Krishna
-
ఆయుర్వేదంలో విస్తృత పరిశోధనలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆయుర్వేదంలో విస్తృత పరిశోధనలు జరగాలని వక్తలు పేర్కొన్నారు. మంగళవారం విజయవాడ ఐలాపురం హోటల్లో ఆయుర్వేద ప్రాంతీయ పరిశోధన సంస్థ, విజయవాడ, కేంద్రీయ ఆయుర్వేద విజ్ఞాన పరిశోధనా పరిషత్ సంయుక్త ఆధ్వర్యాన ప్రజారోగ్య సంరక్షణ పరిశోధన కార్యక్రమంలో భాగంగా పరిశోధకుల కోసం రెండు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం జరిగింది. దేశంలోని ఎంపిక చేసిన రాష్ట్రాల్లో వివిధ జాతులు, తెగలు, సమూహాల్లో ఆహార అలవాట్ల సమాచార సంగ్రహణపై శిక్షణ ఇస్తున్నట్లు ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ఇన్చార్జి అసిస్టెంట్ డైరెక్టర్ బి. వెంకటేశ్వర్లు తెలిపారు. భిన్నప్రాంతాల్లో జాతిపరమైన, మతపరమైన ఆచారాల్లో ఉపయోగించే మొక్కలు, లోహాలు, ఖనిజాలు, జంతు ఉత్పత్తులు, ఇతర పదార్థాల సమాచార సంగ్రహణ అనే అంశాలపై శిక్షణ ఇస్తారన్నారు. డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ రబీనారాయణ వర్చువల్‌గా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాలు ఆయుర్వేద శాస్త్రంలో మరింత లోతుగా అవగాహన కల్పించేందుకు దోహదం చేస్తాయన్నారు. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ నారాయణ శ్రీకాంత్, పమ్మి సత్యనారాయణశాస్త్రి, డాక్టర్ మృత్యుంజయరావు తదితరులు పాల్గొన్నారు. -
హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్‌లో మంగళవారం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఫెడరేషన్ ఆధ్వర్యాన నిరసన దీక్ష జరిగింది. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ ఏవీ నాగేశ్వరరావు దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. మినిమం టైం స్కేల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కల్యాణి మాట్లాడుతూ సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, వేతనాలు, సౌకర్యాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పదఈ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు చేయాలన్నారు. గ్రాట్యూటీ, మెడికల్ సెలవులు – హెల్త్ కార్డులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతికి మార్చాలన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలని, పార్ట్ టైం పదాన్ని పూర్తిగా తొలగించాలన్నారు. కొన్ని క్లస్టర్లలో సీఆర్పీలను తొలగించారని, తక్షణమే విధుల్లోకి తీసుకోవాలన్నారు. తమ సమస్యలు పరిష్కరించేవరకు పోరాడదామన్నారు. దీక్షలో కాంట్రాక్ట్ –ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ చైర్మన్ బి.కాంతారావు, ఆర్గనైజేషన్ సెక్రెటరీ జాన్ మోడీ, వైస్ చైర్మన్ వాసా శ్రీనివాసరావు, మహమ్మద్ రఫీ, ఉద్యోగులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ -
దుర్గమ్మ సేవలో కేంద్ర బృందం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను కేంద్ర అధికారుల బృందం మంగళవారం దర్శించుకుంది. క్యాబినెట్ సెక్రటేరియట్ సెక్రటరీ వందన గుర్నాని, డెప్యూటీ సెక్రటరీ శ్వేత మొహంతి, డీపీఐఐటీ డెప్యూటీ సెక్రటరీ యశ్వసి ముండ్, నీతి అయోగ్ గాయత్రి పాండే అమ్మవారిని దర్శించుకున్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, యూపీహెచ్‌సీలకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. ఆమె మంగళవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. అంతే కాకుండా మైలవరం–2 సచివాలయం పరిధిలో నిర్వహిస్తున్న హెల్త్ క్యాంప్‌ను తనిఖీ చేశారు. అక్కడ ఉన్న రోగులు, రక్తపరీక్షలు నిర్వహిస్తున్న తీరు, మందుల అందుబాటు వంటి అంశాలను పరిశీలించారు. అనంతరం అదే గ్రామంలో జరుగుతున్న ఎన్సీడీ–సీడీ సర్వేను ప్రత్యక్షంగా వీక్షించారు. చంద్రాల వైద్యాధికారి డాక్టర్ ఉనీత్ పాల్గొన్నారు. ఏపీకి చేరుకున్న మయన్మార్‌లో చిక్కుకుపోయిన వ్యక్తులు గన్నవరం: Ð]l$Ķæ$-¯éÃÆŠ‡ §ólÔèæ…ÌZ _MýS$P-MýS$-´ù-Ƈ$$¯]l B…{«§ýl-{ç³-§ól-ÔŒæMýS$ ^ðl…¨¯]l Hyýl$-VýS$Æý‡$ Ð]lÅMýS$¢Ë$ ¿êÆý‡™èl {糿¶æ$™èlÓ ^öÆý‡Ð]l™ø Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… çÜ$Æý‡-„ìS-™èl…V> VýS¯]l²-Ð]lÆý‡… ÑÐ]l*-¯é-{Ôèæ-Ķæ*-°MìS ^ólÆý‡$-MýS$-¯é²Æý‡$. VýS$…r*Æý‡$ hÌêÏMýS$ ^ðl…¨¯]l Ð]l¬VýS$YÆý‡$, }M>-MýS$-âýæ…, Æ>f-Ð]l$…{yìl, Ñf-Ķæ$-Ðéyýl, {´÷§ýl$ª-r*-Æý‡$MýS$ ^ðl…¨¯]l Ð]l$Æø ¯]lË$-VýS$Æý‡$ ÑÑ«§ýl Hgñæ-±ÞË$ §éÓÆ> Ð]lÆŠ‡P ÒÝëOò³ E§øÅ-V>Ë$ °Ñ$™èl¢… Ð]l$Ķæ$-¯éÃÆŠ‡ ÐðlâêÏÆý‡$. Ð]lÇP…VŠæ ÒÝëÌS VýSyýl$Ð]l# ¡Ç-¯]l-ç³µsìæMîS Ððl¯]lMìSP Æ>MýS$…yé Ð]l$Ķæ$¯éÃ-ÆŠ‡-ÌZ¯ól íܦÆý‡-ç³yìl-´ù-Ķæ*Æý‡$. D ÑçÙ-Ķæ*°² VýS$Ç¢…-_¯]l A«¨-M>-Æý‡$Ë$ Hyýl$-VýS$రి ´ë‹Ü-´ù-ÆŠ‡tË$, ÒÝë-ÌS¯]l$ ÝëÓ«©¯]l… ^ólçÜ$MýS$° ¿êÆý‡™èl {糿¶æ$™èlÓ A«¨-M>-Æý‡$-ÌSMýS$ çÜÐ]l*-^éÆý‡… C^éaÆý‡$. çܵ…¨…-_¯]l MóS…{§ýl… Ð]l$Ķæ$-¯éÃÆŠ‡ A«¨-M>-Æý‡$-ÌS™ø çÜ…{ç³-¨…-ç³#Ë$ fÇí³ Hyýl$-VýS$-Ç° ¯]l*ÅÉìl-ÎÏMìS ¡çÜ$-MýS$-Ð]l-^éaÆý‡$. AMýSPyýl çÜÐ]l${VýS Ñ^é-Æý‡×æ A¯]l…-™èlÆý‡… Ð]l$…VýS-âýæÐéÆý‡… Æ>{† GƇ$$Ç…-yìlĶæ* ÑÐ]l*-¯]l…ÌZ VýS¯]l²-Ð]lÆý‡… ç³…í³…-^éÆý‡$. CMýSPyýl GƇ$$ÆŠ‡-´ù-ÆŠ‡tÌZ ÒÇ° VýS¯]l²Ð]lÆý‡… ïÜI ½Ò. ÕÐ]l-{ç³-Ý맊æ, G‹ÜI }«§ýl-ÆŠ‡Ë$ ÇïÜÐŒæ ^ólçÜ$-MýS$-¯é²Æý‡$. A¯]l…-™èlÆý‡… Hyýl$-VýS$-ÇÌZ I§ýl$-VýS$-Ç° ÐéÇ MýS$r$…º çÜ¿¶æ$Å-ÌSMýS$ Aç³µ-W…-^éÆý‡$. Æ>fÐ]l$…{yìl, {´÷§ýl$ªr*Æý‡$MýS$ ^ðl…¨¯]l Ð]lÅMýS$¢Ë¯]l$ º$«§ýlÐéÆý‡… Aç³µW…^èl¯]l$¯]l²r$Ï ïÜI ™ðlÍ´ëÆý‡$. -
ప్లాస్టిక్ వాడకం నియంత్రణకు పటిష్ట చర్యలు
చిలకలపూడి(మచిలీపట్నం): ప్లాస్టిక్ వాడకం నియంత్రించడానికి జిల్లాలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో స్వచ్ఛాంధ్రపై క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం ఎక్కువైన నేపథ్యంలో దుష్పరిణామాలను ప్రజలకు అవగాహన కలిగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్ విక్రయ దుకాణదారులు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలు, వ్యాపారస్తుల నుంచి స్వచ్ఛందంగా ప్లాస్టిక్ కప్పులు, కవర్లు, గ్లాసులు సేకరించాలన్నారు. పర్యావరణ హితమైన వస్త్ర సంచులు, కాగితపు సంచులు ఏ వ్యాపారస్తులు అమ్ముతున్నారో వారిని గుర్తించాలన్నారు. వారికి కృష్ణ యోధులుగా పురస్కారాలు, ధ్రువీకరణ పత్రాలను అందజేసి సన్మానించాలన్నారు. ప్లాస్టిక్ రహిత జిల్లాగా రూపుదిద్దుకునేందుకు ప్రజలను, దుకాణదారులను ప్రోత్సహించాలన్నారు. అన్ని దుకాణాల్లో ఇకపై ప్లాస్టిక్ కవర్లు ఇవ్వరని నోటీసుబోర్డులు ప్రదర్శించాలన్నారు. కొత్తగా వ్యాపార లైసెన్సులు జారీ చేసే సమయంలో వారికి ప్లాస్టిక్ వాడకం నిషేధమన్న నిబంధన విధించాలన్నారు. వీటితో పాటు వివిధ ప్రభుత్వశాఖలు నిర్వహించే సమావేశాల్లో వాటర్ బాటిల్స్బదులుగా గాజు, కాగితంతో తయారుచేసిన గ్లాసులను మాత్రమే వినియోగించాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, డీపీవో అరుణ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బాలాజీ -
టీడీపీ కార్యకర్తా.. కమిషనరా !
● అధికార పార్టీకి తొత్తుగా మునిసిపల్ కమిషనర్ ● రెక్కాడితే గాని డొక్కాడని వారి షాపులను తొలగించారు ● కూటమి నాయకులు, మునిసిపల్ అధికారులపై ధ్వజమెత్తిన పేర్ని నాని చిలకలపూడి(మచిలీపట్నం): మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ టీడీపీ కార్యకర్తా.. లేక కమిషనరా తెలియని పరిస్థితుల్లో నగర ప్రజలు ఉన్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని)అన్నారు. బుధవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం వద్ద అకారణంగా తొలగించిన ర్యాంపును తాత్కాలికంగా నిర్మించుకుంటున్న పార్టీ నాయకులు, కార్యకర్తల వద్దకు వెళ్లి ర్యాంపు నిర్మాణం చేయవద్దంటూ మునిసిపల్ అధికారులు, పోలీసులు మంగళవారం రాత్రి అడ్డగించేందుకు ప్రయత్నించారు. దీంతో మాజీ మంత్రి పేర్ని నాని వారితో కొద్దిసేపు వాగ్వాదం చేసి మాకు దారి కావాలంటూ పార్టీ కార్యాలయంలోకి వెళ్లడానికి మార్గం లేకపోవటంతో తాత్కాలికంగా వేసుకుంటున్నామని అధికారులకు వివరించారు. అంతేకాకుండా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుంటే వాటిని కూడా నిలువరించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పేర్ని నాని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తగిన పత్రాలను చూపించటంతో వారు వెనుతిరిగి వెళ్లిపోయారు. కక్షపూరిత చర్యలు అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ కావాలనే కక్షపూరితంగా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారన్నారు. నగరంలో ఆక్రమణలను తొలగిస్తున్నామని ప్రజలను ఉద్దరిస్తున్నారనే కారణంతో మేం పట్టించుకోవటం లేదని అయితే అధికార పార్టీకి సంబంధించిన నాయకుల కట్టడాలను వదిలేసి పేదల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారన్నారు. మంత్రి నివాసం వద్ద, టీడీపీ నాయకుని కల్యాణ మండపం వద్ద తొలగింపులను వదిలేసి పేదలపై అక్కసుతో దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఆక్రమణలు తొలగించిన వారు అధికారులు, టీడీపీ నేతలకు మళ్లీ డబ్బులిచ్చి తొలగించిన స్థానంలోనే షాపులను ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. ఇవన్నీ అధికారులకు, కూటమి నాయకులకు కనపడవా అని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయానికి వెళ్లే దారి తాత్కాలికంగా ఏర్పాటు చేసుకుంటే దానిని కూడా తొలగించేందుకు ప్రయత్నాలు చేశారని వచ్చిన అధికారిని అడిగితే తాత్కాలిక వేసిన దారిని తొలగించండి, పార్టీ కార్యాలయాన్ని ద్వంసం చేయండని మంత్రి పీఏ బాషా చెప్పినట్లు అధికారులు చెబుతుంటే తాను విస్మయం చెందానన్నారు. విరుద్ధంగా ఏ పనీ చేయడం లేదు అనంతపురం జిల్లా నుంచి వచ్చిన రూ. 10 వేల జీతగాడు అధికారులను శాసిస్తూ ఆయన ఆదేశాలతో అధికారులు బయలుదేరటం విడ్డూరంగా ఉందన్నారు. హక్కుల కోసం పోరాడతాం, ధర్మంగా ఉన్న నిబంధనల ప్రకారం తీసుకున్న ధ్రువీకరణ పత్రాలు చూపిస్తాం అంతే గాని విరుద్ధంగా ఏ పనిచేయటం లేదని పేర్ని నాని అన్నారు. అధికారం ఉంది కదా అని ఏదో చేయాలనుకుంటే అది శాశ్వతం కాదు. పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు వేసుకున్న ర్యాంపును పగలకొట్టమని ఆదేశాలు వచ్చాయని అందుకే వచ్చామని మునిసిపల్ అధికారులు చెప్పారన్నారు. నడమంత్రపు అధికారం వచ్చిందని మిడిసిపడితే భయడపడేది లేదని ఈ అధికారం ఎన్నాళ్లు ఉంటుందో ప్రజకే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. దొడ్డిదారిన నిచ్చెన వేసుకుని పారిపోయే సంస్కృతి మాకు లేదని నిజాన్ని నిర్భయంగా చెప్పి పోరాటమే చేస్తానన్నారు. -
దేవినేనికి దిక్కేది?
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో కొన్నేళ్లపాటు ఏకఛత్రాధిపత్యం చలాయించిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఇక రాజకీయంగా దిక్కెవరనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో సర్వత్రా నడుస్తోంది. ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలి సభ్యత్వం తప్పక దక్కుతుందని ఆశించి నామినేషన్ దాఖలుకు సిద్ధం చేసుకున్న దేవినేనికి చివరకు నిరాశ నిట్టూర్పులే మిగిలాయి. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఆశీస్సులపై అంచనాలన్నీ క్రమంగా పటాపంచలవుతుండటంతో రాజకీయపరంగా దారీతెన్నూ తెలియని దిశకు చేరుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పదవి రాలేదన్న ఆవేదనను, ఆక్రోశాన్ని పంటిబిగువున దాచుకుంటూ కూడా తనదైన మార్కు మాటలతో తాజాగా ప్రతిపక్షాన్ని విమర్శిస్తుండటాన్ని చూసి పార్టీలోని ఆయన వ్యతిరేకులు ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్న చందంగా ఆయన వ్యవహారం ఉందని ఎద్దేవా చేస్తున్నారు. సీనియర్ నాయకుడిగా అందరికీ మార్గదర్శకంగా ఉండాల్సిన ఉమా స్వయం కృతాపరాధాలే ఆయనకు శాపాలుగా మారాయని అనుభవజ్ఞులు అభిప్రాయపడుతుండటం పరిశీలనాంశం. అవకాశాలు మెండుగా.. సోదరుడు దేవినేని వెంకటరమణ అకాల మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన ఉమా.. నందిగామ, మైలవరం నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, నీటిపారుదలశాఖ మంత్రిగా పని చేశారు. నిత్యం హడావుడి, ఆర్భాటాలతో, విమర్శలతో వ్యవహరించారన్నది విదితమే. ఆయన నాయకత్వంలో సీనియర్ నాయకులతో సఖ్యత విషయంలో ఎప్పుడూ పెటాకులే. కారణాలేవైనా కొడాలి నాని, వల్లభనేని వంశీ, కేశినేని నాని తదితర సీనియర్ నాయకులు టీడీపీని వీడటానికి ఉమానే ప్రధాన కారకుడనే విమర్శలు పార్టీ వర్గాల నుంచి వినిపించినవే. ఎన్నికల సమయంలో.. మొన్నటి సాధారణ ఎన్నికల సమయంలో దేవినేని పార్టీ అధినేతను, అధిష్టానాన్ని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారని ప్రచారంలోకి రావడం, నాడు ఆయన వ్యవహార శైలి ఇప్పుడు ఆయనకు పదవి దక్కకపోవడానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. మైలవ రం సీటును వసంత కృష్ణప్రసాద్‌కు రూ.100 కోట్లకు అమ్ముకున్నారని.. ఇలాంటి వాటికి తోడు నందిగామ సీటు విషయంలో అనవసర రాద్ధాంతానికి కారకులయ్యారనే అపప్రద మూటకట్టుకున్నారని గుర్తుచేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు దేవినేని ప్రతిపక్షంతో చేతులు కలిపి వ్యాపార వ్యవహారాలూ కొనసాగించేవారనే ఫిర్యాదుల పరంపరతో పాటు ఆడియో, వీడియోలు సైతం అధిష్టానానికి పార్టీలోని ఆయన వ్యతిరేకులు చేరవేశారనే గుసగుసలు వినిపించాయి. మద్దతు కూడగట్టుకోలేక..ఢిల్లీ నుంచి పావులు కదిపినా.. ఉమాకు పదవి దక్కితే మైలవరం, నందిగామ నియోజవర్గాల్లోనే కాకుండా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నియోజకవర్గాల్లోనూ వర్గాలను కూడగడతారని, లేనిపోని రాద్ధాంతాలు పునరావృతం అవుతాయని గతంలో జరిగిన ఉదంతాలను అధిష్టానం వద్ద, ముఖ్యంగా లోకేష్ వద్ద ఉదహరించినట్లు సమాచారం. ఉమాకు పదవి కేటాయించే విషయంలో మంత్రి లోకేష్ ససేమిరా అన్నట్లు ఆయన వ్యతిరేక వర్గం విస్తృతంగా ప్రచారం చేసింది. లోకేష్‌తో సన్నిహితంగా మెలుగుతున్న స్థానిక ఎంపీకి మరో రాజ్యసభ సభ్యుడు తోడై ఢిల్లీలో చక్రం తిప్పారని, అందువల్లే ఆగ ‘మేఘాల’పై కూటమిలోని మరో పార్టీ నాయకుడికి ఎమ్మెల్సీ పదవి దక్కిందని అంటున్నారు. దారీతెన్నూ తెలియని దిశలో మాజీ మంత్రి ఉమా ఎమ్మెల్సీ ఖాయమని బాబు సంకేతాలంటూ లీకులు పరిగణనలోనే లేదని చినబాబు వర్గీయుల ఎద్దేవా ఢిల్లీ కేంద్రంగా చక్రం తిప్పిన ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వయంకృతాపరాధాలే ఉమాకు శాపాలంటున్న పరిశీలకులు దేవినేనికి జిల్లా పార్టీలో మద్దతుదారులు ఎవరనేది అటుంచితే వ్యతిరేకులు మాత్రం చెప్పుకోదగిన స్థాయిలో ఉండటం గమనార్హం. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తదితరులు బాహాటంగానే వ్యతిరేకిస్తుండగా ఉమ్మడి జిల్లాలోని ఇతర ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్న సందర్భాలు లేవనే చెప్పాలి. -
ఒలింపిక్ మెడల్స్ సాధించాలి
నాగాయలంక: నాగాయలంక వాటర్ స్పోర్ట్స్ అకాడమీ ఇండియా ఒలంపిక్ గోల్డ్ మెడల్స్ సాధించే స్థాయికి ఎదిగి ఖేలో ఇండియా సెంటర్‌గా వెలుగొందాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అభిలషించారు. స్థానిక కృష్ణానది పరీవాహక ప్రాంతంలో నిలిచిపోయిన వాటర్ స్పోర్ట్స్ అకాడమీ భవనం పునఃప్రారంభ పనులకు మంగళవారం కలెక్టర్ శ్రీకారం చుట్టారు. ఈ పనుల కోసం కలెక్టర్ ఆధ్వర్యంలోని డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్టు నుంచి రూ.2కోట్లు నిధులు కేటాయించారు. కయోకింగ్, కెనోయింగ్‌లో నాగాయలంక యువతి నాగిడి గాయత్రి ఇటీవల నేషనల్స్‌లో స్వర్ణ పతకం సాధించడం ఆంధ్రప్రదేశ్‌కే గర్వకారణమని, మరింత మంది జల క్రీడాకారులు ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. స్పోర్ట్స్ అకాడమీ భవనాన్ని అత్యంత నాణ్యతతో నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, క్రీడా సంస్థ అధికారులు స్థానిక శ్రీరామపాద క్షేత్రం ఘాట్ ఎదుట కృష్ణానది మధ్యలో ఉన్న నవలంక దీవిలో కొంత సేపు పర్యటించారు. నవలంకను పర్యాటకంగా ఏవిధంగా అభివృద్ధి చేయవచ్చు అనే అంశాలపై చర్చించారు. కయోకింగ్, కెనోయింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వరపర్ల వెంకటేశ్వరరావు, జిల్లా ప్రెసిడెంట్ దావులూరి సురేంద్రబాబు, జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి ఝాన్సీ పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ -
పీ4 సర్వేతో ప్రతి ఇంటికి లబ్ధి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వామ్యం (పీ4) సర్వేతో ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి జీవితానికి ప్రగతి చేకూరుతుందని కలెక్టర్ డీకేబాలాజీ అన్నారు. ఆయన చాంబర్లో కార్యక్రమ వాల్‌పోస్టర్లను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర దిశగా ముందడుగు వేస్తోందన్నారు. ఇందులో భాగంగా విలువైన అభిప్రాయాన్ని వెబ్సైట్ ద్వారా అందించడానికి ఈ నెల 25వ తేదీ వరకు ప్రజల భాగస్వామ్యం, సంప్రదింపు కాలపరిమితిగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రజల తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ముందుకు రావాలన్నారు. ఉగాది రోజున ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారన్నారు. కార్యక్రమంలో జేసీ గీతాంజలిశర్మ, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, సీపీవో గణేష్‌కృష్ణ, డీఐపీఆర్వో ఎం. వెంకటేశ్వరప్రసాద్ పాల్గొన్నారు. -
వీఆర్ సిద్ధార్థలో ప్రయోగశాలకు రూ.20 లక్షల విరాళం
పెనమలూరు: కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ డీమ్డ్ టుబీ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్(ఈసీఈ) విభాగంలో పరిశోధనలకు అత్యాధునిక ప్రయోగశాల ఏర్పాటుకు దాత రూ.20 లక్షల విరాళం అందజేశారు. కాలేజీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో 1983 బ్యాచ్ పూర్వ విద్యార్థి పొట్లూరి భాస్కరమూర్తి తన తండ్రి పీజే మూర్తి పేరున యాంటీనా ఆర్ఎఫ్ ఇంజినీరింగ్ లేబొరేటరీలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధికి విరాళం ఇచ్చారు. ఈ మేరకు చెక్కును వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ డీమ్డ్ టుబీ యూనివర్సిటీ చాన్సలర్ కేవీ చౌదరికి అందజేశారు. సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు మాట్లాడుతూ పరిశోధనలు, అభివృద్ధి సామర్థ్యం బలోపేతం చేయడానికి ప్రయోగశాల ఉపయోగపడుతుందన్నారు. పరిశ్రమలకు అనుగుణంగా విద్యార్థులు పరిశోధనలు చేస్తే ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. దాతలు ముందుకు వచ్చి సాయం అందిస్తే మరిన్ని ప్రయోగశాలలు విద్యార్థులకు సమకూర్చుతామన్నారు. కార్యక్రమంలో వైస్ చాన్సలర్ పి.వెంకటేశ్వరరావు, ప్రో వైస్ చాన్సలర్ డాక్టర్ ఏవీ రత్నప్రసాద్, డైరెక్టర్ బావినేని పాండురంగారావు, డీన్ డి.వెంకట్రావు పలువురు పాల్గొన్నారు. -
కృష్ణాజిల్లా
బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025 ఇఫ్తార్ సహరి (బుధ) (గురు) మచిలీపట్నం 6.21 4.58 విజయవాడ 6.22 4.59 విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ లబ్బీపేట: గుణదలలోని మడోన డెఫ్ అండ్ డంబ్ పాఠశాల విద్యార్థులకు మంగళవారం కోవే స్వచ్ఛంద సంస్థ, గ్రోవెల్ సహకారంతో ట్యాబ్‌లను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అందజేశారు. ముగిసిన స్కౌట్ శిబిరం వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): స్కౌట్ విద్యార్థులకు విజయవాడ పటమటలోని జెడ్పీ హైస్కూల్లో రాష్ట్ర స్థాయి రాజ్య పురస్కార్ పరీక్ష శిబిరం మంగళవారం ముగిసింది. కపట ‘కూటమి’ నాటకాలు ఇంకెన్నాళ్లు? దేశ ప్రగతికి అత్యంత కీలకమైన యువశక్తిని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది. యువత ఉన్నత చదువులకు ప్రోత్సాహాన్నిచ్చి, ఉజ్వల భవితకు బాటలు వేయాల్సిన సర్కారు పట్టనట్లు వ్యవహరిస్తోంది. డిగ్రీలు పూర్తి చేసిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించడంలోనూ పూర్తిగా విఫలమవుతోంది. ఎన్నికలప్పుడు తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తాం.. 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అంటూ ఊదరగొట్టిన ‘కూటమి’.. ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడంతో ఉద్యోగావకాశాలు లేకుండా చేసి యువతరానికి తీరని అన్యాయం చేస్తోంది. కూటమి చేతిలో మోస పోయిన యువ బాధితులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో బుధవారం యువత పోరుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలోనూ పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. యువతరం అంతా కదలి వచ్చి.. సిగ్గులేని కూటమి ప్రభుత్వాన్ని నిగ్గదీసి ప్రశ్నించించేందుకు సమాయత్తమైంది. 7న్యూస్‌రీల్ -
మక్కీకి మక్కీ దిశ యాప్‌ను కాపీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, విజయవాడ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన హయాంలో దిశ యాప్‌కు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం అందుబాటులోకి తెచ్చిన యాప్ దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ యాప్‌ను నిర్విర్యం చేసింది. తాజాగా అదే యాప్‌ను కూటమి ప్రభుత్వం కాపీ కొట్టింది. మక్కీకి మక్కీ దిశ యాప్ ఫీచర్ల తోనే శక్తి యాప్ రూపొందించింది. ఆ యాప్ వివరాల్ని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. గతంలో దిశ యాప్‌ని చంద్రబాబు, హోంమంత్రి అనిత ఎగతాళి చేశారు. అదే దిశ యాప్‌ని కాపీ కొట్టి నేడు అమలు చేయడం గమనార్హం -
అదనపు పనులు చేయలేకపోతున్నాం సార్..
చిలకలపూడి(మచిలీపట్నం): ‘అదనపు చేయలేక పోతున్నాం సార్. మా శాఖలోనే రోజూ 54 యాప్‌లను ఓపెన్ చేసి, వాటిలో వివరాలు నమోదు చేయాల్సి ఉంది. ఇవికాక సచివాలయ పరిధిలో అదనపు పనులు అప్పగిస్తున్నారు. వీటితో మాకు పని భారం అధికమవుతోంది. మా పరిస్థితి అర్థం చేసుకుని న్యాయం చేయడి’ అంటూ సచివాలయ హెల్త్ సెక్రటరీలు కృష్ణాజిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీకి సోమవారం గోడు వినిపించారు. తమ శాఖ పరంగా ఉన్న యాప్‌లు, సర్వేలతో పాటు సచివాలయం పరంగా జేఆర్వో ట్యాగింగ్, హౌస్‌హోల్డ్ సర్వే, నాన్ ఏపీ రెసిడెన్స్ ఈ–కేవైసీ, ఫ్యామిలీ మైగ్రేషన్, అప్డేట్మొబైల్ నంబర్, ఆధార్ ఈ–కేవైసీ, చిల్డ్రన్ విత్ అవుట్ ఆధార్, పించన్ల సర్వేలతో పాటు ప్రస్తుతం పీ4 సర్వే చేయమంటున్నారని వివరించారు. ఈ సర్వేలు చేయాలంటే కష్టమవుతోందని కలెక్టర్ వద్ద వాపోయారు. తమ శాఖపరంగా ఆర్సీహెచ్, ఎన్సీడీ, ఎన్ఎల్ఈపీ, శానిటేషన్, ఎన్టీఆర్ వైద్యసేవ తదితర అంశాలతో కూడిన 54 యాప్‌లను రోజూ ఓపెన్ చేసి ఇంటింటికీ తిరిగి ఆయా వివరాలు తెలుసుకుని, వాటిని అప్లోడ్ చేస్తున్నామని వివరించారు. వీటితో పాటుగా సచివాలయ అడ్మిన్ల ద్వారా తమకు ఇతర శాఖలకు సంబంధించి సర్వేలను అప్పగిస్తున్నారని పేర్కొన్నారు. కేవలం వైద్య, ఆరోగ్యశాఖకు సంబంధించిన యాప్‌లను నిత్యం అప్లోడ్ చేయాలని, ఎటువంటి ఇతర శాఖల సర్వేలు చేయకూడదని వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు జీఓ విడుదల చేసినప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాల కారణంగా ఇవి చేయాల్సి వస్తోందని వాపోయారు. సెలవు అడిగినా ఇవ్వటం లేదు తమ వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవు అడిగినా వైద్యాధికారులు సెలవు ఇచ్చేది లేదని కఠినంగా చెబుతున్నారని హెల్త్ సెక్రటరీలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఒక హెల్త్ సెక్రటరీ ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని కాలిలో ఉన్న రాడ్ తీయించుకునేందుకు సెలవు అడిగినా ఇవ్వడం లేదని వివరించారు. ఇటువంటి పరిస్థితుల్లో తాము ఈ సర్వేలు, యాప్‌లలో వివరాలు నమోదు చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. సర్వేల పరంగా ప్రజల ఇళ్లకు వెళ్లినప్పుడు వివరాలు నమోదు చేయడానికి ఓటీపీలు అడిగితే వారు చెప్పటం లేదని వివరించారు. ప్రస్తుత సైబర్ నేరాలు జరుగుతున్న నేపథ్యంలో ఏ కుటుంబీకులు తమకు సహకరించటం లేదని, కొంత మంది ఇప్పుడు వద్దు తరువాత రమ్మంటూ తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. ఒక్కసారి తమ గురించి ఆలోచించి న్యాయం చేయాలని వేడుకుంటు న్నామని కలెక్టర్ బాలాజీకి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై కలెక్టర్ బాలాజీ స్పందిస్తూ రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చించాల్సిన అంశమని, దీనిపై మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మా శాఖలోనే 54 యాప్‌ల్లో రోజూ వివరాలు అప్లోడ్ చేయాలి ఇవి కాక అదనంగా మాకు సర్వేలు అప్పగిస్తున్నారు అదనపు సర్వేలు చేయొద్దని జీఓ ఉన్నా పట్టించుకోవడం లేదు కృష్ణా జిల్లా కలెక్టర్ ఎదుట గోడు వినిపించిన హెల్త్ సెక్రటరీలు -
అరకొర పింఛన్లే గతి
గుడ్లవల్లేరు: కూటమి ప్రభుత్వంలో పూటకొకటి, రోజుకొకటి అన్నట్లు ఇష్టారాజ్యంగా సర్వేలు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లాలో 497 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. ఈ పంచాయతీల్లోని అన్ని సచివాలయాల పరిధిలో సర్వేలు కొనసాగుతున్నాయి. ఈ సర్వేలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రజల నుంచి పూటకో వివరం రాబట్టాలని సచివాలయ సిబ్బందితో ప్రభుత్వం ఆడుకుంటోంది. ఎనర్జీ అసిస్టెంట్లు మినహా.. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను తెచ్చింది. 50 ఇళ్లకు ఒక వలంటీర్ నియమించి, రెండు వేల ఇళ్లకు ఒక సచివాలయం చొప్పున ఏర్పాటు చేసింది. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పని చేస్తూ ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను ఇంటి ముంగిటకే చేరవేసేవారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్లను తొలగించారు. గత ప్రభుత్వంలో నెలలో కనీసం రెండు, మూడు సంక్షేమ పథకాలైన అమలయ్యేవి. వాటిని ప్రజలకు అందించాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ తొమ్మిది మాసాల్లో పింఛన్లు మినహా మరే సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదు. దీనితో ప్రభుత్వం ఉద్యోగులు, సిబ్బందిని ఖాళీగా ఉంచడం ఇష్టం లేక నానా రకాల సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఎనర్జీ అసిస్టెంట్లు మినహా మిగిలిన సెక్రటరీలు సహా అందరితో ఈ సర్వేలు చేయిస్తున్నారు. పీ–4 సర్వేతో ప్రజలకు ఇక్కట్లు పీ–4 సర్వే, వర్క్ ఫ్రం హోం సర్వే, ఎంఎస్ఎంఈ సర్వే, చిల్డ్రన్ బర్త్ సర్వే, నాన్ రెసిడెంట్స్ సర్వేలు ఒకేసారి చేయిస్తున్నారు. పీ–4 సర్వేలో ఎంపిక చేసిన వారి ఇంటికి వెళ్లి వారికి కారు, ఏసీ వంటివి ఉన్నాయా? ఎన్ని ద్విచక్ర వాహనాలు ఉన్నాయి? ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా? వంటి వివరాలు అడుగుతున్నారు. పూర్తి వివరాలు నమోదు చేసిన తర్వాత సెల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని సచివాలయ సెక్రటరీకి చెప్పాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రం హోమ్నీ వదలని వైనం సర్వేల్లో వర్క్ ఫ్రం హోమ్‌ను కూడా వదలకుండా చేస్తున్నారు. వర్క్ ఫ్రం హోం సర్వేలో ఎవరి ఇంట్లోనైనా ఐటీ సిబ్బంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు వర్క్ ఫ్రం హోం చేస్తే వారి వివరాలు నమోదు చేయాల్సిందే. ఎంఎస్ఎంఈ సర్వేలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి, వాటి యజమానులు ఎవరు, ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు తది తర వివరాలను సేకరిస్తున్నారు. సర్వేలతో ప్రజలకు విసుగుఈ సర్వేల్లో ఆరాలతో ప్రజలు విసుగు చెందుతూ ఇబ్బందులు పడుతున్నారు. రుణం ఏమైనా కావాలా? వంటి వివరాలు కూడా సర్వేల్లో అడగటం కొన్ని చోట్ల జరుగుతోంది. చిల్డ్రన్ బర్త్ సర్వేలో పుట్టిన బిడ్డకు బర్త్ సర్టిఫికెట్ తీసుకు న్నారా, ఆధార్ కార్డు చేయించారా, ఎందుకు చేయించలేదు అంటూ వివరాలు తెలుసుకుంటున్నారు. ఇక నాన్ రెసిడెంట్స్ సర్వేలో ఎవరి ఇంట్లోనైనా సభ్యులు విదేశాలకు వెళ్లారా, ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్నారా? వంటి వివరాలు రాబడుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఐదు సర్వేలు ఒకేసారి చేయిస్తున్నారు. త్వరలో స్వర్ణాంధ్ర సర్వే కూడా చేపట్టనున్నట్లు వార్తలొస్తు న్నాయి. దీనితో ఇంకా ఎన్ని సర్వేలు చేయా లోనని సచివాలయ సెక్రటరీలు లోలోపలే మదనపడుతున్నారు. రోజుకో సర్వే.. పూటకో సర్వే సంక్షేమ పథకాల్లో కోతకేనాఅని ప్రజల్లో సందేహాలు సచివాలయ సిబ్బందికి సర్వేలతో తప్పని తిప్పలు రోజూ టెలికాన్ఫరెన్స్ గత ప్రభుత్వంలో భార్య లేదా భర్త పింఛన్ పొందుతూ చనిపోతే బతికున్న భార్య లేదా భర్తకు ఆ పింఛన్ అందజేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మార్చిలో చనిపోయిన వారి భర్త లేదా భార్యలకే పింఛన్లు ఇస్తున్నారే తప్ప, తొమ్మిది మాసాలలో చనిపోయిన వారి కుటుంబాలకు పింఛన్ వర్తింపజేయడం లేదు. దీనితో చాలా మంది పింఛన్లు పొందని పరిస్థితి ఏర్పడింది. ఉన్న పింఛన్లను తొలగిస్తున్న తరుణంలో ఇక కొత్త పింఛన్లు ఇవ్వడం జరగదేమోనని ప్రజలు అనుమానిస్తున్నారు. ఈ సర్వేల వెనక మతలబు ఇదేనని పలువురు ఆందో ళన చెందుతున్నారు. అన్ని సర్వేల్లో కేవలం ఇంటి పేరు, పేరు మాత్రమే చెప్పి సర్వే చేయమనడం వల్ల వారు ఎక్కడ నివసిస్తున్నారో, వారి డోర్ నంబర్ ఏమిటో తెలియక సచివాలయ సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. పైగా ఎవరెవరు ఎంత మందిని సర్వే చేశారని ఉన్నతాధికారులు రోజూ టెలి కాన్ఫరెన్స్‌లో ఒత్తిడి చేస్తున్నారు. ఇంటిపేరు, పేరు ఆధారంగా వారిని ఏదో విధంగా గుర్తించినప్పటికీ చాలా మంది సర్వేలకు సహకరించడం లేదని, ఓటీపీలు చెప్పడం లేదని తెలుస్తోంది. -
అంగన్వాడీలకు ‘నిర్బంధ శిక్ష’ణ
ఉయ్యూరు రూరల్: అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ‘చలో విజయవాడ‘ పేరిట ఆందోళన జరిగింది. ఈ ఆందోళనలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు విశ్వప్రయ త్నాలు చేశారు. చివరకు పెద ఓగిరాల ఎంపీపీ పాఠశాలలో శిక్షణ, రివ్యూ సమావేశం నిర్వహించి మమ అనిపించారు. చలో విజయవా డకు అంగన్వాడీ కార్యకర్తలు వెళ్లకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా కృష్ణాజిల్లా కంకిపాడు ప్రాజెక్ట్ అధికారులు స్వామి భక్తిని చాటుకునేలా ఈ సమావేశం నిర్వహించారని ట్రేడ్ యూనియన్ నాయకులు బి.రాజేష్ విమర్శించారు. కంకిపాడు ప్రాజెక్టు పరిధిలో ఎనిమిది సెక్టర్లు ఉండగా, ఆకునూరు సెక్టార్ పరిధిలోని అంగన్వాడీలకు మాత్రమే సమావేశం నిర్వహించి ధర్నాకు వెళ్లకుండా అధికారం ముసుగులో అడ్డు కున్నారన్న ఆరోపణలు వినిపించాయి. ప్రతినెలా చివరిలో సమావేశం నిర్వహించి రిపోర్టులు సేకరించి సమీక్షలు చేయాల్సిన ఐసీడీఎస్ అధికారులు అందుకు విరు ద్ధంగా చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు శిక్షణ, రివ్యూ పేరుతో అడ్డుకోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సోమవారం ఉయ్యూరు మండలం ఆకునూరు సెక్టర్ రివ్యూ సమావేశాన్ని నిర్వహించామని కంకిపాడు ప్రాజెక్టు సీడీపీఓ బేబీ సుకన్య తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తల నుంచి నెలవారీ రిపోర్టులు సేకరించామని పేర్కొన్నారు. ప్రాజెక్టులో ఒక్క సెక్టారులోనే మీటింగ్ -
ప్రజా సమస్యల పరిష్కారంలో జిల్లా వెనుకబాటు
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజాసమస్యల పరిష్కా రానికి సంబంధించి సంతృప్తిస్థాయిలో జిల్లా చాలా వెనుకబడి ఉందని కలెక్టర్ డి.కె.బాలాజీ పేర్కొన్నారు. సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి అర్జీదారులకు సరైన అండార్స్మెంట్తో రిజిస్టర్ పోస్టులో లేదా నేరుగా సమాధానం ఇవ్వాలని సూచించారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో సానుకూలంగా పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. ఉగాది పండుగ రోజు పీ4 సర్వేను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవిష్కరించనున్నారని, ఆలోగా సర్వే వేగవంతం చేసి పూర్తి చేయాలని ఆదేశించారు. మండలస్థాయి అధికారులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించేలా పర్యవేక్షించాలన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ–కోసం) జరి గింది. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ అధికారులకు 142 అర్జీలు అందాయి. కలెక్టర్‌తో పాటు జేసీ గీతాంజలిశర్మ, డీఆర్వో చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ బి.శ్రీదేవి, ఆర్డీఓ కె.స్వాతి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, డీఆర్డీఏ పీడీ వై.హరిహరనాథ్, డ్వామా పీడీ శివప్రసాద్‌యాదవ్, పంచాయతీరాజ్ ఎస్ఈ రమణారావు, డీఎస్ఓ పార్వతి, డీపీఓ అరుణ తదితర అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమైన అర్జీలు ఇవీ.. ● అవనిగడ్డ మండలం వేకనూరు పంచాయతీ పరిధిలోని రక్షిత మంచినీటి పథకానికి 45 సంవత్స రాల క్రితం వేసిన సిమెంటు పైప్‌లైన్ పాడవడంతో వర్షాకాలంలో పైపుల్లోకి మురుగునీరు చేరి కుళా యిల్లో కలుషిత నీరు వస్తోందని గ్రామానికి చెందిన తుంగా మురళీకృష్ణ అర్జీ ఇచ్చారు. కొత్త ఫిల్టర్బెడ్లు, పైప్లైన్లు ఏర్పాటు చేయాలని కోరారు. ● నడకుదురు గ్రామ పంచాయతీ కార్యదర్శి గతంలో తమ పంచాయతీలో పని చేసినప్పుడు పంచాయతీ రికార్డుల్లో పలు తప్పుడు బిల్లులను చూపి నిధులను దుర్వినియోగం చేశారని, విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామానికి చెందిన బచ్చు గంగాధరరావు అర్జీ ఇచ్చారు. ● చినముత్తేవి పీఏసీఎస్‌లో పాడి గేదెల కోసం తన పేరున ఉన్న 50 సెంట్ల మాగాణిభూమిపై 2018లో రుణం తీసుకున్నానని, బాకీ మొత్త తీర్చినా పొలానికి సంబంధించిన దస్తావేజులు, పాస్‌పుస్తకాలు ఇవ్వకుండా నాలుగేళ్ల నుంచి తిప్పించుకుంటున్నారని మొవ్వ మండలం చినముత్తేవి గ్రామానికి చెందిన కూనపరెడ్డి జయలక్ష్మి అర్జీ ఇచ్చారు. ● తనకు కృత్తివెన్ను గ్రామంలో రెండు ఎకరాల భూమి ఉందని, ఆన్లైన్లో, అడంగళ్‌లో చూపించటం లేదని, తన భూమికి సంబంధింఛిన రిజిస్ట్రేషన్, పాస్‌పుస్తకం, శిస్తు రశీదులు, డాక్యుమెంట్లు పరిశీలించి అడంగల్‌లో వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కృత్తివెన్ను మండలం యండపల్లి గ్రామానికి చెందిన పిన్నెంటి మహాలక్ష్మి కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ● తాము యానాది కులానికి చెందిన వారమని, 25 కుటుంబాలకు చెందిన వారదరం 20 ఏళ్లుగా పూరి గుడిసెలు వేసుకుని సముద్రం అంచున మడ అడవుల్లో పీతలు పట్టుకుని జీవనం సాగిస్తున్నా మని, ఈ నెల తొమ్మిదో తేదీన విశ్వనాథపల్లి నాగేశ్వరమ్మ వారి బంధువులతో వచ్చి తమపై దాడి చేసి పాకలు పీకివేసి బెదిరించారని బందరు మండలం పాతపల్లి తుమ్మలపాలెం గ్రామానికి చెందిన సీహెచ్ కొండయ్య, తదితరులు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌కు గోడు వినిపించారు. మీ– కోసం కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీ వివిధ సమస్యలపై 142 అర్జీలు -
యువజనోత్సవాల్లో సత్తాచాటిన కృష్ణా వర్సిటీ
కోనేరుసెంటర్(మచిలీపట్నం): అంతర విశ్వవిద్యాలయాల జాతీయ యువజనోత్సవాల్లో కృష్ణా యూనివర్సిటీ సత్తాచాటింది. కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని విజయవాడ పి.బి.సిద్ధార్థ కళాశాల విద్యార్థులు పాల్గొన్న ఆరు అంశాల్లోనూ ప్రతిభచాటారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం రెక్టార్ ప్రొఫెసర్ బసవేశ్వరరావు విజేతలకు పతకాలు, ప్రశంసపత్రాలు అందజేశారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ నోయిడాలోని ఎమిటీ వర్సిటీ ప్రాంగణంలో ఈ నెల మూడు నుంచి ఏడో తేదీ వరకు నిర్వహించిన క్లాసికల్, ఓకల్, ఇండియన్ గ్రూప్ సాంగ్, మెహందీ అంశాల్లో కృష్ణా వర్సిటీ తరఫున పీబీ సిద్ధార్థ కాలేజీ విద్యార్థులు ప్రతిభ చాటారు. క్లాసికల్ ఇన్స్ట్రుమెంటల్ (తంత్రీవాయిద్యం, పెర్కషన్) విభాగంలో ద్వితీయం, తంత్రీయేతర సంగీతవిభాగంలో తృతీయ, ఫోక్ ఆర్కెస్ట్రా గ్రూప్ సాంగ్‌లో తృతీయస్థానంలో నిలిచారు. పీబీ సిద్ధార్థ సంగీత విభాగంలో జాతీయస్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. ఆరేళ్లుగా కృష్ణా యూనివర్సిటీ జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో రాణిస్తోంది. గతంలో బెంగళూరులోని జైన్ యూనివర్సిటీలో, లూథియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ వర్సిటీలో జరిగిన అంతర విశ్వవిద్యాలయాల జాతీయ యువజనోత్సవ పోటీల్లో కూడా కృష్ణా వర్సిటీ పక్షాన సిద్ధార్థ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచిందని కన్వీనర్ డాక్టర్ బి.జయప్రకాష్, కోఆర్డినేటర్ ఎం.శివరంజని తెలిపారు. విజేతలకు కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.రాంజీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వేమూరి బాబూరావు, డీన్ ఆచార్య రాజేష్ సి.జంపాల, పీబీ సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్, డెంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామోజీ తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు. -
సుస్థిర ఆదాయం ఇచ్చే పంటలు సాగుచేయాలి
జి.కొండూరు: సుస్థిర, అధిక ఆదాయం ఇచ్చే పంటలను రైతులు సాగుచేస్తే ఆర్థికంగా బలో పేతమవుతారని రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్ర మల శాఖ డైరెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు సూచించారు. మైలవరం నియోజకవర్గంలో ఆయన సోమవారం పర్యటించారు. జి.కొండూరులోని టమాట, మైలవరం మండలం పుల్లూరులో మల్లెతోటలు, రెడ్డిగూడెం మండలం రంగాపురంలో మామిడితోటలు పరిశీలించారు. ఆయా గ్రామాల్లో రైతుల సమస్యలు, ధరల్లో తేడా, మార్కెటింగ్ ఇబ్బందులపై ఆరా తీశారు. ఉద్యాన పంటలకు ప్రభుత్వం అందించే రాయితీలు, డ్రిప్ ఇరిగేషన్, నాణ్యమైన దిగుబడులను పొందేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా సూక్ష్మసేద్య అధికారి పి.ఎం.సుభాని, ఎన్టీఆర్ జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏపీ హంసా ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యదర్శిగా రమా లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అసోసియేషన్ (ఏపీహంసా) ఉమ్మడి కృష్ణాజిల్లా కార్యదర్శిగా పి.వెంకట రమణ (రమా) నియమితులయ్యారు. విజయవాడలోని కొత్త ప్రభుత్వాస్పత్రిలో సోమవారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అరవ పాల్, కోశాధికారి వై. శ్రీనివాస్‌తో పాటు ఉమ్మడి కృష్ణా అధ్యక్షుడు వినుకొల్లు రామకృష్ణ, సిటీ అధ్యక్షురాలు జాలం సరోజిని, కార్యదర్శి బొమ్మగంటి రాంబాబు, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కార్యద ర్శిగా నియమితులైన వెంకట రమణను అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. స్టైపెండ్ పెంచాలని వెటర్నరీ విద్యార్థుల వినతి గన్నవరం: స్టైపెండ్ పెంచాలని ఎన్టీఆర్ పశువైద్య కళాశాల విద్యార్థులు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆందోళనలో భాగంగా విద్యార్థులు సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశను కలిసి స్టైపెండ్ పెంచాలని వినతిపత్రం అందజేసి, తమ సమస్యలను విన్నవించుకున్నారు. మెడికల్, డెంటల్, ఆయుష్ విద్యార్థులకు రూ.25 వేల స్టైపెండ్ చెల్లిస్తున్న ప్రభుత్వం వెటర్నరీ విద్యార్థులకు రూ.7 వేలే ఇస్తోందని పేర్కొన్నారు. ఈ అరకొర స్టైపెండ్ చాలక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. మూగజీవాలకు వైద్య సేవలందించేందుకు వెటర్నరీ కోర్స్ అభ్యసిస్తున్న తమపై నిర్లక్ష్యం తగదన్నారు. ప్రభుత్వం స్పందించి రూ.15 వేలకు స్టైపెండ్ పెంచాలని కోరారు. విద్యార్థి నాయకులు పునీత్, భానుప్రకాష్, తిరుమల, లోహిత తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ స్కూల్ పరీక్షలకు 539 మంది గైర్హాజరు వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఏపీ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహిస్తున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు సోమవారం 539 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 17 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 2496 మంది విద్యార్థులకు 1957 మంది హాజరయ్యారు. భౌతికశాస్త్రం, రాజనీతిశాస్త్రం, మనోవిజ్ఞానశాస్త్రం తదితర సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు జరిగాయి. విద్యాపీఠం రాష్ట్ర సంచాలకుడు శివకోటేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి యు.వి.సుబ్బారావు పలు పరీక్ష కేంద్రాలను సందర్శించారు. -
నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా జిల్లాను నేర రహితంగా మార్చేందుకు ప్రతి పోలీస్ కృషి చేయా లని ఎస్పీ ఆర్.గంగాధరరావు సూచించారు. జిల్లా లోని పోలీసు అధికారులతో సోమవారం నేరసమీక్ష సమావేశం జరిగింది. ఎస్పీ గంగాధరరావు మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కలగ కుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచి, అనుమానం వచ్చిన వెంటనే పోలీసు చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు. లా అండ్ ఆర్డర్‌ను కాపాడే విషయంలో రాజీకి తావివ్వొద్దని స్పష్టంచేశారు. అలాంటి సందర్భాలు ఎదురైతే తక్షణమే తన దృష్టికి తీసుకురావాలన్నారు. మహిళలు, పిల్లలకు సంబంధించిన నేరాల విషయంలో పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని ఎస్పీ సూచించారు. త్వరితగతిన విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. స్కూల్స్, కాలేజీలలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. గంజాయిపై ఉక్కుపాదం రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని, దాని ప్రకారం జిల్లాను గంజాయి రహితంగా మార్చాలని ఎస్పీ ఆదేశించారు. గంజాయి కేసులకు సంబంధించి ఫార్వర్డ్ లింక్, బ్యాక్ వార్డ్ లింకు తెలుసుకుని నిందితులను అరెస్ట్ చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఎన్డీపీఎస్ కేసుల విచారణ వేగవంతం చేయడా నికి ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారన్నారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు జరగకుండా నైట్ బీట్ సంఖ్యను పెంచాలన్నారు. బీట్ కానిస్టేబుళ్లు తమ ప్రాంతాల్లోని సస్పెక్ట్ షీట్ హోల్డర్లు, డీసీ షీట్, కేడీషీట్ హోల్డర్ల కదలికలపై నిఘా పెంచాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు మరిన్ని చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. నిరంతరం వాహన తనిఖీలు చేపట్టాలన్నారు. సైబర్ నేరాల నివారణకు.. ప్రస్తుతం సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నందున వాటి నివారణకు జిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్ టీం ఏర్పాటు చేశామని ఎస్పీ గంగాధరరావు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న సైబర్ నేరాల కేసుల విచారణను త్వరగా ముగించాలని సూచించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దర్యాప్తు అధికారులు నేరస్తులను గుర్తించి అరెస్టు చేయాలని పేర్కొన్నారు. కేసులపై సమీక్ష అనంతరంజిల్లాలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులపై ఎస్పీ సమీక్షించారు. కేసుల దర్యాప్తు వివరాలు, చార్జ్ షీట్ దాఖలు, ప్రస్తుతం కోర్టు ట్రైల్ దశ వంటి వివరాలపై ఆరా తీశారు. కోర్టులో స్పీడ్ ట్రయల్ ద్వారా కేసుల్లోని నిందితులకు తగిన శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. హత్య, రేప్ కేసులు, పోక్సో, ప్రాపర్టీ, గంజాయి, ఎస్సీ ఎస్టీ, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల దర్యాప్తుపై ఆరా తీశారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, ఏఆర్ ఏఎస్పీ బి.సత్యనారాయణ, బందరు, అవనిగడ్డ, గుడివాడ, గన్నవరం డీఎస్పీలు, పలువురు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ గంగాధరరావు -
అనాథ పిల్లల సంరక్షణకు చర్యలు
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): శిశు గృహాల్లో ఉన్న అనాథ పిల్లలను పోర్టల్ ద్వారా దత్తత తీసుకునేందుకు వీలుగా ‘కారా’ పోర్టల్‌లో వివరాలను అప్డేట్ చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కేవీ రామకృష్ణయ్యతో కలిసి అనాథ పిల్లల దత్తత, ఇతర సమస్యలపై అధికారులతో చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ అనాథ పిల్లల సంరక్షణ చర్యల్లో భాగంగా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ(కారా) పోర్టల్‌లో వివరాలను అప్డేట్ చేయాలన్నారు. అనాథ పిల్లలను, పిల్లల సంక్షేమ కమిటీ ద్వారా లీగల్లీ ఫ్రీ ఫర్ అడాప్షన్ సర్టిఫికెట్ మంజూరు చేసి కారా వెబ్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలన్నారు. పిల్లల సంరక్షణ సంస్థల్లో రక్షణ పొందుతున్న పిల్లలందరూ చట్టపరిధిలోకి తీసుకువచ్చే విధంగా ఆ సంస్థలను రిజిస్ట్రేషన్ చేసుకునేలా చూడాలన్నారు. అనాథ పిల్లలకు సంబంధించిన ఆధార్‌కార్డులను సేకరించి గ్రామ, వార్డు సచివాలయ అధికారులకు సమర్పించాలన్నారు. తద్వారా ప్రభుత్వం ద్వారా లభించే పథకాలకు వారి పేర్లను నమోదు చేయడానికి వీలవుతుందన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, డీఎంఅండ్‌హెచ్‌వో శర్మిష్ట, డీఈవో ఎంవీజే రామారావు, సీపీవో గణేష్‌కృష్ణ, ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి, గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా సమన్వయ అధికారి కె. రవికాంత్ పాల్గొన్నారు. హెవీ వెహికల్ డ్రైవింగ్‌లో శిక్షణ పూర్తి లబ్బీపేట(విజయవాడతూర్పు): ది కృష్ణాజిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న డ్రైవింగ్ స్కూల్లో హెవీ వెహికల్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సోమవారం సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చాంబ ర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ముఖ్యఅతిథిగా పాల్గొని సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో రవాణా వ్యయం జి.డి.పి.లో 8 శాతమే ఉండ గా, మన దేశంలో 14 శాతం ఉండటం వల్ల ఎగుమతుల పరంగా పోటీపడలేని స్థితి నెలకొందన్నారు. రహదారిపై వాహనం నడిపేవారు సమయ స్ఫూర్తి, ఓర్పు, సహనం ఎల్లవేళలా కలిగి ఉంటే రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉండదన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు నాగుమోతు రాజా, ఉపాధ్యక్షుడు కె.వి.ఎస్.చలపతిరావు, కార్యదర్శి రావి శరత్ బాబు, కోశాధికారి పొట్లూరి చంద్రశేఖరరావు, లారీ ఓనర్స్ కోఆపరేటివ్ స్టోర్స్ అధ్యక్షులు కోనేరు జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నిత్యాన్నదాన పథకానికి రూ. లక్ష విరాళం మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో నిత్యన్నదానానికి మచిలీపట్నంకు చెందిన సర్వా లలిత రూ. లక్ష విరాళంగా అందజేశారు. ఉదయం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం నిత్యన్నదానానికి విరాళాన్ని ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు చెక్కు రూపంలో అందచేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. -
అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు మత్తి అరుణ
గూడూరు: ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలకు గూడూరు జెడ్పీ హైస్కూలు పీడీ మత్తి అరుణ ఎంపికయ్యారు. మాస్టర్ అథ్లెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండి యా ఆధ్వర్యంలో బెంగళూరులో ఈనెల 4 నుంచి 9 వరకు నిర్వహించిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలో ఆమె ఆంధ్ర ప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ జాతీయ స్థాయిలో పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన మత్తి అరుణ రెండు పతకాలు సాధించి సత్తాచాటారు. 4’400 మీటర్స్ రన్నింగ్‌లో బంగారు పతకం, 4’100 మీటర్స్ రన్నింగ్‌లో కాంస్య పథకం సాధించారు. తద్వారా ఇండోనేషియాలో జరగబోయే ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించడమే కాకుండా అంతర్జాతీయ పోటీలకు ఎంపికై గూడూరు హైస్కూలు పేరు ప్రఖ్యాతులు మార్మోగేలా చేసిన మత్తి అరుణకు సోమవారం పాఠశాల విద్యాకుటుంబం ఘనస్వాగతం పలికింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి.పుష్పలత మాట్లాడుతూ మత్తి అరుణ పతకాలు సాధించడం పాఠశాలకు గర్వకారణమన్నారు. -
అయోమయం.. అగమ్యగోచరం
ప్రశ్నార్థకంగా ‘ఓపెన్’ విద్యార్థుల భవిష్యత్తుమధురానగర్(విజయవాడసెంట్రల్): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఈ విద్యాసంవత్సరం నుంచి అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ అధ్యయన కేంద్రం వద్ద సోమవారం విద్యార్థులు యూనివర్సిటీ సేవలు రాష్ట్రంలో కొనసాగించాలని కోరుతూ నిరసన ధర్నా నిర్వహించారు. సేవలు నిలిపివేత.. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం పదేళ్లు పూర్తయిన దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీ సేవలు అకస్మాత్తుగా నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో యూనివర్సిటీలో నమోదు చేసుకుని కోర్సులు పూర్తికాని సుమారు రెండు లక్షల మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఇంకొక సెమ్ పూర్తయితే చేతికి డిగ్రీ పట్టా వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న తమకు అసలు పరీక్షలు జరుగుతాయో లేదో డిగ్రీ చేతికి వస్తుందో రాదో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీని రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు చొరవ చూపితే.. ఏటా సుమారు 35 వేల మంది ఓపెన్ యూనివర్సిటీ ద్వారా విద్యనభ్యసిస్తున్నారని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులకు డిగ్రీ దూరమయ్యే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు చొరవ తీసుకుని రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి వీసీని నియమించి అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం విద్యార్థులలో 90 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు, 48 శాతం మహిళలు ఉన్నారని తెలిపారు. అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ సేవలను నిలిపివేసిన తెలంగాణ విజయవాడ ప్రాంతీయ అధ్యయన కేంద్రం వద్ద విద్యార్థుల నిరసన ఏపీలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ డిగ్రీ చేసే అవకాశం పోతోంది.. నేడు ఏ చిన్న ఉద్యోగం చేయాలన్నా డిగ్రీ కావాల్సి ఉంది. ఉద్యోగం చేసుకుంటూ, ఇంట్లో వారిని ఒప్పించి మరీ డిగ్రీ చేసేందుకు చదువుకుంటున్నా. ఇప్పటికీ 5 సెమ్లు పూర్తయి ఆరో సెమ్ జూన్ జూలై నెలలో నిర్వహించాల్సి ఉంది. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీలో తమ సేవలు నిలిపివేసినట్లు ప్రకటించటంతో పరీక్షలు జరుగుతాయో లేదో తెలియటం లేదు. అడ్మిషన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వక పోవటంతో ఇంట్లో ఉంటూ డిగ్రీ పూర్తి చేయాలని అనుకునే వారికి ఆ అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. – కె.అనిత, అజిత్‌సింగ్‌నగర్ -
కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి
గుడ్లవల్లేరు: కారు ఢీకొట్టడంతో ద్విచక్రవాహనదారుడికి బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందిన ఘటన అంగలూరు గ్రామ శివారులో చోటుచేసుకుంది. గుడ్లవల్లేరు ఎస్.ఐ ఎన్.వి.వి.సత్యనారాయణ చెప్పిన వివరాల మేరకు మండలంలో అంగలూరు గ్రామ శివారులో సోమవారం ఉదయం రోడ్డు పక్కన స్కూటీపై పెడనకు వాసిరెడ్డి వెంకటేశ్వరరావు(45) వెళ్తున్నాడు. ఆ స్కూటీని మచిలీపట్నం నుంచి గుడివాడ వైపు ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావు తలకు బలమైన గాయమైంది. కాలు, చేతులకు కూడా గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి డ్రైవర్‌తో పాటు కారును అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ చెప్పారు. -
నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు చర్యలు
మచిలీపట్నంటౌన్: జిల్లాలో ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎం. సత్యానందం అన్నారు. జిల్లా పరిషత్ సమావేశపు హాలులో విద్యుత్ శాఖాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎస్ఈ మాట్లాడుతూ రాబోయే వేసవి కాలంలో విద్యుత్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి వినియోగదారుడికి నాణ్యమైన విద్యుత్ అందించాలన్నారు. అలాగే మార్చి నెలకు సంబంధించి ఈ నెల 25వ తేదీలోపే నూరుశాతం బిల్లులు చెల్లించేలా చూడాలన్నారు. వినియోగదారునికి బిల్లు ఇచ్చిన 15 రోజుల్లోగా చెల్లింపులు చేసేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో విద్యుత్‌శాఖ జి. గోవిందరావు, డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు సామూహిక ఎలుకల నిర్మూలన
పోస్టర్లను ఆవిష్కరించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలోని వరి సాగు చేసే గ్రామాల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మంగళవారం సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర ఎలుకల యాజమాన్యం (రబీ 2025)పై రూపొందించిన ప్రత్యేక పోస్టర్లను సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ.. వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొలాలు, గట్లపై సజీవ ఎలుక బొరియలను గుర్తించి, వాటిలో బ్రోమోడయోలోన్ మందు కలిపిన ఎరను 10 గ్రాములు చొప్పున వేసి మూసేయాల్సి ఉంటుందని వివరించారు. బ్రోమోడయోలోన్ ఎలుకల మందు కలిపిన ఎరను రైతులు గ్రామ వ్యవసాయ సహాయకుల (వీఏఏ) నుంచి ఉచితంగా పొందొచ్చన్నారు. పంటను కాపాడుకోవాలంటే ఒకేసారి అన్ని పొలాల్లోనూ సామూహిక ఎలుకల నిర్మూలన జరగాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ ఎం.హనుమంతరావు, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
సారా తయారీదారుల అరెస్ట్
తిరువూరు: ‘సారా ఏరులు’ శీర్షికన సాక్షి దిన పత్రికలో సోమవారం వచ్చిన వార్తకు ఎకై ్సజ్ అధికారులు స్పందించారు. తిరువూరు సర్కిల్లో విస్తృత దాడులు చేశారు. గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెంలో సారా కాస్తుండగా పెదగమళ్ల నరసింహారావు, కొత్తపల్లిలో పుప్పాల మోహనరావును తిరువూరు ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ అరెస్టు చేశారు. కనుమూరులో పాత నేరస్తుడు జెర్రిపోతుల కోటేశ్వరరావును కూడా అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విస్సన్నపేట మండలంలో కూడా సారా కాస్తూ పలుమార్లు పట్టుబడిన నరసాపురానికి చెందిన ఉమ్మడి రాంబాబు, బాణావతు బుజ్జి, కాటూరి చెన్నారావు, వేమిరెడ్డిపల్లి తండాలో అజ్మీర బాబూరావులను విస్సన్నపేట తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. నవోదయం 2.0లో భాగంగా సారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెం, కనుమూరు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సారా నిషేధానికి కృషి చేస్తామని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. బెల్టుషాపులపై దాడి.. తిరువూరు పట్టణంలో అనధికారికంగా ఆంధ్రా, తెలంగాణ మద్యం విక్రయిస్తున్న పోతురాజు ధర్మ శ్రీను, గోపుల వినోద్‌కుమార్‌లను ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ అరెస్టు చేశారు. రోలుపడిలో ఈడే భారతమ్మ వద్ద 10 మద్యం సీసాలు, గుమ్మా నాగమణి వద్ద 8 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్ఐలు వెంకటకుమార్, కృష్ణవేణి, టాస్క్ఫోర్ ఎస్ఐ శేఖర్‌బాబు పాల్గొన్నారు. -
జిల్లా వ్యాప్తంగా దాతల సాయంతో చలివేంద్రాలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వేసవి లో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. దాతల సహకారంతో జిల్లా వ్యాప్తంగా మజ్జిగ, తాగునీటిని సరఫరా చేసేలా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి విచ్చేసే సందర్శకులు, అధికారులు, సిబ్బందికి దాహార్తిని తీర్చేందుకు ఆపద్బాంధవులు ట్రస్ట్ సహకారంతో కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరం వద్ద మజ్జిగ సరఫరా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం కలెక్టర్ లక్ష్మీశ ఆపద్బాంధవులు ట్రస్ట్ నిర్వహకుడు శ్రావణ్రెడ్డితో కలిసి మజ్జిగ కేంద్రా న్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 286 గ్రామ పంచాయతీలు, 794 ఆవాసాల్లో 19 సమగ్ర రక్షిత నీటి సరఫరా పథకాలు, 366 రక్షిత నీటి సరఫరా పథకాలు, 63 చిన్న రక్షిత నీటి సరఫరా పథకాలు, 439 డైరెక్ట్ పంపింగ్ పథకాలు, 7,917 చేతి పంపులు ఉన్నాయని.. వీటితో పాటు 44 ప్రభుత్వ, 594 ప్రైవేట్ ఆర్వో ప్లాంట్స్ ద్వారా తాగునీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. ఎద్దడి ఉన్న ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. బస్టాండ్లు, ఆసుపత్రులు, రహదారుల కూడళ్లు తదితర ప్రదేశాల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నామని, ఇందుకు అవసరమైతే దాతల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించామన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం. నరసింహరావు, డీఎం అండ్‌హెచ్‌ఓ డాక్టర్ ఎం. సుహాసిని, డీఆర్డీఏ పీడీ కె. శ్రీనివాసరావు పాల్గొన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగోన్నతులు
చిలకలపూడి(మచిలీపట్నం): ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలో పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగోన్నతులు కల్పిస్తూ జిల్లా పంచా యతీ అధికారి జె. అరుణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 79 మంది గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్–4కు, 19 మంది గ్రేడ్–4 పంచాయతీ కార్యదర్శులు, 19 మంది జూనియర్ అసిస్టెంట్లను గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శులుగా ప్రమోట్ చేశారు. మొత్తం 117 పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి ఉద్యోగోన్నతులు కల్పించినట్లు డీపీవో అరుణ తెలిపారు. ‘ఇంటర్’ పరీక్షకు 18,280 మంది హాజరు చిలకలపూడి(మచిలీపట్నం): ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం లెక్కలు, జువాలజీ, హిస్టరీ పరీక్షకు 18,280 మంది విద్యార్థులు హాజరైనట్లు ఇంటర్మిడియెట్ ప్రాంతీయ అధికారి పీబీ సాల్మన్‌రాజు సోమవారం తెలిపారు. ఈ పరీక్షకు 18,500 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 220 మంది హాజరుకాలేదన్నారు. ఒకేషనల్ కోర్సుకు సంబంధించి 672 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 642 మంది హాజరయ్యారన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 63 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఆకస్మికంగా తనిఖీ చేశాయని ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని సాల్మన్‌రాజు తెలిపారు. చికెన్ పాక్స్‌తో వ్యాపారి మృతి కోడూరు: చికెన్‌పాక్స్ (పొంగు జ్వరం)తో మండలంలోని మందపాకల గ్రామానికి చెందిన వ్యాపారి కోడూరు శ్యామ్ దుర్గాప్రసాద్ (43) ఆదివారం రాత్రి మృతి చెందాడు. దుర్గాప్రసాద్ ఐదు రోజులుగా చికెన్ పాక్స్ సోకడంతో తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. నోటి నుంచి ఆహారం వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కుటుంబీకులు స్థానిక ప్రైవేటు వైద్యుడితో వైద్యం చేయించారు. అయితే దుర్గాప్రసాద్ పరిస్థితి విషమంగా మారడంతో మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు. మందపాకల గ్రామంలో మృతుడు ఎరువు దుకాణంతో పాటు కిరాణా వ్యాపారం చేస్తాడు. దుర్గాప్రసాద్ మృతదేహాన్ని పలువురు రాజకీయ నేతలు, వర్తక, వ్యాపార సంఘాల ప్రతినిధులు సందర్శించి నివాళులర్పించారు. -
ఒక విద్యార్థిని కోసం.. బీభత్సం చేసిన రెండు కాలేజీల ఇంటర్ విద్యార్థులు
సాక్షి,విజయవాడ: కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఇంటర్ విద్యార్థులు ఘర్షణకు దిగారు. రెండు ప్రైవేట్ కాలేజీలకు చెందిన విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. బస్సు అద్దాలను ధ్వంసం చేసి ఘర్షణ వాతావరణం సృష్టించారు. దీంతో బస్సులో ఉన్న విద్యార్ధులు భయబ్రాంతులకు గురయ్యారు.ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులు ఓ విద్యార్థిని విషయంలో ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. పరీక్షకు ముందు ఎగ్జామ్ సెంటర్ సమీపంలోని జిరాక్స్ సెంటర్ వద్ద ఓ కాలేజీ విద్యార్థినితో చిన్న వాగ్వాదం జరిగింది. అది చిలికి చిలికి.. కూల్ డ్రింక్ బాటిళ్లతో తలల పగలగొట్టేంత ఘర్షణకు దారి తీసింది.స్థానికులు వద్దని వారిస్తున్నా వినని విద్యార్థులు షాపుల్లో ఉన్న కూల్‌డ్రింక్ బాటిళ్లతో దాడులకు దిగడంతో భీతావాహ పరిస్థితి నెలకొంది. -
కృష్ణాజిల్లా
ఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025సమ్మర్ జిమ్.. –8లోu ఇఫ్తార్ సహరి (ఆది) (సోమ) విజయవాడ 6.21 5.02 మచిలీపట్నం 6.20 5.00● బరువు తగ్గడానికి ఇదే సరైన సమయం ● కొన్ని సమ్మర్ చిట్కాలతో నాజూగ్గా.. ● యోగా, వాకింగ్, జాగింగ్‌లకు అనుకూలం లబ్బీపేట(విజయవాడతూర్పు): వ్యాయామంతో బరువు తగ్గించుకునేందుకు ఇదే అనువైన సమయమంటున్నారు వైద్య నిపుణులు. ప్రతిరోజూ వ్యాయామం, యోగా చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ వేసవిలో స్లిమ్‌గా మారొచ్చంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పటికే వేసవి ప్రారంభ మైంది. జిమ్ చేయడానికి సిద్ధమవుదాం. నడక ఎంతో ప్రయోజనం ప్రస్తుత యాంత్రిక జీవనంలో అనేక రకాల పనుల కారణంగా తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతోంది. దీన్ని నడకతో అధిగమించవచ్చని వైద్యులు చెబుతున్నారు. సాయంత్రం కంటే మార్నింగ్ వాక్ చాలా మంచిది. ఉదయం స్వచ్ఛమైన వాతావరణంతో పాటు, ఆక్సిజన్ స్థాయి అధికంగా ఉంటుంది. సున్నితంగా సూర్యకిరణాలు పడుతుంటే మనసుకు హాయినిస్తుంది. అయితే జాగింగ్ సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పవంటున్నారు. నీరసం వచ్చే వరకూ జాగింగ్ చేయడం ప్రమాదకరమే. దాహం వేస్తే అందుబాటులో తాగునీటిని ఉంచుకోవాలి. శీతల ప్రాణాయామం ● శీతల ప్రాణాయామం చేస్తే కొంత వరకూ ఎండల ప్రతాపాన్ని తట్టుకునే శక్తి శరీరానికి అందడంతోపాటు, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ● నాలుకను మడిచి, నోటి ద్వారా గాలి పీల్చి ముక్కుద్వారా వదిలే ప్రక్రియే శీతల ప్రాణా యామం. ఉదయం 7 గంటల లోపు 5 నిమిషాలు ఈ వ్యాయామం చేయడం మంచిదని యోగా నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆహారం మేలు ● పుచ్చ, కీర, కర్బూజా, తాటి ముంజలు, బీర, పొట్ల వంటి వాటిలో నీటిశాతం పుష్కలంగా ఉంటుంది. వీటితో శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ● శీతల పానీయాలు, షుగర్ వేసిన జ్యూస్‌లు, మ్యాంగో, సపోటా వంటివి తీసుకుంటే బరువు తగ్గకపోగా కొత్త సమస్యలు వస్తాయి. ● వేసవిలో ఆకలి తక్కువగా, దాహం ఎక్కువగా ఉంటుంది. డైట్ పాటిస్తూ కాలానికి తగ్గట్టుగా ఆహార పదార్థాలను తీసుకుంటే బరువును నియంత్రించవచ్చు. నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తీసుకోవాలి. ఎయిరోస్పేస్‌లో గుడ్లవల్లేరు విద్యార్థులకు కొలువులు గుడ్లవల్లేరు: దేశానికి గర్వకాణమైన ఎయిరోస్పేస్ కంపెనీ ‘రొసెల్ టెక్సిస్ లిమిటెడ్’లో రూ.3 లక్షల వార్షిక వేతనంతో 23మంది గుడ్లవల్లేరు ఏఏఎన్‌ఎం అండ్ వీవీఆర్‌ఎస్‌ఆర్ పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయి. ఈ విషయాన్ని కాలేజీ ప్రిన్సిపాల్ ఎన్.రాజశేఖర్ శనివారం విలేకరులకు తెలిపారు. ఈ సంస్థ ఏపీలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించిన ఏకై క పాలిటెక్నిక్ కాలేజీ తమదే కావడం గర్వకారణమన్నారు. విద్యార్థులను, ప్రత్యేక శిక్షణను ఇచ్చిన అధ్యాపకులను కళాశాల చైర్మన్ నాగేశ్వరరావు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సత్యనారాయణరావు, కో – సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రామకృష్ణ అభినందించారు. 7న్యూస్రీల్మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలిగాంధీనగర్(విజయవాడసెంట్రల్): మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆకాంక్షించారు. పేదరిక నిర్మూలనలో మహిళల పాత్ర చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యాన శనివారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు 3కే రన్ ర్యాలీ నిర్వహించారు. దీన్ని కలెక్టర్ లక్ష్మీశ జెండా ఊపి ప్రారంభించారు. పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, డీసీపీలు గౌతమిషాలి, కేజీవీ సరిత, తిరుమలేశ్వరరెడ్డి, ఏబీటీఎస్ ఉదయరాణి, కృష్ణమూర్తినాయుడు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థుల డప్పు కళా ప్రదర్శన, చిన్నారుల స్కేటింగ్, మహిళా పోలీస్ (డ్రోన్ పైలెట్స్) డ్రోన్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాల సాకారానికి మహిళల పాత్ర చాలా ముఖ్యమన్నారు. సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ మహిళా దినోత్సవం పురస్కరించుకొని వారం రోజులుగా జరుగుతున్న కార్యక్రమాలే మహిళా శక్తికి నిదర్శనమని పేర్కొన్నారు. పోలీస్ శాఖ మహిళల భద్రతకు నిరంతరం కృషి చేస్తోందని.. ముఖ్యమంత్రి శక్తి అనే మొబైల్ అప్లికేషన్‌ను కూడా ఆవిష్కరించడం జరుగుతోందన్నారు. డీసీపీ గౌతమి షాలి మాట్లాడుతూ ప్రస్తుతం చదువు, ఉద్యోగం..ఇలా ఎందులోనైనా అందరూ సమానమేనన్నారు. డీసీపీ కేజీవీ సరిత మాట్లాడుతూ భద్రమైన వాతావరణం లక్ష్యంగా పోలీస్ కమిషనరేట్ భిన్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, డీఎంహెచ్‌వో ఎం.సుహాసిని, వివిధ శాఖల అధికారులు, మహిళలు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. జాగ్రత్తలు తీసుకోవాలి వాకింగ్, జాగింగ్, వ్యాయామం చేసే సమయంలో నీరసం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అతిగా వాకింగ్ చేయకూడదు. ఎండలో వాకింగ్ చేయడం మంచిది కాదు. వేసవిలో శరీరంలో నీరు త్వరగా ఆవిరై డీ హైడ్రేషన్‌కు దారితీస్తుంది. మధుమేహం, రక్తపోటు ఉన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ టీవీ మురళీకృష్ణ, జనరల్ ఫిజీషియన్ఆహార నియమాలు పాటించాలి వేసవిలో ఆహార నియమాలు పాటించాలి. వేపుళ్లు, నూనె ఎక్కువుగా ఉన్న వంటకాలు తీసుకోకుండా ఉండటం మంచిది. తాజా ఆకుకూరలు, పళ్లు తీసుకోవాలి. నీరుశాతం ఎక్కువగా ఉంటే పుచ్చ, కర్బూజ, వంటి పళ్లు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాయామం చేస్తే స్లిమ్‌గా మారొచ్చు. – గర్రే హరిత, ఆహార నిపుణులుఇవి పాటిస్తే.. బరువు తగ్గాలనుకునే వారికి స్విమ్మింగ్ మంచి వ్యాయామం ఎంతటి భోజన ప్రియులైన వేసవిలో కాస్త మోతాదు తగ్గించి ఆహారం తీసుకుంటారు వేసవిలో ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలనిపిస్తుంది రోజుకు కనీసం 5 లీటర్ల నీటిని వివిధ రూపాల్గో తీసుకుంటే బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ఫ్రిజ్‌లో నీటికన్నా కుండలోని నీటిని తాగడం ఉత్తమం. -
లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి
చిలకలపూడి(మచిలీపట్నం): లోక్‌అదాలత్‌ను పెండింగ్‌లో ఉన్న కేసుల కక్షిదారులు వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక అన్నారు. జాతీయ లోక్‌అదాలత్ కార్యక్రమాన్ని న్యాయసేవాసదన్‌లో శనివారం ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో లోక్ అదాలత్‌ను నిర్వహించడానికి 41 బెంచ్‌లను ఏర్పాటు చేశామన్నారు. 10,428 కేసుల పరిష్కారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్‌లో 10,428 కేసులు పరిష్కారమయ్యాయని న్యాయమూర్తి తెలిపారు. 9,674 క్రిమినల్ కేసులు, 159 సివిల్ కేసులు, 333 చెక్‌బౌన్స్ కేసులు, 98 మోటారు వాహన ప్రమాద క్లయిమ్‌లకు గానూ రూ. 8.3 కోట్లు నష్టపరిహారంగా చెల్లించేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు అంగీకరించాయన్నారు. ఇవికాక 164 ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించి అవార్డులను అందజేశారన్నారు. మచిలీపట్నంలో 1,612 కేసులు, విజయవాడ 5,093, గుడివాడ 754, నందిగామ 239, నూజివీడు 228, మైలవరం 197, జగ్గయ్యపేట 469, బంటుమిల్లి 117, కై కలూరు 788, తిరువూరు 21, గన్నవరం 156, అవనిగడ్డ 228, మొవ్వ 356, ఉయ్యూరు 170 కేసులను పరిష్కరించామన్నారు. కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో కృష్ణా రెండోస్థానంలో నిలిచిందని న్యాయమూర్తి తెలిపారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, న్యాయమూర్తులు కెవీ రామకృష్ణయ్య, చినబాబు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
కాలువల్లో అవినీతి మేట
సాక్షి ప్రతినిధి, విజయవాడ: పంట కాలువలు, డ్రెయిన్లలో అవినీతి ‘పూడిక’ అధికమవుతోంది. దీనికి కారణం నీటి పారుదల శాఖ అధికారుల తీరే. కృష్ణా డెల్టా పరిధిలో కాలువలు, డ్రెయిన్లు తూటుకాడ, గుర్రపు డెక్కతో కనిపిస్తున్నాయి. చివరి ఆయకట్టుకు నీరు అందక రైతులు ఇబ్బంది పడే పరిస్థితులున్నాయి. ఇవన్నీ తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గతేడాది ఆలస్యంగా.. కాలువల మరమ్మతులు, నిర్వహణ పనులకు టెండర్లను ఆలస్యంగా పిలుస్తున్నారు. గతేడాది జూన్‌లో కాలువలకు నీరు విడుదల చేశారు. ఆ తర్వాత, కాలువల, డ్రెయిన్ల నిర్వహణకు రూ.32.79 కోట్లతో పనులకు టెండర్లు పిలిచారు. కాలువలకు నీరు విడుదల చేయడంతో పనులు చేసే పరిస్థితి లేదు. దీంతో స్థానిక ప్రజాప్రతి నిధుల కనుసన్నల్లో కొంతమంది కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. పనులు చేయకుండా నిధులు మింగేయడానికి కొంతమంది కాంట్రాక్టర్లు ఏకంగా 40–48 శాతంపైగా లెస్‌కు వేసి పనులు దక్కించుకున్నారు. ఈ ఏడాది మే వరకు పనులు చేసే అవకాశం ఉంది. అయితే పనులు దక్కించుకొన్న కాంట్రాక్టర్లు , నీటి పారుదల శాఖ అధికారులతో కుమ్మక్కై నామ మాత్రంగా పనులు చేసి, బిల్లులు చేయించుకొని దండుకొనేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా ఈ ఏడాది పనులకు టెండర్లు పిలవడానికి ఈ సమయం అనువుగా ఉంటుంది. అలా చేయకపోతే చివరి ఆయకట్టు నీరు అందే పరిస్థితులు లేవని రైతులు వాపోతున్నారు. ఎక్కువ వర్షం కురిస్తే డ్రెయిన్లు పొంగి పంట పొలాలను ముంచెత్తుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. టెండర్లు పూర్తి అయినా.. చేయని పనులు గతేడాది కొంత మంది కాంట్రాక్టర్లు 40–48 శాతంపైగా తక్కువకు టెండర్లు వేసి పనులు దక్కించుకున్నారు. కాలువలో నీరు, డ్రెయిన్లలో నీరు ప్రవహిస్తే గుర్రపు డెక్క కొట్టుకొచ్చి షట్టర్ల వద్ద ఆగుతుంది. అక్కడ యంత్రాలతో తీసి కొంతమంది మమ అనిపించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ప్రభుత్వ నిర్లక్ష్యం, ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్ల కాసుల కక్కుర్తి రైతులకు పెను శాపంగా మారుతోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. అధ్వానంగా డ్రెయిన్లు వర్షం వస్తే..రైతులకు కంటిమీద కునుకు ఉండని పరిస్థితి కృష్ణా డెల్టాలో నెలకొంది. కొద్ది పాటి వర్షానికే డ్రెయిన్లు పొంగి పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. గుడివాడ, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ,పెడన నియోజక వర్గాల పరిధిలో ఎక్కువగా పంట పొలాలు మునుగు తున్నాయి. గుడివాడ నియోజకవర్గ పరిధిలోని గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో పూడికలు తీయక డ్రెయిన్లు అధ్వానంగా మారాయి. గుర్రపుడెక్క, తూటుతో మేట వేసుకుపోయాయి. నియోజకవర్గంలో బుడమేరు, చంద్రయ్య, నెహ్రాల్లీ, మోటూరు ఎల్ఎస్ మేజర్ డ్రెయిన్లు అధ్వానంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా లజ్జబండ, శివగంగ, తాళ్లపాళెం, ఏనుగులకొడు, వన్నేరు, ముస్తాఫాకోడు, యూటీ,పెద్దలంక, గుండేరు, రత్నకొడు డ్రెయిన్లలో రోజుల తరబడి గుర్రపుడెక్క, నాచు, తూటు దట్టంగా పేరుకుపోయి మురుగునీరు సక్రమంగా దిగువకు పారని పరిస్థితి నెలకొంది. విజయవాడ నుంచి నందివాడ మండలం ఎల్‌ఎన్‌పురం వరకు ఉన్న బుడమేరులో గుర్రపుడెక్క దట్టంగా పేరుకుంది. గతేడాది దీని తొలగింపునకు అధికారులు టెండర్లు పిలిచి పనులు అప్పగించినా చేయకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. చంద్రయ్య డ్రెయిన్ గుడివాడ నుంచి మండవల్లి మండలం పెనుమాకలంక వరకు గుర్రపుడెక్క మేటవేసి నీరు వెళ్లని పరిస్థితి నెలకొంది. తమిరిశ వంతెన, పోలుకొండ రెగ్యులేటర్ వద్ద అలముకున్న గుర్రపుడెక్కతో వంతెనలకు ప్రమాదం పొంచి ఉంది. నందివాడ నుంచి మండవల్లి మండలం నందిగామలంక వరకు ప్రవహిస్తున్న నెహ్రాల్లీ డ్రెయిన్ రాళ్లకోడు డ్రెయిన్లు అధ్వానంగా కనిపిస్తున్నాయి. డ్రెయిన్లలో పేరుకున్న తూటు, గుర్రపుడెక్క గతేడాది రూ.32.19 కోట్లతో టెండర్లు పనులు చేయని కాంట్రాక్టర్లు చివరి ఆయకట్టుకు అందని సాగునీరు రైతుల్లో ఆందోళన పర్యవేక్షణ గాలికి వదిలేశారు డ్రెయిన్ల పర్యవేక్షణకు నిధులు మంజూరు చేసినా కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మౖకై పనుల నిర్వహణను గాలికి వదిలేశారు. డ్రెయిన్లలో గుర్రపుడెక్క, తూటు కన్పిస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలి. – రవి, రైతు లింగవరం తూటు, డెక్క తొలగించడం లేదు బుడమేరు డ్రెయిన్‌లో పుట్టగుంట వద్ద నుంచి గుర్రపుడెక్క దట్టంగా పేరుకుపోయింది. ఏటా కాంట్రాక్టర్లు కాంట్రాక్టు తీసుకోవడమే గాని పనులు చేపట్టిన దాఖలాలు లేవు. ఇటీవల సంభవించిన వరదలకు పంట పొలాలు, గ్రామాలు ముంపునకు గురై తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. – ఆంజనేయులు, రైతు ఒద్దులమెరకగత ఏడాది టెండర్లు పిలిచిన పనులు డివిజన్ పనుల విలువ సంఖ్య (కోట్లలో)కృష్ణా తూర్పు 42 8.49 కృష్ణా సెంట్రల్ 40 6.77 డ్రెయిన్ గుడివాడ 73 16.41 స్పెషల్ 05 1.12 మొత్తం 160 32.79 -
భక్తుల కల్పవల్లి ‘అద్దంకి నాంచారమ్మ’
కోడూరు: అద్దంకి నాంచారమ్మ అమ్మవారు ప్రధాన జాతరోత్సవాలకు విశ్వనాథపల్లి ముస్తాబవుతోంది. ఈ నెల 13, 14, 15 తేదీల్లో జరిగే జాతరకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో దేవదాయశాఖ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా పాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున అమ్మవారి ప్రధాన జాతర నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ. నాంచారమ్మ అమ్మవారు అద్దంకి గ్రామం నుంచి రావడంతో గుంటూరు, ప్రకాశం జిల్లాల వారు అమ్మవారి పుట్టింటి వారుగా భక్తులు భావిస్తారు. దీంతో ఆ రెండు జిల్లాల భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. భక్తుల సౌకర్యం కోసం మచిలీపట్నం, రేపల్లె, అవనిగడ్డ నుంచి ‘విశ్వనాథపల్లి స్పెషల్’ పేరుతో 15 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయాన్ని రంగులు, విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. 13న నాంచారమ్మ మూలమూర్తికి ప్రత్యేక అలంకారం, 14న ఆలయ ప్రధాన గుడి జాతర, 15న అమ్మవారికి నైవేద్యాల సమర్పణ చేస్తామని దేవదాయ అధికారులు తెలిపారు. 13 నుంచి ప్రధాన జాతరోత్సవాలు -
రైల్వేస్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం విజయవాడ రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబర్ 1లో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. దీన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ రాజా సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, ఒంటిపై నీలం, ఆకుపచ్చ గళ్ల లుంగీ, కాషాయం రంగు టీ షర్ట్ ధరించి ఉన్నాడని, కుడి చేతిపై శివుని బొమ్మతో పచ్చ బొట్టు ఉందని, ఇతర ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. అనారోగ్యంతో మృతిచెంది ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. వివరాలకు విజయవాడ జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని కోరారు. రైలు ఢీ కొని.. కోనేరుసెంటర్: రైలు ఢీ కొని ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన శనివారం బందరు మండలం బొర్రపోతుపాలెం రైల్వేగేటు సమీపంలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం బందరు మండలం బొర్రపోతుపాలెం గ్రామానికి చెందిన కాగిత శివనాగరాజు(38) కూలి పనులు చేస్తుంటాడు. కొంతకాలం క్రితం భార్య చనిపోయింది. భార్య చనిపోవటానికి నాగరాజు కారణమంటూ మృతురాలి కుటుంబ సభ్యులు పెట్టిన కేసులో సబ్‌జైలులో శిక్ష అనుభవిస్తూ కొద్ది రోజుల క్రితం బయటికి వచ్చాడు. అప్పటి నుంచి నాగరాజు మానసికస్థితి సరిగా ఉండటంలేదు. ఇదిలా ఉండగా నాగరాజు బహిర్భూమికి ప్రతి రోజు రైల్వేట్రాక్ వద్దకు వెళ్తుంటాడు. అలాగే శనివారం ఉదయం రైల్వేట్రాక్ వైపు బహిర్భూమికి వెళ్లిన నాగరాజు ఇంటికి తిరిగిరాలేదు. మధ్యాహ్నం గ్రామస్తులు ట్రాక్ పక్కన శవంగా పడి ఉన్న అతడిని గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతుని వివరాలు సేకరించారు. మృతుడు నాగరాజును రైలు ఢీకొనడంతో చనిపోయినట్లు రైల్వే పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బందరు సర్వజన ఆస్పత్రికి తరలించినట్లు రైల్వే పోలీసు సురేష్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్ఐసీ బిల్డింగ్ పక్కన ఉన్న బస్టాప్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గుర్తించామని స్టేషన్ ఇన్స్పెక్టర్ అడపా నాగమురళి శనివారం తెలిపారు. మృతుడి వయసు 45 ఏళ్లు ఉంటాయని, అనారోగ్యంతో చనిపోయాడన్నారు. వివరాలకు గవర్నర్‌పేట పీఎస్(0866 2576023)లో సంప్రదించాలని కోరారు. -
సుబాబుల్ ట్రాక్టర్ ఢీకొని బాలుడి దుర్మరణం
నందిగామరూరల్: సుబాబుల్ లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొని బాలుడు దుర్మరణం చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు మండలంలోని లింగాలపాడు గ్రామానికి చెందిన నగిరికంటి రవీంద్ర కుమారుడు జోగేంద్ర(8) గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు శనివారం సెలవు కావటంతో తన అక్కతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మరో వ్యక్తి ద్విచక్ర వాహనంపై మిర్చి బస్తాలు వేసుకుని వస్తున్నాడు. ఈ క్రమంలో లింగాలపాడు గ్రామ శివారులోకి వచ్చే సరికి మిర్చి బస్తాల వాహనం వీరికి తగలటంతో బాలుడు ఒక్కసారిగా కిందపడిపోయాడు. అదే సమయంలో అటుగా వస్తున్న సుబాబుల్ ట్రాక్టర్ బాలుడి తలపైకి ఎక్కటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్ డ్రైవర్, మిర్చి బస్తాలు వేసుకువస్తున్న ద్విచక్ర వాహనదారుడు అక్కడి నుంచి పరారయ్యారు. ఎస్ఐ అభిమన్యు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మినుము రైతులు దిగాలు
● ఆశాజనకంగా దిగుబడులు ● మార్కెట్లో ధర లేని వైనం ● ఆర్థికంగా నష్టపోయామంటున్న రైతులు ● గతేడాది రబీలో రూ.9,100 పలికిన క్వింటా ధర కంకిపాడు: సీజన్ మారుతుందే కానీ రైతుల కష్టాలు మాత్రం మారటం లేదు. ఒడిదుడుకులు అధిగమించి పంట చేతికి వచ్చిందని సంతోషించినా మార్కెట్లో సరైన ధర లేకపోవటంతో అన్నదాతలు దిగాలు చెందుతున్నారు. గతేడాదితో పోలిస్తే భారీగా ధరలు నేలచూపులు చూస్తుండటంతో మినుము రైతుల గుండెలు గుభేల్మంటున్నాయి. ఆరుగాలం కష్టించినా అరకొరే చేతికి అందుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా 25 మండలాల్లో ఈ ఏడాది రబీ సీజన్లో 2,84,237 ఎకరాల్లో మినుము సాగు చేపట్టారు. ప్రధానంగా ఎల్బీజీ, పీయూ 31, టీబీజీ, ఇతర విత్తన రకాలను రైతులు సాగుకు ఎంపిక చేసుకున్నారు. గడిచిన వారం రోజులుగా జిల్లాలో మినుము తీత పనులు సాగుతున్నాయి. ఇప్పటికే 30 శాతం మినుము తీతలు పూర్తయ్యి పంట మార్కెట్‌కు చేరినట్లు వ్యవసాయశాఖ అంచనా. ఎకరానికి రూ.40 వేల వరకు పెట్టుబడి.. ఈ ఏడాది రబీ సీజన్లో మినుము దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. అయితే సాగు ఆరంభం నుంచి తెగుళ్లు, పురుగు ఉధృతి పంటపై అధికంగా ఉంది. ప్రధానంగా గతంలో ఎన్నడూ లేని విధంగా పల్లాకు తెగులు విజృంభించటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎకరాకు సరాసరిన పైరు సంరక్షణ, యాజమాన్య చర్యలకు రూ.25 వేల వరకూ పెట్టుబడులు అయ్యేవి. అలాంటిది ఈ ఏడాది పల్లాకు, మచ్చల పురుగు, ఫంగస్ల కారణంగా యాజమాన్య చర్యలకు అదనంగా రూ.15 వేల వరకూ పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది. ఎకరాకు 10 క్వింటాళ్ల వరకూ దిగుబడులు వస్తాయని ఆశించారు. పంట చేతికి వచ్చే సరికి ఆరు క్వింటాళ్ల నుంచి ఎనిమిది క్వింటాళ్ల లోపు మాత్రమే దిగుబడులు వస్తున్నాయి. ఖరీఫ్ సీజన్లో వరి పంట భారీ వర్షాలు, కృష్ణానది వరదల కారణంగా దెబ్బతినంటంతో ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూశారు. ప్రత్యేకించి కౌలు ఒప్పందం ఖరీఫ్‌కు 20 బస్తాలు పైగా చేసుకుని సాగు చేపట్టిన కౌలురైతులు రెండో పంట రబీలో ఆరుగాలం కష్టించినా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని భావించారు. అయితే దిగుబడులు కూడా మోస్తరుగానే దక్కటంతో రైతుల్లో దిగులు నెలకొంది. ధర నేలచూపులు.. ఈ ఏడాది మార్కెట్లో మినుము ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ప్రభుత్వ మద్దతు ధర రూ.7,400గా ఉంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ధర రూ.7,500 నుంచి రూ.7,800 పలుకుతోంది. గత సీజన్లో పంట చేతికి అందే నాటికి క్వింటా మినుము వ్యాపారులు రూ.9,300 నుంచి రూ.9,500 వరకూ ధర చెల్లించి కొనుగోళ్లు చేశారు. కానీ ప్రస్తుతం ఆ ధర పలకటం లేదు. గతంతో పోలిస్తే క్వింటాకు రూ.1800కు పైగా నష్టానికి పంట అమ్ముకోవాల్సి వస్తోంది. మార్కెట్లో వ్యాపారులు సిండికేట్‌గా మారి ధర నిర్ణయం చేయటంతోనే సరైనా ధర పలకటం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో పంటను నిల్వ చేసుకుని మంచి ధర వస్తే విక్రయించుకునే యోచనలో ఉన్నారు. -
అన్నింటా మహిళలు రాణించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): అన్ని రంగాల్లో మహిళలు రాణించి నేటి సమాజంలో మహిళాసాధికారత దిశగా అడుగులు వేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. జిల్లా పరిషత్ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కృష్ణమ్మ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం జెడ్పీ సమావేశపు హాలులో జిల్లా పరిషత్ సభ్యులతో పాటు మహిళా ఉద్యోగులతో కలిసి ఆమె కేక్ కట్ చేశారు. దేశస్థాయిలో అత్యున్నత అవార్డు సాధించిన చైర్పర్సన్ ఉప్పాల హారికను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం గత ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి వాటిని తూ.చ. తప్పకుండా అమలు చేశారన్నారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు జగనన్న తోడు, జగనన్న ఆసరాతో పాటు అన్ని రంగాల మహిళలకు ఆర్థిక చేయూతను అందించారని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు అందజేసి సొంతింటి కలను నెరవేర్చారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ డెప్యూటీ సీఈఓ ఆర్సీ ఆనంద్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యులు, ఉద్యోగినులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక -
ఒత్తిడి జయించేందుకు క్రీడలు దోహదం
గన్నవరంరూరల్: ఒత్తిడిని జయించేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చిన అవుటపల్లి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల క్రీడా మైదానంలో హెల్త్ యూనివర్సిటీ 26వ పురుషుల ఇంటర్ మెడికల్ గేమ్స్ మీట్‌ను శనివారం ప్రారంభించారు. యూనివర్సిటీ పరిధిలోని అన్ని వైద్య, డెంటల్ కళాశాలల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ.. విద్యా సంవత్సరానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. క్రీడాకారులను డాక్టర్ రాధికా రెడ్డి అభినందించారు. సిద్ధార్థ మెడికల్ కళాశాల యాజమాన్యం ఆమెను సత్కరించింది. కళాశాల డైరెక్టర్ జనరల్ డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవి భీమేశ్వర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.అనిల్ కుమార్, హెల్త్ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ త్రిమూర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవినేని రవి, డాక్టర్ రెహమాన్, హెచ్ఓడీలు, వైద్యులు పాల్గొన్నారు. -
ప్రతి పురుషుడి విజయం వెనుక మహిళ
మచిలీపట్నంటౌన్: ప్రతి పురుషుడి విజయం వెనుక సీ్త్ర మూర్తి హస్తం తప్పక ఉంటుందని కృష్ణా జిల్లా కలెక్టర్ సతీమణి పృథ్వీకళ్యాణి అన్నారు. స్థానిక ఈడేపల్లిలోని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) హాల్లో ఆ సంఘ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు కలెక్టర్ సతీమణి పృథ్వీకళ్యాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలను గౌరవించేరోజన్నారు. ఒక పురుషుని విజయం వెనుక ఒక తల్లి, చెల్లి, అక్క, కూతురు, భార్య ఇలా ఎవరో ఒక సీ్త్ర మూర్తి ఉండే ఉంటారన్నారు. వారి త్యాగాలను గుర్తిస్తూ వారి శక్తిని రెండింతలు చేసేలా ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆశాలత, యూటీఎఫ్ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా పృథ్వీకళ్యాణిని ఘనంగా సత్కరించారు. -
నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియడం లేదు: పోసాని
సాక్షి, విజయవాడ: పోసాని కృష్ణమురళీపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపును కొనసాగిస్తూనే ఉంది. వరుస కేసుల్లో అరెస్ట్ చేస్తూ స్టేషన్ల చుట్టూ పోలీసులు తిప్పుతున్నారు. ఇవాళ విజయవాడ చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో పోసానిని పోలీసులు హాజరుపరిచారు. ఈ నెల 20 వరకు కోర్టు రిమాండ్ విధించింది. తనకు ఆనారోగ్య సమస్యలున్నాయని న్యాయమూర్తికి పోసాని చెప్పారు. గుండె ఆపరేషన్ అయ్యిందని.. పక్షవాతం కూడా వచ్చిందని ఆయన తెలిపారు. ‘‘నాపై అక్రమ కేసులు పెట్టారు. నన్ను ఎక్కడికి తీసుకెళుతున్నారో కూడా తెలియడం లేదు’’ అంటూ పోసాని ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసు వాహనంలో గంటల తరబడి కూర్చోలేకపోతున్నానని.. తనను ఒకే జైలులో ఉంచేలా ఆదేశాలివ్వాలని పోసాని కోరగా, పిటి వారెంట్‌పై వచ్చినందున తాను ఎలాంటి ఆదేశాలివ్వలేనని న్యాయమూర్తి తెలిపారు. పోసాని కృష్ణమురళికి ఈనెల 20 వరకూ న్యాయమూర్తి రిమాండ్ విధించారు. పోసానిని కర్నూలు జైలుకి తరలించారు.కాగా, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోసానికి బెయిలు ఇవ్వకూడదని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ.. కోర్టు పోసాని తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ... బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులోనే పోసాని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయ్యారు. -
No Headline
గుడ్లవల్లేరు: దేశ చరిత్రలో అరుదైన పురస్కారం ఇటీవల కృష్ణాజిల్లా పరిషత్‌కు లభించింది. జెడ్పీ ఎంతో పారదర్శకంగా పరిపాలన సాగించిందని చెప్పేందుకు ఐసీఏఐ ఇచ్చిన ఈ అవార్డు నిదర్శనంగా నిలిచింది. ఈ అవార్డు పొందడంలో జెడ్పీ చైర్ పర్సన్‌గా ఉప్పాల హారిక కృషి ఎంతో ఉంది. భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వెరసి 778 జిల్లాలు ఉన్నాయి. ఈ జాతీయ అవార్డును ఇంతవరకు దేశంలో ఏ జిల్లా పరిషత్‌కు ఇవ్వలేదు. 2023 ఆర్థిక సంవత్సరం కింద జిల్లా పరిషత్‌కు ఆర్థిక నివేదికలను ఉత్తమంగా నిర్వహించినందుకు గాను కేంద్ర స్థాయిలో ఈ అవార్డు వచ్చింది. ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) వారు ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్‌కు అరుదైన ఉత్తమ జాతీయ పురస్కారాన్ని ఇచ్చింది. గత నెల ఒకటో తేదీన జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పాల రాము దంపతులు ఢిల్లీలోని కేంద్ర న్యాయ శాఖామంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, ఐసీఏఐ ప్రెసిడెంట్ రంజిత్‌కుమార్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. -
అర్చకత్వానికి అంకితం
ఘంటసాల: మహిళలు అన్ని రంగాలలో ముందుంటూ వారసత్వాన్ని, కుటుంబ బాధ్యతలను స్వీకరించడంలో చాలా దృఢ నిశ్చయంతో కొనసాగుతున్నారు అనడానికి నిదర్శనం ఘంటసాల విజయలక్ష్మి, ఆమె సోదరీమణులు లక్ష్మి, మాధవీలత. ఘంటసాలలోని శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వరస్వామి దేవాలయం, శ్రీ బాల పార్వతీ సమేత జలధీశ్వరస్వామి దేవాలయాల్లో శతాబ్దాలుగా వంశపారంపర్య అర్చకత్వం కొనసాగుతోంది. ఈ పరంపరలో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు ఘంటసాల వెంకటేశ్వరరావుకు ముగ్గురు ఆడపిల్లలు సంతానం ఉన్నారు. వారు ఉన్నత విద్యనభ్యసించారు. ఆయన తదనంతరం కుటుంబంలో పురుషులు లేకపోవడంతో ఆడ పిల్లలు తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి ముందుకు వచ్చారు. 1981లో ఘంటసాల వెంకటేశ్వరరావు కాలం చేయగా.. వారి కుమార్తెలు అర్చకత్వ బాధ్యతలు చేపట్టారు. వీరిలో ముఖ్యంగా ఘంటసాల విజయలక్ష్మి పోస్టు గ్రాడ్యుయేషన్, బీఈడీ చేసినప్పటికీ ఆ రంగాన్ని వదిలి అర్చకత్వ పరీక్షలలో ఉత్తీర్ణురాలై, అవివాహితగా ఉండి తన జీవితాన్ని సంపూర్ణంగా అర్చకత్వానికి అంకితం చేశారు. శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయంతో పాటు సుమారు ఏడేళ్లు శ్రీ జలధీశ్వర స్వామి దేవాలయంలో కూడా విజయలక్ష్మి అర్చకత్వం చేశారు. ఈమెకు వారి సోదరిలు లక్ష్మి, మాధవీలతలు కూడా సహకారం అందించే వారు. ఘంటసాల చుట్టు పక్కల ప్రాంతాల్లో శుభకార్యాలు కూడా వీరే చేయించడం ఓ ప్రత్యేకత. -
వందే వనితరం
సమాజానికి నగిషీలుగా మారుతున్న మహిళామణులు అందం, అభినయం, అణకువ ఒకప్పటి మహిళకు నిర్వచనం.. పరిణతి, పరిపక్వత, పరాక్రమం నేటి మహిళ సొంతం.. ఆమె ఆకాశంలో సగం కాదు.. ఇప్పుడు ఆమే ఆకాశం.. ‘ఇందుగలరు.. అందులేర’ని సందేహం లేకుండా అన్ని రంగాల్లో విజయకేతనం ఎగురవేస్తున్నారు. ఆత్మవిశ్వాసాన్ని ఆభరణంగా మలచుకొని.. విభిన్న వేదికలపై ‘వనిత’ర సాధ్యులమని చాటి చెబుతున్నారు. సర్పంచి నుంచి రాష్ట్రపతి వరకూ.. ఉపాధ్యాయ ఉద్యోగాల నుంచి దేశాన్ని రక్షించే త్రివిధ దళాల వరకూ ప్రతి చోట పురుషులకు దీటుగా సత్తా చాటుతున్నారు. అన్నింటా తెగువ చూపుతూ సమాజానికి నగిషీలుగా మారుతున్నారు. ‘ఇంతి’ంతై.. విశ్వమంతై అన్నట్లుగా జగతి ప్రగతికి మేము సైతం అంటూ నడుం బిగిస్తున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మగువల మనోగతం మీ కోసం.. -
బుడమేరు డైవర్షన్ కెనాల్ పరిశీలన
జి.కొండూరు: గత ఏడాది ఆగస్టులో బుడమేరుకు వచ్చిన వరదల కారణంగా కవులూరు గ్రామ శివారులోని బుడమేరు డైవర్షన్ కెనాల్‌కు గండ్లు పడిన ప్రాంతాన్ని, వెలగలేరు హెడ్ రెగ్యులేటర్‌ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం పరిశీలించారు. ఈ నెల 6వ తేదీన సాక్షి ప్రచురించిన ‘బుడమేరకు పొంచి ఉన్న కడగండ్లు’ కథనానికి స్పందించి ఆయన ఈ పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదట డైవర్షన్ కెనాల్‌కు గండ్లు పడి పూడ్చిన ప్రదేశంలో ఊట వస్తున్న ప్రదేశాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఇక్కడ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సైపన్ల వద్ద కట్ట బలోపేతంపై అధికారులతో చర్చించారు. అనంతరం వెలగలేరు హెడ్‌రెగ్యులేటర్ వద్ద గేట్లను పరిశీలించారు. సమస్య ఉన్న గేట్లకు చేపట్టవలసిన మరమ్మతులపై ఆరా తీశారు. వరదల కారణంగా బుడమేరు, పులివాగుతో పాటు పలు వాగులకు పడిన గండ్లు, మేజర్, మైనర్ ఇరిగేషన్ చెరువులు వాటికి పడిన గండ్లపై అధికారులు, రైతులతో చర్చించారు. రైతులకు ఎటువంటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపిన నేపథ్యంలో అనుమతి రాగానే పనులు ప్రారంభించి వర్షాకాలంలోపు పనులను పూర్తి చేస్తామని అధికారులు కలెక్టర్‌కు తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ చాట్ల వెంకటేశ్వర్లు, రైతులు పాల్గొన్నారు. -
మహిళలపై వివక్ష, సవాళ్లపై చర్చ
భవానీపురం(విజయవాడపశ్చిమ): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషరేట్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్యానల్ డిస్కషన్ జరిగింది. ‘అదృశ్య అవరోధాలను ఛేదించడం – మహిళల నాయకత్వం – సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి వి. అనిత, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. మహిళలు నాయకత్వ స్థాయికి ఎదగడంలో ఎదుర్కొనే సవాళ్ల, అవరోధాలు, వివక్షను అధిగమించే మార్గాల గురించి చర్చించారు. హోం మంత్రి అనిత మాట్లాడుతూ మహిళను విమర్శించే క్రమంలో ముందు క్యారెక్టర్‌ను దూషిస్తారన్నారు. బీసీ వెల్ఫేర్ మంత్రి సవిత మాట్లాడుతూ రాజకీయంగా అనేక ఒడుదుడుకులను ఎదుర్కొన్నానని చెప్పారు. అలాగే అనేక కేసులు, అవమానాలు పడుతూ ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ -
పెన్షనర్లకు పంగనామం!
అవనిగడ్డ: అవనిగడ్డ సబ్ ట్రెజరీ కార్యాలయం (ఎస్టీవో)లో పెద్ద ఎత్తున పెన్షనర్స్ నిధులు దారి మళ్లాయి. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు జిల్లా అధికారులు రెండు రోజుల పాటు చేపట్టిన విచారణలో నిధులు స్వాహా వాస్తవాలని తేలినట్టు సమాచారం. శుక్రవారం జిల్లా ట్రెజరీ కార్యాలయంలో అధికారులు విచారణ చేశారు. రూ.1.70 కోట్లు స్వాహా.. రిటైర్మెంట్ అయిన తరువాత ఉద్యోగులకు కమిటేషన్ బిల్స్ ఇస్తారు. 2023–24లో ఈ బిల్లుల చెల్లింపు పేరుతో రూ.1.70కోట్ల నిధులు ట్రెజరీ అధికారి, సిబ్బంది కలసి స్వాహా చేశారు. పెన్షనర్స్‌కు కమిటేషన్ బిల్స్ చెల్లింపు పేరుతో ఈ నిధులను ఎస్టీవీ, అకౌంటెంట్ తమ ఖాతాలకు మళ్లించుకున్నారు. గత నెలలో జరిగిన ఆడిట్ అనంతరం కాగ్ ఈ విషయాన్ని ఏపీ సెక్రటేరియట్‌కు నివేదిక అందించింది. దీనిపై విచారణ చేపట్టాలని జిల్లా అధికారులకు సెక్రటేరియట్ అధికారులు ఆదేశించడంతో బుధ, గురువారాల్లో స్థానిక ట్రెజరీ కార్యాలయంలో అధికారులు విచారణ చేశారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో విచారణ చేశారు. అవనిగడ్డ ఎస్టీవో కార్యాలయంలో రూ.1.70 కోట్లు స్వాహా కాగ్ నివేదికతో వెలుగులోకి బాగోతం రెండు రోజులుగా గుట్టుగాకొనసాగుతున్న విచారణ గుట్టుగా విచారణ.. 2023–24కు సంబంధించి జరిగిన ఈ అవినీతిని ఎస్టీవో గుట్టు చప్పుడు కాకుండా ఉంచారు. జిల్లా అధికారులు పలుసార్లు తనిఖీలు చేసినా ఈ విషయం చెప్పకుండా, బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. కాగ్ నివేదికలో బయట పడటంతో విచారణకు ఆదేశించారు. రెండు రోజుల పాటు జరిగిన విచారణలో ఎస్టీవో ఆదిశేషు, అకౌంటెంట్ వెంకట్ ఈ నిధులను స్వాహా చేసినట్టు సమాచారం. ఈ విషయమై జిల్లా ట్రెజరీ కార్యాలయంలో శుక్రవారం విచారణ కొనసాగింది. ఈ విషయమై జిల్లా అధికారులను వివరణ కోరగా విచారణ చేస్తున్నామని ఎంత మేర అవినీతి జరిగిందనే విషయం ఇంకా తేలాల్సి ఉందన్నారు. -
ఆదర్శ మహిళా సర్పంచ్‌గా కోటమ్మ
జి.కొండూరు: పురుషులతో సమానంగా మహిళలు రాజకీయాలలో రాణించగలరని భావించి రాజకీయాలలో మహిళలకు యాభైశాతం రిజర్వేషన్‌ను అమలు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలు సాకారమవుతున్నాయి. అవకాశాన్ని అందిపుచ్చుకొని ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండల పరిధి పొందుగల గ్రామ పంచాయతీ నుంచి మొదటి మహిళా సర్పంచ్‌గా ఎన్నికై న గుగులోతు కోటమ్మ విభిన్నమైన ప్రణాళికతో పొందుగలను ఉత్తమ గ్రామ పంచాయతీగా నిలిపి కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డును అందుకున్నారు. సర్పంచ్ కోటమ్మ చదివింది పదో తరగతి. ఏడు ఓట్ల మెజారిటీతో మహిళా సర్పంచ్‌గా గెలుపొందారు. తనకి ఓటు వేసిన వారే కాదు.. ఓటు వేయని వారికి కూడా తాను సర్పంచ్‌ననే భావనతో ఎటువంటి వివక్షకు తావులేకుండా గ్రామాభివృద్ధే ద్యేయంగా పని చేశారు. గ్రామ పంచాయతీలో లేబర్ కాంట్రాక్టరుగా, గుమాస్తాగా పని చేసిన తన భర్త అనుభవాన్ని కూడగట్టుకొని, రాజకీయాలకతీతంగా నిధుల లభ్యతను అందిపుచ్చుకొని, ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చి దిద్దడంలో విజయం సాధించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మహిళగా రాజకీయాలలో పురుషుల కంటే తామేమీ తక్కువ కాదని నిరూపించిన పొందుగల సర్పంచ్ గుగులోతు కోటమ్మకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
కదులుతున్న డొంక!
ప్రత్యేక కమిటీ ముందుకు ‘ఆ ముగ్గురు’! దుర్గమ్మ చీరల విభాగంలో 2018 నుంచి 2023 వరకు బాధ్యతలు నిర్వర్తించిన వారిలో సుబ్రహ్మణ్యం, చెన్నకేశవరావు, రమేష్ కీలకంగా ఉన్నట్లు గుర్తించారు. 2018 నుంచి 2019 వరకు చీరల వ్యవహారంలో గోల్మాల్ జరగగా, ఆ సమయంలో సుబ్రహ్మణ్యం విధుల్లో ఉన్నారు. ఆ తర్వాత చీరల విభాగానికి వచ్చిన మిగిలిన వారు పాత రికార్డులను పట్టించుకోకుండా, తాము బాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చిన చీరల వివరాలను మాత్రమే రికార్డులలో పొందుపరిచారు. తాజాగా ప్రత్యేక కమిటీ ఆ ముగ్గురు ఉద్యోగులను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చీరల గోల్మాల్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన సుబ్రహ్మణ్యం ప్రస్తుతం కూటమి నేతల పంచన చేరారు. కూటమి మంత్రి చేత మాట్లాడించి ప్రత్యేక కమిటీ ముందు హాజరు కాకుండా ఉండేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేనకు చెందిన ఓ మంత్రి సాయంతో ఈ వ్యవహారం నుంచి బయట పడాలని చూస్తున్నట్లు సమాచారం. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిలో చీరల స్కామ్‌పై శుక్రవారం ప్రత్యేక కమిటీ విచారణ చేపట్టింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మహా మండపం 5వ అంతస్తులోని చీరల విభాగంలో దేవదాయ శాఖ గుంటూరు డెప్యూటీ కమిషనర్ కేబీ రావు పర్యవేక్షణలో మొత్తం ముగ్గురు ఏసీలు విచారణ చేపట్టారు. దేవస్థాన పరిపాలనా విభాగం, లీజెస్ సెక్షన్‌తో పాటు చీరల విభాగానికి చెందిన ఉద్యోగులు ప్రత్యేక కమిటీ బృందం ముందు హాజరయ్యారు. చీరల స్కామ్ జరిగినప్పటి రికార్డులను ఇవ్వాలని వారు కోరగా, వాటితో పాటు తాను గతంలో చేసిన విచారణ తాలుకూ రిపోర్డును ఏఈవో సుధారాణి ప్రత్యేక కమిటీకి అందజేశారు. అసలు విషయం ఏమిటంటే.. 2018 నుంచి 2019 వరకు చీరల వ్యవహారంలో గోల్మాల్ జరిగినట్లు గతంలోనే గుర్తించారు. మొత్తం రూ. 2కోట్ల విలువైన 33,686 చీరలు మాయం కాగా వాటి స్థానంలో నాసిరకం, నాణ్యత లేని చీరలను ఉంచినట్లు గుర్తించారు. అయితే చీరల స్కామ్ జరిగినప్పుడు ఎవరెవరూ ఆ విభాగంలో విధులు నిర్వర్తించారు.. ఆ తర్వాత ఎవరు బాధ్యతలు తీసుకున్నారనే దానిపై దేవస్థాన పరిపాలనా విభాగం నుంచి రికార్డులను తెప్పించుకుని కమిటీ పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. శుక్రవారం జరిగిన విచారణలో చీరల విభాగంలో విధులు నిర్వర్తించిన పలువురు ఉద్యోగులు ప్రత్యేక కమిటీ ముందు హాజరై వివరాలను వెల్లడించారు. సెక్షన్ బాధ్యతలు తమపై ఉన్నా.. భక్తులు సమర్పించిన చీరలు, కౌంటర్లో అమ్మకాలు, చీరల నిల్వ వంటి అంశాలన్నీ గుమాస్తాల పర్యవేక్షణలో జరిగాయని తెలియజేశారు. శనివారం కూడా ప్రత్యేక కమిటీ విచారణ చేపట్టే అవకాశాలున్నాయని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. అధికారి మెప్పు కోసమేనా! 2018 నుంచి 2019ల మధ్య తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా, ఆ సమయంలో సుబ్రహ్మణ్యం ఉన్నతాధికారుల మెప్పు కోసమే చీరలను గోల్మాల్ చేసినట్లు అప్పట్లో దుర్గగుడిలో ప్రచారం జరిగింది. కొంత మంది అధికారులు, అప్పటి ప్రజాప్రతినిధులకు భారీ ఖరీదైన పట్టు చీరలను సమర్పించి, వాటి స్థానంలో నాసిరకం, తక్కువ రేటు ఉన్న చీరలను ఉంచినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దుర్గమ్మ చీరల స్కామ్‌లో విచారణ చేపట్టిన ప్రత్యేక కమిటీ -
గణపేశ్వరం దుర్గమ్మ గుడికి వెండి ఆభరణాలు సమర్పణ
గణపేశ్వరం(నాగాయలంక): గ్రామంలోని పురాతనమైన చారిత్రక దేవాలయం శ్రీదుర్గాగణపేశ్వర స్వామి ఆలయాల్లోని శ్రీదుర్గమ్మ గుడికి దాతలు రూ.1.31 లక్షల విలువైన వెండి ఆభరణాలను వితరణ చేశారు. బందరు మాజీ ఎంపీ దివంగత నేత మండల వెంకటస్వామి నాయుడు కుటుంబ సభ్యులు ఈ మేరకు అమ్మవారి వెండి విగ్రహం(రూ.30,300), శ్రీచక్రం(రూ.28,896) శంఖం(రూ.18,748), ఏనుగు ప్లేట్(రూ.49,275), వెండి నవరత్నాల ఉంగరం(రూ.3,816) మాజీ ఎంపీ తనయుడు, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మండల శ్రీరామమూర్తి(రాంబాబు)–అరుణ దంపతుల చేతుల మీదుగా వీటిని ఆలయ అర్చకుడు పోతుకూచి సత్యనారాయణశాస్త్రికి శుక్రవారం అందజేశారు. తొలుత వెండి ఆభరణాలకు శాస్త్రోక్తంగా పూజాదికాలు జరిపారు. -
కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కా..
చిన్నతనం నుంచి కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కి ఈ స్థాయికి ఎదిగా. తండ్రి ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. ఆయన ప్రోద్బలం, భర్త ప్రోత్సాహంతో జిల్లా అధికారిగా ప్రస్తుతం పనిచేస్తున్నా. ఒత్తిడిలో ధైర్యాన్ని కోల్పోకుండా చిత్తశుద్ధితో పనిచేస్తే ఎప్పటికీ గుర్తింపు ఉంటుంది. చదువు పూర్తయిన అనంతరం సంపాదించాలనే ఉద్దేశంతో ట్యూషన్లు చెప్పా. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక ప్రోత్సాహాలతో ప్రతి మహిళ ఎదగాలి. – వి. పార్వతి, జిల్లా పౌరసరఫరాల అధికారి -
కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
ఏపీ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ ఫెడరేషన్(సీఐటీయూ) డిమాండ్ చేసింది. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్‌లో శుక్రవారం మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం కన్వీనర్ బి.ముత్యాలరావు అధ్యక్షతన జరిగిన ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు తమ డిమాండ్ల సాధనకు ఐక్య ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ – ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గత సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలన్నారు. అనంతరం డీఎంఏ అధికారులు ఫెడరేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. -
ఐదు లక్ష్యాల వైపు అడుగులు..
మహిళలు ముఖ్యంగా ఐదు లక్ష్యాల వైపు అడుగులు వేయాల్సి ఉంది. అవి లింగ వివక్ష లేని సమాజం, మహిళలకు సమాన విద్య–ఉద్యోగావకాశాలు కల్పించటం, మహిళలకు భద్రత–ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారత, స్వతంత్ర నిర్ణయాలు ప్రోత్సహించే దిశగా వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవటం. వీటితో పాటుగా రాజకీయాలు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో మహిళలకు సరైన సమానత్వం అందించటమే లక్ష్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. సమాజంలో మహిళలను బలపరిస్తే ఆమె ఒక కుటుంబాన్ని బలపరుస్తుంది. కుటుంబం బలంగా ఉంటే సమాజం అభివృద్ధి చెందుతుందనే నినాదంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. – గీతాంజలిశర్మ, జిల్లా జాయింట్ కలెక్టర్ -
సమస్యలపై సంఘటితంగా స్పందించాలి
కోనేరుసెంటర్: సమాజంలో మహిళలకు ఎదురవుతున్న సమస్యలపై సంఘటితంగా స్పందించాతని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఉమెన్ ఎంపవర్మెంట్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ ఇంప్లిమెంటేషన్ కమిటీ సభ్యురాలు సూయజ్ రావూరి మాట్లాడుతూ మహిళల కోసం అనేక చట్టాలను ప్రభుత్వాలు రూపొందిస్తున్నాయని, వాటిపై పూర్తిగా అవగాహన పెంచుకోవాలని తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ తేజస్వి పొన్నం మాట్లాడుతూ మహిళలు చేసే కార్యక్రమాలను ప్రోత్సహించడం అలవాటుగా చేసుకోవాలన్నారు. రెక్టర్ ఆచార్య ఎంవీ బసవేశ్వరరావు మాట్లాడుతూ ప్రాచీన కాలం నుంచి దేశంలో మహిళలకు గౌరవం ఇస్తున్న దేశం మనదేశం అన్నారు. ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.ఉష మాట్లాడుతూ చదువు ఒక్కటే మహిళల అభ్యున్నతికి దోహదపడుతుందన్నారు. ఎన్ఎస్ఎస్ విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎం.శ్రావణి మాట్లాడుతూ ఉద్యోగాలు చేసే మహిళలపై ఆయా ప్రదేశాల్లో మానసిక ఒత్తిడికి గురి చేసే పరిస్థితులు ఎక్కువగా ఉంటున్నాయిని, వాటిని అరికట్టే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయకుమారి మాట్లాడుతూ మహిళా ఉద్యోగుల కోసం ప్రభుత్వం రూపొందించిన చట్టాలను కృష్ణా విశ్వవిద్యాలయంలో అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉమెన్ ఎంపవర్మెంట్ విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎల్.సుశీల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలు అంశాలపై నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు ఆచార్యులు, సహాయ ఆచార్యులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవంలో వక్తలు కేయూలో ఘనంగా మహిళా దినోత్సవం -
కొమరవోలులో పర్యటించిన నారా భువనేశ్వరి
కొమరవోలు(పామర్రు): గతంలో తాను దత్తత తీసుకున్న గ్రామమైన పామర్రు మండలం కొమరవోలు గ్రామంలో ఎన్టీఆర్ ట్రస్టు చైర్పర్సన్, సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం పర్యటించారు. గ్రామ పొలిమేరలో ఆమెకు పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఏపీ ఎస్ డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, కూటమి నేతలు ఘనంగా స్వాగతం పలికారు. తొలుత తన తల్లిదండ్రులు ఎన్టీఆర్, బసవ తారకం విగ్రహాలకు ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని శివాలయంలో ఆమె ప్రత్యేక పూజలను నిర్వహించి మొక్కుబడులను చెల్లించుకున్నారు. అనంతరం గ్రామ సచివాలయం వద్ద ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దిరిశం రత్నకుమారి గ్రామ సమస్యలను తెలియజేశారు. గ్రామంలోని శ్మశాన వాటిక అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, గ్రామంలో మూడు కిలోమీటర్ల మేర సీసీ రహదార్లు ఏర్పాటు చేయాలని, ఎస్సీ కాలనీ అభివృద్ధి పర్చాలని కోరారు. గ్రామస్తులు వారి వారి సమస్యలను ఆమెకు తెలియజేశారు. భువనేశ్వరి మాట్లాడుతూ గ్రామ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో కృష్ణాజిల్లా ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ వల్లూరిపల్లి గణేష్, టీడీపీ మండల అధ్యక్షుడు కుదరవల్లి ప్రవీణ్‌చంద్ర, ఆ పార్టీ నేతలు కాట్రగడ్డ రమేష్‌బాబు, గొట్టిపాటి లక్ష్మీదాసు, కాకరాల హరిబాబు, గ్రామ కార్యదర్శి స్నేహలత తదితరులు పాల్గొన్నారు. -
సుబ్రహ్మణ్యుని సేవలో కృష్ణా కలెక్టర్
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట మచిలీపట్నం ఆర్డీవో కె. స్వాతి, స్థానిక ఎస్ఐ సత్యనారాయణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పేలిన ఫ్రిడ్జ్.. వంటింటి సామగ్రి ధ్వంసం మైలవరం: వంటింట్లో ఫ్రిడ్జ్ పేలి సామాన్లు ధ్వంసం అయిన సంఘటన ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పూరగుట్టలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. పూరగుట్ట గ్రామానికి చెందిన మరీదు నిరంజన్‌రావు, రమాదేవి దంపతులు కూలి పనులు చేసుకుని జీవిస్తుంటారు. గురువారం రాత్రి వారు బెడ్రూమ్లో నిద్రపోయారు. శుక్రవారం తెల్లవారుజామున వంట గదిలోని ఫ్రిడ్జ్ ఒక్కసారిగా పేలిపోయింది. ఆ పేలుడు ధాటికి ఇంటి తలుపులు, కిటికీలు విరిగిపోయాయి. వంట గదిలోని సామాన్లు చెల్లాచెదురుగా పడ్డాయి. దంపతులు బెడ్రూమ్లో పడుకుని ఉండటం, వంటగదిలో గ్యాస్ సిలిండర్ ఉన్నా అది పేలకపోవడంతో ఎటువంటి అపాయం జరగలేదు. ఫ్రిడ్జ్ పేలుడు శబ్దానికి చుట్టు పక్కల వారు భయాందోళనకు గురయ్యారు. పేలిన శబ్దం అర కిలోమీటరు వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు. దుర్గమ్మ సన్నిధిలోనీతి అయోగ్ సభ్యుడు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మను నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ విజయ్‌కుమార్ సరస్వత్ శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన విజయ్‌కుమార్ సరస్వత్ను ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలకగా, అర్చకులు ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఏఈవో జంగం శ్రీనివాసరావు విజయ్‌కుమార్ సరస్వత్‌కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు. కృష్ణా డీఆర్డీఏ పీడీగా హరిహరనాథ్ చిలకలపూడి(మచిలీపట్నం): డీఆర్డీఏ పీడీగా వై. హరిహరనాథ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి డీఆర్డీఏ పీడీగా ఆయనను నియమిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన కలెక్టర్ డీకే బాలాజీని ఆయన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అనంతరం బాధ్యతలు స్వీకరించారు. -
భూ రీ సర్వే పరిశీలించిన కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ
మేళ్లమర్తిలంక(మోపిదేవి): రైతులకు ఎలాంటి అనుమానాలు లేకుండా భూ రీ సర్వే జాగ్రత్తగా చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రీ సర్వే అధికారులకు స్పష్టంచేశారు. మండల పరిధిలోని ఉత్తర చిరువోలుంక గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా జరుగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. తొలుత గ్రామ సచివాలయంలో పలు రికార్డులు పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతు విశ్వనాథపల్లి నాగరాజుకు చెందిన సర్వే నంబర్ 56/2లో 1.10 ఎకరాల భూమి ఉండగా 94 సెంట్లు మాత్రమే రెనెన్యూ రికార్డుల్లో అధికారులు చూపుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే రికార్డులు పరిశీలించి రైతు భూమిని జిల్లా కలెక్టరే దగ్గర ఉండి భూ రీ సర్వే చేశారు. ఈ సర్వేలో కూడా 94 సెంట్లు మాత్రమే వచ్చిందని అధికారులు వివరించారు. జిల్లా ఏడీ ఎం జోషిలా, మచిలీపట్నం ఆర్డీవో కె.స్వాతి, ఆర్ఎస్ డీటీ వాణి, మండల సర్వేయర్ రామకృష్ణ, వీఆర్వోలు ప్రశాంత్, మోపిదేవి వెంకటేశ్వరావు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
శాటిలైట్ స్టేషన్‌గా రాయనపాడు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లోని రాయనపాడు రైల్వే స్టేషన్‌కు మహర్దశ పట్టనుంది. ఎన్ఎస్జీ–5 కేటగిరీ కలిగిన ఈ రైల్వే స్టేషన్ దక్షిణ తీర ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే చైన్నె – బల్హార్షా – నాగ్‌పూర్ – న్యూఢిల్లీ లైన్‌లోని గ్రాండ్ ట్రంక్ మార్గంలో ఉంది. నిత్యం 250 రైళ్లు, 1.40 లక్షల మంది ప్రయాణికులతో విజయవాడ రైల్వేస్టేషన్లో అధిక రద్దీ నెలకుంటుండటంతో దీనికి ప్రత్యామ్నాయంగా రాయన పాడు రైల్వే స్టేషన్‌ను శాటిలైట్ స్టేషన్‌గా ఆధునీకరించేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు కొన్ని సాధారణ రైళ్లు మాత్రమే ఆగే ఈ స్టేషన్లో భవిష్యత్తులో అన్ని ప్రధాన రైళ్లు కూడా ఆగనున్నాయి. ముఖ్యంగా నాగ్‌పూర్, సికింద్రాబాద్ మార్గం నుంచి వరంగల్ మీదుగా విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్‌కతా వైపు వెళ్లే అనేక రైళ్లు విజయవాడ రైల్వే స్టేషన్‌కు వెళ్లకుండా రాయనపాడు మీదుగా దారి మళ్లించనున్నారు. దీంతో విజయవాడ ప్రధాన స్టేషన్‌పై చాలావరకు వత్తిడి తగ్గుతుంది. ఈ కారణంగానే రాయనపాడు రైల్వే స్టేషన్‌ను విజయవాడ బైపాస్ స్టేషన్ అని కూడ పిలుస్తున్నారు. శాటిలైట్ స్టేషన్‌గా వేగంగా పనులు... అమృత్ భారత్ స్టేషన్ స్కీం (ఏబీఎస్ఎస్) పథకంలో భాగంగా విజయవాడ ప్రధాన రైల్వే స్టేషన్‌కు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రాయనపాడు రైల్వే స్టేషన్‌ను శాటిలైట్ స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి పర్చేందుకు రైల్వేశాఖ రూ.12.13 కోట్లతో స్టేషన్ పునరాభివృద్ధి పనులు చేపట్టింది. గత ఏడాది ఫిబ్రవరిలో స్టేషన్ పునరాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేయగా ఇప్పటి వరకు 58 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరి కల్లా మిగిలిన పనులను కూడ పూర్తిచేసే దిశగా అధికారులు పనులను వేగవంతం చేశారు. రూ.12.13 కోట్లతో స్టేషన్ ఆధునికీకరణ పనులు అంతర్జాతీయ ప్రమాణాలతో బహుళ అంతస్తుల నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేషన్ ఆధునికీకరణ పనులు... అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆంధ్రప్రదేశ్‌లో 53 స్టేషన్లలో పునరాభివృద్ధి పనులకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే విజయవాడ డివిజన్లో 22 స్టేషన్లు ఈ పథకానికి ఎంపిక చేయగా అందులో రాయపాడు స్టేషన్ ఒకటి. ఈ ప్రాజెక్ట్‌లో స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆధునిక బహుళ అంతస్తుల స్టేషన్ భవన నిర్మాణాలు, పరిసర ప్రాంతాలలో గ్రీనరీ, ఏసీ, నాన్ ఏసీ వెయిటింగ్ హాల్స్, ప్లాట్‌ఫాంల పొడిగింపు, ఎస్కలేటర్లు, లిఫ్ట్‌ల ఏర్పాటు, ఫుట్ బ్రిడ్జి నిర్మాణాలు, రిజర్వేషన్ కౌంటర్లు, ముఖ్యంగా దివ్యాంగ ప్రయాణికుల కోసం ప్రత్యేక ర్యాంపు మార్గాలు, మాడ్యులర్ టాయిలెట్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. పనులను వేగవంతంగా చేపట్టామని, ఇప్పటివరకు 58 శాతం భౌతిక పనులు పూర్తయ్యాయని, ఈ ఏడాది చివరి నాటికి మొత్తం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా పనులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. -
సబ్ జూనియర్ జట్ల ఎంపిక పోటీలు
మొవ్వ: ఉమ్మడి కృష్ణాజిల్లా సబ్ జూనియర్ బాల బాలికల అండర్–16 ఎంపిక పోటీలు శుక్రవారం స్థానిక శ్రీ మండవ కనకయ్య జిల్లా పరిషత్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి. మొత్తం 37 పాఠశాలల నుంచి వచ్చిన 150 మందికి పైగా క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. పోటీలను జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు డాక్టర్ వేమూరి పరిశుద్ధ రాజు, ఎంఈఓ–1 ఎం.శివశంకరరావుతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంఈఓ–2 కె.శ్రీలక్ష్మి, పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు పసుపులేటి శివ కోటేశ్వరరావు, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్లు రామారావు, మండలి మనోహరి పాల్గొన్నారు. -
అబద్ధాల బాబు...చంద్రబాబు
పెడన: ఎన్నికలకు ముందు చేనేత రంగాన్ని పరిరక్షిస్తామని హామీలు గుప్పించిన చంద్రబాబు నేడు అందుకు విరుద్ధంగా నడుచుకుంటూ అబద్ధాల బాబుగా మారారని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టా శివదుర్గారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం శుక్రవారం కృష్ణాజిల్లా పెడనలో జరిగింది. ఈ సమావేశానికి ముందు రాష్ట్ర కమిటీ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శివదుర్గారావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత రంగాన్ని కాపాడాల్సింది పోయి జీఎస్టీ అధికంగా వేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి బడ్జెట్లో నామమాత్రంగా నిధులు కేటాయించిందన్నారు. చేనేత కార్మికులు తీవ్ర అప్పుల సంక్షోభంలో కూరుకుపోయి, ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిని ఆయా ప్రభుత్వాలు కల్పిస్తున్నాయని ధ్వజమెత్తారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ మాట్లాడుతూ బడ్జెట్లో కార్మికులకు రూ.5కోట్లు విడుదల చేసి ఖర్చుపెట్టామని చేనేత శాఖ మంత్రి సబితమ్మ శాసనసభను పక్కదారి పట్టించారని ధ్వజమెత్తారు. ఎక్కడ, ఎవరికి ఖర్చుపెట్టారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. చేతివృత్తుల సమన్వయ కమిటీ కన్వీనర్ మున్నూరు భాస్కరయ్య మాట్లాడుతూ ఒక్క చేనేత రంగాన్ని కాకుండా అన్ని వృత్తుల వారిని నమ్మించి దగా చేసిన ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై త్వరలోనే ఉద్యమం చేస్తామన్నారు. అన్ని వృత్తుల వారిని ఏకతాటిపైకి తీసుకువచ్చి ఉద్యమబాట పట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. సమావేశంలో సంఘం కృష్ణాజిల్లా కార్యదర్శి గోరు రాజు, అధ్యక్షుడు వాసా గంగాధరరావు, నందం చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. కాటికాపరుల సమస్యలపై 11న మహాధర్నా కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): శ్మశానంలో గుంతలు తీసి, శవాలను పూడ్చి, కాల్చే కాటికాపరుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 11న ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ప్రదర్శన, మహాధర్నాను నిర్వహించనున్నామని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి చెప్పారు. విజయవాడ నగరంలోని సున్నపుబట్టీల సెంటర్లో ఉన్న పూలే, అంబేడ్కర్ భవన్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాల్యాద్రి మాట్లాడుతూ 11న రైల్వేస్టేషన్ నుంచి అలంకార్ సెంటర్ వరకు ప్రదర్శన, అనంతరం ధర్నా చౌక్‌లో ధర్నా జరుగుతుందని చెప్పారు. ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ ముద్రించిన కరపత్రాన్ని సంఘం సభ్యులు ఆవిష్కరించారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడిసె నటరాజ్, సహాయ కార్యదర్శి జి.క్రాంతి కుమార్ పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు చేనేత రంగాన్ని పరిరక్షిస్తామని హామీలు బడ్జెట్లో చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసేలా కేటాయింపులు వృత్తిదారులను ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమబాట పడతాం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివదుర్గారావు -
గీత కులాలకు మద్యం షాపులు కేటాయింపు
● మొత్తం 12 షాపులకు 286 దరఖాస్తులు ● ప్రక్రియ నిర్వహించిన జేసీ గీతాంజలిశర్మ చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు జిల్లాలో 10 శాతం మద్యం షాపులను గీత కులాల వారికి కేటాయించాలని సూచించటంతో జిల్లాలో 12 మద్యం షాపులకు ఎకై ్సజ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ ఆధారంగా గౌడ్, గౌడ, శెట్టిబలిజ కులాల వారికి ఈ షాపులను కేటాయించారు. మొత్తం 286 దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున లాటరీ ప్రక్రియ ను గురువారం నిర్వహించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ లాటరీ ప్రక్రియ ద్వారా ఒక్కొక్క షాపునకు మూడు లాటరీలను తీశారు. మొదటిగా వచ్చిన దరఖాస్తుదారునికి షాపు కేటాయిస్తారు. ఒకవేళ మొదటి దరఖాస్తుదారుడు షాపు ఏర్పాటు చేసుకోలేకపోతే లాటరీలో 2 లేక 3వ స్థానాలు వచ్చిన దరఖాస్తుదారులకు కేటాయిస్తారు. ఈ ప్రకారం లాటరీని జేసీ నిర్వహించారు. 12 షాపులు కేటాయింపు.. జిల్లాలోని 12 షాపులకు గెజిట్ నంబర్ ప్రకారం ఆ షాపునకు దరఖాస్తు చేసుకున్న వారిని పిలిచి వారి ముందు లాటరీ పద్ధతి ద్వారా షాపు కేటాయించారు. ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ వై. శ్రీనివాసచౌదరి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జి. గంగాధరరావు, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ భార్గవ్, బీసీ సంక్షేమశాఖాధికారి వి. రమేష్ పాల్గొన్నారు. ప్రభుత్వానికి భారీ ఆదాయం.. లాటరీ ప్రక్రియ ద్వారా 286 దరఖాస్తు రాగా నాన్ రిఫండబుల్ ఫీజు రూ. 5.72 కోట్లు ప్రభుత్వానికి వచ్చాయి. ఎంపికై న దరఖాస్తుదారులు 1/4 వంతుగా రూ. 57 లక్షలు చెల్లించారు. -
అంతర్జాతీయ జలక్రీడలకు నాగాయలంక యువతి
నాగాయలంక: థాయిలాండ్‌లో శుక్రవారం నుంచి నిర్వహించనున్న అంతర్జాతీయ జలక్రీడల్లో ఏపీ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో కెనోయింగ్ కయాకింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున కెనోయ్ స్లాలమ్‌లో పాల్గొనేందుకు నాగాయలంక వాటర్ స్పోర్ట్స్ క్రీడాకారిణి నాగిడి గాయత్రి ఎంపికై ంది. ఇప్పటికే థాయిలాండ్ చేరుకున్న ఈ యువతి స్లాలమ్ ఈవెంట్లో సీనియర్, జూనియర్ విభాగాలలో పాల్గొంటుందని అసోసియేషన్ అధ్యక్షుడు బలరామ్ నాయుడు, అడ్వయిజర్ తిప్పిరెడ్డి శివారెడ్డి ద్వారా గురువారం తెలిసింది. గాయత్రి 2023లో గోవాలో జరిగిన నేషనల్ గేమ్స్‌లో రజత పతకం, ఈ ఏడాది గత నెలలో ఉత్తరాఖండ్ రాష్ట్రం శివపురి ప్రాంతంలోని గంగానదిలో జరిగిన నేషనల్స్‌లో బంగారు పతకం సాధించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో జలక్రీడలకు ఎంపికై న గాయత్రిని ఈ ప్రాంతంలో పలువురు ప్రముఖులు అభినందించారు. పతకాలతో తిరిగిరావాలని అభిలషించారు. కొనసాగుతున్న పశువైద్య విద్యార్థుల రిలే దీక్షలు గన్నవరం: ఉపకార వేతనాలు పెంచాలని స్థానిక ఎన్టీఆర్ పశువైద్య కళాశాల విద్యార్థులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం 33వ రోజుకు చేరుకున్నాయి. కళాశాల ఎదుట బైఠాయించిన పశువైద్య విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. ఈ సంద ర్భంగా వెటర్నరీ విద్యార్థినులు ఐశ్వర్య, మృదు ల, హరిత, కోమలి మాట్లాడుతూ మెడికల్, డెంటల్ విద్యార్థులకు రూ. 25 వేలు వరకు స్టైఫండ్ ఇస్తున్న ప్రభుత్వం వెటర్నరీ విద్యార్థులకు మాత్రం గత పదమూడేళ్లుగా రూ. 7 వేలు చొప్పున చెల్లిస్తుండడం అన్యాయమన్నారు. ఉపకార వేతనాలు పెంచాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకునేవారే కరువయ్యారని వాపోయారు. ఇప్పటికై నా స్పందించి స్టైఫండ్‌ను కనీసం రూ. 15 వేలకు పెంచాలని, ఈ దిశగా ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వచ్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కదం తొక్కిన కోకో రైతులు ఏలూరు (టూటౌన్): కంపెనీలు సిండికేట్‌గా మారి కోకో గింజల ధర తగ్గిస్తున్నాయంటూ ఏలూరులో రైతులు కదం తొక్కారు. చలో ఏలూరు కార్యక్రమంలో భాగంగా రైతులు ర్యాలీ, మహాధర్నా చేపట్టారు. ముందుగా ఫైర్‌స్టేషన్ మీదుగా ఉద్యాన శాఖ డీడీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ధర్నాను ఉద్దేశించి ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కిలోకు రూ.900 ధర ఇప్పించాలని, సిండికేట్‌గా మారిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందుకున్న కలెక్టర్ వెట్రిసెల్వి రైతులతో చర్చలు జరిపి వారి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. ఏలూరుతో పాటు పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల రైతులు భారీగా తరలివచ్చారు. -
ఎవర్గ్రీన్ సైకిల్
● విజయవాడలో సైక్లింగ్‌కు సై అంటున్న యువత ● ఫిట్నెస్ కోసం కొందరు.. స్టైల్ కోసం మరికొందరు ● ఖరీదైన మోడళ్లపై మోజు ● విదేశీ సైకిళ్లకు డిమాండ్ ● ఆరోగ్యదాయకమే అంటున్న నిపుణులు ప్రతిరోజూ సైకిల్ తొక్కుతా.. ప్రతిరోజూ 20 నుంచి 25 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతా. దీని వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటాం. ఎనిమిదేళ్ల కిందట సైకిల్ తొక్కడం ప్రారంభించా. తొలుత ఐదారు కిలో మీటర్లు తొక్కేవాడిని, ఇప్పుడు ఉదయాన్నే 25 కి.మీల వరకూ తొక్కడం ప్రారంభించా. నగరంలో తీవ్ర ట్రాఫిక్‌తో సైకిల్ తొక్కేందుకు అనువైన రోడ్లు లేవు. సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – చలపాక కిరణ్‌కుమార్, వ్యాపారి సైకిల్ ఇష్టంగా వాడతా.. నా చిన్నప్పటి నుంచి సైకిల్‌ను ఇష్టంగా వాడతా. ఇప్పటికీ బాస్కెట్‌బాల్ ఆడేందుకు స్టేడియానికి సైకిల్ పైనే వెళ్తుంటా. నాకు ఇష్టమైన సైకిల్‌ను కొనుగోలు చేశా. వైద్య కళాశాలకు వెళ్లి వస్తూనే ప్రతిరోజూ కొద్ది సమయం సైకిల్‌కు కేటాయిస్తా. సెలవు రోజుల్లో దానిపైనే బయటకు వెళ్తుంటా. మా అమ్మా, నాన్న ఇద్దరూ వైద్యులే. ఖరీదైన బైక్ కంటే నాకు సైకిల్ అంటేనే ఇష్టం. నచ్చిన మోడల్‌ను రూ.40 వేలు పెట్టి కొన్నా. – అక్రమ్ షరీఫ్, వైద్య విద్యార్థి గుడ్ మార్నింగ్.. ఇదొక్క అందమైన మార్నింగ్.. అంటూ సూర్యోదయానికి ముందే ట్రింగ్ ట్రింగ్ మనే సైకిల్ బెల్.. కాసేపైన తర్వాత అదే శబ్దం మరోసారి.. ఇది పాలవాడి సైరన్.. మరికాసేపైన తర్వాత అదే సైకిల్ బెల్.. ఇది మన ఇంట్లోని పిల్లలు స్కూల్‌కి బయలుదేరిన శబ్దం.. ఇలా మనిషి జీవన గమనంలో సైకిల్ అనేది అతి ప్రాముఖ్యమైన, నిత్యావసరమైన సాధనంగా ఉండేది. ముఖ్యంగా సామాన్యుడి వాహనంగా పేరుగడించింది. కాల క్రమంలో మోటారు వాహనాల రాకతో సైకిల్ వన్నె తగ్గినట్లు కనిపించింది. కానీ ఇప్పుడు అదే సైకిల్ శ్రీమంతుడి వాహనంగా రూపాంతరం చెందింది. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ నడవడమో, సైకిల్ తొక్కడమో చేయాల్సిందేనని డాక్టర్లు చెబుతుంటే మళ్లీ ఫ్లాష్ బ్యాక్ ‘చక్రాల్లోకి’ వెళ్లక తప్పడం లేదు. యువత కూడా ఖరీదైన సైకిల్‌ను తొక్కడం ఫ్యాషన్‌గా భావిస్తోంది. సైకిల్ కూడా కాలానుగుణంగా తన రూపురేఖలు మార్చుకొని తాను ‘ఎవర్గ్రీన్’ అని చాటిచెబుతోంది. – లబ్బీపేట(విజయవాడతూర్పు) -
పేదరిక నిర్మూలన కోసం పీ4 సర్వే
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్షిప్ (పీ4) సర్వే నిర్వహించనుందని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేకాధికారులతో సర్వే నిర్వహణపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఈ సర్వే జరుగుతుందని తెలిపారు. ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు తమ పరిధిలోని సచివాలయ సిబ్బందికి సర్వేపై పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని నెరవేర్చేందుకు కృషి చేయాలన్నారు. అట్టడుగున ఉన్న పేద కుటుంబాలకు మద్దతుగా నిలిచేలా ప్రోత్సహిం చటం పీ4 సర్వే లక్ష్యమన్నారు. పేదల అవసరాలను గుర్తించి వారి సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టుల రూపకల్పనకు ఈ సర్వే దోహదపడుతుందన్నారు. ఈ సర్వేలో కచ్చితమైన డేటాను సేకరించాలన్నారు. కుటుంబాలు ప్రస్తుతం అందుకుంటున్న పధకాలపై ఈ సర్వే ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేస్తూ సర్వే ద్వారా సేకరించిన డేటా ఆధారంగా ఇంటి అవసరాలకు అనుగుణంగా సమర్ధవంతమై న ప్రణాళిక రూపకల్పనకు వీలవుతుందని వివరించారు. ఈ సమాచారాన్ని కుటుంబాలకు వివరించి వారికి ఉన్న అపోహలు తొల గించి పది రోజుల్లో సర్వేను పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో సీపీఓ గణేష్‌కృష్ణ, జెడ్పీ డెప్యూటీ సీఈఓ ఆనంద్‌కుమార్, గ్రామ/వార్డు సచివాలయాల జిల్లా సమన్వయకర్త కె.రవికాంత్, బందరు మునిసిపల్ కమిషనర్ బాపిరాజు పాల్గొన్నారు. -
కులాంతర వివాహాలకు రక్షణ కల్పించాలని వినతి
కృష్ణలంక(విజయవాడతూర్పు): కులాంతర వివాహాలకు రక్షణ కల్పించాలని, కన్న బిడ్డలను హత్య చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బి.ప్రభావతి, డి.రమాదేవి గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కుప్పం నియోజకవర్గంలో ప్రేమ వివాహం చేసుకున్నందుకు కన్నకూతురిపై, మధ్యవర్తులుగా వచ్చిన వారిపై యువతి తండ్రి శివప్ప దాడిచేసిన ఘటనపై, అనంతపురం జిల్లాలోని గుంతకల్లులో రామాంజనేయులు తన కుమార్తె భారతి ప్రేమను అంగీకరించలేక ఉరేసి చంపి, ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటనలపై త్వరితగతిన విచారణ పూర్తి చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణాలు ఎందుకు జరుగుతున్నాయో ప్రభుత్వం పరిశీలన చేసి నివారణా చర్యలు చేపట్టాలని కోరారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి, చేసుకోబోయే వారికి రక్షణ, భద్రత, ఆసరా కల్పించాల్సిన ప్రభుత్వాలు మౌనం వహిస్తూ పరో క్షంగా కుల అహంకారులకు మద్దతు పలకడం దారుణమని పేర్కొన్నారు. ప్రేమగా పెంచుకున్న బిడ్డలను హత్య చేసి హంతకులుగా మార్చుతున్న కుల అహంకార ప్రచారాలపై, దళిత, ఆదివాసీలపై జరుగుతున్న దాడులపై, వివక్షతపై చర్యలు తీసుకోవాలని, నిందితులైన రామాంజనేయులు, శివప్పను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. కులాంతర వివాహం చేసుకున్న కౌసల్య, చంద్రశేఖర్‌కు కేరళ ప్రభుత్వం మాదిరిగా రూ.10 లక్షల పారితోషికం, ఇల్లు, ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ప్రేమ వివాహం చేసుకునే వారికి దండల వివాహాన్ని గుర్తించి వివాహ పద్ధతిని సులభతరం చేయాలని కోరారు. కుల ఉన్మాదాలను సమూలంగా అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
వక్ఫ్ భూములు.. ఇక ఫట్!
కోర్టు ఆదేశించినా చర్యలు శూన్యం ● ఎన్నికల కోడ్ ముగిసినా వేలం నిర్వహణలో జాప్యం ● భూముల్లో అక్రమంగా సాగు చేస్తున్న ‘పచ్చ’నేతలు ● తాజాగా ఏపీఐఐసీకి కట్టబెట్టేందుకు ప్రభుత్వం పావులు పెనమలూరు: అత్యంత విలువైన వక్ఫ్ భూములు పచ్చనేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. భూములకు కౌలు వేలం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించినా.. నేటికీ అధికారులు చర్యలు తీసుకోలేదు. తాజాగా వక్ఫ్ భూములు ఏపీఐఐసీకి కట్టపెట్టడానికి ప్రభుత్వం సైతం కన్నేయటంతో అత్యంత విలువైన వక్ఫ్ భూములు అన్యాక్రాంతం అయిపోతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదీ విషయం.. కొండపల్లి ఖాజీ సర్వీసుకు చెందిన వక్ఫ్ భూములు తాడిగడప, పెదపులిపాక గ్రామాల్లో ఉన్నాయి. తాడిగడపలో ఆర్ఎస్ నంబర్ 79,173,179లలో 30.04 ఎకరాలు, పెదపులిపాకలో ఆర్ఎస్ నంబర్ 87లో 12.82ఎకరాల భూమి ఉంది. బహిరంగ మార్కెట్లో వీటి ధర రూ. 350 కోట్లకు పైగా పలుకుతుంది. గత కొద్ది సంవత్సరాలుగా ఒక వ్యక్తి చేతిలో ఈ భూములు ఉండటంతో ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. దీంతో వక్ఫ్ అధికారుల్లో కదలిక వచ్చింది. వక్ఫ్ భూములు సాగు కౌలు వేలం నిర్వహించటానికి జిల్లా అధికారుల దృష్టికి జిల్లా ఇన్స్పెక్టర్ ఆడిట్ వక్ఫ్ తీసుకువెళ్లారు. వేలంనకు ఆదేశాలు.. కాగా వక్ఫ్ భూములకు వేలంపాట నిర్వహించటానికి మండల తహసీల్దార్ నోటీసులు ఇచ్చారు. జనవరి 31వ తేదీన వేలంపాట నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ లోగా భూముల్లో ఉన్న వ్యక్తి వేలం ఆపటానికి హైకోర్టును ఆశ్రయించగా కోర్టు సైతం వేలం నిర్వహించాలని ఆదేశించింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సాకుతో అధికారులు వేలం వాయిదా వేశారు. తెరవెనుక రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వేలం వాయిదా పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వక్ఫ్ భూముల్లో అక్రమంగా సాగు.. కాగా కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా పచ్చ నేతలు కొందరు వక్ఫ్ భూముల్లోకి ప్రవేశించి అక్రమ సాగు చేపట్టారు. దీనిపై జిల్లా ఇన్స్పెక్టర్ ఆడిటర్ వక్ఫ్ రాత పూర్వకంగా రెవెన్యూ అధికారులకు, పెనమలూరు పోలీసులకు 15 మందిపై జనవరి 25వ తేదీన ఫిర్యాదు చేశారు. అయితే జిల్లా అధికారులు కాని, పోలీసులు కాని ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోలేదు. హైకోర్టు ఆదేశాలు కాని, ఎన్నికల కోడ్ కాని ఆక్రమణదారులను అడ్డు రాలేదు. వక్ఫ్ భూముల్లో ఆక్రమణదారులు చట్ట విరుద్ధంగా సాగు చేస్తున్నారు. నేటికీ ఆక్రమణదారులపై అధికారులు చర్యలు తీసుకోకపోవటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక పెద్ద ఎత్తున సొమ్ము చేతులు మారిందని ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్ ముగిసినా వేలంపాటకు చర్యలు ఏవని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెరపైకి ఏపీఐఐసీ.. పచ్చనేతలతో పాటు, ప్రభుత్వం కూడా వక్ఫ్ భూములపై కన్నేసినట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు పంటసాగు పై వేలంపాట వేయాల్సి ఉండగా నేటికీ అది జరగలేదు. పైగా అత్యంత విలువైన వక్ఫ్ భూములను దీర్గకాలం లీజుపై ఏపీఐఐసీకి ధారాదత్తం చేయటానికి అఽధికారులు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఒక పక్క పచ్చగద్దలు వక్ఫ్ భూమిలో అక్రమంగా సాగు చేస్తుంటే, మరో పక్క ఏపీఐఐసీ పేరుతో విలువైన వక్ఫ్ భూములకు ఎసరుపెట్టే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాలు వెంటనే అమలు చేయాలి వక్ప్ భూములకు బహిరంగ కౌలు వేంపాట నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు వెంటనే అమలు చేయాలని ముస్లిం మైనారిటీ నేతలు కోరుతున్నారు. అలాగే ఏపీఐఐసీకి వక్ఫ్ భూములు ఇవ్వాలని వచ్చిన ప్రతిపాదన సరైంది కాదని ఖండిస్తున్నారు. వక్ఫ్ భూములు పూర్తిగా వక్ఫ్ ఆధీనంలో ఉండాలని, భూములపై వచ్చే ఆదాయం కేవలం ముస్లిం మైనారిటీల సంక్షేమానికే ఉపయోగించాలని కోరుతున్నారు. వక్ఫ్ భూములపై వచ్చే ఆదాయంతో వక్ఫ్ బోర్డు ఆర్థికంగా బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. వక్ఫ్ అధికారులు భూములు ఆక్రమించిన వారిపై కోర్టు ధిక్కార కేసు వేయాలని సూచిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం చిత్తశుద్ధితో వక్ఫ్ భూములకు కౌలు వేలం నిర్వహించి పచ్చ నేతల నుంచి భూములు కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.అత్యంత విలువైన వక్ఫ్ భూముల పరిస్థితి నేడు ప్రశ్నార్థకంగా మారింది. -
ఇదీ పెడల్ పవర్..
● ప్రతిరోజూ సైకిల్ తొక్కడం వల్ల క్యాలరీలు ఖర్చు అవడంతో బరువును నియంత్రించుకోవచ్చు. ● గుండె ఆరోగ్యం మెరుగు పడటంతో పాటు, రక్తప్రసరణ మెరుగవుతుందని సైంటిఫిక్‌గా నిర్ధారణ అయింది. ● రన్నింగ్ చేయడం కంటే సైకిల్ తొక్కడం వల్ల కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ● స్ట్రెస్ అండ్ యాంగ్జయిటీ నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ● ఎముకలు పటిష్టంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. ● మోటారు వాహనాల వినియోగం తగ్గించి, సైకిల్‌ను వినియోగిస్తే పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుంది. ఇది కూడా ఓ కారణమే.. నగర వాసుల్లో ద్విచక్ర వాహనాలు వాడే కొందరు సైకిల్ తొక్కుతూ కనిపిస్తున్నారు. పెరిగిన పెట్రోల్, లైసెన్స్ ఇతర పత్రాలు తనిఖీలు ముమ్మరం చేసి, భారీగా జరిమానాలు విధిస్తుండటం కూడా సైకిళ్ల వైపు మరలడానికి ఒక కారణంగా కనిపిస్తోంది. -
విజయవాడ సమగ్రాభివృద్ధికి చర్యలు
ఎంపీ కేశినేని శివనాథ్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ నగర సమగ్రాభివృద్ధికి అవసరమైన సవివర ప్రాజెక్టుల నివేదికలు రూపొందించేందుకు అధికారులు కృషి చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు అన్నారు. గురువారం కలెక్టరేట్లో రహదారులు, భవనాలు విజయవాడ నగరపాలక సంస్థ, రెవెన్యూ శాఖల అధికారులతో ఎంపీ సమావేశం నిర్వహించారు. విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య నియోజకవర్గాల పరిధిలో భవిష్యత్‌లో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. నగరంలో భవిష్యత్‌లో ఎలాంటి ట్రాఫిక్ సమస్య ఎదురుకాకుండా ఏర్పాటు చేయాల్సిన పార్కింగ్ స్థలాలు, వంతెనలు, జంక్షన్ల అభి వృద్ధి, ప్రత్యామ్నాయ రహదారులు, రహదారుల అనుసంధానం తదితరాలపైనా చర్చించారు. రివర్ బండ్ సుందరీకరణ, హిల్స్ రెయిలింగ్, కాళేశ్వరరావు మార్కెట్ జంక్షన్ సుందరీకరణ, గాంధీ హిల్ అభివృద్ధి, కేదారేశ్వరరావుపేట–టన్నెల్ రహదారి విస్తరణ, చిట్టినగర్ జంక్షన్ సుందరీకరణ, వాటర్ ఫౌంటేన్‌తో సితార జంక్షన్ సుందరీకరణ, టన్నెల్ – గొల్లపూడి 200 అడుగుల రహదారి సుందరీకరణ, కృష్ణలంక కట్ట సుందరీకరణ, వాక్‌వేలు తదితరాలపై సమావేశంలో చర్చించారు. ఈ అంశాలకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి.. యుద్ధ ప్రాతిపదికన ప్రతిపాదనలు, అంచనాలు, డీపీఆర్‌లు సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. విపత్తు నిర్వహణ ప్రణాళికలో భాగంగా మూడు నియోజకవర్గాల పరిధిలో సైక్లోన్ సెంటర్ల ఏర్పాటు చేయాలన్నారు. విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, వీఎంసీ సూపరింటెంటింగ్ ఇంజనీర్ (ప్రాజెక్టులు) సి.సత్యకుమారి తదితరులు పాల్గొన్నారు. -
సైకిల్ అమ్మకాలు పెరిగాయి..
గతంలో కంటే ప్రస్తుతం సైకిల్ విక్రయాలు పెరిగాయి. యువత ఎక్కువగా ఆధునిక మోడల్స్‌పై ఆసక్తి చూపుతున్నారు. మా వద్ద చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకూ అన్ని వయస్సుల వారికి సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 6 వేల నుంచి రూ.6 లక్షల విలువ చేసే స్వ దేశీ, విదేశీ సైకిళ్లు 130కి పైగా మోడళ్లు అందుబాటులో ఉంచాం. యూత్ తమ కిష్టమైన మోడల్‌ను ముందుగానే ఎంచుకొని స్టోర్‌కు వస్తున్నారు. – బీఎస్ కిరణ్, పెడల్ జోన్ స్టోర్, విజయవాడ -
విజయవంతం చేద్దాం
తిరుపతమ్మ చిన్న తిరునాళ్లను పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మవారి ఆలయంలో చిన్న తిరునాళ్లను అందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని నందిగామ డివిజన్ ఆర్డీఓ కె. బాలకృష్ణ ఆదేశించారు. మార్చి 14 నుంచి 18 వరకు ఐదు రోజుల పాటు జరిగే తిరునాళ్ల ఉత్సవాలకు సంబంధించి గురువారం ఆలయ బేడా మండపంలో అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సమర్థంగా పనిచేయాలన్నారు. తిరునాళ్ల ఉత్సవాలు జరిగే ఐదు రోజులు పారిశుద్ధ్యం, తాగునీటికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మార్చి 17న పుట్టింటి పసుపు–కుంకుమ బండ్లకు విద్యుత్ దీప కాంతులు ఏర్పాటు చేసే సందర్భంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. భక్తులకు అసౌకర్యం లేకుండా ఆలయం వద్ద పలు శాఖల సమాచార కేంద్రాలతో పాటు, తాగునీటి సౌకర్యం, తాత్కాలికంగా బస్టాండ్ల ఏర్పాటు ఉంటుందన్నారు. పుట్టింటి పసుపు కుంకుమ బండ్లకు ప్రభలు 11 అడుగులకు మించి ఉండకూడదన్నారు. సీసీ కెమెరాలు అన్నీ ఒకే చోట పెట్టకుండా గ్రామంలోకి వచ్చే అన్ని దారుల్లో ఏర్పాటు చేయాలని దేవాలయ అధికారులకు సూచించారు. పసుపు బండ్లు వచ్చే దారిలో తాత్కాలిక దుకాణాలు, ఆక్రమణలు ఉండకుండా పంచాయతీ అధికారులు ఇతర శాఖల సహకారంతో చర్యలు తీసుకోవాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు.. ఆలయ చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, ఈఓ బీహెచ్‌వీఎస్‌ఎన్ కిషోర్‌కుమార్ మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా ఐదు రోజుల పాటు ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మునేటిలో భక్తులకు జల్లు స్నానాల ఏర్పాటుతో పాటు మునేరులో తాత్కాలిక కేశఖండనశాల ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ.. నందిగామ ఏసీపీ తిలక్ మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఎటువంటి అవరోధం లేకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం తిరునాళ్ల ఉత్సవాల పోస్టర్‌ను అధికారులు, పాలకవర్గ సభ్యులు ఆవిష్కరించారు. తహసీల్దార్ ఎ. శాంతిలక్ష్మి, ఎంపీడీఓ జి. శ్రీను, ఆలయ ఈఈ ఎల్. రమ, వైద్యాధికారి పి. ఇందిర, జగ్గయ్యపేట సీఐ పి. వెంకటేశ్వర్లు, ఎస్ఐ ఎంఎస్కే అర్జున్, ఇరిగేషన్ జేఈ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సమన్వయ సమావేశంలో ఆర్డీఓ బాలకృష్ణ -
ఇంటర్ గ్రూప్ పరీక్షలు ప్రశాంతం
చిలకలపూడి(మచిలీపట్నం): ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం గ్రూప్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. లెక్కలు, సివిక్స్, బోటనీ పరీక్షలకు 25,319 మంది విద్యార్థులకు 23,808 మంది హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుకు సంబంధించి 963 మందికి 916 మంది విద్యార్థులు హాజరయ్యారు. కేంద్రీయ విద్యాలయం అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం మధురానగర్(విజయవాడసెంట్రల్): కేంద్రీయ విద్యాలయం నంబర్–1 విజయవాడలో 2025 – 2026 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, ఆసక్తి, అర్హత కలిగిన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఎస్. ఆదిశేషు శర్మ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. కేంద్రీయ విద్యాలయంలో ఒకటో తరగతి, బాలవాటిక–3లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొ న్నారు. శుక్రవారం ఉదయం పది గంటల నుంచి 21వ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 31వ తేదీ నాటికి ఆరేళ్లు నిండి ఎనిమిదేళ్ల లోపు ఉండాలని, బాలవాటిక–3లో ప్రవేశాలకు ఐదేళ్లు నిండి ఏడేళ్ల లోపు వయస్సు ఉండాలని స్పష్టంచేశారు. ఆసక్తి కల వారు ఈ నెల 21వ తేదీ రాత్రి పది గంటల్లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల సర్వీస్ నంబర్లు మార్పు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పరిపాలన సౌలభ్యం దిశగా ఈస్‌కోస్ట్ రైల్వే నిర్వహణలో నడుస్తున్న పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల సర్వీసు నంబర్లను మార్పు చేసినట్లు విజయవాడ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. 17488 సర్వీసు నంబర్‌తో నడిచే విశాఖపట్నం – కడప ఎక్స్‌ప్రెస్ ఇక 18521 నంబరుతో నడుస్తుంది. 17487 నంబరు కడప – విశాఖపట్నం రైలు 18522 నంబరుతో, 22701 నంబర్ విశాఖపట్నం – గుంటూరు రైలు 22875 నంబరుతో, 22702 నంబర్ గుంటూరు – విశాఖపట్నం 22876 నంబరుతో, 20896 నంబర్ భువనేశ్వర్ – రామేశ్వరం రైలు 20879 నంబరుతో, 20895 నంబర్ రామేశ్వరం – భువనేశ్వర్ రైలు 20850 నంబరుతో, 12898 నంబర్ భువనేశ్వర్ – పుదుచ్చేరి రైలు 20851 నంబరుతో, 12897 నంబర్ పుదుచ్చేరి – భువనేశ్వర్ రైలు 20852 నంబరుతో, 12830 నంబర్ భువనేశ్వర్ – చైన్నె సెంట్రల్ రైలు 20853 నంబరుతో, 12829 నంబర్ చైన్నె సెంట్రల్ – భువనేశ్వర్ రైలు 20854 నంబరుతో నడవన్నాయి. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ కోరారు. రేపటి నుంచి హెల్త్ వర్సిటీ పురుషుల గేమ్స్ మీట్ గన్నవరం రూరల్: మండలంలోని చిన అవుటపల్లిలో ఉన్న డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఈ నెల ఎనిమిది నుంచి 17వ తేదీ వరకూ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో 26వ పురుషుల ఇంటర్ మెడికల్ కాలేజ్ గేమ్స్ మీట్ జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి.భీమేశ్వర్ గురువారం తెలిపారు. సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమంలో భాగంగా కళాశాల క్రీడా మైదానంలో జరిగే గేమ్స్ మీట్‌ను యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వేమిరెడ్డి రాధికా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు రాజయ్య, కార్యదర్శి లక్ష్మణరావు, డైరెక్టర్ జనరల్ డాక్టర్ సి.నాగేశ్వరరావు, అకాడమీ ప్రతినిధులు, యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ ఇ.త్రిమూర్తి తదితరులు పాల్గొంటారని వివరించారు. -
దేశమంతా ఒకేసారి ఎన్నికలతో అభివృద్ధి
●కేంద్ర మాజీ మంత్రి మురళీధరన్ ●స్టెల్లా కాలేజీ ఆడిటోరియంలో వన్ నేషన్–వన్ ఎలక్షన్‌పై సదస్సు లబ్బీపేట(విజయవాడతూర్పు): వన్ నేషన్ – వన్ ఎలక్షన్ విధానంలో దేశమంతటా అన్ని రకాల ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం ద్వారా దేశాభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత మురళీధరన్ అన్నారు. జమిలి ఎన్నికల వల్ల కలిగే ప్రయోజనాలు దేశంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విజయవాడ స్టెల్లా కళాశాల ఆడిటోరియంలో వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అంశంపై గురువారం జరిగిన సెమినార్లో మురళీ ధరన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికల నిర్వహించాల్సి రావడంతో ఎన్నికల కోడ్ పేరుతో సుమారు మూడు నెలల వరకు ఎలాంటి నిర్ణయాలు, పథకాలు, అభి వృద్ధి పనులు చేపట్టడానికి వీలులేని పరిస్థితులు దేశాభివృద్ధికి అటంకం కలిగిస్తు న్నాయని పేర్కొన్నారు. చాలా రాష్ట్రాల్లో శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలు ఆ తరువాత స్థానిక సంస్థలు ఇలా ఒకదాని తరువాత ఒక ఎన్నికలు జరుగుతూ రాష్ట్ర అభివృద్ధికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. పాఠశాలలో పోలింగ్ బూత్‌లు ఉండటం కారణంగా ఎన్నికల సమయంలో రెండు, మూడు రోజులైనా పాఠశాలలను మూసివేయాల్సిన పరిస్థితి ఉందని, అధికారులకు ఎన్నికల డ్యూటీలతో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇబ్బందులు తప్పడం లేదని పేర్కొన్నారు. తరుచూ ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగటం వల్ల ఖర్చుతో పాటు సమయం వృథా అవుతోందని, అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానం వన్ నేషన్ – వన్ ఎలక్షన్‌తో దేశం అభి వృద్ధి చెందుతుందని కేంద్ర మాజీ మంత్రి మురళీధరన్ అన్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో దేశం ముందుకు వెళ్తోందని, ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలో దేశం ఉందని తెలిపారు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు చేసి పూర్తి స్థాయి విజ్ఞానాన్ని అందించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా కాలేజీ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్న లకు ఆయన సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. సెమినార్ అనంతరం మీడియా ప్రతినిధుల అడి గిన పలు ప్రశ్నలకు మురుళీధరన్ జవాబిస్తూ, వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అన్న అంశంపై పార్లమెంట్లో చర్చ జరుగుతోందన్నారు. 2023 నవంబర్‌లో తెచ్చిన చట్టం ప్రకారం పార్లమెంటు, అసెంబ్లీల్లో నియోజకవర్గాల విభజనపై చర్చ జరగా లన్నారు. 2029 ముందే డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేసేలా కేంద్రం చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. -
పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలి
ఔత్సాహికులకు కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ పిలుపు మచిలీపట్నంటౌన్: పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ పిలుపునిచ్చారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన వారికి రుణాల మంజూరులో బ్యాంకర్లు పూర్తి సహకారం అందించాలని సూచించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న శుభం కన్వెన్షన్ హాల్లో మెగా ఎంఎస్ఎంఈ ఔట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. పరిశ్రమల స్థాపనకు కృష్ణాజిల్లా అనువైన ప్రాంతమని, బ్యాంకర్లు కూడా విరివిగా రుణాలు అందించేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సులభతరమైన ఇండస్ట్రియల్ పాలసీని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనతో ఈ ప్రాంతం మరింత పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపన ద్వారానే అభివృద్ధి చెందాయన్నారు. అతి చిన్న దేశమైన ఇజ్రాయిల్ 1948వ సంవత్సరం నుంచి నేటి వరకు పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ముఖ్యంగా ఏరోనాటికల్ సెక్టార్లో తిరుగులేని ఆధిపత్యం వహిస్తోందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనతో పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా బలోపేతం కావడంతోనే కాకుండా యువతకు విరివిగా ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో దోహదపడతారని కలెక్టర్ బాలాజీ అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రూ.85 కోట్ల రుణాలను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, మహిళా శక్తి సంఘాలకు కలెక్టర్ బాలాజీ అందజేశారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ డెవలప్మెంట్ జీఎం తలశిల కామేశ్వరరావు, ఎస్ఎల్బీసీ కన్వీనర్, జోన్ హెడ్ సి.వి.ఎన్.భాస్కరరావు, మెప్మా పీడీ పి.సాయిబాబు, ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ ఆర్.వెంకట్రావు, యూబీఐ రీజనల్ హెడ్ కె.వెంకట్రావు పాల్గొన్నారు. -
డెప్యూటీ సీఎం గన్నవరం పర్యటన వాయిదా
గన్నవరం: స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చేతుల మీదుగా శుక్రవారం జరగాల్సిన స్వర్ణ పంచా యతీ వెబ్సైట్ ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ఈ మేరకు అధికార వర్గాలు గురువారం ఓ ప్రకటనలో తెలిపాయి. రెండు, మూడు వారాల తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ కార్యక్రమం నిర్వహణకు సంబంధించి పలు ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది మూడు రోజులుగా శ్రమిస్తున్నారు. జాతీయ రహదారి నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వరకు రోడ్డు నిర్మించడంతోపాటు కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. కళాశాల ఆవరణలో స్టేజీ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పర్యటన వాయిదాపడింది. ‘టీబీ ముక్త్ పంచాయతీ’ కమిటీ సమావేశం లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలో టీబీ ముక్త్ పంచాయతీలుగా ఎంపికై న ఇబ్రహీంపట్నం, మూలపాడు, నందిగామ మండలం పల్లగిరి గ్రామాలు కమిటీ సభ్యులు పరిశీలన పూర్తి కాగా, ఆ కమిటీల సమావేశం గురువారం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ మాచర్ల సుహసిని అధ్యక్షతన నగరంలోని తమ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. జిల్లా టీబీ అధికారి డాక్టర్ జె ఉషారాణి, డాక్టర్ కె. శ్రీనివాసరావు , ఐఎంఏ ప్రతినిధి డాక్టర్ విజయ్ కృష్ణ , డీపీసీ దినేష్ చాట్రగడ్డ, లీలా కుమార్, తిరుపతమ్మ పాల్గొన్నారు. రేపు జాతీయ లోక్ అదాలత్ విజయవాడలీగల్: విజయవాడ కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని మండల న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్, రెండో అదనపు జిల్లా జడ్జి ఎ.సత్యానంద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దీర్ఘకాలంగా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్, పరిష్కరించదగిన క్రిమినల్ కేసులను లోక్‌అదాలత్ ద్వారా త్వరితగతిన కక్షిదారులు పరిష్కరించుకునేందుకు ఇదొక చక్కని అవకాశమని సూచించారు. జాతీయ లోక్ అదాలత్ కోసం 12 బెంచ్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం
మల్లాయి చిట్టూరు(ఘంటసాల): విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక ఇల్లు, నాలుగు పశువుల పాకలు, రెండు గడ్డి వాములు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం ఘంట సాల మండలం మల్లాయి చిట్టూరు శివారు మామిడితోట గ్రామంలో గురువారం జరిగింది. మచిలీపట్నం ఏడీఎఫ్‌ఓ బి.నరసింహారావు కథనం మేరకు.. మల్లాయి చిట్టూరు శివారు గ్రామమైన మామిడితోటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎండిన ఆకులకు నింప్పు అంటుకుని మంటలు చెలరేగాయి. సమీపంలోని ఇంటికి ఆ మంటలు వ్యాపించాయి. పక్కనే ఉన్న నాలుగు పశువుల పాకలు, రెండు గడ్డి వాములకు మంటలు అంటుకున్నాయి. గ్రామస్తులు మచిలీపట్నం అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఏడీఎఫ్‌ఓ బి.నరసింహారావు ఆధ్వర్యంలో సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో లోయ కాశీరత్నంనకు చెందిన రెండు పశువుల పాకలు, ఐదు ఎకరాల గడ్డివామి, లోయ చిన్న శ్రీనివాసరావుకు చెందిన ఇల్లు, రెండు ఎకరాల వరిగడ్డివామి, లోయ సుబ్బమ్మ, లోయ బేబీ సరోజినికి చెందిన పశువుల పాకలు బుగ్గిపాలయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.5 లక్షల ఆస్తినష్టం జరిగిందని ఏడీఎఫ్‌ఓ నరసింహారావు తెలిపారు. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేయడంతో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. మంటలు చెల రేగిన వెంటనే పశువులను పాకల నుంచి బయటకు తోలడంతో వాటికి ప్రాణాపాయం తప్పింది. -
భవనంపై నుంచి పడి కార్మికుడు మృతి
పెనమలూరు: మండలంలోని పోరంకిలో నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు కిందకు పడి మృతి చెందాడు. ఈ ఘటనపై పెనమలూరు పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ కథనం మేరకు.. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం మహారాజ్‌గంజ్ జిల్లా మహదేవ గ్రామానికి చెందిన అమిత్‌కుమార్ కొద్ది కాలం క్రితం అదే గ్రామానికి చెందిన విశాల్‌కుమార్ (23), మరి కొందరితో కలిసి పెయింటింగ్ పనులకు పోరంకి వచ్చారు. వారు పోరంకి లోని ఓ నిర్మాణ సంస్థలో ఎనిమిది అంతస్తుల భవనంలో పెయింటింగ్ పని చేస్తున్నారు. మంగళవారం పనులు ముగించుకుని అందరూ అదే భవనంలో మొదటి అంతస్తులో నిద్రపోయారు. అర్ధరాత్రి అమిత్‌కుమార్‌కు మెలకువ వచ్చి చూడగా నిద్రించిన కార్మికుల్లో విశాల్‌కుమార్ కనబడలేదు. దీంతో అందరు నిద్రలేచి అతని కోసం వెతికారు. అయితే విశాల్‌కుమార్ లిఫ్టు కోసం సెల్లార్లో ఏర్పాటు చేసిన గుంతలో రక్తం మడుగులో పడి శవమై కనిపించాడు. అతను అర్ధరాత్రి నిద్రలేచి పై నుంచి లిఫ్టు గుంతలో మూత్రం పోస్తూ ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయాడు. ఆ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నాడని ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అమిత్‌కుమార్ తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు అందటంతో కేసు నమోదు చేశారు. ఉరేసుకుని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య తోట్లవల్లూరు: చెట్టుకు ఉరేసుకుని గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదస్థితిలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని చాగంటిపాడు శివారు కళ్లంవారిపాలెం వద్ద జరిగింది. పోలీసుల కథనం మేరకు.. స్థానిక కృష్ణానది ఆవలి ఒడ్డున ఉన్న ఓ పొలంలోని టేకు చెట్టుకు గుర్తు తెలియన వ్యక్తి బుధవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం అందుకున్న ఎస్ఐ అవినాష్ ఘటనాస్థలాన్ని సందర్శించారు. మృతుడి వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతుడి ఎడమ చేతి మీద డిజైన్, బ్రూస్లీ అని, కుడి చేతి మీద నాయక్, ప్రేమకావాలి, కాజల్, అమ్మ, నాన్న, గంగ అని, ఛాతీపైన పోలమ్మ, కాజల్, బసవమ్మ అని పచ్చబొట్లు ఉన్నాయి. మృతుని ఒంటిపై చొక్కా, టవల్ మాత్రమే ఉన్నాయి. మొక్కజొన్న పొలాల రక్షణకు వినియోగిస్తున్న చీరతో ఉరేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీఆర్ఓ బాలకోటయ్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ అవినాష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలికను వేధిస్తున్న ఇద్దరిపై పోక్సో కేసు కంకిపాడు: బాలికను వేధిస్తున్న ఇద్దరిపై కంకిపాడు పోలీసుస్టేషన్లో పోక్సో చట్టం కింద గురువారం కేసు నమోదైంది. ఎస్ఐ డి.సందీప్ కథనం మేరకు.. మండలంలోని గొడవర్రు గ్రామానికి బాలుడు, మరో వ్యక్తి మేకల రాజశేఖర్ ఆదే గ్రామానికి చెందిన బాలిక వెంట పడి వేధింపులకు గురిచేస్తున్నారు. వారిపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బాలుడు, రాజశేఖర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. ఆర్టీసీను ఢీకొట్టిన ప్యాసింజర్ ఆటో ●ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు ● చిట్టిగూడూరు వద్ద హైవేపై జరిగిన ప్రమాదం గూడూరు: విజయవాడ –మచిలీపట్నం జాతీయ రహదారిపై గూడూరు మండలం చిట్టిగూడూరు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సును ప్యాసింజర్ ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గూడూరు ఎస్ఐ కె.ఎన్.వి.సత్యనారాయణ కథనం మేరకు.. మండలంలోని ఆకుమర్రు గ్రామానికి చెందిన బొల్లా రామ్మోహన రావు(49) ప్యాసింజర్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం విజయవాడ నుంచి ప్యాసింజర్లతో మచిలీపట్నం బయలుదేరాడు. చిట్టిగూడూరు వద్ద పాయింట్లో ఆగిన ఆర్టీసీ బస్సును ఆటో వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జవగా, డ్రైవర్ రామ్మోహనరావు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతిచెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. మల్లవోలుకు చెందిన ప్రత్తిపాటి వెంకటేశ్వరరావు, నాగమణికి తీవ్ర గాయాలవగా విజయవాడ ఆస్పత్రికి తరలించారు. జె.వెంకటేశ్వరరావు, శాంతకుమారి, సుధ మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతుండగా, దుర్గారావు గూడూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేయించుకున్నాడు. రామ్మోహనరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. -
ఆధార్ ప్రామాణికత విధానాన్ని మార్చండి
భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ సంక్షేమ, సామాజికాభివృద్ధి, సంతృప్తికర స్థాయిలను తెలుసుకు నేందుకు వినియోగిస్తున్న ఆధార్ ప్రామాణికత విధానాన్ని మార్చాలని గ్రామ/వార్డ్ సచివాలయ ఉద్యోగుల పంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల అర్లయ్య గురువారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వరుస సర్వేల నిమిత్తం సచివాలయ ఉద్యోగులను ప్రజల ఇళ్లకు పంపి ఆధార్ అథెంటిఫికేషన్ కోసం ఓటీపీ లేదా బయోమెట్రిక్, ఫేషియల్ కోసం అడిగినప్పుడు పదేపదే ఎందుకు ఇన్నిసార్లు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఒక వైపు ఓటీపీలు షేర్ చేయవద్దని వివిధ మాధ్య మాల్లో బ్యాంకులు చెబుతుంటే సచివాలయ ఉద్యోగులు మాత్రం ఇంటింటికి వచ్చి అడిగి ఇబ్బంది పెడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల ద్వారా చేయించే ప్రతి సర్వే గురించి ప్రభుత్వం ముందుగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మాధ్యమాల ద్వారా ప్రతి పౌరునికి తెలిసేలా ప్రచారం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సచివాలయ ఉద్యోగుల పంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు అర్లయ్య -
దుర్గమ్మ సన్నిధిలో సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో బుధవారం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మహా మండపం ఏడో అంతస్తు లోని కళావేదికపై ఆలయ అర్చకులు ఈ వేడుక జరిపించారు. తొలుత అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఉపాలయమైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ కళావేదిక వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. కళావేదికపై ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరింపించారు. నేడు గీత కార్మికులకు వైన్ షాపుల కేటాయింపుగుడ్లవల్లేరు: జిల్లా గీత కార్మికులకు ప్రభుత్వం మంజూరు చేసిన 12 వైన్ షాపుల కేటాయింపునకు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు మచిలీపట్నం కలెక్టరేట్లో డ్రా నిర్వహిస్తామని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జి.గంగాధరరావు బుధవారం తెలిపారు. ఈ షాపులకు 286 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. మచిలీపట్నం కార్పొరేషన్ నుంచి 40, గుడివాడ మునిసిపాలిటీ 32, పెడన మునిసిపాలిటీ 13, తాడిగడప మునిసిపాలిటీ 60, గూడూరు మండలం నుంచి 17, గుడివాడ రూరల్ మండలం 15, పమిడిముక్కల మండలం 30, పెడన మండలం 16, మచిలీపట్నం మండలం 16, కోడూరు మండలం 14, పెదపారుపూడి మండలం 11, బంటుమిల్లి మండలం నుంచి 22 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. దరఖాస్తుదారులు ఉదయం ఎనిమిది గంట లకే వేదిక వద్దకు హాజరు కావాలని ఈఎస్ గంగాధరరావు పేర్కొన్నారు. గంజాయి విక్రేతపై పీడీ యాక్ట్ చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజాయి బ్యాచ్ సభ్యుడు కొండ రమేష్ అలియాస్ చిన్న చిచ్చాపై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు వెస్ట్ ఏసీపీ దుర్గారావు పేర్కొన్నారు. లంబాడీపేటకు చెందిన 22 ఏళ్ల రమేష్‌పై విజయవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో గంజాయి రవాణా, విక్రయాలపై పలు కేసులు నమోదయ్యాయిని పేర్కొన్నారు. కొత్త పేట పోలీస్ స్టేషన్లో రెండు, భవానీపురం పీఎస్‌లో రెండు, జి.కొండూరు పీఎస్, మైలవరం పీఎస్‌లో ఒక్కో కేసు నమోదవగా, దొంగ తనాలు, దారిదోపిడీ వంటి 34 కేసులున్నట్లు పోలీసు రికార్డుల్లో ఉందన్నారు. కొన్ని కేసుల్లో శిక్షలు పడగా, మరి కొన్ని కేసులు విచారణలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం వైజాగ్ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రమేష్‌పై పీడీ యాక్ట్ అమలుతో ఏడాది పాటు బెయిల్ లభించదన్నారు. గంజాయిని పూర్తిగా నిషేధించా లనే భావనతో గంజాయి బ్యాచ్‌పై పీడీ యాక్ట్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 424 మంది గైర్హాజరువన్టౌన్(విజయవాడపశ్చిమ): ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఇంటర్మీడియెట్ పరీక్షలకు బుధవారం 424 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలకు 17 పరీక్ష కేంద్రాలను అధికారులు కేటాయించారు. బుధవారం 2,405 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 1981 మంది హాజరయ్యారు. నగరంలోని బీఎస్ఆర్కే ఎంసీ హైస్కూల్, గాంధీజీ మున్సిపల్ హైస్కూల్, ఏపీఎస్ఆర్ఎం మునిసిపల్ హైస్కూల్ తదితర పరిక్ష కేంద్రాలను ఎన్టీఆర్ జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బా రావు బుధవారం పరిశీలించారు. తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, విజయవాడలోని పలు పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు. 19,200 మంది ఇంటర్ పరీక్షకు హాజరు చిలకలపూడి(మచిలీపట్నం): ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష బుధవారం జరిగింది. ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 19,475 మంది విద్యార్థులు హాజరుకావాలి. 19,200 మంది హాజరైనట్లు ఆర్ఐఓ పి.బి.సాల్మన్‌రాజు తెలిపారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు తొమ్మిది మంది హాజరైనట్లు పేర్కొన్నారు. ఒకేషనల్ విద్యార్థులు 655 మందికి 623 మంది పరీక్ష రాశారు. ఇంగ్లిష్ పరీక్షలో విద్యార్థులు ఇబ్బందు లుపడ్డారు. ప్రశ్న పత్రంలో 8, 13 క్వశ్చన్లు సరిగా కనపడకపోవటంతో ఇన్విజిలేటర్లకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అనంతరం ఇన్విజిలేటర్లు 10 నిమిషాల పాటు సంబంధిత క్వశ్చన్లను విద్యార్థులకు కొన్ని కేంద్రాల్లో చదివి వినిపించటం, కొన్ని కేంద్రాల్లో బోర్డు మీద రాసి వివరించడం చేశారని సమాచారం. -
‘ఉపాధి’ వేతన లక్ష్యాలను చేరుకోవాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం ద్వారా ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో లబ్ధిదారులకు పని కల్పించడం, దినసరి వేతనం రూ.300 అందేలా చూడడంలో నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా చేరుకోవాల్సిందేనని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి డ్వామా అధికారులతో కలిసి ఆయా మండలాల ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి సిబ్బందితో కలెక్టర్ బుధవారం వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం అమలు తీరు, రోజు వారీ సగటు వేతనాలు, గ్రామాల వారీగా వేతనదారుల హాజరు, వారికి అందుతున్న వేతనం తదితరాల్లో పురోగతిని ఈ సంద ర్భంగా కలెక్టర్ లక్ష్మీశ సమీక్షించారు. పథకం ద్వారా వీలైనంత ఎక్కువ మందికి పని కల్పించడంలో పురోగతి చూపాలని సూచించారు. ఈ పథకం కింద చేపట్టేందుకు గ్రామాభివృద్ధి, వ్యక్తిగత, సామాజిక పనులను గుర్తించాలని ఆదేశించారు. వేసవి నేపథ్యంలో ఉదయాన్నే పనులు ప్రారంభించాలని, పని ప్రదేశాల్లో తాగునీరు అందుబాటులో ఉంచేలా చూడా లని ఆదేశించారు. ఉపాధి పనులపై ప్రతివారం జిల్లాస్థాయిలో సమీక్ష చేస్తున్నామని పేర్కొన్నారు. ఎంపీడీఓలు అందరూ తమ మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని, క్షేత్రస్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ ఎ.రాము, గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, సీపీఓ వై.శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
బుడమేరుకు పొంచివున్న కడగండ్లు
అడుగడుగునా నిర్లక్ష్యం ●● డైవర్షన్ కెనాల్ గండ్ల నుంచి ఆగని ఊట ● పంటపొలాల్లో ఉధృతంగా ప్రవహిస్తున్న లీకేజీ నీరు ● ఆధునికీకరణను గాలికొదిలేసిన ప్రభుత్వం ● హెడ్ రెగ్యులేటర్‌కు మరమ్మతులు చేపట్టని వైనం ● సైపన్ల వద్ద ప్రమాదకరంగా మారిన కెనాల్ కట్ట గేట్లకు మరమ్మతులేవీ? వరద విధ్వంసం సమయంలో బడుమేరు ప్రక్షాళన, ఆధునికీకరణ అంటూ మీడియా ముందు గొప్పలు చెప్పిన ప్రభుత్వ పెద్దలు ఆ దిశగా ఒక్క అడుగూ వేయలేదు. కనీసం వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ గేట్లకు మరమ్మతులు చేపట్టలేదు. 11 గేట్లలో మూడు గేట్ల సపోర్టింగ్ రాడ్లు వంకరపోయి పైకి లేపాలన్నా, కిందకి దింపాలన్నా ఇబ్బందిగా మారింది. రెండు గేట్లు పూర్తిగా కిందకి దిగకపోవడంతో పట్టసీమ జలాలు వచ్చినప్పుడు నీరు లీకవ్వకుండా ఇసుక బస్తాలను వేశారు. వరదచ్చి ఆరు నెలలు గడిచినా ఈ గేట్ల మరమ్మతులను గాలికొదిలేయడంతో గేట్ల కింద ఇసుక బస్తాలు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎగువున బుడమేరు గండ్లను పూడ్చేందుకు రూ.29 కోట్ల ఖర్చవుతుందని అధికారులు ప్రభుత్వానికి అంచనాలు పంపినా నిధులు మాత్రం విడుదల కాలేదు. దీంతో మళ్లీ వరద ముప్పు తప్పేలా లేదని బడమేరు పరిసర గ్రామాల ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు.జి.కొండూరు: అసలే పొలాల్లో మట్టి మేటలు. గండ్ల నుంచి ఆగని నీటి ఊట. ఒక పంటకు వరద పోటు. మరో పంటకు నీటి కరువు. వచ్చే ఖరీఫ్‌లో సాగుకు అవకాశం ఉంటుందో లేదో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. బుడమేరు డైవర్షన్ కెనాల్‌కు పడిన గండ్లను తాత్కాలికంగా పూడ్చి చేతులు దులుపుకొంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రే పరిశీలించి డైవర్షన్ కెనాల్ ఆధునికీకరణ చేస్తామంటూ ఇచ్చిన హామీ నీటి మూటగా మిగిలింది. బుడమేరు డైవర్షన్ కెనాల్‌కు పూడ్చిన గండ్ల నుంచి ఊట ఆగడంలేదు. ఊట నీరు పొలాల మీదగా ఉధృతంగా ప్రవహిస్తోంది. బుడమేరు వరద కారణంగా పొలాల్లో మూడు నుంచి ఐదు అడుగుల మేర మట్టి మేటలు వేసింది. ఇప్పుడు గండ్ల నుంచి వస్తున్న నీటి ఊట ఆ పొలాల మీదుగా ఉధృతంగా ప్రవహిస్తోంది. మరో మూడు నెలల్లో ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. ఇప్పుడు ఈ పొలాల్లో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపది కన నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే 50 ఎకరాల వ్యవసాయ భూమి నీటి కుంటలా మారే ప్రమాదం పొంచివుంది. ఊట ఆగడం కష్టమే గత ఏడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు బుడమేరు వరదతో పోటెత్తింది. వరద ఉధృతితో వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణానది వరకు 11.90 కిలోమీటర్లు మేర ఉన్న బుడమేరు డైవర్షర్ కెనాల్‌కు ఎడమ వైపు కట్టకు మూడు చోట్ల, కుడి వైపు కట్టకు ఏడు చోట్ల గండ్లు పడ్డాయి. హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎగువ భాగాన బుడమేరుకు 42 కిలోమీటర్ల మేర 65 వరకు గండ్లు పడ్డాయి. డైవర్షన్ కెనాల్‌కు పడిన గండ్లను మాత్రం మిలటరీ సాయంతో పూడ్చారు. డైవర్షన్ కెనాల్ ఎడమ కట్టకు పడిన మూడు గండ్ల నుంచి నిత్యం నీటి ఊట వస్తూనే ఉంది. వీటీపీఎస్ బ్యాక్ వాటర్ కవులూరు హెడ్ రెగ్యులేటర్ వరకు పోటువేసి ఉండడంతో గండ్లు పూడ్చిన ప్రదేశం నుంచి నీరు లీకై సమీపంలోని పొలాల మీదుగా ప్రవహిస్తూ తారకరామ ఏడమ కాలువలో కలుస్తోంది. గండ్లకు సమీపంలోని 50కి పైగా ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారింది. సైపన్ల వద్ద పొంచి ఉన్న ప్రమాదం బుడమేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి కొండపల్లి శాంతి నగర్ వంతెన వరకు డైవర్షన్ కెనాల్ ఎడమ కట్టకు ఐదు సైపన్‌లు ఉన్నాయి. గత వరదకు కుడి, ఎడమ వైపు కట్టలకు సైపన్‌లు, తూముల వద్దనే ఎక్కవ శాతం గండ్లు పడ్డాయి. సైపన్ల వద్ద గండ్లు పూడ్చేందుకు మట్టిపోసి వదిలేశారు. బలోపేతం చేయకపోవడంతో సాధారణ నీటి ప్రవాహానికే గండ్లు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎడమ కట్టకు పడిన ప్రధాన గండి వద్ద కట్టనైతే బలోపేతం చేశారు కానీ సైపన్ వద్ద తూతూమంత్రంగా పూడ్చి వదిలేశారు. సైపన్ వద్ద మళ్లీ గండి పడే అవకాశం ఉన్నందున కాంక్రీటుతో కట్టను బలోపేతం చేయా లని రైతులు కోరుతున్నారు. సైపన్ వద్ద కట్ట తక్కువ ఎత్తులో వెడల్పుగా లేనందున వ్యవసాయభూములకు ఈ కట్టమీదుగా ట్రాక్టర్లతో రాకపోకలు సాగించే వీలు లేక ఇబ్బంది పడుతున్నామని రైతులు పేర్కొంటున్నారు. -
8 నుంచి ఎన్టీఆర్ జిల్లాలో పీ4 సర్వే
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్షిప్ (పీ4) సర్వేకు రూపకల్పన చేసిందని, ఎన్టీఆర్ జిల్లాలో ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో సర్వే జరుగుతుందని కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. బుధవారం పీ4 సర్వేపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ నెల ఆరు, ఏడు తేదీల్లో మాస్టర్ ట్రైనర్లుగా ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు తమ పరిధిలోని గ్రామ లేదా వార్డు సచివాలయ సిబ్బందికి సర్వేపై పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. టెక్ మాడ్యూల్తో పాటు సర్వే విధానాన్ని క్షుణ్ణంగా వివరించాలన్నారు. పేదరిక నిర్మూలనకు చేపడుతున్న కార్యక్రమాలకు ఈ సర్వే దోహదం చేస్తుందన్నారు. కుటుంబ వివరాలతో పాటు వివిధ సామాజిక, ఆర్థిక పరామితుల కచ్చితమైన సమాచారాన్ని యాప్‌లో పొందుపరచాలన్నారు. కుటుంబాలకు ఏవైనా అపోహలు ఉంటే తొలగించి, సర్వేను పది రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. సీపీఓ వై.శ్రీలత, గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, జిల్లా పరిశ్రమల అధికారి బి.సాంబయ్య పాల్గొన్నారు. -
ఆశ.. నిరాశ
● టీడీపీ నేతలను ఊరిస్తున్న ఎమ్మెల్సీ పదవులు ● ఎమ్మెల్సీ కోసం ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలువురి పోటీ ● చంద్రబాబు, చినబాబు చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు ● సొంత పార్టీలోనే పలువురికి మోకాలడ్డు ● దేవినేని ఉమా ఆశలు ఈసారైనా ఫలించేనా? ఎమ్మెల్సీ హామీకూరలో కరివేపాకులా.. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామనే సంకేతాలు టీడీపీ అధిష్టానం నుంచి ఇంత వరకూ అందలేదని సమాచారం. చివరి క్షణంలోనైనా అవకాశం దక్కుతుందనే భావనలో ఆయన వర్గీయలు ఉన్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వాడుకొని ఎన్నికల తరువాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారిందనే భావనను కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మంత్రిని చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినా ప్రస్తుతం ఆ ఊసే టీడీపీ అధిస్టానం ఎత్తడం లేదని పలువురు స్పష్టంచేస్తున్నారు. ఎన్నికల సమయంలో వాడు కొని కూరలో కరివేపాకులా తీసి వేసినా ఆశ్చర్యం లేదని వారు స్పష్టంచేస్తున్నారు. ఎన్నికల సమయంలో తమకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చాక కనీసం దగ్గరకు కూడా రానివ్వటం లేదని పలువురు వాపోతున్నారు. మొత్తం మీద ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలకు అవకాశం లేనట్టేననే భావన పార్టీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కావడంతో తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. చంద్రబాబు, చినబాబును ప్రసన్నం చేసుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. పార్టీకి కష్ట కాలంలో వెన్నంటి ఉండి పలు పోరాటాలు చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన వారి పరిస్థితి దయనీయంగా మారిందని టీడీపీ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తు న్నాయి. ప్రస్తుతం పలువురు నేతలు చంద్ర బాబును కలిసి ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని వేడుకొంటున్నారు. ఆయన చినబాబును కలవండి అంటూ ఉచిత సలహాలు ఇస్తుండటంతో వారు నివ్వెరపోతున్నారు. చినబాబుతో అయ్యేదేమీ లేదని ఎమ్మెల్సీ పదవులపై ఆశలు వదులుకొంటున్నారు. వారు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ లోలోన రగిలిపోతున్నారు. చినబాబు సీనియర్లను పక్కన పెట్టి తన సొంత టీంను సిద్ధం చేసుకొంటున్నారు. ఇందులో భాగంగా డబ్బు మూటలతో పాటు, తన సొంత కోటరీకే ప్రాధాన్యం ఇస్తున్నా రన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవిపై ఆశల పల్లకీలో ఊరేగుతున్న మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, పార్టీ నాయ కులు బుద్దా వెంకన్న, వంగవీటి రాధాతోపాటు పలువురికి చాన్స్ ఉండదేమోననే భావన టీడీపీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. పాపం..ఉమా టీడీపీలో నేనే నంబరు–2 అనే స్థాయిలో బీరాలు పలికే మాజీ మంత్రి దేవినేని ఉమా పరిస్థితి ప్రస్తుతం పార్టీలో కుడితిలో పడ్డ ఎలుకలా దయనీయంగా మారింది. ఎమ్మెల్సీ పదవి కోసం కాలు కాలిన పిల్లిలా అధిష్టానం చుట్టూ తిరుగుతూ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది. పార్టీలో కొంత మంది ఈ సారీ ఉమాకు అవకాశం లేదనే భావన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు దేవినేని ఉమాకు ఎమ్మెల్సీ పదవి దక్కకుండా టీడీపీ పార్లమెంటు ప్రజాప్రతినిధి, మైలవరం ప్రజాప్రతినిధి గట్టి ప్రయత్నం చేస్తున్నారనే చర్చ టీడీపీలోనే సాగుతోంది. వారు ఇద్దరు చినబాబుకు సన్నిహితంగా ఉండటం ఈ వాదనకు బలం చేకూర్చుతోంది. ఇందులో భాగంగానే వారిద్దరూ ఎమ్మెల్సీ పదవి కోసం నెట్టెం రఘురాం పేరును తెరపైకి తెచ్చి మద్దతు తెలుపుతున్నారు. దేవినేని ఉమాకు అవకాశం దక్కకుండా ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు సమాచారం. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని తమ సొంత సామాజిక వర్గానికే కేటాయించడం కూడా అడ్డంకిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బుద్దాకు మొండి చెయ్యేనా? పేవరు పులిగా పేరొందిన బుద్దా వెంకన్న పరిస్థితి అధిష్టానం వద్ద ఆధ్వానంగా ఉందని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. మాటకు ముందు వైఎస్సార్ సీపీపై ప్రెస్ మీట్లు పెట్టి ఒంటికాలిపై లేస్తే తనకు అవకాశం దక్కుతుందనుకున్న ఆయనకు అధిష్టానం వద్ద అంతసీన్ లేదంటున్నారు. చంద్రబాబు, చినబాబు ఇద్దరూ బుద్దాను పక్కన పెట్టినట్లు పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. దీనికితోడు పార్లమెంటు ప్రజాప్రతినిధితో పాటు, స్థానిక బీజేపీ ప్రజాప్రతినిధి నుంచి ఇతనికి సహకారం పూర్తిగా కొరవడింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవికి ప్రస్తుతం బుద్దా పేరును కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదనే భావనను టీడీపీ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, నాగుల్ మీరా, ఎంకే బేగ్ వంటి పలువురు నేతలు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తుండటం గమ నార్హం. సామాజిక సమీకరణలను తీసుకున్నా బుద్దా వెంకన్నకు మైనస్‌గా మారే అవకాశం ఉందని టీడీపీ నేతలే పేర్కొంటున్నారు. -
యువకుడి దారుణ హత్య
పాత కేసు రాజీ పేరుతో పిలిచి చంపేసినట్లు ఆరోపణలు కాజ(మొవ్వ): మొవ్వ మండలం కాజ గ్రామ శివారు అయినంపూడి డ్రెయిన్‌లో యువకుడి మృతదేహం తేలుతూ కడపడటం బుధవారం కలకలం రేపింది. కూచిపూడి ఎస్ఐ ఎం.సుబ్రహ్మణ్యం కథనం మేరకు.. కాజ గ్రామానికి చెందిన రాజులపాటి వీరవెంకట రాజేష్ (27)కు అదే గ్రామానికి చెందిన జోగి శివ, మంద మధుసూదన్ రెడ్డి, బోళ్ల శ్రీను, తాతా హరి కృష్ణకు గత శివరాత్రి రోజు అన్నసమారాధన సమ యంలో గొడవ జరిగింది. దీనిపై మధుసూదన్ రెడ్డి కూచిపూడి పోలీస్ స్టేషన్లో రాజేష్‌పై కేసు పెట్టారు. ఈ కేసులో రాజీ చేసుకునేందుకు రావాల్సిందిగా హరికృష్ణ ఫోన్ చేసి పిలిపించినట్లు మృతుడైన రాజేష్ తల్లి రామ లక్ష్మి పోలీసులకు వెల్లడించారు. రాజేష్‌ను అతని స్నేహితుడు భరత్‌తో కలిపి హరికృష్ణ ఇంటికి పంపినట్లు చెప్పారు. అక్కడ వీర వెంకట రాజేష్‌పై పథకం ప్రకారం జోగి శివ, మధుసూదన్ రెడ్డి, బోళ్ల శ్రీను, తాతా హరికృష్ణ విచక్షణా రహితంగా కొట్టి హత్య చేసి, గ్రామ శివారులోని అయినంపూడి డ్రెయిన్‌లో పడేసినట్లు ఆరోపించారు. ఘటనా స్థలం పరిశీలన.. గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్, పామర్రు సీఐ వి.సుభాకర్, కూచిపూడి ఎస్ఐ ఎం.సుబ్రహ్మణ్యం, బందరు క్లూస్ టీమ్ బృంద సభ్యులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులకు డీఎస్పీ హామీ ఇచ్చారు. హతుని తల్లి రాజులపాటి రామ లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతునికి తల్లి, చెల్లి ఉన్నారు. -
మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ నెల ఎనిమిదో తేదీన ఘనంగా నిర్వహించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో మహిళా దినోత్సవంపై చర్చించారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. మహిళా సాధికారతను చాటేలా మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలకు తగిన గౌరవం, గుర్తింపు వచ్చేలా సన్మానాలు, ప్రేరణాత్మక అనుభ వాలను పంచుకునే విధంగా చర్చలు తీసుకోవాలని పేర్కొన్నారు. వేడుకల్లో ఆయా శాఖలకు సంబంధించిన స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. బందరు డీఎస్పీ చప్పిడి రాజా, మెప్మా పీడీ పి.సాయిబాబు, మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ బాపి రాజు, డీఎంహెచ్ఓ డాక్టర్ శర్మిష్ట, ఐసీడీఎస్ పీడీ ఎం.ఎన్.రాణి, జిల్లా పరిశ్రమల అధికారి ఆర్.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
ఉద్యోగుల సమస్యలపై అలుపెరగని పోరాటం
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాము పెడన: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర, జిల్లా స్థాయిలో అలుపెరగని పోరాటాలు చేస్తోందని ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు పి.రాము అన్నారు. గుడి వాడ రోడ్డులోని స్థానిక షాదీఖానాలో వార్డు సచివాలయ ఉద్యోగులతో జిల్లా సంఘ నాయకులు సమా వేశమయ్యారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ హోదాలు, శాఖల పరంగా అనేక సంక్షేమ సంఘాలు ఉన్నాయని, వాటన్నింటినీ కలుపుకొని 2010లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏర్పాటయిందన్నారు. ప్రతి ఉద్యోగికి ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు అందించడమే లక్ష్యంగా సంఘం కృషి చేస్తోందన్నారు. కొత్తగా ఏర్పాటు అయిన ప్రభుత్వం రెండేళ్లు గడువు కోరడంతో ఉద్యోగుల సమస్యలపై ఆ సమయం ఇచ్చామన్నారు. సంఘ జిల్లా కార్యదర్శి టి.వి.వి.వి.వర ప్రసాద్ మాట్లాడుతూ వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు సరైన జాబ్‌చార్ట్ లేదన్నారు. అలాగే ఉద్యోగోన్నతులు కూడా లభించని ఉద్యోగాలలో బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని, వీరికి కూడా ఉద్యోగోన్నతి కల్పించాలనే డిమాండ్ ఉందన్నారు. అనంతరం సంఘ నాయకులు ఏపీజీఈఏ డైరీ – 2025ని ఆవిష్కరించారు. జిల్లా నాయకులు సింహాద్రి రాంబాబు, పి.వి.పరమేశ్వరరావు, గొల్లపూడి శ్రీనివాసరావు, కె.లోకేశ్వరరావు, ఎస్.వి. వి.రామారావు, కె.కోటేశ్వరరావు, కె.వి.వి.దుర్గా ప్రసాద్, పెడన ఉద్యోగులు పాల్గొన్నారు. -
వంటా వార్పుతో నిరసన
గుడ్లవల్లేరు: వెటర్నరీ విద్యార్థుల వసతి గృహాలను ప్రభుత్వం మూసివేయటం తగదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సాయికుమార్ అన్నారు. హాస్టళ్ల మూసివేతను నిరసిస్తూ బుధవారం ఉదయం నుంచి పశు వైద్య విద్యార్థులు అందరూ కాలేజీల గేట్ల బయట, రోడ్లపై వంటావార్పుతో నిరసన తెలిపారు. సాయికుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు న్యాయం కోసం పోరాడుతుంటే హాస్టళ్లకు తాళం వేయాలని ప్రభుత్వం ఆదేశాలివ్వడం అన్యాయమన్నారు. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం విద్యార్థులు తిరుపతి, ప్రొద్దుటూరు, గన్నవరం, గరివిడి కాలేజీల్లో 32రోజులుగా వైద్య విద్యార్థులతో సమానంగా తమకు కూడా గౌరవ వేతనం ఇవ్వా లని తరగతులను బహిష్కరించి వెటర్నరీ విద్యార్థులు నిరాహార దీక్షలు చేస్తున్నారని పేర్కొన్నారు. చెప్పారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ యాజమాన్యం సమస్యను పరిష్కరించకపోగా దీక్షాపరులపై కక్ష పూరితకంగా వ్యవహరిస్తూ హాస్టళ్లను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఏఐ ఎస్ఎఫ్ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. -
కూటమి ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
సాక్షి,విజయవాడ: కూటమి ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పీపీలు, ఏపీపీల నియామకంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నిస్తూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. ఏపీపీఎస్సీ చైర్మన్ ,సభ్యుల నియామకం నిబంధనల ప్రకారం జరగలేదని, కాబట్టి వాటిని వెంటనే రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో పాటు కింది కోర్టులో పీపీలు ,ఏపీపీలు తోపాటు మరికొన్ని పోస్టుల నియామకానికి చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.విచారణలో భాగంగా ఏపీపీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామక నోట్ ఫైళ్లను తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు, పీపీలు,ఏపీపీల నియామకంలో జాప్యంపై ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ స్వయంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. -
సచివాలయానికి ‘పచ్చ’ రంగు
‘ఎదుటివాడికి చెప్పేందుకే నీతులు’ అన్నట్టు... వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పంచాయతీలకు, సచివాలయాలకు పార్టీ రంగు వేశారంటూ గగ్గోలుపెట్టిన తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) తాము అధికారంలోకి వచ్చిన తరువాత.. వరుసపెట్టి ప్రభుత్వ భవనాలకు ‘పచ్చ’రంగు పులుముతోంది. తాజాగా కృష్ణాజిల్లా, యనమలకుదురు గ్రామ పంచాయతీ పరిధిలోని పలు సచివాలయాలకు పసుపు రంగులు వేస్తోంది. దీంతో జనాలంతా పై విధంగా విమర్శిస్తున్నారు.– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడనాన్నా... సాధించా..!గుంటూరు వైద్య కళాశాల గ్రాడ్యుయేషన్ డే (Graduation Day) వేడుకలు మంగళవారం గుంటూరు వైద్య కళాశాలలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్డి.ఎస్.వి.ఎల్. నరసింహం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు ఎంబీబీఎస్ డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. ఓ విద్యార్థి డిగ్రీ సాధించిన క్రమంలో తన ఉత్సాహాన్ని తండ్రితో ఈ విధంగా పంచుకుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరుఆకర్షిస్తున్న అడుగు ఎత్తు పుంగనూరు గిత్త దూడ పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం పట్టణం, గునుపూడిలోని పురోహితుడు వేలూరి రామకృష్ణ గోశాలలో నందిని అనే ఆవుకు అడుగు ఎత్తు ఉన్న పుంగనూరు గిత్త దూడ పుట్టింది. ఒక్క అడుగు ఎత్తుతో చూడముచ్చటగా కనిపిస్తోంది. సాధారణంగా పుంగనూరు ఆవు ఎత్తు సుమారు 1.5 నుంచి 3 అడుగుల మధ్య ఉంటుంది. ప్రపంచంలోనే అతి చిన్న ఆవుగా పుంగనూరు ఆవు గుర్తింపు పొందింది. – భీమవరం (ప్రకాశంచౌక్) నేలపై నింగి నీలిముద్ర పరిశీలించి చూస్తే ప్రకృతిలో ప్రతిదీ ఓ సుందర దృశ్యమే. మండుటెండలో ఈ నీలినీడ చూపరులను ఆకట్టుకుంది. కడప నగరంలోని చెమ్ముమియాపేట–రాయచోటి వంతెనపై మంగళవారం మధ్యాహ్నం ఈ నీలి నీడలను సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్ కడపవేసవితాపం.. వీటితో దూరం వేసవి వచ్చిందంటే రోడ్లపై ఎక్కడికక్కడ పుచ్చకాయలు కుప్పలుపోసి అమ్ముతుంటారు. వేసవితాపం నుంచి సేదతీరేందుకు ప్రజలు కూడా వీటినే ఎక్కువగా తీసుకుంటారు. నెల్లూరు మినీ బైపాస్‌లో అమ్మకం కోసం పెట్టిన పసుపు రంగు పుచ్చకాయలను సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరుపిలవని అతిథి విరిసిన పూలపైకి పిలవని అతిథిగా వచ్చి ఊటలూరే మకరందాన్ని ఒడుపుగా సేకరిస్తుంది తేనెటీగ. ఇలా మైళ్లకొద్ది ప్రయాణించి సేకరించిన మకరందాన్ని తేనెపట్టులో భద్రపరుస్తుంది. గుంటూరు జిల్లా ఈపూరు సమీపంలో తేనెటీగ (Honey Bee) పూల నుంచి మకరందాన్ని సేకరిస్తున్న దృశ్యాన్ని సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు -
విధులను బాధ్యతగా నిర్వర్తించండి
కోనేరుసెంటర్: పోలీసులు యూనిఫాంను అధికారంలా కాకుండా బాధ్యతగా భావించి విధులను నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు అన్నారు. ఎస్ఐలుగా శిక్షణ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించిన 21 మంది సబ్ ఇన్స్పెక్టర్లు మంగళవారం ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడమే తమ బాధ్యతగా భావించాలన్నారు. సమాజంలో చెడును అరికట్టేలా పని చేయాలని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించేందుకు కృషి చేయాలన్నారు. విధుల్లో ఎలాంటి రిమార్కులు లేకుండా సత్ప్రవర్తనతో మెలుగుతూ ప్రజల మన్ననలు పొందేందుకు ప్రయత్నించాలన్నారు. విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా, నిజాయతీగా వ్యవహరిస్తూ ప్రజలకు సేవలు అందించాలన్నారు. ప్రజల్లో పోలీసుల పట్ల విశ్వాసం పెరిగేలా పనిచేయాలన్నారు. నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ కేసుల దర్యాప్తును పూర్తిచేయాలన్నారు. శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని విధి నిర్వహణలో అమలుపరుస్తూ పోలీస్ శాఖకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. బాధితులతో మర్యాదపూర్వకంగా మసులుకోవడం, వారి సమస్యలను సానుకూలంగా ఆలకించడం, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం ద్వారా పోలీసుల పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగేందుకు మరింత కృషి చేయాలన్నారు. చట్టాలను అమలు చేసే విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. కేసు దర్యాప్తులకు సంబంధించి ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గరాదన్నారు. శిక్షణ పూర్తి చేసుకుని జిల్లాకు వచ్చిన 21 మంది పీఎస్ఐలను ఆయన అభినందించారు. శిక్షణ పూర్తి చేసుకుని ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రొబేషనరీ ఎస్ఐలు పీఎస్ఐలను అభినందించి దిశానిర్దేశం చేసిన ఎస్పీ -
పది విద్యార్థులకు వాట్సాప్ ద్వారా హాల్‌టికెట్
చిలకలపూడి(మచిలీపట్నం): ఈనెల 17న ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్లను వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు డీఈవో పీవీజే రామారావు మంగళవారం తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మొట్టమొదటిసారిగా ఇటు వంటి అవకాశాన్ని కల్పించామన్నారు. విద్యార్థులు సెల్‌ఫోన్ ద్వారా 9552300009 నంబరుకు హాయ్ అనే సందేశాన్ని పంపితే సేవను ఎంచుకోండి అని వస్తుందన్నారు. దానిపై క్లిక్ చేసి ఎడ్యుకేషన్ సర్వీస్ లేదా విద్యాసేవలు ఎంచుకోండని వస్తుందన్నారు. ఎస్ఎస్సీ హాల్‌టికెట్ అని నమోదు చేసి అప్లికేషన్ నంబరు, విద్యార్థి గుర్తింపు నంబరు, డేట్ ఆఫ్ బర్త్ను నమోదు చేసి స్ట్రీమ్‌ను సెలక్ట్ చేయాలన్నారు. అనంతరం కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే హాల్‌టికెట్ మీ వాట్సాప్‌కు వస్తుందన్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు డౌన్లోడ్ అయిన హాల్‌టికెట్‌లో పేరు, పుట్టినతేదీ, మీడియం, ఫొటోగ్రాఫ్, సంతకం మొదలైన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలన్నారు. విద్యార్థుల వివరాల్లో ఏదైనా మార్పు ఉంటే వెంటనే ప్రధానోపాధ్యాయుడు డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కు మెయిల్ ద్వారా సమాచారం పంపాల్సి ఉందన్నారు. -
ఆలపాటి గెలుపు
సాక్షిప్రతినిధి,గుంటూరు: కృష్ణా–గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు. మొత్తం తొమ్మిది రౌండ్ల కౌంటింగ్ జరగగా మొత్తం పోలైన ఓట్లు 2,41,774కి గాను 2,14,865 ఓట్లు చెల్లబాటయ్యాయి. 26,909 ఓట్లు చెల్లలేదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 1,45,057 ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణ రావుకు 62,737 ఓట్లు వచ్చాయి. దీంతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 82,320 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఈ విజయం దక్కించుకున్నారు. మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో ఉండగా మిగిలిన వారెవరూ కనీస పోటీ ఇవ్వలేదు. మూడోస్థానంలో ఉన్న అన్నవరపు ఆనందకిషోర్కు 860 ఓట్లు దక్కగా గౌతు కట్ల అంకమ్మరావుకు అత్యల్పంగా 26 ఓట్లు దక్కాయి. మంగళవారం గుంటూరు కలెక్టర్ చాంబర్లో కృష్ణా, గుంటూరు పట్టభధ్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, గుంటూరు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు ధ్రువీకరణ పత్రం అందించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ మల్లేశ్వరి పాల్గొన్నారు. దొంగఓట్లు, రిగ్గింగ్‌తో గెలిచారు ఈ ఎన్నికల్లో దొంగ ఓట్లు, బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్‌లతో అధికార పార్టీ గెలిచిందని పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఆరోపించారు. ఫలితాల వెల్లడి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలను రాజకీయం చేసిందని, తనపై ప్రత్యర్థులు దుష్ప్రచారం చేశారని, ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాల మధ్య చీలిక తెచ్చారని, రూ.కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. అనేక చోట్ల ఎన్నికల రోజు, దొంగ ఓట్లు, అక్రమాలు చోటుచేసుకున్నాయని, దీనికి అధికార యంత్రాంగం కూడా సహకరించిందని ధ్వజమెత్తారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు అనేక సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగ యువత, రైతులు పలు ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్ట్, అవుట్ – సోర్సింగ్, అనేక రంగాల్లో పనిచేస్తున్న చిరు ఉద్యోగులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటిపై పోరాటాలను కొనసాగిస్తానని కేఎస్ లక్ష్మణరావు ప్రకటించారు. 40శాతం మంది తొలిసారి ఓటర్లు ఎన్నికల్లో గెలుపొందిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో 40 శాతం మంది తొలిసారి ఓటు హక్కును ఉపయోగించుకున్నారని చెప్పారు. తనపై వ్యతిరేక ప్రచారం చేసినా ఓటర్లు గెలిపించారని పేర్కొన్నారు. సమస్యలపై శాసనమండలిలో గళం విప్పుతానని వివరించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే మ్యాజిక్ ఫిగర్ 82, 390 ఓట్ల మెజారిటీ... అనైతికంగా గెలిచారంటున్న పీడీఎఫ్ ప్రజలు కూటమికే పట్టం కట్టారన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ -
సరుకు విక్రయించిన తర్వాత మూసివేశాం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్)/కంచికచర్ల: కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. హామీల మాట అటుంచి మహిళలు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఏర్పాటు చేసిన మహిళా మార్ట్ల మూసివేతకు కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారు. ఇతర వ్యాపారుల ప్రయోజనాల కోసం లాభాల్లో నడిచే చేయూత మార్ట్లను మూసివేయాలని వత్తిళ్లు తెస్తున్నారు. ఆడిట్ అధికారులపై వత్తిడి తేవడమే కాకుండా చేయూత మార్ట్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేయూత మహిళా మార్ట్‌లకు రాజకీయ గ్రహణం పట్టింది. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసి, వాటి సభ్యులకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేయూత మహిళా మార్ట్లను ఏర్పాటు చేసింది. స్వయం సహాయక సంఘాలలోని ఒక్కో సభ్యురాలి వద్ద నుంచి పెట్టుబడిగా రూ.200 వసూలు చేసి ఆ వచ్చిన మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి మహిళా మార్ట్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సరసమైన ధరలకు, నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలని నిర్ణయించింది. మార్ట్‌లో వచ్చే లాభాల్లో స్వయం సహాయక సంఘ సభ్యులకు జీవిత కాలం వాటా దక్కుతుంది. ఇంతటి సదుద్దేశంతో ఎన్టీఆర్ జిల్లాలో కంచికచర్ల, విస్సన్నపేట, కృష్ణాజిల్లాలో పెడన, అవనిగడ్డ మండల కేంద్రాల్లో మహిళా మార్టులు ఏర్పాటు చేశాారు. భవిష్యత్తులో మండలానికో మార్ట్ చొప్పున ఏర్పాటు చేయాలనే సంకల్పంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పనిచేసింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సిబ్బంది, వీఓలు, మార్ట్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల కృషితో మార్ట్లు మాల్స్‌కు దీటుగా ఏర్పాటయ్యాయి. డ్వాక్రా సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను మార్ట్ల ద్వారా విక్రయించేందుకు వెసులుబాటు కల్పించారు. మార్ట్లు ప్రారంభం నాటి నుంచే లాభాల పట్టాయి. ప్రారంభంలో ఒక్కో మార్ట్ రోజుకు రూ.1.50 లక్షల వ్యాపార లావేదేవీలు నిర్వహించాయి. కంచికచర్లలో ఏర్పాటైన చేయూత మార్ట్‌ను ఒడిశా బృందం సందర్శించి సభ్యులను అభినందించింది. స్కోచ్ అవార్డు కూడా దక్కింది. నాడు కళకళ...నేడు వెలవెల కంచికచర్ల పట్టణంలో రూ.28 లక్షల వ్యయంతో మార్ట్ ఏర్పాటు చేశారు. ఫ్లిప్‌కార్ట్, మెట్రో, మాల్గుడి వంటి సంస్థలు, హోల్ సేల్ మార్కెట్ల ద్వారా నాణ్యమైన సరుకు అందుబాటులో ఉంచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మార్ట్లను నిర్వీర్యం చేసే కుట్రలకు కూటమి నేతలు పదును పెట్టారు. వ్యాపారులతో కుమ్మకై ్క మహిళలు నడిపే మార్ట్‌లపై విషం చిమ్మారు. వ్యాపారుల ప్రయోజనం కోసం సభ్యులు ఎవరూ మార్ట్‌లో సరుకులు కొనుగోలు చేయెద్దంటూ ప్రచారం చేశారు. మార్ట్‌ను మూసివేయాలంటూ కొందరు ఉన్నతాధికారులకు లేఖలు సైతం సంధించారు. కంచికచర్ల మండలానికి చెందిన ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు మార్ట్‌ను నిర్వీర్యం చేసే కుట్రలో భాగస్వామి అయ్యాడు. మార్ట్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లను మార్చి కొత్త వారిని నియమించారు. వీరిలో వ్యాపారస్తులు ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం మార్ట్‌లో అవసరమైన సరుకులు కూడా ఇవ్వడం లేదని కొందరు సభ్యులు వాపోతున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కళకళ లాడిన మార్ట్ ఇప్పుడు వెలవెలబోతోంది. పెడనలో ప్రత్యామ్నాయం చూపని వైనం పెడనలో 2023 సెప్టెంబర్ నెలలో అన్న క్యాంటీన్లో మహిళా మార్ట్‌ను ఏర్పాటు చేశారు. రూ.25లక్షల వ్యయంతో మార్ట్‌ను తీర్చిదిద్దారు. మార్టు ఏర్పాటుకు రెండేళ్ల ఒప్పందం చేసుకున్నారు. ఈ మార్ట్ కూడా లాభాల బాటలోనే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంకా ఒప్పంద కాలం పూర్తికానప్పటికీ మార్ట్‌ను తొలగించారు. సభ్యులు వేరే గది అద్దెకు తీసుకుని అప్పటికే నిల్వ ఉన్న సరుకును విక్రయించారు. ఆ తర్వాత దానిని శాశ్వతంగా మూసివేశారు. దానికి ప్రత్యామ్నాయం కూడా చూపలేదు. మూసివేతకు కూటమి నేతల కుట్ర వ్యాపారస్తులతో కుమ్మకై ్క విష ప్రచారం లాభాల బాటలో ఉన్నా మూసివేయించేందుకు వత్తిడి–రవిబాబు, ఏరియా కో ఆర్డినేటర్ పెడనలో ఏర్పాటు చేసిన చేయూత మహిళా మార్ట్ లాభాల్లోనే నడిచింది. కొన్నాళ్ల తర్వాత ఇక్కడ మార్ట్‌ను తొలగించడంతో రూమ్ అద్దెకు తీసుకుని సరుకులు అందులోకి మార్చేశాం. సరుకు నిల్వ మొత్తం అమ్మిన తర్వాత మార్ట్ మూసివేశాం. -
మహిళా మార్ట్‌లకు
మహిళలను లక్షాధికారులను చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉన్న అవకాశాలను కూడా ఊడగొట్టి వారిని రోడ్డుపాలు చేస్తోంది. వాస్తవానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో డ్వాక్రా మహిళలను వ్యాపారవేత్తలుగా మలిచేందుకు చేయూత మహిళా మార్ట్లను ఏర్పాటుచేసింది. కేవలం రూ.200 పెట్టుబడితో ప్రతి డ్వాక్రా మహిళ వ్యాపార భాగస్వామి అయింది. వ్యాపారంలో వచ్చే లాభాల్లో జీవిత కాలం వాటాదారు అయింది. అయితే జగన్ హయాంలో ఏర్పాటుచేసిన మార్ట్లను కొనసాగిస్తే ఆ పేరు ఆయనకే వస్తుందన్న దురాలోచనతో కూటమి ప్రభుత్వం వీటి నిర్వీర్యానికి నడుంకట్టింది. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే పెడనలో మార్ట్‌ను మూసివేయించింది. మిగతా మార్ట్ల మూసివేతకు కుట్రలు పన్నుతోంది. -
భక్తిశ్రద్ధలతో రాహుకాల పూజలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం రాహుకాల పూజలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని నటరాజ స్వామి వారి ఆలయం, సహస్ర కుంకుమార్చన ప్రాంగణంతో పాటు పాత మెట్ల వద్ద భక్తులు రాహుకాల పూజలను నిర్వహించారు. రాహుకాల పూజలకు తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సుమారు గంట పాటు భక్తులు రాహుకాల పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులు సర్వదర్శనంతో పాటు రూ.100 టికెట్ క్యూలైన్లో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.4.07 కోట్లు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు భక్తులు మాఘమాసంలో రికార్డు స్థాయిలో కానుకలు, మొక్కుబడులను సమర్పించారు. భక్తులు హుండీల ద్వారా రూ.4.07 కోట్ల నగదును ఆది దంపతులకు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులను మంగళవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 26 రోజులకు గాను రూ.4,07,39,829 నగదుతో పాటు 700 గ్రాముల బంగారం, 6కిలోల 550 గ్రాముల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈవో కె.రామచంద్రమోహన్ తెలిపారు. ఇక ఈ హుండీ ద్వారా భక్తులు రూ.2,31,386 విరాళాలను దేవస్థానానికి సమర్పించారు. కానుకల లెక్కింపును ఆలయ ఈవో రామచంద్రమోహన్ పర్యవేక్షించగా, డీఈవో రత్నరాజు దేవదాయ శాఖ సిబ్బది, దేవస్థాన సిబ్బంది, వన్‌టౌన్, ఎస్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. రేపటి నుంచి గుడారాల పండగ అమరావతి: ఏటా నిర్వహించే గుడారాల పండగను ఈ ఏడాది గుంటూరు శివారు లోని గోరంట్లలో కాకుండా మండల పరిధిలోని లేమల్లె గ్రామంలో నిర్వహించటానికి అన్ని ఏర్పాట్లనూ పూర్తిచేశామని హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు అబ్రహం చెప్పారు. మంగళవారం లేమల్లెలోని హోసన్నా దయాక్షేత్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఏసన్న తొలుత లేమల్లె గ్రామంలో హోసన్నా మందిరం నిర్మాణం చేసిన ప్రదేశంలో సుమారు 25 ఏళ్ల తర్వాత 48వ గుడారాల పండుగ నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఈనెల 6,7,8,9 తేదీలలో జరిగే ఈ పండగకు విశ్వాసులు తరలిరావాలని కోరారు. ఆర్టీసీ గుంటూరు నుంచి ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నట్టు వెల్లడించారు. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. పోలీసు శాఖ బందోబస్తును పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. రాయలసీమ, భీమవరం, అనకాపల్లి తదితర ప్రాంతాల నుంచి గుంటూరుకు వచ్చే రైళ్లలో 15 ప్రత్యేక కోచ్‌లను గుడారాల పండుగ కోసం ఏర్పాటు చేయడం విశేషమని చెప్పారు. ఐదో తేదీ బుధవారం సాయంత్రం హోసన్నా దయా క్షేత్రంలో కొత్తగా నిర్మించిన చర్చి ప్రారంభోత్సవం జరగనుందని వెల్లడించారు. -
ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతం
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియెట్ పరీక్ష ‘ఇంగ్లిష్’ మంగళవారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 24,901 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 24,393 మంది విద్యార్థులు హాజరయ్యారు. 495 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియెట్ ప్రాంతీయ అధికారి పీబీ సాల్మన్‌రాజు మచిలీపట్నంలోని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఉయ్యూరు, గుడివాడ, మచిలీపట్నం డివిజన్ల పరిధిలో కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని మాల్‌ప్రాక్టీస్ జరగలేదని ఆర్ఐవో తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి మధురానగర్(విజయవాడసెంట్రల్): రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందిన ఘటన గుణదల పీఎస్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రసాదంపాడుకు చెందిన మంత్రవాది సూర్య తేజ తండ్రి మురళీధర్ (62)మంగళవారం ఉదయం ద్విచక్రవాహనంపై విజయవాడ వైపు వస్తున్నారు. పడవల రేవు జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఎదరుగా వస్తున్న మరొక ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. కిందపడిపోయిన మురళీధర్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మురళీధర్ మృతిచెందారు. దీంతో గుణదల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హాకీ జిల్లా జట్టు ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషుల హాకీ పోటీలకు ప్రాతినిధ్యం వహించే జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా హాకీ సంఘం కార్యదర్శి కె.రాజశేఖర్ తెలిపారు. సింగ్‌నగర్‌లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో మంగళవారం ఎంపిక పోటీలను నిర్వహించామని, ఈ పోటీల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన క్రీడాకారులను జట్టుకు ఎంపిక చేశామన్నారు. రాఘవేంద్రరావు, వేణుగోపాల్, ఉపేంద్ర, శివప్రసాద్, ప్రశాంత్, వరప్రసాద్, సురేంద్ర, పౌల్రత్నం, సాయి, పవన్‌కుమార్, దుర్గామల్లేశ్వరరావు, శ్రీనివాసరావు, ప్రభుకుమార్, సందీప్, కృపాసాగర్, ధావన్, మహ్మద్ బాషా, నరసింహ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ నెల ఆరు నుంచి ఎనిమిదో తేదీ వరకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందన్నారు. -
జీవితంలో క్రీడలు భాగం కావాలి
విజయవాడస్పోర్ట్స్: మానసిక సాంత్వన, శారీరక దృఢత్వం కోసం క్రీడలు దోహదపడతాయని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్జీజీవో రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పోటీలను మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగాన్ని ప్రోత్సహిస్తోందని, రెండు శాతం ఉన్న క్రీడల కోటాను మూడు శాతానికి ప్రభుత్వం పెంచిందన్నారు. ప్రతి ఒక్క మహిళా ఉద్యోగి క్రీడల సాధనకు సమయాన్ని కేటాయించి, దైనందిన జీవితంలో ఎదురయ్యే వత్తిడిని జయించాలని సూచించారు. మహిళా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉందన్నారు. ఈ పోటీలను నిర్వహిస్తున్న ఏపీ ఎన్జీవో నాయకులను అభినందించారు. ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కె.వి.శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల నమ్మకం, విశ్వాసాన్ని కాపాడుతుందన్నారు. టగ్ ఆఫ్ వార్, బ్యాడ్మింటన్, లెమన్ అండ్ స్పూన్ తదితర పోటీల్లో మహిళా ఉద్యోగులు తలపడ్డారు. మరో రెండు రోజులపాటు ఈ పోటీలు జరగనున్నాయని ఏపీ ఎన్జీజీవో మహిళా ఉద్యోగుల సంఘం చైర్పర్సన్ వి.నిర్మలకుమారి వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ పి.మాధవి, కమిటీ కన్వీనర్ ఎం.రాజ్యలక్ష్మి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బి.జానకి, రాష్ట్ర కార్యదర్శి బి.తులసిరత్నం, రాష్ట్ర మహిళా విభాగం నాయకులు, క్యాపిటల్ సిటీ బ్రాంచ్ అమరావతి మహిళా నాయకులు పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీల నిర్వహణ అభినందనీయం మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న ఏపీ ఎన్జీజీవో మహిళా ఉద్యోగుల క్రీడా పోటీలను కలెక్టర్ మంగళవారం సందర్శించి, లెమన్ అండ్ స్పూన్ పోటీలను ప్రారంభించారు.మంత్రి రాంప్రసాద్‌రెడ్డి -
మానవతా నాడి ‘పట్టా’లి
గుంటూరు మెడికల్: వైద్యులు రోగుల పట్ల జాలి, దయ కలిగి ఉండాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ డి.ఎస్.వి.ఎల్.నరసింహం అన్నారు. మంగళవారం గుంటూరు వైద్య కళాశాల జింఖానా ఆడిటోరియంలో 74వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు జరిగాయి. వైద్య కళాశాల 2019 బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థులకు డీఎంఈ డాక్టర్ నరసింహం డిగ్రీ పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నరసింహం మాట్లాడుతూ వైద్య రంగంలో మానవతా విలువలకు పెద్ద పీట వేయాలని చెప్పారు. వైద్య రంగంలో రోబోటిక్ టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వచ్చినా హ్యూమన్ టచ్ ఇవ్వలేవని, వైద్యుడికే అది సాధ్యమని పేర్కొన్నారు. రోగిపై సానుభూతి, మానవతా దృక్పథం కలిగి ఉండాలన్నారు.అనంతరం నరసింహంను నిర్వాహకులు సత్కరించారు. మాతృసంస్థ అభివృద్ధికి తోడ్పడండి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ మాట్లాడుతూ గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సహాయ సహకారాలతో రూ.100 కోట్లతో ఎంసీహెచ్ నిర్మాణం జీజీహెచ్‌లో జరుగుతుందని చెప్పారు. 2026 జనవరి నాటికి భవనం అందుబాటులోకి వస్తుందని, ప్రభుత్వం రూ.40 కోట్ల విలువ గల వైద్య పరికరాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. వైద్య కళాశాలలో చదువుకున్నవారంతా వైద్య వృత్తిలో బాగా స్థిరపడిన తరువాత మాతృ సంస్థ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారీ మాట్లాడుతూ రోగుల పట్ల జాలి, దయ కలిగి ఉండాలని, నేడు చాలా మంది వైద్యులు కఠినంగా మారిపోయారని పేర్కొన్నారు. రోబో మాదిరిగా యాంత్రికంగా వైద్యులు మారిపోయారని, వైద్య వృత్తి వ్యాపారంగా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ప్రభాకర్, జింఖానా కో–ఆర్డినేటర్ పి.వి.హనుమంతరావు పాల్గొన్నారు. -
ప్రపంచ పారా అథ్లెటిక్స్‌కు ముగ్గురు రాష్ట్ర క్రీడాకారులు
విజయవాడస్పోర్ట్స్: వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్–2025కు ప్రాతినిధ్యం వహించే భారత జట్టులో ముగ్గురు రాష్ట్ర క్రీడాకారులు చోటు దక్కించుకున్నారని ఏపీ పారా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు జి.కోటేశ్వరరావు, వి.రామస్వామి తెలిపారు. ఎఫ్–40 కేటగిరిలో ఆర్.రవి(అనకాపల్లి), టి–11 కేటగిరిలో కె.లలిత(పార్వతిపురం), టి–35 కేటగిరిలో టి.రాము(శ్రీకాకుళం) ప్రపంచ పోటీలకు అర్హత సాధించారని వెల్లడించారు. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్–2025 పోటీల్లో పాల్గొంటారన్నారు. ప్రపంచ పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులను ఏపీ క్రీడా ప్రాఽథికార సంస్థ(శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు, ఎండీ పి.ఎస్.గిరీష అభినందించారు. టీల్లో రాణించి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. నృసింహుని ఏకాదశ మాలధారణ దీక్ష స్వీకరణ మంగళగిరిటౌన్: మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఎగువ సన్నిధిలోని పానకాలస్వామి వారి ముఖ మండపంలో మంగళవారం భక్తులు నృసింహుని ఏకాదశ మాలధారణ దీక్ష స్వీకరణ మహోత్సవం జరిగింది. దేవస్థానం ప్రధాన అర్చకులు, గురుస్వామి మాల్యవంతం శ్రీనివాసదీక్షితులు భక్తులకు మాలవేసి దీక్ష ఇచ్చారు. స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవా ట్రస్ట్ అధ్యక్షుడు తోట శ్రీనివాసరావు మాలధారణ దీక్ష స్వీకరించే భక్తులకు దీక్షా వస్త్రాలను ఉచితంగా అందజేశారు. అనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు, న్యాయవాది రంగిశెట్టి లక్ష్మి మాట్లాడారు. కార్యక్రమంలో శివారెడ్డి గురుస్వామి, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు గోగినేని వెంకటేశ్వరరావు, రోటరీ క్లబ్ ప్రతినిధి సైదా నాయక్, తదితరులు పాల్గొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 32 మందికి జరిమానా విజయవాడలీగల్: నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 32 మందికి న్యాయస్థానం జరిమానా విధించింది. నగరంలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి నగర పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు వివిధ ప్రాంతాల్లో మద్యం సేవించిన వాహనచోదకులపై 5వ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మంగళవారం ఆరో అదనపు జ్యుడీషియల్ మెట్రోపాలిటన్ న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి లెనిన్ బాబు 8 మందికి ఒక్కొక్కరికి 15వేలు చొప్పున, మిగిలిన 24 మందికి ఒక్కొక్కరికి 10వేలు చొప్పున జరిమానా విధించారు. -
మల్కాపురం, ముచ్చింతాల రిజిస్ట్రేషన్ కొనసాగింపు
జిల్లా రిజిస్ట్రార్ దుర్గాప్రసాద్ జగ్గయ్యపేట అర్బన్: రగామ పంచాయతీ పెండింగ్ సెస్ టీడీ ఎమౌంట్ ఏప్రిల్‌లో విడుదల అవుతుందని, మల్కాపురం, ముచ్చింతాల గ్రామాల రిజిస్ట్రేషన్ కొనసాగుతుందని జిల్లా రిజిస్ట్రార్ పీవీవీ దుర్గాప్రసాద్ అన్నారు. జగ్గయ్యపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మంగళవారం జిల్లా రిజిస్ట్రార్ దుర్గాప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో సుమారు రూ.44 కోట్ల ప్రభుత్వ టార్గెట్‌లో 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి నాటికి 10,788 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌తో సుమారు రూ. 39.17కోట్ల 34 శాతంగా ఉందన్నారు. ప్రస్తుతం రూ.59.18 కోట్ల టార్గెట్ రావాల్సి ఉండగా 2024 ఏప్రిల్ 2025 ఇప్పటి వరకు 8601 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌తో రూ.29.83 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందన్నారు. దీంతో గత ఏడాది కన్నా 1,049 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు తగ్గడమే కాకుండా 18 శాతం ఆదాయం ఈ కార్యాలయం నుంచి తగ్గిందన్నారు. ఇప్పటికే మల్కాపురం, ముచ్చింతాల గ్రామాల రిజిస్ట్రేషన్ కొనసాగడంలేదని మీడియా సమాచారంతో అత్యవసరంగా డీఆర్, డీఐజీతో ఫోన్లో మాట్లాడి వెంటనే తిరిగి రిజిస్ట్రేషన్ కొనసాగించేలా సమస్యను పరిష్కరించారు. జగ్గయ్యపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి నవంబర్ 2023 నుంచి నేటి వరకు రావాల్సిన సెస్ టీడీ ఎమౌంట్ అందక పంచాయతీలు ఇబ్బందులు పడుతున్నాయన్న మీడియా ప్రశ్నలకు.. ఇది కలెక్టర్ దృష్టిలో ఉందని, పంచాయతీ పెండింగ్ ఎమౌంట్‌ను ఏప్రిల్‌లో వారికి చెల్లిస్తామన్నారు. జిల్లాలో ఇప్పటికే క్లర్క్ ఆఫీస్ సబార్డినేటర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఎటువంటి అభ్యంతరం లేని ఓటీఎస్‌కు పట్టాలకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు. త్వరలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో బిల్డర్లతో రిజిస్ట్రేషన్ పెంచడానికి అవగాహన సమావేశం ఏర్పాటుచేస్తామన్నారు. కార్యక్రమంలో సబ్ రిజిస్ట్రార్ సిబ్బంది, బిల్డర్స్ పాల్గొన్నారు. -
అధికారుల నిర్లక్ష్యంతోనే బ్లూ ఫ్లాగ్ హోదా రద్దు
భవానీపురం(విజయవాడపశ్చిమ): అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ హోదా రద్దైందని ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) చైర్మన్ నూకసాని బాలాజీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్లూ ఫ్లాగ్ స్టేటస్‌కు పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందే పసికట్టి అధికారులను హెచ్చరించానని గుర్తు చేశారు. అక్కడ ఉన్న ఏజెన్సీ కాలపరిమితి ముగియడంతో చర్యలు తీసుకోవాలని వైజాగ్ కలెక్టర్‌ను కోరినట్లు చెప్పారు. తన పర్యటన సందర్భంగా అక్కడ పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందే గుర్తించి మినిట్స్ రూపంలో ఏపీటీడీసీ ఎండీ ద్వారా అధికారులకు సర్క్యులేట్ చేయించానని గుర్తు చేశారు. అయినా సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా బ్లూ ఫ్లాగ్ స్టేటస్‌కు ప్రమాదం ఏర్పడే పరిస్థితి దాపురించడం శోచనీయమని పేర్కొన్నారు. ఇకపై నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారుల పెర్ఫామెన్స్ ప్రాతిపదికన త్వరలో అంతర్గత బదిలీలు చేపడతామని పేర్కొన్నారు. ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజి -
వైద్యం వికటించి గర్భిణి మృతి
● ఆందోళన వ్యక్తం చేసిన బంధువులు ● ఆస్పత్రిలో ఫర్నిచర్ ధ్వంసం ● నిండు గర్భిణి మరణిస్తే రేటు కడతారా మచిలీపట్నం టౌన్: వైద్యం వికటించి ఏడు నెలల నిండు గర్భిణి మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రం మచిలీపట్నంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. నగరంలోని రామానాయుడు పేట సోషల్‌క్లబ్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పెడన మండలం జింజేరు గ్రామానికి చెందిన గర్భిణి నాగదుర్గ(24) ఈ ఆస్పత్రిలో వైద్యం పొందుతోంది. ఎప్పటి మాదిరి మంగళవారం ఉదయం వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చారు. పలు పరీక్షలు చేయాలని పేర్కొంటూ రూ.700 కట్టించుకుని మధ్యాహ్నం సమయంలో వైద్యురాలు నాగదుర్గకు ఇంజక్షన్ చేశారు. కొంతసేపటికి ఆమె ఆస్వస్థతకు గురి కావడంతో ఐసీయూలో చికిత్స అందించారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో నాగదుర్గ మరణించిందని వైద్యురాలు పేర్కొనంతో బంధువులు తీవ్ర ఆందోళన చెందారు. వైద్యురాలి నిర్లక్ష్యంతో నాగదుర్గ చనిపోయిందని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఆందోళన వ్యక్తం చేసిన వారు వైద్యురాలి గదిలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. డాక్టర్ చేసిన ఇంజక్షన్ వికటించి నాగదుర్గ చనిపోయిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఓ పక్క నిండుగర్భిణి చనిపోయిందని బాధతో ఉన్న బంధువులను సెటిల్మెంట్ చేసుకుందామని రావాలంటూ వైద్యురాలి భర్త, వైద్యుడితోపాటు మరికొందరు చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బంధువులు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. నిండు గర్భిణి మృతికి కారణమైన ఆస్పత్రిని సీజ్ చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. తమకు ప్రజాప్రతినిధులు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
యూత్ పార్లమెంట్‌ని వినియోగించుకోవాలి
మధురానగర్(విజయవాడసెంట్రల్): యూత పార్లమెంట్ అవకాశాన్ని యువత వినియోగించుకోవాలని ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ వారి ఆదేశాల మేరకు జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ పోటీలను గుంటూరులోని టీజేపీఎస్ కళాశాలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని, మేధాశక్తి ఉపయోగించి ప్రపంచంలో మన దేశం ప్రథమ స్థానంలో ఉండటానికి కృషి చేయాలన్నారు. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి 18 నుంచి 25 ఏళ్లవారు యూత్ పార్లమెంట్ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. పాల్గొనదలచిన వారు ముందుగా మై భారత్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత ఒక్క నిమిషం నిడివి కలిగిన ‘వాట్ డజ్ వికసిత్ భారత్ మీన్ టూ యూ’ అంశం పై వీడియో చేసి మార్చి 9వ తేదీ రాత్రి 11.59 గంటలలోపు అప్లోడ్ చేయాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిని స్క్రీనింగ్ చేసి జిల్లా స్థాయిలో ఎంపిక చేస్తారని తెలిపారు. తర్వాత ఈ ఐదు జిల్లాల నుంచి ఎంపికై న వారికి జిల్లా స్థాయిలో టీజేపీఎస్ కళాశాల, గుంటూరులో 150 విద్యార్థులకు పోటీ ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్.. పేవింగ్ ది వే ఫర్ వికసిత్ భారత్’పై 3 నిముషాలు మాట్లాడాలని సూచించారు. యూనివర్సిటీ ప్రొఫెసర్లు, వివిధ కళాశాలల అధ్యాపకులు, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల ఎన్ఎస్ఎస్ అధికారులు, యూత్ నాయకులు, నెహ్రూ యువ కేంద్రం అధికారులు, ఇతర అధ్యాపకులు, సామాజిక కార్యకర్తలు ఈ పోటీల గురించి యువతకు అవగాహన కలిగించి ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా చూడాలని ఆయన కోరారు. -
వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడండి
చిలకలపూడి(మచిలీపట్నం): రానున్న వేసవిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మంగళవారం గ్రామీణ నీటి సరఫరా, మునిసిపల్, ఇరిగేషన్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవిలో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మచిలీపట్నం, పెడన మునిసిపాలిటీలకు తరకటూరు స్టోరేజీ నుంచి తాగునీరు సరఫరా అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏప్రిల్ నెలలో కాలువలకు నీటిని విడుదల చేసినప్పుడు పూర్తిస్థాయిలో చెరువులను నింపాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో ట్యాంకర్లతో తాగునీటిని అందించాలన్నారు. గుడివాడలోని టిడ్కో గృహ సముదాయాలకు సరఫరా చేస్తున్న నీరు సరిపోవటం లేదని నీటి వనరులను పెంచాల్సిన అవసరం ఉందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా కలెక్టర్ స్పందిస్తూ సమస్య తలెత్తకుండా అదనంగా ట్యాంకర్లతో సరఫరా చేయాలని సూచించారు. సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా అధికారి నటరాజ్, ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి, సీపీవో గణేష్‌కృష్ణ, మునిసిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బాలాజీ -
మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో ప్రవేశాలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఏపీ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యాన విజయవాడ భవానీపురంలో నిర్వహిస్తున్న ఏపీఆర్ఎస్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల 2025–26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎస్. శివకుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతిలో 40 సీట్లు, 6, 7, 8 తరగతుల్లో (బ్యాక్ లాగ్) మిగిలి ఉన్న సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ముస్లిం (బీసీ–ఇ, బీసీ–బీ, బీసీ–సీ (కన్వర్టెడ్ క్రిస్టియన్) విద్యార్థినులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆయా తరగతుల్లో ప్రవేశానికి శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా వరకు ఆసక్తి ఉన్న విద్యార్థినులు ఈ నెల 31వ తేదీలోపు ఆన్లైన్లో htt pr://aprrapcfrr.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయాలని సూచించారు. ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. మృతుడు తాడిగడప వాసిగా గుర్తింపు కంకిపాడు: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి పెనమలూరు మండలం తాడిగడప వాసిగా పోలీసులు తేల్చారు. ఎస్ఐ సందీప్ మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఈనెల 3న కంకిపాడు బైపాస్ సమీపంలో ప్రొద్దుటూరు పరిఽధిలోని శరత్చంద్ర అకాడమి దగ్గర విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి దాటుతున్న వ్యక్తిని ఉయ్యూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఘటనలో మృతి చెందిన వ్యక్తి పెనమలూరు మండలం తాడిగడప శ్రీనగర్‌కు చెందిన సింగంపల్లి సాయి (40)గా నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన కారు ఉయ్యూరులోని ఓ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్దిగా గుర్తించారు. ప్రమాద సమయంలో ప్రిన్సిపాల్ స్వయంగా కారు నడుపుతున్నట్లు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. వృద్ధురాలి హత్య కేసులో జీవిత ఖైదు విజయవాడలీగల్: నగలు కోసం వృద్ధురాలిని హత్యచేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ 7వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి ఎస్.నాగేశ్వరరావు తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళ్తే నవంబరు, 2014లో విజయవాడ గుణదల ప్రాంతంలో మాధురి అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉంది. తోట్లవల్లూరు గ్రామానికి చెందిన కార్పెంటర్ అబ్దుల్ అజీజ్ అనే బుజ్జి ఇంట్లోకి ప్రవేశించి, ఆమె చేతికి ఉన్న బంగారుగాజులు దొంగి లించి, ఆమెను హత్యచేశాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఐపీసీ 302, 380 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన మాచవరం పోలీసులు దర్యాప్తు చేసి, బుజ్జిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై.జేమ్స్, సీఎంఎస్ ఇన్స్పెక్టర్ జగదీశ్వరరావు, మాచవరం ఇన్స్పెక్టర్ ప్రకాష్‌రావు పర్యవేక్షణలో 18మంది సాక్షులను విచారణ చేశారు. బుజ్జిపై నేరం రుజువు కావడంతో నగలు దోపిడీ చేసి, హత్యచేసినందుకు నిందితుడికి జీవితఖైదు, రూ. 3 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. -
పురుగుల మందు తాగి వృద్ధురాలి ఆత్మహత్య
గుడివాడరూరల్: పురుగుల మందు తాగి వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గుడివాడ తాలూకా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని తటివర్రు గ్రామానికి చెందిన నగుళ్ల రాఘవమ్మ (65) ఆమె కొడుకు సత్యనారాయణ వద్ద పక్క పోర్షన్లో నివాసముంటోంది. ఆమెకు 8 సెంట్ల స్థలం ఉంది. దీన్ని ఆమె అమ్ముకునే ప్రయత్నం చేయగా కొడుకు సత్యనారాయణ, కోడలు లక్ష్మి, మనుమడు గంగాధరరావు అడ్డుకుని తీవ్ర మనోవేదనకు గురి చేయడంతో తెల్లవారు జామున 3గంటలకు వృద్ధురాలు పురుగు మందు సేవించింది. తెల్లవారినా లేవకపోవడంతో చుట్టు పక్కల వారు ఆమెను గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి చావుకి కారణమైన కొడుకు, కోడలు, మనుమడుపై కేసు నమోదు చేసి ఎస్ఐ చంటిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు పోలీసులు అప్పగించారు. -
భాగస్వాములు కావాలి
ప్రకృతి వ్యవసాయంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మానవ మనుగడకు కీలకమైన ప్రకృతి వ్యవసాయ ఉద్యమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు. దశల వారీ కార్యాచరణతో సహజ సాగులో జిల్లాను నంబర్1లో నిలపడానికి కృషి చేయాలన్నారు. మంగళవారం విజయవాడలోని లయోల కళాశాల ఎదురుగా ఉన్న రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో రిసోర్స్ పర్సన్లు, యూనిట్ ఇన్‌చార్జ్‌లు, మోడల్ మేకర్ ట్రైనర్లు తదితరులకు ప్రకృతి వ్యవసాయం–ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికపై వర్క్‌షాప్ జరి గింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంపై అన్నదాతల్లో ఉన్న అపోహలను తొలగించాలన్నారు. ఆరోగ్యకర ఉత్పత్తులతో మొత్తం సమాజానికే మేలు కలిగించే సాగు విధానాలపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ర్యాలీలు, స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కార్యక్రమాలు, పొలం సందర్శనలు వంటివి చేయాలన్నారు. తాను సేంద్రియ వ్యవసాయంలో పీహెచ్డీ చేశానని.. రసాయన పురుగు మందులు, ఎరువులు క్రమేపీ మనిషి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని వివరించారు. సాగులో సేంద్రియ ఎరువులు, జీవ ఉత్ప్రేరకాలు, కషాయాలు/ద్రావణాలు తదితరాల వినియోగంతో ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తులు చేతికందుతాయని కలెక్టర్ వివరించారు. క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతి రైతుకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచాలని.. దశల వారీగా విస్తీర్ణాన్ని పెంచుతూ జిల్లాను ఆదర్శవంతంగా నిలుపుదామని పిలుపునిచ్చారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌లోనూ రైతులకు తోడుగా నిలవాల్సిన అవసరముందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. వర్క్‌షాప్‌నకు వచ్చిన వారితో కలెక్టర్.. ప్రకృతి వ్యవసాయంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి, ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టు మేనేజర్ డీఎంఎఫ్ విజయకుమారి, ట్రైనర్లు డి.రవికుమార్, ఎ.వాణి, సీహెచ్ అంజిరెడ్డి, పి.రాజశ్రీ, వి.సింధు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ హైకోర్టులో పోసాని క్వాష్ పిటిషన్
సాక్షి,విజయవాడ : సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో తనపైన నమోదైన అన్నీ కేసులను కొట్టివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. పోలీసులు నమోదు చేసిన కేసుల్లో తదుపరి చర్యలు అన్నీ నిలిపిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్లో కోరారు. -
వినికిడి దినోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ
మధురానగర్(విజయవాడసెంట్రల్): చిన్న పిల్లల్లో వినికిడి సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా వారి ఆరోగ్యకర జీవితానికి మంచి పునాది వేయవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక పోస్టర్లను సోమవారం వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినికిడి సమస్యలకు కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఈ విషయంలో క్షేత్రస్థాయి వైద్యాధికా రులు, ఏఎన్ఎం, ఆశాలు, అంగన్వాడీ కార్య కర్తలు తదితరులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్, డీఆర్వో ఎం.లక్ష్మీనర సింహం, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని, సీపీఓ వై.శ్రీలత, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, పీఓ–యూసీడీ వెంకటరత్నం, ఐసీడీఎస్ పీడీ డి.శ్రీలక్ష్మి, ఎన్సీడీ కార్యక్రమం అధికారి డాక్టర్ మాధవి నాయుడు, ఎల్డీఎం కె.ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. -
56 మంది కొత్త సబ్ ఇన్స్పెక్టర్లు
విజయవాడస్పోర్ట్స్: అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 56 మంది సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)లను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌కు హోం శాఖ కేటాయించింది. ఈ ఎస్ఐలు అందరూ సోమవారం విజయవాడలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ ఎస్.వి.రాజశేఖరబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. నిర్భ యంగా, నిష్పక్షపాతంగా, జవాబుదారీతనంతో విధి నిర్వహణ చేయాలని వారికి సీపీ సూచించారు. బాధితులకు న్యాయం చేస్తూ, దోషులకు శిక్ష పడేలా పని చేయాలని పేర్కొన్నారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తూ, పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా విధులు నిర్వర్తించాలన్నారు. విధి నిర్వహణలో తలెత్తే సందేహాలపై ఉన్నతాధికారులు సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు గౌతమి శాలి, తిరుమలేశ్వరరెడ్డి, కె.జి.వి.సరిత, ఎ.బి.టి.ఎస్.ఉదయారాణి, కృష్ణమూర్తినాయుడు పాల్గొన్నారు. -
కోడూరుపాడులో ప్రత్యక్షమైన పునుగు పిల్లి
హనుమాన్‌జంక్షన్ రూరల్: కృష్ణాజిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడులో అరుదైన జాతికి చెందిన పునుగు పిల్లి ప్రత్యక్షమైంది. అటవీ ప్రాంతంలో అధికంగా సంచరించే పునుగు పిల్లి జనావాసాల్లోకి రావటంతో గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గ్రామంలో పిల్లిని పోలిన ఓ వింత జీవి తిరుగుతుండటంతో పట్టుకునేందుకు స్థానికులు యత్నించారు. ఈ నేపథ్యంలో సోమవారం గ్రామానికి చెందిన ఆళ్ల భాను దానిని వల సాయంతో పట్టుకుని, తన ఇంట్లోని బోనులో ఉంచారు. ఆ తర్వాత ఈ జంతువును అరుదైన పునుగు పిల్లి అని, కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వరునికి ప్రీతి పాత్రమైనదంటూ పలువురు గుర్తించటంతో మరింత ఆశ్చర్యానికి గురయ్యారు. పునుగుపిల్లి సమాచారాన్ని అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు గ్రామానికి వచ్చి పునుగు పిల్లిని స్వాధీనం చేసుకున్నారు. -
కృష్ణాజిల్లా
మంగళవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2025సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 527.80 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 7,033 క్యూసెక్కులు విడుదలవుతోంది. మహిళలను రక్షించుకుందాం..చిలకలపూడి(మచిలీపట్నం): మహిళలను రక్షించుకుందాం, చదివించుకుందామని నినదిస్తూ మచిలీపట్నంలో సోమవారం అంగన్వాడీలు ర్యాలీ చేశారు. పీహెచ్సీ తనిఖీ పెనమలూరు: పోరంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కృష్ణా జిల్లా వైద్యాధికారిణి శర్మిష్ఠ సోమ వారం తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవల వివరాలు తెలుసుకున్నారు. ఇఫ్తార్ సహరి (మంగళ) (బుధ) విజయవాడ 6.20 5.05 మచిలీపట్నం 6.19 5.03జి.కొండూరు: ఎన్టీఆర్ జిల్లాలో మామిడి దిగుబడులు నేలచూపులు చూస్తున్నాయి. మార్కెట్లో కాయల లభ్యత లేకపోవడం, డిమాండ్ అధికంగా ఉండ టంతో ధర మాత్రం ఆకాశాన్ని అంటుతోంది. మిట్టగూడెం మార్కెట్లో ఆదివారం టన్ను బంగినపల్లి ధర రూ.1.20 లక్షలు పలికింది. అయితే దిగుబడులు లేకపోవ డంతో ఈ ధర కూడా గిట్టుబాటుకాదని రైతులు వాపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల దాడి, ధరలో హెచ్చుతగ్గులు ఇలా ఏదో కారణంతో మామిడి రైతులు ఏటా నష్టపోతూనే ఉన్నారు. నష్టాలు తప్ప లాభాలు లేకపోవడంతో ఏడాదికేడాది మామిడి సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది పూత ఆలస్యంగా రావడంతో పాటు తామర పురుగు ఉదృతి ఎక్కువై పూత రాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దిగుబడి పూర్తిగా పడిపోవడంతో ధర అమాంతం పెరిగింది. పెరుగుతున్న ధరలు చూసి దిగుబడి లేక రైతులు లబోదిబో మంటున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. మూడేళ్లుగా నష్టాలు ఎన్టీఆర్ జిల్లాల్లో పురుగులు, తెగుళ్ల వల్ల మామిడి దిగుబడి మూడేళ్లుగా తగ్గుతూ వస్తోంది. జిల్లాల్లో సారవంతమైన నేలలు అధికంగా ఉండడంతో మామిడి చెట్లు 15 నుంచి 20 అడుగులు ఎత్తు పెరుగుతున్నాయి. దీని వల్లన రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి వీలు ఉండటంలేదు. అంతే కాకుండా రైతులు పూర్వపు సాగు పద్ధతులకు స్వస్తి చెప్పి మామిడి తోటలకు నీటి తడులు అధికంగా ఇస్తున్నారు. దీంతో నేలలో తేమ శాతం పెరిగి మామిడి చెట్లపై పురుగులు, తెగుళ్లు ఉధృతి ఎక్కువ అవుతోంది. మూడేళ్ల నుంచి జిల్లాలో తామర పురుగు, తేనె మంచు పురుగు, పేను వంటి పురుగుల ఉధృతితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రెండు టన్నుల లోపే దిగుబడి జిల్లాలో 22,896 హెక్టార్లలో మామిడి సాగవుతుండగా ఎకరానికి రెండు టన్నుల దిగుబడి కూడా వచ్చే అవకాశం లేదని రైతులు పేర్కొంటున్నారు. ప్రకృతి సహకరిస్తే ఎకరానికి నాలుగు నుంచి ఆరు టన్నుల వరకు దిగుబడి వస్తుందని చెబుతున్నారు. ఎకరానికి దుక్కి, ఎరువులు, పురుగుమందులు, కూలీలు ఖర్చులు కలిపి రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు పెట్టుబడి పెట్టిన నేపథ్యంలో పూత రాలిపోయి దిగుబడిలేక తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. జిల్లాలో గత ఏడాది లక్షా 76వేల టన్నులకు పైగా మామిడి దిగుబడి వచ్చింది. ఈ ఏడాది లక్ష టన్నుల దిగుబడి రావడం కూడా కష్టమేనని అధికారులు అంచనా వేస్తున్నారు. 7 మామిడి తోటలపై మంచు, తామర పురుగు దాడి ఫలితంగా సగానికి తగ్గిపోయిన కాయల దిగుబడి లభ్యతలేక అమాంతం పెరిగిన మామిడి ధర మిట్టగూడెం మార్కెట్లో బంగినపల్లి టన్ను ధర రూ.1.20 లక్షలు న్యూస్రీల్ఎన్టీఆర్ జిల్లాలో మామిడి సాగు వివరాలు జిల్లాలోని పలు మండలాల్లో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. మండలాల వారీగా వత్సవాయిలో 165, జగ్గయ్యపేట 295, పెనుగంచిప్రోలు 244, నందిగామ 251, వీరులపాడు 113, మైలవరం 3,353, గంపలగూడెం 616, తిరువూరు 817, ఎ.కొండూరు 2,336, రెడ్డిగూడెం 4,450, విస్సన్నపేట 5,817, జి.కొండూరు 2,324, కంచికచర్ల 125, చందర్లపాడు 20, ఇబ్రహీంపట్నం 18, విజయవాడరూరల్ మండలంలో 1,952 హెక్టార్లలో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. మిట్టగూడెంలో టన్ను ధర రూ.1.20 లక్షలు రెడ్డిగూడెం మండలంలో మామిడి కోతలు ప్రారంభమ య్యాయి. మండలంలోని మిట్టగూడెం మ్యాంగో మార్కెట్లో ఆదివారం కాయల విక్రయాలు మొదలయ్యాయి. వ్యాపారులు అధిక ధరలు ఇస్తున్నారు. టన్ను బంగిన పల్లి ధర రూ.1.20 లక్షలు, తోతాపురి రూ.70 వేలు, రసాలు రూ.40 వేల చొప్పున కొనుగోలు చేశారు. మండలంలో 4,450 హెక్టార్లలో మామిడి సాగువుతుండగా రైతులే నేరుగా మామిడి కాయలను బొంబాయి, హైదరాబాద్, నాందేడ్ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. నూజివీడు తర్వాత రెడ్డిగూడెం మామిడికి జాతీయ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. -
దుర్గమ్మ చీరల కుంభకోణంపై విచారణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ చీరల కుంభకోణం వ్యవహారంపై సోమవారం విచారణ జరిగింది. మహా మండపం ఐదో అంతస్తులోని చీరల విభాగం కార్యాలయంలో విచారణ జరిగింది. 2018–19లో సుమారు రూ.2 కోట్ల విలువైన చీరలకు సంబంధించి లెక్కలు సరిగా లేవని గతంలో పలు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల్లో నిగ్గు తేల్చేందుకు దేవదాయ శాఖ ఓ ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ సోమవారం దుర్గగుడికి వచ్చి చీరల విభాగంలో పలు రికార్డులను పరిశీలించింది. డెప్యూటీ కమిషనర్ కె.బి.శ్రీనివాస్ నేతృత్వంలోని నలుగురు అధికారులు ఈ విచారణలో పాల్గొన్నారు. ఈ వ్యవహారంలో దేవస్థానం తరఫున విచారణాధికారిగా ఉన్న ఏఈఓ సుధారాణి ప్రత్యేక కమిటీకి తన నివేదిక అందజేశారు. 2018 నుంచి 2023వ సంవత్సరం వరకు చీరల విభాగంలో ఎవరెవరూ విధులు నిర్వహించారు, ఈఓలు ఇచ్చిన ఆదేశాల వివరాలతో కూడిన రికార్డులను ఈ నెల ఏడు, ఎనిమిది తేదీల నాటికి అందుబాటులో ఉంచాలని విచారణ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. సుమారు గంట పాటు జరిగిన విచారణలో దేవస్థానానికి చెందిన పలువురు ఉద్యోగులు, సిబ్బంది కమిటీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. -
విద్యార్థులకు ప్రయోజనాలెన్నో..
పాలిటెక్నిక్‌లో ఏ కోర్సు పూర్తి చేసినా ఉద్యోగం, ఉపాధి సులభంగా దొరుకుతుంది. కళాశాలల్లో ఇటీవల తరచూ ఉద్యోగ మేళాలు జరుగుతున్నాయి. ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చి విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కోర్సు చేయడానికి మూడేళ్లకు కేవలం రూ.13 వేల వరకు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఇంజినీరింగ్ సెంకడియర్లో చేరవచ్చు. లేదా ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు. – ఎన్.రాజశేఖర్, ఏఏఎన్‌ఎం అండ్ వీవీఆర్‌ఎస్‌ఆర్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, గుడ్లవల్లేరు -
శ్రీ అద్దంకి నాంచారమ్మ జాతర మహోత్సవం ప్రారంభం
పెదప్రోలు(మోపిదేవి): మండలంలోని పెదప్రోలు గ్రామంలో ఉన్న శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని సోమవారం చల్లపల్లి సీఐ ఈశ్వరరావు ప్రారంభించారు. ప్రతి ఏడాది అమ్మవారికి 15 రోజుల పాటు ఇంటింటా దర్శనం కల్పించిన అనంతరం పౌర్ణమి నాడు అమ్మవారిని ఆలయ ప్రవేశం చేస్తారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున జాతర నిర్వహించి ఆలయ ప్రవేశం చేస్తామని ఆలయ కార్యదర్శి కూరపాటి కోటేశ్వరరావు తెలిపారు. ఆలయ అభివృద్ధిలో బాగంగా గత ఏడాది చేపట్టిన తవ్వకాల్లో రాతి శిలాశాసనం బయట పడిందని, దానిపై 1919లో గుంటూరు జిల్లా పద్మ శాలీల అమ్మవారుగా గుర్తించి వారి వంశీకులకు సమాచారం ఇచ్చామని, జాతరలో తొలిపూజలు చేసుకునేందుకు వారికి అవకాశం కల్పించినట్లు వివరించారు. ఈ ఏడాది నుంచి గ్రామ జాతరలో తొలిపూజలు పద్మశాలీల వంశీకులు చేపట్టినట్లు తెలియజేశారు. గ్రామ సర్పంచ్ పొలిమెట్ల ఏసుబాబు, మాజీ సర్పంచ్ మద్దిపట్ల జగన్మోహనరావు, ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల వెంకట్రామయ్య, కుర్రా గురుప్రసాద్, పీఏసీఎస్ మాజీ చైర్పర్సన్ ఆది రాంబాబు, ఎస్ఐ సత్యనారాయణ, ఆలయ వంశపారంపర్య ధర్మకర్తల వంశీకులు పడవల వెంకట సుబ్బారావు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
సద్వినియోగం చేసుకోవాలి
పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సులో చదువుకునేందుకు ఉపకరించే పాలిసెట్ – 2025కు దరఖాస్తు చేసుకోవాలి. పాలిటెక్నిక్ చదివితే చిన్న వయసులోనే ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉన్నత విద్యతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు కోచింగ్‌తో పాటు సంబంధిత మెటీరియల్ ఉచితంగా అందుతుంది. – బండి శైలజ, పాలిసెట్ – 2025 కృష్ణాజిల్లా కోఆర్డినేటర్ -
ముగిసిన బ్రహ్మోత్సవాలు
పెదకళ్లేపల్లి(మోపిదేవి): దక్షిణకాశీగా పేరుగాంచిన పెదకళ్లేపల్లిలో వేంచేసియున్న శ్రీ దుర్గ,పార్వతి సమేత నాగేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. గత నెల 23 నుంచి సోమవారం వరకు స్వామివారి మహాశివరాత్రి, వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం రాత్రి ఎని మిది గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు నిర్వహించిన అనంతరం పుష్పశయ్యాలంకృత పవళింపు సేవతో ఉత్సవాలు ముగిసినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. ఉత్సవాలను జయప్రదంచేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులసంఘం డైరీ ఆవిష్కరణ చిలకలపూడి(మచిలీపట్నం): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం 2025 డైరీని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సోమవారం తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సంద్భంగా ఉద్యోగులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ సహకరించా లన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి ఉన్నతస్థాయికి ఎదగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు పి.రాము, కార్యదర్శి తోట వరప్రసాద్, సంఘ నాయకుడు ఎస్.రాంబాబు పాల్గొన్నారు. నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు సోమ వారం రూ.లక్ష విరాళం సమర్పించారు. దామోదర్ (తంబి) పేరిట పెనమలూరు మండలం కానూరుకు చెందిన ఎం.శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. దామోదర్‌కు తన వాళ్లు ఎవరూ లేకపోవడంతో తాము చేరదీశామని, ఆయన అమ్మవారి భక్తుడు కావడం, కొంత డబ్బు దాచుకోవడంతో వాటిని అన్నదానానికి విరాళంగా అందచేసినట్లు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. సెకండ్ ఇంటర్ పరీక్షకు 19,873 మంది హాజరు చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. 20,171 మంది విద్యార్థులకు జిల్లా వ్యాప్తంగా 63 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 19,873 మంది పరీక్షకు హాజరయ్యారు. మరో 298 మంది గైర్హాజరయ్యారు. ఆర్ఐఓ పి.బి.సాల్మన్‌రాజు చిలకలపూడి, మచిలీపట్నం పోలీస్స్టేషన్లతో పాటు ఉయ్యూరులోని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు జిల్లా వ్యాప్తంగా పది కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశాయి. మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఆర్ఐఓ సాల్మన్‌రాజు తెలిపారు. -
సాంకేతిక విద్య.. ఉజ్వల భవిత
గుడ్లవల్లేరు: సాంకేతిక విద్యతో విద్యార్థులు ఉజ్వల భవిష్యత్‌ను పొందొచ్చు. పదో తరగతి ఉత్తీర్ణతతో సాంకేతిక విద్యకు పునాది వేసే పాలిసెట్ ఏప్రిల్ 30వ తేదీన జరగనుంది. ఈ మేరకు సాంకేతిక విద్యా శాఖ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్– 2025ను ప్రకటించింది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు పొందొచ్చు. పదో తరగతి పరీక్షలు మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగానే సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు పాలిసెట్ తేదీని విడుదల చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు, సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ ఖర్చతో సాంకేతిక విద్య పాలిటెక్నిక్‌లో ప్రవేశం ద్వారా తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య లభిస్తే, దానిని పునాదిగా మార్చుకుని భావి జీవితానికి బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. గ్రామీణ పేద విద్యార్థులు ఇంజినీరింగ్ వంటి ఉన్నత సాంకేతిక విద్యను అందుకోవాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకుంది. వారికి పాలిటెక్నిక్ కోర్సులు చక్కని వేదిక లని పలువురు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. పాలిసెట్ ద్వారా పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరి విలువైన సాంకేతిక విజ్ఞానాన్ని సొంతం చేసుకుని సత్వర ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందొచ్చని సూచిస్తున్నారు. పాలిసెట్‌కు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుల తుది గడువును ప్రకటించలేదు. పదో తరగతి విద్యార్థులకు మంచి అవకాశం ఏప్రిల్ 30న పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో అందుబాటులో 11,232 సీట్లు లభించే కోర్సులు ఇవీ.. పాలిటెక్నిక్ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు అందిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెర్చర్ తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయి. పలు చోట్ల ఒక్కో కోర్సులో ఒక్కో బ్రాంచికి 60 నుంచి 120 వరకు సీట్లు అందుబాటులో ఉంటాయి. ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల్లో 11,232 సీట్లు ఉన్నాయి. నాలుగు ప్రభుత్వ, 24 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. పాలిటెక్నిక్ కోర్సుల కాల వ్యవధి మూడేళ్ల వరకు ఉంటుంది. ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ కూడా ఉంటుంది. విద్యార్థుల నైపుణ్యం పెంపొందించుకునే శిక్షణ సైతం ఇస్తారు. పాలిసెట్ ఎంట్రన్స్ ఇలా.. పాలిసెట్– 2025 ఎంట్రన్స్‌ను 120 మార్కులకు నిర్వహిస్తారు. పదో తరగతి సిలబస్ ఆధారంగా ఈ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 30న పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.100, ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.400గా నిర్ణయించారు. -
కొండపల్లి బొమ్మల కీర్తిని దేశానికి చాటుదాం
ఏపీ టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి చెక్క బొమ్మల ఘనకీర్తి, చారిత్రక నేప థ్యాన్ని దేశానికి చాటి చెబుదామని రాష్ట్ర టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ పేర్కొన్నారు. కొండపల్లిలోని బొమ్మల కాలనీ, బొమ్మల పరిశ్రమ కేంద్రాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. బొమ్మల తయారీదారులతో కొద్దిసేపు ముచ్చటించారు. బొమ్మల తయారీ విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. బొమ్మల తయారీకి అవసరమైన తెల్లపొనికి చెట్లు కనుమరుగయినట్లు తయారీదారులు ఆయనకు వివరించారు. తెల్లపొనికి చెట్లు వనాలు పెంచేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. బొమ్మల తయారీలో యాంత్రీకరణ పద్ధ తులు అవలంబిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా అజయ్‌జైన్ మాట్లాడుతూ.. శని, ఆదివారాల్లో కొండపల్లి బొమ్మల్ని కూడా పర్యాటకులకు చూపించే బాధ్యత పర్యాటక శాఖ తీసుకుంటుందని తెలి పారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులకు టూరిజం ప్యాకేజీలో భాగంగా అమరావతితో పాటు దుర్గమ్మ ఆలయం, కొండపల్లి ఖిల్లా, కొండపల్లి బొమ్మలు, వాటర్ ఫాల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి మునిసిపల్ కమిషనర్ రమ్య కీర్తన, ఏపీ టూరిజం శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. -
జిల్లా అఽధికారులతో కృష్ణా కలెక్టర్ సమీక్ష
పెనమలూరు: పోరంకిలోని తాడిగడప మున్సిపల్ కార్యాలయంలో కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 5వ తేదీన పోరంకిలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఇంటికి వస్తున్న సందర్భంగా ఏర్పాట్లపై కలెక్టర్ అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కుమారుడి వివాహం అయిన సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించటానికి సీఎం రానున్నారు. సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ గంగాధరరావు, మున్సిపల్ కమిషనర్ భవానీప్రసాద్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. అదే రోజు వీఆర్ సిద్ధార్థ కాలేజీ గ్రౌండ్స్‌లో వివాహ విందు భోజనాల ఏర్పాట్లను పురస్కరించుకుని కళాశాల మైదానంలో ఎస్పీ గంగాధరరావు పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. -
ముగిసిన ముక్తేశ్వరుని కల్యాణ మహోత్సవాలు
వేదాద్రి(జగ్గయ్యపేట): గ్రామంలో ఉన్న శ్రీ భవానీ ముక్తేశ్వరస్వామి కల్యాణమహోత్సవాలు సోమవారం రాత్రి పవళింపు సేవతో ముగిశాయి. ఈ సందర్భంగా సోమవారం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో అర్చకులు వారణాసి సాంబశివరావు, తూమాటి లక్ష్మీనరసింహాచార్యులు, మద్దిరాల ప్రేమకుమార్శర్మ ఆధ్వర్యంలో పవళింపు సేవ నిర్వహించారు. కల్యాణోత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించామని ఆలయ ఈవో కానూరి సురేష్‌బాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో కేసీపీ ప్రతినిధి రాంప్రసాద్, ఆలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగిన ముక్తేశ్వరుని కల్యాణ మహోత్సవాల్లో స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ.7.53 లక్షల ఆదాయం సమకూరిందని ఈవో సురేష్ తెలిపారు. లడ్డు విక్రయం ద్వారా రూ.1.10 లక్షలు, దర్శనం టికెట్ల ద్వారా రూ.2.50 లక్షలు, కానుకల ద్వారా రూ.3 లక్షలు, అభిషేకాల ద్వారా రూ.86వేలు, కొబ్బరిచిప్పల విక్రయం ద్వారా రూ.59వేలు వచ్చిందని వివరించారు. -
తడి, పొడి చెత్త సేకరణపై ప్రత్యేక శ్రద్ధ
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో తడి, పొడి చెత్త సేకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ఆయన మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, పంచాయతీ అధికారులతో తడి, పొడి చెత్త సేకరణ, ఎంఎస్ఎంఈ సర్వే పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తడి, పొడి చెత్తను వేరువేరుగా కాకుండా కలిపి వేస్తున్నారని దీనిపై పారిశుద్ధ్య సిబ్బందికి కూడా అవగాహన లేనట్లుగా కనిపిస్తోందన్నారు. ప్రజలతో పాటు సిబ్బందికి తగిన అవగాహన కల్పించాలన్నారు. తాను నగరంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో తడి, పొడి చెత్త సేకరణపై ఆకస్మిక తనిఖీలు చేసినప్పుడు మాత్రమే అధికారులు, పారిశుద్ధ్య నిర్వహణ సిబ్బంది స్పందిస్తున్నారని, మిగతా సమయాల్లో దీనిపై దృష్టి పెట్టడం లేదన్నారు. స్వచ్ఛ జిల్లా దిశగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలన్నారు. ఎంఎస్ఎంఈ సర్వే పురోగతిపై మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు శ్రద్ధ పెట్టడం లేదని అసహనం వ్యక్తం చేశారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో సరైన ప్రణాళికతో సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కృష్ణా కలెక్టర్ బాలాజీ ఆదేశం -
బిందు సేద్యం, మల్చింగ్‌తో రైతులకు మేలు
కంకిపాడు: బిందు సేద్యం, మల్చింగ్ ప్రక్రియలతో రైతులకు మేలు చేకూరుతుందని ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ డి.సుధారాణి సూచించారు. మండలంలోని ప్రొద్దుటూరు గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాలను ఉద్యాన, వ్యవసాయశాఖ అధికారులు, రైతులతో కలిసి సోమవారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ యాజమాన్య చర్యలు, పైరు ఎదుగుదల ఆశించిన దిగుబడుల సాధనలో కీలకం అవుతాయన్నారు. సాగు ఖర్చులు తగ్గించుకుంటూ నూతన విధానాలను అవలంబించాలని సూచించారు. శాస్త్రవేత్త డాక్టర్ వి.మంజువాణి మాట్లాడుతూ బిందు సేద్యం, మల్చింగ్‌తో రైతులకు అధిక లాభాలు ఉన్నాయన్నారు. నీరు 40 శాతం–70 శాతం వరకూ ఆదా అవుతుందన్నారు. మొక్కల ఉత్పాదకత, నాణ్యతకు దోహదపడుతుందన్నారు. కలుపు సమస్య, ఎరువు ఖర్చు 30 శాతం ఆదా అవుతుందన్నారు. మల్చింగ్‌తో నేల నాణ్యత వృద్ధి చెంది ఆశించిన దిగుబడులు లభిస్తాయన్నారు. కంకిపాడు ఉద్యానశాఖ అధికారి చందు జోసఫ్ సుందరం మాట్లాడుతూ చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీపై బిందు సేద్యం యూనిట్ లభిస్తుందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి పీఎం కిరణ్, వీఏఏ విజయ్, రైతులు పాల్గొన్నారు. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ డి.సుధారాణి, శాస్త్రవేత్త డాక్టర్ వి.మంజువాణి -
రీయింబర్స్ ఓ మిఽథ్య... కార్మికుల వ్యధ
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఈఎస్ఐ చందాదారులకు నగదు రహిత వైద్యంతో పాటు, అత్యవసర సమయంలో పొందిన వైద్యానికి రీయింబర్స్మెంట్ పొందే సదుపాయం కూడా ఉంది. కానీ ఇది కేవలం ప్రకటనలకే పరిమితమవుతోంది. రీయింబర్స్మెంట్ కోసం వచ్చిన ఫైళ్లు డైరెక్టరేట్ కార్యాలయంలో గుట్టలుగా పడి ఉంటున్నట్లు పలువురు కార్మికులు చెబుతున్నారు. ఆస్పత్రి ఖర్చులకు సంబంధించిన బిల్లులను డిస్పెన్సరీల ద్వారా పంపడమే కానీ, రీయింబర్స్మెంట్ రావడం లేదంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈఎస్ఐలో రీయింబర్స్మెంట్ పథకం ఫార్సుగా మారిందంటున్నారు. నిబంధనలు ఇలా... నగదు రహిత వైద్యం పొందలేని చందాదారులు ప్రైవేటు ఆస్పత్రుల్లో డబ్బులు చెల్లించి వైద్యం పొందిన సందర్భంగా, ఆ ఖర్చులు రీయింబర్స్మెంట్ పొందే అవకాశం ఉంది. ఈఎస్ఐ ఆస్పత్రి నాలుగు జిల్లాలకు విజయవాడలోనే ఉంది. ప్రకాశం జిల్లాకు చెందిన వాళ్లు కూడా చికిత్స కోసం ఇక్కడికే రావాల్సి ఉంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో స్థానికంగా ఉన్న ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈఎస్ఐ రిఫరల్ ఆస్పత్రి అయితే, అక్కడి నుంచి లెటర్ తెస్తే నగదు రహిత వైద్యం పొందేందుకు విజయవాడలోని ఈఎస్ఐ ఆస్పత్రి అధికారులు అనుమతి ఇస్తారు. ఈఎస్ఐ రిఫరల్ ఆస్పత్రి కాని పక్షంలో డబ్బులు చెల్లించి వైద్యం పొందాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా అనేక మంది ఈఎస్ఐ చందాదారులు నగదు రహిత వైద్యం పొందలేక డబ్బులు చెల్లించి వైద్యం పొందుతున్నారు. నగదు రహిత వైద్యంలోనూ... ఈఎస్ఐ ఆస్పత్రి నుంచి నగదు రహిత వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్ చేసిన రోగుల నుంచి కూడా వారు ఎంతోకొంత వసూలు చేస్తున్నారు. ఈఎస్ఐ ప్యాకేజీలు తక్కువగా ఉంటాయని, అంతేకాకుండా కొన్ని రకాల చికిత్సలు కవర్ కావంటూ అందిన కాడికి వసూలు చేస్తున్నారు. దీంతో చేసేది లేక, ఆస్పత్రి వాళ్లు అడిగినంత చెల్లిస్తూ వైద్యం పొందుతున్నారు. కనీసం ఈఎస్ఐ రిఫరల్ కేసులకు వైద్యం ఎలా అందుతుంది, డబ్బులు ఏమైనా వసూలు చేస్తున్నారా అని పర్యవేక్షించే వారు కూడా లేకపోవడం దురదృష్టకరం. ఈఎస్ఐలో ఏళ్లు గడుస్తున్నా చెల్లింపులు లేని వైనం గుట్టలుగా రీయింబర్స్మెంట్ ఫైళ్లు కేవలం ప్రకటనలకే పరిమితం అప్పుల్లో కూరుకుపోతున్న కార్మికులు మా వద్ద పెండింగ్ లేవు ఈఎస్ఐ చందాదారులకు రీయింబర్స్మెంట్ ఫైల్స్ మా వద్దకు వచ్చినవన్నీ క్లియర్ చేశాము. గతంలో ఫైల్స్ డైరెక్టరేట్‌కు వెళ్లేవి, ఇప్పుడు ఆస్పత్రులకు వస్తున్నాయి. వీలయినంత త్వరగా క్లియర్ చేస్తున్నాం. – డాక్టర్ వి.జ్యోతి, సూపరింటెండెంట్, ఈఎస్ఐ ఆస్పత్రి -
బెల్టు దుకాణాలపై ఎన్ఫోర్సుమెంటు దాడులు
పెడన: మచిలీపట్నం ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో గత రెండు రోజులుగా బెల్టు దుకాణాలపై దాడులు నిర్వహించి పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్సుమెంటు ఇన్స్పెక్టర్ పి.వెంకటేశ్వరమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ ఎన్ఫోర్సుమెంట్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ వై.శ్రీనివాస చౌదరి ఆదేశాలతో ఆది, సోమవారాల్లో దాడులు నిర్వహించామన్నారు. గూడూరు మండలం పిండివారిపాలెంలో బెల్టు దుకాణం నిర్వహిస్తున్న గంజాల రామచంద్రరావు నుంచి 20 క్వార్టరు మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని అతని అరెస్ట్ చేశామన్నారు. పెడన పట్టణంలోని రామలక్ష్మీ వీవర్స్ కాలనీలోని పేరక శ్రీకాంత్ నుంచి 17 క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశామన్నారు. మచిలీపట్నం మండలం పోతేపల్లిలో పామర్తి నాగరాజు నుంచి 17 క్వార్టర్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మచిలీపట్నం వైఎస్సార్ కాలనీకి చెందిన షేక్ మదర్‌బీ నుంచి 70 క్వార్టరు మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నామన్నారు. తదుపరి చర్యల నిమిత్తం సోమవారం ఈ నలుగురితో పాటు మద్యం సీసాలను మచిలీపట్నం ఎకై ్సజ్ స్టేషన్‌కు అప్పగించామని వెంకటేశ్వరమ్మ తెలిపారు. దాడుల్లో తనతో పాటు విజయవాడకు చెందిన ఎన్ఫోర్సుమెంటు ఎస్ఐ ఎం.రామశేషయ్య, హెచ్‌సీ కె.మధు పాల్గొన్నారని తెలిపారు. -
సీజనల్ వ్యాధులతో అప్రమత్తం
చిలకలపూడి(మచిలీపట్నం): దోమల వ్యాప్తి, నీటి కాలుష్యం కారణంగా ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో గ్రామీణ నీటి సరఫరా, వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని చెప్పారు. దోమల వ్యాప్తి వల్ల డెంగీ, మలేరియా వంటి విషజ్వరాలు ప్రబలకుండా చూడాలన్నారు. నీటి కాలుష్యంతో వ్యాప్తి చెందే డయేరియా, కలరా వంటి వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయటంతో పాటు మండల, గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఎక్కువ కాలం నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డ్రెయిన్లలో మురుగునీరు సాఫీగా పారుదల అయ్యేలా పూడికతీత, మరమ్మతులు చేపట్టాలన్నారు. విధిగా దోమల నివారణకు మందు పిచికారీ చేయాలని సూచించారు. లీకై న తాగునీటి పైప్లైన్లను గుర్తించి మరమ్మతులు చేపట్టాలన్నారు. ఓవర్‌హెడ్ ట్యాంకులను నిత్యం శుభ్రపరిచి క్లోరినేషన్, బ్లీచింగ్ వేయాలన్నారు. గ్రామాల్లో సచివాలయ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఎంఎల్‌హెచ్‌పీలు నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలన్నారు. నీరు కలుషితమైనట్లు గుర్తిస్తే వెంటనే పై అధికారులకు సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో కాచి చల్లార్చిన నీటిని మాత్రమే పిల్లలకు అందించాలన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా బీసీ, సాంఘిక సంక్షేమ వసతి గృహ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. వసతి గృహాల్లోని కిటికీలకు మెష్లను ఏర్పాటు చేయాలన్నారు. వ్యాధులను నియంత్రించటంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ ఎస్.శర్మిష్ట, జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారి నటరాజన్, బీసీ సంక్షేమాధికారి వి.రమేష్, డీపీవో జె.అరుణ తదితరులు పాల్గొన్నారు. కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ -
కారు ఢీకొని వ్యక్తి మృతి
కంకిపాడు: కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని ప్రొద్దుటూరు పరిధిలో విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని ప్రొద్దుటూరు పరిధిలోని శరత్ చంద్ర అకాడమీ ఎదురుగా జాతీయ రహదారి దాటుతున్న వ్యక్తి (40)ని ఉయ్యూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో రోడ్డు దాటుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు తాడిగడప వాసిగా సమాచారం. మృతుడికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదని ఎస్ఐ డి.సందీప్ తెలిపారు. మార్కులు సరిగా రాలేదని విద్యార్థిని ఆత్మహత్య చిట్టినగర్(విజయవాడపశ్చిమ): పరీక్షలలో మార్కులు సరిగా రాలేదని మానసికంగా కుంగిపోయిన విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఘటనపై విద్యార్థిని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వించిపేట గాంధీబొమ్మ సెంటర్‌కు చెందిన శాన్నం నాగమణి, చలపతిబాబు దంపతులకు ఇద్దరు సంతానం. చలపతిబాబు ఆటో నడుపుకొని జీవనం సాగిస్తుంటాడు. కుమార్తె డీనా వైష్ణవి(20) పీబీ సిద్ధార్థ కాలేజీలో బీకాం సెకండ్ ఇయర్ చదువుతోంది. మూడో సెమిస్టర్ ఫలితాలు శనివారం వచ్చాయి. ఆ ఫలితాలలో మార్కులు తక్కువ రావడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మానసికంగా కుంగిపోయిన వైష్ణవి సోమవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బయటకు వెళ్లి వచ్చిన తల్లి ఇంట్లో తలుపులు తెరిచేందుకు ప్రయత్నించగా తెరుచుకోలేదు. దీంతో బలవంతంగా తలుపు తెరిచి చూసేసరికి లోపల వైష్ణవి ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందకు దింపిన తండ్రి చలపతిబాబు తన ఆటోలోనే కుమార్తెను ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. అప్పటికే వైష్ణవి మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఘటనపై మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
రాష్ట్రస్థాయి ఔషధ మొక్కలపై అవగాహన సదస్సు
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ ఔషధ, సుగంధ మొక్కల బోర్డు ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ మంజుల డీ హోసమని ఆదేశాల మేరకు సోమవారం గాంధీనగర్‌లో రాష్ట్రస్థాయి ఔషధ మొక్కల పంటల కొనుగోలుదారులు, అమ్మకం దారుల అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆయుష్ డిపార్ట్మెంట్, హోమియోపతి అదనపు డైరెక్టర్ డాక్టర్ సుజాత, ఏపీఈడీఏ సంస్థ ప్రాంతీయ డైరెక్టర్ పెద్ద స్వామి, సీనియర్ సైంటిస్ట్ కేవీఎన్ సత్య శ్రీనివాస్, డాక్టర్ బృందావనం, కళ్యాణ్ బాయి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు రైతులకు, ఔషధ మొక్కల పంటలను ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలో వివరించారు. ఔషధ మొక్కల స్టాల్ ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి రైతులకు అర్థమయ్యే రీతిలో తెలియజేశారు. రైతులు పండించే పంటలపై మార్కెటింగ్ చేసుకునే సదుపాయం కూడా కల్పించినట్లు చెప్పారు. ఔషధ మొక్కల సాగు, పంటలు పండించే విధానంతోనే అత్యధిక దిగుబడి సాధించి లాభాలు పొందవచ్చని రైతులకు సూచించారు. జాతీయ ఔషధ మొక్కల బోర్డు, న్యూఢిల్లీ వారి సహకారంతో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు ఆయుష్ శాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ సుజాత స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా శిక్షణ పొందిన రైతులు, అమ్మకందారులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మెడిసినల్ అండ్ ఆటోమేటిక్ ప్లాంట్ బోర్డు సిబ్బంది పాల్గొన్నారు. -
చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలు అరెస్ట్
హనుమాన్‌జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం కానుమోలులో ఇటీవల జరిగిన చోరీ కేసుకు సంబంధించి ఇద్దరు దొంగలను హనుమాన్‌జంక్షన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. గ్రామానికి చెందిన వీఆర్ఏ గద్దె విక్టర్ కుటుంబ సభ్యులతో కలిసి పొరుగూరు వెళ్లగా ఆయన ఇంట్లో గత నెల 24న చోరీ జరిగింది. బీరువాలోని రూ.65 వేల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు. ఈ ఘటనపై వీఆర్ఏ విక్టర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో క్లూస్ టీం ద్వారా దొంగల వేలిముద్రలను సేకరించారు. పాత నేరస్తులే చోరీకి పాల్పడినట్లుగా నిర్థారించారు. ఆ వేలి ముద్రల ఆధారంగా నిందితులు కొఠారు శ్రీనివాస్ (కాకినాడ), షేక్ మున్నా (ఏలూరు)లను సోమవారం హనుమాన్‌జంక్షన్ ఎస్ఐ–2 నరసింహమూర్తి అరెస్ట్ చేశారు. వారి నుంచి చోరీ చేసిన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
శాసన మండలిలో అధికారపక్షం కుప్పిగంతులు : బొత్స ధ్వజం
సాక్షి,విజయవాడ: దేశ చరిత్రలో సీఎం హోదాలో చంద్రబాబు మాట్లాడినట్లు ఎవరూ మాట్లాడలేదని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. సోమవారం శాసన మండలి మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు.‘దేశ చరిత్రలో సీఎం హోదాలో చంద్రబాబు మాట్లాడినట్లు ఎవరూ మాట్లాడలేదు. రుషికొండ భవనాల నిర్మాణంలో అవినీతి జరిగితే కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లించారు? అని ప్రశ్నించారు. రుషికొండ నిర్మాణలపై విచారణకు సిద్ధం ఉన్నామని బొత్స స్పష్టం చేశారు. శాసన మండలిలో అధికారపక్షం కుప్పిగంతులేసింది. సచివాలయ భవనాలపై మంత్రి అచ్చెన్నాయుడికి క్లారిటీ లేదు. తాత్కాలిక భవనాలు అని ఎప్పుడూ చెప్పలేదని అచ్చెన్నాయుడు చెబుతున్నారు. అలాంటప్పుడు కొత్తగా నిర్మాణాలకు టెండర్లు పిలవడమెందుకు. వైఎస్సార్సీపీ వాళ్లకు పనిచేయొద్దని ముఖ్యమంత్రి ఎలా చెబుతారంటే సమాధానం లేదు. చంద్రబాబు మాదిరి ఇంత వరకూ ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదు. లబ్ధిదారుల్లో పార్టీలు చూడటమేంటి.రుషికొండ భవనాల్లో అక్రమాలు జరిగితే ఎందుకు బిల్లులు చెల్లించారు.నిజంగా అవినీతి జరిగితే ఎంక్వైరీ వేయండి. రాజధాని కోసం సుమారు మూడు నాలుగు లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం రాజధానికి రూ.6 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. బడ్జెట్ పై చర్చను డైవర్ట్ చేయడానికి టీడీపీ సభ్యులు ప్రయత్నం చేశారు.ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాయాల్సిన అవసరం మాకేంటి. అధికారంలో ఉన్నది వాళ్లా..మేమా. ఆడలేక మద్దెల ఓడ అన్నట్లుంది కూటమి నేతల తీరు’అని మండిపడ్డారు. -
కృష్ణాజిల్లా
సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025‘మీ కోసం’కు విరామం చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ఇఫ్తార్ సహరి (సోమ) (మంగళ) విజయవాడ 6.20 5.07 మచిలీపట్నం 6.19 5.04 ముస్లింలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవిత్ర రంజాన్ మాసం రానే వచ్చింది. నెలవంక కనిపించడంతో ఆదివారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. శుభప్రదమైన ఈ మాసానికి స్వాగతం పలుకుతూ ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం అంతా కలిసి ఇఫ్తార్ విందు తీసుకున్నారు. ఈ నెలలో ముస్లింలు అల్లాహ్‌ను ధ్యానిస్తూ.. పుణ్యకార్యాలకే పరిమితమవుతారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ విజయవాడ7పవిత్ర మాసం.. ప్రారంభంన్యూస్రీల్ -
కిక్కిరిసిన దుర్గమ్మ సన్నిధి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. భక్తులు, యాత్రికులతో పాటు విద్యార్థులు సైతం పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెల్లవారుజామున దుర్గమ్మకు నిర్వహించిన ఖడ్గమాలార్చన, ఉదయం లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమం, శాంతి కల్యాణంలో పెద్ద ఎత్తున ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. ఉదయం రద్దీ సాధారణంగా ఉన్నా.. 10 గంటల తర్వాత క్రమంగా పెరిగింది. దీంతో సర్వ దర్శనానికి రెండు గంటల సమయం, రూ.100, రూ. 300, రూ. 500 టికెట్టుపై దర్శనానికి గంట సమయం పట్టింది. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు అరగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేయగా, రద్దీ మరింత పెరిగింది. మహా నివేదన అనంతరం 12.20 గంటలకు దర్శనం తిరిగి ప్రారంభం కాగా, మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు రద్దీ కొనసాగింది. రద్దీ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో భక్తులు ఇబ్బందులకు గురి కాకుండా, త్వరితగతిన అమ్మవారి దర్శనం అయ్యేలా ఆలయ ఏఈవోలు, సూపరింటెండెంట్లు క్యూలైన్లను పర్యవేక్షించారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవలో ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. అద్దాల మండపంలో పవళింపు సేవ.. మహా శివరాత్రిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్లకు ఆదివారం పవళింపు సేవ నిర్వహించారు. ఆదివారం సాయంత్రం స్వామి వారికి పంచహారతుల సేవ అనంతరం ఉత్సవమూర్తులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం అద్దాల మండపంలో పవళింపు సేవ జరిపించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు సేవలో పాల్గొన్నారు. -
ఆరోగ్యశ్రీకి అనారోగ్యం
● నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు ఇవ్వని ప్రభుత్వం ● వైద్యం చేయలేమని చేతులెత్తేస్తున్న ఆస్పత్రులు ● ఉమ్మడి కృష్ణా జిల్లాలో రోగుల అవస్థలు ఆరోగ్యశ్రీని పటిష్టంగా అమలు చేయాలి పేదలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి. నెట్వర్క్ ఆస్పత్రులకు పెండింగ్ ఉన్న బిల్లులన్నీ చెల్లించాలి. గత ఏడాది ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిననాడు ఉన్న పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం దుర్మార్గం. ప్రభుత్వ వైఖరితో నెట్వర్క్ ఆస్పత్రులు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి చేరుకున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించాలి. – డాక్టర్ మెహబూబ్ షేక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ వైద్య విభాగంఆరోగ్యశ్రీలో వైద్యం చేయడం లేదు గతంలో తెల్లకార్డు తీసుకుని ఆస్పత్రికి వెళితే రూపాయి ఖర్చు లేకుండా అన్నీ ఉచితంగా చేసేవాళ్లు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి వచ్చిన తర్వాత కూడా రోగి అకౌంట్లో డబ్బులు పడేవి. ఇప్పుడు ఆ డబ్బులు రావడం లేదు. వైద్యం కూడా పూర్తి ఉచితంగా చేయడం లేదు. కార్డు తీసుకుని ఆస్పత్రికి వెళితే కొంత మీరు డబ్బులు కట్టాలని అడుగుతున్నారు. అదేమంటే ప్రభుత్వం మాకు డబ్బులు ఇవ్వడం లేదు. ఏమి చేయమంటారు అంటున్నారు. – వేములకొండ విష్ణు, జి. కొండూరులబ్బీపేట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చిన సర్కారు దానిని ఏమార్చుతోంది. పేదలకు వైద్యం అందించిన ఆస్పత్రులకు బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో వైద్యం చేసేందుకు ఆస్పత్రుల యాజమాన్యాలు ఇష్టపడటం లేదు. ఇప్పటికే రెండు నెలల క్రితం ఈహెచ్ఎస్ సేవలు నిలిపివేసిన నెట్వర్క్ ఆస్పత్రులు పేదలను ఇబ్బంది పెట్టకూడదని మానవతా దృక్పథంతో సేవలు అందిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఆరోగ్యశ్రీని ఎత్తేసి, ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టడానికి బిల్లులు పెండింగ్‌లో ఉంచింది. ఒక్కో ఆస్పత్రిలో రూ.రెండు నుంచి రూ.3 కోట్ల వరకూ బిల్లులు రావాల్సి ఉండటంతో వైద్యం చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. దీంతో నిరుపేద రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇవే నిదర్శనం.. ● ఉయ్యూరుకు చెందిన 38 ఏళ్ల వెంకటేశ్వర్లు ద్విచక్ర వాహనంపై వెళుతూ స్పీడ్‌బ్రేకర్ వద్ద అదుపు తప్పి కింద పడ్డాడు. దీంతో ఎడమ మోకీలు లిగమెంటు తెగింది. దానికి రీ కన్స్ట్రక్షన్ సర్జరీ కోసం నగరం బయట ఉన్న ఓ ఆస్పత్రికి వెళ్లాడు. ముందుగా రూ.45 వేలు చెల్లించి ఆస్పత్రిలో చేరితే ఆరోగ్యశ్రీలో సర్జరీ చేస్తామన్నారు. కష్టపడి పనిచేసుకునే వాళ్లం అంత కట్టలేమని వెళ్లిపోయారు. ● రామవరప్పాడుకు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగికి మోకీలు అరిగిపోయింది. దానిని రీప్లేస్మెంట్ కోసం నగరంలోని ఆస్పత్రులన్నీ తిరిగినా ప్రయోజనం లేదు. ఈహెచ్ఎస్లో చేయలేమంటూ ఆస్పత్రుల యాజమాన్యాలు చేతులెత్తేశారు. చివరికి ఓ ఆస్పత్రికి వెళ్లగా రూ.60 వేలు అదనంగా కడితే చేస్తామన్నారు. ఇలా వీరిద్దరే కాదు ఇప్పుడు ఆరోగ్యశ్రీలో చికిత్స పొందాలంటే ఎంతోకొంత ఆస్పత్రికి చెల్లించుకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. డబ్బులు చెల్లించలేమంటే చికిత్స చేయలేమని ఆస్పత్రుల యాజమాన్యాలు నిర్మొహమాటంగా చెప్పేస్తున్నాయి. గతంలో ఇలా.. గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకంలో రోగుల వద్ద డబ్బులు వసూలు చేయాలంటేనే ఆస్పత్రుల వారు భయపడేవారు. అందుకు జిల్లాస్థాయిలో మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించడమే కారణం. ఒకవేళ ఏదైనా ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీలో రోగి వద్ద డబ్బులు కట్టించుకున్నట్లు ఆరోపణలు వస్తే విచారణ చేసి నిర్ధారణ అయితే డబ్బులు కట్టించుకున్న మొత్తానికి పదిరెట్లు అపరాధ రుసుం కింద వసూలు చేసే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రస్తుతం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులపై పర్యవేక్షణను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడంలో భాగంగానే అలా వ్యవహరిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. కొత్తగా తీసుకురావాలనుకుంటున్న ఇన్సూరెన్స్ స్కీమ్‌ను ఇప్పటికే నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒకవేళ దాన్ని తీసుకు వస్తే ముందుగా తమతో చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం అవేమి పట్టించుకోవడం లేదు. దీంతో పేదలకు వైద్యం అందని పరిస్థితి నెలకొంది. -
పట్టభిషేకం ఎవరికో!
గుంటూరు ఎడ్యుకేషన్: శాసనమండలి కృష్ణా– గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల(ఏసీ)లోని కౌంటింగ్ కేంద్రంలో భద్రపరచిన బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైంది. సోమవారం ఉద యం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదివారం ఏసీ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి పలు సూచన లు, సలహాలు అందజేశారు. అనంతరం జేసీ ఏ.భార్గ వ్ తేజతో కలిసి మీడియాతో నాగలక్ష్మి మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘ ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు చేపడుతున్నామని, ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని ఆమె తెలిపారు. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన అనంతరం అన్ని జిల్లాల బ్యాలెట్ బాక్సులు కౌంటింగ్ జరిగే ఏసీ కళాశాలలోని స్ట్రాంగ్ రూములో భద్రపర్చినట్లు చెప్పారు. పోలింగ్ 69.57 శాతంగా నమోదైన దృష్ట్యా దాదాపు 2.41 లక్షల ఓట్లు లెక్కించాల్సి ఉందన్నారు. 28 టేబుళ్లు ఏర్పాటు ఇందుకు 28 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బ్యాలెట్ పేపర్, మొదటి ప్రాధాన్యత ఓట్లు విధానంతో లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రక్రియ ప్రకారం కౌంటింగ్ సుమారు రెండు నుంచి మూడు రోజులు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రాథమికంగా కౌంటింగ్ మొదటి రౌండ్లో పోలింగ్ బూత్‌ల వారీగా పోలైన ఓట్లను సరిచూసుకొని మిక్సింగ్ చేస్తారన్నారు. తదుపరి చెల్లుబాటయ్యే ఓట్లను పరిశీలించి, మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం జరుగుతుందన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి నిర్దేశించిన కోటా ఓట్లు వచ్చిన అభ్యర్థిని గెలుపొందినట్టు ప్రకటిస్తారన్నారు. అభ్యర్థులు ఎవరికీ నిర్దేశిత స్థాయిలో ఓట్లు రాకపోతే ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ వారికి వచ్చిన తదుపరి ప్రాధాన్యత ఓట్లను ఇతర అభ్యర్థులకు పంచుతూ కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు. నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు గుంటూరు ఏసీ కళాశాలలో పూర్తయిన ఏర్పాట్లు వివరాలు వెల్లడించిన గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మూడు షిఫ్టుల్లో 750 మందికి విధులు.. ఓట్లు లెక్కింపు కోసం మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించేలా 750 మంది సిబ్బందికి వివిధ విధులను కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు సైతం ఏజెంట్లను మూడు షిఫ్టుల్లో నియమించుకునేలా అవకాశం కల్పించామన్నారు. కౌంటింగ్ ప్రదేశం మొత్తం మూడంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, గుర్తింపు కార్డు లేకుండా ఏ ఒక్కరిని కౌంటింగ్ ప్రాంతానికి అనుమతించబోమన్నారు. అదే విధంగా కౌంటింగ్ హాల్లోకి సెల్ఫోన్లు అనుమతించరని, పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే కౌంటింగ్ హాల్లోకి ఏజెంట్లను, కౌంటింగ్ సిబ్బందిని అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు తెలియజేసేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. వీటితో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశామన్నారు. -
ప్రైవేటుతో మిలాఖత్!
● నిబంధనలకు తిలోదకాలిస్తూ నియామకాలు ● చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులుగా ప్రైవేటు కళాశాలల అధ్యాపకుల నియామకం ● ఆయా కళాశాలలు సెంటర్లుగా ఉన్నచోటే వారికి విధులు ● ఇష్టారీతిన వ్యవహరిస్తున్న ఇంటర్మీడియెట్ అధికారులుమళ్లీ పరిశీలిస్తాం.. ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులను నియమించాం. నియమితులైన వారంతా ఎయిడెడ్ కళాశాలలకు చెందిన వారని అనుకుంటున్నా. అయినా ఒకసారి పరిశీలించి.. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకుంటాం. అవసరమయితే వారిని తొలగించి వేరే వారిని నియమిస్తాం. ప్రస్తుతం పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నిర్వహించడానికి అన్ని చర్యలు చేపట్టాం. – వీవీ సుబ్బారావు, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినర్, ఇంటర్మీడియెట్ పెడన: గత కొన్ని రోజులుగా ఇంటర్మీడియెట్ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. ప్రైవేటు కళాశాలలకు మేలు చేసే విధంగా వారు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. ఇటీవల ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ పరీక్ష ఎటువంటి సామగ్రి.. పరికరాలు లేని చోట నిర్వహించి ముక్కున వేలేసుకునేలా చేశారు. ఇప్పుడు ప్రారంభమైన ఇంటర్ పరీక్షలకు సంబంధించిన నియామకాల్లోనూ అవకతవకలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పరీక్ష కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటు అధికారులను నియమించే విషయంలో ప్రైవేటు కళాశాలలకు దాసోహమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా ప్రైవేటు కళాశాలలో(అన్ ఎయిడెడ్) పనిచేసే అధ్యాపకులను చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులుగా నియమించడమే కాకుండా.. వీరిని పరీక్ష కేంద్రాలుగా ఉన్న పలు ప్రైవేటు పాఠశాలల్లో విధులకు కేటాయించడం వివాదాస్పదమవుతోంది. నిబంధనలు ఇవి.. ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులను నియమించాలంటే కొన్ని నియమ నిబంధనలను ఇంటర్ బోర్డు స్పష్టంగా పేర్కొంది. ఎగ్జామ్స్ హ్యాండ్ బుక్ కూడా ప్రింట్ చేయించి ఉన్నతాధికారులకు పంపించారు. అందులోని పొందుపరిచిన వివరాల మేరకు.. ● ప్రభుత్వ కళాశాల జూనియర్ లెక్చరర్ సీనియార్టీ ఉన్న వారిని నియమించాలి. ● వీరు లేకపోతే ఎయిడెడ్ కళాశాలలో ఎయిడెడ్ లెక్చరర్ లేదా రెగ్యులర్ లెక్చరర్‌కు విధులు కేటాయించాలి. ఏపీఆర్జేసీ, ఏపీటీడబ్ల్యూర్జేసీ కంపోజిట్ కళాశాలల వారిని నియమించాలి. ● వీరు కూడా లేకపోతే ప్రభుత్వ కళాశాలలో రెగ్యులర్ ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్లకు విధులు కేటాయించాలి. ● వీరు కూడా లేకపోతే ప్రభుత్వ కళాశాలలో మినిమమ్ టైమ్ స్కేల్‌పై పనిచేసే వారిని నియమించాలి. ● వీరు కూడా లేకపోతే మూడేళ్లు సీనియర్టీ ఉన్న కాంట్రాక్టు అధ్యాపకులను నియమించాలి. ● వీరంతా లేకపోతే ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహించే స్కూలు అసిస్టెంట్ కేడర్వారిని చీఫ్ సూపరింటెండెంట్లుగా, డిపార్ట్మెంటు అధికారులుగా నియమించాలి. ● కానీ అందుకు విరుద్ధంగా ప్రైవేటు కళాశాలలకు చెందిన వారిని నియమించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.అడిగిన చోట విధులు.. అవనిగడ్డ, మొవ్వ, పామర్రు, చల్లపల్లి కళాశాలలో విధులు నిర్వహించేవారు మచిలీపట్నం నుంచే నిత్యం రాకపోకలు చేస్తుంటారు. వీరందరికీ మచిలీపట్నంలోనే పరీక్షల విధులు కేటాయించడం గమనార్హం. ఎవరు, ఎక్కడికి వెళతారంటూ చీఫ్ సూపరిండెంట్లకు, డిపార్ట్మెంటు అధికారులకు అవకాశం కల్పించడమే కాకుండా చివరకు ఇన్విజిలేటర్ విధులు కూడా వారు కోరుకున్న చోటకు సదరు అధికారులను ప్రసన్నం చేయించుకోవడం ద్వారా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. -
న్యాయమూర్తుల నివాస భవనాలు ప్రారంభం
గుడివాడ టౌన్: స్థానిక పోస్టాఫీస్ రోడ్‌లోని కోర్టు ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన న్యాయమూర్తుల నివాస భవనాలను కృష్ణాజిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ స్పెషల్ జడ్జి అరుణ సారిక ఆదివారం ప్రారంభించారు. న్యాయమూర్తులకు అధునాతన సౌకర్యాలతో నివాసాలు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో వీటిని నిర్మించామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో 11వ అదనపు జిల్లా జడ్జి జి. సుబ్రహ్మణ్యం, సీనియర్ సివిల్ జడ్జి వాసుదేవ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొడాలి హరినాథ్, సెక్రటరీ ఎం. నటరాజ్, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో పవళింపు సేవ పెదకల్లేపల్లి(మోపిదేవి): దక్షిణకాశీగా పేరుగాంచిన పెదకళ్లేపల్లిలో వేంచేసియున్న శ్రీ దుర్గా, పార్వతీ సమేత నాగేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం ఉదయం ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు శంకర మంచి భాస్కర విజయకుమార్, బుద్ధు నాగవరప్రసాద్ బ్రహ్మత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి 8 గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు చేసిన అనంతరం భక్తిశ్రద్ధలతో సంప్రదాయ బద్ధంగా స్వామివారి పుష్పశయ్యాలంకృత పవళింపు సేవను వేదపండితులు నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ‘ఏపీ హంస’ క్రీడా పోటీలు ప్రారంభం లబ్బీపేట(విజయవాడతూర్పు): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్(ఏపీ హంస) ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వాస్పత్రి, సిద్ధార్థ వైద్య కళాశాలలో పనిచేసే మహిళా ఉద్యోగులకు వైద్య కళాశాల ప్రాంగణంలో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో పెద్ద ఎత్తున మహిళా ఉద్యోగులు భాగస్వాములవుతున్నారు. వారికి టగ్ ఆఫ్ వార్, షాట్ పుట్, లెమన్ స్పూన్, స్పీడ్ వాకింగ్, మ్యూజికల్ చైర్స్, స్కిప్పింగ్, హ్యాండ్ బాల్ వంటి పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను ఉమ్మడి కృష్ణాజిల్లా ఏపీ హంస అధ్యక్షుడు వినుకొల్లు రామకృష్ణ పర్యవేక్షిస్తుండగా, కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా సహాధ్యక్షుడు సత్యనారాయణ బాబు, జాయింట్ సెక్రెటరీ పిచ్చేశ్వరరావు, రాష్ట్ర కమిటీ జాయింట్ జనరల్ సెక్రెటరీ జాన్ హెన్రీ తదితరులు పాల్గొన్నారు. విద్యారంగానికి నిధులు పెంచాలి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యారంగానికి బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎండీ రఫీ డిమాండ్ చేశారు. స్థానిక పీడీఎస్‌యూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యారంగానికి కేంద్ర బడ్జెట్లో 30శాతం, రాష్ట్ర బడ్జెట్లో 20శాతం, జీడీపీలో 6శాతం కేటాయించాలన్నారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్లో విద్యారంగానికి నిధులు కేటాయించినట్లు గొప్ప లు చెప్పుకుంటుందన్నారు. కానీ విద్యారంగంపై చిన్న చూపు చూస్తోందన్నారు. బడ్జెట్లో సంక్షేమ హాస్టళ్లు, విశ్వవిద్యాలయాల ప్రస్తావన లేకపోవడం శోచనీయమన్నారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులను దగా చేసిందన్నారు. నిరుద్యోగ భృతి ఊసే ఎత్తలేదన్నారు. ప్రధాన కార్యదర్శి ఎస్. కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. -
ముగిసిన ఎడ్ల పూటీ లాగుడు పోటీలు
నందిగామ రూరల్: మండలంలోని దాములూరు కూడలి సంగమేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణలో కల్యాణోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన ఎడ్ల పూటీ లాగుడు పోటీలు శనివారం అర్ధరాత్రితో ముగిశాయి. సీనియర్ విభాగంలో జరిగిన పూటీ లాగుడు పోటీలకు 14 జతల ఎడ్లు పాల్గొన్నట్లు రైతు కమిటీ సభ్యులు తెలిపారు. ఎనిమిది నిమిషాల వ్యవధి, ఆరుగురు వ్యక్తులతో రెండు క్వింటాళ్ల దూరాన్ని లాగేందుకు ఎడ్ల జతలు పోటీ పడ్డాయి. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పగడంవారిపాలెంకు చెందిన కేవీ రెడ్డి ఎడ్ల జత ఎనిమిది నిమిషాల వ్యవధిలో 3,110 అడుగుల దూరాన్ని లాగి ప్రథమ స్థానంలో నిలవగా.. బాపట్ల జిల్లా వేటపాలేంకు చెందిన మునగయ్య ఎడ్ల జత 2,727 అడుగులు, బాపట్ల జిల్లా ముత్తాయపాలెంకు చెందిన వెంకట మణికంఠ ఎడ్ల జత 2,659 అడుగులు, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం మోగులూరుకు చెందిన షేక్ హజ ఎడ్ల జత 2,458 అడుగులు, బాపట్ల జిల్లా ఆవులదొండివారిపాలెంకు చెందిన గోగినేని కార్తీక్ ఎడ్ల జత 2,447 అడుగులు లాగి వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాలలో నిలిచాయి. విజేతలకు వరుసగా రూ. 30 వేలు, 25వేలు, 20వేలు, 15 వేలు, 10 వేలను బహుమతిగా అందజేశారు. సీఐ వైవీఎల్ నాయు డు, సర్పంచ్ గాదెల వెంకట రామారావు, రైతు కమిటీ సభ్యులు గింజుపల్లి శ్రీనివాసరావు, చెరుకూరు సాంబశివరావు, వట్టికొండ చంద్రమోహన్, తులసీరావు, సిద్ధార్థ వీరబాబు పాల్గొన్నారు. -
పవన్‌ను కలిసినా జరగని న్యాయం.. తల్లి,కుమార్తె ఆత్మహత్యాయత్నం
సాక్షి,విజయవాడ : అదనపు కట్నం కోసం అత్తింటి అరళ్లు వేగలేకపోతున్నా న్యాయం చేయాలని ఓ బాధితురాలు హోంమంత్రి, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేని అర్జించింది. వాళ్లు పట్టించుకోకపోవడంతో తనకు ఇక చావే శరణ్యమనుకుంది. కుమార్తెతో కలిసి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటనలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకి ఏం జరిగిందంటే?విజయవాడలో ఆడపిల్లలు పుట్టారని కారణంగా చూపిస్తూ సుభాషిణి అనే మహిళను అత్తమామలు, భర్త, మరిది వేధింపులకు గురి చేసేవారు. ఆ వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వెళ్లింది. సుభాషిణి తన కుమార్తె (మైనర్)తో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది.ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ.. ఆడపిల్లలు పుట్టారని అదనపు కట్నం కోసం నా భర్త , అత్తమామలు, మరిది వేధిస్తున్నారు. నా భర్తను ఏడాది నుంచి మా ఇంటికి రానివ్వడం లేదు. నన్ను వదిలించుకోవడానికి గతంలో పిచ్చెక్కిందని పిచ్చాసుపత్రిలో చేర్పించారు. జనసేన కార్యాలయం చుట్టూ పది సార్లు తిరిగా. పవన్ కళ్యాణ్‌ను ఓ అన్నలా భావించా. న్యాయం జరుగుతుందనుకుని జనసేన కార్యాలయం చుట్టూ తిరిగా. ఓ పవన్ అభిమానిగా న్యాయం జరుగుతుందని నేను ఆశించా. ఆయన అపాయింట్మెంట్ కోసం ఎంతో ప్రయత్నించా ..దొరకనివ్వలేదు. ఫ్యామిలీ మ్యాటర్లో మేం ఇన్వాల్వ్ అవ్వమన్నారు. న్యాయం కోసం హోంమంత్రి అనితను కలిశా. అక్కడ న్యాయం జరగలేదు. జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ... నా సమస్య తీర్చమని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమాకు అప్పగించారు.బోండా ఉమా నా సమస్య తీర్చమని విక్రమ్ పబ్లిషర్స్ చక్రవర్తి దగ్గరకు పంపించారు. విక్రమ్ పబ్లిషర్స్ చక్రవర్తి నన్ను బెదిరించి .. తీవ్ర దూర్భషలాడారు. మేం ఉన్నంత వరకూ నీకు న్యాయం జరగదని చక్రవర్తి బెదిరించారు. నాకు న్యాయం జరగట్లేదు కాబట్టి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాం’ అని వాపోయారు. -
ముగిసిన బ్రహ్మోత్సవాలు
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరావతిలో వేంచేసియున్న బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం పూర్ణాహుతితో ముగిశాయి. తొలుత స్వామివారికి చూర్ణోత్సవంలో భాగంగా ఉత్సవమూర్తులకు స్నపన చేసి నూతన వస్త్రాలంకరణ చేశారు. అనంతరం స్వామివారికి వసంతోత్సవం నిర్వహించారు. ఆలయస్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ మాట్లాడుతూ రథోత్సవం పూర్తయిన స్వామివారికి చూర్ణోత్సవం, వసంతోత్సవం నిర్వహించటం ఆనవాయితీగా వస్తుందన్నారు. అనంతరం నిర్వహించే పూర్ణాహుతితో పంచాహ్నిక దీక్షతో నిర్వహించే బ్రహ్మోత్సవాలు ముగిశాయన్నారు. రాత్రి 10 గంటలకు నిర్వహించే ధ్వజారోహణ కార్యక్రమంతో స్వామివారి ఏకాంతసేవా మహోత్సవాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. వసంతోత్సవ అనంతరం స్వామివారిని పల్లకీలో గ్రామోత్సవం నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
‘ఇంటర్’ పరీక్షలు ప్రారంభం
జిల్లాలో 24,323 మంది విద్యార్థులు హాజరు చిలకలపూడి(మచిలీపట్నం): ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. పరీక్షల కోసం జిల్లాలో 63 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటిరోజు ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించారు. విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి 8.30 గంటల తర్వాత అనుమతించారు. 487 మంది గైర్హాజరు ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మొదటి సంవత్సరం ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షకు మొత్తం 24,810 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 24,323 మంది విద్యార్థులు హాజరయ్యారు. 487 మంది విద్యార్థులు హాజరుకాలేదు. ఇంటర్మీడియెట్ ప్రాంతీయ అధికారి పీబీ సాల్మన్‌రాజు చిలకలపూడి, మచిలీపట్నం పోలీస్స్టేషన్లలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి ప్రశ్నపత్రాల తరలింపు ప్రక్రియను ఆయన పరిశీలించారు. సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం బందరులోని నేషనల్ కాలేజ్, హిందూ, పద్మావతి కళాశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను ఆయన పరిశీలించారు. అక్కడ ఏర్పాటుచేసిన మౌలిక వసతులు పరిశీలించి సూచనలు చేశారు. జిల్లాలోని మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల సభ్యులు 15 కేంద్రాలను తనిఖీ చేశారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని ఆర్ఐవో సాల్మన్‌రాజు వివరించారు. -
వెబ్సైట్లో ఓపెన్ ఇంటర్ విద్యార్థుల హాల్‌టికెట్లు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆ సంస్థ వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యువీ సుబ్బారావు తెలిపారు. ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లను వారి గుర్తింపు కార్డులను పరీక్ష కేంద్రంలోని సూపరింటెండెంట్‌కు చూపించి పరీక్షకు హాజరుకావచ్చని పేర్కొన్నారు. కొంత మంది స్టడీ సెంటర్ల నిర్వాహకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లను సైతం అనుమతిస్తామని పేర్కొన్నారు. -
గ్రామీణ, పట్టణాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు ఆచరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని.. ఈ నేపథ్యంలో మార్చి 2 నుంచి 30వ తేదీ వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. రంజాన్ మాసం ప్రారంభం నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేసేందుకు కలెక్టర్ లక్ష్మీశ శనివారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, పోలీస్, విద్యుత్, మునిసిపల్, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అగ్నిమాపక తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ మసీదుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రార్థన సమయానికి ముందే తాగునీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఆటంకం కలగకుండా లైన్లను తనిఖీ చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. పోలీస్ యంత్రాంగం శాంతిభద్రతలను పర్యవేక్షించాలన్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. నమాజ్ అనంతరం ముస్లింలు ఆహార సామగ్రి కొనుగోలు చేయడానికి దుకాణాలు అందుబాటులో ఉండేలా అనుమతులు మంజూరు చేయాలని కార్మిక శాఖ అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రార్థనలు ఆచరించే ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, ఇతర ఉద్యోగులు గంట ముందే కార్యాలయాల నుంచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సూచించారు. వీసీలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బాని, జిల్లా వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ ఎండీ నూహూ అలీషా, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్, భద్రత, పారిశుద్ధ్య చర్యలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
పీహెచ్సీలో డీఎంహెచ్ఓ తనిఖీలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ మండలం గోళ్లమూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని ఆకస్మిక తనిఖీ చేశారు. పీహెచ్సీలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. గర్భిణులు, పిల్లలకు ఇస్తున్న టీకాలు, వ్యాక్సిన్ నిల్వలు, ఉష్ణోగ్రతల నిర్వహణ, రిజిస్ట్రేషన్ వంటి అంశాలను పరిశీలించారు. లేబొరేటరీలో పరీక్షలు చేస్తున్న వివరాలను తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న ఎన్సీడీ–సీడీ సర్వేను పరిశీలించారు. అక్కడి నుంచి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి చిన్నారులకు పెడుతున్న ఆహారాన్ని పరిశీలించి రుచి చూశారు. పిల్లల ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అక్కడి అంగన్వాడీలను ఆదేశించారు. కార్యక్రమంలో గోళ్లమూడి వైద్యాధికారి డాక్టర్ విజయ్‌కృష్ణ, ఏఎన్ఎంలు, సీహెచ్‌ఓలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. శరీరం కాలినవారికి ఉచిత ప్లాస్టిక్ సర్జరీలు లబ్బీపేట(విజయవాడతూర్పు): శరీరం కాలిన వారికి ఉచిత ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహించనున్నట్లు బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్ ట్రస్ట్ (బీఎస్ఎంఎస్) వ్యవస్థాపకురాలు నీహారి మండలి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ నెల 7వ తేదీ లోపు పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో జరిగే ఘటనల కారణంగా జరిగే ప్రమాదాల్లో శరీరంలోని కొన్ని భాగాలు కాలిపోతుంటాయని, అలాంటివారు ఆత్మన్యూనత భావానికి గురవుతుంటారని పేర్కొన్నారు. ఇలాంటివారు చికిత్స చేయించుకునేందుకు అవసరమైన ప్లాస్టిక్ సర్జరీ విధానం చాలా ఖరీదుగా ఉంటుందని తెలిపారు. వారి కోసం పూర్తిగా ఉచితంగా సేవలు అందించేందుకు బీఎస్ఎంఎస్ను స్థాపించినట్లు పేర్కొన్నారు. సేవలు పొందాలనుకునే వారు 78160 79234 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. గురుకుల పాఠశాల, కళాశాలలో ఆకస్మిక తనిఖీ మోపిదేవి: మోపిదేవి మహాత్మా జ్యోతిబాపూలే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల(బాలురు), జూనియర్ కళాశాలను బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.సత్యనారాయణ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. 10వ తరగతి విద్యార్థులు, ఇంటర్మీడియెట్ విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడి వసతి గృహంలో భోజనం, టాయ్‌లెట్స్ పరిశీలించారు. ఇంటర్మీడియెట్ పరీక్షలు బాగా రాసి మంచి ర్యాంకులు సాధించాలని, పదో తరగతి విద్యార్థులు నూటికి నూరుశాతం ఉత్తీర్ణత పొందడానికి స్ఫూర్తిని నింపారు. జిల్లా బీసీ సంక్షేమ అధికారి రమేష్, కళాశాల ప్రిన్సిపాల్ వీర రవి ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. జాతీయ యోగా పోటీలకు ఎస్ఆర్ఆర్ వ్యాయామ అధ్యాపకుడు మధురానగర్(విజయవాసెంట్రల్): మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వ్యాయామ అధ్యాపకుడు డాక్టర్ డి. యుగంధర్ జాతీయ యోగా పోటీలకు ఎంపికయ్యారు. ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఇటీవల నిర్వహించిన జిల్లా, రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో విజయం సాధించిన డాక్టర్ యుగంధర్ ఆలిండియా సివిల్ సర్వీసెస్ యోగాసన కాంపిటీషన్లో పాల్గొనడానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శనివారం కళాశాలలో యుగంధర్‌ను ప్రిన్సిపాల్ డాక్టర్ కె. భాగ్యలక్ష్మి, అధ్యాపకులు అభినందించారు. పోటీల్లో విజయం సాధించి కళాశాల పేరు ప్రఖ్యాతులు ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. ఆదివారం పోటీల్లో పాల్గొనేందుకు యుగంధర్ బయలుదేరనున్నట్లు తెలిపారు -
న్యాయ విద్యార్థులు ప్రతి అంశాన్ని అధ్యయనం చేయాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): న్యాయ విద్యార్థులు ప్రతి అంశాన్ని ఆధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, సామాజిక ఇంజినీర్లుగా వారి కర్తవ్యాలను విలువలతో నిర్వహించాలని ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్ అన్నారు. గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఏఐఎల్యూ ఆధ్వర్యంలో శనివారం న్యాయ విద్యార్థుల రాష్ట్ర సదస్సు జరిగింది. ముఖ్య అతిథి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ నూతనంగా వచ్చిన చట్టాలను అధ్యయనం చేయాలని, వస్తున్న మార్పులను పరిగణలోకి తీసుకుని సమాజ హితానికి ఎలా ఉపయోగ పడాలో ఆలోచించాలన్నారు. ఏఐఎల్యూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎస్.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ న్యాయ విద్యార్థులు వారి చదువుతో పాటుగా, సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించాలన్నారు. న్యాయవాదులు సంపాదన కంటే సామాజిక బాధ్యతకే ప్రాధాన్యమివ్వాలన్నారు. వీఐటీ యూని వర్సిటీ లా స్కూల్ డీన్ డాక్టర్ చక్యా బెనర్జీ మాట్లాడుతూ ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు జరిగే ఉద్యమాలలో న్యాయ విద్యార్థులు భాగస్వామ్యం కావాలని సూచించారు. కార్యక్రమంలో సిద్ధార్థ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ దివాకర్‌బాబు, గుంటూరు జె.సి.న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.హెచ్.సుధాకర్ బాబు తదితరులు మాట్లాడారు. -
రసవత్తరంగా పూటీ లాగుడు పోటీలు
నందిగామ రూరల్: మండలంలోని దాములూరు కూడలి సంగమేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణలో కల్యాణోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న సీనియర్ విభాగం ఎడ్ల పూటీ లాగుడు పోటీలు శనివారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో మొత్తం 14 జతల ఎడ్లు పాల్గొన్నట్లు రైతు కమిటీ సభ్యులు తెలిపారు. ఎనిమిది నిముషాల వ్యవధి, ఆరుగురు వ్యక్తులతో రెండు క్వింటాళ్ల దూరాన్ని లాగేందుకు ఎడ్ల జతలు పోటీ పడ్డాయి. అర్ధరాత్రి వరకు పోటీలు కొనసాగాయి. పోటీల్లో పాల్గొన్న ఎడ్ల జతల యజమానులకు మొమెంటోలను అందజేశారు. జూనియర్ విభాగం విజేతలు.. సంగమేశ్వర స్వామి వారి కల్యాణోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన జూనియర్ విభాగం ఎడ్ల పూటీ లాగుడు పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం సోపిరాలకు చెందిన విజయలక్ష్మి ఎడ్ల జత ఎనిమిది నిమిషాల వ్యవధిలో 3,514 అడుగుల దూరాన్ని లాగి ప్రథమ స్థానంలో నిలిచింది. కృష్ణాజిల్లా మోపిదేవి మండలం కె.కొత్తపాలెంకు చెందిన నాని ఎడ్ల జత 3,373 అడుగులు, గుంటూరు జిల్లా కాకుమాను మండలం గార్లపాడుకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి ఎడ్ల జత 3,350 అడుగులు, కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం కళ్లెంవారిపాలెంకు చెందిన హనూష్రెడ్డి ఎడ్లజత 3,323 అడుగులు, ఎన్టీఆర్ జిల్లా వత్సవాయికి చెందిన ప్రభాకర్ రెడ్డి ఎడ్ల జత 3,279 అడుగులు లాగి వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచిన విజేతలకు వరుసగా రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలను అందజేశారు. ఆరవ స్థానంలో నిలిచిన ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన శ్రీనివాసరెడ్డి ఎడ్ల జతకు ప్రత్యేక బహుమతిగా రూ.ఐదు వేలను అందజేశారు. కార్యక్రమంలో రెఫరీ నాగిరెడ్డి, సర్పంచ్ గాదెల వెంకట రామారావు, రైతు కమిటీ సభ్యులు గింజుపల్లి శ్రీనివాసరావు, సాంబశివరావు, వట్టికొండ చంద్రమోహన్, తులసీరావు, సిద్ధార్థ వీరబాబు, శ్రీరాంబ్రహ్మం, శ్రీనివాసరావు, నరసింహారావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
శుభాలనిచ్చే రంజాన్
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ముస్లింలకు రంజాన్ మాసం అత్యంత పవిత్రమైనది. ఈ నెలలో చేసే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం ఎన్నోరెట్ల ఫలితాలను అందిస్తుందని వారి విశ్వాసం. ఆదివారం నుంచి ఉపవాసదీక్షలు ప్రారంభమవుతాయని మతపెద్దలు తెలిపారు. రంజాన్ ప్రత్యేక నమాజ్‌లకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మసీదులు ముస్తాబయ్యాయి. ఖురాన్ అవతరించిన మాసం రంజాన్‌ను దివ్య ఖురాన్ భూమిపై అవతరించిన మాసంగా భావిస్తారు. ఈ నెల మొత్తం ముస్లింలు భక్తి శ్రద్ధలతో కఠిన ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. ఈ నెలలో ‘సఫిల్’ చదివితే ‘ఫరజ్’ చదివినంతగా.. అంటే 70 సార్లు నమాజ్ చేసిన పుణ్యం వస్తుందని ఇస్లాం గ్రంథాలు ప్రబోధిస్తున్నాయి. ఈ మాసంలో ముస్లింలు దానధర్మాలకు (జకాత్, ఫిత్రాకు) ప్రాధాన్యమిస్తారు. ఈ నెల రోజుల్లో చేసిన దానాలు 70 రెట్లు అధిక ఫలితాన్ని అందిస్తాయని వారి నమ్మకం. ఈ నెలలో తాక్రాత్ రోజులకు ప్రత్యేకత ఉంది. ప్రతి ముస్లిం ఫిత్రా (నిర్ణీత దానం) తప్పనిసరిగా చేయాలి. ప్రార్థనలకు ప్రత్యేక ఏర్పాట్లు రోజా (ఉపవాసదీక్ష) పాటించే ముస్లింలు నమాజ్‌కు మొదటి ప్రాధాన్యమిస్తారు. దీని కోసం ఉమ్మడి జిల్లాలోని అన్ని మసీదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యోదయానికి ముందు (సహర్) నుంచి సూర్యాస్తమయం (ఇఫ్తార్) వరకూ ఉపవాసదీక్షలు పాటిస్తారు. దీక్షలో రోజుకు ఐదు పూటలా నమాజు చేస్తారు. దీనికి అదనంగా ‘తరావిహ్’ నమాజ్‌ను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకూ సాగే ‘తరావిహ్’ నమాజులో ఖురాన్ పఠనం చేస్తారు. విజయవాడలో వందేళ్లకు పూర్వమే మసీదులను ఏర్పాటు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. సరాయి మసీదు, జుమ్మా మసీదుకు రంజాన్ మాసంలో రోజూ వందల సంఖ్యలో ముస్లింలు హాజరై సామూహిక నమాజ్‌లో పాల్గొంటారు. నగరంలోని వించిపేట, ఇస్లాంపేట, భవానీపురం, అరండల్‌పేట తదితర ప్రాంతాల్లో హలీం దుకాణాలు ఏర్పాటయ్యాయి. పవిత్రమైన మాసం రంజాన్ మాసం చాలా పవిత్రమైనది. ఈ నెల రోజులు మానవ జీవనాన్ని ఎంతగానే ప్రభావితం చేసే అనేక విషయాలను ఖురాన్ వివరించింది. వాటిని ఆచరిస్తే మానవ జీవితం సన్మార్గంలో పయనిస్తుంది. భగవంతుడి కృప లభిస్తుంది. – నయీమ్ ఖదీర్, ఇమామ్, షాహీమసీద్, విజయవాడ నేటి నుంచి ప్రారంభం ప్రత్యేక ప్రార్థనలకు మసీదుల ముస్తాబు -
మహిళా హ్యాండ్‌బాల్ పోటీలకు కృష్ణా వర్సిటీ
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): తమిళనాడులోని పెరియార్ విశ్వవిద్యాలయంలో ఈ నెల మూడు నుంచి జరిగే దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయాల మహిళా హ్యాండ్‌బాల్ పోటీలకు కృష్ణా విశ్వవిద్యాలయం జట్టు పాల్గొనబోతుందని కేబీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణవేణి తెలిపారు. కళాశాల నుంచి లోకేశ్వరి, సీహెచ్ ద్వారకేశ్వరి, టి.అరుణనాగదుర్గ, బి.సత్య, జి.మానస, వి.సుప్రియ, ఆంధ్ర లయోలా కళాశాల నుంచి డి.విజయలక్ష్మి, కె.గోత్రిని, బి.సుమశ్రీ, సిద్ధార్థ మహిళా కళాశాల నుంచి వర్షిని, సీహెచ్ భవ్య శ్రీ, డాక్టర్ లక్కిరెడ్డి హనిమిరెడ్డి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నుంచి ఎస్డీ జాస్మిన్, లీలపద్మజ, ఎస్‌పీఎంహెచ్ కళాశాల మచిలీపట్నం నుంచి మహాలక్ష్మి, వికాస్ కాలేజీ నుంచి కె.శ్రీవిద్య ఎంపికై నట్లు పేర్కొన్నారు. -
కోతల బడ్జెట్ ఇది.. మూడు సిక్స్‌లు ఎగిరిపోయాయి: బీవీ రాఘవులు
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వ బడ్జెట్.. కోతల బడ్జెట్ అంటూ ఎద్దేవా చేశారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. అభివృద్ధి, సంక్షేమం ఊసే లేని బడ్జెట్ ఇది. మహిళలు, నిరుద్యోగులకు మొండి చేయి చూపారని ఆరోపించారు. బడ్జెట్లో సమగ్రత లేదు అంటూ వ్యాఖ్యానించారు.సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఇది కోతల బడ్జెట్ మాత్రమే. ఆదాయాన్ని పెంచుకునే అంకెలు అన్నీ మోసపూరితమైనవి. సొంత పన్నులు 15వేల కోట్లు పెరుగుతాయని చెప్పారు. ఎలా పెరుగుతాయి చెప్పాలి. రెవెన్యూ ఎస్టిమేషన్, ఖర్చుల ఎస్టిమేషన్ కోత పడబోతుంది. ఎర్ర చందనం అమ్మకం ద్వారా తీసుకొస్తారా? లేక మద్యం తాగించి వసూళ్లు చేస్తారా?. బడ్జెట్లో సమగ్రతే లేదు. అభివృద్ధి, సంక్షేమం ఊసే లేని బడ్జెట్ ఇది. కేంద్రం వాటాపై ఒక మాట కూడా మాట్లాడలేదు.ప్రభుత్వం ప్రారంభంలోనే సూపర్ సిక్స్ల్లో మూడు సిక్స్‌లు ఎగిరిపోయాయి. మిగిలినవి కూడా సంఖ్యల తగ్గిస్తారు. మహిళలు, నిరుద్యోగులకు మొండి చేయి చూపారు. వర్గీకరణ చేసిన తర్వాత డీఎస్సీ ఇస్తామని ఉద్యోగాలు ఎగ్గొట్టె ప్రయత్నం చేస్తోంది. వ్యవసాయశాఖ అంకెలు చూస్తే కడుపు తరుక్కుపోతోంది. ఇరిగేషన్‌పై ఖర్చు తగ్గించారు. 54 మండలాలు ఇప్పటికే కరువు మండలుగా ప్రకటించారు. తక్కువ ఖర్చుతో పూర్తి చేసే ప్రాజెక్టులు పూర్తి చేయాలి. మూలధనం వ్యయం 40వేల కోట్లు.. రెవెన్యూ వ్యయం లక్ష కోట్లుగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. -
బందరు జీజీహెచ్‌లో మౌలిక వసతులకు ప్రాధాన్యం
చిలకలపూడి(మచిలీపట్నం): కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులు రూ. 45 లక్షలతో మచిలీపట్నం సర్వజన ఆస్పత్రిలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. వైద్యాధికారులు ప్రభుత్వాస్పత్రిలో పరిస్థితులను వివరిస్తూ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరుగుతున్న దృష్ట్యా అదనంగా మంచాలు, ఎక్స్‌రే వంటి వైద్య పరికరాలు, ఆపరేషన్ థియేటర్లో బెడ్లు, టేబుళ్లు, ఐసీయూ బెడ్లు వంటివి అవసరం ఉందని కలెక్టర్‌కు వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ రూ. 20 లక్షలతో ఎక్స్‌రే సీఆర్ సిస్టమ్, ఇతర పరికరాల కొనుగోలుకు మరో రూ. 25 లక్షలు సీఎస్ఆర్ నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి. ఆశాలత, డీసీహెచ్ఎస్ ఎం. జయకుమార్, సీపీవో గణేష్‌కృష్ణ పాల్గొన్నారు.కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
ఘనంగా అక్కినేని విగ్రహావిష్కరణ
గుడివాడ టౌన్: ప్రముఖ సినీ నటుడు, గుడివాడ ప్రాంతవాసి అక్కినేని నాగేశ్వరరావు విగ్రహావిష్కరణ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విశ్వభారతి విద్యాసంస్థల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో స్థానిక రాజేంద్రనగర్‌లోని విశ్వభారతి హైస్కూల్ ప్రాంగణంలో అక్కినేని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ జరిగింది. అక్కినేని మనుమడు సుమంత్ ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ తమ తాత అక్కినేని నాగేశ్వరరావుకు విశ్వభారతి అధినేత పొట్లూరి శ్రీమన్నారాయణకు మంచి స్నేహం ఉండేదన్నారు. తాత మృతి చెంది ఏళ్లు అయినా కూడా ఆ బంధం తమ కుటుంబ సభ్యులతో ఇంకా కొనసాగుతుందని చెప్పారు. ఆయనను గుర్తు చేసుకుంటూ ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీమన్నారాయణ కుటుంబ సభ్యులకు, విశ్వభారతి యాజమాన్యానికి తాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. కార్యక్రమంలో నాగ సుశీల, సుప్రియ, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు.విగ్రహాన్ని ఆవిష్కరించిన అక్కినేని కుటుంబసభ్యులు -
సహకార రంగం బలోపేతానికి చర్యలు
చిలకలపూడి(మచిలీపట్నం): సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు జిల్లా సహకార అధికారి కె. చంద్రశేఖరరెడ్డి అన్నారు. కేడీసీసీ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం పీఏసీఎస్ సీఈవోలతో సమావేశాన్ని నిర్వహించారు. డీసీవో మాట్లాడుతూ 2025ను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించారన్నారు. సహకార సంస్థలు మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తాయనే అంశంపై ఈ ఏడాది సహకార రంగంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చేలా ప్రణాళికను రూపొందిస్తున్నారన్నారు. స్థిర అభివృద్ధి లక్ష్యాలు 2030 నాటికి అందుకోవాలంటే ప్రపంచ దేశాలు సహకార రంగంలో పురోగమిస్తేనే సాధ్యమవుతుందని ఐక్య రాజ్యసమితి గుర్తించటం అభినందనీయమన్నారు. జిల్లాలోని పీఏసీఎస్‌లలో కంప్యూటరీకరణ చివరిదశకు చేరుకుందని ఈ నెలాఖరు నాటికి నూరుశాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మెరుగైన సేవలే లక్ష్యం.. కేడీసీసీ బ్యాంకు సీఈవో శ్యామ్‌మనోహర్ మాట్లాడుతూ కంప్యూటరీకరణ ప్రక్రియ ఎదురయ్యే సాంకేతిక సమస్యలను అధిగమిస్తూ త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డివిజనల్ కో–ఆపరేటివ్ అధికారి ఫణికుమార్ మాట్లాడుతూ కంప్యూటరీకరణ చేస్తే ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించవచ్చునన్నారు. జనరల్ మేనేజర్ బీఎల్ చంద్రశేఖర్, కేబీ రంగరాజు తదితరులు పాల్గొన్నారు. తొలుత ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కో–ఆపరేటివ్స్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. డీసీవో చంద్రశేఖరరెడ్డి -
అంకితభావంతో సేవలు చేస్తే గుర్తింపు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉద్యోగులు అంకితభావంతో అందించే సేవలే గుర్తింపు తెస్తాయని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. నగరంలో డీఎంహెచ్ఓ కార్యాలయంలోని గణాంక విభాగంలో పనిచేస్తూ శుక్రవారం పదవీ విరమణ చేసిన కొక్కిర నాగమణిని కార్యాలయ ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ ఉద్యోగ విరమణ అనేది ప్రతి ఉద్యోగికి జరిగే సాధారణ ప్రక్రియ అని, వారి అంకిత భావం, ప్రవర్తన ముఖ్యమైనవన్నారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ వై.శరత్ బాబు, డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఇందుమతి, ఎన్హెచ్ఎం, డీపీఎం డాక్టర్ నవీన్, బూచవరం, వెలగలేరు, కొండపల్లి, లింగాలుపాడులో పని చేసే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక అక్షరాస్యత అందరికీ అవసరం కంకిపాడు: ఆర్థిక అక్షరాస్యత అందరికీ అవసరమని కృష్ణా జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సి.రవీంద్రరెడ్డి అన్నారు. ఆర్బీఐ సారథ్యంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు –2025 పురస్కరించుకుని గొడవర్రు జెడ్పీ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులకు బ్యాంకింగ్ వ్యవస్థ–పొదుపు అంశంపై క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన టి.శారద, డి.ఉపాదేవి, కె.శ్రీదేవికి బహుమతులు అందించారు. రవీంద్రరెడ్డి మాట్లాడుతూ మహిళలు పొదుపుపై అవగాహన పెంచుకోవాలన్నారు. దీంతో ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. బ్యాంకింగ్ సేవలు వినియోగించుకుని ఆర్థిక వృద్ధి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం సుబ్రహ్మణ్యం, ఆర్థిక అక్షరాస్యత కేంద్ర కౌన్సిలర్ సునీల్ పాల్గొన్నారు. పశువులకు సకాలంలో టీకాలు వేయాలిగాంధీనగర్(విజయవాడసెంట్రల్): పశువులకు అవసరమైన టీకాలను సకాలంలో అందించి, పూర్తిస్థాయిలో వ్యాధులను అరికట్టేందుకు కృషిచేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ.. పశుసంవర్థక శాఖ అధికారులతో కలిసి గాలికుంటు వ్యాధి, బ్రూసెల్లోసిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ మార్చి 1 శనివారం నుంచి 30వ తేదీ వరకు పశువులకు గాలి కుంటువ్యాధి, బ్రుసెల్లోసిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాలుగు నెలల వయసు దాటిన పశువులకు గాలికుంటువ్యాధి నిరోధక టీకాలు, 4–8 నెలల వయసున్న పెయ్యదూడలకు బ్రుసెల్లోసిస్ నిరోధక టీకాలు పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఉచితంగా రైతు వద్దే వేయాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ ఎం.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. కేయూలో సైన్స్ దినోత్సవంకోనేరుసెంటర్: సైన్స్‌లో రోజురోజుకు విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని కృష్ణా విశ్వవిద్యాలయం రెక్టర్ ఆచార్య ఎంవీ బసవేశ్వరావు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యాన నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. తొలుత సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్ఎస్ఎస్ విభాగం సమన్వయకర్త డాక్టర్ శ్రావణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు, రసాయన శాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ సుజాత, పలువురు ఆచార్యులు, సహాయ ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.