Kurnool
-
పోసాని రిలీజ్ అడ్డుకునే కుట్ర.. ఎల్లో మీడియాలో హింట్!
కర్నూలు, సాక్షి: వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం ఫలితంగా.. కూటమి కక్ష సాధింపు చర్యల నుంచి నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట దక్కింది. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో ఇప్పటికే బెయిల్ లభించింది. ఈ తరుణంలో ఆయన ఇవాళ ఆయన కర్నూలు జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో రిలీజ్‌కు బ్రేక్ పడింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ పెట్టారంటూ పోసానిపై 5 నెలల కిందట ఏపీ సీఐడీ(AP CID) కేసు నమోదు చేసింది. తాజా కేసుల నుంచి ఊరటతో ఆయన జైలు నుంచి విడుదల కాబోతుండగా.. హఠాత్తుగా ఆ కేసును తెరపైకి తెచ్చారు. ఆఘమేఘాల మీద గుంటూరు కోర్టులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేయగా.. కోర్టు సీఐడీ విజ్ఞప్తికి అనుమతించింది. దీంతో.. ఈ ఉదయం సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లారు. పీటీ వారెంట్‌పై పోసానిని కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు సమాచారం. జైలు నుంచే వర్చువల్‌గా జడ్జి ఎదుట ప్రవేశపెడతారని తెలుస్తోంది. పోసానిపై సీఐడీ నమోదు చేసిన కేసు వివరాలు తెలియాల్సి ఉంది. పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) పై మొత్తం ఏపీ వ్యాప్తంగా 30 ఫిర్యాదులకుగానూ 17 కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 26వ తేదీన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసుకు గానూ ఆయన అరెస్ట్ అయ్యారు. అయితే న్యాయస్థానాల్లో ఊరట దక్కవచ్చనే ఉద్దేశంతోనే.. వరుసగా ఒక్కో పీఎస్‌లో నమోదైన కేసుకుగానూనా ఆయన్ని తరలిస్తూ వచ్చారు. అలా 2 వేల కిలోమీటర్లకుపైగా తిప్పి పోసానిని హింసించారు. అయితే చివరకు.. న్యాయమే గెలిచింది. బీఎన్ఎస్ సెక్షన్ 111 ప్రకారం వ్యవస్థీకృత నేరాల కింద కేసుల నమోదుకు న్యాయస్థానాలు సమ్మతించలేదు. పోసానిపై నమోదు చేసిన కేసులకు ఆ సెక్షన్ వర్తించదని స్పష్టం చేశాయి. పోసాని కృష్ణ మురళిపై నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిళ్లు మంజూరు చేశాయి.అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో కేసు.. బెయిల్‌పల్నాడు జిల్లా నరసరావుపేటలో కేసు.. బెయిల్‌ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురం పీఎస్‌లో కేసు.. బెయిల్‌కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసు.. బెయిల్ హైకోర్టులో ఆయనపై పెట్టిన కొన్ని కేసులు.. క్వాష్ మరోవైపు.. పోసాని కృష్ణమురళిపై కూటమి ప్రభుత్వం తన అనుకూల మీడియా ద్వారా విషం చిమ్ముతోంది. ఆయన విడుదలపై సందిగ్ధం నెలకొందంటూ ముందుగానే కథనాలు ఇచ్చేసింది. పోసానిపై పలుచోట్ల కేసులున్న నేపథ్యంలో ఆయన విడుదలయ్యే లోపు, ఇతర జిల్లాల నుంచి ఏ స్టేషన్ పోలీసులైనా వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లొచ్చంటూ పేర్కొనగా.. ఈలోపే సీఐడీ ఆయన విడుదలను అడ్డుకునేందుకు తెర మీదకు రావడం గమనార్హం. -
చౌడేశ్వరీ మాతను దర్శించుకున్న బాలనటి శ్రీదేవి
బేతంచెర్ల: పట్టణానికి సమీపంలోని కొలుములపల్లె రహదారిలో వెలసిన చౌడేశ్వరీ మాతను బింబిసారలో బాలనటిగా నటించిన శ్రీదేవి మంగళవారం దర్శించుకున్నారు. ఈసందర్భంగా చౌడేశ్వరీ మాత ఆలయంలో తల్లిదండ్రులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బేతంచెర్ల పట్టణానికి చెందిన శ్రీహరి గౌడ్, భార్య లక్ష్మి వృత్తి రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. నందమూరి కళ్యాన్‌రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమాలో బాలనటిగా శ్రీదేవి నటించింది. మాటీవీలో చిన్ని, జీటీవీలో కళ్యాణ వైభోగం సీరియల్తోపాటు కొత్తగా రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శాంతి భద్రతలకువిఘాతం కలిగిస్తే చర్యలు ● ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆలూరు రూరల్: శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. స్థానిక పోలీసు స్టేషన్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణాన్ని పరిశీలించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, వాహన తనిఖీలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అసాంఘిక కార్యకలాపాలపై నిఘా వేసి ఉంచాలన్నారు. అనంతరం స్టేషన్‌లోని రికార్డులు పరిశీలించి శాంతి భద్రతలపై సీఐ వెంకటచలపతి, ఎస్ఐ దిలీప్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రాణం తీసిన మలుపు ● బైకు అదుపుతప్పి యువకుడి మృతి కొత్తపల్లి: మూల మలుపు వద్ద బైకు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని శివపురం గ్రామానికి చెందిన హరికృష్ణయాదవ్(37) ఆత్మకూరు మండలం కొట్టాలచెరువు గ్రామ సమీపంలో లింగమయ్య స్వామిని దర్శించుకుని పల్సర్ బైకుపై ఇంటికి తిరుగు పయనం అయ్యాడు. శివపురం గ్రామ పోలిమేరలోని జమ్ములమ్మ గుడి వద్ద మలుపు ఉండటంతో బైకు అదుపు తప్పి రోడ్డు పక్కన పిచ్చి మొక్కల మధ్య ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో పడి ఉండగా అటుగా వెళ్తున్న ప్రయాణికులు గమనించి గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని కొత్తపల్లికి, అక్కడి నుంచి ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య శ్రావణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొత్తపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. -
కర్ణాటక బస్సు ఢీకొని వ్యక్తి మృతి
నందవరం: కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తుతెలి యని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మండల పరిధిలోని హాలహర్వి – చిలకడోణ గ్రామాల మధ్య కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం వద్ద చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. మతిస్థిమిత్తం లేని, గుర్తు తెలియని వ్యక్తి కేజీబీవీ వద్ద జాతీయ రహదారి దాటుతుండగా బెంగళూరు నుంచి మంత్రాలయం వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొంది. ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి కాళ్లకు, తలకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అంబులెన్స్‌లో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతిచెందాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కొండముచ్చు దాడిలో ఇద్దరికి గాయాలు కొలిమిగుండ్ల: బందార్లపల్లెలో కొండ ముచ్చు గ్రామస్తులను హడలెత్తిస్తోంది. మంగళవారం ఎస్సీ కాలనీకి చెందిన ఓబులేసుపై దాడి చేయడంతో చెంపకు, మక్కల నాగేంద్ర వీపుపై రక్తగాయాలయ్యాయి. వారం రోజుల నుంచి కొండముచ్చు గ్రామంలో తిష్టవేయడంతో పిల్లలు, మహిళలు, వృద్ధులు భయభ్రాంతులకు గురవుతున్నారు. బయటకు వెళ్లాలంటే ఎప్పుడు వచ్చి దాడి చేస్తోందనని ఆందోళన చెందుతున్నారు. వీధుల్లో సంచరిస్తూ ఇళ్ల ముందు తిష్టవేస్తుండటంతో మహిళలు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. అటవీ శాఖాధికారులు స్పందించి గ్రామంలో నుంచి కొండముచ్చును తరలించే చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు. నేడు వాహనాల వేలం కర్నూలు: వివిధ ఎకై ్సజ్ నేరాల్లో పట్టుబడిన వాహనాలను బుధవారం వేలం వేయనున్నట్లు కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ సీఐ చంద్రహాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు వేలం ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఆసక్తి ఉన్నవారు దరావత్ సొమ్ము చెల్లించి వేలంలో పాల్గొనాలని పేర్కొన్నారు. స్థానిక ఎకై ్సజ్ స్టేషన్లో వేలం ప్రక్రియ ఉంటుందని సీఐ వెల్లడించారు. -
సారా తయారీ మానుకోకపోతే పీడీ చట్టం
కర్నూలు: నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలు మానుకోకపోతే పీడీ చట్టంతో జైలుకు పంపుతామని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి హెచ్చరించారు. నవోదయం 2.0లో భాగంగా కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని గుడంబాయి తండా, గుమ్మితం తండాల్లో మంగళవారం నాటుసారా వినియోగం వల్ల కలిగే అనర్థాలపై సీఐ చంద్రహాస్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్.హనుమంతరావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సారీ తయారీని మానుకుని ప్రత్యామ్నాయ ఉపాధితో గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపాలని సూచించారు. సీఐ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కాలకూట విషం
పొలాల్లో, ఇంటి పరిసరాల్లో పెరిగిన కలుపు తీసేందుకు వాడే పారాక్వాట్ క్రిమిసంహారక మందు ఇప్పుడు మనుషుల ప్రాణాలు తీసేందుకు ఎక్కువగా ఉపయోగపడుతోంది. గ్రామాల్లోని రైతుల ఇళ్లల్లో, పొలాల్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఈ మందు, ఇప్పుడు పట్టణాల్లోని వారికి సైతం సులభంగా ఫెర్టిలైజర్స్ షాపుల్లో లభ్యమవుతోంది. దీంతో క్షణికావేశంలో దీనిని తాగి ప్రాణాలు తీసుకుంటున్నారు. యాసిడ్ కంటే పదుల రెట్ల గాఢత కలిగిన ఈ ద్రావణాన్ని తాగిన వారు 99 శాతం మరణిస్తారని వైద్యులు చెబుతున్నారు. – కర్నూలు(హాస్పిటల్) ● కర్నూలు మెడికల్ కాలేజీకి చెందిన ఓ వైద్యవిద్యార్థిని గత నెల 14న పారాక్వాట్ అనే విషరసాయనం తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కర్నూలు, అనంతపురం ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆమెను బతికించేందుకు తల్లిదండ్రులు చేయని ప్రయత్నం లేదు. ఇప్పటికే కొన్ని రూ.లక్షలలు ఆమె వైద్యం కోసం ఖర్చు చేశారు. అయినా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. ● కర్నూలు నగరంలోని బి.క్యాంపునకు చెందిన ఓ యువతి(19) ప్రేమించిన వాడు దూరమవుతాడన్న ఆందోళనతో ఈ నెల 9న పారాక్వాట్ రసాయన మందు తాగింది. చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రెఫర్ చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. పారాక్వాట్ రసాయనం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు ఓపీ పాయిజన్ కేసులుగా వచ్చే వాటిలో అధిక శాతం పారాక్వాట్ క్రిమిసంహారక రసాయన మందు నమోదవుతోంది. పంట పొలాల్లో కలుపు తీయడానికి రైతులు ఈ మందును ఎక్కువగా వాడుతుంటారు. వేల లీటర్ల నీటిలో రెండు, మూడు మూతల ద్రావణాన్ని కలిపి ఎకరాల కొద్దీ పొలాల్లో రైతులు ఈ మందును పిచికారీ చేస్తారు. కొద్ది నిమిషాల్లోనే కలుపు మొక్కలు మాడిపోతాయి. అలాంటిది నేరుగా ద్రావణాన్ని తాగితే పరిస్థితి ఎలాగుంటుందో అర్థం చేసుకోవచ్చు. తాగేందుకు డబ్బా నోట్లో పెట్టుకున్నా గుక్కెడు తాగగానే తట్టుకోలేక పారేసే పరిస్థితి ఉంటుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ ద్రావణం వేగంగా శరీరంలోని జీవకణాలను, అంతర్భాగాల్లోని పైపొరలను దెబ్బతీస్తూ వెళ్లి ప్రాణాలను తీస్తుంది. ఇంతటి ప్రమాదకరమైన ఈ రసాయాన్ని కొన్ని రాష్ట్రాల్లో నిషేధించారు. కానీ ఇక్కడ పప్పు, బెల్లాల్లా దుకాణాల్లో లభ్యమవుతోంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ఈ మందు తాగి గత ఏడాది 69 మంది, ఈ యేడాది రెండు నెలల్లోనే 35 మంది చికిత్స కోసం వచ్చారు. ఇందులో కర్నూలు, నంద్యాల జిల్లాలతో పాటు పక్కనున్న ఉమ్మడి అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలు, కర్ణాటక, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల వారూ ఉన్నారు. ఈ ఆసుపత్రితో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆలూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, పత్తికొండ, డోన్ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఏటా వంద మందికి పైగా చికిత్స కోసం వస్తున్నారు. ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ 99 శాతం మంది మరణిస్తుండగా తక్కువ మోతాదులో తాగిన వారు మాత్రమే బతికిపోతున్నారు. పలు దేశాల్లో పారాక్వాట్ నిషేధం ఒడిస్సా రాష్ట్రంలోని బుర్లా జిల్లాలో ఐదేళ్ల క్రితం ఈ విషం భారిన 177 మంది పడ్డారు. ఇందులో ముగ్గురు మాత్రమే జీవించి ఉన్నారు. 2019 సెప్టెంబర్‌లో అక్కడి వైద్యులు నిరసన చేయగా ఒడిస్సా ప్రభుత్వం దీనిని పూర్తిగా నిలిపివేస్తామని హామీ ఇచ్చింది. కేరళ రాష్ట్రంలో మాత్రమే దీనిని పూర్తిగా నిషేధించారు. అభివృద్ధి చెందిన 32 దేశాల్లోనూ పారాక్వాట్‌ను పూర్తిగా నిషేధించారు. దీని జన్మస్థానమైన స్విట్జర్లాండ్‌లోనూ ఈ రసాయాన్ని నిషేధించారు. మన దేశంలో కేవలం 9 రకాల పంటలకు మాత్రమే వాడాలని సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డు, రిజిస్ట్రేషన్ కమిటీ పేర్కొన్నా 25 రకాల పంటలకు వాడుతున్నారు. ప్రాణాలు తోడేస్తున్న పారాక్వాట్ ఏటా వందల మంది మృతి కర్నూలు జీజీహెచ్‌లో 14 నెలల్లో 104 మందికి చికిత్స పారాక్వాట్‌కు విరుగుడు లేదు అభివృద్ధి చెందిన దేశాలతో పాటు కేరళలో నిషేధం పారాక్వాట్‌కు విరుగుడు లేదు పారాక్వాట్ విష రసాయన పదార్థానికి విరుగుడు లేదు. దీని ప్రభావానికి గురైన వారి లక్షణాలను బట్టి వైద్యం చే స్తాం. దానివల్ల కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ విషం తీసుకున్న వారిలో 99 శాతం మంది మరణిస్తున్నారు. – డాక్టర్ రామశివనాయక్, ఎమర్జెన్సీ మెడిసిన్ హెచ్ఓడీ, జీజీహెచ్, కర్నూలు పీల్చినా విషప్రభావమే పారాక్వాట్ మింగినా, తాకినా చివరకు పీల్చినా విషప్రభావానికి గురైనట్లే. కేవలం ఒక టీ స్పూన్ పారాక్వాట్ తీసుకోవడం వల్ల మరణం సంభవించవచ్చు. ఈ రసాయనం దుస్తులు, కళ్లు, చర్మాన్ని తాకినా తీవ్ర అనారోగ్యం లేదా మరణానికి కారణం కావచ్చు. దీనిని తాగిన కొన్ని నిమిషాల్లోనే శరీరంలోని ఇతర భాగాల్లోకి వెళ్లి గుండె, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులను నాశనం చేస్తుంది. – డాక్టర్ పి.సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, జీజీహెచ్, కర్నూలు -
మత్స్య సహకార సంఘాల బలోపేతానికి కృషి
● జిల్లా మత్స్య సహకార సంఘం చైర్మన్ నవీన్‌కుమార్ కర్నూలు(అగ్రికల్చర్): మత్స్యకారుల సంక్షేమానికి, మత్స్య సహకార సంఘాల పటిష్టతకు చర్యలు తీసుకుంటామని ఉమ్మడి కర్నూలు జిల్లా మత్స్య సహకార సంఘం(డీఎఫ్‌సీఎస్) చైర్మన్ బీఎస్ నవీన్‌కుమార్ తెలిపారు. మంగళవారం కర్నూలు బంగారుపేటలోని మత్స్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సవరించిన బైలాను అన్ని సహకార సంఘాలకు త్వరలోనే తెలుగులోనే అందజేస్తామన్నారు. మత్స్యకారులందరు ఎన్ఎఫ్డీపీ, ఈ–శ్రామిక్‌లలో పేర్లను నమోదు చేసుకోవా లని సూచించారు. కొత్త సంఘాల ఏర్పాటుకు ఇప్పటికే ఉన్న సంఘాలలో సభ్యత్వాలను పెంచుకోవడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎఫ్‌సీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ సంధ్యారాణి, డైరెక్టర్లు శేఖర్, నాగశేషులు, శ్రీనివాసు లు, మల్లీశ్వరుడు, మద్దిలేటి, నగేష్ పాల్గొన్నారు. -
అమ్మానాన్నలను మింగేసి.. ఆనందాలను చిదిమేసి!
● ఐదుగురిని బలిగొన్న బస్సు కర్ణాటక రాష్ట్రం గంగావతి డిపోకు చెందిన బస్సు మంత్రాలయానికి మంగళవారం 14 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఆదోని మండలం పాండవగల్ సమీపంలో కల్వర్టు వద్ద వేగాన్ని నియంత్రించుకోలేక రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. బస్సు పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లి నిలిచిపోవడంతో అందులోని ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు కుటుంబాల్లో చీకటి కమ్ముకుంది. – ఆదోని టౌన్ -
బ్యాంకుల సమ్మెను విజయవంతం చేద్దాం
● యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ జిల్లా నాయకులు కర్నూలు (అగ్రికల్చర్): న్యాయమైన డిమాండ్లను సాధించుకునేందుకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయు) పిలుపు మేరకు ఈ నెల 24, 25 తేదీల్లో చేపట్టనున్న బ్యాంకుల సమ్మెను విజయవంతం చేయాలని వివిధ బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు కోరారు. మంగళవారం వివిధ బ్యాంకుల రీజినల్ కార్యాలయాల ఎదుట ఆయా బ్యాంకుల ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా రీజినల్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో యూఎఫ్‌బీయూ జిల్లా కన్వీనర్ నాగరాజు, కెనరా బ్యాంకు రీజినల్ కార్యాలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఆ బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ రీజినల్ సెక్రటరీ కే.పుష్పక్ మాట్లాడారు. ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బ్యాంకు ఉద్యోగులకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. గ్రాట్యూటీ చట్టాన్ని సవరించి రూ.25 లక్షల వరకు గరిష్ట పరిమితిని పెంచాలని కోరారు. కెనరా బ్యాంకు వర్క్‌మెన్ ఎంప్లాయీస్ యూనియన్ సెంట్రల్ కమిటీ సభ్యుడు అనిల్‌రెడ్డి మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని కేడర్లలో తగిన నియామకాలు చేపట్టాలని, తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఐడీబీఐ బ్యాంకును ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వ వాటా 51 శాతం ఉండేలా చూడాలని కోరారు. ఈ నెల 13, 18వ తేదీల్లో ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో జరిగే చర్చలకు యూఎఫ్‌బీయూ నేతలు హాజరవుతున్నారని, చర్చలు ఫలించకపోతే రెండు రోజుల సమ్మెకు సిద్ధం కావాలని సూచించారు. -
ఇప్పటికిప్పుడే పునాదులు ఎలా తీసుకోవాలి
● అధికారులను ప్రశ్నించిన జగనన్న కాలనీ లబ్ధిదారులు కోసిగి: ఇప్పటికిప్పుడే పునాదులు తీసుకోవాలంటే తమ చేత అయ్యే పనేనా అని మండల కేంద్రంలోని జగనన్న కాలనీ లబ్ధిదారులు అధికారుల ఎదుట వాపోయారు. మండల కేంద్రంలోని సజ్జలగుడ్డం రోడ్డులో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న కాలనీ పేరుతో 909 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఎంత మంది పునాదులు తీసుకున్నారు, ఎంత మంది పునాదులు తీసుకోలేదనే వివరాలు సేకరించి నివేదికను తయారు చేసేందుకు మంగళవారం వీఆర్వోలు బలరాం, వీరేష్ కలిసి జగనన్న కాలనీకి రాగా లబ్ధిదారులు కామలదొడ్డి వీరేష్, బసవరాజు, మల్లి, వేమారెడ్డి, మరి కొందరు అక్కడకి చేరుకుని తమ ఆవేదన వెలిబుచ్చారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈరోజే గడువు పూర్తయిందంటే ఎలా అని, ఇప్పటికిప్పుడే పునాదులు వేసుకోవాలంటే తమ ఆర్థిక పరిస్థితి సరిపోతుందా అని నిలదీశారు. ఇప్పటికై నా ప్రభుత్వమే ఇళ్లు మంజూరు చేసి, బిల్లులు విడుదల చేస్తే నిర్మాణాలు ప్రారంభించుకుంటామని బాధితులు విన్నవించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము ఇక్కడికి వచ్చామని చెప్పి వీఆర్వోలు వెళ్లిపోయారు. అలాగే 16 మంది కుమ్మరి కులస్తులకు కేటాయించిన స్థలంలోనూ ప్రైవేట్ వ్యక్తులు ప్లాట్లు వేసుకున్నారని బాధితులు కుమ్మరి కోసిగయ్య, బజారి, నాగరాజు, నరసింహ, అంబమ్మ ఆరోపించారు. ఇదే విషయమై ఫిబ్రవరి 6న తహసీల్దార్‌ను కలిసి ఫిర్యాదు చేసినా పరిష్కారం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలపై తహసీల్దార్ రుద్రగౌడను వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీఆర్వోలు జగనన్న కాలనీలో సర్వే చేపట్టారని, కుమ్మరి కులస్తులకు ఇచ్చిన స్థలాలు ఎక్కడికీ పోవని, ప్రైవేట్ వ్యక్తులు వేసిన లేఅవుట్లను రీసర్వే చేసి లబ్ధిదారులకు న్యాయం చేస్తామని చెప్పారు. -
పన్నులు చెల్లించకుంటే సేవలు బంద్
● డ్రస్ సర్కిల్ షాపు వద్ద నిరసన వ్యక్తం చేసిన మున్సిపల్ సిబ్బంది కర్నూలు (టౌన్): ఈనెల 31లోపు పన్నులు చెల్లించకపోతే సేవలు నిలిపేస్తామని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఆర్జీవీ క్రిష్ణ హెచ్చరించారు. మున్సిపల్ రెవెన్యూ అధికారులు, సిబ్బంది మంగళవారం బకాయిలు ఉన్న వ్యాపార దుకాణాల వద్దకు వెళ్లి యాజమాన్యాల తీరును నిరసించారు. అందులో భాగంగా అబ్దుల్లాఖాన్ ఎస్టేట్‌లోని డ్రస్ సర్కిల్ వద్ద నిరసన చేపట్టగా రూ.6.79 లక్షల బకాయిలు చెల్లిస్తామని యాజమాన్యం లిఖిత పూర్వకంగా రాసివ్వడంతో వెనుదిరిగారు. మేడం కాంపౌండ్‌లోని వాణిజ్య సముదాయాలకు సంబంధించి రూ.5.57 లక్షల బకాయిలను వెంటనే చెల్లించాలని మున్సిపల్ అధికారులు సూచించారు. ఆదేశాలను పట్టించుకోకపోతే శాఖ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్లు జునీద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు భార్గవ్, తిప్పన్న, రాజు పాల్గొన్నారు. -
ఆగని మట్టి అక్రమ తవ్వకాలు
● చూసీచూనడట్లు వదిలేస్తున్న రెవెన్యూ అధికారులు రుద్రవరం: మండలంలో మట్టి అక్రమ తవ్వకాలు ఆగడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాగులు, వంకలు, లే అవుట్లలో యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తుండటంతో అక్రమార్కులది అడిందే ఆట పాడిందే పాటలా తయారైంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొందరి నుంచి భూమిని కొనుగోలు చేసి పేదల కోసం కేటాయించింది. అప్పటి ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి కొంత మంది పేదలకు ఇళ్ల స్థలాలు కూడా పంపిణీ చేశారు. లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేలోపే ప్రభుత్వం మారడంతో అంతా తలకిందులైంది. ఆ భూమిలో ఇప్పుడు కూటమి నేతలు ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు సాగిస్తున్నారు. లబ్ధిదారులు అడ్డుకునేందుకు వెళ్లగా తమ పూర్వికుల భూమి అని, తమకు పూర్తి హక్కులు ఉన్నాయని గదమాయిస్తున్నారు. చేసేదేమీ లేక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకునే నాథుడే లేరు. మంగళవారం పేరూరు సమీపంలోని వక్కిలేరులో మట్టిని తవ్వి ట్రాక్టర్లలో ఆళ్లగడ్డ, శిరివెళ్ల మండలాల్లోని బత్తలూరు, ఎర్రగుంట్ల గ్రామాలకు తరలిస్తున్నండగా స్థానికులు సంబంధిత వీఆర్వోకు సమాచారం ఇచ్చారు. ఆయన అక్కడికి చేరుకుని మట్టి తవ్వకాలు నిలిపేయాలని చెబుతూనే స్థానికులు వెళ్లిపోయిన తర్వాత తిరిగి తవ్వేకోవచ్చన్న సంకేతాలు ఇచ్చి వెళ్లినట్లు సమాచారం. దీంతో కూటమి నేతలు తిరిగి జేసీబీతో వాగులోని మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా వేర్వేరు గ్రామాలకు తరలించారు. మట్టి తవ్వకాలపై తహసీల్దారు మల్లికార్జునరావును వివరణ కోరగా తాము ఎవ్వరికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పుకోచ్చారు. -
రూ.139.90 కోట్లు
4,66,348 జిల్లాలోని గృహాల సంఖ్య నెలకు రూ.3వేల చొప్పున చెల్లించాల్సిన నిరుద్యోగ భృతి విద్యారంగం.. అస్తవ్యస్తం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యారంగం అస్తవ్యస్తంగా మారింది. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినా.. నేటి వరకు ఒక్క నయాపైసా విడుదల చేయలేదు. అదిగో, ఇదిగో డీఎస్సీ అంటూ కాలయాపన చేస్తున్నారు. ఎన్నికలకు ముందు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. – డీ సోమన్న, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు విద్యార్థులకు ఆర్థిక కష్టాలు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయకపోవడంతో విద్యార్థులపై కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయాలన్నా, సర్టిఫికెట్లు తీసుకోవాలన్నా పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులు అనేక ఆర్థిక కష్టాలకు గురవుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదు. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. – అబ్దుల్లా, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఉన్నత విద్య ప్రశ్నార్థకం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా నేటి వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. యువగళం పాదయాత్రలో అన్ని ఇవ్వగలం అని నమ్మించిన మంత్రి నారా లోకేష్ నేడు నోరుమెదపడం లేదు. ఫీజు రీయంబర్స్మెంట్ను విడుదల చేయకుండా బకాయి పెట్టడంతో విద్యార్థుల ఉన్నత విద్య ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే విద్యార్థులతో కలసి ఉద్యమాలు చేస్తాం. – ఆర్ చంద్రప్ప, టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కర్నూలు(అర్బన్): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ అందించకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతోంది. ఫీజు బకాయిలపై నోరు మెదపకుండా విద్యార్థుల చదువులకు చంద్రబాబు ప్రభుత్వం ఆటంకం కల్పిస్తోంది. ఫీజులు చెల్లించాలని విద్యార్థులను వివిధ కళాశాలల యాజమాన్యాలు పట్టిపీడిస్తున్నాయి. ప్రతి విద్యా సంవత్సరం నాలుగు విడతలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తోంది. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి అదే ఏడాది మార్చి 2వ తేదీన మొదటి విడతగా జిల్లాలోని 35,618 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.23.95 కోట్లను అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం జమ చేసింది. మిగిలిన మూడు విడతల ఫీజును ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. వైఎస్సార్సీపీ హయాంలో ఇలా.. 2017–18, 2018–19 విద్యా సంవత్సరాల్లో పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను అధికారంలోకి వచ్చిన వెంటనే 2019–20 విద్యా సంవత్సరంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విడుదల చేసింది. అప్పట్లో జిల్లాలో 32,162 మంది విద్యార్థులకు సంబంధించిన అరియర్స్ అందాయి. గతంలో కుటుంబ వార్షిక ఆదా యం రూ. లక్ష ఉండగా వీలైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరాలనే సదుద్దేశంతో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.2.50 లక్షలకు పెంచింది. ఈ నేపథ్యంలోనే వసతి దీవెన పథకం ద్వారా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు రూ.20 వేల ప్రకారం అందించింది. ● గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టిన సమయంలో బీసీ, ఈబీసీ, మైనారిటీ, కాపు విద్యార్థుల ఇంజనీరింగ్ విద్యకు ఏడాదికి రూ.35 వేలు మాత్రమే విడుదలయ్యేవి. కానీ, కొన్ని పెద్ద కళాశాలల్లో (గ్రేడ్ –1) ఇంజినీరింగ్ ఫీజు ఏడాదికి రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఉంది. ఆయా కళాశాలల్లో చదువుతున్న సంబంధిత సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వం విడుదల చేసే రూ.35 వేలను మినహాయించి మిగిలిన ఫీజు వారి తల్లిదండ్రులే చెల్లించాల్సి వచ్చేది. ఈ ఆర్థిక భారాన్ని కూడా తొలగించేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకు వేసి ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని పెంచారు. దీంతో గ్రేడ్–1 కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని కూడా తగ్గించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కింది. ● ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ తదితర సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.501.60 కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఘరానా మోసం ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా విద్యార్థులను, నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోంది. రూ.3,900 కోట్ల ఫీజు బకాయిలను పెట్టి, విద్యార్థి సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో రూ.780 కోట్లను మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. నెలకు రూ.3 వేల ప్రకారం నిరుద్యోగులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.72 వేలు అప్పుపడింది. 20 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉన్నా.. ఎలాంటి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టలేదు. – రెడ్డిపోగు ప్రశాంత్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వైద్య విద్యకు మోకాలడ్డు ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో వైద్య రంగానికి పెద్దపీట వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు నిర్మాణాలను కూడా ప్రారంభించారు. అందులో భాగంగానే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆదోని, నంద్యాల ప్రాంతాల్లో మెడికల్ కళాశాలల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. నంద్యాలలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభం కాగా, ఆదోనిలో చురుగ్గా జరుగుతున్న మెడికల్ కళాశాల నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం మోకాలడ్డువేసింది. కరువు ప్రాంతమైన ఆదోనిలో మెడికల్ కళాశాల నిర్మాణానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో దాదాపు 80 శాతం నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. మిగిలిన 20 శాతం పనులు పూర్తియితే ఈ ఏడాది 150 సీట్లతో కళాశాల ప్రా రంభయ్యేది. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిర్మాణాలకు బ్రేకులు వేసింది. దీంతో ఆదోని మెడికల్ కళాశాల కలగానే మిగిలిపోయింది.పైపెచ్చు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటై న మెడికల్ కళాశాలలను ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు తీసుకున్న నిర్ణయం పట్ల పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రూ.1678.85కోట్లు అమలు చేయకపోతే ఏడాదికి నష్టం నేడు యువత పోరు కర్నూలు(టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహిస్తున్న యువత పోరు నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలో ఉదయం 10 గంటలకు స్థానిక గౌరి గోపాల్ ఆసుపత్రి వద్దనున్న ధర్నా చౌక్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్బావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లాలో వేడుకలు నిర్వహిద్దామని పిలుపు నిచ్చారు. ప్రస్తుతం ఇలా.. జిల్లాలో 35,618 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, కాపు, క్రిస్టియన్ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి కూటమి ప్రభుత్వం మూడు విడతలుగా రూ.71.86 కోట్లను బకాయి పడింది.చంద్రబాబుకు నిరుద్యోగులను మోసం చేయడం ఆనవాయితీగా మారింది. 2014లో కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తానని, అప్పట్లో రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీని చెత్తబుట్టలో పడేశారు. 2019 ఎన్నిలకు ముందు రాజకీయ లబ్ధి కోసం 2018 అక్టోబర్ నుంచి నెలకు రూ.వెయ్యి కొంతమందికి మాత్రమే నిరుద్యోగ భృతి వేసి చేతులుదులుపుకున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు ఇస్తానని, ఉద్యోగం ఇచ్చే వరకూ ‘యువనేస్తం’ పేరిట నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఈ లెక్కన జిల్లాలో నెలకు రూ.139.90కోట్లు ఇవ్వాలి. ‘కూటమి’ మాటలు నమ్మి ఉద్యోగాలపై ఆశతో కోచింగ్ సెంటర్లకు వెళ్లే విద్యార్థులకు ప్రతి నెలా వేల రూపాయలు ఖర్చవుతోంది. ప్రభుత్వం భృతి ఇవ్వకపోవడంతో వారిపై భారీగా ఆర్థిక భారం పడుతోంది. ఓ వైపు ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవు. మరో వైపు భృతి లేకపోవడంతో నిరుద్యోగులు ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. యువనేస్తం.. నిలువునా మోసం -
గుండ్రేవుల.. ఎండమావిలా ఎన్నాళ్లిలా!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తుంగభద్ర నదిపై ఉన్న సుంకేసుల రిజర్వాయర్ నుంచి ఏటా సగటున 200 టీఎంసీలకుపైగా నీరు కృష్ణాలో కలుస్తోంది. ఆ జలాలు వృథాగా సముద్రం పాలవుతున్నాయి. గతేడాది 341.99 టీఎంసీలకుపైగా నీరు దిగువకు వదిలారు. కళ్లెదుటే ఇంత నీరు వృథాగా పోతుంటే.. కర్నూలు, వైఎస్సార్ జిల్లాలను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. రాష్టంలో అన్ని ప్రాంతాల కంటే దుర్భిక్ష ప్రాంతం రాయలసీమ. సాగునీటి వనరులు అత్యల్పంగా ఉన్న ప్రాంతం. వర్షాధారంపై సాగు చేసే పంటలే అధికం. ప్రతి పదేళ్లలో ఎనిమిదేళ్లు ఈ ప్రాంతంలో కరువే ఉంటుంది. అరకొరగా ఉన్న సాగునీటి వనరులు కూడా మృగ్యమవుతున్నాయి. దీంతో ‘సీమ’లో వ్యవసాయం ప్రమాదంలో పడే పరిస్థితులు నెలకొన్నాయి. సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో తుంగభద్ర నదిపై గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మిస్తే కరువుతో అల్లాడిపోతున్న కర్నూలుతో పాటు వైఎస్సార్ జిల్లాకు మేలు జరుగుతుంది. వైఎస్ హయాంలో బీజం పడినా... కోడుమూరు నియోజకవర్గంలో సుంకేసుల రిజర్వాయర్‌కు 15 కిలోమీటర్ల ఎగువన సీ.బెళగల్ మండలంలో గుండ్రేవుల, రంగాపురం పరిధిలో 20.15 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి అప్పటి ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు విన్నవించారు. దీంతో ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని వైఎస్ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మృతి చెందారు. కాగా.. 2011 ఏప్రిల్ 30న గుండ్రేవుల ప్రాజెక్టు డీపీఆర్‌ను అప్పటి ఈఈ సుబ్బరాయుడు ప్రభుత్వానికి నివేదించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వాలు గుండ్రేవుల నిర్మాణాన్ని విస్మరించాయి. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రభుత్వం హడావుడిగా 2019 ఫిబ్రవరి 21న జీవో154 జారీ చేసింది. గుండ్రేవుల ప్రాజెక్టుకు రూ. 2,890 కోట్ల నిధులతో చేపట్టేలా పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని ప్రాంతాలతో పాటు పశ్చిమ ప్రాంతాల్లో పూర్తిగా సాగు, తాగునీటి సమస్య పరిష్కారమవుతుంది. కర్నూలు నగరపాలక సంస్థకు కూడా తాగునీటి కష్టాలు తీరుతాయి. అలాగే ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ నుంచి లిప్ట్ ఇరిగేషన్ ద్వారా కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం కూడా ఉంది.ఇప్పటికే కొన్ని గ్రామాలకు పరిహారంవైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 2007లో తుంగభద్రకు వరదలు వచ్చాయి. అప్పట్లో తుంగభద్ర పరీవాహక గ్రామాలు మునిగిపోయాయి. అప్పట్లో వైఎస్ ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద కొన్ని గ్రామాలకు పరిహారం కూడా చెల్లించింది. గ్రామాలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. కాబట్టి ముంపు పరిహారం కూడా కొన్ని గ్రామాలకు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అంశాలను బేరీజు వేస్తే ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా సానుకూల పరిస్థితులు ఉన్నట్టు స్పష్టమవుతోంది.గుండ్రేవుల నిర్మించకపోతే ‘ సీమ’కు ఇబ్బందే! తుంగభద్రలో నీటి లభ్యత ఎక్కువ. దీనిపై ఆధారపడే వైఎస్సార్, కర్నూలు జిల్లాల ఆయకట్టు ఆధారపడి ఉంది. భవిష్యత్‌లో కేసీ కెనాల్‌కు సమృద్ధిగా నీటిని అందించాలంటే గుండ్రేవుల ప్రాజెక్ట్ నిర్మించాలి. 2009లో అప్పటి ప్రభుత్వం డీపీఆర్‌కు రూ.53 లక్షలు మంజూరు చేసింది. ప్రభుత్వానికి డీపీఆర్ కూడా అందింది. రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను పక్కనపడేశారు. సుంకేసుల బ్యారేజీ 1.2 టీఎంసీల సామర్థ్యమే. దీంతో పెద్దగా ఉపయోగం లేదు. ఆ నీటిని కూడా తుమ్మిల ఎత్తిపోతల ద్వారా తెలంగాణ తోడేస్తోంది. విభజన తర్వాత ఆ ప్రాజెక్టు అంతరాష్ట్ర ప్రాజెక్టుగా మారింది. గుండ్రేవుల నిరి్మస్తే 20 టీఎంసీలకు పైగా నిల్వ చేసుకోవడంతో పాటు కర్నూలు పశి్చమ ప్రాంతం ఆయకట్టుతోపాటు వైఎస్సార్ జిల్లాకు మేలు జరుగుతుంది. – శ్రీనివాసరెడ్డి, రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ -
పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు
కర్నూల్: ఆదోని కేసులో ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. నిన్న(సోమవారం) పోసానిని కస్టడీకి ఇవ్వాలనే పిటిషన్ కొట్టివేసిన జేఎఫ్‌సీఎం కోర్టు.. ఈ రోజు(మంగళవారం) బెయిల్ మంజూరు చేసింది. ఆదోని త్రీటౌన్ పీఎస్ లో జనసేన నేత రేణువర్మ ఫిర్యాదుతో 2024 నవంబర్ 14న కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ 353(1) , 353(2), 353(సి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, విజయవాడ నుంచి పిటి వారెంట్ పై అరెస్టు చేశారు. ఈనెల 5వ తేదీ నుంచి కర్నూలు జైలులో ఉన్నారు పోసాని. బెయిల్ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనల తరువాత నిన్న తీర్పు రిజర్వు చేశారు మేజిస్ట్రేట్. అయితే పోసానికి బెయిల్ పిటిషన్‌ను ప్రభుత్వ న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. పోసానిని మరింత విచారించాల్సి ఉందని, దూషణల వెనుక ఎవరు ఉన్నారో తేలాల్సి ఉందని, కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం నిన్ననే కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేసిన మేజిస్ట్రేట్.. ఈ రోజు బెయిల్ మంజూరు చేశారు.దాంతో పోసాని కృష్ణమురళికి ఇప్పటివరకూ మూడు కేసుల్లో బెయిల్ లభించింది. నరసరావుపేటలో నమోదైన కేసులో పోసానికి నిన్న బెయిల్ మంజూరైంది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో నరసరావుపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది.అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు గత శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులోనే పోసాని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయ్యారు. పోసానిని హైదరాబాద్‌లోని నివాసంలో అరెస్ట్ చేసి.. ఆ మరుసటి రోజు ఓబులవారిపల్లెకు తీసుకెళ్లారు. అటుపై పల్నాడు జిల్లా నరసరావుపేటలో, కర్నూల్ జిల్లా ఆదోనీ పీఎస్‌లలో నమోదైన కేసుల్లో పీటీ వారెంట్ కింద ఆయన్ని తరలించారు. ఈ కేసుల్లో ఉపశమనం కోరుతూ ఆయన పిటిషన్లు వేశారు. మరోవైపు హైకోర్టులోనూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్ విచారణ దశలో ఉంది. -
కర్ణాటక బస్సు బీభత్సం.. నలుగురి మృతి
సాక్షి, కర్నూలు జిల్లా: కర్ణాటక గంగావతి డిపోకు చెందిన కేఎస్ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. గంగావతి నుంచి రాయచూర్‌కు వెళ్తున్న బస్సు ఆదోని మండలం పాండవగళ్లు గ్రామ సమీపంలో ముందు వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడ డే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.మృతి చెందిన వారిలో ఆదోని మండలం కుప్పగళ్లు గ్రామానికి చెందిన భార్యా భర్తలు, కర్ణాటకలోని మాన్వికి చెందిన అక్కా తమ్ముళ్లు ఉన్నారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టాలి
● వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ కర్నూలు (సెంట్రల్): వర్షపు ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకుని వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. ఆయన సోమవారం మధ్యాహ్నం న్యూఢిల్లీ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి పొదుపు, వినియోగం, నిర్వహణపై కొన్ని ప్రాంతాల కలెక్టర్ల పనితీరును సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులు, పారిశ్రామికవేత్తల ఆర్థిక సాయం, సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులతో మాట్లాడారు. ఫారం పాండ్స్, అమృత సరోవర్ తదితర పనులపై డ్వామా పీడీ వెంకటరమణయ్యను, బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్స్‌పై ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావును, చెరువులు, మైనర్ డ్యామ్‌ల పునరుద్ధరణ పై ఇరిగేషన్ ఎస్ఈ ద్వారకానాథ్‌రెడ్డిని నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. -
రాజకీయ కక్షతో వేధిస్తే ప్రజలే తిరగబడతారు
కర్నూలు: రాజకీయ కక్షతో ప్రతిపక్ష పార్టీ నాయకులను వేధిస్తే ప్రజలే తిరగబడతారని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లను దుర్భాషలాడారన్న అభియోగంపై ఆదోని మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ప్రముఖ సినీనటుడు పోసాని మురళీకృష్ణపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఈనెల 5వ తేదీన రిమాండ్‌పై ఆయనను కర్నూలు శివారులోని జిల్లా కారాగారానికి తరలించారు. కాటసాని రాంభూపాల్‌రెడ్డి సోమవారం జిల్లా జైలుకు వెళ్లి పోసాని మురళీకృష్ణతో ములాఖత్ అయి పరామర్శించారు. అనంతరం కారాగారం గేటు బయట కాటసాని మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ నాయకుల మీద కక్ష సాధింపులు కొనసాగుతున్నాయని, అధికారం ఉంది కదా అని రాజకీయ కక్షతో ఒకే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కేసులు పెట్టి వేధించడం తగదన్నారు. కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను భ్రష్టుపట్టిస్తోందని విమర్శించారు. వైఎస్సార్సీపీ నాయకు లు ఏది మాట్లాడినా అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని, అదే టీడీపీ నాయకులు మాట్లాడితే మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. చట్టం అనేది ఒకరి సొత్తు కాదని, అందరికీ సమానంగా ఉండాలన్నారు. ఎళ్లకాలం ఒకేలా ఉండదని, కూటమి నాయకులు గుర్తు పెట్టుకుని నడుచుకోవాలన్నారు. ప్రముఖ సినీనటుడు పోసాని మురళీకృష్ణతో ములాఖత్ సందర్భంగా కాటసాని -
మోహినీ అలంకారంలో అహోబిలేశుడు
అమృతం అసురుపాలు కాకుండా లోక సంరక్షణ కోసం మహా విష్ణువు దాల్చిన జగన్మోహిని అలంకరణలో ప్రహ్లాదవరుడు భక్తులకు దర్శనమిచ్చారు. అహోబిలేశుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా దిగువ అహోబిలంలో సోమవారం ప్రహ్లాదవరుడు జగన్మోహిని అలంకారంలో కనువిందు చేశారు. పట్టు వస్త్రాలు, మిరుమిట్లు గొలిపే ఆభరణాలు ధరించి పల్లకీలో మాడ వీధుల్లో విహరించారు. ఎగువ అహోబిలంలో వెలసిన జ్వాలా నరసింహస్వామి పొన్నచెట్టు వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. – ఆళ్లగడ -
నిబంధనలకు ‘నీళ్లు’
ఆలూరు: నియోజకవర్గ కేంద్రమైన ఆలూరులో సర్పంచ్ అరుణాదేవి.. నిబంధనలకు నీళ్లు వదిలారు. ప్రజలకు ఇబ్బందులు తెస్తూ తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ‘జీతభత్యాలు ఇస్తున్నాం..మేం చెప్పిన పనులు చేయాల్సిందే’ అంటూ ప్రభుత్వ ఉద్యోగులకు తిప్పలు పెడుతున్నారు. ఆలూరులోని ఇందిరా నగర్, అంబేడ్కర్ నగర్, గాంధీనగర్‌తో పాటు పలుకాలనీల్లో చేస్తున్న పనులకు శుద్ధమైన జలాన్ని వాడుతున్నారు. సీసీ రోడ్డుకు కంకర వేసే మిషన్‌లోకి శుద్ధమైన జలాన్ని నింపుతున్నారు. ఆలూరు మేజర్ పంచాయతీ కాగా.. 16 గ్రామ వార్డులు ఉన్నాయి. గతంలో రూ. 5 లక్షలను ఖర్చు చేసి ప్రజలకు శుద్ధమైన జలాన్ని అందించేందుకు ఏర్పాటు చేశారు. అయితే నేడు పంపులు చెడిపోవడంతో నీటిని అభివృద్ధి పనులకు వాడుకోవడంలో ఆంతర్య మేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ కార్మికులతో కంకర డస్ట్ తొలగించే పనిని చేయించడంపై విమర్శలు వస్తున్నాయి. ఆలూరు సర్పంచ్ అరుణాదేవి చేయిస్తున్న పనులు బాగున్నాయని గుంటూరు జిల్లా పత్తిపాడు ఎమ్మెల్యే బి.రామాంజనేయులు మెచ్చుకోవడాన్ని చూసి ప్రజలు అవాక్కయ్యారు. -
ఈ ప్రభుత్వం వద్దు
అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కర్నూలు జిల్లాపై సవతి తల్లి ప్రేమను చూపుతోందని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కె.జగన్నాథం విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్లో కర్నూలు జిల్లా పేరు లేకుండానే కేటాయింపులు చేయడం కూటమి ప్రభుత్వం దుర్ణీతికి నిదర్శనమని ఆరోపించారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ‘ఈ ప్రభుత్వం మాకు వద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన కర్నూలు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులైనా వేదవతి, గుండ్రేవుల, ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణాలకు నిధులు కేటాయించలేదన్నారు. జిల్లా పశ్చిమ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు వలస వెళ్తున్నా పట్టించుకోవడంలేదన్నారు. జిల్లాలో పరిశ్రమలను స్థాపించి యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలన్నారు. నాయకులు ఎస్.మునెప్ప, పి.రామకృష్ణారెడ్డి, నాగరాజు, శ్రీనివాసులు, ఈశ్వర్ పాల్గొన్నారు. -
మంత్రి లోకేష్.. పట్టించుకోరా?
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వ విద్యాలయాల్లో ప్రవేశం కోసం నిర్వహించి కామన్ పీజీ సెట్ ఎంట్రెన్స్‌ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సోమన్న, షాబీర్‌బాషా డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. కామన సెట్‌తో విద్యార్థులకు ఎంతో నష్టం వాటిల్లుతోందన్నారు. ఇష్టమున్నా లేకున్నా ఇతర యూనివర్సిటీలకు వెళ్లి చదువుకోవాల్సి ఉంటుందన్నారు. అలాగే జీఓ నంబర్ 77ను రద్దుచేస్తానని చెప్పిన మంత్రి లోకేష్ పట్టించుకోవడంలేదన్నారు. వర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. కామన్ సెట్‌తో డిగ్రీ, పీజీ కళాశాలను మూసివేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. శరత్‌కుమార్, అభి, అశోక్, అక్షర తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు చెప్పారు కాబట్టే అడుగుతున్నాం
సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇల్లు లేనిపేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తామని చెప్పారు. కాబట్టే ఇప్పుడు ఇంటి స్థలం ఇవ్వాలని అడుగుతున్నాం. మాకు సొంతిల్లు లేదు. అద్దెలు కట్టలేక అవస్థలు పడుతున్నాం. ఇంటి స్థలంతోపాటు నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాల్సిందే. పేదల ఆశలతో ఆడుకుంటే రోడ్డెక్కి ఆందోళనలు చేపడతాం. – సరిత, అమీర్ హైదర్ఖాన్నగర్, కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న పేద మహిళలుపేదలకు అన్యాయం కర్నూలు, కల్లూరు పరిధిలోని పేదలకు 15 రోజుల్లో సర్వే నంబర్ 70/2బీలో ఉన్న 16.85 ఎకరాలు, సర్వే నంబర్ 68లో ఉన్న 12.75 ఎకరాల భూమిలో లే అవుట్ వేసి పట్టాలు ఇవ్వాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ముట్టడికి పేదలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుమారు 2 గంటల పాటు సీపీఎం ఆధ్వర్యంలో ఽనిరసన చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా అధ్యక్షుడు డి.గౌస్‌దేశాయ్ మాట్లాడుతూ..పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూంటే ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వ పెద్దలు భూములను ఆక్రమిస్తూ ఉంటే ఏమి అనని అధికారులు...పేదలు అటువైపు వెళ్లితే నిబంధనలు చెబుతున్నారని విమర్శించారు. 15 రోజుల్లో పట్టాలు ఇవ్వకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో గుడిసెలు వేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రాజశేఖర్, వై.నగేష్, అలివేలు, అరుణ, విజయరామాంజనేయులు పాల్గొన్నారు. -
నేడు వాతావరణ మార్పులపై వర్క్‌షాపు
కర్నూలు(అగ్రికల్చర్): నాబార్డు ఆధ్వర్యంలో వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులపై ఎమ్మిగనూరు మండలం బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 11న ప్రత్యేక వర్క్‌షాపు నిర్వహిస్తున్నట్లు అసిస్టెంటు జనరల్ మేనేజర్ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ వర్క్‌షాపునకు కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన నాన్ గవర్నమెంటు ఆర్గనైజేషన్లు(ఎన్జీవో), రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు, ఆర్‌ఏఆర్‌ఎస్, వీవీకే శాస్త్రవేత్తలు పాల్గొంటారని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాతావరణ మార్పులను తట్టుకునే వంగడాలు, పంటల గురించి శాస్త్రవేత్తలు తగిన సలహాలు, సూచనలు ఇస్తారని ఆయన పేర్కొన్నారు.సాఫ్ట్వేర్ ఉద్యోగం పేరిట మోసం ● ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు కర్నూలు: హైదరాబాద్‌లో బిందు కన్సల్టెన్సీ పేరిట సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అశ్విని, సాయికృష్ణ, హిమబిందు కలసి రూ.60 వేలు తీసుకుని మోసం చేశారని కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రమేష్‌కుమార్ రెడ్డి ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. కర్నూలు టూటౌన్ పక్కనున్న క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. పీజీఆర్ఎస్కు మొత్తం 122 ఫిర్యాదులు రాగా.. వీటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన పరిష్కారం చూపుతామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా కూడా కార్యక్రమంలో పాల్గొని వినతులను స్వీకరించారు. అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి కర్నూలు(సెంట్రల్): పీజీఆర్ఎస్(పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సెల్)లో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదక(పీజీఆర్ఎస్)ను నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు పరిష్కారం అయ్యాయా లేదా అనే అంశంపై ఆయా శాఖల ఉన్నతాధికారులు ఆడిట్ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ పాల్గొన్నారు. ప్రతి భక్తుడితో మర్యాదగా మెలగాలి శ్రీశైలం టెంపుల్: శ్రీశైల క్షేత్రానికి విచ్చేసే భక్తులందరితో మర్యాదగా మెలగాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు అధికారులకు సూచించారు. సోమవారం ఈ నెల 27 నుంచి 31వ తేది వరకు నిర్వహిస్తున్న ఉగాది మహోత్సవాలపై దేవస్థాన వివిధ శాఖాధిపతులు, పర్యవేక్షకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉగాది మహోత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారని, ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాలలో ఆయా కై ంకర్యాలన్నీ సమయానుకూలంగా, పరిపూర్ణంగా చేపట్టాలన్నారు. నల్లమల అటవీప్రాంతంలో పాదయాత్ర భక్తులకు తాగునీటి సదుపాయం, సేదతీరేందుకు షా మియానాలు ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవాల్లో 12లక్షల లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. శాశ్వత మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. -
ప్రభుత్వ తీరుపై ప్రజాగ్రహం●
● కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నాలు ● ఇళ్ల స్థలాల కోసం పేదల నిరసన ● కామన్ పీజీసెట్‌ను రద్దు చేయాలన్న విద్యార్థులు ● హిందూ సంఘాల నాయకుల ఆందోళన ఒకటి కాదు.. రెండు కాదు.. వందల సంఖ్యలో సమస్యలు.. ప్రతి రోజూ అవస్థలే.. అయినా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం స్పందించకోపవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం భారీగా కలెక్టరేట్‌కు వచ్చి ధర్నాలు, నిరసనలు తెలిపారు. ప్రజల కష్టాలు పట్టవా అంటూ పాలకులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వ అధినేత స్పందించకపోతే ప్రతిరోజు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కామన్ పీజీసెట్ ఎంట్రెన్స్తో తమకు నష్టం వాటిల్లుతోందని, దానిని రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వరా.. ఎవరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తోందని వివిధ సంఘాల నాయకులు మండిపడ్డారు. కర్నూలు జిల్లా పేరు లేకుండానే రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు చేయడం కూటమి ప్రభుత్వం దుర్ణీతికి నిదర్శనమని సీపీఐ నాయకులు ఆరోపించారు. జిల్లాకు జరిగిన అన్యాయంపై ధర్నా నిర్వహించారు. కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో జరుగుతున్న కూల్చి వేతలను వెంటనే నిలపుదల చేయకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోందని హిందూ సంఘాల నాయకులు హెచ్చరించారు. – కర్నూలు(సెంట్రల్) -
‘సూపర్ సిక్స్’ మోసంపై సమష్టి పోరు
కర్నూలు (టౌన్): ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలందరినీ టీడీపీ నేతలు మోసం చేశారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. ‘సూపర్ సిక్స్’ మోసంపై సమష్టిగా అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కర్నూలు ఎస్వీ కాంప్లెక్స్‌లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు రెడ్డిపోగు ప్రశాంత్ అధ్వర్యంలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. సమావేశంలో ఎస్వీ మాట్లాడుతూ.. హామీలు నేరవేర్చకుంటే కాలర్ పట్టుకోవాలని అన్న మంత్రి నారా లోకేష్ ఎందుకు నోరు విప్పడం లేదన్నారు. గత ఏడాది ఆందోళనల కారణంగానే ఫీజు బకాయిలు రూ.700 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నారన్నారు. ఇప్పటికీ రూ.3,200 కోట్లు విడుదల చేయాల్సి ఉందని, పేద, బడుగు, బలహీన, మధ్య తరగతి విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారన్నారు. ఓటాన్ అకౌంట్, వార్షిక బడ్జెట్లో విద్యకు అరకొర నిధులు కేటాయించారన్నారు. నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3 వేలు భృతి ఇస్తామని చెప్పి ఏడాది కావస్తున్నా.. బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈనెల 12న కర్నూలులో చేపడుతున్న యువత పోరు నిరసన కార్యక్రమాన్ని అన్ని విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు, యువతీ, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ● వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు శివారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు రెడ్డి పోగు ప్రశాంత్‌కుమార్ మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పి ఇప్పటికే మూడు నెలలు అవుతుందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు ధనుంజయ ఆచారి, షరీఫ్, ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి షాపీర్‌బాషా, ఏఐఎస్ఎఫ్ రాయలసీమ యూనివర్సిటీ అధ్యక్షుడు శరత్‌కుమార్, వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మణిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు కటికె గౌతం, ఆర్వైఎఫ్ జిల్లా అధ్యక్షుడు రంగముని నాయుడు పాల్గొన్నారు. ఎవరు ఏం మాట్లాడారంటే.. 12న ‘యువత పోరు’కు భారీగా తరలి రావాలి రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారించాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వంలో కనిపించడం లేదు. విద్యార్థుల చదువులకు ఇబ్బందికరంగా మారింది. – సునీల్ రెడ్డి, రాయలసీమ యువజన విద్యార్థి సంఘాల జేఏసీ నాయకుడు ఇంట్లో అందరి విద్యార్థులకు తల్లికి వందనం ఇస్తామన్నారు. నిధులు కేటాయించకుండా మళ్లీ మోసం చేశారు. – శ్రీరాములు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నిరుద్యోగులకు ఉపాధి లేదు. ఖాళీగా ఉండలేక ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళుతున్నారు. నిరుద్యోగ భృతికి బడ్జెట్లో రూపాయి కూడా కేటాయింలేదు. – సూర్యకుమార్, లైబ్రరీ యూనియన్ అధ్యక్షుడు డీగ్రీలు, పీజీలు చదివిన వేలాది మంది ఆటోలు నడుపుతూ జీవితం సాగిస్తున్నారు. ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని అందరికీ అర్థమైంది. – రవికుమార్, రాయలసీమ యువజన విద్యార్థి సంఘాల నాయకుడు విద్యార్థులను, నిరుద్యోగులను ఈ ప్రభుత్వం మోసం చేసింది. కచ్చితంగా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాల్సిందే. ఫీజు బకాయిలు, నిరుద్యోగ భృతి కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం. – చంద్రప్ప, టీఎన్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు యువగళం పేరుతో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలయ్యాయి. ఏమని ప్రశ్నిస్తే అక్రమ కేసులు అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు డీఎస్సీ ఇవ్వలేదు. – కటారు కొండ సాయి కుమార్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
శాసీ్త్రయ పద్ధతులతో పాడిపరిశ్రమ లాభసాటి
కర్నూలు(అగ్రికల్చర్): శాసీ్త్రయ పద్ధతులను అవలంబిస్తే పాడిపరిశ్రమను లాభసాటిగా మార్చుకోవచ్చని ఆర్‌ఏహెచ్‌టీసీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కె.సుధాకర్‌రెడ్డి తెలిపారు. కర్నూలు కొండారెడ్డిబురుజు సమీపంలోని బహుళార్ధ పశువైద్యశాల ప్రాంగణంలోని ట్రైనింగ్ సెంటర్లో పాడిరైతులకు 3 రోజుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా వాణిజ్య సరళిలో పాడిపశువుల పెంపకం అనే అంశంపై సోమవారం శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పాడి రైతులనుద్దేశించి ఏడీ డాక్టర్ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధానంగా పాడిపశువుల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏడాది పొడవునా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఆసక్తి ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అరుణశ్రీ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు అంతంత మాత్రమే కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వాము ధర ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ రైతులకు అంతంతమాత్రం ధర లభిస్తోంది. సోమవారం మార్కెట్‌కు 254 మంది రైతులు 802 క్వింటాళ్ల వాము తెచ్చారు. గరిష్ట ధర రూ.28,888 ఉన్నట్లు ప్రకటించినప్పటికి.. దాదాపు 240 మంది రైతులకు అంతంతమాత్రం ధరే లభించింది. సగటు ధర రూ.12,399 పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. ● ఉల్లి ధరలు పడిపోయాయి. మార్కెట్‌కు ఉల్లి 2,873 క్వింటాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.517, గరిష్ట ధర రూ.1537 లభించగా... సగటు ధర రూ.1,187 నమోదైంది. మిర్చికి గరిష్టంగా రూ.12769 లభించింది. సగటు ధర కేవలం రూ.8,720 మాత్రమే నమోదైంది. మార్కెట్‌కు 1,768 క్వింటాళ్ల కందులు వచ్చాయి. కనిష్ట ధర రూ.3,100, గరిష్ట ధర రూ.7,158 లభించగా.. సగటు ధర రూ.6,909 మాత్రమే పలికింది. ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం ● బస్సును ఢీకొన్న ట్రాక్టర్ వెల్దుర్తి: ఆర్టీసీ బస్సును ట్రాక్టర్ ఢీకొట్టడంతో ట్రాక్టర్ డ్రైవర్ యశ్వంత్ (23) మృతిచెందారు. ఈ దుర్ఘటన వెల్దుర్తి సమీపంలోని హైవే 44పై సోమవారం చోటుచేసుకుంది. ఉదయం 6గంటల సమయంలో కర్నూలు నుంచి అనంతపురం వైపు ఏపీఎస్ ఆర్టీసీ కర్నూలు డిపో అల్ట్రా డీలక్స్ బస్సు వెళ్తోంది. అదే సమయంలో పసుపుల నుంచి వెల్దుర్తికి సొప్పలోడు కోసమని ట్రాక్టరు వస్తోంది. బస్సును పక్కనుంచి ఢీకొనడంతో ట్రాక్టరు ట్రాలీతో విడిపోయి రహదారిపై బోల్తాపడింది. బస్సు డివైడర్ పైకెక్కి, ముందు టైర్లు పగిలిపోయి ఆగిపోయింది. బస్సు పాక్షికంగా ధ్వంసమైంది. ఈ ఘటనలో పసుపులకు చెందిన ట్రాక్టరు డ్రైవర్ యశ్వంత్ మృతిచెందారు. ట్రాక్టర్ క్లీనర్ అదే గ్రామానికి చెందిన సంజీవ్ గాయపడ్డాడు. బస్సు డ్రైవర్, 39 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైవే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం వెల్దుర్తి ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. -
ఈత కొట్టి.. ఒడ్డుకు చేరి!
భానుడు ఉగ్ర రూపం దాల్చుతున్నాడు. రోజు రోజుకు ఎండలు మండుతున్నాయి. ప్రజలతో పాటు మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. వైఎస్సార్ జిల్లా పొన్నంపల్లె, అవుకు మండలం కొండమనాయుని పల్లె నుంచి జీవాల మందను కాపరులు మేత కోసం దొర్నిపాడు పొలాల వైపు తీసుకొచ్చారు. ఎండలు అధికంగా ఉండటంతో క్రిష్టిపాడు గ్రామ సమీపంలో ఉన్న కుందూ నదిలో జీవాలకు దించేందుకు తెచ్చారు. మందంతా ఒకేసారి బ్రిడ్జిపైకి వచ్చిన తర్వాత జీవాలను నదిలోకి తోసేశారు. అవి ఈదుతూ ఒడ్డుకు చేరుకుని వేసవి తాపాన్ని తీర్చుకున్నాయి. – దొర్నిపాడుమాకె‘వరు స’రిలేరు.. వంతెనపై జీవాలు -
చాగలమర్రిలో దంపతులపై దాడి
చాగలమర్రి: మండల కేంద్రమైన చాగలమర్రిలోని మంగలి వీధిలో షేక్ బీబీ, మహబూబ్‌బాషా దంపతులపై అదే కాలనీకి చెందిన వారు దాడి చేశారు. సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే..మహబూబ్‌బాషా ఇంటి ఎదురుగా తాజు, తాహెర్ అనే వ్యక్తులు నివసిస్తారు. ఇళ్ల ముందు వాహనాలు నిలిపే విషయంలో ఇరుకుటుంబాల మధ్య గొడవ ఉంది. ఈ క్రమంలో సోమవారం తాజు, తాహెర్ మరికొంత మంది మహబూబ్‌బాషా దంపతుల ఇంటిపైకి వెళ్లి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బీబీతో పాటు భర్తను స్థానిక ఓ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులపై దాడి విషయం తెలుసుకున్న కుమార్తె అబీదా, బంధువు ఇనాయతుల్లా పరామర్శించేందుకు ప్రొద్దుటూరు నుంచి ఆసుపత్రికి వచ్చారు. నిందితులు మరో పదిమందితో కలిసి అక్కడికి చేరుకొని వారిపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఆళ్లగడ్డ రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే తీవ్రంగా గాయపడిన షేక్ బీబీని వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం ప్రొద్దుటూరుకు తరలించినట్లు కుటుంబీకులు తెలిపారు. -
ఏపీఎస్పీ రెండవ పటాలంలో బదిలీలకు గ్రీన్‌సిగ్నల్
మేనేజర్, స్టోర్ ఎన్సీఓ పోస్టులకు భారీ పోటీ ప్రతి కంపెనీలో ఒక మేనేజర్, స్టోర్ ఎన్సీఓ ఉంటాడు. ఆయా పోస్టులను దక్కించుకునేందుకు సిబ్బంది పోటీ పడుతున్నారు. నిబంధనల ప్రకారం ఆయా పోస్టుల్లో విధులు నిర్వహించాలంటే అందుకు సంబంధించిన శిక్షణ తప్పనిసరి. గతంలో ఇదే విధులు నిర్వహించిన వారికి మళ్లీ నియమించకూడదనే నిబంధన కూడా ఉంది. అయితే కొందరు రెండోసారి కూడా ఆయా పోస్టుల్లో పనిచేశారు. కర్నూలు: ఏపీఎస్పీ కర్నూలు రెండో పటాలంలో సిబ్బంది బదిలీలకు రంగం సిద్ధమైంది. నూతన కమాండెంట్ బాధ్యతలు చేపట్టిన దీపిక పాటిల్ ఆదేశాల మేరకు బదిలీల జాబితా సిద్ధమైనట్లు సిబ్బందిలో చర్చ జరుగుతోంది. గత నెల 25న కమాండెంట్ సంబంధిత కంపెనీ ఆర్ఐలకు(ఆఫీసర్ కమాండింగ్) బదిలీలకు సంబంధించిన మెమో (ఉత్తర్వులు) ఇచ్చా రు. బెటాలియన్‌లో తొమ్మిది కంపెనీలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఏళ్ల తరబడి బయటి కంపెనీల్లో పనిచేసిన వారిని హెడ్ క్వార్టర్‌కు బదిలీ చేయాల్సి ఉంది. మొత్తం పటాలంలో దాదాపు 1100 మంది సిబ్బంది ఉన్నారు. టర్న్ ప్రకారం ప్రతి ఒక్కరికీ హెడ్ క్వార్టర్లో విధులు నిర్వహించేలా అవకాశం కల్పించాలి. ఇందుకు అనుగుణంగా కమాండెంట్ చర్యలు చేపట్టడంతో ఫెవికాల్ వీరులు పైరవీలు ముమ్మరం చేసినట్లు చర్చ జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో బదిలీల జాబితా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలు స్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది ఆఫీసర్ కమాండెంట్లు చేతివాటం ప్రదర్శించి బదిలీల జాబితా తయారీలో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని, జాబితాను సమగ్రంగా పరిశీలించి ఏళ్ల తరబడి బయటి కంపెనీలో పనిచేస్తున్న వారికి కమాండెంట్ న్యాయం చేస్తారనే ఆశాభావం సిబ్బందిలో వ్యక్తమవుతోంది. వీరు ఫెవికాల్ వీరులు ● స్టోర్ ఎన్సీఓగా ఎమ్టీ గ్రూప్‌లో హెడ్ కానిస్టేబుల్ రంగసామిరెడ్డి 15 ఏళ్లుగా కొనసాగుతున్నారు. దీపిక పాటిల్ కమాండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సిబ్బంది సమస్యలపై దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా రంగసామిరెడ్డిపై పలువురు సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో అతడి స్థానంలో బాల హుసేన్ (హెచ్‌సీ 817)ను నియమించారు. అవమానంగా భావించిన రంగసామిరెడ్డి ద్వితీయ శ్రేణి అధికారి సహాయంతో సిక్ లీవ్‌లో వెళ్లారు. ఇందుకు ఓ అధికారికి పి–క్యాప్ స్టిక్ కానుకగా బహుకరించినట్లు సిబ్బందిలో చర్చ జరుగుతోంది. ఈయన ఏఎంటీఓ ద్వారా హెడ్ క్వార్టర్‌లోనే కొనసాగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ● సమరసింహారెడ్డి (కళ్యాణ మండపం నిర్వహణ) 20 ఏళ్లుగా హెడ్ క్వార్టర్‌లోనే కొనసాగుతున్నారు. ● తిరుమల్‌రెడ్డి 30 ఏళ్లుగా ట్రైనింగ్ గ్రూప్‌లోనూ, బందె నవాజ్ 20 ఏళ్లుగా బెటాలియన్ హాస్పిటల్లో, హెడ్ కానిస్టేబుల్ మౌలాలి పదేళ్లుగా హాస్పిటల్ విధులు, టైలరింగ్ గ్రూప్‌లో 15 ఏళ్లుగా జిలానీ బాషాతో పాటు మరో పది మంది దాకా వివిధ గ్రూపుల్లో హెడ్ క్వార్టర్లో విధులు నిర్వహిస్తుండటం వల్ల బయటి కంపెనీల్లో పనిచేసేవారికి అవకాశం దక్కడం లేదని సిబ్బంది వాపోతున్నారు. ● అసిస్టెంట్ కమాండెంట్ల దగ్గర విధులు నిర్వహించే పీఏలు కూడా ఏళ్ల తరబడి హెడ్ క్వార్టర్‌లోనే కొనసాగుతున్నట్లు సిబ్బందిలో చర్చ జరుగుతోంది. ● కానిస్టేబుల్ కిరణ్ 20 ఏళ్లుగా అసిస్టెంట్ కమాండెంట్ దగ్గర పనిచేస్తున్నారు. ● విశ్వనాథ్ రెడ్డి ట్రెజరీలో ఎనిమిదేళ్లుగా హెడ్ క్వార్టర్‌లోనే ఉంటున్నారు. ● డీఎస్పీలు ఎస్ఎం బాషా దగ్గర హుసేనయ్య, రమణ దగ్గర రియాజ్, రవికిరణ్ దగ్గర రాజు కొన్నేళ్లుగా సీట్లకు అతుక్కుని విధులు నిర్వహిస్తున్నారు. ● హెడ్ కానిస్టేబుల్ విశ్వనాథ్ రెడ్డి కూడా అసిస్టెంట్ కమాండెంట్, గతంలో కమాండెంట్ దగ్గర విధులు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్‌గా విధుల్లో చేరినప్పటి నుంచి హెడ్ క్వార్టర్‌లోనే కొనసాగుతుండటంతో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బదిలీలకు రూ.లక్షల్లో వసూలు నచ్చిన చోటుకు పంపేందుకు, ఉన్న చోటనే కొనసాగించేందుకు ఉద్యోగుల నుంచి గతంలో మామూళ్లు వసూలు చేశారని ఫిర్యాదుల నేపథ్యంలో పదవీ విరమణ పొందిన ఓ ఉన్నతాధికారిపై విచారణ జరిగింది. పదవీ విరమణకు ఒక రోజు ముందు బదిలీల పేరుతో ఇద్దరు అధికారులు చక్రం తిప్పి ముడుపులు వసూలు చేశారు. వివిధ హోదాల్లో ఉన్న వంద మందికి స్థానచలనం కల్పించి గత కమాండెంట్ రూ.లక్షల్లో దండుకున్నారు. ఈ తరహా బదిలీలపై సిబ్బంది నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో డీఐజీ రాజకుమారి ఆదేశాల మేరకు 16వ బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాస్ గతంలో విచారణ జరిపి ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. అయితే చర్య ప్రశ్నార్థకంగా మారినట్లు తెలుస్తోంది. మార్గదర్శకాలతో మెమో జారీ చేసిన కమాండెంట్ అర్హుల జాబితాను సిద్ధం చేసిన కంపెనీ ఆర్ఐలు -
రాళ్ల ట్రాక్టర్ బోల్తా పడి బాలుడి మృతి
పాములపాడు: మండలంలోని చెలిమల గ్రామ సమీపంలో రాళ్ల ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. లింగాల గ్రామానికి చెందిన మోహన్‌రావు కుమారుడు జస్వంత్ (17) 9వ తరగతి చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం పని మీద పాములపాడుకు వచ్చిన జస్వంత్ తిరుగు ప్రయాణంలో స్వగ్రామానికి వెళ్తున్న రాళ్ల లోడు ట్రాక్టర్ ఎక్కాడు. మార్గమధ్యలో చెలిమిల గ్రామ సమీపంలో ఎద్దుల వంక వాగు వద్ద ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో రాళ్లపై కూర్చున్న బాలుడు జస్వంత్‌పై రాళ్లుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో బాలుడు సంగీత రాజు క్షేమంగా బయటపడ్డాడు. ప్రస్తుతం డ్రైవర్ స్వాములు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని ప్రమాద వివరాలు సేకరించారు. అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య కొలిమిగుండ్ల: నందిపాడుకు చెందిన గుండ్ర గుర్రప్ప(48) అప్పుల బాధతో సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్ఐ బాబా ప్రకృద్దీన్ తెలిపారు. గుర్రప్ప నాపరాళ్ల వ్యాపారం చేస్తూ నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. కుమారుడు చదువు, కుమార్తె వివాహం కోసం ఫైనాన్స్ సంస్థల వద్ద రూ.9లక్షలు అప్పు చేశాడు. ఇందులో రూ.3 లక్షలు వాయిదాల రూపంలో చెల్లించాడు. మిగిలిన బకాయి చెల్లించే అవకాశం లేక ఆర్థిక సమస్యలతో సతమతమయ్యాడు. దీతో మనస్తాపం చెంది తిమ్మనాయినపేట జంక్షన్ సమీపంలోని పొలంలోకి వెళ్లి శనగ మాత్రలు మింగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికులు గుర్తించి తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. చెట్టుపై నుంచి కిందపడి యువకుడి మృతి ఆదోని అర్బన్: పెద్దకడబూరు మండలం నెమలికల్లు గ్రామానికి చెందిన అల్తాఫ్(26) అనే యువకుడు చెట్టుపై నుంచి కిందపడి సోమవారం మృతిచెందాడు. బంధువులు తెలిపిన వివరాలు మేరకు .. ఉదయం పొలంలోని టెంకాయ చెట్టు ఎక్కి టెంకాయలను తెంపుతుండగా అకస్మాత్తుగా పై నుంచి కింద పడ్డాడు. కిందకు పడిన యువకుడిని వెంటనే స్థానికులు ఆదోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే అల్తాఫ్ మృతిచెందాడు. మృతుడికి భార్య సునీత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడు వలస వెళ్లి ఇటీవలే గ్రామానికి చేరుకున్నాడు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో రోదనలు మిన్నంటాయి. -
టీడీపీ డీలరా.. మజాకా..!
పగిడ్యాల: పేద ప్రజలకు చౌకదుకాణాల ద్వారా ఉచితంగా సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం పంపిణీలో డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కార్డుదారుల వేలిముద్రలను తీసుకుని బియ్యం వేయకుండా మోసం చేసిన వైనం పడమర ప్రాతకోట గ్రామం 21వ షాపు పరిధిలో వెలుగు చూసింది. గత జగనన్న ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ ఇంటింటికి పంపిణీ చేయగా.. కూటమి ప్రభుత్వం అధికార పార్టీ నేతలను డీలర్లు మార్చి పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తోంది. ఇందుకు పడమర ప్రాతకోట 21వ షాపు నిర్వాకుడే నిదర్శనం. ఈ షాపు పరిధిలో 709 కార్డులు ఉన్నా యి. ప్రతి నెల ఏఏవై కార్ుడ్సకు 13.30 క్వింటాళ్లు, తెల్లరేషన్‌కార్డులకు 90.50 క్వింటాళ్లు కాగా క్లోజింగ్ బ్యాలెన్స్ (సీబీ) పోగా ఓపెనింగ్ బ్యాలెన్స్ 55.84 క్వింటాళ్లు సరాఫరా చేస్తున్నామని సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ నివేదిక అందజేశారు. కార్డుదారులకు టోకరా కొట్టేందుకే ఎండీయూ వాహన డ్రైవర్‌తో బయోమెట్రిక్ మిషన్ ఆన్ చేయించుకుని డీల ర్లే స్వయంగా కార్డుదారుల థంబ్ తీసుకుని బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘ప్రభుత్వం మాది మేము బియ్యం పంచుకుంటాం.. కేవలం థంబ్ వేయించి పోండి’ అంటూ ఎండీయూ డ్రైవర్లపై డీలర్లు పెత్తనం చెలాయిస్తున్నట్లు సమాచారం. అందుకే ఫిబ్రవరి నెలకు సంబంధించి బియ్యం కోటా తక్కువ వచ్చిందని మార్చి నెలలో రెండు నెలల బియ్యం ఒకేసారి వేస్తానని కార్డుదారుల వేలిముద్రలు తీసుకుని దాదాపు 80 ప్యాకెట్ల బియ్యాన్ని డీలర్ మాయం చేసినట్లు సమాచారం. ఎక్కువగా 20 కేజీలు, 25 కేజీలు, 35 కేజీలు కలిగిన కార్డుదారుల వ్రేలిముద్రలను తీసుకుని బియ్యం వేయనట్లు తెలుస్తోంది. పేదల నోటి కాడి బియ్యాన్ని పక్కదారి పట్టించిన అధికార పార్టీ డీలర్‌పై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. బియ్యం వేయకుండానే వేలిముద్రలు తీసుకున్నాడు పోయిన నెలలో నా కార్డుకు బియ్యం వేసి మా కొడుకుల కార్డులకు బియ్యం వేయలేదు. వేలిముద్రలు తీసుకున్నావ్ కదా అని అడిగితే వచ్చే నెలలో వేస్తానని చెప్పినాడు. ఈనెల బండి ఇంకా రాలేదు. – హజరాంబీ, పడమర ప్రాతకోట 5 కేజీలు, 10 కేజీల కార్డులకు మాత్రమే వేశారు కార్డులో ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఉన్న వాళ్లకు మాత్రమే 5 కేజీలు, 10, 15 కేజీల బియ్యం వేశారు. 20, 25, 30 కేజీల ఉన్న వారికి ఇవ్వలేదు. నా కొడు కు తలారి అయినా బియ్యం వేయలేదు. ముస్లిం కాలనీలో చాలా మందికి వేయలేదు. రెండు నెలల బియ్యం వేస్తానని వ్రేలిముద్రలు వేయించుకున్నాడు. – మొల్ల జైబున్బీ,పడమర ప్రాతకోట నా దృష్టికి రాలేదు పడమర ప్రాతకోటలోని 21వ షాపు డీలర్ బియ్యం సరిగా పంపిణీ చేయని విషయం నా దృష్టికి రాలేదు. మార్చి నెల కోటా బియ్యం పంపిణీ జరుగుతోంది. ఆర్ఐతో విచారణ చేయించి రెండు నెలల బియ్యం వేసేలా చర్యలు తీసుకుంటాం. – శివరాముడు, తహసీల్దార్, పగిడ్యాల వినియోగదారుల థంబ్ తీసుకుని రేషన్ ఇవ్వని వైనం ఫిబ్రవరి నెలలో దాదాపు 80 బస్తాల బియ్యం మాయం లబోదిబోమంటున్న కార్డుదారులు -
రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి
పత్తికొండ రూరల్/ఆస్పరి: రోడ్డు ప్రమాదంలో పందికోన గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త పందుల బాలరాజు (34) మృతి చెందారు. వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో బాలరాజు చురుగ్గా పాల్గొనేవాడు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఉన్న అభిమానంతో ముగ్గురు సంతానంలో పెద్దకుమార్తె పేరు షర్మిల, చిన్నకుమారుడి పేరు జగన్ అని పెట్టుకున్నారు. ఆస్పరి మండలం కై రుప్పల సమీపంలో ఆదివారం దేవరకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఆటోలో వస్తూ అదుపుతప్పి ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. చికిత్స నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. బాలరాజు మృతితో భార్య సరోజ, బంధువులు బోరున విలపించారు. మృతి వార్త తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి సోమవారం ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై గుర్తు తెలియని దుండగుల దాడి
బేతంచెర్ల: మండల పరిధిలోని సిమెంట్ నగర్ గ్రామ సమీపాన బేతంచెర్ల – నంద్యాల రహదారిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి గాయపరిచారు. ఆదివారం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. బేతంచెర్ల పట్టణానికి చెందిన చంద్ర కుమారుడు జశ్వంత్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు.ఈ యువకుడు ఆదివారం నంద్యాలకు వెళ్లి ద్విచక్ర వాహనం కొనుగోలు చేసుకొని బేతంచెర్లకు బయలు దేరాడు. సిమెంట్ నగర్ సమీపాన బేతంచెర్ల నుంచి నంద్యాల వైపు వెళ్తున్న కోళ్లఫారానికి సంబంధించిన బొలెరో వాహనం ఎదురొచ్చి బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై నుంచి జశ్వంత్ కింద పడగానే బొలెరోలో ఉన్న గుర్తు తెలియని దుండగులు కిందకు దిగి రాళ్లు, రాడ్డుతో తలపై దాడి చేసి ఆ యువకుడి చేతికి ఉన్న నాలుగు తులాల బంగారు కడియం, రెండు రింగులను బలవంతంగా లాక్కున్నారు. తర్వాత ఆ యువకుడు ఆర్టీసీ బస్సు ఎక్కి బేతంచెర్లకు వెళ్లాడు. అక్కడ స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించుకొని విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్ఐ రమేష్ బాబు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బంగారం కోసం దాడి చేశారా లేక మరేదైనా కారణం ఉందా అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలనుంది. -
రోగాలు వస్తున్నాయి
బాపురం రిజర్వాయర్ ను ంచి 15, 20 రోజులకో సారి నీరు వస్తోంది. పెద్ద ల కాలంలో తవ్వించిన ఒక్కిరేణి రక్షణ గోడలు పడిపోవడంతో పశువులు, కుక్కలు నీరు తాగి పోతున్నాయి. కలుషిత నీటితే తాగుతుండటంతో రోగాలు వస్తున్నాయి. మమ్మల్ని అధికారులు పట్టించుకోవడం లేదు. – రామాంజినేయులు రిజర్వాయర్ నిర్మించాలి మా గ్రామానికి ఐదు కిలో మీటర్లు దూరంలో హంద్రీ నీ వా కాలువ ఉంది. ఆ కాలువ నీటిని మళ్లించి జొహరాపురం సమీపంలో రిజర్వాయర్ నిర్మిస్తే ఆస్పరి, చిన్నహోతూరు, శంకరబండ, చిరుమాన్‌దొడ్డి, హలిగేర గ్రామాలకు కూడా మంచి నీటిని సరఫరా చేయవచ్చు. – లక్ష్మన్న అధికారులు పర్యటించాలి మా గ్రామంలో జిల్లా అధికారుల ఒక్కసారి పర్యటిస్తే సమస్య ఏమిటో తెలుస్తుంది. తరతరాలు గా మేం ఒక్కిరేణి నీటినే తాగుతున్నాం. ప్రస్తుతం ఒక్కిరేణిలో ఉన్న నీరు ఒక నెల మాత్రమే సరిపోతుంది. తరవాత బిందెడు మంచి నీళ్ల కోసం పక్క గ్రామాలైన ఆస్పరి, దేవనబండకు వెళ్లాలి. – బంగారు సంజప్ప -
జిల్లా స్థాయి చెస్ పోటీలు ప్రారంభం
నంద్యాల(న్యూటౌన్): పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో 17 సంవత్సరాల్లోపు బాలబాలికలకు జిల్లా స్థాయి చెస్ పోటీలు ప్రారంభమయ్యాయి. నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బయ్య, లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు నిజాముద్దీన్ పోటీలు ప్రారంభించి మాట్లాడారు. చెస్ క్రీడ ఏకాగ్రతను పెంచుతుందని, తద్వారా చదువులో కూడా రాణించడానికి వీలవుతుందన్నారు. పిల్లల చేతికి మొబైల్ ఫోన్లు ఇవ్వకుండా వారి దృష్టిని ఆటలపై మళ్లించాలన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, కార్యదర్శి రామసుబ్బారెడ్డి, రామకృష్ణ డిగ్రీ కళాశాల డైరెక్టర్ ప్రగతిరెడ్డి పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం ఓర్వకల్లు: కర్నూలు–కడప జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గడివేముల మండలం ఒండుట్ల గ్రామానికి చెందిన తలారి రంగస్వామి కొడుకు రంగనాయకులు (50) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తాడు. ఈ క్రమంలో పొగాకు దిగుబడులను విక్రయించేందుకు మండలంలోని నన్నూరు సమీపాన గల డెక్కన్ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. పంట నాణ్యత సరిగాలేదని కొనుగోలు దారులు పొగాకు బేళ్లను రీబేల్ చేయడంతో స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ట్రాక్టర్లో వేసుకొని తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో రెడ్డి డాబా వద్ద ట్రాక్టర్ నిలబెట్టి డాబా వైపునకు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా నంద్యాల నంచి కర్నూలు వైపు వెళుతున్న లారీ రంగనాయకులును ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు హైవే పెట్రోలింగ్ వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడి భార్య ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. -
ముక్క.. మారిన మక్కువ
‘బర్డ్‌ఫ్లూ’ పూర్తిగా తగ్గిపోయినా మాంసం ప్రియులు చికెన్ కొనుగోలుకు ఇష్టం పడటం లేదు. ఖరీదైనా మటన్పైన మక్కువ చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడంతో చికెన్ షాపులు వెలవెల బోతున్నాయి. అధికారులు సైతం అవగాహన కల్పించడంలో విఫలం కావడంతో వ్యాపారులు నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోంది. కర్నూలు నగరంలో రెవెన్యూ కాలనీలో ఆదివారం కనిపించిన దృశ్యమిది. మటన్ సెంటర్ వద్ద మాంసం ప్రియులు పోటెత్తగా చికెన్ కేంద్రం వద్ద కొనుగోళ్లు కనిపించలేదు. –సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
రాయలసీమ రవాణాశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా లక్ష్మీకర్‌రెడ్డి
కడప వైఎస్ఆర్ సర్కిల్: రవాణాశాఖలో రాయలసీమ స్థాయిలో నాన్ టెక్నికల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏపీటీడీ ఎన్టీఈఏ)కు సంబంధించి సీమ అధ్యక్షుడిగా పెద్దిరెడ్డి లక్ష్మీకర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఎన్నికకు సంబంధించి ఫిబ్రవరి 22న నోటిఫికేషన్, 9న నామినేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఎన్నికల అధికారి ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కడపలోని ఓ కల్యాణ మండపంలో నిర్వహించిన ఎన్నిక కార్యక్రమంలో అధ్యక్షుడిగా లక్ష్మీకర్‌రెడ్డి, జోన్ అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఈవై ప్రకాశ్ (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్,కడప), జోన్ వైస్ ప్రెసిడెంట్–1గా కె.సువర్ణకుమారి (అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, అనంతపురం), జోన్ వైస్ ప్రెసిడెంట్–2గా టీఎన్ పురుషోత్తంరెడ్డి (సీనియర్ అసిస్టెంట్, చిత్తూరు), జోన్ వైస్‌ప్రెసిడెంట్–3గా ఎస్.మనోహర్‌బాబు (జూనియర్ అసిస్టెంట్, ఆదోని), జోన్సెక్రటరీగా టి.విజయ్‌కుమార్ (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, మదనపల్లె), జోన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఓ.యువ కిశోర్ (సీనియర్ అసిస్టెంట్, తిరుపతి), జోన్ జాయింట్ సెక్రటరీ–1గా డి.నసీరుద్దీన్ (సీనియర్ అసిస్టెంట్, కర్నూలు), జోన్ జాయింట్ సెక్రటరీ–2 ఓ.నాగరాజ (సీనియర్ అసిస్టెంట్, మదనపల్లె), జోన్ జాయింట్ సెక్రటరీ–3 పి.చక్రపాణి (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, చిత్తూరు), జోన్ ట్రెజరర్‌గా ఎన్.రవిప్రకాశ్ (సీనియర్ అసిస్టెంట్, హిందూపురం)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికై న 11 మందిని పలువురు రవాణాశాఖలో పనిచేసే ఉద్యోగులు, టెక్నికల్ సిబ్బంది ఘనంగా సత్కరించారు. -
బరితెగించిన టీడీపీ శ్రేణులు
కొలిమిగుండ్ల: టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. అక్రమాలు, అన్యాయాలను ప్రశ్నించిన వారిపై దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. తాజాగా ఓ భూమి విషయంలో కొలిమిగుండ్ల మండలం చింతలాయిపల్లెకు చెందిన నలుగురిపై దాడి చేసి గాయపరిచారు. వివరాల్లోకి వెళితే.. చింతలాయిపల్లెలోని 144/1 సర్వే నెంబర్లో 9.72 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి విషయంలో దూదేకుల రహంతుల్లా, అంకిరెడ్డిపల్లెకు చెందిన బత్తుల లక్ష్మన్న మధ్య చాలా రోజుల నుంచి వివాదముంది. దీనిపై కోర్టులో వ్యాజ్యం జరుగుతుంది. రహంతుల్లా సోదరులు ఆ భూమిలో చీని చెట్లు నాటుకున్నారు. ఫిబ్రవరి 28న అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో సర్వేయర్, రెవెన్యూ సిబ్బంది సర్వే చేసి కొలతలు వేసి మూడు ఎకరాల భూమిని లక్ష్మన్నకు అప్పగించారు. జేసీబీ సాయంతో చింతలాయిపల్లెకు చేరుకున్న టీడీపీ శ్రేణులు దౌర్జన్యంగా చీనిచెట్లను తొలగించడంతో రహంతుల్లా కుటుంబానికి చెందిన మహిళలు అడ్డుపడ్డారు. ఇందుకు రెచ్చిపోయిన అధికారపార్టీ నాయకులు లక్ష్మన్న, రంగనాయకులు, సుబ్బులతో పాటు మరి కొంత మంది మహిళలు అని చూడకుండా అమీనాబీ, జైన్‌బీ, ఇమాంబీతో పాటు బాలిక హాసినిపై కట్టెలు, రాళ్లతో ఇష్టానుసారంగా దాడి చేసి గాయపర్చారు. క్షతగాత్రులను కుటుంబ సభ్యులు బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి క్షతగాత్రులను పరామర్శించి ఘటనపై ఆరాతీశారు. చింతలాయిపల్లెలో కొద్ది రోజుల క్రితం వైఎస్సార్సీపీ నేత నీలం సంజీవకుమార్‌రెడ్డికి చెందిన 400 మునగ చెట్లను పూర్తిగా నేలమట్టం చేశారు. ఆకేసులో నిందితులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి అండతోనే దాడులు దౌర్జన్యంగా మహిళలపై దాడి నలుగురికి గాయాలుబనగానపల్లె రూరల్: బీసీ జనార్దన్‌రెడ్డి మంత్రి అయిన తర్వాత నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలకు హద్దు లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. మంత్రి అండతోనే ఆ పార్టీ నాయకులు చింతలాయిపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై దాడి చేశారన్నారు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి బీసీ ప్రోద్బలంతో కొలిమిగుండ్ల సీఐ రమేష్ బాధితులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి కోర్టు వ్యాజ్యంలో ఉన్నటువంటి పొలాన్ని బత్తుల లక్ష్మన్న కుటుంబసభ్యులకు అప్పగించాలని ఒత్తిడికి గురిచేసినట్లు ఆరోపించారు. అంగీకరించకపోవడంతో చీని చెట్లను జేసీబీ సహాయంతో తొలగించడమే కాక దాడి చేశారన్నారు. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు అన్ని విధాలుగా తాను అండగా ఉంటానన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ న్యాయవాది అబ్దుల్‌ఖైర్ ఉన్నారు. -
పంట మార్పిడి ఎంతో మేలు
కర్నూలు(అగ్రికల్చర్): ఎప్పుడూ ఒకే పంట వేస్తుండటంతో చీడపీడల బెడద పెరుగుతుందని, విధిగా పంట మార్పిడి చేపట్టే విధంగా రైతులను ప్రోత్సహించాలని నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ ప్రధానశాస్త్రవేత్త డాక్టర్ రామకృష్ణారావు సూచించారు. కలెక్టరేట్లోని వ్యవసాయ శాఖ సమావేశ మందిరంలో దేశీ డిప్లొమా కోర్సు కింద ఇన్పుట్ డీలర్లకు ఆదివారం శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు వేసవి దుక్కుల ప్రాధాన్యతపై అవగాహన పెంచాలన్నారు. ఎకరానికి 5 నుంచి 10 వరకు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. విశ్రాంత జేడీఏ జయచంద్ర పలు సూచనలు చేశారు. -
మాజీ సైనికుడి మృతి
కర్నూలు(అగ్రికల్చర్): నగర శివారులో నివాసం ఉంటున్న మాజీ సైనికుడు ప్రేమ్‌కుమార్(45) ఆనారోగ్య కారణా లతో ఆదివారం మరణించారు. ఈయన భారత సైన్యంలో ఎంఈజీ 22 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసి హవల్దారుగా పదవీ విరమణ తీసుకున్నారు. నగర శివారులోని వెంకాయపల్లి ఎల్లమ్మ దేవస్థానం ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణించడంతో పలువురు మాజీ సైనికులు సంతాపం ప్రకటించారు. మృతుడి స్వగ్రామమైన ఆళ్లగడ్డలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. సైన్యంలో విశేషంగా సేవలు అందించిన ప్రేమ్‌కుమార్ మృతి బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు నర్రా పేరయ్య చౌదరి ఆదివారం ఓ ప్రకటనలో తన సంతాపం తెలిపారు. బైక్ అదుపు తప్పి.. ● కానాలా గ్రామ వాసి మృతి ఉయ్యాలవాడ: మాయలూరు– కానాల ఆర్అండ్బీ రహదారిలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి అదుపు తప్పి కింద పడి మృతి చెందాడు. ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు... సంజామల మండలం కానాల గ్రామానికి చెందిన కమలాకర్ (45) పనిమీద గోవిందపల్లె గ్రామానికి వెళ్లాడు. తర్వాత తిరిగి తన స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. మార్గ మధ్యంలో మాయలూరు– కానాల ఆర్అండ్బీ రోడ్డులో రైల్వే ట్రాక్ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి పక్కనున్న గుంతలో పడింది. ఈఘటనలో కమలాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య శోభ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని.. గోనెగండ్ల: గుర్తు తెలియని వాహనం ఢీకొని మండల పరిధిలోని ఒంటెడుదిన్నె గ్రామానికి చెందిన కురువ ఈరన్న (30) అనే యువకుడు మృతిచెందాడు. సీఐ గంగాధర్ తెలిపిన వివరాల మేరకు.. కురువ చిన్న ఉరుకుందు, గంగమ్మ కుమారుడు అయిన ఈరన్న శనివారం రాత్రి గోనెగండ్ల నుంచి స్వగ్రామానికి నడుచుకుంటూ వెలుతున్నాడు. అయితే, గాజులదిన్నె ప్రాజెక్టు స్టేజ్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. ఈ ఘటనలో ఈరన్న తలకు తీవ్రగాయం కావడంతో స్థానికులు 108 అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక రాత్రి మృతిచెందినట్లు తెలిపారు. మృతిడి అక్క కురువ నరసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. బియ్యం పట్టివేత నందికొట్కూరు: పట్టణంలోని సంగయ్యపేటలో పగడం పక్కిరయ్య అనే వ్యాపారి ఇంటి ముందు 37 ప్యాకెట్ల రేషన్ బియ్యాన్ని గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి బియ్యాన్ని స్టేషన్‌కు తరలించినట్లు టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. ఎవరైనా పీడీఎస్ బియ్యం విక్రయించినా, అక్రమంగా నిల్వ చేసినా చట్ట పరమైన చర్యలు తప్పవని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
● ఇద్దరి పరిస్థితి విషమం ఆళ్లగడ్డ: కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై ఆళ్లగడ్డ సమీపంలోని హైవే ఢాబా సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కడప పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మహానంది క్షేత్రానికి వెళ్లి దర్శనం చేసుకుని కారులో తిరిగి ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో ఆళ్లగడ్డ సమీపంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న బ్రిడ్జిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న సుధాకర్ (28) అక్కడికక్కడే మృతి చెందగా, వెంకటేఽశ్వర్లు, మనీష్‌కుమార్‌లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న డీఎస్పీ ప్రమోద్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాల వైద్యశాలకు తరలించారు. -
మూడు రోజుల వైద్య శిబిరం
వెల్దుర్తి: చిన్నారులు అనారోగ్యం పాలయ్యారన్న సమాచారం తెలుసుకుని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి శాంతికళ, డీపీఓ భాస్కర్ ఆదివారం వెల్దుర్తి సీహెచ్‌సీ, రత్నపల్లె గ్రామాన్ని సందర్శించారు. చిన్నారులకు విషజ్వరాలు కావని తేల్చుకుని మూడు రోజుల పాటు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎంపీడీఓ డీఐఓ నాగప్రసాద్, సంచార వైద్య చికిత్స నోడల్ అధికారి రఘు, రామళ్లకోట పీహెచ్సీ వైద్యాధికారి భువనతేజ, రత్నపల్లె సర్పంచ్ ఫక్కీరమ్మ పాల్గొన్నారు. -
క‘న్నీటి’ కష్టాలు
● జొహరాపురం గ్రామానికి ఒక్కిరేణి నీరే దిక్కు ● పిల్లల నుంచి పెద్దల వరకు తప్పని అవస్థలు ● పిలిచినా ఊరికి రాని బంధువులు ఒక్కిరేణిలో నీరు తీసుకెళ్తున్న గ్రామస్తులు ఆస్పరి: ఎండలు మండుతూ దాహం వేసినా చుక్క నీరు తాగలేని దుస్థితి వారిది. మంచినీరు కావాలంటే దూరం వెళ్లాలి. అక్కడ వేల మంది జనం.. చాలా కష్టం పడితేనే బిందె నీరు దొరుకుతుంది. ఇంట్లో ఉండే మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులను తమతోపాటు తప్పని తీసుకెళ్లాల్సిన దుస్థితి. ఆస్పరి మండలంలోని జొహరాపురం ప్ర‘జల’ కష్టాలు ఇవీ.. గ్రామంలో 1,200 ఇళ్లు ఉండగా 7,000 మంది నివాసం ఉంటున్నారు. యాభై ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం జొహరాపురానికి 50 కిలో మీటర్లు దూరంలో ఉన్న బాపురం రిజర్వాయర్ నుంచి మంచి నీటి సరఫరా చేసేందుకు పైపులైన్ వేసింది. అయితే పై గ్రామాలైన ఆలూరు, మొలగలవల్లి, కొట్టాల గ్రామాల వారు నీటి అవసరాలు తీర్చుకున్న తరువాతే జొహరాపురం గ్రామానికి బాపురం రిజర్వాయర్ నీరు వస్తుంది. అది కూడా ప్రతి ఒక్క కాలనీకి నీటిని సరఫరా చేయరు. దీంతో ప్రజలు తప్పని పరిస్థితుల్లో గ్రామ సమీపంలో కలుషితంగా ఉన్న ఒక్కిరేణి నీటితోనే దాహం తీర్చుకుంటున్నారు. కొందరు జ్వరం, విరేచనాలు, నొప్పులు ఎక్కువై అస్పత్రుల పాలవుతున్నారు. ఒక్కిరేణిలో నీరు లేకపోతే ఆలూరు, ఆస్పరి నుంచి వచ్చే మినిరల్ వాటర్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఎక్కడ బోరు వేసినా ఫ్లోరైడ్ నీరే! వేసవి వచ్చిందంటే జొహరాపురంలో చదువుకునే పిల్లలు నుంచి వయో వృద్ధు లు వరకు నీటి కోసం వెళ్లాల్సిందే.ఈ గ్రామ పరిసరాలు మొత్తం నల్లరేగడి భూములున్నాయి. దీంతో ఎక్కడ బోరు వేసినా ఫ్లోరైడ్ నీరే పడుతోంది. బోర్లు, రిజర్వాయర్లు లేని కాలంలో దాహం తీర్చుకునేందుకు వందల ఏళ్ల క్రితం పెద్దలు వర్షపు నీరు వెళ్లే ప్రధాన కాలువ సమీపంలో ఒక్కిరేణి నిర్మించుకున్నారు. అప్పటి నుంచి ఒక్కిరేణి నీటినే గ్రా మస్తులు తాగుతున్నారంటే పరిస్థితి ఎంత దారణంగా ఉందో అర్థమవుతోంది. గ్రామంలో మంచి నీటి సమస్య ఉండటంతో దాదాపు వంద కుటుంబాలు భూములను కౌలుకిచ్చి కర్నూలు, బళ్లారి, ఆదోని పట్ణణాలకు వెళ్లి స్థిర పడ్డారు. ఇంకా చాలా మంది వేళ్లే ఆలోచనలో ఉన్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రతి ఇంటికీ సంపు గ్రామంలో కొత్తగా నిర్మించుకునే ప్రతి ఇంటికి సంపు ఏర్పాటు చేసుకుంటున్నారు. మిద్దె పై నుంచి వచ్చే నీటిని పైపులు ద్వారా సంపును నింపుకుంటున్నారు. కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలన్నా నీరు దొరక ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్క ట్యాంకర్ నీరు రూ.800 కొనుగోలు చేస్తున్నారు. ఇది అదనపు ఖర్చు అని బాధపడుతున్నారు. నీటి సమస్య ఉండడంతో గ్రామంలో శుభ కార్యాలు కూడా చేయక పట్టణాలలోని ఫంక్షన్ హల్లో చేసుకుంటున్నారు. -
నాణ్యమైన విద్యకు చిరునామా ‘బనవాసి ఏపీఆర్జేసీ’
దరఖాస్తుకు ఈ నెల 31 ఆఖరు ● ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష ● నాలుగు జిల్లాల విద్యార్థినులకు అవకాశం ఎమ్మిగనూరు రూరల్: బనవాసి ఏపీ గురుకుల జూనియర్ కాలేజీ క్రమ శిక్షణకు, నాణ్యమైన విద్యా బోధనకు పెట్టింది పేరు. కాలేజీలో సీటు రావటం విద్యార్థినులు అదృష్టంగా భావిస్తారు. ఏపీ గురుకుల కాలేజీలో చదువుకున్న విద్యార్థిని ఉన్నత విద్యలో రాణిస్తుందనే నమ్మకం. రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన విద్యార్థినులకు ఇక్కడ రెండు సంవత్సరాల విద్యాబోధన అందుతుంది. ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధిస్తే సీటు వచ్చినట్లే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, క్రీడాకారులు, అనాథలు, ఎన్సీసీ కేడెట్లకు రిజర్వేషన్ వర్తిస్తుంది. సీటు దక్కించు కున్న విద్యార్థినులకు హాస్టల్ వసతి కూడా ఉంటుంది. కాలేజీలో బాలికలకు ఎంపీసీలో 60 సీట్లు, బైపీ సీలో 40 సీట్లు, ఎంఈసీలో 30 సీట్లు ఉంటాయి. ఆన్లైన్లో దరఖాస్తు: ఇంటర్మీడియట్ ప్రవేశానికి పదో తరగతి విద్యార్థి నీలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు https//aprs.apcfss.in వెబ్‌సైట్‌ను చూడవచ్చును. ఈనెల 31లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే.. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25న (మధ్యా హ్నం 2.30 నుంచి 5 గంటల) నిర్వహిస్తారు. బాలికలకు మంచి అవకాశం రాయలసీమలోని నాలుగు జిల్లా విద్యార్థినులకు ఇది మంచి అవకాశం. కాలేజీలో సీటు వస్తే రెండు సంవత్సరాలు బోధన అందిస్తాం. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – వి.గీర్వాణి, జిల్లా కో–ఆర్డినేటర్, ప్రిన్సిపాల్ ఏజీఆర్జేసీ బనవాసి -
ఏఈఓల సంఘం జిల్లా కోశాధికారిగా నరసింహుడు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం(ఏఈఓలు) కోశాధికారిగా వి.నరసింహుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖాళీగా ఉన్న ఈ పోస్టు భర్తీకి శనివారం కలెక్టరేట్లోని జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. మంత్రాలయం మండలంలో ఏఈఓగా పని చేస్తున్న నరసింహుడుని కార్యవర్గసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎంపికకు పరిశీలకుడిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.నాగేశ్వరరెడ్డి వ్యవహరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం అధ్యక్షుడు చాంద్‌బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్, ఇతర కార్యవర్గసభ్యలు పాల్గొన్నారు. కొలనుభారతి దేవికిప్రత్యేక పూజలు కొత్తపల్లి: రాష్ట్రంలో ఏకైక సరస్వతి క్షేత్రంగా విరాజిల్లుతున్న కొలనుభారతి దేవి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసి మహాన్యా స పూర్వక రుద్రాభిషేకం, మహామంగళహారతి వంటి విశేష పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లోక కల్యాణం, ప్రజలు పాడి పంటలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రధాన అర్చకుడు గంట్యాల శ్రీనివాస శర్మ సరస్వతి హోమం నిర్వహించారు. బైక్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య పగిడ్యాల: తండ్రి బైక్ కొనివ్వనందుకు ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్త ముచ్చుమర్రి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోయ వెంకటేశ్వర్లుది నిరుపేద కుటుంబం. వ్యవసాయ పనులకెళ్తూ జీవనం సాగించే ఇతనికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శివరామ్ (21) బోలెరో వాహనానికి డ్రైవర్‌గా వెళ్తున్నాడు. కొద్ది రోజుల నుంచి తనకు బైక్ కొనివ్వాలని తండ్రిని వేధించేవాడు. శుక్రవారం రాత్రి తండ్రితో గొడవపడి ఆవేశంతో ఇంట్లోకి వెళ్లి ఉరేసున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి ఉరికి వేలాడుతున్న యువకుడిని కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ముచ్చుమర్రి పోలీసులు కేసు నమోదు చేశారు. -
భార్య హత్య కేసులో భర్త అరెస్ట్
కొలిమిగుండ్ల: బెలుం శింగవరంలో భార్యను హత్య చేసిన కేసులో భర్తను అరెస్ట్ చేసినట్లు సీఐ రమేష్‌బాబు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో శనివారం నిందితుడి వివరాలను విలేకరుల సమావేశంలో సీఐ వెల్లడించారు. గ్రామానికి చెందిన బిజ్జం చిన్న వెంకట్రామిరెడ్డి, మనోహరమ్మ దంపతులు వ్యవసాయ పనులకు వెళ్తూ జీవనం సాగించేవారు. కాగా చిన్న వెంకట్రామిరెడ్డి మద్యానికి బానిస కావడం, ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పర్చుకుని ఆస్తులతో పాటు డబ్బులు పొగొట్టుకున్నాడు. పూర్తిగా మద్యానికి బానిసై పనికి పోకుండా ఖాళీగా ఉంటూ భార్యతో గొడవ పడేవాడు. మనోహరమ్మ కూలీ పనుల ద్వారా వచ్చిన డబ్బుల కోసం ఘర్షణ పడి లాక్కునేవాడు. పైగా భార్యపై రోజు రోజుకు అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 6వ తేదీన కూలీ పనులకు వెళ్లి ఇంటికి వచ్చిన భార్యను రోకలి బండతో బలంగా కొట్టడంతో దుర్మరణం చెందింది. మృతురాలి తండ్రి గడ్డం తిమ్మా రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితు డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. -
చూపును హరించే ‘గ్లకోమా’
● జిల్లాలో అధికమవుతున్న కేసులు ● నేటి నుంచి ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు కర్నూలు(హాస్పిటల్): కంటి అద్దాలను తరచూ మార్చాల్సి రావడం.. మసక వెలుతురులో వస్తువులను గుర్తించడం ఆలస్యం అవడం.. లైట్ల చుట్టూ రంగుల వలయాలు కనిపించడం.. ఇలా ఎన్నో లక్షణాలు గ్లకోమా వ్యాధిలో భాగంగా ఉంటాయి. ఈ వ్యాధికి ప్రాథమిక దశలో చికిత్స తీసుకుంటే చూపును కాపాడుకోవచ్చు. ఆలస్యం చేస్తే మాత్రం అంధకారమే మిగులుతుంది. ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు గ్లకోమా వారోత్సవాలు నిర్వహించనున్నారు. పెరుగుతున్న బాధితులు కర్నూలులోని ప్రాంతీయ ప్రభుత్వ కంటి వైద్యశాల, నంద్యాల కంటి ఆసుపత్రితో పాటు ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లలో కంటి సమస్యలకు చికిత్స చేస్తారు. గతంలో 2 శాతం వరకు గ్లకోమా బాధితులు ఉంటున్నారు. ప్రస్తుతం వీరి సంఖ్య పెరిగింది. ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో ప్రతి రోజూ 250 నుంచి 300 మంది దాకా చికిత్స కోసం వస్తుండగా అందులో గ్లకోమా బాధితులు 5 నుంచి 10 మంది దాకా ఉంటున్నారు. గ్లకోమా వారోత్సవాలను పురస్కరించుకుని కర్నూలులోని ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో ప్రత్యేక ఓపీ నిర్వహిస్తున్నారు. చికిత్స కోసం వచ్చిన వైద్యులు అవగాహన కల్పించనున్నారు. చికిత్స ఇలా.. గ్లకోమాకు శాశ్వత చికిత్స లేదని, మందులతో వ్యాధిని అదుపు చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. కొందరికి లేజర్ చికిత్స చేయవచ్చు. అలాగే శస్త్రచికిత్సతో చూపును కాపాడుకోవచ్చు. సాధారణ ఆంగిల్ క్లోజర్ గ్లకోమా చికిత్సలో డాక్టర్ లేజర్‌ను ఉపయోగించి ద్రవం ప్రవహించడానికి మరో మార్గం తయారు చేస్తారు. కానీ బాగా ముదిరిన దశలో రోగికి మందులు, శస్త్రచికిత్సల అవసరం ఉంటుంది. వారోత్సవాలు ఎక్కడంటే.. గ్లకోమాపై ఆదివారం అవగాహన వారోత్సవాల ప్రారంభం కార్యక్రమాన్ని కంటి ఆసుపత్రిలో నిర్వహిస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు.జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ ఎం. సంధ్యారెడ్డితో కలిసి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 10వ తేదీన పడిగిరాయి పీహెచ్సీలో, 11న వాక్‌థాన్, 12న పోలకల్ పీహెచ్సీలో, 13న కర్నూలు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో, 14న హర్దగేరి పీహెచ్సీలో, 15న కంటి ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్లకోమా కు కంటి ఆసుపత్రిలో ప్రతిరోజూ ప్రత్యేకమైన పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో కంటి వైద్యులు డాక్టర్ సత్యనారాయణరెడ్డి, డాక్టర్ యుగంధర్‌రెడ్డి పాల్గొన్నారు. -
సాంకేతిక విద్య.. ఉజ్వల భవిత
నంద్యాల(న్యూటౌన్): ఉన్నత చదువులు రోజు రోజుకు భారమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో పేద విద్యార్థులు సాంకేతిక విద్య వైపు అడుగులు వేస్తే భవిష్యత్ బంగారు బాట అవుతుంది. పాలిటెక్నిక్ ప్రవేశం ద్వారా తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య పూర్తి చేసి ఆ తర్వాత దాని పునాదిగా చేసుకుని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందు కోవచ్చు. పదో తరగతి ఉత్తీర్ణతతో సాంకేతిక విద్యకు పునాది వేసే ‘పాలిసెట్’కు సాంకేతిక విద్యాశాఖ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగానే పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకుని జిల్లాలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం పొందవచ్చు. గ్రామీణ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంజినీరింగ్ వంటి ఉన్నత సాంకేతిక చదువులను అందుకోవాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. అటువంటి వారికి పాలిటెక్నిక్ కోర్సులు చక్కని వేదికలని పలువురు సాంకేతిక విషయ నిపుణులు పేర్కొంటున్నారు. పాలిసెట్–2025 కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దరఖాస్తుల తుది గడువు ప్రకటించలేదు. కోర్సులు ఇలా... ప్రస్తుతం సరికొత్త కోర్సులను ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు అందుబాటులోకి తెచ్చాయి. ఆయా కళాశాలల్లో కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ తదితర కోర్సు లు అందుబాటులో ఉన్నాయి. పలు చోట్ల ఒక్కో కోర్సులో ఒక్కో బ్రాంచ్‌కు 60 నుంచి 120 వరకూ సీట్లు ఉన్నాయి. నంద్యాల జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉండగా, జిల్లా వ్యాప్తంగా మరో ఐదు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ 30, మెకానికల్ 30 సీట్లు ఉన్నాయి. ఐదు ప్రైవేట్ కళాశాలల్లో సుమారు 1,500 వరకు సీట్లు ఉన్నాయి. ఈ కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. ఇందులో భాగంగా ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకునే శిక్షణ సైతం ఇస్తారు. పాలిసెట్ ఎంట్రెన్స్‌లో క్వాలిఫై మార్కులు 35గా నిర్ణయించారు. ఏప్రిల్ 30వ తేదీన పాలిసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. పాలిసెట్ ఎంట్రెన్స్ ఇలా.. పాలిసెట్ ఎంట్రెన్స్‌ను 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. గణితం 50, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30 మార్కులకు పరీక్ష ఉంటుంది. పదో తరగతి సిలబస్ ఆధారంగా ఈ ప్రవేశ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 30న పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఎగ్జామ్ ఫీజు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.100, ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.400గా నిర్ణయించారు. పాలిటెక్నిక్ కోర్సులతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏప్రిల్ 30న పాలిసెట్ సద్వినియోగం చేసుకోవాలి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో చదువుకునేందుకు ఉపకరించే పాలిసెట్–2025కు దరఖాస్తు చేసుకోవాలి. పాలిటెక్నిక్ చదివితే ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉన్నత విద్యతో పాటు స్వయం ఉపాధికి అవకాశముంటుంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థులకు ఉచిత కోచింగ్‌తో పాటు, సంబంధిత మెటీరియల్ ఉచితంగా సరఫరా చేస్తున్నాం. – శ్రీనివాసప్రసాద్, పాలిసెట్ జిల్లా కన్వీనర్, నంద్యాల విద్యార్థులకు ప్రయోజనాలెన్నో.. పాలిటెక్నిక్‌లో ఏ కోర్సును పూర్తి చేసినా ఉద్యోగం, ఉపాధి సులభంగా లభిస్తుంది. ఈ కళాశాలల్లో ఇటీవల తరచూ ఉద్యోగ మేళాలను నిర్వహిస్తున్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కోర్సు చేయడానికి మూడేళ్లకు కేవలం రూ.13 వేలు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఇంజినీరింగ్ సెకండియర్ లో చేరవచ్చు. లేదా ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు. -
‘యువత పోరు బాట’ను విజయవంతం చేద్దాం
బనగానపల్లె రూరల్: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీన జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంలో నిర్వహించే ‘యువత పోరు బాట’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గుండం నాగేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం బనగానపల్లెలోని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా ఇంత వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఏటా డీఎస్సీ నోటిఫికేషన్, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి హామీలు చేయకపోవడంతో యువత మోసపోయిందన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పి మహిళలను దగా చేశారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాక ఎంతో మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారని విమర్శించారు. 2014–19 ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కింద సుమారు రూ.3,200 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఈనెల 12న చేపట్టే యువత పోరు బాట కార్యక్రమానికి జిల్లాలోని పార్టీ నేతలు, కార్యకర్తలు, యువత, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. అదే రోజు ముందుగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహంలో నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ప్రచార కార్యదర్శి సిద్దంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం బనగానపల్లె, కోవెలకుంట్ల సంజామల, మండలాల అధ్యక్షులు తూర్పింటి శ్రీనివాసరెడ్డి, అంబటి రవికుమార్‌రెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, తోట వెంకటేశ్వరరెడ్డి, కోవెలకుంట్ల వాణిజ్య విభాగం అధ్యక్షులు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి -
తండ్రి మృతి.. తనయుడికి గాయాలు
కల్లూరు/ వెల్దుర్తి: బైక్‌ను గుర్తుతెలియన వాహనం ఢీకొనడంతో తండ్రి మృతి చెందగా తనయకుడికి గాయలయ్యాయి. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద హైవే 44పై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఉలిందకొండ ఎస్ఐ ధనుంజయ, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. వెల్దుర్తి ఎల్లమ్మ గుడి పూజారి అయిన ఎల్లమద్దిలేటి టైలర్ పనిచేస్తూ తన కుమారుడు ఎల్లస్వామిని బీటెక్ చదివిస్తున్నారు. కుమారుడితో కలిసి బైక్‌పై వెల్దుర్తి నుంచి కర్నూలుకు ఆరోగ్య పరీక్షల నిమిత్తం వెళ్లాడు. సాయంత్రం తిరిగి వస్తుండగా చిన్నటేకూరు సమీపంలో గుర్తుతెలియన వాహనం వీరి బైక్‌ను ఢీకొంది. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలుకొట్టింది. బైక్ వెనుక కూర్చున్న తండ్రి ఎల్లమద్దిలేటి రోడ్డుపై పడ్డి తీవ్ర రక్తగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్ నడుపుతున్న ఎల్లస్వామి స్వల్పగాయాలపాలయ్యాడు. విషయం తెలుసుకున్న ఉలిందకొండ పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. సంఘటనా ప్రాంతంలో తండ్రి మృతదేహం వద్ద కుమారుడి రోదన కంటతడి పెట్టించింది. మృతునికి భార్య లక్ష్మిదేవి, కుమారుడు, డిగ్రీ చదువుతున్న కుమార్తె ఉన్నారు. బైక్‌ను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం -
చంద్రబాబు సృష్టించిన సంపద అప్పులే!
కర్నూలు(టౌన్): గత ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 9 నెలల వ్యవధిలోనే రూ.1.39 లక్షల కోట్ల అప్పు చేశారని, ఇదే ఆయన సృష్టించిన సంపద అని ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి స్పష్టం చేశారు. శనివారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లోని సమావేశ హాలులో ఎమ్మెల్యే విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి ఎలాగైన రావాలన్న ఉద్దేశంతో ప్రజలకు లేనిపోని హామీలన్ని చంద్రబాబు ప్రకటించారన్నారు. ఇప్పుడేమో నిధులు లేవంటూ ఉన్నారన్నారు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా.. అని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఆరోగ్య శ్రీ, 108 అంబులెన్స్‌లు, ఫీజు రీయింబర్స్మెంట్, ఎన్టీఆర్ అంటే రూ. 2 కిలో బియ్యం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే అమ్మ ఒడి, రైతు భరోసా.. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయన్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన హయాంలో ప్రజలకు చేసిన ఒక్క మంచి పథకం పేరు చెప్పాలన్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలను ప్రజలు క్షమించబోరన్నారు. ఆలూరును పట్టించుకోని ప్రభుత్వం ఆలూరు నియోజకవర్గాన్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి ఆరోపించారు. ఆస్పరి మండలంలో మంచి నీళ్లు లేక గ్రామ ప్రజలు వలసలు వెళుతున్నారని, ఇదే విషయంపై జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా దృష్టికి తీసుకువచ్చామన్నారు. రాయలసీమ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి వెల్లడి -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
కర్నూలు(సెంట్రల్): మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.కబర్ది అన్నారు. ప్రమాదం ఎటునుంచి వచ్చినా తట్టుకోగలిగే సామర్థ్యాన్ని మహిళలు పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లా కోర్టు ఆవరణలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లాప్రధాన న్యాయమూర్తి జి.కబర్ది, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, శాశ్వత లోక్ అదాలత్ అధ్యక్షుడు ఎం.వెంకట హ రినాథ్, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి భూపాల్‌రెడ్డి, ఏడో అదనపు జిల్లా న్యాయమూర్తి లక్ష్మీరాజ్యం, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జ్యోత్స్నదేవి, ఎకై ్సజ్ కోర్టు సరోజమ్మ హాజరయ్యారు. మహిళా జడ్జీలను సన్మానించారు. లోక్ అదాలత్‌లో పది వేల కేసుల పరిష్కారం కర్నూలు (టౌన్): జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో పది వేలకు పైగా కేసులు పరిష్కారం జరిగినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 22 చోట్ల జాతీయ లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేసి కక్షిదారుల కేసులు పరిష్కారం చేసినట్లు చెప్పారు. కర్నూలులో 5 బెంచీలు ఏర్పాటు చేసి న్యాయమూర్తులు జి.భూపాల్ రెడ్డి, లక్ష్మిరాజ్యం, జ్యోత్స్నదేవి, ఎం.సరోజనమ్మ, విశ్రాంత న్యాయమూర్తి లక్ష్మీనరసింహారెడ్డి 4,500 కేసులు పరిష్కారం చేశారన్నారు. నంద్యాలలో 1,021, ఆదోనిలో 432, ఆళ్లగడ్డలో 554, ఆలూరులో 291, ఆత్మకూరులో 319, బనగానపల్లెలో 714, డోన్‌లో 630, కోవెలకుంట్లలో 402, నందికొట్కూరులో 266, పత్తికొండలో 427, ఎమ్మిగనూరులో458 కేసులు పరిష్కారం చేసినట్లు తెలిపారు. రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. పొట్టేళ్లు అ‘ధర’ హో.. కోడుమూరు రూరల్: బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో చాలామంది ప్రజలు చికెన్‌ను వదిలేసి మటన్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో పొట్టేళ్లకు గిరాకీ పెరిగింది. శనివారం కోడుమూరులో జరిగిన సంతలో ఒక్కో పొట్టేలు సైజును బట్టి రూ.10వేల నుంచి రూ.20వేలకు పైగా పలికింది. పొట్టేళ్ల ధరలు భారీగా ఉన్నప్పటికీ ప్రజలు కొనేందుకు ఎగబడ్డారు. నేడు జూడో ఎంపిక పోటీలు కర్నూలు (టౌన్): ఆలూరు పట్టణంలోని ప్రభు త్వ బాలుర పాఠశాలలో ఆదివారం ఉదయం 9 గంటలకు జిల్లా స్థాయి జూడో ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా జూడో సంఘం కార్యదర్శి చంద్రయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 15, 16 తేదీల్లో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. -
మహిళలను ప్రోత్సహిస్తే అద్భుత విజయాలు
కర్నూలు(సెంట్రల్): మహిళలను ప్రోత్సహిస్తే అద్భుత విజయాలు సాధిస్తారని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అన్నారు. శనివారం నగరంలోని ఎమ్మార్సీ కన్వెన్షన్ హాలులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను కలెక్టర్ పి.రంజిత్‌బాషా, ఎంపీ బి.నాగరాజు, ఎమ్మెల్యే విరుపాక్షి సన్మాంచి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజం, కుటుంబ వ్యవస్థల్లో మహిళ పాత్ర ఎంతో విశిష్టమన్నారు. బ్యాంకు లింకేజీ ద్వారా సెర్ప్ నుంచి రూ.100 కోట్లు, మెప్మా నుంచి రూ.34 కోట్లు, ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ కింద రూ.55 కోట్ల రుణాలను ఇచ్చామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ కోసం ఓఎన్డీసీ(ఓపెన్ నెట్వర్కుఫర్ డిజిటల్ కామర్స్) ప్లాట్ ఫామ్‌తో ఒప్పందం చేసుకున్నామని, ఇందులో ప్రతి మహిళ తాను ఉత్పత్తి చేసిన ఉత్పత్తుల వివరాలను నమోదు చేస్తే మార్కెటింగ్ లభిస్తుందన్నారు. మార్చి 8న ఒక్కటే దాదాపు 6వేల మంది మహిళలు తమ పేర్లను నమోదు చేసుకోవడం గొప్ప విషయమన్నారు. అనంతరం సెర్ప్, మెప్మా, ఎంఎస్ఎంఈల రుణాలతో పాటు ర్యాపిడో ప్రోగ్రామ్ కింద 25 మంది మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటీలను ప్రదానం చేశారు. ● కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల చేయూతకు విరివిగా రుణాలు ఇచ్చి స్వయం ఉపాధిలో రాణించేందుకు కృషి చేస్తోందన్నారు. ● ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారని, కుటుంబ బాధ్యతల్లోనూ కీలకపాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. పొదుపు రుణాలను పొందిన మహిళలు ఆర్థికాభివృద్ధిని సాధించాలన్నారు. ● జేసీ డాక్టర్ బి.నవ్య మాట్లాడుతూ 1917లో రష్యన్ రెవల్యూషన్స్ సందర్భంగా మహిళల హక్కుల కోసం పోరాడుతున్న నేపథ్యంలో 1922 మార్చి 8వ తేదీన ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ప్రకటించారన్నారు. ఆరోజు నుంచి ప్రతి ఏడాది మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు గర్తు చేశారు. ● డిప్యూటీ మేయర్ రేణుకా సిద్ధారెడ్డి మాట్లాడుతూ చిన్న తనం నుంచే పిల్లల్లో ఆడ, మగ అన్న తేడా లేకుండా పెంచాలని సూచించారు. మహిళలు, బాలికలను గౌరవిండచం నేర్పించినప్పుడే ఉత్తమ సమాజం సాధ్యమన్నారు. పలువురికి సన్మానం కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను సన్మానించారు. మెప్మా ద్వారా నలుగురు ప్రేరణ సఖీలకు రూ.50 వేలు ప్పున బహుమతి ఇచ్చి సన్మానించారు. ఆర్పీల్లో మొదటి బహుమతిగా కర్నూలుకు చెందిన ఎస్.పద్మకు రూ.2500, ఎమ్మిగనూరుకు చెందిన బషీర్బాకు రెండో బహుమతిగా రూ.1500, కర్నూలుకు చెందిన జి.శోభారాణికి మూడో బహుమతిగా రూ.1000 కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు అందజేశారు. కార్యక్రమంలో వాల్మీకి సంఘం చైర్మన్ బొజ్జమ్మ, వాల్మీకి కార్పొరేషన్ డైరక్టర్ సంజమ్మ, ఎస్సీ కార్పొరేషన్ డైరక్టర్ శ్రీనివాసులు, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, ఐసీడీఎస్ పీడీ నిర్మల, మెప్మా పీడీ నాగశివలీల, డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి అరుణ, మునిసిపల్ కమిషనర్ రవీంద్రబాబు పాల్గొన్నారు. -
ముట్టుకుంటే షాక్
● విద్యుత్ వినియోగదారుల నిలువు దోపిడీ ● 2022, 2023, 2025 సంవత్సరాల్లో వాడిన విద్యుత్‌కు ప్రతి యూనిట్‌పై 40పైసల వడ్డింపు ● ట్రూ అప్ చార్జీలతో మరో అదనపు భారం ● బిల్లులను చూసి బెంబేలెత్తుతున్న ప్రజలు కర్నూలు(అగ్రికల్చర్): వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యుత్ చార్జీలపై టీడీపీ, జనసేనలు చేసిన దుష్ప్రచారం అంతాఇంతా కాదు. అడ్డుగోలుగా చార్జీలు పెంచి మోయలేని భారం వేస్తున్నారని ప్రజలను నమ్మించి ఎన్నికల్లో లబ్ధి పొందడం తెలిసిందే. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వి నియోగదారులపై విద్యుత్ చార్జీల భారం మోపం, చార్జీలు తగ్గిస్తాం తప్ప పెంచబోమనే ప్రచారాన్ని ఊదరగొట్టారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొమ్మిది నెలల్లోనే విద్యుత్ వినియోగదారులు చుక్కలు చూస్తున్నారు. సామాన్య ప్రజలు మొదలు అన్ని వర్గాల వారిపై మోపిన విద్యుత్ చార్జీల భారం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మొదటి ఏడాదిలోనే విద్యుత్ చార్జీల భారం ఈ స్థాయిలో ఉంటే, రానున్న నాలుగేళ్లలో పరిస్థితి ఊహించుకుంటేనే షాక్ కొడుతోంది. ప్రతి నెలా క్రమం తప్పకుండా విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నా.. ఒక్కరోజు ఆలస్యమైతే చాలు సర్‌చార్జీ పేరిట జరిమానా విధిస్తున్నారు. మళ్లీ సర్దుబాటు తదితర పేర్లతో 2022, 2023 సంవత్సరాల్లో వినియోగించిన విద్యుత్‌కు కూడా నేడు చార్జీ వేస్తుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వ ‘షాక్’ ఇలా వినియోగదారుడు ఒక నెలలో 125 యూనిట్లు వినియోగిస్తే మొదటి మూడు శ్లాబ్‌ల ప్రకారం బిల్లు రూ.417 వస్తుంది. దీనికి కస్టమర్ చార్జీ రూ.45, ఫిక్స్డ్ చార్జీ రూ.20, ఈడీ చార్జీ రూ.7.50 వసూలు చేస్తారు. అన్నీ కలిపి 125 యూనిట్లకు చెల్లించాల్సిన బిల్లు రూ.489.5 మాత్రమే. ఇదే 125 యూనిట్లకు కూటమి ప్రభుత్వం వసూలు చేస్తున్న మొత్తం రూ.850. అంటే బిల్లుపై అదనంగా రూ.361 భారం మోపుతోంది. విద్యుత్ వినియోగం పెరిగే కొద్దీ భారం తడిచి మోపెడవుతుంది. భారం ఇలా పడుతోంది.. విద్యుత్ చార్జీల భారం వివిధ రూపాల్లో పడుతోంది. 2022, 2023, 2025 సంవత్సరాలకు సంబంధించి సర్దుబాటు పేరుతో ఎఫ్‌పీపీసీఏ వసూలు చేస్తున్నారు. ఆయా సంవత్సరాల్లో నెల వారీగా వినియోగించిన యూనిట్లపై 40 పైసల ప్రకారం భారం పడుతోంది. ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ట్రూ అప్ చార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. ప్రజలను ఈ చార్జీలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సగటున ప్రతినెలా రూ.95కోట్లకు పైనే భారం సంక్షేమ పథకాల ఊసే లేకపోవడం వల్ల ప్రజల్లో నగదు సర్క్యులేషన్ గణనీయంగా తగ్గిపోయింది. మళ్లీ పేదరికం పురుడుపోసుకుంటోంది. ఇప్పటికే ఎన్నికల హామీలను పక్కనపెట్టిన ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ చార్జీల పేరిట అదనపు భారం మోపుతోంది. ఉమ్మడి జిల్లాలో 15.85 లక్షల గృహ విద్యుత్ కలెక్షన్లు ఉన్నాయి. ఈ లెక్కన ఒక్కో కనెక్షన్‌కు సగటున రూ.600 అదనపు భారం లెక్కకట్టినా ప్రతి నెలా రూ.95కోట్లకు పైనే ముక్కుపిండి వసూలు చేస్తుండటం గమనార్హం. రూ.542 అదనపు బిల్లు ఫిబ్రవరి నెలలో 145 యూనిట్లు వినియోగించాం. విద్యుత్ చార్జీ రూ.537 వచ్చింది. ఫిక్స్డ్ చార్జీ రూ.50, కస్టమర్ చార్జీ రూ.50 వేశారు. మామూలుగా అయితే రూ.637 బిల్లు చెల్లించాల్సి ఉంది. అయితే 2022 సంవత్సరం ఫిబ్రవరి నెలకు సంబంధించి ఎఫ్‌పీపీసీఏ రూ.307.07, 2023 సంవత్సరం ఫిబ్రవరి నెల ఎఫ్‌పీపీసీఏ రూ.166.20, 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల ఎఫ్‌పీపీసీఏ రూ.59.60, ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.8.70 ప్రకారం అదనపు భారం పడింది. మొత్తంగా వచ్చిన బిల్లు రూ.1,179. – బి.నాగలక్ష్మి, కర్నూలు -
సర్దుబాటు పేరిట భారం తగదు
రెండు మూడేళ్ల క్రితం వినియోగించిన కరెంటుకు కూడా ఇప్పుడు సర్దుబాటు పేరుతో భారం వేయడం తగదు. మే ము ఫిబ్రవరిలో 96 యూనిట్ల కరెంటు మాత్రమే వా డాము. ఇందుకు చార్జీ రూ.206, ఫిక్స్డ్ చార్జి రూ.10, కస్టమర్ చార్జీ రూ.40 మాత్రమే చెల్లించా ల్సి ఉంది. అయితే రూ.520 బిల్లు ఇచ్చారు. 2022–23 సంవత్సరాల్లో వాడిన ప్రతి యూనిట్‌కు నిబంధనల ప్రకారం బిల్లు చెల్లించాం. ఇప్పుడు మళ్లీ అదనపు చార్జీలు వసూలు చేయడం దారుణం. – గోవిందరాజులు, రాంపురం, తుగ్గలి మండలం చార్జీలు పెంచమని మోసగించారు కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నారు. మేము 135 యూనిట్ల విద్యుత్ వాడాము. ఇందుకు రూ.477 చార్జి, ఫిక్స్డ్ చార్జి రూ.10, కస్టమర్ చార్జి రూ.40తో కలిపి చెల్లించాల్సి ఉంది. అయితే 2022 బకాయి అని రూ.103, 2023 బకాయి అని రూ.57, తాజా వాడకానికి సంబంధించి రూ.33.50, సర్‌చార్జి రూ.25, ట్రూ అప్ చార్జి రూ.52 భారం వేశారు. మొత్తం 830 బిల్లు చెల్లించాల్సి వచ్చింది. వాడిన వినియోగానికి ఇది రెట్టింపు. – సగిలే కృష్ణారెడ్డి, లింగాపురం, బండిఆత్మకూరు ● -
బీటెక్ విద్యార్థుల ప్రేమ ‘పంచాయితీ’
తెలిసీ తెలియని వయస్సులో ప్రేమలో పడటం.. జీవితంలో స్థిరపడకుండానే పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడం తమ విజయంగా భావించడం యువతకు పరిపాటిగా మా రింది. ఏ తల్లిదండ్రులైనా తమ కుమార్తె సంతోషాన్నే కోరుకుంటారు. ఆడ..పిల్ల అయినప్పటికీ ఆ గజ్జెల సవ్వడితో మురిసిపోతారు. ఇలాంటి అమ్మానాన్నలు.. ప్రేమ వాకిట్లో కానివాళ్లుగా మారిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.మూడు రోజులుగా ఆ తండ్రి వేదన వర్ణనాతీతం. కంటికి రెప్పలా చూసుకున్న కుమార్తె నిన్న మొన్న పరిచయమైన ప్రేమకునితోనే ఉంటానని చెప్పడం ఆ హృదయాన్ని కలచివేసింది. కాళ్లావేళ్లా పడినా.. వాళ్లతో వీళ్లతో చెప్పించినా.. కుమార్తె మనసు కరగకపోవడంతో ఆ తల్లిదండ్రుల మనసు గాయపడింది.ప్రేమించడం తప్పుకాదు.. పెళ్లి చేసుకోవడం నేరం అంతకన్నా కాదు. కానీ పెద్దలను ఒప్పించి చేసుకున్నప్పుడే ఆ ప్రేమకు పరిపూర్ణత చేకూరుతుంది. ఇటీవల కాలంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎన్నో జంటలు చిన్న చిన్న వివాదాలతో ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లడం చూస్తే.. ఏ తల్లిదండ్రులకై నా ప్రేమ పెళ్లి గుండెను బరువెక్కించక మానదు.కర్నూలు: బేతంచర్ల మండలం బుగ్గానిపల్లె తండాకు చెందిన రాజేష్‌నాయుడు, మాధురిబాయి ఎదురెదురు ఇళ్లలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ ఒకే ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. మూడు రోజుల క్రితం ఇద్దరూ కనిపించకుండా పోయారు. దీంతో ఇరువురి కుటుంబ సభ్యులు ఆరా తీస్తే విషయం బయటపడింది. మాధురిబాయి తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన విన్నపం మేరకు త్రీటౌన్ పోలీసులు బుధవారం రాత్రి ప్రేమ జంటను స్టేషన్‌కు రప్పించారు. అయితే ఇరువురూ ఇష్టపూర్వకంగా వెళ్లినట్లు రాత పూర్వకంగా అంగీకరించారు. గురువారం ఉదయం తిరిగి ఇరువురి తరపు బంధువులు స్టేషన్లో పంచాయితీ పెట్టినా ఫలితం లేకపోయింది. ఈ విషయమై శుక్రవారం ఉదయం గ్రామంలో యువకుడి ఇంటి ముందు తమ కుమార్తెను మోసం చేసి పెళ్లిచేసుకున్నాడని యువతి కుటుంబ సభ్యులు గగ్గోలు పెట్టారు. సమాచారం తెలుసుకున్న సీఐ వెంకటేశ్వరరావు సిబ్బందితో అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు.టూటౌన్ పోలీస్టేషన్లో మూడో రోజు..ఇదిలా ఉండగా గ్రామం నుంచి పంచాయితీ కోసం వచ్చిన ఇరువురి కుటుంబాలను పోలీసులు టూటౌన్‌కు రప్పించారు. అక్కడ సీఐ ఇస్మాయిల్, త్రీటౌన్ సీఐ కంబగిరిరాముడు కలిసి ప్రేమ జంటను పెద్దల ఎదుట నిలబెట్టారు. యువతి తను ప్రేమించిన యువకుడితోనే వెళ్లిపోతానని తెగేసి చెప్పడంతో యువతి తండ్రి కన్నీళ్లు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
సాయం.. ‘తులసీ’ వ్రతం
‘‘ సమాజంలోని అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి.. అవసరమైన సందర్భాల్లో సహాయ సహకారాలు అందించాలి.. ఇందుకు మహిళలు ముందుండాలి’’ అని అంటున్నారు ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే తులసీదేవి. తమది ఉన్నత కుటుంబమైనా, కొన్ని పరిస్థితులతో బాల్యంలో పలు కష్టాలను చవిచూడాల్సి వచ్చిందని, అమ్మ నేర్పిన క్రమశిక్షణ, చదువుపై ఆమెకున్న శ్రద్ధ, పట్టుదలే తమను ఇంతవాళ్లను చేశాయని ఆమె పేర్కొన్నారు. ‘‘ అమ్మ, నాన్న ప్రాథమిక విద్యతోనే చదువు ఆపేసినా, నన్ను, అన్నను ఉన్నత విద్యావంతులను చేశారు. నాకున్న ఇద్దరు సంతానాన్ని అమ్మ వద్దే ఉంచి చదివించాం. బాబు నిఖిల్, పాప ప్రీతి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. మా వారు కే మల్లికార్జునరెడ్డి హైదరాబాద్‌లో ఓ మల్టీనేషనల్ కంపెనీలో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగంలో నిజాయితీ ముఖ్యం.’’ అని ఆమె అన్నారు. – కర్నూలు(అర్బన్) -
సాహితీ వనంలో ‘పార్వతీ’ సేవ
కర్నూలు ప్రభుత్వ బీఈడీ (ఐఏఎస్ఈ) కళాశాలలో తెలుగు ఉపన్యాసకురాలు డాక్టర్ దండెబోయిన పార్వతీ దేవి జన్మస్థలం గిద్దలూరు తాలూకా రాచర్ల మండలం పోతం శెట్టి పల్లె. తల్లిదండ్రులు పాపులమ్మ, బాల రంగయ్య (ఉపాధ్యాయుడు). భర్త లక్ష్మయ్య ఉపాధ్యాయుడు. టీచర్ ట్రైనింగ్ కళాశాలల్లో ఉపాధ్యాయురాలుగా, అధ్యాపకురాలుగా, ఉపన్యాసకులుగా పనిచేయడం ఈమె ప్రత్యే కం. తెలుగు అకాడమీ వారి తెలుగు బాట 8వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం సంపాదక వర్గంలో ఒకరుగా ఉన్నారు. కర్నూలు జిల్లా రచయితల దర్శిని, నేను సైతం పుస్తకాలకు సంపాదకులుగా వ్యవహరించారు. ఇప్పటి వరకు 11 తెలుగు భాషా సాహిత్య సదస్సులు, 6 సెమినార్లు నిర్వహించారు. ‘‘ప్రస్తుతం మహిళలకు అవకాశాలు చాలా ఉన్నాయి. సీ్త్రలకు సంపూర్ణమైన స్వేచ్ఛనివ్వాలి. యువతులు సైతం అధైర్య పడక సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో ఉన్నతమైన స్థాయిలో రాణించాలి’’ అని దండెబోయిన పార్వతీ దేవి అన్నారు. – కర్నూలు కల్చరల్ -
జగమేలు నాయక.. జగదానంద తారక
ఆళ్లగడ్డ: అహోబిలేశుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు శుక్రవారం దిగువ అహోబిలంలో ప్రహ్లాదవరద స్వామి హంస వాహనంపై కొలువై భక్తులను కనువిందు చేశారు. వేకువ జామునే నిత్యపూజల అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకాలంకరణలో ఉన్న హంస వాహనాన్ని అధిష్టించిన ప్రహ్లాదవరదుడు మాడ వీధుల్లో విహరించారు. అహో బిల మఠం చేరుకున్న హంసవాహానదీశుడైన అహోబిలేశునికి మఠం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ప్రత్యేక పూజలు చేపట్టారు. మధ్యాహ్నం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను యాగశాలలో కొలువుంచి పట్టు పీతాంబరాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. రాత్రి సూర్యప్రభ వాహనంపై కొలువైన ప్రహ్లాదవరదుడు భక్తులను కునువిందు చేశారు. భక్త హనుమంత .. తనువు పులకింత ఎగువ అహోబిల క్షేత్రంలో కొలువైన జ్వాలా నరసింహుడు హనుమంత వాహనంపై వివహరించారు. త్రేతాయుగం నాటి శ్రీరాముడిని తానేనంటూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శుక్రవారం రాత్రి అనన్య భక్తుడైన హనుమంతు వాహన సేవలో స్వామివారు కోదండరామ అలంకరణలో భక్తులను కటాక్షించారు. కృతయుగంలో వేంకటేశ్వరుడిగా, త్రేతాయుగంలో శ్రీరాముడిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా, కలియుగంలో అహోబిలేశుడిగా స్వామి అవతరించారనే సందేశాన్ని చాటుతూ మాడవీధుల్లో హనుమంత వాహనసేవ.. రామరాజ్య వైభవాన్ని సాక్షాత్కరింపజేసింది. హంస, సూర్యప్రభ వాహనాలపై దర్శనమిచ్చిన ప్రహ్లాదవరదుడు -
నైతిక విలువలు నేర్పాలి
‘తల్లిదండ్రులు పిల్లలకు నైతిక విలువలను తెలియజేయాలి. వారి ఉన్నత స్థితికి తోడ్పాటు పడాలి’ అని ప్రిన్సిపల్ సీనియర్ జడ్జి బెజవాడ రాధారాణి అన్నారు. తన తండ్రి ఎంతో ప్రోత్సహించారని తెలిపారు. వివరాలు జడ్జి మాటల్లోనే..‘‘ మా ఇంట్లో నాన్నగారు నన్ను లాయర్‌గా చదువుకోవాలని ప్రోత్సహించారు. ఆయన కోరిక ప్రకారం లా చదివి పాసయ్యాను. పెళ్లి చేసుకున్న తరువాత భర్త సహకారంతో ఐదు సంవత్సరాల్లో జడ్జి అయ్యాను. ప్రతి ఒక్కరూ సమాజానికి మంచి చేసే విధంగా ఎదగాలి.. సమయాన్ని వృథా చేసుకోకుండా దేశానికి ఉపయోగపడే విధంగా పాటుపడాలి. న్యాయవ్యవస్థలో ఎక్కువగా మహిళలు జడ్జిలుగా రాణిస్తున్నారు.’’ – నంద్యాల(వ్యవసాయం) -
సర్పంచ్ అయినా..
రవణమ్మ ..ఒక గ్రామ పంచాయతీకి సర్పంచ్ అయినా హంగు, ఆర్భాటం లేకుండా వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామ పంచాయతీ జనరల్ మహిళకు రిజర్వేషన్ అయ్యింది. దీంతో 2021 ఫిబ్రవరి 9వ తేదీన సర్పంచ్ ఎన్నికల్లో సంకల రవణమ్మ గెలుపొందారు. సర్పంచ్ అయినా సరే వ్యవసాయ పనులు చేయడంలో తనకు ఇబ్బందులు లేవని ఆమె తెలిపారు. సర్పంచ్ మాటల్లోనే వివరాలు..‘ నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. నేను గ్రామ సర్పంచ్ అయినా సరే నేను నమ్ముకున్న వృత్తిని ఎప్పుడూ వదిలి పెట్టలేదు. గ్రామంలో పారిశుధ్ధ్యం, తాగునీటి వసతి, వీధి దీపాల ఏర్పాటు.. తదితర పనులు చేపడుతూ ప్రజల మన్ననలు పొందుతుండటం ఆనందంగా ఉంది.’’ – నంద్యాల(అర్బన్) -
వ్యవసాయం.. ‘లక్ష్మి’ కటాక్షం
ప్రకృతి వ్యవసాయంలో గూడూరుకు చెందిన మహిళ రైతు జి. లక్ష్మీదేవి అద్భుతంగా రాణిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో గణనీయమైన నికరాదాయాన్ని పొందుతున్నారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘ మాకు 10 ఎకరాల భూమి ఉంది. ఇందులో నాలుగు ఎకరాల్లో ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. ఏటీఎం నమూనాలో ఒక ఎకరాలో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాం. పెట్టుబడి కోసం రూ.15 వేలు ఖర్చు చేయగా.. రూ.లక్షకుపైగా ఆదాయం వచ్చింది. మిగిలిన మూడు ఎకరాల్లో వివిధ పంటలు వేస్తున్నాం. మా పంటల సాగును ప్రత్యేక బృందాలు వచ్చి అధ్యయనం చేశాయి. పంటలను పరిశీలించి జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి కూడా అభినందించారు.’’ – కర్నూలు(అగ్రికల్చర్) -
భారీగా మొబైల్ ఫోన్ల రికవరీ
కర్నూలు: పోయిన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని బాధితులకు అందించేందుకు పోలీసు శాఖ శ్రమిస్తోంది. రకరకాల కారణాలతో చోరీకి గురైన, పోగొట్టుకున్న సెల్‌ఫోన్ రికవరీలో జిల్లా పోలీసులు సత్తా చాటుతున్నారు. లాస్ట్ మొబైల్ ట్రాకింగ్ అప్లికేషన్ ద్వారా బాధితుడు ఇచ్చిన ఓ చిన్న ఫిర్యాదుతో పోయిన సెల్‌ఫోన్ ఇతర రాష్ట్రాలు, జిల్లాలు, ఎక్కడున్నా పట్టేస్తున్నారు. ఇప్పటివరకు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ హయాంలో రూ.16 కోట్ల విలువ చేసే 7,154 సెల్ఫోన్లు, కృష్ణకాంత్ హయాంలో రూ.2.56 కోట్ల విలువ చేసే 1,282 సెల్ఫోన్లు, బిందు మాధవ్ హయాంలో రూ.1.34 కోట్ల విలువైన 587 సెల్ఫోన్లు, విక్రాంత్ పాటిల్ బాధ్యతలు చేపట్టిన నెల రోజుల వ్యవధిలోనే మొదటిసారిగా 600 సెల్ఫోన్లు రికవరీ చేశారు. శుక్రవారం బాధితులను జిల్లా పోలీస్ పరేడ్ మైదానానికి పిలిపించి ఎస్పీ విక్రాంత్ పాటిల్ చేతుల మీదుగా అందజేశారు. ఫోన్ పోగొట్టుకున్న వారిలో పలువురు ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, రైతులు, మహిళలు, ఇతర వర్గాల వారు ఉన్నారు. తక్కువ వ్యవధిలో, మూడు నాలుగేళ్ల క్రితం పోగొట్టుకుని ఆశ వదులుకున్న వారి చేతికి మొబైల్ రికవరీ మేళాలో ఫోన్ అందడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఎస్పీతో పాటు జిల్లా పోలీసులు, సైబర్ ల్యాబ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, ఏ ఆర్ డీఎస్పీ భాస్కర్‌రావు, సీఐలు తేజమూర్తి, రామ య్య నాయుడు, నాగరాజరావు, వేణుగోపాల్, సైబ ర్ ల్యాబ్ టెక్నికల్ బృంద సభ్యులు పాల్గొన్నారు. ఆనందం వ్యక్తం చేసిన బాధితులు -
పల్లెల్లో మహిళా గ్రామ సభలు
కర్నూలు(అర్బన్): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో మహిళా గ్రామ సభలను నిర్వహించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామ సభల్లో ముఖ్యంగా మహిళలకు సంబంధించిన సమస్యలపై చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. జిల్లాలోని గోనెగండ్ల గ్రామ పంచాయతీలో అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామ సర్పంచుతో పాటు 10 మంది వార్డు సభ్యులు ఇక్కడ మహిళలే ఉండడంతో పాటు పారిశుద్ధ్యం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ నిర్వహణ తదితర అంశాల్లో ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీగా గోనెగండ్ల ఎంపికై ందన్నారు. షెడ్ల నిర్వహణకు సంబంధించి ఈ నెల 3వ వారంలో ఏడు రోజుల పాటు ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తున్నారన్నారు. ప్రజలు ఇచ్చే సమాధానాలకు అనుగుణంగా ప్రభుత్వం జిల్లాకు రేటింగ్ ఇస్తుందన్నారు. స్వామిత్వ సర్వేకు సంబంధించి మూడు డివిజన్లలో గ్రామ సచివాలయాల ఉద్యోగులకు మండలానికి 10 మంది చొప్పున ఈ నెల 8న శిక్షణ ఇస్తామని తెలిపారు. -
ప్రతికూల పరిస్థితులతో పోరాడి...
ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా జిల్లా ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ పోతుల శ్రీదేవి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘ మాది మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా పార్వతీపురం. నాన్న పోతుల నరసయ్య పోలీసు శాఖలో ఇన్స్పెక్టర్గా పనిచేశారు. అమ్మ పోతుల శాంతమ్మ. 1998లో నాకు 16 ఏళ్ల వయస్సులో నాన్న మరణించారు. నేను పెద్ద కుమార్తెను. నాకు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. నాన్న నాకు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చేవారు. భయాన్ని ఎదుర్కొని.. వైఫల్యాన్ని విజయానికి మెట్టుగా మల్చుకోవాలని సూచించారు. నాన్న మరణం తర్వాత కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చినప్పటికీ అమ్మ ఆ ఉద్యోగాన్ని తిరస్కరించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కోచింగ్ లేకుండానే నేను గ్రూప్–1లో ర్యాంకు సాధించాను. మొదట పార్వతీపురం జిల్లాలో ని జియ్యమ్మవలసలో విధులు నిర్వహించి ఉత్తమ ఎంపీడీఓ అవార్డు అందుకున్నా. విధులు నిర్వహిస్తూనే గ్రూప్–1లో ర్యాంకు సాధించి ఎకై ్సజ్ శాఖలో అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా ఎంపికయ్యాను. నా విజయానికి తండ్రి నరసయ్య, భర్త నరేంద్ర కుమార్ రాజు కారణం. మాకు ఇద్దరు పిల్లలు సంతానం. నువేశ్ నంద 8వ తరగతి, దిమాహి 4వ తరగతి చదువుతున్నారు. 2011లో మహబూబ్ నగర్లో విధులు నిర్వహించేటప్పుడు బెస్ట్ ఏఈఎస్ అవార్డు అందుకున్నాను.’’ – కర్నూలు భర్త ప్రోత్సాహంతోనే డీఎఫ్ఓగా.. కర్నూలు జిల్లా అటవీ శాఖ అధికారి పి.శ్యామల జన్మస్థలం అనంతపురం జిల్లా కల్యాణదుర్గం. తల్లిదండ్రులు శకుంతల, తిమ్మరాయప్ప. వీరి మొదటి కుమార్తె అయిన శ్యామల ఎస్కే యూనివర్సిటీలో బాటనీలో పీజీ పూర్తి చేసి గోల్డ్‌మెడల్ సాధించారు. ఈమె 2004లో అటవీ శాఖలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్‌కు ఎంపికై అనంతపురంలోనే ఉద్యోగంలో చేరారు. 2006లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. 2023 మార్చి నుంచి కర్నూలు డీఎఫ్ఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘భర్త ప్రోత్సాహంతో నేను ఈ స్థాయికి వచ్చాను. కుటుంబంలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన ఉండకూడదు. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం చాలా అవసరం’ అని డీఎఫ్ఓ శ్యామల పేర్కొన్నారు. – కర్నూలు కల్చరల్ -
వైకల్యాన్ని అధిగమించి...
చదువుకు, ఉద్యోగానికి వైకల్యం అడ్డురాదని ఆమె నిరూపించారు. రెండు కాళ్లు లేకపోయినా ఆత్మవిశ్వాసంతో బీఎస్సీ, బీఈడీ పూర్తి చేశారు. సచివాలయ మహిళా పోలీస్ ఉద్యోగం సాధించి.. సేవలు అందిస్తున్నారు. సంజామల మండలం వెంకటసుబ్బయ్య, మహేశ్వరి దంపతుల కుమార్తె సువర్ణ విజయ గాథ ఆమె మాటల్లోనే... ‘‘మా తండ్రి విద్యుత్ సబ్‌స్టేషన్‌లో లైన్మెన్గా పనిచేస్తూ నాతోపాటు తమ్ముడు సురేష్, చెల్లెలు సుమిత్రను ఉన్నత చదువులు చదివించారు. ప్రస్తుతం లైన్మెన్గా రిటైర్డ్ అయి కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. పుట్టిన ఏడాదికే పోలియో సోకి నా రెండు కాళ్లు చచ్చుబడ్డాయి. అప్పటి నుంచి రెండు కర్రల సాయంతో నడక సాగిస్తున్నాను. కాళ్లు లేకపోయినా మనోధైర్యంతో బీఎస్సీ, బీఈడీ పూర్తి చేశాను. 2019లో గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసుగా ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం సంజామల మండలంలోని ముక్కమల్ల గ్రామ సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాను’’. – కోవెలకుంట్ల ● విభిన్న రంగాల్లో రాణిస్తున్న మహిళలు ● ఇతరుల ఎదుగుదలలోనూ సహకారం ● నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలాలన..పాలన.. ఓర్పు.. నేర్పు.. పట్టుదల.. క్రమశిక్షణ.. వీరత్వం.. ధీరత్వం.. సహనం.. సౌశీల్యం.. వీటి ప్రతి రూపమే మహిళ.. ప్రాచీన కాలం నుంచి నేటి డిజిటల్ ఆధునిక కాలం వరకు సీ్త్ర లేకపోతే పురుషునికి ఎదుగుదల ఉండదని నిరూపితమైతూనే ఉంది. ప్రస్తుతం సీ్త్ర చైతన్యాన్ని శక్తి సామర్థ్యాలను గమనించిన పురుషులు ఆమె ఎదుగుదలను అంగీకరిస్తూ ప్రోత్సహిస్తున్నాడన్నది అక్షర సత్యం. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో పలు రంగాల్లో రాణిస్తున్న మహిళామణుల విజయ గాథలు ఇవీ.. -
సాయం.. ‘తులసీ’ వ్రతం
‘‘ సమాజంలోని అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి.. అవసరమైన సందర్భాల్లో సహాయ సహకారాలు అందించాలి.. ఇందుకు మహిళలు ముందుండాలి’’ అని అంటున్నారు ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే తులసీదేవి. తమది ఉన్నత కుటుంబమైనా, కొన్ని పరిస్థితులతో బాల్యంలో పలు కష్టాలను చవిచూడాల్సి వచ్చిందని, అమ్మ నేర్పిన క్రమశిక్షణ, చదువుపై ఆమెకున్న శ్రద్ధ, పట్టుదలే తమను ఇంతవాళ్లను చేశాయని ఆమె పేర్కొన్నారు. ‘‘ అమ్మ, నాన్న ప్రాథమిక విద్యతోనే చదువు ఆపేసినా, నన్ను, అన్నను ఉన్నత విద్యావంతులను చేశారు. నాకున్న ఇద్దరు సంతానాన్ని అమ్మ వద్దే ఉంచి చదివించాం. బాబు నిఖిల్, పాప ప్రీతి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. మా వారు కే మల్లికార్జునరెడ్డి హైదరాబాద్‌లో ఓ మల్టీనేషనల్ కంపెనీలో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగంలో నిజాయితీ ముఖ్యం.’’ అని ఆమె అన్నారు. – కర్నూలు(అర్బన్) -
హదీస్ వెలుగు :
యుద్ధంలో ప్రత్యర్థుల ఆయుధాల నుంచి కాపాడేందుకు కవచం ఉపయోగపడినట్లు పాపాల నుంచి మనిషిని రంజాన్ ఉపవాస దీక్ష కాపాడుతుంది. – పవిత్ర ఖురాన్ ఇఫ్తార్ సహెర్ కర్నూలు సాశ్రీశ్రీ 6:32 ఉశ్రీశ్రీ 5:09 ఆదోని సాశ్రీశ్రీ 6:31 ఉశ్రీశ్రీ 5:10 నంద్యాల సాశ్రీశ్రీ 6:29 ఉశ్రీశ్రీ 5:09 ఆత్మకూరు సాశ్రీశ్రీ 6:28 ఉశ్రీశ్రీ 5:03 బనగానపల్లె సాశ్రీశ్రీ 6:31 ఉశ్రీశ్రీ 5:05 -
వేలాది మందికి ప్రాణదానం
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్లాస్టిక్ సర్జరీ హెచ్ఓడీగా పనిచేస్తున్న డాక్టర్ ఎం. మంజులాబాయి 30 ఏళ్ల తన సర్వీసులో వేలాది మందికి ప్రాణదానం చేశారు. ఎంతో మందికి అందమైన రూపాన్ని ఇచ్చారు. విజయ ప్రస్థానం డాక్టర్ మాటల్లోనే.. ‘‘ మానాన్నతో పాటే పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించా. మెరిట్ స్కాలర్‌షిప్‌లతో ఇంటర్‌లోనూ మంచి మార్కులు సాధించా. 1986–92వరకు తిరుపతిలోని స్విమ్స్‌లో ఎంబీబీఎస్, 1995 నుంచి 98వరకు కర్నూలు మెడికల్ కాలేజిలో జనరల్ సర్జరీ పీజీ పూర్తి చేశా. గోనెగండ్ల పీహెచ్సీలో కొన్ని వందల మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించాను. కొంత కాలానికే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల జనరల్ సర్జరీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా అవకాశం రావడంతో చేరాను. ప్లాస్టిక్ సర్జరీ కోర్సు 2003 నుంచి 2006 వరకు ఉస్మానియా మెడికల్ కాలేజీలో పూర్తి చేశాను. వేలాది మందికి శస్త్రచికిత్సలు చేసి ప్రాణం పోశా. పేదలకు వైద్య సేవలు అందించడం చాలా ఆనందంగా ఉంది. – కర్నూలు(హాస్పిటల్) -
శ్రమనే నమ్ముకుని...
శ్రమనే ఆమె నమ్ముకున్నారు. కుటుంబానికి అండగా ఉండేందుకు వివాహానికి దూరంగా ఉన్నారు. ధైర్యంగా తన పనులు నిర్వహిస్తూ ఖైరూన్‌బీ అందరికీ ఆదర్శంగా నిలిచారు. దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన రంజాన్, భక్షోబీ దంపతులకు నలుగురు సంతానం. ఇందులో ఇద్దరు కుమారులు కాగా.. ఖైరూన్‌బీ, బిస్మిలా కుమార్తెలు. ఖైరూన్‌బీ వివాహం చేసుకోకుండా కుటుంబానికి అండగా నిలిచారు. తల్లిదండ్రులతో పాటు పొలం పనులకు వెళ్లేవారు. వ్యవసాయ పనులు లేని సమయంలో టైర్లకు పంక్చర్లు వేయడం నేర్చుకున్నారు. కప్పట్రాళ్ల బస్టాండు సమీపంలో పంక్చర్ల షాపును సైతం ఏర్పాటు చేసుకున్నారు. సైకిల్ టైర్లతోపాటు టాక్టర్లు, జేసీబీ టైర్లకు పంక్చర్లు వేస్తున్నారు. వచ్చిన మొత్తాన్ని కుటుంబానికి ఇస్తున్నారు. – ఆలూరు -
బీసీ, ఈబీసీలకు ఉచిత డీఎస్సీ శిక్షణ
కర్నూలు(అర్బన్): జిల్లాలోని బీసీ, ఈడబ్ల్యూఎస్(ఈబీసీ) అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణ అందిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ, సాధికారత అధికారి బి.కె.వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ టెట్‌లో అర్హత సాధించిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులన్నారు. శిక్షణకు ఈ నెల 10 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. పూర్తి చేసిన దరఖాస్తును స్వయంగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అందించాలన్నారు. దరఖాస్తుకు చివరి తేది, కోచింగ్ కాల వ్యవధి తదితర వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు కర్నూలు(సెంట్రల్): పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లోని డీఆర్వో కార్యాలయం ఎదుట ఏపీజేఏసీ అమరావతి ఏర్పాటు చేసిన షీ బాక్సును కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లైంగిక వేధింపులను బహిరంగంగా చెప్పలేని ఉద్యోగినులు షీ బాక్సుల్లో ఫిర్యాదు వేస్తే బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగినులు స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసేందుకు అన్ని చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నిర్వాహకురాలు సింధు సుబ్రమణ్యం, ఏపీజేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు కేవై కృష్ణ, మహిళా విభాగం చైర్పర్సన్ సహెరాబాను, ఏపీఆర్ఎస్ఏ మహిళా విభాగం నాయకురాళ్లు శివపార్వతి, పద్మావతి పాల్గొన్నారు. 16న జెడ్పీ సర్వసభ్య సమావేశం కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 16న ఉదయం 11 గంటలకు జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ నీటి సరఫరా–పారిశుద్ధ్యం, వ్యవసాయం, జలవనరులు, 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జెడ్పీ, ఎంపీపీ బడ్జెట్‌పై చర్చిస్తామన్నారు. అధ్యక్షుని అనుమతితో ఇతర అంశాలను చర్చించే అవకాశం ఉందని, ఈ సమాచారాన్ని ఉమ్మడి జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కలెక్టర్లు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీపీ, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులకు తెలియజేశామని పేర్కొన్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కర్నూలు(సెంట్రల్): అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను సుంకేసుల రోడ్డులోని ఎమ్మార్సీ కన్వెన్షన్ హాలులో శనివారం ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి కలెక్టర్ పి.రంజిత్‌బాషాతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కానున్నారు. -
ఉపాధి చూపండి.. సారా మానుకుంటాం!
కర్నూలు : ‘‘ఉపాధి చూపండి.. సారా తయారీ మా నుకుంటాం’’ అంటూ కర్నూలు బంగారుపేటలో నివాసముంటున్న నీలిషికారీల మహిళలు ఎకై ్సజ్ అధికారులను నిలదీశారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నవోదయం 2.0 పేరుతో బంగారుపేటలో అవగాహన సదస్సు నిర్వహించేందుకు ఎకై ్సజ్ అధికారులు ఏర్పాట్లు చేశారు. నోడల్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణారెడ్డి తదితరులు శుక్రవారం కార్యక్రమానికి హాజరయ్యా రు. ఈ సందర్భంగా సభలో డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి మాట్లాడుతుండగా.. నీలిషికారీ మహిళలు ఒక్కసారిగా లేచి తాము ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పుకొచ్చారు. ‘‘కొన్నేళ్ల నుంచి నీలి షికారీలుగా జీవనం సాగిస్తున్నాం.. ఎస్టీలుగా గుర్తించాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. చాలా మందికి ఆధార్ కార్డులు లేవు. కులం సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం లేదు’’ అని చెప్పారు. ‘ఉపాధి చూపండి.. సారా మానుకుంటాం’ అంటూ మహిళలు నిలదీయడంతో సదస్సులో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. నీలిషికారీ మహిళల నుంచి చుక్కెదురు కావడంతో సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తామంటూ అధికారులు హామీ ఇచ్చారు. దీంతో నీలిషికారీ మహిళలు శాంతించారు. నాటుసారాతో అనర్థాలను అధికారులు వివరించి.. సారా తయారీని మానుకుంటామంటూ మహిళల చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సీఐలు చంద్రహాస్, రాజేంద్రప్రసాద్, జయరాం నాయుడు, మెప్మా, ఐసీడీఎస్ తదితర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. బంగారుపేటలో ఎకై ్సజ్ అధికారులను నిలదీసిన షికారీలు -
సార్.. బూటకపు హామీలు నమ్మి మోసపోయాం
డోన్: గత ఎన్నికల సమయంలో కూటమి నాయకుల బూటకపు వాగ్దానాలు నమ్మి మోసపోయామని పలువురు మహిళలు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో వాపోయారు. స్థానిక పాతపేట శ్రీరాముల దేవాలయం సమీపంలో నివసిస్తున్న వంట మాస్టర్ కుమ్మరి నాగరాజు ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను శుక్రవారం రాత్రి మాజీ మంత్రి బుగ్గన పరామర్శించారు. వైఎస్సార్సీపీతో పాటు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని మృతుని కుటుంబ సభ్యులకు ఆయన హామీ ఇచ్చారు. అనంతరం తిరిగి బయలుదేరుతున్న మాజీ మంత్రితో కొందరు మహిళలు తమ గోడును వెల్లబోసుకున్నారు. కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా తమను వంచించిందన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. తొమ్మిది నెలలు గడిచినా ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ప్రతి ఆడ పిల్లకు ప్రతినెలా రూ.1,500, అన్నదాత సుఖీభవా ఇవ్వలేదని బుగ్గన దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబును నమ్మి ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసం ప్రజలకు అర్థమైందని, 2029 ఎన్నికల్లో తిరిగి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, అప్పటి వరకు ఓపిక పట్టాలని మహిళలకు భరోసా కల్పించారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ జాకీర్ హుస్సేన్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కురుకుందు హరి, వలంటీర్ విభాగం జిల్లా అధ్యక్షుడు పోస్టు ప్రసాద్, యువజన విభాగం అధ్యక్షుడు ఆర్ఈ రాజవర్దన్, కౌన్సిలర్లు కటికె వేణు, కురుకుందు పద్మావతి, కో ఆప్షన్ సభ్యులు కుమ్మరి రాజు తదితరులు ఉన్నారు. మాజీ మంత్రి బుగ్గనతో వాపోయిన మహిళలు -
సంక్షేమానికి ‘కూటమి’ ఎగనామం
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి కర్నూలు(టౌన్): ‘సూపర్‌సిక్స్’ పేరిట మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఎగనామం పెట్టిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. ‘సూపర్‌సిక్స్’ హామీల అమలుపై క్యాలెండర్ విడుదల చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లోని తన చాంబర్లో శుక్రవారం విలేకరులతో ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడారు. బడ్జెట్ ప్రసంగం అంతా అంకెల గారడీ తప్ప ఏమీ లేదన్నారు. ఉచిత ఆర్టీసీ బస్సు విషయంలోనూ చంద్రబాబు సర్కార్ మొండిచెయ్యి చూపిందన్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలంటే బడ్జెట్లో రూ.79 వేల కోట్లు కేటాయించాల్సి ఉందని, అయితే మొదటి బడ్జెట్లో రూ.7,282 కోట్లు, ఈ ఏడాది రూ.16,200 కోట్లు కేటాయించిందన్నారు. అసెంబ్లీలో గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించడం చంద్రబాబు సర్కార్కే దక్కుతుందన్నారు. ఇంగ్లిషులో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో చదివితే తెలుగులో మాత్రం ఉద్యోగాల కల్పన చేస్తున్నట్లు ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విమర్శించే అర్హత కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. మూడు ఆత్మలు ఘోషిస్తున్నాయి రాష్ట్రంలో టీడీపీ పాలనతో మూడు ఆత్మలు ఘోషిస్తున్నాయని, ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ తెలుసుకోవాలని ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. వెన్నుపోటుకు బలైన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, హరికృష్ణ, నారా రామ్మూర్తి నాయుడుల ఆత్మలు ఘోషిస్తున్నాయన్నారు. ప్రశ్నించే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను వేధించడం, భయభ్రాంతులకు గురిచేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. గ్రామాల్లో తిరిగే కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలను మహిళలు, రైతులు చొక్కా పట్టుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. -
అలుపెరగని అమ్మ
పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. తమ అమేయ శక్తితో అద్భుతాలను సృష్టిస్తున్నారు. కుటుంబానికి అండగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కర్నూలు బుధవారపేటకు చెందిన కాతున్బీ తొమ్మిది పదుల వయస్సుల్లోనూ బీపీ, షుగర్ వంటి ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ఈమెకు ఐదుగురు కుమార్తెలు, ఆరుగురు కుమారులు ఉన్నా.. ఇంటి పని చేస్తున్నారు. గొడ్డలితో కట్టెలను కొడుతూ ఔరా అనిపిస్తున్నారు. కర్నూలు పూలబజార్‌లో 80 ఏళ్ల వయస్సు కలిగిన నాగమ్మ.. పెరుగు అమ్మకాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కర్నూలు నగరంలోని నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో 60 సంవత్సరాల వయస్సు ఉన్న ఐలమ్మ.. చెప్పులు కుడుతూ కుటుంబానికి అండగా ఉన్నారు. కర్నూలు సి.క్యాంప్ సమీపంలో రోళ్లు మలుస్తూ సౌమ్య అనే మహిళ.. కర్నూలు నగరం మద్దూర్‌నగర్‌లో చేపల వ్యాపారం చేస్తున్న వరలక్ష్మి.. వీరే కాదు ఇంకా ఎంతో మంది వివిధ పనులు చేస్తూ ప్రతి ఒక్కరిలో జీవనోత్సహాన్ని నింపుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు మోసపోయామని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది ● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి కల్లూరు: చంద్రబాబు నాయుడు ఆచరణ సాధ్యం కాని హామీలతో మోసపోయామని ప్రజలకు అర్థమైందని, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన స్వగృహంలో బడ్జెట్ కేటాయింపులపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బండారాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్ష్యాలతో సహా బయటపెట్టారన్నారు. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లలో సూపర్ సిక్స్ పథకాలైన తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు, ఆడ బిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ మొదలగు పథకాల అమలు ఊసే లేదన్నారు. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానని ప్రమాణం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు వైఎస్సార్సీపీ వాళ్లకు ఏమీ ఇవ్వొద్దని బహిరంగగానే చెప్పడం వివక్ష పాలనకు నిదర్శనమన్నారు. ప్రజా బలంతో సీఎం అయిన వ్యక్తి వైఎస్ జగన్.. ప్రజా బలంతో సీఎం అయిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కాటసాని అన్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పేందుకు వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిక్షంగా గుర్తించాలని జగన్ డిమాండ్ చేస్తున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అర్హత కల్గిన రైతులందరికి పార్టీలు, కులాలు, మతాలు, రాజకీయాలు, వర్గాలకు అతీతంగా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించామన్నారు. ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ. 20వేలు అందిస్తామన్నారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్న ఇంత వరకు ఒక్క రైతుకు సహాయం అందలేదన్నారు. 12న ఫీజు పోరును విజయవంతం చేద్దాం.. ఈనెల 12వ తేదీన వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించే ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని కాటసాని పిలుపు నిచ్చారు. నంద్యాల జిల్లా ఉదయానంద హోటల్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు విద్యార్థులతో కలసి ర్యాలీ ఉంటుందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందిస్తామన్నారు. ర్యాలీకి జిల్లాలోని నియోజకవర్గాల నుంచి విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలిరావాలన్నారు. అలాగే 12న వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఉదయం కల్లూరు అర్బన్ శరీన్‌నగర్‌లోని దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహం దగ్గర పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తామన్నారు. -
గవర్నర్‌ను కలసిన ఆర్యూ వీసీ
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వి.వి.బసరావు శుక్రవారం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్, వర్సిటీ చాన్సలర్ ఎస్.అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్యూ అభివృద్ధికి రాజ్‌భవన్ సహాయ సహకారాలు ఉంటాయని గవర్నర్ హామీ ఇచ్చినట్లు వీసీ పేర్కొన్నారు. వర్సిటీలో విద్యా ప్రమాణాలు మెరుగు పరచడంపై దృష్టి సారించాలని సూచించారన్నారు. విద్యా రంగంలో ఉమ్మడి జిల్లాను ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేయాల్సిందిగా సూచించారని పేర్కొన్నారు. మిల్లెట్ బేకింగ్‌పై 10న శిక్షణ కర్నూలు (టౌన్): కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంట్ర ప్రెన్యూర్స్ (సీఓడబ్ల్ల్యూఈ ) ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ నెల10వ తేదీన ‘మిల్లెట్ బేకింగ్’పై మహిళలకు శిక్షణ కార్యక్ర మం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆ సంస్థ అధ్యక్షురాలు రాధిక ఒక ప్రకటన వి డుదల చేశారు. కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కళాశాల,ఎమ్మిగనూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం సమావేశ హాళ్లలో, పత్తికొండలోని సీ్త్రశక్తి భవన్లో ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. వివరాలకు 94908 80172 ను సంప్రదించాలని సూచించారు. ముగిసిన వాదనలు కర్నూలు(టౌన్): సినీ నటుడు పోసాని కృష్ణమురళీకి సంబంధించి బెయిల్ పిటిషన్ వాదనలు శుక్రవారం ఆదోని కోర్టులో ముగిసాయి. కర్నూలు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న పోసానికి బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు సువర్ణ రెడ్డి వేసిన పిటిషన్‌పై కోర్టులో వాదనలు జరిగాయి. ప్రాసిక్యూషన్ తరపున ఆదోని సీనియర్ ఏపీపీ వాదించారు. సుదీర్ఘంగా రెండు గంటల పాటు ఇరువురి వాదనలు సాగాయి. బెయిల్ పిటిషన్‌కు సంబంధించి కోర్టు తీర్పును రిజర్వు చేసింది. అలాగే పోలీసు కస్టడీకి సంబంధించి సోమవారం ఉత్తర్వులు జారీ చేస్తామని మొదటి అదనపు జ్యుడీషిషల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ అపర్ణా వెల్లడించారు. -
నాటుసారా రహిత జిల్లాగా మారుద్దాం
కర్నూలు: నాటుసారా రహిత జిల్లాగా మార్చడమే నవోదయం 2.0 కార్యక్రమం లక్ష్యమని, దీనికి అందరూ సహకరించాలని ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయంలో గురువారం జిల్లాలోని ఇన్స్పెక్టర్లతో ఆమె నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. నాటుసారాను జిల్లాలో సమూలంగా నిర్మూలించడానికి ప్రభుత్వం నవోదయం 2.0ను ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందన్నారు. ఇప్పటివరకు ఎన్ని గ్రామాల్లో సభలు నిర్వహించారు, ఎంతమంది పాత నేరస్థులను బైండోవర్ చేశారు, ఎన్ని గ్రామాల్లో గ్రామ కమిటీలు ఏర్పాటు చేశారు తదితర అంశాలపై సమీక్షించారు. అసిస్టెంట్ కమిషనర్ రావిపాటి హనుమంతరావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మచ్చా సుధీర్ బాబు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి, ట్రైనీ ఏఈఎస్ హర్ష యశస్కర్తో పాటు అన్ని స్టేషన్ల సీఐలు పాల్గొన్నారు. ఎకై ్సజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు నూతనంగా ఎన్నికై న అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, ఉపాధ్యక్షులు భార్గవ రెడ్డి, రమేష్‌రెడ్డి, సందీప్, సోమశేఖర్, నవీన్ బాబు, రెహనాబేగం, కృష్ణా నాయక్, ఇందిర కిరణ్ తదితరులు డీసీని మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి -
రాజకీయ కక్షతో వేధిస్తే ప్రజలే తిరగబడతారు
కర్నూలు (అర్బన్): రాజకీయ కక్షతో వేధిస్తే ప్రజలే తిరగబడతారని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, సీనియర్ న్యాయవాది మద్దూరు సుభాష్ చంద్రబోస్, కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది ఎం.సుబ్బయ్య కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం బడుగు, బలహీనవర్గాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక యునైటెడ్ క్లబ్లో ‘ఒకే అంశం – వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు సమంజసమా’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వేదిక కన్వీనర్లు, న్యాయవాదులు శేఖర్, శివ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సుభాష్ చంద్రబోస్, సుబ్బయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కక్షపూరిత తప్పుడు కేసులపై హైకోర్టు, సుప్రీం కోర్టు కలుగజేసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నా రు. ఎవరైనా తప్పు చేసి ఉంటే చట్టం ప్రకారం ఒక కేసు నమోదు చేసి భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థలోని చట్టాల ప్రకారం నడుచుకోవాలని డిమాండ్ చేశారు. అలా గాకుండా అధికారం ఉంది కదా అని రాజకీయ కక్షతో ఒకే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 15, 20 కేసులు పెట్టి బాధిత కుటుంబాలను వేధిస్తూ పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ తప్పుడు కేసులపై జిల్లా వ్యాప్తంగా మేధావుల సదస్సులు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో న్యాయవాదులు రాజేష్, బంగి సుధీర్, ఉపేంద్రనాథ్, బోయ వెంకటేశ్వర్లు, బాలాజీ రెడ్డి, అబ్దుల్లా సాహెబ్, వెంకట కిషోర్, కిరీటి, విద్యావేత్తలు బోయ అర్జున్, శ్రీరాం పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ అక్రమ కేసులపై న్యాయస్థానాలు కలుగజేసుకోవాలి వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మద్దూరు సుభాష్ చంద్రబోస్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది ఎం.సుబ్బయ్య -
లింగ నిర్ధారణపై ప్రకటనలు ఇస్తే చర్యలు
కర్నూలు(హాస్పిటల్): లింగ నిర్ధారణకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు జారీ చేసినా చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో డాక్టర్ పి. శాంతికళ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లా పరిధిలోని ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు లింగనిర్ధారణపై వాణిజ్య ప్రకటనలు ఇవ్వకూడదన్నారు. లింగనిర్ధారణ పరీక్షలను ప్రోత్సహించేలా గోడపత్రికలు అంటించినా, హోర్డింగ్‌లు పెట్టినా, వాణిజ్య ప్రకటనలు చేసినా పీసీ అండ్ పీఎన్డీటీ చట్టం ప్రకారం నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని, నిబంధనలను అతిక్రమిస్తే మూడు నుంచి ఐదేళ్లు జైలు శిక్ష, రూ.50వేల నుంచి రూ.ఒక లక్ష వరకు జరిమానా విధిస్తామన్నారు. యువకుడి దుర్మరణం నందవరం: మండల పరిధిలోని జొహరాపురం గ్రామం వద్ద గురువారం బైక్‌ను బొలెరో వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఎస్ఐ శ్రీనివాసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. జొహరాపురం గ్రామానికి చెందిన కేసీ ఓసూరప్ప, సోమేశ్వరమ్మ దంపతుల రెండో కుమారుడు చక్రవర్తి(23) ఉదయం ఎరువుల కోసమని బైక్‌పై నాగలదిన్నెకు బయలుదేరాడు. సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామానికి చెందిన బొలెరో వాహనం కందుల లోడ్‌తో కర్ణాటక రాష్ట్రం రాయచూరు మార్కెట్‌కు బయలుదేరింది. జొహరాపురం గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిలో బొలెరో వాహనం అతివేగంగా బైక్‌ను ఢీకొంది. ప్రమాదంలో చక్రవర్తి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పోలీసులు ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేతికి అందివచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. పంట కాలువలో రైతు మృతదేహం లభ్యం సి.బెళగల్: మండల కేంద్రంలోని తెలుగు వీధిలో నివసముండే రైతు తెలుగు రోగెన్న (52) మృతదేహం గురువారం పంట కాలువలో లభ్యమైంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. ఈనెల 3న రాత్రి రాత్రి భోజనం అనంతరం కల్లంలో ఉన్న ఎండుమిర్చి దిగుబడుల వద్దకు కాలప నిమిత్తం వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన చోటల్లా గాలించారు. ఈక్రమంలో గురువారం ఉదయం పొలాలకు వెళ్తున్న రైతులకు కాలువలో రోగెన్న మృతదేహం కలినిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. కాగా ఎండుమిర్చి దిగుబడుల వద్దకె కాలువపై కాలినడకన వెళ్తూ ప్రమాదశాత్తూ అందులో జారి పడి మృతి చెంది ఉంటాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతుడికి భార్య సావిత్రమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. బీసీ మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కర్నూలు(అర్బన్): వెనుకబడిన తరగతుల ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని బీసీ, ఈబీసీ, కమ్మ, రెడ్డి, క్షత్రియ, వైశ్య, కాపు (బలిజ) కులాల మహిళలకు టైలరింగ్‌లో ఉచితంగా శిక్షణ ఇచ్చి శిక్షణ అనంతరం కుట్టు మిషన్లు అందించనున్నట్లు బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్ జాకీర్‌హుసేన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా కులాలకు చెందిన 18 నుంచి 50 ఏళ్లలోపు వయస్సు ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు తమకు సమీపంలోని సచివాలయాల ద్వారా httpr://apobmms.apcfss.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్, రేషన్ కార్డు, మొబైల్ ఫోన్ నంబర్ కలిగి ఉండాలన్నారు. మరింత సమాచారం కోసం 9908132030 నంబర్‌ను సంప్రదించాలన్నారు. -
పోలీసు ప్రతిష్టను పెంచేలా సేవలందించండి
కర్నూలు: విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా సేవలందించి పోలీసు శాఖ పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రొబేషనరీ ఎస్ఐలకు సూచించారు. అనంతపురం పీటీసీలో ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్న 8 మంది ప్రొబేషనరీ ఎస్ఐలను కర్నూలు జిల్లాకు కేటాయించారు. గురువారం వారు డీపీఓలో ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎనిమిది మంది సివిల్ ఎస్ఐలలో ఏడుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. ప్రొబేషనరీ ఎస్ఐలను గ్రేహౌండ్స్, బెటాలియన్, సమస్యాత్మక ప్రాంతాల్లో కొన్ని నెలల పాటు విధులకు కేటాయించనున్నారు. అప్పగించిన విధులను బాధ్యతతో నిర్వర్తించి వ్యక్తిగతంగా మంచి పేరు తెచ్చుకోవడమే గాక పోలీసు ప్రతిష్టను పెంచాలని వారికి ఎస్పీ సూచించారు. జిల్లాకు కేటాయించిన ప్రొబేషనరీ ఎస్ఐలకు ఎస్పీ సూచన -
అన్ని వ్యాధులకూ వైద్యం చేస్తున్నాం
వంద పడకల ప్రభుత్వాసుపత్రిలో అన్నిరకాల వైద్యసేవలు సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వెటర్నటీ, ఆర్థోపెడిక్, డెంటల్, ఈఎన్టీ తదితర విభాగాలలో ఇక్కడే వైద్యులు శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. 80 శాతం రోగాలకు ఎక్కడకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడే వైద్యం అందిస్తాం. – డాక్టర్ హనీఫ్, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్, డోన్డోన్ వంద పడకల ప్రభుత్వాసుపత్రిమణికట్టు వద్ద ప్లేట్ వేసి శస్త్రచికిత్స శ్రీనివాసనగర్‌కు చెందిన నగేష్ మణికట్టు వద్ద ప్రమాదవశాత్తూ గాయం తగిలి తిరగతోడింది. దీనిని ఫ్రాక్చర్ షప్ట్ రౌస్గా గుర్తించి ఆరిఫ్ విత్ ప్లాస్టింగ్ శస్త్రచికిత్స ద్వారా ప్లేట్లు విజయవంతంగా అమర్చారు. దీంతో అతను సంపూర్ణంగా కోలుకొని తన పని తాను చేసుకోగలుగుతున్నారు. తెగిన కాలి మడిమకు చికిత్స కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామానికి చెందిన చంద్రకళ కట్టెలు కొడుతుండగా కుడికాలు మడిమ వద్ద నరం తెగి తీవ్ర రక్తస్రావమైంది. కొందరు డాక్టర్లు యుద్ధ ప్రాతిపదికన కుట్లు వేసి పంపించడంతో గాయం తిరగతోడింది. దీంతో ఆమె ప్రభుత్వాసుపత్రిలో వైద్యులను సంప్రదించింది. టెండో అచిలిస్ టెండర్ టియర్‌గా గుర్తించి అత్యవసర చికిత్స చేశారు. డోన్ మండలం చింతలపేట గ్రామానికి చెందిన చంద్రుడు, రితికలకు ఆరు నెలల క్రితం కూతురు పుట్టింది. అయితే చిన్నారి వంకర పాదాలు(క్లబ్ ఫుట్)తో జన్మించడంతో దంపతులు ఆవేదన చెందారు. తమ బిడ్డను తీసుకుని డోన్ ప్రభుత్వాస్పత్రికి వెళ్లగా సూపరింటెండెంట్ డాక్టర్ హనీఫ్, ఆర్థోపెడిక్ డాక్టర్ గౌస్ పోనిశెట్టి కాస్టింగ్ టెనోటోమి చికిత్స ద్వారా వంకర కాళ్లను సరిచేశారు. డాక్టర్లు తమ బిడ్డ పాదాలు సరిచేయకపోతే జీవితాంతం వికలాంగత్వంతో బాధపడేదని, వైద్యులకు ఆజన్మాంతం తమ కుటుంబం ఋణపడి ఉంటుందని దంపతులు చంద్రుడు, రితిక దంపతులు పేర్కొన్నారు. ● ప్రభుత్వాసుపత్రిలో క్లిష్ట మైన శస్త్రచికిత్సలు ● కార్పొరేట్ వైద్యం అందుతుండటంతో రోగులు ఆనందం ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చొరవతో పేదలకు తప్పిన కష్టాలు ● అన్నిరకాల శస్త్రచికిత్సలను త్వరలో అందుబాటులోకి తెస్తాం గత ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పేదలకు అధునాతన వైద్యం అందుతోంది. జిల్లా కేంద్రానికో, ఏ ఇతర ప్రాంతాలకో వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే అన్ని వ్యాధులకూ అత్యంత ఖరీదైన వైద్యం ఉచితంగా లభిస్తోంది. ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి పేదల డాక్టర్‌గా వైఎస్ఆర్ పేరు పొందగా.. ఆయన బిడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విన్నపం మేరకు రూ.40 కోట్లతో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేసి, వేల మందికి వైద్యం అందించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు గాంచారని డోన్ నియోజకవర్గ ప్రజలు వేనోళ్ల పొగుడుతున్నారు.డోన్: నంద్యాల జిల్లా డోన్ పట్టణం గుత్తి రోడ్డు పక్కన ఉన్న రుద్రాక్షగుట్ట ప్రాంతంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చొరవతో రూ.40 కోట్లు వెచ్చించి అత్యంత ఆధునిక వంద పడకల ప్రభుత్వాసుపత్రిని నిర్మించారు. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల, పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, వెల్దుర్తి, కృష్ణగిరి, దేవనకొండ మండలాల పేదలకు ఈ ఆసుపత్రి ద్వారా వైద్య సేవలందుతున్నాయి. కర్నూలు ప్రభుత్వాసుపత్రికి వెళ్లే అవసరం లేకుండానే 80 శాతం శస్త్ర చికిత్సలను వైద్యులు ఇక్కడే చేస్తుండటంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నరాలు తెగి స్పర్శ కోల్పోయినా.. స్థానిక కోట్లవారిపల్లెకు చెందిన ఈడిగ సతీష్ అనే యువకునికి ప్రమాదవశాత్తూ ఎడమ అరచేతిలో గాయం కావడంతో నరాలు తెగి రెండు చేతి వేళ్లకు స్పర్శ లేకుండాపోయింది. ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు సకాలంలో టెండన్ రిపేర్ అనే ప్రక్రియ ద్వారా అత్యవసర చికిత్స చేసి తిరిగి చేతివేళ్లకు స్పర్శ వచ్చేందుకు ప్రయత్నించి సఫలీకతులయ్యారు. -
సేవల జాప్యం.. తీసింది ప్రాణం
● బ్యాంక్ కార్యాలయ మెట్లు ఎక్కలేక గర్భిణికి రక్తస్రావం ● ఖాతాలో పేరు మార్పునకు జాప్యం ● పురిటిలోనే మృతి చెందిన మగశిశువుకోసిగి: బ్యాంకు సిబ్బంది కాలయాపనతో ఓ మహిళ పురిటిలోనే తన బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాల్సిన బ్యాంకుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనేందుకు ఈ ఘటనే నిదర్శనం. బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రం కోసిగిలో 6వ వార్డులో నివాసం ఉంటున్న జాలిమంచి సురేష్ భార్య అంజలి నిండు గర్భిణి. ప్రసవం నిమిత్తం ఆమె పుట్టినిల్లు వందగల్లు గ్రామంలో ఉంటుంది. అయితే ఆమె బ్యాంక్ ఖాతా స్టేట్ బ్యాంక్‌లో ఉంది. పెళ్లియినా తర్వాత పుట్టింటి నుంచి మెట్టింటికి రావడంతో పేరు మార్పు చేసుకోవాల్సి ఉంది. పేరు మార్పు కోసం నెల రోజులుగా బ్యాంక్ అధికారులు కాలయాపన చేస్తూ తిప్పుతూ ఉన్నారు. ఈ బ్యాంక్ కార్యాలయం ఓ భవనంపై రెండో అంతస్తులో ఉండటంతో మెట్లు ఎక్కి దిగ లేక అవస్థలు పడుతుండేది. గురువారం ఆమె బ్యాంక్ మెట్లు ఎక్కి కొద్ది సేపటికే రక్త స్రావం కావడంతో వెంటనే అప్రమత్తమై అక్కడి నుంచి ఆటోలో కోసిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి పరిస్థితి విషమంగా ఉండటంతో 108 ఆంబులెన్స్‌లో ఆదోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కాగా అప్పటికే తల్లి పురిటిలోనే మగ బిడ్డ చనిపోయినట్లు నిర్ధారించడంతో అంజలి, ఆమె కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమని వాపోయారు. కోసిగి స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ కార్యాలయం రెండవ అంతస్తులో ఉండడంతో గర్భిణులు, వృద్ధులు, వికలాంగులు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. -
బనగానపల్లెలో భారీ చోరీ
బనగానపల్లె రూరల్: పట్టణంలోని శివరామ్ టాకీస్ సమీపంలో నివాసం ఉంటున్న సత్యనారాయణ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి 16 తులాల బంగారం, రెండు కేజీ వెండి ఆభరణాలతోపాటు రూ.4 లక్షల నగదుతో ఉడాయించారు. బాధితుడు తెలిపిన వివరాలు.. సత్యనారాయణ కుటుంబం రెండు రోజు క్రితం ఇంటికి తాళం వేసి తిరుపతికి వెళ్లారు. బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళం పగలగొట్టి లోపలకు ప్రవేశించి, బీరువాలో ఉన్న బంగారు, ఆభరణాలు, నగదును మూటగట్టుకుని పరారయ్యారు. ఇంటి తలుపులు తెరిచి ఉంచినట్లు స్థానికుల ద్వారా తెలుసుకున్న సత్యనారాయణ తిరిగి ఇంటికి వచ్చి చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నంద్యాల క్లూస్ టీం బృందం చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి, వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. భర్త చేతిలో భార్య దారుణ హత్య ● రోకలి బండతో తలపై దాడి ● ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి కొలిమిగుండ్ల: జీవితాంతం తోడుంటానని బాస చేసిన భర్తే భార్యను కర్కషంగా హత్య చేశాడు. ఈ ఘటన గురువారం బెలుం శింగవరంలో చోటుచేసుకుంది. సీఐ రమేష్‌బాబు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బిజ్జం చిన్న వెంకట్రామిరెడ్డి, మనోహరమ్మ(37)కు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. 13 ఏళ్ల కుమారుడు ప్రతాప్‌రెడ్డి ఉన్నాడు. వీరి స్వగ్రామం వైఎస్సార్ కడప జిల్లా కొండసుంకేసుల కాగా బెలుం శింగవరంలో స్థిరపడ్డారు. మొదట్లో నాపరాతి గని తీసుకొని జీవనం సాగిస్తుండేవాడు. తర్వాత మద్యానికి బానిసై, భార్యపై అనుమానం పెంచుకున్నాడు. భార్య వ్యవసాయ కూలీ పనులకెళ్లి కుటుంబాన్ని పోషిస్తుండేది. రోజు మాదిరిగా కూలీ పనులు ముగించుకుని ఇంటికి చేరుకొని కాళ్లు, ముఖం శుభ్రం చేసుకుని ఇంట్లోకి వెళ్లగానే తలుపులు మూసి.. అప్పటికే పథకం ప్రకారం సిద్ధంగా ఉంచుకున్న రోకలిబండతో తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై కుప్పకూలిపోయింది. స్థానికుల సాయంతో బంధువులు చికిత్స నిమిత్తం అవుకు సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు కర్నూలుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ బెలుం శింగవరం చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. -
గురుకులాల ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు గడువు పెంపు
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డా.బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల/ కళాశాలల్లో 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 13వ తేదీ వరకు గడువును పొడిగించినట్లు ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్స్పైర్ అవార్డులకు 9 ప్రాజెక్టులు ఎంపిక ... 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన ఇన్స్పైర్ అవార్డులకు జిల్లాలోని డా.బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యార్థులు రూపొందించిన 9 ప్రాజెక్టులు ఎంపిక అయ్యాయని డీసీఓ శ్రీదేవి తెలిపారు. అలాగే టీసీఎస్ నిర్వహించిన గ్లోబల్ ఇన్నోవేటర్ ఆఫ్ ద ఇయర్ (జీఓఐటీ) కాంపిటీషన్స్‌లో 373 ప్రాజెక్టుల్లో ఫైనల్‌కు మూడు ఎంపిక అయ్యాయన్నారు. ఇందులో కర్నూలు జిల్లాలోని దిన్నెదేవరపాడు గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉండటం హర్షణీయమన్నారు. ఈ విద్యార్థులు ఈ నెల 25వ తేదీన వర్చువల్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. -
బర్త్ డే పార్టీ మిగిల్చిన విషాదం
● రోడ్డు ప్రమాదంలో సెక్యూరిటీ గార్డు మృతి కర్నూలు (హాస్పిటల్): పుట్టిన రోజు వేడుక స్నేహితుల్లో విషాదాన్ని నింపింది. విందు పూర్తి చేసుకుని తిరుగుపయణమైన స్నేహితులలో ఒకరిని రోడ్డుప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. నగర శివారు పంచలింగాల చెక్‌పోస్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దాస్పత్రి సెక్యూరిటీ గార్డు కొమ్ము మహేష్ (25) మృతిచెందాడు. మహేస్తోపాటు విష్ణువర్ధన్, రాజేంద్రసింగ్, తిరుమలేష్ పెద్దాస్పత్రిలో సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు. విష్ణువర్ధన్ పుట్టిన రోజు కావడంతో వీరు నలుగురు గురువారం విధులకు సెలవు పెట్టి అలంపూర్‌కు వెళ్లారు. అక్కడ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుని మధ్యాహ్నం ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. పంచలింగాల చెక్‌పోస్టు సమీపంలోకి రాగానే వారి ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన నలుగురిని చికిత్స నిమిత్తం పెద్దాస్పత్రికి తరలించగా కోలుకోలేక మహేష్ మృతిచెందాడు. బంగారుపేటకు చెందిన ఇతడికి భార్య, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా క్షతగాత్రులను ఆసుపత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సీతారామయ్య పరామర్శించారు. -
కంటైనర్‌లో వస్తారు.. ఏటీఎంలు కొల్లగొడతారు!
● హర్యానా ముఠా గుట్టు రట్టు ● చిన్నటేకూరు ఏటీఎం దోపిడీకి యత్నించింది వీరే ● సాంకేతిక పరిజ్ఞానంతో నలుగురు అరెస్టు కర్నూలు: నలుగురు సభ్యుల ముఠా... అందరిదీ హర్యానా. వృత్తిరీత్యా డ్రైవర్లు కావడంతో కంటైనర్‌లో అన్ని రాష్ట్రాల్లో తిరుగుతుంటారు. మార్గమధ్యలో చోరీకి అనుకూలంగా ఉన్న ఏటీఎం కేంద్రాలను గుర్తించి దోపిడీలకు పాల్పడుతారు. ఈ అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను కర్నూలు పోలీసులు అరెస్టు చేసి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎదుట హాజరుపరిచారు. డీపీఓలోని వ్యాస్ ఆడిటోరియంలో కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్‌తో కలసి ఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామంలో ఎన్‌హెచ్44 సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం కేంద్రాన్ని కొల్లగొట్టేందుకు గత నెల 24వ తేదీ రాత్రి యత్నించారు. షట్టర్ పెకిలించి ఏటీఎం మిషన్‌కు తాడుతో కట్టి టోయింగ్ (వాహనాలను తరలించే) వాహనంతో లాక్కునిపోవడానికి యత్నించారు. అదే గ్రామానికి చెందిన యువకులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. యువకులు చూస్తున్నారని దొంగలు పసిగట్టి ఏటీఎం మిషన్‌ను వదిలేసి టోయింగ్ వాహనంలో అక్కడి నుంచి పారిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు... బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో నాలుగు పోలీసు బృందాలు రంగంలోకి దిగి పక్కా ఆధారాలతో హర్యానా రాష్ట్రం నూహ్మేవత్ జిల్లా రాయపురి గ్రామానికి చెందిన షాహిద్ ఖాన్, పాల్వాల్ జిల్లా మమ్ముల్కా గ్రామానికి చెందిన సున్ని ఇమ్రాన్ ఖాన్, మేవాత్ జిల్లా రాయపురి గ్రామానికి చెందిన జంషాద్ ఖాన్, షావ్కర్ ఖాన్‌లను చెట్లమల్లాపురం గ్రామ సమీపంలోని ఎన్‌హెచ్44 పక్కన గల సంరాతల్ రాజస్థాన్ డాబా దగ్గర అదుపులోకి తీసుకుని విచారించగా వారి నేరాల చిట్టా బయటపడింది. చిన్నటేకూరు దగ్గర బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం కేంద్రంతో పాటు అంతకుముందు రోజు నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో కూడా తెల్లవారుజామున దొంగతనానికి ప్రయత్నించారు. అలారం మోగడంతో పారిపోయినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. దోపిడీ కోసం బళ్లారి చౌరస్తా సమీపంలో ఒక టోయింగ్ వాహనాన్ని చోరీ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. వీరు హర్యానా, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో నేరాలు చేసినట్లుగా అంగీకరించారని ఎస్పీ తెలిపారు. షాహిద్ ఖాన్‌పై 26, ఇమ్రాన్ ఖాన్‌పై 15 ఏటీఎం చోరీ కేసులు ఉన్నాయన్నారు. నిందితుల వద్ద నుంచి ఒక గ్యాస్ కట్టర్ , చిన్న గ్యాస్ సిలిండర్, రెండు కత్తులు, తాళాలు తెరవడానికి ఉపయోగించే మారు తాళాలు, మాస్కులు, గ్లౌజులు, రెండు స్ప్రే టిన్ లు, కూలింగ్ అద్దాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తింపు... చోరీ చేసిన టోయింగ్ వాహనంపై లభించిన ఆధారాలతో పాటు ఏటీఎం కేంద్రం దగ్గర ఉన్న సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా దొంగలను గుర్తించారు. వారు వినియోగించిన సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా కంటైనర్ వాహనం ద్వారా బెంగుళూరు వైపు ప్రయాణిస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. సీఐలు చంద్రబాబు నాయుడు, శేషయ్య, వంశీధర్, వేణుగోపాల్, ఎస్ఐలు ధనుంజయ, సునిల్ తదితరులు కూడా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. సిబ్బందికి నగదు రివార్డు పది రోజుల వ్యవధిలోనే ఏటీఎం చోరీ కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని నగదు రివార్డుతో ఎస్పీ సత్కరించారు. ఈ కేసులో నలుగురు దొంగలను అరెస్టు చేసిన కర్నూలు డీఎస్పీ, సీఐలతో పాటు బృందంలోని సభ్యులు డి.శేఖర్ బాబు, వాసు, షమీర్, నాగరాజు, శ్రీనివాసులు, శేఖర్, రవి, సైబర్ ల్యాబ్ పీసీ రాజేష్ తదితరులను ఎస్పీ అభినందించారు. -
హదీస్ వెలుగు :
అల్లాహ్ అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. చేసిన పాపాల నుంచి ముక్తి కోసం, కరుణ కోసం నిత్యం దువా చేస్తూ ఉండండి. – పవిత్ర ఖురాన్ ఇఫ్తార్ సహెర్ కర్నూలు సాశ్రీశ్రీ 6:32 ఉశ్రీశ్రీ 5:10 ఆదోని సాశ్రీశ్రీ 6:31 ఉశ్రీశ్రీ 5:11 నంద్యాల సాశ్రీశ్రీ 6:28 ఉశ్రీశ్రీ 5:10 ఆత్మకూరు సాశ్రీశ్రీ 6:28 ఉశ్రీశ్రీ 5:04 బనగానపల్లె సాశ్రీశ్రీ 6:30 ఉశ్రీశ్రీ 5:06 -
వైఎస్ జగన్ ముందుచూపుతో ‘ఆడా’
ఆదోని డివిజన్ వెనుకబాటును గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రాంతాన్ని ‘ఆడా’(ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ)గా ఏర్పాటు చేస్తూ 2022 జనవరి 12న జీవో 7 విడుదల చేశారు. ఆదోని, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు పరిధిలోని 381 పంచాయతీలను ప్రత్యేక ఏరియాగా పరిగణించి, వీటి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు. వలసల నివారణ, అక్షరాస్యత పెంపు, పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పన, సాగునీటి వనరులతో పాటు వీలైనంత వరకు అందరికీ భూమి ఉండేలా చేయాలనేది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ సంకల్పం. ఈ మేరకు అప్పటి కలెక్టర్ కోటేశ్వరావు డీపీఆర్‌ను సిద్ధం చేసి రెండు దఫాలు అప్పటి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో సమీక్షలో పాల్గొన్నారు. ● మంత్రాలయం నియోజకవర్గంలో ఐదు ఎత్తిపోతలకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పులికనుమ రిజర్వాయర్‌కు ఇప్పటికే తుంగభద్ర నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. దీని పరిధిలో 3వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ● హాల్వి, ఐరనగల్లు, కందుకూరు, కగ్గల్లు, బసాపురం ఎత్తిపోతల పనులు చేపట్టారు. పైపులు ఇతర సామగ్రి కూడా తెప్పించారు. ఇవి పూర్తయితే 10వేల ఎకరాలకు సాగునీరు, 20 గ్రామాలకు తాగునీరు అందుతుంది. ● గురురాఘవేంద్రతో పాటు దిద్ది, మాధవరం, బసలదొడ్డి, వగురూరు ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందుతోంది. ఆర్డీఎస్, వేదవతి పూర్తయితే ఈ ప్రాంతం పూర్తి సస్యశ్యామలం అవుతుంది. ● పత్తికొండ నియోజకవర్గం లక్కసాగరం నుంచి 77 చెరువులకు సాగునీరు ఇచ్చే పథకాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. పత్తికొండ, ఆలూరుతో పాటు పాణ్యం నియోజకవర్గంలోని చెరువులకు నీరు అందుతోంది. ● గాజులదిన్నె ప్రాజెక్టు సామర్థ్యాన్ని 4.5 టీఎంసీల నుంచి 5.5 టీఎంసీలకు పెంచారు. అలాగే హంద్రీ–నీవా నుంచి 3 టీఎంసీల గాజులదిన్నెకు కేటాయించారు. ● పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ఎక్కువ పెట్టుబడితో ‘గ్రీన్’కో స్థాపించారు. జయరాజ్ ఇస్పాత్ కూడా గత ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటైంది. -
ఆదోని ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించాలి
జిల్లాలో పరిశ్రమల ఊసే లేదు. ప్రజలు జీవనోపాధికి ఎక్కడెక్కడికో వలస వెళ్తున్నారు. ఇప్పటికై నా ఆదోని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆ ప్రాంతానికే చెందిన వారు కావడంతో పరిశ్రమల స్థాపనకు చొరవ తీసుకోవాలి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఏర్పాటైన ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ నిర్ణయాలను కొనసాగించాలి. –విజయకుమార్‌రెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా చైర్మన్, కర్నూలు కర్నూలుకు ఎప్పుడూ అన్యాయమే తరతరాలుగా కర్నూలుకు తీరని అన్యాయం జరుగుతోంది. ఈ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినా జిల్లా అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరం. వేదవతి, గుండ్రేవుల, సిద్ధేశ్వరం అలుగు చేపట్టాలని కోరుతున్నా పాలకులు నిర్లక్ష్యం వీడని పరిస్థితి. విధిలేని పరిస్థితుల్లో చదువుకున్న విద్యార్థులు హైదరాబాద్, బెంగళూరు, చైన్నెలకు వలస వెళ్తున్నారు. ఓర్వకల్లును ఇండస్ట్రీయల్హబ్గా తీర్చిదిద్దుతామన్న మాటకు కట్టుబడాలి. – శ్రీనివాసరెడ్డి, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు, కర్నూలు కూటి కోసం కొట్లాటలు తప్పవు పడమటి ప్రాంతంలో వ్యవసాయం జూదంగా మారింది. వర్షాలు వస్తేనే రైతులు పంటలు పండించుకునే పరిస్థితి. ఎల్ఎల్సీ, గురురాఘేంద్ర ప్రాజెక్టులకు నీళ్లు రావడం లేదు. హెచ్‌ఎన్‌ఎన్‌ఎస్ కాలువ జిల్లా మీదుగా వెళ్తున్నా నీరందడం లేదు. దేవనకొండ, పత్తికొండ, కోసిగి, కౌతాళం మండలాల్లో సగం మంది ఊళ్లు విడిచి వలస పోవడం పరిపాటిగా మారింది. వ్యవసాయానికి సాగునీరు పెంచకపోతే కూటి కోసం భవిష్యత్‌లో కొట్లాటలు తప్పవు. – ఎంఏ గఫూర్, మాజీ ఎమ్మెల్యే, కర్నూలు -
పరీక్షల నిర్వహణలో పొరపాట్లకు తావివ్వొద్దు
కర్నూలు కల్చరల్: ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. గురువారం పరీక్షలు నిర్వహిస్తున్న ఓల్డ్‌సిటీలోని ఉస్మానియా కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 1వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా 69 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయన్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఇంటర్ విద్యార్థులు మొత్తం 45,325 మంది పరీక్షలు రాస్తున్నారన్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామన్నారు. పోలీస్ బందోబస్తు సైతం ఏర్పాటు చేశామన్నారు. ఆర్ఐవో గురవయ్య శెట్టి మాట్లాడుతూ గురువారం మొదటి సంవత్సరం విద్యార్థులు 25,250 మందికి 24, 495 మంది హాజరు కాగా 744 మంది గైర్హాజరయ్యారన్నారు. కర్నూలు బీక్యాంప్ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో చూచిరాతకు పాల్పడిన ఆరుగురు విద్యార్థులను డిబార్ చేశామన్నారు. జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా -
అదనపులోడు క్రమబద్ధీకరణకు 50 శాతం రాయితీ
కర్నూలు(అగ్రికల్చర్): గృహ విద్యుత్ వినియోగంలో అదనపు లోడ్‌ను క్రమబద్ధీకరించుకోవాలని విద్యుత్ శాఖ ఎస్ఇ ఉమాపతి తెలిపారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. గృహ వినియోగానికి సంబంధించి చాలా వరకు మొదట ఒక కిలో వాట్ లోడ్‌తోనే కనెక్షన్ తీసుకుంటారని, అయితే ఆ తర్వాత ఏసీలు, ఇతరత్రా వాటితో లోడు రెండు, మూడు కిలో వాట్స్కు పెరుగుతుందన్నారు. వినియోగించిన విద్యుత్‌కు వినియోగదారులు చార్జీలు చెల్లిస్తున్నప్పటికీ ట్రాన్స్ఫార్మర్పై లోడు పెరుగుతుండటం వల్ల కాలిపోవడం, లో ఓల్టేజీ, హైవోల్టేజీ సమస్యలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. అదనపు లోడ్‌ను క్రమబద్ధీకరించుకుంటే ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యంపై పూర్తి స్పష్టత వస్తుందన్నారు. అదనపు లోడు క్రమబద్ధీకరణకు డిపార్టుమెంటుకు చెల్లించాల్సిన రుసుములో 50 శాతం రాయితీతో ఏపీఎస్పీడీసీఎల్ వెబ్సైట్ www.apspdcl.on, సమీపంలోని మీ సేవ, గ్రామ, వార్డు సచివాలయాల్లో చెల్లించవచ్చని తెలిపారు. ఈ అవకాశం జూన్ 30 వరకు ఉందన్నారు. తమ్ముళ్లా.. మజాకా! నందవరం: తెలుగు తమ్ముళ్లు ఉపాధి కూలీల నోట్లో మట్టి కొడుతున్నారు. ఓ వైపు అధికారులు వలసల నివారణకు ఉపాధి పనులు కల్పిస్తున్నామని చెబుతుండగా.. మరో వైపు టీడీపీ నాయకులు యంత్రాలతో పనులు చేపడుతుండటం గమనార్హం. కూలి గిట్టుబాటు కాగా ఎంతో మంది పేదలు పొట్ట చేతబట్టుకుని వలసబాట పడుతున్నారు. ఊర్లో కొందరికై నా ఉపాధి కల్పించాల్సిన పనులు యంత్రాలతో చేపట్టంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోనకలదిన్నె గ్రామంలో ఫారం పాండ్ పనులను తెలుగు దేశం పార్టీ నేతలు జేసీబీతో చేయిస్తున్నారు. గురువారం గ్రామంలోని దైవందిన్నె రోడ్డులో మూల్లా కాజావలి అనే రైతు పొలంలో జేసీబీతో చేపట్టారు. కనీసం రైతుకు సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. ఉపాధి కూలీలకు కడుపు కొట్టి యంత్రాలతో పని చేసే వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఉపాధి కూలీలకు వాటర్ బెల్ ● డ్వామా పీడీ వెంకటరమణయ్య కర్నూలు(అగ్రికల్చర్): వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఉపాధి కూలీల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకట రమణయ్య తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయడంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఉపాధి పనులకు ఉదయం 6 గంటలలోపే పని ప్రదేశానికి హాజరై 11 గంటలకు ముగించుకునే విధంగా ఉపాధి కూలీలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇలా చేయడం వల్ల ఎండ తీవ్రత పెరుగకముందే ఇంటికి చేరుకునే అవకాశం ఉంటుందన్నారు. అవసరమైతే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు పనులు చేసుకొని గరిష్ట వేతనం రూ.300 పొందవచ్చని సూచించారు. పని ప్రదేశాల్లో కూలీలకు నీటి వసతి కల్పించాలని, ప్రతి గంటకు నీరు తాగే విధంగా వాటర్ బెల్ పద్ధతిని అమలు చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అధిక ఉష్ణోగ్రతల నుంచి కూలీలను కాపాడేందుకు అందుబాటులో ఉన్న షేడ్స్‌ను వినియోగించాలని, లేకపోతే స్థానికంగా లభించే తాటాకు, ఈతాకు తదితర వాటితో పందిరి వేసే విధంగా సూచించామన్నారు. పని ప్రదేశంలో ఫస్ట్ ఎయిడ్ కిట్‌తో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. -
బీమా కంపెనీ వ్యాపారిపై నాన్ బెయిలబుల్ వారెంట్
కర్నూలు(సెంట్రల్): ముంబయికి చెందిన రిలయన్స్ నిప్పోన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కర్నూలు బ్రాంచ్ మేనేజర్‌పై జిల్లా వినియోగదారుల వ్యాజ్య పరిష్కార కమిషన్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019 మేలో కమిషన్ రూ.4.22 లక్షలను ఓ కక్షిదారుడికి చెల్లించాలని ఆదేశాలిచ్చింది. దీనిపై ఆ కంపెనీ రాష్ట్ర కమిషన్‌ను ఆశ్రయించింది. అయితే 2022 అక్టోబర్ 13న ఆ కంపెనీ వాదనను రాష్ట్ర కమిషన్ తిరస్కరించి జిల్లా కమిషన్ తీర్పును అమలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. అయితే ఇప్పటి వరకు కమిషన్ ఆదేశాలను కంపెనీ అమలు చేయకపోవడంతో గురువారం జిల్లా కిషన్ అధ్యక్షుడు కె.కిశోర్‌కుమార్, సభ్యులు ఎన్.నారాయణరెడ్డి, నజీమా కౌసర్ నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేశారు. నకిలీ విత్తన వ్యాపారికి కూడా.. పత్తికొండకు చెందిన శ్రీవెంకటేశ్వర ట్రేడర్స్ యాజమాని డి.గంగాధర రావుపై గురువారం జిల్లా కిషన్ అధ్యక్షుడు కె.కిశోర్‌కుమార్, సభ్యులు ఎన్.నారాయణరెడ్డి, నజీమా కౌసర్ నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేశారు. ఆ వ్యాపారి ముగ్గురు రైతులకు నకిలీ విత్తనాలు అమ్మి మోసం చేశాడు. బాధిత రైతులు కమిషన్‌ను ఆశ్రయించగా 2024 జూన్ 21న రూ.70 వేలు చెల్లించాలని వ్యాపారికి కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ఇంతవరకు పరిహారం చెల్లించకపోవడంతో బాధితులు మరోసారి కమిషన్‌ను ఆశ్రయించిన నేపథ్యంలో నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేస్తూ ఆదేశాలిచ్చారు. -
‘సీమ’కు జలవనరుల రాజధాని ‘కర్నూలు’. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రాంతాన్ని దశాబ్దాలుగా పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాగా ఉన్నంత వరకూ ఈ ప్రభావం పెద్దగా తెలియలేదు. జిల్లాలు విడిపోయిన తర్వాత ఈ నిర్లక్ష్య ప్రభావం స్పష్టంగా తెలుస్తోంది. ఇటీ
రాష్ట్రంలోనే అత్యంత పేద జిల్లా కర్నూలు ● సోషియో ఎకనమిక్ సర్వే వెల్లడి ● అత్యధిక సాగుభూమి సొంతమైనా అందని నీరు ● వర్షాధార పంటలతో ఏటా తప్పని వలసలు ● ఉపాధి, ఉద్యోగాల కల్పనకు పరిశ్రమలూ కరువే.. ● అక్షరాస్యతలోనూ చివరి స్థానం ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రత్యేక చొరవ ● కూటమి ప్రభుత్వంలో సీమ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరానికి ‘సోషియో ఎకనమిక్ సర్వే’ విడుదల చేసింది. ఇందులో అత్యంత ధనిక జిల్లాగా పశ్చిమ గోదావరి మొదటి స్థానంలో, అత్యంత పేద జిల్లాగా కర్నూలు చివరి స్థానంలో నిలిచాయి. నిజానికి ఈ రెండు జిల్లాల్లోని పరిస్థితిని పోల్చి చూస్తే ప్రధానంగా సాగునీటి వనరులే ప్రభావం చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. కర్నూలు జిల్లాలో 12.5 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో 2.57లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 6.45 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. అంటే మన కంటే దాదాపు 50 శాతం తక్కువ. అయితే 4.70 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఆ జిల్లాలో సాగునీటి కాల్వల ద్వారా 4.12 లక్షల ఎకరాలకు మూడు పంటలకు నీరు అందుతుంటే, ఇక్కడ కేవలం 60 వేల ఎకరాలకు మాత్రమే కాలువల ద్వారా నీరు పారుతోంది. ఇదొక్క ఉదాహరణతో సాగునీటి కల్పనలో ఎంత వెనుకబడి ఉన్నామో తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో బోర్ల ద్వారా 1.72లక్షల ఎకరాలు, చెరువుల ద్వారా 25వేల ఎకరాలకు నీరు అందుతుండగా.. పశ్చిమ గోదావరిలో బోర్ల ద్వారా 47వేల ఎకరాలకు మాత్రమే నీరు అందుతోంది. వలస వెళ్తున్న కోసిగి గ్రామస్తులుకర్నూలు జిల్లాలో తుంగభద్ర, కృష్ణా ద్వారా సాగునీరు కల్పించే అవకాశం ఉన్నా ఆ దిశగా పాలకులు ఆలోచించని పరిస్థితి. కర్నూలు జిల్లా పాలకులు కూడా ఈ పాపంలో భాగస్వాములే. సిటీని పక్కన పెడితే ఆదోని, ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో సాగునీటి అవకాశాలు స్వల్పం. కేవలం వర్షాధారంపై ఆధారపడి మాత్రమే పంటలు సాగు చేస్తారు. వర్షాలు రాకపోతే కరువు బారిన పడాల్సిందే. బతికేందుకు ‘సుగ్గిబాట’ పట్టాల్సిందే. ఆదోని డివిజన్ నుంచి ఏటా లక్షల మంది బతికేందుకు కర్ణాటక, తెలంగాణ, కేరళతో పాటు కోస్తాంధ్ర ప్రాంతాలకు వెళతారంటే ఇక్కడ ఎంతటి దారుణ పరిస్థితులు ఉన్నాయో స్పష్టమవుతోంది. ఈ దిశగా ఆలోచించరేం! గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మిస్తే డిస్ట్రిబ్యూటరీలతో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ ప్రాంతం మొత్తానికి తాగు, సాగునీరు అందుతుంది. మన జిల్లాతో పాటు కేసీ కెనాల్ ద్వారా కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ జిల్లాలోని 2.65లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. తుంగభద్ర డ్యాం నుంచి ఏటా సగటున 200 టీఎంసీలు కిందకు వెళుతున్నా ఆ నీటిని మనం వినియోగించుకోలేకపోతున్నాం. 20.15 టీఎంసీల సామర్థ్యంతోగుండ్రేవుల నిర్మిస్తే కనీసం వరద రోజులతో కలిపి 40 టీఎంసీలకుపైగా నీటిని వినియోగించుకోచ్చు. 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించొచ్చు. ఊళ్లూ వదిలి.. -
నల్లమల.. వన్యప్రాణుల ఖిల్లా
ప్రకృతి అందాలకు నల్లమల అటవీ ప్రాంతం ఆలవాలమైంది. ఎటు చూసినా ఆకాశాన్నంటే చెట్లు, బెబ్బులి గర్జనలు, నెమళ్ల నాట్యాలు, అరుదైన పక్షుల కిలకిలా రావాలు, అటు నుంచి ఇటు పరిగెత్తే జింకలు, సెలయేళ్లు, పర్యాటక ప్రదేశాలకు నల్లమల అటవీ ప్రాంతం నెలవుగా మారింది. ప్రతి ఏడాది మార్చి 3న ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ప్రజలకు వణ్యప్రాణుల సంరక్షణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు.మార్కాపురం:నల్లమల అటవీ ప్రాంతం ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాల పరిధిలో సుమారు 6.50 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. ఈ అటవీ ప్రాంతంలో 87కు పైగా రాయల్ బెంగాల్ టైగర్లు, సుమారు 400 కు పైగా చిరుతలు తిరుగుతున్నాయి. వీటితోపాటు వందల సంఖ్యలో దుప్పులు, జింకలు, నీల్గాయ్లు, ఎలుగుబంట్లు ఉన్నాయి.వీటితోపాటు ఆకాశంలో 4 నుంచి 5 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ క్షణాల్లో భూమిమీద తిరిగే వన్యప్రాణులను తినే అరుదైన క్రస్టడ్ హక్ ఈగల్ (నల్లపాముల గద్ద), షార్టు టోడోస్ స్నేక్ఈగల్, హనీబజర్, క్రస్టడ్ సర్పెంట్ ఈగల్‌లు సంచరిస్తున్నాయి. ఇక రష్యా నుంచి 8 వేల కిలోమీటర్లు ప్రయాణించి నల్లమలకు వచ్చే మాన్టెగ్యూష్ హారియర్, పాలిడ్ హ్యారియర్ తదితర పక్షులకు కూడా నల్లమల ప్రాంతం నివాసంగా మారింది. మార్కాపురానికి చుట్టుపక్కల నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పెద్దదోర్నాల, పుల్లలచెరువు, యర్రగొండపాలెం, పెద్దారవీడు, అర్ధవీడు, గిద్దలూరు తదితర మండలాల్లో అటవీ సమీప గ్రామాలున్నాయి. పెద్దదోర్నాల మండలంలోని నల్లగుంట్ల, వై చర్లోపల్లి, తుమ్మలబైలు, శ్రీశైల శిఖరం, బొమ్మలాపురం, ఘాట్‌రోడ్డు, అర్ధవీడు మండలంలోని వెలగలపాయ, మాగుటూరు తాండ, గన్నెపల్లి, లక్ష్మీపురం, దొనకొండ, మార్కాపురం మండలం గొట్టిపడియ, పెద్దారవీడు మండలం గుండంచర్ల తదితర గ్రామాల సమీపాల్లోకి వన్యప్రాణులు తరచుగా వస్తుంటాయి. ముఖ్యంగా పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, నెమళ్లు సంచరిస్తున్నాయి. అటవీశాఖ అధికారులు వన్యప్రాణుల సంరక్షణకు అన్నీరకాల చర్యలు తీసుకుంటున్నారు. పెద్దపులులు, చిరుతలకు అడవిలోనే నీటి సమస్య లేకుండా సోలార్ సాసర్పిట్లు ఏర్పాటుచేసి అధికారులు నీటి సమస్య తీర్చారు. నల్లమల పరిధి పెరిగిపోతోంది. గతంలో ఏపీలోని ప్రకాశం, గుంటూరు, కర్నూల్, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ తదితర జిల్లాలతో అనుసంధానంగా ఉండగా ఇప్పుడు శేషాచలం అడవులను కలుపుతూ ఎన్ఎస్టీఆర్ (నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు), శేషాచలం అడవులను కలిపి టైగర్ కారిడార్ ఏర్పాటైంది. నల్లమల అడవిలోని పెద్దపులులు కడప మీదుగా వనిపెంట, ఒంటిమిట్ట తదితర ప్రాంతాల్లో ఉన్న శేషచలం అడవుల్లో కూడా సంచరిస్తున్నాయి. దీంతో నల్లమల పరిధి 8 వేల చదరపు కిలోమీటర్ల నుంచి 16 వేల చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 1000 మంది సిబ్బందిని, 85 బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. పులుల సంరక్షణకు తీసుకునే చర్యల వలన పులుల సంఖ్య పెరగడం విశేషం. ఆకట్టుకుంటున్న జంగిల్ సఫారీ..దోర్నాల నుంచి శ్రీశైలం మధ్య అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జంగిల్ సఫారీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జంగిల్ సఫారీని చూడొచ్చు. అటవీశాఖాధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో నల్లమల అటవీ ప్రాంతంలో సుమారు 25 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు. జింకలు, నెమళ్లు, పలురకాల పక్షిజాతులు కనిపిస్తాయి. ఇందులో పులికుంట వద్ద వ్యూ పాయింట్ వద్ద కాసేపు వాహనాన్ని ఆపుతారు. పెద్దపులులు, చిరుతలు ఇక్కడికి తరచుగా వచ్చి నీళ్లు తాగుతాయి. ఇక కొండ చిలువలు, పెద్ద పెద్ద చెట్లకు చుట్టుకుని కనిపిస్తాయి. జంగిల్ సఫారీ అద్భుతంనల్లమల అటవీ ప్రాంతంలో దోర్నాల నుంచి శ్రీశైలం మధ్యలో అటవీశాఖ వారు ఏర్పాటు చేసిన జంగిల్ సఫారీ చాలా అద్భుతం. విజ్ఞానంతోపాటు వినోదాన్ని కూడా అందిస్తుంది. ప్రతి ఒక్కరూ సెలవు రోజుల్లో పిల్లలను తీసుకుని జంగిల్ సఫారీకి వెళితే అన్నీ రకాల వన్యప్రాణులను మనం చూడవచ్చు. – జీఎల్ రమేష్ బాబు, టీచర్ మార్కాపురం -
సారా తయారీ మానుకుంటే ‘నవోదయం’
వెల్దుర్తి: బతుకుదెరువు కోసమని సారా తయారు చేస్తూ చివరకు పోలీసు స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగడంతోనే బతుకులను నాశనం చేసుకుంటున్నారని, తయారీ మానుకుంటేనే జీవితాల్లో నవోదయం వస్తుందని ఎకై ్సజ్ శాఖ ఉమ్మడి జిల్లా డిప్యూటీ కమిషనర్ పోతుల శ్రీదేవి అన్నారు. బుధవారం ఆమె మండలంలోని ఎల్.నగరం తండాలో అసిస్టెంట్ కమిషనర్ రావిపాటి హనుమంతరావు, సూపరింటెండెంట్ సుధీర్ బాబుతో కలిసి నవోదయం కార్యక్రమం నిర్వహించారు. అధికారులు గ్రామస్తులతో మమేకమై, వారి కుటుంబాలతో కలిసి మాట్లాడుతూ సారా తయారీ మానుకునే వారికి జీవనాధారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మానుకోకపోతే పీడీ యాక్టు నమోదుకు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. నాటు సారా తయారీ, అమ్మకం, తాగడం ద్వారా జరిగే అనర్థాలను గ్రామస్తులకు వివరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు దాదిపోగు సుంకన్న, ఏఈఎస్ రాజశేఖర్ గౌడ్, ఈఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్, కోడుమూరు ఎకై ్సజ్ సీఐ మంజుల, ఎస్ఐ చంద్రమోహన్ పాల్గొన్నారు. -
క్యాన్సర్ చికిత్సకు లీనాక్ మిషన్ ప్రారంభం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలో ఉన్న స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో క్యాన్సర్ చికిత్సలో భాగమైన లీనాక్ మిషన్‌ను బుధవారం మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్లో 80 శాతం వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇప్పటికే ఓపీ సేవలు, ఇన్‌పేషెంట్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, మరికొన్ని ఆపరేషన్ థియేటర్ పరికరాలు రావాల్సి ఉందన్నారు. అవి వచ్చిన వెంటనే త్వరలో ఆపరేషన్ థియేటర్ సేవలు కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్కే ప్రకాష్, సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ హేమనళిని పాల్గొన్నారు. -
ఆతిథ్య సేవలకు రేటింగ్
కర్నూలు(సెంట్రల్): ప్రభుత్వ నిబంధనల మేరకు పర్యాటక ఆతిథ్యాలకు స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ (ఎస్జీఎల్ఆర్) ఇవ్వాలని కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. పర్యాటకులకు అసౌకర్యం కలగకుండా ఎస్జీఎల్ఆర్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఆయన బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పర్యాటకులకు సౌకర్యాలు కల్పిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, హోమ్‌స్టేలు, ధర్మశాలలు, లాడ్జీలకు రేటింగ్‌ను ప్రకటించాలన్నారు. టాయిలెట్ సదుపాయాలు, తడి, పొడిచెత్తను వేరుచేసే విధానాలను పరిశీలించి రేటింగ్ ఇవ్వాలన్నారు. మునిసిపల్ కమిషనర్లు, డీపీఓలు ఈ అంశంపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే ఆతిథ్య సంస్థలకు జిల్లా, డివిజనల్ స్థాయిల్లో వర్కుషాపులు నిర్వహించాలని ఆర్డబ్ల్యూఎస్, టూరిజం, పంచాయతీ, అధికారులను ఆదేశించారు. దీనిపై మార్చి 31లోపు నివేదిక సమర్పించాలని ఆదోని సబ్‌కలెక్టర్ మౌర్య భరద్వాజ్, కర్నూలు, పత్తికొండ ఆర్డీఓలను ఆదేశించారు. జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావు, జిల్లా పర్యాటక శాఖ అధికారి విజయ, డీపీఓ భాస్కర్, ఏపీ టూరిజం కార్పొరేషన్ డిప్యూటీ మేనేజర్ సువర్ణ పాల్గొన్నారు. -
అహోబిలం.. బ్రహ్మోత్సవ వైభవం
ఆళ్లగడ్డ: శ్రీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు నాంది పులుకుతూ దిగువ అహోబిలంలో అంకురార్పణ కార్యక్రమాన్ని బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పది రోజుల పాటు ఎటువంటి ఆటంకాలు లేకుండా క్రతువులు జరగాలని శాస్త్రోక్తంగా విశ్వక్సేనుడికి అహోబిల మఠం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్, వేదపండితులు, అర్చకులు ఆరాధన చేశారు. అనంతరం తిరుమంజనం, స్వస్తివచనంతో పాటు ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా ముస్తాబుచేసి ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేశారు. వైష్ణవ ఆచారం ప్రకారం రాత్రివేళ వేదమంత్ర పఠనాలతో మృత్యుంగ్రహణం పర్వాన్ని చేపట్టారు. అనంతరం ఈశాన్యంలోని పుట్టమన్ను తెచ్చి నవధాన్యాలను నాటి బ్రహ్మోత్సవాలకు నాంది పలికారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువా రం తెల్లవారుజామున దిగువ అహోబిలంలో ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. అనంతరం భేరీ పూజ, రాత్రి సింహ వాహన సేవలు కొనసాగుతాయి. ఎగువ అహోబిలంలో.. బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గరుత్మంతుని చిత్రపటావిష్కరణ చేశారు. బుధవారం రాత్రి జ్వాలా నరసింహస్వామి సింహవాహనంపై అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు. సింహహనంపై కొలువైన స్వామికి అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. -
‘కూటమి’ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత
ఆదోని టౌన్: రాష్ట్రంలోని ‘కూటమి’ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శశికళ కృష్ణమోహన్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆదోని పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల్లో ఘోరంగా విఫలం చెందిందని విమర్శించారు. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కడమే లక్ష్యంగా పెట్టుకోవడం దారుణమన్నారు. ఆదోని పట్టణంలోని భీరప్పస్వామి దేవాలయ ఆవరణలో ఈనెల 8వ తేదీన మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు ఆమె తెలిపారు. అందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. దళిత మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీలక్ష్మి, మహిళా నాయకురాళ్లు శ్రీదేవి, సుగుణ, సుభాషిణి పాల్గొన్నారు. -
అప్పు కట్టలేదని రైతు బైకు స్వాధీనం
కర్నూలు(అగ్రికల్చర్)/చిప్పగిరి: పంటలు పండక, ప్రకృతి సహకరించక.. సరైన గిట్టుబాటు ధర లభించక రైతుల జీవనం దినదిన గండంగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం రైతులను ఏమాత్రం ఆదుకోకపోగా, వ్యవసాయాన్ని కష్టతరం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాల్సిన బ్యాంకులు సైతం రుణాల రికవరీ పేరిట ఆస్తులను జప్తు చేసేందుకు సిద్ధపడటం విమర్శలకు తావిస్తోంది. జిల్లా సహకార కేంద్రబ్యాంకు రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించింది. బుధవారం ఐదు ప్రత్యేక బృందాలు ఆలూరు, పత్తికొండ, డోన్ ప్రాంతాల్లో రుణాలు రికవరీకి రైతుల ఇళ్లకు వెళ్లారు. ఆరేడేళ్ల క్రితం డీసీసీబీ నుంచి రుణాలు తీసుకొని ఇంతవరకు ఒక్క కంతు కూడా చెల్లించకపోవడంతో వడ్డీ, అపరాధవడ్డీలతో అప్పు పేరుకుపోయిందని, వెంటనే చెల్లించాలని కోరారు. ఆలూరు బ్రాంచ్ పరిధిలోని చిప్పగిరి మండలం కుందనగుర్తి గ్రామానికి చెందిన ఓ రైతు 2016లో రూ.1.08 లక్షల అప్పు తీసుకోగా ఇప్పుడు వడ్డీతో కలిసి రూ.3 లక్షలు దాటింది. డీసీసీబీ జనరల్ మేనేజర్ పి.రామాంజనేయులు ఆధ్వర్యంలో టీమ్ రికవరీకి వెళ్లగా రైతు తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని వాపోయాడు. దీంతో అధికారులు రైతుకు చెందిన బైక్‌ను స్వాధీనం చేసుకుని సంబంధిత సొసైటీకి అప్పగించారు. కూటమి ప్రభుత్వంలో రైతుల దయనీయ స్థితికి ఆ ఘటన అద్దం పడుతోంది. -
లింగ సమానత్వంపై చిత్రలేఖన పోటీలు
కర్నూలు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని వారోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థినులకు లింగ సమానత్వంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. మహిళా చట్టాలు, పోక్సో చట్టం, సైబర్ నేరాలపై 5 రోజులుగా మహిళలు, విద్యార్థి నులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అత్యవసర సేవల కోసం పోలీస్ హెల్ప్‌లైన్ 100/112, ఉమెన్ హెల్ప్‌లైన్ 181, చైల్డ్ లైన్ నెంబర్ 1098ను సంప్రదించాలని అవగాహన సదస్సులో సూచిస్తున్నారు. -
ఉరుకుంద హుండీ ఆదాయం రూ.90.16లక్షలు
కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయం హుండీని బుధవారం స్థానిక కాలక్షేప మండపంలో లెక్కించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు, హుండీ పర్యవేక్షణ అధికారి వెంకటేశ్ ఆధ్వర్యంలో లెక్కింపు చేపట్టారు. 57రోజులకు సంబంధించి భక్తులు స్వామి వారికి నగదు రూపంలో రూ.90,16,666 సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వెండి 11కేజిల 20గ్రాములు, బంగారం 13 గ్రాములు వచ్చిందన్నారు. 8న జాతీయ లోక్ అదాలత్ కర్నూలు(సెంట్రల్): కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని వివిధ కోర్టుల్లో పెండింగ్‌లోని కేసుల పరిష్కారానికి ఈనెల 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.కబర్థి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జస్టిస్ పి.లీలా వెంకట శేషాద్రి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ లోక్ అదాలత్‌లో న్యాయ స్థానాల్లో పెండింగ్ ఉండి రాజీ పడేందుకు సిద్ధంగా ఉన్న సివిల్, క్రిమినల్, ప్రీలిటిగేషన్ కేసులను పరిష్కరించుకోవాలని బాధితులకు సూచించారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళా ఉద్యోగులకు నేడు, రేపు ప్రత్యేక సెలవులు కర్నూలు(అగ్రికల్చర్): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉద్యోగులకు ఈ నెల 6, 7 తేదీలను ప్రత్యేక సాధారణ సెలవులుగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా తేదీల్లో మహిళా ఉద్యోగులకు ఆటలు పోటీలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించే 8వ తేదీ రెండవ శనివారం కావడంతో సెలవు వస్తుంది. ఇటీవల ఏపీఎన్జీవో అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యవర్గం అధ్యక్షుడు వీసీహెచ్ వెంగళ్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు ఈనెల 6, 7 తేదీలను ప్రత్యేక సాధారణ సెలవులుగా ప్రకటించాలని కోరారు. ఆ మేరకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల వెంగళ్‌రెడ్డితో పాటు అసోసియేషన్ కార్యదర్శి కేసీహెచ్ కృష్ణుడు, నగరశాఖ అధ్యక్షుడు ఎంసీ కాశన్న, ఉమన్ వింగ్ నేత చందన తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. దూదేకొండలో టమాట ప్రాసెసింగ్ యూనిట్ కర్నూలు(అగ్రికల్చర్): పత్తికొండ మండలం దూదేకొండలో టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2.50 ఎకరాల్లో యూనిట్ ఏర్పాటుకు బుధవారం జీఓ విడుదల చేసింది. ఇందుకు కేంద్రం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద రూ.8 కోట్లు, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆపరేషన్ గ్రీన్ రూ.3 కోట్లు విడుదల చేయనుంది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులు వినియోగిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పత్తికొండ మండలం హోసూరు వద్ద టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయతలపెట్టింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. పనులు కూడా మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పనులు నిలిచిపోయాయి. తాజాగా దూదేకొండలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ఫేక్ కాల్స్ నమ్మొద్దు కర్నూలు(అర్బన్): మూడు చక్రాల వాహనాలు (స్కూటీ), ల్యాప్‌టాప్, ఇతర సహాయ పరికరాలు మంజూరు అయ్యాయని 9642076467, 6364506562, 6300090356 నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను నమ్మొద్దని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సహా య పరికరాలు అందించాలంటే కొంత డబ్బు ఫోన్‌పే చేయాలని కొందరు దివ్యాంగులను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి కాల్స్ వల్ల దివ్యాంగులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సహాయ పరికరాల సమాచారం కోసం తమ కార్యాలయ ఫోన్ నంబర్‌ను 08518–277864ను సంప్రదించాలన్నారు. రెగ్యులర్ సీఈగా కబీర్ బాషా కర్నూలు (సిటీ): కర్నూలు ప్రాజెక్ట్స్ ఇన్చార్జ్ సీఈగా పనిచేస్తున్న షేక్ కబీర్ బాషాకు పదోన్నతి కల్పించి రెగ్యులర్ సీఈగా నియమించారు. ఈయన ఎస్ఆర్బీసీ సర్కిల్–1 పర్యవేక్షక ఇంజినీర్‌గా పనిచేస్తూనే 2022 జులై 4వ తేదీ నుంచి ఇన్చార్జ్ సీఈగా పనిచేస్తున్నా రు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం పర్యవేక్షక ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఎంఎల్వీ వరప్రసాద్‌ను తెలుగుగంగ తిరుపతి చీఫ్ ఇంజినీర్‌గా నియమించారు. -
సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందజేయాల్సిన గ్రామ, వార్డు సచివాలయాలను బలహీన పరిచేందుకు ‘కూటమి’ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సమీపంలో ఉన్న రెండు, మూడు సచివాలయాలను ఒకే క్లస్టర్ కిందకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. గ్రూపింగ్ పేరుతో
● సమీప సచివాలయాల గ్రూపింగ్‌కు రంగం సిద్ధం ● రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు ● ఉద్యోగులను రెండు కేటగిరీలుగా విభజన ● మొదటి దశలో టెక్నికల్ ఫంక్షనీర్స్‌పై దృష్టి ● అనంతరం మల్టీపర్పస్ ఫంక్షనీర్స్కు కదలిక ● ప్రభుత్వ చర్యతో తిరిగి ప్రారంభం కానున్న రాజకీయ ఒత్తిళ్లు మళ్లీ అవే కష్టాలు గ్రామ/ వార్డు వ్యవస్థ ఆవిర్భావానికి ముందు మూడు, నాలుగు గ్రామాలకు ఒక్క పంచాయతీ కార్యదర్శి మాత్రమే ఉండేవారు. వ్యవసాయ అసిస్టెంట్లు ఎక్కడో ఉండేవారో తెలియని పరిస్థితి. అవసరాలకు అనుగుణంగా సర్వేయర్లు లేకపోవడంతో కూడా పలు మండలాల్లో ఇన్చార్జ్ సర్వేయర్లతో ప్రజలు ఇబ్బంది పడేవారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న సచివాలయాల క్లస్టర్ల విధానంతో పాత రోజులు పునరావృతం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రూపింగ్‌లో భాగంగా తీసుకోబోయే నిర్ణయాలతో ఆయా సచివాలయాల్లోని కీలకమైన ఉద్యోగులు రెండు, మూడు గ్రామాలకు ఒకరు ప్రకారం పనిచేయాల్సిన పరిస్థితులు మళ్లీ రానున్నాయి. గ్రామాల్లో సర్వేయర్ల సమస్య తీవ్రంగా వేధించే అవకాశం కూడా లేకపోలేదు. కర్నూలు(అర్బన్): ఎవరి సిఫార్సులు లేకుండా, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చారు. అప్పట్లో ఈ వ్యవస్థను పరిశీలించి వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు మెచ్చుకున్నారు. అయితే రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆదర్శ వ్యవస్థను ప్రజలకు దూరం చేసే కుట్ర చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. అందులో భాగంగానే సచివాలయాల గ్రూపింగ్ పేరుతో సమీపంలో ఉన్న రెండు, మూడు సచివాలయాలను ఒకే క్లస్టర్ కిందకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయా గ్రామ/వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే గ్రామ/వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను టెక్నికల్ ఫంక్షనీర్స్, మల్టీపర్పస్ ఫంక్షనీర్స్‌గా రెండు విభాగాలుగా విభజించారు. ప్రస్తుతం ప్రతి సచివాలయంలో అన్ని విభాగాలకు సంబంధించిన ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన క్లస్టర్ ప్రక్రియ పూర్తి అయితే ముందుగా టెక్నికల్ ఫంక్షనీర్స్‌గా గుర్తించిన ఉద్యోగులు ఒక్కొక్కరు రెండు లేక మూడు సచివాలయాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆయా కేటగిరిలకు చెందిన మిగిలిన ఉద్యోగులను ఖాళీగా ఉన్న ప్రాంతాలకు లేదా ఇతర శాఖలకు బదలాయించే అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. టెక్నికల్ ఫంక్షనీర్స్ ప్రక్రియ పూర్తి అయిన అనంతరం ఆయా సచివాలయాల పరిధిలోని జనాభాను అనుసరించి మల్టీపర్పస్ ఫంక్షనీర్స్‌పై దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. ఫంక్షనీర్స్ ఎవరంటే.. ● వీఆర్ఓ, సర్వే అసిస్టెంట్, ఏఎన్ఎం, అగ్రికల్చర్/హార్టికల్చర్ అసిస్టెంట్, పశుసంవర్ధశాఖ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్లను ప్రభుత్వం టెక్నికల్ ఫంక్షనీర్స్‌గా గుర్తించింది. ● మల్టీ పర్పస్ ఫంక్షనీర్స్‌గా పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీస్‌ను గుర్తించారు. మొదటి దశలో టెక్నికల్ ఫంక్షనీర్స్‌పై దృష్టి సచివాలయాల గ్రూపింగ్ పూర్తి అయిన వెంటనే టెక్నికల్ ఫంక్షనీర్స్ను కదలించే చర్యలు ప్రారంభం కానున్నాయి. ఒక సచివాలయంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇక నుంచి సమీపంలోని రెండు, మూడు సచివాలయాల్లో కూడా సేవలు అందించాల్సి ఉంటుంది. క్లస్టర్ పరిధిలోకి వచ్చిన రెండు, మూడు సచివాలయాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్లను జిల్లాలో ఎక్కడైనా ఆ పోస్టులు ఖాళీగా ఉంటే అక్కడికి బదిలీ చేయవచ్చు. ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాల్లోనైనా వీరి సేవలను ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి. టెక్నికల్ ఫంక్షనీర్స్ ప్రక్రియ పూర్తి అయిన అనంతరం ఇదే విధానాన్ని మల్టీపర్పస్ ఫంక్షనీర్స్‌గా గుర్తించి ఉద్యోగులకు కూడా వర్తింప చేయనున్నారు. రాజకీయ ఒత్తిళ్లు ప్రారంభం ప్రభుత్వం తీసుకున్న సచివాలయాల గ్రూపింగ్ విధానంలో రాజకీయ ఒత్తిళ్లు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తమకు ఇష్టం లేని వారిని సుదూర ప్రాంతాలకు, ఇతర ఇంజినీరింగ్ విభాగాలకు పంపించాలని టీడీపీ నేతలు.. సంబంధిత అధికారులపై ఒత్తిడి చేసే ప్రమాదం ఉంటుంది. ఉద్యోగుల బదిలీల్లో భాగంగా గత నాలుగు నెలల క్రితం ఇతర ప్రభుత్వ శాఖల్లో నిర్వహించిన విధంగానే సచివాలయ ఉద్యోగులను బదిలీ చేశారు. తిరిగి ఇప్పుడు సచివాలయాల గ్రూపింగ్ పేరుతో ఉద్యోగులను ఇబ్బంది పెడితే రాజకీయ నాయకులకు మరోసారి అవకాశం కల్పించినట్టవుతుందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. కోడుమూరు మండలం పులకుర్తి గ్రామ సచివాలయంగత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో జీరో వేకెన్సీకి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు. ఆయా శాఖల్లో ఖాళీ అయిన ఉద్యోగాల భర్తీకి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. గ్రామ/ వార్టు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 1,969 పోస్టుల భర్తీకి మూడో విడత నోటిఫికేషన్ జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రక్రియకు అప్పట్లో బ్రేకులు పడ్డాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపడుతున్న హేతుబద్దీకరణ పూర్తయితే కొత్త పోస్టుల భర్తీ లేనట్టే అని స్పష్టమవుతోంది. రెండు రోజుల్లో గ్రూపింగ్ పూర్తి చేయాలని ఆదేశాలు ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి గ్రామ/వార్డు సచివాలయాల గ్రూపింగ్‌ను రెండు రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ద్వారా జిల్లాలోని అందరు ఎంపీడీఓలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ఎలా గ్రూపింగ్ చేయాలి, వాటి మార్గదర్శకాలకు సంబంధించిన సూచనలను ఎంపీడీఓలకు తెలియజేశాం. గ్రూపింగ్ పూర్తి అయితే సచివాలయాలు అక్కడే ఉంటాయి, కాకపోతే ఉద్యోగులకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. సమీపంలోని రెండు లేదా మూడు సచివాలయాలను ఒక క్లస్టర్ కిందకు తీసుకువస్తాం. – జీ నాసరరెడ్డి, జెడ్పీ సీఈఓ, జీఎస్‌డబ్ల్యూఎస్ జిల్లా నోడల్ అధికారి సచివాలయ ఉద్యోగుల వివరాలు జిల్లా సచివాలయాలు మంజూరైన పోస్టులు విధులు నిర్వహిస్తున్న వారు ఖాళీలు కర్నూలు 672 5,738 4,256 1,482 నంద్యాల 516 4,297 3,810 487 మొత్తం: 1,188 10,035 8,066 1,969 -
హదీస్ వెలుగు :
‘రంజాన్ ఉపావాస దీక్ష మనిషిలోని అహాన్ని తొలగించి.. ఆధ్యాత్మికత, మంచి నడవడికను నేర్పుతుంది. వీటిని తప్పనిసరిగా పాటించి అల్లాహ్ అనుగ్రహం పొందండి.’ – పవిత్ర ఖురాన్ ఇఫ్తార్ సహెర్ కర్నూలు సాశ్రీశ్రీ 6:31 ఉశ్రీశ్రీ 5:10 ఆదోని సాశ్రీశ్రీ 6:30 ఉశ్రీశ్రీ 5:12 నంద్యాల సాశ్రీశ్రీ 6:28 ఉశ్రీశ్రీ 5:10 ఆత్మకూరు సాశ్రీశ్రీ 6:27 ఉశ్రీశ్రీ 5:05 బనగానపల్లె సాశ్రీశ్రీ 6:30 ఉశ్రీశ్రీ 5:07 -
మహిళలకు ఉచిత వైద్యశిబిరం
కర్నూలు(అగ్రికల్చర్): అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మహిళా ఉద్యోగులు, మహిళా ఖాతాదారులు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించినట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) రీజినల్ ఆఫీసు హెడ్ పి.నరసింహరావు తెలిపారు. సాధారణ ఆరోగ్య సమస్యలకు ఓమిని హాస్పిటల్ వైద్యులు, దంత సమస్యలపై స్మైల్ డెంటల్ కేర్ డాక్టర్లు, కంటి సమస్యలకు సుశీల నేత్రాలయ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ హెడ్స్ సురేంద్రగౌడు, ఎన్వీ అనంతకుమర్ పాల్గొన్నారు. -
అప్పు కట్టలేదని రైతు బైకు స్వాధీనం
కర్నూలు(అగ్రికల్చర్)/చిప్పగిరి: పంటలు పండక, ప్రకృతి సహకరించక.. సరైన గిట్టుబాటు ధర లభించక రైతుల జీవనం దినదిన గండంగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం రైతులను ఏమాత్రం ఆదుకోకపోగా, వ్యవసాయాన్ని కష్టతరం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాల్సిన బ్యాంకులు సైతం రుణాల రికవరీ పేరిట ఆస్తులను జప్తు చేసేందుకు సిద్ధపడటం విమర్శలకు తావిస్తోంది. జిల్లా సహకార కేంద్రబ్యాంకు రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించింది. బుధవారం ఐదు ప్రత్యేక బృందాలు ఆలూరు, పత్తికొండ, డోన్ ప్రాంతాల్లో రుణాలు రికవరీకి రైతుల ఇళ్లకు వెళ్లారు. ఆరేడేళ్ల క్రితం డీసీసీబీ నుంచి రుణాలు తీసుకొని ఇంతవరకు ఒక్క కంతు కూడా చెల్లించకపోవడంతో వడ్డీ, అపరాధవడ్డీలతో అప్పు పేరుకుపోయిందని, వెంటనే చెల్లించాలని కోరారు. ఆలూరు బ్రాంచ్ పరిధిలోని చిప్పగిరి మండలం కుందనగుర్తి గ్రామానికి చెందిన ఓ రైతు 2016లో రూ.1.08 లక్షల అప్పు తీసుకోగా ఇప్పుడు వడ్డీతో కలిసి రూ.3 లక్షలు దాటింది. డీసీసీబీ జనరల్ మేనేజర్ పి.రామాంజనేయులు ఆధ్వర్యంలో టీమ్ రికవరీకి వెళ్లగా రైతు తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని వాపోయాడు. దీంతో అధికారులు రైతుకు చెందిన బైక్‌ను స్వాధీనం చేసుకుని సంబంధిత సొసైటీకి అప్పగించారు. కూటమి ప్రభుత్వంలో రైతుల దయనీయ స్థితికి ఆ ఘటన అద్దం పడుతోంది. -
భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం
ఆదోని టౌన్: భారీగా కర్ణాటక మద్యాన్ని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరా వు తెలిపిన వివరాలు.. ఆలూరు నుంచి బొలేరో వా హనంలో 80 బాక్సులు కర్ణాటక టెట్రా ప్యాకెట్ల లోడుతో ఆదోనికి వస్తుండగా మహాయోగి లక్ష్మమ్మ ఆర్చ్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.3.50 లక్షల దాకా ఉంటుందని అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. కర్ణాటక మద్యం తరలిస్తున్న బాషా,అజయ్కుమార్లను అదుపులోకి తీసుకోగా, నాగిరెడ్డి పరార్ అయ్యాడన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సంగాల గ్రామ సమీపంలో .. ఆలూరు రూరల్: అక్రమంగా తరలుతున్న కర్ణాటక మద్యాన్ని మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ సీఐ లలిత తెలిపిన వివరాలు.. చిప్పగిరి మండలం సంగాల గ్రామ సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఆలూరు మండలం మొలగవల్లి గ్రామానికి చెందిన ఎరుకల కృష్ణ స్కూటర్‌పై వెళ్తుండగా ఆపి తనిఖీ చేశారు. 7 బాక్సుల కర్ణాటక మద్యం 672 టెట్రా ప్యాకెట్లు (90 ఎంఎల్) గుర్తించి స్వాఽధీనం చేసుకున్నారు. స్కూటర్ సీజ్ చేసి, నిందితుడు కృష్ణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తనిఖీలో ఎస్ఐ నవీన్‌బాబు, సిబ్బంది మాలవ్య, సూర్యప్రకాష్, లక్ష్మమ్మ సోమేష్ పాల్గొన్నారు. -
● గత నెల 26న ఏడేళ్ల బాలిక మృతి ● చికిత్స పొందుతున్న మరో ఇద్దరు చిన్నారులు ● గత ఏడాది జిల్లాలో 306 కేసులు ● ఈ ఏడాది రెండు నెలలకే 35 కేసులు ● దోమలు విజృంభిస్తున్నా చర్యలు తీసుకోని అధికారులు
● గోనెగండ్ల మండలంలోని కులుమాల గ్రామంలో ఇటీవల ఓ మహిళకు డెంగీ జ్వరం రావడంతో కర్నూలులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించడంతో కోలుకుంది. విషయం తెలుసుకున్న మలేరియా అధికారులు గ్రామంలో వైద్య సిబ్బందితో కలిసి అవసరమైన చర్యలు చేపట్టారు. ● పెద్దకడబూరు మండలం నౌలేకల్లు గ్రామానికి చెందిన అక్షయ(7) అనే బాలిక గత నెల 26న డెంగీ జ్వరంతో బాధపడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఇదే జ్వరం పాప అక్కలైన సిరివెన్నెల(12), సింధుప్రియ(9)లకు కూడా సోకింది. వారు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. చర్యలు చేపడుతున్నాం మలేరియా సిబ్బంది ద్వారా దోమల నివారణకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. వీరితో పాటు ఆశ, ఏఎన్ఎంలు ఇంటింటి సర్వే నిర్వహించి జ్వరపీడితులుంటే రక్తపూతల పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో పాజిటివ్ వస్తే ఎలీసా టెస్ట్‌కు పంపిస్తున్నాం. అక్కడ కూడా పాజిటివ్ వస్తేనే డెంగీగా నిర్ధారించి నివారణ చర్యలు చేపడుతున్నాం. –నూకరాజు, జిల్లా మలేరియా అధికారి, కర్నూలు కర్నూలు(హాస్పిటల్): డెంగీ జ్వరం పేరు చెబితేనే దీని గురించి తెలిసిన వారితో పాటు సామాన్యులకూ వెన్నులో వణుకుపుడుతోంది. చిన్నదోమ కారణంగా వచ్చే ఈ వ్యాధి లక్షణాలతో బాధితులు ఆసుపత్రులకు వెళ్తున్నారు. రక్తంలో ప్లేట్లెట్లు తగ్గుతుంటే రోగుల సహాయకుల్లో మరింత ఆందోళన పెరుగుతోంది. ఎలాగైనా రోగిని ప్రాణాలతో దక్కించుకోవాలని అప్పులు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇదే సమయంలో సాధారణ జ్వరానికి సైతం కొందరు వైద్యులు, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు డెంగీ పేరుతో రోగులను దోచుకుంటున్నాయి. కర్నూలు జిల్లా జనాభా 2024 సంవత్సర అంచనాల ప్రకారం 24.49లక్షలు. ఇందులో 12.31లక్షలు పురుషులు, 12.18లక్షలు సీ్త్రలు ఉన్నారు. వైద్యపరంగా జిల్లాలో ఒక ప్రభుత్వ, ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా బోధనాసుపత్రులున్నాయి. వీటితో పాటు ఒక ఏరియా ఆసుపత్రి, ఐదు కమ్యూనిటి హెల్త్ సెంటర్లు, ఒక మాతాశిశు సంరక్షణ కేంద్రం, 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కొత్తగా మరో 12 పీహెచ్‌సీలు, 28 అర్బన్ హెల్త్ సెంటర్లు, 502 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఉన్నాయి. వీటితో పాటు 150కి పైగా ప్రైవేటు ఆసుపత్రులు, మరో 300 దాకా క్లినిక్‌లు ఏర్పాటయ్యాయి. ఆయా ఆసుపత్రుల్లోని వైద్యుల వద్దకు సీజనల్ వారీగా ప్రతిరోజూ జ్వరపీడితులు చికిత్స కోసం వస్తుంటారు. ఒకప్పుడు వర్షాకాలంలో మాత్రమే దోమల ద్వారా వ్యాప్తి చెందే మలేరియా, డెంగీ, చికున్‌గున్యా జ్వరాలు వచ్చేవి. ఇప్పుడు ఏడాది పొడవునా ఈ కేసులు నమోదవుతున్నాయి. గతంలో చాలా అరుదుగా నమోదయ్యే డెంగీ కేసులు కాస్తా ఇప్పుడు ప్రతి నిత్యం నమోదవుతూనే ఉన్నాయి. డెంగీకి సీజన్‌తో పనిలేకుండా అన్ని సీజన్లలో కేసులు నమోదవుతుండటంతో అధికారులు, వైద్యుల్లోనూ ఆందోళన నెలకొంది. తాజాగా పెద్దకడుబూరు మండలం నౌలేకల్లు గ్రామంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లకు ఈ వ్యాధి సోకగా ఒక బాలిక మృతి చెందింది. దీంతో గ్రామంలో మలేరియా అధికారులు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వారానికి మించి నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆలూరు, కోడుమూరు, మంత్రాలయం నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండల కేంద్రాలు, గ్రామా ల్లో పారిశుద్ధ్యం కొరవడింది. గత కొంత కాలంగా ఎక్కడ చూసినా మురుగునీరు నిలిచిపోవడంతో దోమలు పెరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు మురుగుకాల్వలు శుభ్రం చేయకపోవడం, అందులో వ్యర్థాలు వేయడంతో నీరు నిలిచిపోయి దోమలు పెరిగేందుకు ఆవాసంగా మారాయి. దీనికితోడు గ్రామాలు, పట్టణాల్లోని మురికివాడల్లో నీటి కొరత కారణంగా ప్రజలు నీటిని తొట్లలో నిల్వ చేసుకుంటున్నారు. నెలల తరబడి వాటిని శుభ్రం చేయకపోవడంతో అందులో లార్వా పెరిగి దోమలుగా మారు తున్నాయి. ఈ విషయమై వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అవగాహన కల్పించడంలో విఫలం అ య్యా యనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మొక్కుబడిగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ●డెంగీకారక ఏడిస్ ఈజిప్ట్ దోమ కేవలం పగలు మాత్రమే కుడుతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో శరీరాన్ని పూర్తిగా కవర్ చేసేలా దుస్తులు ధరించాలి. చిన్నపిల్లల ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. ● దోమతెరలు, జాలీలు వాడాలి, దోమలను చంపే క్రీములు, స్ప్రేలు వాడాలి. ● ఇంటిలో, ఇంటి ఆవరణలో నీళ్ల కుండీలు, ఓవర్‌హెడ్ ట్యాంకుల్లో, బావులపై దోమలు గుడ్లు పెట్టకుండా మూతలు అమర్చాలి. ● పనికిరాని సీసాలు, డబ్బాలు, రబ్బరుటైర్లు, వాటర్ కూలర్లు వంటి పాత్రల్లో నీరు నిల్వ లేకుండా చూడాలి. శ్రీమఠం.. శోభాయమానం డెంగీ పేరుతో దోపిడీ చాలా వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపతుల్లో ర్యాపిడ్ టెస్ట్ ద్వారా డెంగీ నిర్ధారణ అయిన వెంటనే లక్షణాలను బట్టి చికిత్స ప్రారంభిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ మాత్రం ర్యాపిడ్ టెస్ట్‌లో పాజిటివ్ రిపోర్ట్ వస్తే తమకు సమాచారం అందించాలని, ఈ మేరకు రక్తం సీరా తీసి కర్నూలు, ఆదోనిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎలీసా టెస్ట్ చేయించాలని చెబుతున్నారు. అక్కడి నివేదిక ఆధారంగానే డెంగీ వ్యాధిగా ఆసుపత్రులు ప్రకటించాలని చెబుతున్నారు. ఎలీసా టెస్ట్ రిపోర్టు రావాలంటే వారం, పదిరోజుల సమయం పడుతోందని, అప్పటి వరకు చికిత్స చేయకుండా ఎలాగని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అదనుగా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు మాత్రం ప్రతి సాధారణ జ్వరాన్ని డెంగీ లక్షణాలుగా పేర్కొంటూ రోగులను దోచుకుంటున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా తప్పించుకోవాలి అవగాహన కను‘మరుగు’ ఏడాది పొడవునా డెంగీ కేసులు తీవ్రమైన తలనొప్పి, కళ్లు, కండరాలు, కీళ్లనొప్పులు ఉంటాయి. ఒంటిపై ఎర్రటి దురదలు కనిపిస్తాయి. ముక్కు, చిగుళ్లల్లో రక్తం స్రవిస్తుంది. డెంగీ లక్షణాలు -
రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు
కర్నూలు(అగ్రికల్చర్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సీఎస్ఎస్–ఎస్ఎంఏఎం కింద రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రపరికరాల పంపిణీ చేయడానికి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఏ యంత్ర పరికరాలు ఇస్తారు.. యూనిట్ కాస్ట్ ఎంత, సబ్సిడీ వివరాలను వ్యవసాయ శాఖ విడుదల చేసింది. ఏపీ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీ ఆగ్రోస్) యంత్రపరికరాలను సరఫరా చేస్తోంది. కర్నూలు జిల్లాకు 1,660 యూనిట్లు మంజూరయ్యాయి. వీటికి సబ్సిడీ కింద రూ.2.87 కోట్లు మంజూరు చేసింది. నంద్యాల జిల్లాకు 1,635 యూనిట్లు మంజూరు చేయగా.. సబ్సిడీ రూ.2.85కోట్లు మంజూరు చేసింది. సబ్సిడీలో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరిస్తుంది. రైతులు స్థానిక రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. శాసీ్త్రయ ఆవిష్కరణలపై దృష్టి సారించాలికర్నూలు సిటీ: శాసీ్త్రయ నూతన ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి సారించాలని డీఈఓ ఎస్.శామ్యూల్‌పాల్ అన్నారు. జాతీయ సైన్స్ వారోత్సవాల సందర్భంగా మంగళవారం ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాస్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్ఈ)లో జిల్లాలోని వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. ‘వికసిత్ భారత్ కోసం సైన్స్, ఆవిష్కరణలలో ప్రపంచ నాయకత్వం కోసం భారతీయ యువతకు సాధికారత’’ అనే అశంపై క్విజ్, వ్యాసరచన, పోస్టర్ ప్రదర్శన, సెమినార్ నిర్వహించారు. డీఈఓ ఎస్.శామ్యూల్‌పాల్ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. విద్యార్థులు ప్రతి అంశాన్ని పరిశోధనాత్మకంగా చదవాలని, శాసీ్త్రయతను పెంచుకోని సరికొత్త ఆవిష్కరణలను తయారు చేయాలన్నారు. విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రిన్సిపాల్ ఆర్.ఆదినారాయణ రెడ్డి, సైన్స్ కో–ఆర్డినేటర్ రంగమ్మ పాల్గొన్నారు. -
వేతనాలు ఎగ్గొట్టి.. కూలీల కడుపుకొట్టి!
కర్నూలు(అగ్రికల్చర్): అడిగిన వారందరికీ ఉపాధి కల్పిస్తామని చెబుతున్న అధికారులు వేతనాల చెల్లింపుల విషయంలో నోరు మెదపని పరిస్థితి. జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారుల మాటలు నమ్మి రెక్కలు ముక్కలు చేసుకున్న కూలీలు ప్రస్తుతం ఆకలితో అలమటిస్తున్నారు. రోజులు, వారాలు.. నెలలు గడుస్తున్నా వేతనాలు దక్కకపోవడంతో కూలీలు దిక్కుతోచని స్థితిలో వలస బాట పడుతున్నారు. జనవరి 13 తర్వాత నుంచి ఎలాంటి చెల్లింపులు చేయకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కారణంగా మహాశివరాత్రి, తిరుణాలను కూడా చేసుకోలేకపోయినట్లు ఉపాధి కూలీలు ఆవేదన చెందుతున్నారు. కర్నూలు జిల్లాలోని పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, పెద్దకడుబూరు, హాలహర్వి, ఆలూరు, ఆదోని, కోసిగి, దేవనకొండ, హొలగొంద, ఆస్పరి, నంద్యాల జిల్లాలోని డోన్, ప్యాపిలి, ఆదోని తదితర మండలాలకు ఉపాధి పనులే ఆధారం. జనవరి రెండవ వారం నుంచి ఇప్పటి వరకు ఉపాధి కూలీలకు ఒక్క రూపాయి వేతనం కూడా చెల్లించిన దాఖలాలు లేవు. కర్నూలు జిల్లాలో ఉపాధి కూలీలకు దాదాపు రూ.25 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.21 కోట్ల మేర బకాయిలు ఉండటం గమానార్హం. ఉమ్మడి జిల్లాలో లేబర్ కాంపోనెంటు కింద రూ.84 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతానికి సంబంధించిన బకాయిలే దాదాపు 75 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. నంద్యాల జిల్లాలో డోన్ నియోజక వర్గంలో వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతులకు ఉపాధి పనులే ఆధారం. వ్యవసాయ పనులు లేని సమయంలో వారాల తరబడి వేతనాలు లేకపోవడంతో బతుకు భారమై కూలీలు వలస బాట పడుతున్నారు. పడిపోతున్న కూలీల హాజరు ప్రస్తుతం రోజుకు కర్నూలు జిల్లాలో లక్ష మందికి పని దినాలు కల్పించాలనేది లక్ష్యం. కానీ రోజుకు 50వేల మంది కూడా ఉపాధి పనులకు హాజరు కాని పరిస్థితి. దొంగ మస్టర్లు వేస్తుండటం వల్ల ఈ సంఖ్య కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నంద్యాల జిల్లాలో హాజరు మరింత దయనీయంగా మారింది. జనవరి నుంచి ఉపాధి పనులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కూలీలకు వారం వారం వేతనాలు చెల్లిస్తేనే హాజరు కూడా మెరుగవుతుంది. బకాయిలు భారీగా ఉండటంతో వేతనాలు ఇవ్వని ఉపాధి పనులు మాకొద్దు అనే పరిస్థితి ఏర్పడింది. మెటీరియల్ పనులకు పేమెంట్లు బంద్ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీడీపీ కార్యకర్తల కోసం ఉపాధి నిధులతో సీసీ రోడ్లు, పశువుల షెడ్లు నిర్మిస్తోంది. కర్నూలు జిల్లాలో సీసీ రోడ్లు 900 మంజూరు కాగా 825 పూర్తయ్యాయి. పశువుల షెడ్లు 950 మంజూరు కాగా 630 పూర్తి చేశారు. జనవరి 13 నుంచి మెటీరియల్ పనులకు కూడా పేమెంట్లు నిలిచిపోయాయి. మెటీరియల్ కింద కర్నూలు జిల్లాలో రూ.46 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.38 కోట్ల బకాయి ఉంది. ఉపాధి కూలీల వేతనాలకు కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు విడుదల చేస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను ఉపాధి కూలీలకు చెల్లించకుండా ఇతర అవసరాలకు మళ్లించడం వల్లే బకాయిలు పేరుకుపోయినట్లు తెలుస్తోంది. మార్చి మొదటి వారంలో నిధుల విడుదల జిల్లాలో లేబర్ కాంపోనెంటు కింద దాదాపు రూ.25 కోట్లు, మెటీరియల్ కింద రూ.46 కోట్లు చెల్లించాల్సి ఉంది. మార్చి నెల మొదటి వారంలో ఉపాధి కూలీల బ్యాంకు ఖాతాలకు వేతనాలు జమ అయ్యే అవకాశం ఉంది. వేతనాల విషయంలో కూలీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – వెంకటరమణయ్య, ప్రాజెక్టు డైరెక్టర్, డ్వామా, కర్నూలు ఉపాధి బకాయిలు రూ.130 కోట్లు గత జనవరి 13 నుంచి నిలిచిపోయిన చెల్లింపులు మెటీరియల్ పనులకు నిలిచిపోయిన పేమెంట్లు ఆందోళన చెందుతున్న కూలీలు ఉపాధి పనులకు తగ్గిన హాజరు విధిలేని పరిస్థితుల్లో వలసబాట -
టీడీపీ నేత గోడౌన్లో అక్రమ బియ్యం పట్టివేత
● 256 సంచుల బియ్యం సీజ్ ఆళ్లగడ్డ: పట్టణ శివారులోని టీడీపీ నేత గోడౌన్లో అక్రమంగా నిలువ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు సీజ్ చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు, బియ్యం డాన్‌గా పేరొందిన శివకుమార్‌పై కేసు నమోదు చేసిన ఘటన మంగళవారం నియోజవర్గంలో చర్చనీయాంశమైంది. పట్టణ శివారులోని చిన్నకందుకూరు గ్రామ రహదారిలో ఓ గోడౌన్‌ను టీడీపీ నేత బాడుగకు తీసుకుని నియోజకవర్గ వ్యాప్తంగా సేకరించిన రేషన్ బియ్యం నిల్వ ఉంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంటారని సమాచారం. ఈ క్రమంలో బుధవారం గోడౌన్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమంగా నిలువ ఉంచారని పోలీసులకు సమాచారం అందడంతో డీఎస్పీ ప్రమోద్ ఆదేశాల మేరకు పట్టణ ఎస్ఐ నగీన నంద్యాల పౌరసరఫరాల అధికారులకు సమాచారం ఇచ్చి గోడౌన్‌పై దాడులు నిర్వహించారు. దాడుల్లో 256 సంచుల రేషన్ బియ్యం నిలువ ఉంచినట్లు గుర్తించి రేషన్ బియ్యం, గోడౌన్ సీజ్ చేశారు. నిల్వ చేసిన వ్యక్తి పట్టణానికి చెందిన శివకుమార్ అని నిర్ధారణ కావడంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నగీన తెలిపారు. -
బాల్య వివాహాలను అరికట్టండి
ఓర్వకల్లు: బాల్య వివాహాలను అరికట్టాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శాంతికళ సూచించారు. ఆమె మంగళవారం మండలంలోని నన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలోని మౌలిక వసతులు, మందులు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్న వయస్సులోనే ఆడపిల్లలకు పెళ్లి చేయడం వల్ల వచ్చే అనర్థాలను వివరించారు. బాలికలకు శారీరక ఎదుగుదల, చదువు, పోషకాహారం ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని సూచించారు. శారీరకంగా, మానసికంగా ఎదిగిన తర్వాతే వివాహాలు జరిపించాలని, చిన్నతనంలో వివాహం చేయడం వల్ల త్వరగా గర్భం దాల్చడం, తద్వారా కలిగే ప్రమాదకర పరిస్థితులు, తల్లీబిడ్డ మరణం ముప్పు పెరిగే అవకాశాలున్నాయని, అలా జరగకుండా తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆరోగ్య కార్యకర్తలకు, ఆశావ ర్కర్లను ఆదేశించారు. గర్భిణుల వివరాలను సకాలంలో ఆర్సీహెచ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ ఆళ్లగడ్డ: అహోబిలంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి మఠం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్రమహా దేశికన్ పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టారు. ఎగువ అహోబిలంలోని శ్రీ జ్వాలా నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విష్వక్సేనుడికి తల పాగా చుట్టి పల్లకీలో కొలువుంచి ఆలయం వెలుపలకు తోడ్కొని వచ్చారు. ఈ బ్రహ్మోత్సవాలకు పర్యవేక్షుకుడిగా విష్వక్సేనుడు వ్యవహరిస్తారు. అనంతరం పుట్టమన్ను తెచ్చి అంకుర హోమం నిర్వహించి సోమకుంభ స్థాపన చేశారు. బ్రహ్మోత్సోవాల్లో భాగంగా బుధవారం ఎగువ అహోబిలంలో ధ్వజారోహణ కార్యక్రమం, దిగువ అహోబలంలో బ్రహ్మోత్సవ వేడుకలకు అంకురార్పణ పూజలు చేపట్టనున్నారు. -
క్లస్టర్ యూనివర్సిటీ వీసీకి వీడ్కోలు సన్మానం
కర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీ వీసీగా పని చేస్తు న్న ఆచార్య డీవీఆర్ సాయిగోపాల్ పదవీ కాలం ముగియడంతో మంగళవారం వర్సిటీ అనుబంధ కాలేజీ సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజీలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు, రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్‌కుమార్, మాజీ రిజిస్ట్రార్ శ్రీనివాసులు పా ల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య డీవీఆర్ సాయిగోపాల్ మాట్లాడుతూ క్లస్టర్ యూనివర్సిటీకి మొదటి వీసీగా పని చేయడం సంతోషంగా ఉందన్నారు. వీసీ ఆచార్య డీవీఆర్ సాయిగోపాల్, వాసంతి దంపతుల ను ఘనంగా సన్మానించారు. వీసీ నేను నా ఆత్మకథ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో వర్సి టీ అనుబంధ కాలేజీల ప్రిన్సిపాళ్లు డాక్టర్ ఎం ఇందిరాశాంతి. డాక్టర్ వీవీఎస్ కుమార్, చంద్రశేఖర్ కల్కూర, రచయిత రమణయ్య పాల్గొన్నారు. -
కేసీ కెనాల్ వాటా నీటిని విడుదల చేయండి
● టీబీ బోర్డు కార్యదర్శికి లేఖ రాసిన ఈఎన్సీ కర్నూలు సిటీ: తుంగభద్ర జలాశయంలోని నిల్వ నీటిలో కర్నూలు–కడప కాలువ కోటాగా కేటాయించిన నీటిలో నుంచి విడుదల చేయాలని కోరుతూ జల వనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు మంగళవారం టీబీ డ్యాం సెక్రటరీకి లేఖ రాశారు. ఈ ఏడాది టీబీ డ్యాంలో నీటి చేరికలను బట్టి కేసీకి 9.4 టీఎంసీలు కేటాయించారు. ఇందులో అక్టోబరులోపు కేసీ కెనాల్ వాటా నీటికి ఇండెంట్ పెట్టకపోవడంతో 1 టీఎంసీ నీరు పక్క జిల్లాకు మళ్లించారు. ఆ తరువాత ఒక టీఎంసీ ఒకసారి, మరో టీఎంసీ, ఇటీవల అర టీఎంసీ నీటిని అనంతపురం హెచ్చెల్సీకి మళ్లించారు. మొత్తం 3.5 టీఎంసీ మళ్లించగా మిగిలిన నీటిలో జనవరి నెలలో 2.5 టీఎంసీల నీటిని టీబీ డ్యాం నుంచి వినియోగించారు. మిగిలిన నీటి నుంచి గత నెల 15 నుంచి నెలాఖరు వరకు రోజుకు 2 వేల క్యూసెక్కుల చొప్పున 1.73 టీఎంసీ నీటిని తీసుకోగా, మిగిలిన నీటిలో నుంచి 1.61 టీఎంసీల నీటిని నేటి(బుధవారం)నుంచి 2,500 క్యూసెక్కుల చొప్పున 8 రోజుల పాటు విడుదల చేయాలని టీబీ బోర్డు కార్యదర్శిని ఏపీ ఈఎన్సీ లేఖ ద్వారా కోరారు. టీబీ డ్యాంలో తెలంగాణలోకి ఆర్డీఎస్ కాలువ కోటాగా 1.057 టీఎంసీల నీరు ఉంది. ఈ నీటిని నేటి నుంచి డ్యాం నుంచి విడుదల చేయాలని బోర్డుకు లేఖ రాశారు. దీంతోనే ఏపీ జల వనరుల శాఖ ఇంజినీర్లు సైతం ఆర్డీఎస్ కోటాతో కలిసి కేసీ కోటా నీరు విడుదల చేస్తే నీరు వృథా కాకుండా ఉంటుందనే ఉద్దేశంతోనే కోటా నీటికి ఇండెంట్ పెట్టారు. కేసీ కెనాల్ పరిధిలో 90,200 ఎకరాల ఆయకట్టు సాగులో ఉంది. ప్రస్తుతం సుంకేసుల బ్యారేజీ, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా కూడా నీటి విడుదల నిలిచిపోయింది. మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి మాత్రమే 675 క్యూసెక్కుల నీటిని కేసీకి పంపింగ్ చేస్తున్నారు. వాస్తవానికి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి సైతం నీటిని పంపింగ్ చేసేందుకు శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి మట్టం ఉన్నప్పటికీ ఇంజినీర్లు నీటిని పంపింగ్ చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
కేఎంసీలో చదవడం గర్వకారణం
● అడిషనల్ డీఎంఈ డాక్టర్ రఘునందన్ కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసించడం గర్వకారణమని అకడమిక్ డీఎంఈ డాక్టర్ జి.రఘునందన్ అన్నారు. కర్నూలు మెడికల్ కళాశాల ఎంబీబీఎస్ 2019 బ్యాచ్ గ్రాడ్యుయేషన్ డే అమృత్వ–25 పేరుతో మంగళవారం సాయంత్రం కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ జి.రఘునందన్ మాట్లాడుతూ కర్నూలు మెడికల్ కళాశాలలో చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించారన్నారు. ఇప్పటి విద్యార్థులు కూడా అదే స్ఫూర్తితో విద్యను అభ్యసించాలని సూచించారు. పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.వెంకటరంగారెడ్డి మాట్లాడుతూ ఎంబీబీఎస్ పూర్తయిన విద్యార్థులు స్పెషాలిటీ కోర్సులపై దృష్టి సారించాలన్నారు. 20 ఏళ్ల క్రితం కర్నూలులో ఇద్దరు మాత్రమే గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు ఉండేవారని, ఇప్పుడు వారి సంఖ్య 16కు పెరగడం గమనించాలన్నారు. నేటి విద్యార్థులు పదేళ్లు ముందుగా ఆలోచించి చదివితేనే విజయం సాధిస్తారన్నారు. కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైద్యంలో విలువలు పాటిస్తూ రోగుల పట్ల సానుభూతి చూపాలన్నారు. అనంతరం పలువురు విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో హాస్టల్ డిప్యూటీ వార్డెన్ డాక్టర్ శ్రీరాములు, వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ రేణుకా దేవి, డాక్టర్ హరిచరణ్, డాక్టర్ సాయి సుధీర్, డాక్టర్ విజయానంద బాబు తదితరులు పాల్గొన్నారు. సబ్జెక్టు వారీగా గోల్డ్ మెడల్స్ అందుకున్న విద్యార్థులు 1. టి.హర్షిత(ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ) 2. ధనిరెడ్డి లక్ష్మినరహరి రెడ్డి(ఫిజియాలజీ, ఫోరెన్సిక్ అండ్ టాక్సికాలజీ, జనరల్ సర్జరీ) 3. నవలూరి శ్రీనాగ ఈశ్వర్(ఫిజియాలజీ, ఫార్మకాలజీ, మైక్రో బయాలజీ, జనరల్ మెడిసిన్, ఆబ్‌స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్) 4. జి.జి.మానస(బయోకెమిస్ట్రీ, పాథాలజీ) 5. టి.పవన్ సాయి(ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ) 6. మద్దిపట్ల మనోజ్ నాయుడు (కమ్యూనిటీ మెడిసిన్) 7. కంచి జయశ్రీ వైష్ణవి వర్మ(ఆప్తమాలజీ) -
● 350 ఎకరాలకు అవే ఆధారం ● ఒకే గ్రామ పరిధిలో దాదాపు 70 వరకు నేల బావులు ● కొన్నేళ్ల వరకు అన్ని అవసరాలకూ అవే నీరు వినియోగం ● తెలుగుగంగ, పాలేరు సాగునీటి రాకతో తగ్గిన ప్రాధాన్యం ● కొందరు రైతులకు ఇప్పటికీ అవే ఆధారం
నంద్యాల(అర్బన్): నంద్యాల మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దకొట్టాల గ్రామంలో 2,200 కుటుంబాలు 1,250 ఎకరాల సాగు భూములు ఉన్నాయి. ఈ ఊరిలో ఏళ్ల నుంచి సాగు, తాగునీటికి నేల బావులే ఆధారం. గతంలో బావుల నీటినే అన్ని పనులకు వినియోగించుకునే వారు. ఎప్పుడూ తాగునీటి ఎద్దడి ఉండేది కాదని గ్రామస్తులు చెబుతున్నారు. అప్పట్లో నివాసాల్లో బోర్లు వేసే ప్రయత్నాలు ఎన్నో సార్లు చేసినా వీలు కాలేదు. కాలక్రమేణా గ్రామస్తులు కొందరు తన నివాసాల్లో బావులు తవ్వుకున్నారు. ముందుగా తవ్విన వారి నివాసాల్లోని బావుల్లో ఎండాకాలంలోనూ బావి అడుగంటకుండా ఉండకపోవడం, నీరు తాగేందుకు మంచిగా ఉండటంతో ప్రతి ఒక్కరూ తమ నివాసాల్లోనూ బావులు తవ్వించారు. మహిళలకు వీధి బావుల వద్ద నుంచి బిందెల మోత తప్పి, నివాసాల్లోని బావుల వద్దే నీటిని చేదుకునేవారు. అందరి నివాసాల్లో బావులకు మోటార్లు అమర్చుకుని తాగునీటికి ఎలాంటి డోకా లేకుండా జీవించేవారు. దీంతో గ్రామంలో మొత్తం 70 నుంచి 80 దాకా నేల బావులు ఉండేవి. అనంతరం కాలంలో పొలాల సాగులో భాగంగా ప్రస్తుతం 60 నుంచి 70 దాకా నేల బావులున్నాయి. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఆధ్వరంలో పలు కాలనీల్లో వాటర్ ట్యాంకులు, ప్రైవేటు మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు అయ్యాయి. దీంతో పంచాయతీ ఆధ్వర్యంలో పైప్లైన్ల ద్వారా తాగునీరు వస్తుంది. నివాసాల్లో తవ్వుకున్న బావుల నుంచి నీటిని వాడకాలకు ఉపయోగించుకుంటున్నారు. అదే విధంగా పొలాల్లోని నేల బావుల నీరు సాగునీటికి ఉపయోగపడుతుంది. తెలుగుగంగ, పాలేరు సాగునీటి రాకతో.. గ్రామం మీదుగా తెలుగుగంగ కాల్వ ఏర్పాటు కావడం, పాలేరు నీటిని పొలాలకు మళ్లించుకోవడంతో నేల బావుల నీటి వాడకం తగ్గింది. తెలుగుగంగ నీరు నీటితో వందలాది ఎకరాల్లో రెండు కార్ల పంటలు పండుతుండగా పాలేరు నీరు కూడా రైతులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. దీంతో నేల బావుల ఉపయోగంతగ్గింది. కొంత మంది రైతులకు వాటితోనే వ్యవసాయం నివాసాల్లో ఏర్పాటు చేసుకున్న నేల బావులు అత్యవసరాలకు ఉపయోగపడుతుండగా పొలాల్లో ఏర్పాటైన బావులు కొంత మంది రైతులకు సాగునీటి అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. దాదాపు 350 ఎకరాల దాకా బావుల కింద పొలాలు సాగు అవుతున్నట్లు సమాచారం. వర్షాలు సకాలంలో కురవని సమయాల్లో నేల బావులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. ఏ కాలంలోనైనా బావుల్లో నీరు తగ్గే పరిస్థితి తలెత్తదని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. జూన్, జూలై మాసాల్లో ఖరీఫ్ సాగుకు వర్షాలు కురియకపోతే వరి నారు మడులు మొత్తం బావుల కిందనే సాగవుతాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటే తప్ప పంటలు పండకపోవడం జరగదని రైతులు ధీమాగా చెబుతున్నారు. వరికోతలు పూర్తయిన తర్వాత అదే భూముల్లో మళ్లీ దుక్కి దున్ని మార్చి నుంచి సెప్టెంబర్ వరకు కొంత మంది రైతులు కూరగాయలు పండించుకుంటున్నారు. పొలంలో ఏర్పాటు చేసుకున్న నేల బావి -
రైతుకో నేలబావి!
ఇప్పుడైతే బోరు బావులు వేయడం పరిపాటిగా మారింది. కానీ కొన్నేళ్ల క్రితం నేల బావులే రైతులకు ఆధారం. అందులో నంద్యాల మండల పరిధిలోని పెద్దకొట్టాల గ్రామ పరిధిలో దాదాపు 70 నేల బావులుండేవి. వ్యవసాయ సాగుతో పాటు అన్ని అవసరాలకూ వాటినే ఉపయోగించుకునేవారు. తెలుగుగంగ, పాలేరు సాగునీటి రాకతో వాటి అవసరం కాస్త తగ్గినా కొందరు రైతులకు మాత్రం అవే వ్యవసాయానికి ఉపయోగపడుతున్నాయి. ఇక ఇదే గ్రామంలో ఇళ్ల పరిసరాల్లోనూ నేల బావులుండేవి. కాలక్రమేణా కొందరు పూడ్చి వేయగా.. మరికొన్ని కంప చెట్లు మొలిచి శిథిలావస్థకు చేరుకున్నాయి. -
ఎన్జీఓ అసోసియేషన్ నుంచి నలుగురి బహిష్కరణ
కర్నూలు(అగ్రికల్చర్): ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఉమ్మడి కర్నూలు జిల్లా బ్రాంచి నుంచి నలుగురు నేతలను బహిష్కరిస్తూ అధ్యక్షుడు వీసీహెచ్ వెంగళ్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 20న జరిగిన కార్యవర్గ సమావేశంలో సంఘం వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై జిల్లా కార్యదర్శి వి.జవహార్‌లాల్, ఉపాధ్యక్షులు డి.సాంబశివారెడ్డి. ఆర్వీ రమణ, కోశాధికారి భాస్కరనాయుడుల ను సస్పెండ్ చేస్తూ తీర్మానం చేశారు. వీరిలో మార్పు వస్తే సస్పెన్షన్ ఎత్తివేస్తామని ప్రకటించారు. అయితే ఇటీవల జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్వీ రమణ జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్ వెంగళ్‌రెడ్డిని టార్గెట్‌గా చేసుకొని పలు అరోపణలు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. దీంతో నలు గురిని సంఘం నుంచి బహిష్కరిస్తూ ఉత్తర్వు లు జారీ చేశారు. ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య ఆదోని అర్బన్: పట్టణంలోని అమరావతి నగర్‌కు చెందిన నెట్టేకల్(33) అప్పుల బాధ, కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై మంగళవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్‌టౌన్ సీఐ శ్రీరామ్ తెలిపిన వివరాలు.. అమరావతి నగర్‌కు చెందిన నెట్టేకల్ గోనె సంచులు కుడుతూ జీవనం సాగించేవాడు. ఈక్రమంలో గుడిసె వేసుకునేందుకు రూ.2 లక్షలు అప్పు చేశాడు. వాటిని తీర్చలేక, భార్య పల్లవితో గొడవ పడట, కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుడిసెలోనే చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి బిణిగేరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ వార్డెన్ దుర్మరణం కర్నూలు: స్థానిక బళ్లారి చౌరస్తా సమీపంలోని డీ–మార్ట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ వార్డెన్ గుడికాటి కృష్ణారెడ్డి (67) అక్కడికక్కడే దుర్మరణం తిచెందాడు. కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన ఈయన లద్దగిరి బీసీ హాస్టల్ వార్డెన్‌గా పనిచేసి పదవీ విరమణ పొంది ప్రస్తుతం కల్లూరులోని పంచరత్న కాంప్లెక్స్ వీధి (శ్రీచక్ర హాస్పిటల్) వెనుక ఇల్లు నిర్మించుకుని నివాసముంటున్నాడు. ప్రతిరోజూ ద్విచక్ర వాహనంపై బళ్లారి చౌరస్తాలోని మహింద్రా షోరూమ్ వద్దకు వెళ్లి అక్కడ పార్కు చేసి వాకింగ్ అనంతరం తిరిగి ఇంటికి వెళ్లేవాడు. యథా ప్రకారం మంగళవారం ఉదయం వాకింగ్ ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా డీ–మార్ట్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో కృష్ణారెడ్డి అవయవాలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. ఈయన భార్య కూడా అనారోగ్యంతో మూడు మాసాల క్రితం మృతిచెందారు. విషయం తెలిసిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహానికి ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలో పోస్టుమా ర్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుని కుమారుడు రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. -
గురుకులం పిలుస్తోంది!
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశానికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్ష రాసేందుకు ఈ నెల 6లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. స్కూల్స్‌లో ప్రవేశం పొందితే ఉచిత విద్యతో పాటు నాలుగు జతల యూనిఫాం, షూస్, ప్లేట్, గ్లాసు, ట్రంక్ బాక్సు, పెన్నులు, పెన్సిల్స్, పుస్తకాలు, టవల్స్, బెడ్‌షీట్స్, మంచాలు అందిస్తారు. అలాగే విద్యార్థులకు గేమ్స్‌లో అధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. డైట్ ప్రకారం ఆహారం అందిస్తారు. 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలు ప్రారంభం ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు ఈ నెల 6 ఆఖరు స్కూళ్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే.. కర్నూలు జిల్లా బాలికల: దిన్నెదేవరపాడు, ఆదోని, కంబాలపాడు, వెల్దుర్తి, పత్తికొండ. బాలుర: సి.బెళగల్, అరికెర, చిన్నటేకూరు. నంద్యాల జిల్లా బాలికల: లక్ష్మీపురం, ఆళ్లగడ్డ రెగ్యులర్, ఆళ్లగడ్డ ఆర్పీఆర్పీ, కోవెలకుంట్ల, డోన్ బాలుర: జూపాడుబంగ్లా, డోన్(ఆర్ ) -
క్షేత్ర ప్రదర్శనలతో రైతులకు మెరుగైన సేవలు
కర్నూలు(అగ్రికల్చర్): క్షేత్ర ప్రదర్శనలతో రైతులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ఆచార్యా ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ శివనారాయణ తెలిపారు. సోమవారం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోని సమావేశ మందిరంలో ఏరువాక కేంద్రం జిల్లా స్థాయి సమన్వయ సంఘం సమావేశం నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డాక్టర్ ఎం.జాన్షన్ అధ్యక్షతన నిర్వహించారు. యూనివర్సిటీ విస్తరణ సంచాలకులు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పలు సూచనలు అందజేశారు. శనగలో నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ ద్వారా విడుదలైన ఎన్‌బీఈజీ 857, 1267 రకాలతో ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాల ద్వారా రైతులు మంచి ఫలితాలు సాధించారన్నారు. వ్యవసాయంలో కూలీల కొరతను అధిగమించేందుకు కలుపు మందుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ జాన్షన్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా రైతులకు నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో నంద్యాలలోని ఏరువాక కేంద్రాన్ని గత ఏడాది ఆగస్టు 1 నుంచి కర్నూలుకు తరలించామన్నారు. మొక్కజొన్నలో కెమికల్ వినియోగం పెరిగిపోయిందని, వచ్చే ఏడాది వీటిని తగ్గించి జీవన ఎరువుల వాడకాన్ని పెంచుతామన్నారు. సమావేశంలో ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, కో–ఆర్డినేటర్ డాక్టర్ సుజాతమ్మ, నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి, ఆత్మ డీపీడీ శ్రీలత, ఏడీఏ వెంకటేశ్వర్లు, సమన్వయ కమిటీ సభ్యులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
ఎస్టీ రిజర్వేషన్ కోసం వాల్మీకుల పోరాటం
కర్నూలు(సెంట్రల్): వాల్మీలకు ఎస్టీ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తామని వీఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దూరు సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు. సోమవారం వీఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్టీ రిజర్వేషన్ సాధన కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం తెలిపేలా సీఎం చంద్రబాబునాయుడు కృషి చేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు టీడీపీ నాయకులు.. వాల్మీలకు ఎస్టీ రిజర్వేషన్ అవకాశాన్ని కల్పించాలన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వాలే ఉండటంతో ఎస్టీ రిజర్వేషన్ సాధన సులభతరం అవుతుందన్నారు. వీఆర్పీఎస్ ఆధ్వర్యంలో 18 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. వాల్మీకుల ఆశలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతూనే ఉందన్నారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, నాయకులు కాశీం నాయుడు, మురళీ నాయుడు, రాఘవేంద్ర పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా -
స్టాక్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసం
కర్నూలు: స్టాక్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.42 లక్షలు మోసం చేశారని ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు కర్నూలు బి.క్యాంప్‌కు చెందిన బాధితురాలు ఫిర్యాదు చేశారు. రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాట్సాప్‌లో తెలియని వ్యక్తులు లింకులు పంపి.. బ్లాక్ ట్రేడింగ్ అని, ఐపీఓ సబ్స్క్రిప్షన్ వంటి వాటితో నమ్మించారని, పెట్టుబడి పెట్టిన డబ్బుకు రెట్టింపు మొత్తం ఇస్తామని చెప్పి మోసం చేశారని బాధితురాలు ఫిర్యాదు చేశారు. భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నందున మహిళను పూర్తిస్థాయిలో విచారించి దర్యాప్తు వెంటనే ప్రారంభించాలని సైబర్ ల్యాబ్ పోలీసులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 102 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐ శ్రీనివాస నాయక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని... ● అమడగుంట్ల గ్రామంలో తన 6 ఎకరాల పొలాన్ని దస్తగిరి అనే వ్యక్తి కౌలుకు తీసుకుని కౌలు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని కర్నూలు వెంకటరమణ కాలనీలో నివాసముంటున్న ప్రభావతమ్మ ఫిర్యాదు చేశారు. ● తన పేరుతో ఉన్న ఆస్తి, పెన్షన్ కోసం పెద్ద కుమార్తె, అల్లుడు, చిన్న కుమార్తె పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కర్నూలు గఫూర్ నగర్‌కు చెందిన సుబ్బారావు ఫిర్యాదు చేశారు. ● తనకు సంబంధించిన 30 గొర్రెలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారని, విచారణ జరిపి తగు న్యాయం చేయాల్సిందిగా సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామానికి చెందిన పల్దొడ్డి జమ్మన్న ఫిర్యాదు చేశారు. ● ఇంటి పక్కన ఖాళీ స్థలాన్ని కొందరు ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారని నందవరం గ్రామానికి చెందిన సావిత్రమ్మ, తన ఇంటికి రస్తా ఇవ్వకుండా వేరే వ్యక్తులు అడ్డంగా ఇల్లు నిర్మించుకుంటున్నారని పత్తికొండ మండలం పులికొండ గ్రామానికి చెందిన బోయ లక్ష్మి ఫిర్యాదు చేశారు. రూ.42 లక్షలు స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు -
నృత్యం.. సంగీతం.. అ‘మోఘ’ం
కర్నూలు కల్చరల్: తల్లిదండ్రుల ప్రోత్సాహం.. గురువుల మార్గదర్శనం.. నృత్యం, సంగీతంలో కామళే మేఘనను ఘనాపాటిని చేశాయి. జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నాట్య ప్రదర్శనలు ఈమె అవార్డులు సాధించారు. ఆదో ని పట్టణం ఆర్టీసీ కాలనీకి చెందిన బ్యాంగ్ ఉద్యో గి కామళే రమేష్ బాబు, కామళే విజయలక్ష్మి దంపతలు మూడో కుమార్తె కామళే మేఘన. ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం బీకాం కంప్యూటర్స్ చదువుతున్నారు. ఈ విద్యార్థిని 2015 నుంచి కూచిపూడి, భరత నాట్యంతో పాటు కర్ణాటక సంగీతంలో గాయనిగా సాధన చేయడం మొదలు పెట్టారు. ఆదోనిలో సంవత్సరం క్రితం శ్రీ నృత్య కళా నిలయం బ్రాంచ్‌ను ప్రారంభించి శాసీ్త్రయ కళలను ఇతరులకు నేర్పిస్తూ ఆదర్శంగా నిలిచారు. ప్రశంసలు.. ● నేపాల్ దేశం రాజధానిలోని ఖాట్మాండ్లో కామళే మేఘన నృత్య ప్రదర్శనను ఇచ్చి ప్రశంసలు అందుకున్నారు. ● ఇటీవల బెంగళూరులోని జరిగిన నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్‌లో పాల్గొని జాతీయ స్థాయిలో తృతీయ స్థానంలో నిలిచారు. ● మేఘన తన నృత్య ప్రదర్శనలతో గిన్నిస్ వరల్డ్ రికార్డు, ఏసియా బుక్ ఆఫ్ రికార్డు, భారత్ వరల్డ్ రికార్డు, వండర్ బుక్ ఆఫ్ రికార్డు, ఇంటర్నేషనల్ ట్రెడిషినల్ బుక్ ఆఫ్ రికార్డు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు, ట్రెజర్ హంట్ రికార్డు అందుకున్నారు. ● కోల్‌కతాలో నిర్వహించిన భారత్ సంస్కృతి ఉత్సవ్ పోటీల్లో ప్రెసిడెంట్ అవార్డు కై వసం చేసుకున్నారు. భావితరాలకు అందిస్తా శాసీ్త్రయ నృత్యాలు నేర్చుకోవాలనే ఆసక్తి చాలా మంది చిన్నారులకు ఉండటం లేదు. నేను కూచిపూడి నృత్యంలో లెవల్–4, భరత నాట్యంలో మధ్యమ, కర్ణాక సంగీతంలో లెవల్–5 పూర్తి చేశాను. చదువుతో పాటు నృత్యమూ ముఖ్యమే. నాకు తెలిసిన విద్యను భావితరాలకు అందించాలన్నదే నా లక్ష్యం. – కామళే మేఘన కూచిపూడి, భరత నాట్యం, కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం ఆదోనికి చెందిన కామళే మేఘన అత్యుత్తమ ప్రతిభ -
శాస్త్రోక్తంగా సెల్వర్ కుత్తు ఉత్సవం
ఆళ్లగడ్డ: అహోబిలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎగువ అహోబిలం క్షేత్రంలో సెల్వార్ కుత్తు ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారం నుంచి అహోబిలేశుడి వివాహ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నిత్య పూజల అనంతరం ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీ జ్వాలా నరసింహస్వామి ఉత్సవమూర్తిని పల్లకీలో కొలువుంచి దేవాలయం ఎదురుగా ఉన్న ధ్వజ స్తంభం వద్దకు తోడ్కొని వచ్చారు. వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో సెల్వర్ కుత్తు ఉత్సవం నిర్వహించారు. -
మంచి, చెడు స్పర్శపై అవగాహన
కర్నూలు(హాస్పిటల్): మంచి, చెడు స్పర్శపై బాలికలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ పి. శాంతికళ తెలిపారు. లైంగిక దాడుల నివారణపై సోమవారం కర్నూలు మెడికల్ కాలేజిలోని క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్, విద్య, వైద్య ఆరోగ్యశాఖ క్షేత్రస్థాయి అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ పి. శాంతికళ మాట్లాడుతూ.. బాల్యవిహాలు చేసినా, బాలికలను లైంగికంగా వేధించినా 1098, 100, 181 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. పిల్లలు లైంగికదాడులకు గురైనప్పుడు ఆందోళనకు గురవుతారని, వారిని గుర్తించి ఎలా కౌన్సిలింగ్ చేయాలో మానసిక వైద్యనిపుణులు డాక్టర్ చైతన్య వివరించారు. ఆర్బీఎస్కే జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ శైలేష్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రీయ బాలస్వాస్త్య కార్యక్రమంతో పిల్లలకు పుట్టుకతో వచ్చే లోపాలను గుర్తించి వైద్యం అందిస్తారన్నారు. డీపీఎంఓ డాక్టర్ ఉమ, డైస్ మేనేజర్ ఇర్ఫాన్, ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ సుధాకర్, ఆర్బీఎస్కే కన్సల్టెంట్ మల్లికార్జున పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య ఎమ్మిగనూరురూరల్: పిల్లలు కాలేదని, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది ఆదివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఉప్పర సందీప్(25) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని కొండవీటి ప్రాంతానికి చెందిన కుమారుడు ఉప్పర సందీప్(25)కు అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ ప్రాంతానికి చెందిన మానసతో రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సందీప్ హోటల్ వ్యాపారం చూసుకునే వాడు. హోటల్ సరిగా నడవకపోవటంతో రెండు నెలల నుంచి మూసివేసి వేరే పనికి వెళ్లేవాడు. ఆర్థిక ఇబ్బందులు, రెండు సంవత్సరాలు కావస్తు న్నా పిల్లలు పుట్టకపోవటంతో తీవ్ర మనస్తానికి గురయ్యాడు. ఆదివారం ఇంటి తలుపులు వేసుకుని ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇంటి తలుపులు బద్దకొట్టి సందీప్‌ను కిందకు దించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సందీప్ భార్య మానస ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పట్టణ ఏఎస్ఐ క్రిష్టప్ప తెలిపారు. రైల్వే ట్రాక్‌పై మృతదేహం తుగ్గలి: లింగనేనిదొడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్‌పై ఓ వ్యక్తి మృతదేహాన్ని సోమవారం గుర్తించిన గ్యాంగ్ మెన్లు డోన్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే కానిస్టేబుల్ నరసింహ ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి ఆచూకీపై ఆరా తీశారు. మొహంపై తీవ్రగాయాలై మృతి చెందాడు. రైలులో నుంచి జారి పడ్డాడా, మరేదైనా కారణమా అనే విషయాలు విచారణలో తేలాల్సి ఉంది. మృతుడి వద్ద లభ్యమైన ఆధార్‌కార్డు చిరునామా మేరకు ఒడిశా రాష్ట్రం రాజ్‌గంగపూర్ కిషన్పాడకు చెందిన రటియా బాడెక్(33)గా గుర్తించారు. సెంట్రింగ్ కూలీ నిమిత్తం గదగ్ వెళుతున్నట్లు కానిస్టేబుల్ తెలిపారు. మృతుడు జనరల్ టికెట్‌పై ప్రయాణిస్తున్నారని తోటి ప్రయాణికుడి వద్ద టికెట్ ఉన్నట్లు సమాచారం అందిందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని డోన్ రైల్వే ఆసుపత్రికి తరలించారు. -
నిర్ణీత గడువులోగా అర్జీలకు పరిష్కారం
కర్నూలు(సెంట్రల్): పీజీఆర్ఎస్(పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సెల్)లో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదకి(పీజీఆర్ఎస్)ను నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్ లాగిన్‌లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలని, రీఓపెన్ అయిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలన్నారు. కలెక్టరేట్లో ఉన్న కార్యాలయాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఆర్వో సి. వెంకట నారాయణమ్మ పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని... ● కృష్ణగిరి మండలం మాదాపురం పరిధిలో 43.23 ఎకరాలను 13 మంది మాదిగలకు కేటాయించారని, ఆ భూములను కొందరు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకులు కలెక్టర్‌ను కోరారు ● కర్నూలు ఎస్ఆర్ నగర్‌లోని మాస్టర్ జూనియర్ కాలేజీ నుంచి వెలువడే వ్యర్థాల బారి నుంచి కాలనీని కాపాడాలని కోరుతూ ఎస్ఆర్ నగర్ వెల్ఫేర అసోసియేషన్ నాయకులు విన్నవించారు. నాటుసారా నిర్మూలనకు ‘నవోదయం’ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో నాటుసారా నిర్మూలన కోసం చేపట్టిన నవోదయం 2.0 కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నవోదయం 2.0 పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎక్కడైనా నాటుసారా కాస్తే టోల్ ఫ్రీ నంబర్ 14405కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్‌కుమార్, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ ఇంద్రకరణతేజ, హెడ్ కానిస్టేబుల్ సాయిబాబా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా -
నాణ్యత నగు‘బాట’
కూటమి ప్రభుత్వంలో చేపట్టిన పనుల నాణ్యత మున్నాళ్ల ముచ్చటగా మారింది. గతేడాది డిసెంబర్లో ప్రధాన రహదారులకు నామమాత్రంగా మరమ్మతులు చేశారు. మూడు నెలలు తిరగక ముందే రహదారులు యథాస్థితికి వచ్చాయి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వెల్దుర్తి నుంచి కృష్ణగిరి మీదుగా ఆగవేళి వరకు వేసిన ప్యాచ్‌లు లేచిపోయి గుంతలుగా మారాయి. ప్రజాధనం ఇలా వృథా చేయడం ఏంటని ప్రజలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం చెప్పేది ఒకటి.. చేసేది ఒకటని ప్రజలు చర్చించుకుంటున్నారు. – కృష్ణగిరి -
విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్‌టాప్‌లు
కర్నూలు(సెంట్రల్): పాలిటెక్నిక్, డిగ్రీ చదువుతున్న 6గురు విభిన్న ప్రతిభావంతులకు కలెక్టర్ పి.రంజిత్‌బాషా ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేసిన ఆయన చదువులో రాణిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కర్నూలులోని ప్రకాష్ నగర్‌కు చెందిన హకీమ్, రేష్మా దంపతులు తమ కుమారుడు ఉమర్‌కు ట్రై సైకిల్ ఇప్పించాలని కోరగా వెంటనే మంజూరు చేయించారు. ● విభిన్న ప్రతిభావంతుల సౌకార్యార్థం అన్ని శాఖల కార్యాలయాల్లో ర్యాంపులు ఏర్పాటు చేశారని.. ఒక్క డీపీఓ, డీఈఓ కార్యాలయాల్లో మాత్రమే ఎందుకు ఏర్పాటు చేయలేదని సంబంధిత అధికారులను కలెక్టర్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షల్లో పది మాల్ ప్రాక్టీస్ కేసులు కర్నూలు సిటీ: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షల్లో పది మంది విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు అయినట్లు ఆర్ఐఓ గురువయ్య శెట్టి తెలిపారు. జిల్లాలో 69 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 20,506 మందికిగాను 20,160 మంది విద్యార్థులు హాజరుకాగా, 336 మంది గైర్హాజరయ్యారన్నారు. పత్తికొండ ప్రభు త్వ జూనియర్ కాలేజీలో ఆరుగురు, ఏపీ మోడల్ స్కూల్ పత్తికొండలో ఒకరు, గోనెగండ్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఒకరు, ప్రభుత్వ జూనియర్ కాలేజీ(బాలురు)ఎమ్మిగనూరులో ఒకరు, నారాయణ జూనియర్ కాలేజీలో ఒకరు మాల్ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్నట్లు తనిఖీ బృందాలకు తెలిసిందన్నారు. గోఆధారిత వ్యవసాయ ఉత్పత్తులకు ఆదరణ కర్నూలు(అగ్రికల్చర్): గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో ఆదరణ లభిస్తోందని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన గోఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి పరిశీలించారు. జిల్లా అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, గ్రీవెన్స్‌కు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రైతులు ఎలాంటి కెమికల్స్ లేకుండా గోఆధారిత ఎరువుల ద్వారా పండించిన కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ఈ కౌంటర్ రైతుసాధికార సంస్థ ఆధ్వర్యంలో పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో డీపీఎం చంద్రశేఖర్, డీఎల్ఎంపీ లక్ష్మయ్య, మార్కెటింగ్ ఎన్ఎఫ్ఏ మల్లికార్జున పాల్గొన్నారు. నవోదయలో ‘యువ పార్లమెంట్’ ఎమ్మిగనూరురూరల్: బనవాసి జవహర్ నవోదయ విద్యాలయంలో పార్లమెంట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ 2019 నవంబర్ 26న జాతీయ యవ పార్లమెంట్ పథకం వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. సోమవారం విద్యాలయంలో పార్లమెంట్ సమావేశాలు ఏ విధంగా జరుగుతాయి, అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీ, స్పీకర్ వంటి సన్నివేశాలు నిర్వహించారు. యువ పార్లమెంట్ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన విద్యార్థులను విద్యాలయ ప్రిన్సిపాల్ ఇ.పద్మావతి అభినందించారు. వైస్ ప్రిన్సిపాల్ చందిరన్, బసవరాజ్, కె. వెంకటేశ్వర్లు, శశికిరణ్, రాజు, వెంకటేష్, రవిశంకర్, మీనాచంద్రన్ పాల్గొన్నారు. రైతు ఆత్మహత్య పాణ్యం: బలపనూరు గ్రామానికి చెందిన వై.రామ్మోహన్‌రెడ్డి(63) అనే రైతు విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు, గ్రామస్తులు సోమవారం తెలిపారు. వారు తెలిపిన మేరకు వివరాలు.. రామ్మోహన్‌రెడ్డికి 10 ఎకరాల సొంత భూమి ఉంది. కొడుకు గంగధారర్రెడ్డితో కలిసి ఆ పొలంలో వరి పంటను సాగు చేశాడు. అంతేకాక కౌలుకు మరో 10 ఎకరాల భూమి తీసుకొని మిరప, మినుము పంటలను సాగు చేశాడు. పంటలకు సుమారు రూ.12 లక్ష ల నుంచి రూ.14లక్షల వరకు అప్పు తెచ్చి పెట్టుబడులు పెట్టాడు. మిరప పంట సరిగ్గా లేకపోవడం, వచ్చిన పంటకు మద్దతు ధర లేనందున నిత్యం ఇంట్లో, బంధువుల వద్ద ఆవేదన వ్యక్తం చేసేవాడు. సోమవారం ఇంట్లో వారు బంధువుల వివాహానికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో విషపు గుళికలు మింగాడు. వచ్చిన తర్వాత గమనించిన బంధువులు, కుటుంబ సభ్యులు చికిత్స కోసం నంద్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కోలుకోలేక మృతి చెందాడు. మృతుడికి భార్య వరలక్ష్మి, కుమారుడు గంగాధర్‌రెడ్డి ఉన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపారు. -
సమస్తం నిర్లక్ష్యం.. అంతటా వైఫల్యం
శ్రీగిరిలో జరిగిన శివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణలో దేవస్థాన యంత్రాంగం వైఫల్యం చెందిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉత్సవాల విజయవంతానికి మూడు నెలల ముందు నుంచే సమీక్షలు, సమావేశాలు అంటూ హడావుడి చేసిన అధికారులు చివరకు భక్తులకు సౌకర్యాల కల్పనలో చేతులెత్తేశారు. శ్రీశైల క్షేత్రంలో గత నెల 19 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరిగాయి. 11 రోజుల పాటు సాగిన ఉత్సవాల్లో అధికారుల నిర్లక్ష్యం దర్శనమిచ్చింది. భక్తులను అతిథులుగా భావించి సౌక ర్యాలు కల్పిస్తామని చెప్పి చివరకు కష్టాల పాలు జేశా రు. మరో వైపు అడుగడుగునా దోపిడీకి గురవుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. దాదాపు 6.5 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ మేరకు ముందస్తు ప్రణాళిక రూపొందించిన అధికారులు అమలు చేయడంలో విఫలమయ్యారు. ఇప్పటికై న దేవస్థాన అధికారులు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో చోటుచేసుకున్న లోపాలపై సమీక్షించుకుని, ఈ నెలాఖరులో జరిగే ఉగాది ఉత్సవాలను విజయవంతం చేయాలని భక్తులు కోరుతున్నారు. – శ్రీశైలంటెంపుల్ మల్లన్న భక్తుల కష్టాలు ఇలా.. ● చంద్రావతి కల్యాణ మండపంలో శివదీక్ష భక్తులకు అల్పాహారం, తాగునీరు అందించడంలో అధికారులు విఫలమయ్యారు. క్యూలైన్ ఏర్పాటులో నిబంధనలు పాటించడం లేదని తెలుస్తోంది. ● జ్యోతిర్ముడి సమర్పించే క్రమంలో అర్చకులు శివదీక్ష రూ.100 ముక్కుపిండి వసూలు చేశారు. ● నందిమండపం, గంగాధర మండపం, సాక్షిగణపతి ఆలయాల వద్ద కొబ్బరికాయ కొట్టేందుకు రూ.10 వసూలు చేశారు. ● తలనీలాలు సమర్పించిన భక్తుల నుంచి టికెట్టు కాకుండా వంద రూపాయాలు అదనంగా వసూలు చేశారు. ● శ్రీశైలంలో లీటర్ ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించడంతో లీటర్ నీళ్ల సీసా రూ.60 వెచ్చించాల్సి వచ్చింది. ● కొన్ని ఆర్టీసీ బస్సులు అధిక చార్జీల పేరుతో అదనంగా వసూలు చేశారు. ● పలు హోటల్ నిర్వాహకులు ఆహార పదార్థాలపై ఇష్టానుసారంగా ధరలను పెంచి భక్తులను దోచుకున్నారు. ● ఫోన్ సిగ్నల్ సమస్య భక్తులకు వేధించింది. నెట్వర్క్ పనిచేయకపోవడంతో భక్తులు అవస్థలు పడ్డారు. ● క్షేత్ర పరిధిలో ‘మే ఐ హెల్ప్ యూ’ సమాచార కేంద్రాలు ఏర్పాటు చేసినటప్పటికీ అక్కడ సిబ్బంది లేకపోవడంతో అవి నామమాత్రంగా పని చేశాయి. ● సమాచార బోర్డులు సైతం తక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయడంతో భక్తులు తికమక పడ్డారు. ● దర్శన కంపార్ట్మెంట్లలో అధికసంఖ్యలో ఫ్యాన్లు లేకపోవడం, భక్తులు కూర్చునేందుకు వీలుగా బెంచీలు లేకపోవడం, రేకులషెడ్డు కావడంతో గంటల తరబడి ఉక్కపోతతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ● లగేజ్ భద్రపరిచేందుకు నిర్ణీత రుసుం కంటే అధికంగా వసూలు చేశారు. ఉచిత ప్రసాదం చిక్కిపోయింది బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 24 నుంచి 27వ తేదీ వరకు నాలుగు రోజుల్లో దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడికి ఉచిత లడ్డూ ప్రసాదం అందజేస్తామని మంత్రులు గొప్పలు చెప్పారు. సాధారణంగా దేవస్థానం భక్తులకు 100 గ్రాములు లడ్డూ రూ.20కు విక్రయిస్తారు. అదే పరిమాణం ఉన్న లడ్డూను ఉచితంగా ఇస్తారని భక్తులు భావించారు. అయితే 50 గ్రాముల లడ్డూను మాత్రమే ఉచితంగా అందజేశారు. సాధారణ రోజుల్లో స్వామి ప్రసాదంగా పులిహోర, దద్దోజనం, 20 గ్రాముల లడ్డూ, గుగ్గులు, పొంగలి ఇలా ప్రతిరోజు ఏదో ఒకటి భక్తులకు ఉచితంగా అందజేస్తారు. అయితే బ్రహ్మోత్సవాల్లో వంద గ్రాముల లడ్డూ ఉచితంగా పంపిణీ చేసి బాగుండేదని పలువురు భక్తులు చర్చించుకున్నారు. పేలవంగా కళా ప్రదర్శనలు.. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో క్షేత్ర పరిధిలో మూడు చోట్ల పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అయితే అవి భక్తులను అలరించలేదనే విమర్శలు ఉన్నాయి. గతంలో సినీ ప్రముఖులు, నేపథ్య గాయకులు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులతో కార్యక్రమాలు నిర్వహించేవారు. కానీ ఈ ఏడాది నామమాత్రంగానే జరిగాయనే విమర్శలు ఉన్నాయి. అలాగే మొదటి రెండు రోజులు సాంస్కృతిక కార్యక్రమాల వివరాలను సకాలంలో మీడియాకు సైతం అందించలేకపోవడం గమనార్హం. పాగాలంకరణ సమయంలో పేలవంగా ప్రవచనాలు వినిపించారనే విమర్శలు ఉన్నాయి. పరమ పవిత్ర కార్యక్రమమైన పాగాలంకరణ, లింగోద్భవకాల మహాన్యాస పూర్వక ఏకాదశ మహారుద్రాభిషేకం సమయంలో అధ్యాత్మికతో భక్తులు శివనామస్మరణ చేసే సమయంలో, దేవదాయశాఖ ఆర్జేసీ ప్రభుత్వ పథకాల గురించి వివరించడం అనేక విమర్శలు దారితీసింది. బ్రహ్మోత్సవాల్లో ఏర్పాట్లలో నిర్లక్ష్యం, పాగాలంకరణ సమయంలో పేలవంగా ప్రవచనాలు వినిపించడం, తదితర విషయాలపై శివరాత్రి అనంతరం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అధికారులతో సమావేశమై హెచ్చరించినట్లు సమాచారం. కొరవడిన సమన్వయం దేవస్థానం అధికారులు, ఉత్సవాల విధులకు వచ్చిన అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. మహాశివరాత్రి పర్వదినం రోజున బందోబస్త్‌కు వచ్చిన పోలీసులు తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్శనాలు చేసుకునేందుకు ఆరాటపడ్డారు. బ్రహ్మోత్సవాల కవరేజ్‌కు వచ్చిన మీడియా ప్రతినిధులను, దేవస్థాన సిబ్బందిని సైతం అడ్డుకుని అత్యుత్సాహం ప్రదర్శించారనే విమర్శలు ఉన్నాయి. దేవస్థాన అధికారులుకు, పోలీసుల మధ్య సమన్వయం లేక గేట్లు తెరవడంతో పాగాలంకరణ అనంతరం దర్శనానికి వెళ్లేందుకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎమ్మెల్యే దంపతులు భక్తుల రద్దీతో ఇబ్బందులు పడ్డారు. బ్రహ్మోత్సవాల ముందు రోజు దేవస్థానం అధికారులు, ఏసీఎస్పీడీసీఎల్ అధికారులకు మధ్య సమన్వయం లేకపోవడంతో విద్యుత్లైన్లు మారుస్తున్న కార్మికుడు విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాడు. అలాగే బ్రహ్మోత్సవాల్లో డ్యాం దిగువన సున్నిపెంటలోని పాతాళగంగలో పుణ్యస్నానికి వెళ్లి తండ్రి, కుమారుడు మృత్యువాత పడ్డారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా మల్లన్న భక్తుల నిలువు దోపిడీ అసౌకర్యాల నడుమ స్వామి దర్శనం -
మూగజీవాలు విలవిల
చెట్ల నీడన సేదతీరుతున్న గొర్రెలు, మేకలు సోమవారం మధ్యాహ్నం నిర్మానుష్యంగా డోన్ ఆర్టీసీ బస్టాండ్ కౌతాళం: మండలంలో వారం రోజులుగా పెరుగుతున్న ఎండ తీవ్రతకు ప్రజలతో పాటు మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. మండలంలో ఎండల తీవ్రత 35డిగ్రీలకు తగ్గకుండా నమోదవుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఎండల తీవ్రత నానాటికీ పెరిగిపోతుండటంతో మండల పరిదిలోని ఉరుకుంద గ్రామ శివారులో గొర్రెలు, మేకలు చెట్ల కింద సేదతీరడం కనిపించింది. రానున్న రోజుల్లో తీవ్రతకు ఈ దృశ్యం అద్దం పట్టింది. ఈ వేసవి నిప్పుల కొలిమే! ● మార్చి నుంచి మే వరకు అధిక ఉష్ణోగ్రతలు ● గత ఏడాది అత్యధికంగా 47 డిగ్రీలు నమోదు ● ఈ సారి 48 డిగ్రీలకు చేరుకునే అవకాశం ● వేసవి తీవ్రత పెరుగుతున్నా కనిపించని ఉపశమన చర్యలు ● జాడలేని చలువ పందిళ్లు, చలివేంద్రాలుఈ నెల 1 నుంచి నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు తేదీ కర్నూలు నంద్యాల గరిష్టం–కనిష్టం గరిష్టం–కనిష్టం 1వ తేదీ 36.8-20.0 36.4-18.6 2వ తేదీ 37.0-23.1 37.0-20.0 3వ తేదీ 39.5-22.0 38.5-23.6 ఈత.. కేరింత దొర్నిపాడు: రోజురోజుకూ వేసవి ముదురుతోంది. పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పైగా నమోదు అవుతుండంతో జనాలు భానుడి సెగకు తట్టుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారులు వేసవి తాపం తాళలేక క్రిష్టిపాడు గ్రామంలోని కుందూనదిలో ఈతకు వెళ్లి కేరింతలు కొట్టడం కనిపించింది.వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు ఇలా..కర్నూలు(అగ్రికల్చర్): గత ఏడాది ఉమ్మడి కర్నూలు జిల్లాలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ సారి కూడా భానుడి భగభగలు గత ఏడాది కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు, మూడేళ్లతో పోలిస్తే ఈ సారి సూర్య ప్రతాపం పెరుగనుంది. ఏప్రిల్ మొదటి వారంలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు మార్చి నెలలోనే కనిపిస్తుండటంతో ఉమ్మడి జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత ఏడాది అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశంలోనే ఇది అత్యధిక ఉష్ణోగ్రత. రాష్ట్రంలో సాధారణంగా అత్యధిక ఉష్ణోగ్రతలు రెంటచింతలలో నమోదవుతాయి. అలాంటిది అక్కడి కంటే ఇక్కడ రెండు, మూడు డిగ్రీలు ఎక్కువ నమోదు అవుతుండటం గమనార్హం. మార్చి నెల చివరికి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు, ఏప్రిల్ నెలలో 45 డిగ్రీలకు, మే నెలలో 47/48 డిగ్రీలకు చేరుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. గత ఏడాది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండల తీవ్రత ఉన్నా సాయంత్రానికి అకాల వర్షాలు పడటం, గాలుల వల్ల కాస్త ఉపశమనం లభించింది. ఈ సారి అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెరుగుతున్న వడగాలులు గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే వాతావరణం చల్లగా ఉంటుంది. ఫిబ్రవరి నెలతో పోలిస్తే గాలిలో తేమ తగ్గింది. ఈ కారణంగా వడగాలులు మొదలయ్యాయి. భూగర్భ జలాలను ఎక్కువగా వినియోగిస్తుండటం వల్ల భూమిలో నీటి నిల్వలు రోజురోజుకు ఇంకిపోతున్నాయి. అక్టోబర్ నుంచి వర్షాలు లేవు. ఇందువల్ల భూమిలో తేమ లేక ఎండల తీవ్రతకు పెరిగి నేల నుంచి వేడి సెగలు పుట్టుకొస్తున్నాయి. అడవులు తరిగిపోతుండటం, పచ్చదనం కనుమరుగు అవుతుండటం కూడా ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవుతోంది. జిల్లా విస్తీర్ణంలో అడవులు 33 శాతం ఉండాల్సి ఉండగా.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 16 శాతం మాత్రమే అడువులు ఉన్నట్లు తెలుస్తోంది. వాహనాల సంఖ్య పెరిగి వాయు కాలుష్యం అధికమవడం కూడా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటితే వేడి గాలులు మొదలవుతాయి. దీనినే హీట్‌వేవ్‌గా వ్యవహరిస్తారు. ఇప్పుడు 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. అప్పుడే వడగాలులు మొదలు కావడం ఆందోళన కలిగించే విషయం. పెరిగిన విద్యుత్ వినియోగం ఎండల తీవ్రతతో విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోంది. ఏసీలకు తోడు కూలర్లు, ఫ్యాన్ల వినియోగం అధికమైంది. ఉమ్మడి జిల్లాలో ఫిబ్రవరి 1న 15లక్షల మిలియన్ యూనిట్ల వినియోగం ఉండగా.. ఈ నెల 1న వినియోగం 16.02 లక్షల మిలియన్ యూనిట్లకు చేరుకుంది. రికార్డు స్థాయిలో లక్ష మిలియన్ యూనిట్లకుపైగా వినియోగం పెరగడం గమనార్హం. రానున్న రోజుల్లో ఎండలు, వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో విద్యుత్ వినియోగం 20 లక్షల మిలియన్ యూనిట్లకు పైగా పెరిగే అవకాశం ఉందని విద్యుత్ అధికారులు అంచనా. వడదెబ్బ లక్షణాలు: తలనొప్పి, తలతిరగడం, తీవ్రమైన జ్వరం, మత్తునిద్ర, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి. ఉపాధి, పొలం పనులకు వెళ్లే వాళ్లు సాధ్యమైనంత వరకు ఉదయం 11 గంటల్లోపు ఇంటికి చేరుకోవాలి. ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తే గొడుగు తీసుకెళ్ల్లాలి. కనీసం తలపైన టోపి లేదా టువాలను కప్పుకోవాలి. కళ్ల రక్షణకు సన్ గ్లాసెస్ ఉపయోగించాలి. దాహం వేయకపోయినా తరచూ చల్లని నీరు ఎక్కువగా తీసుకోవాలి. కొద్దిగా ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు, కొబ్బరి నీళ్లు వీలైనంత వరకు తాగుతుండాలి. వేసవిలో తెల్లని వస్త్రాలు ధరించడం ఉత్తమం. మధ్యాహ్నం 11 నుంచి 4 గంటల మధ్య శారీరక శ్రమతో కూడిన పనులు చేయరాదు. బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగరాదు. 48 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం మార్చి నుంచి మే నెల చివరి వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణం కంటే 3–4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.ఈ సారి ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రత 47–48 డిగ్రీల వరకు చేరుకోవచ్చు. గాలిలో తేమ శాతం తగ్గుతున్నందున వడగాలుల ప్రభావం ఉంటుంది. – నారాయణ స్వామి, సీనియర్ వాతావరణ శాస్త్రవేత్త ఉపశమన చర్యలు శూన్యం 2024 వేసవి వరకు ముందస్తుగానే ఉపశమన చర్యలు తీసుకోవడం కనిపించింది. కలెక్టరేట్‌లోకి వెళ్లే ప్రాంతంలో ఇరువైపులు, కలెక్టరేట్ బస్టాపు, రాజ్‌విహార్, బళ్లారి చౌరస్తా, సి.క్యాంపు సెంటర్, ట్రాఫిక్ సిగ్నల్ పడే ప్రాంతాల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేసేవాళ్లు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయడం చూశాం. పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు, గ్రామాల్లో పంచాయతీలు ఉపశమన చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఆ దిశగా ఇప్పటి వరకు చర్యలు కరువయ్యాయి. ఉపాధి పనులు జరిగే ప్రాంతాల్లోనూ నీడ సదుపాయం కల్పిస్తున్న దాఖలాల్లేవు. -
నేటి సాయంత్రంలోగా పీ4 సర్వే పూర్తి చేయాలి
కర్నూలు(అర్బన్): జిల్లాలో చేపట్టిన పీ4 (పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్, పార్టనర్షిప్ ) సర్వేను ఈ నెల 4 సాయంత్రంలోగా పూర్తి చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి కోరారు. ఆయన సోమవారం జెడ్పీలోని తన చాంబర్ నుంచి జిల్లాలోని ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన లక్ష్యాల మేరకు ఆధార్ వెరిఫికేషన్‌ను తప్పకుండా పూర్తి చేయాలన్నారు. గ్రామ సచివాలయాలను జనాభా ఆధారంగా రెండు, మూడు సచివాలయాలను కలిపి క్లస్టర్ చేసేందుకు ప్రభుత్వ ఆదేశాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. సర్వేలను త్వరితగతిన పూర్తి చేసి రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాను ముందు వరుసలో నిలపాలన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది రోజు వారీ హాజరును తప్పక వేయాలని, లేనిపక్షంలో షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్లను త్వరగా పూర్తి చేసి, వర్మీ తయారీపై దృష్టి సారించాలన్నారు. వెబ్సైట్లో ఫిర్యాదుల పరిష్కార ప్రొఫార్మాలు కర్నూలు(హాస్పిటల్): అభ్యర్థుల ఫిర్యాదుల పరిష్కార ప్రొఫార్మాలను కర్నూలు, నంద్యాల జిల్లాల వెబ్సైట్లు https:// kurnool.ap.gov.in, https://nandyal.ap. gov.in, కర్నూలు మెడికల్ కాలేజీ వెబ్సైట్ https:// kurnoolmedicalcollege.ac.inలలో అప్లోడ్ చేసినట్లు కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలకు సంబంధించిన ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు 2023 నవంబర్ 21న జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి 11 కేటగిరిల అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ కర్నూలు సిటీ: ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాలు డీఈఓ వెబ్సైట్లో ఉన్నాయని, అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో తెలపాలని డీఈఓ ఎస్.శ్యామూల్ పాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆధారంగా తయారు చేసిన జాబితాను వైబ్‌సైట్‌తో పాటు నోటీసు బోర్డులో కూడా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. జెడ్పీ, మండల, మునిసిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని స్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులు అభ్యంతరాలు ఈనెల 10వ తేదీలోపు డీఈఓ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో అందజేయాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్లకు అభ్యంతరాలు ఉంటే ఆర్జేడీ కడప కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. కేసీకి నీటి విడుదల బంద్ కర్నూలు సిటీ: సుంకేసుల బ్యారేజీ నుంచి కర్నూలు–కడప కెనాల్‌కు నీటి విడుదల పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. అలాగే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి సైతం నీటి విడుదల నిలిపివేశారు. మల్యాల నుంచి 675 క్యుసెక్కుల నీరు మాత్రమే కేసీకి పంపింగ్ చేస్తున్నారు. ఈ కాలువ పరిధిలో రబీలో సుమారుగా 90,200 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. మొన్నటి వరకు ఆయకట్టుకు నీరు అందించామని, ప్రస్తుతం పంటలకు నీరు అవసరం లేదని ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. నంద్యాల, ఆళ్లగడ్డ సబ్ డివిజన్ ప్రాంతంలోని సాగులో ఉన్న ఆయకట్టుకు వచ్చే నెల వరకు నీరిస్తేనే పంటలు చేతికొచ్చే అవకాశం ఉంది. వైఎస్సార్ జిల్లా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. -
ఆమెకు ‘రక్షణ’ కవచం
హెల్ప్లైన్లు నంబర్లు చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 ఉమెన్ హెల్ప్‌లైన్ 181 పోలీస్ హెల్ప్‌లైన్ 100/112 సైబర్ క్రైం హెల్ప్‌లైన్ 1930 పోలీస్ కంట్రోల్ రూమ్ వాట్సాప్ నెంబర్ 77778 77722 కర్నూలు: సమాజంలో మహిళలు, విద్యార్థినులపై వేధింపులు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ పరిణామాలు అందరిలోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారికి రక్షణ కవచంలా నిలిచేందుకు జిల్లా పోలీసులు కదిలారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందుగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు మహిళల రక్షణ, భద్రతకు సంబంధించిన చట్టాలపై పోలీస్ స్టేషన్ల వారీగా అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు పోలీస్ సబ్ డివిజన్లు, 39 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. గత మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓపెన్ హౌస్, మహిళా చట్టాలపై అవగాహన ర్యాలీలు, మెడికల్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నారు. ఈ తరహా కార్యక్రమాలను ఈనెల 8వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. మహిళలకు సంబంధించిన అంశాలపై వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చివరి రోజు 8వ తేదీ మహిళలతో ప్రదర్శనలు నిర్వహించేలా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. వ్యాసరచన పోటీలు... మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలపై అవగాహన కార్యక్రమాలతో పాటు సోమవారం జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా కర్నూలులోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల, అశోక్ ఉమెన్స్, కేవీఆర్ కళాశాలలో విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జిల్లాలోని ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో కూడా వ్యాసరచన పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సందర్శించండి... తెలుసుకోండి మహిళలు, యువతులు, విద్యార్థినులను పోలీస్ స్టేషన్లకు ఆహ్వానిస్తున్నారు. పోలీసు విధులు, మహిళా సహాయక కేంద్రం పనితీరు, అధికారుల పనితీరు, విధి నిర్వహణలో ఉపయోగించే పరిక రాలపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థినుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. మహిళలు, యువతులు, చిన్నారుల రక్షణకు రూపొందించి అమలు చేస్తున్న చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఫోక్సో చట్టాలతో పాటు సామాజిక మాధ్యమాల వినియోగం–దుష్పరిణామాలు, సైబర్ నేరాలు–తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర అంశాలపై వివరిస్తున్నారు. బాలికలు స్వీయరక్షణ పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు. సహాయానికి ఫోన్ చేయండి మహిళలు, విద్యార్థినులు, చిన్నారులు ఎక్కడైనా, ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటే తక్షణ సహాయం కోసం పోలీసులతో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు. మహిళల భద్రతకు పోలీసులు జిల్లా అంతటా అవగాహన కార్యక్రమాలు -
ఊరు అడుగుతోంది నీరు
ఆస్పరి: మంచినీరు అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిందె నీటికి రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. ఆస్పరి మండలంలోని చిన్నహోతూరు, జొహరాపురం గ్రామాల్లో రేగడి పొలాలు ఉన్నాయి. ఎక్కడ బోర్లు వేసినా ఫ్లోరైడ్ నీరే పడుతోంది. దీంతో బాపురం రిజర్వాయర్ నీటి కోసం వేచి ఉండాల్సిన పరిస్ధితి నెలకొంది. జొహరాపురంలో 7,000, చిన్నహోతూరులో 4,000 మంది ప్రజలు ఉన్నారు. రెండు గ్రామాల్లో మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కాలేదు. వేసవి కాలం వచ్చిందంటే వారికి కష్టాలు తప్పడం లేదు. జొహరాపుర గ్రామస్తులు నేటికీ వక్కిరేణి నీటినే తాగుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బాపురం రిజర్వాయర్ నుంచి 15 రోజులకోసారి వచ్చే నీటి కోసం రెండు గ్రామాల ప్రజలు రాత్రింబవళ్లు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు గ్రామాలకు బాపురం రిజర్వాయర్ నీటిని పైపులైన్ ద్వారా అందిస్తున్నారు. రెండు గ్రామాలకు పై భాగంలో ఉన్న పల్లెవారు పట్టుకున్న తర్వాత నీటిని వదులుతున్నారు. తమ గ్రామాలకు బాపురం రిజర్వాయర్ నుంచి నేరుగా పైపులైన్ వేస్తే బాగుంటుందని చిన్నహోతూరు, జొహరాపురం గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. రెండు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నాం మండలంలోని చిన్నహోతూరు, జొహరాపురం గ్రామాలకు రెండు రోజులకోసారి బాపురం రిజర్వాయర్ నీటిని సరఫరా చేస్తున్నాం. అయితే గ్రామాల్లో పంచాయతీ వారు విడతలు వారీగా ఒక్కో కాలనీకి ఒక్క రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. చివర కాలనీలకు నీరు వచ్చేలోపు ఆలస్యమవుతుండొచ్చు. పందికోన రిజయర్వాయర్ నుంచి ఆస్పరి మండలంలోని జొహరాపురం, చిన్నహోతూరు, ఆస్పరి, శంకరబండ, చిరుమాన్‌దొడ్డి, హలిగేర, బిణిగేర, చిగిళి, నగరూరు గ్రామాలకు శాశ్వతంగా మంచి నీటి పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీతో సర్వే చేయిస్తోంది. – హనుమంతు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పెద్దల కాలం నుంచి తిప్పలే పెద్దల కాలం నుంచి మంచి నీటి కోసం అవస్థలు తప్పడం లేదు. మా ఎస్సీ కాలనీకి 15 రోజులకోసారి బాపురం రిజర్వాయర్ నీరు వచ్చినా చాలడం లేదు. తప్పని సరి పరిస్థితులలో వర్షాధారంతో నిండిన వక్కిరేణి నీటినే నేటికీ తాగుతున్నాం. ఏప్రిల్, మే నెలలో అయితే వక్కిరేణిలో నీరు పూర్తిగా అడుగంటి పోతుంది. బు రద నీరు ఉన్నా దానినే తాగుతున్నాం. హంద్రీ నీవా నీటిని మా సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి. – కరుణాకర్, జొహరాపురం గ్రామం, ఆస్పరి మండలంపైపులైన్ మార్చాలి బాపురం రిజర్వాయర్ నుంచి మా గ్రామానికి 50 ఏళ్లు క్రితం పైపులైన్ వేశారు. పాత పైపులైన్ మార్చి కొత్తగా వేయాలి. అంతేగాక పెద్దహోతూరు నుంచి కాకుండా నేరుగా పైపులైన్ వేస్తే నీటి సమస్య కొంత వరకు తీరుతుంది. మాగ్రామంలో ఎక్కడ బోర్లు వేసినా ఫ్లోరైడ్ నీరే పడుతుంది. అధికారులు మా గ్రామానికి శాశ్వతంగా మంచి నీటి సమస్య పరిష్కారం చే యాలి. – హరికృష్ణ, చిన్నహోతూరు సర్పంచ్, ఆస్పరి మండలం బాపురం రిజర్వాయర్ నీరే గతి చిన్నహోతూరు, జొహరాపురం గ్రామాల్లో అవస్థలు -
నియోజకవర్గాల వారీగా ముఠాలు
● ఒక్క కర్నూలులోనే 25కు పైగా గ్యాంగులు ● పట్టుకోసం రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరు ● ఎక్కడికక్కడ ఎమ్మెల్యేల పేరు చెప్పుకొని అక్రమ రవాణా ● కళ్లెదుటే సాగుతున్నా నోరు మెదపని అధికారులు ● పోలీసులకు పెద్ద ఎత్తున మామూళ్లుమల్లన్నకు నృత్యనీరాజనం శ్రీశైలంటెంపుల్: నిత్యకళావేదికపై ఆదివారం కర్నూలుకు చెందిన వి.ప్రసాద్ బృందం వారి నృత్యప్రదర్శన ఆకట్టుకుంది. వాగ్వేది ప్రసాద్, మహతి, సాహిత్య, తపస్య, సంధ్య నృత్యం ప్రదర్శించారు.సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025కర్నూలు(సెంట్రల్): పేదల బియ్యం అక్రమార్కుల పాలిట వరంగా మారింది. ఏ స్థాయిలో దందా చేసుకుంటే అంతటి ఆదాయాన్ని సమకూర్చి పెడుతోంది. గతంలో ఎన్నడూలేని విధంగా రేషన్ బియ్యం కోసం మాఫియాలు పుట్టుకొచ్చాయి. నియోజకవర్గాల వారీగా టీడీపీ ప్రజాప్రతినిధుల అనుచరులు ముఠాలుగా ఏర్పడి సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రికి రాత్రి రేషన్ బియ్యాన్ని జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. ఇందులో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, పోలీసు, ఇతర అధికారులందరికీ మామూళ్లు ముడుతున్నట్లు చర్చ జరుగుతోంది. జిల్లాలో నెలకు దాదాపు రూ.100 కోట్లకుపైగా బియ్యం అక్రమ రవాణా వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది. చాలా చోట్లా నేరుగా ఎండీయూ ఆపరేటర్లే బియ్యాన్ని రూ.10 నుంచి రూ.15 వరకు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని చోట్ల డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లు కలసి అక్రమాలకు పాల్పడుతున్నారు. మరికొన్ని చోట్ల వినియోగదారుల నుంచే నేరుగా తక్కువ ధరకు కొనుగోలు చేసే గ్యాంగులు ఉండటం గమనార్హం. కర్నూలులో బరితెగించిన రెండు ముఠాలు అక్రమ బియ్యం దందా జిల్లా అంతటా సగం ఉంటే.. మిగిలిన సగం జిల్లా కేంద్రంలో నడుస్తోంది. ఇక్కడ ఏకంగా 170 చౌకధరల దుకాణాల పరిధిలో 1,100 టన్నుల బియ్యం కేటాయింపులు ఉంటున్నాయి. దీంతో ఇక్కడ పట్టుకోసం టీజీ, గౌరుల పేర్లు చెప్పుకొని వ్యాపారం చేసే వారు బరితెగించారు. కర్నూలులో 25 గ్యాంగుల వరకు పనిచేస్తున్నాయి. వీరంతా ఇద్దరు వ్యాపారులకు ఇన్నాళ్లూ బియ్యం ఇచ్చేవారు. అయితే కొత్తగా వెలుగోడు కేంద్రంగా ఓ వ్యక్తి చక్రం తిప్పుతున్నాడు. గౌరు అనుచరుడినంటూ చెప్పుకొని అప్పటికే ఉన్న వారిద్దరిని కూడా తనకే బియ్యం అమ్మాలంటూ హుకుం జారీ చేశాడు. అమ్మకుంటే అంతు చూస్తానని హెచ్చరించినట్లు సమాచారం. ఒకానొక సమయంలో దాడులు కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే చివరకు పోలీసులు కలుగజేసుకొని కర్నూలులో వ్యాపారం చేస్తున్న బాషా, శరణయ్యలను వెలుగోడు వ్యక్తికి సహకరించాలని, లేదంటే ఇబ్బందులు పడతారని హెచ్చరించి రాజీ చేసినట్లు చర్చ జరరుగుతోంది. అయినప్పటికీ రెండు వర్గాల మధ్య వార్ నడుస్తోందని, ఎప్పుడు ఏమి జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. మిన్నకుండిపోయిన నిఘా వ్యవస్థలు జిల్లాలో ప్రతి నెలా బియ్యం దందా రూ.100 కోట్ల వరకు జరుగతున్నా పౌరసరఫరా, పోలీసు, విజిలెన్స్ నిఘాలకు మాత్రం దొరకని పరిస్థితి. బహిరంగంగా తెలిసినా ఎవరూ తమకు తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు. పైగా అక్రమ బియ్యం ఎక్కడైనా ఉంటే తమకు చెబితే పట్టుకుంటామని పౌరసరఫరాల అధికారులు చెబుతుండడం గమనార్హం. మరోవైపు విజిలెన్స్ ఇన్‌ఫ్మార్మర్లను సైతం పచ్చ మూకలు కనిపెట్టినట్లు తెలుస్తోంది. వారిని దారికి తెచ్చుకోవడం, లేదంటే భయపెట్టే వరకు వెళ్లడంతో ఆ వ్యవస్థ కూడా దిక్కుతోచని స్థితిలో ఉంటోంది. ఇక పోలీసులు చాలా చోట్ల వారికి అన్నీ తెలిసినా ఏమీ అనకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ బియ్యం దందాలో పోలీసులకు పెద్ద ఎత్తున మామూళ్లు అందుతున్నట్లు బహిరంగంగానే చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల వారీగా ‘పచ్చ’ ముఠాలు కర్నూలులో దాదాపు 25 గ్యాంగులు బియ్యం దందాలో ఉన్నాయి. బుధవారపేటకు చెందిన వ్యక్తి, పాతబస్తీకి చెందిన మరో వ్యక్తి ఆయా గ్యాంగుల నుంచి బియ్యాన్ని సేకరిస్తున్నారు. వీరికి పట్టణం నడిబొడ్డున బుధవారపేట, శరీన్‌నగర్, వీకర్ సెక్షన్‌కాలనీ, పంచలింగాలలో గోదాములు ఉన్నాయి. అక్కడి నుంచి బియ్యాన్ని జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. కాగా, వీరిద్దరూ ఓ మంత్రికి అనుచరులు. శ్రీశైలం నియోజకవర్గంలోని వెలుగోడుకు చెందిన ఓ వ్యాపారి ఓ ఎమ్మెల్యే భర్త ఆశీస్సులతో శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, కర్నూలులలో బియ్యం సిండికేట్‌కు తెరలేపారు. డోన్, కోడుమూరు, పత్తికొండలో అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుడు వెల్దుర్తి కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా చేస్తున్నాడు. గతంలో ఆయన ఉమ్మడి జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదోనిలో ఓ బీజేపీ నాయకుడు తన కింద 10మందితో బియ్యం దందాను నడిపి కర్ణాటకలోని శిరుగుప్పు, రాయచూరు, బళ్లారి వరకు విస్తరించారు. ఆలూరు నియోజకవర్గంలో బియ్యం అక్రమ రవాణా వ్యాపారాన్ని గుంతకల్‌కు చెందిన వ్యక్తులు నడిపిస్తున్నారు. మంత్రాలయం, ఎమ్మిగనూరులో కొంత భాగం వెల్దుర్తి కేంద్రంగా పనిచేసే వ్యాపారి, మిగిలిన భాగాలను కొందరు టీడీపీ నాయకులు కర్ణాటక వ్యాపారులతో కలిసి నిర్వహిస్తున్నట్లు సమాచారం. న్యూస్‌రీల్ -
విశ్రాంత ఇంజినీర్ సుబ్బరాయుడుకు ‘గాడిచర్ల పురస్కారం’
కర్నూలు కల్చరల్: నగరానికి చెందిన నీటిపారుదల శాఖ విశ్రాంత ఇంజినీర్ ఎం.సుబ్బరాయుడుకు 29వ ‘గాడిచర్ల పురస్కారం’ను ఆదివారం ఆయన స్వగృహంలో ప్రదానం చేశారు. ఆంధ్ర తిలక్ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు 66వ వర్ధంతిని పురష్కరించుకొని గాడిచర్ల ఫౌండేషన్, ఎగ్జిబిషన్ సొసైటీ, ఏపీ గ్రంథాలయ సంఘం, విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తున్న గాడిచర్ల పురస్కారాన్ని ఈఏడాది సుబ్బరాయుడుకు చల్లా కాంపౌండ్‌లోని ఆయన స్వగృహంలో అందజేశారు. అనంతరం క్లస్టర్ యూనివర్సిటీ పరిఽధిలోని కేవీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని ప్రకాశం సభా భవనంలో గాడిచర్ల వర్ధంతి సభ జరిగింది. జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాడిచర్ల చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన క్లస్టర్ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య డీవీఆర్ సాయిగోపాల్ మాట్లాడుతూ విజ్ఞాన వేత్త సాగు, తాగు నీటి కోసం శ్రమించిన సుబ్బరాయుడు పనిలో దైవాన్ని చూసే వారన్నారు. నీటిని పదిలం చేసే పనిలో వంద శాతం కృషి చేశారన్నారు. రాయలసీమకు సాగు, తాగు నీరు కోసం విశేషంగా శ్రమించారన్నారు. క్లస్టర్ యూనివర్సిటీ లైబ్రరీకి గాడిచర్ల హరిసర్వోత్తమ రావు పేరు పెడతామన్నారు. గాడిచర్ల ఫౌండేషన్, సాహితీ సదస్సు అధ్యక్షుడు కురాడి చంద్రశేఖర కల్కూర మాట్లాడుతూ కృష్ణా నదిపై సిద్ధేశ్వరం అలుగు, తుంగ భద్రపై గుండ్రేవుల రిజర్వాయర్, వేదవతి నదిపైన ఎత్తిపోతల పథకం కడితే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని చెప్పిన దార్శనికుడు సుబ్బరాయుడని కొనియాడారు. క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు, రాయలసీమ జల సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీవీఎస్ కుమార్, తెలుగు భాషా వికాస ఉద్యమం కార్యదర్శి జేఎస్ఆర్కే శర్మ మాట్లాడారు. కార్యక్రమంలో ఏపీఎస్పీ బె బెటాలియన్ డీఎస్పీ మహబుబ్ బాషా, గ్రంఽథాయల సంస్థ మాజీ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి, మధుర కవి ఎలమర్తి రమణయ్య మాట్లాడారు. కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు దండెబోయిన పార్వతీ దేవి, డాక్టర్ రాధారాణి, చరిత్ర విభాగాధిపతి జయలక్ష్మి, ఉపన్యాసకులు విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
పెద్దాసుపత్రిలో వృద్ధురాలికి అరుదైన చికిత్స
కర్నూలు(హాస్పిటల్): ఆహారం, నీళ్లు మింగలేక ఇబ్బంది పడుతున్న వృద్ధురాలికి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు ఆపరేషన్ అవసరం లేకుండా ఎండోస్కోపి ద్వారా చికిత్స చేసి సమస్య పరిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం గద్వాలకు చెందిన అహ్మద్బీ (65) కొంత కాలంగా ఆహారం, నీళ్లు మింగలేక ఇబ్బంది పడుతోంది. ఈ మేరకు ఇటీవల ఆమె చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గ్యాస్ట్రో ఎంట్రాలజి విభాగానికి వచ్చింది. ఆమెను పరీక్షించిన ఆ విభాగాధిపతి డాక్టర్ మోహన్‌రెడ్డి అకలేషియా కార్డియా అనే జబ్బుతో బాధపడుతోందని నిర్ధారించారు. సాధారణంగా ఇలాంటి సమస్యకు ఆపరేషన్ ద్వారా పరిష్కరిస్తారు. కానీ ఆపరేషన్ అవసరం లేకుండా ఆదివారం ఎండోస్కోపి పరికరంతో పరోరల్ ఎండోస్కోపిక్ మయాటమి(పోయమ్) అనే విధానం ద్వారా అన్నవాహికలో దెబ్బతిన్న కండరాన్ని కట్‌చేసి తొలగించారు. ఇదే చికిత్సను డోన్ మండలం ధర్మవరానికి చెందిన రఘుయాదవ్(30) అనే యువకుడికి కూడా నిర్వహించారు. కోత, కుట్లు లేని ఈ చికిత్స వల్ల రోగి త్వరగా కోలుకుంటారని, రక్తస్రావం ఉండదని డాక్టర్ మోహన్‌రెడ్డి తెలిపారు. ఇలాంటి చికిత్సకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, ఈ ఆసుపత్రిలో తాము ఉచితంగా నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. -
దాన ధర్మం..పుణ్యఫలం!
● రంజాన్ మాసం ప్రత్యేకం ● జకాత్, పిత్రాకు అత్యధిక ప్రాధాన్యత ● ఒక రూపాయి దానం చేస్తే 70 రెట్లు ఫలితం గడివేముల: ముస్లింలకు అత్యంత ప్రీతికరమైనది రంజాన్ మాసం. జీవితాన్ని, జీవిత గమనాన్ని మార్చి మనసుకు ప్రశాంతత ఇచ్చే ఈ మాసంలో ఇస్లామియ బోధనల ప్రకారం నడుచుకుంటారు. దీనివల్ల మిగతా 11 నెలలు కూడా అదే విధంగా జీవించేలా అలవాటు అవుతుందని ముస్లింల నమ్మకం. ఇదే కాకుండా ఆరాధన విషయంలో ఇస్లాం నిర్వచనం విభిన్నమైంది. విధిగా చేయాల్సిన సమాజ్, రోజా, జకాత్, హజ్ వంటి ఆరాధనలే కాదు. దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఖురాన్ ఆదేశాల ప్రకారం చేసిన ప్రతి మంచి పని ఆరాధన కిందికే వస్తుంది. అందుకే రంజాన్ మాసంలో చేసే ఏ పనులకై నా 70 రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుందని ముస్లింల నమ్మకం. ఒక రూపాయి దానం చేస్తే రూ.70 దానం చేసినంత పుణ్యం లభిస్తుందని ముస్లిం పెద్దలు చెబుతున్నారు. అందుకే ఈ మాసంలో అందరూ దానం చేస్తారు. దానధర్మాలు రెండు రకాలు సమాజంలో నిర్భాగ్యులు, అనాథలను ఆదుకోవడానికి దానం చేయాలని ఇస్లాం బోధిస్తుంది. అందుకే ముస్లింలు రంజాన్ మాసంలో ఇతోధికంగా దాన ధర్మాలు చేస్తుంటారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడరు. ఇస్లాంలో దానధర్మాలు రెండు రకాలు ఒకటి తప్పనిసరిగా చేయవలసినది జకాత్. అంటే తన వద్ద ఉన్న సంపదలో 2.5 శాతం పేదలకు పంచాలి. ఇలా చేయడం ద్వారా సంపద శుద్ధి అవుతుందని నమ్మకం. రెండోది ఫిత్రా. రంజాన్ మాసం తర్వాత రోజు ఈద్ నమాజ్ కన్నా ముందు ఫిత్రా తప్పనిసరిగా చెల్లించాలి. ఇంట్లో ఎంత మంది ఉంటే అందరి పేరిట ఫిత్రా దానం తప్పనిసరిగా చేయాలి. రెండు కిలోల 50 గ్రాముల ధాన్యం లేదా గోధువులు లేదా వాటి మార్కెట్లో వాటి ధరకు సరిపడ సొమ్మునైనా పేదలకు దానంగా చేయాలి. పేదలు కూడా ధనికులతో సమానంగా పండుగ చేసుకోవాలన్నది ఈ సాయం ఉద్దేశం. అల్లా ప్రసాదించిన మాసం మానవుల అధికంగా పుణ్యం చేకూర్చేందుకే అల్లా ప్రసాదించిన నెల రంజాన్. ఈ మాసంలో ఆధ్యాత్మికతలో గడపాలి. నిరుపేదలకు ఫిత్రా, జకాత్ చేయాలి. నిష్టతో ఉప వాసం ఉండాలి. ప్రతి ముస్లిం జకాత్ తప్పనిసరిగా ఇవ్వాలి. పేదలు కూడా ధనికులతో సమానంగా పండుగా చేసుకునేలా చూడాలి. సాధ్యమైనంత వరకు మంచి పనులు చేయాలి. అప్పుడే అల్లా కరుణిస్తాడు. ఈ మాసంలో చిన్న దానం చేసినా పుణ్యం లభిస్తుంది. –ఖాజీ మౌలానా షేక్ అబ్దుల్ రెహమాన్ రషాది, ప్రభుత్వఖాజీ, గడివేముల మండలం దానం చేస్తే రెట్టింపు పుణ్యం రమదాన్ మాసంలో రూ.1 దానం చేస్తే రూ.70 దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ప్రతి ముస్లిం జకాత్ తప్పనిసరిగా ఇవ్వాలి. తను ఉన్న ఇల్లు కాకుండా ఇతర మార్గాల్లో వచ్చే సంపదలో 2.5 శాతం జకాత్‌గా చెల్లించాలి. ఇది అల్లా ఆదేశం. రంజాన్ మాసంలో రోజా ఉండటం ఎంత ముఖ్యమో పేదలకు సాయం చేయడం కూడా అంతే ముఖ్యం. –హఫీజ్ జాఫర్ ఉశేన్,మంచాలకట్ట. -
విద్యార్థులకు సంస్కారం అవసరం
కర్నూలు కల్చరల్: విద్యార్థులకు చదువే కాదు సంస్కారం కూడా అవసరమని జిల్లా జడ్జి జి.కబర్ది అన్నారు. ఆదివారం ఓల్డ్‌సిటీ చిదంబరావు వీధిలోని స్వామి వివేకానంద సంస్కృత పాఠశాలలో అన్నపూర్ణమ్మ విద్యార్థి వసతి గృహం వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువు, సంస్కారం అందించడం అభినందనీయమన్నారు. హైదరాబాద్ ఆర్ఎస్ఎస్ క్షేత్ర సేవా ప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్ ముఖ్య వక్తగా హాజరై సందేశమిచ్చారు. పారిశ్రామికవేత్త శేరి బాలనాగరాజు, ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యకారిని సభ్యులు సుబ్బ లక్ష్మయ్య, వసతి గృహం అధ్యక్షులు బి.చిరంజీవిరెడ్డి, కార్యదర్శి కె.బాలాజీరావు మాట్లాడారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లా జడ్జి జి.కబర్ది -
ఏపీజీబీని కడపలోనే కొనసాగించాలి
కర్నూలు(అగ్రికల్చర్): విలీనం తర్వాత అతి పెద్ద బ్యాంకుగా అవతరించనున్న ఆంధప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించే విధంగా ప్రభుత్వాన్ని కోరుతామని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రామకృష్ణ అన్నారు. ఆదివారం ఏపీజీబీ అధికారుల సంఘం ప్రతినిధులు బీజేపీ జిల్లా అధ్యక్షుడిని కలసి వినతిపత్రం సమర్పించారు. ప్రధాన కార్యాలయాన్ని కడపకు తరలించడం ద్వారా కలిగే నష్టాలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి కోరుతామని తెలిపారు. ఆర్థిక శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కూడా ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించాల్సి ఉందని తెలిపారు. అభివృద్ధి మొత్తాన్ని ఆమరావతిలోనే కేంద్రీకృతం చేస్తే ప్రాంతీయ విభేదాలు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ఏపీజీబీ అధికారుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఘనంగా గురు వైభవోత్సవాలు
మంత్రాలయం: ప్రహ్లాదరాయల వరదుడు.. యతి వరేణ్యుడు శ్రీరాఘవేంద్ర స్వామి గురు భక్తి వైభవోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. రెండో రోజు ఆదివారం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో వేకువ జామున సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పూజా మందిరంలో పీఠాధిపతి చేపట్టిన మూల, జయ, దిగ్విజయ రాముల సంస్థాన పూజలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వేద మంత్రోచ్ఛారణలు, భక్తి కీర్తనలు, మంగళవాయిద్యాల మధ్య అర్చన, అభిషేకాది పూజలు, దివిటీ సేవలు నిర్వహించారు. అనంతరం రాఘవేంద్రుల మూల బృందావనానికి పంచామృతాభిషేకం గావించి పుష్పాలంకరణ చేపట్టి హారతులు పట్టారు. వేడుకల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది. పూజోత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక చింతనలో ముంచింది. అనుగ్రహ ప్రశస్థి అవార్డులు వేడుకల సందర్భంగా యోగీంద్ర మంటపంలో కర్ణాటక రేల్వే సహాయక మంత్రి సోమన్న రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్థి అవార్డు అందుకున్నారు. అదే మంటపంలో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బెంగళూరుకు చెందిన విదూషి అదితి నారాయణ కర్ణాటక సంగీత విభావరి, బెంగళూరుకు చెందిన కడప హనుమేష్ ఆచార్ వీణానాద ప్రదర్శన అలరించాయి. ఉత్సవాల్లో ఏఏవో మాధవశెట్టి, సలహాదారు శ్రీనివాసరావు, మేనేజర్ వెంకటేష్‌జోషి, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, మేనేజర్–సి సురేష్ కోనాపూర్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, సంస్కృత విద్యాపీఠం ప్రధానాచార్యులు వాదీరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. -
ప్రముఖ విద్యావేత్త రాయసం రత్నస్వామి మృతి
వెలుగోడు: ప్రముఖ విద్యావేత్త, వెలుగోడు గ్రామ నివాసి డాక్టర్ రాయసం రత్న స్వామి (90) ఆదివారం స్వగృహంలో వయోభారంతో కన్నుమూశారు. వెలుగోడులో అనేక విద్యాసంస్థలకు సారథ్యం వహించిన ఈయన నీలం సంజీవరెడ్డి డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. సర్దార్ పటేల్ ఐటీఐను స్థాపించారు. ముస్లిం మైనార్టీల కోరిక మేరకు స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో స్థానికంగా ఉర్దూ కళాశాల స్థాపించారు. సామాజిక సేవలో భాగంగా రూరల్ డెవలప్మెంట్ సొసైటీని ఏర్పాటు చేసి తన సేవలను జిల్లా వ్యాప్తంగా అందించారు. అలాగే వృద్ధాప్య ఆశ్రమాన్ని స్థాపించి వృద్ధులకు వసతి కల్పించారు. అవివాహితుడైన రత్న స్వామి మృతి విషయం తెలియగానే గ్రామస్తులు, విద్యావేత్తలు, మేధావులు సంతాపం తెలియజేశారు. స్నేహితుడి కుటుంబానికి చేయూత గోనెగండ్ల: అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి స్నేహితులు అండగా నిలిచారు. లక్షరూపాయలు సాయం అందజేసి గొప్ప మనసును చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే..గోనెగండ్లలోని శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన పూజారి ఒంకార్ (48)కు భార్య పూజారి లత, కూతురు, కుమారుడు ఉన్నారు. మోటర్ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించే ఈయనకు వారం రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు పెంచికల పాడు ఆసుపత్రిలో చేర్పించగా కోలుకోలేక ఆదివారం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న గోనెగండ్ల జెడ్పీ హైస్కూల్ 1992–93 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థులు, మెకానిక్ యూనియన్ సభ్యులు ఒంకార్ స్వగృహానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రూ. లక్ష సాయం అందజేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
మోతాదుకు మించి పురుగుమందులు వాడొద్దు
కర్నూలు(అగ్రికల్చర్): మోతాదుకు మించి పురుగు మందులు పిచికారీ చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని ఇన్పుట్ డీలర్లను ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీలత సూచించారు. కలెక్టరేట్లోని వ్యవసాయ శాఖ సమావేశ మందిరంలో ఆదివారం ఇన్పుట్ డీలర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మ డీపీడీ మాట్లాడుతూ.. పురుగుమందులు ఎక్కువగా వాడుతుండటంతో ఆహార పంటలు, కూరగాయల్లో వాటి అవశేషాలు ఉంటున్నట్లు స్పష్టమవుతోందన్నారు. విశ్రాంత జేడీఏ, దేశీ శిక్షణ కార్యక్రమం సమన్వయకర్త జయచంద్ర పాల్గొన్నారు. నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నిధులు దుర్వినియోగం చేశారని ఆ సంఘం కోశాధికారి భాస్కరనాయుడు, మరి కొందరు కార్యవర్గ సభ్యుల ఫిర్యాదు చేశారు. సంఘం తాలూకా కార్యవర్గాల ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా నాయకత్వం ఏకపక్షంగా ముందుకు పోతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కేవీ శివారెడ్డి, ఎ.విద్యాసాగర్ చర్యలు చేపట్టారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు తాలూకా ఎన్నికలు జరుపవద్దని, సంఘం నిధుల దుర్వినియోగంపై వస్తున్న ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని జిల్లా నాయకత్వాన్ని ఆదేశించారు. అలాగే జిల్లా సంఘంలో వైస్ ప్రెసిడెంటుగా ఉన్న ఆర్వీ రమణ.. జిల్లా నాయకత్వంపై పలు విమర్శలు చేశారు. సంఘం ఆదాయాన్ని స్వాహా చేస్తున్నారని పేర్కొంటూ 21 అంశాలపై ఆరోపణలు చేస్తూ పత్రిక ప్రకటన విడుదల చేశారు. వీటిని రాష్ట్ర నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. -
అన్నదాన పథకానికి విరాళం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణకు ఆదివారం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దశరథరామమ్ రూ.లక్ష విరాళా న్ని పర్యవేక్షకురాలు హిమబిందుకు అందజేశారు.● ఆదోని పట్టణంలో కోసిగికి చెందిన రాఘవేంద్ర, గోవిందమ్మల నుంచి 5.27 క్వింటాళ్ల బియ్యం, రవాణా వాహనం సీజ్ సీజ్. ● కర్నూలు రూరల్ మండలం పంచలింగాల సమీపంలో లారీని సీజ్ చేసి 135 బస్తాల బియ్యం స్వాధీనం. లారీ ఓనర్ ప్రైమ్ సీలోరియాతో పాటు మద్దిలేటి అనే వ్యక్తిపై క్రిమినల్ కేసు. ● పత్తికొండ మండలం హోసూరులో 52 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం. అరుణాక్షి, రామకృష్ణలపై క్రిమినల్, 6ఏ కేసులు. ● తుగ్గలి మండలం రాంపల్లి వద్ద లారీ, ఓ కారును సీజ్ చేసి 1100 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం. అనంతపురం జిల్లాకు చెందిన డి.శంకర్, శివప్రసాద్, తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన భాస్కరరెడ్డి, డోన్ మండలం చింతలపేటకు చెందిన వడ్డే సురేష్‌లపై కేసు. ● కల్లూరు చెన్నమ్మ సర్కిల్‌వద్ద 30 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం. కె.మహేశ్, జయప్రకాష్‌నాయుడు, ఇర్ఫాన్‌పై కేసు. ● మంత్రాలయం మండలం మాధవరం చెక్‌పోస్టు వద్ద కర్ణాటకకు తరలిస్తున్న 80 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం. ● ఆదోని పట్టణం ఢణాపురం రోడ్డులో 3.20 క్వింటాళ్ల బియ్యం సీజ్ చేసి షేక్ షబ్బీర్‌పై కేసు నమోదు. మరో కేసులో 3.51 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం. వాహనాన్ని సీజ్ చేసి అబ్దుల్ రహిమాన్ అనే వ్యక్తిపై కేసు. ఇటీవల నమోదైన కొన్ని 6ఏ, క్రిమినల్ కేసులు -
ప్చ్.. వినపడటం లేదు..!
వినికిడి సమస్యకు కారణాలు ● ధ్వని ఎక్కువగా ఉండే పరిసరాల్లో ఉండటం ● మొబైల్, బ్లూటూత్, హెడ్ఫోన్లలలో పెద్దశబ్దంతో మ్యూజిక్ వినడం ● వాహనాల శబ్దాలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో ఎక్కువసేపు ఉండటం ● జన్యుకారణాలు, పుట్టుకతో వచ్చే లోపాలు ● మేనరికం, వంశపారంపర్యంగా రావడం ● వృద్దాప్యం, చెవి మధ్యలో ఇన్ఫెక్షన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● చెవి శుభ్రతకు బడ్స్, పిన్ను సూదులు తదితరాలు ఉపయోగించకూడదు. ● చెవిలో నొప్పికి నూనె, ఆకుపసర్లు వేయకూడదు. ● చెవిలో చీము కారుతుంటే స్విమ్మింగ్ చేయకూడదు. ● చెవిలో నీరు పోకుండా నూనె అంటిన దూదిని చెవిలో పెట్టుకోవాలి. ● ఎక్కువ శబ్దాలు వచ్చే ప్రదేశంలో పనిచేసే వారు ఇయర్ ప్లగ్స్ వాడాలి. ● ప్రతి ఆరు నెలలకు ఒకసారి వినికిడి పరీక్ష చేయించుకోవడం మంచిది. ● బ్లూటూత్, హెడ్ఫోన్లతో వినికిడి సమస్య ● పెద్దగా మ్యూజిక్ వినడంతో ఇబ్బందులు ● కొందరికి పుట్టుకతో వినికిడి లోపం ● పరిష్కారం చూపుతున్న ఆధునిక హియరింగ్ ఎయిడ్లు ● నేడు ప్రపంచ వినికిడి సమస్య అవగాహన దినంకర్నూలు(హాస్పిటల్): స్మార్ట్ ఫోన్ అధిక వినియోగం ఎన్నో అనర్థాలకు దారి తీస్తోంది. ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వినికిడి సమస్య బాధితులు పెరుగుతున్నారు. ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడటం, అధిక శబ్దంతో పాటలు వినడం, బ్లూటూత్, హెడ్సెట్ వినియోగించడం తదితర కారణాలతో వినికిడి సమస్య ఏర్పడి బాధితులు అవస్థలు పడుతున్నారు. ఎదుటి వారు చెప్పేది సరిగా వినిపించకపోతే తలెత్తే సమస్య అంతా ఇంతా కాదు. వినికిడి సమస్యను అధిగించేందుకు ఏటా మార్చి 3న ప్రపంచ వినికిడి సమస్య అవగాహన దినాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లాలో వినికిడి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. ఐదేళ్ల క్రితం జిల్లాలో వీరి సంఖ్య 4వేల దాకా ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య 5 వేలు దాటిందని వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటు పాక్షికంగా సమస్య ఉన్న వారి సంఖ్య ఇందుకు మూడింతలు ఉంటుందని వారి అంచనా. కర్నూలుతో పాటు ఆదోని, ఎమ్మిగనూరులలో చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టి ) వైద్యుల వద్దకు చెవిలో ఇబ్బందులతో రోజుకు సగటున 250 నుంచి 300 మంది వస్తుండగా అందులో వినికిడి సమస్యతో బాధపడే వారు 40 శాతానికి పైగా ఉంటున్నారు. ఇలాంటి వారు సరిగ్గా వినపడని కారణంగా శారీరక, మానసిక సమస్యలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్య కొందరికి పుట్టుకతో వస్తుండగా మరికొందరికి ప్రమాదాల్లో సమస్య ఏర్పడుతోంది. సమస్యను పరిష్కరిస్తున్న వినికిడి మిషన్లు ఆధునిక టెక్నాలజీతో కంప్యూటరైజ్డ్ వినికిడి మిషన్లు వచ్చాక చాలా మంది వాటిని వాడటం సులభంగా మారింది. వీటిని వైద్యులు చెవిలోపల, చెవి వెనుక కనిపించకుండా అమరుస్తారు. ఇవి వాడటం వల్ల మనకు ఎంత వినికిడి శక్తి కావాలో అంతే తీసుకుంటుంది. నాయిస్ రిడక్షన్ ఆప్షన్ ఉండటం, అడ్వాన్స్ టెక్నాలజీ రిమోట్ కంట్రోల్ హియరింగ్ ఎయిడ్స్ ద్వారా మనం ఎంత సౌండ్ కావాలో ఈ టెక్నాలజి ఉపయోగపడుతుంది. పుట్టుకతోనే వినికిడి సమస్య ఉన్న పిల్లలకు వినికిడి మిషన్లు అమర్చి స్పీచ్‌థెరపీ ఇప్పిస్తే వారు త్వరగా మాటలు వినడమే గాక అర్థం చేసుకుని తిరిగి మాట్లాడేందుకు సులభం అవుతుంది. వినికిడి మిషన్ వాడటం వల్ల చిన్నశబ్దాలు, మాటలు మొదలుకొని దూరం నుంచి వచ్చే శబ్దాలు, మాటలు చక్కగా వినగలరు. ఉన్న వినికిడి లోపం పెరగకుండా కాపాడుకోగలరు. చెవిలో నుంచి శబ్దం తగ్గుతుంది. వినికిడి పరీక్ష ఇలా చేయించుకోవాలి వినికిడి సమస్య ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే ఈఎన్టీ వైద్యులు, ఆడియాలజిస్టు వద్దకు వెళ్లి ఆడియోమెట్రి పరీక్ష చేయించుకోవాలి. దీనివల్ల ఎంత శాతం వినికిడి కోల్పోయింది. ఎందువల్ల అని నిర్దారణ అయితే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆడియోమెట్రిక్ పరీక్ష చేయించుకున్న తర్వాత సెన్సార్ హియరింగ్ లాస్ అయితే వినికిడి మిషన్, హియరింగ్ ఎయిడ్ తప్పనిసరిగా వాడాలి. దీనివల్ల చిన్న శబ్దాలు, మాటలు మొదలుకొని దూరం నుంచి వచ్చే శబ్దాలు, మాటలు చక్కగా వినిపిస్తాయి. ఉన్న వినికిడి లోపం పెరగకుండా కాపాడుకోవచ్చు. -
ప్రశాంతంగా ‘ఏకలవ్య’ ప్రవేశ పరీక్ష
కర్నూలు(అర్బన్): గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఏకలవ్య మోడల్ స్కూల్స్‌లో 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించి ఆదివారం పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి కే తులసీదేవి తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి స్థానిక బీ క్యాంప్‌లోని ఏపీటీడబ్ల్యూఆర్ (బాలికలు) స్కూల్లో ఈ పరీక్షను నిర్వహించామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ పాఠశాలల్లో ప్రవేశాలకు కర్నూలు జిల్లా నుంచి 42 మంది బాల బాలికలు దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరిలో ఎంట్రెన్స్ టెస్ట్‌కు బాలురు 30 మందికి గాను 19 మంది, బాలికలు 12 మందికి గాను 9 మంది హాజరు అయ్యారన్నారు. మిగిలిన 14 మంది పరీక్షకు హాజరు కాలేదని తెలిపారు. ‘ఎకై ్సజ్’ సంఘం అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎగ్జిక్యూటీవ్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా కర్నూలుగా ఈఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు. ఆదివారం కర్నూలు ఎకై ్సజ్ కార్యాలయం ఆవరణలో జిల్లా డీపీఈఓ మచ్చా సుధీర్‌బాబు అధ్యక్షతన ఎన్నిక లు జరిగాయి. అసోసియేట్ ప్రెసిడెంట్‌గా సోమశేఖర్ (డోన్ ఎస్ఐ), ఉపాధ్యక్షులుగా బార్గవ్‌రెడ్డి (కోసిగి ఎస్ఐ), ప్రధాన కార్యదర్శిగా సందీప్ (కోవెలకుంట్ల ఎస్ఐ), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రమేష్‌రెడ్డి (ఎమ్మిగనూరు సీఐ), సహాయ కార్య దర్శిగా రహెనాబేగం (కర్నూలు ఎస్ఐ), కోశాధికారిగా దుర్గా నవీన్‌బాబు (కర్నూలు ఎస్ఐ), కార్యవర్గ సభ్యులుగా ఇన్స్పెక్టర్లు శ్రీధర్, రమాదేవి, శేషాచలం, సబ్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్‌కుమార్ నాయక్, ఇంద్ర కిరణ్ తేజ ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి సుధీర్‌బాబు, ఏఈఎస్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆధ్యాత్మిక భావం అలవర్చుకోవాలిఆళ్లగడ్డ: సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావం అలవర్చుకోవాలని అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీ రంగరాజ యతీంత్ర మహాదేశికన్ స్వామీజీ అన్నారు. అహోబిలం క్షేత్రంలో ఇస్కాన్ ఇండియా యూత్ కౌన్సిల్ (ఐఐవైసీ) సమావేశాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఆదివారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీఠాధిపతి ప్రసంగిస్తూ.. నేటి యువత ఆధ్యాత్మిక భావనలు కలిగి ఉండి రేపటి తరానికి ఆదర్శంగా నిలవాలన్నారు. అహోబిలం క్షేత్రం చరిత్ర, ప్రాశస్త్యం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మఠం ప్రతినిధి శ్రీకార్యం, ప్రధానార్చకులు వేణుగోపాలన్ పాల్గొన్నారు. సైక్లింగ్‌తో ఆరోగ్యం కర్నూలు (టౌన్): ‘ప్రతి రోజు కొంత సమయాన్ని కేటాయించి సైక్లింగ్ చేద్దాం.. ఆరోగ్యంగా ఉందాం’ అంటూ జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, శాయ్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) సెంటర్ ఆధ్వర్యంలో కర్నూలులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్డీవో మాట్లాడుతూ ఆరోగ్య భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా కార్యక్రమం దేశ వ్యాప్తంగా నిర్వహిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో సైక్లింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. -
ఎస్ఐ శిక్షణలో ప్రతిభ
కర్నూలు: కర్నూలు పట్టణం ప్రకాష్‌నగర్‌కు చెందిన చైతన్య స్వరూపరాణి ఎస్ఐ శిక్షణలో ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఈ నెల 1వ తేదీన అనంతపురం పోలీస్ శిక్షణ కేంద్రంలో ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ నేపథ్యంలోనే చైతన్య స్వరూపరాణి ఫైరింగ్‌లో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ట్రోఫీ అందుకున్నారు. కర్నూలు ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవి దంపతుల కూతురు చైతన్య డిగ్రీలో బయో టెక్నాలజీ పూర్తి చేశారు. పత్తికొండకు చెందిన వెంకటేశ్వర్లు ఉద్యోగ రీత్యా కర్నూలులో ఉంటున్నారు. తండ్రిని ఆదర్శంగా తీసుకొని పోలీస్ శాఖలో ఎస్ఐ పోస్టును సాధించినట్లు చైతన్య తెలిపారు. 12 నెలల శిక్షణ కాలంలో ప్రతిభను చూపినందుకు గోల్డ్ మెడల్ దక్కిందని, మే నెల నుంచి నెల రోజుల పాటు ఏపీఎస్పీ కర్నూలు బెటాలియన్‌లో శిక్షణ పొందనున్నట్లు చైతన్య తెలిపారు. తనను అనంతపురం జిల్లాకు కేటాయించినట్లు ఆమె తెలిపారు. హ్యాండ్‌బాల్ విజేత కల్లూరు జట్టు కర్నూలు (టౌన్): స్థానిక బి. క్యాంపు క్రీడా మైదానంలో నిర్వహించిన హ్యాండ్‌బాల్ ఇన్విటేషన్ పోటీల్లో కల్లూరుకు చెందిన బడే సాహెబ్ జట్టు విజేతగా నిలింది. ఈ పోటీల్లో నాలుగు జట్లు పాల్గొన్నాయి. బహుమతుల కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు పాల్గొని మాట్లాడారు. ఇన్విటేషన్ పోటీల్లో పాల్గొనడం ద్వారా క్రీడాకారుల్లో ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. జిల్లాలోనే కర్నూలుకు హ్యాండ్‌బాల్ క్రీడలో మంచి పేరు ఉందని, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎంతో మంది క్రీడాకారులు ప్రతిభ చాటారన్నారు. కార్యక్రమంలో జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం కార్యదర్శి సువర్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు చిన్న సుంకన్న తదితరులు పాల్గొన్నారు. -
వినికిడి సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు
చెవిలో సమస్య వచ్చిన వారు నిర్లక్ష్యం చేయకూడదు. వైద్యులను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలి. చెవి సమస్యలను నిర్లక్ష్యం చేస్తే కొన్నిసార్లు అవి వినికిడి లోపానికి దారి తీసే ప్రమాదం ఉంది. ఉదాహరణకు చిన్నపిల్లల్లో దగ్గు, జలుబు వచ్చినప్పుడు చెవి బ్లాక్ అవుతుంది. దానివల్ల కొన్నిసార్లు వినికిడి సమస్య రావచ్చు. చెవిలో రంధ్రం పడితే మైరింగోప్లాస్టీ ఆపరేషన్ చేస్తాం. పెద్దల్లో నరాల బలహీనత వల్ల వినికిడి సమస్య వస్తుంది. వీరికి ఆడియోమెట్రీ పరీక్ష చేసి మందులు వాడాల్సి ఉంటుంది. తగ్గకపోతే హియరింగ్ ఎయిడ్ వాడాల్సి వస్తుంది. – డాక్టర్ వై. ప్రవీణ్‌కుమార్, ఈఎన్టీ వైద్యులు, కర్నూలు సరైన హియరింగ్ ఎయిడ్ వాడాలి వినికిడి సమస్య ఉన్న వారు అవసరమైన చికిత్సను పొందకపోయినా, వినికిడి మిషన్‌ను ఉపయోగించకపోయినా, ఎక్కువగా సెల్‌ఫోన్ రేడియేషన్, శబ్దకాలుష్యానికి గురైనా వారి వినికిడి సామర్థ్యం మరింత క్షీణిస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత పూర్తిగా వినికిడి శక్తి కోల్పోతారు. సరైన హియరింగ్ ఎయిడ్, లిజనింగ్ ట్రైనింగ్ ద్వారా వినికిడి లోపం తగ్గించవచ్చు. బ్యాలెన్స్ సమస్యను బ్యాలెన్స్ థెరపి సహాయంతో పరిష్కరించవచ్చు. వినికిడి సమస్య ఉన్న వారు ఆడియాలజిస్టును సంప్రదిస్తే పరీక్షించి అవసరమైన పరికరాన్ని అమరుస్తారు. మిషన్లు పెట్టుకోవడానికి నామోషీ పడేవారికి చెవిలోపల కూడా అమర్చే మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. – రోజా బంగి, ఆడియాలజిస్టు, కర్నూలు -
ఎస్టీ రిజర్వేషన్ సాధనకు నేడు వీఆర్పీఎస్ ధర్నా
కర్నూలు(అర్బన్): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాల్మీకి/ బోయలకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలనే ప్రధాన డిమాండ్‌పై సోమవారం ఉదయం 11.30 గంటలకు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మొలగవెళ్లి రామాంజనేయులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాల్మీకి/ బోయలకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించేందుకు పార్లమెంట్లో చట్టం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా జిల్లా నలుమూలల నుంచి వాల్మీకులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. -
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్టు
బేతంచెర్ల: మండల పరిధిలోని ముసలాయిచెర్వు గ్రామంలో గత నెల 25వ తేదీన జరిగిన హత్యా యత్నం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. సీఐ వెంకటేశ్వరరావు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు. ముసలాయి చెర్వుకు చెందిన పల్లె రాములమ్మ, కొడుకు మహేశ్వర్‌రెడ్డి పొలం గట్టు విషయంలో పాత కక్షలు మనసులో పెట్టుకొని అదే గ్రామానికి చెందిన కుంచె రామేశ్వర్‌రెడ్డి, కొడుకు సుదర్శన్‌రెడ్డిపై కత్తితో దాడి చేసి గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మండలంలోని రంగాపురం గ్రామంలో ఇద్దరు నిందితులు ఉన్నారనే సమాచారం మేరకు దాడి చేసి అరెస్టు చేశారు. డోన్ కోర్టులో హాజరు పరుచగా రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. నిందితుల ను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులు గురుబాబు, శ్రీను, దస్తగిరి, రాజు నాయక్, సురేష్ కుమార్, వెంకటేష్‌ను సీఐ అభినందించారు. -
విద్యార్థిని శ్రీలేఖ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
కర్నూలు(సెంట్రల్): ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విద్యార్థిని జి.శ్రీలేఖ కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల సి.బెళగల్ మండలం పోలకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న సైన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న శ్రీలేఖతో పాటు మరో ఆరుగురిపై చెట్టు కొమ్మ విరిగి పడగా తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలుపెద్దాసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీలేఖ ఆదివారం చనిపోవడంతో విషయాన్ని కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా రూ.5 లక్షలు మంజూరు చేశారు. బాలిక మృతి దురదృష్టకరమని చెప్పారు.