Parvathipuram Manyam
-
పాముకాటుకు గురై ఫీల్డ్ అసిస్టెంట్ మృతి
రామభద్రపురం: మండలంలోని నాయుడువలసకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ పాము కాటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనపై కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ ఆర్నిపల్లి సత్యనారాయణ(36) గ్రామంలోని మామిడితోటలో ఉపాధి కూలీలు వారం రోజులుగా చేసిన ఉపాధి పనుల కొలతలు వేసేందుకు శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో వెళ్తుండగా తోటలో ఆకులు ఎక్కువగా ఉండడంతో ఆకుల కింద పాము ఉందన్న విషయం తెలుసుకోలేక కాలితో మట్టేశాడు. దీంతో ఆకుల కింద ఉన్న పాము కాటు వేయడంతో స్థానికులు మెరుగైన చికిత్స కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 11 గంటల సమయంలో మృతిచెందాడు. మృతుని భార్య గత రెండేళ్ల క్రితం మృతి చెందింది. పెద్ద పాప జ్యోతి ఇంటర్మీడియట్ మొదటి ఏడాది పరీక్షలు రాస్తోంది. రెండవ పాన నిఖిత 7 వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో పిల్లలిద్దరూ దిక్కులేని వారయ్యారు. -
డీకేటీ రైతులకు అన్యాయం..!
పార్వతీపురంటౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం వివిధ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చాయి. రైతులకు ఆ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రస్తుతం వివిధ రకాల పద్ధతులను అవలంబిస్తున్నాయి. అయితే భవిష్యత్‌లో రైతులకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్, పంటల యోజన బీమా, సబ్సిడీ పరికరాలు, పంట నష్టపరిహారం, ఎరువుల రాయితీ, కనీస మద్దతు ధర తదితర పథకాలను అందించేందుకు ప్రత్యేక కార్డులను అందించనున్నారు. ఇందుకోసం అర్హులైన ప్రతి రైతుకు ఆధార్‌కార్డు తరహాలో వ్యవసాయ శాఖ ద్వారా 14అంకెల యూఐడీ కేటాయిస్తున్నారు. అయితే ఇప్పటివరకు సొంత పట్టా భూములు ఉన్న రైతుల వివరాలు మాత్రం నమోదు చేసి ఒక యూనిక్ ఐడీని కేటాయిస్తున్నారు. కానీ డీకేటీ పట్టాలు ఉన్న రైతుల వివరాలు నమోదు చేయడం లేదు. ఇందుకు ఆన్లైన్లో అనుమతించడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో డీకేటీ రైతులు తమకు పథకాలు, నిధులు అందుతాయో లేదోనన్న ఆందోళనలో ఉన్నారు. కేవలం పట్టాదారులకే నమోదు చేస్తారా? జిల్లాలో గల 15 మండలాల్లో గడిచిన రెండు వారాలుగా అన్ని గ్రామాల్లో రైతులకు యూనిక్ ఐడీ నంబర్ కేటాయింపు కోసం వ్యవసాయ సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తున్నారు. రైతుల వద్దకు వెళ్లి వారి భూమి పాస్‌బుక్‌లు, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ద్వారా ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేసి యూనిక్ ఐడీ కేటాయిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని రైతుసేవా కేంద్రాల్లో కూడా నమోదు ప్రక్రియ జరుగుతోంది. కానీ డీకేటీ రైతులకు మాత్రం ఆన్లైన్లో నమోదు అవడం లేదంటూ చెప్పి పంపించేస్తున్నారు. కేవలం పట్టాదారులకే నమోదు చేస్తారా? అంటూ డీకేటీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో డీకేటీ రైతుల వివరాలు యూనిక్ ఐడీ కోసం డీకేటీ భూములున్న ఏ ఒక్క రైతుకు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వడం లేదు. జిల్లాలో పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో 24,245 మంది రైతులు డీకేటీ పట్టాలు కలిగి ఉన్నారు. రెండు ఐటీడీఏల పరిధిలో 36,483 మంది రైతులు నమోదు కావాల్సి ఉంది. ఆ రైతులందరూ యూనిక్ ఐడీ కార్డులు మాకు ఇవ్వరా? కార్డు ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తే మా పరిస్థితి ఏమిటి అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు.అనుమతి వస్తే నమోదు చేస్తాం ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే, వెబ్సైట్లో ఆప్షన్ వచ్చిన వెంటనే డీకేటీ రైతుల వివరాలు నమోదు చేస్తాం. ప్రస్తుతం సొంత పట్టాదారులకు సంబంధించి యూనిక్ ఐడీలను అప్లోడ్ చేస్తున్నాం. త్వరలోనే అనుమతి వస్తుందని సమాచారం. త్వరలో వారివి కూడా యూనిక్ ఐడీల నమోదు ప్రక్రియ చేపడతాం. – రాబర్ట్‌పాల్, జిల్లా వ్యవసాయశాఖాధికారి, పార్వతీపురం మన్యం ఫార్మర్ రిజిస్ట్రేషన్‌లో సొంత పట్టాదారులకే నమోదు వారికే యూనిక్ ఐడీల కేటాయింపు డీకేటీ రైతులకు నమోదు అవదంటున్న అధికారులు ఆందోళనలో రైతులు -
విద్యార్థులకు ఇస్రో పిలుపు
● అంతరిక్షం.. స్పేస్ అప్లికేషన్‌పై అవగాహన ● 9వ తరగతి విద్యార్థులకు చక్కటి అవకాశం ● మార్చి 23 వరకు దరఖాస్తుల స్వీకరణపాలకొండ రూరల్: విద్యార్థి దశ నుంచి సైన్స్‌పై మక్కువ చూపుతూ..నూతన ఆవిష్కరణల పట్ల ఉత్సాహం చూపే విద్యార్థులను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రోత్సహిస్తోంది. యువిక (యుంగ్ సైంటిస్ట్)–2025 పేరిట ఉపగ్రహ ప్రయోగాలను తెలుసుకునేందుకు, శాస్త్రవేత్తలతో మాట్లాడేందుకు 9వ తరగతి విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది. లక్ష్యాలు.. ● భారత అంతరిక్ష పరిశోధనలను విద్యార్థులకు పరిచయం చేయడం ● విద్యార్థులను స్పేస్ టెక్నాలజీ వైపు ప్రోత్సహించడం ● అంతరిక్ష పరిశోధకులుగా వారిని సిద్ధం చేయడం దరఖాస్తు చేసే విధానం.. ఈ నెల 23వ తేదీలోగా విద్యార్థులు నాలుగు దశల్లో దరఖాస్తులను పూర్తి చేయాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను ఏప్రిల్ 7వ తేదీనాటికి వడపోసి ఎంపికై న విద్యార్తుల జాబితాలను విడుదల చేస్తారు. మే నెల 18 నుంచి విద్యార్థులను ఆహ్వానిస్తారు. 19 నుంచి 30వ తేదీ వరకూ యువికా–25 కార్యక్రమం చేపడతారు. మే 31న ముగింపు కార్యక్రమం జరుగతుంది. అదే రోజు ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. ఎంపికై న విద్యార్థులకు ప్రయాణ, భోజన, వసతి ఏర్పాట్లును ఇస్రో పూర్తి ఉచితంగా అందజేస్తుంది. ఎంపికై న విద్యార్థులను మే నెలలో 14 రోజులు ఇస్రోకు చెందిన స్పెస్ సెంటర్లకు తీసుకువెళ్తారు. అక్కడి వింతలు, విశేషాలు, సప్తగహ కూటమి తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తారు. ఎవరు అర్హులు ● ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులు ● ఆన్లైన్ పరీక్షలో ప్రతిభ కనపర్చిన విద్యార్ధులు ● 8వ తరగతిలో సాధించిన మార్కుల్లో 50 శాతం, మూడేళ్లలో పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనల్లో పాల్గొంటే వాటి ఆధారంగా 2 నుంచి 10 శాతం, ఆన్లైన్ క్విజ్ పోటీల్లో చూపించిన ప్రతిభకు 10 శాతం వెయిటేజీ అందిస్తారు. ఎన్సీసీ, స్కౌట్, గైడ్స్ విభాగాల్లో ఉంటే 5 శాతం, పల్లె ప్రాంతాలకు చెందినవారికి 15 శాతం ప్రాధాన్యం కల్పిస్తారు.భావిశాస్త్ర వేత్తలకు ప్రోత్సాహం భావిశాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు ఇస్రో చేపడుతున్న యువికా కార్యక్రామాన్ని అర్హతగల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. సంబంధిత పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులు పిల్లలకు సహకరించాలి. జిల్లా పరిధిలో డీవీఈఓలు, ఎంఈఓలు ఈ విషయంపై వారి పరిధిలో యంత్రాంగాన్ని చైతన్యపర్చాలి. పెద్ద సంఖ్యలో విద్యార్థులతో దరఖాస్తు చేయించాలి. – ఎన్.తిరుపతినాయుడు, జిల్లా విద్యాశాఖాధికారి, పార్వతీపురం మన్యంజిల్లావ్యాప్తంగా సంసిద్ధం గతంలో నిర్వహించిన అనేక సైన్స్ ఎగ్జిబీషన్లు, పోటీ పరీక్షల్లో మన జిల్లా విద్యార్థులు సత్తాచాటి జాతీయ స్థాయిలో వారి ప్రదర్శనలతో అబ్బురపర్చారు. ఇదే స్ఫూర్తితో పెద్ద సంఖ్యలో అర్హత గత విద్యార్థులను సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే 40 వరకూ దరఖాస్తులను ఆన్లైన్లో రిజిస్టర్ చేశారు. ప్రస్తుత వేసవి సెలవుల్లో సమయం వృథా కాకుండా ఈ పర్యటనలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. – జి.లక్ష్మణరావు, జిల్లా సైన్స్ అధికారి, పార్వతీపురం మన్యం -
విద్యార్థులు మరింత విజ్ఞానం పెంపొందించుకోవాలి
పార్వతీపురం టౌన్: విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలకు వెళ్లే విద్యార్థులందరూ తమ విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అభిలాషించారు. జిల్లా విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి బస్సును ప్రారంభించారు. గతంలో జిల్లాలో నిర్వహించిన విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులందరూ తమ విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకునేలా విశాఖపట్నంలోని కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఆర్కే బీచ్ వద్ద గల ఐఎన్ఎస్ కుర్పురా సబ్‌మైరెన్ మ్యూజియం, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, ఆర్కియాలజీ మ్యూజియంలను సందర్శించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులందరికీ ఆయా ప్రాంతాల్లోని కొత్త విషయాలను తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని, ఆ విధంగా తమ విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకుని, భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలకు నాంది పలకాలని కలెక్టర్ పిలులపునిచ్చారు. మండలానికి మూడు పాఠశాలలు చొప్పున జిల్లాలోని 15 మండలాల నుంచి 45 మంది విద్యార్ధులు ఈ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలకు బయలుదేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఎన్. తిరుపతినాయుడు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్ పెద్ద ఎత్తున చేపట్టాలి పార్వతీపురంటౌన్/పార్వతీపురం: ఎవెన్యూ ప్లాంటేషన్ పెద్ద ఎత్తున చేపట్టాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆయన అటవీ కార్యకలాపాలపై తన చాంబర్లో డీఎప్‌ఓ ప్రసూనతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారుల వెంబడి ఎవెన్యూ ప్లాంటేషన్, చెరువు చుట్టూ ప్లాంటేషన్, గ్రామల్లో చెట్ల పెంపకానికి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సీడ్ బాల్స్ తయారీకి చర్యలు చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ పథకం, వన సంరక్షణ సమితుల ద్వారా ప్లాంటేషన్ పనులు చేపట్టాలని, త్కాలిక హోల్డింగ్ ఏరియా ఏర్పాట్ల పనులు చేపట్టడంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. జిల్లాలో చిత్తడి నేలల సరిహద్దులు, వాటి నోటిఫికేషన్‌పై సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ -
సెరీకల్చర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలి
పార్వతీపురంటౌన్: రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రతి ఏడాది ప్రాథమిక రంగాలు వృద్ధి సాధించాలని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సూచించారు. ఈ మేరకు మంగళవారం సంబంధిత శాఖాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సేంద్రియ వ్యవసాయం ఎక్కువగా జరుగుతుందని, సేంద్రియ పంటల రైతులను ప్రోత్సహించాలన్నారు. నిమ్మగడ్డికి మంచి గిరాకీ ఉందని, అందుకు తగిన ప్రణాళికలు రూపొందించి రైతులను ప్రొత్సహించాలని కోరారు. వ్యవసాయ పంటల్లో ఏటా 15 శాతానికి మించి వృద్ధి ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పట్టు, వశుసంవర్థక శాఖాధికారులు కె. రాబర్ట్‌పాల్, బి.శ్యామల, వి.తిరుపతయ్య, ఏవీ సాల్మన్ రాజు, డా.ఎస్ మన్మథరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
గ్లకోమా వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండాలి
విజయనగరం ఫోర్ట్: గ్లకోమా(నీటికాసులు) వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి సూచించారు. ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద జెండా ఊపి మంగళవారం ఆమె ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్లకోమా అనేది కళ్లకు సంబంధించిన వ్యాధి అని, కంటి డ్రైనేజీ నిర్మాణాలు సరిగా పనిచేయకపోవడం వల్ల కంటి లోపల పీడనం పెరిగి నరానికి హాని కలుగుతుందని తెలిపారు. గ్లకోమా ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చునన్నారు. క్రమంగా చూపు కోల్పోవచ్చునని హెచ్చరించారు. గ్లకోమా బారిన పడిన చాలామందికి తమకు వ్యాధి ఉందని తెలియదన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ కె.రాణి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి -
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
పార్వతీపురం రూరల్: మండలంలోని పలు పంచాయతీల్లో ఎన్ఆర్ఈజీస్ నిధుల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎంపీడీఓ జీవీ రమణ మూర్తి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మండలంలోని నర్సిపురం, పెదబొండపల్లి, ఎమ్మార్‌నగరం, తాళ్లబురిడి పంచాయతీలలో ప్రత్యేకాధికారి రమేష్ రామన్‌తో కలసి పర్యటించారు. అలాగే ఆయా పంచాయతీల్లో జరుగుతున్న పీ4 సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మౌలిక సదుపాయాల్లో భాగంగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించినట్లు చెప్పారు. పీ4 సర్వేను వేగవంతం చేయాలని సంబంధిత సచివాలయ సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. తాళ్లబురిడిలో ఇటీవల అంటువ్యాధులకు గ్రామస్తులు పలువురు గురికావడంతో గ్రామంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించి, పారిశుధ్య నిర్వహణ మెరుగుపరచాలని, తాగునీటి బోర్లు, రక్షిత పథకాల వద్ద క్లోరినేషన్ చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. -
జూడో రాష్ట్రస్థాయి పోటీలకు కేజీబీవీ విద్యార్థులు
నెల్లిమర్ల: పట్టణంలోని కేజీబీవీ విద్యార్థులు జూడో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ జూడో పోటీలకు జిల్లా నుంచి మహిళల విభాగంలో ఈ పాఠశాలకు చెందిన జె కావ్య, పి పావని, పి జ్యోత్స్న రాణి, ఎస్.ఢిల్లీశ్వరి, కె భార్గవి, బి.దీపిక, సత్య, అనూష, జయలక్ష్మి ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఉమ తెలిపారు. వారిని పీఈటీ రమణి, ఉపాధ్యాయినులు అభినందించారు.అంతర రాష్ట్ర ఫెన్సింగ్ క్రీడలకు విద్యార్థి ఎంపికవిజయనగరం అర్బన్: కేరళలో ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు జరిగే ఫెన్సింగ్ క్రీడలో అంతర్ రాష్ట్ర పోటీలకు పట్టణానికి చెందిన సత్య డిగ్రీ/ పీజీ కళాశాల విద్యార్థి కె.పవన్‌కుమార్ ఎంపికయ్యాడు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీసాయిదేవమణి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.ఎంపికై న విద్యార్థిని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, కళాశాల అధ్యాపకులు అభినందించారు.ఎకనామిక్స్–1 పరీక్షకు 580 మంది గైర్హాజరు పార్వతీపురంటౌన్: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఎకనామిక్స్ పరీక్షకు 580మంది గైర్హాజరైనట్లు డీవీఈఓ మంజుల వీణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో ఒకేషనల్ పేపర్3, ఎకానమిక్స్–1 పరీక్షకు 9540 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 8,960మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, మాస్‌కాపీయింగ్ జరగలేదని స్పష్టం చేశారు. 30 కేజీల గంజాయి పట్టివేత పాచిపెంట: మండలంలోని పి.కోనవలస చెక్‌పోస్టు దుర్గ గుడి వద్ద 30 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు ఎస్సై వెంకటసురేష్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ, సోమవారం పి.కోనవలస చెక్‌పోస్టు సమీపంలో దుర్గ గుడి వద్ద ముగ్గురు వ్యక్తులు గంజాయితో పట్టుబడ్డారన్నారు. పట్టుబడిన వారిలో కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మహమ్మద్ షఫీజ్, దివ్యాన్షు శుక్లా, ఓం శుక్లాల నుంచి 30 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు. జిల్లా ప్రయాణికుల లోగో ఆవిష్కరణపార్వతీపురంటౌన్: జిల్లా ప్రయాణికుల లోగోను కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ మంగళవారం ఆవిష్కరించారు. జిల్లా ప్రయాణికుల సంక్షేమసంఘం ఈ లోగోను రూపొందించింది. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బడే నాగభూషణరావు, తోటపల్లి ట్రస్ట్ ట్రెజరర్ జి.శ్రీరామచంద్రమూర్తి, డీఆర్‌యూసీసీ సభ్యులు శ్రీహరి, ఏఐ స్టాఫ్ బ్రాండ్ ప్రతినిధి భూషణ్ తదితరులు పాల్గొన్నారు. ముగ్గురి అరెస్టుసీతంపేట: గతంలో సారా విక్రయిస్తూ పరారైన ఇద్దరిని అరెస్టు చేసినట్టు ఎస్సై వై.అమ్మన్నాయుడు మంగళవారం తెలిపారు. మండలంలోని ఆనపకాయలగూడ గ్రామానికి చెందిన సిమ్మయ్య సారా విక్రయిస్తుండగా పరారయ్యాడని, ఇప్పుడు పట్టుకున్నామని తెలిపారు. అలాగే ఇటీవల నెల్లిగండి గ్రామానికి చెందిన కె.తేజేశ్వరరావు 30 లీటర్ల సారా విక్రయిస్తూ పరారవడంతో పట్టుకుని ఇద్దరినీ కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు. దోనుబాయి పోలీస్‌స్టేషన్ పరిధిలో.. దోనుబాయి పోలీస్ స్టేషన్ పరిధిలో కోసంగి గ్రామంలో 20 లీటర్ల సారా పట్టుకున్నట్టు ఎస్సై అహ్మద్ తెలిపారు. ఈ కేసులో గౌరునాయుడిని అరెస్టుచేశామని చెప్పారు. -
వన్‌ధన్ వికాస కేంద్రాలు వృద్ధి చెందాలి
పార్వతీపురం: ఐటీడీఏ పరిధిలోని వన్‌ధన్ వికాస కేంద్రాలు వృద్ధి చెందాలని ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన తన కార్యాలయంలో వీడీవీకేల నిర్వహణ, యంత్రాల కొనుగోలుపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీడీవీకేల ఉత్పత్తులు పెంచేందుకు అవసరమైన యంత్ర సామగ్రిని వారికి సమకూర్చి, వాటిపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి, ఉత్పత్తులకు ఆకర్షణీయమైన ప్యాకింగ్ ఏర్పాటు చేసి మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వెలుగు ఏపీడీ, వెలుగు 8మండలాల ఏపీఎంలు, హెడ్‌క్వార్టర్ ఏపీఎంలు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ -
ఎంత కష్టమొచ్చింది..!
తల్లీ.. నీకు కళింగ సైనీ (ఫైల్) ● మడ్డువలస కుడికాలువలో పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం ● ఏడేళ్ల కుమార్తె సైనీ గల్లంతు వంగర: ఓ వైపు మానసిక స్థితి సరిగాలేక దూరంగా ఉంటున్న భర్త.. మరోవైపు పెద్దవారవుతున్న పిల్లల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత.. అన్నింటికీ తల్లిదండ్రులపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు.. ఆ తల్లిని మనోవేదనకు గురిచేశాయి. ఆర్థికంగా, మానసికంగా కుంగదీశాయి. నవమసాలు మోసి కనీపెంచిన పిల్లలను బలవంతంగా లాక్కొచ్చి కాలువలో దూకి ప్రాణాలు తీసుకునేంత స్థాయికి దిగజార్చాయి. ఓ యువకుడి సాహసంతో ఈ ప్రమాదంలో తల్లీ, కుమారుడు ప్రాణాలతో బయటపడగా.. కుమార్తె గల్లంతైన విషాదకర ఘటన వంగర మండలం మడ్డువలస కాలువ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వంగర మండలంలోని కింజంగి గ్రామానికి చెందిన గుంట తవుడు, కళావతిల రెండో కుమార్తె శ్రావణికి పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం గంగాడ గ్రామానికి చెందిన కళింగ సుధాకర్‌తో 11 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి సిద్ధు, సైనీ(7)లు పుట్టిన తరువాత భర్త సుధాకర్ మానసిక స్థితి సరిగా లేకపోవడంతో శ్రావణి కింజంగిలోని తల్లిదండ్రుల చెంతకు చేరింది. ఐదేళ్లుగా తల్లిదండ్రుల వద్దనే ఉంటూ పొందూరులోని ఓ నర్సింగ్ కళాశాలలో ఎనస్తీషియాలో డిప్లమా చేస్తోంది. కుమారుడు సిద్ధు రేగిడి మండలం ఉంగరాడమెట్ట వద్ద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో ఐదో తరగతి, కుమార్తె సైనీ కింజంగి ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. మూడు రోజుల కిందట గరుగుబిల్లి మండలం బురదవెంకటాపురంలోని అక్క సంధ్య ఇంటికి పిల్లలతో కలిసి వెళ్లింది. కుమారుడుని ఉంగరాడమెట్ట వద్ద గురుకులానికి తీసుకెళ్తానని చెప్పి మంగళవారం తిరుగుప్రయాణమైంది. మార్గం మధ్యలో వంగర మండలంలోని మడ్డువలస కుడి ప్రధాన కాలువ వద్దకు మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో చేరుకుని పిల్లలతో కలిసి దూకేసింది. చేపల వేటకు అటువైపుగా వెళ్తున్న సంగాం గ్రామానికి చెందిన యువకుడు జన్ని జగన్మోహన్(చిన్ని) వారిని గమనించి హుటాహుటిన కాలువలోకి దూకి శ్రావణి, సిద్ధులను కాపాడి ఒడ్డుకు చేర్చాడు. బాలికను కాపాడే ప్రయత్నంలో మరోసారి శ్రావణి తన కుమారుడితో కలిసి దూకేయడంతో మళ్లీ ఒడ్డుకు చేర్చాడు. ఇంతలో బాలిక సైనీ నీటిలో కొట్టుకు పోయింది. స్థానికుల సమాచారంతో ఎస్ఐ షేక్‌శంకర్, వంగర తహసీల్దార్ దిరిశాల ధర్మరాజు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మడ్డువలస ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఇచ్చి కాలువ హెడ్‌స్లూయీస్ వద్ద గేట్లు మూసివేయించారు. గజఈతగాళ్లు, మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి సమయం కావడంతో బాలిక ఆచూకీ లభించలేదు. బాలిక గల్లంతైనట్టు కేసు నమోదు చేశారు. భర్తకు దూరంగా ఉండడం, మానసిక, ఆర్థిక సమస్యలతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు ప్రాథమికంగా నిర్ధారించినట్టు ఎస్ఐ తెలిపారు. సైనీ గల్లంతుతో తాత, అమ్మమ్మలు బోరున విలపించారు. -
ధారపర్తిని దగా చేసిందెవరు..?
శృంగవరపుకోట: అభంశుభం తెలియని గిరిజన తల్లుల గర్భశోకం..ఎవరి పాపం. తీవ్రమైన జ్వరాలు, వంటిపై దద్దుర్లుతో ఆస్పత్రి పాలైన చిన్నారుల తల్లుల శోకానికి, పాపానికి కారణం ఎవరన్న విషయమై వైద్యాధికారులు ఇంతవరకూ చెప్పలేదు. ఎస్.కోట మండలంలోని ధారపర్తి పంచాయతీ గిరిశిఖర గ్రామాల్లోని చిన్నారులు ఇటీవల తీవ్రజ్వరం, దద్దుర్లుతో ప్రాణాపాయ స్థితిలో స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేరారు. ఏరియా ఆస్పత్రి వైద్యులు పరిస్థితిని చక్కదిద్దినా, డబ్ల్యూహెచ్ఓ సపోర్టింగ్ టీమ్ సభ్యుడు చెనగపాడు గ్రామంలో పర్యటించి ఇచ్చిన రిపోర్టుతో తీగలాగితే డొంక కదిలినట్లు, వైద్యసిబ్బంది కట్టు కథ బయటికొచ్చింది. పిల్లల్లో తట్టు, పొంగు వ్యాధుల నివారణకు ఇచ్చే ఎంఆర్ వ్యాక్సిన్ సకాలంలో ఇవ్వక పోవడం వల్లనే జ్వరాలు, దద్దుర్లు వచ్చాయని, ఇవి తట్టు లక్షణాలేనన్న నిజం బయటకు వచ్చింది. దీంతో గత వారం రోజులుగా వైద్యారోగ్యశాఖ అధికారులు, క్షేత్రసిబ్బంది కొండపైకి పరుగులు తీస్తూ, ఈ వ్యవహారం నుంచి బయట పడేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎంసీపీ కార్డులు మాయం చేసి, ఎంఆర్ వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా కనిపించిన వారందరికీ వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఇంతవరకూ వైరాలజీ ల్యాబ్ రిపోర్టులు ఏం చెప్పాయో తేల్చలేదు. దారపర్తి ఘటనపై విచారణకు ఆదేశించలేదు. దారపర్తిలో జ్వరాలకు కారకులైన క్షేత్రస్థాయి సిబ్బందిపై ఇంతవరకూ చర్యలు తీసుకోలేదు. ఇంతవరకూ 18మంది చిన్నారులు జ్వరం, దద్దుర్లతో ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందారు. మరో 14మంది చిన్నారుల శాంపిల్స్ వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. కాగా శాంపిల్ రిపోర్టులు బయట పెట్టలేదు. మరో 12మంది చిన్నారులు జ్వరాలు తదితర సమస్యలతో చికిత్స తీసుకున్నారు. చర్యల కోసం డిమాండ్ పిల్లలకు వ్యాక్సిన్ వేయకుండా వారి ప్రాణాలతో చెలగాటం అడుతున్న క్షేత్రస్థాయి వైద్యసిబ్బందిపై కలెక్టర్ తక్షణం చర్యలు తీసుకోవాలని ఏపీ గిరిజన సంఘ నేతలు డిమాండ్ చేశారు. అంతరించిందనుకున్న తట్టు వ్యాధి వైద్యసిబ్బంది నిర్లక్ష్యంతో తిరిగి పురుడు పోసుకోవడం ప్రభుత్వానికే సిగ్గు చేటని మండిపడ్డారు. గతంలో చిన్నారులు చనిపోతే కనీస విచారణ లేకుండా జిల్లా అధికారులు చేతులు తుడిచేసుకున్నారని ధ్వజమెత్తారు. వైద్యాధికారులు వదిలేసినా, తాము ఈ విషయాన్ని వదిలిపెట్టబోమన్నారు. ఈ వ్యవహారంలో జిల్లా అధికారుల నుంచి ఫీల్డ్‌స్టాఫ్ వరకూ అందరూ భాగస్వాములేనని మండిపడ్డారు. -
సాలూరులో కూటమికి షాక్
సాలూరు: అధికార కూటమి టీడీపీ, జనసేన పార్టీలకు సాలూరు పట్టణంలో షాక్ తగిలింది. పట్టణంలో 13, 17, 18 వార్డుల నుంచి పెద్ద సంఖ్యలో యువత ఆ పార్టీలను వీడి వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి సాలూరులోని తన ఇంటివద్ద మాజీ డిప్యూటీ సీఎం, మాజీ గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర పార్టీ కండువాలు వేసి సోమవారం సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కిలపర్తి ఓంకేష్, వేలంగి ఫ్రేమ్, పూసర్ల దిలీప్, సంకుర్తి వెంకటేష్, బోను మనోజ్, దుర్గాసి బాలాజీ, పేకేటి తరుణ్, పి.సతీష్, ఎస్.గణేష్, జి.నవీన్, ఎల్.శ్రీను, కె.సతీష్, ఎస్.ప్రసాద్, ఎస్.కిరణ్, టి.యశ్వంత్, కె.లీలాప్రసాద్, జి.ధర్మరాజు, కె.వంశీ, సీహెచ్ తిరుపతి తదితరులు ఉన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 12న జిల్లా కేంద్రంలో జరబోయే యువత పోరుకు తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రజలను మోసంచేస్తోందన్నారు. అందుకే.. అనతికాలంలోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని, ప్రజలు, యువత వాస్తవాలను గ్రహించి వైఎస్సార్సీపీలో చేరడం శుభపరిణామమని తెలిపారు. యువత పోరు.. వైఎస్సార్సీపీ జోరుతో కూటమికి భవిష్యత్తులో బేజారు తప్పదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ, వైస్‌చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, ప్రజాప్రతినిధులు, నాయకులు దాసరి మనోజ్, కొల్లి వెంకటరమణ, హరిబాలాజీ, గులిపల్లి నాగేశ్వరరావు, గిరిరఘు, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తలు -
నేడు కన్వర్జెన్స్ సమావేశం
పార్వతీపురం: కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం కన్వర్జెన్స్ సమావేశం నిర్వహిస్తామని జిల్లా మత్య్సశాఖ అధికారి వేముల తిరుపతయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్యాప్టివ్ సీడ్ నర్సరీస్ ఏర్పాటుపై సమావేశంలో చర్చిస్తామన్నారు. ఇంజినీరింగ్, డ్వామా, ఇరిగేషన్, పంచాయతీ, డీఆర్డీఏ, మత్స్యశాఖ అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. అదుపులో డయేరియా పార్వతీపురం రూరల్: పార్వతీపురం మండలం తాళ్లబురిడి గ్రామంలో డయేరియా అదుపులో ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు పేర్కొన్నారు. గ్రా మాన్ని సోమవారం సందర్శించారు. విరేచనాలు, వాంతులతో బాధపడుతున్న 19 మందికి వైద్యసేవలందించడంతో కోలుకున్నట్టు తెలిపారు. గ్రామస్తులందరూ కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వ్యక్తిగత, పరిసరాల పరిశు భ్రత పాటించాలని కోరారు. ఆయన వెంట ప్రొగ్రాం అధికారి డాక్టర్ విజయమోహన్, వైద్యాధికారులు ఐశ్వర్య, కౌశిక్, సిబ్బంది సత్తిబాబు, శంకర్, శ్రీనివాసరావు ఉన్నారు. ఆపరేటర్ ఖాతాలోకి ఆర్థిక సంఘం నిధులు కొమరాడ: స్థానిక మండల పరిషత్ కార్యలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి ఖాతాలోకి 15 ఆర్థిక సంఘం నిధులు జమకావడం చర్చనీయాంశంగా మారింది. 31 పంచాయతీల్లో 15వ ఆర్థిక సంఘం నిధులతో వివిధ రకాల పనులు చేపట్టారు. వీటిలో అధిక పంచాయతీల్లో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లుల డబ్బులు సుమారు రూ.15లక్షల నిధులు ఆయన ఖాతాలోకి మళ్లడం అనుమానాలకు తావిస్తోంది. సంబంధిత ఆపరేటర్ డిజిటల్ సంతకాలను (డీఎస్కే) తన వద్ద ఉంచుకుని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఎంపీడీఓ మల్లికార్జునరావు వద్ద ప్రస్తావించగా.. పంచాయతీల్లో జరిగే పనులతో తనకు సంబంధం లేదని, పంచాయతీ విస్తరణ అధికారి, పంచాయతీ కార్యదర్శులే చూసుకుంటారని సెలవిచ్చారు. రాజకీయ కక్ష సాధింపులు ఆపాలిపార్వతీపురంటౌన్: మధ్యాహ్న భోజన పథక కార్మికులపై కక్షసాధింపులు, వేధింపులు ఆపాలని సీఐటీయూ నాయకుడు ఎం.మన్మథరావు డిమాండ్ చేశారు. పార్వతీపురం కలెక్టరేట్ ఆవరణలో మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి సోమవారం నిరసన తెలియజేశారు. అనంతరం కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గత 22 సంవత్సరాలకు పైగా పాఠశాలల్లో చాలీచాలని జీతంతో, ప్రతినెల బిల్లులు రాకపోయినా అప్పుచేసి పిల్లలకు భోజనం పెడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలోని పలు పాఠశాలల్లో ఎలిమెంటరీ స్కూలు, మధ్యాహ్న భోజన పథక కార్మికులను తొలగించారన్నారు. వారిని కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా కొత్తవారిని నియమించారని మండిపడ్డారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు జి. వెంకటరమణ, బి.సూరిబాబు, వి.ఇందిర, శాంతి, తులసి, లక్ష్మి, చిలకమ్మ, పూర్ణిమ పాల్గొన్నారు. ప్లాస్టిక్ రహిత జిల్లాయే లక్ష్యం ● కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పార్వతీపురంటౌన్: ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్ వినియోగించబోమని జిల్లాలో ఉన్న అన్ని పురపాలక సంఘాలు, పంచాయతీలు తీర్మానం చేసి అమల్లోకి తేవాలన్నారు. భవిష్యత్‌లో పేపర్, క్లాత్ బ్యాగ్‌లను ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో 2.50 లక్షల గృహాలను ఈ నెల 15లోగా సందర్శించి పీ–4 సర్వే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణ, బాల్య వివాహాల నిర్మూలనకు గ్రామస్థాయిలో ఈగల్ క్లబ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, ఇన్చార్జి జేసీ హేమలత, ఎస్డీసీ పి.రామచంద్రారెడ్డి, వివిధ శాఖాధికారులు పాల్గొన్నారు. -
కూటమి మోసాలపై పోరుబాట
● ‘యువత పోరు’ పోస్టర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే కళావతి పాలకొండ: కూటమి ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హమీలపై పోరుకు సిద్ధం కావాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఈ నెల 12న చేపడుతున్న యువత పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను పాలకొండలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, లేదంటే రూ.3వేలు నిరుద్యోగభృతి చెల్లిస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు నిలువునా ముంచేశారన్నారు. తల్లికి వందనం కింద ప్రతివిద్యార్థికి రూ.15వేలు అందిస్తామని చెప్పి ఒక్కపైసా ఇవ్వకపోవడంతో విద్యార్థుల పరిస్థితి దీనంగా మారిందని వాపోయారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను కలిసికట్టుగా అడ్డుకుందామని పిలుపునిచ్చారు. యువపోరును విజయవంతం చేయాలని యువత, విద్యార్థుల తల్లితండ్రులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్ చైర్మన్ రౌతు హనుమంతురావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు వెలమల మన్మథరావు, పాలవలస దవళేశ్వరరావు, నీలాపు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ కార్మికుల మెరుపు సమ్మె
సాలూరు: జీతాల చెల్లింపు తదితర తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ పెద్దలు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ మున్సిపల్ కార్మికులు మెరుపు సమ్మె చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సి పల్ వర్కర్స్‌అండ్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. ప్రతి నెలా 1 నుంచి 5వ తేదీలోగా జీతాలు చెల్లించాలని, బకాయి ఉన్న ఫిబ్రవరి జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన కుటుంబాలకు బెని ఫిట్స్, ఉద్యోగాలు నేటికీ లేవన్నారు. మంత్రి సంధ్యారా ణి హామీ ప్రకారం సొంత నిధులతో ఇస్తామన్న సబ్బులు, నూనెలు, చెప్పులు, నేటికి ఇవ్వలేదని వాపోయారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా సమ్మె విరమించాలని, జీతాలు చెల్లింపు చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ, కమిషనర్ సత్యనారాయణలు కార్మికులకు సూచించగా తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎన్వైనాయుడు, రాముడు, శంకర్, రవి, కార్మికులు పాల్గొన్నారు. -
మోసం చేయడం చంద్రబాబుకు అలవాటే
ఎన్నికల ముందు హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా మోసం చేయడం చంద్రబాబుకు అలవాటే. 2014 సంవత్సరంలో ఎన్నికముందు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి నాడు మోసం చేశారు. నేడు ప్రతీ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని, ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతిని ఇస్తానని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన పదినెలలు గడుస్తున్నా ఈ అంశంపై ఎటువంటి ప్రస్తావన లేదు. చంద్రబాబుకు నిరుద్యోగులను మోసం చేయడం అలవాటే. – బి. ప్రవీణ్, నిరుద్యోగి, పార్వతీపురం అర్బన్ ఇదెక్కడి అన్యాయం విద్యాదీవెన పథకం నిధులు విడుదల చేయాలని పలు మార్లు విన్నవిస్తున్నా ఫలితం లేకపోతోంది. ఇదెక్కడి అన్యాయం. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఈ పథకంపై ఎటువంటి హామీ ఇవ్వకపోవడం బాధాకరం. అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలి – పి.నవీణ్, విద్యార్థి ఉద్యోగం రాక.. నేను డిగ్రీ పూర్తి చేశాను. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాకపోవడంతో కుటుంబ పోషణ కోసం విశాఖపట్నంలోని ఓ కంపెనీలో చేరాను. ఉద్యోగం వచ్చేవరకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇస్తే చదువుకునేందుకు కాస్త ఆర్థిక ఆసరా దొరికేది. – ఎన్.మురళి, నిరుద్యోగి, తాడికొండ, గుమ్మలక్ష్మీపురం మండలం ● -
ముందుచూపు తప్పనిసరి
● గ్లకోమాపై నిర్లక్ష్యం.. కంటి చూపుపై ప్రభావం ● వ్యాధి బారినపడకుండా జాగ్రత్తలు అవసరం ● వైద్యుల సూచనలు తప్పనిసరి. ● 40 ఏళ్లు దాటితే రెండేళ్ల కోసారి నేత్ర పరీక్షలు చేయించుకోవాలి. ● ఈ నెల 15వరకు గ్లకోమా వారోత్సవాలుగ్లకోమా నివారణకు చర్యలు.. ● గ్లకోమా వ్యాధి కుటుంబ చరిత్ర కలవారు ముప్పై సంవత్సరాల వయసు నుంచే సమగ్ర నేత్ర పరీక్షలు(దృష్టి పరీక్ష, కంటిలో ఒత్తిడి, ఫంగస్ ద్వారా రెటీనా పరీక్షలు, క్షేత్ర దృష్టి పరీక్షలు) చేయించుకోవాలి. ● 40 సంవత్సరాలు వయసు దాటిన తరువాత క్రమం తప్పకుండా రెండేళ్లకు ఒకసారి సమగ్రంగా నేత్ర పరీక్షలు చేయించుకోవాలి. ● వైద్యుల సలహా మేరకు మాత్రమే స్టెరాయిడ్ మందులు లేదా కంటి చుక్కల మందు వాడాలి. ● కంటి గాయాలను నిర్లక్ష్యం చేయకుండా నేత్ర నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందాలి. ● గ్లకోమా వ్యాధి నిర్ధారణ జరిగినప్పుడు నేత్ర నిపుణుల సలహా, సూచనల ప్రకారం నేత్ర పరీక్షలు చేసుకోవడం, మందులు వాడడం చేయాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా శాశ్వత అంధత్వం వస్తుంది.రాజాం సిటీ/పార్వతీపురంటౌన్: సృష్టిలో ప్రకృతి అందాలను వీక్షించాలంటే కంటి చూపు తప్పనిసరి. జ్ఞానేంద్రియాలన్నింటిలోను కంటి చూపు చాలా ప్రాధాన్యం కలిగి ఉంటుంది. మనిషి పుట్టిన నాటి నుంచి మరణించేవరకు మంచి దృష్టితో జీవించాలని కోరుకుంటాడు. అయితే కంటి ఆరోగ్యం, కంటి దృష్టిపై అవగాహనలేక చాలా మంది అంధత్వం బారిన పడుతున్నారు. కంటి శుక్లాలు, కంటి వక్రీభవన దృష్టి లోపాలు, గ్లకోమా వంటివి అంధత్వానికి ప్రధాన కారణం. గ్లకోమాను నీటి కాసులుగా కూడా పిలుస్తారు. గ్లకోమా వ్యాధితో ఒక్కసారి దృష్టిని కోల్పోతే తిరిగి పొందలేము. 40 ఏళ్లు పైబడిన వారిలో 1.12 శాతం గ్లకోమా వ్యాధితో బాదపడుతున్నవారే అధికం. ఈ వ్యాధి మనకంటిలోని ఆప్టిక్ నాడికి నష్టం కలిగించడం ద్వారా దృష్టిని క్రమక్రమంగా క్షీణించేలా చేస్తుంది. గ్లకోమాలో సాధారణంగా ప్రారంభదశలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా చాపకింద నీరులా ఈ వ్యాధి వ్యాప్తి చెంది శాశ్వత అంధత్వానికి దారితీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా మార్చి 9 నుంచి 15 వరకు ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు జిల్లా అంధత్వ నివారణ సంస్థ నిర్వహిస్తుంటుంది. ఈ ఏడాది ‘గ్లకోమా రహిత ప్రపంచం కోసం ఐక్యమవుదాం’ అనే నినాదంతో కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తద్వారా ఈ వ్యాధి వల్ల సంక్రమించే అంధత్వాన్ని నివారించవచ్చు.● -
సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు
● పీజీఆర్ఎస్కు 136 వినతులుపార్వతీపురంటౌన్: పీజీఆర్ఎస్ ద్వారా అందిన వినతులపై అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 136 మంది అర్జీదారుల నుంచి వినతులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలు త్వరితగతిన పరిష్కారం కావాలని కోరారు. అర్జీదారుల విజ్ఞప్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పారదర్శకంగా విచారణ చేపట్టి అర్జీదారులను న్యాయం చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. దిగువస్థాయి అధికారులను పంపి మొక్కుబడిగా పరిష్కారం చేస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. పీజీఆర్ఎస్లో అందిన వినతుల్లో కొన్ని.. ● పాచిపెంట మండలం కీరంగి నుంచి గ్రామ సర్పంచ్ లచ్చయ్య అర్జీని అందిస్తూ తమ మండల పరిధిలో చెక్‌డ్యామ్‌లు పాడైనందున వ్యవసాయానికి సాగునీరు అందడం లేదని చెక్‌డ్యాంలు మరమ్మతులు చేపట్టాలని కోరారు. ● పాలకొండ మండలం వాటపాగు నుంచి ఆర్.దుర్గాప్రసాదరావు దరఖాస్తులు అందిస్తూ తమ గ్రామంలో సర్వే నంబర్ 42–37లో తన వాటాగా సంక్రమించిన భూమిలోని ఐదు సెంట్లు జి. గౌరునాయుడు కబ్జా చేశారని తనకు న్యాయం చేయాలని కోరాడు. ● సాలూరు మండలం పెద్దవలస గ్రామానికి చెందిన కె.బంగార్రాజు తమ గ్రామంలో తన భూమి అన్యాక్రాంతమైందని, న్యాయం చేయాలని కోరాడు. ● జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామానికి చెందిన సాయిగీత వ్యవసాయ డిప్లమో చేసి ఖాళీగా ఉన్నానని తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరింది. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, ఇన్చార్జ్ జేసీ హేమలత, ఎస్డీసీ పి. ధర్మచంద్రారెడ్డి, జిల్లా వ్యవసాయశాఖాధికారి రాబర్ట్‌పాల్, పశుసంవర్ధకశాఖాధికారి మన్మథరావు, డ్వామాపీడీ కె.రామచంద్రరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సకాలంలో సమస్యల పరిష్కారానికి చర్యలు పార్వతీపురం రూరల్: సకాలంలో ఫిర్యాదు దారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుని ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించాలని పోలీస్ అధికారులను ఎస్పీ మాధవ్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి నిర్వహించారు. ఈ పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి అర్జీలను స్వీకరించి నేరుగా ఎస్పీ వారితో మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రుల వేదింపులు, భర్త/అత్తారింటి వేదింపులు, భూ–ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్లైన్ మోసాలు, ప్రేమపేరుతో వంచన వంటి పలు సమస్యలపై ఫిర్యాదు దారులు ఎస్పీకి విన్నవించారు. వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో ఎస్పీ స్వయంగా ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు అంశాలను పరిశీలించి వాటి పూర్వాపరాలపై విచారణ చేసి ఫిర్యాదులు వాస్తవాలు అయినట్లైతే చట్టపరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. ఐటీడీఏ గ్రీవెన్స్ సెల్‌కు 61 వినతులు సీతంపేట: ఐటీడీఏ కార్యాలయంలో పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 61 వినతులు వచ్చాయి. ఈతమానుగూడ గ్రామానికి చెందిన ఎస్.సింహాచలం వైద్యశాఖలో ఉద్యోగం ఇప్పించాలని కోరారు. ఎర్రకువ్వారి గ్రామానికి చెందిన త్రినాథ్ అడ్వెంచర్ పార్కులో షాపుపెట్టుకోవడానికి అనుమతి ఇప్పించాలని విన్నవించాడు. కుశిమి గ్రామస్తుడు నిమ్మక వరహాలు గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ గ్రామంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాడు. డెప్పిగూడ గ్రామస్తురాలు నిమ్మక కల్యాణి కమ్యూనిటీ హెల్త్ వర్కర్ జాబ్ ఇప్పించాలని వినతిపత్రం అందజేసింది. కార్యక్రమంలో ఈఈ రమాదేవి, పీహెచ్‌వో ఎస్వీ గణేష్, డిప్యూటీ ఈవో ప్రసన్నకుమార్, పశుసంవర్థకశాఖ ఎ.డి శ్రీనివాసరావు, సీడీపీఓ రంగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ముందుచూపు తప్పనిసరి
● గ్లకోమాపై నిర్లక్ష్యం.. కంటి చూపుపై ప్రభావం ● వ్యాధి బారినపడకుండా జాగ్రత్తలు అవసరం ● వైద్యుల సూచనలు తప్పనిసరి. ● 40 ఏళ్లు దాటితే రెండేళ్ల కోసారి నేత్ర పరీక్షలు చేయించుకోవాలి. ● ఈ నెల 15వరకు గ్లకోమా వారోత్సవాలుగ్లకోమా నివారణకు చర్యలు.. ● గ్లకోమా వ్యాధి కుటుంబ చరిత్ర కలవారు ముప్పై సంవత్సరాల వయసు నుంచే సమగ్ర నేత్ర పరీక్షలు(దృష్టి పరీక్ష, కంటిలో ఒత్తిడి, ఫంగస్ ద్వారా రెటీనా పరీక్షలు, క్షేత్ర దృష్టి పరీక్షలు) చేయించుకోవాలి. ● 40 సంవత్సరాలు వయసు దాటిన తరువాత క్రమం తప్పకుండా రెండేళ్లకు ఒకసారి సమగ్రంగా నేత్ర పరీక్షలు చేయించుకోవాలి. ● వైద్యుల సలహా మేరకు మాత్రమే స్టెరాయిడ్ మందులు లేదా కంటి చుక్కల మందు వాడాలి. ● కంటి గాయాలను నిర్లక్ష్యం చేయకుండా నేత్ర నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందాలి. ● గ్లకోమా వ్యాధి నిర్ధారణ జరిగినప్పుడు నేత్ర నిపుణుల సలహా, సూచనల ప్రకారం నేత్ర పరీక్షలు చేసుకోవడం, మందులు వాడడం చేయాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా శాశ్వత అంధత్వం వస్తుంది.రాజాం సిటీ/పార్వతీపురంటౌన్: సృష్టిలో ప్రకృతి అందాలను వీక్షించాలంటే కంటి చూపు తప్పనిసరి. జ్ఞానేంద్రియాలన్నింటిలోను కంటి చూపు చాలా ప్రాధాన్యం కలిగి ఉంటుంది. మనిషి పుట్టిన నాటి నుంచి మరణించేవరకు మంచి దృష్టితో జీవించాలని కోరుకుంటాడు. అయితే కంటి ఆరోగ్యం, కంటి దృష్టిపై అవగాహనలేక చాలా మంది అంధత్వం బారిన పడుతున్నారు. కంటి శుక్లాలు, కంటి వక్రీభవన దృష్టి లోపాలు, గ్లకోమా వంటివి అంధత్వానికి ప్రధాన కారణం. గ్లకోమాను నీటి కాసులుగా కూడా పిలుస్తారు. గ్లకోమా వ్యాధితో ఒక్కసారి దృష్టిని కోల్పోతే తిరిగి పొందలేము. 40 ఏళ్లు పైబడిన వారిలో 1.12 శాతం గ్లకోమా వ్యాధితో బాదపడుతున్నవారే అధికం. ఈ వ్యాధి మనకంటిలోని ఆప్టిక్ నాడికి నష్టం కలిగించడం ద్వారా దృష్టిని క్రమక్రమంగా క్షీణించేలా చేస్తుంది. గ్లకోమాలో సాధారణంగా ప్రారంభదశలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా చాపకింద నీరులా ఈ వ్యాధి వ్యాప్తి చెంది శాశ్వత అంధత్వానికి దారితీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా మార్చి 9 నుంచి 15 వరకు ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు జిల్లా అంధత్వ నివారణ సంస్థ నిర్వహిస్తుంటుంది. ఈ ఏడాది ‘గ్లకోమా రహిత ప్రపంచం కోసం ఐక్యమవుదాం’ అనే నినాదంతో కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తద్వారా ఈ వ్యాధి వల్ల సంక్రమించే అంధత్వాన్ని నివారించవచ్చు.● -
పార్వతీపుం మన్యం జిల్లా అంతటా గ్లకోమా సదస్సులు
ఈ వ్యాధి వచ్చినట్లు గుర్తించిన వెంటనే కంటి ఒత్తిడిని తగ్గించడమే దీనికి ప్రధాన చికిత్స. దీర్ఘకాలిక నియంత్రణ ఇచ్చే కంటి చుక్కల మందు, మాత్రల వాడకం చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో శస్త్ర చికిత్స కూడా చేయవలసి వస్తుంది. క్రమం తప్పకుండా నేత్ర పరీక్షలు చేయించుకోవాలి. గ్లకోమాను ముందుగా గుర్తిస్తే వైద్యం ద్వారా కళ్లను కాపాడుకోవచ్చు. జిల్లా అంతటా ప్రత్యేక గ్లకోమా అవగాహన సదస్సులు, ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తాం. – నగేష్ రెడ్డి, కంటి వెలుగు నేత్ర వైద్యాధికారి, పార్వతీపురం ● -
ఇంటర్మీడియట్ ‘ద్వితీయ’ పరీక్షకు 372మంది గైర్హాజరు
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షకు 372మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీవీఈఓ మంజులవీణా తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించామని 7,880 మందికి గాను 7508 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. అందులో జనరల్ సబ్జెక్టు జువాలజీ–2 పరీక్షకు 4954 మంది హాజరు కావాల్సి ఉండగా 4812 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. ఒకేషనల్–2 పరీక్షకు 2926మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 2696 మంది హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘనలు కాని, మాస్కాపీయింగ్గాని జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. ఫ్లయింగ్, సిటింగ్ స్క్వాడ్లు, బల్క్ మెంబర్లు పరీక్షలను పర్యవేక్షించారని, పరీక్షలు సీసీ కెమెరా లైవ్ స్ట్రీమింగ్ ప్రత్యేక పర్యవేక్షణలో నిర్వహించినట్లు వివరించారు. కరాటేలో రెండు గోల్డ్ మెడల్స్సీతంపేట: ఈనెల 9న విజయనగరంలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన అంతర్ జిల్లా స్థాయి కరాటే పోటీల్లో సీతంపేట మండలంలోని అచ్చిబ గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు గోల్డ్‌మెడల్స్ సాధించారు. గ్రామానికి చెందిన కె.దీపక్, ఎన్.హర్షలు బంగారు పతకాలు సాధించడంతో గ్రామస్తులు వారిని సోమవారం అభినందించారు. కారును ఢీ కొన్న లారీ●● కారు డ్రైవర్ మృతి ● మరో ఇద్దరికి గాయాలు గరుగుబిల్లి: పార్వతీపురం–పాలకొండ ప్రధాన రహదారిలో సుంకి జంక్షన్ వద్ద పార్వతీపురం నుంచి గుమ్మలక్ష్మీపురం వెళ్తున్న కారును ఖడ్గవలస నుంచి పార్వతీపురం వెళ్తున్న కర్రలలోడ్తో ఉన్న లారీ బలంగా ఢీ కొట్టడంతో జరిగిన ప్రమాదంలో కారు ముందుబాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ కుండింగి హరి ప్రసాద్ (29) కారులో తన సీటు, స్టీరింగ్ మధ్య ఇరుక్కోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే కారులో ఉన్న లవాల గౌరీశంకర్, బిడ్డిక శ్రీనులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ మేరకు 108కు సమాచారం అందించగా ఘటనా స్థలానికి హుటాహుటిన వచ్చి క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి చికిత్సకోసం తరలించింది. సమాచారం మేరకు ఎస్సై పి.రమేష్‌నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
పరారీలో ఉన్న నిందితుడి అరెస్టు
శృంగవరపుకోట: గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడిగా ఉండి పోలీసులు కళ్లు గప్పి తిరుగుతున్న గంజాయి స్మగ్లర్‌ను సోమవారం ఉదయం అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్.కోట సీఐ వి.నారాయణమూర్తి చెప్పారు. 2023లో హోండాసిటీ కారులో 60కిలోల గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన కేసులో అనంతగిరి మండలం, డుంబ్రి గూడ గ్రామానికి చెందిన కె.శ్యామ్ ప్రధాన నిందితుడన్నారు. గతంలో చాకచక్యంగా తప్పించుకుని పరా రై తిరుగుతున్న శ్యామ్‌ను సోమవారం తమకు అందిన సమాచారంతో నిఘా వేసి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు సీఐ చెప్పారు. -
ధారపర్తిని దగా చేసిందెవరు..?
శృంగవరపుకోట: అభంశుభం తెలియని గిరిజన తల్లుల గర్భశోకం..ఎవరి పాపం. తీవ్రమైన జ్వరాలు, వంటిపై దద్దుర్లుతో ఆస్పత్రి పాలైన చిన్నారుల తల్లుల శోకానికి, పాపానికి కారణం ఎవరన్న విషయమై వైద్యాధికారులు ఇంతవరకూ చెప్పలేదు. ఎస్.కోట మండలంలోని ధారపర్తి పంచాయతీ గిరిశిఖర గ్రామాల్లోని చిన్నారులు ఇటీవల తీవ్రజ్వరం, దద్దుర్లుతో ప్రాణాపాయ స్థితిలో స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేరారు. ఏరియా ఆస్పత్రి వైద్యులు పరిస్థితిని చక్కదిద్దినా, డబ్ల్యూహెచ్ఓ సపోర్టింగ్ టీమ్ సభ్యుడు చెనగపాడు గ్రామంలో పర్యటించి ఇచ్చిన రిపోర్టుతో తీగలాగితే డొంక కదిలినట్లు, వైద్యసిబ్బంది కట్టు కథ బయటికొచ్చింది. పిల్లల్లో తట్టు, పొంగు వ్యాధుల నివారణకు ఇచ్చే ఎంఆర్ వ్యాక్సిన్ సకాలంలో ఇవ్వక పోవడం వల్లనే జ్వరాలు, దద్దుర్లు వచ్చాయని, ఇవి తట్టు లక్షణాలేనన్న నిజం బయటకు వచ్చింది. దీంతో గత వారం రోజులుగా వైద్యారోగ్యశాఖ అధికారులు, క్షేత్రసిబ్బంది కొండపైకి పరుగులు తీస్తూ, ఈ వ్యవహారం నుంచి బయట పడేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎంసీపీ కార్డులు మాయం చేసి, ఎంఆర్ వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా కనిపించిన వారందరికీ వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఇంతవరకూ వైరాలజీ ల్యాబ్ రిపోర్టులు ఏం చెప్పాయో తేల్చలేదు. దారపర్తి ఘటనపై విచారణకు ఆదేశించలేదు. దారపర్తిలో జ్వరాలకు కారకులైన క్షేత్రస్థాయి సిబ్బందిపై ఇంతవరకూ చర్యలు తీసుకోలేదు. ఇంతవరకూ 18మంది చిన్నారులు జ్వరం, దద్దుర్లతో ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందారు. మరో 14మంది చిన్నారుల శాంపిల్స్ వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. కాగా శాంపిల్ రిపోర్టులు బయట పెట్టలేదు. మరో 12మంది చిన్నారులు జ్వరాలు తదితర సమస్యలతో చికిత్స తీసుకున్నారు. చర్యల కోసం డిమాండ్ పిల్లలకు వ్యాక్సిన్ వేయకుండా వారి ప్రాణాలతో చెలగాటం అడుతున్న క్షేత్రస్థాయి వైద్యసిబ్బందిపై కలెక్టర్ తక్షణం చర్యలు తీసుకోవాలని ఏపీ గిరిజన సంఘ నేతలు డిమాండ్ చేశారు. అంతరించిందనుకున్న తట్టు వ్యాధి వైద్యసిబ్బంది నిర్లక్ష్యంతో తిరిగి పురుడు పోసుకోవడం ప్రభుత్వానికే సిగ్గు చేటని మండిపడ్డారు. గతంలో చిన్నారులు చనిపోతే కనీస విచారణ లేకుండా జిల్లా అధికారులు చేతులు తుడిచేసుకున్నారని ధ్వజమెత్తారు. వైద్యాధికారులు వదిలేసినా, తాము ఈ విషయాన్ని వదిలిపెట్టబోమన్నారు. ఈ వ్యవహారంలో జిల్లా అధికారుల నుంచి ఫీల్డ్‌స్టాఫ్ వరకూ అందరూ భాగస్వాములేనని మండిపడ్డారు. ల్యాబ్ రిపోర్టులు ఎక్కడ..? బాధ్యులపై చర్యలకు గిరిజన సంఘం డిమాండ్ -
పీజీఆర్ఎస్కు పోటెత్తిన అర్జీదారులు
విజయనగరం అర్బన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు అర్జీదారులు పోటెత్తారు. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత పునఃప్రారంభించిన ఈ కార్యక్రమానికి అధికసంఖ్యలో వినతులు అందాయి. కలెక్టర్ డాక్టర బీఆర్అంబేడ్కర్, ఇన్చార్జ్ జేసీ ఎస్.శ్రీనివాసమూర్తి, కేఆర్ఆర్సీ ఎస్డీసీ మురళి వినతులను స్వీకరించగా ఈ వారం మొత్తం 231 అర్జీలు వచ్చాయి. తప్పుగా ఎండార్స్మెంట్ ఇస్తే క్రమశిక్షణ చర్యలు పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి అందిన వినతులకు ఏ విధమైన పరిష్కారం చూపిస్తున్నదీ సంబంధిత అర్జీదారుకు ఆయా ప్రభుత్వ శాఖలు తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుందని కలెక్టర్ డాక్టర్ బీఆర్ డాక్టర్ అంబేడ్కర్ అధికారులకు స్పష్టం చేశారు. వినతుల పరిష్కారంలో తప్పుగా ఎండార్స్మెంట్ ఇచ్చి పరిష్కరించినట్లు పేర్కొంటే ఆయా అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ఇప్పటికే తప్పుగా ఎండార్స్మెంట్ ఇచ్చిన 33 మంది అధికారులకు మెమోలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌కు 37 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 37 ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు ఎస్పీ వకుల్ జిందల్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్వీకరించిన ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించి 11, కుటుంబ కలహాలకు సంబంధించి 3, మోసాలకు పాల్పడినట్లు 10, ఇతర అంశాలకు సంబంధించి 13 ఫిర్యాదులు ఉన్నాయి. సంబంధిత అధికారులు ఫిర్యాదు అంశాలను పరిశీలించి, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలు వాస్తవమైనట్లయితే చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, డీసీఆర్బీ ఎస్సై రాజేష్, సిబ్బంది కృష్ణ, షణ్ముఖ్ తదితరులు పాల్గొన్నారు. వినతులను స్వీకరించిన కలెక్టర్ అంబేద్కర్ -
పిల్లలు తల్లిదండ్రుల ప్రతిబింబాలు
విజయనగరం అర్బన్: విద్యార్థులు బాల్యంలో తమ తల్లిదండ్రులను అనుకరిస్తారని వారికి మంచి విద్య ద్వారానే వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి యూ.మాణిక్యం నాయుడు అన్నారు. ఈ మేరకు స్థానిక గురజాడ పాఠశాలలో ఆదివారం జరిగిన 27వ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విలువలతో కూడిన అత్యుత్తమ విద్యను అందించడానికి విద్యాసంస్థలు ఉత్తమ నిర్వహణతో పాటు విద్యార్థి వ్యక్తిత్వపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపడం అవసరమన్నారు. విద్యార్థి దశ నుంచి విద్యతోపాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కళాప్రదర్శన, చిన్నారుల ఆటపాటలు తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి. పాఠశాల కరెస్పాండెంట్ స్వరూప ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్సీ రఘువర్మ, రిటైర్డ్ డీఈఓ అరుణకుమారి, పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ఎంవీఆర్కృష్ణాజీ, ప్రధానోపాధ్యాయుడు పూడి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. డీఈఓ యూ.మాణిక్యం నాయుడు -
మూగజీవులు సజీవ దహనం
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని పరజపాడు గ్రామంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మూగజీవాలు ఉన్న పశువుల శాలకు నిప్పంటించారు. ఈ మేరకు జరిగిన ప్రమాదంలో రెండు గొర్రెలు, 20 కోళ్లు సజీవ దహనమైనట్లు గ్రామానికి చెందిన గుంట్రెడ్డి శివున్నాయుడు ఆదివారం చినమేరంగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పి.అనీష్ ఆదివారం తెలిపారు. 33 మద్యం సీసాలతో వ్యక్తి అరెస్ట్తెర్లాం: మండలంలోని డి.గదబవలస గ్రామంలో అక్రమంగా మద్యం సీసాలు తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఆదివారం తెర్లాం ఎస్సై సాగర్‌బాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. డి.గదబవలస గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 33 మద్యం సీసాలు తీసుకు వెళ్తున్నట్లు శనివారం రాత్రి సమాచారం రావడంతో దారికాచి ఆ వ్యక్తిని మద్యం సీసాలతో పట్టుకున్నామని తెలిపారు. ఆ వ్యక్తి గ్రామంలో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్నాడని చెప్పారు. ఎప్పటిలాగానే మద్యం సీసాలు విక్రయించేందుకు తీసుకు వెళ్తుండగా పట్టుకుని 33 మద్యం సీసాలను సీజ్ చేయడంతో పాటు అరెస్ట్ చేశామన్నారు. 1500 లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసంసీతంపేట: మండలంలోని నెల్లిగండి కొండల ప్రాంతంలో సారా వండడానికి నిల్వచేసిన 1500 లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం చేసినట్టు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. సారా వంటకాలు జరుగుతున్నాయనే సమాచారం రావడంతో తమ సిబ్బందితో దాడులు చేయగా 20 డ్రమ్ములతో నిండి ఉన్న బెల్లం ఊటలు లభించగా ధ్వంసం చేసినట్లు తెలిపారు. నేరాలను అదుపు చేసేందుకు సీరియల్ నంబర్లు● ఎస్పీ మాధవ్ రెడ్డి పార్వతీపురం రూరల్: నేరాలను అదుపుచేసేందుకు ఒకే పట్టణం, ఒకే ఆటో ఒకే సంఖ్య విధానాన్ని అమలు చేయనున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో ఆటో యూనియన్లు, ఎన్ని ఆటోలు ఉన్నాయి. యజమానులు, డ్రైవర్లు, ఆటోలకు సంబంధించిన రికార్డుల అన్ని వివరాలు ఆయా స్టేషన్లలో నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ వల్ల పక్క రాష్ట్రాల నుంచి, వేరే ప్రాంతాల నుంచి వచ్చే ఆటోల సమాచారం, అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలను నిరోధించేందుకు, కనుగొనేందుకు అవకాశం ఉంటుందన్నారు. అలాగే ప్రమాదాలు జరిగినప్పుడు తప్పించుకుని వెళ్లేందుకు ప్రయత్నించే ఆటోల వివరాల కూడా ఈ సంఖ్యల ద్వారా గుర్తించగలమని అభిప్రాయ పడ్డారు. ఈ నమోదు ప్రక్రియపై ఇటీవల జిల్లావ్యాప్తంగా ఆయా స్టేషన్ల సిబ్బందికి మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. సెల్ఫోన్లో టెన్త్ హాల్టికెట్పార్వతీపురం: వాట్సాప్ గవర్నెన్స్‌లో భాగంగా పదోతరగతి హాల్ టికెట్స్‌ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దీంతో పదోతరగ తి విద్యార్థులు ఎక్కడికీ వెళ్లకుండా తమ చేతి లో ఉన్న సెల్‌ఫోన్ ద్వారా హాల్‌టికెట్ తీసుకు నే వెసులుబాటు కల్పించింది. హాల్‌టికెట్ తీ సుకోవడానికి విద్యార్థులు ఫోన్ 9552300009 నంబర్‌కు వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ చేస్తే..ఏ సేవ కావాలో ఎంచుకోవాలని వస్తుంది. అక్కడ విద్యను ఎంపిక చేసుకోవాలి, పదో తరగతి హాల్ టికెట్స్ విభాగాలు కనిపిస్తాయి. పదో తరగతి హాల్ టికెట్స్‌ను ఎంపిక చేసుకుని విద్యార్థి ఐడీ, పుట్టిన తేదీవంటి వివరాలను నమోదు చేస్తే పీడీఎఫ్ రూపంలో హాల్‌టికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఏడుగురు జూదరుల అరెస్టుపార్వతీపురం రూరల్: పార్వతీపురం మండలంలోని లక్ష్మీనారాయణపురం గ్రామం పరిధిలో గల వ్యవసాయ పొలాల్లో జూదం అడుతున్న ఏడుగురు వ్యక్తులను ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు పార్వతీపురం రూరల్ ఎస్సై బి.సంతోషి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు దాడి చేసి జూదం ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుంచి రూ.15,050 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు, జూదం ఆడుతున్న వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు ఎస్సై చెప్పారు. -
హెడ్ స్లూయిస్ షట్టర్ల మార్పిడి
సంతకవిటి: మండలంలోని ప్రధాన సాగునీటి వనరైన నారాయణపురం ఆనకట్టలో దాదాపు రూ.35లక్షల వ్యయంతో హెడ్ స్లూయిస్ షట్టర్ల మార్పిడి పనులు ప్రా రంభించారు. కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా శివారు ఆయకట్టు రైతులకు నీరు అందించడంలో ఈ షట్టర్లదే ప్రదాన భూమిక. ఈ ఆనకట్ట నుంచి కుడి ప్రధాన కాలువ ద్వారా 18691 ఎకరాలకు, ఎడమ ప్రధాన కాలువ ద్వారా 18362 ఎరాలకు సాగునీరు అందుతుంది. ఈ మేరకు డీఈ వై.రవీంద్రనాయుడు ఆదివారం పనులను పరిశీలించారు. వారంరోజుల్లో ఆనకట్ట షట్టర్లు మార్పిడి పనులు పూర్తిచేసి సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా డీఈ తెలిపారు. పరిశీలించిన డీఈ రవీంద్ర నాయుడు -
చినమేరంగి సర్కిల్ ఆఫీసుకు ఐదుగురు ట్రైనీ ఎస్సైలు
జియ్యమ్మవలస రూరల్: పోలీస్ సూపరింటెండెంట్ ఎస్వీ మాధవ్‌రెడ్డి ఆదేశాల మేరకు జియ్యమ్మవలస మండలంలోని చినమేరంగి సర్కిల్ ఆఫీస్‌లో ఐదుగురు ట్రైనీ ఎస్సైలు ఆదివారం విధుల్లో చేరారు. ఈ మేరకు ఎస్సై పి.అనీష్ వారిని అభినందిస్తూ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన చినమేరంగి, జియ్యమ్మవలస పోలీస్స్టేషన్లలో ట్రైనీ ఎస్సైలు నియమితులయ్యారని, వారంతా సీఐ వీటీ తిరుపతిరావు పర్యవేక్షణలో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కమ్యూనిటీ పోలీసులతో పాటు వారిలో చినమేరంగికి ఎం.అనిల్ రెడ్డి, వి.మణికంఠేశ్వర రెడ్డి, వై జ్యోతిలను నియమించగా, జియ్యమ్మవలస పోలీస్‌స్టేషన్‌లో వి.నారాయణరెడ్డి, వి ప్రదీప్‌లు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. -
వెన్నుపోటు
సోమవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2025విద్యార్థులకు12యువత పోరు పోస్టర్‌ను విడుదల చేస్తున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు యువత పోరు పోస్టర్ విడుదల జియ్యమ్మవలస రూరల్: విద్యార్థులను, నిరుద్యోగులను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 12న జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టే నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొనాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు పిలుపునిచ్చారు. చినమేరంగిలోని తన క్యాంపు కార్యాలయంలో యువత పోరు పోస్టర్‌ను ఆదివారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, యువతకు ఉద్యోగ కల్పన, నిరుద్యోగ భృతి ఇస్తానన్న ఏ ఒక్క హామీను నిలబెట్టుకోనందున రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమానికి యువత నాంది పలకాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కోట రమేష్‌నాయుడు, గరుగుబిల్లి మండల అధ్యక్షుడు కేతిరెడ్డి అచ్యుతరావు, వైస్ ఎంపీపీ సంపత్‌కుమార్ వైఎస్సార్సీపీ నాయకులు ఎం.కిషోర్, దత్తి శంకరరావు, కె.వెంకటనాయుడు, అల్లు ఈశ్వరరావు, గంట జగన్నాధంనాయుడు, రాయగడ శేఖర్, ఎం.సింహాచలం, శివ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ నెల 12న వైఎస్సార్సీపీ యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేసి కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్‌కు వినతిపత్రం అందజేయనున్నారు. యువతకు ప్రభుత్వం న్యాయం చేసేంతవరకు యువతకు అండగా నిలుస్తామంటూ వైఎస్సార్సీపీ నాయకులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్వతీపురం టౌన్: విద్యార్థులను, యువతను మోసం చేయడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారింది. గత ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీల పేరిట అధికారం చేపట్టిన కూటమి పాలకులు అన్ని వర్గాల వారిని వెన్నుపోటు పొడుస్తుంది. యువతకు ఏటా ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతీ నెల రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నేడు మోసం చేసింది. తల్లికి వందనం పథకం కింద ఏటా రూ.15వేలు తల్లుల ఖాతాలో వేస్తామని చెప్పి నేడు ఆ హామీని మరిచింది. ఫీజు రీయింబర్స్‌మెంటు విషయంలో కూడా మాట తప్పింది. ఎన్నికల వేళ ఇచ్చిన ఈ హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న జిల్లా కేంద్రంలో యువత పోరు కార్యక్రమానికి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. నిరుద్యోగులకు అన్యాయం కూటమి ప్రభుత్వంపై యువతలో అసంతృప్తి వ్యక్తమవుతుంది. జిల్లాలో సుమారు 92వేల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తామని, లేకుంటే రూ.3వేలు ప్రతీ నెల నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందంటూ యువత మండి పడుతున్నారు. నిరుద్యోగ భృతికి అవసరమైన నిధులు గత బడ్జెట్లో కేటాయించకపోవడంతో ఈ పథకంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్ధులకు తీవ్ర ఇబ్బందులు కూటమి పాలనలో విద్యార్థులు అన్ని విధాల ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో జిల్లాలో సుమారు 16 వేల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బడ్జెట్లో నిధులు తక్కువగా కేటాయించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తమకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. న్యూస్రీల్నయువత పోరు మోసపూరిత ప్రభుత్వం – అలజంగి జోగారావు, మాజీ ఎమ్మెల్యే ఈ నెల 12న వైఎస్సార్సీపీ యువత పోరు అదే రోజు కలెక్టర్‌కు వినతిపత్రాల అందజేత నిలిచిన విద్యార్థి పథకాలు నిరుద్యోగ భృతి ఊసెత్తని కూటమి సర్కార్ కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలిచ్చి అధికారం చేపట్టింది. సుమారు 10 నెలలు పాలన పూర్తి చేసినా యువత, నిరుద్యోగులు, విద్యార్థులకు అన్యాయం చేస్తుంది. విద్యాదీవెన బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా ఈ నెల 12న యువత పోరు కార్యక్రమంలో భాగంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తాం. -
నేడు పీజీఆర్ఎస్
సీతంపేట: స్థానిక ఐటీడీఏలో సోమవారం నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) స్థానిక ఐటీడీఏలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్టు ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యలపై గిరిజనులు వినతులు సమర్పించవచ్చన్నారు. దరఖాస్తుల ఆహ్వానం పార్వతీపురం టౌన్: సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ను పోస్టులకు దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.తిరుపతినాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 15 మండలాల నుంచి ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మున్సిపల్ పాఠశాలలో పని చేస్తున్న అర్హత గల స్కూల్ అసిస్టెంట్ల నుంచి ఈ నెల 10 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 12 సాయంత్రం 5 గంటలలోగా సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాలని సూచించారు. పై పోస్టులకు సంబంధించిన దరఖాస్తు, అర్హత వివరాలు హెచ్‌టీటీపీఎస్:// పార్వతీపురం మన్యం.ఈఏఎఫ్ఎఐసీఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైటు నందు పొందుపరిచినట్టు తెలిపారు. పక్కాగా సర్వేలు విజయనగరం: పన్ను వసూళ్లతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన పీ–4 సర్వే, వర్క్ ఫ్రమ్ హోం సర్వేలను పక్కాగా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశించారు. ఈ మేరకు సహాయ కమిషనర్ కె.అప్పలరాజు సచివాలయాల పరిధిలో నిర్వహిస్తున్న సర్వేలు, పన్ను వసూళ్ల ప్రక్రియలను ఆదివారం వ్యక్తిగతంగా పరిశీలించారు. నేడు ఎస్పీ గ్రీవెన్స్‌సెల్ విజయనగరం క్రైమ్ : జిల్లాలో ఎమ్మెల్సీ కోడ్ ఎత్తేయడంతో తమ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం యథావిధిగా నిర్వహించనున్నట్టు ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం తెలిపారు. ఇకపై ప్రతీ సోమ వారం ఈ కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. వినతులు స్వీకరిస్తామని తెలిపారు. డైట్ చార్జీలు విడుదల పూసపాటిరేగ: బీసీ సంక్షేమ వసతిగృహాలకు డైట్ చార్జీలు రిలీజ్ చేస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ అధికారి పెంటోజీరావు ఆదివా రం తెలిపా రు. వసతిగృహాలకు డైట్ చార్జీలు చెల్లించకపోవడంపై సాక్షి దినపత్రికలో ఈ నెల 8వ తేదీన నిర్లక్ష్యపు నీడ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయనగరం జిల్లాకు రూ.2.31కోట్లు మూడో క్వార్టర్ బడ్జెట్లో భాగంగా మంజూరు చేశారని జిల్లా బీసీ సంక్షేమాధికారి తెలిపారు. నేటి నుంచి పైడితల్లి, కనకదుర్గ అమ్మవార్ల జాతర భోగాపురం: పోలిపల్లి పైడితల్లి, భోగాపురం కనకదుర్గమ్మ జాతరలు సోమవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు పూర్తి చేశారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు వీలుగా ఆలయాల వద్ద క్యూలైన్లు ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల భక్తులు ఇప్పటికే ఆలయాల వద్దకు చేరుకున్నారు. అమ్మవార్లను దర్శించుకుని, తలనీలాలు చెల్లించి బోనాలు సమర్పించుకుంటారు. జాతర ప్రాంతాలు దుకాణాలు, సర్కస్‌లు, బొమ్మల దుకాణాలతో కళకళలాడుతున్నాయి. అలాగే ప్రధాన రహదారులు, ఆలయ ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఏస్పీ వకుల్ జిందల్ అదేశాల మేరకు సీఐ ఎన్వీ ప్రభాకర్, ఎస్సైలు పాపారావు, సూర్యకుమారి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
జిల్లాలో పీ–4 సర్వేని పక్కాగా చేపట్టాలి:కలెక్టర్
పార్వతీపురం టౌన్: మార్చి 8 నుంచి జిల్లాలో ప్రారంభమైన పీ – 4 సర్వేను పక్కాగా చేపట్టాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. ఈ విషయమై సంబంధిత అధికారులతో కలెక్టర్ ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 2 లక్షల 65 వేల గృహాలకు సర్వే చేయాల్సి ఉన్నందున, ప్రతి అధికారి పక్కా ప్రణాళికతో ప్రతి రోజూ సర్వే చేయాలన్నారు. పీ – 4 సర్వేపై ఇప్పటికే శిక్షణ కార్యక్రమం నిర్వహించినందున, ఎటువంటి అనుమానాలకు తావులేకుండా జాగ్రత్తగా చేయాలన్నారు. గ్రామాల్లోని ప్రజలు వారి వృత్తుల రీత్యా ఉదయమే బయటకు వెళ్లి, సాయంత్రం తిరిగి వచ్చే అవకాశం ఉన్నందున, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఉదయం, సాయంత్రం వేళల్లో సర్వేను చేయాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఇళ్లు పేదరికాన్ని అధిగమించి, ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న వారి సహకారంతో అట్టడుగు స్థాయిలో ఉంటూ జీవించడానికి కనీస సౌకర్యాలు లేని వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఈ విధానం అవలంభించనుందన్నారు. ప్రజలు అందుబాటులో ఉండే సమయంలో ఒక్కొక్కరూ రోజుకు కనీసం 90 వరకు సర్వేలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జూన్ మాసాంతం వరకు పురపాలక, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలను ఇప్పటి నుంచే తీసుకోవాలని హితవు పలికారు. ప్రతీ ఎంపీడీఓ, కమిషనర్ వారి పరిధిలోని నీటి కొళాయిలు, బోర్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, సమస్యలు ఉన్న చోట తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో అవసరమైతే బోర్లు వేయడం, మరమ్మతులు చేపట్టాలన్నారు. పురపాలక పరిధిలో కొత్తగా ఏర్పడిన కాలనీలకు కూడా తాగునీటి సరఫరా కావాలని వివరించారు. ప్రతీ వారం తాగునీటి పరీక్షలు జరిపి రక్షిత మంచినీటిని సరఫరా చేయాలని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో ఎక్కడికక్కడ చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కాన్ఫరెన్స్‌లో మునిసిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్పసాద్ -
అంగన్వాడీల ఆందోళన అణిచివేతకు కుట్ర..!
విజయనగరం ఫోర్ట్: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సోమవారం చలో విజయవాడ కార్యక్రమాన్ని అంగన్వాడీలు తలపెట్టారు. అంగన్వాడీల ఆందోళనను అణిచివేసేందకు కూటమి ప్రభుత్వం అధికారులతో కుట్ర చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈనెల 10వతేదీన చలో విజయవాడ పేరిట ధర్నా చేస్తామని అంగన్వాడీలు ముందుస్తుగా ఐసీడీఎస్ సీడీపీఓలకు వినపతి పత్రం ఇచ్చారు. తీరా రేపు సమావేశం అనగా ఆందోళనకు వెళ్లొద్దని నేరుగా చెప్పకుండా ప్రతి ఐసీడీఎస్ సెక్టార్ పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలకు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఐసీడీఎస్ అధికారులు అంగన్వాడీలకు తెలియజేశారు. సమావేశానికి కచ్చితంగా ప్రతి అంగన్వాడీ కార్యకర్త హాజరు కావాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు సమాచారం. ముందుగా సెలవు పెట్టిన వారి దరఖాస్తులు సైతం తిరస్కరించాలని సూపర్వైజర్లకు అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. జిల్లాలో ఉన్న 90 సెక్టార్లలోనూ సమావేశాలు నిర్వహించనున్నారు. యూనియన్ నాయకుల హౌస్ అరెస్టులు అంగన్వాడీ యూనియన్ నాయకులు విజయవాడలో జరిగే ఆందోళనలో పాల్గొనకుండా పోలీసులు వారిని హౌస్ అరెస్టు చేస్తున్నారు. విజయనగరంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి.పైడిరాజు, జిల్లా కమిటీ సభ్యురాలు తులసిలను హౌస్ అరెస్టు చేశారు. జిల్లావ్యాప్తంగా సమావేశాలు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సెక్టార్లలో సమావేశాలు నిర్వహించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు అన్ని సెక్టార్లలో సమావేశాలు నిర్వహించనున్నాం. జి.ప్రసన్న, ఇన్చార్జి పీడీ, ఐసీడీఎస్ -
రాజకీయాలకు అతీతంగా టీచర్లకు సేవలందిస్తా
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే అజెండాగా రాజకీయాలకు అతీతంగా సేవలు అందిస్తానని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు ఉద్ఘాటించారు. పీఆర్టీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తోటపాలెంలోని ప్రైవేట్ కళాశాల ప్రాంగణంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆయన స్పష్టం చేశారు. తాను ఎన్నికై న తరువాత ముఖ్యమంత్రిని కలిసిన సమయంలో ఆయన దృష్టికి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగంలోని సమస్యలను తీసుకెళ్లానని వివరించారు. ప్రభుత్వానికి ఉపాధ్యాయులకు మధ్య వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధానకార్యదర్శి వి.రవీంద్రనాయుడు, ఆర్.రాంబాబు, బంకపల్లి శివప్రసాద్, ఆల్తి రాంబాబు, డెక్క వెంకటరావు, శంకర్‌నాయుడు, వివిధ మండల కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. అదే విధంగా ఏపీటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సంఘం కార్యాలయంలో ఎమ్మెల్సీని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ ఉపాధ్యా ప్రగతి ప్రధాన సంపాదకుడు జి.సత్యనారాయణ, గౌరవ అధ్యక్షుడు ఎ.సదాశివరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.చిరంజీవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.ఈశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి పి.ధనుంజయరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధుసూదన రావు, డి.వెంకటనాయుడు, ఆరు జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, పీఆర్టీయూ జిల్లా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు -
అంగరంగ వైభవంగా... పోలిపల్లి పైడితల్లమ్మ జాతర
● వేలాదిగా తరలివస్తున్న భక్తులు ● మూడు రోజుల పాటు నిర్వహణ ● సేవా కార్యక్రమాల్లో అధికారులు, స్వచ్ఛంద సంస్థలు 400 మంది సిబ్బందితో బందోబస్తు ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. 400 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశామని చీపురుపల్లి డీఎస్సీ ఎస్.రాఘవులు అన్నారు. జాతరను పర్యవేక్షించేందుకు 27 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్స్ సహాయంతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. సేవా కార్యక్రమాల్లో సంస్థలు రాజాం పట్టణానికి చెందిన సత్యసాయి సేవా సంస్థలు, వాసవీ క్లబ్ సభ్యులు, రెడ్ క్రాస్ బృందంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు ప్రారంభించాయి. రాజాం పట్టణం జాతర సందర్భంగా కళకళలాడుతోంది. ఆలయ ఆవరణలో విద్యుత్ దీపాలంకరణ కనువిందు చేస్తుంది. రాజాం/రాజాం సిటీ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవంగా పేరొందిన రాజాంలోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయ 99వ జాతర ఉత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే జాతరలో తొలి రోజు నుంచే పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. భక్తులతో బొబ్బిలి రోడ్డులో జనసందోహం నెలకొంది. అమ్మవారి కొలువు ఇలా... పట్టణ పరిధిలోని కొండంపేట గ్రామానికి చెందిన లంకలపల్లి వంశీకులు వెంకప్ప ఒకనాడు విజయనగరం జిల్లా పోలిపల్లి గ్రామంలో యాత్రకు కుటుంబంతో వెళ్లాడు. జాతరను చూసి తిరిగి వస్తుండగా కొంతదూరం వచ్చేసరికి ఎవరో బండి ఎక్కినట్లు, బండి బరువెక్కి ఎడ్లు లాగడానికి కష్టంగా తోచడంతో వెనుదిరిగి చూశాడు. ఎవరూ కనిపించలేదు. అలాగే ఆ చీకటిలో ప్రయాణం చేసి కొండంపేట పరిసరాలకు వచ్చేసరికి ఎవరో బండిపై నుంచి కిందకు దూకినట్లు గజ్జల ధ్వని వినిపించింది. ఇంతలో నేను పైడితల్లిని పోలిపల్లి నుంచి నీ బండిపై వచ్చాను. ఈ పనస చెట్టుపై కొలువుంటానని పలికినట్లు ఆయనకు వినిపించింది. వెంకప్ప అమ్మవారిని భక్తితో నమస్కరించి ఇంటికి చేరుకొని ఈ విషయాన్ని బంధుమిత్రులకు చెప్పగా అప్పటి నుంచి అమ్మవారు కొలువున్న పనస చెట్టు ఆయన వంశీకులు, గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల వారు పసుపు కుంకుమలు ఇచ్చి పూజించడం ప్రారంభించారు. నమ్మకం ఇలా.. రాజాం పట్టణానికి చెందిన వ్యాపారి వాకచర్ల మల్లయ్య కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని తరచు పార్వతీపురం కోర్టుకు వెళ్తుండేవారు. కేసులు ఎంతకీ తేలక నష్టాల పాలయ్యారు. ఇలాంటి పరిస్థితిలో అమ్మవారు కళలో కనిపించి పనస చెట్టు వద్ద తనకు గుడి కట్టించమని కోరింది. మరునాడు ఆయన కోర్టు వ్యవహారాలపై పార్వతీపురం వెళ్తూ అమ్మవారికి నమస్కరించి కోర్టు వ్యవహారంలో జయం కలిగితే తప్పకుండా ఆలయం కట్టిస్తానని మొక్కుకున్నాడు. అనుకున్నదే తడవుగా కోర్టు వ్యవహారంలో గెలవడమేకాక దొంగలపాలైన అతని ధనం తిరిగి లభించింది. ఆ సంతోషంతో అమ్మవారిని దర్శించి ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు ప్రారంభించారు. తన స్నేహితులైన పీసపాటి సత్యన్నారాయణాచార్యులు, పొట్టా సత్యన్నారాయణ, సలాది వెంకటప్పడు, గుడివాడ పెంటయ్య సహాయంతో వాస్తు పండితుడైన మజ్జి రమణయ్య సూచనలతో 1926లో ఆలయ నిర్మాణం మొదలు పెట్టి 1927 నాటికి పూర్తి చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఫాల్గుణమాసం శుక్లపక్షంన పౌర్ణమి ముందు వచ్చే ఆది, సోమ, మంగళవారాల్లో అమ్మవారి జాతర అత్యంత వైభవంగా రాజాంలో జరుగుతుంది. -
ఎలక్ట్రీషియన్ల కొరత..!
ప్రభుత్వ ఆస్పత్రుల్లో.. విజయనగరం ఫోర్ట్: ఆస్పత్రుల్లో చికిత్స పొందే రోగులకు 24 గంటలూ విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండాలి. ఐసీయూ, అత్యవసర విభాగాల్లో చికిత్స పొందే రో గులకు ఒక్క క్షణం విద్యుత్ సరఫరా నిలిచిపోయినా చెప్పలేనంత ఇబ్బంది నెలకొంటుంది. కొందరు రోగులకైతే విద్యుత్ ప్రాణాధారమేనని చెప్పాలి. అటువంటి విద్యుత్ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించి, సమస్యలను పరిష్కరించే ఎలక్ట్రీషియన్ల కొర త ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉంది. దీంతో విద్యుత్ సర ఫరాలో అంతరాయం ఏర్పడితే సేవల్లో జాప్యం ఏర్పడుతుంది. జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఎలక్ట్రీషియన్ల కొరత నెలకొంది. 100 బెడ్లకు ఒక ఎలక్ట్రీషియన్ నిబంధనల ప్రకారం 100 బెడ్లకు ఒక ఎలక్ట్రీషియ న్ ఉండాలి. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ఘోషాస్ప త్రిల్లో 430 బెడ్స్ ఉన్నాయి. సర్వజన ఆస్పత్రికి ఘోషాస్పత్రి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ లెక్కన రెండు ఆస్పత్రుల్లో ఐదుగురు ఎలక్ట్రీషియన్లు ఉండాలి. కానీ రెండు ఆస్పత్రుల్లో ముగ్గురే ఉన్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిల్లో ఇద్దరు, ఘోషాస్పత్రిలో ఒకరు ఉన్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మేల్, ఫీమేల్ జనరల్ వార్డులు, మేల్, ఫిమేల్ జి.ఈ వార్డులు, మేల్, ఫిమేల్ ఆర్థో వార్డు లు, క్యాజువాలటీ, 30 పడకలు ఐసీయూ, స్టెప్ డౌ న్ ఐసీయూ, ఎమర్జీన్సీ వార్డు, బ్లడ్ బ్యాంక్, ల్యాబొ రేటరీ, ఓపీవిభాగాలు, ఎక్సరే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఎంఆర్ఐ స్కాన్, సీటీ స్కాన్ విభాగాలు ఉన్నాయి. ఐసీయూ, క్యాజువాలటీ, ఎమర్జెన్సీ వార్డుల్లో చికిత్స పొందే రోగులకు విద్యుత్ ఒక సెకన్ కూడా ఆగకూడదు. పొరపాటున విద్యుత్ సరఫరా నిలిచిపోతే రోగులు తీవ్ర ఇబ్బందే పడే అవకాశం ఉంది. ఈ విభాగాల్లో వెంటిలేటర్, సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు నిరంతరాయంగా ఆక్సిజ న్ అందాలి. అలా అందాలంటే విద్యుత్ నిరంతరాయంగా సరఫరా కావాలి. ఎలక్ట్రీషియన్ల కొరత వల్ల రోగులకు సేవల్లో జాప్యం ఏర్పడుతుందనే విమర్శలున్నాయి. వీరిద్దరిలో ఏ ఒక్కరు సెలవు పెట్టినా ఒక్క ఎలక్ట్రీషియన్ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. 24 గంటల పాటు ఒక్కరు విధులు నిర్వ హించడం అనేది కష్టతరమే. ఘోషాస్పత్రిలో 20 పడకల నవజాతి శిశువుల ప్రత్యేక సంరక్షణ కేంద్రం(ఎస్ఎన్సీయూ) ఉంది. వీరికి సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ ద్వారా నవజాతి శిశువులకు ఆక్సిజన్ అందుతుంది. ఎస్‌ఎన్‌సీయూలో వార్మర్లు, ఫోటోథెరిపి పరికరాలు ఉన్నాయి. ఇవి కూడా విద్యుత్ పైనే అధారపడి నడుస్తాయి. వీరితో పాటు గర్భిణులకు హైరిస్క్ గర్భిణుల కోసం ఇక్క డ ఐసీయూ కూడా ఉంది. అదేవిధంగా పిల్లల వా ర్డు, గర్భిణులు వార్డు ఉంది. ఇక్కడ ఒకే ఎలక్ట్రీషియన్ ఉన్నారు. ఏదైనా సమస్య వస్తే ఒక్కడే కావ డంతో సేవల్లో జాప్యం ఏర్పడుతుందని రోగులు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఎదైనా సమస్య వస్తే సకాలంలో సమస్య పరిష్కారం కావడం లేదనే ఆవేదన రోగుల్లో ఉంది. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 150 ఏసీలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 150 వరకు ఏసీలు ఉన్నాయి. ఐసీయూ, ఎమర్జెన్సీ వార్డు, బ్లడ్ బ్యాంక్, ఎంఆర్ఐ స్కాన్, సీటీ స్కాన్ వంటి వాటిల్లో ఏసీలు నిరంతరాయంగా పని చేయాలి. వీటికి ఏదైనా సమస్య వస్తే రిఫర్ చేయడానికి ఏసీ మెకానిక్ కూడాలేరు. ఏసీలు మరమ్మతులకు గురైతే రోజుల తరబడి బాగు చేయించడం లేదనే వాదన ఉంది. ఏసీలు బాగు చేయడానికి ఏడాదికి ఒకసారి నిర్వహించే మెయింటెనెన్స్ కోసం లక్షలాది రుపాయిలు ప్రైవేటు సంస్థకు చెల్లిస్తున్నారు. ఏసీ మెకానిక్ ఉంటే చాలా వరకు ప్రజాధనం సాదా అయ్యేదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. వంద పడకలకు ఒక ఎలక్ట్రీషియన్ అవసరం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒకే ఒక్కడు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 150 వరకు ఏసీలు కానీ ఒక్క ఏసీ మెకానిక్ కూడా లేరు.. మరమ్మతులు, మెయింటెనెన్స్ పేరిట ప్రైవేటు వారికి రూ.లక్షల చెల్లింపు ఎలక్ట్రీషియన్ల కొరతతో సేవల్లో జాప్యం -
వైభవంగా పునర్వసు పట్టాభిషేకం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో పునర్వసు పట్టాభిషేకం కార్యక్రమాన్ని అర్చకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో సుందరకాండ హవనం జరిపించారు. అనంతరం ఆలయంలో వెండి మంటపం వద్ద సీతారామస్వామిని నూతన పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించి స్వామి వారి నిత్య కల్యాణ మహోత్సవ ఘట్టాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఉత్సవమూర్తుల వద్ద రామాయణంలో పట్టాభిషేకం సర్గ విన్నవించి శ్రీరామచంద్రమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వివిధ రకాల ఫల రసాలతో విశేష అభిషేకాలు, పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవంగా జరిపించారు. కార్యక్రమంలో అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
‘శతర’ కవితా సంపుటి ఆవిష్కరణ
పార్వతీపురం: తాను రచించిన ‘శతర’ ఆదివాసీ కవితా సంపుటిని ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో నిర్వహించిన ద్వితీయ తెలుగు మహసభల్లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ.రమణ శనివారం ఆవిష్కరించారని ప్రముఖ కవి సిరికి స్వామినాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన తన స్వగృహంలో మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన తెలుగు మహసభల్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారని చెప్పారు. ‘శతర’ పుస్తకంలో అడవుల్లోని అందాలు, గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలు, విద్య, ఆరోగ్యం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గిరిజనుల విధానంలో మార్పు తదితర అంశాలను పొందుపరిచినట్లు వివరించారు. తాను రాసిన కవితా సంపుటికి దేశంలో గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. -
రాత్రి 11గంటల తరువాత సంచరించొద్దు
విజయనగరం క్రైమ్: సహేతుకమైన కారణం లేకుండా అర్ధరాత్రి నగరంలో తిరిగితే టౌన్ న్యూసెన్స్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరించారు. ఈ మేరకు నగరంలోని బ్యారెక్స్ వద్ద ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అన్ని స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని, అందుకు అనుగుణంగా పోలీస్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. విజయనగరంలో రైల్వేస్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, మూడు లాంతర్లు, కోట జంక్షన్, బాలాజీ జంక్షన్, దాసన్నపేట రైతుబజార్, రింగు రోడ్డు, కొత్తపేట, ఐస్ ఫ్యాక్టరీ, జమ్ము, వీటీ అగ్రహారం, బొబ్బిలి, నెల్లిమర్ల, రాజాం మున్సిపాల్టీల్లో కొన్ని ముఖ్య ప్రాంతాల్లోను పోలీసులు తనిఖీలు చేపడుతున్నారన్నారు. రాత్రి 11గంటల తరువాత వ్యాపారాలు, షాపులు, టిఫిన్ బండ్లు మూసివేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యాపారాలు సాగించినా, కారణాలు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరించిన వారిపై టౌన్ న్యూసెన్స్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కేసు నమోదు చేసిన వారిని స్టేషన్‌కు పిలిపించి, వారి తల్లిదండ్రులను రప్పించి, కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. నేరాల నియంత్రణలో భాగంగా ఇప్పటివరకు రాత్రి గస్తీల్లోను, పెట్రోలింగ్ నిర్వహించడంలో మౌలికమైన మార్పులను చేపట్టారు. రాత్రి పెట్రోలింగ్, గస్తీ విధులకు వెళ్లే పోలీసు సిబ్బందితో సంబంధిత పోలీసు అధికారులు సమావేశమై, రాత్రి గస్తీలో నిర్వహించాల్సిన విధుల పట్ల వారికి దిశానిర్దేశం చేస్తున్నట్లు చెప్పారు. ఇక రాత్రి గస్తీ, పెట్రోలింగ్ నిర్వహించే పోలీసు సిబ్బంది తమ వెంట తప్పనిసరిగా విజిల్స్, లాఠీలను తప్పనిసరిగా తీసుకుని వెళ్లాలని ఆదేశించారు. కాగా జిల్లా వ్యాప్తంగా జనవరి నుంచి ఇప్పటివరకు 850 మందిపై టౌన్ న్యూసెన్స్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, కౌన్సెలింగ్ నిర్వహించామని ఎస్పీ చెప్పారు. -
మన్యం సహజ రైతు ఉత్పత్తిదారుల కంపెనీకి జాతీయ అవార్డు
సీతంపేట: మన్యం సహజ రైతు ఉత్పత్తిదారుల కంపెనీకి జాతీయ స్థాయి అవార్డు లభించింది. ఈ మేరకు అవార్డును కేరళ రాష్ట్రంలోని త్రిశూర్‌లో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్బీఐ ప్రతినిధి సతీష్ కె.మల్హోత్ర, ఈఎస్ఏఎఫ్ ఫౌండర్ పాల్ జోషెఫ్ చేతుల మీదుగా రూ.లక్ష నగదు బహుమతి, ప్రశంసా పత్రాన్ని ఆర్ట్స్ డైరెక్టర్ నూక సన్యాసిరావు, మన్యం సహజ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ సీఈఓ బెండి శంకరరావు అందుకున్నారు. ఆర్ట్స్ నేతృత్వంలో మన్యంలోని గిరిజన రైతులు సహజ ఉత్పత్తులను సాగు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా జాతీయ స్థాయిలో ఈ అవార్డు రావడం పట్ల పలువురు అభినందించారు. -
క్రీడాకారులకు అభినందనలు
విజయనగరం: గత నెలలో మంగళగిరిలో జరిగిన 7వ పారా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన జిల్లాకు చెందిన క్రీడాకారులను పలువురు ప్రజాప్రతినిధులు శనివారం అభినందించారు. నగరంలోని రాజీవ్ క్రీడామైదానం ప్రాంగణంలో గల జిల్లా క్రీడాప్రాధికార సంస్థ కార్యాలయంలో జరిగన కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అతిధి గజపతిరాజులు క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అతిధి గజపతిరాజు మాట్లాడుతూ.. ప్రతిభకు వైకల్యం అడ్డుకాదన్న విషయాన్ని పారా క్రీడాకారులు నిరూపిస్తున్నారని, ఇతర క్రీడాకారులకు ఏ మాత్రం తీసిపోని విధంగా మెడల్స్ సాధించడమే కాకుండా రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాను రెండో స్థానంలో నిలపడం అభినందనీయమన్నారు. భవిష్యత్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం విజేతలకు మెడల్స్ వేసి, మెరిట్ సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో తూర్పుకాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్విని, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్, తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి వేంకటేశ్వరుని కల్యాణోత్సవం
డెంకాడ: చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్ వద్ద ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో వేంచేసి ఉన్న వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవానికి ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. స్వామివారి 41వ వార్షిక కల్యాణ మహోత్సవాలు ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ శ్రీనివాసుని కల్యాణ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ తెలిపింది. 9వ తేదీ ఉదయం నుంచి స్వామివారి కల్యాణ ఉత్సవ పూజలు ప్రారంభమై సాయంత్రం 4.30 గంటలకు శ్రీవారి తిరువీధి ఉత్సవం జరుగుతుందని వివరించారు. 10వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీవారి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. 11వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరులో తెప్పోత్సవం కన్నుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్న సమారాధన జరుగుతుందని కమిటీ తెలిపింది. భక్తులు పాల్గొని స్వామి ప్రసాదాన్ని స్వీకరించాలని వారు కోరారు. ఉత్సవంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయన్నారు. -
హెల్త్‌సిటీలో రక్త రుగ్మతల కేంద్రం ప్రారంభం
ఆరిలోవ: హెల్త్‌సిటీ యునిక్ ఆస్పత్రిలో మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో రక్త రుగ్మతుల కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఈ కేంద్రాన్ని హెమటాలజీ పితామహుడు డాక్టర్ మామ్మెన్ చాందీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సికిల్ సెల్, తలసేమియాతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉన్నారన్నారు. అలాంటి వారికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. పేదలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా ఈ కేంద్రాన్ని నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కేంద్రం విశాఖలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఊన్న మురళీకృష్ణను అభినందించారు. నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సదాశివుడు మాట్లాడుతూ విశాఖలో రక్త రుగ్మతుల కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఆరోగ్య సంరక్షణలో కీలక ముందుడుగు పడిందన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. అలాంటి సమస్యల నివారణకు ఈ కేంద్రం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఏపీతోపాటు ఒడిశా, చత్తీస్‌గఢ్‌లలో ఎక్కడా రక్త వ్యాధులను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా హెమటాలజీ కేంద్రం లేదన్నారు. ఈ లోటును భర్తీ చేయడానికి ఇక్కడ సమగ్ర రక్త రుగ్మతల కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు ఆంకాలజీ విభాగం వైద్యులు పాల్గొన్నారు. -
గడ్డి ట్రాక్టర్‌ను ఢీకొన్న గుర్తు తెలియని లారీ
కొత్తవలస : మండలంలోని అరకు – విశాఖ జాతీయ రహదారిలో నిమ్మలపాలెం జంక్షన్ సమీపంలో గల సూర్య ఐటీఐ వద్ద ముందు వెళ్తున్న గడ్డి ట్రాక్టర్‌ను వెనుక నుంచి గుర్తు తెలియని లారీ శనివారం ఢీకొట్టింది. ఎల్.కోట మండలం కళ్లేపల్లి నుంచి వరి గడ్డితో ట్రాక్టర్‌పై నుంచి కొత్తవలస వెళ్తుండగా వెనుక నుంచి అతి వేగంగా గుర్తు తెలియని లారీ వచ్చి ఢీకొట్టింది. దీంతో గడ్డి లోడుతో ఉన్న ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాక్టర్ డ్రైవర్ తెరుకునే లోపే లారీ అతివేగంగా తప్పించుకుపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. జేసీబీ సాయంతో గడ్డి ట్రాక్టర్‌ను రోడ్డు సేఫ్టీ పోలీస్‌లు దగ్గరుండి పక్కకు తొలిగించారు. గడ్డి ట్రాక్టర్ దగ్ధం గజపతినగరం రూరల్: మండలంలోని గంగచోళ్లపెంట గ్రామంలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో విద్యుత్ వైర్లుకు గడ్డి ట్రాక్టరు తగలడంతో దగ్ధమైంది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కనకల సూర్యనారాయణకు చెందిన ట్రాక్టరులో ఎండు గడ్డిని ఎక్కించి తీసుకువెళ్తుండగా మార్గ మద్యలో ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించి గడ్డితో పాటు ట్రాక్టరు పూర్తిగా కాలిపోయింది. ప్రమాద సంఘటన విషయాన్ని గజపతినగరం అగ్ని మాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో అగ్ని మాపక సిబ్బంది వాహనంతో వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే ట్రాక్టరు పూర్తిగా కాలి పోయింది. కుల దూషణపై అట్రాసిటీ కేసు బొండపల్లి: మండలంలోని కొత్తపాలెం సచివాలయం వెల్ఫేర్ సహాయకుడుగా పని చేస్తున్న ఉద్యోగిపై కుల దూషణ చేసినట్లు ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు నిర్వహించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ యు.మహేష్ తెలిపారు. ఈ నెల 1న సామాజిక భద్రత పింఛన్లను పంపిణీ చేసేందుకు యడ్లపాలెం గ్రామానికి చెందిన వెల్ఫేర్ సహాయకుడు గొర్లె సతీష్‌కుమార్ వెళ్లాడు. మజ్జి అప్పయ్యమ్మ ఇంటికి పింఛన్ ఇచ్చేందుకు వెళ్లగా సెల్ సిగ్నల్స్ పని చేయకపోవడంతో పక్క ఇంటికి వెళ్లి పింఛన్ అందించడానికి వెళ్లాడు. ఈ క్రమంలో మా అమ్మకు పింఛన్ ఇవ్వకుండా పక్క ఇంటికి ఎందుకెళ్లావు? అని అప్పయ్యమ్మ కుమారుడు బంగారునాయుడు కులం పేరిట దూషించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ డీఎస్పీ వీరాకుమార్ దర్యాప్తు నిర్వహించి కేసు నమోదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు పార్వతీపురం రూరల్: పార్వతీపురం పట్టణంలో గల ఎస్ఎన్పీ కాలనీకి చెందిన జె.సత్తిరాజు ఈ నెల 5వ తేదీన ఉదయం 6గంటలకు తన రోజువారీ పనుల నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య సౌజన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్ఐ గోవిందరావు శనివారం తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. గడ్డి మందు తాగి వ్యక్తి మృతి మక్కువ : మండలంలోని పాయకపాడు గ్రామానికి చెందిన సామంతుల స్వామినాయుడు (29) మనస్తాపంతో గడ్డి మందు తాగి, వైద్య చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్వామినాయుడు ఈ నెల 6వ తేదీన ఉదయం ఇంటి వద్ద గడ్డి మందు తాగడంతో స్థానికులు గమనించి మక్కువలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రధమ చికిత్స చేసి మెరుగైన వైద్యం నిమిత్తం విజయనగరం మహారాజ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. గత కొంతకాలంగా ఏ పని చేయకుండా ఖాళీగా ఉండడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన స్వామినాయుడు గడ్డి మందు తాగాడు. మృతుడికి వివాహమై ఏడాదైంది. భార్య శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. -
లోక్ అదాలత్‌లో..6,677 కేసుల పరిష్కారం
విజయనగరం లీగల్: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, శృంగవరపుకోట, చీపురుపల్లి, గజపతినగరం, కొత్తవలస, కురుపాం కోర్టులలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లలో 6,677 కేసులు పరిష్కరించినట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. రాజీయే రాజమార్గమని తెలిపారు. మోటారు ప్రమాద బీమా క్లైమ్లకు సంబంధించిన కేసులో రూ.70 లక్షల పరిహారాన్ని అందజేసినట్టు వెల్లడించారు. సుమారు రూ.35 కోట్ల ఆస్తులకు సంబంధించిన (విలువైన) కేసులు పరిష్కారమయ్యాయన్నారు. 10,500 మంది కక్షిదారులు ప్రయోజనం పొందినట్టు తెలిపారు. లోక్ అదాలత్‌లలో వివిధ కోర్టుల న్యాయమూర్తులు, జడ్జిలు బి.అప్పలస్వామి, ఎన్.పద్మావతి, కె.నాగమణి, టి.వి.రాజేష్‌కుమార్, బీహెచ్‌వీ లక్ష్మీకుమారి, ఎల్.దేవీరత్నకుమారి, బి.రమ్య, పి.బుజ్జి, ఎమ్.శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎ.హరీష్ తదితరులు పాల్గొన్నారు. -
రాజీతోనే కేసుల పరిష్కారం
పార్వతీపురం టౌన్: రాజీతోనే ఎక్కువ శాతం కేసులు పరిష్కారం అవుతాయని రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు అన్నారు. స్థానిక జిల్లా కోర్టుల సముదాయంలో శనివారం ఏర్పాటు చేసిన మెగా లోక్ అదాలత్‌తో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసులు పరిష్కారానికి ఇరువర్గాల సభ్యుల రాజీ ఎంతో అవసరమని తెలిపారు. వివాదాలు ఒకసారి ప్రారంభం అయితే జీవితాంతం కొనసాగుతాయని, వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కక్షిదారులకు విజ్ఞప్తి చేశారు. సంవత్సరాల తరబడి కేసుల వెంట వెళ్లేకన్నా రాజీ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. న్యాయ స్థానాల్లో పెండింగ్‌లో వున్న కేసుల సంఖ్యను తగ్గించుకోవడానికి, వ్యాజ్యాలకు ముందు దశలోనే వివాదాలను పరిష్కరించడానికి న్యాయస్థానాలు లోక్ అదాలత్‌ను తీసుకువచ్చాయన్నారు. కార్యక్రమంలో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ సౌమ్య జోిస్పిన్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ఎస్ రావు, అదనపు పీపీ చంద్రకుమార్, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. -
ప్రజలకు అత్యుత్తమ సేవలందించాలి : ఎస్పీ
ఎన్డీఏకు ఎంపికై న విద్యార్థులకు సత్కారంత్రుటిలో తప్పిన ప్రమాదం పాలకొండ రూరల్: నిత్యం రద్ధీగా ఉండే స్థానిక ప్రధాన మార్కెట్‌కు ఆనుకుని ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ ఒక్కసారిగా నేలకొరిగింది. నెలలో రెండవ శనివారం పాఠశాలకు సెలవు కావటం, గోడకు మరోవైపు ఉన్న మార్కెట్లో ఆ సమయంలో ఎవ్వరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఉన్నట్లుండి పెద్ద శబ్ధంతో ఈ భారీ గోడ కూలటంతో చుట్టపక్కల వారు అక్కడి చేరుకుని పరిస్థితిని పాఠశాల యాజమాన్యానికి తెలియజేశారు. ఈ ఘటనతో ఎటువంటి సమస్య తలెత్తకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న పాఠశాల హెచ్ఎం బి.శ్రీదేవి శాఖాపరమైన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామన్నారు. పార్వతీపురం రూరల్: అనంతపురం పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం గుంటూరు, కర్నూల్ రేంజ్‌కు సంబంధించిన 35మంది ప్రొబేషనరీ ఎస్ఐలను ప్రాక్టికల్ శిక్షణ నిమిత్తం పార్వతీపురం మన్యం జిల్లాకు కేటాయించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు శాఖ కార్యాలయంలో శిక్షణ నిమిత్తం వచ్చిన ఎస్ఐలు ఎస్పీ మాధవ్రెడ్డిని మర్యాదపూర్వకంగా శనివారం కలిశారు. ఈ నేపథ్యంలో ఎస్పీ వారితో మాట్లాడుతూ ప్రజలకు పోలీసు శాఖ ద్వారా అత్యుత్తమ సేవలందించాలన్నారు. విధి నిర్వహణలో నిర్భయంగా, నిష్పక్షపాతంగా, క్రమ శిక్షణ, నిజాయితీ, పారదర్శకత, జవాబుదారీతనంగా సేవలందించాలన్నారు. ప్రతీ ఒక్కరు ఈ శిక్షణలో టెక్నాలజీని ఉపయోగించి ఉత్తమ ఫలితాలను రాబట్టి పోలీసు శాఖ ప్రజలకు మరింత సేవలందించేలా చూడాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మృదు స్వభావంతో మెలగాలన్నారు. ఎఫ్ఐఆర్ దర్యాప్తుకు సంబంధించిన రికార్డులు రాయడం గురించి క్షుణ్ణంగా తెలుసుకొని, కేసులను ఏ విధంగా ఛేదించాలి, సీసీటీఎన్ఎస్, డ్రోన్స్‌ను ఉపయోగించడం, పెట్రోలింగ్, సీసీ కెమెరాలను ఉపయోగించు విధానం, పహారా బీట్ గురించి ఎన్డీపీఎస్ కేసులలో చేయాల్సిన విధులు, కేసు డైరీ రాయడం, నేర స్థల పరిశీలన, పోలీసు బందోబస్తు ఏ విధంగా నిర్వహించాలో క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఏ విధమైన అనుమానాలు వ్యక్తమైనా సీనియర్ అధికారులను అడిగి తెలుసుకొని నివృత్తి చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా వారికి క్షేత్ర స్థాయిలో నిర్వహించాల్సిన విధులపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో ఉన్న పలు పోలీసుస్టేషన్లకు కేటాయించారు. ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ -
మహిళా చైతన్యంతో సమాజాభివృద్ధి
పార్వతీపురం రూరల్: మహిళా చైతన్యంతో సమాజ అభివృద్ధి సాధ్యమని, మహిళలు అన్నిరంగాల్లోనూ రాణించాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం మహిళా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. మహిళా పోలీసుల ఆధ్వర్యంలో కేక్ కట్‌చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారతకు పోలీస్‌శాఖ అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. ప్రతీ విద్యార్థిని చక్కగా చదువుకొని భవిష్యత్‌లో ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. మహిళలకు రాజకీయాలు, వ్యాపార, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అవకాశాలు అపారమన్నారు. మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా విద్యార్థినులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పోలీసు శాఖలో ఉత్తమ సేవలందించిన మహిళా సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పాలకొండ డీఎస్పీ రాంబాబు, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఏఆర్ ఆర్ఐలు రాంబాబు, నాయుడు, ఎస్బీ సీఐ రంగనాథం, సీసీఎస్ సీఐ అప్పారావు, సోషల్ మీడియా సీఐ శ్రీనివాసరావు, రూరల్ ఎస్ఐ సంతోషి, ఎస్పీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
వాల్పిన్ను మింగేసిన చిన్నారి..
రాజాం: పట్టణ వైద్యులు ఏడాదిన్నర చిన్నారి ప్రాణాన్ని కాపాడారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం గెడ్డకంచరాంకు చెందిన ఏడాదిన్నర వయస్సున్న డి.దుర్గాప్రసాద్ ఆటాడుతూ సైకిల్ ట్యూబ్ వాల్ పిన్ను శనివారం మింగేశాడు. అది బాలుని గొంతువద్ద అడ్డంగా ఇరుక్కోవడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. విషయం గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే రాజాంలోని ఆరోగ్య ఆస్పత్రికి 108 వాహనంలో తీసుకెళ్లారు. ఆస్పత్రి ఎండీ సుంకరి రఘు ఎండోస్కోప్ విధానంలో వాల్పిన్ను బయటకు తీశారు. బాలునికి ప్రాణాపాయాన్ని తప్పించారు. ఎండోస్కోప్ విధానంలో బయటకు తీసిన వైద్యులు తప్పిన ప్రాణాపాయం -
మహిళా సాధికారతే ధ్యేయం
పార్వతీపురంటౌన్: మహిళా సాధికారతకు ప్రభు త్వం కృషిచేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. మహిళలు తలచుకుంటే సాధించలేనిది లేదని గుర్తుచేశారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో టీటీడీ కళ్యాణ మండపంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని, ఉన్నతమైన స్థానాల్లో నిలిచారని ఆమె గుర్తుచేశారు. భారత రాష్ట్రపతి, రాష్ట్ర హోంశాఖ మంత్రి, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు మహిళలేనన్నారు. వివిధ రంగాల్లో రాణించిన, సేవలందించిన మహిళలకు కలెక్టర్, పార్వతీపురం ఎమ్మెల్యే బి.విజయచంద్రతో కలిసి జ్ఞాపిక, శాలువ, ధ్రువీకరణ పత్రాలతో సత్కరించారు. వాలీబాల్, రన్నింగ్, కబడ్డీ, ఖోఖో విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. వీడీవీకే ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో మహిళల ఆధ్వర్యంలో వీడీవీకేలు విజయవంతంగా నడుస్తున్నాయని, ఇక్కడి ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ సదుపాయం కల్పిస్తామని చెప్పా రు. మూఢనమ్మకాలు, బాల్యవివాహాల నిర్మూలనకు గ్రామస్థాయి కమిటీలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గర్భిణులు పౌష్టికాహారం తీసుకునేలా చూడాలని ఐసీడీఎస్ సిబ్బందికి సూచించారు. మహిళలందరూ కలిసి ఎనీమియా ముక్త్ పార్వతీపురంను చేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వెలుగు పథక సంచాలకులు సుధారాణి, వై.సత్యంనాయుడు, జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.తిరుపతి నాయుడు, పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ ఎం.వి.కరుణాకర్, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎస్.కృష్ణ్ణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎస్ భాస్కరరావు, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్మోహన్రావు, జట్టు ఆశ్రమం నిర్వాహకురాలు వెలిగొండ పద్మజ, చేనేత, జౌళిశాఖ సహాయ అభివృద్ధి అధికారి ఎన్.వెంకటరమణ, సీడీపీఓలు, సూపర్ వైజర్లు, అంగన్వాడీలు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో ఘనంగా మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యేలు -
No Headline
పూసపాటిరేగ: సంక్షేమ వసతిగృహాల నిర్వహణపై సర్కారు చిన్నచూపు చూస్తోంది. వసతిగృహాలలో ఉంటూ చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు మంజూరు చేయాల్సిన డైట్ చార్జీల మంజూరుపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత సెప్టెంబర్ నెల నుంచి ఆరు నెలలుగా బీసీ సంక్షేమ వసతిగృహాలకు మంజూరు చేయాల్సిన డైట్ చార్జీలు మంజూరు చేయకపోవడంతో సంబంధిత అధికారులు అప్పులు చేసి మరీ వసతిగృహాలను నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్థిక సమస్యలతో సతమతం కావడంతో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ పక్కాగా అమలు చేయలేని దుస్థితి ఏర్పడింది. జిల్లాలో 52 బీసీ సంక్షేమ వసతిగృహాలుండగా వాటిలో సుమారు 3,522 మంది విద్యార్థులు చదువుతున్నారు. నిరుపేద విద్యార్థుల భవిష్యత్‌కు బంగారుబాటలు వేసే వసతిగృహాల నిర్వహణపై సర్కారు నిర్లక్ష్యపు ధోరణి ప్రదర్శించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. గత ప్రభుత్వంలో డైట్ చార్జీలు ప్రతి రెండు నెలలకోసారి ఠంచన్‌గా మంజూరు చేసేవారు. ఐదేళ్ల పాటు క్రమం తప్పకుండా డైట్ చార్జీలు మంజూరు చేశారు. నాడు – నేడు పనులలో భాగంగా వసతిగృహాలను సుందరంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వం మారాక అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరగడం, చాలీచాలని డైట్ చార్జీలతో వసతిగృహాల నిర్వహణ అంతంతమాత్రంగా మారింది. ఇప్పటికై నా సంక్షేమ పథకాల ఊసెత్తని సర్కారు కనీసం వసతిగృహ విద్యార్థులకై నా న్యాయం జరిగేలా డైట్ చార్జీలు చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
మార్చి 12లోగా వ్యవసాయ పరికరాలకోసం దరఖాస్తు
పార్వతీపురం: వ్యవసాయ యాంత్రికరణలో భాగంగా రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాల కోసం రైతు సేవా కేంద్రాల్లో ఈనెల 12లోగా దరఖాస్తు చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయాధికారి కె.రాబర్ట్‌పాల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ 2024–25 సంవత్సరానికి గాను రైతులకు 50శాతం సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను సరఫరా చేసేందుకు పార్వతీపురం మన్యం జిల్లాకు రూ.2.47కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. బ్యాటరీ స్ప్రేయర్లు, ఫుట్ స్ప్రేయర్లు, తైవాన్ స్ప్రేయర్లు, ట్రాక్టర్ దుక్కు, దమ్ము సెట్లు, రోటోవేటర్లు, పవర్ వీడర్లు, పవర్ టిల్లర్లను అందించనున్నట్లు చెప్పారు. గత ఐదేళ్లుగా వ్యవసాయశాఖ నుంచి సబ్సిడీ ద్వారా పరికరాలు పొందని ఎస్సీ,ఎస్టీ, సన్న, చిన్నకారు మహిళా రైతులు అర్హులన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ భూములను సాగుచేస్తున్న రైతులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఏపీ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్ఏఐడీసీ) రైతులతో చర్చించి పరికరాల ధరలను నిర్ణయించి లబ్ధిదారులకు అందించనున్నామని చెప్పారు. ఆసక్తిగల రైతులు వినియోగించుకోవాలని కోరారు. -
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
విజయనగరం: విద్యార్థి దశలో క్రీడల్లో రాణించిన వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి, జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యం నాయుడులు పేర్కొన్నారు. జాతీయస్థాయిలో జరిగిన స్కూల్‌గేమ్స్ పోటీల్లో రాష్ట్ర జట్టుకు విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన 28 మంది క్రీడాకారులకు శుక్రవారం సర్టిఫికెట్లు ప్రదానం చేసారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా నుంచి ఖోఖో, కబడ్డీ, స్విమ్మింగ్, సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్, సైక్లింగ్, తైక్వాండో, రెజ్లింగ్ పోటీల్లో రాష్ట్ర జట్లలో 28 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిని ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారితో పాటు, విద్యాశాఖ అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ క్రీడల ద్వారా మంచి భవిష్యత్ అందిపుచ్చుకోవచ్చన్నారు. జాతీయస్థాయి సర్టిఫికెట్తో ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్ ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హెచ్ఎం అసోసియేషన్ కార్యదర్శి సన్యాసిరాజు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం కార్యదర్శి ఎన్.వెంకటనాయుడు, ఎస్ జీఎఫ్ జిల్లా కార్యదర్శి కె.కృష్ణంరాజు, వ్యాయామ ఉపాధ్యాయులు కేవీఎఎస్ రాజు, చంద్రశేఖర్, సూర్యారావు, తౌడుబాబు, సత్యనారాయణ, అప్పలనాయుడు, శ్రీను, టి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్కూల్‌గేమ్స్‌లో పాల్గొన్న క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం -
ఆత్మవిశ్వాసమే ఆభరణం
మహిళకు ఆత్మవిశ్వాసమే అసలైన ఆభరణం. మొక్కవోని కార్యదీక్ష, ఓర్పు, నేర్పు, శక్తియుక్తి వంటి లక్షణాలే తరగని ఆభరణాలు. మగవారికి మకుటమై మణిమాణిక్యమై మనుగడకే మణిదీపమై వెలుగులీనే వేగుచుక్క నేటి మహిళ. విధివంచితలైనా, విజయభేరి మోగించే నేటిమహిళ పురషుల కన్నా మహాశక్తి కలది.సమాజంలోని ఆటుపోట్లను ఎదుర్కొని ముందడుగు వేసే ప్రతిమహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. – కోరుపోలు కళావతి, ప్రముఖ రచయిత్రి, విజయనగరంఅన్నిరంగాల్లోనూ మహిళలు రాణించాలినేటి మహిళలందరూ ప్రతి రంగంలోనూ రాణించాలి. ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకు వెళ్లాలి. భవిష్యత్తుకు మార్గం వేయాలి. కుటుంబసభ్యుల ప్రోత్సాహం తప్పనిసరిగా ఉండాలి. కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసే విషయంలో మహిళలు నైపుణ్యం ఎలా ప్రదర్శిస్తారో..ఉద్యోగ విషయంలోనూ ఎటువంటి పరిస్ధితినైనా సమర్ధవంతంగా ఎదుర్కొని దానికి చక్కటి పరిష్కారం చూపించ గలుగుతారు. వృత్తిపట్ల నిబద్ధతతో పనిచేయగలుగుతారు. మహిళా మణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. – కె.శిరీష, జిల్లా దేవాదాయశాఖ అధికారిణి, విజయనగరం -
నిర్లక్ష్యపు నీడ..
● బీసీ సంక్షేమ వసతిగృహాలకు ఆరు నెలలుగా అందని డైట్ చార్జీలు ● అప్పులు చేసి నిర్వహణ ● ఆర్థిక సమస్యలతో సతమతంఇబ్బంది పడుతున్నాం డైట్ చార్జీలు చెల్లించకపోవడంతో అప్పులు చేసి వసతిగృహం నిర్వహిస్తున్నాం. వసతిగృహం నిర్వహణకు చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించకోలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. డైట్ చార్జీలు చెల్లించి వసతిగృహాల నిర్వహణకు సహకరించాలి. ఎ.కొండ, వసతిగృహ సంక్షేమాధికారి -
ప్రజా సమస్యల పరిష్కార కోసమే చైతన్యయాత్రలు
విజయనగరం గంటస్తంభం: సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన ప్రజాచైతన్య యాత్రల్లో ప్రజాసమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి పోరాటాలు చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన స్థానిక ఎల్బీజీ భవన్లో జరిగిన కార్యక్రమంలో కరప్రత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సైకిల్‌యాత్రగా విజయనగరం నుంచి బయలుదేరి మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించి ప్రజలను కలిసి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మండలాలు, పట్టణ ప్రాంతాల్లో పాదయాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి 10 నెలలు గడిచినా ఉపాధి కల్పనపై చిత్తశుద్ధి లేదని, ధరలు అదుపులో ఉండడం లేదన్నారు. మరోవైపు కరెంట్ చార్జీల భారం విపరీతంగా ప్రజలపై వేస్తున్నారని విమర్శించారు. సూపర్‌సిక్స్ గురించి గొప్పగా చెప్పడం తప్ప ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా, సంక్షేమ పథకాల్లో కోత విధిస్తున్నారన్నారు. విజయనగరం జిల్లాలో కూడా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, వేసవి తీవ్రత పెరగకుండానే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ప్రజలను చైతన్య పరుస్తూ తమయాత్రలు 17 వ తేదీ వరకు జరుగుతాయని తెలియజేశారు. ప్రజలంతా తమ సమస్యలను సీపీఎం దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ఈనెల 22 నుంచి 28 వరకు వివిధ రూపాల్లో ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. అయినా ప్రభుత్వం స్పందించకపోతే ఏప్రిల్, మే నెలల్లో సమరశీల పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ -
ఇష్టారాజ్యంగా కంకర తరలింపు
సాలూరు రూరల్: మండలంలోని నెలిపర్తి పంచాయతీ బట్టివలస గ్రామం వెళ్లే దారిలో గడిచిన 5 రోజులుగా అక్రమంగా కంకర తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలిసినప్పటికీ కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.ఈ వ్వవహరంలో అక్రమ కంకర తవ్వకం దారులకు తెలుగుతమ్ముళ్లు అండగా ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూలో ఉన్నతాధికారులను సైతం వారు మేనేజ్ చేస్తామని అక్రమార్కులకు భరోసా ఇస్తున్నట్లు పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కంకర తవ్వకాల్లో జేసీబీతో పాటు సుమారు 10నుంచి 15 ట్రాక్టర్లు రవాణాలో వినియోగిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం నుంచి విజయనగరం జిల్లా రామభద్రపురం మండలానికి కంకర రవాణా చేస్తున్నారు. కనీసం ఎలాంటి అనుమతులు లేకుండా ఇంత బహిరంగంగా పక్క జిల్లాకు కంకర రవాణా జరుగుతున్నా ఇంతవరకు అధికారులు పట్టించుకోకపోవడం వెనుక కంకర అక్రమ తవ్వకాలను ఏమేరకు రెవెన్యూ అధికారులు ప్రోత్సహిస్తున్నారో అర్థమవుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా రెవెన్యూ అధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పట్టించుకోని రెవెన్యూ అధికారులు -
నేడే జాతీయ లోక్ అదాలత్
విజయనగరం లీగల్: జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాలతో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా 21 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేశామని తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులను, మోటార్ ప్రమాద బీమా కేసులు, బ్యాంకు కేసులు, చెక్కుబౌన్స్ కేసులు, మనీ కేసులు, ప్రాంసరీ నోట్ కేసులు, ఎలక్ట్రిసిటీ కేసులు, ఎకై ్సజ్ కేసులు, ల్యాండ్ కేసులు, కుటుంబ తగాదాలు వాటర్ కేసులు, మున్సిపాలిటీ కేసులు, ప్రి లిటిగేషన్ కేసులు, ఇరుపార్టీల అనుమతితో రాజీ మార్గంలో శాశ్వత పరిస్కారం చేసుకోవచ్చునన్నారు. కక్షిదారులు, ప్రజలు శనివారం జరగనున్న జాతీయ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. -
మహిళా క్రీడాపోటీలతో ఆనందం
విజయనగరం అర్బన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీఎన్జీవో జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ స్టేడియంలో శుక్రవారం జరిగిన క్రీడా పోటీలు మహిళా ఉద్యోగుల్లో ఆనందం నింపాయి. తొలుత పోటీలను విజయనగరం ఆర్డీఓ దాట్ల కీర్తి గాల్లో బెలూన్లు ఎగరవేసి జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన మహిళా ఉద్యోగులు అధికసంఖ్యలో ఉత్సాహవంతంగా పాల్గొని పోటీల్లో ప్రతిభ చూపారు. కబడ్డీ, ఖోఖో, టెన్నికాయిట్, షటిల్ బాడ్మింటన్, మ్యూజికల్ చైర్ తదితర క్రీడల్లో అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. పోటీలను కె.భాను, పి.అదిలక్ష్మి, వి.సౌదామిని, ఎస్.విజయలక్ష్మి, పి.భారతీదేవి, అనురాధ నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు డీవీరమణ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.శ్రీధర్‌బాబు, ఎ.సురేష్, జీవీఆర్ఎస్కిశోర్, వై.ఆనంద్‌కుమార్, గోపీనాథ్, జిల్లా కోశాధికారి ఎస్వీసుధాకర్, ఎ.కనకరాజు, ఎల్.తవుడు, కేవీశ్రీను, జిల్లా మహిళా విభాగం చైర్పర్సన్ కె.ఆదిలక్ష్మి, ఆర్.శ్రీసప్న, కె.రాధిక, మహిళా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
సారా నిర్మూలనకు ‘నవోదయం 2.0
విజయనగరం క్రైమ్: సారా నిర్మూలనకు ‘నవోదయం 2.0’ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఉమ్మడి విజయనగరం జిల్లా ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ పైడి రామచంద్రరావు తెలిపారు. విజయనగరం ప్రదీప్నగరలోని ఎకై ్సజ్‌శాఖ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయనగరం జిల్లాలో 26, పార్వతీపురం మన్యం జిల్లాలో 137 గ్రామాలను సారా ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించామన్నారు. ఒక్కో ఎకై ్సజ్ అధికారికి రెండు నుంచి మూడు గ్రామాలు దత్తత ఇచ్చి ఆయా గ్రామాల్లో సారా నిర్మూలనకు కృషిచేస్తామని చెప్పారు. దీనికోసం సర్పంచ్, వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ, స్థానిక ఎకై ్సజ్ అధికారి, మహిళా సంఘాల సభ్యులతో గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. మండల స్థాయి కమిటీలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ, ఎఫ్ఆర్ఓ, జిల్లా స్థాయి కమిటీలో కలెక్టర్, ఎస్పీ, జిల్లా ఎకై ్సజ్ అధికారి, అటవీ అధికారి ఉంటారని చెప్పారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ అమలుచేస్తామని హెచ్చరించారు. గతేడాది అక్టోబర్ నుంచి విజయనగరం, పార్వతీపురం(మన్యం) జిల్లాల్లో 360 కేసులు నమోదుచేసి 210 మందిని అరెస్టు చేశామన్నారు. సారా తయారు చేసినా, నిల్వ ఉంచినా, రవాణా చేసినా, విక్రయించినా టోల్ ఫ్రీ నంబర్ 14405కి, విజయనగరం కంట్రోల్ రూమ్‌నంబర్ 08922 274865, పార్వతీపురం కంట్రోల్ రూమ్ నంబర్– 08963222778కి సమాచారం అందజేయాలని కోరారు. ఆయా వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. -
బైక్‌పైనుంచి జారి పడి వ్యక్తి మృతి
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని అలమండ పంచాయతీ నీలకంఠాపురం గ్రామానికి చెందిన కొండగొర్రి నాగేశ్వరరావు(46) బైక్‌పై నుంచి జారిపడి మృతి చెందాడు. ఈ మేరకు చినమేరంగి ఎస్సై పి.అనీష్ తెలిపిన వివరాల మేరకు నీలకంఠాపురం గ్రామానికి చెందిన నిమ్మక శంకర్రావు తన బైక్‌పై అదే గ్రామానికి చెందిన కొండగొర్రి నాగేశ్వరరావు, పాలక లాలిబాబులను ఎక్కించుకుని గురువారం రాత్రి గుమ్మలక్ష్మీపురం మండలం బొద్దిడి గ్రామదేవత పండగకు వెళ్తున్నాడు. ఆ సమయంలో మార్గమధ్యంలో బైక్‌పై నుంచి జారిపడిన నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలు కావడంతో 108 సహాయంతో పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. మితిమీరిన వేగంతో వెళ్లడంతోనే ప్రమాదం జరిగిందని, ప్రమాదంలో తమ చిన్నాన్న మృతి చెందాడని కొండగొర్రి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి...భోగాపురం: ఈనెల 5వ తేదీన మండంలోని రావివలస ట్రంపెట్ వంతెన కింద ఆగి ఉన్న లారీని ఢీకొని గాయపడిన జోతేంద్ర నారాయణ పాండే(41) చికిత్స పొందుతూ మృతిచెందాడు. విశాఖపట్నానికి చెందిన జోతేంద్ర పాండేను గాయాల పాలైన అనంతరం తగరపువలస ఎన్ఆర్ఐ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. మృతుడి తండ్రి హరినారాయణ పాండే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఎన్వీ ప్రభాకర్ తెలిపారు. -
నైపుణ్యాలు కలిగిన యువతతో గ్రామీణాభివృద్ధి
● గిరిజన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టి.వి.కట్టిమణి విజయనగరం అర్బన్: నైపుణ్యాలు కలిగిన యువతతో గ్రామీణాభివృద్ధి సాధించవచ్చని కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీవీ కట్టిమణి అన్నారు. వర్సిటీలో ‘ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ద్వారా గ్రామీణాభివృద్ధి సాధికారపరచడం’ అనే అంశంపై శుక్రవారం జరిగిన సదస్సును ఆయన ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధిలో వ్యవస్థాపకత ప్రాముఖ్యతను తెలియజేశారు. నైపుణ్య అభివృద్ధి, స్థిరమైన పద్ధతులతో జనాభాను శక్తివంతంచేసే సహాయక కార్యక్రమాలకు వర్సిటీ ప్రాధాన్యమిస్తోందన్నారు. ప్రొఫెసర్ విఘ్నకాంత్ ఎస్.చాట్పల్లి మాట్లాడుతూ జీవనోపాధి మార్గాలను మెరుగుపరుచుకునేందుకు వ్యవస్థాపక వ్యూహాలను గ్రామీణ యువత అనుసరించాలన్నారు. కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (ఎస్ఎంఎస్) డీన్, ప్రొఫెసర్ జితేంద్రమోహన్ మిశ్రా, బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం అధిపతి డాక్టర్ ఎ.వి.అప్పసాబా పాల్గొన్నారు. -
10న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా
సాలూరు: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఈ నెల 10న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఉషశ్రీ, జేకేసీ కో ఆర్డినేటర్ రాంబాబులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దివిస్ ల్యాబొరేటరిస్ లిమిటెడ్ హైదరాబాద్, విశాఖపట్నం, కాకినాడ సమీపంలో ఉన్న బల్క్‌డ్రగ్ ప్రొడక్షన్ విభాగంలో పనిచేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ట్రైనీ సూపర్వైజర్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు బీఎస్సీ కెమిస్ట్రీ, బీఫార్మశీ, బీటెక్(కెమికల్). ఎంఎస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రి),అనలిటికల్ కెమిస్ట్రీ, ఎం ఫార్మశీ చేసిన వారు అర్హులని తెలిపారు.పై కోర్సులు పూర్తిచేసిన లేదా ఆఖరి సంవత్సరం చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు ఒరిజనల్ సర్టిఫికెట్స్, జిరాక్స్‌లను తీసుకుని ఇంటర్వూకు హాజరు కావాలని సూచించారు. డీఎస్సీ, ఎస్జీటీకి ఆన్లైన్లో ఉచిత శిక్షణ విజయనగరం టౌన్: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆఽంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు డీఎస్సీ, ఎస్జీటీ పరీక్షకు అర్హులైన జిల్లాకు చెందిన బీసీ, ఈడబ్ల్యూఎస్, ఈబీసీ వర్గాలకు చెందిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.పెంటోజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 10వతేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అభ్యర్థుల వార్షిక ఆదాయం రూ.రెండు లక్షల లోపు ఉండాలని స్పష్టం చేశారు. ఉచిత ఆన్లైన్ శిక్షణకు డిగ్రీ మార్క్‌లిస్ట్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, నేటివిటీ, డీఎస్సీకి ఎంపికై న టెట్ మార్క్స్, జిరాక్స్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు రెండు దరఖాస్తుతో జతచేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9603557333, 9177726454 నంబర్లను సంప్రదించాలని కోరారు. సేవా పతకాలు అందజేసిన కమాండెంట్ మల్లికా గార్గ్డెంకాడ: ఉత్కృష్ఠ, అతి ఉత్కృష్ఠ సేవా పతకాలను ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్ పోలీస్అధికారులు, సిబ్బందికి కమాండెంట్ మల్లికా గార్గ్ అందజేశారు. చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో 2019లో 12, 2020లో 9, 2023లో 13 ఉత్కృష్ఠ సేవా పతకాలకు ఎంపికై న బెటాలియన్ పోలీస్ అధికారులు, సిబ్బందికి కమాండెంట్ చేతుల మీదుగా అందజేశారు. అలాగే 2019వ సంవత్సరంలో 7, 2020లో 4, 2023లో 7 అతి ఉత్కృష్ఠ పతకాలను అందజేశారు. పదిమందికి యాంత్రిక్ సేవా పతకాలను అందించారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ డి.వెంకటేశ్వరరావు,అసిస్టెంట్ కమాండెంట్లు పి.సత్తిబాబు,ఎస్.బాపూజీ, డీవీ రమణమూర్తి,, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 41 గ్యాస్ సిలిండర్ల సీజ్ విజయనగరం ఫోర్ట్: జిల్లాలో డొమెస్టిక్ సిలిండర్లను అక్రమంగా వాడుతున్న హోటల్స్, రెస్టారెంట్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్‌పై సివిల్ సప్లయిస్ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు చేశారు. సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్దార్లు రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. విజయనగరం, డెంకాడ, గజపతినగరం మండలాల్లో 8 చోట్ల 6ఎ కేసులు నమెదు చేసి 25 సిలిండర్లు సీజ్ చేశారు. అదేవిధంగా చీపురుపల్లి, రాజాం, గరివిడి మండలాల్లో 7 చోట్ల ఏడు 6 ఎ కేసులు నమోదు చేసి 16 సిలిండర్లను సీజ్ చేశారు. -
టేకు, మామిడి, జీడిచెట్లు దగ్ధం
బలిజిపేట: మండలంలోని మిర్తివలస గ్రామసమీపంలో మిర్తివలస, తుమరాడ రెవెన్యూ పరిధిలో ఉండే టేకు, మామిడి, జీడితోటల్లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించడంతో చెట్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో 18మంది రైతులకు చెందిన సుమారు 2,580టేకుచెట్లు, 307మామిడి, 170జీడి చెట్లు కాలిపోయాయని రైతులు తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కావడంతో మంటలు ఆర్పేందుకు అవకాశం లేకవడంతో చెట్లు కాలిపోయాయని రైతులు వాపోయారు. రెవెన్యూ సిబ్బంది నష్టాన్ని అంచనా వేశారని రైతులు తెలిపారు. ఈ ప్రమాదంలో డొక్కర రాము, ప్రగడ సోములయ్య, సాలీల సుశీల, శ్రీరాములు, పోలిరాజు, పైడితల్లి, ఈశ్వరరావు, గుడుపూరు గణపతి, జి.లక్ష్మణ, ఎం.పైడిరాజు, పి.రామారావు, జి.అచ్చియ్య, పైడయ్య, ఆర్. తిరుపతి, ఎస్.శివకృష్ణ, గంగయ్య, జి.సత్యం, ఎస్.సత్యం, మజ్జియ్య తదితరుల రైతులకు సంబంధించిన తోటల్లోని చెట్లు దగ్థమయ్యాయి. దీనిపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు. -
విద్యార్థినులకు లఘుచిత్ర ప్రదర్శన
పార్వతీపురం రూరల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో విద్యార్థినులకు మహిళల గౌరవాన్ని పెంపొందించే లఘు చిత్రాలను జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో సంబంధిత స్టేషన్ల సిబ్బంది ద్వారా శుక్రవారం ప్రదర్శించినట్లు ఎస్పీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు సామాజిక, ఆర్థిక, క్రీడ, రాజకీయ రంగాల్లో సాధించిన ప్రగతిని గురించి విద్యార్థులకు వివరించి మహిళల హక్కులు, వారి శక్తి, సమానత్వం, మానసిక స్థైర్యం, స్వీయ రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలను గత ఏడు రోజులుగా నిర్వహించామని చెప్పారు. మహిళా చట్టాలు, పోక్సో యాక్ట్, ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, గుట్టచ్, బ్యాడ్‌టచ్, సామాజిక మాధ్యమాలు, సైబర్ నేరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల పరమైన అంశాలపై పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. పోలీసుశాఖ మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పోలీస్‌సిబ్బంది సహాయ సేవలు 24/7 ఉంటాయన్నారు. అత్యవసర సమయాల్లో హెల్ప్‌లైన్ నంబర్లు చైల్డ్హెల్లైన్ 1098, ఉమెన్ హెల్లైన్ 181, పోలీస్ హెల్లైన్ 100/112 సైబర్ నేరాల హెల్ప్‌లైన్ 1930 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
మహిళల పట్ల గౌరవంతో మెలగాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్వతీపురంటౌన్: సమాజ, కుటుంబ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించే మహిళల పట్ల ప్రతిఒక్కరూ గౌరవంతో మెలగాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2కె రన్‌ను శుక్రవారం ఉదయం ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వ కార్యాలయాల సముదాయం(ఆర్సీఎం) నుంచి కలెక్టరేట్ వరకు 2కె రన్ సాగింది. అక్కడ మానవహారాన్ని ఏర్పాటుచేసి అధికారులు, విద్యార్థులతో మహిళాదినోత్సవం ప్రాధాన్యతను వివరిస్తూ కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. మహిళలు ఏ రంగంలోనూ పురుషుల కంటే తక్కువ కాదని, వారిని వారు ప్రతిక్షణం నిరూపించుకుంటున్నారని తెలిపారు. విద్య, వైద్యం, వ్యాపారం, రాజకీయాలు, క్రీడలు, నటన, టెక్నాలజీ, బ్యాంకింగ్, హెల్త్ కేర్, అంతరిక్షం, ఇంటి బాధ్యతలతో సహా పలు రంగాల్లో మహిళలు రాణిస్తూ, మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పారు. రంగం ఏదైనా, ఎంత కష్టమైనా ఉన్నత శిఖరాలను చేరుకొని పురుషులకు తామేమీ తీసిపోమని తెలియజేస్తున్నారని కితాబిచ్చారు. శనివారం నిర్వహించే మహిళా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖాధికారి డా.టి.కనకదుర్గ, జిల్లా విద్యాశాఖ అధికారి డా.ఎస్.తిరుపతినాయుడు, వైద్యారోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి టి.జగన్మోహన్రావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. వట్టిగెడ్డ పరిశీలన జియ్యమ్మవలస రూరల్: మండలంలోని రావాడ రామభద్రపురం వద్ద ఉన్న ఒట్టిగెడ్డ ప్రాజెక్టును కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. ఆయకట్టు, ప్రాజెక్టు పరిస్థితిని సాగునీటి సంఘ సభ్యులను అడిగితెలుసుకున్నారు. అనంతరం స్థానిక పీహెచ్సీను సందర్శించారు. పీహెచ్సీలో అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. సిబ్బంది కొరత, సమస్యలను వైద్యుడు సీహెచ్ శంకరరావును అడిగి తెలుసుకున్నారు. గిరిజన సంక్షేమ పాఠశాల ఆవరణలో పదోతరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. సమయం వృథాకాకుండా చదవాలని, మంచి మార్కులు సాధించాలని ఉద్బోధించారు. -
శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025
వెయిట్‌లిఫ్టింగ్ పోటీలో తలపడుతున్న ఉషారాణి విజయలక్ష్ములు.. ఆడపిల్లంటే.. ఆటబొమ్మ కాదు.. ‘ఆటా’డించే అమ్మ. ఎంత ‘బరువైన’ బాధ్యతలనైనా ఇట్టే ఎత్తి పడేస్తారు. అచ్చంగా ఈ విజయలక్ష్ముల్లా. పాలకొండలోని పెద్దకాపు వీదికి చెందిన గార తిరుపతిరావు, చిన్నమ్మడులది వ్యవసాయ కుటుంబం. తిరుపతిరావు ఎద్దుల బండి నడిపేవారు. ఆయనకు మొదటి నుంచి సంగిడీలు ఎత్తడమంటే ఆసక్తి. అప్పుడప్పుడు పోటీలకు కూడా వెళ్లేవాడు. అందువల్లేనేమో.. పిల్లలకు కూడా క్రమంగా ఇష్టం ఏర్పడింది. వెయిట్ లిఫ్టింగ్ వైపు మళ్లేలా చేసింది. తన కుమార్తెలు అరుణరాణి, లలితరాణి, ఉషారాణిలకు చిన్నప్పటి నుంచి వెయిట్‌లిఫ్టింగ్‌లో ప్రోత్సహించారు. చిన్నతనంలో ఆడపిల్లలు బరువులు ఎత్తడం ఏమిటని మాట్లాడుకునేవారే.. ఇప్పుడు వారి సంకలాన్ని చూసి అభినందిస్తున్నారు. ఎన్నో ‘ఆట’ంకాలను అధిగమిస్తూ.. నేడు వెయిట్‌లిఫ్టింగ్‌లో ముగ్గురు అక్కాచెల్లెళ్లూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. వివిధ వేదికల్లో రజిత, బంగారు పతకాలు సాధించారు. పెద్ద కుమార్తె క్రీడా కోటాలో రైల్వేలో ఉద్యోగం సాధించింది. రెండో కుమార్తె ఉషారాణి 2005లో క్రీడల్లోకి అడుగు పెట్టారు. ఆటలో రాణించడం.. ఆమె జీవితాన్నే మార్చింది. పస్తుతం పీఈటీగా సరుబుజ్జిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నారు. తనలాంటి ఎంతోమంది క్రీడా మెరికల ను తయారు చేస్తున్నారు. ఇద్దరు అక్కల అడుగుజాడల్లోనే చిన్న అమ్మాయి కూడా నడుస్తున్నారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో రాణిస్తూ.. ఎన్నో పతకాలను కై వసం చేసుకున్నారు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ముగ్గురు అమ్మాయిలు.. ఏకంగా జాతీయ స్థాయి క్రీడల్లో రాణించడమంటే చిన్న విషయం కాదు. ఈ క్రమంలో వారి కెదురైన ఎన్నో సవాళ్లను దీటుగా ఆటాడేసుకున్నారు. విజయులై సగర్వంగా నిలబడ్డారు. జాతీయ పతాకాన్ని, పాలకొండ కీర్తిని నలుదిశలా రెపరెపలాడిస్తున్నారు. ఆడపిల్ల అంటే.. ‘ఆడే’ ఉండిపోవాలా..? ఫలానా పనికే పరిమితం కావాలా..? కట్టుబాట్ల బందిఖానాలో బందీ అయిపోవాలా..? ఎవరన్నారు.. సృష్టికి మూలం, అవనిలో సగం.. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం.. ఇలా ‘ఆమె’ కోసం ఎన్ని చెప్పినా, ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ రంగం.. ఈ రంగమన్న తేడా లేదు. పురుషులు చేసే ప్రతి పనినీ సమర్థంగా చేయగలిగే స్థాయికి చేరుకుంది నేటి ఆధునిక మహిళ. ‘సమానత్వమన్న’ పదానికి అర్థం చెబుతోంది. తన శక్తి అపరిమితం.. తన సహనం, తెగువ అనితర సాధ్యం. మధ్యమధ్యలో ఎక్కడో రాబందులు.. తన ఉనికికి అడ్డొస్తున్నా, తన భవితను చిదిమేస్తున్నా.. వెరవక, వెనకడుగు వేయక.. ధైర్యంగా ముందడుగు వేస్తోంది.. నేటి మన ధైర్య లక్ష్మి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొంతమంది వనితల విజయగాథలు, మనో ధైర్యానికి ‘సాక్షి’ అక్షరరూపం. – సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్/పాలకొండ రూరల్ మూడేళ్ల కిందటి వరకు అందరిలానే తానూ ఒక సాధారణ గృహిణి. ఇంటి పని, వంట పని, పిల్లలను చదివించుకోవడం..ఇదే తనకు తెలిసిన వ్యాపకం. భర్త మరణం..ఒక్కసారిగా జీవితాన్ని తలకిందులు చేసింది. ముగ్గురు ఆడపిల్లలు. పెంచడం, పెళ్లిళ్లు చేయడం పెద్ద సవాలు. పెద్దగా చదువు లేకున్నా ఆ బాధ్యతను ధైర్యంగా స్వీకరించింది నాగవంశం లక్ష్మి. పార్వతీపురంలోని జగన్నాథపురానికి చెందిన ఈమె..మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురా లు. పొరుగుసేవల ప్రాతిపదికన పనిచేస్తోంది. మూడేళ్ల కిందట అనారోగ్యంతో భర్త చనిపోయాడు. అప్పటి నుంచి పారిశుద్ధ్య కార్మికురాలి గా మున్సిపాలిటీలో పనిచేస్తోంది. ఈ కాలంలోనే ఎన్నో కష్టాలను దిగమింగుతూ, ముగ్గురు పిల్లలకూ పెళ్లిళ్లు చేసింది. నేటి సమాజం అంతే.. ఒంటరి మహిళంటే చిన్నచూపు. అలాంటి అవమానాలు ఎదుర్కొంటూనే బతుకుపై ఆశతో... పిల్లలు, మనవళ్లపై మమకారంతో అన్నింటినీ అధిగమిస్తూ ముందుకు సాగిపోతున్నట్టు జీవన గాథను వినిపించారు. వైద్యులు దైవంతో సమానం. ఎన్నో ప్రాణాలను నిలుపుతారు. అందుకే.. సమాజంలో ఈ వృత్తి అంటే ఎనలేని గౌరవం. అలాగనీ.. ఇందులో సవాళ్లు లేకపోలేదు. ఒక్కోసారి ఎక్కడ చిన్న తేడా జరిగినా.. రోగుల బంధువుల ఆగ్రహానికి గురికాక తప్పదు. మన చేతిలో చిన్న పొరపాటు జరిగినా, అది జీవితాంతం వెంటాడుతుంది. కొన్ని దశాబ్దాలుగా ఈ వృత్తిలోని సవాళ్లను అధిగమిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నారు పాలకొండ ఏరియా ఆసుపత్రి సీ్త్ర వైద్యనిపుణురాలు వై.శివనాగజ్యోతి. సుదీర్ఘ వైద్యవృత్తిలో ఎన్నో పురుళ్లు పోశారు. ఆమె చేతులమీదుగా ఎంతోమందికి కొత్త జీవితాన్ని ఇచ్చారు. మొదటిగా ఈ లోకాన్ని చూపారు. గతంతో పోల్చుకుంటే నేడు వైద్యవృత్తి సవాల్‌గా మారింది. ఒక సమయమంటూ ఉండదు. 24 గంటలూ నిద్రాహారాలకు దూరమవ్వాలి. పురుషాధిక్య సమాజంలో మగవారితో పోల్చుకుంటే.. ఆడవారికి వైద్యవృత్తి కష్టమైనదే. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నారు ఈ చదువుల తల్లి. ‘మహిళలు సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. సుస్థిర గుర్తింపును సాధించేలా అడుగులు వేయాలి. సమాజ మనుగడలో కీలక భూమిక పోషించాలి’ అని ఆమె చెబుతున్నారు. ఆరోగ్యవంతమైన మహిళతో కుటుంబ ఆరోగ్యం కూడా ముడిపడి ఉంటుందని.. ఇటీవల కాలంలో వైద్యవృత్తిపై విద్యార్థినులు ఆసక్తి చూపడం అభినందనీయమన్నారు. ఆడపిల్లలు పైలెట్ అవ్వడం చూశాం.. లోకో పైలెట్ అవ్వడమూ చూశాం.. మరి.. ఆటో నడపాలంటే..చిన్నతనమేమీ కాదంటున్నారు పార్వతీపురం మండలంలోని కృష్ణపల్లికి చెందిన ఎం.సుకన్య. పదో తరగతి వరకు చదువుకున్న సుకన్య..26 ఏళ్ల వయస్సులోనే భారమైన బాధ్యతలు మోస్తోంది. కుటుంబ అవసరాల కోసం తొలుత ఏదో ఒక షాపులో పనికి కుదరాలనుకుంది. ఒకరి మీద ఆధారపడకుండా, నేటి సమాజంలో పురుషులకు దీటుగా నిలబడాలన్న ఆలోచన ఆమెను కొత్తగా ఆలోచించేలా చేసింది. ఆటో చోదకురాలిగా మారితే..ఇలా వచ్చిన ఆలోచనను తన భర్తతో పంచుకుంది. కష్టమైన రంగం..ఎన్నో సవాళ్లు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని నలువైపులా సున్నితమైన హెచ్చరిక. అవేవీ తన లక్ష్యం ముందు నిలవలేకపోయాయి. తన భర్త సహకారంతో రెండు రోజుల్లో ఆటో నడపడం ఆరంభించింది. ఇప్పుడు రెండేళ్లుగా తన జీవన ప్రయాణం ఆటోతోనే. నేడు మహిళా ప్రయాణికులు ఆమెను చూసి గర్విస్తున్నారు.. సెహభాష్ అంటూ భుజం తడుతున్నారు. మగవారైతే..చెల్లెమ్మా, ధైర్యంగా ముందుకెళ్లు అంటూ అండగా నిలుస్తున్నారు. తన కోరిక సొంత ఇల్లు కట్టుకోవాలని..కష్టపడుతోంది..కష్టపడుతూనే ఉంది. ఇంత కష్టాన్నీ భరిస్తున్న ఆమెకు చిన్న వెలితి..రూ.3.35 లక్షలు పెట్టి ఆటో కొనుగోలు చేసింది. నెలకు రూ.10 వేల వరకూ ఈఎంఐకే పోతోంది. నెలయ్యేసరికి కష్టమే కనిపిస్తోంది. ఆటో కోసం చేయూత అందించాలని అధికారుల చుట్టూ తిరిగింది. ఏ ఒక్కరూ దయతలచలేదు. సబ్సిడీ రుణమిప్పిస్తే ఆటో కోసం చేసిన అప్పు తీర్చుకుంటానని ఆమె కోరుతోంది. తండ్రి కూలీ. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబ నేపథ్యం. ఆ ఇంటి నుంచి ఒక ఆడపిల్ల సవాళ్లను అధిగమించి, ఉన్నత చదువులు చదవడమే కాదు..నేడు సమాజానికి మార్గదర్శిగా ఉద్యోగ బాధ్యతలు నెరవేరుస్తున్నారు పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై బెల్లాన సంతోషికుమారి. విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం మజ్జివలస గ్రామానికి చెందిన సంతోషికుమారిది నిరుపేద కుటుంబం. తండ్రి లేబర్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. కుమార్తె ఒక్కరే కావడంతో.. కష్టమైనా, తన ఇష్టం మేరకు ఉన్నంతలో మంచి చదువులు చదివించారు. కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకున్న ఆమె కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తూ, ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకుంటూ బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఈ క్రమంలో ఎన్నో అవాంతరాలు.. ఆటుపోట్లు. ఆడపిల్లకు అంత పెద్ద చదువులెందుకని కొందరు..శిక్షణ నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లాలంటే..అంతదూరం ఎందుకని ఇంకొందరు భయపెట్టారు. నచ్చజెప్పారు. కుటుంబ ప్రోత్సాహంతో వాటన్నింటినీ ఆమె అధిగమించారు. పోటీ పరీక్షలు రాసి, 2016లో ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం 2018లో విధుల్లో చేరారు. ప్రస్తుతం పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వరిస్తున్నారు. పోలీసు విధులంటే..24 గంటలూ రిస్క్‌తో కూడుకున్న పని. పెళ్లయిన తర్వాత కూడా భర్త (సంతోష్ హరి శివప్రసాద్), అత్తామామల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. దీంతో ఆమె ధైర్యంగా తన పని తాను చేసుకోగలుగుతున్నారు. ఆడపిల్లలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లక్ష్యం కోసం పరిశ్రమించాలని.. సవాళ్లను అధిగమిస్తూ విజయానికి బాటలు వేసుకోవాలని ఆమె స్ఫూర్తి మంత్రం వినిపిస్తున్నారు. అబ్బురపరిచిన వర్ణచిత్రం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీ్త్రమూర్తి వివిధ వృత్తులలో రాణిస్తున్నట్లు గరుగుబిల్లి మండలంలోని నాగూరు గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి పాలెల సోమేష్ వేసిన వర్ణచిత్రం పలువురిని ఆకట్టుకుంది. – గరుగుబిల్లి సంతాన లక్ష్మి.. మనోధైర్యే లక్ష్మి సాహసే లక్ష్మి.. -
పోక్సో కేసు నమోదు
బొండపల్లి: మండలంలోని ఒక గ్రామానికి చెందిన బాలుడు మరో గ్రామానికి చెందిన బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు బాధిత బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై యు.మహేష్ తెలిపారు. బాలికతో పాటు బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు నిర్వహించి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. హోమ్‌గార్డు కుటుంబానికి పోలీస్ శాఖ ‘చేయూతవిజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్‌శాఖలో పని చేసి, ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన హోమ్‌గార్డు కుటుంబానికి పోలీస్ శాఖ చేయూత అందించింది. ఈ మేరకు ఎస్పీ వకుల్ జిందల్ తన కార్యాలయంలో గురువారం హోమ్ గార్డు కుటుంబానికి సుమారు రూ.3 లక్షల చెక్కును అందజేశారు. ఏడాది పొడవునా హోమ్‌గార్డు సిబ్బంది పోగు చేసిన ఒక్క రోజు డ్యూటీ అలవెన్స్ చెక్కును జిల్లా పోలీసు కార్యాలయంలో హోంగార్డు భార్య వి.సత్యవతికి ఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, హోమ్గార్డ్స్ ఇన్చార్జ్ ఆర్ఐ ఆర్.రమేష్ కుమార్, డీపీఓ సూపరింటెండెంట్ ఏఎస్వీ ప్రభాకరరావు, పోలీసు కుటుంబసభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
8 నుంచి పీ–4 సర్వే చేపట్టాలి
పార్వతీపురంటౌన్: జిల్లాలో పీ–4 విధానంపై (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్షిప్) సర్వేను మార్చి 8 నుంచి పక్కాగా చేపట్టాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి మార్చి 7వ తేదీన సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇచ్చి 8వ తేదీ నుంచి ప్రారంభించి వారంలోగా సర్వేను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లావ్యాప్తంగా 2లక్షల 65వేల గృహాలకు సర్వే చేయాల్సి ఉందని, కావున ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టంచేశారు. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వ్మ్యాం(పీ–4)తో సర్వే, ఉపాధిహామీ, వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణ చర్యలపై గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీ–4 విధానం ద్వారా పేదలకు ఆర్థిక సాధికారత చేకూర్చడానికి జీవన ప్రమాణాలలో అట్టడుగు స్థాయిలో గల 20శాతం మంది నిరుపేదలను గుర్తించాల్సి ఉందన్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు చొరవ తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న వారి సహకారంతో అట్టడుగు స్థాయిలో ఉంటూ జీవించడానికి కనీససౌకర్యాలు లేని వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి పీ–4 విధానం ప్రభుత్వం అవలంభించనుందని చెప్పారు. ప్రజలు అందుబాటులో ఉండే సమయంలో ఈ సర్వేను చేపట్టాలని, ఒక్కొక్కరూ కనీసం 90 వరకు సర్వేలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీటి ఎద్దడి ఉండరాదు వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి మస్య ఉండరాదని, జూన్ మాంసాంతం వరకు తాగునీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జల్‌జీవన్ మిషన్ ద్వారా బోర్లు మంజూరై ఉంటే వాటిని వేయించుకోవాలని లేదా జిల్లా పరిషత్ నుంచి నిధులు పొంది పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడా తాగునీటి సమస్య వచ్చే జూన్ మాసాంతం వరకు తలెత్తరాదని తెల్చిచెప్పారు. భవిష్యత్‌లో స్వచ్ఛంద సంస్థల సహకారంతో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ మార్చి 20లోగా ఉపాధి పనుల పూర్తి మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ. 215కోట్లు జిల్లాకు మంజూరు కాగా, ఇప్పటివరకు రూ.158 కోట్ల మేర పనులు పూర్తి చేశారని, మరో రూ.28కోట్ల మేరకు పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. మిగిలిన నిధులకు సరిపడా పనులను మార్చి 20వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో మినీ గోశాలలు నిర్మాణాల కోసం చాలామంది కోరుతున్నారని, వాటిని దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో కేఆర్ఆర్సీ ప్రత్యేక ఉపకలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, జిల్లా పశు సంవర్ధక అధికారి డా.ఎస్. మన్మథరావు, మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకుడు కె.రామచంద్రరావు, పరిశ్రమల కేంద్ర జిల్లా మేనేజర్ ఎంవీ కరుణాకర్, జిల్లా విద్యాశాఖాధికారి డా.ఎన్. తిరుపతినాయుడు, జిల్లా ప్రణాళిక అధికారి పి.వీర్రాజు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్ అధికారి ఒ.ప్రభాకరరావు, డీఎల్డీఓ రమేష్ రామన్, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, పంచాయతీ రాజ్, మున్సిపాల్టీల డీఈఈలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్‌కు పేర్లు నమోదు చేసుకోవాలి
పార్వతీపురం: నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు యువత తమ వివరాలను నమోదు చేసుకోవాలని నెహ్రూ యువ కేంద్రం జిల్లా కె. వెంకట్ ఉజ్వల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని, యువత మేధాశక్తిని ఉపయోగించడంలో ప్రపంచంలో కెల్లా మన దేశం ప్రథమ స్థానంలో ఉండాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పిస్తున్నట్లు తెలిపారు. 18 నుంచి 25ఏళ్ల వయస్సు కలిగిన వారు ఈ యూత్ పార్లమెంట్ పోటీల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. యువత మై భారత్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని తరువాత ఒక్క నిమిషం నిడివి కలిగిన ‘‘వాట్ డజ్ వికసిత్ భారత్ మీన్ టూ యూ’’ అనే అంశంపై వీడియో చేసి మార్చి 9 అర్ధరాత్రిలోపు మై భారత్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. స్క్రీనింగ్ చేసి జిల్లా స్థాయిలో ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. జిల్లాస్థాయిలో వన్‌నేషన్, వన్ ఎలక్షన్, పేవింగ్ ది వేఫర్ వికసిత్ భారత్ అనే అంశంపై మూడు నిమిషాలు మాట్లాడాలని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సంస్థ రూపొందించిన వీడియోను వీక్షించేందుకు క్యూఆర్‌కోడ్‌ను అందుబాటులో ఉంచినట్లు తెలియజేశారు. -
ఓపెన్ హౌస్‌తో పోలీస్ వ్యవస్థ్ధపై అవగాహన
● ఎస్పీ మాధవ్ రెడ్డి పార్వతీపురం రూరల్: మహిళ సాధికార వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని చాకలి బెలగాంలో ఉన్న పోలీస్‌శాఖ మల్టీఫంక్షన్ హాల్ ఆవరణంలో గురువారం ఓపెన్ హౌస్ ఫర్ ఉమెన్ కార్యక్రమాన్ని జిల్లా పోలీస్‌శాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎస్పీ మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఽభద్రతే ప్రాధాన్యంగా పోలీసుశాఖ నిరంతరం పనిచేస్తుందని మార్చి 8వ తేదీన జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని మహిళ సాధికార వారోత్సవాలను పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. పోలీస్‌శాఖ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వినియోగించే ఆయుధాలను, పోలీస్‌శాఖలో కీలకమైన సాంకేతిక వ్యవస్థను, నేరస్థలంలో సాక్ష్యాలను సేకరించేందుకు క్లూస్‌టీమ్ ఉపయోగించే పరికరాలు, డాగ్‌స్క్వాడ్ పనితీరును కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి కళాశాల విద్యార్థినులు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా పోలీస్‌సిబ్బంది హాజరయ్యారు. కార్యక్రమంలో ఎస్పీ స్వయంగా కొన్ని ఆయుధాలు వినియోగించే పద్ధతులను మహిళలకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన జాగిలాల విన్యాసాలు చూపరులను అబ్బురపరిచాయి. కార్యక్రమంలో ఏఎస్పీ అంకిత సురానా, డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్ఐలు రాంబాబు, నాయుడు, టౌన్ సీఐ మురళీధర్, రూరల్ ఎస్సై సంతోషి, శాఖాపరమైన సిబ్బంది పాల్గొన్నారు. -
నెలాఖరులోగా వక్ఫ్ ఆస్తుల సర్వే
విజయనగరం అర్బన్: జిల్లాలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, దీనిలో భాగంగా ఈ నెలాఖరులోగా స్థలాల సర్వేను పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా స్థాయి వక్ఫ్ పరిరక్షణ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ చాంబర్లో గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో వక్ఫ్ స్థలాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వక్ఫ్ స్థలాలు అన్యాక్రాంతం అవకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లాలో మైనారిటీ సంక్షేమశాఖ రికార్డుల ప్రకారం మొత్తం 96 వక్ఫ్ స్థలాలను గుర్తించినట్లు చెప్పారు. మొత్తం ఆ స్థలాల వివరాలను వెంటనే సంబంధిత ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లకు అందజేయాలని వక్ఫ్, మైనారిటీ శాఖాధికారులకు సూచించారు. అలాగే ఇవే కాకుండా రెవెన్యూ, టౌన్ రికార్డుల్లో ఉన్న మొత్తం వక్ఫ్ స్థలాల వివరాలను సేకరించి, వాటిని సర్వే చేసి, నమూనా పటాలతో సహా ఈ నెలాఖరుకు అందజేయాలని, అనంతరం ఈ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు. -
సెంచూరియన్‌లో ఘనంగా జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవం
నెల్లిమర్ల రూరల్: మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వ విద్యాలయంలో జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఔషధ విద్యకు పునాది వేసిన ప్రొఫెసర్ మహాదేవ్ లాల్ ష్రాఫ్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పఠానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ ప్రశాంత కుమార్ మహంతి మాట్లాడుతూ ఈ ఏడాది ఫార్మా, పార్మసీ ప్రాక్టీస్‌లో వ్యవస్థాపక స్టార్టప్‌లు ప్రోత్సహించడమే ప్రధాన అజెండాగా ప్రభుత్వం పేర్కొందని, ఆ దిశగా విద్యార్ధులు సన్నద్ధం కావాలని సూచించారు. శిక్షణ ప్రారంభం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు సెంచూరియన్‌లో రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామ్‌ప్రసాద్ గురువారం ప్రారంభించారు. గ్రామీణ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకువెళ్తున్నామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ పల్లవి, డిప్యూటీ రిజిస్ట్రార్ వర్మ, డీన్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. -
ఏపీసీ పరిశోధనకు పేటెంట్ హక్కు
విజయనగరం అర్బన్: జిల్లా సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త (ఏపీసీ) డాక్టర్ ఎ.రామారా వు రూపొందించిన ‘పోలిమర్ పుల్లీ డ్రైవెన్ సెట్రీ ప్యూగల్ పంపు’నకు కేంద్ర ప్రభుత్వ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ శాఖ నుంచి పేటెంట్ హక్కు లభించింది. ఈ మేరకు ఆ శాఖ నుంచి ధ్రువీకరణ పత్రం అందినట్టు తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామారావు వెల్లడించారు. డాక్టర్ ఎన్టీఆర్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ యూనివర్సిటీలో పీహెచ్డీ కోర్సుగా 2014 నుంచి 2017 సంవత్సరం వరకు పరిశోధించిన ఆ పరికరానికి పేటెంట్ హక్కు లభించిందని వివరించారు. పూర్తిగా ప్లాస్టిక్ వినియోగంతో తక్కువ బరువు, తక్కువ వ్యయంతో పదేళ్లపాటు శ్రమించి పంపింగ్ పరికరాన్ని తయారుచేసినట్టు తెలిపారు. పరికరాని కి 20 సంవత్సరాలకు పేటెంట్ హక్కు లభించిందన్నారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కలిసి అభినందనలు అందుకున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు ప్రశంసలు విజయనగరం అర్బన్: జిల్లా కేంద్రం నుంచి ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాకు వెళ్లిన భక్తుల కు సురక్షిత ప్రయాణ సేవలందించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్లను జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ అభినందించారు. ప్రయాణికుల విశేష ఆదరణ పొందిన ఐదుగురు డ్రైవర్లకు జ్ఞాపిక లు, బహుమతులను ఆర్టీసీ డీపో ప్రాంగణంలో గురువారం అందజేశారు. కుంభమేళాకు నడిపిన ఐదు బస్సుల నుంచి రూ.12లక్షల వరకు ఆదా యం సమకూరిందని చెప్పారు. -
జ్వరాలకు కారణాలు విశ్లేషించాలి
శృంగవరపుకోట: మండలంలోని ధారపర్తి పంచాయతీ పరిధిలో జ్వరాలు విజృంభిస్తున్నాయన్న వార్తపై రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు స్పందించారు. ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి గురువారం చేరుకుని జ్వరాలతో చికిత్స పొందుతున్న గిరిజన చిన్నారులను పరామర్శించారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వైద్యసేవలపై ఆరా తీశారు. జ్వరాలకు కారణాలు అన్వేషించి నివారణ చర్యలను వేగవంతంగా చేపట్టాలని వైద్యులకు సూచించారు. ఆయన వెంట ఎస్టీ కమిషన్ మెంబర్ కొర్రా రామలక్ష్మి ఉన్నారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకరరావు -
వసతి గృహాలపై నిరంతర పర్యవేక్షణ
పార్వతీపురంటౌన్: జిల్లాలోని వసతి గృహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో వసతి గృహాల పనితీరుపై గురువారం సమీక్షించారు. మెనూ అమలు, బోధన, తాగునీరు, మరుగుదొడ్లు నిర్వహణ తదితర అంశాలపై సహాయ సంక్షేమ అధికారులు తనిఖీలు నిర్వహించి నివేదికలు అందజేయాలని ఆదేశించారు. పల్లె నిద్రలో భాగంగా వసతిగృహాల పరిశీలనలో మంజూరు చేసిన పనుల పురోగతి, పూర్తి కావలసిన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వసతిగృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలన్నారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జి డీడీ చంద్రబాబు, జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ సాధికారత అధికారి ఎం.డి. గయాజుద్దీన్, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి ఎస్.కృష్ణ పాల్గొన్నారు. సెల్ టవర్ల ఏర్పాటు స్థలాలు గుర్తించాలి జిల్లాలో జియో, బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ల ఏర్పాటుకు అవసరమైన ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సెల్ టవర్ల ఏర్పాటుపై ఎంపీడీఓలు, సంబంధిత అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సిగ్నల్ సమస్యలు ఉన్న ప్రాంతాలకు తొలుత ప్రాధాన్యమివ్వాలన్నారు. అవసరమైతే అటవీశాఖ అధికారులతో మాట్లాడతానన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో కె.హేమలత, సాలూరు, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం ఎంపీడీఓలు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి జిల్లాలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మంజూరైన అభివృద్ధి వనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పీఎం జన్మాన్, పల్లె పండగ పనుల పురోగతిపై అధికారులతో గురువారం సమీక్షించారు. కొత్తగా మంజూరైన పనులను వెంటనే ప్రారంభించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. 56 పనులకు సమగ్ర అంచనాలను సిద్ధంచేసి నివేదిక అందజేయాలని స్పష్టంచేశారు. -
ఆయుష్‌శాఖలో సిబ్బంది కొరత
● హోమియో, ఆయుర్వేదం, యూనాని విభాగాల్లో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది అవసరం ● ఇబ్బందులు పడుతున్న రోగులు విజయనగరం ఫోర్ట్: అల్లోపతి వైద్యం చేయించుకోవడానికి కొంతమంది అసక్తి చూపుతుండగా, మరి కొంతమంది ఆయుష్ వైద్యం పట్ల అసక్తి కనబరుస్తున్నారు. అయితే ఆయుష్‌శాఖలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కొరత అధికంగా ఉంది. దీంతో రోగులకు వైద్యసేవలు పూర్తి స్థాయిలో అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆయుష్‌శాఖ పరిధిలో హోమియో, ఆయుర్వేదం, యునాని, నేచురోపతి విభాగాలు ఉన్నాయి. జిల్లాలో కొన్ని చోట్ల హోమియో డిస్పెన్సరీలు ఉండగా, మరి కొన్ని చోట ఆయుర్వేదం డిస్పెన్సరీలు, యునాని, నేచురోపతి డిస్పెన్సరీలు ఉన్నాయి. వైద్యసిబ్బంది కొరత అధికంగా ఉన్నప్పటికీ కూటమి సర్కార్ ఖాళీలు భర్తీ చేయకుండా అలసత్వం వహిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. హోమియోలో 22 ఖాళీలు హోమియో విభాగంలో 16 డిస్పెన్సరీలు ఉన్నాయి. 16మంది వైద్యులకు గాను 13 మంది ఉన్నారు. మూడు వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంపౌండర్లు 16 మందికి గాను ఆరుగురు మాత్రమే ఉన్నారు. 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్వీపర్కమ్ స్కావెంజర్ పోస్టులు 16 పోస్టులకు గాను ఏడుగురు ఉన్నారు. 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయుర్వేదంలో.. ఆయుర్వేదం శాఖలో 16 డిస్పెన్సరీలు ఉన్నాయి. 16మంది వైద్యుల పోస్టులకు గాను 15 మంది ఉన్నారు. ఒక వైద్యాధికారి పోస్టు ఖాళీగా ఉంది. కాంపౌండర్ పోస్టులు ఏడుకుగాను ఇద్దరు ఉన్నారు. ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏఎన్ఎం పోస్టులు 8కి గాను ఇద్దరు ఉన్నారు ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అటెండర్ పోస్టులు ఐదుకుగాను ఐదు ఖాళీగా ఉన్నాయి. నర్సింగ్ ఆర్డర్లీ ఏడుకుగాను నలుగురు ఉన్నారు. మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిస్పెన్సరీ మూడు పోస్టులకు మూడు ఖాళీగా ఉన్నాయి. మెటర్నిటీ అసిస్టెంట్ ఒక పోస్టుకు గాను ఒక పోస్టు ఖాళీగా ఉంది నేచురోపతిలో.. నేచురోపతి డిస్పెన్సరీలు మూడు ఉన్నాయి. ముగ్గురు వైద్యులకుగాను ముగ్గురు ఉన్నారు. కాంపౌండర్లు ముగ్గురికి గాను ఒక్కరే ఉన్నారు. రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు మూడుకు గాను ఇద్దరు ఉన్నారు. ఒక పోస్టు ఖాళీగా ఉంది. యునానిలో.. యునాని డిస్పెన్సరీలు రెండు ఉన్నాయి. ఇద్దరు వైద్యులకు గాను ఒక్కరే ఉన్నారు. ఒక పోస్టు ఖాళీగా ఉంది. కాంపౌండర్ పోస్టులు రెండుకు గాను ఒక్కరే ఉన్నారు. ఒక పోస్టు ఖాళీగా ఉంది. స్వీపర్ కమ్ స్కావెంజర్ ఒక పోస్టుకుగాను ఒక్కరు ఉన్నారు. ఆయుష్‌శాఖలో వివిధ వ్యాధులకు చికిత్స ఆయుష్‌శాఖలో ఉన్న హోమియో, ఆయుర్వేదం, యునాని, నేచురోపతి విభాగాల ద్వారా వివిధ వ్యాధులకు వైద్యసేవలు అందిస్తారు. చర్మవ్యాధులు, పక్షవాతం, కీళ్లవాతం, నడుంనొప్పి, బీపీ, సుగర్, ఊబకాయం, సైనసైటిస్, ఆస్తమా, మూత్ర సంబంధిత, సొరియాసిస్, కామెర్లు తదితర వ్యాధులకు చికిత్స అందజేస్తారు. సిబ్బంది కొరత వాస్తవం ఆయుష్‌శాఖలో పారామెడికల్ సిబ్బంది కొరత ఉంది. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలపై నివేదిక ఉన్నతాధికారుల వద్ద ఉంది. డాక్టర్ జి.వరప్రసాద్, సీనియర్ హోమియో వైద్యాధికారి -
‘మన్యం సహజ రైతు ఉత్పత్తి దారులకు’ జాతీయ అవార్డు
సీతంపేట: మండలంలోని మన్యం సహజ రైతు ఉత్పత్తిదారుల కంపెనీకి జాతీయ స్థాయి లో గుర్తింపు లభించింది. భారత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ కలెక్టీవ్ ఎంటర్‌ప్రైజస్ అవార్డు వరించింది. కేరళ రాష్ట్రం త్రిశూర్‌లో ఈ నెల 8వ తేదీన అవార్డును కంపెనీ సభ్యులు అందుకుంటారని ఆర్ట్స్ డైరెక్టర్ నూక సన్యాసిరావు తెలిపారు. 70 గ్రామాల్లో 1507 మంది వాటా దారులు (రైతులు) ఇందులో సభ్యులుగా ఉన్నారు. పసుపు, జీడి, చిరుధాన్యాలు, పైనా పిల్, కొండచీపుర్లు వంటి పంటల గ్రేడింగ్, విలువ ఆధారిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పైనాపిల్జామ్, జ్యూస్, క్యాండీస్, పన సతో చిప్స్, చిరుధాన్యాలతో బిస్కెట్ల తయారీ వంటి అంశాలపై ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం సాంకేతిక పరిజ్ఞానం సాయంతో శిక్షణ ఇవ్వడంతో పాటు స్వయంగా యూనిట్లు నిర్వహిస్తున్నట్టు సంఘ సభ్యులు గౌరమ్మ, సీఈఓ శంకరరావు తెలిపారు. దేవదాయశాఖ భూముల పరిరక్షణే ధ్యేయం విజయనగరం టౌన్: జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవదాయశాఖ భూముల పరిరక్షణే ధ్యేయమని ఆ శాఖ జిల్లా సహాయ కార్యనిర్వహణాధికారి కె.శిరీష తెలిపారు. విజయనగరంలోని దేవదాయశాఖ కార్యాలయంలో ఆమె గురువారం మాట్లాడారు. జిల్లాలో దేవదాయశాఖ పరిధిలో 9,900 ఎకరాల భూములు ఉన్నాయన్నారు. వాటిలో నాలుగువేల ఎకరాల వరకు ఆక్రమణలో ఉన్నట్టు వెల్లడించారు. శిస్తుల రూపంలో 2వేల ఎకరాల భూములకు రూ.50 లక్షలు, ఆస్తుల లీజుల వల్ల రూ.57 లక్షల ఆదాయం సమకూరుతోందని తెలిపారు. శిస్తులు చెల్లించాలని రైతులకు చెప్పామన్నారు. జిల్లాలో 473 ఆలయాల రిజిస్టరై ఉన్నాయని, భూములున్న దేవాలయాలు 313కాగా, 165 ఆలయాలు మాత్రమే కార్యనిర్వహణాధికారుల చేతుల్లో ఉన్న ట్టు వెల్లడించారు. -
10న జువాలజీ ఫ్యాకల్టీ పోస్టుకు ఇంటర్వ్యూ
పార్వతీపురంటౌన్: పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జువాలజీ ఫ్యాకల్టీ పోస్టుకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. చింతల చలపతి రావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 10న ఉదయం 10:30లకు జువాలజీ ఫ్యాకల్టీ పోస్టు నియామకానికి నేరుగా ముఖాముఖి పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి నియామకం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నియామకం పూర్తిగా గెస్ట్ ఫ్యాక్టల్టీ పద్ధతిలో జరుగుతుందని తెలియజేశారు. నెలకు రెమ్యూనరేషన్ రూ. 28000 వరకు అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. ఏడుగురు జూదరుల అరెస్టు పార్వతీపురం రూరల్: పార్వతీపురం మండలంలోని కృష్ణపల్లి గ్రామ పరిధిలో పార్వతీపురం రూరల్ పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేసి జూదం ఆడుతున్న ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ ఎస్సై బి.సంతోషి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు గురువారం కృష్ణపల్లి గ్రామ శివారులో దాడిచేసి జూదం ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుంచి రూ.18,300 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. 8న సబ్ జూనియర్ కబడ్డీ జట్ల ఎంపికవిజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సబ్‌జూనియర్స్ బాల, బాలికల కబడ్డీ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఈనెల 8వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కేవీ ప్రభావతి గురువారం తెలిపారు. నగరంలోని సిటీ క్లబ్ ఆవరణలో ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఎంపిక పోటీల్లో 16 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండి 55 కేజీల బరువు కలిగిన క్రీడాకారులు మాత్రమే పాల్గొనేందుకు అర్హులుగా పేర్కొన్నారు. జిల్లా జట్ల ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు కడప జిల్లాలో జరగబోయే అంతర్ జిల్లాల పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తిగల క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9949721949 నంబర్‌ను సంప్రదిం చాలని కోరారు. గంజాయితో ఇద్దరి అరెస్ట్నెల్లిమర్ల: గంజాయి లావాదేవీలు చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై బి.గణేష్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒడిశాలోని రాయగడ నుంచి గంజాయిని నెల్లిమర్ల పట్టణంలోని చంపావతి నది తీరంలో థామస్ పేట గ్రౌండ్ వద్దకు తరలిస్తున్న వ్యక్తి, దానిని కొనుగోలు చేసిన వ్యక్తిని పట్టుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నెల్లిమర్లకు చెందిన వ్యక్తి గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్ల రూపంలో వినియోగ దారులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వారిద్దరి దగ్గర సుమారు ఒక కేజీ 160 గ్రాముల గంజాయిని సీజ్ చేసి అరెస్టు చేసినట్లు చెప్పారు. రెండు బైక్‌లు ఢీకొని వ్యక్తి ..రామభద్రపురం: మండలం పరిధిలోని తారాపురం టీకాల లచ్చన్న గుడి వద్ద గురువారం రెండు బైక్‌లు ఢీ కొని ఒకరు మృతిచెందగా మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రామ్‌గోపాల్ గౌతం, సాన్వర్ ప్రసాద్ వర్మ స్నేహితులు. వారిద్దరూ కొన్ని నెలల క్రితం జీవనోపాధి కోసం సాలూరుకు వచ్చి కొత్తభవనాలకు పుట్టీలు, సీలింగ్‌లు వేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని సొతూరుకు వెళ్తానని బొబ్బిలి రైల్వేస్టేషన్లో డ్రాప్ చేయమని రామ్‌గోపాల్‌ను ప్రసాద్ వర్మ కోరడంతో ఇద్దరూ కలిసి ద్విచక్రవాహనంపై బొబ్బిలి రైల్వేస్టేషన్‌కు బయల్దేరి వెళ్తున్నారు. సరిగ్గా తారాపురం టీకాల లచ్చన్న గుడి వద్దకు వచ్చేసరికి వారికంటే ముందుగా ద్విచక్రవాహనంపై వెళ్తున్న అనకాపల్లి జిల్లా రామవరం గ్రామానికి చెందిన రామదాసు సొంతూరుకు వెళుతూ గుడిలో అమ్మవారిని దర్శించుకుందామని బైక్ స్లో చేశాడు. ఇంతలో వెనకనుంచి వస్తున్న ఇద్దరు స్నేహితులు ముందున్న బైక్‌ను ఢీకొట్టడంతో బైక్ వెనుక కూర్చున్న ప్రసాద్ వర్మ(42) ప్రమాదవశాత్తు తుళ్లిపోయి రోడ్డు దెబ్బతిన్నాడు. దీంతో తలకు తీవ్రగాయం కాగా, రామ్‌గోపాల్ గౌతమ్‌కు, రామదాసుకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎస్సై వి.ప్రసాదరావు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రథమ చికిత్స నిమిత్తం గాయపడిన ముగ్గురిని బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడికి చేరుకునే సరికి ప్రసాద్ వర్మ మృతిచెందాడని వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు ఎస్సై ప్రసాదరావు కేసే నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
నేలమీద నే రాయాలా..!
రామభద్రపురం: పదో తరగతిలో అత్యధిక ఉత్తీర్ణత శాతం కోసం విద్యాశాఖ 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తోంది. అందుకనుగుణంగా ఉపాధ్యాయులు సిలబస్ పూర్తి చేశారు. విద్యార్థులు రేయింబవళ్లు కష్టపడి చదువుతున్నారు. అయితే మా పాఠశాల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలి. అందరూ ఉత్తమ మార్కులు పొందాలనే ఆలోచనే తప్ప..విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు పరీక్ష కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా? లేదా? అని కనీస అలోచన చేయడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. పరీక్షకేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, అంతులేని నిర్లక్ష్యం చూపుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లావాప్తంగా 119 పరీక్ష కేంద్రాల్లో 447 ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలలకు చెందిన 22,939 మంది, గతంలో ఫెయిలైన విద్యార్థులు 835 మంది మొత్తం 23,774 మంది పరీక్షలు రాయనున్నారు. పదోతరగతే కీలకం పదో తరగతి ప్రతి విద్యార్థి జీవితంలో ఎంతో కీలకం. పదో తరగతిలో సాధించిన మార్కులే ఉన్నత విద్య, ఉద్యోగాల కోణంలో ప్రతి దశలోనూ పరిగణనలోకి తీసుకుంటున్నారు. అయితే ఉత్తమ మార్కులు సాధించాలంటే పరీక్షల కోసం బాగా చదవాలి. అలాగే చదివింది బాగా రాయాలంటే పరీక్ష రాసే గదిలో ప్రశాంత వాతావరణం ఉండాలి. ఈ నెల 17 నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఆరంభం కానున్నాయి. ఈ పరీక్షలను విద్యార్థులు కూర్చుని రాసేందుకు బల్లలు, తాగునీరు, ఆ గదిలో ఫ్యాన్ వంటి కనీస మౌలిక సదుపాయాలు అవసరం. విద్యార్థి పరీక్ష రాసేటప్పుడు ఎంత బాగా సదుపాయం ఉంటే అంత బాగా రాసి ఉత్తమ ఫలితాలు సాధించగలడు. విద్యాలయాలు వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నా..అత్యధిక మార్కులు రావాలన్నా ఆయా పరీక్ష కేంద్రాల్లో వారు పరీక్ష రాసేందుకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు ఉండాలి. పలు పరీక్ష కేంద్రాలలో కనీస సదుపాయాలు లేవు. అందుకు నిదర్శనం రామభద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే పరీక్ష కేంద్రం. ఇక్కడ సుమారు పది తరగతి గదులలో 250 మంది వరకు పరీక్షలు రాయనున్నారు. ఈ కేంద్రంలో విద్యార్థులు కూర్చుని పరీక్ష రాసేందుకు దాదాపు 120 బల్లలు అవసరం. పరీక్షలు ఇంకా పట్టుమని పది రోజులు కూడా లేవు. ఇప్పటివరకు ఒక్క గదిలో కూడా ఒక్క బెంచీ సమకూర్చిన పాపాన పోలేదు. ఒక్కగదిలో కూడా ఫ్యాన్ తిరగడం లేదని విద్యార్థులు చెబుతున్నారు.అలాగే ప్రశ్నపత్రాలు నేడో రేపో పోలీస్ స్టేషన్లకు రానున్నాయి. ఆ ప్రశ్న పత్రాలు భద్రపరిచేందుకు ట్రంకుపెట్టెలు అవసరం. వాటిని ఇప్పటివరకు సమకూర్చనట్లు తెలిసింది.తనిఖీలు తప్ప చర్యలు శూన్యం సమస్యల్లో పదోతరగతి పరీక్షా కేంద్రాలు కూర్చుని రాసేందుకు బల్లలు, తాగేందుకు నీరులేని పరిస్థితి గదులలో ఫ్యాన్లు, బాయ్స్‌కు బాత్రూమ్ సదుపాయం కరువు జిల్లావ్యాప్తంగా 119 పరీక్ష కేంద్రాలు హాజరుకానున్న విద్యార్థులు 23,774 మంది సమీపిస్తున్న పరీక్షలు విస్తుపోతున్న విద్యార్థులుహెచ్ఎం వసతులు సమకూర్చుతామన్నారు త్రిమెన్ కమిటీ పాఠశాలను సందర్శించి పరీక్షకేంద్రాల మౌలిక సదుపాయాలపై ఆరా తీసింది. అప్పట్లో పరీక్షల సమయానికి తాము సమకూర్చుతామని పాఠశాల హెచ్ఎం కామేశ్వరరావు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు.సమకూర్చాల్సిన బాధ్యత ఆయనదే. ఎ.తిరుమలప్రసాద్, ఎంఈవో, రామభద్రపురంచాలా రోజుల క్రితం త్రిమెన్ కమిటీ వచ్చి పరీక్ష కేంద్రాలను పరిశీలించి వెళ్లింది. అలాగే ఇటీవల పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ తనిఖీచేసి వెళ్లారు. అయితే తనిఖీలు తప్ప తక్షణ చర్యలు లేవు. పరీక్షలు నిర్వహించే బాధ్యత ఎంఈవోలదేనని, వారే మౌలిక వసతులు సమకూర్చుతారని పాఠశాల యాజమాన్యం చూస్తోంది. అలాగే వేరే పాఠశాలల నుంచి 120 బల్లలు తేవడానికి, తిరిగి పంపించడానికి సుమారు రూ.25 వేల వరకు రవాణా ఖర్చులు అవుతున్నాయని, ఆ నిధులు ఎవరిస్తారని భావిస్తున్నట్లు తెలిసింది. పాఠశాల యాజమాన్యమే వసతులు సమకూర్చుతుంది. మాకేటి సంబంధం అన్న భావనలో ఎంఈవోలు ఉన్నట్లు సమాచారం. అయితే పరీక్షలు సమీస్తున్నాయి.ఇప్పటికీ వసతులు సమకూర్చలేదు.ఏమవుతుందో వేచి చూడాలి మరి. -
గురుకులాల్లో ప్రవేశాలకు గడువు పెంపు
విజయనగరం అర్బన్: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశ దరఖాస్తుకు ఈ నెల 13 వరకు గడువు పెంచినట్టు గురుకులాల సమన్వయకర్త శంబాన రూపవతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.‘ఏపీపీఆర్ఏజీసీఈటీ.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఐఎన్’ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ సీతంపేట: ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఆశ్రమ పాఠశాలల హెచ్ఎంలు, గురుకులాల ప్రిన్సిపాల్స్‌తో ఐటీడీఏలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ముఖ్యమైన ప్రశ్న లు, జవాబులపై తర్ఫీదు ఇవ్వాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో డీడీ అన్నదొర, డిప్యూ టీ ఈఓ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. జీడిపప్పు పరిశ్రమ ఏర్పాట్లు పరిశీలన పార్వతీపురంటౌన్: స్థానిక వ్యవసాయ మార్కె ట్ యార్డు గోదాంలో జీడి పరిశ్రమ ఏర్పాటు అనుకూలతలను కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ గురువారం పరిశీలించారు. సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చించారు. యంత్రాల ఏర్పా టు, ముడి సరుకు నిల్వ, అవసరమైన వసతు ల కల్పన అంశాలను వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. జీడి పరిశ్రమ స్థాపనతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పరిశ్రమ కు ప్రోత్సాహం లభిస్తుందని వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన ఔత్సాహికులకు అనుమతులను త్వరితగతిన మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్డీఏ పీడీ సుధారాణి పాల్గొన్నారు. గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపు పార్వతీపురంటౌన్: జిల్లాలోని నాలుగు మద్యం దుకాణాలను గీత, సొండి కులాల వారికి లాటరీ పద్ధతిలో కేటాయించినట్టు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో గురువారం లాటరీ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2024–26 సంవత్సరానికి 4 మద్యం దుకాణాలకు 60 దరఖాస్తులు వచ్చాయన్నారు. పార్వతీపురం, సాలూరు, వీరఘట్టం, పాలకొండలోని మద్యం షాపులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సమక్షంలో లాటరీ తీసి దుకాణాలను కేటాయించారు. రిజర్వు షాపులకు రూ.1.20 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. లాటరీలో షాపులు దక్కించుకున్న వారి నుంచి లైసెన్సు ఫీజు కింద రూ.20,83,335 ఆదాయం లభించినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ సూపరింటెండెంట్ ఎ.శ్రీరంగం, సీఐలు బి.నర్సింగరావు, జి.దాసు, కె.సూర్యకుమారి, వీవీఎస్ శేఖర్‌బాబు, పి.శ్రీనివాసరావు, పి.మురళీధర్, సిబ్బంది పాల్గొన్నారు. రేపు జాతీయ లోక్ అదాలత్ విజయనగరం లీగల్: ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ నెల 8న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు బి.సాయికళ్యాణ్ చక్రవర్తి కోరారు. రాజీపడదగిన క్రిమినల్ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
చల్లని తల్లి ఎల్లారమ్మ
శృంగవరపుకోట: ‘ఎంత చల్లని తల్లి ఎల్లారమ్మ.. బ్రాహ్మణ పిల్లవే బంగారు బొమ్మ.. మర్రి ఆకుల పానుపే మా అమ్మకి.. వింజామరలు వీచరే మా తల్లికి.’ అంటూ జముకుల పాటల మధ్య ఎల్లారమ్మ గంభీరంగా కదిలింది. మూడు రోజుల ఎల్లారమ్మ జాతరకు ఊరూవాడ ఏకం అయ్యింది. జామి గ్రామం కాస్త జనసంద్రమైంది. ఎటు చూసినా భక్తుల కోలాహలం.. ఆధ్యాత్మిక వాతావరణం.. సాంబ్రాణి పరిమళం.. అమ్మను చూడాలన్న ఆర్తితో జనంకదిలి రాగా ఎల్లారమ్మ జాతర జన జాతరను తలపించింది. గురువారం నిర్వహించిన అమ్మవారి తొలేళ్ల ఉత్సవం అంగరంగా వైభవంగా సాగింది. డప్పుల మోతల నడుమ కళారూపాలు కదిలాయి. సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను అలరించాయి. ముహూర్తం ప్రకారం.. జామి చుక్కవీధిలో ఉన్న గద్దె ఇంటి వద్ద ఎల్లారమ్మ తల్లి ప్రభను ముహూర్తం ప్రకారం రాత్రి 10.30 గంటలకు గద్దెదించారు. అమ్మవారికి పూజాధికాలు నిర్వహించి చీరసారెలు సమర్పించారు. తల్లి ఊరే గింపునకు అంకురార్పణ చేశారు. జముకుల పాట నడుమ ఎల్లారమ్మ తిరువీధి సాగింది. అర్చకులు, బ్రాహ్మణులు, గ్రామస్తులు అమ్మవారికి పూజలు చేసి, చీర సారెలు, పసుపు, కుంకుమలు సమర్పించారు. అమ్మవారి తిరువీధి ఆలయం వరకు వేడు కగా సాగింది. వేకువజామును 3 గంటలకు అమ్మవారు ఆలయానికి చేరుకునేవేళ బాణసంచా వెలుగులు భక్తులను ఆకట్టుకున్నాయి. జంతు బలులు లేని జాతర... ఎల్లారమ్మ తల్లి జాతరలో ఎటువంటి జంతు బలులు ఇవ్వరు. దర్శనానికి వచ్చే భక్తులు బియ్యం, ఉలవలు, పెసలు, పసుపు–కుంకుమలు, కర్ర భరిణెలు సమర్పిస్తారని గ్రామ పెద్దలు తెలిపారు. జముకుల పాటతో జాతర ఆరంభం తెల్లవార్లూ జాతరే జాతర -
–8లో
శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025జంఝావతి ప్రాజెక్టు ●పట్టించుకోని కూటమి ప్రభుత్వం ●బడ్జెట్లోనూ అరకొర కేటాయింపులు ●ఒడిశాతో చర్చలకు ఇదే సమయమంటున్న రైతులు దశాబ్దాలు గడుస్తున్నా.. జంఝాటం వీడటం లేదు. జంఝావతి కంఠ ఘోష ఎవరికీ వినిపించడం లేదు. ఒడిశా మడత పేచీ.. ఇక్కడి రైతులకు శాపంగా మారింది. ప్రస్తుతం అటు ఒడిశాతో పాటు.. ఇటు ఏపీలోనూ కేంద్రం మద్దతుతో నడుస్తున్న ప్రభుత్వాలే ఉన్నాయి. వివాదం పరిష్కారానికి ఇదే సరైన సమయమని.. ఏపీలోని కూటమి ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించి, జంఝావతి విషయంలో ఒడిశా ప్రభుత్వంతో చర్చలు జరిపి, సమస్య పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక కూటమి నేతలు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై ఆవేదన చెందుతున్నారు. ఇటీవల కేటాయించిన బడ్జెట్లో నిధులు కేటాయింపులు లేకపోవడంపై రైతు సంఘం నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, పార్వతీపురం మన్యం: కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద జంఝావతి ప్రాజెక్టుకు 1976లో శ్రీకారం చుట్టారు. అప్పట్లో రూ.15.51 కోట్ల అంచనా వ్యయంతో దీనిని ప్రారంభించారు. కొమరాడ, గరుగుబిల్లి, పార్వతీపురం, సీతానగరం, మక్కువ మండలాలకు నీటిని అందించాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. వాస్తవానికి ఒడిశాలో వర్షాలు కురిస్తేనే నదిలో నుంచి వచ్చిన నీటిని ఇక్కడ ఒడిసిపట్టవచ్చు. జలాశయం పూర్తయితే ఒడిశా రాష్ట్రంలోని మూడు గ్రామాలతోపాటు.. కొంత అటవీ ప్రాంతం ముంపు బారిన పడతాయి. దీంతో గేట్ల ఏర్పాటు సవాల్‌గా మారింది. ఇరు రాష్ట్రాల మధ్య వివాదమై కూర్చొంది. గతంలో పలు దఫాలు ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయి. నగుల్లువలస, చీకటిలోవ, పిల్లిగుడ్డి గ్రామాల వారికి పునరావాసంతోపాటు.. నష్టపోతున్న ప్రాంతానికి పరిహారం ఇచ్చేందుకు కూడా ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. గేట్ల ఏర్పాటుకు మాత్రం ఒడిశా ప్రభుత్వం అంగీకరించలేదు. స్పిల్‌వే దగ్గర పనులు చేసుకునేందుకు మాత్రమే అంగీకరించింది. దీంతో 1980వ దశకంలో కొమరాడ మండలంలోని జంఝావతి ఎగువ, దిగువ కాలువల నుంచి 24 వేల ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా రూ.124 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు పనులు చేపట్టారు. ఎనిమిది వేల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వగలిగారు. అప్పటి నుంచి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో పూర్తి కాకపోవడంతో రైతులకు అరకొర సేవలే అందుతున్నాయి. ఒడిశా ప్రభుత్వంతో చర్చలు సఫలమైతే ఇక్కడి రైతాంగానికి మేలు చేకూరుతుంది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కూడా ఈ సమస్యపై దృష్టి సారించారు. ఒడిశా ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అటు నుంచి సానుకూలత రాకపోవడంతో సమస్య కూడా అలానే ఉండిపోయింది. అసలే వివాదం.. ఆపై అరకొర కేటాయింపులు పూర్తిస్థాయిలో పనులు జరగకపోవడం వల్ల శివారు భూములకు సాగునీరు అందని పరిస్థితి ఉంది. 27,790 కిలోమీటర్ల పొడవు ఉన్న ఎగువ కాలువ ద్వారా కొమరాడ, పార్వతీపురం, సీతానగరం మండలాలల్లో 12 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. కొమరాడ మండలం డంగభద్ర వద్ద పెద్ద బండరాయి ఉండటంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. దిగువ కాలువ నుంచి ఎగువ కాలువకు నీరును ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన పథకం మరమ్మతులకు గురైంది. దీనివల్ల కేవలం 700 ఎకరాలకు మాత్రమే నీరందే పరిస్థితులు ఉన్నాయి. దిగువ కాలువ ద్వారా గరుగుబిల్లి, పార్వతీపురం, కొమరాడ, సీతానగరం మండలాల్లోని 12 వేల ఎకరాలకు సాగునీరందాల్సి ఉంది. కాలువ పనులు జరిగినా నీరు మళ్లించే మదుముల వద్ద షట్టర్లు ఏర్పాటు చేయలేదు. పంటభూములకు సాగునీరు చేరేలా పిల్ల కాలువలనుతవ్వాల్సి ఉంది. కొన్నిచోట్ల యూటీలు నిర్మించాలి. ఈ పనులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సి ఉన్నా.. కూట మి ప్రభుత్వం కనీసం దృష్టి సారించడం లేదు. ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో జంఝావతి ప్రాజెక్టుకు కనీస నిధులు కేటాయించక పో వడం పట్ల ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి తీవ్ర స్థాయిలో ఖండించింది. ప్రాజెక్టు వద్ద నిరసన వ్యక్తం చేసింది. జంఝావతికి బడ్జెట్లో ఎటువంటి ప్రాధాన్యత లేకపోవడం దారుణమని చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మరిశర్ల మాల తీ కృష్ణమూర్తి నాయుడు, ప్రతినిధులు వి.దాలినాయుడు, వి.శ్రీహరి, టి.ప్రభాకరరావు, బి.కృష్ణ అన్నారు. ఇది పూర్తిగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల వైఫల్యమేనని విమర్శించారు. రెండు రాష్ట్రాల్లోనూ కూటమి అనుకూల ప్రభుత్వాలే ఉన్నాయని.. ఒడిశాతో ఉన్న అతి చిన్న సమస్యను పరిష్కరించడానికి ఇదే మంచి సమయమని తెలిపారు. పాలకులు ఆ దిశగా ఆలోచించకపోవడం బాధాకరమన్నారు. ఆస్ట్రియా సాంకేతికతతో రబ్బరు డ్యాం.. 2006లో ఆస్ట్రియా సాంకేతికతతో నాటి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఇక్కడ రబ్బరు డ్యాం ఏర్పాటు చేసింది. దీని ద్వారా 12 వేల ఎకరాలకు నీరివ్వాలని భావించారు. 3.60 కిలోమీటర్ల లింకు కాలువను తవ్వి, డిస్ట్రిబ్యూటరీతో అనుసంధానించడం ద్వారా మరో 12 వేల ఎకరాలకు తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు 650 హార్స్ పవర్ గల మూడు మోటార్లను, ప్రత్యేకంగా విద్యుత్తు సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. తాత్కాలికంగానైనా చేపట్టిన ఈ ప్రక్రియ వల్లే 15 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. న్యూస్‌రీల్ -
●మహిళల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
● ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి పార్వతీపురంటౌన్: మహిళల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యతని, మహిళలు కూడా చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి సూచించారు. మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా ఐసీడీఎస్, పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో హహిళలను గౌరవిస్తూ ఆత్మస్థైర్యం నింపాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని గుర్తుచేశారు. బాల్యవివాహ వ్యవస్థను నిర్మూలించేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బాలికలు సైబర్ నేరగాళ్ల మోసపూరిత మాటలు, ప్రలోభాలకు గురికారాదని హితవు పలికారు. ఆడపిల్లలు అన్నింటా రాణించాలంటే విద్య ఒక్కటే మార్గమని, ఏకాగ్రతతో చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ అంకిత సురానా, ఐసీడీఎస్ పీడీ డాక్టర్ టి.కనకదుర్గ, సీడీపీఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
శ్రీరాముడే ఆదర్శం
● సర్వజీవరాశులను కాపాడే బాధ్యత మనుషులదే.. ● త్రిదండి చినజియర్ స్వామి ఆధ్యాత్మిక ఉపన్యాసం చేస్తున్న చినజియర్ స్వామి పార్వతీపురం: ప్రతి ఒక్కరూ శ్రీరాముడును ఆదర్శంగా తీసుకొని కుటుంబ, రాజ్యవ్యవస్థను నిర్వహించాలని త్రిదండి చినజియర్ స్వామి పిలుపునిచ్చారు. సర్వజీవరాశులను పరిరక్షించాల్సిన బాధ్యత మనుషులదేనన్నారు. పార్వతీపురం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వికాస తరంగణి అధ్యక్షుడు యిండుపూరు గున్నేశ్వరరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన శ్రీరామ పాదుకా పట్టాభిషేకం వైభవంగా సాగింది. కార్యక్రమంలో పాల్గొన్న చినజియర్ స్వామి మాట్లాడుతూ పూర్వం సంప్రదాయలకు విలువ ఇచ్చేవారని, అందుకే వారంతా ఎంతో సుఖసంతోషాలతో జీవించేవారన్నారు. గత సంప్రదాయాలు నేర్పకపోవడం కారణంగా భావితరాల పిల్లలు తప్పులు చేస్తున్నారని, దీనికి తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సమాజంలో జీవించే ప్రతిఒక్కరూ మంచిని కోరుకోవాలన్నారు. సర్వమానవాళి ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్రకృతిలో ఉండే అన్ని జీవరాశులను బతికిస్తూ మనం బతకాలన్నారు. ప్రకృతిని ధ్వంసం చేయడం వల్ల మానవుడు తనను తనే విధ్వంసం చేసుకుంటున్నాడన్నారు. పార్వతీపురంలోని జట్టు ఆశ్రమం నిర్వాహకురాలు పద్మజ చెత్తాచెదారాలను సేకరించి సంపదను సృష్టించడం వల్ల పర్యావరణం అభివృద్ధి చెందడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు బాటలు వేస్తున్నారన్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్నారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేకం పూజలను జరిపారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. పలువురు చిన్నారులు వేంకటేశ్వరస్వామి, ఆంజనేయుడు, పద్మావతి, లక్ష్మీ తదితర వేషధారణలతో అలరించారు. మహిళల కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కల్యాణమండపంలో భక్తులకు తీర్థం పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్డులో ఉన్న కల్యాణమండపంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చినజియర్ స్వామి స్వహస్తాలతో భక్తులందరికీ తీర్థం ఇచ్చారు. కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ దంపతులు, పార్వతీపురం అడిషనల్ జిల్లా జడ్డి ఎస్.దామోదర్‌రావు, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, న్యాయవాదులు టి.జోగారావు, వెంకటరావు, వైద్యులు డి.రామ్మోహనరావు, యాళ్ల వివేక్, పద్మజ, పి.వసంతకుమార్, జి.వాసుదేవరావు, వ్యాపారులు, నారాయణసేవకులు తీర్థగోష్ఠిలో పాల్గొన్నారు. -
ఏపీ మెడికల్ ల్యాబ్ టెక్సీషియన్ల నూతన కార్యవర్గం
పార్వతీపురంటౌన్: ఏపీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియ న్ల మన్యం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక బుధవా రం పట్టణంలోని ఎన్జీఓహోమ్లో నిర్వహించారు. రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ ఎ.తిరుపతిబాబు ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరగ్గా జిల్లా ప్రెసిడెంట్‌గా వై.తిరుపతిరావు, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఆర్. శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్లుగా పి.రాజేష్, పి. మురళి, వి.నిర్మల, వి. చెల్లారావు, ఎం.గోపాలకృష్ణ, కార్యదర్శిగా ఆర్.సురేష్ కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పి.శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ లుగా బి.రాము, లీలావతి, జి.సుమన్, ఎ.ఆనంద్, ఎన్ ఆదిలక్ష్మి, కొశాధికారిగా కె.కిశోర్, ఈసీ మెంబర్లుగా ఎం.అమరావతి, కె.గిరిబాబు, కె.శరత్ కు మార్లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్‌ఎస్ కిశోర్, ల్యాబ్ టెక్సీషియన్ల విజయనగరం జిల్లా అధ్యక్షుడు కేఎస్ అప్పల నాయుడు, ఎ.శంకర్రావు, కేవీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
●నేడు మద్యం షాపుల లాటరీ
‘లాటరీ’ ద్వారా కేటాయింపు... జిల్లా యూనిట్‌గా కోటా ప్రకారం దరఖాస్తు చేసుకోవడానికి ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల చొప్పున ప్రభుత్వం ఫీజు నిర్ణయించింది. ఏ4 మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. ఫిబ్రవరి 6వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరించారు. గత నెల 10వ తేదీన ఉభయ జిల్లాల్లో లాటరీ తీయడానికి ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వాయిదా వేశారు. ఆ ప్రక్రియను ఈ నెల 6వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆఫీసర్ బి.శ్రీనాథుడు తెలిపారు. విజయనగరం జిల్లాలోని దుకాణాలకు సంబంధించి కలెక్టరేట్ కాంప్లెక్స్‌లోని ఆడిటోరియంలో ఉదయం 9 గంటలకు లాటరీ తీస్తారు. పార్వతీపురం మన్యం జిల్లాలో దరఖాస్తుదారులకు కూడా అదే సమయానికి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో లాటరీ నిర్వహిస్తారు. ● కల్లుగీత, సొండి కులాలకు విజయనగరం జిల్లాలో 16, పార్వతీపురం మన్యం జిల్లాలో నాలుగు షాపులు సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉభయ విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కల్లుగీత, సొండి కులాలకు కేటాయించిన 20 మద్యం షాపులకు సంబంధించిన లాటరీ ప్రక్రియ గురువారం నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పటికే విజయనగరం జిల్లాలో 153, పార్వతీపురం మన్యం జిల్లాలో 52 మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యాపారులకు అప్పగించిన సంగతి తెలిసిందే. వాటికి ఇప్పుడీ 20 అదనం. జిల్లా యూనిట్‌గా కల్లు గీత, సొండి సామాజికవర్గాల వారికి వీటిని కేటాయించారు. శెట్టిబలిజ, యాత, సెగిడి, శ్రీసైన, సొండి సామాజిక వర్గాలకు చెందినవారు విజయనగరం జిల్లాలోని 16 దుకాణాల్లో కోటా ప్రకారం ఎక్కడివాటికై నా దరఖాస్తు చేసుకోడానికి అవకాశం ఇచ్చారు. అలా 308 దరఖాస్తులు వచ్చాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో శ్రీసైన, సెగిడి, సొండి కులస్తులు నాలుగు దుకాణాల్లో కోటా ప్రకారం దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. దీంతో 60 దరఖాస్తులు దాఖలయ్యాయి. -
గిరిజన సర్పంచ్‌లంటే అంత చులకనా?
సాలూరు రూరల్: గిరిజన సర్పంచ్‌లను చులకనగా చూస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తున్న అధికారులపై కోర్టు తీర్పుధిక్కరణ కేసు వేస్తామని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర స్పష్టంచేశారు. ఇంజినీరింగ్ అధికారులు గిరిజన సర్పంచ్‌లపై నిర్లక్ష్యధోరణి చూపుతున్నారంటూ పాచిపెంట మండలంలోని పలువురు సర్పంచ్‌లు రాజన్నదొర దృష్టికి బుధవారం తీసుకెళ్లారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేస్తామని ఫిర్యాదు కాపీని రాజన్నదొరకు ఆయన నివాసంలో అందజేశారు. దీనిపై మాజీ డిప్యూటీ సీఎం స్పందిస్తూ పార్వతీపురం జిల్లాలో పనిచేస్తున్న పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అధికారులు గిరిజన సర్పంచ్‌లను అవహేళన చేసి మాట్లాడడం తగదన్నారు. ఉపాధిహామీ అధికారి అల్లువాడ గోపాలకృష్ణ, సాలూరు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ టెక్నికల్ అసిస్టెంట్ గొట్టాపు సంధీప్లు గిరిజన సర్పంచ్‌లను గౌరవించకుండా వ్యవహరిస్తున్నారని, వీరి తీరును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. మంత్రి చెప్పిన పనులు మాత్రమే చేస్తామని బహిరంగంగా చెబుతుండడం ఆగ్రహం వ్యక్తంచేశారు. 1994 సెక్షన్ 45 పంచాయ తీ రాజ్ చట్టం ప్రకారం సర్పంచ్ల హక్కులు, అధికారాలకు భంగం కలిగితే రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమేనని అన్నారు. ఆర్టికల్ 243 ద్వారా సర్పంచ్‌లకు అధికారాలు ఉన్నాయని, అలా కాకుండా అధికారులు సర్పంచ్‌లపై దురుసు గా వ్యవహరిస్తే ఎస్సీ, ఎస్టీ చట్టం 33/1989 ప్రకారం చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఉపాధి హామీ రిట్ పిటిషన్ నంబర్ 2174/2025పై ఫిబ్రవరి 3న ఉపాధి హామీ పనుల మీద హైకోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు ధిక్కరిస్తున్నారన్నారు. పాచిపెంట మండలం గిరిజన సర్పంచ్‌లందరూ కలిసి ఏపీ గిరిజన శాఖ కమిషనర్, కలెక్టర్, జాతీ య మానవ హక్కుల సంఘం చైర్మన్‌కు అధికారు ల తీరుపై ఫిర్యాదు చేస్తామన్నారు. హైకోర్టు తీర్పును ధిక్కరించిన అధికారులపై కోర్టుధిక్కరణ కేసు వేస్తాం సర్పంచ్ల ప్రమేయం లేకుండా అడ్డగోలు నిర్ణయాలు సరికాదు మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర -
గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2025
ఇంటర్ ఇంగ్లిష్–2 ప్రశ్న పత్రంలో ముద్రణా లోపాలు పార్వతీపురంటౌన్: ఇంటర్ ఇంగ్లిష్–2 పరీక్ష ప్రశ్నపత్రంలో లోపాలు ఉండడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బి.రవికుమార్ అన్నారు. ప్రశ్నపత్రంలో 8, 13 ప్రశ్నలు ముద్రణాలోపంతో విద్యార్థులకు స్పష్టంగా కనిపించలేదన్నారు. పరీక్ష ప్రారంభమైన 25 నిమిషాల తరువాత తప్పు జరిగింది, సరి చేసుకోమని పరీక్ష నిర్వాహకులు తెలియజేయడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారని, సమయం వృథా అయ్యిందన్నారు. కొన్ని సెంటర్లలో బ్లాక్ బోర్డుపై ప్రశ్నలు రాశారన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి కారకులైన బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ ఇంగ్లిష్–2 పరీక్షకు 394 మంది గైర్హాజరు పార్వతీపురంటౌన్: జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ ఇంగ్ల్లిష్ –2 పరీక్షలకు 394 మంది గైర్హాజరైనట్లు డీవీఈ ఓ మంజులవీణ తెలిపా రు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నా రు. జిల్లావ్యాప్తంగా 8520 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 8,216 మంది హాజరైనట్లు స్పష్టం చేశారు. మాదలింగి సమీపంలో ఏనుగుల గుంపు కొమరాడ: మండలంలోని మాదలింగి, వన్నాం గ్రామ పంటపొలాల్లో ఏనుగులు సంచరిస్తున్నాయి. జొన్న, కర్బూజా, అరటి, పామాయిల్ తదితర పంటలు చేతికొచ్చే సమయంలో ధ్వంసం చేస్తున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగులు మాటలు కోటలు దాటాయేతప్ప ఏనుగుల తరలింపు ప్రక్రియ ఒక్క అడుగు ముందుకు పడలేదని రైతులు విమర్శిస్తున్నారు. ఏనుగులను తరలించకుంటే వ్యవసాయం విడిచిపెట్టి వలసపోవాల్సిందేనని వాపోతున్నారు. మహిళా దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష పార్వతీపురం టౌన్: అంతర్జాతీయ మహిళాదినోత్సవ ఏర్పాట్లపై పార్వతీపురం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్ ఎ. శ్యామ్‌ప్రసాద్ బుధవారం సమీక్షించారు. ఆహ్వాన పత్రికలను ముద్రించి మంత్రులు, ప్రజాప్రతినిధు లు, అధికారులను ఆహ్వానించాలన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరచిన నారీమణులను సత్కరించాలన్నారు. వేదిక వద్ద వివిధ రకాల స్టాళ్లతో పాటు ముఖ్యమంత్రి ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించేందుకు డిజిటల్ స్క్రీ న్లు ఏర్పాటుచేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో కె.హేమలత, జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారిత అధికారి డా.టి.కనకదుర్గ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వెలుగుపథక సంచాలకులు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: శాసనసభకు వెళ్లడానికి వీలుగా టికెట్ ఇవ్వనప్పుడు కనీసం శాసనమండలికై నా వెళ్లి ‘అధ్యక్షా...’ అనడానికి అవకాశం వస్తుందని ఆశించిన స్థానిక టీడీపీ నాయకులకు నిరాశే ఎదురైంది. ఎప్పటివలే ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తన మోసపూరిత మార్కురాజకీయం చూపించారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను ఊరించి ఉసూరుమనిపించినట్టే .. పార్టీ నాయకులను ఎన్నికల్లో వాడుకుని ఇప్పుడు వదిలేశారు. దీనిపై ఆ పార్టీ నాయకుల అనుచరగణం భగ్గుమంటోంది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ ఆశ చూపించి అన్యాయం చేశారని మండిపడుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక తొలిసారి ఎమ్మెల్యేల కోటాలో ఐదు ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకునే అవకాశం వచ్చింది. దీంతో తమకు అవకాశం వస్తుందని విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలువురు టీడీపీ స్థానిక నాయకులు ఆశలు పెట్టుకున్నారు. గతంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల కాలంలో ఏ కోటాలో ఎమ్మెల్సీలను పంపడానికి అవకాశం వచ్చినా ఉత్తరాంధ్రకు పెద్దపీట వేసేవారు. అలా.. విజయనగరం జిల్లా నుంచి డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, ఇందుకూరి రఘురాజు శాసనమండలిలో అడుగుపెట్టడానికి అవకాశం వచ్చింది. సురేష్బాబుకై తే రెండోసారి కూడా ఎమ్మెల్సీ పదవి దక్కింది. అలాగే చంద్రబాబు కూడా తమకు అవకాశం ఇవ్వకపోతారా? అని ఆశించిన ఉభయ జిల్లాల నాయకులకు ఆశాభంగమైంది. ఒక అవకాశం ఇవ్వకపోతారా అని అధిష్టానం వద్ద విశ్వ ప్రయత్నాలు చేసినా తుదకు ఆశావహుల జాబితాలోనూ వారిని పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. ఊరించి.. ఉసూరుమనిపించి... గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ టికెట్ వస్తుందని కర్రోతు బంగార్రాజు, గొంప కృష్ణ, కిమిడి నాగార్జున, బొబ్బిలి చిరంజీవులు, ఆర్పీ భంజ్‌దేవ్, తెంటు లక్ష్మునాయుడు, కేఏ నాయుడు, కావలి గ్రీష్మ... ఇలా పలువురు నాయకులు తమ నియోజకవర్గాల్లో పట్టు పెంచుకున్నారు. టికెట్ ఇవ్వకపోతే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎక్కడ టీడీపీ అభ్యర్థులకు దెబ్బ కొడతారోనని ఊహించిన చంద్రబాబు... వారందర్నీ ‘ఎమ్మెల్సీ’ ఆశల పల్లకి ఎక్కించారు. వారంతా మనసు మార్చుకొని పార్టీలో తమ పోటీదారులకు మద్దతు పలికారు. ఎలాగో గెలిచి పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వారంతా అధిష్టానం తమకు ఇచ్చిన హామీ నెరవేర్చుతుందని ఆశించారు. రూ.18 కోట్లతో 6 హాస్టల్స్‌కు భవనాలు లక్కవరపుకోట: జిల్లాలో సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 6 వసతి గృహాలకు ప్రధాన మంత్రి అనుసుచిత్ జాతి అభ్యుదయ్ యోజన(పీఎం అజేయ్) పథకంలో భాగంగా రూ.18 కోట్లతో భవనాల ను నిర్మించనున్నట్లు ఆశాఖ డీడీ బి.రామానందం తెలిపారు. ఈ మేరకు లక్కవరపుకోట మండల కేంద్రానికి బుధవారం వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. పీఎం అజేయ్ పథకంలో విజయనగరం–2, శృంగవరపుకోట–1, బొబ్బిలి–2, గజపతినగరం–1 చొప్పున ఆరు హాస్టల్స్‌ను ఒక్కో హాస్టల్‌కు రూ.3 కోట్లతో భవనాలను నిర్మించనున్నట్లు తెలిపారు. జిల్లాలో గల 23 వసతి గృహాల్లో రూ 4.67 కోట్లుతో మరమ్మతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో గల 30 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న 102 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరవుతారన్నారు. పోలమాంబ ఆరవ జాతర ఆదాయం రూ.4,57,524లు మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవే ల్పు శంబర పోలమాంబ అమ్మ వారి ఆరవ జాతర ఆదాయం ఈవో వి.వి.సూర్యనారాయణ సమక్షంలో బుధవారం లెక్కించారు. శీఘ్ర, ప్రత్యేక దర్శనం, కేశఖండనశాల టికెట్ల విక్రయం, అన్నదాన విరాళాలు, లడ్డూ, పులిహోర ప్రసాదం విక్రయంతో రూ.4,57,524లు ఆదాయం సమకూరిందన్నారు. లెక్కింపు కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, దేవదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. న్యూస్రీల్నామినేటెడ్ పదవులతో సరి... ఎమ్మెల్యే అవదామనుకున్న కర్రోతు బంగార్రాజు తనకు కనీసం ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశించారు. కానీ ఆయనకు నామినేటెడ్ పదవి ఇవ్వడంతో మిన్నకుండక తప్పలేదు. ఆర్పీ భంజ్‌దేవ్, తెంటు లక్ష్మునాయుడు, కావలి గ్రీష్మలతో పాటు బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావుకు కూడా నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. అలా వారు కూడా ఎమ్మెల్సీ సీటు ఆశించకుండా నీళ్లు చల్లేశారు. ఇక మిగిలింది గొంప కృష్ణ, కిమిడి నాగార్జున, బొబ్బిలి చిరంజీవులతో పాటు మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు. తమకు నామినేటెడ్ పదవి ఇవ్వలేదంటే ఎమ్మెల్సీ సీటు వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అధిష్టానం వద్ద విశ్వప్రయత్నాలు చేసినా చివరకు వారి పేర్లు పరిశీలనలోకై నా తీసుకోలేదని తెలిసి మౌనంగా ఉండిపోయారు. ‘కొల్ల’కై తే ఇప్పటికీ నిరాశే... టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చిందంటే ఎమ్మెల్సీ పదవి ఎంతవరకూ వస్తుందో టీడీపీ సీనియర్ నాయకుడు కొల్ల అప్పలనాయుడే ఓ ఉదాహరణ. రాజాం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సంతకవిటి మండలంలో తూర్పుకాపు సామాజికవర్గానికి చెందిన ఆయన గతంలో ఎంపీపీగా మూడు పర్యాయాలు పనిచేశారు. మరో రెండు దఫాలు తన అనుచరులను ఎంపీపీ పదవిలో కూర్చోబెట్టారు. తన భార్యను కూడా జెడ్పీటీసీగా ఒక పర్యాయం గెలిపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన్ను వాడుకొనే ఉద్దేశంతో చంద్రబాబు తాయిలం వేశారు. శ్రీకాకుళం జిల్లాపరిషత్ చైర్మన్‌ను చేస్తానని ఆశ చూపించారు. తీరా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొండిచేయి చూపించారు. చౌదరి బాబ్జీ భార్య చౌదరి ధనలక్ష్మికి చంద్రబాబు ఆ పదవి కట్టబెట్టారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన కొల్ల అప్పలనాయుడిని బుజ్జగించడానికి చంద్రబాబు ఎమ్మెల్సీ అస్త్రం ఉపయోగించారు. 2017 ఫిబ్రవరిలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. అప్పుడు టీడీపీ టికెట్ తనకు ఇస్తారని ఆశించిన కొల్లకు చంద్రబాబు మళ్లీ జెల్లకొట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన శత్రుచర్ల విజయరామరాజుకు ఆ టికెట్ ఇచ్చేశారు. దీంతో రెబెల్‌గా బరిలోకి దిగేందుకు కొల్ల అప్పలనాయుడు సిద్ధమయ్యారు. నాడు శ్రీకాకుళం జిల్లా ఇన్చార్జి మంత్రిగానున్న పరిటాల సునీత, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు హుటాహుటిన కొల్ల స్వగ్రామం మామిడిపల్లి వెళ్లి మరీ ఆయనను బుజ్జగించారు. నామినేటెడ్ పదవి ఇస్తామని, సముచిత స్థానం కల్పిస్తామని హామీల వర్షం కురిపించారు. ఆ తర్వాత రెండేళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉన్నా కొల్ల కల నెరవేరలేదు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా కొల్లను కనీసం పట్టించుకోలేదు. అలా ఆయన ‘ఎమ్మెల్సీ’ ఆశ ఇప్పటికీ నెరవేర లేదు. అదీ చంద్రబాబు మార్క్ రాజకీయం. అధ్యక్షా.. అనాలనుకున్న టీడీపీ నాయకుల ఆశలపై నీళ్లు ఉమ్మడి విజయనగరం నుంచి ఏ ఒక్కరికీ దక్కని ఎమ్మెల్సీ సీటు సార్వత్రిక ఎన్నికల్లో రెబెల్స్‌కు చంద్రబాబు గట్టి హామీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ పదవిపై స్థానిక నాయకుల ఆశలు ఐదు ఖాళీల్లో అవకాశమిస్తారని అధిష్టానం వద్ద ప్రయత్నాలు కనీసం పరిశీలన జాబితాలోనూ పేరు లేకపోవడంతో నిరాశ! -
శ్రీరాముడే ఆదర్శం
● సర్వజీవరాశులను కాపాడే బాధ్యత మనుషులదే.. ● త్రిదండి చినజియర్ స్వామి ఆధ్యాత్మిక ఉపన్యాసం చేస్తున్న చినజియర్ స్వామి పార్వతీపురం: ప్రతి ఒక్కరూ శ్రీరాముడును ఆదర్శంగా తీసుకొని కుటుంబ, రాజ్యవ్యవస్థను నిర్వహించాలని త్రిదండి చినజియర్ స్వామి పిలుపునిచ్చారు. సర్వజీవరాశులను పరిరక్షించాల్సిన బాధ్యత మనుషులదేనన్నారు. పార్వతీపురం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వికాస తరంగణి అధ్యక్షుడు యిండుపూరు గున్నేశ్వరరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన శ్రీరామ పాదుకా పట్టాభిషేకం వైభవంగా సాగింది. కార్యక్రమంలో పాల్గొన్న చినజియర్ స్వామి మాట్లాడుతూ పూర్వం సంప్రదాయలకు విలువ ఇచ్చేవారని, అందుకే వారంతా ఎంతో సుఖసంతోషాలతో జీవించేవారన్నారు. గత సంప్రదాయాలు నేర్పకపోవడం కారణంగా భావితరాల పిల్లలు తప్పులు చేస్తున్నారని, దీనికి తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సమాజంలో జీవించే ప్రతిఒక్కరూ మంచిని కోరుకోవాలన్నారు. సర్వమానవాళి ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్రకృతిలో ఉండే అన్ని జీవరాశులను బతికిస్తూ మనం బతకాలన్నారు. ప్రకృతిని ధ్వంసం చేయడం వల్ల మానవుడు తనను తనే విధ్వంసం చేసుకుంటున్నాడన్నారు. పార్వతీపురంలోని జట్టు ఆశ్రమం నిర్వాహకురాలు పద్మజ చెత్తాచెదారాలను సేకరించి సంపదను సృష్టించడం వల్ల పర్యావరణం అభివృద్ధి చెందడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు బాటలు వేస్తున్నారన్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్నారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేకం పూజలను జరిపారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. పలువురు చిన్నారులు వేంకటేశ్వరస్వామి, ఆంజనేయుడు, పద్మావతి, లక్ష్మీ తదితర వేషధారణలతో అలరించారు. మహిళల కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కల్యాణమండపంలో భక్తులకు తీర్థం పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్డులో ఉన్న కల్యాణమండపంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చినజియర్ స్వామి స్వహస్తాలతో భక్తులందరికీ తీర్థం ఇచ్చారు. కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ దంపతులు, పార్వతీపురం అడిషనల్ జిల్లా జడ్డి ఎస్.దామోదర్‌రావు, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, న్యాయవాదులు టి.జోగారావు, వెంకటరావు, వైద్యులు డి.రామ్మోహనరావు, యాళ్ల వివేక్, పద్మజ, పి.వసంతకుమార్, జి.వాసుదేవరావు, వ్యాపారులు, నారాయణసేవకులు తీర్థగోష్ఠిలో పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ఆరంభం
వీరఘట్టం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతలు బలపరిచిన పాకలపాటి రఘువర్మకు ఓటుతో గురువులు బుద్ధిచెప్పారని పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. ప్రలోభాలతో అభ్యర్థులను గెలిపించలేరన్నది స్పష్టంచేశారన్నారు. వండువలో మీడియాతో ఆమె మంగళవారం మాట్లాడారు. గత తొమ్మిది నెలల కూటమి పాలనపై విసిగిన ఉపాధ్యాయులు ఓటుతో తమ నిరసన తెలిపారన్నారు. కూటమి బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని మంత్రి సంధ్యారాణి పాలకొండ ప్రాంతంలో ముమ్మర ప్రచారంచేశారని, ఆమె మాటలను ఉపాధ్యాయులు నమ్మలేదన్నారు. ఇటీవల పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ పదవి దక్కించుకోవాలని మంత్రి సంధ్యారాణి చేసిన ప్రయత్నాలు సైతం బెడిసికొట్టాయన్నారు. కూటమి ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందన్నారు. ప్రజల నుంచి తిరుగుబాటు రాకముందే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కళావతి -
ఇదే కదా అభివృద్ధి..!
ఓ వైపు సంక్షేమ పథం.. మరోవైపు అభివృద్ధి మంత్రంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పల్లెలు, పట్టణాల్లో ప్రగతి పవనాలు బలంగా వీయడంతో ఏజెన్సీ ప్రజలకు విద్య, వైద్య సదుపాయాలు చేరువయ్యాయి. పర్యాటక ప్రదేశాలు అభివృద్ధి చెందాయి. మారుమూల గ్రామాలకు రోడ్ల సదుపాయాలు కలిగాయి. దీనికి సీతంపేట మన్యంలో కనిపిస్తున్న అభివృద్ధి పనులే నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 2019–2024 వరకు ఐదేళ్ల పాలనలో రూ.50 కోట్లతో సీతంపేటలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మంజూరైంది. మరో రూ.20 కోట్లతో 30 పడకల ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేశారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని 47 ఆశ్రమపాఠశాలల్లో ‘నాడు–నేడు’ నిధులు రూ.20 కోట్లతో మౌలికవసతులు కల్పించారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేశారు. దాదాపు వందకు పైగా గ్రామాలకు రూ.69 కోట్ల వ్యయంతో గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో రోడ్లు నిర్మించారు. కొండలపై నుంచి జాలువారే వర్షపు నీరు గిరిజన గూడలను ముంచెత్తకుండా 114 వరదగోడలు నిర్మించారు. సీతంపేటలో స్కిల్ కళాశాల ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్, డిగ్రీ.. ఆపైన చదివిన వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించారు. నెట్వర్క్ లేని గ్రామాలకు సెల్ సిగ్నల్ కోసం 53 ప్రత్యేక టవర్లు ఏర్పాటు చేశారు. సాంకేతిక సేవలు అందుకునేందుకు అవకాశం కల్పించారు. పర్యాటకానికి పెద్దపీట వేస్తూ రూ.2 కోట్ల ఖర్చుతో ఆడలి వ్యూ పాయంట్‌ను వైఎస్సార్సీపీ హయాంలోనే అభివృద్ధి చేశారు. రూ.కోటి ఖర్చుతో జగతపల్లి వ్యూ పాయింట్ పనులు సైతం జరిగాయి. రూ.10 కోట్లతో సీతంపేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. రైతన్నకు ఆర్థిక అండ అందించడంతో పాటు 25 వేల ఎకరాల కొండపోడు భూములకు సంబంధించి 15వేల మంది రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. అందుకే సమావేశమైనా.. వేదిక ఏదైనా మాజీ ఎమ్మెల్యే కళావతి తన హయాంలో జరిగిన అభివృద్ధిని ఘనంగా చెప్పుకుంటున్నారు. చేసిన మేలును గిరిజనులు తెలియజేస్తుంటే సంతోషపడుతున్నారు. ప్రస్తుత కూటమి నేతలు ఉత్తుత్తి మాటలతో కాలక్షేపం చేయకుండా గిరిజనులకు మేలుచేసే పనులు చేయాలని కోరారు. – సీతంపేట -
కూటమికి ఓ గుణపాఠం
మేధావుల తీర్పు... సాలూరు రూరల్: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులు ఇచ్చిన తీర్పు కూటమి ప్రజావ్యతిరేక పాలనకు చెంపపెట్టు అని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. సాలూరు పట్టణంలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘవర్మను గెలిపించాలంటూ ఊరూరా తిరుగుతూ, గురువులపై ఒత్తిడి తెచ్చిన కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలకు తగిన గుణపాఠం చెప్పారన్నారు. మేధావుల తీర్పును సామాన్యులు సైతం స్వాగతిస్తున్నారన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రివి అర్థంలేని మాటలుగా పేర్కొన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన గాదె శ్రీనివాసులునాయుడు తమవాడే అంటూ ప్రకటించడాన్ని చూసి మేధావివర్గం నవ్యుకుంటోందన్నారు. 9 నెలల పాలనలో ఉపాధ్యాయుల పీఆర్సీ, ఈఆర్, పెండింగ్ బిల్లుల వంటి సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం కనీసం చొరవ చూపకపోవడంతో తగ్గిన బుద్ధిచెప్పారన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రజాసేవలో ఉత్సాహంగా ఉండాలని, కూటమి పాలనపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావుల తీర్పు తేటతెల్లం చేసిందన్నారు. గెలిచిన అభ్యర్థులు మా పార్టీ వారేనని చెప్పుకోవడం సిగ్గుచేటు కూటమి నాయకుల తీరుచూసి నవ్యుకుంటున్న మేధావివర్గం మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర -
8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం
● కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పార్వతీపురంటౌన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఈ నెల 8వ తేదీన ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. తన చాంబర్లో మహిళా దినోత్సవ వేడుకలపై సంబంధిత అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఆ రోజుకు ఎన్నికల కోడ్ ముగిసే అవకాశం ఉన్నందున వేడుకలకు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. జిల్లాలో ఉన్నత శిఖరాలకు చేరుకున్న మహిళలను గుర్తించి, వారి విజయగాథలతో ఇతర మహిళల్లో స్ఫూర్తినింపాలని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం, గిరిజన సంస్కృతి–సంప్రదాయాలను కాపాడే మహిళలు, ఇతరులకు రోల్ మోడల్‌గా నిలిచిన మహిళలను సన్మానించాలని చెప్పారు. మహిళలకు మెగా చెక్కుల పంపిణీ వంటివి చేపట్టాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఏఎస్పీ సురాన అంకిత్ మహావీర్, డీఆర్ఓ కె.హేమలత, జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారిత అధికారి డా.టి.కనకదుర్గ, పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ ఎం.వి.కరుణాకర్, ఐపీఓ వి.కె.వర్ధన్, ఎల్డీఎం ఎన్.విజయ్ స్వరూప్, డీఎస్డీఓ కె.సాయి కృష్ణ చైతన్య, తదితరులు పాల్గొన్నారు. సంగమేశ్వరుడి హుండీల ఆదాయం రూ. 7.65 లక్షలు వంగర : వంగర మండలం సంగాంలో వెలిసిన సంగమేశ్వరస్వామి ఆలయ హుండీల ఆదాయం రూ.7.65 లక్షలు వచ్చినట్టు ఈవో పొన్నాడ శ్యామలరావు తెలిపారు. ఏడు రోజుల పాటు నిర్వహించిన మహాశివరాత్రి ఉత్సవాల్లో స్వామి వారి ప్రత్యేక దర్శనం, శీఘ్ర దర్శనం టికెట్ల విక్రయం, విరాళాలు, ప్రసాద విక్రయాలు, హుండీలలో భక్తులు వేసిన కానుకల రూపంలో పై మొత్తం వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ బోను ఆనందరావు, బొడ్రోతు శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
రక్తదానం ప్రాణదానంతో సమానం
పార్వతీపురంటౌన్: రక్తదానం.. ప్రాణదానంతో సమానమైనదని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. లైన్మెన్ దివస్‌ను పురస్కరించుకొని ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో కార్యాలయం వద్ద మంగళవారం నిర్వహించిన ‘నేను సైతం’ రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతలు రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడవచ్చన్నారు. ప్రతి ఆరుమాసాలకు రక్తదానం చేయవచ్చని, అపోహలు వీడి రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డీఆర్డీఏ పీడీగా సుధారాణి పార్వతీపురంటౌన్: డీఆర్డీఏ పీడీగా సుధారాణి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా గ్రామీణాభివృద్ధికి తన వంతు కృషిచేయాలని కల్టెకర్ సూచించారు. పార్వతీపురం చేరుకున్న చిన జియర్ స్వామి ● నేడు శ్రీరామపాదుకాపట్టాభిషేకం పార్వతీపురం: పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం సాయంత్రం 6 గంటలకు శ్రీరామ పాదుకాపట్టాభిషేకం పూజాకార్యక్రమాలు నిర్వహించేందుకు మంగళవారం సాయంత్రం త్రిదండి చినజియర్ స్వామి పార్వతీపురం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన బెలగాంలోని వెంకటేశ్వర దేవస్థానానికి వెళ్లి భక్తులతో ముచ్చటించారు. శ్రీరామ పాదుక పట్టాభిషేకం పూజా విశిష్టతను వివరించారు. పూజల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొనాలని కోరారు. అనంతరం మైదానంలో ఏర్పాటు చేస్తున్న పాదుకాపట్టాభి షేక ప్రాంగణ ఏర్పాట్లను వికాస తరంగిణి అధ్యక్షుడు యిండుపూరు గున్నేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. జాతీయ జెండాకు అవమానం విజయనగరం: విజయనగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాకు ఘోర అవమానం జరిగింది. సిద్ధాంతాలకు పేటెంట్ మా నాయకుడు అని చెప్పుకుని తిరిగే జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు తమ కార్యాలయంలోనే జాతీయ పతాకాన్ని అవమానకర రీతిలో మూలనపడేయడమే కాకుండా జెండాపై తాగిన టీ కప్పులు వేయడం ఘోర తప్పిదమని కార్యాలయానికి విచ్చేసిన పలువురు పేర్కొన్నారు. ఈ నెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ నాయకులు పాలవలస యశస్వి, పడాల అరుణ, గురాన అయ్యలు మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఉన్న బీరువా పక్కన జాతీయ పతాకాన్ని మూలనపడేసి ఉన్న విషయాన్ని అక్కడికి విచ్చేసిన జనసేన కార్యకర్తలు చూడడమే కాకుండా వాటిపై తాగిన టీ కప్పును పడేయడం అవమానకరమని పలువురు పేర్కొంటున్నారు. జాతీయ పతాకాన్ని అవమానించిన జనసేన నాయకులు, కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. రక్తదాన శిబిరాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ -
రేషన్ కష్టాలు..!
రేషన్ డిపో వద్ద సరుకులు తీసుకుంటున్న దృశ్యం విజయనగరం మండలం జొన్నవలస గ్రామం. ఇంటిముందుకే వచ్చి సరుకులు ఇచ్చే ఎండీయూ (మొబైల్ డిస్పెన్షరీ యూనిట్) వాహనం రాకపోవడంతో రేషన్ డిపో వద్దకే వెళ్లి లబ్ధిదారులు ప్రతినెలా సరుకులు తీసుకుంటున్నారు. గంట్యాడ మండలంలోని తాటిపూడి, మధుపాడ గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. విజయనగరం ఫోర్ట్: రేషన్ సరుకుల పంపిణీలో మళ్లీ పాతరోజులు వచ్చే సమయం దగ్గర పడింది. నిత్యావసర సరుకుల కోసం గంటలు, రోజుల తరబడి క్యూ కట్టాల్సిందే. పని మానుకుని సరుకుల కోసం వేచి చూడాల్సిందే. ఇప్పటికే చాలా గ్రామాల ప్రజలకు ఎండీయూ వాహన సేవలు అందడం లేదు. వారంతా రేషన్‌డిపో వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు. వాహన డ్రైవర్లు మానేసిన చోట కొత్తవారిని ప్రభుత్వం నియమించకపోవడమే దీనికి కారణం. గతంలో నడవలేని వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, మంచాలపై ఉన్న వారు రేషన్ సరుకుల కోసం వెళ్లలేకపోయేవారు. సరుకులు విడిపించేవారు కాదు. పేదలందరికీ రేషన్ సరుకులు అందాలన్న ఉద్దేశంతో పాటు స్థానిక యువతకు ఉపాధి చూపాలన్న లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎండీయూ వాహన సేవలను అందుబాటులోకి తెచ్చింది. పల్లెలు, పట్టణాల్లోని వీధివీధి తిరుగుతూ లబ్ధిదారులకు సరుకులు అందజేసేది. ఇంటిముందరకే వాహనం రావడంతో వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు సైతం సులభంగా రేషన్ సరుకులు తీసుకునేవారు. ఇప్పుడు ఈ సేవలపై నిర్లక్ష్యం అలముకుంది. వాహన సేవలు ఒక్కొక్కటిగా దూరమవుతున్నాయి. జిల్లాలో 370 ఎండీయూ వాహనాలు... జిల్లాలో ఎండీయూ వాహనాలు 370 ఉన్నాయి. వాటిలో 21 ఎండీయూ ఆపరేటర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బాడంగి మండలం, బొబ్బిలి, దత్తిరాజేరు, డెంకాడ, గంట్యాడ, గుర్ల, కొత్తవలస, ఎల్.కోట, మెరకముడిదాం, పూసపాటిరేగ, రేగిడి ఆముదాలవలసలో ఒక్కొక్కటి చొప్పున, భోగాపురంలో–2, గరివిడిలో–03, ఎస్.కోటలో 03, విజయనగరంలో–2 చొప్పున ఎండీయూ ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడంలో కూటమి ప్రభుత్వం జాప్యం చేయడంతో లబ్ధిదారులకు రేషన్ కష్టాలు తప్పడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 5,71,354 రైస్ కార్డుదారులు ఉన్నారు. వీరికి సరుకులు పంపిణీకి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. జిల్లాలో కొన్నిచోట్ల డిపోలకు వెళ్లి సరుకులు తీసుకోవాల్సిన దుస్థితి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో లబ్ధిదారుల ఇంటివద్దకే రేషన్ జిల్లాలో 370 ఎండీయూ యూనిట్స్ 21 చోట్ల ఎండీయూ ఆపరేటర్ల ఖాళీ భర్తీలో కూటమి ప్రభుత్వం అలసత్వం 21 చోట్ల ఆపరేటర్ల రాజీనామా జిల్లాలో 370 ఎండీయూ వాహనాలు ఉన్నాయి. 21 చోట్ల ఆపరేటర్లు రాజీనామా చేశారు. అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా డీలర్ల ద్వారా సరుకులు సరఫరా చేస్తున్నాం. మిగిలిన చోట్ల ఎండీయూ వాహనాలతో సరుకులు అందజేస్తున్నాం. – కె.మధుసూదనరావు, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి -
మనోవేదనతో వ్యక్తి మృతి
శృంగవరపుకోట: పట్టణంలోని పుణ్యగిరి రోడ్డులో నివాసం ఉంటున్న వ్యక్తి మనోవేదనతో మృతిచెందాడు. ఈ ఘటనపై ఇరుగుపొరుగు వారు, పోలీసులు ప్రాథమికంగా సేకరించిన వివరాలిలా ఉన్నాయి. నాయీబ్రాహ్మణ కులానికి చెందిన కొరువాడ శ్రీనివాసరావు(43) పట్టణంలోని పుణ్యగిరి రోడ్డులో నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. వేర్వేరు వ్యాపారాల్లో నష్టాలపాలైన శ్రీనివాసరావు కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యానికి బానిసైన శ్రీనివాసరావు భార్యతో గొడవపడి విడాకుల వరకూ వెళ్లాడు. కోర్టులో వారి విడాకుల కేసు నడుస్తుండడంతో శ్రీనివాసరావు భార్య కుమార్తెతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉంటోంది. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు కొంతకాలంగా తన ఇంటి మేడ మీది గదిలో ఒంటరిగా ఉంటున్నాడు. మూడు రోజులుగా శ్రీనివాసరావు కనిపించలేదని, బయటకు రాలేదని కింది పోర్షన్లో ఉన్న వారు స్థానికులకు చెప్పడంతో వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇంటికొచ్చి తలుపులు తెరిచి, చూడగా శ్రీనివాసరావు చనిపోయి మంచంపై పడి ఉన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
పాలకొండ రూరల్: గ్రామస్థాయిలో పీహెచ్‌సీల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని పార్వతీపురం మన్యం జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఎస్.భాస్కరరావు అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన పాలకొండ మండలంలోని అన్నవరం, ఎం.సింగుపురం పీహెచ్‌సీలను సందర్శించి అక్కడి డ్రగ్‌స్టోర్, ల్యాబ్బ్ లతో పాటు రోజువారీ ఓపీ రిజస్టర్లు పరిశీలించారు. ఈ క్రమంలో మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రం తాజా స్థితిగతులును తెలుసుకున్నారు. ప్రైవేట్ వైద్య కేంద్రాలను సందర్శించిన ఆయన అక్కడి వసతుల గురించి రోగుల దగ్గర ఆరా తీశారు. ప్రభుత్వ వైద్యులు సమయపాలన పాటించాలని, క్షేత్రస్థాయి వైద్యసిబ్బంది గ్రామాల్లో సంచరిస్తూ రోజువారీ నివేదికలు అందించాలని ఆదేశించారు. ప్రస్తుత సీజన్లో విజృంభించే వ్యాధులు, వాటిని అధిగమించేందుకు అవలంబించాల్సిన రోగ నిరోధక విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆయన వెంట యోగేశ్వరరెడ్డి, సన్యాసిరావు, డీఎస్ఓ శంకరావు, వైద్యాధికారులు తేజరత్న రాజ్, వెన్నెల, రవికుమార్, అనిల్‌కుమార్ తదితరులున్నారు. డీఎంహెచ్ఓ భాస్కరరావు -
ఎడ్ల పరుగు పోటీల్లో వావిలపాడు విజేత
ప్రదర్శనలో పరుగు తీస్తున్న ఎడ్లువేపాడ: మండలంలోని పాటూరు సమీపంలో గాడివారి కళ్లాల వద్ద మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఎడ్ల పరుగు ప్రదర్శనలో వావిలపాడుకు చెందిన ఎడ్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. కళ్లాల వద్ద అభయాంజనేయ స్వామి తీర్థమహోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలో 12 ఎడ్లు జతలు పాల్గొన్నాయి. వాటిలో రెండోస్థానంలో వల్లంపూడికి చెందిన ఏడువాక సత్తిబాబు ఎడ్లు, మూడోస్థానంలో తుమ్మికాపల్లికి చెందిన జైదర్శిని ఎడ్లు, నాల్గో స్థానంలో కృష్ణారాయుడుపేటకు చెందిన గుమ్మాలమ్మ తల్లి ఎడ్లు, ఐదోస్థానంలో కలగాడకు చెందిన ఎడ్లు, ఆరోస్థానంలో వావిలపాడుకు చెందిన గండి వెంకటరావు ఎడ్లు నిలిచాయి. విజేతలకు రూ.12వేలు,10వేలు, 8వేలు, 6వేలు, 4 వేలు చొప్పున నగదు బహుమతులను గ్రామపెద్దలు, ఉత్సవ కమిటీ, దాతలు అందజేశారు. స్వామివారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి మద్యాహ్నా అన్నసమారాధన చేశారు. -
ఎల్లమ్మ గుడిలో హుండీని విరగ్గొట్టిన దుండగులు
గంట్యాడ: మండలంలోని నరవ గ్రామంలో ఉన్న ఎల్లమ్మ గుడిలో హుండీని సోమవారం రాత్రి దుండగులు విరగ్గొట్టారు. అందులో ఉన్న డబ్బులను దొంగిలించారు. అయితే ఈవిషయంపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. డ్రోన్ సహాయంతో జూదరుల అరెస్టుపార్వతీపురం రూరల్: పట్టణంలోని బూరాడ వీధిలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద రూ.1560లు నగదును స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ ఎస్సై ఎం.గోవింద తెలిపారు. మంగళవారం పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలు నిరోధించేందుకు డ్రోన్ కెమెరాను వినియోగించిన సందర్భంలో పేకాట ఆడుతున్న దృశ్యాన్ని గుర్తించి పేకాట శిబిరం వద్దకు వెళ్లి జూదరులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్‌లు శాస్త్రోక్తంగా నిత్య పూజాదికాలు చేశారు. మహిళలు, పెద్దలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఘటాలను సమర్పించారు. కార్యక్రమాలను ఆలయ ఇన్చార్జ్ ఈఓ కెఎన్‌వీడీవీ .ప్రసాద్ పర్యవేక్షించారు. -
ఇంటర్ ఫస్ట్ఇయర్ పరీక్షకు 562 మంది గైర్హాజరు
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు 562మంది గైర్హాజరైనట్లు డీవీఈఓ మంజుల వీణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె పట్టణంలోని పలు పరీక్షాకేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9437 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 8875మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, మాస్‌కాపీయింగ్ జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సిటింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్, బల్క్మెంబర్లు పరీక్షలను పర్యవేక్షించారన్నారు. పరీక్షలన్నీ నిత్యం సీసీ కెమెరాల లైవ్‌స్ట్రీమింగ్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి మా్స్కాపీయింగ్ నమోదు కాలేదని స్పష్టం చేశారు. డీవీఈఓ మంజుల వీణ -
రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లా యువత ప్రతిభ
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో విజయనగరం యువత సత్తా చాటారు. ఈనెల 1,2 తేదీల్లో విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన పోటీల్లో నగరంలోని బాడీ ఫిట్నెస్ జిమ్‌లో శిక్షణ పొందుతున్న కె.జగదీష్ 56 కేజీల బెంచ్ ప్రెస్ విభాగంలో 87.5 కేజీల బరువు ఎత్తి బంగారు పతకం, డిడ్లిఫ్ట్లో 195 కేజీల బరువు ఎత్తి మరో బంగారు పతకం దక్కించుకున్నాడు. అంతేకాకుండా సీనియర్ కేటగిరీ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జగదీష్ స్ట్రాంగ్ మెన్ టైటిల్ కై వసం చేసుకోవడం విశేషం. ఇదే పోటీల్లో 66 కేజీల విభాగంలో విజయనగరం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎ.రాజా డెడ్‌లిఫ్ట్‌లో 205 కేజీల బరువు ఎత్తి బంగారు పతకం సాధించగా..74 కేజీల విభాగంలో ఎం.వెంకటేష్ బెంచ్ ప్రెస్‌లో 90 కేజీల బరువు ఎత్తి కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను బాడీ ఫిట్నెస్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డి శంకరరావు, ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావులు అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించి జిల్లా కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పాలని ఆకాంక్షించారు. -
అమ్మా..కరుణించమ్మా
● అనుబంధ అమ్మవార్ల దర్శనానికి పోటెత్తిన భక్తులు ● పసుపు, కుంకుమలతో మొక్కులు చెల్లించుకున్న భక్తులు ● కోటదుర్గమ్మ, సంతానలక్ష్మి, అసిరితల్లి, భాగిరేతమ్మ ఆలయాల్లో సందడిచీపురుపల్లి: భక్తుల కష్టాల్లో తోడుంటూ ఆదుకునే అమ్మా కరుణించండి అంటూ పట్టణంలోని అనుబంధ అమ్మవార్లను భక్తులు వేడుకున్నారు. పసుపు, కుంకుమలతో అమ్మవార్లకు మొక్కులు సమర్పించుకున్నారు. తమ కష్టాలు తొలగించండి తల్లీ అంటూ చీరలు చూపిస్తూ అమ్మవార్లకు భక్తి, శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. దీంతో పట్టణంలో అనుబంధ అమ్మవార్లుగా చెప్పుకునే శ్రీ కోటదుర్గమ్మ, శ్రీ సంతానలక్ష్మి, శ్రీ అసిరితల్లి, శ్రీ భాగిరేతమ్మ ఆలయాల్లో భక్తుల సందడితో పాటు ఆధ్యాత్మిక వాతావరణ నెలకొంది. సంప్రదాయం ప్రకారం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి అక్క, చెల్లెళ్లుగా చెప్పుకునే అనుబంధ అమ్మవార్లుగా పట్టణంలో ఉన్న శ్రీ కోటదుర్గమ్మ, శ్రీ సంతోషిమాత, శ్రీ అసిరితల్లి, శ్రీ భాగిరేతమ్మ అమ్మవార్లకు కనక మహాలక్ష్మి జాతర ఉత్సవాల్లో ఆఖరి రోజు భక్తులు ప్రత్యేక పూజలతో బాటు మొక్కులు సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే మంగళవారం పట్టణంలోని శ్రీ కోటదుర్గమ్మ, సంతానలక్ష్మి, అసిరితల్లి, భాగిరేతమ్మ అమ్మవార్ల ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచే అమ్మవార్ల దర్శనానికి భక్తులు క్యూలో బారులు తీరారు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని వేడుకున్న మాదిరిగానే పసుపు, కుంకుమలతో పాటు చీరలు మొక్కుతూ తమ కష్టాలు నెరవేర్చాలని అనుబంధ అమ్మవార్లను వేడుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొత్తగవిడివీధిలో గల శ్రీ కోటదుర్గమ్మ వారి ఆలయంలో భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటూనే వేపచెట్టు వద్ద పూజలు చేశారు. అలాగే శ్రీ సంతోషిమాత, భాగిరేతమ్మ, అసిరితల్లి ఆలయాల వద్ద భక్తులు తులసి కోటకు పూజలు చేసి అమ్మవారిని వేడుకున్నారు. ఆలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని శ్రీ కోటదుర్గమ్మవారి ఆలయం వద్ద దర్శనానికి వచ్చే భక్తుల కోసం సిటీకేబుల్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని పలువురు ప్రముఖులు మంగళవారం దర్శించుకున్నారు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ఆఖరిరోజు మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, కుమారుడు డా.బొత్స సందీప్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, డా.బొత్స సందీప్‌లు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మీసాల వరహాలు నాయుడు, బెల్లాన వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
పార్వతీపురం టౌన్: గరుగుబిల్లి మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన నాగళ్ల సింహాచలం(55) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు, ఈ ఘటనపై పార్వతీపురం జిల్లా ఆస్పత్రి అవుట్‌పోస్ట్ పోలీసులు మంగళవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొమరాడ మండలం కళ్లికోట గ్రామానికి చెందిన గౌరీ శంకరరావు దగ్గర గొర్రెల కాపరిగా సింహాచలం పనిచేస్తున్నాడు. సింహాచలం కుమారుడు విశాఖపట్నంలో పనిచేస్తున్నాడు. కుమారుడికి ఎన్ని మార్లు ఫోన్ చేసినా స్పందన లేకకోవడంతో మనస్తాపం చెంది సోమవారం సాయంత్రం గుమడ గ్రామ సమీపంలో ఉన్న ఇటుకబట్టీల వద్దకు వెళ్లి పురుగు మందు తాగేశాడు. గమనించిన యజమాని గౌరీశంకరరావు వెంటనే తన మోటార్ సైకిల్‌పై పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తీసుకు రావడంతో వైద్యులు చికిత్స అందజేస్తుండగా మంగళవారం ఉదయం మృతిచెందాడు. గరుగుబిల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అవుట్‌పోస్టు ఏఎస్సై నిమ్మకాయల భాస్కరరావు తెలిపారు. ఉరి వేసుకుని వ్యక్తి.. సాలూరు: పట్టణంలోని దుర్గానవీధిలో నివాసముంటున్న షేక్ ఖలీల్ (29)ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదు అందిందని సీఐ అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ, సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో షేక్ ఖలీల్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు మృతుడి భార్య షేక్ భువనేశ్వరి ఫిర్యాదులో పేర్కొన్న మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి పార్వతీపురం రూరల్: మండలంలోని పార్వతీపురం–నర్సిపురం రహదారి పరిధిలో ఈనెల 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన కొల్లి బాలాజీ (34) విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. ఈ మేరకు మృతుడి భార్య రూరల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.సంతోషి తెలిపారు. -
ఎందుకంత ప్రేమంట..!
● ఒకే ఊరికి 30 గోకులాలు మంజూరుగోకులాల నిర్మాణానికి ఎంతెంత? రెండు ఆవులు ఉంటే.. రూ.1లక్షా30వేలు నాలుగు ఆవులకు రూ.1లక్షా80వేలు ఆరు ఆవులకు రూ.2లక్షల 30వేలు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 90శాతం రైతులకు నిధులు ఇవ్వగా పది శాతం మాత్రమే రైతులు పెట్టుకోవాలిబ్యాంకులో బంగారం పెట్టి గోకులం కట్టాను మినీ గోకులం నిర్మాణానికి రూ.1లక్షా 30వేలు ఖర్చుచేశాను. గోకులం నిర్మాణం పూర్తయినా ఒక్క రూపాయి కూడా బిల్లు ఇవ్వలేదు.నా భార్య బంగారం బ్యాంకులో తాకట్టుపెట్టి నిర్మాణం చేశాను. బిల్లు కోసం ఎదురు చూస్తున్నాను. – లోగిశ సూరప్పడు, లోగిశ గ్రామంగజపతినగరం రూరల్: గ్రామీణ ప్రాంతాల్లోని పశువులను కమ్మలతో కూడిన శాలల్లో ఉంచడం వల్ల అప్పుడప్పుడు అనారోగ్యం పాలవుతున్నాయి. తగిన సదుపాయాలు లేక ఆరోగ్యం పాడై మృత్యువాత పడుతున్నాయి. ఈ సందర్భాలను రాష్ట్ర ప్రభుత్వం గమనించి, ఆసక్తి ఉన్న రైతులకు మినీ గోకులాల నిర్మాణం చేపట్టుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రభుత్వం 90శాతం నిధులు మంజూరుచేస్తే స్ధానిక రైతులు పదిశాతం మాత్రమే పెట్టుబడి పెట్టి మినీ గోకులాల నిర్మాణం చేసుకోవచ్చంటూ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లు తమ గ్రామాల్లో ఆధిపత్యం చెలాయించడం కోసం మినీ గోకులాలు అధికంగా కావాలని నాయకుల వద్దకు సిఫార్సులతో వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో గజపతినగరం మండలంలోని లోగిశ గ్రామ రైతులకు మండలంలో ఏగ్రామానికి లేనంతగా 30గోకులాలు అధికార పార్టీ నేతలు మంజూరు చేయించారు. అయితే దీని వెనుక అదే గ్రామానికి చెందిన మాజీ మండల ప్రజాప్రతినిధి అభీష్టం మేరకు స్థానిక మంత్రి జిల్లాస్ధాయి అధికారులతో మాట్లాడి 30 గోకులాలు మంజూరుచేయించినట్లు సమాచారం. జిల్లాలో ఒక్కో మండలానికి తొలిదశలో 75 గోకులాలు మంజూరైతే ఒక్క గజపతినగరం మండలానికి ఏకంగా 135 గోకులాలు మంజూరు చేశారు. ఇందులో ఒక్క లోగిశ గ్రామానికే 30గోకులాలు మంజూరు చేయడంపై సంబంధిత మాజీ ప్రజాప్రతినిధిపై స్థానిక మంత్రికి కాస్త ప్రేమ ఎక్కువగానే ఉన్నట్లు ఉందని కూటమి ప్రభుత్వానికి చెందిన స్థానిక నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకీ 30 గోకులాలు మంజూరైనప్పటికీ అందులో కేవలం ఏడు గోకులాలు మాత్రమే నిర్మాణం పూర్తిచేసుకున్నట్లు సమాచారం. మిగిలిన 23 మంది రైతులు ముందు తాము పెట్టుబడి పెడితే ఆనక బిల్లులు మంజూరు కావడంలో ఆలస్యమైతే ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుందని గోకులాల నిర్మాణానికి ముందుకు రానట్లు సమాచారం.నిధులు రాలేదు నిర్మాణాలు పూర్తయిన గోకులాలన్నింటికి బిల్లులు అప్లోడ్ చేసి ఉంచాం. నిధులు రాగానే బిల్లులు చెల్లింపు చేస్తాం. ఇప్పటివరకూ మండలానికి 135 గోకులాలు మంజూరుకాగా 80 గోకులాల నిర్మాణం పూర్తయింది. లోగిశ గ్రామానికి మంజూరైన 30 గోకులాలు స్ధానిక మంత్రి జిల్లా స్ధాయి అధికారులతో మాట్లాడి మంజూరు చేయించారు. – కల్యాణి, ఎంపీడీఓ, గజపతినగరం మండలం -
ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు
వంగర: మండల పరిధిలో సంగాంలో వెలిసిన పవిత్ర సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఏడు రోజుల పాటు జరిగిన మహాశివరాత్రి ఉత్సవాలు మంగళవారం ముగిశాయి. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేలాది మంది భ భక్తులు సువర్ణముఖి, వేగావతి, నాగావళి నదులు కలిసే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి సంగమేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పీటీసీలో న్యాయశాస్త్రంపై విద్యార్థులకు శిక్షణవిజయనగరం క్రైమ్: స్థానిక కంటోన్మెంట్ పోలీస్ శిక్షణ కళాశాలలో న్యూక్రిమినల్ లాస్‌పై అన్న అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రెండు రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమాన్ని పీటీసీ ప్రిన్సిపాల్ టి.రామచంద్రరాజు మంగళవారం ప్రారంభించారు. క్రిమినల్ ప్రాసీజర్, ఎవిడెన్స్ యాక్ట్, ఇంటరాగేషన్ టెక్నిక్స్ తదితర అంశాలపై పీటీసీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. అనంతరం ప్రిన్సిపాల్ చేతుల మీదుగా స్టూడెంట్స్‌కు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పి.వి.అప్పారావు, డీఎస్పీ శ్రీకాంత్, డీఎస్పీ రమేష్, పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ పనులు పరిశీలించిన విజిలెన్స్ ఎస్పీపాచిపెంట: మండలంలోని గురివినాయుడుపేట వద్ద ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్మాణమవుతున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను శ్రీకాకుళం విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు పరిశీలించారు. ఈ మేరకు మంగళవారం ఆయన పాఠశాల భవన నిర్మాణాన్ని పరిశీలించి పనుల ప్రగతిపై ఆరా తీశారు. ఆమోదం పొందిన ప్లాన్ ప్రకారం నిర్మాణం జరుగుతున్నదీ..లేనిదీ తనిఖీచేస్తున్నామని, నాణ్యత పరీక్షలు చేసిన తరువాత ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఈఈ మణిరాజ్, డీఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్పై బురద జల్లడం తగదుపార్వతీపురంటౌన్: ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఓటమిని అంగీకరించకుండా యూటీఎఫ్పై బురద జల్లడం మానుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీ మోహనరావు మంత్రి అచ్చెంనాయుడికి సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను రాజకీయం చేసి, కూటమి అభ్యర్థి ఓడిపోయిన తరువాత, గెలిచిన వారే మా అభ్యర్థి అనడం..అక్కడితో ఆగకుండా యూటీఎఫ్ ముసుగులో వైఎస్సార్సీపీ పోటీచేసిందనడం వారి రాజకీయ క్రీడలను సంఘాలకు ఆపాదించడం సరికాదన్నారు. ప్రభుత్వం ఏదైనా గానీ ఉపాధ్యాయులకు, విద్యారంగానికి వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తే నిలదీసే తత్వం ఉన్న సంఘం కాబట్టే సుమారు 6వేల ఓట్లు వచ్చాయన్నారు. భవిష్యత్‌లో నైనా ఇటువంటి చౌకబారు ఆరోపణలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. బైక్‌పైనుంచి జారిపడి యువకుడి మృతిచీపురుపల్లి: పట్టణంలోని ఆంజనేయపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుడుముల బంగారునాయుడు(32) అనే యువకుడు మృతిచెందాడు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి హెచ్‌సీ రమణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గరివిడి మండలంలోని రేగటి గ్రామానికి చెందిన కుడుమల బంగారు నాయుడు, శనపతి రాము కలిసి ద్విచక్ర వాహనంపై చీపురుపల్లిలోని అమ్మవారి జాతరకు వచ్చారు. తిరిగి తమ గ్రామానికి వెళ్తుండగా వాహనం నడుపుతున్న శనపతి రాము ఆంజనేయపురంలో సడన్‌గా బ్రేక్ వేయడంతో వెనుక కూర్చున్న బంగారునాయుడు ద్విచక్ర వాహనం నుంచి కింద పడిపోగా తలకు బలమైన గాయమైంది. దీంతో తక్షణమే సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కూటమి ప్రభుత్వానికిచెంపపెట్టు
–8లోమంగళవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2025అందుబాటులో హాల్ టికెట్లు పార్వతీపురంటౌన్: పదో తరగతి విద్యార్థులకు హాల్‌టికెట్లు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.తిరుపతినాయుడు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, మీడియం, విద్యార్థి ఫొటో, సంతకం, సబ్జెక్టు వివరాలు నిశితంగా పరిశీలించి తప్పులు గమనిస్తే వెంటనే గౌరవ సంచాలకులు, ప్రభుత్వ పరీక్షల విభాగాన్ని సంప్రదించాలన్నారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను వాట్సాప్ ద్వారా పోందే వెసులబాటు ఉందన్నారు. లింగ నిర్ధారణ చేసేవారిపై కఠిన చర్యలు విజయనగరం ఫోర్్ట: లింగ నిర్ధారణ చేసేవారితో పాటు, సంబంధిత అంశంపై వాణిజ్య ప్రకటనలు, పోస్టర్లు, హోర్డింగ్‌లు పెట్టేవారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి హెచ్చరించారు. జిల్లా వైద్యశాఖ పరిధిలో నమోదైన ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని తెలిపారు. సీసీపీఎన్‌డీటీ యాక్టును అతిక్రమిస్తే మూడు నుంచి ఐదేళ్ల జైలుశిక్ష, రూ.50 వేలు నుంచి రూ.లక్ష వరకు జరిమానా తప్పదన్నారు. సీనియార్టీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ ● ఈ నెల 10వ తేదీలోపు గడువు ● డీఈఓ యు.మాణిక్యంనాయుడు విజయనగరం అర్బన్: పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ కింద పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయ/ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాను వెబ్సైట్లో పొందుపరిచామని డీఈఓ యు.మాణిక్యంనాయుడు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టీఐఎస్) రూపొందించిన ఈ జాబితాపై ఎలాంటి అభ్యంతరాలున్నా ఈ నెల 10వ తేదీలోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. అభ్యంతరం చేసే ఉపాధ్యాయుని పూర్తి పేరు, పనిచేస్తున్న కేడర్, అభ్యంతరం చెబుతున్న వివరాలు వివరించాలి. సీనియారిటీ జాబితాలో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పేర్కొనాలి. ఆధారాలు లేదా సంబంధిత సాక్ష్యాలు విధిగా జతచేయాలి. పూర్తి వివరాల కోసం జిల్లా విద్యాశాఖ కార్యాయంలో సంప్రదించవచ్చని తెలియజేశారు. రోడ్డు పనులకు సహకరించండి ● అటవీశాఖ అధికారులకు ఎస్టీ కమిషన్ చైర్మన్ సూచన విజయనగరం అర్బన్: అల్లూరి జిల్లా అనంతగిరి మండలం చిన్నకోనల గిరిశిఖర గ్రామ రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అధికారులు సహకరించాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు కోరారు. రోడ్డు పనులను అటవీశాఖాధికారులు అడ్డుకుంటున్నారంటూ గిరిజనుల నిరసన తెలపడంపై ఆయన సోమవారం స్పందించారు. నాన్ షెడ్యూల్ ఏరియాలోని రొంపల్లి పంచాయతీ పరిధి కొండశిఖర గ్రామాలైన చిన్నకోనల, భూరిగా, వనిజతో పాటు ఎన్.ఆర్.పురం పంచాయతీ పరిధిలోని మరో ఐదు గ్రామాలను కలుపుతూ వేసే రోడ్డు నిర్మాణంపై అటవీశాఖ అభ్యంతరాలను నివేదిక రూపంలో అందజేయాలని సంబంధిత అధికారులను కోరారు. గిరిజనులకు మౌలిక సదుపాయాల కల్పనపై అలసత్వం వహించరాదన్నారు. బొబ్బిలిలో నిలిచిన గూడ్స్‌రైలు బొబ్బిలి: సాంకేతిక సమస్య కారణంగా బొబ్బిలి–డొంకినవలస రైల్వేస్టేషన్ల మధ్య ఓ గూడ్స్‌రైలు సోమవారం సాయంత్రం నిలిచిపోయింది. దీంతో బొబ్బిలి రైల్వేస్టేషన్ మీదుగా ప్రయాణించాల్సిన విశాఖ–కొరాపుట్ రైలుతో పాటు పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గంట కాలం పాటు రైలు అలాగే ఉండిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. స్పందించిన రైల్వే అధికారులు.. కొరాపుట్ రైలుకు వేరే ఇంజిన్ తెప్పించి, రైలును కదిలించే ప్రయత్నం చేశారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవి వ్యూహాలు... మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి ముక్తాయింపులు... టీడీపీ ఎమ్మెల్యేలు కళావెంకటరావు, బేబీనాయన, అదితి గజపతిరాజు ఒడ్డిన సర్వశక్తులు, కోళ్ల లలితకుమారి, విజయచంద్ర తదితర కూటమి ఎమ్మెల్యేల సముదాయింపులు, బెదిరింపులు, లాలింపులు, తాయిలాలు, తాలింపులు... ఇవేవీ ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మను గెలిపించలేకపోయాయి. సార్వత్రిక ఎన్నికలను తలపించేలా ప్రతి ఎమ్మెల్యే, మండల స్థాయి నాయకులు ఎంత ప్రచారం చేసినా, చివరకు పోలింగ్ రోజున కేంద్రాల ముందు శిబిరాలు తెరిచి కూర్చున్నా వారి ప్రయత్నాలన్నీ మేధావుల నిర్ణయం ముందు తేలిపోయాయి. అధికారం అప్పగించి తొమ్మిది నెలల్లోనే అరాచకాలతో, అప్రజా స్వామిక పాలన సాగిస్తున్న టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వానికి తమ ఓటుతో బుద్ధి చెప్పా రు. ఒకవైపు పలు ఉపాధ్యాయ సంఘాల ప్రత్యక్ష మద్దతు, వైఎస్సార్సీపీ పరోక్ష మద్దతుతో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులనాయుడు ఘన విజయం సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరి కూడా గట్టి పోటీ చేశారు. వీరిద్దరికీ కలిపి ప్రథమ ప్రాధాన్య ఓట్లలో సుమారు 70 శాతం వరకూ రాగా, కూటమి ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డినా ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు రమారమి 30 శాతం ఓట్లే దక్కాయి. అధికార దర్పంతో విర్రవీగుతున్న ‘రెడ్‌బుక్’ ప్రభుత్వానికి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఇచ్చిన తీర్పు ఒక చెంపపెట్టు వంటిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ● మూడోసారి గాదెకు అవకాశం... ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి సభ్యునిగా డాక్టర్ గాదె శ్రీనివాసులనాయుడు ఎన్నిక సోమ వారం రాత్రి 10 గంటలకు ఖరారైంది. గతంలో రెండు సార్లు ఉపాధ్యాయ శాసనమండలికి ప్రాతిని ధ్యం వహించిన ఆయనకు ఆరేళ్ల విరామం తర్వాత మరోసారి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు అవకాశం ఇచ్చారు. విజయనగరం జిల్లాలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూ ఉపాధ్యాయ, విద్యారంగంలోని సమస్యలపై పోరాడుతూ వచ్చిన గాదె ఉత్తరాంధ్ర సుపరిచితులు. పీఆర్టీయూ సంఘానికి జిల్లా, రాష్ట్రస్థాయి నాయకత్వం వహించారు. వాస్తవానికి గాదె పూర్వీకులది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలంలోని జోగింపేట గ్రామం. ఉద్యోగరీత్యా ఆయన తండ్రి వెంకునాయుడు విజయనగరం జిల్లాకు నివాసం వచ్చేశారు. జిల్లా పరిషత్ సీఈవోగా ఉమ్మడి (శ్రీకాకుళం, విజయనగరం) జిల్లాలో పనిచేశారు. అలా జిల్లాతో అనుబంధం ఏర్పడిన శ్రీనివాసులనాయుడు తన పాఠశాల విద్యను విజయనగరం, గజపతినగరం ప్రాంతాల్లోనే సాగించారు. ఉన్నత విద్య విషయానికొస్తే ఆయన ఎమ్మెస్సీ, ఎంటెక్, బీఈడీ, ఎంఏ (ఎడ్యుకేషన్) పూర్తి చేశారు. విద్యారంగంపై పరిశోధన చేశారు. పీహెచ్డీ పట్టాతో డాక్టర్ శ్రీనివాసులనాయుడు అయ్యారు. 2007, 2013 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరుసగా రెండు దఫాలు ఉత్తరాంధ్ర ఉపాధ్యా య ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఉపాధ్యాయ హక్కుల సాధనలో ఆయన కృషిని ఉపాధ్యాయులు గుర్తించారు. ● ఉపాధ్యాయ సంఘాల మద్దతు... రఘువర్మ పదవీకాలం పూర్తికావడంతో జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి శ్రీనివాసులనాయు డు బరిలో నిలిచారు. ఆయనకు ఏపీటీఎఫ్ (1938) , ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్), రాష్ట్రీయ ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ), ఆర్‌యూపీపీ, బీటీఏ, ఏపీటీయూ (ఎయిడెడ్), ఏపీటీ జీ (ఎయిడెడ్), టీఆర్ఈఐఎల్ఏ, టీఆర్ఈఐటీఏ, జీజీటీఏ, ఏపీజీటీడబ్ల్యూఆర్ఎస్, ఏటీఏ, ఎస్డ బ్ల్యూఈఎఫ్–ఏపీ, ఏపీటీడబ్ల్యూఏహెచ్ఎస్, ఏపీటీ డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కళాశాలలు, ఏపీపీటీ, పీఈటీ, పీడీ, పీటీఎల్ఎఫ్, ఏపీఎంపీఎస్టీయూ తదితర సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆయన ముచ్చటగా మూడోసారి శాసనమండలిలో అడుగుపెట్టడానికి సహకరించాయి. విలేకరుల సమామేశంలో మాట్లాడుతున్న మాజీ డిప్యూటీ సీఎం పీడీక రాజన్నదొర, పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి సాలూరు రూరల్: సంక్షేమ పథకాలు, జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఏకై క హీరో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి అని, ఆయన పాలన సంక్షేమానికి చిరునామాగా పేరొందిందని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. సాలూరులోని రాజన్నదొర ఇంటి వద్ద సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అబద్ధాలు చెప్పడంలో కూటమి నేతలు ఆరితేరిపోయారన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత విద్యా శాఖ మంత్రి లోకేశ్ జాబ్, సంక్షేమ క్యాలండర్ విడు దల చేస్తామని చెప్పిన విషయం నిరుద్యోగులు, ప్రజలకు గుర్తుందన్నారు. సంక్షేమ పథకాలు అందిస్తారని ప్రజలు ఇప్పటికీ ఆశగా ఎదురు చూస్తున్నారని, తక్షణమే పథకాలు అందజేయాలన్నారు. ప్రస్తుతం పేదలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, ఆదుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. 2014లో రైతు రుణమాఫీ కింద రూ. 87వేల కోట్లు బ్యాంకులకు కట్టాల్సి ఉండగా కేవల రూ.20వేల కోట్లు కట్టిన చంద్రబాబునాయుడు.. మరోసారి రైతులకు రూ.20వేలు పెట్టుబడి సా యం అందజేస్తామని మోసం చేశారన్నారు. మహిళలకు రూ.12వేల కోట్లు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేయడంతో వడ్డీతో కలిపి రూ.25వేల కోట్లను నాలుగు దఫాలుగా గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చెల్లించిన విషయం అందరి కీ గుర్తుందన్నారు. 41లక్షల మంది తల్లులకు అమ్మవడి అందించిన ఘనత జగన్ మోహనరెడ్డికే దక్కుతుందన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఎం.తులసిరెడ్డి వంటి మేధావులు కూటమి ప్రభుత్వం కంటే గత జగన్ ప్రభుత్వం మేలు చేసిందని చెబుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనను ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావి వర్గం గట్టిగా తిప్పికొట్టిందన్నారు. ఇప్పటికై నా టీడీపీ నాయకులు అబద్ధాలు చెప్పడం మాని వాస్తవాలకు దగ్గరగా పాలన అందించాలని హితవు పలికారు. విజయనగరం ఫోర్ట్: కూటమి ప్రభుత్వ పాలనలో రేషన్ లబ్ధిదారుల ‘పప్పు’లుడకవిక. పేదలకు సరఫరా చేసే కందిపప్పు సరఫరాకు ఎసరు పెట్టింది. కేవలం బియ్యం, పంచదార సరఫరాకే ప్రజాపంపిణీ వ్యవస్థను పరిమితం చేసింది. ఎన్నికలవేళ అలవికాని హామీలిచ్చిన కూటమి నేతలు గద్దె నెక్కాక ఒక్కొక్కదానిని తుంగలో తొక్కడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం పేరిట రూ.15 వేలు చొప్పున అందిస్తామని చెప్పారు. విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా ఆర్థిక సాయం సున్నాగానే మిగిలింది. రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవ పథకంగా పేరుమార్చి రైతులకు ఏమార్చారు. పైసా సాయం అందజేయకుండా కష్టాల్లోకి నెట్టారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఉత్తుత్తిదే అని తేల్చేశారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని చెప్పారు. ఒక్కరికీ ఇచ్చిన దాఖాలా లేవు. నిరుద్యోగ భృతి ఎండమావిగానే మారింది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అన్ని సరుకులు ప్రజలకు అందిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందించే సరుకుల్లోనూ కోత విధిస్తూవస్తున్నారు. గత కొద్ది నెలలుగా కందిపప్పులో కోత విధిస్తున్న కూటమి సర్కారు మార్చి నెలకు ఏకంగా మంగళం పాడేయడంపై మండిపడుతున్నారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని పాలన ఎందుకంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. అమరావతిని కట్టేస్తే పేదల కడుపునిండుతుందా అని ప్రశ్నిస్తున్నారు. పెద్దల లబ్ధికోసం పేదలకు కేటాయించాల్సిన డబ్బులన్నీ రాజధాని నిర్మాణం పేరుతో జేబుల్లోవేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఇదీ పరిస్థితి... జిల్లాలో తెలుపు రేషన్‌కార్డు దారులు 5,71,354 మంది ఉన్నారు. వీరికి నెలకు 571.354 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం. నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో పేద, మధ్యతరగతి ప్రజలు జీవనానికి ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.180 పలుకుతున్న కందిపప్పును కొనుగోలు చేయడం తలకుమించిన భారంగా మారింది. ప్రభుత్వం స్పందించి గతంలో వలే కిలో రూ.67 చొప్పున రాయితీపై అందజేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ పార్వతీపురం టౌన్: జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అసక్తికలిగిన పెట్టుబడిదారులను స్వాగతిస్తామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా పర్యా టక అభివద్ధి మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రీసార్ట్స్, బోటింగ్, వాటర్ స్పోర్ట్స్, లోటస్ గార్డెన్ ఏర్పాటుకు ముందుకు వచ్చే పెట్టుబడిదారులను స్వాగతిస్తామని, వారికి కావల సిన అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామన్నారు. తోటపల్లి, వెంగళరాయసాగరం, పెద్దగెడ్డ వంటి రిజర్వాయర్ల లో బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ వంటివి ఏర్పాటు చేయవచ్చన్నారు. తోటపల్లి వద్ద ఉన్న ఐటీడీఏ పార్కును అభివృద్ధి చేయాలని సూచించారు. ఆడలి వ్యూపాయింట్ వద్ద రక్షణ గోడలు, రహదారి పను లు, రెండు గదుల నిర్మాణాలు వీలైనంత త్వరగా పూర్తి కావాలని, నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ స్పష్టంచేశారు. పార్వతీపురంలో బడ్జెట్ హోటల్ నిర్మాణానికి ముందుకు వచ్చిన పెట్టుబడిదారులకు స్థలాన్ని అప్పగిస్తామని, ప్రభు త్వం రాయితీలను ప్రకటించిందని కలెక్టర్ గుర్తుచేశారు. అరుకు–సాలూరు–పార్వతీపురం మీదుగా మందస వరకు గల సర్క్యూట్ టూరిజంను వీలైనంత త్వరగా ప్రతిపాదనలు పంపి ప్రారంభించాలని సూచించారు. సమావేశంలో ఐటీడీఏ పీఓలతోపా టు డీపీఓ టి.కొండలరావు, అడ్వంచర్ అండ్ వాట ర్ స్పోర్ట్స్ డైరెక్టర్ బి.బలరాంనాయుడు, నీటిపారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజినీరు ఆర్.అప్పలనాయుడు, తోటపల్లి రిజర్వాయర్ ఉపకార్యనిర్వాహక ఇంజినీరు టి.రఘునాథనాయుడు, దేవదాయ శాఖాధికారి యస్.రాజారావు తదితరులు పాల్గొన్నారు. న్యూస్రీల్ఉత్తరాంధ్ర వేదికగా తిరుగుబాటు... కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు ఉత్తరాంధ్ర వేదికగా తిరుగుబాటు మొదలైంది. తొలుత ఆ బాధ్యతను మేధావివర్గం భుజానకెత్తుకుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నడూ కనిపించిన రాజకీయ జోక్యాన్ని కలిసికట్టుగా తిప్పికొట్టారు. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తే ఓటుతో బుద్ధిచెబుతారని తెలియజెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయకుండా ప్రజా, ఉద్యోగ వ్యతిరేక పాలన సాగిస్తూ, కక్షపూరిత రాజకీయాలకు తెరతీసిన కూటమి ప్రభుత్వం ఇక రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనన్న సంకేతాన్ని మేధావివర్గం ఇచ్చిందన్న చర్చ పల్లెలు, పట్టణాల్లో జోరందుకుంది. రోడ్లు వేసినది ఎవరో ఏజెన్సీ ప్రాంత గిరిజనులను అడితే చెబుతారు అబద్ధాలు చెప్పినంత సులభం కాదు పనులు చేయడం ప్రజల్లోకి వెళ్తే కూటమి పాలన ఎలా ఉందో తెలుస్తుంది.. కూటమి ప్రజావ్యతిరేక పాలనను తిప్పికొట్టిన మేధావి వర్గం మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన అవసరం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ఎంవీవీ శ్రీనివాస్ విజయనగరం ఫోర్ట్: వ్యవసాయ పద్ధతులను విద్యార్థులు తెలుసుకోవాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ఎంవీవీ శ్రీనివాస్ తెలిపారు. ఏరువాక కేంద్రంలో సోమవారం గ్రామీణ వ్యవసాయ అవగాహన అనుభవ కార్యక్రమంలో భాగంగా శిక్షణ పొంతున్న నైరా కళాశాల వ్యవసాయ విద్యార్థులతో సమావేశమయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి రైతులు వివిధ పంటల్లో అవలంభిస్తున్న పద్ధతులను తెలుసుకోవాలన్నారు. వారికి తెలియని విషయాలను తెలియజేయాలన్నారు. కందిపప్పు కట్..! రేషన్ లబ్ధిదారులకు నిలిచిన కందిపప్పు సరఫరా కూటమి ప్రభుత్వ తీరుపై విమర్శల వెల్లువ మార్చినెలకు విడుదలకాని కందిపప్పు జిల్లాలో రైస్‌కార్డులు 5,71,354 571.354 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం లబ్ధిదారులకు బియ్యం, పంచదార మాత్రమే సరఫరా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం అప్రజాస్వామ్య పాలనపై మేధావుల తీర్పు మరోసారి పెద్దల సభకు గాదె శ్రీనివాసులునాయుడు ఉత్కంఠ పోరులో మూడోసారి ఎమ్మెల్సీగా గెలుపు టీడీపీ, జనసేన నాయకులు సర్వశక్తులు ఒడ్డినా తప్పని రఘువర్మ ఓటమి కూటమి ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైంది... టీడీపీ, జనసేన పార్టీలు బలపర్చిన సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ కన్నా ఆయన సమీప ప్రత్యర్థులిద్దరికీ దాదాపు 70 శాతం టీచర్లు మద్దతు పలికారంటే తొమ్మిది నెలల్లోనే ప్రజాభిప్రాయంలో ఎంత మార్పు వచ్చిందో అర్థమవుతోంది. రఘువర్మ తరఫున ఆ పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, మంత్రులు ప్రత్యక్షంగా ప్రచారం చేసి, పోలింగ్ కేంద్రాల ముందు స్లిప్పులు పంచినా తీర్పు మాత్రం కూటమి ప్రభుత్వానికి చెంపదెబ్బ కొట్టినట్లు చెప్పారు. ఇక్కడితో కౌంట్‌డౌన్ మొదలైంది. – మజ్జి శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సంతోషంగా ఉంది ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులనాయుడు గెలవడం సంతోషంగా ఉంది. ఇది కూటమి ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిది. ఇకనైనా ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి. – అమరపు సూర్యనారాయణ, పీఆర్టీయూ అసోసియేట్ అధ్యక్షుడుసరఫరా కాలేదు.. రేషన్ కార్డుదారులకు మార్చినెలకు సరఫరా చేసేందుకు కందిపప్పు సరఫరా కాలేదు. జిల్లాకు నెలకు 571.354 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం పడుతుంది. ఈ నెల బియ్యం, పంచదార మాత్రమే సరఫరా చేస్తాం. – కె.మధుసూదనరావు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ -
వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తనీయొద్దు
పార్వతీపురం టౌన్: ప్రస్తుత వేసవి కాలంలో జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారుల ను ఆదేశించారు. జూన్ మాసాంతం వరకు నిరంత రం తాగునీరు సరఫరా చేసేలా ముందస్తు ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. సమస్యతలెత్తితే సంబంధిత ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. నీటి ఎద్దడి ఉన్నచోట బోర్లు వేసేందుకు, పాడైనవి బాగుచేసేందుకు 15వ ఆర్థిక సంఘం నిధులు/ఐటీడీఎ/ జెడ్పీ నిధులు వినియోగించుకోవాలని సూచించా రు. ఎక్కడైనా తాగునీటి సమస్యలు తలెత్తితే సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. పీఎం సూర్యఘర్ యూనిట్లను అధిక మంది వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీఎం జన్మన్, పీఎంఏవై 2.0 కింద నిర్మితమవుతున్న గృహాలపై ఐటీడీఎ పీఓలు ప్రత్యే క శ్రద్ధ కనబరచాలన్నారు. జిల్లాలో 94 సెల్ టవర్ల ఏర్పాటుకు బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ నెట్ వర్క్స్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని, టవర్లులేని ప్రాంతాలను గుర్తించి గురువారం నాటికి నివేదికలు అందజేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఐటీడీఏ పీఓలు అశుతోష్ శ్రీవాస్తవ, సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, హౌసింగ్, డ్వా మా, డీఆర్డీఏ, ఐసీడీఎస్ పీడీలు ధర్మచంద్రారెడ్డి, కె. రామచంద్రరావు, వై.సత్యంనాయుడు, టి.కనకదు ర్గ, సీపీఓ పి.వీర్రాజు, డీపీఓ టి.కొండలరావు, జిల్లా ఆరోగ్య శాఖాధికారి ఎస్.భాస్కరరావు, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ ఎస్.మన్మథరావు, జిల్లా మత్స్య శాఖాధికారి వి.తిరుపతయ్య, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి.శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారి ఒ.ప్రభాకరరావు, జిల్లా బీసీ సంక్షేమాధికారి ఎస్.కష్ణ, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ కె.చలపతిరావు, డీఎస్డీఓ కె.సాయికష్ణచైతన్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం
● కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్పార్వతీపురంటౌన్: జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మహిళా దినోత్సవం నిర్వహణపై సోమవారం ఆయన కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా దినోత్సవంలో మహిళలందరినీ భాగస్వామ్యం చేయాలని సూచించారు. ప్రేరణ, సఖి కింద ప్రభుత్వ శాఖల్లో పదవులు అధిరోహించిన మహిళలు, పారిశ్రామిక వేత్తలు, విద్యావేత్తలు, క్రీడలు, వ్యవసాయంలో రాణించిన మహిళలు, సంగీత కళాకారులు, పారిశుద్ధ్యం, ఆశ, వైద్య రంగాలలో విశేష సేవలందించిన మహిళలందరినీ గుర్తించాలని సూచించారు. ఆ మహిళల ద్వారా ఇతరులు ప్రారణ పొందాలని అభిప్రాయపడ్డారు. మహిళల ఎంపికలో పారదర్శకత అవసరం మహిళల ఎంపికలో పారదర్శకత అవసరమని, అన్ని వర్గాలకు అవకాశం కల్పించాలని కలెక్టర్ చెప్పారు. అన్ని నియోజక వర్గాల్లో ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఓసీ మిగిలిన అన్ని వర్గాలకు అవకాశం కల్పించాలని, మహిళలు తయారు చేసిన అన్ని రకాల ఉత్పత్తులు, తినుబండారాల స్టాల్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. జిల్లా అధికార యంత్రాంగం చేపడుతున్న న్యూట్రీకిట్ల పంపిణీ, పాఠశాల స్థాయిలో విద్యార్ధులకు ఏర్పాటు చేసిన భవిత తదితర అంశాలు ఆవిష్కృతం కావాలని పిలుపునిచ్చారు. నేడు హెల్దీ ఉమెన్.. హ్యాపీ ఉమెన్ ఈనెల 4న హెల్దీ ఉమెన్..హ్యాపీ ఉమెన్ పేరిట యోగా, ధ్యానం వంటి కార్యక్రమాలు చేపట్టాలని, మండల స్థాయి విజేతలకు ఈనెల 6వ తేదీన, జిల్లాస్థాయిలో విజేతలకు ఈనెల 7వ తేదీన అవార్డుల ప్రదానం చేపట్టాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో డీఆర్ఓ హేమలత, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, డీఆర్డీఏ పీడీ వై.సత్యంనాయుడు, మెప్మా పీడీ కె.శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు, పరిశ్రమల మేనేజర్ ఎంవీ కరుణాకర్, డీపీఆర్ఓ ఎల్.రమేష్, నైపుణ్యాభివృద్ధి అధికారి సాయికృష్ణ చైతన్య, డీఎస్డీఓ ఎస్.వెంకటేశ్వర్లు, జిల్లా, మండల మహిళా సమాఖ్య అధ్యక్షులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
సునీల్‌కుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలి
విజయనగరం టౌన్: దళిత అధికారులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరిత చర్యలు చేపట్టడం దారుణమని, కూటమి ప్రభుత్వం పలువురు దళిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగులివ్వకుండా ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తోందని, డీజీ ర్యాంకులో ఉన్న పీవీ.సునీల్ కుమార్‌పై ఉద్దేశపూర్వకంగా కక్షసాధింపు చేపట్టడం విచారకరమని అంబేడ్కర్ ఇండియా మిషన్ ప్రతినిధులు బొంగ భానుమూర్తి, రేగాన శ్రీనివాసరావు, కె.భీమారావు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక బాలాజీ కూడలి వద్దనున్న అంబేడ్కర్ భవన్లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 జూన్ 12 తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాటి నుంచి నేటివరకూ సుమారు తొమ్మిదినెలల కాలంలో రాష్ట్రంలో ఉన్న దళిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేస్తూ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెడుతూ, నారా లోకేష్ తీసుకువచ్చిన రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అములుచేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని మోడీ అమలుచేస్తే, రాష్ట్రంలో లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుచేస్తూ తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో సోము మురళీమోహన్, పి.ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ ఇండియా మిషన్, దళిత సంఘాల నాయకులు -
క్రీడల్లో మిమ్స్ వైద్య విద్యార్థుల ప్రతిభ
నెల్లిమర్ల: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన క్రీడాపోటీల్లో నెల్లిమర్లలోని మిమ్స్ హోవియో కళాశాల వైద్య విద్యార్థులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఈ మేరకు సోమవారం మిమ్స్ పీఈటీ కె.వెంకటరావు మాట్లాడుతూ ప్రతిపాడు హెల్త్ యూనివర్సిటీ ఏఎస్ఆర్ హోమియో వైద్య కళాశాలలో మూడు రోజులుగా జరుగుతున్న అంతర్ కళాశాల క్రీడా పోటీల్లో మిమ్స్ హోమియో వైద్య విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఓవరాల్ చాంపియన్ సాధించారని తెలిపారు. అలాగే పోటీల్లో పురుషులు, మహిళా జట్లు విజేతలుగా నిలిచాయని చెప్పారు. పురుషుల జట్టు క్రికెట్, టేబుల్‌టెన్నిస్, డిస్కస్‌త్రో, షాట్‌పుట్‌లో బంగారు పతకాలు సాధించగా, మహిళా క్రీడాకారులు వాలీబాల్, త్రోబాల్, బ్యాడ్మింటన్, పరుగుపందెంలో బంగారు పతకాలు సాధించారని వివరించారు. ఈ సందర్భంగా మిమ్స్ చైర్మన్,మేనేజింగ్ ట్రస్టీ అల్లూరి సత్యనారాయణరాజు, మేనేజింగ్ట్రస్టీ డాక్టర్ ప్రవీణ్ వర్మ, డీన్ డాక్టర్ లక్ష్మీకుమార్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రఘురాం, అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ వేణుగోపాలరావు, సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు, హోమియోపతి వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, ఏఓ పి.గణేష్ పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. -
సంగాం ఆలయంలో భక్తుల రద్దీ
● త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలువంగర: మండల పరిధి సంగాంలో వెలసిన పవిత్ర సంగమేశ్వరస్వామి ఆలయానికి సోమవారం భక్తుల రద్దీ పెరిగింది. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో ఉన్న సువర్ణముఖి, వేగావతి, నాగావళి నదులు కలిసే కూడలి(త్రివేణి) సంగమం వద్ద పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించి సంగమేశ్వరుడిని దర్శించుకున్నారు. పితృదేవతలకు అధిక సంఖ్యలో భక్తులు పిండప్రదానాలు చేశారు. -
డీఏవీ స్కూల్ విద్యార్థి ప్రతిభ
రాజాం సిటీ: స్థానిక డీఏవీ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న హనుమంతు జయాన్ చక్కని ప్రతిభ కనబరిచాడు. హైదరాబాద్‌కు చెందిన విశ్వం ఎడ్యుటెక్ నిర్వహించిన జిల్లా, రాష్ట్ర స్థాయి, అబాకస్, వేదిక్ మ్యాథ్స్‌లో ప్రతిభకనబరిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. ఈ నెల 2న జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీలో సీనియర్ విజవలైజింగ్ కేటగిరిలో ద్వితీయ స్థానం సంపాదించాడని పాఠశాల సిబ్బంది తెలిపారు. తన కుమారుడి ప్రతిభపట్ల రాజాం రూరల్ సీఐ హెచ్.ఉపేంద్రరావుతో పాటు కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. -
భక్తి మార్గం అనుసరణీయం
● మాజీ ఎంపీ బెల్లానవంగర: ప్రజలు భగవన్మామస్మరణతో మెలిగి భక్తిమార్గాన్ని అనుసరణీయంగా భావించా లని విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయ న వంగర మండల పరిధి గీతనాపల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీరామాలయం పునఃప్రతిష్ట, శ్రీఆంజనేయస్వామి ఆలయం ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ నెయిగాపుల శివరామకృష్ణయ్య, నెయిగాపుల ప్రసాదరావులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ, పార్టీ నాయకులు యలకల వాసునాయుడు, కిమిడి స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.సెంచూరియన్‌లో క్యాంపస్ ఇంటర్వ్యూలునెల్లిమర్ల రూరల్: మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో నాగ్‌పూర్‌కు చెందిన కోడ్ ఎఫ్ సొల్యూషన్స్ సంస్థ సోమవారం క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఫోరెన్సిక్ అనలిస్ట్, ఫోరెన్సిక్ ట్రైనీ, ఇన్వెస్టిగేటర్, క్రైమ్ ఆఫీసర్స్, తదితర ఉద్యోగాలకు ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ శుభం రాజేంద్ర సాహు మాట్లాడుతూ బీఎస్సీ, ఎమ్మెస్సీ పోరెన్సిక్లో మొదటి సంవత్సరం చదివిన విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కాలంలో రూ.10వేలు స్టైపెండ్ అందిస్తామన్నారు. ఇంటర్న్‌షిప్ అనంతరం ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో హెచ్ఆర్ హెడ్ శుభాంగి నీల్కాంత్ నిఖారే పాల్గొన్నారు.గొర్రెపోతుల పందాలపై పోలీసుల దాడిలక్కవరపుకోట: మండలంలోని ఖాసాపేట గ్రామం సమీపంలో గల తోటల్లో రహస్యంగా నిర్వహిస్తున్న గొర్రెపోతుల పందాలపై ఎస్సై నవీన్‌పడాల్ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం దాడి చేశారు. ఈ సందర్భంగా పందెం నిర్వహిస్తున్న ఐదుగురు పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.2వేలు, రెండు గొర్రెపోతులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదంలో జేఎల్ఎం మృతిచీపురుపల్లి: పట్టణంలోని ఆంజనేయపురం సమీపంలో విజయనగరం–పాలకొండ ప్రధాన రహదారిలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని పేరిపి గ్రామానికి చెందిన కరణం సత్యం(48) మృతిచెందాడు. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం పేరిపి గ్రామానికి చెందిన కరణం సత్యం ఆర్ఈసీఎస్లో చీపురుపల్లి మండలంలోని పత్తికాయవలస జూనియర్ లైన్‌మన్(జెఎల్ఎం)గా పనిచేస్తున్నాడు. అయితే పట్టణంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో మూడు రోజులు నిరంతర విద్యుత్ సరఫరాలో భాగంగా ఉన్నతాధికారులు జేఎల్ఎంలకు చీపురుపల్లిలో అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో విధి నిర్వహణలో భాగంగానే సత్యం ఆదివారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తరువాత చీపురుపల్లి నుంచి గరివిడి వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న పాలవ్యాన్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయనకు భార్య సుజాత, కుమారుడు ఉన్నారు. పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీరామ రామ రామేతి..!
● అజరామరం గుళ్ల సీతారాంపురంలోని ఆలయం ● 500 ఏళ్ల చరిత్ర కలిగిన సీతారాముల ఆలయం ● ఆలయంలో అంగరంగ వైభవంగా డోలోత్సవం నిర్వహణరాజాం నియోజకవర్గంలోని సంతకవిటి మండలంలో గల గుళ్ల సీతారాపురం గ్రామంలో వెలసిన సీతారాముల ఆలయానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయంలో సీతారాములు స్వయంభూగా వెలిశారు. ఆనాడు ఈ ప్రదేశం నిర్మానుష్యంగా ఉండడంతో ఆలయం నిర్మాణంతో పాటు గ్రామం నిర్మించారు. సీతారాంపురం గ్రామాలు ఎక్కువగా ఉండడంతో గుడి సీతారాంపురంగా ఈ గ్రామాన్ని పిలిచేవారు. కాలక్రమేణా అది గుళ్ల సీతారాంపురంగా రూపాంతరం చెందింది. ఈ ఆలయానికి బొబ్బిలి రాజులు వంశపారంపర్యంగా ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. ఈ ఆలయం మొత్తం రాళ్ల పేర్పుతో నిర్మించిన అద్బుత కట్టడం. ఈ ఆలయంలో గాలిగోపురం దాదాపు 65 అడుగుల పొడవు ఉంటుంది. గాలిగోపురం పైకి ఎక్కితే బొబ్బిలిలోని వేణుగోపాలుని ఆలయం గాలి గోపురం కనిపిస్తుందని ప్రాశస్త్యం. స్వయంభూగా వెలిసిన ఇక్కడి సీతారాములు ఏకాంతవాసంలో ఉన్నట్లు ఏకశిలపై ఉండడం విశేషం. ఏ ఆలయంలో అయినా సీతారాములతో పాటు లక్ష్మణుడు, ఆంజనేయుడు ఉంటారు. కానీ ఈ ఆలయంలో లక్ష్మణుడు, ఆంజనేయుడు, శంఖుచక్రాలు, ధనుర్బాణాలు ఉండవు. ఈ ఆలయం గోడలపై చెక్కిన శిల్పాలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. ప్రధాన ఆలయం చుట్టూ బేడాను ఏర్పాటు చేశారు. ఈ బేడాను అనుసరించి ఆళ్వారులు, రాధాకావతులు, రామానుజుల వారు, నమ్మాళ్వాల్, గరుడాళ్వాల్, మానవాళ్ల మహాముని, దాసాంజనేయులకు ప్రత్యేకంగా సన్నిధులను ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం జేష్ఠ శుద్ధ ఏకాదశినాడు ఉదయం రాధాకాంతుల కల్యాణం, రాత్రి సీతారాముల కల్యాణం, శ్రావణ శుద్ధ ఏకాదశి నాడు పవిత్రోత్సవాలు, 30 రోజులపాటు ధనుర్మాస ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకుడు భోగాపురపు ప్రసాదరావు తెలిపారు. అంగరంగ వైభవంగా డోలా పౌర్ణమి ఫాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు(డోలా పౌర్ణమి) స్వామి వారిని ఆంజనేయ వాహనం, సర్ప వాహనంపై ఊరేగింపుగా ఉత్తర ముఖ మంటపానికి వేంచేసి భక్తకోటి అందరికి దర్శన భాగ్యం కల్పిస్తారు. ఇక్కడ స్వామి వారికి ఊంజల్ సేవ చేస్తారు. దీనినే డోలోత్సవం అంటారు. ఆ రోజు నుంచి మూడు రోజుల పాటు డోలాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా ఏటాలాగానే ఈ నెల 14 నుంచి 16 వరకు డోలాయాత్ర నిర్వహించనున్నారు. ఆలయాని చేరుకోవడమిలా.. రాజాం పట్టణానికి 8 కిలోమీటర్ల దూరం..సంతకవిటి మండకేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. రాజాం నుంచి బస్సు సౌకర్యం ఉంది. రాజాం నుంచి మందరాడ, సంతకవిటి, మండాకురిటి బస్సు ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. -
5 చోరీ కేసుల్లో నిందితుడి అరెస్టు
● రూ.ఆరు లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనంవిజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పీఎస్ పరిధి జమ్ములో గత నెల 22న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ఇంట్లో జరిగిన దొంగతనం కేసును రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు సదరు నిందితుడిని రూరల్ పోలీసులు అరెస్టు చేసి నిందితుడి దగ్గర నుంచి సుమారు రూ.ఆరు లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రూరల్ పీఏస్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ, సీఐ లక్ష్మణరావు, ఎస్సై అశోక్‌లు ఈ విషయంపై మాట్లాడారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకు చెందిన చల్లా ప్రతాప్‌రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 దొంగతనాలకు పాల్పడ్డాడని చెప్పారు. గత నెల ఫిబ్రవరిలో జమ్ములో రిటైర్డ్ బ్యాంకు ఎంప్లాయి ఇనుగంటి సూర్యనారాయణ తన ఇంటికి తాళం వేసి పెళ్లి నిమిత్తం యలమంచిలి వెళ్లారు. అదే రోజున గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తలుపులు పగులగొట్టి బీరువాలో బంగారు అభరణాలను ఎత్తుకెళ్లారని రూరల్ పోలీస్‌స్టేషన్‌లో రిటైర్డ్ బ్యాంకు ఎంప్లాయి ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఎస్సై అశోక్ సీఐ లక్ష్మణరావు సూచనలతో నిఘా పెట్టగా సోమవారం నగరంలోని విజ్ఞాన భారతి స్కూల్ వద్ద బాబామెట్ట ద్వారకనగర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ప్రతాప్‌రెడ్డిని పట్టుకుని విచారణచేయగా దొంగతనం విషయం బయట పడింది. నిందితుడి దగ్గర ఒక బంగారు నెక్లెస్, ఒక హారం, నాలుగున్నర జతల చెవి దిద్దులు, జతగొలుసు, ఒక గోల్డ్ చైన్‌తో కలిసి మొత్తం రూ.6లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ వివరించారు. -
శబ్ద కాలుష్యం నివారించాలి
విజయనగరం ఫోర్ట్: శబ్ద కాలుష్యం నివారించాలని అందుకుగాను డీజేలు వంటి పోగ్రాంలు నిరోధించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ జీవన రాణి అన్నారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న పిల్లలకు సెల్‌ఫోన్ ఇవ్వకూడదని తెలిపారు. అవసరం మేరకు మాత్రమే సెల్‌ఫోన్ వినియోగించాలని సూచించారు. మానవుడికి వినికిడి చాలా ప్రధానమైనదన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ కె.రాణి, ఎన్‌సీడీపీఓ డాక్టర్ వీవీబీ సుబ్రహ్మణ్యం, డీపీఎంఓ డాక్టర్ సూర్యనారాయణ, డీఎంఓ మణి, డాక్టర్ వెంకటేష్, డెమో వి.చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ జీవన రాణి -
కార్మికులకు ధన్యవాదాలు
నెల్లిమర్ల: కార్మికుల శాంతియుత పోరాటంతో జూట్‌మిల్లు తిరిగిందని జూట్‌మిల్ వర్కర్స్ యూనియన్ నాయకుడు కిల్లంపల్లి రామారావు అన్నారు. ఈ మేరకు సోమవారం మిల్లు తిప్పడానికి యాజమాన్యం నోటీసు జారీచేసి నిర్వహణ పనులు ప్రారంభించిన నేపథ్యంలో ఆయన గేట్మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికుల శాంతియుత పోరాటం ఫలితంగా మిల్లు తిరుగుతుందన్నారు. అలాగే గడిచిన 9నెలలుగా యాజమాన్యం అక్రమంగా లాకౌట్ చేసి కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినా కార్మికుల శాంతియుత పోరాటంతో దఫా దఫాలుగా చర్చలు జరిపి ముందుగా బోనస్ సాధించి మిల్లు తిరగడానికి పార్టీల కతీతంగా కార్మికులు ఎంతో సహకరించారంటూ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా కార్మికులు ఇదే స్ఫూర్తిని కొనసాగించి సమస్యలు ఎదురైతే భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. -
ధాన్యం కుప్పలు దగ్ధం
దత్తిరాజేరు: మండలంలోని పెదమానాపురంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పటించడంతో దుద్ది రమణ, చుక్క రాము, సబ్బి మంగమ్మ, చిల్ల ఈసు, తదితరులకు చెందిన ధాన్యం కుప్పలు దగ్ధమయ్యాయి. వెంటనే గజపతినగరం ఫైర్‌స్టేషన్‌కు గ్రామస్తులు సమాచారం అందించగా వారు వచ్చి మంటలు మంటలను అదుపు చేయడంతో పెనుప్రమాదం జరగలేదని గ్రామపెద్ద రామసత్యం చెప్పారు.సంవత్సరం అంతా తినడానికి ఉంచుకున్న తిండి గింజలు కాలి బూడిదయ్యాయని పేద రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. సతివాడ వైపు ఏనుగుల పయనంభామిని: మండలంలో ఏనుగుల బెడద తీవ్రమైంది. ఆదివారం భామిని మండలంలోని సతివాడ సమీపంలో మొక్కజొన్న తోటలను తినివేస్తూ ఏనుగుల గుంపు పయనమైంది. పాత ఘనసర సమీపంలో తిష్ఠ వేసిన ఏనుగుల గుంపు తివ్వాకొండల వైపు దారిమళ్లినట్లు ఫారెస్టు అదికారులు చెబుతున్నారు.ప్రస్తుతం మొక్కజొన్న పొత్తులు చేతికి అందే సమయంలో తోటలపై ఏనుగులు దాడి చేసి తినివేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఏనుగులను పూర్తి స్థాయిలో దారి మళ్లించి కాపాడాలని బాధిత రైతులు కోరుతున్నారు. వైద్యరంగంలో ఎనస్థీషియాదే ప్రధాన పాత్రనెల్లిమర్ల: వైద్య రంగంలో ఎనస్థీసియాదే ప్రధాన పాత్ర అని ఐఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సూరిశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. విజయనగరం మిమ్స్ వైద్య కళాశాలలో న్యూరో అనస్థీషియా సీఎంఈ సదస్సును ఆదివారం నిర్వహించారు. నేషనల్ ఐఎస్ఏ, విజయనగరం సిటీ బ్రాంచ్ సహకారంతో ఈ సదస్సు నిర్వహించగా సుమారు 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సులో రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అనుభవజ్ఞులైన కన్సల్టెంట్లు పాల్గొని వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా కళాశాల అనస్థీషియా విభాగం ఆచార్యులు కె వేంకటేశ్వరరావు మాట్లాడుతూ మిమ్స్ మెడికల్ కళాశాలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సదస్సు నిర్వహించామన్నారు. ఈ సీఎంఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మత్తువైద్యులకు ఎంతో ఉపకరిస్తుందని అభిప్రాయ పడ్డారు. వైద్యరంగంలో ప్రధానంగా అనస్థీషియాకు సంబంధించి నూతన ఆవిష్కరణలను డాక్టర్ రాకేష్, డాక్టర్ మీనాక్షి సుందరం, డాక్టర్ విష్ణు మహేష్ వంటి ప్రముఖులు తెలియజేసినట్లు చెప్పారు. సాయి శర్వాణీ కాలనీలో చోరీబొబ్బిలి: పట్టణంలోని పాత బొబ్బిలి సమీపంలో గల సాయిశర్వాణీ కాలనీలో శనివారం రాత్రి చోరీ జరిగింది. మాజీ కౌన్సిలర్ పిల్లా రామారావు ఇంట్లో నగదు, ఇంటి నిర్మాణ సామగ్రిని దొంగతనం చేసినట్లు సమాచారం రావడంతో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇంటి వద్ద ఉన్న సీసీటీవీకి గోనె సంచి కప్పి ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. దీనిపై ఏఎస్సై బీవీ రమణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.మూడు డ్రిల్లింగ్ మెషీన్లు, కొంత నగదు పోయినట్లు అనుకుంటున్నా ఇంటి యజమాని విజయవాడ వెళ్లడం వల్ల పూర్తి వివరాలు తెలియరాలేదు. ఆయన వచ్చిన తరువాత ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసే అవకాశముందని ఏఎస్సై తెలిపారు. జూదరుల అరెస్టుపార్వతీపురం రూరల్: పట్టణంలోని రెండుచోట్ల పేకాట స్థావరాలపై దాడులు చేసి 9 మందిని అదుపులోకి తీసుకుని రూ.4,420లు స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ ఎస్సై గోవింద తెలిపారు. పట్టణంలోని బుగత వీధిలో పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని రూ.1020, రామాపురం కాలనీలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని రూ.3,400లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై చెప్పారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం పార్వతీపురం ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ వద్ద హాజరు పరచనున్నట్లు తెలిపారు. -
ఎక్కడి పనులు అక్కడే ఆపండి..!
సాలూరు: వారంతా నిబంధనల ప్రకారం, కాంట్రాక్ట్‌లు దక్కించుకుని పనులు ప్రారంభించారు. నిర్దేశించిన పనులు చేపట్టే క్రమంలో కొద్ది శాతం పనులు పూర్తయిన తరువాత అధికారులు సదరు కాంట్రాక్టర్లకు షాకింగ్ వార్త చెప్పారు. ఎక్కడిపనులు అక్కడే ఆపివేయాలని, స్థానిక మంత్రిని కలిసి ఆమె అంగీకారం తెలిపిన తరువాతే పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్లు కంగుతున్నారు. ఇది సాలూరు నియోజకవర్గంలో పెద్దగెడ్డ రిజర్వాయర్ కాలువల పూడికతీత పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల పరిస్థితి. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ నుంచి పెద్దగెడ్డ సబ్‌డివిజన్ పరిధిలో పూడికతీత పనులు చేపట్టడానికి రూ.91.21 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో ప్రాజెక్టు పరిధిలో ఉన్న కాలువల పూడిక తీత, గోడలు, మదుముల నిర్మాణ పనులకు టెండర్లు ఆహ్వానించారు. ఈ పనులను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. నిబంధనల మేరకు పనులను ప్రారంభించారు. ప్రాజెక్టు పరిధిలో 15 పనులకు సంబంధించి టెండర్లు పిలవగా వాటన్నింటి పనులను అధికారుల ఆదేశాల మేరకు టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించారు. దాదాపు 20 నుంచి 30 శాతం పనులు చేసిన తరువాత కాంట్రాక్టర్లకు పెద్దగెడ్డ అధికారుల నుంచి షాకింగ్ వార్త వినాల్సి వచ్చింది. చేస్తున్న పనులు ఎక్కడివక్కడే నిలిపివేయాలని, మీరంతా స్థానిక మంత్రి గుమ్మడి సంధ్యారాణిని కలవాలని ఆమె చేయమంటేనే పనులు పూర్తిచేయాలని లేకుంటే లేదని స్పష్టం చేశారు. పనులు చేసిన వరకు బిల్లులు చెల్లించండి దీంతో కంగుతున్న కాంట్రాక్టర్లు ఆ పనులను నిలిపివేశారు. పనులు ప్రారంభించకముందే ఏదైనా చెప్పాలని, పనులు చేపట్టిన మధ్య ఇలా చెప్పడం ఏమిటని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. పలువురు కాంట్రాక్టర్లు మంత్రిని కలిసిన తరువాత, నిరాశగా వెనుదిరగడంతో అక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు ఎర్త్‌వర్క్ తదితర పనులు చేపట్టామని కావున చేపట్టిన పనుల వరకు బిల్లుల చెల్లింపులు చేయాలని అధికారులను కాంట్రాక్టర్లు కోరడం కొసమెరుపు. దీనిపై పెద్దగెడ్డ డీఈ శ్రీనివాసరావును వివరణ కోరగా, ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ, స్థానిక మంత్రిని కలవాలని కాంట్రాక్టర్లకు చెప్పామన్నారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన పెద్దగెడ్డ పూడికతీత పనులు నిలిపివేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించిన అధికారులు మంత్రి అంగీకారం లేకుండా పనులు చేయవద్దని హుకుం -
ఆదర్శంగా చదువుకుందాం..రా..!
మెరకముడిదాం మండలం గర్భాం ఆదర్శపాఠశాల మెరకముడిదాం/లక్కవరపుకోట: దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిరుపేద విద్యార్థులకు సైతం కార్పొరేట్ స్థాయి విద్యను చేరువచేయాలనే సంకల్పంతో 2009వ సంవత్సరంలో ఏపీ మోడల్‌స్కూల్స్ పేరుతో పాఠశాలలను ప్రారంభించారు. ఆయన సత్సంకల్పంతో ప్రారంభించిన ఈ మోడల్ స్కూల్స్ నేడు ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నాయి. మరోవైపు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఏపీ మోడల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ భోధన, అలాగే 9 వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయసంవత్సరం వరకూ ఈ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు పాఠశాలల్లోనే వసతితో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. దరఖాస్తుల ఆహ్వానం విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఉన్న 16 ఆదర్శ పాఠశాలల్లో 2025–2026 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరోతరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 24 నుంచి మార్చి 31 వరకూ అర్హులైనవారు ఆన్లైన్లో వివరాలను నమోదు చేసుకోవాలని ఆధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థి అర్హతను పరిశీలించి అర్హుడని తేలితే క్రెడిట్, డెబిట్, నెట్‌బ్యాంకింగ్ కార్డులు ఉపయోగించి గేట్‌వే ద్వారా రుసుం చెల్లించిన తరువాత జనరల్ నంబర్ కేటాయిస్తారు. ఆ నంబర్ ఆధారం గా వెబ్సైట్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్, ఏపీఎంఎస్.ఏపీజీవోవీ.ఇన అడ్రస్‌కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కులాల వారీగా పరీక్ష రుసుం ఓసీ, బీసీ వారికి రూ.150, ఎస్సీ, ఎస్టీలకు రూ.75 చెల్లించాలి. ప్రవేశపరీక్షలో ఓసీ, బీసీ విద్యార్థులకు కనీసం 35 మార్కులు, ఎస్సీ, ఎస్టీలకు 30 రావాలి. ప్రతిభ, మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఏప్రిల్ 20 వతేదీన పాఠశాలకు సంబంధించిన ప్రవేశపరీక్ష ఉంటుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాలయాల్లో చదువుకున్న విద్యార్థులు కూడా ఈ పాఠశాలల్లో చేరేందుకు అర్హులు. మోడల్‌స్కూల్స్‌లో ప్రవేశాలకు ఆహ్వానం ఉమ్మడి జిల్లాలో 16 పాఠశాల్లో దరఖాస్తుల స్వీకరణ 1600 మంది విద్యార్థులు చేరేందుకు అవకాశం -
అమ్మవారికి ఘటాల నివేదన
సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025గరుగుబిల్లి మండలంలోని రావుపల్లి గ్రామంలో శ్రీ గట్టాలమ్మ ఆలయ పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా మహిళలు ఆదివారం ఘటాలతో ఊరేగింపు నిర్వహించారు. ఉదయం 5 గంటలకు మేళతాళాల నడుమ, మంగళ వాయిద్యాలతో పెద్ద సంఖ్యలో మహిళలు ఘటాలతో బారులు తీరారు. ఊరేగింపుగా గట్టాలమ్మ తల్లి ఆలయానికి తరలివెళ్లారు. ఉదయం 11 గంటలకు విగ్రహం, పూర్ణ కలశ ప్రతిష్ఠ మహోత్సవం భక్తుల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ బొంతాడ మహేశ్వరరావు, గ్రామస్తులు పాల్గొన్నారు. – గరుగుబిల్లి న్యూస్‌రీల్ -
సంస్కృతి, సంప్రదాయాలు సొంతం చేసుకోవాలి
● మహిళల ఆరోగ్యం కోసం వికాస్ తరంగణి సేవా సంస్థ ● చినజియర్ స్వామిచీపురుపల్లి: ప్రస్తుత సమాజంలో చిన్న వయస్సు నుంచే పెద్దల దగ్గర నుంచి సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోవడమే కాకుండా సొంతం చేసుకోవాలని వేద గురువు, ఉపదేశకుడు చిన్న జియర్ స్వామి బోధించారు. ఈ మేరకు ఆదివారం చీపురుపల్లిలోని ప్రముఖ వ్యాపారులు అంధవరపు హరి, గోవింద నివాసంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన స్థానిక రాధామాధవ్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. పూర్వీకులు పాటించిన సంప్రదాయాలు ప్రతి వ్యక్తి జీవితంపైనా ఎంతో ప్రభావం చూపుతాయన్నారు. పూర్వ సంప్రదాయాలకు ఎంతో గొప్ప విలువ ఉందని అందుకనే పూర్వీకులు పాటించారని తెలిపారు. ప్రస్తుతం ఆ సంప్రదాయాలు తెలియక పిల్లలు తప్పులు చేస్తున్నారని అలాంటప్పుడు పిల్లలను కాకుండా సంప్రదాయాలు నేర్పని తల్లిదండ్రులనే దండించాలని అభిప్రాయ పడ్డారు. సంస్కృతి, సంప్రదాయాలు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందన్నారు. సమాజంలో ఉండే ప్రతి ఒక్కరూ మంచిని కోరుకోవాలని అప్పుడే ప్రతి కుటుంబం బాగుంటుందన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలని లేదంటే కుటుంబం రోడ్డున పడుతుందన్నారు. మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలని సూచించారు. న్నారు. ఇటీవల కాలంలో మహిళలను క్యాన్సర్ మహమ్మారి వెంటాడుతోందని, అందుకనే వికాస్ తరంగిణి సేవా సంస్థను 2007లో నెలకొల్పి ఇంతవరకు 30 లక్షల మంది మహిళలకు ఉచితంగా వైద్య సహాయం, అవగాహన కల్పించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వికాస్ తరంగిణి సేవా సంస్థకు వలంటీర్లు ఉన్నారని చెప్పారు. మహిళలు అప్రమత్తమై వికాస్ తరంగిణి సేవా సంస్థను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
మనిషికి వినికిడి ప్రధానం
● 5 నుంచి 10 శాతం మందికి పుట్టుకతో వినికిడి సమస్య ● 10 రోజులు వెంటిలేటర్‌పై చికిత్స తీసుకున్న శిశువులకు వినికిడి సమస్య వచ్చే అవకాశం ● త్వరగా గుర్తించకపోతే మూగ, చెవిడు బారిన పడే ప్రమాదం విజయనగరం ఫోర్ట్: మానవుడికి కళ్లు ఎంతటి ప్రాధాన్యమైనవో చెవులు కూడా అంతటి ప్రాధాన్యమైనవే. వినికిడి సమస్య ఉంటే ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. వినికిడి సమస్యను త్వరగా గుర్తించగలగాలి. లేదంటే చెవుడుతో పాటు మూగ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా శిశువులకు పుట్టకతో వినికిడి సమస్య వచ్చే ఆస్కారం ఉంది. సోమవారం ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రపంచ జనాభాలో 10 శాతం మంది వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. భారతదేశం జనాభాలో 5నుంచి 10 శాతం మంది వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. జిల్లాకు సంబంధించి 5 నుంచి 10 శాతం వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. అప్పుడే పుట్టిన శిశువులు వారం నుంచి 10 రోజులు వెంటిలేటర్‌పై చికిత్స పొందే పరిస్థితి ఉంటే వినికిడి సమస్య బారిన పడే అవకాశం ఉంది. 40 ఏళ్లు దాటిన వారు కూడా వినికిడి సమస్య బారిన పడే అవకాశం ఉంది. సమస్యను త్వరగా గుర్తించాలి నవజాత శిశువుల్లో వినికిడి సమస్యను త్వరతిగతిన గుర్తించాలి. త్వరగా గుర్తించకపోతే మూగ, చెవుడు సమస్యల బారిన పడతారు. అదేవిధంగా భాష కూడా అభివృద్ధి చెందదు. పుట్టిన ప్రతి నవజాత శిశువుకు వినికిడి సమస్య ఉందా? లేదా? అని స్క్రీనింగ్ చేయించాలి. స్క్రీనింగ్‌లో వినికిడి సమస్య ఉన్నట్లు అనిపిస్తే, వినికిడి లోపం ఎంత ఉందో తెలుసుకునేందుకు బెరా టెస్టు చేయించాలి. వినికిడి సమస్యకు కారణాలు: నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంది. మేనరికం వివాహం చేసుకునే వారికి పుట్టే శిశువులకు వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంది. జన్యుపరమైన లోపాల వల్ల, క్రోమోజోముల్లో తేడా వల్ల సౌండ్ పొల్యుషన్ వల్ల వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంది. అతిగా సెల్ఫోన్లు వినియోగించడం వల్ల కూడా వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంది. వినికిడి సమస్యలతో అనేక మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు వస్తున్నారు. వినికిడి మెషీన్ల ద్వారా సమస్య కొంతవరకు తీరుతుంది. కొంతమందికి శస్త్రచికిత్సలు చేయడం వల్ల సమస్య తీరుతుంది. పుట్టిన నెల లోపు శిశువులకు స్క్రీనింగ్ చేయించాలి:నవజాత శిశువులకు పుట్టిన నెలలోగా వినికిడి సమస్యను తెలుసుకునేందుకు స్క్రీనింగ్ చేయించాలి. పుట్టిన మూడు నెలల లోపు బెరా టెస్టు చేయించాలి. పుట్టిన ఆరు నెలల లోపు ఆపరేషన్ చేయించడం గాని మెషీన్ పెట్టించడం గానీ చేయాలి. అతిగా సెల్ ఫోన్ వినియోగించకూడదు. వినికిడి సమస్యలను ఎంత త్వరగా గుర్తిస్తే అంతమంచిది. నిర్లక్ష్యం చేస్తే వినికిడి సమస్యతో పాటు మాటలు రాని పరిస్థితి వస్తుంది. డాక్టర్ బి.అజయ్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈఎన్టీ విభాగం -
పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పార్వతీపురం టౌన్: జిల్లాలో ఈ నెల 17 నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ విద్యాశాఖాధికారులను ఆదేశించారు. శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం కావాలని, ప్రతీ ఏడాది వలే ఈ ఏడాది కూడా రాష్ట్ర స్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై డీఈఓ, ఎంఈఓలు, హెచ్ఎంలతో ఆయన ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలకు ఇంకా 15 రోజులే గడువు ఉన్నందున విద్యార్థులు బాగా చదివేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రాత్రి వేళల్లో విద్యా ర్థుల ఇళ్లకు వెళ్లి పరిశీలించాలని సూచించారు. విద్యార్థుల గ్రేడింగ్ ఆధారంగా ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. సీ, డీ గ్రేడ్ విద్యార్థులకు ప్రత్యేకంగా బోధించాలని అన్నారు. పరీక్షలకు కొద్ది రోజులే సమయం ఉన్నందున తగిన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. క్లస్టర్ రిసోర్సుపర్సన్లతో మోడల్ పాఠాలను తయారీ చేసి ఉత్తమ బోధన చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో మార్చి 17 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 10,455 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో పక్కా ఏర్పాట్లు చేసి పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు. వేసవి దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో తాగునీరు ఏర్పాటు చేయాలని, అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, ఎస్కార్ట్, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని విద్యా శాఖాధికారులకు తెలిపారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా విద్యా శాఖాధికారి ఎన్.తిరుపతినాయుడు, మండల విద్యాశాఖాధికారులు, ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నీతి మాలిన కూటమి పాలన ● మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి జియ్యమ్మవలస రూరల్: రాష్ట్రంలో కూటమి పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నీతి మాలిన పాలన సాగిస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ధ్వజమెత్తారు. చినమేరంగిలోని తన కార్యాలయంలో విలేకరులతో ఆమె ఆదివారం మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, ప్రజలకు ఎలాంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమలను చేయొద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం ఒక ముఖ్యమంత్రిగా ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుగా అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమ పాలన వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యమ న్నారు. అబద్ధపు హామీలతో అడ్డదారిలో అధికారం చేపట్టి నేడు ఇలాంటి వ్యాఖ్యలతో ఏం సాధించాలనుకుంటున్నారో చెప్పాలని అన్నా రు. కూటమి పాలన చూసి దేశంలో ఇతర రాజకీయ పార్టీలు సిగ్గు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 20న ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి పరీక్ష పార్వతీపురం టౌన్: జిల్లాలో నాలుగు ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశానికి ఏప్రిల్ 20న పరీక్ష నిర్వహించనున్నట్టు డీఈఓ ఎన్.తిరుపతినాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గల సాలూరు, మక్కువ, కురుపాం, భామిని ఆదర్శ పాఠశాలల్లో ఏప్రిల్ 20న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎంఎస్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఐన్ ఆన్లైన్ ద్వారా ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వ్యాయామ ఉపాధ్యాయుల సంఘ ఎన్నిక విజయనగరం: జిల్లా వ్యాయామ ఉపాధ్యాయు ల సంఘం అధ్యక్షుడిగా గోపి లక్ష్మణరావు, కార్యదర్శిగా నల్లా వెంకటనాయుడు ఎన్నికయ్యారు. పువ్వాడ స్కూల్లో ఆదివారం జరిగిన విజయనగరం జిల్లా వ్యాయామ సంఘ ఎన్నికలలో నూతన కార్యవర్గం ఎన్నికై ంది. 251 మంది పీడీ, పీఈటీలు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర నాయకులు ఎంవి.రమ ణ, సాంబమూర్తి వ్యవహరించారు. కొత్త కార్యవర్గ సభ్యులకు ఉత్తరాంధ్ర జిల్లాల వ్యాయామ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు అభినందనలు తెలిపారు. -
మనసాస్మరామి..
●వైభవంగా ప్రారంభమైన కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర ●క్యూలో బారులు తీరిన భక్తులు ●అధికార పార్టీ నేతల అనుచరులకు పక్క దారి దర్శనాలు ●రూ.100 టిక్కెట్ ఉన్నా తప్పని ఇక్కట్లు ●పట్టించుకోని దేవదాయ, పోలీసు శాఖలు అమ్మవారిని దర్శించుకున్న జెడ్పీ చైర్మన్ చీపురుపల్లి: శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 27వ జాతర మహోత్సవాల్లో భాగంగా పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. మూడు రోజులు జాతరలో భాగంగా తొలి రోజు ఆదివారం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ సీపీజిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, పుష్పాంజలి దంపతులు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖ ర్, శ్రీదేవి దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు చీపురుపల్లి: కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 27వ జాతర మహోత్సవములు ఆదివా రం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఆపదల నుంచి గట్టెక్కించు తల్లీ అంటూ భక్తులు అమ్మవారిని భక్తిశ్రద్దలతో వేడుకున్నారు. ఆది, సోమ, మంగళవారం మూడు రోజుల పాటు జరగనున్న అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున 2 గంటల నుంచి దర్శనా లు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో క్యూలై న్లు నిండిపోయాయి. మధ్యా హ్నం 1 గంట వరకు క్యూలైన్లు కొనసాగాయి. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి పసుపు, కుంకు మ, చీరలతో మొక్కులు సమర్పించుకున్నారు. అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న ధ్వజస్తంభంతో పాటు రావి చెట్టు వద్ద మహిళలు పూజలు చేసి దీపాలు వెలిగించారు. మరికొందరు భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. విజయనగరం, విశాఖపట్టణం, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్‌తో పాటు ఒడిశా ప్రాంతం నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వీఐపీ పేరుతో యథేచ్ఛగా దర్శనాలు అమ్మవారి జాతరలో తొలి రోజు దర్శనాల విషయంలో భక్తులు నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.100, రూ.50, రూ.20, రూ.10 టిక్కెట్లును విక్రయించారు. వాటికి సంబంధించి అన్ని క్యూలైన్లలో భక్తులు టిక్కెట్లు కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు. అయితే వీఐపీ దర్శనాల కోసం ఉంచిన గేటు నుంచి సామాన్యులు సైతం పదుల సంఖ్యలో వెళ్తుండడంతో దర్శనాలకు ఆటంకం కలిగిందని పలువురు భక్తులు దేవదాయ శాఖ అధికారులను ప్రశ్నించారు. అధికార కూటమి నాయకులు దగ్గరుండి సామాన్యులను వీఐపీ గేటు నుంచి నేరుగా గర్భగుడికి తీసుకెళ్లి దర్శనాలు చేయించుకున్నారని దీంతో టిక్కెట్లు కొనుగోలు చేసిన తామంతా గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చిందని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టించుకోని దేవదాయ, పోలీస్ శాఖలు పక్క గేటు, వెనుక ద్వారం నుంచి దర్శనాలు నిలువరించి టిక్కెట్లు కొనుగోలు చేసుకుని దర్శనాలకు వెళ్లే భక్తులకు అవస్థలు లేకుండా చూడాల్సిన దేవదాయ, పోలీస్ శాఖలు కనీసం చర్యలు చేపట్టలేదనే విమర్శలు భక్తుల నుంచి వినిపించాయి. వీఐపీ గేటు తాళం టీడీపీ కార్యకర్తల చేతికి ఇచ్చి సాధారణ భక్తుల దర్శనాలకు జాప్యం జరిగే విధంగా దేవదాయ, పోలీస్ శాఖలు వ్యవహరించడం ఏమిటని క్యూలైన్లలో భక్తులు పోలీస్ సిబ్బందిని కూడా ప్రశ్నించారు. వీఐపీ గేటు నుంచి అధిక సంఖ్యలో సాధారణ భక్తులను పంపించడం ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేసి దర్శనాలకు వెళ్తున్న తమను ఇబ్బందులకు గురి చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. కనీసం మిగిలిన రెండు రోజులైన ఇలాంటి చర్యలను నిలువరించాలని భక్తులు కోరుతున్నారు. -
ఒక్క అడుగు ముందుకు పడితే ఒట్టు...
సాలూరు: మండలంలోని సారిక – సొంపిగాం మధ్య సువర్ణముఖి నదిపై వంతెన నిర్మాణ పనులు ఎక్కడివక్కడ కూటమి పాలనలో నిలిచిపోయాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన ఇక్కడ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ప్రత్యేక చొరవతో ఈ వంతెనను మంజూరు చేయించారు. అదే వేగంతో పనులకు శంకుస్థాపన కూడా చేశారు. అప్పట్లోనే సొంపిగాంకు బీటీ రోడ్డు మంజూరు చేయగా నిర్మాణ పనులు అప్పట్లోనే పూర్తయ్యాయి. ఇదే క్రమంలో 3 కోట్ల 87 లక్షల రూపాయిలతో మంజూరైన ఈ వంతెన పనులూ గత ప్రభుత్వంలో చకచకా చేపట్టారు. పిల్లర్ల వరకు నిర్మాణ పనులు జరిగాయి. ఇంతలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. తొమ్మిది నెలలుగా పనులు చేపట్టకపోవడంతో ఈ పనులపై అనుమానాలు మొదలయ్యాయి. ఇక ఈ పనులు ముందుకు సాగుతాయా? లేదా? అనే ఆందోళన గిరిజనుల్లో నెలకొంది. ఈ వంతెన పనులు పూర్తి కాకుంటే వచ్చే వర్షాకాలంలో తమ గ్రామాలకు ఇబ్బందులు తప్పవని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. రాకపోకలకు కూడా ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి వెంటనే నిలిచిన చోట నుంచి పనులు పునఃప్రారంభించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. కూటమి పాలనలో నిలిచిన సొంపిగాం వంతెన పనులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తయిన పిల్లర్ల పనులు -
● Ððl¬§ýlsìæ {´ë«§é¯]lÅ™èl Kr$ 50 Ô>™èl… Oò³ºyìl Ð]lõÜ¢ Ñgôæ™èl˘ ● లేకుంటే 2, 3 ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు ● మొత్తం ఓట్లు 22,493 ● పోలైన ఓట్లు 20,794 ● పోలింగ్ శాతం 92.44 శాతం
వీరఘట్టం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఫిబ్రవరి 27న జరగ్గా నేడు సోమవారం ఓట్ల లెక్కింపు విశాఖపట్నంలో చేయనున్నారు. పోటీలో పది మంది అభ్యర్థులున్నప్పటికీ ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ ఉన్నట్టు పోలింగ్ సరళి స్పష్టం చేసింది. మిగిలిన అభ్యర్థులు కూడా తమ అనుచరులతో ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడంతో 2019లో జరిగిన ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్ పెరిగింది. ఈ నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓట్లు చీలిపోయినట్టు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. స్పష్టమైన మెజార్టీ ఎవరికీ వచ్చే పరిస్థితి లేదని ఉపాధ్యాయు లు చెబుతున్నారు. రెండు, మూడు ప్రాధాన్యత ఓట్లుపైనే పోటీదారులు ఆశలు పెట్టుకున్నారు. ఇదీ విషయం గత నెల ఫిబ్ర వరి 27న జరిగిన ఉపాధ్యా య ఎమ్మెల్సీ ఎన్నికల్లో 22,493 మంది ఓటర్లకుగాను 20,794 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 92.44 శాతం ఓటింగ్ జరిగింది. పోలింగ్ శాతం పెరగడంతో ప్రధాన అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. మొదటి ప్రాధాన్యత ఓటు చీలి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుచే గెలుపునకు కావాల్సిన మొదటి ప్రాధాన్యత ఓట్లు 50% ప్లస్ 1 ఓటు ఎవరికీ వచ్చే పరిస్థితి లేదంటున్నారు. ●మొత్తం చెల్లిన ఓట్లులో మొదటి ప్రాధాన్యత ఓట్లు 50 శాతం ప్లస్ 1 ఓటు వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ●ఒకే వేళ ఈ మ్యాజిక్ ఫిగర్ రాకపోతే మొత్తం పది మందిలో అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చిన చివరి అభ్యర్థి ఓట్లులో 2వ నంబర్ ఎవరెవరికి వచ్చిందో ఆ ఓట్లును మిగిలిన తొమ్మిదిలో ఎంత మందికి వస్తే వారందరికీ ఆ ఓట్లు సర్దుతారు. చివరి వ్యక్తిని ఎలిమినేట్ చేస్తారు. ●అయినా ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ఇప్పుడు ఉన్న 9 మందిలో తక్కువ ఓట్లు వచ్చిన ఓట్లులో 3వ నంబర్ ఓటు ఎంత మందికి వస్తే ఆ ఓటును మిగిలిన వారికి సర్దుతారు. తర్వాత చివరి అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తారు. ●ఇలా మ్యాజిక్ ఫిగర్ వచ్చేంత వరకు చివరిగా ఉన్న అభ్యర్థుల ఓట్లను మిగిలిన వారికి సర్దుతూ, ఆ అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ 50 శాతం ప్లస్ 1 ఓటు ఎవరికి వస్తే వారిని రిటర్నింగ్ అధికారి విజేతగా ప్రకటిస్తా రు. అక్కడితో ఎన్నిక తంతు ముగుస్తుంది. ●ఉత్తరాంధ్ర జిల్లాల్లోని 123 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్స్‌ల్లో ఉన్న ఓట్లు అన్నీ కలిపేస్తారు. దీంతో ఓట్లు లెక్కింపు సమయంలో ఏ మండలం నుంచి ఏ జిల్లా నుంచి పోటీదారులకు ఎన్ని ఓట్లు వచ్చాయో ఎవ్వరికీ తెలియదు. ●ఓట్లు లెక్కింపునకు 20 టేబుల్స్ వేస్తారు. మొత్తం ఒకచో ట వేసిన ఓట్లును 25 ఓట్లు చొప్పున కట్టలు కడతారు. ఇలా 25 ఓట్లు ఉన్న 40 కట్టలను(1000 ఓట్లు) ఆ ఇరవై టేబుల్స్‌కు పంచుతారు. ●మొత్తం పోలైన ఓట్లు 20,794 కావున ఇందులో 20 వేల ఓట్లును 25 ఓట్లు చొప్పున 800 కట్టలు కట్టి ఇరవై టేబుల్స్‌కు సర్దుతారు. మిగిలిన 794 ఓట్లు చివరి టేబుల్‌కు ఇస్తారు. ●ఈ 20 టేబుల్స్‌లో తొలుత చెల్లినవి, చెల్లని ఓట్లు వేరు చేస్తారు. మళ్లీ చెల్లిన ఓట్లును 25 చొప్పున కట్టలు కడతారు. ●పోటీ చేసిన అభ్యర్థులు 10 మంది కావడంతో పది ట్రేల్ ఏర్పాటు చేస్తారు. ●ఈ పది ట్రేల్స్లో 25 చొప్పున కట్టిన ఓట్లులో 1వ నంబర్ ఎవరెవరికి వచ్చిందో ఆ ఓట్లును ఆ ట్రేల్స్ లో వేసి వారికి వచ్చిన మొత్తం ఓట్లును లెక్కిస్తారు. గెలుపు ఇలా .. కౌంటింగ్ ఇలా... -
మహిళా పోలీస్ సిబ్బందికి యోగా శిక్షణ
విజయనగరం క్రైమ్: స్థానిక కంటోన్మెంట్లో గల పోలీస్ పరేడ్ మైదానంలో మహిళా పోలీస్ సిబ్బందికి జిల్లా పోలీస్ శాఖ యోగ శిక్షణను ఆదివారం అందజేసింది. మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో మహిళా పోలీసు సిబ్బందికి ప్రత్యేకంగా యోగా తరగతులను నిర్వహించారు. యోగా అనేది శరీరానికి, మనసుకు, ఆత్మకు శాంతి కలిగించే ప్రాచీనమైన సాధన అని ఎస్పీ వకుల్ జిందల్ ఈ సందర్భంగా అన్నారు. మహిళలు కుటుంబ బాధ్యతలను, ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూ, హార్మోనల్ సవాళ్లను ఎదుర్కొంటారని, వాటిని అధిగమించడానికి యోగసాధన ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. యోగాతో హార్మోనుల సమతుల్యత సాధించి థైరాయిడ్, ఇతర అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చునన్నారు. యోగాతో మహిళల్లో సహనశక్తి పెరుగుతుందని, ఆందోళన, ఒత్తిడి, నిద్ర సమస్యలు తగ్గి, మానసిక ప్రశాంతత పొందవచ్చునన్నారు. నిరంతరం యోగ సాధన చేయడం వల్ల మహిళల్లో ఆలోచన శక్తి, ఏకాగ్రత పెరిగి, పనుల్లో మంచినిర్ణయాలు తీసుకుంటూ, జీవితంలో సమర్థవంతమైన వ్యక్తులుగా రాణిస్తారని అభిప్రాయ పడ్డారు. ప్రతిరోజూ యోగ సాధన చేయడంతో శారీరక, మానసిక ఆనందాన్ని పొందవచ్చునని ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టం చేశారు. మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ ఈ.నర్సింహమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ యోగా శిక్షణ తరగతుల్లో ఆర్ఐ ఎన్.గోపాలనాయుడు, ఎస్సైలు పద్మావతి, నరసింగరావు, ఎఆర్ ఎస్సై కె.రమేష్, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. -
ఆదివాసీ సంస్కృతికి ప్రతీక.. అక్షరబ్రహ్మ ఆలయం
భామిని: అక్షరాలే విగ్రహాలుగా ఉన్న అక్షర బ్రహ్మ ఆలయం, దేశాంతరాలు చాటే థింసా నృత్యాలు ఆదివాసీ గిరిజనుల ఔన్నత్యాన్ని చాటుతున్నాయని, వారి సంస్కృతికి ప్రతీకలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ అన్నారు. ఐటీడీఏ పీఓ యశ్వంత్ కుమార్‌రెడ్డితో కలిసి భామిని మండలం మనుమకొండను శనివారం సందర్శించారు. గిరిజనులతో మాట్లాడారు. నీతి ఆయోగ్ ప్రతిపాదనతో మనుమకొండ ఆదర్శ గ్రామంగా నిలిచిందన్నారు. గ్రామానికి చెందిన ఒక ఆదివాసీతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాడ్లాడేలా ఏర్పాట్లు చేస్తానని కలెక్టర్ స్పష్టం చేశారు. గిరిజనులతో కలిసి థింసా నృత్యం చేశారు. గ్రామానికి సబ్‌సెంటర్ మంజూరు చేయిస్తానని చెప్పారు. వీడీవీకేలను బలోపేతం చేసుకోవాలని సూచించారు. ఆదివాసీ బాలిక మండంగి తుర్ణమామి బీటెక్ చేసి నిరుద్యోగిగా ఉండడంపై ఆరా తీశారు. యాస్పిరేషన్ బ్యాంక్‌కు అంబాసీడర్‌గా నియమిస్తామని హామీ ఇచ్చారు. ఇంటిలో మరుగుదొడ్డి నిర్మాణానికి కలెక్టర్ స్వయంగా ఆర్థిక సహాయం అందజేశారు. గిరిజన ఉత్పత్తులను నిల్వ చేసేందుకు అవసరమైన మినీగోదాం నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. గిరిజన సంక్షేమ ఈఈ రమాదేవికి సూచనలు చేశారు. నిరుద్యోగుల కోసం లైబ్రరీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. పలు సమస్యలను సర్పంచ్ నిమ్మల కేశవ, ఎంపీటీసీ పత్తిక మురళీ, మాజీ సర్పంచ్‌లు నిమ్మల కోరా, నిమ్మల అన్నయ్యలు వివరించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీహెచ్ఓ గణేష్, తహసీల్దార్ అప్పారావు, ఎంపీడీఓ సత్యం, ఎంఏఓ సింహాచలం, ఏపీఓ చక్రపాణి, ఏపీఓ బాబూరావు, బత్తిలి ఎస్ఐ అనీల్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ప్రధానమంత్రితో మాట్లాడిస్తానని ఆదివాసీలకు భరోసా -
ఈ బడ్జెట్ మాకొద్దు
పార్వతీపురంటౌన్: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్లో పార్వతీపురం మన్యం జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని, ప్రజా సంక్షేమంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల ఆధునికీకరణకు నిధుల మంజూరులో రిక్తహస్తం చూపిందని సీపీఎం రాష్ట్ర నాయకుడు ఎం.కృష్ణమూర్తి అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌కు నిరసనగా పార్వతీపురం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సీపీఎం నాయకులతో కలిసి శనివారం ఆందోళన చేశారు. జిల్లాకు నిధులు మంజూరులో అన్యాయం చేశారని, న్యాయం చేయాలంటూ డీఆర్వో కె.హేమలతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో యూనివర్సిటీ, మెడికల్ కళాశాల, పార్వతీపురం, పాలకొండ, కురుపాంలలో పీజీ కాలేజీలు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. సీతంపేట, సాలూరు, కురుపాంలలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించాలన్నారు. దీనికోసం బడ్జెట్లో రూ.2వేల కోట్లు కేటాయించాలన్నారు. జంఝావతి, అడారుగెడ్డ, తోటపల్లి, పెద్దగెడ్డ ప్రాజెక్టులకు, గిరిజన ప్రాంతంలో మినీ రిజర్వాయర్లు నిర్మించాలన్నారు. గుమ్మడిగెడ్డ రిజర్వాయర్‌ను ఆధునీకరించేందుకు రూ.2వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లచ్చయ్యపేట ఎన్సీఎస్ సుగర్, జీగిరాం జ్యూట్ మిల్లును ప్రభుత్వమే నడపాలన్నారు. రామభద్రపురం నుంచి కూనేరు వరకు రోడ్డు వెడల్పుచేసి కోటిపాం వద్ద జంఝావతిపై బ్రిడ్జి నిర్మించాలన్నారు. పూర్ణపాడు–లాబేసు వంతెన నిర్మాణం పూర్తి చేసేందుకు బడ్జెట్లో రూ.వేయి కోట్లు కేటాయించాలని కోరారు. నాగావళి, జంఝావతి నదులు చెంతనే ఉన్నా పార్వతీపురం పట్టణానికి రెండు మూడు రోజులకోసారి తాగునీరు సరఫరా చేయడాన్ని తప్పుబట్టారు. పార్వతీపురం పట్టణానికి బైపాస్ రోడ్డు నిర్మిస్తామన్న హామీని బడ్జెట్లో విస్మరించారన్నారు. కార్యక్రమంలో నాయకులు జి.వెంకటరమణ, కె.సాంబమూర్తి, వి.ఇందిర, ఆర్.శ్రీదేవి, బి.వి.రమణ, తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాకు తీరని అన్యాయం సంక్షేమం లేదు.. సాగునీటి ప్రాజెక్టుల ఆధునికీకరణ ఊసేలేదు సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన -
ఒడిశా దూకుడు
ఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2025కొటియా గ్రామాల్లో సమస్య పరిష్కరిస్తారా? ఆంధ్రా–ఒడిశా మధ్య పలు వివాదాలకు తెరదించేందుకు గత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నేరుగా ఒడిశా వెళ్లి అక్కడ నాటి సీఎం నవీన్‌పట్నాయక్‌తో మాట్లాడారు. కొటియా గ్రామాల్లో వివాదాలు జరగకుండా నాటి ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర సైతం కృషిచేశారు. గిరిజనులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. సంక్షేమ పాలనను చేరువచేశారు. నేడు ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఆంధ్రాలో సైతం ఆ పార్టీ అండదండలతో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. వివాదాస్పద కొటియా గ్రామాల సమస్య పరిష్కారానికి ఇదే మంచి సమయమని, ఆ దిశగా సీ్త్రశిశుసంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి చొరవ చూపాలని గిరిజన నాయకులు కోరుతున్నారు. కొటియా గ్రామాల సమస్యపై నాడు ప్రతిపక్షంలో ఉన్న సమయమంలో చేసిన విమర్శలకు నేడు బదులిస్తూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. సాలూరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా గ్రూప్ గ్రామాల్లో ఒడిశా ప్రభుత్వం దూకుడు పెంచింది. ఆ గ్రామాలన్నీ తమవేనంటూ అధికారులు హల్చల్ చేస్తున్నారు. ఆంధ్రా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు నేమ్ బోర్డులను సైతం పీకేశారు. పట్టుచెన్నేరు గ్రామంలో ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే జల్‌జీవన్ మిషన్ పనులకు ఇటీవల వెళ్లిన కూలీలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సామగ్రిని సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు అదే ప్రాంతంలో కొటియా నుంచి పట్టుచెన్నేరుకు సుమారు 15 కి.మీ మేర బీటీ రోడ్డు నిర్మాణాన్ని ఒడిశా ప్రభుత్వం తలపెట్టింది. స్టేటస్ కో అమలులో ఉన్న ఈ ప్రాంతాల్లో ఆంధ్రా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఒడిశా ప్రభుత్వం, అధికారులు అడ్డుకుంటుడంగా, ఇదే ప్రాంతాల్లో ఒడిశా ప్రభుత్వం యథేచ్ఛగా పనులు చేపడుతున్నా కూటమి ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కొటియా గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. తమను ఆంధ్రాలో కలపాలంటూ గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నా వారి మొర ఆలకించేవారు కరువయ్యారు. గత ప్రభుత్వం గంజాయిభద్రకు మంజూరుచేసిన హెల్త్‌సెంటర్ భవనం నిధులను సైతం ఆంధ్రా అధికారులు ఈ వివాదాలను సాకుగా చూపి ఎగువశెంబికు మళ్లించినట్టు సమాచారం. న్యూస్‌రీల్ కొటియా నుంచి పట్టుచెన్నేరుకు 15 కి.మీ.మేర బీటీ రోడ్డు నిర్మాణం పల్లెల్లో ఒడిశా అధికారుల హల్చల్ ఆంధ్రా ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకుంటున్న వైనం పట్టించుకోని ఆంధ్రా ప్రభుత్వం -
ది గోట్ లైఫ్
సాక్షి, పార్వతీపురం మన్యం: కుటుంబ పోషణ కోసం గల్ఫ్ దేశాలు వెళ్లి.. ఏజెంట్ చేతిలో మోసపోయి, అక్కడ అరబ్బుల చేతిలో చిత్రవధకు గురైన ఓ నజీబ్ కథ... ది గోట్ లైఫ్ (ఆడు జీవితం). ఓ నవల ఆధారంగా ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ కదిలించింది. కథలో కొద్దిగా మార్పులున్నా.. అటువంటి పరిస్థితినే అనుభవించాడు అప్పారావు అనే ఓ వ్యక్తి. ప్రస్తుతానికై తే అతనిది పార్వతీపురంగానే చెబుతున్నాడు. పేరు, ఊరు అయితే గుర్తుంది గానీ.. అంతకుమించి వివరాలేవీ చెప్పలేకపోతున్నాడు. దీంతో స్వస్థలానికి తిరిగి చేరుకోలేకపోతున్నాడు. ఇటీవలే తమిళనాట వెట్టిచాకిరీ నుంచి బంధవిముక్తుడైన అతని కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కార్మిక శాఖాధికారుల చొరవతో బంధవిముక్తి.. అక్కడి జిల్లా కార్మిక సంక్షేమ శాఖ అధికారులు సాధారణ తనిఖీల్లో భాగంగా కొద్దిరోజుల కిందట కదంబంకుళం వెళ్లారు. అక్కడ గొర్రెలు మేపుతూ అప్పారావు కనిపించాడు. ఆరా తీయగా.. తాను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాడినని, తన గ్రామానికి వెళ్లకుండా 20 ఏళ్లకుపైగా అక్కడే పశువులను మేపుతున్నానని వివరించాడు. అప్పారావు దీనస్థితికి చలించిన కార్మిక సంక్షేమ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిముత్తు.. తక్షణమే అతనిని విడిపించేందుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో 20 ఏళ్ల వెట్టిచాకిరీ నుంచి బంధ విముక్తుడయ్యాడు. పార్వతీపురమే గానీ.. 20 ఏళ్లు అయిపోవడం.. అప్పటి నుంచి తనతో తెలుగు మాట్లాడేవారు ఎవరూ సరిగ్గా లేకపోవడమో ఏమో గానీ.. పేరు కోనేరు అప్పారావు అని, ఊరు విజయనగరం జిల్లా పార్వతీపురం (అప్పట్లో ఉమ్మడి జిల్లా) అని మాత్రమే అక్కడి అధికారులకు చెప్పగలుగుతున్నాడు. తమిళం, తెలుగు కలిపి మాట్లాడటం వల్ల అధికారులూ పూర్తి వివరాలను తెలుసుకోలేకపోతున్నారు. ఎలాగైనా తనను కుటుంబ సభ్యుల వద్దకు చేర్చాలని ఆయన ప్రాథేయపడటంతో, అక్కడి శివగంగ జిల్లా కలెక్టర్.. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్‌ను ఇటీవల ఫోన్లో సంప్రదించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం జిల్లా అధికారులు గ్రామంలో సంప్రదించి, ఫొటో చూపించినా.. ఎవరూ గుర్తించలేకపోయారు. ప్రస్తుతం అప్పారావు అక్కడే పునరావాస కేంద్రంలో ఉన్నాడు. అప్పారావు కుటుంబ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాం.. – ఎ.శ్యామ్‌ప్రసాద్, కలెక్టర్, పార్వతీపురం మన్యం 20 ఏళ్ల కిందట టీ తాగేందుకు దిగి... సుమారు 20 ఏళ్ల కిందట అప్పారావు అనే వ్యక్తి పనుల కోసమని కొంతమందితో కలిసి పాండిచ్చేరి బయల్దేరాడు. మార్గమధ్యంలో టీ కోసం రైల్వే స్టేషన్లో దిగాడు. ఆయన మరలా రైలు ఎక్కేలోపే అది వెళ్లిపోయింది. భాష రాదు, ఎటు వెళ్లాలో తెలియదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఈ పరిస్థితుల్లో అక్కడే కొన్నాళ్లు చిక్కుకుపోయాడు. చివరికి కలైయార్కోయిల్ ప్రాంతానికి చేరుకున్నాడు. శివగంగ జిల్లాలోని కలైయార్కోయిల్ తాలూకా కదంబంకుళం ప్రాంతంలో అన్నాదురై అనే వ్యక్తి మాటలు నమ్మి, బతుకుదెరువు కోసం అక్కడ పనికి కుదిరాడు. నాటి నుంచి గొర్రెల కాపరిగా అక్కడే మగ్గిపోయాడు. పని చేసిన కాలానికి రూపాయి కూడా జీతం లేదు. వెట్టిచాకిరీ తప్ప. ఎటు వెళ్లాలో తెలియదు. ఎవరితోనూ మాట్లాడే పరిస్థితి ఉండదు. ఈ క్రమంలోనే 20 ఏళ్లు గడిచిపోయాయి. సొంత ఊరికి వెళ్లిపోతానని, ప్రయాణానికి డబ్బులు కావాలని ఎన్నోసార్లు యజమానికి ప్రాథేయపడినా.. ఫలితం లేకపోయింది. ఇదో తరహా ‘ఆడు జీవితం’ కథ.. 20 ఏళ్లుగా తమిళనాట మగ్గిపోతున్న ఓ వృద్ధుని కన్నీటిగాథ గొర్రెల కాపరిగా వెట్టిచాకిరీ ఇటీవలే బంధవిముక్తి కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం అక్కడి వారి ప్రయత్నం పార్వతీపురం ప్రాంతానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్న అధికారులు ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన అప్పారావు అనే వ్యక్తి 20 ఏళ్ల నుంచి కుటుంబానికి దూరంగా ఉంటూ, తమిళనాడుకు చెందిన అన్నాదురై దగ్గర గొర్రెల కాపరిగా పని చేస్తున్నట్లు తమిళనాడు కార్మిక శాఖ అధికారులు గుర్తించారు. అప్పారావు చెబుతున్న ప్రాంతం ఒడిశా సరిహద్దులో ఉన్నట్లు ఆయన చెబుతున్న వివరాలు ఆధారంగా తెలుస్తోంది. రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు కూడా వాటిని పరిశీలించాలని ఆదేశించాం. ఆయన కుటుంబ ఆచూకీ లభ్యమైతే సమాచారాన్ని ఫోన్ 83338 13243 నంబరుకు తెలియజేయాలి. -
తొలిరోజు పరీక్ష ప్రశాంతం
పార్వతీపురంటౌన్: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష తొలిరోజు ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డి.మంజులావీణ తెలిపారు. పార్వతీపురం పట్టణంలోని పలు పరీక్ష కేంద్రాలను ఆమె శనివారం తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 6,372 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు సెకెండ్ లాంగ్వేజ్ పరీక్ష రాయాల్సి ఉండగా 6,127 మంది హాజరయ్యారని, 245 మంది గైర్హాజరైనట్టు తెలిపారు. వృత్తి విద్యాకోర్సులకు సంబంధించి 2,963 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 2,622 మంది హాజరయ్యారని, 341 మంది గైర్హజరయ్యారని తెలిపారు. జిల్లాలోని 34 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష సజావుగా సాగిందన్నారు. ఒక విద్యార్థి డీబార్ భామిని: భామిని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థి మాస్‌కాపీయింగ్‌కు పాల్పడడంతో డీబార్ చేసినట్టు అధికారులు తెలిపారు. 34 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణ 586 మంది విద్యార్థులు గైర్హాజరు -
ఫౌండేషన్ స్కూళ్లు ఎన్నో బహిర్గతం చేయాలి
● యూటీఎఫ్ రాష్ట్రకార్యదర్శ మురళీమోహనరావు పార్వతీపురంటౌన్: జిల్లాలో ఎన్ని ఫౌండేషన్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారో బహిర్గతం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మురళీమోహనరావు అధికారులను శనివారం డిమాండ్ చేశారు. ఫౌండేషన్ పాఠశాలల ఏర్పాటుకు ఎస్ఎంసీలను రహస్యంగా సమావేశపరచి తప్పుదోవ పట్టించి ఆమోదం పొందేలా చేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. తక్షణమే ఫౌండేషన్ స్కూళ్ల ఏర్పాటు ప్రయత్నాలను నిలిపివేయాలని కోరారు. లేదంటే విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
సెలవులో జేసీ
పార్వతీపురంటౌన్: జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక శనివారం సెలవుపై వెళ్లారు. ఆమె స్థానంలో ఎఫ్ఏసీ బాధ్యతలు ప్రస్తుతానికి ఎవరికీ అప్పగించలేదు. పార్వతీపురం సబ్‌కలెక్టర్, ఐటీడీఏ పీఓగా ఉన్న అశుతోష్ శ్రీవాత్సవకు ఎఫ్ఏసీ జేసీగా బాధ్యతలు అప్పగిస్తే ఆయన మూడు బాధ్యతలు నిర్వహించా ల్సి ఉంటుంది. ఎఫ్ఏసీ జేసీగా ఎవరికి ఇస్తారో అన్నది ఉద్యోగుల్లో చర్చనీయాంశమైంది. రోగులకు మెరుగైన వైద్యం అందించాలి ● ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ కొమరాడ/గుమ్మలక్ష్మీపురం/కురుపాం: ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందజేయాలని ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ కురుపాం సీహెచ్‌సీ సిబ్బందికి సూచించారు. సీహెచ్‌సీని ఆయన శనివారం తనిఖీ చేశారు. వార్డులు, లేబర్ రూమ్, మందుల నిల్వ గది, రికార్డులు పరిశీలించారు. వైద్యసేవలపై ఆరా తీశారు. సదుపాయాలు, సమస్యలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సీహెచ్‌సీ కొత్త భవనాల నిర్మాణ పురోగతిపై ప్రశ్నించారు. అనంతరం కొమరాడ మండలంలోని మాదలింగి పీహెచ్‌సీని పరిశీలించి వైద్యులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట వైద్యారోగ్యశాఖ జిల్లా ప్రొగ్రాం అధికారి జగన్మోహనరావు, సూపరింటెండెంట్ శోభారాణి, తదితరులు ఉన్నారు. ఎకై ్సజ్ ‘గుట్టు’ రట్టు అయ్యేనా? ● మద్యం షాపు లైసెన్స్‌దారుల నుంచి అక్రమ వసూళ్లపై ఆరా ● ఒక్కో సీఐ పరిధిలో ఇద్దరేసి చొప్పున లైసెన్స్‌దారులకు పిలుపు ● డీసీ కార్యాలయంలోనే గుట్టుగా విచారణ సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎకై ్సజ్ శాఖలో భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడిన ఓ ఉన్నతాధికారి గురించి గుట్టుగా విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. విజయనగరంలోని ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో శనివారం ఉదయం నుంచి విచారణ సాగింది. జిల్లాలో ఒక్కో సర్కిల్ ఇన్స్పెక్టర్ పరిధిలో ఇద్దరేసి మద్యం షాపు లైసెన్స్‌దారులను రప్పించి విచారణ జరిపారు. ఇదే అదనుగా విచారణలో ఏం చెప్పాలో ఆయా సర్కిల్ ఇన్స్పెక్టర్లు సదరు మద్యం షాపుల లైసెన్స్‌దారులకు ముందుగానే బెదిరించి మరీ ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలిసింది. అలా సదరు ఉన్నతాధికారిపై ఈగ కూడా వాలకుండా జాగ్రత్త పడ్డారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉభయ విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో మద్యం షాపుల లైసెన్స్‌దారుల నుంచి మామూళ్లు వసూలు చేసిన వ్యవహారాన్ని గత జనవరి నెలలో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఎకై ్సజ్ శాఖలో ఓ ఉన్నతాధికారి రెండు జిల్లాలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లకు రూ.4 కోట్ల వరకూ వసూలు చేయాలని టార్గెట్ పెట్టిన విషయాన్నీ బహిర్గతం చేసింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. అందులో భాగంగానే అడిషినల్ డైరెక్టర్ దేవకుమార్ విజయనగరం వచ్చారు. డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలోనే విచారణ ప్రారంభించారు. ఒక్కో సీఐ ఇద్దరేసి చొప్పున మద్యం దుకాణాల లైసెన్స్‌దారులను తీసుకురావాలని చెప్పడంతో జిల్లా అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. విచారణకు హాజరైన లైసెన్సీలు ఏం చెప్పారనేదే ఇప్పుడు కీలకంగా మారింది. -
కుంకీ ఏనుగులు వచ్చేదెప్పుడు?
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ఏనుగుల సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని అరకు పార్లమెంటు సభ్యులు గుమ్మతనూజా రాణి అన్నారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. మన్యం జిల్లాలో ఇప్పటికే ఏనుగుల బారినపడి 12 మంది వరకూ మృతి చెందడం బాధాకరమన్నారు. కుంకీ ఏనుగులు రప్పించి ఇక్కడి గజరాజుల సమస్య పరిష్కరిస్తానన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. త్వరితగతిన ఆ హామీని నిలబెట్టుకోవాలని కోరారు. నెలలు గడుస్తున్నా కుంకీల విషయంలో ఇప్పటికీ ఏ విధమైన ముందు అడుగూ పడకపోవడంపై అధికారులు స్పష్టమైన సమాధానం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ప్రతిరోజూ ఏనుగుల వల్ల రైతుల పంటలకు నష్టం ఏర్పడుతోందని.. గ్రామాల్లో ప్రజలు ప్రాణభయంతో గడపాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మన జాతి సంపదైన వన్య ప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. గతంలో ఇక్కడ గుర్తించిన విధంగా ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, వాటికి అన్ని సదుపాయాలూ కల్పించాలన్నారు. భవిష్యత్తులో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశాలను పరిశీలించాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. గజరాజులు సంచరించే ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. బాధితులకు తక్షణం నష్ట పరిహారం అందించే చర్యలు చేపట్టాలని సూచించారు. పూతికవలసలో ఏనుగుల బీభత్సం గుమ్మలక్ష్మీపురం(కురుపాం): కురుపాం మండలంలోని పూతికవలస గ్రామంలో శనివారం ఉదయం ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఈ మేరకు గ్రామంలోని ఏగిరెడ్డి సింహాచలానికి చెందిన 3 ఎకరాల కర్బూజ, పామాయిల్ పంటలను నాశనం చేశాయి. అప్పులు చేసీ మరీ కర్భూజ పంటను సాగుచేశానని, దిగుబడి వచ్చిన సమయంలో ఏనుగులు పంటను ధ్వంసం చేయడం వల్ల సుమారు 3 లక్షల వరకు నష్టపోవాల్సివచ్చిందని, ప్రభుత్వాధికారులు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. జిల్లాలో గజరాజుల సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపాలి అరకు ఎంపీ గుమ్మ తనూజా రాణి -
ఉమెన్ హెల్ప్డెస్క్లుగా రిసెప్షన్ కౌంటర్లు
విజయనగరం క్రైమ్: పోలీస్ స్టేషన్లలో ఉన్న రిసెప్షన్ కౌంటర్లు ఇకపై ఉమెన్ హెల్ప్ డెస్క్‌లుగా మారుస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్‌లో రిసెప్షనిస్టులుగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక్కరోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. ఉమన్ హెల్ప్ డెస్క్‌లో ఒక మహిళా ఏఎస్సై, హెచ్‌సీ, మహిళా పీసీలను నియమిస్తామన్నారు. బాధితులు ఫిర్యాదు రాయలేకపోతే సిబ్బందే వారి ఫిర్యాదులను రాయాలని సూచించారు. ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఆయా అంశాలను రిసెప్షన్ రిజిస్టర్లో నమోదు చేసి బాధితులకు రశీదు ఇవ్వాలన్నారు. అనంతరం విషయాన్ని స్టేషన్ హౌస్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హెల్ప్ డెస్క్‌లో నియమించిన సిబ్బంది ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 వరకు అందుబాటులో ఉండాలన్నారు. గొడవల కారణంగా బాధితులు ఎవరైనా తిరిగి ఇంటికి వెళ్లలేని పరిస్థితుల్లో ఉంటే వారిని స్వధార హోమ్, వన్‌స్టాప్ సెంటర్లో ఆశ్రయం కల్పించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, మహిళా పీఎస్ సీఐ ఈ.నర్సింహమూర్తి, వన్‌స్టాప్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, వివిధ పోలీస్స్టేషన్లకు చెందిన ఎస్హెచ్ఓలు, హెల్ప్‌డెస్క్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ వకుల్ జిందల్ -
ఇది మోసపూరిత బడ్జెట్
వంగర: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి మోసపూరితంగా ఉందని.. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు, ఇప్పుడు బడ్జెట్లో కేటాయింపులకు పొంతనే లేదని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోవడమే కూటమి ప్రభుత్వ ఉద్దేశమని మండిపడ్డారు. మండలంలోని కోనంగిపాడులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గతేడాది సూపర్ సిక్స్ పథకాల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని.. ఈ ఏడాది బడ్జెట్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర నిధులు కేటాయించడం చూస్తుంటే.. ఆ పథకాల అమలుపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. ఫ్రీ బస్, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి పథకాలకు కేటాయింపులు లేకపోవడం అన్యాయమన్నారు. 50 ఏళ్లు పైబడిన బీసీలకు పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. ప్రజలు సీఎం చంద్రబాబును నమ్మి మోసపోయారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పేదల పక్షపాతి అని.. పేదల సంక్షేమానికి ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ఎక్కడా ప్రవేశపెట్టలేదని తెలిపారు. ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్యసేవగా పేరుమార్చి పథకాన్ని పూర్తిగా నీరుగార్చారని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా తీసుకెళ్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం రెవెన్యూ వ్యయం కింద రూ.2.51 లక్షల కోట్లు కేటాయించి, మూలధన వ్యయం కింద కేవలం రూ.40 వేల కోట్ల కేటాయింపులు చేయడమే వారి మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోయిందని తెలిపారు. తన మంత్రి పదవిని కాపాడుకునేందుకే పయ్యావుల కేశవ్ బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబు, లోకేష్‌లను పొగిడే దుస్థితికి దిగజారారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కరణం సుదర్శనరావు, సర్పంచ్‌లు చందక తాతబాబు, నెయిగాపుల శివరామకృష్ణయ్య, పార్టీ నాయకులు కనగల పారినాయుడు, వేమిరెడ్డి సూర్యనారాయణ, బెవర నూకంనాయుడు, యలకల వాసునాయుడు, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ -
పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు
సీతంపేట: మన్యంలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. ఏజెన్సీలోని పలు పర్యాటక ప్రదేశాలను శనివారం ఆయన సందర్శించారు. జగతపల్లి వ్యూ పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. పర్యాటకులను ఆకర్షించే విధంగా వ్యూ పాయింట్‌ను తీర్చిదిద్దాలన్నారు. అనంతరం పనుకువలస నర్సరీలో గ్రామదర్శిని కార్యక్రమం ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించి ఇక్కడ అనుకూలంగా ఉందన్నారు. గడిగుడ్డిలోని పట్టు పరిశ్రమ యూనిట్‌ను పరిశీలించారు. పట్టునుంచి దారం తీసే విధానాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే పెదరామ గ్రా మంలో మల్బరీ తోటలు పెంచే రైతులతో మాట్లాడారు. ఐటీడీఏలోని ముక్కిడిపోలమ్మ జీడి ప్రాసెసింగ్ యూనిట్ పరిశీలించారు. కొండచీపుర్లు, అగరుబత్తి యూనిట్, పసుపు ప్రాసెసింగ్ కేంద్రాలను సందర్శించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్ రెడ్డి, ఏపీఓ చిన్నబాబు, డీడీ అన్నదొర, ఈఈ రమాదేవి, ఎంపీడీఓ గీతాంజలి, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ -
సహనం నేర్పే రంజాన్..
● నేటి నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం ● నెల రోజుల పాటు కఠిన దీక్షలు, దానధర్మాలు ● ప్రార్థనలకు ముస్తాబైన మసీదులువిజయనగరం టౌన్: యావత్ ప్రపంచంలో ఉన్న ముస్లింలకు అత్యంత పవిత్రమైన, సంతోషాలు పంచే నెల రంజాన్. ఈ నెల అరబీ నెలల వరుస క్రమంలో తొమ్మిదవది. రంజాన్ అంటే కాలిపోవడం, భస్మీపటలమవ్వడం, ఆగిపోవడం అనే అర్థాలను సూచిస్తుంది. రంజాన్ నెలలో తమ పాపాలు, పొరపాట్లు, తప్పిదాలన్నీ కాలిపోయి వాటికి బదులుగా పుణ్యఫలాలు పొందుతామనేది ముస్లింల నమ్మకం. ఈ శుభాల సరోవరం, వరాల వసంతం అయిన రంజాన్ మాసం నెల వంకను చూసిన వెంటనే ప్రారంభమవుతుంది. ఈ నెలకు అల్లాహ్ దృషి్ోట్ల పవిత్రమైన, ప్రత్యేకమైన స్థానముంది. విశ్వాసులకు ఎనలేని సంతోషాలు, పుణ్యాలను అందిస్తుంది ఈ మాసం. ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లలు మొదలుకుని వృద్ధుల వరకు ఈ పవిత్రమాసం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉంటారు. ఆదివారం నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభించాలని జమాతే ఇస్లామీ హింద్ సంస్థ మతాధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రార్థనలకు మసీదులన్నీ విద్యుత్ అలంకరణలతో ముస్తాబయ్యాయి. ఆలయ కమిటీల ప్రతినిధులు అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేపట్టనున్నారు. ఉచితంగా నమాజ్ పుస్తకాల పంపిణీ... రంజాన్ మాసంలో ఉచితంగా నమాజ్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు పట్టణ ముస్లిం ప్రతినిధి మహమ్మద్ గౌస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక చేసిన గ్రామాలు, మండలాల్లో 38 వేల నమాజ్ పుస్తకాలను పంపిణీ చేపట్టనున్నామన్నారు. అవకాశం ఉన్నవారందరూ పుస్తకాలను స్వీకరించాలని కోరారు. -
క్యాంపస్ ఇంటర్వ్యూలు రేపు
బొబ్బిలి: పట్టణంలోని రాజా కాలేజ్‌లో దివిస్ ల్యాబ్స్ కంపెనీ ప్రతినిధులు సోమవారం క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారని ప్రిన్సిపాల్ సీహెచ్ వీరేంద్రకుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ ఆర్గానిక్ లేదా ఎనలటికల్ కెమిస్ట్రీ, బీటెక్ కెమి కల్ ఇంజినీరింగ్, బి ఫార్మసీ కోర్సులు చేసిన పురుష అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. 2000– 2005 సంవత్సరాల మధ్య విద్యార్హత కలిగి ఉండాలన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు, బయోడేటా, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకుని నేరుగా కళాశాలలో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని కోరారు. యువకుడిపై కేసు నమోదు పార్వతీపురం రూరల్: పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ అమ్మాయి ఇంటికి వెళ్లి దాడి చేసిన అబ్బాయిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కె. మురళీధర్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పార్వతీపురానికి చెందిన అమ్మాయి తన చుట్టాలబ్బాయితో కొమరాడ మండలంలోని గుంప వెళ్లి వస్తుండగా.. శివిని గ్రామం వద్ద నిందితుడు వాళ్ళిద్దర్నీ అడ్డుకొని తాను ప్రేమించిన అమ్మాయితో నీకేంటి పని అని గద్దిస్తూ చుట్టాలబ్బాయిని బెదిరించాడు. అక్కడితో ఆగకుండా అమ్మాయి ఇంటికి వెళ్లి దుర్భాషలాలడుతూ అమ్మాయిపై చేయి చేసుకున్నాడు. ఈ మేరకు అమ్మాయి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సేంద్రియ ఎరువు తయారీపై దృష్టి● డీపీఓ వెంకటేశ్వరరావు రాజాం సిటీ: గ్రామాల్లో ఏర్పాటు చేసిన సంపద సృష్టి కేంద్రాల ద్వారా సేంద్రియ ఎరువు తయారీపై దృష్టి సారించాలని డీపీఓ వెంకటేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని సోపేరు గ్రామంలో శనివారం ఆయన పర్యటించి, వర్మీకంపోస్టు తయారీపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో క్లాప్‌మిత్రలు సేకరించిన తడి, పొడి చెత్తను కేంద్రంలో పూర్తిగా వేరు చేయాలని సూచించారు. తడిచెత్తను బయట ఏర్పాటు చేసిన ఫిట్స్‌లో వేయాలని, పొడి చెత్తను కేంద్రం లోపల డ్రై ఫిట్స్‌లో వేయాలన్నారు. ప్రతి ఒక్క పంచాయతీలో సందప సృష్టిపై పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో డీపీఆర్సీ కో ఆర్డినేటర్ పట్నాయక్, ఎంపీడీఓ వి.శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడికి గాయాలు రాజాం సిటీ: స్థానిక బొబ్బిలి రోడ్డులోని ఫైర్‌స్టేషన్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మున్సిపాల్టీ పరిధి వస్త్రపురి కాలనీకి చెందిన ఆగూరు తిరుపతిరావు అనే వృద్ధుడు సైకిల్‌పై అమ్మవారి గుడి సమీపంలోని యోగాశ్రమానికి వెళ్తున్నా డు. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన మో టార్సైక్లిస్ట్ ఢీ కొనడంతో వృద్ధుడికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి అత డ్ని రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించగా.. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. క్షతగాత్రుడి అన్నయ్య ఆగూరు వెంకటరమణ ఇ చ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యా ప్తు చేస్తున్నామని ఎస్సై వై.రవికిరణ్ తెలిపారు. స్వగ్రామానికి ఎంటెక్ విద్యార్థి మృతదేహం ● మూడు రోజుల కిందట సూరత్‌లో జరిగిన ప్రమాదంలో మృతి నెల్లిమర్ల రూరల్: మండలంలోని పూతికపేట గ్రామానికి చెందిన యువకుడు పత్తిగిడి నాగరాజు (25) గత నెల 27న గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి మృతి చెందాడు. అక్కడి రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని సెల్‌ఫోన్ ఆధారంగా స్నేహితులకు సమాచారం అందించారు. వెంటనే వారు కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో హైదరాబాద్‌లో ఉన్న మృతుడి అన్నయ్య చిరంజీవి సూరత్ వెళ్లి మృతదేహాన్ని స్వగ్రామమైన పూతికపేట గ్రామానికి శనివారం తీసుకువచ్చారు. నాగరాజు ఐదు నెలల కిందటే సూరత్‌లోని ఎన్ఐటీలో ఎంటెక్ చేసేందుకు వెళ్లాడు. తమ కుమారుడు తరుచూ ఫోన్లో మాట్లాడుతుండేవాడని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండే యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు శోక సంద్రంలో మునిగిపోయారు. -
ఏడో తేదీ వరకు మహిళా సాధికారత వారోత్సవాలు
విజయనగరం క్రైమ్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి ఒకటో తేదీ నుంచి ఏడు వరకు జిల్లాలో మహిళా సాధికారత వారోత్సవాలు నిర్వహిస్తామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో విద్యార్థినులు, మహిళల భద్రత.. పోలీస్ విధులపై అవగాహన కల్పించేందుకు ‘ఓపెన్ హౌస్‘ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారోత్సవాల్లో భాగంగా మెడికల్ క్యాంపులు, వ్యాసరచన, వక్తృ త్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తామన్నారు. అలాగే ఓపెన్ హౌస్, ర్యాలీ కూడా చేపడతామని చెప్పారు. మహిళల భద్రత, రక్షణ, సమానత్వం, అభివృద్ధి, సాధికారతకు కృషి చేయాలన్న సంకల్పంతో జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. BĶ欫§éÌS ˘ ప్రదర్శన.. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన ఓపెన్‌హౌస్ కార్యాక్రమంలో భాగంగా పోలీసులు ఆయుధాలు ప్రదర్శించారు. తుపాకులు, బాంబ్ డిస్పోజల్స్ పరికరాలు, పోలీస్ డాగ్స్, డ్రోన్స్, సాంకేతికత, బాడీ వోర్న్ కెమెరాలు, ట్రాఫిక్, కమ్యూనికేషన్ విభాగాల్లో వినియోగిస్తున్న పరికరాలు ప్రదర్శించి, వాటి పనితీరును వివరించారు. అలాగే నేర స్థల పరిశీలనలో క్లూస్ టీమ్ ఆధారాలు, ఫింగర్ ప్రింట్స్ పని తీరుపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, మహిళా పీఎస్ సీఐ ఈ.నర్సింహమూర్తి, వన్‌టౌన్ సీఐ ఎస్.శ్రీనివాస్, టూటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు, ఆర్ఐలు ఎన్. గోపాలనాయుడు, ఆర్.రమేష్‌కుమార్, టి.శ్రీనివాసరావు, ఏఆర్, సివిల్ పోలీసు అధికారులు, సిబ్బంది, వివిధ పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్పీ వకుల్ జిందల్ -
వైఎస్సార్సీపీలో చేరిన ఇండిపెండెంట్ కౌన్సిలర్
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మున్సిపాలిటీకి చెందిన ఇండిపెండెంట్ కౌన్సిలర్ రణభేరి బంగా రు నాయుడు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో శుక్రవారం ఉమ్మడి విజయనగరం జిల్లాపరిషత్ చైర్మన్ మజ్జి శ్రీని వాసరావును విజయనగరంలోని జెడ్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం పురపాలక సంఘంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను మాజీ ఎమ్మెల్యే జోగారావు వివరించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ భవిష్యత్ కార్యాచరణపై కొన్ని కీలక సూచనలు చేశారు. అనంతరం ఒకటవ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ రణభేరి బంగారు నాయుడు పార్టీ కండువా వేసుకుని పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి, వైస్ చైర్పర్సన్ కొండపల్లి రుక్మిణి, వైస్‌చైర్మన్ యిండుపూరు గున్నేశ్వరరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ, వివిధ వార్డులకు చెందిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
ఏటా మూడు పంటల సాగు ప్రణాళిక
పార్వతీపురంటౌన్: జిల్లాలో ఏటా మూడు పంటల సాగుకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు. ఏపీసీసీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రజాభాగస్వా మ్య ప్రకృతి వ్యవసాయంపై కలెక్టరేట్లో శుక్రవా రం నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ సమావే శంలో ఆయన మాట్లాడారు. పంటలకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ నిధులతో ఫారంపాండ్స్, చెక్‌డ్యాముల నిర్మాణం, చెరువుల అభివృద్ధి పనులు చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఘన, ద్రవ జీవమృతాల తయారీతో పాటు వినియోగ పద్ధతులను ప్ర యోగాత్మకంగా వివరించాలన్నారు. వాటి ప్రయోజనాలను తెలియజేయాలని తెలిపారు.సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్, ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ షన్ముఖరాజు, జిల్లా ఉద్యానవన శాఖాధికారి బి.శ్యామల, జిల్లా పశు సంవర్థకశాఖాధికారి డాక్టర్ ఎస్.మన్మథరావు, జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ పథక సంచాలకుడు వై.సత్యంనాయుడు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్‌రాజు, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, విస్తరణాధికారులు, ఏపీసీఎన్‌ఎస్ అధికారులు పాల్గొన్నారు. -
బడ్జెట్లో మన్యంకు మొండిచేయి
● జిల్లా అభివృద్ధికి రూ.10వేల కోట్లు కేటాయించాలి ● నేడు బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ ఎదుట నిరసన పార్వతీపురంటౌన్: జిల్లా అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గొర్లి వెంకటరమణ మండిపడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్ర బడ్జెట్ కు నిరసనగా శుక్రవారం పార్వతీపురం సుందర య్య భవనంలో కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో మన్యం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులైన జంఝావ తి, తోటపల్లి, గుమ్మడిగెడ్డ, వట్టిగెడ్డ ప్రాజెక్టుల పూర్తికి ఎలాంటి కేటాయింపులు లేవన్నారు. జిల్లా లోని గిరిజన ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి, మరమ్మతులకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు. జిల్లాలో పీజీ కాలేజ్, యూనివర్సిటీ, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీ తదితర సంస్థల ఏర్పాటులో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. జిల్లాలో మౌలిక వసతుల కల్పనకు, అభివృద్ధి పనులకు రూ.10వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రూ. 3.22 లక్షల కోట్లతో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో సామా జిక రంగానికి, విద్య, వైద్యానికి కోత పెట్టడం విచా రకరమన్నారు. తెలుగు భాష అభివృద్ధికి కేవలం రూ.10 కోట్లు కేటాయించడం తగదన్నారు. బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద శనివారం నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. కార్యక్రమంలో బి.వి రమణ, పి రాజశేఖర్, నాయకులు పి. సన్యాసిరావు, బి.సూరిబాబు, ఎస్.ఉమామహేశ్వరరావు, జి.కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
అరచేతిలో వైకుంఠం... అమల్లో ఎగనామం!
● కూటమి ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌పై సర్వత్రా విమర్శలు ● సూపర్ సిక్స్ అమలుపై కరిగిపోయిన సామాన్యుల ఆశలు ● 2025–26 పూర్తిస్థాయి బడ్జెట్లో కనిపించని సంక్షేమ పథకాలు ● ప్రస్తావించిన అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలపైనా సందేహాలు ● అమలయ్యేవరకూ చెప్పలేమంటున్న ప్రజానీకం ● అన్నీ కంటితుడుపు కేటాయింపులేనని పెదవి విరుపు మరికొన్ని కేటాయింపులు... ●భోగాపురం ఎయిర్‌పోర్టు అనుసంధాన రహ దారి నిర్మాణానికి ఇంకా 40 ఎకరాల భూసేకరణకు సంబంధించి రూ.195 కోట్లు ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. ●పార్వతీపురం మన్యం జిల్లా సహా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో నెలకొన్న ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు ఎలిఫెంట్‌కు కేవలం రూ.1.28 కోట్లే కేటాయించారు. ●విజయనగరంలోని జేఎన్టీయూ–గురజాడ ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయంలో మౌలిక వసతు ల కల్పనకు సాయంగా సుమారు రూ. 5.60 కోట్లు ప్రతిపాదించారు. దీంతో పాటు కురుపాంలోని గిరిజన ఇంజనీరింగ్ కళాశాలకు కలిపి భవనాలు, ల్యాబ్‌ల నిర్మాణం కో సం మరో రూ.3.40 కోట్లు కేటాయించారు. ●విజయనగరం శివారులోని కోరుకొండ సైనిక్స్కూల్తో పాటు కలికిరి సైనిక్ స్కూ ల్కు కలిపి అదనపు నిర్మాణాల కోసం రూ.2 కోట్లు ప్రతిపాదించారు. ●గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాలైన సీతంపేట, పార్వతీపురంతో పాటు మరో మూడు ప్రాంతాల్లో నిర్మించ తలపెట్టిన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు రూ.110 కోట్లు ప్రతిపాదించారు. ●గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన విజయనగరం సహా రాష్ట్రంలోని మరో ఆరు బోధనాసుపత్రులకు కలిపి రూ.375 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. అరకొర నిధులతో విజయనగరం మెడికల్ కాలేజీలో రెండో దశ నిర్మాణాలు వేగవంతమయ్యే అవకాశం కనిపించట్లేదు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీ, జనసేన, బీజేపీ కలగలిపిన కూటమి ప్రభుత్వం మాది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారం తమదే.. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ టీడీపీ, జనసేన నాయకులు చెప్పుకొనే గొప్పలు చూస్తే అబ్బో అనిపిస్తాయి! తీరా రాష్ట్ర బడ్జెట్ చూస్తే మాత్రం అంతా అంకెల గారడీనే కనిపిస్తుందని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. వైఎస్సార్సీపీ అమలుచేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని, అంతకుమించి సూపర్ సిక్స్ పథకాలను అమలుచేస్తామని గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో టీడీపీ, జనసేన నాయకులు అరచేతిలో వైకుంఠం చూపించారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీలకు ఎగనామం పెట్టేశారు. అదిగో ఇదిగో అంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇక రానున్న సంవత్సరం కూడా సూపర్ సిక్స్ పథకాలు అందవన్న విషయం శుక్రవారం నాటి రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు చూసిన తర్వాత స్పష్టమైంది. సామాన్యుల ఆశలు కరిగిపోయాయి. గత ఏడాది నవంబర్‌లో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లోనే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను ప్రస్తావించినా తర్వాత వాటి ఊసే లేదు. వాటినే మళ్లీ తాజా పూర్తిస్థాయి బడ్జెట్ 2025–26లోనూ ప్రతిపాదించినా అరకొర నిధులే కేటాయించడంతో అవెంత వరకూ అమలుచేస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ సిక్స్‌లోని మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రతిపాదనలేవీ లేవు. దీంతో ఈ బడ్జెట్ సామాన్యులకు కంటితుడుపు మాదిరిగానే ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై ఉభయ విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల ప్రజలు పెదవి విరుస్తున్నారు. రైతులకు సాయం అందేనా? పెట్టుబడి సాయం కింది ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.20 వేల చొప్పున అందిస్తామనేది టీడీపీ, జనసేన నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీ. గత తాత్కాలిక బడ్జెట్లోనే ఇస్తామని ప్రతిపాదించినా ఒక్క పైసా కూడా రైతులకు ఇవ్వలేదు. ఈసారి బడ్జెట్లో రాష్ట్రంలో 53.5 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద దఫదఫాలుగా సాయం అందించేందుకు రూ.6,300 కోట్లు ప్రతిపాదించారు. అమలయ్యేవరకూ అనుమానమే. రైతుసేవా కేంద్రాలుగా పేరుమార్చిన రాష్ట్రంలోని 10778 రైతుభరోసా కేంద్రాలకు నిర్వహణ ఖర్చుల కింద కేవలం రూ.19.42 కోట్లు మాత్రమే ప్రతిపాదించారంటే... వాటిని మరింత నిర్వీర్యం చేయ డానికేనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయాధారిత విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో రైతులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇవెంతగానే ఉపయోగపడిన విషయం తెలిసిందే. మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోతే కొనుగోలు చేసి రైతులను ఆదుకొనేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సుమారు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం బడ్జెట్లో కేవలం రూ.300 కోట్లు మాత్రమే ప్రతిపాదించింది. సాగునీటి పథకాలకు అరకొరగా నిధులు.. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఉమ్మడి విజయనగరం జిల్లాలో జలయజ్ఞంలో భాగంగా తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టు పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా ఆయన కుమారుడు, గత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిధులు కేటాయిస్తూ వచ్చారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రాజెక్టుల పనులపై కినుక వహించింది. కాలువల నిర్మాణానికి సంబంధించి జంఝావతి, తోటపల్లి కొత్త ఆయకట్టుతో కలిపి వెంగళరాయసాగర్ విస్తరణకు అవసరమైన 21 ఎకరాల భూసేకరణకు, తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టు మిగులు పనులకు, తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు గజపతినగరం బ్రాంచ్ కెనాల్‌కు అవసరమైన 240 ఎకరాల భూసేకరణకు, పాత తోటపల్లి బ్యారేజ్ ఆధునికీకరణ, పెద్దేరు రిజర్వాయరు, మడ్డువలస రిజర్వాయరు మిగులు పనులన్నింటికీ కలిపి కేవలం రూ.54.73 కోట్లు మాత్రమే ప్రతిపాదించడమే దీనికి నిదర్శనం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూ.605.75 కోట్లు, తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టుకు రూ.47.80 కోట్లు ప్రతిపాదించారు. మిగులు పనులు, నిర్వాసితులకు పరిహారం చెల్లింపునకు కలిపి తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టుకు రూ.68 కోట్లు కేటాయించారు. ●కోతల బడ్జెట్ సంపద సృష్టించి సంక్షేమా న్ని ప్రజలకు చేరువచేస్తామన్నారు. ద్రవ్య, రెవెన్యూ లోటే చూపించారు. సంక్షే మ పథకాల అమలులో కోతలు తప్పవని బడ్జె ట్ సాక్షిగా చెప్పారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగా కల్పన ఊసే లేదు. – పాలవలస విక్రాంత్, రాష్ట్ర శాసన మండలి సభ్యుడు ●మాయా బడ్జెట్ టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహిళలకు మొండిచేయి చూపారు. ఉచిత బస్సు సదుపాయం, 18 నుంచి 60 సంవత్సరా ల మధ్య మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్నా పథకాల ఊసేలేదు. – బడ్నాన ప్రమీల, ఎంపీపీ పాచిపెంట ●నిరాశ జనక బడ్జెట్ ఉద్యోగులకు ఇది నిరాశాజనక బడ్జెట్. పీఆర్సీ బకాయిలు, డీఏలు, తదితర కేటాయింపులు లేకపోవడం విచారకరం. – ఎ.సూర్యనారాయణ, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు -
●బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీలా బడ్జెట్
2025–26 బడ్జెట్ బాబు ష్యూరిటీ.. మోసం, నయవంచన గ్యారంటీలా ఉంది. ఎన్నికల్లో ప్రతి గ్రామానికి వెళ్లి అధికారంలోకి రాగానే సూపర్ 6 అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. రూ.3 లక్షల 22వేల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో సూపర్ 6 పథకాలకు ఎగనామం పెట్టారు. నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1500, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లు, ఉచిత బస్సు వంటి పథకాలకు బడ్జెట్లో ప్రస్తావనే లేకుండాపోయింది. అన్నదాత సుఖీభవకు రూ.11 వేల కోట్లు అవసరమైతే కేవలం రూ.6,300 కోట్లు మాత్రమే కేటాయించారు. – పాముల పుష్పశ్రీవాణి, మాజీ డిఫ్యూటీ సీఎం -
అప్పుల ఆంధ్రప్రదేశ్ ఘనత చంద్రబాబుదే
సాలూరు రూరల్: రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత సీఎం చంద్రబాబుదేనని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర విమర్శించారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు, అభివృద్ధి పనులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పులుచేస్తే ఆంధ్రప్రదేశ్ ఒక వెనుజులా, మరో శ్రీలంకగా తయారవుతుందని ఆరోపించిన చంద్రబాబునాయుడు... ఇప్పుడు తను చేస్తున్న అప్పులు ఎవరికోసం చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సాలూరులోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తామని ఎన్నికల్లో లబ్ధిపొందిన చంద్రబాబు... ఇప్పుడు ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయకుండా మోసం చేశారన్నారు. ప్రజావ్యతిరేకతకు భయపడి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నారన్నారు. అసెంబ్లీలో ప్రశ్నిస్తారన్న భయంతో వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడంలేదన్నారు. ఢిల్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి గతంలో ప్రతిపక్ష హోదా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల సమక్షంలో ఎండగడతామన్నారు. తొమ్మిది నెలల పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసినది శూన్యమన్నారు. గతంలో కేవలం 10 నెలల పాలనలో జగన్ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి 1.35 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందన్నారు. కూటమి ప్రభుత్వం సున్నా సంక్షేమంతో రికార్డు కెక్కిందన్నారు. తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, కొత్తపెన్షన్లు, కాంట్రాక్టు ఉద్యోగాలు, మహిళలకు ఉచిత బస్సు, 50 ఏళ్లకే పింఛన్, జాబ్ క్యాలెండర్, డీఎస్సీ, వలంటీర్లకు రూ.10వేల జీతం వంటి హామీలన్నీ సున్నాగానే మిగిలాయన్నారు. అంగన్వాడీల వేతనం పెంపు, ఉద్యోగుల పీఆర్సీ, మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఆర్థిక సాయం అందని ద్రాక్షగానే మారాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్ గిరిరఘు, మాజీ కౌన్సిలర్ పిరిడి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. రూ.లక్ష కోట్లు అప్పుచేసిన చంద్రబాబుకు ఇప్పుడు వెనుజులా, శ్రీలంక గుర్తురాలేదా? జగన్ చేసిన అప్పులకు లెక్కలున్నాయి చంద్రబాబుచేసిన అప్పులకు లెక్కలు చూపించగలరా? బడుగు బలహీనవర్గాలతో మూడు ముక్కలాట ఆడుతున్న కూటమి ప్రభుత్వం మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర -
ఏటా మూడు పంటల సాగు ప్రణాళిక
పార్వతీపురంటౌన్: జిల్లాలో ఏటా మూడు పంటల సాగుకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు. ఏపీసీసీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రజాభాగస్వా మ్య ప్రకృతి వ్యవసాయంపై కలెక్టరేట్లో శుక్రవా రం నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ సమావే శంలో ఆయన మాట్లాడారు. పంటలకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ నిధులతో ఫారంపాండ్స్, చెక్‌డ్యాముల నిర్మాణం, చెరువుల అభివృద్ధి పనులు చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఘన, ద్రవ జీవమృతాల తయారీతో పాటు వినియోగ పద్ధతులను ప్ర యోగాత్మకంగా వివరించాలన్నారు. వాటి ప్రయోజనాలను తెలియజేయాలని తెలిపారు.సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్, ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ షన్ముఖరాజు, జిల్లా ఉద్యానవన శాఖాధికారి బి.శ్యామల, జిల్లా పశు సంవర్థకశాఖాధికారి డాక్టర్ ఎస్.మన్మథరావు, జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ పథక సంచాలకుడు వై.సత్యంనాయుడు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్‌రాజు, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, విస్తరణాధికారులు, ఏపీసీఎన్‌ఎస్ అధికారులు పాల్గొన్నారు.