Prakasam
-
యువత పోరును జయప్రదం చేయాలి
సింగరాయకొండ: కూటమి ప్రభుత్వం యువతను మోసం చేస్తోందని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తయినా సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పేద విద్యార్థుల కోసం జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద వంటి పథకాలు అమలు చేసి ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీలు ఇచ్చి యువతను మోసం చేసిందని దుయ్యబట్టారు. వైఎస్సార్ ఉన్నతాశయంతో తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడాన్ని తప్పుబట్టారు. బుధవారం జిల్లా కేంద్రం ఒంగోలులో చేపట్టే యువత పోరు కార్యక్రమానికి యువత, వారి తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తల్లికి వందనానికి అరకొర నిధులా? తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్రంలో 1.20 కోట్ల మంది తల్లులు ఉంటే ప్రభుత్వం ప్రకటించిన రూ.15 వేల ప్రకారం సుమారు 15 వేల కోట్లు అవసరమైతే బడ్జెట్లో కేవలం 9 వేల కోట్లు మాత్రమే ప్రకటించారని మండిపడ్డారు. ప్రస్తుతం నూతన విధానం ప్రకారం 10 రోజుల పాటు విద్యార్థి ఎటువంటి కారణం లేకుండా పాఠశాలకు రాకపోతే అతని పేరు తొలగించాలని ఆదేశాలు ఇచ్చారని ఆ ప్రకారం జిల్లాలో 45 వేల మంది విద్యార్థుల పేర్లు తొలగించారని ఆదిమూలపు సురేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికి కూటమి ప్రభుత్వం రెండు బడ్జెట్లు ప్రవేశ పెట్టినప్పటికీ నిరుద్యోగులకు ఒక్క రూపాయి కూడా కేటాయింలేదని ఆరోపించారు. మెడికల్ కాలేజీలపై నిర్లక్ష్యం వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో డాక్టర్ కావాలన్న పేద పిల్లల కలలను నిజం చేసేందుకు 17 మెడికల్ కాలేజీలు నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక కేవలం 11 మెడికల్ కాలేజీలు మామే నిర్మించారని గుర్తు చేశారు. ఈ కాలేజీల ద్వారా 2,500 మెడికల్ సీట్లు పేద విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయన్నారు. మార్కాపురం, ఆదోని, పులివెందులలో మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తే ఇంకా పనులు ఉన్నాయని వాటిని గాలికి వదిలేసి పేద విద్యార్థులు డాక్టర్ కోర్సు చదవకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు పనిచేయవద్దని, వారికి పనిచేస్తే పాముకు పాలు పోసినట్లేనని సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బహిరంగంగా చెప్పడంపై మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో ఆరాచక పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. ఎప్పుడో ఏదో అన్నారని పార్టీ కార్యకర్తలతో కేసులు పెట్టించి కోర్టు ముందు హాజరుపరచకుండా వైఎస్సార్ సీపీ మద్దతుదారులను ఇబ్బందులకు గురి చేయడాన్ని ఆక్షేపించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్‌ను హోం మంత్రి అనిత చెత్త యాప్ అంటున్నారంటే మహిళలపై ఆమెకు ఉన్న గౌరవం అర్థమవుతోందన్నారు. అనంతరం యువత పోరుకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. పార్టీ ఇంటలెక్చువల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తుల అశోక్‌కుమార్‌రెడ్డి, ఎంపీపీ కట్టా శోభారాణి, బీసీ సెల్ రీజినల్ కో ఆర్డినేటర్ బొట్లా రామారావు, జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, మాకినేని వెంకట్రావు, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ సుల్తాన్, జిల్లా బూత్ కమిటీ విభాగం అధ్యక్షుడు పుట్టా వెంకట్రావు, జిల్లా ఆర్గనైజేషన్ మెంబరు కట్టా ఆనంద్, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు మారంరెడ్డి గంగాధర్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పరిటాల సునీల్‌కుమార్, బీసీ సెల్ అధ్యక్షుడు యామవరపు వసంతరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు యనమల మాధవి, ఇంటలెక్చువల్ విభాగం అధ్యక్షుడు భువనగిరి సత్యనారాయణ, పంచాయతీరాజ్ విభాగం షేక్ వన్నూరు, సోషల్ విభాగం అధ్యక్షుడు వేమిరెడ్డి పెద్దిరెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు చుక్కా కిరణ్‌కుమార్, ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ సలీం, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు కొమ్ము ప్రభుదాస్, వాణిజ్య విభాగం అధ్యక్షుడు గాదంశెట్టి గుప్తా, జిల్లా ప్రచార విభాగం మాజీ అధ్యక్షుడు చింతపల్లి హరిబాబు పాల్గొన్నారు. మాజీ మంత్రి సురేష్ పిలుపు -
మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్
కనిగిరిరూరల్: పట్టణంలోని ట్యాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఇఫ్తార్ విందు ఇచ్చారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఇఫ్తార్ విందులో మేము సైతం అంటూ కార్మికులు భాగస్వాములయ్యారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ దువా, విందులో మున్సిపల్ చైర్మన్ ఎస్కే అబ్దుల్ గఫార్, సీపీఐ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సయ్యద్ యాసీన్న్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ మతసామరస్యతకు ప్రతీకగా.. సోదర, స్నేహ భావాన్ని పెంపొందిచే విధంగా ట్యాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడాన్ని కొనియాడారు. సీపీఐ కార్యదర్శి సయ్యద్ యాసీన్ మాట్లాడుతూ లౌకిక విలువలు కాపాడుతూ.. ప్రజల్లో ఐక్యత, స్నేహభావాన్ని పెంపొందించే విధంగా కర్షక వర్గాలు చేపట్టిన బృహత్తర కార్యక్రమంగా కొనియాడారు. అనంతరం ముస్లింలకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. న్యాయవాది సుమైర్, నజీర్‌బాష, ఎస్కే సందాని, ఫయాజ్, గండికోట రవి, ఎస్కే వలి, బాషా, నాయబా, అసోసియేషన్ నాయకులు, మదర్ థెరిసా సేవా సమితి అధ్యక్షుడు ఎస్ ఎన్ రసూల్, మండ్రు రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన జిల్లా పోలీసులు
ఒంగోలు టౌన్: జాతీయ స్థాయిలో నిర్వహించిన అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో జిల్లాకు చెందిన పోలీసులు సత్తా చాటారు. ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు బెంగళూరులో 45వ నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌ఫిప్–2025 పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో జిల్లా పోలీసు శాఖ నుంచి 30 ప్లస్ ఏజ్ గ్రాప్ విభాగంలో పోలీసులు సత్తా చాటారు. ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సురేష్ 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెంలో రెండు సిల్వర్, 4‘100 మీ, 4్ఙశ్రీ400 మీటర్ల రిలే పోటీల్లో రెండు బ్రాంజ్ పతాకాలను సాధించారు. పోలీసు కానిస్టేబుల్ శ్రీనివాసరావు 4్ఙశ్రీ 100, 4్ఙశ్రీ400 మీటర్ల పోటీల్లో రెండు బ్రాంజ్ పతకాలను సాధించారు. పోటీల్లో ప్రతిభ చాటిన ఆర్ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ శ్రీనివాసరావులను మంగళవారం ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఏఆర్ ఏఎస్పీ అశోక్ బాబు, ఐటీ కోర్ సీఐ సూర్యనారాయణ, ఆర్ఐ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సేవల్లేక జనం విలవిల.. ఉద్యోగుల్లో అసంతృప్తి జ్వాల!
అమ్మా రేషన్ కార్డు.. అయ్యా పింఛనెప్పుడు? ఇంటింటి సర్వే, పింఛన్ల పంపిణీ సమయంలో ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు సచివాలయ ఉద్యోగుల వద్ద సమాధానం ఉండటం లేదు. ‘కొత్త పింఛన్లు రాస్తున్నారా అయ్యా.. రేషన్ కార్డు కోసం అప్లికేషన్ తీసుకుంటున్నారా అమ్మా..’ అంటూ ఆశగా అడుగుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు ‘లేదు.. లేదు.. గవర్నమెంట్ ఇంకా సైటు వదల్లేదు’ అని చెప్పి ముందుకు కదులుతున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలు గడిచినా పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆధారమైన రేషన్‌కార్డుల మంజూరులో ప్రభుత్వం అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. సచివాలయాల్లో దరఖాస్తులు పెట్టుకుని నెలలు గడుస్తున్నా కొత్త కార్డులు మంజూరు చేయకపోవడంతో పేదలు ఆందోళన చెందుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రేషన్‌కార్డులు, కొత్త పింఛన్లు, ఆరోగ్యశ్రీ కార్డులు, అన్నదాత సుఖీభవకు సంబంధించి ఒక్క దరఖాస్తు కూడా స్వీకరించకపోవడం ప్రభుత్వ పాలన తీరును తేటతెల్లం చేస్తోంది. బేస్తవారిపేట: గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించాల్సిన సేవల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. సుమారు 554 రకాల సేవలు అందిస్తున్న గ్రామ/వార్డు సచివాలయాలను కూటమి ప్రభుత్వం క్రమంగా దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్న తీరు అటు ప్రజల్లోనే కాకుండా ఇటు ఉద్యోగుల్లోనూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాలను ఎలాంటి పక్షపాతం, అవినీతికి తావులేకుండా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ అందజేయయుడమే లక్ష్యంగా 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 1058 గ్రామ/వార్డు సచివాలయాలు ఏర్పాటు కాగా జిల్లాల విభజన అనంతరం ప్రకాశంలో ప్రస్తుతం 716 సచివాయాలున్నాయి. మొత్తం 5 వేల మందికి పైగా ఉద్యోగులు సేవలందిస్తున్నారు. వీటిలో మూడొంతులకు పైగా భవనాలను ప్రభుత్వం సొంత నిధులు వెచ్చించి నిర్మించింది. ఒక్కో సచివాలయాన్ని రూ.45 లక్షలతో అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏ సంక్షేమ పథకం అమలు చేసినా సచివాలయ ఉద్యోగులతో పాటు వలంటీర్ల ద్వారా అందరికీ తెలియజేసి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరినీ లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. నాడు కళకళ.. నేడు వెలవెల తొమ్మిది నెలల క్రితం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే సచివాలయాల్లో సేవలకు గ్రహణం పట్టింది. సేవలను పూర్తిగా నీరుగార్చడంతో ప్రజలు తమ సమస్యలపై పొలోమంటూ మండల కేంద్రాల్లో అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. అక్కడా పరిష్కారం కాకుంటే వ్యయ ప్రయాసలకోర్చి ఆర్డీఓలు, జిల్లా కేంద్రానికి వెళ్లి తమ బాధలు చెప్పుకొని వినతి పత్రాలు ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో రోజూ సాయంత్రం 3 నుంచి 5 గంటల మధ్య నిర్వహించే స్పందన కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలకడమే ఈ దుస్థితికి కారణం. ప్రస్తుతానికి జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేయకపోయినా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అనధికారికంగా కూటమి నాయకులే చూస్తుండటంతో సచివాలయాలు వెలవెలబోతున్నాయి. ప్రభుత్వ కార్యకలాపాల్లో టీడీపీ, జనసేన నాయకుల మితిమీరిన జోక్యం కారణంగా అర్హులైన వారు అన్యాయానికి గురవుతుండగా.. కూటమి కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూరుతోంది. ఉపాధి హామీ నిధులతో సబ్సిడీపై అందించే పశుగ్రాసం యూనిట్లు, గోకులం షెడ్ల నిర్మాణం, బీసీ, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ రుణాల మంజూరు.. ఇలా ప్రతి పథకంలో నేరుగా కూటమి సానుభూతిపరునే లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇలాంటి పథకాలన్నీ సచివాలయాల ద్వారా పారదర్శకంగా జరిగేవని గ్రామాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కుల, ఆదాయ, ఫ్యామిలీ మెంబర్, బర్త్, డెత్ తదితర ధ్రువీకరణ పత్రాలకు సచివాయాల్లో దరఖాస్తు చేసుకున్నా మండల కేంద్రాల్లో అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోందని, లేదంటే ఆలస్యంగా ధ్రువీకరిస్తున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయాల సేవలకు మంగళం పాడిన కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల మంజూరుపై ఉద్యోగులను ప్రశ్నిస్తున్న జనం కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలైనా తెరుచుకోని వెబ్సైట్లు సర్వేల పేరుతో ఉద్యోగులను ఇంటింటికీ తరుముతున్న ప్రభుత్వం గతంలో వలంటీర్లతో సర్వే చేయించడాన్ని తప్పుబట్టిన చంద్రబాబు అండ్ కో ‘సర్వే’శ్వరా.. గత ప్రభుత్వంలో వలంటీర్లతో సర్వేలు చేయించడాన్ని తప్పుబట్టిన అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు.. తాను అధికారంలోకి వచ్చాక ప్లేటు ఫిరాయించారు. ఏకంగా సచివాలయ ఉద్యోగులను సర్వేల పేరుతో నిరంతరం తరుముతున్నారు. మొత్తం 15 రకాల ఇంటింటి సర్వేలతో సచివాలయాల ఉద్యోగులు కుస్తీలు పడుతున్నారు. ‘సర్వే చేస్తున్నాం.. ఓటీపీ చెప్పండి’ అని అడిగితే జనం చీదరించుకుంటున్నారని, తమకు కనీస గౌరవం లేకుండా పోతోందని ఉద్యోగులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. సెలవు రోజులతో సంబంధం లేకుండా సర్వేలు చేయాలని చెప్పడం, సర్వే పేరుతో టార్గెట్లు పెట్టడం, మరో వైపు మాతృశాఖల పనులు, బీఎల్ఓ విధులు ఇలా అన్ని రకాల పనులు పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి వరుసగా వస్తున్న ఆదేశాలతో సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. పని ఒత్తిడి తగ్గించాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. సర్వేల పేరుతో ఇతర శాఖల అధికారులు వేధిస్తున్నారని, పరిస్థితి మారకుంటే ధర్నా చేస్తామంటూ ఏఎన్ఎంలు రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి నోటీసులివ్వగా మిగిలిన శాఖల ఉద్యోగులు సైతం ఇదే బాటను అనుసరించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. -
వలసబాట
డిగ్రీ, ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు: 47,423 ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.218 కోట్లు యువత సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ఒంగోలు టౌన్: జిల్లాలో డిగ్రీ, ఇంజినీరింగ్, ఇతర చదువులు చదువుకుంటున్న విద్యార్థులు సుమారు 47,423 మంది ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీరికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంలేదు. దాంతో గత ఏడాదికి సంబంధించి రూ.110 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. కాలేజీ యాజమాన్యాలు మాత్రం ఫీజు రీయింబర్స్‌మెంటుతో మాకు సంబంధం లేదంటూ ముక్కుపిండి మరీ ఫీజులను వసూలు చేశారు. దాంతో వేలాది మంది విద్యార్థుల తలిదండ్రులు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కొంతమందైతే చదువులు మానేసి పనులకు వెళ్లడం మొదలుపెట్టారు. ఇక రెండో ఏడాదైనా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తారేమో అని ఎంతో మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూశారు. కానీ రెండో ఏడాది కూడా చంద్రబాబు ప్రభుత్వం సాకులు చెప్పి మొండిచేయి చూపింది. దీంతో కాలేజీ యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులపై ఒత్తిడి చేయడం మొదలు పెట్టాయి. నగరంలోని ఒక ఇంజినీరింగ్ కాలేజీలో ఫీజు చెల్లించలేదని ఒక విద్యార్థిని కాలేజీ బయట నిలబెట్టారు. బైపాస్ లో ఉన్న మరో డిగ్రీ కాలేజీ యాజమాన్యం ఫీజు కడితేనే పరీక్షలకు అనుమతిస్తాం, లేకుంటే లేదని బెదిరింపులకు దిగింది. హాల్ టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను నానా తిప్పలు పెట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో 2023–24 సంవత్సరానికి ఒక త్రైమాసికంలో మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించారు. మిగతా మూడు త్రైమాసికాలకు ఫీజులు చెల్లించలేదు. అలాగే 2024–25 విద్యాసంవత్సరానికి గాను మూడో సెమిస్టర్ గడుస్తున్నా నేటికీ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయలేదు. ఇప్పటి వరకూ జిల్లాకు సంబంధించి రూ.218 కోట్లు పెండింగులో ఉన్నాయి. రీయింబర్స్మెంట్ ఇస్తారో లేదో తెలియక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. నిరుద్యోగ భృతికి ఎగనామం: లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని, లేకపోతే ఉద్యోగం వచ్చే వరకు ఒక్కొక్కరికి రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో గొప్పలు చెప్పిన కూటమి నాయకులు అధికారం చేపట్టిన తరువాత ఆ మాటే మరిచిపోయారు. జిల్లాలో సుమారు 7.86 లక్షల యువకులు, 7.65 లక్షల మంది యువతులు ఉన్నారు. వీరిలో సుమారు 11 లక్షల మంది యువతీ యువకులు ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఉద్యోగాలు వచ్చే వరకు కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇస్తారేమో అని ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు నెలకు రూ.330 కోట్ల మేర నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన ఏడాదికి రూ.3,960 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకూ చిల్లిగవ్వకూడా ఇవ్వలేదు. అటు ఉద్యోగాలు ఇవ్వకుండా, చేయడానికి ఎలాంటి పనులు చూపకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ, పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థుల ఎదురుచూపు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ ఫైలు మీద తొలి సంతకం చేస్తామని చంద్రబాబు చెప్పిన మాట కూడా నీటి మూటలా మిగిలి పోయింది. జిల్లాలో బీఈడీ చేసిన సుమారు 8 వేల మంది అభ్యర్థులు డీఎస్సీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక కానిస్టేబుల్ పరీక్షలు రాసిన వారు 5 వేల మంది ఉన్నారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మార్కాపురం, ఒంగోలు మెడికల్ కాలేజీలు, జీజీహెచ్ ఆస్పత్రుల్లో వివిధ విభాగాలకు సంబంధించి 290 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ రావడంతో అప్పుడు ఉద్యోగాల నియామకాలు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ నోటిఫికేషన్ రద్దు చేసింది. ఆ ఉద్యోగాల కోసం అప్పట్లో 15 వేల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారి వద్ద నుంచి వసూలు చేసిన దరఖాస్తు ఫీజును వెనక్కి తిరిగి ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. వైఎస్స్రా్ సీపీ అధికారంలోకి వచ్చాక జిల్లా సుమారు ఆరు వేల మందికి సచివాలయ వ్యవస్థ ద్వారా శాశ్వత ఉద్యోగాలు కల్పించింది. వలంటీరు వ్యవస్థను ఏర్పాటు చేసి దాదాపు 12 వేల మందికి ఉపాధి కల్పించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక వలంటీరు శాఖకు మంత్రిని నియమించింది కానీ ఆ వ్యవస్థకు మంగళం పాడడం గమనార్హం.ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకున్నవారు: 23,448 మంది ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న చిరుద్యోగులు: 52,000 మంది 11 లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి నెలకు: రూ.330 కోట్లు సంవత్సరానికి: రూ.3,960 కోట్లు బీఈడీ అభ్యర్థులు: 8000 మంది కానిస్టేబుల్ పరీక్షరాసిన వారు: 5000 మంది ఉద్యోగం రాక కూలి పనులకు వెళ్తున్నాను నేను డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాలు రాక పొలం పనులకు వెళ్తున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పరిస్థితులు కనబడటం లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలి. – సుధా, అర్థవీడు మండలం జిల్లాలో నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. ఇళ్లు గడవడం కష్టమైపోవడంతో ఏ పని దొరికితే ఆ పనికి వెళుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చేయడానికి పనులు కూడా లేకపోవడంతో ఉపాధి హామీ కూలీలుగా పనులకు వెళుతున్నారు. అక్కడ కూడా రాజకీయాలు ప్రవేశించడంతో చేసేదేమీ లేక భవన నిర్మాణ కార్మికులుగా బెంగళూరు, హైదరాబాద్, చైన్నె నగరాలకు వలసపోతున్నారు. ప్రస్తుతం జిల్లాలో వివిధ పనులకు వెళుతున్న వారి సంఖ్య ఇలా ఉంది. ప్రైవేటు స్కూళ్లలో టీచర్లుగా, నాన్ టీచింగ్ పనులు చేస్తున్నవారు 7 వేలు, ప్రైవేటు కాలేజీలలో పనులు చేస్తున్న వారు 5 వేలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో కాంపౌండర్లుగా, నర్సులుగా పనులు చేస్తున్న వారు 10 వేలమంది, జుమాటో, స్విగ్గిలలో 3 వేల మంది, ఆటో డ్రైవర్లుగా 8 వేల మంది, పెట్రోలు బంకుల్లో బాయ్స్‌గా , అకౌంటెంట్లుగా 1500 మంది, షాపింగ్ మాల్స్‌లో సేల్స్ మెన్లు, సేల్స్ ఉమెన్లుగా 7 వేల మంది, చిన్న షాపింగ్ మాల్స్‌లో 5 వేల మంది, మెడికల్ రిప్రజెంటివ్స్ 500 మంది, కేటరింగ్ 3 వేల మంది, టెలీ కాలర్స్ 2 వేల మంది అసంఘటిత కార్మికులుగా పని చేస్తున్నారు. సుమారు 52 వేల మంది వచ్చే అరకొర వేతనాలతో బతుకుబండిని నెట్టుకొస్తున్నారు. దివ్యాంగులకు సైతం మొండిచేయి... జిల్లాలో వేలాది మంది దివ్యాంగులు చదువుకొని ఉద్యోగం కోసం వస్తుందన్న ఆశతో ఉన్నారు. వీరిలో కంటి చూపు లేని వారు 626 మంది, చెవిటి మూగ వారు 640 మంది, కాళ్లు చేతులు లేని వికలాంగులు 4,172 మంది ఉన్నారు. మొత్తం 5438 మంది దివ్యాంగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. వీరే కాకుండా 6,348 మంది మహిళలు, 7,184 మంది ఎస్సీలు, 1,511 మంది ఎస్టీలు, 6,620 మంది బీసీలు ఉన్నారు. నేటికి 23,448 మంది ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్‌లో రిజిస్టర్ చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. -
తొలగించిన భూముల పునఃపరిశీలన చేపట్టాలి
● సీసీఎల్ఏ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి ఒంగోలు సిటీ: నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల పునఃపరిశీలన పటిష్టంగా చేపట్టాలని సీసీఎల్ఏ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి ఆదేశించారు. అమరావతి నుంచి సీసీఎల్ఏ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ, నిషేధిత భూముల జాబితాలో నుంచి తొలగించిన భూములు చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయ్యాయా లేదా పూర్తి స్థాయిలో పరిశీలించాలన్నారు. ఒంగోలు కలెక్టరేట్ నుంచి ఈ వీడియో కాన్ఫెరెన్స్‌లో కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌష్ బాషా, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తల్లి బిడ్డలకు మేలు చేసే కంగారు కేర్ సెంటర్లు ఒంగోలు టౌన్: తల్లీ బిడ్డల ఆరోగ్యానికి కంగారు మదర్ కేర్ సెంటర్లు ఎంతో మేలు చేస్తాయని కమ్యూనిటీ ఎంపవర్మెంట్ చీఫ్ ఆఫీసర్ ట్రాయ్ చున్నిగం అన్నారు. మంగళవారం ఆయన సీఈబీ టీం సభ్యులతో కలిసి జీజీహెచ్‌లోని గైనికాలజీ, పీడియాట్రిక్, ఎస్ఎన్సీయూ, ప్రతిపాదిత కంగారు మదర్ కేర్ సెంటర్లను పరిశీలించారు. తొలుత సీఈబీ టీం సభ్యులు రీసెర్చ్ డైరక్టర్ వివేక్ సింగ్, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రావ్యలు సూపరింటెండెంట్ డాక్టర్ జమున, వివిధ విభాగాలకు చెందిన వైద్యులతో చర్చించారు. సీఈబీ పూర్తి స్థాయిలో సాంకేతిక సాయాన్ని అందజేస్తుందని చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జీజీహెచ్‌లో అన్నీ రకాల సౌకర్యాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ జమున టీం సభ్యులకు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డా.కిరణ్, డీసీహెచ్ఎస్ డా.సూరిబాబు, మదర్ కేర్ నోడల్ అధికారి డా.వేణుగోపాల్ రెడ్డి, హెచ్ఓడీలు సంధ్యారాణి, శివరామకృష్ణ, డా.తిరుమలరావు, నర్సింగ్ సూపరింటెండెంట్ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శనగలు, మినుములు కొనుగోలుకు అనుమతులు ● జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఒంగోలు సిటీ: శనగలు, మినుముల పంట ఉత్పత్తులను నాఫెడ్ ఆధ్వర్యంలో రైతుల వద్ద నుంచి శనగలు కనీస మద్దతు ధర రూ.5650, మినుములు కనీస మద్దతు ధర రూ.7400 లకు కొనుగోలు చేసేందుకు అనుమతులు వచ్చినట్లు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 23,023 మంది రైతులు 24,600 హెక్టార్లలో శనగల పంట సాగు చేసుకున్నట్లు ఈ క్రాప్‌లో నమోదు చేసుకున్నారు. దీనికి గాను 60,826 మెట్రిక్ టన్నుల పంట వస్తుందని వ్యవసాయ శాఖ ద్వారా అంచనా వేశారు. మినుములు 11,200 హెక్టార్లలో 12,540 మంది రైతులు ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్నారు. దీనికి గాను 14,489 మెట్రిక్ టన్నుల పంట వస్తుందని అంచనా వేశారు. రబీ 2024–25 లో శనగ, మినుముల పంటను ఈ క్రాప్‌లో నమోదు చేయించుకున్న రైతుల వద్దనుంచి పంట కొనుగోలు చేస్తారన్నారు. రైతులు ఈనెల 13వ తేదీ నుంచి రైతు సేవా కేంద్రాల్లో పంట వివరాలు, పంట నూర్పిడి తేదీని నమోదు చేయించుకోవాలని చెప్పారు. రైతు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ద్వారా అమ్ముకోవాలని సూచించారు. తమ సరుకును అమ్ముకొనే తేదీ రిజిస్టర్ మొబైల్ నంబరుకు మెసేజ్ వస్తుందని, రైతులకు తమ డబ్బులు ఆధార్ తో అనుసంధానం అయిన బ్యాంకు అకౌంట్ లో జమ చేస్తారన్నారు. రైతులు తమ సరుకును అమ్మే సమయంలో తమ మొబైల్ నంబరు, ఆధార్, బ్యాంక్ అకౌంట్ కు లింక్ అందో లేదో సరి చూసుకోవాలని తెలిపారు. రైతులు తమ పంటను శుభ్రపరుచుకొని, ఆరబెట్టుకొని శనగలు తేమ శాతం 14 శాతంలోపు, మినుములు తేమ 12 శాతం లోపు ఉండి ప్రభుత్వం సూచించిన నాణ్యతా ప్రమాణాల్లో ఉండేలా చూసుకోవాలన్నారు. -
‘యువత పోరు’ను జయప్రదం చేయండి
దర్శి (కురిచేడు): ఒంగోలులో బుధవారం జరిగే యువతపోరును జయప్రదం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి కోరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి కార్యకర్తలు, నాయకుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నగదు ప్రభుత్వం ఇవ్వకపోవటంతో అనేక మంది కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నారన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో విద్యా దీవెన, వసతి దీవెన కింద ఏటా స్కాలర్ షిప్ లు అందించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంత వరకు ఎటువంటి ఫీజులు చెల్లించలేదని విమర్శించారు. నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 9 నెలలు అయినా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా నిరుద్యోగ భృతి చెల్లించలేదని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దర్శి మండల అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, దర్శి పట్టణ అధ్యక్షుడు ముత్తినీడి సాంబయ్య, మండల పార్టీ అధ్యక్షులు కాకర్ల కృష్ణారెడ్డి, యన్నాబత్తుల వెంకట సుబ్బయ్య, చింతాశ్రీనివాసరెడ్డి, తూము వెంకట సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీలు పోశం మధుసూదనరెడ్డి, ఇత్తడిదేవదానం, జెడ్పీటీసీలు రత్నరాజు, నుసుం వెంకట నాగిరెడ్డి, మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి మేడికొండ జయంతి, జిల్లా యూత్ అధ్యక్షుడు జీ శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు యం దేవప్రసాద్, జిల్లా జనరల్ సెక్రటరీ సూదిదేవర అంజయ్య, ముండ్లమూరు ఎంపీపీ సుంకర సునీతా బ్రహ్మానందరెడ్డి, దర్శి నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షుడు బంకా నాగిరెడ్డి, బొమ్మిరెడ్డి లక్ష్మిరెడ్డి, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కొల్లా ఉదయ భాస్కర్ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి -
టీడీపీ కార్యకర్తలా ఏపీఎం!
● కోర్టు ఆదేశాలు బేఖాతరు ● వీఓఏలపై వైఎస్సార్ సీపీ ముద్రవేసి తొలగింపు ● కార్యాలయాన్ని ముట్టడించిన బాధితులు ముండ్లమూరు(కురిచేడు): కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తరువాత చిరుద్యోగులపై వేధింపులు మొదలయ్యాయి. ఎలాంటి తప్పులు లేకపోయినా కూటమి నాయకులు కక్షగట్టి మరీ తప్పిస్తున్నారు. మండలంలో వీఓఏల పై ఏపీఎం హనుమంతరావు ఒక టీడీపీ కార్యకర్తలా ప్రవర్తిస్తూ వేధిస్తున్నారని చిరుద్యోగులు వాపోతున్నారు. టీడీపీ ముఖ్యనేతల నుంచి తనపై ఒత్తిళ్లు ఉన్నాయని, ఉద్యోగాల నుంచి వైదొలగాలని వీఓఏలను బలవంతం చేయటంతో కొందరు తప్పుకున్నారు. మరికొందరు కోర్టును ఆశ్రయించారు. తాజాగా మండలంలోని చిన్న ఉల్లగల్లు గ్రామ సంఘం వీఓఏగా పనిచేస్తున్న తప్పెట కృపమ్మను ఏపీఎం హనుమంతరావు, సీసీ రత్నకుమారి విధులు నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని వారిపై కృపమ్మ హైకోర్టులో కేసు వేశారు. ఆమె విధులకు ఆటంకం కలిగించకూడదని కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. అయినా కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఆన్లైన్ నుంచి తన పేరును తొలగించినట్లు కృపమ్మ తెలిపింది. ఆమేరకు మంగళవారం వెలుగు కార్యాలయం ఎదుట నిరసన తెలిపింది. ప్రభుత్వం మారిందని నన్ను తొలగించారు ప్రభుత్వం మారిందని, టీడీపీ నాయకుల ఒత్తిళ్లు తనపై ఉన్నాయని నన్ను ఏపీఎం హనుమంతరావు, సీసీ రత్నకుమారి మానుకోవాలని నిత్యం ఒత్తిడి చేస్తున్నారు. వారి ఒత్తిడి తట్టుకోలేక హైకోర్టులో వారిపై కేసు వేసి ఇంజక్షను ఆర్డర్ తెచ్చుకున్నాను. అయినా కూడా రూ.20 వేలు ఇవ్వాలని, ఇస్తే ఉంచుతానని ఏపీఎం డిమాండ్ చేశారు. అవి ఇచ్చేందుకు నావద్ద లేవని చెప్పటంతో నాపేరు ఆన్లైన్ నుంచి తొలగించారు. కోర్టు ఆర్డరు తెచ్చుకున్నా మీరు ఉద్యోగం ఎలాచేస్తారో చూస్తానంటూ బెదిరిస్తున్నారు. కోర్టు ధిక్కారం కింద ఏపీఎం, సీసీపై కేసు నమోదు చేసి నాకు న్యాయం చేయండి. – తప్పెట కృపమ్మ, వీఓఏ మేము తొలగించలేదు కృపమ్మను ఉద్యోగం నుంచి తొలగించలేదు. 10వ తేదీ వరకు విధులు నిర్వహించింది. కోర్టు ఇంజక్షను ఆర్డర్ తెచ్చినా మేము ఏమీ అనలేదు. ఆ తరువాత కోర్టు ధిక్కరణ కింద మాపై మళ్లీ కోర్టుకి వెళ్లింది. అందువలన ఆమె లాగిన్ ఆన్లైన్లో ఇన్ యాక్టివ్ చేశాం. – ఏపీఎం హనుమంతరావు -
యువత పోరు ర్యాలీ విజయవంతం చేయండి
ఒంగోలు సిటీ: విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, యువతకు ఉద్యోగ కల్పన లేకుండా మోసగిస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 12న చేపట్టిన శ్రీయువత పోరుశ్రీ ర్యాలీని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కోరారు. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువత పోరు పోస్టర్‌ను జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ చుండూరి రవిబాబుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 12వ తేదీ నెల్లూరు బస్టాండ్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. యువత, విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. గత ప్రభుత్వంలో ఏ ఇబ్బందులు లేకుండా 99 శాతం ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన ఇచ్చారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల కింద గత ఆర్థిక సంవత్సరం, ప్రస్తుత సంవత్సరానికి కలిపి రూ.7800 కోట్లు బకాయిలు ఉంటే కేవలం రూ.700 కోట్లు మాత్రమే విడుదల చేశారన్నారు. ఇటీవల ప్రకటించిన బడ్జెట్లో కూడా సుమారు రూ.2 వేల కోట్లు మాత్రమే పెట్టారన్నారు. ఫీజులు కట్టడం లేదని కొంత మంది యాజమాన్యాలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు డ్రాప్‌అవుట్‌గా మిగిలిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వడమే కాక, ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో నిరుద్యోగభృతి ఒక్కొక్కరికీ రూ.3 వేలు ఇస్తామని ప్రకటించారు కానీ ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశచరిత్రలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని, అందులో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారని చెప్పారు. 12 మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో ఉండగా, చంద్రబాబు ఈ రాష్ట్రానికి మెడికల్ సీట్లు అవసరం లేదని సెంట్రల్ గవర్నమెంట్ కు లిఖిత పూర్వకంగా ఇచ్చారన్నారు. మార్కాపురం మెడికల్ కాలేజీ 75 శాతం పూర్తయిందన్నారు. మిగిలిన నిధులు విడుదల చేసి పూర్తిచేయాలని, మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేయకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన పది నెలల్లో రూ.లక్ష కోట్లు అప్పు చేశారని విమర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులను ఎన్నికల ముందు సంక్షేమ పథకాల అమలు కోసం కేటాయిస్తే, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.లక్ష కోట్లు అప్పులు చేసి కూడా ఒక్క సంక్షేమ పథకాన్నీ అమలు చేయలేదన్నారు. వెలుగొండపై చంద్రబాబు చెప్పేవన్నీ అసత్యాలే.. వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు చేసిన ప్రసంగాలన్నీ అసత్యాలేనని బూచేపల్లి ధ్వజమెత్తారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలోని రెండు టన్నెల్స్ పూర్తి చేశారన్నారు. మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే ఆర్ఆర్ ప్యాకేజీ ఇచ్చి వెలిగొండ ద్వారా నీళ్లిచ్చే వాళ్లమన్నారు. కానీ మార్కాపురం సభలో చంద్రబాబు చేసిన ప్రసంగం అంతా అబద్ధాల పుట్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్లో రూ.600 కోట్లు అని పెట్టారు కానీ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, వెలుగొండను నిర్వీర్యం చేశారన్నారు. చంద్రబాబు కేవలం ప్రాజెక్టుకు శంకుస్థాపన మాత్రమే చేశారని, ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పనులు ప్రారంభించి శరవేగంగా చేశారన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో వెలుగొండకు నిధులు కేటాయించి రెండు టెన్నెల్స్ పూర్తి చేశారని అన్నారు. చంద్రబాబు తొమ్మిది నెలల కాలంలో ఒక్క సెంటీమీటరు అన్నా పనులు చేశారా అని ప్రశ్నించారు. ప్రజల పక్షాన పోరాడేందుకే తాము ప్రతిపక్ష హోదా అడుగుతున్నామని, కానీ కూటమి ప్రభుత్వం జగన్‌కి ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ప్రభుత్వ వైఫల్యాలపై ఎక్కడ ప్రశ్నిస్తాడేమోనని భయంతో ఉన్నారని అన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు ఏ పనీ చేయొద్దని చంద్రబాబు చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కులం, మతం, పార్టీ చూడకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, మాజీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్ వై.ఎం ప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు దామరాజు క్రాంతికుమార్, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కర్నేటి ప్రసాద్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు శ్రీకాంత్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒంగోలులో ‘యువత పోరు’ ర్యాలీ రేపు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగాలిస్తామని, నిరుద్యోగ భృతిపై మోసగించిన చంద్రబాబు వెలుగొండపై బాబు చెప్పేవన్నీ అసత్యాలే వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి -
సబ్‌రిజిస్ట్రార్‌పై ఆగంతకుల దాడి
గిద్దలూరు రూరల్: గిద్దలూరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎన్.కృష్ణమోహన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన సోమవారం రాత్రి గిద్దలూరు పట్టణంలోని జువ్విళ్లబావి సమీపంలో సబ్ రిజిస్ట్రార్ ఇంటి వద్ద చోటుచేసుకుంది. ఇటీవల బదిలీపై గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్‌గా నియమితులైన కృష్ణమోహన్ తన సమీప బంధువుతో కలిసి జువ్విళ్ల బావి వద్ద ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ కుటుంబ సభ్యులు మాత్రం చీరాలలో నివాసం ఉంటున్నారు. సోమవారం రాత్రి ముఖానికి మాస్క్‌లు ధరించిన నలుగురు వ్యక్తులు సబ్ రిజిస్ట్రార్‌పై దాడికి తెగబడినట్లు సమాచారం. పిడిగుద్దులు కురిపించిన వెంటనే అక్కడ నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. దాడి అనంతరం తేరుకున్న సబ్‌రిజిస్ట్రార్ స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రాత్రి పొద్దుపోయే వరకు భూముల రిజిస్ట్రేషన్లు సాగుతున్నట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. డివైడర్‌ను ఢీకొట్టిన బైక్ ● ఒకరికి తీవ్ర గాయాలు కంభం: వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఒకిరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం రాత్రి అనంతపురం–అమరావతి హైవే రోడ్డుపై కంభంలో చోటుచేసుకుంది. వివరాలు.. యర్రగొండపాలేనికి చెందిన నలుగురు వ్యక్తులు రెండు బైకులపై వ్యక్తిగత పని నిమిత్తం నంద్యాల జిల్లా పాణ్యం వెళ్తున్నారు. ఈ క్రమంలో కంభం పట్టణంలోని హైవే రోడ్డుపై ఉన్న యూటర్న్ అర్థంగాక ఓ బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. బైక్‌పై నుంచి రోడ్డు మీద పడిపోయిన బి.వెంకటేశ్వర్లుకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బైకును ఢీకొట్టిన లారీ ● చర్చి పాస్టర్ మృతి అద్దంకి: బైకును లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఓ చర్చి పాస్టర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన అద్దంకి పట్టణంలోని బస్టాండు సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. అందిన వివరాల మేరకు.. మండలంలోని కలవకూరు గ్రామానికి చెందిన పాస్టర్ అత్తోటి బాలసుందరం(66) బైకుపై వ్యక్తిగత పని నిమిత్తం అద్దంకి వచ్చారు. బైకు బస్టాండ్ సమీపంలోకి రాగానే.. అద్దంకి నుంచి మేదరమెట్ల వైపుకు వెళ్తున్న లోడ్ లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన బాలసుందరం అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని ఎస్సై రవితేజ పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
కులం పేరుతో దూషిస్తూ అత్తింటివారి వేధింపులు
ఒంగోలు టౌన్: కులాంతర వివాహం చేసుకున్న ఒక దళిత మహిళను అత్తింటి వారు కులం పేరుతో దూషించడమే కాకుండా ఆస్తి ఇవ్వకుండా వేధిస్తున్నారన్న ఫిర్యాదుపై ఒంగోలు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం... నగరానికి చెందిన ఎస్సీ మహిళ సురేఖ బ్రాహ్మణ కులానికి చెందిన చంద్రశేఖర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. అనారోగ్యంతో చంద్రశేఖర్ 2023లో మరణించారు. అనంతరం ఆస్తి పంపకాల విషయమై అడిగితే అత్తింటివారు కులం పేరుతో దూషిస్తూ ఆస్తిలేదు.. పాస్తిలేదని తెగేసి చెబుతున్నారు. మూడు సంవత్సరాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గత నెల 26వ తేదీ సురేఖ చిన్న కూతురికి ఆరోగ్యం బాగలేకపోవడంతో చికిత్స చేయించేందుకు వైద్యశాల ఖర్చులు అడగటానికి అత్తవారింటికి వెళ్లగా, బయటకు నెట్టి వేసి కులం పేరుతో దూషించారు. దీనిపై వన్‌టౌన్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో గత ఆదివారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి ఆత్మహత్యాయత్నం రాచర్ల: కుటుంబ కలహాల నేపథ్యంలో రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని పోలీసులు సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన సంగపేట–జగ్గంబొట్లకృష్ణాపురం మధ్య రైల్వే ట్రాక్‌పై సోమవారం చోటు చేసుకుంది. అందిన సమాచారం మేరకు వివరాలు.. కంభం పట్టణానికి చెందిన కొప్పుల రమేష్‌కు రెండేళ్ల క్రితం వివాహమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని రైల్వే ట్రాక్‌పైకి చేరుకున్నాడు. ఈ విషయాన్ని తన సన్నిహితులకు తెలియజేశాడు. రమేష్ ఆత్మాహత్య చేసుకోబోతున్నాడని కంభం పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే ఫోన్ లొకేషన్ ట్రేస్ చేశారు. రాచర్ల పరిధిలో లొకేషన్ చూపించడంతో అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. ఫోన్ లొకేషన్ ఆధారంగా రాచర్ల ఎస్సై పి.కోటేశ్వరరావు సంగపేట–జగ్గంబొట్లకృష్ణాపురం రైల్వే ట్రాక్‌పైకి చేరుకుని యువకుడిని రక్షించారు. కౌన్సెలింగ్ అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. పట్టపగలే ఆటో చోరీ రాచర్ల: జనం సంచారం మెండుగా ఉన్న సమయంలో ఆటో చోరీకి గురైంది. ఈ సంఘటన మండల కేంద్రమైన రాచర్ల కస్తూర్బా బాలికల పాఠశాల సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. కంభం పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ శివశేఖర్ కుమార్తె రాచర్ల కస్తూర్బా బాలికల పాఠశాలలో చదువుతోంది. సోమవారం కుమార్తెను చూసేందుకు వచ్చిన శివశేఖర్ తన ఆటోను స్కూల్ బయట ఉంచి లోపలికి వెళ్లాడు. ఈ సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆటోను అపహరించారు. స్కూల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆటో కనపడకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రాచర్ల, అనుములపల్లె గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్‌ను ఎస్సై పి.కోటేశ్వరరావు పరిశీలించారు. ఆటోను చోరీ చేసిన నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఒంగోలు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు ప్రాణాలు కాపాడిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి పట్టివేత -
షిఫ్ట్ ఆపరేటర్‌పై లైన్‌మన్ దౌర్జన్యం
కొమరోలు: విద్యుత్ సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్‌పై లైన్‌మన్ తన అసిస్టెంట్‌తో కలిసి దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం కొమరోలు మండలం తాటిచెర్ల మోటు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. షిఫ్ట్ ఆపరేటర్ గుర్రాల చంద్రశేఖర్ కథనం మేరకు.. తాటిచెర్ల మోటు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో గత రెండేళ్ల నుంచి చంద్రశేఖర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనెల 6వ తేదీ గురువారం రాత్రి లైన్మెన్ డికోజీ నాయక్ అసిస్టెంట్‌గా ఉన్న నాగూర్ అనే వ్యక్తి పూటుగా మద్యం తాగి విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పడుకునేందుకు వెళ్లాడు. దీంతో శ్రీమద్యం తాగి ఉన్నావు.. ఇక్కడ పడుకోవద్దుశ్రీ అని షిఫ్ట్ ఆపరేటర్ నిరాకరించాడు. ఆ సమయంలో ఆపరేటర్‌ను తిడుతూ నాగూర్ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు. సోమవారం చంద్రశేఖర్ విధుల్లో ఉన్న సమయంలో లైన్‌మన్ డికోజీ నాయక్, అసిస్టెంట్ నాగూర్ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు చేరుకున్నారు. చంద్రశేఖర్‌పై దౌర్జన్యం చేసి దుర్భాషలాడటమే కాకుండా చేతులతో నెట్టి కొట్టారు. సబ్ స్టేషన్లో జరిగిన పరిణామాలపై విద్యుత్ శాఖ ఏఈకి చంద్రశేఖర్ ఫిర్యాదు చేశాడు. దీంతో విద్యుత్ లైన్‌మన్ డికోజీనాయక్, అసిస్టెంట్ నాగూర్ మళ్లీ సబ్ స్టేషన్ వద్దకు చేరుకుని ‘మాపైనే ఫిర్యాదు చేస్తావా, నీ సంగతి తేలుస్తాం, అంతు చూస్తాం’ అని బెదిరించారు. తనకు ప్రాణహాని ఉందని, రాత్రి వేళల్లో విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఒక్కడినే ఉంటానని, తనకు రక్షణ కల్పించాలంటూ సంబంధిత అధికారులను షిఫ్ట్ ఆపరేటర్ చంద్రశేఖర్ వేడుకుంటున్నాడు. సహాయకుడికి మద్దతుగా వచ్చి దాడి చేసిన వైనం తనకు రక్షణ కల్పించాలంటున్న షిఫ్ట్ ఆపరేటర్ చంద్రశేఖర్ -
అర్ధరాత్రి కరెంటు.. అన్నీ కష్టాలే..
కురిచేడు మండలం కాటంవారిపల్లె గ్రామానికి చెందిన నుసుం నాగిరెడ్డి 5 ఎకరాల్లో మిరపపంట సాగు చేశాడు. ఎకరానికి సుమారు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాడు. 9 గంటలు కరెంటు ఇస్తామని చెప్పి 7 గంటలు ఇస్తున్నారు. మిగతా 2 గంటలు రాత్రి 10–12 వరకు ఇస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఆపిన కరెంటు రాత్రి 10 గంటలకు ఇచ్చే సరికి ఎండకు ఉదయం పెట్టిన నీరు ఇంకిపోతున్నాయి. సరిపడా నీళ్లు అందక పోవడంతో పంటలు ఎండిపోతున్నట్టుగా తయారవుతున్నాయి. పైగా తెల్లవారు జామున 4 గంటలకు కరెంటు ఇస్తుండడంతో మూడు గంటలకు లేచి పొలం వెళ్లాల్సి వస్తోంది. అర్ధరాత్రి పొలంలో విషసర్పాలు తిరుగుతుంటాయి. ఏ టైంలో ఏం జరుగుతుందోననే భయంగా..భయంగా పొలానికి వెళ్లాల్సి వస్తోంది. రాత్రి పూట అనేసరికి కూలీలకు రెట్టింపు రేట్లు చెల్లించాల్సి వస్తోంది. 11 గంటలకు కరెంటు ఆగిపోతే పగలంతా పనులు చేసుకుని, మళ్లీ రాత్రిపూట రోజూ నిద్రకాయటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటోందని నాగిరెడ్డి వాపోతున్నాడు. ప్రభుత్వ చర్యలతో అన్ని విధాలా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వేళాపాళాలేని కోతలతో ఇబ్బంది పడుతున్నాం.. నేను 27 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశాను. పొగాకు 7 ఎకరాలు, నిమ్మ 4 ఎకరాలు, బొబ్బర్లు 6 ఎకరాలు, మినుము 4 ఎకరాలు, కంది 6 ఎకరాల్లో సాగు చేశాను. వ్యవసాయానికి ఉదయం 8:00 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పగటిపూట తొమ్మిది గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలి. అప్పుడే రైతులు తమ పొలాల్లో నీరు పెట్టుకుంటారు. ఇటీవల కాలంలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయి. రాత్రిపూట సరఫరా చేయటం వల్ల నీరు పెట్టుకోవటం ఇబ్బందిగా ఉంది. కరెంట్ కోతలతో సరఫరా ఇలా కొనసాగితే పొగాకు, నిమ్మ పంటలు దెబ్బతింటాయి. – రామాంజనేయ రెడ్డి, రైతు, పొదిలి మండలం బట్టువారిపల్లి రాత్రి పూట జాగారం.. గత ఏడాది మిర్చి 5 ఎకరాలు సాగు చేశాను. మాది వర్షాధారం. బోర్ ద్వారా పైరుకు నీటి తడి ఇస్తాను. అయితే పగటి పూట విద్యుత్ ఒక్కొక్క సారి నిరంతరం 9 గంటలు ఇవ్వడం లేదు. ఇలా ఇవ్వని రోజు రాత్రి పూట ఇస్తారు. దీంతో రాత్రి పూట పొలాలకు వెళ్లి నీటి తడులు పెట్టుకుంటూ జాగారం చేస్తాను. మేము కోరేది ఒకటే..రోజూ ఎటువంటి అంతరాయం లేకుండా పగటి పూట 9 గంటల విద్యుత్ ఇవ్వాలి. – ఎన్.వెంకటేశ్వర్లు, రైతు, కొనకనమిట్ల మండలం గొట్లగట్టు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా వ్యాప్తంగా 2,36,866 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ సీపీడీసీఎల్) ఎలాంటి ప్రకటనలు చేయకుండానే అనధికారిక కోతలకు శ్రీకారం చుట్టాయి. జిల్లాలో 680 వ్యవసాయ విద్యుత్ ఫీడర్లు ఉన్నాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాను ఏ, బీ గ్రేడులుగా విభజించించారు. ఏ గ్రేడులో ఉదయం గం.8.45 నుంచి సాయంత్రం గం.5.45 వరకు నిరంతరాయంగా ఇస్తున్నామని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. బీ గ్రేడ్‌లో ఉదయం గం.9 నుంచి సాయంత్రం గం.6 వరకు సరఫరా చేస్తున్నామని అంటున్నారు. వాస్తవానికి విరుద్ధంగా.... జిల్లాలో ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో అన్నిరకాల పంటలకు బోర్లే ఆధారం. అందుకు విద్యుత్ సరఫరా సక్రమంగా ఉంటేనే పంటలు పండుతాయి. పగటిపూట వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. మరో వైపు భూగర్భ జలాలు అడుగంటి పోతుండడం అన్నదాతను ఆందోళనకు గురిచేస్తోంది. ఉన్న నీటినైనా ఉపయోగించుకొని సాగు చేసిన పంటలను పండించుకుందామంటే విద్యుత్ అంతరాయం పెద్ద సమస్యగా మారింది. పగటి పూట నిరంతరాయం అని చెప్పి విడతల వారీగా ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రాత్రింబవళ్లు అన్న తేడాలేకుండా సరఫరా ఇవ్వటంతో రాత్రి వేళల్లో కూడా రైతులు పొలాల్లో పంటలు తడుపుకోవటానికి పడిగాపులు కాయాల్సి వస్తోంది. పశ్చిమ ప్రకాశంలోని మండలాలతో పాటు జిల్లాలోని అన్ని మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. రోజులో రెండు మూడు దఫాలుగా కరెంటు ఇస్తుండడంతో పంటలు సక్రమంగా తడవక రైతులు విలవిల్లాడుతున్నారు. మెట్టకు బోర్లే ఆధారం.. పశ్చిమ ప్రకాశంలోని మండలాల్లో ఎక్కువ శాతం రైతులు ప్రధానంగా మిర్చి, శనగ, జొన్న, మొక్కజొన్న, సజ్జ, కందులు, మినుము, పెసర, నువ్వు, ఆవాలు, మామిడి, నిమ్మ, సపోట, బత్తాయి, సన్‌ఫ్లవర్, వేరుశనగ, పొగాకు, పత్తితో పాటు అనేక రకాల పంటలు సాగుచేస్తున్నారు. అన్ని రకాల పంటలకు వ్యవసాయ విద్యుత్ మోటార్ల ద్వారా అందించే బోరు నీరే ఆధారం. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోతే కీలక దశలో నీటి ఎద్దడి ఏర్పడి ఆయా పంట దిగుబడులపై ప్రభావం పడుతుందని రైతులు వాపోతున్నారు. విద్యుత్ సరఫరా సక్రమంగా చేస్తున్నామని అధికారులు చెబుతుండగా .. 7 గంటలు కూడా సక్రమంగా ఇవ్వటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అదేమని అడిగితే లోడ్ రిలీఫ్ (ఎల్ ఆర్) ఇచ్చామంటూ విద్యుత్ అధికారులు, సిబ్బంది చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో మెయిన్ సప్లై పోయిందని, ఎప్పుడొస్తుందో చెప్పలేమనే సమాధానం ఇస్తున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. ఇలా ప్రతి రోజూ రెండు గంటలకు పైగా అనధికారికంగా విద్యుత్ కోత విధిస్తున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మార్చి నెల దాటితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. కనీసం 5 గంటల సరఫరా కూడా సక్రమంగా అందుతుందో లేదోననే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ కోతలకే పరిమితమైన కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి అనధికారికంగా రెండు గంటలు కోత బోర్ల ద్వారా పంటలకు నీరు అందక మాడిపోతున్న వైనం ప్రస్తుతం రాత్రింబవళ్లు తేడా లేకుండా ఇవ్వడంతో అవస్థలు రాత్రి వేళల్లో పొలాల్లో కాపలా కాస్తున్న రైతన్నలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నిరంతరాయంగా తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా -
బాబు పాలనలో అడుగడుగునా వంచనే..
మద్దిపాడు: ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనలో మోసం, వంచనలే ఉంటాయని మాజీ మంత్రి, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున అన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన సోమవారం కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. యువతకు లక్షలాది ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఉద్యోగం లేని యువకులకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని మోసపూరితమైన వాగ్దానాలు చేశారని, పదవి వచ్చిన తర్వాత ఆ హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి వసతి దీవెనకు సంబంధించి రూ.4600 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా ఇంతవరకు దాని ఊసే ఎత్తడం లేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే అందులో ఐదు కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమైన దశలో మొత్తం మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడానికి చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను రద్దు చేయొద్దని, పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించడానికి కళాశాలలను ప్రభుత్వమే నడిపించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి వంటి పథకాలను పూర్తిగా ఎత్తివేయడానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు రైతులు మద్దతు ధర లేక విలవిలాడిపోతున్నారన్నారు. మిర్చి పంట వేసిన రైతులకు గతంలో క్వింటా రూ.28 వేల వరకు ధర వస్తే ప్రస్తుతం చంద్రబాబు ధర విషయంలో కేంద్రం రూ.11 వేలు ఇస్తుంది అని చెప్పి తప్పుకున్నారన్నారు. పత్తి, వరి రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. రైతులు, విద్యార్థులు, యువకులు ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 12న శ్రీయువత పోరు’ కార్యక్రమం చేపట్టామని, యువతకు సంబంధించిన పలు విషయాలపై కలెక్టర్‌కు మెమొరాండం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ తరలిరావాలని, సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లేలా కార్యక్రమం నిర్వహించుకోవాలని కోరారు. ముందుగా ఆయన ‘యువత పోరు’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షులు దుంపా చెంచిరెడ్డి, పోలవరపు శ్రీమన్నారాయణ, మద్దిపాడు మండల పార్టీ కార్యదర్శి వాక కోటిరెడ్డి, పైనం ప్రభాకర్, పైడిపాటి వెంకట్రావు, నాదెండ్ల నాదెండ్ల మహేష్, రామాంజనేయులు, పల్లపాటి అన్వేష్ ,దుడ్డు వినోద్, సురేష్, సుబ్బారావు, అనిల్ శ్రీనివాసరావు, పాల్గొన్నారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున -
సబ్సిడీ పనిముట్ల పేరుతో రైతులకు మోసం
ఒంగోలు టౌన్: సబ్సిడీ పనిముట్లు ఇప్పిస్తానంటూ దర్శికి చెందిన ఒక మోసగాడు రైతులను నిండా ముంచాడు. దర్శి ప్రాంతానికి చెందిన పలువురు రైతులకు మాయమాటలు చెప్పి 16.82 లక్షల రూపాయలు వసూలు చేశాడు. రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పనిముట్లు ఇప్పించకపోవడంతో రైతులు సదరు వ్యక్తి వద్దకు వెళ్లి నిలదీశారు. అయినప్పటికీ అతడు లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా జవాబు ఇవ్వడంతో మోసపోయినట్లు గమనించిన రైతులు సోమవారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి వివరాలు తెలుసుకున్న పోలీసు అధికారులు చట్టపరంగా విచారించి తగిన చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. మరో ఘటనకు సంబంధించి.. ఒంగోలుకు చెందిన ఒక యువకుడికి కరెంటు ఆఫీసులో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నగరానికి చెందిన వ్యక్తి మోసానికి పాల్పడ్డాడని బాధితులు ఫిర్యాదు చేశారు. కరెంటు ఆఫీసులో ఉద్యోగం పేరుతో 6 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలిపారు. ఉద్యోగం రాకపోవడంతో తమ వద్ద తీసుకున్న డబ్బు తిరిగివ్వమని అడిగితే ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరిస్తున్నాడని బాధితులు వాపోయారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి 77 ఫిర్యాదులు వచ్చాయి. అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, సీసీఎస్ సీఐ జగదీష్, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి ఆయా సమస్యలపై సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సైలు షేక్ రజియా సుల్తానా, ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పోలీసులకు బాధితుల ఫిర్యాదు -
కన్నీళ్లు పెట్టిస్తూ..!
కోతలు కోస్తూ.. గతం.. ఘనం వ్యవసాయానికి పగటి పూటే నిరంతరాయంగా 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టింది. అభివృద్ధి పనులకు నాంది పలికింది. విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి శ్రీకారం చుట్టింది. అప్పటికి ఉన్న ఫీడర్ల సామర్థ్యం సరిపోదని భావించి, ట్రాన్స్మిషన్ కెపాసిటీ అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా రూ.850 కోట్ల వ్యయంతో 35 కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి నాంది పలికింది. సబ్ స్టేషన్లు, ట్రానన్స్ ఫార్మర్లు, వ్యవసాయ ఫీడర్లను సిద్ధం చేసింది. నూతనంగా 1750 కిలో మీటర్ల మేర విద్యుత్ లైన్లు వేసింది. నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా వ్యవసాయానికి అందజేసింది. విద్యుత్ ఉపకేంద్రాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి నిర్మాణాలు పూర్తయి, సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి. వీటిలో కొన్నింటిని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వినియోగంలోకి తెచ్చింది. కళ్ల ఎదుటే రెక్కల కష్టం చెదిరిపోతుంటే .. కరెంటు రూపంలో పంటలు ఎండుతుంటే..అన్నదాత గుండె మండుతోంది. తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాపై మాట తప్పిన కూటమి సర్కార్‌పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా కోతలు విధిస్తూ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రస్తుతం జిల్లాలో ఏడు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోంది. అది కూడా వేళాపాళా లేకుండా ఇష్టారాజ్యంగా కరెంటు ఇస్తుండడంతో రైతుల బాధలు వర్ణనాతీతం. ఒకవైపు అడుగంటుతున్న భూగర్భ జలాలు.. మరో వైపు విద్యుత్ కోతలు వారిపాలిట శాపంగా మారాయి. -
పొగాకు వేలం ప్రారంభం
ఒంగోలు సబర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సోమవారం నుంచి పొగాకు వేలం ప్రారంభమైంది. ఒంగోలు నగర పరిధిలోని పేర్నమిట్టలో ఉన్న ఒంగోలు–1 వేలం కేంద్రంతో పాటు కొండపి, పొదిలి వేలం కేంద్రాల్లో ప్రారంభించారు. నెల్లూరు జిల్లా కందుకూరు వేలం కేంద్రంలో కూడా ప్రారంభమైంది. మిగతా ప్రకాశం జిల్లాలోని 5 వేలం కేంద్రాలు, నెల్లూరు జిల్లాలోని 2 వేలం కేంద్రాల్లో ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. అయితే మొదటి రోజు నాలుగు వేలం కేంద్రాల్లో కలిపి 81 బేళ్లు వ్యాపారులు కొనుగోలు చేశారు. వేలంలో 15 పొగాకు కంపెనీలు పాల్గొన్నాయి. అన్ని వేలం కేంద్రాల్లో అత్యధికంగా కిలో పొగాకు ధర రూ.280, అత్యల్ప ధర రూ.278 పలికింది. పొగాకు వేలం కేంద్రాన్ని ప్రారంభించిన బోర్డు ఈడీ శ్రీధర్ బాబు సంతనూతలపాడు: మండలంలోని పేర్నమిట్టలో ఉన్న ఒంగోలు 1వ పొగాకు వేలం కేంద్రాన్ని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. తొలిరోజు కిలో గరిష్ట ధర రూ.280 పలికింది. మొదట వేలం కేంద్రంలో జరిగిన ప్రారంభ పూజల్లో ఆయన పాల్గొని చిలంకూరుకు చెందిన 18 పొగాకు బేళ్లను మొదటి రోజు వేలానికి అనుమతించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పొగాకుకు డిమాండ్‌ను బట్టి ధరలు వస్తాయన్నారు. కరోనా కాలంలో అంతర్జాతీయంగా పలు దేశాల్లో పొగాకు ఉత్పత్తి లేక గత ఏడాది మంచి ధరలు లభించాయన్నారు. ఈ ఏడాది అంతర్జాతీయంగా పలు దేశాల్లో పొగాకు ఉత్పత్తి చేశారన్నారు. ఈ ఏడాది పొగాకుకు ఖర్చులు పెరిగిపోయాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని పొగాకు బయ్యర్స్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఈ ఏడాది కూడా పొగాకుకు తగు మేరకు ధరలు లభిస్తాయని పేర్కొన్నారు. పొగాకు వేలాన్ని ఆక్షన్ సూపరింటెండెంట్ ఎం.రవికాంత్ పర్యవేక్షించారు. రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రైతు సంక్షేమ భవన్, పొగాకు బోర్డు కార్యాలయాలకు ఈడీ శంకుస్థాపన చేశారు. రైతు కమిటీ ఆధ్వర్యంలో ఈడీ అద్దంకి శ్రీధర్ బాబును రైతు కమిటీ నాయకులు ఆళ్ల సుబ్బారావు, ఫ్లోర్ కమిటీ అధ్యక్షుడు సూరం గురువారెడ్డి, తదితరులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్ ఎం లక్ష్మణరావు, పొగాకు బోర్డు డైరెక్టర్ పొద వరప్రసాదరావు, మాజీ డైరెక్టర్ పి.బద్రిరెడ్డి, ఐటీసీ లీఫ్ మేనేజర్ శివకుమార్, జీపీఐ ప్రతినిధులు ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డి, ఒంగోలు 1, 2 వేలం కేంద్రాల రైతు కమిటీ అధ్యక్షులు ఎస్ గురువారెడ్డి, వి ప్రసాద్, రైతు కమిటీ నాయకులు ఆళ్ల సుబ్బారావు, వడ్డం పూడి వెంకటేశ్వరరావు, జి సుబ్రమణ్యం, లింగంగుంట వెంకటేశ్వర్లు, మేకల కృష్ణారెడ్డి, ఎం వెంకటనారాయణ, కరిచేటి సుబ్బారావు, ఎన్ మస్తాన్ రెడ్డి, ఆళ్ల రవి, వరహాల చౌదరి, బోర్డు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 4 వేలం కేంద్రాల్లో మొదలు మిగతా ఏడు కేంద్రాల్లో ఈ నెల 19 నుంచి ప్రారంభం కిలో అత్యధిక ధర రూ.280, అత్యల్పం రూ.278 -
మాదిగలను మరోసారి వంచనకు గురిచేయొద్దు
● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య ఒంగోలు టౌన్: జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ అమలు చేయనున్నట్లు చెప్పడమంటే మరోసారి మాదిగలను వంచనకు గురి చేయడమేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జనాభా దామాషా ప్రకారం వర్గీకరణకు కట్టుబడిన చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్‌లో నేడు జిల్లా యూనిట్‌గా వర్గీకరణ చేస్తామని చెప్పడం అన్యాయం అన్నారు. స్థానిక అంబేడ్కర్ భవన్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరి మెప్పు కోసం నేడు జిల్లా యూనిట్ గురించి మాట్లాడుతున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలని నిలదీశారు. ఎస్సీ వర్గీకరణ కోసం గతంలో వేసిన కమిషన్లన్నీ జనాభా దామాషా ప్రకారమే చేయాలని నివేదికలు ఇచ్చాయని గుర్తు చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీల జనాభా 84,45,400 మంది ఉన్నారని, వారిలో మాలలు 40,43,101 మంది ఉండగా, మాదిగలు 34,68,967 మంది ఉన్నారని, ఉప కులాలు 9,33,332 మంది ఉన్నారని వివరించారు. ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం మాలలకు 7 శాతం, మాదిగలకు 6 శాతం, ఉప కులాలకు 2 శాతం వర్తిస్తుందన్నారు. విభజిత ఏపీలో మాదిగల కంటే మాలలు ఎక్కువగా ఉన్నందున వారికి దక్కాల్సిన వాటా దక్కడం ధర్మమేనని చెప్పారు. అలాగే మాదిగలకు కూడా న్యాయబద్ధంగా వాటా అందించాలని డిమాండ్ చేశారు. అందుకు భిన్నంగా జిల్లా యూనిట్‌గా వర్గీకరణ అమలు చేస్తే మాల మాదిగలతో పాటుగా సంచార జాతులకు కూడా అన్యాయం జరుగుతుందన్నారు. సమావేశంలో జిల్లా నాయకులు ఆలూరి చిరంజీవి, రేణమాల మాధవ, గౌడిపేరు కృష్ణ, జి.మహేష్, ముట్లూరి మోజేష్, ఏ.ప్రకాశం పాల్గొన్నారు. -
కోర్టు క్యాలెండరు ఆవిష్కరణ
ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబులు కోర్టు క్యాలెండరును సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ఒంగోలు నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు ధర్నాసి హరిబాబు, ఒంగోలు నియోజకవర్గ సమాచారహక్కు వింగ్ అధ్యక్షుడు కె.శేషాద్రిరెడ్డి, ఇతర లీగల్ సెల్ సభ్యులు కాటుకూరి బాబురావు, కాటుకూరి సంపత్, ఎస్.పి.జయచంద్రనాయక్, గాయం సావిత్రి, నీలం పద్మలత, తోట రాగసుధారాణి, నాగమల్లేశ్వరరెడ్డి, గంగవరపు ప్రవీణ్‌కుమార్, కె.స్వామిరెడ్డి, తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. -
అర్జీలు త్వరగా పరిష్కరించాలి
ఒంగోలు సిటీ: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలను అధికారులు త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్లోని మీ కోసం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఇతర అధికారులు పాల్గొని ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతగా పనిచేయాలన్నారు. ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానమిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందన్నారు. అర్జీలు రీ ఓపెన్ అయితే వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందన్నారు. మొత్తం 237 అర్జీలు రాగా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అధికారులకు కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదే శం -
ఎన్ని కాన్పులైనా ప్రసూతి సెలవులిస్తాం
మార్కాపురం/తర్లుపాడు: ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఇకపై ఎన్ని కాన్పులైనా ప్రసూతి సెలవులు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గతంలో తానే జనాభా నియంత్రణ పాటించాలని చెప్పానని, అయితే భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రంలో జనాభా పెరగాల్సిన అవసరం ఉందని.. ఈ నేపథ్యంలో ఎంతమంది పిల్లలను కన్నా మహిళా ఉద్యోగుల ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు బదులిచ్చారు. ఆయన ఏమన్నారంటే.. మహిళలను లక్షాధికారులుగా మారుస్తా. ఈ ఏడాదిలో లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను.రాష్ట్రంలో వంద మంది మహిళా పారిశ్రామికవేత్తలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి. పాతికేళ్ల క్రితం నేను డ్వాక్రా గ్రూపులను తయారుచేస్తే అందరూ విమర్శించారు. కానీ, ఇప్పుడు వారు రాజకీయ, ఆర్థిక శక్తిగా మారడం ఎంతో సంతోషంగా ఉంది. మహిళా దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వం 21 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. డ్వాక్రా మహిళలు తయారుచేసిన ఉత్పత్తులకు ప్రపంచస్థాయి గుర్తింపు, మార్కెటింగ్ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. పరిశ్రమలు స్థాపించే మహిళలకు 45 శాతం రాయితీ కల్పించి ప్రోత్సహిస్తాం.ఈరోజున రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు రూ.లక్ష కోట్ల అప్పు తీసుకునే స్థాయికి వచ్చాయి. మహిళల కోసమే ర్యాపిడో, అరకు కాఫీ, ఫ్లిప్‌కార్ట్ వంటిసంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. ప్రతి మేజర్ పంచాయతీలో అరకు కాఫీ కేంద్రాన్ని మహిళలు ఏర్పాటుచేయాలి. టెక్నాలజీని ఉపయోగించుకుని వర్క్ ఫ్రం హోం ద్వారా మహిళలు రాణించాలి. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఈ ఏడాది నుంచి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం వర్తింపజేస్తాం. మే నుంచి అన్నదాత సుఖీభవ పథకాలను అమలుచేస్తాం. ప్రపంచంలో ఉండే ప్రముఖ కంపెనీలు, వ్యక్తులను మన రాష్ట్రానికి తీసుకొస్తా. ఈ రోజున డ్వాక్రా మహిళలకు రూ.1,826.43 కోట్ల రుణాలు అందిస్తున్నాం. డ్వాక్రా మహిళలు సొంత ఊరిలోనే ఉండి వ్యాపారాలు చేయాలి. టీవీల్లో, బయట, సోషల్ మీడియాల్లో మహిళల గురించి ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే క్షమించేది లేదు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిరోధానికి ఈగల్ వ్యవస్థను ఏర్పాటుచేశాం. దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు అందిస్తున్నాం. వెలిగొండకు గోదావరి, కృష్ణా నీళ్లు పారిస్తా.. ఈ సమావేశంలో ఒక మహిళ, విద్యారి్థని అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు బదులిస్తూ.. తానే వెలిగొండకు శంకుస్థాపన చేశానని, తానే పూర్తిచేసి గోదావరి, కృష్ణా జలాలను వెలుగొండ ద్వారా ఈ ప్రాంతానికి పారిస్తానని చెప్పారు. అలాగే, బనకచర్ల–గోదావరి ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని తరలిస్తామన్నారు. త్వరలో మార్కాపురం జిల్లాను ఏర్పాటుచేస్తానని, అప్పుడు ఈ ప్రాంత సమస్యలు తీరతాయని ఆయన చెప్పారు. మహిళా లబ్ధిదారులకు చంద్రబాబు ఈ–ఆటోలు, బైక్‌లు అందించారు. మహిళలు, పిల్లల రక్షణకు సంబంధించిన శక్తియాప్‌ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఐజీపీ రాజకుమారి, ఎస్పీ దామోదర్ల సమక్షంలో సీఎం ప్రారంభించారు. ఎమ్మెల్యే పనితీరు ఆశాజనకంగా లేదు.. అనంతరం టీడీపీ కార్యకర్తలతో జరిగిన ముఖాముఖిలో చంద్రబాబు మాట్లాడుతూ ఇక్కడి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పనితీరు ఆశాజనకంగాలేదన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి అండగా ఉంటానన్నారు. ఇక మహిళా దినోత్సవం రోజున జరుగుతున్న ఈ సమావేశంలో 50 శాతం మహిళలు ఉండాల్సి ఉండగా, కేవలం ఒక్క శాతమే ఉన్నారంటే పరిస్థితిని ఏవిధంగా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. సామాజికంగా, రాజకీయంగా ఓటు బ్యాంకు పెంచే బాధ్యత తనదని తెలిపారు. ఇదిలా ఉంటే.. సీఎం బందోబస్తుకు వచ్చిన పోలీసులు ఎండ వేడికి తట్టుకోలేకపోయారు. ఒంగోలు ఏఆర్ కానిస్టేబుల్ రమణయ్య స్పృహతప్పి పడిపోయారు. -
కంభంలో వ్యక్తి అనుమానాస్పద మృతి
కంభం: స్థానిక తర్లుపాడు రోడ్డులోని రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న ప్లాట్లలో సుమారు 50 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతుడిని కందులాపురం కాలనీకి చెందిన శ్రీనుగా గుర్తించారు. మృతుడు హోటళ్లలో పనిచేసుకుంటూ ఖాళీ సమయంలో ప్లాస్టిక్ బాటిల్స్ సేకరించి విక్రయించుకుంటూ జీవనం సాగిస్తుంటాడని తెలిసింది. మృతుడు వడదెబ్బతో మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి వివాహం కాలేదు. అసలు అక్కడికి ఎందుకు వెళ్లాడు? మృతికి గల కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. పెట్రోల్ దాడిలో గాయపడిన మహిళ మృతి పెద్దదోర్నాల: స్థలం విషయమై దాయాదుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆరోగ్య పరిస్థితి విషమించి ఆస్పత్రిలో మృతి చెందింది. పెద్దదోర్నాల మండలం బొమ్మలాపురం పంచాయతీలోని తూర్పుపల్లెలో శుక్రవారం వేకువజామున చలిమంట వద్ద ఉన్న నాగూరువలి, నూర్జహాన్బీపై దాయాదులైన దూదేకుల ఖాశింవలి, అతని కుటుంబ సభ్యులు పెట్రోల్ క్యాన్లతో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన నాగూర్వలి మృతి చెందగా, నూర్జహాన్బీ శుక్రవారం అర్ధరాత్రి ఒంగోలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించింది. ప్రత్యర్థులు జరిపిన పెట్రోల్ దాడిలో 80 శాతం కాలిన గాయాలైన నూర్జహాన్ను చికిత్స నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. ప్రథమ చికిత్స చేస్తున్న క్రమంలో ఆమె పరిస్థితి విషమించి మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. సెంటున్నర స్థలం విషయమై దాయాదుల పిల్లల మధ్య జరిగిన గొడవల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. -
ఆత్మస్తుతి..పరనింద
32/18ప్రకాశం7గరిష్టం/కనిష్టందొడ్డుబియ్యం తినలేకపోతున్నాం.. రోజూ దొడ్డుబియ్యం అన్నం పెడుతున్నారు. అది తినలేకపోతున్నామని కనిగిరి బీసీ గురుకుల విద్యార్థులు మంత్రులు సవిత, ఆనం ఎదుట మొరపెట్టుకున్నారు. జగనన్న పాలనలో మహిళలకు సమాన అవకాశాలు వైఎస్ జగన్ పాలనలో మహిళలకు సంక్షేమ పథకాలు అందాయని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. పొగమంచు కురుస్తుంది. రాత్రి చలిగాలులు వీస్తాయి. – 8లో.. ఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025 -
జగనన్న పాలనలో మహిళలకు సమాన అవకాశాలు
చీమకుర్తి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనా కాలంలో సంక్షేమ పథకాలు, పార్టీ పదవుల్లో 50 శాతం మహిళలకే కట్టబెట్టారని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం చీమకుర్తిలోని బీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో కాలేజీ మహిళా లెక్చరర్లు, సిబ్బంది ఆధ్వర్యంలో బూచేపల్లి వెంకాయమ్మను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ.. మహిళల రక్షణకు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశ యాప్‌ను తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని కాలేజీ విద్యార్థినులతో కలిసి ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ -
జగన్ హయాంలో మహిళలకు స్వర్ణయుగం
ఒంగోలు సిటీ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన రాష్ట్రంలోని మహిళలకు ఒక స్వర్ణయుగంగా మిగిలిపోతుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. ఒంగోలులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో మహిళల సంక్షేమం కొనసాగిందన్నారు. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతిదీవెన, వైఎస్సార్ చేయూత, తదితర పథకాల పేరుతో మహిళల బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు జమ చేశారని చెప్పారు. ప్రభుత్వ పథకాలన్నింటిలో మహిళలకు భాగస్వామ్యం కల్పించారని, పరిపాలనలో పెద్దపీట వేశారన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారి ఓ దళిత మహిళలకు హోంశాఖ మంత్రిగా నియమించిన ఘనత ఒక్క జగన్మోహన్రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు. మహిళల రక్షణ కోసం దిశ యాప్‌ను తీసుకురావడమే కాకుండా దిశ చట్టాన్ని అమలు చేశారన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ముఖ్యంగా మహిళలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం మహిళలను విస్మరిస్తోందని, అనేక రకాల వాగ్దానాలు చేసి అమలు చేయకుండా మహిళలను నిట్టనిలువునా మోసం చేశారని విమర్శించారు. జగనన్న పాలనలో కడుపులోని బిడ్డ నుంచి వందేళ్ల వృద్దుల వరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు. ఆనాడు కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మోసపూరిత విధానాలను మహిళలు నిలదీయాలన్నారు. మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాజకీయంగా, పరిపాలన పరంగా మహిళలకు సమాన అవకాశాలు కల్పించడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాటుపడ్డారని తెలిపారు. వైఎస్సార్ హయాంలో ఏకంగా ఆరుగురు మహిళలకు మంత్రివర్గంలో స్ధానం కల్పించారన్నారు. మహిళలు ముందడుగు వేస్తేనే సమాజంలో సానుకూల మార్పు వస్తుందని భావించిన మహిళా పక్షపాతి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం మ్యానిఫెస్టోను అటకెక్కించి చేసిన హామీల్లో ఒక్కదానిని కూడా సక్రమంగా అమలు చేయకుండా ఒట్టి చేతులు చూపుతున్నారని విమర్శించారు. కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మీ పథకాలకు రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు. సీ్త్రనిధి నిధులను పక్కదారి పట్టిస్తూ దుర్వినియోగం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. కూటమి ప్రభుత్వం కుట్రలను మహిళలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. జగనన్న 2.0 లో కార్యకర్తలకే పెద్దపీట వేయనున్నారని చెప్పారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కార్యకర్తలు పోరాడాలన్నారు. ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు మాట్లాడుతూ జగనన్న పాలనలో మహిళల సాధికారిత కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని చెప్పారు. మహిళలు చైతన్యవంతులు కావాలని ప్రభుత్వ మోసపూరిత విధానాలను ప్రశ్నించాలని సూచించారు. తొలుత పార్టీ కార్యాలయంలో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాయకుడు నూకతోటి శరత్‌కుమార్ ఆలపించిన జయహో మహిళ పాట ఆకట్టుకుంది. జిల్లాలోని మహిళా నాయకులు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మను గజమాలతో ఘనంగా సన్మానించి అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు బొట్లా సుబ్బారావు, ఒంగోలు జెడ్పీటీసీ చుండూరు కోమలేశ్వరి, హనుమంతునిపాడు ఎంపీపీ గాయం సావిత్రి, కొండెపి జెడ్పీటీసీ మారెడ్డి అరుణకుమారి, రాష్ట్ర మహిళా కార్యదర్శి మేడికొండ జయంతి, మహిళా నాయకురాలు భూమిరెడ్డి రమణమ్మ, కనిగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ పులి శాంతి, కార్పొరేటర్ వెన్నపూస కుమారి, కోఆప్షన్ మెంబర్ షేక్ రషీదా, ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పి.ప్రసన్న, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బడుగు ఇందిర, అంగన్వాడీ అధ్యక్షురాలు గోవిందమ్మ, మద్దిపాడు ఎంపీపీ అరుణ, తమ్మినేని సుజాతారెడ్డి, నియోజకవర్గ అంగన్వాడీ అధ్యక్షురాలు వడ్లమూడి వాణి, మేరికుమారి, సయ్యద్ అప్సర్, ఎస్.రమణమ్మ, జ్యోతి, మాధవి, బి.రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళలకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కోలాహలం పాల్గొన్న మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్ -
బీజేపీ పాలనలో మహిళలపై దాడులు
ఒంగోలు టౌన్: బీజేపీ ప్రభుత్వంలో మహిళలు, మహిళా హక్కులపై దాడులు పెరిగిపోయాయని ప్రగతిశీల మహిళా సంఘ జాతీయ కన్వీనర్ వి.సంధ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి మనువాదాన్ని ప్రోత్సహించే బీజేపీ ప్రభుత్వం రావడంతో పితృస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతమైందని, దళితులు, మైనారిటీలపై దాడులు ఎక్కువయ్యాయని అన్నారు. నగరంలోని ఎన్జీఓ హోంలో శనివారం నిర్వహించిన ప్రగతిశీల మహిళా సంఘాల విలీనసభలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలోనే కాకుండా భారతదేశంలో కూడా నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని చెప్పారు. అయినప్పటికీ పురుషుల కంటే మహిళల హోదా తక్కువగా ఉందన్నారు. మహిళలు శక్తివంతంగా పోరాడుతున్నప్పటికీ వారి మీద జరుగుతున్న లైంగికదాడులు ఆగలేదన్నారు. హత్రాస్‌లో దళిత బాలిక, మణిపూర్‌లో గిరిజన మహిళ, బెంగాల్లో పీజీ డాక్టర్‌పై జరిగిన ఘటనలే దీనికి నిదర్శనమన్నారు. దేశంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే లక్షల మంది ఆకలి చావులకు బలవుతున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం మనిషికి ఐదు కిలోల లెక్కన బియ్యం సరఫరా చేసి ఇంట్లో ఆఖరి ముద్ద తినే మహిళలను మరింతగా ఆకలికి గురిచేస్తోందన్నారు. కొత్తగా వచ్చిన లేబర్ కోడ్ చట్టాలు మహిళా కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని, వ్యవసాయ కూలీల వేతనాలు అమలు జరగడం లేదని అన్నారు. సభలో పీఓడబ్ల్యూ జాతీయ కో ఆర్డినేటర్ ఝాన్సీ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమాసుందరి మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నా, సమాన హోదా కావాలన్నా, దోపిడీ రహిత సమాజం నిర్మాణం జరగాలన్నా మహిళలు మరింత క్రియాశీలకంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ముందుగా నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. సభలో విష్టు, గంగా భవాని, బి.పద్మ, ఎం.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రగతిశీల మహిళా సంఘాల విలీన సభలో జాతీయ కన్వీనర్ సంధ్య ఆగ్రహం -
టిడ్కో ఇళ్లకు నిధులివ్వకుండా విమర్శలు సిగ్గుచేటు
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో 9 నెలల క్రితం అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ టిడ్కో ఇళ్లను పూర్తి చేయకుండా కేవలం విమర్శలతో కాలయాపన చేస్తోందని సీపీఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు మండిపడ్డారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా సీపీఎం నాయకులు శనివారం నగరంలోని చింతల, కొప్పోలు టిడ్కో గృహ సముదాయాలను పరిశీలించారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. టిడ్కో గృహాలను పూర్తి చేయకుండా రాజకీయ విమర్శలకు పూనుకోవడం సిగ్గుచేటన్నారు. గత ఐదేళ్లుగా టిడ్కో గృహాల గురించి నోరు విప్పకుండా, రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించకుండా కేవలం విమర్శలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని హితవుపలికారు. సొంతింటి కల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న లబ్ధిదారులను మభ్య పెట్టడం మానుకుని ఇప్పటికై నా టిడ్కో ఇళ్లను పూర్తి చేసేందుకు అవసరమైన కార్యచరణ రూపొందించుకోవాలని చెప్పారు. కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే టిడ్కో ఇళ్లను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కొప్పోలు, చింతల వద్ద గృహ సమూదాయాలు నివాసయోగ్యంగా లేవని తెలిపారు. వరద నీరు, చిల్లకంపతో నిండిపోయి ఉందన్నారు. ఇక్కడ గుంటలు పూడ్చి , చదును చేసి మౌలిక సదుపాలయాలను కల్పించాలని కోరారు. టిడ్కో గృహసమూదాయాల వద్ద ఎలాంటి రక్షణ లేదని, దొంగల బెడద ఎక్కువగా ఉందని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి తెలిపారు. కార్యక్రమంలో తంబి శ్రీనివాసరావు, పి.కల్పన, బి.రఘురాం, సయ్యద్ హుసేన్, తంగిరాల మహేష్, దారా వెంకటేశ్వర్లు, దామా శ్రీనివాసరావు, సీహెచ్ వినోద్, తిరుపతిరావు, స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీపీఎం నేతల విమర్శ -
మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధించాలి
● జిల్లా ఫ్రధాన న్యాయమూర్తి భారతి ఒంగోలు: మహిళలు అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా న్యాయస్థానం ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయసేవాధికార సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు. సెలవులతో సంబంధం లేకుండా నిరంతరం పనిచేసే శక్తి మహిళా శక్తి అని అభివర్ణించారు. పురుషులతో సమానంగా శ్రమిస్తున్నప్పటికీ సామాజికంగా చిన్న చూపు చూడటం తగదన్నారు. మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తూనే ఆర్థికంగా స్వయం ప్రతిపత్తి సాధించడం ద్వారా శక్తివంతంగా మరింత ముందుకు వెళ్లవచ్చన్నారు. కార్యక్రమానికి హాజరైన మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో లైంగిక దోపిడీ జరిగినట్లయితే సంబంధిత కమిటీకి తమ సమస్యను తెలియజేసి తగిన విధంగా పరిష్కారం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు డి.అమ్మన్నరాజా, డి.రాములు, జి.దీన, కె.శైలజ, సీనియర్ సివిల్ న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి ఎస్.హేమలత, జూనియర్ సివిల్ న్యాయమూర్తులు పి.భానుసాయి, ఎస్.కోమలవల్లి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
దొడ్డు బియ్యం తినలేకపోతున్నాం
కనిగిరిరూరల్: ‘రోజూ లావు బియ్యంతో అన్నం పెడుతున్నారు. అది తినలేకపోతున్నాం. మంచి నీళ్లకు చాలా ఇబ్బంది పడుతున్నాం. హాస్టల్ బిల్డింగ్ కూడా బాగోలేదు’ అని కనిగిరి బీసీ గురుకులం విద్యార్థులు రాష్ట్ర మంత్రులు ఎస్. సవి, ఆనం రామనారయణరెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కనిగిరి వచ్చిన ఇద్దరు మంత్రులు.. ఇక్కడి మహాత్మాజ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. మెనూ, ఇతర వసతుల గురించి ఆరా తీస్తున్న సమయంలో విద్యార్థులు తమ అవస్థలను తెలియజేశారు. మెనూ అమలు తీరు, హాజరు, స్టాక్ రికార్డులను పరిశీలించిన అనంతరం మంత్రి సవిత విలేకర్లతో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నుంచి వసతి గృహాలకు బీపీటీ బియ్యాన్ని అందజేస్తామని చెప్పారు. హాస్టల్లో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత తక్కువగా ఉందని, స్టాక్ రిజిస్టర్ నిర్వహణ సక్రమంగా లేదని గుర్తించి తగిన చర్యలకు ఆదేశాలిచ్చామన్నారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్టును తప్పకుండా పూర్తి చేసి కనిగిరి, మార్కాపురం, దర్శి, పొదిలి తదితర ప్రాంతాలకు తాగు, సాగు నీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. మంత్రులు సవిత, ఆనం ఎదుట గురుకుల పాఠశాల ఆవేదన -
మహిళల అభ్యున్నతికి కృషి చేయాలి
ఒంగోలు సిటీ: మహిళల అభ్యున్నతికి నిరంతరం కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఒంగోలులోని సంఘ భవనంలో ఘనంగా నిర్వహించారు. మహిళలకు పలు పోటీలు నిర్వహించారు. 50 మంది మహిళా ఉద్యోగులను సత్కరించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారన్నారు. ఇదేవిధంగా రాణించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వరకుమార్, కోశాధికారి రంగారెడ్డి, జిల్లా సహాధ్యక్షుడు మసూద్ అలీ, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఎస్వీ రమణారెడ్డి, శ్రీనివాస్ యాదవ్, భూపాల్, ఒంగోలు పట్టణ అధ్యక్షుడు మోటార్ శ్రీనివాసరావు, కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, ఒంగోలు తాలూకా అధ్యక్షుడు సురేష్, యేసురత్నం చంద్రశేఖర్, గోపికృష్ణ, డాక్టర్ రజిత మానస, వనజ, గౌరీ, సుమతి, దర్శి అధ్యక్షుడు సుబ్బారెడ్డి, కనిగిరి అధ్యక్షుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు. మహిళా చైతన్యమే సమాజాభివృద్ధికి గీటురాయి... ● యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు శ్రీనివాసరావు మహిళా చైతన్యమే సమాజాభివృద్ధికి గీటురాయి అని, దేశంలోని మహిళలందరూ విద్య సముపార్జించిన రోజే మహిళా సాధికారతకు మార్గం సుగుమం అవుతుందని యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఒంగోలులోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి ఎం.సంధ్యారాణి అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పని ప్రదేశాలలో విశ్రాంతి సౌకర్యాలు కల్పించాలన్నారు. పాఠశాలలో బాలికలకు ప్రత్యేక విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా గౌరవాధ్యక్షుడు ఎస్.రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వీరాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధిలో, ఉపాధ్యాయ హక్కులు సాధించడంలో మహిళా ఉపాధ్యాయులు ముందు వరుసలో ఉండాలన్నారు. నాయకత్వ స్థానాల్లోకి రావాలని కోరారు. అనంతరం ఒంగోలు ఎంఈఓ సరస్వతి, జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం పార్వతీశాంతి, ఎం.శ్రీదేవి, నాగకళ్యాణి, సంపూర్ణమ్మలను యూటీఎఫ్ నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షురాలు జి.ఉమామహేశ్వరి, ఐద్వా జిల్లా కార్యదర్శి కె.రమాదేవి, జిల్లా కోశాధికారి ఎన్.చిన్నస్వామి, జిల్లా కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వరరావు, సీహెచ్ ప్రభాకర్‌రెడ్డి, ఒంగోలు నగర అధ్యక్షురాలు డి.జ్యోత్స్నదేవి, ఒంగోలు ప్రాంతీయ మండలాల నాయకులు కాట్రగడ్డ నర్సింహారావు, ఆంజనేయులు, ఎస్వీ కొండారెడ్డి, హేమలత, ఉషారాణి, ఝాన్సీలక్ష్మీబాయి, పద్మశ్రీ, ధనలక్ష్మి, ఎన్.శారదమ్మ, తదితరులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి -
భూ సమస్య చెప్పుకొందామంటే అడ్డుకున్నారు
సీఎంను కలవనీయలేదని వృద్ధురాలి ఆవేదనమార్కాపురం: తన భూమిని అన్యాయంగా వీఆర్ఓ ఆన్లైన్ చేసుకున్నాడని సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వృద్ధ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఎంతో దూరం నుంచి వస్తే ముఖ్యమంత్రి వద్దకు వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారని మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకుంది. కొనకనమిట్ల మండలం నాగంపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు మాణిక్యమ్మ శనివారం మార్కాపురం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబును కలిసేందుకు వచ్చింది. తన పొలాన్ని గ్రామ వీఆర్ఓ అన్యాయంగా ఆన్లైన్ చేసుకోవడంపై తహసీల్దార్, ఆర్డీఓకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తనకు జరిగిన అన్యాయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు అర్జీ చేతపట్టుకుని ఎండను సైతం లెక్క చేయకుండా మార్కాపురం చేరుకుంది. ఇక్కడి తర్లుపాడు రోడ్డులో మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్ద సీఎంను కలిసేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆర్డీఓ తాను కచ్చితంగా సమస్యను పరిష్కరిస్తానని చెప్పడంతో ఉసూరుమంటూ వెనుదిరిగింది. -
నేడు మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన
మార్కాపురం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఉదయం 10.45 గంటలకు హెలికాప్టర్లో మార్కాపురం రానున్నారు. గం.10.55 వరకూ ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు. గం.11.15 వరకు అధికారులతో సమావేశమై సభా వేదికకు చేరుకుంటారు. అనంతరం స్టాల్స్‌ను సందర్శించి రుణాల పంపిణీ, మహిళలతో ముఖాముఖితోపాటు మహిళలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశమై, జిల్లా అధికారులతో సమీక్ష చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు, సభా వేదిక ఏర్పాట్లను కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, సబ్‌కలెక్టర్ త్రివినాగ్, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ ద్వారా సీఎం పర్యటించే ప్రాంతాల్లో పటిష్ఠ భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. హెలీప్యాడ్ ప్రాంతాన్ని, సీఎం కాన్వాయ్ రూటును పరిశీలించారు. ట్రయల్‌రన్ నిర్వహించారు. ఈయన వెంట అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, ఎస్ఎస్జీ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, ఎస్ఎస్జీ డీఎస్పీ పోతురాజు, డీఎస్పీలు నాగరాజు, శ్రీనివాసరావు, సాయి ఈశ్వర్ యశ్వంత్, సీఐలు రాఘవేంద్ర, సుబ్బారావు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలకు 818 మంది గైర్హాజరు ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం పరీక్షలు మూడో రోజు మాథ్స్ 2ఏ, బోటనీ 2, సివిక్స్ 2 పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలకు 19,614 మందికి గాను 18796 మంది విద్యార్థులు హాజరయ్యారు. 818 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ 17666 మంది విద్యార్థులు గాను 17013 మంది హాజరవగా, 653 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ పరీక్షకుగాను 1948 మందికి గాను 1783 మంది హాజరవగా, 165 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షలు నిర్వహించడానికి జిల్లాలో 67 సెంటర్లు కేటాయించారు. ఆర్ఐఓలు ఏడుగురు, 17 మంది డీఈసీ– డీఐఈఓలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. 32 మంది స్క్వాడ్స్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. మాల్ ప్రాక్టీస్ చేసిన ఒకరిని బుక్ చేశారు. నేడు రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు కొమరోలు: మండలంలోని ఇడమకల్లు గ్రామంలో కళ్యాణరామ, పట్టాభిరామస్వామి ఆలయ జీర్ణోద్ధరణ ధ్వజ, శిఖర, కలశ విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా శనివారం రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. బండలాగుడు పోటీల్లో 7 నగదు బహుమతులు వరుసగా రూ.1 లక్ష, రూ.80 వేలు, రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు అందజేస్తున్నామన్నారు. ఉదయం 10 గంటలకు పోటీలు నిర్వహిస్తారని, ఆసక్తి గల వారు 9573319779 సంప్రదించాలని తెలిపారు. -
సహనంలో అవని
కొండపి: కట్టుకున్న భర్త కిడ్నీ జబ్బుతో కాలం చేయడంతో కలత చెందిన ఆమెకు కళ్ల ముందే భవిష్యత్ కనిపించింది. ఇద్దరు పసివాళ్లను ప్రయోజకులను చేయడం కోసం కూలీనాలీ చేసింది. సంపాదన సరిపోకపోవడంతో ఆటో డ్రైవర్ అవతారమెత్తింది. ‘ఆడదానివి నువ్వు ఆటో నడుపుతావా..’ కొందరు హేళన చేసినా కుటుంబ పోషణ నిమిత్తం సడలని సంకల్పంతో అనుకున్నది సాధించింది. చకా చకా గేర్లు మారుస్తూ కొండపి మండలంలో రోడ్లపై ఆటోను రయ్రిమనిపించింది. ఆటో నడపడానికి వచ్చిన కొత్తలో హేళన చేసిన వారితోనే ‘ఆటో రెడ్డమ్మ’ అని పిలిపించుకుంది. జరుగుమల్లి మండలం పీరాపురం గ్రామానికి చెందిన బండి సుజాత ప్రస్తుతం కొండపి మండలం జాళ్లపాలెం గ్రామంలో నివసిస్తున్నారు. 13 సంవత్సరాల క్రితం భర్త బండి మాల కొండయ్య కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మరణించారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. తండ్రి చనిపోయేనాటికి పెద్ద కుమారుడు వీర వెంకటేష్ మూడేళ్లు, చిన్న కుమారుడు బ్రహ్మారెడ్డికి రెండేళ్ల వయసు. ఊహ తెలిసే సమయానికి తండ్రిని కోల్పోయిన పిల్లలకు సుజాత అన్నీ తానైంది. తండ్రి లేని లోటు పిల్లలకు తెలియకుండా చిన్నచిన్న పనులు చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. కూలీ పనులతో వచ్చిన డబ్బు ఇంటి ఖర్చులకు, పిల్లల చదువులకు సరిపోకపోవడంతో ఆటో నడపాలని నిర్ణయించుకుంది. ఆటో కొనేందుకు ఆర్థిక పరిస్థితి సరిపోకపోవడంతో అప్పు చేసింది. గత ఐదేళ్లుగా కొండపి నుంచి జాళ్లపాలెం వరకు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. జాళ్లపాలెం మార్గంలో ఆటోల సంఖ్య క్రమంగా పెరగడంతో రోజుకు రెండు ట్రిప్పులు తిరగడం కూడా కష్టంగా మారింది. ఓ పక్క అనారోగ్య సమస్యలు బాధిస్తున్నా పిల్లల ఉన్నతికి, కుటుంబం గడవడం కోసం మొక్కవోని ధైర్యంతో ఆటో నడుపుతోంది. ఆర్థిక స్థోమత అంతంతమాత్రమే కావడంతో ఇంటి నిర్మాణం మధ్యలోనే నిలిపివేసింది.‘ఆటో నడపడం ప్రారంభించిన కొత్తలో ‘ఆడ మనిషి ఏ విధంగా ఆటో నడుపుతుంది’ అని కొందరు ప్రయాణికులు ఎక్కేందుకు నిరాకరించారు. ఆ సమయంలో కుటుంబ పోషణ మరింత కష్టమైపోయింది. కొన్నాళ్ల తర్వాత ప్రయాణికుల్లో నమ్మకం కుదిరింది. అప్పటి నుంచి అందరూ ఆటో ఎక్కుతున్నారు’ అని పాత రోజులను గుర్తు చేసుకుంది రెడ్డెమ్మ. ఈమె పెద్ద కుమారుడు కొండపి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం, రెండో కుమారుడు పెద్ద కండ్లగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. పిల్లలు బాగుండాలన్న తాపత్రయంతోనే తాను ఆటో డ్రైవర్ అవతారం ఎత్తాల్సి వచ్చిందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సహనం కోల్పోకుండా బతుకు బండిని నెట్టుకొస్తున్నానని చెబుతోంది ఈ ఆటో రెడ్డెమ్మ. భర్త మరణానంతరం బతుకు బండిని నడిపిస్తున్న సుజాత అవమానాలు ఎదురైనా సడలని సంకల్పంతో ఆటోడ్రైవర్‌గా.. -
విద్యలో వాణి
సంతనూతలపాడు: దృఢ సంకల్పం ఉంటే.. కొండంత లక్ష్యమైనా ఛేదించడం సులువే! వైఫల్యాలు వెక్కిరించినా, విజయమే లక్ష్యంగా ముందుకు సాగారు ఈ అక్కాచెల్లెళ్లు. లక్షల మందితో పోటీపడి పోటీ పరీక్షల్లో నెగ్గి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. తల్లి ప్రోత్సాహంతో విజయం దిశగా వడివడిగా అడుగులు వేసిన వీరి ప్రస్థానం యువతకు ఆదర్శనీయం. మహిళా దినోత్సవం సందర్భంగా తమ విజయాన్ని తల్లికి అంకితమిచ్చారు. సంతనూతలపాడుకు చెందిన గోనేపల్లి కోటేశ్వరరావు, సుజాత దంపతుల కుమార్తెలు అనుపమ, లక్ష్మీప్రియ. ఇద్దరూ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు సంతనూతలపాడులో గోదాటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీనివాస కాన్వెంట్లో చదివారు. ఆరు నుంచి పదో తరగతి వరకు జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యనభ్యసించారు. అక్కాచెల్లెళ్లిద్దరూ పదో తరగతి నుంచి ఎంటెక్ వరకు ప్రథమస్థానాల్లో మార్కులు సాధించారు. ఇంజినీరింగ్ పూర్తయిన వెంటనే హెచ్‌సీఎల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌గా అవకాశం వచ్చినా వదిలేశారు. ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అనుపమ వీఆర్ఓ, పంచాయతీ సెక్రటరీగా ఒకే పర్యాయంలో ఉద్యోగాలు సాధించింది. చీమకుర్తిలో వీఆర్ఓగా భాధ్యతలు నిర్వహించి, అందరి మన్ననలూ పొందింది. ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షల్లో నెగ్గి కేంద్ర హోంశాఖలో ఉన్నత ఉద్యోగం సాధించింది. నంద్యాలలోని కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందిన లక్షీప్రియ తన సోదరికి ఉద్యోగం వచ్చిన మరుసటి నెలలోనే ఆంధ్రా బ్యాంక్ పీఓగా ఎంపికై ంది. నెల వ్యవధిలోనే కుమార్తెలిద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాదించడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. అమ్మే నా మొదటి గురువు చిన్ననాటి నుంచి అమ్మ ప్రభావం నాపై ఎక్కువగా ఉంది. నాన్న ఫొటోగ్రఫీతో బిజీగా ఉండేవారు. క్రమం తప్పకుండా అమ్మ మా ఆలనాపాలనా చూస్తూ క్రమశిక్షణ, విద్యాబుద్ధులు నేర్పించింది. అమ్మ ప్రోత్సాహం, నాన్న కృషి వల్లే పట్టుదలతో చదివి హోంశాఖలో ఉన్నత ఉద్యోగం సాధించగలిగా. – అనుపమ ఈ విజయం అమ్మదే.. చిన్నప్పటి నుంచి అమ్మే దగ్గరుండి చదివించేది. క్రమం తప్పకుండా బడికి వెళ్లేవాళ్లం. మంచి మార్కులు సాధించేవాళ్లం. అక్క అనుపమ హోంశాఖలో ఉద్యోగం సాధించడం నాలో పట్టుదలను మరింత పెంచింది. బ్యాంక్ ఉద్యోగం సాధించడానికి విపరీతమైన పోటీ ఉన్నా కష్టపడి చదివి ఆంధ్ర బ్యాంక్ పీఓగా ఎంపికయ్యా. ఈ విజయం అమ్మకే అంకితం. – లక్ష్మీప్రియ -
వెన్నుపోట్లు
వెలుగొండపై ఇంతటి నిర్లక్ష్యమా మార్కాపురం: ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల్లో శాశ్వతంగా కరువు నివారించే పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణపనులపై నీలి నీడలి కమ్ముకున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడ్జెట్లో కేవలం రూ.309.13 కోట్లు కేటాయించడంతో సిబ్బంది జీతభత్యాలకు మాత్రమే సరిపోతుందని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణం ఇలా: ప్రాజెక్టు వల్ల 4.47 లక్షల 300 ఎకరాలకు సాగునీరు, 15.25 మంది లక్షల మందికి తాగు నీరు అందించేలా డిజైన్ చేశారు. దివంగత వైఎస్సార్ ప్రాజెక్టును ప్రారంభించగా 2014 నాటికి ప్రాజెక్టు కోసం రూ.1448.14 కోట్లు ఖర్చు పెట్టారు. గొట్టిపడియ, సుంకేసుల, కాకర్ల డ్యాంలు పూర్తయ్యాయి. 1వ టన్నెల్ 11.50 కిలో మీటర్లు పూర్తికాగా, 2వ టన్నెల్ 9 కిలోమీటర్లు పూర్తైంది. టన్నెల్ 1 పనులు 62 శాతం, టన్నెల్ 2 పనులు 48 శాతం పూర్తయ్యాయి. 2014–18 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో వెలిగొండకు రూ.600 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలపై దృష్టి సారించలేదు. 1వ టన్నెల్‌కు సంబంధించి కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే పనులు జరిగాయి. 2019– 24 మధ్య జరిగిన అభివృద్ధి ఇదీ.. 2019–24 మధ్య వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ప్రాజెక్టు పనులకు రూ.822.08 కోట్లు ఖర్చుపెట్టారు. ఇంకా భూసేకరణకు రూ.79.21 కోట్లు, పునరావాస కల్పనకు రూ.76.73 కోట్లు కేటాయించారు. దోర్నాల మండలం కొత్తూరు వద్ద రెండు టన్నెల్ పనులు పూర్తయ్యాయి. ఒక్కొక్క టన్నెల్ 18.8 కిలో మీటర్ల పొడవుతో నిర్మించారు. మొదటి టన్నెల్ పనులు పూర్తి చేయగా, రెండో టన్నెల్ పనులు కూడా వేగంగా చేపట్టారు. తీగలేరు, గొట్టిపడియ, తూర్పు ప్రధాన కాలువ, ఉపకాలువలు, ఉదయగిరి ఉపకాలువ, పడమర ఉపకాలువ, టి–5 కాలువల పనులు పూర్తయ్యాయి. 3 గ్యాప్‌ల నిర్మాణం వల్ల 11 గ్రామాలు మునిగిపోనున్నాయి. ఇందులో మొత్తం 7270 కుటుంబాలు ఉన్నాయి. వీరిలో కొంతమందికి వన్‌టైమ్ సెటిల్మెంటు, మరికొంత మందికి ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాల్సి ఉండగా, ఈ బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వంలో పునరావాస కాలనీలకు శ్రీకారం చుట్టారు. సిమెంటు రోడ్లు, వాటర్‌ట్యాంకులు, పాఠశాలలను నిర్మించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వీటిని పట్టించుకోకపోవడంతో చిల్లచెట్లతో నిండిపోయాయి. మహిళల నమ్మకాన్ని పోగొట్టుకున్నారు మహిళల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తామని చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. ఇప్పటికి 9 నెలలు అవుతున్నాయి. కనీసం ఒక్కటంటే ఒక్క పథకం కూడా సంపూర్తిగా అమలు చేయడం లేదు. తల్లికి వందనం ఎగవేశారు. ఉచిత బస్సును అడ్రస్ లేకుండా చేశారు. నెలకు రూ.1500 ఒక భ్రమగా మిగిలింది. మహిళలను అన్నీ రకాలుగా మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ దగా చేసేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు. ఆయన మహిళల నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. ఎన్ని వేషాలు వేసినా నమ్మే పరిస్థితి లేదు. – కంకణాల రమాదేవి, ఐద్వా జిల్లా కార్యదర్శి మహిళలను ఎల్లకాలం మోసం చేయలేరు ఒకసారి చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయిన మహిళలు మరోసారి నమ్మడానికి సిద్ధంగా లేరు. గత ఎన్నికల్లో సూపర్ సిక్స్ అన్నారు. అదెక్కడికి పోయిందో అర్థం కావడం లేదు. రాష్ట్రంలో కోటి 54 లక్షల కుటుంబాలకు ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలంటే ఏడాదికి రూ.4 వేల కోట్లు అవసరమవుతాయి. కానీ కేవలం రూ.895 కోట్లు మాత్రమే కేటాయించడం చంద్రబాబు దగాకోరుతనానికి నిదర్శనం. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసిన తరువాతనే చంద్రబాబు మహిళా దినోత్సవాలకు రావాలి. – బి.పద్మ, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి ఇలా అయితే వెలుగొండ ఎప్పటికి పూర్తవుతుంది ? ఇటీవల బడ్జెట్లో వెలుగొండ ప్రాజెక్టుకు రూ.309.13 కోట్లు మాత్రమే కేటాయించారు. వీటితో వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తిచేసి, నిర్వాసితులకు న్యాయం చేసి నీళ్లెప్పుడు ఇస్తారో అర్థం కావడం లేదు. చంద్రబాబునాయుడు వెలుగొండకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించి త్వరితగతిన ప్రాజెక్టును పూర్తిచేయాలి. పునరావాస కాలనీలు నిర్మించి నిర్వాసితులకు న్యాయం చేయాలి. – జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ పునరావాస పనులకు నిధులెక్కడ ఇటీవల బడ్జెట్లో ప్రకటించిన వెలుగొండ ప్రాజెక్టు నిధుల్లో పునరావాస కాలనీలకు ఎంత నిధులు కేటాయిస్తారో చెప్పలేదు. మార్కాపురం మండలం కుంట వద్ద గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో పిచ్చిచెట్లు పడ్డాయి. ప్రభుత్వం వెంటనే ప్రత్యేకంగా నిధులు కేటాయించి పునరావాస కాలనీలు పూర్తిచేయాలి. – నల్లబోతుల కొండయ్య, గొట్టిపడియ -
వైఎస్సార్ విగ్రహంపై దాడి తగదు
ఒంగోలు సిటీ: ఒంగోలు నగరంలోని మామిడిపాలెంలో రెడ్డి హాస్టల్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం, అవమాన పరచడం మంచి పద్ధతి కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి హెచ్చరించారు. ఒంగోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ విగ్రహాన్ని అవమానపరిచిన వారిపై పోలీసులు తక్షణమే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఇలాంటి దుశ్చర్యలు పునరావృతం అయ్యే అవకాశం ఉందన్నారు. అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు ఉంటే ఇంటి దగ్గర తేల్చుకోవాలని ఇలా రోడ్ల మీద పడి రచ్చ చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఒంగోలు నగర ప్రజలు ఇలాంటి తప్పుడు సంస్కృతిని అంగీకరించరని చెప్పారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా ఎవరు ప్రయత్నించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలందరి ప్రాణాలను కాపాడడానికి 108 అంబులెన్స్‌లు, నిరుపేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ, పేదరికం కారణంగా చదవులు ఆగిపోకుండా ఫీజురీయింబర్స్‌మెంట్ తీసుకొచ్చిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. ఈవీఎంలు, అసత్య ఆరోపణలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందే తప్ప రాష్ట్రంలో ఇప్పటికీ టీడీపీ, జనసేన కంటే బలంగా ఉందని గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి పుట్టిన పార్టీ అని, ప్రజలే మా నాయకులు అని స్పష్టం చేశారు. ఇది ఎవరి నుంచో లాక్కున్న పార్టీ కాదని, ఒక నాయకుడి పోరాట పటిమతో పురుడు పోసుకున్న పార్టీ అని చెప్పారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని లక్షలాది ప్రజలకు సాగు, తాగునీరు అందించే వెలుగొండ ప్రాజెక్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే 90 శాతం వరకు పూర్తయిందన్నారు. కేవలం ఆర్ఆర్ ప్యాకేజీలు ఇచ్చి చిన్న చిన్న పనులు చేస్తే మిగిలిన ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టుకు అరకొర నిధులు కేటాయించడానికి వ్యతిరేకంగా యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పాదయాత్ర చేయనున్నట్లు అసెంబ్లీలోనే ప్రకటించారని, పాదయాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయన వెంట నడుస్తాయని చెప్పారు. రెడ్‌బుక్ రాజ్యాంగానికి ఇక్కడ ఎవరూ భయపడటం లేదన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను భయపెట్టాలంటే ఎక్కువ రోజులు సాధ్యం కాదన్నారు. కూటమి నాయకులు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఎంపీ అభ్యర్థికి ఆరున్నర లక్షలకు పైగా ఓట్లు వచ్చాయని తెలిపారు. ఎక్కడికి వెళ్లినా మా ఓట్లు ఏమైపోయాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. ఆయన వెంట ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు బొట్లా సుబ్బారావు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, వైఎస్సార్సీపీ నాయకులు నటారు జనార్ధనరెడ్డి, పిగిలి శ్రీను, హౌసింగ్ చిన్న, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి -
సైబర్ మాయలో వైన్‌షాపు యజమాని
సింగరాయకొండ: ‘హలో గోవిందరావు..నేను ఏఎస్సై ప్రభాకర్‌ని..ఎక్కడున్నావు’..? ఇవతలి నుంచి గోవిందరావు..్ఙసార్ నేను షాపులో ఉన్నాను సార్’. అవతలి నుంచి..సరేగానీ..నాకు అర్జంటుగా రూ.95 వేలు ఫోన్ పే చెయ్యి..నేను ఆ మొత్తాన్ని కానిస్టేబుల్‌తో పంపిస్తున్నా.. సింగరాయకొండ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద గల రమ్య వైన్ షాపులో పనిచేస్తున్న గోవిందరావుకు 9010699759 సెల్ నంబర్ నుంచి శుక్రవారం సాయంత్రం ఫోన్ వచ్చింది. దీంతో గోవిందరావు మాట్లాడుతూ ఈ విషయం మా సార్‌కు కూడా చెప్పండి సార్ అంటూ షాపు పర్యవేక్షణ చేసే ఉప్పాళ్ల రమేష్‌కు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు. ఆ తర్వాత ఏఎస్సై ప్రభాకర్ అని చెప్పుకున్న వ్యక్తి రమేష్‌కు కూడా ఫోన్ చేసి ఏం చెప్పాడో ఏమోగానీ.. ఆయన వెంటనే అతనికి రూ.95 వేలు ఫోన్ పే చేశాడు. కానిస్టేబుల్ డబ్బు తెస్తాడు.. తీసుకో అని గోవిందరావుకు కూడా ఫోన్ చేసి చెప్పాడు. తీరా చూస్తే పోలీస్‌స్టేషన్‌లో ప్రభాకర్ అనే పేరుతో ఏఎస్సై ఎవరూ లేరని, తాము సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డామని తెలుసుకుని హుటాహుటిన పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన మోసాన్ని పోలీసులకు తెలిపారు. వారి సూచన మేరకు వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేసి సమాచారం అందించారు. పోలీసుల పేరుతో వైన్ షాపు యజమానిని నమ్మకంగా మోసం చేసిన ఈ విషయం గురించి తెలుసుకుని మండల ప్రజలు ఉలిక్కిపడ్డారు. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య ఒంగోలు టౌన్: రైలుకింద పడి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరారెడ్డి పాలెం, టంగుటూరు రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని ఒక వ్యక్తి రఫ్తీ సాగర్ ఎక్స్‌ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకొని మృతిచెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడి వయసు 35 ఏళ్లు ఉంటుందని, కుడి చేతి మీద అమ్మ అని, ఎడమ ఛాతీ మీద ఈశ్వరి అని పచ్చబొట్టు ఉంది. జీఆర్పీ ఎస్సై అరుణ కుమారి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. మృతుడు తిరుపతి, టంగుటూరు ప్రాంతాలకు చెందిన వ్యక్తి గా పోలీసులు భావిస్తున్నారు. చిరుత మృతి కేసులో ఇద్దరు ఫారెస్ట్ ఉద్యోగుల సస్పెన్షన్ యర్రగొండపాలెం: చిరుత పులి మృతిచెందిన సంఘటనపై నమోదైన కేసులో ఇద్దరు అటవీశాఖ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ మార్కాపురం టైగర్ ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్ జి.సందీప్‌కృపాకర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 16వ తేదీ యర్రగొండపాలెం రేంజ్ పరిధిలోని కొలుకుల బీట్‌లో అటవీ జంతువుల కోసం వేసిన ఉచ్చులో చిరుత పులి చిక్కుకుంది. అటవీ శాఖాధికారులు సకాలంలో స్పందించకపోవడం వలన అది మృతి చెందింది. దీనిపై నమోదైన కేసులో ఇటీవల నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అటవీ ప్రాంతంలో సంచరించే వేటగాళ్లను గుర్తించలేకపోవడం, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఉచ్చులో చిరుత చిక్కుకుని మరణించినట్లు గుర్తించిన ఫారెస్ట్ శాఖ ఉన్నతాధికారులు కొలుకుల సెక్షన్ ఆఫీసర్ బి.సక్రూనాయక్, బీట్ ఆఫీసర్ టి.నాగేశ్వరరావును సస్పెండ్ చేశారు. రూ.95 వేలు పోగొట్టుకుని 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు -
No Headline
కొనకనమిట్ల: మొక్కవోని దీక్షతో ప్రకృతి సాగులో రాణిస్తూ వ్యవసాయానికి మహిళలు కూడా వెన్నెముకగా నిలుస్తారని నిరూపిస్తున్నారు ఆదర్శ మహిళా రైతు గుళ్లాపల్లి సుజాత. సమాజంలో లింగ వివక్ష, అసమానతలను నివారించినప్పుడే ప్రగతి సాధ్యమవుతుందనే సంకల్పంతో కాడి, మేడి పట్టిన ఈ లేడీ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. ప్రకృతి వ్యవసాయం చేయాలనే తలంపుతో కొనకనమిట్ల మండలం పెదారికట్ల గ్రామ సమీపంలో రాళ్లు రప్పలున్న 40 ఎకరాల భూమిని కొనుగోలు చేసి బిందు సేద్యంతో నేడు నవధాన్యాలు పండిస్తున్నారు. రసాయనిక అవశేషాలు లేని అన్ని రకాల ఆహార పంటలు పండిస్తున్నారు. అందరూ ఆరోగ్యకరమైన జీవనం సాగించేలా రైతులకు సాగులో మెళకువలు నేర్పిస్తున్నారు. వర్షాలపై ఆధారపడకుండా సోలార్ సిస్టం, డ్రిప్ సౌకర్యంతో నీటి తడులు అందిస్తూ ఏడాది పొడవునా రరకాల పంటలు పండిస్తున్నారు. పొలంలో సేద్యం, పురుగు మందుల పిచికారీ, విత్తనాల సాగును సులభంగా చేసేందుకు మెకానికల్ ఇంజనీర్ అయిన భర్త కోటేశ్వరరావు సహకారంతో మల్టీపర్పస్ రోబోను తయారు చేశారు. తాము పండించిన ఆహార ఉత్పత్తులను ‘విశ్వమాత ఫామ్స్’ పేరుతో దేశ, విదేశాల్లో మార్కెటింగ్ చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో మేటిగా నిలిచిన సుజాతను ప్రభుత్వం రైతు నేస్తం అవార్డుతో సత్కరించింది. 2021లో సాక్షి ఎక్సలెన్స్ అవార్డు, ముప్పవరపు ఫౌండేషన్ నుంచి ఉత్తమ రైతు అవార్డు, రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు నుంచి బయోడైవర్సిటీ కన్జర్వర్ అవార్డు తదితర పురస్కారాలు అందుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం గుంటూరు సమీపంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఆర్.శారద, జయలక్ష్మి చేతుల మీదుగా సన్మానం, ప్రసంస పత్రం అందుకున్నారు. -
క్రికెట్ బెట్టింగ్‌లో టీడీపీ వర్గీయులపై కేసులు
ఒంగోలు టాస్క్‌ఫోర్స్: కొద్ది రోజులుగా సింగరాయకొండ మండలంలో చర్చనీయాంశంగా మారిన క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో టీడీపీ వర్గీయులపై కేసులు నమోదయ్యాయి. గురువారం రాత్రి పిగిలి శివ, కేదారి రామకృష్ణ, నక్కా రమేష్, షేక్ నిస్సార్, షేక్ కరిముల్లా, రామారావు, సుబ్బారెడ్డి, ఎం.వెంకట్రావు, షేక్ యస్దాని, మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి స్టేషన్ బెయిలిచ్చి పంపించారు. కేసులు నమోదైన వారిలో పిగిలి శివ పాతసింగరాయకొండ పంచాయతీకి చెందిన టీడీపీ నాయకుడికి దగ్గర బంధువు. ఈ నాయకుడే క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ తన బంధువు శివను కూడా బుకీగా మార్చాడని ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. చుట్టుపక్కల మండలాల్లో కూడా ఇతని నెట్వర్క్ ఉందని, ఇటీవల కాలంలో ఇతని పేరుపై కొనుగోలు చేసిన స్థలాలు, మామిడితోటలు, ఇళ్లు ఇందుకు నిదర్శనమని జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేగాకుండా గతంలో బెట్టింగుల్లో డబ్బు పోగొట్టుకున్న గుంటూరు జిల్లాకు చెందిన వారు మురళితో పాటు శివపై కూడా ఫిర్యాదు చేశారని, ఆ కేసు గుంటూరు సీసీఎస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉందని సమాచారం. ఈ కేసులో ఉన్న టీడీపీ ముఖ్య నాయకుడు రామకృష్ణ మండల కేంద్రంలో రెస్టారెంట్ నిర్వహిస్తూ ఆ రెస్టారెంట్ కేంద్రంగా క్రికెట్ బెట్టింగులు ఆడిస్తూ మద్యం అమ్మకాలు సాగిస్తున్నాడని సమాచారం. అయితే, టీడీపీ వారు కొద్దిరోజులుగా ఈ కేసును పక్కదారి పట్టించేందుకు పచ్చపత్రికల్లో వైఎస్సార్ సీపీకి చెందినవారే బెట్టింగులకు పాల్పడుతున్నారంటూ దుష్ప్రచారం చేశారు. శానంపూడిలో ఎంఎల్‌హెచ్‌పీగా పనిచేస్తున్న వ్యక్తి రైలు కిందపడి చనిపోయిన ఘటన, పాకలకు చెందిన యువకుడు రైలు పట్టాల కిందపడి చనిపోయిన ఘటన, వ్యవసాయశాఖలో పనిచేసే అధికారి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని చనిపోయిన ఘటనకు టీడీపీ మద్దతుదారులైన బుకీలే కారణమని తెలుస్తోంది. ఇటీవల బాలయోగినగర్‌కు చెందిన యువకుడు పందెంలో రూ.4 లక్షలు గెలుచుకున్నాడు. కానీ, అతనికి బుకీలు రూ.లక్ష మాత్రమే ఇచ్చి మళ్లీ అతనిచేత బెట్టింగు ఆడించి ఆ రూ.3 లక్షలు స్వాహా చేశారని, అలాగే కలికవాయకు చెందిన యువకుడు సుమారు రూ.50 లక్షల వరకు బెట్టింగులో పోగొట్టుకున్నాడని సమాచారం. ఈ బెట్టింగ్ వ్యవహారం జరుగుమల్లి మండలం పైడిపాడు గ్రామానికి చెందినది కాగా, తీగలాగితే డొంక కదిలినట్లు మండలంలో బెట్టింగ్ వ్యవహారం మొత్తం బయటపడింది. క్రికెట్ బుకీలు గురువారం రాత్రి స్టేషన్ బెయిల్ తీసుకుని వచ్చిన తర్వాత వారి అడ్డా అయిన కందుకూరు ఫ్లైఓవర్ సెంటర్లో సమావేశమైనట్లు తెలిసింది. నిందితులు వైఎస్సార్ సీపీ సానుభూతిపరులంటూ వారం రోజులుగా పచ్చపత్రికల దుష్ప్రచారం -
ఒట్టిమాటలు..
శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025తల్లికి వందనం..ఉచిత బస్సు ప్రయాణం..మహిళలకు నెలకు రూ.1500 ఇలా సూపర్ సిక్స్‌లో మహిళల కోసం చెప్పిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా దగాచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకవైపు మహిళలను మోసం చేస్తూనే మరోవైపు ఇంకా వారిని భ్రమల్లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేడు మార్కాపురంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్నారు. చంద్రబాబు పర్యటనను జిల్లాలోని మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒట్టిమాటలు చెప్పడం మానేసి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.మెడి‘కలే’నాసాక్షి ప్రతినిధి, ఒంగోలు/ఒంగోలు టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలతో మహిళా సంక్షేమం తీసుకొస్తామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఊరువాడా హోరెత్తించారు. మాయమాటలు చెప్పి ఓట్లేయించుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత తల్లికి వందనానికి ఎగనామం పెట్టారు. ఉచిత బస్సు ఊసే మరిచారు. మూడు సిలిండర్లకు కోతలు పెట్టారు. చేసిన హామీలన్నిటినీ అటకెక్కించారు. కాపురాలు కూల్చి మహిళల కాపురాల్లో చిచ్చుపెట్టే మద్యం వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఊరూరికి మద్యం సరఫరా చేస్తూ మహిళలపై హింసను రాజేస్తూ నాయకుల సంపద పెంచే పనిలో పడ్డారు. తల్లికి వందనానికి తొలి ఏడాదే ఎగనామం: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమ్మ ఒడి పేరుతో ఏడాదికి రూ.15 వేల చొప్పున అందించారు. 2019 నుంచి క్రమం తప్పకుండా అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారు. జిల్లాలో మొత్తం రూ.1358 కోట్లను తల్లుల ఖాతాలో జమచేశారు. కానీ ఇందుకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం తొలి ఏడాదే తల్లికి వందనం పథకానికి ఎగనామం పెట్టింది. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికి ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున అందిస్తామని చెప్పిన చంద్రబాబు అండ్ కో ఇచ్చిన మాట తప్పి తొలి ఏడాదే తల్లులను మోసం చేసిందని మహిళలు మండిపడుతున్నారు. జిల్లాలో 1 నుంచి 6వ తరగతి వరకు 96,258 మంది విద్యార్థులుండగా, 6 నుంచి 9వ తరగతి వరకు 94,362 మంది ఉన్నారు. ఇక 29,603 మంది పదో తరగతి, 43,441 మంది ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. మొత్తం మీద 2,63,664 మంది విద్యార్థులకు గాను ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున రూ.395 కోట్ల 49 లక్షల 60 వేలను కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టిందని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఈ ఏడాది పథకాన్ని అమలు చేస్తానని చెబుతున్నా బడ్జెట్లో అరకొర నిధులను కేటాయించడంతో ఎన్ని కోతలు పెడతారోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. షరతులతో ఉచిత బస్సు... రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం అధ్యయనం పేరిట కాలయాపన చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2025–26 బడ్జెట్లో కూడా దీనికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణానికి పరిమితులు విధిస్తూ కేవలం జిల్లాలోపు మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారని చెబుతున్నారు. ఈ పరిమితులపై మహిళలు మండిపడుతున్నారు. జిల్లాలో 13 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణంపై ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏడాదికి ఒక్క గ్యాస్ సిలిండరే... ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటూ కూటమి నాయకులు హామీ ఇచ్చారు. గత ఏడాది దీపావళి రోజు దీపం 2.0 పథకాన్ని ప్రారంభించారు. అయితే గత ఏడాది కేవలం ఒక్క గ్యాస్ సిలిండర్ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అది కూడా నామమాత్రంగా అమలు చేస్తుండడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 49 గ్యాస్ ఏజన్సీల ద్వారా వంటగ్యాస్ సరఫరా చేస్తారు. జిల్లాలో 3,26,865 ఐఓసీ కనెక్షన్లు ఉన్నాయి. 1,57,202 హెచ్‌పీ కనెక్షన్లు, 2,16,323 బీఈసీ కనెక్షన్లు ఉన్నాయి. మొత్తం 7.39 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. దీపం 2.0 పథకం ప్రారంభోత్సవం సమయంలో జిల్లాలో 4,80,711 మంది లబ్ధిదారులు ఉన్నట్లు అధికారులు చెప్పడం గమనార్హం. దీనిని బట్టి చూస్తే మిగతా 2.60 లక్షల మందికి ఉచిత గ్యాస్ లేనట్టేనని చెప్పవచ్చు. ప్రభుత్వం కేటాయించిన నిధుల ప్రకారం చూస్తే సగానికి సగం మందికి కూడా ఉచిత గ్యాస్‌కు సంబంధించిన నగదు జమ కావట్లేదు. నెలకు రూ.1500 పథకం ఊసే లేదు: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 55 ఏళ్లు దాటిన మహిళలకు ఏడాదికి రూ.18 వేలు ఇచ్చారు. అదే పథకానికి రంగుపూసిన చంద్రబాబు 19 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ పథకం గురించి ఇప్పుడు అస్సలు మాట్లాడడం లేదు. జిల్లాలో 7.80 లక్షల మంది 19 నుంచి 45 ఏళ్ల వయసు కలిగిన మహిళలున్నారు. 5.2 లక్షల మంది 45 పైబడిన వయసు కలిగిన మహిళలున్నారు. వీరంతా నెలకు రూ.1500 వస్తాయి కదా అనుకొని ఆశ పడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో మండిపడుతున్నారు. మద్యంతో మహిళలపై పెరిగిన హింస... చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు సంక్షేమాన్ని విస్మరించి టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులకు సంపద సృష్టించి ఇవ్వాలన్న తపనతో మద్యం వ్యాపారాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. జిల్లాలో 171 మద్యం దుకాణాలను కేటాయించగా, 2500కు పైగా బెల్టు దుకాణాల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నారు. జిల్లాలో గుక్కెడు మంచినీళ్లు దొరకడం లేదు కానీ కావలసినంత మద్యం మాత్రం దొరకుతోంది. దీంతో గ్రామాల్లో మందుబాబుల సంఖ్య బాగా పెరిగింది. తప్పతాగి ఇంటికెళ్లి భార్యాబిడ్డలను వేధిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం ప్రభావం ఎక్కువగా మహిళలపై ఉందని, ఇటీవల మహిళలపై హింస బాగా పెరిగిపోయిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మార్కాపురం పట్టణం వ్యూనిలిచిన మార్కాపురం మెడికల్ కళాశాల భవనం హామీలు అమలు చేయకుండా మహిళలను వంచించిన చంద్రబాబు తొలి ఏడాది తల్లికి వందనానికి ఎగనామం మహిళలకు ఉచిత బస్సుపైనా కాలయాపన 18 ఏళ్లు పైబడిన మహిళలకు నెలకు రూ.1500 ఊసే లేదు 45 ఏళ్లు నిండిన మహిళలకు రూ.20 వేలు ఇస్తామన్న హామీకి మంగళం ఏడాదికి మూడు సిలిండర్లంటూ తొలి ఏడాది ఒక్క సిలిండర్‌తో సరి విచ్చలవిడి మద్యం వ్యాపారంతో మహిళలపై పెరిగిన వేధింపులు మార్కాపురం జిల్లా ఏర్పాటయ్యేనా..? మార్కాపురం: కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలు కావస్తున్నా మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించకపోవడంతో ఈ ప్రాంత ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అధికారంలోకి రాగానే జిల్లా ఏర్పాటు చేస్తామని నాటి ఎన్నికల సభలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, లోకేష్ హామీ ఇచ్చారు. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, దర్శి, కనిగిరి ప్రాంతాలను కలుపుతూ జిల్లా ఏర్పాటు చేయడంతో పాటు కందుకూరు, అద్దంకి ప్రాంతాలను ఒంగోలులో కలుపుతామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా ఏర్పాటుపై ప్రకటన చేస్తారని ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్నారు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసేందుకు అన్నీ అర్హతలు ఉన్నాయి. మార్కాపురంలోనే సబ్‌కలెక్టర్, డీఎస్పీతోపాటు గతంలో అదనపు ఎస్పీ స్థాయి అధికారిని ఓఎస్డీగా నియమించారు. మార్కాపురంలో జిల్లా ఆరో దనపు కోర్టు, ఆకాశవాణి కేంద్రం, ఎకై ్సజ్ కార్యాలయాలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జీఎస్టీ కార్యాలయాలు ఉన్నాయి. మార్కాపురం రైల్వేస్టేషన్ రోడ్, మెడికల్ కాలేజీ, జీజీహెచ్, వీటితో పాటు నాలుగు ఇంజినీరింగ్ కళాశాలలు, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, లా, అగ్రికల్చర్, హార్టీకల్చర్ కాలేజీ తదితర విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. జిల్లా కేంద్రం ఏర్పాటైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి వచ్చే నిధులు మార్కాపురానికి వస్తాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు వెళ్లాలంటే పుల్లలచెరువు నుంచి 170 కిలోమీటర్లు, గిద్దలూరు నుంచి 150 కిలోమీటర్లు, దోర్నాల నుంచి 130 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. మార్కాపురం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మార్కాపురంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. కాలేజీ నిర్మాణ పనులు యధావిధిగా జరిగి ఉంటే ఈ ఏడాది ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం ప్రవేశాలు ప్రారంభమై ఉండేవి. పశ్చిమ ప్రకాశంలోని సుమారు 8 లక్షల మంది ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్కాపురానికి సుమారు రూ.475 కోట్లతో మెడికల్ కళాశాల మంజూరు చేశారు. పనులు కూడా దాదాపు 75 శాతం పూర్తయ్యాయి. జిల్లా వైద్యశాలను జీజీహెచ్‌గా మార్చడంతోపాటు 450 బెడ్లు ఏర్పాటుచేసి, 82 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంటు ప్రొఫెసర్లు, డాక్టర్లు అందుబాటులో ఉంచారు. దీంతో రోజుకు సుమారు 750 నుంచి 800 మంది పేషంట్లు వైద్యసేవలు పొందేవారు. 3 ఆక్సిజన్ ప్లాంట్లు, ఐసీయూ యూనిట్, వెంటిలేటర్ సౌకర్యాలు కూడా కల్పించారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం అసంపూర్తి భవనాలంటూ నిలిపేయడంతో పాటు జీజీహెచ్‌లో ఉన్న సుమారు 40 మంది వైద్యులని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు బదిలీ చేసింది. దీంతో వైద్యసేవలు తగ్గిపోయాయి. పశ్చిమ ప్రకాశంలో సుమారు 72 చెంచుగూడేలు ఉన్నాయి. వీరందరికీ కార్పొరేట్ వైద్యం అందాలంటే మార్కాపురం వచ్చి అక్కడి నుంచి కర్నూలు, గుంటూరు వెళ్లాల్సి వస్తోంది. నూతనంగా వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని మెడికల్ కళాశాలను గుజరాత్ తరహాలో పీపీపీ (పబ్లిక్ ప్రైవేటు పార్టనర్షిప్) విధానంలో చేపట్టే ప్రతిపాదనలు చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రైవేటు వ్యక్తుల నియంత్రణలో వైద్యసేవలు అందుతాయి. దీనిపై జనం భగ్గుమంటున్నారు. త్వరగా మార్కాపురం జిల్లాఏర్పాటు చేయాలి పశ్చిమ ప్రకాశం ప్రజల చిరకాల కోరిక అయిన మార్కాపురం జిల్లా ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త్వరగా నిర్ణయం తీసుకోవాలి. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్కాపురం వచ్చినప్పుడు మార్కాపురం కేంద్రంగా జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. – పత్తి రవిచంద్ర, వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిమెడికల్ కళాశాల పూర్తిచేసి అడ్మిషన్లు ప్రారంభించాలి అర్ధాంతరంగా నిలిపేసిన మెడికల్ కళాశాల భవన నిర్మాణాలు పూర్తిచేసి అడ్మిషన్లు వెంటనే ప్రారంభించాలి. వెనుకబడిన ప్రాంత విద్యార్థులు ఎంబీబీఎస్ చదవాలంటే దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. మెడికల్ కళాశాల పూర్తిచేసి ప్రారంభిస్తే ఈప్రాంత విద్యార్థులకు ఉపయోగంగా ఉంటుంది. మెడికల్ కళాశాల నిర్వహణ ప్రైవేటుపరం చేయకుండా ప్రభుత్వమే నిర్మించాలి. – అందె నాసరయ్య, సీపీఐ ఏరియా కార్యదర్శి, మార్కాపురం -
మహిళా పోలీసులు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి
ఒంగోలు టౌన్: విధి నిర్వహణలో నిత్యం మానసిక ఒత్తిడికి గురయ్యే మహిళా పోలీసులు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రతలు తీసుకోవాలని, ఆరోగ్య రక్షణకు తగినంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక పోలీసు కళ్యాణ మండపంలో మహిళా సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డీపీఓ మహిళా సిబ్బంది, సచివాలయ మహిళా పోలీసులు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పాల్గొని మాట్లాడుతూ మహిళా సిబ్బందికి ఏదైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. నిత్యం వ్యాయామం, యోగా చేయాలని, మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలని సూచించారు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటూ నిర్దేశిత లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్‌బాబు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, అర్ఐ సీతారామరెడ్డి, పోలీసు యూనిట్ డాక్టర్ భానుమతి, వైద్యులు థేరాజ్, లావణ్య, శ్యామసుందరి, శిల్ప, ప్రియాంక, జహంగిర్, ఆనంద్ యాదవ్, హైందవి, ప్రియదర్శిని, కిరణ్ కుమార్‌రెడ్డి, రామాంజనేయులు, ప్రవీణ్, శుభశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ -
బినామీ కులకలం!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రతిష్టాత్మక ఒంగోలు ట్రిపుల్ ఐటీ కాలేజీలో ఆయన చెప్పిందే వేదం.. ఆయన ఆ కళాశాలలో పనిచేయరు..ఆయనకు ఆ కాలేజీకి ఎలాంటి సంబంధం లేదు. కాని ఆయన మాటే అక్కడ శాసనం..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే గ్రామానికి చెందిన 50 మందికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలిప్పించిన ఘనత ఆయనది. ప్రభుత్వంలో కీలక మంత్రికి ఆయన బినామీ. దీనికి తోడు కాలేజీలో పనిచేస్తున్న అధ్యాపకులు, సిబ్బంది కొందరు సహకరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎవరా ‘శక్తి’ ఇతను ఓ ఎన్నారై. ఆయన స్వగ్రామం కందుకూరు మండలం ఎడ్లూరుపాడు. ఒంగోలు నగరంలో ఓ జూనియర్ కాలేజీ కూడా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వంలో కీలకంగా ఉండే ఓ మంత్రికి ఆయన బినామీ అని ప్రచారం జరుగుతోంది. సదరు మంత్రి సాన్నిహిత్యంతోనే ట్రిపుల్ ఐటీ కళాశాల వ్యవహారాల్లో మితిమీరి జోక్యం చేసుకోవడమే కాకుండా కాలేజీ పెద్దలను సైతం మంత్రి పేరు చెప్పి బెదిరించి పెత్తనం చలాయిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పచ్చదండు కన్ను... ఒంగోలు ట్రిపుల్ ఐటీ కాలేజీకి సంబంధించి క్యాంపస్–2, క్యాంపస్–3 ఒంగోలు నగరంలో ఉండగా, కడప ఆర్కే వ్యాలీలో క్యాంపస్–1 ఉంది. ఒంగోలు ఎస్ఎస్ఎన్ కాలేజీలో క్యాంపస్–2 నిర్వహిస్తుండగా, దక్షిణ బైపాస్‌లోని రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కాలేజీలో క్యాంపస్–3 నడుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులు ఈ కాలేజీపై కన్నేశారు. ఎలాగైనా సరే కాలేజీపై పెత్తనం కొనసాగించాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ట్రిపుల్ ఐటీ కాలేజీకి సంబంధించి నగరంలోని రెండు క్యాంపస్‌లలో సుమారు 50 మంది టీడీపీ కార్యకర్తలకు ఎలాంటి నోటిఫికేషన్లూ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు ఇప్పించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకే కులం, ఒకే గ్రామానికి ఉద్యోగాలు... ట్రిపుల్ ఐటీ కాలేజీలో పనిచేస్తున్న అధ్యాపకులతో సదరు ఎన్నారైకి మంచి సంబంధాలు ఉన్నాయని తెలిసింది. వారంతా కూడా ఆయన సామాజికవర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. వారు ఆయనతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. వీరితో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆయన స్వగ్రామానికి చెందిన 50 మందికి నిబంధనలు పాటించకుండా ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు ఇప్పించినట్టు సమాచారం. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు లేకుండానే సదరు ఎన్నారై ద్వారా ఈ నియామకాలు జరిగినట్లు తెలుస్తుంది. సదరు మంత్రి ఆశీస్సులతోనే ఈ నియామకాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఫోర్జరీ సంతకాలతో జీతాలు... ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న ఎల్లో గ్యాంగ్ కాలేజీ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల ఒక మహిళా ఉద్యోగిని 20 రోజులకుపైగా విధులకు హాజరుకాకపోయినప్పటికీ రిజిస్టర్లో ఎల్లో గ్యాంగ్ సభ్యులే ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు సమాచారం. ఇదే కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగి కూడా 15 రోజులకుపైగా గైర్హాజరైనప్పటికీ ఎల్లో ముఠా సభ్యులు సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. విధులకు రాకుండానే జీతాలు తీసుకున్నట్లు సమాచారం. అంతేగాకుండా కాలేజీ సిబ్బంది సెలవు పెట్టాలన్నా, వ్యక్తిగత పనుల మీద క్యాంపస్ దాటి బయటకు వెళ్లాలన్నా డైరెక్టర్ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. కానీ, ఈ ఎల్లో గ్యాంగ్ ఉద్యోగులు మాత్రం డైరెక్టర్‌కు చెప్పాపెట్టకుండానే సెలవులు పెట్టడం, క్యాంపస్ నుంచి బయటకు వెళ్లి రావడం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, కాలేజీలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్నట్లు సమాచారం. చీటికీమాటికీ వారిమీదకు ఒంటి కాలితో వెళ్లడమే కాకుండా ‘రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలో ఉంది. మా వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు’ అంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు బడుగు బలహీన వర్గాలకు చెందిన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలో ఎల్లో గ్యాంగ్ డెన్... ఔట్ సోర్సింగ్ ద్వారా వీరిని కేర్ టేకర్, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్లు, ఐటీ టెక్నీషియన్లు, అటెండర్లు, సెక్యూరిటీ సిబ్బందిగా నియమించినట్లు చెబుతున్నారు. ఎగ్జామినేషన్ సెల్ పక్కనే ఉన్న ఒక గదిని వీరు డెన్‌గా ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. కాలేజీకి వచ్చి బయోమెట్రిక్ వేసి గదిలోకి వెళ్లిపోయి టైం పాస్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎల్లో గ్యాంగ్ చేష్టలకు ట్రిపుల్ ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు భయపడి మిన్నకుండిపోతున్నట్లు తెలిసింది. వీరి ఆగడాలను తట్టుకోలేక కళాశాల నిర్వాహకుల దృష్టికి తీసుకువెళితే.. వారు సైతం తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. -
మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం
● ఒకరికి తీవ్ర గాయాలు బేస్తవారిపేట: మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఈ సంఘటన బేస్తవారిపేట బస్టాండ్ ఆవరణలో గురువారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. అర్థవీడు మండలం కాకర్లకు చెందిన రైతు ట్రాక్టర్‌పై పొగాకు బేళ్లను బేస్తవారిపేట జంక్షన్ వైపునకు తీసుకువెళ్తున్నాడు. అదే సమయంలో లారీలో బెంగుళూరు నుంచి విజయవాడకు ప్రైవేట్ కంపెనీ బ్యాటరీలను తరలిస్తున్నారు. లారీ డ్రైవర్ పూటుగా మద్యం సేవించి ట్రాక్టర్ వెనుక వైపున ట్రాలీని ఢీకొట్టాడు. దీంతో ట్రాలీలోని పొగాకు బేళ్లు రోడ్డుపై అడ్డదిడ్డంగా పడిపోయాయి. పొగాకు బేళ్లు సర్వీస్ రోడ్డులో తోపుడు బండ్లపై పడటంతో పండ్లు నేలపాలయ్యాయి. ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ అదుపుతప్పి రోడ్డు మార్జిన్లో కంభం వైపు మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టింది. మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఆర్మీ ఉద్యోగి బీరబోయిన నాగేంద్రను మోటార్‌సైకిల్‌తో కొద్ది దూరం లారీ లాక్కెళ్లింది. ప్రమాదంలో నాగేంద్ర చెయ్యి నుజ్జు నుజ్జు కాగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని 108లో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డ్రైవర్ లారీని ఆపకుండా పరారవుతుండటంతో పోలీసులు వెంబడించి పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
●వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ ఒంగోలు సిటీ: రేపు జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ పిలుపునిచ్చారు. గురువారం ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రమణమ్మ మాట్లాడారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహిళా దినోత్సవంలో భాగంగా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మను సన్మానించనున్నట్లు తెలిపారు. ముఖ్య అతిథులుగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జ్‌లు, ముఖ్య నాయకులు పాల్గొంటున్నట్లు వెల్లడించారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు భూమిరెడ్డి రమణమ్మ, ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షురాలు బడుగు ఇందిర, హనుమంతునిపాడు ఎంపీపీ గాయం సావిత్రి, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్న, జి.మేరీ, సయ్యద్ అప్సర, పార్టీ జిల్లా సెక్రటరీ జాన్సీ, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ విగ్రహాన్ని అవమానపరిచిన విద్యార్థుల సస్పెన్షన్ ఒంగోలు టౌన్: స్థానిక రెడ్డి హాస్టల్లో బుధవారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి టీడీపీ జెండాలు కట్టి అవమానించిన విద్యార్థులపై క్విస్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటనకు పాల్పడిన ఆరుగురు విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న వి.హేమంత్, జి.రితీష్, బీవీ చక్రధర్, పి.విష్ణు, పి.మణి, కె.భానులను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు తెలియజేసింది. తదుపరి నిర్ణయం వరకు వీరి సస్పెన్షన్ అమలులో ఉంటుందని తెలిపింది. -
దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం అవసరం
● యూత్ పార్లమెంట్ పోస్టర్ ఆవిష్కరించిన ఏకేయూ వీసీ మూర్తి, రిజిస్ట్రార్ హరిబాబు ఒంగోలు సిటీ: దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం ఎంతో అవసరమని స్థానిక ఆంధ్రకేసరి యూనివర్శిటీ (ఏకేయూ) వీసీ ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు అన్నారు. కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక ఆంధ్రకేసరి యూనివర్శిటీ పరిపాలనా భవనం వద్ద ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ పోస్టర్‌ను గురువారం వారు లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారిన కాలానికి అనుగుణంగా యువత తమ మేధాసంపత్తితో ప్రతి రంగంలోనూ భారతావనిని ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ముందుకు తీసుకెళ్లాలన్నారు. యువత యూత్ పార్లమెంట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్‌లో ఉన్నతంగా ఎదగాలన్నారు. నేడు దేశానికి యువత అవసరం ఎంతో ఉందన్నారు. జిల్లాలోని యువత ఈ సదావకాశాన్ని వినియోగించుకుని దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు. విక్రమ సింహపురి యూనివర్శిటీలో జరిగే యూత్ పార్లమెంట్ పోటీల్లో 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు గల ఆంధ్రకేసరి యూనివర్శిటీ పరిధిలోని యువత పాల్గొనవచ్చని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి ఆసక్తి గల యువతీ యువకులు ముందుగా మై భారత్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అదే విధంగా ఒక్క నిమిషం కాలం నిడివి కలిగిన ‘వాట్ డస్ వికసిత్ భారత్ మీన్ టూ యూ’ అనే అంశంపై వీడియో తీసి మార్చి 9వ తేదీ అర్ధరాత్రి 12 గంటల్లోపు అప్లోడ్ చేయాలని ఆంధ్రకేసరి యూనివర్శిటీ ఎన్.ఎస్.ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ మండే హర్షప్రీతం దేవ్‌కుమార్ యువతీ యువకులకు సూచించారు. యూత్ పార్లమెంట్ పోటీల్లో ఆంధ్రకేసరి యూనివర్శిటీ విద్యార్థులు, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన యువతీ యువకులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనే విధంగా సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏకేయూ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజమోహన్‌రావు, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.నిర్మలామణి, నెహ్రూ యువ కేంద్రం జిల్లా కో ఆర్డినేటర్ కమల్ షా, సహాయ ఆచార్యులు డాక్టర్ ఉబ్బా ఈతముక్కల, జాస్మిన్, ఎన్.ఎస్.ఎస్ వలంటీర్లు, ఏకేయూ బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రకాశం
36/257గరిష్టం/కనిష్టంనిద్ర చేసి వస్తూ.. తండ్రి మృతిచెందిన నేపథ్యంలో సోదరి ఇంటికెళ్లి నిద్రచేసి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై యాక్సిస్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ మృతిచెందాడు. మూగ వేదన.. రైతుల రోదన పశ్చిమ ప్రకాశంలోని వందకుపైగా గ్రామాల్లో పశుగ్రాసం కొరతతో పశువులు, వాటి పోషకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణం ఉదయం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటుంది. రాత్రి చలిగాలులు వీస్తాయి. శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025– 8లో.. -
వైఎస్సార్ విగ్రహంపై దాడి జుగుప్సాకరం
● వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ఒంగోలు సిటీ: జనహృదయనేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై దాడి చేయడం జుగుప్సాకరమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఒంగోలు రెడ్డి హాస్టల్లోని వైఎస్సార్ విగ్రహంపై బుధవారం కొందరు యువకులు దాడి చేయడంపై గురువారం ఆయన స్పందించారు. కొందరు విద్యార్థులు విపరీత ధోరణితో వైఎస్సార్ విగ్రహంపై దాడి చేయడమంటే కులాల మధ్య చిచ్చుపెట్టే అవకాశం లేదా అని ప్రశ్నించారు. విద్యార్థులు అన్ని కులాలకు సంబంఽధించిన వారు ఉంటారన్నారు. వీరందరి ఉజ్వల భవిష్యత్ కోసం వైఎస్సార్ చేసిన మేలును మరిచారా అని ప్రశ్నించారు. వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ కండువాలు కప్పి సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించారన్నారు. వృత్తి పరంగా వైద్యుడైన వైఎస్సార్.. ప్రజా జీవితంలోకి వచ్చి సర్వజనులకు సేవలందించిన మహనీయునిగా ముద్ర వేసుకున్నారన్నారు. పాదయాత్ర తర్యాత సర్వజనుల నిజజీవితాలను గుర్తించి సంస్కరణలు రూపొందించి నిరుపేదలను సైతం ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారన్నారు. అందరి ఉన్నతికి బాటలు వేసిన మహానేతను అవమానించడం సమంజసం కాదంటూ హితవు పలికారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష మార్కాపురం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 8వ తేదీ మార్కాపురం వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లపై గురువారం రాత్రి మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మార్కాపురంలో సమీక్ష నిర్వహించారు. తర్లుపాడు రోడ్డులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్, సభా వేదిక, తదితర ప్రాంతాలను పరిశీలించారు. వారి వెంట జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ త్రివినాగ్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను ఎస్పీ దామోదర్ పరిశీలించారు. హెలీప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, కాన్వాయ్ మార్గాలను తనిఖీ చేసి పలు సలహాలు, సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఆయన వెంట అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ నాగరాజు, ఎస్ఎస్జీ డీఎస్పీ పోతురాజు, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, సీఐ సుబ్బారావు తదితరులు ఉన్నారు. నేరాల కట్టడిలో డ్రోన్ కెమెరాల పాత్ర కీలకం ● ఎస్పీ దామోదర్ ఒంగోలు టౌన్: నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో డ్రోన్ కెమెరాలు చాలా ఉపయోగపడతాయని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. నిఘా అవసరాల కోసం కామేపల్లి గ్రామానికి చెందిన ఏలూరు రాంబాబు జిల్లా పోలీసు శాఖకు అత్యంత ఆధునిక సాంకేతికతతో కూడిన డ్రోన్ కెమెరాను గురువారం బహూకరించారు. స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎస్పీ దామోదర్‌కు ఈ డ్రోన్ కెమెరా అందజేశారు. ఆ కెమెరాను వెంటనే జరుగుమల్లి పోలీసు స్టేషన్‌కు ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతానికి 30 కెమెరాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో నేరాలు జరిగే ప్రాంతాలకు డ్రోన్ కెమెరాలు పంపించి నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్య కూడళ్లలో కూడా డ్రోన్ కెమెరాలతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సింగరాకొండ సీఐ హజరత్తయ్య, జరుగుమల్లి ఎస్ఐ మహేంద్ర పాల్గొన్నారు. -
అన్ని రంగాల్లో మహిళల ప్రావీణ్యం
ఒంగోలు సిటీ: ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో ప్రావీణ్యం సాధించి తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని పశుసంవర్థకశాఖ జేడీ డాక్టర్ బేబీరాణి అన్నారు. ఈ నెల 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం ఒంగోలు అంబేడ్కర్ భవన్ ప్రాంగణంలో ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ మహిళలు సమాజంలో ప్రత్యేక స్థానం సంపాదించుకునేందుకు ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కల్పిస్తోందనారు. నేటి కాలంలో పురుషులకు సమానంగా అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారన్నారు. సీ్త్ర అనుకుంటే ఏ రంగంలోనైనా విజయం సాధించేలా కష్టపడుతుందన్నారు. మార్కాపురం డీడీ డాక్టర్ రాఘవయ్య మాట్లాడుతూ విద్యారంగంలో, వైద్యరంగంలో నేడు మహిళలే అగ్రస్థానంలో ఉన్నారన్నారు. కుటుంబంతో పాటు చేసే పనిని కూడా సొంత పనిగా చేయగల శక్తి మహిళలకే ఉందన్నారు. వీపీసీ డీడీ డాక్టర్ జగత్ శీనివాసరావు మాట్లాడుతూ తల్లిగా, చెల్లిగా, భార్యగా తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహిళలు.. నేడు అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. అనంతరం స్టేట్ యూనియన్ ప్రెసిడెంట్ రాజేష్, ప్రకాశం యూనియన్ ప్రెసిడెంట్ వాసు తిరుపాలు, గురవయ్య, శశి పలువురు నాయకులు మాట్లాడారు. మహిళలందరూ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నృత్యాలు చేసి అలరించారు. కార్యక్రమంలో పశుసంవర్థకశాఖ మహిళా సహాయకులు, తదితరులు పాల్గొన్నారు. పశుసంవర్థకశాఖ జేడీ డాక్టర్ బేబీరాణి ఘనంగా మహిళా దినోత్సవం ముందస్తు వేడుకలు -
జరిమానా 20 వేలు!
పన్ను 13 వేలు..ఒంగోలు టౌన్: ఆస్తి పన్ను, నీటి పన్నుల వసూళ్ల విషయంలో ఒంగోలు నగరపాలక సంస్థ ఉద్యోగుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 31వ తేదీతో ఆర్థిక సంవత్సరం గడువు ముగుస్తుండటంతో పన్ను బకాయిల వసూళ్లపై నగరపాలక సంస్థ రెవెన్యూ, ఇంజినీరింగ్ అధికారులు ఒక్కసారిగా ప్రజలపై ఒత్తిడి పెంచి జులుం ప్రదర్శిస్తున్నారు. పన్నుల వసూళ్లపై ఇన్నాళ్లూ నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రస్తుతం ఏకంగా మంచినీటి కుళాయిలు కట్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అంతేగాకుండా అసలు పన్ను కంటే జరిమానాలు రెట్టింపు వేసి జనాన్ని వేధిస్తున్నారు. మంచినీటి కనెక్షన్ లేకపోయినా సరే నీటి పన్ను కట్టమంటూ విడ్డూరంగా మాట్లాడుతుండటంతో నగర ప్రజలు బెంబేలెత్తుతున్నారు. స్పెషల్ డ్రైవ్ పేరుతో వేధింపులు... ఒంగోలు నగరంలోని సంతపేట, సుజాతనగర్, ఆర్పీ రోడ్డు, పీఐపీ రోడ్డు, రాజీవ్ నగర్లో పన్నుల వసూళ్లపై బుధవారం నగరపాలక సంస్థ అధికారులు, ఉద్యోగులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుతో ప్రజలు భయాందోళకు గురయ్యారు. కరోనా మహమ్మారి దెబ్బకు నగరంలో అనేక మంది వ్యాపారాలు దెబ్బతిన్నాయి. రెండేళ్లపాటు వ్యాపారాలు లేక నష్టాలపాలయ్యారు. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలు, సామాన్యులు కుటుంబ పోషణ కూడా కష్టమై ఇబ్బందులు పడ్డారు. దాంతో అనేక మంది ఇంటిపన్నులు, మంచినీటి కుళాయి పన్నులు చెల్లించలేకపోయారు. మానవతా దృక్పథంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పన్ను వసూళ్ల విషయంలో ప్రజలపై ఒత్తిడి చేయలేదు. దాంతో అనేక మంది సామాన్యులు, చిరువ్యాపారులు పన్ను బకాయిపడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రావడంతో సకాలంలో పన్నులు చెల్లించని పౌరులను నగరపాలక సంస్థ అధికారులు దొంగల్లాగా చూస్తున్నారని కొందరు మండిపడుతున్నారు. పన్నులన్నీ చెల్లించాలంటూ ఒకేసారి తీవ్రమైన ఒత్తిడికి గురిచేయడంపై ఆందోళన చెందుతున్నారు. కుళాయి మంజూరు చేయకుండానే పన్ను..! గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమృత్ పథకంలో మంచినీటి కుళాయి కోసం నాగాంజనేయులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, కుళాయి మంజూరు చేయకుండానే దానికి పన్ను వేశారు. ఇప్పుడు తాజాగా నగరపాలక సంస్థ అధికారి భాస్కర్ మంచినీటి కనెక్షన్ పీకేస్తామని చెప్పడంతో ఆయనకేమీ పాలుపోలేదు. అయ్యా.. నాకు నగరపాలక సంస్థకు సంబంధించిన మంచినీటి కుళాయి కనెక్షనే లేదు.. నా సొంత ఖర్చులతో ఇంట్లో బోరు వేసుకున్నానని ఆయన చెప్పుకున్నారు. అయినప్పటికీ ఆర్ఓ వినలేదు. బోరు కనెక్షన్ పీకేస్తామంటూ హెచ్చరించడమే కాకుండా దురుసుగా ప్రవర్తించినట్లు బాధితుడు వాపోయాడు. పన్ను కట్టేందుకు కాస్త సమయం ఇవ్వమని బతిమాలినప్పటికీ వినకుండా అవమానకరంగా మాట్లాడినట్లు చెపుతున్నారు. జరిమానాతో సహా పన్ను కట్టకపోతే నీవు ఎలా వ్యాపారం చేసుకుంటావో చూస్తానంటూ వార్నింగ్ ఇవ్వడంతో భయాందోళనకు గురైన నాగాంజనేయులు.. కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇది కేవలం నాగాంజనేయులు సమస్య మాత్రమే కాదు. గత కొన్ని రోజులుగా నగరంలోని అనేక మంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య అని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. పన్నులు చెల్లించడానికి ప్రజలకు మరికొంత సమయం ఇవ్వాలని, పెద్ద మొత్తంలో బకాయిలున్న వారికి విడతల వారీగా పన్నులు చెల్లించుకునే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేగాకుండా పన్నుల మీద విధించిన జరిమానాలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. నగరపాలక సంస్థలో పన్ను పేరుతో జులుం.! పన్నుల భారంతో ప్రజలు విలవిల మంచినీటి కనెక్షన్ లేకపోయినా పన్ను కట్టమంటూ ఒత్తిడి వారం టైం ఇవ్వమని అడిగినా.. ససేమిరా అంటున్న ఉద్యోగులు ఉద్యోగుల వేధింపులతో చిరువ్యాపారులు, సామాన్య ప్రజల బెంబేలు రెట్టింపు జరిమానాలతో బెంబేలు... పన్నులు కడితే సరేసరి.. లేకపోతే ఇంటి కుళాయి కనెక్షన్లు కట్ చేస్తామంటూ నగరపాలక సంస్థ అధికారులు, ఉద్యోగులు ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అయితే, పన్నుల వరకై తే అప్పోసొప్పో చేసి చెల్లించేవారిమని, కానీ, రెట్టింపు జరిమానాలు వేసి కడతారా.. చస్తారా..? అంటూ ఒత్తిడి చేస్తే ఎలాగని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని మంగమూరు రోడ్డులో నివాసముంటున్న పెరకం నాగాంజనేయులుకు నగరపాలక సంస్థ ఉద్యోగులు ఇంటిపన్ను కట్టాల్సిందిగా గురువారం నోటీసులిచ్చారు. అసలు పన్ను 13 వేల రూపాయలు కాగా, దానికి జరిమానా 20 వేల రూపాయలు వేయడంతో ఆయన బిత్తరపోయారు. మొత్తం 33 వేల రుపాయలను సాయంత్రంలోపు కట్టకపోతే మీ ఇంటి మంచినీటి కుళాయి కనెక్షన్ పీకేస్తామంటూ నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారి భాస్కర్ బెదిరింపులకు దిగినట్లు నాగాంజనేయులు తెలిపారు. -
ధ్యానం, వ్యాయామంతో ఆరోగ్యం
● ఏకేయూ వీసీ ప్రొఫెసర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు ఒంగోలు సిటీ: ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ధ్యానం, వ్యాయామం ముఖ్యమైనవని ఏకేయూ వీసీ ప్రొఫెసర్ మూర్తి, రిజిస్ట్రార్ ఫ్రొఫెసర్ బి.హరిబాబు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని ఆంధ్రకేసరి యూనివర్శిటీ సమావేశపు హాలులో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజమోహన్ రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమనే సూత్రాన్ని ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. సూర్యోదయాన్నే చేపట్టాల్సిన ధ్యానం, వ్యాయామం తదితర సన్మార్గాల గురించి వివరించారు. వ్యాయామం, ధ్యానం అనేవి వయసుతో నిమిత్తం లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ చేపట్టవచ్చన్నారు. వైద్యులు డాక్టర్ ప్రసాదరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పక ఆరోగ్య సూత్రాలు పాటించాలన్నారు. ఈ సందర్భంగా పలువురు యోగా మాస్టర్లు యోగసానలు వేసి చూయించారు. ఏకేయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ దేవీ వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలకు స్వీయ రక్షణ నైపుణ్యం అవసరం
● ఎస్పీ ఏఆర్ దామోదర్ ఒంగోలు టౌన్: మహిళలు స్వీయ రక్షణ నైపుణ్యాన్ని పెంచుకోవాలని, మానసికంగా, శారీరకంగా ధృఢంగా ఉండాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. నేటి సమాజంలో మహిళలపై అనేక ఆకృత్యాలు జరుగుతున్నాయని, ఇలాంటి సమయంలో తమను తాము రక్షించుకునేలా తర్ఫీదు పొందాలని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్లో వివిధ కళాశాలలకు చెందిన 600 మంది విద్యార్థినులకు స్వీయ రక్షణపై అవగాహన కల్పించారు. మార్చి 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మహిళా సాధికార ఉత్సవాలు నిర్వహించిన పోలీసు శాఖ ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థినులకు ఓపెన్ హౌస్, వ్యాసరచన ,వక్తృత్వ, చిత్రలేఖన పోటీలను నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. సెల్ఫ్ డిఫెన్స్ అంటే కేవలం శారీరక శక్తి మాత్రమే కాదని, ప్రతికూల సమయాల్లో స్పందించే సామర్థ్యాన్ని పెంచుకోవడం కూడా సెల్ఫ్ డిఫెన్స్‌గా పేర్కొన్నారు. ఆత్మ రక్షణ మహిళలకు ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుందని, మానసికంగా బలోపేతం చేస్తుందన్నారు. విద్యార్థినులు ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు వాడవద్దని సూచించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. క్రమశిక్షణతో మంచి చదువులతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. మహిళల కోసం జిల్లాలోని అన్నీ పోలీస్స్టేషన్లలో ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళల రక్షణ కోసం పోలీసు శాఖ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అనంతరం ఏపీ పోలీసు కరాటే కోచ్ నల్లూరి మోహన్, సుబ్రహ్మణ్యంలు కరాటేలో కీలకమైన 10 టెక్నిక్లను సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, మహిళా పీఎస్ సుధాకర్, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, ఆర్ఐ సీతారామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిద్ర చేసి వస్తూ...!
● రోడ్డు ప్రమాదంలో అసిస్టెంట్ మేనేజర్ మృతి ● భార్య నిండు గర్భిణి మర్రిపూడి: ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడటంతో ప్రైవేట్ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని రేగలగడ్డ సమీపంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..పొన్నలూరు మండలంలో ముప్పాళ్ల గ్రామానికి చెందిన పత్తిపాటి సుబ్బారావు, సింగమ్మలకు ఇద్దరు కుమారులు, ఇద్దరుకుమార్తెలు. చిన్న కుమారుడైన పత్తిపాటి అశోక్(32) కందుకూరు యాక్సిస్ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అశోక్ తండ్రి సుబ్బారావు 9 నెలల క్రితం మృతి చెందాడు. దీంతో నిద్ర చేసేందుకు దర్శిలో ఉన్న సోదరి వద్దకు బుధవారం రాత్రి వెళ్లాడు. గురువారం ఉదయం తన సొంత గ్రామమైన ముప్పాళ్లకు అశోక్ ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. ఈ క్రమంలో మండంలోని రేగలగడ్డ సమీపంలోకి రాగానే పొదిలి–టంగుటూరు రహదారిపై ఉన్న గుంటల వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడిపోయాడు. ప్రమాదంలో అశోక్ తలకు తీవ్ర గాయాలుకావడంతో గ్రామస్తులు 108 వాహనంలో పొదిలి ప్రభుత్వ వైద్యశాలకుతరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుని అక్క స్రవంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై రవికుమార్ తెలిపారు. మృతుడు అశోక్ భార్య హైమావతి నిండు గర్భిణి. డెలవరీ కోసం హైదరాబాద్ వెద్యశాలకు వెళ్లిట్లు బంధువులు తెలిపారు. తండ్రి చనిపోవడంతో అక్క ఇంటి వద్ద నిద్ర చేసేందుకు వెళ్లి కానరాని లోకానికి వెళ్లిపోవడం, నిండు గర్భిణీ అయిన తన కూతురు ఏమైపోవాలి అని విలపించిన తీరు స్థానికులను కంట తడిపెట్టించింది. -
పొలంలో భారీ ఆగ్నిప్రమాదం
● రూ.8 లక్షల ఆస్తినష్టం. పుల్లలచెరువు: పొలంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకొని రూ.8 లక్షల ఆస్తినష్టం సంభవించింది. ఈ సంఘటన మండల కేంద్రంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మాజీ మండల అధ్యక్షుడు ఆర్. ఽలక్ష్మీధర్మానాయక్, వారి కుమారులు హరినాయక్, శివాజీనాయక్లకు చెందిన పొలంలో వివిధ రకాల పండ్ల మొక్కలు పూర్తిగా ఆగ్నికి ఆహుతయ్యాయి. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. 5 ఎకరాల జామాయిల్, 100 నిమ్మ, 50 మామిడి, 50 శ్రీగంధం, 20 ఉసిరి చెట్లు, 10 స్తంభాలకు సరిపడే సర్వీస్ వైరు, రూ.3 లక్షల విలువైన డ్రిప్ పరికరాలు మొత్తం పూర్తిగా కాలిపోయినట్లుగా బాధితులు తెలిపారు. సమారు రూ.8 లక్షల మేర నష్టం జరిగిట్లుగా వారు వాపోయారు. పైర్‌ఇంజన్ వచ్చే సరికి కొంత మేరకు నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న వీఆర్ఓ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఎంత నష్టం వాటిల్లిందో అంచనా వేసి అధికారులకు నివేదిక ఇస్తామని తెలిపారు. -
రైతుల రోదన
మూగ వేదన..మార్కాపురం: గ్రామాల్లో గ్రాసం కొరడ ఏర్పడింది. గడ్డి ధరలు అమాంతం పెరిగిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రాక్టర్ గడ్డి రూ.15 వేలకు పైనే పలుకుతోంది. దీంతో పాడి రైతులు ఏం చేయాలో తెలియక తల్లడిల్లుతున్నారు. ఎండుగడ్డి దొరికే పరిస్థితి లేకపోవడంతో పాడి పశువులను ఎలా బతికించుకోవాలోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాభావంతో గ్రాసం కొరత.. మార్చి ప్రారంభంలోనే ఎండ తీవ్రతతో అందరూ తల్లడిల్లిపోతున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి వర్షాలు లేకపోవడంతో పశ్చిమ ప్రకాశంలో పశుగ్రాసం కొరత ఏర్పడింది. పశువులు గడ్డికొరతతో పాటు తాగునీటి సమస్య కూడా ఏర్పడింది. పశ్చిమ ప్రకాశంలో గ్రాసం కొరత కొనసాగుతుండటంతో గ్రామాల్లో పాలదిగుబడి తగ్గిపోతోంది. పశ్చిమ ప్రకాశంలోని సుమారు 100 గ్రామాల్లో పశుగ్రాసం కొరత ఏర్పడింది. దీంతో రైతులు పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాలకు వెళ్లి ట్రాక్టర్ గడ్డి రూ.15 వేలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. గ్రాసం కొరత మూలంగా 4 లీటర్లు ఇచ్చే పాడిగేదె 2 లీటర్లే ఇవ్వడంతో పాల ఉత్పత్తి తగ్గిపోతోంది. మార్కాపురం మండలంలోని గజ్జలకొండ, మిట్టమీదపల్లె, కొండేపల్లి, భూపతిపల్లె, బిరుదులనర్వ, నికరంపల్లి, వేములకోట, రాచర్ల మండలంలోని ఆకవీడు, ఆరవీటి కోట, యర్రగొండపాలెం మండలంలోని గంగుపల్లి, పుల్లలచెరువు మండలంలోని గంగవరం, ముటుకుల, మర్రివేముల, శతకోడు, తదితర గ్రామాల్లో గ్రాసం కొరత ఉన్నట్లు తెలిసింది. అర్ధవీడు మండలంలోని పాపినేనిపల్లె, పెద్ద కందుకూరు, కాకర్ల, కొమరోలు మండలంలోని ముక్తాపురం, రాజుపాలెం, కొమరోలు, కురిచేడు మండలంలోని గొల్లపాలెం, తర్లుపాడు మండలంలోని కేతగుడిపి, లక్ష్మక్కపల్లె, రాగసముద్రం, ఉమ్మారెడ్డిపల్లె, తాడివారిపల్లె, తదితర గ్రామాల్లో గ్రాసం కొరత ఉంది. డివిజన్లో ఆవులు, ఎద్దులు సుమారు 36 వేలు, గేదెలు 3,76,520 పాలిచ్చే గేదెలు సుమారు 1,19,200 ఉన్నాయి. ఒక గేదెకు రోజుకు 5కిలోల మేత అవసరం. 5కిలోల కంటే ఎక్కువగా తింటేనే పశువులు పాలు ఇస్తాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాడిగేదెలను బతికించుకునేందుకే పోషకులు నానా కష్టాలు పడుతున్నారు. దాణా కూడా కిలో రూ.15 నుంచి రూ.25కు పెరిగింది. ట్రాక్టర్ గడ్డి రూ.15వేల చొప్పున కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నా దొరకటం లేదు. పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. సాధారణంగా ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు 5 లీటర్లు పాలు ఇచ్చే గేదె ప్రస్తుతం 3 లీటర్లు మాత్రమే ఇస్తుంది. ఎండుగడ్డి కూడా ఆశించినంతగా లేకపోవటంతో గేదెలకు పొదుపుగా వేస్తున్నారు. మార్కాపురం డివిజన్లో సుమారు 10 ప్రైవేట్ పాలడైరీలు పాలసేకరణ చేస్తున్నాయి. పశ్చిమ ప్రకాశంలో 100 గ్రామాల్లో గ్రాసం కొరత ట్రాక్టర్ గడ్డి రూ.15 వేలు పైమాటే తగ్గుతున్న పాలదిగుబడి తల్లడిల్లుతున్న పాడి రైతులు750 ఎకరాల్లో గడ్డి సాగు పశ్చిమ ప్రకాశంలో గడ్డికొరతను అదిగమించేందుకు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 750 ఎకరాల్లో గడ్డిసాగు చేపడుతున్నాం. ఎవరైనా పశుపోషకులు, రైతులు గడ్డిసాగును చేపడితే వారికి అనుమతి ఇస్తాం. గ్రామాల్లో సాగుచేసిన గడ్డిని తమకు వాడుకుని, మిగిలిన గడ్డిని అమ్ముకోవచ్చు. గడ్డి కొరత రాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాం. – రాఘవయ్య, వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్, మార్కాపురం రూ.15 వేలు పెట్టి ట్రాక్టర్ కొన్నా.. వేసవికావడంతో గడ్డికొరత ఎర్పడింది. ఇటీవలే ట్రాక్టర్ గడ్డిని పల్నాడు ప్రాంతం నుంచి రూ.15వేల ప్రకారం కొనుగోలు చేసి తెచ్చాను. పొలాల్లో పచ్చిగడ్డి లేకపోవడంతో ఎండుగడ్డిమీదే ఆధారపడాల్సి వస్తుంది. – సీహెచ్ చెంచిరెడ్డి, పిచ్చిగుంటపల్లి -
ఇంటర్ పరీక్షకు 1562 మంది గైర్హాజరు
ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలు మూడో రోజు గురువారం ప్రశాంతంగా జరిగాయి. మూడో రోజు 23,827 మందికి గాను 22,265 మంది విద్యార్థులు హాజరు కాగా 1562 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ 21,617 మంది విద్యార్థులు గాను 30,378 మంది హాజరవగా, 1239 మంది గైర్హాజరు అయ్యారు. ఒకేషనల్ పరీక్షకు 2210 మందికి గాను 1887 మంది హాజరవగా 323 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో 67 సెంటర్లలో పరీక్షలు సాగాయి. ఆర్ఐఓలు ఆరుగురు, 8 మంది డీఈసీ, డీఐ ఈఓలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. 35 మంది స్క్వాడ్స్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. విద్యుదాఘాతానికి యువకుడి మృతి ● వీధి దీపాల ఏర్పాటుకు స్తంభం ఎక్కిన సమయంలో ప్రమాదం బేస్తవారిపేట: విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని ఎంపీ చెరువులో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని జేబీకేపురానికి చెందిన మీనిగ వెంకట రమణ(24) ఐటీఐ పూర్తి చేశాడు. ఎలక్ట్రీషియన్ పని నేర్చుకుందామని తన సమీప బంధువైన జూనియర్ లైన్‌మెన్‌తో కలిసి రోజువారీ పనికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎంపీ చెరువు గ్రామంలో నాలుగు వీధుల్లో విద్యుత్ స్తంభాలు ఎక్కి వీధి దీపాలు ఏర్పాటు చేశాడు. పాఠశాల ఉన్న వీధిలో కొత్తపేట ఎస్సీకాలనీకి 11 కేవీ సింగల్‌ఫేజ్ విద్యుత్‌లైన్ గతంలో ఏర్పాటు చేసి ఉన్నారు. జూనియర్ లైన్‌మన్ వేరేచోట వీధి దీపాల పనులు చేస్తున్నాడు. ఈ విషయం తెలియని వెంకట రమణ 11 కేవీ విద్యుత్ లైన్ ఉన్న వీధిలోని విద్యుత్ స్తంభం ఎక్కిన సమయంలో విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయాడు. ప్రమాదంలో తలపగిలి తీవ్రంగా గాయపడిన క్షతగాత్రున్ని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతిచెందినట్లు ధృవీకరించారు. మృతుడి తండ్రి క్రిష్ణ మతిస్థిమితం లేక ఇంటి నుంచి వెళ్లి పోయాడు. తల్లి ఆదిలక్ష్మమ్మ వెంకట రమణనను కష్టపడి చదివించింది. చేతికందివచ్చిన ఒక్కగానొక్క కుమారుడు అకాల మరణంతో బోరున విలపించింది. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుల నియామకం ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు దర్శి, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లోని పార్టీ మండల అధ్యక్షులను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దర్శి నగర పంచాయతీ అధ్యక్షునిగా ముతినేడి సాంబశివరావు, దర్శి మండల అధ్యక్షునిగా వెన్నపూస వెంకటరెడ్డి, ముండ్లమూరు మండల అధ్యక్షునిగా చింతా శ్రీనివాసరెడ్డి, దొనకొండ మండల అధ్యక్షునిగా కాకర్ల క్రిష్ణారెడ్డి, తాళ్లూరు మండల అధ్యక్షునిగా తూము వెంకట సుబ్బారెడ్డి, కురిచేడు మండల అధ్యక్షునిగా ఎన్నాబత్తుల వెంకట సుబ్బయ్యలను నియమించారు. అలాగే యర్రగొండపాలెం నియోజకవర్గంలోని యర్రగొండపాలెం మండల అధ్యక్షునిగా ఏకుల ముసలారెడ్డి, దోర్నాల మండల అధ్యక్షునిగా గంటా రమణారెడ్డిలను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. -
అన్నదమ్ముల మధ్య ముదిరిన వివాదం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తొమ్మిదేళ్లుగా స్వగ్రామం తూర్పునాయుడుపాలెంలో జరుపుకుంటున్న పుట్టిన రోజు వేడుకలను ఈ దఫా ఒంగోలు నగరంలో నిర్వహించడం చర్చనీయంగా మారింది. తన సోదరుడు, ఎమ్మెల్యే జనార్దన్‌తో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా సత్య నగర రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనార్దన్, సత్యల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. తాజాగా ఫ్లెక్సీల వివాదం రాజుకోవడంతో సత్య తన పుట్టిన రోజు వేడుకలను పట్టుబట్టి ఒంగోలు నగరంలో నిర్వహించుకున్నారు.భాగ్యనగర్‌లో జరుపుకున్న ఈ వేడుకలకు కొండపి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున నాయకులు, అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదిక మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జనార్దన్ ఫొటో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. త్వరలో ఇక్కడే క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్న ఆయన ఇకనుంచి ఒంగోలు కేంద్రంగా పార్టీ కార్యకలాపాలను నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు చాలా మందిని ఈ వేడుకలకు ఆహ్వానించినప్పటికీ హాజరుకాలేదు. అసెంబ్లీ జరుగుతుందన్న సాకుతో డుమ్మా కొట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద జిల్లా కేంద్రమైన ఒంగోలులో టీడీపీకి ఇప్పటికే రెండు కార్యాలయాలు ఉన్నాయి. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయం ఒకటి భాగ్యనగర్‌లో ఉండగా, గుంటూరు రోడ్డులో జనార్దన్ ఆధ్వర్యంలోని మరో కార్యాలయం ఉంది. తాజాగా సత్య రంగ ప్రవేశంతో మూడో కార్యాలయం సిద్ధమవుతోంది. -
వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ కండువా..
● ఒంగోలు రెడ్డి హాస్టల్ ముందు టీడీపీ కార్యకర్తలు, ఓ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల హల్చల్ ఒంగోలు వన్‌టౌన్: డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీ కండువా వేసిన ఘటన ఒంగోలులో బుధవారం సాయంత్రం జరిగింది. ఒంగోలు మామిడి పాలెం వద్ద ఉన్న రెడ్డి హాస్టల్ ముందు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఉంది. ఈ విగ్రహానికి టీడీపీ కార్యకర్తలు, ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు సాయంత్రం 4 గంటల సమయంలో టీడీపీ కండువా వేశారు. అనంతరం విగ్రహం సమీపంలోనే టీడీపీ జెండా పెట్టారు. హాస్టల్ ప్రహరీ గేటు పక్కన ఉన్న విద్యుత్ లైట్‌ను ధ్వంసం చేశారు. కొంత సేపు అక్కడే నినాదాలు చేస్తూ హల్చల్ చేశారు. దాదాపు 50 మందికి పైగా ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ డ్రస్‌లో ఉన్న విద్యార్థులు, టీడీపీ కార్యకర్తలు రెడ్డి హాస్టల్ వద్ద గుమికూడటంతో లోపల హాస్టల్లో ఉన్న కొద్ది మంది విద్యార్థులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. కాసేపు నినాదాలు చేసిన అనంతరం టీడీపీ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. వీరంతా ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య జన్మదినం కావడంతో వెంగముక్కలపాలెం నుంచి ఒంగోలులోని దామచర్ల సత్య కార్యాలయానికి ర్యాలీగా వెళుతూ మార్గం మధ్యలో ఇలా ఇష్టారీతిన ప్రవర్తించారు. ఈ ర్యాలీకి ముందస్తు పోలీసు అనుమతి కూడా లేదని సమాచారం. ర్యాలీలో ఒక్క పోలీసు కూడా లేకపోవడంతో మద్యం తాగిన టీడీపీ కార్యకర్తలు, విద్యార్థులు నడిరోడ్డుపై చిందులేశారు. రెడ్డి హాస్టల్లో ఉండే విద్యార్థులు కళాశాలలకు వెళ్లడంతో పెద్ద గొడవ తప్పింది. కళాశాల వదిలిన తర్వాత అయితే హాస్టల్లో కూడా విద్యార్థులు అధిక సంఖ్యలో ఉండేవారు. అదే సమయంలో టీడీపీ కార్యకర్తలు వచ్చి ఉంటే పెద్ద ఘర్షణ జరిగి ఉండేది. టీడీపీ కార్యకర్తలు ఇలాంటి కవ్వింపు చర్యలను ఆపాలని స్థానికులు కోరుతున్నారు. రెడ్డి హాస్టల్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై పసుపు కండువాలు వేయడం, కాలితో తన్నడం, విగ్రహంపై కూర్చోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రెడ్డి హాస్టల్ కార్యవర్గం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. -
అందుబాటులో పదో తరగతి పరీక్ష హాల్‌టికెట్లు
ఒంగోలు సిటీ: జిల్లాలో మార్చిలో జరగబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్స్ ను ప్రధానోపాధ్యాయులు వారి స్కూల్ లాగిన్‌లో డౌన్లోడ్ చేసుకోవాలని డీఈఓ అత్తోట కిరణ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ మొదటిసారిగా విద్యార్థుల సౌకర్యార్థం హాల్‌టికెట్స్ ను వాట్స్‌యాప్ యాప్, మన మిత్ర (వాట్సాప్ గవర్నెన్స్) ద్వారా పొందే సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. హాల్టికెట్స్లో పేరు, పుట్టినతేదీ, మీడియం, ఫొటో, సంతకం, సబ్జెక్టు మిస్ మ్యాచ్ ఉంటే సంబంధిత స్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంటనే డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ పరీక్షల విభాగం వారికి ఈ మెయిల్ dirgovexamr@yahoo.com ద్వారా తెలియజేయాలని కోరారు. హత్యకేసులో ఐదుగురికి యావజ్జీవ ఖైదు ఒంగోలు: హత్యకేసులో ఐదుగురు నిందితులకు యావజ్జీవ ఖైదు విధిస్తూ ఒంగోలు 3వ అదనపు జిల్లా జడ్జి డి.రాములు బుధవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన షేక్ ఖాశింపీరా(63) తన కుమారుడు షేక్ ఖాశిం సాహెబ్‌తో కలిసి టెంట్ హౌస్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ నేపథ్యంలో బేల్దారి పనులకు సంబంధించి ఖాశింపీరా తమ్ముడు జిలాని, అదే గ్రామానికి చెందిన మజున్సా నయబా మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో మజున్సా నయబాను ఖాశిం పీరా మందలించాడు. అనంతరం 2017 జనవరి 15న ఖాశిం పీరా మరో తమ్మునితో గొడవపడి కొట్టడంతో ఖాశింపీరా, ఆయన కుమారుడు కలిసి మజున్సా నయబాను మందలించారు. దీనిపై కక్ష పెట్టుకున్న మజున్సా నయబా తమ బంధువులైన మజున్సా రసూల్, మజున్సా బాబు, మజున్సా ఖాజా, మజున్సా మస్తాన్ అలియాస్ మస్తాన్ సాహెబ్ అనే వారితో కలిసి అదే రోజు రాత్రి 8 గంటల సమయంలో టెంట్ హౌస్ మూసివేసి ఇంటికి వెళుతున్న ఖాశింపీరా, ఆయన కుమారుడు మహబూబ్‌బాషాలపై కత్తి, క్రికెట్ బ్యాట్‌తో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. తీవ్రంగా గాయపడిన ఖాశింపీరా వైద్య చికిత్స పొందుతూ మృతిచెందగా ఆయన కుమారుడు మహబూబ్‌బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి పామూరు ఎస్సై సాంబశివరావు కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ ఎం.రాజేష్ విచారణ చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. సాక్షులను విచారించిన అనంతరం నేరం రుజువైనట్లు పేర్కొంటూ నిందితులు ఐదుగురికి జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.7500 చొప్పున జరిమానా విధిస్తూ 3వ అదనపు జిల్లా జడ్జి డి.రాములు తీర్పునిచ్చారు. సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరిచిన సిబ్బందిని, కేసును వాదించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై.ప్రశాంతికుమారిని, సీఐ ఎం.రాజేష్, ఎస్సై సాంబశివరావులను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు. పురుగుమందు తాగి పోలీస్‌స్టేషన్‌కు.. ● వెంటనే ఆస్పత్రికి తరలించిన పోలీసులు ● చికిత్స పొందుతూ మృతి రాచర్ల: పురుగుల మందుతాగిన ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సంఘటన మండల కేంద్రమైన రాచర్ల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలకు సోమిదేవిపల్లె గ్రామానికి చెందిన పిక్కిలి చెన్నరాయుడు(58) అనే వ్యక్తి పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి వెంటనే స్థానిక రాచర్ల పోలీస్ స్టేషన్ వచ్చాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానిక పోలీసులు వెంటనే ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని వెంటనే పోలీస్ వాహనంలోనే గిద్దలూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్సై పి.కోటేశ్వరరావు వెంటనే గిద్దలూరు ఏరియా వైద్యశాలకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్ట కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పిక్కిలి చెన్నరాయుడుకి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. పిక్కిలి చెన్నరాయుడికి రెండేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది. అప్పటి నుంచి భార్య అతడిని వదిలేయడంతో చిన్న కుమారుడి దగ్గర ఉంటున్నాడు. ఈక్రమంలో కుటుంబ సమస్యలతో మనస్తాపం చెందిన చెన్నరాయుడు పురుగులమందు తాగినట్లు సమాచారం. -
అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడండి
పామూరు: అగ్రిగోల్డ్ ఆస్తులను కొల్లగొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వం కస్టమర్లకు న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని కట్టకిందపల్లెవద్ద అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న జామాయిల్ తోటలను, ఇటీవల నరికివేతకు గురైన జామాయిల్ పొలాలను బుధవారం క్షేత్రస్థాయిలో స్థానిక సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నేపల్లి లక్ష్మీనారాయణ, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి తిరుపతిరావు, స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడి 19.52 లక్షల మంది చేసిన డిపాజిట్లను తిరిగి చెల్లించాలని 2015 నుంచి అసోసియేషన్ పోరాటం చేస్తోందన్నారు. రాష్ట్రంలో మొత్తం 24 వేల ఎకరాలను ప్రభుత్వం ఆటాచ్ చేసిందన్నారు. అధికార పార్టీవారు అగ్రిగోల్డ్ ఆస్తులను కొల్లగొడుతున్నారని, జామాయిల్‌ను యథేచ్ఛగా కొట్టి రూ.కోట్లు దండుకుంటున్నారన్నారు. కనిగిరి నియోజకవర్గంలో అగ్రిగోల్డ్‌కు చెందిన పొలాల్లోని జామాయిల్, ఎర్రచందనం నరికించి రూ.కోట్లు కొల్లగొడుతున్నా కాపాడేవారు లేకపోవడం హేయమన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో రూ.20 వేల లోపు డిపాజిట్ ఉన్న సుమారు 10.50 లక్షల మందికి నగదు చెల్లించిందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం 45 రోజుల్లో అగ్రిగోల్డ్ ఆస్తులను అటాచ్చేశారన్నారు. నేడు మేనిఫెస్టోలో అగ్రిగోల్డ్ కస్టమర్లకు న్యాయం చేస్తామని ప్రకటించి ప్రభుత్వం వచ్చి 9 నెలలు పూర్తయినా నేటికీ దానిపై పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి తిరుపతిరావు మాట్లాడుతూ నాడు అగ్రిగోల్డ్ మూతబడిన తరువాత జిల్లాలో 6,500 ఎకరాలు సీజ్‌చేశారని, కట్టకిందపల్లెలో 357 ఎకరాలు పొలాలు ఉన్నాయని వీటిలో జామాయిల్ సాగు ఉందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నేపల్లి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ కస్టమర్లకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ సొమ్ము ఇవ్వాల్సిన పనిలేదని అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మితే అంతకంటే ఎక్కువ మొత్తం వస్తుందని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు సయ్యద్ మౌలాలి, మండల కార్యదర్శి పోతల ప్రభాకర్, వైఎస్సార్ సీపీ నాయకులు అంబటి కొండారెడ్డి పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు -
ఊరిస్తున్న ధరలు..!
పొగాకు రైతును సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్ పరిధి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మొత్తం 11 వేలం కేంద్రాలున్నాయి. ఉమ్మడి ప్రకాశంలో 24 వేల బ్యారన్ల ద్వారా 30 వేల మంది రైతులు పొగాకు సాగు చేస్తున్నారు. 2025–26 సీజన్‌కు సంబంధించి 105.27 మిలియనన్ కేజీల పొగాకును అధికారికంగా అమ్ముకునేందుకు బోర్డు అనుమతి ఉంది. అయితే ప్రస్తుతం సాగు విస్తీర్ణం, వస్తున్న ఉత్పత్తిని పరిశీలిస్తే 162 మిలియన్ కేజీల వరకు ఈ సీజన్లో అమ్మకాలు ఉండొచ్చని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. కర్ణాటక మార్కెట్ సరాసరి రూ.268 ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న పొగాకు వేలంలో ధరలు ఆశాజనకంగానే ఉన్నాయని అక్కడ రైతులు అంటున్నారు. బ్రైట్ గ్రేడ్ కేజీ పొగాకు ధర రూ.337 వరకు పలుకుతోంది. మొత్తం కేజీ పొగాకు సరాసరి ధర చూస్తే రూ.268.25 వరకు వచ్చింది. అయితే ఆంధ్రాలో పెరిగిన సాగు ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ధరలు రూ.300లకు పెంచాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు. గ్రేడింగ్‌లో జాగ్రత్తలు అవసరం.. ఈ ఏడాది పొగాకు నాణ్యత ఆశాజనకంగా ఉండడం రైతులకు ఊరటనిచ్చే అంశంగా మారింది. మొత్తం ఉత్పత్తుల్లో 50 శాతానికి పైగా మొదటి రకం అంటే బ్రేట్గ్రేడ్ వచ్చాయని బోర్డు అధికారులు చెప్తున్నారు. మిగిలిన గ్రేడ్ కూడా ఆశించిన స్థాయిలో నాణ్యతగా ఉన్నాయని చెప్తున్నారు. ఇది వేలంలో రైతులకు సానుకూలాంశంగా మారనుంది. అయితే గ్రేడింగ్ విధానంలో రైతులు సరైన జాగ్రత్తలు పాటించాలని, గ్రేడ్లు వేరు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించి బేళ్లు కట్టాలని సూచిస్తున్నారు. 10 నుంచి వేలం ప్రారంభం: ఈ నెల 10వ తేదీ నుంచి ఉమ్మడి జిల్లా పరిధిలో పొగాకు వేలం ప్రారంభం కానుంది. కందుకూరు–1వ వేలం కేంద్రంతో పాటు ఒంగోలు–1, కొండపి, పొదిలి వేలం కేంద్రాల్లో వేలం ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. మిగిలిన ఏడు వేలం కేంద్రాల్లో కందుకూరు–2, కలిగిరి, డీసీపల్లితో పాటు ఒంగోలు–2, టంగుటూరు, వెల్లంపల్లి, కనిగిరి వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేలం ప్రారంభమయ్యాకే ధరలపై అంచనా ఈనెల 10వ తేదీ నుంచి ఈ సీజన్‌కు సంబంధించి అధికారికంగా పొగాకు వేలం ప్రక్రియ ప్రారంభించనున్నాం. మొదటి దశలో నాలుగు వేలం కేంద్రాలు, 19వ తేదీ మిగిలిన వేలం కేంద్రాల్లో వేలం ప్రారంభిస్తాం. ఈ ఏడాది ఉత్పత్తి బాగా పెరిగింది. రైతులు ఖర్చులకు అనుగుణంగా ధరలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వేలం ప్రారంభమైన తరువాత ధరలపై ఒక అంచనాకు రాగలం. – లక్ష్మణరావు, ఆర్ఎం భారీగా పెరిగిన సాగు ఖర్చులు.. పొగాకు రైతులు పోటీ పడడంతో పొలాల, బ్యారన్ కౌలు ధరలు అమాంతం పెరిగిపోయాయి. గతేడాది లక్ష రూపాయలు ఉన్న బ్యారన్ కౌలు ఈ ఏడాది రూ.2.50 లక్షలకు పెరిగింది. ఇలా పొలం కౌలు, కూలీల రేట్లు అన్నీ రెట్టింపయ్యాయి. ఈ పరిస్థితుల్లో గతేడాది కంటే బ్యారన్‌కు రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు అదనంగా ఖర్చు అయిందని స్వయంగా బోర్డు అధికారులే లెక్కలు వేస్తున్నారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వేలంలో ధరలు కూడా పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేజీ పొగాకు సరాసరి ధరను రూ.300లకు తగ్గకుండా ఇవ్వాలని కోరుతున్నారు. అయితే గతేడాది వేలం ముగిసే సమయానికి కేజీ పొగాకు సరాసరి ధర రూ.254 మాత్రమే ఉంది. అంటే ఈ ఏడాది అదనంగా దాదాపు రూ.50 వరకు సరాసరి ధర పెంచాలని రైతులు డిమాండ్ చేశారు. కానీ రైతులు ఆశించిన స్థాయిలో ఈ ఏడాది మార్కెట్ ఉంటుందా ఉండదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. భారీగా పెరిగిన సాగు ఖర్చులు గత ఏడాది కంటే ఎక్కువ రేటు వస్తేనే లాభాలు సరాసరి రూ.300 ఇవ్వాలని రైతులు డిమాండ్ ఈనెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పొగాకు వేలం -
ప్రకాశం
ఇంటర్ పరీక్షలకు 733 మంది గైర్హాజరు 36.7/259గరిష్టం/కనిష్టంఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష బుధవారం ప్రశాంతంగా జరిగింది. రెండో రోజు 19,047 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 733 మంది గైర్హాజరయ్యారు. 18,314 మంది హాజరయ్యారు. ఇందులో జనరల్ 17,140 మంది విద్యార్థులకు గాను 16,574 మంది విద్యార్థులు హాజరవగా, 566 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ పరీక్షకు గాను 1907 మందికి గాను 1740 మంది విద్యార్థులు హాజరవగా 167 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో 67 సెంటర్లలో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఆరుగురు ఆర్ఐఓలు, 12 మంది డీఈసీలు, 33 మంది స్క్వాడ్స్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉక్కపోతగా ఉంటుంది. రాత్రి చలిగాలులు వీస్తాయి. గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2025 -
సర్పంచ్ చెక్‌పవర్ రద్దు అప్రజాస్వామికం
● మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ సింగరాయకొండ: కొండపి మండలం పెద్ద కళ్లగుంట సర్పంచ్ భువనగిరి సత్యన్నారాయణకు ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా చెక్‌పవర్ రద్దు చేయటం దారుణమని, అప్రజాస్వామిక చర్య అని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. పార్టీ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన కూటమి ప్రభుత్వం చేపడుతున్న అప్రజాస్వామిక చర్యలను ఎండగట్టారు. డాక్టర్ సురేష్ మాట్లాడుతూ ఒక సర్పంచ్‌కు ముందస్తు నోటీసు ఇవ్వకుండా, అతని సంతకం తీసుకోకుండా ఏ ప్రాతిపదికన చెక్‌పవర్ రద్దు చేస్తారని? దీనికి ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి పవన్‌కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం కక్ష సాధింపు చర్యఅని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క పనిచేయనీకుండా అడ్డుకుంటున్నారని, ప్రస్తుతం గ్రామంలో తాగునీటి సరఫరా టీడీపీ నాయకుల పర్యవేక్షణలోనే జరుగుతుందని, ఆరునెలలుగా వీధిదీపాలు లేక గ్రామం అంధకారంలో ఉందని, ఇదేనా గ్రామ స్వరాజ్యం అని ఎద్దేవా చేశారు. గతంలో సర్పంచ్ సత్యన్నారాయణ పనిచేసిన రూ.3 లక్షల బిల్లులు డ్రా చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇకనైనా కక్ష సాధింపు చర్యలు మానుకుని గ్రామాభివృద్ధికి కృషి చేయాలని, చెక్‌పవర్‌ను పునరుద్ధరించాలని ప్రభుత్వానికి సూచించారు. వైఎస్సార్ విగ్రహాన్ని అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలి ● నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్‌ఖాన్ ఒంగోలు టౌన్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని అవమానపరిచిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్‌ఖాన్ డిమాండ్ చేశారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలుచేసి నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేలా సాయపడిన మహానేత విగ్రహంపై కూర్చోవడం, కాలితో తన్నడం మూర్ఖపు చర్యని అన్నారు. మూర్ఖంగా ప్రవర్తించిన విద్యార్థులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
తాజాగా ఫ్లెక్సీల రగడ
ఎమ్మెల్యే జనార్దన్ పుట్టిన రోజు వేడుకలు జనవరి 20వ తేదీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన అభిమానులు నగరం అంతటా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి వరకూ అవి అలాగే ఉన్నాయి. దాదాపు మూడు నెలల పాటు ఈ ఫ్లెక్సీల కారణంగా నగర ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డా ఇటు కార్పొరేషన్ అధికారులు కానీ అటు పోలీసులుకానీ స్పందిస్తే ఒట్టు. సత్య పుట్టిన రోజు సందర్భంగా నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి నెల్లూరు బస్టాండు వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాండ్ వరకు ఫ్లెక్సీలు వేసేందుకు సిద్ధం చేసుకుంటుండగా సోమవారం సాయంత్రం నగర పాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు నగరంలో ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదంటూ నోటీసు ఇవ్వడం వివాదంగా మారింది. నిన్న మొన్నటి వరకు లేని ఆంక్షలు ఇప్పుడే ఎందుకు విధిస్తున్నారో చెప్పాలని సత్య వర్గం ప్రశ్నిస్తోంది. ఎమ్మెల్యే జనార్దన్ ఒత్తిడితోనే నగర పాలక సంస్థ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. -
తెల్ల పేపరుపై హాల్‌టికెట్లు ప్రింట్అవుట్ తీయాలి
ఒంగోలు సిటీ: మార్చి 2025 పరీక్షలకు హాజరయ్యే మొదటి లేదా రెండో సంవత్సరం ఇంటర్మీడియెట్ విద్యార్థులందరూ తమ హాల్‌టికెట్లను వైట్ పేపరు మీద మాత్రమే ప్రింట్ అవుట్ తీసుకొని పరీక్ష హాల్‌కు రావాలని ఆర్ఐఓ సైమన్ విక్టర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలర్ పేపరు మీద హాల్‌టికెట్లను ప్రింట్ అవుట్ తీసిన విద్యార్థులను పరీక్షల హాల్లోకి అనుమతించరని అన్నారు. విద్యార్థులందరూ గమనించాలని కోరారు. పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి ● ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వెంకట శివప్రసాద్ పెద్దదోర్నాల: ఇంటర్, పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వెంకట శివప్రసాద్ ప్రధానోపాధ్యాయులకు సూచించారు. మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ పాఠశాలలో మంగళవారం నంద్యాల, పల్నాడు, ప్రకాశం జిల్లాల పరిధిలోని ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గురుకులాల ప్రిన్సిపాల్, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ గూడెం వారీగా హౌస్‌హోల్డ్ సర్వే నిర్వహించాలన్నారు. గూడేల్లో రేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఫుడ్ బాస్కెట్ ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయులు తమ వంతు విధులు నిర్వహించాలన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, విద్యా నైపుణ్యాలను పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో ఏఎంఓపీ రామాంజనేయులు, ఎంఈఓ కొండల నాయక్, మంతన్న, లాలా అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
అభద్రతలో జనార్దన్...
ఒంగోలు నియోజకవర్గం నుంచి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దామచర్ల జనార్దన్ ఓటమిపాలయ్యారు. ఆ తరువాత 2014 ఎన్నికల సమయంలో ఈ సీటు కోసం దామచర్ల సత్య ప్రయత్నించారు. అయితే జనార్దన్ వైపే అధిష్టానం మొగ్గుచూపింది. ఆ ఎన్నికల్లో జనార్దన్ విజయం సాధించడంలో సత్య కీలకపాత్ర పోషించినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నారు. దాంతో సత్య ఎప్పటికైనా తనకు పోటీగా ఎదుగుతాడన్న అనుమానం జనార్దన్‌లో బలంగా నాటుకొని పోయిందని అంటున్నారు. ఈ క్రమంలోనే 2016లో సత్య పుట్టిన రోజు సందర్భంగా ఒంగోలు నగరంలో ఏర్పాటు చేసిన సత్య ఫ్లెక్సీలను చించేసినట్లు అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. అప్పటి నుంచి స్వగ్రామమైన తూర్పు నాయుడు పాలెంలోనే సత్య పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సత్యకు మారిటైం బోర్డు చైర్మన్ పదవి రాకుండా చేయడానికి ఎమ్మెల్యే జనార్దన్ చివరి నిముషం వరకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే లోకేష్‌తో ఉన్న సాన్నిహిత్యంతో సత్య కార్పొరేషన్ పదవిని తెచ్చుకున్నారు. -
ఆధిపత్య ముల్లు!
దామచర్ల బ్రదర్స్. జిల్లా టీడీపీలో హాట్ టాపిక్. ఇద్దరి మధ్య ఏమాత్రం పొసగడంలేదు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు చేస్తున్న యత్నాలు రసవత్తరంగా మారాయి. ప్రస్తుతం వారిద్దరి మధ్య వివాదం తార స్థాయికి చేరుకుంది. బినామీ పేర్లతో సాగిస్తున్న వ్యాపారాలపై అధికారులను ఉసిగొల్పుతూ కేసులు పెట్టుకునే స్థాయికి వెళ్లింది. తాజాగా ఒంగోలు నగరంలో ఎలాంటి ఫ్లెక్సీలు కట్టరాదంటూ రాత్రికి రాత్రే కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇవ్వడం వెనక తమ్ముడి పుట్టిన రోజు సందర్భంగా చేసే హడావుడికి అడ్డుకట్ట వేసేందుకు అన్న వేసిన ఎత్తుగడ ఇది అని అధికార పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అన్నదమ్ముల మధ్య ఫ్లెక్సీల రగడ ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి. అన్నతమ్ముళ్లు..సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా టీడీపీలో దామచర్ల సోదరుల మధ్య రాజకీయంగానే కాదు వ్యాపార పరంగాను ఆధిపత్య పోరుసాగుతోంది. దామచర్ల జనార్దన్ ఒంగోలు ఎమ్మెల్యేగా ఉండగా, ఆయన సోదరుడు సత్య లోకేష్ అండదండలతో ఏపీ మారిటైంబోర్డు చైర్మన్‌గా ఉన్నారు. ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇద్దరి మధ్య పోరు ముదిరి పాకాన పడింది. అధికారంలోకి వచ్చాక అన్నదమ్ములు పోటాపోటీగా అక్రమ వ్యాపారాలకు శ్రీకారం చుట్టారని, బినామీ పేర్లతో మట్టి, ఇసుక, మద్యం, రేషన్, మైనింగ్ దందాలు చేస్తున్నట్లు ఆరోపణలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఒకరి వ్యాపారాన్ని మరొకరు దెబ్బ తీయాలన్న కసితో అధికారులను ఉసికొల్పుతున్నట్లు సమాచారం. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు.. దామచర్ల సోదరుల మధ్య రాజకీయ వివాదం ప్రస్తుతం వారు చేస్తున్న బినామీ వ్యాపారాలకు పాకిందని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నట్టు సమాచారం. జనార్దన్ అనుచరులు ఇటీవల జరుగుమల్లి, కామేపల్లి మండలాల్లో ఇసుక క్వారీలు కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇక్కడ నుంచి ప్రతి రోజు వందల ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా ఒంగోలుకు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కొండపి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఇక్కడి ఇసుకనంతా ఒంగోలుకు తరలించుకొని పోతే మేమంతా ఏమైపోవాలని ప్రశ్నించినట్లు సమాచారం. దాంతో ఇసుక ట్రాక్టర్లు ఒంగోలుకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సత్య ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా కొంతకాలంగా ఒంగోలు మండలంలోని యరజర్ల, టంగుటూరు మండలంలోని కొణిజేడు, సింగరాయకొండ మండలంలోని పాత సింగరాయకొండ, శానంపూడి తదితర ప్రాంతాల్లోని కొండలు, డీకే భూముల్లో ఇద్దరు మనుషులు భారీగా మట్టి తవ్వకాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో సత్య కు చెందిన వాహనాలపై కేసులు నమోదు చేయాలంటూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. అలాగే సింగరాయకొండలోని ఒక రైస్ మిల్లుపై కూడా జనార్దన్ వర్గం ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విజిలెన్స్ అధికారులపై ఒత్తిడి చేసి మిల్లును సీజ్ చేయించాలని ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మధ్య ముదిరిన పోరు ఒకరి వ్యాపారాలపై మరొకరు గురి చినబాబు అండతో దూకుడు పెంచిన సత్య అభద్రతాభావంలో ఎమ్మెల్యే జనార్దన్ నగరంలో సత్య బర్త్ డే ఫ్లెక్సీలు కట్టకుండా రాత్రికి రాత్రే నోటీసులు రగిలిపోతున్న సత్య అనుచర వర్గం తాడోపేడో తేల్చుకునేందుకు ఒంగోలులో సత్య కార్యాలయం -
టీచకుడు.. వేధిస్తున్నాడు!
కొనకనమిట్ల: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు దారి తప్పాడు. గత కొద్ది కాలంగా అతను మతి చలించి ప్రవర్తిస్తున్న తీరు, అసభ్యకర చేష్టలకు పాల్పడుతున్న వైనాన్ని కొందరు బాలికలు బాలల భక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతికి పూసగుచ్చినట్లు వివరించినట్లు సమాచారం. జిల్లా పర్యటనలో భాగంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మంగళవారం కొనకనమిట్ల మండలంలోని ఓ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం, పాఠశాలను తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణలో లోపాలను గుర్తించి సక్రమంగా నడుచుకోవాలని, గడువు ముగిసిన వస్తువులను వెనక్కి పంపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా యూపీ పాఠశాలలో ఉపాధ్యాయుడు ప్రవర్తిస్తున్న తీరును బాలికల ద్వారా తెలుసుకుని నిశ్చేష్టురాలయ్యారు. మండల స్థాయి అధికారులను పాఠశాలకు పిలిపించి, బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. బాలలపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలికలపై లైంగిక వేధింపుల విషయం తాను వచ్చే వరకు బయటపడలేదంటే అధికారులు ఏం చేస్తున్నట్లు అని అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిషన్ సభ్యురాలి వెంట తహసీల్దార్ సురేష్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజ్‌కుమార్, ఎంపీడీఓ డి.ఈశ్వరమ్మ, డీవైఈఓ శామ్యూల్ జాన్, ఎంఈఓ డాంగే షరీఫ్, బి.నర్సింహారావు, సీహెచ్ఓ ఎస్కే మస్తానమ్మ, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఎంఎస్కే సుధారాణి, బాలల సంరక్షణ అధికారులు ఉన్నారు. ఉపాధ్యాయుడి తీరుపై బాలల హక్కుల కమిషన్ సభ్యురాలికి బాలికల ఫిర్యాదు విచారణ చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు -
ఇంజన్లో మంటలు.. కారు దగ్ధం
హనుమంతునిపాడు: మరమ్మతుల కోసం తీసుకెళ్తుండగా ఇంజన్లో మంటలు చెలరేగి కారు దగ్ధమైంది. ఈ సంఘటన హనుమంతునిపాడు మండలంలోని హాజీపురం సమీపంలో సోమవారం రాత్రి ఒంటి గంట సమయంలో చోటుచేసుకుంది. ఎస్సై ఎం.మాధవరావు కథనం మేరకు.. కనిగిరి పట్టణానికి చెందిన సయ్యద్ హనీఫ్‌కు చెందిన కారుకు మరమ్మతులు చేయించేందుకు డ్రైవర్ మన్నెం కృపాదానం కర్నూలు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో హాజీపురం సమీపంలోని టూరిజం పార్కు వద్ద ఇంజన్ నుంచి పొగలు వచ్చాయి. డ్రైవర్ కారు ఆపి బాయ్నెట్ డోర్ తెరవగా ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో డ్రైవర్ ముఖానికి కాలిన గాయాలయ్యాయి. డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి మంటలు ఆర్పివేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఏఆర్ కానిస్టేబుల్ అదృశ్యం ● పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య కంభం: తన భర్త 15 రోజులుగా ఇంటికి రావడం లేదని షేక్ నఫియా అనే వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. కంభం పట్టణానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ఆరీఫ్ బాషాతో నఫియాకు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. ఇటీవల కాలంలో భర్త ప్రవర్తన సక్రమంగా లేకపోవడంతో ఎస్పీ కార్యాలయంలో ఆమె గోడు వెళ్లబోసుకున్నారు. ఉన్నతాధికారుల సూచన మేరకు మంగళవారం ఆమె కంభం పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత 7 నెలలుగా ఇంటి అవసరాలకు భర్త డబ్బు ఇవ్వడం లేదని, గత 15 రోజులుగా ఫోన్ స్విచాఫ్ చేశాడని వాపోయారు. పోలీసులు విచారించి న్యాయం చేయాలని కోరారు. కేసుల పరిష్కారానికి కక్షిదారులు సహకరించాలి ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి ఒంగోలు: ఇరువర్గాల ఆమోదంతో కేసుల పరిష్కారానికి కక్షిదారులంతా సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎ.భారతి పేర్కొన్నారు. ఈనెల 8వ తేదీ రెండో శనివారం దేశవ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని న్యాయస్థానాల్లో ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తారన్నారు. రాజీకి అర్హత కలిగిన అన్ని క్రిమినల్ కేసులు, మోటారు వాహన ప్రమాద బీమా పరిహారపు చెల్లింపు కేసులు, చెక్ బౌన్స్ కేసులు, వివాహ సంబంధ వ్యాజ్యాలు, అన్ని రకాల సివిల్ కేసులు ఇరువర్గాల ఆమోదంతో పరిష్కరిస్తారన్నారు. ఈ అవకాశాన్ని న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల్లో ఉన్నవారు ఉపయోగించుకుని వ్యాజ్యాలను పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్‌లో పరిష్కరించుకున్న కేసుల్లో తీర్పు అంతిమతీర్పు అని, కోర్టుల్లో చెల్లించిన ఫీజు కూడా తిరిగి పొందవచ్చన్నారు. ప్రీ సిట్టింగ్ రూపంలో ఇరువర్గాల ఆమోదంతో ముందస్తుగా వ్యాజ్యాల పరిష్కారానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ, సంబంధిత న్యాయవాదులు, మీడియేషన్ న్యాయవాదులు సహకరిస్తారని, ఇదే విధంగా పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారులు, న్యాయవాదులు ఎక్కువ సంఖ్యలో కేసుల పరిష్కారానికి సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి పేర్కొన్నారు. -
మహిళ అదృశ్యంపై కేసు నమోదు
మద్దిపాడు: మండల పరిధిలోని గార్లపాడు గ్రామానికి చెందిన మహిళ అదృశ్యమైన ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గార్లపాడు గ్రామానికి చెందిన జానపాటి మనీషా కు నాగులుప్పలపాడు మండలం చీర్వానుప్పలపాడు గ్రామానికి చెందిన జానపాటి ప్రసాద్ తో 12 ఏళ్ల కిందట వివాహమైంది. మనీషా కు తన భర్తతో కొంతకాలం నుంచి వివాదాలు ఏర్పడిన నేపథ్యంలో ఆమె పిల్లలను తీసుకొని గార్లపాడు లో పుట్టింటికి చేరుకుంది. ఈ నేపథ్యంలో మనీషా తన పిల్లలను తల్లి దగ్గర వదిలిపెట్టి ఎటో వెళ్లిపోయిందని భర్త స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ బీ శివరామయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఏపీఎం జిల్లా కేంద్రానికి సరెండర్ పెద్దదోర్నాల: మహిళా ఉద్యోగిపై వేధింపులకు పాల్పడిన పెద్దదోర్నాల వెలుగు ఏపీఎంను జిల్లా కేంద్రానికి సరెండర్ చేసినట్లు యర్రగొండపాలెం ఏరియా కో ఆర్డినేటర్ డి.దానం తెలిపారు. తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ సదరు మహిళ సోమవారం పోలీసులను ఆశ్రయించిన విషయం పాఠకులకు విదితమే. ఏపీఎం సరెండర్‌కు సంబంధించిన ఉత్తర్వులు జిల్లా కేంద్రం నుంచి వెలువడినట్లు దానం తెలిపారు. యర్రగొండపాలెం క్లస్టరుకు చెందిన మూల వెంకయ్య ఇన్చార్జి ఏపీఎంగా నియమించినట్లు చెప్పారు. -
ప్రకాశం
34/247గరిష్టం/కనిష్టంపనికావాలంటే చేయితడపాల్సిందే సంతనూతలపాడు తహసీల్దార్ కార్యాలయం అవినీతికి కేరాఫ్‌గా మారింది. కొందరు అధికారులు పైసా ముట్టజెప్పందే పని చేయడం లేదు. గ్రామకంఠంలో పచ్చగద్దలు పీసీపల్లి మండలం పెద ఇర్లపాడులో విలువైన గ్రామకంఠం భూములను టీడీపీ నాయకులు కబ్జా చేసి వెంచర్లుగా మార్చారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది.వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. పొగమంచు కురుస్తుంది. చలిగాలులు వీస్తాయి. బుధవారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2025– 8లో.. -
పని కావాలంటే.. చేయి తడపాల్సిందే!
సంతనూతలపాడు: కూటమి ప్రభుత్వం కొలువయ్యాక సంతనూతలపాడు తహసీల్దార్ కార్యాలయం అవినీతికి కేరాఫ్‌గా మారింది. కొందరు రెవెన్యూ అధికారులు పైసా ముట్టజెప్పందే.. పని చేయని పరిస్థితి నెలకొందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కుల, ఆదాయ, ఫ్యామిలీ మెంబర్ ఇతరత్రా సర్టిఫికెట్లు కావాలంటే కొంత మంది అధికారులు వేల రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముడుపులు చెల్లిస్తే తప్ప భూమి సర్వే దరఖాస్తుల వైపు కన్నెత్తి చూడటం లేదని అర్జీదారులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. కార్యాలయంలో ఏ పనీ కావడం లేదంటూ తరచూ బాధితులు నిరసన వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం కార్యాలయంలో జరుగుతున్న పలు కార్యకలాపాలపై ఉద్యోగుల మధ్యే తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. కొందరు ఉద్యోగులకే ప్రాధాన్యతను ఇస్తూ... కార్యాలయంలో కొందరు ఉద్యోగులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తహసీల్దార్ కార్యాలయంలో సానుకూలంగా ఉన్న అధికారులు ధ్రువీకరించిన సర్టిఫికెట్లకు ఆమోదం తెలపడం, సానుకూలంగా లేని అధికారులు ఇచ్చిన ధ్రువపత్రాలను తిరస్కస్కరిస్తున్నారనే విషయం చర్చనీయాంశమైంది. ఉద్దేశపూర్వకంగానే కొర్రీలు పెడుతూ కుల ధ్రువీకరణ పత్రాలను పెండింగ్‌లో ఉంచుతుండటంతో విద్యార్థులు, ఇతర అవసరాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక వీఆర్వోల విషయంలో కూడా కొందరికే ప్రాధాన్యతను ఇస్తూ పనులు అప్పగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు తహసీల్దార్ కార్యాలయంలో సముచిత గౌరవం దక్కడం లేదని కూటమి ప్రజాప్రతినిధులు సైతం నొచ్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఓ వీఆర్ఏ అన్నీ తానై వ్యవహరిస్తూ, పనులు చేయిస్తామని దరఖాస్తుదారుల నుంచి పెద్దమొత్తంలో నగదు గుంజుతున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సామాన్యులకు సవాలక్ష కొర్రీలు రెవెన్యూపరమైన సమస్యలపై కార్యాలయానికి వెళ్లే సామాన్యులను సవాలక్ష కొర్రీలతో అధికారులు తిప్పలు పెడుతున్నారు. అదే రూ.లక్షల్లో ముడుపులు వస్తాయంటే నిబంధనలు సైతం వారు తుంగలో తొక్కి తామే స్వయంగా ఫీల్డుకు వెళ్లి అప్పనంగా వారికి కట్టబెట్టేందుకు సైతం వెనుకాడడంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో భూముల రీసర్వే సైతం అట్టకెక్కింది. రీసర్వేను పర్యవేక్షించి గాడిలో పెట్టాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడడడం లేదన్న ఆరోపణలున్నాయి. అవినీతికి కేరాఫ్‌గా సంతనూతలపాడు రెవెన్యూ కార్యాలయం అన్నీ తానై చక్రం తిప్పుతున్న ఓ వీఆర్ఏ భూ సమస్యలు, ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజల ప్రదక్షిణలు కార్యాలయ ఉద్యోగులపైనా పక్షపాతం చూపుతున్నట్లు ఆరోపణలు -
లైంగిక వేధింపుల చట్టాలపై మహిళలకు అవగాహన
ఒంగోలు టౌన్: కర్మాగారాల్లో పనిచేసే మహిళలు, విద్యాసంస్థల్లో చదువుకునే బాలికలకు లైంగిక వేధింపుల చట్టాలపై అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు చెప్పారు. జీజీహెచ్ ఆర్బీఏకే కార్యాలయంలో మంగళవారం పిల్లల లైంగిక వేధింపులపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. లైంగిక వేధింపులను ఎదుర్కొనేందుకు మానసికంగా, శారీరకంగా సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ఆరోగ్య, పాఠశాల విద్య, ఇంటర్మీడియెట్, వికలాంగుల సంక్షేమం, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులకు ఇస్తున్న ఈ శిక్షణలో మహిళా చట్టాలను పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా మానసిక వ్యాధుల నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మహిళలు, విద్యార్ధినులకు పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత సమాజంలో లైంగిక దోపిడీ ఎక్కువగా జరుగుతోందన్నారు. వనరుల కొరత, ఆహారం, ఆర్ధిక భద్రత మహిళలకు శాపంగా మారిందన్నారు. కార్యక్రమంలో ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ భగీరధి, జిల్లా విద్యా శాఖ అధికారి కిరణ్ కుమార్, సైకాలజిస్టులు సుప్రజా దేవి, గిరి రంగ ప్రసాద్, ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీసర్ హేమ సుజన్, మాస్ మీడియా జిల్లా అధికారి డి.శ్రీనివాసులు, డాక్టర్ ప్రీతమ్, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు -
వెట్టి చాకిరీ బందీలకు విముక్తి
ఒంగోలు సిటీ: పల్నాడు జిల్లాలోని నరసరావుపేట ప్రాంతంలో ఓ కాంట్రాక్టర్ వద్ద ఏళ్ల తరబడి వెట్టి చాకిరీ చేస్తున్న యానాది కుటుంబాలకు జిల్లా అధికారుల చొరవతో విముక్తి లభించింది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామానికి చెందిన 5 ఎస్టీ(యానాది) కుటుంబాలను నరసరావుపేట ప్రాంతంలో కర్ర కోత కోసం పదేళ్ల క్రితం ఓ కాంట్రాక్టర్ తీసుకెళ్లాడు. అందుకుగాను వారికి కొంత నగదును అడ్వాన్స్ ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి వారిని అక్కడే బందించి వెట్టి చాకిరీ చేయిస్తున్నాడు. కర్ర కోతకు వెళ్లిన ఆ కుటుంబాలను కాంట్రాక్టర్ వేధిస్తున్న తీరును బాధితుల బంధువులు భారతీయ జనతా మజ్దూర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖలీఫాతుల్లా బాషాకు వివరించారు. ఈ మేరకు కలెక్టర్ తమీమ్ అన్సారియాకు గత నెలలో ఫిర్యాదు చేయగా ఒంగోలు ఆర్డీఓతో విచారణ చేయించారు. బాధిత కుటుంబాలకు విముక్తి కల్పించగా మంగళవారం కలెక్టర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా ఓ కాంట్రాక్టర్ వద్ద బందీలుగా ఉన్న మరో మూడు కుటుంబాలు తప్పించుకుని వచ్చాయి. వీరందరికీ ఆధార్ కార్డులు మంజూరు చేయడంతోపాటు పౌష్టికాహారం అందించి, పిల్లలకు చదువు చెప్పిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భారతీయ జనతా మాజ్దూర్ సెల్ కార్యదర్శి షేక్ సిద్ధాంబీ, యానాది సంఘ నాయకులు, ఎస్సీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
కందిపప్పు కట్!
మార్కాపురం: తెలుగు వారి పెద్దపండుగైన ఉగాదికి రేషన్‌కార్డుదారులు పప్పన్నం తినలేని పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 4 నెలల నుంచి కందిపప్పులో కోత విధిస్తూ ఈనెల నుంచి పూర్తిగా నిలిపేశారు. జిల్లాలో మొత్తం రేషన్ దుకాణాలు 1392, రేషన్‌కార్డు దారులు 6,76,160 మంది ఉన్నారు. సుమారు నెలకు 655 టన్నుల వరకూ కందిపప్పు అవసరం. ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా కిలో రూ.67కే కందిపప్పు అందిస్తోంది. దీంతో చాలా మంది ప్రతినెలా కందిపప్పు, చెక్కర, బియ్యం తీసుకుంటున్నారు. నవంబరు నుంచి కూటమి ప్రభుత్వం రేషన్ సరుకుల్లో ప్రధానమైన కందిపప్పు సరఫరాలో కోత విధిస్తూ మార్చి నెలలో ఏకంగా కోటా తీసేసింది. దీంతో రేషన్‌కార్డుదారులు పప్పన్నం తినాలంటే బయట మార్కెట్లో కిలో రూ.160 పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది.కందిపప్పు కేటాయింపు ఇలా...మార్కాపురం పౌరసరఫరాల శాఖ గోడౌన్ పరిధిలో మార్కాపురం, తర్లుపాడు, త్రిపురాంతకం, పెద్దారవీడు, పెద్దదోర్నాల మండలాలు ఉన్నాయి. ప్రతి నెలా ఈ మండలాల్లోని రేషన్షాపులతోపాటు దొనకొండలో 8 షాపులు, కొనకనమిట్లలో 6 షాపులకు గానూ మొత్తం కలిపి 150 రేషన్ దుకాణాలకు 78 టన్నుల కందిపప్పు రావాల్సి ఉండగా జనవరిలో 45 టన్నుల కందిపప్పు మాత్రమే సరఫరా చేశారు. పొదిలి పౌరసరఫరాల శాఖ గోడౌన్ పరిధిలోని పొదిలి, కొనకనమిట్ల మండలాలకు గానూ 40 టన్నుల కందిపప్పునకు గాను 28 టన్నుల కందిపప్పు మాత్రమే సరఫరా అయింది. మార్చిలో కందిపప్పు సరఫరా పూర్తిగా నిలిపేశారు. -
రామతీర్థం అందించవా స్వామీ..!
మర్రిపూడి: విద్యుత్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల మధ్య సమన్వయ లోపంతో 11 గ్రామాలకు 13 రోజులుగా నీటిసరఫరా నిలిచిపోయింది. మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న మర్రిపూడి మండలంలోని 32 గ్రామాలకు రామతీర్థం జలాశయం నుంచి నీరందిస్తున్నారు. జిల్లాలోని పశ్చిమప్రాంతం అత్యంత ఫ్లోరైడ్ ప్రాంతంగా గుర్తించి వారికి శుద్ద జలాలు అందించే లక్ష్యంతో 2008లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రామతీర్థం రిజర్వాయర్ నుంచి రూ.5 కోట్లు వెచ్చించి ఫిల్టర్ బెడ్లలో రోజుకు 2 లక్షల లీటర్లు శుద్దిచేసి పైపులైన్ ద్వారా ఈ నీటిని అందిస్తున్నారు. అయితే ఆ లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం నీరు కారుస్తోంది. ఆర్డీఎస్ఎస్ పథకం కింద మండలంలోని రూరల్ గ్రామాలకు త్రీఫెస్ విద్యుత్ సరఫరా అందించేందుకు నూతన స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్‌లైన్ ఏర్పాటు చేస్తున్నారు. నూతన స్తంభాల ఏర్పాటు కోసం గుంతలు తీశారు. ఈ క్రమంలో దాదాపు 9 ప్రదేశాల్లో తాగునీటి పైపులు పగిలిపోయి నీరు వృథాగా పోతున్నాయి. లీకులు ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు తలనొప్పిగా మారాయి. విషయం తెలుసుకున్న నీటిపారుదల శాఖాధికారులు తాగునీటి సరఫరాను ఆయా గ్రామాలకు నిలిపేశారు. దీంతో మండలంలోని దుగ్గిరెడ్డిపాలెం, వల్లాయపాలెం, చిమట, పాత పన్నూరు, కొత్తపన్నూరు, శివరాయునిపేట, కాకర్ల, చిలంకూరు, కూచిపూడి, మర్రిపూడి, ఏలూరు గ్రామాలకు 13 రోజులుగా రామతీర్థం నీరు నిలిచిపోయింది. వేసవి సమీపిస్తున్న తరుణంలో తాగునీరు అందకపోవడంతో బోరునీరు, బబుల్స్ వాటర్‌ను మండల వాసులు ఆశ్రయిస్తున్నారు. ఆ నీరు తాగడం వల్ల జలుబు, జ్వరాలు వస్తున్నాయని వారు వాపోతున్నారు. మండలంలోని శివరాయునిపేట నుంచి కాకర్ల మీదుగా చిలంకూరు గ్రామానికి త్రిఫేస్ విద్యుత్ సరఫరా చేసేందుకు నూతన విద్యుత్ స్తంభాలతోపాటూ, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో పైపులైన్లు పగిలిపోయాయని, లీకులకు కొంత పరిహారం చెల్లించాలని గ్రామ నీటి సరఫరా అధికారులు విద్యుత్ శాఖాధికారులను డిమాండ్ చేశారు. అయినా విద్యుత్‌శాఖాధికారుల నుంచి సరైన సమాధానం లేకపోవడంతో విద్యుత్‌శాఖ కాంట్రాక్ట్ పై మర్రిపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ జైపాల్ తెలిపారు. రెండు శాఖల అధికారులను ఒప్పించాలన్న ఎస్ఐ సురేష్‌బాబు ప్రయత్నం ఫలించలేదు. మండల స్థాయి అధికారులు నేటికీ తాగునీటి సమస్యపై పరిష్కారం చూపలేదు. మంత్రి సొంత నియోజకవర్గంలో దాదాపు 13 రోజులుగా ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలు మండుతున్న తరుణంలో తాగునీరు అందించాలని వారు కోరుతున్నారు. 11 గ్రామాలకు 13 రోజులుగా నిలిచిన రామతీర్థం నీరు విద్యుత్ స్తంభాల ఏర్పాటుతో పగిలిన తాగునీటి పైపులు విద్యుత్ కాంట్రాక్టర్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఆర్డబ్ల్యూఎస్ ఏఈ -
మూలరక్త కణాలు ఇచ్చి ప్రాణాలు కాపాడి..
ఒంగోలు సిటీ: క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆరేళ్ల చిన్నారి చికిత్స కోసం మూలరక్త కణాలు ఇచ్చి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడాడు ఓ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలులోని క్విస్ ఇంజినీరింగ్ కాలేజీలో సీఎస్బీఎస్ రెండో ఏడాది చదువుతున్న ఎన్ఎస్ఎస్ వలంటీర్ దోసపాటి సుబ్బారెడ్డి.. హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రిలో క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆరేళ్ల చిన్నారి చికిత్స కోసం మూలరక్త కణాలు ఇచ్చి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. ఇలాంటి అవకాశం అరుదుగా దక్కుతుందని, ఈ విషయంపై అవగాహన కలిగి, హైదరాబాద్‌కు వెళ్లి డొనేట్ చేసి రావడం గొప్పవిషయమని క్విస్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ సూర్యకళ్యాణ చక్రవర్తి, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ గాయత్రి విద్యార్థిని మంగళవారం అభినందించారు. సుబ్బారెడ్డి తన మూలరక్త కణాలను ఇచ్చేందుకు ఒప్పుకున్న అతని తల్లిదండ్రులు వెంకటరత్తమ్మ, నరసారెడ్డిని కూడా అభినందించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం, కణాల దానంపై అవగాహన కలిగి ఉండాలని, అది ఒక నిండుప్రాణాన్ని కాపాడుతుందని అన్నారు. రక్తకణాలను దానం చేసిన సుబ్బారెడ్డికి ధాత్రి బ్లడ్ స్టెమ్ డొనేషన్ వారు ప్రశంస పత్రం అందించారు. -
పొజిషన్ సర్టిఫికెట్ కోసం నిరసన
పేర్నమిట్ట గ్రామానికి చెందిన తుళ్లూరు బోసుబాబు తనకు పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా తిప్పుకుంటున్నారంటూ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పేర్నమిట్ట ఎస్సీ కాలనీకి చెందిన తుళ్లూరి ప్రభుదాసుకు 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఐదు సెంట్ల నివాస స్థలాన్ని కేటాయించింది. ఆ స్థలంలో ఏళ్లుగా నివాసం ఉంటున్నామని అర్జీదారురాలైన తుళ్లూరు సుభాషిణి భర్త తుళ్లూరి బోసుబాబు ఆ స్థలానికి పొజిషన్ సర్టిఫికెట్ కోసం జనవరి 30వ తేదీన దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం ఒంగోలు ఆర్డీఓ కార్యాలయంలో పొజిషన్ సర్టిఫికెట్ ఇప్పించాలని మొరపెట్టుకోగా తహసీల్దార్‌ను కలవాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం 11 గంటలకు తహసీల్దార్ ఆదిలక్ష్మిని కలవగా‘మీరు కలెక్టర్ ఆఫీస్ కో, ఆర్డీవోకో ఫిర్యాదు చేసినంత మాత్రాన నేను భయపడతానా, ఆర్టీఏ పెట్టినంత మాత్రాన నేను భయపడతానా, పని అయినప్పుడు తెలియజేస్తాం.. అప్పుడే రావాలి మీరు వెళ్లండి ఇక్కడ నుంచి’ అని అనడంతో బోసుబాబు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పొజిషన్ సర్టిఫికెట్ మంజూరు గురించి చెప్పకుండా రోజూ తిప్పుకుంటున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఎస్సై వి.అజయ్‌బాబు అర్జీదారుడితో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. అర్జీదారుడు నిరసన తెలపడంపై పేర్నమిట్ట–3 వీఆర్ఓ కె.జాలయ్య మాట్లాడుతూ.. జనవరి 30వ తేదీ పొజిషన్ సర్టిఫికెట్ కోసం తుళ్లూరి సుభాషిణి దరఖాస్తు చేశారని, ఫిబ్రవరి 5వ తేదీ ఫీల్డ్ వెరిఫికేషన్ చేశామన్నారు. ఆ స్థలంలో గృహ నిర్మాణం చేపట్టగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని, నిబంధనల ప్రకారం నిర్మాణం జరిగి ఉన్న స్థలానికి పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వడం సాధ్యపడదని చెప్పారు. -
గ్రామ కంఠంలో పచ్చ గద్దలు
పీసీపల్లి: అధికారమే అండగా పచ్చ తమ్ముళ్లు బరి తెగిస్తున్నారు. భూ బకాసురుల అవతారమెత్తి ప్రభుత్వ భూములను మింగేస్తున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు యంత్రాలతో చదును చేసి యథేచ్ఛగా ఆక్రమించి వెంచర్లు వేస్తున్నారు. అధికారుల హెచ్చరికలను సైతం లెక్క చేయడం లేదు. వివరాల్లోకి వెళ్తే.. పీసీపల్లి మండలం పెద ఈర్లపాడులో టీడీపీ నాయకులు విలువైన గ్రామ కంఠం భూమిని కబ్జా చేసి వెంచర్‌గా మార్చిన వైనంపై కలెక్టర్ తమీమ్ అన్సారియాకు సోమవారం గ్రీవెన్స్‌లో ఫిర్యాదు అందింది. భూ ఆక్రమణను అడ్డుకుని నిందితులపై చర్యలు తీసుకోవాలని కొందరు గ్రామస్తులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేయడం చర్చనీయాంశమైంది. పెద ఈర్లపాడు గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 870లోని 4 సబ్ డివిజన్లలో మొత్తం 11 ఎకరాల గ్రామ కంఠం భూమి ఉంది. ఇందులో 870/2లో 1.18 ఎకరాల భూమిలో చెరువు కాలువ ఉంది. అయితే 870, 870/1, 870/3, 870/4లో ఖాళీగా ఉన్న 9.82 ఎకరాల గ్రామ కంఠం భూమిని టీడీపీ నేతలు ఆక్రమించి వెంచర్ వేశారు. దీని విలువ ఇప్పుడు సుమారు మూడు కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. వాస్తవానికి ఈర్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు గతంలోనే ఈ భూమిలో చెట్లు, చిల్లకంప తొలగించి చదును చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ భూమిపై టీడీపీ నాయకులు మళ్లీ కన్నేశారు. అడిగేవారు లేరన్న అధికార మదంతో గ్రామ కంఠాన్ని ఆక్రమించి ఏకంగా వెంచర్ వేశారు. దీనిపై ప్రశ్నించిన స్థానికులపై బెదిరింపులకు దిగడంతో పంచాయితీ కలెక్టర్ వద్దకు చేరింది. భూ ఆక్రమణపై ఈవోఆర్డీ మల్లేశ్వరిని వివరణ కోరగా.. ‘గతంలో గ్రామ కంఠం స్థలం ఆక్రమణకు గురైన విషయం వాస్తవమే. అప్పుడు ప్రభుత్వ స్థలంగా పేర్కొంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశాం. ఇటీవల కొంత మంది అదే భూమిని మళ్లీ చదును చేసి వెంచర్ వేస్తుండగా సోమవారం హెచ్చరిక బోర్డు పెట్టించాం’ అని తెలిపారు. పీసీపీల్లి మండలం పెద ఈర్లపాడులో టీడీపీ నేతల భూ కబ్జా రూ.3 కోట్ల విలువైన 9.82 ఎకరాల భూమిని చెరబట్టిన పచ్చ ముఠా దర్జాగా వెంచర్ వేసి బిట్లు బిట్లుగా విక్రయించేందుకు పక్కా స్కెచ్ రెవెన్యూ అధికారుల హెచ్చరికలనూ లెక్కచేయని వైనం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి భూమిని కాపాడాలని కోరిన గ్రామస్తులు -
ఇంగ్లిష్ పరీక్షకు 1391 మంది గైర్హాజరు
ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష మంగళవారం ప్రశాంతంగా జరిగింది. రెండో రోజు ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పేపర్ 1 పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 22,975 మందికి గాను 21,584 మంది విద్యార్థులు హాజరయ్యారు. 1391 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ 20,728 మంది విద్యార్థులకుగాను 19,654 మంది హాజరవగా, 1074 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ పరీక్షకు 2247 మందికి గాను 1930 మంది విద్యార్థులు హాజరవగా, 317 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు నిర్వహించడానికి జిల్లాలో 67 సెంటర్లు కేటాయించారు. ఆర్ఐఓలు ఆరుగురు, 12 మంది డీఈసీ, డీఐఈఓ లు, 34 మంది స్క్వాడ్స్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. -
కార్గిల్ సైనికుడినీ వదిలిపెట్టని మాఫియా...
సంతనూతలపాడు మండలంలోని మైనంపాడుకు చెందిన ఆకుల మోహన్‌రావు దేశ సరిహద్దులలో సైనికుడిగా పనిచేశారు. 1998లో జరిగిన కార్గిల్ పోరాటంలో శత్రు దేశానికి వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడారు. భూమికి 5140 అడుగుల ఎత్తులో ఉన్న టోలోలింగ్ పర్వతంపైన బోఫోర్స్ తుపాకీతో పోరాడారు. 2000 సంవత్సరంలో రిటైర్డ్ అయిన మోహన్‌రావు స్వగ్రామానికి చేరుకుని లారీ కొనుక్కున్నారు. పదేళ్లుగా ఇసుక విక్రయిస్తున్నారు. ఎనాడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో దారుణంగా తయారైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జనవరిలో ఆయన టిప్పర్ ఆపిన ఇసుక మాఫియా.. డ్రైవర్‌ను చితకబాది టిప్పర్ తీసుకెళ్లి మూడు రోజుల పాటు యార్డులో నిర్బంధించారు. -
బాలికల హక్కులను పరిరక్షించాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సిటీ: బాలికలు స్వేచ్ఛగా ఎదిగేలా వారి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఒంగోలులోని ప్రభుత్వ ఆస్పత్రి (రిమ్స్) నుంచి నెల్లూరు బస్టాండ్ సెంటర్ వరకూ నిర్వహించిన క్యాండిల్ ర్యాలీని ఆమె ప్రారంభించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో మహిళలు, నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు సుమారు వెయ్యి మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక ఇతివృత్తంతో జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ‘బాల్యవివాహాల రహిత ప్రకాశం జిల్లా’ ఆవిష్కరణ కోసం ప్రజల్లో చైతన్యం కలిగించేలా ఈ క్యాండిల్ ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. కనీసం 18 ఏళ్లు నిండే వరకూ ఆడపిల్లలకు వివాహం చేయకుండా వారిని చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. బాల్యవివాహం చేసుకోబోనని ప్రతి ఆడపిల్ల కూడా సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. బాలికల ఆరోగ్యం, హక్కులను కాపాడేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ హేనా సుజన్, సీడీపీవోలు, అంగన్వాడీ వర్కర్లు, ఆశాలు, ఏఎన్ఎంలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి
● కలెక్టర్ తమీమ్‌అన్సారియా ఒంగోలు సిటీ: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ లో వచ్చే అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన శ్రీమీ కోసం్ఙ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ వీటిని ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించాలని స్పష్టం చేశారు. ‘మీ కోసం’ కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ప్రతి ఒక్క అర్జీ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వాటికి అర్ధవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కారం చూపాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చిన అర్జీలను నిర్దేశించిన గడువులోపు పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితిల్లో అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలని ఆదేశించారు. అధికారులు ప్రతి రోజు లాగిన్ అయి ఆన్ లైన్ లో వచ్చిన వినతులను చూడాలని చెప్పారు. సాంకేతిక సమస్యల వలన క్షేత్రస్థాయిలో పరిష్కరించలేని అర్జీలు వస్తే ఆ విషయాన్ని ప్రజలకు అప్పుడే స్పష్టం చేయాలన్నారు. ఒంగోలు నియోజకవర్గం యరజర్ల, కొణిజేడు నుంచి వందల టిప్పర్లతో రోడ్లు మొత్తం నాశనం చేస్తూ శబ్ద కాలుష్యం సృష్టిస్తూ జరుగుతున్న అక్రమ మైనింగ్ మాఫియా మీద చర్యలు తీసుకోవాలని కలెక్టరుకు స్థానికులు అర్జీ ఇచ్చారు. కలెక్టరు వెంటనే మైనింగ్ మాఫియా మీద చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో బి.చిన ఓబులేసు, డిప్యూటీ కలెక్టర్లు జాన్సన్, పార్ధసారథి, వరకుమార్, విజయజ్యోతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఆప్కాస్ రద్దుపై భగ్గుమన్న కార్మికులు
● కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ధర్నా ఒంగోలు టౌన్: ఆప్కాస్‌ను రద్దు చేయాలన్న కూటమి ప్రభుత్వం నిర్ణయంపై కార్మికులు రోడ్డెక్కారు. మున్సిపల్ కార్మికుల జీవితాలను కాంట్రాక్టర్లకు అప్పగించే ప్రయత్నాలపై మండిపడ్డారు. కోవిడ్ ఆపద సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవలందించిన మున్సిపల్ కార్మికుల బతుకులతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుతోందని కార్మిక నాయకులు విమర్శించారు. కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు ఎస్డీ సర్దార్ మాట్లాడుతూ ఆప్కాస్‌ను రద్దు చేయాలన్న ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు మెరుగైన జీతాలు ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత అసలుకే ఎసరు పెట్టే చర్యలకు ఉపక్రమించడం దుర్మార్గం అన్నారు. కనోనా సమయంలో మున్సిపల్ కార్మికులు చేసిన సేవలను మరిచి పోవడం ఎంత మాత్రం సమర్థనీయం కాదన్నారు. ఔట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, కార్మికులపై రాజకీయ జోక్యాన్ని నిలువరించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికులను ప్రైవేటు కాంట్రాక్టులకు అప్పగిస్తే జీతాలు, పీఎఫ్‌లు సక్రమంగా రావని, కార్మిక హక్కులను కాలరాస్తారని చెప్పారు. కార్మిక వర్గం శ్రమదోపిడీకి గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులందరికీ ఇళ్ల స్థలాలను ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కార్మికులను రాజకీయ వేధింపులకు గురిచేయడం ఎక్కువై పోయిందని యూనియన్ జిల్లా నాయకుడు శ్రీరామ్ శ్రీనివాసరావు విమర్శించారు. కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాల్సి వస్తుందనే ఆప్కాస్‌ను రద్దు చేసే కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో కార్మిక నాయకులు ఆదినారాయణ, హరిబాబు, ఎంఏ సాలార్, చెన్నయ్య, వెంకటేశ్వర్లు, గోపి, శేషయ్య తదితరులు పాల్గొన్నారు. కార్మికులను ప్రైవేటు నరకంలోకి నెట్టొద్దు: సీఐటీయూ డిమాండ్ ఆప్కాస్‌ను రద్దు చేసి కార్మికులను ప్రైవేటు నరకంలోకి నెట్టొద్దని సీఐటీయూ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. సోమవారం యూనియన్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ విజన్ అంటూ గొప్పలు చెబుతోందని, కార్మికులు పనిచేయకపోతే స్వచ్చ ఆంధ్ర ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడం వలన కార్మికులు అనేక ఇబ్బందులు పడతారని చెప్పారు. సమ్మెకాల ఒప్పందాలను అమలు చేయాలని, ఆప్కాస్ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ విజయవాడలో జరిగే ధర్నాలో జిల్లా కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టి.మహేష్, విజయమ్మ, కె.సామ్రాజ్యం, ఎం.బాబు, దివ్య, జేమ్స్, భారతి, కె. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక ఇజం!
పచ్చ సైన్యం.. జిల్లాలో ఇసుకాసురుల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. కూటమి పార్టీల నేతలు బరితెగించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చిపోతున్నారు. ప్రైవేటు సైన్యాన్ని పెట్టుకుని అరాచకాలు సృష్టిస్తున్నారు. ఎక్కడ నుంచి ఇసుక తెచ్చుకున్నా మా యార్డులో దించాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. బలవంతంగా యార్డులో దించుతున్నారు. కాదంటే భౌతిక దాడులకు తెగబడుతున్నారు. అంతా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కన్నుసన్నల్లో జరుగుతుండటంతో సంబంధిత శాఖల అధికారులు మౌనవ్రతం పాటిస్తున్నారు. సహనం నశించిన లారీ యజమానులు సోమవారం ఏకంగా ఒంగోలులో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. స్పందనలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఇసుక మాఫియా దౌర్జన్యాలకు తెగబడుతోంది. పట్టపగలే రెచ్చిపోయి రౌడీయిజం చేస్తోంది. నగరంలోని కొప్పోలు హైవే వద్ద ఇసుక యార్డు ఏర్పాటు చేశారు. నెల్లూరు రీచ్ నుంచి ఇక్కడకు ఇసుక తరలించి విక్రయాలు జరుపుతుంటారు. జిల్లాలో కొందరు టిప్పర్ యజమానులు పదేళ్లుగా ఇసుక వ్యాపారం చేస్తున్నారు. ఒంగోలు, దర్శి, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, పొదిలి, చీమకుర్తి తదితర ప్రాంతాల్లో ఇసుక విక్రయాలు చేస్తుంటారు. గృహనిర్మాణదారులు నేరుగా ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకునే వెసులుబాటు ఉండడంతో వారికి తక్కువ ధరకే ఇసుక సరఫరా చేస్తున్నారు. టిప్పర్ యజమానులు టన్నుకు రూ.600 తీసుకుంటుండగా యార్డులో మాత్రం టన్నుకు రూ.850కిపైగా వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో గృహనిర్మాణదారులు అనేకమంది స్వయంగా ఆన్లైన్లోనే ఇసుక బుక్ చేసుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లించి బిల్లులతో ఒంగోలుకు తరలిస్తున్నారు. దీనిని సైతం ఇసుక మాఫియా అడ్డుకుంటోంది. 100 మంది ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసి నగరంలో సొంతంగా నిఘా పెట్టి దాడులకు పాల్పడుతోంది. నగరంలోని గుంటూరు రోడ్డు బైపాస్‌లో కిమ్స్ హాస్పిటల్ వద్ద ఒక బ్యాచ్, నెల్లూరు రోడ్డులోని బైపాస్ వద్ద సంఘమిత్ర హాస్పిటల్ వద్ద ఒక బ్యాచ్, కర్నూలు రోడ్డు ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద మరొక బ్యాచ్‌తో నిఘా పెడుతున్నారు. నెల్లూరు నుంచి బిల్లులతో వచ్చే లారీలు, టిప్పర్లను అడ్డుకుని డ్రైవర్లను చితకబాది భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అంతటితో ఊరుకోకుండా బలవంతంగా లారీలను తీసుకెళ్లి యార్డులో ఇసుక డంప్ చేసుకుంటున్నారని టిప్పర్ యజమానులు వాపోతున్నారు. పోలీసుల నో యాక్షన్... నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఇసుక మాఫియా రెచ్చిపోతున్నా పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెతుతున్నాయి. ఒక్క ఒంగోలులోనే కాకుండా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇసుక మాఫియా ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్పప్పటికీ పోలీసులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఒంగోలులో 100 మంది ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని టిప్పర్ యజమానులు, గృహనిర్మాణదారులపై దాడులకు పాల్పడుతున్నా.. మాకేమీ తెలియదని చెబుతున్నారంటే పోలీసుల మీద అధికార పార్టీ ఎమ్మెల్యేల ఒత్తిడి ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. టిప్పర్ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోగా ఎదురుగా తమనే బెదిరిస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటి వరకు కనీసం ఒక్కరి మీదైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో పేట్రేగిపోతున్న ఇసుకాసురులు ప్రైవేటు సైన్యంతో నిఘా పెట్టి మరీ వేధింపులు వ్యాపారులపై దాడులతో భయభ్రాంతులకు గురిచేస్తున్న వైనం కార్గిల్ సైనికుడిని సైతం వదలకుండా ఇబ్బందులు పెడుతున్న ఇసుకాసురులు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం ఒంగోలులో కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగిన టిప్పర్ యజమానులు -
ఇష్టారాజ్యంగా లారీల నిర్బంధం ...
చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ఇసుక మాఫియా రోజురోజుకూ మరింత రెచ్చిపోతోందని టిప్పర్ యజమానులు ఆరోపిస్తున్నారు. గతేడాది డిసెంబర్ 5వ తేదీ నెల్లూరు నుంచి బిల్లులతో వస్తున్న ఇసుక లారీని కిమ్స్ హాస్పిటల్ వద్ద మూడు రోజుల పాటు ఆపేసి లారీ యజమానిని ఇబ్బందులకు గురిచేసినట్టు సమాచారం. ఈ ఏడాది జనవరి 28వ తేదీ కూడా ఒక టిప్పర్‌ను ఆపి డ్రైవర్‌ను చితకబాది లారీ అద్దాలను పగులగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతటితో ఊరుకోకుండా లారీని తీసుకెళ్లి యార్డులో మూడు రోజులపాటు నిర్బంధించినట్లు తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని టిప్పర్ యజమాని ఆకుల మోహన్‌రావు తెలిపారు. ఫిబ్రవరి 23వ తేదీ దర్శిలో మరోలారీపై ఇసుక మాఫియా దాడి చేసి అద్దాలు పగులగొట్టింది. దర్శి ఇసుక యార్డుకు సంబంధించిన 15 మంది ప్రైవేటు సైన్యం బిల్లులతో వస్తున్న లారీని అడ్డుకుని విధ్వంసం సృష్టించారు. లారీ అద్దాలను పగులగొట్టడమే కాకుండా టైర్లను కత్తితో కోసేశారు. లారీ డ్రైవర్‌ను క్రూరంగా హింసించారు. ఈ దాడిపై ఫిర్యాదు చేసేందుకు పోలీసుస్టేషన్‌కు వెళ్లగా, అక్కడకు కూడా వచ్చిన ప్రైవేటు సైన్యం ఎస్ఐ ముందే దాడి చేస్తామని బెదిరింపులకు దిగడం గమనార్హం. ఫిబ్రవరి 24వ తేదీ పెద్దారవీడు మండంలోని దేవరాజుగట్టు వద్ద ఇసుక మాఫియా లారీని ఆపి రచ్చ చేసినట్లు సమాచారం. ఈ ప్రభుత్వం మాది, మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం, నీ ఇష్టం వచ్చిన వాడికి చెప్పుకోమంటూ సవాల్ విసరినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేసేదేమీ లేక టన్నుకు రూ.250 చొప్పున కప్పం కట్టి లారీని విడిపించుకున్నట్లు తెలిసింది. గత మూడు నెలల్లో ఇలాంటి ఘటనలు సుమారు 15 నుంచి 20కిపైగా ఉన్నట్లు సమాచారం. దీంతో లారీ డ్రైవర్లు డ్యూటీలకు వెళ్లాలంటేనే ప్రాణభయంతో వణికిపోతున్నారు. లారీ యజమానులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని టిప్పర్ల అసోసియేషన్ నాయకులు ఆరోపిస్తున్నారు. -
● ప్రశాంతంగా ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు ● గైర్హాజరైన 763 మంది విద్యార్థులు
విజయోస్తు ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అధికారులు ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసి పకడ్బందీగా నిర్వహించారు. మొదటి రోజు ఇంటర్ రెండో సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొదటి రోజు 19213 మందికి గాను 18450 మంది విద్యార్థులు హాజరయ్యారు. 763 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ 17,252 మంది విద్యార్థులకుగాను 16,659 మంది హాజరవగా, 593 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ పరీక్షకుగాను 1961 మందికి గాను 1791 మంది విద్యార్థులు హాజరవగా 170 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు నిర్వహించడానికి జిల్లాలో 67 సెంటర్లు కేటాయించారు. ఆర్ఐఓలు ఐదుగురు, 10 మంది డీఈసీ–డీఐఈఓలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. 33 మంది స్క్వాడ్స్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. -
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ఒంగోలు సిటీ: ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్మీడియెట్ పరీక్షలు సోమవారం ఇంగ్లిష్ సబ్జెక్టుతో ప్రారంభమైనట్లు డీఈఓ అత్తోట కిరణ్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 3702 నుంది విద్యార్థులను గాను 2,846 మంది హాజరవగా, 856 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 21 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. 21 పరీక్ష కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లను, ఐదు ఫ్లయింగ్‌స్క్వాడ్ టీమ్‌లను నియమించారు. స్థానిక ఎంఈఓ లను, ప్రధానోపాధ్యాయులను 21 పరీక్షా కేంద్రాల్లో పర్యవేక్షణకు నియమించారు. స్క్వాడ్ ఆఫీసర్స్ 21 పరీక్ష కేంద్రాలను సందర్శించారు. డీఈఓ కిరణ్‌కుమార్ మూడు పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కట్టు దిట్టమైన చర్యలతో పకడ్బందీగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జిల్లాలో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. సీనియార్టీ జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ ఒంగోలు సిటీ: సీనియారిటీ జాబితాపై ఎవరికై నా అభ్యంతరాలుంటే ఈ నెల 9వ తేదీ లోపల సంబంధిత జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి సమర్పించాలని డీఈఓ అత్తోట కిరణ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాలు సంబంధిత జిల్లా విద్యాశాఖ/ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో, నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అభ్యంతరాల సమర్పణకు అవసరమైన వివరాలను అభ్యంతరం చేసే ఉపాధ్యాయుడి పూర్తి పేరు, పదవి, సంబంధిత వివరాలు, సీనియారిటీ జాబితా లో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పేర్కొనాలన్నారు. అలాగే ఆధారాలు లేదా సంబంధిత సాక్ష్యాలు జత చేయాలన్నారు. ఫిర్యాదుల పరిష్కార కమిటీ అభ్యంతరాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకొని సంబంధిత ప్రధానోపాధ్యాయులు/ఉపాధ్యాయులకు తెలియజేస్తారన్నారు. మరిన్ని వివరాలకు సంబంధిత జిల్లా విద్యాశాఖ / జోనల్ విద్యాశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో తృతీయ స్థానంలో ప్రకాశం ఒంగోలు: రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో ప్రకాశం క్రీడాకారులు ఓవరాల్ ఛాంపియన్ తృతీయ స్థానంను కై వసం చేసుకున్నారు. కృష్ణాజిల్లా కంచికచర్లలోని ఏకత్వ పాఠశాల ఆవరణలో ఈనెల 1వ తేదీ ప్రారంభమైన అండర్ 14 సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ స్థానాన్ని కై వసం చేసుకున్నారని ప్రకాశం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జి.నవీన్ తెలిపారు. సత్తాచాటిన క్రీడాకారులను అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.నాగేశ్వరరావు, కోచ్‌లు డి.రాజు, జి.అనీల్ అభినందించారు. ఫాయల్ బ్రాంజ్ మెడల్ సాధించిన బాలురు: జె.జగదీశ్వర్, టి.అలితేష్, సీహెచ్ జ్ఞానేశ్వర్ ఈపీ విభాగం బంగారు పతకం సాధించిన బాలురు: టి.శ్రీసాయి చరణ్, ఎస్కె అయాన్ మహిద్, డి.చరణ్‌సాయి ఫణీశ్వర్ ఈపీ విభాగంలో స్వర్ణాలు సాధించిన బాలికలు: టి.మితుల చౌదరి, డి.షణ్ముక ప్రియ, డి.వెంకట సౌమ్యశ్రీ శాబర్లో కాంస్యం సాధించిన బాలికలు: వి.లేఖన, వి.జ్యోతిక, పి.చక్రిక తల్లి మృతిని తట్టుకోలేక కుమార్తె ఆత్మహత్య కొండపి: తల్లి మృతిని తట్టుకోలేక కుమార్తె ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొండపి మండలంలోని నేతివారిపాలెం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నేతివారిపాలెం గ్రామానికి చెందిన వల్లపు జ్యోతి (19) తల్లి లక్ష్మి రెండు నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందడంతో అప్పటి నుంచి తల్లి మీద బెంగ పెట్టుకొని ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా ఉంటోంది. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి మాలకొండయ్య ఇంటికి వెళ్లే సరికి ఉరికి వేలాడుతూ ఉంది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రేమ్ కుమార్ తెలిపారు. జ్యోతి డిప్లొమా చదివింది. ఆమెకు ఇద్దరు అక్కలు, ఒక అన్న ఉన్నారు. ఇద్దరు అక్కలకు వివాహమైంది. -
ప్రకాశం
34/247గరిష్టం/కనిష్టంఉద్యోగాల పేరుతో మోసం ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగి ఉద్యోగాలిప్పిస్తానని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.సర్వేలపై అలసత్వం వహిస్తే చర్యలు జిల్లాలో నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈ సర్వే, పీ4 సర్వేలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. చలిగాలులు వీస్తాయి. పొగమంచు కురుస్తుంది. – 8లో.. మంగళవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2025 -
సర్వేలపై అలసత్వం వహిస్తే చర్యలు
● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సిటీ: జిల్లాలో నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈ సర్వే, పీ4 సర్వేలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని, అలసత్వం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తమీమ్ అన్సారియా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలను హెచ్చరించారు. గృహ నిర్మాణాల పురోగతి, ఎంఎస్ఎంఈ సర్వే, పీ4 సర్వే, మిస్సింగ్ సిటిజన్స్ మ్యాపింగ్, సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్ అటెండెన్స్, గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య ఏర్పాట్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, జాతీయ ఉపాధి హామీ పథకం అమలు, స్కూల్ టాయిలెట్ల ఇన్ఫెక్షన్, తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఏపీవోలతో సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలిసి నిర్వహించిన ఈ సమీక్షలో పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ సర్వేను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పీ4 సర్వేను కూడా ఈ నెల 4వ తేదీలోపే పూర్తి చేయాలని చెప్పారు. నిర్దేశించిన గడువులోగా సర్వేలు పుర్తిచేయకుండా అలసత్వం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గృహ నిర్మాణ పథకంలో లబ్ధిదారులు వేగంగా ఇళ్లు నిర్మించుకునేందుకు చర్యలు చేపట్టడంతో పాటు అవసరమైన వారికి త్వరగా పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సచివాలయ సిబ్బంది వంద శాతం బయోమెట్రిక్ హాజరు వేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ హాజరుపై ప్రతిరోజూ మానిటరింగ్ చేయాలని ఎంపీడీఓలు, మున్సిపల్ కమినర్లను ఆదేశించారు. గృహనిర్మాణాలకు సంబంధించి 90 రోజుల పని దినాలను లక్ష్యం మేరకు కల్పించాలని ఎంపీడీఓలను ఆదేశించారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఎంపీడీఓలు, ఏపీడీలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఉపాధి హామీ పనులను పర్యవేక్షించడంతో పాటు పథకం కింద కేటాయించిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేసేలా దృష్టి సారించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈఓ చిరంజీవి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాలశంకరరావు, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, జిల్లా పరిశ్రమల శాఖాధికారి శ్రీనివాసరావు, డీపీఓ వెంకటనాయుడు, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, సీపీఓ వేంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు, పశుసంవర్థకశాఖ జేడీ బేబీరాణి, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఉద్యోగాల పేరుతో మోసం
ఒంగోలు టౌన్: ఎంప్లాయిమెంటు కార్యాలయంలో విధులు నిర్వహించే ఒక ఉద్యోగి ఉద్యోగాలిప్పిస్తానంటూ పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు దర్శికి చెందిన బాధితులు ఎస్పీ ఏఆర్ దామోదర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీని కలిసి తమకు జరిగిన మోసాన్ని తెలియజేశారు. దర్శి ప్రాంతానికి చెందిన ఆరుగురికి ఉద్యోగాలిప్పిస్తానంటూ ఎంప్లాయిమెంటు ఆఫీసు ఉద్యోగి ఒకరు ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షల చొప్పున మొత్తం 9 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలిపారు. ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేయడంతో తమ దగ్గర వసూలు చేసిన డబ్బు తిరిగివ్వమని అడుగుతుంటే జవాబు చెప్పడం లేదని వాపోయారు. తమకు న్యాయం చేయాలని, మోసానికి పాల్పడిన ఉద్యోగిని కఠినంగా శిక్షించాలని కోరారు. అలాగే, గృహం కొనుగోలు కోసమంటూ అప్పుగా డబ్బు తీసుకుని తిరిగివ్వమంటే దాడి చేయడానికి వస్తున్నారని నేలటూరు గ్రామానికి చెందిన ఒక మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మూడు నాలుగు నెలల్లో తిరిగిస్తానని చెప్పడంతో తన కుమార్తె చదువు, వివాహం కోసం దాచుకున్న రూ.5 లక్షలు ఇచ్చానని, మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా నలుమూలల నుంచి మొత్తం 78 మంది బాధితులు వివిధ సమస్యలపై ఫిర్యాదు చేశారు. వారితో మాట్లాడిన ఎస్పీ ఆయా పోలీసు స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితులకు వెంటనే న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా పోలీసు స్టేషన్ సీఐ సుధాకర్, రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు, సీసీఎస్ సీఐ జగదీష్, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, వేదిక ఎస్సైలు షేక్ రజియా సుల్తానా, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంప్లాయిమెంట్ కార్యాలయ ఉద్యోగిపై ఎస్పీకి బాధితుల ఫిర్యాదు -
కూతుర్ని చూసేందుకు వచ్చి..
ఒంగోలు టౌన్: విధి విచిత్రమైనది. ఎప్పుడు ఎవరిని ఎలా కాటేస్తోందో తెలియదు. కూతుర్ని చూడాలని వినుకొండ నుంచి ఒంగోలుకు ఆర్టీసీ బస్సులో వచ్చిన ఓ వృద్ధురాలు అదే బస్సు ఢీకొనడంతో మృతి చెందింది. సోమవారం ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన చేవూరి నాగేంద్రమ్మ (69)కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రెండో సంతానమైన నాగమణి సంతనూతలపాడు మండలంలోని బోడపాలెంలో నివసిస్తోంది. నాగేంద్రమ్మ తరచూ కూతురిని చూసేందుకు వచ్చివెళ్తుంటుంది. వినుకొండలో ఆమెను బస్సు ఎక్కించి ఒంగోలు పంపడం.. కూతురు నాగమణి ఒంగోలు వచ్చి తల్లిని బోడపాలెం తీసుకెళ్లడం జరుగుతుంటుంది. అయితే, ఈసారి మాత్రం విధి ఆడిన ఆటలో ఆ తల్లి కూతురి వద్దకు చేరలేదు. ఒంగోలులోనే తిరిగిరాని లోకాలకు చేరింది. వినుకొండ నుంచి ఒంగోలుకు ఆమె వచ్చిన ఆర్టీసీ బస్సే రివర్స్ చేస్తూ.. అప్పుడే బస్సు దిగి వెనుక నుంచి వెళ్తున్న నాగేంద్రమ్మను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగేంద్రమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. అప్పటికే నాగమణి ఒంగోలు ఆర్టీసీ డిపోకు వచ్చి తల్లి కోసం ఎదురుచూడసాగింది. ఆ సమయంలో ఒక అంబులెన్స్ వచ్చి ఆగింది. సమీపంలో జనం గుమిగూడి ఉన్నారు. దాంతో డిపోలో నిలబడి ఉన్న ప్రయాణికులను అక్కడ ఏం జరుగుతోందని నాగమణి అడిగింది. ఎవరో ముసలావిడి చనిపోయిందని చెప్పడంతో అనుమానం వచ్చి దగ్గరకు వెళ్లి చూడగా, నాగేంద్రమ్మ నిర్జీవంగా పడి ఉంది. ఊహించని ఘటనతో నివ్వెరపోయిన నాగమణి.. తల్లి మృతదేహం మీద పడి విలపించడం అక్కడున్న వారితో సైతం కన్నీరు పెట్టించింది. నాగేంద్రమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే వినుకొండ టీడీపీ నాయకులు పలువురు ఒంగోలు చేరుకుని కేసు నమోదు చేయవద్దంటూ పోలీసులు, బాధితులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు మృతి వినుకొండ నుంచి ఆర్టీసీ బస్సులో ఒంగోలు రాగా, అదే బస్సు రివర్స్ చేస్తూ ఢీకొని దుర్మరణం -
హరహరా.. మార్కండేశ్వరా..
● శివనామ స్మరణతో మారుమోగిన మార్కాపురం ● వైభవంగా శివపార్వతుల రథోత్సవం మార్కాపురం టౌన్: పట్టణంలోని మార్కండేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి శివపార్వతుల రథోత్సవం భక్తుల శివనామ స్మరణల మధ్య అత్యంత వైభవంగా సాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి రథాన్ని నాలుగు మాఢ వీదుల్లో ఊరేగించారు. రాత్రి 7.30 గంటలకు శివపార్వతుల ఉత్సవమూర్తులను రథంపై ప్రతిష్టించి ప్రత్యేకంగా అలంకరించారు. ఈఓ చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు తేజ శర్మ, ఆంజనేయశర్మ ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల జయజయ ధ్వానాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి రథోత్సవం శోభాయమానంగా సాగింది. చిన్నారులు, మహిళల కోలాట ప్రదర్శన భక్తులను అలరించింది. స్వామివారిని వివిధ పార్టీల నాయకులు, అధికారులు, పుర ప్రజలు దర్శించుకుని మొక్కులు చెల్లించారు. సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై సైదుబాబు, రూరల్ ఎస్సై అంకమరావు తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. -
మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ
ఒంగోలు వన్‌టౌన్: బీసీ, ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు ఎం.వెంకటేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ, ఈబీసీ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ కులాలకు చెందిన మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీ టైలరింగ్‌లో ఉచిత శిక్షణను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల మహిళలు సంబంధిత ఎంపీడీఓల కార్యాలయాల్లోగానీ, సచివాలయాల్లోగానీ యాప్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. 90 రోజుల పాటు ఉచిత కుట్టు శిక్షణ పూర్తయిన తర్వాత కుట్టుమిషన్ అందిస్తామన్నారు. మహిళల వయస్సు 18 నుంచి 45 సంవత్సరాల్లోపు ఉండాలని సూచించారు. -
మహిళా ఉద్యోగిపై ఏపీఎం వేధింపులు
● పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు పెద్దదోర్నాల: మహిళా ఉద్యోగిపై వేధింపులకు పాల్పడిన ఏపీఎంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వివరాల ప్రకారం.. మండలంలోని వెలుగు కార్యాలయంలో రైతు ఉత్పత్తిదారుల సంఘంలోని విభాగంలో అకౌంటెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళ పట్ల ఏపీఎం దర్శనం పోలయ్య అసభ్యంగా ప్రవర్తించాడు. కొద్ది రోజుల నుంచి వేధింపులకు గురిచేస్తున్నాడు. దానికితోడు జీతం ఇవ్వాలంటే రూ.5 వేలు లంచం కావాలని కూడా డిమాండ్ చేశాడు. దీంతో బాధిత మహిళ స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు. -
పర్చూరులో ఫారం–7తో ఓట్ల తొలగింపుపై సిట్
● ప్రకాశం ఎస్పీ నేతృత్వంలో ఇద్దరు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం ● ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ సాక్షి, అమరావతి: బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జీవించి ఉన్న ఓటర్లు మృతి చెందినట్లుగా పేర్కొంటూ ఫారం–7తో ఓట్ల తొలగింపునకు పాల్పడటంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం ఎస్పీ నేతృత్వంలో మరో ఇద్దరు సభ్యులతో సిట్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విజ్ఞప్తి ఆధారంగా సిట్ ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. 24,000 ఓట్లు తొలగింపునకు పారం–7 దరఖాస్తులను అక్రమంగా చేశారని, జీవించి ఉన్న వారు మృతి చెందినట్లు పేర్కొన్నారని ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో గతంలోనే కేసు నమోదు చేశారు. అయితే ఎటువంటి చర్యలను తీసుకోలేదని, దీనిపై సిట్‌తో దర్యాప్తు చేయించాలని ఎమ్మెల్యే కోరినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రకాశం ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలో గుంటూరు పశ్చిమ డీఎస్పీ అరవింద్‌తోపాటు డీజీపీ ద్వారా మరో అధికారిని నియమించుకుని దర్యాప్తు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఐడీ డీజీ ఆదేశాలు, పర్యవేక్షణలో సిట్ పనిచేయాలని పేర్కొన్నారు. సిట్ సాక్షులను, పత్రాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు చట్టానికి లోబడి నిందితులను అరెస్టు చేయడం, నిర్బంధించడం చేయవచ్చునని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దర్యాప్తు పురోగతికి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు త్రైమాసిక నివేదికను సిట్ సమర్పించాలని స్పష్టం చేశారు. -
ఆటో డ్రైవర్ నిజాయితీ
● ల్యాప్‌టాప్ బ్యాగ్ పోలీస్‌స్టేషన్‌లో అందజేత పామూరు: ఆటోడ్రైవర్ నిజాయితీని చాటుకున్నాడు. తనదికాని వస్తువు అవసరం లేదంటూ దానిని పోలీసులకు అప్పజెప్పాడు. వివరాలు.. మండల కేంద్రమైన పామూరు విరాట్‌నగర్ జంక్షన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి ల్యాప్‌టాప్ బ్యాగును పోగొట్టుకోగా రోడ్డుపై పడిఉంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న పామూరుకు చెందిన ఆటోడ్రైవర్ లక్కనబోయిన నారాయణ బ్యాగును చూసి దానిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి ఎస్సై టి.కిషోర్‌బాబుకు అందజేశారు. ఆటోడ్రైవర్‌ను ఎస్సై అభినందించారు. ల్యాప్‌టాప్ పోగొట్టుకున్నవారు పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు. ‘ఏకేయూ పరిశోధక నిబంధనావళి’ ఆవిష్కరణ ఒంగోలు సిటీ: ఆంధ్ర కేసరి యూనివర్శిటీలో పీహెచ్డీ స్కాలర్లు, వారికి సూచనలు, సలహాలిచ్చే రీసెర్చ్ డైరెక్టర్లకు దిక్సూచిగా ఉపయోగపడేలా ‘ఏకేయూ పరిశోధక నిబంధనావళి’ని రూపొందించారు. ఈ పుస్తకాన్ని సోమవారం సాయంత్రం వర్శిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబుతో కలిసి వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. యూనివర్సిటీ రీసెర్చ్ విభాగంలో భవిష్యత్ అవసరాల కోసం ఈ నిబంధనావళి మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. ఆంధ్ర కేసరి యూనివర్శిటీ పరిధిలో పరిశోధకులు, పరిశోధనలో భాగస్వాములైన రీసెర్చ్ డైరెక్టర్లను దృష్టిలో ఉంచుకుని నిబంధనావళిని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఏకేయూ పరిధిలో మొత్తం 52 మంది విద్యార్థులు తమ పరిశోధనలను కొనసాగిస్తున్నట్లు వర్శిటీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ డైరెక్టర్, వైస్ ప్రిన్సిపాల్ ఎన్.నిర్మలామణి వెల్లడించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రాజమోహన్‌రావు, సీడీసీ డీన్ ప్రొఫెసర్ సోమశేఖర తదితరులు పాల్గొన్నారు. డ్రెయినేజీలో జారిపడి వ్యక్తి మృతి మార్కాపురం: డ్రెయినేజీలో జారిపడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి వేళ మార్కాపురం పట్టణంలోని రామలక్ష్మణ వీధిలో చోటుచేసుకుంది. వివరాలు.. రామలక్ష్మణ వీధిలో నివాసం ఉండే తాడి వెంకటేశ్వరరావు(39) ప్లంబర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇంటికి వెళ్లే క్రమంలో చీకటిలో కాలుజారి డ్రెయినేజీలో పడిపోయాడు. డ్రెయినేజీలో ఉన్న రాయి తగలడంతో తలకు బలమైన గాయమై రక్తస్రావమైంది. కాసేపటి తర్వాత దారినపోయేవారు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటికే వెంకటేశ్వరరావు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జలపాతంలో పడి కడితి మృతిసీఎస్పురం(పామూరు): భైరవకోన కొండ పైనుంచి కడితి ప్రమాదవశాత్తు జలపాతంలో జారిపడి మృత్యువాత పడింది. ఈ సంఘటన సోమవారం వెలుగు చూసింది. ఆలయ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ కనిగిరి ఎఫ్ఆర్ఓ టి.ఉమామహేశ్వరరెడ్డి, ఎఫ్ఎస్ఓ షేక్.అలీమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కడితిని బయటకు తీయించి, పశువైద్యాధికారి షేక్.మునీర్‌తో పోస్టుమార్టం చేయించారు. అనంతరం కడితి కళేబరాన్ని ఖననం చేశారు. అంబవరం ఎఫ్బీఓ డి.బ్రహ్మయ్య, వైద్య సిబ్బంది రాజేష్, ఆదినారాయణ పాల్గొన్నారు. -
పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
ఒంగోలు టౌన్: జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షల కోసం ఏర్పాటు చేసిన 67 కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. సోమవారం ఆయన ఒంగోలు నగరంలో ఇంటర్ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పరీక్ష సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రశ్న పత్రాల తరలింపు, సమాధాన పత్రాలు డిపాజిట్ చేయడానికి తగిన ఎస్కార్ట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కనీస వసతులు సమకూర్చాలని సంబంధిత అధికారులను సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, వన్‌టౌన్ సీఐ నాగరాజు, తాలుకా ఎస్సై సందీప్ తదితరులు ఉన్నారు. -
చంద్రబాబుది రాజ్యాంగ ఉల్లంఘన
● వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి ఒంగోలు సిటీ: ప్రజాస్వామ్య విలువలు కాపాడాల్సిన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతా రహితంగా ప్రకటనలు చేయడం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి విమర్శించారు. శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఏ ఒక్క పనీ చేయకూడదని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం సరికాదని మండిపడ్డారు. ఆదివారం కె.వి.రమణారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ ఎన్నికలప్పుడే రాజకీయాలు అని, తర్వాత కులం, మతం, పార్టీలు చూడమంటూ అర్హులందరికీ తన పాలనలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి న్యాయం చేశారన్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు బహిరంగ సభల్లో చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఆయన ఆ పదవికి ఏమాత్రం అర్హుడు కాదనిపిస్తోందన్నారు. కేవలం ఒకే ఒక్క వర్గానికి న్యాయం చేయాలనుకోవడం సరికాదన్నారు. నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే ముఖ్యమంత్రి చేస్తున్న ప్రకటనలు సరికాదన్నారు. గత ఎన్నికల్లో నలభై శాతం మంది ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని, ఇప్పుడు వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటం రాజ్యాంగాన్నే అవమానించినట్లని విమర్శించారు. మీరు ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో నాయకులు కాదని ప్రజలందరూ ఎన్నుకుంటేనే మీరు ముఖ్యమంత్రి అయ్యారనే విషయాన్ని ఆలోచించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం పాలు చేస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న మీరు ఆ పదవిలో ఒక్క నిమిషం కూడా ఉండటానికి అర్హత లేదన్నారు. -
50 ఏళ్ల తరువాత అ‘పూర్వ’ కలయిక
మార్కాపురం: సుమారు 50 ఏళ్ల తరువాత పూర్వ విద్యార్థుల అపూర్వ కలయికకు పట్టణంలోని ఎస్వీకేపి కళాశాల వేదికగా మారింది. 1972–75 ఏళ్ల మధ్య ఎస్వీకెపి కళాశాలలో బీకాం డిగ్రీ చదివిన విద్యార్థులు 50 ఏళ్ల తరువాత ఆదివారం కలిశారు. జీవితంలో స్థిరపడి ఇన్నేళ్ల తర్వాత ఒకరినొకరు పలకరించుకుని ఆప్యాయంగా యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆనాడు కళాశాలలో చేసిన అల్లరిని, గోలను గుర్తుచేసుకుని నువ్విలా చేశావంటే... నువ్వలా చేశావంటూ.. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ పరామర్శించుకుని మనవళ్లూ.. మనవరాళ్ల సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. సమావేశానికి నాటి విద్యార్థి, నేటి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సాయిబాబా మందిరం వ్యవస్థాపక కార్యదర్శి గోపాలుని హరిహరరావు అధ్యక్షత వహించి పాత స్నేహితులందరినీ కలిపారు. అప్పటి గురువులైన ఊటుకూరి బాలరత్నం శెట్టి, దేవతి రాములను ఘనంగా సత్కరించి తమ గురుభక్తిని చాటుకున్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులైన ఐఎన్జీ వైశ్యాబ్యాంకు వైస్ ప్రెసిడెంట్ ఆర్ నారాయణశెట్టి, ప్రముఖ ఆడిటర్ జంకె కృష్ణారెడ్డి, కమర్షియల్ డిప్యూటీ కమిషనర్ ప్రకాష్‌రావు, సర్వేశ్వర భట్టు తదితరులు పాల్గొన్నారు. -
కూటమి ఫలహారం
పోస్టుల బేరంఅంగన్వాడీ పోస్టులు అంగట్లో సరుకుల్లా మారాయి. అధికార కూటమి నాయకులు పోస్టుకో రేటు కట్టి బేరసారాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెంటర్‌ను బట్టి వసూలు చేసి అమ్ముకుంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వారి బంధువులు, పీఏలదే ఇందులో కీలక పాత్ర. వీరు ఓకే చెబితే అధికారులు ఆమోదముద్ర వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనిలోపనిగా అధికారులూ తమ చేతివాటం చూపిస్తూ జేబులు నింపుకుంటున్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒంగోలు సిటీ: జిల్లాలో 38 మండలాల్లో 13 ఎస్సీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కింద 2,903 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో అంగన్వాడీలు, హెల్పర్లు, మినీ అంగన్వాడీ వర్కర్లకు సంబంధించి ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. 109 అంగన్వాడీ పోస్టులకు 283, వర్కర్ పోస్టులు 16కుగాను 74, 89 అంగన్వాడీ హెల్పర్ల పోస్టులకు గాను 200 దరఖాస్తులు వచ్చాయి. అలాగే నాలుగు మినీ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి తొమ్మిది దరఖాస్తులు వచ్చాయి. ఇంత వరకూ ప్రక్రియ సజావుగా సాగింది. అధికార కూటమి నాయకులు రంగప్రవేశం చేశారు. పోస్టును బట్టి బేరాలు మొదలెట్టేశారు. అంతా బహిరంగంగా జరుగుతూనే ఉన్నా ఉన్నతాధికారులు కనీసం పట్టించుకున్న దాఖలాల్లేవు. ఒక్కో పోస్టుకు మూడు లక్షల పైగా వసూలు.. ప్రభుత్వ పెద్దల దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో అధికార పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. డిమాండ్‌ను బట్టి రేటు నిర్ణయించారన్న ఆరోపణలు ఉన్నాయి. సెంటర్‌ను బట్టి ఒక్కో పోస్టుకు రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. హెల్పర్లకు, మినీ అంగన్వాడీ కార్యకర్తలకు మరో రేటు నిర్ణయించారు. ప్రధానంగా ఒంగోలు, మార్కాపురంలలో ముందుగా డబ్బులు చెల్లించిన వారికి సదరు నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి లెటర్‌తో పాటు, పీఏ, వారి బంధువులు అధికారులకు ఫోన్ చేసి పలానా వారికి కన్ఫర్మ్ చేయండి అంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నట్టు తెలిసింది. ఇదంతా ఒక తంతు అయితే జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలోని సిబ్బంది కూడా మా సంగతి ఏమిటని అడుగుతున్నట్టు సమాచారం. వీరు కూడా పోస్టును బట్టి రూ.50 వేలు నుంచి రూ.లక్షన్నర వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంగట్లో అంగన్వాడీ పోస్టులు అమ్ముకుంటున్న కూటమి నాయకులు పోస్టుకు రూ.3 లక్షల పైగా వసూలు చేస్తున్న వైనం అధికారులు కూడా రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షలు వసూలు చేస్తున్నట్లు సమాచారం ఎమ్మెల్యే ిపీఏ, బంధువుల కాల్‌తో కన్ఫర్మ్ చేస్తున్న అధికారులు లబోదిబోమంటున్న అర్హులు -
ప్రకాశం
34/237గరిష్టం/కనిష్టంరేషన్ బియ్యం లారీల పట్టివేత చీరాల నుంచి నెల్లూరు జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న రెండు రేషన్ బియ్యం లారీలను నాగులుప్పలపాడు మండల అధికారులు పట్టుకున్నారు. పేదలపై పీ–4 సర్వే పిడుగు పీ–4 సర్వే పేరుతో సచివాలయ ఉద్యోగులు 27 రకాల ప్రశ్నలతో సర్వే చేస్తున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో కోత పెట్టేందుకే సర్వే చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. పొగమంచు కురుస్తుంది. చలిగాలులు వీస్తాయి. – 8లో.. సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025 -
నల్లమల వన్యప్రాణుల ఖిల్లా
మార్కాపురం: నల్లమల అటవీ ప్రాంతం ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాల పరిధిలో సుమారు 6.50 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. ఈ అటవీ ప్రాంతంలో 87కు పైగా రాయల్ బెంగాల్ టైగర్లు, సుమారు 400 కు పైగా చిరుతలు తిరుగుతున్నాయి. వీటితోపాటు వందల సంఖ్యలో దుప్పులు, జింకలు, నీల్గాయ్లు, ఎలుగుబంట్లు ఉన్నాయి. వీటితోపాటు ఆకాశంలో 4 నుంచి 5 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ క్షణాల్లో భూమిమీద తిరిగే వన్యప్రాణులను తినే అరుదైన క్రస్టడ్ హక్ ఈగల్ (నల్లపాముల గద్ద), షార్టు టోడోస్ స్నేక్ఈగల్, హనీబజర్, క్రస్టడ్ సర్పెంట్ ఈగల్‌లు సంచరిస్తున్నాయి. ఇక రష్యా నుంచి 8 వేల కిలోమీటర్లు ప్రయాణించి నల్లమలకు వచ్చే మాన్టెగ్యూష్ హారియర్, పాలిడ్ హ్యారియర్ తదితర పక్షులకు కూడా నల్లమల ప్రాంతం నివాసంగా మారింది.మార్కాపురానికి చుట్టుపక్కల నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పెద్దదోర్నాల, పుల్లలచెరువు, యర్రగొండపాలెం, పెద్దారవీడు, అర్ధవీడు, గిద్దలూరు తదితర మండలాల్లో అటవీ సమీప గ్రామాలున్నాయి. పెద్దదోర్నాల మండలంలోని నల్లగుంట్ల, వై చర్లోపల్లి, తుమ్మలబైలు, శ్రీశైల శిఖరం, బొమ్మలాపురం, ఘాట్‌రోడ్డు, అర్ధవీడు మండలంలోని వెలగలపాయ, మాగుటూరు తాండ, గన్నెపల్లి, లక్ష్మీపురం, దొనకొండ, మార్కాపురం మండలం గొట్టిపడియ, పెద్దారవీడు మండలం గుండంచర్ల తదితర గ్రామాల సమీపాల్లోకి వన్యప్రాణులు తరచుగా వస్తుంటాయి. ముఖ్యంగా పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, నెమళ్లు సంచరిస్తున్నాయి. అటవీశాఖ అధికారులు వన్యప్రాణుల సంరక్షణకు అన్నీరకాల చర్యలు తీసుకుంటున్నారు. పెద్దపులులు, చిరుతలకు అడవిలోనే నీటి సమస్య లేకుండా సోలార్ సాసర్పిట్లు ఏర్పాటుచేసి అధికారులు నీటి సమస్య తీర్చారు.నల్లమల పరిధి పెరిగిపోతోంది. గతంలో ఏపీలోని ప్రకాశం, గుంటూరు, కర్నూల్, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ తదితర జిల్లాలతో అనుసంధానంగా ఉండగా ఇప్పుడు శేషాచలం అడవులను కలుపుతూ ఎన్ఎస్టీఆర్ (నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు), శేషాచలం అడవులను కలిపి టైగర్ కారిడార్ ఏర్పాటైంది. నల్లమల అడవిలోని పెద్దపులులు కడప మీదుగా వనిపెంట, ఒంటిమిట్ట తదితర ప్రాంతాల్లో ఉన్న శేషచలం అడవుల్లో కూడా సంచరిస్తున్నాయి. దీంతో నల్లమల పరిధి 8 వేల చదరపు కిలోమీటర్ల నుంచి 16 వేల చదరపు కిలోమీటర్లకు విస్తరించింది.పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 1000 మంది సిబ్బందిని, 85 బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. పులుల సంరక్షణకు తీసుకునే చర్యల వలన పులుల సంఖ్య పెరగడం విశేషం. -
అరకొర నిధులతో వెలుగొండను ఎలా పూర్తి చేస్తారు?
కొండపి: వెలుగొండ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా గుర్తించి 2027 కల్లా పూర్తి చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్లో అరకొరా నిధులు కేటాయించి ప్రకాశం జిల్లా ప్రజల ఆశల మీద నీళ్లు చెల్లిందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కంకణాల ఆంజనేయులు విమర్శించారు. మండల కేంద్రమైన కొండపి బస్టాండ్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై నిరసన ఆదివారం వ్యక్తం చేశారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావడానికి సుమారు రూ.4 వేల కోట్లు అవసరమవుతాయని, రూ.1458 కోట్లతో మొదటి దశ 2027 నాటికి పూర్తి చేస్తామని వెలుగొండ ప్రాంతంలో పర్యటించిన నీటిపారుదల శాఖ మంత్రి ఇటీవల ప్రకటించారని అన్నారు. బడ్జెట్లో పాలేటిపల్లె రిజర్వాయర్, సంగమేశ్వరం ప్రాజెక్టు, ప్రస్తావనే లేదని, దొనకొండ కారిడార్ కనిగిరి నిమ్స్, ఒంగోలు విమానాశ్రయం, పరిస్థితి ఏమిటి అనేది ప్రభుత్వం ప్రస్తావించలేదని అన్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేని స్థితిలో రైతులుంటే కేవలం రూ.300 కోట్లతో ధరల స్థిరీకరణ ఎలా సాధ్యమని పంటల పండగ ఎలా చేస్తారని ఆయన విమర్శించారు. మెగా డీఎస్సీ కలగా మారిందని, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ, మహాలక్ష్మి పథకం లాంటి ఎన్నికల నాటి పథకాలన్నీ కనుమరుగు చేసేలా బడ్జెట్ ఉందని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కేజీ మస్తాన్, జిల్లా నాయకురాలు కంకణాల రమాదేవి, వి.మోజస్, మండల కార్యదర్శి మల్లెల కొండయ్య, బ్రహ్మయ్య, చిన్న పేతురు, బ్రహ్మయ్య, వందనం, పెద్ద పేతురు, నిర్మల, ప్రేమ్ రాజు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలను నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడుకంకణాల ఆంజనేయులు -
ముస్లిం స్టీరింగ్ కమిటీ ఏర్పాటు
● సమన్వయకర్తగా పఠాన్ కరిముల్లా ఖాన్ ఒంగోలు వన్‌టౌన్: ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కోసం ముస్లిం స్టీరింగ్ కమిటీని ఆదివారం ఏర్పాటు చేశారు. ఒంగోలు బండ్లమిట్టలో ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు సన్నాహక సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎస్డీ సర్దార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న ముస్లిం నాయకులు మాట్లాడుతూ ముస్లిం హక్కుల సాధన కోసం, సమస్యల పరిష్కారానికి నగరంలోని ముస్లింలు అందరూ ఒకే తాటిమీదకు వచ్చి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఒంగోలు నగరంలో సుదీర్ఘకాలంగా పరిష్కారం కాని ముస్లిం శ్మశాన వాటిక, షాదీఖానా నిర్వహణ, ఉర్దూ పాఠశాల ఏర్పాటు వంటివి పరిష్కారం కాకుండా ఉన్నాయన్నారు. ముస్లింలకు న్యాయంగా అందాల్సిన సంక్షేమం, రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కోసం, హక్కుల సాధన కోసం ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటులో ప్రధాన ఉద్దేశం అని అన్నారు. నగరంలోని 50 డివిజన్ల పరిధిలోని ముస్లింలందరినీ చైతన్య పరిచి యాక్షన్ కమిటీ ఏర్పాటు కోసం స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. సభ్యులుగా ప్రజా సంఘాల నాయకులు ఎస్డీ ఇస్మాయిల్, ఎండీ రఫీ అహ్మద్, ఎస్కే అబ్దుల్ రవూఫ్, మహ్మద్ రఫీ, ఎస్డీ హుస్సేన్, ఎస్డీ కరీముల్లా, ఎంఏ సాలార్, ఎస్డీ ఇలియాజ్‌లను వ్యవహరిస్తారు. సలహాదారులుగా ఎస్డీ సర్దార్, ఎస్కే కరీముల్లా, ఎస్కే మహబూబ్ భాయ్‌లు వ్యవహరిస్తారు. కార్యక్రమంలో ఎస్కే షబ్బీర్, ఎస్కే కరీం, ఎస్కే ఖాదర్ వలి, ఎస్డీ సలీం, ఎస్కే గౌస్ భాషా, ఎస్కే ఫయాజ్, ఎస్డీ సమద్, పఠాన్ గౌస్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆకట్టుకుంటున్న జంగిల్ సఫారీ..
దోర్నాల నుంచి శ్రీశైలం మధ్య అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జంగిల్ సఫారీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జంగిల్ సఫారీని చూడొచ్చు. అటవీశాఖాధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో నల్లమల అటవీ ప్రాంతంలో సుమారు 25 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవ చ్చు. జింకలు, నెమళ్లు, పలురకాల పక్షిజాతులు కనిపిస్తాయి. ఇందులో పులికుంట వద్ద వ్యూ పాయింట్ వద్ద కాసేపు వాహనాన్ని ఆపుతారు. పెద్దపులులు, చిరుతలు ఇక్కడికి తరచుగా వచ్చి నీళ్లు తాగుతాయి. ఇక కొండ చిలువలు, పెద్ద పెద్ద చెట్లకు చుట్టుకుని కనిపిస్తాయి. -
ప్రమాదంలో పోస్టాఫీసుల ఉనికి
ఒంగోలు టౌన్: కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా పోస్టాఫీసుల ఉనికి ప్రమాదంలో పడిందని , కార్మికుల భవిష్యత్‌ను కాపాడుకునేందుకు పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. తపాలా శాఖలో జరుగుతున్న పెను మార్పులపై సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అజయ్‌కుమార్ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వాలు తపాలా శాఖను సేవారంగంగా పరిగణించాయని, ప్రస్తుత ప్రభుత్వం అందుకు విరుద్ధంగా తపాలా శాఖను వ్యాపార సంస్థగా మార్చి వేస్తుందన్నారు. రానున్న రోజుల్లో తపాలా శాఖను మూడు విభాగాలుగా విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, మెయిల్ డెలివరీ విభాగాలుగా తపాలా శాఖను విడగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని, దీని వల్ల తపాలా ఉద్యోగులు, కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు తపాలా కార్మికులు ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పారు. సదస్సులో ఎన్ఈపీఈ జిల్లా కార్యదర్శి ఏ.హరిబాబు, ఏఐజీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి ఎం. పోలయ్య, మహిళా నాయకులు డి. శ్రీలక్ష్మి, కె.ప్రసన్న, జీవీ సుబ్బారావు, కొప్పోలు వెంకటేశ్వరరావు, దర్శి మోహన్‌రావు, పాతం శెట్టి పేరయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు, జి.శ్రీనివాసులు, దామా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
డివిజన్ల వారీగా ఖాళీల వివరాలు ఇలా...
ఒంగోలు డివిజన్: పోస్టులు దరఖాస్తులు అంగన్వాడీ వర్కర్లు 06 34 అంగన్వాడీ హెల్పర్లు 45 106 కనిగిరి డివిజన్: అంగన్వాడీ వర్కర్లు 06 30 అంగన్వాడీ హెల్పర్లు 20 42 మినీఅంగన్వాడీ వర్కర్లు 01 02 మార్కాపురం డివిజన్: అంగన్వాడీ వర్కర్లు 04 10 అంగన్వాడీ హెల్పర్లు 24 52 మినీఅంగన్వాడీ వర్కర్లు 03 09 -
మొక్కుబడిగా ఇంటర్వ్యూలు..
ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించిన ఇంటర్వ్యూలను అధికారులు మొక్కుబడిగా నిర్వహించి మమ అనిపించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నెల 14వ తేదీన ఒంగోలు నగరంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇచ్చిన లిస్టుల ఆధారంగానే ఎంపికలు జరిగినట్టు తెలిసింది. అలాగే నోటిఫికేషన్ ఇవ్వకుండానే కొన్ని కేంద్రాల్లో పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్టు సమాచారం. దర్శి నియోజకవర్గంలో అధికార టీడీపీ నాయకులు భారీగా డిమాండ్ చేసినట్టు తెలిసింది. -
రేషన్ బియ్యం లారీలు పట్టివేత
నాగులుప్పలపాడు: చీరాల నుంచి నెల్లూరు జిల్లాకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న రెండు లారీలను ఆదివారం నాగులుప్పలపాడు సమీపంలో అధికారులు పట్టుకున్నారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతుందన్న సమాచారంతో ఒంగోలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. నాగులుప్పలపాడు సమీపంలోని ఇంకొల్లు క్రాస్ రోడ్డు వద్ద ఏపీ 39 టీయూ 1015, ఏపీ 39 టీయూ 4972 నంబర్ల గల లారీలను తనిఖీ చేయగా, ఒక్కో లారీలో 350 చొప్పున 50 కేజీల రేషన్ బియ్యం బస్తాలు ఉన్నాయి. మొత్తం 700 బస్తాలున్నట్లు గుర్తించి వాహన డ్రైవర్లు అరవపల్లి గోపి, ఇమ్రాన్ నుంచి వాంగ్మూలం సేకరించారు. ఈ బియ్యంను నెల్లూరు జిల్లా కావలికి చెందిన వంశీరెడ్డి, వాహన ఓనర్ శామ్యూల్, మాల్యాద్రి అక్రమంగా సేకరించి రవాణా చేస్తున్నట్లు గుర్తించి వారిపై నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేయించినట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన 700 బస్తాల రేషన్ బియ్యంను ఒంగోలు ఎంఎల్ఎస్ గోడౌన్లో అప్పగించినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ సీఐ రాఘవరావు, ఎస్సై నాగేశ్వరరావు, ఒంగోలు ఎన్పోర్స్మెంట్ డీటీ రాజ్యలక్ష్మి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. -
క్రికెట్ బుకీలు జంప్
● జరుగుమల్లి యువకుడు పరారీతో బట్టబయలైన బెట్టింగ్ బాగోతం ● పోలీసుల అదుపులో క్రికెట్ బుకీలు? ● క్రికెట్ బెట్టింగ్‌పై విచారణ వేగవంతం చేసిన పోలీసులు సింగరాయకొండ: క్రికెట్ బెట్టింగ్‌లో జరుగుమల్లి మండలం పైడిపాడు గ్రామానికి చెందిన యువకుడు బత్తిన అశోక్ నగదు పోగొట్టుకుని ఇంటి నుంచి పరారైన ఘటనతో క్రికెట్ బెట్టింగ్ భూతం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం జరుగుమల్లి, సింగరాయకొండ మండలాల్లోని క్రికెట్ బుకీల వెన్నులో దడపుట్టించింది. ఈ వ్యవహారం ఎస్పీ ఏఆర్ దామోదర్ దృష్టికి వెళ్లటంతో ఆయన ఆదేశాలతో ఈ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేయటంతో క్రికెట్ బుకీలు జంప్ అయ్యారన్న ప్రచారం సాగుతోంది. పూర్తి వివరాల ప్రకారం... పైడిపాడు గ్రామానికి చెందిన అశోక్ క్రికెట్ బెట్టింగులు ఆడి భారీగా డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో క్రికెట్ బుకీలకు డబ్బులు కట్టలేక ఇంట్లో చెప్పలేక చివరకు ఈ నెల 20వ తేదీ ఉదయం హెయిర్ కటింగ్ చేయించుకుని వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో అతను చివరిసారిగా ఆ గ్రామానికి చెందిన క్రికెట్ బుకీ తన్నీరు తేజతో ఫోన్ మాట్లాడినట్లు తెలుసుకున్న అశోక్ బంధువులు జరుగుమల్లి పోలీస్‌స్టేషన్‌లో గత నెల 21వ తేదీ ఫిర్యాదు చేశారు. దీంతో ఆ మండలంలో జరుగుతున్న బెట్టింగ్ విషయం బట్టబయలైంది. ఈక్రమంలో అశోక్ బంధువులు ఎస్పీ ఏఆర్ దామోదర్‌ను కలిసి అశోక్ పారిపోవటానికి గల కారణాలను వివరించారు. గత నెల 23వ తేదీ సాయంత్రం అశోక్ తన బంధువులకు ఫోన్ చేసి మీరు భయపడవద్దని తాను తిరుపతి సమీపంలో ఉన్నానని ఇంటికి వస్తున్నానని చెప్పి మరుసటి రోజు ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో జరుగుమల్లి పోలీసులు అశోక్ ను తహశీల్దార్ వద్ద హాజరు పరచి అతను ఇంటి నుంచి వెళ్లిపోవటానికి గల కారణాలను రాత పూర్వకంగా నమోదు చేశారు. తరువాత పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణ చేపట్టారు. సీఐ హజరత్తయ్య పర్యవేక్షణలో జరుగుమల్లి ఎస్సై బీ మహేంద్ర ఆధ్వర్యంలో విచారణ సాగుతున్నట్లు సమాచారం. రెండు రోజులుగా పోలీసులు జరుగుమల్లి, సింగరాయకొండ మండలాల్లో క్రికెట్ బుకీల కోసం వేట మొదలు పెట్టి సుమారు 15 మంది వరకు బుకీలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారన్న ప్రచారం జోరుగా ఉంది. వీరిలో ప్రధానంగా సింగరాయకొండ కు చెందిన రెస్టారెంట్ యజమాని, అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి ఉన్నాడని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసులపై అధికార పార్టీ నాయకుల ఒత్తిడి తీవ్రమైంది. ఇటీవల ఐసీసీ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి కందుకూరు ఫ్లైఓవర్ జంక్షన్ బెట్టింగు రాయుళ్లకు అడ్డాగా మారిందని, ఆ ప్రాంతంలోని హోటళ్ల వద్ద కూర్చొని బెట్టింగ్ ఆడుతున్నారని సమాచారం. ఇటీవల కాలంలో తమ పిల్లలు లక్షలకు లక్షలు బెట్టింగులో పోగొట్టుకుంటున్నారని, ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాలేదని ఇకనైనా బెట్టింగు జాడ్యానికి పోలీసులు ముగింపు పలకాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆదివారం ఇండియా– న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతున్నా కందుకూరు ఫ్లై ఓవర్ జంక్షన్ ప్రాంతం బోసిపోయింది. క్రికెట్ బుకీలు ఇతర రాష్ట్రాలకు పరారై తలదాచుకుంటున్నారు. దీనిపై సీఐ హజరత్తయ్యను వివరణ కోరగా...అనుమానితులను విచారిస్తున్నామని, ఎవ్వరినీ అదుపులోనికి తీసుకోలేదని తెలిపారు. -
వితంతు పింఛన్ కోసం పది నెలలుగా పడిగాపులు
● సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్త పోస్టు వైరల్ కంభం: ‘నా భర్త చనిపోయి ఏడాది కావస్తుంది. వితంతు పింఛన్ కోసం పది నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా మంజూరు కాలేదు. మేం తొలి నుంచి టీడీపీ కార్యకర్తలం’ అంటూ స్థానిక కందులాపురం పంచాయతీలో హైవేరోడ్డుపై చిన్న బంకు పెట్టుకొని జీవనం సాగిస్తున్న షేక్ కరీమున్నిసాపై సోషల్ మీడియా పోస్టు వైరల్‌గా మారింది. అయితే ఆ పోస్టు గమనించిన టీడీపీ మండల అధ్యక్షుడు ప్రస్తుతం ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి లేదని, అందుబాటులోకి వెంటనే పింఛన్ మంజూరవుతుందంటూ మరో పోస్టు సోషల్ మీడియాపై పెట్టారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలవుతున్నా పింఛన్లు, రేషన్‌కార్డులకు సంబంధించి వెబ్సైట్ పోర్టల్ అందుబాటులోకి తీసుకురాలేదని, దీంతో ఎంతో మంది లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి
మద్దిపాడు: రోడ్డు ప్రమాదంలో శనివారం గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. బాపట్ల జిల్లా అద్దంకి పట్టణానికి చెందిన తాటి అజయకుమార్, అతని తల్లి పుష్పావతి ద్విచక్ర వాహనంపై అద్దంకి వెళ్తుండగా జాతీయ రహదారిపై మద్దిపాడు మండలంలోని ఏడుగుండ్లపాడు సమీపంలో మార్కెట్ యార్డ్ వద్ద వెనుక నుంచి ఇసుజు వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడిన తాటి పుష్పావతి ఒంగోలులో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు మద్దిపాడు పోలీసులు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పుచ్చలమిట్టలో చోరీ
దర్శి(కురిచేడు): స్థానిక పుచ్చలమిట్టలోని త్రిపురాభట్ల పున్నయ్యశాస్త్రి ఇంట్లో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే..పుచ్చలమిట్టకు చెందిన పున్నయ్యశాస్త్రి కుటుంబసభ్యులు వేసవి కాలం కావడంతో వరండాలో నిద్రిస్తున్నారు. బెడ్రూంకు, వరండాలకు వేర్వేరు దారులు ఉన్నాయి. ఉదయాన్నే నిద్ర లేచి చూసేసరికి బెడ్‌పై దుస్తులు చిందరవందరగా పడేసి ఉన్నాయి. బీరువా తాళాలు తీసి ఉండటంతో పరిశీలించగా..అందులోని 13 సవర్ల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు గుర్తించారు. అయితే ఈ ఇంట్లో చోరీ తరువాత దుండగలు మరో ఇంట్లో చోరీకి తాళాలు పగులగొడుతుండగా చుట్టుపక్కల వారు నిద్ర లేవడంతో దొంగలు పరారయ్యారు. -
చిరుత పులి కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు
యర్రగొండపాలెం: అటవీ జంతువుల కోసం ఉచ్చులు వేసి చిరుత పులి మరణానికి కారణమైన ఇద్దరు నిందితులను అటవీ శాఖాధికారులు ఆదివారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..గత నెల 15వ తేదీ రాత్రి కొలుకుల సెక్షన్‌లోని వరదరాజు స్వామి గుడి ప్రాంతంలో అటవీ జంతువులను వేటాడటానికి మండలంలోని పెద్ద కొలుకుల గ్రామానికి చెందిన దొంత రామయ్య, దొంత యల్లయ్యలు ఉచ్చులు వేశారు. ఈ ఉచ్చులో చిరుత పులి చిక్కుకుంది. తప్పించుకునే వీలులేక పోవడంతో మరుసటి రోజు ఆ పులి మృతి చెందింది. ఈ కేసు ముమ్మరం చేసిన ఫారెస్ట్ అధికారులు డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజీను సేకరించి నిందితులను గుర్తించి వారితో పాటు అనుమానితులైన మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్ట్ అయిన మొదటి నిందితుడు రామయ్య ఇంటి వద్ద 3కణితి కొమ్ములు, 2చుక్కల దుప్పి కొమ్ములు, 2 సెల్ఫోన్లు, కత్తి, టార్చ్‌లైట్, మోటారు బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు. -
పీ–4 సర్వే పిడుగు
పేదల పైబేస్తవారిపేట: కూటమి నేతలు సూపర్ సిక్స్ అంటూ గత ఎన్నికల ప్రచారంలో ఉదరగొట్టారు. ఇంటింటికీ కరపత్రాలు పంచుతూ మీ ఇంటికి ఇన్ని పథకాలు వస్తాయి..ఇంత మేలు జరుగుతుందంటూ నమ్మించారు. కూటమి అధికారంలోకి వస్తే మీ జీవితాలు మెరుగుపడతాయన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక తొమ్మిది నెలలవుతున్నా వీటి అమలుకు నోచుకోలేదు. చెప్పిన వాగ్దానాలు అమలు చేయకుండా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తాజాగా పీ–4 సర్వే పేరిట ఉన్న సంక్షేమ పథకాలను ఎత్తేసేందుకు శ్రీకారం చుట్టారు. పీ–4 సర్వేలో భాగంగా సచివాలయ ఉద్యోగులు ప్రజలకు ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. టీవీ, ఏసీ, ఫోర్ వీలర్, టూ వీలర్, ఇతర గృహోపకరణాలు, ఇళ్ల స్వరూపం, లేకులా, స్లాబా, బ్యాంక్ ఖాతా.... ఇలా 27 రకాల ప్రశ్నలు అడిగి సమాధానాలను సిబ్బంది నింపాల్సిన పరిస్థితి. ఆపై ప్రజల ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నమోదు చేసి ఈ తతంగాన్ని ముగిస్తున్నారు. జిల్లాలో 1392 రేషన్ దుకాణాల పరిధిలో 6.73 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వేల కుటుంబాలు కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. వీరంతా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలే. అప్పోసప్పో చేసి, నెలవారీ వాయిదాల్లో ఏసీలను ఎక్కువ మంది ఏర్పాటు చేసుకుని ఉంటారు. అయితే ఇది ఉందని తెలిస్తే చాలు వెంటనే సదరు వివరాలను ప్రభుత్వ రికార్డుల్లోకి సిబ్బంది నమోదు చేస్తున్నారు. ఈ వ్యవహారంతో తమకు సంక్షేమ పథకాలు ఆగిపోతాయనే ఆందోళన పేదల్లో నెలకొంది. నిరాకరించినా..నమోదే... సర్వేలో సిబ్బంది పొందుపర్చే అంశాలు ప్రస్తుత జీవనశైలిలో భాగమైనవే. స్మార్ట్ఫోన్లు, బైక్‌లు ఇలాంటి ప్రశ్నలు ఉండటంతో సంక్షేమ పథకాల్లో కోత పడుతుందనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. సర్వేకు ఎవరైనా నిరాకరిస్తే వారి పేర్లను సైతం నమోదు చేయాలనే ఆదేశాలు సిబ్బందికి జారీ చేయడం కలవరానికి గురిచేస్తోంది. బాబూ నమ్మండయ్యా.. పీ–4 సర్వేను పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ షిప్‌తో నిర్వహిస్తున్నారు. దీన్ని నమ్మాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు. జిల్లాలోని అన్ని సచివాలయాల పరిధిలో ఉన్న కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది. ఇంటి వద్దకు సిబ్బంది వెళ్లి వివిధ రకాల సమాచారాన్ని సేకరించి యాప్‌లో నమోదు చేస్తున్నారు. సర్వే పకడ్బందీగా నిర్వహించాలని, దీన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని చెబుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల గుర్తింపు కోసం ఇది దోహదపడుతుందనే అంశాన్ని ప్రజలకు తెలియజేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి అధికారులు చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు యథావిధిగా కొనసాగుతాయని, ఇందులో ఎలాంటి అపోహలొద్దని చెబుతున్నా క్షేత్రస్థాయిలో అంతా అయోమయం నెలకొంది. 27 రకాల ప్రశ్నలతో సచివాలయ ఉద్యోగుల సర్వే ఇంటిలోని విలువైన వస్తువుల వివరాల నమోదు చడీచప్పుడు లేకుండా సాగుతున్న సర్వే సంక్షేమ పథకాల లబ్ధిదారుల కోత కోసమేనా ? -
ఆ పిల్లలకు దిక్కెవరు..!
● విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి ● ఏడాది క్రితం తల్లి మృతి ● అనాథలైన నలుగురు పిల్లలు పుల్లలచెరువు: విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని పిడికిటివానిపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన దండేబోయిన కోటేశ్వరరావు(38) ఉపాధి హామీ పథకంలో ఆపరేషటర్గా పనిచేస్తూ ఉన్న దానిట్లో వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేసుకొని తనకు ఉన్న నలుగురు పిల్లలను చదివించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కోటేశ్వరరావు భార్య ఏడాది క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి అన్ని తానై పిల్లలను చూసుకుంటున్నాడు. విధి చిన్న చూపు చూడడంతో శనివారం రాత్రి సమయంలో ప్లాంట్ రిపేరు రావడంతో కోటేశ్వరరావు తనకు ఉన్న పరిజ్ఞానంతో రిపేరు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురైఅక్కడికక్కడే మృతి చెందాడు. పక్క ఇళ్లవారు వచ్చి చూసే సరికి మృతి చెంది ఉండడంతో వారి పిల్లల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం ఒక్కసారిగా మార్మోగింది. కోటేశ్వరరావు ఇటీవల వరకు పుల్లలచెరువులో పనిచేసి ఇటీవలనే యర్రగొండపాలెం కార్యాలయానికి బదిలీపై వెళ్లాడు. అందరికీ పరిచయమైన వ్యక్తిగా మంచి పేరు సంపాదించుకున్న కోటేశ్వరరావు మృతితో చిన్నారులు అనాథలుగా మిగిలారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
త్రిపురాంతకేశ్వరుడి ఆదాయం రూ.12.82 లక్షలు
త్రిపురాంతకం: పార్వతీ త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి, బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయాల హుండీ ఆదాయం రూ.12,82,579 వచ్చినట్లు ఆలయాల కార్యనిర్వహణాధికారి డి.రజనీకుమారి తెలిపారు. స్వామివారి దేవస్థానం హుండీలో రూ.7,88,736, అమ్మవారి దేవస్థానం హుండీలో రూ.4,59,781, అన్నదానం హుండీలో రూ.34,062 వచ్చినట్లు పేర్కొన్నారు. హుండీలను చీఫ్ ఫెస్టివల్ అధికారి డి.అనిల్‌కుమార్, ఆలయాల కమిటీ చైర్మన్ ఇమ్మడిశెట్టి వెంకట సుబ్బారావు, ధర్మకర్తల మండలి సభ్యులు, బాలా త్రిపుర సుందరీ, భ్రమరాంబ సేవా సమితీల ఆధ్వర్యంలో లెక్కించినట్లు పేర్కొన్నారు. -
యోగాతో ఒత్తిడి దూరం
ఒంగోలు టౌన్: నిత్యం మానసిక ఒత్తిడికి గురయ్యే మహిళా పోలీసులు యోగా ద్వారా ఉపశమనం పొందవచ్చని ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్‌బాబు సూచించారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మానసికంగా కూడా ధృఢంగా వుంటారని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీసు కళ్యాణ మండపంలో మహిళా పోలీసులకు యోగా నిర్వహించారు. ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ పని ఒత్తిడికి గురవుతున్నారని, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నారన్నారు. మెడిటేషన్, యోగాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని, జీవితంలో విజయం సాధించడానికి ఉపయోగపడతాయన్నారు. మానసిక భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ద్వారా అన్ని రంగాల్లో విజయం సాధించడం సాధ్యమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, ఆర్ సీతారామిరెడ్డి, యోగా గురువు బాలు, మహిళా పోలీసులు, హోంగార్డులు, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు. -
హత్యలు చేసి... పుణ్యక్షేత్రాల్లో మకాం!
మార్కాపురం: అనుమానంతో భార్యను, ఆపై ఆమె తల్లిని హత్య చేసిన నిందితుడు పరారై.. పోలీసులకు దొరక్కుండా ఎనిమిది నెలలుగా పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ముప్పు తిప్పలు పెట్టాడు. చివరికి పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం డీఎస్పీ డాక్టర్ యు.నాగరాజు శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం యర్రగొండపాలెం మండలం యల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రేళ్ల శ్రీనుకు, వేములకోట గ్రామానికి చెందిన కన్నెసాని నారాయణమ్మ కుమార్తె సునీతతో వివాహమైంది.భార్యపై అనుమానంతో తరచుగా వేధింపులకు గురిచేసేవాడు. ఈ నేపథ్యంలో 2023 మార్చి 14న వేములకోటలోని తన అత్తగారింట్లో ఉన్న భార్య సునీతను రోకలిబండతో హత్యచేసి పరారయ్యాడు. పోలీసులు అరెస్టుచేసి జైలుకు పంపగా బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే శ్రీను తన అత్త నారాయణమ్మను కూడా హతమార్చాలని నిర్ణయించుకుని గతేడాది జూన్ 30వ తేదీ రాత్రి వేములకోటలోని తన ఇంటిలో నిద్రపోతున్న ఆమెను కత్తితో విచక్షణా రహితంగా నరికి చంపి పారిపోయాడు. ఈ సంఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పుణ్యక్షేత్రాల్లో నివాసం..నిందితుడైన శ్రీను హత్య కేసుల నుంచి తప్పించుకునేందుకు పుణ్యక్షేత్రాల్లో నివాసమున్నట్లు పోలీసులు గుర్తించారు. సెల్‌ఫోన్ వాడితే తనను పోలీసులు పట్టుకుంటారని భావించి దారిన పోయేవారి సెల్‌ఫోన్ తీసుకుని తెలిసిన వారికి ఫోన్‌చేస్తూ సమాచారం కనుక్కుంటూ ఉండేవాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు శ్రీనుకు తెలిసిన వారి ఫోన్నంబర్లపై నిఘా పెట్టారు. సీఐ సుబ్బారావు, రూరల్ ఎస్సై అంకమరావు ప్రత్యేక టీమును ఏర్పాటు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.నిందితుడైన శ్రీను షిరిడీ, కాశీ, వేములవాడ, రామేశ్వరం, చెన్నై, పూణే తదితర ప్రాంతాల్లో ఉంటూ ఒక చోట టీ మాస్టరుగా, మరోచోట దోసె మాస్టరుగా హోటల్లో పనిచేస్తూ ఎక్కడా పట్టుమని 10 రోజులు కూడా ఉండకుండా మకాంలు మారుస్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతూ వచ్చాడు. కాగా నిందితుడు ఎక్కడ ఉన్నా శివాలయానికి వెళ్తాడని పోలీసులు గుర్తించి మాటు వేశారు. తిరుత్తణి దగ్గర త్రుటిలో తప్పించుకున్న శ్రీను శ్రీశైలం నుంచి త్రిపురాంతకం వెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగా శనివారం దేవరాజుగట్టు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద గాలింపు చర్యలు చేపట్టగా నిందితుడు పట్టుబడ్డాడు. అరెస్ట్ అనంతరం నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. పోలీసు సిబ్బందికి రివార్డులు.. ఎనిమిది నెలలలుగా తప్పించుకుని తిరుగుతూ ముప్పుతిప్పలు పెట్టిన శ్రీనును అరెస్టు చేసే విషయంలో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీ నాగరాజు, సీఐ సుబ్బారావు, రూరల్ ఎస్సై అంకమరావు, ఏఎస్సైలు ఎస్కే జిలానీ, డీ శ్రీనివాసరావు, సిబ్బంది వెంకటేశ్వర్లు, అరుణగిరి ఆంజనేయులు, జె వెంకటేశ్వర్లును ఎస్పీ దామోదర్ అభినందించారు. డీఎస్పీ నాగరాజు పలువురికి నగదు బహుమతి అందజేశారు. ప్రెస్మీట్లో సీఐ సుబ్బారావు, ఎస్సైలు అంకమరావు, సైదుబాబు పాల్గొన్నారు. -
విజయీభవ
● పేర్నమిట్టలోని సరస్వతి కాలేజీలో విద్యార్థి మాల్ ప్రాక్టీస్ ● తొలిరోజు 1408 మంది గైర్హాజరుఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అధికారులు పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసి పకడ్బందీగా నిర్వహించారు. మొదటి రోజు ఇంటర్ మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పేపర్ వన్ పరీక్ష నిర్వహించారు. జనరల్, ఒకేషనల్ పరీక్షలకు కలిపి మొత్తం 22,690 మందికి గాను 21,282 మంది హాజరయ్యారు. 1408 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ పరీక్షకు 20,564 మంది విద్యార్థులకుగాను 19,461 మంది హాజరవగా, 1103 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ పరీక్షకుగాను 2126 మందికి గాను 1821 మంది విద్యార్థులు హాజరవగా 305 మంది గైర్హాజరయ్యారు. ఆర్ఐఓలు ఏడుగురు, 12 మంది డీఈసీ– డీఐఈఓలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. 32 మంది స్క్వాడ్స్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఇంటర్ పరీక్షలను కలెక్టర్ తమీమ్ అన్సారియా సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. ఒంగోలులోని ఏకేవీకే జూనియర్ కాలేజీ, నారాయణ కాలేజీని ని పరిశీలించారు. ఆమె వెంట ఆర్డీఓ ఉన్నారు. పేర్నమిట్ట సరస్వతి జూనియర్ కాలేజ్‌లో పరీక్ష రాస్తుండగా ఒక విద్యార్థి మాల్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడని గుర్తించి అతని మీద కేసు బుక్ చేశారు. -
మృత్యు వలలో!
సాగర తీరం అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్ల మృత్యు తీరమవుతోంది. చేప గుడ్లను మింగేసే జెల్లీఫిష్‌ను, నాచును తినడం ద్వారా మత్స్యసంపదను కాపాడుతున్న వీటికి ప్రాణగండం ఏర్పడింది. సముద్రగర్భంలో ఉండే ఇవి గుడ్లు పెట్టేందుకు తీరానికి వచ్చి మృత్యువాత పడుతున్నాయి. తమిళనాడుకు చెందిన మెకనైజ్డ్ బోట్లు తీరం సమీపానికొచ్చి వేటసాగించడం, భారీ వలలు, కాలుష్యం తదితర కారణాలతో నేడు అవి జీవన్మరణ పోరాటం సాగిస్తున్నాయి. సింగరాయకొండ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రామాయపట్నం నుంచి చీరాల వరకూ విస్తరించి ఉన్న సముద్రతీరంలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల కళేబరాలు దర్శనమిస్తుండడంపై మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా నవంబరు నుంచి మార్చి నెల మధ్యలో ఇవి సంతానోత్పత్తి కోసం థాయ్‌లాండ్, మలేషియా, ఇండోనేషియా తదితర దేశాల నుంచి సుమారు 20 వేల కిలోమీటర్లు ప్రయాణించి ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోని సముద్రతీరాలను చేరుకుని గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేసిన తరువాత తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లిపోతాయి. ఈ ప్రాంతాలకు వచ్చిన అవి గుడ్లు పెట్టే సమయంలో తీరానికి వస్తాయి. ఒక్కో తాబేలు గుడ్లు పిల్ల దశకు రావడానికి సుమారు 60 రోజులు పడుతుంది. ఈ ప్రక్రియ కోసం వచ్చిన తాబేళ్లు మృత్యువాత పడడం విచారకరం. ఉమ్మడి జిల్లాలో 600 వరకూ మృతి నవంబర్ నుంచి ఫిబ్రవరి మాసం వరకు ఉమ్మడి ప్రకాశం తీరంలో 500 నుంచి 600 వరకూ మృతి చెంది ఉంటాయని చైన్నెకు చెందిన ‘ట్రీ ఫౌండేషన్ సంస్థ’ చెబుతోంది. ఈ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న తీర ప్రాంతాల్లో మైరెన్, మత్స్యశాఖ, పోలీస్‌శాఖకు చెందిన వారితో కలసి ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ఉమ్మడి జిల్లాలోని తీరం వెంబడి వందల సంఖ్యలో ఇవి చనిపోయాయని గుర్తించింది. తాబేళ్లు సముద్రపు అడుగున ఉంటున్నప్పటికీ ప్రతీ 45 నిమిషాలకు ఒకసారి నీటిపైకి వచ్చి గాలి పీల్చుకొని మళ్లీ వెళ్లిపోతాయి. అలాగే గుడ్లు పెట్టే సమయంలోనూ తీరానికి వస్తుంటాయి. ఇదే వీటి పాలిట శాపంగా మారింది. సాగరతీరంలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల మరణ మృదంగం ఉమ్మడి ప్రకాశంలో సుమారు 600 వరకూ మృత్యువాత తీరంలో భారీగా తాబేళ్ల కళేబరాలు తమిళనాడు సోనాబోట్లు, భారీ వలలు, కాలుష్యం కారణం సంరక్షణకు నామమాత్రపు చర్యలు -
రైతాంగం ఆశలపై నీళ్లు చల్లిన రాష్ట్ర బడ్జెట్
ఒంగోలు టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2025–26 బడ్జెట్ జిల్లా రైతాంగం ఆశలపై నీళ్లు చల్లిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జజ్జురి జయంతి బాబు, పమిడి వెంకటరావు విమర్శించారు. స్థానిక ఎల్బీజీ భవనంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ..వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.1000 కోట్లు, మొదటి టన్నెల్ అడ్డంకులను తొలగించడానికి రెండో టన్నెల్ పనులను కొనసాగించడానికి మరో రూ.1000 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. వెంటనే రూ.2 వేల కోట్లు కేటాయించి యుద్ధ ప్రతిపాదికన పనులు చేపట్టి జూన్ నాటికి వరద నీటిని నల్లమల సాగర్‌కు నీటిని మళ్లించాలని రైతు సంఘం డిమాండ్ చేస్తుందన్నారు. ఇప్పటికే 30 ఏళ్లుగా ప్రజలు వెలుగొండ ప్రాజక్టు కోసం ఎదురు చూస్తున్నారని, అంతటి ప్రాధాన్యత కలిగిన ప్రాజక్టుకు కేవలం రూ.359 కోట్లు మాత్రమే కేటాయించడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం అన్నారు. పాలేటిపల్లి రిజర్వాయర్, సంగమేశ్వరం ప్రాజెక్టులను అస్సలు పట్టించుకోకపోవడం అన్యాయం అన్నారు. గుండ్లకమ్మకు రూ.100 కోట్లు కేటాయిస్తేనే కానీ కాలువలకు నీరు ప్రవహించదన్నారు. బడ్జెట్లో సవరణ చేసైనాసరే ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. -
మహిళలందరూ ఆర్థిక స్వావలంబన సాధించాలి
● కలెక్టర్ తమీమ్‌అన్సారియా ఒంగోలు సిటీ: మహిళలందరూ ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద శనివారం ప్రారంభమైన అవగాహన ర్యాలీ రిమ్స్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీని కలెక్టర్ తమీమ్ అన్సారియా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ ఈనెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు మహిళలు, హక్కుల సాధికారతపై అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం పలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ర్యాలీలో పట్టణంలోని వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ హేనా సుజన్, డీసీపీఓ దినేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. రజకులంటే కక్ష ఎందుకు చంద్రబాబు ? ఒంగోలు టౌన్: జీవో నెంబర్ 24 ద్వారా లాండ్రీలకు ఇచ్చే 150 యూనిట్ల ఉచిత విద్యుత్, 75 జీవో ద్వారా దోభీఘాట్లకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌కు రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం కూటమి ప్రభుత్వం రజకుల పట్ల వివక్ష చూపుతుందనడానికి నిదర్శనమని రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పొటికలపూడి జయరాం శనివారం ఒక ప్రకటనలో చెప్పారు. ఈ రెండు జీవోలను బడ్జెట్లో తుంగలో తొక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు రజకులంటే ఎందుకు కక్షో తెలపాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు తెలుగు దేశం ప్రభుత్వం రజకులకు ఇచ్చిన ఒక్కటంటే ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడని హామీలను నెరవేర్చే అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం రజకులకు మేలు చేసేందుకు సిద్ధంగా లేదన్నారు. ఈనామ్ భూములు అన్యాక్రాంతంపై కూటమి పాలకులు మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. జగనన్న టౌన్‌షిప్పుల్లో సేకరించిన కమ్యూనిటీ స్థలాల్లో రజకుల వృత్తి అవసరాలకు ప్రత్యేక స్థలాలను కేటాయిస్తే ప్రభుత్వం పై పడే ఆర్థిక భారం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో రజకులు ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. బడ్జెట్ ప్రతుల దహనం మార్కాపురం టౌన్: బడ్జెట్లో వెలుగొండ ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపడాన్ని నిరశిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం మార్కాపురం పట్టణంలోని కోర్టు సెంటర్లో బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ, సీపీఎం నాయకులు అందె నాసరయ్య, రఫీ, సోమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో వెలుగొండకు రూ.2 వేల కోట్లు కేటాయించాలని కోరినా కేవలం రూ.359 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. వెలుగొండ ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం నశించాలన్నారు. పశ్చిమ ప్రకాశం ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని చెప్పారు. ఏ మాత్రం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నా రూ.2 వేల కోట్లు కేటాయించాలని, నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, మొదటి టన్నెల్ ద్వారా ఈ ఏడాది వరద సీజన్‌కు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయా పార్టీల నాయకులు జి.బాలనాగయ్య, ఎస్కే ఖాశీం, జవ్వాజి రాజు, రూబెన్, నన్నేసా, సురేష్ కుమార్, కాశయ్య, చిత్తారి పెద్దన్న, అల్లూరయ్య పాల్గొన్నారు. -
మృత్యుపాశాలుగా సోనాబోట్లు
తమిళనాడు రాష్ట్రం కడలూరు ప్రాంతానికి చెందిన సోనాబోట్లు తాబేళ్ల పాలిట మృత్యువు పాశాలుగా మారాయి. సోనాబోట్లు తీరానికి దూరంగా 12 నాటికన్ మైళ్లకు అవతల చేపలు వేటాడాలి. అయితే తీరానికి 40 మీటర్ల దూరంలోనే చేపల వేట సాగిస్తున్నాయి. దీంతో గుడ్లు పెట్టడానికి తీరానికి చేరుకునే ప్రయత్నంలో తాబేళ్లు సోనాబోట్ల వలలకు చిక్కి మరణిస్తున్నాయి. ఒక్కసారి సోనాబోట్ల వలలో చిక్కుకుంటే చాలు మృత్యువాత పడినట్లేనని స్థానిక మత్స్యకారులు అంటున్నారు. కొద్ది నెలలుగా ప్రతిరోజు రాత్రి పగలు తేడా లేకుండా తీరంలో వేటాడటంతో అటు మత్స్య సంపద పోవటంతో పాటు తాబేళ్లు కూడా మృత్యువాత పడి కళేబరాలు తీరానికి చేరుకుంటున్నాయి. చేపగుడ్లను తినే జెల్లీ ఫిష్‌ను ఇవి ఆహారంగా తీసుకోవటంతో మత్స్యసంపద వృద్ధి చెందుతుంది. అదే విధంగా సముద్రపు నాచును కూడా ఇవి ఆహారంగా తీసుకోవడంతో చేపలు గుడ్లు పెట్టేందుకు అనువుగా ఉంటుంది. తాబేళ్లు అంతరించిపోతే మత్స్యసంపదకే ప్రమాదమని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు. -
పిల్లల హక్కులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● ఏపీ బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి ఒంగోలు సిటీ: పిల్లల హక్కుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ప్రైవేటు స్కూల్ యాజమాన్యం పై చర్యలు తీసుకుంటామని ఏపీ బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి ఒంగోలులో పలు ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలను శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కనీస వసతులు కూడా లేవన్నారు. స్కూల్ ఫీజు చెల్లించని విద్యార్థులను క్లాస్ రూమ్ లో అందరి ముందు నిలబెడుతున్నారని, పిల్లల్ని ఫీజుల విషయంలో ఇబ్బంది పెడుతున్నారని దీనివల్ల పిల్లలు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారన్నారు. పరీక్ష సమయంలో పిల్లల చదువుపట్ల సరైన దృష్టి పెట్టలేకపోతున్నారన్నారు. విద్యార్థులకు కనీస సమాచారం అందించేలాగా చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్స్ స్కూల్లో ప్రదర్శించాలని స్కూల్ యాజమాన్యాన్ని ఆదేశించారు. పిల్లలు ఫీజులు కట్టలేదని వారిని మానసిక ఒత్తిడికి గురిచేస్తే యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోజులో ఎక్కువ సమయం స్టడీ అవర్స్ పెట్టడం వలన వారు మానసిక ఒత్తిడికి గురవుతారని, పిల్లలకి కనీస సమయంలోనే చదువు నేర్పించాలన్నారు. క్లాస్ రూమ్స్ కి సరైన వెంటిలేషన్, పరిశుభ్రమైన టాయిలెట్స్ ఉండాలని, స్కూలు వదిలిన తర్వాత పిల్లలని జాగ్రత్తగా తల్లిదండ్రులకు అప్పగించాల్సిన బాధ్యత స్కూల్ యాజమాన్యంపై ఉందన్నారు. స్కూల్లో కనీసం ఉండాల్సిన కంప్లైంట్ బాక్స్, చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్స్ ప్రదర్శించలేదని, కనీసం పాటించవలసిన నియమాల పట్ల ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తే ఆ స్కూల్ కి వెంటనే నోటీసులు జారీ చేయాల్సిందిగా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో మండల విద్యాశాఖ అధికారి, బాలల సంక్షేమ కమిటీ సభ్యులు ఈ.నీలిమ వంశీ లత, బాలల సంరక్షణ విభాగం సిబ్బంది, సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
సూపర్–6ను తుంగలో తొక్కారు
మార్కాపురం: సూపర్ 6 పథకాలను కూటమి సర్కారు గంగలో కలిపిందని మాజీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ జంకె వెంకటరెడ్డి విమర్శించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో ఓ అంకెల గారడీ అని అన్నారు. చంద్రబాబు సర్కారు మరోసారి తన మోసపూరిత నైజాన్ని చాటుకుందని విమర్శించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలుచేస్తామని చెబుతూనే బడ్జెట్లో కేటాయింపులు మాత్రం అరకొరగా చేశారని అన్నారు. ఈ రెండు పథకాల్లో భారీగా లబ్ధిదారులను తగ్గించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు మహిళలకు ప్రతినెలా రూ.15 వేలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని, దీనికి బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు, డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు బడ్జెట్లో ఒక్కరూపాయి కూడా కేటాయించలేదని, దీనితో లక్షలాది మంది మహిళలను చంద్రబాబు ఎప్పటిలాగే మోసం చేశారన్నారు. గత ఎన్నికల సమయంలో అప్పటి సీఎం జగన్‌కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు అందిస్తామని నమ్మించి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు చివరికి మానిఫెస్టోలో పెట్టిన హామీలనే అమలుచేయలేని దుస్థితికి వచ్చారన్నారు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అని ఈ బడ్జెట్‌తో మరోసారి రుజువైందని జంకె చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని, గత బడ్జెట్లో రూ.399 కోట్లు కేటాయిస్తే, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రూ.359 కోట్లు మాత్రమే కేటాయించిందని అన్నారు. కేవలం నిర్వాసితులను తరలించేందుకే రూ.800 కోట్లు ఖర్చవుతుందని, ప్రాజెక్టు పూర్తికావాలంటే రూ.2 వేల కోట్లు అవసరమని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రులు, ప్రాజెక్టులను సందర్శించి, సమీక్షలు జరిపి కేవలం బడ్జెట్లో నామమాత్రంగా కేటాయించారన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ప్రాజెక్టు పనులు ఏవిధంగా పూర్తవుతాయని జంకె ప్రశ్నించారు. వెలుగొండకు నిధులెక్కడ ? మాజీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ జంకె వెంకటరెడ్డి -
బడ్జెట్లో వెలుగొండకు అరకొర నిధులు అన్యాయం
● నిరసన ప్రదర్శనలో సీపీఎం నాయకులు ఒంగోలు టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2025–26 బడ్జెట్లో జిల్లాకు తలమానికం లాంటి వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి అరకొర నిధులు కేటాయించడం అన్యాయమని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు చీకటి శ్రీనివాసరావు చెప్పారు. నగరంలోని సాగర్ సెంటర్లో శనివారం బడ్జెట్‌కు వ్యతిరేకంగా సీపీఎం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టుకు నామమాత్రంగా కేవలం రూ.359 కోట్ల నిధులు కేటాయించడం అంటే జిల్లా ప్రజలను అవమానపరచడమేనని స్పష్టం చేశారు. బడ్జెట్‌ను సవరించి కనీసం రూ.2 వేల కోట్లు కేటాయిస్తేనే కానీ 2026 నాటికి ప్రాజెక్టు నుంచి నీరు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. ప్రాజెక్టుకు నిధులు కేటాయించడాన్ని బట్టి చూస్తే ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఉద్దేశం కనిపించడం లేదన్నారు. కూటమి సర్కార్ తీరును ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఆంధ్రకేసరి యూనివర్శిటీకి కానీ, విమానాశ్రయానికి, నగరాభివృద్ధికి, హార్బరు అభివృద్ధికి నయాపైసా కూడా వెచ్చించలేదని విమర్శించారు. జిల్లాకు నిధులు తీసుకొరావడంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు వైఫల్యం చెందారన్నారు. కూటమి తరఫున గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికై నా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొనిరావాలన్నారు. గత ప్రభుత్వం 25 వేలమంది పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ బడ్జెట్లో సవరణలు చేసేంత వరకు ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జి.ఆదిలక్ష్మి, జి.రమేష్, ఎస్డీ హుసేన్, మాలకొండయ్య హనుమంతరావు, సుబ్బారావు, సుబ్బారెడ్డి, కేఎఫ్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
ప్రకాశం
33/247గరిష్టం/కనిష్టంవిద్యుదాఘాతంతో ఒకరు మృతి విద్యుదాఘాతంతో ఒకరు మృతిచెందిన ఘటన కనిగిరి మండలంలోని పునుగోడులో శనివారం జరిగింది. ఉపవాసం..పుణ్యఫలం ముస్లింల పవిత్ర మాసం రంజాన్ నెల ప్రారంభమైంది. ఆదివారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమవుతున్నట్లు మత పెద్దలు ప్రకటించారు.వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. పొగమంచు కురుస్తుంది. చలిగాలులు వీస్తాయి. ఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2025– 8లో.. -
పుణ్యఫలం
ఉపవాసం...● నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ● ఆకాశంలో నెలవంక దర్శనమివ్వడంతో ప్రారంభమైన రంజాన్ మాసం ● ఉపవాస దీక్షలకు సరంజామా సిద్ధం చేసుకుంటున్న ముస్లింలు ● ముస్తాబైన మసీదులు ● సహరీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు ● అమ్మకాలకు సిద్ధమవుతున్న హలీం నియ్యత్కి దువాకనిగిరి రూరల్/కంభం: ముస్లింల పవిత్ర మాసం రంజాన్ నెల ప్రారంభమైంది. శనివారం రాత్రి నెలవంక దర్శనమివ్వడంతో ఆదివారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమవుతున్నట్లు మసీదుల్లోని మత పెద్దలు ప్రకటించారు. రంజాన్ నెల ప్రారంభ సూచికగా కొన్ని ప్రాంతాల్లో సైరన్ మోగించారు. శనివారం రాత్రి 9 గంటలకు మసీదుల్లో ప్రత్యేక నమాజ్ (తరావీహ్) చదివారు. ముస్లింలు ఒకరికొకరు ‘చాంద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఉపవాసాలకు ముస్లింలు సరంజామా సిద్ధం చేసుకున్నారు. ముస్లింలు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో రంజాన్ మాస సందడి ప్రారంభమైంది. ‘రంజాన్ నెలలో స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి.. సైతాన్ బంధితుడు అవుతాడు’.. అనే మొహమ్మద్ ప్రవక్త ప్రవచనానికి అనుగుణంగా ముస్లింలు ఆధ్యాత్మిక జీవనాన్ని అలవరచుకుంటారు. ఆదివారం ఉదయం 5–08 గంటలకు సహార్ (ఉపవాస దీక్ష ప్రారంభం), సాయంత్రం 6.25 గంటలకు ఇఫ్తార్ (ఉపవాస దీక్ష విరమించడం) జరుగుతుంది. రంజాన్ అనేది ఒక మాసం (నెల) పేరు. ఉర్దూలో రంజ్ అనగా దహించేదని, ఆన్ అంటే నెల అని అర్థం. మనషుల పాపాలన్నీ ఉపవాసాలతో, దానాలతో దహిస్తాయి. అందువలన రంజాన్ అనే పేరు వచ్చింది. ఈ మాసంలోనే పవిత్ర గ్రంథం ఖురాన్ ఆవిర్భవించింది. రంజాన్ నెలలో ఖురాన్ చదివితే మరింత పుణ్యం లభిస్తుందని మత పెద్దలు చెబుతారు. ముస్లింలకు అత్యంత ముఖ్యమైన మాసం రంజాన్. ఈ నెలలో ముస్లింలు ఎంతో కఠోరమైన ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. రంజాన్ మాసంలో ముస్లింలలో భక్తిభావం ఉప్పోంగుతుంది. ధార్మిక చింతన, ప్రేమ, సౌభ్రాతృత్వం, దానగుణం, క్రమశిక్షణ, పరోపకారం తదితర నియమాలను ముస్లింలు పాటిస్తారు. రంజాన్ నెలలో అత్యంత నిష్టగా జరుపుకునే రోజు షబ్–ఏ–ఖదర్. దీని తర్వాత మూడు రోజులకు రంజాన్ పండుగ చేస్తారు. ఆదివారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది. జిల్లాలో సుమారు 270 మసీదులు... ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యధికంగా ముస్లిం జనాభా ఒంగోలు, కనిగిరి, కందుకూరు, పొదిలి, మార్కాపురం, కంభం, గిద్దలూరు, పర్చూరు ప్రాంతాల్లో ఉంది. ప్రస్తుతం జిల్లాలోని మున్సిపాలిటీల్లో అత్యధికంగా కనిగిరిలో ముస్లింలు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలున్నాయి. జిల్లాలో సుమారు 270 వరకు మసీదులున్నట్లు సమాచారం. ఒక్క కనిగిరి నియోజకవర్గంలోనే 65 వరకు మసీదులున్నాయి. జిల్లాలోని మసీదులన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పలుచోట్ల రంజాన్ మాసం ప్రారంభ సూచికగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా ముస్లింలు అధికంగా ఉండే ఏరియాల్లో తోరణాలు, ఫ్లెక్సీలతో కళకళలాడుతున్నాయి. రోజా (ఉపవాస దీక్షలు)... సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎటువంటి ఆహార పానియాలు ముట్టకుండా (కఠోర దీక్ష) ఉపవాసాన్ని పాటిస్తారు. కనీసం లాలాజలం కూడా మింగరు. అత్యంత నిష్టతో ఉపవాసాన్ని (రోజాను) ఆచరిస్తారు. సూర్యోదయంకు ముందు సహార్ అని, సూర్యాస్తమయం తర్వతా ఇఫ్తార్ అని పిలుస్తారు. రోజా ఉండేవారు సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఏదైన ఫలాహారాలు తీసుకుంటారు. రోజుకు కనీసం 13 గంటలు ఉమ్మి కూడా మింగకుండా కఠోర దీక్షలు ఆచరిస్తారు. రోజా పాటించేవారు మనస్సును భగవంతునిపై లగ్నం చేసి చెడు ఆలోచనలకు దూరంగా ఉంటారు. సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని మసీదుల్లో, దైవ ధ్యానంలో గడుపుతారు. ఈ దీక్షల వల్ల మానవునిలో భగవంతుని పట్ల భక్తి, నమ్మకం, విశ్వాసం, భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అనే భావం పెంపొందుతాయి. ఏహ్ తే కాఫ్... ఈ మాసంలో 21వ రోజు నుంచి నెల చివరి వరకు (తపోనిష్టతో) ఏహ్ తే కాఫ్ కూర్చుంటారు. ఈ ఏహ్ తే కాఫ్ పాటించే వారు మసీదులోనే పూర్తి సమయాన్ని గడపుతూ ప్రార్థనల్లో దివ్య ఖురాన్ (దైవ గ్రంథాలు) చదువుతూ ఉపవాస దీక్షలో నిమగ్నమవుతారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే మసీదు నుంచి బయటకు అడుగుపెడతారు. జకాత్... ముస్లింలలో మరీ ముఖ్యమైన సంప్రదాయం జకాత్. ప్రతి వ్యక్తి తన లాభార్జనలో కొంత మేర నిరుపేదలకు దానధర్మాలు చేయడాన్ని జకాత్‌గా పిలుస్తారు. ప్రతి మనిషి తనలాగే ఉన్నతుడు కావాలని కోరుకోవడం ఈ జకాత్ ప్రధాన ఉద్దేశం. జకాత్ నిధితో నిరుపేదలకు వస్తువుల రూపంలోగానీ, నగదు రూపంలోగానీ దానం చేస్తారు. అయితే దానస్వీకర్తల పేర్లను గోప్యంగా ఉంచడమే దీని ప్రధాన నియమం. రంజాన్ నెలలోనే జకాత్ ఇస్తారు. ఫిత్రా... రంజాన్ మాసం చివరిరోజున జరుపుకునే పర్వదినం రంజాన్ (ఈద్–ఉల్–ఫితర్). దేవుని అనుగ్రహం కోసం, కృతజ్ఞతగా నిరుపేదలకు ఫిత్రా (దానం) ఇస్తారు. ప్రతిఒక్కరూ కనీసం రెండు కిలోల గోధుమలు లేదా దానికి సమానమైన ఇతర ఆహార ధాన్యాలు లేదా నగదు దానం చేస్తారు. రంజాన్‌ను ప్రతి ముస్లిం లోటులేకుండా సంతోషంగా జరుపుకునేందుకు చేయాల్సిన దానధర్మాలను ఇస్లాం మతం ఉద్భోదిస్తుంది. ఇఫ్తార్ ప్రత్యేకత... రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసదీక్ష విరమింపజేసే కార్యక్రమాన్నే ఇఫ్తార్ అంటారు. ఇఫ్తార్ సమయంలో తీసుకునే ఆహారాన్ని దీక్ష వాసులకు అందించడం కూడా పుణ్యకార్యంగా భావిస్తారు. ఇఫ్తార్ విందులను ముస్లింలే కాకుండా ఇతరులు కూడా రోజా ఆచరించిన వారికి ఇస్తారు. తరావీహ్ నమాజ్... ముస్లింలు ప్రతిరోజూ 5 సార్లు నమాజు (ఉదయం ఫజర్, మధ్యాహ్నం జోహర్, సాయంత్రం 5 గంటలకు అసర్, రాత్రి 6.30 గంటలకు మగ్రీబ్, రాత్రి 8 గంటలకు ఇషా నమాజ్) చేస్తారు. అయితే, రంజాన్ నెలలో ఇషా నమాజ్ తర్వాత ప్రత్యేకంగా ఎంతో నిష్టతో మరో 20 రకాత్లు ‘తరావీహ్’ నమాజ్ చేస్తారు. రంజాన్ మాసంలో తరావీహ్ నమాజ్‌కు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. షబ్ ఏ ఖద్ర్... రంజాన్ మాసంలో ఆచరించాల్సిన మరో అంశం షబ్ ఏ ఖద్ర్. ఆకాశ గ్రంథమైన దివ్యఖురాన్ రంజాన్ మాసంలో షబ్ ఏ ఖద్ర్ రోజున అవతరించింది. చివరి పదిరోజుల్లో 21, 23, 25, 27, 29వ బేసి రాత్రుల్లో ఏదో ఒక రాత్రి షబ్ ఏ ఖద్ర్ ఉంటుంది. కంభం పట్టణంలోని జమియా మసీదు30 రోజుల పాటు మసీద్ వద్ద సహారి ఏర్పాట్లు...పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఆచరించే వారి కోసం 30 రోజుల పాటు కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ (ఛోటి మసీద్)లో యువత సహారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం సహారి (ఉపవాసం ఆచరించే వారు ఉదయాన్నే తినే ఆహారం) మసీదులోనే ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ముస్లిం యూత్ కమిటీలు టీంలుగా ఏర్పడి ఒక్కోరోజు కేటాయించుకున్నారు. వారికి కేటాయించిన తేదీల్లో ఉదయాన్నే రోజా ఆచరించే వారికి ఇఫ్తార్ సౌకర్యం కల్పిస్తారు. దీంతో రోజా ఆచరించే వారు మసీద్ వద్దకు వచ్చి సహారీ చేసుకుంటారు. దీన్ని ఎంతో సేవ, పుణ్యకార్యంగా భావిస్తారు. కంభం పట్టణంలో... కంభం పట్టణంలోని జామియా మసీదు, రైల్వేస్టేషన్ సమీపంలోని నూర్ మక్కా మసీదులో రంజాన్ నెల మొత్తం ఉపవాసదీక్షలు ఉండే వారి కోసం సహారీ ఏర్పాట్లు చేశారు. సహారీలో యువకులు ఉత్సాహంగా పాల్గొని మసీదుల్లో భోజనాలు తయారు చేసుకుని ఉపవాస దీక్షలు ఉంటారు. రైలు ప్రయాణానికి వెళ్లే వారు మసీదులో సహారీ చేసుకుని వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుంది.రోజెకి నియ్యత్: అల్లాహుమ్మా అసూముగదన్ లక ఫగ్ ఫిర్లీ మాఖద్దమ్‌తు వమా అఖ్ఖర్తు.. ఉదయం సహార్ (ఉపవాసం ప్రారంభించేటప్పుడు) చేసే సమయంలో చేసే దువా.. ఇఫ్తార్‌కి దువా: అల్లాహుమ్మ లక సుమ్తు వఫిక ఆమన్తు వఅలైక తవక్కల్తు అలారిజ్ ఖిక అఫ్తర్తు ఫత ఖిబ్బల్ మిన్నీ.. సాయంత్రం ఇఫ్తార్ (ఉపవాస దీక్ష విరమించే) సమయంలో చేసే దువా.. -
ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలి
● విద్యార్థులకు కలెక్టర్ తమీమ్ అన్సారియా పిలుపు ఒంగోలు సిటీ: ఇంటర్మీడియట్, పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా సానుకూల దృక్పథంతో పరీక్షలు రాయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ఇంటర్మీడియట్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులతో శనివారం స్థానిక ప్రకాశం భవనం నుంచి జూమ్ మీటింగ్ నిర్వహించి కలెక్టర్ మాట్లాడారు. పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న తీరుపై ఆరా తీశారు. పలువురు విద్యార్థులతో నేరుగా మాట్లాడి భవిష్యత్తు లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవడానికి పదో తరగతి పరీక్షలు పాస్‌పోర్టు లాంటివని వ్యాఖ్యానించారు. పదో తరగతి విద్యార్థులకు ఆలిన్ వన్ గైడ్లు ఇచ్చామని, ట్యూటర్లను కూడా నియమించామని అన్నారు. వీటిని ఉపయోగించుకుని నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. అందరూ కనీసం డిగ్రీ పూర్తి చేయాలని చెప్పారు. 18 ఏళ్లు నిండే వరకు పెళ్లి చేసుకోబోనని ప్రతి ఆడపిల్ల తీర్మానం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పరీక్షల సమయంలో విద్యార్థుల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని హాస్టల్ వార్డెన్లను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి అంజల, పుల్లలచెరువు నుంచి జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి పాల్గొన్నారు. -
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
సింగరాయకొండ: ప్రమాదవశాత్తూ రైలు నుంచి జారిపడి సుమారు 47 ఏళ్ల వయసు గల గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం ఉదయం 11 గంటల సమయంలో సింగరాయకొండ–ఉలవపాడు రైల్వే స్టేషన్ల మధ్య మూడో రైల్వే లైనుపై జరిగింది. మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని, ఖాకీ రంగు ఫుల్ హాండ్స్ చొక్కా, బిస్కెట్ రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. ఒంటిపై పచ్చ, ఎరుపు, పసుపు గళ్ల కండువా కలిగి ఉన్నాడు. ఇతని ఆచూకీ తెలిసిన వారు ఒంగోలు జీఆర్పీ రైల్వేస్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్సై టి.అరుణకుమారి సూచించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కి తరలించినట్లు తెలిపారు. -
విద్యుదాఘాతంతో ఒకరు మృతి
కనిగిరి రూరల్: విద్యుదాఘాతంతో ఒకరు మృతిచెందిన సంఘటన మండలంలోని పునుగోడులో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామంలో పెద్ద మనిషిలా వ్యవహరించే తోట చిన వెంకట నరసయ్య (69) మహాశివరాత్రి సందర్భంగా గ్రామంలో అందరి సహకారంతో అభయాంజనేయస్వామి గుడి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాతలు ఇచ్చిన విరాళాల వివరాలతో కూడిన ఫ్లెక్సీని గుడి వద్ద ఏర్పాటు చేశారు. పండుగ ముగియడంతో ఆంజనేయస్వామి గుడి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఫ్రేమ్ తొలగించేందుకు తోట వెంకట నర్సయ్య, కల్లూరి కొండయ్య వెళ్లారు. ఫ్లెక్సీ ఐరన్ ఫ్రేం తొలగించే క్రమంలో బరువుకు అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మపై పడింది. దీంతో తోట వెంకట నర్సయ్య (69) కరెంట్ షాక్‌కు గురయ్యాడు. అతని కుడి కాలు, కుడి చేయి పూర్తిగా కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి కే కొండయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. ఎస్సై టి.శ్రీరాం ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీరాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే వెంకట నర్సయ్య నిమిషాల వ్యవధిలో మృత్యుఒడికి చేరడంతో పల్లె జనం శోక సంద్రంలో మునిగిపోయారు. వెంకట నర్సయ్య భౌతిక కాయాన్ని వైస్ ఎంపీపీ లక్కిరెడ్డి తిరుపతిరెడ్డి, పలువురు నాయకులు, గ్రామ పెద్దలు సందర్శించి నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
వరకట్న హత్య కేసులో నిందితుల అరెస్టు
మార్కాపురం: పట్టణంలోని కొండారెడ్డికాలనీలో గత నెల 26వ తేదీ గంజాయి లక్ష్మి అనే వివాహిత ఉరేసుకుని మృతిచెందిన కేసులో దర్యాప్తు చేసి వరకట్న హత్యకేసుగా మార్చి నిందితులను శనివారం అరెస్టు చేసినట్లు మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు. శనివారం స్థానిక తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆ వివరాలు వెల్లడించారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామానికి చెందిన దుద్దుకూరి దేవమ్మ కుమార్తె లక్ష్మికి మార్కాపురం పట్టణంలోని కొండారెడ్డి కాలనీకి చెందిన గంజాయి సాయితో 2022లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. పెళ్లి సమయంలో భర్తతో పాటు కుటుంబ సభ్యులకు రూ.3 లక్షలు కట్నంగా ఇచ్చారు. కొంత కాలం తర్వాత భర్త సాయిబాబు, మామ అల్లూరయ్య, అత్త సుశీలమ్మ, మరిది గంజాయి డాన్ కలిసి లక్ష్మిని అదనపు కట్నం కోసం వేధించినట్లు దేవమ్మ ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో మరిది గంజాయి డాన్ గత నెల 26వ తేదీ లక్ష్మి తమ్ముడికి ఫోన్‌చేసి మీ అక్క ఇంట్లో తాడుతో ఉరేసుకుందని సమాచారమిచ్చాడు. బంధువులు వచ్చి చూడగా మృతురాలి ఒంటిమీద గాయాలు, మెడమీద తాడుతో బిగించినట్లుగా ఉన్న గుర్తులు ఉన్నాయి. ఆ మేరకు తల్లి దేవమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టణ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. శనివారం పట్టణ ఎస్సై సైదుబాబు తన సిబ్బందితో కలిసి నిందితుని ఇంటివద్దకు వెళ్లగా వారు పారిపోయేందుకు ప్రయత్నించడంతో అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి విచారించారు. అదనపు కట్నం కోసం మృతురాలిని శారీరకంగా, మానసికంగా వేధించి తాడుతో గొంతు బిగించి చంపినట్లు ఒప్పుకోవడంతో అరెస్టు చేసినట్లు డీఎస్పీ వివరించారు. -
గుడిలో, ఇంట్లో చోరీ
● సుమారు 10 సవర్ల బంగారం, రూ.1.80 లక్షల నగదు అపహరణ సింగరాయకొండ: ఒకేరోజు గుడిలో, ఇంట్లో జరిగిన వేర్వేరు చోరీల్లో సుమారు 10 సవర్ల బంగారం, రూ.1.80 లక్షల నగదు అపహరణకు గురైంది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం.. సింగరాయకొండ మండల కేంద్రంలోని మినీబైపాస్‌లో అరుణకాలనీ మొదటిలైనులో నివసిస్తున్న మలినేని ఇందిర జాతీయ రహదారిపై విమానాల రన్‌వే వద్ద హోటల్ నిర్వహిస్తోంది. శుక్రవారం రాత్రి హోటల్ వద్దే ఉండి శనివారం మధ్యాహ్నం ఇంటికి వచ్చింది. ఇంటి తలుపులు తీసి ఉండటాన్ని గమనించి చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. మూడు సవర్ల బంగారం, రూ.1.80 లక్షల నగదు చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో ఘటనకు సంబంధించి.. మూలగుంటపాడు పంచాయతీ కార్యాలయం సమీపంలోని తిరుపతమ్మ గుడిలో చోరీ జరిగింది. ఆలయంలో 15 రోజుల క్రితం అమ్మవారి నూతన విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. శనివారం 16 రోజుల పండుగ నిర్వహించాల్సి ఉంది. అందుకోసం అమ్మవారి విగ్రహానికి సుమారు 7 సవర్ల బంగారం వస్తువులైన మంగళసూత్రం, చెవి కమ్మలు, బొట్టు, ముక్కుపుడక అలాగే ఉంచారు. రాత్రి సుమారు ఒంటిగంట వరకు పూజలు కూడా జరిగాయి. తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య చోరీ జరిగింది. ఆలయంలో హుండీ కూడా తొలగించారని, కానీ, హుండీలో కేవలం రూ.300లోపే నగదు ఉంటుందని, విలువైన బంగారం చోరీ జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ రెండు చోరీలకు సంబంధించి క్లూస్ టీం సిబ్బంది వచ్చి ఆధారాలు సేకరించారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై బి.మహీంద్ర తెలిపారు. కోర్టు పనులను పరిశీలించిన హైకోర్టు జడ్జి సింగరాయకొండ: స్థానిక మండల కాంప్లెక్స్‌లో నూతనంగా నిర్మిస్తున్న జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పనులను హైకోర్టు జడ్జి కె.మన్మథరావు శనివారం పరిశీలించారు. అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. మార్చి 15వ తేదీకల్లా భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు. అడ్వకేట్లు రాయి రమేష్, సన్నెబోయిన శ్రీనివాసులు, తహసీల్దార్ టి.రవి, ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని పోలీసుస్టేషన్లలో ఓపెన్ హౌస్ఒంగోలు టౌన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పోలీసు స్టేషన్లలో శనివారం ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్లను సందర్శించిన మహిళలు, విద్యార్థినులకు పోలీసు స్టేషన్ల పనితీరు, మహిళా సహాయక కేంద్రంపై అవగాహన, పోలీసు స్టేషన్లలో ఉపయోగించే పరికరాలు, రికార్డుల నిర్వహణ, తదితర విషయాలను వివరించారు. మహిళా చట్టాలు, పోక్సో చట్టం, ఈవ్‌టీజింగ్, గుడ్ టచ్.. బ్యాడ్ టచ్, సైబర్ మోసాల గురించి అవగాహన కల్పించారు. మానసికంగా, శారీరకంగా ద్రుఢంగా ఉన్నప్పుడే స్వీయ రక్షణ సాధ్యమవుతుందన్నారు. బాలికలు చదవుకుని సమాజానికి, తల్లిదండ్రులకు ఉపయోగపడాలని సూచించారు. అత్యవసర సమయంలో సహాయం కోసం చైల్డ్ హెల్ప్ నంబర్ 1098, ఉమెన్ హెల్ప్ లైన్ 181, పోలీసు హెల్ప్ లైన్ 100, 112, సైబర్ క్రైం నంబర్ 1930, పోలీసు కంట్రోలు రూం నంబర్ 9121102266కు ఫోన్ చేయాలని పోలీసు అధికారులు సూచించారు. పలకల గోడౌన్లో అగ్నిప్రమాదం మార్కాపురం: పట్టణ శివార్లలోని ఎస్టేట్‌లో ఉన్న పలకల గోడౌన్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో శనివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించి సుమారు రూ.2 లక్షల మేర ఆస్తినష్టం జరిగింది. ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్టేట్‌లోని చిలకపాటి లింగమయ్యకు చెందిన వేస్టేజీ ప్లాస్టిక్ గోడౌన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్న సామగ్రి కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం తెలియజేయడంతో ఫైరింజన్‌తో వచ్చి మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. -
అంగరంగ వైభవంగా రథోత్సవం
త్రిపురాంతకం: పార్వతీ త్రిపురాంబా సమేత త్రిపురాంతకేశ్వర స్వామి రథోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని రథంపై ఉంచి హరహర మహాదేవ నినాదాలతో ఊరేగారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పల్లకి సేవా ద్వారా ఆలయానికి చేర్చారు. రథోత్సవం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఐ అస్సాన్, ఎస్సై బసవరాజు చర్యలు తీసుకున్నారు. ఆలయాల ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఇమ్మడిశెట్టి వెంకటసుబ్బారావు, కార్యనిర్వహణాధికారిణి డి.రజని కుమారి కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు
ఒంగోలు సిటీ: పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ పాల్గొని పలు సలహాలు, సూచనలు చేశారు. 386 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు హాజరయ్యారు. ఏపీఓఎస్ఎస్ (ఎస్ఎస్సీ, ఇంటర్)కు సంబంధించి 88 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు హాజరయ్యారు. డీఈఓ అత్తోట కిరణ్‌కుమార్, జిల్లాలోని ఎంఈవోలు, ఉపవిద్యాశాఖాధికారులు, అసిస్టెంట్ కమిషనర్, పరీక్షల విభాగం, డీసీఈబీ సెక్రటరీ, తదితరులు పాల్గొన్నారు. -
మంచి డాక్టర్లుగా పేరు తెచ్చుకోవాలి
ఒంగోలు టౌన్: నిత్య అధ్యయనం ద్వారా ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు తెలుసుకుంటూ మంచి వైద్యులుగా పేరు తెచ్చుకోవాలని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలు వైద్య విద్యార్థులకు పిలుపునిచ్చారు. నగరంలోని మెడికల్ కళాశాలలో పీజీ వైద్య విద్య పూర్తి చేసుకున్న 2019 బ్యాచ్ వైద్యులకు శుక్రవారం గ్రాడ్యుయేషన్ వేడుకలు నిర్వహించి పట్టాలు ప్రదానం చేశారు. నేటితో చదువు పూర్తయిందని అనుకోవద్దని, జీవితాంతం నేర్చుకుంటూనే విద్యార్థులుగా ఉండాలని సూచించారు. వైద్య రంగంలో అనేక నూతన ఆవిష్కరణలు వస్తున్నాయని, ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్‌తో వైద్యరంగం రూపురేఖలే మారిపోతున్నాయని చెప్పారు. ఒంగోలు మెడికల్ కళాశాల నుంచి బయటకు వచ్చిన వైద్యులు అన్ని రంగాలలోనూ రాణిస్తున్నారని చెప్పారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నందకిషోర్ ప్రసంగిస్తూ దేశంలో 4 లక్షల మంది వైద్యులు ఉన్నారని, రాష్ట్రంలో ఐఎంఏకి 100 బ్రాంచ్‌లు ఉన్నాయని, 25 వేల మంది వైద్యులు ఉన్నారని తెలిపారు. 20 లక్షల మంది నీట్ పరీక్షలు రాస్తే కేవలం 50 వేల నుంచి లక్ష మందే డాక్టర్ సీటు సంపాదించగలుగుతున్నారని తెలిపారు. ఎంతో శ్రమ తర్వాత వైద్యులై వస్తున్న కొత్త వైద్యులకు అభినందనలు తెలిపారు. డాక్టర్ అంటే కేవలం రోగం నయం చేసేవారే కాదని, మంచి సపోర్టర్‌గా మసలే వారని చెప్పారు. వైద్య వృత్తి నిబద్ధత కలిగిన వైద్యులకు పూర్తిగా ఆత్మ సంతృప్తి ఇస్తుందన్నారు. జీజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు సీతారామయ్య, వైస్ ప్రిన్సిపాల్ సుధాకర్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, డీసీహెచ్ఎస్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
శనివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2025
● వెలుగొండకు కావాల్సింది కొండంత.. విదిల్చింది గోరంత ● రూ.359 కోట్లతో సరిపెట్టిన బాబు సర్కార్ ● ఆర్ఆర్ ప్యాకేజీకి రూ.1000 కోట్లు అవసరమైతే ఇచ్చింది రూ.116 కోట్లే ● తెలుగు తమ్ముళ్లకు ఏటీఎంగా గుండ్లకమ్మ నిధులు ● తల్లికి వందనం, అన్నదాత సుఖీభవకు కేటాయింపులపై పెదవి విరుపు ● ఉచిత బస్సు ఊసు లేదు ● బడ్జెట్ కేటాయింపుల్లో జిల్లాకు అత్తెసర నిధులునేటి నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఇంటర్మీడియెట్ పరీక్షలకు మొత్తం 42,439 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో మొదటి సంవత్సరం పరీక్షలు 21,624 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలు 20,815 మంది విద్యార్థులు రాయనున్నారు. వీరి కోసం 67 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 67 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 67 మంది డిపార్టుమెంటల్ అధికారులను, 1089 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. వీరికి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. 8.30 గంటలకే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. బాలికను గర్భవతిని చేసి పరారైన యువకుడు ఒంగోలు టౌన్: నగరానికి చెందిన ఒక యువకుడు మాయమాటలతో బాలికను లొంగదీసుకుని గర్భవతిని చేసి పరారయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం... ఒంగోలు నగరానికి చెందిన షేక్ ఆరీఫ్ అనే 25 ఏళ్ల యువకుడు స్థానిక మంగళపాలెంలోని స్నేహితుడి ఇంటికి తరచూ వస్తూపోతూ ఉండేవాడు. ఈ క్రమంలో స్నేహితుడి మేనత్త కూతురైన 18 ఏళ్ల బాలికతో అతనికి పరిచయమైంది. తరచూ ఆమెతో ఇన్‌స్ర్ట్రాగామ్ చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. తన పిన్ని కూతురు పుట్టిన రోజని, కేక్ కటింగ్ జరుగుతుందని మాయమాటలు చెప్పి పేర్నమిట్టలోని గదికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమైపె లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక నెలతప్పడంతో సమాచారం తెలుసుకున్న ఆరీఫ్ ఊరి నుంచి పరారయ్యాడు. వాకబు చేయగా ఆరిఫ్‌కు అప్పటికే పెళ్లయిందని తెలిసింది. దాంతో మోసపోయానని గ్రహించిన బాధిత బాలిక జరిగిన విషయాన్ని తలిదండ్రులకు తెలియజేసింది. వారు ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ అజయ్‌కుమార్ పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తండ్రి హత్య కేసులో కొడుక్కి జైలుచీమకుర్తి: బండ్లమూడి గ్రామంలో తండ్రిని హత్యచేసిన సంఘటనలో కొడుకుకి జిల్లా కోర్టు జైలు శిక్ష విధించినట్లు సీఐ ఎం.సుబ్బారావు శుక్రవారం తెలిపారు. వనిపెంట లక్ష్మారెడ్డిని ఆయన కుమారుడు చంద్రశేఖరరెడ్డి 15 రోజుల క్రితం మెడపై గొడ్డలితో వేటు వేయగా తీవ్ర గాయాలైన లక్ష్మారెడ్డి ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఫిబ్రవరి 18న మృతి చెందాడు. తండ్రి కొడుకుల మధ్య ఆస్తి వివాదం కారణంగా ఈ సంఘటన జరిగింది. తండ్రిపై హత్యకు పాల్పడిన కొడుకు చంద్రశేఖరరెడ్డిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు సీఐ సుబ్బారావు తెలిపారు. పోలీసుల అదుపులో జంట హత్యల కేసు నిందితుడు మార్కాపురం: మండలంలోని వేములకోటలో గతేడాది జూలై 1వ తేదీన సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వేములకోటలో భార్య రేళ్ల సునీత, అత్త కన్నెసాని నారాయణమ్మను నిందితుడైన రేళ్ల శ్రీను కత్తితో పొడిచి హత్య చేశాడు. అప్పటి నుంచి శ్రీను సెల్‌ఫోన్ వాడకుండా తెలంగాణతో పాటు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ తప్పించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో మార్కాపురం రూరల్ ఎస్సై అంకమరావు నిందితుడి కదలికలు, బంధువులపై నిఘా పెట్టడంతో రైల్వేస్టేషన్ సమీపంలో సంచరిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వెలుగొండను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు పశ్చిమ ప్రాంతాలకు సంజీవిని లాంటి వెలుగొండ ప్రాజెక్టుకు అరకొర నిధులను కేటాయించడం కూటమి ప్రభుత్వ వక్రబుద్ధికి నిదర్శనం. బడ్జెట్లో కేవలం రూ.359 కోట్లు మాత్రమే కేటాయించడం, ఆర్ఆర్ ప్యాకేజీకి రూ.116 కోట్లు మాత్రమే కేటాయించడం పశ్చిమ ప్రకాశం ప్రజలను దగా చేయడమే. మార్కాపురంను జిల్లా చేస్తామని చెప్పి ఇప్పుడు మాట దాట వేస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలంటే చంద్రబాబు ఎందుకు చిన్నచూపు చూస్తున్నారో చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వ మోసపూరిత విధానాలను ప్రజల తెలియజేస్తూ యర్రగొండపాలెం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తాం. – తాటిపర్తి చంద్రశేఖర్, యర్రగొండపాలెం ఎమ్మెల్యే సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలకు సాగునీరు, తాగునీరందించే వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే కరువు నేల సస్యశ్యామలమవుతుందని ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల సమయంలో మార్కాపురం వచ్చిన చంద్రబాబు నేనైతే వెలుగొండ ప్రాజక్టును చిటికెలో పూర్తి చేసి చూపిస్తానంటూ గొప్పలు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో వెలుగొండను పూర్తి చేసి నీరందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామిలతో కలిసి ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వెలుగొండ ప్రాజెక్టును సందర్శించి ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. అయితే అందుకు భిన్నంగా కేటాయింపులు జరిగాయి. ఈ ప్రాజెక్టుకు కేవలం రూ.359 కోట్లు కేటాయింపులు ఏమూలకు సరిపోవని నీటిపారుదల నిపుణులు అంటున్నారు. నిజానికి ఈ ప్రాజెక్టుకు రూ.4 వేల కోట్లు కేటాయిస్తేనే కానీ అనుకున్నట్లు పనులు జరగవు. కనీసం ఈ ఏడాది బడ్జెట్లో రూ.2 వేల కోట్లు కేటాయిస్తే అందులోంచి రూ.1000 కోట్లు నిర్వాసితులకు, మరో రూ.1000 కోట్లు ప్రాజెక్టు పనుల కోసం వెచ్చించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన నిధులతో ఏమి చేయాలో పాలుపోవడం లేదని అధికారులు వాపోతున్నారు. బడ్జెట్లో కేటాయించిన రూ.359 కోట్లలో నిర్వాసితులకు రూ. 116 కోట్లుగా చెబుతున్నారు. మిగిలిన రూ.243 కోట్లు దేనికి సరిపోతాయని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. కూటమి ప్రభుత్వంపై పశ్చిమ ప్రకాశం జిల్లా రైతులు పెట్టుకున్న ఆశలపై నీరు చల్లినట్టయిందని, మాయమాటలు చెప్పిన చంద్రబాబు మరోసారి నిట్టనిలువునా మోసం చేశారని రైతు సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. తల్లికి వందనంలో కోతలు తప్పవా... అమ్మ ఒడి పథకాన్ని పేరుమార్చిన ప్రభుత్వం విద్యార్థుల తలిదండ్రులను ఏమార్చేందుకు సిద్ధమైంది. ఎన్నికలకు ముందు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి పథకం ద్వారా ఒక్కొక్కరికి .. నీకు రూ.15 వేలు...నీకు రూ.15 వేలు అంటూ ఊదరగొట్టింది. అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాది పాటు కాలయాపన చేసింది. ఇప్పుడు 2025–26 బడ్జెట్లో నామమాత్రపు నిధులను కేటాయించింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసింది. 2019 నుంచి క్రమం తప్పకుండా నాలుగు విడతలుగా సుమారు రూ.1358 కోట్లు తల్లుల ఖాతాలో జమచేసింది. కరోనా సమయంలో కూడా విద్యార్థులకు అమ్మఒడి ఇచ్చి తన మాట నిలుపుకున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కిస్తూ 9 నెలలు గడిపింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేదని కుంటి సాకులు చెబుతూ ఒక ఏడాది తల్లికి వందనం ఇవ్వకుండా మోసం చేసింది. ప్రస్తుతం తల్లికి వందనం పథకానికి కేటాయించిన నిధులను గమనిస్తే పెద్ద సంఖ్యలో విద్యార్థులకు కోత పెట్టేందుకు తెరవెనుక కుట్రలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. జిల్లా అభివృద్ధి పట్టని టీడీపీ ఎమ్మెల్యేలు... రాష్ట్రంలో ప్రకాశం జిల్లా వెనకబడిన ప్రాంతంగా పేరొందింది. జిల్లా అభివృద్ధి కోసం కనీసం రూ.10 కోట్లు కేటాయించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో టీడీపీ ఎమ్మెల్యేలకు చీమకుట్టినట్టు కూడా లేదు. రాష్ట్ర బడ్జెట్లో జిల్లాకు నిధులు కేటాయించకపోవడంలో ఎమ్మెల్యేలు పూర్తిగా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని జిల్లా ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రంలో 4 పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తామని చెప్పిన సీఎం దొనకొండ గురించి ప్రస్తావించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇది ఎంత వరకూ కార్యరూపం దాల్చుతుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సూపర్ సిక్స్‌లోని మహిళలకు ఉచితబస్సు అటకెక్కింది. దీంతో జిల్లాలోని సుమారు 12 లక్షల మంది మహిళలను ప్రభుత్వం మరోసారి మోసం చేసిందనే చెప్పాలి. అన్నదాత సుఖీభవకు కేటాయింపులు పరిశీలిస్తే గత ప్రభుత్వం కంటే లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో 2.96 లక్షల మంది రైతులకు రైతుభరోసా ఇవ్వగా రానున్న రోజుల్లో ఈ సంఖ్యలో భారీగా కోతపడుతుందన్న అనుమానాన్ని రైతు సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. మిగిలిన ప్రాజెక్టుల సంగతేంటి వెలుగొండ ప్రాజెక్టుకు నామమాత్రంగా నిధులను కేటాయిండం దారుణం. ఎంతో ప్రతిష్టాత్మమైన వెలుగొండ ప్రాజెక్టునే పట్టించుకోని ప్రభుత్వం ఇక జిల్లాలోని సంగమేశ్వరం, పాలేటిపల్లి ప్రాజెక్టులను పట్టించుకుంటుందనుకోవడం అత్యాశే. జిల్లా అభివృద్ధికి నిధులు తీసుకొని రావడంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పూర్తిగా విఫలమయ్యారు. – ఎస్కె మాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి అరకొర కేటాయింపులు అన్యాయం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్లో విద్యారంగానికి అరకొర కేటాయింపులు చేయడం అన్యాయం. కేవలం 10.8 శాతం కేటాయింపులతో ఏమాత్రం విద్యారంగ అభివృద్ధి సాధ్యం కాదు. 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించి అన్ని రకాల పెండింగ్‌లో ఉన్న వేల కోట్ల బకాయిల చెల్లింపులపై 12వ పీఆర్సీ మధ్యంతర భృతి, సీపీఎస్ ఉద్యోగులకు డీఏల 90 శాతం చెల్లింపులు, మ్యాచింగ్ గ్రాంట్జమ, పీఎఫ్, ఏపీ జీఎల్ఐ పార్ట్ ఫైనల్స్, ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర్న్లీవ్స్ మంజూరులను బడ్జెట్లో ఏ మాత్రం ప్రస్తావించలేదు. దీంతో ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లకు నిరాశ ఎదురైంది. – బి.అశోక్ కుమార్, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దగా చేసిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో వెలుగొండ ప్రాజెక్టుకు కేవలం రూ.359 కోట్లు కేటాయించడం జిల్లా ప్రజలను మోసగించడమే. దీనిని బట్టి చూస్తే వెలుగొండ పూర్తి చేసే విషయంలో సర్కారుకు చిత్తశుద్ధిలేదని తెలిసిపోతుంది. దొనకొండ పారిశ్రామికవాడ గురించి ఆశలు కల్పించడం మినహా మరేమీ కాదు. అంకెల గారడీతో మోసం చేయాలని చేస్తే ప్రజలేమీ పిచ్చివాళ్లు కాదు. తగిన గుణపాఠం చెబుతారు. – ఎంఎల్ నారాయణ, సీపీఐ జిల్లా కార్యదర్శి న్యూస్రీల్పచ్చ తమ్ముళ్లకు పాకెట్ మనీగా గుండ్లకమ్మ నిధులు... రాష్ట్ర బడ్జెట్లో గుండ్లకమ్మ ప్రాజెక్టుకు రూ.15.50 కోట్లు కేటాయించడంపై విమర్శలు వెల్లువెతుతున్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్వహణ కోసమంటూ రూ.6.50 కోట్లు బినామీ కంట్రాక్టర్ల పేరుతో టీడీపీ నాయకులు దోచుకున్నారని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు కేటాయించిన నిధులను ప్రాజెక్టు కోసం నయా పైసా కూడా ఖర్చు చేయకుండా సుందరీకరణ పేరుతో కోట్ల రూపాయలు దిగమింగారన్న ఆరోపణలు ఉన్నాయి. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం గుండ్లకమ్మకు రూ.9 కోట్లు కేటాయించి ప్రాజక్టు గేట్లన్నిటినీ మరమ్మతులు చేయించింది. అలాగే ఒంగోలుకు మంచినీరు అందించేందుకుగాను అన్నంగికొండపై లిఫ్ట్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం కేటాయించిన నిధులతో కుడి కాలు, ఎడమ కాలువ పూడిక పనులు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ పనులను ఇప్పటికే తెలుగు తమ్ముళ్లకు అప్పగించినట్లు తెలుస్తుంది. అంటే కాలువ పూడిక పనులు, ప్రాజెక్టు నిర్వహణ పేరుతో పచ్చ తమ్ముళ్లకు పాకెట్ మనీ ఇవ్వడమేనని రైతులు ఆరోపిస్తున్నారు. -
హామీలకు నీళ్లు..
మిర్చి క్లస్టర్ ఎవరి కోసం..వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో లాభాలు చవిచూసిన మిర్చి రైతులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరల్లేక, ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో భారీగా నష్టపోయారు. గుంటూరు మార్కెట్లో ధరలు పతనమవుతున్న సమయంలో ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న రైతులకు వినతులను ప్రభుత్వ పెద్దలుగాని, జిల్లా ప్రజాప్రతినిధులు పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో మిర్చిరైతుల పరిస్థితి దయనీయంగా మారింది. తాజా బడ్జెట్లో జిల్లాను మిర్చిక్లస్టర్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి చేతులు దులుపుకుంది. అసలు ఇది ఎవరికోసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. తాగు, సాగునీటి ప్రాజెక్టులకు తీరని నష్టం జిల్లాకు ప్రధాన సాగునీటి వనరైన పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు బడ్జెట్లో కేవలం రూ.359 కోట్లు కేటాయించడం దారుణం. మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టు పరిశీలనకు వచ్చినప్పుడు రూ.4 వేల కోట్లు అవసరమని చెప్పి బడ్జెట్లో 10 శాతం కూడా కేటాయించలేదు. ఈ లెక్కన ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారో అర్థం కావటం లేదు. జిల్లా ప్రజలకు సాగు, తాగునీరు అందించకుండా నాలుగు సంవత్సరాల పాటు ప్రాజెక్టును సాగదీయటమే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంగా ఉంది. రాష్ట్ర మంత్రి స్వామి మాత్రం బడ్జెట్ సూపర్‌గా ఉందని ప్రకటించడాన్ని బట్టి ఆయన బడ్జెట్ కేటాయింపులు తెలిసి మాట్లాడుతున్నాడా లేక తెలియక మాట్లాడుతున్నాడా అర్థం కావటం లేదు. మంత్రి స్వామి ఇవే మాటలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి చెబితే ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారు. –డాక్టర్ ఆదిమూలపు సురేష్, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి నిధులు కేటాయింపులో తీవ్ర అన్యాయం వెలుగొండ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగింది. గత బడ్జెట్లో రూ.399 కోట్లు కేటాయిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రూ.359 కోట్లు కేటాయించింది. కేవలం నిర్వాసితులను తరలించడానికే రూ.800 కోట్ల ఖర్చవుతుంది. ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.2 వేల కోట్లు అవసరం. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రులు ప్రాజెక్టును సందర్శించి సమీక్షలు జరిపి వచ్చే జూన్, జూలై నెలల్లో నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా ప్రాజెక్టు పనులు ఏ విధంగా పూర్తవుతాయి?. సూపర్ సిక్స్ పథకాలు కేటాయింపులు లేవు. తల్లికి వందనంకి రూ.12 వేల కోట్లు అవసరమైతే రూ.9400 కోట్లు మాత్రమే కేటాయించారు. – బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే -
రాష్ట్ర ప్రభుత్వానిది రౌడీయిజం
ఒంగోలు టౌన్: ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం రౌడీయిజానికి పాల్పడుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతులను అణచివేస్తోందని, అందులో భాగమే ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టు అని చెప్పారు.జూపూడి గురువారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోసాని దొంగో, నేరస్తుడో కాదని, ఒక రచయితగా, సినిమా దర్శకుడిగా, నటుడిగా ప్రజలకు అండగా నిలబడి మాట్లాడారని, ఆయన అరెస్టు అక్రమమేనని చెప్పారు.దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై వ్యక్తిగత దూషణలు చేసిన చంద్రబాబు సంగతేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు ఎంతటి వారినైనా విమర్శిస్తారుగానీ.. ఆయన మీద విమర్శలు చేస్తే అరెస్టులు చేయిస్తారా అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాలు, అణచివేతలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పోరాటాలు చేస్తుందని జూపూడి తెలిపారు. -
తెలుగు భాషలో చెరగని సంతకం.. నాగభైరవ
ఒంగోలు మెట్రో: అసలు సిసలైన తెలుగు నుడికారానికి, తెలుగు భాషకు చెరగని నిలువెత్తు సంతకం డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు అని ప్రముఖ రచయిత, డాక్టర్ జక్కంపూడి సీతారామారావు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం బృందావన గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణంలో జాతీయ కవి, కవిరత్న డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు సాహిత్య ప్రతిభా పురస్కారాల సభ నిర్వహించారు. ఈసందర్భంగా సీతారామారావు మాట్లాడుతూ సాహితీ జగత్తులో తనదంటూ బలమైన ముద్ర వేసిన కవి నాగభైరవ అని పేర్కొన్నారు. మరో ముఖ్య అతిథి శాంతా కళాశాల అధినేత పెంట్యాల శ్రీమన్నారాయణ మాట్లాడుతూ నాగభైరవ కవిగా సామాజిక ప్రయోజనాన్ని ఆశిస్తూ నేటి తరానికి ఉపయోగపడే సాహిత్య సృజన చేశారన్నారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ సోదరుడు కోటేశ్వరరావుతో గల అనుబంధాన్ని, అనుభవాలు పంచుకున్నారు. నరసం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు తేళ్ల అరుణ పురస్కార గ్రహీతలు అంకమ్మరావు, చంద్రమోహన్ రచనల గురించి సంక్షిప్తంగా సభకు పరిచయం చేశారు. ప్రజా గాయకుడు నూకతోటి శరత్‌బాబు తన అభ్యుదయ గేయాలతో సభను ఆనందింపజేశారు. అనంతరం నాగభైరవ కోటేశ్వరరావు పురస్కారాలను ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ నూనె అంకమ్మరావు, రెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శెట్లెం చంద్రమోహన్‌లకు ప్రదానం చేశారు. నిర్వాహకులు, అతిథులు అందరి చేతులు మీదుగా పురస్కార గ్రహీతలను సత్కరించి, మెమొంటోలు, నగదు బహుమతులు అందజేశారు. ఈసందర్భంగా పురస్కార గ్రహీతలు మాట్లాడుతూ నాగభైరవ కోటేశ్వరరావు పుస్కారం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమాన్ని నాగభైరవ పురస్కార కమిటీ చైర్మన్ కళారత్న డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు, కుటుంబ సభ్యులు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థాన పాలకమండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య, రచయితలు, సాహిత్య అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నాగభైరవ సాహిత్య పురస్కారాలు ప్రదానం -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
ఒంగోలు సిటీ: మార్చి 1వ తేదీ నుంచి జిల్లాలో ప్రారంభమవుతున్న ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని ఇంటర్‌బోర్డు ఆర్ఐవో సైమన్ విక్టర్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ఐవో సైమన్ విక్టర్ మాట్లాడుతూ మొదటిరోజు మొదటి సంవత్సరం విద్యార్థులతో పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. మొత్తం 42,439 మంది విద్యార్థులు ఉండగా అందులో 21,624 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 20815 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సర విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. వీరి కోసం 67 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. వీటిలో కంభం, పెద్దదోర్నాల, అర్థవీడు, యర్రగొండపాలెం, గిద్దలూరు లోని కళాశాలలను సున్నితమైనవిగా గుర్తించామని, ఈ ఐదు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి ఉంటుందని చెప్పారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, ఉదయం 8:30 గంటలకే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతిస్తారన్నారు. పరీక్ష 9 గంటలకు ప్రారంభం తర్వాత ఎవరు వచ్చినా అనుమతించరని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణకు 67 మంది చీఫ్ సూపరింటెండెంట్, 67 మంది డిపార్టుమెంటల్ అధికారులు, 1089 మంది ఇన్విజిలేటర్లను నియమించామని చెప్పారు. ఈ పరీక్షల్లో కాపీయింగ్ నిరోధించేందుకు మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్, మూడు సిట్టింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేశామని, వీరికి తోడు ఆర్.ఐ.ఓ, డీఈసీ సభ్యులు, స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్, రెవెన్యూ అధికారులు, రాష్ట్ర స్థాయి బోర్డు అధికారులు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తారన్నారు. వాట్సాప్ ద్వారా హాల్‌టికెట్: పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరికీ హాల్‌టికెట్లు జారీ చేయాల్సిందేనని, ఎవరైనా ట్యూషన్ ఫీజు చెల్లించలేదని కారణాలతో హాల్ టికెట్లు నిరాకరిస్తే అటువంటి కళాశాల గుర్తింపు రద్దు చేస్తామని ఆర్ఐఓ హెచ్చరించారు. విద్యార్థులు కళాశాలలతో నిమిత్తం లేకుండా నేరుగా ఇంటర్నెట్ సెంటర్ నుంచి హాల్ టికెట్స్ పొందవచ్చన్నారు. హాల్ టికెట్ పై తమ కళాశాల ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదన్నారు. అంతే కాకుండా కొత్తగా ప్రవేశపెట్టిన వాట్స్‌యాప్ సర్వీస్ శ్రీమన మిత్ఙ్ర ద్వారా కూడా హాల్ టికెట్ లను పొందవచ్చన్నారు. ఈ సర్వీసు కోసం రిజిస్టర్ నంబర్ 9552300009 కు ‘హాయ్’ అనే సందేశాన్ని పంపి విద్యార్థి పుట్టిన తేదీ, ఆధార్ నంబర్ సహాయంతో సులభంగా విద్యార్థి హాల్ టికెట్‌ను పొందవచ్చని చెప్పారు. సీసీ కెమెరాలు అనుసంధానం: ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాల పటిష్ట నిఘాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు జరగనున్నట్లు ఆర్ఐవో తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోని అన్ని గదులకు, ప్రధాన ప్రవేశ ద్వారం, ప్రశ్నపత్రాల బండిల్స్ ఓపెన్ చేసే గది, జవాబు పత్రాలు ప్యాక్ చేసే గదితో సహా మొత్తం సీసీ కెమెరాలు బిగించినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో ఏం జరుగుతుందని ప్రత్యక్షంగా చూసేందుకు వీలుగా ఒంగోలు లోని ఆర్.ఐ.ఓ కార్యాలయానికి, విజయవాడలోని ఇంటర్ బోర్డు ప్రధాన కార్యాలయానికి సీసీ కెమెరాలు అనుసంధానించామన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లు నిషిద్ధం విద్యార్థులు ఎవరూ పరీక్ష కేంద్రానికి స్మార్ట్ వాచ్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫోన్లు తీసుకొని రాకూడదని ఆర్ఐఓ చెప్పారు. చీఫ్ సూపరింటెండెంట్ తో పాటు కేంద్రంలో పని చేసే సిబ్బంది ఎవరూ మొబైల్ ఫోన్ తీసుకురాకూడదన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేశారని, అవసరమైన చోట్ల ఇతర కళాశాలల నుంచి ఫర్నిచర్ కూడా తెప్పించినట్లు చెప్పారు. ఆర్టీసీ వారి సహకారంతో పరీక్ష కేంద్రాలు దూరంగా ఉన్న చోట్లకు బస్సులు నడుపుతారన్నారు. పరీక్ష కేంద్రంలో ఎవరైనా అస్వస్థత చెందితే వారికి ప్రాథమిక చికిత్స అందించేందుకు ఒక ఆరోగ్య కార్యకర్త, ఏఎన్ఎంను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రానికి చుట్టూ 144వ సెక్షన్ ఏర్పాటు చేశారని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేసేందుకు ఆదేశాలు ఇచ్చారన్నారు. విధుల్లో ఉండే వారికి ఐడీ తప్పనిసరి: పరీక్ష కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బంది ప్రతి ఒక్కరూ వారి ఐడెంటిటీ కార్డును ధరించాలని ఆర్ఐఓ తెలిపారు. పరీక్షల సమయంలో తప్పుడు ప్రచారాలు వ్యాపింప చేసినా, తప్పుడు మార్గాలను అన్వేషించి వాటికోసం పాకులాడినా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటారన్నారు. ఇందుకోసం పోలీస్ శాఖ ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. పరీక్షలకు సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా వాటిని జిల్లా కేంద్రంలోని కంట్రోల్ రూమ్ నంబర్ 08592–281275 ను సంప్రదించవలసినదిగా కోరారు. నిఘానేత్రాల నీడలో ఇంటర్మీడియెట్ పరీక్షలు ఆర్ఐఓ సైమన్ విక్టర్ -
అక్రమాలకు చెక్ పెట్టిన గత ప్రభుత్వం...
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పనుల్లో జరిగే అక్రమాలకు చెక్ పెట్టింది. 2015 వరకు ఉపాధి హామీ పథకం వ్యవహారాలన్నీ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ సాఫ్ట్‌వేర్‌లో జరిగేవి. ఇవి పారదర్శకంగా లేకపోవడంతో గత ప్రభుత్వం నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ సాఫ్ట్‌వేర్‌కు మార్చింది. దీంతో పాటు శ్రమశక్తి సంఘాలు, మేట్ల వ్యవస్థకు మంగళం పాడింది. ఫలితంగా పెద్ద ఎత్తున అక్రమాలకు చెక్ పెట్టినట్లయింది. బేస్తవారిపేట: కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో శ్రమశక్తి సంఘాల ఏర్పాటు, మేట్ల వ్యవస్థను తీసుకొచ్చి అక్రమాలకు రాచమార్గం వేసింది. ఫలితంగా ఈ పథకం లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. ఇప్పటికే కొందరు నాయకులు బోగస్ మస్టర్లతో కూలీల పొట్టకొడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పనులను కూడా కేవలం కూటమి సానుభూతిపరులకే కేటాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2014–19 వరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నో అక్రమాలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కాంపొనెంట్ పనుల్లో 50 శాతం నిధులు స్వాహా చేశారని కూలీలే చెప్పుకున్నారు. అప్పడు కూడా శ్రమశక్తి సంఘాలు, మేట్లను ఏర్పాటు చేసి దోచిపెట్టారు. పనులు చేయకుండా ౖపైపె పూతలతో బిల్లులు చేసుకుని జేబులు నింపుకున్నారు. జిల్లాలోని 38 మండలాల్లో మొత్తం 4.41 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. అందులో 3.82 లక్షల కార్డులు యాక్టివ్‌లో ఉన్నాయి. 8.13 లక్షల మంది కూలీలు ఉండగా, వీరిలో 6.78 లక్షల మంది కూలీలు యాక్టివ్‌గా ఉన్నారు. 6.78 లక్షల మంది కూలీలకు 13,560 మంది మేట్లను నియమించే అవకాశం ఉంది. అయితే, 1,01,750 మంది కూలీలకు 2,631 మేట్లను నియమించారు. ఉపాధి హామీ నిధులతో సీసీ, బీటీ రోడ్ల పనులు, గోకులం షెడ్లు, పచ్చ గడ్డి పెంపకం, ఇంకుడు గుంతల పనులన్నీ అధికార కూటమి నేతలు తమకు నచ్చిన వారికి కేటాయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మేట్ పేరుతో దోపిడీ... జిల్లాలో ఇప్పటివరకూ 2,631 శ్రమశక్తి సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ సంఘంలో 25 నుంచి 50 మంది ఉంటారు. ఇందులో ఒకరిని లీడర్‌గా నియమిస్తారు. ఆయన్ను మేట్ అంటారు. కూలీలను పనికి తీసుకెళ్లే బాధ్యత మేట్దే. మేట్ కూడా కూలీలతో పాటు పనిచేయాల్సిందే. కానీ, పనిచేయకుండానే వేతనం పొందుతారని కూలీలే చెబుతున్నారు. కూలీలపై అజమాయిషీ చెలాయిస్తారు. ఉపాధి కూలీల హాజరు, ఆన్లైన్ చేయడం, వేతనాల సిఫార్సు మొత్తం వీరే చేస్తారు. తమకు నచ్చిన వారికి పని కల్పించడం, పనులకు హాజరుకాకపోయినా మస్టర్లు వేయడం, ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. కొత్తగా నియమించే మేట్లు అందరూ టీడీపీ కార్యకర్తలే ఉండాలని ఎమ్మెల్యేలు అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. రెండువారాల కిందట ఈ ప్రక్రియ ప్రారంభమైంది. త్వరలో ప్రక్రియ మొత్తం పూర్తి చేయడానికి గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఫీల్డ్ అసిస్టెంట్లు, శ్రమశక్తి సంఘాల లీడర్ల ఆధ్వర్యంలోనే ఉపాధి పనులు జరుగుతాయి. ఇప్పటికే అనేక చోట్ల ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి కూటమి కార్యకర్తలను నియమించారు. లీడరుగా ఉన్నందుకు మేట్‌కు ఒక కూలీపై రోజుకు రూ.1.50 చొప్పున చెల్లిస్తారు. యాక్టివ్‌గా ఉన్న కూలీలు 6.78 లక్షల మంది. దానిప్రకారం రోజుకు మేట్లకు సుమారు రూ.10.17 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 100 రోజులకు దాదాపు రూ.10 కోట్లపైనే వీరికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకంగా కూటమి ప్రభుత్వం దోపిడీకి తెరతీసింది. శ్రమశక్తి సంఘాలు, మేట్లపేరుతో అక్రమాలకు రాచమార్గం మేట్లకు గౌరవ వేతనం పేరుతో రూ.కోట్లు స్వాహా వారి చేతిలోనే హాజరు, ఆన్లైన్, కూలీల వేతనాల సిఫార్సు అధికార పార్టీవారే ఉండాలంటూ ఎమ్మెల్యేల ఆదేశం త్వరలో పూర్తికానున్న ప్రక్రియ అక్రమాల కారణంగా ఈ వ్యవస్థను ఎత్తేసిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం -
ప్రకాశం
33/24Iగరిష్టం/కనిష్టంకట్టుకథలు చెప్పొద్దు ప్రజల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా కారణాలడిగితే కట్టుకథలు చెప్పొద్దంటూ అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. ధాన్యం రైతుకు దిక్కెవరు..? జిల్లాలో ధాన్యం రైతు పరిస్థితి దయనీయంగా మారింది. గిట్టుబాటు ధరలు లేక, దిగుబడి రాక అల్లాడుతున్నారు. దళారులకు పంటనమ్ముకుని దగా పడుతున్నారు.వాతావరణం ఉదయం పొగమంచు ఉంటుంది. ఎండ తీవ్రత స్వల్పంగా పెరుగుతుంది. ఉక్కపోతగా ఉంటుంది.శుక్రవారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025– IIలో.. -
రైతు వ్యతిరేక కుట్రలను తిప్పికొడతాం
● సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు ఒంగోలు టౌన్: రైతాంగ ఉద్యమాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రపూరిత దుష్ప్రచారాలను తిప్పికొట్టేందుకు మార్చి 5వ తేదీ జిల్లా కేంద్రమైన ఒంగోలు కలెక్టరేట్ వద్ద, మార్చి 10 తేదీ గుంటూరులో నిర్వహించే రాష్ట్ర స్థాయి ధర్నాలను జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని మాదాల నారాయణస్వామి భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న రైతు ఉద్యమాలను విచ్ఛిన్నం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. గిట్టుబాటు ధరలపై కుదుర్చుకున్న ఒప్పందాలపై తప్పుడు ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. స్వామినాథన్ సిఫార్సులు అమలు చేసేంత వరకు ఉద్యమం ఆగదన్నారు. రాష్ట్రంలో బ్లాక్ బర్లీ, వైట్ బర్లీ పొగాకు ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయిందని, వ్యాపారులు గతేడాది కంటే 4 నుంచి 5 వేల వరకు తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. దీనివలన రైతులు చాలా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జామాయిల్, సుబాబుల్ కర్రలను పెరిగిన ధరలకు అనుగుణంగా కొనుగోలు చేయకుండా ఐటీసీ కూటమి మాటున వెయ్యి నుంచి రూ.1,500 తక్కువకు కొనుగోలు చేయడం దుర్మార్గమని ఏపీ రైతు సంఘ జిల్లా కార్యదర్శి వీరారెడ్డి మండిపడ్డారు. ప్రకాశం, కృష్ణా జిల్లాల సుబాబుల్ రైతులు ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. జిల్లాలో సాగు చేస్తున్న తేజ మిర్చికి గుంటూరు మిర్చి మార్కెట్లో 13 నుంచి 14 వేల రూపాయల ధర పలుకుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.11,781 మద్దతు ధర ప్రకటించడాన్ని తప్పుబట్టారు. విదేశాల నుంచి సరుకులు దిగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం రైతులను నిండాముంచేందుకేనని రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు జజ్జూరి జయంతిబాబు విమర్శించారు. సమావేశంలో భీమవరపు సుబ్బారావు, ఎంఎస్ సాయి, ఎల్.రాజశేఖర్, సీహెచ్ సాగర్ పాల్గొన్నారు. ఓపెన్ ఇంటర్ హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి ఒంగోలు సిటీ: 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను మార్చి 3 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ అత్తోట కిరణ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం హాల్‌టికెట్లను ఆన్లైన్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీవోఎస్ఎస్.ఓఆర్జీ ద్వారా హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. -
ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్య పరిష్కరించాలి
ఒంగోలు సిటీ: మార్కాపురం ఎయిడెడ్ ఉపాధ్యాయుల జాయినింగ్ సమస్యను డీఈఓ కిరణ్‌కుమార్ తక్షణమే పరిష్కరించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్ ప్రభాకరరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మార్కాపురం ఆజాద్ ఎయిడెడ్ పాఠశాలలో పనిచేసే ఇద్దరు ఉపాధ్యాయులు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నారని, వారిని మార్కాపురం మండల ఎంఈఓ రిలీవ్ చేసి ఫిబ్రవరి 25న తర్లుపాడు ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలకు పంపించారని తెలిపారు. ఆ పాఠశాల యాజమాన్యం వారిని విధుల్లో చేర్చుకోలేదన్నారు. ఆ మండల ఎంఈఓ ఆ ఉపాధ్యాయులను మీరు డీఈఓ దగ్గరకి వెళ్లాలని చెప్పారన్నారు. రిలీవ్ చేసే ఎంఈఓలు జాయిన్ చేసుకునే విషయంలో సమస్య పరిష్కరించాలేగానీ.. ఉపాధ్యాయులను డీఈఓ దగ్గరకు వెళ్లమని చెప్పడం సరికాదన్నారు. -
వైభవంగా కల్యాణోత్సవం
కొత్తపట్నం: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం వేకువ జామున కల్యాణోత్సవం వైభవంగా సాగింది. గ్రామ పెద్దలు, ఈవో సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో రామలింగేశ్వరస్వామి, కన్నేశ్వరస్వామిలకు పూజలు చేసి కల్యాణోత్సవం నిర్వహించారు. కొత్తపట్నం నాగేశ్వరస్వామి ఆలయంలో ఈవో సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో శివ, పార్వతలకు కల్యాణం నిర్వహించారు. దంపతులు కల్యాణం ముందు పూజలు చేశారు. భక్తులు ఓం నమశివాయ.. హర హర మహాదేవ శంభోశంకర అంటూ ఒక్కసారిగా పోటెత్తారు. ఆలయం ప్రాంగణంలో భక్తులు బారులు తీరారు. పూజలు అనంతరం భక్తులు సముద్రస్నానాలు చేసిన అనంతరం ఆలయానికి వచ్చి దర్శనం చేసుకున్నారు. తీర్థప్రసాదం పంపిణీ చేశారు. భక్తులకు అన్నదానం చేశారు. -
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించాలి
మర్రిపూడి: ప్రభుత్వ భూముల్లో ఎలాంటి ఆక్రమణలు ఉన్నా వెంటనే తొలగించాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మండల అధికారులను ఆదేశించారు. మండలంలోని జువ్విగుంటలో భూముల రీ సర్వేను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీ సర్వేలో తొలుత విలేజ్ బౌండరీ, బ్లాక్ బౌండీరీ, ప్రభుత్వ భూములను హద్దులు పూర్తి చేసిన తర్వాతే పట్టా భూములను ప్రారంభించాలన్నారు. పట్టాదారు సమక్షంలో మాత్రమే భూములు సర్వే చేయాలన్నారు. సుదూర ప్రాంతంలో నివసిస్తున్న రైతుల వివరాలను రిజిష్టర్‌లో నమోదు చేసి వారికి వాట్సప్ ద్వారా సమాచారం ఇచ్చి వారు రీ సర్వేలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ జ్వాలా నరసింహారావు, డీటీ నాగరాజు, సర్వేయర్ బాల వెంకటరెడ్డి పాల్గొన్నారు. టంగుటూరు: మండలంలోని కొణిజేడు గ్రామంలో జరుగుతున్న రీ సర్వేను జేసీ గోపాలకృష్ణ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్వే అధికారులు, సిబ్బందికి సూచనలుచేశారు. తహసీల్దార్ ఆంజనేయులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీలు
కొనకనమిట్ల: మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని వాగుమడుగు పంచాయతీ అంబాపురంలో గురువారం రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. అంబాపురంలోని అంబబాల సంగమేశ్వరస్వామి ఆలయం ఆవరణలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పాలపండ్ల విభాగం నుంచి ఆరుబంట సైజు వరకు (12క్వింటాల బండ) ఎడ్ల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా దాతల సహకారంతో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. పశు ప్రదర్శన పోటీలు రైతులకు ఎంతగానో ఉత్సాహం నింపుతాయన్నారు. ఎడ్ల పోటీలను తిలకించేందుకు మండలంలోని పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో తరలి వచ్చారు. పోటీల్లో కంభం మండలం ఎల్‌కోటకు చెందిన ఉలవల హరికృష్ణ ఎడ్ల జత 2550 అడుగులు లాగి మొదటి స్థానంలో నిలిచాయి. అదే విధంగా పొదిలి మండలం రాములవీడుకు చెందిన సలగాల శ్రీవర్థన్, నాగరాజుకుంటకు చెందిన కుడుముల లక్ష్మిరెడ్డిల సంయుక్త ఎడ్ల జత 1393 అడుగులు లాగి రెండ వ స్థానంలో నిలిచాయి. పొదిలి మండలం రాములవీడుకు చెందిన గుంటూరి బాలయ్య, తాళ్లూరు మండలం లక్కవరానికి చెందిన కె.నరసింహారావుల సంయుక్త ఎడ్ల జత 1350 అడుగులు లాగి మూడవ స్థానంలో నిలిచాయి. అంబాపురంకు చెందిన మాదాల నాగమల్లేశ్వరి ఎడ్ల జత 1262 అడుగులు లాగి నాల్గవస్థానంలో నిలిచాయి. మొదటి, రెండు, మూడు బహుమతులను రూ.30వేలు, రూ.20వేలు, రూ.10 వేలను దాతలు చెన్నెబోయిన తిరుపాలు, కొల్లెబోయిన నడిపి వెంకటేశ్వర్లు, పెరికె రత్నంలు యజమానులకు అందజేశారు. -
గిరిజనులను అడ్డుకున్న అటవీశాఖ అధికారులు
పెద్దదోర్నాల: శ్రీశైలంలో దైవదర్శనం అనంతరం స్వస్థలాలకు అటవీ మార్గంలో వెళ్లేందుకు ప్రయత్నించిన గిరిజనులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. ఈ సంఘటన మండల పరిధిలోని నెక్కంటి బేస్ క్యాంపు వద్ద గురువారం జరిగింది. వివరాల్లోకి ..నియోజకవర్గంలోని పాలుట్ల, నెక్కంటికి చెందిన గిరిజనులు శ్రీశైలంలో దైవదర్శనం ముగించుకుని స్వస్థలాలకు బయలు దేరారు. ఈ క్రమంలో వారికి అత్యంత సమీపంలోని ఇష్టకామేశ్వరి అలయానికి వెళ్లే రహదారిలో వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడే ఉన్న అటవీశాఖ అధికారులు వీరిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన గిరిజనులు తాము ఎన్నేళ్ల నుంచో ప్రయాణాలు చేసే దారిలో వెళ్లేందుకు మీ అనుమతులు ఎందుకంటూ వారితో వాదనకు దిగారు. అయినా అధికారులు పట్టు వదలకపోవటంతో వారు శ్రీశైలం రహదారిలో రాస్తారోకో చేపట్టంతో ఆ రహదారిలో వాహనాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో దిగివచ్చిన అధికారులు గిరిజనులను అటవీమార్గంలో ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వటంలో అందోళన సద్దుమణిగింది. నెక్కంటి బేస్ క్యాంపు వద్ద గిరిజనుల రాస్తారోకో..