SPSR Nellore
-
ఆరుగురు ‘తెలుగు తమ్ముళ్ల’పై కేసు●
● స్కూల్ వార్షికోత్సవంలో బీభత్సం చేసిన ఘటనలో.. తోటపల్లిగూడూరు: ఓ పాఠశాల వార్షికోత్సవంలో పచ్చమూక సృష్టించిన బీభత్సంపై బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆరుగురిపై కేసు నమోదైంది. వివరాలు.. మండలంలోని చెన్నపల్లిపాళెం ఉన్నత పాఠశాలలో సోమవారం సరస్వతి పూజ, వార్షికోత్సవం జరిగింది. దీనికి వెంకటేశ్వరపట్టపుపాళెం, ముత్యాలతోపు పట్టపుపాళెం గ్రామాల్లోని అధికార పార్టీకి చెందిన కొందరు యువకులు మద్యం తాగొచ్చి బీభత్సం చేసిన సంగతి తెలిసిందే. డీజే సిస్టం నిర్వాహకులైన వంశీ (పల్లిపాడు), విక్రమ్ (విలుకానుపల్లి)పై తెలుగు తమ్ముళ్లు దాడి చేశారు. అంతే కాకుండా డీజే సిస్టంకు సంబంధించిన మిక్సర్, ల్యాప్‌టాప్‌లను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో బాధితులైన వంశీ, విక్రమ్‌లు మంగళవారం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీకి చెందిన ఆవుల గణేష్, ముత్యాల హరి, మహేష్, చందు, విజయ్, కిరణ్‌తో పాటు మరికొందరు అకారణంగా దాడి చేసి, డీజే సిస్టం సామగ్రిని ధ్వంసం చేశారని, సుమారు రూ.లక్ష ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు దాడికి పాల్పడిన ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన్నట్లు స్థానిక ఎస్సై వీరేంద్రబాబు తెలిపారు. -
దంపతుల ఆత్మహత్యాయత్నం
కావలి: కోర్టు వివాదంలో ఉన్న పొలంలో వరి పంట కోత పనులను అడ్డుకుంటుండటంతో కౌలు రైతు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కావలి రూరల్ మండలం తాళ్లపాళెం గ్రామంలో మంగళవారం జరిగింది. కోత పనుల కోసం కౌలు రైతు ప్రసాద్‌రెడ్డి వరికోత మెషీన్‌ను తీసుకెళ్లగా కొందరు అడ్డుకున్నారు. దీంతో అతను, భార్య లక్ష్మీకాంతమ్మ పొలంలోనే పురుగు మందు తాగగా స్థానికులు వారిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికీ ప్రాణహాని లేదని తెలిసింది. సమాచారం అందుకున్న కావలి రూరల్ పోలీసులు విచారణ చేస్తున్నారు. అడవుల్లో ట్రాప్ కెమెరాల ఏర్పాటు సీతారామపురం: మండలంలోని సీతారామపురం, పండ్రంగి, దేవమ్మచెరువు, చిన్నాగంపల్లి బీట్ల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో 35 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు డీఆర్వో కేవీ ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల వెలుగొండ అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నందున దానిని గుర్తించేందుకు అడవిలో కెమెరాలు అమర్చామన్నారు. పశువుల కాపరులు అడవిలో సంచరించే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే అడవికి నిప్పు పెడితే శిక్షార్హులవుతారన్నారు. -
బీపీటీ రకాన్ని కేంద్రాల్లోనే విక్రయించుకోండి
● డీఏఓ పి.సత్యవాణి సూచన కొడవలూరు: బీపీటీ రకం ధాన్యాన్ని మార్కెట్లో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నందున, దానిని రైతులు విధిగా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారిని పి.సత్యవాణి సూచించారు. మండలంలోని గుండాలమ్మపాళెం, వెంకన్నపురం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీపీటీ రకానికి ప్రభుత్వం పుట్టికి రూ.19,720 మద్దతు ధర ప్రకటించిందని, మార్కెట్లో రూ.17,500లకే కొంటున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రంలో విక్రయించుకుని అధిక ధర పొందాలన్నారు. తేమ శాతంలోనూ మినహాయింపు ఉన్నందున రైతులు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. తేమ శాతం అధికంగా ఉంటే అదనంగా ఉన్న ఒక్కో శాతానికి క్వింటాకు కిలో ధాన్యం వంతున అదనంగా కేంద్రాలకు ఇవ్వడం ద్వారా విక్రయించుకునే వెసులుబాటు ఉందన్నారు. ప్రధానంగా వరికోత కోసే రైతులు వారం ముందుగానే వీఏఏను సంప్రదించి షెడ్యూలింగ్ నమోదు చేసుకోవాలన్నారు. దీంతో కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, మిల్లుల కేటాయింపు, వాహనాలు సిద్ధం చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఆమె పంట నమోదైన రైతుల వివరాలను కేంద్రాల వద్ద ప్రచురించారు. కార్యక్రమంలో ఏడీఏలు నర్సోజీ, శేషగిరిరావు, ఏఓ లక్ష్మి, ఏఈఓ పి.వెంకట్రావు, వీఏఏలు కె.విష్ణుప్రియ, బి.లిఖిత తదితరులు పాల్గొన్నారు. -
మితిమీరిన టీడీపీ అరాచకాలు
నెల్లూరు(బారకాసు): కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతల అరాచకాలు మితిమీరడమే కాదు.. హద్దు కూడా మీరాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నెల్లూరు నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో కాకాణి మీడియాతో మాట్లాడుతూ తోటపల్లిగూడూరు మండలం కోడూరు మజరా చెన్నపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సౌండ్ టెక్నీషియన్‌పై దాడి చేయడంతోపాటు వారి సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను ధ్వంసం చేశారన్నారు. పవిత్రమైన సరస్వతి విద్యాలయంలో టీడీపీకి చెందిన ఆవుల గణేష్, ముత్యాల హరి, పామంచి వాసు, మహేష్, చందు, విజయ్ మరో పది మంది మద్యం తాగి పాఠశాలల్లోకి వెళ్లి గందరగోళాన్ని సృష్టించారన్నారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తుంటే.. అసభ్యకరమైన పాటలు పెట్టి వాటికి డ్యాన్సులు వేయాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. అడ్డుకున్న పాఠశాల హెడ్మాస్టర్ను దుర్భాషలాడి, దాడి చేయడంతోపాటు సెల్‌ఫోన్ పగులగొట్టారన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాటు చేసిన సౌండ్ టెక్నీషియన్ ల్యాప్‌టాప్‌ను పగులగొట్టారన్నారు. ఇంత జరిగితే విద్యాశాఖ, పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. తాను డీఈఓను అడిగితే తనకేమి తెలియనట్లు చెప్పడం చూస్తే అధికార యంత్రాంగం పచ్చమూకలకు ఏ విధంగా సాగిలపడుతున్నారో అర్థమవుతుందన్నారు. తమ పార్టీ తరఫున అక్కడికి వెళ్లితే పాఠశాల ఉపాధ్యాయులను టీడీపీ నాయకులు ఇబ్బందులు పెడతారన్న ఉద్దేశంతో తాము వెళ్లలేదనన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఇటువంటి ఘటనలు జరిగాయా అని ప్రశ్నించారు. కొత్త సంప్రదాయాలు, సంస్కృతికి తెరలేపి విచ్చలవిడి తనానికి కేరాఫ్‌గా సర్వేపల్లి తయారైందన్నారు. సంబంధిత అధికారులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము విడిచి పెట్టేది లేదన్నారు. సోమిరెడ్డి.. నీది తప్పుడు బతుకు సోమిరెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం చూస్తే ఆయన నిజాయితీతో కూడిన బతుకు బతుకుతున్నాడని తాను అనుకోవడం లేదని కాకాణి అన్నారు. ఆయనపైన అక్రమంగా 18 కేసులు పెట్టినట్టుగా అసెంబ్లీ సాక్షిగా చెప్పాడని, ఆ కేసుల వివరాలు చెప్పాలని కాకాణి డిమాండ్ చేశారు. రేయింబవుళ్లు ఆయన్ను పోలీస్‌స్టేషన్‌లో ఉంచినట్లుగా కూడా సోమిరెడ్డి చెప్పాడని, ఈ విషయాల్లో ఒక్కటైనా రుజువు చేయాలని ఛాలెంజ్ విసిరారు. హిజ్రాలతోపాటు మరి కొంతమంది కలిసి దాదాపు 400 మంది తనపై దాడి చేయడానికి వచ్చారని సోమిరెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఓ వ్యక్తికి చెందిన 2.30 ఎకరాల స్థలాన్ని సోమిరెడ్డి దొంగతనంగా అమ్మేశాడని, దీనిపై సదరు యజమాని సోమిరెడ్డిపై కేసు పెట్టారన్నారు. తన ఆత్మహత్యకు సోమిరెడ్డి కారణమని రాసిన లేఖలను సైతం మాయం చేసినటు వంటి వ్యక్తివి నువ్వు.. నీది ఒక బతుకేనా అని కాకాణి ఎద్దేవా చేశారు. సోమిరెడ్డి చెప్పిన విషయాలపై సీబీఐతో విచారణ జరిపిస్తే వాస్తవాలు బయట పడుతాయన్నారు. అక్రమంగా గ్రావెల్, బూడిద, ఇసుక, మట్టి దోచుకునే వ్యక్తి, అబద్ధాలు చెప్పే వ్యక్తి సోమిరెడ్డి అని చెప్పారు. సర్వేపల్లిలో 6 ఎకరాలను వైఎస్సార్సీపీకి చెందిన వ్యక్తులు రూ.35 లక్షలకు విక్రయించడం జరిగిందని సోమిరెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇందులో ఎవరి పాత్ర ఉందో నిగ్గు తేల్చాలని కొందరు సోమిరెడ్డికి ఛాలెంజ్ విసిరారన్నారు. పొదలకూరు పోలీస్‌స్టేషన్‌లో ఆర్డీఓ సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న విషయంపై నమోదైన కేసులో సోమిరెడ్డి కుమారుడు ఉన్నాడని, ఈ కేసుపై ఇప్పటికీ విచారణ జరగడం లేదన్నారు. ఈ కేసును తొక్కిపెట్టారని కాకాణి ఆరోపించారు. వైఎస్సార్సీపీ గురించి విమర్శించే అర్హత, కానీ, స్థాయి కానీ నీకు లేదన్న విషయాన్ని సోమిరెడ్డి గుర్తుపెట్టుకోవాలన్నారు. మద్యం తాగి వచ్చి పాఠశాలలో రచ్చ రచ్చ విద్యార్థులు, హెడ్మాస్టర్పై దాడి చేయడం దారుణం వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి 18 అక్రమ కేసులు పెట్టినట్లు అసెంబ్లీలో చెప్పిన సోమిరెడ్డి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి -
దంపతుల ఆత్మహత్యాయత్నం
కావలి: కోర్టు వివాదంలో ఉన్న పొలంలో వరి పంట కోత పనులను అడ్డుకుంటుండటంతో కౌలు రైతు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కావలి రూరల్ మండలం తాళ్లపాళెం గ్రామంలో మంగళవారం జరిగింది. కోత పనుల కోసం కౌలు రైతు ప్రసాద్‌రెడ్డి వరికోత మెషీన్‌ను తీసుకెళ్లగా కొందరు అడ్డుకున్నారు. దీంతో అతను, భార్య లక్ష్మీకాంతమ్మ పొలంలోనే పురుగు మందు తాగగా స్థానికులు వారిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికీ ప్రాణహాని లేదని తెలిసింది. సమాచారం అందుకున్న కావలి రూరల్ పోలీసులు విచారణ చేస్తున్నారు. అడవుల్లో ట్రాప్ కెమెరాల ఏర్పాటు సీతారామపురం: మండలంలోని సీతారామపురం, పండ్రంగి, దేవమ్మచెరువు, చిన్నాగంపల్లి బీట్ల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో 35 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు డీఆర్వో కేవీ ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల వెలుగొండ అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నందున దానిని గుర్తించేందుకు అడవిలో కెమెరాలు అమర్చామన్నారు. పశువుల కాపరులు అడవిలో సంచరించే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే అడవికి నిప్పు పెడితే శిక్షార్హులవుతారన్నారు. -
వందలాది మందికి ఉపాధి
రంజాన్ మాసంలో చాలామందికి ఇష్టమైన వంటకం హలీం. ముస్లింలే కాకుండా ఇతరులు చాలామంది దీని రుచిని ఆస్వాదించేందుకు ఇష్టపడుతుంటారు. ఇప్పటికే నెల్లూరు నగరంలో హలీం తయారీ కేంద్రాలు ప్రధాన రహదారుల వెంట ఏర్పాటయ్యాయి. ఒకప్పుడు పెద్ద నగరాలకే పరిమితమైన హలీం ప్రస్తుతం ప్రధాన పట్టణాల్లోనూ లభ్యమవుతోంది.ఇష్టంగా తింటున్నారు నెల్లూరు ప్రజలకు కొన్ని ఏళ్లుగా హలీంను విక్రయిస్తున్నాం. అప్పట్లో చాలా తక్కువ మంది మాత్రమే తినేవారు. ముస్లింలు ఉపవాస దీక్ష అనంతరం పౌష్టికాహారంగా ఈ వంటకాన్ని స్వీకరించేవారు. ఇప్పుడు చాలామంది ఇష్టంగా తింటున్నారు. – రబ్బానీ, రియాజ్ హోటల్, నెల్లూరునెల్లూరు సిటీ: రంజాన్ మాసం వచ్చిందంటే.. అందరికీ గుర్తుకొచ్చేది హలీం. ఇది పోషక విలువలతో కూడిన రుచికరమైన ప్రత్యేక మాంసాహార వంటకం. రంజాన్ నెల ఎప్పుడొస్తుందా అని వేచిచూసే హలీం అభిమానులు పట్టణాలు, నగరాల్లో ఉన్నారంటే దీని ప్రత్యేకత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. నెల్లూరు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో పదుల సంఖ్యలో మటన్, చికెన్ హలీం బట్టీలున్నాయి. 30కి పైగా కేంద్రాలు నెల్లూరు నగరంలో కొన్నేళ్ల క్రితం వీఆర్సీ సెంటర్లో మాత్రమే మూడు హలీం కేంద్రాలుండేవి. అప్పట్లో ఈ వంటకం హైదరాబాద్, చైన్నె, బెంగళూరు సిటీలకు మాత్రమే పరిమితం. నగరవాసులకు హలీం నుంచి రూచి చూపించేందుకు నాడు రియాజ్, రేష్మా, శ్రావణ్య హోటల్స్ నిర్వాహకులు ముందుకొచ్చారు. క్రమేణా నగరంలోని పలు హోటళ్ల నిర్వాహకులు రంజాన్ సమయంలో హలీం తయారు చేసే మాస్టర్లను సిటీల నుంచి పిలిపిస్తున్నారు. దీంతో నేడు 30కి పైగా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వీఆర్సీ సెంటర్, వేదాయపాళెం, ట్రంకు రోడ్డు, పొదలకూరు రోడ్డు, అన్నమయ్య సర్కిల్, కిసాన్ నగర్ తదితర ప్రాంతాల్లో విక్రయ కేంద్రాలున్నాయి. ఆస్వాదిస్తూ.. రంజాన్ ఉపవాస దీక్షల అనంతరం పోషక విలువలతో కూడిన మటన్, చికెన్ హలీం తినేందుకు ముస్లింలు ఇష్టపడతారు. దీని తయారీలో మటన్, చికెన్, గోధుమలు, పప్పులు, నెయ్యి, ఎండు ఫలాలు, ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకాల మసాలా దినుసులు వినియోగిస్తారు. అదే విధంగా ఇతర వర్గాలు వాళ్లు కూడా హలీం రుచిని ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తున్నారు. రూ.3.5 కోట్లకు పైగా వ్యాపారం ఏటా రంజాన్ మాసంలో నెల్లూరు నగరంలో రూ.3.5 కోట్లకు పైగా హలీం వ్యాపారం సాగుతుంది. నగరంలో తయారు చేసే బట్టీలు పది ఉన్నాయి. వాటి నుంచి 30కి పైగా విక్రయ కేంద్రాలకు సరఫరా చేస్తారు. ప్లేట్ చికెన్ హలీం రూ.80 నుంచి రూ.150 ఉండగా, మటన్ రూ.220 నుంచి రూ.260ల మధ్య ఉంది. హలీంను సిద్ధం చేస్తూ.. హలీంను తినేందుకు జనం ఆసక్తి చూపుతుండటంతో విక్రయ కేంద్రాలు పదుల సంఖ్యలో వెలిశాయి. చిన్న హోటళ్ల నిర్వాహకులు సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో మాస్టర్‌కు నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేలు వరకు చెల్లించాల్సి ఉంది. అదే విధంగా సహాయకులు, విక్రయదారులు ఇలా అనేకమంది ఉపాధి పొందుతున్నారు.రంజాన్ మాసంలో దొరికే ప్రత్యేక వంటకం ఒకప్పుడు పెద్ద నగరాల్లో లభ్యం నేడు నగరం, పట్టణాల్లో అందుబాటులో.. నెల్లూరులో 30కి పైగా హలీం కేంద్రాల ఏర్పాటు రుచి చూసేందుకు జనం ఆసక్తిఏటా విక్రయ కేంద్రం ఏర్పాటు చేస్తా రంజాన్ మాసం వచ్చిందంటే హలీం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ వంటకాన్ని చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు తింటున్నారు. ఆరోగ్యవంతమైన ఆహారం కావడంతో విక్రయ కేంద్రాలు విస్తృతంగా ఏర్పాటవుతున్నాయి. – కొవ్వూరి మదన్ తేజ, హలీం పాయింట్ నిర్వాహకుడు, ఎన్టీఆర్ పార్క్ -
గ్లకోమా.. చాలా డేంజర్
లక్షణాలిలా..బీపీ, షుగర్ ఉండే వారిలో రావొచ్చు. ఇంట్లో ఎవరికై నా ఉంటే వారి బిడ్డలకు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైనా కంటికి గాయమైతే అది కాలక్రమంలో గ్లకోమాకు దారితీయొచ్చు. పిగ్మెంటరీ డిస్పర్షన్ సిండ్రోమ్ సోకినా, కొన్ని రకాల కార్టికో స్టెరాయిడ్స్ వాడినా గ్లకోమాకు గురికావొచ్చు. కంటి నొప్పి, తలనొప్పి, వికారం, వాంతులు, చూపు అస్పష్టంగా ఉండటం, ప్రకాశవంతమైన లైట్ల చుట్టూ ఇంద్రధనస్సు – రంగుల వృత్తాలు కనిపించడం, కన్ను ఎరుపెక్కడం, కంటి నుంచి నీరు రావడం, ఇరుకై న దృష్టి లాంటి లక్షణాలుంటే గ్లకోమాగా అనుమానించి నేత్ర వైద్యుని సంప్రదించాలి.నెల్లూరు(అర్బన్): కాలుష్యం, స్క్రీన్కు అతుక్కుని పోవడం, కంటి సమస్యల పట్ల నిర్లక్ష్యం, ఎప్పుడైనా పురుగు పడటం, కన్నును ఎప్పుడో రుద్దడం, వంశపారంపర్యం తదితర వాటివల్ల మనుషులకు నీటి కాసులు (గ్లకోమా) వ్యాధి వస్తుంది. ఫలితంగా తెలియకుండానే క్రమేపీ చూపు కోల్పోవడం జరుగుతుంది. దృష్టిని దొంగిలించే వ్యాధిగా పేరున్న గ్లకోమా పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని నేత్ర డాక్టర్లు పేర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈనెల 9 నుంచి 15వ తేదీ వరకు గ్లకోమా వారోత్సవాలు నిర్వహిస్తోంది. ప్రతి ఏడాది మార్చి 12వ తేదీని ప్రపంచ గ్లకోమా డేగా ప్రకటించింది. జిల్లాలో అంధత్వ నివారణ శాఖ అధికారులు ప్రజలను చైతన్యం చేస్తున్నారు. దెబ్బతింటూ.. గ్లకోమా అనేది ఒక్కసారిగా బయటపడదు. కొంచెం, కొంచెంగా చూపు దెబ్బతింటూ వస్తుంది. ఈలోపు డాక్టర్లను సంప్రదించి వైద్యం చేయించుకుంటే సరే. లేకుంటే చూపును కోల్పోతారు. అప్పటి వరకు పోయిన చూపును తిరిగి తీసుకునిరాలేం. మిగిలిన చూపును మందులతో కాపాడుకోవచ్చు. గ్లకోమాతో ఒక కంటి చూపు పూర్తిగా పోయినవారు జిల్లాలో అనేకమంది ఉన్నారు. మరొక కన్ను చూపు కూడా తగ్గిపోయిన వారున్నారు. ఇలా పాక్షికంగా, పూర్తిస్థా యిలో చూపును కోల్పోయిన బాధితులు సుమారు 2.70 లక్షల మంది వరకు ఉన్నారని వైద్యుల అంచనా. వైద్యరీక్షలు తప్పనిసరి గ్లకోమాకు గురైన వారిలో ప్రధానంగా కంటి లోపల ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కన్ను వెనుక వైపు ఉండే ఆప్టిక్ నాడిని దెబ్బతింటుంది. కంటి నుంచి మెదడుకు దృశ్య సమాచారాన్ని ప్రసారం చేసే వ్యవస్థకు ఆటంకం కలిగి చూపును కోల్పోవడం జరుగుతుంది. 40 సంవత్సరాల వయసు పైబడిన వారు ప్రతి ఆరునెలలకు ఒకోసారి తప్పనిసరిగా కంటి వైద్యపరీక్షలు చేయించుకోవాలి. బీపీ, షుగర్ ఉన్న వారు క్రమం తప్పకుండా చేయించుకుంటే మంచిది. కన్ను ఎరుపెక్కినా, నీరు కారుతున్నా తక్షణమే సంబంధిత డాక్టర్‌ను సంప్రదించాలి. కొన్ని సందర్భాల్లో లేజర్ చికిత్సతో చూపును కాపాడతారు. మందులు, లేజర్ చికిత్సలు కూడా సరిగా పని చేయని సందర్భంలో డాక్టర్లు గ్లకోమా సర్జరీలు చూడా చేస్తున్నారు.కంటి లోపల అధిక ఒత్తిడితో ఈ వ్యాధి ఆప్టిక్ నరం దెబ్బతిని చూపును కోల్పోయే ప్రమాదం జిల్లాలో పదిశాతం మంది రోగులు నేడు ప్రపంచ గ్లకోమా డేఅవగాహన పెంచుకోవాలి గ్లకోమాపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. అప్పుడప్పుడు నేత్ర వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ముందుగా గ్లకోమాను గుర్తిస్తే వైద్యం చేయడం ద్వారా అరికట్టగలం. ప్రస్తుతం ఆధునిక మందులు వచ్చాయి. ఇవి చూపును పరిరక్షించడంలో సమర్థవంతంగా పని చేస్తున్నాయి. జిల్లా అంధత్వనివారణ సంస్థ తరఫున తాము అన్ని ఆస్పత్రుల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. – డాక్టర్ శార్వాణి, జిల్లా అంధత్వ నివారణ అధికారిణి -
జూపూడి పేరుతో నకిలీ ఫిర్యాదు
కోవూరు: కోవూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో కీలక అధికారి లంచాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. తన పరిధిలో ఉన్న పంచాయతీల్లోని కార్యదర్శులను బెదిరించి లంచాలు తీసుకునేందుకు ఆకాశ రామన్న ఉత్తరాలు రాయిస్తూ.. విచారణ పేరు తో ముడుపులు గుంజుతున్నాడని ఆరోపణలు ఉన్నా యి. తాజాగా మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, నెల్లూరు అడ్రస్‌తో కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ కార్యదర్శి అవినీతికి పాల్పడినట్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆ లేఖ కాపీలు కలకలం రేపుతున్నాయి. అందులో కనీసం తేదీని కూడా కనబరచకపోవడం గమనార్హం. ఫిర్యాదు కాపీ ఒకటే.. కానీ రెండు రకాలుగా ఉన్నాయి. 2025 ఫిబ్రవరి 10వ తేదీతో కలెక్టర్ కార్యాలయం, 2025 ఫిబ్రవరి 20వ తేదీతో జిల్లా పంచాయతీ కార్యాలయ ముద్రలు ఉన్న ఫిర్యాదు కాపీపై సదరు జూపూడి ప్రభాకర్ సంతకం లేదు. బయటపడిన మరో కాపీలో జూపూడి సంతకం చేసినట్లు ఉంది. ఈ రెండు కాపీలు చూస్తే ఫేక్ ఫిర్యా దులతోపాటు కలెక్టర్, డీపీఓ కార్యాలయాల సీళ్లను ఉపయోగించి సదరు అధికారి ఈ దారుణానికి పాల్ప డుతున్నట్లు సమాచారం. కలెక్టర్, డీపీఓలు విచారణకు ఆదేశించారంటూ ఆగమేఘాలపై సదరు అవినీతి అధికారే విచారణ పేరుతో పంచాయతీ కార్యదర్శిని వేధించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ సంబంధిత అధికారులు విచారణకు ఆదేశిస్తే.. ముందుగా ఆ ఫిర్యాదుల కాపీలు మండల పరిషత్ అధికారి కి రావాలి. ఎంపీడీఓకు కూడా తెలియకుండా సదరు అధికారి చేతికి వచ్చాయంటే.. ఇవి నకిలీ ఫిర్యాదులే అని అర్థమవుతోంది. సదరు అధికారి కలెక్టర్, డీపీఓ కార్యాలయాల సీళ్లను దుర్వినియోగం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మాజీ ఎమ్మెల్సీ జూపూడి పేరుతో వచ్చిన ఫిర్యాదులపై ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో తాను ఆ లేఖ రాయలేదని తన పేరు ఉపయోగించి ఫేక్ ఫిర్యాదులు సృష్టించిన వారిపై చర్యల నిమిత్తం పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కోవూరు ఎంపీడీఓ కార్యాలయ అధికారి ప్రమేయం ఉన్నట్లు అనుమానం ఒకే ఫిర్యాదు కాపీ.. సంతకం లేకుండా.. సంతకంతో మరొకటి సంతకం లేని కాపీపై కలెక్టర్ కార్యాలయ ముద్ర కలెక్టర్, డీపీఓ కార్యాలయాల సీళ్లు తయారు చేసుకుని దుర్వినియోగం పోలీసులకు ఫిర్యాదు చేయనున్న జూపూడి -
ఆరుగురు ‘తెలుగు తమ్ముళ్ల’పై కేసు●
● స్కూల్ వార్షికోత్సవంలో బీభత్సం చేసిన ఘటనలో.. తోటపల్లిగూడూరు: ఓ పాఠశాల వార్షికోత్సవంలో పచ్చమూక సృష్టించిన బీభత్సంపై బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆరుగురిపై కేసు నమోదైంది. వివరాలు.. మండలంలోని చెన్నపల్లిపాళెం ఉన్నత పాఠశాలలో సోమవారం సరస్వతి పూజ, వార్షికోత్సవం జరిగింది. దీనికి వెంకటేశ్వరపట్టపుపాళెం, ముత్యాలతోపు పట్టపుపాళెం గ్రామాల్లోని అధికార పార్టీకి చెందిన కొందరు యువకులు మద్యం తాగొచ్చి బీభత్సం చేసిన సంగతి తెలిసిందే. డీజే సిస్టం నిర్వాహకులైన వంశీ (పల్లిపాడు), విక్రమ్ (విలుకానుపల్లి)పై తెలుగు తమ్ముళ్లు దాడి చేశారు. అంతే కాకుండా డీజే సిస్టంకు సంబంధించిన మిక్సర్, ల్యాప్‌టాప్‌లను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో బాధితులైన వంశీ, విక్రమ్‌లు మంగళవారం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీకి చెందిన ఆవుల గణేష్, ముత్యాల హరి, మహేష్, చందు, విజయ్, కిరణ్‌తో పాటు మరికొందరు అకారణంగా దాడి చేసి, డీజే సిస్టం సామగ్రిని ధ్వంసం చేశారని, సుమారు రూ.లక్ష ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు దాడికి పాల్పడిన ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన్నట్లు స్థానిక ఎస్సై వీరేంద్రబాబు తెలిపారు. -
బీపీటీ రకాన్ని కేంద్రాల్లోనే విక్రయించుకోండి
● డీఏఓ పి.సత్యవాణి సూచన కొడవలూరు: బీపీటీ రకం ధాన్యాన్ని మార్కెట్లో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నందున, దానిని రైతులు విధిగా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారిని పి.సత్యవాణి సూచించారు. మండలంలోని గుండాలమ్మపాళెం, వెంకన్నపురం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీపీటీ రకానికి ప్రభుత్వం పుట్టికి రూ.19,720 మద్దతు ధర ప్రకటించిందని, మార్కెట్లో రూ.17,500లకే కొంటున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రంలో విక్రయించుకుని అధిక ధర పొందాలన్నారు. తేమ శాతంలోనూ మినహాయింపు ఉన్నందున రైతులు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. తేమ శాతం అధికంగా ఉంటే అదనంగా ఉన్న ఒక్కో శాతానికి క్వింటాకు కిలో ధాన్యం వంతున అదనంగా కేంద్రాలకు ఇవ్వడం ద్వారా విక్రయించుకునే వెసులుబాటు ఉందన్నారు. ప్రధానంగా వరికోత కోసే రైతులు వారం ముందుగానే వీఏఏను సంప్రదించి షెడ్యూలింగ్ నమోదు చేసుకోవాలన్నారు. దీంతో కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, మిల్లుల కేటాయింపు, వాహనాలు సిద్ధం చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఆమె పంట నమోదైన రైతుల వివరాలను కేంద్రాల వద్ద ప్రచురించారు. కార్యక్రమంలో ఏడీఏలు నర్సోజీ, శేషగిరిరావు, ఏఓ లక్ష్మి, ఏఈఓ పి.వెంకట్రావు, వీఏఏలు కె.విష్ణుప్రియ, బి.లిఖిత తదితరులు పాల్గొన్నారు. -
డిజిటల్ అరెస్ట్ చేసి.. రూ.1.02 కోట్లు దోచేసి..
● సైబర్ నేరగాళ్ల నిర్వాకం ● రూ.23 లక్షలు ఫ్రీజ్ చేసిన పోలీసులు ● లబోదిబోమంటున్న విశ్రాంత ఉద్యోగినెల్లూరు(క్రైమ్): సీబీఐ అధికారులమంటూ సైబర్ నేరగాళ్లు ఓ విశ్రాంత ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ చేసి రూ.1.02 కోట్ల నగదును దోచేశారు. మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై నెల్లూరు వేదాయపాళెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారి కథనం మేరకు.. నెల్లూరు నగరానికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగికి గతనెల 25వ తేదీన ట్రాయ్ అఽధికారినంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి ఢిల్లీలో మీరు కొనుగోలు చేసిన సిమ్‌పై 85 ఫిర్యాదులు అందాయని, వాటిపై కేసు నమోదైందని చెప్పారు. మీ పేరుపై ఉన్న బ్యాంక్ ఖాతాను మనీల్యాండరింగ్‌కు వినియోగించారని, జాతీయ భద్రతా చట్టాన్ని దుర్వినియోగం చేశారని చెప్పగా తనకు ఎలాంటి సంబంధం లేదని విశ్రాంత ఉద్యోగి తెలియజేశాడు. ఈ విషయాన్ని సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేయాలని చెప్పి ట్రాయ్ అధికారి ఫోన్ కాల్ కట్ చేశారు. తర్వాత సీబీఐ అధికారినంటూ శర్మ అనే వ్యక్తి ఫోన్ చేసి మీపై కేసు నమోదైందని చెప్పాడు. అనంతరం మోహిత్ కందా అనే మరో వ్యక్తి ఫోన్ చేసి తానూ సీబీఐ అధికారినేనని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న రాకేష్‌కుమార్‌తో మాట్లాడి కేసు నుంచి తప్పిస్తానని చెప్పాడు. అందరూ కలిసి ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5వ తేదీ వరకు విశ్రాంత ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.1,02,47,680ల నగదును వివిధ బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నారు. అనంతరం వారు కేసు నుంచి తప్పించేందుకు వీలుకావడం లేదని బెయిల్ పొందేందుకు మరో రూ.3 కోట్లు డిపాజిట్ చేయాలని చెప్పడంతో విశ్రాంత ఉద్యోగికి అనుమానం వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు 1930కు ఫిర్యాదు చేశాడు. వేదాయపాళెం పోలీసులకు సోమవారం రాత్రి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి రూ.23 లక్షలను ఫ్రీజ్ చేసినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ బలోపేతానికి చర్చలకు ఆహ్వానం నెల్లూరు(అర్బన్): ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేసేందుకు భారత ఎన్నికల సంఘం చర్యలు చేపట్టిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఒ.ఆనంద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం కమిషన్ చేసిన సూచనల్ని ఆయన వివరించారు. అన్ని జాతీయ, రాష్ట్ర పార్టీల నాయకులు, సీనియర్ రాజకీయ ప్రతినిధులతో చర్చలు జరిపి వారి నుంచి సూచనలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఎటువంటి పరిష్కారం లభించని సమస్యలపై ఏప్రిల్ 30వ తేదీ నాటికి రాజకీయ పార్టీల నుంచి ఎన్నికల సంఘం సూచనలు కోరిందన్నారు. ఈ మేరకు వాటికి వ్యక్తిగతంగా లేఖలు పంపిందన్నారు. పార్టీల అధ్యక్షులు, పార్టీల సీనియర్ సభ్యులతో పరస్పర అనుకూల సమయానికి సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియలను మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్యలు చేపట్టిందని వివరించారు. -
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కొలువులు
ఈ దంపతుల పేర్లు గడ్డం శీను, సరసమ్మ. సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం పంటపాళెం గ్రామానికి చెందిన వారు. వీరి కుమార్తె గడ్డం సుమిత్ర ఓ కాలేజీలో రెండో సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతోంది. కూటమి ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. కళాశాల యాజమాన్యం మాత్రం వెంటనే ప్రభుత్వం ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. నిరుపేదలైన తాము చెల్లించే పరిస్థితిలో లేమని ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. – పొదలకూరు ● జిల్లాలో 5 లక్షల మందికిపైగా నిరుద్యోగులు ● ఏడాదిగా కొత్త పరిశ్రమల ప్రతిపాదనలు లేవు ● కూటమి ప్రభుత్వం రాకతో గతంలో మంజూరైన పరిశ్రమల పురోగతి లేదు ● మెగా డీఎస్సీ పేరుతో దగా ● ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి విడుదల కాని ఒక్క నోటిఫికేషన్ ● రెండు బడ్జెట్లలోనూ నిరుద్యోగ భృతి ఊసేలేదు ● జిల్లాలో 50 వేల మందికి అందని ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన ● నేడు జిల్లాలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘యువత పోరు’ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచిపోయాయి. చదువుకునేందుకు విద్యార్థులు, చదువు పూర్తి చేసుకున్నా ఉద్యోగాలు రాక నిరుద్యోగుల కుటుంబాలు రోజు రోజుకు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. మరో వైపు నిరుద్యోగులు వయస్సు మీద పడిపోతున్నా.. కొత్త ఉద్యోగాలకు సంబంధించి ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామంటూ హామీలు గుప్పించిన ప్రభుత్వ పెద్దలు ఆ ఊసే లేకుండా చేశారు. ఉద్యోగం కల్పించలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినా.. ఈ పథకానికి పైసా కూడా కేటాయించలేదు. ఇంటర్ నుంచి డిగ్రీ, ఇంజినీరింగ్ తదితర కోర్సులు చదివే విద్యార్థులకు ఐదు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఫీజులు చెల్లిస్తున్నారు. జిల్లాలో గత ప్రభుత్వ ఐదేళ్లలో భారీగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఆయా పరిశ్రమల్లో జిల్లాకు చెందిన నిరుద్యోగుల్లో టెక్నికల్, లేబర్ విభాగాల్లో సుమారు 50 వేల మందికిపైగా కొలువులు సాధించారు. ఇక సాఫ్ట్వేర్ రంగంలో అయితే లక్షల మందికి కొలువులు సాధించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త కొలువులు సాధించడం కష్టంగా మారింది. గత ప్రభుత్వం హయాంలో చివరిలో మంజూరైన చాలా పరిశ్రమలకు కూటమి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లేకపోవడంతో గ్రౌండింగ్ ప్రక్రియలో కాలయాపన జరుగుతోంది. ఇక ఈ ప్రభుత్వంలో కొత్త పరిశ్రమల ప్రతిపాదన కూడా ఒక్కటీ లేదు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల మాట అటు ఉంచితే.. ప్రైవ్రేట్రంగంలో కూడా ఉద్యోగాలు రావడం నిరుద్యోగులకు కలగా మిగిలిపోతోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎన్నికల్లో గెలవడానికి అడ్డమైన హామీలన్నీ ఇచ్చిన చంద్రబాబు అండ్ కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక నాలుక మడతేస్తున్నారు. అధికారం చేపట్టి తొమ్మిది నెలలు దాటిపోయినా.. ఒక్క పోస్టు భర్తీకి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఊసే లేకపోవడంతో ఉద్యోగార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. విద్యాదీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో పేద విద్యార్థులకు చదువులు భారంగా మారాయి. జిల్లాలో ప్రభుత్వ అంచనా ప్రకారం సుమారు 5 లక్షల మందికిపైగా నిరుద్యోగులు ఉన్నారు. డిగ్రీ, ఇంటర్మీడియట్, పదో తరగతి అర్హతతో జిల్లాలో ఎంతో మంది ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వ కొలువులు కోసం కష్టపడుతూనే.. మరో వైపు కనీసం ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కోసం వెంపర్లాడుతున్నారు. ఎన్నికల ముందు రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి కింద ప్రతి నెలా రూ.3,000 వంతున ఇస్తామని చంద్రబాబు చెబితే.. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు కల్పిస్తామంటూ లోకేశ్ హామీలు గుప్పించారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ పేరుతో తొలి సంతకం చేసినా.. తొమ్మిది నెలలుగా నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఇదిగో అదిగో అంటూ ఊరిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ వస్తే కనీసం జిల్లాలో 650 మందికి ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో వేలల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలను కుదించడంతోపాటు అందులో ఉద్యోగుల సంఖ్యను సైతం కుదించారు. నిరుద్యోగ భృతి.. భ్రాంతి అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే ఉద్యోగాల కల్పనపై దృష్టి సారిస్తామని, లేదంటే నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీలు గుప్పించిన కూటమి పాలకులు తొమ్మిది నెలలుగా ఆ ఉసే ఎత్తడం లేదు. కూటమి ప్రభుత్వం రెండు బడ్జెట్లు ప్రవేశ పెట్టినా నిరుద్యోగుల భృతికి సంబంధించి రూపాయి నిధులు కేటాయించలేదు. దీన్ని బట్టి ఈ ఏడాదికి కూడా భృతి భ్రాంతియే అని స్పష్టమవుతోంది. డీఎస్సీ అభ్యర్థులతోపాటు పోలీస్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ ఉంటుందని పోలీస్ ఉన్నతాధికారులు చెప్పడంతో ఆ కొలువులు కోసం యువత శిక్షణ తీసుకునేందుకు రూ.వేలల్లో ఫీజులు కట్టి కోచింగ్‌లు తీసుకుంటున్నారు. కుటుంబానికి ఆర్థిక భారం ఉన్నప్పటికి ప్రభుత్వ కొలువులు కోసం అప్పులు చేసి కోచింగ్‌లకు కట్టే ఫీజులు కాకుండా, ప్రైవేట్ వసతిగృహాల్లో ఉండేందుకు నెలకు రూ.6 వేల వరకు ఖర్చులు పెట్టుకుంటున్నారు. ఇటువంటి వారికి కనీసం నిరుద్యోగ భృతి కొంత మేర ఉపయోగపడుతుంది. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెనకు పంగనామాలు జిల్లాలో టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇక ఇంజినీరింగ్ పూర్తి చేసుకునే విద్యార్థులు అనేక మంది ఉన్నారు. వీరిలో ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెనకు అర్హులైన 40,299 మంది ఉన్నారు. గతేడాది జనవరి నెల నుంచి ఇప్పటి వరకు ఆయా పథకాలకు నిధులు మంజూరు చేయలేదు. గత ప్రభుత్వంలో ప్రతి మూడు నెలలకు ఈ పథకాల ద్వారా తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. ఇప్పటికి నాలుగు త్రైమాసికాలు పూర్తికాగా, ఈ నెలతో మరో త్రైమాసికం కూడా పూర్తి కానుంది. మరో నెల రోజుల్లోనే ఈ విద్యా సంవత్సరం ముగియనుంది. కానీ కూటమి ప్రభుత్వం ఐదు త్రైమాీసికాలుగా బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులపై కళాశాలలు ఒత్తిడి పెంచడంతో విద్యార్థులు తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు చెల్లించుకుని పరీక్షలకు హాజరు అయ్యేలా చేసుకున్నారు. జిల్లాలో కుటుంబాల సంఖ్య 7.2 లక్షలు (అంచనా) ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ ద్వారా 6,150 శాశ్వత ఉద్యోగులు 6,323 వలంటీర్లు 12,793 ప్రైవేట్ రంగాల్లో 8,600 వివిధ పరిశ్రమల్లో 50 వేల మందికిపైగా.. నిరుద్యోగ యువత5 లక్షల మంది పైగా.. 40,299 మంది ‘యువత పోరు’ నేడు జిల్లాలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం చేసిన మోసం, దగాపై ‘యువత పోరు’ కార్యక్రమం బుధవారం నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. నెల్లూరు నగరంలోని ఉదయం 10 గంటలకు వీఆర్సీ సెంటర్ నుంచి అంబేడ్కర్ విగ్రహం నుంచి ర్యాలీ వెళ్లి కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేయనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వంచనపై నిరసన గళాన్ని వినిపించనున్నారు. అదే విధంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. -
అసంపూర్తి గృహాలకు అదనపు ఆర్థిక సాయం
నెల్లూరురూరల్: 2019–24 మధ్య కాలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గృహాలు మంజూరై ఇంకా వివిధ దశల్లో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అందజేసే యూనిట్ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్ ఆనంద్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు గృహ నిర్మాణశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు రూ.50 వేలు, ఎస్టీ లబ్ధిదారులకు రూ.75 వేలు, అత్యంత వెనుకబడిన గిరిజనులకు రూ.లక్ష అదనపు ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. పీఎంఏవై 1.0 ఇల్లు మంజూరై నిర్మాణంలో ఉన్న గృహాలకు అదనంగా ఆర్థిక సహాయం అందించి ఆ ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సంకల్పించినట్లు చెప్పారు. పీఎంఏవై (అర్బన్) బీఎల్సీ–1.0, పీఎంఏవై (గ్రామీణ్)–1.0, పీఎం జన్మన్ పథకాల కింద ఇప్పటికే గృహాలను మంజూరు చేసిన లబ్ధిదారులకు ఈ అదనపు ఆర్థిక సహాయం వర్తిస్తుందన్నారు. ఈ మేరకు లబ్ధిదారుడు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవడానికి తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వార్డు అడ్మిన్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసి లబ్ధిదారులు త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకునేలా సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. జిల్లాలో 75,344 మందికి రూ.1,199.85 కోట్ల మంజూరు జిల్లాలో 75,344 మంది లబ్ధిదారులకు ప్రయో జనం చేకూరనుంది. ఆత్మకూరులో 8,467, కందుకూరు 6,159, కావలి 10,779, కోవూరు 8,696, నెల్లూరు సిటీ 6,690, నెల్లూరు రూరల్ 8,400, సర్వేపల్లి 19,267, ఉదయగిరి 6,886 ఇళ్లకు సంబంధించి రూ.119.85 కోట్లు మంజూరయినట్లు కలెక్టర్ తెలిపారు. పీఎంఏవై (అర్బన్) బీఎల్సీ–2.0, పీఎంఏవై (గ్రామీణ్) –2.0, పీఎం జన్మన్ తదితర పథకాల కింద యూనిట్ విలువ రూ.2.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎస్టీలకు రూ.75 వేలు, ఎస్సీ, బీసీలకు రూ.50వేలు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 75,334 మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలెక్టర్ ఆనంద్ -
శనగల కొనుగోలుకు నేటి నుంచి రిజిస్ట్రేషన్లు
ఉదయగిరి: జిల్లాలో శనగ పంట ఉత్పత్తులను ప్రభు త్వ మద్దతు ధరకు విక్రయించేందుకు రైతులు మంగళవారం నుంచి మార్చి 20వ తేదీ వరకు రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని జేసీ కార్తీక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7వ తేదీన ‘శనగ రైతు.. దైన్యం’ శీర్షికతో సాక్షిలో కథనం ప్రచు రితమైన విషయం తెలిసిందే. అధికారులు స్పందించి రిజిస్ట్రేషన్ పక్రియ పూర్తయ్యాక రైతుల నుంచి మద్దతు ధర రూ.5,650కు కొనుగోలు చేస్తామని తెలిపారు. కలెక్టరేట్ వద్ద వీహెచ్‌పీ ధర్నా నెల్లూరు రూరల్: అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్రస్వామి ఆలయ పార్వేట ఉత్సవం సందర్భంగా భక్తుల ఊరేగింపుపై అన్యమతస్తుల దాడిని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ఆనంద్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రశాంతంగా ఉత్సవా న్ని నిర్వహించుకునే హిందువులపై అన్యమతస్తులు దాడి చేస్తే.. అందుకు హిందూ సంస్థలను బాధ్యుల్ని చేస్తూ కేసులు పెట్టడం దారుణ మన్నారు. హిందువులను, ఆ సంస్థలను కించపరిచే విధంగా పోలీసులు ప్రవర్తించడం, దేశభక్త సంస్థలైన ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీలపై కేసు పెట్ట డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. నాగులవెల్లటూరు చెరువుకు గండి చేజర్ల: మండలంలోని నాగులవెల్లటూరు గ్రామ చెరువుకు సోమవారం గండి పడింది. సోమశిల దక్షిణ కాలువ నీటితో చెరువు నిండి కట్ట తెగింది. సమాచారం అందుకున్న సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ వేలూరు కేశవచౌదరి సోమవారం సాయంత్రం చెరువు దగ్గరకు చేరుకుని పరిశీలించారు. సోమశిల దక్షిణ కాలువ 5ఎన్ నుంచి విడుదలయ్యే నీటిని తాత్కాలికంగా నిలుపుదల చేయాలని అధికారులను ఆదేశించారు. నీటి ప్రవాహం తగ్గిన వెంటనే మరమ్మతులు చేపడతామని, రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. అయితే ఇరిగేషన్ అధికారులతో ఈ విషయమై మాట్లాడేందుకు ఫోన్ ద్వారా సంప్రదించగా సరిగా స్పందించలేదు. వాడింది 5 యూనిట్లు.. వచ్చిన బిల్లు రూ.945నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఓ వినియోగదారుడు తన దుకాణానికి నెలరోజులపాటు తాళం వేసి ఒక జీరో బల్బు వేసి ఉంచితే నెలకు అయిన విద్యుత్ వినియోగం 5 యూనిట్లు మాత్రమే. అయితే వచ్చిన బిల్లు మాత్రం రూ.945. నెల్లూరు నగరానికి చెందిన న్యాయవాది బసిరెడ్డి నారాయణరెడ్డికి రామ్మూర్తినగర్ విద్యుత్ సెక్షన్ పరిధిలో ఓ దుకాణం ఉంది. 3321214186941 నంబరుతో విద్యుత్ సర్వీస్ కనెక్షన్ ఉంది. దీనిని బాడుగకు తీసుకున్నవారు గత నెల ఖాళీ చేశారు. అందులో ఒక జీరో బల్బు మాత్రమే వేసి ఉండటంతో ఫిబ్రవరి నెల మొత్తానికి 5 యూనిట్లు విద్యుత్ మాత్రమే ఖర్చు అయ్యింది. దీనికి చెల్లించాల్సింది రూ.65 మాత్రమే. కానీ బిల్లులో వివిధ చార్జీలతో కలిపి మొత్తం రూ.945 బిల్లు వచ్చింది. -
కంచే చేను మేస్తోంది
ఉదయగిరి: వరికుంటపాడు మండలంలోని నక్కలగండి రిజర్వాయర్ కట్టపైన ఉన్న విలువైన వేప, తుమ్మ, చిల్లకర్రను అక్రమార్కులు నరికి స్వాహా చేస్తున్నారు. ఇరిగేషన్ పరిధిలో ఉండే ఈ రిజర్వాయర్‌లో గత 20 రోజుల నుంచి యథేచ్ఛగా ప్రభుత్వ సంపద తరలివెళుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆ శాఖలో పనిచేసే ఓ అధికారి కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరుగుతోందనే విమర్శలున్నాయి. నక్కలగండి రిజర్వాయర్ ప్రధానమైన సాగునీటి వనరు. దీని కట్టకు ఇరువైపులా ఏళ్ల తరబడి రూ.లక్షల విలువచేసే వేప, తుమ్మ, చిల్లకర్ర పెద్దమొత్తంలో ఉంది. దీనిపై కన్నేసిన అక్రమార్కులు ఇరిగేషన్ శాఖలోని ఓ అధికారి సహకారంతో దోపిడీ మొదలుపెట్టారు. కట్ట దిగువ భాగంలో జేసీబీలు, ఇతర యంత్రాలు ఉపయోగించి వేళ్లతో సహా పెకిలించి కూలీలచేత సైజుల్లో ముక్కలుగా నరికించి వాహనాల ద్వారా బయటకు తరలిస్తున్నారు. ఇప్పటికే సుమారు రూ.25 లక్షలకు పైగా విలువచేసే కలప సంపదను తరలించినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. మరో రూ.50 లక్షలు విలువైన కర్ర ఇంకా మిగిలిఉందని ఆయకట్టు రైతులు చెబుతున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్ ఏఈ అంకులయ్యను ప్రశ్నించగా తానే ఈ చెట్లు నరకమని చెప్పానని, దీనికోసం ప్రత్యేకంగా ప్రభుత్వం రూ.3 లక్షల నిధులు కేటాయించిందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా కలపను ఎలా నరికిస్తున్నారని ప్రశ్నించగా తగిన జవాబు రాలేదు. వింజమూరు ఇరిగేషన్ డీఈ రమణరావును ప్రశ్నించగా స్పందించిన ఆయన వరికుంటపాడు ఎస్సై రఘునాథ్‌కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా అక్కడ కలప లోడ్ చేసిన వాహనాలు ఉన్నప్పటికీ అదుపులోకి తీసుకోకుండా వదిలేసినట్లుగా సమాచారం. నక్కలగండి రిజర్వాయర్‌లో కలప అక్రమంగా నరికివేత ఇరిగేషన్ అధికారి కనుసన్నల్లో నిరాటంకంగా దోపిడీ చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం -
రైతన్నకు అండగా ఉంటాం
విడవలూరు: ధాన్యానికి గిట్టుబాటు ధరను కల్పించి, రైతులను ఆదుకోవాలని కోవూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్నదాతలకు అండ.. వైఎస్సార్సీపీ అజెండా అనే నినాదంతో విడవలూరులోని అంకమ్మతల్లి దేవస్థానం వద్ద సోమవారం ఆయన ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడకు చేరుకున్న వైఎస్సార్సీపీ నాయకులు, రైతులతో కలిసి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. తర్వాత వైఎస్సార్సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు పూండ్ల అచ్యుత్‌రెడ్డి, డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు, డీఏఏబీ మాజీ చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబు రెడ్డి మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్రెడ్డి ప్రతి ఒక్క రైతును ఆదుకున్నాడన్నారు. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లను అందుబాటులో ఉంచారని తెలిపారు. రైతు భరోసా సొమ్ము జమ చేశాడని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి రైతన్నలను రోడ్డుపాలు చేసిందని విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలను చూస్తే భయమేస్తుందన్న వ్యక్తి 2029లో సూపర్ 10 పథకాలతో మళ్లీ మనముందుకు వస్తాడని, అప్పుడు రైతులే తగిన బుద్ధి చెప్పాలన్నారు. కోవూరు నియోజకవర్గంలో రైతులు పండించిన పంటను అమ్ముకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు అన్నారు. ఇకనైనా రెవెన్యూ, వ్యవసాయ, సివిల్ సప్లయ్స్ విభాగాల అధికారులు రైస్ మిల్లర్లతో సమన్వయం చేసుకుంటూ మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ కాటంరెడ్డి నవీన్‌రెడ్డి, ఇందుకూరుపేట మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులురెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు కొండూరు వెంకటసుబ్బారెడ్డి, బుచ్చిరెడ్డిపాళెం నగర కన్వీనర్ షేక్ షాహుల్, కౌన్సిలర్లు షకీలా బేగం, ప్రమీలమ్మ, జయంతి, అనంతలక్ష్మి, యానాదిరెడ్డి, వైఎస్సార్సీపీ సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు. మద్దతు ధరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలి హామీలను విస్మరించిన చంద్రబాబుది మోసపూరిత వైఖరి ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి విడవలూరులో రైతులతో ర్యాలీ, ధర్నా -
తెలుగు తమ్ముళ్ల అధికార గర్వం
తోటపల్లిగూడూరు: అధికారంలో ఉన్నామని తెలుగు తమ్ముళ్తు రెచ్చిపోతున్నారు. సోమవారం ఓ స్కూల్ వార్షికోత్సవంలో బీభత్సం సృష్టించారు. వివరాలు.. చెన్నపల్లిపాళెం ఉన్నత పాఠశాలలో సోమవారం ఉదయం సరస్వతి పూజ, పాఠశాల వార్షికోత్సవం జరిగింది. పూజ అనంతరం మధ్యాహ్నం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కోడూరు పంచాయతీ వెంకటేశ్వరపట్టపుపాళెం, ముత్యాలతోపు పట్టపుపాళెం గ్రామాల్లోని టీడీపీకి చెందిన యువకులు మద్యం తాగి స్కూల్‌కు చేరుకుని విద్యార్థులు నృత్యాలు చేస్తుండగా కేకలు, అరుపులతో గంతులేశారు. తాము కోరిన పాటలు పెట్టాలంటూ ఆర్కెస్ట్రా నిర్వాహకులతో గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా ల్యాప్‌టాప్‌ను ధ్వంసం చేశారు. ఇదేంటని అడిగిన సౌండ్ సిస్టం ఆపరేటర్‌పై దాడికి దిగారు. టీచర్లు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. మద్యం మత్తులో ఉన్న యువకులు ఓ టీచర్‌పై దాడి చేసి అతడి సెల్‌ఫోన్‌ను పగులగొట్టారు. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థులు, టీచర్లు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనపై హెచ్ఎం సాయిప్రసాద్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యం తాగొచ్చి స్కూల్ వార్షికోత్సవంలో బీభత్సం టీచర్, మరో వ్యక్తిపై దాడి -
భార్య ఆత్మహత్య కేసులో భర్త అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): భార్య ఆత్మహత్యకు కారణమైన భర్తను నెల్లూరు సంతపేట పోలీసులు సోమవా రం అరెస్ట్ చేశారు. వారి కథనం మేరకు.. పొర్లుకట్టకు చెందిన రహంతుల్లా అలియాస్ మున్నా, సమీనా (37)లు దంపతులు. భర్త వేధింపులు తాళలేక సమీనా ఆదివారం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి బీబీజాన్ ఫిర్యాదు మేరకు సంతపేట పోలీసులు మున్నాపై కేసు నమోదు చేశారు. సోమవారం రాత్రి పొర్లుకట్ట సుందరయ్యనగర్ వద్ద అతడిని అరెస్ట్ చేశారు.నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.90 సన్నవి : రూ.60 పండ్లు : రూ.40 నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు బ్రాయిలర్ (లైవ్) : 92 లేయర్ (లైవ్) : 90 బ్రాయిలర్ చికెన్ : 170 బ్రాయిలర్ స్కిన్లెస్ : 190 లేయర్ చికెన్ : 153 -
మోసగించారు..న్యాయం చేయండి
నెల్లూరు(క్రైమ్): ఐటీ లావాదేవీలు చూస్తానని, జాబ్ ఇప్పిస్తానని, బ్యాంక్ లోన్ ఇప్పిస్తానని, ప్లాట్ల పేరిట మోసాలకు పాల్పడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు ఎస్పీ జి.కృష్ణకాంత్‌ను కోరారు. సోమవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. వివిధ ప్రాంతాలకు చెందిన 73 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీకి అందజేశారు. వాటిని పరిశీలించిన ఆయన ఆయా ప్రాంతాల పోలీస్ అధికారులతో మాట్లాడారు. చట్టపరిధిలో సత్వరమే సమస్యల్ని పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో నగర డీఎస్పీ పి.సింధుప్రియ, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, ఎస్బీ – 2 ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాసరెడ్డి, ఫిర్యాదుల సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● నా భర్తకు కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. కోవూరుకు చెందిన సురేష్ చార్టెడ్ అకౌంటెంట్‌నని పరిచయమయ్యాడు. కంపెనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు చూస్తానని నమ్మించాడు. ఐటీ చెల్లిస్తానని రూ.1.27 కోట్లు తీసుకున్నాడు. ఇటీవల ఐటీ కట్టలేదని నోటీసులొచ్చాయి. విచారించగా సురేష్ సీఏ కాదని తేలింది. అతడిని ప్రశ్నించగా దౌర్జన్యం చేస్తున్నాడని నెల్లూరు వేదాయపాళేనికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ● నెల్లూరుకు చెందిన డానియల్ ద్వారా ప్రమీల అనే మహిళ పరిచయమైంది. వారిద్దరూ తిరుపతి గోశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.3 లక్షలు తీసుకున్నారు. నెలలు గడుస్తున్నా జాబ్ రాకపోవడంతో నిలదీయగా నానా దుర్భాషలాడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని జువ్వలదిన్నెకు చెందిన వ్యక్తి కోరారు. ● నెల్లూరు బాలాజీనగర్‌కు చెందిన శశిధర్, ఈశ్వరయ్యలు నా వ్యాపారానికి తోడ్పాటునందించేందుకు బ్యాంక్‌లో లోన్ ఇప్పిస్తానని నమ్మించి వివిధ పత్రాలు తీసుకున్నారు. నాకు తెలియకుండా రూ.10 లక్షల లోన్ తీసుకుని వారు వాడుకున్నారు. నేను ప్రశ్నించగా దిక్కున్నచోట చెప్పుకోమంటున్నారని నవాబుపేటకు చెందిన ఓ మహిళ వినతిపత్రం ఇచ్చారు. ● బుచ్చికి చెందిన శ్రీధర్‌రెడ్డి, మోహన్‌లు నా స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాన్ని తీసుకెళ్లి నాకు తెలియకుండా అమ్మేశారు. వారిని అడిగితే బెదిరిస్తున్నారని బుచ్చికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ● వెంకటాచలం మండలం పాలిచర్లపాడులో లేఅవుట్లోని స్థలాలను నెల్లూరుకు చెందిన శ్రీనివాసరావు మాకు విక్రయించాడు. ఇటీవల ఆ స్థలాన్ని కొందరు చదును చేసి వ్యవసాయం చేసుకుంటుండగా మేం అడ్డుకున్నాం. శ్రీనివాసరావు స్థలం తాలూకా డబ్బులు ఇంకా ఇవ్వకపోవడంతో సాగు చేసుకుంటున్నామని వారు చెప్పారు. రెవెన్యూ అధికారులను సంప్రదించగా వ్యవసాయేతర భూమిగా మార్చకుండా, నుడా అప్రూవల్ పొందకుండానే శ్రీనివాసరావు లేఅవుట్ వేసి ప్లాట్లు విక్రయించినట్లు తేలింది. తమను మోసగించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు. ● నా పెద్ద కుమారుడు బాగోగులు చూసుకుంటానని నమ్మించి ఆస్తి మొత్తం రాయించుకున్నాడు. కొంతకాలంగా పట్టించుకోకుండా ఇబ్బందులు పెడుతున్నాడు. విచారించి న్యాయం చేయాలని సంతపేటకు చెందిన వృద్ధుడు ఫిర్యాదు చేశాడు. నెల్లూరులో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ఎస్పీకి వినతులు అందజేసిన బాధితులు -
వినతులిచ్చి.. దయ చూపమని కోరి..
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● అధికారులకు అందిన 309 విన్నపాలు నెల్లూరు రూరల్: జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనం తమ సమస్యలపై ఉన్నతాధికారులకు అర్జీలిచ్చి దయ చూపాలని కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్, డీఆర్వో ఉదయభాస్కర్‌రావు, డ్వామా పీడీ గంగాభవాని, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 308 అర్జీలను ప్రజలు అందజేశారు. వీటిలో ఎక్కువగా రెవెన్యూ శాఖవి 133, మున్సిపల్ శాఖవి 30, సర్వేవి 13, పంచాయతీరాజ్ శాఖవి 16, పోలీస్ శాఖవి 43, సివిల్ సప్లయ్స్‌వి 9 తదితర శాఖలవి 309 ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలన్నారు. కాగా అర్జీదారులకు భోజనం అందజేశారు. అన్న క్యాంటీన్లకు సరఫరా చేసే వారు కలెక్టరేట్ వ్యాన్‌లో భోజనం తీసుకొచ్చి వడ్డించారు. కాలువ నిర్మించండి 25వ డివిజన్ బుజబుజ నెల్లూరు భగత్‌సింగ్ కాలనీలో డ్రెయినేజీలు నిర్మించాలని స్థానికులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో ఒకటో వీధి నుంచి మసీదు వరకు 11 వీధులున్నాయని, అక్కడ కాలువల్లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. అధికారంలో ఉన్న కొందరు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కాలువలు నిర్మిస్తున్నారని తెలిపారు. 300 కుటుంబాలు ఉన్న ఏరియాలో నిర్మించట్లేదని వాపోయారు. ఉయ్యాల శ్రీనివాసులు, కె.కృష్ణమూర్తి, నాగూర్‌బాబు, వెంకటస్వామి, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధుడి బలవన్మరణం
బిట్రగుంట: బోగోలు మండలం చెంచులక్ష్మీపురం గ్రామానికి చెందిన బిజ్జం వెంకారెడ్డి (75) తన ఇంట్లోనే ఉరేసుకుని సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. వెంకారెడ్డి కుటుంబ సభ్యులంతా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఆయన ఒక్కడే స్థానికంగా నివాసం ఉంటున్నాడు. ఆ ఇంట్లో తిరుపతికి చెందిన శాంతమ్మ అనే మహిళ ఏడాది నుంచి పనిమనిషిగా ఉంది. ఈనెల 4వ తేదీన యజమాని మందలించాడనే కారణంతో శాంతమ్మ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో ఏం జరిగిందో గానీ వారం తిరిగేసరికి వెంకారెడ్డి కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
అంబేడ్కర్ విశ్వవిద్యాలయ ఏర్పాటు కోసం..
ఆంధ్రప్రదేశ్‌లో అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం లేకపోవడంతో దూర విద్య విద్యార్థులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని రీజినల్ కో–ఆర్డినేటర్ సెంటర్లలో పనిచేసే సిబ్బంది ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌కు చెందినందున ఈ సంవత్సరం ఏపీలో అడ్మిషన్లు నిలిపివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. గడిచిన మూడేళ్లుగా మన రాష్ట్రంలోని సెంటర్లలో పనిచేస్తున్న పార్ట్‌టైం లెక్చరర్లకు, సిబ్బందికి జీతాలు కూడా నిలిపివేసినట్లు చెప్పారు. అడ్మిషన్లను చేపట్టాలన్నారు. -
పీహెచ్‌సీలకు చేరిన ఇన్సులిన్ వైల్స్
ఆత్మకూరు: షుగర్ వ్యాధిగ్రస్తులకు అందజేసే ఇన్సులిన్ వైల్స్ రెండు రకాలను ప్రభుత్వం సరఫరా చేసింది. సోమవారం ఉదయం నాటికి అన్ని పీహెచ్‌సీలకు జిల్లా సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి సరఫరా అయ్యాయి. గత నెల 20వ తేదీన సాక్షిలో ‘ఇన్సులిన్‌కూ కటకటే’ అనే శీర్షికతో కథనం వచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కేరళ రాష్ట్రం నుంచి ఇన్సులిన్‌ను తెప్పించింది. 70 శాతం అందుబాటులోకి వచ్చిందని సిబ్బంది పేర్కొన్నారు. మద్యం మత్తులో వీరంగం సృష్టిస్తూ..సోమశిల: మండల కేంద్రమైన అనంతసాగరం గ్రామానికి చెందిన ఓ యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టిస్తూ చోరీలకు పాల్పడుతుండటంతో సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై సూర్యప్రకాష్‌రెడ్డి కథనం మేరకు.. ఎస్సీ కాలనీకి చెందిన పెనగలూరి రాజేంద్ర (బళ్లారి) గతంలో ఐస్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఇతడికి మద్యం అలవాటు ఉంది. డబ్బుల్లేనప్పుడు వృద్ధులు, ఒంటరిగా వెళ్తున్న వారిపై దాడి చేసి నగదు, సెల్ఫోన్లు లాక్కొని పరారవుతుంటాడు. దుకాణాల్లో సామగ్రి, ఇళ్ల ముందు ఉండే బైక్‌లు, సైకిళ్ల తీసుకెళ్లి విక్రయించి మద్యం తాగుతుంటాడు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. శనివారం రాత్రి పాతదేవరాయపల్లి దర్గాలో జరిగిన చోరీకి ఇతడే బాధ్యుడని తెలిసింది. ఇంకా ఓ ఇంట్లో వస్తువులు, బైక్ చోరీ చేశాడని గుర్తించారు. రాజేంద్రపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్సై తెలిపారు. -
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
నెల్లూరు(బారకాసు): నెల్లూరు రూరల్ పరిధిలోని 35వ డివిజన్‌కు చెందిన పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి సమక్షంలో యాకసిరి రంజిత్ కిరణ్, 200 మంది పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చింతారెడ్డిపాళెంలోని తన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో వీరికి పార్టీ కండువాలను కప్పి ఆయన సాదరంగా ఆహ్వానించారు. కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్‌యాదవ్, మాజీ కార్పొరేటర్ నెల్లూరు మదన్‌మోహన్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రావు శ్రీనివాసరావు, ఐరెడ్డి సుబ్బారెడ్డి, నారాయణరెడ్డి, మస్తాన్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, ఆదిరెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, మురళీయాదవ్, తదితరులు పాల్గొన్నారు. -
శోభాయమానంగా గిరిపరిక్రమణ
● గోవింద నామస్మరణతో మార్మోగిన బిలకూట క్షేత్రం బిట్రగుంట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండబిట్రగుంట బిలకూట క్షేత్రంలో ప్రసన్న వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికగా గిరిప్రదక్షణ ఆదివారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భగవంతుడికి భక్తుడిని చేరువ చేసేందుకు రమణమహర్షి సూచించిన గిరిప్రదక్షణను అరుణాచలంలో ఘనంగా నిర్వహిస్తారు. ఆ సంప్రదాయాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలనే సంకల్పంతో ఎనిమిదేళ్ల నుంచి కొండ చుట్టూ గిరిపరిక్రమణ నిర్వహిస్తున్నారు. వేకువనే ఆలయ అర్చకులు, వేదపండితులు ప్రసన్నుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సుముహూర్తంలో ప్రసన్న వేంకటేశ్వరస్వామి, ఉభయదేవేరుల ఉత్సవ మూర్తులతో వేదపండితులు వేదనాదం చేస్తుండగా, మంగళవాయిద్యాలు, గోవింద నామస్మరణ మధ్య స్వామివారు కొండ దిగి కిందకు వచ్చారు. అలంకార ప్రియుడైన స్వామి వారు ఉభయ దేవేరులతో కలిసి కొండ దిగగా గోవింద నామాలు కీర్తిస్తూ భక్తులు సవ్య దిశలో కొండ చుట్టూ ప్రదక్షణ చేశారు. గోవింద నామస్మరణలు, అన్నమయ్య కీర్తనలు, కోలాట ప్రదర్శనల నడుమ కొండ చుట్టూ భక్తులు చేసిన పరిక్రమణ ఆద్యంతం భక్తి పారవశ్యంతో సాగింది. భగవంతుడి సత్సంగంలో భాగమైన స్మరణ, స్తోత్రం, దర్శనం, సన్నిధి నివాసం, తదితర క్రియల్లో గిరి ప్రదక్షణే అత్యంత శక్తి వంతమైనదని ఈ సందర్భంగా అర్చకులు తెలిపారు. కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి దంపతులు, ఆర్డీఓ వంశీకృష్ణ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిసారి ఉత్సవ మూర్తులతో.. బిలకూట క్షేత్రంలో ఎనిమిదేళ్ల క్రితం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభించగా గతేడాది వరకు స్వామివారి నిలువెత్తు చిత్రపటంతోనే భక్తులు కొండ చుట్టూ సవ్య దిశలో ప్రదక్షిణ నిర్వహించేవారు. ఈ దఫా మాత్రం స్వామివారు, దేవేరుల ఉత్సవమూర్తులతో గిరిపరిక్రమణ నిర్వహించగా భక్తులు భారీగా తరలివచ్చారు. -
ఇటీవల జరిగిన ప్రమాదాలు
అభివృద్ధికి చిహ్నాలైన రహదారులు నెత్తురోడుతున్నాయి. సవ్యంగా లేని రోడ్లు.. వాహనాలను నిర్లక్ష్యంగా నడిపే చోదకులు.. భద్రత నిబంధనలపై అవగాహలేమి.. కారణాలేమైతేనేం రుధిరదారులుగా మారుతున్నాయి. ఆనందంగా సాగిపోతున్న ప్రయాణాల్లో అంతలోనే అంతులేని విషాదం కమ్మేస్తోంది. కన్నవారిని, కడుపున పుట్టిన వారిని కోల్పోయిన కుటుంబాలు కుమిలిపోతున్నాయి. ఎంతోమంది శాశ్వత వైకల్యం బారిన పడి జీవితాంతం బాధపడుతున్నారు. 68 రోజుల వ్యవధిలో 44 మందికిపైగా మృతి చెందారంటే సమస్య తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. నెల్లూరు(క్రైమ్): రోడ్లెక్కాక ఇంటికి క్షేమంగా చేరుతామో.. లేమోననే మీమాంసలో వాహనచోదకులున్నారు. జిల్లా పరిధిలోని రోడ్లపై నిరంతరం ప్రమాదాలు చోటుచేసుకుంటూ.. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుండగా, పదుల సంఖ్యలో క్షతగాత్రులవుతున్నారు. మితిమీరిన వేగం.. ఓవర్‌టేకింగ్.. అకస్మాత్తుగా వాహనాలను నిలపడం.. నిద్ర లేమి.. మద్యం మత్తు.. సెల్‌ఫోన్ డ్రైవింగ్.. ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణ.. పరిమితికి మించి ప్రయాణం.. రాంగ్రూట్లో రాకపోకలు.. ఇలా ప్రమాదాలకు కారణాలెన్నో. కొన్ని సందర్భాల్లో గమ్యస్థానానికి సకాలంలో చేరాలనో.. అందరి కంటే ముందుగా వాహనాన్ని చేర్చాలనో.. అత్యవసర పనో.. మరో బాడుగ ఉందనో వాహనాలను వేగంగా నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. అంతా అస్తవ్యస్తం.. జాతీయ, రాష్ట్ర రహదారులు కొంతవరకు బాగానే ఉన్నా.. జిల్లా, మండల, గ్రామీణ రహదారులు గుంతలు పడి దుర్భరంగా మారాయి. రోడ్లపై నిర్దిష్ట పార్కింగ్ ప్రాంతాల్లో కాకుండా ఎక్కడపడితే అక్కడ వాహనాలను ఇష్టారాజ్యంగా నిలుపుతున్నారు. అప్రమత్తం చేసేలా ఇండికేటర్లు, స్టిక్కరింగ్తో కూడిన ట్రయాంగిల్ గుర్తులనూ వాడకపోవడంతో వెనుకొచ్చే వారికి కనిపించక వేగంగా ఢీకొని ప్రాణాలు కోల్పోతున్నారు. వాహనాల ముందు, వెనుకా పసుపు, ఎరుపు రంగులతో రేడియం స్టిక్కర్లున్నా, అధిక శాతం నాసిరకంగా మారాయి. దుమ్మూ, ధూళితో ఉండటంతో చీకట్లో వాహనం ఉందో లేదో తెలుసుకోలేని పరిస్థితి నెలకొంటోంది. స్టీరింగ్ పడుతున్న క్లీనర్లు క్లీనర్లు అరకొరా డ్రైవింగ్‌తో వాహనాలను అప్పుడప్పుడూ నడుపుతూ పట్టు కోల్పోయి ప్రమాదాలకు కారణమవుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి రోజుల తరబడి వాహనాలను నడుపుతూ నిద్రమత్తుకు గురై ప్రమాదాలకు కారకులవుతున్నారు. వీరు ప్రాణాలను కోల్పోవడమే కాకుండా ఎదుటి వారి ప్రాణాలనూ బలిగొంటున్నారు. మొక్కుబడి చర్యలు జిల్లాలో ప్రమాదాలు అధికంగా జరిగే 54 బ్లాక్స్పాట్లను అధికారులు గుర్తించారు. ఇందులో ఉలవనాడు – మనుబోలు (ఎన్‌హెచ్ – 16)పై 45.. కృష్ణపట్నం – బద్వేల్ (ఎన్‌హెచ్ – 67)పై ఏడు.. ఇతర రహదారుల్లో మరికొన్నింటిని కనుగొన్నారు. ఆయా ప్రాంతాల్లో ఇసుక డ్రమ్ములు, బ్యారికేడ్లు, మలుపుల వద్ద రేడియం స్టిక్కర్లు, సోలార్ విద్యుద్దీపాలు, సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని రోడ్డు భద్రత సమావేశాల్లో అధికారులు తీర్మానించారు. కొన్ని ప్రాంతాల్లో మినహా అవి మరెక్కడా కానరావడంలేదు. వేగ నియంత్రణ, బ్లాక్ స్పాట్ల వద్ద నిర్దిష్ట చర్యలు, రోడ్డు సేఫ్టీ కమిటీ నిర్ణయాల అమలుపై పోలీస్, రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫేస్‌వాష్‌కు బ్రేక్.. నిద్రమత్తులో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని గుర్తించిన అధికారులు వాహన డ్రైవర్లకు ఫేస్‌వాష్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పట్లో ప్రమాదాలు తగ్గుముఖం పట్టగా, కాలక్రమంలో ఆ ప్రక్రియకు బ్రేక్‌పడింది. ప్రమాదంలో దెబ్బతిన్న వాహనం ఇలా చేస్తే.. కొంత మేలు జాతీయ రహదారిపై ఎక్కడపడితే అక్కడ వాహనాలను నిలపకుండా చూడాలి. రాత్రి వేళ వాహనచోదకుడికి ముందు వాహనం ఉందనే విషయాన్ని స్పష్టంగా కనిపించేలా చేయాలి. వేగ నియంత్రణ, మద్యం మత్తులో వాహనాలు నడపకుండా చూడాలి. అతివేగంతో దూసుకెళ్లే వాహనాలను నిఘా కెమెరాలతో గుర్తించి వెంటనే కళ్లెం వేయాలి. సంబంధిత వాహన యాజమాని సెల్‌ఫోన్‌కు సందేశం పంపి అప్రమత్తం చేయాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించాలి. అనుభవం లేని వారు వాహనాలను నడుపుతుంటే కేసులు నమోదు చేయాలి. ద్విచక్రవాహనచోదకుడైతే హెల్మెట్.. కారులోని వారు సీట్ బెల్టును విధిగా ధరించేలా చూడాలి. నిబంధనల ఉల్లంఘనలపై కొరడా ఝళిపించాలి. ఫేస్ వాష్ కార్యక్రమాన్ని పునరుద్ధరించాలి. హైవే పెట్రోలింగ్ సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహించేలా చూడాలి. జిల్లా పరిధిలోని రోడ్లపై నిత్యం ప్రమాదాలు గాల్లో కలుస్తున్న ప్రాణాలు వీడని నిర్లక్ష్యం.. భద్రతలో అలక్ష్యం 68 రోజుల్లో 44 మందికిపైగా మృత్యువాత సుందరయ్య కాలనీ సమీపంలోని జాతీయ రహదారిపై కారు మితిమీరిన వేగంతో వస్తూ ముందు వెళ్తున్న ఆటోను ఢీకొంది. ఘటనలో ఆటోలోని ఇద్దరు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇన్నోవా డ్రైవర్ నిద్రమత్తులో వాహనాన్ని నడుపుతూ భగత్‌సింగ్‌కాలనీ సమీపంలో డివైడర్‌ను శనివారం తెల్లవారుజామున ఢీకొని.. గూడూరు వైపు వెళ్లే లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో అక్కాతమ్ముడు మృతి చెందగా, వారి తల్లిదండ్రులు, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. సంగం మండలంలో ఆటోను పల్లెవెలుగు బస్సు జనవరిలో ఢీకొనడంతో వెంకటశేషయ్య, వరలక్ష్మి దంపతులు మృతి చెందారు. -
యువతకు అండగా వైఎస్సార్సీపీ ఉద్యమ బాట
● 12న ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా ● ‘యువత పోరు’ పోస్టర్ ఆవిష్కరణలో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నెల్లూరు(బారకాసు): ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా, ఉద్యోగావకాశాలు కల్పించకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం విద్యార్థులను చదువులకు దూరం చేయడంతోపాటు నిరుద్యోగులను దగా చేస్తోందని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అందుకు నిరసనగా ఈ నెల 12న విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగులతో కలిసి పోరుబాట చేపడుతున్నామని తెలిపారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన ‘యువత పోరు’కు సంబంధించిన పోస్టర్‌ను పలు నియోజకవర్గాల ఇన్చార్జిలు, విద్యార్థి సంఘ నాయకులు, పార్టీ నాయకులతో కలిసి ఆదివారం కాకాణి నగరంలోని డైకస్‌రోడ్డులో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. కాకాణి మాట్లాడుతూ చంద్రబాబు అన్ని రంగాల వారిని మోసం చేసినట్లుగానే విద్యార్థులను, యువతను కూడా మోసం చేస్తున్నారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారన్నారు. విద్యార్థుల భవిష్యత్ బాగుండాలన్న ఉద్దేశంతో దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఈ పథకాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్కడా ఇబ్బంది లేకుండా కొనసాగించారన్నారు. చంద్రబాబు నాడు–నేడు ఈ పథకాలను నీరు గార్చారని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానని, లేకపోతే నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం మెడలు వంచి నిధులు విడుదల చేయించే విధంగా పోరాడేందుకు వైఎస్సార్సీపీ నడుం బిగించిందన్నారు. ఈ నెల 12న నిర్వహించే యువత పోరుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యువకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. వైస్సార్సీపీ వెంకటగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల ఇన్చార్జిలు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, ఆనం విజయకుమార్‌రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ మేరిగ మురళి, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అశ్రిత్‌రెడ్డి, నాయకులు వెంకటశేషయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఏకపక్షంగా ఆ సంస్థ వైఖరి
హైదరాబాద్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ దుర్మార్గ వైఖరి.. వరి రైతులకు శరాఘాతంగా మారింది. కృష్ణపట్నం పోర్టు నుంచి హైదరాబాద్ వరకు బీపీసీఎల్ సంస్థ ఆయిల్ సరఫరాకు పైప్‌లైన్ నిర్మిస్తోంది. పచ్చని పంటలను ధ్వంసం చేసి తమ పైప్‌లైన్ ఏర్పాటు చేయడానికి దుందుడుకుతనంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ తీరుపై పైప్‌లైన్ వెళ్లే మార్గంలోని రైతులు కస్సుబుస్సులాడుతున్నారు. ఈ సమస్యపై రైతు సంఘాలు, వామపక్ష పార్టీలు సైతం కలెక్టర్‌ను కలిసి పంట కాలం పూర్తయ్యే వరకు ఈ పనులు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశాయి. రైతులకు జరిగే నష్టాన్ని అంచనా వేయకుండా బీపీసీఎల్ ఏకపక్షంగా వ్యవహరిస్తుంటే ఇందుకు పోలీసులు, అధికారులు వత్తాసు పలకడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పచ్చటి పొలాల వద్దకు చేరిన పైప్‌లైన్ కావలి: వ్యవసాయ భూముల్లో బీపీసీఎల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న పైప్‌లైన్ పల్లెల్లో రగడ సృష్టిస్తోంది. పంట చివరి దశలో ఉండగా ఆ భూములను ధ్వంసం చేసి పైప్‌లైన్ వేయడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయా భూముల్లో వరి పంట సాగులో ఉంది. కనీసం 20 రోజులు సమయం ఇస్తే పంట కోత పూర్తవుతుందని నచ్చ జెప్పినా బీపీసీఎల్ సిబ్బంది ఖాతరు చేయడం లేదు. మండలంలోని సర్వాయపాళెం, ఆనెమడుగు పంచాయతీల పరిధిలో పలు గ్రామాల మీదుగా ఈ నెల 11వ తేదీ నుంచి వరి సాగులో ఉన్న భూముల్లో పైప్‌లైన్ వేసి తీరుతామని బీపీసీఎల్ ప్రతినిధులు మంకుపట్టు పడుతున్నారు. మా భూముల్లో మాకు తెలియకుండా దౌర్జన్యంగా పైప్‌లైన్ వేయడమేంటని రైతులు ఆగ్రహిస్తున్నారు. వరి పైరు పాడైపోతే నష్ట పరిహారం ఇస్తామని బీపీసీఎల్ సిబ్బంది చులకన భావంతో చెబుతున్న మాటలు రైతుల్లో ఆగ్రహం రగిలిస్తోంది. గ్రామాల్లో పోలీసులు పహారా నడుమ పొలాల్లో పైప్‌లైన్ వేయడానికి అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న తీరుపై రైతులు కలత చెందుతున్నారు. సన్నకారు రైతులు భూముల్లో నడి మధ్యన పైప్‌లైన్ వేసి పొలాలను ధ్వంసం చేసి రైతుల జీవనాధారం కోల్పోయే దుర్మార్గమైన వాతావరణాన్ని అధికారులు సృష్టిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. నిర్మాణం ఎలాగంటే.. పైపులైన్ వేసేందుకు రూ.451 కి.మీ. పొడవునా 16 మీటర్ల వెడల్పున భూమిని స్వాధీనం చేసుకుంటారు. అందులో రెండు మీటర్ల వెడల్పులో ఆరు అడుగుల లోతు తవ్వుతారు. పైపులైన్‌కు ఒక వైపున మూడు మీటర్లు, మరో వైపు 11 మీటర్ల మేర ఖాళీ ఉంచుతారు. లైన్ కోసం తవ్విన మట్టిని ఒక వైపు పోసి, మెటీరియల్‌ను మరో వైపు నుంచి తీసుకెళ్తారు. 16 అంగుళాల పైపు వేసి తిరిగి ఆ మట్టిని పూడ్చేస్తారు. అనంతరం ఆ భూమిని రైతులకు అప్పగిస్తారు. ప్రతి 10 కి.మీ.కు ఒక చోట చెకింగ్ పాయింట్‌తో పాటు లైన్ పొడవునా సెన్సార్లు ఏర్పాటు చేయనున్నారు. పనులు పూర్తయిన తర్వాత రైతులు ఎప్పటిలా పంటలు సాగు చేసుకోవచ్చు. అయితే సాధారణ వ్యవసాయ పంటలు తప్ప వేర్లు బాగా లోపలికి వెళ్లి పైపును డ్యామేజీ చేసే మామిడి, జామాయిల్ వంటివి సాగు చేసే అవకాశం లేదు. పైపులైన్ నిర్మాణం తర్వాత ఆ ప్రాంతంలో పంటలు వేసుకోవచ్చు. అయితే పైపులైన్న్దెబ్బతినే స్థాయిలో పెద్దపెద్ద వృక్షాలు పెంచకూడదు. పొలాల్లో చివరి దశలో వరి పైరు ఈ నెల 11 నుంచి పైప్‌లైన్ ఏర్పాటుకు యత్నాలు పంట దెబ్బతింటే సహించమంటున్న రైతులు -
రైతులంటే అలుసైపోయారు
రైతులంటే అలుసైపోయారు. కోతకు వచ్చిన పైరును ఇంటికి చేర్చుకోనే వరకు కూడా ఓపిక పట్టలేమంటే ఎలా. పైప్‌లైన్ నిర్మాణ పనులు జరిగితే వారు పనులు చేసే చోటనే కాకుండా పైరంతా కూడా గింజ చేతికి రాదు. పైగా పైరుకు నష్ట పరిహారం ఇస్తామంటూ హేళన చేయడం దారుణం. బీపీసీఎల్ తేదీలు పెట్టి అదే చివరి గడువని హెచ్చరించే ధోరణిలో బెదిరిస్తే ఎవరూ బెదిరిపోరు. పంట ఇంటికి చేరే వరకు పొలాల్లో పైప్‌లైన్ పనులు జరగనివ్వం. – రేమాల లిగారెడ్డి, రైతు, ఆనెమడుగు, కావలి మండలం ● -
ధీమానా?.. ధిక్కారమా!
● ప్రభుత్వ ఆదేశాలు.. చిత్తు కాగితాలతో సమానం ● మైపాడు రోడ్డు పనులు రద్దు చేసినా.. కొనసాగిస్తున్న కాంట్రాక్టర్ ● 5 శాతం ఎక్సెస్‌తో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ● షాడో ఎమ్మెల్యేకు ముడుపులు ఇచ్చుకుని యథేచ్ఛగా పనులు ● అనుమతి లేకుండా పనులు జరుగుతున్నా అధికారులు మౌనం ● అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నాసిరకంగా నిర్మాణం జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల అండ ఉంటే ప్రభుత్వ ఉత్తర్వులు సైతం చిత్తు కాగితాలుగా మారిపోతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలకే దిక్కు లేకుండా పోవడం చూసి అధికార యంత్రాంగమే విస్తుపోతోంది. గత ప్రభుత్వంలో మంజూరైన రోడ్ల నిర్మాణ పనులు 25 శాతం పూర్తి కాని వాటిని రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు నెల్లూరు– మైపాడు రహదారికీ వర్తిస్తాయి. సదరు కాంట్రాక్టర్ ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల అండతో ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి ఎంచక్కా రోడ్డు వర్క్ చేస్తున్నాడు. షాడో ఎమ్మెల్యేలకు ముడుపులు ఇవ్వడంతో అధికార యంత్రాంగం కాంట్రాక్టర్ ముందు మోకరిల్లింది.సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు– మైపాడు రోడ్డు పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ రద్దయిన పనులను ఎంచక్కా కానిచ్చేస్తున్నాడు. గతంలో ఆ వర్కుకు టెండర్లు వేసిన సమయంలో కాంట్రాక్టర్లు సిండికేట్‌గా మారి ముగ్గురు కలిసి 5 శాతం ఎక్సెస్ ధరకు పనులు దక్కించుకున్నారు. రూ.48 కోట్ల (సీఆర్ఐఎఫ్) నిధులతో నెల్లూరు – మైపాడు రోడ్డును అభివృద్ధి చేసేందుకు రెండేళ్ల క్రితం టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌కు అప్పగించారు. రెండేళ్లలో పూర్తి చేయాలని గడువు విధించారు. ప్రభుత్వం మారడంతో ఆ వర్క్ నెల్లూరు డివిజన్ పరిధిలో జరుగుతున్నా.. కోవూరు డివిజన్ పరిధిలోకి మార్పు చేసుకున్నారు. తర్వాత కూటమి ప్రభుత్వం 25 శాతం కంటే తక్కువ పని చేసిన వర్క్‌లను రద్దు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం ఈ ఆదేశాలిచ్చే సరికి దాదాపు 10 శాతం కూడా ఆ రోడ్డు పని పూర్తి కాలేదు. రద్దయిన పనుల జాబితాలోకి ఆ పని కూడా వచ్చింది. కానీ సదరు కాంట్రాక్టర్ ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల ద్వారా రాజకీయ ఒత్తిడి తెచ్చి రద్దయిన పనిని కూడా చేస్తున్నాడు. షాడో ఎమ్మెల్యే పాత్ర కీలకం మైపాడు రోడ్డు అభివృద్ధి పనులు గతంలో చేపట్టిన సిండికేట్‌లోని ముగ్గురిలో ఒకరు మిగతా ఇద్దరు కాంట్రాక్టర్ల వద్ద ఎక్సెస్ ధర మేర ముడుపులు తీసుకుని రద్దయిన పనిని పూర్తి చేయించేలా కోవూరు షాడో ఎమ్మెల్యేతో ఒప్పందం చేసుకున్నారు. ఈ రోడ్డు నిర్మాణ పరిధిలోకి వచ్చే ఇద్దరు ఎమ్మెల్యేల ద్వారా ఆ శాఖ మంత్రికి చెప్పించుకుని రోడ్డు పనిని అనధికారికంగా పూర్తి చేయిస్తున్నారని తెలిసింది. ప్రభుత్వ ఉత్తర్వులకే దిక్కులేకపోవడంతో మిగిలిన కాంట్రాక్టర్లు విస్తుపోతున్నారు. అడ్డదారుల్లోనైనా.. నెల్లూరు–మైపాడు రోడ్డు 10 శాతం పనులు మేర జరిగిన నేపథ్యంలో రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో.. అనధికారికంగా మరో 15 శాతం పనులు పూర్తి చేస్తున్నారు. 10 శాతం పనుల జాబితాలో ఈ రోడ్డు ఉండడంతో.. అడ్డదారుల్లో వెళ్లి ఆ పనిని ఆ జాబితా నుంచి తప్పించారని సమాచారం. ఇటీవల జిల్లాకు వచ్చిన సదరు శాఖ మంత్రిని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి ఆ పని రద్దు కాకుండా పనులు సజావుగా జరిగేలా చూడాలని కోరినట్లు తెలిసింది. అధికారికంగా ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో 25 శాతం పనులు జరిగినట్లు ధ్రువీకరించి కోర్టు ద్వారా అయినా కాంట్రాక్ట్‌ను చేజార్చుకోకుండా చూసుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. నాణ్యతకు నీళ్లు మైపాడ్ రోడ్డు విస్తరణ పనుల్లో నాణ్యతకు నీళ్లోదిరారు. సంబంధిత శాఖ ఇంజినీర్లు రద్దయిన రోడ్డు నిర్మాణ పనుల జోలికి వెళ్లకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇప్పటికే రోడ్డు మార్జిన్లో ఉన్న గ్రావెల్‌ను రియల్ వెంచర్లకు తోలి రూ.కోట్లు కొల్లగొట్టారు. పనులు కూడా కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత ఆర్అండ్బీ అధికారులు మాత్రం మైపాడు రోడ్డు పనులు రద్దయింది వాస్తవమేనని ఒప్పుకుంటున్నారు. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రమేయం ఉండడంతో తామేమి చేయలేమని చేతులెత్తేస్తున్నారు. రోడ్డు పనులు ఆపే శక్తి తమకు లేదని అధికారులు చెప్పడం చూస్తుంటే కాంట్రాక్టర్ పవర్ ఏమిటో ఇట్టే తెలిసిపోతుంది. -
అందుబాటులో హాల్ టికెట్లు
నెల్లూరు (టౌన్): ఏపీ ఓపెన్ స్కూల్ పదో తరగతి అభ్యాసకుల హాల్‌టికెట్లు సంబంధిత స్టడీ సెంటర్లలో అందుబాటులో ఉన్నట్లు డీఈ ఓ ఆర్.బాలాజీరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ఈ నెల 17 నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయన్నారు. హాల్ టికెట్లను వాట్సాప్–మనమిత్ర ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. కనువిందు చేసిన నృత్య ప్రదర్శన నెల్లూరు (బృందావనం): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నగరపాలక సంస్థ, జిల్లా ప్రజాపరిషత్ పాఠశాలలకు చెందిన 1,116 మంది విద్యార్థులు నారాయణమూర్తి ఆధ్వర్యంలో ఆదివారం సామూహిక నృత్య ప్రదర్శన నిర్వహించారు. ‘మొక్కజొన్న తోటలో’ జానపద గేయానికి అనుగుణంగా సాగిన నృత్య ప్రదర్శన ప్రేక్షకులకు కనువిందు చేసింది. ఈ కార్యక్రమానికి వండర్బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, భారత్ రికార్డు, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు తదితర సంస్థల ప్రతినిధులు హాజరై వీక్షించారు. విద్యార్థులు, నిర్వాహకులకు ఆయా సంస్థల ప్రతినిధులు సర్టిఫికెట్లు, పతకాలు అందజేశారు. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన పలువురు పాల్గొన్నారు. -
నెల్లూరు, కోవూరు కేంద్రంగా నకిలీ ఉత్పత్తులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో కరేడు నుంచి మనుబోలు వరకు సముద్ర తీరంలో ఆక్వా సాగు ఉంది. మొత్తం 33,104 ఎకరాల్లో ఆక్వా సాగు ఉండగా ఇందులో 22,104 ఎకరాల్లో రొయ్యలు, మిగిలిన ఎకరాల్లో చేపలు పెంచుతున్నారు. నాణ్యమైన రొయ్య పిల్లల ఉత్పత్తికి కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ కొన్ని మార్గ దర్శకాలను రూపొందించింది. ఎంపెడా ద్వారా అనుమతి పొందిన హేచరీలకు బ్రూడర్స్ (తల్లి రొయ్యలు)ను సరఫరా చేస్తోంది. వీటి ద్వారా ఒక దఫాకు ఒక మిలియన్ సీడ్ ఉత్పత్తి అవుతోంది. ఒక బ్రూడర్‌తో 3, 4 సార్లు కంటే ఎక్కువ సార్లు గుడ్లు పెట్టించకూడదు. అంత కంటే ఎక్కువ సార్లు పెట్టిస్తే నాసిరకం పిల్లలు ఉత్పత్తవుతాయి. ఆరోగ్యంగా ఉన్న బ్రూడర్స్ నుంచి గుడ్లు పెట్టించి పొదిగించిన సీడ్ నాణ్యతగా ఉంటుంది. బ్రూడర్స్ నుంచి 1, 2, 3, 4 దఫాల్లో వచ్చిన రొయ్య పిల్లలు నాణ్యతతో పాటు పెరుగుదల ఒకే విధంగా ఉంటుంది. బ్రూడర్స్ ఎంపెడా నుంచి కొనుగోలు చేయడానికి రూ.లక్షల్లో ఖర్చు అవుతుంది. దీంతో హేచరీల యజమానులు అత్యాశకు పోయి కొన్ని రకాల మందులను వినియోగించి 10 నుంచి 12 సార్లు కృత్రిమంగా గుడ్లు పెట్టించి పిల్లలను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారు. మొదటి నాలుగు దశల్లో పొదిగించిన సీడ్‌తో 11, 12 దశల్లో వచ్చిన రొయ్య పిల్లలను కల్తీ చేసి రైతులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో రైతుకు ఇచ్చిన రొయ్య పిల్లలు చెరువులో వదిలితే 50 శాతానికిపైగా చనిపోతున్నాయి. జిల్లాలో 18 హేచరీలకే అనుమతి జిల్లాలో 69 హేచరీలు ఉండగా వీటిలో 18 హేచరీలకే ఎంపెడా అనుమతి ఉంది. మిగతా హేచరీల్లో అనధికారికంగా సీడ్ ఉత్పత్తి చేస్తున్నారు. అనుమతి లేని హేచరీలకు ఎంపెడా బ్రూడర్స్ సరఫరా చేయకపోవడంతో వీరు సముద్రంలో దొరికే రొయ్యలను కొనుగోలు చేసి, వాటి ద్వారానే సీడ్ ఉత్పత్తి చేస్తున్నారని సమాచారం. ఇటువంటి హేచరీలు తాము చైన్నె నుంచి గుడ్లు తెచ్చి పొదిగించామని, నేచురల్ (ఎకో) సీడ్, హైజెనిక్ (పరిశుభ్రమైన) సీడ్ అని రైతులను నమ్మించి మోసం చేస్తున్నారు. నష్టాల నుంచి బయటపడేందుకు.. ప్రతి పంటలో ఎదురవుతున్న పంట నష్టాల నుంచి బయట పడేందుకు రైతులు సామర్థ్యానికి మించి సీడ్ కొనుగోలు చేస్తున్నారు. వాస్తవానికి ఎకరా విస్తీర్ణానికి 30 వేల నుంచి 40 వేల వరకు రొయ్య పిల్లలను గుంతల్లో వదలవచ్చు. అయితే నకలీ సీడ్ కారణంగా సర్వైవల్ ఉండడం లేదని రైతులు రెండింతలకు పైగా అంటే సుమారు ఎకరాకు లక్షకు పైగా సీడ్ వదులుతున్న పరిస్థితి. ఆక్వా సాగు ప్రారంభంలో టైగర్ రొయ్యల సీడ్‌ను ఎకరాకు 15 వేల నుంచి 20 వేల వరకు వదిలేవారు. గుంతల్లో డెన్సిటీ తక్కువగా ఉండడంతో గ్రోత్ (కౌంట్ సైజ్) బాగా ఉండేది. రానురాను సీడ్ నాణ్యత తగ్గిపోవడంతో లక్షల్లో సీడ్‌ను వదిలి పెట్టేవారు. నకిలీ సీడ్ కారణంగా ఏకంగా రాష్ట్రంలోనే టైగర్ రొయ్యల సాగు పూర్తిగా కనుమరుగు అయిపోయింది. ఈ దశలో ఎంపెడా విదేశాల నుంచి వెనామీ తీసుకువచ్చింది. ప్రస్తుతం వెనామీ పరిస్థితి కూడా టైగర్ బాటలోనే కనుమరుగు దశకు చేరుకుంటోందని ఆక్వా నిపుణులు చెబుతున్నారు. ఊపిరి తీస్తున్న ఫీడ్ కంపెనీలు, వ్యాపారులు ఫీడ్ కంపెనీలు, వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను నిలువునా ముంచేయడంతో ఆక్వా రంగం జిల్లాలో కొన ఊపిరితో కునారిల్లుతోంది. వ్యాపారులే మార్కెటింగ్ ఏజెంట్లను పెట్టుకుని.. వీరే టెక్నీషియన్లు అని చెప్పి ఫీల్డ్‌లోకి పంపిస్తోంది. వీరికి కనీస పాటి అవగాహన కూడా ఉండడం లేదు. వీరు అవసరం లేకపోయినా.. గ్రోత్ కోసం, జీర్ణశక్తి మెరుగు పరిచేందుకు, బాక్టీరియా, అమోనియా లోడ్ కంట్రోల్, విటమినన్ సీ, మినరల్స్, మౌల్టింగ్ త్వరగా అయ్యేందుకు, ఆక్సిజనన్ వినియోగం పెరిగేందుకు అంటూ ఇలా రకరకాల పేర్లతో మందులు అంటగడుతున్నారు. ఆక్వా ఫీడ్ తయారీలో పేరెన్నికగన్న సంస్థలు కూడా సీజన్‌ను, డిమాండ్‌ను బట్టి నాసిరకం మేతలు సరఫరా చేస్తున్నాయని ఆక్వా రైతులు వాపోతున్నారు. నాణ్యత లేని సీడ్, వాతావరణ మార్పుల కారణంగా ఎదుగుదల ఏ మాత్రం నెమ్మదించినా విపరీతంగా మందులు వాడుతున్నారు. చివరకు దుకాణాల్లో అప్పులు పెరిగి ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితికి చేరుకుంటున్నారు. కొందరు వ్యాపారులు నెల్లూరు, కోవూరు పరిసర ప్రాంతాల్లో అద్దె భవనాలు ఏర్పాటు చేసుకుని ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చైన్నె వంటి ప్రాంతాల నుంచి సరుకులు (నాణ్యత లేనివి) తీసుకువచ్చి గోడౌన్లలో అందమైన కవర్లు, డబ్బాల్లో ప్యాక్ చేసి రైతులకు అంటగడుతున్నారు. తీరం వెంబడి ఆక్వా సాగు చేసే గ్రామాల్లోనే మేత, మందులు విక్రయించే దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని సీడ్ దగ్గర నుంచి మేత, మందులు, జనరేటర్లు, డీజిల్ వరకు చిన్న రైతులకు అప్పుగా ఇస్తున్నారు. పంట పట్టుబడికి వచ్చిన తర్వాత వీళ్లే రొయ్యలు విక్రయించి తమ బాకీ జమ చేసుకుని మిగిలిన సొమ్ము రైతులకు ఇస్తున్నారు. మత్స్యశాఖ చర్యలు తీసుకోవాలి నకిలీ సీడ్ ఉత్పత్తి చేస్తూ మాయ మాటలతో అమ్మకాలు చేసే హేచరీలపై మత్స్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. మూడు నెలల పెంపకంలో ఎదుగుదల కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన రైతులకు సీడ్, ఫీడ్, ఖర్చులకు వెచ్చించిన డబ్బు తిరిగి ఇప్పించాలి. ప్రభుత్వ అనుమతి లేని హేచరీలను మూయించి వేయాలి. – కృష్ణప్రసాద్‌రెడ్డి, ఆక్వా రైతు, పోలంరాజుగుంట తనిఖీలు చేస్తున్నాం జిల్లా వ్యాప్తంగా హేచరీస్‌లో నకిలీ సీడ్స్‌పై విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాం. ముత్తుకూరు మండలంలోని రైతులు నష్టపోయారని తమ దృష్టికి వచ్చింది. విచారణ చేశాం. నకిలీ సీడ్‌పై తనిఖీలు నిర్వహించి చర్యలు చేపడతాం. – నాగేశ్వరరావు, మత్స్యశాఖ జేడీ, నెల్లూరు నకిలీ సీడ్‌తో తీవ్ర నష్టాలు వెనామీ రొయ్యల పెంపకంలో విపరీతంగా ఖర్చులు, కష్టాలు పెరిగాయి. వైరస్ వ్యాప్తి కూడా అధికంగా ఉంది. కొనుగోలు ధరలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఈ సమస్యలతో సతమతమవుతుంటే ఎన్నడూ లేని విధంగా నకిలీ సీడ్ ఉత్పత్తి చేస్తూ కొన్ని హేచరీలు రైతులకు తీవ్ర నష్టాలు కలిగిస్తున్నాయి. – సన్నారెడ్డి మధురెడ్డి, ఆక్వా రైతు, గుడివాడతోపు -
వైఎస్సార్సీపీలోనే మహిళలకు గౌరవం
నెల్లూరు (బారకాసు): వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు రాజ్యాధికారంలో సముచిత గౌరవాన్ని కల్పించారని, సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సాధికారతకు తోడ్పాటు అందించారని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ ఆనం ఆరుణమ్మ తదితరులు గుర్తు చేశారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం మహిళలను అన్ని విధాలుగా మోసం చేస్తోందని విమర్శించారు. శనివారం నగరంలోని డైకస్‌రోడ్డులో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీసునంద ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, మహిళలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను పార్టీ నాయకులు సత్కరించారు. మహిళా పక్షపాతి వైఎస్ జగన్ : కాకాణి రాజ్యాధికారంలో మహిళలకు అత్యున్నత స్థానం కల్పించడంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో వ్యవహరించారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. మహిళల గురించి, వారికి అందించిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకునే హక్కు ఒక్క వైఎస్సార్సీపీకి మాత్రమే ఉందన్నారు. మహిళా దినోత్సవానికి సంబంధించి ర్యాలీని ఆశా, అంగన్వాడీ వర్కర్లతో జరుపుకునే దుస్థితి టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఏర్పడిందన్నారు. ఆడబిడ్డ నిధి అడ్రస్ లేకుండా పోయిందన్నారు. ఉచిత గ్యాస్ తుస్సుమందని, చంద్రబాబు పేరు చెప్పి బస్సు ఎక్కితే ఎక్కిన చోటే దించేస్తున్నారని చెప్పారు. ● పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ సృష్టికి మూలం మహిళ అని మహిళలు లేకుంటే ప్రపంచమే లేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పురుషులతోపాటు మహిళలకు సమాన హక్కు ఇచ్చి తీరాలన్న ఉద్దేశంతోనే వారికి స్థానిక సంస్థల్లో 50 శాతం కేటాయించడం జరిగిందన్నారు. వైఎస్సార్సీపీ మహిళలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని వారి సంక్షేమం కోసం పోరాటం చేస్తుందన్నారు. ● ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ బాధ్యతకు మారు పేరు మహిళ అని కొనియాడారు. విద్యలో మహిళలే అధిక శాతం ఉత్తీర్ణత సాధించడం జరుగుతుందన్నారు. రాజకీయాల్లో కూడా మహిళలు తమవంతు పాత్ర పోషిస్తున్నారన్నారు. ● జెడ్పీ చైర్పర్సన్ ఆనం ఆరుణమ్మ మాట్లా డు తూ మహిళలు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు పొందాలని, హక్కులను కాపాడాలని, ఈ లక్ష్యాన్ని సాధించడానికి మహిళాభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ● పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీసునంద మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంక్షేమం కోసం వంద రకాల పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. మహిళలు అన్ని విధాలుగా సంతోషంగా ఉండాలంటే భవిష్యత్తులో మరలా వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకురాళ్లు పూజితారెడ్డి, కార్పొరేటర్ మొయిళ్లగౌరి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లతోపాటు పలువురు పాల్గొన్నారు. రాజ్యాధికారం, సంక్షేమంతో సముచిత స్థానం కల్పించిన వైఎస్ జగన్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం మహిళలను సత్కరించిన పార్టీ నేతలు కాకాణి, ఆనం, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి -
మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం
● జిల్లా ఇన్చార్జి మంత్రి మహ్మద్ ఫరూక్ ● కస్తూర్బాలో ఘనంగా మహిళా దినోత్సవం నెల్లూరు(అర్బన్): మహిళలు ఆర్థికంగా పరిపుష్టి సాధించి అన్ని రంగాల్లో ముందంజలో ఉంటూ మహిళా సాధికారత సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా ఇన్చార్జి మంత్రి మహ్మద్ ఫరూక్ అన్నారు. శనివారం నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో కలెక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. తొలుత సెల్ఫీ బూత్‌ను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు సంక్షేమ పథకాలతో పాటు సబ్సిడీ రుణాలు, స్వయం ఉపాధి పథకాలు అందిస్తున్నామన్నారు. మహిళలకు రూ.440 కోట్ల రుణాలు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు రకాల పథకాల ద్వారా రూ.440 కోట్ల మేర రుణాల పంపిణీకి సంబంధించి మంత్రి మహ్మద్ ఫరూక్, కలెక్టర్ ఆనంద్ మెగా చెక్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కృష్ణకాంత్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ట్రైకార్ డైరెక్టర్ అనూరాధ, డీఆర్డీఏ, మెప్మా, ఐసీడీఎస్ శాఖల పీడీలు నాగరాజకుమారి, రాధమ్మ, సుశీల, డీఎంహెచ్ఓ సుజాత, పరిశ్రమల శాఖ జీఎం మారుతీప్రసాద్, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీకాంత్ ప్రదీప్‌కుమార్, హ్యాండ్లూమ్స్ ఏడీ వరప్రసాద్, పలువురు జిల్లా అధికారులు, పొదుపు మహిళలు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్‌లో 32,848 కేసుల పరిష్కారం
● రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మొదటి స్థానం నెల్లూరు (లీగల్) ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌లో 32,848 కేసులు పరిష్కరించి, రూ.2,64,53,501 చెల్లింపులు చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.యామిని ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలోని ఆరో జిల్లా కోర్టు హాల్లో న్యాయమూర్తి కె. వెంకటనాగపవన్కుమార్ జాతీయ లోక్ అదాలత్‌ను ప్రారంభించారు. నెల్లూరు నగరంలో కేసుల పరిష్కారానికి ప్రత్యేకంగా 5 బెంచ్‌లను ఏర్పాటు చేసి న్యాయమూర్తులు కె. వెంకటనాగపవన్, ఎస్. శ్రీనివాస్, గోరంట్ల స్వాతి, ఎల్.శారదరెడ్డి, ఎన్.లావణ్య, ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరించి 14,208 కేసులు పరిష్కరించారు. జిల్లాలోని వివిధ కోర్టుల్లో లోక్‌అదాలత్ జరిగింది. గూడూరు 341, కోవూరు 3,976, కావలి 2,615, వెంకటగిరి 2,601, కోట 300, నాయుడుపేట 55, సూళ్లూరుపేట 1,164, ఆత్మకూరు 2,168, ఉదయగిరి 1,550 కేసులు పరిష్కరించారు. సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వాణి, పలువురు న్యాయమూర్తులు, పోలీసు, బ్యాంకు, ఇన్సూరెన్స్ అధికారులు పాల్గొన్నారు. -
జెడ్పీ సమావేశం వాయిదా
నెల్లూరు (పొగతోట): కోరం లేని కారణంగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. శనివారం సర్వసభ్య సమావేశ నిర్వహణకు జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, సీఈఓ విద్యారమ షెడ్యూల్ ప్రకటించారు. అయితే శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో జెడ్పీ సభ్యులు, మంత్రులు హాజరు కాలేదు. కోరం లేక సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ ప్రకటించారు. మహిళా దినోత్సవం నేపథ్యంలో చైర్‌పర్సన్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ విద్యారమ, డ్వామా పీడీ గంగాభవాని, వ్యవసాయశాఖ అధికారిణి సత్యవాణి, బీసీ సంక్షేమ అధికారి వెంకటలక్ష్మమ్మ, జిల్లా గిరిజన సంక్షేమాధికారిణి పరిమళ, బీసీ కార్పొరేషన్ ఈడీ నిర్మలారెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ అధికారిణి శోభారాణి తదితర అధికారులు పాల్గొన్నారు. నంబరు ప్లేట్లు, బ్లాక్ ఫిల్మ్‌పై తనిఖీలు నెల్లూరు (టౌన్): వాహనా లపై నంబర్ ప్లేట్లు, కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్‌లపై రవాణా శాఖాధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. బైక్‌ల నుంచి కార్ల వరకు రవాణాశాఖ నిబంధనలు ధిక్కరించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఈ నెల 6వ తేదీ సాక్షిలో ‘అడిగే దమ్ముందా?!’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆ శాఖ అధికారులు స్పందించారు. శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో బృందాలుగా ఏర్పడి నిబంధనలు అతిక్రమించిన పలు వాహనాలపై కేసులు నమోదు చేశారు. ప్రధానంగా నాలుగు చక్రాల వాహనాలకు సంబంధించి నంబరు ప్లేట్లు, బ్లాక్ ఫిల్మ్, ద్విచక్ర వాహనదారుల నంబరు ప్లేట్లుపై తనిఖీలు చేశారు. దాదాపు 100 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ. 2 లక్షల మేర అపరాధ రుసుం విధించారు. ఇన్చార్జి ఆర్టీఓ బాలమురళీకృష్ణ మాట్లాడుతూ రవాణా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐలు ఎండీ రఫీ, కార్తీక్, బాబు, ఏఎంవీఐలు పూర్ణచందర్రావు, స్వప్నిల్రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య ఫ్లెక్సీల రగడ గుడ్లూరు: నియోజకవర్గంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వర్గీయుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. గుడ్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాల ఎదురుగా ఎంపీ వర్గీయులు ఓ ఫ్లెక్సీని ఏర్పా టు చేశారు. అయితే ఎంపీ వర్గీయులు ఏర్పా టు చేసిన ఫ్లెక్సీని పక్క పడేసి, ఆ స్థానంలో ఎమ్మెల్యే వర్గీయులు మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆదివారం వీపీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ట్రై సైకిళ్ల పంపిణీ ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీ వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చూసి ఎమ్మెల్యే వర్గీయులు జీర్ణించుకోలేక పడేయటం చర్చనీయాంశమైంది. -
రాసుకున్నోళ్లకు రాసుకున్నంత!
కందుకూరు రూరల్: కందుకూరులోని టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు చూసి రాత పరీక్షలుగా మారాయి. శనివారం జరిగిన మ్యాథ్స్ 1–బీ పరీక్షకు సంబంధించిన చిట్టీలు, మైక్రో జెరాక్స్‌లు కళాశాల గేటు వద్ద, ప్రహరీ పక్కన కనిపించాయి. పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి చిట్టీలు కనిపిస్తున్నాయి. ఒక సబ్జెక్ట్ చాప్టర్‌నే మైక్రో జిరాక్స్ తీయించి దారం కట్టి తెచ్చారు. ప్రశ్నపత్రం బయటకెళ్లాక మైక్రో జెరాక్స్‌లు వస్తున్నాయనేది అనుమానంగా ఉంది. కళాశాల కిటికీలు, ప్రహరీల పక్కన, గేటు వద్ద మైక్రో జెరాక్స్‌లు ఆ అనుమానాలను ధృవపరుస్తున్నాయి. తనిఖీ అధికారులు ఏం చేస్తున్నట్లు? మ్యాథ్స్, బోటని, జువాలజీ సబ్జెక్ట్‌లకు సంబంధించిన చిట్టీలు ఆ కళాశాల ప్రాంగణంలో బయట పడుతున్నాయి. పరీక్ష కేంద్రంలోకి అనుమతిచ్చే ముందే గేటు వద్ద పోలీసులు, కళాశాల సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంటే.. ఈ చిట్టీలు ఎలా వస్తున్నాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీన్ని బట్టి విద్యార్థులు చిట్టీలతో వెళ్తున్నా పట్టించుకోవడం లేదనుకోవాలి. లేదా పరీక్ష ప్రారంభం అయిన తర్వాత పేపర్ బయటకు వెళ్లి.. ఆన్సర్లు మైక్రో జెరాక్స్‌ల రూపంలో అయినా వస్తుండాలి. పరీక్ష కేంద్రంలో చిట్టీలు పెట్టి రాస్తుంటే పరీక్ష కేంద్రం చీఫ్, డిపార్ట్మెంట్ అధికారి ఏం చేస్తున్నారని మరికొందరు విద్యార్థులు నిల దీస్తున్నారు. దీనిపై ఆర్ఐఓ శ్రీనివాసులను వివరణ కోరగా ఈ పరీక్ష కేంద్రంపై ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయి. సిట్టింగ్ స్క్వాడ్ కూడా ఏర్పాటు చేశాం. రేపటి నుంచి ఇంకా కఠినంగా చర్యలు తీసుకుంటాం. చిట్టీలు జరుగుతున్నాయంటే చర్యలు తప్పక తీసుకుంటాం. ఇంటర్ పరీక్షల ప్రారంభం నుంచి అదే తంతు పరీక్ష కేంద్రం వద్ద కుప్పలు కుప్పలుగా మైక్రో జెరాక్స్ చిట్టీలు మొక్కుబడిగా తనిఖీలు.. చూసీచూడని వైఖరి -
కంటైనర్‌ను ఢీకొనడంతో..
నెల్లూరు(క్రైమ్): జాతీయ రఽహదారిపై కంటైనర్‌కు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి బైక్ ఢీకొంది. ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న కుమారుడు మృతి చెందగా, తల్లి అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల సమాచారం మేరకు.. ముత్తుకూరుకు చెందిన కొండమ్మ, తన కుమారుడు రవికుమార్ బైక్‌పై గూడూరు వైపు శనివారం బయల్దేరారు. సౌత్‌రాజుపాళెం జంక్షన్ వద్దకొచ్చేసరికి ముందు వెళుతన్న కంటైనర్‌కు డ్రైవర్ సడన్‌బ్రేక్ వేశారు. దీంతో బైక్ ఢీకొనడంతో తల్లీకుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108లో జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే రవికుమార్ మృతి చెందారు. కొండమ్మ అపస్మారక స్థితిలో ఉన్నారు. సమాచారం అందుకున్న నార్త్ ట్రాఫిక్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి.. హాస్పిటల్‌కు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి సెల్‌ఫోన్‌ను అన్‌లాక్ చేసి అందులోని నంబర్లకు ఫోన్ చేసి కుటుంబసభ్యులకు సమాచారం అందించామని ఇన్స్పెక్టర్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రభుత్వ తీరుతో పేదల ఇబ్బంది
నెల్లూరు(వీఆర్సీసెంటర్): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అవలబిస్తున్న వైఖరితో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీరి సమస్యల పరిష్కారం కోసం ప్రజా చైతన్యయాత్రలను సాగిస్తున్నామని సీపీఎం జిల్లా, నగర కార్యదర్శులు మూలం రమేష్, కత్తి శ్రీనివాసులు పేర్కొన్నారు. నగరంలోని 53వ డివిజన్ వెంకటేశ్వరపురంలో ప్రజా చైతన్య యాత్రలను శనివారం ప్రారంభించారు. డివిజన్లోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజాసమస్యలను ఆరాతీసి అర్జీలను స్వీకరించారు. అనంతరం వీరు మాట్లాడారు. పెన్నా పక్కనే ఉన్నా, కుళాయిల్లో మంచినీరు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రేషన్ కార్డులు, పింఛన్ల కోసం నిరీక్షిస్తూ.. అధిక విద్యుత్ చార్జీలు చెల్లించలేక ప్రజలు సతమతమవుతున్నారని పేర్కొన్నారు. సర్వే పేరుతో అర్హుల పేర్లను తొలగించి సంక్షేమ పథకాలకు కోత విధించడం తగదన్నారు. సమీక్షల పేరుతో కాలయాపన చేస్తూ, ప్రజా సమస్యలను మంత్రి నారాయణ ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. పార్టీ నగర కార్యదర్శివర్గ సభ్యులు మస్తాన్‌బీ, నాగేశ్వరరావు, నేతలు మూలం ప్రసాద్, గడ్డం శ్రీనివాసులురెడ్డి, షకీలా, కత్తి పద్మ, జాఫర్, బయ్యన్న, నరసింహ తదితరులు పాల్గొన్నారు. -
రిసెప్షన్‌కు వెళ్లొస్తూ అనంతలోకాలకు
నెల్లూరు పరిధిలోని జాతీయ రహదారి శనివారం రక్తసిక్తమైంది. వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాత పడగా, పది మంది గాయపడ్డారు. ఈ ఘటనలు ఆయా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి. – నెల్లూరు(క్రైమ్) నుజ్జునుజ్జయిన ఆటో ● వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురి మృతి ● మృతులు విడవలూరు, ముత్తుకూరు, సూర్యాపేట వాసులు ● పది మందికి గాయాలు విడవలూరు మండలం మన్మథరావుపేటకు చెందిన ఆయోధ్య రామయ్య(55) బంధువులకు అదే ప్రాంతంలో ఇటీవల వివాహమైంది. ఈ క్రమంలో నెల్లూరులోని అంబాపురంలో రిసెప్షన్‌ను శుక్రవారం నిర్వహించారు. దీంతో ఆయోధ్య రామయ్య, తన బంధువులైన కామాక్షినగర్‌కు చెందిన శ్రీరాములు (74), అల్లూరు మండలం యర్రపుగుంటకు చెందిన శ్రీనివాసులు, పద్మ దంపతులు, కుమారుడు మధుసూదన్, విడవలూరు మండలం పటేల్‌నగర్‌కు చెందిన నరసింహులు, రాజేశ్వరి దంపతులు, బంధువు భవానితో కలిసి తన ఆటోలో అంబాపురానికి వెళ్లారు. అనంతరం విడవలూరుకు అర్ధరాత్రి బయల్దేరారు. సుందరయ్య కాలనీ సమీపంలోని మలుపు వద్ద చైన్నె వైపు నుంచి విజయవాడ వెళ్తున్న కారు వేగంగా ఢీకొంది. ఆటో బోల్తాపడటంతో ఆయోధ్య రామయ్య అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన వారు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 సాయంతో నగరంలోని మెడికవర్ హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న సౌత్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీరాములు శనివారం మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మధుసూదన్, నరసింహులును మెరుగైన చికిత్స నిమిత్తం చైన్నె తరలించారు. నగరంలోని జీజీహెచ్‌లో శ్రీనివాసులు, పద్మ, రాజేశ్వరి, భవాని చికిత్స పొందుతున్నారు. మధుఽసూదన్ ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను జీజీహెచ్‌కు తరలించారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నారు. -
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
ముత్తుకూరు: అదానీ కృష్ణపట్నం పోర్టు ప్రభావిత గ్రామాల్లో పేద మహిళలు ఆర్థికంగా ఎదగాలని పోర్టు సీఈఓ జగదీష్ పటేల్ కాంక్షించారు. కృష్ణపట్నంలో శనివారం నిర్వహించిన మహిళా దినోత్సవానికి తన సతీమణి చాందినీ పటేల్‌తో కలిసి హాజరైన ఆయన మాట్లాడారు. గ్రామీణ మహిళలు సంతోషంగా, గర్వంగా జీవనం సాగించాలని, దీనికి అదానీ ఫౌండేషన్ కృషి చేస్తోందని చెప్పారు. అనంతరం సుగంధద్రవ్యాల ప్రాసెసింగ్ – ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటుకు రూ.ఐదు లక్షల చెక్కును మహిళా గ్రూప్ లీడర్‌కు అందజేశారు. జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం సరళ తదితరులు పాల్గొన్నారు. -
కారు అదుపుతప్పి మహిళ దుర్మరణం
● ముగ్గురికి గాయాలు మర్రిపాడు: కారు అదుపుతప్పి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఢీకొనడంతో మహిళ మృతి చెందగా, ముగ్గురు గాయపడిన ఘటన మండలంలోని నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై కండ్రిక సెంటర్ వద్ద శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. ఆత్మకూరు నుంచి మర్రిపాడుకు వెళ్తున్న కారు మార్గమధ్యలో ప్రమాదానికి గురైంది. తీవ్రంగా గాయపడిన పల్లవోలుకు చెందిన సుజాతమ్మ (55)ను మెరుగైన వైద్యం నిమిత్తం నెల్లూరుకు తరలిస్తుండగా వాశిలి సమీపంలో మృతి చెందారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఘటన స్థలాన్ని ఎస్సై శ్రీనివాసరావు, ఎమ్వీఐ రాములు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు. బైక్ ఢీకొని మహిళకు గాయాలు పొదలకూరు: బైక్ ఢీకొనడంతో మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన పట్టణంలోని మనుబోలు రోడ్డు నిమ్మ మార్కెట్ యార్డు వద్ద శనివారం చోటుచేసుకుంది. ఎస్సై హనీఫ్ వివరాల మేరకు.. నిమ్మ మార్కెట్ యార్డులో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన జయంతిశక్తి రోడ్డుపై వెళ్లసాగారు. ఈ క్రమంలో సైదాపురం మండలం దేవరవేమూరుకు చెందిన శంకరయ్య మద్యం మత్తులో బైక్‌ను నడుపుతూ ఆమెను ఢీకొన్నారు. క్షతగాత్రురాలిని 108లో ఆస్పత్రికి తరలించారు. -
రైల్లో వెళ్లాలనుకొని.. ఇన్నోవాలో బయల్దేరి
భగత్‌సింగ్‌కాలనీ జంక్షన్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన అక్కా, తమ్ముడు మృతి చెందగా, వారి తల్లిదండ్రులు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు.. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన మల్లయ్య, నాగమణి దంపతులకు నిషిత (22), కార్తీక్ (20) సంతానం. సూర్యాపేటలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ, కుమార్తెను బీటెక్ ఫైనలియర్, కుమారుడ్ని డిప్లొమా చదివిస్తున్నారు.తన కుటుంబంతో కలిసి తిరుమలకు ఈ నెల ఆరున వెళ్లారు. దర్శనానంతరం తిరిగి తమ ఊరెళ్లేందుకు గానూ తిరుపతికి శుక్రవారం అర్ధరాత్రి చేరుకున్నారు. రైల్వేస్టేషన్‌కు బయల్దేరగా, మార్గమధ్యలో ఇన్నోవా డ్రైవర్ తాను విజయవాడ వెళ్తున్నానని చెప్పారు. దీంతో వీరు అందులో బయల్దేరారు. భగత్‌సింగ్ కాలనీ జంక్షన్ వద్దకొచ్చేసరికి డ్రైవర్ నిద్రమత్తులో డివైడర్‌ను ఢీకొని, ఆపై చైన్నె వైపు వెళ్లే జాతీయరహదారిపై గుర్తుతెలియని లారీని ఢీకొన్నారు.ఘటనలో నిషిత, కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందగా, తల్లిదండ్రులు, డ్రైవర్ శివరామకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 సాయంతో మెడికవర్ హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న నార్త్ ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఎస్సై బలరామిరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నదాతలకు శాపం
ఇసుకకు తాపత్రయం.. ● సంగం బ్యారేజీలో డ్రెడ్జింగ్‌కు నీరు నిల్వ ● బీరాపేరు నీటితో వందెకరాల్లో మునిగిన వరి ● ఆందోళనలో అన్నదాతలు సంగం: ఇసుకాసురుల తాపత్రయం అన్నదాతలకు శాపంగా పరిణమిస్తోంది. సంగం బ్యారేజీ దిగువ భాగంలో ఇసుక డ్రెడ్జింగ్ కోసం ఎగువ భాగంలో నీటిని అలానే నిల్వ ఉంచుతున్నారు. ఈ క్రమంలో ఇది సమీపంలోని బీరాపేరులోకి చేరి చెంతనే ఉన్న పొలాలను ముంచెత్తుతోంది. ఈ పరిణామంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. రైతులకు నరకం అన్నదాతలకు ప్రత్యక్ష నరకాన్ని కూటమి ప్రభుత్వం చూపుతోంది. సంగం సమీపంలోని బీరాపేరు వద్ద వందెకరాలకుపైగా సాగు భూములున్నాయి. ఇందులో రైతులు బీపీటీ రకం వరిని పండిస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో వీరి పంటలు పాడైపోయేలా ఉన్నాయి. పెన్నాలో పడవతో ఇసుక డ్రెడ్జింగ్‌కు సంగంతో పాటు పొదలకూరు మండలంలోని సూరాయపాళేన్ని ఎంచుకోవడం ఇక్కడి రైతులకు ఇబ్బందిగా మారింది. ఇక్కడ పడవల ద్వారా ఇసుకను సేకరించాలంటే సంగం బ్యారేజీ వద్ద 13.2 అడుగుల మేర నీటిమట్టాన్ని ఉంచాలి. ఆ మేరకు నీటిమట్టాన్ని ఉంచడంతో బీరాపేరు వాగులోకి నీరు అధికంగా చేరి పక్కనే ఉన్న రైతుల పొలాల్లోకి చేరుతోంది. దీంతో ఇప్పటికే కోత దశకొచ్చిన వందెకరాలకు పైగా వరి పంట దెబ్బతింటోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఆశయం ఉంటే ఏదైనా సాధ్యమే
వింజమూరు(ఉదయగిరి): ఆశయం ఉంటే.. ఏదైనా సాధించడం కష్టం కాదు. చిన్న తనం నుంచి క్రీడలంటే ఎంతో ప్రేమ. ఆ మక్కువే తనను వ్యాయామ ఉపాధ్యాయ వృత్తి వైపు నడిపించింది. 2009లో పీఈటీగా ఉద్యోగం పొంది కాటేపల్లి, వింజమూరు ఉన్నత పాఠశాలల్లో పని చేస్తూ మాస్టర్ అథ్లెటిక్స్ వెటరన్ పోటీల్లో జాతీయ స్థాయిలో ఎన్నో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించాను. 2019లో ఇంటర్ నేషనల్ స్థాయి (సింగపూర్) ఆటలో పాల్గొనే అవకాశం వచ్చినా, ఆర్థిక ఇబ్బందులతో వెళ్లలేకపోయాను. 2019 నుంచి 2024 వరకు వరసగా వెటరన్ (35–40 ఇయర్స్ ఏజ్ గ్రూపు విభాగం)లో పతకాలు సాధిస్తున్నారు. ఇటీవల కాకినాడలో రాష్ట్ర స్థాయిలో పీడీలకు జరిగిన పోటీల్లో లాంగ్‌జంప్, వాకింగ్, 100 మీ. పరుగు పందెంలో గోల్డ్ మెడల్స్ సాధించాను. – గంగమాల విలాసిని, వింజమూరు బాలికల హైస్కూల్ పీడీ -
విద్యతోనే సాధికారిత
నెల్లూరు(క్రైమ్): విద్యే మహిళా సాధికారతకు బాటలు వేస్తుంది. వైఎస్సార్ జిల్లా మైదుకూరుకు చెందిన విశ్రాంత ఆర్టీసీ డ్రైవర్ ఖలీల్‌బాషా, ఖాజాబీ దంపతుల కుమార్తెను. డిగ్రీ వరకు మైదుకూరులో చదువుకుని, తిరుపతిలో ఎంబీఏ పూర్తి చేశాను. నా తల్లిదండ్రుల కుటుంబాల్లో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కష్టపడి చదివాను. 2018లో గ్రూప్–1లో రాణించి ఎకై ్సజ్ శాఖలో ఏఈఎస్‌గా బాధ్యతలు చేపట్టాను. ఏలూరులో బాధ్యతలు చేపట్టిన అనంతరం అంచెలంచెలుగా పదోన్నతి పొంది ప్రస్తుతం నెల్లూరు ఐఎంఎల్ డిపోలో విధులు నిర్వహిస్తున్నాను. విద్యతోనే ఉన్నతి లభిస్తుంది. అక్షరాస్యత ఎక్కువగా ఉన్న చోట మహిళలు అన్ని రంగాల్లో చురుకై న పాత్ర పోషిస్తున్నారు. – ఆయేషాబేగం, ఐఎంఎల్ డిపో మేనేజర్ -
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బంది పెడితే క్రిమినల్ కేసులు
నెల్లూరు (అర్బన్): ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెడితే మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ కార్తీక్‌తో కలిసి కలెక్టర్ ధాన్యం కొనుగోళ్ల విషయంపై మాట్లాడారు. జిల్లాలో అన్ని రకాల ధాన్యాలు కలిపి 11 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా ఉందన్నారు. ఇందులో ప్రధానంగా 5 లక్షల మెట్రిక్ టన్నులు బీపీటీ రకం దిగుబడి వస్తుందని లెక్కలు వేశామన్నారు. కనీసం 50 శాతం ధాన్యాన్ని రానున్న రెండు వారాల్లో కొనుగోలు చేస్తామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కన్నా బయట ధర ఉంటే రైతులు అమ్ముకోవచ్చన్నారు. ఎంఎస్పీ కన్నా తక్కువ ధరకు మిల్లర్లు కొనుగోలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. తేమ శాతం కొంచెం అటూ, ఇటూ ఉన్నా మిల్లర్లు కొనాల్సిందేనన్నారు. మిల్లర్లతో సమావేశాన్ని నిర్వహించి సూచనలు చేశామన్నారు. రైతులు, వ్యాపారులు నష్టపోకూడదనే ఉద్దేశంతో 105 రైసుమిల్లుల వద్ద ప్రభుత్వ అధికారులను అందుబాటులో ఉంచామన్నారు. ఇప్పటికే మిల్లర్లు రూ.20 కోట్లు బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చారని, రాబోయే నాలుగైదు రోజుల్లో మరో రూ.40 కోట్లకు బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే లక్ష గన్నీ బ్యాగులు సిద్ధం చేశామన్నారు. మరో 3 రోజుల్లో పూర్తిస్థాయిలో గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచుతామన్నారు. ఒక వేళ రైతులే గన్నీ బ్యాగులు, హమాలీలు, రవాణా సమకూర్చుకుంటే అందుకు సంబంధించిన నగదును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. గతంలో మాదిరిగా కాకుండా ధాన్యం సేకరించిన 24 నుంచి 48 గంటల్లోపు నగదును రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. నెల్లూరు బీపీటీ ధాన్యానికి మంచి నాణ్యత ఉందన్నారు. అందువల్ల మిల్లర్లు ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ రూపంలో బియ్యంగా సేకరించనున్నామన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన పడాల్సిన పని లేదన్నారు. ధాన్యం కొనాలంటే ముందుగా రైతులు వీఏఏను కలిసి తాము ఎప్పుడు వరి కోతలను ప్రారంభిస్తామో షెడ్యూల్ రిజిస్టర్ చేయించుకోవాలన్నారు. ఈ ఒక్క పని చేస్తే ఇక అప్పటి నుంచి అధికారులు ధాన్యం సేకరణ నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమయ్యే వరకు పర్యవేక్షణ చేస్తారన్నారు. రైతు లు ధాన్యాన్ని అమ్ముకోకుండా నిల్వ ఉంచుకోవాలనుకుంటే ఎంపీఎఫ్సీ, ఏపీఎంఎస్ ద్వారా గోడౌన్లను అందుబాటులోకి తెస్తామన్నారు. జేసీ కార్తీక్ మాట్లాడుతూ రైతులకు అండగా ఉంటామని తెలిపారు. కనీస మద్దతు ధరకు కొనాల్సిందే 24 నుంచి 48 గంటల్లోపు రైతుల ఖాతాల్లో నగదు జమ కలెక్టర్ ఆనంద్ -
నేడు మహిళా దినోత్సవం
లక్ష్యం దిశగా శ్రమించాలి నెల్లూరు(క్రైమ్): యువతకు లక్ష్యం ఉండాలి. పట్టుదలతో పాటు సరైన ప్రణాళికతో కృషి చేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. మా ఊరు తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా వీరారెడ్డిపల్లి. తండ్రి పి.లింగారెడ్డి ఉపాధ్యాయుడు కాగా, తల్లి వనజాక్షి గృహిణి. బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఏడాది పాటు సివిల్ ఇంజినీర్‌గా పనిచేశాను. సివిల్స్, ఏపీపీఎస్పీ పరీక్షలు రాసి ఉన్నత ఉద్యోగం సాధించాలని ఉస్మానియా లో ఎంఏ సోషియాలజీ పూర్తి చేశాను. 2018లో సీ్త్ర,శిశు సంక్షేమశాఖలో సీడీపీఓగా సూర్యాపేట లో బాధ్యతలు చేపట్టాను. మహిళా కమిషన్‌లో విధులు నిర్వహిస్తుండగా 2022లో ఏపీఎస్పీ రాసి డీఎస్పీగా ఎంపికయ్యాను. – పి. సింధుప్రియ, నగర డీఎస్పీ -
కుటుంబ విలువలను కాపాడదాం
నెల్లూరు (పొగతోట): నేటి సమాజంలో కుటుంబ విలువలను కోల్పోతున్నాం. కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇచ్చేలా అందరూ ప్రత్యేక శ్రద్ధ చూపాలి. డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి నెల్లూరులో ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించారు. వివిధ మండలాల్లో ఎంపీడీఓగా పనిచేశారు. దివ్యాంగుల శాఖ ఏడీగా జిల్లాలో విధులు నిర్వహించారు. అనంతరం పదోన్నతి పొందారు. ప్రస్తుతం డీఆర్డీఏ పీడీగా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. మహిళలు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణిస్తూ ఆరోగ్యం, కుటుంబ విషయాలపై ప్రత్యేక సమయం కేటాయించాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో బిజీగా ఉన్నా పిల్లల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాలి. – నాగరాజకుమారి, డీఆర్డీఏ పీడీ -
జనని.. జగజ్జేత
ఆకాశమే హద్దుగా అవకాశాలను అందిపుచ్చుకుని ఆమె జగజ్జేతగా ఎదుగుతోంది. అమ్మగా, అక్కగా, చెల్లిగా, ఆలిగా కుటుంబ బాధ్యతల్లో మునిగి తేలుతున్న ఆమె ఉద్యోగినిగా, ప్రజాప్రతినిధిగా దక్షత చూపుతోంది. మదుపరులుగా సామాన్య మహిళలు కుటుంబసభ్యుల సహకారం, ప్రోత్సాహంతో చిరు వ్యాపారాల్లో, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తలుగా ఆర్థిక సాధికారత వైపు అడుగులు వేస్తున్నారు. అసామాన్య ప్రతిభతో అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇంటిని చక్కదిద్దిన చేతులతో నవసమాజాన్ని తీర్చిదిద్దుతున్నారు. జగతికి వెలుగులు పంచుతున్న అమృతమూర్తులు జగజ్జేతలు. ట్రాక్టర్ నడుపుతున్న సర్పంచ్ వెంకటసుబ్బమ్మ కాకినాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకం అందుకున్న విలాసిని (ఫైల్) మొక్కుబడిగా పనులు.. రూ.లక్షల్లో నిధుల స్వాహా ● మౌనం పాటిస్తున్న ఉన్నతాధికారులు ● వరికుంటపాడు ఫారెస్టు బీట్‌లో అంతులేని అవినీతి ఉదయగిరి: అటవీ శాఖ వరికుంటపాడు బీట్ పరిధిలో కొత్తపేటలో క్యాంపా పథకం పేరుతో అటవీశాఖలో దోపిడీ పర్వానికి తెరతీశారు. గతేడాది ఈ ఏరియాలో సుమారు 116 హెక్టార్లలో తెల్లమద్ది, వేప, మర్రి, రాగి, నేరేడు, ఎర్రచందనం మొక్కలు నాటారు. ఇక్కడ నుంచే అవినీతికి శ్రీకారం చుట్టారు. ఈ మొత్తం భూమి కొనుగోలు చేసి అటవీ శాఖకు ఇచ్చారు. అప్పటికే ఈ భూమిలో జామాయిల్ మోడు ఉంది. ఈ ల్యాండ్ అభివృద్ధి పేరుతో అధికారులు సుమారు రూ.20 లక్షలు నిధులు స్వాహా చేశారనే అరోపణలు ఉన్నాయి. ఈ మోటు కర్ర మొత్తం రూ.20 లక్షలకు అమ్ముకున్నారు. అంటే అభివృద్ధి పేరుతో నిధులు కాజేయడంతో పాటు ఉన్న మోడు అమ్మకం ద్వారా పెద్ద మొత్తంలో జేబుల్లో వేసుకున్నారు. వరికుంటపాడు, దుత్తలూరు మండలాల సరిహద్దు ప్రాంతం కొత్తపేట ఏరియాలో 116 హెక్టార్ల ప్రభుత్వ భూమిలో ప్రత్యామ్నాయ వనీకరణ పథకానికి సుమారు రూ.కోటి నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉదయగిరి అటవీ అధికారులు ప్రారంభించారు. ఈ పనులు కనియంపాడు వన సంరక్షణ సమితి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరగాలి. కానీ వారిని డమ్మీ చేసి పనులు మొత్తం ఉదయగిరి ప్రాంతం నుంచి కూలీలను తీసుకొచ్చి పనులు చేయించారు. రికార్డుల్లో మాత్రం కనియంపాడు వీఎస్ఎస్ సభ్యులు పేర్లు నమోదు చేశారు. ఈ వ్యవహారం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి స్థానిక నేతలు తీసుకెళ్లారు. దీంతో ఆయన స్థానిక నేతలకు వీఎస్ఎస్ సభ్యులకు, అటవీ అధికారులకు రాజీ కుదిర్చి కొంత మొత్తం పంచుకున్నట్లు సమాచారం. పనుల్లో మాయ.. దోపిడీ అధికమాయె మొక్క నాటే సమయంలో నిబంధనలు పాటించలేదు. ఈ భూమి మొత్తం ఇసుక తెర తేలిక నేల అయినప్పటికీ కొంత మేర గట్టి నేలగా చూపించి అధిక రేట్లతో ఎంబుక్ రికార్డు చేసి నిధులు కాజేశారు. మొక్క నాటేందుకు 30 సెం.మీ. లోతు, వెడల్పుతో గుంతలు తీయాల్సి ఉన్నా.. ౖపైపెనే గుంతలు తీసి నాటారు. దీంతో మొక్కలు ఏపుగా పెరిగే అవకాశం ఉండదు. ఎండబెట్టకు మొక్క చనిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం చాలా మొక్కలు ఎండిపోయి ఉన్నాయి. మొక్కలు నాటేటప్పడు రసాయనిక ఎరువులు (డీఏపీ, యూరియా, ఫాస్పరస్) గుంతల్లో వేసి మట్టి కప్పివేయాలి. కానీ ఎరువులు వేయ లేదు. అన్నీ వేసినట్లుగా ఎంబుక్‌ల్లో నమోదు చేసుకుని పెద్ద మొత్తంలో నిధులు స్వాహా చేశారు. అంతర సేద్యంలో అదే తంతు ఈ ఏడాది మొక్కల్లో అంతర సేద్యం మమ అనిపించారు. అరకొరగా చేసి.. మొత్తం భూమిలో సేద్యం చేసినట్లు నిధులు డ్రా చేశారు. మొక్కలు దగ్గర 30 సెం.మీ. మేర కూలీలతో అంతర కృషి చేయాలి. కానీ అది కూడా తూతూ మంత్రంగా చేసి నిధులు కాజేశారు. ఈ భూమిలో 3 బీట్లు ఉండగా ఒక్కొక్క బీట్‌కు ముగ్గురు చొప్పున కాపలాదార్లను పెట్టినట్లు రికార్డు చేసి నెలకు ఒక్కొక్కరి పేరుతో రూ.13 వేలు డ్రా చేస్తున్నారు. కానీ అక్కడ మొత్తం ముగ్గురు మాత్రమే కాపలా ఉన్నారు. వారికి నెలకు రూ.6 వేలు మాత్రమే ఇస్తున్నారు. రెండో ఏడాది మొక్కలకు ఎరువులు కూడా వేయకుండానే వేసినట్లు రికార్డు చేసి నిధులు కాజేశారు. అనేక విధాలుగా పెద్ద మొత్తంలో ప్రజాధనం అటవీ అధికారులు, సిబ్బంది దిగమింగేశారు. దిగువ స్థాయి నుంచి పైస్థాయి వరకు ఎవరి కమీషన్ వారు తీసుకొని గుమ్మనంగా అవినీతిని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కమీషన్లతో ముఖం చాటవేత ఈ అవినీతి మొత్తం బయటకు రావాలంటే విజిలెన్స్, సీఐడీ సమగ్రంగా దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అందులో జరిగిన అవినీతి బయట పడుతుంది. ఈ అవినీతి వ్యవహారంలో కొంత మంది అధికారులు పాత్ర ఉండడం, పైగా ఈ పనులకు సంబంధించి ఎఫ్బీఓ నుంచి జిల్లా స్థాయి అధికారులకు వరకు కమీషన్లు ఇస్తుండడంతో పత్రికల్లో, మీడియాలో కథనాలు వస్తున్నా.. స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పది పూర్తి కాగానే వివాహం – జెడ్పీ సీఈఓ విద్యారమ నెల్లూరు (పొగతోట): విద్యారమ చిత్తూరులో పెరిగారు. పదో తరగతి పూర్తికాగానే వివాహం అయింది. అనంతరం భర్త ప్రోత్సాహంతో ఎస్వీ యూనివర్సిటీలో పీజీ వరకు చదివారు. 2000 సంవత్సరంలో ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీఓగా చిత్తూరులో దీర్ఘకాలం పని చేశారు. అనంతరం పదోన్నతిపై శ్రీకాళహస్తి డీఎల్పీఓగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ సీఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఉన్నత శిఖరాలను అధిరోహించగలిగారు. లక్ష్యాల వైపు అడుగులు వేసి.. – గంగాభవాని, డ్వామా పీడీ నెల్లూరు (పొగతోట): మహిళలు స్వయంసమృద్ధి సాధించాలంటే లక్ష్యాల వైపు అడుగులు వేయాల్సి ఉంది. కోనసీమ జిల్లాకు చెందిన గంగాభవానీ విద్యాభ్యాసం స్థాయి నుంచే తన లక్ష్యం వైపు అడుగులు వేశారు. అక్కడే విద్యను పూర్తిచేశారు. 2000 సంవత్సరంలో ఈఓపీఆర్డీగా ఉద్యోగంలో చేరిన ఆమె అనంతరం అంచెలంచెలుగా ఎంపీడీఓగా, డీఎల్పీఓగా చిత్తూరు జిల్లాలో విధులు నిర్వహించారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా డ్వామా పీడీగా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. అన్ని రంగాల్లో ముందుండాలంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయాల్లో సరైన భాగస్వామ్యం కల్పించాలి. సమాజంలో మహిళను బలపరిస్తే ఆమె కుటుంబాన్ని బలపరుస్తుంది. కుటుంబం బలంగా ఉంటే సమాజం అభివృద్ధి చెందుతుంది. అప్పుడే సమాజం ఆనందంగా ముందుకు సాగుతుందని ఆమె అంటారు. ఆమెది బహుముఖ పాత్ర పొదలకూరు: ఇంటినే కాదు.. ఊరిని పరిశుభ్రంగా ఉంచడంలో ఆమెకు ఆమె సాటి. ఇంట్లో పాడి గేదెల పోషణ, సేద్యం పనుల నుంచి పంచాయతీ పాలన వరకు ఆమె ఒంటి చేత్తో చేస్తోంది. పురుషులతో మహిళలు ఏమాత్రం తీసిపోరని మండలంలోని పులికల్లు సర్పంచ్ గొడ్డేటి వెంకటసుబ్బమ్మ నిరూపిస్తోంది. సర్పంచ్‌కు వ్యవసాయంపై మక్కువ ఎక్కువ. ఆమె స్వయంగా ట్రాక్టర్ నడుపుతోంది. పొలం దుక్కి దున్నకం పనులు, తన నిమ్మతోటలో చెట్లకు స్ప్రేయర్‌తో పిచికారీ చేయడంతోపాటు అన్ని రకాల వ్యవసాయ పనులను చేయడంతోపాటు, పాడి గేదెల ఆలనా పాలనా చూసుకుంటారు. పొదుపు సంఘంలో సభ్యురాలిగా కొనసాగుతూ మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు. పంచాయతీ పాలన విషయానికి వస్తే గ్రీన్ అంబాసిడర్లను నియమించి చెత్త నుంచి సంపద కేంద్రానికి ప్రతినిత్యం ఊర్లో చెత్తను సేకరించి తరలిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు. లక్ష్యానికి వివాహం ఆటంకం కాదు – హిందీ పండిత్ నాగేశ్వరి నెల్లూరు సిటీ: పెళ్లి తర్వాత జీవితం ఇంతటితో అయిపోయిందని చాలా మంది మహిళలు నిరుత్సాహానికి గురవుతారు. నా జీవిత ప్రయాణం వివాహం తర్వాతనే సార్థకమైంది. నెల్లూరు నగరంలోని మూడో మైలుకు చెందిన నాగేశ్వరికి ఇంటర్ పూర్తి కాగానే 1993లో పెద్దలు వివాహం చేశారు. ఈ క్రమంలో భర్త శ్రీహరిబాబు ప్రోత్సాహంతో వివాహమైన 8 ఏళ్లకు డిగ్రీ పూర్తి చేసింది. హెచ్‌పీటీ, ఎంఏ హిందీ, ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేసింది. 2008లో హిందీ పండిట్ గా ఉద్యోగం సాధించింది. మూడేళ్లలోనే ఎస్‌ఏగా పదోన్నతి పొందారు. ఆత్మస్థైర్యంతో ముందుకు – సబ్‌కలెక్టర్ తిరుమాణి శ్రీపూజ కందుకూరు: ఎంచుకున్న రంగంలో రాణించేందుకు మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. ప్రస్తుత సమా జ తీరును బట్టి మహిళలు ఇంటికే పరిమితం కాకూడదు. ఇంట్లో ఉండే మహిళలైనా సరే ఏదో ఒక రంగంలో రాణించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తే విజయం సాధించడం చాలా సులభం. స్వయం ఉపాధిని పొందేందుకు చేతి వృత్తులు వంటివి నేర్చుకుని కుటుంబానికి అండగా నిలబడవచ్చు. మహిళల్లో కూడా తాము సాధించగలం అనే నమ్మకం పెరుగుతుంది. పెళ్లికాగానే అంతా అయిపో యిందనే భావన నుంచి మహిళలు బయటకు వచ్చి స్వతంత్రంగా రాణించేందుకు ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ప్రతి తల్లిదండ్రులు కూడా చదువుకునే విషయం దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ ఆడపిల్లలను మగ పిల్లలతో సమా నంగా చూడాల్సిన అవసరం ఉంది. మొక్కల మాటున మేత ఉదయగిరి ఫారెస్టు రేంజ్ పరిధిలోని కృష్ణంపల్లి సెక్షన్ వరికుంటపాడు బీట్ పరిధిలో కొత్తపేటలో జరుగుతున్న అటవీ ప్రత్యామ్నాయ వనీకరణ (సీఏ) పథకం పనుల్లో అంతులేని అవినీతి చోటు చేసుకుంటోంది. భూమికి భూమి పరిహారంగా కొనుగోలు చేసిన ప్రక్రియ నుంచి భూమి అభివృద్ధి, మోడు కర్ర తొలగించడం, గుంత తీయడం, మొక్కలు నాటడం, ఎరువులు వేయడం వరకు అడుగడుగునా నిధులను క్షేత్రస్థాయిలో దోచుకున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో నాటిన మొక్కలు కూడా ఎండిపోతున్నాయి. -
చదువుతోనే మహిళల అభివృద్ధి
ఆత్మకూరు: చదువుతోనే మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యం. గతంలో చదువుకు మహిళలకు ఎన్నో ఆటంకాలు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మహిళలు ఆడ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలి. అందుకు పూర్తి మద్దతు ఇవ్వాలి. మాది వైఎస్సార్ జిల్లాలోని మైదుకూరు సమీపంలోని పల్లె. తండ్రి గంగయ్య రైతు. తల్లి లక్ష్మీ గృహిణి. చదువులో తనను బాగా ప్రోత్సహించారు. కడపలోని వాగ్ధేవి ఇంజినీరింగ్ కళాశాలలో మెరిట్ మార్కులతో ఉత్తీర్ణురాలైనప్పటికీ ఆసక్తి ఉన్న సివిల్స్‌కు సాధన చేసి మూడో సారి రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించాను. తిరుపతిలో శిక్షణ అనంతరం తొలిసారి ఆర్డీఓగా ఆత్మకూరులో విధులు నిర్వహిస్తున్నాను. తల్లిదండ్రుల ప్రోత్సాహం, చదువుపై ఆసక్తే ఈ స్థాయికి తెచ్చింది. – భూమిరెడ్డి పావని, ఆర్డీఓ, ఆత్మకూరు -
సీఎం ఆఫీస్ నుంచి వచ్చామంటూ..
నెల్లూరు(క్రైమ్): మీ పిల్లలు మలేసియాలో చిక్కుకుపోయారని తెలిసి సీఎం కార్యాలయం నుంచి వచ్చానని దంపతులను ఓ వ్యక్తి నమ్మించాడు. పిల్లలను స్వదేశానికి తీసుకొస్తానని రూ.50 వేలు తీసుకుని ఉడాయించిన ఘటనపై నెల్లూరు చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. తెగచర్ల గ్రామానికి చెందిన జయమ్మ, పెద్దయ్య దంపతులు ప్రస్తుతం హరనాథపురంలో ఉంటున్నారు. వారి కుమారుడు సింహాద్రి ఇంటర్మీడియట్ వరకు చదివాడు. మలేసియాలోని హోటల్లో పనిచేస్తే ఎక్కువ డబ్బులొస్తాయని ఓ ఏజెంట్ సింహాద్రిని, అతని తల్లిదండ్రులను నమ్మించాడు. దీంతో వారు రూ.50 వేలు అతడికి ఇచ్చారు. సింహాద్రితోపాటు అతని పెదనాన్న కుమారుడు పవన్‌ను గతేడాది జూన్‌లో మలేసియాకు పంపారు. ఏజెంట్ వర్క్ పర్మిట్ అని వారిని నమ్మించి టూరిస్ట్ వీసా ఇవ్వడంతో ఇటీవల సింహాద్రి, పవన్‌ను మలేసియా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని స్వదేశానికి రప్పించాలంటూ ఇటీవల పెద్దయ్య, జయమ్మ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం గుర్తుతెలియని వ్యక్తి తాను సీఎం కార్యాలయం నుంచి వచ్చానని జయమ్మ, పెద్దయ్యను కలిశాడు. మీ గ్రామంలో మీ పిల్లల గురించి ఆరాతీయగా వారిపై ఎలాంటి కేసులు లేవని తేలిందన్నాడు. కలెక్టర్ కార్యాలయానికి తీసుకెళ్లాడు. కలెక్టర్‌తో మాట్లాడి వస్తానని వారిని బయట కూర్చోబెట్టి లోపలికి వెళ్లాడు. కొద్దిసేపటి అనంతరం బయటకు వచ్చినతను అంతా మాట్లాడానని సింహాద్రి, పవన్‌లను తీసుకొచ్చేందుకు విమాన టికెట్లు, ఇతర ఖర్చులు రూ.60 వేల వరకు అవుతాయని చెప్పాడు. తాము అంత ఇవ్వలేమని బాధిత తల్లిదండ్రులు చెప్పగా చివరగా రూ.50 వేలు తీసుకుని ఇప్పుడే వస్తానని వెళ్లిపోయాడు. అలా వెళ్లిన వాడు ఎంతకీ రాకపోవడంతో పెద్దయ్య అతడికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. మోసపోయామని గ్రహించిన పెద్దయ్య, జయమ్మలు శుక్రవారం చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.● దంపతులను మోసం చేసిన వ్యక్తి ● రూ.50 వేలతో ఉడాయించిన వైనం -
రైస్‌మిల్లు యజమానిపై కేసు నమోదు
నెల్లూరు(క్రైమ్): ధాన్యం తాలూకా నగదు ఇవ్వకుండా రైతును మోసగించిన రైస్‌మిల్లు యజమానిపై నెల్లూరు నవాబుపేట పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. ఆత్మకూరు పట్టణం పంటవీధికి చెందిన పి.పవన్‌కుమార్‌రెడ్డి నెల్లూరు నగరంలోని యనమలపాళెంలో ఉన్న శ్రీసాయిబాబా రా అండ్ బాయిల్డ్ రైస్‌మిల్లు యజమాని శేఖర్‌బాబుకు రూ.8.31 లక్షల విలువైన ధాన్యం తోలాడు. శేఖర్‌బాబు దీనికి సంబంధించిన నగదు ఇవ్వకుండా మోసం చేసి పరారయ్యాడు. బాధితుడు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ అన్వర్‌బాషా తెలిపారు. జెడ్పీ సర్వసభ్య సమావేశం నేడునెల్లూరు(పొగతోట): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన శనివారం నెల్లూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుంది. దీనికి రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పి.నారాయణ, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. గ్రామీణ నీటి సరఫరా, అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించనున్నారు. జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని సీఈఓ విద్యారమ శుక్రవారం కోరారు. నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.70 సన్నవి : రూ.50 పండ్లు : రూ.35 పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు బ్రాయిలర్ (లైవ్) : 92 లేయర్ (లైవ్) : 90 బ్రాయిలర్ చికెన్ : 170 బ్రాయిలర్ స్కిన్లెస్ : 190 లేయర్ చికెన్ : 153 -
ధరలు పెంచాలంటూ..
కందుకూరు: పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్ పరిధిలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మొత్తం 11 వేలం కేంద్రాలున్నాయి. ఈనెల 10వ తేదీ నుంచి కందుకూరు – 1వ కేంద్రంతోపాటు ఒంగోలు –1, కొండపి, పొదిలి కేంద్రాల్లో వేలం ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. మిగిలిన కందుకూరు – 2, కలిగిరి, డీసీపల్లితోపాటు ఒంగోలు – 2, టంగుటూరు, వెల్లంపల్లి, కనిగిరి వేలం కేంద్రాల్లో 19వ తేదీ నుంచి మొదలవుతుంది. 2025 – 26 సీజన్‌కు సంబంధించి 11 కేంద్రాల పరిధిలో 105.27 మిలియన్ కేజీల పొగాకును అధికారికంగా అమ్ముకునేందుకు బోర్డు అనుమతి ఉంది. అయితే ప్రస్తుతం సాగు విస్తీర్ణం, వస్తున్న ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని 162 మిలియన్ కేజీల వరకు ఈ సీజన్లో అమ్మకాలు ఉండొచ్చని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న పొగాకు వేలం అక్కడి రైతులకు కొంత ఆశాజనకంగానే ఉందని అధికారులు చెబుతున్నారు. బ్రైట్ గ్రేడ్ కేజీ పొగాకు ధర రూ.337 వరకు పలుకుతోంది. మొత్తంగా కేజీ సరాసరి ధర చూస్తే రూ.268.25 వరకు ఉంది. అయితే ఆంధ్రాలో పెరిగిన సాగు ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ధరలు పెంచాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు. ఈ ఏడాది పొగాకు నాణ్యత ఆశాజనకంగా ఉండటం రైతులకు ఊరటనిచ్చే అంశంగా మారింది. మొత్తం ఉత్పత్తుల్లో 50 శాతానికి పైగా మొదటి రకం అంటే బ్రైట్ గ్రేడ్ వచ్చాయని బోర్డు అధికారులు చెబుతున్నారు. మిగిలిన గ్రేడ్లు కూడా ఆశించిన స్థాయిలో నాణ్యతగా ఉన్నాయంటన్నారు. ఇది వేలంలో రైతులకు సానుకూలాంశంగా మారనుంది. అయితే గ్రేడింగ్ విధానంలో వారు సరైన జాగ్రత్తలు పాటించి బేళ్లు కట్టాలని అధికారులు సూచిస్తున్నారు.మరికొద్దిరోజుల్లో పొగాకు వేలం ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. రెండేళ్లుగా ధరలు ఆశాజనకంగా ఉండి రైతులకు లాభాలొచ్చాయి. ఈ ఏడాది మార్కెట్ ఎలా ఉంటుందోనని ఎదురు చూస్తున్నారు. సాగు ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో వేలంలో దక్కే ధరలపై ఆశలు పెట్టుకున్నారు. గతేడాది కంటే ధరలు పెంచితేనే లాభాలు వస్తాయని లేకుంటే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అటు బోర్డు అధికారులతోపాటు, ఇటు రైతులు అభిప్రాయపడుతున్నారు. రెండు సంవత్సరాలుగా పొగాకు మార్కెట్ రైతులకు లాభాల పంట పండించింది. దీంతో ఈ ఏడాది అనేకమంది సాగుపై అధికంగా మొగ్గు చూపారు. బోర్డు పరిమితికి మించి భారీగా పంట వేశారు. రైతులు సాగులో పోటీ పడటంతో పొలాలు, బ్యారెన్ల కౌలు ధరలు అమాంతం పెరిగిపోయాయి. గతేడాది రూ.లక్ష ఉన్న బ్యారెన్ కౌలు ఈసారి రూ.2.50 లక్షల వరకు పెరిగింది. పొలం కౌలు, కూలీల రేట్లన్నీ రెట్టింపయ్యాయి. ఈ పరిస్థితుల్లో గతేడాది కంటే బ్యారెన్‌కు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అదనంగా ఖర్చయ్యిందని స్వయంగా బోర్డు అధికారులే లెక్కలు వేస్తున్నారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వేలంలో ధరలు కూడా పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేజీ పొగాకుకు సరాసరి ధరను రూ.300కు తగ్గకుండా ఇవ్వాలని కోరుతున్నారు. అయితే గతేడాది వేలం ముగిసే సమయానికి కేజీ సరాసరి ధర రూ.254 మాత్రమే ఉంది. కానీ రైతులు ఆశించిన స్థాయిలో ఈ సంవత్సరం మార్కెట్ ఉంటుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈనెల 10వ తేదీ నుంచి పొగాకు వేలం ప్రారంభం ధరలపై ఆశలు పెట్టుకున్న రైతులు గతేడాదితో పోల్చుకుంటే భారీగా పెరిగిన సాగు ఖర్చులు సరాసరిన కిలోకు రూ.300 ఇవ్వాలని రైతుల డిమాండ్ 162 మిలియన్ కేజీల వరకు ఉత్పత్తులు రావొచ్చని అంచనా -
ప్రసన్నుడి బ్రహ్మోత్సవాలకు వేళాయె..
● 9 నుంచి 15వ తేదీ వరకు.. బిట్రగుంట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండబిట్రగుంట బిలకూట క్షేత్రంలో ఆదివారం నుంచి 15వ తేదీ వరకూ ప్రసన్నుని వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. భక్తుల పాలిట ప్రసన్నుడిగా, ఆపద మొక్కులవాడిగా పేరొందిన స్వామిని దర్శించి, తరించేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ప్రధాన ఘట్టాలైన గరుడ సేవ, మొక్కుబడులు, కల్యాణోత్సవం రోజుల్లో బిలకూట క్షేత్రం భక్తజన సంద్రంగా మారుతుంది. బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. భక్తుల కోసం చలువ పందిళ్లు, చలివేంద్రాలు సిద్ధమవుతున్నాయి. స్వామివారి విద్యుత్ కటౌట్లను పెడుతున్నారు. భక్తుల రాకపోకలకు అనుగుణంగా రవాణా సౌకర్యాలు మెరుగుపరిచారు. భక్తుల భద్రత, పారిశుద్ధ్యం, వైద్య సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అంతరాలయంలో ప్రత్యేకంగా ఏసీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా.. 9వ తేదీన గిరి ప్రదక్షిణ, అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 10న తిరుమంజనం, ధ్వజారోహణ (కొడిముద్దలు), శేషవాహన సేవ, 11న హనుమంతసేవ, 12న ఉదయం మోహినీ ఉత్సవం, రాత్రికి గరుడసేవ, 13వ తేదీన ఉదయం మొక్కుబడులు, సాయంత్రం తెప్పోత్సవం, రాత్రికి గజవాహనసేవ, 14న ఉదయం కల్యాణోత్సవం, సాయంత్రం రథోత్సవం, రాత్రికి అశ్వవాహన సేవ, 15న సాయంత్రం పుష్పయాగం, రాత్రికి ఏకాంతసేవతో ఉత్సవాలు పూర్తవుతాయి. రోజూ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. -
బెల్లం సరఫరా చేయొద్దు
● వ్యాపారులకు ఏసీ, డీపీఈఓల హెచ్చరిక నెల్లూరు(క్రైమ్): నాటుసారా తయారీదారులకు బెల్లం సరఫరా చేయొద్దని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ పి.దయాసాగర్‌రావు, డీపీఈఓ ఎ.శ్రీనివాసనాయుడు బెల్లం వ్యాపారులను హెచ్చరించారు. శుక్రవారం నెల్లూరు బీవీ నగర్‌లోని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయంలో బెల్లం హోల్‌సేల్ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ పది కేజీల మించి బెల్లం విక్రయిస్తే కొనుగోలుదారుని ఆధార్, ఫోన్ నంబర్‌ను సేకరించి ఆ వివరాలను ఎకై ్సజ్ కార్యాలయంలో అందజేయాలన్నారు. బెల్లం కొనుగోలుకు వచ్చేవారు అనుమానాస్పదంగా ఉంటే తమకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎకై ్సజ్ నెల్లూరు – 1 ఇన్స్పెక్టర్ పి.రమే ష్‌బాబు, ఎస్సై ఎస్.ప్రభాకర్‌రావు పాల్గొన్నారు. -
కుమారుడు పెళ్లి చేసుకోవడం లేదని..
● తల్లి ఆత్మహత్య కోవూరు: కుమారుడు పెళ్లికి నిరాకరించడంతో అతని తల్లి అయిన చుండుగుంట గ్రామానికి చెందిన ఎన్.సుజన (49) ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సుజనకు శ్రీకాంత్ అనే కుమారుడు ఉన్నాడు. పెళ్లి చేసుకోమని అతడికి తల్లి చెబుతూ వచ్చింది. అయితే వాయిదా వేస్తూ వచ్చాడు. తట్టుకోలేకపోయిన సుజన కుమారుడి ఆలోచన మార్చాలని భావించి ఈనెల 5వ తేదీన పురుగు మందు తాగింది. ఆమెను నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘పది’ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం
నెల్లూరు సిటీ: ఈనెల 17 నుంచి 31వ తేదీ వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పి స్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను చూసి ప్రయాణం చేయొచ్చని స్థానిక అధికారులు తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 511 మంది గైర్హాజరు నెల్లూరు(టౌన్): ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 511 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్‌కు సంబంధించి 23,575 మందికి గానూ 23,106 మంది ఎగ్జామ్స్ రాశారు. 469 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 994 మందికి గానూ 952 మంది హాజరయ్యారు. 42 మంది గైర్హాజరయ్యారు. సంస్కృత జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభం నెల్లూరు(టౌన్): నెల్లూరులోని కేఏసీ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలకు సంబంధించి సంస్కృతం జవాబుపత్రాల మూల్యాంకనాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఆర్ఐఓ శ్రీనివాసులు చీఫ్, అసిస్టెంట్ ఎగ్జామినర్లతో సమావేశం నిర్వహించి పొరబాట్లకు తావు లేకుండా మూల్యాంకనం చేయాలన్నారు. సమయపాలన పాటించాలన్నారు. కార్యక్రమంలో కేఏసీ ప్రిన్సిపల్ శ్రీనివాసులురెడ్డి, సౌత్‌మోపూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 13న వాహనాల వేలంనెల్లూరు(టౌన్): జిల్లా రవాణా శాఖ అధికారుల తనిఖీల్లో పట్టుబడి ఎలాంటి పత్రాల్లేకుండా సీజ్ చేసిన 17 వాహనాలను ఈనెల 13వ తేదీన వేలం వేయనున్నట్లు డీటీసీ చందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు రూ.5 వేలు డిపాజిట్‌ను చెల్లించాలన్నారు. వాహనాన్ని పాడుకున్న వారు వేలంలో దక్కించుకున్న మొత్తానికి 18 శాతం జీఎస్టీ, నిర్దేశిత పార్కింగ్ ఫీజు చెల్లించాలన్నారు. వేలం రోజే బిడ్ రూపంలో సగం మొత్తాన్ని కార్యాలయంలో కట్టాలన్నారు. మిగిలిన మొత్తాన్ని ఈనెల 24వ తేదీలోపు చెల్లించాలన్నారు. వేలంలో పాల్గొనే సభ్యులు జీఎస్టీ నంబర్‌ను కలిగి ఉండాలన్నారు. ఓపెన్ స్కూల్ పరీక్షలకు 2,945 మంది హాజరునెల్లూరు(టౌన్): ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్షలకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 318 మంది అభ్యాసకులు గైర్హాజరయ్యారు. 3,263 మందికి గానూ 2,945 మంది హాజరయ్యారు. కెమిస్ట్రీ, ఎకనామిక్స్ సబ్జెక్టుల పరీక్షలు జరిగాయి. రైలు ఢీకొని యువకుడి మృతినెల్లూరు(క్రైమ్): రైలు ఢీకొని గుర్తుతెలియని యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన సౌత్ రైల్వే స్టేషన్ సమీపంలో నెల్లూరు వైపు వచ్చే పట్టాలపై శుక్రవారం జరిగింది. మృతుడి వయసు సుమారు 25 నుంచి 30 ఏళ్ల లోపు ఉండొచ్చని భావిస్తున్నారు. పసుపు రంగు ఫుల్‌హ్యాండ్స్ చొక్కా, బ్లూ రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. కుడిచేతిపై అమ్మ.. సంజీవమ్మా అనే పచ్చబొట్టు ఉంది. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై జి.మాలకొండయ్య ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. తెలుగుదేశం నాయకుల దౌర్జన్యం ● వైఎస్సార్సీపీ మద్దతుదారుడి సొంత స్థలంలో సీసీ రోడ్డు నిర్మాణం ● ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులువెంకటాచలం: మండలంలోని ఇడిమేపల్లి పంచాయతీ పరిధిలో జంగాలపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మద్దతుదారుడైన పచ్చికాల శీనయ్య సొంత స్థలంలో టీడీపీ నాయకులు దౌర్జన్యంగా సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీనిపై బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శీనయ్యకు చెందిన సర్వే నంబర్ 531 – 2లో 21 అంకణాల స్థలంలోని ప్రహరీని టీడీపీ నాయకులు దౌర్జన్యంగా కూల్చేశారు. దీనిపై బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇటీవల ఆ భూమిలో సీసీ రోడ్డు వేసేందుకు చదును చేయగా శీనయ్య కలెక్టర్, ఎస్పీ, రూరల్ డీఎస్పీకి ఫిర్యాదు చేశాడు. దీంతో ఇటీవల గ్రామానికి పోలీసులు, పంచాయతీ అధికారులు వచ్చి పరిశీలించారు. కానీ గురువారం ఆ స్థలంలో రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా రోడ్డు వేశారని శీనయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయమై ఎంపీడీఓ కల్పనను వివరణ కోరగా ఫిర్యాదుపై విచారణ జరుగుతోందని, రోడ్డు నిర్మాణ విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. -
పీఎంశ్రీ నిధులను సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ ఆనంద్ నెల్లూరు రూరల్: పీఎంశ్రీ పథకం ద్వారా జిల్లాలో ఎంపికైన పాఠశాలలకు మంజూరైన నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఒ.ఆనంద్ తెలిపారు. శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో 42 పాఠశాలల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. కెమిస్ట్రీ, కంప్యూటర్ ల్యాబ్‌లు, క్రీడా మైదానాలు, లైబ్రరీలు, కిచెన్ షెడ్స్, మరుగుదొడ్ల నిర్మాణం తదితర వాటికి రూ.5.33 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు సుమారు రూ.3 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. స్కూళ్ల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలన్నారు. ఉపాధి పథకం ద్వారా బడుల్లో ప్లాంటేషన్, సీసీ రోడ్లు మంజూరు చేస్తామని చెప్పారు. సమావేశంలో సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, ఈఈ సుబ్బరాయులు తదితరులు పాల్గొన్నారు. -
మహిళల భద్రతకు పెద్దపీట
నెల్లూరు(క్రైమ్): మహిళల భద్రతకు పోలీస్ శాఖ పెద్దపీట వేసినట్లుగా ఎస్పీ జి.కృష్ణకాంత్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నుంచి కేవీఆర్ పెట్రోల్ బంకు వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, ఐసీడీఎస్ పీడీ సుశీలాదేవీలు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కేవీఆర్ పెట్రోల్ బంకు కూడలిలో విద్యార్థినులు నృత్యాలు చేస్తూ మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. తొలుత ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో మహిళల గౌరవాన్ని పెంపొందించే విధంగా పోలీసు అధికారులు పలు చిత్రాలను ప్రదర్శించారు. నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులకు ఎస్పీ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ మునిరాజా, నగర డీఎస్పీ పి.సింధుప్రియ, డీసీపీఓ సురేష్, సీడీపీఓలు లక్ష్మీదేవి, అనురాధ, డీటీసీ ఇన్స్పెక్టర్ మిద్దె నాగేశ్వరమ్మ, మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ టీవీ సుబ్బారావు, ఆర్ఐలు అంకమరావు, రాజారావు, అధ్యాపకురాలు లేపాక్షి, పలు కళాశాలల విద్యార్థినులు పాల్గొన్నారు. -
మిత్రుడ్ని చూసేందుకెళ్లి.. మృత్యుఒడిలోకి
సాక్షి, చెన్నై / నెల్లూరు(క్రైమ్): చెన్నైలోని ఓ కళాశాలలో చదువుతున్న మిత్రుడ్ని చూసి సరదాగా గడపాలని భావించారు. అనుకున్నదే తడవుగా అక్కడికెళ్లి ఉత్సాహంగా గడిపారు. వీరు ఒకటి సంకల్పంచగా, విధి మరోలా తలచి రోడ్డు ప్రమాద(road accident) రూపంలో ఇద్దర్ని పొట్టనబెట్టుకున్న హృదయ విదారక ఘటన చెన్నైలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఆనందం.. అంతలోనే ఆవిరి పోలీసుల వివరాల మేరకు.. నెల్లూరుకు చెందిన ధనిష్ రెడ్డి (21) చెన్నై శివార్లలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్(B.Tech students) తృతీయ సంవత్సరం చదువుతున్నారు. నెల్లూరులోని ఓ కళాశాలలో చదువుకుంటున్న శ్రేయాష్ (21), మరో ఇద్దరు విద్యార్థులు.. ధనిష్రెడ్డిని చూసేందుకు కారులో వచ్చారు. బుధవారం రాత్రి కలిసి, అర్ధరాత్రి వేళ వీరితో పాటు ధనిష్ కళాశాల మిత్రుడు జయంత్‌తో పాటు కారులో సిటీ వైపు బయల్దేరారు. మార్గమధ్యలో ఊరపాక్కం దాటగానే కిలాంబాక్కం బస్ టెర్మినల్‌కు కూతవేటు దూరంలో ముందుగా వెళ్తున్న లారీ హఠాత్తుగా ఆగడంతో వెనుక వేగంగా వస్తున్న కారు ఢీకొంది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, ఘటన స్థలంలోనే ధని‹Ùరెడ్డి, శ్రేయాష్ మరణించారు. గాయపడిన ఇద్దరు విద్యార్థులు, జయంత్‌ను చికిత్స నిమిత్తం పోతేరిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను చెంగల్పట్టు జీహెచ్‌కు తరలించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శోకసంద్రం చెన్నై శివార్లలో జరిగిన రోడ్డుప్రమాదంలో నగరానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. స్టోన్‌హౌస్‌పేటకు చెందిన ప్రముఖ ట్రాన్స్పోర్ట్ నిర్వాహకుడు సుధాకర్‌రెడ్డి కుమారుడు ఎర్రగుంట ధని‹Ùరెడ్డి, రితి్వక్ ఎన్‌క్లేవ్‌కు చెందిన న్యాయవాది గుడుగుంట వేణుగోపాల్ కుమారుడు శ్రేయాష్ మరణవార్తతో కుటుంబసభ్యులు హతాశులయ్యారు. విషయం తెలుసుకున్న వారు హుటాహుటిన చెన్నై వెళ్లారు. మృతదేహాలు నెల్లూరుకు గురువారం రాత్రి చేరుకున్నాయి. పలువురు ప్రముఖులు నివాళులరి్పంచి బాధిత కుటుంబాలను ఓదార్చారు. -
● ఈ ఏడాది ఆర్థికంగా కుదేలు
శనగను సాగు చేసిన రైతుల పరిస్థితి దీనంగా మారుతోంది. ఖర్చులు, పెట్టుబడి గణనీయంగా పెరిగినా, దిగుబడులు అంతంతమాత్రమే వస్తుండటం వీరిని కలవరపాటుకు గురిచేస్తోంది. మద్దతు ధర లభించకపోవడం ఓ ఎత్తయితే.. కొనుగోలు కేంద్రాలను నేటికీ ప్రారంభించకపోవడంతో అన్నదాతల ఆందోళన వర్ణనాతీతమవుతోంది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుండటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పొలాల్లో విక్రయానికి సిద్ధంగా.. ● పెరిగిన ఖర్చులు.. తగ్గిన దిగుబడులు ● నానాటికీ పతనమవుతున్న ధరలు ● నేటికీ ప్రారంభం కాని కేంద్రాలు గఉదయగిరి: జిల్లాలో శనగను సాగు చేసిన రైతులను ఈ ఏడాది నష్టాలు వెంటాడుతున్నాయి. పెరిగిన పెట్టుబడులు.. కూలీ ఖర్చులు.. తగ్గిన దిగుబడులు.. గిట్టుబాటు లేని ధరలతో ఆర్థికంగా చితికిపోతున్నారు. ఆపదలో ఉన్న అన్నదాతను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఏ మాత్రం కనికరించడంలేదు. ఫలితంగా అప్పులతో ఆర్థికంగా కుదేలవుతున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో శనగ విస్తీర్ణం సాధారణంగా 11,833 హెక్టార్లు కాగా, ఈ రబీ సీజన్లో 3436 హెక్టార్లలోనే సాగు చేశారు. వాస్తవానికి జిల్లాలో శనగను నవంబర్‌లో వేస్తారు. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కాస్త ఆలస్యంగా ప్రారంభించారు. చీడపీడల ఉధృతి అధికంగా ఉండటంతో సాగు ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఆ మేరకు దిగుబడులు రాకపోగా, మరింత తగ్గడం వీరిని ఆవేదనకు గురిచేస్తోంది. తగ్గుతున్న ఆసక్తి జిల్లాలోని మెట్ట మండలాలైన పొదలకూరు, చేజర్ల, అనంతసాగరం, అనుమసముద్రంపేట, కలిగిరి, వింజమూరు, కొండాపురం, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లో ఎక్కువ మంది రైతులు శనగను సాగు చేసేవారు. అయితే ఇందులో లాభాలు రాకపోవడంతో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు. నిరాశాజనకంగా ధరలు శనగ రైతులకు ఖర్చులు, పెట్టుబడులు ఏటా పెరుగుతున్నా, ఆ మేరకు ధరలు మాత్రం లభించడంలేదు. ఒక ఎకరాలో సాగు చేసేందుకు కనీసం రూ.20 వేల నుంచి రూ.25 వేలు వెచ్చించాల్సి వస్తోంది. అయితే ధర ప్రస్తుతం క్వింటా రూ.ఐదు వేలే పలుకుతోంది. దిగుబడి మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల మేరే వస్తోంది. ఇలా చూస్తే ఎకరాకు కనీసం రూ.ఐదు వేల వరకు నష్టం తప్పడంలేదు. ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర రూ.5,650గానే ఉంది. కొనుగోలు కేంద్రాలను నేటికీ ఏర్పాటు చేయలేదు. పైగా ఇందులో సవాలక్ష నిబంధనలతో కోత పెడుతున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. దీంతో వచ్చిన ధరలకే దళారులకు రైతులు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ సాగు చేసింది సాధారణంగా సబ్ డివిజన్ సాగయ్యేది (హెక్టార్లలో) ఆత్మకూరు 1178 3076 కావలి 1314 2854 నెల్లూరు 39 68 కందుకూరు 905 5835సాగులో ఎంతో వ్యత్యాసం నష్టాలు తప్పడంలేదు మూడెకరాల్లో శనగ సాగు చేశా. పెట్టుబడిగా ఎకరానికి రూ.25 వేల చొప్పున రూ.75 వేలైంది. దిగుబడి పది క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుత ధర మేరకు రూ.50 వేలే లభించేలా ఉంది. దీని బట్టి నష్టం తప్పేలా లేదు. మద్దతు ధరను పెంచి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. – సురేష్, రైతు, పార్లపల్లి, కొండాపురం మండలంప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం జిల్లాలో సాగు చేసిన శనగ నూర్పిళ్లను ప్రస్తుతం చేస్తున్నారు. వీటిని మార్క్‌ఫెడ్, రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసే విషయమై ఉన్నతాధికారులకు నివేదించాం. వీరి నుంచి ఆదేశాలు రాగానే కొనుగోలు చేస్తాం. – సత్యవాణి, జిల్లా వ్యవసాయాధికారి -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
● ఆన్లైన్ గేమ్స్, కోడిపందేల్లో డబ్బు పోగొట్టుకున్న వైనం నెల్లూరు సిటీ: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు రూరల్ మండలంలో జరిగింది. గురువారం పోలీసులు వివరాలు వెల్లడించారు. రూరల్ మండలంలోని పొట్టేపాళెం గ్రామంలో గొట్టేటి మురళి (48) నివాసం ఉంటున్నాడు. అతడికి భార్య సలోమి, కుమారుడు, కుమార్తె సంతానం. మురళి గతంలో ఆటో నడిపాడు. ఇటీవల కూలీగా వెళ్తున్నాడు. అతడిని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఆన్లైన్ గేమ్స్, కోళ్లపందేలు ఆడి కొంతమేర డబ్బు పోగొట్టుకున్నాడు. ఓవైపు అప్పులు, మరోవైపు ఇంటి పోషణ కష్టమవడంతో మానసికంగా కుంగిపోయాడు. బుధవారం ఇంటి వద్ద గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందాడు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
● ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు కందుకూరు రూరల్: కందుకూరు నుంచి ఒంగోలు వెళ్తున్న కందుకూరు డిపోకు చెందిన ఆర్టీసీ నాన్ స్టాప్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికుల కథనం మేరకు.. గురువారం ఓవీ రోడ్డులో బస్సు వేగంగా వెళ్తోంది. ఈ క్రమంలో 167బీ జాతీయ రహదారి మూడు రోడ్ల కూడలి వద్ద డ్రైవర్ స్పీడ్ బ్రేకర్‌ను తప్పించబోయాడు. దీంతో వాహనం సైడుకు వెళ్లింది. ఈ సమయంలో కంట్రోల్ తప్పి హైవే మార్జిన్లోకి వెళ్లింది. టైర్లు అక్కడ కొత్తగా పోసిన మట్టిలోకి దిగాయి. అంతే కాకుండా పెద్ద రాళ్లు ఉండటంతో బస్సు అదుపు తప్పకుండా ఆగిపోయింది. అప్పటికే అందులో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. బోల్తా పడకుండా నిలిచిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. స్పీడ్ బ్రేకర్ వద్ద వేగం తగ్గించి బస్సును సైడుకు తిప్పకుండా ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని ప్రయాణికులు చెబుతున్నారు. -
నమ్మండయ్యా.. ఇక్కడే హాస్టల్..!
షాపింగ్ కాంప్లెక్.. నివాసాల మధ్య ● రెండు ఇరుకు గదులే విద్యార్థినులకు దిక్కు ● రక్షణా ప్రశ్నార్థకమే ● ఆరేళ్లుగా ఇక్కడే నిర్వహణ ● అధికారుల వింతపోకడ నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): గిరిజన శాఖ నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. విద్యార్థినుల కోసం ఆ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్టల్ ప్రాంతాన్ని పరిశీలిస్తే వారి వ్యవహారమేంటో ఇట్టే అర్థమవుతుంది. మూలాపేటలోని అలంకార్ సెంటర్లో సంక్షేమ వసతిగృహం ఉందంటే ఎవరూ నమ్మరు. కారణం ఇక్కడ కనిపించే పరిస్థితులు. ముందు షాపింగ్ కాంప్లెక్స్.. వెనుక హౌసింగ్ కాంప్లెక్స్‌లో రెండు ఇరుకు గదుల్లో దీన్ని నిర్వహిస్తున్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. అంతా లోపభూయిష్టం ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థినులకు హాస్టల్‌ను అలంకార్ సెంటర్లో గిరిజన శాఖ ఆధ్వర్యంలో సాగిస్తున్నారు. చదువుకునేందుకు.. ఆడుకునేందుకు.. కనీసం ఒక చోట భోజనం చేసే అవకాశమే ఇక్కడ కానరాదు. ఇలాంటి చోట ఎందుకు నిర్వహిస్తున్నారో అధికారులకే తెలియాలి. చేరేందుకు వెనుకంజ హాస్టల్లో ఆన్రోల్ 39 మంది ఉండగా, ప్రస్తుతం 19 మంది విద్యార్థినులు ఇక్కడ ఉంటూ చదువులను కొనసాగిస్తున్నారు. ఇక్కడ వంద మందిని చేర్చుకునే అవకాశం ఉన్నా, హాస్టల్ పరిస్థితి చూసి ఎవరూ ముందుకురావడంలేదు. షాపింగ్ కాంప్లెక్స్‌లో ఇరుకైన ద్వారం మీదుగా లోపలికి వెళ్తేనే అక్కడ హాస్టల్ ఉందనే విషయం తెలుస్తుంది. బోర్డును తీసి మూలనపడేశారు. చుట్టూ అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో వంటలు చేస్తున్నారు. ఇక్కడే విద్యార్థినులు భోజనం చేయాల్సి వస్తోంది. జనావాసాల మధ్య నిర్వహిస్తుండటంతో విద్యార్థి నులకు రక్షణ ప్రశ్నార్థకమవుతోంది. నెలకు రూ.22 వేల అద్దె మొదటి అంతస్తులోని రెండు ఇరుకు గదుల్లో విద్యార్థినులు ఉంటున్నారు. దుస్తులను ఉతికి ఆరేసే పరిస్థితీ కరువవుతోంది. కాపురాలు ఉండాల్సిన ఇళ్లలో ఇలా హాస్టల్‌ను నిర్వహిస్తూ, దీనికి ప్రతి నెలా రూ.22 వేల అద్దెను చెల్లిస్తున్నారు. మరోవైపు ఇక్కడే ఉండే వారు డీకేడబ్ల్యూ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారు. కాలేజీకి కిలోమీటర్ దూరంలో వసతిగృహాన్ని నిర్వహించాల్సిన అవసరం ఏముందని చుట్టుపక్కల వారు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థినులపై నిర్లక్ష్యమో లేక ఉన్నతాధికారుల లాభసాటి వ్యాపారమో తెలియదు గానీ ఆరేళ్లుగా ఇక్కడే నిర్వహిస్తున్నారు. కాగా ఈ విషయమై అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అంకయ్య, జిల్లా ట్రైబల్ అఽధికారి పరిమళను సంప్రదించగా, స్పందించేందుకు వారు ఆసక్తి చూపలేదు. హలో.. ఈ ప్రాంతంలో ప్రభుత్వ వసతిగృహం ఉందంట.. అదెక్కడ అని మూలాపేటలోని అలంకార్ సెంటర్ వద్దకెళ్లి ఎవర్ని ప్రశ్నించినా, అయోమయపు ముఖాన్ని ప్రదర్శిస్తారు. కష్టపడి ఆరాతీసి.. చివరికి అక్కడికెళ్లి పరిశీలిస్తే, గగుర్పాటుకు గురవడం ఖాయం. షాపింగ్ కాంప్లెక్స్ మధ్య ఇరుకై న సందులో.. జనావాసాల మధ్య దీని నిర్వహణ చూసి మీకో నమస్కారం అంటూ తమ పిల్లలను అందులో చేర్చేందుకు ఎవరూ సాహసించడంలేదు. అసలు ఈ తరహాలో ఎందుకు నిర్వహిస్తున్నారో ఎవరికీ అంతుచిక్కడంలేదు. చర్యలు చేపడతాం హాస్టల్ నిర్వహణపై విచారణ జరిపి చర్యలు చేపడతాం. వీలైనంత వరకు అన్ని వసతులు ఉన్న అద్దె భవనానికి హాస్టల్‌ను మార్చేందుకు యత్నిస్తా. ఇటీవలే చార్జి తీసుకున్నా. ఈ విషయమై సంబంధిత అధికారులతో మాట్లాడతా. – మల్లికార్జునరెడ్డి, ఐటీడీఏ పీఓ -
పైప్‌లైన్‌ను దౌర్జన్యంగా ఎలా వేస్తారు..?
● అధికారులను ప్రశ్నించిన రైతులు కావలి: కృష్ణపట్నం పోర్టు నుంచి హైదరాబాద్ వరకు బీపీసీఎల్ సంస్థ తలపెట్టిన పైప్‌లైన్‌ను త మ భూముల్లో ఎలా వేస్తారని రైతులు ప్రశ్నిస్తుంటే, ఏర్పాటు చేసి తీరుతామంటూ అధికారులు, సంస్థ ప్రతినిధులు దబాయిస్తున్నారని పలువురు వాపోతున్నారు. కావలి రూరల్ మండలం సర్వాయపాళెం, మాతినివారిపాళెం, కోనేటివారిపాళెం రైతులతో స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ సన్ని వంశీకృష్ణ గురువారం చర్చించారు. ప్రస్తుతం పంట కోత దశకొచ్చిందని, 20 రోజులాగితే ఇది పూర్తవుతుందని, గ్రామాల్లో సమావేశాలను ఏర్పాటు చేసుకొని తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని రైతులు చెప్పారు. కాగా పైప్‌లైన్ నిర్మాణ పనులను ఈ నెల 11న ప్రారంభించనున్నామని, పంట నష్టానికి పరిహారాన్ని చెల్లిస్తామని ఆర్డీఓ సమక్షంలో బీపీసీఎల్ ప్రతినిధులు చెప్పగా, రైతులు అంగీకరించలేదు. ఆర్డీఓ సైతం ఇలానే చెప్పడంతో వారు బయటకొచ్చేశారు. అనంతరం రైతులు మాట్లాడారు. గ్రామాల్లో భయోత్పాతాన్ని సృష్టించి.. అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూముల్లో పైప్‌లైన్‌ను నిర్మించే అవకాశమున్నా, తమ భూముల్లోనే నిర్మించాలంటూ మొండిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సన్నకారు రైతుల భూముల్లో నిర్మించి పొలాలను ధ్వంసం చేసి జీవనాధారాన్ని దెబ్బతీసే వాతావరణాన్ని అధికారులు సృష్టిస్తున్నా రని వాపోయారు. దిక్కున్న చోటకెళ్లి చెప్పకోండంటూ దారుణంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేదిలేదని స్పష్టం చేశారు. జిల్లా సహకారాభివృద్ధి కమిటీ సమావేశం నెల్లూరు రూరల్: జిల్లాలోని వ్యవసాయ, పాడి, మత్స్య సహకార సంఘాలను పటిష్టపర్చి, సభ్యులకు మరింత మెరుగైన సేవలందించాలని కలెక్టర్ ఆనంద్ కోరారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో గురువారం నిర్వహించిన జిల్లా సహకారాభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కంప్యూటరీకరించిన వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో మాన్యువల్ విధానంలో లావాదేవీలను నిర్వహించరాదని, ఆన్లైన్ ద్వారానే జరపాలని సూచించారు. అర్హత కలిగిన అన్ని పీఏసీఎస్‌లలో పెట్రోల్ బంకులు, ఎల్పీజీ గ్యాస్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని ఏరియా ప్రభుత్వాస్పత్రుల్లో ప్రధానమంత్రి జనఔషధి కేంద్రాల ఏర్పాటుకు చొరవ చూపాలన్నారు. డీసీఓ గుర్రప్ప, డీసీసీబీ సీఈఓ శ్రీనివాసరావు, నాబార్డు డీడీఎం డాక్టర్ బాబు, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, జిల్లా మత్స్యశాఖ అధికారి నాగేశ్వరరావు, జిల్లా ఉద్యానాఽధికారి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ లోక్‌అదాలత్ రేపు
నెల్లూరు (లీగల్): ఈ నెల ఎనిమిదిన నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్ విజయవంతానికి కృషి చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని పేర్కొన్నారు. జిల్లా కోర్టులోని తన చాంబర్లో విలేకరులతో గురు వారం ఆమె మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించనున్నామని, నెల్లూరు, కోవూరు, కావలి, గూడూ రు, వెంకటగిరి, ఆత్మకూరు, కోట, ఉదయగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట కోర్టుల్లోని కక్షిదారులు సద్వినియోగం చేసుకొని కేసులను రాజీ చేసుకోవాలని కోరారు. ఐదో అదనపు జిల్లా జడ్జి సర స్వతి, పోక్సో ప్రత్యేక కోర్టు జడ్జి సుమ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కరుణకుమార్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వాణి తదితరులు పాల్గొన్నారు. -
మిత్రుడ్ని చూసేందుకెళ్లి.. మృత్యుఒడిలోకి
సాక్షి, చైన్నె / నెల్లూరు(క్రైమ్): చైన్నెలోని ఓ కళాశాలలో చదువుతున్న మిత్రుడ్ని చూసి సరదాగా గడపాలని భావించారు. అనుకున్నదే తడవుగా అక్కడికెళ్లి ఉత్సాహంగా గడిపారు. వీరు ఒకటి సంకల్పించగా, విధి మరోలా తలచి రోడ్డు ప్రమాద రూపంలో ఇద్దర్ని పొట్టనబెట్టుకున్న హృదయ విదారక ఘటన చైన్నెలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఆనందం.. అంతలోనే ఆవిరి పోలీసుల వివరాల మేరకు.. నెల్లూరుకు చెందిన ధనిష్రెడ్డి (21) చైన్నె శివార్లలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు. నెల్లూరులోని ఓ కళాశాలలో చదువుకుంటున్న శ్రేయాష్ (21), మరో ఇద్దరు విద్యార్థులు.. ధనిష్రెడ్డిని చూసేందుకు కారులో వచ్చారు. బుధవారం రాత్రి కలిసి, అర్ధరాత్రి వేళ వీరితో పాటు ధనిష్ కళాశాల మిత్రుడు జయంత్‌తో పాటు కారులో సిటీ వైపు బయల్దేరారు. మార్గమధ్యలో ఊరపాక్కం దాటగానే కిలాంబాక్కం బస్ టెర్మినల్‌కు కూతవేటు దూరంలో ముందుగా వెళ్తున్న లారీ హఠాత్తుగా ఆగడంతో వెనుక వేగంగా వస్తున్న కారు ఢీకొంది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, ఘటన స్థలంలోనే ధనిష్రెడ్డి, శ్రేయాష్ మరణించారు. గాయపడిన ఇద్దరు విద్యార్థులు, జయంత్‌ను చికిత్స నిమిత్తం పోతేరిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను చెంగల్పట్టు జీహెచ్‌కు తరలించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శోకసంద్రం చైన్నె శివార్లలో జరిగిన రోడ్డుప్రమాదంలో నగరానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. స్టోన్‌హౌస్‌పేటకు చెందిన ప్రముఖ ట్రాన్స్పోర్ట్ నిర్వాహకుడు సుధాకర్‌రెడ్డి కుమారుడు ఎర్రగుంట ధనిష్రెడ్డి, రిత్విక్ ఎన్‌క్లేవ్‌కు చెందిన న్యాయవాది గుడుగుంట వేణుగోపాల్ కుమారుడు శ్రేయాష్ మరణవార్తతో కుటుంబసభ్యులు హతాశులయ్యారు. విషయం తెలుసుకున్న వారు హుటాహుటిన చైన్నె వెళ్లారు. మృతదేహాలు నెల్లూరుకు గురువారం రాత్రి చేరుకున్నాయి. పలువురు ప్రముఖులు నివాళులర్పించి బాధిత కుటుంబాలను ఓదార్చారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి మరో ముగ్గురికి గాయాలు -
నష్టపరిహారం ఇవ్వలేదని..
● నూతన రోడ్డును ధ్వంసం చేసిన రైతులు ఆత్మకూరు: నష్టపరిహారం చెల్లించలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా వేస్తున్న రోడ్డును ట్రాక్టర్‌తో ధ్వంసం చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఆత్మకూరు మండలంలోని రామస్వామిపల్లి నుంచి గండ్లవేడు వరకు కొత్తగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గ్రామంలో సర్వే నంబర్లు 189, 190ల్లో పక్కా పట్టా భూమిలో రోడ్డు నిర్మాణం గురించి తమకు తెలపకపోవడం, నష్టపరిహారం ఇవ్వలేదని కోపగించుకున్న రైతులు ట్రాక్టర్ ద్వారా గురువారం రోడ్డును ధ్వంసం చేశారు. దీనిపై కాంట్రాక్టర్, అధికారులను ప్రశ్నించారు. కాగా ఈ విషయమై సంబంధిత కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఫుల్ జోష్..
సూపర్ సిక్స్ పథకాల అమలెప్పుడు? కుమార్తె కళ్లెదుటే ప్రాణాలు విడిచి.. పరుగుకు మేం రెడీ.. షాట్‌పుట్ విసురుతూ.. కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానంనెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్ పరిధి కొత్తూరులోని కేంద్రీయ విద్యాలయంలో 2025 – 26 విద్యాసంవత్సరానికి ఒకటో తరగతి అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శంకరయ్య గురువారం ప్రకటనలో తెలిపారు. https://kvsonlineadmission.kvs.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి ఈనెల 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒకటో తరగతిలో చేరాలనుకునే పిల్లల వయసు మార్చి 31వ తేదీ నాటికి ఆరు సంవత్సరాలు నిండి ఉండాలన్నారు. 80 సీట్లు ఉన్నాయని, ఆర్టీఈ యాక్ట్ కింద 20 సీట్లు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్స్ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆన్లైన్ పోర్టల్‌లో ఉదయం 10 నుంచి దరఖాస్తు చేసుకోవాలన్నారు. రెండో తరగతి నుంచి ఆపై తరగతుల వరకు ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారని తెలియజేశారు.● స్కూటీని ఢీకొన్న ఆటో ● తల్లిదండ్రుల మృతి ● సైదాపురంలో విషాదం -
ఇంటర్ పరీక్షలకు 1,002 మంది గైర్హాజరు
నెల్లూరు(టౌన్): ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,002 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్‌కు సంబంధించి 28,376 మందికి గానూ 27,539 మంది హాజరయ్యారు. 837 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌కు సంబంధించి 1,399 మందికి గానూ 1,234 మంది హాజరయ్యారు. 165 మంది గైర్హాజరయ్యారు. నెల్లూరు ఫత్తేఖాన్‌పేటలోని విశ్వసాయి, రవీంద్రభారతి, రావూస్, కృష్ణచైతన్య, అరవింద్‌నగర్‌లోని నారాయణ జూనియర్ కళాశాలల్లో పరీక్షల నిర్వహణను ఆర్ఐఓ ఆదూరు శ్రీనివాసులు పరిశీలించారు. -
మా ఆయన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కాదు.. అమ్మాయిల బ్రోకర్
నెల్లూరు: ఒకతను తాను సాఫ్ట్వేర్ ఇంజినీర్‌నని నమ్మించి రూ.లక్షల్లో కట్న కానుకులు తీసుకుని ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. కొద్దిరోజులు ఆమెకు ఎలాంటి అనుమానం రాకుండా నటించాడు. అనంతరం భార్యను చిత్రహింసలకు గురి చేయసాగాడు. ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కాని భార్య.. భర్త ప్రవర్తనను నిశితంగా పరిశీలించగా అసలు విషయం తెలిసి నిర్ఘాంతపోయింది. భర్త సాఫ్ట్వేర్ ఇంజినీర్ కాదని యువతుల బ్రోకర్ అని తేలడంతో కన్నీటి పర్యంతమైంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు మెక్లెన్స్ రోడ్డుకు చెందిన ఓ యువతికి ఆమె పెద్దలు మ్యాట్రిమోని ద్వారా వివాహ సంబంధాలు చూస్తుండగా.. విజయవాడ ప్రాంతానికి చెందిన అమీర్‌ఖాన్ పరిచయమాయ్యాడు. తాను సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాని, నెలకు రూ.80 వేలు జీతమని నమ్మించాడు. ఇరు కుటుంబాల అంగీకారంతో ఆ యువతికి 2023 సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన అమీర్‌ఖాన్‌తో వివాహం జరిగింది. ఆ సమయంలో యువతి కుటుంబ సభ్యులు రూ.15 లక్షల నగదు, 13 సవర్ల బంగారు కట్నకానుకుల కింద ఇచ్చారు. రెండునెలలపాటు వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగింది.చదవండి: కుటుంబ పరువు కోసం కన్న కూతురినే కడతేర్చిన తండ్రిప్రవర్తనలో మార్పుక్రమంగా అమీర్‌ఖాన్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్యను చిత్రహింసలకు గురి చేయసాగాడు. గంటల తరబడి ఒంటరిగా గదిలో ఉంటూ ఆమెను పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. దీంతో అతడి ప్రవర్తనపై భార్యకు అనుమానం వచ్చింది. ఓ రోజు అతను బాత్రూమ్కు వెళ్లిన సమయంలో ఆమె రూమ్ శుభ్రం చేస్తుండగా మంచం పక్కనే పెద్ద సంఖ్యలో సెల్ఫోన్లు ఉండటాన్ని గమనించింది. ఒకటి తీసుకుని అందులోని నంబర్లకు కాల్ చేసింది. అవతలి వాళ్లు చెప్పిన మాటలకు ఆమె నిర్ఘాంతపోయింది. అమీర్‌ఖాన్ అమ్మాయిల బ్రోకర్ అనే విషయం బయటపడింది. దీంతో భర్తను ప్రశ్నించగా కోపోద్రిక్తుడైన అతను ఆమైపె దాడి చేశాడు. అత్తమామలు, ఆడబిడ్డ సైతం దుర్భాషలాడారు. అదనపు కట్నం కోసం ఆమెను చిత్రహింసలు పెట్టారు. ఇటీవల ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో బాధిత మహిళ నెల్లూరులోని తల్లిదండ్రుల వద్దకు చేరుకుని బోరున విలపించింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌నని తమను నమ్మించి మోసగించిన భర్త, అత్తింటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె బుధవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని చిన్నబజార్ ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు తెలిపారు. -
బియ్యం సేకరణ ఇలా..
కందుకూరు నియోజకవర్గంలో బడా నేత ఆధ్వర్యంలో మండలాలనికి ఇద్దరు టీడీపీ నాయకులను ఈ వ్యాపారానికి కేటాయించారు. డీలర్లు ప్రజల నుంచి కేజీ బియ్యం రూ.10 కొనుగోలు చేస్తారు. ఇది కేవలం 25 శాతం మాత్రమే. 75 శాతం ప్రజల వరకు రాకుండానే నేరుగా తరలుతుంది. ఈ బియ్యాన్ని డీలర్లు రూ.16లకు మండలంలోని ఆ టీడీపీ నేతకు అమ్ముతారు. ఆయన రూ.19లకు రైస్ మిల్లుకు చేర్చుతారు. అక్కడ పాలిష్ పట్టించి.. రూ.39లకు ఒంగోలుకు చెందిన ఓ టీడీపీ నేతకు విక్రయిస్తారు. సదరు నేత నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతకు నెలకు రూ. 26 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఒంగోలుకు చెందిన వ్యాపారి తప్ప ఇంకెవరూ ఈ నియోజకవర్గంలో వ్యాపారం చేయడానికి లేదని ఆదేశాలు వెళ్లాయి. ఎవరైనా చిరు వ్యాపారి రేషన్ బియ్యం కొనుగోలు చేశాడంటే పోలీసు కేసులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ విధంగా నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేత ఇటు డీలర్లు, మండల స్థాయి ఏజెంట్ల నుంచి కూడా కమీషన్లు దండుకుంటున్నట్లు సమాచారం. అధికారుల సహకారంతోనే.. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి బియ్యం అక్రమ వ్యాపారం మొత్తం అధికారుల పూర్తి సహకారం అండతోనే జరుగుతోంది. రెవెన్యూ, పోలీస్ శాఖ తమ శాయశక్తులా ఈ వ్యాపారానికి అండగా ఉంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతకు తెలియకుండా ఎవరైనా వ్యాపారం చేస్తే వారిని పిలిచి వార్నింగ్‌లు ఇచ్చే స్థితికి పోలీస్ శాఖ వెళ్లిదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఓ చిరు వ్యాపారిని నీ సంగతి తేలుస్తా అంటూ ఉలవపాడు పోలీస్ అధికారి బెదిరించినట్లు సమాచారం. తాజాగా బుధవారం కూడా మరోసారి బడా నేతకు తెలియకుండా చేస్తే వెంటనే అధికారులు వచ్చి పట్టుకుని కేసు నమోదు చేస్తారంటూ బెదిరించినట్లు తెలిసింది. -
సబ్ కలెక్టర్ తనిఖీలో అక్రమాలు
పేదల ఆకలి తీర్చే రేషన్ బియ్యంతో అధికార పార్టీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. మార్కెట్లో బియ్యం కొనే ఆర్థిక స్థోమత లేక.. రేషన్ బియ్యం అందక పేదలు ఆకలి మంటలతో అల్లల్లాడుతున్నారు. జిల్లాలో గడిచిన మూడు నెలలుగా రేషన్ షాపులకు చేరాల్సిన నెలవారీ బియ్యం కోటా తగ్గిపోయింది. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి షాపులకు వెళ్లాల్సిన బియ్యం నేరుగా రైసు మిల్లులకు చేరుతోంది. అక్కడి నుంచి దొడ్డిదారిన విదేశాలకు తరలిపోతోంది. ప్రధానంగా కందుకూరు నియోజకవర్గంలో ప్రతి రేషన్ షాపును అధికార పార్టీ ముఖ్య నేతలు తన గుప్పెట్లో పెట్టుకుని గుప్పెడు బియ్యం కూడా పేదలకు చేరకుండా అక్రమ రవాణా దందాకు పాల్పడుతున్నట్లు సమాచారం. పోలీసులు, రెవెన్యూ, సివిల్ సప్లయీస్ అధికారులు రేషన్ మాఫియా ముఠాకు సహకారం అందిస్తున్నారు. పెదపవని గ్రామంలోని ఓ రైస్ మిల్లులో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం బస్తాలు ● పేదల బియ్యంతో పెద్దల వ్యాపారం ● కందుకూరు అడ్డాగా చెలరేగిపోతున్న మాఫియా ● పెదపవని రైస్‌మిల్లు కేంద్రంగా అక్రమ రవాణా ● ఒంగోలు వ్యాపారులకే అమ్మేలా నిర్ణయం ● నియోజకవర్గ ముఖ్య నేతకు నెలకు రూ.22 లక్షలు ● మూడు నెలలుగా రేషన్ షాపులకు తగ్గిన సరఫరా ‘కోటా’ ● పేదల ఇంట ఆకలి కేకలు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కందుకూరు నియోజకవర్గంలో రేషన్ బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. పేద ప్రజలకు కడుపు నింపాల్సిన రేషన్ బియ్యాన్ని టీడీపీ నేతలు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. 80 శాతం బియ్యం నేరుగా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రైస్‌మిల్లులకు తరలిస్తుండగా, మిగతా 20 శాతం బియ్యం పేదలకు పంపిణీ చేసినట్లు రేషన్ షాపుల దగ్గరే బలవంతంగా కొనుగోలు చేస్తున్నారు. రేషన్ షాపుల వద్ద బియ్యం కొనుగోలు చేయడానికి మండలానికొక ఏజెంట్లను నియమించుకున్నారు. బయట మార్కెట్లో కేజీ బియ్యం రూ.63 పలుకుతోంది. రేషన్ బియ్యం వస్తున్నా.. తీసుకెళ్లి తినేందుకు కూడా వీలులేకుండా టీడీపీ నేతలు కేజీకి రూ.10 చేతిలో పెట్టి తన్నుకుపోతున్నారు. దీంతో పేదలు తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారు. నెలకు 1100 మెట్రిక్ టన్నులు విదేశాలకు.. నియోజకవర్గంలో కందుకూరు మున్సిపాలిటీ నుంచి కందుకూరు రూరల్, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, వలేటివారిపాళెం మండలాల్లో కలిపి మొత్తం 174 రేషన్ షాపులు ఉన్నాయి. ఆ షాపులకు నెలకు 1100 మెట్రిక్ టన్నుల బియ్యం ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సరఫరా చేయాల్సి ఉంది. ఇందులో కేవలం 200 నుంచి 250 మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రజలందరికీ కనిపించేలా లబ్ధిదారులకు సరఫరా చేస్తున్నారు. ఆ పక్కనే ఉండే ఏజెంట్లు (వీరు టీడీపీ నేతలు ఏర్పాటు చేసుకున్న క్యారియర్లు) కార్డుదారుల నుంచి బలవంతంగా కొనుగోలు చేస్తారు. కార్డుదారులకు బియ్యం ఇవ్వడం, లేదంటే బియ్యం బదులుగా నగదు ఇచ్చేసి డీలర్లు కొనుగోలు చేసి వాటిని ఆ మండల ఏజెంట్లకు అప్పగిస్తారు. ఈ లెక్కన ఏ కార్డుదారుడి ఇంటికి గుప్పెడు రేషన్ బియ్యం చేరే పరిస్థితి లేదు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి, కార్డుదారుల నుంచి సేకరించిన బియ్యాన్ని లింగసముద్రం మండలం పెదపవనిమిల్లు లోని ఓ రైస్‌మిల్లుకు తరలిస్తారు. అక్కడ పాలిష్ పట్టించి, బ్రాండెడ్ బ్యాగుల్లో ప్యాక్ చేసి లారీల ద్వారా కృష్ణపట్నం పోర్టు, చైన్నె నుంచి విదేశాలకు తరలివెళ్తున్నాయి. కందుకూరు: కందుకూరులో రేషన్ మాఫియా ఏ స్థాయిలో చేలరేగిపోతుందో సబ్ కలెక్టర్ బుధవారం చేపట్టిన తనిఖీల్లో బట్టబయలు అయింది. పట్టణంలోని ఉప్పుచెరువు రోడ్డులో ఉన్న ఓ రేషన్ షాపులో బియ్యాన్ని లబ్ధిదారులకు ఇవ్వకుండా రెండు రోజుల క్రితమే పూర్తిగా బ్లాక్ మార్కెట్‌కు తరలించినట్లు సబ్ కలెక్టర్ తిరుమాణి శ్రీపూజకు సమాచారం అందింది. దీంతో ఆమె బుధవారం మధ్యాహ్నం తన సిబ్బందితో కలిసి రేషన్ షాపు తనిఖీకి వెళ్లారు. అయితే సబ్ కలెక్టర్ తనిఖీకి వస్తున్న సమాచారాన్ని ముందుగానే తెలుసుకున్న రేషన్‌షాపు డీలర్ షాపునకు తాళాలు వేసి అక్కడి నుంచి పరారయ్యాడు. దాదాపు ఓ అరగంట పాటు షాపు వద్ద వేచి ఉన్న సబ్ కలెక్టర్ ఎట్టకేలకు డీలర్‌కు ఫోన్ చేయగా తాము ఇక్కడ లేమని, ఒంట్లో బాగోలేక హాస్పిటల్‌కు వెళ్లినట్లు సమాచారం ఇచ్చారు. దీంతో సబ్ కలెక్టర్ రేషన్‌షాపు వద్ద ఓ వీఆర్ఏని కాపలా ఉంచి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు తాళాలు తీయొద్దని ఆదేశాలిచ్చి వెళ్లిపోయారు. సబ్ కలెక్టర్ వెళ్లగానే.. ఆదేశాలు ధిక్కరించి.. సబ్ కలెక్టర్ అలా వెళ్లడమే ఆలస్యం.. షాపులో సరుకు సరి చేసేందుకు మొత్తం రేషన్ మాఫియా క్షణాల్లో రంగంలోకి దిగింది. పట్టణంలోని మరో షాపు నుంచి రేషన్ బియ్యం బస్తాలను ఎండీయూ వాహనం ద్వారా తరలించారు. గంట వ్యవధిలో మరో షాపు నుంచి బియ్యం బస్తాలు తెచ్చి ఈ షాపులో ఉంచారు. స్వయంగా సబ్ కలెక్టర్ వచ్చి తనిఖీ చేసి తాళాలు తీయొద్దని ఆదేశాలిచ్చి వెళ్లినా కింది స్థాయి అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా రేషన్ మాఫియాకు యథేచ్ఛగా సహకరించారు. సబ్ కలెక్టర్ లంచ్‌కు బంగ్లాకు వెళ్లిన సమయంలో రేషన్ మాఫియా ఈ తతంగాన్ని పూర్తి చేసింది. సగం షాపులు ఖాళీ వాస్తవానికి రేషన్ షాపుల ద్వారా ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకు బియ్యంతోపాటు ఇతర సరుకులు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే రేషన్‌షాపుల మొత్తాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్న అధికార పార్టీకి చెందిన కీలక నేతలు చెప్పినట్లు డీలర్లు వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి పంపిణీ ప్రారంభం కాకముందే నేరుగా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఆ తర్వాత నిదానంగా లబ్ధిదారులకు బియ్యం లేవని చెప్పి, డబ్బులిచ్చి వేలిముద్రలు వేయించుకున్నారు. ఈ నెల 5వ తేదీ నాటికే కందుకూరు పట్టణంలో దాదాపు సగం షాపుల్లో ఇప్పటికే బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలించినట్లు సమాచారం. ఏ షాపుల్లోనూ బియ్యం నిల్వలు లేవు. ఈ విధమైన సమాచారం రావడంతోనే బుధవారం సబ్ కలెక్టర్ ఓ రేషన్‌షాపు తనిఖీకి వెళ్లారు. అయితే, ఇక్కడ కూడా దొరకకుండా సబ్‌కలెక్టర్‌ను సైతం రేషన్ మాఫియా బోల్తా కొట్టించింది. సబ్‌కలెక్టర్ కళ్లుగప్పి మరీ లేని బియ్యాన్ని ఉన్నట్లు చూయించేందుకు నానా హైరానా పడ్డారు. ఈ వ్యవహారంలో సివిల్ సప్లయీస్ శాఖలో పనిచేసే ఓ అధికారి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఎవరైనా తనిఖీలకు వస్తుంటే ముందుగా రేషన్ మాఫియాకు సమాచారం ఇవ్వడం, వారిని అలర్ట్ చేసే పనిలో ఈ అధికారి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికార యంత్రాంగం ప్రస్తుతం పట్టణంలోని రేషన్ షాపులన్నీ తనిఖీ నిర్వహిస్తే వీరి బండారం మొత్తం ఒక్క సారిగా బయటపడుతుంది. -
దళారులను నమ్మి మోసపోవద్దు
మనుబోలు: దళారులను నమ్మ మోసపోవద్దని, ప్రభుత్వ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆనంద్ రైతులకు సూచించారు. మండలంలోని పిడూరులో నిర్వహిస్తున్న భూముల రీసర్వేను బుధవారం ఆయన పరిశీలించారు. మనుబోలు సచివాలయం–1లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే సకాలంలో తమకు నగదు జమ చేయడం లేదని రైతులు ఆయన దృష్టికి తెచ్చారు. దీనికి స్పందించిన కలెక్టర్ రైతులు అలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. విక్రయించిన ధాన్యానికి సకాలంలో నగదు జమ చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు చేర్చేందుకు రవాణా సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. జిల్లాలోని 33 మండలాల్లో ఒక్కొక్క గ్రామంలో రీసర్వేను మోడల్‌గా నిర్వహిస్తున్నామని తెలిపారు. అది పూర్తయ్యాక లోటు పాట్లను పరిశీలించి అన్ని గ్రామాల్లో రీసర్వేను నిర్వహిస్తామని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ సుబ్బయ్య, రీసర్వే డీటీ మంజుల, ఆర్ఐ శ్రీకాంత్, ఏఓ షేక్ జహీర్, వీఆర్వో నాగార్జునరెడ్డి తదితరులున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి కలెక్టర్ ఆనంద్ -
ఇంటర్ పరీక్షలకు 75 మంది గైర్హాజరు
నెల్లూరు (టౌన్): ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు బుధవారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 75 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ విభాగానికి సంబంధించి 23,310 మంది విద్యార్థులకు 22,877 మంది హాజరయ్యారు. 433 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌కు సంబంధించి 986 మందికి 944 మంది హాజరు కాగా 42 మంది గైర్హాజరయ్యారు. పలు పరీక్ష కేంద్రాలను ఆర్ఐఓ ఆదూరు శ్రీనివాసులు, డీవీఈఓ 5, డీఈసీ 4, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ అధికారులు 24 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. ఓపెన్ స్కూల్ పరీక్షకు 279 మంది.. ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలకు బుధవారం మొత్తం 279 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలో 20 సెంటర్లలో జరిగిన పరీక్షకు 3,056 మంది విద్యార్థులకు 2,777 మంది హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.బాలాజీరావు 4 సెంటర్లను తనిఖీ చేశారు. పులుల గణన ప్రారంభం ● ఫారెస్ట్ రేంజర్ శేఖర్ ఆత్మకూరు: ఆత్మకూరు అటవీ రేంజ్ పరిధిలో పులుల గణన ప్రారంభించనున్నట్లు రేంజ్ అధికా రి శేఖర్ బుధవారం తెలిపారు. ఇప్పటికే అటవీ ప్రాంతంలో ట్రీ, ట్రాప్ కెమెరాలు కొన్ని ఏర్పాటు చేశామని, అయితే పులుల గణనకు అవి సరిపోవన్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి మహబూబ్‌బాషా ఆదేశాలతో శ్రీశైలం ప్రాంతం నుంచి మరి న్ని కెమెరాలు తీసుకురానున్నట్లు తెలిపారు. ఇప్పటికే అడవిలో పులులు సంచరించే ముఖ్య ప్రాంతాలను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేసి పులుల సంఖ్యను లెక్కించనున్నామన్నారు. ఈ ప్రక్రియ నెల రోజులకుపైగా పట్టే అవకాశం ఉందని తెలిపారు. పులుల సంరక్షణ కోసం అడవిలో పలు ప్రాంతాల్లో సిమెంట్ తొట్టెల ద్వారా తాగునీటి ఏర్పాట్లు చేశామన్నారు. ఎప్పటికప్పుడు వాటిలో క్షేత్ర స్థాయి సిబ్బంది నీరు నింపుతున్నట్లు తెలిపారు. అటవీ సమీప గ్రామాల్లో నివశిస్తున్న వారు జంతువుల సంరక్షణకు ఎలాంటి విఘాతం కలిగించరాదన్నారు. ఆయన వెంట డీఆర్ఓ పిచ్చిరెడ్డి ఉన్నారు. రేపు టౌన్ ప్లానింగ్ సిబ్బందికి శిక్షణ నెల్లూరు (బారకాసు): గుంటూరు ప్రాంతీయ సంచాలకుల పట్టణ ప్రణాళికా విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 7న నెల్లూరు నగర పాలక సంస్థతోపాటు కావలి, ఆత్మకూరు మున్సిపాలిటీలు, బుచ్చిరెడ్డిపాళెం, అల్లూరు నగర పంచాయతీల పరిధిలోని పట్టణ ప్రణాళికా విభాగం సిబ్బంది, వార్డు సచివాలయాల ప్లానింగ్ కార్యదర్శులు, ఎల్టీపీలకు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు పట్టణ ప్రణాళిక విభాగం సిటి ప్లానర్ పద్మజ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో ఉదయం 10 గంటలకు జరగనున్న శిక్షణలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ విభాగంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్దేశించిన వివిధ మార్గదర్శకాలపై అవగాహన సదస్సు కల్పించనున్నారని తెలిపారు. ఈ సమావేశానికి లైసెన్స్డ్ సివిల్ ఇంజినీర్లు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ, మున్సిపల్, నగర పంచాయతీల కమిషనర్లు తమ పరిధిలోని పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించిన సిబ్బంది శిక్షణకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హౌసింగ్ కార్పొరేషన్ ఏఈ సస్పెన్షన్● మరో నలుగురికి షోకాజ్ నోటీసులు నెల్లూరు(అర్బన్): అక్రమాలకు పాల్పడినట్టు తేలడంతో జిల్లాలోని హౌసింగ్ కార్పొరేషన్ ఏఈ మధుసూదన్‌రావును సస్పెండ్ చేస్తూ ఆ శాఖ ఎండీ రాజాబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో హౌసింగ్ కార్పొరేషన్ ఇన్చార్జి ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన నాగరాజుతోపాటు ఆ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దయాకర్, ఏఈలు జమీర్, వెంకటేశ్వర్లుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గతంలో హౌసింగ్ కార్పొరేషన్లో అనేక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. సిమెంట్, స్టీల్‌తోపాటు ఇసుకను కూడా అమ్ముకున్నట్లు రూఢీ అయింది. ఒక్క ఇసుక ద్వారానే రూ.34.45 లక్షలు అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక పంపింది. దీంతో ఆ శాఖ ఎండీ రాజాబాబు ఈ మేరకు చర్యలు చేపట్టారు. దీంతో హౌసింగ్ కార్పొరేషన్లో జరిగిన అవినీతి చర్చనీయాంశంగా మారింది. -
అప్పులతో రాజధాని నిర్మాణం
నెల్లూరు రూరల్: రాష్ట్ర రాజధానిని అప్పులతో నిర్మిస్తున్నామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. బుధవారం వివిధ శాఖల అధికారులతో మంత్రి తిక్కన ప్రాంగణంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రూ.64 వేల కోట్లతో 5 వేల ఎకరాల్లో రాజధాని నిర్మిస్తాం అని తెలిపారు. ఇప్పటికే రూ.50 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని చెప్పారు. రాజధాని పరిధిలో ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల్లో నుంచి ఒక్క పైసా కూడా రాజధానికి ఖర్చు చేయమని తెలిపారు. 5 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించామని, రాజధాని నిర్మాణానికి హడ్కో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ తదితర బ్యాంక్‌ల నుంచి అప్పు తీసుకుని నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. 1000 నుంచి 1200 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలు, పాఠశాలలు, సంస్థలకు కేటాయించామన్నారు. బడ్జెట్లో రాజధానికి రూ.6 వేల కోట్లు కేటాయించాం. అవసరమైతే ఇంకా నిధులు ఇస్తామని సీఎం చెప్పారన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఓ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
మత్స్యకారులకు అండగా ఉంటాం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ముత్తుకూరు: మత్స్యకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని మాజీమంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. కృష్ణపట్నం పంచాయతీలోని ఆర్కాట్‌పాళెంలో బుధవారం ఆయన పర్యటించారు. మత్స్యకార కుటుంబ పెద్దలతో మాట్లాడారు. మత్స్యకార కుటుంబాలకు ఇచ్చిన హామీలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారన్నారు. ప్రస్తుతం చంద్రబాబు తాను ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని హామీని చంద్రబాబు ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. మత్స్యకార భరోసా కింద రూ.20 వేలకు ఇస్తానని, డీజిల్‌పై 50 శాతం సబ్సిడీ ఇస్తామని ఓట్లు దండుకుని మొండి చెయ్యి చూపారని గుర్తు చేశారు. వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని రూ.4 వేల నుంచి రూ.10వేలకు పెంచి ఇస్తామని 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్రెడ్డి నెరవేర్చారని గుర్తు చేశారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఈ పథకాన్ని అందించారని తెలిపారు. ప్రస్తుతం ఏ పథకాలు మత్స్యకారులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక వైఎస్సార్సీపీ నేత అక్కయ్యగారి అంకయ్య తల్లి లక్ష్మమ్మ ఇటీవల మృతి చెందగా ఆ కుటుంబాన్ని కాకాణి పరామర్శించారు. పార్టీ మండల అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నెల్లూరు శివప్రసాద్, స్థానిక ఉపసర్పంచ్ రాగాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
● అర్హత, పారదర్శకతకు పాతర
● ఎమ్మెల్యే కార్యాలయాలే కేంద్రంగా లబ్ధిదారుల ఎంపిక ● గత ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికం ● కూటమి పాలనలో పార్టీ, కమీషన్లకే ప్రాధాన్యంఉదయగిరి: కూటమి నేతలు ప్రతి అవకాశాన్ని తమ రాబడి పథకంగా మార్చుకుంటున్నారు. చివరకు పేదల స్వయం ఉపాధి కల్పనకు మంజూరు చేస్తున్న సబ్సిడీ రుణాల్లోనూ కమీషన్లు గుంజుతున్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా మంజూరు చేసే ఈ రుణాల్లో సబ్సిడీ గరిష్టంగా రూ.2.50 లక్షలు ఉండడంతో సిఫార్సులతో కమీషన్లు దండుకుంటున్నారు. ఈ రుణాల మంజూరు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కార్యాలయాలు కేంద్రంగా ఎంపిక జరుగుతోంది. గ్రామ స్థాయి ‘పచ్చనేతల నుంచి నియోజకవర్గ స్థాయి నేతల వరకు పంచుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రుణాలతో అప్పుల ఊబిలోకి.. పేద వర్గాల మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందించడం కోసం స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తోంది. ప్రతి ఒక్కరికి సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తున్నట్లు ప్రచారం చేయడంతో వేల సంఖ్యలో దరఖాస్తులు చేస్తున్నారు. మంజూరు చేసిన రుణంలో 50 శాతం రాయితీ ఉంటుంది. మిగతా 50 శాతం బ్యాంకులు రుణంగా మంజూరు చేస్తాయి. లబ్ధిదారులు తాము ఏర్పాటు చేసుకున్న యూనిట్లు ద్వారా వచ్చిన ఆదాయంతో బ్యాంకు రుణ కంతులను ఐదేళ్లలో చెల్లించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రుణాలు తీసుకునే లబ్ధిదారులు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయే అవకాశం ఉంది. ఇందులో సబ్సిడీ గరిష్టంగా రూ.2.50 లక్షలు ఉండడంతో అందులో భారీగా ‘పచ్చనేతల కమీషన్‌గా’ ముందుగానే ఇచ్చుకోవాల్సి ఉంది. రుణంగా వచ్చిన డబ్బులు ఇలా కమీషన్లకు ఇచ్చుకోవడంతో మిగిలిన మొత్తంతో ఆయా యూనిట్ల స్థాపనకు అడ్డంకిగా మారనుంది. బ్యాంకర్లు రుణం మంజూరు చేయాలంటే సదరు లబ్ధిదారులు సెక్యూరిటీని చూపించాల్సి ఉంటుంది. తీసుకున్న రుణంతో యూనిట్ స్థాపించలేక.. రాబడి పొందలేక.. బ్యాంకు రుణాలు చెల్లించలేక అనేక విధాలుగా అవమానాలతోపాటు సెక్యూరిటీగా పెట్టిన ఆస్తులను సైతం కోల్పోవాల్సిన పరిస్థితి అనివార్యమవుతోంది. పేరుకే ఇంటర్వ్యూలు.. అంతా తమ్ముళ్లకే ప్రభుత్వం పేదలకు సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటోంది. అంతా పారదర్శకమని చెప్పుడంతో వేలాది మంది ఔత్సాహికులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా మండల కేంద్రాల్లో దరఖాస్తుదారులకు ఎంపీడీఓలు, బ్యాంకర్లు కలిసి ఇంటర్వ్యూల ప్రక్రియ పూర్తి చేశారు. ఇంతలో అందరి ఎంపీడీఓలకు ఎమ్మెల్యే కార్యాలయాల నుంచి లబ్ధిదారుల ఎంపిక జాబితా తామే పంపిస్తామని, మీరు ఎలాంటి లబ్ధిదారుల జాబితా తయారు చేయొద్దని ఆదేశాలు వచ్చాయి. జిల్లా అంతటికి 2,069 యూనిట్లే జిల్లాలో సుమారు 25 లక్షల మంది జనాభా ఉంది. కానీ ప్రభుత్వం ప్రస్తుతం బీసీ, ఈబీసీ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, కుమ్మరి, కాపు వంటి ఎనిమిది కులాల కార్పొరేషన్ల ద్వారా కేవలం 2,069 యూనిట్లే మంజూరు చేసింది. ఇప్పటికే దాదాపు 18,922 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆయా యూనిట్లకు సంబంధించి రూ.43.12 కోట్లు కేటాయించారు. తాజాగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మరో 1300 యూనిట్లు మంజూరు చేశారు. త్వరలో దరఖాస్తులు తీసుకోనున్నారు. రాజకీయ ప్రమేయంతోనే లోన్లు ప్రస్తుత కూటమి ప్రభుత్వం గతానికి భిన్నంగా సబ్సిడీ రుణాలకు లబ్ధిదారుల ఎంపికను పూర్తిగా రాజకీయం ప్రమేయంతో చేస్తోంది. ఆయా నియోజక వర్గాల ఎమ్మెల్యేల కనుసన్నల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సాగుతోంది. గ్రామస్ధాయి టీడీపీ నేతలు జాబితా తయారు చేస్తున్నారు. కొన్ని లోన్లు తమ అనుచరులకు, మరికొన్ని లోన్లు ముందుస్తు అవగాహన ప్రకారం కమీషన్లు ఇచ్చిన వారికి ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ తరహా లోన్లు లబ్ధిదారుల ఎంపికకు అధికారులు, బ్యాంకర్లకు పూర్తి స్వేచ్ఛ ఉండేది. ఈ కమిటీలో ఎంపీడీఓ, బ్యాంకర్లు ఉండేవారు. రాజకీయ ప్రమేయం లేకుండా అర్హత ఉన్న వారికి లోన్లు మంజూరు చేసేవారు. ప్రస్తుతం అందుకు భిన్నంగా ఈ ప్రక్రియ జరుగుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా మహిళలకు ఇస్తున్న సబ్సిడీ రుణాలు సిఫార్సు ఉంటేనే దక్కే పరిస్థితి కనిపిస్తోంది. రుణాల మంజూరు అంతా ఒక ఫార్సుగా జరుగుతోంది. పారదర్శకంగా రుణాలు మంజూరు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ లబ్ధిదారుల ఎంపిక ఇప్పటికే జరిగిపోయింది. కూటమి ప్రభుత్వంలో యూనిట్ ఏర్పాటుతో సంబంధం లేకుండా కేవలం పార్టీ, కమీషన్లకే ప్రాధాన్యతనిస్తోంది. -
అమాంతం పెరిగిన నిమ్మ ధరలు
● బస్తా రూ.8 వేలు పొదలకూరు: స్థానిక ప్రభుత్వ నిమ్మ మార్కెట్ యార్డులో రెండు రోజుల్లో నిమ్మ ధరలు అమాంతం పెరిగాయి. బస్తా (లూజు) కాయల ధర రూ.8 వేలకు పలికింది. కిలోల వంతున చూసుకుంటే రూ.70 నుంచి రూ.110 వరకు ధరలున్నట్టు వ్యాపారులు వెల్లడించారు. దీంతో రైతుల్లో సంతోషం నెలకొంది. అయితే అందరి తోటలు కాయల్లేవు. ఉన్న రైతులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ధరలు ఇంకా పెరుగుతాయని భావిస్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల నిమ్మ వినియోగం ఇతర రాష్ట్రాల్లో పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ మార్కెట్ ఒక్కసారిగా ఊపందుకున్నట్టు వ్యాపారులు తెలిపారు. అయితే కొన్ని సందర్భాల్లో నిమ్మ మార్కెట్ ధరలు నిలకడగా ఉండవు. ఇతర రాష్ట్రాల నుంచి ఎగుమతి పెరిగితే ఇక్కడ ధరలు తగ్గే అవకాశం కూడా ఉంది. ఈ కేవైసీకి రేపటి వరకు గడువునెల్లూరు(సెంట్రల్): జిల్లాలోని రైతులు ఈ–కేవైసీ, ఈ–క్రాప్ నమోదు చేయించుకునేందుకు ఈనెల 6వ తేదీ వరకే గడువు ఉన్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి సత్యవాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నమోదు చేసుకున్న రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయం చేసుకోవచ్చన్నారు. ఈనెల 7 నుంచి 11వ తేదీ వరకు నమోదు చేసుకున్న రైతుల వివరాలు గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శిస్తారన్నారు.ఉన్నత శిఖరాలను అధిరోహించాలి● జడ్జి కరుణకుమార్ నెల్లూరు(టౌన్): న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కరుణకుమార్ ఆకాక్షించారు. నెల్లూరు బీవీనగర్‌లోని ఆర్వీఎస్ కల్యాణ మండపంలో వీఆర్ న్యాయ కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ లా విద్యార్థులకు జ్ఞాపికలు అందించి ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలికారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కరుణకుమార్ మాట్లాడుతూ పక్షపాతం లేకుండా పారదర్శకంగా ప్రతి ఒక్కరికీ న్యాయం అందించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నగర డీఎస్పీ సింధుప్రియ, అంతర్జాతీయ మానవ హక్కుల రక్షణ కమిషన్ చీఫ్ జనరల్ సెక్రటరీ ఇంతియాజ్, లా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు 885 మంది గైర్హాజరు
నెల్లూరు (టౌన్): ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 885 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇంటర్ జనరల్‌కు సంబంధించి 27,613 మంది విద్యార్థులకు 26,892 మంది హాజరయ్యారు. ఒకేషనల్‌కు సంబంధించి 1,394 మందికి 1,230 మంది హాజరయ్యారు. 164 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఆర్ఐఓ 6, డీవీఈఓ 4, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ అధికారులు 28 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీ వర్క్‌షాపులో ఆత్మకూరు జెడ్పీటీసీ నెల్లూరు (పొగతోట): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ప్రజా ప్రతినిధులకు ఢిల్లీలో రెండు రోజుల పాటు వర్కు షాపు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా నుంచి ఆత్మకూరు జెడ్పీటీసీ పి.ప్రసన్నకు అరుదైన అవకాశం లభించింది. జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ఆత్మకూరు జెడ్పీటీసీని ప్రతిపాదించి ఢిల్లీకి పంపించారు. ఢిల్లీలో జెడ్పీటీసీ మహిళా సాధికారత, మహిళా భాగస్వామ్యం, మహిళల సాకారం, మహిళలు తదితర అంశాలపై అవగాహన కల్పించి, చర్చించారు. ‘రిలయన్స్’ భూముల్లో జంగిల్ క్లియరెన్స్ ముత్తుకూరు: కృష్ణపట్నంలో రిలయన్స్ విద్యుత్ ప్రాజెక్ట్ (కోస్టల్ ఆంధ్ర పవర్ లిమిటెడ్) కోసం సేకరించిన భూముల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం గతంలో సుమారు 2,600 ఎకరాలు సేకరించారు. అనంతరం కొద్ది కాలానికే పనులు నిలిచిపోవడంతో 15 ఏళ్ల నుంచి ఈ భూముల్లో ఏపుగా చెట్లు పెరిగాయి. ఇటీవల ఈ ప్రాజెక్ట్ యజమాని అనిల్ అంబానీ కృష్ణపట్నం వచ్చి భూములు పరిశీలించి వెళ్లారు. జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామాలకు అప్పగించారు. యంత్రాల ద్వారా ముళ్ల చెట్లు, పొదలను తొలగించి, భూములను చదును చేసే పనులను కాంట్రాక్ట్ పద్ధతిపై నిర్వహిస్తున్నారు. కూటమి పాలనలో వ్యవసాయ సంక్షోభం ●● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు నెల్లూరు (వీఆర్సీసెంటర్): రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉండడానికి కూటమి ప్రభుత్వమే కారణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఏడాది పుట్టి ధాన్యం రూ.22 వేలు ఉండగా, ఈ ఏడాది రూ.17 వేలకు పడిపోయిందని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నా.. ప్రభుత్వం మాత్రం దిష్టిబొమ్మలా చూస్తోందన్నారు. ఆప్కాస్ ద్వారా కార్మికులు వేతనాలు తీసుకుంటుంటే దానిని రద్దు చేసి టీడీపీ నాయకులకు కాంట్రాక్ట్ ఇచ్చి 4 శాతం కమీషన్ కొట్టేసేందుకు సిద్ధపడిందని ఆరోపించారు. అదానీ, మోదీ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని టీడీపీ తాకట్టు పెడుతోందన్నారు. మార్చి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాచైతన్య యాత్రలు సాగిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏవీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మీకు సిగ్గు, శరం ఉందా
● సచివాలయాల అడ్మిన్లపై ఆర్ఐ దూషణలు ● అంతే దీటుగా బదులిచ్చిన అడ్మిన్లు ● రెవెన్యూ సమావేశం రసాభాస నెల్లూరు(బారకాసు): ‘మీకు సిగ్గు, ఎగ్గు ఉందా.. మీ మొహానికి గ్రూపు–2 పరీక్ష అవసరమా.. పన్నుల వసూళ్లు సక్రమంగా చేయడం చేత కాదా’ అంటూ నగర పాలక సంస్థ పరిధిలోని సచివాలయ అడ్మిన్లపై ఓ ఆర్ఐ అభ్యంతరకర, వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో కోపంతో రగిలిపోయిన అడ్మిన్లు సైతం నీవెంత.. నీ అధికారమెంత.. అంటూ ఆర్ఐపై తిరగబడ్డారు. మరి కొంతమంది అడ్మిన్లు కూడా కలిసి మమ్మల్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడే అధికారం నీకెవరిచ్చారంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో సమావేశం రసాభాసగా మారి గందరగోళం నెలకొంది. ఈ ఘటనకు నెల్లూరు నగర కార్పొరేషన్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగం వేదికై ంది. నగరంలో పన్ను వసూళ్లపై మంగళవారం జరిగిన సమీక్షా సమావేశం చివర్లో ఓ ఆర్ఐ సచివాలయాల్లోని పన్నులు వసూలు చేసే అడ్మిన్ కార్యదర్శులను ఉద్దేశించి ఇలా పలు విధాలుగా దుర్భాషలాడుతూ కించపరిచినట్లుగా మాట్లాడారు. ఇదంతా సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్న అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్ల సమక్షంలోనే జరిగింది. దీంతో వారు అందరికీ సర్దిచెప్పి గొడవను సద్దుమణిగేలా చేశారు. ఈ వివాదం పన్ను విధించే క్రమంలో సంబంధిత భవన యజమానుల నుంచి అధిక మొత్తంలో తీసుకున్న లంచాల్లో వాటాల పంపకంలో తేడాలు వచ్చినందునే జరిగిందని కార్యాలయ ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం కమిషనర్ సూర్యతేజ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. జరిగిన గొడవపై ఆయన వచ్చాక ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. -
నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు
విద్యార్థులతో పనులు చేయించుకోండి ● అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారిణి శ్రీదేవి నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): సెలవు రోజుల్లో విద్యార్థుల చేత హాస్టళ్ల గదుల్లోని బూజు, పెట్టెల మధ్యలో ఉన్న చెత్తను తొలగించే పనులు చేయించుకోవాలని అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారిణి శ్రీదేవి అన్నారు. నెల్లూరులోని కొండాయపాళెంగేటు సెంటర్లో ఉన్న ఆ శాఖ కార్యాలయంలో మంగళవారం వార్డెన్లతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగామాట్లాడుతూ ప్రతి హాస్టల్లో విద్యార్థులతో కమిటీలు వేయాలన్నారు. విద్యార్థులకు కొన్ని బాధ్యతలు అప్పగించి వారి ద్వారా బూజు దులపడం, గదులను శుభ్రం చేయించడం వంటి పనులను చేయించుకోవాలన్నారు. వార్డెన్లు విధిగా స్థానికంగా నివాసం ఉండాలన్నారు. అలా వీలుకాకపోతే హాస్టల్ పనివేళల్లో అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలన్నారు. లేకపోతే పనివారు కూడా మీ మాట వినరని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. మాన్యువల్ హాజరును పరిగణనలోకి తీసుకోకుండా ఎఫ్ఆర్ఎస్ హాజరు ఎంతమంది విద్యార్థులకు పడుతుందో అంతమందికే డైట్ బిల్లులు మంజూరు చేస్తామన్నారు. మహిళ బలవన్మరణంబిట్రగుంట: బోగోలు మండలం చెంచులక్ష్మీపురంలో శాంతమ్మ (50) అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చెంచులక్ష్మీపురం గ్రామానికి చెందిన బిజ్జం వెంకారెడ్డి ఇంట్లో ఏడాది నుంచి తిరుపతికి చెందిన శాంతమ్మ అనే మహిళ పనిమనిషిగా ఉంది. ఆమె మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి స్వస్థలం, ఇతర వివరాలు పూర్తిగా తెలియకపోవడంతో కేసు నమోదు చేసుకుని ఆమె సంబంధీకులకు సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.బ్రాయిలర్ (లైవ్) : 119 లేయర్ (లైవ్) : 90 బ్రాయిలర్ చికెన్ : 214 బ్రాయిలర్ స్కిన్లెస్ : 236 లేయర్ చికెన్ : 153 -
కన్నీటి సంద్రం
ఆమె జీవితం..మంచానికే పరిమితమైన నాగమల్లేశ్వరి, పక్కనే చిన్నారి ఆత్మకూరు: పట్టణంలోని వందూరుగుంట ప్రాంతంలో నివాసం ఉంటున్న నాగులు, తిరుపతమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. అందరికీ వివాహాలై ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. నాగులు తోపుడు బండిపై పండ్లు అమ్ముతుంటాడు. అతని పెద్ద కుమార్తె నాగమల్లేశ్వరికి వివాహమైంది. రెండేళ్ల క్రితం.. భర్త, ఏడాది వయసున్న కూతురితో కర్నూలులో ఆనందంగా ఉంది. ఈ క్రమంలో నాగమల్లేశ్వరి ఇంటి వద్ద జారిపడగా తలకు గాయమైంది. భర్త ఆస్పత్రిలో చూపించాడు. వ్యాధిని వైద్యులు నిర్ధారించలేకపోయారు. దీంతో ఆమెను, కుమార్తెను ఆత్మకూరులోని తల్లిదండ్రుల వద్ద వదిలి వెళ్లిపోయాడు. అప్పుడప్పుడు చుట్టపుచూపుగా వచ్చి చూసేవాడు. ఏడాదిన్నరగా అతను రావడంలేదని నాగులు, తిరుపతమ్మలు చెబుతున్నారు. కుమార్తెను చూసి.. నాగమల్లేశ్వరి మంచానికే పరిమితమైంది. ఆమె ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. నోట మాట లేకపోగా కాళ్లు, చేతులు సైతం చచ్చుబడ్డాయి. మంచంపై ఉన్న తల్లిని చూసి కుమార్తె ద్వారక పలకరిస్తుంది. సమాధానం చెప్పలేని స్థితిలో నాగమల్లేశ్వరి కూతురిని చూస్తూ కన్నీరు పెడుతుంటుందని నాగులు చెబుతున్నాడు. ఈయన కూడా ఏడాది కాలంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. బండిని నెట్టుకుంటూ తిరిగి పండ్లు అమ్మలేని పరిస్థితి రావడంతో తిరుపతమ్మ కూలి పనులకు వెళ్తోంది. ఇంటికొచ్చాక నాగమల్లేశ్వరికి అన్ని సేవలు ఆమే చేస్తోంది. అసలు నాగమల్లేశ్వరికి వచ్చిన వ్యాధి ఏమిటో నిర్ధారించేందుకు చైన్నె లాంటి నగరాల్లోని ఆస్పత్రులకు వెళ్లాలని స్థానిక వైద్యులు తెలపడంతో ఇప్పటికే రూ.2 లక్షలకు ఖర్చు చేసి అప్పులపాలయ్యారు. మందుల కోసం ప్రతినెలా రూ.6 వేల నుంచి రూ.7 వేల ఖర్చు చేస్తున్నారు. నాగమల్లేశ్వరి ఆహారం తినలేకపోవడంతో ట్యూబ్ ద్వారా పాలు మాత్రమే అందిస్తున్నారు. మందులను పాలల్లో కలిపి ట్యూబ్ ద్వారా ఇస్తున్నట్లు నాగులు కన్నీరు పెట్టుకుంటూ తెలిపాడు. దాతలు సాయం చేస్తే కుమార్తెకు చికిత్స చేయించి బతికించుకుంటామని వేడుకుంటున్నాడు. తెలియని వ్యాధితో జీవచ్ఛవంలా మంచానికే పరిమితమైంది ఓ మహిళ. వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగుతున్న తరుణంలో అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఆమె తలకు గాయమైంది. ఆరోగ్య పరిస్థితి క్షీణించి శరీర అవయవాలు చచ్చుబడ్డాయి. భార్యపై కనికరం చూపకుండా భర్త వదిలేసి వెళ్లిపోయాడు. రెండు సంవత్సరాలుగా మంచానికే పరిమితం పాలే ఆహారం మందుల కోసం నెలకు రూ.వేలు ఖర్చు దాతల సాయం కోసం ఎదురుచూపులుదాతలు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ : 94918 28138 -
ఈ ఘటనలకు బాధ్యులెవరు?
మిల్లర్‌కు ధాన్యం అమ్మిన 250 మంది రైతులు ● ఇవ్వాల్సిన బాకీ రూ.5.60 కోట్లు ● ఏడాదిగా అడుగుతున్నా దిక్కులేదు ● మిల్లు ఎదుట ఆందోళనకు దిగిన అన్నదాతలు నెల్లూరు (పొగతోట): ‘మాయమై పోతున్నడమ్మా.. మనిషన్న వాడు మచ్చుకై నా లేడు చూడు.. మానవత్వము ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నాడో కాని కంటికి కానరాడు..’ అంటూ ఓ కవి రచన ‘అన్నదాతలకు అచ్చు గుద్దినట్లు సరిపోతోంది. స్వార్ధ పూరిత పాలకులు, మిల్లర్ల దోపిడీ దాష్టీకానికి అన్నదాతలు విలవిలలాడుతున్నారు. నెల్లూరుకు చెందిన శేఖర్‌బాబు నగరంలోని నవాబుపేట ప్రాంతంలో ఓ రైస్‌మిల్లును లీజుకు తీసుకుని, గతేడాది ఇదే సీజన్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 250 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించారు. రైతులు, దళారులకు రూ.5.60 కోట్ల చెల్లించాల్సి ఉంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మలిచి విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. ఏడాది కాలంగా ఆ రైతులకు, దళారులకు ధాన్యం డబ్బులు ఇవ్వకుండా తిప్పించుకుంటున్నాడు. తమ ధాన్యం డబ్బులు ఇప్పించాలని రైతులు, దళారులు అధికారులు, పోలీసులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నేతల చుట్టూ తిరిగారు. రైతులు ఇటీవల జిల్లా స్థాయి అధికారిని సంప్రదించగా ‘మీ డబ్బులు ఇప్పించడానికి నేనేమైనా రౌడీనా.. గూండానా’.. మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి అంటూ సమాధానం చెప్పడంతో చివరకు మంత్రులు నారాయణ, ఆనంలను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నా.. ఫలితం కానరాకపోవడంతో మంగళవారం రైతులు రైస్‌మిల్లు ఎదుట ఆందోళనకు దిగారు. డబ్బులిప్పించండి.. సారూ ఏడాది క్రితం శేఖర్‌బాబుకు ధాన్యం విక్రయించాం. పక్క మిల్లుల కంటే అధిక ధర ఇస్తానంటే ఆశతో ధాన్యం విక్రయించాం. డబ్బుల కోసం ఏడాది కాలంగా తిరుగుతున్నాం. స్థానిక అధికారుల నుంచి జిల్లా అధికారుల వరకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. జిల్లా ఉన్నతాధికారులైనా రైతులపై దయ చూపి ధాన్యం నగదు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి. – పవన్‌రెడ్డి, రైతు, ఆత్మకూరు అధికారులను సంప్రదించినా ఫలితం లేదు రైతుల నుంచి ధాన్యం సేకరించి నవాబుపేటలోని శేఖర్‌బాబుకు విక్రయించాం. లోడుకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు వస్తుందనే ఆశతో రైస్‌మిల్లర్‌కు ధాన్యం సరఫరా చేశాం. ధాన్యం నగదు కోసం గతేడాది కాలంగా పడరాని పాట్లు పడుతున్నాం. అధికారులు, ప్రజా ప్రతినిధులు, పోలీసుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేదు. న్యాయం జరిగేలా జిల్లా అధికారులైనా చర్యలు తీసుకోవాలి. – నర్సింహనాయుడు, దళారి ఆత్మకూరు ప్రాంతానికి చెందిన సుధాకర్‌రెడ్డి అనే దళారీ రూ.22 లక్షల విలువ చేసే ధాన్యాన్ని శేఖర్‌బాబుకు విక్రయించారు. అందులో రూ.4 లక్షల నగదు ఇచ్చాడు. మిగిలిన నగదు కోసం సుధాకర్‌రెడ్డి అనేక పర్యాయాలు రైస్‌మిల్లర్ చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. రైతులు ఒత్తిడి చేయడంతో అనారోగ్యం పాలయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుధాకర్‌రెడ్డికి వైద్య ఖర్చుల నిమిత్తం కనీసం రూ.20 వేలన్నా.. ఇవ్వాలంటూ ఆయన భార్య రైస్‌మిల్లర్‌ను ప్రాధేయపడింది. చిల్లిగవ్వ కూడా ఇవ్వకపోవడంతో సుధాకర్‌రెడ్డి మెరుగైన వైద్యం చేయించుకోలేక మరణించాడు. రైతుల నుంచి ఽమస్తాన్ అనే దళారీ దాన్యం సేకరించి శేఖర్‌బాబుకు విక్రయించారు. ధాన్యం డబ్బులు ఇవ్వకపోవడంతో రైతులు మస్తాన్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతను పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. శేఖర్‌బాబు గతంలో ఓ రైస్‌మిల్లులో గుమస్తాగా పనిచేసిన అనుభవంతో నవాబుపేట సమీపంలోని రైస్‌మిల్లును లీజుకు తీసుకున్నాడు. రైతులను, దళారులను అధిక ధర ఇస్తానంటూ నమ్మించాడు. దీంతో రైతులు, దళారులు అధిక ధర వస్తుందని శేఖర్‌బాబుకు ధాన్యం విక్రయించారు. అటువంటి వారిలో ఓ రైతు దిగులతో అనారోగ్యానికి గురై మృతి చెందగా, మరో దళారీ జైలుపాలయ్యాడు. ఆత్మకూరుకు చెందిన అనేక మంది రైతులు శేఖర్‌బాబుకు ధాన్యం విక్రయించారు. నగదు ఇవ్వకపోవడంతో రైతులు నగదు కోసం చేయని ప్రయత్నాలు లేవు. రైతులు దళారులతో కలిసి నగదు ఇవ్వాలంటూ పోలీసులను సంప్రదించారు. సీఐ వద్ద పంచాయితీ జరిగింది. జిల్లా అధికారులు, పోలీసు అధికారులు రైతులకు న్యాయం చేయకుండా రైస్‌మిల్లర్ల వైపు నిలబడ్డారు. రైస్‌మిల్లర్లు ఇచ్చే ముడుపులు తీసుకుని కోట్ల రూపాయలు దిగమింగిన మిల్లర్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. -
ఆరోగ్యశ్రీలో డబ్బులు వసూలు చేస్తే భారీ జరిమానా
● కలెక్టర్ ఆనంద్ నెల్లూరు(అర్బన్): డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవా (ఆరోగ్యశ్రీ) పథకం కింద వైద్య సేవలు పొందుతున్న రోగుల నుంచి అదనంగా ఫీజులు వసూలు చేసే ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు భారీగా జరిమానాలు విధిస్తామని కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన క్రమశిక్షణా కమిటీ సమావేశం జరిగింది. ఎన్టీఆర్ వైద్య సేవా జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ సుధీర్‌కుమార్ మాట్లాడుతూ పలు ఆస్పత్రుల్లో రోజు వారీ తనిఖీలు నిర్వహిస్తుండగా రోగ నిర్ధారణ కోసం అదనంగా రోగుల నుంచి 12 ఆస్పత్రుల యాజమాన్యాలు డబ్బులు వసూలు చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్‌కు వివరించారు. వీరందరికీ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు మరోమారు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. నోటీసులు అందుకున్న వారి నుంచి వివరణ తీసుకున్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీఎంహెచ్ఓ ఖాదర్‌వలీ, జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి (డీసీహెచ్ఎస్) డాక్టర్ రమేష్‌నాథ్, వైద్యసేవాట్రస్ట్ జిల్లా మేనేజర్ వెంకటమురళి పాల్గొన్నారు. -
యువకుడి ఆత్మహత్యాయత్నం
ఆత్మకూరు: ఓ యువకుడు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆత్మకూరు మండలం బోయలచిరివెళ్ల గ్రామంలో మంగళవారం జరిగింది. బాధితుడు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన సీహెచ్ అభినవ్శర్మ తండ్రి చనిపోవడంతో గ్రామంలోని దేవాలయంలో పూజలు నిర్వహిస్తుండేవాడు. పాలిటెక్నిక్ ఉత్తీర్ణుడయ్యాక తన తాతకు దేవాలయం పనులు అప్పగించి కార్లు అద్దెకు తిప్పుతున్నాడు. ఈ క్రమంలో దగదర్తి మండలం దుండిగం గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి అతడికి పరిచయమాయ్యాడు. అభినవ్ కార్లను శ్రీకాంత్ తీసుకొని తాను హైదరాబాద్ – గుంటూరు మధ్య అద్దెకు తిప్పుతానని నమ్మించాడు. అభినవ్ తన కార్లతోపాటు మరో ఇద్దరి వద్ద నుంచి రెండు కార్లను అద్దెకు తీసుకెళ్లాడు. శ్రీకాంత్ అద్దె చెల్లించకపోగా పరారయ్యాడు. దీంతో అభినవ్‌కు కార్లు అప్పగించిన వారు ఒత్తిడి చేయడంతో అతనే అద్దెలు చెల్లించాడు. దీంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాడు. శ్రీకాంత్ నుంచి సుమారు రూ.19 లక్షల నగదు రావాల్సి ఉండటం, ఇతరుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఇంటి వద్ద సూసైడ్ నోట్ రాసి నిద్ర మాత్రలు మింగాడు. అతని తల్లి, తమ్ముడు పరిశీలించి వెంటనే 108 అంబులెన్స్‌లో ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై ఎస్కే జిలానీ తెలిపారు. -
రూ.30 లక్షలు గోల్మాల్
ఆత్మకూరు: పట్టణంలోని డివిజన్ పోస్టాఫీసులో పోస్టల్ ఏజెంట్‌గా ఉన్న ఇమామ్ ఖాసీం తమ సంతకాలను ఫోర్జరీ చేసి తమ ఖాతాల్లోని నగదును డ్రా చేశాడని, డిపాజిట్ చేయమని చెల్లించిన నగదును కాజేశాడని కొందరు వ్యక్తులు మంగళవారం పోలీసులు, పోస్టాఫీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన దగుమాటి నారాయణరెడ్డి, నారాయణమ్మ దంపతులు కొన్నేళ్లుగా పోస్టాఫీసులో సేవింగ్ ఖాతాల్లో డిపాజిట్ రూపంలో జమ చేస్తుండేవారు. ఈ క్రమంలో పట్టణానికి చెందిన పోస్టల్ ఏజెంట్ షేక్ ఇమామ్ ఖాసీం పరిచయం కావడంతో నాలుగైదేళ్లుగా అతని ద్వారానే నగదును డిపాజిట్ చేయించడం, అవసరమైనప్పుడు విత్‌డ్రా చేస్తుండేవారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఉంటున్న తమ కుమార్తెలు, బంధువులైన పి సుజాత, కె స్వాతి, డి.స్వేత, డి రాజమ్మ ద్వారా కూడా పోస్టాఫీసులో ఇతని ద్వారానే ఖాతాలు తెరిపించి నగదు డిపాజిట్ చేస్తుండేవారు. ఇలా నమ్మకంగా వారి లావాదేవీలు నిర్వహిస్తున్న ఇమామ్ ఖాసీంకు వారం రోజుల క్రితం నారాయణమ్మ ఖాతా నుంచి నగదు తీసుకురావాలని సంతకం చేసి విత్ డ్రా ఫారం ఇచ్చారు. అయితే వారం గడిచినా నగదు తీసుకురాకపోవడంతో శనివారం గట్టిగా నిలదీశారు. తమ అల్లుడు సుధీర్‌రెడ్డి ద్వారా ఫోన్లో అడిగించారు. ఈ క్రమంలో సుధీర్‌రెడ్డి తన అత్త నారాయణమ్మను ఖాతా పాస్ పుస్తకాలు తీసుకెళ్లి పోస్టాఫీసులో విచారించగా ఇమామ్ వారం రోజుల క్రితమే ఆ నగదును తీసుకెళ్లినట్లు అధికారులు చెప్పడంతో మిగతా ఖాతాల పుస్తకాలను తెచ్చి చూశారు. నారాయణరెడ్డి ఖాతా లో రూ.13,08,800, నారాయణమ్మ ఖాతాలో రూ.12,66,000, డి రాజమ్మ ఖాతాలో రూ.3,27,800, డి స్వేత ఖాతాలో రూ.14000, కె స్వాతి ఖాతాలో రూ.43,595, పి సుజాతమ్మ ఖాతా లో రూ.87,000 ఇలా మొత్తం రూ.30,47,195 నగదు మాయమైందని గుర్తించి పోస్టల్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టల్ ఏజెంట్‌పై పోలీసులకు ఫిర్యాదు తనకేపాపం తెలియదంటున్న ఏజెంట్ లోతుగా విచారిస్తామన్న పోలీసులు నేను ఏ పాపం ఎరుగను తాను ఎలాంటి మోసానికి పాల్పడలేదని 32 ఏళ్లుగా పోస్టల్ ఏజెంట్‌గా పని చేస్తున్నానని ఏజెంట్ ఇమామ్ ఖాసీం తెలిపాడు. మూడు నెలల క్రితం నారాయణమ్మ కుటుంబీకులకు సంబంధించిన డిపాజిట్ బాండ్ మెచ్చ్యూర్ కావడంతో నగదును పోస్టాఫీసులో డ్రా చేయించి వారి వద్ద రూ.2.41 లక్షల నగదును అప్పుగా తీసుకుని, తన భార్యకు వైద్యం చేయించానన్నారు. తిరిగి రూ.80 వేలు ఫిబ్రవరిలో చెల్లించానని, ఇంకా రూ.1.61 లక్షలు అప్పు ఇవ్వాల్సి ఉందని తెలిపాడు. తనను ఆదివారం వారింటికి పిలిపించి బలవంతంగా ఖాళీ స్టాంప్‌లపై బాకీ ఉన్నానని సంతకాలు తీసుకున్నారని, కొన్ని ఖాళీ ప్రామిసరీ నోట్లపై కూడా సంతకాలు చేయించుకున్నారని, తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఈ విషయమై పోలీసులను సంప్రదించగా ఇరువురు ఫిర్యాదులు చేశారని, పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహించి నిజానిజాలు నిగ్గుతేలుస్తామని సీఐ, ఎస్సైలు తెలిపారు. -
సేదతీరుతూ..
నర్సింగ్ విద్యార్థిని అదృశ్యంనెల్లూరు(క్రైమ్): నర్సింగ్ విద్యార్థిని అదృశ్యమైన ఘటనపై నెల్లూరు వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. వెంకటాచలం మండలానికి చెందిన సింధు నెల్లూరు నగరంలోని రిచ్ నర్సింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. రోజూ ఆమె ఇంటి నుంచి కళాశాలకు వచ్చి వెళ్లేది. ఈనెల ఒకటో తేదీన కళాశాలకు వచ్చింది. అక్కడి నుంచి అదృశ్యమైంది. బాధిత కుటుంబ సభ్యులు గాలించినా జాడ తెలియకపోవడంతో సోమవారం రాత్రి వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తప్పిపోయిన చిన్నారి
నెల్లూరు(క్రైమ్): ఇంటి ముందు ఆడుకుంటూ తప్పిపోయిన చిన్నారిని గంటల వ్యవధిలోనే పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలు.. నెల్లూరులోని ముంగమూరువారి వీధిలో శంకర్‌సింగ్ కుటుంబం నివాసం ఉంటోంది. అతను కనకమహల్ సెంటర్లో పవర్ టూల్స్ వ్యాపారం చేస్తున్నాడు. శంకర్ మూడేళ్ల కుమార్తె మాధవి సింగ్ మంగళవారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఆడుకుంటూ తప్పిపోయింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు బాలిక కోసం చుట్టుపక్కల గాలించారు. జాడ తెలియకపోవడంతో చిన్నబజారు పోలీసులకు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు ఈ విషయాన్ని ఎస్పీ జి.కృష్ణకాంత్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా గాలించారు. కాపువీధిలో చిన్నారి ఏడుస్తూ ఉండగా వినోద్‌కుమార్ అనే వ్యక్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన చిన్నారి విషయాన్ని సమీపంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న చిన్నబజారు పోలీసులకు తెలియజేశారు. వారు చిన్నారిని తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. గంటల వ్యవధిలోనే కుమార్తెను సురక్షితంగా అప్పగించిన ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, సిబ్బందికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. గంటల వ్యవధిలోనే గుర్తింపు తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు -
రైతులు నిండా మునిగిపోతున్నారు..
● టీడీపీ నేతతోపాటు అన్నదాతల ఆవేదన కోవూరు: రైతులందరూ నిండా మునిగిపోతున్నారు. గత సీజన్లో నాలుగు పుట్లు దిగుబడి వస్తే ఇప్పుడు మూడు పుట్లు మాత్రమే వచ్చింది. గత సీజన్లో పుట్టి రూ.24 వేలకు అమ్మితే.. ఇప్పుడు పుట్టి రూ.15,200 కూడా కొనడం లేదు. ఓ టీడీపీ నేత జిల్లా వ్యవసాయశాఖాధికారిణి సత్యవాణిని నిలదీశాడు. మండలంలోని పాటూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీఏఓ సత్యవాణి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ టీడీపీ నేత లక్ష్మీశెట్టి శీనయ్య మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో పట్టలు లేవని, ధాన్యాన్ని ఆరబెడితే వర్షం వస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇప్పుడు మీటింగ్ పెట్టి ప్రభుత్వ మద్దతు ధర రావాలంటే తేమ శాతం వస్తేనే కొలుస్తామన్నారు. ఇదేం సమాధానం. ఎకరానికి రూ.30 వేలు నష్టపోతున్నాం.. ఈ నష్టం డబ్బులెవరిస్తారు. పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్ క్వింటాకు రూ.300 ఎక్కువ ఇస్తామన్నారు. ఎక్కడిచ్చారంటూ నిలదీశారు. నిర్దిష్ట తేమ శాతం రావాలంటే.. ఇంకా పది రోజులు ఆరబోయమంటున్నారు. ఎక్కడ ఆరబోయాలి. పట్టలిచ్చారా? కల్లాలిచ్చారా? ఎక్కడ ఆరబోయాలంటూ ప్రశ్నించారు. దీంతో ఆమె ఏదో సర్దిచెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పడుగుపాడు సొసైటీని కార్యాలయాన్ని రైతులతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక ఎకరానికి సాగు ఖర్చులు రూ.40 వేలు అవుతుంటే.. పుట్టి ధాన్యం రూ.15 వేలకు కూడా మిల్లర్లు కొనడం లేదని, ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, సీనియర్ నాయకురాలు జక్కా శేషమ్మ, రైతు సంఘం నాయకుడు ఎం. వెంగయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎం.పుల్లయ్య, జి శేషయ్య తదితరులు పాల్గొన్నారు. -
తీరానికి కోత..
సముద్ర తీరంలో ఇసుకను అక్రమంగా తరలించడంతో ఇసుక దిబ్బలు చదునుగా మారిన దృశ్యం అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరు ప్రకృతి వినాశానికి పాల్పడుతున్నారు. ఈ పరిణామాలు భవిష్యత్‌లో పెను ముప్పునకు దారితీయనున్నాయి. వాతావరణ విపత్తు తలెత్తినప్పుడు తీరంలోనే ఎగిసిపడే అలలు.. గ్రామాలకు గ్రామాలను ముంచెత్తే ప్రమాదాలు లేకపోలేదు. తీరానికి కోత పెడుతూ సాగిస్తున్న ఇసుక దందా మున్ముందు గుండె కోతలను మిగల్చనుంది. ఇప్పటి వరకు నదులు, కాలువలు, వాగుల్లో ఇసుకను కొల్లగొట్టిన అక్రమార్కులు ఇప్పుడు సముద్ర ఇసుకపై పడ్డారు. కావలి: ఇసుకాసురుల బరి తెగింపు.. తీర ప్రాంత గ్రామాలకు పెను ముప్పుగా పరిణమించనుంది. అక్రమార్జనే ధ్యేయంగా అధికార పార్టీ అండతో కొందరు సముద్ర ఇసుక దందాకు పాల్పడుతున్నారు. కావలి మండలం అన్నగారిపాళెం, బోగోలు మండలం జువ్వలదిన్నె పంచాయతీ పరిధిలోని సముద్ర తీరంలో ఉన్న ఉప్పు ఇసుకను అక్రమార్కులు కొంత కాలంగా యథేచ్ఛగా తరలిస్తున్నారు. సముద్రం అంచున ఉండే ఇసుకను జేసీబీలు పెట్టి టిప్పర్లతో రేయింబవళ్లు తరలిస్తున్నారు. సముద్ర తీరానికి, గ్రామాల మధ్య రక్షణగా ఇసుక కట్టలు (చెలియ కట్టలు), మడ అడవులు ఉండేవి. కాలక్రమంలో మడ చెట్లు అంతరించిపోవడంతో ఇసుక దిబ్బలే రక్షణ గోడగా నిలుస్తున్నాయి. ఊర్లకు ఊర్లే కొట్టుకుపోతాయి ప్రకృతి, వాతావరణంలో మార్పుల కారణంగా సముద్రంలో అల్పపీడన ద్రోణి, వాయుగుండాలు, తుపాన్లు ఏర్పడినప్పుడు తరచూ సముద్రం సాధారణ పరిస్థితి కంటే 50 నుంచి వంద అడుగుల మేర ముందుకు చొచ్చుకు వస్తు న్న పరిణామాలను గమనిస్తున్నాం. సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చినప్పుడు ఈ ఇసుక కట్టలే రక్షణగా ఉంటున్నాయి. సుమారు 20 ఏళ్ల క్రితం వచ్చిన సునామీ సమయంలో చాలా చోట్ల అనేక గ్రామాలను ఈ ఇసుక దిబ్బలే కాపాడాయి. ప్రస్తుతం అక్రమార్కులు సముద్రం అంచున ఉన్న ఇసుకను తరలించడంతో తీరానికి, గ్రామాలకు మధ్య రక్షణగా ఉండే ఇసుక కట్టలు లేకుండాపోతున్నాయి. ఈ పరిణామాలతో భవిష్యత్‌లో ఇంతకంటే ఎక్కువ స్థాయిలో అలల ఉధృతి పెరిగితే నేరుగా అలలు తీర ప్రాంతాల్లోని ఊర్లకు ఊర్లే కొట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉందని స్థానిక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. సముద్రం ఒడ్డున ఇసుకను విచ్చలవిడిగా తరలిస్తున్నా.. మత్స్యశాఖ అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు, సచివాలయ అధికారులు, సిబ్బంది కళ్లు మూసుకుని తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సముద్రపు ఇసుక తరలింపు ప్రమాదకరం కావలి ప్రాంతంలోని సముద్ర తీరప్రాంతం నుంచి ఇసుకను జేసీబీల సహాయంతో టిప్పర్ల ద్వారా విచ్చలవిడిగా తరలిస్తున్నారని, ఇది ప్రమాదకరమ ని జాతీయ మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షుడు పోన్నపూడి తాతారావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ ఒ.ఆనంద్ వినతిపత్రం అందజేశారు. ఇసుక తవ్వకాలతో భవిష్యత్‌లో అలలు గ్రామాలను ముంచెత్తే అవకాశం లేక పోలేదని పేర్కొన్నారు. ఈ ఇసుకను ఎక్కడికి తరలిస్తున్నారో తెలియడం లేదు. ఆ ఇసుకతో సాగించే నిర్మాణాలకు భద్రత ఉండదు. ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్న వ్యవహారంపై విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అక్రమార్కుల బరితెగింపు సముద్ర ఇసుక అక్రమ రవాణా భవిష్యత్‌లో గ్రామాలను ముంచనున్న అలలు -
వీఆర్వో, సర్వేయర్‌పై చర్యలు తీసుకోవాలి
● వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి నెల్లూరు సిటీ: ఉన్నతాధికారులకు సమాచారం కూడా ఇవ్వకుండా టీడీపీ నాయకుల ఆదేశాలతో ఆమంచర్ల బిట్–2 ఎంపీటీసీ సభ్యుడు సురేంద్రరెడ్డికి చెందిన స్థలం హద్దు కంచెను తొలగించిన వీఆర్వో, సచివాలయ సర్వేయర్‌పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరులోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ లాజరస్‌కు సోమవారం అప్పయ్యకండ్రిగ గ్రామస్తులు, సురేంద్రరెడ్డితో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ అప్పయ్యకండ్రిగలోని పడమరవీధిలో సురేంద్రరెడ్డికి చెందిన పూర్వీకుల స్థలం చుట్టూ ఉన్న హద్దు కంచెను వీఆర్వో, సచివాలయ సర్వేయర్లు జేసీబీతో తొలగించారన్నారు. గ్రామస్తులు ప్రశ్నించగా వారు అక్కడి నుంచి వెళ్లిపోయారన్నారు. ఈ క్రమంలో తాను రూరల్ సీఐకి ఫోన్ చేసి లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని, చర్యలు తీసుకోవాలని చెప్పానన్నారు. అలాగే డిప్యూటీ తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్తే తాము ఆదేశాలివ్వలేదని చెప్పారన్నారు. టీడీపీ నాయకుల ఆదేశాలతో కంచె తొలగించారని మండిపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపి వారిద్దరిపై కఠిన చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. లేకపోతే కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్తామన్నారు. బాధితుడిపైనే జేసీబీ నిర్వాహకుడు తప్పు డు కేసు పెట్టారన్నారు. సురేంద్రరెడ్డి ఆమంచర్లలోని 23 కుటుంబాలకు న్యాయం చేసేందుకు ముందుకు రావడమే చేసిన తప్పా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ మండలాధ్యక్షుడు పుచ్చలపల్లి రాంప్రసాద్‌రెడ్డి, నాయకులు శివాజీ, వెంకటసుబ్బారెడ్డి, రఘురామ్‌రెడ్డి, సుమన్‌రెడ్డి, సింహాద్రి, మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.వెబ్సైట్లో సీనియారిటీ జాబితానెల్లూరు(టౌన్): జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ పరిధిలోని స్కూళ్లలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచినట్లు డీఈఓ ఆర్.బాలాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దానిపై అభ్యంతరాలుంటే మంగళవారం నుంచి 10వ తేదీ లోపు సంబంధిత జిల్లా విద్యాశాఖ, ప్రాంతీయ సంయుక్త సంచాలకుల పాఠశాల విద్యాశాఖకు సమర్పించాలన్నారు. అభ్యంతరాలను ఫిర్యాదుల పరిష్కార కమిటీ పరిశీలించి తుది నిర్ణయాన్ని తెలియజేస్తుందన్నారు. వివరాలకు జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. లైంగికదాడి కేసులో ఒకరికి పదేళ్ల జైలునెల్లూరు(లీగల్): బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడినట్టు నమోదైన కేసులో దేవరకొండ విజయకుమార్ అనే వ్యక్తికి పదేళ్ల జైలుశిక్ష, రూ.22 వేల జరిమానా విధిస్తూ నెల్లూరు పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సిరిపిరెడ్డి సుమ సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. జలదంకి ప్రాంతానికి చెందిన ఓ బాలిక 2017లో బ్రాహ్మణక్రాక గ్రామంలోని బంధువులు ఇంటికి వెళ్లింది. అదే గ్రామానికి చెందిన విజయకుమార్ ప్రేమ పేరుతో నమ్మించి బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తాత ఫిర్యాదు మేరకు జలదంకి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం నిందితుడిపై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో జైలుశిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. గుర్తుతెలియని మృతదేహాలు లభ్యంవెంకటాచలం: మండలంలోని జోసఫ్‌పేట గ్రామ సమీపంలో సర్వేపల్లి రిజర్వాయర్‌లో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు సోమవారం గుర్తించారు. గత నెల 20వ తేదీన గొలగమూడి సమీపంలో సర్వేపల్లి కాలువలో మహిళ మృతదేహం నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడాన్ని రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ మృతదేహం జోసఫ్‌పేట వద్ద రిజర్వాయర్ కట్ట అంచుకు రావడంతో స్థానికులు చూసి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అల్లూరు కాలువలో.. కొడవలూరు: మండలంలోని గండవరం సమీపంలోని అల్లూరు కాలువలో సుమారు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు సోమవారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆ వ్యక్తి చనిపోయి మూడురోజులై ఉండొచ్చని భావిస్తున్నారు. బ్లూ కలర్ కాటన్ చొక్కా, లుంగీ ధరించి ఉన్నాడు. మద్యం బాటిల్ ఉన్నట్లు ఎస్సై తెలిపారు. ఉదయకళేశ్వరుని తిరునాళ్లకు వచ్చి బహిర్భూమి నిమిత్తం కాలువ వద్దకు వెళ్లి మద్యం మత్తులో కాలువలో పడి మృతిచెంది ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు. -
బీజేపీ నేతల నిరసన
హౌసింగ్ అధికారులు ప్రభుత్వ ఆదేశాలు పాటించలేదని బీజేపీ నేత మిడతల రమేష్ అన్నారు. నాయకులు కలెక్టరేట్లో నిరసన తెలిపి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన పీఎంఏవై గృహాలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. కొందరు అధికారులు ఫైనల్ బిల్లులు చేసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. విజిలెన్స్ విచారణకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపకుండా ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో నిధులు విడుదల కావడం లేదన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన కందికట్ల రాజేశ్వరి, పొట్లూరు శ్రీనివాసులు, ప్రసాద్, రఘురామయ్య, పద్మ, సుజన, నాగేంద్రసింగ్, ఓజిలి సుధాకర్ నారాయణ యాదవ్, సుబ్బయ్య యాదవ్, కల్లు భాస్కర్, ముజీబ్, వెంకటేష్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదుల్లో కొన్ని..
● నెల్లూరు బారకాస్ సెంటర్‌కు చెందిన సునీల్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. సినిమా రంగంలో అడుగులు వేయాలంటే ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు వెళ్లాలని నమ్మించాడు. అక్కడకు తీసుకెళ్లి మత్తుపానీయాలిచ్చి లైంగికదాడి చేశాడు. అసభ్యకర ఫొటోలు, వీడియోలు తీశాడు. తాను చెప్పినట్లు వినకపోతే వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించి నగదు తీసుకున్నాడు. ఇంకా కావాలంటూ దాడి చేయడమే కాకుండా నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. అతడిపై చర్యలు తీసుకోవాలని దర్గామిట్టకు చెందిన ఓ యువతి కోరారు. ● హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో సూపర్వైజర్గా పనిచేస్తున్నానని పొదలకూరుకు చెందిన సునీల్ అనే వ్యక్తి నమ్మించాడు. నా కుమారుడికి అక్కడ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.1.43 లక్షలు తీసుకున్నాడు. నెలలు గడుస్తున్నా జాబ్ ఇప్పించలేదు. నగదు తిరిగివ్వాలని కోరగా పట్టించుకోవడం లేదు. విచారించి న్యాయం చేయాలని పొదలకూరుకు చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ● నా ఆర్థిక అవసరాల నిమిత్తం రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను. అక్కడి కాంట్రాక్టర్ రమేష్ కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేశాడు. నిరాకరించడంతో కోపంతో నాపై దాడిచేసి అవమానకరంగా మాట్లాడాడు. అతడిపై చర్యలు తీసుకోవాలని తోటపల్లిగూడూరు మండలానికి చెందిన ఓ మహిళ కోరారు. ● నా భర్త మద్యం వ్యసనానికి బానిసై నన్ను, పిల్లలను పట్టించుకోవడం లేదు. మద్యం మత్తులో మమ్మల్ని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని వేదాయపాళేనికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ● నెల్లూరు రూరల్ మండలానికి చెందిన శ్రీనివాసులురెడ్డి అనే వ్యక్తి నాకు ప్లాట్‌ను విక్రయించాడు. అందులో నిర్మాణ పనులు చేపడుతుండగా ఆ స్థలం తమదని కొందరు అడ్డుకున్నారు. విచారించగా డబుల్ రిజిస్ట్రేషన్ అని తేలింది. విచారించి చర్యలు తీసుకోవాలని ఓ వ్యక్తి అర్జీ ఇచ్చాడు. -
‘నా కుమారుడు దౌర్జన్యం చేస్తున్నాడు’
నెల్లూరు(క్రైమ్): ‘వృద్ధాప్యంలో ఉన్న నన్ను బాగా చూసుకుంటానని చిన్న కుమారుడు నమ్మించాడు. నా పేరు మీద ఉన్న ఇంటిని తన పేరుపై రాయించుకుని పట్టించుకోవడం లేదు. ఇదేమని ప్రశ్నిస్తే దౌర్జన్యం చేస్తున్నాడు. విచారించి న్యాయం చేయండి’ అంటూ తోటపల్లిగూడూరు మండలానికి చెందిన ఓ వృద్ధుడు పోలీసులను కోరాడు. సోమవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 85 మంది విచ్చేసి తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ జి.కృష్ణకాంత్‌కు అందజేశారు. త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంత పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర, ఎస్బీ డీఎస్పీలు పి.సింధుప్రియ, ఎ.శ్రీనివాసరావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీసులకు ఓ తండ్రి ఫిర్యాదు సినిమాల్లో అవకాశం పేరుతో లైంగికదాడి ఓ యువతి ఆవేదన నెల్లూరులో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ -
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.61 సన్నవి : రూ.40 పండ్లు : రూ.30 నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు బ్రాయిలర్ (లైవ్) : 119 లేయర్ (లైవ్) : 85 బ్రాయిలర్ చికెన్ : 214 బ్రాయిలర్ స్కిన్లెస్ : 236 లేయర్ చికెన్ : 145 -
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం..
ఆప్కాస్‌ను రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను అప్పగించేందుకు యత్నించడం దారుణమని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుమల్లి శంకర్ కిశోర్ అన్నారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆప్కాస్‌ను రద్దు చేస్తామని లీకులిస్తున్నారని తెలిపారు. ఒక వ్యవస్థను మార్చాలంటే అంతకంటే మంచి మార్గం చూపాలే తప్ప రద్దు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. దీని వల్ల ప్రైవేట్ ఏజెన్సీలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తాయన్నారు. అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. -
కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్యాయం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెంకటాచలం: కూటమి ప్రభుత్వంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కసుమూరు గ్రామంలో సోమవారం ఆయన రైతులతో కలిసి ధాన్యం రాసులను పరిశీలించారు. పంటకు మద్దతు ధర లేదని, కొనుగోలు కేంద్రాల్లో గింజ కొనడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం గోవర్ధన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలియజేశారు. జిల్లాలో రైతులు పండించిన ధాన్యం 16 లక్షల పుట్లు మార్కెట్లోకి వస్తే రూ.400 కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. అధికారులు 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలంటూ ఆర్భాటంగా ప్రకటించినా, క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రాల్లో గోనెసంచులు, కొనుగోలు చేసే సిబ్బంది కనిపించడం లేదన్నారు. మద్దతు ధర లేనికారణంగా ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు నష్టపోతున్నారని మండిపడ్డారు. బడ్జెట్లో మద్దతు ఽధర కోసం కేవలం రూ.300 కోట్లు మాత్రమే కేటాయించారని, గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించినట్లు చెప్పారు. నాడు పుట్టి ధర రూ.23 వేల నుంచి రూ.28 వేల వరకు పలకడంతో రైతులు సంతోషంగా పంటను అమ్ముకున్నారని గుర్తు చేశారు. దోచుకోవడంపైనే సోమిరెడ్డి దృష్టి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి దోచుకోవడంపైనే దృష్టి పెట్టారని కాకాణి విమర్శించారు. ఆయన ప్రజలు, రైతుల సమస్యల్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సాగునీటి కాలువల్లో పనులు చేయకుండానే బిల్లులు చేసుకుని నిధులు స్వాహా చేశాడన్నారు. రైతుల్ని ఆదుకోవాలని కూటమి నేతలు గ్రీవెన్స్‌డేకు వెళ్లి జిల్లా అధికారులను కోరుతున్నట్లు చెప్పారు. దీనిని చూసిన ప్రజలకు ఈ ప్రభుత్వ చేతగానితనం స్పష్టమైందన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవాలని కోరారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి, మద్దతు ధర కల్పించి, నష్టపోయిన రైతులకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర కోసం వైఎస్సార్సీపీ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కనుపూరు కోదండరామిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, మండల కన్వీనర్ కొణిదెన మోహన్‌నాయుడు, విజయభాస్కర్‌నాయుడు, హుస్సేన్, చీకుర్తి నరసయ్య, గుర్రం పుట్టయ్య, సర్పంచ్ కడివేటి శివ, ఉపసర్పంచ్ బాబర్ తదితరులు పాల్గొన్నారు. -
కుమారుల్ని స్వదేశానికి రప్పించాలంటూ..
ఏజెంట్ మోసంతో మా పిల్లలు మలేసియా జైల్లో చిక్కుకున్నారని, వారిని స్వదేశానికి రప్పించాలని రాపూరు మండలం తెగచర్లకు చెందిన కరిపం జయమ్మ, పెద్దయ్య కోరారు. ఈ మేరకు కలెక్టర్ ఆనంద్‌కు వినతిపత్రం సమర్పించారు. గ్రామానికి చెందిన కరిపం సింహాద్రి, పవన్ పదినెలల క్రితం చైన్నెలోని ఓ ఏజెంట్ ద్వారా మలేసియాలోని హో టల్లో పనినిమిత్తం వెళ్లారు. ఏజెంట్ వర్క్ పర్మిట్ అని చెప్పడంతో నమ్మి మోసపోయారు. మూడు నెలల క్రితం వర్క్ పర్మిట్ లేదని, అది కేవలం టూరిజం వీసా అని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దీనిపై ఏజెంట్‌ను సంప్రదించగా అతను సరిగా సమాధానం ఇవ్వట్లేదని తల్లిదండ్రులు తెలిపారు. ఎలాగైనా వారిని ఇండియాకు రప్పించాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. -
ఘనంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల గ్రాడ్యుయేషన్ డే
● 177 మందికి డాక్టర్ పట్టాలు నెల్లూరు(అర్బన్): నెల్లూరు దర్గామిట్టలోని ఏసీఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సోమవారం రాత్రి గ్రాడ్యుయేషన్ (స్నాతకోత్సవం) డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల పీజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ నరేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీటు తెచ్చుకోవడం ఒక వరమన్నారు. ఎంతో కష్టపడి డాక్టర్లుగా మారారని కొనియాడారు. రోగులను గౌరవిస్తూ వారిని ప్రేమగా చూడాలన్నారు. డిప్యూటి కలెక్టర్ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ రోగుల ప్రాణాలను కాపాడే డాక్టర్లకు సమాజంలో ప్రత్యేక స్థానముందన్నారు. దానిని నిలుపుకొనేందుకు కృషి చేయాలన్నారు. ప్రొఫెసర్లు మస్తాన్‌బాషా, కాలేషాబాషాలు మాట్లాడుతూ నిరంతర శ్రమ వల్లనే నేడు డాక్టర్లుగా మారారని కొనియాడారు. నీతి, నియమాలు, రోగులను ప్రేమతో మాట్లాడే విధానాలే డాక్టర్లను ఉన్నత స్థానంలో నిలుపుతాయన్నారు. నూటికి 80 శాతం పేదరోగులే ఆస్పత్రులకు వస్తారన్నారు. అలాంటి వారిని అక్కున చేర్చుకుని సేవలందించాలని కోరారు. డబ్బు కోసం వైద్య ప్రాథమిక లక్ష్యాలను అమ్ముకోవద్దని సూచించారు. ప్రస్తుతం డాక్టర్లపై దాడులు జరుగుతున్నాయన్నారు. అలా జరగకుండా ఉండాలంటే నైతిక విలువలు పాటిస్తూ.. వాస్తవాలను చెబుతూ వైద్యసేవలందించాలని సూచించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఆరో బ్యాచ్‌గా నూటికి నూరుశాతం మంది డాక్టర్లుగా పట్టాలు అందుకోవడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా పట్టాలు పొందిన వారందరితో విలువలతో వైద్య సేవలందిస్తామంటూ ప్రమాణం చేయించారు. 177 మందికి పట్టాలు అందజేశారు. అనంతరం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డాక్టర్లు వెంకటేశ్వర్లు, ఖాదర్‌వలీ, రాజమ్మ, విజిత, పలువురు డాక్టర్లు పాల్గొన్నారు. -
ప్రతి వారం వెల్లువలా అర్జీలు
● ఈ సోమవారం సంఖ్య 436 ● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నెల్లూరు రూరల్: అర్జీల సంఖ్య తగ్గడం లేదు. మండలాల్లోని కొందరు అధికారులు సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకపోవడంతో ప్రజలు జిల్లా కేంద్రం బాట పడుతూనే ఉన్నారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ ఆనంద్, అధికారులు వినతులు స్వీకరించారు. ఈసారి కూడా రికార్డు స్థాయిలో 436 అర్జీలను ప్రజలు అందజేశారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 169, పోలీస్ శాఖవి 61, మున్సిపల్ శాఖవి 36, సర్వేవి 36, పంచాయతీరాజ్ శాఖవి 34, విద్యుత్ శాఖవి 9 తదితర శాఖలకు సంబంధించి అర్జీలు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. రెవెన్యూ అంశాలకు సంబంధించి వినతులు ఎక్కువగా వస్తున్నాయని వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో ఉదయభాస్కర్‌రావు, జెడ్పీ సీఈఓ విద్యారమ, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌రెడ్డి, డ్వామా పీడీ గంగాభవాని తదితరులు పాల్గొన్నారు. -
6 నుంచి మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు
నెల్లూరు(అర్బన్): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 6వ తేదీ నుంచి మూడురోజులపాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహిస్తామని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మన్నేపల్లి పెంచలరావు తెలిపారు. నెల్లూరు దర్గామిట్టలోని ఎన్జీఓ భవన్లో ఆ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని మహిళా విభాగం చైర్పర్సన్ ఉదయగిరి చిన్నమ్మ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెంచలరావు మాట్లాడుతూ పోటీలను ఏసీ స్టేడియంలో కలెక్టర్ ఆనంద్ ప్రారంభిస్తామన్నారు. మహిళా ఉద్యోగులు పాల్గొనేందుకు కలెక్టర్ రెండురోజులపాటు ప్రత్యేక అనుమతి ఇచ్చారన్నారు. 8న సెలవు మంజూరు చేశారన్నారు. ఈ మూడురోజులు ఉద్యోగులకు భోజనం, తాగునీరు ఇతర వసతులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శివారెడ్డి, విద్యాసాగర్‌లు ముఖ్యఅతిథిలుగా విచ్చేస్తారన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ పోటీలలో మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారుపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి రామకృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి లక్కాకుల పెంచలయ్య, ఇంకా ఆంజనేయవర్మ, ప్రసాద్‌రెడ్డి, కరుణమ్మ, కృష్ణంరాజు, సతీష్‌బాబు, రాజేంద్రప్రసాద్, విజయబాబు, కృష్ణకుమార్, సువర్ణ, స్వర్ణలత, నవోదయ, లక్ష్మి, జానకి, కిష్టమ్మ, సుమన తదితరులు పాల్గొన్నారు.వర్చుసా లేఅవుట్ ప్రారంభంమనుబోలు: మండల పరిధిలోని కాగితాలపూరు క్రాస్‌రోడ్డు సమీపంలో జాతీయ రహదారి పక్కన వర్చుసా లేఅవుట్‌ను ఆదివారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చేతుల మీదుగా లేఅవుట్‌ను ప్రారంభించారు. సినీ హీరోయిన్లు నిధి అగర్వాల్, ఐశ్వర్య రాజేష్, జబర్దస్త్ కమెడియన్లు సందడి చేశారు. ఈ సందర్భంగా లేఅవుట్ యజమాని వెంకటేశ్వర్లు, జీఎం శివాజీ మాట్లాడుతూ హైవే పక్కనే అందరికీ అందుబాటులో లేఅవుట్‌ను తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. బస్సు సౌకర్యం, 300 మీటర్ల దూరంలో రైలు సౌకర్యాలున్నాయని తెలిపారు. లేఅవుట్లో విశాలమైన రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నేడు ప్రత్యేక ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంకలువాయి: మండలంలోని మాదన్నగారిపల్లి సచివాలయంలో సోమవారం జాయింట్ కలెక్టర్ కార్తీక్, ఆత్మకూరు ఆర్డీఓ అధ్యక్షతన ప్రత్యేక ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమం నిర్వహించనున్నట్టు తహసీల్దార్ శ్యామ్‌సుందర్‌రాజు ఆదివారం తెలిపారు. రైతులు హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని కోరారు.వృద్ధుడి ఆత్మహత్యనెల్లూరు(క్రైమ్): అనారోగ్యమో మరే ఇతర కారణమో స్పష్టంగా తెలియదు గానీ ఓ వృద్ధుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. సంతపేటకు చెందిన సత్యనారాయణ (60), సుజాత దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. ఒకరు అమెరికాలో ఉండగా, మరొకరు ఇక్కడే ఉంటున్నారు. సత్యనారాయణ గతంలో కుదువ వ్యాపారం చేసేవాడు. రెండేళ్లుగా మతిస్థిమితం సక్రమంగా లేక ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అప్పుడప్పుడు వచ్చి భార్యకు కనిపించేవాడు. శనివారం రాత్రి ఆయన సంతపేట సమీపంలో పురుగు మందు తాగాడు. చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. సుజాత ఫిర్యాదు మేరకు సంతపేట ఎస్సై బాలకృష్ణ కేసు నమోదు చేశారు. కండలేరులో 51.647 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 51.647 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 760, లోలెవల్ కాలువకు 110, హైలెవల్ కాలువకు 160, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.61 సన్నవి : రూ.40 పండ్లు : రూ.30 పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు బ్రాయిలర్ (లైవ్) : 116 లేయర్ (లైవ్) : 80 బ్రాయిలర్ చికెన్ : 210 బ్రాయిలర్ స్కిన్లెస్ : 230 లేయర్ చికెన్ : 136 -
తోపుడు బండ్లను ఢీకొన్న కారు
నెల్లూరు(క్రైమ్): కారు మితిమీరిన వేగంతో రోడ్డుపక్కనే ఉన్న తోపుడు బండ్లు, స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటన నెల్లూరులోని కేవీఆర్ పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం జరిగింది. సేకరించిన సమాచారం మేరకు.. కస్తూరిదేవి గార్డెన్స్ ఎదురు ఖాళీ స్థలం వద్ద రోడ్డుమార్జిన్‌లో తోపుడు బండ్లపై కొందరు పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఫత్తేఖాన్‌పేట నుంచి కేవీఆర్ పెట్రోల్ బంకు వైపు కారు మితిమీరిన వేగంతో వస్తూ రెండు పండ్ల బండ్లను, ఒక స్కూటీని ఢీకొట్టి ఆగిపోయింది. వ్యాపారులు, స్కూటీ యజమాని సకాలంలో పక్కకు దూకడంతో ప్రమాదం తప్పింది. ప్రమాదానికి కారణమైన కారు ముందుబాగం దెబ్బతింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. తల్లీబిడ్డల అదృశ్యంముత్తుకూరు: భర్త వైఖరితో మనస్తాపం చెందిన ఓ భార్య తన ఇద్దరు పిల్లలను తీసుకుని అదృశ్యమైన ఘటన కృష్ణపట్నం పంచాయతీలో జరిగింది. ఆదివారం కృష్ణపట్నం ఎస్సై శ్రీనివాసరెడ్డి వివరాలు వెల్లడించారు. ఆర్కాట్పాళేనికి చెందిన సురేష్, పామంజి కల్యాణి దంపతులకు లీలా మనోహర్, భార్గవ్ అనే పిల్లలున్నారు. సురేష్ నిరుద్యోగిగా ఉండటం భార్యకు నచ్చలేదు. పుట్టింటి నుంచి తెచ్చిన డబ్బుతో భర్త ద్వారా రొయ్యల పెంపకం చేయాలనుకుంది. కాగా అందులో సగం డబ్బు ఖర్చు కావడం ఆమెను తీవ్ర వేదనకు గురిచేసింది. భర్తపై అలిగి ఇద్దరు పిల్లలను తీసుకుని శనివారం కల్యాణి ఇంటి నుంచి వెళ్లిపోయింది. సురేష్ గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరులో యువతినెల్లూరు(క్రైమ్): ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు బయోడేటా తయారు చేసుకుని వస్తానని ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైంది. పోలీసుల కథనం మేరకు.. గుప్తా పార్కు ప్రాంతానికి చెందిన యువతి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. బయోడేటా తయారు చేసుకునేందుకు గాంధీబొమ్మ సెంటర్‌కు వెళ్తున్నానని ఆమె ఆదివారం కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చింది. తిరిగి రాకపోవడంతో కుటుంబం గాలించింది. ఆచూకీ తెలియకపోడంతో సంతపేట పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చీఫ్ నిర్లక్ష్యం.. విద్యార్థికి సంకటం
కందుకూరు రూరల్: కందుకూరులోని టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, పరీక్ష కేంద్ర చీఫ్ సూపరింటెండెంట్ నాగూర్‌వలీ నిర్లక్ష్యంతో ఓ విద్యార్థిని పరీక్ష రాయలేదు. ఉన్నతాధికారుల సూచనలను సైతం లెక్క చేయకుండా.. పరీక్షకు విద్యార్థినిని దూరం చేశారు. జరిగిందిదీ.. టీఆర్ఆర్ జూనియర్ కళాశాల కేంద్రంలో ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు తెలుగు, సంస్కృతం, ఉర్దూ సబ్జెక్టులకు పరీక్షను జరపాలి. అయితే ప్రతిభ కళాశాలకు చెందిన ఇంద్రకంటి శరణ్య సంస్కృతాన్ని చదివినా, ఆమెకు ఇచ్చిన హాల్‌టికెట్‌లో తెలుగు సబ్జెక్టుగా ముద్రించారు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లేంత వరకు ఈ అంశాన్ని విద్యార్థిని గమనించలేదు. తీరా తెలుగు ప్రశ్నపత్రాన్నిచ్చారు. అయితే తాను చదివింది సంస్కృతమని, ఆ ప్రశ్నపత్రాన్నే ఇవ్వాలని కోరారు. కాగా హాల్‌టికెట్‌లో ఏ సబ్జెక్టుంటే దాన్నే ఇస్తామని ఖరాఖండీగా చెప్పడంతో మూడు గంటల పాటు పరీక్ష రాయకుండా విద్యార్థిని కూర్చుండిపోయారు. ఆదేశాలు బేఖాతర్ హాల్టికెట్లలోని సబ్జెక్టుల్లో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే ముందే మార్చుకోవాలని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఒకవేళ పొరపాటు జరిగితే విద్యార్థి ఏ పరీక్ష రాస్తారో అదే ప్రశ్నపత్రాన్ని ఇవ్వాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా చీఫ్ నాగూర్‌వలీ వీటిని ఏ మాత్రం పట్టించుకోకుండా విద్యార్థినిని పరీక్షకు దూరం చేశారు. కాగా ఈ అంశమై ఆర్ఐఓ శ్రీనివాసులును సంప్రదించగా, విద్యార్థినిని పరీక్ష రాయనీయకపోవడం పొరపాటేనని, దీనిపై విచారణ జరుపుతామని బదులిచ్చారు. ఇంటర్ పరీక్షలో చేదు అనుభవం చదివింది సంస్కృతం.. కానీ హాల్‌టికెట్‌లో తెలుగుగా ముద్రణ అందులో ఏది ఉంటే అదే రాయాలని ఆదేశం చివరికి ఎగ్జామ్ రాయకుండానే వెనుదిరిగి -
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● గతంలో పూరిళ్లు, గడ్డివాములు అధికంగా అగ్నికి ఆహుతయ్యేవి. ఇప్పుడు ఎక్కువ ప్రమాదాలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్, గ్యాస్ లీకేజీ తదితరాలు కారణాలుగా నిలుస్తున్నాయి. ● నివాసాలు, పొలాల గట్లపైన ఉన్న గడ్డివాముల చుట్టూ కంచె నిర్మించుకోవడం మంచిది. వీటికి సమీపంలో పొగతాగడం, చుట్ట, సిగరెట్, బీడీ వంటివి ఆర్పకుండా పారేయడం ప్రమాదకరం. ● ఎండుగడ్డిని ట్రాక్టర్లు, లారీల్లో రవాణా చేసే సమయంలో విద్యుత్ వైర్లకు తగలకుండా చూడాలి. ● రహదారి, కాలువగట్టు, నివాసాల పక్కన చెత్త వేయడం మంచిదికాదు. చెత్తకు నిప్పంటించడం ప్రమాదకరం. అది చుట్టుపక్కల వ్యాపించే అవకాశం ఉంటుంది. ● నాణ్యత కలిగిన విద్యుత్ వైర్లు, పరికరాలను మాత్రమే ఇళ్లు, దుకాణాల్లో వినియోగించుకోవాలి. ● ప్రమాదం సంభవించిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసే ఆధునిక ఆపరేటింగ్ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి.● కొద్దిరోజుల క్రితం మర్రిపాడు మండలంలోని నందవరంలో ఓ పొగాకు బ్యారెన్ దగ్ధమైంది. క్యూరింగ్ కోసం ఏర్పాటు చేసిన పొగాకు కర్రలు జారిపడిపోవడంతో సాయంత్రం 5.30 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినా రాత్రి 7.30 గంటలకు కూడా ఫైరింజిన్ ఘటనా స్థలానికి రాలేదు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇక్కడి అగ్నిమాపక శకటాన్ని నెల్లూరుకు తరలించినట్లు చెబుతున్నారు. సుమారు రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లింది. నెల్లూరు(క్రైమ్): ఎండలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. వేసవి పూర్తిగా రాకముందే భానుడు తన ప్రకోపాన్ని మెల్లమెల్లగా పెంచుతున్నాడు. అజాగ్రత్త, ఏమరపాటో, ఆకతాయిల చేష్టలు ఇలా కారణం ఏదైతేనేం ఏదో ఒకచోట నిప్పు రాజుకుంటూనే ఉంటోంది. ఆ సమయంలో ప్రతిక్షణం అమూల్యమైనదే. ఆలస్యమయ్యే కొద్దీ నష్టం పెరుగుతుంది. జిల్లాలో అవసరం మేరకు అగ్నిమాపక కేంద్రాల్లేక ప్రమాదాల నివారణ సవాలుగా మారుతోంది. కేంద్రాలున్న చోట కూడా సిబ్బంది కొరత వేఽధిస్తోంది. కొన్ని ప్రాంతాలు కేంద్రాలకు దూరంలో ఉండటంతో ఫైరింజిన్లు చేరుకునేలోగా బూడిద మిగులుతోంది. తరచూ మరమ్మతులకు.. భానుడి భగభగలకు మానవ తప్పిదాలు తోడైతే పెను నష్టం వాటిల్లుతుంది. వేసవిలో అగ్నిప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉంది. అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా లేకపోతే ప్రజల ఆస్తులు, ప్రాణాలు బుగ్గిపాలు కావాల్సిందే. జిల్లాలో నెల్లూరు, కందుకూరు, కావలి, వింజమూరు, ఉదయగిరి, మర్రిపాడు, ఆత్మకూరు, రాపూరు, పొదలకూరుల్లో అగ్నిమాపక కేంద్రాలున్నాయి. స్టాండింగ్ ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ ప్రమాణాల మేరకు ప్రతి 50 వేల జనాభాకు ఒక ఫైరింజిన్ ఉండాలి. ప్రస్తుతం 11 మాత్రమే ఉండగా అందులో ఒకటి మరమ్మతులకు గురైంది. మినీ ఫైరింజిన్ మూలనపడింది. కొన్ని వాహనాలకు పూర్తిస్థాయిలో ఫిట్నెస్ లేకపోవడంతో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. దీంతో అగ్నిప్రమాదాలను సకాలంలో అరికట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనాభా పెరుగుదల, విస్తరిస్తున్న ప్రాంతాలతో ప్రమాద సమయంలో అగ్నిమాపక వాహనాలు సకాలంలో అక్కడకు చేరుకోలేక పోతుండటంతో ఆస్తి, ప్రాణనష్టం జరుగుతోంది. తీవ్ర ఇబ్బందులు జిల్లాలో అపార్ట్మెంట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వాటిల్లో కొన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినవే. అపార్ట్మెంట్లలో సెట్‌బ్యాక్ లేకపోవడంతో ప్రమాదం జరిగితే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాస్తవానికి అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఫైరింజిన్లు సులువుగా వెళ్లి మంటలను అదుపు చేసే పరిస్థితి ఉండాలి. అయితే అది చాలాచోట్ల లేదు. అలాగే గోదాముల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇంకా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు, ఆస్పత్రులను బహుళ అంతస్తుల భవనాల్లో నిర్వహిస్తున్నారు. వీటిలో అధికశాతం ప్రమాద నివారణకు అవసరమైన పరికరాలు ఉంచడం లేదు. దీంతో ఆస్తితోపాటు ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. సర్వం కాలిపోయి.. నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో నెల్లూరు అగ్నిమాపక కేంద్రం నుంచి అగ్నిమాపక శకటాలు వెళ్లి మంటలను ఆర్పుతున్నాయి. ముత్తుకూరు, వెంకటాచలం, ఇందుకూరుపేట, రాజుపాళెం, కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే 30 నిమిషాల నుంచి గంటపైగా సమయం పడుతుంది. దీంతో అనుకోని ఘటన జరిగితే ఫైరింజిన్లు అక్కడికి చేరుకునేలోపే సర్వం బుగ్గిపాలవుతోంది. కొండాపురం, వరికుంటపాడు తదితర ప్రాంతాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న ప్రాంతాలకు అనుగుణంగా మండలానికి ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు పంపారు. అత్యవసర ప్రాతిపదిక కింద నెల్లూరు రూరల్, బుచ్చిరెడ్డిపాళెంలో నూతన అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు, ఆత్మకూరు, ఉదయగిరి కేంద్రాల రెన్నోవేషన్, కావలిలో డబుల్ యూనిట్ పెట్టేందుకు చర్యలు చేపట్టారు. అవి కార్యరూపంలో ఉండగానే ఎన్నికలు రావడం, కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో ఆ ప్రక్రియ మందగించింది. ఖాళీలిలా.. అగ్నిమాపక శాఖలో సిబ్బంది కొరత వెంటాడుతోంది. జిల్లా కేంద్రంలో ఏడీఎఫ్‌ఓ, ఆరుగురు లీడింగ్ ఫైర్మెన్లు, ఐదు డ్రైవర్/ఆపరేటర్, 18 మంది ఫైర్‌మెన్స్, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో అగ్నిమాపక కేంద్రానికి ఎస్ఎఫ్ఓ, ముగ్గురు లీడింగ్ ఫైర్మెన్లు, ముగ్గురు డ్రైవర్/ఆపరేటర్, తొమ్మిది మంది ఫైర్మన్లుండాలి. జిల్లాలో 158 మంది సిబ్బందికి గానూ 35 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎనిమిది మంది ఫైర్ ఆఫీసర్లకు గానూ ఐదుగురు మాత్రమే ఉన్నారు. మర్రిపాడు, ఉదయగిరి, ఆత్మకూరుల్లో ఫైర్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 90 మంది ఫైర్మెన్లకు గానూ 58 మంది మాత్రమే ఉన్నారు. వారి స్థానంలో హోంగార్డులను వినియోగిస్తున్నారు. అయితే వారూ సరిపడనంతా లేకపోవడంతో ఉన్నవారిపైనే పనిభారం పడుతోంది. అగ్నిమాపక శాఖను వేధిస్తున్న సిబ్బంది కొరత భారీ ప్రమాదాలు సంభవిస్తే అంతే సంగతులు అందుబాటులో 11 ఫైరింజిన్లు తరచూ మరమ్మతులకు గురవుతున్న వైనం ఆ శాఖలో కొన్ని పోస్టులు ఖాళీ -
ఎల్ఐసీలో పాలసీదారులకు నూరుశాతం భద్రత
నెల్లూరు(అర్బన్): ప్రభుత్వ రంగంలో నడుస్తున్న అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీలో పాలసీదారుల ప్రీమియంకు నూరుశాతం భద్రత ఉంటుందని ఎల్ఐసీ డివిజనల్ (నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు) సేల్స్ మేనేజర్ జి.ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం నెల్లూరులోని మద్రాస్ బస్టాండ్ వద్ద ఉన్న ఓ హోటల్లో ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల నుంచి సేకరించిన ప్రీమియంను ప్రభుత్వ ఆధ్వర్యంలోని రైల్వేలు, రోడ్లు, భారీ పరిశ్రమల్లోనే పెట్టుబడిగా పెట్టే సంస్థ ఎల్ఐసీ అన్నారు. జీవన్ ఉత్సవ్, జీవన్ ఉమాంగ్, అమృత్‌బాల్, జీవన్ ఆనంద్ లాంటి పాలసీలకు పెద్దఎత్తున ప్రజల నుంచి స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి పాలసీల పట్ల ప్రజలకు ఏజెంట్లు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఎండీఆర్టీ, ఇతర లక్ష్యాలను సాధించిన ఏజెంట్లను సన్మానించారు. కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాళెం బ్రాంచ్ మేనేజర్ పెంచలయ్య, డీఓ బాలసుబ్రహ్మణ్యం, పలువురు ఏజెంట్లు పాల్గొన్నారు. -
పెత్తనం నీదా.. నాదా..?
సైదాపురం మండలంలోని గనుల కోసం కూటమి నేతలు కొట్లాడుకుంటున్నారు. ప్రధానంగా శ్రీనివాసా పద్మావతి మైన్‌ను సొంత చేసుకునేందుకు ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేపారు. నెల్లూరుకు చెందిన ఓ ముఖ్యనేత ఆధిపత్యాన్ని సహించలేని స్థానిక ప్రజాప్రతినిధి మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే పోలీస్.. రెవెన్యూ అధికారులను ఆదివారం రంగంలోకి దించారు. అయితే సదరు ముఖ్యనేత జోక్యం చేసుకోవడంతో చేసేదిలేక చేతులెత్తేశారు. తూతూమంత్రంగా చర్యలు చేపట్టి ముఖం చాటేశారు. మైనింగ్‌కు అనుమతి లేదు శ్రీనివాసా పద్మావతి గనిలో అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదులొచ్చాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు పరిశీలించాం. ఇక్కడ కేవలం పంపింగ్‌ను మాత్రమే చేస్తున్నారు. ఖనిజాన్ని తరలించేందుకే అనుమతి ఉంది. మైనింగ్‌కు లేదు. – రమాదేవి, తహసీల్దార్, సైదాపురం ఫిర్యాదు అందలేదు శ్రీనివాసా పద్మావతి గనిలో అక్రమ మైనింగ్‌పై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు చేపడతాం. ఇక్కడ వాహనాలను స్వాధీనం చేసుకోలేదు. ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదు. – క్రాంతికుమార్, ఎస్సై, సైదాపురం ●శ్రీనివాసా పద్మావతి గని కోసం కూటమి నేతల ఘర్షణ ● సిండికేట్‌కు వ్యతిరేకంగా స్థానిక ప్రజాప్రతినిధి ఆదేశాలు ● ముఖ్యనేత జోక్యంతో తలలు పట్టుకుంటున్న అధికారులు సైదాపురం: మండలంలోని రామసాగరం, సైదాపురం గ్రామాలకు చెందిన ప్రభుత్వ భూమిని శ్రీనివాసా పద్మావతి గనికి గతంలో కేటాయించారు. 2019లోనే లీజు కాలపరిమితి ముగియడంతో అది కాస్తా మూతపడింది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వమొచ్చిన అనంతరం దానిపై పలువురు నేతల కన్నుపడింది. ఎలాంటి అనుమతుల్లేకుండా నెల్లూరుకు చెందిన టీడీపీ పెద్దల ఆధ్వర్యంలో మైనింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో రామసాగరం గ్రామస్తులు కొందరు అక్రమ మైనింగ్‌ను ఆదివారం అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన మైనింగ్ సిండికేట్‌కు చెందిన వ్యక్తులు తమకు అధికార పార్టీ ఎంపీ, మరో నాయకుడి మద్దతు ఉందంటూ గ్రామస్తులను బెదిరించి తరిమేశారు. ప్రజాప్రతినిధి ఆగ్రహం మైనింగ్ సిండికేట్ దౌర్జన్యాలపై రామసాగరం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే ఫోన్ చేసి మైనింగ్ నిర్వాహకులపై చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు మైన్ వద్దకు వచ్చిన పోలీసులు ఎనిమిది మోటార్‌సైకిళ్లు, ఓ ఎస్యూవీ వాహనాన్ని స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు. తదనంతరం ఏమి జరిగిందో గానీ.. పోలీసులు సీజ్ చేసి వాహనాలు స్టేషన్ ఆవరణ నుంచి వెళ్లిపోయాయి. ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధికి తెలియడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాల మేరకు తహసీల్దార్ రమాదేవి, ఎస్సై క్రాంతికుమార్ హుటాహుటిన శ్రీనివాసా పద్మావతి గని వద్దకు చేరుకొని, అక్రమ మైనింగ్‌పై విచారణ చేపట్టారు. అనుమతుతెలా..? శ్రీనివాసా పద్మావతి గనిలో మైనింగ్ కోసం వచ్చిన దరఖాస్తును జనవరిలో తిరస్కరించారు. ఇంతలో ఏమైందో తెలియదు గానీ నెల గడవక ముందే సదరు గనిలో 1.5 లక్షల టన్నుల ఖనిజాన్ని తవ్వుకొని తరలించుకునేందుకు అనుమతులు మంజూరయ్యాయి. ఈ గనిపై కోర్టులో కేసు నడుస్తుండగానే అధికారులు పర్మిషన్ ఇవ్వడం గమనార్హం. -
అరాచకాలకు అడ్డొస్తే కక్షసాధింపే
నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ నేతల కక్షసాధింపులు పరాకాష్టకు చేరుకుంటున్నాయి. తమకు అడ్డొచ్చినా.. ప్రశ్నించినా తట్టుకోలేకపోతున్నారు. వీరిపై అధికారులను ఉసిగొల్పి ఇబ్బందులకు గురిచేయడం పరిపాటిగా మారింది. నోటీసులివ్వకుండానే.. రూరల్ మండలంలోని ఆమంచర్ల బిట్ – 2 ఎంపీటీసీ సురేంద్రరెడ్డికి చెందిన స్థల హద్దు కంచెను ఎలాంటి నోటీసులివ్వకుండానే రెవెన్యూ అధికారులు తొలగించారు. వాస్తవానికి అప్పయ్యకండ్రిగలోని పడమర వీధిలో ఎంపీటీసీ చింతా సురేంద్రరెడ్డికి 50 అంకణాల స్ధలం ఉంది. తాతల నాటి నుంచే ఇది సంక్రమించింది. అక్కడ దశాబ్దాలుగా ఉన్న చిన్న ఇల్లు పాతబడటంతో కొన్నేళ్ల క్రితం తొలగించారు. స్థలం ప్రస్తుతం ఖాళీగా ఉండటంతో చుట్టూ కంచె వేశారు. పచ్చ నేతల సూచనలతోనే.. స్థలం వద్దకు స్థానిక సర్వేయర్, వీఆర్వో శనివారం చేరుకొని, టీడీపీ నేత వేణుకు సంబంధించిన జేసీబీని తీసుకొచ్చారు. రూరల్‌లోని ఓ టీడీపీ ముఖ్యనేత ఆదేశాలతో స్థలం చుట్టూ ఉండే కంచెను తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఎంపీటీసీ కుమారుడు మస్తాన్‌రెడ్డి అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించగా, తామేమీ చేయలేమని, టీడీపీ పెద్దల సూచనలతోనే వచ్చామని బదులిచ్చారు. అధికారుల తీరుపై స్థానికులు మండిపడ్డారు. వాగ్వాదం జరుగుతున్న సమయంలోనే కంచెను జేసీబీతో తొలగించారు. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కాగా పచ్చ నేతలను కలవాలని సూచించి, అధికారులు నిష్క్రమించారు. బాధితులకు అండగా నిలిచినందుకే.. ఆమంచర్లలోని 23 కుటుంబాలకు సంబంధించిన భూమిని టీడీపీకి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించేందుకు యత్నించారు. ఈ వ్యవహారంలో పేదలకు ఎంపీటీసీ సభ్యుడు అండగా నిలిచారు. సమస్యను కలెక్టర్ దృష్టికీ తీసుకెళ్లారు. దీంతో కక్ష పెంచుకున్న వారు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా పొరంబోకు స్థలమంటూ కంచె తొలగింపు చర్యలకు అధికారులు పూనుకున్నారు. ఇలా వ్యవహరించడం దారుణమని సురేంద్రరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీటీసీ సభ్యుడి స్థల హద్దు కంచె తొలగింపు టీడీపీ ముఖ్యనేత ఆదేశాలకు అధికారుల జీహుజూర్ మూడు తరాలుగా అక్కడే నివాసం ఉన్న కుటుంబం -
పీడించండి.. వసూలు చేయండి
● హడలెత్తిస్తున్న మార్కెటింగ్ శాఖ ● సెస్ వసూలు విషయంలో ఉన్నతాధికారుల ఒత్తిళ్లు ● 15 రోజుల్లో రూ.7 కోట్లు ముక్కుపిండి వసూలు ● కూటమి ప్రభుత్వంపై కన్నెర్రగోదాము (ఫైల్) నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో నెల్లూరు, కోవూరు, కావలి, కందుకూరు, రాపూరు, ఆత్మకూరు, ఉదయగిరి, సర్వేపల్లి మార్కెట్ కమిటీలున్నాయి. వాటి పరిధిలో పండించిన వ్యవసాయ ఉత్పత్తులను వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేందుకు మార్కెట్ శాఖకు సెస్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది విధించిన లక్ష్యం రూ.34.43 కోట్లు. ఈ నెలాఖరుకు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏ ప్రాంతాల్లో ఎంతంటే.. నెల్లూరులో రూ.5.13 కోట్లు, కోవూరులో రూ.6 కోట్లు, కావలిలో రూ.3.83 కోట్లు, కందుకూరులో రూ.1.36 కోట్లు, రాపూరులో రూ.46 లక్షలు, ఆత్మకూరులో రూ.1.17కోట్లు, ఉదయగిరిలో రూ.1.18 కోట్లు, సర్వేపల్లిలో రూ.1.49 కోట్ల చొప్పున ఇప్పటి వరకు వసూలు చేసినట్లు తెలిసింది. నెలాఖరు సమీపిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఒత్తిడితో గత 15 రోజుల్లో సుమారు రూ.7 కోట్ల వరకూ ముక్కుపిండి వసూలు చేసినట్లు సమాచారం. ఎన్నడూ లేని విధంగా.. సాధారణంగా వ్యవసాయ ఉత్పత్తులు తరలించే వారి నుంచి సెస్ వసూలు చేస్తుంటారు. కూటమి ప్రభుత్వం ముక్కుపిండి వసూలు చేసే విధానానికి తెర తీసింది. ఎన్నడూ లేని విధంగా విద్యార్థులుండే హాస్టల్స్, బేకరీలు, స్వీట్ షాపుల్లో మార్కెట్ శాఖ తనిఖీలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. హాస్టల్స్‌లో వాడే బియ్యం ఎక్కడి నుంచి తెచ్చారు?, బిల్లు ఉందా?, ఏ మిల్లు నుంచి తెచ్చారు? లేక ఏ రైతు నుంచి కొనుగోలు చేశారనే వివరాలను తెలుసుకుంటున్నారు. నిర్వాహకులు నేరుగా రైతుల నుంచి తీసుకుని కొనుగోలు చేస్తే దానికి సెస్ కట్టారా?, ఆ రైతు వివరాలు ఇవ్వండంటూ బెంబేలెత్తిస్తున్నారు. దీంతోపాటు స్వీట్ షాపులు, బేకరీల్లో తనిఖీలు చేస్తూ మీరు వాడుతున్న స్వీట్స్‌కు జీడిపప్పు, బాదం పప్పు, ఇతర పప్పు దినుసులు ఎక్కడి నుంచి కొన్నారు? తదితరాలను అడుగుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఒత్తిడి చేయడంతో.. పనులన్నీ పక్కనపెట్టి సెస్ వసూళ్లపైనే దృష్టి పెట్టాలని ప్రభుత్వం ఒత్తిడి తేవడంతో మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బందికి నిద్రాహారాలు కరువయ్యాయి. రాత్రి, పగలు తేడా లేకుండా చెక్‌పోస్టు పాయింట్లలో ఉండి వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. టార్గెట్ పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని ఉన్నతాధికారులు తెగేసి చెప్పడంతో అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు.వ్యాపారులు నష్టాల్లో ఉన్నా.. వ్యవసాయంలో లాభాలు రాకపోయినా.. మనకు సంబంధం లేదు. ఆహార ఉత్పత్తులు రవాణా చేసే వారి నుంచి సెస్‌ను ముక్కుపిండి వసూలు చేయాలని జిల్లాలోని మార్కెటింగ్ శాఖ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సెస్ వసూళ్లంటూ అధికారులు తనిఖీల పేరుతో హడావుడి చేస్తున్నారు. నిబంధనల ప్రకారం వసూలు మార్కెట్ శాఖకు కట్టాల్సిన సెస్ వసూళ్లలో మేం నిబంధనలు పాటిస్తున్నాం. సెస్ కట్టాల్సిన వారి నుంచి తప్పకుండా వసూలు చేసేలా అధికారులు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే రూ.20 కోట్ల మేర వసూలైంది. ఈనెల చివరికి టార్గెట్ పూర్తి చేసే పనిలో ఉన్నాం. – అనితాకుమారి, ఏడీ, జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ -
హైలెవల్ కాలువను వెంటనే నిర్మించాలి
మర్రిపాడు: సోమశిల హైలెవల్ కెనాల్‌ను వెంటనే పూర్తి చేయాలంటూ మర్రిపాడులో రైతు సదస్సును సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య మాట్లాడారు. మెట్ట ప్రాంత తాగు, సాగునీటి అవసరాల కోసం నిర్మించనున్న దీన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ప్రాజెక్ట్ పూర్తి చేసేలా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చొరవ చూపాలని కోరారు. ఈ విషయమై నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడ్ని ఈ నెల ఐదున కలవనున్నామన్నారు. నేతలు మూలె వెంగయ్య, నాగయ్య, లక్కు ప్రసాద్, చండ్రా నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. ఏడు నెలల పాపతో తల్లి ఆత్మహత్యాయత్నం ● రక్షించిన పోలీసులు నెల్లూరు(క్రైమ్): కుటుంబకలహాలతో మనస్తాపానికి గురైన వివాహిత తన ఏడు నెలల కుమార్తెతో కలిసి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వీరిని రక్షించారు. వివరాలు.. చింతారెడ్డిపాళేనికి చెందిన నితిన్, జాస్మిన్ గతేడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఏడు నెలల పాప ఉంది. కొంతకాలం సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు చోటుచేసుకున్నాయి. ఈ తరుణంలో జాస్మిన్ తన పాపతో కలిసి ఇంటి నుంచి శనివారం రాత్రి బయటకొచ్చారు. సౌత్ రైల్వేస్టేషన్ సమీపంలోని పట్టాల వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా, అటుగా వెళ్తున్న హరీష్.. 112కు సమాచారం అందించారు. చిన్నబజార్ ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు ఆదేశాల మేరకు కానిస్టేబుళ్లు ప్రభు కిరణ్, పుల్లయ్య హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని తల్లీకుమార్తెను రక్షించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వివరాలు సేకరించి ఆమె కుటుంబసభ్యులకు సమాచారాన్ని ఇన్స్పెక్టర్ అందించారు. అనంతరం నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు పంపారు. బాధితురాలి కుటుంబసభ్యులకు రూరల్ ఇన్స్పెక్టర్ వేణు కౌన్సెలింగ్ చేసి వీరిని అప్పగించారు. -
చూస్తే.. కన్నీరే..!
● స్వస్థత కోసం ఏఎస్‌పేట దర్గాకు మతిస్థిమితం లేని వారు దక్షిణాది రాష్ట్రాల్లో సుప్రసిద్ధమైన దర్గాల్లో ఏఎస్‌పేటలోని హజరత్ ఖాజానాయబ్ రసూల్ దర్గా ఒకటి. దీని దర్శనార్థం దేశ, విదేశాలకు చెందిన ఎంతో మంది భక్తులు వస్తుంటారు. స్వస్థత నిమిత్తం మతిస్థిమితం లేని వారిని ఇక్కడికి తీసుకొస్తే ఆ సమస్య నయమవుతుందనేది ప్రగాఢ విశ్వాసం. ఈ నమ్మకంతో పలువుర్ని ఈ ప్రాంతంలో వదిలేసి కుటుంబసభ్యులు వెళ్తుంటారు. ఈ అవకాశాన్నే సంరక్షకులు చక్కగా క్యాష్ చేసుకుంటున్నారు. మానసిక వ్యాధిగ్రస్తులను చైన్లతో కట్టి.. వేధింపులకు పాల్పడుతూ అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు పర్యవేక్షణలేక కొందరు అటవీ ప్రాంతంవైపు వెళ్లి మృత్యువాత పడుతున్న ఘటనలూ ఉన్నాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తులు నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు. మానసిక రోగైన మస్తాన్‌ను కుటుంబసభ్యులు ఏఎస్‌పేటలోని ఓ కేర్ టేకర్ వద్ద మూడు నెలల క్రితం వదిలారు. ఆయనకు తోడుగా సోదరి ఉంటున్నారు. ఆమైపె కన్నేసిన కేర్ టేకర్ షరీఫ్ ఎలాగైనా లొంగదీసుకోవాలనే ఉద్దేశంతో మస్తాన్‌ను ఓ గదిలో మూడు రోజుల క్రితం బంధించి కొట్టారు. తనకు సహకరించకపోతే సోదరుడ్ని చంపేస్తానంటూ ఆమెను బెదిరించారు. అంతటితో ఆగకుండా గదిలోకి లాక్కెళ్లి చేయి చేసుకున్నారు. తప్పించుకున్న ఆమె.. ఏఎస్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో షరీఫ్‌పై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గొలుసుతో అమానవీయంగా బంధించి సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఏఎస్‌పేటలోని హజరత్ ఖాజానాయబ్ రసూల్ దర్గా భక్తుల విశ్వాసానికి ప్రతీక. దీన్ని దర్శించుకుంటే తమ మొక్కులు తీరుతాయనే నమ్మకం చాలా మందిలో బలంగా నాటుకుంది. మతిస్థిమితం లేని వారిని ఇక్కడ కొంతకాలం ఉంచితే నయమవుతుందనే భావనా ఉంది. దీంతో వీరిని ఇక్కడి సంరక్షణ కేంద్రాల్లో కుటుంబసభ్యులే వదిలేసి వెళ్తారు. వీరి సంరక్షణ నిమిత్తం ఒక్కో కేంద్రానికి ఒక్కో కేర్ టేకర్ ఉంటారు. సంరక్షకులే.. భక్షకులు కేర్ టేకర్ ముసుగులో మానసిక రోగులను సంరక్షకులు వేధింపులకు గురిచేస్తున్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఓ మహిళపై కేర్ టేకర్ షరీఫ్ అఘాయిత్యానికి పాల్పడిన ఘటన పెద్ద దుమారమే రేపింది. ఇలాంటి ఘటనలు జరిగినా బయటి ప్రపంచానికి చెప్పుకోలేక మరింతగా కుంగిపోతున్నారు. ఏఎస్‌పేటలో దాదాపు ఐదుగురు కేర్ టేకర్లుండగా, ఒక్కో కేంద్రంలో 50 నుంచి 70 మంది వరకు మానసిక రోగులు ఉంటున్నారు. నగదు ఇవ్వకపోతే.. గెంటివేతే ఇక్కడ ఉండే వారికి నిత్యం అన్నం పెడతారు. చేయిచాస్తే దయార్థులిచ్చే చిల్లరతో టీ, కాఫీలు సేవిస్తుంటారు. వసతిగృహాల్లోని గదులు దుర్భరంగా దర్శనమిస్తాయి. పరిశుభ్రత కానరాదు. కాలకృత్యాలు తీర్చుకునే సమయంలోనూ సంకెళ్లు తీయని ఘటనలు ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నెలవారీగా కుటుంబసభ్యుల నుంచి నగదును మాత్రం తెప్పించుకుంటారు. ఒకవేళ జాప్యం జరిగితే వసతిగృహం నుంచి గెంటేస్తారు. నమ్మకమే.. గేట్ వే..! ఏఎస్‌పేట దర్గాలో తిరిగే మానసిక రోగుల ఆరోగ్యం కుదుటపడిన ఉదంతాలూ చాలానే ఉన్నాయి. నెలల వ్యవధిలోనే సాధారణ స్థితికొచ్చి తిరిగి స్వస్థలాలకు వెళ్తుండటంతో ఇది మానసిక రోగులకు నిలయంగా మారింది. వైద్యం చేయించినా ప్రయోజనం లేకపోతే దర్గా పరిసర ప్రాంతాల్లో వదిలేస్తే దైవమే నయం చేస్తుందనే నమ్మకం ఉంది. దీంతో చాలా మందిని ఇక్కడ వదిలి వెళ్తుంటారు. క్షుద్బాధతో మృత్యువాత పేద మానసిక రోగులకు ప్రత్యేక వసతి గృహాల్లో స్థానం ఉండదు. దీంతో దేవుడిపై కుటుంబసభ్యులు భారమేసి బయటే వదిలి వెళ్తున్నారు. పర్యవేక్షణ లేక వీరు అడవిబాట పడుతున్నారు. అలా వెళ్లిన వారు రోజుల తరబడి అక్కడే ఉంటూ ఆకలితో అలమటించి, తాగునీరు దొరక్క మృత్యువాత పడుతున్న ఘటనలూ ఉన్నాయి. ఐదేళ్లలో ఈ తరహాలో దాదాపు పది మంది వరకు మృత్యువాత పడ్డారని తెలిసింది. ఇలాంటి ఘటనల్లో కుటుంబసభ్యులకు సమాచారమిచ్చే పరిస్థితీ ఉండదు. గుర్తుతెలియని మృతదేహాలుగా పోలీసులు కేసు నమోదు చేసి అక్కడే అంత్యక్రియలు చేయించాల్సి వస్తోంది. ఓ ఇంట్లో మానసిక రోగులు ఏఎస్‌పేట దర్గాలో మానసిక రోగుల కోసం ప్రత్యేక వసతి గృహాలను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దర్గా ప్రస్తుతం వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉంది. దీని నిర్వహణపై ఎన్నో ఫిర్యాదులూ వెళ్లాయి. వసతుల ఏ ర్పాటులో నిర్లక్ష్యం వహిస్తున్న తీరు ను తప్పుబడుతున్నారు. అక్కడే వదిలేస్తున్న కుటుంబసభ్యులు చుట్టూ తిరిగితే వ్యాధి తగ్గుతుందనే నమ్మకం అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్న సంరక్షకులు చైన్లతో కట్టి.. ఆపై హింసిస్తూ.. పర్యవేక్షణ లేక అటవీ ప్రాంతం వైపు వెళ్లి మృత్యువాత మానసిక రోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటుంది. కాళ్లు, చేతులకు సంకెళ్లేసి వదిలేస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు వీటితోనే నడవాల్సి ఉంటుంది. వారికంటూ ప్రత్యేక చికిత్సే ఉండదు. ఏఎస్‌పేట దర్గా పరిసర ప్రాంతాల్లో దాదాపు 300 మంది వరకు మానసిక రోగులున్నారు. వీరిలో ఎక్కువ మంది ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసిన వసతి గృహాల్లోనే ఉంటున్నారు. పర్యవేక్షకులు మాత్రం వీరిని సాటి మనుషులుగా పరిగణించరు. ఎదురుతిరిగితే కర్రతో చావబాదుతారు. దీంతో వీరి శరీరం నిండా దెబ్బలే కనిపిస్తాయి. భయపడి పర్యవేక్షకులు చెప్పిన విధంగా నడుచుకోవాల్సి వస్తోంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తులు కొద్ది నెలలుగా కేర్‌టేకర్ షరీఫ్ వద్ద ఉంటున్నారు. వీళ్లను బేల్దారీ పనులకు పంపిస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారు. మానసిక రోగులనే కనికరం లేకుండా కర్రతో కొడుతూ వికృతానందం పొందుతున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.15 వేలను కుటుంబసభ్యుల వద్ద వసూలు చేస్తుంటారు. వీరిని వివిధ పనులకు పంపిస్తూ కూలి డబ్బులనూ కొల్లగొడుతున్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
పొదలకూరు: పట్టణంలోని దుకాణాల వద్ద భిక్షాటన చేసుకుంటూ మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న వ్యక్తి (45) స్థానిక శివాలయ సమీపంలోని శ్మశాన వాటికలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారాన్ని శనివారం అందించారు. సీఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్సై హనీఫ్ ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి తలపై గాయాలుండటం, రక్తపు మడుగులో పడి ఉండటంతో హత్యగా అనుమానిస్తున్నారు. హిందీ మాట్లాడే సదరు వ్యక్తి రెండేళ్లుగా పట్టణంలో తిరిగేవారని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ ద్వారా ప్రాథమిక ఆధారాలను సేకరించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. రైలు ఢీకొని యువకుడి దుర్మరణంనెల్లూరు(క్రైమ్): రైలు ఢీకొనడంతో గుర్తుతెలియని యువకుడు మృతి చెందిన ఘటన వేదాయపాళెం రైల్వేస్టేషన్ సమీపంలో చైన్నె వైపు వెళ్లే పట్టాలపై శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మృతుడు సుమారు 30 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు కలిగి.. మెరూన్, నలుపు రంగు చెక్స్ ఫుల్‌హ్యాండ్స్ చొక్కా, బ్లూ రంగుపై తెలుపు డిజైన్ షార్ట్‌ను ధరించి ఉన్నారు. మృతుడి కుడిచేతిపై ఆర్ఏకేయూ అని ఇంగ్లిష్ అక్షరాలతో పచ్చబొట్టు ఉంది. మృతదేహాన్ని నెల్లూరు రైల్వే ఎస్సై మాలకొండయ్య పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు నెల్లూరు రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు. బైక్ ఢీకొని వృద్ధుడు.. తోటపల్లిగూడూరు: బైక్ ఢీకొనడంతో వృద్ధుడు మృతి చెందిన ఘటన విలుకానుపల్లిలో శనివారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై వీరేంద్రబాబు సమాచారం మేరకు.. విలుకానుపల్లి దళిత కాలనీకి చెందిన గెద్ది శేషయ్య (64) బహిర్భూమి నిమిత్తం గ్రామ సమీపంలోని కోడూరు ప్రధాన రహదారివైపు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో వెళ్లారు. తిరిగి ఇంటికి రాకపోవడంతో గాలింపు చర్యలను కుటుంబసభ్యులు చేపట్టారు. కోడూరు ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న పంచాయితీ దొరువులో శేషయ్య పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. నెల్లూరులోని ఓ వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం నెల్లూరులోని జీజీహెచ్‌కు తరలించారు. ఘటన స్థలంలో లభ్యమైన ఏటీఎం కార్డుల ఆధారంగా సౌత్‌ఆములూరుకు చెందిన సుమన్ బైక్ ఢీకొని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. రేపట్నుంచి ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు నెల్లూరు (టౌన్): ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలను సోమవారం నుంచి ఈ నెల 15 వరకు జిల్లాలోని 20 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహించనున్న పరీక్షలకు 3580 మంది అభ్యాసకులు హాజరుకానున్నారు. ఐదు ఫ్లయింగ్.. పది సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు 20 మంది చొప్పున, ఇన్విజిలేటర్లుగా 200 మందిని నియమించారు. సమస్యలుంటే హెల్ప్‌డెస్క్ 83414 08109 నంబర్‌ను సంప్రదించొచ్చు. పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. కాగా పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే యాజమాన్యాలపై చర్యలు తప్పవని డీఈఓ బాలాజీరావు స్పష్టం చేశారు. వీఎస్‌యూలో 4న జాబ్‌మేళా వెంకటాచలం: కాకుటూరు సమీపంలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ)లో జాబ్‌మేళాను ఏపీఎస్సెస్డీసీ, జిల్లా ఎంప్లాయ్మెంట్ కార్యాలయం, సీడాప్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించనున్నామని వీసీ అల్లం శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరై ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారని చెప్పారు. 18 నుంచి 35 ఏళ్లలోపు ఉండి, ఎస్సెస్సీ, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ చదివిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
చేనేతలకు అన్యాయం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో చేనేత రంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఏపీ చేనేత కార్మిక సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు పముజుల హరి ఆరోపించారు. నగరంలోని తన కార్యాలయంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడారు. చేనేత రంగానికి బడ్జెట్లో రూ.138 కోట్లను కేటాయించడం దారుణమని, ఇందులో రూ.ఐదు కోట్లే చేనేత సహకార సంఘాలకు ఉపయోగపడతాయని, మిగిలిన మొత్తం అలంకారప్రాయంగా మారనుందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అందజేసిన నేతన్న నేస్తం కంటే మెరుగైన పథకాలను ఇస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. చేనేత రంగాన్ని నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. -
మందులకు కొరత తలెత్తకూడదు
నెల్లూరు(అర్బన్): జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో మందులకు కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని డీఎంహెచ్ఓ సుజాత సూచించారు. సంతపేటలోని వైద్యశాఖ కార్యాలయంలో ఫార్మసీ అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మందుల సరఫరా, వినియోగం, నిల్వ ఉంచే విధానాలపై జాగ్రత్తలు తీసుకొని వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని కోరారు. వేసవిలో చిన్నారులకేసే టీకాలకు సంబంధించిన కోల్డ్ చైన్‌ను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఉమామహేశ్వరి, జిల్లా ఎపిడమిక్ అధికారి భాస్కర్, స్టాటిస్టికల్ అధికారి సహన, ఫార్మసీ ఆఫీసర్ రాధమ్మ పాల్గొన్నారు. మున్సిపల్ డ్రైవర్ల ధర్నా నెల్లూరు(బారకాసు): నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయ సమీపంలో చెత్త వాహనాలు నిలిపే వెహికల్ షెడ్ వద్ద నిరసనను డ్రైవర్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు, నగరాధ్యక్షుడు సునీల్‌కుమార్ మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసి, ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు చర్యలు చేపట్టడం దారుణమన్నారు. క్రమబద్ధీకరించేంత వరకు ఆందోళనను కొనసాగిస్తామని తెలిపారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నెల్లూరు నగర కార్యదర్శి అశోక్, లోకేశ్, డ్రైవర్స్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు జయకుమార్, మనోజ్, నేతలు శివ, షఫీ, రమేష్, నాగేశ్వరరావు, కామేశ్వరరావు పాల్గొన్నారు. -
మహిళలకూ సోకిన వ్యసనం
పురుషులకు సమానంగా తామేమి తీసిపోమంటూ మహిళలూ క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడడం ఆందోళన కల్గించే విషయం. ఇంటి అవసరాలకు భర్త ఇచ్చిన దాంట్లో మిగుల్చుకుని కొందరు, ఉద్యోగం చేస్తూ వచ్చిన నగదుతో మరికొందరు బెట్టింగ్‌లు కాస్తున్నారు. కొందరు రూ.లక్షల్లో బెట్టింగులు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు. బయటకు చెప్పుకోలేక సొంత ఇళ్లలోనే దొంగతనాలు చేస్తున్న వారు కొందరుండగా, బలవన్మరణాలకు పాల్పడుతున్న వారు లేకపోలేదు. ఇంకొందరు నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా కోవూరులో ఓ వృద్ధురాలు తన మనవడ్ని ఇంటి ముందు ఆడిస్తుండగా ఇద్దరు మహిళలు స్కూటీపై అక్కడికి వచ్చారు. వృద్ధురాలి కళ్లలో కారం కొట్టి ఆమె మెడలోని రెండున్నర సవర్ల బంగారు సరుడును తెంపుకెళ్లేందుకు యత్నించారు. వృద్ధురాలు పెద్దగా కేకలు వేయడంతో కుటుంబసభ్యులు, స్థానికులు వారిని పట్టుకుని పోలీసుస్టేషన్లో అప్పగించారు. విచారణలో సదరు మహిళలు వైద్యశాఖలో హెల్త్ అసిస్టెంట్లనీ, క్రికెట్ బెట్టింగుల్లో రూ.30 లక్షలు అప్పులపాలై దొంగతనానికి యత్నించినట్లు వెల్లడైంది. ఈ విషయం అందర్నీ విస్మయానికి గురిచేసింది. మహిళలు సైతం బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారంటే జిల్లాలో ఏ స్థాయిలో పందేలు సాగుతున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. -
దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్వేపల్లి నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా ఆక్రమించేస్తున్నారు. విలువైన ప్రభుత్వ భూములపై కన్నేసి రాత్రికి రాత్రే పెద్ద యంత్రాలతో చదును చేసి రూపురేఖలు మార్చేస్తున్నారు. తాజాగా వెంకటాచలం మండలం చవటపాళెం పంచాయతీ అనుపల్లిపాడు వద్ద రూ.2 కోట్ల విలువైన సుమారు మూడెకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ నాయకులు దర్జాగా కబ్జా చేయడంపై నాలుగు గ్రామాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పరిధిలో అనుపల్లిపాడు గ్రామానికి వెళ్లే మార్గంలో రహదారికి ఆనుకుని విలువైన ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. టీడీపీ నాయకులు నాలుగు రోజుల క్రితం యంత్రాలతో సదరు భూమిని, దానికి అనుకుని ఉన్న దశాబ్దాల క్రితం తవ్విన పంట కాలువను పూడ్చి చదును చేశారు. పంట కాలువ రూపురేఖలు లేకుండా చేశారు. సుమారు మూడెకరాలను కబ్జా చేసేశారు. ఆక్రమణలకు గురైన ఈ భూమి జాతీయ రహదారికి కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఎకరా పొలం ధర రూ.70 లక్షలు ఉంటుందని రైతులు చెబుతున్నారు. టీడీపీ నాయకులు కబ్జా చేసిన పంట కాలువ ద్వారానే అనుపల్లిపాడు, నాయుడుపాళెం, జంగాలపల్లి, రామదాసుకండ్రిగ గ్రామాల రైతులకు సాగునీరు విడుదల చేయాల్సి ఉంది. కబ్జా విషయం తెలుసుకున్న రైతులు వెంటనే అక్కడకు చేరుకుని ఆక్రమణదారులతో వాగ్వాదానికి దిగారు. నాలుగు గ్రామాలకు సాగునీరు విడుదల చేసే కాలువను ఎలా పూడ్చివేస్తారని ప్రశ్నించినా వారు లెక్కచేయకుండా పనులు కొనసాగించారు. పట్టించుకోని అఽధికారులు? పంట కాలువను కబ్జా చేస్తున్నారని ఆయా గ్రామాల రైతులు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ఈ కాలువను పూడ్చివేస్తే తమ పొలాలు బీడు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, వెంటనే ఆక్రమణలు తొలగించి, పంట కాలువను యథావిధిగా ఉంచాలని ఫిర్యాదు చేశారు. అయితే ఏ ఒక్క అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. టీడీపీ పెద్దల సహకారంతోనే పంట కాలువను కబ్జా చేసి చదును చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఉన్నతాఽఽధికారులు జోక్యం చేసుకోవాలని, లేకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగుతామని రైతులు హెచ్చరిస్తున్నారు. టీడీపీ నాయకుల ఇష్టారాజ్యం ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమితోపాటు పంట కాలువ ఆక్రమణ నాలుగు గ్రామాల రైతుల ఆగ్రహం ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు -
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
● తొలిరోజు 914 మంది గైర్హాజరు నెల్లూరు (టౌన్): ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు శనివారం తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 79 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. తొలిరోజు 29,102 మంది విద్యార్థులకుగానూ 28,188 మంది హాజరయ్యారు. 914 మంది గైర్హాజరయ్యారు. ఆర్ఐఓ శ్రీనివాసులు స్టోన్‌హౌస్‌పేటలోని నారాయణ, శ్రీచైతన్య, విశ్వసాయి, కృష్ణచైతన్య తదితర పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులతో పాటు వచ్చిన తల్లిదండ్రులు బయట పడిగాపులు కాశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పరీక్షా కేంద్రాల సమీపంలోని చెట్లు కింద సేద తీరారు. కేంద్రాల వద్ద తాగునీరు ఏర్పాటు చేయకపోవడంతో మంచినీటి కోసం ఇబ్బంది పడ్డారు. -
బెట్టింగ్ జాడ్యం
● జిల్లాలో జోరుగా క్రికెట్ పందేలు ● ఆన్లైన్లో నిర్వహిస్తున్న వైనం ● ఉచ్చులోచిక్కుకుంటున్న మహిళలు ● అప్పులపాలై దొంగతనాలకు ● తాజాగా దొరికిన ఇద్దరు మహిళా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ● అయినా దృష్టి సారించని పోలీసులు ఈమె రమ్మశ్రీ (పేరు మార్చాం). నెల్లూరు కిసాన్‌నగర్‌లో నివాసముంటున్నారు. ప్రభుత్వ వైద్యశాఖ కార్యాలయంలో ఎఫ్‌ఎన్‌ఓగా పనిచేస్తోంది. పదేళ్ల క్రితం వివాహం జరిగింది. క్రికెట్ బెట్టింగ్‌లు, రమ్మీతో పాటు పలు ఆన్లైన్ గేములు ఆడుతుంది. అంతేకాకుండా పేటీఎం, ఫోన్‌పే తదితర వాటి ద్వారా ఆన్లైన్లో సుమారు రూ.5 లక్షల వరకు రుణం, అలాగే స్నేహితుల వద్ద మరో రూ.5 లక్షలు అప్పు తీసుకుని ఆన్లైన్ బెట్టింగులకు పాల్పడుతూ రూ.10 నుంచి రూ.20 లక్షల వరకు అప్పులపాలైంది. ఈఎంఐలు చెల్లించలేక అప్పులు ఎలా తీర్చాలో తెలియక కోవూరులో రెండు రోజుల క్రితం చైన్ స్నాచింగ్ చేస్తూ దొరికిపోయింది. సాక్షిప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ మళ్లీ జడలు విప్పుకుంది. ప్రధాన పట్టణాల నుంచి పల్లెల వరకు ఈ జాడ్యం పాకింది. ప్రస్తుతం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. బుకీలకు కాసులు కురిపిస్తోంది. ప్రజలు బెట్టింగ్ ఉచ్చులో పడి చేతులు కాల్చుకుంటున్నారు. ఒకరిద్దరు పందేలు గెల్చుకుంటున్నా, ఓడిపోయేవారే కోకొల్లలు. బెట్టింగ్‌లో సర్వం కోల్పోయి అప్పుల బాధలు తాళలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుండగా మరికొందరు నేరాలకు తెగబడుతున్నారు. బెట్టింగ్‌ను పూర్తిస్థాయిలో కట్టడి చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో జిల్లాలో జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. బెట్టింగ్ విధానాల్లో మార్పులు క్రికెట్ ఫార్మాట్లో వస్తున్న మార్పుల తరహాలోనే బెట్టింగ్ విధానాల్లోనూ మార్పులు వస్తున్నాయి. గతంలో మ్యాచ్ టూ మ్యాచ్ మాత్రమే బెట్టింగ్‌లు కాసేవారు. ప్రస్తుతం టాస్ ఎవరు గెలుస్తారు? గెలిచిన జట్టు ఎంత స్కోర్ చేస్తుంది? ప్రతి బంతికి, ఓవర్‌కు ఎన్ని పరుగులు వస్తాయి? ఫలానా బ్యాట్స్‌మెన్ ఎన్ని పరుగులు చేస్తారు? బౌలర్ ఎన్ని వికెట్లు తీస్తారు? ఇలా ప్రతి అంశంపై బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ల ద్వారా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. సెల్ఫోన్లతోనే బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. టీవీల్లో చూసే వాటి కంటే రెండు, మూడు నిమిషాల ముందుగానే ప్రత్యేక యాప్‌ల్లో మ్యాచ్ వివరాలు తెలిసిపోతుండటం గమనార్హం. గతంలో నగరాలు, పట్టణాలకే పరిమితమైన బెట్టింగ్‌లు నేడు గ్రామీణ ప్రాంతాలకు పాకాయి. సులువుగా డబ్బులు సంపాదించే అవకాశం ఉందంటూ బుకీలు ఎరవేయడంతో యువత, విద్యార్థులు, కూలీలు, కార్మికులు, వ్యాపారస్తులతో పాటు వివిధ రంగాల్లోని వారు బెట్టింగ్ మాఫియా వలలో చిక్కుకుంటున్నారు. బెట్టింగ్ వ్యసనాలకు బానిసై రూ.లక్షల్లో అప్పులు చేసి మరీ బెట్టింగ్‌లు కాస్తున్నారు. బెట్టింగ్‌ల్లో నష్టపోయి అప్పులను తీర్చలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంకొందరు దొంగతనాలకు పాల్పడుతూ వచ్చిన సొమ్ముతో అప్పులు తీర్చి తిరిగి బెట్టింగ్‌లు కాస్తూనే ఉన్నారు. ఈమె పేరు జానకి (పేరు మార్చాం). నెల్లూరు మూలాపేటలో నివాసం. కోవూరు మండలంలోని ఓ వ్యక్తితో వివాహమైంది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. కరోనా సమయంలో విజయవాడలోని ఎఫ్ఎన్ఓ ట్రైనింగ్ పూర్తి చేసి 2022లో కోవూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవుట్ సోర్సింగ్ ఎఫ్‌ఎన్‌ఓగా చేరారు. కరోనా సమయంలో నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో కొందరితో స్నేహం కుదిరి వారి ద్వారా ఆన్లైన్ బెట్టింగ్‌లు అలవాటు చేసుకుంది. అప్పటి నుంచి ఆన్లైన్ బెట్టింగ్‌లకు పాల్పడుతూ అప్పులు తీర్చేందుకు దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. ● వనంతోపు సెంటర్‌కు చెందిన ఓ యువకుడు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీతో సరదాగా బెట్టింగ్‌లు కాయడం ప్రారంభించాడు. అది వ్యసనంగా మారిపోవడంతో తెలిసిన వారివద్ద అప్పులు చేశాడు. తల్లిదండ్రులు కొని ఇచ్చిన బైక్‌ను కుదువపెట్టి మరీ బెట్టింగ్‌లు కాశాడు. అందులో నష్టాలు రావడంతో బైక్ దొంగతనం జరిగిందని తల్లిదండ్రులను నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరకు వారు గట్టిగా నిలదీయడంతో బెట్టింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎక్కడ చూసినా క్రికెట్ పందేలే చాపకింద నీరులా బెట్టింగ్ భూతం విస్తరిస్తూ ప్రజల జీవితాలను, కుటుంబాలను ఛిద్రం చేస్తున్నా పోలీసులు అటువైపుగా దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పోలీసులకు చిక్కకుండా పకడ్బందీగా క్రికెట్ బెట్టింగ్ సాగుతోంది. నగరంలోని బార్లు, హోటల్స్, అపార్ట్మెంట్లు, వ్యాపారసంస్థలు ఎక్కడ చూసినా క్రికెట్ పందేలే. ఈ జాడ్యం వందలాది కుటుంబాల్లో చిచ్చురేపుతోంది. మార్చి 9వ తేదీన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగుస్తున్నా.., మార్చి 22 నుంచి మే 25వ తేదీ వరకు ఐపీఎల్ జరగనుంది. ఈసీజన్లో ఎంతమంది ఆర్థికంగా చితికిపోతారో? ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారో? ఎన్ని కుటుంబాలు వీధినపడనున్నాయో తలచుకుంటేనే భయం కలుగుతోంది. ఇప్పటికై నా పోలీసు అధికారులు స్పందించి బెట్టింగ్‌పై ఉక్కుపాదం మోపాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ● బుచ్చిరెడ్డిపాళెం చెందిన శ్రీనివాసులు బెట్టింగ్‌ల్లో నష్టపోయాడు. బెట్టింగ్‌రాయుళ్ల ఒత్తిడితో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈవిషయం తెలుసుకున్న అతని భార్య యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎంతో సంతోషంగా ఉండే ఆ కుటుంబాన్ని బెట్టింగ్ భూతం కబళించింది. ఇలా జిల్లాలో అనేకమంది నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు.ఉదాహరణలు ఇవిగో.. నెల్లూరు నగరానికి చెందిన ఇద్దరు యువకులు సులువుగా డబ్బు సంపాదించాలని బెట్టింగ్‌లు ఎంచుకున్నారు. చిన్న చిన్న మొత్తాలతో పందేలు కాయడం.. వారు ఎంచుకున్న జట్లు గెలుపొందడంతో డబ్చు వచ్చింది. దీంతో తమ తాహతుకు మించి అప్పులు చేసి మరీ రూ.లక్షల్లో బెట్టింగ్‌లు కాశారు. కథ అడ్డం తిరగడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి బైక్ దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కి జైలుపాలయ్యారు. -
కనిపించిన ‘నెలవంక’
● పవిత్ర రంజాన్ మాసం ఆరంభం ● సంబరాలు చేసుకున్న ముస్లింలు నెల్లూరు(బృందావనం): ఆకాశంలో శనివారం సాయం సంధ్యవేళ నెలవంక కనిపించడంతో రంజాన్ నెల ఆరంభమైంది. నెలవంకను వీక్షించిన అనంతరం మతపెద్దల సూచనలతో ముస్లింలు రాత్రి 8.45 గంటలకు తరావీనమాజు ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక ‘దువా’ (ప్రార్థన) చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ‘రంజాన్’ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మిఠాయిలు పంచుకుని, బాణసంచా పేల్చి ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకున్నారు. రంజాన్ మాసంలో నెల రోజులపాటు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఆథ్యాత్మిక చింతనతో గడుపుతారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సంప్రదాయంగా నియమ నిబంధనలను పాటిస్తూ కఠోర ఉపవాసంతో దీక్షలో ఉంటారు. ప్రతి రోజు వేకువజామున ‘సహరి’తో ఉపవాసం ఆరంభించి సాయంత్రం సంధ్యవేళ ‘ఇఫ్తారి’తో ఉపవాసం దీక్ష విరమణ పరిపాటి. ఎఫ్ఆర్ఎస్ హాజరు వేయకపోతే కఠిన చర్యలు ● డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ పద్మావతి నెల్లూరు(అర్బన్): ముఖ ఆధారిత హాజరు (ఎఫ్ఆర్ఎస్) వేయని వైద్యశాఖ అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ కె.పద్మావతి పేర్కొన్నారు. విజయవాడ నుంచి వచ్చిన ఆమె శనివారం నగరంలోని వైద్యశాఖ కార్యాలయంలోని డీఎంహెచ్ఓ చాంబర్లో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధుల్లో సమయపాలన పాటించని వారిపైన కూడా చర్యలు తప్పవన్నారు. ప్రతి అధికారి, ఉద్యోగి వారు విధులు నిర్వర్తించే ప్రాంతంలోనే తప్పనిసరిగా నివాసముండాలని సూచించారు. ఐపీ, ఓపీ, ఆస్పత్రులలో ప్రసవాలు, ల్యాబ్ టెస్ట్‌లు, ఐయుసీడీల ఆధారంగా సీహెచ్‌సీలకు గ్రేడింగ్ విధానం అమలు చేస్తున్నామన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ సుజాత, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ ఖాదర్‌వలి, డీఐఓ డా.ఉమామహేశ్వరి పాల్గొన్నారు. నుడా ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు ● జిల్లా కలెక్టర్ ఆనంద్ నెల్లూరు(బారకాసు): నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ నుడా కమిటీ సభ్యులు, అధికారులకు సూచించారు. శనివారం వేదాయపాలెం గాంధీనగర్‌లోని కార్యాలయంలో నుడా అథారిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ఆనంద్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వైస్ చైర్మన్ సూర్యతేజ, అథారిటీ సభ్యులు హాజరయ్యారు. నుడా కార్యకలాపాల కోసం సిబ్బంది నియామకం, లేఅవుట్ల అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపులు అజెండాలో ప్రధాన అంశాలుగా పొందుపరిచారు. పలు అంశాలను సభ్యుల సమక్షంలో కలెక్టర్ సమీక్షించి ఆమోదించారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ నగరంతో పాటు జిల్లాలోని పలు పట్టణాలు, పంచాయతీల్లో నుడా ఆధ్వర్యంలో లేఅవుట్లు వేసి తక్కువ ధరకు ఇంటి స్థలాలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. వైస్‌చైర్మన్ మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ మాట్లాడుతూ నుడా ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఇరిగేషన్, ఆర్అండ్బీ ఎస్ఈలు దేశ్‌నాయక్, గంగాధర్, పరిశ్రమల శాఖ జీఎం ప్రసాద్, ఆర్డీఓ వంశీకృష్ణ, ముఖ్య ప్రణాళికాధికారి కె హిమబిందు, నుడా సెక్రటరీ పెంచలరెడ్డి, ప్రణాళికాధికారి ఎం హిమబిందు పాల్గొన్నారు. -
ఉద్యోగాల పేరుతో టోకరా
నెల్లూరు(అర్బన్): అతను అటెండర్ స్థాయి ఉద్యోగి. రాష్ట్ర ఉన్నతాధికారుల పేరుతో ఫోర్జరీ సంతకాలు చేసి నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో (పెద్దాస్పత్రి) నియమిస్తూ ఉద్యోగ ఉత్తర్వులు కూడా అందజేశాడు. వాటిని నిజమైనవిగా భావించిన నిరుద్యోగులు పెద్దాస్పత్రికి వెళ్లారు. తీరా తాము మోసపోయామని తెలిసి లబోదిబోమంటున్నారు. మోసం చేసింది ఎవరో కాదు.. పెద్దాస్పత్రిలో సర్జికల్ విభాగంలో అటెండర్‌గా ఉద్యోగం చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగి మురళి. నెల్లూరు పొదలకూరు రోడ్డులో నివసిస్తున్న జాన్ అనే వ్యక్తి కొత్తూరు వద్ద కరెంటాఫీస్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ ఇటీవల రిటైరయ్యారు. పెద్దాస్పత్రిలో పనిచేసే మురళి ఆయనతో పరిచయం పెంచుకున్నాడు. ఆరు నెలల క్రితం జాన్ కుమార్తె షారోన్ మాధురికకు ల్యాబ్ టెక్నీషియన్‌గా కాంట్రాక్ట్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. రూ.1.50 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లిస్తే సరిపోతుందని నమ్మబలికాడు. జాన్ పలుదఫాలుగా ఫోన్‌పే ద్వారా మురళికి నగదు పంపాడు. అలాగే తన తమ్ముడు కుమార్తె హారికకు ఉద్యోగం కోసం రూ.75 వేల వరకు మురళికి ఇప్పించాడు. డబ్బులిచ్చాక ఉద్యోగం ఎక్కడని ప్రశ్నించడంతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారి పేరుతో దొంగ సంతకం చేసి 2024 నంబర్ ఒకటో తేదీన ఉద్యోగమిస్తూ అపాయింట్మెంట్ ఉత్తర్వులిచ్చాడు. మొత్తం 8 మందికి ఉద్యోగాలిస్తూ ఫేక్ లెటర్లు ఇచ్చాడు. వాటిని నిజమని నమ్మి పెద్దాస్పత్రికి వెళ్లగా ఇక్కడ ఖాళీల్లేవని ఎవరో మోసం చేశారని అధికారులు చెప్పడంతో అప్పటికి గాని తాము మోసపోయినట్టు జాన్ సోదరులకు తెలియలేదు. దీంతో వారు డబ్బుల కోసం మురళిపై ఒత్తిడి తెచ్చారు. అతను తప్పించుకుని తిరగడంతో నాలుగో నగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మురళిని పిలిపించారు. అతని తల్లి అక్కడకు వచ్చి తన బిడ్డను వదిలేయాలని, ఆ డబ్బు తాను చెల్లిస్తానని బతిమాలుకుంది. దీంతో జాన్ సోదరులు రాజీపడి డబ్బుల కోసం ఎదురు చూడసాగారు. స్పందన లేకపోవడంతో మురళి కోసం శుక్రవారం జాన్ పెద్దాస్పత్రికి వచ్చాడు. మోసాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు తెలిపాడు. ఎనిమిది మందికి.. ఆరుగురికి జూనియర్ అసిస్టెంట్లుగా, ఒకరికి ల్యాబ్ టెక్నీషియన్‌గా, మరొకరికి అటెండర్‌గా మురళి ఉత్తర్వులిచ్చాడు. అందులో రిజర్వేషన్, ఆధార్ నంబర్లు, జీతం స్కేల్ పొందుపరుస్తూ దొంగ ఉత్తర్వులు ఇవ్వడం విశేషం. వారిలో ఎస్కే రేష్మ, కె.కలీమ్, ఎస్కే వశీం అహ్మద్, ఎ.షారోన్ మాధురిక, కామాటి అనూష, జొన్నవాడ షాలీము, ఎం.నాగసుమతి, టి.నరేంద్ర తదితరులున్నారు. తమను మోసం చేశాడని తెలుసుకున్న కొంతమంది నిరుద్యోగులు మురళిపై ఒత్తిడి తెచ్చి డబ్బు తిరిగివ్వాలని డిమాండ్ చేయసాగారు. మరో వైపు ఈ కథ పోలీసులకు చేరింది. దీంతో మురళి పెద్దాస్పత్రి విధులకు రావడం మానేశాడు. తప్పించుకుని తిరుగుతున్నాడు. అమాయకులను మోసం చేసి సుమారు రూ.15 లక్షల వరకు దండుకున్నాడనే ప్రచారం పెద్దాస్పత్రిలో జరుగుతోంది. నకిలీ ఉత్తర్వుల అందజేత ఏకంగా డీఎంఈ సంతకం ఫోర్జరీ ఒక్కో ఉద్యోగానికి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వసూలు పెద్దాస్పత్రిలోని ఓ చిరుద్యోగి నిర్వాకం పోలీసులకు బాధితుల ఫిర్యాదువిచారణ చేస్తున్నాం ఉద్యోగాలు కల్పిస్తామంటూ డబ్బులు వసూలు చేయడం, డీఏంఈ పేరుతో దొంగ ఉత్తర్వులు సృష్టించినట్టు ఫిర్యాదు అందింది. విచారణ చేస్తున్నాం. డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. – డాక్టర్ సిద్ధానాయక్, పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ -
టీడీపీ నేత ఆధ్వర్యంలో పేకాట శిబిరం
నెల్లూరు టాస్క్‌ఫోర్స్: కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండల స్థాయి టీడీపీ నేత పేకాట శిబిరం నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీడీపీ నేతలు మద్యం తాగుతూ పేకాట ఆడుతున్న వీడియో వైరల్ కావడం చర్చనీయాంశమైంది. నార్తురాజుపాళేనికి చెందిన టీడీపీ నేత జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అనధికార పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నాడు. జిల్లా నలుమూలల నుంచి జూదరులు వచ్చి అక్కడ మూడు ముక్కలాడుతున్నారు. నిత్యం రూ.లక్షలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేత రెండేళ్ల క్రితం అనధికార పేకాట శిబిరం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అయినా మార్పురాలేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ యథేచ్ఛగా పేకాట శిబిరం నిర్వహిస్తూ ఆదాయ వనరులుగా మార్చుకున్నాడు. రోజూ ప్లేస్‌లు మార్చేస్తూ.. ఈజీ మనీకి అలవాటు పడిన సదరు టీడీపీ నేత నియోజకవర్గంలోని కొడవలూరు, యల్లాయపాళెం ప్రాంతాల్లో అనధికార పేకాట శిబిరాలను నిర్వహించేవాడు. కానీ ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ప్లేస్‌లు మార్చేస్తూ మూడు ముక్కలాటతో సొమ్ము చేసుకుంటున్నాడు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఓ ప్రాంతంలో పేకాట ఆడుతున్న వీడియోను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అక్కడే మద్యం తాగుతూ, డ్యాన్స్‌లు చేస్తూ, పేకాట ఆడుతున్న వీడియో పెద్ద దుమారమే రేపింది. కమీషన్లతో రూ.లక్షల్లో ఆదాయం ఈ అనధికార పేకాట శిబిరం నిర్వహణ కోసం పేకాటరాయుళ్లు సదరు టీడీపీ నేతకు 20 శాతం కమీషన్ సమర్పించాలి. ఆటలో కూర్చోవాలంటే ముందుగా రూ.5,000 కట్టాలి. ఆపై పెట్టే ప్రతి రూపాయిలో 20 శాతం ముందుగానే తీసుకుని టోకెన్లు ఇస్తారు. ఆ టోకెన్లు ఉంటేనే ఆడాలి. ఇలా రోజువారీ టీడీపీ నేతకు రూ.లక్షల్లో ఆదాయం వస్తోంది. రోజువారీగా రూ.లక్షలు చేతులు మారుతున్న వైనం కొడవలూరు మండల టీడీపీ నేత నిర్వాకం సోషల్ మీడియాలో వీడియో వైరల్ -
విధుల నుంచి ఇద్దరు ఎఫ్‌ఎన్‌ఓల తొలగింపు
నెల్లూరు(అర్బన్): జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలో పనిచేస్తూ దొంగతనానికి పాల్పడి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఇద్దరు ఎఫ్ఎన్ఓలను విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ డీఎంహెచ్ఓ వి.సుజాత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. యల్లాయపాళెం పీహెచ్సీ ఎఫ్ఎన్ఓ దార్ల జీవిత, సర్వాయపాళెం పీహెచ్సీ ఎఫ్ఎన్ఓ వాసుకిలు ఆప్కాస్‌లో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ కోవూరు మండలం పాటూరు రోడ్డులో గురువారం రాత్రి ఓ వృద్ధురాలి నుంచి బంగారు చైన్ చోరీ చేస్తూ పట్టుపడ్డారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అందువల్ల వీరిని ఉద్యోగాల నుంచి తొలగించామని తెలిపారు.న్యాయవాదుల కోర్టు విధుల బహిష్కరణనెల్లూరు(లీగల్): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అడ్వకేట్ యాక్ట్ 2025 బిల్లును వ్యతిరేకిస్తూ నెల్లూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం కోర్టు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కొత్త బిల్లును పునః పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. న్యాయవాదులందరు తమ ఆందోళన విరమించి విధులకు హాజరు కావాలని కోరారు. బార్ అధ్యక్షుడు ఉమామహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులూ.. విజయీభవ ● నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ● 79 కేంద్రాల ఏర్పాటు నెల్లూరు(టౌన్): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 79 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. విద్యార్థులను అరగంట ముందుగా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 53,200 మంది హాజరుకానున్నారు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి 28,176 మంది, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 25,024 మంది ఉన్నారు. కోవూరు, తోటపల్లిగూడూరు, బిట్రగుంట, మర్రిపాడు, ఆత్మకూరు, ఉదయగిరి, రావూరు, కుల్లూరు, చేజర్ల, పొదలకూరు, బుచ్చిరెడ్డిపాళెం, అల్లూరు ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. హాల్‌టికెట్లను బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని హాజరుకావొచ్చు. దానిపై సంబంధిత కళాశాల ప్రిన్సిపల్ సంతకం ఉండాల్సిన అవసరం లేదు. విద్యార్థుల సమస్యలు, ఇబ్బందుల కోసం కంట్రోలు రూమ్‌ను ఏర్పాటు చేశారు. 0861 – 2320312 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలి. మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా నాలుగు ఫ్లయింగ్, 5 సిటింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. 1,400 మందికి పైగా ఇన్విజిలేటర్లను నియమించారు. విద్యార్థులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆర్ఐఓ ఆదూరు శ్రీనివాసులు సూచించారు. నేడు పింఛన్ల పంపిణీనెల్లూరు (పొగతోట): సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రక్రియకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. శనివారం జిల్లా వ్యాప్తంగా 3,07,232 మంది లబ్ధిదారులకు రూ.132 కోట్ల నగదును పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి సచివాలయాల ద్వారా నగదును సిబ్బందికి అందజేశారు. పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది ఉదయం నుంచి నగదు పంపిణీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇసుక మోసిన విద్యార్థులు దుత్తలూరు: దుత్తలూరులోని ఏపీ మోడల్ పాఠశాలలో శుక్రవారం విద్యార్థుల చేత ఇసుక బస్తాలు మోయించారు. స్కూల్లో సరస్వతీదేవి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరుబయట ఉన్న ఇసుకను బస్తాల్లోకి నింపి లోపలికి మోయించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని గురించి ప్రిన్సిపల్ సైమన్రావును వివరణ కోరగా తాము విద్యార్థులకు ఎటువంటి పని చెప్పలేదని, వారే స్వయంగా తీసుకొచ్చారని తెలిపారు. -
నిరుద్యోగ భృతి ఎక్కడ?
సూపర్ సిక్స్కూ ఎగనామమేనా! అంకెల గారడీ చేసిన ఆర్థిక మంత్రి కేశవ్ సాక్షిప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి మిగిలింది. రూ.3.22 లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ‘కలరింగ్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ’ అన్న రీతిలో ఉందని జిల్లాలోని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. బడ్జెట్‌ను పరిశీలిస్తే ప్రధానంగా పొదుపు మహిళలు, కౌలు రైతులు, నిరుద్యోగులు, పింఛనుదారులు వీరంతా నష్టపోతున్నారు. జిల్లాలోని పెన్నా డెల్టాకు, తెలుగుగంగ ప్రాజెక్టు, సోమశిల–స్వర్ణముఖి కెనాల్‌కు ఆశించిన మేర నిధులు కేటాయించలేదు. అరకొరగా కేటాయించి చేతులు దులుపుకొన్నారు. అది మినహా జిల్లాకు ఒరిగిందేమి లేదు. సున్నా వడ్డీ ఊసేలేదు జిల్లాలో 39,358 పొదుపు గ్రూపులున్నాయి. వీటిలో 4,02,729 మంది సభ్యులున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో వీరికి సున్నా వడ్డీ కింద రూ.188 కోట్లు అందజేసింది. నేటి బడ్జెట్లో సున్నా వడ్డీ ఊసే లేకపోవడంతో పొదుపు మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారు. పింఛన్లకు కోత జిల్లాలో పింఛన్‌దారులు 3.7 లక్షల మంది ఉన్నారు. వీరికి ప్రతి నెలా రూ.132 కోట్లు పింఛన్ రూపంలో ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే బడ్జెట్లో రాష్ట్ర వ్యాప్తంగా రూ.27,500 కోట్లు పింఛన్‌దారుల కోసం కేటాయించారు. ఇప్పుడు ఇస్తున్న లెక్కల ప్రకారమే రాష్ట్రంలో రూ.32,628 కోట్లు పింఛన్‌కు ఖర్చవుతోంది. అంటే రూ.5,128 కోట్ల మేర కోత వేయబోతున్నారు. తల్లికి వందనంలో మతలబు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జూన్ 2024కు పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 43,96,000 మంది విద్యార్థులకు రూ.6,590 కోట్లు అమ్మఒడి కింద ఇచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్పినట్టు 1 నుంచి 12వ తరగతి వరకు ఎంతమంది విద్యార్థులు చదువుతుంటే అంతమందికి రూ.15 వేలు చొప్పున ఇవ్వాలి. విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే 87.41 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ తల్లికి వందనం నిధులివ్వాలంటే రూ.13 వేల కోట్లకు పైగా ఇవ్వాలి. అయితే బడ్జెట్లో కేటాయింపులు రూ.9,407 కోట్లుగా పేర్కొన్నారు. అంటే వేలాది మందికి తల్లికి వందనం సొమ్ముకు ఎగనామం పెట్టనున్నారు. ఎన్నికల హామీలో భాగంగా టీడీపీ నిరుద్యోగ భృతి కల్పిస్తామంది. జిల్లాలో సుమారు లక్ష మంది నిరుద్యోగులు డిగ్రీలు చేతబట్టుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికల హామీ మేరకు వీరికి నిరుద్యోగ భృతి కింద బడ్జెట్లో నిధులు కేటాయించాలి. ఆ ఊసేలేదు. 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. ఈ హామీకి కూడా బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. జిల్లాలో నూతన పరిశ్రమలకు ప్రోత్సాహం లేదు జిల్లాలో ఆత్మకూరు సమీపంలోని నారంపేట వద్ద గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పేందుకు శ్రీకారం చుట్టారు. అక్కడ కొంత మేరకు పనులు జరిగాయి. ప్రభుత్వం మారింది. బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆటో కార్మికులు, మత్స్యకారులు, కాయకష్టం చేసుకునే కూలీలు ప్రతి నెలా ఏదో ఒక పథకం ద్వారా లబ్ధిపొందేవారు. ఇప్పుడు అన్నీ ఆగిపోయాయి. పాఠశాల విద్యకు ఇంతేనా? బడ్జెట్లో రాష్ట పాఠశాల విద్యకు 20 శాతం నిధులు కేటాయించాలి. 2025–26కి బడ్జెట్లో పాఠశాల విద్యాశాఖకు 9.86 శాతం నిధులు కేటాయించడం సరికాదు. ఈ నిధులు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఏ మాత్రం సరిపోవు. మోడల్ ప్రైమరీ స్కూల్స్‌కు కావాల్సిన తరగతి గదులు, వసతులు కోసం బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించలేదు. – నవ కోటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి, యూటీఎఫ్ బడ్జెట్ సంతృప్తికరంగా లేదు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతృప్తికరంగా లేదు. విద్య, వైద్యం, రైతు, యువతకు గత బడ్జెట్‌తో పోల్చుకుంటే ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. గత ప్రభుత్వం ధరల స్థిరీకరణకు రూ.3,000 కోట్లు కేటాయిస్తే, ప్రస్తుత ప్రభుత్వం రూ.300 కోట్లు మాత్రమే కేటాయించడం దారుణం. జలాశయాల అభివృద్ధికి అరకొరగా నిధులు కేటాయింపులు చేశారు. – కాకు వెంకటయ్య, రైతు నాయకుడు, ఉదయగిరి బడ్జెట్లో జిల్లాకు మొండి చేయి నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదు పింఛన్‌దారులకు కష్టకాలమే. కలరింగ్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ బడ్జెట్‌పై ప్రజల అసంతృప్తి -
సింహపురి ఆభరణాలు భళా..
స్వర్ణాభరణాల తయారీలో దక్షిణాది రాష్ట్రాల్లో సింహపురి రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఇక్కడ లభించే వినూత్న డిజైన్లకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. స్థానికంగా స్థిరపడిన మార్వాడీలు, జైన్లు.. ఇక్కడి వారు అందించే ముడిసరుకుతో ఆభరణాలను తయారు చేస్తూ స్వర్ణకారులు, ముస్లింలు ఉపాధి పొందేవారు. అయితే కాలక్రమేణా వీరి స్థానాన్ని బెంగాలీలు ఆక్రమిస్తున్నారు. ఫలితంగా ఎన్నో ఏళ్లుగా ఇదే వృత్తిని నమ్ముకున్న తయారీదారులు ప్రస్తుతం జీవనోపాధి కోల్పోయి నానా అగచాట్లు పడుతున్నారు. నెల్లూరు (పొగతోట): స్వర్ణాభరణాల తయారీకి కేరాఫ్‌గా నెల్లూరు నిలుస్తోంది. దక్షిణాదిలో కోయంబత్తూరు తర్వాతి స్థానం నెల్లూరుదే కావడం విశేషం. చెన్నై సైతం మూడో స్థానంలో ఉందంటే ఇక్కడ రూపొందించే ఆభరణాలకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి 50 ఏళ్ల నుంచే జిల్లాలో నిష్ణాతులు పాతుకుపోయారు. పెద్ద, చిన్న, అతి సూక్ష్మ ఆభరణాల తయారీలో ఇక్కడి స్వర్ణకారులు ప్రావీణ్యం సాధించారు. అర గ్రాము, గ్రాముతో చిన్న కమ్మలు, నెక్లెస్‌లు, స్టోన్ ఐటెమ్స్‌ను రూపొందించడంలో చేయి తిరగడంతో వీటిని సింగపూర్, మధ్య ప్రాచ్య దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. జిల్లాలో నెలకు రూ.500 కోట్లకుపైగా వ్యాపారం జరుగుతోందని అంచనా. జిల్లాలో ఇలా.. ఆభరణాలను తయారు చేసే స్వర్ణకారులు జిల్లాలో సుమారు 15 వేల మందికిపైగా ఉన్నారు. చిన్న, పెద్ద బంగారు షాపులు నగరంలో వెయ్యికిపైగా ఉన్నాయి. స్వర్ణాభరణాలను తయారు చేయడంలో ప్రారంభంలో స్థానిక స్వర్ణకారులు, అనంతరం ముస్లింలు, ప్రస్తుతం బెంగాలీలు ముందంజలో ఉన్నారు. చేతితో తయారుచేసే బంగారు ఆభరణాలను ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారు. అదే ముంబై, కోయంబత్తూర్ తదితర ప్రాంతాల్లో మెషీన్ కటింగ్‌తో తయారు చేస్తున్నారు. నగరంలోని ఆచారివీధి, చిన్నబజార్, కొరటాల వీధి, గిడ్డంగివీధి, కాకర్ల వీధి, కుక్కల గుంట, మండపాల వీధిలో వేలాది మంది స్వర్ణకారులు జీవనోపాధి పొందుతున్నారు. అధిక శాతం షాపులనూ ఆయా ప్రాంతాల్లోనే ఏర్పాటు చేశారు. కాలానుగుణంగా మార్పులు స్వర్ణకారులకు ముడి సరుకును మార్వాడీలు, జైన్లు, స్థానికులు అందజేస్తారు. స్వర్ణకారులుండే రోజుల్లో వంద గ్రాముల బంగారానికి 8 గ్రాముల తరుగు, కూలిని అందించేవారు. ఇలా వంద గ్రాముల బంగారాన్ని ఇస్తే 92 గ్రాములతో ఆభరణాలను తయారుచేసేవారు. ఫలితంగా స్వర్ణకారులకు 8 గ్రాముల బంగారం, కూలి లభించేది. అనంతరం తయారీలో ముస్లింలు ప్రవేశించారు. ఆ సమయంలో కూలిని ఎత్తేసి తరుగును మాత్రమే ఇచ్చేవారు. గోల్డ్ మాఫియా ఆగడాలు జిల్లాలో గోల్డ్ మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. బడా నేతల సహకారంతో ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించకుండానే రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. జిల్లాలో తయారు చేస్తున్న రాళ్లు, ఫ్యాన్సీ ఐటమ్స్ నగలకు దేశ వ్యాప్తంగా ప్రత్యేక డిమాండ్ ఉండటంతో ఇతర రాష్ట్రాలకు చెందిన బడా వ్యాపారులు దొడ్డిదారిన తీసుకొచ్చి తయారీ అనంతరం అదే మార్గంలో అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు, పోలీసులకు ప్రతి నెలా ముడుపులు అందుతుండటంతో నామమాత్రపు తనిఖీలు చేసి చేతులు దులుపుకొంటున్నారు. పెండింగ్‌లో ఎఫ్ఐఆర్లు బంగారు ఆభరణాలను తయారు చేసేందుకు వచ్చిన బెంగాలీల్లో అధిక శాతం మంది పూర్తి వివరాల్లేకుండానే ఉంటున్నారు. బంగారు ఆభరణాల చోరీలకు సంబ«ంధించిన ఎఫ్ఐఆర్లు సంతపేట పోలీస్‌స్టేషన్‌లో అధిక శాతం పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు వీటిని తయారు చేసే దుకాణంలో సీసీ ఫుటేజ్‌లు అందుబాటులో ఉన్నా, అపహరించిన వారిని పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. జిల్లాలో నైపుణ్యమున్న స్వర్ణకారులు కార్మికులుగానే మిగిలిపోతున్నారు. వీరి జీవితాల్లో వెలుగులు రావడంలేదు. బెంగాల్ నుంచి తయారీదారులను ఆహ్వా నించి సూక్ష్మ బంగారు ఆభరణాలను రూపొందించడాన్ని ప్రారంభించారు. సూక్ష్మ, పలచటి ఆభరణాలపై ఎక్కువ మంది ఆసక్తి చూపడంతో అధిక శాతం మంది రావడం ప్రారంభించారు. తయారీలో ప్రస్తుతం వీరే కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరికి ప్రస్తుతం తరుగుగా ఐదు గ్రాములను ఇస్తున్నారు. వీరి రంగప్రవేశంతో స్వర్ణకారులు, ముస్లింలు ఉపాధి కోల్పోయారు. ఫలితంగా ఆటోలు తోలుకుంటూ, కూరగాయలు, పండ్ల వ్యాపారాలు, బడ్డీ కొట్లు నడుపుకొని జీవనం సాగిస్తున్నారు.సందట్లో సడేమియాగా మధ్యవర్తులుబంగారు ఆభరణాల తయారీలో మధ్యవర్తులుగా చిన్నబజార్, పెద్దబజార్ తదితర ప్రాంతాలకు చెందిన కీలక వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నారు. మధ్యవర్తులు సూచించిన వ్యక్తులకే బంగారాన్ని ఆభరణాల తయారీ నిమిత్తం ఇస్తారు. తయారీదారులకొచ్చే తరుగులో కొంత భాగాన్ని వీరు తీసుకుంటున్నారు. మరోవైపు కొన్ని చోట్ల కీలకంగా ఉండే వ్యక్తులకు బంగారు ముడి సరుకును ఇస్తున్నారు. వీరు బెంగాలీలతో బంగారు ఆభరణాలను తయారు చేయించి తిరిగి అందజేస్తున్నారు. -
ఈ టీచరమ్మ నిత్య విద్యార్థి
‘నేను ఇప్పటికీ విద్యార్థినే’అంటుంది విజయమ్మ. ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ విరమణ చేసిన విజయమ్మ మదిలో ‘విశ్రాంతి’ అనే ఊహ ఎప్పుడూ రాలేదు. ఆమె ఇల్లు పెద్దబడి. చిలుకలు వాలిన చెట్టులా ఎప్పుడూ సందడిగా ఉంటుంది. ‘సామాజిక సేవాకార్యక్రమాల్లోనే సంతోషం’ అని చెబుతున్నట్లుగా ఉంటుంది. ‘నేను నిత్య విద్యార్థిని’ అని చెప్పే విజయమ్మ మాటను అక్షరాలా నిజం చేయడానికన్నట్టు ఇప్పటికే ఐదు డిగ్రీలు, 4 పీజీ కోర్సులు పూర్తి చేసి పదవ కోర్సుకు సిద్ధమవుతోంది.ఉద్యోగానికి ఉత్సాహం తోడైతే ఆ శక్తే వేరు. ఆ శక్తి విజయమ్మలో కనిపిస్తుంది. ఉద్యోగ విధులకు సామాజిక బాధ్యతను కూడా జోడించడం ఆమె ప్రత్యేకత. తాను ఉద్యోగం చేసిన ప్రతి గ్రామంలో విద్యాబోధనతోపాటు పర్యావరణ సంరక్షణ గురించి పిల్లలకు అవగాహన కలిగించేది. ఆయా గ్రామాలలో వందల మొక్కలను నాటించింది. బాలికల చదువు విషయంలో ప్రత్యేక చొరవ చూపేది. ‘ఇప్పటి నుంచే మీకంటూ ఒక కల ఉండాలి’ అని చెబుతుండేది.పేదరికాన్ని జయించి, ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి గొప్పస్థానంలో నిలిచిన ఆదర్శనీయ మహిళల గురించి చెబుతూ ఉండేది. వింజమూరు, ఇందుకూరుపేట, టీపీ గూడూరు, నెల్లూరు రూరల్ తదితర ప్రాంతాల్లో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహించిన విజయమ్మ ఇందుకూరుపేట మండలం కొత్తూరు హైస్కూల్లో ఉపాధ్యాయినిగా ఉద్యోగ విరమణ చేసింది. రోజూ ఎంతో ఉత్సాహంగా స్కూల్‌కు వెళ్లే విజయమ్మకు ఉద్యోగ విరమణ తరువాత స్కూలు దూరం అయింది. అయితే ఉత్సాహం దూరం కాలేదు. జనవిజ్ఞాన వేదిక ద్వారా సామాజిక కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటోంది.మైపాడు గేటు సమీపప్రాంతంలో ఆమె ఉండే ఇల్లు పిట్టలు వాలిన చెట్టులా ఎప్పుడూ కళకళగా ఉంటుంది. విజయమ్మ పదవీ విరమణ చేసినా ఇప్పటికీ స్థానికులతో సహా ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులు వస్తూనే ఉంటారు. విద్యార్థుల కోసం పుస్తకాలతోపాటు డ్రాయింగ్ టూల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. విజయమ్మ ఇంట్లో ఒక మూల పుస్తకాలు చదువుకునే, ఒక మూల పెయింటింగ్ వేసే అమ్మాయిలు కనిపిస్తుంటారు. ఆమె మార్గదర్శకత్వంలో రోడ్డుకు ఇరువైపులా, రైల్వే గేట్.. మొదలైనప్రాంతాల్లో విద్యార్థులు విరివిగా మొక్కలు నాటుతున్నారు.అవయవ దానంతో పాటు శరీర దానాలు చేసేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ‘సింహపురి దేహ సమర్పణ’ సంస్థను విజయమ్మ ప్రారంభించింది. మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి శరీరాన్ని వైద్యశాలలకు దానం చేసేలా చొరవ చూపుతుంది. ఇప్పటివరకు నలుగురి మృతదేహాలను ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలకు అందజేసింది. ప్లాస్టిక్ వినియోగం వల్ల జరిగే నష్టాలపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కలిగేలా ర్యాలీలు నిర్వహిస్తోంది.పనిలోనే ఆనందంరోజూ బడికి వెళుతున్నప్పుడల్లా ఎంతో ఉత్సాహంగా ఉండేది. విద్యార్థులలో విద్యార్థిగా మారిపోయేదాన్ని. ఇప్పుడు స్కూల్‌కు వెళ్లే అవకాశం లేకపోయినా విద్యార్థులకు దూరం కాలేదు. ఇప్పటికీ ఎంతోమంది విద్యార్థులు నా దగ్గరికి వస్తుంటారు. మేమందరం కలిసి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ‘హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకోకుండా ఇవన్నీ ఎందుకు?’ అనే వాళ్లు కూడా ఉంటారు. అయితే నాకు పనిలోనే ఆనందం దొరుకుతుంది. మనం చేయడానికి ఈ సమాజంలో ఎన్నో మంచి పనులు ఉన్నాయి. మనం అనుకున్నవాటిలో కొన్ని చేయగలిగినా ఎంతో సంతోషం, ఎంతో శక్తి వస్తుంది.– విజయమ్మ – వల్లూరు సాంబశివరావు, సాక్షి, పొగతోట, నెల్లూరు -
అనారోగ్యంతో బాధపడుతూ..
● జీవితంపై విరక్తితో వృద్ధుడి ఆత్మహత్య నెల్లూరు(క్రైమ్): జీవితంపై విరక్తి చెంది పురుగు మందు తాగిన ఓ వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగుకు చెందిన ఎన్.సుధాకర్ (81) కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతూ నెల్లూరులో చికిత్స చేయించుకుంటున్నాడు. ఆయన బుధవారం చికిత్స నిమిత్తం నెల్లూరుకు వచ్చాడు. ఆరోగ్యం కుదుట పడకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మకూరు బస్టాండ్‌లోని మున్సిపల్ మరుగుదొడ్ల సమీపంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన స్థానికులు వృద్ధుడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌లో చేర్పించారు. సుధాకర్ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుడి కుమారుడు సురేష్ నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శిశు ఆధార్‌ను నమోదు చేయాలి
నెల్లూరు(అర్బన్): బిడ్డ పుట్టిన వెంటనే శిశు ఆధార్‌ను నమోదు చేయించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉప సంచాలకుడు శ్రీనివాసరెడ్డి సూచించారు. విజయవాడ నుంచి నెల్లూరొచ్చిన ఆయన డీఎంహెచ్ఓ సుజాతతో పాటు ఇతర అధికారులతో సమీక్ష సమావేశాన్ని నగరంలోని వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శిశు ఆధార్‌తో పాటు జనన ధ్రువీకరణ పత్రాలను సకాలంలో పొందేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. టీకాలేయడం, ఫీవర్ సర్వే, ఎన్సీడీ, మలేరియా, కుష్టు, టీబీ తదితర సర్వేలు, వ్యాధుల నియంత్రణలో నూరు శాతం ప్రగతి సాధించేందుకు కృషి చేయాలని కోరారు. పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్‌లో అర్జీలు పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. ఏపీ మెడికల్ అండ్ హెల్త్ స్టాటిస్టికల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్లను ఆవిష్కరించారు. అనంతరం దర్గామిట్టలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన శిశు ఆధార్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ సిద్ధానాయక్తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. డెమో అధికారి కనకరత్నం, స్టాటిస్టికల్ ఆఫీసర్ సహన, డిప్యూటీ ఎస్ఓ మల్లికార్జున, డీపీహెచ్ఎన్ఓ మంజుల, డీపీఓ రమేష్, ఏఎస్ఓలు రమేష్, మణికంఠ, డీపీఏ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలతో..
ఉదయగిరి: ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ మహిళ ఉదయగిరి ఆనకట్టలో శవమై తేలిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని యాదవవీధికి చెందిన పువ్వాడి ధనలక్ష్మి (53) అనే మహిళకు 35 సంవత్సరాల క్రితం వెంకటాద్రి అనే వ్యక్తితో వివాహమైంది. వారికి కుమార్తె, కుమారుడు సంతానం. కుమారుడు హరినాథ్‌కు వివాహమై తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. కుమార్తెకు వివాహమై గుంటూరులో ఉంటోంది. హరినాథ్‌కు భార్య శిరీషతో విభేదాలున్నాయి. బుధవారం వారి మధ్య వివాదం నెలకొనడంతో ధనలక్ష్మి ఎవరికీ చెప్పకుండా గుంటూరులోని తన కుమార్తె వద్దకు వెళ్లింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో తన బంగారు ఆభరణాలను కిటికీలో నుంచి వారి ఇంట్లోకి విసిరింది. అనంతరం కారును అద్దెకు తీసుకొని అర్ధరాత్రి సమయంలో ఉదయగిరి ఆనకట్ట వైఎస్సార్ సర్కిల్ వద్ద దిగింది. అయితే ఇంటికి వెళ్లకుండా సమీపంలోని ఆనకట్ట నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. గురువారం ఉదయం ఆనకట్టపై వాకింగ్ చేస్తున్న స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి తన సిబ్బందితో ఆనకట్ట వద్దకు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించి వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తన భార్య కనిపించడం లేదని వెంకటాద్రి బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసి ఉన్నాడు. కాగా మృతురాలి తండ్రి బాలయ్య తన కుమార్తె మృతిపై అనుమానాలున్నాయని ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళ ఉదయగిరి ఆనకట్టలో మృతదేహం అనుమానం వ్యక్తం చేసిన తండ్రి -
కుష్టు వ్యాధి నివారణే లక్ష్యం
నెల్లూరు(అర్బన్): కుష్టు వ్యాధి నివారణే లక్ష్యంగా వైద్య సిబ్బంది కృషి చేయాలని ఏడీఎంహెచ్ఓ ఖాదర్‌వలీ పేర్కొన్నారు. కుష్టువ్యాధిపై నగరంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎల్సీడీ సర్వేలో జిల్లాలో 28 మంది కుష్టు రోగులను గుర్తించారని, వీరికి మందులను సకాలంలో అందజేశామని చెప్పారు. మందులను సక్రమంగా వినియోగిస్తే నయమవుతుందని తెలిపారు. పీహెచ్‌సీల పరిధిలోని అనుమానిత రోగులను పరీక్షించి వ్యాధిని నిర్ధారించాలని కోరారు. డీపీఎమ్మార్ శిబిరాలను పీహెచ్‌సీల పరిధిలో ప్రతి నెలా నిర్వహిస్తూ అనుమానిత కుష్టు రోగులను గుర్తించి పరీక్షలు చేయించి చికిత్సను అందించాలని చెప్పారు. అంగవైకల్యం ఉన్న కేసులను గుర్తించి వారికి శస్త్ర చికిత్సలు చేయించేందుకు డీఎఫ్ఐటీ కేంద్రానికి పంపాలన్నారు. డీఎన్‌ఎంఓ సురేంద్రబాబు, ఫిజియోథెరపిస్ట్ నరసింహులు, డీఎఫ్ఐటీ అధికారి పీటర్, సిబ్బంది మల్లమ్మ, ప్రసాదాచారి తదితరులు పాల్గొన్నారు. -
తప్పుడు ప్రచారాలు సిగ్గుచేటు
నెల్లూరు(బారకాసు): తమ కుటుంబం గురించి వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేయడం సిగ్గుచేటు అని వైఎస్సార్సీపీ రూరల్ ఇన్చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ స్థలాన్ని వైఎస్సార్సీపీ నేత కబ్జా చేశారంటూ ఎల్లో మీడియాలో అసత్య వార్తను ప్రచారం చేయడంపై చింతారెడ్డిపాళెంలోని ఆయన నివాసంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. 1946లో నగరంలోని ముత్తుకూరు గేట్ సెంటర్, సర్వేపల్లి కాలువ పక్కనే ఉన్న స్థలం ఓరుగంటి వెంకటరెడ్డికి చెందినదని, అందులో ప్రభుత్వ అనుమతులు పొంది ఆయన పేరుమీద రైస్‌మిల్లును నిర్మించారన్నారు. ఆ మిల్లును వెంకటరెడ్డి కుమార్తె అయిన నా తల్లి వెంకటరమణమ్మకు రాసిచ్చినట్లు తెలిపారు. ఇందులో మా నలుగురు అన్నదమ్ములకు సమాన భాగం ఉండేలా మా తల్లి సెటిల్మెంట్ పత్రం రాసిపెట్టిందని, ఆ పత్రం తన వద్దే ఉందని మీడియాకు చూపించారు. తమ ఇంటికి సంబంధించిన పలు విషయాల్లో ఒకటైన రైసుమిల్లుకు సంబంధించిన విషయాలను మొదటి నుంచి తానే చూసుకునేవాడినని వెల్లడించారు. అప్పటి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఫ్యాక్టరీల శాఖ నుంచి అనుమతి పొంది నిబంధనల మేరకే రైస్‌మిల్లు నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. అంతేకాకుండా రైస్‌మిల్లు స్థలానికి సంబంధించి అప్పట్లో శిస్తులు, ప్రస్తుత కార్పొరేషన్‌కు కూడా పన్ను, విద్యుత్ బిల్లులను చెల్లిస్తున్నామని చెప్పారు. 70 ఏళ్లకు పైబడిన రైస్‌మిల్లు నిర్మాణం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని, దానిని తొలగించి నూతన నిర్మాణం చేపట్టాలనే ఆలోచనతో మా కుటుంబసభ్యుల ఆమోదంతోనే శంకుస్థాపన చేశామన్నారు. ఈ వాస్తవాలు తెలుసుకోకుండా బురదజల్లే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఆనం కుటుంబానికి చెందిన స్థలాన్ని తానేదో కబ్జా చేస్తున్నానని అధికారులకు తప్పుడు ఫిర్యాదులు ఇచ్చారని, దీంతో వారు వచ్చి స్థలాన్ని పరిశీలించి పత్రాలను సరిచూసి వెనుదిరిగి వెళ్లారన్నారు. ఈ విషయాలు తెలుసుకోకుండా కొందరు తప్పుడు సమాచారం అందజేసి నాపై దుష్ప్రచారం చేయించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. నాపై బురద జల్లేందుకు యత్నిస్తే ఉపేక్షించను వైఎస్సార్సీపీ రూరల్ ఇన్చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి -
బాబూ.. నమ్మండయ్యా..!
పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్, పార్ట్నర్షిప్తో నిర్వహించేదే పీ – 4 సర్వే. దీన్ని విశ్వసించాలని పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు.. మండలాల్లో ఎంపీడీఓలు ప్రజలను అభ్యర్థిస్తున్నారు. జిల్లాలోని 927 సచివాలయాల పరిధిలో 13,35,459 కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది. ఇంటి వద్దకు సిబ్బంది వెళ్లి వివిధ సమాచారాన్ని సేకరించి యాప్‌లో నమోదు చేస్తున్నారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని.. దీన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను గుర్తించేందుకు ఇది దోహదపడుతుందనే అంశాన్ని ప్రజలకు తెలియజేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి అధికారులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు యథావిధిగా కొనసాగుతాయని, ఇందులో ఎలాంటి అపోహలొద్దని చెప్తున్నా, క్షేత్రస్థాయిలో అంతా అయోమయం నెలకొంది. కావలి: సూపర్ సిక్స్.. ఈ నినాదాన్ని గత ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రచార సభల్లో తరచూ ఉచ్ఛరించేవారు. వీటిని అమలు చేస్తే తమ జీవితాలు మెరుగుపడతాయనే ఆశతో ఆ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. తీరా అధికారంలోకి వచ్చి ఎనిమిదిన్నర నెలలవుతున్నా, వీటి అమలును విస్మరించిన ప్రభుత్వం.. తాజాగా పీ – 4 సర్వే పేరిట ఉన్న వాటిని కొల్లగొట్టేందుకు శ్రీకారం చుట్టింది. ఫోన్.. టీవీ.. ఏసీ.. ఇతర గృహోపకరణాలు.. బైక్లున్నాయా.. ఇళ్ల స్వరూపం... రేకులా, స్లాబా.. బ్యాంక్ అకౌంట్.. ఇలా 27 రకాల ప్రశ్నల్ని సంధించి, సమాధానాలను సిబ్బంది నింపాల్సిన పరిస్థితి. ఆపై ప్రజల ఫోన్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి ప్రక్రియను ముగిస్తున్నారు. ఏసీ ఉన్నా లక్షాధికారులేనా..? జిల్లాలో 7,33,520 కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయి. వీటి కోసం మరో 1,45,438 ఫ్యామిలీలు ఎదురుచూస్తున్నాయి. వీరందరూ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలుగానే పరిగణించాలి. అప్పో సొప్పో చేసో.. నెలవారీ వాయిదాలతోనో.. లేక ఎవరైనా కానుకగా ఇస్తే వారి ఇళ్లలో ఏసీలను ఎక్కువ మంది ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇది ఉందని తెలిస్తే చాలు వెంటనే సదరు వివరాలను ప్రభుత్వ రికార్డుల్లోకి సిబ్బంది నమోదు చేస్తున్నారు. ఈ వ్యవ హారంతో తమకు సంక్షేమ పథకాలు ఆగిపోతాయనే ఆందోళన పేదల్లో నెలకొంది. -
కేన్సర్‌పై అవగాహన అవసరం
నెల్లూరు(అర్బన్): కేన్సర్ వ్యాధిపై అవగాహన పెంచుకొని, ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని రెడ్‌క్రాస్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ మెడికల్ సూపరింటెండెంట్, సర్జికల్ ఆంకాలజిస్ట్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. పొదలకూరు రోడ్డులోని కేన్సర్ ఇన్స్టిట్యూట్లో విద్యార్థులకు గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జంక్‌ఫుడ్, పంటలకు ఎక్కువగా వాడుతున్న పురుగుమందులు, రసాయనిక ఎరువులు, ప్లాస్టిక్ వినియోగం, కొన్ని రకాల వైరస్లు, పొగాకు వినియోగం, కాలుష్య కారణంగా కేన్సర్ రోగాలు పెరిగాయని చెప్పారు. ప్రజలు తమ ఆహార అలవాట్లను మార్చుకోవాలని కోరారు. 30 ఏళ్లు దాటిన వారు ఏడాదికోసారి స్కానింగ్ లాంటి పరీక్షలను చేయించుకోవాలని సూచించారు. చిన్న పరీక్షల ద్వారా కేన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించొచ్చన్నారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ లక్ష్మి, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ వాకాటి విజయకుమార్‌రెడ్డి, సర్జికల్ ఆంకాలజిస్ట్ ముత్తు, ఆస్పత్రి జీఎం ఇస్కా భక్తవత్సలరెడ్డి, నర్సింగ్ సూపరింటెండెంట్లు మోహనాంబ, మృదుల తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ..
వేర్వేరు చోట్ల ఇద్దరి మృతినెల్లూరు(క్రైమ్): అనారోగ్యం తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. కొడవలూరు మండలం తలమంచికి చెందిన పి.శ్రీనివాసులు అలియాస్ శీనయ్య (35) అవివాహితుడు. అతను నెల్లూరు హరనాథపురం ఒకటో వీధిలో శ్రీరాజరాజేశ్వరి ప్రొవిజన్స్ షాపు నిర్వహిస్తున్నాడు. రోజూ ఇంటి వద్ద నుంచి షాపునకు వచ్చి వెళ్లేవాడు. రెండేళ్లుగా శీనయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే మద్యానికి బానిసయ్యాడు. ఆరోగ్యం ఎంతకీ కుదుట పడకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఈనెల 24వ తేదీ రాత్రి తన షాపు వద్దనే మద్యంలో పురుగు మందు కలిపి తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పక్కనే ఉన్న నారాయణ కళాశాల వాచ్మెన్ ఈ విషయాన్ని గమనించి శీనయ్య కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేశాడు. అనంతరం శీనయ్యను అపోలో హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి అన్న ప్రసాద్ గురువారం బాలాజీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై ఎం.పుల్లారెడ్డి కేసు నమోదు చేసి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రోడ్డు ప్రమాదంలో..రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్యామ్ బిహారీ (28), ప్రీతి దంపతులకు ఇద్దరు సంతానం. అతను పీఓపీ (సీలింగ్) పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో కొన్నేళ్ల క్రితం అతను ఒక్కడే ఉపాధి నిమిత్తం నెల్లూరు వైఎస్సార్‌నగర్‌లో ఉంటున్న బంధువుల వద్దకు వచ్చాడు. అయ్యప్పగుడి ప్రాంతానికి చెందిన పప్పు రాజ్ మేసీ్త్ర వద్ద పనులు చేస్తున్నాడు. అప్పుడప్పుడు భార్యాపిల్లల వద్దకు వెళ్లి వచ్చేవాడు. ఈనెల 25వ తేదీన శ్యామ్ తన సహచరుడు బబ్లూరాజ్తో కలిసి బైక్‌పై పనికి బయలుదేరాడు. వేదాయపాళెం రైల్వేస్టేషన్ ఆర్చ్ వద్ద రోడ్డు దాటుతుండగా అయ్యప్పగుడి వైపు వెళ్తున్న బైక్ వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో శ్యామ్‌కు తీవ్రగాయాలయ్యాయి. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. పప్పు రాజ్ ఫిర్యాదు మేరకు సౌత్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. -
సజావుగా పింఛన్లు అందజేయాలి
నెల్లూరు (పొగతోట): సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియను సజావుగా జరపాలని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి ఆదేశించారు. నగరంలోని డీఆర్డీఏ కార్యాలయం నుంచి మండలాధికారులతో గురువారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 3,07,232 మంది లబ్ధిదారులకు రూ.132 కోట్లను శనివారం ఉదయం నుంచే పంపిణీ చేయాలని సూచించారు. సచివాలయాల వారీగా బ్యాంకుల నుంచి నగదును డ్రా చేసి సిబ్బందికి సకాలంలో అందజేయాలన్నారు. కిచెన్ గార్డెన్ లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. మహిళలకు అవగాహన కల్పించి ఇంటి చుట్టుపక్కల ఉండే స్థలాలు, ఇంటి పైభాగంలో కుండీలను ఏర్పాటు చేసి కూరగాయల మొక్కలను సాగు చేసేలా చూడాలని సూచించారు. అప్పులపాలై.. ఆపై దొంగలై ● మహిళ కళ్లలో కారం కొట్టి బంగారు సరుడు అపహరణ ● పోలీసులకు ఇద్దరు మహిళల అప్పగింత ● వైద్యశాఖలో హెల్త్ అసిస్టెంట్లుగా విధులు..! కోవూరు: ఇంటి ముందు మనవడ్ని ఆడిస్తున్న ఓ మహిళ కళ్లలో కారం కొట్టి బంగారు చైన్‌ను ఇద్దరు మహిళలు తెంపుకెళ్లిన ఘటన పట్టణంలోని పాటూరు రోడ్డులో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల వివరాల మేరకు.. స్థానికంగా నివాసం ఉంటున్న అత్తిపల్లి సతీష్‌కుమారి తన మనవడ్ని ఇంటి ముందు రోడ్డుపై ఆడించసాగారు. ఈ తరుణంలో స్కూటీపై వచ్చిన ఇద్దరు మహిళలు.. వీధిలో ఏమైనా ఇళ్లు ఖాళీగా ఉన్నాయానని అడిగారు. సమాధానం చెప్తున్న సమయంలో నీరు కావాలని స్కూటీ నడుపుతున్న మహిళ కోరారు. ఈలోపు వెనుక కూర్చున్న మహిళ తన వెంట తెచ్చుకున్న కారంపొడిని ఆమె కళ్లలో కొట్టారు. ఆమె మెడలోని రెండున్నర సవర్ల బంగారు సరుడును తెంపుకొని పరారయ్యేందుకు యత్నించారు. బాధితురాలు కేకలేయడంతో చుట్టుపక్కల వారు, ఆమె కుమారుడు అనూప్‌రెడ్డి వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కాగా చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన దార్ల జీవిత యల్లాయపాళెం పీహెచ్సీలో.. వాసుకి డిప్యూటీ డీఎంహెచ్ఓ కార్యాలయంలో హెల్త్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారనే అంశం పోలీసుల విచారణలో వెల్లడైంది. ఐపీఎల్లో బెట్టింగులు పెట్టి వీరిద్దరూ రూ.30 లక్షల మేర అప్పులపాలయ్యారని తెలిసింది. మెయిన్‌బజార్‌లో బురఖా కొనుక్కొని స్కూటీపై తిరుగుతూ చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారని వెల్లడైంది. కోవూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
సోమశిలకు రక్షణేదీ..?
ఆత్మకూరు: జిల్లాలో సాగు, తాగునీటికి వరదాయినైన సోమశిల జలాశయ సేఫ్టీ వాల్‌కు రక్షణ కరువైంది. వాస్తవానికి నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇది ప్రస్తుతం ప్రమాదభరితంగా మారింది. ఈ అంశంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. బీటలు వారి.. దుర్భరంగా జలాశయంలో ఐదు నెలలుగా 60 టీఎంసీలకుపైగా నీరు నిల్వ ఉంది. 1979 – 80లో ఆప్రాన్‌కు.. జలాశయానికి రక్షణగా ఉండేలా ఎడమ వైపు రాళ్లతో పటిష్టంగా రక్షణ గోడను కోర్వాల్గా నిర్మించారు. 100 మీటర్ల వెడల్పు.. 40 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ రక్షణ గోడ పలుచోట్ల బీటలు వారి.. రాళ్లు సైతం ఊడి రంధ్రాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఫలితంగా ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇసుకతో అధిక బరువు మూడేళ్ల క్రితం వచ్చిన భారీ వరదలకు ఆప్రాన్ దెబ్బతినింది. మరమ్మతులను ఐదు నెలల క్రితం ప్రారంభించి అర్ధాంతరంగా నిలిపేశారు. దెబ్బతిన్న రక్షణ గోడ పైభాగంలోని ఖాళీ స్థలంలో టన్నుల ఇసుకను ఆ సమయంలో నిల్వ ఉంచారు. బీటలు వారి దెబ్బతిన్న రక్షణ గోడపై బరువు మరింత పెరిగింది. పనులను నిలిపేయడంతో ఇవి నేటికీ అలానే ఉన్నాయి. మరోవైపు ఆప్రాన్ మరమ్మతుల సమయంలో సంబంధిత కాంట్రాక్టర్ తగు సాంకేతిక పరిజ్ఞానం లేకుండా బ్లాస్టింగ్ పనులు చేయడంతో రక్షణ గోడ దెబ్బతిని ఉండొచ్చని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సైతం ఎలాంటి నివేదికను ఉన్నతాధికారులకు అందించలేదు. హామీ నీటిమూటేనా..? సోమశిల జలాశయ పరిశీలన నిమిత్తం మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు గతేడాది అక్టోబర్‌లో వచ్చారు. మరమ్మతు పనులను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఐదు నెలలు పూర్తయినా ఆప్రాన్ పనులు సగం కూడా కాలేదు. మిగిలిన పనులు ఎప్పటికి పూర్తవుతాయో నేటికీ స్పష్టత లేదు. నాలుగు దశాబ్దాల క్రితం సేఫ్టీ వాల్ నిర్మాణం నేడు ప్రమాదభరితంగా.. నిలిచిన ఆప్రాన్ పనులు ఆరు నెలల్లో పూర్తి చేస్తామని సీఎం హామీ నేటికీ అతీగతీ లేని వైనం ప్రమాదమేమీలేదు జలాశయ రక్షణ గోడను పరిశీలిస్తున్నా. ప్రమాదమేమీలేదు. గోడ పైభాగంలో ఉన్న ఇసుకను జేసీబీలతో తొలగించాలని సిబ్బందిని ఆదేశించా. ఆప్రాన్ పనులు నిలిచిన విషయం వాస్తవమే. త్వరలోనే ప్రారంభి రక్షణ గోడకు మరమ్మతులు చేయిస్తాం. – దశరథరామిరెడ్డి, ప్రాజెక్ట్ ఈఈ -
మిల్లర్.. చీటర్
మిల్లర్లు రైతులను దోచుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. సీజన్ ప్రారంభం కాగానే అన్నదాతల ఎదుట వాలిపోతున్నారు. ధాన్యాన్ని ధర తగ్గించి కొనుగోలు చేసి ఆపై మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడ బియ్యంగా ఆడించి మార్కెట్‌కు తరలించి రేట్లు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరుగాలం కష్టించి పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర ఉండకపోగా.. అడ్డగోలుగా దోచుకెళ్తున్న మిల్లర్లు ఆడించే బియ్యం రేటు మాత్రం అధికంగా ఉండటం గమనార్హం. దీనిపై అధికారులు సైతం చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.సిండికేట్‌గా ఏర్పడి ధాన్యం ధర తగ్గింపు ● తాము ఆడించే బియ్యానికి రేట్లు తగ్గకుండా జాగ్రత్తలు ● తూకాల్లోనూ మోసాలు ● లబోదిబోమంటున్న అన్నదాతలు ● కన్నెత్తి చూడని అధికారులుసూళ్లూరుపేట: జిల్లాలో మిల్లర్ల మాయాజాలానికి రైతులు, వినియోగదారులు బలవుతున్నారు. మొదట సీజన్ ప్రారంభంలోనే మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడుతున్నారు. ఆపై బినామీలతో రేట్లు ఉండవని ఊదరగొట్టి రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. చివరగా కష్టించి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేకుండా రైతుల నుంచి ఒకటికి సగానికి కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన ధాన్యాన్ని తమ మిల్లుల్లో ఆడించి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఆపై ఆ బియ్యం రేట్లు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేతల నుంచి అధికారుల వరకు సహకరిస్తుండటంతో వీరి అక్రమ వ్యాపారం మూడు బస్తాలు.. ఆరు లారీలుగా వర్థిల్లుతోంది. సీజన్ ప్రారంభం కాగానే.. వరికోతల సీజన్ ప్రారంభం కాగానే మిల్లర్లు దళారులను రంగంలోకి దింపుతారు. బస్తా ధాన్యాన్ని రూ.1,800 దాకా కొనుగోలు చేసి హైప్ చూపిస్తారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను వీరు పట్టించుకోరు. ఆ తర్వాత మిల్లర్లందరూ సిండికేట్‌గా మారి దళారుల చేతనే రేట్లు తగ్గిపోయాయని చెప్పిస్తారు. ఉదాహరణకు తమిళనాడులో పంటలు బాగా పండటంతో అక్కడ రేట్లు లేవు. తెలంగాణలోని కోదాడ, ఖమ్మం నుంచి భారీగా ధాన్యం వస్తోంది. పైపెచ్చు విదేశాలకు ఎగుమతులు ఆగిపోయాయి. అందుకే రేట్లు భారీగా తగ్గిపోయాయని రైతులను కలవర పెడుతుంటారు. ఆ తర్వాత మిల్లర్ల బినామీలు రంగప్రవేశం చేసి రూ.1,600, రూ.1,650 కొనుగోలు చేస్తారు. గతేడాది రూ.2,200 అమ్మిన బస్తా ధాన్యం ఈ ఏడాది ఎందుకు తగ్గిపోయిందో అర్థం కాని పరిస్థితి. ప్రతి ఏటా ఇదే తంతు జరుగుతున్నా స్పందించే వారే లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. మిల్లర్ల ముడుపులు మిల్లర్లు సిండికేట్ ఏర్పడి అఽధికార పార్టీ వారికి ముడుపులు చెల్లిస్తారు. ఆపై అధికారులను బుట్టలో వేసుకుని రైతుల కడుపు కొట్టడం ప్రారంభిస్తారు. అన్నదాతలు అప్పుల బారినపడి ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి దిగజారుస్తారు. ధాన్యాన్ని కొనుగోలు చేసుకుని వ్యాపారం చేసే మిల్లర్లు మాత్రం కోట్ల రూపాయలకు పడగలెత్తుతారు. రేషన్ బియ్యాన్నీ వదలకుండా.. రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. వాటిని తాము ఆడించే బియ్యంలో పాలిష్ పట్టి బస్తాకు 7 నుంచి 9 కిలోల వరకు కలిపేస్తారు. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏమిటంటే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసేటప్పుడు 75 కిలోల ధాన్యం బస్తాకి మరో ఐదు కిలోలు తరుగు కింద లాగేస్తారు. అదే బియ్యం వద్దకొచ్చే సరికి గోతం మీద నెట్ వెయిట్ 25 కిలోలని ఉంటుంది. దాన్ని తూకం వేస్తే 23, 24 కిలోలు మాత్రమే ఉంటుంది. ఈ విషయం తూనికలు, కొలతల శాఖ అధికారుల తనిఖీల్లో బయట పడినా ఎలాంటి చర్యలుండవు. ఎందుకంటే ఆమ్యామ్యాలతో అంతా సర్దేసుకుంటారు మరి. ఇష్టారాజ్యంగా.. తిరుపతి జిల్లా కంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే రైస్ మిల్లులు ఎక్కువ. ముఖ్యంగా నెల్లూరు నగరం చుట్టూ వంద నుంచి 150 రైస్‌మిల్లులున్నాయి. తిరుపతి జిల్లాలో సూళ్లూరుపేట నియోజకవర్గంలో పది, శ్రీకాళహస్తిలో మరో పది రైస్ మిల్లులున్నాయి. ఇక తిరుపతి, చంద్రగిరిలో ఐదారు మిల్లుల వరకూ ఉన్నాయి. అదే నెల్లూరులో అయితే ఇదొక పెద్ద ఇండస్ట్రీలా ఉంది. సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల నుంచి నెల్లూరులోని మిల్లులకే ధాన్యం వెళ్తుంది. రేషన్ బియ్యం కూడా అక్కడి కొన్ని మిల్లులకు వెళ్తున్నట్టు సమాచారం. తమిళనాడులో ఇచ్చే రేషన్ బియ్యం (ఉప్పుడు బియ్యం) నెల్లూరు మిల్లులకే తరలిస్తున్నారు. నెల్లూరు అంటే మిల్లర్ల అడ్డాగా ఉంది. -
ఓవైపు అప్పులు.. మరోవైపు ఆరోగ్య సమస్యలు
● ఆత్మహత్య చేసుకున్న యువకుడు నెల్లూరు సిటీ: ఓవైపు ఆరోగ్య సమస్యలు.. మరోవైపు ఆర్థిక సమస్యలు. అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి చావే దిక్కని నిర్ణయించుకున్నాడు.. గన్నేరు పప్పు తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. గురువారం పోలీసులు వివరాలు వెల్లడించారు. దొంతాలికి చెందిన సూరిశెట్టి శ్రీనివాసులు (28)కు మల్లేశ్వరితో నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరు కోడూరుపాడు కల్తీ కాలనీలో కాపురం ఉంటున్నారు. శ్రీనివాసులు పాల వ్యాపారం చేసేవాడు. కొంతకాలంగా అతడిని ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇదే క్రమంలో పాల వ్యాపారంలో కూడా రూ.20 లక్షలు వరకు నష్టం వాటిల్లింది. అప్పుల బాధ తట్టుకోలేకపోయాడు. ఈనెల 25వ తేదీన మధ్యాహ్నం ఇంటి వద్ద గన్నేరు పప్పు తిని అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. రూరల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కండలేరులో 51.938 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 51.938 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 620, పిన్నేరు కాలువకు 120, లోలెవల్ కాలువకు 210, హైలెవల్ కాలువకు 210, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.వీఎస్‌యూలో వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ) నేషనల్ యూత్ పార్లమెంట్ – 2025 వాల్‌పోస్టర్లను వీసీ అల్లం శ్రీనివాసరరావు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని జిల్లాస్థాయిలో నిర్వహించడానికి వీఎస్‌యూ ఎన్ఎస్ఎస్ విభాగం, నెహ్రూ యువ కేంద్రానికి బాధ్యతలు అప్పగించారన్నారు. ఆసక్తి గల వారు మై భారత పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. వికసిత్ భారత్‌పై ఒక నిమిషం నిడివి గల వీడియోను చిత్రీకరించి అప్లోడ్ చేయాల్సిందిగా సూచించారు. 150 మందిని ఎంపిక చేసి, జిల్లా స్థాయిలో వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అనే అంశంపై మూడు లేదా నాలుగు నిమిషాలు మాట్లాడేలా అవకాశం కల్పిస్తామన్నారు. ప్రతిభ చూపిన పదిమందిని ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో యూత్ పార్లమెంట్‌కు పంపిస్తారని తెలియజేశారు. అక్కడ ఉత్తమ ప్రతిభ చూపిన ముగ్గురికి ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో తమ ఆలోచనలను వెల్లడించేందుకు అవకాశం కల్పిస్తారని తెలియజేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, ప్రిన్సిపల్ సీహెచ్ విజయ, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ ఉదయ్‌శంకర్ తదితరులు పాల్గొన్నారు. నేడు ఐటీఐలో జాబ్‌మేళా నెల్లూరు(టౌన్): ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్, సీడాప్లు సంయుక్తంగా నెల్లూరు వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ శ్రీధర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్, అమర్‌రాజా బ్యాటరీస్ తదితర కంపెనీలు మేళాలో పాల్గొంటాయన్నారు. ఎస్ఎస్సీ, డిగ్రీ, డిప్లొమా చదివిన వారు హాజరుకావొచ్చన్నారు. వివరాలకు 94944 56326, 97045 10793 ఫోన్ నంబర్లును సంప్రదించాలని తెలియజేశారు. -
వేరుశనగ సాగు.. అంతంతమాత్రం
పొదలకూరు: వేరుశనగ సాగులో జిల్లా వెనుకబడి ఉంది. కేవలం 900 హెక్టార్లలోనే పండిస్తున్నారు. ఈ విస్తీర్ణాన్ని పెంపునకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. వాస్తవానికి నూనెగింజల సాగు మన దేశంలో తక్కువ. వంట నూనెలకు సంబంధించి 60 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పరిస్థితులున్నాయి. 70 శాతానికి పైగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న దేశంలోని రైతులు నూనెగింజల సాగుపై మాత్రం మొగ్గు చూపడం లేదు. ప్రధానంగా పామాయిల్, వేరుశనగ, పొద్దుతిరుగుడు తదితర వాటికి సంబంంధించి ఓ ప్రాంతం లేదా ఒక రాష్ట్రం వరకే పరిమితమవుతున్నారు. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో నూనెగింజలను పండిస్తే విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదనేది వ్యవసాయ శాస్త్రవేత్తల అభిప్రాయం. నూనె గింజల సాగులో ప్రధానమైన వేరుశనగ విస్తీర్ణం జిల్లాలో పెరగడం లేదు. అనంతపురం జిల్లాలో బాగుంది. సత్యసాయి జిల్లాలో ఉన్న కదిరి వ్యవసాయ పరిశోధన స్థానంలో ఆరు రకాల విత్తనాలను రూపొందించారు. అవగాహన లేక.. జిల్లాలో వేరుశనగ సాగుపై రైతులకు అవగాహన లేకపోవడం వల్ల విస్తీర్ణం పెరగడం లేదని తెలుస్తోంది. విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటే ఎకరాకు 30 బస్తాల వరకు దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుందని వ్యవసాయాధికారులు అంటున్నారు. సాధరణంగా వేరుశనగలో నూనె శాతం అధికంగా ఉంటుంది. వంట నూనెను వీటి నుంచే తీయడం తెలిసిందే. ఇసుక నేలల్లో అధికంగా పండిస్తారు. కదిరి లేపాక్షి 1812 రకం సాగు చేస్తే రైతులకు గిట్టుబాటు అవుతున్నట్టు తెలుస్తోంది. కదిరి పరిశోధన స్థానం కనుగొన్న ఆ రకాన్ని తెలంగాణ, మన రాష్ట్రంలోని రైతులు సాగు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉండే రాయలసీమలో సైతం ఈ రకం సాగువుతున్నట్టు వ్యవసాయాధికారులు వెల్లడించారు. చీడపీడలు తక్కువగా ఉంటాయని, ఎకరాకు రూ.50 వేలు పెట్టుబడి పెడితే 30 బస్తాలకు పైబడి దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంది. ఒక్కో మొక్కకు 100 నుంచి 150 కాయలు కాస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వేరుశనగ పంటకు సంబంధించి టీఎస్జీఎస్ 1707 (ఐసీఏఆర్ – కోణార్క్) స్పానిష్ బంచ్, నంద్యాల గ్రామ్ (ఎల్బీఈజీ 1267) రకాలు ఏపీలో అనుకూలంగా ఉంటాయని సూచించింది. ఇక్కడిలా.. పొదలకూరులో చిరుధాన్య పరిశోధన స్థానం ఉంది. ఇక్కడికి ప్రధాన శాస్త్రవేత్తగా ప్రసన్న రాజేష్ కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ఇక్కడకు వచ్చారు. ఆయన వేరుశనగ పంటపై అనేక పరిశోధనలు చేశారు. జిల్లాలో విస్తీర్ణం పెంపొందించేందుకు కృషి చేస్తానంటున్నారు. రైతులు ముందుకొస్తే పంటల మార్పిడికి కూడా ఊతం ఇచ్చినట్టవుతుంది. పొదలకూరు మండలంలోని కొనగలూరు, నల్లపాళెం, సూరాయపాళెం తదితర గ్రామాల్లో స్వల్పంగా వేరుశనగను పండిస్తున్నారు.వేరుశనగ పంట (ఫైల్) జిల్లాలో కేవలం 900 హెక్టార్లలోనే.. విస్తీర్ణం పెంపునకు శాస్త్రవేత్తల కృషి కదిరి లేపాక్షి రకం విత్తనం మేలంటున్న శాస్త్రవేత్తలు పొదలకూరు చిరుధాన్య పరిశోధన స్థానం నుంచి అవగాహన -
ధాన్యానికి రేట్లు లేవు
రైతులు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వకుండా మిల్లర్లు సిండికేట్‌గా మారి మోసం చేస్తున్నారు. వారు తయారు చేసే బియ్యానికి మాత్రం రేట్లు తగ్గించకుండా విక్రయిస్తున్నారు. ఇక్కడ చూస్తుంటే రైతు పండించిన ధాన్యానికి రేట్లు లేకుండా చేసి పబ్లిక్ మార్కెట్లోనేమో బియ్యం కొనుగోలు చేసే వినియోగదారులకు రేట్లు పెంచడమే కాకుండా తూకాల్లో కూడా ఒకటి రెండు కేజీలు తగ్గించి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. – గాలి మల్లికార్జున్‌రెడ్డి, సుగ్గుపల్లి, సూళ్లూరుపేట మండలం -
బియ్యం ధరలు ఎందుకు తగ్గించరు?
నేను గతంలో వరి సాగుచేసేవాడ్ని. ప్రస్తుత పరిస్థితులు బాగోలేక వ్యవసాయం చేయడం మానేశా. కష్టపడి పండించిన పంటను ఎవరో మిల్లర్లు వచ్చి దోచుకెళుతున్నారు. ఆరునెలలపాటు పడిన కష్టాన్ని వ్యాపారం చేసుకునే వారు తక్కువ రేట్లతో దండుకుని వెళ్తున్నారు. ఇలా చేస్తే వ్యవసాయంలో అప్పులు తప్ప ఏమీ మిగలవు. ప్రస్తుతం ధాన్యానికి ధరలు లేవు కదా! మరి మార్కెట్లో బియ్యం రేట్లు ఎందుకు తగ్గట్లేదు..? – వంకా చంద్రశేఖర్, సూళ్లూరుపేట -
అండగా ఉంటాం : పర్వతరెడ్డి
వెంకటాచలం: మండలంలోని చెముడుగుంటలో సెంట్రల్ జైల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఎ.శ్రీధర్‌రెడ్డిని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి గురువారం ములాఖత్ ద్వారా కలిశారు. గుంటూరు జిల్లాకు చెందిన శ్రీధర్‌రెడ్డిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు మోపడంతో జైల్లో ఉన్నాడు. దీంతో చంద్రశేఖర్‌రెడ్డి అతడి ఆరోగ్య విషయాలు తెలుసుకుని, అధైర్యపడొద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.పశుగణన గడువు పొడిగింపు నెల్లూరు(సెంట్రల్): పశుగణన గడువును మార్చి 31వ తేదీ వరకు పొడిగించినట్లుగా జిల్లా పశుగణన నోడల్ అధికారి మంజునాథ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదట ఈనెలాఖరు వరకు గడువు ఇచ్చారన్నారు. అయితే పలు ప్రాంతాల్లో ఇంకా గణన చేయాల్సి ఉందన్నారు. పశుసంవర్థక శాఖ అధికారులు వచ్చినప్పుడు పాడి రైతులు సహకరించాలని సూచించారు. ఆటోను ఢీకొన్న కారునాయుడుపేట టౌన్: స్వర్ణముఖి నది కాజ్వే వద్ద గురువారం కారు వేగంగా వచ్చి ఆటోను ఢీకొంది. పోలీసుల కథనం మేరకు.. మాచవరం గ్రామానికి చెందిన రవివర్మ ఆటోలో నాయుడుపేటకు వచ్చి తిరిగి స్వగ్రామానికి స్నేహితుడితో కలిసి బయలుదేరాడు. స్వర్ణముఖి నది కాజ్వే వద్ద వెనుక నుంచి కారు ఢీకొంది. దీంతో ఆటో కాజ్వే పైనుంచి స్వర్ణముఖి నదిలోకి బోల్తా పడింది. రవివర్మ గాయపడ్డాడు. -
గుర్తుతెలియని వ్యక్తి మృత్యువాత
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలోని గుడి వద్ద గురువారం గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండటాన్ని స్థానికులు గుర్తించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు బాలాజీ నగర్ పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి పక్కనే ఉన్న సంచిలో బేల్దారి పనిముట్లను గుర్తించారు. వయసు 60 ఉంటుందని భావిస్తున్నారు. వృద్ధుడు ఉదయం 7 గంటల నుంచి ముత్తుకూరు బస్టాండ్ వద్ద ఆటోలు ఆపుతుండగా మద్యం తాగి ఉన్నాడని ఎవరూ స్పందించలేదని స్థానికులు తెలిపారు. దీంతో మద్యం మత్తులో ఊపిరాడకో లేదా అనారోగ్యంతో మృతిచెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు బాలాజీ నగర్ పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. -
బీపీసీఎల్ నిర్మాణానికి ప్రజలంతా వ్యతిరేకం
ఉలవపాడు: బీపీసీఎల్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని.. తీరప్రాంతంలో చేస్తున్న భూసేకరణ ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని మానవహక్కుల వేదిక డిమాండ్ చేసింది. వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు వీఎస్ కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేష్, రాష్ట్ర కార్యదర్శి రోహిత్, చేనేత జన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు మోహనరావు, మత్స్యకార సంఘం నాయకులు దుర్గారావులు మూడురోజులుగా మండల పరిధిలోని కరేడు, కొత్తపల్లెపాళెం, టెంకాయచెట్లపాళెం, అలగాయపాళెం, చాకిచర్ల, పెదపట్టపుపాళెం గ్రామాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. గురువారం ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రాంతంలో ఆరువేల ఎకరాల్లో సంవత్సరానికి 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రిఫైనరీ, పెట్రో కెమికల్స్ కాంప్లెక్స్‌తోపాటు అదనంగా భవిష్యత్ అవసరాల కోసం మరో పదివేల ఎకరాలు తీసుకోవాలనుకోవడం రైతులకు ఏ మాత్రం ఇష్టం లేదన్నారు. కరేడు నుంచి పోర్టు వరకు రైల్వే లైను, సముద్రం మధ్య ఉన్న అధిక శాతం మత్స్యకారులు, గిరిజనులతో మాట్లాడగా వారు ఈ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకమని చెప్పారన్నారు. మానవహక్కుల వేదిక ప్రజాభిప్రాయ సేకరణ భూసేకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ -
ఇంటర్ పరీక్షలకు వేళాయె
ఇంటర్ పరీక్షలకు జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. శనివారం నుంచి మార్చి 20 వరకు వీటిని నిర్వహించనున్నారు. జంబ్లింగ్ పద్ధతిలో జరిపేందుకు చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి లైవ్ స్ట్రీమింగ్‌ను రాష్ట్ర, జిల్లా ఇంటర్ బోర్డు కార్యాలయాలకు అనుసంధానం చేశారు. నెల్లూరు (టౌన్): ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా 28 ప్రభుత్వ, 51 ప్రైవేట్.. మొత్తం 79 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 53,200 మంది హాజరుకానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సర జనరల్ విద్యార్థులు 26,931, ఒకేషనల్ 1,245 మంది కలిపి 28,176.. ద్వితీయ సంవత్సర జనరల్ 23,994 మంది, ఒకేషనల్ 1,030 మంది కలిపి 25,024 మంది ఉన్నారు. వీరిలో 326 మంది ప్రత్యేకావసరాల విద్యార్థులు ఉన్నారు. వీరి అవసరాల మేరకు స్క్రైబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. ఇప్పటికే మూడు సెట్ల ప్రశ్నపత్రాలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. వీటిని ఆయా పరీక్ష కేంద్రాల సమీపంలోని 51 స్టోరేజీ పాయింట్లు (పోలీస్ స్టేషన్లు)ల్లో ఖాకీల పహారాలో భద్రపర్చారు. 12 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు జిల్లాలో మొత్తం 12 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు గుర్తించారు. వీటిలో కోవూరు, తోటపల్లిగూడూరు, బిట్రగుంట, మర్రిపాడు, ఆత్మకూరు, ఉదయగిరి, రాపూరు, కుల్లూరు, చేజర్ల, పొదలకూరు, బుచ్చిరెడ్డిపాళెం, అల్లూరు పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. వీటిపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. ఈ కేంద్రాలకు అదనంగా అడిషనల్ చీఫ్ సూపరిటెండెంట్లు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులను నియమించనున్నారు. పక్కాగా నిర్వహణ ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా ఇంటర్ అధికారులు ఏర్పాట్లు చేశారు. 79 కేంద్రాల్లో ప్రతి కేంద్రానికీ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. 1,200 మందికి పైగా ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారు. పరీక్షలు జరిగే కేంద్రాల సమీపంలో 144 సెక్షన్‌ను అమలు చేయనున్నారు. సమీపంలోని జిరాక్స్, ఆన్లైన్ సెంటర్లను మూయించనున్నారు. పరీక్ష కేంద్రాల్లోకి చీఫ్ సూపరింటెండెంట్లకు మాత్రమే ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసిన సెల్‌ఫోన్‌ను అనుమతిస్తారు. విద్యార్థులు కాలిక్యులేటర్, మొబైల్, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లకూడదు. పరీక్ష కేంద్రాల ద్వారం వద్ద విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించాకే లోపలికి అనుమతించనున్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు విద్యార్థుల ఇబ్బందులు, సమస్యల పరిష్కారానికి 0861–2320312 నంబర్‌తో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. bie.ap.gov.in వెబ్సైట్ లేదా 95523 00009 వాట్సాప్ నంబర్‌కు హాల్ టికెట్ నంబర్, ఆధార్ లేదా డేట్ ఆఫ్ బర్త్ను నమోదు చేసి పంపడం ద్వారా నే రుగా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ను కల్పించారు. హాల్ టికెట్‌పై సంబంధిత కళాశాల ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదు. ఎవరైనా ఇబ్బంది పెడితే నేరుగా ఆర్ఐఓకు ఫిర్యాదు చేయాలి. పరీక్ష సమయానికి అరగంట ముందుగా కేంద్రంలోకి అనుమతించనున్నారు. గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవా లని ఇంటర్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు. రేపట్నుంచి మార్చి 20 వరకు.. జంబ్లింగ్ విధానం అమలు 79 కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు హాజరుకానున్న 53,200 మంది విద్యార్థులు ప్రతి కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారుల నియామకం 1200 మందికి పైగా ఇన్విజిలేటర్లు 4 ఫ్లయింగ్.. ఐదు సిట్టింగ్ స్క్వాడ్ల ఏర్పాటు సజావుగా జరిగేలా చర్యలు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు చేపడుతున్నాం. పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశాం. కలెక్టర్ ఆనంద్ ఆదేశాల మేరకు పకడ్బందీగా నిర్వహిస్తాం. పరీక్ష సమయానికి ఐదు నిమిషాల వరకే విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించనున్నాం. ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా గంట ముందే కేంద్రం వద్దకు చేరుకోవాలి. సమస్యాత్మక కేంద్రాల్లో అదనంగా సిబ్బందిని నియమిస్తాం. విద్యార్థులు ఒత్తిడికి గురికా కూడదు. సమస్యలుంటే కంట్రోల్ రూమ్ నంబర్‌కు ఫోన్ చేస్తే వెంటనే పరిష్కరిస్తాం. – శ్రీనివాసులు, ఆర్ఐఓ -
వివాహిత బలవన్మరణం
నెల్లూరు(క్రైమ్): ఓ వివాహిత ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్ మండలం కాకుపల్లికి చెందిన శేషసాయి పొదలకూరు మండలం మర్రిపల్లికి చెందిన శివప్రియ (26)లు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తొలుత కాకుపల్లిలో కాపురం పెట్టి మూడునెలల క్రితం ప్రశాంతినగర్‌కు వచ్చారు. వారికి నెలల వయసున్న కుమారుడున్నాడు. బాబు విషయంలో గురువారం దంపతుల నడుమ వాగ్వాదం జరిగింది. శేషసాయి పని నిమిత్తం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. సాయంత్రం ఆమె తన భర్తకు వాట్సాప్‌లో గుడ్‌బై అని మెసేజ్ చేసింది. ఇది చూసిన భర్త వెంటనే ఆమెకు ఫోన్ కాల్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో అతను జరిగిన విషయాన్ని తన ఇంటి యజమానికి తెలియజేయగా, వారు వెళ్లి కిటికీలో నుంచి చూశారు. అప్పటికే శివప్రియ ఉరేసుకుని ఉండటాన్ని గమనించి ఇదే విషయాన్ని భర్తకు తెలియజేశారు. అనంతరం అందరూ కలిసి ఇంటి తలుపులు పగులగొట్టి ఆమెను చికిత్స నిమిత్తం అపోలో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు భర్త నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ అన్వర్‌బాషా హాస్పిటల్‌కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు నెల్లూరుకు బయలుదేరారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. -
హైస్కూల్లో 50 కుళాయిల చోరీ
● పది తలుపులు, పది వాష్బేసిన్ల ధ్వంసం కొడవలూరు: మండలంలోని యల్లాయపాళెం జెడ్పీ హైస్కూల్లో బుధవారం చోరీ జరిగింది. దుండగులు పది తలుపులు పగులగొట్టి బాలబాలికల మరుగుదొడ్లు, తాగునీటికి సంబంధించిన 50 స్టీల్ కుళాయిలను అపహరించారు. కుళాయిల కోసం పది వాష్బేసిన్లను పగులగొట్టారు. ఈ ఘటన సెలవు రోజైన బుధవారం మధ్యాహ్నం జరిగిందా లేక రాత్రి జరిగిందా? అని తెలియాల్సి ఉంది. పాఠశాలకు గురువారం ఉదయం వచ్చిన విద్యార్థులు ముందుగా మరుగుదొడ్లు ధ్వంసం కావడాన్ని చూసి ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానోపాధ్యాయుడు మోహన రామలింగయ్య పరిశీలించి చూసి సుమారు రూ.2.50 లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు. హెచ్ఎం, ఎంపీటీసీ సభ్యుడు గరికపాటి రాజేంద్ర, స్థానిక నాయకులు వంశీధర్‌రెడ్డి, రియాజ్, కేతు వెంకటరమణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాఘవేంద్రలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఇదే పాఠశాలలో 2023 డిసెంబర్ 31న చోరీ జరిగ్గా పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి మృతి
సంగం: ఈనెల 16వ తేదీన పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ వ్యక్తి నెల్లూరులోని వైద్యశాలలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు సంగం పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు.. మండలంలోని అనసూయనగర్కు చెందిన ఎ.హరిబాబు (32) మద్యానికి బానిసై అప్పులపాలయ్యాడు. అప్పుల బాధలు తాళలేక పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు గుర్తించి నెల్లూరులోని వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు
ఆర్అండ్బీ ఎస్ఈ గంగాధరం నెల్లూరు(అర్బన్): ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆర్అండ్బీ పరిధిలోని 460 కిలోమీటర్ల పరిధిలో రోడ్లు వేసేందుకు, 15 మేజర్ బ్రిడ్జిల నిర్మాణానికి, రోడ్ల వెడల్పుకు, సింగిల్ రహదారులను డబుల్‌గా మార్చేందుకు రూ.1,000 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపామని ఆ శాఖ ఎస్ఈ గంగాధరం తెలిపారు. నెల్లూరులోని తన కార్యాలయంలో గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. అన్ని మండల హెడ్‌క్వార్టర్స్‌కు రోడ్లు వేస్తామన్నారు. ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన రూ.19.8 కోట్లతో 790 కిలోమీటర్ల పరిధిలో చేపట్టిన ప్యాచ్ వర్కు పనులు 95 శాతం పూర్తయ్యాయని తెలిపారు. 255 కిలోమీటర్ల పరిధిలో ప్యాచ్‌వర్కులు చేసినా వాటిని సరిచేయలేమన్నారు. వీటి ని పునఃనిర్మించేందుకు రూ.80 కోట్ల అవసరం కానున్నాయన్నారు. నెల్లూరులోని పొదలకూరు రోడ్డులో మరమ్మతులు జరుగుతున్నాయన్నారు. -
గిరిజన బాలికను గర్భవతిని చేసి మోసం
కావలి: మండలంలోని ఒక గ్రామానికి చెందిన గిరిజన బాలికను ఓ వ్యక్తి గర్భవతి చేసినట్లు బుధవారం కావలిరూరల్ పోలీసులకు ఫిర్యాదు అందింది. బాలికకు రుతుస్రావం ఆగిపోవడంతో కుటుంబ సభ్యులు పట్టణంలోని వైద్యశాలకు తీసుకొచ్చి పరీక్షలు చేయించారు. బాలిక గర్భం దాల్చినట్లు వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. ఇంటికి తీసుకెళ్లి బాలికను కుటుంబ సభ్యులు విచారించగా గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ చదివిన వ్యక్తి మాయమాటలు చెప్పి శారీరకంగా కలిసినట్లు వెల్లడించింది. దీంతో వారు కావలిరూరల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు అందజేశారు. అయితే బాధితురాలి కుటుంబ సభ్యులను రెండు రోజుల తర్వాత పోలీస్‌స్టేషన్‌కు రావాలని పోలీసులు పంపించేశారు. అయితే ఈ వ్యవహారంపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.