనివర్సిటీ మూడు రోజులపాటు నిర్వహించే ‘నారీ ఫెస్ట్ 2025’ ఉత్సవాలను మంగళవారం ఒక చిన్నారితో జ్యోతిని వెలిగింపజేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన సభలో వీసీ మాట్లాడుతూ ఆడవారిని ఆకాశంలో సగం, అవకాశాలలో సగం అంటే సరిపోదని, ఆదరించడంలో కూడా సగం కావాలన్నారు. ఆడవారికి ఆదరణే ఆధారమని, ఆ ఆదరణ తల్లిదండ్రుల నుంచి, జీవిత భాగాస్వామి నుంచి, పిల్లల నుంచి లభిస్తుందన్నారు. గతంలో ఆడవారి పట్ల వివక్ష చూపేవారని, ఆధునిక సమాజంలో కొంత మార్పు వచ్చిందన్నారు. ఇదే క్రమంలో రాబోయే కాలంలో వివక్ష లేని సమాజం వైపు అడుగులు వేయాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు. తరాలు మారుతున్నా అంతరాలు మారకూడదనే ఉద్దేశంతో బామ్మ – మనుమరాలి షో నిర్వహిస్తున్నామన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచే బామ్మలను స్ఫూర్తినగా మార్గదర్శకంగా తీసుకుని ఆమె చేయి పట్టుకుని మనుమరాళ్లు నడుస్తుంటే ముచ్చటగొలుపుతుందన్నారు. పెద్దలను ఎల్లప్పుడూ గౌరవించాలని, వృద్ధాశ్రమాల అవసరం లేని సమాజం వైపు పయనించాలన్నారు. అలరించిన వెల్ బేబీ షో బామ్మ – మనుమరాలు షోతోపాటు నిర్వహించిన వెల్ బేబీ షోకు కూడా అపూర్వ స్పందన లభించింది. రాజమహేంద్రవరం పరిసరాల నుంచి తరలివచ్చిన అనేక మంది తల్లిదండ్రులు తమ చిన్నారులను వేదిక పైకి తీసుకువచ్చి, బుడగలతో పోటీలు నిర్వహించడంలో ఎంజాయ్ చేశారు. అలాగే గ్రూప్ సింగింగ్, గ్రూప్ డాన్స్, ఫ్యాషన్ షో, స్కిట్స్‌లలో పోటీలు జరిగాయి. పరిసరాలలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉమెన్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ పి. ఉమామహేశ్వరిదేవి, ప్రిసైడింగ్ అధికారి డాక్టర్ వి.పెర్సిస్, డాక్టర్ ఎన్.సజనారాజ్, డాక్టర్ కె.దీప్తి, డాక్టర్ డి. లతా, డాక్టర్ బి.విజయకుమారి, ఆచార్య డి.జ్యోతిర్మయి, డాక్టర్ పి.విజయనిర్మల, డాక్టర్ కె.సుబ్బారావు, డాక్టర్ కె.నూకరత్నం, డాక్టర్ పద్మావతి, డాక్టర్ కె.రమణేశ్వరి పాల్గొన్నారు. -
కామన్వెల్త్ క్షయ నివారణ కమిటీ సభ్యుడిగా శర్మ
అమలాపురం రూరల్: 56 దేశాల సభ్యత్వం కలిగిన కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్‌లో క్షయ వ్యాధి నివారణ కోసం 12 మంది సభ్యులతో ఏర్పాటైన ఉప సంఘంలో దేశం నుంచి ముగ్గురు డాక్టర్లను ఎంపిక చేశారని, ఇందులో జిల్లా నుంచి డాక్టర్ పీఎస్ శర్మ సభ్యునిగా ఉండడం అభినందనీయమని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. సోమవారం అమలాపురంలోని కలెక్టర్ చాంబర్లో క్షయ వ్యాధి అపోహల నిర్మూలన గురించి ముద్రించిన ముద్రికను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధి నిర్మూలన ఉప సంఘంలో అమలాపురానికి చెందిన డాక్టర్ శర్మకు అవకాశం లభించడం హర్షణీయమన్నారు. క్షయ వ్యాధి నివారణ అందరి బాధ్యత అని, ప్రతి పౌరుడు తమ వంతు కృషి చేయాలని తెలిపారు. ఈ నెల 17న కలెక్టరేట్ ప్రాంగణంలో క్షయ వ్యాధి నిర్మూలన గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని డాక్టర్ పీఎస్ శర్మ తెలిపారు. క్షయ వ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు డీఐఈఓ సోమశేఖరరావు అమలాపురం టౌన్: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లు, మూడు సిటింగ్ స్క్వాడ్లు, కస్టోడియన్స్ పర్యవేక్షణలో పకడ్బందీగా జరుగుతున్నాయని డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఐఈఓ) వనుము సోమశేఖరరావు తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులకు తెలుగు, హిందీ, సంస్కృతం పరీక్షలు, ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులకు జనరల్ ఫౌండేషన్ కోర్సులకు సోమవారం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు. జనరల్ ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి జిల్లాలో మొత్తం 10,028 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 9,705 మంది హాజరయ్యారని చెప్పారు. 323 మంది గైర్హాజరయ్యారన్నారు. అదే ఒకేషనల్ ఇంటర్ పరీక్షలకు 2,348 మంది హాజరు కావాల్సి ఉండగా, 2,197 మంది పరీక్షలు రాశారన్నారు. జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్, సిటింగ్ స్క్వాడ్లతో పాటు డీఐఈఓ సోమశేఖరరావు, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు తనిఖీ చేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలుపుపై హర్షం అమలాపురం టౌన్: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ, మిత్ర సంఘాలు బలపరిచిన గాదె శ్రీనివాసుల నాయుడు గెలుపుపై పీఆర్టీయూ జిల్లా శాఖ హర్షం వ్యక్తం చేసింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గతంలో రెండుసార్లు ఎన్నికై న శ్రీనివాసుల నాయుడు ఆ అనుభవంతోనే గెలిచారని, ఇక ముందు కూడా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని పీఆర్టీయూ జిల్లా శాఖ అధ్యక్షుడు నరాల కృష్ణకుమార్, ప్రధాన కార్యదర్శి దీపాటి సురేష్ బాబు అన్నారు. ఈ మేరకు వీరు అమలాపురంలో సోమవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. వీరితోపాటు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మొంగం అమృతరావు కూడా శ్రీనివాసుల నాయుడికి అభినందనలు తెలిపారు. ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావాలి తుని: జీవాత్మకు పరమాత్మను అనుసంధానం చేసేదే ధర్మమని, ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య, ఆధ్మాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని కహెన్ షా వలీ దర్గాలో సోమవారం జరిగిన 28వ వార్షిక సర్వధర్మ సమ్మేళన సభకు ఆయన అధ్యక్షత వహించారు. సికింద్రాబాద్ యోగాలయ నిర్వహకుడు డాక్టర్ వాసిలి వసంత్ కుమార్, హిందూ ధర్మ ప్రతినిధి స్వామి విజయానంద, ఇస్లాం ప్రతినిధి సూఫీ షేక్ అహ్మద్ జానీ, క్రైస్తవ ప్రతినిధి ఎస్.బాలశౌరి, బౌద్ధం ప్రతినిధి పూజ్య భంతే, సిక్కు మత ప్రతినిధి గురుచరణ్ సింగ్‌తో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి, సమ్మేళనాన్ని ప్రారంభించారు. -
పదవుల కోసం ముందుకు..
●● మార్కెట్ కమిటీలపైనే ఆశలు ● నెలాఖరుకు భర్తీ చేస్తామన్న చంద్రబాబు ● మొదలైన కూటమి నేతల పైరవీలు ● టీడీపీ, జనసేన సిగపట్లు సాక్షి, అమలాపురం: నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో ఆశావహులు ముందుకు వస్తున్నారు. ప్రధానంగా మార్కెట్ యార్డు పదవులపై జిల్లాలో కీలక నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ పదవుల పందేరం కూటమి పార్టీల్లో కొత్త విభేదాలకు దారితీయనుంది. ఈ నెలాఖరు నాటికి నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో ఎమ్మెల్యే తరువాత ప్రోటోకాల్ పరంగా ఇంచుమించి నియోజకవర్గం అంతా ప్రతిబింబించే మార్కెట్ కమిటీలపై ద్వితీయ శ్రేణి నేతలు అధికంగా ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా శాసన మండలి ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లాలో తొమ్మిది వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. పి.గన్నవరం, కొత్తపేట నియోజకవర్గానికి మాత్రం రెండు చొప్పున, మిగిలిన నియోజకవర్గాల్లో ఒకటి చొప్పున ఏఎంసీలు ఉన్నాయి. అంబాజీపేట, నగరం, కొత్తపేట, ఆలమూరు, ముమ్మిడివరం, రాజోలు, రామచంద్రపురం మార్కెట్ కమిటీలు ఆదాయ పరంగా, సదుపాయాల విషయాల్లో ముందున్నాయి. పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ముందు మార్కెట్ యార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అప్పటి రిజర్వేషన్ ప్రకారం కొత్తపేట (బీసీ జనరల్), అంబాజీపేట (ఓసీ జనరల్), రామచంద్రపురం (ఓసీ జనరల్), అమలాపురం (ఓసీ మహిళ), ముమ్మిడివరం (ఓసీ జనరల్), రాజోలు (బీసీ మహిళ), నగరం (ఎస్సీ మహిళ), మండపేట (బీసీ జనరల్), ఆలమూరు (ఓసీ మహిళ) రిజర్వ్ అయ్యింది. అయితే ఈ రిజర్వేషన్లు మారే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఈ రిజర్వేషన్లను బట్టి ఇప్పటికే కొన్ని మార్కెట్ యార్డులకు చైర్మన్లను స్థానిక ఎమ్మెల్యేలు ఎంపిక చేసినట్టు తెలిసింది. చిచ్చు రేపేలా.. కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పందేరం భాగస్వామ్య పార్టీల మధ్య చిచ్చు రేపుతోంది. ఈ పదవులకు టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు పోటీ పడుతున్నారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్నచోట తమకు అవకాశం ఇవ్వాలని టీడీపీ నాయకులు పట్టుబడుతున్నారు. ఇదే సమయంలో తమ నియోజకవర్గాల్లో జనసేనకు అవకాశం ఇచ్చేందుకు సుముఖత చూపడం లేదు. దీంతో జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారి కార్యక్రమాలను బాయ్‌కాట్ చేస్తున్నారు. తమ గోడును పార్టీ అగ్రనేతలకు మొర పెట్టుకుంటున్నారు. అయినా టీడీపీ ఎమ్మెల్యేలు ఖాతరు చేయడం లేదు. తమ పార్టీ వారినే ఏఎంసీ చైర్మన్లుగా ఎంపిక చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఎలా అంటే.. ముమ్మిడివరంలో టీడీపీకి చెందిన తాడి నరసింహారావుకు దాదాపు ఖరారైనట్టు సమాచారం. అలాగే అమలాపురానికి టీడీపీకి చెందిన జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు అధికారి జయ వెంకటలక్ష్మిలకు ఖరారైనట్టు తెలిసింది. రామచంద్రపురం ఏఎంసీ చైర్మన్ పదవికి సైతం రెండు పార్టీలు పట్టుబడుతున్నాయి. టీడీపీ నుంచి కడియాల రాఘవన్, రావిపాటి వెంకట గణేష్చౌదరి, జనసేన నుంచి ముప్పాళ్ల గణేష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మంత్రి వాసంశెట్టి సుభాష్ మాత్రం టీడీపీకి మొగ్గు చూపుతున్నారు. మండపేట ఏఎంసీ పదవి సైతం స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తన పార్టీకి చెందిన కాపు, బీసీ సామాజికవర్గానికి ఇచ్చే అవకాశముంది. కొత్తపేట ఏఎంసీ చైర్మన్ పదవిని టీడీపీ నుంచి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రెడ్డి రామకృష్ణ, రావులపాలెం మండల టీడీపీ అధ్యక్షుడు గుత్తుల పట్టాభిరామయ్య ఆశించారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మొగ్గు పట్టాభిరామయ్యపై ఉన్నట్టు తెలిసింది. ఇదే నియోజకవర్గంలో ఉన్న ఆలమూరు ఏఎంసీ చైర్మన్ జనరల్ మహిళకు కేటాయించగా జనసేన పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ కొత్తపల్లి వెంకటలక్ష్మికి అవకాశం వస్తోందనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే ఉన్నచోట రెండు ఏఎంసీలలో ఒక్కటి మాత్రమే జనసేనకు దక్కుతోంది. జనసేన ఎమ్మెల్యేలున్న రాజోలు నియోజకవర్గం పరిధిలోని రాజోలు ఏఎంసీ చైర్మన్ పదవి జనసేన నేత గబ్బుల ఫణికుమార్ పేరు దాదాపు ఖరారైనట్టు తెలిసింది. కాక రేపుతున్న అంబాజీపేట ఏఎంసీ జిల్లాలో అంబాజీపేట ఏఎంసీ చైర్మన్ పదవి ఉత్కంఠ రేపుతోంది. పి.గన్నవరం నియోజకవర్గం పరిధిలో అంబాజీపేటతోపాటు, నగరం మార్కెట్ కమిటీ ఉంది. అంబాజీపేట ఓసీ జనరల్ కాగా, నగరం ఎస్సీ మహిళ అయ్యింది. నగరం జనసేనకు ఇస్తే అంబాజీపేట టీడీపీకి ఇస్తారని తొలుత ప్రచారం జరిగింది. టీడీపీ నుంచి అయినవిల్లి మండలానికి చెందిన టీడీపీ అనుకూల కమ్మ సామాజికవర్గానికి చెందిన నాయకుడికి లేదా క్షత్రియ సామాజికవర్గానికి చెందిన వారిలో ఒకరికి ఈ పదవి దక్కుతోందని బలమైన ప్రచారం జరుగుతోంది. కమ్మ సామాజికవర్గం నేత లోకేష్ కోటరీకి చెందిన వారు కావడంతో అతనికే పదవి దాదాపుగా ఖరారైనట్టు ప్రచారం సాగుతోంది. నగరానికి సంబంధించిన జనసేన ఎస్సీ మహిళల తరఫున పెనుమాల లక్ష్మీ ఒక్కరే రేసులో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అంబాజీపేట జనసేనకు ఇవ్వాలని, తొలి నుంచి ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న కాపు సామాజికవర్గం నుంచి అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణపై ఒత్తిడి అధికంగా వస్తోంది. జనసేనకు సొంత సొమ్ము ఖర్చు పెట్టిన వారిని ఇప్పుడు దూరం పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. జనసేన నుంచి ఈ పదవి ఆశిస్తున్న కొర్లపాటి గోపి, మహిపాల తాతాజీలిద్దరూ అంబాజీపేటకు చెందినవారే కావడం గమనార్హం. ఎమ్మెల్యే కనుక ఈ ఒత్తిడికి తలొగ్గితే ఆ ప్రభావం నగరం మార్కెట్ కమిటీపై పడనుంది. అంబాజీపేట మార్కెట్ యార్డు కార్యాలయంఅల్లవరం మార్కెట్ యార్డు కార్యాలయం -
రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి
●● ఇప్పటి వరకూ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం ● రాష్ట్ర కాపు జేఏసీ నేతల డిమాండ్ ● తాడిపూడి మృతుల కుటుంబాలకు పరామర్శ తాళ్లపూడి: మహాశివరాత్రి సందర్భంగా గత నెల 26న తాడిపూడిలో గోదావరి పుణ్యస్నానాలకు వెళ్లి, ఐదుగురు యువకులు మృతి చెందితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ కనీసంగా కూడా స్పందించకపోవడం బాధాకరమని రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు జెట్టి గురునాథం, తోట రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పంధించి మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన మృతుల కుటుంబాలను రాష్ట్ర కాపు జేఏసీ, నియోజకవర్గ కాపు నాయకులు సోమవారం పరామర్శించారు. పడాల దుర్గా ప్రసాద్, పడాల దేవదత్త సాయి, అనిశెట్టి పవన్ గణేష్, గర్రే ఆకాష్, తిరుమలశెట్టి పవన్ కుమార్ల కుటుంబ సభ్యులను కలిసి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాపు సంఘం తరఫున ఒక్కొక్క మృతుని కుటుంబానికి రూ.30 వేల చొప్పున మొత్తం రూ.1.50 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా గురునాథం మాట్లాడుతూ, ఈ ఘటనపై ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కాపు జేఏసీ సభ్యుడు, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు తోట రామకృష్ణ మాట్లాడుతూ, కాపుల ఓట్లతో గెలిచిన కూటమి ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ ఘటనపై స్పందించాలని అన్నారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా కూడా పవన్ కల్యాణ్‌కు చేరాలని, బాధితులకు న్యాయం చేయాలంటూ పోస్టులు పెట్టి వైరల్ చేస్తున్నారని అన్నారు. తాడిపూడి సర్పంచ్ నామా శ్రీనివాస్ మాట్లాడుతూ, మృతుల కుటుంబాలకు ర్యాంపు నిర్వాహకులు కూడా నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కాపు సంఘం అధ్యక్షుడు నామా ప్రకాశం, పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, కరిబండి విద్యాసంస్థల డైరెక్టర్ కరిబండి త్రినాథస్వామి, కాపు నాయకులు పాల్గొన్నారు. -
తాగునీటి ఎద్దడి రాకుండా చూడండి
అధికారులతో కలెక్టర్ మహేష్ కుమార్ అమలాపురం రూరల్: వేసవి దృష్ట్యా జిల్లాలో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్లో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజినీర్లు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. వేసవి తాగునీటి ప్రణాళికలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో తాగునీటి వనరుల సమస్య లేకుండా వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. శివారు గ్రామాలకు నీటి సమస్య ఉంటే ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కృష్ణారెడ్డి, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య విభాగం ఇంజినీర్లు, మున్సిపల్ కమిషనర్లు వీఐపీ నాయుడు, కేవీఆర్ రాజు, టీవీ రంగారావు, రవివర్మ పాల్గొన్నారు. జియో మ్యాట్ల వినియోగం పెంచాలి బీటీ, సీసీ రోడ్లు, కాలువ గట్ల నిర్మాణాల్లో భూమి దిగువకు జారిపోయే చోట జియో టెక్స్టైల్స్ మ్యాట్ల వినియోగం పెంచాలని కలెక్టర్ మహేష్‌కుమార్ ఆదేశించారు. కలెక్టర్ చాంబర్లో పంచాయతీరాజ్, రహదారులు భవనాల శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు, ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. జియో టెక్స్టైల్స్, జియో సింథటిక్ పేపర్ ద్వారా రోడ్ల నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో అంచనాలు రూపొందించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పీకేపీ ప్రసాద్, పంచాయతీ రాజ్ ఎస్ఈ పి.రామకృష్ణారెడ్డి డీఈఈ ఆన్యం రాంబాబు పాల్గొన్నారు. ఇసుక తవ్వకాలపై తనిఖీలు జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రోడ్లు, భవన నిర్మాణ రంగాల డిమాండ్‌కు అనుగుణంగా ఇసుకను సరఫరా చేయాలన్నారు. అనధికారంగా గోదావరి నదిలో ఇసుక తవ్వకాలు చేపడుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. విశాఖపట్నం జిల్లాలో భవన నిర్మాణాలకు పొడగట్లపల్లి ఇసుక రీచ్‌ను కేటాయించామన్నారు. జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారి ఎల్.వంశీధర్ రెడ్డి, జిల్లా రవాణా అధికారి డి.శ్రీనివాసరావు. కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వాహక ఇంజినీర్ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షల్లో ప్రథమ స్థానంలో నిలపండి
అమలాపురం రూరల్: ఉన్నత విద్యకు పదో తరగతి తొలిమెట్టని, ఈ పరీక్షల్లో విద్యార్థులు నూరు శాతం సాధించి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా రెవెన్యూ అధికారి బీఎల్ఎన్ రాజకుమారి తెలిపారు. సోమవారం అమలాపురంలోని డీఆర్వో చాంబర్లో 10వ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్చి 17 నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షల్లో 19,217 విద్యార్థుల కోసం 110 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. పరీక్షలంటే విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి, వారిలో స్ఫూర్తిని నింపాలన్నారు. ప్రఽథమ స్థానం సాధించేలా సమాయత్తం చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఈ పరీక్షలకు 13 రోజులు మాత్రమే ఉందని, ఎటువంటి భయాందోళనకు గురికాకుండా ఉపాధ్యాయులు ఇచ్చిన సూచనలు విద్యార్థులు పాటిస్తే తప్పకుండా ఉత్తీర్ణత సాధిస్తారని తెలిపారు. ఇంజినీర్, డాక్టర్, కలెక్టర్ తదితర ఉద్యోగాలకు ముందు మెట్టు పదో తరగతి ఉత్తీర్ణతేనని, వీటిలో మంచి మార్కులు సాధిస్తే భవిష్యత్తులో కోరుకున్న ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుందన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నూరు శాతం ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. సమావేశంలో డీఈఓ షేక్ సలీం బాషా, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్ బి.హనుమంతరావు, ఉప విద్యాశాఖ అధికారి జి.సూర్యప్రకాశం, పోస్టల్, ఆర్టీసీ ట్రాన్స్‌కో అధికారులు పాల్గొన్నారు. -
రత్నగిరిపై కనకవర్షం
● సత్యదేవునికి రికార్డు స్థాయి ఆదాయం ● 30 రోజులకు హుండీల ద్వారా రూ.1.89 కోట్ల రాబడి అన్నవరం: మాఘ మాసం పుణ్యమా అని రత్నగిరిపై కనకవర్షం కురిసింది. గడచిన 30 రోజులకు గాను అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి హుండీల ద్వారా రికార్డు స్థాయిలో రూ. 1,88,91,940 ఆదాయం సమకూరింది. దేవస్థానంలోని హుండీలను సోమవారం తెరచి, భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. నగదు రూ. 1,80,63,749, చిల్లర నాణేలు రూ.8,28,191 వచ్చా యని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సు బ్బారావు తెలిపారు. వీటితో పాటు బంగారం 66.010 గ్రాములు, వెండి 693 గ్రాములు వచ్చాయని చెప్పారు. విదేశీ కరెన్సీ హుండీల ద్వారా సత్యదేవునికి పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ కూడా లభించింది. అమెరికన్ డాలర్లు 129, సింగపూర్ డాలర్లు 50, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ దీనార్ 21, ఇంగ్లండ్ పౌండ్లు 10, ఖతార్ రియల్స్ 28, ఆస్ట్రేలియా డాలర్లు 25, యూఏఈ దీరామ్స్ 530, యూరోలు 5, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ బైసా 100, మలేషియా రింగిట్స్ 6 లభించాయి. కలిసొచ్చిన మాఘం గడచిన మాఘ మాసంలో రత్నగిరిపై పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. అలాగే ఫాల్గుణ మాసంలో కూడా గత మూడు రోజులుగా రత్నగిరిపై జోరుగా వివాహాలు జరుగుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న వారు కూడా అధిక సంఖ్యలో సత్యదేవుని ఆలయానికి తరలి వస్తున్నారు. అలాగే, గత నెలలో భీష్మ ఏకాదశి సందర్భంగా సుమారు లక్ష మంది భక్తులు సత్యదేవుని దర్శనానికి వచ్చారు. ఇలా వచ్చిన భక్తులందరూ పెద్ద మొత్తంలో హుండీల్లో కానుకలు సమర్పించారు. దీంతో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందని, హుండీల ద్వారా రోజుకు సగటున రూ.6,09,412 రాబడి వచ్చిందని చైర్మన్, ఈఓ తెలిపారు. హుండీల ఆదాయం లెక్కింపులో పలు స్వచ్ఛంద సంస్థల సిబ్బంది పాల్గొన్నారు. వచ్చిన నగదును స్థానిక స్టేట్ బ్యాంకుకు తరలించారు. -
కాశీ స్ఫూర్తి కొనసాగాలి
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వరూప్ ● అంతర్జాతీయ క్రీడాకారుడు సాత్విక్‌కు పరామర్శ అమలాపురం టౌన్: తన తనయుడు సాత్విక్ సాయిరాజ్‌ను అంతర్జాతీయ క్రీడాకారుడిగా తయారు చేసి జిల్లా గర్వించేలా శ్రమించిన క్రీడాభిమాని, జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ రిఫరీ రంకిరెడ్డి కాశీ విశ్వనాథం మృతి క్రీడా రంగానికే తీరని లోటని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పినిపే విశ్వరూప్ అన్నారు. తండ్రి మరణంతో విషాదంలో ఉన్న దివంగత కాశీ తనయులు అంతర్జాతీయ క్రీడాకారుడు సాయిరాజ్ సాత్విక్, రామ్ చరణ్‌లను ఆయన ఆదివారం పరామర్శించారు. స్థానిక ముమ్మిడివరం గేటు సెంటరులో గల కాశీ కుటుంబ సభ్యులను విశ్వరూప్ కలిసి ఓదార్చారు. కాశీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశ్వరూప్ సాయిరాజ్ సాత్విక్‌తో కొద్దిసేపు మాట్లాడారు. తండ్రి క్రీడా స్ఫూర్తిని పుణికి పుచ్చుకుని, ఆయన క్రీడా ఆశయాలను మరింత నెరవేర్చేలా శ్రమించాలని పేర్కొన్నారు. విశ్వరూప్‌తో పాటు పార్టీ నాయకులు కల్వకొలను బాబి, కల్వకొలను ఉమ తదితరులు ఉన్నారు. కొత్త అల్లుడికి కోనసీమ మర్యాదలు 29 వంటకాలతో విందు భోజనం అమలాపురం టౌన్: అత్తింటికి వచ్చిన ఓ అల్లుడికి ఆ కుటుంబ సభ్యులు కోనసీమ మర్యాదలు రుచి చూపించారు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి యర్రమల్లు వంశీకి ఇటీవల అమలాపురం పట్టణం శ్రీరామపురానికి చెందిన ప్రత్యూషతో వివాహమైంది. వంశీ ఆదివారం అమలాపురంలోని తన అత్తవారింటికి రావడంతో మధ్యాహ్నం 29 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. కొత్త దంపతులిద్దరికీ సంప్రదాయబద్ధంగా ఒకే అరిటాకులో ఆ పదార్థాలన్నీ వడ్డించగా వంశీ, ప్రత్యూష ఆ విందు ఆరగించారు. కొత్త జంటకు భోజనంలో బిర్యానీ, పులిహోర, ఉల్లి చట్నీ, పన్నీర్ కర్రీ, ములక్కాడ, టమాటా కర్రీ, ఆనపకాయ కూర, చామదుంపల పులుసు, సాంబారు, దోసకాయ పప్పు, ఆవకాయ, శనగ పొడుం, కొబ్బరి కాయ పచ్చడి, పెరుగు, బొబ్బట్లు, చక్కెర పొంగలి, జున్ను, కాజా, పూరి, పాలకోవా, ఉండ్రాళ్లు, సేమియా, లడ్డూలు, బాదంగీర్, కూల్ డ్రింక్, ఫ్రూట్ సలాడ్ ఇలా అనేక రుచులతో వడ్డించారు. శ్రీరామపురానికి చెందిన తుమ్మూరి వీర వెంకట సత్యనారాయణ (మామ), ఉమా శ్రీదేవి (అత్త) దంపతులు తమ అల్లుడికి దగ్గరుండి ఈ విందు వడ్డించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు అమలాపురం రూరల్: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసే వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వ హించడం లేదని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీకోసం), మండల కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించడం లేదని తెలిపారు. కేవలం గ్రామ సచివాలయాలలో మాత్రమే ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయినవిల్లికి పోటెత్తిన భక్తులు అయినవిల్లి: సంకటహర చతుర్థి సందర్భంగా ఆదివారం అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని పూజలు చేయించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, లక్ష్మీగణపతి హోమం, గరిక పూజ నిర్వహించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.2,70,660 ఆదాయం లభించినట్లు ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. -
నిజాయితీతో సేవలందించాలి
● ఏలూరు పోలీస్ రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ ● 100 మంది ఎస్సైలకు నియామక పత్రాలు ఏలూరు టౌన్: సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కు నిర్భయంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీతో సేవలందించాలని ఏలూరు పోలీస్ రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబేషనరీ సబ్ ఇన్ స్పెక్టర్లు ఐజీని ఏలూరు రేంజ్ కార్యాలయంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రొబేషనరీ ఎస్సైలకు ఆయన నియామక ఉత్తర్వు లు అందజేశారు. రేంజ్ పరిధిలో 100 మంది (68 మంది పురుషులు, 32 మంది మహిళలు) ఎస్సై శిక్షణ పూర్తి చేసుకోగా జిల్లాల వారీగా ఏలూరు 1, అల్లూరి సీతారామరాజు 4, కాకినాడ జిల్లా 2, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా 1, తూర్పు గోదావరి జిల్లాకు 15, పశ్చిమ గోదావరి జిల్లా 1, కృష్ణా జిల్లాకు 20, ఎన్టీఆర్ జిల్లాకు 56 మందిని నియమించారు. ఈ సందర్భంగా ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా ప్రజలకు అత్యుత్తమ స్థాయిలో సేవలు అందించాలని సూచించారు. బాధితుల పక్షాన న్యాయం చేయాలని, నిందితులకు చట్ట ప్రకారం శిక్షలు పడేలా పారదర్శకత, జవాబుదారీతనంతో పని చేయాలని అన్నారు. పోలీస్ శాఖలో అడుగు పెడుతున్న మీరంతా సమాజంలో నేరస్తులకు భయం, బాధితులకు అభయం అందించేలా పని చేయాలన్నారు. పోలీస్ విధుల్లో పని చేయటం అదృష్టంగా భావిస్తూ చట్టాలకు లోబడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని ఐజీ పిలుపునిచ్చారు. -
కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
● 28 టేబుళ్లు.. 17 రౌండ్లు ● 2,18,902 ఓట్ల లెక్కింపుఏలూరు (మెట్రో): ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు సోమవారం ప్రారంభం కానుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆధ్వర్యంలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని ఆరు జిల్లాల్లోని 456 పోలింగ్ కేంద్రాల్లో గత నెల 27న పోలింగ్ జరిగింది. 69.50 శాతం పోలింగ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3,637, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 47,125, ఏలూరు జిల్లాలో 29,651, కాకినాడ జిల్లాలో 47,150, తూర్పు గోదావరి జిల్లాలో 42,446, పశ్చిమ గోదావరి జిల్లాలో 48,893 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 69.50 శాతం ఓటింగ్ నమోదు కాగా, బ్యాలెట్ బాక్సులను ఏలూరులోని స్ట్రాంగ్ రూములో భద్రపరిచారు. ఈ ఎన్నికల బరిలో 35 మంది నిలిచారు. టీడీపీ బలపర్చిన పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులు మధ్య ప్రధాన పోటీ నెలకొందని భావిస్తున్నారు. ఉదయం 7 గంటలకు.. కౌంటింగ్ కేంద్రానికి సిబ్బంది 6.30 గంటలలోపు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. మూడు షిప్టుల్లో 700 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొంటారు. మొత్తం 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 17 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. ప్రతి టేబుల్‌కు కౌంటింగ్ సిబ్బంది, సూపర్వైజర్, రోల్ ఇన్చార్జి, షిఫ్ట్ ఇన్చార్జి, మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వహిస్తారు. సమగ్ర శిక్షణ ఏలూరు (ఆర్ఆర్ పేట): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కౌంటింగ్ ఏర్పాట్లను ఆదివారం ఆమె పరిశీలించారు. కౌంటింగ్‌పై సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇచ్చామన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి రెండు మూడు రోజుల సమయం పట్టవచ్చన్నారు. పూర్తి భద్రతా ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు. కౌంటింగ్ సిబ్బందికి డ్యూటీ పాసులు, ఏజెంట్లకు ఐడీ కార్డులు జారీ చేశామన్నారు. పాస్ లేనిదే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రంలోనికి సెల్ఫోన్లను నిషేధించామన్నారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద నిర్వహిస్తామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఈపీడీసీఎల్ ఎస్ఈ పి.సాల్మన్‌రాజును కలెక్టర్ ఆదేశించారు.ఎవరి లెక్కలు వారివి.. అమలాపురం టౌన్: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాల కోసం జిల్లా ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఏలూరు జిల్లా కేంద్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం నిర్వహిస్తుండడంతో పట్టభద్రులు ఎవరికివారు అంచనాలు, లెక్కలు, మెజార్టీలు కడుతున్నారు. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందోననే చర్చ ప్రజల్లో సాగుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 64,471 మంది ఓటర్లు ఉండగా 47,125 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో 73.09 శాతం మేర పోలింగ్ జరిగింది. పురుషులు 27,353 మంది, మహిళలు 19,771 మంది ఓట్లు వేశారు. ఎన్నికల బరిలో 35 మంది అభ్యర్థులు ఉన్నా ప్రధాన పోటీ మాత్రం కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులు మధ్యే జరిగిందని భావిస్తున్నారు. పోటీలో తలపడ్డ కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు రెండో ప్రాధాన్య ఓట్లపై ఆశలు పెట్టుకుని ఫలితం కోసం ఆతృతతో ఎదురు చేస్తున్నారు. -
సుఖీభవకు మంగళం!
ఆలమూరు: రాష్ట్రంలో ఏటా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు, ధరల స్థిరీకరణ నిధులు లేక వరిసాగు క్రమేణా తగ్గుతున్న తరుణంలో ఆదుకోవలసిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదుకుంటామన్న కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. ఏటా పెరుగుతున్న పెట్టుబడికి తగ్గట్టుగా ధాన్యం ధర పెరగడం లేదు. దీనికి తోడు ప్రకృతి వైపరీత్యాలు నష్టాలను మిగులుస్తున్నాయి. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అర్హులైన వరి రైతులందరికి రూ.20 వేలు పంట సాయం అందిస్తామన్న కూటమి ప్రభుత్వం హామీ బుట్టదాఖలైంది. ప్రభుత్వం పాలన చేపట్టి తొమ్మిది నెలలు పూర్తయినా అన్నదాత సుఖీభవ పథకం అమలుకు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అలాగే ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ అరకొర నిధుల కేటాయింపుపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రంతో కలిసి ప్రతి ఏటా మూడు విడతలుగా రూ.13,500 సాయం అందించేవి. కేంద్ర ప్రభుత్వం మూడు విడతలుగా రూ.ఆరు వేలు, రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతలుగా రూ.7500 రైతుల బ్యాంకు ఖాతాల్లో క్రమం తప్పకుండా నిర్ణీత సమయానికి పంట సాయం సొమ్ము జమ అయ్యేది. ఇలాంటి తరుణంలో గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పంటసాయాన్ని రూ.13,500 నుంచి రూ 20 వేలు పెంచుతానని హామీ ఇచ్చింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జూన్ 18న తొలివిడతగా రూ రెండు వేలు జమ చేయగా, అక్టోబర్ ఐదున రెండో విడతగా మరో రూ.రెండువేలు జమ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24న మూడో విడతగా రూ.రెండు వేలు జమ చేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ సుఖీభవకు నయపైసా విడుదల చేయలేదు. అమలు చేసేదెప్పుడు? డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 22 మండలాల్లో 2025–26 రబీ సీజన్‌కు సంబంధించి 1.89 లక్షల ఎకరాల్లో 1.03 లక్షల రైతులు రబీ సీజన్లో వరిసాగు చేపట్టారు. అందులో భాగంగా పీఎం కిసాన్ పథకానికి 1.28 లక్షల మంది రైతులు అర్హుత పొంది ఉన్నారు. గత ఏడాది జూన్ 18న రూ.రెండు వేలు చొప్పున అర్హులైన రైతులందరికి రూ.24.46 కోట్లు జమ చేసింది. రెండో విడతగా అక్టోబర్ 5న రెండో విడతగా మరో రూ.22.45 కోట్లు, ఈ ఏడాది ఫిబ్రవరి 24న మూడవ విడత రూ 24.58 కోట్లు జమ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయడంతో తొలివిడత సాయం జమ చేయకుండా వదిలేసింది. రెండో విడత సాయంపైనా, ఈ ఏడాది మూడో విడతపై కూడా ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించలేదు. ఏటా పెరుగుతున్న పెట్టుబడి వరి పంటకు మద్దతు ధర అంతగా పెరగకపోయినా పెట్టుబడి మాత్రం ప్రతి సీజన్‌కు పెరిగిపోతోంది. గత వైఎస్సార్ సీపీ హయాంలో నిర్ణీత తేదీన పంటసాయాన్ని రైతు ఖాతాలో వేయడంతో పెట్టుబడికి ఉపశమనం లభించేది. ఈ ఖరీఫ్ సీజన్లో ఎకరా వరిసాగుకు రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకూ ఖర్చు అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడకుండా రైతులు వరిసాగు చేపట్టేవారు. ప్రస్తుతం ప్రభుత్వ అనాలోచిత వైఖరి వల్ల వరి రైతులకు సాగు కష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం మూడు విడతలు పంట సాయం మంజూరు చేయకపోవడంతో జిల్లాలో రైతులు రూ.144.20 కోట్లు కోల్పోయారు. ఈ మూడు విడతల్లో ఒక్కొక్క రైతు సగటున రూ.14 వేలు కోల్పోయినట్ల అయ్యింది. రైతు భరోసా కేంద్రం పీఎం కిసాన్ మూడో విడత విడుదలైనా పైసా విదల్చని కూటమి సర్కార్ బడ్జెట్లో అరకొర కేటాయింపులు పెట్టుబడి సాయానికి అన్నదాత ఎదురుచూపువరిసాగు వివరాలు ఖరీఫ్ వరిసాగు (ఎకరాల్లో) 1.89 లక్షలు వరిసాగు చేసిన రైతులు 1.03 లక్షలు పీఎం కిసాన్ లబ్ధిదారులు 1,28 లక్షలు జిల్లాలో రైతు భరోసా కేంద్రాలు 515మూడు విడతల సాయం ఒకేసారి అందించాలి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం అఽధికారం చేపట్టి నాటి నుంచి ఇప్పటి వరకూ రైతుల ఖాతాల్లో మూడు విడతల సొమ్ము రూ.20 వేలు జమ చేయాలి. – అన్యం చంద్రరావు, కౌలురైతు, ఆలమూరు అధిక వడ్డీలకు అప్పులు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో ప్రకటించిన విధంగా పంటసాయం అందించకపోవడంతో అఽధిక వడ్డీలకు అప్పులు చేసి వరిసాగు చేస్తున్నాం. దీనివల్ల తీవ్రమైన ఆర్థికభారం పడుతోంది. గత ప్రభుత్వం సీజన్‌కు ముందే రైతుల ఖాతాల్లో పంట జమ చేసేది. – పిల్లి వెంకన్న, వరిరైతు, పినపళ్ల, ఆలమూరు మండలం -
5 నుంచి వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలు
● ఐదు రోజులు విశేష వాహన సేవలు ● 6న వైభవంగా శ్రీవారి కల్యాణోత్సవం కొత్తపేట: ఆత్రేయపురంలోని లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకూ వైభవంగా నిర్వహించనున్నారు. ఆ మేరకు ఆలయ శాశ్వత ధర్మకర్త, ఆలయ కమిటీ చైర్మన్ పాతపాటి వెంకట సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో వెంకట సత్యరాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో ఐదు రోజుల పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల వివరాలను ఉత్సవ కమిటీ సభ్యులు ఆదివారం విలేకరులకు తెలిపారు. ఐదో తేదీ తెల్లవారు జాము నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాలలో ఆ రోజు నుంచి వివిధ వాహనాలపై శ్రీవారి ఊరేగింపులు కనువిందు చేయనున్నాయి. రాత్రి 7.30 గంటలకు శేష వాహనోత్సవం నిర్వహిస్తారు. ఆరో తేదీ ఉదయం 10.30 గంటలకు శ్రీవారి కళ్యాణోత్సవం, సాయంత్రం 6 గంటలకు హనుమద్ వాహనోత్సవం, 7న ఉదయం 108 బిందెలతో కలశాభిషేకం, మహిళలచే సామూహిక కుంకుమార్చన, సాయంత్రం 108 తామర పుష్పాలతో మహాలక్ష్మీహోమం, అనంతరం సింహ వాహనోత్సవం నిర్వహిస్తారు. 8న గరుడ వాహనోత్సవం, అనంతరం శంకు, చక్ర నామార్చన, సహస్ర దీపాలంకరణ సేవ, ఊంజల్ సేవ నిర్వహిస్తారు. 9 న మహా శాంతి హోమం, పూర్ణాహుతి, అనంతరం శ్రీచక్ర స్నానం, అన్న సమారాధన, పల్లకిసేవ, రాత్రి శ్రీపుష్పయాగోత్సవం నిర్వహించనున్నారు. -
ఘనంగా సత్యదేవుని రథసేవ
అన్నవరం: రత్నగిరిపై ఆలయ ప్రాకారంలో ఆదివారం సత్యదేవుని రథసేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి రథంపై వేంచేయించారు. అర్చకుడు ప్రయాగ రాంబాబు, పరిచారకుడు ముత్య వేంకట్రావు తదితరులు పూజలు చేశారు. రత్నగిరిపై రామారాయ కళావేదిక మీద సూర్య నమస్కారాలు, సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవారు సోమవారం ముత్యాల కవచాలు (ముత్తంగి సేవ) ధరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
హంస వాహనంపై వీరేశ్వరుని తెప్పోత్సం
మురమళ్ల గౌతమీ గోదావరిలో విహరిస్తున్న భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఐ.పోలవరం: పార్వతి పరమేశ్వరుల నదీ వీహార మహోత్సవం అంబరాన్ని తాకింది. మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం స్వామి, అమ్మవార్లను మేళతాళాలు, బాజాభజంత్రీలతో, బాణసంచా కాల్పులతో, వివిధ రకాల సాంసృతిక కార్యక్రమాలతో భారీ ఎత్తున గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం వృద్ధ గౌతమీ గోదావరిలో పంచ హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంపై స్వామి, అమ్మవార్లు విహరించారు. -
ఆ రూ.3 లక్షల కోట్లు ఏమయ్యాయి?
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అంబాజీపేట: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 9 నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లు విడుదల చేసినట్లు చెప్పారని, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్లాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం శాసనసభలో రూ.3.22 లక్షల కోట్ల బాహుబలి బడ్జెట్ ప్రవేశ పెట్టిందని, ఇంత భారీ లోటు ఉన్న బడ్జెట్ ఎప్పుడూ చూడలేదని, లెక్కలు ఫుల్.. నిధులు నిల్ అని విమర్శించారు. ిసీపీఐ శత వార్షికోత్సవాల సందర్భంగా అంబాజీపేటకు చెందిన ప్రముఖ సీపీఐ నాయకుడు నేలపూడి సూరన్న 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక మంత్రి కేశవ్ బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతూనే ప్రధాన మంత్రిని పొగడడం సిగ్గుచేటన్నారు. సూపర్ సిక్స్ పథకాలపై భారీ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని, ఎన్ని పథకాలు ఆచరణలో పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. తల్లికి వందనం లేదు, నిరుద్యోగ భృతి లేదు, డీఎస్సీ, మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ లేదని అన్నారు. స్వపక్షం నుంచే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయని, మొత్తం డబ్బు చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ 24, 25 తేదీల్లో విజయవాడలో సీపీఐ అంతర్జాతీయ సెమినార్ జరుగుతుందని, సుమారు 40 దేశాల నుంచి నాయకులు తరలి వస్తున్నారని తెలిపారు. సీపీఐకి మంచి పట్టున్న భద్రాచలంలో శత వార్షికోత్సవ భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని రామకృష్ణ తెలిపారు. అంతకు ముందు సూరన్న చిత్రపటానికి రామకృష్ణ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరీదేవి, గొల్లపల్లి సూర్యారావు, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నేలపూడి స్టాలిన్‌బాబు తదితరులు నివాళులర్పించారు. -
వనామీ.. ధర ఇదేమి!
సాక్షి, అమలాపురం: జాతీయ వనామీ రొయ్యల మార్కెట్ షేర్ మార్కెట్‌ను తలపిస్తోంది. షేర్ మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో అంచనా వేయలేమన్నట్టుగా వనామీ రొయ్యల ధరలను సైతం ఇటు ఆక్వా రైతులు, అటు వ్యాపారులు అంచనా వేయలేకపోతున్నారు. ఒకవైపు అంతర్జాతీయంగా ఎగుమతులు ఆశాజనంగా ఉన్నా.. మరోవైపు బర్డ్ ఫ్లూ వల్ల స్థానికంగా చికెన్ స్థానంలో రొయ్యల వినియోగం పెరిగినా మార్కెట్లో వనామీ ధర తగ్గుతుండటం శోచనీయం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని తీర ప్రాంత మండలాల్లో వనామీ రొయ్యల సాగు అధికంగా సాగుతోంది. కాకినాడ జిల్లాలో సుమారు 8 వేల ఎకరాల్లో ఈ సాగు ఉండగా, కోనసీమ జిల్లాలో 15 వేల ఎకరాల్లో జరుగుతున్నట్టు అంచనా. మొత్తం రెండు జిల్లాల్లో కలిపి 23 వేల ఎకరాల్లో సాగవుతోంది. కాకినాడ జిల్లాలో తొండంగి, తుని రూరల్, యు.కొత్తపల్లి, తాళ్లరేవు, కోనసీమ జిల్లాలో ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో అధికంగా సాగవుతోంది. ప్రస్తుతం మూడొంతుల మంది రైతులు తొలి పంట సాగు చేస్తుండగా, మిగిలిన ఒక వంతు రైతులు గత ఏడాది నవంబర్, డిసెంబర్లో పిల్లలు వదిలారు. ఇప్పుడు ఆ పంట చేతికి వస్తుంది. ఇటీవల కాలంలో ఆక్వా ధరలు ఆశాజనకంగా పెరిగాయి. దీంతో రైతులు పూర్తి స్థాయిలో సాగు ఆరంభించారు. స్వల్పంగా తగ్గిన ధరలు వనామీ రొయ్యల ధరలు గత ఫిబ్రవరి మొదటి వారానికి ఆశాజనకంగా పెరిగాయి. యూరప్ మార్కెట్ నుంచి అధికంగా ఆర్డర్లు వస్తుండడంతో పెద్ద కౌంట్ అయిన 30 కౌంట్ (కిలోకి 30 రొయ్యలు), 40 కౌంట్‌కు డిమాండ్ వచ్చింది. దీంతో రైతుల్లో హుషారు నెలకొంది. కానీ ఈ సమయంలో పట్టుబడులు జరిగి మార్కెట్‌కు వచ్చిన రొయ్యలు చాలా తక్కువ. మార్చి మొదటి వారం నుంచి పట్టుబడులు మొదలు కానున్నాయి. ఈ సమయంలో ధరలు స్వల్పంగా తగ్గుతుండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. కొనుగోళ్లు తగ్గించేసి.. వనామీ రొయ్యలకు మార్కెట్లో కిలోకు రూ.5 నుంచి రూ.25 వరకూ తగ్గింది. ఇదే సమయంలో పెద్ద కౌంట్ రొయ్యలను కొనుగోలు చేయడం స్థానిక వ్యాపారులు తగ్గించేశారు. 30 కౌంట్ కొంత వరకూ కొనుగోలు చేస్తున్నా 40 కౌంట్ నుంచి 50 కౌంట్ మధ్య కొనుగోలు మరీ మందకొడిగా సాగుతోంది. ఈ రకం కొనుగోలుకు వ్యాపారులు కనీసం వారం రోజులు సమయం తీసుకుంటున్నారు. పైగా మార్కెట్లో కిలోకి రూ.25 వరకూ కోత పెడుతున్నారు. నవంబర్‌లో సాగు మొదలు పెట్టిన రొయ్యల చెరువుల్లో ఈ కౌంట్ అధికంగా వస్తోంది. ఇలా ఉమ్మడి జిల్లాలో 7 వేల ఎకరాలకు పైబడి చెరువుల్లో ఈ రకం కౌంట్ వస్తోందని రైతులు చెబుతున్నారు. యూరప్ మార్కెట్ నుంచి వచ్చే కంటైనర్లలో 40 నుంచి 50 కౌంట్ రొయ్యలకు వచ్చే ఆర్డర్లు పదో వంతు తగ్గిపోయాయని కొనుగోలుదారులు చెబుతున్నారు. కానీ రైతులు మాత్రం కొనుగోలుదారులు సిండికేట్‌గా మారి మార్కెట్‌కు ఏ రకం కౌంట్ అధికంగా వస్తుందో చూసి అదే రకం కొనుగోలుకు కొర్రిలు వేస్తున్నారని అంటున్నారు. వీటికి ధరలు కూడా తగ్గిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వినియోగం పెరిగినా.. కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చిన తరువాత చికెన్ వినియోగం దాదాపు తగ్గింది. మేక మాంసం, చేపలు, రొయ్యల వినియోగం పెరిగింది. స్థానికంగా హెచ్చు ధరతో పెద్ద కౌంట్ రొయ్యల కొనుగోలు ఉండదు. వంద కౌంట్ అధికంగా వినియోగిస్తారు. ఇప్పుడు ఈ కౌంట్ ధరను సైతం కొనుగోలుదారులు తగ్గించడం విశేషం. 100 కౌంట్‌కు ఏకంగా రూ.15 వరకు తగ్గించేశారు. జనవరి తరువాత రొయ్య పిల్లలు వదిలిన చెరువుల నుంచి 100 కౌంట్ అధికంగా వస్తోంది. ఇలా మార్కెట్‌కు వచ్చే రొయ్యల ధరలు తగ్గించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ నిలకడగా లేదు వనామీ రొయ్యల ధరలు నిలకడగా ఉండడం లేదు. ఎప్పుడు పెరుగుతు న్నాయో.. ఎప్పుడు తగ్గుతున్నాయో తెలియడం లేదు. పట్టుబడులు సమయంలో ధరలు తగ్గిపోతున్నాయి. అందుకే మంచి కౌంట్ వచ్చినా మాకు నష్టాలే మిగులుతున్నాయి. – చెదళ్ల పాపారావు, ఆక్వా రైతు, సామంతకుర్రు, అల్లవరం మండలం ప్రభుత్వ నియంత్రణ ఉండాలి వనామీ రొయ్యల ధరలను ప్రైవేట్ కొనుగోలుదారులతో పాటు ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. అంతర్జాతీయ మార్కెట్లపై కేంద్ర ప్రభుత్వానికి అవగాహన ఉంటోంది కాబట్టి ధరలను నిర్ణయించే అవకాశం ఉంటోంది. అప్పుడే మార్కెట్లో నిలకడగా ధర ఉంటోంది. – కొక్కిలిగడ్డ లోకేష్, గాడిమొగ, తాళ్లరేవు మండలం ఐ.పోలవరం మండలం మురమళ్లలో వనామీ రొయ్యల చెరువులు మందకొడిగా పెద్ద కౌంట్ కొనుగోళ్లు 50 నుంచి 100 కౌంట్‌కు డిమాండ్ 30 నుంచి 40 కౌంట్‌కు పెద్దగా లేని ఆర్డర్లు మార్కెట్ రేటు కన్నా రూ.10 నుంచి రూ.20 తగ్గించి కొనుగోలు నష్టపోతున్న వనామీ రైతులు రొయ్యల ధరలు ఇలా.. కౌంట్ రకం ఫిబ్రవరి ప్రస్తుతం మొదటి ధర వారంలో 30 కౌంట్ 470 465 40 కౌంట్ 415 390 50 కౌంట్ 375 365 60 కౌంట్ 345 335 70 కౌంట్ 320 300 80 కౌంట్ 285 270 90 కౌంట్ 265 250 100 కౌంట్ 255 240 -
వరాల వసంతం
ప్రత్యేక ప్రార్థనలు ముస్లింలు ఈ మాసమంతా ఆధ్యాత్మికంగా గడుపుతారు. ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనల్లో నిమగ్నమవుతారు. రోజూ సూర్యాస్తమయం వరకూ కఠోర ఉపవాస దీక్షలు పాటిస్తారు. దానధర్మాలు చేస్తారు. ఐదు పూటలా నమాజ్‌తో పాటు తరావీ ప్రార్థనల్లో పాల్గొంటారు. 30 అధ్యాయాలున్న ఖురాన్‌ను నెలలోగా పఠించాలన్న ప్రవక్త ఆదేశాన్ని తప్పక పాటిస్తారు. పేదలకు సంపన్నులు జకాత్ చెల్లిస్తారు. చివరి పది రోజులూ ఇంటిని వదిలి మసీదుల్లో ఉంటూ దైవస్మరణ చేస్తారు. పండగకు ముందు ఫిత్రా ఇస్తారు. ఉపవాస సమయంలో జరిగిన తప్పులు, లోటుపాట్లకు ఈ ఫిత్రా పరిహారం. ఉపవాసాలు పాటించిన వారు, పాటించని వారు, చిన్నాపెద్దా అనే తారతమ్యం లేకుండా దానం చేస్తారు. 30 రోజులు ప్రత్యేకం ● రంజాన్ మాసంలో తొలి 10 రోజులు కారుణ్య దినాలు. ● 10 నుంచి 20 క్షమాపణ రోజులు, ● 20 నుంచి 30 వరకూ నరకాగ్ని నుంచి విముక్తి దినాలు.● నెలవంక దర్శనంతో ప్రారంభమైన పవిత్ర రంజాన్ మాసం ● ఉపవాస దీక్షలకు సిద్ధమైన ముస్లింలు ● తరావిహ్ నమాజ్ ప్రారంభం ● ఉమ్మడి జిల్లా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు ● విద్యుద్దీపాలతో శోభిల్లుతున్న ప్రార్థనా స్థలాలుసాక్షి, రాజమహేంద్రవరం: ముస్లింలకు సమస్త శుభాలూ కలిగించే పవిత్ర మాసం రంజాన్. శనివారం సాయంత్రం నెలవంక దర్శనంతో ఈ మాసం ప్రారంభమైంది. ‘ఓ నెలవంకా! నీ దేవుడు, మా దేవుడు, అందరి దైవం అల్లాహ్ మాత్రమే’ అంటూ ప్రార్థించి నెలవంకను ముస్లింలు వీక్షించారు. మసీదుల్లో ఇమామ్‌లు రంజాన్ మాసాన్ని ప్రకటించారు. దీంతో శనివారం రాత్రి నుంచే తరావీహ్ నమాజ్ ప్రారంభమైంది. ఆదివారం వేకువజాము నుంచి ఉపవాస దీక్షలను ముస్లింలు ప్రారంభిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎలాంటి ఆహారం, కనీసం నీళ్లు కూడా తాగకుండా కఠోర నిష్టతో దీక్ష పాటిస్తారు. ఉమ్మడి ‘తూర్పు’న ఆధ్యాత్మిక శోభ.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా దాదాపు 400 మసీదులున్నాయి. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మసీదులన్నీ ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. రంగురంగుల విద్యుద్దీపాలతో శోభిల్లుతున్నాయి. ముస్లింలు రోజా, నమాజ్, జికర్, దువాలతో గడపనున్నారు. మసీదుల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంటోంది. సహెరి, ఇఫ్తార్ విందులతో హడావుడి కనిపించనుంది. ఉపవాస దీక్షలు ఆచరించేందుకు అవసరమైన నిత్యావసరాలను ముస్లింలు విరివిగా కొనుగోలు చేశారు. ఉపవాసం ప్రత్యేకత ఇస్లాంలో నాలుగో మూలస్తంభం ఉపవాసం. ముస్లిం సమాజం త్రికరణ శుద్ధితో ఆచరించే ఆరాధనా వ్రతమిది. ఎదుటి వారి ఆకలి విలువ గుర్తించాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. ఉపవాసాన్ని అరబీ భాషలో ‘సౌమ్’గా, ఉర్దూలో ‘రోజా’గా పిలుస్తారు. ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం తొమ్మిదో నెల అయిన రంజాన్ మాసంలో ఈ ఆరాధన వ్రతాన్ని పాటిస్తారు. ఇస్లాం ధర్మశాస్త్ర పరిభాషలో సౌమ్ అంటే ఆగి ఉండటం. అంటే ఉషోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ తినడానికి, తాగడానికి, మనోవాంఛలకు దూరంగా ఉండటమని అర్థం. ఉపవాసం మినహాయింపు మనిషి బలహీనతలను, వారి కష్టసుఖాలను బాగా ఎరిగిన దైవం ఉపవాసాన్ని విధిగా నిర్ణయించినప్పటికీ, కొందరికి మినహాయింపులు కూడా ఇచ్చారు. చిన్న పిల్లలు, బాటసారులు, వ్యాధిగ్రస్తులు, వృద్ధాప్యం మరీ ఎక్కువైనవారు, మతిస్థిమితం లేనివారు, అశుద్ధావస్థలో ఉన్న మహిళలకు ఉపావాసం నుంచి మినహాయింపు ఉంది. దివ్య ఖురాన్ అవతరణ మాసం ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించి, సదా ఆచరించే దివ్య గ్రంథం ఖురాన్ ఈ మాసంలోనే అవతరించింది. ఇతర ప్రవక్తలపై ఫర్మానులు సైతం ఇదే నెలలో అవతరించాయి. అందుకే ఈ నెలకు అంత ప్రాధాన్యం. ఈ సమయంలో సైతాను బందీ అవుతాడని, నరక ద్వారాలు మూతపడి స్వర్గ ద్వారాలు తెరచుకుంటాయని ముస్లింల ప్రగాఢ విశ్వాసం. తరావిహ్ నమాజ్ ప్రారంభం రంజాన్ మాసంలో నెలవంక దర్శనమిచ్చినప్పటి నుంచే తరావిహ్ నమాజ్ ప్రారంభమవుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మసీదుల్లో రంజాన్ మాసం ముగిసే (మళ్లీ నెలవంక దర్శనమిచ్చేంత) వరకూ ప్రతి రోజూ రాత్రివేళ నమాజ్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా రోజుకు ఖురాన్‌లోని కొన్ని అధ్యాయాలు చదివి వినిపిస్తారు. మాసం పూర్తయ్యేలోగా ఖురాన్ పఠనం పూర్తి చేస్తారు. నాలుగు వాక్యాలే ప్రధానం పవిత్ర రంజాన్ మాసంలో మహ్మద్ ప్రవక్త నాలుగు విషయాల్ని అధికంగా స్మరించాలని ఉపదేశించారు. వాటి ప్రాముఖ్యతను ధార్మిక పండితులు వివరిస్తారు. లాయిలాహ ఇల్లల్లాహ్, అస్తగ్ఫిరుల్లా.., అస్ అలుకజన్నత్, అవుజుబికమిన్నార్.. ఎక్కువగా పఠించాలి.సంకల్పం ప్రవక్త బోధించిన ‘నవయతు అన్ అసుముగజన్ లిల్లాహి తాలా మిన్ సౌమిరమజాన్’ అనే వచనాలు పఠించి ముస్లింలు ఉపవాస వ్రతానికి శ్రీకారం చుడతారు. ఉపవాస విరమణ సమయంలో ‘అల్లాహుమ్మ లకసుంతు వబిక ఆమంతు, వ అలైక తవక్కత్తు, వ ఆలారిస్కిక అఫ్తర్తు ఫతఖబ్బల్ మిన్ని’ అని వచిస్తారు. ఇఫ్తార్ సూర్యాస్తమయం తరువాత ఏదైనా ఆహారం తీసుకుని ఆ రోజు దీక్షను విరమించడమే ఇఫ్తార్. ఖర్జూరాలతో ఇఫ్తార్ చేయడం ప్రవక్త సంప్రదాయం. అందకే ముస్లింలందరూ ఖర్జూరాలతోనే ఇఫ్తార్ చేస్తారు. దీక్ష విరమించే సమయంలో ఉపవాసి దేనిని అర్థించినా అల్లాహ్ స్వీకరిస్తాడని ప్రగాఢ విశ్వాసం. ఉపవాసికి ఇఫ్తార్ ఇవ్వడం దైవసేవగా భావించి, విందు ఇచ్చేవారి పాపాలను దేవుడు క్షమిస్తాడని ముస్లింలు నమ్ముతారు. సహర్ ఉపవాసం (రోజా) ఉండదలచిన వారు తెల్లవారుజామున 4 గంటల సమయంలో భోజనం చేస్తారు. దీనినే సహర్ అంటారు. సాయంత్రం వరకూ ఏ పదార్థాన్నీ తినరు. ఏదైనా కారణం వల్ల సహర్ తీసుకోకపోయినా వ్రతాన్ని మాత్రం ఆపరు. -
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
● 13,230 మంది విద్యార్థుల హాజరు ● 761 మంది గైర్హాజరు అమలాపురం టౌన్: జిల్లాలో ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ సబ్జెక్ట్‌లకు సంబంధించి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం తెలుగు, హిందీ, సంస్కృతం, ఒకేషనల్‌లో ప్రథమ సంవత్సరం ఫౌండేషన్ కోర్సులకు పరీక్షలు జరిగాయి. మొత్తం 40 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు. జిల్లాలో తొలి రోజు ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. మొత్తం 13,991 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, 13,230 మంది హాజరయ్యారు. 761 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఐఈఓ) వనుము సోమశేఖరరావు ఆధ్వర్యంలో జిల్లా పరీక్షల కమిటీ ప్రతినిధుల పర్యవేక్షణలో పరీక్షలు మొదలయ్యాయి. అమలాపురంలోని డీఐఈఓ కార్యాలయం నుంచి డీఐఈఓ సోమశేఖరరావు జిల్లాలో ప్రారంభమైన పరీక్షలను ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలించారు. ఆధ్యాత్మిక కేంద్రంగా విలసవిల్లి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఉప్పలగుప్తం: హైందవ ధర్మానికి ఆధ్యాత్మిక కేంద్రంగా విలసవిల్లి గ్రామం విరాజిల్లుతుందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. విలసవిల్లి రామ మందిరంలో పవిత్ర మాఘమాసం పురస్కరించుకొని నెల రోజులుగా జరుగుతున్న మహా సౌరయాగ వార్షికోత్సవ పూజల్లో ఎమ్మెల్సీ శనివారం పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు వేదమంత్రాలతో స్వాగతించారు. యాగం విశిష్టతను యాగకర్త మున్నంగి రామకృష్ణశర్మ వివరించి, త్రిమూర్తులుకు వేద ఆశీర్వచనం అందించారు. ఉషా, ఛాయా, పద్మినీ సమేత సూర్య భగవానుని కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నసమారాధన జరిగింది. సర్పంచ్ సలాది ఊర్మిళాదేవి, వైఎస్సార్ సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు సలాది సతీష్, నాయకులు నడింపల్లి గిరిబాబు, శ్రీ తోట రాము, గంధం శ్రీనివాసరావు, నిమ్మకాయల గోపాలరావు, సలాది రవి, కోలాఏసు, కొలిశెట్టి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే లైన్ పనులు వేగవంతం చేయండి
అమలాపురం రూరల్: జిల్లా ప్రజల చిరకాల వాంఛ కోటిపల్లి – నరసాపురం రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అధికారులను ఆదేశించారు. శనివారం అమలాపురం కలెక్టరేట్లో రైల్వే, రెవెన్యూ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. రైల్వే లైన్ ఏర్పాటులో భూసేకరణ నష్ట పరిహారం చెల్లింపు, నష్ట పరిహారం పెంపుపై తీసుకున్న చర్యలు, నూతన అలైన్మెంట్, ట్రాఫిక్ సర్వే తదితర అంశాలపై సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ రైల్వే ఇంజినీర్లు, రెవెన్యూ అధికారుల సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఇప్పటికే రైల్వే లైన్ ఏర్పాటులో భాగంగా భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లోని భూమిని రైల్వే అధికారులు స్వాధీన పరుచుకుని పనులను చేపట్టాలన్నారు. అయినవిల్లి, అమలాపురం రూరల్ మండల గ్రామాల్లో రైల్వే లైనుకు సంబంధించి భూసేకరణ పూర్తయ్యిందన్నారు. ఆ భూములను సర్వే చేసి హద్దులను సూచిస్తూ రైల్వే అధికారులకు అప్పగించాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్ పనుల్లో ఉత్పన్నమైన వివిధ సమస్యలను అధికారులు సమన్వయంతో దశల వారీగా అధిగమించాలన్నారు. సమావేశంలో రైల్వే శాఖ చీఫ్ ఇంజినీర్ కె.సూర్యనారాయణ, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ ఎ.బద్దయ్య, సహాయ కార్య నిర్వాహక ఇంజినీర్ పి.అర్జున్‌రావు, డీఆర్వో బీఎల్ఎన్ రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. -
పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చర్యలు
అమలాపురం రూరల్: జిల్లాలో పారిశ్రామిక వేత్తలుగా మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించే దిశగా పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ఒక్కో నియోజకవర్గంలో 5 నుంచి 25 ఎకరాల విస్తీర్ణం గల స్థలాలను గుర్తించాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. శనివారం అమలాపురంలోని కలెక్టరేట్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు భూసేకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంస్థ ఎన్నో పథకాలను అందిస్తోందన్నారు. ఆ దిశగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. కేవలం భారీ పరిశ్రమల ద్వారా కాకుండా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై ఆధారపడి ఎంతో మంది ఉపాధి పొందుతున్నారన్నారు. పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకునేలా పలు విధానాలు ఎంఎస్ఎంఈ నూతన విధానంలో ఉన్నాయన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, డీఆర్వోబీ ఎల్ఎన్ రాజకుమారి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పీకే పి.ప్రసాద్, ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ జోనల్ మేనేజర్ ఎ.రమణారెడ్డి, ఆర్డీఓలు కె.మాధవి, పి.శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ లా యూనివర్సిటీలో సంజీవయ్య కాంస్య విగ్రహం
● ఆగస్టులో స్నాతకోత్సవం సందర్భంగా ఆవిష్కరణ ● కొత్తపేట వుడయార్ శిల్పశాలలో రూపకల్పన కొత్తపేట: విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (లా యూనివర్సిటీ)లో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య కాంస్య విగ్రహాన్ని నెలకొల్పనున్నారు. దీని తయారీ బాధ్యతను కొత్తపేటకు చెందిన అంతర్జాతీయ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్‌కు అప్పగించారు. ఆయన ఇప్పటికే సంజీవయ్య నమూనా విగ్రహం రూపొందించారు. దీనిని యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ (వీసీ) ప్రొఫెసర్ డి.సూర్యప్రకాశరావు, సంజీవయ్య అన్న కుమారుడు, దామోదరం సంజీవయ్య స్మారక సంస్థ చైర్మన్ దామోదరం రంగయ్య శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వీసీ సూర్యప్రకాశరావు విలేకర్లతో మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా 2008లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విశాఖ ఎంవీపీ కాలనీలో లా యూనివర్సిటీని ప్రారంభించారని తెలిపారు. దీనికి అనుబంధంగా రాయలసీమకు సంబంధించి కడప, తెలంగాణకు సంబంధించి నిజామాబాద్‌లో బ్రాంచ్ యూనివర్సిటీలను ఏర్పాటు చేశారన్నారు. తరువాత ఈ రెండు బ్రాంచ్‌లు తీసివేయగా విశాఖ లా యూనివర్సిటీ బలోపేతమైందన్నారు. ఏపీ లా యూనివర్సిటీకి దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీగా పేరు పెట్టాలని 2013లో అప్పటి ఏపీ శాసన మండలి చైర్మన్, సంజీవయ్య శిష్యుడు అప్పనబోయిన చక్రపాణి ప్రతిపాదించారని, దీనిని ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. 2022 ఫిబ్రవరి 14న సంజీవయ్య శత జయంతి వేడుకల సందర్భంగా ఆయన విగ్రహం నెలకొల్పాలని సంజీవయ్య స్మారక సంస్థ చైర్మన్ దామోదరం రంగయ్య ప్రతిపాదించారని, దీంతోపాటు మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలు కూడా నెలకొల్పాలని యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానించిందని వివరించారు. ఆ మేరకు 10 అడుగుల కాంస్య విగ్రహాలు తయారు చేయాల్సిందిగా శిల్పి రాజ్‌కుమార్‌కు ఆర్డర్ ఇచ్చామన్నారు. విగ్రహాలు జీవకళతో ఉట్టి పడుతున్నాయన్నారు. ఆగస్టు మొదటి వారంలో వర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పి.శ్రీనరసింహ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఽయూనివర్సిటీ చాన్స్‌లర్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చేతుల మీదుగా విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నామని వీసీ తెలిపారు. కార్యక్రమంలో లా యూనివర్సిటీ ప్రొఫెసర్ దాసరి సుజాత పాల్గొన్నారు. -
వాలీబాల్ పోటీలో విజేత ఇన్కమ్ ట్యాక్స్ చైన్నె
ఉప్పలగుప్తం: జాతీయ వాలీబాల్ పోటీల్లో ఇన్కమ్ ట్యాక్స్ చైన్నె జట్టు విజేతగా నిలిచింది. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో జరుగుతున్న అరిగెల శ్రీరంగయ్య మెమోరియల్ నేషనల్ మెన్ వాలీబాల్ టోర్నమెంట్ శనివారం రాత్రితో ముగిసింది. ఫైనల్స్‌లో ఇన్కమ్ టాక్స్ చైన్నె జట్టు తమ సమీప ఇండియన్ బ్యాంక్ చైన్నె జట్టుపై 26–24, 25–23, 25–22 తేడాతో వరుస మూడు సెట్లలో విజయం సాధించింది. ముంబయి హూపర్స్ మూడు, ముంబయి జీఎస్టీ జట్టు నాల్గో స్థానాలు దక్కించుకున్నాయి. ప్రేక్షకుల హృదయాలను గెలిచేలా.. గెలుపు.. ఓటములను పక్కన పెడితే మొత్తం జాతీయ వాలీబాల్ పోటీలో ముంబయి జట్టు ప్రేక్షకుల మనసుల్లో విజేతగా నిలిచింది. ముంబయి హూపర్స్ జట్టులో ఎక్కువ మంది క్రీడాకారులు చైన్నె గల్లీ టీమ్ సభ్యులు. కానీ వారు జాతీయ క్రీడాకారులను తలదన్నేలా పోటీ పడ్డారు. ఈ జట్టు క్రీడాకారులకు కనీసం కాళ్లకు షూ కూడా లేవు. కానీ ప్రతి క్రీడాకారుడు అద్భుత ప్రతిభ కనబరుస్తూ ప్రేక్షకుల నుంచి జేజేలు అందుకున్నాడు. ఈ జట్టులో జర్సీ నెంబర్ సెవెన్ సెల్వన్ సెట్టర్‌గా ఉత్తమ ప్రతిభ పాటవాలు ప్రదర్శించారు. ఈ జట్టు టోర్నమెంట్లో మూడవ స్థానం దక్కించుకుంది. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు లకీ్ష్ నారాయణ, డీఎస్పీ ప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి గొలకోటి ఫణి పాల్గొన్నారు. -
మరోసారి మోసానికి తెరతీసిన కూటమి
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అమలాపురం టౌన్: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తుంటే మరోసారి మోసానికి తెరతీసినట్లు ఉందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాలంటూ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఆ పథకాల అమలుకు కేటాయింపులు ఏమీ చేయలేదన్నారు. తల్లికి వందనం పథకానికి అరకొర నిధులు బడ్జెట్లో కేటాయించి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని వర్గాలకు మేలు జరిగిందని గుర్తుచేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 143 హామీలను గాలిలో కలిపేసేలా బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఎమ్మెల్సీ విమర్శించారు. ఇందులో పేదల ప్రయోజనాలు కనిపించలేదని అన్నారు. అమరావతిని ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన అప్పుతో అభివృద్ధి చేయనున్నారని, బడ్జెట్లో అదేదో కూటమి ప్రభుత్వం గొప్పలుగా చెబుతోందన్నారు. ఈ బడ్జెట్ డబ్బున్న వ్యక్తులకు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైందని చెప్పారు. రైతులు, చేనేత కార్మికులు ఇలా ప్రతి రంగానికి అన్యాయం జరిగిందన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, పార్టీ నాయకుడు ముంగర ప్రసాద్ పాల్గొన్నారు. ఆర్థిక భారం మోపేలా బడ్జెట్ ప్రత్తిపాడు: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలపై పన్నుల భారం మోపేలా ఉందని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బుగత బంగార్రాజు విమర్శించారు. గత ప్రభుత్వం కంటే పథకాలకు, సంక్షేమానికి చాలా తక్కువగా నిధులు కేటాయించి, ఎన్నికల హామీలు అమలు చేస్తామనడం ప్రజలను మోసం చేయడమేనని వ్యాఖ్యానించారు. ప్రత్తిపాడు లిబరేషన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తలకు మించి హామీలిచ్చిన చంద్రబాబు తల్లికి వందనంలో నిర్ధిష్టమైన విధానాన్ని ప్రకటించకుండానే కేటాయింపులు చేశారన్నారు. గత ప్రభుత్వం రూ.17 వేల కోట్లు అమ్మ ఒడికి కేటాయించి, ఇంటికి ఒకరికి అమలు చేస్తే... ప్రస్తుతం బడ్జెట్లో రూ. 1,500 కోట్లు కేటాయించి అందరికీ వర్తింపచేస్తాననడం బూటకం కాదా అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వం రైతు భరోసాకు రూ. 1800 కోట్లు, ఇరిగేషన్ శాఖకు రూ. 24.73 వేల కోట్లు, విద్యకు రూ. 11.03 కోట్లు, ప్రజారోగ్యానికి రూ. 6.02 కోట్లు కేటాయిస్తే... ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసాకు రూ. 900 కోట్లు, ఇరిగేషన్‌కు రూ. 23.98 కోట్లు, విద్యకు రూ. 10.9 కోట్లు, ప్రజారోగ్యానికి రూ. 0.98 కోట్లు కేటాయించడం చూస్తుంటే మౌళిక వసతులను నిర్లక్ష్యం చేసేలా ఉందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 20 లక్షల ఉద్యోగాల కల్పన, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేంతవరకు ఇస్తానన్న నిరుద్యోగ భృతికి కేటాయింపులే లేవన్నారు. రాష్ట్రంలో 16,340 టీచర్ పోస్టులు డీఎస్సీ ద్వారా ప్రకటించారని, ఇది ముందుకు సాగే విధాన ప్రకటన లేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు, 19 ఏళ్లు దాటిన మహిళలకు ఆసరా పథకానికి బడ్జెట్లో ప్రస్తావనే లేకపోవడం.. ప్రజలను దగా చేయడమేనన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెబుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు ఇప్పటివరకూ కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా రాష్ట్రానికి తీసుకురాలేదన్నారు. సమావేశంలో అఖిల భారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర కమిటీ సభ్యుడు మానుకొండ లచ్చబాబు తదితరులు పాల్గొన్నారు. -
యువికా.. ప్రతిభకు వేదిక
ఫ ఇస్రో ఆధ్వర్యంలో యువ విజ్ఞాన కార్యక్రమం ఫ 9వ తరగతి విద్యార్థులకు చక్కని అవకాశం ఫ మార్చి 23 వరకూ దరఖాస్తులకు గడువు రాయవరం: అంతరిక్ష విజ్ఞానం, స్పేస్ అప్లికేషన్స్‌పై అవగాహన కల్పించేందుకు యువికా–2025 (యంగ్ సైంటిస్ట్) కార్యక్రమాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రూపొందించింది. అంతరిక్షంలో ఎలా ఉంటుంది.. ఉపగ్రహాల ప్రయోగం ఎలా చేస్తారు.. ఇలాంటి అంశాలపై శాస్త్రవేత్తలతో నేరుగా మాట్లాడే అవకాశాన్ని విద్యార్థులకు కల్పిస్తుంది. వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి యువ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 9వ తరగతి విద్యార్థులకు చక్కని తోడ్పాటు అందిస్తుంది. యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా) పేరుతో అర్హులకు ఈ శిక్షణ ఇవ్వనుంది. ప్రతిభావంతులకు.. విద్యార్థి దశ నుంచే సైన్స్‌పై ఆసక్తి చూపి ఎందరో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. అటువంటి విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మెరుస్తున్నారు. వారి కోసం ఇస్రో ప్రత్యేకంగా యువ విజ్ఞాన కార్యక్రమాన్ని ‘యువికా’ పేరుతో నిర్వహిస్తోంది. 2024–25 విద్యా సంవత్సరంలో ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇస్రో.జీవోవీ.ఇన్‌లో ఈ నెల 24 నుంచి మార్చి 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. వచ్చిన దరఖాస్తుల నుంచి ఏప్రిల్ 7న మొదటి విడత ఎంపిక జాబితా విడుదల చేస్తారు. అర్హతలివీ.. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు యువికా–2025 దరఖాస్తుకు అర్హులు. 8వ తరగతి పూర్తి చేసి, ప్రస్తుతం 2024–25 విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే దరఖాస్తుకు అవకాశముంది. విద్యార్థి విద్యాభ్యాస కాలంలో చూపించిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాష్ట్ర సిలబస్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. ఎంపిక పద్ధతి 8వ తరగతిలో పొందిన మార్కులు (50 శాతం), మూడేళ్లలో పాఠశాల, జిల్లా, రాష్ట్ర/జాతీయ స్థాయిలో నిర్వహించిన ఏదైనా వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొంటే (2/5/10 శాతం), ఆన్లైన్ క్విజ్‌లో ప్రతిభకు (10 శాతం), ఒలింపియాడ్‌లో పాల్గొని పాఠశాల/ జిల్లా/ రాష్ట్ర స్థాయిల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి (2/ 4/ 5శాతం), రిజిస్టర్డ్ క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలు, అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటిన వారికి (2/ 4/ 5శాతం), మూడేళ్లలో స్కౌట్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ప్రతిభ చూపిన వారికి (5 శాతం), గ్రామీణ ప్రాంతంలో చదువుతున్న వారికి (15 శాతం) మార్కులు ఇస్తారు. జాతీయ స్థాయిలో ఎంపికై న వారికి మే 18వ తేదీ నుంచి 30 వరకు ఆయా కేంద్రాల్లో పూర్తిగా రెసిడెన్షియల్ పద్ధతిలో శిక్షణ ఇస్తారు. ఎంపికై న విద్యార్థితో పాటు తల్లిదండ్రుల్లో ఒకరు లేదా గైడ్ టీచర్‌కు కూడా ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. శిక్షణ అనంతరం శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లి అక్కడి విశేషాలను వివరిస్తారు. ఏడు శిక్షణ కేంద్రాల్లో.. విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఏడు కేంద్రాలను ఎంపిక చేశారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్, బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్, అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్, హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఐఐఆర్ఎస్, డెహ్రాడూన్, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, శ్రీహరికోటలో ఎంపికై న విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. దరఖాస్తు విధానం నాలుగు దశల్లో విద్యార్థులు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటగా ఈ–మెయిల్ ఐడీతో వివరాలు నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న 48 గంటల వ్యవధిలో ఇస్రో ఏర్పాటు చేసిన ఆన్లైన్ క్విజ్‌లో పాల్గొనాలి. క్విజ్ పూర్తి చేసిన 60 నిమిషాల తర్వాత యువికా పోర్టల్‌లో ఆన్లైన్ దరఖాస్తుతో పూర్తి వివరాలు నమోదు చేసి సమ ర్పించాలి. మూడేళ్లలో వివిధ అంశాల్లో విద్యార్థి సా ధించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ ప త్రాలు ఏవైనా ఉంటే, వాటి జెరాక్స్ కాపీలపై విద్యార్థి సంతకం చేసి అప్లోడ్ చేయాలి. దరఖాస్తులు సమర్పించేందుకు మార్చి 23వ తేదీ వరకూ అవకాశముంది. ఎంపిక జాబితాను రెండు విడతల్లో ప్రకటించి అర్హత సాధించిన వారికి సమాచారం అందిస్తారు. యువికా శిక్షణకు ఎంపికై న వారికి శిక్షణకు హాజరయ్యేందుకు రవాణా చార్జీలు, బస, భోజన వ సతితో పాటు అన్ని సౌకర్యాలను ఇస్రో కల్పిస్తుంది. -
పొగాకు బ్యారన్లు, పాకలు దగ్ధం
సీతానగరం: మండలంలోని కాటవరంలో నాలుగు పొగాకు బ్యారన్లు, మూడు రెల్లుగడ్డి పాకలకు అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం కాటవరం పెట్రోల్ బంకు దగ్గరలో సాయంత్రం 5 గంటలకు చిట్టూరి వరప్రసాద్, పోలిన ప్రకాశం, చిట్టూరి వీర్రాజులకు చెందిన పొగాకు బ్యారన్లలో వర్జీనియా పొగాకు క్యూరింగ్ జరుగుతుండగా, ప్రమాదవశాత్తు బ్యారన్లో గొట్టాలపై ఆకులు పడి అగ్ని ప్రమాదం జరిగింది. దానితో నాలుగు బ్యారన్లు, మూడు పాకలు పూర్తిగా దగ్ధమయ్యాయి. బ్యారన్లలో ఉన్న పొగాకు, ములకలకర్రలు, బాజులు, అలాగే రెల్లుగడ్డి పాకల్లో ఉంచిన పొగాకు బేళ్లు కాలిపోయాయి. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో స్థానికులు ఇళ్ల వద్ద ఉన్న మోటార్లు వేసి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. రాజమహేంద్రవరం నుంచి రెండు అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 లక్షల నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. -
దినకర తేజ... ధరణీనాయక
ఫ దారులన్నీ వాడపల్లి క్షేత్రానికే.. ఫ ఒకేరోజు రూ.44.31 లక్షల ఆదాయం కొత్తపేట: దినకర తేజా గోవింద.. ధరణీనాయక గోవింద అంటూ ఆ స్వామిని కీర్తిస్తూ భక్తజనం మురిసింది.. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం ఆధ్యాత్మిక చింతనతో బాసిల్లింది. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే వాడపల్లి బాట పట్టారు. పావన గౌతమీ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, క్యూ లైన్లలో బారులు తీరి మరీ స్వామివారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. తలనీలాలు సమర్పించారు. ఏడు శనివారాల వెంకన్న దర్శనం నోము ఆచరించే భక్తులు మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేశారు. అర్చకులు సుప్రభాత సేవతో ప్రారంభించి వివిధ సేవలు నిర్వహించారు. రంగురంగుల సుగంధ భరిత పుష్పాలతో స్వామివారిని అలంకరించారు. స్వామి దర్శనం, తీర్థప్రసాదాల స్వీకరణ అనంతరం అన్నసమారాధనలో వేలాది మంది అన్న ప్రసాదం స్వీకరించారు. దేవదాయ– ధర్మదాయ శాఖ డిప్యూ టీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఇతర అధికారులు, సిబ్బంది భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లను పర్యవేక్షించారు. వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఈ ఒక్కరోజు దేవస్థానానికి సాయంత్రం 4 గంటల వరకూ రూ 44.31 లక్షల ఆదాయం వచ్చినట్టు ఈఓ తెలిపారు. రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్ఐ ఎస్.రాము, వాడపల్లిలో ట్రాఫిక్ నియంత్రించి, బందోబస్తు పర్యవేక్షించారు. ఏపీఎస్ ఆర్టీసీ వివిధ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుంచి వాడపల్లికి ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపింది. -
సద్వినియోగం చేసుకోండి
విద్యార్థులు కలలను సాకారం చేసుకోవడానికి ఇది చక్కని అవకాశం. దీనిని అందిపుచ్చుకునేందుకు విద్యార్థులు ప్రయత్నించాలి. ఇస్రో పేర్కొన్న అర్హతలు కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకునేలా సైన్స్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ఇది మంచి మార్గం. –జీవీఎస్ సుబ్రహ్మణ్యం, జిల్లా సైన్స్ అధికారి, అమలాపురం ఎంతో ఉపయుక్తం యువికాకు అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. శాస్త్రవేత్తలు కావాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయుక్తం. ప్రశ్నించేతత్వమే ప్రయోగాలకు, శాస్త్రవేత్తలు కావడానికి కారణమవుతుంది. డీఈఓలు, డీవైఈఓలు, జిల్లా సైన్స్ అధికారులు, సైన్స్ టీచర్లు శ్రద్ధ తీసుకుని అధిక సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా చూడాలి. –జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కిర్లంపూడి: ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడని ఎస్సై జి.సతీష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. సోమవరం గ్రామానికి చెందిన సుంకు నూకరాజు (47) అదే గ్రామంలో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నాడు. స్థానిక పరిసర గ్రామాల్లో తన ట్రక్ ఆటోలో వాటర్ బాటిల్స్ డెలివరీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి యర్రవరంలో వాటర్ బాటిల్ వేసి తిరిగి వస్తుండగా సోమవరం జాతీయ రహదారిపై మలుపు తిరుగుతున్న సమయంలో రాజమహేంద్రవరం వైపు నుంచి వైజాగ్ వెళుతున్న కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది. ఆటోలో ఉన్న నూకరాజు తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. దీంతో కార్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని ఎస్సై తెలిపారు. మృతుడీకి భార్య, పెళ్లైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడు కుమార్తె టిక్కా సంగీత ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. డ్రైవర్ దుర్మరణం పి.గన్నవరం: స్థానిక కొత్త అక్విడెక్టుపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. మామిడికుదురు మండలం ఈ దరాడకు చెందిన డ్రైవర్ ఇంజరపు దుర్గావెంకట నాగరామకృష్ణ (39) రాజమహేంద్రవరం నుంచి ఇంటికి ఆటోపై వస్తుండగా, మలికిపురం నుంచి ఆలమూరుకు వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొంది. దీంతో రామకృష్ణ అక్కడిక్కడే మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహానికి రాజోలు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఎస్సై బి.శివకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. తేనెటీగల దాడి సామర్లకోట: స్థానిక సీబీఎం సెంటర్లో తేనెటీగల దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం సీబీఎం సెంటర్లో కేబుల్ వైరు పనులు, చిరు వ్యాపారులు పనులు చేసుకొంటున్న సమయంలో ఆకతాయిలు చెట్టుపై ఉన్న తేనె పుట్టను కొట్టడంతో ఒకసారిగా తేనెటీగలు చెలరేగిపోయాయి. ఆ రోడ్డుపై ఉన్న వారిపై దాడి చేశాయి. దాంతో ప్రయాణికులతో పాటు చిరు వ్యాపారస్తులు, కేబుల్ టెక్నీషియన్లు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే సమీపంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స చేశారు. -
అబద్ధాల కుప్పగా ఏపీ బడ్జెట్: మార్గాని భరత్
సాక్షి, తూర్పుగోదావరి: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అబద్ధాల కుప్పగా, చంద్రబాబు మోసాలకు ప్రతిరూపంగా ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆక్షేపించారు. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు, ఇప్పుడు కేటాయింపులకు పొంతన లేకుండా బడ్జెట్ రూపొందించారని, ఇదంతా సూపర్ సిక్స్ పథకాల అమల్లో ప్రజలను మోసం చేయడంలో భాగమే అని ఆయన ఆరోపించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర నిధులు కేటాయించడం చూశాక వాటిని కూడా సక్రమంగా అమలు చేయరన్నది స్పష్టమవుతోందని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన మార్గాని భరత్ చెప్పారు.మార్గాని భరత్ ఇంకా ఏమన్నారంటే..:ఎవరు కౌటిల్యుడు? ఎవరు చంద్రగుప్తుడు?:అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా పయ్యావుల కేశవ్ తనను తాను కౌటిల్యుడిగా, చంద్రబాబును చంద్రగుప్త మౌర్యుడిగా పోల్చాడు. సామాన్యుడి సంక్షేమమే తన సంక్షేమంగా భావించి ప్రజలకు మేలు చేసిన చంద్రగుప్త మౌర్యుడితో చంద్రబాబును పోల్చడం విడ్డూరంగా ఉంది. సూపర్ సిక్స్ హామీలకు సంబంధించిన బడ్జెట్లో నిధులు కేటాయించకుండా గొప్పలు చెప్పుకోవడం కన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా?. ఇప్పటికే కూటమి ప్రభుత్వం దాదాపు రూ.1.40 లక్షల కోట్ల అప్పు చేసింది. మరోవైపు బడ్జెట్ ప్రసంగంలో భారతదేశంలో అప్పు తీసుకునే శక్తి లేని రాష్ట్రంగా ఏపీ తయారైందని ఆర్థిక మంత్రి పచ్చి అబద్ధాలు చెప్పారు. ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్లో ఆదాయం కింద రూ.2.17 లక్షల కోట్లు వస్తుందని అంచనా వేశారు. ఇందులో రూ. 1.04 లక్షల కోట్లు అప్పు కింద సమీకరిస్తున్నామని వారే చెప్పారు.మాటలకు చేతలకు పొంతన లేదు:అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా తీసుకెళ్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం రెవెన్యూ వ్యయం కింద రూ.2.51 లక్షల కోట్లు కేటాయించి, మూలధన వ్యయం కింద కేవలం రూ.40 వేల కోట్లు కేటాయించింది. అంటే వారు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదని అర్థమవుతుంది. 1995లో ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారి సీఎం అయిన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ప్రభుత్వం జీతాలివ్వలేని స్థితిలో ఉందని చెప్పి, అంతకు ముందు పాలించిన ఎన్టీఆర్‌ను ఘోరంగా అవమానించారు. వాస్తవానికి ఆ రోజుల్లో మిగులు బడ్జెట్ ఉంటే ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు సీఎం అయ్యాకే రాష్ట్రం అప్పులపాలైంది. సీనియర్ నాయకుడు అయి ఉండి కూడా బడ్జెట్ ప్రసంగంలో పయ్యావుల కేశవ్ తన మంత్రి పదవి కాపాడుకోవడానికి నారా లోకేష్‌ను, సీఎం చంద్రబాబును పొగిడే దుస్థితికి దిగజారిపోయారు.పారిశ్రామికవేత్తలను తరిమేస్తున్నారు:పెయిడ్ ఆర్టిస్టును అడ్డం పెట్టి చంద్రబాబు ప్రభుత్వం సజ్జన్ జిందాల్‌ను వేధించి ఏపీ నుంచి తరిమేస్తే ఆయన కంపెనీ జేఎస్‌డబ్ల్యూ మహారాష్ట్రలో రూ.3 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతోంది. ఇలాంటోళ్లు జగన్ పారిశ్రామికవేత్తలను తరిమేశాడని తప్పుడు ప్రచారం చేశారు. పొరుగునే ఉన్న తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు దావోస్‌లో లక్షల కోట్లు ఒప్పందాలు చేసుకుంటే.. రాష్ట్ర యువతకు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలిస్తామన్న తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ ఉత్త చేతులతో తిరిగొచ్చారు. ఉద్యోగాలివ్వలేని పక్షంలో నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు, ఆ పథకానికి బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించకుండా 20 లక్షల మంది నిరుద్యోగ యువతను నిలువునా మోసగించాడు.పథకాలన్నీ నిర్వీర్యం:ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మార్చి ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ట్రస్టు మోడల్ నుంచి ఇన్సూరెన్స్ మోడల్‌కి మార్చేసి పేదలకు ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మార్చేశారు. గతేడాది బడ్జెట్లో సూపర్ సిక్స్‌లో ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా, ఈ ఏడాది బడ్జెట్లో కూడా ఫ్రీ బస్, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి పథకాలకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోగా, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర నిధులు కేటయించి అమలు చేయడంపైనా ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నారు. 50 ఏళ్లు దాటిన బీసీలకు పింఛన్ ఇస్తామని మాట తప్పారు. అందుకే చంద్రబాబును నమ్మితే పులి నోట్లో తల పెట్టడమేనని, ఎన్నికల ముందు జగన్ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని మార్గాని భరత్ గుర్తు చేశారు. -
యూట్యూబర్ చర్యతో స్టేడియంలో గోతులు
అమలాపురం రూరల్: వ్యూస్ కోసం కొందరు యూట్యూబర్లు విచక్షణను వదిలేస్తున్నారు. అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియం గ్రౌండ్‌ను ఓ యూట్యూబర్ అనుచరులు గోతులమయం చేశారు. ఈ చేష్టలను జిల్లా క్రీడాఅభివృద్ధి అధికారి అడ్డుకోవడంతో అక్కడి నుంచి పారిపోయారు. సుమారు 300 మందిని వెంటబెట్టుకుని ఓ యూట్యూబర్ (YouTuber) బాలయోగి స్టేడియం గ్రౌండ్లోకి(Balayogi Stadium Ground) ప్రవేశించాడు. ఈ గ్రౌండ్లో బంగారం పాతిపెట్టానని, అది ఎవరికి దొరికితే వారిదే అంటూ అక్కడ వచ్చిన యువకులను ఉసిగొల్పాడు. దాంతో వారు చేతికి దొరికిన వస్తువుతో గ్రౌండ్‌ను తవ్వడం మొదలెట్టారు. దీనిని గమనించిన జిల్లా క్రీడాభివృద్ధి అధికారి సురేష్‌కుమార్ వారి చర్యలను నిలుపుదల చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
సూపర్ సిక్
గోదావరి డెల్టాకూ అరకొరే.. గోదావరి డెల్టా అభివృద్ధి పనులకు కేటాయింపుల విషయంలోనూ ప్రభుత్వం రైతుల అంచనాలను అందుకోలేకపోయింది. గత ఏడాది బడ్జెట్లో రూ.70 కోట్లు చూపించిన ప్రభుత్వం ఈ ఏడాది రూ.200 కోట్లు కేటాయించింది. ఐదు జిల్లాల పరిధిలో ఉన్న డెల్టాకు ఈ కేటాయింపులు ఏ మూలకని రైతులు అంటున్నారు. ఒక్క కోనసీమ నుంచే రూ.350 కోట్లకు ప్రతిపాదన పంపించిన విషయం గమనార్హం. రైతులంటే చిన్నచూపు రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం అరకొర నిధులు కేటాయించింది. వ్యవసాయ రంగాన్ని, రైతులను చిన్నచూపు చూసింది. ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని గాలికి వదిలేసింది. ఇవ్వాల్సిన సొమ్ములో సగమే ఇస్తామని చెప్పడం భావ్యం కాదు. అర్హులందరికీ అన్నదాత సుఖీభవ అందించాలి. – భూపతిరాజు సత్యనారాయణరాజు, రైతు, గంటి, కొత్తపేట మండలం ‘దీపం’ లబ్ధిలోనూ మోసమే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలులో లబ్ధిదారులను మోసం చేస్తోంది. రాష్ట్రంలో 1.55 కోట్ల మంది మహిళలకు దీపం పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాల్సి ఉండగా, కేవలం 90 లక్షల మందికే ఇస్తోంది. దీనివల్ల జిల్లాలో మూడు వంతుల్లో ఒక వంతు మహిళలకు లబ్ధి చేకూరదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సంక్షేమ పథకాలను అన్నివర్గాలకు ఓ టైమ్ టేబుల్ ప్రకారం అందించారు. సంక్షేమం అంటే అది. – కొల్లాటి దుర్గాభవానీ, అమలాపురం మహిళలను నిరాశ పరిచేలా.. మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పిన హామీకి బడ్జెట్లో కేటాయింపులు లేవు. తల్లికి వందనం ఇప్పటికే ఒక ఏడాది ఇవ్వలేదు. దీపం పథకంలో ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అని చెప్పి గత ఏడాది ఒక్క సిలిండర్ మాత్రమే ఇచ్చారు. బడ్జెట్లో ఈ పథకాన్ని సగానికి కుదించేస్తున్నారు. అర్హులందరికీ పథకాలు ఇవ్వలేనప్పుడు అమలు చేస్తామని ఎలా చెబుతున్నారు. ఈ బడ్జెట్ మహిళలను తీవ్రంగా నిరాశపరిచింది. – వంగా గిరిజా, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు, సన్నవిల్లి, ఉప్పలగుప్తం మండలం సాక్షి, అమలాపురం: ‘‘అన్న మాటకు కట్టుబడడం.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం’’ అనేది తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి నిరూపించారు. ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలమైంది. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన 2025–26 బడ్జెట్ చూస్తే అది తేటతెల్లమైంది. అందులో కేటాయింపులు పరిశీలిస్తే పేదలు, వారికి అమలు చేసే సంక్షేమ పథకాలు.. రైతులు.. నిరుద్యోగులు.. మహిళల ప్రయోజనాలపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని నిరూపించుకుంది. మహిళా శక్తి, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణానికి పైసా ఇవ్వని ప్రభుత్వం.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకాలకు భారీగా కోత విధించింది. ఈ బడ్జెట్‌పై జిల్లాలో అన్నివర్గాల ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇటు సంక్షేమం లేదు.. అటు అభివృద్ధి లేదని వారు నిట్టూర్పు వదులుతున్నారు. ప్రధాన పథకాలకు దగాదగా ● మహిళా శక్తి పథకంలో వనితలకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పిన చందబ్రాబు ప్రభుత్వం, దానికి ఈ బడ్జెట్లో ఎగనామం పెట్టింది. ఈ పథకం ద్వారా జిల్లాలో 6.03 లక్షల మంది లబ్ధి పొందాల్సి ఉంది. నెలకు రూ.90.45 కోట్ల చొప్పున ఏడాదికి రూ.1,085.40 కోట్లను కోల్పోవాల్సి వచ్చింది. ● ‘నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు’ అంటూ ఒక ఇంట్లో ఎంత మంది విద్యార్థులుంటే అందరికీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు చెప్పినా, భారీగా కోత విధించారు. బడ్జెట్లో రూ.8,276 కోట్లు మాత్రమే తల్లికి వందనం పథకానికి కేటాయించారు. రూ.12 వేల కోట్లకుపైగా తల్లికి వందనం పథకానికి అవసరం ఉంటుంది. గత ఏడాది ఈ పథకానికి ఎగనామం పెట్టిన ప్రభుత్వం ఈ ఏడాది సగం కోత విధించింది. దీనివల్ల జిల్లాలో 2.80 లక్షల మందికి కలగాల్సిన లబ్ధిని కూటమి ప్రభుత్వం చాలా మందికి కోత పెట్టినట్టే. ● దీపం పథకానికి భారీగా ఎసరు పెట్టింది. రాష్ట్రంలో 1.55 కోట్ల మంది లబ్ధిదారులను 90 లక్షలకు కుదించింది. బడ్జెట్లో రూ.4 వేల కోట్లకు గాను రూ. 2,601 కోట్లు మాత్రమే కేటాయించింది. దీనివల్ల జిల్లాలో 3.90 లక్షల మంది వరకూ ఉండగా, ఇప్పుడు వీరి సంఖ్య 1.95 లక్షలకు తగ్గిపోనుంది. ● డ్వాక్రా మహిళలకు బడ్జెట్లో కూటమి ప్రభుత్వం టోకరా వేసింది. రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాల పథకం ప్రభుత్వం ప్రకటించలేదు. ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకూ సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్ర భుత్వం కేటాయింపుల్లో చూపించలేకపోయింది. ● అన్నదాత సుఖీభవ పథకానికీ సగమే కేటాయించింది. కేవలం రూ.6300 కోట్లు మాత్రమే ఇచ్చింది. రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దీనికి రూ.10,400 కోట్లు అవసరం కాగా రూ.6,300 కోట్లు కేటాయింపులు చేసింది. ఇప్పటికే ఒక ఏడాది ఎగవేసింది. జిల్లాలో 1,45,890 మంది లబ్ధిదారులకు ఏడాదికి రూ.204.24 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఈ ఏడాది ప్రభుత్వం ఇస్తే సుమారు 95 వేల మందికి మాత్రమే లబ్ధి చేకూరనుంది. ● ఉచిత బస్సు హామీని బడ్జెట్లో తుస్సు మనిపించింది. ఈ పథకానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. దీనివల్ల సుమారు తొమ్మిది లక్ష మంది మహిళలను ప్రభుత్వం మోసం చేసినట్టయ్యింది. కీలక పథకాలకు బడ్జెట్లో ఎగనామం నిధుల కోతపై ప్రజల పెదవివిరుపు మహిళా శక్తి, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు మాటేలేదు అన్నదాత సుఖీభవ, దీపం పథకాలకు కోత చేనేతలకు మొండిచెయ్యి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో చేనేత కార్మికులకు మొండి చెయ్యి చూపింది. ఎన్నికల ముందు బూటకపు హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను గాలికి వదిలేసింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నేతన్న నేస్తం పథకం ద్వారా రూ.24 వేలు నేరుగా లబ్ధిదారులకు అందించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేనేత రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. –జాన జగదీష్ చంద్రగణేష్, వైఎస్సార్ సీపీ జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు నిధులు ఏ మాత్రం సరిపోవు తల్లికి వందనం పథకానికి ప్రభుత్వం కేటాయించిన నిధులు ఏ మాత్రం సరిపోవు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ పథకానికి రూ.12 వేల కోట్లు కేటాయించాలి. ప్రతి విద్యార్థికి ఇస్తానన్న రూ.15 వేలు వారి ఖాతాల్లో జమ చేయాలి. గత ఏడాది ఇవ్వాల్సిన నిధులు కూడా అందించాలి. అంతే కాకుండా ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే ప్రకటించి, టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. – బి.సిద్ధూ, రాష్ట్ర సహాయ కార్యదర్శి, పీడీఎస్‌యూ, వెదురుపాక, రాయవరం మండలం ప్రజా వ్యతిరేక బడ్జెట్ ఇది బడ్జెట్లో సూపర్ సిక్స్ పథకాలకు నిధుల కేటాయింపు లేవు. తల్లికి వందనం పథకానికి అరకొర నిధులు ఇచ్చారు. దీంతో ప్రభుత్వం అర్హులకు లబ్ధి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందని తేటతెల్లమవుతోంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కనీసం డీఏ, పీఆర్సీ, ఐఆర్లకు నిధులు ఇవ్వలేదు. రైతులు, చేనేత కార్మికులకు ఇలా పలు రంగాలను విస్మరించారు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్. – బొమ్మి ఇజ్రాయిల్, ఎమ్మెల్సీ -
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం
కలెక్టర్ మహేష్ కుమార్ అమలాపురం రూరల్: ప్రకృతి సాగు ఉత్పత్తులకు జిల్లాలోని రైతు బజార్లలో ప్రత్యేక దుకాణాలను కేటాయించి, ఆ అమ్మకాలను ప్రోత్సహిద్దామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సూచించారు. శుక్రవారం అమలాపురం కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, రానున్న ఖరీఫ్ సీజన్ యాక్షన్ ప్లాన్ రూపొందించడానికి వ్యవసాయ, హార్టికల్చర్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులతో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తుల స్టాల్స్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాల్లో 2024 –25 ఆర్థిక సంవత్సరంలో 92 గ్రామాల్లో 22,399 మంది రైతులు 22,586 ఎకరాల్లో పూర్తిగా లేదా పాక్షికంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారన్నారు. ఈ వ్యవసాయంతో భూమి కలుషితం కాకుండా ఉంటుందని, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా కాపాడవచ్చన్నారు. ఏటీఎం మోడల్ ద్వారా 20 సెంట్ల భూమిలో 15 నుంచి 20 రకాల ఆకుకూరలు, కూరగాయలు, దుంపలు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించవచ్చని వివరించారు. జిల్లా వ్యవసాయ అధికారి బోసుబాబు, డీఆర్డీఏ పీడీ డాక్టర్ శివశంకర ప్రసాద్, రైతు సాధికార సంస్థ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫ పింఛన్లు పంపిణీ చేసేటప్పుడు లబ్ధిదారులతో సిబ్బంది మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పింఛన్ల పంపిణీ, వేసవి నేపథ్యంలో తాగునీటి సరఫరా, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజల ఫీడ్ బ్యాక్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి నెలా మొదటి రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పింఛన్లు పంపిణీ చేయాలన్నారు. మిగిలిన వారికి తరువాత రోజున అందించాలన్నారు. జేసీ టి.నిషాంతి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ప్రసాద్, డ్వామా పీడీ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
బడ్జెట్‌తో మోసం చేసిన చంద్రబాబు
మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌తో చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలకు కూటమి ప్రభుత్వం నిధులు కేటాయింపులు చేయలేదన్నారు. మహిళలకు సున్నా వడ్డీకి రుణాలు, ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పి బడ్జెట్లో మొండిచేయి చూపారని అన్నారు. నిరుద్యోగులకు భృతి కింద రూ.మూడు వేలు ఇస్తామని ప్రకటించి మాట మార్చారన్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20 వేలు ఇస్తామని చెప్పినా, దానికి తగినట్టుగా బడ్జెట్లో కేటాయింపులు లేవన్నారు. దీపం పథకం కింద రాష్ట్రంలో 1,55,000 మంది మహిళలు లబ్ధి పొందే అవకాశం ఉంటే, దానికి రూ.4 వేల కోట్లు అవసరం కాగా కేవలం రూ.2,601 కోట్లు కేటాయించారన్నారు. తల్లికి వందనం పథకానికి నామమాత్రం కేటాయింపులు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బడ్జెట్ ప్రవేశ పెడుతుంటే ఏమీ మాట్లాడకుండా ఉండడం చూస్తుంటే విస్తుపోయేలా చేస్తోందన్నారు. ప్రశ్నించడానికే వచ్చానని, ప్రజల పక్షాన పోరాడతానని మాట్లాడిన పవన్ కళ్యాణ్ మహిళలకు రూ.1,800 ప్రతి సంవత్సరం ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టించి ఇప్పుడు మోసం చేస్తున్నారని అన్నారు. విద్యుత్ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేశారని గుర్తు చేశారు. అలాగే ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను గాల్లో కలిపేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ చేతుల్లో ఉందని చెప్పుకునే చంద్రబాబు పన్నుల రూపంలో ఆంధ్ర రాష్ట్రం నుంచి వంద రూపాయలు కడుతుంటే తిరిగి రాష్ట్రానికి కేవలం 42 రూపాయలు మాత్రమే తీసుకువస్తున్నారని, పక్కన ఉన్న తెలంగాణ 49 రూపాయలు తెచ్చుకుంటున్నారని అన్నారు. కేవలం అసెంబ్లీ అంటే లోకేష్‌కు భజన చేసే సభగా మార్చేశారని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే చొక్కా పట్టుకుని అడగమని మాట్లాడిన లోకేష్ చొక్కాను పవన్ కళ్యాణ్ ఎందుకు పట్టుకోవటం లేదని ప్రశ్నించారు. మంత్రులందరికీ ర్యాంకులు ఇచ్చిన చంద్రబాబు అవినీతిలో కూడా ర్యాంకులు ఇస్తే మొట్టమొదటి స్థానంలో లోకేష్ వస్తాడని, రెండో స్థానంలో కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఉంటాడన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా తొలిసారిగా రావులపాలెం వచ్చిన పిల్లి సూర్యప్రకాష్‌ను మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పూలమాలలు, శాలువాతో సత్కరించారు. అముడా మాజీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్‌రాజు, కొత్తపేట ఎంపీపీ మార్గన గంగాధరరావు, రావులపాలెం జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, కప్పల శ్రీధర్, మండల కన్వీనర్లు దొమ్మేటి అర్జునరావు, తమ్మన శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
పీఆర్సీ అమలుకు కేటాయింపులేవి...?
రాష్ట్ర బడ్జెట్‌పై ఎస్టీయూ అసంతృప్తి అమలాపురం టౌన్: గతం నుంచి అమలు చేయాల్సిన 12వ పీఆర్సీ ఇప్పటికే కొన్ని నెలలపాటు జాప్యం జరిగినప్పటికీ అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దాని అమలుకు నిధుల కేటాయింపుపై స్పష్టత లేదని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతంశెట్టి దొరబాబు, సరిదే సత్య పల్లంరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు అమలాపురంలో వారు ఓ ప్రకటన విడుదల చేశారు. సీపీఎస్, జీపీఎస్ కంటే మెరుగైన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీపై బడ్జెట్లో ఎలాంటి ప్రకటన లేనందుకు నిరుత్సాహంగా ఉందన్నారు. అలాగే పాఠశాల విద్యకు గత సంవత్సరం 10.15 శాతం నిధులు కేటాయించగా ప్రస్తుతం 9.86 శాతం మాత్రమే నిధులు ఇచ్చారన్నారు. విద్యా రంగాన్ని మెడల్‌గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించినట్లుగా బడ్జెట్లో ఆ రంగానికి తగిన నిధులు కేటాయించలేదని దొరబాబు, సత్య పల్లంరాజు స్పష్టం చేశారు. ఈవీఎం గోదాముల తనిఖీ ముమ్మిడివరం: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా రెవెన్యూ అధికారి బీఎల్ఎన్ రాజకుమారి తెలిపారు. శుక్రవారం ఆమె ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపర్చిన గోదామును అధికారులతో కలసి పరిశీలించారు. నెలవారీ తనిఖీలో భాగంగా గోదాము సీళ్లను తనిఖీ చేసి రిజిస్టర్లో సంతకం చేశారు. ఈవీఎంల భద్రతకు ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ప్రతి మూడు నెలలకోసారి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల గోదాములను తనిఖీ చేసి సమగ్ర నివేదికను ఎన్నికల సంఘానికి పంపిస్తామని డీఆర్వో తెలిపారు. ఎలక్షన్ డీటీ శివరాజ్, ముమ్మిడివరం డిప్యూటీ తహసీల్దార్ గోపాలకృష్ణ, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా సైన్స్ సంబరాలు రాయవరం: సర్ సీవీ రామన్ జయంతిని ఆయా పాఠశాలల్లో జాతీయ సైన్స్ దినోత్సవంగా శుక్రవారం జరుపుకొన్నారు. జిల్లాలోని 1,582 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సీవీ రామన్ చిత్రపటానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పలు పాఠశాలల్లో విద్యార్థులు తీర్చిదిద్దిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. అలాగే విద్యార్థులు తయారు చేసిన పలు సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శనకు ఉంచారు. వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. జిల్లా సైన్స్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తొలిసారిగా ఆన్లైన్ క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా ప్రారంభించారు. ఆన్లైన్ క్విజ్‌లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు చెందిన 8, 9 తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెల 3న జిల్లా స్థాయి ఆఫ్‌లైన్ క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆలయ అభివృద్ధికి రూ.2 లక్షలు ఆలమూరు: చింతలూరులో నూకాంబిక అమ్మవారి ఆలయ అభివృద్ధికి ఓ దాత రూ.2 లక్షల విరాళం అందజేశారు. గుమ్మిలేరుకు చెందిన శ్రీకృష్ణతేజ సంస్థల అఽధినేత వంక సత్యనారాయణ (అన్నవరం) తన వ్యాపార భాగస్వామ్యులతో కలిసి శుక్రవారం ఆలయానికి విచ్చేశారు. అనంతరం ఈ విరాళాన్ని ఆలయ ఈఓ ఉండవల్లి వీర్రాజు చౌదరికి అందజేశారు. శ్రీకృష్ణ ప్రభాస్ పేపరుమిల్లు యాజమాన్య ప్రతినిధులు వైట్ల దుర్గారావు, వల్లూరి వెంకట్రావు, వంక ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
మద్యం సీసాల ధ్వంసం
అమలాపురం టౌన్: అమలాపురం పట్టణం, రూరల్, అల్లవరం, ఉప్పలగుప్తం మండలాల పోలీస్ స్టేషన్ల పరిధుల్లో 130 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 3,220 మద్యం బాటిల్స్‌ను ఎకై ్సజ్, పోలీస్‌శాఖల అధికారులు సంయుక్తంగా ధ్వంసం చేశారు. అలాగే పట్టుబడ్డ నాన్ డ్యూటీ పెయిడ్, డ్యూటీ పెయిడ్‌కు సంబంధించి 859 లీటర్ల మద్యాన్ని, 9 కేసుల్లో దొరికిన 56 లీటర్ల సారాను పారబోశారు. అమలాపురం 30వ వార్డు రజకపేట శివారులో మద్యం బాటిళ్లను ధ్వంసం చేయడంతోపాటు మద్యాన్ని, సారాను గొయ్యి తీసి అందులో పారబోసి పూడ్చారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ వై.చైతన్య మురళి, జిల్లా ఎస్పీ బి.కృష్ణారా వు ఆదేశాల మేరకు అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ పర్యవేక్షణలో మద్యాన్ని ధ్వంసం చేశారు. -
సరదాగా వెళ్లి... విగతజీవులై
ఫ రోడ్డు ప్రమాదంలో యువకుల మృతి ఫ పాత ఇంజరం వద్ద ఘటన ముమ్మిడివరం/ఐ.పోలవరం: బైక్‌పై సరాదాగా వెళ్లిన ఇద్దరు యువకులను గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే మృతి చెందారు. ఐ.పోలవరం మండలం పాత ఇంజరం వద్ద గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ముమ్మిడివరం మండలం బూరుగుపేటకు చెందిన మట్టా ఆకాష్‌రెడ్డి (21), ముమ్మిడివరం టెలిఫోన్ ఎక్ఛ్సేంజ్ వీధికి చెందిన దొమ్మేటి అభినవ్ (17) స్పోర్ట్స్ బైక్‌పై యానాంకు సరాదాగా వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నారు. వీరిని పాత ఇంజరం 216 జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరూ సంఘటనా స్థలంలో మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు మృతదేహాలను ఐ.పోలవరం పోలీసులు ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, ఘటనా స్థలంలో సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఐ.పోలవరం ఎస్సై మల్లిఖార్జున రెడ్డి తెలిపారు. ఒక్కగానొక్క కొడుకు.. ఒక్కగానొక్క కొడుకు అభినవ్ మృతితో ఆ తల్లిదండ్రుల రోధన కంటతడి పెట్టించింది. అల్లారు ముద్దుగా పెంచుకున్నామని, ఇక మాకెవరు దిక్కంటూ దొమ్మేటి అచ్యుత వీరవెంకట సత్యనారాయణ, సరోజనీ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో దేవుళ్లకు మొక్కితే 14 ఏళ్లకు కొడుకు పుట్టాడని, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నామని వారన్నారు. పదో తరగతి వరకూ చదువుకున్న తమ కుమారుడు స్నేహితులతో కలసి వెళ్లి ఇలా విగతజీవుడవుతాడని అనుకోలేదని ఆ కుటుంబ సభ్యులు అంటున్నారు. చేతికి అందివచ్చి.. మట్టా రాహుల్, సుభాషిణి దంపతులకు పెద్ద కుమారుడు ఆకాష్‌రెడ్డి. ప్రసుత్తం ముమ్మిడివరంలో డిగ్రీ చదువుతున్నాడు. చేతికంది వచ్చిన కొడుకు మృతితో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్నేహితులతో సరదాగా తిరిగి వస్తున్నాడనుకున్నామని, ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతాడని అనుకోలేదని ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోధించారు. -
ఇంటర్ పరీక్షలకు కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
అమలాపురం టౌన్: జిల్లాలో శనివారం నుంచి 20వ తేదీ వరకూ జరిగే ఇంటర్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో అమలాపురంలోని కలెక్టరేట్, డీఐఈఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఐఈఓ) వనుము సోమశేఖరరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ మహేష్కుయార్ ఆదేశాల మేరకు కలెక్టరేట్, డీఐఈఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ల ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు పరీక్షలపరంగా ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు డీఐఈఓ సోమశేఖరరావు అమలాపురంలో శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఇన్చార్జుల ఫోన్ నంబర్లు 89190 91012, 83096 53112, డీఐఈఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఫోన్ నంబరు 95503 35191ను సద్వినియోగం చేసుకోవాలని అన్నాశారు. ఈ రెండు చోట్ల నలుగురు ప్రతినిధులు విధులు నిర్వహిస్తారన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 40 పరీక్ష కేంద్రాల పనితీరును ఈ కంట్రోల్ రూమ్‌ల నుంచి సీసీ కెమెరాలతో అనుసంధానమైన కంప్యూటర్ తెరలపై అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తారని తెలిపారు. పరీక్ష కేంద్రం పరిశీలన జిల్లాలో శనివారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు సంబంధించి అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని డీఐఈఓ సోమశేఖరరావు పరిశీలించారు. పరీక్షల నిర్వహణ సిబ్బందికి ఆయన పలు సూచనలు ఇచ్చారు. పరీక్ష కేంద్రం పేరు, ఫోన్ నంబరును కేంద్రం బయట ఒక బ్యానర్ రూపంలో ప్రదర్శించాలని సూచించారు. విద్యార్థులు పరీక్షలు జరుగుతున్న రోజుల్లో త్వరగా జీర్ణమయ్యే మంచి ఆహార పదార్థాలను భుజించాలని, ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. తమ పిల్లలను పరీక్ష కేంద్రాలకు సకాలంలో పంపించే ఏర్పాటు చేయాలన్నారు. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘన
కూటమి అభ్యర్థికి ఓట్లేయాలని పోలింగ్ కేంద్రాల వద్ద ఎమ్మెల్యే గిడ్డి, టీడీపీ కన్వీనర్ నామన ప్రచారం పి.గన్నవరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం హైస్కూలు ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, పి.గన్నవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ నామన రాంబాబు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి, పోలింగ్ కేంద్రాల వద్దే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌కు ఓట్లేయాలని వారు కోరారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న పట్టభద్రులను ఆపి మరీ వారు ప్రచారం చేశారు. వారిలో కొందరితో ఎమ్మెల్యే గిడ్డి మాట్లాడుతూ.. మీరు సచివాలయం సిబ్బంది కదా, మీరు పేరాబత్తులకు ఓట్లేయాలి అని అన్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ఎమ్మెల్యేతో పాటు, కూటమి నేతలు పోలింగ్ బూత్‌ల వద్దే ప్రచారం నిర్వహించడాన్ని పలువురు తీవ్రంగా విమర్శించారు. పట్టభద్రులను ఆపి కూటమి నేతలు ఓట్లు అడుగుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. అధికారం అండతో కూటమి నాయకులు ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడంతో జనం విస్తుపోయారు. -
మందకొడిగా మొదలై...
సాక్షి, అమలాపురం: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల శాసనమండలి ఎన్నికల పోలింగ్ ఉదయం మందకొడిగా మొదలై... మధ్యాహ్నం నుంచి జోరందుకుంది. ఓటు వేసేందుకు పట్టభద్రులు పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరారు. కూటమి పార్టీలతో పాటు పీడీఎఫ్ మద్దతుదారులు పోలింగ్ ప్రక్రియలో ఉత్సహంగా పాల్గొనడంతో అంచనాలకు మించి ఓటింగ్ నమోదయ్యింది.ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి కోనసీమ జిల్లాలో 73.37 శాతం పోలింగ్ నమోదయ్యింది. జిల్లాలో 64,471 మంది పట్టభద్ర ఓటర్లు ఉన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు జిల్లావ్యాప్తంగా 47,301 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్టు జిల్లా అధికారులు తెలిపారు. వీరిలో పురుషులు 27,450 మంది కాగా, 19,850 మంది మహిళులో ఓటు వేశారు. ఒక ట్రాన్స్జండర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యువకుల నుంచి వయసు మళ్లిన వారి వరకు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినవారు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. రాయవరం తహసీల్దార్ కార్యాలయంలో నవ వధువులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి.ఎల్.ఎన్.రాజకుమారి పరిశీలించారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని ఆమె తెలిపారు.ఉదయం అంతంత మాత్రమేజిల్లాలో పోలింగ్ ఉదయం అంతంత మాత్రంగానే సాగింది. ఉదయం 10 గంటలకు 12.74 శాతం ఓటింగ్ నమోదు కాగా, మధ్యాహ్నం 12 గంటలకు ఇది 32.36 వరకు సాగింది. మధ్యాహ్నం 2 గంటలకు 50.48 శాతం నమోదయ్యింది. తరువాత నుంచి ఓటింగ్ జోరందుకుంది. సాయంత్రం నాలుగు గంటల సమయానికి 73.37 శాతం నమోదయినట్టు జిల్లా అధికారులు తెలిపారు.రామచంద్రపురంలో వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, పార్టీ రామచంద్రపురం కో ఆర్డినేటర్ పిల్లి సూర్య ప్రకాష్, అమలాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, ఎస్కేబీఆర్ కాలేజీలో ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావులు, ఐ.వెంకటేశ్వరరావు, రావులపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఓటింగ్‌లో పాల్గొన్నారు. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ అమలాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.అడుగడుగునా అధికార దుర్వినియోగంఎన్నికల కేంద్రాల వద్ద కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల వద్ద మెప్పు కోసం ఓట్లు లేనివారు సహితం పోలింగ్ కేంద్రాలకు వెళుతూ హడావుడి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద నిలబడి ఓటు వేసేందుకు వచ్చినవారిని తమ పార్టీ అభ్యర్థి నంబరు, ఓటు వేయాల్సిన నంబరులు చెబుతూ వచ్చారు. ఇంత జరుగుతున్నా పోలీసులు, ఇతర అధికారులు ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. పి.గన్నవరం పోలింగ్ కేంద్ర ప్రాంగణంలో స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఓటర్లకు తమ కూటమి అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించడం గమనార్హం. అంబాజీపేట జెడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు 20 మంది ఓటర్లు ఉంటే బయట కూటమి నాయకులు 200 మంది వరకు మోహరించడం విశేషం.పోలింగ్‌లో కొరవడిన కూటమి నేతల ఉత్సాహంకొత్త ఓటర్ల నమోదులో చూపించిన ఉత్సాహం.. పోలింగ్ విషయంలో కూటమి నాయకులు చూపించి లేక పోయారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తే కూటమి నేతలు, కార్యకర్తలు పోలింగ్ కేంద్రాల బయట హడావుడి సృష్టించారు కాని అనుకూల ఓటింగ్ వేయించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇదే సమయంలో పీడీఎఫ్ ప్రతినిధులు వ్యూహాత్మకంగా వ్యవహరించి నిశ్శబ్దంగా తమ అనుకూల ఓటింగ్ వేయించుకున్నారు. కూటమి క్యాడర్ తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, పార్టీ పెద్దల వద్ద మార్కులు కొట్టేసేందుకు అన్నట్టుగా పోలింగ్ కేంద్రాల వద్ద హడావుడి చేశారు. అది చూసుకుని స్థానిక ఎమ్మెల్యేలు మురిసిపోయారు. కొత్తగా తమ ఆధ్వర్యంలో నమోదు చేసిన ఓటర్ల మీద కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌తోపాటు ఆయా పార్టీల మద్దతుదారులు భారీగా ఆశలు పెట్టుకున్నా ఆ ఓటర్లు సహితం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓటింగ్‌లో చూపించారని సమాచారం. మొత్తం మీద పోల్ మేనేజ్మెంట్లో కూటమి పార్టీలు విఫలమయ్యాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రచారంలోనే కాకుండా పోలింగ్ రోజున కూడా పీడీఎఫ్ ప్రతినిధులు వారి అనుకూలురు చాప కింద నీరులా వ్యవహరించి తమకు అనుకూలమైన ఓటును అత్యధికంగా వేయించుకున్నారు.జిల్లాలో మొత్తం ఓటర్లు64,416 మంది ఓటర్లుజిల్లాలో 73.37 శాతం ఓటింగ్ -
హోరాహోరీగా వాలీబాల్ పోటీలు
ఉప్పలగుప్తం: జాతీయ వాలీబాల్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పోటీలో తలపడుతున్న ఇరు జట్లు నువ్వా... నేనా అన్నట్టుగా తలపడుతుండడంతో పలు మ్యాచ్‌లు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. అంతర్జాతీయ, జాతీయ క్రీడాకారులు రావడంతో పోటీలు రసవతర్తరంగా సాగుతున్నాయి. క్రీడాకారులు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్నారు. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో అరిగెల శ్రీ రంగయ్య మెమోరియల్ డే అండ్ నైట్ వాలీబాల్ పోటీలు గురువారం రెండవ రోజు జరిగాయి. ముంబై జీఎస్టీ, కేరళ స్పైకర్స్ మధ్య జరిగిన పోటీ వాలీబాల్ ఆట మజాను క్రీడా వీక్షకులకు చూపించింది. రెండు జట్లు చావోరేవు అన్నట్టుగా తలపడడంతో పోటీ వీక్షకులను ఉర్రూతలు ఊగించింది. తొలి మ్యాచ్‌ను ముంబై జట్టు 25–20 తేడాతో విజయం సాధించగా, రెండు, మూడు మ్యాచ్‌లను కేరళ జట్టు 25–23, 25–19 తేడాతో గెలుచుకుంది. నాల్గవ మ్యాచ్‌ను ముంబై జట్టు 25–22 తేడాతో గెలవగా, కీలకమైన ఐదవ మ్యాచ్ 15–13వ తేదీ ముంబై జట్టు విజయం సాధించి విజేతగా నిలిచింది. ప్రతి మ్యాచ్‌లోనూ.. ప్రతి పాయింట్ ఇరు జట్లు సమానంగా సాధించడంతో ఈ పోటీ రసవత్తరంగా మారింది. కీలకమైన ఐదవ మ్యాచ్‌లో సహితం 1–1, 2–2... 13–13 వరకు స్కోర్ నమోదయ్యింది. చివరి రెండు పాయింట్లు ముంబై జట్టు సాధించడంతో విజేతగా నిలిచింది. అలాగే ఇండియన్ బ్యాంకు చైన్నైపె బెంగళూరు స్పైకర్స్ జట్టు విజయం సాధించింది. ఈ పోటీలు శుక్ర, శనివారాలలో కూడా జరగనున్నాయి. ముంబై... కేరళ జట్ల మధ్య మూడు గంటల పోరు -
కొబ్బరి శాస్త్రవేత్తలకు టీమ్ అవార్డు
అంబాజీపేట: వివిధ పంటలపై ఆశించే పురుగులు, తెగుళ్ల సమర్ధ నివారణకు జీవ నియంత్రణ పద్ధతుల వినియోగంపై స్థానిక డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా కేంద్ర శాస్త్రవేత్తలకు టీమ్ అవార్డు లభించినట్టు కేంద్ర అధిపతి డాక్టర్ ఎన్.బి.వి.చలపతిరావు తెలిపారు. ఈ మేరకు గురువారం బెంగళూరులో జరిగిన రెండవ అంతర్జాతీయ జీవ నియంత్రణ సమావేశంలో ఈ అవార్డును ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్, నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చర్ ఇన్సెక్ట్స్ రీ సోర్సెస్ అధ్యక్షుడు డాక్టర్ ఎన్. ఎస్.సుశీల్, పరిశోధనా కేంద్ర అధిపతి డాక్టర్ చలపతిరావుకు ప్రదానం చేశారు. కొబ్బరి, కోకో, పంటలపై పురుగులు, తెగుళ్లను జీవ నియంత్రణ పద్ధతులలో నివారిస్తూ, బదనికలను అధిక సంఖ్యలో ఉత్పత్తి చేసి రైతులకు పంపిణీ చేసినందుకు ఈ అవార్డు లభించినట్లు చలపతిరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమెరికాకు చెందిన ఇతర పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
పదవీ విరమణకు ఒక్క రోజు ముందు ఆగిన గుండె
రాజోలు: అగ్నిమాపకశాఖలో ఫైర్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న భైరిశెట్టి బాలకృష్ణ(62)కు పదవీ విరమణకు ఒక రోజు ముందు గుండెపోటుతో రావడంతో గురువారం మృతి చెందారు. ఒక రోజు డ్యూటీ చేస్తే చాలని ఆ తర్వాత పూర్తిగా విశ్రాంతి జీవితం గడుపుదామని అనుకునే క్షణాల్లోనే గుండెపోటు ఆయనను శాశ్వత నిద్రలోకి నెట్టేసింది. రాజోలు గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న ఆయన ముమ్మిడివరం అగ్నిమాపక కేంద్రానికి విధులు నిర్వర్తించేందుకు మోటార్ సైకిల్‌పై బయలుదేరారు. ఇంటికి కూతవేటు దూరం వెళ్లేసరికి పంచాయతీ రోడ్డులో ఛాతి బరువెక్కి తీవ్రమైన గుండె నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో స్థానికులు ఆయనను రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. రాజోలులో లీడింగ్ ఫైర్‌మన్‌గా విధులు నిర్వహిస్తూ మూడు నెలల క్రితం పదోన్నతిపై ముమ్మిడివరం ఫైర్ ఆఫీసర్‌గా బదిలీపై వెళ్లారు. వివిధ హోదాల్లో సుమారు 22 ఏళ్ల పాటు ఆయన రాజోలు అగ్నిమాపక కేంద్రంలో పని చేశారు. ఈ నెల 28న ఫైర్ఆఫీసర్గా పదవీ విరమణ చేయనున్నారు. ఆయన అన్న కుమారుడు భైరిశెట్టి రాధాకృష్ణమూర్తి ఫిర్యాదు మేరకు రాజోలు ఎస్సై రాజేష్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టమ్ అనంతరం బాలకృష్ణ మృతదేహాన్ని స్వగ్రామం మామిడికుదురు మండలం కంచివారిపాలానికి తరలించారు. ఆయన మృతి పట్ల రాజోలు అగ్నిమాపక సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.డ్రైవర్ అక్రమ సస్పెన్షన్‌పై కొనసాగుతున్న దీక్షలుఅమలాపురం రూరల్: అమలాపురం ఆర్టీసీ డిపోలో డ్రైవర్ బీఎస్ నారాయణ అక్రమ సస్పెన్షన్ రద్దు చేయాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. డ్రైవర్ నారాయణ సస్పెన్షన్ ఎత్తివేయాలని, 1/19 సర్క్యులర్ కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళ ఉద్యోగులు గురువారం రిలే దీక్షలు నిర్వహించారు. యునైటెడ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి వి. గణపతి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లా యాజమాన్యం, డిపో యాజ మాన్యం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, నారాయణపై విధించిన అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. యునైటెడ్ వర్కర్ యూనియన్ డిపో కార్యదర్శి కె.రవికుమార్, ఎన్ఎంయూ జిల్లా కార్యదర్శి గణపతి మద్దతు తెలిపారు.పీఠంలో లింగోద్భవ పూజలురాయవరం: మండలంలోని వెదరుపాక విజయదుర్గా పీఠంలో బుధవారం అర్ధరాత్రి లింగోద్భవ పూజలు ఘనంగా నిర్వహించారు. పీఠంలోని విజయదుర్గా అమ్మవారి సన్నిధిలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ పూజలు నిర్వహించారు. పీఠంలో ఉన్న ఎనిమిది ఈశ్వర బాణాలకు రాత్రి 11గంటల నుంచి శివుడు లింగరూపంలో ఉద్భవించిన సమయం వరకు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, అభిషేకం, అర్చనలు తదితర పూజలు నిర్వహించారు. వేద పండితులు చీమలకొండ వీరావధాని, శ్రీనివాసావధానులు, తోలేటి నాగేంద్రశర్మ, చక్రవర్తుల మాధవాచార్యులు తదితర 18 మంది వేద పండితులు ఈ పూజలను నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి లింగోద్భవ పూజలను వీక్షించారు. పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. రాయవరం పార్వతీ సమేత రాజేశ్వరస్వామి, అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి, సోమేశ్వరంలోని శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత సోమేశ్వరస్వామి, చెల్లూరులోని అగస్తేశ్వరస్వామి, వెంటూరులోని ఉమా సమేత సోమేశ్వరస్వామి, వెదురుపాక పార్వతీ సమేత సోమేశ్వరస్వామి, మాచవరంలో భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి, పసలపూడిలో రాజరాజేశ్వరస్వామి ఆలయాల్లో లింగోద్భవ పూజలు భక్తుల శివనామస్మరణ నడుమ పురోహితులు నిర్వహించారు. -
ఆంధ్ర శబరిమలైలో ఆదియోగి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆంధ్రా శబరిమలైగా పేరొందిన ద్వారపూడికి మరింత శోభను తెస్తూ నిలువెత్తు ఆదియోగి విగ్రహం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రాష్ట్రంలో మొదటిదిగా, దేశంలో మూడోదిగా 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో యోగముద్రలో ఈ ముక్కంటి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. మహాశివరాత్రి పర్వదినమైన బుధవారం దీనిని ప్రారంభించనున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రంగా.. వస్త్ర మార్కెట్‌కు పేరొందిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్వారపూడిలో ఎస్ఎల్ కనకరాజు గురుస్వామి 1983లో అయ్యప్ప స్వామి ఆలయాన్ని నిర్మించారు. సింహం నోటిలో నుంచి దుర్గామాత ఆలయానికి, సింహం జూలుపై నుంచి అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లేలా నిర్మించడం దీని ప్రత్యేకత. కేరళలోని శబరిమలై వెళ్లలేని స్వాములు రాష్ట్రం నలుమూలల నుంచీ ఇక్కడకు వచ్చి ఇరుముడులు సమర్పిస్తూండటంతో అనతి కాలంలోనే ఇది ఆంధ్రా శబరిమలైగా గుర్తింపు పొందింది. తర్వాతి కాలంలో ఈ ప్రాంగణంలో దుర్గాదేవి, పంచముఖాంజనేయస్వామి, వేంకటేశ్వరస్వామి ఆలయాలతో పాటు 40 అడుగుల ఏకశిలా శివలింగం, శివాలయం, భూగర్భ జ్యోతిర్లింగాలయం, సాయిబాబా, నక్షత్రాలయం, నాగమ్మతల్లి తదితర 35కు పైగా ఆలయాలను ఇక్కడ నిర్మించారు. దీంతో ద్వారపూడి ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఔరా! అనిపించేలా.. శివాలయాన్ని ఆనుకుని అతిపెద్ద ఆదియోగి విగ్రహం ఏర్పాటుకు గత ఏడాది జనవరి 3న ఆలయ కమిటీ శ్రీకారం చుట్టింది. అనపర్తి మండలం కొమరిపాలేనికి చెందిన శిల్పి వీర రాఘవ ఆధ్వర్యాన నిరాటంకంగా విగ్రహం నిర్మాణం జరిగింది. కింది భాగంలో స్లాబ్ వేసి నవదుర్గా మాతల విగ్రహాలు ఏర్పాటు చేశారు. పైభాగంలో 100 అడుగుల వెడల్పు, 60 అడుగుల ఎత్తులో ఆదియోగి విగ్రహం ఉంటుంది. దీని తయారీకి సిమెంట్, ఇటుక, ఐరన్ వినియోగించి, తల, భుజాలు, ఛాతి మాత్రమే కలిగిన శిల్పంగా విగ్రహాన్ని రూపొందించారు. చుట్టూ గణనాథుడు, కుమారస్వామి, సప్తర్షుల విగ్రహాలుంటాయి. విగ్రహం లోపలి భాగంలో శివలింగాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు అక్కడ కూర్చుని ధ్యానం చేసుకునేలా ఏర్పాటు చేశారు. విగ్రహం తయారీకి రూ.25 లక్షలు, స్లాబ్, ఇతర నిర్మాణాలకు రూ.25 లక్షలు ఖర్చయ్యింది. దేశంలోనే అతి పెద్ద ఆదియోగం విగ్రహం కోయంబత్తూరులో 112 అడుగుల పొడవు, 82 అడుగులు ఎత్తుతో ఉంది. రెండో స్థానంలో బెంగళూరులోని విగ్రహం ఉండగా, మూడోదిగా ద్వారపూడిలో ఆదియోగి విగ్రహం యోగముద్రలో రూపొందించారు. ఇప్పటికే పెద్ద ఎత్తున సందర్శకులు ఈ విగ్రహాన్ని చూసేందుకు వస్తున్నారు. సెల్ఫీలు తీసుకుని మురిసిపోతున్నారు. ఫ ద్వారపూడిలో భారీ ముక్కంటి విగ్రహం ఏర్పాటు ఫ 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పు ఫ రూ.50 లక్షల వ్యయం ఫ దేశంలోనే మూడో అతిపెద్ద విగ్రహం ఫ నేడు ప్రారంభం -
కోనసీమ నలుచెదురులా పురాణ ప్రసిద్ధి
సాక్షి, అమలాపురం: పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. గౌతమీ చెంతన వెలసిన కోటిపల్లిలో శ్రీపార్వతీ సమేత సోమేశ్వరస్వామి, నిత్య కల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతూ.. వృద్ధ గౌతమీ నదీపాయ చెంతన వెలసిన భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి, క్షణ కాలంలో ముక్తిని ప్రసాదించే ముక్తేశ్వరం క్షణ ముక్తేశ్వరస్వామి, అనంత కుండల ఫలాన్ని ప్రదర్శించే కుండలేశ్వరంలోని కుండలేశ్వరస్వామి, దేశంలో ఎక్కడా లేని విధంగా శివపార్వతులు ఒకే పీఠంపై కొలువైన పలివెల ఉమా కొప్పేశ్వర స్వామి ఆలయం.. ఇలా చెప్పుకొంటూపోతే పచ్చని కోనసీమ నలుచెదురులా పురాణ ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలకు కొదవేలేదు. గోదావరి సప్త నదీపాయల ప్రవాహంతో పునీతమైన కోనసీమ బుధవారం జరిగే మహా శివరాత్రిని పురస్కరించుకుని ఆధ్యాత్మిక పరవళ్లు తొక్కనుంది.పంచారామం క్షేత్రం ద్రాక్షారామంపంచారామ క్షేత్రమైన త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయం. మహిమాన్విత శివలింగ క్షేత్రాల్లో ఇదొకటి. 12వ శక్తి పీఠంగా, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు ఇక్కడ వెలిశారు. దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఇక్కడ శివ లింగం 18 అడుగుల ఎత్తు ఉంటోంది. -
వాలీ‘బాల్’మే సవాల్
ఉప్పలగుప్తం: ఆలిండియా పురుషుల వాలీబాల్ పోటీల నిర్వహణకు ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో సర్వం సిద్ధమైంది. అరిగెల శ్రీరంగయ్య వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా శివరాత్రి సందర్భంగా ఈ పోటీలు నిర్వహించనున్నారు. బుధవారం నుంచి మార్చి ఒకటి వరకు ఈ పోటీలు డే అండ్ నైట్ పద్ధతిలో జరగనున్నాయి. ఈ పోటీలు గొల్లవిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం వేదిక కాబోతోంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పోటీలకు గొల్లవిల్లి జెడ్పీ మైదానంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కోర్టు నిర్మించారు. సుమారు ఐదు వేల మంది వీక్షించేలా గ్యాలరీ నిర్మాణం చేశారు. నాలుగు రోజుల పాటు జరిగే పోటీల్లో జీఎస్టీ (ముంబాయి), కర్ణాటక స్పైకర్స్, కేరళ స్పైకర్స్, ఇండియన్ బ్యాంకు(చైన్నె), ఇన్‌కం ట్యాక్స్ (చైన్నె), హూపర్స్ స్పోర్ట్స్ క్లబ్ (ముంబాయి) జట్లు పాల్గొననున్నాయి. అంతర్జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించిన సుమారు 20 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనున్నారని నిర్వాహకులు తెలిపారు. నాలుగు దశాబ్దాల క్రితం గొల్లవిల్లిలో నాలుగు దశాబ్దాల క్రితం కోనసీమ స్థాయిలో వాలీబాల్ పోటీలు మొదలయ్యాయి. 1988లో యూఎస్ఎస్ఆర్ మెమోరియల్ పేరుతో తొలిసారిగా కోనసీమ స్థాయిలో ఇక్కడ వాలీబాల్ టోర్నమెంట్ ఆరంభమైంది. 1990లో కోనసీమ, 1991 తూర్పుగోదావరి జిల్లా, 1992 ఉభయ గోదావరి జిల్లాలు, 1993 నుంచి 2001 వరకు రాష్ట్రస్థాయి పోటీలు జరిగాయి. 2012న తిరిగి ఎస్పీఆర్ మెమోరియల్ పేరుతో రెండు సార్లు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. 2017 నుంచి ఎన్వీఆర్ పేరుతో నాలుగేళ్ల పాటు జాతీయ స్థాయి పోటీలు జరిగాయి. తాజాగా అరిగెల శ్రీరంగయ్య వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరోసారి జాతీయ పోటీల నిర్వహణ చేపట్టారు. నేటి నుంచి జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు ముస్తాబైన గొల్లవిల్లి అంతర్జాతీయ క్రీడాకారుల రాక -
వందలాది ఆలయాలకు ఆధ్యాత్మిక శోభ
అనంత కుండలాల ఫలాన్నిచ్చే కుండలేశ్వరుడు కాట్రేనికోన మండలం కుండలేశ్వరంలో వెలిసిన పార్వతీ సమేత కుండలేశ్వరుని దర్శనం అనంత కుండాల ఫలం. నూరు గోవులను హత్య చేసిన పాపం నుంచి కుండలేశ్వరుని దర్శిస్తే విముక్తి పొందుతారని భక్తుల నమ్మకం. కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ నదీస్నానం చేయడం వల్ల లక్ష గోవులను దానమిచ్చినంత పుణ్యఫలం దక్కుతోందని భక్తుల నమ్మకం. ఆలయాన్ని ఆనుకుని వృద్ధ గౌతమీ నదీపాయలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు. ● నేడు మహా శివరాత్రి పర్వదినం ● కోనసీమలో ముస్తాబైన శైవక్షేత్రాలు ● పోటెత్తనున్న ద్రాక్షారామ, కోటిపల్లి, మురమళ్ల, కుండలేశ్వరం, ముక్తేశ్వరం, పలివెల, కడలి క్షేత్రాలు – ఆలయాల వద్ద విస్తృత ఏర్పాట్లు ● కోటిపల్లి, కుండలేశ్వరం వద్ద పెద్దఎత్తున పుణ్యస్నానాలు ఏక పీఠంపై శివపార్వతులు కొలువై.. అగస్త్యేశ్వర మహాముని కోరిక మేరకు శివపార్వతులు ఏక పీఠంపై కొలువు దీరిన ఆలయం కొత్తపేట మండలం పలివెల ఉమా కొప్పేశ్వరుడు. పరమశివుని మహా భక్తుడైన పూజారి ప్రాణాలు నిలిపేందుకు శివుడు కొప్పు ధరించిన వైనం మరో విశేషం. అందుకే ఈ క్షేత్రంలో శివలింగానికి ముందు భాగంలో కొప్పు ఉంటుంది. ఈ క్షేత్రంలో మహా శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి.ఇవే కాకుండా జిల్లావ్యాప్తంగా వందలాది సంఖ్యలో ఆలయాలు మహా శివరాత్రి పర్వదినానికి ముస్తాబయ్యాయి. రాజోలు మండలం కడలి కపోతేశ్వరస్వామి, శివకోడు ఉమా కొప్పేశ్వరస్వామి, అంతర్వేది నీలకంఠేశ్వరస్వామి, అంబాజీపేట మండలం వ్యాఘ్రేశ్వరంలో వ్యాఘ్రేశ్వరస్వామి ఆలయం, ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి, కాట్రేనికోన మండతం బ్రహ్మసమేధ్యం పంచాయతీ మగసానితిప్పలోని కాలభైరవస్వామి ఆలయంలో శివరాత్రి ఘనంగా జరగనుంది. ఆయా ఆలయాలకు వెళ్లేందుకు రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురంతో పాటు, పలు డిపోల నుంచి అదనపు బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. దర్శనాలకు ఇబ్బంది లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రధాన ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, భక్తుల రద్దీ లేకుండా చేస్తున్నారు. వీటితో పాటు అయినవిల్లి శ్రీవరసిద్ధి వినాయకస్వామి, అంతర్వేది లక్ష్మీనర్సింహస్వామి, ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి, వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాలనూ భక్తులు పెద్దఎత్తున దర్శించుకోనున్నారు. మగసానితిప్ప వెళ్లేందుకు ఐ.పోలవరం మండలం జి.మూలపొలం, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప నుంచి ప్రత్యేకంగా బోట్లు నడపనున్నారు. అలాగే ముక్తేశ్వరం–కోటిపల్లి మధ్య కూడా సాధారణ పంట్లతో పాటు, అదనంగా పడవలను నడపనున్నారు. -
మెహబూబ్ సిస్టర్స్‌కు పతకాల పంట
అమలాపురం టౌన్: అమలాపురానికి చెందిన మెహబూబ్ సిస్టర్స్ షహీరా, షకీలా మరో మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో బంగారు, వెండి పతకాలు కై వసం చేసుకున్నారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో అనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో మెహబూబ్ సిస్టర్స్ చెరో మూడు బంగారు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా మాస్టర్స్ గేమ్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో హైదదాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో ఈ నెల 23న జరిగిన ఏడో మాస్టర్ గేమ్స్ తెలంగాణ స్టేట్ చాంపియన్‌షిప్–2025లో సైతం మెహబూబ్ సిస్టర్స్ 4 బంగారు, రెండు వెండి పతకాలు కై వసం చేసుకున్నారు. దేశంలో ఎక్కడ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు జరిగినా, దూరాభారం, వ్యయప్రయాసలు లెక్కచేయకుండా వెళ్లి పతకాలు కొల్లగొట్టడం ఈ సిస్టర్స్‌కు నాలుగు దశాబ్దాలుగా వెన్నతో పెట్టిన విద్య. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా పేరుతో జరిగిన పోటీల్లోనూ మెహబూబ్ సిస్టర్స్ సత్తా చాటి పతకాలు సాధించడమే కాకుండా, జాతీయ పోటీలకు సైతం అర్హత సాధించారు. ఏప్రిల్ నాలుగో వారంలో హిమాచల్ ప్రదేశ్ జరగనున్న జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గోనున్నారు. హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర చాంపియన్‌షిప్ పోటీల్లో 75ప్లస్ విభాగంలో షహీరా లాంగ్ జంప్, 200 మీటర్ల పరుగులో ప్రథమ స్థానాల్లో నిలిచి రెండు బంగారు పతకాలు, వంద మీటర్ల పరుగులో ద్వితీయ స్థానాన్ని సాధించి వెండి పతకాన్ని గెలిచారు. అలాగే 65ప్లస్ విభాగంలో షకీలా లాంగ్ జంప్, వంద మీటర్ల పరుగులో ప్రథమ స్థానాలు పొంది బంగారు పతకాలను, డిస్కస్ త్రోలో ద్వితీయ స్థానం పొంది వెండి పతకాన్ని కై వసం చేసుకున్నారు. పతకాలతో పాటు, మెరిట్ సర్టిఫికెట్లూ అందుకున్నారు. ఆయా పోటీల్లో బంగారు, వెండి పతకాలు సాధించి, మంగళవారం అమలాపురానికి చేరుకున్న మెహబూబ్ సిస్టర్స్‌కు క్రీడాకారులు, వాకర్లు అభినందనలు తెలిపారు. ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ పత్రాలు అమలాపురం రూరల్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ పత్రాలను పోస్ట్ ద్వారా వారి చిరునామాలకు పంపించామని కలెక్టర్ మహేష్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు పోస్టల్ బ్యాలెట్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఏలూరు కలెక్టర్‌కు మార్చి 3న ఉదయం 7.59లోగా పోస్ట్ లేదా స్వయంగా అందేలా పంపాలన్నారు. ఫారం–13 డిక్లరేషన్‌లో బ్యాలెట్ పేపర్ వరుస సంఖ్య, వారి సంతకం, చిరునామాతో పాటు, డిక్లరేషన్‌పై గెజిటెడ్ అధికారి సంతకం చేయించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ పత్రాలపై ప్రాధాన్య క్రమంలో పెన్నుతో అంకెలను వేయాలని, టిక్ పెట్టరాదన్నారు. పోస్టల్ బ్యాలెట్ పేపర్ అని రాసిన కవర్లో ఫారం ఉంచి, కవరును రిటర్నింగ్ అధికారికి పంపాలన్నారు. వ్యాపార, వాణిజ్య, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఓటర్లకు ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. -
చివరాఖరికి కదలిక
● రత్నగిరిపై కలెక్టర్ తనిఖీతో అధికారుల్లో చలనం ● దేవస్థానం ర్యాంకు తగ్గడంపై అసంతృప్తి ● వివిధ విభాగాలను పరిశీలించిన ఈఓ అన్నవరం: ప్రముఖ పుణ్య క్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ దేవస్థానం అధికారుల్లో చలనం వచ్చింది. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో రత్నగిరికి చివరి ర్యాంకు రావడంతో, దేవస్థానంలో మార్పు తెచ్చేందుకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ప్రత్యేక దృష్టి సారించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే సోమవారం ఆయన దేవస్థానంలోని వివిధ విభాగాల్లో తనిఖీలు చేశారు. భక్తులతో నేరుగా మాట్లాడారు. వసతి గదుల విభాగంలో అవకతవకలు ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దేవస్థానంలో తీసుకునే ప్రతి కీలక నిర్ణయాన్ని కలెక్టర్ పరిశీలించనున్నారు. దేవస్థానంలో ఆయా విభాగాల అధికారులపై వేటుకూ వెనుకాడని పరిస్థితులు నెలకొనడంతో ఆయా వర్గాల్లో కదలిక మొదలైంది. కాగా దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు ఇతర అధికారులతో కలసి అన్నదాన విభాగం, న్యూ సీసీ, ఓల్డ్ సీసీ సత్రాల్లో మరమ్మతులు చేయాల్సిన గదులు, పాత మెయిన్ గెస్ట్‌హౌస్ వెనుక టాయిలెట్స్‌ను మంగళవారం పరిశీలించారు. మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈఓ వెంట ఈఈ రామకృష్ణ, ఇతర అధికారులున్నారు. బఫే పద్ధతిలో భోజనాలు అన్నదానం విభాగంలో భక్తులకు భోజనాలు ఆలశ్యమవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించిన విషయం విదితమే. దీనిపై అన్నదానం హాలు మొదటి అంతస్తులో కొందరు భక్తులకు బఫే పద్ధతిలో భోజనాలు పెడతామని అధికారులు తెలిపారు. దీనిపై ఈఓ సుబ్బారావు అన్నదాన విభాగాన్ని పరిశీలించారు. ఆహార పదార్థాల తరలింపు కోసం లిఫ్ట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. భక్తులు వెళ్లేందుకు మెట్లు కూడా నిర్మించాలి. వచ్చే నెలలో మరోసారి తనిఖీ..! జిల్లా కలెక్టర్ వచ్చే నెలలో కూడా దేవస్థానంలో సమీక్ష నిర్వహించనున్నారు. ఈసారీ ఆకస్మిక తనిఖీలు చేస్తారని దేవస్థాన వర్గాలు చెబుతున్నాయి. పరిస్థితులు గాడిన పడే వరకు ప్రతి నెలా దేవస్థానానికి వస్తానని కలెక్టర్ చెప్పిన విషయం విదితమే. సోమవారం కలెక్టర్ పర్యటన ముందుగా నిర్ణయించినది కావడంతో దేవస్థానం అధికారులు జాగ్రత్త పడ్డారనే ప్రచారం సాగుతోంది. ఇలాఉండగా ఈ నెలాఖరు నుంచి వచ్చే నెలాఖరు వరకు సత్యదేవుని ఆలయానికి విచ్చేసిన భక్తుల నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం సమాచారం సేకరించనుంది. దాని ఆధారంగా మరలా ర్యాంకులు కేటాయిస్తారు. తొలి మూడు ర్యాంకుల్లో అన్నవరం దేవస్థానం ఉండేలా సేవలు మెరుగుపడాలని ఇప్పటికే కలెక్టర్ ఆదేశించారు. -
ఫీల్డ్ ఆపరేటర్ కార్మికుల నిరాహార దీక్ష
● ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ కార్యాలయం వద్ద ఆందోళన ● వేతన సవరణ చేయాలని పీఈయూ నేత సురేష్‌కుమార్ డిమాండ్ రాజమహేంద్రవరం రూరల్: వేతన సవరణ కోసం ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్‌లో పనిచేస్తున్న 360 మంది ఫీల్డ్ ఆపరేటర్ కార్మికులు ఆందోళన ముమ్మరం చేశారు. యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో, మంగళవారం ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ కార్యాలయం వద్ద ఆందోళనకు ఉపక్రమించారు. పెట్రోలియం ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రటరీ కొడవటి సురేష్‌కుమార్ సారథ్యంలో కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సురేష్‌కుమార్ మాట్లాడుతూ, ఫీల్డ్ ఆపరేటర్ కార్మికులకు ప్రతి నాలుగేళ్లకు వేతన సవరణ జరగాల్సి ఉందన్నారు. 2019కి చివరగా వేతన సవరణ అసంపూర్తిగా జరిగినందున ప్రతి కార్మికునికి రూ.4,050 జీతం తక్కువగా అందుతోందన్నారు. 2023 జనవరి ఒకటి నుంచి కొత్త వేతన సవరణ జరగాల్సి ఉందన్నారు. దీనిపై యాజమాన్యం నుంచి ఎటువంటి ఫలితం లేకపోవడంతో, ఈ ఏడాది జనవరిలో యాజమాన్యానికి నోటీసులు అందజేశామన్నారు. యాజమాన్యం కొంత సమయం కోరడంతో ఇప్పటివరకు సంయమనం పాటించామన్నారు. పరిస్థితుల్లో మార్పు లేకపోవడంతో నిరహార దీక్ష చేపట్టాల్సి వచ్చిందన్నారు. వేతన సవరణతో పాటు, ఇతర కార్మిక డిమాండ్లపై మంగళవారం సాయంత్రం యాజమాన్యానికి నిరవధిక సమ్మె నోటీసు అందజేశామని సురేష్‌కుమార్ తెలిపారు. బుధవారం నుంచి దశలవారీగా నిరసనలు తెలుపుతూ, మార్చి 12 నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని నిర్ణయించామన్నారు. యూనియన్ రాజమండ్రి అసెట్ జనరల్ సెక్రటరీ జి.ప్రశాంత్‌కుమార్, ఇతర కార్మిక ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఘనమై.. ఆదర్శ వరమై..
ఫ ఉమ్మడి జిల్లాలో శంఖవరం, హంసవరంలో ఆదర్శ పాఠశాలలు ఫ ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ ఫ ఆన్లైన్లో విద్యార్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిరుపేద విద్యార్థులకు సైతం కార్పొరేట్ విద్య అందాలనే సత్సంకల్పంతో ఏపీ మోడల్ పాఠశాలలను 2013లో ప్రారంభించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుతం పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధనతో పాటు, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో శంఖవరం మండలం శంఖవరం, తుని మండలం హంసవరంలో ఆదర్శ పాఠశాలలున్నాయి. ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశానికి విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దరఖాస్తులకు ఆహ్వానం మోడల్ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. సోమవారం నుంచి ఆన్లైన్లో ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ మార్చి 31 వరకు కొనసాగుతుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థి అర్హతను పరిశీలించి, అర్హుడని తేలితే క్రెడిట్, డెబిట్‌కార్డులు, నెట్ బ్యాకింగ్ ఉపయోగించి గేట్‌వే ద్వారా రుసుం చెల్లిస్తే, ఓ జర్నల్ నంబర్ కేటాయిస్తారు. ఆ నంబర్ ఆధారంగా www.cse.ap.gov.in లేదా www.apms.apcfss.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత నకలును పాఠశాలలో సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఆరో తరగతి ప్రవేశానికి గతేడాది మాదిరిగానే ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న మోడల్ స్కూల్లోనే పరీక్ష ఏప్రిల్ 20న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. మెరిట్ లిస్ట్ ఆధారంగా రోస్టర్ ప్రకారం సీట్లను కేటాయించనున్నారు. ఏప్రిల్ 27న మెరిట్ లిస్ట్, అదే రోజు సెలెక్షన్ లిస్టును వెల్లడిస్తారు. ఏప్రిల్ 30న సర్టిఫికెట్ల పరిశీలనతో పాటు, కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ తేదీ నుంచి తరగతులు మొదలవుతాయి. ఇక్కడ సీటుకు చాలా డిమాండ్ పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు కూడా ఉన్నత చదువును అందుబాటులోకి తీసుకురావడమే ధ్యేయంగా ఏపీ మోడల్ పాఠశాలలు ఏర్పాటయ్యాయి. ఆయా పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశం పొందితే, ఇంటర్ వరకు ఇంగ్లిష్ మీడియం విద్యను అందించడంతో పాటు, విద్యా కానుక కిట్లు, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు కల్పిస్తారు. పూర్తి ఇంగ్లిష్ మీడియంతో సత్ఫలితాలను సాధిస్తున్న మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ పొందడం అంత ఈజీ కాదు. ప్రైవేట్ పాఠశాలల్లో ఎంత ఖర్చు పెట్టినా అందుబాటులో లేని నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్య.. ఇక్కడ లభ్యం కావడం పేద పిల్లలకు వరంగా మారింది. లభించే సదుపాయాలివే.. ● నిష్టాతులైన ఉపాధ్యాయులతో బోధన ● కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఐదు ఎకరాల సువిశాల ప్రాంగణాల్లో భవనాలు ● ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఇంగ్లిష్ మీడియం విద్యా బోధన ● సౌకర్యవంతంగా విశాల తరగతి గదులు, విద్యార్థులకు ఉచిత విద్య ● బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు పూర్తి స్థాయి పరికరాలతో వేర్వేరుగా ల్యాబ్‌లు ● నీట్, జేఈఈ, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ● స్పోకెన్ ఇంగ్లిష్, చేతి రాతపై ప్రత్యేక శ్రద్ధ ● అన్ని సదుపాయాలతో గ్రంథాలయం ● ఎల్సీడీ ప్రొజెక్టర్‌తో విద్యా బోధన, డిజిటల్ విద్యా విధానం ● తొమ్మిదో తరగతి నుంచి అకడమిక్ విద్యకు సమాంతరంగా కనీసం రెండు ఒకేషనల్ కోర్సులు నాణ్యమైన విద్యా బోధన పేద విద్యార్థులకు మోడల్ పాఠశాలలు బంగారు భవిష్యత్తు ఇస్తాయి. ఐదో తరగతి పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థి ఇందులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలి. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మోడల్ పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో హంసవరం, శంఖవరంలో మోడల్ స్కూళ్లు నిర్వహిస్తున్నాం. నాణ్యమైన విద్యా బోధనతో పాటు, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం ఉచితంగా ఇస్తారు. ఆరో తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలి. – పి.రమేష్, జిల్లా విద్యా శాఖాధికారి, కాకినాడ ఎవరు అర్హులంటే.. ఓసీ, బీసీ విద్యార్థులు 2013 సెప్టెంబర్ ఒకటి నుంచి 2015 ఆగస్టు 31 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 2011 సెప్టెంబర్ ఒకటి నుంచి 2015 ఆగస్టు 31లోపు జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.75, ఓసీ, బీసీలు రూ.150 పరీక్ష ఫీజు చెల్లించాలి. ప్రభుత్వం లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నిరవధికంగా ఐదో తరగతి చదివి ఉండాలి. ప్రవేశ పరీక్షలో ఓసీ, బీసీ విద్యార్థులకు 35 మార్కులు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 30 మార్కులు వచ్చి ఉండాలి. -
పోలవరం కాలువ పనుల అడ్డగింపు
బ్రిడ్జి నిర్మించాలని ఆందోళనకారుల డిమాండ్ తుని రూరల్: వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ పోలవరం ఎడమ ప్రధాన కాలువ తవ్వకం పనులను తుని మండలం తాళ్లూరు వద్ద రైతులు, గ్రామస్తులు మంగళవారం అడ్డుకున్నారు. తమ పొలాలకు, ఇళ్లకు వెళ్లేందుకు రహదారి మార్గం లేకుండా కాలువ నిర్మిస్తుండడంతో తాళ్లూరు గ్రామస్తులు ఈ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ, పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూ సేకరణలో తమ గ్రామానికి చెందిన 300 ఎకరాలు ఇచ్చామన్నారు. మిగిలిన 400 ఎకరాలు సాగు చేస్తూ బతుకుతున్నామని చెప్పారు. కాలువకు ఓవైపు భూములు, జగనన్న కాలనీ, గ్రామ దేవత గుడి, లక్ష్మీనారాయణ గుడి, మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలుర వసతి గృహం(నిర్మాణంలో ఉంది) ఉండగా, మరోవైపు గ్రామమంతా ఉందని వివరించారు. గ్రామస్తులు కాలనీకి, వ్యవసాయ పనుల కోసం పొలాలకు, గుళ్లకు వెళ్లాలన్నా కాలువ దాటుకుని వెళ్లాల్సి ఉందన్నారు. అందుకు అనువుగా వంతెన నిర్మించిన తర్వాతే, పోలవరం కాలువ పనులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. పదేళ్లుగా తమ సమస్యను పట్టించుకోకపోవడంతోనే పనులను అడ్డుకోవాల్సి వచ్చిందన్నారు. తమ సమస్యలను పరిష్కరిస్తేనే, కాలువ పనులకు సహకరిస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సంఘటన స్థలానికి పోలవరం కాలువ డీఈ మురళీ, ఏఈ డాక్టర్ మహేష్‌కుమార్, ఇతర అధికారులు చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. గ్రామస్తులు, రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని వారు తెలిపారు. స్పష్టమైన హామీ వచ్చే వరకు పనులు చేపట్టవద్దని ఆందోళనకారులు భీష్మించారు. అప్పటికే రాళ్లను పేల్చేందుకు అమర్చిన పేలుడు సామగ్రిని తొలగించడం సాధ్యం కాదని, పేలుళ్లు పూర్తయ్యాక పనులు నిలిపివేస్తామని అధికారులు చెప్పడంతో, ఆందోళనకారులు అంగీకరించి, అక్కడి నుంచి నిష్క్రమించారు. -
రాగి జావ తాగి విద్యార్థులకు అస్వస్థత
● గోప్యంగా ఉంచేందుకు హెచ్ఎం యత్నం ● జగ్గిరాజుపేట స్కూల్లో ఘటన ఉప్పలగుప్తం: చల్లపల్లి పంచాయతీలోని జగ్గిరాజుపేట మండల ప్రజా పరిషత్ పాఠశాలలో మంగళవారం ఉదయం అల్పాహారంగా ఇచ్చిన రాగి జావ తాగి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలకు మొత్తం 26 మంది విద్యార్థులు హాజరవ్వగా, 14 మంది వాంతులతో అస్వస్థతకు గురవ్వడం చర్చనీయాంశమైంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసే కుక్ ముందుగా ఇంటి వద్దే ఆహారం తయారు చేసి, ఫంక్షన్‌కు వెళ్లడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని హెచ్ఎం వరలక్ష్మి తెలిపారు. హెచ్ఎం అందించిన సరకులతోనే పిల్లలకు ఆహారాన్ని తయారు చేసి, బంధువుల పెళ్లికి వెళ్లానని కుక్ సుజాత పేర్కొన్నారు. రెండు ప్యాకెట్ల రాగి పిండిని నెలంతా 28 మంది విద్యార్థులకు సర్దుబాటు చేసేలా హెచ్ఎం చెబుతారని, ఎప్పటిలాగే ఈరోజూ తయారుచేశానని వివరించారు. రాగి పిండి మంగళవారంతో అయిపోయిందని గ్రామస్తుల ఎదుట వాపోయారు. రాగి పిండి కాల పరిమితి ముగిసి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. పాఠశాలలో కనీసం రాగి పిండి ప్యాకెట్లు లేకపోవడం గమనార్హం. ఉదయం సుమారు 10 గంటలకు సంఘటన జరగ్గా, హెచ్ఎం గోప్యంగా ఉంచటంతో, మధ్యాహ్నం రెండు గంటలకు కానీ ఉన్నతాధికారులకు విషయం తెలియలేదు. సమాచారం అందుకున్న ఎంఈవో సత్తి సత్యకృష్ణ, సర్పంచ్ ఇసుకపట్ల జయమణి, దళిత నాయకుడు ఇసుకపట్ల రఘుబాబు, వైద్య సిబ్బంది పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులకు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం అమలాపురం ఏరియా ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. హెచ్ఎం వరలక్ష్మి తీరుపై ఎంఈవో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే ఆనందరావు, ఆర్డీవో కె.మాధవి, డీఈవో సలీం బాషా, ఎంఈవో కిరణ్‌బాబు పరామర్శించారు. విధుల నుంచి తొలగింపు ఈ సంఘటనపై డీఈవో సలీం బాషా మాట్లాడుతూ, కుక్ ఇంటి వద్ద ఆహారం తయారు చేసుకుని రావడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగిందని, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు కుక్‌తో పాటు హెల్పర్‌ను విధుల నుంచి తొలగించామని ప్రకటించారు. దీనిపై స్థానిక కూటమి నాయకుల ఒత్తిళ్లు ఉన్నాయని గ్రామంలో చర్చించుకుంటున్నారు. -
లారీ ఢీకొని యువకుడి మృతి
నక్కపల్లి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై బైక్‌ను లారీ ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల వివరాల మేరకు, కాకినాడ జిల్లా గొల్లప్రోలుకు చెందిన చిక్కాల శ్యామ్‌ప్రసాద్(29) వేంపాడు సమీపంలో సుబి ఇన్ఫ్రా ఫ్యాబ్రికేషన్ వర్క్ షాపులో పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి తన స్నేహితుడితో కలిసి బైక్‌పై టోల్ ప్లాజా వద్ద టీ పాయింట్‌కు వెళ్తుండగా, వెనుక నుంచి లారీ ఢీకొంది. బైక్ నడుపుతున్న శ్యామ్‌ప్రసాద్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న స్నేహితుడు సాయిబాబాకు గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోలీసులు నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సన్నిబాబు తెలిపారు. ఆలయంలో కానుకల చోరీ కేసులో జైలు తిరుత్తణి: ఆలయంలో వినూత్నంగా కానుకలు చోరీ చేసిన వ్యక్తికి ఆరేళ్ల జైలు శిక్షను విధిస్తూ తిరుత్తణి కోర్టు తీర్పు వెలువరించింది. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో గతేడాది ఏప్రిల్‌లో కొండ ఆలయ హుండీల్లో భక్తులు చెల్లించే కానుకలను ఓ వ్యక్తి నూలు సంచిలో పడేలా హుండీ లోపలి భాగంలో ఏర్పాటు చేస్తున్నట్టు సీసీ కెమెరాల్లో ఆలయ అధికారులు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుత్తణి పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం సిద్యాలయ గ్రామానికి చెందిన జేమ్స్ శ్యామ్వేల్ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. తిరుత్తణి క్రిమినల్ కోర్టులో జరిగిన కేసు విచారణలో నేరం రుజువైంది. నిందితుడికి ఆరేళ్ల పాటు జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ముత్తురాజ్ తీర్పు చెప్పారు. -
మృత్యువు విడదీయని స్నేహ బంధం
● ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు యువకుల మృతి ● పోలీస్ స్టేషన్ ఎదుట మృతుల బంధువుల ఆందోళన ధవళేశ్వరం: వారిద్దరూ స్నేహితులు. కలిసిమెలిసి తిరుగుతూ.. జీవితానందాన్ని ఆస్వాదిస్తున్న వారిని మృత్యువు అమాంతం మింగేసింది. ఆ మృత్యువు కూడా ఆ స్నేహితులను విడదీయలేకపోయింది. ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ధవళేశ్వరం జాలరుపేటకు చెందిన యువకులు నాగమల్లి ముత్యాలరావు(18), బొడ్డు వెంకటేష్(16) మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం మధ్యాహ్నం 3.30కు రాజోలు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాజోలు నుంచి రాజమహేంద్రవరానికి వెళుతోంది. ధవళేశ్వరం కాటన్‌పేట సమీపంలో ముత్యాలరావు, వెంకటేష్ మోటార్ బైక్‌పై వెళుతూ ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేయబోయారు. అదుపుతప్పి కిందపడడంతో వారి తలలపై నుంచి బస్సు వెనుక చక్రాలు దూసుకెళ్లి, అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జాలరుపేట వాసులు, స్థానికులు కలిసి సంఘటన స్థలంలో ఆందోళన చేపట్టారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి, నిరసన తెలిపారు. దీంతో వేమగిరి వైపు నుంచి వచ్చే వాహనాలను హైవే మీదుగా, రాజమహేంద్రవరం నుంచి వచ్చే వాహనాలను ఐఎల్టీడీ జంక్షన్ నుంచి మళ్లించారు. ఆందోళన చేస్తున్న మృతుల బంధువులతో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి చర్చలు జరిపారు. వ్యక్తిగతంగా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. ప్రభుత్వ పరంగా సాయం అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఆర్టీసీ అధికారులు రూ.15 వేల చొప్పున ప్రకటించారు. ధవళేశ్వరం సీఐ టి.గణేష్ వ్యక్తిగతంగా రూ.10 వేల చొప్పున డీఎస్పీ భవ్య కిషోర్ చేతుల మీదుగా అందజేశారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐలు గణేష్, కె.మంగాదేవి, వెంకటేశ్వరరావు, ఎస్సైలు క్రాంతికుమార్, హరిబాబు తదితరులు బందోబస్తు నిర్వహించారు. చిన్న వయసులోనే యువకులు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. జాలరుపేట ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
పెదపూడి: ఆలయం వద్ద విద్యుద్దీపాలంకరణకు సాయం చేస్తున్న యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఉదంతమిది. ఎస్సై రామారావు వివరాల మేరకు, కై కవోలు గ్రామంలో మహా శివరాత్రిని పురస్కరించుకుని మంగళవారం ఉదయం శివాలయం వద్ద విద్యుద్దీపాల అలంకరణ చేస్తున్నారు. ఈ ఏర్పాట్లకు స్థానికుడైన జీకే విశ్వేశ్వరరావు(22) సాయం చేస్తున్నాడు. విద్యుత్ తీగ తగలడంతో అతడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే స్థానికులు అతడిని పెదపూడి సీహెచ్‌సీకి తీసుకెళ్లి, మెరుగైన వైద్యం కోసం కాకినాడ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి చక్రరావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. క్వార్టర్స్ దశలో హాకీ పోటీలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఆలిండియా సివిల్ సర్వీసెస్ కల్చరల్, స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో కోకనాడ స్పోర్ట్స్ క్లబ్ పర్యవేక్షణలో జరుగుతున్న ఆలిండియా సివిల్ సర్వీస్ హాకీ పోటీలు మంగళవారం క్వార్టర్స్ దశకు చేరాయి. మధ్యప్రదేశ్‌పై సెంట్రల్ సెక్టార్, ఛత్తీస్‌గఢ్‌పై ఆంధ్రప్రదేశ్, కేరళ సెక్టార్‌పై రాజస్థాన్ సెక్టార్ విజయం సాధించాయి. డీఎస్డీఓ బి.శ్రీనివాస్‌కుమార్, కోకనాడ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకుడు రవిచంద్ర, అంతర్జాతీయ హాకీ క్రీడాకారుడు దాసరి మురళీకృష్ణ, టోర్నమెంట్ కమిటీ సభ్యులు మ్యాచ్‌లను తిలకించారు.గుర్తు తెలియని మృతదేహం లభ్యంమండపేట: పట్టణంలోని మెహర్‌బాబా స్కూల్ ఎదురుగా ఉన్న పెద్ద కాలువలో సుమారు 35 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు మంగళవారం కనుగొన్నారు. సుమారు 5.6 అడుగుల ఎత్తు ఉన్నాడు. స్కైమన్ అని రాసి ఉన్న నలుపు జీన్స్ ప్యాంట్, పింక్ పొడవు చేతుల గళ్ల చొక్కా మృతదేహానికి ఉన్నాయి. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని సీఐ దారం సురేష్ తెలిపారు. -
వీఐపీలకు ఒంటి గంట నుంచి 2.30 వరకు దర్శనం
కలెక్టర్ షణ్మోహన్ సామర్లకోట/పిఠాపురం: స్థానిక పంచారామ క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామి వారిని మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30 గంటల మధ్య దర్శనం చేసుకోవలసి ఉంటుందని కలెక్టర్ షణ్మోహన్ సగిలి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల అధికారుల సమీక్ష సందర్భంగా వీఐపీలు దర్శనానికి వచ్చిన సమయంలో సాధారణ భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారనే ఫిర్యాదుల మేరకు ఆయన ఈ ప్రకటన చేశారు. వీఐపీలు వచ్చిన సమయంలో వారికి దర్శనం చేయించడానికి ఇద్దరు లైజన్ అధికారులు మనోజ్‌కుమార్, బీవీ మోహన్‌రావులను నియమించినట్టు తెలిపారు. పంచారామ క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ మేరకు భక్తుల సహాలు, సూచనలు తీసుకొన్నామన్నారు. ఉచిత దర్శనంతోపాటు, రూ.20, రూ.50, రూ.100 క్యూ లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మహాశివరాత్రి రోజున భక్తులు ఆలయ కోనేరులో పుణ్యస్నానాలు చేసే అవకాశం ఉన్న కారణంగా ప్రమాదాలు జరుగకుండా గజ ఈతగాళ్లను నియమించామన్నారు. 27న రథోత్సవానికి భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. పిఠాపురంలో ఇలా.. ఈ నెల 26 న జరిగే మహా శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం దర్శనం నిమిత్తం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. వీఐపీలు 26 వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చని పేర్కొన్నారు. వీఐపీలకు ఇద్దరు లైజన్ అధికారులను నియమించామని తెలిపారు. బి వీర భద్రరావు సెల్ నెంబర్ 9963575998, జోగా సత్యనారాయణ సెల్ నెంబర్ 9948024322 లను సంప్రదించి వీఐపీ దర్శనం చేసుకోవచ్చని సూచించారు. పుష్కరిణి పారిశుధ్య పనుల కోసం అదనంగా వంద మంది పారిశుధ్య సిబ్బందిని నియమించామన్నారు. భక్తుల రక్షణ కోసం చిన్న బోటును, కోనేటి చుట్టూ 24 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశామన్నారు. మహా శివరాత్రికి వాహనాలపై వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయానికి నలువైపులా కేవలం 500 మీటర్లు దూరంలోనే ఆరు పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశామన్నారు. -
చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య
గండేపల్లి: మండలంలోని మురారిలో పోలవరం గట్టు వద్ద గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్మకు పాల్పడ్డాడు. సుమారు 35 నుంచి 40 సంవత్సరాలు వయస్సు గల మృతుని ఒంటిపై నీలం, పసుపు, నలుపు రంగు గల పొడుగు చేతుల చొక్కా, బిస్కెట్ రంగు ఫ్యాంట్, మెరూన్ రంగు డ్రాయర్ ధరించి ఉన్నాడు. పక్కనే సైకిల్ పడి ఉంది. గ్రామ వీఆర్ఏ ఫిర్యాదు మేరకు గండేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మృతుని ఆచూకీ తెలిస్తే సెల్: 9440796529, 9440904841 నెంబర్లకు తెలియజేయాలని ఎస్సై యువీ శివనాగబాబు తెలిపారు. మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో 72 గంటల పాటు ఉంచనున్నట్టు చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి సామర్లకోట: స్థానిక రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇది. రైల్వే హెచ్‌సీ శ్రీనివాసులు కథనం ప్రకారం సామర్లకోట నుంచి విజయవాడ వైపు వెళుతున్న రైలు నుంచి 30–35 సంవత్సరాల వయసు వ్యక్తి జారి పడి అక్కడిక్కడే మృతి చెందాడు. రైల్వే మేనేజర్ ఎం.రమేష్ నుంచి వచ్చిన ఫిర్యాదుతో ఘటనా ప్రదేశానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి కుడి చేయి దిగువ భాగంలో ఈశ్వరీ అని తెలుగులో పచ్చబోట్టుతో రాసి ఉంది. వివరాల కోసం రైల్వే పోలీసు స్టేషన్లో సంప్రదించాలన్నారు. కేసు నమోదు చేసి రైల్వే ఎస్సై దర్యాప్తు చేస్తున్నారు. -
బాలయోగి ప్రీమియర్ లీగ్ విజేత రాధా లెవన్
అమలాపురం రూరల్: జీఎంసీ బాలయోగి ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌ను రాధా లెవన్ జట్టు కై వసం చేసుకుంది. ఫిబ్రవరి 16న బాలయోగి స్టేడియంలో ఈ పోటీలు పారంభించామని నిర్వాహకులు రాజీవ్, చిన్ను, బాబీ, నాయుడు తెలిపారు. ఈ పోటీల్లో 32 జట్లు తలపడ్డాయి. సోమవారం జరిగిన ఫైనల్లో రాధా లెవెన్, జట్టు చందు లెవెన్ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో రాధా లెవన్ విజయం సాధించింది. రూరల్ సీఐ ప్రశాంత్‌కుమార్ ,కోనసీమ కేర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కారెం రవితేజ, స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ సురేష్ చేతుల మీదుగా విన్నర్‌కు రూ.30,000 వేలు నగదు బహుమతి, రన్నర్ జట్టుకు రూ.15,000 వేలు నగదు, ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో లింగోలు వీర రాజ్, కిఫోర్, పేరాబత్తుల ఫణి, యాళ్ల రవి, లింగోలు కృష్ణ, పెయ్యల సాయి, చిత్రపు అజయ్, మేడేపల్లి రాజు, కొప్పల ప్రశాంత్, అరిగెల వెంకటేశ్వరరావు, డేవిడ్ అంబేడ్కర్, చిత్రపు జయరాజ్, జిల్లెళ్ళ రమేష్, శ్రావణ్, కుమ్మరి పాల్గొన్నారు. -
వెటరన్ టీటీ పోటీలలో మోహన్‌బాబుకు కాంస్యం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఈ నెల 17 నుంచి 23 వరకు జరిగిన 31వ జాతీయస్థాయి వెటరన్ టేబుల్ టెన్నిస్ పోటీలలో ఏపీ జట్టు ప్రతిభను కనబరచి రాష్ట్ర చరిత్రలో తొలిసారి కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఈ పోటీలలో పాల్గొనే రాష్ట్ర జట్టుకు కాకినాడ జిల్లాకు చెందిన రిటైర్డ్ ఆయుష్ వైద్యాధికారి కోటగిరి మోహన్ బాబు కెప్టెన్‌గా వ్యవహించారు. నాకౌట్ పోటీలలో కర్ణాటక, గుజరాత్ బి, చండీఘర్ జట్లపై గెలుపొంది సెమీఫైనల్స్‌లో గుజరాత్ ఏ పై 3–2 స్కోర్‌తో ఏపీ జట్టు ఓటమి చెంది తృతీయస్థానంలో నిలిచింది. 1975 నుంచి టీటీ ఆడుతున్న మోహన్‌బాబు 1978లో కాలికట్ నేషనల్స్, 1982, 84లో ఆలిండియా ఇంటర్ యూనివర్శిటీ పోటీల్లో పాల్గొన్నారు. ప్రస్తతం కాకినాడ డీఎస్ఏ టీటీ హాల్లో క్రీడాకారులకు తర్ఫీదునిస్తున్నారు. జాతీయస్థాయిలో పతకం సాధించిన మోహన్‌బాబును జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్, జిల్లా టీటీ సంఘ గౌరవ అధ్యక్షుడు రావు చిన్నారావు, అధ్యక్షుడు విజయప్రకాష్, ఉపాధ్యక్షుడు దంటు భాస్కర్, టీటీ క్రీడాకారుడు సింగరాజు సోమవారం అభినందించారు. -
భీమేశ్వరునికి నేత్రపర్వంగా..
సామర్లకోట: బాలాత్రిపుర సుందరి సమేత కుమార రామభీమేశ్వరస్వామి కల్యాణం సోమవారం రాత్రి నేత్రపర్వంగా జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాలకు స్వాగతం పలుకుతూ స్వామి వారి కల్యాణం జరుగుతుంది. దీనిలో భాగంగా ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మధ్యాహ్నం నంది వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. పురవీధుల గుండా గ్రామోత్సవం పూర్తి చేసుకొని రాత్రి ఆలయానికి చేరింది. ఆలయంలో గ్రామోత్సవంలో పాల్గొన్న స్వామి వారి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బ్యాండ్ మేళాల మధ్య ఆలయంలోని తోటలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి, అమ్మ వారి విగ్రహాలను ఉంచారు. ఈ మేరకు వేదికను పూలతో అలంకరించారు. అన్నవరం దేవస్థానం నుంచి వేదపండితులు పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చారు. పారిశ్రామిక వేత్త గంజి బూరయ్య ముత్యాల తలంబ్రాలు ఏర్పాటు చేశారు. అన్నవరం, ఆలయ వేద పండితులు వేద మంత్రాల మధ్య స్వామి అమ్మవార్ల కల్యాణం నేత్ర పర్వంగా జరిగింది. ఈ కల్యాణంను తిలకించడానికి జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కంటే బాబు దంపతులు, ఈఓ బళ్ల నీలకంఠం ఆధ్వర్యంలో కల్యాణం నిర్వహించారు. అన్నవరం వేద పండితులు, ఆలయ వేద పండితుల వేద మంత్రాల మధ్య కల్యాణంలో పట్టణ పరిఽధిలోని పారిశ్రామిక వేత్తలు, రైతులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ఆటో నుంచి జారిపడి బాలుడి మృతి
ఆదిమూలంవారిపాలెంలో పెళ్లి ఇంట విషాదం పి.గన్నవరం: స్థానిక అక్విడెక్టుపై సోమవారం సాయంత్రం శివకోడు నుంచి ఆదిమూలంవారిపాలెం వెళుతున్న గూడ్స్ ఆటో గుంతలో పడి డోర్ ఓపెన్ కావడంతో దాని నుంచి జారి కిందపడి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఆదిమూలంవారిపాలెంలో మార్చి 1న బాలుడి చిన్నాన్న వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందడంతో పెళ్లి ఇంట విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఊడిమూడి శివారు ఆదిమూలంవారిపాలెంనకు చెందిన చిలకలపూడి శివనాగేంద్ర, అతని తమ్ముడు దైవప్రసాద్ హైదరాబాద్‌లో కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. తమ్ముడు దైవప్రసాద్‌కు వచ్చేనెల 1న వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నాగేంద్ర భార్య స్వర్ణ, వారి చిన్న కుమారుడు పవన్ శ్రీనివాస్ (4)లు ఇటీవల హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన ఆదిమూలంవారిపాలెంనకు వచ్చారు. ఒక పక్క పెళ్లి ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నాగేంద్ర కుటుంబ సభ్యుడు ఒకరు శివకోడు గ్రామంలోని సోదరి ఇంటికి ఆటోలో బయల్దేరాడు. అతనితో పాటు బాలుడు పవన్ శ్రీనివాస్ కూడా మేనత్త ఇంటికి వెళ్లాడు. సాయంత్రం అక్కడి నుంచి తిరిగి వస్తుండగా స్థానిక అక్విడెక్టుపై కుదుపులకు సడన్‌గా ఆటో డోర్ ఓపెన్ అయ్యింది. దీంతో డ్రైవర్ పక్కన కూర్చొన్న బాలుడు అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. బాలుడిని హుటాహుటిన అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో నాలుగు రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. అల్లారు ముద్దుగా పెరిగిన పవన్ శ్రీనివాస్‌ను మృత్యువు కాటేయడంతో కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగి పోయారు. బాలుడి తండ్రి నాగేంద్ర హైదరాబాద్ నుంచి బయల్దేరాడు. అక్రమంగా పశువులను తరలిస్తున్న లారీ పట్టివేత కిర్లంపూడి: అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న గూడ్స్ లారీని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై జి.సతీష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. వైజాగ్ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న గూడ్స్ లారీని తనిఖీ చేయగా దానిలో 72 ఎద్దులను అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. కొత్తవలస, విజయనగరం ప్రాంతాల నుంచి కేరళ రాష్ట్రానికి ఎద్దులను తరలిస్తున్నట్టు విచారణలో తేలింది. దీంతో లారీని సీజ్ చేసి, కేరళకు చెందిన డ్రైవర్ విష్ణుతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. ఎద్దులను గోకవరం మండలం కృష్ణునిపాలెంలోని గోశాలకు అప్పగించామన్నారు. -
దేవళాలకు పెళ్లి కళ!
ఆ మూడు దేవాలయాల్లో సోమవారం పెళ్లి కళ తొణికిసలాడింది! కాకినాడ జిల్లా సామర్లకోటలోని బాలాత్రిపుర సుందరి సమేత కుమారారామభీమేశ్వర స్వామి, పిఠాపురంలోని శ్రీకుక్కుటేశ్వరస్వామి, కోనసీమ జిల్లాలోని పలివెల ఉమా కొప్పేశ్వరస్వామివార్ల కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులే పెళ్లి పెద్దలుగా అర్చకుల వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాద్యాల నడుమ కల్యాణాలు వైభవోపేతంగా సాగాయి. పిఠాపురం: పెళ్లంటే నూరేళ్ల పంట నిత్య కల్యాణాలతో విరాజిల్లే ఆది దేవుడి వార్షిక కల్యాణం అంటే భక్తులకు కనుల పండువ. ఆది దేవుని కల్యాణానికి ముత్తయిదువలు పసుపు వాయ వేయగా భక్తులంతా పెళ్లి పెద్దలుగా తరలిరాగా ఆధ్యాత్మిక కేంద్రమైన పిఠాపురం పెళ్లి కళతో కళకళలాడింది. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా స్వామి అమ్మవార్లను తీసుకుని సారె చీరలతో వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాలతో భక్త జనం తరలివచ్చారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ క్షేత్రంలో వార్షిక కల్యాణోత్సవాలు, మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీకుక్కుటేశ్వరస్వామి కల్యాణం సోమవారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్త జనసందోహం నడుమ శ్రీకుక్కుటేశ్వరస్వామి, శ్రీరాజరాజేశ్వరి అమ్మవార్ల పరిణయం వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం భక్తుల ఆధ్వర్యంలో పసుపు కొట్టి స్వామి అమ్మ వార్లను పెళ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేశారు. అనంతరం స్థానిక శ్రీరామకృష్ణ వాసవి కన్యకాపరమేశ్వరీ కల్యాణ మండపం వద్ద ఎదురు సన్నాహం నిర్వహించారు. గజవాహనంపై గ్రామోత్సవం అనంతరం ఆలయ అర్చకుల ఆద్వర్యంలో పెండ్లికుమారుడైన కుక్కుటేశ్వరస్వామిని, పెండ్లి కుమార్తెగా రాజరాజేశ్వరి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పట్టు వస్త్రాలు, నగలతో అర్చకులు అలంకరించారు. స్వామివారిని, అమ్మవారిని అర్చకులు ఊరేగింపుగా తీసుకొని వచ్చి రంగు రంగుల విద్యుత్ దీపాలు, పువ్వులతో సుందరంగా అలంకరించిన కల్యాణ వేదికపై అధిష్టింపచేశారు. వేద పండితులు ద్విబాష్యం సుబ్రహ్మణ్యశర్మ ఘనాపాటి ఆధ్వర్యంలో అర్చకులు చెరుకుపల్లి వెంకటేశ్వశర్మ, అల్లంరాజు చంద్రమౌళి, వింజమూరి సుబ్రహ్మణ్యం యాజ్ఞీకంలో వేదమంత్రాల నడుమ విష్వక్సేన పూజతో కల్యాణాన్ని ప్రారంభించారు. రాత్రి 8.32 గంటలకు స్వామివారి కల్యాణం కనులపండువగా నిర్వహించారు. వివాహ సమయంలో పుణ్యాహవచనం, కంకణ ధారణ, సుముహూర్తం, కన్యాదానం, యజ్ఞోపవీతధారణ, మంగళ సూత్రధారణ, తలంబ్రాలు, ఆశ్వీరచనం తదితర పూజా కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తుల శివనామ స్మరణల మధ్య కుక్కుటేశ్వరస్వామి కల్యాణోత్సవం రమణీయంగా నిర్వహించారు. ఈవో జగన్మోహన్ శ్రీనివాస్, ఆలయ సిబ్బంది, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కమనీయం కుక్కుటేశ్వరుని కల్యాణం భక్తులతో కిక్కిరిసిన పాదగయక్షేత్రం మారుమోగిన శివనామస్మరణ -
అదనపులోడు
ఆక్వా రైతులపైసాక్షి, అమలాపురం: దేశీయంగా.. అంతర్జాతీయంగా ఎగుమతులు పెరగడంతో ధరలు పెరిగి కోలుకుంటున్న ఆక్వా ఊపిరి తీసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వివిధ రకాలుగా విద్యుత్ చార్జీల మోత మోగిస్తూ ఆక్వా రైతులను ముప్పుతిప్పులు పెడుతోంది. అదనపులోడు వినియోగం బిల్లు.. దానిపై అపరాధ రుసుము.. ఆపై అదనపు వినియోగానికి డిపాజిట్.. ఇవి కాదని కొత్త ట్రాన్స్ఫార్మర్లు.. సర్వీస్ లైన్ చార్జీల పేరుతో ఆక్వా రైతుల నడ్డివిరుస్తోంది. సర్వీసు లైన్ చార్జీల మోతపై రైతుల ధర్నా జిల్లాలో వెనామీ సాగుకు విద్యుత్ శాఖ యూనిట్‌కు రూ.1.50 చొప్పున రాయితీపై విద్యుత్ అందిస్తోంది. జిల్లాలో 5,970 వరకు ఆక్వా సర్వీసులు ఉండగా, వీటిలో 4,870 రాయితీ సర్వీసులున్నాయి. ఇటీవల రొయ్యల ధరలు పెరగడంతో రైతులు ఈ ఏడాది తొలి పంటను పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. ఈ సమయంలో విద్యుత్ శాఖ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రైతులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇటీవల ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లిలో ముందస్తు సమాచారం ఇవ్వకుండా విద్యుత్ నిలిపివేయడంతో చెరువులోని రూప్ చందువాలు చనిపోయి రైతులు రూ.లక్షల్లో నష్టపోయిన విషయం తెలిసింది. అలాగే సర్వీసు లైన్ చార్జీల మోత మోగిస్తున్నారని సఖినేటిపల్లి మండలానికి చెందిన రైతులు ఇటీవల రాజోలు ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో సోమవారం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. రైతుల నుంచి ప్రతిఘటన అధికంగా ఉండడంతో విద్యుత్ సరఫరా తొలగింపు తాత్కాలికంగా నిలుపుదల చేసినా, వెనామీ రైతుల నెత్తిన విద్యుత్ చార్జీల కత్తి వేలాడుతూనే ఉంది. బిల్లులో చూపించరు.. నోటీసు ఇవ్వరు అదనపు విద్యుత్ వినియోగంపై రైతులకు సమాచారం ఉండడం లేదు. మీ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని, మీ విద్యుత్ బిల్లు చెల్లింపునకు ఫలానా తేదీ ఆఖరు అని సెల్ ఫోన్లకు సంక్షిప్త సమాచారం పంపిస్తున్న విద్యుత్ శాఖ మీరు పరిధికి మించి విద్యుత్ వినియోగం చేస్తున్నారనే సమచారం ఇవ్వడం లేదు. కనీసం నెలనెలా వచ్చే బిల్లులో కూడా ఓవరు లోడు ఇంత బకాయి ఉందని కాని, అడిషినల్ కంజప్షన్ డిపాజిట్ (ఏసీడీ) ఇంత చెల్లించాలని కాని చూపించడం లేదు. వీటిపై విడిగా నోటీసు కూడా రైతులకు జారీ చేయడం లేదు. ఒక రాత్రికి రాత్రి స్పెషల్ డ్రైవ్ అని వచ్చి విద్యుత్ సర్వీస్‌లు కట్ చేసుకుపోతున్నారు. ఏసీడీ, ఓవర్ లోడు చార్జీలు చాలామందికి రూ.50 వేలకు పైబడి ఉంటోంది. ఒకేసారి ఇంత పెద్ద మొత్తం చెల్లించడం చిన్న రైతులకు ఇబ్బందిగా మారింది. విచిత్రంగా ఏసీడీ చార్జీల వివరాలు ఆన్లైన్లో కనిపిస్తున్నాయి. కానీ వేళ్ల మీద లెక్క పెట్టే స్థాయిలోనే రైతులు మాత్రమే ఆన్లైన్లో చూస్తుంటారు. పైగా దీనిలో ఓవర్ లోడు చార్జీలు కనిపించవు. ఈ రెండు పక్కాగా తెలుసుకోవాలంటే అమలాపురంలో ఉన్న విద్యుత్ శాఖ ఎకౌంట్స్ కార్యాలయానికి వెళ్లాల్సిందే. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ల భారం ఆక్వా విద్యుత్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 5,450 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఆక్వా రైతులకు 25 కేవీ, 40 కేవీ, 62 కేవీ, 100 కేవి, 150 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. అదనంగా వాడుతున్నందున 25 కేవీ ఉన్న రైతులు 40 కేవీ, 40 కేవీ రైతులు 60 కేవీ కెపాసిటీ పెంచాలని ఒత్తిడి చేస్తున్నారు. 60 కేవీ ట్రాన్స్ఫార్మర్ను వేయించాలంటే రైతులు రూ.5 లక్షల నుంచి రూ.ఏడు లక్షల వరకు ఖర్చు కానుంది. శ్ఙ్రీకేవలం నెల రోజులు మాత్రమే అదనంగా వాడితే దానిని మాత్రమే పరిగణలోకి తీసుకుని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం భావ్యంగా లేదు. కనీసం మూడు నెలల విద్యుత్ సగటు వినియోగాన్ని పరిగణలోకి తీసుకోవాలిశ్రీ అని ఆక్వా రైతులు కోరుతున్నా పట్టించుకునే వారు లేరు. ట్రాన్స్ఫార్మర్ల ఒత్తిడి వెనుక కాంట్రాక్టర్లతో విద్యుత్ శాఖ సాధారణ ఉద్యోగి నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు లాలూచీ పడడం కూడా కారణమని ఆక్వా రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అదనంగా వినియోగిస్తే వాతే విద్యుత్ సర్వీస్ పొందిన సమయంలో పొందుతున్న హార్స్ పవర్ కన్నా అదనంగా వినియోగిస్తే రైతుకు బిల్లు మోత మోగుతోంది. అదనపు వినియోగం, దానిపై అసరాధ రుసుం కలిపి సర్వీసుకు రూ.20 వేల నుంచి రూ.60 వేల వరకు విద్యుత్ బిల్లు వస్తోంది. సాధారణంగా చిన్న రైతులు 25 కేవీ, 40 కేవీలు ట్రాన్స్ఫార్మర్లను వేయించుకుంటారు. వీళ్లు సాధారణంగా 15 నుంచి 20 కేవీ వరకు వినియోగిస్తుంటారు. చెరువులో రొయ్య పిల్లలు అధికంగా ఉండి కౌంట్ పెరిగిన తరువాత ఏరియేటర్లు ఎక్కువ సమయం వాడుతుంటారు. ఈ సమయంలో విద్యుత్ వాడకం ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ కన్నా అదనంగా ఉంటోంది. దీనిని బూచిగా చూపి ఓవర్ లోడు చార్జీలు, దీనిపై అపరాధ రుసుము వసూలు చేస్తున్నారు. ఇది సర్వీసుకు వచ్చి రూ.10 వేల నుంచి రూ.70 వేల వరకు ఉంటోంది. జిల్లాలో సుమారు 400 మంది సర్వీసులపై అదనపు లోడు కత్తి వేలాడుతోందని అంచనా. -
ఉమా కొప్పేశ్వరుల పరిణయం
కొత్తపేట: పురాణ ప్రసిద్ధి చెందిన పలివెల ఉమా కొప్పేశ్వరస్వామివార్ల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రాష్ట్రంలో ప్రముఖ శైవ క్షేత్రాల్లో కొత్తపేట మండలం పలివెల క్షేత్రం ఒకటి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ శివ పార్వతులు ఏకపీఠంపై కొలువైన విషయం తెలిసిందే. దేవదాయ – ధర్మాదాయ శాఖ జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో దేవస్థానం ఈఓ సోమాల శివ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దానిలో భాగంగా సోమవారం తెల్లవారుజామున ఆలయంలో కల్యాణమూర్తులైన ఉమా కొప్పేశ్వరులను అర్చకులు, వేద పండితులు ప్రాంగణంలోని రాజరాజనరేంద్రుడు నిర్మించిన కల్యాణ మండపంలోకి తీసుకువచ్చారు. స్థానిక ఆర్డీఓ పి.శ్రీకర్, డీఎస్పీ సుంకర మురళీమోహన్ సతీ సమేతంగా కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఆలయం తరఫున డీఎస్పీ మురళీమోహన్ దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. 4.45 గంటలకు స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ప్రతీ ఘట్టం కనుల వైకుంఠంగా జరిపింఆరు. అనంతరం భక్తులకు కల్యాణ తలంబ్రాలు, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. -
అదనపు చార్జీలు వసూలు చేయొద్దు
గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులకు జేసీ ఆదేశం అమలాపురం రూరల్: మార్చి ఒకటో తేదీ నుంచి గ్యాస్ డోర్ డెలివరీలో అదనపు చార్జీలు వసూళ్లు నిలిసివేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులను, డోర్ డెలివరీ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం జిల్లాలో 31 ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు, డెలివరీ సిబ్బందితో గోదావరి భవన్లో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మేలు చేకూర్చాలనే ప్రధాన సంకల్పంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా దీపం– 2 పథకాన్ని ప్రవేశపెట్టిందని ఇటీవల కాలంలో కోనసీమ జిల్లా ఎల్పీజీ గ్యాస్ వినియోగదారుల నుంచి అదనపు డోర్ డెలివరీ చార్జీలు వసూలు చేస్తున్నారని అన్నారు. జిల్లా నుంచి 70 శాతం మంది నుంచి ఫిర్యాదులు ఐవీఆర్ఎస్, వాట్సాప్ క్యూఆర్ కోడ్, ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా వచ్చాయని తెలిపారు. రశీదులో ముద్రించిన సొమ్మును మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేశారు. డోర్ డెలివరీలో అధిక చార్జీలు వసూళ్లపై క్షేత్రస్థాయి తనిఖీల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. అదనపు సొమ్ము వసూలు చేస్తే టోల్ ఫ్రీ 1967కి ఫిర్యాదు చేయవచ్చునన్నారు. పౌరసరఫరాల కమిషనర్ ఆదేశాల పాటించని పక్షంలో సంబంధిత గ్యాస్ డెలివరీ బాయ్స్, పంపిణీదారులపై చర్యలు తీసుకొంటామని తెలిపారు. తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ రాజేష్ మాట్లాడుతూ డోర్ డెలివరీ వద్ద సిలిండర్ల తూనికను సీళ్లను పర్యవేక్షిస్తామని కేవలం 150 గ్రాముల వరకు వ్యత్యాసాలను అనుమతిస్తామని ఆపై వ్యత్యాసాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. జిల్లా పౌర సరఫరాల మేనేజర్ ఎం.బాలసరస్వతి మాట్లాడుతూ గ్యాస్ వినియోగదారులు, వారికిచ్చిన రశీదులో ముద్రించి ఉన్న ధర కంటే అదనంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఉన్నత విద్యకు 10వ తరగతి తొలి మెట్టు విద్యార్థుల బంగారు భవితకు ప్రాథమిక విద్యా పునాది అని, ఉన్నత విద్యకు 10వ తరగతి తొలి మెట్టని జేసీ నిషాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ నిర్ణయించే పదో తరగతి పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనేలా విద్యార్థులను సన్నద్ధం చేయడంతో పాటు వివిధ సబ్జెక్టుల్లో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్దపెట్టి నూరు శాతం ఫలితాలు సాధిం చేందుకు కృషిచేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రస్తుతం నేర్చుకున్న విషయాలు ఇప్పటి పరీక్షలకే కాకుండా జీవితాంతం ఉపయోగపడతాయని సూచించారు. పరీక్షలకు సుమారు 15 రోజులు వ్యవధి మాత్రమే ఉందని ఈ సమయం ఎంతో కీలక మైనదన్నారు. సబ్జెక్టు ఉపాధ్యాయులు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి బోధించి పరీక్షలను ఎదుర్కొనేందుకు సన్నద్ధం చేయాలన్నారు. -
మంగళవారం శ్రీ 25 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
● అదనపు లోడు వినియోగంస్తే వాతలే ● అదనపు బిల్లు.. దానిపై అపరాధ రుసుము... ఆపై డిపాజిట్ చార్జీలు ● విద్యుత్ కనెక్షన్‌కు వచ్చి రూ.10 వేల నుంచి రూ.70 వేలు ● ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లు మార్చాలని పట్టు ● రూ. ఐదు లక్షల నుంచి రూ.ఏడు లక్షల వరకు భారం -
దొంగ కోడలి పట్టివేత
కాకినాడ క్రైం: అత్త సొత్తు కోసం ఓ కోడలు దొంగగా మారింది. మావయ్య చనిపోతే మొసలు కన్నీళ్లు కారుస్తూ పరామర్శ పేరుతో అత్తగారింట్లో రెక్కీ చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా అక్కడి నుంచి స్వస్థలానికి వెళ్లిపోయి, మళ్లీ తిరిగి వచ్చి ముసుగు దొంగ అవతారంలో ప్రత్యక్షమైంది. అయితేనేం, సీసీ టీవీ ఫుటేజీ, సాంకేతికత పట్టుబడేలా చేశాయి. అత్తారింటిని నిండా ముంచిన కోడలి చోర ప్రావీణ్యాన్ని కాకినాడ సబ్ డివిజన్ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ సోమవారం నగరంలోని స్థానిక వన్‌టౌన్ పీఎస్‌లో విలేకరులకు వెల్లడించారు. కాకినాడ జగన్నాథపురం యానాం రోడ్ సమీపంలో ఉండే 74 ఏళ్ల చాగంటి శుక్రవారపు మహాలక్ష్మి భర్త శ్రీరామచంద్రమూర్తి వయో భారంతో కొద్దిరోజుల క్రితం మృతి చెందారు. ఈయన విశ్రాంత ఏపీఎస్పీ అడ్మినిస్ట్రేటర్. ఈ దంపతులకు పిల్లలు లేకపోవడంతో శంకర్ అనే వ్యక్తిని చిన్నప్పుడే దత్తత తీసుకొన్నారు. ఈయన సిర్పూర్–కాగజ్‌నగర్‌లో ఓ సంస్థలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన కొద్ది నెలల క్రితం తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా, మేడిపల్లి మండలం, కట్లకుంట గ్రామానికి చెందిన ధారా రజిత అనే యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడు. భార్యతో కలిసి హైదరాబాద్‌లో కాపురం ఉంటున్నాడు. కొద్ది వారాల క్రితం శంకర్ దత్త తండ్రి శ్రీరామచంద్రమూర్తి మృతి చెందారు. మావయ్య చనిపోవడంతో కోడలు అత్తయ్యని పరామర్శించేందుకు వచ్చింది. నెల రోజులకు పైగా అత్తగారింట్లోనే గడిపింది. అనంతరం అక్కడి నుంచి స్వగ్రామానికి వెళ్లిపోయింది. అలా వెళ్లిపోయిన రజితకు అత్తగారింట్లో చూసిన బంగారం, డబ్బుపై దుర్బుద్ధి పుట్టింది. ఎలా అయినా కాజేయాలని కుట్ర పన్నింది. ఈ క్రమంలో తమ బంధువులైన ధారా రఘు(కట్లకుంట గ్రామం), తోందిర్తి లత(రాయలపల్లి గ్రామం, గంగాధర మండలం, కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం), తాటి వెంకటేష్(ఇస్లాంపూర్ గ్రామం, గంగాధర మండలం, కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం)లతో కలిసి పథక రచన చేసింది. ఈ నెల 14వ తేదీన కాకినాడ వచ్చి అనుకున్నది అనుకున్నట్లు అమలు చేశారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న వృద్ధురాలిని విచక్షణారహితంగా కొట్టారు. నోట్లో గుడ్డలు కుక్కి చేతులు, కాళ్లు కట్టేశారు. చేతి గాజులు, మెడలో ఉన్న బంగారాన్ని లాక్కున్నారు. ట్రంకు పెట్టెలో ఉన్న రూ.60 వేల నగదును ఎత్తుకెళ్లారు. పరామర్శ సమయంలో తాను చూసిన బంగారం అక్కడ లేకపోవడంతో, మీ ఇంట్లో ఎక్కువ బంగారమే ఉండాలి అదంతా ఏమైందో చెప్పాలని పెద్దామెను చిత్రహింసలకు గురి చేశారు. ఫలితం లేకపోయే సరికి అందిన కాడికి దోచుకొని పరారయ్యారు. ఆ వెంటనే మహాలక్ష్మి కాకినాడ వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. సీఐ నాగదుర్గారావు, సీసీఎస్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో బృందాలు దొంగలను వెతికే పనిలో పడ్డాయి. సీసీ టీవీ ఫుటేజీలు, సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా మహాలక్ష్మి కోడలు రజిత దొంగతనానికి ఒడిగట్టిందని వెల్లడైంది. బాధితురాలు మహాలక్ష్మి ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి రామలక్ష్మి ఎప్పటికప్పుడు వీరికి సాయం అందించేదని పోలీసుల విచారణలో తేలింది. దీంతో రజిత సహా ధారా రఘు, తోందిర్తి లత, తాటి వెంకటేష్, రామలక్ష్మిలను పోలీసులు అరెస్టు చేశారు. వారు అన్నమ్మఘాటి సెంటర్లో పట్టుబడినట్లు సబ్ డివిజన్ ఏఎస్పీ వెల్లడించారు. వారి నుంచి రూ.2.3 లక్షల నగదు, 9.5 గ్రాముల బంగారు ఆభరణాలు, కారు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఫిర్యాదుదారి ఇంటి నుంచి వీటిలో రూ.60 వేల నగదు, 9.5 గ్రాముల బంగారాన్ని కోడలు ఆమె బృందం ఎత్తుకెళ్లారు. కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన సీసీఎస్ సీఐ క్రాంతి, వన్‌టౌన్ సీఐ నాగదుర్గారావు బృందాన్ని ఏఎస్పీ అభినందించారు. అత్త సొత్తు కోసం కుతంత్రం దాడి చేసి బంగారం, సొమ్ము చోరీ సాంకేతికత సాయంతో ఆమె అనుచరులు కూడా అరెస్ట్ -
నిరుద్యోగుల జీవితాలతో ఆటలొద్దు
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శిరీష్ అమలాపురం టౌన్: ఎనిమిది నెలల పాలనలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువత జీవితాలతో ఆటలాడుతోందని, వారిని నట్టేట ముంచుతోందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మిండగుదిటి శిరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా గ్రూప్ –2 పరీక్షల రాసే అభ్యర్థుల విషయంలో సైతం కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతపై ఆది నుంచి వహిస్తున్న నిర్లక్ష్యమే వహించిదని ఆరోపించారు. ఈ మేరకు శిరీష్ అమలాపురంలో ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. గ్రూప్–2 అభ్యర్థులకు రోస్టర్ విధానాన్ని సరిచేసి పరీక్షలు నిర్వహించాల్సిన ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేస్తామని చెబుతూ చివరి నిమిషం వరకూ డైలమాలో పడేడయం సరికాదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, విద్యా మంత్రి ఈ పరీక్షల నిర్వహణలో కల్లబొల్లి కబుర్లు చెబుతూ చివరి నిమిషంలో ఆ నెపాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై నెట్టేసి అర్ధంతరంగా ఆదివారం పరీక్ష పెట్టడం వారిని అయోమయంలో పడేయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీ మేరకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు సరికదా కనీసం పోటీ పరీక్షలైనా సక్రమంగా నిర్వహించకుండా నిరుద్యోగ యువత భవితను ఈ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రతీ ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తానని చెప్పిన ప్రభుత్వం అదీ అమలు చేయకుండా నిరుద్యోగ యువత జీవితాలను అగమ్య గోచరం చేస్తోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి సరైన సమయంలో గుణపాఠం చెప్పేందుకు నిరుద్యోగ యువత కాచుకుని ఉందని శిరీష్ స్పష్టం చేశారు. సత్యదేవుని సన్నిధిలో భక్తజన వాహిని అన్నవరం: సత్యదేవుని సన్నిధికి ఆదివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. సుమారు 50 వేల మందికి పైగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున రత్నగిరిపై, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులు సత్యదేవుని దర్శించేందుకు రత్నగిరికి తరలివచ్చారు. దీనికి తోడు మాఘ బహుళ దశమి పర్వదినం కావడంతో పెద్ద సంఖ్యలో ఇతర భక్తులు కూడా తరలి వచ్చారు. దీంతో ఆలయంలో తీవ్ర రద్దీ ఏర్పడింది. ఉదయం 9 గంటల వరకూ ఓ మాదిరిగా ఉన్న రద్దీ తరువాత ఒక్కసారిగా పెరిగిపోయింది. సాయంత్రం వరకూ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. రద్దీ కారణంగా అంతరాలయ దర్శనాలను మధ్యాహ్నం వరకూ నిలిపివేశారు. మొత్తం 50 వేల మంది భక్తులు రత్నగిరికి వచ్చారని అధికారులు తెలిపారు. దేవస్థానానికి రూ.50 లక్షలు పైగా ఆదాయం సమకూరింది. సత్యదేవుని వ్రతాలు సుమారు 4 వేలు జరిగాయి. స్వామివారి నిత్య కల్యాణంలో 50 మంది పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు వేళాయె
● మార్చి ఒకటి నుంచి 20 వరకూ నిర్వహణ ● జిల్లావ్యాప్తంగా 40 కేంద్రాలు ● హాజరుకానున్న 27,312 మంది విద్యార్థులు రాయవరం: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధం అవుతోంది. మార్చి 1న ఫస్టియర్ పరీక్షలతో ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలు మార్చి 20న సెకండియర్ పరీక్షలతో ముగియనున్నాయి. జిల్లా మొత్తం మీద 27,312 మంది విద్యార్థులు 40 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. ప్రశ్నపత్రాలను 14 స్టోరేజీ పాయింట్లకు తరలించే ప్రక్రియ త్వరలోనే చేపట్టనున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రానికి మూడు సెట్ల పరీక్ష ప్రశ్నపత్రాలు చేరుకున్నాయి. వీటిని అమలాపురం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పోలీసు బందోబస్తుతో భద్రపరిచారు. పరీక్షలను సమర్థంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144వ సెక్షన్ అమల్లో ఉంటుంది. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈసారి జంబ్లింగ్ విధానంలోనే ఈసారి కూడా పరీక్షలు జంబ్లింగ్ విధానంలోనే నిర్వహిస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్ 11,023 జనరల్ విద్యార్థులు, 2,408 మంది వొకేషనల్, ఇంటర్ సెకండియర్ జనరల్ విద్యార్థులు 11,235 మంది, వొకేషనల్ విద్యార్థులు 2,646 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏమైనా సమస్యలుంటే కంట్రోలు రూమ్‌లో ఏర్పాటు చేసిన 9550335191 నంబరుకు ఫోన్ చేయవచ్చు. ఈ సంవత్సరం కలెక్టరేట్లో కూడా ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. హాల్ టికెట్లు డౌన్ లోడ్ విద్యార్థుల హాల్ టికెట్లను నేరుగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని ఇంటర్మీడియెట్ బోర్డ్ కల్పించింది. విద్యార్థి పేరు, హాల్ టికెట్ నంబరును టైప్ చేస్తే పరీక్ష కేంద్రం వివరాలు తెలుస్తాయి. ఇప్పటికే హాల్ టికెట్లను ప్రిన్సిపాల్స్ విద్యార్థులకు అందజేస్తున్నారు. ఇంటర్మీడియేట్ బోర్డు ఏర్పాటు చేసిన 95523 00009 వాట్సాప్ నంబరుకు ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఏర్పాటు చేసింది. మొదటగా వాట్సాప్ నంబరుకు హాయ్ అని ఇంగ్లిషులో టైప్ చేసి పంపించాలి. వెంటనే ప్రభుత్వ సర్వీసులు డిస్ప్లే అవ్వగానే, విద్యాశాఖను ఎంపిక చేసుకోవాలి. అందులో విద్యార్థి ఆధార్ నంబరు లేదా రోల్ నంబరును టైప్ చేయాలి. తర్వాత విద్యార్థి పుట్టిన తేదీ, నెల, సంవత్సరం టైప్ చేయాలి. కాసేపట్లో విద్యార్థి హాల్ టికెట్ అదే వాట్సాప్‌కు పీడీఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ అవుతుంది. దివ్యాంగులకు సదుపాయాలు దృష్టిలోపం ఉన్న వారు పరీక్ష రాసేందుకు సహాయకుడిని నియమించుకోవచ్చు. వీరికి జంబ్లింగ్ నుంచి మినహాయింపు ఉంది. పరీక్ష రాసేందుకు 30 నిమిషాల అదనపు సమయం ఇస్తారు. దివ్యాంగ శాతాన్ని బట్టి విద్యార్థికి ఆయా సబ్జెక్టుల్లో ఉత్తీర్ణతా మార్కులను తగ్గిస్తారు. వినికిడి లోపం ఉంటే పై మినహాయింపులతో పాటు ఒక లాంగ్వేజ్‌లో పార్ట్–1, పార్ట్–2 నుంచి మినహాయింపు ఇస్తారు. ఒకేషనల్ విద్యార్థులకు ఆంగ్లంలో చదివే కమ్యూనికేషనన్ స్కిల్స్ నుంచి మినహాయిస్తారు. శారీరక వైకల్యం ఉంటే రెండు చేతులు లేని వారికి స్క్రైబ్‌ను ఇస్తారు. డిస్లెక్సియా లోపం ఉన్న వారికి గంట అదనపు సమయం ఇస్తారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఎక్కడా అవకతవకలకు అవకాశం లేకుండా పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించం. మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే దాని తీవ్రతను బట్టి 8 పరీక్షల వరకూ డిబార్ చేస్తాం. ఉదయం 6.45కు రేడియోలో వచ్చే ప్రాంతీయ వార్తల్లో చెప్పే సెట్ నంబర్ ప్రశ్నాపత్రాన్ని పోలీస్ స్టేషన్ నుంచి ఉదయం 8.3 0గంటలకు పరీక్షా కేంద్రానికి తరలిస్తారు. – వనుము సోమశేఖరరావు ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాశాఖ అధికారి, అమలాపురం జిల్లా నుంచి ఇంటర్ రాసే విద్యార్థులు : 27,312 ప్రథమ సంవత్సరం విద్యార్థులు –13, 431 ద్వితీయ సంవత్సరం విద్యార్థులు – 13,881 పరీక్షా కేంద్రాలు: 40 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలు: 01 ఫ్లయింగ్ స్క్వాడ్స్ – 4 సిట్టింగ్ స్క్వాడ్స్ – 3 -
పదవులను బాధ్యతగా నిర్వహిద్దాం
– వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పిల్లి సూర్య ప్రకాష్మలికిపురం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మనపై ఎంతో నమ్మకంతో ఇచ్చిన పార్టీ పదవులను బాధ్యతగా నిర్వహిద్దామని, నూతనంగా నియమితులయిన వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పిల్లి సూర్యప్రకాష్ పేర్కొన్నారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుని తొలిసారిగా ఆదివారం మలికిపురంలో పార్టీ కార్యాలయంలో నియోజక వర్గ పార్టీ కేడర్‌తో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పార్టీలో అన్ని వర్గాలకూ సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. వచ్చే నాలుగేళ్లలో శ్రమించి జిల్లాలో అత్యధిక స్థానాలలో పార్టీ విజయం సాధించేలా కృషి చేద్దామన్నారు. ఇందుకోసం పార్టీ కేడర్ అంతా శ్రమించాలన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా ఎంతో ఉత్తమ పాలన అందించిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాలన అస్తవ్యస్థం చేసిందన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్న ఏకై క ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనన్నారు. కూటమి ప్రభుత్వం పాలనలో అవినీతి విలయ తాండవం చేస్తోందన్నారు. కూటమి పాలనపై ఎనిమిది నెలల్లోనే ప్రజలు విరక్తి చెందారన్నారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ సూర్య ప్రకాష్ ఆధ్వర్యంలో జిల్లాలో పార్టీ యువజన విభాగం మరింత బలోపేతం అయి వచ్చే ఎన్నికల నాటికి విజయ తీరాలకు చేరుద్దామన్నారు. జగన్ నేతృత్వంలో అంతా కలిసిమెలసి పనిచేసి ముందుకు సాగుదామన్నారు. నాయకులు కేఎస్ఎన్ రాజు, జంపన బుజ్జిరాజు, కంచర్ల శేఖర్, పాటి శివకుమార్, బొలిశెట్టి భగవాన్, కుసుమ చంద్రశేఖర్, గుబ్బల మనోహర్, ఈద రవిరెడ్డి, గుబ్బల వీర వెంకట సత్యనారాయణ, గుర్రం జాషువా, తాడి సహదేవ్, నామన మణికంఠ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సూర్య ప్రకాష్‌ను శాలువాలతో సన్మానించి అభినందించారు. -
అయినవిల్లిలో భక్తుల సందడి
అయినవిల్లి: విఘ్నేశ్వర స్వామివారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజ జరిపారు. ఆర్చకులు స్వామిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామికి మహానివేదన చేశారు. రాత్రి ఎనిమిది గంటలకు విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. స్వామివారి పంచామృతాభిషేకాల్లో మూడు జంటలు పాల్గొన్నాయి. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 62 మంది, శ్రీ లక్ష్మీగణపతి హోమంలో 25 జంటలు, స్వామివారి గరిక పూజలో ఒక జంట పాల్గొన్నారు. ముగ్గురు భక్తులు స్వామికి ఉండ్రాళ్ల పూజలు జరిపారు. స్వామి వారి సన్నిధిలో 77 మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు, 15 మంది చిన్నారులకు అన్న ప్రాశనలు, 14 మందికి తులాభారం, ఒకరికి నామకరణ చేశారు. స్వామికి 12 మంది తలనీలాలు సమర్పించారు. 48 నూతన వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. 4,100 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజా టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.5,72,525 ఆదాయం లభించినట్లు ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. -
అందరికీ ఆమోదయోగ్యంగా కేంద్ర బడ్జెట్
అమలాపురంలో మేధావుల సమావేశం అమలాపురం రూరల్: ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని అమలాపురంలో కేంద్ర బడ్జెట్‌పై జరిగిన మేధావుల సమావేశం తెలిపింది. అమలాపురం ప్రెస్ క్లబ్ హాల్లో ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్‌పై మేధావుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.డి.విల్సన్ మాట్లాడుతూ కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా దేశ సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్ అని అన్నారు. ఈ బడ్జెట్ ద్వారా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. యువతను పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చేయటానికి ఎంఎస్ఎమ్ఈలకు 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. వాళ్లకు ఇచ్చే రుణాలు రూ.ఐదు కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచే ప్రణాళిక సిద్ధం చేశారని అన్నారు. మహిళల అభివృద్ధికి సంబంధించి అనేక పథకాలు ప్రవేశపెట్టారు. రైతు కిసాన్ పథకాన్ని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారన్నారు. మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బోనం సత్తిబాబు, జిల్లా ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏడిద దొరబాబు, వివిధ వ్యాపార సముదాయాల అధ్యక్షులు నల్లా పవన్‌కుమార్, గోకరకొండ హరిబాబు, కంచిపల్లి అబ్బులు, మేడిచర్ల త్రినాథ్, వంటెద్దు బాబు, డాక్టర్ వీరా ధన్వంతరీ, మణికుమారి, డాక్టర్లు, లాయర్లు పాల్గొన్నారు. -
లోవలో భక్తుల సందడి
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానం ప్రాంగణంలో ఆదివారం సందడి నెలకొంది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 7 వేల మంది భక్తులు క్యూ లైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకున్నట్లు ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,21,365, పూజా టికెట్లకు రూ.75,520, కేశఖండన శాలకు రూ.9,840, వాహన పూజలకు రూ.2,810, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.60,032, విరాళాలు రూ.62,280 కలిపి మొత్తం రూ.3,31,847 ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు. -
ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
● సీసీ కెమెరాల నిఘా నడుమ పరీక్షల నిర్వహణ ● జిల్లా పరీక్షల కమిటీ సమావేశంలో డీఐఈవో సోమశేఖరరావు వెల్లడి అమలాపురం టౌన్: మార్చి 1 నుంచి 20వ తేదీ వరకూ జరగనున్న ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షలు నిర్వహణ అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సంసిద్ధమై ఉండాలని జిల్లా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఐఈవో) వనుము సోమశేఖరరావు ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఆదివారం జరిగిన ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణ కమిటీ సమావేశంలో డీఐఈవో మాట్లాడారు. ఇంటర్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో నిర్దేశించిన 40 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటున్న దృష్ట్యా పోలీసు పహరా ఉంటుందని తెలిపారు. ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్ధులు, ఇన్విజిలేటర్లు సెల్ఫోన్లు వాడకూడదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రం వద్ద చీఫ్ సూపరింటెండెంట్ మాత్రం ఇంటర్మీడియెట్ విద్యా మండలి సరఫరా చేసిన సాధారణ ఫోన్‌ను పరీక్షకులకు సంబంఽధించిన సమాచారం కోసం వాడవచ్చని సూచించారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులైన అధికారులకు పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలను డీఐఈవో తెలిపారు. జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు వై.లక్ష్మణరావు, ఎం.రామారావు, కె.శ్రీనివాసరావు, బల్క్ ఇన్చార్జి డి.శ్రీనివాసరావు, జిల్లా జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
అంబాలెన్స్లకు మంగళం
అమలాపురం రూరల్: 1962 హెల్ప్ లైన్ మూగబోయింది. మొబైల్ వెటర్నరీ క్లినిక్‌లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. మారుమూల పల్లెల్లో సైతం అందించే విశిష్ట పశువైద్య సేవలు నిలిచిపోయాయి. ఎన్నో అరుదైన, కష్టసాధ్యమైన శస్త్రచికిత్సలు చేసి మూగజీవాలకు ప్రాణదానం చేసిన మొబైల్ అంబులెన్స్‌లు రోడ్డెక్కడం లేదు. వారం రోజుల క్రితం అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా 7 అంబులెన్స్‌లు నిలిచిపోగా రేపో మాపో మిగిలిన 7 అంబులెన్స్‌లు కూడా ఆగిపోనున్నాయి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా... దేశంలోనే తొలిసారిగా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో 108 అంబులెన్స్‌లు ప్రవేశపెట్టి పేదలకు ఎంతో సాంత్వన చేకూర్చారు. అదే స్ఫూర్తితో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మరో అడుగు ముందుకు వేసి మూగజీవాల కోసం 2022 సంవత్సరంలో మే 19 తేదీన మొబైల్ అంబులెన్స్‌లు తీసుకువచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేసిన ఈ అంబులెన్సులు మంచి ఫలితాలు ఇవ్వడంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వీటిని సమకూర్చారు. నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల విలువ చేసే మందులు సైతం ఉచితంగా అందించారు. అర్హత కలిగిన పశువైద్యులు ఒక పేరావిట్, డ్రైవర్‌ను నియమించారు. 1962 ట్రోల్ నంబరు ఏర్పాటు చేశారు. రైతుల నుంచి ఫోన్ వచ్చిన వెంటనే 108 మాదిరిగానే మారుమూల ప్రాంతాలకు 1962 అంబులెన్సులు వెళ్లి రైతు ఇంటి వద్ద మూగజీవాలకు వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు. మూగజీవాలకు ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు అంబులెన్స్ ద్వారా సమీప పశువుల అసుపత్రికి తీసుకువెళ్లి పశుసంవర్ధక శాఖ డాక్టర్లు, ఏడీల సహకారంతో శస్త్రచికిత్సలు అందించి ప్రాణం కాపాడేవారు. కక్ష గట్టి కూటమి ప్రభుత్వం నిలిపివేత ఉన్నత ఆశయంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబులెన్న్స్లపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. కాంట్రాక్టు ముగిసిందనే నెపంతో 7 అంబులెన్స్‌లను ఈ నెల 16 నుంచి నిలిపివేసింది. మరికొన్ని రోజుల్లో మిగిలిన 7 అంబులెన్స్‌లను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తూ చేస్తున్నారు. వీటీని జీవీకే సంస్థ నిర్వహించేది. కాంట్రాక్టర్ గడువు ముగిసిందని కుంటి సాకుతో నిలిపివేశారు. ఒక్కసారిగా 1962 అంబులెన్స్ సేవలను నిలిపివేయడంతో రైతులు కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మూగజీవాల వైద్య సేవలకు అంతరాయం ఏర్పడుతోందని ఆందోళన చెందుతున్నారు. మరోపక్క 1962 అంబులెన్స్‌ల్లో పనిచేసిన ఉద్యోగులు పరిస్థితి అగమ్య గోచరంగా తయారయింది. కొత్త సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటే తమ పరిస్థితి ఏమిటని ఉద్యోగులు వాపోతున్నాడు. కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ఆదోళన చెందుతున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2019 లెక్కల ప్రకారం జిల్లాలో పశువుల వివరాలు ఉద్యోగుల నిరసన మా కుటుంబాలు రోడ్డున పడకుండా ఉద్యోగాలు ఇవ్వాలని 1962 అంబులెన్స్ ఉద్యోగులు కోరుతున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పనిచేస్తున్న 1962 మొబైల్ అంబులెన్స్‌లలో పనిచేసే ఉద్యోగులు గురువారం అమలాపురంలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. జిల్లా పశువైద్య అధికారి వెంకట్రావును కలిసి వినతిపత్రం సమర్పించారు. ముందస్తు సమాచారం లేకుండా నోటీసు ఇవ్వకుండా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం లేకుండానే అంబులెన్స్‌లు నిలిపివేయడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ తమను మళ్లీ విధుల్లోకి తీసుకునేలా చూడాలని కోరారు జీవీకెఈఎమ్.ఆర్ ఐ. సంస్థ ద్వారా 2022 నుంచి విధులు నిర్వర్తిస్తే ఇప్పుడు తొలగించడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. డాక్టర్, పేరావిట్, డ్రైవర్లుగా పని చేస్తున్నామని మాకు న్యాయం చేయాలని కోరారు. మాకు ఉద్యోగాలు ఇవ్వాలి సంస్థలో మూడు సంవత్సరాలుగా పేరావిట్గా పనిచేస్తూ వేలాది పశువులకు సేవలు అందించాను. అధికారులు, ప్రభుత్వం స్పందించి ఉద్యోగులను విధులలోనికి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం అన్యాయంగా తొలగించడం వల్ల మా కుటుంబాలు రోడ్డున పడతాయి. – మోహన్, పేరావిట్, అమలాపురం 1962 అంబులెన్స్‌లో సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బంది (ఫైల్) ఆగిపోయిన 1962 మొబైల్ అంబులెన్స్‌లు కూటమి ప్రభుత్వంలో పశువైద్యానికి కష్టకాలం జిల్లాలో 7 వాహనాల నిలిపివేత 108 మాదిరిగా పశువుల కోసం ప్రారంభించిన జగన్ ప్రభుత్వం ప్రభుత్వ తీరుపై పాడి రైతుల ఆగ్రహం ఆవులు 75,460 గేదెలు 1,53, 542 ఎద్దులు 57, 031 మేకలు 23.518 గొర్రెలు 25 ,111 పందులు 6.268 కుక్కలు 20,890 అంబులెన్స్ 14 ఉద్యోగులు 46 -
మెడికల్ షాపు క్యాష్ కౌంటర్లోని రూ. లక్ష చోరీ
సినీ ఫక్కీలో బైక్‌పై పారిపోయిన ఇద్దరు యువకులు పి.గన్నవరం: స్థానిక మెయిన్‌రోడ్డులో ఆదివారం మందుల షాపు వద్ద సరుకులు కొనుగోలు చేస్తున్నట్టు నటించి క్యాష్ కౌంటర్లో సుమారు లక్ష రూపాయల నగదుతో ఉన్న బ్యాగ్‌ను ఇద్దరు యువకులు దొంగిలించి బైక్‌పై పారిపోయారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనతో షాపు యజమాని ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక పోతురాజు స్వామిగుడి ఎదురుగా తోలేటి రాంబాబు గణేష్ మెడికల్ షాపును నిర్వహిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పల్సర్ బైకుపై ఇద్దరు యువకులు వచ్చి షాపు వద్ద ఆగారు. ఒకడు బైక్‌పై ఉన్నాడు. మరొక యువకుడు షాపు యజమానిని డైపర్స్ కావాలని అడిగాడు. ఈ క్రమంలో తన వద్ద రూ.1,400ల విలువైన పది, ఇరవై రూపాయల నోట్లు ఉన్నాయి, వాటిని తీసుకుని పెద్ద నోట్లు ఇస్తారా అని అడిగాడు. వాటిని లెక్క చేసే సరికి రూ.1,200 మాత్రమే ఉండటంతో దానికి సరిపడా రాంబాబు పెద్దనోట్లు ఇచ్చారు. అర్జంటుగా డైపర్స్ ఇవ్వాలని అగంతకుడు కోరాడు. వాటిని షాపు యజమాని తీసి ఇచ్చేలోగా.. క్యాష్ కౌంటర్లోని సూమారు లక్ష రూపాయల నగదు ఉన్న బ్యాగును తీసుకుని బైక్‌పై ఉడాయించారు. వారిద్దరూ రావులపాలెం వైపు పారిపోయినట్టు గుర్తించారు. దీంతో షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బి.శివకృష్ణ వివరించారు.