Palnadu
-
మాతా, శిశు మరణాలు నివారించాలి
వైద్యాధికారులకు సూచించిన డీఎంహెచ్‌వో నరసరావుపేట: జిల్లాలో మాతా, శిశు మరణాలు చోటు చేసుకోకుండా చూడాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.రవి ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో మాతృ, శిశు మరణాలపై సమీక్ష చేశారు. శిరిగిరిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆరేపల్లి ముప్పాళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో చోటుచేసుకున్న రెండు మాతృ మరణాలు, రామిరెడ్డిపేట యూపీహెచ్సీ, సత్తెనపల్లి, వినుకొండ కో–లొకేటెడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలలో జరిగిన మూడు శిశు మరణాలు సంభవించడానికి గల కారణాలను వైద్యాధికారులు, కాన్పులు నిర్వహించిన ప్రైవేటు వైద్యశాల నుంచి హాజరైన గైనకాలజిస్ట్, అనస్తిష్టు, చిన్నపిల్లల వైద్యులను విచారించి మరణాలకు దారితీసిన కారణాలు తెలుసుకున్నారు. గర్భిణులు పోషకాహారం, హిమోగ్లోబిన్ శాతం, గర్భస్థ శిశువు కదలికలన్నింటినీ తెలుసుకునేందుకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చేసే అల్ట్రా సోనోగ్రఫీ, టిఫ్ పరీక్షలను చేయించుకునే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. డెప్యూటీ డీఎంహెచ్‌వో పద్మావతి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ గీతాంజలి, డాక్టర్ మంత్రునాయక్, డాక్టర్ లక్ష్మణరావు, డీపీహెచ్‌ఎన్‌వో బి.సురేఖ, ఏఎన్ఎం, ఆశాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ప్రతి రైతు ఫాంపాండ్ ఏర్పాటు చేసుకోవాలి
వెల్దుర్తి: ప్రతీ ఒక్క రైతు తమ పొలంలో ఫాంపాండ్‌ను ఏర్పాటు చేసుకోవాలని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పీడీ సిద్ధ లింగమూర్తి సూచించారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజావేదికలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2023–24 సంవత్సరంలో జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు, పంచాయితీ రాజ్‌శాఖ పరిధిలో జరిగిన పనులపై సామాజిక తనిఖీల బృందం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 401 పనులకు గాను వేతనంగా రూ.7,03,58,938 /–లు, మెటల్ పనులకు రూ. 60,06,910/–లు మొత్తం రూ.7,63,65,848/–లు పంచాయితీరాజ్ డిపార్ట్మెంట్ కింద 135 పనులకు రూ. 2499/–లు, మెటల్ పనులకు రూ 2,25, 37,721/–లు మొత్తం రూ.2,25,40,220/–ల పను లు జరిగాయన్నారు. ఈ పనులపై గ్రామసభల ను ఏర్పాటు చేసి ప్రజావేదికను నిర్వహించటం జరి గిందన్నారు. కొత్త పుల్లారెడ్డి గూడెంకు చెందిన రామచంద్రనాయక్ తనకు ఆరు సంవత్సరాల నుంచి జాబ్ కార్డు లేదని తెలిపినప్పటికీ ఎవరూ స్పందించలేదని పీడీ దృష్టికి తీసుకురావటంతో అర్థగంటలోనే జాబ్ కార్డును తయారు చేసి ఆయనకు ఇవ్వటం జరిగింది. రామచంద్రనాయక్‌ను పీడీ లింగమూర్తి మీ పొలంలో ఫాంపాండ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన ఆయన వెంటనే మా పొలంలో ఫాంపాండ్‌ను ఏర్పాటు చేస్తానన్నారు. ఉపాధి హామీ సిబ్బంది రైతులను చైతన్యపరిచి పంట పొలాలలో ఫాంపాండ్లను ఏర్పాటు చేయాలన్నారు. వెనుకబడిన వెల్దుర్తి మండలంలో హార్టీకల్చర్ ద్వారా పండ్ల మొక్కలను నాటినప్పటికీ అవి బ్రతకటం లేదన్నారు. రైతులు పాంపాండ్‌ను ఏర్పాటు చేసుకుంటే కొంత వరకై నా పండ్ల మొక్కలను బ్రతికించుకోవచ్చన్నారు. 20 గ్రామ పంచాయతీలలో జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ బృందాలు గ్రామ సభలు నిర్వహించి పనులు జరిగిన విధానాలను ప్రజావేదికలో వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఇజిఎస్ ఏపీడీ కొరటా మల్లిఖార్జునరావు, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ కోటమ్మ, స్టేట్ రిసోర్స్‌పర్సన్ లోకేష్, ఎంపీడీవో ప్రసాద్, పంచాయతీరాజ్ ఏఇ శ్రీనివాసరెడ్డి, ఏపీవో రేఖాజ్యోతి, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, డీఆర్పీలు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పీడీ సిద్ధ లింగమూర్తి -
రేపు ఎయిమ్స్‌లో వాక్‌థాన్
మంగళగిరి: నగర పరిధిలోని ఆల్ ఇండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(ఎయిమ్స్) ఆవరణలో వాక్‌థాన్ నిర్వాహకులు వి.నేహ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా నెఫ్రాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 13న గురువారం ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు వాక్‌థాన్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఎయిమ్స్ ఆవరణలోని ఆడిటోరియంలో నిర్వహించే సమావేశంలో కిడ్నీ ప్రాముఖ్యంపై అవగాహన కల్పించనున్నట్టు వివరించారు. సాగర్ నీరు సాగు, తాగుకే వాడుకోవాలి నరసరావుపేట: నాగార్జునసాగర్ కుడికాలువకు కృష్ణా బోర్డు కేటాయించిన నీటిలో మిగిలిన నీరు మార్చి చివరి వరకు మాత్రమే సరిపోయే అవకాశం ఉన్నందున వృథా చేయకుండా పంట పొలాలు, తాగునీటి చెరువులకు మాత్రమే ఉపయోగించాలని ఎన్ఎస్పీ సూపరింటెండెంట్ ఇంజినీర్ కృష్ణమోహన్ సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మే నెలలో తాగునీటి చెరువుల కోసం నీరు విడుదల చేసేంత వరకు కాలువలు మూసివేయనున్నట్టు చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా విభాగం, ప్రజారోగ్యశాఖల అధికారులు తాగునీటి చెరువుల్లోని నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని కోరారు. రేపు సత్రశాలలో 16 రోజుల పండుగ సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద వేంచేసిన శ్రీగంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానంలో గురువారం 16 రోజుల పండగ నిర్వహించనున్నట్లు ఈఓ గాదె రామిరెడ్డి మంగళవారం తెలిపారు. మహాశివరాత్రి పండగ వెళ్లిన 16 రోజుల తరువాత దేవస్థానంలో స్వామివార్ల కల్యాణం నిర్వహించి అనంతరం కనులపండువగా వసంతోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తున్నట్లు వివరించారు. వలస పక్షుల రాక పెదకూరపాడు : కొల్లేరు ప్రాంతానికి విదేశీ పక్షులు రావడం అందరికీ తెలిసిన విషయమే. గుంటూరు జిల్లాలోనూ తక్కెళ్లపాడు చెరువుకు వలస పక్షులు రావడం సహజం. ఈ కోవలోనే పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరు గ్రామంలోని చెరువు కూడా వలస పక్షులకు ఆవాసంగా మారడంతో ప్రజలు పక్షులను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువు గట్లపైన పండ్ల మొక్కలు నాటి సంరక్షిస్తే పక్షులకు ఆవాసాలుగా మారతాయని, తద్వారా జీవవైవిధ్యాన్ని కాపాడవచ్చని పక్షి ప్రేమికులు కోరుతున్నారు. యార్డులో 1,44,323 బస్తాలు మిర్చి విక్రయం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 1,38,953 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,44,323 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. -
నిలువునా ముంచింది
విద్యార్థులు, యువతను కూటమి ప్రభుత్వం నిలువునా ముంచింది. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతోంది. ఉద్యోగాల భర్తీ లేదు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు యత్నిస్తోంది. సర్కారుపై పోరు గళం విప్పుతాం. ఏపీ కామన్ పీజీ సెట్‌ను రద్దు చేయాలి. జీవో నంబర్ 77ను రద్దు చేసి పీజీ స్టూడెంట్లకూ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలి. వెటర్నరీ విద్యార్థులకు రూ.25వేల స్టైఫండ్ చెల్లించాలి, – కోట సాయికుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ -
అన్ని రంగాల్లో మహిళలు పురోగతి సాధించాలి
నాదెండ్ల: ఆర్థ్ధిక, సామాజిక, రాజకీయంగా మహిళలు పురోగతి సాధించాలని, కుటుంబ నిర్ణయాల్లో మహిళలు ప్రధాన భూమిక పోషించాలని పల్నాడు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పీడీ హీరాలాల్‌నాయక్ చెప్పారు. నాదెండ్ల శుభోదయ మండల సమాఖ్య ఆధ్వర్యంలో హెల్త్ సబ్ కమిటీ, సోషల్ యాక్షన్ కమిటీ సభ్యులు, వీవోఏలు, ఆఫీస్ బేరర్స్‌కు మూడు రోజుల పాటూ జరగనున్న శిక్షణా కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పేదరిక నిర్మూ లన లక్ష్యాలు నెరవేరాలంటే మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, కుటుంబ నిర్ణయాల్లో కీలక భూమిక పోషించాలన్నారు. సామాజిక వనరులను సరైన పద్ధతిలో సద్వినియోగం చేసుకున్నపుడే మహిళలు ఆర్ధిక స్వావలంబన సాధ్యమౌతుందన్నారు. మహిళలు ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని సాధించాలన్నారు. కార్యక్రమంలో డీపీఎం ఇన్చార్జి డీబీ ప్రియదర్శిని, వన్‌స్టాప్ సకీ సెంట్రల్ లీగల్ అడ్వైజర్ కంభంపాటి వాణిశ్రీ, ఏపీఎం మేకతోటి రమేష్, సీసీలు సాంబశివరావు, హేమలత, సుధ, సాగర్, యానిమేటర్లు పాల్గొన్నారు. పేపర్ లీక్ చేస్తే.. గుర్తింపు రద్దు చేయాలి ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సాయికుమార్ డిమాండ్ నరసరావుపేట: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో పేపర్ లీకేజీకి పాల్పడిన ఘటనలో అరెస్ట్ అయిన స్వామి వివేకానంద కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్.ఎఫ్.ఐ పల్నాడు జిల్లా కన్వీనర్ కె.సాయికుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో విలేకరులతో సాయి కుమార్ మాట్లాడుతూ పలుమార్లు పేపర్లు లికేజీలకు పాల్పడిన కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని, విద్యార్థుల భవిష్యత్తును విచ్ఛిన్నం చేసేందుకు కళాశాల యాజమాన్యం అవినీతికి పాల్పడుతుందని విమర్శించారు. చదువుకొని పరీక్షలు రాయాల్సిన విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం తగదన్నారు. ఇటువంటి ఘటనలు ఎంతో కష్టపడి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి చదువుకున్న విద్యార్థులు చాలా అవకాశాలను కోల్పోతారన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ప్రభుత్వ పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందన్నారు. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. బీఈడీ కళాశాలలు మొదలుకొని పరీక్షలు వరకు రాష్ట్రంలో ఉన్న పలు కళాశాలలో పేపర్ లీకేజీలు జరుగుతున్నాయన్నారు. ఇటువంటి ఘటనలపై యూనివర్సిటీలపై ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ చూపించకపోవటంతో లోపాయి కారి ఒప్పందాలతో యూనివర్సిటీ అధికారులు పాల్పడుతున్నారన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జరిమానాలు కాకుండా ఆయా కళాశాలల గుర్తింపు రద్దు చేయాలన్నారు. ఆర్థిక స్వావలంబనతోనే కుటుంబ వృద్ధి గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా పీడీ హీరాలాల్ నాయక్ -
ఎమ్మెల్యే చదలవాడ చర్యలు నీతి బాహ్యం
నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావు పేట టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు చర్యలు నీతిబాహ్యంగా ఉన్నా యని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అసలు ఆయన అధికారపక్షంలో ఉన్నరా, ప్రతిపక్షంలో ఉన్నారో నియోజకవర్గ ప్రజలకు అంతుబట్టడంలేదని అన్నారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ రెండు రోజుల క్రితం ప్రభుత్వ కార్యాలయమైన ఎకై ్సజ్ కమిషనరేట్‌లో ధర్నా చేయడం, ఆ పార్టీ నాయకులు వారించినా లెక్క చేయకపోవడం, అధికారులను ఇబ్బంది పెట్ట డం సముచితంగా లేదన్నారు. గత 20 ఏళ్లు గా అనేకమంది ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అనేక ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్నారని, వారందరూ ఒకే పార్టీకి చెందిన వారు కాదని, వీరి కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆప్కాస్ ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ భద్రతను కల్పించిందన్నారు. కేవలం ప్రతిపక్షానికి చెందిన వారనే నెపంతో 11 కుటుంబాల వారిని అన్యాయంగా తీసివేయాలనుకోవటం దుర్మార్గ పాలనకు నిదర్శనమన్నారు. ఈ ఎమ్మెల్యే మాట నరసరావుపేట, రొంపిచర్ల తహసీల్దార్లు వినడం లేదని తాను చెప్పిన పనులు చేయడం లేదంటూ కలెక్టర్‌కు ఫిర్యా దు ఇవ్వటం బట్టి చూస్తే ఇతని మాట అధికారులు వినటం లేదేమో అనే వాదన ప్రజల్లో బలపడుతుందన్నారు. పట్టణంలో అనుమతి లేకుండా లేఅవుట్లు గత ప్రభుత్వంలో వేశా రని చెబుతున్నారని, ఇప్పుడు తొమ్మిది నెలల కాలంలో అనేక అన్ఆధరైజ్డ్డు లే అవుట్లు వెలిశాయని చెప్పారు. దీనికి తన వద్ద రుజువు కూడా ఉన్నాయని, తాను రుజువు చేయగలనని దీనికి మీరు ఏం సమాధానం చెబుతారని సూటిగా ప్రశ్నించారు. కోటప్పకొండ దేవుని మాన్యంలో మట్టి తోలుకుంటున్నారు కోటప్పకొండ దేవస్థానంకు సంబంధించిన ఆరున్నర ఎకరాల దేవదాయ భూమిని నాయీ బ్రాహ్మణులకు కేటాయిస్తే ఆ భూమి ని ఆక్రమించుకొని ఎమ్మెల్యే, ఆయన మనుషులు మట్టి తోలుకుంటున్నారని చెప్పారు. స్వయానా ఈ మట్టితవ్వే భూములను పరిశీలించిన కోటప్పకొండ ఈవో ఇది దేవస్థానానికి సంబంధించిన భూమి అని నిర్ధారించారన్నారు. అక్కడ ఉన్న వాహనాలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారన్నారు. ఇంత జరిగి నా మళ్లీ అసెంబ్లీలో అతనే ప్రస్తావించటాన్ని చూస్తే అతనికి నైజం ఏమిటో అర్థమౌతుందన్నారు. ఎనిమిది అడుగుల లోతు మట్టి తీసి అమ్ముకున్నారని, ఇప్పుడు ఈ గుంటలు పడ్డ భూమి సాగుకి, దేవదాయ శాఖకు పనికిరాదని ఇప్పుడు ఈ భూమికి సంబంధించిన నష్టపరిహారాన్ని ఎవరు భరిస్తారని దీనికి ఎమ్మెల్యేనే సమాధానం చెప్పాలని కోరారు. కోడెల శివరామ్‌పై కేసులతో నాకు సంబంధం లేదు కోడేల శివరాం అభిమానుల పేరుతో తనపైన, విజయసాయిరెడ్డిపై శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ఎవారిపేట గ్రామానికి చెందిన ఆంధ్ర మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు అనే వ్యక్తి టీడీపీ నాయకులు కేసు పెట్టించారని అన్నారు. అయితే అతనెవరూ, అతని ఊరు, మండలం కూడా తమకు తెలియదన్నారు. 2019లో అధికారం వచ్చిన తర్వాత ఈ నాగరాజు అనే వ్యక్తి తన వద్దకు వచ్చి నేను శివరాంకు రూ.15 లక్షలు లంచంగా ఇచ్చానని, నా డబ్బు నాకు ఇప్పించడని వేడుకున్నాడన్నారు. అతడిని పోలీసుల వద్దకు పంపటం జరిగిందన్నారు. కేసులు పెట్టింది కోడెల శివరాంపైనే కాని కోడెలపై కాదని అన్నారు. నాగరాజు ఈరోజు తన కేసు లోక్ అదాలత్‌లో చేసుకున్నాడని అతని ద్వారా మీడియా ముందు మాట్లాడించి కేసు క్లోజ్ చేశారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ వేధింపుల్లో భాగమే నాపై కేసు కోడెల శివరాం అక్రమాలపై ఫిర్యాదు చేసిన వారే మాట మార్చారు! వినుకొండరోడ్డు వెంచర్లో ప్రభుత్వ భూమిలేదని అధికారులు తేల్చారు కోటప్పకొండలోని నాయీ బ్రాహ్మణుల భూమిలో ఎమ్మెల్యే మట్టి తవ్వకాలు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి -
మాతా, శిశు మరణాలు నివారించాలి
వైద్యాధికారులకు సూచించిన డీఎంహెచ్‌వో నరసరావుపేట: జిల్లాలో మాతా, శిశు మరణాలు చోటు చేసుకోకుండా చూడాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.రవి ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో మాతృ, శిశు మరణాలపై సమీక్ష చేశారు. శిరిగిరిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆరేపల్లి ముప్పాళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో చోటుచేసుకున్న రెండు మాతృ మరణాలు, రామిరెడ్డిపేట యూపీహెచ్సీ, సత్తెనపల్లి, వినుకొండ కో–లొకేటెడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలలో జరిగిన మూడు శిశు మరణాలు సంభవించడానికి గల కారణాలను వైద్యాధికారులు, కాన్పులు నిర్వహించిన ప్రైవేటు వైద్యశాల నుంచి హాజరైన గైనకాలజిస్ట్, అనస్తిష్టు, చిన్నపిల్లల వైద్యులను విచారించి మరణాలకు దారితీసిన కారణాలు తెలుసుకున్నారు. గర్భిణులు పోషకాహారం, హిమోగ్లోబిన్ శాతం, గర్భస్థ శిశువు కదలికలన్నింటినీ తెలుసుకునేందుకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చేసే అల్ట్రా సోనోగ్రఫీ, టిఫ్ పరీక్షలను చేయించుకునే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. డెప్యూటీ డీఎంహెచ్‌వో పద్మావతి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ గీతాంజలి, డాక్టర్ మంత్రునాయక్, డాక్టర్ లక్ష్మణరావు, డీపీహెచ్‌ఎన్‌వో బి.సురేఖ, ఏఎన్ఎం, ఆశాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
లీకు లాగితే కదిలిన డొంక
వినుకొండ: వినుకొండలోని వివేకానంద బీఈడీ కళాశాల వేదికగానే బీఈడీ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాస్పెక్టివ్ ప్రశ్నాపత్రం లీక్ కావడం సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ సంస్థ అక్రమాల డొంక కదులుతోంది. తొలి నుంచి కళాశాలలో అడ్మిషన్ దగ్గర నుంచి సర్టిఫికెట్లు మంజూరు చేసే వరకు అవినీతి దందా కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఏటా డీఎస్సీ లేకపోవడం, టీచర్ పోస్టులు ఖాళీ లేకపోవడం వల్ల ఇక్కడ బీఈడీకి ప్రాధాన్యం తగ్గిపోయింది. అయితే ఈ కోర్సుకు ఒడిశా, ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. దీనిని ఆసరాగా చేసుకుని వివేకానంద కళాశాల యాజమాన్యం ఒడిశా విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తోంది. ఏజెంట్ల ద్వారా అడ్మిషన్లు పొందిన ఒడిశా, ఇతర రాష్ట్రాల విద్యార్థులు లంచాలు సమర్పించి కళాశాలకు రాకుండా హాజరు వేయించుకుంటున్నారని తెలుస్తోంది. కొన్నేళ్ల నుంచి ఈ దందా సాగుతోందని సమాచారం. గతంలో ఇక్కడ విద్యార్థులకు పుస్తకాలు ఇచ్చి మరీ పరీక్షలు రాయించేవారు. మారిన నిబంధనల ప్రకారం 2024 నుంచి ప్రశ్నాపత్రం ఆన్లైన్లో పంపిస్తుండడంతో కళాశాల యాజమాన్యం పరీక్ష సమయానికంటే ముందే ప్రశ్నాపత్రాలు లీక్ చేసి ఒడిశా విద్యార్థులకు రూ.లక్షలకు అమ్ముకుంటున్నట్టు సమాచారం. తాజాగా చైల్డ్ డెవలప్మెంట్ ప్రాస్పెక్టివ్ పేపర్ లీక్ విషయం బయటకు పొక్కడంతో వివేకానంద కళాశాల యజమాని సయ్యద్ రఫీక్ అహ్మద్‌తోపాటు కళాశాల కంప్యూటర్ ఆపరేటర్ మరి కొంతమంది సిబ్బందిని గుంటూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో నడుస్తున్న ఈ కళాశాలలో ఈ తంతు ఏటా గుట్టుగా జరుగుతూనే ఉందని సమాచారం. ఇదిలా ఉంటే లీకైన ప్రశ్నాపత్రాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. మళ్లీ బుధవారం పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. వివేకానంద బీఈడీ కళాశాల అక్రమాలెన్నో.. ప్రశ్నపత్రం లీక్‌తో గుట్టురట్టు విద్యార్థుల జీవితాలతో యాజమాన్యం చెలగాటం ఏళ్ల తరబడి ఇదే తంతు తొలి నుంచీ అదే తీరు వినుకొండ వివేకానంద బీఈడీ కళాశాల కరస్పాండెంట్ సయ్యద్ రఫీక్ అహ్మద్ పై గతంలోనూ ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. కేసులూ ఉన్నాయి. రాష్ట్ర విభజనకు పూర్వం హైదరాబాద్‌లో ఉన్నతాధికారులకు లంచాలు ఇస్తూ ఏసీబీకి పట్టుబడిన కేసులు నడుస్తున్నాయి. తాజాగా వినుకొండలో పేపర్ లీకేజీ వ్యవహారం బయటకు పొక్క డంతో ఈ కళాశాలపై ప్రభుత్వం కఠిన చర్య లు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
సంక్షేమం ఫ్రీజ్
వైఎస్ జగన్ ప్రభుత్వంలో కొలువుల జాతర అబద్ధాల విష వలయం చుట్టుముడితే.. ఆకాశానికి నిచ్చెన వేసి ఆశల పల్లకీలో ఊరేగిస్తే.. అరచేతిలో వైకుంఠం చూపి మంత్రదండంలా ఆడిస్తే నిజమని నమ్మిన సామాన్యుడు.. కాల‘కూటమి’ చక్రబంధనంలో చిక్కుకున్నాడు.. అది మాయాచట్రమని తెలుసుకునేలోపు నివురుగప్పిన మోసం నిలువునా ముంచేసింది. బంగారు భవితను అంధకారం చేసింది. ఇంటికో ఉద్యో గం.. నిరుద్యోగ భృతి అంటూ యువగళంలో పోసిన గరళం అంపశయ్యపైకి చేర్చింది. తల్లికి వందనం పేరిట ‘అమ్మఒడి’లో రేపిన మంట కార్చిచ్చులా చుట్టుముట్టింది. విద్యా దీవెనలు.. శాపాల శరాఘాతాలై నిలువెల్లా తాకాయి. ఫలితంగా దగా పడ్డ తెలుగుబిడ్డ ఆగ్రహజ్వాలతో గళమెత్తి గర్జిస్తున్నాడు. కూటమి సర్కారుపై కన్నెర్రజేసి ఖబడ్దార్ అంటూ హెచ్చరిస్తున్నాడు. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో దళమై కదంతొక్కేందుకు సిద్ధపడ్డాడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా జిల్లాలో సుమారు ఐదు వేల మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా మరో ఐదు వందల మందికి ఉపాధి దొరికింది. చాలా మంది తమ సొంత గ్రామాలు, సొంత మండలాల్లో ఉపాధి పొందారు. అప్పట్లో హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నవారు సొంత ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం గమనార్హం. ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాల కల్పన గతంలో ఎన్నడూ జరిగిన దాఖలాలు లేవు. వైద్య ఆరోగ్య శాఖలో రెండు వేలకు పైగా ఉద్యోగాలు కల్పించారు. అలాగే ఇతర శాఖల్లో శాశ్వత, కాంట్రాక్టు పోస్టులు భర్తీ చేశారు. అప్కాస్ పేరిట వేలాది మందికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే స్థానిక యువతకు వలంటీర్ వ్యవస్థ ద్వారా భారీగా ఉపాధి కల్పించడం విశేషం. జిల్లాలో సుమారు పది వేల మందికిపైగా మంది వలంటీర్లుగా సొంత గ్రామంలో ఉపాధి పొందారు. ప్రజల ముంగిళ్లలోకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లారు. పచ్చి మోసం టీడీపీ కూటమి ప్రభు త్వం విద్యార్థులు, యువతను పచ్చి మోసం చేస్తోంది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ వసతి దీవెనకు రూ.1,800 కోట్లు మంజూరుచేశారు. ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఏమీ మంజూరు చేయలేదు. నిరుద్యోగ భృతి రూ.3వ ేలు ఇస్తామని చెప్పి బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. గత ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలల నిర్మాణం చేపట్టి, ఐదింటిలో తరగతులు ప్రారంభిస్తే ఈ సర్కారు వాటిని ప్రైవేటు పరం చేసేందుకు పావులు కదుపుతోంది. ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఇప్పటివరకు కొత్తగా ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు. పైగా ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నారు. – గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్, విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షులు, వైఎస్సార్ సీపీ ఉద్యోగం కోసం నిరీక్షణ నేను బీటెక్ పూర్తి చేశా. ఎలాంటి ఉద్యోగం లేకపోవడంతో హైదరాబాద్‌లో కంప్యూటర్ కోర్సులో శిక్షణకు వెళుతున్నా. జనవరిలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటి వరకూ ఆ ఊసే ఎత్తడం లేదు. నిరుద్యోగ భృతిపై ఎలాంటి ప్రకటనా చేయటం లేదు. అధికారంలోకి వచ్చే వరకు ఒక మాట. ఇప్పుడొక మాట. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోంది. – వల్లెం ఈశ్వర్ సాయికుమార్, నిరుద్యోగి, సత్తెనపల్లిసాక్షి ప్రతినిధి, గుంటూరు: అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటికొక ఉద్యోగం ఇస్తాం.. యువతకు ఉపాధి కల్పిస్తాం.. సంపద సృష్టించి అభివృద్ధి చేస్తాం.. నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు భృతి ఇస్తామంటూ ఎన్నికల సమయంలో కూటమి నేతలు, ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఊదరగొట్టారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా కొత్త ఉద్యోగం ఇవ్వలేదు. పైగా ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇంటర్, డిగ్రీ, డిప్లమా, ఐటీఐ, ఇంజినీరింగ్, పీజీ ఇలా ఏదో ఒకటి పూర్తిచేసిన నిరుద్యోగులు ఐదు లక్షల 58 వేల మంది ఉన్నారని అంచనా. వీరికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ దిశగా సర్కారు చర్యలు తీసుకోవడం లేదు. నిరుద్యోగ భృతి ఊసే లేదు. బడ్జెట్లోనూ కేటాయింపులు చేయలేదు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ, తొలి సంతకం అంటూ ఆర్భాటం చేసిన చంద్రబాబు ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లూ ఇవ్వడం లేదు. ఫలితంగా యువత నిరసన గళం విప్పుతోంది. బాబు వల్ల విద్యారంగం నిర్వీర్యం బాబు పాలనలో విద్యారంగం నిర్వీర్యమైపో తోంది. గత ప్రభుత్వంలో అమలైన ఫీజు రీయింబర్స్మెంట్(విద్యాదీవెన), వసతి దీవెన పథకాలు అటకెక్కాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో కళాశాలల నుంచి ఎప్పుడు బయటకు గెంటేస్తారో తెలీక విద్యార్థులు సతమతమవుతున్నారు. ఇప్పటికే చదువు పూర్తయిన విద్యార్థులకు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఫలితంగా ఉద్యోగాల కోసం యత్నిస్తున్న వారు అవస్థలు పడుతున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ కాలేజీలకు ఫీజులు చెల్లిస్తున్నారు. అప్పులకు వడ్డీ భారం పెరుగుతున్నా.. సర్కారులో మాత్రం చలనం ఉండట్లేదు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. ఇదిలా ఉండగా, ఫీజులు చెల్లిస్తేనే ఈ ఏడాది పరీక్షలకు అనుమతిస్తామని కళాశాలల నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు. వైఎస్సార్ సీపీ ఉద్యమబాట వైఎస్సార్ సీపీ నిరుద్యోగ యువత, విద్యార్థుల పక్షాన ఉద్యమ బాట పట్టింది. ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ బుధవారం ‘యువత పోరు’ పేరుతో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టనున్నారు. జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా, కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నారు. భారీగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తల్లికి వందనం, విద్యాదీవెన, వసతి దీవెనకు మంగళం నిరుద్యోగ భృతి అడ్రస్ గల్లంతు ఉపాధి లేదు.. ఉద్యోగం రాదు.. యువత తరఫున నేడు వైఎస్సార్ సీపీ పోరుబావుటా ప్రతిపక్షానికి అన్నివర్గాల నుంచి విశేష మద్దతు తల్లికి వందనం ఎక్కడ? కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే గత ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. గతంలో నాలుగేళ్లపాటు నిరాటంకంగా అమలైన జగనన్న అమ్మ ఒడి ఆర్థిక ప్రోత్సాహం ఆగిపోయింది. ఏటా తల్లుల ఖాతాల్లో జమైన రూ.15వేలు పిల్లల చదువులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. కరోనా సంక్షోభంలోనూ అమ్మఒడి ఆగలేదు. కూటమి సర్కారు వచ్చాక తల్లికి వందనం అని చెప్పి మొత్తంగా ఎగ్గొట్టారు. -
పది దూరవిద్య పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న పదో తరగతి దూరవిద్య పరీక్షలకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. పరీక్షల నిర్వహణపై శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఈఓ చంద్రకళ మాట్లాడుతూ పరీక్షలు ఈనెల 17 నుంచి 28 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లా పరిధిలో 27 పరీక్ష కేంద్రాలలో 1,200 మంది పరీక్షకు హాజరు కానున్నట్టు తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 57 మంది ఇన్విజిలేటర్లను నియమించామని పేర్కొన్నారు. 28 మంది సిట్టింగ్ స్క్వాడ్లను నియమించామని చెప్పారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ కరదీపికను సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ కె.ఎం.ఎ.హుస్సేన్, డెప్యూటీ డీఈఓలు ఎస్.ఎం.సుభాని, వి.ఏసుబాబు, రిసోర్స్ పర్సన్ బీవీఎల్ వరప్రసాదు తదితరులు పాల్గొన్నారు. డీఈఓ చంద్రకళ -
ప్రతి రైతు ఫాంపాండ్ ఏర్పాటు చేసుకోవాలి
వెల్దుర్తి: ప్రతీ ఒక్క రైతు తమ పొలంలో ఫాంపాండ్‌ను ఏర్పాటు చేసుకోవాలని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పీడీ సిద్ధ లింగమూర్తి సూచించారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజావేదికలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2023–24 సంవత్సరంలో జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు, పంచాయితీ రాజ్‌శాఖ పరిధిలో జరిగిన పనులపై సామాజిక తనిఖీల బృందం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 401 పనులకు గాను వేతనంగా రూ.7,03,58,938 /–లు, మెటల్ పనులకు రూ. 60,06,910/–లు మొత్తం రూ.7,63,65,848/–లు పంచాయితీరాజ్ డిపార్ట్మెంట్ కింద 135 పనులకు రూ. 2499/–లు, మెటల్ పనులకు రూ 2,25, 37,721/–లు మొత్తం రూ.2,25,40,220/–ల పను లు జరిగాయన్నారు. ఈ పనులపై గ్రామసభల ను ఏర్పాటు చేసి ప్రజావేదికను నిర్వహించటం జరి గిందన్నారు. కొత్త పుల్లారెడ్డి గూడెంకు చెందిన రామచంద్రనాయక్ తనకు ఆరు సంవత్సరాల నుంచి జాబ్ కార్డు లేదని తెలిపినప్పటికీ ఎవరూ స్పందించలేదని పీడీ దృష్టికి తీసుకురావటంతో అర్థగంటలోనే జాబ్ కార్డును తయారు చేసి ఆయనకు ఇవ్వటం జరిగింది. రామచంద్రనాయక్‌ను పీడీ లింగమూర్తి మీ పొలంలో ఫాంపాండ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన ఆయన వెంటనే మా పొలంలో ఫాంపాండ్‌ను ఏర్పాటు చేస్తానన్నారు. ఉపాధి హామీ సిబ్బంది రైతులను చైతన్యపరిచి పంట పొలాలలో ఫాంపాండ్లను ఏర్పాటు చేయాలన్నారు. వెనుకబడిన వెల్దుర్తి మండలంలో హార్టీకల్చర్ ద్వారా పండ్ల మొక్కలను నాటినప్పటికీ అవి బ్రతకటం లేదన్నారు. రైతులు పాంపాండ్‌ను ఏర్పాటు చేసుకుంటే కొంత వరకై నా పండ్ల మొక్కలను బ్రతికించుకోవచ్చన్నారు. 20 గ్రామ పంచాయతీలలో జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ బృందాలు గ్రామ సభలు నిర్వహించి పనులు జరిగిన విధానాలను ప్రజావేదికలో వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఇజిఎస్ ఏపీడీ కొరటా మల్లిఖార్జునరావు, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ కోటమ్మ, స్టేట్ రిసోర్స్‌పర్సన్ లోకేష్, ఎంపీడీవో ప్రసాద్, పంచాయతీరాజ్ ఏఇ శ్రీనివాసరెడ్డి, ఏపీవో రేఖాజ్యోతి, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, డీఆర్పీలు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పీడీ సిద్ధ లింగమూర్తి -
AP: జీబీఎస్ వైరస్‌తో మరో మహిళ మృతి
సాక్షి, గుంటూరు: గుంటూరు ఆసుపత్రిలో జీబీఎస్ వైరస్‌తో మరో మహిళ మృతి చెందింది. వారం క్రితం వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలోకి చేరిన మహిళ.. చికిత్స పొందుతూ మరణించింది. కాగా, గుంటూరు జీజీహెచ్‌లో గత నెల.. షేక్ గౌహర్ జాన్ అనే మహిళ మృతి చెందింది. గులియన్ బార్ సిండ్రోమ్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన గౌహర్.. వ్యాధి తీవ్రత మరణించింది.కాగా, ఇటీవల ఇదే ఆసుపత్రిలో కమలమ్మ అనే మహిళ జీబీఎస్‌తో చనిపోగా.. ఇపుడు మరో మహిళ కూడా మరణించడంతో జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న జీబీఎస్ బాధితులు ఆందోళన చెందుతున్నారు.భయపెడుతున్న జీబీ సిండ్రోమ్గులియన్ బ్యారి సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణాలేమిటి? దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలను ప్రజలు శోధిస్తున్నారు. కలుషిత నీరు, ఆహారం తీసుకునేవారిలోనే జీబీఎస్ అధికంగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. -
జగనన్న కాలనీ కబ్జా.. పల్నాడులో బరితెగించిన టీడీపీ గూండాలు
సాక్షి, పల్నాడు జిల్లా: గురజాల నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను సైతం వదలడం లేదు. టీడీపీ నాయకులు యథేచ్ఛగా సాగిస్తున్న భూ దందా సాగిస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో టీడీపీ నాయకులు మరింత రెచ్చిపోతున్నారు.గురజాల మండలంలోని పులిపాడు గ్రామంలో జగనన్న కాలనీని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరులు కబ్జా చేసేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో పులిపాడులో 70 సెంట్ల లో 40 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ భూములంటూ యరపతినేని అనుచరులు నకిలీ సర్టిఫికెట్ సృష్టించారు. పొజిషన్ సర్టిఫికెట్ జారీ చేయడంలో వీఆర్వో జ్యోతి కీలక పాత్ర పోషించారు.పొజిషన్ సర్టిఫికెట్ ఆధారంగా 70 సెంట్లు జగనన్న కాలనీని తొమ్మిది మంది టీడీపీ నేతలు తమ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎవరైనా గొడవ చేస్తే చంపేస్తామంటూ టీడీపీ గూండాలు బెదిరింపులకు దిగుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. -
అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య
నకరికల్లు: టీడీపీ, జనసేన నాయకుల బెదిరింపులు భరించలేక ఒక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య చేసుకున్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం పాపిశెట్టిపాలేనికి చెందిన షేక్ ఫాతిమాబేగం (35) అదే గ్రామంలో 11 ఏళ్లుగా అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమెను అంగన్వాడీ టీచర్ పోస్టు నుంచి తొలగించి, తమవారిని నియమించుకుంటామని గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన నాయకులు బెదిరిస్తున్నారని ఫాతిమాబేగం కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు 9 నెలలుగా ఆమెను బెదిరిస్తూనే ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఫాతిమాబేగాన్ని అంగన్వాడీ టీచర్ ఉద్యోగం నుంచి తొలగిస్తారని టీడీపీ, జనసేన నాయకులు ప్రచారం చేస్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె ఆదివారం తమ ఇంట్లోనే గడ్డిమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. వెంటనే బంధువులు నరసరావుపేటలోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. ఫాతిమాబేగం భర్త సైదావలి గుంటూరులో మెకానిక్‌గా పని చేస్తున్నారు. వారికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. తన భార్య మృతిపై సైదావలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నాకు, నా కుటుంబానికి రక్షణ కల్పించండి
టైలరింగ్ చేస్తూ జీవిస్తుంటాను. నా ఇంటి పక్కనే ఉండే పూజల కోటేశ్వరరావు గతంలో నా భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. కోర్టులో అతనికి రెండేళ్ల శిక్ష పడింది. అతనిపై పోలీసు స్టేషన్లో రౌడీషీటు కూడా ఉంది. శిక్షాకాలం పూర్తిచేసుకుని వచ్చిన అతను నాపై కత్తితో దాడిచేయటంతో నేను తీవ్రంగా గాయపడి చికిత్స పొంది కోలుకున్నా. కత్తితో దాడి చేసిన కేసు ఉపసంహరించుకోవాలని, లేకుంటే చంపుతానని కోటేశ్వరరావు, బ్రహ్మమ్మలు మమ్మల్ని బెదిరిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకొని మా కుటుంబానికి తక్షణం రక్షణ కల్పించండి. – బుర్రి వెంకటరావు, బయ్యవరం, క్రోసూరు మండలం -
కళా సాధనకు నిరంతరం కృషి చేయాలి
సత్తెనపల్లి: ప్రతి మనిషిలో ఓ కళ ఉంటుందని, ఆ కళని సాధించడానికి నిరంతర కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ డైరెక్టర్ రాసంశెట్టి నరసింహారావు అన్నారు. చైతన్య కళా స్రవంతి సత్తెనపల్లి 46వ వార్షికోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి తెలుగు సినిమా పాటల పోటీలు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో ఆదివారం నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. నరసింహారావు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ వర్ధమాన గాయకులు విజయపథం వైపు పయనించాలని ఆకాంక్షించారు. జాతీయస్థాయి తెలుగు సినిమా పాటల పోటీలలో ప్రథమ బహుమతి మాధవి (విజయవాడ), ద్వితీయ బహుమతి కె.రామారావు (కారంపూడి), తృతీయ బహుమతి కె.దుర్గాప్రసాద్ (హైదరాబాద్) కై వసం చేసుకున్నారు. వీరితోపాటు 10 మంది కన్సొలేషన్ బహుమతులు, 15 మంది ప్రత్యేక బహుమతులను అందుకున్నారు. బహుమతి ప్రదానోత్సవానికి చైతన్య కళా స్రవంతి గౌరవ సలహాదారు లయన్ ముట్లూరి వెంకయ్య అధ్యక్షత వహించారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఎ.విశ్వేశ్వరరావు(పిడుగురాళ్ల), ఎస్.కళాంజలి(రాజంపేట), ఎం.రవివర్మ (నరసరావుపేట) వ్యవహరించారు. కార్యక్రమంలో వ్యాపారవేత్త పోతుగంటి రామ కోటేశ్వరరావు, శ్రీమారుతీ ట్రేడర్స్ అధినేత ఆత్మకూరి వెంకట హరేరామచెంచయ్య, వెంకటసుబ్బయ్య, కళాస్రవంతి అధ్యక్షుడు లయన్ కమతం శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి గుండ వరపు అమర్ నాధ్, ట్రెజరర్ ఎస్సీయం. సుభాని, మహేష్, బాలరాజు, ఆచారి, అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ డైరెక్టర్ రాసంశెట్టి నరసింహారావు జాతీయ స్థాయి సినిమా పాటల పోటీల విజేత విజయవాడ మాధవి -
తిరునాళ్లకు వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు..
రెంటచింతల: పాలువాయి గేటు గ్రామంలో సోమవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గోలి గ్రామానికి చెందిన మాచవరపు నాగేశ్వరరావు(45), బాలగాని ఆంజనేయులు ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై దుర్గి మండలంలోని ముటుకూరు తిరునాళ్లకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 167 ఏడీ నిర్మాణంలో భాగంగా పాలువాయి గేటు గ్రామంలోని రైల్వే ట్రాక్ వద్ద చేపట్టిన హైలేవల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవంతో రాత్రి సమయం కావడం వల్ల ముందు ఏమీ కనిపించకపోవడంతో ఒక్కసారిగా ద్విచక్రవాహనంతో బ్రిడ్జిపై నుంచి ఇద్దరూ కింద పడిపోయారు. దీంతో తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ తొలుత నర్సరావుపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో మాచవరపు నాగేశ్వరరావు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. బాలగాని ఆంజనేయులును మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణంలో ఉన్నట్లు ఆ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నాగేశ్వరరావుకు భార్య ఏసమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సీహెచ్ నాగార్జున తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు -
ఉత్సాహంగా జాతీయస్థాయి ఎడ్ల పందేలు
రాజుపాలెం: మండలంలోని ఆకుల గణపవరంలో ప్రసన్నాంజనేయ స్వామి జయంత్యుత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల పందేలు సోమవారం రసవత్తరంగా జరిగాయి. ఆరు పళ్ల విభాగంలో బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శిరీష, శివకృష్ణచౌదరికి చెందిన ఎడ్ల జత 4,250 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానం కై వసం చేసుకుంది. కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన వల్లభనేని మోహన్‌రావు, ఉత్తం పద్మావతిరెడ్డి ఎడ్ల జత 4,000 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామానికి చెందిన నెల్లూరి రామకోటయ్య ఎడ్ల జత 3,783 అడుగుల దూరం లాగి తృతీయ స్థానం, సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గ్రామానికి చెందిన పాశం గోవర్ధనరెడ్డి, రాయుడు సుబ్బారావు ఎడ్ల జత 3,500 అడుగుల దూరం లాగి నాలుగో స్థానం, ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అక్కలరెడ్డిపల్లికి చెందిన కూతర్ల దీక్షిత్‌రెడ్డి, నిశాంత్‌రెడ్డికి చెందిన ఎడ్లజత 3,380 అడుగుల దూరం లాగి ఐదో స్థానం సాధించాయి. మంగళవారం జూనియర్స్ విభాగంలో పందేలు జరగనున్నాయని కమిటీ సభ్యులు తెలిపారు. రోజూ పందేలు తిలకించేందుకు వచ్చే రైతులకు అన్నదానం చేస్తున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. -
యువతకు అండగా వైఎస్సార్ సీపీ
● రేపు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ‘యువత పోరు’ కార్యక్రమం ● పోస్టర్లు ఆవిష్కరించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల: విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ ఈనెల 12వ తేదీన పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘యువత పోరు’ నిర్వహిస్తున్నట్లు పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. మాచర్ల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలసి సోమవారం పోస్టర్లు ఆవిష్కరించారు. పిన్నెల్లి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మోసపోతున్న విద్యార్థులు, యువతకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందన్నారు. ఈనెల 12న ఉదయం 10 గంటలకు నరసరావుపేటలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ‘యువత పోరు’ ర్యాలీ ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా చేరుకుని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగ యువత పెద్దఎత్తున తరలివచ్చి ప్రభుత్వ మోసపూరిత విధానాలపై గళం వినిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైనా, ఇప్పటివరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో సరైన కేటాయింపులు చేయలేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేశారన్నారు. మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తెచ్చారని, ఈ పథకం ద్వారా ఎంతో మంది పేదలు ఉన్నత చదువులు చదివారన్నారు. డాక్టర్లు, ఇంజినీర్లుగా స్థిరపడ్డారన్నారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మరో అడుగు ముందుకు వేసి వసతిదీవెన పథకం కింద హాస్టల్ ఖర్చులు అందజేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడుస్తోందని విమర్శించారు. వెంటనే రూ.4,600 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫీజుల కోసం కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఎన్నికల్లో రూ.3 వేల నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ బడ్జెట్లో ఎక్కడా దీని ప్రస్తావన లేదన్నారు. వై.ఎస్.జగన్ పాలనలో 17 మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుడితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమవుతోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ చేస్తున్న ‘యువత పోరు’లో అందరూ భాగస్వాముల కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈనెల 12న వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నరసరావుపేటలోని జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తామని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని కోరారు. -
పరస్పర సహకారంతో అభివృద్ధి
నరసరావుపేట: ఐక్యరాజ్యసమితి ఈ ఏడాదిని అంతర్జాతీయ సహకార ఏడాదిగా గుర్తించినందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సంఘాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక వేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. దీనికి సంబందించిన ఐవైసీ పోస్టర్‌ను సోమవారం సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించి, కార్యక్రమం ఉద్దేశాలను వివరించారు. వేస్ట్ పికర్స్‌కు బల్ల బండ్లు అందజేత.. చెత్తను సేకరించే వృత్తి నుంచి వ్యాపార రంగంలోకి ఎస్టీ యానాదులు మార్పు చెందాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆకాంక్షించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో వేస్ట్ పికర్స్‌కి జీవనోపాధులు మెరుగుపర్చుకునేందుకు నాలుగు చక్రాలు, మూడు చక్రాల బల్లబండ్లను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ రీజినల్ కో–ఆర్డినేటర్ మల్లెల చిన్నప్ప, నరసరావుపేట ఏరియా కో–ఆర్డినేటర్ తోకల సాంబయ్య పాల్గొన్నారు. పీ–4 కార్యాచరణలో భాగస్వాములు కండి స్వర్ణాంధ్ర–2047లో భాగంగా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు పీ4 విధానం అమలుకు కసరత్తు జరుగుతోందని, ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సీపీఓ ఆధ్వర్యంలో పీ–4కు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. జేసీ సూరజ్ గనోరే, డీఆర్వో మురళి పాల్గొన్నారు. అదేవిధంగా ఢిల్లీ నుంచి జల్ శక్తి మంత్రిత్వ శాఖ జల్‌శక్తి అభియాన్ ‘జల్ సంచయ్ జన్ భగీదారి’పై దేశవ్యాప్తంగా 80 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వర్చువల్ విధానంలో కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్.పాటిల్ నిర్వహించిన సమీక్షకు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి పాల్గొన్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ సహకార ఏడాదిగా గుర్తింపు పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ -
వెల్దుర్తిలో తీవ్ర విషాదం
● రోడ్డు ప్రమాదంలో తండ్రీ కూతురు మృతి ● ఆగివున్న ట్రాక్టర్‌ను బైక్ ఢీకొట్టగా ఘటన ● ఘటనాస్థలంలోనే మృతి చెందిన వైనం వెల్దుర్తి: ఆగివున్న ట్రాక్టర్‌ను ఢీకొని తండ్రి కూతురు మృతిచెందిన విషాదకర సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని మిట్టమీదపల్లె గ్రామానికి చెందిన పల్లా శ్రీనివాసరావు (30), తన కుమార్తె రూప (3)తో కలిసి ద్విచక్రవాహనంపై మాచర్ల నుంచి స్వగ్రామం మిట్టమీదపల్లెకు వెళ్తున్నారు. ఈక్రమంలో వేగంగా వెళ్తూ 565 జాతీయ రహదారిలో వెల్దుర్తి సమీపంలోని పెట్రోలు బంకువద్ద రోడ్డు మార్జిన్లో నిలుపుదల చేసిన ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పల్లా శ్రీనివాసరావు, రూపలు తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎయిమ్స్‌కు, పానకాల స్వామి కొండకు ఎలక్ట్రిక్ బస్సులు
మేఘా ఇంజినీరింగ్ కంపెనీ వితరణ మంగళగిరి: మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నృసింహస్వామి కొండతోపాటు ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు రెండు ఎలక్ట్రిక్ బస్సులను మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్టక్చర్ కంపెనీ సోమవారం అందజేసింది. బస్సులను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్టక్చర్ సీఎస్ఆర్ నిధుల ద్వారా రూ.2.4 కోట్ల విలువైన రెండు అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను అందజేసింది. ఈ బస్సుల్లో ఒకటి మంగళగిరి బస్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్, డీజీపీ ఆఫీసు మీదుగా ఎయిమ్స్‌కు వెళ్తుంది. మరొకటి మంగళగిరి బస్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా శ్రీ పానకాలస్వామి కొండకు వెళ్తుంది. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ కేవీ ప్రదీప్, ఎయిమ్స్ డైరెక్టర్ శాంతా సింగ్, డిప్యూటీ డైరెక్టర్ శశికాంత్, ఆలయ ఈవో ఏ రామకోటిరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, పద్మశాలీ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య పాల్గొన్నారు. ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారిగా మధు నరసరావుపేట: ఏపీఎస్ ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి(ఆర్ఎం)గా ఎం. మధు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక డిపో కార్యాలయంలోని జిల్లా కార్యాలయానికి వచ్చిన ఆయనకు పలువురు ఉద్యోగులు, యూనియన్ నాయకులు స్వాగతం పలికారు. విజయవాడలోని హెడ్ ఆఫీసులో పనిచేస్తూ పదోన్నతిపై పల్నాడు జిల్లాకు వచ్చారు. కాగా ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన ఎన్వీ శ్రీనివాసరావు గత నెల 28న ఉద్యోగ విరమణ చేశారు. ఇంటర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీసు కేసు నమోదు గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో సోమవారం తొలి మాల్ ప్రాక్టీసు కేసు నమోదైంది. పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన ద్వితీయ సంవత్సరం గణితం–2బీ పరీక్షకు గుంటూరు జిల్లాలోని 87 పరీక్షా కేంద్రాల పరిధిలో 28,274 మంది విద్యార్థులు హాజరయ్యారు. 446 మంది గైర్హాజరయ్యారు. గుంటూరులోని ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో కాపీయింగ్‌కు ప్రయత్నించిన ఓ విద్యార్థిపై అధికారులు మాల్ ప్రాక్టీసు కేసు నమోదు చేశారు. ఆర్ఐవో జీకే జుబేర్ ఐదు పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన మంగళగిరి: సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం మంగళగిరి మండలంలోని నీరుకొండ గ్రామంలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి సోమవారం పరిశీలించారు. సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది, అధికారులతో కలిసి ఆమె వర్సిటీని సందర్శించారు. సీఎం ప్రారంభించనున్న సీవీ రామన్ బ్లాక్, ప్రసంగించనున్న అబ్దుల్ కలామ్ ఆడిటోరియం తదితర ప్రదేశాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. వర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ నారాయణరావు, ప్లానింగ్ ఈడీ వీఆర్ అలపర్తి, సెక్రటరీ అనంత్ సింగ్, రిజిస్ట్రార్ ఆర్. ప్రేమ్‌కుమార్, సీఎల్‌ఎం డైరెక్టర్ అనూప్‌సింగ్, జీఎం రమేష్‌బాబు పాల్గొన్నారు. -
‘ఫైనాన్స్’ ఆగడాల నుంచి రక్షించండి
● పీజీఆర్ఎస్లో బాధితురాలి వినతి ● ప్రజల నుంచి 62 అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు నరసరావుపేట: తన భర్త బాజీవలి స్టార్ ఫైనాన్స్ వద్ద రూ.5లక్షలు రుణం తీసుకొని కరోనా సమయంలో చనిపోయాయని, తాను ఇప్పటివరకు రూ.4.50లక్షలు చెల్లించానని, ఇంకా చెల్లించాలంటూ కోర్టు ఆదేశాల లేకుండానే తమ ఇంటికి తాళాలు వేసిన సదరు ఫైనాన్స్ ప్రతినిధులు నెలరోజులు వేధించారని, వారే ఇప్పుడు తాళాలు తీసి.. ఇంకా రూ.10లక్షలు చెల్లించాలని వేధిస్తున్నారని, తనకు అంత స్థోమత లేదని, వారి ఆగడాల నుంచి రక్షించాలని చిలకలూరిపేట పండరీపురంకు చెందిన సయ్యద్ ఆయేషా ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం కలెక్టరేట్ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, డీఆర్ఓ ఎ.మురళి, అధికారులతో కలిసి పాల్గొని ప్రజల నుంచి 62 అర్జీలు స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మండలాల్లో జీఎస్‌డబ్లుఎస్ సర్వే, పీ–4 సర్వే, ఎంఎస్ఎంఈ సర్వే పురోగతిని కూడా పర్యవేక్షించాలని కోరారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.. నకరికల్లు మండలం దేచవరంలో చర్మకారులైన తమకు ప్రభుత్వం ఒక ఎకరం పొలం కేటాయించగా దానిని సాగుచేసుకుంటూ జీవిస్తున్నాం. గ్రామ టీడీపీ నాయకుడు వెంకయ్య ఈ భూమిని అక్రమంగా ఆన్లైన్ చేయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ రద్దుచేయించి చర్మకారుల సంఘానికి ఆ భూమిని అప్పచెప్పండి. – కనుమూరి ఆదెయ్య, వై.వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, జి.రామకృష్ణ, చర్మకారుల సంఘ నాయకులు -
న్యాయం జరిగేవరకు పోరాడుతాం
● సమస్య సీఎం దృష్టికి వెళ్లినా పరిష్కారం కాకపోవటంపై అసంతృప్తి ● భవిష్యత్ కార్యాచరణపై పుల్లారావు బాధితుల సమావేశం నరసరావుపేట టౌన్: కలిసి కట్టుగా ఉద్యమం చేసి న్యాయం జరిగే వరకు పోరాడదామని సాయి సాధన చిట్‌ఫండ్ స్కాం బాధితులు తీర్మానించుకున్నారు. సాయి సాధన చిట్‌ఫండ్ బాధితులు సోమవారం పట్టణంలోని ఓ హోటల్లో సమావేశం అయ్యారు. పాలడుగు పుల్లారావు చిట్‌ఫండ్, విజయలక్ష్మి టౌన్షిప్ పేర్లతో కోట్లాది రూపాయలు వసూలు చేసి పరారీ అయిన విషయం విధితమే. రియల్ ఎస్టేట్ మోసంపై పుల్లారావుతో పాటు అతని భాగస్వాములపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు అవ్వగా, కోర్టులో లొంగిపోయి సబ్జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఆ కేసులో సోమవారం పుల్లారావు అతని భాగస్వాములు గుండా సాంబశివరావు, గుండా అనిల్‌లకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నరసరావుపేట వన్‌టౌన్ పోలీసులు నమోదు చేసిన చీటింగ్ కేసులో పుల్లారావుకు బెయిల్ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై బాధితులంతా సమావేశమై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సమస్య తీసుకువెళ్లినా న్యాయం జరగలేదని కొందరు అభిప్రాయబడ్డారు. కేసు సీఐడీకి బదిలీ అయినప్పటి నుంచి పుల్లారావు కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేసే వరకు అవసరమైతే రిలే నిరాహార దీక్షలు చేద్దామని చర్చించుకున్నారు. చీటీపాట స్కాంలో ఉన్న బాధితులు సుమారు 600 మందితో త్వరలోనే సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని కమిటీ సభ్యులు చేకూరి సాంబశివరావు, ఇ.ఎం.స్వామి, యామిని రామారావు తెలిపారు. -
ఒకేసారి 220 ఎలక్ట్రానిక్ డివైజ్‌ల తయారీ
గుంటూరు ఎడ్యుకేషన్: ఒకే వేదికపై 220 మంది విద్యార్థులు ఎలక్ట్రానిక్ డివైజ్ రూపొందించారు. ఉపాధ్యాయుల సూచనలు ఆలకిస్తూ సర్క్యూట్ బోర్డులతో 220 డివైజ్‌లను వారు తయారు చేశారు. డాక్టర్ చివుకుల హనుమంతరావు చారిటబుల్ ట్రస్ట్ అనుబంధ సంస్థ సుగుణ సైన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం అమరావతి రోడ్డులోని హిందూ ఇంజినీరింగ్ కళాశాల సుధర్మ ఆడిటోరియంలో ‘ఎలైట్ అండ్ ఎనర్జిటిక్ మైండ్స్’ పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. నాలుగు చక్రాల వాహనాలను రివర్స్ చేసే సమయంలో ఉపయోగించే అలారంతో కూడిన ఎలక్ట్రానిక్ డివైజ్‌ను విద్యార్థులు తయారు చేశారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. గుంటూరులోని శ్రీపాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌తోపాటు వెంకటకృష్ణాపురంలోని సిద్దార్థ హైస్కూల్‌కు చెందిన 220 మంది విద్యార్థులు పాలుపంచుకున్నారు. సుగుణ సైన్స్ అకాడమీ సీఈవో డాక్టర్ చివుకుల సాంబశివరావు అధ్యక్షత వహించారు. ప్రత్యేక పరిశీలకుడు పత్రి వేణుగోపాల్ సారథ్యంలో డివైజ్‌లు తయారు చేయించారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ బోడేపూడి రామారావు అకాడమీ ప్రతినిధులకు ధ్రువీకరణపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో అప్కాస్ట్ మెంబర్ సెక్రటరీ డాక్టర్ కె. శరత్‌కుమార్, కేఎల్ వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జేవీ షణ్ముఖ కుమార్, సెర్చ్ ఎన్జీవో సంస్థ అధ్యక్షుడు మన్నవ హనుమప్రసాద్, అమ్మనాన్న చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు చెన్న పోతురాజు, పాఠశాలల కరస్పాండెంట్లు పాటిబండ్ల విష్ణువర్ధన్, కట్టా శ్రీనివాసరావు పాల్గొన్నారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కోసం ప్రయోగం వాహన రివర్స్ అలారంతయారు చేసిన విద్యార్థులు -
అంగన్వాడీలపై సర్కారు ద్వంద్వ వైఖరి
లక్ష్మీపురం: అంగన్వాడీల విషయంలో కూటమి ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ ధ్వజమెత్తారు. స్థానిక బ్రాడీపేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ... ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూటమి నాయకులు అంగన్వాడీల సమ్మె శిబిరాలలో ప్రత్యక్షంగా పాల్గొని పోరాటానికి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా జీతాల పెంపు పట్టించుకోవడం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం మార్చి 10వ తేదీన విజయవాడలో ధర్నా నిర్వహించనున్నట్లు ముందుగానే అధికారులు, మంత్రులకు యూనియన్ వినతి పత్రాలు ఇచ్చిందన్నారు. అయినప్పటికీ ధర్నాను భగ్నం చేసేందుకు అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా సెక్టార్లవారీగా ట్రైనింగులు ఉంటాయని, దానికి హాజరు కాకపోతే తీవ్ర చర్యలు చేపడతామని హెచ్చరికలు జారీ చేయడం, యూనియన్ నాయకుల గృహనిర్బంధాలు, అరెస్టులు ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని చెప్పారు. ఇలాంటి నిర్బంధాలు కొత్త కాదని, వాటన్నింటినీ అధిగమించి పోరాటం చేయగల సత్తా అంగన్వాడీలకు ఉందని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను కట్టిపెట్టి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారిపై నిర్బంధం ప్రయోగిస్తే పోరాడే అంగన్వాడీలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. సమ్మె ముగింపు సందర్భంగా ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు విషయంలోనూ తూట్లు పొడుస్తున్నారని తెలిపారు. ఒప్పందంలో మట్టి ఖర్చులు రూ.20వేలు ఇవ్వాలని ఉంటే దాన్ని రూ.15 వేలకు కుదించి జీవో ఇవ్వడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. అలాగే రిటైర్మెంట్ సర్వీసు పరిహారం కింది అంగన్వాడీలకు రూ.1.20 లక్షలు, హెల్పర్లకు రూ.60 వేలు ఇవ్వాలని ఒప్పందంలో ఉంటే దాన్ని రూ. 20 వేల వంతున తగ్గించారన్నారు. మళ్లీ పేరు మార్చి గ్రాట్యూటీ అని చెబుతూ దానితోనే సంబరపడమని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెనూ చార్జీల పెంపుదల, ప్రమోషన్లు తదితర విషయాలపై ఏర్పాటు చేసిన కమిటీని పక్కన పెట్టేశారని విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ -
ఎంఎల్‌హెచ్‌పీ ఆత్మహత్యాయత్నం
యద్దనపూడి: యద్దనపూడి పీహెచ్సీ పరిధిలోని జాగర్లమూడి గ్రామంలో గతంలో మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ)గా విధులు నిర్వహించిన ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం ఘటన ఆదివారం కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి... యద్దనపూడి మండలం జాగర్లమూడి గ్రామంలో సరోజిని ఎంఎల్‌హెచ్‌పీగా విధులు నిర్వహిస్తుండేది. ఆమె విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తోటి సిబ్బందితో పాటు గ్రామస్తులు పలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో డీఎంహెచ్ఓ విజయమ్మ నాలుగు నెలల క్రితం కేంద్రాన్ని సందర్శించి రికార్డులు సక్రమంగా లేకపోవడంతో ఆమెను వివరణ కోరారు. అయినా ఆమె పద్ధతి మార్చుకోకపోవడంతో వైద్యాధికారి శ్రీహర్ష నాలుగు నెలల క్రితం డీఎంహెచ్ఓ కార్యాలయానికి సరెండర్ చేశారు. ఈ క్రమంలో డీఎంహెచ్ఓ కార్యాలయ అధికారులు ప్రాంతీయ సంచాలకుల కార్యాలయానికి ఆమెను సరెండర్ చేయడం గమనార్హం. ఈ క్రమంలో ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడంతో యద్దనపూడి పరిధిలోనే హాజరు వేసుకుంటూ తనకు వేతనం మంజూరు చేయడం లేదని కొన్ని రోజులుగా ఆస్పత్రి వైద్యాధికారి శ్రీహర్షపై ఒత్తిడి చేస్తూ అతనితో వివాద పడింది. కొన్ని రోజులుగా వివాదం నడుస్తుందని ఆస్పత్రి సిబ్బంది స్వయంగా సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో జీతాలు, విధులు నిర్వహించాల్సిన ప్రాంతం విషయంలో అధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో పర్చూరు పోలీస్ స్టేషన్లోను, యద్దనపూడి పోలీస్ స్టేషన్లోను వైద్యాధికారి శ్రీహర్షపై ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో తనను మానసికంగా వైద్యాధికారి, ఉన్నతాధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆమె ఎలుకల మందు తీసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గుంటూరు ఆస్పత్రిలో చేర్చారు. ఈ విషయం సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో స్థానికంగా కలకలం రేకెత్తింది. ● ఈ విషయమై డీఎంహెచ్ఓ విజయమ్మను వివరణ కోరగా గతంలో సరోజిని విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటుందనే ఆరోపణలు రావడంతో సాధారణ తనిఖీల్లో భాగంగా విచారించామన్నారు. రికార్డుల నిర్వాహణ సక్రమంగా లేక పోవడంతోపాటు అక్కడి స్థానిక వైద్యసిబ్బందితో పాటు ప్రస్తుతం వైద్యాధికారి శ్రీహర్షతోపాటు గతంలో ఉన్న వైద్యాధికారిపై కూడా పలు నిరాధారణ ఆరోపణలు చేసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక వైద్యసిబ్బంది ఆరోపణల నేపథ్యంలో వైద్యాధికారి శ్రీహర్ష జిల్లా కేంద్రానికి సరెండర్ చేయగా, తాము ఆర్డీ కార్యాలయానికి సరెండర్ చేసినట్లు చెప్పారు. ● ఈ విషయమై రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిని వివరణ కోరగా యద్దనపూడి పీహెచ్సీ కేంద్రం నుంచి డీఎంహెచ్ఓ కార్యాలయానికి, అక్కడి నుంచి ఆర్డీ కార్యాలయానికి సరెండర్ చేసిన మాట వాస్తవమే అని వివరణ ఇచ్చారు. ఆమెకు మరోచోట బదిలీ చేసేందుకు ఎంఎల్సీ కోడ్ అడ్డుగా వచ్చిందన్నారు. నాలుగు రోజుల క్రితం ఆమె ఆర్డీ కార్యాలయానికి వచ్చి జాగర్లమూడి గ్రామంలో పని చేసుకుంటానని ప్రాధేయపడిందని, కానీ ఆమెకు యద్దనపూడీ పీహెచ్సీలో పనిచేసేందుకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని చెప్పారు. ఆమెకు వేతనాలు మంజూరు చేసే అధికారం యద్దనపూడి పీహెచ్సీ వైద్యాధికారికి లేదన్నారు. ఈ ఆత్మహత్యయత్నం ఘటన ఇప్పుడే తెలిసిందని, వాస్తవాలు విచారించి తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వైద్య సిబ్బంది వేధింపులే కారణమంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వేధించారని ఆరోపణలు -
జిల్లాను ప్రగతి పథంలో నిలపాలి
నరసరావుపేట: ఉపాధి హామీ పథక సిబ్బంది బాధ్యతగా పనిచేసి జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ మైలవరపు వీఆర్ కృష్ణతేజ అన్నారు. జిల్లాలోని ఉపాధి హామీ పథకంలో పనిచేసే క్షేత్ర సహాయకులకు ఆదివారం టౌన్ హాలులో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పథకంలో పనిచేసే ప్రతి ఒక్కరికీ కనీసంగా రూ.300 కూలీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సిబ్బందికి సూచించారు. ప్రతి కుటుంబానికీ వంద రోజుల పని కల్పించాలని తెలిపారు. కూలీల హక్కులు, క్షేత్ర సహాయకులు, మేట్ల విధులు, బాధ్యతలు, జాబ్ కార్డు, పనుల కల్పన, ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా మస్టర్ నిర్వాహణ తదితర అంశాల గురించి వివరించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ కమిషనర్ తెలిపిన పేరామీటర్స్ను అనుసరించి జిల్లా ప్రగతికి దోహదం చేయాలని కోరారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ ఫరం పాండ్ నిర్మాణానికి గ్రామాల్లోని నాయకులతో కలిసి విజయవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ఈజీఎస్ డైరక్టర్ వి.కె.షణ్ముక్‌కుమార్, అదనపు కమిషనర్ మల్లెల శివప్రసాద్, పథక సంచాలకులు యం.సిద్ధలింగమూర్తి, నరసరావుపేట, గురజాల, సత్తెనపల్లి, వినుకొండ క్లస్టర్ల సహాయ పథక సంచాలకులు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని ప్రకాష్‌నగర్‌లో ఉంటున్న మున్సిపల్ మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా గృహాన్ని సందర్శించారు. వారికి గుప్తా మెమెంటోను అందజేశారు. అనంతరం పంచాయతీరాజ్ శాఖ నిధులతో కొత్తపాలెం నుంచి కోటప్పకొండ వరకు చేపట్టిన రోడ్డును పరిశీలించారు. కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ కృష్ణతేజ -
ఒకేసారి 220 ఎలక్ట్రానిక్ డివైజ్‌ల తయారీ
గుంటూరు ఎడ్యుకేషన్: ఒకే వేదికపై 220 మంది విద్యార్థులు ఎలక్ట్రానిక్ డివైజ్ రూపొందించారు. ఉపాధ్యాయుల సూచనలు ఆలకిస్తూ సర్క్యూట్ బోర్డులతో 220 డివైజ్‌లను వారు తయారు చేశారు. డాక్టర్ చివుకుల హనుమంతరావు చారిటబుల్ ట్రస్ట్ అనుబంధ సంస్థ సుగుణ సైన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం అమరావతి రోడ్డులోని హిందూ ఇంజినీరింగ్ కళాశాల సుధర్మ ఆడిటోరియంలో ‘ఎలైట్ అండ్ ఎనర్జిటిక్ మైండ్స్’ పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. నాలుగు చక్రాల వాహనాలను రివర్స్ చేసే సమయంలో ఉపయోగించే అలారంతో కూడిన ఎలక్ట్రానిక్ డివైజ్‌ను విద్యార్థులు తయారు చేశారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. గుంటూరులోని శ్రీపాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌తోపాటు వెంకటకృష్ణాపురంలోని సిద్దార్థ హైస్కూల్‌కు చెందిన 220 మంది విద్యార్థులు పాలుపంచుకున్నారు. సుగుణ సైన్స్ అకాడమీ సీఈవో డాక్టర్ చివుకుల సాంబశివరావు అధ్యక్షత వహించారు. ప్రత్యేక పరిశీలకుడు పత్రి వేణుగోపాల్ సారథ్యంలో డివైజ్‌లు తయారు చేయించారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ బోడేపూడి రామారావు అకాడమీ ప్రతినిధులకు ధ్రువీకరణపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో అప్కాస్ట్ మెంబర్ సెక్రటరీ డాక్టర్ కె. శరత్‌కుమార్, కేఎల్ వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జేవీ షణ్ముఖ కుమార్, సెర్చ్ ఎన్జీవో సంస్థ అధ్యక్షుడు మన్నవ హనుమప్రసాద్, అమ్మనాన్న చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు చెన్న పోతురాజు, పాఠశాలల కరస్పాండెంట్లు పాటిబండ్ల విష్ణువర్ధన్, కట్టా శ్రీనివాసరావు పాల్గొన్నారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కోసం ప్రయోగం వాహన రివర్స్ అలారంతయారు చేసిన విద్యార్థులు -
నేడు పీజీఆర్ఎస్
నరసరావుపేట: కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నెల రోజుల పాటు నిలిపివేసిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) సోమవారం జిల్లా కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాల్లో యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రజలు గమనించాలని వారు కోరారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 523.90 అడుగుల వద్ద ఉంది. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు 8,023 క్యూసెక్కులు విడుదలవుతోంది. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మాచర్ల: స్థానిక రింగు రోడ్డు సెంటర్లో లారీ బైక్‌కు తగలడంతో ఆదివారం అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. అన్నెబోయన అమరలింగం(39) ఇంటి నుంచి బైక్‌పై సెంటర్‌కు వస్తున్నాడు. ఆంజనేయస్వామి దేవాలయం వద్ద లారీని రివర్స్ చేస్తుండగా బైక్‌కు తగిలింది. దీంతో అమరలింగం లారీ వెనుక టైర్ కింద పడి మృతి చెందాడు. అతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గూడ్స్ రైలు కిందపడి టైల్స్ మేస్త్రి ఆత్మహత్య నరసరావుపేట టౌన్: గూడ్స్ రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దొండపాడుకు చెందిన పుట్లూరి శివారెడ్డి(42) పట్టణంలోని బరంపేటలో నివాసం ఉంటున్నాడు. టైల్స్ మేస్త్రిగా జీవనం కొనసాగిస్తున్నాడు. శావల్యాపురం రైల్వే స్టేషన్ సమీపంలో వెల్లలచెరువు ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకటేశ్వరనాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. 15 నుంచి ‘తిరుమల మహా పాదయాత్ర’ పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి తెనాలి: పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీవాసవీ పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి (బాలస్వామి) ఈ నెల 15వ తేదీ నుంచి ‘తిరుమల మహా పాదయాత్ర’ చేపట్టనున్నారు. రైత్చు క్షేమార్థం, ధర్మసంస్థాపనార్థం చేపట్టనున్న తిరుమల మహాపాదయాత్రను భక్తజన సమూహంగా ఆరంభించనున్నారు. దీనికి ముందుగా తెనాలిలో ‘గురు పాదధూళి’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఆరు గంటలకు స్థానిక గంగానమ్మపేటలోని శ్రీవిద్యాపీఠం శ్రీసాలిగ్రామ పీఠం నుంచి బయలుదేరి బుర్రిపాలెం రోడ్డులోని గోశాల వరకు పాదయాత్ర చేశారు. తిరుమల మహా పాదయాత్ర రోజు వరకు రోజూ గురు పాదధూళి పాదయాత్ర ఉంటుందని, భక్తులు పాల్గొనాలని కోరారు. శ్రీసాలిగ్రామ పీఠం కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
సందడిగా సినిమా పాటల పోటీలు ప్రారంభం
సత్తెనపల్లి: చైతన్య కళా స్రవంతి 46వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫంక్షన్ హాలులో ఆదివారం జాతీయస్థాయి సినిమా పాటల పోటీలు ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు హాజరయ్యారు. పోటీల్లో సోలో పాటలకు మాత్రమే అవకాశం కల్పించారు. డ్యూయెట్స్ను అనుమతించలేదు. ముందుగా చైతన్య కళా స్రవంతి వ్యవస్థాపక అధ్యక్షుడు పిల్లుట్ల రామారావు చిత్రపటానికి చైతన్య కళా స్రవంతి అధ్యక్షులు కమతం శ్రీనివాసరావు, సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పాటల పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో వ్యాపారవేత్త పోతుగంటి రామకోటేశ్వరరావు, చైతన్య కళా స్రవంతి ఉపాధ్యక్షులు పిల్లుట్ల రాజా వీరాస్వామి, ప్రధాన కార్యదర్శి గుండవరపు అమర్నాథ్, ట్రెజరర్ ఎస్సీఎం సుభాని, గౌరవ సలహాదారుడు ముట్లూరి వెంకయ్య, కంబాల వెంకటేశ్వరరావు, అచ్చిరెడ్డి పాల్గొన్నారు. -
రసవత్తరంగా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు
రాజుపాలెం: మండలంలోని ఆకుల గణపవరంలో గల శ్రీ ప్రసన్నాంజనేయస్వామి 96వ జయంత్యుత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల పందేలు ఆదివారం రసవత్తరంగా జరిగాయి. నాలుగు పళ్ల విభాగంలో బాపట్ల జిల్లా పంగులూరు చిలుకూరి నాగేశ్వరరావుకు చెందిన ఎడ్ల జత 5,278 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరికి చెందిన చీరబోయిన కోటేశ్వరరావు ఎడ్ల జత 4,250 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవ్వులూరు గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాసరావు ఎడ్ల జత 4,000 అడుగుల దూరం లాగి తృతీయ స్థానంలో నిలిచాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం భీమవరానికి చెందిన దివ్యశ్రీ ఎడ్ల జత 3,027 అడుగుల దూరం లాగి నాల్గవ స్థానం, పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం నిండుజర్లకు చెందిన ప్రసన్నాంజనేయ ఎడ్ల జత 2250 అడుగుల దూరం లాగి ఐదవ స్థానం సాధించాయి. సోమవారం వ్యవసాయ విభాగంలో పందేలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి రోజూ పందేలు చూడటానికి వచ్చే రైతులకు అన్నదానం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పోరాటం
తెనాలి: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఎస్టీయూ నిరంతరం పోరాటం చేస్తుందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.సాయి శ్రీనివాస్ చెప్పారు. ఉపాధ్యాయ బదిలీలపై ప్రభుత్వం ప్రత్యేకచట్టం చేసిందని గుర్తుచేశారు. అలాగే పీఆర్సీ బకాయిలు, డీఏ ఇవ్వాలని, పెండింగు సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నట్టు తెలిపారు. ఎస్టీయూ, ఏపీ ఉపాధ్యాయ సంఘం, ఉమ్మడి తెనాలి ఏరియా (తెనాలి అర్బన్, తెనాలి, దుగ్గిరాల, కొల్లిపర, చుండూరు, అమర్తలూరు, వేమూరు, కొల్లూరు మండల శాఖలు) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్జీవో కళ్యాణమండపంలో జరిగిన ఈ వేడుకలకు ఎస్టీయూ తెనాలి ఏరియా కార్యదర్శి డీవీ సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఆత్మీయ అతిథిగా పాఠశాల విద్య ఆర్జేడీ బి.విజయభాస్కర్ మాట్లాడుతూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్.రామచంద్రయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేఏకే జిలాని, జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి అమరనాథ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు ఏవీ ప్రసాద్ బాబు, వేమూరు ఏరియా కార్యదర్శి ఎం.శ్రీధర్, డాక్టర్ శారద మాట్లాడారు. దుగ్గిరాల జిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రధానోపాధ్యాయిని శోభాదేవి, కవయిత్రిగా గుర్తింపును తెచ్చుకున్న కొలకలూరు ఉపాధ్యాయిని దేవికరాణి, వివిధ మండల శాఖల మహిళా కన్వీనర్లు సహా 23 మందిని ఘనంగా సత్కరించారు. ఉమ్మడి తెనాలి ఏరియా కార్యదర్శి ఎం.శ్రీధర్‌తోపాటు ఏరియాలోని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏవీ గోపాలరావు, ఎం.రవి, జి.మిథున్ చక్రవర్తి, ఎస్.నాగేశ్వరరావు, ఉన్నం ప్రసాద్, మునిపల్లి మోహన కృష్ణ, ఖాన్, ఆరోన్, వినోద్, ప్రసాద్, నాగరాజు, చంద్రశేఖర్, కిరణ్, నాగరాజు, శ్రీనివాస్, రామకృష్ణ, సీనియర్ నాయకులు ఈ.అంబరీషుడు, పట్టణ శాఖ నాయకులు పూషాడపు శ్రీనివాసరావు, ఉమ్మడి తెనాలి ఏరియాలోని రాష్ట్ర కౌన్సిలర్లు, జిల్లా కార్య నిర్వాహక సభ్యులు, మండల కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు. -
నూతన కార్యవర్గం ఎన్నిక
చీరాల టౌన్: ఉమ్మడి ప్రకాశం జిల్లా ఏపీ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షునిగా జమండ్లమూడి శ్రీనివాసరావును ఎన్నుకున్నారు. ఆదివారం పట్టణంలోని డోలా ఐజాక్ ఎన్జీవో భవనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం.వెంకటరెడ్డి, మాజీ సలహాదారు షేక్ యూసుఫ్ మొహరాలి అధ్యక్షతన నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం అధ్యక్షులుగా జమండ్లమూడి శ్రీనివాసరావు, సహాధ్యక్షులుగా ఎన్.కృపాచార్యులు, జనరల్ సెక్రటరీగా సాయి మహేష్, ఉపాధ్యక్షులుగా ఎం.వెంకటేశ్వర్లు, కోశాధికారిగా సూర్యనారాయణ, సభ్యులను ఎన్నుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం బలోపేతం చేయడంతోపాటు హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అందరం ఐక్యమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. -
శంకర కంటి ఆస్పత్రికి నేత్ర దానం
శావల్యాపురం: మండలంలోని వేల్పూరుకు చెందిన కంచర్ల సుబ్బారావు (55) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల అనుమతితో శంకర కంటి వైద్యశాలకు మృతుడి నేత్రాలను దానం చేసినట్లు జిల్లా అమ్మ నేత్ర, అవయవ దాన సంఘం కోఆర్డినేటరు సండ్రపాటి చలపతిరావు తెలిపారు. అవయవ దానం చేయడం పలువురికి ఆదర్శనీయమని కొనియాడారు. నేత్ర దానానికి సహకరించిన సుబ్బారావు కుటుంబ సభ్యులు ఆలపాటి శివ, సుబ్రహ్మణ్యం, సురేష్, పరమేశ్వరరావు, అంజయ్యను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఒక్క మాత్రతో నులిపురుగుల నివారణ గుంటూరు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి గుంటూరు మెడికల్: జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా సోమవారం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. ఒకే మాత్రతో నులి పురుగులను నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో ఏడాది నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ తప్పనిసరిగా నులిపురుగుల నిర్మూలన కోసం 400 ఎంజీ ఆల్బెండజోల్ బిళ్లలను చప్పరించి మింగించాలని తెలిపారు. ఏడాది నుంచి రెండేళ్ల పిల్లలకు అరమాత్ర, 2 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు పూర్తి మాత్ర ఇవ్వాలని సూచించారు. సోమవారం వీలు కాని వారితో ఈ నెల 17వ తేదీన మాపప్ రౌండ్లో మింగించాలన్నారు. పిల్లలకు మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత గంట తేడాతో మాత్రలు ఇవ్వాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు. జిల్లాలో అర్హులైన పిల్లలు 4,24,742 మంది ఉన్నారని చెప్పారు. కార్యక్రమాన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహిస్తారని తెలిపారు. నులిపురుగుల నిర్మూలన వల్ల పిల్లలలో రక్తహీనతను నివారించి వారి ఆరోగ్యాన్ని సంరక్షించవచ్చని పేర్కొన్నారు. ఏఎన్ఎంలపై పనిఒత్తిడి తగ్గించాలి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.రోశయ్య బాపట్ల: ఏఎన్ఎంలపై పని ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె.రోశయ్య పేర్కొన్నారు. బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో అసోసియేషన్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో కె.రోశయ్య మాట్లాడుతూ తాలుకా, జిల్లా బాడీలను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. 143 జీఓని రద్దు చేయాలని కోరారు. ఏఎన్ఎంలపై ఒత్తిడి తగ్గించాలని, గ్రేడ్ 3 ఏఎన్ఎంలను వైద్యశాఖలోకి తీసుకోవాలని కోరారు. పీ4 సర్వేలో ఏఎన్ఎంలను మినహాయించాలన్నారు. సమావేశంలో నాయకులు సీహెచ్ బెనర్జీ, జె.సుధాకర్, ఎన్.సుబ్బారావు, కె.మారుతి ప్రసాద్, రత్నకుమారి, రమణమ్మ, సైదయ్య, వేణు, మహబూబ్, రాజేష్, బాపట్ల టౌన్ అధ్యక్షుడు జి.శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులతో భక్తులకు రక్షణ
విజయపురిసౌత్: ‘‘ఏసు ప్రభువునకు ఎల్లప్పుడూ కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట రక్షణదాయకమ’’ని గుంటూరు పీఠాధిపతులు చిన్నాబత్తిని భాగ్యయ్య అన్నారు. సాగర్మాత మహోత్సవం ముగింపు రోజైన ఆదివారం నిర్వహించిన సమష్టి దివ్య బలి పూజలో ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. పవిత్రాత్మ ప్రభావం వల్ల కన్నె మరియమాత గర్భాన దివ్యజ్యోతి అయిన ఏసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించినట్లు పేర్కొన్నారు. పవిత్రమైన ఏసుక్రీస్తును దీనభావంతో స్తుతించాలని తెలిపారు. ఆధ్యాత్మిక ఆయుధాలైన ప్రార్థన, ప్రేమ, నీతి, కరుణ, దయ, క్షమాగుణం కలిగిన వ్యక్తులు దేవుని మార్గంలో నడిపింపబడుతున్నారని ఆయన పేర్కొన్నారు. సాగర్మాత మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు దేవుడు ఐశ్వర్య, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రార్థించారు. రథోత్సవంతో ఉత్సవాలు ముగింపు ఆదివారం రాత్రి సాగర్ మాత రథోత్సవం ప్రధానమైంది. ఈ ఊరేగింపుతో ఉత్సవం ముగుస్తుంది. ఉదయం 5గంటలకు అత్తలూరు విచారణ గురువులు చాట్ల కస్సార్, 6గంటలకు కారంపూడి విచారణ గురువులు పెట్లమర్రి అనిల్, 7గంటలకు ముట్లూరు విచారణ గురువులు మార్నేని దిలీప్, 8గంటలకు దాచేపల్లి విచారణ గురువులు ఏరువ బాలశౌర్రెడ్డి, ఉదయం 10.30 గంటలకు గుంటూరు పీఠాధిపతులు చిన్నాబత్తిని భాగయ్య సమష్టి దివ్య పూజలు నిర్వహించారు. పామిశెట్టి తోమస్ బృందం గానం ఆకట్టుకుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదానం, 3గంటలకు కోలాటం, బ్యాండ్ మేళం ప్రదర్శన, సాయంత్రం 6గంటలకు సాగర్మాత రథోత్సవం, బాణసంచా వెలుగులు ఆకట్టుకున్నాయి. రాత్రి 9 గంటలకు తప్పిపోయిన కుమారుడు బైబిల్ నాటకం ప్రదర్శించారు. వేడుకలలో ఫాదర్స్ జోసఫ్ బాలసాగర్, ఫాదర్ తంబి, మనోజ్‌కుమార్, ఆలయ పెద్దలు ఎం. జోషి, జెక్కిరెడ్డి చిన్నపరెడి, డి. ఇన్నారెడ్డి, కె. శౌర్రాజు, మరియదాసు, శౌరిబాబు, బాలస్వామి పాల్గొన్నారు. -
ప్రార్థనతోనే దేవుడి అనుగ్రహం
అమరావతి: ‘‘ప్రభువైన ఏసుక్రీస్తు కృప లోకమంతా నిండియున్నదని, మానవుడు దేవుని ఎంతగా ప్రార్థిస్తే మనను అంతగా అనుగ్రహిస్తా’’డని హోసన్నా మినిస్ట్రీస్ చీఫ్ పాస్టర్ జాన్‌వెస్లీ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని లేమల్లె హోసన్నా దయా క్షేత్రంలో హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహిస్తున్న 48వ గుడారాల పండుగ చివరి రోజు పగటిపూట ముగింపు ప్రార్థనలకు లక్షలాది మంది ఆరాధికులు తరలివచ్చారు. పాస్టర్ జాన్‌వెస్లీ ప్రసంగిస్తూ.. జాతి, కుల, మత, వర్గ, పేద, ధనిక భేదం లేకుండా అందరికీ దేవుని కృప ఉంటుందని, ఆయన్ను స్తుతిస్తూ బలి పీఠం దగ్గరకు ఎవరు వస్తారో వారిపై ప్రత్యేక కృప కనబరుస్తాడని పేర్కొన్నారు. లోకమంత దేవుని కృపతో నిండియున్నదని, దాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆయన్ను నిరంతరం స్తుతించాలని తెలిపారు. ప్రపంచంలో అందరి పైనా ఆయన వర్షం కురిపించినా అత్మీయులపై మాత్రం కృపా వర్షం కురిపిస్తాడని పేర్కొన్నారు. హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు పాస్టర్ అబ్రహాం ప్రసంగిస్తూ.. గుడారాల పండుగలో దేవుని దర్శించిన ప్రతి ఒక్కరి వెంట ఆయన వస్తున్నాడని.. మంచిని కలుగచేస్తాడని తెలిపారు. మానవుని ఆశ్రయించే దురాత్మలను దేవుడు దూరం చేసి సంతోషం కలుగ చేస్తాడని వివరించారు. ఎంతో దూరం నుంచి వచ్చిన లక్షలాది మంది విశ్వాసులకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించకపోయినా, సర్దుకు పోయిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తొలి సంవత్సర అనుభవాలతో వచ్చే ఏడాది ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 5,6,7,8 తేదీల్లో గుడారాల పండుగ నిర్వహిస్తామని ప్రకటించారు. గుడారాల పండుగ ఘనంగా సహకరించిన అన్ని ప్రభుత్వశాఖల అధికారులకు, సిబ్బందికి హోసన్నా మినిస్ట్రీస్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పాస్టర్ల బృందం స్తుతి గీతాలు ఆలపించింది. ఆదివారం కావడంతో లక్షలాది మంది హోసన్నా ఆరాధికులు పాల్గొన్నారు. ముగిసిన 48వ గుడారాల పండుగ ముగింపు ప్రార్థనలు చేసిన పాస్టర్స్ జాన్‌వెస్లీ, అబ్రహాం దయా క్షేత్రానికి చేరుకున్న లక్షలాది మంది విశ్వాసులు -
గుంటూరుకు 100 ఎలక్ట్రిక్ బస్సులు
కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని నెహ్రూనగర్: కేంద్ర ప్రభుత్వం గుంటూరు పట్టణానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, చార్జింగ్ పాయింట్లు తదితర ఏర్పాట్ల కోసం ఆదివారం తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఆర్టీసీ అధికారులతో కలిసి ఆయన గుంటూరు బస్టాండ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ బస్సులను ఒక్కసారి చార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్లు వరకు ప్రయాణించగలవని తెలిపారు. వీటి నిర్వహణకు ప్రత్యేక సదుపాయాలు కావాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండ్ 20 ఎకరాల విస్తీర్ణంలో ఉందని చెప్పారు. బస్టాండ్, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు పోనూ మిగిలిన స్థలాన్ని పీపీపీ పద్ధతిలో లీజులకు ఇస్తే సంస్థకు ఆదాయం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. దీనిపై ఆర్టీసీ అధికారులు కసరత్తు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ కొనకళ్ల నారాయణ, ఈడీ అడ్మిన్ జి. రవివర్మ, ఈడీ జోన్ –3 నెల్లూరు నాగేంద్రప్రసాద్, ఆర్ఎం ఎం.రవికాంత్, డిపో మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు. శ్రీనివాస కల్యాణ వేడుక ఏర్పాట్లు పరిశీలన వెంకటపాలెం (తాడికొండ): తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలోని టీటీడీ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఈ నెల 15వ తేదీన జరగనున్న శ్రీనివాస కల్యాణ మహోత్సవ ఏర్పాట్లను గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో ఆదివారం ఆయన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలను పరిశీలించారు. ఆలయం వద్ద వాహనాల పార్కింగ్, రాకపోకలకు అనువుగా కేటాయించిన మార్గాలు, వీవీఐపీ, వీఐపీ భక్తులకు ప్రత్యేక మార్గాల కేటాయింపు తదితర అంశాలపై సిబ్బందితో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన వెంట లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ రవికుమార్, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, సీఐలు వెంకటేశ్వర్లు, అంజయ్య తదితరులు ఉన్నారు. 17 నుంచి టెన్త్ దూర విద్య హాల్ టికెట్లు పంపిణీ నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఈనెల 17నుంచి టెన్త్ దూర విద్య హాల్ టికెట్లను సంబంధిత స్టడీ సెంటర్ల ద్వారా పొందవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. చంద్రకళ ఆదివారం తెలిపారు. మన మిత్ర వాట్సాప్ నంబర్ ద్వారా కూడా అడ్మిషన్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. హాల్ టికెట్లలో వివరాలను సరి చూసుకోవాలని ఆమె సూచించారు. సార్వత్రిక విద్యాపీఠం వెబ్సైట్ నుంచి కూడా పొందవచ్చని ఆమె తెలిపారు. అవయదానంతో ముగ్గురికి కొత్త జీవితం గుంటూరు మెడికల్: ఓ మహిళ అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేయడానికి అంగీకరించడంతో ముగ్గురికి నూతన జీవితం లభించింది. బాపట్ల జిల్లా బాపట్ల పట్టణం వివేకానంద నగర్ కాలనీకి చెందిన కొప్పనాతి వరలక్ష్మి (45) మెదడు సంబంధిత వ్యాధితో ఈ నెల 6 న గుంటూరులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో చేరారు. ఆమె పరిస్థితి విషమంగా మారి ఆదివారం బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ జీవన్ దాన్ ప్రతినిధులు వరలక్ష్మి కుటుంబసభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. దీంతో వారు విశాల హృదయంతో దానం చేసేందుకు అంగీకరించారు. -
అవినీతికి కేరాఫ్ రెవెన్యూ
ఒక్క క్లిక్ చేయండి చాలు.. వాట్సాప్ ద్వారా ప్రజా సేవలన్నీ మీ అరచేతిలోనే ఉన్నాయి.. ఇదంతా ఐటీ మంత్రి లోకేశ్ గొప్పతనమంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతోంది. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రతి విభాగంలో పైసలిస్తేనే ఫైలు కదులుతోంది. ప్రధానంగా రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. చేతిలో బరువు పెట్టకపోతే ఫైలు పక్కనపడిపోతోంది. పొలాలు, స్థలాలు సర్వే చేయాలన్నా, మ్యుటేషన్ జరగాలన్నా మూట పక్కన పెడితేనే ముందుకు కదులుతోంది. చివరకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కోసం కూడా లెక్క కట్టి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. నరసరావుపేట, రొంపిచర్ల ప్రాంతాల్లో రెవెన్యూ సేవల కోసం వచ్చే ప్రజలకు సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. నరసరావుపేట టౌన్: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు పారదర్శక పాలనతో పాటు 520 సేవలను అందించింది. ఏ సర్టిఫికెట్ కావాలన్నా వలంటీర్ ఇంటికి తీసుకొచ్చి అందించేవారు. ప్రస్తుతం ప్రజలు సచివాలయాల చుట్టూ తిరిగి దరఖాస్తులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సేవలన్నింటిని వాట్సాప్ ద్వారా అరచేతిలోకి తీసుకొస్తున్నామని ప్రకటించింది. దీన్ని ఐటీ మంత్రి, సీఎం కుమారుడు లోకేశ్ అద్భుతంగా ప్లాన్ చేశారని గొప్పగా చెప్పుకొచ్చారు. అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం పైసలివ్వనిదే పనులు కావడం లేదు. రెవెన్యూ సిబ్బందికి కాసుల పంట నరసరావుపేట మండలంలోని భూముల మ్యుటేషన్, సర్వే కోసం దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ సిబ్బందికి కాసుల పంట పండుతోంది. ముఖ్యంగా నరసరావుపేట మండల సర్వేయర్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూ వివాదాలను ఆసరా చేసుకొని లక్షల రూపాయలు గుంజుతున్నారు. కన్వర్షన్ ఫైళ్లల్లో తహసీల్దార్‌కు డబ్బులు ఇవ్వాలని ఆయన బహిరంగంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు విమర్శలు లేకపోలేదు. ప్రోటోకాల్‌కు ఖర్చు అవుతుందని చెప్పి పలు పనులపై వచ్చే వారి నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే సమయంలో రొంపిచర్ల తహసీల్దార్ కార్యాలయంలోనూ ఇదే తంతు నడుస్తోంది. ఇక్కడ అధికారులు చిన్న చిన్న ధ్రువీకరణ పత్రాలకు సైతం నగదు భారీగా వసూలు చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు సిఫార్స్ చేస్తేనే అక్కడ పనులు జరుగుతున్నాయి. ఈ తహసీల్దార్ మాకొద్దు ! ఎక్కడా లేని విధంగా ఏకంగా తహసీల్దార్ మా కొద్దు ! అంటూ ఒక ఎమ్మెల్యే కలెక్టర్‌ను బహిరంగంగా కోరడం నరసరావుపేటలో తీవ్ర చర్చనీయాంశమైంది. తహసీల్దార్ కార్యాలయంలో సామాన్యులకు పనులు జరగడం లేదని, రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని కలెక్టర్ దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. కార్యాలయంలో అవినీతి జరుగుతుందని, దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నరసరావుపేట తహసీల్దార్ తెలుగుదేశం పార్టీ అండదండలతో సీసీఎల్ఏ రూల్స్‌కు విరుద్ధంగా ఇక్కడ పోస్టింగ్ వేయించుకున్నారు. ఈయన స్వగ్రామం రావిపాడు ఇదే మండలంలో ఉంది. సీసీఎల్ఏ నిబంధనల ప్రకారం సొంత మండలంలో విధులు నిర్వర్తించకూడదు. కానీ టీడీపీ నేతలు పట్టుబట్టి మరీ దొడ్డిదారిలో డెప్యూటేషన్‌పై తీసుకొచ్చారు. వచ్చినప్పటి నుంచి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న తహసీల్దార్ వేణుగోపాల్‌పై ఏకంగా ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఫిర్యాదు చేయడంపై టీడీపీ అధిష్టానం సమాలోచనలో ఉన్నట్లు తెలిసింది. మూట ఇస్తేనే మ్యుటేషన్.. కాసులుంటేనే కన్వర్షన్ నరసరావుపేట, రొంపిచర్ల మండలాల్లో రెవెన్యూ లీలలు ప్రతి పనికీ పైసలు వసూలు తాజాగా నరసరావుపేట తహసీల్దార్ వద్దంటూ ఎమ్మెల్యే ఫిర్యాదు రెవెన్యూ అవినీతిపై ప్రజల మండిపాటువిచారించి చర్యలు తీసుకుంటాం నరసరావుపేట, రొంపిచర్ల, తహసీల్దార్ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. పనుల కోసం ఎవరైనా డబ్బులు అడిగితే తమకు నేరుగా ఫిర్యాదు చేయాలి. – కె. మధులత, ఆర్డీవో -
పల్నాడు
సోమవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2025‘యువత పోరు’ను జయప్రదం చేయాలి మాచర్ల: రాష్ట్రంలో నిరుద్యోగ యువత, విద్యార్థులను మోసం చేసి వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయటానికి సిద్ధమైన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 12న వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘యువత పోరు’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పల్నాడు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన లేకుండా, నిరుద్యోగి భృతి ఇవ్వకుండా.. అదిగో ఇదిగో ! అంటూ చంద్రబాబు నాటకాలాడుతున్నారని విమర్శించారు. ప్రతి చిన్న విషయానికి మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిపై నెపం వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ, వారిచ్చిన హామీలను విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిర్వహిస్తున్న ఉద్యమంలో భాగంగా నర్సరావుపేట కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఈ నెల 12న శాంతియుత నిరసన జరపనున్నట్లు వెల్లడించారు. ఎన్నికలప్పుడు ఉద్యోగాలు కల్పిస్తానని, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని యువకులను చంద్రబాబు మోసం చేశారని దుయ్యబట్టారు. అధికారంలోకి తొమ్మిది నెలలైనా వాటి ఊసే లేదని మండిపడ్డారు. వైద్య విద్య ప్రైవేటీకరణలో భాగంగా 17 కళాశాలను ధారాదత్తం చేసే పనిలో ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వ మోసాలపై అన్ని వర్గాలతో కలసి 12న ఉదయం 9 గంటలకు నర్సరావుపేట వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలంతా కలవనున్నట్లు వివరించారు. కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు పెద్దఎత్తున యువత, విద్యార్థులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా నిరసన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించనున్నట్లు వివరించారు. కార్యక్రమానికి ఏడు నియోజక వర్గాల ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజలంతా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇఫ్తార్ సహర్ (సోమ) (మంగళ) నరసరావుపేట 6.24 5.05 గుంటూరు 6.22 5.03 బాపట్ల 6.22 5.03 ప్రసిద్ధ పుణ్య క్షేత్రం అమరావతిలోని శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామికి ఖమ్మం జిల్లా దెందుకూరులో ఉన్న 410.34 ఎకరాల భూమిని నేటికీ కూడా నామమాత్రపు ధర పైనే కౌలుదారులు సాగు చేసుకుంటున్నారు. భూములకు ఈనాటికి బహిరంగ వేలం పాటలు నిర్వహించలేని దుస్థితిలో దేవదాయ శాఖ ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మాదల, దమ్మాలపాడు, దొండపాడు, దావులూరు, అమరావతి గ్రామాల్లో 267.28 ఎకరాలను దాతలు విరాళంగా ఇచ్చారు. ఈ భూములకు కూడా సరిపడా కౌలు రాకపోయినా గుడ్డి కన్నా మెల్ల మేలు అనే చందాన దేవదాయ శాఖ అధికారులు సరిపెట్టుకున్నారు. నేడు రాజధానిలో ఏకంగా భూములు అమ్మకం చేపట్టినా చలనం లేదు. అమరేశ్వరునికి వందలాది ఎకరాలు భక్తితో దాతలు సమ ర్పించినప్పటికీ, వాటి రక్షణ కోసం దేవదాయశాఖ సరైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. సర్వీస్దారులను గుర్తించి వారి భూములను కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇనాం భూములు కూడా ఇంతవరకు లెక్క తేల్చలేదు. వెంటనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని దేవుని భూములను రక్షించాలి. – నేరెళ్ల హనుమంతరావు, అమరేశ్వరాలయ పాలక మండలి మాజీ సభ్యుడు, అమరావతి దేవునికి దాతలు సదుద్దేశంతో ఇచ్చిన భూములను దేవదాయ శాఖ రక్షించడంలో అలసత్వం వహిస్తోంది. ఇప్పటికై నా రెవెన్యూఽ శాఖతో సమన్వయం చేసుకుని అన్యాక్రాంతమయ్యే భూములను కాపాడాలి. వీటిపై లావాదేవీలు జరగుకుండా దేవాదాయశాఖ ప్రత్యేక ప్రణాళికతో పని చేయాలి. లేనిపక్షంలో భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదు. –కోలా వెంటేశ్వరరావు, బీజేపీ జిల్లా కార్యదర్శి అమరావతి: ప్రముఖ శైవక్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలో స్వామికి వివిధ సేవలు అందించటానికి రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు సర్వీస్దారులకు 192.96ఎకరాలను ఇనాంగా ఇచ్చారు. ప్రస్తుతం అమరావతిలో రాజధాని పనులు సాగుతుండటంతో ఈ భూమిపై ప్రస్తుతం అందరి చూపు పడింది. ఇందులో సంగీత కళాకారులకు ఇనాంగా ఇచ్చిన 89 సర్వే నంబరులోని 10.70 ఎకరాలను దేవాలయం స్వాధీనం చేసుకుంది. మిగిలిన సర్వే నంబర్లు 201,124, 202,86, 171, 63, 132, 190, 77, 175, 184, 32, 83, 144లో ఉన్న 192.36 ఎకరాలను సర్వీస్ ఇనాంలుగా, మాన్యాలుగా ఇచ్చారు. సర్వీస్ ఇనాంలు పొందిన వారు దేవుని భూముల్లో ప్రస్తుతం కొన్నింటికి పట్టాలు పుట్టించి అమ్మకాలు జరిపినట్లు సమాచారం. మరికొన్నింటికి రెవెన్యూశాఖ ద్వారా పాసు పుస్తకాలు సంపాదించి బ్యాంకుల్లో రుణాలు కూడా తీసుకున్నారు. 2014లో రాజధానిగా అమరావతిని ప్రకటించటంతో కొంతమంది ఇనాందారులు తమ అనుభవంలో గల భూములను తాకట్టు పెట్టడం, లీజు ఒప్పందాలు చేసుకుని లక్షల రూపాయలు సొమ్ము చేసుకున్నారు. మరలా అవే భూములకు అగ్రిమెంరాయడానికి ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఎకరా భూమి కోట్ల రూపాయలు పలుకుతోంది. దీంతో సర్వీస్, ఇనాం భూములపై రాజకీయ నాయకులు, బడా వ్యాపారుల కన్ను పడింది. అనుభవదారుల వద్ద ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాాలతో కొంతమంది రిజిస్టర్ కూడా చేసేస్తున్నారు. ఏళ్లకు ఏళ్లు లీజు ఒప్పందాలు రాస్తున్నారు. కళ్ల ముందే అన్యాక్రాంతమవుతున్న దేవుని భూములను దేవదాయ శాఖ అధికారులు కాపాడాలని భక్తులు కోరుతున్నారు. 7న్యూస్‌రీల్ సర్వీస్, ఇనాం భూములపై బడాబాబుల కన్ను రాజధాని కారణంగా డిమాండ్ వందలాది ఎకరాల దేవుని భూములు అన్యాక్రాంతమయ్యే అవకాశం పట్టాదారు పాస్ పుస్తకాలు, అడంగల్ కాపీలు చూపితే రూ. లక్షల్లో అడ్వాన్లు కమిషనర్‌కు నివేదిక దేవాలయానికి చెందిన సర్వీస్, ఇనాం భూములపై రాష్ట్ర దేవదాయ కమిషనర్‌కు నివేదిక ఇప్పటికే సమర్పించాం. ఈ భూముల సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో ఉంచాం. ఈ భూములపై జరిపే అనధికార లావాదేవీలకు గానూ దేవాలయానికి సంబంధం లేదు. ఇప్పటికే సర్వీసుదారులకు నోటీసులు కూడా ఇచ్చాం. – సునీల్‌కుమార్, అమరేశ్వరాలయ కార్యనిర్వహణాధికారి -
జాతీయ లోక్ అదాలత్‌లో 197 కేసులు పరిష్కారం
నరసరావుపేట టౌన్: జాతీయ లోక్ అదాలత్‌లో 197 కేసులు పరిష్కారం కాగా, రూ.1.88 కోట్లు కక్షిదారులకు పరిహారం కింద లభించిందని 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్. సత్యశ్రీ తెలిపారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. అదాలత్‌లో సివిల్, రాజీ పడదగ్గ క్రిమినల్, చెల్లని చెక్కు, ముందస్తు వ్యాజ్యాలు, మనోవర్తి, రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసులు పరిష్కారం అయ్యాయి. కార్యక్రమంలో న్యాయమూర్తులు కె. మధుస్వామి, ఎన్. లావణ్య, సిబ్బంది పాల్గొన్నారు. రాజాధిరాజ వాహనంపై నారసింహుడు మంగళగిరి/ మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నాలుగో రోజైన శనివారం స్వామి వారు రాజాధిరాజ వాహనంపై దర్శనమిచ్చారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదికలో భక్తి గీతాలు, కూచిపూడి నృత్యం తదితర ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో రామకోటిరెడ్డి పర్యవేక్షించగా.. కై ంకర్యపరులుగా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన పెమ్మసాని శైలేంద్ర వ్యవహరించారు. స్వామివారు ఆదివారం రాత్రి యాలివాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
కూటమి కూసాలు కదిలేలా ఫీజు పోరు
వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య నగరంపాలెం: కూటమి ప్రభుత్వ కూసాలు కదిలేలా ఫీజు పోరుకు తరలిరావాలని వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య పిలుపునిచ్చారు. ఈ నెల 12న వైఎస్సార్ సీపీ చేపట్టనున్న ఫీజు పోరుని జయప్రదం చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి క్యాంపు కార్యాలయంలో విద్యార్థి నాయకులతో శనివారం సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు చిన్నాబత్తిన వినోద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పానుగంటి చైతన్య మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకపోవడంతో విద్యార్థులను విద్యకు దూరమవుతున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం తక్షణమే కపట నాటకాలు నిలిపివేయాలని అన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యంకావడంతో చదువులు అర్ధాంతంగా నిలిపివేయాల్సి వస్తోందని వాపోయారు. తద్వారా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. పిల్లల ఫీజులకు డబ్బులు చెల్లించలేక తల్లిదండ్రులు అప్పులు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో పలు కళాశాలల కమిటీ అధ్యక్షులు మణిచౌదరి, సుభానీ, శ్రీకాంత్, ప్రవీణ్, మస్తాన్‌రెడ్డి, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బడే జగదీష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గురిశెట్టి రవి, గంటి, జిల్లా ప్రధాన కార్యదర్శులు మస్తాన్, కరీం, రాజేష్, అజయ్, జిల్లా కార్యదర్శులు సన్ని, రామకృష్ణ, కిరణ్ పాల్గొన్నారు. మాజీ స్పీకర్ తనయుడిపై పెట్టిన కేసు రాజీ ●లోక్ అదాలత్‌కు హాజరైన కోడెల శివరామ్ ●ఫిర్యాదుదారుడు నాగరాజు రాజీ పడటంతో కేసు కొట్టివేత నరసరావుపేటటౌన్: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామ్‌పై పెట్టిన కేసు విషయమై మాజీ రంజీ క్రికెటర్ బుడుమూరి నాగరాజు శనివారం లోక్ అదాలత్‌లో రాజీ పడ్డాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల తనయుడు, తనయురాలిపై నరసరావుపేట, సత్తెనపల్లిలో నమోదైన బలవంతపు వసూళ్లు, చీటింగ్ కేసులు ఒక్కొక్కటి రాజీమార్గం ద్వారా పరిష్కారం అవుతున్నాయి. ఈ వ్యవహారంలో బాధితులను పోలీసులతో బెదిరించి రాజీ కుదుర్చుకున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగరాజు తన వద్ద కోడెల శివరామ్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.15 లక్షలు తీసుకున్నాడని, ఉద్యోగం రాకపోవటంతో డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడ్డాడని గతంలో నాగరాజు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆ కేసు జాతీయ లోక్‌అదాలత్ ముందుకు వచ్చింది. నిందితుడిగా కోడెల శివరామ్ హాజరయ్యారు. ఫిర్యాదుదారుడైన నాగరాజు రాజీ పడటంతో కేసును కొట్టివేశారు. అనంతరం నాగరాజు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కేసు పెట్టినట్లు తెలిపాడు. ఇదిలా ఉండగా నాగరాజుపై రాష్ట్రంలోని గుంటూరు, విజయవాడ, వైజాగ్ తదితర ప్రాంతాల్లో చీటింగ్, బ్లాక్‌మెయిలింగ్ కేసులు ఉన్న విషయం తెలిసిందే. లారీ ఢీకొని యువకుడు మృతి రాజుపాలెం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని మాచర్ల–గుంటూరు రహదారిపై రెడ్డిగూడెం రైస్‌మిల్లు వద్ద శనివారం రాత్రి జరిగింది. పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామానికి చెందిన సంధ్యానాయక్ (26)అనే యువకుడు సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ల వెళుతుండగా అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ కె.వేణుగోపాల్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాన్ని సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రకృతే దేవుని ఆయుధం
అమరావతి: ప్రకృతే దేవుని ఆయుధమని, ప్రభువైన ఏసుక్రీస్తు మనపక్షాన నిలిస్తే ప్రకృతిలోని పంచభూతాలు సహకరించి ఆనందింపచేస్తాయని పాస్టర్ రమేష్ అన్నారు. శనివారం మండల పరిధిలోని లేమల్లె హోసన్నా దయాక్షేత్రంలో హోసన్నా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో 48వ గుడారాల పండుగ మూడవరోజు రాత్రి సమయంలో ప్రార్థనలకు వచ్చిన లక్షలాది మంది విశ్వాసులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దేవుని చేతిలో ఉన్న అతిపెద్ద ఆయుధం ప్రకృతి అని, దానిని మనం కాపాడుకోవాలన్నారు. ప్రకృతిలో గాలి, నీరు పంచభూతాలు ఎంతో శక్తివంతమైనవని, అలాంటి శక్తివంతమైన ఆయుధాలను వశపరుచుకున్న సర్వశక్తి మహిమగల దేవుడిని మనం స్తుతించాలన్నారు. హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు పాస్టర్ అబ్రహాం, చీఫ్ పాస్టర్ జాన్‌వెస్లీలు దయాక్షేత్రం పాటల పుస్తకంలోని దేవుని గీతాలను అలపించారు. రెండవ వర్తమానంలో ఒంగోలుకు చెందిన పాస్టర్ రాజు మాట్లాడుతూ దేవుణ్ణి పూర్ణ మనస్సుతో ఆరాధించాలన్నారు. పాస్టర్ అనిల్ మాట్లాడుతూ దేవుని వాక్యాలను మన హృదయాలలో స్థిరపరుచుకుని నిరంతరం ధ్యానించాలన్నారు. తిరుపతికి చెందిన పాస్టర్ సాగర్ బృందం, సిస్టర్ ప్రేమ బృందం స్తుతి గీతాలు ఆలపించారు. అదేవిధంగా హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహిస్తున్న బైబిల్ కాలేజీలో 2024వ సంవత్సరంలో శిక్షణ పొందిన 183 మంది విద్యార్థులకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఈ ప్రార్థనల్లో దేశం నలుమూలల నుంచి వచ్చిన లక్షలాదిమంది విశ్వాసులు పాల్గొన్నారు. హోసన్నా మినిస్ట్రీస్ పాస్టర్ రమేష్ కొనసాగిన 3వ రోజు గుడారాల పండుగ ప్రార్థనలు -
భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లి సాగర్మాత
విజయపురిసౌత్: ఎందరో భక్తులకు దర్శనం ఇస్తూ కోరిక కోరికలు తీర్చే తల్లి సాగర్మాత అని నెల్లూరు సహవారస పీఠాధిపతులు డాక్టర్ పిల్లి అంతోని ఉద్భోధించారు. రెండో రోజైన శనివారం ఆయన సాగరమాత ఆలయంలోని జపమాల క్షేత్రంలో ఆలయ విచారణ గురువులు పామిశెట్టి జోసఫ్ బాలసాగర్ ఆధ్వర్యంలో జరిగిన సమష్టి దివ్యబలిపూజలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. క్రైస్తవ భక్తులంతా సమాజానికి ఆదర్శవంతంగా నిలవాలన్నారు. సాటివారిని ఆదరించడం, ప్రేమను పంచిపెట్టడం క్రైస్తవ్యం ప్రధాన లక్షణమన్నారు. సృష్టికర్త సైతం అమ్మ ద్వారానే ఈ లోకానికి వచ్చాడన్నారు. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం సంతోషకరమన్నారు. మరియమాత మన మధ్యలో నిలిచి కాపాడుతుందన్నారు. గురుశ్రీ చిన్నాబత్తిని కిరణ్‌కుమార్, తుమ్మా కరుణాకరరెడ్డి, గురుశ్రీ పామిశెట్టి బాలస్వామి, గురుశ్రీ ఆర్ రాజు, గురుశ్రీ అల్లం చిన్న శౌరెడ్డి, గురుశ్రీ రవికుమార్లచే దివ్య బలిపూజ, స్తుతి ఆరాధనలు జరిగాయి. రాత్రి తేరు ప్రదక్షిణ,సాగర్మాత బృందం వారిచే సాగర్మాత మహిమలు బుర్రకథ, 9గంటలకు శిలువ ధారి బైబిల్ నాటకం కార్యక్రమాలు నిర్వహించారు. -
మహిళా సాధికారతకు కృషి
నరసరావుపేట: రాష్ట్రంలో మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్లోని గుర్రం జాషువా సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాలలో మంత్రి గొట్టిపాటి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధ్యక్షత వహించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళామణులకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాలలో వృద్ధి చెందడం మంచి పరిణామమన్నారు. సీఎం చంద్రబాబు కృషితో మహిళలకు మేలు జరిగిందన్నారు. రాజ్యాంగంలో మహిళలు గౌరవంగా జీవించే హక్కును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కల్పించారన్నారు. ఎన్టీఆర్ ఆస్తిలో, రాజకీయాల్లో అతివలకు సమాన హక్కులు కల్పించారని తెలిపారు. ఎమ్మెల్యే చదలవాడ మాట్లాడుతూ మహిళలు లేకుండా సమాజం మనుగడ కూడా కష్టమేనని పేర్కొన్నారు. మహిళలకు సీఎం సమాజంలో సముచితస్థానం కల్పించారని తెలిపారు. అందువల్లే ఎక్కువగా రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అన్నింటినీ ఆడపిల్లల పేరున అందిస్తున్నారని వ్యాఖ్యానించారు. అందరినీ ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు సీఎం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ మహిళలు కుటుంబ బాధ్యతతోపాటు సమాజ ప్రగతిలోనూ గణనీయమైన పాత్ర పోషిస్తున్నట్లు గుర్తుచేశారు. ఈ సందర్భంగా 603 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రూ.125.87 కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కులను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. వేడుకల్లో భాగంగా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం స్టేషన్‌రోడ్డులోని గాంధీపార్కు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ పి.అరుణ్‌బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు, జేసీ సూరజ్ గనోరే, జిల్లా అటవీశాఖ అధిదికారి కృష్ణప్రియ, అదనపు ఎస్పీ జేవీ సంతోష్ పాల్గొన్నారు. మహిళా పోలీసులు తమ వాహనాలతో వెంట వచ్చారు. మహిళా ఎన్సీసీ క్యాడెట్లు, స్కౌట్ విద్యార్థినులు, ఉద్యోగినులు, పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, పోలీసులు పాలుపంచుకున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళా గ్రూపులకు బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ -
పల్నాడు
ఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025నేడే ఆంజనేయస్వామి తిరునాళ్ల రొంపిచర్ల: మండలంలోని గోగులపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సువర్చలా సమేత అభయాంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం ఆదివారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు పెదపులివర్రు(భట్టిప్రోలు): పెదపులివర్రు గ్రామంలో కొలువైన శ్రీ భూనీళా సమేత వరదరాజస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ప్రసన్నాంజనేయస్వామి జయంతి రాజుపాలెం: మండలంలోని ఆకుల గణపవరంలో ప్రసన్నాంజనేయస్వామి జయంతి మహోత్సవం సందర్భంగా శనివారం లక్ష తమలపాకుల పూజ చేశారు. ఇఫ్తార్ సహర్ (ఆది) (సోమ) నరసరావుపేట 6.24 5.06 గుంటూరు 6.22 5.04 బాపట్ల 6.22 5.04 ముప్పాళ్ళ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేసే వ్యవసాయ సంబంధిత పథకాలు, రాయితీలు వంటివి ఇకపై కౌలు రైతులు, డీకే పట్టా భూములున్న వారు, అటవీ భూములు సాగు చేసుకునే రైతులకు ఇకపై దూరం కానున్నాయి. ఆధార్ కార్డు తరహాలోనే దేశంలోని ప్రతి రైతుకు విశిష్ట సంఖ్యతో భూ ఆధార్ కార్డులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న రోజుల్లో ఈ కార్డులున్న వారికే పీఎం కిసాన్, అన్నదాతా సుఖీభవ పెట్టుబడి సాయం, వ్యవసాయ సంబందిత పథకాలు, రాయితీలపై పరికరాలు, పంటల బీమా, పంట విక్రయాలు, రుణాలపై వడ్డీ రాయితీ, సూక్ష్మ సేద్యంపై రాయితీ వంటి ప్రోత్సాహకాలు అందించనున్నట్లు నిబంధనల్లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇప్పటికే భూ ఆధార్ కార్డుల జారీకి ఫార్మర్ రిజిస్ట్రీలో వివరాలు నమోదు ప్రక్రియను రైతు సేవా కేంద్రాల్లో ప్రారంభించింది. ఈ నెల 25వ తేదీలోపు వివరాలు నమోదు చేసుకోవాలని గడువు కూడా విధించింది. అయితే భూ ఆధార్ పొందేందుకు సొంతంగా భూములున్న రైతులే అర్హులని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కౌలు రైతులు, డీకే పట్టా భూములున్న దళిత, ఇతర రైతులు, అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతుల వివరాలను ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకునేందుకు అవకాశం ఇవ్వలేదు. గతంలో జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం రెవెన్యూ గ్రామసభలు నిర్వహించి అర్హులైన వారికి కౌలు రైతు గుర్తింపు కార్డులు మంజూరు చేసింది. అలాగే ఇనాం భూములు సాగు చేసుకుంటున్న రైతులు ఉన్నారు. సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో మొత్తం సుమారు 44,741 రైతులు ఉన్నారు. వీరు కాక 18,346 మంది కౌలు రైతులు, ఇనాం భూములు, అటవీ భూములు సాగు చేసే వారు ఉన్నారు. వీరంతా భూ ఆధార్‌కు అర్హులు కారని వ్యవసాయ అధికారులు చెబుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దమ్మాలపాడులో భూ ఆధార్ నమోదు చేస్తున్న వ్యవసాయ శాఖ సిబ్బంది 7తీవ్ర నష్టం తప్పదున్యూస్రీల్ప్రభుత్వం అండగా ఉండాలి గతంలో కౌలు రైతులకు యజమానులకే భూ ఆధార్ నమోదు ఫార్మర్ రిజిస్ట్రీలో కౌలు రైతులకు చోటు దక్కకపోవడంతో అన్యాయం భూ ఆధార్ నమోదైతేనే అందనున్న ప్రభుత్వ పథకాలు, రాయితీలు ప్రక్రియనే నిలిపివేయాలని రైతు సంఘాలు డిమాండ్ సాగు చేసే రైతుకే వర్తింపజేయాలి కొత్త విధానంతో కౌలు రైతుకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా వారికి గుర్తింపు నెంబర్ ఇవ్వాలి. కేవలం సొంత భూములున్న వారికే కార్డులు ఇస్తే మిగతా వారి సంగతి ఏం కావాలి? జిల్లావ్యాప్తంగా వేల మంది కౌలు, గిరిజన, దళిత రైతులు పథకాలు అందక నష్టపోతారు. పైగా పంటలకు గిట్టుబాటు ధర అందక, సబ్సిడీ రాక కౌలు రైతులు మరింత నష్టపోతారు. పాత పద్ధతిలోనే అన్ని వర్గాల రైతులకు పథకాలు అమలు చేయాలి. – వై.రాధాకృష్ణ, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి, పల్నాడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన భూ ఆధార్ రిజిస్ట్రేషన్‌లో కౌలు రైతులను తీసుకోకపోవటం వల్ల వారు తీవ్రంగా నష్టపోతారు. ప్రభుత్వం అందించే యంత్ర పరికరాలు, సబ్సిడీ విత్తనాలు, బ్యాంకు రుణాలు, అన్నదాతా సుఖీభవ వంటి పథకాలన్నీ అందకుండా పోతే కౌలు రైతు ఎలా బతకాలి? ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖరీఫ్, రబీ సీజన్లలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి సాయాన్ని అందించలేదు. –మువ్వా శ్రీనివాసరావు, కౌలు రైతు, చాగంటివారిపాలెం, ముప్పాళ్ల మండలం. భూమి ఉన్న రైతుకే ప్రభుత్వం అన్నీ ఇస్తే కౌలు రైతుల పరిస్థితి ఏంటి? ఎక్కువగా అంతా కౌలు రైతులే ఉంటారు. వారికి గుర్తింపు లేకుండా భూమి ఉన్న వారి పేర్లే రిజిస్ట్రీలో నమోదు చేయటం సరైంది కాదు. సాగు ఎవరు చేస్తారో వారికే సాయం అందిస్తే బాగుంటుంది. అప్పుడే సాగుకు మనుగడ ఉంటుంది. –శివరాత్రి ఏడుకొండలు, రైతు, దమ్మాలపాడు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కౌలు రైతులకు ప్రభుత్వం రైతు భరోసా సాయం అందించింది. క్రమం తప్పకుండా ఏడాది రూ.11,500 కోట్లు ఆర్థిక సాయం వారి ఖాతాల్లో జమ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక భూ యజమానులు మాత్రమే పథకాలు అర్హులంటూ భూ ఆధార్ ప్రక్రియ చేపట్టడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు మేలు చేయని ఇలాంటి విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ వినిపిస్తోంది. గతంలో మాదిరిగా అందరికీ పథకాలు అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. ఇలాంటి ఉపయోగం లేని ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సర్కారు తీరు మారకుంటే మండల స్థాయిలో ఉద్యమ కార్యాచరణ చేపట్టాల్సి ఉంటుందని కౌలు రైతు సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు. -
పీ–4 సర్వే ప్రారంభం
సత్తెనపల్లి: పేదరిక నిర్మూలనకు నిర్వహించనున్న పీ–4 (పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టనర్ షిప్) ను ఉగాది నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సత్తెనపల్లి మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో ఈ సర్వే శనివారం నుంచి ప్రారంభమైంది. ఈనెల 18వ తేదీకి సర్వే పూర్తి చేయనున్నారు. అడుగుతున్న ప్రశ్నలు ఇవి... ● కుటుంబ యజమాని పేరు ● ఆధార్, సెల్‌ఫోన్ నెంబర్ ● ఇంట్లో సభ్యులు ఏ పని చేస్తున్నారు ● నెలకు కుటుంబ ఆదాయం ఎంత ● డిగ్రీ, ఆ పైన చదివిన వారెందరు ● వృత్తి, వ్యవసాయం, భూమి, పట్టణ ఆస్తి వివరాలు, వాహనాలు ● ఇంటి స్థితి ● వంటగ్యాస్ వినియోగిస్తున్నారా! ● కుళాయి కనెక్షన్ ఉందా! ● టీవీ, రిఫ్రిజిరేటర్, ఏసీ, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం ● కుటుంబ నెలవారీ ఖర్చు ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ ఏ పథకాలు అందుతున్నాయి. తదితర వివరాలను సేకరిస్తున్నారు. ఇదీ షెడ్యూల్... సత్తెనపల్లి మండలంలో శనివారం సర్వే ప్రారంభమైంది. ఈనెల 18వ తేదీలోగా పూర్తి చేయాలి. 21 నుంచి 23 వరకు గ్రామాల వారీగా సభలు నిర్వహించి వివరాలు వెల్లడిస్తారు. 24 నుంచి 26 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఈ నెల 27 నుంచి 29 వరకు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి తుది జాబితా ప్రకటిస్తారు. 30న ఉగాదికి కార్యక్రమ వివరాలు ప్రకటిస్తారు. వీరికి మినహాయింపు... ● గ్రామీణ ప్రాంతాల్లో 10 ఎకరాల భూమి ఉన్న వారు ● పట్టణ ప్రాంతాల్లో సొంత నివాసం ఉన్నవారు ● నాలుగు చక్రాల సొంత వాహనం ఉన్నవారు ● ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు ● ఆదాయపు పన్ను చెల్లించేవారు ● 200 కంటే ఎక్కువ యూనిట్లు విద్యుత్ వినియోగించే వారి వివరాలు సేకరించారు. రాష్ట్రవ్యాప్తంగా పేదరికం రూపుమాపేందుకు ప్రభుత్వ ఈ సర్వే చేపట్టిందని ఎంపీడీఓ బండి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. -
మగువలు అన్ని రంగాల్లో ముందుండాలి
గురజాల: మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని సీనియర్ సివిల్ జడ్జి వై.శ్రీనివాసరావు అన్నారు. స్థానిక కోర్టు భవనాల్లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచంలో పురుషులతో పాటు సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారన్నారు. మహిళలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి.అలేఖ్యతోపాటు పలువురు మహిళలను ఘనంగా సన్మానించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మందపాటి శ్రీనివాసరెడ్డి, బండి వీరభద్రుడు, వీఎన్వీ హనుమంతరావు, జక్కా చెన్నకేశవరావు, కె.ప్రభుదాసు, జానీబాష, కె.చలమరాజు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ఏదో ఒక చోట ఆపేయాలి
మద్యపానం, ధూమపానం లాగా బెట్టింగ్ సైతం ఓ వ్యసనం. ఆ వ్యసనం ముదిరితే వ్యాధిగా మారే అవకాశం కూడా లేకపోలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ‘గ్యాంబ్లింగ్ డిజార్డర్’గా గుర్తించింది. మొదట సరదాగా మొదలయ్యే ఈ జూదం గెలిచినప్పుడు మరింత గెలవాలన్న ఆశతో, ఓడినప్పుడు పోయిన చోటే తిరిగిపొందాలన్న కసితో అప్పులు చేసైనా ఆడుతారు. చివరికి అప్పులు ఊబిలో కూరుకుపోయి డిప్రెషన్‌కు గురవుతారు. కొంతమంది చనిపోవాలన్న కఠినమైన నిర్ణయం తీసుకుంటారు. ఈ వ్యసనాన్ని ఏదో ఒక చోట ఆపగలిగి, మానసిక వైద్యుడిచేత కౌన్సిలింగ్ అందజేస్తే ఆత్మహత్యల వరకు వెళ్లే ప్రమాదం తప్పుతుంది. – డాక్టర్ వీవీ కిరణ్, అసోసియేట్ ప్రొఫెసర్, మానసిక వ్యాధుల వైద్యవిభాగం, జీజీహెచ్, గుంటూరు -
మహిళలు పోరాటాలకు సిద్ధం కావాలి
శ్రామిక మహిళ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ నరసరావుపేట: అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తితో అతివలు పోరాటాలకు సిద్ధం కావాలని శ్రామిక మహిళ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డి.శివకుమారి పిలుపునిచ్చారు. పట్టణంలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో శనివారం యూటీఎఫ్, సీఐటీయూ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షురాలు ఎ.భాగేశ్వరిదేవి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో శివకుమారి మాట్లాడుతూ.. మహిళా సాధికారత గురించి పాలకుల ఉపన్యాసాల్లో తప్ప ఆచరణలో ఏమీ లేదన్నారు. కనీస రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తీరుతో మహిళా సాధికారత వెనుకబడిందన్నారు. సమాన పనికి సమాన వేతనం అందడం లేదని, స్థిరమైన ఉపాధి లభించడం లేదన్నారు. సమాన అవకాశాలు మహిళలకు దూరంగా ఉన్నాయన్నారు. అంగన్వాడీ, ఆశా, మున్సిపల్, భవన నిర్మాణ, ఇతర రంగాలలో వేలాదిమంది మహిళలు మగ్గుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటుపల్లి రజిని, సంఘం సీనియర్ నాయకులు గద్దె ఉమశ్రీ, నాయకులు ఎస్.దుర్గా బాయి, నాగమ్మ బాయి, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
సమాజాభివృద్ధిలో అతివల పాత్ర కీలకం
సత్తెనపల్లి: సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లాలో ఏకై క మోడల్ మహిళా స్నేహ పూర్వక గ్రామంగా ఎంపికై న నందిగామలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం శనివారం మండల స్థాయిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాస్కరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలను గౌరవించాలని, మగవారి ఎదుగుదల వెనుక సీ్త్ర ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. నందిగామ ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్ జిల్లాస్థాయిలో మంచి గుర్తింపు కలిగి ఉందని, ఈ స్ఫూర్తిని కొనసాగించాలని ఇక్కడి హరిత రాయబారులను ప్రశంసించారు. ఉత్తమ మోడల్ మహిళా ఫ్రెండ్లీ గ్రామంగా ఎంపికై న నందిగామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సత్తెనపల్లి ఎంపీడీఓ బండి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళా గ్రీన్ అంబాసిడర్లను, అన్ని శాఖల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బందిని పూలమాలలు, దుశ్శాలువాలతో సన్మానించారు. గ్రామంలోని ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించి, హాకీలో జాతీయస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించిన ధరణిని సన్మానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామంలోని మహిళలు, ఉద్యోగినిలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఏఎంసీ మాజీ చైర్మన్ ఆళ్ల సాంబయ్య, ఈటీసీ బాపట్ల ఫ్యాకల్టీ మెంబర్ ఆర్.వర్ధని, డీటీఎం నాగేశ్వరరావు, డీఆర్పీ ఎం.నరసింహనాయక్, డీఎల్సీఓ అహ్మద్ బీ, గ్రామ సర్పంచ్ బి.రమాదేవి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు,గ్రామస్తులు పాల్గొన్నారు. జిల్లా పంచాయతీ అధికారి భాస్కరరెడ్డి -
బెదిరింపులు.. ప్రలోభాలు
నరసరావుపేట: అసలు బలమేలేని మండల పరిషత్‌లో పాగా వేసేందుకు కూటమి నేతలు, కుట్రలు, కుతంత్రాలకు, బెదిరింపులకు గురిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. మాచర్ల మండల పరిషత్‌లో 14 ఎంపీటీసీల్లో కూటమికి ఒక్క ఎంపీటీసీ కూడా లేరు. అయినా శనివారం జరిగిన మండల పరిషత్ అత్యవసర సమావేశంలో బలవంతంగా ఎంపీటీసీలను తమ ఖాతాలో వేసుకొని ఎట్టకేలకు బడ్జెట్ అంచనాలను ఆమోదించుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎలాగైనా మండల పరిషత్‌ను స్వాధీనం చేసుకోవాలని కుయుక్తులు పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీపీగా చేస్తున్న బూడిద మంగమ్మ ఏడు నెలల క్రితం అనారోగ్యంతో సెలవుపై వెళ్తూ మొదటి వైస్ ఎంపీపీగా ఉన్న పోతురెడ్డి సుజాతకు బాధ్యతలివ్వాలని సభ్యులందరి చేత తీర్మానం చేయించి తీర్మాన పత్రాన్ని, సెలవు మంజూరు దరఖాస్తును అప్పటి జెడ్పీ సీఈఓను స్వయంగా కలిసి అందించారు. ఇదే అదనుగా భావించిన కూటమి నేతలు కుట్రలకు తెరలేపారు. జిల్లా అధికారుల నుంచి ఇన్చార్జి ఎంపీపీ బాధ్యతలను సుజాతకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఒక్క సభ్యుడూ లేని మండల పరిషత్‌లో రెండవ వైస్ ఎంపీపీగా ఉన్న పరిమళ మనీషాను నయానో.. భయానో తమ వైపునకు తిప్పుకొని ఆమెను అడ్డం పెట్టుకుని మండల పరిషత్‌ను ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని కూటమి నేతలు పన్నిన కుయుక్తులు ఏడు నెలలుగా ఫలించలేదు. ఒక్కరు తప్పితే మిగతా 13 మంది వైఎస్సార్ సీపీ వైపే ఉన్నారు. ● అయితే శనివారం జరిగిన అత్యవసర సమావేశంలో అధికార పార్టీ నాయకులు మండల పరిషత్ కార్యాలయంలోకి ప్రవేశించి సంబంధిత ఎంపీటీసీలను బెదిరింపులకు, ప్రలోభాలకు గురిచేస్తూ హల్చల్ సృష్టించారు. ఉదయం 11గంటలకు ప్రారంభమైన సమావేశం మధ్యాహ్నం 2గంటలు దాటుతున్నా నలుగురు మాత్రమే హాజరు కావటంతో ఎలాగైనా మరొక ఎంపీటీసీని తెప్పించి బడ్జెట్ అంచనాలను ఆమోదం చేసుకోవాలనే కూటమి నేతల కుతంత్రాలకు తెరలేపి ఎంపీటీసీలను బెదిరించి, బుజ్జగించి ప్రలోభాలకు గురి చేసి ఎట్టకేలకు ఐదుగురితో సంతకాలు చేయించి బడ్జెట్ ఆమోదం చేసుకున్నారు. సమావేశానికి హాజరైన వైఎస్సార్ సీపీ సర్పంచ్ల పై కూటమి నేతలు దూషణకు పాల్పడి దౌర్జన్యాలకు దిగారు. వైఎస్సా ర్సీపీ నాయకులు ఈ సమావేశ ప్రాంతంలో ఉండకూడదని, వెళ్లిపోవాలని ఆగ్రహిస్తూ ఇతర మండలాల నుంచి వచ్చిన కూటమి నాయకులు, కార్యకర్తలు వారిపై దౌర్జన్యం చేస్తూ ఆ ప్రాంతం నుంచి వెళ్లగొట్టారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఐ, ఎస్ఐల ముందే కూటమి నేతలు దౌర్జన్యాలకు పాల్పడడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మాచర్ల మండల పరిషత్ సమావేశంలో టీడీపీ నేతల హల్చల్ వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లపై దౌర్జన్యం బడ్జెట్ అంచనాలు ఆమోదింపజేసుకున్న వైనం ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు సంవత్సర బడ్జెట్ అంచనాలను ఉన్నతాధికారులకు నివేదించేందుకు అత్యవసర సమావేశం నిర్వహించాం. ఈ సమావేశానికి పశువేముల, కంభంపాడు 2, చింతలతండ, జమ్మలమడక, కొప్పునూరుకు చెందిన ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు. వైస్ ఎంపీపీ–2గా ఉన్న పరిమళ మనీషా ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఐదుగురు సభ్యుల ఆమోదంతో బడ్జెట్ అంచనాలను ఆమోదించి ఉన్నతాధికారులకు అందజేస్తాం. – ఫణికుమార్ నాయక్, ఎంపీడీఓ -
ప్రపంచ శాంతి కోసమే గుడారాల పండుగ
అమరావతి: ప్రభువైన ఏసుక్రీస్తుచే తేజరింపచేసి ప్రపంచంలోని మానవులందరి ఉజ్జీవం కోసం గుడారాల పండుగలో ప్రార్థనలు చేస్తున్నామని హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు, దైవజనులు ఫాస్టర్ అబ్రహం అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని హోసన్నా దయాక్షేత్రంలో హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహించే 48వ గుడారాల పండుగ రెండవ రోజు రాత్రిపూట ప్రార్థనలకు వచ్చిన లక్షలాది మంది ఆరాధికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ఈ పండుగలో విశ్వాసులు, సేవకులు ఉజ్జీవింపబడాలంటే దేవుని చేత ప్రకాశించి, వాక్యం మీద ఆసక్తి కలిగి దేవుని ప్రార్థనే ఊపిరిగా భావించాలన్నారు. దేవున్ని స్తుతించకుండా, ఆరాధించకుండా ఉండలేననే స్థితికి మనం చేరుకోవాలన్నారు. తాను కూడా అనేకులను ప్రభువు చెంతకు చేర్చటానికి సారధిగా మారాలనే సంకల్పం ఉండాలన్నారు. దేవుని యందు విశ్వాసంతో మనం పనిచేయగలిగితే జనులు కూడా నిన్ను అనుసరిస్తారు, అందుకు దైవజనులు ఏసన్న జీవితమే సాక్ష్యమన్నారు. 48 సంవత్సరాల కిందట కేవలం 80 మందితో నిర్వహించిన గుడారాల పండుగకు అదే గ్రామంలో నేడు లక్షలాదిమంది తరలిరావడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు. వసతులు ఉన్నా, లేకపోయినా, అవకాశం ఉన్నా లేకపోయినా లక్షలాది మంది ఈ దయాక్షేత్రానికి రావడానికి కారణమైన ఏసుప్రభు చూపిన మార్గంలో మనందరి నడిపిన దైవజనులు ఏసన్న కారణజన్ముడన్నారు. దేవుని కృప నీపై ప్రసరించబడిన ఈరోజు నుంచి ప్రతి ఒక్కని జీవితంలో సర్వసమృద్ధి కలుగుతుందన్నారు. దేవుడు తనని నమ్మినవారందరిని ఒకరి వద్ద చేతుల చాచే స్థితిలో లేకుండా అదృష్టాన్ని ప్రసాందించబోతున్నారన్నారు. దేవుని అనుగ్రహం పొందినవారిని తృణీకరించిన వారందరూ సాగిలపడతారన్నారు. అనంతరం రెండవ వర్తమానంలో హోసన్నా మినిస్ట్రీస్ చీఫ్ పాస్టర్ జాన్‌వెస్లీ ప్రసంగించారు. తొలుత దేవుని స్తుతి గీతాలకు సండేస్కూల్ చిన్నారుల నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. సుపీరియర్ సిస్టర్ ప్రేమ ఆధ్వర్యంలో దేవని గీతాలాపనలు విశ్వాసులను భక్తిభావంలో ఓలలాడించాయి. ఈ ప్రార్థనలలో దేశం నలుమూలల నుంచి వచ్చిన లక్షలాదిమంది హోసన్నా ఆరాధికులు పాల్గొన్నారు. ఫాస్టర్ అబ్రహం తరలివచ్చిన విశ్వాసులు -
అభయారణ్యానికి రాణి
నల్లమల టైల్‌ఎండ్... నాగార్జునసాగర్– శ్రీశైలం పులుల అభయార్యణం.. పల్నాడు జిల్లాలో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతమిది. జిల్లా ఫారెస్ట్ అధికారిగా జి.కృష్ణప్రియ తన విధులను సమర్థంగా నిర్వహిస్తున్నారు. కొద్ది నెలల కిందటే డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంపై పట్టు సాధించారు. పెద్దపులులు జిల్లాలోని దుర్గి, లోయపల్లి, వెల్దుర్తి, కారంపూడి, బొల్లాపల్లి మండలాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు గుర్తించి వాటి సంరక్షణకు చర్యలు తీసుకున్నారు. ఆయా ప్రాంతాలలోని ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు, వన్యప్రాణులకు రక్షణ ఇస్తూ సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారు.ప్రతి మహిళను గౌరవించాలి ప్రతి మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. మహిళా సమాజంతో తన గౌరవాన్ని కోరుకుంటుంది. ఈ ఏడాది మహిళా దినోత్సవ థీమ్‌లో ఒకటైన సమానత్వం వాస్తవ రూపం దాల్చాలి. లింగ వివక్షకు సమాజంలో తావివ్వకూడదు. –జి.కృష్ణప్రియ, డీఎఫ్ఓ, పల్నాడుజిల్లా -
లక్ష్యాన్ని అల్లుకున్న లత
చిన్న తనంలోనే తండ్రిని కోల్పోయింది ఆమె. తన మాతృమూర్తి తనను, తమ్ముడిని పెంచేందుకు పడిన కష్టాన్ని గమనిస్తూ ఎదిగింది. చదువు పూర్తిచేసుకొని ఉద్యోగ వేటలో గ్రూప్–4 ఉద్యోగానికి ఎంపికయ్యారు. తల్లి పెళ్లి చేసింది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. కానీ, తాను ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలనే లక్ష్యానికి మెట్టినిల్లు అండగా నిలిచింది. భర్త, అత్తమామలు అందించిన ప్రోత్సాహంతో గ్రూప్–1 ఉద్యోగానికి ఎంపికై రెవెన్యూ డివిజనల్ అధికారిగా నరసరావుపేట ఆర్డీవోగా మధులత బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా చిక్కుముడిగా ఉన్న లింగంగుంట్ల ఈనాం భూ సమస్యను పరిష్కరించటంలో తనదైన పాలనను చూపారు. -
విద్యా రంగానికి కళ
జిల్లా విద్యా రంగాన్ని మహిళా అధికారులే ఏలుతున్నారు. పాఠశాల విద్య జిల్లా విద్యాశాఖాధికారిగా ఎల్.చంద్రకళ, ఇంటర్విద్యాశాఖాధికారిగా ఎం.నీలావతిదేవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిల్లాల పునర్విభజనలో నూతనంగా ఏర్పడిన జిల్లాలో శాశ్వత కార్యాలయం లేక అద్దె భవనంలో కొనసాగుతున్న జిల్లా విద్యా శాఖ కార్యాలయానికి తాను డీఈఓగా బాధ్యతలు చేపట్టిన చంద్రకళ వెంటనే పరిష్కారాన్ని చూపారు. నిరుపయోగంగా ఉన్న ఎన్బీటీ అండ్ ఎన్సీవీ కళాశాల హాస్టల్ గదులను జిల్లా కలెక్టర్ సహకారంతో డీఈఓ కార్యాలయంగా మార్చారు. ఆమె పర్యవేక్షణలో విద్యాశాఖ సిబ్బంది వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని తమ కార్యాలయాన్ని తీర్చిదిద్దుకున్నారు. నిత్యం ఏదో ఒక పాఠశాలను సందర్శిస్తూ బాలికలకు చదువు ప్రాధాన్యతను వివరిస్తున్నారు. బాలికలను చదివించాలి.. సమాజంలో ప్రతి ఒక్కరూ బాలికల విద్య పట్ల శ్రద్ధ తీసుకోవాలి. పాఠశాల విద్యతోనే ఆపివేయకుండా వారికి ఉన్నత విద్యను అందించాలి. చదువుతోనే ఏదైనా సాధించగలమని మహిళలు గుర్తించాలి. బాల్య వివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించారు. మహిళలు సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. –ఎల్.చంద్రకళ, డీఈఓ, పల్నాడుజిల్లా -
సాధారణ స్థాయి నుంచి జిల్లా అధికారిగా..
సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నీలావతిదేవి నేడు జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో బీఎడ్ పూర్తిచేశారు. భర్త ప్రోత్సాహంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ విద్యామండలిలో 20 సంవత్సరాలపాటు పనిచేశారు. అనంతరం ఏలూరు, రాజమండ్రిలో జిల్లా ఉపవిద్యాశాఖాధికారిగా పనిచేసి నూతన జిల్లాల ఆవిర్భావంతో పల్నాడు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించి సమర్థంగా నిర్వహిస్తున్నారు. విద్యార్థి దశలో కీలకమైన ఇంటర్మీడియెట్ విద్యాశాఖ కత్తి మీద సాముగా గుర్తించి సమర్థంగా నడుపుతున్నారు. జిల్లాలోని ప్రతి ఇంటర్మీడియెట్ కళాశాలను సందర్శించి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. కుటుంబ ప్రోత్సహంతోనే... మరో ఏడాదిలో ఉద్యోగ విరమణ చేస్తున్నా. నా జీవిత ప్రయాణంలో తల్లిదండ్రులు, భర్త ప్రోత్సాహం ఎంతో ఉంది. ప్రతి ఆడపిల్ల జీవితంలో ఇటువంటి ప్రోత్సాహం ఉన్నప్పుడు వారు సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు. అంతరిక్షానికై నా ఎగురగలరు. సైన్యంలో చేరి సరిహద్దులను కాపాడగలరు. –నీలావతిదేవి, ఇంటర్ విద్యాశాఖాధికారి -
రెవెన్యూపై సైబర్ వల
నరసరావుపేటటౌన్: ‘హలో మేము ఏసీబీ అధికారులం.. మీ డిప్యూటీ తహసీల్దార్ రూ.20 వేలు లంచం తీసుకుంటూ దొరికారు. మీ ఆస్తులపై దాడులు చేయబోతున్నాం. మీరు డబ్బులిస్తే వదిలేస్తాం’ అని నరసరావుపేట తహసీల్దార్‌కు రెండు రోజుల కిందట సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. తహసీల్దార్ తొలుత కొంత తత్తరపాటుకు గురై, అనంతరం మా ఆస్తులపై దాడులు చేసుకోవచ్చంటూ బదులిచ్చారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌ను టార్గెట్ చేసిన సదరు మోసగాళ్లు మీ అవినీతి బాగోతమంతా తమకు తెలుసునని, అకౌంట్లో మనీ వేస్తే వదిలేస్తామని బెదిరించారు. ఆర్ఐ వివరాలు తెలుసుకుని తనకు కాల్ చేశారు. తాము ఏసీబీ అధికారులమని తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్‌పై దాడులు చేశామని చెప్పి భయపెట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఇద్దరు పిల్లలు విదేశాల్లో చదివిస్తున్నట్లు తెలిసిందని, అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో లెక్క చెప్పాలంటూ ప్రశ్నించారు. అడిగినంతా ఇస్తే మీ జోలికి రానని చెప్పారు. దీంతో ఆర్ఐ రూ.70 వేలు వారు చెప్పిన ఖాతాకు జమ చేశారు. వీరంతా ఒక్క చోటకు చేరి విషయం తెలిశాక తాము మోసపోయామని గుర్తించారు. ఈ విషయంపై సైబర్ నియంత్రణ విభాగానికి డిప్యూటీ తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. తెలిసిన వారి పనే (నా)? ఆన్లైన్లో తహసీల్దార్ నంబరు మాత్రమే అందుబాటులో ఉంటుంది. డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐల నంబర్లు ఉండవు. తహసీల్దార్‌కు కాల్ చేసిన వారు, డీటీ, ఆర్ఐలను సైతం బెదిరించి ఆర్ఐ వద్ద నగదు వసూలు చేశారు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి గురించి బాగా తెలిసిన వారే చేశారని చర్చించుకుంటున్నారు. ఈ కోణంలోనూ సైబర్ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి ఏసీబీ పేరుతో వచ్చిన కాల్స్ కారణంగా రెవెన్యూ ఉద్యోగుల్లో కలకలం రేగింది. ఏసీబీ అధికారులమంటూ బెదిరింపులు ఆర్ఐ నుంచి రూ.70 వేలు వసూలు మోసపోయాక సైబర్ అధికారులకు ఫిర్యాదు తెలిసిన వారి పనేనని అనుమానాలు సైబర్ క్రైంకు ఫిర్యాదు చేశాం తనతో పాటు డీటీకి రెండు రోజుల కిందట ఫోన్ చేసి ఏసీబీ అధికారులమంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. లంచం తీసుకుంటుండగా డీటీని పట్టుకున్నామని చెప్పారు. ఆర్ఐను బెదిరించి అతని వద్ద నుంచి రూ.70 వేలు కాజేశారు. వెంటనే అప్రమత్తమై వన్‌టౌన్ సీఐ చరణ్‌కు విషయాన్ని తెలియజేశాం. ఆయన ఇచ్చిన సూచన మేరకు సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేసి నగదు పంపిన అకౌంట్ వివరాలు చెప్పి సీజ్ చేయాలని కోరాం. జరిగిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీటీకి చెప్పాను. – వేణుగోపాల్, తహసీల్దార్ -
అభయారణ్యానికి రాణి
నల్లమల టైల్‌ఎండ్... నాగార్జునసాగర్– శ్రీశైలం పులుల అభయార్యణం.. పల్నాడు జిల్లాలో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతమిది. జిల్లా ఫారెస్ట్ అధికారిగా జి.కృష్ణప్రియ తన విధులను సమర్థంగా నిర్వహిస్తున్నారు. కొద్ది నెలల కిందటే డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంపై పట్టు సాధించారు. పెద్దపులులు జిల్లాలోని దుర్గి, లోయపల్లి, వెల్దుర్తి, కారంపూడి, బొల్లాపల్లి మండలాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు గుర్తించి వాటి సంరక్షణకు చర్యలు తీసుకున్నారు. ఆయా ప్రాంతాలలోని ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు, వన్యప్రాణులకు రక్షణ ఇస్తూ సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారు.ప్రతి మహిళను గౌరవించాలి ప్రతి మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. మహిళా సమాజంతో తన గౌరవాన్ని కోరుకుంటుంది. ఈ ఏడాది మహిళా దినోత్సవ థీమ్‌లో ఒకటైన సమానత్వం వాస్తవ రూపం దాల్చాలి. లింగ వివక్షకు సమాజంలో తావివ్వకూడదు. –జి.కృష్ణప్రియ, డీఎఫ్ఓ, పల్నాడుజిల్లా -
విద్యా రంగానికి కళ
జిల్లా విద్యా రంగాన్ని మహిళా అధికారులే ఏలుతున్నారు. పాఠశాల విద్య జిల్లా విద్యాశాఖాధికారిగా ఎల్.చంద్రకళ, ఇంటర్విద్యాశాఖాధికారిగా ఎం.నీలావతిదేవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిల్లాల పునర్విభజనలో నూతనంగా ఏర్పడిన జిల్లాలో శాశ్వత కార్యాలయం లేక అద్దె భవనంలో కొనసాగుతున్న జిల్లా విద్యా శాఖ కార్యాలయానికి తాను డీఈఓగా బాధ్యతలు చేపట్టిన చంద్రకళ వెంటనే పరిష్కారాన్ని చూపారు. నిరుపయోగంగా ఉన్న ఎన్బీటీ అండ్ ఎన్సీవీ కళాశాల హాస్టల్ గదులను జిల్లా కలెక్టర్ సహకారంతో డీఈఓ కార్యాలయంగా మార్చారు. ఆమె పర్యవేక్షణలో విద్యాశాఖ సిబ్బంది వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని తమ కార్యాలయాన్ని తీర్చిదిద్దుకున్నారు. నిత్యం ఏదో ఒక పాఠశాలను సందర్శిస్తూ బాలికలకు చదువు ప్రాధాన్యతను వివరిస్తున్నారు. బాలికలను చదివించాలి.. సమాజంలో ప్రతి ఒక్కరూ బాలికల విద్య పట్ల శ్రద్ధ తీసుకోవాలి. పాఠశాల విద్యతోనే ఆపివేయకుండా వారికి ఉన్నత విద్యను అందించాలి. చదువుతోనే ఏదైనా సాధించగలమని మహిళలు గుర్తించాలి. బాల్య వివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించారు. మహిళలు సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. –ఎల్.చంద్రకళ, డీఈఓ, పల్నాడుజిల్లా -
ప్రేమ, కరుణ ప్రసాదించండి
● విచారణ గురువులు జోసఫ్ బాలసాగర్ ● ఘనంగా మొదలైన సాగర్మాత మహోత్సవాలు విజయపురిసౌత్ : శాంతి, సమాధానం, ప్రేమ, కరుణ, వాత్సల్యాలను భక్తులకు ప్రసాదించాలని సాగర్మాత విచారణ గురువులు జోసఫ్ బాలసాగర్ ప్రార్ధించారు. మాచర్ల మండలం విజయపురిసౌత్‌లో శుక్రవారం ప్రారంభమైన సాగర్మాత మహోత్సవాలను పురస్కరించుకొని జరిగిన సమష్టి దివ్య బలిపూజ కార్యక్రమంలో ఆయన భక్తులనుద్ధేశించి ప్రసంగించారు. పరిశుద్ధాత్మ అయిన ఏసుక్రీస్తుకు జన్మను ప్రసాదించిన సాగర్మాత(మరియమ్మ) ఆశీస్సులు ఎల్లవేళల మీయందరి యందున ఉంటాయని, ఆ తల్లిని భక్తి విశ్వాసాలతో పూజిస్తే కోరికలతోపాటు పాపాలు చెరిగిపోతాయని ఉద్భోదించారు. పరిపూర్ణమైన హృదయంతో, జ్ఞానంతో, వివేకంతో మన తండ్రి అయిన ఏసుక్రీస్తును ప్రార్థించాలని, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలని కోరారు. ఆ తరువాత సాగర్మాత మహోత్సవాల సందర్భంగా ఆలయాలను, జపమాల క్షేత్రాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీనికి ముందు ఉదయం 5.30గంటలకు సాగర్మాత విచారణ గురువులు పామిశెట్టి జోసఫ్ బాలసాగర్చే, 6.30గంటలకు గురుశ్రీ జోసఫ్ తంబి అన్నెంచే దివ్యబలిపూజ, 9.30 గంటలకు గోరంట్ల గురుశ్రీ గోపు జోసఫ్చే జపమా ల, స్తుతి ఆరాధన, మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం, 2గంటలకు గురుశ్రీ గోపు జోసఫ్ చే వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థనలు, సాయంత్రం 5.30గంటలకు గురుశ్రీ ప్రత్తిపాటి మరియదాసుచే జపమాల, నవదిన జపములు, తేరు ప్రదక్షిణ, దివ్యబలిపూజ 7.30గంటలకు కొవ్వొత్తులతో తేరు ప్రదక్షి ణ, రాత్రి 8గంటలకు సాగర్మాత కళాకారుల బృందంచే యేసేపు చరిత్ర బుర్రకథ, రాత్రి 9గంటలకు ధనవంతుడు బీదలాజరు బైబిల్ నాటకం ప్రదర్శించారు. 8,9తేదీల్లో కార్యక్రమాలునిర్వహించనున్నా రు. భారీగా తరలివచ్చిన భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో విజయపురిసౌత్ కళకళలాడింది. లాంచీస్టేషన్ సెంటర్ నుంచి సాగర్మాత దేవాలయం వరకు రోడ్డుకు ఇరువైపుల తినుబండారాల దుకాణాలు, ఫ్యాన్సీ షాపులు, వివిధ రకాల ఆటబొమ్మల షాపులు వెలిశాయి. సాగర్మాత ప్రాంగణంలో చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన జెయింట్ వీల్, రంగుల రాట్నాలు ఆకర్షణగా నిలిచాయి. దేవాలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఉచిత వైద్య శిబిరాలు స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడడికల్ ఆఫీసర్ కెపీ చారి, కొప్పునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటుచేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సమృద్ధి ఫౌండేషన్, కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. సాగర్మాత తిరునాళ్లకు ప్రత్యేక బస్సులు మాచర్ల : మాచర్ల ఆర్టీసీ డిపో నుంచి సాగర్మాత తిరునాళ్లకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో శుక్రవారం ఉదయం నుంచి 15 ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు డీఎం వీరాస్వామి తెలిపారు. గుంటూరు నుంచి మాచర్లకు రైలులో వచ్చే ప్రయాణికులను సాగర్మాతా తిరునాళ్లకు చేర్చేందుకు రైల్వేస్టేషన్ వద్ద ప్రత్యేకంగా మరో ఎనిమిది బస్సులు ఏర్పాటు చేశారు. మరో రెండు రోజులపాటు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
లక్ష్యాన్ని అల్లుకున్న లత
చిన్న తనంలోనే తండ్రిని కోల్పోయింది ఆమె. తన మాతృమూర్తి తనను, తమ్ముడిని పెంచేందుకు పడిన కష్టాన్ని గమనిస్తూ ఎదిగింది. చదువు పూర్తిచేసుకొని ఉద్యోగ వేటలో గ్రూప్–4 ఉద్యోగానికి ఎంపికయ్యారు. తల్లి పెళ్లి చేసింది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. కానీ, తాను ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలనే లక్ష్యానికి మెట్టినిల్లు అండగా నిలిచింది. భర్త, అత్తమామలు అందించిన ప్రోత్సాహంతో గ్రూప్–1 ఉద్యోగానికి ఎంపికై రెవెన్యూ డివిజనల్ అధికారిగా నరసరావుపేట ఆర్డీవోగా మధులత బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా చిక్కుముడిగా ఉన్న లింగంగుంట్ల ఈనాం భూ సమస్యను పరిష్కరించటంలో తనదైన పాలనను చూపారు. -
సాధారణ స్థాయి నుంచి జిల్లా అధికారిగా..
సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నీలావతిదేవి నేడు జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో బీఎడ్ పూర్తిచేశారు. భర్త ప్రోత్సాహంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ విద్యామండలిలో 20 సంవత్సరాలపాటు పనిచేశారు. అనంతరం ఏలూరు, రాజమండ్రిలో జిల్లా ఉపవిద్యాశాఖాధికారిగా పనిచేసి నూతన జిల్లాల ఆవిర్భావంతో పల్నాడు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించి సమర్థంగా నిర్వహిస్తున్నారు. విద్యార్థి దశలో కీలకమైన ఇంటర్మీడియెట్ విద్యాశాఖ కత్తి మీద సాముగా గుర్తించి సమర్థంగా నడుపుతున్నారు. జిల్లాలోని ప్రతి ఇంటర్మీడియెట్ కళాశాలను సందర్శించి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. కుటుంబ ప్రోత్సహంతోనే... మరో ఏడాదిలో ఉద్యోగ విరమణ చేస్తున్నా. నా జీవిత ప్రయాణంలో తల్లిదండ్రులు, భర్త ప్రోత్సాహం ఎంతో ఉంది. ప్రతి ఆడపిల్ల జీవితంలో ఇటువంటి ప్రోత్సాహం ఉన్నప్పుడు వారు సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు. అంతరిక్షానికై నా ఎగురగలరు. సైన్యంలో చేరి సరిహద్దులను కాపాడగలరు. –నీలావతిదేవి, ఇంటర్ విద్యాశాఖాధికారి -
రోడ్డు ప్రమాదంంలో ఏడుగురికి గాయాలు
అమరావతి: మండల పరిధిలోని లేమల్లెలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయపడ్డారు. పోలీసుల అందించిన వివరాలు.. లేమల్లెలో జరుగుతున్న గుడారాల పండుగకు గుంటూరు ఏటీ అగ్రహారం నుంచి ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఆటోలో బయదేరి వస్తున్నారు. అలాగే మంగళగిరికి చెందిన కట్టె ప్రకాశరావు స్కూటీపై మంగళగిరి నుంచి గుడారాల పండుగకు వస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వేగంగా వస్తున్న నీళ్ల ట్యాంకర్‌తో కూడిన ట్రాక్టర్ ప్రమాదశాత్తు తొలుత స్కూటీని ఢీకొట్టి, అనంతరం ఆటోని కూడా ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఏడుగురు గాయపడగా అందులో మంగళగిరికి చెందిన కట్టె ప్రకాశరావు, గుంటూరు ఏటీ అగ్రహారానికి చెందిన దేవరపల్లి మారుతయ్యలకు తీవ్రగాయాలు కాగా, మిగిలిన ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని అమరావతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ప్రాథమిక చికిత్స అందించిన మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై అమరావతి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన విదేశీ బృందం
బెల్లంకొండ: ప్రకృతి వ్యవసాయ విధానంలో మండలంలో సాగు చేస్తున్న వరి, కంది క్షేత్రాలను ఫ్రాన్స్ దేశానికి చెందిన విదేశీ బృందం సభ్యులు శుక్రవారం సందర్శించారు. మండలంలోని నాగిరెడ్డి పాలెంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలకు జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె.అమలుకుమారి విదేశీ బందాన్ని తీసుకెళ్లి అవగాహన కల్పించారు. బీజామృతం, విత్తన గుళికలు, ద్రవ జీవామృతం, ఘనజీవామృతం, నీమాస్త్రం తయారు చేస్తున్న విధానాలను మహిళా రైతులు వారికి వివరించారు. కంది పంటలో ఏ గ్రేడ్ మోడల్ వ్యవసాయ క్షేత్రాన్ని చూపించి, కంది పంటలో ఐదు నుంచి పది రకాల అంతర పంటలు వేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం చేకూరుతుందని చెప్పారు. నిరంతరం ఆదాయం వచ్చే ఏటీఎం మోడల్ సూర్య మండలం మోడల్లో 27 రకాల కూరగాయల పంటలను రైతుల పండిస్తున్నట్లు తెలిపారు. నంది రాజుపాలెంలో మహిళా రైతు అనంతలక్ష్మి పండిస్తున్న వరి ఏ గ్రేడ్ మోడల్ క్షేత్రాన్ని సందర్శించారు. వరి పొలం గట్లపై అరటి, కొబ్బరి, బొప్పాయి, జామ, బంతి పలు రకాల చెట్లను నాటడాన్ని వివరించారు. కందిపాడు గ్రామంలో రైతు నాగమల్లేశ్వరరావు సాగు చేస్తున్న ప్రధాన పంట దొండ పందిరి తోట, అందులో అంతర పంటలుగా వేసిన టమోటో బంతి చిక్కుడు ఆముదం పంటలను పరిశీలించారు. కార్యక్రమంలో స్టేట్ ఎన్ఎఫ్ఏ మౌనిక, జిల్లా ఎన్ఎఫ్ఏలు నందకుమార్, ప్రవీణ, ఎంటీలు అనంతలక్ష్మి, జయలక్ష్మి, అంజలి పాల్గొన్నారు. -
ల్లాయిడ్ హెల్త్ కేర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రెసిడెంట్ మహేష్ కవథేకర్
దివ్యాంగుల బదిలీల్లో వెసులుబాటు కల్పించండి గుంటూరు వెస్ట్: ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో దివ్యాంగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్లయ్య కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో ఈ మేరకు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎల్లయ్య మాట్లాడుతూ 40 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులను ప్రాధాన్య క్రమంలో చేర్చి బదిలీలు నిర్వహించాలన్నారు. 70 శాతం పైబడి ఉన్న వారికి బదిలీల నుంచి మినహాయింపునివ్వాలని ఒకవేళ వారు కోరుకుంటే మొదటి ప్రాధాన్యం వారికే ఇవ్వాలని కోరారు. 2025లో రూపొందించిన ఉపాధ్యాయ బదిలీ చట్టంలోని దివ్యాంగులకు ఇబ్బందికరంగా ఉన్న అంశాలను తొలగించాలన్నారు. సాంకేతికతతో కొత్త అవకాశాలు చేబ్రోలు: సాంకేతికతతో కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయని ల్లాయిడ్ హెల్త్ కేర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రెసిడెంట్ మహేష్ కవథేకర్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ నావిగేటింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ మేనేజ్మెంట్ విత్ టెక్నాలజీ అండ్ సస్టైనబిలిటీ’ అనే అంశంపై రెండు రోజుల పాటు బ్లెండెడ్ మోడ్‌లో నిర్వహించే అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ కవథేకర్ మాట్లాడుతూ ఆటోమేషన్, ఏఐ, డేటా ఎనలిటిక్స్ తదితర అంశాల గురించి వివరించారు. -
వారబందిపై రైతులకు అవగాహన కల్పించండి
నరసరావుపేట: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటిని జిల్లాలో పంటల సాగు వినియోగానికి అవలంబిస్తున్న వారబందీ విధానంపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో కలసి రబీ సాగు, వేసవి తాగునీటి సరఫరాకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి వినియోగంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు నీటిలో మన రాష్ట్ర వాటాను వృథా చేయకుండా కాలువలపై ఆధారపడి సాగు చేస్తున్న ప్రతి ఎకరాకూ నీరు అందించాలని కోరారు. నీటి చౌర్యానికి పాల్పడుతూ చివరి ఆయకట్టు రైతులకు నీరు అందకుండా చేసే రైతులకు వాస్తవ పరిస్థితిని వివరించాలని చెప్పారు. ప్రాజెక్టు నీటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీసు సాయం తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ, సాగర్ ప్రాజెక్టు అధికారులు సమన్వయం చేసుకుని ప్రాజెక్టులో నీటిని రైతులందరూ న్యాయబద్ధంగా వినియోగించుకునేలా చూడాలన్నారు. మార్చి నెలాఖరు వరకూ రైతులకు నీరు అందించడమే మొదటి ప్రాధాన్యం అని, ఏప్రిల్‌లో తాగునీటి వినియోగం కోసం ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ప్రస్తుతం 40 శాతం లోపు నీరున్న చెరువులను నింపేందుకు మాత్రమే ప్రాజెక్టు నీటిని వినియోగించాలని కోరారు. ఇప్పటికే నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న బొల్లాపల్లి మండలానికి నీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే, డీఆర్వో ఎ.మురళి, నాగార్జునసాగర్ ప్రాజెక్టు చైర్మన్ కాంతారావు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎస్ఈ కృష్ణమోహన్, జిల్లా వ్యవసాయ అధికారి ఐ.మురళి, ఆర్డీఓ కె.మధులత, జిల్లా ఉద్యాన అధికారి రమణారెడ్డి పాల్గొన్నారు. తండాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి జిల్లాలో గిరిజనులు నివాసం ఉండే తండాలలో వారు జీవించేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో గిరిజన ఆవాసాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్–దర్తీ అభ) పథకానికి చెందిన గైడ్‌లైన్స్ గురించి సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు. జిల్లాలోని ఎంపీడీవోలకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని ఐదు మండలాలైన మాచర్ల, దుర్గి, దాచేపల్లి, అచ్చంపేట, బొల్లాపల్లిలలో 17 రకాలైన సౌకర్యాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. దీనిలో 17 విభాగాల అధికారులు పాలు పంచుకుంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కె.జ్యోత్స్న, పశుసంవర్ధకశాఖ పీడీ కాంతారావు, జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి సమీక్ష -
మనస్తాపంతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
పెదకూరపాడు: చదువుకోవటం నాకు ఇష్టం లేదు... నన్ను బలవంతం పెట్టకండి.. నేను హాస్టల్‌కి వెళ్లను. ఇంటివద్ద ఉంటాను... అంటూ విద్యార్థి చెప్పడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని పంట పొలంలోని పురుగులు మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలోని జలాలపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. జలాలపురం గ్రామానికి చెందిన మన్నవ శరీలు, చిట్టెమ్మల కుమార్తె మన్నవ జోష్ రాణి (17) నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సెలవులకు స్వగ్రామం జలాలపురం వచ్చింది. సెలవులు అనంతరం కళాశాలకు వెళ్లకపోవటంతో తల్లి మందలించింది. చదువు ఇష్టం లేదని జోష్ రాణి చెప్పటంతో కళాశాలకు వెళ్లక పోతే నాతో పాటు వ్యవసాయ పనులకు రావాలని ఒత్తిడి చేయటంతో రెండు రోజులపాటు తల్లితో కలిసి మిరప కోత పనులకు వెళ్లింది. ఈ క్రమంలో బుధవారం మిర్చి కోతలు కోస్తున్న పంట పొలంలో రైతు దాచుకున్న పురుగులు మందును తాగింది. వాంతులు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను సత్తెనపల్లి ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఇన్విజిలేటర్‌కు దేహశుద్ధి గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పరీక్షలు రాస్తున్న ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఇన్విజిలేటర్‌కు తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ప్రకాశం జిల్లా దర్శి మండలానికి చెందిన విద్యార్థిని గుంటూరులోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాల హాస్టల్లో ఉండి చదువుతోంది. ఈనెల 3 నుంచి పొన్నూరు రోడ్డులోని ఓ ప్రైవేటు కళాశాల పరీక్ష కేంద్రంలో సీనియర్ ఇంటర్ పరీక్షలకు రాస్తోంది. ఇన్విజిలేటర్‌గా వ్యవహరిస్తున్న యువకుడు పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం, ఫోన్ నంబర్ ఇవ్వాలంటూ అడగడం చేశాడు. దీంతో విద్యార్థిని తాను చదువుతున్న కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. కళాశాల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ యువకుడిని రెండు రోజుల క్రితం మందలించారు. అదే రోజు అతడిని ఇన్విజిలేషన్ విధుల నుంచి అధికారులు తొలగించారు. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం పరీక్ష కేంద్రం వద్దకు చేరుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు చీఫ్ సూపరింటెండెంట్‌తోపాటు కళాశాల ప్రిన్సిపాల్‌తో మాట్లాడి యువకుడిని కళాశాలకు పిలిపించారు. అతడికి దేహశుద్ధి చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో ఓ ప్రైవేటు కళాశాలలో ఎంబీఏ చదువుతున్న వ్యక్తిని అధికారులు ఇన్విజిలేటర్‌గా నియమించడం గమనార్హం. ఈ విషయం ఆర్ఐఓ జీకే జుబేర్ దృష్టికి వెళ్లడంతో ఎంబీఏ విద్యార్థిని ఇన్విజిలేటర్‌గా నియమించడంపై చీఫ్ సూపరిండెంట్‌ను సంజాయిషీ కోరారు. 1,22,426 బస్తాలు మిర్చి విక్రయం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం 1,11,958 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,22,426 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,500 వరకు పలికింది. -
కోటప్పకొండ కొండలపై జిల్లా అధికారుల ట్రెక్కింగ్
నరసరావుపేట రూరల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం కోటప్పకొండలో మహిళా అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు ట్రెక్కింగ్ నిర్వహించారు. మహిళా అధికారులైన ఐ అండ్ పీఆర్ డీడీ దీప్తి, డీఎఫ్ఓ కృష్ణప్రియ, డ్రగ్ ఇన్స్పెక్టర్ సునీత, ప్రకృతి వ్యవసాయ డీపీఎం అమలకుమారి, సర్వేయర్ ఏడీ భానుకీర్తి, కార్మిక విభాగ అసిస్టెంట్ కమిషనర్ ధనలక్ష్మి, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ రమణ, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కుముదిని పాల్గొనగా, ఫారెస్టు విభాగం ఏర్పాటు చేసిన పోజ్ ఆర్చ్ ముందు కలెక్టర్, ఎస్పీ, మహిళా అధికారులు తమ ఫొటోలు దిగారు. అదనపు ఎస్పీ జేవీ సంతోష్, ఆర్అండ్బీ ఈఈ రాజానాయక్ పాల్గొన్నారు. డీఎస్సీ బీసీ అభ్యర్థులకు ఉచిత ఆన్లైన్ శిక్షణ నరసరావుపేట ఈస్ట్: పల్నాడుజిల్లా పరిధిలో డీఎస్సీ–2025 పరీక్షకు అర్హులైన బీసీ, ఈబీసీ అభ్యర్థులకు ఆన్లైన్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు జిల్లా బీసీ సంక్షేమ, సాధికారత అధికారి బి.శివనాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈనెల 10వతేదీలోగా పట్టణంలోని తిలక్ స్కూల్ రోడ్డులోని బీసీ సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. టీటీసీ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 9441630075లో సంప్రదించాలని కోరారు. బ్యాంక్ ఉద్యోగుల నిరసన కొరిటెపాడు(గుంటూరు): బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 24, 25 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఈమేరుక ఉద్యోగులు, అధికారులు శుక్రవారం చంద్రమౌళి నగర్‌లోని కెనరా బ్యాంక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. బ్యాంక్ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక(యుఎఫ్‌బీయూ) జిల్లా కన్వీనర్ బాషా మాట్లాడుతూ బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎస్బీఐ ఉద్యోగ సంఘ నేత పరేంద్ర మాట్లాడుతూ ఐడీబీఐ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. యూబీఐ ఉద్యోగ నేత రాంబాబు, యూఎఫ్‌బీయూ సలహాదారుడు పి.కిషోర్ కుమార్ పాల్గొన్నారు. -
జనరిక్ ఔషధాల వినియోగంపై అవగాహన కల్పించాలి
జన ఔషధి దివస్‌లో ఎంపీ లావు సూచన నరసరావుపేట: జనరిక్ మందుల ఔషధాల వినియోగం పెరిగేలా డాక్టర్లు శ్రద్ధ చూపాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. శుక్రవారం జన ఔషది దివస్‌ను పురస్కరించుకొని పల్నాడురోడ్డులోని పాత ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ప్రధానమంత్రి జనరిక్ షాపు వద్ద డీఎంహెచ్ఓ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన జనరిక్ షాపుల ద్వారా చాలా తక్కువ ధరకే నాణ్యమైన మందులు అందించటం జరుగుతుందని చెప్పారు. డీఎంహెచ్ఓ బి.రవి, జిల్లా డ్రగ్ నియంత్రణ అధికారి డాక్టర్ డి.సునీత, జిల్లా ప్రభుత్వ వైద్యశాలల పర్యవేక్షణ అధికారి డాక్టర్ బీవీ రంగారావు పాల్గొన్నారు. -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు నరసరావుపేట: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మదర్‌థెరిస్సా, కల్పనా చావ్లా, సునీత విలయమ్స్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పల్నాడు పోలీసు విభాగం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశపు హాలులో సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ విశ్వ క్రీడా వేదికపై మహిళలు రాణిస్తూ వారి దేశాల జెండాలను రెపరెపలాడిస్తున్నారని చెప్పారు. అక్షరాస్యతలో ప్రతి ఏడాది మహిళల యొక్క అంకె పెరుగుతూ ఉందని వివరించారు. అయితే ఇంకా చిన్నారుల మీద, పసికందుల మీద లైంగికదాడులు జరుగుతూ ఉన్నాయని, వీటిని నివారించేందుకు ప్రభుత్వం చట్టాలు చేసి ప్రత్యేకమైన న్యాయస్థానాలు ఏర్పాటు చేయటంతో పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తోందని చెప్పారు. ఎప్పుడైనా, ఎక్కడైనా మహిళలు పనిచేసే ప్రదేశం, వారు ప్రయాణించే వాటిలో కానీ, నివాసం ఉంటున్న చోట కానీ ఎటువంటి ఇబ్బంది కలిగినా వెంటనే స్పందించేందుకు ఎన్నో టోల్ ఫ్రీ నంబర్లు ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. కానీ వాటిని ఉపయోగించుకునే మహిళల శాతం తక్కువగానే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డు ప్రొఫెసర్ టీడీ విమల, నరసరావుపేట లీగల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ టి.అమూల్య, ఏరియా హాస్పిటల్ డాక్టర్ వెంకటరమణ, డీఈఓ ఎల్.చంద్రకళ, ఏఎంవీఐ మనీషా, ఐసీడీఎస్ పీడీ ఎస్.ఉమాదేవి, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం, సోషల్ మీడియాలో మహిళలకు గోప్యతను కాపాడే అవసరమైన డిజిటల్ భద్రత, స్వీయరక్షణ, మహిళలకు పని ప్రదేశాల భద్రత, వేధింపులపై మౌనాన్ని వీడటం, బహిరంగ ప్రదేశాలలో మహిళల భద్రత సవాళ్లు, పరిష్కారాలు, మహిళల భద్రతకు భరోసా ఇవ్వడంలో పురుషుల పాత్ర, పని ప్రదేశంలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి స్థానాలు, వ్యూహాలు, సోషల్ మీడియా దుర్వినియోగం వంటి వాటిపై సమగ్రంగా చర్చించారు. పరిపాలన విభాగ అదనపు ఎస్పీ జేవీ సంతోష్, మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ వెంకటరమణ, సీఐ కేవీ సుభాషిణి పాల్గొన్నారు. -
No Headline
నగరంపాలెం: మహిళా దినోత్సవం సందర్భంగా చేపట్టిన మహిళా ఫిర్యాదుల విండోకు విశేష స్పందన లభించిందని ట్రైనీ ఐపీఎస్ అధికారిణి దీక్ష చెప్పారు.ఎస్పీ సతీష్‌కుమార్ నేతృత్వంలో గురువారం జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్స్టేషన్లలో మహిళా ఫిర్యాదుల విండో కార్యక్రమాన్ని నిర్వహించారు. చి మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది ఫిర్యాదులు స్వీకరించారు. కొన్ని ఫిర్యాదులను కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా 64 మంది మహిళలు ఫిర్యాదులివ్వగా, అందులో 57 సమస్యలను తక్షణం పరిష్కరించినట్టు అధికారులు చెప్పారు. ఈ సదర్భంగా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి దీక్ష మాట్లాడుతూ ప్రత్యేక ఫిర్యాదుల విండో మంచి కార్యక్రమమని పేర్కొన్నారు. -
కనుల పండువగా జీవధ్వజ ప్రతిష్టా మహోత్సవం
సత్తెనపల్లి: పట్టణంలోని వడ్డవల్లి వీరాంజనేయ స్వామి దేవస్థానం జీవధ్వజ ప్రతిష్టా మహోత్సవం శుక్రవారం కనుల పండువగా నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచే పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసన, పంచగవ్యారాధన, ప్రాత:సవనం, ఉక్త, మూర్తి హోమాలు, రత్నన్యాసం, బీజన్యాసం, యంత్ర స్థాపన చేపట్టారు. జీవధ్వజ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కళావాహన, ధేను దర్శనం, కుంభదృష్టి, ప్రథమ పూజ, పూర్ణాహుతి, నీరాజనమంత్రపుష్పములు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై జై శ్రీ రామ్ ... జై హనుమాన్ నామస్మరణ మార్మోగింది. దేవదాయ శాఖ కార్యనిర్వాహ ణాధికారి సనిమెళ్ళ కోటిరెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించారు. -
ఊపిరాడక... ఉక్కపోసి...
● ఇదేం చోద్యం ● ఉపకరణాల నిర్ధారణ వైద్య శిబిరంలో అవస్థలు ● ఇరుకు గదుల్లో ప్రత్యేక అవసరాల చిన్నారులకు పరీక్షలు నరసరావుపేట ఈస్ట్: ప్రత్యేక అవసరాలు గల పిల్లలతో తమకు పనేంటి అనుకున్నారో ఏమో.. ఏ ఒక్క జిల్లా అధికారి అటువైపు కన్నెత్తి చూడలేదు. మానసిక, శారీరక దివ్యాంగులు అవటం వలనేమో నోరు తెరిచి అడగలేరనే ధీమా కాబోలు కనీస సదుపాయాలు కల్పించలేదు. పట్టుమని 50 మందికి కూడా సరిపోని ఇరుకు గదిలో దాదాపు 300 మందికి శిబిరం ఏర్పాటు చేశారు. జిల్లా పాఠశాల విద్యశాఖ సమగ్ర శిక్ష సహిత విద్యావిభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ఉపకరణాలను ఉచితంగా అందించేందుకు నిర్ధారణ శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని పాతూరులోని భవిత పాఠశాలలో ఏర్పాటు చేయటంతో ప్రత్యేక అవసరాల చిన్నారులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కనీసం మూడు గదులు కూడా లేని చిన్న పాఠశాలలో జిల్లా పరిధిలోని 11 మండలాలకు చెందిన భవిత పాఠశాలల దివ్యాంగ చిన్నారులకు వైద్య నిర్ధారణ కోసం ఏర్పాటు చేయటం విమర్శలకు తావిచ్చింది. కిక్కిరిసి పోయిన గదుల్లో చిన్నారులు ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందు పడ్డారు. అధికారుల లెక్కల ప్రకారం 161 మంది చిన్నారులకు ఉపకరణాలను నిర్దేశిస్తూ వైద్యులు ధ్రువీకరించారు. చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు, 11 మండలాలలో భవిత పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బంది హాజరు కావటంతో గందరగోళ పరిస్థితి కనిపించింది. దీనిపై ఐఈడీ కోఆర్డినేటర్ ఆర్.సెల్వరాజ్‌ను వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాలతో హడావుడిగా క్యాంప్ నిర్వహించాల్సి వచ్చిందన్నారు. మున్సిపల్ పాఠశాలల్లో పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా భవిత పాఠశాలలో ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. -
విద్యుత్ చౌర్యం సామాజిక నేరం
సీఆర్డీఏ ఎస్ఈ సుబ్రహ్మణ్యం మహిళా ఫిర్యాదుల విండోకు విశేష స్పందన చిలకలూరిపేట: విద్యుత్ చౌర్యం సామాజిక నేరమని సీఆర్డీఏ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ పి.సుబ్రహ్మణ్యం తెలిపారు. విద్యుత్ విజిలెన్స్ అధికారుల బృందం శుక్రవారం కనెక్షన్ల తనిఖీలు నిర్వహించింది. తనిఖీల్లో 35 మంది అధికారులు, 105 మంది సిబ్బంది 35 బృందాలుగా ఏర్పడి 2,074 సర్వీసులు తనిఖీ చేసి, రూ.3.08 లక్షల అపరాధ రుసుం విధించినట్లు అధికారులు తెలిపారు. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మీటరు ఉన్నప్పటికీ అక్రమంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న ఒకరిని గుర్తించి రూ.10 వేలు, ఇతర కేటగిరిలో విద్యుత్ వినియోగిస్తున్న మరొకరిని గుర్తించి రూ.10 వేలు చొపజరిమానా విధించినట్లు తెలిపారు. అనుమతించిన లోడు కంటే అదనంగా విద్యుత్ వినియోగించుకుంటున్న 55 మందిని గుర్తించి రూ.2.86 లక్షలు జరిమానా విధించటం జరిగిందన్నారు. దాడుల్లో ఈఈలు సీహెచ్ వెంకటేశ్వరరావు, బి.సంజీవరావు, డీఈఈలు ఎన్ఎం ప్రసాద్, ఆర్.అశోక్‌కుమార్ పాల్గొన్నారు. 57 ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం -
పసుపు రైతులకు త్వరితగతిన పరిహారం
తెనాలి: దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ గతేడాది జనవరిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు చెల్లించాల్సిన పరిహారంపై రైతు సంఘం నేతలు గురువారం తెనాలిలో సబ్ కలెక్టర్ సంజనా సింహాను కలిశారు. రైతులకు రావాల్సిన పరిహారంపై ప్రభుత్వం ఇచ్చిన హామీని త్వరితగతిన నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. బాపట్ల జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వేములపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కోల్ట్ స్టోరేజీ అగ్ని ప్రమాదం దుర్ఘటనకు సంబంధించి, మొత్తం 380 మంది పసుపు రైతులకు పరిహారం అందాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వం ఆమోదించిన పరిహారం మొత్తాన్ని ఒకే విడతలో చెల్లించాలని కోరామని, సబ్ కలెక్టర్ సంజనా సింహ ఈ విషయంపై సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివ సాంబిరెడ్డి మాట్లాడుతూ పసుపు రైతులకు పరిహారంపై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఎనిమిది నెలల క్రితం ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరకపోవడంపై విచారం వ్యక్తంచేశారు. సబ్ కలెక్టర్‌ను కోరిన రైతు సంఘం బృందం -
పవిత్ర మాసంలో శుభాల శుక్రవారం
యడ్లపాడు: ముస్లిం సమాజానికి జుమ్మా(శుక్రవారం) పవిత్రమైన ప్రత్యేక రోజు. సూర్యుడు ఉదయించే రోజుల్లో అన్నింటికంటే ఉత్తమమైన రోజుగా జుమ్మాను పరిగణిస్తారు. ఇస్లాంలో ప్రధానంగా రంజాన్, బక్రీద్ అనే రెండు పండుగలు ఉన్నప్పటికీ, వారంలో ఒకరోజైన జుమ్మాను ప్రత్యేక పండుగ రోజులా పరిగణిస్తారు. రంజాన్ మాసంలో ఇది మరింత విశిష్టతను సంతరించుకుంటుంది. ముఖ్యంగా చివరి జుమ్మా విశేష ఫలప్రదమైనదిగా భావిస్తారు. ఖురాన్‌లోని సూరా ‘అల్–జుమ్మా‘లో శుక్రవారం విశిష్టత వివరించబడింది. జుమ్మా రోజున ముస్లింలు తమ పనులను విడిచి మసీదులకు వెళ్లి ప్రాపంచిక విషయాలను పక్కన పెట్టి దైవచింతనతో ప్రార్థనలు చేయాలని స్పష్టంగా పేర్కొనబడింది. ఇస్లామిక్ గ్రంథాల ప్రకారం, తీర్పుదినం రోజు యూదులు, క్రైస్తవుల కంటే ముందుగా ముస్లింలు దైవ విచారణను ఎదుర్కొంటారని ప్రవక్త మొహమ్మద్ (సఅసం) తెలియజేశారు. మానవజాతి మొదటి వ్యక్తి అయిన ఆదాము(అ)ను దైవం సృష్టించబడిన రోజు శుక్రవారం. అతను స్వర్గానికి పంపించబడినదీ శుక్రవారమే. అనంతరం నిషేధిత ఫలం తిన్నరోజు.. ఆదాం అవ్వాలను తిరిగి భూమికి తరిమివేయబడినదీ ఆ రోజే. తమ తప్పును గ్రహించి అల్లాహ్‌ను క్షమాభిక్ష కోరిన రోజు కూడా శుక్రవారం కావడం విశేషం. తొలి మానవుడు ఆదాం మరణించినది ఇదే రోజు. తీర్పు దినం (ఖయామత్) కూడా శుక్రవారం జరిగే రోజు అని ప్రవక్త ముహమ్మద్ (సఅసం) తెలియజేశారు. శుక్రవారం 15 సున్నతులు పాటించాల్సి ఉంటుంది. ఇస్లాంలో జుమ్మా రోజుకు, జుమ్మా జోహర్ నమాజుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అల్లాహ్ ఆదేశానుసారం ప్రవక్త ఆచరించి చూపిన వాటిలో జుమ్మా నమాజు ఒకటి. పవిత్రమైన ఆ రోజున అల్లాహ్ ఆరాధనలో గడపాలని అల్లాహ్ యొక్క హుజూర్, ఉమ్మత్తులు అందరికీ నిశ్చయించారు. ఖురాన్, హుజూర్ నుంచి ఎన్నో హదీసుల ద్వారా సందేశాలను తెలియజేశారు. నేడు రంజాన్ మాసం తొలి శుక్రవారం ఇస్లాంలో జుమ్మా ఎంతో ప్రత్యేకం -
అగ్నిప్రమాదంలో మూడు పూరిళ్లు దగ్ధం
నిజాంపట్నం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నికి మూడు పూరిళ్లు దగ్ధమైన సంఘటన మండలంలోని నక్షత్రనగర్‌లో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు గ్రామంలోని మోపిదేవి శివనాగరాజు గృహంలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు ఎగసిపడ్డాయి. పక్కనే ఉన్న మరో రెండు పూరిళ్లకు మంటలు వ్యాపించి మూడు పూరిళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. బాధితులు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. సంఘటనా స్థలానికి రేపల్లె అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. రూ.11లక్షల వరకు ఆస్తినష్టం సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. -
ఎంతో పుణ్యఫలం
జుమ్మా నాడు మసీదుకు నడిచి వెళ్లిన వారి ఒక్కొక్క అడుగుకి ఒక్కో పాపం తొలగి, వారి దర్జా స్వర్గంలో హెచ్చించబడుతుంది. ఎవరైతే మసీదు లోపలికి మొదటిగా ప్రవేశిస్తారో వారికి దేవదూతలు ఒక ఒంటెను త్యాగం చేసినంత పుణ్యాన్ని లిఖిస్తారు. ప్రవేశించిన రెండో వ్యక్తికి ఆవు, మూడో వ్యక్తికి మేకను, నాలుగో అతనికి కోడి, ఐదో వ్యక్తికి గుడ్డుకు సమానంగా పుణ్యమును వారి ఖాతాల్లో దేవదూతలు రాయడం జరుగుతుంది. జుమ్మా నమాజ్‌తోపాటు అల్ కహాఫ్ సూరా చదివి, శ్రద్ధగా బయాన్ విన్నవారికి జుమ్మా నుంచి జుమ్మా వరకు చేసిన పాపములు అల్లాహ్ క్షమిస్తాడు. జుమ్మారోజు సూరా అల్ దుఖాన్ ఎవరైతే చదువుతారో వారికోసం 70 వేల దేవదూతలు దువా చేస్తారు. ఇలా జుమ్మాను పవిత్రంగా భావించి ఆరాధన చేసిన వారికి అల్లాహ్ ఒక సంవత్సరం అంతా ఒక్కపొద్దు, ప్రార్థనలు చేసినంత పుణ్యమును బహుమతిగా ఇస్తారు. అలాగే జుమ్మా రోజు చనిపోయిన వారికి అల్లాహ్ సమాధి శిక్షల నుంచి తొలగిస్తాడు. – షేక్ అబ్దుల్ కలీం, మత గురువు -
ప్రజా సంక్షేమానికి ప్రభుత్వాలు తూట్లు
నరసరావుపేట: ప్రజా సంక్షేమానికి, ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడుస్తున్న కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై ప్రజలలో చైతన్యం నింపి పోరాటాలకు సిద్ధం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. గురువారం పల్నాడు జిల్లా కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో పార్టీ జిల్లా కమిటీ సమావేశం కమిటీ సభ్యులు జి.రవిబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ మోదీ వరుసగా మూడవసారి అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. బీజేపీతో కూడిన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు సూపర్ సిక్స్ అంటూ విస్తృతంగా ప్రచారం చేశారని తెలిపారు. ఇప్పుడు అమలు చేయలేక పోతున్నామని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన 23 వేల అర్జీల విషయంలో కాలయాపన వీడి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ప్రజా చైతన్య యాత్రల ద్వారా ప్రజా సమస్యలను అధ్యయనం చేసి ఈ నెల 20 నుంచి జిల్లా కలెక్టరేట్లు వద్ద, రెవెన్యూ, మండల పరిషత్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేయాలన్నారు. పార్టీ సీనియర్ నాయకులు గద్దె చలమయ్య, పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ మాట్లాడారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు వై.రాధాకృష్ణ, అనుముల లక్ష్మీశ్వరరెడ్డి, ఏపూరి గోపాలరావు, తిమ్మిశెట్టి హనుమంతరావు, తెలకపల్లి శ్రీను, ఎస్.ఆంజనేయ నాయక్, మహిళా నాయకులు ఉమశ్రీ, మల్లీశ్వరి, విమల, రజిని, దుర్గాబాయి పాల్గొన్నారు. -
విద్యుత్ చౌర్యం కేసులో రూ. 85వేలు జరిమానా
గుంటూరు లీగల్: విద్యుత్ చౌర్యం కేసులో జరిమానా విధిస్తూ జడ్జి వి.ఎ.ఎల్.సత్యవతి తీర్పు చెప్పారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాల గ్రామానికి చెందిన వేల్పుల పెదఏసు 2016 నవంబరు 15న అక్రమంగా విద్యుత్ వినియోగిస్తుండగా ఆ శాఖ అధికారి ఎం.కోటయ్య తనిఖీల్లో పట్టుకున్నారు. దీనిపై ఆయన యాంటీ పవర్ తెఫ్ట్ స్క్వాడ్‌కు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్ఐ కె. హనుమంతరావు విచారణ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఒకటో అదనపు జిల్లా కోర్టులో విచారణ జరిగింది. నేరం రుజువు కావడంతో జడ్జి వి.ఎ.ఎల్.సత్యవతి రూ. 85వేలు జరిమానా విధించారు. కట్టలేని పక్షంలో ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వజ్రాల రాజశేఖరరెడ్డి వాదనలను వినిపించారు. భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య యద్దనపూడి: భార్య కాపురానికి రాకపోవటంతో జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని పూనూరులో జరిగింది. మండలంలోని పూనూరు గ్రామంలోని వడ్డెర కాలనీకి చెందిన తన్నీరు గంగరాజు (28) కు జె. పంగులూరు మండలం కొప్పెరపాడు గ్రామానికి మహిళతో ఏడేళ్ల కిందట వివాహమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య నాలుగేళ్ల కిందట అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. రోజులు గడుస్తున్నా భార్య కాపురానికి రాకపోవటంతో ఈ నెల 4వ తేదీ భార్య దగ్గరికి వెళ్లి కాపురానికి రమ్మని చెప్పగా ఆమె నిరాకరించటంతో మనస్తాపానికి గురైన గంగరాజు బుధవారం మధ్యాహ్నం పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి గురువారం మృతి చెందినట్లు ఎస్సై రత్నకుమారి తెలిపారు. మృతుని తండ్రి రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వేర్వేరు అగ్ని ప్రమాదాల్లో రూ.1.75 లక్షల నష్టం చీరాల అర్బన్: ఈపురుపాలెంలో జరిగిన వేర్వేరు అగ్ని ప్రమాదాల్లో రూ.1.75 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల మేరకు.. బుధవారం రాత్రి చీరాల మండలం ఈపురుపాలెంలోని పాత ఇనుపసామాన్ల షాపులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక లక్షా 50 వేల రూపాయల విలువ గల సామగ్రి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షాపు యజమాని సయ్యద్ అఫ్రీది నుంచి వివరాలు నమోదు చేశారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. గురువారం సాయంత్రం ఈపురుపాలెంలోని ఎస్బీఐ సమీపంలో ఓ ఇంటిలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఇంటిలోని సామాగ్రి దగ్ధమైంది. మంటలు చెలరేగడానికి కారణం తెలియరాలేదు. ఇంటి యజమాని చెరుకూరి నారాయణ నుంచి వివరాలను నమోదు చేశారు. -
పర్యవేక్షణ అధికారి పోస్టుకు దరఖాస్తు ఆహ్వానం
నరసరావుపేట రూరల్: జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పోస్ట్‌కు ఫారిన్ సర్వీస్‌పై పనిచేయుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ వి.సుబ్బారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న అర్హులైన స్కూల్ అసిస్టెంట్ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. ఐదు హాస్పిటళ్లకు జరిమానాలు నరసరావుపేట: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో వచ్చిన 77 ఫిర్యాదులపై కమిటీ సభ్యులు విచారించారు. అందులో డబ్బులు వసూలు చేసిన ఐదు హాస్పిటళ్లకు జరిమానా విధించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధ్యక్షతన జిల్లా క్రమశిక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ వైద్యసేవ పేషెంట్లకు బిల్లులు లేకుండా నగదు రహిత వైద్యం అందించేలా ఆసుపత్రి యాజమాన్యాలు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఎంహెచ్‌వో డాక్టర్ బి.రవి, జిల్లా ప్రభుత్వ వైద్యశాలల పర్యవేక్షణ అధికారి డాక్టర్ బీవీ రంగారావు, డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ జి.చంద్రశేఖర్, డాక్టర్ విక్టర్, సిబ్బంది పాల్గొన్నారు. బబ్బేపల్లి కొండపై మంటల కలకలం మార్టూరు: మండలంలోని బబ్బేపల్లి కొండపై గురువారం రాత్రి మంటలు స్థానికంగా కలకలం రేకెత్తించాయి. రాత్రి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో కొండపై నుంచి ఎగిసిపడుతున్న మంటలను చూసిన స్థానికులు మంటల సమీపం లోకి వెళ్లి పరిశీలించారు. గొర్రెలు లేదా పశువుల కాపర్లు పొరపాటున విసిరిన సిగరెట్ లేదా బీడీలు మంటలకు కారణమై ఉండవచ్చని మొదట భావించారు. కానీ ఒకేసారి నాలుగైదు వైపుల నుంచి ఎగిసిపడుతున్న మంటలను చూసి ఎవరైనా కావాలని చేశారా.. అనే అనుమానం గ్రామస్తులు వ్యక్త పరుస్తున్నారు. ఈ విషయమై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేష్‌ను వివరణ కోరగా.. మంటలకు కారణం పొరపాటా లేక ఎవరైనా కావాలని చేశారా.. అనే విషయం శుక్రవారం ఉదయం వెళ్లి పరిశీలించి చెబుతామన్నారు. -
దాతపై పచ్చ నేతల దౌర్జన్యం
నాదెండ్ల: సచివాలయం, రైతు భరోసా కేంద్రం భవనాల నిర్మాణానికి స్థలమిచ్చిన దాతను కూటమి నేతలు తీవ్ర వేధింపులకు గురిచేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రు గ్రామానికి చెందిన 75 ఏళ్ల పచ్చవ కోటేశ్వరరావు రెండు పర్యాయాలు గ్రామ ఉపసర్పంచ్‌గా పనిచేశారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. 2020 ఆగస్టు 28న పచ్చవ వెంకటేశ్వర్లు కుమారుడు అనిల్‌కుమార్ వద్ద 20 సెంట్లు కొనుగోలు చేశారు. ఈ స్థలంలో 10 సెంట్లు సచివాలయ నిర్మాణానికి, 5 సెంట్లు రైతు భరోసా కేంద్రానికి దానపత్రం రాసి రిజిస్టర్ జరిపింపారు. అప్పటి పంచాయతీ కార్యదర్శి భార్గవ్‌కు దస్తావేజులను అందించారు. 20 సెంట్లలో 15 సెంట్లు దానమివ్వగా మిగిలిన 5 సెంట్లలో సెంటున్నరను రైతు భరోసా కేంద్రానికి దారి నిమిత్తం వదిలిపెట్టారు. రెండు రోజుల క్రితం ఆ మూడున్నర సెంట్లలో తన గేదెలకు షెడ్డు వేసేందుకు గుంతలు తీయించారు. ఇక్కడ ఆయనకు స్థలం లేదని గ్రామ టీడీపీ నాయకులు దౌర్జన్యం చేశారు. షెడ్డు కోసం తీసిన గుంతలను పూడ్చివేయటమే కాక ఇదేమని అడిగినందుకు కోటేశ్వరరావుపై చేయి చేసుకున్నారు. దీంతో కోటేశ్వరరావు కిందపడటంతో స్వల్పగాయాలయ్యాయి. ఇంతటితో వదలక కోటేశ్వరరావుపై నాదెండ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ నిమిత్తం గత రెండు రోజులుగా కోటేశ్వరరావును పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఉదయం నుండి రాత్రి వరకూ అక్కడే ఉంచుతున్నారు. గ్రామంలోకి వెళ్తే గొడవ అవుతుందని, టీడీపీ నాయకులు ఒప్పుకోవటం లేదంటూ పోలీసులు చెబుతున్నారు. దీనిపై బాధిత మాజీ ఉపసర్పంచ్ కోటేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గతంలో సచివాలయం, ఆర్బీకే భవనాలపై దాతలు పచ్చవ కోటేశ్వరరావు, పెద్దబ్రహ్మమ్మ దంపతుల పేరిట శిలాఫలకాలు ఏర్పాటు చేశారన్నారు. సచివాలయ నిర్మాణానికి రూ.40 లక్షలు, ఆర్బీకే నిర్మాణానికి రూ.21.80 లక్షల వ్యయంతో పనులు చేశామన్నారు. సంబంధిత బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, నేటి వరకూ రూ.47 లక్షలు మాత్రమే వచ్చాయన్నారు. మరో రూ.14 లక్షలు రావాల్సి ఉందన్నారు. గ్రామంలోని టీడీపీ నాయకులు తనపై దౌర్జన్యం చేస్తున్నారని, పోలీసులతో ఇబ్బందులకు గురిచేయించటం ఎంతవరకు సబబని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పంచాయతీ ఇన్చార్జి కార్యదర్శి రాఘవయ్య ప్రోద్బలంతోనే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఎం.ప్రసాద్, పి. శౌరిరాజులు తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సచివాలయం, ఆర్బీకే భవనాలకు 15 సెంట్లు దానమిచ్చిన కోటేశ్వరరావు మాజీ ఉప సర్పంచ్, 75 ఏళ్ల వృద్ధుడిపై టీడీపీ నేతల దాడి -
యార్డులో 1,19,950 బస్తాలు మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 1,16,671 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,19,950 అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 54,938 బస్తాలు నిల్వ ఉన్నట్లు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. -
రెడ్‌బుక్ పోలీసింగ్ అమలు
పల్నాడు జిల్లాలో ఇటీవలికాలంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పోలీసుల దాష్టీకం విపరీతంగా పెరిగింది. పచ్చ నేతల ప్రోద్బలంతో కొందరు.. కూటమి నేతల మెప్పు పొందేందుకు మరికొందరు ఖాకీలు వైఎస్సార్ సీపీ శ్రేణులపై రెచ్చిపోతున్నారు. తొలుత తప్పుడు కేసులు నమోదు చేయడం.. పోలీసు స్టేషన్‌కు పిలిపించడం.. ఆనక బెదిరించడం.. మాట వినకపోతే చిత్రహింసలకు గురిచేయడం పరిపాటిగా మారింది. విషయం తెలుసుకున్న దాచేపల్లి మండల వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. హనుమంతరావు, చిరంజీవిల అక్రమ నిర్భంధంపై పోలీసులను ప్రశ్నించారు. దాచేపల్లి మండలం నుంచి కాార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివస్తున్న విషయం పోలీసులు తెలుసుకుని హనుమంతరావు, చిరంజీవిలను స్టేషన్ నుంచి పంపించారు. పోలీసుల దెబ్బలకు గాయపడిన హనుమంతరావు, చిరంజీవిలు గురజాల ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి చికిత్స పొందారు. తమను పోలీసులు చిత్రహింసలకు గురిచేసిన విషయాన్ని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసుల తీరుపై కాసు మహేష్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ భాస్కర్, ఎస్ఐలు పాపారావు, సౌందర్య రాజన్ వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఐ, ఎస్ఐలపై హైకోర్టులో ప్రైవేటు కేసు వేసేందుకు మహేష్‌రెడ్డి చర్యలు తీసుకున్నారు. ఇటీవల కాలంలో వైఎస్సార్ సీపీ శ్రేణులపై పోలీసుల దాడులు పెచ్చరిల్లుతున్నాయని వైఎస్సార్ సీపీ నేతలు చెబుతున్నారు. పోలీసుల తీరుపై స్థానిక ప్రజలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాక్షి టాస్క్‌ఫోర్స్: జిల్లాలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పోలీసులు తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి తీవ్ర హింసలకుపాల్పడుతున్నారు. దీనిపై ప్రశ్నించిన కార్యకర్తలపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ చితకబాదుతున్నారు. అసలేం జరిగిందంటే.. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేశానుపల్లి గ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఉల్లేరు హనుమంతరావు, సంక్రాంతి చిరంజీవిలను బుధవారం మధ్యాహ్నం దాచేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని తీవ్రంగా కొట్టారు. హనుమంతరావు ఇంటివద్ద గత వారం రోజుల క్రితం జరిగిన చిన్న వివాదంపై టీడీపీ నేత ఎం.ప్రశాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాలుగు రోజుల తరువాత దాచేపల్లి సీఐ భాస్కర్ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు హనుమంతరావు, చిరంజీవిలను పోలీసు స్టేషన్‌కు పిలిపించారు. స్టేషన్లో హనుమంతరావు, చిరంజీవిలను సీఐ భాస్కర్ తీవ్ర పదజాలంతో దూషించారు. అంతేకాకుండా వీరిద్దరిని పోలీసులు చితకబాదారు. ఈఘటనలో చిరంజీవి వేలికి గాయమైంది. హనుమంతరావు శరీరంపై లాఠీ దెబ్బలు ఉన్నాయి. ఇద్దరు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను స్టేషన్‌కు పిలిపించి చితకబాదిన వైనం సీఐ, ఎస్ఐల దాష్టీకంపై వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కాసు ఆగ్రహం ప్రైవేటు కేసు వేసేందుకు సిద్ధం ఇదిలా ఉండగా దాచేపల్లి పోలీసుల నుంచి తమకు ప్రాణ హాని ఉందని హనుమంతరావు, చిరంజీవిలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తనపై ఫిర్యాదు చేస్తే చంపుతానని సీఐ భాస్కర్ బెదిరించారని వాపోయారు. పోలీసుల తీరుపై ఆగ్రహం -
ఉద్యోగినులకు ‘ఆట’ విడుపు
నరసరావుపేట: స్థానిక కలెక్టరేట్ పరేడ్‌గ్రౌండ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లాలోని మహిళా ఉద్యోగులకు క్రీడాపోటీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు పచ్చజెండా ఊపి పోటీలను ప్రారంభించారు. వాలీబాల్, టెన్నికాయిట్ వంటి ప్రొఫెషనల్ ఆటలతో పాటూ మ్యూజికల్ చైర్స్, స్పూన్ రన్నింగ్ రేస్, కళ్ల గంతల వంటి సరదా ఆటలతో మహిళా ఉద్యోగులు రోజంతా ఉల్లాసంగా గడిపారు. వేడుకలలో భాగంగా మహిళా ఉద్యోగుల సేవలు స్మరించుకుంటూ జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు పింక్ బెలూన్లు ఎగరేశారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన మహిళా ఉద్యోగులు పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్, ఎస్పీతో కలిసి మీడియాతో మాట్లాడారు. క్రీడా పోటీల్లో విజయం సాధించిన మహిళలకు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో బహుమతులు అందజేస్తామని వెల్లడించారు. ఉదయం ఔట్ డోర్ గేమ్స్‌కు ప్రాధాన్యతనిచ్చి, ఎండ వేడిమి దృష్ట్యా మధ్యాహ్నం నుంచి చెస్, క్యారమ్స్ వంటి ఇండోర్ గేమ్స్ నిర్వహించామన్నారు. దాదాపు 500 మంది వరకూ మహిళా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని క్రీడాపోటీలను విజయవంతం చేశారన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు పరేడ్ గ్రౌండ్లో ప్రత్యేక ఏర్పాట్లు రోజంతా పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన క్రీడా పోటీలకు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎండ తీవ్రత దృష్ట్యా షామియానాలు ఏర్పాటు చేయడంతో పాటూ ప్రతి మహిళా ఉద్యోగికి తెల్లటి టోపీలు అందజేశారు. మధ్యాహ్నం పరేడ్ గ్రౌండ్‌లోనే జిల్లా కలెక్టర్ స్వయంగా అందరికీ రుచికరమైన భోజనాలు వడ్డించారు. పోలీసుశాఖ ఏర్పాటుచేసిన జాగిలాలు, ఆయుధాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే, డీఆర్వో ఎ.మురళి, డీఎఫ్ఓ కృష్ణప్రియ, ఆర్డీఓ కె.మధులత, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పరీక్ష కేంద్రాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి
నిజాంపట్నం: పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని డిప్యూటీ డీఈవో కేసనశెట్టి సురేష్ అన్నారు. ఈనెల 17వ తేదీ నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో మండలంలో ఏర్పాటు చేసిన పలు పరీక్ష కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన బెంచీలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాల ఆవరణంలో ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పాఠశాలకు 100 మీటర్ల వరకు ఎవరూ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈవోలు ఆర్.శోభాచంద్, జీ.శేషుగోపాలం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ డీఈవో సురేష్ -
హోసన్నా.. జయము!
అమరావతి: లక్షలాదిమంది విశ్వాసుల స్తోత్రములతో దైవజనుల ప్రార్థనలతో, ప్రభు ఏసును కీర్తిస్తూ, స్తుతి గీతాలాపనల నడుమ గురువారం రాత్రి 48వ గుడారాల పండుగ ఎంతో ఘనంగా ప్రారంభమైంది. పల్నాడు జిల్లా అమరావతి మండలం లేమల్లె గ్రామంలో హోసన్నా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో హోసన్నా దయాక్షేత్రం ప్రాంగణంలోని సువిశాలమైన మైదానంలో గుడారాల పండుగ ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. తొలుత హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు అబ్రహాం మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు జరిగే గుడారాల పండుగకు ప్రపంచవ్యాప్తంగా విచ్చేసిన విశ్వాసులను ఏసుక్రీస్తు నిరంతరం కాపాడాలని ప్రార్థిస్తున్నామన్నారు. గుడారాల పండుగలో దేవుడు అద్భుత కార్యాలను జరిపిస్తాడన్నారు. రోగులకు స్వస్థత చేకూరాలని, సేవకులకు ఉజ్జీవం కలగాలని ప్రార్థించారు. 32 ఏళ్ల తర్వాత మళ్లీ లేమల్లెలో.. హోసన్నా మినిస్ట్రీస్ చీఫ్ పాస్టర్ జాన్‌వెస్లీ మాట్లాడుతూ గుడారాల పండుగ 1977 నుంచి 1992 వరకు హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు ఏసన్న చేతుల మీదుగా లేమల్లె గ్రామంలో జరిగాయన్నారు. అయితే 1993 నుంచి 2024 వరకు 32 సంవత్సరాలపాటు గుంటూరు సమీపంలో గోరంట్లలో నిర్వహించుకున్నామన్నారు. 32 సంవత్సరాల తర్వాత మళ్లీ లేమల్లె గ్రామంలో మార్చి 5వ తేదీన హోసన్నా దయాక్షేత్ర ఆవరణలో నూతన చర్చి ప్రారంభించుకున్నామని తెలిపారు. స్తుతి గీతాల ఆల్బమ్ విడుదల.. దక్షిణాఫ్రికాకు చెందిన దైవజనులు పాస్టర్ జాషువా మోజెస్ ప్రత్యేక ప్రార్థనలు చేసి లక్షలాదిమంది విశ్వాసులు స్తోత్రాలు, కరతాళ ధ్వనుల మధ్య జాతీయపతాకంలోని మూడు రంగుల బెలూన్లను, శ్వేతవర్ణ పావురాలను ఎగురవేసి నాలుగు రోజులపాటు నిర్వహించే గుడారాల పండుగను ప్రారంభించారు. అనంతరం నూతన స్తుతిగీతాల పుస్తకమైన దయాక్షేత్రం పాటల పుస్తకాన్ని అమెరికాకు చెందిన దైవజనులు ఎర్నెట్‌పాల్ ప్రార్థనలు చేసి ఆవిష్కరించారు. అలాగే హోసన్నా స్తుతిగీతాల అల్బమ్‌ను మదనపల్లెకు చెందిన దైవజనులు పాస్టర్ రాజశేఖర్ ప్రార్థనలు చేసి ఆవిష్కరించారు. ప్రార్థనల్లో చైన్నెకి చెందిన దైవజనులు మోహన్. సి. లాజరస్తో పాటుగా పాస్టర్లు రమేష్, ఫ్రెడ్డీపాల్, అనీల్, రాజు పాల్గొని స్తుతి గీతాలను ఆలపించారు. తొలిరోజు ప్రార్థనల్లో రెండు తెలుగు రాష్టాల నుంచే కాక దేశ, విదేశాల నుంచి లక్షలాదిగా విశ్వాసులు తరలివచ్చారు. లేమల్లెలో ఘనంగా ప్రారంభమైన హోసన్నా 48వ గుడారాల పండుగ -
సీనియార్టీ జాబితాలో లోపాలు సవరించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యాశాఖ విడుదల చేసిన మున్సిపల్ ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలో లోపాలను సవరించాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుకకు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ (ఎన్టీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.హైమారావు విజ్ఞప్తి చేశారు. గురువారం డీఈవో కార్యాలయంలో రేణుకను కలసిన ఎన్టీఏ నాయకులు ఆమెకు వినతిపత్రం సమర్పించారు. ఉపాధ్యాయుల సీనియార్టీని పరిగణలోకి తీసుకోకపోవడంతో పాటు ఇతర మేనేజ్మెంట్ల నుంచి వచ్చిన ఉపాధ్యాయులను జూనియర్లుగా చూపలేదని డీఈవో దృష్టికి తెచ్చారు. జాబితాలోని తప్పులను సవరించాలని కోరారు. దీనిపై డీఈవో మాట్లాడుతూ సీనియార్టీ జాబితాలో తప్పులు దొర్లిన నేపథ్యంలో ఉపాధ్యాయులు తగు ఆధారాలతో ఈనెల 10లోపు ఫిర్యాదు చేయాలని సూచించారు. డీఈవోను కలసిన వారిలో ఎన్టీఏ గుంటూరు జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖలీల్, గుంటూరు నగర శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయి విశ్వనాఽథ్, పి. లలితబాబు, గౌరవాధ్యక్షుడు ఏవీ కృష్ణారావు ఉన్నారు. -
ప్రగతికి రోల్ మోడల్
సత్తెనపల్లి: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిరుపేద విద్యార్థులకు సైతం కార్పొరేట్ విద్య అందాలనే సత్సంకల్పంతో ఏపీ మోడల్ పాఠశాలలను 2013లో ప్రారంభించారు. మహానేత ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుతం పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధనతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. పల్నాడు జిల్లాలో 14 మోడల్ పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో 100 చొప్పున 6వ తరగతిలో ప్రవేశానికి 1400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తులకు ఆహ్వానం... మోడల్ పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఆన్లైన్లో ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 31వరకు కొనసాగుతుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థి అర్హతను పరిశీలించి అర్హుడను తేలితే క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి గేట్‌వే ద్వారా రుసుము చెల్లిస్తే ఓ జర్నల్ నెంబర్ కేటాయిస్తారు. ఆ నెంబర్ ఆధారంగా ఠీఠీఠీ. ఛిట్ఛ. ్చఞ. జౌఠి. జీుఽ లేదా ఠీఠీఠీ. ్చఞఝట. ్చఞఛిజటట. జీుఽ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత నకలును పాఠశాలో సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష... ఆరో తరగతి ప్రవేశానికి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న స్కూల్లోనే పరీక్ష ఏప్రిల్ 20న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. మెరిట్ లిస్ట్ ఆధారంగా రోస్టర్ ప్రకారం సీట్లను కేటాయించనున్నారు. ఏప్రిల్ 27న మెరిట్‌లిస్ట్ అదేరోజు సెలక్షన్ లిస్ట్‌ను వెల్లడిస్తారు. ఏప్రిల్ 30న సర్టిఫికెట్ల పరిశీలనతో పాటు కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ తేదీ నుంచి తరగతులు మొదలవుతాయి. దాచేపల్లిలోని మోడల్ స్కూల్ భవనం నోటిఫికేషన్ జారీచేసిన విద్యాశాఖ ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం జిల్లాలో 14 మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు ఒక్కో మోడల్ స్కూల్లో 100 సీట్లు చొప్పున జిల్లాలో 1400 మందికి అవకాశం ముఖ్యంగా గుర్తుంచుకోవలసినవి.. 6వ తరగతిలో ప్రవేశం పొందాలనుకునే ఓసీ, బీసీ కులాలకు చెందిన విద్యార్థులు 2013 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 2015 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. వీరు కనీసం 35 మార్కులు పొంది ఉండాలి. పరీక్ష ఫీజు రూ.150 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు 2011 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 2015 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. వీరు కనీసం 35 మార్కులు పొంది ఉండాలి. పరీక్ష ఫీజు రూ.75 చెల్లించాలి సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నిరవధికంగా 2023–24, 2024–25 విద్యా సంవత్సరాల్లో 4,5 తరగతుల్లో చదివి ప్రమోషన్‌కు అర్హత పొంది ఉండాలి పరీక్షలో వచ్చే మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది 5వ తరగతి స్థాయిలో ఉండే ఈ పరీక్షను తెలుగు/ఇంగ్లిష్ మీడియంలో రాయవచ్చు ఇక్కడ సీటుకు చాలా డిమాండ్ సద్వినియోగం చేసుకోవాలి జిల్లాలోని పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మోడల్ స్కూల్ ప్రవేశాల ప్రక్రియపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలనే ధ్యేయంతో ఏపీ మోడల్ స్కూళ్లను తీసుకొచ్చారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన జరుగుతుంది. ఆరో తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. – బత్తుల శ్రీనివాసరెడ్డి, ఏడీ, మోడల్ పాఠశాలలు, పల్నాడు జిల్లా పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు కూడా ఉన్నత చదువులు అందుబాటులోకి తీసుకురావడమే ధ్యేయంగా ఏపీ మోడల్ పాఠశాలలు ఏర్పాటయ్యాయి. ఆయా పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశం పొందితే ఇంటర్‌వరకు ఇంగ్లిష్ మీడియం విద్యను అందించడంతోపాటు విద్యాకానుక కిట్లు, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు కల్పిస్తారు. పూర్తి ఇంగ్లిష్ మీడియంతో సత్ఫలితాలను సాధిస్తున్న మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో అడ్మిషన్ పొందడం అంత ఈజీ కాదు. ప్రైవేట్ పాఠశాలల్లో ఎంత ఖర్చుపెట్టినా అందుబాటులో లేని నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్య ఇక్కడ లభ్యం కావడం పేద పిల్లలకు వరంగా మారింది. -
నేడు చిట్‌ఫండ్ స్కాంలో ముందస్తు బెయిల్‌పై విచారణ
నరసరావుపేటటౌన్: సాయి సాధన చిట్‌ఫండ్ స్కాం కేసులో ప్రధాన నిందితుడు పాలడుగు పుల్లారావు కుటుంబ సభ్యులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం వాదనలు జరగనున్నాయి. చీటీపాటలు, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో సాయి సాధన చిట్‌ఫండ్ నిర్వాహకుడు పుల్లారావుతో పాటు సంస్థలో డైరెక్టర్లుగా ఉన్న పాలడుగు వాణిశ్రీ, పాలడుగు పవన్‌కుమార్, పాలడుగు హర్షవర్థినిలు రూ.కోట్లు వసూలు చేసి ఉడాయించారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సుమారు 800 మంది బాధితుల నుంచి రూ.300 కోట్లకు పైగా సేకరించినట్లు విచారణలో తేల్చారు. కేసును సీఐడీకు అప్పగించారు. ఇప్పటికే పుల్లారావు కోర్టులో లొంగిపోయి సబ్జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండగా, కేసులో నిందితులుగా ఉన్న అతని కుటుంబ సభ్యులు ముందస్తు బెయిల్ కోసం 13వ అదనపు జిల్లా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ ద్వారా వేసిన సిట్ బృందం డీఎస్పీ కేసు సీడీ ఫైల్‌ను గురువారం జిల్లా కోర్టుకు అందజేశారు. దీనిపై శుక్రవారం ఇరుపక్షాల వాదనలు జరగనున్నాయి. -
అనుమతితోనే బల్లకట్లు, పడవలు నడపాలి
నరసరావుపేట: పల్నాడు జిల్లాలో లైసెన్స్‌లు, అనుమతులు ఉన్న బల్లకట్టు, లాంచీలు, పడవలను మాత్రమే నడపాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే సూచించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లాలో బల్లకట్లు, లాంచీలు, పడవలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. వాటికి అనుమతులు ఉన్నదీ, లేనిదీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీఆర్వో మురళి, సత్తెనపల్లి డీఎస్పీ ఎం.హనుమంతరావు, అచ్చంపేట, అమరావతి, దాచేపల్లి, గురజాల, రెంటచింతల, మాచర్ల, మాచవరం తహసీల్దార్లుతోపాటు జిల్లా టూరి జం ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. -
మహిమాన్వితం.. సాగర్మాత క్షేత్రం
విజయపురిసౌత్: ఆధ్యాత్మిక భావనకు ప్రతీకగా వెలుగొందుతున్న సాగర్మాత మహోత్సవాలను ఈ నెల 7, 8, 9 తేదీలలో ఘనంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయపురి సౌత్‌లో కృష్ణానది ఒడ్డున నెలవైన ప్రముఖ పుణ్యక్షేత్రం సాగర్మాత దేవాలయానికి రాష్ట్రంలోనే విశిష్టత కలిగిన దేవాలయంగా పేరుంది. భక్తులు కోర్కెలు తీర్చే తల్లి సాగర్మాత ఆలయానికి నిత్యం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ మందిరానికి 1977 అక్టోబర్ 10వ తేదిన అప్పటి గుంటూరు మండల పీఠాధిపతి కాగితపు మరియదాసు ప్రారంభోత్సవం చేశారు. ఉత్సవాల నేపధ్యంలో మూడు రోజులు పుణ్యక్షేత్రంలో దివ్యసత్ప్రసాదన నిత్య ఆరాధనలు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయి. కార్యక్రమాలు ఇలా.. 7వ తేదీ ఉదయం 5.30గంటలకు సాగర్మాత విచారణ గురువులు పామిశెట్టి జోసఫ్ బాలసాగర్చే, ఇతర ఫాదర్లచే దివ్యబలిపూజ, జపమాల, స్తుతి ఆరాధన, ఇలా.. రాత్రి 9గంటల వరకు ప్రార్థనలు, ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. ● 8వ తేదీ ఉదయం 5 గంటలకు గురుశ్రీ చిన్నాబత్తిని కిరణ్‌కుమార్, ఇతర ఫాదర్లచే దివ్యబలిపూజ, వాక్య పరిచర్య, రాత్రి 9గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు, ప్రత్యేక కార్యక్రమాలు. ● 9వ తేదీ గురువారం రాత్రి సాగర్మాత రథోత్సవం ప్రధానమైంది. ఈ ఊరేగింపుతో ఉత్సవం ముగుస్తుంది. ఆ రోజు ఉదయం 5గంటలకు అత్తలూరు విచారణ గురువులు గురుశ్రీ చాట్ల కస్సార్‌చే దివ్యబలిపూజ, 6 గంటలకు కారంపూడి విచారణ గురువులు పెట్ల గురుశ్రీ మర్రి అనిల్ దివ్యబలిపూజ, 7 గంటలకు ముట్లూరు విచారణ గురువులు గురుశ్రీ మార్నేని దిలీప్‌చే దివ్యబలిపూజ, 8గంటలకు దాచేపల్లి విచారణ గురువులు గురుశ్రీ ఏరువ బాలశౌర్రెడ్డిచే దివ్యబలిపూజ, ఉదయం 10.30 గంటలకు గుంటూరు పీఠాధిపతులు చిన్నాబత్తిని భాగయ్యచే సమష్టి దివ్యపూజ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గురవరేణ్యులు గురుశ్రీ పామిశెట్టి తోమస్ బృందంచే గానం, రాత్రి 9గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు, కార్యక్రమాలు ఉంటాయి. ఏసుప్రభు పడిన శ్రమలను స్మరించుకుంటూ మోకాళ్ల నడక ప్రార్ధన చేస్తూ సాగర్‌మాతను దర్శించుకొనేందుకు ఇసుకరోడ్ను నిర్మించారు. పూర్తయిన ఏర్పాట్లు.. రేపటి నుంచి 9వ తేదీ వరకు సాగర్మాత మహోత్సవాలు మాచర్ల మండలం కొప్పునూరు ప్రాథమిక వైద్యశాల ఆధ్వర్యంలో పండుగ మూడు రోజులు ప్రథమచికిత్సా శిబిరం, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చలివేంద్రం మూడు రోజులు ఏర్పాటు చేస్తున్నారు. మాచర్ల ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ప్రతి అరగంటకు విజయపురిసౌత్‌లోని సాగర్మాత దేవాలయానికి బస్‌లు అందుబాటులో ఉంటాయి. ఉత్సవాలకు తరలి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా మాచర్ల రూరల్ సీఐ నఫీజ్బాష ఆద్వర్యంంలో విజయపురిసౌత్ ఎస్ఐ మహమ్మద్ షఫీ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మహిళా భక్తుల భద్రత కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. గుడి సమీపంలోని కృష్ణా జలాశయంలో స్నానం చేసే భక్తుల భద్రత కోసం గజ ఈతగాళ్లను, ప్రత్యేక బోట్‌ను పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. -
కూలీల ట్రాక్టర్‌ను ఢీకొన్న ఇసుక టిప్పర్
తొమ్మిది మందికి గాయాలు కారెంపూడి: పొలం పనులకు వెళ్తున్న కూలీల ట్రాక్టర్‌ను టిప్పర్ ఢీకొనడంతో 9 మంది గాయపడిన ఘటన మండలంలోని నరమాలపాడు గ్రామం వద్ద బుధవారం జరిగింది. మండలంలోని మిరియాల గ్రామం నుంచి మిరపకాయలు కోసేందుకు నరమాలపాడు గ్రామానికి కూలీలు ట్రాక్టర్లో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నరమాలపాడు గ్రామ ఎస్సీ కాలనీ వద్ద ట్రాక్టర్‌కు అడ్డుగా కోళ్లు రావడంతో డ్రైవర్ స్లో చేశాడని తెలుస్తోంది. ఇదే సమయంలో వెనుకగా అమరావతి నుంచి ఇసుక లోడుతో వస్తున్న టిప్పర్ అదుపుతప్పి ట్రాక్టర్ ట్రక్కును వెనుకగా ఢీకొంది. దీంతో ట్రక్కులో ఉన్న వారిలో 9 మందికి గాయాలయ్యాయి. వద్దెబోయిన లక్ష్మయ్య, ఆయన భార్య నాగలక్ష్మి, గండికోట ఆవులయ్య, కఠారి సంధ్య, బైనబోయిన వెంకటేశ్వర్లు, పేరుబోయిన అంకమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. మారుబోయిన పార్వతి, మారుబోయిన నర్సయ్య, సకినాల సైదులు స్వల్పంగా గాయపడ్డారు. వీరిలో కొందరిని గురజాల ప్రభుత్వ వైద్యశాలకు, మరికొందరిని నర్సరావుపేట ఏరియా ఆస్పత్రికి 108 అంబులెన్సులలో తరలించారు. టిప్పర్ ఢీకొనే సమయంలో ట్రక్కు వెనుక కూర్చున్న వారు కాళ్లు తక్షణమే పైకిపెట్టుకోవడంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని సీఐ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎస్ఐ వాసు పరిశీలించారు. ఎస్ఐ వాసు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పందికొక్కుల దాడిలో పసికందు మృతి!
నూజెండ్ల: ఊయలలో నిద్రిస్తున్న మూడు నెలల పసికందును పంది కొక్కులు కొరికి చంపిన ఘటన నూజెండ్ల మండలం రవ్వారం గ్రామంలో బుధవారం జరిగింది. రవ్వారం గ్రామానికి చెందిన నాయిని కొండ గురవయ్య, దుర్గమ్మలు గ్రామాల్లో తిరిగి గాజులు అమ్ముకుని జీవనం సాగిస్తుటారు. వీరికి ఒక పాప ఉంది. సమీపంలోని ఓ తండా నుంచి మూడునెలల బాబు కౌషిక్‌ను తెచ్చుకుని పెంచుకుంటున్నారు. ఎప్పటిలానే కొండ గురవయ్య గాజుల విక్రయానికి వెళ్లాడు. అదే సమయంలో పాప ఏడుస్తూ ఉండడంతో ఏదైనా కొని తెద్దామని తల్లి సమీపంలోని దుకాణానికి వెళ్లింది. ఈ సమయంలో ఊయలలో ఒంటరిగా ఉన్న కౌషిక్‌పై పందికొక్కులు దాడి చేశాయి. తల వెనుక భాగాన, ముఖం, కాలివేళ్లను కొరికివేశాయి. దుకాణం నుంచి వచ్చిన తల్లి పరిస్థితిని గమనించి వైద్యశాలకు తరలించేలోపు చిన్నారి మృతి చెందింది. ముక్కుపచ్చలారని చిన్నారికి జరిగిన దారుణం చూపరులను కంటతడి పెట్టించింది. -
గుడారాల పండగ ఏర్పాట్ల పరిశీలన
అమరావతి : గుడారాల పండగ ఏర్పాట్లను బుధవారం ఎస్పీ పరిశీలించారు. ఆయన హోసన్నా దయాక్షేత్రం ప్రాంగణంలో పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నియంత్రణ, కంట్రోల్ రూం వంటి అంశాలపై నిర్వాహకులతో చర్చించారు. పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు, నిర్వాహకులు అబ్రహం, జాన్‌వెస్లీ, అనీల్, సీఐ అచ్చియ్య పాల్గొన్నారు. నేడు మద్యం దుకాణాలకు లాటరీ నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం గీత కులాలకు మద్యం దుకాణాలను కేటాయిస్తున్నట్లు ఎకై ్సజ్ ఈ.ఎస్ మణికంఠ బుధవారం తెలిపారు. జిల్లాలో గీత కులాలకు కేటాయించిన 13 మద్యం దుకాణాలకు 199 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. కలెక్టర్ అరుణ్‌బాబు ఆధ్వర్యంలో లాటరీ పద్ధతి ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు జరుగుతుందన్నారు. దరఖాస్తు దారులంతా హాజరై లాటరీలో మద్యం దుకాణం దక్కించుకొన్న వారు ప్రభుత్వం నిర్ధారించిన సొమ్ము చెల్లించాలన్నారు. ప్రపంచబ్యాంక్ బృందం పర్యటన తాడికొండ: రాజధాని అమరావతిలో నిపుణులతో కూడిన ప్రపంచ బ్యాంక్ బృందం బుధవారం పర్యటించింది. రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రపంచ బ్యాంక్ బృందం నిర్దేశించిన కార్యక్రమాల అమలు, వాటి నిర్వహణ రూపకల్పనపై చర్చ జరిపింది. నీటి నిర్వహణ ప్రాజెక్టులు, పర్యావరణ, సామాజిక రక్షణకు రూపొందించిన కార్యకలాపాలు, ప్రొక్యూర్మెంట్ విషయాలపై ఏపీ సీఆర్డీయే అధికారులతో బృంద సభ్యులు మాట్లాడారు. కార్యక్రమంలో ప్రపంచ బ్యాంక్ కో టాస్క్ టీం లీడర్ గెరాల్డ్ ఒలీవర్ తదితరులు ఉన్నారు. రెడ్‌క్రాస్ ప్యాట్రన్ సభ్యత్వం బాపట్ల : ఇండియన్ రెడ్‌క్రాస్ జిల్లా ప్యాట్రన్ సభ్యత్వం 24 మందికి ఇవ్వటం ఎంతో సంతోషకరమని బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి పేర్కొన్నారు. ఈ మేరకు రూ.6.02 లక్షల చెక్కును రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ నారాయణభట్టుకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గ్లోరియా, రెడ్‌క్రాస్ బృందం సభ్యులు పాల్గొన్నారు. జిల్లాలో రెడ్‌క్రాస్ సేవలు విస్తృతం చేయాలని సూచించారు. పోలీసుల నుంచి తప్పించుకోబోయి వ్యక్తి మృతి నరసరావుపేట టౌన్: పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు లాడ్జి పైనుంచి దూకి వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి పట్టణంలో చోటు చేసుకుంది. టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తెలంగాణ రాష్ట్రం తుకారాంగేట్‌కు చెందిన రాములు నాయక్ గుంటూరు పరిసరాల్లో జరిగిన చోరీల్లో అనుమానితుడిగా భావిస్తున్నారు. నరసరావుపేట కోర్టుకు వాయిదాకి వచ్చినట్లు తెలుసుకున్నారు. అనంతరం బస్టాండ్ సమీపంలోని లాడ్జికి వెళ్లాడు. గుంటూరు నుంచి వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాత్రూంకు వెళ్లి వస్తానని చెప్పి కిటికీలో నుంచి కిందకు దిగే ప్రయత్నం చేశాడు. ప్రమాదవశాత్తు జారి మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఐపీ పెట్టిన ధాన్యం వ్యాపారి!
నరసరావుపేట టౌన్: రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ఓ వ్యాపారి రాత్రికిరాత్రే కోట్ల రూపాయలకు ఐపీ పెట్టిన వైనం పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చేజర్ల గ్రామానికి చెందిన శ్రీనివాసరావు పాతూరులో స్థిరపడ్డాడు. మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్లో దుకాణం అద్దెకు తీసుకుని గత కొన్ని సంవత్సరాలుగా నమ్మకంగా ధాన్యం, మొక్కజొన్న వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో రైతుల వద్ద నుంచి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేసి వాటిని విక్రయించి ఆ తరువాత డబ్బులు ఇస్తుండేవాడు. ఈ క్రమంలోనే నాలుగు నెలలుగా రైతుల వద్ద నుంచి ధాన్యం, మొక్కజొన్న లారీలకు లోడ్లు ఎత్తుకున్నాడు. నెలలు గడుస్తున్నా డబ్బులు చెల్లించలేదు. ఈ మధ్య కాలంలో రైతులు అతని దుకాణం వద్దకు వచ్చి డబ్బుల కోసం నిలదీశారు. దీంతో 20 రోజుల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన శ్రీనివాసరావు ఐపీ నోటీసులు పంపించాడు. సుమారు 80 మంది రైతులకు రూ.2 కోట్ల పైచిలుకు బాకీ ఉన్నట్లు సమాచారం. ధాన్యం వ్యాపారి ఐపీ పెట్టడం రైతు లను, వ్యాపారులను కలవరపాటుకు గురిచేసింది.రైతులకు రూ.2 కోట్ల పైచిలుకు టోపీ -
కోటప్పకొండ ఆలయ భూముల రికార్డులు ట్యాంపరింగ్
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయ భూముల రికార్డులను ట్యాంపరింగ్ చేసినట్టు అధికారులు గుర్తించారు. ఆలయ భూముల్లో అక్రమ తవ్వకాలపై ‘దేవాంతకులు’ శీర్షికన సాక్షి దినపత్రికలో బుధవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కొండకావూరు పరిధిలో నాయీబ్రాహ్మణులకు కేటాయించిన భూములను బుధవారం కోటప్పకొండ ఆలయ ఈఓ డి.చంద్రశేఖరరావు పరిశీలించారు. అక్రమార్కులు గ్రావెల్ తవ్వకాలు జరిపిన భూమి ఆలయానికి చెందిందిగా నిర్ధారించారు. భూముల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపినట్టు గుర్తించారు. ఆరున్నర ఎకరాలలో దాదాపు రెండు ఎకరాల్లో అక్రమార్కులు గ్రావెల్ తవ్వకాలు జరిపి ఉంటారని భావిస్తున్నారు. అనంతరం రెవెన్యూ రికార్డులను అధికారులు పరిశీలించారు. నాయీబ్రాహ్మణులకు కేటాయించిన భూములు రెవెన్యూ రికార్డుల్లో ప్రైవేటు భూములుగా కనిపించాయి. గతంలోనే రెవెన్యూ రికార్డుల్లో ఆలయ భూముల ట్యాంపరింగ్ జరిగిందని భావిస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో పరిశీలన జరిపేందుకు ఆలయ అధికారులు సిద్ధమవుతున్నారు. భూముల్లో ఆక్రమ తవ్వకాలు జరిపిన వారిపైనా చర్యలకు సమాయత్తమవుతున్నారు. పూర్తి వివరాలు సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. ఈనాం భూములు ప్రైవేటువిగా మార్పు అక్రమ తవ్వకాల వ్యవహారంతో వెలుగులోకి భూములను పరిశీలించిన ఈఓ చంద్రశేఖర్ -
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది
వినుకొండ: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, వైఎస్సార్ సీపీ నాయకులే లక్ష్యంగా కూటమి నేతలు దమనకాండ కొనసాగిస్తున్నారని వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. పోలీసులు, టీడీపీ నాయకుల వేధింపులు తాళలేక పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఎస్కే రఫీని బుధవారం ఆయన పరామర్శించారు. పట్టణంలోని చిన్నపరెడ్డి ఆసుపత్రి వద్దకు వెళ్లి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఎస్కే రఫీతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో బ్రహ్మనాయుడు మాట్లాడుతూ గ్రామంలో కేవలం రెండు, మూడు కుటుంబాలు ఉన్న ముస్లిం మైనార్టీ వర్గాలకు కూడా రక్షణ లేకుండా పోయిందని, కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా పోలీసులు జోక్యం చేసుకొని ప్రతిరోజూ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి రఫీని బెదిరించినట్లు చెప్పారు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పారు. రఫీ కుటుంబసభ్యులకు అండగా ఉంటామని, న్యాయపరమైన పోరాటానికి కూడా సిద్ధమని ప్రకటించారు. చేతనైతే మంచి పరిపాలన అందించాలని, ఇలా కక్షసాధింపు రాజకీయాలు మానుకోవాలని అన్నారు. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కి వెళ్తే పోలీసులే ఈ విధంగా భయపెట్టి దారుణంగా కొట్టి హింసించి స్థానిక టీడీపీ నాయకుల కాళ్లు పట్టుకొని క్షమాపణ అడిగితేనే కేసులు లేకుండా చేస్తామని అనడం దేశంలో ఎక్కడా లేదన్నారు. ఇప్పటికై నా పనితీరు మార్చుకొని అభివృద్ధిపై దృష్టిపెట్టాలని, లేనిపక్షంలో కార్యకర్తల కోసం ఎందాకై నా పోరాడుతానని అన్నారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు -
ఫిర్యాదుల పరిష్కారంలో శ్రద్ధ అవసరం
నరసరావుపేట: జిల్లాలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే అర్జీల పరిష్కారంలో అధికారులు శ్రద్ధ కనబరచాలని కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. సీఎం ఎండార్స్మెంట్ ఫిర్యాదుల విషయంలో అధికారులు విచారణ చేసి ఉన్నతాధికారులకు పంపాలని సూచించారు. ఫిర్యాదులు రీ ఓపెన్ కాకూడదని స్పష్టం చేశారు. అన్ని ఫిర్యాదులపై నాలుగుస్థాయిల్లో ఆడిట్ జరుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన ఇంకొల్లుకు చెందిన గంటా సుబ్బారావుతో కలెక్టర్ నేరుగా ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదుదారు చెప్పిన అంశాలపై దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారులతో సమీక్షించి రికార్డులు వెరిఫికేషన్ కోసం 10వ తేదీ వరకు సమయం ఇచ్చారు. అచ్చంపేట మండలం నిడుజెర్ల గ్రామానికి చెందిన పి.నాగరత్తమ్మతో కూడా ఫోన్లో మాట్లాడి ఫిర్యాదుపై చర్చించారు. పోలీసులకు సూచనలు చేశారు. పీ–4 సర్వేకు సహకరించండి జిల్లాలో చేపట్టే పీ–4 సర్వేకు అందరూ సహకరించాలని కలెక్టర్ పి.అరుణ్‌బాబు కోరారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి సర్వే సూపర్వైజర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈనెల 8 నుంచి 18 వరకు పీ–4 సర్వే జరుగుతుందని పేర్కొన్నారు. కలెక్టర్ అరుణ్‌బాబు -
పల్నాడు
గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2025పోలీసుల స్వచ్ఛ భారత్ తాడేపల్లిరూరల్: తాడేపల్లి పోలీస్ స్టేషన్లో బుధవారం పోలీసులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. స్టేషన్ ఆవరణలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శుభ్రం చేశారు. ఇఫ్తార్ సహర్ (గురు) (శుక్ర) నరసరావుపేట 6.23 5.07 గుంటూరు 6.21 5.05 బాపట్ల 6.21 5.05 సాక్షి, నరసరావుపేట: అధికార బలం, ప్రభుత్వ అధికారుల సహకారంతో కూటమి నేతలు అక్రమార్జనకు తెరలేపారు. నిబంధనలకు విరుద్ధంగా వేలం పాట లేకుండా 200 ఎకరాల చేపల చెరువును అక్రమంగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. చేపల సాగు మొదలుపెట్టారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి రూ.లక్షల్లో గండిపడింది. నరసరావుపేట మండలం కాకానిలో 294 ఎకరాల్లో చేపల చెరువు ఉంది. ఇందులో 90 ఎకరాలకుపైగా ఇప్పటికే ఆక్రమణకు గురైంది. మిగిలిన 200 ఎకరాలను మైనర్ ఇరిగేషన్ శాఖ నిర్వహిస్తోంది. ఏటా చెరువుకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో వేలం నిర్వహిస్తారు. వేలంలో అత్యధిక ధరకు పాడిన వారికి ఏడాదిపాటు చేపలు పెంపకానికి అనుమతిస్తారు. సుమారు రెండు వందల ఎకరాల విస్తీర్ణం ఉన్న చెరువు కావడంతో వేలంలో పెద్ద మొత్తంలో ధర పలుకుతుంది. పట్టించుకోని అధికారులు ఎనిమిది నెలలుగా చెరువులో చేపలు సాగవుతున్నా అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు చెరువుకు అధికారులు వేలం నిర్వహించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఈ చెరువుకు ఇప్పుడు వేలం నిర్వహిస్తే ప్రభుత్వానికి సుమారు రూ.20 లక్షల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఈ ఆదాయాన్ని పంచాయతీ, నీటి సంఘాలు, మైనర్ ఇరిగేషన్ శాఖకు కేటాయిస్తారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. పైగా చేపల సాగు చేస్తున్న అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నరసరావుపేట మండలం కాకాని చెరువు టీడీపీ నాయకుల ఆక్రమణలో,, న్యూస్రీల్త్వరలో వేలంపాట కాకాని చేపల చెరువుకు ఇప్పటివరకు వేలం పాట నిర్వహించలేదు. కలెక్టర్ అనుమతితో త్వరలో చెరువు వేలం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఎవరైనా చెరువులో చేపల సాగు చేస్తూ ఉంటే అది అక్రమంగా చేస్తున్నదే. – మాధవీలత, నరసరావుపేట ఆర్డీఓ వేలం లేకుండానే చేపల చెరువును స్వాధీనం చేసుకున్న వైనం మైనర్ ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో 200 ఎకరాల చెరువు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన వేలంలో దాదాపు రూ.12 లక్షలకు చెరువును వ్యాపారులు దక్కించుకున్నారు. ఆ తరువాత వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో వేలం పాటలు నామమాత్రంగా జరిగాయి. కనీస ధరకే టీడీపీ నాయకులు పాటను దక్కించుకొని చెరువులో చేపల పెంపకాన్ని చేపట్టారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కరోనా వల్ల రెండేళ్లు వేలం పాట నిలిచిపోయింది. ఆ తరువాత కూడా వ్యాపారులు ముందుకు రాకపోవడంతో తక్కువ ధరలకే వేలం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వేలం పాటలను నిర్వహించలేదు. చెరువును గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఆక్రమించి జూలైలో చేప పిల్లలను వదిలి సాగును ప్రారంభించారు. -
మానవతా నాడి పట్టాలి
స్టెతస్కోప్ చెవిన పెట్టకుండానే లబ్‌డబ్ సవ్వడి వీనులను తాకిందా.. మది నిండా ఉప్పొంగిన భావోద్వేగం ఆనందబాష్పమై కురిసిందా.. ఆరేళ్ల శ్రమ కనుల వేడుకై మెరిసిందా.. ఎన్నాళ్లో వేచిన హృదయం ‘పట్టా’భిషిక్తమై మురిసిందా.. అన్నట్టు గుంటూరు వైద్యకళాశాల సంతోషాల వేదికై ంది. గ్రాడ్యుయేషన్ డే ఉత్సాహంతో ఉప్పొంగింది. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆత్మీయ ఆలింగనాలతో నవ్వులు చిలికింది. ఈ సంబరమంతా తళుకులీని కెమెరాల్లో అందంగా బంధీయైంది. రోగులపై దయ చూపాలి డీఎంఈ డాక్టర్ నరసింహం ఉత్సాహంగా వైద్య కళాశాల 74వ గ్రాడ్యూయేషన్ డే -
రేపటి నుంచి గుడారాల పండగ
అమరావతి: ఏటా నిర్వహించే గుడారాల పండగను ఈ ఏడాది గుంటూరు శివారులోని గోరంట్లలో కాకుండా మండల పరిధిలోని లేమల్లె గ్రామంలో నిర్వహించటానికి అన్ని ఏర్పాట్లనూ పూర్తిచేశామని హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు అబ్రహం చెప్పారు. మంగళవారం లేమల్లెలోని హోసన్నా దయాక్షేత్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఏసన్నా తొలుత లేమల్లె గ్రామంలో హోసన్నా మందిరం నిర్మాణం చేసిన ప్రదేశంలో సుమారు 25 ఏళ్ల తర్వాత 48వ గుడారాల పండగ నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఈనెల 6,7,8,9 తేదీలలో జరిగే ఈ పండగకు విశ్వాసులు తరలిరావాలని కోరారు. ఆర్టీసీ గుంటూరు నుంచి ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నట్టు వెల్లడించారు. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. పోలీసు శాఖ బందోబస్తును పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. రాయలసీమ, భీమవరం, అనకాపల్లి తదితర ప్రాంతాల నుంచి గుంటూరుకు వచ్చే రైళ్లలో 15 ప్రత్యేక కోచ్‌లను గుడారాల పండగ కోసం ఏర్పాటు చేయడం విశేషమని పేర్కొన్నారు. ఐదో తేదీ బుధవారం సాయంత్రం హోసన్నా దయాక్షేత్రంలో కొత్తగా నిర్మించిన చర్చి ప్రారంభోత్సవం జరగనుందని వెల్లడించారు. -
ఎస్ఐ వేధింపులు తాళలేక..
సాక్షి, నరసరావుపేట : పోలీసుల వేధింపులు తాళలేక వినుకొండ రూరల్ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన ఎస్కే రఫీ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రఫీ వైఎస్సార్ సీపీ కార్యకర్త. గతంలో రఫీ తమను బూతులు తిట్టాడంటూ ఇటీవల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పోలీసుల ద్వారా వినుకొండ స్టేషన్‌కి అతడిని పిలిపించారు. వారం రోజుల నుంచి ఎలాంటి కేసు నమోదు చేయకుండా రోజూ ఉదయాన్నే రఫీని పోలీస్ స్టేషన్‌కు పిలిపిస్తున్నారు, సాయంత్రం వరకు ఉంచుతున్నారు. దారుణంగా కొడుతున్నారు. మంగళవారం కూడా పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఎస్ఐ సత్యనారాయణ ఫోన్ చేశాడు. టీడీపీ నాయకుల కాళ్లు పట్టుకుని క్షమాపణ అడగాలని, వాళ్లు క్షమించారని తనకు చెబితేనే వదిలిపెడతామని ఎస్ఐ రఫీని భయపెట్టారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రఫీ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న భార్య ఫాతిమా, తల్లి శిలార్బీలతో పాటు పలువురు గ్రామస్తులు ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం చేయాల్సిన పోలీసులే ఈ విధంగా ప్రవర్తించడాన్ని తప్పుబట్టారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ ఘటనపై పూర్తి విచారణ చేయించి బాధితులకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వ్యక్తి ఆత్మహత్యాయత్నం టీడీపీ నాయకుల ప్రోద్బలంతో ఖాకీల అరాచకం -
మహిళా వారోత్సవాలు నిర్వహించండి
నరసరావుపేట: ఈనెల ఎనిమిదిన మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో వారోత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ పి.అరుణ్‌బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వారోత్సవాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వారోత్సవాల నిర్వహణ నోడల్ అధికారిగా ఐసీడీఎస్ పీడీ ఉమాదేవిని నియమించారు. ఆరో తేదీన జిల్లాలోని మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మహిళా ఉద్యోగినులను తగిన రీతిలో గౌరవిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఆర్వో ఎ.మురళి, డీఎఫ్ఓ కృష్ణప్రియ, ఆర్డీవో కె.మధులత పాల్గొన్నారు. కలెక్టర్ అరుణ్‌బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు -
కిక్కిరిసినఆడిటోరియం
వైద్య విద్యార్థులకు పట్టా ప్రదానం వేడుకను కనులారా వీక్షించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఫలితంగా వైద్య కళాశాల ఆవరణం, కళాశాల ఆడిటోరియం కిక్కిరిసిపోయాయి. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా కళాశాలను సుందరంగా తీర్చిదిద్దారు. ఎక్కువగా రైతు కుటుంబాలకు చెందిన పిల్లలు వైద్యులుగా పట్టాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ కమనీయ దృశ్యాలను బంధించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేకంగా వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లను పెట్టుకుని హాజరవడం అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులు పట్టాలు చేతపట్టుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కళాశాల ప్రాంగణంలోనే ఫొటోలు దిగి మురిసిపోయారు. -
నృసింహుని ఏకాదశ మాలధారణ దీక్ష స్వీకరణ
మంగళగిరిటౌన్: మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఎగువ సన్నిధిలోని పానకాలస్వామి వారి ముఖ మండపంలో మంగళవారం భక్తులు నృసింహుని ఏకాదశ మాలధారణ దీక్ష స్వీకరణ మహోత్సవం జరిగింది. దేవస్థానం ప్రధాన అర్చకులు, గురుస్వామి మాల్యవంతం శ్రీనివాసదీక్షితులు భక్తులకు మాలవేసి దీక్ష ఇచ్చారు. స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవా ట్రస్ట్ అధ్యక్షులు తోట శ్రీనివాసరావు మాలధారణ దీక్ష స్వీకరించే భక్తులకు దీక్షా వస్త్రాలను ఉచితంగా అందజేశారు. అనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు, న్యాయవాది రంగిశెట్టి లక్ష్మి మాట్లాడారు. కార్యక్రమంలో శివారెడ్డి గురుస్వామి, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు గోగినేని వెంకటేశ్వరరావు, రోటరీ క్లబ్ ప్రతినిధి సైదా నాయక్, తదితరులు పాల్గొన్నారు. జాతీయ సమావేశాలకు ఐదుగురికి ఆహ్వానం సత్తెనపల్లి: అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో ప్రత్యేకత చాటుకున్న ఎంపీడీవో, గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు ఈనెల 4, 5 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న జాతీయ సమావేశానికి ఆహ్వానం అందింది. గుంటూరు జిల్లా పెదనందిపాడు ఎంపీడీవో జీ లక్ష్మీదేవి, గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామ సర్పంచ్ ఎం.లలితకుమారి, వెంగళాయపాలెం గ్రామ కార్యదర్శి వి.రవి, కొల్లిపర మండలం వల్లభాపురం సర్పంచ్ బి. భ్రమరాంబ, పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామ సర్పంచ్ షేక్ గౌసియా బేగం స్నేహపూర్వక పంచాయతీల (ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ) పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను పంచాయతీలో అమలు చేస్తున్నారు. ఇందుకు ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి సమావేశాలకు వీరికి ఆహ్వానం అందడంతో సోమవారం పయనమై వెళ్లారు. హాల్‌టికెట్ల కలర్ ప్రింటవుట్‌ను అనుమతించం డీఐఈఓ నీలావతిదేవి నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్‌టికెట్లను వైట్ పేపర్‌పై ప్రింటవుట్ తీసుకొని పరీక్ష కేంద్రాలకు రావాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి సోమవారం తెలిపారు. కొందరు విద్యార్థులు హాల్‌టికెట్లను కలర్ ప్రింట్లో తీసుకువస్తున్నారని, వాటిని అనుమతించటం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్ విద్యామండలి నుంచి ప్రత్యేక ఉత్తర్వులు అందినట్టు వివరించారు. విద్యార్థులు గమనించి తమ వెంట తెల్లకాగితంపై ప్రింట్ చేసిన హాల్‌టికెట్లతో హాజరు కావాలని సూచించారు. జలపాలేశ్వరుడిపై సూర్యకిరణాలు ఫిరంగిపురం: మండలంలోని వేములూరిపాడు గ్రామంలోని జలపాలేశ్వర ఆలయంలో స్వామిపై మంగళవారం సూర్యకిరణాలు ప్రసరించాయి. ఈ సమయంలో అనేకమంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామికి అభిషేకాలు చేయించుకున్నారు. గ్రామంలో చోళుల కాలంనాటి జలపాలేశ్వర ఆలయం ఉంది. 16వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలోని జలపాలేశ్వరుడిపై ఏటా పాల్గుణ మాసంలో కొద్దిరోజులపాటు సూర్యోదయ కాలంలో సరాసరి స్వామివారి లింగాకృతి కింది భాగం నుంచి పూర్తిగా స్వామి పైవరకు సూర్యకిరణాలు ప్రసరిస్తాయని ఆలయ అర్చకులు ఉమాపతి శాస్త్రి తెలిపారు. మళ్లీ అవి తగ్గుముఖం పట్టి పూర్తిగా సూర్యకిరణాలు ప్రసరించడం ఆగుతుందని తెలిపారు. -
తప్పు చేశా.. క్షమించండి
దాచేపల్లి : పింఛన్‌దారుల డబ్బులు తీసుకుని పరారీలో ఉన్న దాచేపల్లి నగర పంచాయతీలోని వార్డు సచివాలయం–3 వెల్ఫేర్ కార్యదర్శి సంపతి లక్ష్మీప్రసాద్ సామాజిక మాధ్యమాల్లో మంగళవారం పొస్ట్చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆన్లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పెట్టి మోసపోయాను. నెలరోజులు గడువు ఇస్తే డబ్బులు చెల్లిస్తా.. అంటూ ఆ వీడియోలో చెప్పాడు. ఇంకా ఆ వీడియోలో ఏమి చెప్పడంటే.. ‘‘సార్.. ఆన్లైన్ బెట్టింగ్‌లు పెట్టి ఎన్నో డబ్బులు పొగొట్టుకున్నా. గవర్నమెంట్ డబ్బులు కూడా ఆన్లైన్ బెట్టింగ్‌లో పెట్టి మోసపోయా. నేను తప్పు చేశానని ఈ రోజు అర్ధమైంది. కలెక్టర్ గారు, కమిషనర్ గారు నేను తప్పు చేశా. నన్ను క్షమించండి. ఒక నెల నాకు అవకాశం ఇస్తే తల్లిదండ్రులను బతిమాలుకుని నేను తీసుకున్న డబ్బులను చెల్లిస్తా. నేను చేసిన తప్పు వల్ల నా భార్య పిల్లలతో రోడ్డుపై పడ్డా. పిల్లలు రెండు రోజుల నుంచి ఏమీ తినలేదు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. నా తప్పు తెలుసుకున్నా. ఒక్క అవకాశం ఇప్పించండి. ఇంకోసారి ఇటువంటి తప్పు చేయను. నా భార్య పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. సార్ మమ్మల్ని క్షమించండి’’ అంటూ ఆ వీడియోలో లక్ష్మీప్రసాద్ చెప్పాడు. ఫిబ్రవరి 28న బ్యాంక్ నుంచి డ్రా చేసిన రూ.8.23 లక్షల పింఛన్ డబ్బులతో లక్ష్మీప్రసాద్ పారిపోయిన విషయం తెలిసిందే. ఇతనిపై కమిషనర్ ఎంవీ అప్పారావు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో దర్యాప్తు చేపట్టారు. తాజాగా లక్ష్మీప్రసాద్ తాను మాట్లాడిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పొస్ట్ చేయటంతో అతని ఆచూకీ కనుగొనేందుకు నగర పంచాయతీ అధికారులు, పోలీసులు యత్నిస్తున్నారు. ఆన్లైన్లో బెట్టింగ్‌లు పెట్టి మోసపోయా నెల రోజుల్లో పింఛన్ డబ్బులు చెల్లిస్తా పరారైన సచివాలయ వెల్ఫేర్ కార్యదర్శి లక్ష్మీప్రసాద్. -
ఆలపాటి గెలుపు
సాక్షి ప్రతినిధి, గుంటూరు : కృష్ణా–గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు. మొత్తం తొమ్మిది రౌండ్ల కౌంటింగ్ జరగగా మొత్తం పోలైన ఓట్లు 2,41,774కి గాను 2,14,865 ఓట్లు చెల్లబాటయ్యాయి. 26,909 ఓట్లు చెల్లలేదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 1,45,057 ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుకు 62,737 ఓట్లు వచ్చాయి. దీంతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 82,320 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఈ విజయం దక్కించుకున్నారు. మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో ఉండగా మిగిలిన వారెవరూ కనీస పోటీ ఇవ్వలేదు. మూడోస్థానంలో ఉన్న అన్నవరపు ఆనందకిషోర్కు 860 ఓట్లు దక్కగా గౌతుకట్ల అంకమ్మరావుకు అత్యల్పంగా 26 ఓట్లు దక్కాయి. మంగళవారం గుంటూరు కలెక్టర్ చాంబర్లో కృష్ణా, గుంటూరు పట్టభధ్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, గుంటూరు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు ధ్రువీకరణ పత్రం అందించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ మల్లేశ్వరి పాల్గొన్నారు. దొంగ ఓట్లు, రిగ్గింగ్‌తో గెలిచారు ఈ ఎన్నికల్లో దొంగ ఓట్లు, బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్‌లతో అధికార పార్టీ గెలిచిందని పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఆరోపించారు. ఫలితాల వెల్లడి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలను రాజకీయం చేసిందని, తనపై ప్రత్యర్థులు దుష్ప్రచారం చేశారని, ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాల మధ్య చీలిక తెచ్చారని, రూ.కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. అనేక చోట్ల ఎన్నికల రోజు, దొంగ ఓట్లు, అక్రమాలు చోటుచేసుకున్నాయని, దీనికి అధికార యంత్రాంగం కూడా సహకరించిందని ధ్వజమెత్తారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు అనేక సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగ యువత, రైతులు పలు ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్ట్, అవుట్ – సోర్సింగ్, అనేక రంగాల్లో పనిచేస్తున్న చిరు ఉద్యోగులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ అంశాలపై పోరాటాలను కొనసాగిస్తానని కేఎస్ లక్ష్మణరావు ప్రకటించారు. 40 శాతం మంది తొలిసారి ఓటర్లు ఎన్నికల్లో గెలుపొందిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో 40 శాతం మంది తొలిసారి ఓటు హక్కును ఉపయోగించుకున్నారని చెప్పారు. తనపై అసత్య ప్రచారం చేసినా ఓటర్లు కూటమిని గెలిపించారని పేర్కొన్నారు. సమస్యలపై శాసన మండలిలో గళం విప్పుతానని వివరించారు. మొదటి ప్రాధాన్య ఓట్లతోనే మ్యాజిక్ ఫిగర్ 82,320 ఓట్ల మెజారిటీ అనైతికంగా గెలిచారంటున్న పీడీఎఫ్ ప్రజలు కూటమికే పట్టం కట్టారన్న ఆలపాటి -
ముగిసిన బాల్ బాడ్మింటన్ పోటీలు
నరసరావుపేట రూరల్: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర కళాశాలల మహిళల బాల్ బాడ్మింటన్ పోటీలు మంగళవారం ముగిశాయి. రెండు రోజలపాటు కేసానుపల్లిలోని ఎంఏఎం ఫార్మసీ కళాశాలలో ఈ పోటీలు నిర్వహించారు. విజేతగా జేఎంజే మహిళా కళాశాల (తెనాలి) ప్రథమ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వ్యాయామ కళాశాల ద్వితీయ, ఎంఏఎం ఫార్మసీ కళాశాల (కేసానుపల్లి) తృతీయ బహుమతులు సాధించాయి. పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా చిలకలూరిపేట శ్రీ నిఖిల టెక్నో స్కూల్ డైరక్టర్ వాలేటి శిరీష, వర్సిటీ యోగా సెంటర్ కో ఆర్టినేటర్ డి.సూర్యనారాయణలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఆటలో గెలుపు, ఓటములు సహజమని తెలిపారు. కళాశాల చైర్మన్ మేదరమెట్ల రామశేషగిరిరావు మాట్లాడుతూ క్రీడలతో పోరాట స్ఫూర్తి అలవడుతుందని తెలిపారు. విజేతలుగా నిలిచిన జట్లకు బహుమతులు అందజేశారు. కళాశాల డైరక్టర్ దరువూరి శ్రావ్య, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.ప్రసాదరావు, ఫిజికల్ డైరక్టర్ జె.శంకర్, సెలక్షన్ కమిటీ సభ్యులు డాక్టర్ సీహెచ్ వెంకట్రావు, జె.ప్రేమ్‌కుమార్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
యూత్ పార్లమెంట్ పోటీలకు ఆహ్వానం
గుంటూరు ఎడ్యుకేషన్: యూత్ పార్లమెంట్ పోటీలను సద్వినియోగం చేసుకోవాలని నెహ్రూ యువ కేంద్ర జిల్లా యూత్ అధికారి కిరణ్మయి దేవిరెడ్డి పేర్కొన్నారు. పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాలలో మంగళవారం యూత్ పార్లమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి 18 ఏళ్లు నుంచి 25 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారు యూత్ పార్లమెంట్ పోటీలలో పాల్గొనవచ్చని సూచించారు. తొలుత ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మై భారత్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, ఒక్క నిమిషం నిడివి కలిగిన ‘వాట్ డస్ వికసిత్ భారత్ మీన్ టూ యూ అనే అంశం పైన వీడియో చేసి ఈనెల 9వ తేదీ అర్ధరాత్రి 11–59లోగా మై భారత్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ విధంగా నమోదు చేసుకున్న వారిని స్క్రీనింగ్ చేసి జిల్లా స్థాయిలో ఎంపిక చేస్తారని వివరించారు. ఆయా జిల్లాల నుంచి ఎంపికై న వారికి జిల్లా స్థాయిలో టీజేపీఎస్ కళాశాలలో 150 మంది విద్యార్థులకు పోటీ ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్ :పేవింగ్ ది వే ఫర్ వికసిత్ భారత్ అనే అంశంపై 3 నిముషాలు మాట్లాడాలని తెలిపారు. వర్శిటీ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, ఆయా జిల్లాల ఎన్ఎస్ఎస్ అధికారులు, యూత్ నాయకులు, నెహ్రూ యువ కేంద్ర అధికారులు, ఇతర అధ్యాపకులు, సామాజిక కార్యకర్తలు పోటీల గురించి యువతకు అవగాహన కల్పించి, ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా చూడాలని చెప్పారు. వివరాలకు డాక్టర్ జేవీ సుధీర్ కుమార్ (9849854221), కిరణ్మయి దేవిరెడ్డి (9177753393)ని సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కేవీ బ్రహ్మం, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.అనితాదేవి డాక్టర్ బీవీహెచ్ కామేశ్వర శాస్త్రి, సీహెచ్ రాంబాబు, ఆర్.జయశైలజ పాల్గొన్నారు. -
బైకుల చోరీ కేసుల్లో నిందితుడికి ఏడాది జైలు
నరసరావుపేట టౌన్: మూడు చోట్ల బైకుల చోరీ కేసుల్లో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ స్థానిక మొదటి అదనపు జూనియర్ సివిల్ కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి ఆర్.ఆశీర్వాదం పాల్ మంగళవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. గత ఏడాది నవంబర్ 19న నరసరావుపేట జీబీఆర్ వైద్యశాల వద్ద బైకు చోరీ కావడంతో వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అదే రోజు రామిరెడ్డిపేటకు చెందిన షేక్ మహబూబ్ సుభాని ఇంటివద్ద, గీతామందిర్ వద్ద కంభంపాటి వెంకట చలమయ్యకు చెందిన బైకు చోరీ అయ్యాయి. పోలీసులు దర్యాప్తు అనంతరం నిందితుడు నాదెండ్ల మండలం కనపర్తి గ్రామానికి చెందిన బాల యేసుగా గుర్తించారు. వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. దీంతో పైవిధంగా కోర్టు తీర్పు వెలువరించింది. ఏక కాలంలో మూడు కేసుల్లో ఏడాది శిక్ష అనుభవించేలా తీర్పులో పేర్కొన్నారు. -
జోసిల్లో ఘనంగా జాతీయ భద్రత వారోత్సవాలు
మేడికొండూరు: మండల పరిధిలోని డోకిపర్రులోని జోసిల్ కర్మాగారంలో జాతీయ భద్రత వారోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆ సంస్థ సెక్రటరీ, డీజీఎం కోటా రఘురాం మాట్లాడుతూ మంగళవారం నుంచి పదో తేదీ వరకు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ భద్రతా ప్రమాణాలను పాటించాలని కోరారు. ఈ సందర్భంగా కార్మికులకు, ఉద్యోగులకు పలు రకాల పోటీలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భద్రతపై వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సంస్థ అడ్వైజర్లు రామినేని బెనర్జీ బాబు, యడ్లపాటి భాను ప్రసాద్ పాల్గొన్నారు. మిర్చి యార్డులో 1,27,375 బస్తాల విక్రయం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకు మంగళవారం 1,25,574 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,27,375 బస్తాలు అమ్మకాలు జరిగాయి. ఈ సీజన్లో ఈ స్థాయిలో మిర్చి బస్తాలు రావడం ఇదే ప్రథమం. శని, ఆదివారాలు యార్డుకు సెలవు కావడంతో ఆదివారం రాత్రి నుంచే వాహనాల్లో మిర్చి బస్తాలను తీసుకురాగా యార్డు నిండిపోయింది. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,000 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. ఇంకా 70,117 బస్తాలు నిల్వ ఉన్నాయి. -
7 నుంచి కృత్రిమ అవయవాలు పంపిణీ
అచ్చంపేట: దివ్యాంగులకు ద చేంజ్ మేకర్స్ సంస్థ, ఆర్కే ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 7, 8, 9వ తేదీలలో విజయవాడలోని సి.వి.రెడ్డి హాల్లో కృత్రిమ అవయవాలు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు నిర్వహకులు కమల్సైదా మంగళవారం అచ్చంపేటలో విలేకరులకు తెలిపారు. అవసరమైన వారు వివరాలను 70138 31026, 95505 45539, 83676 75615 ఫోను నెంబర్లకు వాట్సాప్ ద్వారా పంపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. కాపుసారా విక్రయిస్తే కఠిన చర్యలు అచ్చంపేట: గ్రామాలలో కాపుసారా విక్రయించినా, కాచి అమ్మినా కఠిన చర్యలు తప్పవని ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ రవికుమార్‌రెడ్డి హెచ్చరించారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా మండలంలోని కంచుబోడు, జడపల్లి, సండ్ర తండాలలో ఆయన పర్యటించారు. అన్ని ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన తండా వాసులతో మాట్లాడారు. కాపుసారా తాగడం వల్ల అనారోగ్యం పాలవుతారని, కుటుంబాలకు దూరం అవుతారని చెప్పారు. కుటుంబంతో చక్కగా జీవించాలని, సన్మార్గంలో నడుచుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సూర్యనారాయణ, క్రోసూరు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ తులసి, ఎస్ఐలు శ్రీనివాస్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి శిక్షణకు నందిగామ సర్పంచ్ సత్తెనపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్లలోని ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ సెంటర్లో ఈ నెల 5, 6వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్ శిక్షణ సంస్థ ‘ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీలు’ అంశంపై రెండు రోజుల రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించనుంది. పల్నాడు జిల్లా నుంచి సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామ సర్పంచ్ బలిజేపల్లి రమాదేవి, పంచాయతీ కార్యదర్శి చిలువూరి కృష్ణప్రసాద్ దీనికి ఎంపిక అయినట్లు సత్తెనపల్లి ఎంపీడీఓ బండి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఒక్కో జిల్లా నుంచి ఎంపిక అయిన 26 మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొంటారన్నారు. -
పొగాకు బోర్డు ఈడీ శ్రీధర్‌బాబుకు సత్కారం
కొరిటెపాడు(గుంటూరు): పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఏడున్నర సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వ సేవలు పూర్తి చేసుకుని ఉత్తరఖండ్ రాష్ట్రానికి వెళ్తున్న అద్దంకి శ్రీధర్‌బాబును పొగాకు బోర్డు పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం సత్కరించారు. ఈ సందర్భంగా పొగాకు బోర్డు పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.ఎన్.మిత్ర మాట్లాడుతూ శ్రీధర్‌బాబు పొగాకు పరిశ్రమకు చేసిన సేవలు అసమానమైనవని, రైతులు, వ్యాపారులు, ఉద్యోగుల అభ్యున్నతికి చేసిన కృషి శ్లోఘనీయమని కొనియాడారు. పొగాకు పరిశ్రమ వ్యవస్థకే ఒక స్ఫూర్తిదాయక వ్యక్తి శ్రీధర్‌బాబు అని, కోవిడ్ సమయంలో ఆయన బోర్డు కార్యకలాపాలు సమర్థంగా నడిపిన తీరు అందరి ప్రశంసలు పొందారన్నారు. సత్కార గ్రహీత శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పొగాకు బోర్డుకి సేవలు చేసే అవకాశం భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం అని పేర్కొన్నారు. తన తల్లీదండ్రులు, గురువుల వద్ద నేర్చుకున్న సిద్ధాంతం ‘అన్నదాత సుఖీభవ’ అని రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని అదే నా విజయానికి కారణమని తెలిపారు. -
గురుకుల ఉర్దూ కళాశాలలో ప్రవేశాలు
గుంటూరు ఎడ్యుకేషన్: పాత గుంటూరు నందివెలుగురోడ్డులోని ఏపీ రెసిడెన్షియల్ ఉర్దూ బాలుర జూనియర్ కళాశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ పి.సాంబశివరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోస్తాంధ్రలో ముస్లిం, మైనార్టీ బాలుర విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న కళాశాలలో జూనియర్ ఇంటర్లో ప్రవేశానికి ఏప్రిల్ 25న జరగనున్న ఏపీఆర్జేసీ సెట్‌కు ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఏపీఆర్ఎస్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు 87126 25073, 96525 69140 నంబర్లలో సంప్రదించాలని కోరారు. పొన్నూరు రోడ్డు సంగడిగుంటలోని ఏపీ రెసిడెన్షియల్ మైనార్టీ బాలికల పాఠశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎ.బాలాశ్రీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతిలో 80 సీట్లు, 6,7,8 తరగతుల్లో మిగిలిన మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ ఖాళీల భర్తీ కోసం కోసం ఆసక్తి గల విద్యార్థినులు ఈనెల 31లోగా ఏపీఆర్ఎస్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆయా తరగతుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష జరుగుతుందని, వివరాలకు 87126 25039 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
నమ్మకంగా తీసుకెళ్లి చంపేశారు..!
పిడుగురాళ్ల: తెలిసిన వ్యక్తులు నమ్మకంగా తీసుకెళ్లి ఒకరిని హత్య చేశారు. ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కథనం మేరకు... సత్తెనపల్లికి చెందిన మందడపు అంజిబాబు అనే వ్యక్తికి పిడుగురాళ్ల పట్టణంలోని రైల్వే స్టేషన్ మాస్టర్ రామారావు పరిచయం అయ్యాడు. నాలుగు రోజుల నుంచి పిడుగురాళ్ల రైల్వే క్వార్టర్స్‌లోనే ఉంటున్నాడు. అంజిబాబుకు తెలిసిన కొందరు వ్యక్తులు సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్లకు సోమవారం ఉదయం 11 గంటల సమయంలో వచ్చారు. పిడుగురాళ్ల రైల్వే క్వార్టర్స్‌లో ఉన్న అంజిబాబును కలిసి కొంత సమయం మాట్లాడారు. తర్వాత అందరూ మాచవరం మండలంలోని నాగేశ్వరపురం తండా సమీపంలో, పిడుగురాళ్ల మండలానికి బోర్డర్లో మద్యం తాగేందుకు వెళ్లారు. మద్యంలో పురుగు మందు కలిపి అంజిబాబుకు తాపించటంతో అతడి పరిస్థితి విషమంగా మారింది. ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించే సమయంలో పెట్రోలింగ్ పోలీసులు ఆపారు. మద్యం తాగాడని, ఆరోగ్యం బాగాలేదని చెప్పటంతో పోలీసులు వారిని హాస్పిటల్‌కు వెళ్లాలని పేర్కొన్నారు. పట్టణంలో ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అంజిబాబు(40) మృతి చెందాడు. సత్తెనపల్లి మండలంలోని పాకాలపాడు గ్రామానికి చెందిన అంజిబాబు కార్లకు ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండేవాడు. వృత్తి రీత్యా సత్తెనపల్లి పట్టణంలోని రఘురామ్‌నగర్‌లో కొంతకాలంగా నివాసం ఉంటున్నాడు. ఆర్థిక లావాదేవీలు ఈ గొడవకు కారణమై ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పిడుగురాళ్ల పట్టణంలో సుమారు ఐదారుగురు వ్యక్తులు అతడిని తీసుకొని వెళ్లినట్లు ఆధారాలు ఉన్నాయి. నిందితుల్లో సుప్రీం, రైల్వే గేటు వద్ద నివాసం ఉంటున్న అమ్మయ్య, సత్తెనపల్లి పట్టణానికి చెందిన నాని, బాజీ, మరికొంత మంది ఉన్నట్లు సమాచారం. సత్తెనపల్లి డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. మద్యంలో పురుగు మందు కలిపి తాగించిన వైనం కార్ల ఫైనాన్స్ వ్యాపారి మృత్యువాత -
ఎలుకల సామూహిక నివారణకు చర్యలు
నకరికల్లు: ఎలుకల సామూహిక నివారణ చేపడితే వరి పంటను కాపాడుకోవడంలో ఆశించిన ఫలితాలు వస్తాయని జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి సూచించారు. మండలంలోని దేచవరం గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఎలుకల సామూహిక నివారణ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లాలో తొలిసారిగా దేచవరంలో ప్రారంభించారు. బ్రోమోడయోలిన్ మందును విషపు ఎరగా తయారు చేసే విధానాన్ని రైతులకు వివరించి, ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాలోని 28 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వరి పంటలో ఈ నివారణ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. వరి పంట పిలక దశ నుంచి చిరుపొట్ట దశలో వరకు పంటను ఎలుకలు అధికంగా నాశనం చేస్తాయని అన్నారు. ఎలుకల దాడితో ఎకరాకు 10 నుంచి 30 శాతం పంట నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. పల్నాడు జిల్లా వనరుల కేంద్రం డీడీఏ ఎం.శివకుమారి మాట్లాడుతూ.. ఒక కేజీ విషపు ఎర తయారీకి నూకలు 96 శాతం, నూనె 2 శాతం, రసాయనిక మందు 2 శాతం కలిపి వాడాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఏరువాక కేంద్రం సమన్వయకర్త ఎం.నగేష్, పిడుగురాళ్ల డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు బి.శ్రీకృష్ణదేవరాయలు, మండల వ్యవసాయాధికారి కె.దేవదాసు, ఎంపీఈఓలు కె.రవిబాబు, కె.హనుమంతరావు, వీఏఏ షేక్.సుభాని, ఏఈఓ కె.దిలీప్‌కుమార్, రైతులు పాల్గొన్నారు. -
కబడ్డీ జట్ల ఎంపిక
బాపట్ల: బాపట్ల మున్సిపల్ హైస్కూలులో మంగళవారం ఉమ్మడి గుంటూరు జిల్లా కబడ్డీ సబ్ జూనియర్ బాలబాలికల జట్ల ఎంపిక నిర్వహించారు. ఎంపికై న జట్లు ఈనెల 14,15,16 తేదీలలో కడప జిల్లాలో జరిగే అంతర జిల్లాల కబడ్డీ పోటీల్లో పాల్గొంటాయని గుంటూరు జిల్లా (కబడ్డీ) సెక్రటరీ మంతెన సుబ్బరాజు తెలిపారు. బాలికల జట్టులో జె.ప్రవల్లిక, సారిక, కీర్తి, హాసిని, సలోమి, ఆసిఫా, అమూల్య, శ్రావ్య (నరసాయపాలెం), కీర్తన(పేరలి), అంజలి, భార్గవి (నిజాంపట్నం), మౌనిక, దుర్గ, యామిని (ఎంపీపాలెం), బాలుర జట్టు ఎస్.హేమంత్, జ.మహిమరాజు, ఎస్.కె జుబెల్, కె.మణికంఠరెడ్డి, శ్రీనివాసులు, ప్రభు, ప్రశాంత్ (మునిసిపల్ హైస్కూల్, బాపట్ల), సాయి హర్షవర్ధన్ రెడ్డి, నాగభూషణ్, తేజ, చిన్న అయ్యప్ప (కర్లపాలెం), సుబ్బారావు, పోల్‌రెడ్డి (పేరలి), ప్రేమ్‌చంద్, మణి (దాచేపల్లి)లను ఎంపిక చేశారు. కార్యక్రమంలో పీడీలు కత్తి శ్రీనివాసరావు, ఎన్.కుటుంబరావు, పి. శైలజ, కోచ్ తిరుపతమ్మ (పి.ఈ.టి) ఎం.సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. ల్యాండ్ పూలింగ్‌కు రైతులు డిమాండ్ అమరావతి: మండల పరిధిలోని వైకుంఠపురం గ్రామంలో పెన్నాగోదావరి నదుల అనుసంధాన ప్రాజెక్టుకు అవసరమైన భూములు ల్యాండ్ పూలింగ్ కింద మాత్రమే ఇస్తామని రైతులు మంగళవారం సర్వే అధికారులను ఆడ్డుకున్నారు. మంగళవారం వైకుంఠపురం గ్రామ పరిధిలో పెన్నా గోదావరి నదుల అనుసంధాన ప్రాజెక్టులో పంప్‌హౌస్ నిర్మాణానికి భూసర్వే చేస్తున్న అధికారులను అడ్డుకున్నారు. తమ భూముల సంగతి తేల్చిన తర్వాతే సర్వే చేయాలని మండల సర్వేయర్, వీఆర్వో తదితర సిబ్బందిని వెనక్కి పంపిచేశారు. ఈ సందర్భంగా రైతు భోగినేని సుబ్బారావు మాట్లాడుతూ.. రాజధానికి దగ్గరగా ఉన్న వైకుంఠపురం గ్రామంలో 56.88 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్టుకు సేకరించాలని నిర్ణయించారన్నారు. తాము భూసేకరణకు అంగీకరించబోమని చెప్పారు. కార్యక్రమంలో బాధిత రైతులు పాల్గొన్నారు. -
ముగిసిన బాల్ బాడ్మింటన్ పోటీలు
నరసరావుపేట రూరల్: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర కళాశాలల మహిళల బాల్ బాడ్మింటన్ పోటీలు మంగళవారం ముగిశాయి. రెండు రోజలపాటు కేసానుపల్లిలోని ఎంఏఎం ఫార్మసీ కళాశాలలో ఈ పోటీలు నిర్వహించారు. విజేతగా జేఎంజే మహిళా కళాశాల (తెనాలి) ప్రథమ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వ్యాయామ కళాశాల ద్వితీయ, ఎంఏఎం ఫార్మసీ కళాశాల (కేసానుపల్లి) తృతీయ బహుమతులు సాధించాయి. పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా చిలకలూరిపేట శ్రీ నిఖిల టెక్నో స్కూల్ డైరక్టర్ వాలేటి శిరీష, వర్సిటీ యోగా సెంటర్ కో ఆర్టినేటర్ డి.సూర్యనారాయణలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఆటలో గెలుపు, ఓటములు సహజమని తెలిపారు. కళాశాల చైర్మన్ మేదరమెట్ల రామశేషగిరిరావు మాట్లాడుతూ క్రీడలతో పోరాట స్ఫూర్తి అలవడుతుందని తెలిపారు. విజేతలుగా నిలిచిన జట్లకు బహుమతులు అందజేశారు. కళాశాల డైరక్టర్ దరువూరి శ్రావ్య, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.ప్రసాదరావు, ఫిజికల్ డైరక్టర్ జె.శంకర్, సెలక్షన్ కమిటీ సభ్యులు డాక్టర్ సీహెచ్ వెంకట్రావు, జె.ప్రేమ్‌కుమార్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
గురుకుల ఉర్దూ కళాశాలలో ప్రవేశాలు
గుంటూరు ఎడ్యుకేషన్: పాత గుంటూరు నందివెలుగురోడ్డులోని ఏపీ రెసిడెన్షియల్ ఉర్దూ బాలుర జూనియర్ కళాశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ పి.సాంబశివరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోస్తాంధ్రలో ముస్లిం, మైనార్టీ బాలుర విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న కళాశాలలో జూనియర్ ఇంటర్లో ప్రవేశానికి ఏప్రిల్ 25న జరగనున్న ఏపీఆర్జేసీ సెట్‌కు ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఏపీఆర్ఎస్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు 87126 25073, 96525 69140 నంబర్లలో సంప్రదించాలని కోరారు. పొన్నూరు రోడ్డు సంగడిగుంటలోని ఏపీ రెసిడెన్షియల్ మైనార్టీ బాలికల పాఠశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎ.బాలాశ్రీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతిలో 80 సీట్లు, 6,7,8 తరగతుల్లో మిగిలిన మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ ఖాళీల భర్తీ కోసం కోసం ఆసక్తి గల విద్యార్థినులు ఈనెల 31లోగా ఏపీఆర్ఎస్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆయా తరగతుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష జరుగుతుందని, వివరాలకు 87126 25039 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
బైకుల చోరీ కేసుల్లో నిందితుడికి ఏడాది జైలు
నరసరావుపేట టౌన్: మూడు చోట్ల బైకుల చోరీ కేసుల్లో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ స్థానిక మొదటి అదనపు జూనియర్ సివిల్ కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి ఆర్.ఆశీర్వాదం పాల్ మంగళవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. గత ఏడాది నవంబర్ 19న నరసరావుపేట జీబీఆర్ వైద్యశాల వద్ద బైకు చోరీ కావడంతో వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అదే రోజు రామిరెడ్డిపేటకు చెందిన షేక్ మహబూబ్ సుభాని ఇంటివద్ద, గీతామందిర్ వద్ద కంభంపాటి వెంకట చలమయ్యకు చెందిన బైకు చోరీ అయ్యాయి. పోలీసులు దర్యాప్తు అనంతరం నిందితుడు నాదెండ్ల మండలం కనపర్తి గ్రామానికి చెందిన బాల యేసుగా గుర్తించారు. వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. దీంతో పైవిధంగా కోర్టు తీర్పు వెలువరించింది. ఏక కాలంలో మూడు కేసుల్లో ఏడాది శిక్ష అనుభవించేలా తీర్పులో పేర్కొన్నారు. -
క్రీడలతో మానసిక ఉల్లాసం
ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు గుంటూరు మెడికల్: ఉద్యోగులు ఒత్తిడితో నిత్యం సతమతమవుతున్న మహిళలకు క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం లభిస్తోందని ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు అన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరులోని ఏపీ ఎన్జీవో హోంలో మహిళ ఉద్యోగులకు క్రీడాపోటీలు ప్రారంభించారు. క్రీడా పోటీలను ఘంటసాల శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ మహిళలు ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ మరోపక్క కుటుంబ బాధ్యతలతో బాగా బిజీగా ఉంటారన్నారు. అలాంటివారికి ఆటవిడుపుగా క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. 200 మంది మహిళ ఉద్యోగులు పోటీల్లో పాల్గొన్నట్లు ఏపీ ఎన్జీఓ మహిళ విభాగం జిల్లా చైర్మన్ రాధారాణి అన్నారు. క్రీడల్లో పాల్గొన్న మహిళ ఉద్యోగులకు రెండు రోజులపాటు కలెక్టర్ సెలవు ప్రకటించారని బుధవారం కూడా క్రీడా పోటీలు జరుగుతాయని జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు శ్యామ్‌సుందర శ్రీనివాస్, రాజశేఖర్, వెంకటరెడ్డి, సుకుమార్, శ్రీధర్‌రెడ్డి, సయ్యద్జానీబాషా, సూరి, కళ్యాణ్‌కుమార్, నాగేశ్వరరావు, మరీలు, కన్వీనర్ లక్ష్మీరమ్య, జాయింట్‌సెక్రటరీ శివజ్యోతి పాల్గొన్నారు. -
పొగాకు బోర్డు ఈడీ శ్రీధర్‌బాబుకు సత్కారం
కొరిటెపాడు(గుంటూరు): పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఏడున్నర సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వ సేవలు పూర్తి చేసుకుని ఉత్తరఖండ్ రాష్ట్రానికి వెళ్తున్న అద్దంకి శ్రీధర్‌బాబును పొగాకు బోర్డు పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం సత్కరించారు. ఈ సందర్భంగా పొగాకు బోర్డు పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.ఎన్.మిత్ర మాట్లాడుతూ శ్రీధర్‌బాబు పొగాకు పరిశ్రమకు చేసిన సేవలు అసమానమైనవని, రైతులు, వ్యాపారులు, ఉద్యోగుల అభ్యున్నతికి చేసిన కృషి శ్లోఘనీయమని కొనియాడారు. పొగాకు పరిశ్రమ వ్యవస్థకే ఒక స్ఫూర్తిదాయక వ్యక్తి శ్రీధర్‌బాబు అని, కోవిడ్ సమయంలో ఆయన బోర్డు కార్యకలాపాలు సమర్థంగా నడిపిన తీరు అందరి ప్రశంసలు పొందారన్నారు. సత్కార గ్రహీత శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పొగాకు బోర్డుకి సేవలు చేసే అవకాశం భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం అని పేర్కొన్నారు. తన తల్లీదండ్రులు, గురువుల వద్ద నేర్చుకున్న సిద్ధాంతం ‘అన్నదాత సుఖీభవ’ అని రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని అదే నా విజయానికి కారణమని తెలిపారు. -
జోసిల్లో ఘనంగా జాతీయ భద్రత వారోత్సవాలు
మేడికొండూరు: మండల పరిధిలోని డోకిపర్రులోని జోసిల్ కర్మాగారంలో జాతీయ భద్రత వారోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆ సంస్థ సెక్రటరీ, డీజీఎం కోటా రఘురాం మాట్లాడుతూ మంగళవారం నుంచి పదో తేదీ వరకు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ భద్రతా ప్రమాణాలను పాటించాలని కోరారు. ఈ సందర్భంగా కార్మికులకు, ఉద్యోగులకు పలు రకాల పోటీలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భద్రతపై వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సంస్థ అడ్వైజర్లు రామినేని బెనర్జీ బాబు, యడ్లపాటి భాను ప్రసాద్ పాల్గొన్నారు. మిర్చి యార్డులో 1,27,375 బస్తాల విక్రయం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకు మంగళవారం 1,25,574 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,27,375 బస్తాలు అమ్మకాలు జరిగాయి. ఈ సీజన్లో ఈ స్థాయిలో మిర్చి బస్తాలు రావడం ఇదే ప్రథమం. శని, ఆదివారాలు యార్డుకు సెలవు కావడంతో ఆదివారం రాత్రి నుంచే వాహనాల్లో మిర్చి బస్తాలను తీసుకురాగా యార్డు నిండిపోయింది. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,000 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. ఇంకా 70,117 బస్తాలు నిల్వ ఉన్నాయి. -
ట్రావెల్ బస్సును ఢీకొన్న లారీ
రొంపిచర్ల: మండలంలోని సుబ్బయ్యపాలెం అడ్డరోడ్డు సమీపంలోని అద్దంకి నార్కెట్‌పల్లి రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో బస్సు వెనుక భాగం ధ్వంసం అయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును అదే మార్గంలో వెనుకగా వస్తున్న లారీ ఢీకొట్టింది. బస్సు వెనుక భాగంలో ఇంజిన్ ఉండటం వల్ల లారీ ఢీకొట్టినా ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగటానికి గల కారణాలపై ఆరా తీశారు. రాత్రిళ్లు రహదారిపై వాహనాలు ఎక్కడబడితే అక్కడ పార్కింగ్ చేయకుండా పెట్రోలింగ్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ కంచి శ్రీనివాసరావు వెంట పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు. ●ప్రయాణికులంతా క్షేమం ●సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ శ్రీనివాసరావు -
వర్సిటీ మహిళల బాల్ బాడ్మింటన్ పోటీలు ప్రారంభం
పాల్గొన్న ఐదు కళాశాలల జట్లు నరసరావుపేట రూరల్: మహిళలు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ ప్రొఫెసర్ పీపీఎస్ పాల్‌కుమార్ తెలిపారు. వర్సిటీ అంతర కళాశాలల మహిళల బాల్ బాడ్మింటన్ పోటీలు కేసానుపల్లిలోని ఎంఏఎం ఫార్మసీ కళాశాలలో సోమవారం ప్రారంభమయ్యాయి. పోటీలో ఐదు జట్లు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పీపీఎస్ పాల్‌కుమార్, టైనీటాట్స్ స్కూల్ అధినేత పాతూరి కోటేశ్వరమ్మలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి విద్యార్థులు మొబైల్‌కు దూరంగా ఉంటూ ఆటలాడుతూ చదువులో కూడా ముందుండాలని సూచించారు. పోటీలలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులతో వర్సిటీ జట్టును ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. కరైకుడిలోని అల్లప్ప యూనివర్సిటీలో నిర్వహించే ఆల్ ఇండియా అంతర వర్సిటీ పోటీల్లో వర్సిటీ జట్టు పాల్గొంటుందని తెలిపారు. పోటీలకు సెలక్షన్ కమిటీ సభ్యులుగా డాక్టర్ సిహెచ్ వెంకట్రావు, జె.ప్రేమ్‌కుమార్, ఇ.ఆదిబాబు, డాక్టర్ అరుణ సుజాతలు వ్యవహరించారు. కళాశాల చైర్మన్ మేదరమెట్ల రామశేషగిరిరావు, డైరక్టర్ దరువూరి శ్రావ్య, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రామారావు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక చింతనతో భక్తిభావం
ప్రత్తిపాడు: ఆధ్యాత్మిక చింతనతో భక్తిభావం కలుగుతుందని విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ అన్నారు. విశ్వంజీ జన్మదిన వేడుకల్లో భాగంగా మూడవ రోజైన సోమవారం మండల పరిధిలోని చినకోండ్రుపాడు విశ్వనగర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య విశ్వంజీ ఔదంబర వృక్ష పీఠ సుస్థాపిత దత్త గురువులకు విశేష అర్చన చేశారు. అనంతరం యాగశాలలో వేద పండితులు శాస్త్రోక్తంగా అగ్ని ప్రతిష్ట, మహాగణపతి హవనం, సుదర్శన నారసింహ, శ్రీ మహారుద్ర హవనములు, స్థాపిత దేవతా పంచోపచార పూజ, నీరాజన, మహామంత్రపుష్ప చతుర్వేద సేవలను చేశారు. తొలుత శాంతిపాఠం, గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యమేళన ప్రాశనం, రక్షాబంధనం, ఆచార్యాది ఋత్విక్ వరణం, వాస్తు, నవగ్రహ, యోగిని, క్షేత్రపాలక, సర్వతోభద్ర, సుదర్శన నారసింహ, మహామృత్యుంజయ సప్త చిరంజీవి ఆవాహనం, అఖండధీప స్థాపన కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి. విశ్వమానవ సమైక్యతా సంసత్ కన్వీనర్ ఆకుల కోటేశ్వరరావు, కామేశ్వరి దంపతులతో విశ్వంజీ ప్రత్యేక పూజలు చేయించారు. రాత్రి ఆడిటోరియంలో విశ్వణి కూచిపూడి నాట్య ప్రదర్శన, లోల మనస్వి, నిధిమల భరతనాట్య ప్రదర్శన, కౌటూరి గాయత్రి సంగీత విభావరి, ఫణికుమార్ వేణుగాన కచేరీలు అలరించాయి. విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ -
లోకేష్ రాజ్యాంగం మేరకే పోసానిపై అక్రమ కేసులు
నరసరావుపేట: సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై లోకేష్ రాజ్యాంగం మేరకు తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని పల్నాడు జిల్లా నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాజంపేట పోలీసుల అదుపులో ఉన్న పోసానిని నరసరావుపేట పోలీసులు పీటీ వారెంట్‌పై కోర్టుకు తీసుకొస్తున్నారనే సమాచారం మేరకు అక్కడకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. 2023లో స్థానిక టీడీపీ నాయకుడు కొట్టా కిరణ్‌కుమార్ తమ నాయకులు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్‌లను పోసాని అసభ్య పదజాలంతో తిట్టారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు పీటీ వారెంట్‌పై తీసుకొస్తున్నారన్నారు. ఈవిధంగా పోసానిని వేధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 14 చోట్ల కేసులు నమోదు చేయించి అతడిని అరెస్టుచేసి స్టేషన్ల వారీగా తిప్పాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించటం దారుణమన్నారు. రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి బదులు లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తుందనేది స్పష్టమవుతుందన్నారు. పోసానికి మద్దతుగా న్యాయవాదులు అందరూ వచ్చారని, కోర్టులో బెయిలు తీసుకుంటామని వెల్లడించారు. జెడ్పీటీసీ సభ్యుడు పదముత్తం చిట్టిబాబు, న్యాయవాదులు ఆర్.శ్రీనివాసరావు, ఆరె శ్రీనివాసరెడ్డి, సీతారామిరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి -
కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ వర్కర్ల నిరసన
లక్ష్మీపురం: ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు, మున్సిపల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల రవికుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మున్సిపల్ కార్మికులకు అనేక హామీలు ఇచ్చిందన్నారు. తీరా గద్దె నెక్కాక వాటిని మరిచిందని విమర్శించారు. అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్‌ను రద్దు చేసి దాని స్థానంలో ప్రైవేట్ కంపెనీలకు, ఏజెన్సీలకు ఇచ్చే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే ఉద్యోగుల జీవితాలతో వారు చెలగాటం ఆడతారని తెలిపారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులను పెంచాలని కోరారు. విధుల్లో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆప్కాస్ ఉద్యోగ, కార్మికుల రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నగర కార్యదర్శి కోట మాలాద్రి, మంగళగిరి పట్టణ కార్యదర్శి దుర్గారావు, కార్మికులు పాల్గొన్నారు. -
గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్టు
మరో ఇద్దరు పరారీ తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతానగరం రైల్వే బ్రిడ్జి సమీపంలో గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారయ్యారు. ఈ సంఘటనపై సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కల్యాణ్ రాజు వివరాలు వెల్లడించారు. విజయవాడలోని విద్యాధరపురానికి చెందిన గుమ్మడి సాయికుమార్ మరో ఇద్దరు యువకులు గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో కలసి సీతానగరం రైల్వే బ్రిడ్జి వద్దకు వెళ్లామని తెలిపారు. ఈ దాడిలో సాయికుమార్ వద్ద 1050 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఉండవల్లికి చెందిన మహేష్, విజయవాడకు చెందిన కోటి పరారయ్యారని పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న సాయికుమార్‌ను కోర్టుకు హాజరు పరచనున్నామని తెలిపారు. గంజాయి అమ్మకాలతో పాటు తాగే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
శబ్దకాలుష్యం నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి
బాపట్ల: శబ్ద కాలుష్యం నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ విజయమ్మ పేర్కొన్నారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా సోమవారం ఏర్పాటుచేసిన ప్రదర్శనను డాక్టర్ విజయమ్మ ప్రారంభించారు. డాక్టర్ విజయమ్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ వినికిడి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. చెవి వినడం ఆరోగ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పెద్ద, పెద్ద శబ్దాల నుంచి చెవిని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
చెత్త నుంచి సంపదపై దృష్టి పెట్టాలి
సత్తెనపల్లి: చెత్త నుంచి గ్రామ పంచాయతీలకు ఆదాయం చేకూర్చాలని జిల్లా పంచాయతీ అధికారి ఎంవీ భాస్కర్‌రెడ్డి అన్నారు. స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా గ్రామ పంచాయతీలలో ఘన వ్యర్ధాల నిర్వహణపై జిల్లాలోని అన్ని మండలాల విస్తరణాధికారులకు సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామంలోని ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్లో సోమవారం శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటి నుంచి హరిత రాయబారుల ద్వారా ఇంటింటి చెత్త సేకరణ జరగాలన్నారు. తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా సేకరించి చెత్తను సంపద తయారీ కేంద్రానికి చేర్చి వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, పొడిచెత్తను వేరుచేసి విక్రయించి గ్రామపంచాయతీలకు ఆదాయం చేకూర్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా ఎటువంటి చెత్త కుప్పలు లేకుండా పారిశుద్ధ్య నిర్వహణ చేయాలన్నారు. అలా చేయని పంచాయతీ కార్యదర్శులు, మండల విస్తరణాధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు, మండల విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ చెత్త సేకరణ చేయించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనే హెచ్చరికలు తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా ఘన వ్యర్థాల నిర్వహణపై జిల్లా రిసోర్స్ పర్సన్లు ఆర్.నరసింహ నాయక్, విశ్వరూపాచారిలు శిక్షణ ఇచ్చారు. అనంతరం ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్లో సామూహిక భోజనాలు చేశారు. తొలుత జిల్లాలోనే ఆదర్శంగా గుడిపూడిలో ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్డును తీర్చిదిద్దిన గ్రామ పంచాయతీ కార్యదర్శి సిహెచ్ శ్రీనివాసరావును అభినందించారు. నరసరావుపేట డివిజనల్ పంచాయతీ అధికారి వీవీఎం లక్ష్మణరావు, జిల్లాలోని 28 మండలాల మండల విస్తరణ అధికారులు, హరిత రాయబారులు, పాల్గొన్నారు. గ్రామాల్లో చెత్తకుప్పలు లేకుండా పారిశుద్ధ్య నిర్వహణ చేయాలి జిల్లా పంచాయతీ అధికారి ఎంవీ భాస్కర్‌రెడ్డి జిల్లాలోని మండల విస్తరణ అధికారులకు గుడిపూడిలో శిక్షణ -
మిర్చి రైతులకు అండగా ఉంటాం
లక్ష్మీపురం: మిర్చి రైతులకు అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నేతలు స్పష్టం చేశారు. సోమవారం గుంటూరు మిర్చి యార్డును నేతలు సందర్శించారు. రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి. ప్రసాద్, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన రూ.11,781 మద్దతు ధరతో రైతుల ఆశలు అడియాసలయ్యాయని తెలిపారు. కనీసం రూ.20వేలు అయినా ప్రకటిస్తారని ఎదురు చూశారని పేర్కొన్నారు. తీరా గుంటూరు మార్కెట్ యార్డుకు వస్తే వ్యాపారస్తుల దోపిడీకి రైతులు బలి అవుతున్నారని చెప్పారు. మచ్చు, కమిషన్, గోతం పేరులతో క్వింటాకు వెయ్యి రూపాయల వరకు దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆసియాలోనే అతి పెద్దదైన గుంటూరు మిర్చి యార్డులో ఎన్నో రైతుల కన్నీటి గాథలు ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొల్లి రంగారెడ్డి, పచ్చల శివాజీ, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి. జగన్నాథం, కంజుల విఠల్ రెడ్డి, పల్నాడు జిల్లా కార్యదర్శి ఉలవలపూడి రాము, ప్రకాశం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హనుమారెడ్డి, వీరారెడ్డి, రామయ్య పాల్గొన్నారు. విద్యుత్ వైర్లు తగిలి గడ్డి ట్రాక్టర్‌కు మంటలు పర్చూరు(చినగంజాం): డ్రైవర్ చాకచక్యంతో పెనుప్రమాదం తప్పింది. వరిగడ్డి లోడుతో వెళుతున్న ట్రాక్టర్‌కు విద్యుత్ వైర్లు తగిలి నిప్పులు చెలరేగడంతో తీవ్రంగా మంటలు చెలరేగి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన మండలంలోని వీరన్నపాలెం గ్రామంలో సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అందిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన యార్లగడ్డ శ్రీనివాసరావు అనే రైతుకు చెందిన వరిగడ్డిని పొలం నుంచి ఇంటికి చేరుస్తున్నాడు. ఈక్రమంలో వరిగడ్డి ట్రాక్టర్ పంచాయతీ కార్యాలయం ముందుగా వెళ్తున్న సమయంలో ఆ మార్గంలో వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి వరిగడ్డి పూర్తిగా తగలబడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో ట్రాక్టర్ డ్రైవర్ ఆనందరావు చాకచక్యంగా వ్యవహరించాడు. తానేమాత్రం భయాందోళనకు గురికాకుండా గడ్డిని పక్కన పడేసి అందులో ఉన్న కూలీలను, ట్రాక్టర్‌ను కాపాడాడు. వెంటనే స్థానికులు మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గడ్డి పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ.50 వేలు వరకు నష్టం వాటిల్లి ఉంటుందని సమాచారం. -
సన్మార్గ దర్శిని దివ్య ఖురాన్
చిలకలూరిపేట: ప్రపంచంలోని ముస్లింలందరికీ నెలరోజుల పండుగ రంజాన్. దివ్యఖురాన్ దైవం నుంచి భువికి అవతరించిన మాసం కూడా ఇదే. ఈ పవిత్ర గ్రంథం వెలుగులో ఆత్మప్రక్షాళన చేసుకొనే అవకాశం కల్పిస్తుంది. సాఫల్య జీవితానికి సోఫానం దివ్యగ్రంథం పవిత్ర ఖురాన్. అల్లా నుంచి అవతరించి భూమిపైకి వచ్చిన గ్రంథం కావటంతో దీనిని దివ్యఖురాన్ అంటారని మౌల్వీలు పేర్కొంటున్నారు. మానవుడు ఉన్నత జీవితం గడిపేందుకు అవసరమైన అన్ని సూచనలు, నియమాలు ఇందులో పొందుపరిచి ఉన్నాయి. ప్రాపంచిక విషయాల్లో ఎదురయ్యే ఎలాంటి ఒడిదుడుగులకై నా ఈ గ్రంథంలో పరిష్కార మార్గం ఉంటుంది. మానవ సంబంధాలు, శాంతియుత జీవనం, అహింస, విశ్వసనీయత, సౌభ్రాతృత్వం, రోజువారీ జీవితం ఎలా గడపాలి వంటి ఇహలోక అంశాలతో పాటు పరలోక సౌఖ్యం పొందటానికి అవసమైన మూలసూత్రాలు ఇందులో పొందుపరిచి ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇహ, పరలోకాల సౌఖ్యం, సాఫల్య జీవితానికి మూల సూత్రాలే దివ్యగ్రంథంలోని ప్రధాన అంశాలు. పవిత్ర ఖురానులో సూచించిన మార్గాన్ని మహమ్మద్ ప్రవక్త అనుసరించారు. ఈ లోకానికి ఆచరించి చూపారు. దివ్యఖురాన్ రంజాన్ మాసంలో అవతరించటంతో ముస్లింలు ఈ మాసంలో ఖురాన్‌ను పఠిస్తూ దాని పవిత్రతను చాటుతుంటారు. ఖురాన్లో 114 సూరాలు, 6,666 ఆయాత్‌లు, 540 రుకూలు ఉంటాయి. సంపూర్ణ గ్రంథాన్ని 30 భాగాలుగా విభజించారు. వాటిని పారాలుగా పేర్కొంటారు. రంజాన్‌మాసంలో తరావి నమాజు కింద పూర్తిపఠనం గావిస్తారు. మహిమాన్విత వరం.. దైవం దివ్యఖురానును ప్రపంచ మానవాళికి మహిమాన్విత వరంగా ప్రసాదించారు. అజ్ఞానపు కారుచీకట్ల నుంచి విజ్ఞానమనే వెలుగు బాటను చూపిన ఈ దివ్య గ్రంథం మానవుడి అవివేకాన్ని తుడిచిపెట్టేందుకు ఉత్తమమైన మార్గంగా నిలుస్తోంది. మామూలు వ్యక్తిని కూడా మహోన్నతునిగా మార్చేందుకు దోహదపడుతుంది. ఈ దివ్యగ్రంథంలో మొత్తం 30 భాగాలు ఉంటాయి. మొదటి భాగం ‘ఎఖ్రా’ (విద్య) సంబంధించినది. దీని ద్వారా ప్రతి ఒక్కరికీ చదువు తప్పనిసరి అన్న సూచన అందుతోంది. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు అనుసరించాల్సిన విధుల గురించి ఈ సూచనలు ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ మాసంలో ధనికులు జకాత్, ఫిత్రాలను ఖచ్చితంగా అందజేస్తే రంజాన్ ఈద్ ప్రార్థన సమయానికి పేదలనే వారు ఉండరని ఈ గ్రంథం వివరిస్తుంది. మానవుడిలోని మద్యపానం, వ్యభిచారం, పాపం, ద్రోహం, హింస, చెడుగా మాట్లాడటం, కించపరచాలనుకోవటం వంటి విషయాలను ఈ గ్రంథం తీవ్రంగా నిరసిస్తుంది. నైతిక విలువలతో జీవించాలని ప్రభోదిస్తుంది. ఖురాన్‌ను చదివి, దానిని పాటించేవారికి స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని మౌల్వీలు చెబుతారు. పఠించేవారికి ప్రశాంతతో పాటు మనశ్శాంతి లభిస్తుందని విశ్వాసుల నమ్మకం. సాఫల్య జీవితానికి నిర్దేశిని శాంతియుత జీవనానికి సోపానం జీవితాంతం పఠించాలి.. దివ్యఖురాన్ సాధారణ గ్రంథం కాదు. ఇది దైవం మనకు ప్రసాదించిన దివ్యమైన కాంతిపుంజం. దాని పవిత్రతను తెలుసుకొని ఆచరించి ఆరాధిస్తే దైవం ద్వారా మనకు స్వర్గం ప్రాప్తిస్తుంది. ఈ పవిత్ర రంజాన్ మాసంలో పఠించటం ముఖ్యమే అయినా జీవితాంతం క్రమం తప్పకుండా పఠించి, పాటించడం ముక్తిదాయకం. ఖురాన్‌ను నేర్చుకుంటూ, ఇతరులకు నేర్పేవారు ఈ భూమిపై అందరికంటే ఉన్నతులు. – మౌలానా మొహమ్మద్ అబ్బాస్‌ఖాన్ నద్వి, ఇస్లామిక్ పండితుడు -
పారిశుద్ధ్య సేవలు ప్రైవేటుకు అప్పజెప్పొద్దు
నరసరావుపేట: జీఓవెంటనే 279ని సత్వరం రద్దు చేసి ప్రైవేట్ కంపెనీలకు పారిశుద్ధ్య సేవలు అప్పజెప్పే విధానాన్ని విడనాడాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరేకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ గతంలో అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం తక్షణమే సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. లేనిపక్షంలో ఈనెల 11న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి లక్షలాదిగా తరలివెళ్తామన్నారు. ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఉప్పలపాటి రంగయ్య, వైదన వెంకట్, దాసరి రాజు, జయరాజు, వరహాలు, వందనం, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ నేతలు, కార్మికుల ధర్నా -
పోసానిపై కేసు.. బయటపడ్డ మరో కుట్ర
అన్నమయ్య జిల్లా, సాక్షి: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి(Posani KrishnaMurali)పై కూటమి కుట్ర ఎఫ్ఐఆర్ సాక్షిగా బయటపడింది. పల్నాడు జిల్లా నరసరావుపేట(Narasaraopeta) టూటౌన్ పోలీసులు.. ఈ ఉదయం రాజంపేట సబ్ జైలు నుంచి ఆయన్ని తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆయనపై అక్కడ నమోదైన ఎఫ్ఐఆర్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. టీడీపీ ప్రధాన కార్యదర్శి కొట్టు కిరణ్ ఈ ఫిర్యాదు చేశారు. 2022లో తమ నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్(అప్పటికీ ఇంకా పొత్తులో లేరు), నారా లోకేష్‌లపై పోసాని అసభ్యపదజాలంతో పోస్టులు పెట్టారని, అవహేళనగా మాట్లాడారని.. కాబట్టి చర్యలు తీసుకోవాలని కిరణ్ కోరారు. అయితే.. 2024 నవంబర్ 13వ తేదీనే ఆయన ఫిర్యాదు చేయగా.. ఆ మరుసటిరోజే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అదీ బీఎన్ఎస్ సెక్షన్ల మీద కాకుండా.. ఐపీసీ సెక్షన్ల కింద. ఇక.. అరెస్ట్ మాత్రం రెండు నెలల తర్వాతే చేశారు. అదీ మరో కేసులో అరెస్టైన టైం చూసుకుని మరీ. మరోపక్క.. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై 30 ఫిర్యాదులకుగానూ.. 16 కేసులు నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లా జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు ఓబులవారీ పోలీసులు కేసు నమోదు చేసుకుని మరీ ఆయన్ని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న పోసాని విషయంలో కూటమి పెద్దలు ఇంత కక్ష పూరితంగా వ్యవహరిస్తారని ఎవరూ ఊహించలేరు. గుండె సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలున్న ఆయన్ని కావాలనే పీఎస్‌లకు తిప్పుతున్నారనే వాదన వినిపిస్తోంది. అదే టైంలో.. మిగతా చోట్ల పోలీసులు వారెంట్లను సిద్ధం చేస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వక చర్య కాకుంటే మరేమిటి? అని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ పోసాని బెయిల్ పిటిషన్ అంశం చర్చకు రావడం.. మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు ములాఖత్‌కు దరఖాస్తు చేసుకున్నందునే ఇలా మరో కేసుతో ఆయన్ని జిల్లా తరలించారనే చర్చ నడుస్తోందక్కడ. మార్చి 5వ తేదీకి కడప కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది. ఈలోపు ఆయన్ని మరింత ఇబ్బంది పెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.పోలీసుల పోటీ.. అవసరమా?నరసరావుపేటకు పోసానిని తరలించే ముందు రాజంపేట సబ్ జైలులో పోలీసుల హైడ్రామా నడిచింది. నరసరావుపేటతో పాటు అల్లూరి జిల్లా, అనంతపురం రూరల్ పోలీసులు ఒకేసారి జైలు వద్దకు చేరుకున్నారు. పోసానిపై నమోదైన కేసులకు సంబంధించి పీటీ వారెంట్లు జైలు అధికారులకు సమర్పించారు. ‘మేం కోర్టు అనుమతి తీసుకున్నాం.. ముందుగా మాకే పోసానిని అప్పగించాలి..’ అని కోరారు. దీంతో ఉన్నతాధికారులతో మాట్లాడిన అనంతరం నరసరావుపేట పోలీసులకు అనుమతి ఇచ్చారు. తనకు ఛాతీలో నొప్పిగా ఉందంటూ పోసాని చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించారు. 👉పోసానిపై అక్రమ కేసులు బనాయిస్తూ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ మొదటి నుంచి మండిపడుతున్న సంగతి తెలిసిందే. అనారోగ్యం గురించి పట్టించుకోగా.. పోసానిని అపహాస్యం చేసేలా మీడియా ముందు మాట్లాడుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వ పెద్దల(Kutami Peddalu) డైరెక్షన్లోనే ఇలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఇటు వైఎస్సార్సీపీ నేతలు, అటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
రజకులకు బడ్జెట్లో అన్యాయం
బాపట్ల: లాండ్రీలు, దోబీఘాట్ల విద్యుత్ అవసరాలకు కూటమి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంపై రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పొటికలపూడి జయరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం బాపట్ల వచ్చిన జయరాం స్థానిక మీడియాతో మాట్లాడుతూ టీడీపీ రజకులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుందన్నారు. రజకుల నిర్మాణాత్మకమైన అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వటం లేదన్నారు. లాండ్రీలకు ఇచ్చే 150 యూనిట్లకు, దోబీ ఘాట్లకు ఇచ్చే ఉచిత విద్యుత్ అవసరాలకు బడ్జెట్లో నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంపై రాష్ట్రంలో రజకులు ఆగ్రహంతో రగిలిపోతున్నారన్నారు. రజకులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని తెలుగుదేశం ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ఆర్థిక భారం పడని హామీలు నెరవేర్చే అవకాశం ఉన్నా, కూటమి ప్రభుత్వం రజకులకు మేలు చేసేందుకు సిద్ధంగా లేదన్నారు. కూటమి ప్రభుత్వానిది పెత్తందారుల ప్రభుత్వం కాబట్టే రజకుల ఈనాం భూముల అన్యాక్రాంతంపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. రజకులకు ప్రత్యామ్నాయ భూములను కేటాయించడం లేదన్నారు. జగనన్న కాలనీలు, జగనన్న టౌన్స్ పేరుతో సేకరించిన కమ్యూనిటీ స్థలాల్లో రజకుల వృత్తి అవసరాలకు ప్రత్యేక స్థలాలను కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై కొత్తగా పడే ఆర్థిక భారం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడి్డ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయూత కింద రజక వృత్తిదారులకు రూ.10 వేలు ఇచ్చారని, టీడీపీ పాలనలో రజకులు నిండా మోసపోయారని మండిపడ్డారు. సమితి రాష్ట్ర అధ్యక్షుడు పొటికలపూడి జయరాం -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
దెందులూరు: వివాహానికి కారులో వెళ్లి తిరిగొస్తుండగా జరిగిన ప్రమాదంలో ఐదుగురు గాయాలపాలయ్యారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం గుండేరు వాగు వద్ద శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో నివాసం ఉంటున్న ఊట్ల రామకృష్ణ కుటుంబసభ్యులు ఐదుగురు కలసి కారులో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వివాహానికి వెళ్లారు. అనంతరం శనివారం రాత్రి రాజమహేంద్రవరానికి బయలుదేరారు. అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో ఏలూరు జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం గుండేరు వాగు వద్దకు వచ్చారు. ఎదురుగా వెళుతున్న లారీని దాటేందుకు ప్రయత్నించగా, కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ఊట్ల రామకృష్ణకు తలపై, ఆయన భార్య అరుణ కాలికి గాయాలయ్యాయి. రామకృష్ణ నాయనమ్మ అనంతలక్ష్మి, అరుణ అమ్మమ్మ సామ్రాజ్యం, వారి కుటుంబసభ్యుడు ఇరుసుమల్లి మణికంఠ కూడా గాయాలపాలయ్యారు. దెందులూరు ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, హైవే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 అంబులెన్సులో ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. బాధితులకు చికిత్స అందిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శివాజీ తెలిపారు. డ్రైవరు నిద్రమత్తు వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. -
యువతితో అసభ్య ప్రవర్తన
సత్తెనపల్లి: యువతితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలోని ఓ గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు.. మిరపకాయల కోతలకు ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతానికి చెందిన 40 మంది కూలీలు నెల క్రితం వచ్చి గుడారాలు వేసుకొని జీవనం వెళ్లదీస్తున్నారు. కూలీలలో ఓ మహిళ అనారోగ్యం పాలవడంతో కుమార్తె ఇడ్లీ తెచ్చేందుకు సిద్ధమైంది. కూలీలను గ్రామానికి తీసుకువచ్చిన హనిమిరెడ్డి అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై ఆ యువతిని ఎక్కించుకొని వెళ్లాడు. ఇడ్లీ తీసుకొని తిరిగి వస్తుండగా వాహనం నడుపుతూనే వెనుక కూర్చున్న యువతిపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. గుడారాల వద్ద కాకుండా మరికొంత ముందుకు తీసుకెళ్లి ద్విచక్ర వాహనాన్ని ఆపి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేందుకు యత్నించడంతో ఆమె పెద్దగా కేకలు వేస్తూ పరుగులు పెట్టింది. గుడారాల వద్దకు చేరుకొని జరిగిన ఘటనను తల్లిదండ్రులకు వివరించి విలపించింది. గ్రామ పెద్దలు వచ్చి రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలాన్ని సత్తెనపల్లి రూరల్ పోలీసులు సందర్శించి, వివరాలు సేకరించారు. -
చిన్నారిపై బాలుడు లైంగిక దాడికి యత్నం
చెరుకుపల్లి: ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగిన ఘటన మండలంలోని ఆరేపల్లి పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. ఆదివారం అదే గ్రామానికి చెందిన 16 సంవత్సరాల వయసు గల ఓ మైనర్ బాలుడు చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆ చిన్నారి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి తల్లికి చెప్పింది. ఆమె వెంటనే తెనాలి ఏరియా హాస్పిటల్‌కు వైద్య పరీక్షల నిమిత్తం తీసుకువెళ్లినట్లు సమాచారం. దీనిపై స్థానిక ఎస్ఐను సంప్రదించగా చిన్నారి నాన్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
చిరు వ్యాపారులకు అండగా నిలవాలి
నగరంపాలెం: చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు సమష్టి నిర్ణయంతో చిన్న వ్యాపారులకు బ్యాంకు రుణాలు ఇప్పించే దిశగా పయనించాలని కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికై న యేల్చూరి వెంకటేశ్వర్లుకు ఆత్మీయ సన్మాన మహోత్సవం, రజత కిరీటంతో ఆదివారం శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సత్కరించారు. తొలుత అతిథులు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ కొత్తగా వ్యాపారాలు చేసే వారికి అవగాహన కల్పించాలని అన్నారు. బ్యాంక్ అధికారులతో మాట్లాడి రుణాలు ఇప్పించే దిశగా ముందుకెళ్లాలని సూచించారు. ఆన్లైన్లో డిజిటల్ మార్కెటింగ్ పై శిక్షణ అందించాలని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను వ్యాపారులకు వివరించాలని అన్నారు. క్రేన్ గ్రూప్ సంస్థల అధినేత గ్రంథి కాంతారావు మాట్లాడుతూ చాంబర్ ఆఫ్ కామర్స్ గతంలో కొంతమేర నిర్వీర్యమైపోయిందని అన్నారు. ఇప్పటికై నా ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకోవడం అభినందనీయమన్నారు. ఇకనైనా సభ్యత్వ నమోదు పక్రియను వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా ఐసీసీకి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సన్మాన గ్రహీత ఐసీసీ అధ్యక్షుడు యేల్చూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వ్యాపారులకు అండగా ఉంటానని చెప్పారు. ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, కన్నా లక్ష్మీనారాయణ, బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్‌కుమార్‌లు మాట్లాడారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్‌కృష్ణ, ఐసీసీ శాశ్వత గౌరవాధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, డిప్యూటీ మేయర్ సజల, కార్పొరేటర్లు ఈరంటి వరప్రసాద్, పోతురాజు సమత, నాయకులు కొనకళ్ల సత్యం, కొత్తూరు వెంకట్ పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వాహకులుగా వెచ్చా కృష్ణమూర్తి, దేవరశెట్టి సుబ్బారావులు వ్యవహరించారు. ఐసీసీ అధ్యక్షుడి సన్మాన సభలో కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని -
వైభవంగా శ్రీవారి కల్యాణోత్సవం
గురజాల: నగర పంచాయతీలోని జంగమహేశ్వరపురంలో పలనాటి తిరుమలగా పేరుగాంచిన శ్రీ అలమేలు మంగా పద్మావతీ సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవం ఆదివారం కనుల పండువగా నిర్వహించారు. తొలుత దేవాలయ ప్రాంగణంలోని కల్యాణ మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. మండపంలో అలమేలు మంగా పద్మావతీ సమేత వెంకటేశ్వరస్వామి వారి కల్యాణాన్ని వేదపండితులు కారెంపూడి వరదాచార్యులు, రాఘవాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. పలువురు దంపతులు ఈ మహోత్సవంలో పీట్లపై కూర్చున్నారు. వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు అన్నసంతర్పణ, తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. మరోవైపు స్వామి వారి 49వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించారు. వేకువజాము నుంచి భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఉత్సవాల సందర్భంగా స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. దేవాలయంలో హోమం, బలిహరణంతో పాటుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సకల ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఎదురు కోల, కోలాట కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
ఆకట్టుకున్న గ్రామీణ కళారూపాలు
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ తిరునాళ్లలో ఐదు చోట్ల ప్రదర్శించిన సంప్రదాయ గ్రామీణ కళారూపాలు భక్తులను, యాత్రికులను ఆకట్టుకున్నాయని మంచి చిత్రాల అభిమాన సంఘం ప్రతినిధులు ఈదర గోపీచంద్, కంచర్ల నాగవీరయ్యలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శాలివాహన సత్రంలో కావూరు గ్రామానికి చెందిన కళాకారులు గొట్టం ఆంజనేయులు దర్శకత్వంలో ప్రదర్శించిన బ్రహ్మం గారి నాటకం అలరించిందని తెలిపారు. కాకతీయ కళావేదికపై సినిమా పాటల కచేరీతోపాటు గయోపాఖ్యానం, శ్రీకృష్ణ రాయబారం, రామాంజనేయ యుద్ధం పౌరాణిక పద్య నాటకాలు ప్రదర్శించారని పేర్కొన్నారు. అలాగే దివ్యాంగ కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాటల కచేరీ, మిమిక్రీ, ఏకపాత్రాభినయాలు ఆకట్టుకున్నాయని తెలిపారు. కావూరు ప్రభ వద్ద మహిళా కోలాటం, భట్రాజు సత్రంలో బ్రహ్మంగారి నాటకాన్ని ప్రదర్శించారని చెప్పారు. త్వరలో పట్టణంలో నిర్వహించే అభినందన సభలో వారిని సత్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో సాంస్కృతిక వేదికపై ప్రదర్శనలు ఇవ్వలేకపోయామని పద్య కవి, నటులు ఈవూరి వెంకటరెడ్డి వాపోయినట్లు వివరించారు. -
నేటి నుంచి సీనియర్ ఇంటర్ పరీక్షలు
గుంటూరు జిల్లాలోని 87 కేంద్రాల్లో హాజరు కానున్న 35,946 మంది గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ద్వితీయ సంవత్సర విద్యార్థులకు సోమవారం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. గుంటూరు జిల్లావ్యాప్తంగా హాజరుకానున్న 35,946 మంది విద్యార్థులకు 87 కేంద్రాలను సిద్ధం చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8.30 నుంచి కేంద్రాల్లోకి అనుమతించడం ప్రారంభించిన తరువాత, 9 గంటల తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు యంత్రాంగం 144 సెక్షన్ అమలు పరుస్తోంది. గుంటూరులోని ఏసీ కళాశాలలో సోమవారం నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న దృష్ట్యా, ఏసీ కళాశాల కేంద్రంగా ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాల్ టిక్కెట్లు పొందిన విద్యార్థులకు పక్కనే ఉన్న ఏసీ లా కళాశాల ద్వారం నుంచి పరీక్ష కేంద్రంలోకి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. -
యువతితో అసభ్య ప్రవర్తన
సత్తెనపల్లి: యువతితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలోని ఓ గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు.. మిరపకాయల కోతలకు ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతానికి చెందిన 40 మంది కూలీలు నెల క్రితం వచ్చి గుడారాలు వేసుకొని జీవనం వెళ్లదీస్తున్నారు. కూలీలలో ఓ మహిళ అనారోగ్యం పాలవడంతో కుమార్తె ఇడ్లీ తెచ్చేందుకు సిద్ధమైంది. కూలీలను గ్రామానికి తీసుకువచ్చిన హనిమిరెడ్డి అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై ఆ యువతిని ఎక్కించుకొని వెళ్లాడు. ఇడ్లీ తీసుకొని తిరిగి వస్తుండగా వాహనం నడుపుతూనే వెనుక కూర్చున్న యువతిపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. గుడారాల వద్ద కాకుండా మరికొంత ముందుకు తీసుకెళ్లి ద్విచక్ర వాహనాన్ని ఆపి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేందుకు యత్నించడంతో ఆమె పెద్దగా కేకలు వేస్తూ పరుగులు పెట్టింది. గుడారాల వద్దకు చేరుకొని జరిగిన ఘటనను తల్లిదండ్రులకు వివరించి విలపించింది. గ్రామ పెద్దలు వచ్చి రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలాన్ని సత్తెనపల్లి రూరల్ పోలీసులు సందర్శించి, వివరాలు సేకరించారు. -
కూటమి ప్రభుత్వానిది దగా బడ్జెట్
జె.పంగులూరు: ఎన్నో మోసపూరిత హామీలిచ్చి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం, తప్పించుకునే వీల్లేక, రాష్ట్ర ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను కప్పి పుచ్చేందుకు చివరికి ఒక దగా బడ్జెట్ ప్రకటించిందని రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి చందోలు రాజ్‌కుమార్ దుయ్యబట్టారు. మండల పరిధిలోని పంగులూరులో ఆదివారం ఆయన మాట్లాడారు. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామన్న పథకం ఏమైందని ప్రశ్నించారు. తల్లికి వందనం అభాసు పాలైందని, అనేక కారణాలతో విద్యార్థుల సంఖ్య కూడా తగ్గించే విధంగా చేస్తున్నారని తెలిపారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ కింద రూ.10 లక్షలు, ప్రతి మహిళకు రూ.1500 సంగతి ఎటు పోయిందని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడకి పోయిందని ప్రశ్నించారు. ఇప్పటికే రూ. లక్ష కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం మరో రూ.80 వేల కోట్లు తీసుకురావాలని ప్రకటించడం సంపద సృష్టిలో భాగమా అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి చందోలు రాజ్‌కుమార్ -
పల్నాడు
సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025అన్ని డబ్బులెక్కడివని ‘సాయిసాధన’ బాధితులకే ఎదురు ప్రశ్నలు 7మావుళ్లమ్మ విగ్రహ పునఃప్రతిష్ట కొల్లూరు: మండలంలోని చినపులివర్రు శివారు గురివిందపల్లిలో నూతనంగా నిర్మించిన ఆలయంలో గ్రామ దేవత మావుళ్లమ్మ విగ్రహ పునఃప్రతిష్టాపన వేడుక ఆదివారం ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్నసంతర్పణ చేశారు.గుంటూరు రేంజ్‌కు 53 మంది ప్రొబేషనరీ ఎస్ఐలునగరంపాలెం: సమర్థంగా విధులు నిర్వర్తించాలని, ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదివారం ప్రొబేషనరీ ఎస్ఐలకు సూచించారు. శిక్షణ పూర్తయి, గుంటూరు రేంజ్ పరిధిలో విధుల నిర్వహించేందుకు ఎంపికై న 53 (36 మంది పురుషులు, 17 మంది మహిళలు) మంది ప్రొబేషనరీ ఎస్ఐలు గుంటూరు నగరంలోని గుంటూరు రేంజ్ కార్యాలయంలో ఐజీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ క్రమశిక్షణ, నిజాయతీ, పారదర్శకత, జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని వారికి సూచించారు. తద్వారా పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలన్నారు. అనంతరం వారికి జిల్లాలు కేటాయిస్తూ నియామక ఉత్తర్వులను ఐజీ అందించారు. గుంటూరు జిల్లాకు 22 మంది, పల్నాడు జిల్లాకు 13, బాపట్ల జిల్లాకు 10, ప్రకాశం జిల్లాకు ఒకరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు ముగ్గురు, తిరుపతి జిల్లాకు నలుగురిని కేటాయిస్తూ నియామక ఉత్తర్వులు అందించారు. ఈనెల 2 నుంచి 6 వ తేదీ వరకు పీఎస్ఐలకు సెలవులని ఐజీ తెలిపారు. అనంతరం ఈ నెల 7వ తేదీ నుంచి గ్రేహౌండ్స్ శిక్షణకు పంపిస్తామని వెల్లడించారు. అనంతరం పీఎస్ఐలతో కూడా ఐజీ ప్రత్యేకంగా మాట్లాడారు. ఇఫ్తార్ సహరి (సోమ) (మంగళ) నరసరావుపేట 6.13 5.10 గుంటూరు 6.22 5.10 బాపట్ల 6.21 5.08 పెద్దల హస్తంపై అనుమానాలు పుల్లారావు విషయంలో మొదటి నుంచీ పోలీసు శాఖలోని పెద్దల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటు ప్రభుత్వ పెద్దలూ అతనికి అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలి నుంచీ పరిశీలిస్తే పుల్లారావు మోసాల చిట్టా బయట పడిన నెల తర్వాతగానీ ఆయన కోర్టులో లొంగిపోలేదు. ఈలోగా ప్రజల నుంచి దోచిన సొమ్మంతా వివిధ రూపాల్లో దారి మళ్లించాడు. పుల్లారావును అరెస్టు చేసి, దోచుకున్న సొమ్ము రికవరీ చేయడంపై పోలీసులు దృష్టి సారించలేదు. దీని వెనుక పోలీసు ఉన్నతాధికారులతోపాటు ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని బాధితులు మండిపడుతున్నారు. సుమారు వెయ్యి మంది బాధితులు ఉంటే ప్రభుత్వం ఆర్థిక నేరగాడైన పుల్లారావుకు లబ్ధి చేకూరేలా వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదెలా పారదర్శక పాలన అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇచ్చిన మొత్తం తిరిగి వస్తుందో రాదో.. ఎవరికి చెబితే వేదన తీరుతుందో.. అనే దిగులుతో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న సాయిసాధన చిట్‌ఫండ్ బాధితులకు సీఐడీ షాక్ ఇస్తోంది. ఉన్న కొద్దిపాటి ఆశలను ఆదిలోనే సమాధి చేస్తూ సీఐడీ అధికారులు అడిగే ప్రశ్నలు బాధితుల గుండెల్లో మరింత వేదన మిగులుస్తున్నాయి. అయ్యా.. కష్టపడి రూపాయి రూపాయిగా కూడబెట్టుకున్న డబ్బులను వడ్డీ ఆశతో పుల్లారావుకు ఇస్తే నిండా మునిగిపోయామని చెప్పేలోగానే అధికారులు వారి అసలు నైజం చాటుతున్నారు. పోయిన డబ్బుల సంగతి సరే.. అసలు మీకు అంత మొత్తం ఎలా వచ్చాయి.. వాటికి లెక్కలు చెప్పండి.. అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. బాధితులు చేసేది లేక అంతులేని వేదనతో వెనుదిరుగుతున్నారు. ఇదేం అన్యాయమంటూ గుండెలు బాదుకుంటున్నారు. చీటర్కే అనుకూలంగా వ్యవహరిస్తున్న నిస్సిగ్గు సీఐడీ, ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేట టౌన్: రెండు నెలల క్రితం గుంటూరు, పల్నాడు జిల్లాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలవ్యాప్తంగా సంచలనం సృష్టి్ంచిన సాయిసాధన చిట్‌ఫండ్ పాలడుగు పుల్లారావు స్కాం కేసులో బాధితుల వేదన అంతా ఇంతా కాదు. అధిక వడ్డీ ఆశ చూపి, లేని ఆస్తులు ఉన్నట్లు మాయ చేసి సుమారు వెయ్యి మంది వద్ద రూ.400 కోట్లకుపైగా పుల్లారావు వసూలు చేశాడు. ఈ నగదుతో రాత్రికి రాత్రే కుటుంబంతో ఉడాయించాడు. బాధితులు ఒక్కొక్కరూ తమకు జరిగిన అన్యాయంపై గోడు వెళ్లబోసుకున్నారు. కమిటీగా ఏర్పడి పుల్లారావు ఆస్తులెంత.. అప్పులెంత ? అంటూ ఆరా తీశారు. ఇప్పటికే ఎమ్మెల్యే అరవింద్ బాబు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవి, హోంమంత్రి అనితలను సైతం కలిసి న్యాయం చేయాలని వేడుకున్నారు. సీఐడీకి కేసు అప్పగించవద్దంటూ విన్నవించుకున్నారు. ఎవరికి వారు తాము అండగా నిలబడతామని చెప్పారేగానీ.. బాధితులను న్యాయం చేసే దిశగా మాత్రం చర్యలు శూన్యం. బాఽధితులు భయపడినట్టే కేసు చివరకు సీఐడీకి చేరింది. అయినప్పటికీ న్యాయం జరిగే అవకాశాలు లేకపోవడంతో ఆదివారం నరసరావుపేటలోని ఓ హోటల్లో బాధితులంతా సమావేశమై పలు తీర్మానాలు చేశారు. పుల్లారావు స్కాంపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని ఎమ్మెల్యే అరవింద్ బాబును కలసి విన్నవించారు. ఆ డబ్బులకు లెక్కలు చెప్పండి.. కూటమి ప్రభుత్వం ఎంత వేడుకున్నా పట్టించుకోకుండా పుల్లారావు కేసును నీరుగార్చేలా సీఐడీకి అప్పగించింది. సీఐడీ బాపట్ల ఎస్పీ తుషార్‌తో కలసి ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే సీఐడీకి బదిలీ అయ్యాక 15 రోజులకుగానీ బాధితులతో సిట్ అధికారులు మాట్లాడలేదు. సీఐడీ బృందం ఒక్కసారి కూడా నరసరావుపేటలోని సాయిసాధన చిట్‌ఫండ్‌కు వచ్చి తనిఖీలు చేపట్టలేదు. బాధితులను మాత్రం ఫిరంగిపురం పోలీస్‌స్టేషన్, గుంటూరు సీఐడీ కార్యాలయానికి పిలిపించుకుని విచారణ చేస్తున్నారు. అక్కడ తమనే దోషుల్లాగా చూస్తూ సీఐడీ అధికారులు వ్యవహరిస్తున్నారంటూ బాధితులు వాపోతున్నారు. అసలు పుల్లారావుకు ఇచ్చేందుకు మీకు డబ్బులు ఎలా వచ్చాయో లెక్కలు చెప్పండంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారట. దీంతో బాధితులు ఇదెక్కడి దారుణమంటూ బోరున విలపిస్తున్నారు. సీఐడీ అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో బాధితులు వారి వద్దకు వెళ్లేందుకు కూడా వెనుకడుగు వేస్తున్నారు. ఉన్న కష్టాలకు తోడు కొత్త సమస్యలు వస్తాయేమోనన్న ఆలోచనతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేస్తారని ఆశించి వస్తే ఇదేం తీరని ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. దర్జా అంటే పుల్లారావు కుటుంబానిదే.. పుల్లారావుకు చెందిన సాయిసాధన చిట్‌ఫండ్‌తోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కూడా ఆయన భార్య, కుమారుడు, కుమార్తె, అత్తమామలు భాగస్వాములుగా ఉన్నారు. ఈ చీటింగ్ వ్యవహారంలో వీరంతా దోషులే. అయితే పుల్లారావు కోర్టులో లొంగిపోయి రెండు నెలలు కావస్తున్నా ఆయన కుటుంబ సభ్యులపై కనీస చర్యలు కూడా లేవు. వీరంతా ప్రజల సొమ్ముతో దర్జాగా బయట తిరుగుతున్నారు. పుల్లారావుతోపాటు అతని కుటుంబసభ్యులపై నరసరావుపేట వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదవ్వడంతో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకొన్నారు. వారిని అరెస్ట్ చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు బాధితులు బోరున విలపిస్తుంటే.. పుల్లారావు కుటుంబ సభ్యులు మాత్రం ఎంచక్కా దర్జాగా తిరుగుతున్నారు. జిల్లాల వారీగా కేటాయింపులు నియామక ఉత్తర్వులు అందించిన రేంజ్ ఐజీన్యూస్రీల్ పుల్లారావు కేసు విషయంలో దారుణంగా సీఐడీ ధోరణి మోసపోయిన మొత్తం వదిలేసి.. ఎలా వచ్చాయంటూ నిలదీత ఇదెక్కడి తీరంటూ గుండెలు బాదుకుంటున్న బాధితులు పుల్లారావుకు మేలు చేసేలా కూటమి ప్రభుత్వ తీరు ఉందని ఆగ్రహం ఆయన కుటుంబంపైనా ఇప్పటివరకు చర్యలు లేవంటూ ఆవేదన పుల్లారావు స్కాంపై అసెంబ్లీలో చర్చించాలని ఎమ్మెల్యేకు వినతి -
పట్టభిషేకం ఎవరికో!
నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల(ఏసీ)లోని కౌంటింగ్ కేంద్రంలో భద్రపరచిన బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదివారం ఏసీ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం జేసీ ఎ.భార్గవ్ తేజతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగలక్ష్మి మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘ ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు చేపడుతున్నామని, ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన అనంతరం అన్ని జిల్లాల బ్యాలెట్ బాక్సులు ఏసీ కళాశాలలోని స్ట్రాంగ్ రూములోకి భద్రపర్చినట్లు చెప్పారు. పోలింగ్ 69.57 శాతంగా నమోదైన దృష్ట్యా దాదాపు 2.41 లక్షల ఓట్లు లెక్కించాల్సి ఉందన్నారు. 28 టేబుళ్లు ఏర్పాటు ఇందుకు 28 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. బ్యాలెట్ పేపర్, మొదటి ప్రాధాన్యత ఓట్లు విధానంతో లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రక్రియ ప్రకారం కౌంటింగ్ సుమారు రెండు నుంచి మూడు రోజులు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రాథమికంగా కౌంటింగ్ మొదటి రౌండ్లో పోలింగ్ బూత్‌ల వారీగా పోలైన ఓట్లను సరిచూసుకొని మిక్సింగ్ చేస్తారన్నారు. తదుపరి చెల్లుబాటయ్యే ఓట్లను పరిశీలించి, మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం జరుగుతుందన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి నిర్దేశించిన కోటా ఓట్లు వచ్చిన అభ్యర్థి గెలుపొందినట్టు ప్రకటించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఎవరికీ నిర్దేశిత ఓట్లు రాకపోతే ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ వారికి వచ్చిన తదుపరి ప్రాధాన్యత ఓట్లను ఇతర అభ్యర్థులకు పంచుతూ కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు. మూడు షిఫ్టుల్లో 750 మందికి విధులు.. ఓట్లు లెక్కింపు కోసం మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించేలా 750 మంది సిబ్బందికి వివిధ విధులను కేటాయించినట్లు తెలిపారు. అభ్యర్థులు సైతం ఏజెంట్లను మూడు షిఫ్టుల్లో నియమించుకునేలా అవకాశం కల్పించామన్నారు. కౌంటింగ్ ప్రదేశం మొత్తం మూడంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, గుర్తింపు కార్డు లేకుండా ఏ ఒక్కరిని కౌంటింగ్ ప్రాంతానికి అనుమతించబోమన్నారు. అదే విధంగా కౌంటింగ్ హాల్లోకి సెల్ఫోన్లు అనుమతించరని, పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే కౌంటింగ్ హాల్లోకి ఏజెంట్లను, కౌంటింగ్ సిబ్బందిని అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు తెలియజేసేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. వీటితో పాటు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఏసీ కళాశాల కౌంటింగ్ కేంద్రంలో పూర్తయిన ఏర్పాట్లు ఉమ్మడి కృష్ణా–గుంటూరు జిల్లాల ఓట్ల లెక్కింపు ఇక్కడే 2.41 లక్షల ఓట్లను లెక్కించేందుకు 28 టేబుళ్లు ఏర్పాటు వివరాలు వెల్లడించిన ఆర్ఓ, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి